గోపబందుదాస్ -9(చివరిభాగం )

గోపబందుదాస్ -9(చివరిభాగం )
‘’దేశం యొక్క మూలస్వరూపాన్ని అంతా ఒరిస్సాలోనే చూశాను ‘’అన్నాడు ఆనాడు గాంధీ వచ్చి చూసి .సమాజ్ పత్రిక సంపాదకుడిగా తనబాధ్యత ఏమిటో గోపబందు తెలియజేశాడు .రచయితరాసిన్దంతా ప్రచురించటం సాధ్యంకాకపోవచ్చు .సందర్భోచితం సముచితమైనవాటినే ప్రచురించాలి .దాస్ పై వేసిన దావా వీగిపోయింది .భద్రతా డిపాజిట్ కింద రెండు వేలు కట్టమన్న నోటీస్ ఆయనకు అందలేదు మళ్ళీ అరెస్ట్ చేసిరెండేళ్ళు ఖైదు విధించారు .హరిహర దాస్ బాధ్యతలు తీసుకొన్నాడు .సహాయ నిరాకరణలో కోర్టులని బహిష్కరించి దాస్ తనవాదన వినిపించలేదు. ఎక్స్పార్టీ తీర్మానం తో శిక్ష పడింది .
జైలునుంచి రాగానే పత్రిక సంపాదకత్వం చేబట్టి ,పత్రిక పలుకుబడి సాహసం పెరగాయి ప్రజలలోకి బాగా చొచ్చుకుపోయింది .17-6-1928 గోపబందు చనిపోవటానికి ముందే పత్రిక దాని ఆస్తిపాస్తులు లాహోర్ లోని సర్వెంట్స్ ఆఫ్ దిపీపుల్స్ సొసైటీకి రాసేశాడు .పత్రికలాభాలు సొసైటీ వారు తీసుకోకుండా జాగ్రత్త చేశాడు .లాభాలన్నీ సామాజిక రాజకీయ విద్యావిశాయాలకే ఖర్చుపెట్టాలని నిబంధన విధించాడు .అందుకే సమాజ్ పత్రిక అంతగా ప్రవర్ధమానమైన దని అందరూ చెబుతారు .వార్తాపత్రికకు పర్యాయపదమే సమాజ్ పత్రిక అయింది .తాజావార్తలు రోజూ ప్రజలకు అందించాలని దిన సంచికను రెండు పైసలకు అందిస్తూ డబుల్ క్రౌన్ సైజ్ లో రెండు శీట్లతో 6-4-1930నుంచి ప్రచురించారు .ఆయన భాషా శైలి అనితరసాధ్యం అట్టడుగు వర్గాలకు వార్తా చేరాలన్నదే ఆయన తపన .ఒరియా సాహిత్యరంగం లో ఒక వినూత్న వరవడికి శ్రీకారంచుట్టినవాడు గోపబందు దాస్ .ఇప్పుడు వార్తాపత్రిక అయింది .స్వంతభవనం ఉంది .
కాంగ్రెస్ సభ్యుడుగాగోపబందు ‘’తిలక్ స్వరాజ్య నిధి ‘’వసూలు చేసి అప్పగించాడు .ఉత్కళస్వాతంత్ర సేవాదళ్ ఏర్పరచాడు .రాష్ట్రాలుతిరిగి కరువు నిధి వసూలు చేస్సి ప్రజలనుఆదుకొన్నాదు .పీడిత రైతాంగం ఆయన నాయకత్వం లో విజ్రుం భిన్చింది 144 సెక్షన్ జారీచేశారు .ఆయన ఎక్కడా మాట్లాడకూడదని ఆంక్ష విధించారు .ఏకారణమూ దొరక్క స్వచ్చంద దళం ఏర్పాటు చేసినందుకు కటక్ జిల్లా మేజిష్ట్రేట్ వారంట్ జారీచేస్తే ‘’ఇన్నాళ్ళకు మీరు వచ్చారన్నమాట .దీనికోసమే చూస్తున్నా ‘’అన్నాడు .భద్రక్ లో ఉత్తర్వులు ఉల్లంఘిన్చినదుకు అరెస్ట్ చేసి రెండున్నర ఏళ్ళు జైలు విధించారు .కటక్ జైల్లోపెట్టారు .పేపర్లన్నీ పోలీస్ చర్యలపై విరుచుకు పడ్డాయి .నిరంజన్ పట్నాయక్ ‘’కనికాలో స్వచ్చంద న్యాయ విచారణ జరగాలి ‘’అని కోరాడు మరోకేసుపెడితే దానితో ప్రజలముందు ముఖం చూపించలేమని వెంటనే ఉప సంహరించుకున్నది ప్రభుత్వం .దావా రద్దుకాగానే ఆయన్ను 24-1-1923న ఆయన్ను హజారీబాగ్ జైలు కు మార్చారు .ఆయనతోబాటు దేశం లో పేరుపొందిన జాతీయనాయకులు కూడా అక్కడ ఉన్నారు .సంస్కృత గంధాలను అధ్యయనం చేశాడు .మహాభారతం మహా భాగవతమనే రెండు గ్రంధాలు రాశాడు .జైలులో రాసినవాటిలో ‘’బందీర్ ఆత్మకధ ,ధర్మపాద ,గోమాహాత్మ్యం ,నాచికేతోపాఖ్యానం ,కారాగార కవిత ఉన్నాయి .ఖైదీలను వార్డెన్ లనూ సంస్కరించాడు గోపబందు .బుధవారం మౌనవ్రతం పాటించేవాడు .అది తర్వాత జీవితాంతం పాటించాడు .గాంధీకి సోమవారం మౌనవ్రతం .1924జూన్ 26న హజారీబాగ్ జైలు నుంచి విముక్తుడయ్యాడు .
