మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -331

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -331

331-మీర్జాపురం రాజా ,కృష్ణ వేణి దంపతులకుమార్తే ,,చక్రధారి అనుబంధం నిర్మాత లక్ష్మీ కంబైన్స్ అధినేత్రి –ఎన్.అనూరాధా దేవి

ఎన్. అనూరాధాదేవి తెలుగు చలనచిత్ర నిర్మాత. బహుకొద్దిమంది మహిళా నిర్మాతలలో ఈవిడ ఒకరు. ఈమె మూడు తరాల హీరోలతో చిత్రాలను నిర్మించింది. ఈమె నిర్మించిన సినిమాలలో 80 శాతం విజయవంతమై స
జీవిత విశేషాలు
ఈమె 1947, అక్టోబరు 24న విజయవాడలో జన్మించింది. ఈమె తండ్రి శోభనాచల పిక్చర్స్ అధినేత మిర్జాపురం రాజాగా ప్రసిద్ధులైన రాజా వెంకట్రామ అప్పారావు. ఈమె తల్లి సుప్రసిద్ధ నటి, నిర్మాత సి.కృష్ణవేణి. ఈమె మద్రాసులోని గుడ్ షెపర్డ్ స్కూలులో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఈమెకు చదువు అబ్బకపోవడంతో అంతటితో ఆపివేసింది. ఈమెకు 1967లో వరంగల్లు వాస్తవ్యుడు నంగనూరు శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఈమె భర్త 2005లో మరణించాడు[1].

సినిమా నిర్మాణం
ఈమె తండ్రి మీర్జాపురం రాజా తన తరువాత కూడా చలనచిత్ర నిర్మాణ రంగ కార్యకలాపాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఈమెను నిర్మాతగా కొనసాగమని కోరాడు. అతనే లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనే బ్యానరు పేరు పెట్టాడు. ఈమె మొదట కన్నడ భాషలో రాజ్‌కుమార్ హీరోగా భక్త కుంబార అనే సినిమాను కలర్‌లో నిర్మించింది. ఈ సినిమా 1974లో విడుదలయ్యింది. తరువాత ఈ సినిమానే తెలుగులో చక్రధారి పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రీమేక్ చేసింది. ఆ తరువాత హిందీలో హిట్ అయిన సినిమా “సమాధి”ని నిండు మనిషి పేరుతో నిర్మించింది. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత ఈమె అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, చిరంజీవి, వడ్డే నవీన్, అబ్బాస్, రవితేజ, జె.డి.చక్రవర్తి మొదలైన హీరోలతో, దాసరి నారాయణరావు, ఎ.కోదండరామిరెడ్డి, సి.వి.శ్రీధర్, టి.ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది.

సినిమాల జాబితా
ఈమె నిర్మాతగా లక్ష్మీ ఫిలిం కంబైన్స్ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

  1. చక్రధారి (1977)
  2. నిండు మనిషి (1978)
  3. రావణుడే రాముడైతే (1979)
  4. శ్రీవారి ముచ్చట్లు (1981)
  5. రాముడు కాదు కృష్ణుడు (1983)
  6. అనుబంధం (1984)
  7. ఆలయదీపం (1985)
  8. ఇల్లాలే దేవత (1985)
  9. ప్రియా ఓ ప్రియా (1997)
  10. ప్రేమించేమనసు (1999)
  11. మా పెళ్ళికి రండి (2000)

క్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకుంది.

332-తెలుగు ,కన్నడ చిత్ర నిర్మాత ,తోడూ నీడా సినీ ఫేం –ఎన్.నిత్యానంద భట్

ఎన్.నిత్యానంద్ భట్ చలనచిత్ర నిర్మాత.

జీవిత విశేషాలు
ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారాడు. తన స్నేహితుడు ఎ.రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్.‌టి.ఆర్., భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించాడు[1].

ఫిల్మోగ్రఫీ
ఎన్.ఎన్.భట్ నిర్మించిన కొన్ని సినిమాలు:

తెలుగు
· తోడూ నీడా (1965)

· సుఖదుఃఖాలు (1967)

· భలే రంగడు (1969)

· సుగుణసుందరి కథ (1970)

· మూగ ప్రేమ (1971)

కన్నడ
· అత్తెగొందు కాల సొసెగొందు కాల (1968)

· శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)

· వీరాధివీర (1985)

· ఈ జీవ నినగాగి (1986)

· జీవనజ్యోతి (1987)

· ఒందాగిబాళు (1989)

· రెడీమేడ్ గండ (1991

· 333-సామాజిక చైతన్య సినీ నిర్మాత ,,శ్రీరాములయ్య ,జైబోలో తెలంగాణా నిర్మాత ,నటుడు ,నంది అవార్డీ,ఆస్కార్ స్క్రీనింగ్ కమిటి సభ్యుడు ,తెలంగాణా సినీ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ –నిమ్మల శంకర్

·

నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. జయం మనదే రా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. 2011 సెప్టెంబరులో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో [1][2] ప్రదర్శించబడింది.

జననం
గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో 1968 అక్టోబర్ 3 నా జన్మించాడు .[3]

సినీరంగం
దర్శకుడిగా
1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా,[4][5] భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

తెలుగు

  1. 2 కంట్రీస్ (2017)[6][7]
  2. జై బోలో తెలంగాణా – (04.02.2011)
  3. రామ్ -(30 మార్చి 2006)
  4. ఆయుధం -(2003)
  5. భద్రాచలం – (2001)
  6. జయం మనదేరా -(07.10.2000)
  7. యమజాతకుడు – (1999)
  8. శ్రీరాములయ్య – (28.09.1999)
  9. ఎన్‌కౌంటర్ – (14.08.97)

కన్నడ

  1. నమ్మణ్ణ (2005)

నటుడిగా
రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యాడు.

అవార్డులు
నంది అవార్డులు
· 2011 లో సరోజినిదేవి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడు – ఎన్.శంకర్‌ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు – గద్దర్.

పదవులు
· ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా

· నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)

· గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా

· తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)

· తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

హాస్యానందం

53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

 ప్రబంధాలలో

ఏ రసమైనా ఆభాస రూపం హాస్య కారణ మౌతుంది .మను చరిత్రలో వరూధిని అలాకావాల్సి ఉంది .కానీ కాలేదు పారిజాతాపహరణం లో సత్య, కృష్ణుని నారదుడికి దానం చేస్తుంది .అతని బరువు ఎంతో అంతధనం ఇచ్చి తిరిగిపొం.దాలి ఇదీ హాస్యం పుట్టించే చోటే కాని కవి అలా చేయలేదు భగవంతుడిని అపహాస్యం చేయలేడుకవి .ఉదాత్త విషయాలను తేలిక తనం తో పరామిర్శించటం తగనిపని అని ప్రబంధకవులు దాని జోలికి పోలేదు అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పూర్వకవుల నవ్వుటాలకు అనే మాటల్నికూడా పెదవి బిగబట్టి గంభీరంగా అ౦ టారేకాని తేలికగా అనరు .అది మడి కట్టిన హాస్యం అన్నారు బాధగా మాస్టారు .శశి రేఖా పరిణయం లో ఘటోత్కచుని మాయవలన లక్ష్మణకుమారుడికి శశిరేఖ కుందేలుగా, పిల్లిగా ,కోతిగా  భల్లూకం గా పాముగా కనిపిస్తుంది .నిజానికి ఇవన్నీ హాస్య జనకాలే .

 చంద్ర లేఖా విలాపం లో హాస్యముందని అ౦టారుకాని అందులో జుగుప్సాకరమైన వర్ణనలు చాలాఉన్నాయన్నారు గురూజీ ‘’పళ్ళు తోమడు .గుద ప్రక్షాళన చేయడు ‘’వంటివి .ఆపుస్తకం చదివి నవ్వుతాముకానీ ,అది వికారం తెప్పించేదేకాని నిర్మలమైన నవ్వు కాదన్నారు సార్.తర్వాత వచ్చిన రావణ దమ్మీయం అధిక్షేపకావ్యం హాస్యజనకం అన్నారని మాస్టారు చెప్పారు .

శతకాలు

చంద్ర శేఖర శతకం పామరుల భాషలో రాయబడింది .పామరుల నోళ్ళలో వికృతిపొందిన శబ్దాలను కవి ఉపయోగించాడు .వాటి సుస్వరూపం వెంటనే మనకు గుర్తుకురాదు .ఇది శబ్దాశ్రయహాస్యం .పుస్తకం అంతాఒకే తీరులో ఉండటంతో విసుగుపుట్టి పది పద్యాలతర్వాత చదవలేము అన్నారు మునిమాణిక్యం .ఈ భాషా వైపరీత్యం కొత్తదనాన్ని పోగొడుతుంది .చదవాలనే ఆసక్తీ నశిస్తు౦దన్నారు అనుభవంతో మునిజీ .

 సింహాద్రి నారసి౦హ శతకం  ,ఆంద్ర నాయక శతకం హాస్యాన్ని అందిస్తాయి జానపద గీతాలలోనూ హాస్యం ఉందన్నారు డా రామరాజుగారు .వదినా మరదళ్ళ  మధ్య ,అత్తా కోడళ్ళమధ్య జరిగే సంభాషణలలో కావలసినంత హాస్యం ఉందని ,దాన్ని ఎవరూ పోగు చేయలేదని ,చాలావరకు గాలికి కొట్టుకు పోగా ,కొంతవరకు జానపద సాహిత్యం లో ఇరుక్కుంది అని రామరాజుగారన్నారని మస్టారువాచ .పాతకాలపు పాటల్లోనూ హాస్యం ఉంది .మొత్తం మీద పూర్వ సాహిత్యం లో హాస్యం తక్కువే అని అంగీకరించాలి .గొప్పకవులేవరూ హాస్యం జోలికి పోలేదన్నారు మునిమాణిక్యంగారు .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-22-ఉయ్యూరు —

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.15వ భాగం.24.10.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

విజయ విలాసం.15వ భాగం.24.10.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దీపావళి భిక్ష

స్వాతంత్రం రాకముందు స్కూల్స్ నడవడానికి దసరా మామూలు లాగా దీపావళి భిక్ష జరిగింది  అని తెలుస్తోంది

ప్రజలు దీపావళి అతిగా ఖర్చు పెట్టకుండా భారతీయులు స్థాపించి నడుపుతున్న  బడులు, ఆశ్రమాలు  దీపావళి భిక్ష రూపం లో స్వీకరించి రసీదులు ఇచ్చేది. దసరా నుంచి దీపావళి వరకూ మూడు వారాలు జరిపినట్లు తెలుస్తోంది 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి గ్రామ, ఊరు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి భిక్షలు  జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఏడాది స్కూల్ నిర్వహణకు, విద్యార్థులకు కావలసిన ఫీజులు మొత్తం సేకరించేవారు. 

స్వాతత్రం వచ్చిన తరువాత దీపావళి భిక్షలు ఆగిపోయాయి అందువల్ల తరువాతి తరాలకు దీపావళి భిక్షలు అసలు తెలియదు 

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం థనం.15వ భాగం.24.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం థనం.15వ భాగం.24.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328
328-కర్తవ్యమ్ సినీ నిర్మాత –ఎ.ఎం.రత్నం
ఏ.ఎం.రత్నం (ఆంగ్లం: A. M. Rathnam) దక్షిణ భారతదేశానికి చెందిన సినీనిర్మాత. ఇతడు మొదట సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి తరువాత నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇతను శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇతని మొదటి సినిమా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇతని కుమారులు జ్యోతి కృష్ణ, రవికృష్ణలు కూడా సినీరంగంలోనే ఉన్నారు.
తెలుగు సినిమాలు
• ధర్మ యుద్ధం (1989)
• కర్తవ్యం (1990)
• పెద్దరికం (1992) – దర్శకత్వం
• సంకల్పం (1995) – దర్శకత్వం
• భారతీయుడు (1996)
• ఒకే ఒక్కడు (1999)
• ప్రేమికులరోజు (1999)
• స్నేహం కోసం (1999)
• ఖుషి (2001)
• నాగ (2003)
• 7G బృందావన్ కాలనీ (2004)
• బంగారం (2006)
• నీ మనసు నాకు తెలుసు
329–శ్రీరంజని కుమారుడు స్క్రీన్ ప్లే రచయితా సహాయ దర్శకుడు ,,ప్రమీలార్జు నీయం దర్శకుడు –ఎం.మల్లికార్జున రావు
ఎం.మల్లికార్జునరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖనటి శ్రీరంజని (సీనియర్) కుమారుడు.29-
జీవిత విశేషాలు
ఎం.మల్లికార్జునరావు 1923లో గుంటూరు జిల్లా, మురికిపూడి గ్రామంలో శ్రీరంజని, కె.నాగమణి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను నరసారావుపేటలో ఉన్నత విద్యను గుంటూరులో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేశాడు. ఇతడు గుంటూరు హిందూ కాలేజీలో చదివినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఇతని సహాధ్యాయి. అదే సమయంలో ఎ.సి.కాలేజీలో నందమూరి తారకరామారావు, కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్‌.శర్మ మొదలైన వారు చదివేవారు. ప్రతి యేటా జరిగే అంతర్ కళాశాల నాటకపోటీలలో ఈ యువకళాకారులు అందరూ కలిసి నాటకాలు వేసేవారు. “నాయకురాలు” నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు పాత్ర ధరించగా, ఇతడు బాలచంద్రుని వేషం వేశాడు. ఈ నాటకాన్ని మాధవపెద్ది గోఖలే దర్శకత్వం వహించాడు. ఇంకా ఇతడు విద్యార్థి దశలోనే వసంతసేన, పిచ్చిరాజు, విప్లవం వంటి నాటకాలలో అనేక పాత్రలను ధరించాడు. హిస్ట్రానిక్స్ సొసైటీ సెక్రెటరీగా అనేక సేవలను అందజేశాడు[1].
సినీరంగ ప్రస్థానం
తన తల్లి శ్రీరంజని (సీనియర్) ను సినిమా రంగానికి పరిచయం చేసిన పి.పుల్లయ్యనే ఇతడిని గొల్లభామ సినిమాలో కథానాయకి కొడుకు పాత్రలో నటుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. కె.వి.రెడ్డి ఇతడిని నాగిరెడ్డి, చక్రపాణిలకు పరిచయం చేయడంతో విజయా సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా తీసుకోబడ్డాడు. పెళ్ళిచేసిచూడు సినిమాలో ఎల్.వి.ప్రసాద్ క్రింద సహాయదర్శకునిగా ఇతనికి తొలి అవకాశం వచ్చింది. తరువాత ఆ సంస్థలో చంద్రహారం సినిమా వరకూ అన్ని చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలాగే అమరసందేశం సినిమాలో ఆదుర్తి సుబ్బారావు వద్ద, పెంకి పెళ్ళాం సినిమాలో కమలాకర కామేశ్వరరావు వద్ద, సతీ అనసూయ చిత్రంలో కడారు నాగభూషణం వద్ద, రక్త సంబంధం సినిమాలో వి.మధుసూధనరావు వద్ద పనిచేశాడు. చిత్రపరిశ్రమలోని అన్ని శాఖలలోను పనిచేసి మెలకువలను తెలుసుకున్నాడు. తన తల్లి పేరుమీద స్థాపించిన ఎస్.ఆర్.మూవీస్ పతాకం మీద నిర్మించిన ప్రమీలార్జునీయం సినిమా ద్వారా ఇతడు దర్శకునిగా పరిచయమయ్యాడు.
చిత్రాల జాబితా
• దర్శకుడిగా:
1. తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987)
2. రగిలే హృదయాలు (1980)
3. దొంగల దోపిడీ (1978)
4. మనుషులు చేసిన దొంగలు (1977)
5. బంధంగల్ బంధంగల్ (1976) (మలయాళం)
6. రక్త సంబంధాలు (1975)
7. పట్టాభిషేకం (1974)
8. కండవరుండో (1972) (మలయాళం)
9. కోడలు పిల్ల (1972)
10. బందిపోటు భీమన్న (1969)
11. చెల్లెలి కోసం (1968)
12. గూఢచారి 116 (1967)
13. అందరికి మొనగాడు (1971)
14. ముహూర్త బలం (1969)
15. ప్రమీలార్జునీయం (1965)
• నిర్మాతగా:
1. సితార (1980)
• రచయితగా:
1. చెల్లెలి కోసం (రచయిత)
2. ప్రమీలార్జునీయం (స్క్రీన్ ప్లే)
330-పార్లమెంట్ మెంబర్ ,నటుడు ,గీతాంజలి కరణం మల్లేశ్వరి సినీ నిర్మాత-ఎం.వి వి సత్యనారాయణ
ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సినీ నిర్మాత.[2] అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుండి ఎంపీగా గెలిచాడు.[3][4
జననం, విద్యాభాస్యం
సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో 1966 జూన్ 25న రఘునాయకులు ముళ్ళపూడి, పర్వతా యర్ధనమ్మ దంపతులకు జన్మించాడు. అతను ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. 1997లో ఎంవీవీ బిల్డర్స్ సంస్థను స్థాపించాడు. అతను విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించాడు.[5][6]
సినీ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై తెలుగు, కన్నడలో పలు సినిమాలను నిర్మించాడు. [7]
నిర్మించిన సినిమాలు
1. గీతాంజలి (2014) [8]
2. అభినేత్రి (2015)
3. శంకరాభరణం (2015)
4. లక్కున్నోడు (2017)
5. నీవెవరో (2018)
6. కవచ (కన్నడ – 2019)
7. కరణం మల్లేశ్వరి బయోపిక్ (2021)
నటుడిగా
1. శంకరాభరణం (2015)
2. లక్కున్నోడు (2017)
రాజకీయ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విశాఖ లోక్‌సభ కో ఆర్డినేటర్‌గా నియమితుడయ్యాడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.భరత్ పై 4414 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[9] అతనిని 2019 సెప్టెంబరు 15న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించాడు.[10]
సశేషం
దీపావళి శుభ కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 32- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం

52- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

భారతంలో భీముడు సౌగ౦ధికాహరణం కోసంపోతుంటే దారిలో హనుమ దారికి అడ్డంగా ఉంటె లెమ్మనమని అంటే, ముసలికోతిని లేవలేను నువ్వే ఎత్తి అడ్డం తొలగించుకోమంటే, భీముడు విశ్వ ప్రయత్నం చేసి తోకనుకూడా కదల్చ లేకపోయాడు .హనుమ మహా బలశాలి అని చెప్పటమే కవి ఉద్దేశ్యం. ఇది పరమ సత్యం .అతిశయోక్తికాదు .ఆదృష్టిలో ఇందులో హాస్యం లేదు .తోక ఎత్తకపోతే నవ్వేది పిల్లలు మాత్రమె .ఇందులో వికృతి, అసందర్భం లేనే లేవన్నారు మునిమాణిక్యం .

