విజయ విలాసం7వ భాగం.16.10.22

విజయ విలాసం7వ భాగం.16.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 1వ భాగం.16.10.22

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 1వ భాగం.16.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

ఆంధ్రా ఎడిసన్ కవిశేఖర పాను గంటివారి సాక్షి .3వ భాగం.16.10.22

ఆంధ్రా ఎడిసన్ కవిశేఖర పాను గంటివారి సాక్షి .3వ భాగం.16.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 7వ భాగం.16.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 7వ భాగం.16.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

విజయ విలాసం.6 వ భాగం.15.10.22

విజయ విలాసం.6 వ భాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4హరిశ్చంద్ర -4

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4

రాజారామ మోహన రాయ్ తన ‘’బంగదూత ‘’ను దేవనాగరిలో వచనం  తో సహా నాలుగు భాషలలో ప్రచురించాడు .ఉద౦త్ మార్తాండ్ మొదటి హిందీ పత్రికలో వచనమే రాశాడు .హిందీ వాడుకభాషలో వచ్చిన మొదటి పత్రిక కాశీ నుంచే 1844లో వెలువడింది .తారామోహన మిత్ర సంపాదకుడు .రాజా శివప్రసాద్ ‘’సితార ఎ హింద్’’పత్రిక కు పోషకుడు .ఇది హిందీలిపిలో ఉన్నా పర్షియన్ ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉండేది .1850లో తారామోహన మిత్ర సుధాకర్ పత్రిక స్థాపించాడు

  పత్రికలో ఏ భాష వాడాలి అనే వివాదానికి తెరదించి హరిశ్చంద్ర 1867లో  ‘’కవివచన సుధ’’పత్రిక నిర్వహించాడు .మొదట్లో బిహారి,జాయసీ రాసిన పద్యాలు వేశారు .హరిశ్చంద్రకు పద్య రచనా నైపుణ్యమే కాదు అద్భుతంగా శ్రావ్యంగా గానం చేసే ప్రతిభ ఉంది  .అందుకే ఆయనను ‘’కలియుగ్ కా కన్హ యా ‘’కలియుగ కృష్ణుడు అనేవారు .అతని శరీరచాయ గిరజాల జుట్టూ కూడా దానికి తగినట్లే ఉండేవి .ఇతని పత్రికకొనేవారు 25౦ మంది .వీరిలో 150 మంది చందాదారులు .మిగిలినవాటిని బ్రిటిష్ వారుకోనేవారు .కొద్దికాలంలోనే పక్షపత్రిక ఆతర్వాత వారపత్రికగా మారింది ..1867లో వెలువడిన మూడు స్వతంత్రహిందీ పత్రికలలో కవి వచన సుధఒకటిగా గుర్తి౦పు పొందింది.రామమోహన రాయ్ అంతటివాడు అని ప్రఖ్యాతిపొండాడు హరిశ్చంద్రసంపాదకుడై .ఎందఱో రచయితలకు మార్గదర్శి అయ్యాడు ..ఇతనివల్లనే హిందీ పత్రికా రంగానికి స్థిరత్వం కలిగింది .ఆకాలం లో సాహిత్యవిలువలున్న ఎన్నో పత్రికలూ వచ్చినా నిలదొక్కుకోలేక కాలగర్భం లో కలిసిపోయాయి .

 1873లో భారతేందు మరోపత్రిక ‘’మేగజైన్ ‘’ప్రారంభించాడు .ఈపేరు చాలామందికే కాక అతనికీ నచ్చక ‘’చంద్రిక ‘’గా మార్చాడు .ఇందులో వచనం నాటకాలు సమీక్షలు వ్యాసాలూ ,హాస్యరచనలు ,చదరంగ పోటీ విశేషాలు ఉండేవి .అంటే మానవ జీవితానికి కావాల్సిన అన్నీ ఉండేవి .సహాయ సంపాదకులుగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వామి దయానంద సరస్వతి ,భీషుబ్ చంద్ర సేన్ ,వంటిప్రముఖులు౦డేవారు .ఈపత్రికనూ బ్రిటీష్ వారు వందకాపీలు కొని ప్రోత్సహించారు .రాజా శివరామ ప్రసాద్ తనపత్రికలో వాడే పర్షియన్ పద మిశ్రిత హిందీకి ,వారణాసి బ్రాహ్మణులు వాడే సంస్కృత పదభూయిష్ట హిందీకి మధ్యగా హరిశ్చంద్ర చంద్రిక పత్రికలో సామాన్యమానవులు వాడే వాడుక భాషను వాడి ప్రజలకు పత్రికను సన్నిహితం చేశాడు .సంపన్న ఉన్నత కుటుంబం లో పుట్టినా సామాన్యుల భాషను ప్రోత్సహించటం ప్రశంసనీయం .వేషం లో డాబూ దర్పం ఉన్నా ,వీధి భాగవతులతోకలిసి కవిత్వం అల్లేవాడు .తాను  అనుసరించిన మార్గాన్నే పత్రిక భాషగా తీర్చి దిద్దాడు .ఇతని రెండు పత్రికలు ఎందరికో ప్రత్సాహాన్నిచ్చి ఎన్నోపత్రికలు రావటానికి తోడ్పడ్డాయి .దీనిఫలితంగా ‘’హరిశ్చంద్ర మండలి ‘’ఏర్పడి ,ఇప్పటికీ నడుస్తూనే ఉంది .బద్రీ నారాయణ చౌదరి అనే ప్రేమ ఘన అతడి వీరాభిమాని .ఆనంద్ కాదంబినీ ,మాసపత్రిక నగరినినాద్ వార పత్రిక ఈ ధ్యేయంతోనే ప్రారంభించి నిర్వహించాడు .పండిత ప్రతాప్ నారాయణ మిశ్ర హరిశ్చంద్ర పత్రికలకు రాసేవాడు .కలకత్తా నుంచి  అలహాబాద్ వచ్చిన పండిత బాలకృష్ణ భట్టా హిందీప్రదీప్ పత్రికస్థాపించాడు .ఇదేఅలహాబాద్ లో హిందీ వర్ధని సభకు మార్గదర్శనం చేసింది .దీనికి చైతన్యం తెచ్చినవాడు హరిశ్చంద్ర .అధ్యక్షోపన్యాసం ఇవ్వటానికి అలహాబాద్ వెళ్ళినప్పుడు మాతృభాష ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పాడు. ప్రఖ్యాత రచయిత లాలా శ్రీనివాసదాస్ ఇక్కడికి వచ్చి ‘’సదా ధర్మ సదాదర్శ్ ‘’పత్రిక  పెట్టి నిర్వహించాడు .కొంతకాలానికి దాన్ని చంద్రికలో విలీనం చేశాడు .హరిశ్చంద్ర పై విపరీత అభిమాన గౌరవాలున్న రాధాచరణ్ గోస్వామి ‘’భారతే౦దు ‘’పత్రిక స్థాపించి తన అభిమాన్నాన్ని వ్యక్తం చేశాడు .ఇంతమంది గోప్పరచయితలకు ప్రేరణ ,ప్రోత్సాహం కల్పించటం వారి రచనలు తన పత్రికలలో ప్రచురించటం హరిశ్చంద్రకు గొప్ప గర్వ కారణం.

  పత్రికారంగం లో సాధించిన విజయాలను పురస్కరించుకొని మహిలా ఉద్యమ వ్యాప్తికి  ‘’బాలబోధిని ‘’,తానూ జన్మతః వైష్ణవుడుకనుక వైష్ణవ భక్తీ ప్రచారానికి ‘’భగవత్ తోషిణి’’అనే మరో రెండు పత్రికలూ నిర్వహించాడు .ప్రభుత్వం యధాశక్తి సహకరించింది .గోహత్య మహా పాతకం అనే శీర్షికపై రచనలు నాటికలపోటీ నిర్వహించి బహుమతులిచ్చేవాడు .మద్యం, మాంసాహారం తీసుకోము అని సభ్యులతో ప్రమాణం చేయించేవాడు .తన పత్రిక పాఠకులతో విదేశీ వస్త్రాలు వాడము అని ప్రతిజ్ఞ చేయించాడు .ఉత్తరభారతం లో హిందీని ప్రాధమిక భాష చేయాలని తీవ్రంగా కృషి చేశాడు

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంధ్రా ఎడిసన్ కవి శేఖర పానుగంటి వారి సాక్షి….2వభవంభాగం.15.10.22

ఆంధ్రా ఎడిసన్ కవి శేఖర పానుగంటి వారి సాక్షి….2వభవంభాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 6వ భాగం.15.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 6వ భాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5

14-సాహితీ విమర్శకుడు కధాశిల్పం ఫేం ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ,,లెక్చరర్ –శ్రీ వల్ల్మపాటి వెంకట సుబ్బయ్య

, వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 – జనవరి 2, 2007) సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[1]

జననం
వల్లంపాటి 1937, మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లె బీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.

వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి…? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.

ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.

మరణం
2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.

రచనల జాబితా
నవలలు

· ఇంద్ర ధనుస్సు – 1962

· దూర తీరాలు – 1964

· మమతలు – మంచుతెరలు – 1972

· జానకి పెళ్ళి – 1974

కథలు

· బండి కదిలింది

· రానున్న శిశిరం

· బంధాలు

సాహితీ విమర్శ, పరిశోధన

· కథా శిల్పం – 1996

· నవలా శిల్పం – 1995

· నిమర్శా శిల్పం – 2002

· అనుశీలన – 1985

· నాటికవులు – 1963

· వల్లంపాటి సాహిత్య వ్యాసాలు – 1997

· రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ – 2006

అనువాదాలు

· ప్రపంచ చరిత్ర

· చరిత్ర అంటే ఏవిటి?

· చరిత్రలో ఏమి జరిగింది?

· ప్రాచీన భారతదేశం ప్రగతి

· సంప్రదాయ వాదం – 1998

· భారతదేశం చరిత్ర – (ఆర్.ఎస్.శర్మ 2002)

· బతుకంతా (కన్నడ నవల)

· లజ్జ

· నవల-ప్రజలు

ఇంకా

· ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు

· తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు

· ఇండో – ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.

సత్కారాలు
· తాపీ ధర్మారావు అవార్డు – 1993

· కొండేపూడి సాహిత్య సత్కారం[2]. – 1995

· తెలుగు యూనివర్శిటీ అవార్డు – 1997

· గజ్జల మల్లారెడ్డి అవార్డు – 2000

· కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2000

15-సుప్రసిద్ధ కదా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత ,డా అంబేద్కర్ యూని వర్సిటి డైరెక్టర్ –శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు

వ్యక్తిగత జీవితం
జూలై 10, 1939 న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం, వృత్తి
కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

సాహిత్య రంగం
ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు “దృష్టి” అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం “ఈభూమి” పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

పురస్కారాలు
· కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),

· భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),

· తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),

· రావిశాస్త్రి అవార్డు,

· రితంబరీ అవార్డు

· ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2].

అధ్యాపకుడుగా
· విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.

వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని…
· 1991 కేతు విస్వనాథరెడ్డి కథలు……. ఆంధ్రజోతి వార పత్రిక.

· 1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.

· 1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.

· 1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.

· 1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.

· 1979 ఆరోజులొస్తే… నివేదిత మాస పత్రిక.

· 1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.

· 1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.

· 1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.

· 2001 కాంక్ష రచన మాస పత్రిక.

