మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

· 194-గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ దగ్గరుంచుకొనే కన్నీటి నటి –డబ్బింగ్ జానకి

· డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.

నేపధ్యమ
వీరిది పెద్దాపురం లోని మధ్యతరగతి కుటుంబం. అక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు. అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

నట జీవితము
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి ‘సినిమాల్లో నటిస్తారా’ అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో ‘భూ కైలాస్’లో చెలికత్తె పాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పనిచేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.

పేరు వెనుక చరిత్ర
శంకరాభరణం సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, షావుకారు జానకి, గాయని ఎస్. జానకి వెళ్లారు. ‘వేదిక మీదకు జానకిగారు రావాలి’ అని మైకులో చెప్పేసరికి ముగ్గురూ లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.

విశేషాలు
· ‘మాతృ దినోత్సవం’ వచ్చిందంటే ’20వ శతాబ్దం’ చిత్రం లోని ‘అమ్మను మించి దైవమున్నదా’ పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.

· ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి ‘రక్తకన్నీరు’ నాటకం వేసినప్పుడు ఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.

· ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే ‘జంబలకిడి పంబ’లోని పాత్ర… ‘రామాయణంలో పిడకల వేట’లోని గయ్యాళి అత్త పాత్ర.

· సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే ‘నిండు సంసారం’ సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరువాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.

నటించిన చిత్రాలు
తెలుగు (పాక్షిక జాబితా)
· గీతాంజలి

· సాగర సంగమం

· జీవనవేదం (1993)

· 20వ శతాబ్దం (1990)

· చెవిలో పువ్వు (1990)

· అనసూయమ్మ గారి అల్లుడు (1986)

· ఆలయశిఖరం (1983)

· హోమం (2008)

·

· డబ్బింగ్ జానకి ఎన్నో టివి షోలలో సీరియల్స్ లో నటించి మెప్పించింది .ఆమెకు అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది .

· సశేషం

· శ్రీరామనవమి శుభా కాంక్షలతో

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.