హాస్యానందం 32- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం

52- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

భారతంలో భీముడు సౌగ౦ధికాహరణం కోసంపోతుంటే దారిలో హనుమ దారికి అడ్డంగా ఉంటె లెమ్మనమని అంటే, ముసలికోతిని లేవలేను నువ్వే ఎత్తి అడ్డం తొలగించుకోమంటే, భీముడు విశ్వ ప్రయత్నం చేసి తోకనుకూడా కదల్చ లేకపోయాడు .హనుమ మహా బలశాలి అని చెప్పటమే కవి ఉద్దేశ్యం. ఇది పరమ సత్యం .అతిశయోక్తికాదు .ఆదృష్టిలో ఇందులో హాస్యం లేదు .తోక ఎత్తకపోతే నవ్వేది పిల్లలు మాత్రమె .ఇందులో వికృతి, అసందర్భం లేనే లేవన్నారు మునిమాణిక్యం .

  తెలుగులో ఉత్తమకవులెవరూ హాస్యాన్ని పోషిస్తూ రచనలు చేయలేదు .అక్కడక్కడ కొన్ని చెణుకులున్నా,అది ఉత్తమ హాస్యం కాదు .నన్నయ భీముని వర్ణించే ఘట్టం లో రాసిన పద్యంలో హాస్య చాయలు కనిపిస్తాయన్నారు మాస్టారు .పదేళ్ళ భీముడిని ఎత్తుకొని కుంతీ దేవగృహానికి వెడుతుంటే ,పులిఎదురైతె భయపడి పసివాడిన జారవిడిస్తే ఒకరాతిపై పడితే ఆరాయి ముక్కలు చెక్కలయింది .బకాసుర వధ సందర్భంలో భీముడిని పంపే ఈవిషయం లో కుంతీదేవి ఈ సంగతి బయట పెట్టి ‘’వీడు పుట్టిన పదియవనాడు పెలుచ బడియె .నా చేతినుండి యప్పర్వతమున బడిన వాడి జేసి బాలకు నొడలుదాకి యాక్షణ౦ బ రాఎల్ల నుగ్గయ్యే జూవె ‘’అని అక్కడి బ్రాహ్మణ కుటుంబానికి చెప్పింది .ఈ సన్నివేశం నవ్వు పుట్టి౦చెదె కాని హాస్యంకోసం కవి రాయలేదు .భీరువు దీరుడిగా వృద్ధుడు యువకుడిలా మాట్లాడితే నవ్వు వస్తుంది .అంటే అసహజత్వం ఉంటేనే నవ్వు వస్తుంది అన్నారు గురూజీ .భీముడు బండెడు అన్నం తినటమూ నవ్వు పుట్టి౦చేదికాదు. ఒక వేళ నవ్వినా అది ఆశ్చర్యానికి  సంబంధించింది అన్నారు  మునిమాణిక్యం .

 పిల్లలమఱ్ఱి పినవీర భద్రుడు జైమిని భారతం లో ఉద్దాలకుని కధలో భార్యకు భర్త ఏమాట చెప్పినా వ్యతిరేకం గా  చేస్తుంది .మదడిధొవతి తెమ్మంటే సగం చింపి ఇస్తుంది .జపమాలిక ఇమ్మంటే తెంపి ఇస్తుంది .అతిధులు వస్తే గౌరవించమంటే అగౌరవం చేస్తుంది .ఇవన్నీ హాస్య జనకాలే. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానంలో  కలహ కంఠి చండిక కూడా ఇదేరకం .ఆమె మాటల్లో హాస్యం వెతుక్కొంటే దొరకచ్చు అని మునిమాణిక్యం గారువాచ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

రేపు నరకచతుర్దశి ,దీపావళి శుభా కాంక్షలతో

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.