· 2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.[3]

ఇతరుల మాటలు
· ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందింది కాదు. అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)

· 1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-మధురాంతకం రాజారాం

· విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది. ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది. అలంకారాలుండవు-అనుభూతివుంటుంది; కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారాయణ

· నీల్లు లేని రాయలసీమలో జీవన ప్రవాహంలో తనుమోసిన, అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య

· ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి. కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది. అంటే అంత కఠినమైనది. తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు

· …సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా

· ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

హాస్యానందం45-సమాసోక్తి

హాస్యానందం
45-సమాసోక్తి
రెండు మూడు అక్షరాల మాట తో చెప్పాల్సిన దాన్ని పెద్ద సమాసం లో చెప్పటం సమాసోక్తి అన్నారు మునిమానిక్యంగారు .చెంబు అని సింపుల్ గా అనకుండా ‘’జలాది ద్రవ్య ధారక సమర్ధ లోహాదిపదార్ధనిర్మిత ఘటికా విశేషం ‘’అ౦టేఅవతలి వాడి బుర్ర పగిలిపోతుంది .అంటే అల్పమైన భావాన్ని పెద్దసమాసంలో కూర్చటం అన్నారు మాస్టారు .అలాగే అందమైన వాడు అనటానికి ‘’పవనాశనేంద్ర ధర మకుటాలంకార మణి జనక వరపుత్రీ రమణ కుమారరూపదీపితుడు ‘’అంటే క్లిష్టం అయి కావ్యదోశ మౌతుందని ఆలంకారికులు అన్నారు .ఈ డొంక తిరుగుడు వలన వినే వాడికి నవ్వు పుట్టిస్తుంది ,వాడి అందం దేవుడెరుగు .
ప్రగల్భోక్తి –నమ్మటానికి వీల్లేని దాన్ని నమ్మమని చెప్పటమే ప్రగల్భోక్తి అని నిర్వచించారు మాణిక్యంసార్ .ప్రగల్భాలు అతిశయోక్తులే .విస్తరించి చెబితే అర్దాశ్రయ హాస్య ప్రక్రియ అవుతుందన్నారు .ఉదాహరణ –ఒకాయన ఈకాలపు మనుష్యుల బలహీనతలగురించి చెబుతూ ‘’ఈకాలం సన్నాసులు దేనికీ పనికిరారు పిట్ట తిండి పిట్ట కూతగాళ్ళు .మాకాలం లో ఒక్కొక్కడూ సేరు బియ్యం అన్నం ఊదేసే వాళ్ళం .చుట్టలు ఇప్పటివాళ్ళూ కాలుస్తారుకానీ ,అప్పుడు మావాళ్ళూ కాల్చేవారు ఎంతతేడా ఎంతతేడా ?మా వాడు భోంచేసి చుట్ట ముట్టి౦చాడూ అంటే ఆచుట్ట రాత్రంతా అలా కాలుతూనే ఉండేది. రూళ్ళకర్రల్లాగా ఉండేవి ఆకాలం చుట్టలు .ఇప్పుడు వీళ్ళు కాల్చేది చుట్టలుకాదు చుట్టపీకలు .పది నిమిషాలకంటే ఎక్కువ సేపు చుట్ట కాల్చేవాడు దివిటీవేసి వెతికినాదొరకడు ఇప్పుడు .ఆ కాలం వేరు ఆమనుషులు వేరు .
మరో ఉదాహరణ –ఒకాయన ‘’ఇప్పుడు గ్రహణాలు పడితే అర్ధగంట మహా అయితే గంట .మాకాలం లో అసలు గ్రహణాలు పట్టేవేకావు .కర్మ చాలక గ్రహణం పట్టిందా అంటే రెండురోజులు ఏక ధాటిగాఉండేవి .ఇప్పుడేవీ అలంటి గ్రహణాలు పిదపకాలం పిదప గ్రహణాలూ’’అన్నాడట
ఇంకో ముదురాయన ‘’మా తాత పాలు తీయటానికి ముక్కాలు పీట వేసుకొని పొడదుగు దగ్గర కూచున్నాడూ అంటే సాయంత్రం ఆరింటికి కూచున్నవాడు తెల్లార్లూ తీస్తూనే ఉండేవాడు .చివరికి విసుగొచ్చి లేచి ,దూడను వదిల్తే చీకటిపడే దాకా పాలు కుడుస్తూనే ఉండేది .ఇప్పుడు అలాంటి ఆవులూ లేవు అలాటి మనుష్యులూ లేరు ‘’అన్నాడు.
ఆత్మ తృప్తితో అంటున్నమాట కూడాహాస్యమనోహారం చెయ్యచ్చునన్నారు మునిమాణిక్యం .ఒకావిడ భర్తతో పోట్లాడి బావిలో పడిచస్తాను అని బెదిరించింది .భర్తకు ఒళ్ళు మండి ‘’నీ చావు నువ్వు చావు .మనదొడ్లో బావిలేదు .ఎదురింట్లో ఉంది కావాలంటే అందులో దూకి చావు ‘’అన్నాడు .ఆమెకు అభిమానం తన్నుకొచ్చి ‘’ఎవరి బావిలోనో పడి చచ్చే కర్మనాకేం పట్టలేదు .మన ఇంట్లోనే బావి తవ్వించుకొని మరీ చస్తాను’’ .ఇదీ ప్రగల్భోక్తి లాంటిదే అని ప్రగల్భం స్వాభిమానంతో గర్వం తో పుట్టేది అని వివరణ ఇచ్చారు గురూజీ .ప్రగల్భం ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి అక్కా చెల్లెళ్ళు లాంటివే .హనుమతుడు రావణుడి ఎదుట తనతోక అతిగా పెంచి ఆదేసి౦హసనమనుకుని కూర్చున్నాడు .ఈ విషయం హనుమంతుడి నోటిద్వారా వస్తే ప్రగల్భోక్తి అయ్యేది,దాన్ని పరమ సత్యంగా భావిస్తాం కనుక హాస్యపు పలుకుగానే ఉంటుందన్నారు మునిమానిక్యంజీ .కానీ ఇది సరైనదికాదు అని ఆయన మిత్రులు వాదించారట .మరింత లోతుగా ఆలోచించాలని ఆపేశారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-14-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.5వ భాగం.14.10.22

విజయ విలాసం.5వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3

  సత్య హరిశ్చంద్రుని పేరు తనపేరుకావటం భారతేందు అని అందరూ గౌరవంగా పిలవటం ఆయనకు గర్వంగా ఉండేది.ఉదారస్వభావుడుగానేకాక సత్యధర్మ పాలకుడుగా కూడా ఉండేవాడు .ఆలిగగడ్ విశ్వ విద్యాలయం స్థాపించిన సయ్యద్ అహ్మద్ ఖాన్ న్యాయవాదిగా వారణాసి బదిలీ మీద వస్తే ,ఇతని పై  వేసిన దావాలో ఈయన కోర్ట్ కు హాజరవ్వాల్సివచ్చింది .ఆదావాలో ఈయన ఒక వ్యాపారికి 3వేలరూపాయలు తీర్చాల్సి వస్తే ,వ్యాపారి ఒక నావను అమ్మి కొంతడబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది .డబ్బు ఎగగొట్టటానికి మంచి అవకాశం .న్యాయమూర్తి ఈయన నిజాయితీ గుర్తించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే ‘’డబ్బుకోసం మతధర్మం , సత్యాన్ని త్యాగం చేయలేను .ఆవ్యాపారి నన్ను ప్రోనోట్ రాసిమ్మని అడగలేదు ,అతని షరతులకు నేను ఒప్పుకొని తీసుకున్నాను .అప్పు తీర్చే టప్పుడుఎ౦దుకుకు మాట తప్పాలి ?సత్యానికి ప్రతీకగా నిలబడిన హరిశ్చంద్రుని పేరే నా పేరు ‘’అన్నాడు .న్యాయమూర్తి ఆయన సత్య సంధత గుర్తించి సాక్షుల విచారణ చేయకుండా తీర్పు చెప్పాడు .అతని నీతి నిజాయితీలకు ఇలాంటివి కోకొల్లలు .చిన్న అప్పులకు కూడా ఎక్కువ డబ్బు చెల్లించేవాడు .

  ఒకసారి కుటుంబంతో పూరీ యాత్రకు బయల్దేరి వెడుతుంటే గోపాల్చంద్ర స్నేహితుడు రెండు బంగారు నాణాలు అప్పుగా ఇచ్చాడు తనకు డబ్బు అవసరం లేదని ఎంత చెప్పినా వినకుండా .వెళ్లిరావటానికి కొన్ని రోజులుపట్టింది .నాణాలను డబ్బుగా మార్చాడు .ఆయన దగ్గర డబ్బున్న సంగతి తెల్సి కొంతకాలం అక్కడే ఉందామన్నారు కుటుంబ సభ్యులు .డబ్బు పూర్తిగా ఖర్చైపోయింది .రెండు నాణాల అప్పు తీర్చటానికి ఆతర్వాత ఆయన 15వేలు ఖరీదు చేసే ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆయనే ఒకసారి చెప్పాడు .ధనార్జన ,పొదుపు ఆయనకు తెలీనివి .పూర్వం వ్యాపారంలో కుటుంబం కుబేర స్థానంలో ఉంటె ఇప్పుడు ‘’బేర్’’మనే స్థితికి వచ్చింది .వ్యయం తప్ప ఆదాయం హుళక్కి.కుటుంబ సభ్యులు కాశీ రాజు దగ్గరకు వెళ్లి ఈయనతో ఎలాగైనా దుబారాఖర్చు తగ్గించెట్లు చేయమనికోరితే ఆయన ఈతన్ని పిలిపించి సూచన చేయబోతే ‘’అయ్యా డబ్బు మాపూర్వీకుల్ని హరించి వేసింది .నేను డబ్బును హరి౦చాలనుకొన్నాను. నాకు డబ్బుపై వ్యామోహం లేదు ‘’అన్నాడు .ఇక ఎవరూ ఆయన్ను ఆపలేకపోయారు .

  లాభం లేదని కుటుంబంలోని వారంతా భాగాలు పంచుకొందామని నిర్ణయించి ,ఈయన అనాసక్తత వలన ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టగా ఉన్నదంతా వాళ్ళే పంచేసుకొన్నారు .ఆయన చిన్నతనం లోచేసిన అప్పులు కూడాఆయన భాగంలోనే చూపించార్రు .తర్వాత అమ్మమ్మ  ఆస్తిపంపకాలలో కూడా ఇలానే  ఆయన్ను అన్యాయం చేశారు .అయినా ఉమ్మడిగానే ఉన్నారు .హరిశ్చంద్ర ఉన్నభాగం తో మిగిలినవారు సంబంధం పెట్టుకోలేదు .ఆదాయం లేకపోవటం వలన అప్పులు చేయాల్సి వచ్చి తీర్చటానికి ఆస్తి అమ్మాల్సి రాగా సోదరుడు గోకుల్ చంద్ర ,ఈయన అప్పులు తీర్చేసిఅస్తి స్వాధీనం చేసుకొన్నాడు .ఆస్తి పోయినందుకు బాధపదలేదుకానీ అప్పు పుట్టనందుకు ఎక్కువ బాధ పడ్డాడు .ఇంతజరుగుతున్నా ఆయన సాహిత్య సంపదమాత్రం పెరుగుతూనే ఉంది . హరిశ్చంద్ర హిందీ సాహిత్యానికి చేసిన సేవ తెలియాలంటే ,అతనికి ముందు హిందీ సాహిత్యం ఎలా ఉందో తెలియాలి .అప్పటి ఉత్తర హిందూస్థాన్ లో అంటే ఇప్పటి బీహార్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ ,మధ్య ప్రదేశ్ లలో మాండలిక భాషలనుంచే ఇప్పటి హిందీఎర్పడింది .ఇక్కడి మాండలీకాలు మేవతి ,మార్వారీ ,జైపూరి,రాజస్థాన్ లకు చెందిన ఖడీబోలీ అంటే బంగారుభాష ,బ్రజ్ ,కనౌజీ ,బుందేలీ ,అవధి ,బాగ్ హెలి ,చత్తీస్ ఘడీ ,మైధిలి ,భోజ్ పూరి ,మాగధి ,.వీటిని దేవనాగరిలిపిలోనే రాసేవారు .మార్వాడీ వ్రజ్ ,అవధి మైధిలి భోజ్ పూరి లను కేవలం కవులే వాడేవారు .సాహిత్యం పద్యరూపం గా ఉండేది .వచనం అరుదు.మొగలాయీ దండయాత్రతో కొంత మార్పు జరిగింది .అరబిక్ పర్షియన్ టర్కి పదాలు ఆయా ప్రాంత మా౦డలీకాలలో  చేరిపోయాయి .దీనివలన ఉర్దూ భాష వచ్చింది .ఉర్దూ అంటే టర్కీ భాషలో’’ మిలిటరీ బస’’ అని అర్ధం.ఈ ఉర్దూ హిందీభాషలలో కలిసిపోయింది .ఢిల్లీ లో మాండలికంగా ఉన్న రెఖటా లేక హిండ్వీభాష మహమ్మదీయ రాజుల్నించి ఫకీరులా ‘’జాలియాస్ ‘’వరకు అలవాటైంది .షామిరాన్ బుర్హనుద్దీన్ ,మహమూద్ గౌస్ మొదలైనవారు ‘’హిండ్వీ’’లోనే రచన చేశారు .మంచి హిందీభాషగా చెలామణి అయింది ఈభాషలోనే అమీర్ ఖుశ్రు ,జాయాసి, కబీర్ లు కవిత్వం రాశారు .అక్బర్ ఈభాషను బాగా ప్రోత్సహించాడు అక్బర్ హిండ్వీభాషలో రాసిన పద్యాలనూ ‘’అక్బార్ రే ‘’అనే కలం పేరుతొ రాశాడు .అతని సమకాలికులు తోడర్ మల్ బీ  ర్బల్, అబ్దుల్ రహీం, ఖాన్ ఖానా ,అబుల్ ఫైజి, ,గంగాకవి తులసీదాస్ సూర్ దాస్ లుకూడా హిండ్వీలోనే రాశారు .జహంగీర్ షాజహాన్ ,ముర్షిదాబాద్ ,జీడ్,దక్కన్ సుబెదార్లు అందరూ దీన్ని ప్రోత్సహించారు .మొగలుల చివరి చక్రవర్తి బహదూర్ షా హిందీలోమంచికవి చాలారచనలు చేశాడు .