ఒరిస్సా రాష్ట్ర రాజకీయ సభ కటక్ లో జరిగితే గోపబందు , ప్రఫుల్ల చంద్ర రాయ్ హాజవగా జనల సంతోషానికి పట్టపగ్గాలులేవు .ఆయన్ను పొగడ్తలలో ముంచేశారు .సత్యవాది విద్యాలయం ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోతే ,1926లో మూసేయ్యాల్సి వచ్చింది .దీనికి సి ఎఫ్ ఆండ్రూస్ ‘’మీరు ఎంత వ్యధకు గురయ్యారో అర్ధం చేసుకొన్నాను .ఒకజాతీయ విద్యాసంస్థ స్థితి ఇలా అయింది .శాంతినికేతన్ ,గుజరాత్ విద్యాపీఠ్ మాత్రమె మిగిలాయి ‘’అని ఉత్తరం రాశాడు .
1926ఏప్రిల్ లో గవర్నర్ పూరీవస్స్తే ,ఎమర్ మఠాధిపతి వెయ్యి రూపాయలతో విన్దుఇస్తెప్రజలకు నచ్చక దాన్ని క్షామనివారణకు ఇస్తే బాగుండేదని నిరసన తెలిపితే గోపబందు మాట్లాడకుండా ప్రభుత్వం ని షేధించింది .1924లో వరపు వల్ల క్షామం వస్తే గాంధీ వచ్చి చూశాడు .1925లో వరదలు వస్తేగాంధీ ఆదేశం పై ఆండ్రూస్ కుండపోతు వర్షంలో వచ్చి చూసి చలించి ‘’తీరని నష్టం ‘’అని ,మరోగ్రామం లో పశువులపాకలో మకాం చేసి కొద్దిగా రొట్టేమాత్రమే లభిస్తే తిన్నాడు గోపబందుతో .వెంటనే గాంధీకి పూర్తీ వివరాలతో లేఖ రాశాడు వెళ్ళిపోతూ గోపబంధుని ఆప్యాయంగా కౌగలించుకొని ‘’కష్టాల్లోని ప్రజలకు భగవంతుడు మేలు చేస్తాడు .మిమ్మల్ని భగవంతుడు ఆశీర్వది౦చు గాక ‘’అన్నాడు .
1927లో దేశం లోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో ఎన్నడూ రాని వరదలు వచ్చి అంతులేని నష్టం కలిగించాయి .రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయాయి .సత్యవాదిలో ఉన్న గోబందుకు టెలిగ్రాం ద్వారా వార్తా చేరింది .కదిలే స్థితిలేదు లింగరాజ్ మిశ్రా బృందాన్ని పంపాడు ,జాజ్ పూర్ భద్రక్ డివిజన్లు ప్రత్యక్షనరకం అనుభవించాయి .పదికోట్ల నష్టం అని అంచనా .లార్డ్ ఇర్విన్ రావాల్సి ఉంది ఆయనా రాలేకపోయాడు .కాంగ్రెస్ అత్యవసర సమావేశం జరిపి గోపబందుద్వారా ప్రజలకు ధైర్య౦ కలిగించమని కోరితే అలానే చేసి శాశ్వత వరదనివారణ జరపాలి అని కోరాడు .
గోపబందు అన్న నారాయణ దాస్ 22-11-1927 చనిపోయాడు .భరించలేకపోయాడు దాస్ .1926లో పూరీలో ‘’జగన్నాథ వితంతు ఆశ్రమం ‘’స్థాపించి సేవ చేస్తున్నాడు .1928ఏప్రిల్ లో ప్రజాసేక సమాజ్ వార్షిక సభ లాహోర్ లో జరుగుతుంటే గోపబందు ,లింగ రాజ్ కలిసి వెళ్లి 22చేరి ,తిరుగు ప్రయాణం లో గోపబందు కొంచెం అస్వస్తత కు గురైతే 29న హౌరా స్టేషన్ లో లింగరాజ్ ప్రధమ చికిత్స చేసి.సాక్షీ గోపాల్ తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉంటె ,కాదు బాలాసూర్ లో దించితే వరదబాధితులకు ఊరట కలిగిస్తానని చెప్పాడు .తానూ వెంటుండి అన్నీ చూపించి 13ఉదయం సాక్షీ గోపాల్ చేరారు .టైఫాయిడ్ వచ్చి కోలుకోవటానికి 25రోజులుపట్టింది .