  తెలుగులో ఉత్తమకవులెవరూ హాస్యాన్ని పోషిస్తూ రచనలు చేయలేదు .అక్కడక్కడ కొన్ని చెణుకులున్నా,అది ఉత్తమ హాస్యం కాదు .నన్నయ భీముని వర్ణించే ఘట్టం లో రాసిన పద్యంలో హాస్య చాయలు కనిపిస్తాయన్నారు మాస్టారు .పదేళ్ళ భీముడిని ఎత్తుకొని కుంతీ దేవగృహానికి వెడుతుంటే ,పులిఎదురైతె భయపడి పసివాడిన జారవిడిస్తే ఒకరాతిపై పడితే ఆరాయి ముక్కలు చెక్కలయింది .బకాసుర వధ సందర్భంలో భీముడిని పంపే ఈవిషయం లో కుంతీదేవి ఈ సంగతి బయట పెట్టి ‘’వీడు పుట్టిన పదియవనాడు పెలుచ బడియె .నా చేతినుండి యప్పర్వతమున బడిన వాడి జేసి బాలకు నొడలుదాకి యాక్షణ౦ బ రాఎల్ల నుగ్గయ్యే జూవె ‘’అని అక్కడి బ్రాహ్మణ కుటుంబానికి చెప్పింది .ఈ సన్నివేశం నవ్వు పుట్టి౦చెదె కాని హాస్యంకోసం కవి రాయలేదు .భీరువు దీరుడిగా వృద్ధుడు యువకుడిలా మాట్లాడితే నవ్వు వస్తుంది .అంటే అసహజత్వం ఉంటేనే నవ్వు వస్తుంది అన్నారు గురూజీ .భీముడు బండెడు అన్నం తినటమూ నవ్వు పుట్టి౦చేదికాదు. ఒక వేళ నవ్వినా అది ఆశ్చర్యానికి  సంబంధించింది అన్నారు  మునిమాణిక్యం .

 పిల్లలమఱ్ఱి పినవీర భద్రుడు జైమిని భారతం లో ఉద్దాలకుని కధలో భార్యకు భర్త ఏమాట చెప్పినా వ్యతిరేకం గా  చేస్తుంది .మదడిధొవతి తెమ్మంటే సగం చింపి ఇస్తుంది .జపమాలిక ఇమ్మంటే తెంపి ఇస్తుంది .అతిధులు వస్తే గౌరవించమంటే అగౌరవం చేస్తుంది .ఇవన్నీ హాస్య జనకాలే. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానంలో  కలహ కంఠి చండిక కూడా ఇదేరకం .ఆమె మాటల్లో హాస్యం వెతుక్కొంటే దొరకచ్చు అని మునిమాణిక్యం గారువాచ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

రేపు నరకచతుర్దశి ,దీపావళి శుభా కాంక్షలతో

Posted in రచనలు | Leave a comment

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం

ధర్మవీర పండిత లేఖరాం

సికందరాబాద్ శ్రీ గాయత్రీ ఆశ్రమ ట్రస్ట్ అనేక సిద్ధాంత ,నీతి గ్రంధాలు ,మహాపురుషుల జీవిత చరిత్రలు ప్రచురిస్తూ 25వ కుసుమంగా ధర్మవీర పండిత లేఖరాం గారి జీవిత ప్రచురించింది .బలిదానం లో ‘’వీర తృతీయ ‘’గా ఉన్న లేఖరాం తన 39సంవత్సరాలజీవితం లో 20ఏళ్ళు వైదిక ధర్మ ప్రచారానికే అంకితం చేశారు .35వ ఏట వివాహమాడి ,అయిదేళ్ళయినా వివాహ జీవితం గడపని నిరంతర కార్యశీలి. ధర్మపత్ని లక్ష్మీదేవి కూడా త్యాగమయ జీవితం గడిపిన ఆదర్శ మహిళ.భయం ఎరుగని మేరునగధీరుడు లేఖరాం నేటి తరానికి ప్రేరణగా నిలిచారు .ఈమహామహుని జీవిత చరిత్రను హిందీలో త్రిలోక చంద్ర విశారద రాస్తే ,శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు తెలుగు అనువాదం చేశారు .1997లో ప్రచురింపబడిన ఈపుస్తకం ఖరీదు 3 రూపాయలు .

     రావల్పిండి జిల్లా పోఠోహార్ లో ,ఇప్పుడుగురుకులాలున్న చోట లేఖరాం వంశస్తులు ఉండేవారు .తాత మహతా నారాయణ్ సింహ్ తండ్రి సయ్యద్ పురగ్రామం లో స్థిరపడ్డాడు .ఈగ్రామం జీలం జిల్లా లో చక్వాల్ తాలూకాకు సుమారు 10కిలోమీటర్లదూరంలో ఎత్తైన కొండలమీద ఉంది .ఇక్కడే లేఖరాం జన్మించాడు .మూడువైపులా వర్షాకాల నదులు ప్రవహిస్తాయి. అయన శారీరక మానసిక స్థితిపై ఇవి గొప్ప ప్రభావం చూపాయి .దృఢమైన శరీరం ,తీవ్రమైన ఆలోచనలు ఆయనవి .

   జననం

లేఖరాం తాత కు మహతా తారాసి౦హ్ ,మహతా గండా సింహ్ అనే ఇద్దరుకొడుకులు .తారా సింహ ముగ్గురు కుమారులలో లేఖరాం 1859లో జన్మించాడు .ఇండియాలో ఆంగ్లసామ్రాజ్య స్థాపన తర్వాత ప్రజలనుంచి ఆయుధాలు లాగేసుకొన్నారు .ఆంగ్లేయులకు స్వయంగా ఆయుధాలు అప్పగించటం అవమానంగా భావించి వాటిని  పూంచ్ రాజ్యానికి తీసుకు వెళ్లి అమ్మేశారు .శ్యాం సిన్హ బ్రహ్మచారి. సిక్కు సామ్రాజ్యపతనం తర్వాత సాధువుగా మారాడు .దీనిప్రభావం లేఖరాం పై పడింది .

  విద్యాభ్యాసం జీవితం

ఆరేళ్ళ వయసులో లేఖరాం తండ్రి గ్రామపాఠలలో పార్సేఉర్దూ లు నేర్చాడు .చలాకీ కుర్రాడు . ,ఒకసారి విద్యాశాఖాధికారి వస్తే తన బుద్ధిబలం ప్రదర్శి౦చి ,అనెకబహుమానాలు పొందాడు .పెషావర్ లో ఉన్న పినతండ్రి  దగ్గరకు 11వ ఏట వెళ్ళాడు .ఆయన ఇతని విద్యకోసం ఒక ముస్లిం ఉపాధ్యాయుడిని నియమించాడు .ఆయన ముస్లిం భావాలు వ్యాప్తి చేస్తూడటం నచ్చక మానేశాడు .పినతండ్రి బదిలీ అయిన ప్రతి సారీ చదువుకు విఘాతకలిగి,చదువుసాగనందున స్వగ్రామానికి పంపెశాడుపినతండ్రి.14వ ఏట మళ్ళీ గ్రామపాఠశాలలో  చేరి చదివాడు .హెడ్ మాస్టర్ ఇతనిపై మంచి అభిమానం చూపేవాడు .

  ఇతడు చొక్కా గుండీలుసరిగ్గా పెట్టుకోనేవాడుకాదు .టోపీ ఊడినా సరి చేసుకొనేవాడుకాదు .ప్రతివిషయం చదివి స్వయంగా గ్రహించేవాడు  .కవిత్వంపై మక్కువకలిగింది .

పోలీసు ఉద్యోగం

21-12-1875న పెషావర్ లో పోలీసు ఉద్యోగంలో17వ ఏట  చేరి ,అయిదేళ్ళు పని చేశాడు .మనసు నిరంతర౦ ఈశ్వర లగ్నమై ఉండటం వలన ఉద్యోగం మానేశాడు .నిత్యభజనలు చేసే సిక్కు సిపాయి ప్రభావం ఇతనిపై పదడి ,నిర౦తర ఈశ్వరోపాసనలో గడిపాడు .నిత్యం గీత చదివేవాడు .శ్రీ కృష్ణునిపై అమిత భక్తి ఏర్పడింది .కృష్ణ నామ జపం అర్ధసహిత౦ గా  చేసేవాడు .ఉద్యోగం మానేసి బృందావనం చేరాడు .

  వైదిక ధర్మం వైపు దృష్టి మరలటం

  క్రమంగా అన్నిమతాలపై ప్రేమ భావం కలిగింది .పంజాబ్ సంఘ సంస్కర్త కన్హయాలాల్  అలక్ ధారి పుస్తకాలు చదివి మహర్షి దయానంద రచనలతో  పరిచయమేర్పడింది .అద్వైతం కనుమరుగైంది .మహర్షి గ్రంథాల అధ్యయనం చేసి వైదికధర్మ సేవకుడైనాడు

  పెషావర్ లో ఆర్య సమాజం

పండిత లేఖరాం ఆర్య సమాజ సిద్ధాంతాలపై జీవించాలని నిర్ణయించుకొన్నాడు .1880లో పెషావర్ లో ఆర్య సమాజాన్ని స్థాపింఛి ,మాయీ రంజీ ధర్మశాలలో ఉన్నాడు .దైనిక సమావేశాలు జరుపుతూ ధర్మాన్ని ప్రచారం చేశాడు .

  మహర్షి దర్శనం

దయానందసారస్వతం  చదివినప్పటినుంచీ ఆయన్ను ఎప్పుడు దర్శిస్తానా అని తహతహ లాడేవాడు .ఒక నెల సెలవు తీసుకొని అజ్మీర్ లో సేఠ్ ఫతెమల్ దేవిడీలో మహర్షిదయానందుని దర్శించాడు .వ్యాపక పదార్దాలైన ఆకాశం ,బ్రహ్మతత్వం ఒకే స్థానంలో ఎలాఉ౦టాయి  అని ఋషిని అడిగితె, ఆయన ఒకరాయిని చూపించి అందులో అగ్ని, మట్టి, పరమాత్మ ఉన్నాయాలేదా అని అడిగి ఒకసూక్ష్మ వస్తువు ఒక స్థూల వస్తువులో వ్యాపించి ఉంటుంది అని చెప్పగా పరమానందం పొందాడు లేఖరాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు  

Posted in మహానుభావులు | Leave a comment

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు

 సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22 

 సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22 

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326
• 326-బిజినెస్ మాన్ ,పైసా సినీ నిర్మాత ,ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్ –ఆర్ ఆర్.వెంకట్
• ఆర్.ఆర్.వెంకట్ తెలుగు సినిమా నిర్మాత. ఆయన పూర్తి పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రా రెడ్డి. వెంకట్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్ , డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించి, అనేక సినిమాలను డిస్టిబ్యూషన్ చేసి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు నిర్మించాడు. వెంకట్ 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
సినీ జీవితం
ఆర్ఆర్ వెంకట్ హిందీలో 2004లో ఏక్ హసీనా తి, 2012లో ‘డివోర్స్‌ ఇన్విటేషన్‌’ ఇంగ్లీష్ సినిమాను నిర్మించాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన తెలుగులో ఆహ్వనం పేరుతో రిలీజ్ అయిన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో రీమేక్ చేశాడు.
నిర్మించిన సినిమాలు
• పైసా (2013)
• ఆటోనగర్ సూర్య (2013)
• డమరుకం (2012)
• లవ్‌లీ (2012)
• పూలరంగడు (2012)
• డివోర్స్ ఇన్విటేషన్ (ఇంగ్లీష్ – 2012)
• బిజినెస్‌మెన్ (2012)
• మిరపకాయ్ (2011)
• డాన్ శీను (2010)
• ప్రేమ కావాలి (2010)
• కిక్ (2009)
• బహుమతి (2007)
• గుండమ్మగారి మనవడు (2007)
• విక్టరీ (సినిమా) (2008)
• మాయాజాలం (2006)
• జేమ్స్ (హిందీ – 2005)
• ఏక్ హసీనా తి (హిందీ – 2004)
• ఆంధ్రావాలా (2004)
• సామాన్యుడు (2006)
మరణం
వెంకట్ కొన్ని రోజులుగా కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‏, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‏లో 27 సెప్టెంబర్ 2021న మరణించాడు.[1][2][3]
• 327-చివరకి మిగిలేదిచిత్రనిర్మాత తెలంగాణా రాష్ట్ర రాజకీయ కురు వృద్ధుడు ,మాజీ మంత్రి –ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి
• మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడుగా పేరొందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి (1933 – ఆగష్టు 3, 2013) హైదరాబాదు రాష్ట్రానికి చెందిన తొలితరం కాంగ్రెస్ నాయకులలో ఒకరు
జననం
ఈయన యాదాద్రి – భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం అడ్డగూడూర్ గ్రామంలో 1933లో జన్మించారు.
ఉప్పునూతల రాజకీయ ప్రస్ధానం
ఈయన చిన్ననాటి నుంచి రాజకీయాల్లో చురుగ్గాపాల్గొని మంచినేతగా గుర్తింపు పొందారు. స్వంత గ్రామమైన అడ్డగూడూరులో సర్పంచ్‌ పదవి తో రాజకీయం ప్రారంభమైంది. రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా, రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా, ఏపీఐఐసీకి ఛైర్మన్ గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఛైర్మన్ గా పనిచేశారు. వీరు 1947 లో కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనా ఉద్యమమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. 1957 లో ఆంధ్ర ప్రదేశ్ లో స్నేహపూరిత వాతావరణం కొరకు సుహృద్భావ సందేశం పేరిట యాత్ర నిర్వహించారు. 1969 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969 నుండి 1972 వరకు చిన్న నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసి, 1974 నుండి 1977 వరకు అబ్కారీ, గనుల శాఖ మంత్రిలో పనిచేశారు.
ఆ తర్వాత మోత్కూర్‌ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కోని మరీ ముందడుగు వేసి తన సత్తాను చాటుకున్నాడు. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల లాబీయింగ్‌తో రాష్ట్రంలో రాజకీయాలను శాశించాడు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన ఆయన తనదైన శైలిలో ముందుకు సాగి అందరి మన్ననలు పొందాడు. తెలంగాణవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి నేతనైనా వ్యతిరేకించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. రెండుసార్లు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో 1973లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవుల మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.
రాజకీయాల్లో చక్రం తిప్పిన కురువృద్దులు.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేసుకున్న నేత.. జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్‌ నాయకులు.. ఢిల్లి పెద్దల లాబీయింగ్‌తో కాంగ్రెస్‌లో ఒకవెలుగు వెలిగిన సీనియర్‌ నేత.. పేరున్న తెలంగాణ వాది.. ఇలా సుదీర్ఘరాజకీయ అనుభవం గడించి రాజకీయ భీష్మాచార్యుడిగా పేరొందారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావుతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతగా జిల్లాలో చక్రం తిప్పారు. రెండు పర్యాయాలు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాలను శాసించారు.
జిల్లా కాంగ్రెస్‌లో మంచి క్యాడర్‌ను సంపాదించుకొని ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు డిసిసి అధ్యక్షుడుగా ఉన్న చకిలం శ్రీనివాసరావు, పురుషోత్తంరెడ్డికి వైరం ఉండేది. పురుషోత్తంరెడ్డికి టికెట్‌ రాకుండా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఆశీస్సులతో శ్రీనివాసరావు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేని ఆయన వ్యతిరేక శిబిరాన్ని నడిపాడు. పోటీ డిసిసిని ఏర్పాటు చేసి గిరిజననేత ధీరావత్‌ రాగ్యా నాయక్‌ను అధ్యక్షుడుగా ఎంపికచేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం చురుగ్గా సాగింది. 1999, 2004 మినహా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఏనాడు పొందలేదు. ఇండిపెండెంట్‌గా, రెబల్‌ అభ్యర్థిగా పోటీచేసి సిపిఐ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా వెనుతిరగని నేతగా ముందుకు సాగి రెండుసార్లు టికెట్‌ పొంది విజయం సాధించారు. దివంగత సిఎం వై.యస్. రాజశేఖరరెడ్డి క్యాబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే కురువృద్దులైన గాదె వెంకట్‌రెడ్డి, ఎం.సత్యనారాయణరావు లను మంత్రి వర్గంలోకి తీసుకొని ఈయనకు మొండిచేయి చూపించారు. ప్రత్యేక తెలంగాణ వాదిగా గుర్తింపు ఉండడంతో గమనించిన వైఎస్‌ తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ పదవిలో కొన్ని రోజులు పనిచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట నియోజకవర్గం నకిరేకల్‌ నియోజకవర్గం లోకి మారింది. ఆ నియోజకవర్గాన్ని ఎస్‌సిలకు కేటాయించారు. దీంతో పురుషోత్తంరెడ్డి భువనగిరి, ఆలేరు లలో ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కాని చివరకు తప్పుకొని తన అనుచరగణంగా ముద్రపడిన చింతల వెంకటేశ్వరరెడ్డికి భువనగిరి, బూడిద భిక్షమయ్య గౌడ్‌కు ఆలేరు శాసన సభ్యులుగా టికెట్‌ ఇప్పించారు. వారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించినా భిక్షమయ్యగౌడ్‌ గెలవడం, చింతల ఓటమిపాలయ్యారు.
వైకాపా పార్టీ
రాజకీయ చివరిలో, ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఉప్పునూతల 2012 వ సంవత్సరంలో వైకాసా పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేరారు. కాంగ్రెస్‌ శాసన సభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్‌, చింతలతో కొంత విభేదాలు తలెత్తడంతో ఆయన వారిని వ్యతిరేకించి పార్టీ మారారు. వైఎస్‌కు వ్యతిరేకిగా ఉన్న ఆయన విభేదాలతో వైఎస్‌ఆర్‌ సిపి తీర్థం పుచ్చుకోక తప్పలేదు. పార్టీలో చేరినా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోయారు.
నిర్మాతతో సినీ పరిచయం
సినీ రంగంలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. చివరకు మిగిలేది చిత్రాన్ని సావిత్రితో తీసి నిర్మాతగా సినీరంగంలో పరిచయం పొందారు. అప్పట్లో ఆ చిత్రానికి విశేష ఆదరణ పొంది నంది అవార్డు కూడా లభించింది. అయితే ఒకే ఒక సినిమా తీసి రాజకీయంపై ఉన్న మమకారంతో సినీ రంగానికి దూరమయ్యారు.
మరణం
గత కొంతకాలంగా అస్వస్ధతతో బాధపడుతూ హైదరాబాదు‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2013, ఆగష్టు 3 న, 80 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస వదిలారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం51- పూర్వ సాహిత్యం లో హాస్యం

హాస్యానందం

51- పూర్వ సాహిత్యం లో హాస్యం

మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను ఎక్కారట .ఆతొ౦దర, భయం లో గుర్రాలతోకవైపు ముఖం పెట్టి కూర్చుని దౌడు తీశారట .నవ్వు వస్తు౦దికాని ఇది ఉత్తమహాస్యం కాదన్నారు మాస్టారు .

ప్రతాపరుద్రీయం లో ఉదాహరణ –కొప్పులుపెట్టి కళ్ళకు కాటుకపెట్టి కృత్రిమ స్తనాలతో స్త్రీ వేషం ధరించి ప్రచ్చన్నంగా కాకతీయ ఆంధ్రనగర వీధుల్లో వెళ్ళే శత్రురాజుల్ని చూసి దుండగులు, విటులు వారి బట్టలూడదీసి కుచాలులాగి నీవిని తాకి హిహిహీ అని నవ్వారని హాస్యానికి ఉదాహరణ గా ఇచ్చారు .ఇదాహాస్యం అన్నారు గురూజీ .

