మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257
• 257-సంగీత విద్వాంసుడు రసపుత్ర విజయ ‘’విమల ‘,రాదా కృష్ణ లో రాధ ’ఫేం,పారుపల్లి వారి తమ్ముడు ,సినీ రాముడు ,ధర్మరాజు ,జనకుడు –పారుపల్లి సుబ్బారావు
• పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నట ప్రస్థాన౦
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
నటించిన పాత్రలు
• విమల (రసపుత్ర విజయం)
• రాముడు (లవకుశ)
• సావిత్రి
• లీలావతి
• రాధ
• సుకన్య
• కైక
• చంద్రమతి
• రుక్మిణి
• రత్నాంగి
• కమలాంబ
• దుర్యోధనుడు
• రామదాసు

సినిమాలు
1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.
• 1936: సతీ సులోచన (1936 సినిమా)
• ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]
• 1944: సీతారామ జననం (జనకుడు)[3]
• 1934లో సి పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన లవకుశ సినిమాలో రాముడు వేష దారి .మాస్టర్ భీమారావు లవుడు ,మాస్టర్ మల్లేశ్వరరావు కుశుడు ,పారుపల్లి సత్యనారాయణ వాల్మీకి ,సీనియర్ శ్రీరంజని సీత ,ఈమని వెంకటరామయ్య లక్ష్మణుడు .సంగెతం ప్రభల సత్యనారాయణ ,రచన  బలిజేపల్లి లక్ష్మీకాంతం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –258
• 258-పాత లవకుశ సంగీతదర్శక ఫేం ,’’కల్లు మానండోయ్  ‘’పాట రచయిత-ప్రభల సత్యనారాయణ 
• ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. తరువాత వరవిక్రయము (సినిమా) కు సంగీతాన్నందించాడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.[1]
• సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రామునిగా నటించాడు; కానీ అతని గళం స్త్రీ గళంగా ఉండేది. అపుడు ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావును కలసి సలహా తీసుకుని సరిదిద్దుకున్నట్లు అక్కినేని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు
చిత్రసమాహారం
• లవకుశ (1934) తమిళ చిత్రం
• అనసూయ (1936) తెలుగు చిత్రం
• గృహలక్ష్మి (1938) తెలుగు చిత్రం : ఇందులో రెండు పాటలు పాడాడు. అవి “కల్లుమానండోయి”, “లెండు భరత వీరుల్లారా” [4]
• వరవిక్రయము (సినిమా) (1939) హిందీ చిత్రం
• కాలచక్రం (1940) తెలుగు చిత్రం
• సీతారామ జననం (1944) తెలుగు చిత్రం[5]
•    సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.