  మొగలాయికాలం లో పద్యమే ఏలింది .రాం ప్రసాద్ నిరంజన్ రాసిన భాషా యోగవశిష్ట -1741,పండిత్ దౌలత్ రాం అనువదించిన పద్మపురాణం -1761వంటివి అతితక్కువ వచన రచనలు. క్రైస్తవ కాలం లో మత ప్రచారం కోసం ఆయా మా౦డలీకాలనే వాడేవారు .హిందీ రచయితలకు అవకాశాలు బాగా వచ్చాయి. ప్రజలు ఎక్కువమంది అర్ధం చేసుకొనేవారు .కానీ బ్రజ్ భాషలోనే రచన జరిగింది .మొగలాయీలతర్వాత వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఉర్దూ పిచ్చపిచ్చగా నచ్చి ఉర్దూ-ఇంగ్లీష్ డిక్షనరీ,  ఉర్దూ వ్యాకరణం  గిల్ క్రైస్ట్ తో రాయించారు , రచయితలూ బాగా పండితులవటంతో ఉర్దూ పర్షియన్ భాషల్లో రచనలు చేశారు .ఆగ్రానుంచి వచ్చిన లల్లూ జూలాల్ కి ఉత్తరప్రదేశ్ లో మాట్లాడే ఖడ్ బోలీ బ్రజ్ లలో మంచి పరిచయముంది .భాగవతాన్ని హిందీలోని అనువదించి ప్రేమ సాగర్ పేరుతొ ప్రచురించాడు .హితోపదేశ ,పంచ తంత్రాలకు బ్రజ్ భాషలో అనువాదం చేశాడు .బైతాల్ మొదలైన వాటిని ఉర్దూ-హిందీ మిశ్రమభాషలో రాశాడు .నాసికేలో పాయాన్ ను  సాదత్ మిశ్రా 1803లో రాశాడు .ఖేత్ కికహాని అనే సంప్రదాయ గ్రంథాన్నిన  ఇన్సాల్లాఖాన్ రాశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-22-ఉయ్యూరు

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి.1వ భాగం.14.10.22

పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి.1వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం.5వ భాగం.14.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం.5వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -20

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -20

· 56-రచయిత ,కధకుడు పాడే ,వాడినమల్లెలు ఫేం,రాచకొండ పురస్కార గ్రహీత –శ్రీ సొదు౦ జయరాం

· సొదుం జయరాం తెలుగు రచయిత, కథకుడు. [1]

జీవిత విశేషాలు
అతను కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించాదు. అతను ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో చదివుకున్నాడు. అతను బి.ఏ. పట్టభద్రులు.అతను కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందాడు. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి అతని పేరొందిన కథలు. అతని కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. అతను రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది.[2]

1986లో అతను రాసిన ‘కర్రోడిచావు’ రాసిన కథలను కలిపి 1991లో ‘సొదుం జయరాం కథలు’ సంకలనం వచ్చింది. పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సొదుం జయరాం సాహిత్యనేత్రం ప్రచారం ద్వారా ‘రాతిపూలు’ సంకలనం తెచ్చారు.జయరాం రాసిన 12 కథలు రష్యా భాషలోకి, కొన్ని హిందీ,కన్నడ భాషలోకి అనువదింప బడినాయి.[3]

రచనల]
· వాడినమల్లెలు (కథాసంకలనం)

57-జుమ్మా కదల ఫేం,కేంద్ర సాహిత్య అకాడెమియువ అవార్డీ,టివి వ్యాఖ్యాత –శ్రీ వేంపల్లి షరీఫ్

వేంపల్లె షరీఫ్ తెలుగునాట ప్రముఖ కథా రచయిత. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు కడప జిల్లా వేంపల్లె గ్రామానికి చెందినవారు. ఇతని జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది [1].ఈ పుస్తకంలోని కథలను కడప ఆల్ ఇండియా రేడియో వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.

జుమ్మా
జుమ్మాఁ ఒక కథల సంపుటి [2]. జుమ్మా అంటే ఉర్దూలో శుక్రవారం అని అర్థం. హైదరాబాద్ లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ హిందీ, ఇంగ్లీషు, మైథిలి, కొంకణి, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి.ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘిక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ పుస్తకం తృతీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.

జుమ్మాలో ఉన్న కథలు

  1. జుమ్మా
  2. అయ్యవారి చదువు
  3. పర్దా
  4. తెలుగోళ్లదేవుడు
  5. ఆకుపచ్చముగ్గు
  6. చాపరాయి
  7. జీపొచ్చింది
  8. రజాక్‌మియాసేద్యం
  9. పలక -పండగ
  10. దస్తగిరి చెట్టు
  11. రూపాయి కోడిపిల్ల.

మరోవైపుఇటీవలే ఆయన “తలుగు’పేరుతో ఒకే కథను నేరుగాపుస్తకంగా ప్రచురించారు. “తలుగు’ అంటే రాయలసీమ మాండలికంలో గొడ్లనుకట్టేసే తాడు అని అర్థం.

బాల్యం
వేంపల్లె షరీఫ్ అసలు పేరు షేక్ మహమ్మద్ షరీఫ్. తండ్రి రాజాసాహెబ్, తల్లి నూర్జహాన్. కడప జిల్లాలోని వేంపల్లెలో పేద ముస్లిం కుటుంబంలోపుట్టారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. బాల్యమంతా వేంపల్లెలోనే గడిచింది. పదవ తరగతి వరకు వీరి చదువు సజావుగా సాగింది. తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. మొదట చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. రాయలసీమ గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా మలుస్తున్నారు. 2003లో సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ చేరారు. హైదరాబాద్ వచ్చాక ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

చదువు
హైదరాబద్లో ని పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పిహెచ్ డి చేశారు. “టీవీ ప్రకటనల్లో సంస్కృతి” అనే అంశంపై పరిశోధన చేశారు. అదే యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. “తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ‘ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు. ఎం ఏ తెలుగు చేశారు. ఆల్ ఇండియా రేడియో నుంచి “వాణి సర్టిఫికెట్ కోర్సు’ పూర్తి చేశారు.

రచనలు

  1. జుమ్మా (2011)- కథల సంపుటి (జుమ్మా కథా సంకలనం ఇంగ్లీషులో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం కన్నడ భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)
  2. తియ్యని చదువు (2017)- పిల్లల కథలు
  3. టోపి జబ్బార్ (2017)- కథల సంపుటి
  4. కథామినార్ (సహ సంపాదకత్వం) (2018) – నవ్యాంధ్ర ముస్లిం కథా సంకలనం
  5. చోంగారోటీ (సంపాదకత్వం) (2020) – రాయలసీమ ముస్లిం కథా సంకలనం
  6. తలుగు (2015) – ఏక కథాపుస్తకం – మనిషైనా, పశువైనా పరపీడన నుంచి విముక్తి కోరుకుంటే ఎలాంటి ‘తలుగు’లనైనా ఇట్టే తెంచుకోవచ్చని చాటి చెప్పిన కథ
  7. టీవీ ప్రకటనలు (2021) – పరిశోధనా రచన

తెలుగు టీవీ ప్రకటనల్లో భాషా సంస్కృతులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణగా వివరించిన పరిశోధనా పుస్తకం ఇది. తెలుగులో టీవీ ప్రకటనలకు స్క్రిప్టు ఎలా రాయాలి? అనువాదం ఎంత జాగ్రత్తగా చేయాలి? భావం ఎంత స్పష్టంగా ఉండాలి? సంస్కృతీపరమైన అంశాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాల మీద ఈ పరిశోధన సాగింది. రచయిత తన పిహెచ్ డి పరిశోధనలో భాగంగా ఈ పుస్తకం రాశారు. మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకంగా దీనిని విమర్శకులు ప్రశంసించారు.

ఇతర రంగాలు
వేంపల్లె షరీఫ్ రచయితగానే కాకుండా అప్పుడప్పుడు న్యూస్ రీడర్ గా కూడా టీవీల్లో కనిపిస్తారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్ ఎమ్ 101.9 లో ఆర్.జెగా వినిపిస్తారు. గతంలో వివిధ పత్రికల్లోనూ పనిచేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్యాకేంద్రం విద్యార్థులకోసం కొన్ని జర్నలిజం పాఠాలు రాశారు. చెప్పారు. సారంగ సాహిత్య వెబ్ మ్యాగజైన్లో 2012 నుంచి 2013 వరకు కథల విభాగానికి ఎడిటర్ గా పనిచేశారు. కొంతకాలం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెలువడుతున్న బాలికల ద్వైమాస పత్రిక “కస్తూరి”కి ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఉత్తమ కథలను స్వయంగా చదివి రికార్డు చేసి యూట్యూబ్ లో “కథనం” పేరుతో ప్రచురిస్తున్నారు. వీటికి అశేష ప్రజానీకం దగ్గర్నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

అవార్డులు
· కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం (జాతీయ పురస్కారం) 2012

· గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2017

· విమలాశాంతి సాహిత్యపురస్కారం (అనంతపురం)

· డా.కవితా స్మారక సాహిత్య పురస్కారం (కడప)

· కొలకలూరి భగీరథి కథా పురస్కారం (తిరుపతి)

· కథాపీఠం సాహిత్య పురస్కారం (రచన ప్రతిక)

· అక్షర గోదావరి కథా సాహిత్య పురస్కారం (విశాఖ) 2017

· వేదగిరిరాంబాబు కథానిక పురస్కారం (హైదరాబాద్) 2017

· విళంబి నామ ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2018

· కన్నడ సాహిత్యపరిషత్ పురస్కారం (కర్ణాటక ప్రభుత్వం) 2018

· చాసో సాహితీ స్ఫూర్తి పురస్కారం (విజయనగరం) 2018

· కువెంపు భాషా భారతి ప్రాదికార పురస్కారం (బెంగళూరు) 2019

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 44-పర్యాయోక్తి

హాస్యానందం

44-పర్యాయోక్తి

ప్రశ్ననుంచే సమాధానం లాగే పద్ధతిని పర్యాయోక్తి అన్నారు మునిమాణిక్యం మాస్టారు.మనం ఏ ప్రశ్న అడిగినా ఇమ్మీడియట్ గా జవాబు వస్తుంది .ఆప్రశ్న జ్యోతిశ్శాస్త్రం కానీ మరేదైనా కానీ .తెలీదు అని అనడం ఉండదు .గారడీ లాగా ప్రశ్నలో౦ చే సమాధానం లాగుతాడు .ప్రశ్నలోనే ఉన్న మాటలనే మార్చిజవాబుగా ఇస్తాడు .ఉదాహరణ-‘’ఒంటె మెడ అంతఎత్తుకు ఎత్తి ఎందుకు నడుస్తుంది ?’’అని అడిగితె తెలివైనోడు’’దాని మెడ పొడుగయ్యా .అందుకని అలా ఎత్తక తప్పదు’’అంటాడు ఠప్పున. ఇంకోటి ‘’పిల్లి రాత్రిళ్ళు ఎలా చూడగలుగుతుంది ?’’’’చీకట్లో కళ్ళు కనబడతాయి కాబట్టి ‘’అని ప్రశ్న పూర్తిగా ఆడిగేలోపే జవాబు వస్తుంది .మరోటి –‘’సగోత్రీకులపిల్లను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ??’’’అది తప్పుకదయ్యా శాస్త్రాలు ఘోషిస్తున్నాయికాబట్టి ‘’.మరోటి ‘’అకాల వర్షాలకు కారణం ఏమిటి ?’’సకాలం లో వర్షాలు పడకపోవటమే ‘అంటాడు .  ఒకసారి బీహార్ లో వరదలు ముంచేస్తుంటే ప్రధాని నెహ్రు చూడటానికి వెళ్లి తిరిగొచ్చాక విలేకరులు ‘’ఎలాగుంది వరద ?’’అని అడిగితె ‘’అంతా జలమయంగా ఉంది ‘’అన్నాడు ఇందులో తర్కం ఆత్మాశ్రయ ఉ౦దికనుక ఇదీ పర్యాయోక్తే అన్నారు నరసింహారావు జీ .