రసగంగాధర౦ లో ‘’గోవు పృష్టభాగం దర్శనీయం .రాసభ పృష్టభాగం ఎందుకు దర్శనీయంకాడదు ?అని ఉదాహరణ.పేలవంగా జుగుప్సగా లేదా అంటారు మాస్టారు .రమణీయార్ధకంగా ఉండాలన్న కర్త ఇలా వెకిలి ఉదాహరణ ఇవ్వటం ఏమిటని బాధపడ్డారు .కనుక హాస్యానికికూడా కావ్య లక్షణాలు ఉండాలన్నారు సార్.జుగుప్సలేని సభ్యమైన రసజనకమైనచిత్తవృత్తిని కలిగించేది ఉత్తమహాస్యం అని నిర్వచించారు నరసింహారావు మాస్టారు

పూర్వకవులలో హాస్యం మృగ్యం కాదు కానీ చాలాతక్కువ .బహుశా హాస్యానికి ఆరోజుల్లో ఆదరణ లేకపోబట్టి ఆవైపుకు వెళ్లి ఉండరు .హాస్య శీలుడిని నటవిట విదూషకుల పాత్రలతో కలిపి కూర్చోబెట్టారు .అంటే పంక్తి బాహ్యుడిని చేశారన్నమాట అంతనీచంగా చూస్తె ఎవరు సాహసించి హాస్యం వండి వడ్డిస్తారు అన్నారు మాస్టారు .ఇంకోటి అనౌచిత్యం .కావాలని ఏకవీ అనౌచిత్యాన్నిప్రవేశ పెట్టడు .దాన్ని సవ్యంగా సరసంగా సుందరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు.డో౦క తిరుగుడుగా చెప్పి నవ్వించే ప్రయత్నం చేయడు అని వారి తరఫున వకాల్తా పుచ్చుకొన్నారు మాస్టారు .

పోనీ నాటకాలలో హాస్యం ఉందేమో అని వెతికితే ఆదిదొరకదు .పూర్వ పండితులుకవులూ హాస్యాన్ని గొల్లభాగోతులకు కేతిగాళ్ళకీ ,భండిక జనానికి గంధోలి గాళ్ళకు ఇచ్చేసి తాము గంభీర రచనలు చేశారు .నాటకపాత్రలూ హాస్యం మాట్లాడరు .నాయకుడుకానీ నాయిక కానీ చమత్కారంగా మాట్లాడరు అని నొచ్చుకొన్నారు.

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-22-10-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం
  ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా సాహిత్యలోకానికి అపూర్వ కానుకగా షోడశ కళా ప్రపూర్ణ౦గా  తామువ్రాసిన 16 అమూల్య వ్యాస రత్నాలహారాన్నికూర్చి ,తమ భాషా శాస్త్ర బోధకులు ఆచార్య తూమాటి దొణప్ప గారికి అంకితమిచ్చి గురుభక్తిని ప్రదర్శింఛి ,నాకు ‘’ఆత్మీయత తో ‘’అ౦పి౦చగా ,నాలుగు రోజులక్రితం అంది, వెంటనే వాట్సాప్ మెసేజ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాను .
  ఇందులో మొదటి అయిదు వ్యాసాలూ సాహిత్య శిరోమణులగురింఛి పరిచయంగా రాసినవి .తర్వాత నాలుగు సంస్కృత సాహిత్యానికి ,మిగిలినవి తెలుగు సాహిత్యానికి సంబంధించినవి . 
ఆచార్య పింగళి లక్ష్మీ కా౦త౦ గారిగురించిన పరిచయంలో గురువు చెళ్ళపిళ్ళ వారిచే కవిగా గుర్తింపబడిన సందర్భంలో చెప్పిన ‘’అ౦కిలిమాంచి భాగవతమౌ పలుకున్ వెలయించి ,పల్కులో వంకలు దీర్చి దిద్ది రసవంతం గా ‘’తీర్చితనను  దిద్దారని కొనియాడారు .ఆంధ్ర విశ్వ కళాపరిషదా౦ధ్ర శాఖా ధ్యక్ష పదవి ని అలంకరించటంలో వారిప్రతిభ సర్వతోముఖ వికాసం పొందింది .వారు నిర్ణయించిన పాఠ్యప్రణాళికలోని ఆంధ్రసాహిత్య చారిత్ర ,ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య విమర్శన విధానం సంస్కృత సాహిత్య వ్యాకరణ పరిజ్ఞానం తెలుగులో ఛందో వ్యాకరణ అలంకార గ్రంథాధ్యయనం అయన వైదుష్యానికి నిదర్శనం .ఆయన ఘనుడు ,అల్పుడు అనే భేదం లేని శిష్యవాత్సల్యులు .గురువులకు ,దేవుడికి కాక ఇతరులకు మొక్కని వ్యక్తిత్వం కలవారు .వారికుమారులు తండ్రిగారి సాహిత్య వరివస్యపై ప్రసిద్ధ పండితులచే పరిశోధనాత్మక వ్యాసాలు  రాయించి ‘’రసజ్ఞ’’గా ముద్రించి పిత్రూణ౦  తీర్చు కొనటం ప్రశంసార్హమన్నారు .
ఆచార్య శిరోమణి శ్రీ గంటి జోగి సోమయాజి తెలుగు సాహిత్యాన్నిఅధ్యయనం చేసేటప్పుడు ,ఆ భాష పుట్టు పూర్వోత్తరాలు, పొందిన క్రమ పరిణామ వికాసం ప్రాధాన్యం వహిస్తుందని గుర్తించిన విలక్షణ  ప్రతిభాశాలి అని శ్లాఘించారు .విషయ సమగ్రత ,బోధనాపటిమ ఆయన విశిష్ట లక్షణాలు ఆంద్ర భాషా వికాసం బోధించటం ఆయనకు మహా అభిరుచి . కరతలామలకం.ప్రతి సూక్ష్మ విషయాన్నీ పరిశోధనాత్మకంగా దర్శిస్తారు .భాషాధ్యయనం ప్రత్యేకంగా చేయమని ప్రోద్బలం కలిగించగా శిష్యులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ,ఆచార్య దొణప్ప,ఆచార్య పి.ఎస్.సుబ్రహ్మణ్యం, ఆచార్య చేకూరి రామారావు భాషా శాస్త్రంలో విశేష పరిశ్రమ చేసి లోక ప్రసిద్దులయ్యారని జ్ఞాపకం చేశారు .యూనివర్సిటీలోఅధ్యాపకులుగా ఉన్నప్పుడే వివిధ సంస్థలలో విశిష్ట సభ్యత్వం పొందటానికి కారణం ఆయన భాషా శాస్త్ర పరిజ్ఞానమే అన్నారు .ఆయనరాసిన  ‘’ఆంధ్ర భాషా వికాసం’’వెలుగులిచ్చే గొప్పకరదీపిక .తెలుగు ఉపన్యాసకునికి ఆంగ్ల,గణిత ,భౌతికాది శాస్త్ర బోధకులతో సమాన వేతనం పొందటానిముఖ్యులు సోమయాజిగారే అన్నారు .
అభినవ వాగనుశాసన శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు ‘’వేలలో ఒకపండితుడు పుడతాడు ‘’అన్న ఆర్యోక్తికినిదర్శనం .తాను  రచించిన ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’ను తమ గురుదేవులు నడిచే మహా విద్యాలయమైన’’కడి యెద్ద జన్మించి కాశికాపురికేగి శబ్దాది శాస్త్రాలు ‘’సంతరించిన బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారికి అంకితమిచ్చారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం లో తెలుగు లో పండితపదవిలో రాణించారు .ఐ.పి.ఎస్.  పరీక్షాధికారిగా పని చేయటం వారి ధిషణకు తార్కాణ.సంస్కృతాంధ్రాలలో బహు గ్రంథాలు రాశారు .ఆంధ్ర భవిష్య రచనలో శ్రీనాథుని అనుకరిస్తూ తమ రచనా వ్యాసంగాన్ని పద్య నిబద్ధం చేసి –‘’తెనిగించి విదురనీతి బూర్తిగామున్ను –స్త్రీ ధర్మబోదినీ కృతి యొనర్చి ‘’—‘సురభారతిని ‘’బ్రహంసూత్రార్ధ దీపిక ‘’అంటూ తమరచనలనూ వాటితత్వాన్నీ సూత్రప్రాయంగా సూచించారని వేదులవారన్నారు .శాస్త్రిగారు పవిత్ర శీలురు స్వతంత్రులు .శిష్యవాత్సల్యం అపారం. అనేక పురస్కారాలు, రాజాస్థాన గౌరవాలు పొందారు .
చతురవచస్వి ,చారుమనస్వి ,చిరయశస్వి ఆచార్య యస్వీ జోగారావు  అనే శిష్ట్లా వేంకట జోగారావు  గారు ఆంధ్రవిశ్వ విద్యాలయ యశశ్చంద్రికలను నాల్గు దిక్కులా విస్తరింపజేశారు తండ్రిపై ‘’పంచ కల్యాణి ‘’కృతిలో పద్య ప్రశంస చేశారు .యక్షగాన వాజ్మయంపై విపుల పరిశోధన చేశారు .గురువులు కళాప్రపూర్ణ గంటి జోగి సోమయాజి గారి ని స్తుతిస్తూ –‘’బహుభాషాబహుశాస్త్ర బంధుర మహా వైదుష్య మత్యద్భుతావహ మేధావధి ‘’అన్నారు .లెక్చరర్ గా చేరి ప్రొఫెసర్ ,హెడ్ ఆఫ్ దిడిపార్ట్ మెంట్ గా 30 ఏళ్ళు  ఆంధ్రవిశ్వవిద్యాలయ౦  లో పని చేశారు .ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందారు .సాహిత్యవిమర్శ బోధన మహ ఇష్టం. పద్య గేయ నృత్యనాటికలెన్నో రాశారు .’’నాది రసరాజ్యమార్గము ,ప్రాతయనిపించు సరికొత్త పదము నాది ‘అని చాటుకొన్నారు నిజంగా ఆయన ప్రతివాక్యమూ రసరమ్యమే అని నాకూ అని పించింది .ఆంధ్ర కావ్య మహాస్రష్టలలో  –నాకు నచ్చిన శిల్పులు నల్వురేను –తిక్కయజ్వ ,సూరన్న ,సుధీశ్వరుండు –విశ్వనాథ మహాకవి యస్విసుకవి ‘’అని తననుకూడా కలుపుకొని ‘’హలో భగవాన్ ‘’లో భంగ్యంతరంగా  చెప్పారు .లండన్ కెనడా మలేషియా సింగపూర్ సందర్శించారు తెలుగు అకాడెమి గవర్నర్ గా ఎన్నుకోబడ్డారు .మద్రాస్ తెలుగు అకాడెమి ,కేంద్ర సాహిత్యేకాడేమి లచే సత్కారం పొందారు .గుంటూరుజిల్లా రచయితల సహకార సంఘానికి అధ్యక్షులు రోటరీ డిస్ట్రిక్ట్ 315కి ఆస్థాన కవి .
బ్రాహ్మీ భూషణ రాంభట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారు మహావక్త ,పౌరాణిక పండితాగ్రగణ్యులు  .మురారి అనర్ఘ రాఘవాన్ని అనువదించారు .ఆయన రచనా వ్యాసంగం బహుముఖీయం బహు శ్లాఘనీయం అన్నారు .అపూర్వ కల్పనా సనాథనంగా ‘’ప్రతీక ‘’నాటకం వారి రచనాకౌశలాన్ని వెల్లడిస్తుంది .అహోబల పండితీయం కు రాంభట్ల వారి అనువాదం విద్వజ్జన సమాదరణీయం కాని ముద్రణ భాగ్యం పొందలేదని బాధపడ్డారు .వేదాంత మంత్ర శాస్త్ర గ్రంథాలను అనువదించి వ్యాఖ్యానించి స్వతంత్రంగా రచించిన శాస్త్రిగారు చిరస్మరణీయులు అన్నారు శ్రీ వేదుల .
  ఈ వ్యాసాలలో మనకు తెలియనివి వారికి అనుభవమైనవి ఎన్నో విషయాలు ఉటంకించారు వారిపై గౌరవం ఇనుమడింపజేశారు శాస్త్రిగారు
  తర్వాత సంస్కృత సాహిత్యానికి చెందిన సంస్క్రుతభాగవతం అవతారిక ,శ్రీదేవీ భాగవతం సంక్షిప్తపరిచయం ,ఊరుభంగ నాటకం భాసుని ఉపజ్ఞ ,స్వప్న వాసవదత్తం ,అభిజ్ఞాన శాకుంతలం రచనా సంవాదాలు ,.ఆతర్వాత తెలుగు సాహిత్యానికి చెందిన సాహిత్యాభిరుచి ,కవిత్వ తత్వ మీమాంస ,రుషి వంటికవి నన్నయ్య రెండవ వాల్మీకి ,తిక్కన్న శిల్పపు దెనుగు తోట ,హరివంశం ఎర్రన కవితా వైభవం ,దూబగుంట నారాయణకవి పంచతంత్రం ,మనుచరిత్రం మన చరిత్ర వ్యాసాలున్నాయి అన్నీ అన్నే .అన్నీ ఆచార్య సార్వభౌమ వేదులవారి సర్వతోముఖ పాండిత్యానికి విమర్శనానికి విశ్లేషణకు,బహుకాల బోధనా ధిషణకు  ,అనుభవానికి ప్రతీకలే  .చదివి ఆనంది౦చాల్సినవే. విజ్ఞానం పెంచుకోవాల్సినవే .వారి కలం తాకితే ఏ వ్యాసమైనా సువర్ణం కావాల్సిందే .వారికలం పరుసవేది .వారిగళ౦ సాహితీ పుంస్కోకిలం .చక్కని ముద్రణ ,దంపత్యుక్తమై అర్ధవంతమైన ముఖ చిత్రం పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి .
  ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు   శతాధిక ఆయుర్దాయం తో ,దంపత్యుక్తంగా ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఇతోధిక సాహితీ సేవ చేస్తూ వారి ‘’శారదా పీఠం’’నిరంతర విజ్ఞాన తేజో పుంజాలను వెదజల్లాలని ఆశిస్తున్నాను .
   దీపావళి శుభా కాంక్షలతో
  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ విలాసం.13వ భాగం.22.10.22

విజయ విలాసం.13వ భాగం.22.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ శూన్య లింగ శతకం

శ్రీ శూన్య లింగ శతకం
కాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస పద్యం లో –‘’ననునేల భయమేల నయశీల రావేల –చీటికిమాటికి మూల గ్రాలనేల ‘’అంటూ నెపం తో మొదలెట్టి ,గీతపద్యం లో –‘’పలుకవేల శ్రీలోల నన్ దలపవేల –సహజ యోగానంద జలధి లోల ‘’అని, రెండవ సీసం లో –‘’శ్రీరామ యని నిన్ను బ్రేమగా బిల్చెదనన్న –నామ రూపములు నాస్తి కన్న-వైకుంఠ నిను గాంచి వర్ధిల్లెద నటన్న –లోకాళితో బొత్తునీకు సున్న’’అని వ్యాజంతో అంటూ కానుకలిచ్చి ఘనత చెందుదామంటే కామాది వాసనలు కల్ల – భక్తితో ప్రణమిల్లుదామంటే ఒక్క చోటా నీకు కాలునిలువదాయే,పాహిమాం అందామంటే తలపులు కలలోని మాటలే –‘’సీతమ్మతో జెప్పి చెంత చేరెదనన్న –తలపదు నా మాట కలియనిన్ను ‘’అని గీతం లో –‘’నీవు నన్నెట్లు గాచేదో నిర్వికార –నయన పథచార రాగాది భయవిదూర –త్రిపుర సంహార యో వీర ధీర ధీర –భౌమ శబ్దార్ధ సువిచార స్వా విహార ‘’అని తన వేదాంత పరిజ్ఞానమంతా వలకబోసి, చెప్ప బోయేదానికి నాందీ ప్రస్తావనగా చేశారు .అసలు శతకమంతా గీత పద్యాలలో కూర్చి ‘’సుభగ పుష్ప భ్రు౦గ శూన్యలింగ ‘’అని మకుట కిరీటం పెట్టారు .
శతకాన్ని తారక యోగంతో ప్రారంభించి ‘’భక్తికలుగు పూజ పరమపదమునిచ్చు ‘’అంటూ ,కర్మ చేస్తే ముక్తి రాదు జ్ఞానమార్గంతో సద్గురునివలన చిత్తశుద్ధికలుగుతుంది .మూర్తి ఆరాధనతో శివుడిని కొలిస్తే ‘’మూర్తి విడిచి మూల మూర్తి తానౌను ‘’అన్న ఎరుక చెప్పారు .అణోరణీయాన్ మహతో మహీయాన్ ‘’అనే భావన చక్కని పద్యంలో కూర్చి ‘’శ్రుతులు కూడా నిన్ను నుతియి౦ప జాలవు ‘’అన్నారు .చిత్త శుద్ధి లేనిది ఏదీ సాధ్యం కాదు అని మరీ మరీ చెప్పారు .చిత్ర చిత్ర కళలు చిత్ర విభ్రమాలు –‘’పండు వెన్నెల తుది నిండి యున్న రూపులేనికళను రూపించి చూడు ‘’అన్నారు .ధీయోగి నాద సూత్రం తెలుసుకొని నాదలయం లో మోదించి నిలుస్తాడు’’.అవ్యక్త స్థితినే బిందు అంటారు .బుద్ధిని దాటితే అంతా పూర్ణమే.యోని లింగైక్యం శివుని చేరుస్తుంది .స్త్రీపురుషులు ఒక్కరవటమే ‘’పరగ నద్వైతము ‘’’’మరుని క్రతువుకన్నా మారులేదు ‘’.’’సతిని గూడ ముక్తి –సతిని వీడితెబంధం ‘’ హఠంలో అష్ట సిద్ధులు కల్గుతాయి .యోగం అభ్యసించి భోగం వదిలితే మనసు చిక్క బట్టితే అంతా ఆనుకూల్యమే .
తర్వాత సాంఖ్యయోగం వివరించారు –‘’సృష్టిజాడ సృష్టికర్తకేతెలుసు –శ్రుతులు భిన్నరూపంగా చెప్పాయి .’’లేనిదాని నెట్లు లెక్కింప భయం ‘’దేనికి ?జగత్తు స్థూలం .తత్త్వం సూక్ష్మం.ఉన్నదానిను౦చేఉత్పత్తికాని, శూన్యంలో సృష్టి జరుగుతుందా ?తలిదండ్రిలేక సంతానం ఉంటుందా ?’’.కార్యజగము కాదు కారణాత్మ కాదు .చిత్రం ఏమిటో చెప్పలేము –‘’తెచ్చుకొన్న ముండ తిప్పలు పెట్టదా?’’అని నీతి చెప్పారు .’’దేహ సాక్షి అంటే దేహం తానూ అవటమే ‘’దృక్కు బ్రహ్మమౌను –దృశ్యంబు జగమౌను …సత్తు చిత్తూ సకలం తానె ‘’ ‘’
తర్వత ‘’అమనస్క యోగం ‘’వివరించారు –‘’మానసంబు చేత గానవచ్చు జగము –మనసు గలియకున్న గనుట లేదు –మనసే చూడటానికి దృశ్యజాలం అవుతుంది .మనసును తెలుసుకొన్న వారెవరూ లేరు .అన్నిటికీ మనస్సాక్షి ముఖ్యం .దినదినం లో సుషుప్తి తేజరిల్లుతుంది .జన్మజన్మాల మధ్యా చావు ఉంటుంది ..సహజ రాజయోగ సారమే మనిషి ..జగం వేరే కాదు జగమంతా బ్రహ్మమే .జగత్తు బ్రహ్మంలో పుట్టి బ్రహ్మ లో కలిసిపోతుంది .దేహంలోనే ముక్తి దేహాంతంలో కూడా ముక్తి –కనుక నేలవిడిచి సాము వద్దు ..తనను తానటంచు దగగాంచ ముక్తుడౌ.’’సార మెద్ది జ్ఞాన రూపం బెద్ది –యాదికాది కెద్ది యఖిల మెద్ది –యెద్దిబుద్ధి నడపునద్దియే బ్రహ్మంబు ‘’అని అసలు సూక్షం ఆవిష్కరించారు ‘’’తలప నీశు డౌను తత్పద వాచ్యంబు –తత్పరు౦డజుడు తత్పద లక్ష్యంబు ‘’బ్రహ్మాన్ని తెలిసినవాడు బ్రహ్మమే అవుతాడు –నువ్వు నేను లేని నిలకడ బ్రహ్మం ‘’అని ఉపనిషత్ ఉపదేశం అందించారు
99వ పద్యంలో –‘’సకల నిగమ రూప సారసంగ్రహ మూర్తి –యంగలింగ రూప లింగమూర్తి –సకల హృదయ గమ్య చైతన్య సత్కీర్తి –సుభగ పుష్పభ్రు౦గ శూన్యలింగ ‘’100వ చివరి పద్యం –‘’ఆశ్రిత జన రక్షణానంద సుముఖా౦గ -నిజ సులభ సుఖ జలనిధితరంగ –ద్వయ రహితసుభాంగ భావ వర్జిత సంగ –సుభగపుష్ప భ్రుంగశూన్య లింగ ‘’అని పూర్తిచేశారు ‘.
చివరలో గద్యం రాసి ‘’ఇది శ్రీ పరమేశ్వరీ పరమేశ్వరైక్య స్వరూప భూత ,విద్వాదనుభవ సిద్ధ సహజామనస్క –రాజయోగ సారామృత నిరంతర పానానంద విరాజిత ,నిముస కవి వంశ పారావార రాకాసుధాకర శ్రీ మల్లప రాజామాత్య శేఖర శ్రీ మత్సద్గురు చరణారవింద ,కరుణా కటాక్ష లబ్ధజ్ఞాన ,ఓలేటివంశ పవిత్ర శ్రీసూర్య నారాయణ మంత్రిపుత్ర శేషమాంబా శుక్తి ముక్తాఫల సుబ్బారాయ విరచిత శ్రీ సీతారామ సంవాద సార సంగ్రహ రూప శ్రీ శూన్యలింగ శతక రాజంబు సర్వంబు శ్రీ పరదేవతార్పణమస్తు –శ్రీ శ్రీశ్రీ .
అని తన ప్రవర తెలియ జేశారు కవి .హెడ్ క్లార్క్ ఇంతటి ఘనమైన తత్వాన్ని అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు ,ఆరుచిని తేనే మాధుర్య శైలిలో రంగరించి మనకు అందించారు .మనముందు అసలు ‘’సీతారామాంజనేయ సంవాద౦’’దాన్ని ప్రతిపద్య మాధుర్య ఫలభరిత౦గారచించిన శ్రీ పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి దర్శన మిస్తారు .ఆగ్రంథాన్నీ ఆకర్తను మన ముందుంచారు ఈశతకం ద్వారా మనకవి శ్రీ ఓలేటి సుబ్బారావు గారు .ఓలేటి వారు అంటే సాహిత్య ,కవనాలను ‘’ఏలేటి వారు ‘’ అని వీరూ రుజువు చేసుకొన్నారు .
ఈ శతకం మన వాళ్ళ దృష్టిలో పడిన దాఖలా నాకు కనిపించలేదు .ఈ శతకకర్తనూ, శతకాన్నీ పరిచయం చేసి నేను అదృష్ట వంతుడినయ్యాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు ‘’..

