కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3

. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3
పాఠశాల పర్యవేక్షణాధికారి
ఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఆయన బాగా పేరు పొందాడు .కొడుకులు మంచి విద్యలు నేర్చి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .పెద్దకొడుకు ముకుంద భిలాయ్ లో రెండవవాడు గోపాల రావు హైదరాబాద్ లో అడ్వ కేట్ గా స్థిరపడ్డాడు .మూడవ వాడు రామారావు అనుకోకుండా బస్ యాక్సిడెంట్ లో చనిపోయాడు .కూతురు అనసూయ లండన్ లో సాహిత్యం లో డిగ్రీ పొందిన వాడిని పెళ్ళాడి బొంబాయిలో ఉంటోంది .చివరిపిల్ల శాంత రామేశ్వరరావు హైదరాబాద్ లో ఉంటోంది .
పర్యవేక్షణకు కాలినడకన లేక ఎడ్ల బండీలో వెళ్ళాల్సి వచ్చేది. వెంట ఒక వంటవాడు ,సేవకుడు ఉండేవారు .జానపద గేయాలు కధలు సామెతలు సేక రించాటానికి వాళ్ళు సాయం చేసేవారు .మద్రాస్ విద్యా శాఖ కు ఎజి బోర్న్ అనే విద్యా సంస్కర్త వచ్చి బోధనలో ప్రత్యక్ష విధానం ప్రవేశపెట్టాడు .ఇది బాగా నచ్చింది పంజే కు .దీనివల్ల ఉపాధ్యాయ విద్యార్ధులకు పని భారం తగ్గి ,నేర్చే కాలమూ తగ్గింది .
  కాసర గోడ్ మలేరియా ప్రాంతం .అయినా మారుమూల గ్రామ స్కూల్స్ ను పర్యవేక్షించిన ఉక్కుమనిషి .ఆయన కోసం బదులు ఆసక్తిగా ఎదురు చూసేవి .బోధనలో పాటలు డాన్సులు ,ఆటలు కధలు తో మంచి ఉత్సాహం కలిగించేవాడు .’’ఒక పర్యవేక్షణాదికారి అసంబద్ధపు దిన చర్య ‘’అనే పుస్తకం లో తన అనుభవాలు రాశాడు .రాయచూరు కన్నడ సాహిత్య పరిషత్ లో అధ్యక్ష ఉపన్యాసమిస్తూ ‘’సాహిత్య ,భాష ,గ్రామీణాభి వృద్ధి మొదలైనవి ఉపాధ్యాయుల చేతులలో ఉన్నాయి .వాళ్ళను సభ్యులుగా చేర్చాలి .వారి చొరవ వలన ప్రతి బడీ సాహిత్య పరిషత్ భవనం అవుతుంది .వారి వ్రాతప్రతులు కరదీపికలౌతాయి .గ్రామీణ యువ ఉపాధ్యాయులే  నా నిజమైన స్నేహితులు ‘’అన్నాడు .
  మళ్ళీ మంగుళూరు కు బదిలీ అయ్యాక ఆయన నూతన విధానాలకు మున్సిపాలిటి ,సమితి అధ్యక్షులు వగైరా ముఠా అడ్డు కట్ట వేశారు  .కానీ  ఆయన వచ్చాక ఆయన్ను ఆపగలిగే వారే లేకపోయారు .తర్వాత ట్రయినింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యాడు .తన కార్యదీక్షతో ఇందులో విప్లవాత్మకమార్పులు తెచ్చాడు .ఉపాధ్యాయుల్ని సేవకులుగా కాకుండా మనుషులుగా గౌరవించేవాడు .పెత్తందార్లు ,మొండివాళ్ళు ఆయన్ను జిల్లానుంచి తోలేసేదాకా నిద్రపోలేదు .పంజే అభి వృద్ధిపనులకు అడ్డగించటం పై అధికారులకు ఇష్టం లేదు .ఆయనవలననే విద్యా వ్యవస్థ కుసుమిస్తోందని నమ్మారు .ఐ యేట్స్ ఆయన్ను కొడగు జిల్లాకు బదిలీ చేశాడు .ఇక్కడా రాజీలేని తన నూత్న విద్యా బోధనా అమలు పరచాడు .తర్వాత మేర్కరా లో కేంద్ర ఉన్నత పాఠశాలకు ముఖ్యోపాధ్యాయుడయ్యాడు .ధోవతి ,కోటు ,తలపాగా వేషం లో ఉన్న పంజేను చూసి వాళ్ళు తేలికగా తీసుకొన్నారు  .క్రమంగా వాళ్ళే దారికొచ్చారు స్థానిక సంఘ సంస్థలలో సభ్యుడయ్యాడు .గౌరవ ప్రేమలకు పాత్రుడయ్యాడు ‘
కొడగుజిల్ల ముఖ్యపట్టణం మేర్కరా లో కాపురం పెట్టాడు .ఆర్ధిక ఇబ్బందులు లేవు .కాసర్గోడులో ఉన్నప్పుడు ‘’నాగర హావే ‘’-నాగుపామా అనే అపూర్వ మనోహర గీతాన్ని పిల్లలకోసం రాసి పాడి పాడించాడు .భారత స్వాతంత్ర్య కాంక్ష ఆయన గీతాలలో ఉంటుంది .హత్తరి హాడు అనే గీతం లో కొడగు వారి జాతీయ పర్వాన్ని ,సౌందర్యం ,ప్రజలగురించి వర్ణించాడు .ఎక్కడ పని చేసనా జానపద గీతాలు ఐతిహ్యాలు సేకరించటం ఆయన హాబీ .
పత్రిక ,ప్రచురణ రంగాలు
ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గా రిటై రై,మంగుళూరు లోని  కద్రిలో కాపురమున్నాడు .తర్వాత ఇదే సాహిత్య వేత్తలకు  పుణ్యస్థలమైంది .1927లో మంగుళూరులో కన్నడ సాహిత్య సమావేశాలు జరిగితే పంజే అండగా నిలిచాడు .బాసెల్ మిషన్ వాళ్ళు విద్యా విషయకపనులు ,ప్రచురణ చూసిపెట్టమని కోరితే చేశాడు .కన్నడ భాషా వ్యాకరణం ప్రచురించమని కోరితే అంగీకరించి చేశాడు దీనితో యూరోపియన్ విధానాలు ,అక్కడి బాలసాహిత్య విషయాలు తెలుసుకోవటానికి ఆయనకు బాగా తోడ్పడింది .1902లో ఆయన బావమరిది బెనెగల్ రామారావు ‘’సువాసిని ‘’వారపత్రిక సంపాదకుడు .ఈ రామారావు భారత రిజర్వ్ బాంక్ కు నాల్గవ గవర్నర్ .ఈయన సంతకం తోనే నోట్లు ముద్రి౦ప బడేవి  . సువాసిని లో  ముఖ్యరచనలు పంజే వే .బాలసాహిత్యం జానపద సాహిత్యం అభి వృద్ధికి ‘’చోదియాల్ బైల్ ‘’అనే సంస్థ ఏర్పడింది  ,గొప్ప బాలసాహిత్యం వచ్చింది .చారిత్రక శాసనవిషయాలపైనా రాశాడు .’’హరటే మల్ల ‘’పేరుతొ అప్పటికి కొత్తవైన రచనా చిత్రాలు ,పారడీలు ,వ్యంగ్య రచనలు రాశాడు .ఎన్ ఎం కామత్ ,శంకరయ్య మాస్తి వెంకటేశయ్య౦గార్ వగైరా మహా మహులతో పరిచయ మేర్పడింది  .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.