పునరుక్తి –ఒకసారి అన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అనటమే పునరుక్తి అన్నారు .మొదట ఒకభాషలో అని తర్వాత అదే అర్ధాన్ని మరికొన్ని భాషల్లో అనటమూ పునరుక్తే అన్నారు మునిమాణిక్యం .మన సినిమాలో రాళ్ళపల్లి దీన్ని బాగా పండించాడు .గురజాడ కన్యాశుల్కం లో ఇది పుష్కలం అంటారు మాస్టారు ..భర్త భార్యతో ‘’ఖరీదైనది వద్దు  మామూలు వాషింగ్ మెషిన్ కొందాము అంటే వినలేదు నామాట .అప్పు తీర్చటం యెంత కష్టమో నీకు తెలీదు ‘’అనగా భార్య తెలివిగా ‘’అదే మంత కష్టం లెండి .కాకపొతే ఆ అప్పు తీర్చటానికి నెలకు యాభై వంతున  ఏడాది పట్టే బదులు పన్నెండు నెలలు కట్టాలి అంతేగా ?’’భర్త మాట కాదన్నట్లున్నా,నిజానికి ఇద్దర్దీ ఒకేమాట ఒకేబాట అన్నారు మునిమాణిక్యం .ఒకావిడ పక్కావిడతో ‘’ఆవిడ ఎంత చెవిటిది అంటే ఎవరన్నా పిలిస్తే వస్తున్నాను అని కూడా అనలేదు .మరో తమాషా .ఆమె  మాటలు ఆమెకు వినిపించక ‘’నేనేమన్నాను ?’’అని అడుగుంది .ఆమె ఎంత మూగది అంటే ,ఆకలైతే అన్నం పెట్టమని కూడా అడగలేదు ‘’

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.4వ భాగం.13.10.22

విజయ విలాసం.4వ భాగం.13.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2

తండ్రి మరణం తో  కుటుంబ బాధ్యతలుమోస్తూ ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టాడు  హరిశ్చంద్రరంగురంగులబట్టలు పీతాంబరాలు ,సెంట్లు అత్తరు లతో విలాస పురుషుడుగా ఉండేవాడు .అత్తరు ,తమలపాకుల్లో వాడేఅత్తరు ఖర్చు చూసి గుండెలు బాదుకోనేవారు .ఎప్పుడూ మహారాజుగా ఘుమ ఘుమ లాడుతూ ముస్తాబులో ఉండేవాడు .వివిధ ప్రాంతాలనుంచి అమ్మకానికి వచ్చిన చిత్రాలు చిత్ర సంపుటాలు పురాతన గ్రంథాలు ఎంత ఖరీదైనా కొని తండ్రి ఏర్పాటు చేసుకొన్న స్వంత గ్రంథాలయానికి వన్నె తెచ్చేవాడు .అనాదిగా వస్తున్న కళాకారులపోషణ తలకు మించిన భారమూ  అయ్యేది .ప్రముఖ దేశీయులు ,విదేశీయులు ఇంటికి అతిధులుగా వస్తే వారిని భారీ ఖర్చుతో సన్మాని౦చేవాడు .ఆధునికత ఏరూపం లో ఉన్నా అతడు ఆదరించేవాడు .గడియారాలపై మోజు ఎక్కువ .వందలాది  వాటిని కొని వందిమాగధులకు ధారాదత్తం చేసేవాడు,కొత్తగా వచ్చిన ఫోటో పరిశ్రమ లో నిలదోక్కుకోనేవారికి పెట్టుబడి పెట్టి జీవనోపాధి కల్పించాడు. హోమియోపతి వైద్యాన్నీ ప్రోత్సహించాడు .ఉచిత హోమియో చికిత్సాలయం నెలకొల్పి నెలకు నూట పాతిక రూపాయలు ఖర్చు చేసే  వాడు .

  లితో ప్రింటింగ్ తో తండ్రి పుస్తకాలు ముద్రించేవాడు .’’సుందరీ తిలక్ ‘’పేరుతొ ప్రఖ్యాత కవుల కవితా సంకలనాలు ప్రచురించాడు .కొత్తగా అప్పుడప్పుడే ప్రవేశం అయిన ముద్రణా యంత్రాలు కొని ముద్రించే వారికి ఆర్ధిక సాయం చేసేవాడు .కుస్తీపోటీలకు ,ఇంద్రజాల ప్రదర్శనాలకు గొప్ప ప్తోత్సాహం కల్పించేవాడు .దానాలు చేసేటప్పుడు స్వంత ఉంగరాలు రవ్వలు కూడా ఇచ్చి దాన కర్ణుడు అయ్యాడు .చలిలో వణుకుతున్న బిచ్చగానికి తన వంటిపై ఉన్న ఖరీదైన శాలువా ఇచ్చేసిన మానవతా మూర్తి .ఆపదలలో ఉన్న బ్రాహ్మణుడికి తన వజ్రాల ఉన్గారమే ఇచ్చేసిన త్యాగి .తన వెండి పెట్టె చూసి ముచ్చటపడ్డ ఒక బాలుని తండ్రికి విలువైన ఆపెట్టెను బహూకరించిన త్యాగధనుడు .రూపం ,ధనంపుష్కలంగా ఉన్న ఈ నవయవ్వనుని చుట్టూ అవకాశవాదులు చేరి స్తోత్రాలు చేసి ,డబ్బు గుంజుకొనేవారు .హిందీ భాషలో మొట్టమొదటగా వచ్చిన స్వీయ చరిత్ర హరిశ్చంద్ర రాసి౦దె ,ఇలాంటి వారినందరి మనస్తత్వాన్ని నాటి సామాజిక స్థితి ని అందులో  వర్ణించాడు.’’నన్ను నిజంగా ప్రేమించేవారెవరో ,వందిమాగధులు ఎవరో తెలీని అమాయకుడిని కాను,అజ్ఞానినీకాను  .నీదగ్గరున్నవి పావురాలా దివి నుంచి దిగివచ్చిన దివ్య గరుడ పక్షులా ?నా గుర్రాల్ని మెచ్చేవాడొకడు నా క౦చర గాడిదల్ని పోగిడేవాడొకడు  .ఈ పొగడ్తల కుంభ వృష్టికి నేను తట్టుకోన్నానుకాని ,ఇంకొడైతే పారిపోయేవాడు .ఇదంతారోజూ మాకచ్చేరి గదిలో జరిగే తంతు .ఇవన్నీ నీటి బుడగలలా చల్లగా జారిపోయేవి ‘’అని యదార్ధ చిత్రణ చేశాడు

  .’’మెట్లగది దగ్గర మరోరకమైన తంతు జరిగేది .నలుగురైదుగురు హిందూ ముసల్మానులు కాపలావారు ,ఇద్దరుముగ్గురు ఉద్యోగాలకోసం వచ్చేవారు,ఇంకొందరు చిల్లరమల్లర పనులకోసం వచ్చినవారు .కొందరు నిలబడి కొందరుకూర్చుని  అందరి ప్రార్ధనా డబ్బు కోసమే .ఇందులోఅందరూ స్వార్ధ పరులుకారు .భక్తిప్రపత్తులున్నవారూ ఉండేవారు .ఒకడు తార్పుగానితోబేరాలుపెట్టేవాడు ‘’రూపయకి బేడా నాకు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా .నువ్వు వెనకేసుకొచ్చే బీబీ జాన్ ఈ ఇంటి గడపకూడా దాటి లోపలి రాలేదు ‘’అనేవాడు .బట్టలవ్యాపారితో ఒక లంచగొండి ‘’ఆ నల్లశాలువా నాకు ఇస్తేనే లోపలి వెళ్లి బట్టలు అమ్ముకోగలవు. నా మాట శాసనం ఇక్కడ.అమ్మినదానికి నీకుడబ్బు చేతిలో పడాలంటే నా చేయి తడపాల్సి౦దే,శాలువా కప్పాల్సిందే  ‘’అని బెదిరిస్తాడు .ఇంకో మధ్యవర్తి ‘’నేను అయ్యగారి తలలో నాలుక ‘’అని హడల గోడతాడు .మరోఘనుడు ‘’నాముందు తల ఎత్త టానికి నీకెన్ని గుండెలు?ఆడాళ్ళకు డబ్బు పంచేది నేనే ‘’హడలగొడతాడు ‘’ఇంతనిర్మొహమాటంగా తన జీవిత చరిత్ర చెప్పుకొన్నాడు .

 హర్స్చంద్ర భార్య మన్నో దేవి వలన ఇద్దరుకొడుకులు ,ఒకకూతురు పుట్టారు .ముగ్గురూ చిన్నప్పుడే చనిపోయారు .వివాహ జీవితం లో అన్యోన్యత లేదు .ఇంటి వైద్యుడు అతన భార్య అనారోగ్యానికి కారణం భర్త నిరాదరణ.అని చెప్పి , ఆయనకు సూటిగా  చెప్పటం కంటే ఆ సున్నిత మనస్కుడికి ఉత్తరం ద్వారా తెలియజేస్తే మంచిదని జాబురాశాడు .ఈయన దీనికి జవాబు బెంగాలో దేవనాగరలిపిలో తనకు ఇంట్లో సుఖం లేదని భార్యను ఇబ్బంది పెట్టటం లేదని ,అన్ని సౌకర్యాలు ఆమెకు కల్పిస్తున్నాననీ ,,అయితే తన హృదయాన్ని అదుపులో పెట్టుకొనే సామర్ధ్యం తనకు లేదనీ,తానూ ‘’అసహాయుడను ‘’అనీ  ‘’రాశాడు .

  1870లో కాశీలో సంపన్నులు తమకున్న ఇంటిని బట్టి ఉంచుకున్న కళావంతుల్ని బట్టి స్టేటస్ అంచనా వేసుకొనేవారు ‘’.గురూజీ’’ ఇందులో ఏమీ తీసిపోలేదు .ఉమ్మడికుటుంబం కనుక సరదాలు బయటనే తీర్చుకోనేవాడు .కళావంతుల ఇళ్ళకు వెళ్ళేవాడు వాళ్ళు ఈయన వసతి గృహానికి వచ్చేవారు .ఈయన సాహిత్యం లోనూ జీవితం లోనూ ,పాలుపంచుకొన్న ఇద్దరు స్త్రీలలో ఒకామె ఆలీజాన్ .ఆమె చేసిన అప్పు తీర్చటానికి వీళ్ళ ఇంటికి వచ్చేది .ఈయనతో పరిచయం పొందిన మహమ్మదీయ స్త్రీ .ఆమె పేరు మాధవిగా మార్చి హిందూమతంలోకి మార్చి అండన  చేర్చుకున్నట్లు కథనం.ఆమె ఇంట్లోనేదర్బారుపెట్టి పగలురాత్రి అక్కడే గడిపేవాడు .ఇల్లంతా దంతపు శోభ చేకూర్చాడు .ఇతని మరణం తర్వాత గోకుల్ చంద్ర ఆయిల్లు స్వాధీనం చేసుకొని నెలకు పదిరూపాయలు మాత్రమె ముట్ట చెప్పేవాడు .ఇతని చావుతర్వాత ఆమెకు ఆ ఆధారమూలేకుండా పోయింది .మల్లిక అనే బెంగాలీఅమ్మాయికూడాహరిశ్చంద్ర జీవితంలో ప్రవేశించి ,ఆమెకున్న సాహిత్య పరిజ్ఞానంతో మరీ దగ్గరైంది .గేయాలురాసేది .మూడు బెంగాలీనవలలు హిందీ లొకిఅనువది౦చి౦ది  .ఒక అనువాఫం ఇతనికే అంకితమిచ్చి అతడిని ‘’నేను ఆరాధించే ప్రభువు ‘’అన్నది .ప్రభువు ప్రోత్సాహంతోనే తనపుస్తలు ప్రచురితాలయ్యాయని కృతజ్ఞత తెల్పింది  ఇతని రచనలకు సహాయపడుతూ ప్రచురణాలయం పెట్టి ,ఇతనిపుస్తకాలు విక్రయించేది .