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323

323-శుభలగ్నం నంబర్ వన్ సినీ నిర్మాత,అనేక అవార్డులగ్రహీత  –అడుసుమిల్లి వెంకటేశ్వరరావు

అడుసుమిల్లి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత. నిర్మించిన తక్కువ చిత్రాలతోటే ఎక్కువ ప్రజాదరణ పొందిన నిర్మాత ఆయన.[1]

జివిత విశేషాలు

వెంకటేశ్వరరావు నంబర్‌వన్‌, శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు.[2]

మరణం

ఆయన అనారోగ్యంతో బుధవారం ఆగష్టు 19 2015 న మృతిచెందారు.పేగు సంబంధిత సమస్యతో బాధపడుతూ కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. [3

324-దూకుడు సినీ నిర్మాత రచయితా ,దర్శకుడు  –అనిల్ సుంకర

అనిల్ సుంకరతెలుగు సినిమా నిర్మాతరచయితదర్శకుడు. ఇతడు నిర్మించిన దూకుడు సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది.[1][2]

సినిమారంగం

అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ1 – నేనొక్కడినే, లెజెండ్ఆగడుకృష్ణ గాడి వీర ప్రేమ గాథహైపర్లై మొదలైన సినిమాలను, ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్ఆహా నా పెళ్ళంటయాక్షన్ 3D, జేమ్స్ బాండ్రన్ఈడోరకం ఆడోరకంఈడు గోల్డ్ ఎహెకిట్టు ఉన్నాడు జాగ్రత్తఅంధగాడుకిరాక్‌ పార్టీరాజుగాడుసీతచాణక్య మొదలైన సినిమాలను నిర్మించాడు. 2013లో యాక్షన్ 3D చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహాసముద్రం సినిమా, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మాణ దశలో ఉన్నాయి.[3][4][5]

సినిమాలు

నిర్మాతగా

క్రమసంఖ్యసంవత్సరంసినిమా పేరు
292021మహాసముద్రం
282020సరిలేరు నీకెవ్వరు
272019చాణక్య
252019సీత
242018రాజుగాడు
232018కిరాక్‌ పార్టీ
222017లై[6]
212017అంధగాడు
202017కిట్టు ఉన్నాడు జాగ్రత
192016ఈడు గోల్డ్ ఎహె
182016హైపర్
172016సెల్ఫీ రాజా
162016ఈడోరకం ఆడోరకం
152016రన్
142016కృష్ణ గాడి వీర ప్రేమ గాథ
132015రాజు గారి గది
122015జేమ్స్ బాండ్
112014ఆగడు
102014పవర్
92014లెజెండ్
82014చందమామ కథలు[7]
720141 – నేనొక్కడినే
62013యాక్షన్ 3D
52012వెన్నెల 1 1/2
42011దూకుడు
32011ఆహా నా పెళ్ళంట
22010నమో వెంకటేశ
12010బిందాస్

దర్శకుడిగా

·         యాక్షన్ 3D (2013)

అవార్డులు

·         ఉత్తమ చిత్ర విభాగంలో సినీ’మా’ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్రంగా సైమా అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్ర విభాగంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు (2013): దూకుడు

·         తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం (2015): చందమామ కథలు

325-టెన్త్ క్లాస్ ,నోట్ బుక్ సినీ దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత–చందు

చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

జీవిత విషయాలు]

చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.

సినిమారంగం

2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]

సినిమాలు

దర్శకుడిగా

·         టెన్త్ క్లాస్ (2006)[3]

·         నోట్ బుక్ (2007)

·         ప్రేమ ఒక మైకం (2013)

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

·         కళ్యాణ రాముడు (2003)

·         సాంబ (2004)

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 50- అభి యుక్తోక్తి

హాస్యానందం

50-  అభి యుక్తోక్తి

అభియుక్తుడు అంటే పండితుడు ,అనుభవమున్నవాడు అనేమాటను అభియుక్తోక్తి అంటారని ఇంగ్లీష్లో ఎపిగ్రం అంటారని మునిమాణిక్యం గారన్నారు .జ్ఞాని తననుభావాన్ని మాటున పెట్టి అన్నమాటగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్కమాటలో ఎంతో అర్ధం ఇమిడి ఉంటుంది మనల్ని ఆమాట ఆశ్చర్య చాకితుల్నీ  చేస్తుంది .ఆమాట వింటే పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది అన్నారుమాస్టారు .అది చురుక్కున తగిలి గాటు పెట్టచ్చుకూడా .కానీ చమత్కారం తళుక్కున మెరుస్తూ బాధ అనిపించదు .ఉదాహరణ –1-ఆడవాళ్ళను అడిగి చూడు సలహా –ఆచరణలో మాత్రం ఏదైనా చేయి అది మినహా ‘’2-ప్రేమతో వచ్చింది ఒక్కటే ఇక్కట్టు  -సుఖదుఖాలమధ్య అది సీజను టికెట్టు3-దయ్యలవంటిదంటాను నిజమైన మక్కువ –లోకం లో ఇది కనబడేది తక్కువ వినబడేది ఎక్కువ 4-అసలు అడ్రసు లేనివాడు అడవారకం –రెండు అడ్రసులు ఉన్నవాడు భడవారకం 5-పాతదన్నది ఎల్లను మారుతుంది-కొత్తడానికి చోటిచ్చి తీరుతుంది 6-వట్టి గొద్దుకు అరుపులెక్కువ –మట్టి బుర్రకు మాటలెక్కువ ‘’.

మణిప్రవాళోక్తి-

రెండుమూడు భాషలపదాలు కలిపి చేసిన రచనను మణిప్రవాళం అంటారు .సంస్కృతం తెలుగు కలిపి అలాంటి రచనలు పూర్వం వచ్చాయి .ఇప్పుడు తెలుగులోనూ బాగానే వస్తున్నాయి అన్నారు గురూజీ .ఉదాహరణలు -1-తండులాలు గృహమందు నసంతి –తి౦డికైతే పది మంది వసంతి .పెద్దగా హాస్యం పండని కొన్నిటిని ఆయనే ఉదాహరించారు .2-రేరే గజ్జలిగా కిమస్తి నగరే –ఏమబ్బ ఎపుడోస్తిరి ?

విశేషోక్తి

అనేకకారణాలున్నా కార్యం జరగకపోవటం అని అర్ధం అన్నాడులక్షణకర్త .కానీ దీన్ని హాస్యంలో వాడితే ఎలాఉంటుందో శా౦పిల్స్ ఇచ్చారు -1-పల్లం ఉన్నా పారదు నీరు –నాలుకున్నా మాట్లాడదు నోరు .కవులు శ్లేషతో విశేషోక్తి సాధిస్తారు దాని స్వరూపాన్ని తాను  కొద్దిగా మార్చి విశేషోక్తి సాధించానని చెప్పి మాస్టారు స్వంత ఉదాహరణలు ఇచ్చారు .1-ఎరువు వేసినా ఎదగదు మా గులాబిమొక్క –మందలు తిన్నా కుదరదు మావాడి తలతిక్క 2-వాకిలి ఉన్నా తలుపులు లేవు-కురుపులుఉన్నా సలుపులు లేవు 3-ఎర్రగా బుర్రగా ఉన్నది ఏమితక్కువ ?-ఏలనన్నాడు మగడు తెలివి తక్కువ .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషంమీ –గబ్బిటదుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం.12వ భాగం.21.10.22

విజయ విలాసం.12వ భాగం.21.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సుబుద్ధి శతకం  

సుబుద్ధి శతకం  

గుంటూరు తాలూకా గారపాడు వాసి ఖాసీం ఆలీషా కవి సుబుద్ధి శతకాన్ని రచించి గుంటూరు కన్యకా ముద్రాక్షరశాలలో 1924న ప్రచురించారు .ఈకవి మణిమంజరి నాటకం ,కొండవీటి చరిత్ర మొదలైన రచనలు చేశారు.వేద విద్యాపరుడు ,ప్రదిత సత్కీర్తి ,సూనృత వ్రత గరిష్టుడు,అమలగుణ శాలి అయిన తన తండ్రి మౌలాలీ గారికి అంకితమిచ్చారు . ఈ కంద పద్య శతక మకుటం ‘’సుబుద్ధీ ‘’.  

 మొదటిపద్యంలో లక్ష్మీదేవిని –శ్రీ మహిలా మణిత్రిజ –ద్దామోదర ప్రధిత మణియునై-దైవ గణ పురం –ద్రీమణిదుగ్దాబ్దికుమా –రీమణిరామనిన్ను గనికరించును  సుబుద్ధీ’’అని ధైర్యం చెప్పారు .భువి దివి సర్వగ్రహాలను ,సూర్య మాతరిశ్వాదులను సృజించిన ఆ భూధవుని పరాత్పరుని ,పరుని తలచారు .అక్షరుని సర్వ లోకాధ్యక్షుని దక్షుని స్తుతించమని చెప్పారు .తర్వాత గణనాధుని ,సద్రస పేశల మాధురీ నిరంకుశ భాషా రసికత్వం లో కుశలత ఇవ్వటానికి భారతిని కొల్చారు అంటే కొలవమని చెప్పారని భావం.

 ‘’క౦ద౦బులు సుకవీశుల-కందంబు లమంద సుందరాబ్జాస్యలకున్ –గుందంబులు బుధ –కర్ణానందంబులు ‘’కనుక కందంలో కదను తొక్కానని అందంగా చిందులేస్తూ  చెప్పారు .తెలుగు కవిత్వం అల్లన కుమ్మరిమొల్లకు జోహార్లు చెప్పారు .పూర్వకవులకు కైమోడ్పులు పలికారు .

  తర్వాత నీతులు బోధించటం ప్రారంభించి అత్తనుకులదేవతగా ,మామను ఉర్వీన్ద్రునిగా ,భక్తితో సేవించే సతిని సత్తరుణి అంటారని ,భర్తను సేవి౦చె భార్య సౌభాగ్యవతి అనీ ,జనకజ కుముదవతి అనసూయ అరు౦ధతులమార్గం లో స్త్రీలు నడిస్తే ఉత్తమగతులు కలుగుతాయని చెప్పారు .తగిన మగడు ఇంట్లో ఉంటె ,వాడిని దిగ ద్రొక్కి విటాళికోసం తెగతిరిగే వగలాడిని ,చెడు బోటిని తెగనరికినా తప్పులేదన్నారు .మొగుడితో గుద్దులాడేది ఆడదికాడు గాడిద అన్నారు .కడుపెకైలాసంగా జీవించటం నీచం .రచ్చలకుఎక్కకు రచ్చలకుకాలుదువ్వకు ,మెచ్చులకోసం అదరకు .యాత్రలకోసం గాత్రాన్ని ఇబ్బంది పెట్టక కించిత్ స్తోత్రం చేస్తేముక్తివస్తుంది .నడవడి చెడితే నీచునిగా లోకంచూస్తుంది .భిక్షం (బికిరం )ఎత్తేవారిని ,వికలాంగుల్ని పరిహాసం చేయకు అది భగవత్ ప్రయత్నం వాళ్ళ తప్పుకాదని గ్రహించు .

  లక్షణం లేనికవిత్వం శిక్షణ లేని స్త్రీ శీలం భిక్షాటన జీవితం అక్షయమైన నింద.లయ లేని సంగీతం ప్రియం తెలియని తిండి ,వ్యయం తెలీని డంబం నియమం లేని నెలత రాణించవు .నీతి స్థిరురులైన పెద్దలమాటలు వేదవాక్యాలే .’’చెడి బ్రతుకుట కంటే లేదు చెరుపు ‘’.శిలకు ,శైలానికి ,దోమకు ఏనుగుకు ,ఎంత తేడానో కులకాంతకు వెలకా౦తకు అంత తేడాఉంది .దేనినైనా తనవారికంటే ముందు తింటే –‘’ఎనుబోతని ,మనుబోతని ,తినుబోతని లోకం ఈసడిస్తుంది .పరువంలో బుద్ధి త్వరత్వరగా పరిగెత్తుతుంది .దానితో పరిగెత్తగలమా ?’’కరువలి (గాలి )కైనా ,మురహరి గరుడునికైనా ‘’ఇది తప్పదు.చీటికీ మాటికీ అత్తింట్లో అలిగి ‘’బుట్టింటి కేగకెప్పుడు –మెట్టిన నట్టింట ఉండటం మేలు .’’చచ్చినమీదట పుచ్చిన వక్కైన నీతో రాదు .కోపం ఘోర విపద్ధూపం దుర్భర దురంత దుష్కృత కూపం .శాంతం ‘’విలసత్కార్యాశాంతం –చిరసౌఖ్యసద్యశః ప్రాంతం వేదాన్తోదంతం శాంతమే భోషాణం సారీ భూషణం .కవిగాయకులకు సతికి భోగినికి కళలే .’’తొడవులు ‘’.తన శుభ్రత గృహశుభ్రత ఘనం .

  ‘’బాలికలకు బాలురకును-దేలికగా దెలియ దేట తెనుగుపడంబుల్ –గ్రాలెడు పద్యంబులనే  -జాలగ వ్రాసితిని దీని జదువుసుబుద్దీ ‘’అని 102వ పద్యం రాసి చివరి 103వ కందంలో –‘’మతిమంతుల హృద్గతమై –క్షితి సాధ్వీతిలకములకు శ్రీకరమైశా –శ్వతమై మత్క్రుతమగు నీ –శతకము వర్ధి లును గాక సతతము సుబుద్ధీ ‘’అని ఆశావహంగా ముగించారు ఆలీషా కవి .ధారాశుద్ధికల కవిత్వం అందరికి కావాల్సిన నీతులు పుష్కలంగా ఉన్నాయి .చిన్నాపెద్దాముసలీ ముతకా అందరూచదివి తీరాల్సిన శతకం .బుద్ధికి పదును పెట్టి సుబుద్ధిని చేసే శతకం .ఎక్కడాతడబాటులేదు .ధార కుంటూ పడటం లేదు .పరుగోపరుగు అన్నట్లు క౦దాలను హృదయంగమంగా రాసిన కవి ఖాసీం ఆలీషా మరో వేమన అనిస్తారు మరో సుమతీశతకం కుమారీశతకం మనము౦దున్నట్లు భావన కలుగుతుంది .

  ఈకవినీ ,ఈశతకాన్నీ పరిచయం చేసి నేను ధన్యుడను అయ్యాను .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీకం లో మార్కండేయ పురాణం

కార్తీకం లో మార్కండేయ పురాణం
సాహితీ బంధువులకు కార్తీకమాస శుభా కాంక్షలు .26-10-22 బుధ వారం నుంచి కార్తీకమాసం  ప్రారంభం ఆవుతున్న  సందర్భంగా ఆరోజునుంచే సాయం కాలం ప్రస్తుతం నడుస్తున్న విజయవిలాసం ను వాయిదా వేస్తూ ”మార్కండేయ మహా పురాణం ”ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -21-10-22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 12వ భాగం.21.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 12వ భాగం.21.10.22

http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com youtube channel : https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w FB page : https://www.facebook.com/sarasabharathi.vuyyuru Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D Gabbita Durga Prasad Rtd. head Master Sivalayam Street Vuyyuru 521165 Krishan District Andhra Pradesh

Thumbnail

Select or upload a picture that shows what’s in your video. A good thumbnail stands out and draws viewers’ attention. Learn more

Playlists

Add your video to one or more playlists. Playlists can help viewers discover your content faster. Learn more

మహాభారత తత్వ కథనం

Audience

Paid promotion, tags, subtitles, and more

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -319

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -319

319–పార్లమెంట్ సభ్యుడు చిలకమ్మ చెప్పింది ,సినీ నిర్మాత ,ఫిలిం అభివ్రుద్ధిమండలి చైర్మన్ –చేగొండి హరిరామ జోగయ్య

చేగొండి వెంకట హరిరామజోగయ్య (జ: 5 ఏప్రిల్, 1937) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.

వీరు నారాయణ స్వామి, కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.

1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.

వీరు 1972 – 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983, 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

ఇతడు 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో

320-కురుక్షేత్రం సినీ కళాదర్శకుడు –కుదరవల్లి నాగేశ్వరరావు

కుదరవల్లి నాగేశ్వరరావు ప్రముఖ సినీ కళా దర్శకుడు.

వీరు సృష్టించిన అపూర్వ కళాఖండం 1977లో కృష్ణ నిర్మించిన కురుక్షేత్రం.[1]

డ్రైవర్ రాముడు

చిత్ర సమాహారం
· 1949 : గుణసుందరి కథ

· 1963 : తిరుపతమ్మ కథ

· 1967 : భామా విజయం

· 1968 : రణభేరి

· 1970 : లక్ష్మీ కటాక్షం[2]

· 1974 : తిరపతి [3]

· 1975 : మాయామశ్చీంద్ర [4]

· 1977 : కురుక్షేత్రం

· 1979 : డ్రైవర్ రాముడు

· 1979 : శ్రీమద్విరాట పర్వము

· 1980 : ఆటగాడు [5]

321-అల్లుడు శీను నిర్మాత –బెల్లంకొండ సురేష్

బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.

జీవిత చరిత్ర
బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

వివాదం
టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]

322-మరోచరిత్ర మిషన్ ఇంపాజిబుల్ నిర్మాత ,న్యాయవాది ,రాజకీయ నాయకుడు –నిరంజన్ రెడ్డి

సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 17న వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1

జననం, విద్యాభాస్యం
నిరంజన్‌రెడ్డి 1970 జులై 23న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలం, సిర్గాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్‌ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం
నిరంజన్‌రెడ్డి సింబయాసిస్‌ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులు ఒ.మనోహర్‌రెడ్డి, కె.ప్రతాప్‌ రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై 1992 నుంచి హైకోర్టులో, 1994 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా సేపని చేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితుడయ్యాడు.[3]

రాజకీయ జీవితం
నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న ప్రకటించింది.[4]

నిర్మించిన సినిమాలు
ఆయన 2002లో హైదరాబాదులో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించాను. ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించి ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది.

క్రమసంఖ్య

సంవత్సరం

సినిమా పేరు

భాష

గమనిక

1

2010

మరోచరిత్ర

తెలుగు

అనుబంధ సంస్థగా

2

2011

గగనం

తెలుగు

అనుబంధ సంస్థగా

3

2016

క్షణం

తెలుగు

4

2017

ఘాజీ

తెలుగు, హిందీ

5

2017

రాజు గారి గది 2

తెలుగు

అనుబంధ సంస్థగా

6

2021

ఆచార్య

తెలుగు

7

2021

వైల్డ్ డాగ్

తెలుగు

8

2021

అర్జున ఫల్గుణ

తెలుగు

[5]

9

2022

మిషన్ ఇంపాజిబుల్

తెలుగు

సశేషం

-మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం

49-  వినోక్తి

gabbita prasadThu, Oct 20, 8:45 PM (13 hours ago)
to sahitibandhu@googlegroups.com, Andukuri, Narasimha, Vuppaladhadiyam, Gopala, Krishna, గోదావరి, Lavanya, Padma, Padmasri, Durvasula, Sastri, mrvs, GITANJALI, Ramky, Sai, Pavan

హాస్యానందం

49-  వినోక్తి

అని ఒక అలంకారం .ఒకదాన్ని వదిలేస్తే మరొకటి అందంగా ఉన్నట్లు చెబితే అది వినోక్తిఅని నిర్వచించారు మునిమాణిక్యం నరసింహా రావు గారు. కావ్యాలంకార కర్త ఉదాహరణ గా క్రూరతలేని చూపు సుందరం .రవిలేని నభం అసుందరం .మనింట్లో భార్యాభర్తల సంభాషణలలో ఇలాంటివి దొర్లుతాయన్నారుమాస్టారు .ఒకసారి మాస్టారిగది అంతా చిందర వందరగా,నానా కంగాళీగా ఉంటె కా౦త౦ గార్నిపిలిచి ‘’ఇల్లంతా ఇంత అసెయ్య౦గా ఉందేమిటి  ?’’అని అడిగితె ‘’అలా ఉంటేనే అందం .అప్పుడే పిల్లలున్న కుటుంబం అని తెలుస్తుంది అవి లేకపోతె శోభే ఉండదు ‘’అన్నారని గురువాచ .

  ఆవిడే ఇంకోసారి ‘’కిచకిచాలాడే పిచ్చికలు ,గలగలలాడే పిల్లలు లేనిఇల్లు ఇల్లెకాదు  ‘’అన్నారట .ఇంకోసారి ఆమె ‘’గోడలకు బూజు కోడలికి పోజూ పనికి రావు ‘’అలానే మరోసారి ‘’వాసన లేనిమద్యం ,దోషం లేనిపద్యం సుందరం ‘’అన్నారు .అలానే ‘’ప్రాకారం లేనిగోపురాలు ,సహకారం లేనికాపురాలూ అందం లేని నవ్వు మకరందం లేనిపువ్వు ,కండలు లేని ఒళ్ళు ,ముండలు లేని ఊళ్లు అసు౦దరాలుఅని ఆయన స్నేహితుడు అదే ధోరణలో వాక్రుచ్చడట ..

 ఇంకో ఇంచి ముందుకేసి ఒక కవి –బొజ్జలేని గణపతి ,లజ్జలేని కులపతి ,టాపులేనికారు ,పోపులేనికూర ,జుట్టులేని తల ,బొట్టులేనిముఖం ,ఎరుకలేనిచదువు ,ఎరుపులేని పెదవి ,ముక్కులేనిమోము ,ముద్దులేని ప్రేమ ,అని గిలికాడు .అదే బాణిలో మాస్టారు –ఒక గుణము బాసి వస్తు-వొప్పిదమును బాయు నననెడి –వింతయైన వినోక్తికి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శాంపిల్స్ ‘’అని ‘’ముదురులేని ముంజలు ,ముసురులేని సంజలు ,ముండ్లు లేని బాటలు ముళ్ళు లేనిమాటలు ,మచ్చలేనజాబిలి ,రొచ్చులేనివాకిలి ,పుచ్చులేనిగింజలు ,పచ్చిలేని లంజలు ,మట్టిలేనిబుర్రలు ,పొట్టలేనిపిర్రలు ,-‘ఒకటి లేనికతన మొప్పిదమగునవి చెప్పేడు వింతయైన వినోక్తి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శామ్పుల్స్ ‘’అని నాన్ స్టాప్ గా వాయించేశారు

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

విజయ విలాసం.11వ భాగం.20.10.22

విజయ విలాసం.11వ భాగం.20.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి ఆచార్య నాకు నూతన పరిచితులే .నన్ను పీఠిక రాయమనటం సమంజసంగా లేదు .ఏలయన నేను అల్పజ్ఞుడిని ,కుక్షి౦భరుడిని .వారు పండితులు ,శబ్దవిదులు ..అట్టి వారి కవిత్వాన్ని నేను విమర్శించటం హాస్యాస్పదం .కానీ పద్యాలు మిగుల రసవత్తరంగా ,భావగర్భితాలుగా ,స్వాభావోక్తులుగా ,శైలి మృదు మధురంగా ,పండిత పామర రంజకంగా ఉందని చెబుతూ ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కవివరునికి ఇంకా అనేక ఉద్గ్రంథ రచనకు తోడ్పడాలని,ఆశీర్వ ది౦చాలనీ  అనికోరుతున్నాను ‘’అన్నారు .

  తర్వాత కవిగారుచేసిన ‘’ విజ్ఞప్తి ‘’లో ’’శతకరచన మిక్కిలి కష్టమని పెద్దలంటారు నేను అల్పమతిని సంస్కృతాంధ్రాలలో భాషాపరిచయం స్వల్పం .కవిత్వ రసానుభావమూ శూన్యమే .తొలి శతకరచన కనుక ఇందులో గుణాలు తక్కువ దోషాలు ఎక్కువగా ఉంటాయి ‘’ఏకస్వాదు నమ౦భూ జీయాత్ ‘’అన్న పెద్దలమాటలను బట్టి శ్రీ కృష్ణ పరమాత్మ నా హృదయం లో చేరి నాతొ రాయించి నా ఆన౦దాన్ని లోకానికీ పంచమన్నట్లు గా అడియాస .రెండేళ్లక్రితమే రచన పూర్తి అయినా ,ఇరవై నెలలక్రితం అప్పటి బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆ. సుబ్బారావు గారిద్వారా శ్రీ ఇలపావులూరి శ్రీరాములుగారికి చేరింది(వీరు శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి తండ్రి గారేమో ) .ముద్రించేశక్తి నాకు లేకపోవటంతో ‘’యోగక్షేమం వహామ్యహం ‘’అని చెప్పిన వాడి మీదనేపెట్టి ఊరుకున్నాను .

  ఇంతలో వేదాంత గ్రంథ విచార ప్రచారకులైన శ్రీ శ్రీరాములుగారి అమోఘ ఆశీర్ బలముతో ,సహృదయులు శ్రీ సుబ్బారాగారి భక్తిభావ గరిమతో ,ప్రియశిష్యులు శ్రీ పూనూరు భక్త సమాజం వారి ఆదరాతిశయాలతో ,వేణుగోపాలుని నైసర్గిక వత్సలత్వ విలసనంతో ,శతకము ముద్రణ పొందింది .స్థల పురాణం కూడా రాయమని మిత్రులు కోరినా అందులో నిజానిజాలేమిటో తెలుసుకోవటం కష్టం కనుక దాని జోలికి పోలేదు .’’ప్రార్ధయే స్సర్వ విదు షో,క్షంతు మంతు శతానిచ –యద్యాత్ర కుత్రచిద్దోషో,నిర్మలం కురుతాదరాత్ ‘’అని బుధజన విధేయుడైన కవి కోరారు .’’వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’అనేది ఈ సీసపద్య శతకానికి మకుటం .

మొదటి పద్యం –‘’శ్రీ యాదవాన్వాయ క్షీర నీరధిపూర్ణ –చంద్ర చంచాత్క్రుపా సాంద్ర హృదయ -శౌర్య ధైర్య స్థైర్య చాతుర్యసద్గుణ –ధామ ,నిర్జిత దుష్ట దైత్య సీమ

శిశుపాల చాణూర జీవ సమీర భు –జ౦గాయమాన,విహంగ యాన –కంసాది రాక్షస గర్వపర్వత పాక-శాసన ధర్మ సంస్థాపనాద్య

తే.గీ.-నీరజేక్షణ భక్త చకోర చంద్ర –గాత్రజితమేఘ బుధజనస్తోత్ర పాత్ర – భుక్తిముక్తిఫలప్రద –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’

అని ప్రారంభించారుకవి.నాల్గవ పద్యం లో పూర్వ సంస్కృత, తెలుగుకవులను స్తుతించి ,తర్వాత తనగురువు మంగళగిరి దూపాటి వంశానికి చెందిన విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవరులు ,మంత్రోపదేశి ,వే౦కటగురు వర్యుని స్తోత్రం చేసి ,తర్వాత పోతన్నలాగా ‘’అవిరలానంద సౌఖ్యములగూర్చు నీదు నామంబు స్మరియించు నాలుకనాలుక ‘’అంటూ కరచరణాదులు మనసు ఆయనకు అర్పిస్తేనే అవిధన్యం అన్నాడు .శంతన సుతుడిలాగా మంతనం చేసే మనసులో బంధించలేను ,విదురునిలాగా నీతి వాక్యాలు చెప్పలేను ,పార్ధుడిలాగా చెట్టపట్టాలేసుకొని బందుత్వంతో తిరగలేను ,గోపాలురులాగా నిన్ను పొందే భాగ్యం పొందలేదు ,చంద్రునికి నూలుపోగుగా నా శక్తికొద్దీ నీ పరిచర్య చేస్తా .ప్రాపుగా ఉంటూ రక్షించు అన్నారు .భువనాలను బ్రోవజాలిన నీబలానికి ,బ్రహ్మా౦డాల్ని   రమణీయంగా చేసే నీ కౌశలానికి ,బ్రహ్మమొదలు స్తంభ పర్యంతం జీవులలో సంచరించే నీఘనత ,కోటి సూర్య ప్రకాశం మించే నీ తేజస్సు లకు ఎల్లలు లేవు అన్నారు

  అంతర బాహ్య ఇంన్ద్రియాలను అణచి నిశ్చలభక్తితో నీపూజ చేయని జీవితం వ్యర్ధం .పుణ్యనదులకు  పాపాలను పోగొట్టే శక్తి ,చంద్ర సూర్యాగ్నులకు దివ్యదీప్తి ,సౌందర్య సౌరభ్య సౌకుమార్యాలను ప్రసవజాతికి ,చెరుకులో తియ్యదనం ,కవులవాక్కులకు అమృతం కూర్చిన ‘’నీ వినోదంబులు అమితాద్భుతములు ‘’అన్నారు .తర్వాత ముచుకు౦దు డు మొదలైన భక్తులకు మోక్షమిచ్చిన గాధలు ప్రస్తుతించారు .’’దురితాటవులకు విస్ఫురదగ్నిహోత్రం,ఆపదద్రులకు వజ్రాయుధం ,వివిధ మనో రోగ బిస తంతువులకు గంధ బంధుర మత్తగజం ,అజ్ఞానరూప గాఢాంధకారానికి గొప్ప ప్రభాకర మండలోదయం ,తీరని దారిద్ర్య వారివాహకులకు భూరిజవోపేత మారుతం ,సకలపురుషార్ధ ఫలజయ సాధనం ,భావ మహార్ణవ తరణం కృష్ణనామం పావనం అని మహా గొప్పగా పద్యం రాశారు

 నారదుడు నీ భక్తిబీజాన్ని భువిలో నాటితే ,ధ్రువుడు నిశ్చలభక్తితో పాదు చేస్తే ,ప్రహ్లాదుడు నీరుపోస్తే ,రుక్మా౦గదుడు అంకురిం పిస్తే ,భీష్ముడుచివురి౦ప జేస్తే ,ద్రౌపది పర్ణాళిప్రబలజేస్తే ‘’విరుల నలరార జేససెనుకరి ,శుకుండు –పక్వ ఫలములగాయించచె భక్తులీ-ఫలముల గడుమెక్కి ‘’నీ పదాంబుజాలను చేరుకొంటున్నారని మరో అద్భుతపద్యం సెలవిచ్చారు ఆచార్యవర్యకవి .నీపాదాలు నిర్మలగంగాభవానీ సముద్భవ స్థానాలు .నీ అమ్ఘ్రులు నిగమాంత పుష్ప సంచార పారీణ పుష్పంధయాలు ,నీపద్మాలు నిత్యపద్మాలయా ప్రియంభావుకాలు ,నీ అడుగులు నిర్వాణసౌధాగ్ర సీమలకు అలంకారాలు ,నీచరణపద్మాలు ‘’నీరజాసనాది సుర సంచయమునకవ్యాజసౌఖ్య –సంపదల నెల్ల సమకూర్చు ‘’అని మరో చిరస్మరణీయ పద్యం శాయించారు ఆచార్యశ్రీ .తనకేమీ రాదంటూనే వేదాన్తరహస్యాలన్నీ కరతలామలకం చేశారు భక్తిలో మునిగి,ముంచి తేల్చారు

  ‘’మాధరా ఉధృత భూధరా పి౦ఛదా-మాధరా విష్టప నాద రార’’అనిమరోరసగుళిక వదిలారు .’’కుమ్మరపుర్వులాగున సంసరణమందు- దిరుగుచు నిన్ను నేమరసివాడు –భక్తి నిష్టాగరిష్టుడై వరలువాడు –సర్వమర్పించి నీసేవ సలుపువాడు-నీకు ప్రియతమ భక్తీ  నిర్మలాత్మ ‘’అని భక్తితత్పరుని దివ్యలక్షణాలు ఆవిష్కరించారు .’’అవురయేమందు నీయంద మందు –విందు వి౦దది వలపుల మందు ‘’అని మహామహాకవులకేమీ తీసిపోనట్లు పద్యాలు అమృతరసప్రవాహంగా చిమ్మేశారు .’’చిత్తమా భక్తితో శ్రీ వేణుగోపాలు –భక్తితో భజియించి ముక్తి బడయుమంటి ‘’వక్త్రమా వ్రజసున్దరీ నాధుని కీర్తనలుపాడి సుఖంపొందు ,ఘ్రాణమా కృష్ణ అంఘ్రి రాజీవ పరిమళతులసి గంధాలలో మెలుగు ,పాణి యుగ్మమా కృష్ణ పాదారవి౦ద౦బు బు లర్చించి సంతోషించు అక్షియుగ్మమా శ్రీకృష్ణుని చూడు శ్రోత్రయుగామా హరికధల్ విను ,మూర్ధమా ప్రీతితో కన్నయ్యకు మొక్కుఅని శరీరభాగాలన్నిటినిస్వామి సేవలో తరించమని హితవుచెప్పారు ఇలాంటిపద్యం అరుదు అనిపించింది .

  106వ పద్యంలో ప్రజలు సౌహార్దభావంతో మెలిగేట్లు చేయమని ,ధర్మమే జయం అన్నదాన్ని సార్ధకం చేయమని ,భూమి ముక్కారుపంటలతో విలసిల్లెట్లుగా సామాజికధర్మ౦గా కోరి ‘’ఆరనిభక్తితో ఆ గోపాలబాలుని అందరూ అర్చించే భక్తిభావన కల్పించమని ,ప్రతికుటుంబం  ,పాడి పంటలతో తామరతంపరగా వెలయు నట్లు చేయమని ,అందరికి తోడూ నీడగా ఉంటూ కాచి రక్షించమని వేణుగోపాలకృష్ణుని ప్రార్ది౦చారుకవి విశ్వ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ .ఇలా రాసినవారరెవరైనా ఇంతకుము౦దున్నారా అని నాకు అనుమానం .తర్వాత సీసం లో మంగళం పాడారు  .చివరి 108పద్యంలో –తండ్రి వెంకటాచార్యులు తల్లి పేరిందేవి ,శ్రీనివాసాచార్య సోదరుడు ,వంశం దూపాటివంశం.తనను నారాయణా అనిపిలుస్తారు ,తన ఊరు చిన్ని యనమదల ..’’కేవలజ్ఞుడ యుష్మతగ్రుపా వశమున –త్వద్గుణార్ణవమున గొన్ని పద్య రత్న-ములను దేవితి గొని ,నన్ను బ్రోవుమయ్య –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’ అంటూ’’ ఆడియేన్ దాసోహం’’గా కవి తన భక్తిని మనస్పూర్తిగా చాటుకున్నారు .రసప్రవాహ పద్యాలివి .జ్ఞానవైరాగ్య తత్వ ప్రధానాలు ,ప్రదానాలుకూడా .దూపాటి వారి వంశం అంటే నే గోప్పకవిపండితులకు నిలయం .మనకవి అందులో ఎవరికీతక్కువకాదు  అన్నిరకాల భావాలతో పద్యాలుపరిగెత్తాయి .అద్భుతం అనిపించింది .ఈ శతకాన్నీ ,ఈ కవిగారిని పరిచయం చేసి నేను ధన్యుడిని అయ్యాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22.

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -318318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసినఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -318

318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

భాష మారినా దర్శకుడికి తను చూపించాలనుకున్న కథని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్న వాళ్లయినా సరే.. తెలుగులో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే, తెలుగు దర్శకులైన కె. విశ్వనాథ్, రవిరాజా పినిశెట్టి, దాసరి నారాయణ రావ్, ఇంకా రామ్ గోపాల్ వర్మ వంటి నేటి దర్శకులు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేసారు. కేవలం ఒకట్రెండు సినిమాలు కూడా కాదు. చాలానే చేసారు. ఐతే, వేరే భాషల నుండి మన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం.

