హాస్యానందం 53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

హాస్యానందం

53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

 ప్రబంధాలలో

ఏ రసమైనా ఆభాస రూపం హాస్య కారణ మౌతుంది .మను చరిత్రలో వరూధిని అలాకావాల్సి ఉంది .కానీ కాలేదు పారిజాతాపహరణం లో సత్య, కృష్ణుని నారదుడికి దానం చేస్తుంది .అతని బరువు ఎంతో అంతధనం ఇచ్చి తిరిగిపొం.దాలి ఇదీ హాస్యం పుట్టించే చోటే కాని కవి అలా చేయలేదు భగవంతుడిని అపహాస్యం చేయలేడుకవి .ఉదాత్త విషయాలను తేలిక తనం తో పరామిర్శించటం తగనిపని అని ప్రబంధకవులు దాని జోలికి పోలేదు అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పూర్వకవుల నవ్వుటాలకు అనే మాటల్నికూడా పెదవి బిగబట్టి గంభీరంగా అ౦ టారేకాని తేలికగా అనరు .అది మడి కట్టిన హాస్యం అన్నారు బాధగా మాస్టారు .శశి రేఖా పరిణయం లో ఘటోత్కచుని మాయవలన లక్ష్మణకుమారుడికి శశిరేఖ కుందేలుగా, పిల్లిగా ,కోతిగా  భల్లూకం గా పాముగా కనిపిస్తుంది .నిజానికి ఇవన్నీ హాస్య జనకాలే .

 చంద్ర లేఖా విలాపం లో హాస్యముందని అ౦టారుకాని అందులో జుగుప్సాకరమైన వర్ణనలు చాలాఉన్నాయన్నారు గురూజీ ‘’పళ్ళు తోమడు .గుద ప్రక్షాళన చేయడు ‘’వంటివి .ఆపుస్తకం చదివి నవ్వుతాముకానీ ,అది వికారం తెప్పించేదేకాని నిర్మలమైన నవ్వు కాదన్నారు సార్.తర్వాత వచ్చిన రావణ దమ్మీయం అధిక్షేపకావ్యం హాస్యజనకం అన్నారని మాస్టారు చెప్పారు .

శతకాలు

చంద్ర శేఖర శతకం పామరుల భాషలో రాయబడింది .పామరుల నోళ్ళలో వికృతిపొందిన శబ్దాలను కవి ఉపయోగించాడు .వాటి సుస్వరూపం వెంటనే మనకు గుర్తుకురాదు .ఇది శబ్దాశ్రయహాస్యం .పుస్తకం అంతాఒకే తీరులో ఉండటంతో విసుగుపుట్టి పది పద్యాలతర్వాత చదవలేము అన్నారు మునిమాణిక్యం .ఈ భాషా వైపరీత్యం కొత్తదనాన్ని పోగొడుతుంది .చదవాలనే ఆసక్తీ నశిస్తు౦దన్నారు అనుభవంతో మునిజీ .

 సింహాద్రి నారసి౦హ శతకం  ,ఆంద్ర నాయక శతకం హాస్యాన్ని అందిస్తాయి జానపద గీతాలలోనూ హాస్యం ఉందన్నారు డా రామరాజుగారు .వదినా మరదళ్ళ  మధ్య ,అత్తా కోడళ్ళమధ్య జరిగే సంభాషణలలో కావలసినంత హాస్యం ఉందని ,దాన్ని ఎవరూ పోగు చేయలేదని ,చాలావరకు గాలికి కొట్టుకు పోగా ,కొంతవరకు జానపద సాహిత్యం లో ఇరుక్కుంది అని రామరాజుగారన్నారని మస్టారువాచ .పాతకాలపు పాటల్లోనూ హాస్యం ఉంది .మొత్తం మీద పూర్వ సాహిత్యం లో హాస్యం తక్కువే అని అంగీకరించాలి .గొప్పకవులేవరూ హాస్యం జోలికి పోలేదన్నారు మునిమాణిక్యంగారు .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-22-ఉయ్యూరు —

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.