స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన వంగల వెంకట నారాయణ దంపతులు .
వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే ..లక్నో యూని వర్సిటిలో గొప్ప పదవులలో ఉన్నారు .కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి కుమార్తె ను శివరాం గారు వివాహం చేసుకొని ,యూరప్ అమెరికాలకు వెళ్లి విజ్ఞాన ఖనులుగా గుర్తింపు పొందారు .
వెంకట నారాయణ గారు బియేపాసై ఉపాధ్యాయ వృత్తి లో చేరి ,రెండేళ్ళు పని చేసి జపాన్ వెళ్ళారు .అక్కడ రసాయన శాస్త్రం లో నిష్ణాతులయ్యారు .ఆదేశాలు స్వేచ్చా స్వాతంత్రాలతో వర్దిల్లటం కనులారా చూసి ,తన మాతృభూమి భారత దేశం పరదేశ దాస్య శ్రుంఖలాలలో బంధింప బడటం తట్టుకోలేక పోయారు .
1905-06లో ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట నారాయణ గారు వివాహం చేసుకొని రాజమండ్రి లో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు .అప్పటినుంచి ఆంద్ర తొలిలి విప్లవవీరుడు ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారితో గొప్ప పరిచయం ఏర్పడింది .శాస్త్రిగారు రాజకీయం లో ప్రవేశించగానే వంగల వారు ఆయనకు కుడిభుజంగా నిలిచారు .అత్యంత రహస్య విషయాలు సేకరిస్తూ శాస్త్రి గారికి అందిస్తూ ,కావలసిన అన్ని విధాల సాయం అందించారు .
ఆరోజుల్లో వెంకట నారాయణ గారి ఇల్లు రాజమండ్రి లో తీవ్ర రాజకీయ ఆందోళనలకు నిలయంగా ఉండేది .ఎవరు ఏ విషయం మాట్లాడాలన్నా వెంకట నారాయణ గారింటికే వచ్చి మాట్లాడే వారు .ఎవరెవరు పోలీసు వారంట్ తప్పించుకోవాలన్నా వంగల వారింటికే చేరేవారు .వెంకట నారాయణ దంపతులు అందరికి చక్కని వసతి భోజనాలు సమకూర్చేవారు .వెంకట నారాయణ గారు వారికి గొప్ప సలహాదారు గా మాత్రమె ఉన్నారు .కానీ సాహసించి ముందు అడుగు వేయలేదు .
కానీ ఆయన భార్య అలాకాదు .ఆకాలం లో విప్లవకారులతో దీటుగా పని చేసేవారు .పోలీసుల ఎర్ర టోపీ చూసి భయపడే ఆకాలం లో ఆమె ధైర్య సాహసాలతో ,ఉత్సాహం గా ముందుకు వచ్చి భారత స్వాతంత్ర్య విప్లవానికి సాటిలేని సహాయం చేసేవారు .ఎవరికీ ఏ వార్త చేరాలన్నా, ఆమె ద్వారానే చేరేది అలాంటి’’ కీ రోల్ ‘’పోషించారామే .రకరకాలుగా దుస్తులు మార్చుకొని ,వేషాలు వేసుకొని పోలేసుల కళ్ళు కప్పి ,విప్లవ కారులకు గొప్ప సాయం చేసేవారు .ఆకాలం లో రాజమండ్రి లో అంతటి సాహసం చేసి౦ది వెంకట నారాయణ గారి భార్య ఒక్కరే .
ఒక రోజు దొరసాని వేషం తో గోదావరి స్టేషన్ లో దిగిన ఆమె ను పోలీసులు వెన్నంటారు .రెండు మూడు సందులు దాటి మాయమయ్యారామె .పోలీసులకు ఆమె దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా ..అప్పుడామే సరాసరి’’జాతీయ నాయకులు ‘’పుస్తక రచయిత ,జగ్గన్న శాస్త్రికి కుడిభుజం కోటమర్తిచినరఘు పతి గారింటికి వెళ్లారు .ఆయన తల్లి సోదరి ఆమెను ఆశ్చర్యంగా చూసి ‘’అమ్మా ఇదేమిటి ?’’అని అడిగితె మాట్లాడ వద్దని సౌజ్ఞ చేసి ,లోపలి వెళ్లి దొరసాని వేషం తీసేసి .ముఖానికి పసుపురాసుకొని స్నానం చేసి ,పట్టు చీర పట్టు జాకెట్ ధరించి,నుదుటిపై కాణీ అంత కుంకుమ బొట్టు తలలో పూలు ధరించి ,పళ్ళెం లో పూలు ,పళ్ళు పెట్టుకొని ,చేతిలో చెంబు నీళ్ళు పట్టుకొని ,అతి శాస్త్రోక్తంగా రఘుపతి గారిచ్చిన రహస్యమైన జాబులు మొలలో దాచుకొని ,సరాసరి గుడికి వెళ్లి ,అక్కడినుంచి బండి కట్టించుకుకొని ఇంటికి చేరారు .భర్త వెంకట నారాయణ గారు ‘’ఎప్పుడు వచ్చావు ?ఈ వేషం ఏమిటి ?’’అని అడిగితె ,ఆమె దొరసానివేషం తో తన పుట్టిల్లు అయిన రఘుపతి గారింటికి వెళ్లి ,అక్కడినుంచి తాను తెచ్చిన రహస్య ఉత్తరాలను భర్తకు అందజేశారు .ఇంతటి ధైర్య సాహసాలతో స్వాతంత్ర్య సమరానికి రహస్యంగా తోడుపడిన ఏకైక ఆంద్ర మహిళ వెంకట నారాయణ గారి భార్య ,రఘుపతి గారి సోదరి 1914లో బొంబాయిలో మరణించారు .ఆమె పేరు కూడా మనకు తెలీదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో శ్రీ వంగల వెంకట నారాయణ దంపతులను పరిచయం చేయటం మహదానందంగా ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు–