పాత తెలుగు సినిమాల డాన్సర్ ,నృత్య దర్శకుడు శ్రీ .కె.ఎస్.రెడ్డి .
ఈయన గురించి నాకే ఎక్కడా సమాచారం దొరకలేదు .AI శరణం గచ్చామి అని భారం వేస్తె కొన్ని వివరాలు దొరికాయి వాటినే మీకు అందిస్తున్నాను .ఇ౦కా ఎవరికైనా అదనపు సమాచారం లభిస్తే తెలియజేయండి
పాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాకినాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ నృత్య దర్శకుడు మరియు చిత్ర దర్శకుడు కే.ఎస్. రెడ్డి (కాకినాడ శ్రీనివాసరెడ్డి / కే.ఎస్. రెడ్డి మాస్టర్) గురించిన వివరాలు:
పరిచయం & నేపథ్యం
- స్వస్థలం: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణానికి చెందినవారు.
- చిత్రసీమ ప్రవేశం: 1960ల కాలంలో మద్రాసు (చెన్నై) చిత్ర పరిశ్రమకు వచ్చి, మొదట డాన్సర్‌గా, ఆ తర్వాత నృత్య దర్శకుడిగా (కోరియోగ్రాఫర్) స్థిరపడ్డారు.
- నాటి పాత సినిమాల్లో పౌరాణిక, జానపద, మరియు సాంఘిక చిత్రాలలోని అనేక పాటలకు నృత్యాలు సమకూర్చారు.
ముఖ్యమైన సినిమాలు & ప్రయాణం
- నృత్య దర్శకత్వం (కోరియోగ్రఫీ): 1960-70ల నాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబుల సినిమాలకు మరియు జానపద/యాక్షన్ సినిమాలకు డాన్స్ మాస్టర్‌గా పనిచేశారు.
- దర్శకత్వ బాధ్యతలు: కేవలం డాన్స్ మాస్టర్‌గానే కాకుండా తదనంతరం చిత్ర దర్శకుడిగా మరియు నిర్మాతగా కూడా మారారు.
- బంగారు మనసులు (1973): జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి కే.ఎస్. రెడ్డి దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు.
- పిచ్చోడి పెళ్లి (1975): రాజబాబు, రామకృష్ణ, విజయనిర్మల నూతన తారలతో వచ్చిన ఈ సినిమాకి ఈయనే దర్శకత్వం వహించారు.
బంగారు మనసులు
కె.ఎస్. రెడ్డి
దేశం: భారతదేశం; సంవత్సరం: 1973; భాష: తెలుగు; రంగు: నలుపు మరియు తెలుపు
స్టూడియో: కె.ఎస్.ఆర్. చిత్రాలు
నిర్మాత: కె.ఎస్. రెడ్డి; సినిమాటోగ్రాఫర్: ఎం. కన్నప్ప; ఎడిటర్: బి. కందస్వామి; స్వరకర్త: సత్యం చెల్లపిల్ల; సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, రాజశ్రీ (రచయిత)
తారాగణం: జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ (తెలుగు నటుడు), అల్లు రామలింగయ్య, కె.వి. చలం, త్యాగరాజు, రామదాసు, మా గోపి, రాజసులోచన, శకుంతల, ఛాయాదేవి, శ్రీరంజని జూనియర్, లీలా రాణి, మీనా కుమారి, సుశీల ప్రసాద్, సుజాత జయకర్, మంజుల విజయ్‌కుమార్, బేబీ గౌరీ, బేబీ భారతి, ఎం.వి. చలపతిరావు, మోదుకూరి సత్యం, భూసారపు, అప్పారావు, వేలంగి, సువాసు, అంజిబాబు, గణేష్, మాస్టర్ శ్రీనివాస్, కె. రామిరెడ్డి, టి.కృష్ణ కుమారి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 1973
పిచ్చోడి పెళ్లి
కె.ఎస్. రెడ్డి
దేశం: భారతదేశం; సంవత్సరం: 1975; భాష: తెలుగు; రంగు: నలుపు మరియు తెలుపు
స్టూడియో: మురళీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్
నిర్మాత: కె. మురళీ కృష్ణ; సినిమాటోగ్రాఫర్: బి.ఎన్. హరిదాస్; ఎడిటర్: బి. కందస్వామి; స్వరకర్త: సత్యం చెల్లపిల్ల; సాహిత్యం: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, మైలవరపు గోపి
తారాగణం: రాజబాబు, జి. రామకృష్ణ, విజయనిర్మల, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, కొమ్మినేని శేషగిరిరావు, పినిశెట్టి, డాక్టర్ రమేష్, టైగర్ ప్రకాష్, పింజల భాస్కర్ రావు, సూర్యకాంతం, వై. విజయ, టి. రాజేశ్వరి, లక్ష్మి (నృత్యకారిణి)
విడుదల తేదీ: అక్టోబర్ 3, 1975
కథ: ఎస్.ఆర్. పినిశెట్టి; స్క్రీన్ ప్లే: కె.ఎస్. రెడ్డి; సంభాషణ: ఎస్.ఆర్. పినిశెట్టి
గానం: P. సుశీల, S. జానకి, S.P. బాలసుబ్రహ్మణ్యం
ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు
కె.ఎస్.రెడ్డి గురించి వాళ్ళబ్బాయి సినీ నిర్మాత శ్రీ కె.మురళీ కృష్ణారెడ్డి తెలియజేసిన వివరాలు