  భారతే౦దు అనే ముందుపేరు  హరిశ్చంద్ర  నడవడికను బట్టి వచ్చి, జీవితాంతం ఉండిపోయింది .ఒకపెద్ద మనిషిని ఒకసారి యితడు హేళన చేస్తేసున్నితంగా మందలిస్తూ నువ్వేమైనా తోపువా ?నీ నడవడినిర్మలమా ?నీ ప్రవర్తన నిజానికి చంద్రుని లాంటిది. చంద్రునిలో మచ్చలున్నట్లే నీ ప్రవర్తనలోనూ ఉన్నాయి అందుకే నిన్ను ‘’భారతేందు’’అనవచ్చు అనగా,తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు మనవాడు .ఆపేరుతోనే స్నేహితులు పిలిచేవారు. 1870-80కాలం లో హరిశ్చంద్ర హిందీలో వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రఖ్యాతుడయ్యాడు .తోటి రచయితలు ఇతన్ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించాలని కోరారు .ప్రభుత్వం  స్పందించక పోవటంతో పాటు, అతని ప్రత్యర్ధి రాజా శివ ప్రసాద్ కు ‘’సితార ఎహిందూ ‘’ఇవ్వటం బాధాకరంగా అనిపించి కలకత్తాలోని సారసుధానిధి పత్రికాసంపాదకుడు  హరిశ్చంద్ర  ‘’భారతేందు  ‘’  అంటే ‘’భారత చంద్రుడు’’ అని ప్రకటించగా సాహిత్యలోకమంతా  ఏకీభవి౦చగా ఆనాటినుండి సాహిత్యలోక౦  ఆయన్ను ‘’భారతేం హరిశ్చంద్ర ‘’అని అత్య౦త గౌరవంగా సంబోధించింది .ఇదే స్థిరపడిపోయింది .జార్జి గ్రీసన్ ,గర్కాన్ డిటాసీ వంటి పాశ్చాత్య ప్రముఖులు ఇలాగే సంబోధిస్తే చిరునవ్వు నవ్వేవాడు .తన లెటర్ పాడ్ పై  చంద్రోదయం ముద్రించుకొన్నాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-13-10-22-ఉయ్యూరు

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

· 55-జీవితానుభవాలను రచనలలో పొందుపరచిన దార్శనిక రచయిత,బాలసాహిత్య నిర్మాత ,శారదా పీఠ స్థాపకుడు,రైతాంగ సాహిత్య వైతాళికుడు –శ్రీ కె.సభా

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు

జీవిత విశేషాలు
సభా చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1 న సభా జన్మించారు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, చెంగల్వరాయుడు. తండ్రి వీధిబడి ఉపాధ్యాయుడు. సభా ఎనిమదవ తరగతి పూర్తి చేసి తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. పదహారేళ్ళ వయస్సులో ఉపాధ్యాయు వృత్తి లోనికి చేరారు. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే బి.ఏను పూర్తిచేశారు.

సమాజ సేవకునిగా
సభా శ్రీ రమణ పబ్లికేషన్స్‌ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు.1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించిన సభాకు రైతులలో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తమకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభా అనుభవంలో రైతు కష్టాల్ని రంగరించుకున్నారు. మద్యనిషేధం ఎత్తివేతతో ఛిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీలయాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.

సభా చిత్తూరు -జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో సభ్యులుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి. పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి. పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాల్ని సేకరించి ప్రచురించిన సభా లెక్కకుమించిన రేడియో ప్రసంగాలు చేశారు.ఆంధ్రప్రభ, జమీన్‌ రైతు, నాగేలు మొదలైన పత్రికల సంపాదకవర్గంలో పనిచేశారు. దేవదత్తం అనే పేరుతో ఒక వారపత్రికను సంపాదకత్వం వహించి నడిపారు. ఆంగ్లంలో పాంచజన్యం అనే పత్రికను నడిపారు.

రాయలసీమ రైతాంగ సహిత్య వైతాళికుడు
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. ‘పిచ్చిదంపతులు’ అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. ‘అంబా’ కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. ‘అంతరంగం’ కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. ‘చుక్కలవరాలు’ కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.

రచనలు
కథా సంపుటాలు బంగారు (5 కథలు, పాతాళ గంగ (పది కథలు), నీటి దీపాలు (15 కథలు) యిలా మూడొందల కథలు, పిల్లలకథలు వందల సంఖ్యలో ఉండగా తొమ్మిది సంపుటాలు వెలువడ్డాయి. భిక్షుకి, మొగలి, దేవాంతకుడు వంటి నవలలు, పిల్లల కోసం మరో ఏడు నవలను వ్రాసారు. వేయికి పైగా బాలగేయాలు వ్రాసారు. విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాసారు.దయానిధి వేదభూమి వంటి పద్యకావ్యాలను వ్రాసారు.రైతురాజ్యం, పాంచజన్యం అనే బుర్రకథలు వ్రాసారు.

ఈయన 1980 నవంబరు 4 న మరణించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విజయ విలాసం.3వ భాగం.12.10.22

విజయ విలాసం.3వ భాగం.12.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 168వ కార్యక్రమ౦గా నాటక, టివి, సినీనటులు –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’

అక్షరం లోక రక్షకం

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

సరస భారతి 168వ కార్యక్రమ౦గా  నాటక, టివి,  సినీనటులు  –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’

 సరసభారతి ,స్థానిక శ్రీనివాస అక్షరాలయం సంయుక్తం గా 29-10-22 శనివారం ఉదయం 11గం.కు శ్రీనివాస కాలేజి లో సరసభారతి 168వ కార్యక్రమం గా ప్రయోగాత్మక నాటక నటులు ,ప్రదర్శకులు ,రేడియో ,టి.వి.చలనచిత్ర నటులు శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మగారికి ‘’జీవనసాఫల్య పురస్కారం ‘’ప్రదానోత్సవం  నిర్వహిస్తున్నాము .సాహితీ, సాంస్కృతిక అభిమానులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .

పాల్గొనుఅతిధులు

ముఖ్య అతిధి – శ్రీ మండలి బుద్ధప్రసాద్ –ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ ఉపసభాపతి

విశిష్ట అతిధి -శ్రీ ఓలేటి పార్వతీశం – కవి పండితులు వక్త ,విశ్లేషకులు ,దూరదర్శన్ ఎక్సిక్యూటివ్

ఆత్మీయ అతిధులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు

శ్రీ జివి .పూర్ణచంద్-కృష్ణాజిల్లారచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

మొదలైన ప్రముఖులు

  పూర్తి వివరాలతో ఆహ్వానపత్రం మరో వారంలో అంద జేస్తాం .

                           గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                         పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస అక్షరాలయం ప్రిన్సిపాల్

                               12-10-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -4
12-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ

ణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.[1]

జననం
1907లో నవంబర్ 22న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో సంజీవరాయశర్మ జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవాడు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే అతను వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నాడు.

గణితావధానం
సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించాడు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చాడు.[2] అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే.

ప్రత్యేకతలు
సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవాడు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.

ఒక చిన్న వైఫల్యం
సంజీవరాయశర్మ ఏవిధంగా చూసినా గణనంలో గొప్పవాడు. జాత్యంధుడైనా, ఏవిధంగా గణనం చేసేవాడో తెలుసుకొందామనుకున్న వారికి నిరాశే ఎదురయింది. పుట్టు గ్రుడ్డి అయినందున, అంకెల భావనయే కాని, రూపము తెలియదు. మరి ఎలా గణనం చేసేవాడోనని అడుగుతే, తనకు చీకటి, అందులోనే వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులోనే సమాధానం తట్టుతుందనీ చెప్పాడు. కనుక, అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. శ్రీనివాస రామానుజన్ కు గోడ చేర్పు లాగ హార్డీ దొరికినట్లు, ఇతనికి కూడా ఎవరైనా దొరికి ఉంటే, ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేది.
ఒకసారి, విశాఖపట్నంలో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ఒకప్రశ్న:
61 x2+1 = y 2
అనే సమీకరణానికి x, yలు ధన పూర్ణాంకాలు అయేటట్లు సాధన చెప్పండని కోరగా, తనకు సాధన తట్టడం లేదని, కాని ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పాడు. సాధన చెప్పలేకపోవడం ఒక చిన్న వైఫల్యంగా తీసుకున్నా, సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయన్నది నిజం.
సాధన : x = 226153980, y = 1766319049
ఇలాంటి సమీకరణాలను, పెల్ సమీకరణాలు అంటారు. ఇవి డయొఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి. ఇలాంటి సమీకరణాలకు సాధనలు కనుక్కొనేందుకు చాలా కాలము క్రితమే ప్రముఖ భారతీయ గణితవేత్తలు, బ్రహ్మగుప్తుడు ( సా.శ.628) సమాస పద్ధతిని, భాస్కరాచార్యుడు ( సా.శ.1150) చక్రవాళ పద్ధతిని సూచించారు.
ఆధునిక కాలంలో, ఈ సమీకరణాల సాధనకు, సతత భిన్న వాదమును వాడుతారు.

సత్కారాలు
· శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 1996 లో గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

· 1959 లో డిల్లీలో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూరాజేంద్రప్రసాద్, ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్దలముందు తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.[3]

కుటుంబం
అతనికి పందొమ్మిదవయేట వివాహమైంది. భార్య పేరు ఆది లక్ష్మమ్మ. పెళ్ళినాటికి ఈమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ 1994 జనవరి 5 న శ్రీకాళహస్తిలో చనిపోయింది. ఆ తరువాత ఆయన మకాం హైదరాబాదులో ఉన్న కుమారుని వద్దకు మారింది. ఇతడు 1997 డిసెంబరు 2 న హైదరాబాదులో పరమపదించాడు.

13-ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యుడు ,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,మద్రాస్ మహాజనసభ వ్యవస్థాపక సభ్యుడు ,నాగపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు,రావుబహదూర్ –శ్రీ వనప్పాకం అనంతాచార్యులు

పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, పీపుల్స్ మాగజీన్ అను మాసపత్రికకు సంపాదకుడుగానూ ఉన్నాడు. “ఆయన పేరు పి. ఆనందాచార్యులని ప్రసిద్దిచెందిననూ ఆయన ఎప్పుడూ పి. అనంతాచార్లు అని సంతకం చేస్తూ తనను తెలుగు వాడిగా ప్రకటించుకుంటూ ఉండిరి” అని 1948 మే 5వ తేది ఆంధ్రపత్రికలో మద్రాసు మహాజన సభ అనే వ్యాసములో దిగవల్లి వేంకటశివరావు వ్రాశాడు.[2]

జీవిత విశేషాలు
అనంతాచార్యుల వారి పూర్వులు చంగల్ పట్టు జిల్లా పొన్నేరు తాలూకా లోని గ్రామం పనప్పాకం వాస్తవ్యులు. వీరి తండ్రిగారు శ్రీనివాసా చార్యులు గారు ఇప్పటి చిత్తూరు జిల్లా (అదివరకటి నార్త్ ఆర్కాట్ జిల్లాలో కడమంచి అను తెలుగు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర పడ్డారు. అనంతాచార్యులు కడమంచి గ్రామంలోనే 1843లో జన్మించారు. వారి 12 ఏటనే తండ్రి శ్రీనివాసాచారి మరణించాడు.

ఈయనచిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863 లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. వీరు 1889లో మద్రాసు అడ్వొకేట్ల సంఘాన్ని స్థాపించారు.[3] లండనులో ఇంపీర్యల్ కౌన్సిల్లో ఇద్దరే ఇద్దరు భారతీయ (నేటివ్) సభ్యులోలో వీరు 1895 నుండి 8 ఏండ్లు సభ్యలుగా వుండి భారతీయుల దీనస్థితిగతులను వైస్రాయి సమక్షంలో కూడా ధైర్యముగా వెల్లడించేవారు. 1885 డిసెంబరు 28 న జాతీయ కాంగ్రెస్ మహాసభ స్దాపించుటకు బొంబాయి నగరములో జరిగిన ప్రప్రథము సభలో పాల్గోన్న 72 మందిలో అనంతాచార్యులు గారు తెలుగువారవటం గర్వించతగిన విషయం. అటు తరువాత 1891 డిసెంబరులో నాగపూరులో జరిగిన 7 వ కాంగెస్ మహాసభకు అధ్యక్షుడైనారు. 1878 లో స్దాపించబడ్డ హిందూ మహాజన సభలో సభ్యులు గానున్న సర్ టి. మాధవరావు, దివాన్ బహదూర్ ఆర్ రఘునందన రావు, న్యాపతి సుబ్బారావు గార్లతోపాటు గావీరు గూడా సభ్యులు, వీరందరూ తిరునల్ వేలి లటరరీ సదస్సులోకూడా ప్రముఖ సభ్యులు. హిందూ పత్రికలో 1878 నుండి వారి వ్యాసములు ప్రచురితమైనవి.1882 లో “How to reform the Courts” అను గ్రంథమును 1883లో“The Legal Profession, how to reform it” అను గ్రంథముప్రచురించారు. Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో వ్యాసములు వ్యాసేవారు వారు న్యాయవాదిగా చేసిన కేసులలో వారి వాదనలు Indian Law Report లో తరచు రిపోర్టు అవబడుతూవుండేవి.

అనంతాచార్యులు గారిని గురించి ఆదిభట్ల నారాయణదాసు కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసి యున్నారు. ఆంతటి విశేష మైనవ్యక్తి జీవితచరిత్ర లేకపోవటం, వేరెవరూ కూడా వ్రయకపోవటం అంతేకాక వారిని గురించి 1966 తరువాత వచ్చిన మూలాధారములు వారి పేరు “ఆనందాచార్యులు” అని ఉండటం చాల నొచ్చుకోతగ్గవిషయం. దీనికి కారణం వారిని గూర్చిన మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు అరవభాషలో వ్రాసియుండటం తదుపరి మూలాధారాలైన కాంగ్రెస్ చరిత్ర పుస్తకంలో వారి పేరు “ఆనందాచార్యులు” అయిపోవటం మరీ దురదృష్టకరమని వాపోయారు చరిత్రకారులు.[4]

న్యాయవాది వృత్తి, రావుబహదూర్ బిరుదు
1870లో మద్రాసు హేకోర్టులో న్యాయవాదిగా చేరారు.కావలి వెంకటపతిరావుగారి జూనియర్ గా కేసులు చేయటం ప్రారంభించిన కొద్దిరోజులలోనే వీరికి ప్రతిపక్షంగా బారిస్టర్ H.D Mayne అనుఆఖండన్యాయది (హిందూధర్మశాస్త్రాన్ని గూర్చి రచించిన ఉద్ఘ్రంధ కర్త ) తో భేటి పడిన ఒక కేసులో వీరు కేసు నడిపించి వాదాన చేయటం ఆ వాదనను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి స్వయముగా ప్రసన్నించటము వీరి న్యాయవారి వృత్తిలో ఒక మైలు రాయి లాగ అయి అప్పటినుండి వీరి సీనియర్ కావలి వెంకటపతిగారు వీరిని జూనియర్ గా కాక తన భాగస్వామిగా స్వీకరించటం జరిగింది. త్వరలోనే వీరు చన్నపట్ణంలో అప్పటిలోనున్న అగ్రశ్రేణి న్యాయవాదులైన భాష్యం అయ్యంగార్, సర్ సుబ్రమణ్య అయర్ కోవకి చేరుకునటం జరిగింది. వీరి గొప్ప సమర్ధత ప్రావీణతకు హైకోర్టు ప్రధాన్యాయమూర్తి సిఫారసుపై రావుబహదూర్ బిరుదును విక్టోరియా రాణీ జాబిలీ సందర్భమున వీరికి ఇవ్వబడింది. వీరు గొప్ప ధైర్యసహాసములు గలవారు. ఆరోజులలోని ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడులోని నిషేధనలోని లోటుపాటులను నీరు తీవ్రముగా విమర్శించి ఖండించారు. అప్పటి ప్రభుత్వము ఆయా శాసనములను సవరించుటకు నియమించబడ్డ ఉపసంఘములో ఇద్దరే ఇద్దరు నేటివ్ సభ్యులగల ఉపసభలో వీరొకరు, దర్భాంగ మహారాజ గారిని సభ్యులుగా నియమించారు. మిగతావారందరు ఆంగ్లేయదొరలగుట వారి అధిక సంఖ్యతో వీరి ప్రతిపాదనలు తిరస్కరించటం వీరు తీవ్రంగా డిసెంట్ ప్రకటించారు. వీరి ధైర్యసాహసాలు గణనీయము. నిర్మొహమాటంగా అన్యాయమును ఖండించగల ధైర్యసాహసి. 1881-1886 మధ్యకాలంలో మద్రాసు గవర్నరుగా నుండి అతి కఠినముగా భారతీయలపై పక్షపాతముగా నిర్దయుడైన గ్రాంటు దొర గారి వీడ్కోలుకు ప్రభు భక్తులు సంసిద్ధులగుతుండగా అనంతాచార్యులుగారొక బహిరంగసభలో నిర్మొహమాటంగా ఆప్రతిపాదనను తిర్కరించి ప్రసంగించటంతో ఆ వీడ్కోలు సన్నాహం ఆపటం జరిగింది.

రచయితగా
మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు. రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు.[5]

రాజకీయ నేతగా
వీరు 1885లో బొంబాయిలో సమావేశమైన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెసు సభా సమావేశాలలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. వీరు నవంబరు 28 1907 న పరమపదించారు.

సత్కారాలు
ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి.

అనంతాచార్లుగారా? ఆనందాచార్లుగారా?
ఈయన పేరు వివిధ పుస్తకాలు, అంతర్జాల వనరులలో రెండు విధాలుగా ఉంటుంది. ఈయన పేరు అనంతాచార్యులైనా అనేక గ్రంథములలో ఆనందాచార్యులుగా ప్రచురితమైనది. అది తేలేవరకూ నేలటూరి వెంకట రమణయ్య విజ్ఞాన సర్వస్వం లో వ్రాసినట్లు అనంత(ఆనందా)చార్యులు గారే.[6] ఇది తమిళ- ఆంగ్ల తర్జుమాల గడబిడ. మద్రాసు హైకోర్టు సెంటినెరీ సంకలన పుస్తకములో కూడా ” ఆనందాచార్యులు ” అని వుండటం.[7]. అంతకన్నాముందే ఇంకో మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు, కె సుందర రాఘవన్ అను వారు తమిళం లో వ్రాసిన గ్రంథము”Rao Bhadur P.Anandacharyulu” మూలాధారముచేసి 1965 Freedom Struggle in Andhra Pradesh Volume I Document No.86 pp235–245 అను ప్రభుత్వ ప్రచురితమైన గ్రంథములో ఇంగ్లీషు తర్జుమాల లోను వచ్చిన గడబిడ. ప్రభుత్వప్రచురణ గీటురాయి యై తదుపరి ప్రచురణలకు కారణభూతమైనది . 19 వశతాబ్దమునాటి ఆంధ్రమహాపురుషుని గూర్చిన విషయ సేకరణ ఇప్పుడు 21వ శతాబ్దములో విషయ స్పష్టతకి మార్గం తిరిగి మరోమారు

మూలాధార సేకరణ

  1. ఆయన స్వయంగా రచించిన వ్యాసములు, వారు 1890 -1895 మధ్య నడిపించి న పత్రిక “వైజయంతి “ అను పత్రిక, న్యాయవాదిగా వారి వాదనలు రిపోర్టు చేసిన I L R reports [Indian Law Reports back issues ]
  2. హరికథా పితామహుడుగా బిరుదు పొందిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1864- 1945) గారి ఆత్మకథలో అనంతాచార్యులుగారిని గురించి వ్రాశారు[8]
  3. 1891 నాగాపూరులో జరిగి న అఖిలజాతీయ కాంగ్రెస్ మహాసభ రిపోర్టు (2) ఉద్ధండులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 05/03/1944ఆంధ్రపత్రికలో వీరిని గురించి వ్రాసిన వ్యాసం.[9]
  4. ఆంధ్ర విజ్ఞాన సర్వసంలో డా నేలటూరి వెంకటరమణయ్య గారి వ్యాసం.
  5. మద్రాసు మహాజనసభ లోఅనంతాచార్యులుగారి కృషి.[10]
  6. 1924 నుండి అనేక చారిత్రక విశేషాలు రచించిచి అనేక మన్ననలందుకుని నిర్మహొమాటంగా నిజం చప్పగలిగినవారని పేరుపొంది,19వ శతాబ్దమునాటి అనేక ప్రముఖులతో (వేటూరి ప్రభాకరశాస్త్రి, వడ్డాదిసుబ్బారాయడు, న్యాపతి సుబ్బారావు మొదలగు ఇంకా ఎందరి తోనో) స్వయంగా పరిచయముకలిగి అనేక చారిత్రకవిషయనులు త్రవ్విపోసినట్టి చరిత్రకారుడు 1966 లోనే ఈ లోపమును బయటపెట్టిన చారిత్రాత్మక ప్రచురణ.[11].
  7. దిగవల్లి వేంకట శివరావు గారు 1988 లో సమాలోచనలో వ్రాసిన వ్యాసములో అనంతాచార్యులు గారిని గూర్చిచాల అమూల్యవిశేషాలు వ్రాస్తూ స్వాతంత్ర్యపోరాటములో 1930 -1933 మధ్య వారితో పాటు ఒకసహగ్రంధకర్తగా నుండిన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా స్వతంత్రోద్యమచరిత్రలో అనంతాచారిగారి పేరును’ఆనందాచారి’గా చరిత్రలోకెక్కించారని చెప్పక తప్పదని వాపోయారు.

ఛాయాచిత్రములో “పి. ఆనందాచార్యులు”

1944 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వ్యాసంలో మొత్తం అంతా అనంతాచార్యులు గారనే అనేక సార్లు సంబోధించి యుండగా ఆవ్యాసములో ప్రచురించిన ఛాయాచిత్రము క్రింద ఆనందార్యులు అని వుండటం ఆశ్చర్యమైన విషయం. కానీ ఆంధ్ర విజ్ఞానసర్వస్యం లోనేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసంలో మాత్రం ఛాయాచిత్రము క్రింద “చిత్రము 128 పనస్పాకము అనంతాచార్యులు” అని వుండటం గమనీయం.[12]

సాహిత్యకృషి
సర్ టి మాధవరావు, మరియూ దివాన్ బహదూర్ ఆర్ రఘునాధ రావు గారు నిర్వహించిన The Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో అనంతాచార్లుగారు వ్యాసాలు వ్యాశారు. ఆ పత్రిక కొన్నాళకు ఆగిపోయినతరువాత దాని స్ధానంలో మద్రాసీ అను తెలుగు పత్రికలో వ్యాసాలు వ్రాశారు. 1878 లో స్దాపించ బడ్డ హిందూ పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశారు. అనేక బహిరంగ సభలలో ఉపన్యాసాలుచ్చారు. 1890-1899 మధ్యన వారు వైజయంతి అను తెలుగు పత్రిక నడిపించారు. ఆ పత్రికలోకొక్కొండ వెంకటరత్నం గారు రచించిన మహాశ్వేత అను నవలను ప్రకటించారు. శబ్దరత్నాకరం రచించిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు గూడా ఆ వైజయంతి పత్రికలో వ్యాసాలు వ్రాసేవారు. అనంతాచార్లుగారు మంజువాణీవిజయము అనే నాటకమును రచించి తన పత్రిక వైజయంతిలో ప్రచురించారు. ఆ వైజయంతి పత్రికలో అనేక గొప్ప గొప్ప పూర్వప్రబంధములను ప్రచురించారు అందులో ఎర్రాప్రగడ విరచితమైన నృసింహపురాణము, మాడభూషి వెంకటనరసిహాచారి గారు రచించిన పల్లవీపల్లవోల్లాసమను శకుంతలా పరిణయము (కృష్ణకవిరచించిన) మొదలగునవి ప్రచురించారు. అనంతాచారి గారి చరమదశలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు స్నేహితులైనారు. అనంతాచారిగారిని స్వయంగా ఎరిగి వారిని గూర్చి 5-3-1944 లో ఆంధ్రపత్రికలో వ్యాసము వ్రాశారు.

మరణం
పనప్పాకం అనంతా చార్యులు గారు 28/11/1907 న దివంగతులైనారు

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి

హాస్యానందం

43- నిరుత్సాహోక్తి

కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం నువ్వూ రాస్తావు .అక్కడ కొండల్ని చూట్టమూ గొప్పేనా ?మా అమ్మాయి కొండపల్లి కొండలు చూసింది .పర్వత సానువుల్లో ఏనుగుల్ని చూశాట్ట .ఓరి వీడిల్లు బంగారంకానూ !మహారణ్యంలో ఏనుగుల్ని కాక పీనుగుల్ని చూస్తాడా ?’’అన్నాడు .ఇదే నిరుత్సాహోక్తి అన్నారుమునిమానిక్యం మాస్టారు

  టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడని అందరూ గర్వంగా చెప్పుకొంటూ ఉంటె ఒక నీరసంగాడు ‘’పర్వతం ఎక్కాడా ?ఆ జాతి వాళ్ళ పనే అది రోజూ ..అలవాటుంటే మనం గోడలూ చెట్లూ ఎక్కటం లేదా ?మనిషి అన్నాక ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాడు  ,పడుతూ ఉంటాడు. ఇంతోటిదానికి తాషా మర్బా  మోత ఎందుకంట ‘’అన్నాడు .అంతటితో ఆగకుండా ‘’మళ్ళీ దిగాడా లేదా ?అయినా ఎక్కినవాడు దిగకేం చేస్తాడు .అక్కడ బువ్వ ఎవరు పెడతాడు?.అయినా దిగేవాడు అసలు ఎక్కటం ఎందు కంటా.దీనికి మనం అర్రులు చాచి చంకలు కొట్టుకోనక్కర్లేదు ‘’అన్నాడు .

 అలాంటి వాడితోనే మునిమానిక్యంగారు ఒకసారి ‘’చూశారా బాబుగారూ!మనవాడు వర్తకం మొదలెట్టి ఏడాది తిరక్కుండానే లకారాధిపతి అయ్యాడు .’’అన్నారు మహోత్సాహంగా అభినందిస్తూ వాళ్ళబ్బాయిని  .ఆ మేళానికిఇదేమీ కిక్ ఇవ్వలేదు .చప్పరించి ఇదోన్యూసా  అనుకోని ‘’వాడి జాతకం అలా౦టిదయ్యా శుక్రమహర్దశ నడుస్తోంది. లగ్నాన్ని బుధుడు చూస్తున్నాడు శుభగ్రహాలన్నీ బాగా నిక్కినిక్కి చూస్తుంటే అంతే.,శని ఉచ్చ దశలో వుండి ముడ్డిమీద తంతుంటే వాడు సంపాదిస్తాడా వాడి తలలో జేజమ్మ సంపాదిస్తుందా ?గ్రహబలమయ్యా అంతాగ్రహబలం ‘’అన్నాడు .

ఇలా ఏ విషయాన్నైనా లైట్ తీసుకొని ,చెప్పేవాడికి నీరసం పుట్టిస్తారు . ఇవే నిరసోక్తులు అంటే అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గురూజీ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వసు చరిత్ర.2వ భాగం.11.10.22.

వసు చరిత్ర.2వ భాగం.11.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1

మదన్ గోపాల్ రాసిన పుస్తకానికి శ్రీమతి ఎ.లక్ష్మీ రమణ చేసిన  అనువాదమే  ‘’ భారతే౦దు హరిశ్చంద్ర  ‘’.దీన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .

19వ శతాబ్ది మేధావి భారతే౦దు హరిశ్చంద్ర  .బహుముఖ ప్రజ్ఞాశాలి ,సంఘ సంస్కర్త .ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,తిరువనంతపురం యువరాజు కేరళ వర్మ ,కేశవ చంద్ర సేన్ ,మధుసూదన దత్ ఆయన సమకాలికులు .బెంగాల్లో వచ్చిన మార్పుల్ని హిందీలో ప్రవేశపెట్టాడు .ఆధునిక హిందీభాషకు నాంది పలికి ,వివిధ శాఖలకు అండగా నిలిఛి ‘’ఆధునిక హిందీ భాషా పితామహుడు ‘’అయ్యాడు  . .హిందీ పత్రికారంగం లో అగ్రస్థానం సాధించాడు .వివిధ ఛందస్సులలో 3వేల భక్తీ గీతాలు రాశాడు .ఖడీ బోలీ మాండలీకాన్ని ప్రచారంలోకి తెచ్చాడు భారత దేశ భాషలలో ఎంతో కృషి చేసిన విదేశీ రచయిత జార్జి గ్రీసన్  ‘’ఈ నాటి భారత దేశ కవులలో సుప్రసిద్ధుడు ,దేశ భాషా వ్యాప్తి చేసినవారూ మాన వేందు కంటే ఎవరూ లేరు ‘’అన్నాడు .ముప్ఫైనాలుగు  ఏళ్లకే 175రచనలు చేశాడు అని ఎఫ్. ఇ.పాయ్ అన్నాడు .

  వారణాసి లో వ్యాపార కుటుంబం లో జన్మించిన హరిశ్చంద్ర ముత్తాత వ్యాపారం లో మీర్జాఫర్ చేత మోసగ౦ప బడ్డాడు.దాన్ని తట్టుకోలేక దిగులుతో చనిపోయాడు .ఆయనకొడుకు సేత్  ఫతే చ౦ద్ సోదరుదడితోకలిసి వారణాసి వచ్చి వ్యాపారంలో బాగా సంపాదించి కాశీ రాజుకే పెట్టుబడులు పెట్టగల సమర్ధుడయ్యాడు .ఈయన మనవడు గోపాల్ చంద్ర వ్యాపారంలో దిట్ట .వ్యాపారంతోపాటు కవిత్వంలోనూ పట్టుసాధించి ‘’గిరిధరదాస్ ‘’కలం పేరుతొ  నలభై రచనలు చేశాడు .వైష్ణవ సంప్రదాయం వీరిది.బ్రిటిష్ వారు నిర్వహించే పుష్ప ప్రదర్శనలో ఎప్పుడూ మొదటి బహుమతి పొందేవాడు .గానం, సంగీతం అంటే మహా పిచ్చి .ప్రతి ఏడాదీ కాశీలో జరిగే బుడవా మంగళ –నౌకామహోత్సవం లో ఇతని కుటుంబ పాత్ర గొప్పగా ఉండేది .కాశీ రాజుకూడా పాల్గొనేవాడు .ఈ తెప్ప తిరునాళ్ళలో ఈ కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఉండేది .కళాకారులకు రచయితలకు గోపాల చంద్ర అండగా ఉండేవాడు .ఎప్పుడూ ఎవరినోఒకర్నిపిల్చిఆతిధ్యమిచ్చేవాడు బసంతు ఉత్సవానికి పిల్చేవారు వచ్చేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించేవారు .రంగురంగుల వసంతం చల్లుకొనేవారు .హోలీ అంటే కిర్రెక్కించే వారు .

  గోపాల్ చంద్ర గిరిధర్ దాస్ పెద్దకుమారుడే మన  హరిశ్చంద్ర 1950లో జన్మించగా తమ్ముడు గోకుల్ చంద్ర 15నెలల తర్వాత పుట్టాడు .హరిశ్చంద్ర సాహిత్య వృత్తికీ  గోకుల్ వ్యాపార వృత్తికీ అంకితమయ్యారు .రాజారామ మోహన్ రాయ్ బ్రహ్మ సమాజోద్యమం తో ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాలం అది .1848లో లార్డ్ డల్హౌసీ రాకతో ఒక శకం ముగిసింది .ఈస్ట్ ఇండియాకంపెనీ పంజాబ్ నుకూడాస్వాధీనం చీసుకొని ఆక్రమణలో అగ్రస్థానం పొందింది .కలకత్తానుంచి ఆగ్రాకు వైర్లెస్ వచ్చింది .కలకత్తా నుంచి ఢిల్లీ కి రైల్ మార్గమేర్పడింది  .నదులపై ఓడలు నడిచాయి. బాంబే మద్రాస్ కలకత్తాలలోయూని వర్సిటీలు ఏర్పడ్డాయి .హిందూ విధవా వివాహ చట్టం అమలైంది .పాశ్చాత్య పద్ధతుల ప్రభావం నెమ్మది నెమ్మదిగా పడుతోంది .

 పాశ్చాత్య నాగరకత వైపు గోపాల్ చంద్ర  కూడా ఆకర్షితుడయ్యాడు .తనతండ్రి ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా,అభ్యుదయభావాలు పొందాడని మతాచారం ఉన్నా ఆధునికతవైపు మొగ్గు చూపాడని ,ధాంప్సన్ గవర్నర్ గా  ఉన్నప్పుడు కాశీలో పెట్టిన బాలికా పాఠశాలలో తన సోదరిని చేర్చాడని ,ఆకాలం లో అది గొప్ప సాహస చర్య అనీ ,తమందరికి ఇంగ్లీష్ నేర్పించాడని చెప్పాడు .

 1857లో బ్రిటిష్ వారు ఎంతోఆపదలో ఉంటె ,వారిఅమూల్య వస్తువుల్ని గోపాల్ చంద్ర ఇంట్లో భద్రపరచారు .వీరికుటు౦బీకులకు బ్రిటిష్ వారు 48తుపాకీలు పిస్టల్స్ ఇచ్చారు .వీటితో బ్రిటిష్ వారికి రక్షణ కల్పించారు .ప్రథమ స్వాతంత్ర్య సమరానికి ఏడేళ్ళు ము౦దేపుట్టిన హరిశ్చంద్ర బాల్యంలో మహాతెలివి తేటలతో చిలిపితనం తో అందర్నీ ఆకర్షించేవాడు .చీకటిలో మెరిసే భాస్వరం తో గోడలపై బొమ్మలేసి రాత్రిళ్ళు తోటి వారిని భయపెట్టేవాడు .ఉర్దూ పార్శీ ఇంగ్లీష్  నేర్పే బడిలోనే చేరిచదివాడు .అతని జ్ఞాపక శక్తి అమోఘం .తండ్రి సాహితీ వాసనయీయనకూ అబ్బి  ఆనాటి  బ్రిజ్ భాషలో పద్యాలు రాయటం అందులోని కవిత్వాన్ని వివరించటం చేసేవాడు .పద్యాల్లో నవరసాలు ఒలకబోసి పండితులను మెప్పించేవాడు .భార్య చనిపోతే తండ్రి ద్వితీయం చేసుకొన్నాడు .ఇద్దరుకొడుకులకు ఉపనయనాలు చేశాడు .27ఏళ్ళు మాత్రమె ఉన్న గోపాల్ చంద్ర భ౦గ్ పానానికి బానిసయై మితిమీరి, వడుగు జరుగుండగానే అకస్మాత్తుగా చనిపోయాడు .దర్జాగా కుర్చీలో కూచున్నతండ్రికి ఏ అనారోగ్యలక్షణాలు కనపడలేదని అయితేహఠాత్తుగా ‘’శీతలాని బాగ్ మోడ్ దీహై –అచ్చా అబ్ లేజావ్ ‘’అంటూ చనిపోయాడని హరిశ్చంద్ర చెప్పాడు .

  తండ్రి చనిపోయేనాటికి కొడుకులు చాలా చిన్నవాళ్ళే .సవతి తల్లీ చిన్నదే .ఇంటి పెత్తనం ఒక బంధువు చేతిలో పడింది .క్వీన్స్ కాలేజీలోచదువుతున్న హరి స్థిమితం లేకుండా ,క్రమశిక్షణ లేకుండా ఉండేవాడు .తండ్రి మరణం తో బంధనాలు తెగాయనుకొన్నాడు .డబ్బు దుబారా చేసేవాడు. అందుకని ఇంట్లో అందరికీ దూరమయ్యాడు .సవతితల్లి పిసినిగొట్టుగా ఉండేది .నౌకామహోత్సవాలకు కూడా డబ్బు ఇచ్చేదికాదు .అప్పులే శరణ్యం అయ్యాయి  హరిశ్చంద్రకు .గోరంత అప్పు కొండ౦తై భారమైంది .దిగాలుగాఉండేవాడు .పెళ్ళికూడా చేసేశారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18

· 52-జైన మత మహా చార్యుడు ,పంచాస్తికాయ కర్త -,ఆచార్య కుంద కుందా చార్యుడు

· కుందకుందాచార్యుడు, తెలుగు వాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది…సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది.ఇతను జైనమత సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..

· కొనకొండ్ల గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఇతనిని కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.ప్రాచీన జైన సంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.ఇతనికి వక్రగ్రీవుడు (ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు అనే పేర్ల ఉన్నాయి.

· సామన్యశకం 40 ప్రాంతంలో పుట్టాడని, సా.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తుంది.దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు.ఇతని శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.

రచనలు
కుందకుందాచార్యుడు మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.

ప్రాముఖ్యత
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.అతని శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలో అతని పేరు వినపడుతుంది.

మంగళం భగవాన్ వీరో

మంగళం గౌతమో గణిన్

మంగళం కుందకుందార్యో

జిన ధర్మోస్తు మంగళం….

మహావీరుడు, గౌతములతో పాటు ఒక్క కుందకుందార్యుణ్ణే స్మరిస్తూ స్తుతిస్తారు.కొనకొండ్లను కొండకుందేయ తీర్థం అని కూడా అంటారు.మూలసంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యులలో భద్రబాహుని అనంతరం నాలుగవ ఆచార్యుడు కొండకుంద…52 సంవత్సరాలు ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతుంది.ఇతను బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ (వక్రగచ్ఛ) లను స్థాపించారు..కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని పలు చోట్లలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు

· 53-బాలసాహిత్య,గేయ కర్త ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –శ్రీ కలువకొలను సదానంద

· కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్‌ పురస్కారం అందుకున్న వ్యక్తి.

జీవిత విశేషాలు
సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి చేసి టి.ఎస్‌.ఎల్‌.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.

రచయితగా
సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు.

సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా… మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి పురస్కారం లభించింది. వీరి “నవ్వే పెదవులు – ఏడ్చేకళ్ళు” కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ “తాత దిగిపోయిన బండి”కి స్థానం లభించింది. త్వరలో వీరి “పరాగభూమి కథలు” గ్రంథం వెలువడనుంది[1].

పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.

పురస్కారాలు
· ప్రతిభా పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం, 2013[2][3]

మరణం
ఈయన ఆగస్టు 25, 2020న పాకాలలోని తన స్వగృహంలో స్వర్గస్థులైనారు.

· 54-నవల కధలలో మానవ అంతరంగ కల్లోలాల ఆవిష్కర్త –శ్రీ కాశీభట్ల వేణు గోపాల్

· కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి, రచయిత. ఆయనకు సంగీతంతో కూడా పరిచయం ఉంది. ఆయన స్వస్థలం కర్నూలు.

