• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174
• 174-జయ ,శోభనాచల సంస్థ , దక్ష యజ్ఞం,గొల్లభామ ,లక్షమ్మ నిర్మాత దర్శకుడు –మీర్జాపురం రాజా
• శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. మీర్జాపురం అంటే నూజివీడు .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురం .అసలు పేరు మేకా రంగయ్యప్పారావు .ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941). గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రం చిత్రానికి రాజా వారు దర్శకుడి, నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియోగా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పనిచేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.
చిత్ర సమాహారం
జయ ఫిలిమ్స్ చిత్రాలు
• జరాసంధ (1938)
• మహానంద (1939)
• భోజ కాళిదాసు (1940)
• జీవన జ్యోతి (1940)
శోభనాచల చిత్రాలు
• దక్షయజ్ఞం (1941)
• భీష్మ (1944)
• గొల్లభామ (1947)
• మదాలస (1948)
• కీలుగుర్రం (1949)
• లక్ష్మమ్మ (1950) (ఎం.ఆర్.ఏ. ప్రొడక్షన్స్తో కలిసి)
• తిలోత్తమ (సినిమా) (1951)
• ప్రజాసేవ (1952)
• సావాసం (1952)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-175
• 175-మీర్జాపురం రాణి ,గాయని ,నిర్మాత ,రామారావు రంగారావు ఘంట సాల,రమేష్ నాయుడు లను తెలుగు తెరకు పరిచయం చేసిన అందాలనటి గొల్లభామ,లక్షమ్మ ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ –కృష్ణ వేణి
• సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత
జీవిత చరిత్ర[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత,తనకంటే 29ఏళ్ళు పెద్ద అయిన మీర్జాపురం రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
పురస్కారాలు
• తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
కృష్ణవేణి నటించిన సినిమాలు
1. సతీ అనసూయ -ధ్రువ (1936)
2. మోహినీ రుక్మాంగద (1937)
3. కచ దేవయాని (1938)
4. మళ్ళీ పెళ్ళి (1939)
5. మహానంద (1939)
6. జీవనజ్యోతి (1940)
7. దక్షయజ్ఞం (1941)
8. భీష్మ (1944)
9. బ్రహ్మరథం (1947)
10. మదాలస (1948)
11. మన దేశం (1949)
12. గొల్లభామ (1947)
13. లక్ష్మమ్మ (1950)
నిర్మాతగా కృష్ణవేణి
కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
• భర్త స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
• సొంత సంస్థ – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
• మన దేశం (1949)
• లక్ష్మమ్మ (1950)
• దాంపత్యం (1957)
• గొల్లభామ (1947)
• భక్త ప్రహ్లాద (1042)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22-ఉయ్యూరు
•
వీక్షకులు
- 1,107,534 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

