‘’మీన’’లోచని ,చివరిదాకా కుమారి ‘’నిత్య ‘’నటనా సర్వస్వమే –కుమారి శ్రీమతి
వైజయంతి మూవీస్ ‘’స్వప్న ‘’సినీ సంస్థ నిర్మాణంలో ,గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం లో ఈ అక్టోబర్ 6 న విడుదలైన ఈ సినిమాని మా అబ్బాయి శర్మ మొన్న ఫోన్ చేసి ‘’నాన్నా !ప్రైం లో ఉంది’’ కుమారి శ్రీమతి .నీకు నచ్చుతుంది ‘’అంటే నిన్న చూశాం .అన్నట్లుగానే బాగానే ఉంది.క్రెడిట్ అంతా నిత్యామీనన్ కే దక్కుతుంది .అలా దక్కి౦చే అవసరం కలిపించాడు స్క్రీన్ ప్లే ,సంభాషణ కర్త అవసరాల శ్రీనివాస్ .అతడు మంచి దమ్మున్న రచయిత.చాలా వాటిల్లో రుజువు చేసుకొన్నాడు .అయినా ఇంకా ‘’పదార్ధం ‘’ఉన్నోడు.ఎప్పుడో అందర్నీ అధిగమించి ముందుకు దూకుతాడని నా నమ్మకం .అంతర్వేది కి వెళ్ళే దారిలో ‘’రామరాజుపల్లి ‘’ఉంది.మా పెద్ద కోడలు సమత దగ్గర బంధువు అక్కడ ఉండేవారని మాతో అంతర్వేదికి వచ్చినప్పుడు చూపించి పరవశించింది .కానీ ఇది రాజమండ్రి దగ్గర్లో ఉన్న ‘’రామరాజు లంక ‘’లో కథ నడుస్తుంది .కార్తీక దీపం వంటలక్క భర్త డాక్టర్ బాబు నిరుపం పరిటాల ,సీనియర్ నటి గౌతమి ,’’సీతాలు సింగారం’’ పాటఫెం తాళ్ళూరి రాజేశ్వరి .కొన్ని నిమిషాలపాత్రదారులు మురళీ మోహన్ ,సుబ్బరాయ శర్మ ,అవసరాల .సంగీతం ఉందొ లేదో అనిపించేట్లు వాయిన్చినవారు రాజీవ్ రాజ్ ట్రయో .కన్నులపండువుగా మొహనంగా చూపించింది మోహన కృష్ణ .బాబాయి పాత్రలో తిరువీర్ హాస్యం షేడ్ తో కనిపించీ కనిపించని విలనీ షేడ్ తో బాగా చేశాడు .అమెరికా కుర్రాడు బార్ కు సహాయం చేసినవాడు ,అక్కడి నాలుగు బార్ల వొనర్,,పక్కింటి పరిటాల శ్రీమతిని ప్రేమిస్తారుకానీ వర్కౌట్ కాదు .అన్తెఅంటే ట్రాయాన్గిల్ వన్ సైడ్ లవ్ .పరిటాల ఆయనా తంటా పడతాడుకాని లవ్ లెటర్ లోనే ఫెయిల్యూర్ .వీరంతా నిత్యా బార్ కు సాయం చేసిన వాళ్ళే .దానితో ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకొన్న వాళ్ళే .ఆమె మాట పధ్ధతి ధ్యేయం ఆదర్శం ముందు నిలబడలేక తప్పుకొని ఆమెకు లైన్ క్లియర్ చేసి ఆమె అనుకొన్నది సాధించటానికి ఉపయోగపడి తమ పెద్దమనసుల్ని చాటుకొన్నారు .18ఏళ్ళ క్రితం సంసారాన్ని అంటే భార్య ,నాయనమ్మ ,ఇద్దరు ఆడపిల్లల్ని నడి బజారులో వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి కటార్ దోహా లో డబ్బు సంపాదించు కొని మళ్లీ కొంపకు చేరిన నరేష్ తల్లి చేత చీపురు దెబ్బలు భార్య కంటి చూపుతో అవమానం కూతుళ్ళ చీత్కారం భరించి ,బుద్ధి తెచ్చుకొని కుటుంబానికి అండగా నిలబడతాడు
ఆడవాళ్ళు సారా ,కల్లు దుకాణాలు నడపటం మనకు తెలుసు .దానికెవరు అడ్డు చెప్పరు .కానీ హోటల్ మేనేజి మెంట్ చదివి ,తనూర్లో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టి నడిపి వచ్చే డబ్బుతో బాబాయ్ లాక్కున్న ఇంటిని విడిపించుకోవటానికి నడు౦ కడితే అందరూ బిలో డిగ్నిటి గా భావిస్తారు .వీటన్నిటిని భరిస్తూ ,ఇంట్లోని బంగారాన్ని అమ్మి ఆడబ్బుతో బార్ కాంటాక్ట్ దక్కించుకొనే ప్రయత్నం చేసి రాకపోతే స్నేహితుడి ద్వారా అతనికున్న ఒక బార్ ను పొంది ‘’తాజ్ మహల్ బార్ అండ్ రెస్టారెంట్ ‘’ప్రారంభించి ముదురు మందుబాబుతో రిబ్బన్ కట్ చేయిస్తుంది .ఊళ్లో ఆడాళ్ళు బార్ మీద దాడి చేసి భీభత్సం చేస్తే తల్లి చెప్పిన మాటతో వారందర్నీ ఒప్పించి మళ్లీ నడిపిస్తుంది .మంచి క్రమ శిక్షణతో ఆరోగ్యకరమైన డ్రింక్స్ తో సిగ్నేచర్ పానీయాలు ఇంట్లోని సరుకులతో బార్ కు గొప్ప వైభవం తెస్తుంది .తాతయ్య ఇల్లు బాబాయికి దాబ్బిచ్చికొని స్వంతం చేసుకొని ,గృహప్రవేశం చేసి ,తాత రాసిన విల్లు నేలమాళిగలో కనిపిస్తే చదివి అది తమ తండ్రి పేరా రాసిన్దనిగ్రహించి అందరు కలిసి ఉండాలని భావించి చిమ్పేసి ,బాబాయి ఇద్దరు దమ్మి కొడుకులకు బార్ అప్పగించి తాను విశ్రమించి కధకు గౌరవ ప్రదమైన ఫినిషింగ్ టచ్ ఇస్తుంది నిత్యామీనన్ కుమారిగా ఉన్న శ్రీమతి .
బలభద్రపాత్రుని రమణి ,మల్లిక్ రాం ఒరిజినల్ కథకు మంచి హంగులు కూర్చి మనముందుంచారు .చెల్లి కల్యాణి గా ప్రణీత పట్నాయక్ ఆకర్షణీయంగా ఉంది.డాక్టర్ బాబు చెల్లెలు వేసిన అమ్మాయి కూడా బాగా చేసింది .మొత్తం మీద నిత్యామీనన్ ‘’అనుక్షణ నిత్య ‘’గా సినిమా అంతా కనిపించి మనల్ని తన కళ్ళతో తన వెంట లాక్కు వెళ్ళేట్లు చేసిన డైరెక్టర్ ప్రతిభకు జోహార్లు చెప్పాల్సిందే .మీనన్ ను కొంచెం సన్నగా చూపిస్తే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-23-ఉయ్యూరు