ముందుగా బాలీవుడ్ “మహేష్ భట్” నుండి మొదలుపెడదాం. మహేష్ భట్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలని చేసారు. అలాంటి డైరెక్టర్ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న నాగార్జునతో ‘క్రిమినల్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ ఆయన చేయడానికి మరో కారణం.. ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నం కూడా జరిగింది.

ఇక తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది తెలుగులో ఒక సినిమా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి “మణిరత్నం”. ఈ మూవీకూడా నాగార్జున హీరోగా వచ్చిందే. అదే ‘గీతాంజలి’. మణిరత్నం చేసిన ఒక్కగానొక్క ఈ క్లాసిక్ తెలుగులో ఆయన స్ట్రైట్ ఫిల్మ్. ఇక నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న “ప్రతాప్ పోతన్” కూడా తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. విశేషం ఏంటంటే ఇది కూడా నాగార్జున హీరోగా చేసిన సినిమానే. అదే ‘చైతన్య’. ఇంకా చెప్పాలంటే “ఫాజిల్” అనే మరో తమిళ దర్శకుడు కూడా నాగార్జున హీరోగా ఒకే ఒక్క స్ట్రైట్ తెలుగు సినిమా చేశారు. అదే ‘కిల్లర్’.

మరో తమిళ దర్శకుడు “విష్ణువర్ధన్” పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ అనే స్ట్రైట్ సినిమా చేశారు. అదే పవన్ కళ్యాణ్ హీరోగా మరో తమిళ దర్శకుడైన “ధరణి” చేసిన స్ట్రైట్ ఫిల్మ్ ‘బంగారం’. “అదయమాన్” అనే దర్శకుడు ‘బొబ్బిలి వంశం’. “సుబ్రహ్మణ్యం శివ” అనే మరో తమిళ్ దర్శకుడు ‘దొంగ దొంగది’. “షాజీ కైలాష్” మంచు విష్ణు హీరోగా ‘విష్ణు’ సినిమా చేశారు. ఇక “అగస్త్యన్” రవితేజ హీరోగా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొట్టడం చెప్పుకోవాల్సిన విషయం.

ఇక కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఉపేంద్ర నటించిన సినిమాలు చాలావరకు తెలుగులో డబ్ అయ్యాయి. వాటితో పాటు తెలుగులో నేరుగా ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా పేరు రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఓం’. మరో కన్నడ దర్శకుడు “పవన్ వడేయార్” మంచు మనోజ్ హీరోగా ‘పోటుగాడు అనే మూవీ చేశారు. అలాగే బెంగాలీ దర్శకుడైన గౌతం ఘోష్ ‘మా భూమి’ అనే సినిమా చేశారు. ఈ మూవీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉద్దేశించి ఉంటుంది. బెంగాలీవాడైనా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన సినిమా చేయడం విశేషం.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ

— సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3]

జననం
సుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

ఉద్యమంలో
ఈయన్ని 1908లో బ్రిటీష్ వారు అరెస్టు చేశారు. మద్రాసు జైలులో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను సేలం జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు రైలులో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ, మాధవ విజయం పుస్తకాలు రచించాడు.[3]

గౌరవాలు
సుబ్రహ్మణ్య శివ మరణానాంతరం దిండుగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తియాగి సుబ్రమణ్య శివ మాళిగైగా పేరు పెట్టబడింది. ధర్మపురి జిల్లా పెన్నగడం సమీపంలోని పప్పరపట్టి వద్ద ఒక స్మారక చిహ్నం స్థాపించబడింది.[4]

మరణం
1925, జూలై 23న కుష్టువ్యాధితో చనిపోయాడు.[1]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్-20-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 48-  విభావనోక్తి

హాస్యానందం

48-  విభావనోక్తి

కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని  పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా  అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో  కొ౦ప మునిగిందని కిందకి దిగివచ్చాను ..ఏదో గుడ్డ తగలడుతోంది .ఏమిట్రా అది అన్నాను .అమ్మ చీర అన్నారు ఎందుకు తగలడుతోంది అన్నాను .నిప్పు పుల్లగీచి దానిపై వేస్తె అన్నారు .నిప్పుపుల్ల గీసి మేము వేయలేదునాన్నా అని అందరూ ఒక్కసారే అన్నారు .ఆశ్చర్యమేసింది .ఆశ్చర్యం కోపం ,వచ్చి వళ్ళు మండింది ‘’చా గాడిద కొడుకుల్లారా !ఎవరాపని చేసింది ?అని అగద్దించాను .మా అయిదేళ్ళ పెద్ద కు౦క   ధైర్యంగా ‘’మేమంతా ఇక్కడే ఉన్నాం.మేమెవ్వరం అగ్గిపుల్లగీసి చీరమీద వేయలేదండి నానారండీ ‘’అన్నాడు .ఎట్లా అంటుకొందిరా. అంటే పెద్దపిల్ల ‘’ఏమో నాన్న దానంతట అదే  అంటుకొని భగ్గున మండింది ‘’అన్నది  ‘’కారణం లేకుండా కార్యం జరిగినట్లు చెప్పారన్నమాట అన్నారు స్వానుభవంతో మునిమాణిక్యం .

  ఒక్కోసారి బల్లమీద మంచినీళ్ళ గ్లాస్ దానంతతకడే మొగ్గేసి బోర్లపడుతుంది.నూనె దానంతట అదే ఒలుకుతుంది .పుస్తకం లో పేజీలు  వాటంతకు అవే చినిగిపోతాయి .మరీ విచిత్రం ఏమిటంటే ‘’మా ఆవిడ పులుసు రాచిప్ప పోయిమీద పెట్టి దొడ్లోకి స్నానికి వెళ్లి వచ్చే సరికి డబ్బాలో ఉన్న బొగ్గులు అవే నడిచివచ్చి పులుసులో పడిపోతాయి’’ .కనపడకుండా ఇవి జరిగిపోతూనే ఉంటాయి దానితో హాస్యం పుడుతూనే ఉంటుంది . .ఒక్కోసారి ఎండలేకుండానే దేశం మండిపోతుంది .ప్రేమలేకుండా భార్యను ప్రేమిస్తాడు. కోపం లేకుండానే ముఖం చిటపట లాడుతుంది ‘’అన్నారు .

‘’ఒకసారి రైలలో వెడుతున్నాం  .పొలాల మధ్య రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది .డ్రైవర్ దిగి చూస్తె పట్టాలమధ్య ఆవు నలిగి రక్త సిక్తమైంది .ఆవు ఆసామివచ్చి డ్రైవర్ తో తగాదాపడి ‘’నా ఆవును చంపావు ‘’అని కలబడ్డాడు .డ్రైవర్ ‘’నేను చంపలేదు ఇంజన్ ఆవుమీదు గా పోలేదు .ఆవు దానంతతకు అదే చచ్చింది ‘’అంటే ఆసామి ‘’కాళ్ళు ఎలాతెగాయి “”అనగా ‘’ఆకాళ్ళు చచ్చు  కాళ్ళు వాటంతటకవే తెగిపదడిపోయాయి .ఆవు తలను రైలు చక్రాలమధ్య పెట్టి ఆత్మ హత్య చేసుకొంది’’అన్నాడు ఆసామి ‘’ఇంజన్ నడుపుతున్నావుగా .కాస్త చూసి నడపాలికదా ‘’అంటే డ్రైవర్ ‘’ఇంజన్ ను నేను నడపటం లేదు అద౦తట అదే నడుస్తోంది ‘’అన్నాడు అని కత చెప్పి ఇందులో ఉపద్రవాలకు దేనికీ కారణం లేదు వాటంతకవే జరిగాయి. కారణం లేకుండా కార్యం జరగటానికి హాస్యం గా నడిపిస్తే ,అర్ధం పర్ధం లేకుండా ,అసంబద్ధంగా హాస్యజనకంగా ఉంటుంది అన్నారు మునిమాణిక్యం ముసిముసి నవ్వులతో .మరికొన్ని ఉదాహరణలు వాయి౦చా రాయన .వాహకుడు లేని పల్లకి ,కడుపులేనికానుపు ,తడుపులేని నానుపు ,మగువ లేని దాంపత్యం ,మగడు లేని పాతివ్రత్యం ,ప్రియురాలులేని అనురాగం,జవరాలులేనిపెనుభోగం ,నాటకం లేని వేషాలు ,మగతనం లేనిమీసాలు ,బిడ్డలు లేని ఇల్లరికం ,అత్తలేని కోడరికం ,భాగ్యాలు లేని పంపకం ,రోకళ్ళు లేని దంపుడు ,అని ఏకధాటిగా వాయించారు సార్.పైగా ‘’ఉన్నట్లు అంటే –ఊహిచటం విభావనోక్తి .కారణం లేని కార్యం ఉన్నచొ  కవితా చమత్కారోక్తి .స్వకీయముల్ ఈ ఎక్సాంపుల్స్ –సరసము లీ శా౦పుల్స్ ‘’అని కవిత్వం తో ఎడాపెడా వాయించారు .

 మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు 

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం. 10వ భాగం.19.10.22.

విజయ విలాసం. 10వ భాగం.19.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )

  హిందీ భాషాభి వృద్ధి మరచి గుడ్డిగా ఆంగ్లేయులను అనుసరించే వారిని హరిశ్చంద్ర గట్టిగా విమర్శించాడు హిందీ పత్రికాప్రచారానికి ఆయన మార్గదర్శి .సాహిత్యంలో హాస్యాన్ని పోషించాడు .హరిశ్చంద్రతర్వాత  అదే దారిలో నడిచినవారు కాన్పూరు కు చెందిన ప్రతాప్ నారాయణ మిశ్రా ,బాలకృష్ణ భట్ లు .నాటక రచనకూ భారతే౦దు మార్గదర్శనం చేశాడు. హరిశ్చంద్ర అసంపూర్తి నాటికలను బాబూ రాదా కృష్ణ దాస్ పూర్తి చేయటమేకాక దుఖినీబాలా ,రాణాప్రతాప్ నాటకాలు కూడా రాశాడు

  హరిశ్చంద్ర స్త్రీ విద్య ,విధవావిహాం ,సముద్రప్రయాణ౦  వంటి  సంస్కరణ లపైనా  రాశాడు .పూరీ జగన్నాథ దర్శనానికి వెడుతూ బర్ద్వాన్ కు చేసిన ప్రయాణమే అతని మొదటి రైలు ప్రయాణం ఆ తర్వాత అనేక చోట్లకు రైలులో వెళ్ళాడు .దీనివలన విశాలభావాలుకలిగాయి .ఖందేప్ లో గుజరాత్ వరద బాధితులకు సహాయం తన పత్రికలద్వారానూ , స్వయంగా చేశాడు .అతని విస్తృత యాత్రా ఫలితంగా రాసినవే యాత్రా చరిత్రలు .అవసాన దశలో అస్వస్థతకు కారణమైనది ఉదయపూర్ ప్రయాణం .

  సంపన్న యువరాజులకు ,జమీందార్ పిల్లలకోసం స్థాపించబడిన ఒక విద్యా సంస్థలో పురాతన వృత్తాంతాల సంగ్రహణ కర్తగా ఉన్న రాజెంద్రలాల్ మిత్ర ఈయన ఇంటికి దగ్గరలో ఉండేవాడు .ఇద్దరూ విష్ణు భక్తులే సన్నిహితులయ్యారు .దానితో ప్రాచీన వస్తువులపై ఇతనికి ఆసక్తికలిగి,ప్రాచీన వస్తు చరిత్రను మొట్టమొదటి సారిగా హిందీలో రాశాడు .వారణాశి అంతా విస్తృతంగా తిరిగి రాగి శాసనాలు చదివి విపులంగా రాశాడు .కలకత్తా వెడితే ఆసియా సంఘాన్ని తప్పక చూసేవాడు .ఎన్నో వ్రాతప్రతులు దానికి సమర్పించాడు .వివిధకాలాల భారతచరిత్రను వ్యాసాలుగా రాశాడు .ఇలా రాసేటప్పుడు అందులోని సాహిత్యమంతా కాచి వడపోసేవాడు .బ్రిటిష్, ఫ్రెంచ్ చరిత్రకారుల రచనలలోని విషయాలుకూడా పొందు పరచేవాడు .ఉదయపూర్ రాజభవనం ,రాజస్థాన్ కోట చరిత్ర గురించి అతడు రాసినవి పరమ ప్రామాణికాలు .ఇవి రాయటానికి ముందు ‘’టాడ్’’రాసిన ‘’అనల్స్ ఆఫ్ రాజస్థాన్ ‘’క్షుణ్ణంగా చదివాడు .అనేక భారతీయ సంస్థానాధీశులు హరిశ్చంద్రను ఆహ్వానించి గౌరవించి సత్కరించారు .

  ‘’కాల చక్ర ‘’రచనలో ప్రపంచ చరిత్రను కొన్ని భాగాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు .భక్తుడే కాని మూఢ భక్తిలేదు .జైనం లో నిరసి౦చటానికి ఏమీ లేదన్నాడు . 1870లో ఆర్యసమాజం వారు వారణాశి మతబోధకులను విమర్శించే సమయంలో స్వామి దయానంద సరస్వతికి వ్యతిరేకంగా నిలిచాడు .తర్వాత కాలం లో ఆయన్ను తనపత్రికలో చేర్చుకొన్నాడు .చివరికాలం లో మతసమన్వయతకోసం అర్రులు చాచాడు .వచనంలో ఖడీబోలీ ప్రవేశపెట్టిన మార్గదర్శి అయ్యాడు .హిందీలో నవలలు రాలేదని ఆవేదన చెందాడు .రాధా చరణ్ గోస్వామి ,బాబూకాశీ నాథ లను హిందీ నవలలు రాయమని ప్రోత్సహించాడు .తన రెండవ భార్య బెంగాలీ అయిన మల్లిక ను బెంగాలీ నవలలను అనువదించమని కోరగా రాధారాణి ,చంద్రప్రభపూర్ణ ప్రకాష్ ,సౌందర్యమయి నవలలను హిందీలోకి అనువదించి రాధారాణి ని ఆయనకే అంకితమిచ్చినది .బంకిం చంద్ర నవల ‘’రాజ సిన్హా ‘’ను స్వయంగా అనువాదం మొదలు పెట్టిరాయగా అసంపూర్ణంగా మిగిలిపోతే బంధువు రాధా కృష్ణ దాస్ పూర్తి చేశాడు .ఇతడే స్వయంగా స్వర్ణలత ,పండిత రాం శంకర నవల ‘’మధుమాలతి’’కూడా అనువదించాడు .

  డబ్బు దుబారాతో మనశ్శాంతి భోగ విలాసాలతో ఆరోగ్యం కోల్పోయిన హరిశ్చంద్ర ,దూర ప్రయాణాలు మానలేదు .చిరకాల మిత్రుడు మోహన్ లాల్ పాండ్య ఉదయపూర్ లో ఉంటె  వెళ్లి చూసి అటునుంచి నత్వారాకు వెళ్ళాడు .దీనితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది .కలరా సోకి ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది .ఎన్నో ఇబ్బందులు తట్టుకొని కాశీచేరాడు .తన ప్రాణప్రదమైన రచనలు పూర్తి చేయలనుకొన్నాడు .భారతీయ రంగ౦  తీరు తెన్నులపై ఒక గ్రంథం రాశాడు. బ్రిటిష్ వారి కోరికపై వారి జాతీయ గీతాన్ని హిందీలోకింవాదం చేశాడు .కొన్ని నాటికలు  మరికొన్ని రచనలూ చేశాడు .బల్లియాలో అతడురాసిన సత్య హరిశ్చంద్ర ,నీల్ దేవ్ ప్రదర్శిస్తున్నారని తెలిసి ,అక్కడికి వెళ్ళగా అందరూ హరిశ్చంద్రద్రను షేక్స్పియర్ అంతటి వాడు అని మెచ్చుకొన్నారు ‘

  తిరిగి కాశీ వచ్చాక అనారోగ్యం తిరగబెట్టింది .డాక్టర్లు వారించినా రచన చేస్తూనే ఉన్నాడు .9-9-1850లో జన్మించిన హరిశ్చంద్ర  5-1-1885 న 35వ ఏట అతి తక్కువవయసులోనే తనువు  చాలించాడు .తులసీదాస్ తర్వాత అంతటి ప్రతిభామూర్తి హరిశ్చంద్ర . అయితేనేమి హిందీ సాహిత్యానికి మార్గదర్శి అయి ఆధునిక హిందీ భాషా పితామహుడు అనిపించుకొన్నాడు .అతని మనసులో 1-హిందీ బోధనాభాషగా యూని వర్సిటి నెలకొల్పటం 2-తన ఉద్యానవనం లో ఠాకూర్ జీ విగ్రహం నెలకొల్పటం 3-దేశం వాయవ్యమూలలో  లలితకళా నిలయంగా ఒక కళాశాల స్థాపించటం 4-అమెరికా ,బ్రిటన్ దేశాలు సందర్శించటం అనే కోరికలున్నట్లు మిత్రులకు చెప్పేవాడు .అవి చేయలేక పోయానని బాధపడ్డాడు .

ఆధారం –మదన గోపాల్ రచనకు శ్రీమతి ఎ.లక్ష్మీరమణ చేసిన తెలుగు అనువాదపుస్తకం –భారతే౦దు హరిశ్చంద్ర .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు   , . ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -317

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -317

317-కళాత్మక చిత్ర చాయాగ్రాహకుడు ,శంకరాభరణం మనవూరి పాండవులు ఫేం ,నిరీక్షణ ,సంధ్యారగం దర్శకుడు ,బహుపురస్కార గ్రహీత –బాలు మహేంద్ర

బాలు మహేంద్ర (Balu Mahendra) (మే 20, 1939 – ఫిబ్రవరి 13, 2014) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు.

జననం, విద్యాభ్యాసం
1939లో శ్రీలంక లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. విద్యాభ్యాసంకూడా అక్కడే పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణె లోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు.

మరణం
2014 ఫిబ్రవరి 13 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11.00 గంటలకు మరణించారు.

