మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక
మా నాన్న గారు విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ (ఇ.సి.ఎంహైస్కూల్ )లో సేనియర్ తెలుగు పండిట్ గా 1931 నుంచి 1953వరకు పని చేసినపుడు ‘’నవ్య జ్యోతి ‘’మాస పత్రిక కు సంపాదకులుగా ఉంటూ వెలువరించారని నాకు ఇంతవరకు తెలియదు .దీని విషయం శ్రీ ఆశావాది ప్రకాశరావు గారు రాయల సీమ లో వెలువడిన పత్రికల గురించి సేకరించివిషయాలను తెలుగు అకాదేమికి అందించినట్లు ,ఇవాళ మా అబ్బాయి శర్మ సేకరించి పంపగా తెలిసి మహా సంతోషం పొందాను .వాడికి అభినందనలు -దుర్గాప్రసాద్ -26-8-22-ఉయ్యూరు
Page Number 445 : https://ia801604.us.archive.org/8/items/in.ernet.dli.2015.489107/2015.489107.Telugulo-Parishodhana.pdf