భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు
జననం – విద్యాభ్యాసం
అప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశారు.తలి దండ్రులు లక్ష్మీ నరసమ్మ ,శ్రీరామ మూర్తి .
ఇతర వివరాలు
’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడరు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.’’సంస్కృత శాస్త్రాలునృత్త , నృత్య నాట్యాలు ,-చతుర్విధ అభినయాలు ‘’పై విశిష్ట గ్రంథరచన -1986-88 కాలం లో రాశారు
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకులు . భీమవరం, రాజమహేంద్రవరం, మద్రాసు, కడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశారు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశారు.తెలుగు అకాడెమీ ,,అంతర్జాతీయ తెలుగు సంస్థల డైరెక్టర్ గాపని చేసి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా -1983లో పదవీ విరమణ చేశారు .
  మలేసియా ,సింగపూర్ ,లండన్ ,ప్రాగ్ ,వియన్నా ,అమెరికాలను సందర్శించారు
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యాన్ని విపుల పీఠిక తో 1968లో ప్రచురించారు 1983లో విషాద సారంగధర ను విస్తృత పీఠిక ముద్రించారు .Historical tebles ,selected prayers ,Anoyims  and synonyms -1973లో ప్రచురించారు .’’మానవల్లి కవి రచనలు ‘’1972లో తెలుగులోనూ ,1986లో ఇంగ్లీష్ లోను ప్రచురించారు ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము).నృత్య కళ-తెలుగు దేశం –తెలుగు నృత్య రత్నావళి కి 70పేజీల పీఠిక-1974,ధర్మవరం రామకృష్ణ మాచార్య –జీవితం ,రచనలు -1986,భారతీయ నాటక రంగం –శ్రీ ఆద్య రంగాచారి  గారి ఆంగ్ల గ్రంధానికి అనువాదం -1980,అభినయ దర్పణం -1987,నాట్య శాస్త్రం –విశ్లేషణాత్మక అధ్యయనం -1988,సాత్వికాభినయం -1993,వైఖానసాగమనం -1993,ఉత్తమా౦గాభినయం-1993,శారీరాభినయం -1994,చేష్టాకృతాభినయం -1994,చిత్ర సూత్రం -1994,హస్తాభినయం -1994.
1994 నాటికి -అముద్రిత రచనలు -ప్రధమాంధ్ర నాటక కర్తలు ,ఆంద్ర అలంకారికులు ,,సాహిత్య సంప్రదాయాలు ,ప్రాచీన నృత్యాలు
సత్కారసన్మానాలు – అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నారు.[1]
నాట్య శాస్త్రం కు ఉత్తమ గ్రంథ కర్త గా 1961లో జాతీయ బహుమానం అందుకొన్నారు .1975లో ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు .1980ఉత్తమకళాశాల అధ్యాపక సన్మానం పొందారు .1994లో మద్రాస్ తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారం ,19-11-94న రాజాలక్ష్మీ పురస్కారం అందుకొన్నారు
ఆంద్ర ప్రదేశ్ పాఠ్య గ్రందాల జాతీయీ కరణ రివ్యు కమిటి -1964,ఆంద్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమి -1964-65,పానుగంటి లక్ష్మీ నరసింహారావు శాత జయంతి ఉత్సవ కమిటి -1965,ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడేమీ ల రివ్యు కమిటీ -1972-73, కేంద్ర ప్రభుత్వ హిందీ గ్రంథ అకాడెమీ ల రివ్యు కమిటీ  -1976,ఆంద్ర ప్రదేశ్ నృత్య అకాడెమి -1981 లలో విశిష్ట సేవలు అందించారు
1988నుంచి –హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం లో ప్రదర్శన కళలు లో ఆచార్యులు
మరణం
నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2 న కన్నుమూశారు
నేను అప్పారావు గారిని కూచిపూడిలో జరిగిన సిద్ధేంద్ర యోగి ఉత్సవాలలో ప్రసంగిస్తుండగా చూసిన అదృష్ట వంతుడిని .పరిచయం చేసుకొని మాట్లాడాను .అప్పుడు ఆయన బొంబాయి నుంచి కళల పై ఒక త్రైమాసపత్రిక ఇంగ్లీష్ లో నడుపుతున్నారు .అందులో డా.వేదాంతం చిన సత్యం గారిపై ఒక ప్రత్యెక సంచిక కూడా తెచ్చారు అది నేను కొని భద్రపరచుకోన్నాను .
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.