సినీ నేపథ్య౦
సొమ్మొకడిది సోకుకడది, తరం మారింది, లంబాడోళ్ల రాందాసు, మనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయగ్రాహాకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్ – శ్రీదేవి జంటగా నటించిన వసంత కోకిల చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. ఆయన రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తోపాటు, కేంద్ర ప్రభుత్వ, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

చిత్ర సమాహారం
దర్శకుడిగా
· Athu Oru Kanaa Kaalam (2005)

· Julie Ganapathy (2003)

· Aur Ek Prem Kahani (1996)

· సతీ లీలావతి (1995)

· Marupadiyam (1993)

· చక్రవ్యూహం (1992)

· Poonthenaruvi Chuvannu (1991)

· Vanna Vanna Pookkal (1991)

· సంధ్యారాగం (1989)

· వీడు (1988)

· Irattaival Kuruvi (1987)

· Rendu Thokala Titta (1987)

· Yaathra (1985)

· Unn Kannil Neer Vazhindal (1985)

· Neengal Kettavai (1984)

· Oomai Kuyil (1983)

· Sadma (1983)

· Moondram Pirai (1982)

· నిరీక్షణ (1982)

· Olangal (1982)

· Manju Moodal Manju (1980)

· Moodupani (1980)

· Azhiyatha Kolangal (1979)

· కోకిల (1977)

· Motor Sundaram Pillai (1966)

ఛాయాగ్రహకుడిగా
· Yaathra (1985)

· పల్లవి అనుపల్లవి (1983)

· Sadma (1983)

· Moondram Pirai (1982)

· Olangal (1982)

· సీతాకోకచిలుక (1981)

· Moodupani (1980)

· శంకరాభరణం (1979)

· మనవూరి పాండవులు (1978)

· లంబాడోళ్ళ రామదాసు (1978)

· సొమ్మొకడిది సోకొకడిది (1978)

· Ulkatal (1978)

· తరం మారింది (1977)

· Nellu (1974)

అవార్డులు, గౌరవాలు
జాతీయ చలనచిత్ర అవార్డులు
· కోకిల – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం (1978), (బ్లాక్ అండ్ వైట్)

· మూంద్రన్ పిరాయి (వసంత కోకిల) – [జాతాయ [ఉత్తమ ఛాయాగ్రహణం]], (1983), (కలర్)

· వీడు – జాతీయ ఉత్తమ చిత్రం, (1988) (తమిళం)

· సంధ్యారాగం – జాతీయ ఉత్తమ కుటుంబ చిత్రం, 1990

· వన్న వన్న పూక్కల్ – జాతీయ ఉత్తమ చిత్రం, (1992) (తమిళం)

ఫిల్మ్ ఫేర్ అవార్డులు
నామినేట్ అయినవి

· సద్మా – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ రచన (1983),

గెలుపొందినవి

· మూంద్రన్ పిరాయి – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (తమిళం)

· ఒలంగల్ – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (మలయాళం)

· వీడు – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1988) (తమిళం)

కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు]
· కోకిల – ఉత్తమ నేపథ్యం – 1977

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
· నీల్లు – ఉత్తమ ఛాయాగ్రహణం – 1974

· చువన్న సంధ్యకల్, ప్రయాణం- ఉత్తమ ఛాయాగ్రహణం – 1975 (బ్లాక్ అండ్ వైట్)

నంది పురస్కారాలు
· మనవూరి పాండవులు – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం- 1978.

· నిరీక్షణ – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం – 1982.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 10వ భాగం.19.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 10వ భాగం.19.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8

21-అణుశాస్త్ర వేత్త ,వైద్య వైజ్ఞానికుడు ,రేడియో ధార్మిక శాస్త్రజ్ఞుడు ,మేరీ క్యూరీ వద్ద పరిశోధన చేసిన అణుధార్మిక పరిశిధన సంస్థ స్థాపకుడు –శ్రీ పత్తిపాటి రామయ్య నాయుడు

  • పత్తిపాటి రామయ్య నాయుడు (జూన్ 1904-జూన్ 1991) ప్రఖ్యాతిగాంచిన అణుశాస్త్రవేత్త, వైద్య వైజ్ఞానికుడు, రేడియోధార్మిక శాస్త్రజ్ఞుడు. వైద్య భౌతిక శాస్త్రము ఆవిష్కరించినవారిలో ఆద్యుడు. పారిస్ లో నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ వద్ద పరిశోధనలు చేసిన మేధావి. 1938లో భారతదేశములో మొట్టమొదటి అణుధార్మిక పరిశోధనశాల స్థాపించిన వాడు.

బాల్యము, విద్య
నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో జూన్ 1904న జన్మించాడు[1]. చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి. డిగ్రీని, 1933లో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాడు.

పరిశోధనలు
ఇతడు తన డాక్టోరల్ థీసిస్ కొరకు క్యూరీ-కార్నెగీ రీసర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా పారిస్ లోని రేడియమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మేడం క్యూరీతో కలిసి పనిచేశాడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా సంపాదించాడు. 1936లో బొంబాయిలోని టాటా ట్రస్టు ఇతడిని కేన్సర్ వ్యాధి చికిత్స కోసం రాడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశానికి ఆహ్వానించింది. 1938లో ఇతడు రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు తీసుకురాబడ్డాడు. ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖకు బదిలీ అయ్యింది.

వ్యక్తిగతము
మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె లీల హిందీ చలనచిత్ర నటి. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. వీరికి లీల 1940 సంవత్సరములో జన్మించింది. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).

22-న్యాయవాది లోక్ సభ స్పీకర్ ,,కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షుడు ,బీహార్ గవర్నర్ –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్

, మాడభూషి అనంతశయనం అయ్యంగారు స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు. ఇతడు 1891, ఫిబ్రవరి 4 తేదీన చిత్తూరు జిల్లా, తిరుచానూరులో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. పచ్చయప్ప కళాశాల నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం తిరుపతిలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు నిర్వహించాడు. మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి, రెండవ లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

1948లో మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. 1962లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నాడు.

కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు.[1]

ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసింది.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 47- వ్యాజోక్తి

హాస్యానందం

47- వ్యాజోక్తి

అసలు దాన్ని వేరే నెపం తో చెప్పటం వ్యాజోక్తి .నాయికకు నరస భూపలుడిని చూస్తె ,ఆనంద బాష్పాలు వస్తే ,ఆమాట చెప్పటానికి సిగ్గుపడి అగరు ధూపం వలనఆనంద బాష్పాలు కారాయని చెప్పింది .ఒక కధకుడు ‘’ఆమెకు భర్తపై చాలా   దయ ఉంది . .భర్తపై ఆమెకు అమితమైన ప్రేమ దయా ఉన్నాయి ఆమెకు కోపం వస్తే మొగుడి చెవి మేలేసినా ,దానివల్ల వచ్చే వాపు తగ్గటానికి వెంటనే మందు రాస్తుంది ‘’అని తమాషా ఉదాహరణ ఇచ్చారు మునిమాణిక్యం .మేలేయటం లో  ధూర్త లక్షణం కనిపించినా ,మందు రాయటం తో దాన్ని కప్పేసింది .మరోటి ‘’అప్పుడప్పుడు ఆమె మొగుడిపై కాఫీ కప్పు విసుర్తుంది .కనీ ఆయన బట్టలు ఖరాబుకాకుండా కాఫీ వేరే దాన్లో పోసి ఖాళీ కప్పే విసుర్తుంది .అందులో స్పూన్ తేసేసి మరీ విసుర్తుంది అది తగిలి ఆయనముఖం వాచిపోతు౦ దేమోననే భయంతో ‘’.మునిమాణిక్యం గారి మామ్మ ఒక కత చెప్పిందట –ఒక కోడలు లేచిపోతూ ‘’అత్తానీకొడుకు ఆకలికి ఆగలేడు జాగ్రత్తగా చూసుకో అందట .

  చేసే పనివలన బయట పడే గుణం ఒకటి ,దాని తర్వాత అన్నమాటలవలన స్పురించే భావం వేరొకటి .ఆ మాటల్లో అప్రకటిత భావాన్ని దాచే ప్రయత్నం ఉంటుంది లక్షణ కర్త చెప్పింది కాదుకానీ తానె సరదాగా దీన్ని వ్యాజోక్తి కింద జమ కట్టానని మాస్టారువాచ. హాస్యంలో పారిభాషిక పదాలు లేవుకనుక సాహిత్యం లో ఒక అర్ధం లో స్థిరపడిన ఉన్నమాటకే విశేషార్ధం కల్పించి ఇలాంటి పారిభాషిక పదాలు సృష్టించాల్సి వచ్చిందని ఇదివరకే చెప్పాననీ ఇప్పుడు చేస్తుంది అదే అని మునిమాణిక్యం సార న్నారు.

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు .

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం.9వ భాగం.18.10.22

విజయ విలాసం.9వ భాగం.18.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6

  విక్టోరియా రాణికాలం లో హరిశ్చంద్ర 11వ ఏట నే ప్రిన్స్ ఆల్బర్ట్ ను అభినందిస్తూ ఒకపద్యం రాశాడు .తాను  స్థాపించిన పాఠశాలలో ప్రతియేటా రాణి పుట్టినరోజు జరిపేవాడు . దేపాలతొఅల౦క రింప జెసి ,కాశీ పండితులతో యువరాజుకు ఆశీస్సు పద్యాలు చెప్పించి ,ప్రశంసా పత్రాలు అచ్చువేయించి యువరాజుకు బహుమతిగా పంపేవాడు .బ్రిటిష్ వారి ఆదరాభిమానాలు పొందటం చేత ,ఆయన్ను మునిసి పల్ అదికారిగా ,గౌరవ న్యాయాధికారిగా చేసి గౌరవించేవారు .న్యాయవిచారణ సంఘ గౌరవ స్థానం చాల చిన్న వయసులోనే పొందాడు .కాశీలో ఇలాంటి గౌరవం పొందినవారిలో ఇతడే అతి చిన్నవాడు .అతని పత్రికలకు పోషకులుగా ప్రభుత్వం ఉండటంకూడా గౌరవానికి గుర్తే .డైరెక్ట్ గా లండన్ లోని సె౦ట్ జేమ్స్ రాజగృహంతో సంబంధాలు నెలకొల్పుకున్నాడు .1871లోచక్రవర్తి ఆధ్వర్యం లో  జరిగిన జగద్విఖ్యాత ప్రదర్శనకు యితడు పంపిన పురాతన వస్తువులకు  వేల్స్ యువరాజు స్వయంగా యోగ్యతా పత్రం బహూకరించాడు .ఇంగ్లాండ్ రాజు రాణీలతోనేకాకుండా రష్యా జార్ చక్రవర్తి ,జర్మనీ ఖైజర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .తన పుస్తకాలు వారికి పంపటంతో మొదటిసారిగా విదేశాలకు హిందీ సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనకీర్తి  పొందాడు .తూర్పు దేశ భాషలతో బాగా పరిచయమున్న గార్కాన్ డిటాస్, తోనూ పరిచయం పొందాడు .రష్యా ఆలోచనా సభ సభ్యుడు సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి ఇతనికి రాసిన లేఖను బట్టి 1870లో తూర్పు దేశ భాషలలో పరిజ్ఞానమున్న రష్యా దేశీయులకు హరిశ్చంద్ర రచనలతో బాగా పరిచయంన్నట్లు తెలుస్తోంది .బ్రిటిష్ వారిద్వార బెర్లిన్ కు, పిట్స్ బర్గ్ కు పంపిన పుస్తకాలు అందినట్లు ఇండియా గవర్నర్ కు, ఉత్తరప్రదేశ్ గవర్నర కు వ్రాతపూర్వక సమాచారం చేరేది .

  యువరాజు ఇండియావస్తే అతనిపై ప్రశంసా పద్యాలు,రాణి హంతకుల తుపాకి దేబ్బలనుంచి తప్పించుకొన్న దానిపై కవితలు అల్లాడు  .భారతీయులతో ఉన్న బ్రిటిష్ సైన్యం విజయాలు సాధిస్తే ఉత్సాహంగా కవితలు కూర్చాడు  . కాశీ వచ్చిన రాజ కుటుంబీకులతో స్నేహభావంగా మెదిలేవాడు .ఇవన్నీ రాజా శివరాం ప్రసాద్ కు కంటకంగా ఉండేది .వారిని సరదాగా ఆటపట్టి౦చి  యేదడిపించేవాడు .ఇలాంటి బ్రిటిష్ వీరాభిమాని 1870విదేశీ వస్తు నిషేధానికి ఉద్యమించాడు అంటే ఆశ్చర్యమేస్తుంది   .స్వదేశీ  వస్తువులే వాడమని ప్రమాణాలు చేయించాడు .కొద్దికాలం తర్వాత ఇతని ఈరకమైన అభిప్రాయాన్ని బ్రిటిష్ వారు సహించలేకపోయారు .పత్రిక పోషణ మానేశారు .దీనికి నిరసనగా ఈయన మున్సిపిల అధికార,గౌరవ న్యాయాధీశ పదవులకు రాజీనామా చేసి తన దేశభక్తి నిరూపించాడు .దేశమే అత్యున్నతమైనది అన్న భావం నిలబెట్టాడు .ఇతని పత్రికలూ అందులోని వ్యాసాలూ ప్రభుత్వ వ్యతిరేకం గా ఉన్నాయని ప్రత్యర్ధులు కాకిగోల చేశారు .ప్రభుత్వం చెప్పుడుమాటలకు లొంగి ఈయన ప్రత్యర్ధి శివరామ ప్రసాద్ ను దగ్గరకు చేర్చుకున్నది.దీనిఫలితంగా ఇతని కవి వచన సుధ పత్రిక ఆర్ధికంగా నష్టపోగా,చివారికి దివాలా తీసింది .పత్రికను స్నేహితుడికి ఇచ్చేశాడు .బాలబోధిని పత్రికకూ ఇలాంటి స్థితి ఏర్పడగా ,దాన్నీ మూసేశాడు .మిత్రునితో మాట్లాడి కవివచన కు దీన్ని అనుబంధం చేసినా దాని ప్రత్యేకత కోల్పోయింది .చివరికి కవి వచన సుధ ఆయన ప్రత్యర్దిశివ రామప్రసాద్ చేతికి చిక్కింది .

  ఒక్క చంద్రికను మాత్రమేకొంతకాలం నడిపి తర్వాత మిత్రుడు మోహన చంద్ర దాన్ని తనపత్రికలో కలిపేయమని కోరగా చివరికి అది ‘’హరిశ్చంద్ర మోహన చంద్రిక’’గా వెలువడింది .మోహన్ లాల్  విష్ణూ లాల్ పాండ్య కు ఉద్యోగం రాగా  పత్రిక ఉదయపూర్ కు  మారి,తర్వాత నఢ్ధావాలాకు  మారి చివరికి ఎడారిలో కలిసిపోయింది .చనిపోవటానికి కొంతకాలం ముందు హరిశ్చంద్ర తన ప్రియమైన చంద్రికను ‘’నవోదిత చంద్రిక ‘’గా ముద్రించాడు .కానీ ఎంతోకాలం కాకుండానే కన్ను మూశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు  

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

2022 దీపావళి పండుగసందర్భంగాఆన్ లైన్ విధానంలోఏక పత్ర కథల పొటీ(Single page story)

2022 దీపావళి పండుగ
సందర్భంగా
ఆన్ లైన్ విధానంలో
ఏక పత్ర కథల పొటీ
(Single page story)

  • ఔత్సాహిక రచయితలకు ఆహ్వనం.
  • వ్రాతప్రతిలో A4 పేజీ లో 32 లైన్లు రావచ్చును.
  • పిడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి.
  • కథ ఇంతకుముందు ఏ ఫార్మట్ లోనూ ప్రచురణ అయి ఉండకూడదు. ప్రచురణార్థం పంపి ఉండకూడదు. అభ్యర్థులు ఈ మేరకు హామి పత్రం మరియు తమ పూర్తి వివరాలు, చరవాణి సంఖ్యలను కథ చివరలో పొందుపరచాలి.
  • రచన సమకాలీన తెలుగు జీవన విధానాన్ని ప్రతిబింబించాలి.
  • ఒక అభ్యర్థి ఒక కథను మాత్రమే పంపాలి. ఎక్కువ పంపిన సందర్భంలో మొదటగా పంపిన రచన మాత్రమే పోటీకి స్వీకరించబడుతుంది.
  • బహుమతి పొందిన కథా రచయితలకు తగు రీతిన ప్రోత్సాహకాలు ఉంటాయి.
  • బహుమతి పొందిన కథలను నిర్వాహకులు ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉంటుంది.
  • తుది తీర్పు న్యాయ నిర్ణేతలదే.
  • పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది .
  • దీనిలో పాల్గొనుటకు కథల్ని
    kmvvaranasi@yahoo.com
    మెయిల్ కు పంపాలి.
  • కథలని పంపుటకు చివరి తేది 25.10. 2022
Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.10.22.

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7

19- ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు ,ఆంధ్రమహాసభ అధ్యక్షుడు –శ్రీ దేశపాండ్య సుబ్బారావు

ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో ఈయన సభ్యుడు. ఈ సంఘపు చర్చలే శ్రీబాగ్‌ ఒడంబడికకు దారితీసాయి.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్రానికి దత్తమండలపు నాయకులు తొలుత సుముఖంగా లేరు. ఆంధ్ర మహాసభ నాయకులు తరచుగా పర్యటనలు జరిపి సాగించిన ప్రచారం ప్రభావమో తెలియదు కాని క్రమంగా ‘సీమ’వారి వైఖరి మారింది. 1915లో జరిగిన కర్నూలు జిల్లా రెండవ మహాసభ ఆంధ్ర ఉద్యమాన్ని, దాని ఆశయాలను పూర్తిగా బలపరిచింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన తృతీయాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన చిత్తూరుకు చెందిన పానుగంటి రాజా రామారాయణింగార్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వెంటనే వద్దన్నాడే కానీ అసలే వద్దన లేదు. ఇదే సభలో పాల్గొన్న దేశపాండ్య సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రాన్ని బేషరతుగా, మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఇలా అన్నారు “నేను సీడెడ్ జిల్లాలకు చెందిన వాడిని… ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న ఉత్సాహం మీకెంత ఉన్నదో మాకూ అంతే ఉన్నది. తిక్కనను చదివి, ఆనందించిన ప్రతి ఆంధ్రుడికీ ఆ కోరిక ఉండాలి. ఇంకోసారి చెబుతున్నాను – సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం కావాలంటున్నాయి” సుబ్బారావు లాంటివారి మద్దతుతో సీడెడ్ జిల్లాల ప్రతికూలతపట్ల సర్కార్ జిల్లాల వారికి సందేహాలు తగ్గాయి. ఆ జిల్లాలకు వెళ్లి సభలు పెడితే అక్కడివారూ మనకు ఇంకా చేరువవుతారు, మనతో కలిసి వస్తారు అని వల్లూరి సూర్యనారాయణరావు, కె.ఆర్.వి. కృష్ణరావు తదితరులు విశాఖపట్నం మహాసభలో సూచించారు. దానితో మరుసటి సంవత్సరం ఆంధ్రమహాసభ నెల్లూరులోనూ, ఆ తర్వాత నంద్యాలలోనూ జరిగింది.

1934లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని పట్టించుకునే దిక్కులేని నిస్తబ్ధ దురవస్థలో దేశపాండ్య సుబ్బారావు ఆంధ్రత్వం మీది అభిమానంతో ఖర్చులు తానే పెట్టుకుని లండను వెళతానని ముందుకొచ్చాడు. ఆంధ్రుల తరఫున మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయనను సీమలో ఎవరైనా అడిగే పరిస్థితి రాకూడదు కదా? అందుకని ఆయన కోరిన మేరకు పెద్దలు బద్ధకంగా కదిలి అతి కష్టంమీద విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచి, సుబ్బారావును అధ్యక్షుడుగా ఎన్నుకుని, సభ పనుపున లండను రాయబారానికి అధికారికంగా పంపించారు. అదే పదివేలు అనుకున్న సుబ్బారావు ఎవరినీ పైసా అడక్కుండా సమస్త ఖర్చులూ తానే భరించి హుటాహుటిన ఓడ ఎక్కి లండన్ వెళ్లి బ్రిటిషు రాజకీయ ప్రముఖులను దర్శించి ఆంధ్రకు న్యాయం చెయ్యమని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు “మీకు జరిగింది న్యాయమో, అన్యాయమో మాకెలా తెలుస్తుంది? తగినంత ఆందోళన జరిగినప్పుడే కదా పరిస్థితి తీవ్రత మీకు అర్థమయ్యేను. ఇక్కడ మా వ్యవహారాలు కూడా తగిన పబ్లిసిటీ, ప్రాపగాండా లేనిదే పార్లమెంటులో పాసుకావు” అన్ని తిప్పి పంపారు.