మద్రాస్ లో పని దొరకక ఖాళీగా ఉన్న తన తండ్రికే.ఎస్.రెడ్డి ,మరో డాన్సర్ శకుంతల రెడ్డిగారికి అవకాశాలు కల్పించారు ఇద్దరూకలిసి డాన్స్ చేసేవారు .రెడ్డిగారి భార్య అప్పటికే చనిపోవటం వలన వీరిద్దరూ తర్వాత పెళ్లి చేసుకొన్నారు .రాజమండ్రిలో సెటిల్ అయ్యారు .పిల్లలందరూ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉండేవారు .రెడ్డిగారి నడక సిగరెట్ కాల్చే విధానం చాల స్టైలిష్ గా ఉండేది .డాన్స్ లో ఒరిజినాలిటి చూపేవారు .కానీ బాగా కోపధారి .అందుకే అవకాశాలు తక్కువగా వచ్చేవి .తనతో డాన్స్ చేసిన వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎవరికీ వారికి ప్రత్యేకకవర్లలో పెట్టి ఇంట్లో ఉంచేవారు వారువచ్చినప్పుడు ఆయన భార్య వారికి ఆకవార్ ఇచ్చేది .అందుకని ఆయనతో డాన్స్ చేయటానికి డాన్సర్లు చాలా ఉత్సాహం చూపించేవారు మాజీ ముఖ్యమంత్రి శ్రే భవనం వెంకట్రాం రెద్దిగారికిఆత్మీయయ మిత్రుడు ముఖ్యమంత్రియ్యాక రెడ్డిగారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించుకొని మాట్లాడారు .ఏమైనాసహాయంకావాలా అని అడిగితె రెడ్డిగారు వద్దన్నారు .హైదరాబాద్ లో సినీ నటులకు ఇళ్లస్థలాలు ఇస్తున్నాము ఒకటి తీసుకో అన్నారు .రెడ్డిగారు ఆసక్తి చూపలేదు .రెండుసార్లు పిలిపించి స్థలం తీసుకోమన్నా రెడ్డిగారు సుముఖత చూపలేదు .
ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్.టి. రామారావు గారున్నప్పుడు కూడా రెడ్డి గార్ని ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు .ఏదైనా కావాలంటే చేస్తాననే వారు .వద్దనే వారు రెడ్డిగారు .తమిళనాడు ముఖ్యమంత్రులుశ్రీ కరుణానిధి ఎ౦ జి. రామచంద్రన్ లు కూడా రెడ్డిగారు అంటే విపరీతమైన ఆప్యాయత ఆదరణ చూపేవారు .వారి వలన కూడా రెడ్డిగారు ఫేవర్ ఆశించలేదు .వారిని వాడుకోలేదు .రెడ్డిగారి పెద్ద కుమార్తె వివాహానికి తెలుగు తమిళ సినీ నటీ నటులు డాన్సర్లు వచ్చి శోభ చేకూర్చారు రెడ్డి గారు. అంటే అంత అభిమానం చూపించేవారు అందరూ .రెండవ అమ్మాయి పెళ్ళికి శోభన్ బాబు,.కె.ఆర్ విజయ వంటి సేలిబ్రేట్స్ కూడా వచ్చారు .శోభన్ తో రెడ్డి గారు చాలా జోవియల్ గా మాట్లాడేవారు .వారంతా రెడ్డిగారి డాన్స్ కు నృత్య దర్శకత్వానికి ఫిదా అయిన వారే .
డాన్స్ లద్వారా విపరీతంగా ధనం సంపాదించి రాజు రాణీ లాగా బ్రతికిన రెడ్డి దంపతులు డబ్బు దాచుకోవటం చేతకాక విచ్చలవిడిగా ఖర్చు చేయటంతో చివరికి నిర్ధనులయ్యారు .ఇలాంటి దుర్భర జీవితం జీవించటం ఇష్టం లేక చివరికి అన్నవరం వెళ్లి దర్శనం చేసుకొని తుని వెళ్లి ఆత్మహత్య చేసుకోనిజీవిత నాటక రంగం నుంచి విముక్తులయ్యారు .వాళ్ల శరీరాలను గుర్తించి రెడ్డి గారి స్వగ్రామ౦ లో ఉన్న తండ్రిగారికి కబురు చేస్తే వారువచ్చి రాజమండ్రి తీసుకు వెళ్లి దహన క్రియలు చేశారు .అంతఘనంగా జీవించి ఇంత పిరికితనంగా ఆత్మహత్య చేసుకోవటం తమ కుటుంబం జీర్ణించు కోలేకపోయిందని కె.ఎస్ రెడ్డి గారి కుమారుడు మురళీ కృష్ణారెడ్డి కన్నీటితో బాధ పడుతూ చెప్పారు .
నేను కె.ఎస్ రెడ్డి గారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో రాద్దామని దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆశగా ఎదురు చూస్తె నిరాశే మిఇలింది .గూగుల్ లో అసలు సమాచారం దొరకలేదు .ఇవాళ కృత్రిమ మేధ AI ద్వారా కొంత సమాచారం సేకరించి రాస్తుండగా ‘’వెండి వెన్నెల ‘’చానల్ వారబ్బాయి ఇచ్చిన వివరాలు లభించి ఆర్టికల్ పూర్తి చేశాను .AI ని రెడ్డిగారి ఫోటో అడిగితె ‘’ఆ ఒక్కటీ అడక్కు ‘’అన్నట్లు సమాధానం చెప్పింది .అనుకోకుండా వెండి వెన్నెల ఇంటర్వ్యు లో రెడ్డిగారి ఫోటో చివరికి కనబడితే మా మనవడు చరణ్ కు చెబితే ఏదో తంటాలుపడి ఫోటో డెస్క్ టాప్ పైన సేవ్ చేశాడు .అఫోటో మీకు ఆర్టికల్ తో పాటు జత చేస్తున్నాను .ఇన్నాళ్ళుగా రెడ్డిగారి గురించి రాయాలనుకొన్న నా కల ఇలా నెరవేరింది
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-26-ఉయ్యూరు .