కలకత్తా కార్మికుల కోరికపై 1928జూన్ 2బయల్దేరగా హౌరాస్తేషన్ లో అపూర్వ స్వాగతం ఇచ్చారు .అన్ని సౌకర్యాలూన్న చోట బస ఏర్పాటు చేస్తామని అంటే వద్దని ఒరియాకార్మికులు ఉండే ప్రేమ చ౦ద్ బోరల్ వీధిలో వారితో ఉంటానన్నాడు .చిన్నగదులలో గదికి 15మంది ఉన్నదానిలో ఉన్నాడు .అక్కడ కార్మిక సంఘాన్ని పటిష్టం చేశాడు .జూన్ 11సత్యవాది వచ్చాడు .జూన్ 12న బార్డోలిసత్యాగ్రహం లో వల్లభాయ్ సాధించిన విజయోత్సవాన్ని పూరీలో ఘనంగా జరిపి పాల్గొని ప్రసంగించాలనుకోన్నాడుకానీ జ్వర తీవ్రత వలన వెళ్ళ లేకపోయాడు .నీరసించిన ఆయన్ను చూడాటానికి వందలాది జనం వచ్చారు .వాళ్ళను చూసి ఆయనకళ్ళు చెమ్మగిల్లాయి .డాక్టర్ వస్తే చలించిపోతే ‘’నేను నా జబ్బుకోసం బాధ పడటం లేదు నాలో కవి హృదయం ఉంది .ఒక పద్యపాదం’’ఈ జీవన సాగరం మీద ఎన్నాళ్ళు ఈ పడవ నడపగలను ?దీన్ని నువ్వే కాచుకో .నా గుండె జారిపోతోంది ‘’ జ్ఞాపకం వచ్చి౦ది . అన్నాడు ఆయన్ను అందరూ ఊరడించారు .
మరణ శయ్యమీద ఉన్నా గోపబందు దేశాన్ని మరవలేదు. సమాజ్ పత్రికకు ,మిత్రులకు వ్యాసాలూ లేఖకుడిని పెట్టుకొని రాస్తూనే ఉన్నాడు .జూన్ 16ఆరోగ్యం విషమిస్తే సివిల్ సర్జన్ ను పిలిపించారు .ఆయన లేవకుండా చూడాలని జాగ్రత్తలు చెప్పాడు బంధు మిత్రులకు టెలిగ్రాములు వెళ్ళాయి .నీలకంఠ దాస్ రాగా చేతులుపట్టుకొని ‘’నన్ను వదిలి వెళ్ళకు ‘’అన్నాడు .అర్ధరాత్రికి గుండె మరీ బలహీనమైనది .ఆయన చుట్టూ అభిమానులే ఉన్నారు .లింగరాజ్ ఆస్తులవిషయం ఏమైనా రాయాలా అని అడిగితె ఆయనతోకాగితాలు పెన్నూ తెప్పించి ఆయనకుఇంగ్లీష్ లోడిక్టేషన్ చెప్పి నాలుగు అరఠావుల కాగితాలపై విల్లు రాయించి అన్ని ఏర్పాట్లు చేశాడు .సాయంత్రం 5-30కు అందరితో ‘’మీరంతా భద్రంగా ఉండండి .నాకాలం సమీపించింది .నన్ను పోనివ్వండి ‘’అన్నాడు దుఖం మింగుకొంటూ అందరూ భజన చేశారు. వారితో గోపబందు గొంత కలిపాడు .1928జూన్ 17 దేశభక్త ,’’ఆధునిక ఉత్కళ పిత ‘’గోపబంద్ దాస్ మరణించాడు .పూరీ రధోత్సవానికి ముందు రోజు అది. దీన్ని ‘’నవయౌవన దర్శన్ ‘’అంటారు అంటే పూరీలోని ముగ్గురు దేవతామూర్తులు నవయవ్వన శోభ దర్శించే వేళ అన్నమాట .
ఇంతటి విశిష్ట మూర్తిని గురించి రాసే అదృష్టం నాకు దక్కింది .
ఆధారం –శ్రీ రామచంద్రదాస్ రచనకు డా ఆర్. ఎస్ .సుదర్శనం తెలుగు అనువాదం ‘’గోపబందు దాస్ ‘’పుస్తకం .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -27-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.