ఈయన కన్నడ కథా, నాటక రచయిత టి.పి.కైలాసంకు సన్నిహిత స్నేహితుడు. 1933లో కైలాసం పంపిన లిటిల్ లేస్ అండ్ ప్లేస్ ప్రతి సుబ్బారావుకు బాగా నచ్చి, సొంతగా పుస్తకాన్ని అచ్చువేయించి, అన్ని ప్రతులను కైలాసానికి బహూకరించాడు.

1939లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు జిల్లా, కాల్వబుగ్గలో ప్రారంభించిన రాజకీయ, ఆర్థిక శాస్త్రాల వేసవి పాఠశాలలో దేశపాండ్య సుబ్బారావు అధ్యాపకునిగా పనిచేశాడు.

20-కొచ్చిన్ సంస్థాన దివాన్ ,ఇటుకల తయారీ పరిశ్రమ స్థాపకుడు స్వాతంత్ర్య సమరయోధుడు –శ్రీ నెమిలి పట్టాభిరామారావు

దీవాన్ బహుద్దూర్ నెమిలి పట్టాభి రామారావు (1862 – అక్టోబరు 15, 1937) బి.ఏ స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌.

పట్టాభి రామారావు 1862లో కడప జిల్లా, సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి రామానుజరావు అప్పట్లో కడప జిల్లాలో తాసీల్దారుగా పనిచేస్తున్నాడు.[1] పట్టాభి రామారావు విద్యాభ్యాసం కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు.

ఉద్యోగ జీవితం
చిత్తూరు జిల్లాకు చెందిన పట్టాభి రామారావు 1882 ఏప్రిల్ 15న మద్రాసు రాష్ట్ర రెవిన్యూ సెటిల్‌మెంట్ శాఖలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నాడు.[2] 1888లో దక్షిణ ఆర్కాటులో సూపర్‌వైజరుగా పనిచేశాడు. ఆ తరువాత 1892లో మలబారుకు బదిలీ అయి అక్కడ అన్‌కవెనెంటెడ్ అసిస్టెంటుగా పనిచేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అసిస్టెంటు కమీషనరుగాను, తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందాడు. డిప్యూటి కమీషనరు హోదాలో గోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలలో పనిచేశాడు.[1] కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు, ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్ సంస్థానం యొక్క దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన పట్టాభి రామారావు రెవిన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించాడు. అప్పట్లో 350 రూపాయల ఉద్యోగవిరమణ భత్యంతో పదవీ విరమణ చేశాడు.

ప్రజాసేవలో
పదవీ విరమణానంతరం పట్టాభి రామారావు మద్రాసులోని పూనమల్లి హై రోడ్డుపై శ్రీరామ బ్రిక్ వర్క్స్ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించాడు. ఈ కర్మాగారంలో 30-40 లక్షల ఇటుకల తయారుచేయబడేవి. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఈయన ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవాడు. తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవాడు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించాడు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచనిలిస్తుండేవాడు.[1]

తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని ప్రతేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునిచ్చాడు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3]

పట్టాభిరామారావు 75సంవత్సరాల వయసులో వృద్ధాప్యకారాణాలవల్ల 1937, అక్టోబరు 15 న మద్రాసులో తన స్వగృహంలో మరణించాడు.[4]

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 46-అసంభవోక్తి

హాస్యానందం

46-అసంభవోక్తి

జరగటానికి వీల్లెనిది అసంభవం .ఊహించటానికి కూడా ఆస్కారం లేని విషయాలను నవ్వు పుట్టించటానికి రాసే ఉక్తి విశేషమే అసంభావోక్తి అని నిర్వచించారు మునుమాణిక్యం జీ .ఉదాహరన  –ఒకడు నీళ్ళు పల్చగా ద్రవంలాగా ఉన్నాయి కనుక సరిపోయి౦ది కానీ ,రాళ్ళలాగా ఉన్నట్లయితే కొట్టుకొని తాగటానికి చచ్చేంత పని అయ్యేది’’ .మరొకటి ఒకడిని అంతా ఏవగించుకొంటారని చెప్పటానికి ‘’వాడ్ని చూస్తేనే అసయ్యం .వాడి నీడే వాడి వెంటరాదు ‘’.మరోటి ‘’పడవ ఎంత తేలిక అంటే పొగమంచు మీద కూడా రయ్యిన దూసుకు వెడుతుంది .ఇంకోటి ‘’ఆమెకు ఎంతసిగ్గు అంటే బట్టలు మార్చుకోనేప్పుడేకాక మనసు మార్చుకోన్నప్పుడూ తలుపు వేసుకొంటుంది ‘’ఇవి అసంభావాలే అయినా చమత్కార భాజనాలు కనుక నవ్వు పుడుతుందన్నారు మాస్టారు

 ఒకడు ఎంత బలం కలాడు అంటే ‘’ఒక చేత్తో తన జుట్టు పట్టుకొని తననే భూమ్మీంచి ఆరడుగుల ఎత్తుకు లెవ నెత్తగలడు ‘’మరొకడుడు ‘’నాదొక్కటే కోరికభయ్యా .చనిపోయాక మా ఆవిడ ఎలా ఏడుస్తుందో చూడాలని ఉంది ‘’జరగటానికి వీల్లెనిదాన్ని చెప్పి చమత్కారం సాధించటం అన్నమాట .పిసినారి గురించి ఒకడు ‘’వాడు మహా పీనాసి ఎంత పీనాసి సన్నాసి అంటే ఒకే పంచాంగాన్ని ఏళ్ళ తరబడి వాడుతాడు ‘’.మరోటి ‘’ఆమె యెంత ఎత్తు అంటే ,తనపళ్ళు తనకే అందకా ,కుర్చీ ఎక్కి మరీ తోముకుంటుంది’’ .ఇంకోతి-‘’ఆమెకు జ్ఞాపకశక్తి పోయింది .తాను  బతికి ఉందొ లేదో పక్క వాళ్ళని అడిగి తెలుసుకొంటు౦ది .’’ఒక కొంటె కుర్రాడు ‘’నువ్వు బతికి ఉన్నావని ఎవరు చెప్పారమ్మా  ఆ మాట శుద్ధ అబద్ధం .అన్నాడు వెంటనే ఆమె ‘’నేను చచ్చానన్న సంగతి నాకెందుకు చెప్పలేదు ‘’అని ఏడుస్తూ కూర్చుంది .’’స్నానానికి చన్నీళ్ళు మంచిదే కానీ అందులో కొన్ని వేన్నీళ్ళు కలిపితే ప్రశస్తం ‘’.మరోటి ‘’ఆకవి పద్యాలన్నీ వచనంలోనే అఘోరిస్తాడు ‘’.ఒక హాస్యరచయిత ‘’భార్యా విధేయుడు వేళకు కొంపకు చేరతాడు లేకపోతెభార్య  చెవులు మేలేస్తు౦దనొ సాదిస్తు౦దనొనభయం .కానీ అటువంటి వాడుకాదట తనను ఇంటికి చేర్చే రైలు తప్పినా ఎక్కటంమానడుట .

  ఒకాయన తనతో మాట్లాడటానికి వచ్చిన స్నేహితుడితో ‘’ఇక్కడే వెయిట్ చేయి నేను అలావెల్లి వస్తా .నేను లేనప్పుడు నేను రావచ్చు అప్పుడు నువ్వు నన్ను మిస్ అవుతావు –దీన్నే ఇంగ్లీష్ లో ‘’Imay come in my absence ‘’అని అంటారు .దీన్ని అబ్సర్డ్ అన్నారు అందులోనే మనోహర చమత్కారం ఉందన్నారు సార్. అబ్సర్డిటి చమత్కారానికి గని అన్నారు ముని జీ .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.8వ భాగం.17.10.22

విజయ విలాసం.8వ భాగం.17.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5

  హరిశ్చంద్ర ఏడవఏటనే కవిత్వం రాశాడు .అందులో వైష్ణవ భక్తీ ఎక్కువ.కొన్ని ఇతరవిశషయాలూ ఉన్నాయి .బ్రజ్ భాషపై మక్కువ తో రాదా కృష్ణులపై భక్తికీర్తనలురాశాడు . వెన్నెముక లేనిది  అని బ్రజభాషను కొందరు అన్నా ,అందులో ఆభాష ఆయన కవిత్వంలో మృదు మధురరూపం దాల్చింది .ప్రేమకు భక్తికి సమన్వయము తెచ్చాడు .శృంగారానికి ఆధ్యాత్మికత జోడించాడు .మొత్తం మీద 3వేల భక్తీ కీర్తనలు ,ప్రణయ గీతాలు రచించాడు .హిందోళ ,పూర్వి ,ఖయాల్ కల్యాణి వంటి వందరాగాలలో ఇవి రాశాడు .ఇవన్నీ 20సంపుటాలుగా వచ్చాయి .భక్తీ సర్వస్వం అనే దానిలో భగవంతుని లక్షణాలు వివరించాడు .ప్రేమమాలికలో బాల కృష్ణ లీలలు వర్ణించాడు .కృష్ణుడు వ్రేపల్లె వదిలి వెళ్ళే టప్పుడు గోపికలు పడేఆరాటం ఆవేదన మనోహరంగా చూపాడు .ప్రేమ పవిత్రతకు చిహ్నం అన్నాడు .ప్రేమ ప్రతాప్ లో నిష్ఫలప్రేమలో నిరాశ వివరించాడు .ప్రేమ అశ్రు వర్ణాలో ఋతు శోభ వర్ణించాడు .పరిపక్వంకాని ప్రేమ శూన్యం అన్నాడు .

  బ్రజ్ పై ఎంత వ్యామోహమున్నా ఖడ్ బోలీ లోనూ పద్యాలు రాశాడు .ఆతర్వాత ఈ రెండిటి రూపు రేఖలూ లేకుండా తుడిచేశాడు .హిందీలో గొప్ప రచనలు చేసిన ఈయన ఉర్దూ  లోనూ బాగా కృషి చేశాడు .1872లో’’క్వాసిడ్ ‘’అనే  ఉర్దూ పత్రిక ప్రారంభించటానికి ప్రకటనలు కూడా ఇచ్చాడు .ప్రోత్సాహం లభించకమానేశాడు ఉర్దూ లో పద్యాలు ,వచన రచనలు మిమర్శ అచ్చులో వంద పేజీలదాకా రాశాడు .అనిల్ ,వాజిస్ అనే ఉర్దూ కవులకు మిత్రుడుగా ,పోషకుడుగా ఉంటూ ‘’రస ‘’కలం పేరుతొ ఉర్దూలో రాసేవాడు .అతని గులిస్తాన్ ఇపుర్ బాహర్ ,చమాని స్తాన్ ఇ పుర్ బాహర్ అనే పద్య సంపుటాలు విజ్ఞాన ఖనులు అన్నారు. గజల్స్ కూడా రాశాడు .సమకాలీన ఉర్దూకవుల రచయిత్రుల వివరాలు తెలుసుకోనేవాడు .రూప్ రతన్ కలం పేరుతొ భోపాల్ బీగం రాసిన రచనలను ఆసక్తిగా చదివేవాడు .వాటినితన పత్రికలో ప్రచురిస్తూ ,కలకత్తా నుంచి వెలువడే భారత మిత్ర కు తన ప్రసంశలు జోడించి ముద్రణకు పంపి ప్రోత్సహించేవాడు .పంచ వన్ పైఘామ్బార్ ,కుషీ అనే వచన వ్యాసాలూ ఉర్దూలో రాశాడు .హిందూస్తానే అక్బర్ పత్రిక ఇతని ఉర్దూ రచనలను శ్లాఘించేది .ఆయన ఉర్దూలో నాటికలు రాయకపోవటం పెద్ద వెలితి అని సాహిత్యకారులు అంటారు .

   అనేక సాహిత్యప్రక్రియలపై తనదైన ముద్ర వేసిన హరిశ్చంద్ర హిందీ నాటకాలకు చేసిన సేవ అపూర్వం .స్వంతవీ బెంగాలీసంస్కృత ఇంగ్లీష్  అనువాదాలు కలిపి 18నాటికలు హిందీలో రాశాడు .మొదటినుంచి బెంగాలీ స్నేహితులు ఆయనకు ఎక్కువగా ఉండేవారు .ఆధునిక హిందీనాటికలలో సీతల్ ప్రసాద్ త్రిపాఠి1867లో  రాసిన ‘’జానకీమన్ డళ్’’మొదటిది .కాశీ రాజు ఎదుట ప్రదర్శించాలి అనుకొన్న దీనిలోని లక్ష్మణ పాత్రధారి అనారోగ్యం తో రాలేకపోతే ,17ఏళ్ళ హరిశ్చంద్ర కొద్ది సమయం తనకిస్తే ఆపాత్ర ధరిస్తానని చెప్పాడు .ఇంత తక్కువ సమయంలో వేరొకరు నటించటం అసాధ్యమన్నాడు రాజు .అరగంట యిస్తే చాలన్నాడు ఈయన ,గంట సమయమిచ్చారు .ఆసమయంలో నాటకం బాగా చదివాడు .అందులోని ప్రతివాక్యం గడగడా వప్పచేప్పేసరికి అంతా ఆశ్చర్యపోయారు .లక్ష్మణ వేషం వేసి రక్తికట్టించి సమర్ధత చాటి చూపాడు .

  అప్పుడే నాటక రచనకు శ్రీకారం చుట్టాడు .ప్రవాస్ అనే మొదటి నాటకం రాశాడు ఇప్పుడది అలభ్యం.రెండోది రత్నావళికి అనువాదం .జతెన్ద్రమోహన్ ఠాకూర్ బెంగాలీ నాటకానువాదంగా విద్యాసుందర్ రాశాడు .అప్పుడే 1870లో ప్రెస్టన్ జీ ఫ్రాంజీ అనే మొదటి నాటక సంస్థ వెలిసింది .7ఏళ్ళ తర్వాత ఢిల్లీ కి చెందిన కుర్ పద్ జీ బాలీవాలా ‘’విక్టోరియా ధియేట్రికల్ కంపెని ‘’ప్రారంభించాడు .కోవాల్ ఖాతూవ్ పెట్టిన ‘’ఆల్ఫ్రెడ్ ధియేట్రి కల్ కంపెనీ కూడా ప్రసిద్ధికెక్కింది .నాటకం నవరస భరితంగా ,పంచ కళా స్వరూపంగా ఉండాలని హరిశ్చంద్ర భావించాడు .అందుకే తన భావ వ్యక్తీకరణ ధ్యేయంగా నాటకాలు రాశాడు .పార్శీ నాటకరంగం వేగం గా దూసుకుపోవటానికి కారణాలు గ్రహించాడు .అందులోని మంచినీ సనాతన రంగస్థల వాంచలను ప్రవేశ పెట్టాడు .నాటకపద్యాలు సున్నితంగా బ్రజభాషలోనే రాసినా ఖడ్ బోలీకి ప్రాదాన్యమిచ్చాడు .బ్రాహ్మణ పాత్రలకుసంస్క్రుతం సామాన్యులకు వాడుకభాష వాడి,సహజత్వం తెచ్చాడు .కాలానికి అనుగుణంగా నూతన విధానాలు జోడించాడు .అనారోగ్యంగా ఉండి,అవసాన దశలో రాసినవిశిష్టరచన  ‘’నాటక్’’.ఇందులో ఆనాటి నాటకాల పురోగమనానికి కారణమైన ఇంగ్లీష్,బెంగాలీ  నాటకాలను చక్కగా విశ్లేషించాడు .సాహిత్యంలో నాటకం ముఖ్యభాగం అన్నాడు .

    పురాతన చారిత్రిక సాంఘిక నాటకాలు రాసినా భారతే౦దు సమకాలీన సమాజ చిత్రణలో కొత్త వరవడి ప్రవేశపెట్టి మార్గదర్శి అయ్యాడు .విధవా వివాహం మాంసాహారనిషేధం ,సంస్థానాలలో అరాచకాలు , ,భారత్ ఉత్పత్తిని బ్రిటన్ దేశాభి వృద్ధికి వాడుకోవటం మొదలైన విషయాలు నాటకాలలో చర్చించాడు .సమాజ దురాచారాలను అవినీతిని చీల్చి చెండాడాడు .అతని ఆదర్శాలకు అండగా ప్రతాప నారాయణ మిశ్రా ,బద్రీ నారాయణ చౌదరి ,బాలకృష్ణ భట్ట వంటి సాహితీ ప్రముఖులున్నారు .

  హిందీ నాటకానికి ఆధునికత తెచ్చినవాడు హరిశ్చంద్ర .మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని ‘’ ,దుర్లాభ్ బంధు ‘’గా స్వేచ్చానువాదం చేశాడు .పాత్రలు పోర్షియాకు పుర్ శ్రీ ,,షైలాక్ కు శౌలాక్షు అని బసానియోకి బసంతు అనీ ,హిందూ పెర్లుపెట్టాడు .బెంగాలీనుంచి విద్యాసుందర్ ,భారత్ జనని అనుకరణలుగా రాశాడు .సంస్క్రుతనాటకాలకు అనువాదాలు అనుసరణలూ చేశాడు .సత్యానికి అసత్యానికి జరిగే నిరంతర పోరాటం గా ‘’సత్యహరిశ్చంద్ర ‘’,మానవాతీత సత్యనిరతికి హరిశ్చంద్రుడు ,దాన్ని విచ్చిన్నం చేసే దుష్టశక్తి విశ్వామిత్రుడు గా చూపాడు .చంద్రావలి నాటకం లో సర్వ ప్రపంచాన్నే రక్షించే ప్రేమస్వరూపుడుగా కృష్ణుడిని ఆవిష్కరిస్తాడు .శోకాన్ని అధిగమించి ధర్మ సిద్ధికోసం నిరంతర అన్వేషిగా చంద్రావలి ని తీర్చి దిద్దాడు .’’ప్రేమ జోగిని ‘’లో ఆనాటి కాశీ పరిస్థితులు ప్రతిబింబింప జేశాడు .కళావంతులనుసమర్ధించాడు .మంచి చెడ్డ లేక నిష్పక్షపాతం ఇందులో సమర్ధించాడు .అనారోగ్యం పేదరికం ,అవివేకం తాగుడు లను పాత్రలు చేయటం కొత్త పధ్ధతి .ఇలాగే  అంధేర్ నగరి  కూడా రాశాడు .నీల్ దేవి లోనూ సమాజ దుర్దశ చూపాడు .బ్రిటన్ లో స్త్రీలు పురుషులతో సమానంగా ముందుకు వెడుతుంటే మనదేశం లో స్త్రీలు ఇంటికి అంటుకు పోయారని బాధపడుతూ ,వాళ్ళు  పిల్లాపాపలనుచక్కగాసాకుకొంటూ నమ్రత తో ఉంటూ కూడా ఇంటి బయట నిర్మాణాత్మకమైన కార్యాలలో ముందుకు రావాలని కోరాడు .భారత నారీమణులు ఉన్నత స్థానం లో ఉన్నారు ఆవిషయాలు ఇప్పటి స్త్రీలు గుర్తించి  అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నాడు .’’విపస్య విష మౌషధం’’నాటకం బరోడా రాజు పతనంపై రాసింది .ఇంగ్లీష్ లో కొద్ది పరిజ్ఞానంసంపాది౦చినంతమాత్రాన ,అభ్యుదయవాడదులమనీ పునరుద్ధరణకు కంకణం కట్టుకొన్నామని విర్ర వీగేవారిని విమర్శించాడు .ఈ విమర్శ ఆయన ప్రత్యర్ధులు రాజా శివరామప్రసాద్ ఆయన అనుచరులను ఉద్దేశించి అన్నమాటలే .

 సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-17-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment