శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం )
‘’తనగానం ఎంత భయంకర సౌందర్యమో –అంత శ్రావ్యతాధిక్యత వలన మరణించే పక్షి ‘’చిత్రాన్ని కీట్స్ కవితా సంకలనం పై ముద్రించినందుకు మురిసిపోయిన ఇమేజిజం కవయిత్రి అమీ లో వెల్ అన్నమాటలివి .అలాగే అత్యంత భావ స్నిగ్ధ హృదయుడైన కీట్స్ మహాకవి తనకు తెలిసిందంతా కొద్దికాలం లోనే పాడి మరణించాడు .రాశికన్నా వాసి ముఖ్యమని రుజువు చేశాడు .కనుక ఆపక్షి బొమ్మ సంపుటిపై ముద్రించటం ఆప్ట్ అన్నదామె భావోద్రేకం తో .ఈమే’’పటిష్టమైన వసుధ లో ఐక్యం కావటం తనకు ఆనందం అని ప్రకటించింది మరో కవితలో.కీట్స్ పై ఆరాధన వెదజల్లుతూ మరొక కవితలో ‘’పరిపూర్ణ పరిపక్వ మేధనీది .కవితా బృహస్పతి .అవనీతల యవ్వనం లో తారాహారాలు వెదజల్లిన స్ఫటిక ద్వార సంరక్షకుడు అని ,అతనిగానం మునుముందుకు సాగిపోవాలని ఆసౌ౦దర్య విలసితకవిత్వం అనంతంగా వెల్లివిరియాలని మనస్పూర్తిగా ఆకాంక్షించింది .
తన పందెం గెలవలేని వాడు మగతనం ఉన్న మగాడు అనిపించుకోడు .పెరుగుదలలేక బతికి చనిపోతాడు .ఎండవాన చలి మంచు లోనే చేవకలకలప పెరుగుతుంది మనుష్యులూ అంతేఅంటాడు డగ్లాస్ మాల్కొచ్ .దీర్ఘ యాత్ర ముగిసిన తర్వాత ప్రశాంతమైన ముద్ర ,మధురస్వప్నాలు మాత్రమె అడిగాను అన్నాడు మాన్స్ ఫీల్డ్ వారధి జ్వరం కవితలో .మరోకవి వాఖేల్ లిండ్సే ‘’పూలతోటల్లో నందనవనాల్లో నడిచే బాలుడిని జ్ఞాపకం చేసుకొన్నాడు .తోటిపిల్లలతో హాయిగా అడిపాడుతాడు .శాశ్వత వాసంతికాద్భుత మధుర వనాన్వేషకుడు వాడు..అందమైన జీవితం లో ప్రేమా ,విశ్వాసాలే మనిషికి ముక్తి కలిగిస్తాయి అని చాటింది నాన్సీ టర్నర్ .
రెండుభాగాల ప్రసిద్ధ దీర్ఘ కవిత ‘’దిహైవే మాన్ ‘’లో ఆల్ఫ్రెడ్ నోయిస్ బందిపోటు వర్ణన అద్భుతంగా చేశాడు .సత్రపు యజమాని నళ్ళకళ్ళ కూతురు పై మనసు పారేసుకొన్నవాడు చంద్రకాంతిలో ఆమె కేశాలను ముద్దాడటం చూశాడు .చంద్రకాంతిలో తనకోసం చూడమని చెప్పి వాడు గుర్రమెక్కి వెళ్ళాడు .ఎంతకీ రాలేదు .నిరీక్షించి చీకటి లో చనిపోయింది .దౌడు తీశాడు హైవే పై కాల్చి పారేశారు అతడినీ .ఈ కవితలో ప్రేమ ,శౌర్యం, త్యాగం త్రివేణి గా సాగాయి .స్వచ్చమైన ప్రేమకు అద్దంపట్టింది .బెస్,హైవే మాన్ఇద్దరూ తమ వాగ్దానాలు నిలబెట్టుకొన్నారు .కానీ దుర్విధి ఇద్దర్నీ వేరు చేయటమే కాదు ,చంపబడ్డారు నిర్దాక్షిణ్యంగా .కానీ వారి ఆత్మలు మాత్రం స్వర్గం లో కలుసుకున్నాయి .ప్రేమ,ప్రేమ కోల్పోవటం, చావు ఇందులో అంశాలు .
‘’వచ్చింది అతి ఎక్కువగా ,పోయింది అతి ఎక్కువగా చూడు ‘’అని వేదాంతి మాటగా సారా టియస్ డేల్ కవితలో చెప్పింది .మరోకవితలో కాంతిలో కాంతి కరిగినట్లు తానూ కరిగిపోవాలనీ ,లోతైన ప్రేమలో ముంచేసి బధిరాంధురాలిని చేయమనీ కోరింది .ఒకరోజు సార్ధకం కావాలంటే ఒక తల్లి ముద్దు ,ఒకపాప ప్రార్ధన ,పుట్టెడు ప్రేమ ,ఒకసోదరభావం ఆశామంత్రం మిత్రుని ప్రోత్సాహం ఉండాల్సిందే అన్నాడు విలియం సెడ్జేర్.రూపర్ట్ బ్రూక్ ‘’వంటరులై నిర్ధనులై విశ్వాన్ని వదిలి పెట్టి ,ఆశించని ప్రశాంతత కు దూరమై పుత్రులుగా ఉండబోయేవారికి అమరత్వం కలిగించి ,వారసత్వాన్ని గౌరవాన్నీ కలిగించిన మృతులను అమరులన్నాడు .మనసు దాచగలిగినదానికన్నాఎత్తుగా పెరుగుతుంది .తారలను దూరంగా నిలబెట్టే అద్భుతం అదే అన్నాడు అమెరికన్ కవి కమింగ్స్ .ఎం ఎన్ రాయ్ ‘’జ్ఞాని ప్రవరుడు .నూతనమానవతా వాద జ్వాలతో జీవి౦చి ,కోట్లదిమానవుల మనస్సులలో విజ్ఞానకాంతి నింపాడు ‘’అని గొప్పగా కీర్తి౦చాడు తన గురువు ఫిలాసఫర్ గైడ్ మానవేంద్ర రాయ్ ని శ్రీ శ్రీ,ఆరుద్ర లాంటి వారెందరికో మార్గదర్శి అయిన డా అబ్బూరి రామకృష్ణారావు .చీకటిలో ఉన్నా ఆమె ఒకపాట లా మెదిలి ఇంకా మదిలో మెరుస్తూనే ఉంది జె.హెచ్ జోన్స్ కు .
లూయీ షిమాన్ కు ‘’జీవితం ఇంకా హాయిగా ఉంటుంది చూసిన మంచిని పొందగలిగితే అనిపించింది .మంచిగా ఆలోచించటం ఆనందకరం ,ఆరోగ్యం కూడా .తండ్రి ప్రేమలో ఉన్న ఒంటరితనం గాంభీర్యం తనకేమీ తెలియదన్నాడు రాబర్ట్ హైడన్.’’అనాక్రమిత పావనోన్నత –ప్రదేశం లో పాదాలుపెట్టి చేయి సాచి దైవ ముఖం తాకాడు ‘’కవీ ,పైలట్ జాన్ గిల్లిప్సి మాగీ .ఇతడే శోకిస్తూ ప్రేమిస్తూ నిద్రించిన ‘’అతడు’’ ను గుర్తుకు తెచ్చుకొన్నాడు .’’ఏది జరిగినా వంటరి కావు .ఎండకోసం వేచి ఉండు .మేఘాలు ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు’’అని ధైర్యం చెప్పిన కవిత లీసా మార్క్ ది.’’నిరసన భావమే ఓటమి వంతు .చిత్తుగా ఓడి,తిరిగి పోరాడే వాడే నిజమైన రాజు .పరాజితులు జెండాలను ఎప్పటికీ విప్పరు. వీళ్ళకూ ప్రశంసా గీతాలు పాడతాను అంటాడు ఒక అజ్ఞాతకవి .ఈ సౌన్దర్యభరిత లోకాన్ని విడిచినా ,దైవంతో ఉన్నది ఒకటి ,దివ్యమైనది మరోటీ ఉన్నాయి అంటుంది స్వయం కృషితో కవయిత్రి అయినఆశావాదీ అమెరికన్ మహిళ హామాండ్ .మరోఅజ్ఞాతకవి ‘’జీవితం నాకేమీ రుణపడి లేదు .ప్రతికొత్తశ్వాస నూ ఆనందిస్తూ,జీవితాన్ని కౌగిలిస్తాను చావును లక్ష్యపెట్టను .పదేళ్ళు, కాని తొమ్మిది పదులు కానీ ప్రతిగడియను బ్రతికినంతకాలం కృతజ్ఞత తో స్వాగతిస్తాను ‘’అని జీవితానికి సార్ధకత కూర్చటం మన ధర్మమని ఎలుగెత్తి చెప్పిన కవితతో ఈ కవితా కలకూజితం ముగిసింది .
ఇలా అరవై కవితలను రాసిన అందరి కవులను గురించి స్ప్రుశించాను అంతే .తలస్పర్శ అంటారు అది నేను చేసింది .ప్రతికవితలో ఏదో ఒక విలక్షణత ,ఒక వైవిధ్యం ఒక తాత్వికత ,జీవిత దృక్పధం ,ప్రేమ శుద్ధ స్వచ్చ ప్రణయం ,కర్తవ్య౦,దైవీ భావం ,మానవత్వ వికసనం ,సౌందర్యం, దానికై ఆరాటం ,ఆరాధన ,ఆత్మ దర్శనం ,చావును లేక్కచేయకపోవటం, అది తప్పదు అన్న నిజం , దానికి దిగులు పడుతూ కూర్చోటం కన్నా ఎప్పుడూ అడుగు ముందుకు వేసే ఆలోచన ,ఆశ మిత్రప్రోత్సాహం ,గెలవాలి గెలిచితీరాలన్న దీక్ష ,జాతికి విజ్ఞాన వెలుగు నిచ్చిన వారికి కైమోడ్పు ,ఓడినా పోరాటం ఆపరాదనే సంకల్పం ,విపరీత భయంకర కాలం లోనూ సడలని విశ్వాసం ,బ్రతికి నేర్వటం బ్రతుకుతూ బ్రతికించటం వంటి జీవిత సౌందర్య విషయాలు స్పష్టంగా ,నిర్దుష్టంగా ,అంతర్వాహినిగా ఉన్నాయి .ఇన్ని గోప్పలక్షణాలున్నడా శర్మాజీ అందుకే వీటిని ఎన్నుకొని అనువదించి న్యాయం చేకూర్చి ఆ ఆంగ్లకవులకు తెలుగు మాగాణం లో ,గుండెల్లో గుడులు కట్టించారు ,నాకు ఆకవితల్లో లభించిన ఆణిముత్యాలను ఏరి మీ ముందు పోశాను .పుస్తకం చివర ప్రతికవినీ సంక్షిప్తంగా శర్మగారు పరిచయం చేసి ,వారిని మనవారిని చేశారు .అందులో ఆయనకుఅత్యంత ఇష్టుడైన కీట్స్ కవి వసంతునిపై సుదీర్ఘ వివరణ రాసి ,ఈ కవితా సంకలన శీర్షిక కే సార్ధక తెచ్చారు .
ఈ శతవసంత కవి డా రాచకొండ నరసింహ శర్మ ఎం డి.గారు నా లాంటి వారికి స్పూర్తి ప్రదాత .మరో సారి వారికి పాదాభి వందనం చేస్తూ ముగిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.