జీవిత విశేషాలు
కాశీభట్ల వేణుగోపాల్ జనవరి 2, 1954 కర్నూలులో కాశీభట్ల యల్లప్ప శాస్త్రి, హనుమాంబ దంపతులకు పుత్రిడిగా జన్మించారు. వీరిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలూ. అందరికన్నా ఆఖర్న ఈయన జన్మించారు. తొమ్మిది నెలల బిడ్డగా వున్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతుంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాల్ని నేర్పించింది అమ్మ అని, అన్నలూ, అక్కలూ అంతా వెళుతుంటే వాళ్ళ వెంటపడి గ్రంథాలయానికి వెళ్తూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను అని, అమ్మకూ అక్కలకూ సాహిత్యం యిష్టం కాబట్టి నాకుకూడా వెళ్ళి కవి కావాలనుకున్నారు అని చెబుతారు. [1]

వేణుగోపాల్ మొదటి గురువు హనుమాంబ అని చెప్పుకుంటారు. కాలీజీల చదువు అబద్ధం అని నమ్మి కాసింత చదువులు చదివి వచ్చిన ధృవ పత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు. ఏవో నాలుగు అక్షరాలు పట్టుబడింది పాతికేళ్ళ తర్వాతే అని, డెబ్బైల నుండీ అతని అసలు సాహితీ ప్రస్థానం మొదలైంది. శ్రోత్రియ నియమాలను వ్యతిరేకించినట్టే అన్ని మానవ నిర్మితాలైన విలువల్నీ ఒప్పుకోలేను అందుకేనేమో మనసుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు అని చెప్పుకుంటారు. ఎవ్వరితోనీ పోల్చదగ్గ వాడిని కాను అని, ఈ చిన్న జీవిత ప్రస్థానంలో బాగా తెలుసుకున్నదొకటే నాకేమీ తెలియదు అంటారు. ఈయనకి వేణువు ప్రియమైన వాయిద్యం.

మల్లాది, బుచ్చిబాబు, ల ప్రభావం ఈయన మీద బాగా ఉంది.కానీ శ్రీశ్రీ ప్రభావం అంతగా లేదు చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మకి వీరు అభిమాని. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలుకు ఆకర్షించినా, విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుండి బయటపడ్డాను అని చెబుతారు. వీరు బ్రహ్మచారి అని, మంచి పద్యం, మద్యం రెండూ నాకు ప్రీతి అని చెబుతారు. కీర్తిశేషులు అమ్మ చిన్నప్పుడే వల్లె వేయించిన అమరకోశం, చదివించిన రఘువంశం ఈ రోజుకీ నాకు ఉపయోగపడుతాయి అంటారు. ఫ్రాంజ్ కాఫ్కా, గోగే, హరిప్రసాద్ చౌరాసియా వీరికి ఇష్టులు.

దేశాటన చేయడం వీరికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే మూడుసార్లు దేశాటన చేశారు. చదివే అలవాటుతో పాటు, అలా దేశాటన చేయడం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని వొడిసి పట్టుకోగలిగాడనుకుంటారు. నేను రచయిత కావడానికి అదే కారణమైందని అంటారు. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్‌ మీదా, స్కూటర్‌ మీదా మూడుసార్లు దేశాటన చేశారు. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే సంగీత సాధన చేశారు.

రచన శైలి
గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి, సాదా సీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన వాక్యాలు ఒక ఇమేజే మీద మరొక ఇమేజ్ ఏర్పడి form అయ్యే మాంటేజ్ లు. ఇంగ్లీషూ, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాషగా morph అవుతుంది. కథ ముందుకు సాగుతూండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తుంటాడు. [2]

అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలను కదిలిస్తాయి. అంతగా ఎవరూ స్రృశించడానికి సాహసించని స్త్రీ పురుష సంబంధాల్నీ, పురుషుని చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాల్నీ (ఇన్‌సిస్ట్‌) తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత (సిగ్నేచర్‌ ట్యూన్‌)ను ఏర్పాటు చేసుకున్న రచయిత.[3]

రచనలు
1974 లో ఆంధ్ర పత్రికలో రంగనాయకి లేచిపోయిందీ అనే కథతో వీరి సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు. ఆమె కష్టాల్లో వుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అన్నది ఈ కథలో కథావిశేషం. తర్వాత వీరు విస్తృతంగా కవిత్వం రాసినా, వైయుక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయారు. ‘నేను-చీకటి’ నవల చిత్తు ప్రతిగా వున్నప్పుడు దాన్ని చదివి, ఎత్తి రాసిన కథా రచయిత వెంకట కృష్ణ. అది అచ్చయ్యేంతదాకా వెంటపడటమే యిప్పటి నా సాహితీస్థితికి కారణం అని చెబుతారు. [4]

· ఘోష – కథల సంపుటి

· నేనూ – చీకటి నవల [5]

· దిగంతం – నవల

· నేనూ- చీకటి – నవల

· తపన – నవల

· రంగుల – నవలిక

· మంచు -పూవు – నవల

· తెరవని తలుపులు – నవల

· నికషం – నవల

· అసత్యానికి ఆవల – నవల

· అసంగత (త్వరలో) – నవల

· నాలుగు కథా సంకలనాలు

· మూడు కవిత్వం పుస్తకాలు

· నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం 

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం 
-సాహితీ బంధువులకు శుభ కామనలు -ఇటీవల నాకు పంపిన వివిధ రచయితల పుస్తకాలు 22చదివి కొండను అద్దం లో చూపించినట్లు సంక్షిప్తంగా మీకు పరిచయం చేసి ,నిన్న ఆ పుస్తకాలన్నిటిని అందరి ఉపయోగం కోసం ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో అంద జేశాను -దుర్గాప్రసాద్-11-10-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

విజయ విలాసం.1వ భాగం.10.10.22

విజయ విలాసం.1వ భాగం.10.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం

శ్రీ చెముడుపాటి  వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన చేసుకొన్నాడు .ఆ మహిమతొ యీశతక౦ రాసి ,స్వానుభావాన్ని లోకానికి చాటాడు .బాల్యం నుంచి హూణ విద్య మాత్రమె నేర్చి ,రాజకీయోద్యోగంలోనే జీవితం గడుపుచూ ,సద్గురు కటాక్షం ,సాధనా బలం వలన సత్కవిగా పరిణమించటం దైవ బలాన్ని సూచిస్తోంది ‘’అని వెన్ను తట్టారు .శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ఈ శతక మకుటం –‘’సర్వేశ్వరా ‘’.

మొదటి మత్తేభం-‘’చదువా లేదు ,పురాణమన్న నెరుగన్ ,శాస్త్రం బదెట్లుండునో-పదమా  తోచదు శయ్య వృత్తియెరుగన్బద్యంబు లల్లంగా గో

విదుడన్ గానిక ,దప్పులన్ విడిచి తృప్తిన్ నాదుపద్యాళిలో –దుదిపాదంబున నొప్పు నామ సుధనెంతో గ్రోలి నాదండముల్ –పది వేల్ గైకొని  భక్తులార తరియి౦పన్ మిము వేడెదన్ ‘’అని ఆపద మొక్కులు మొక్కి దండం అంటే నమస్కారం దశ గుణం భజేత్ అన్నట్లు తనలో ఏమీ లేకున్నా ఓపికగా  చదివి తరియించమని గడుసుగా చెప్పి ,బోనస్ గా అయిదవ పంక్తి కూడా చేర్చాడు .తర్వాత శ్రీరామస్తుతి చేసి  శివ శివాలకు మొక్కి –‘’ఆధారంబు పయిన్ షడక్షరయుత ,ప్రాంచద్దళో పేతమై  -బోధ బ్రాహ్మి సకామ బీజములచే బొల్పోంది తానిత్యమున్

సాధిష్టాన విదాతయై రుధిర రమ్యంబౌ నుపస్థాశ్రిత –స్వాధిష్టాన నివాస మొందుజననిన్ బ్రార్ధింతు సర్వేశ్వరా ‘’అని గహన వేదాంతాన్ని అమ్మవారి నివాసాన్నీతన వేదాంత పరిజ్ఞానం జోడించి రాశాడు .’’శ్రీ కాంతా వల్లభ పాదుకాంచిత శిరున్ గా౦భీర్యయుక్తున్ గపిన్ ,ఉపనిషత్సంపూర్ణ పా౦డినత్యు దీమంతున్మారుతి మత్కృతిన్ సతతంబు మన్నింపగా ‘’స్వాంతంలో భజిస్తానన్నారు ..కపి అంటూనే ఆయనలో సర్వదిషణకు నీరాజనం పట్టారుకవి తర్వాత కవులందరికీ దండాలుపెట్టారు .

  అందరు కవుల్లాగానే తన పాపాల చిట్టా విప్పారు .అందరూపొందే లోభమోహ మదమాత్సర్యాలు తననూ పీడించాయన్నారు .సద్గురరు దర్శనం తో తనజీవితం గాడినపడి శస్త్రాలు తత్వాలు చదివి జ్ఞానం పొందానన్నారు .తల్లీ తండ్రీ కొడుకు బంధువులు అన్నీ నేవే అనే ఎరుక నిలిచి ఉంచమని సర్వేశ్వరుని వేడారు .’’నామనము నందు దుఃఖము లంటనీక సన్మార్గంబు నందుంచు ‘’అని వేడికోలు చేశారు .’’కామాంధులు కా౦తావాస మతిన్ ‘’త్రికూట’’ ముపయిన్ గన్గొందు సదా ‘’అని ఈసడించారు .

  బిందు నాదాల సౌభాగ్యోన్నత ప్రభావమైన కళ.దీన్ని చూస్తూ ప్రజ్ఞానియై నిర్వృతి తో ఉంటేనే సన్యాసం లభించి ముక్తిమార్గం కనిపిస్తుంది .తర్వాత ఉదయ  ప్రార్ధనం,జ్ఞాన ప్రభాతం ,రాత్రిధ్యానం ,మానసిక ధ్యానం ,ఉదయ సాయం సమయాలలో చేసే మానసికపూజ షోడశోప చారాలతో పద్యాలలో చెప్పారు .చివరగా –‘’వరదా! నే శత వందనంబులిడి నా వైరాగ్య పాత్రంబునన్ –భరమౌ కర్మ చయంబనా బరగు కప్ర౦బున్ వెలిగింతు భా-స్వర నీవారజ శూక సూక్ష్మమగు ప్రజ్ఞాన దీప్తిన్ విభూ –స్థిరమై మంగళ హారతి౦గొనుచు దృప్తిం బొందు సర్వేశ్వరా ‘’అని మంగళం పాడారు .

 విద్వన్నుత మండపాక కలశామ్భో రాశి చంద్రుడు ,సత్కవి వర్యుడైన పార్వతీశ్వరుడు విద్వాంసుడు నా మిత్రుడు ,నా కవిత్వంలో తప్పులు సవరించి ,నన్ను వివేకిగా లోకం ముందు నిలబెట్టాడు ఆమహనీయుని ఔదార్యం తో ‘’బ్రోవగా భవదీయాన్ఘ్రి సరోజముల్ గొలుతు నీ భక్తుండ సర్వేశ్వరా’’అన్నారు . .వెంకటార్య అనే ఆయన కొడవంటి అప్పలశర్మ గారి ద్వితీయ పుత్రులు ,రాజమండ్రి వీరభద్రపుర వాస్తవ్యులు .ప్రస్తుతం అంటే ఈ శతకం రాసే సమయం లో మహానంది పర్వతం పై తపస్సు చేస్తున్నారని మనకు తెలియని మరో విషయాన్ని తెలియజేశారు కవి .

  తనకేమీ తెలీదు అంటూనే తత్వాన్ని కవిత్వంలో అందంగా బహుకమ్మగా బంధించి మనకు అందించారు ,కవి .వారినీ వారి శతకాన్ని పరిచయం చేసే భాగ్యం ఆ ‘’సర్వేశ్వరుడు’’ నాకు ప్రసాదించాడు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ

శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్ర
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించే వారు. ఆమె నిజతత్త్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్ళిచేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్ళి జరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె యథాప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానినిగా భావించి ఆమెను రాళ్ళతో కొట్టి హింసించడం వంటి పనులు చేసినవారంతా ఆమెనొటినుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అట్టిది. ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఆమె కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిర పడింది.

ఆమె చూపిన మహిమలు
లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు కాన్సర్ వ్యాధి నయం చేసింది. ఆమె అవ్వకు ఒక్క అణా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసింది. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులైనారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ. కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతింస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వవారు చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియయనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపారు.

అమే నిజమహిమ తెలుసుకొన్నస్వర్గీయులు రాచోటి వీరన్నగారు, తుంబళంగుత్తిలక్ష్మయ్య గారు, బల్లేకల్లు నరసప్పగారు, మన్నే రాంసింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవలో తరించి సౌభాగ్యము, సంపదలు పొందినారు. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయొగి లక్ష్మమ్మవారు 16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతున్నది.ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్యగారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండిరథము, దేవాలయానికి వెండిరేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన మొదలైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వమందిరము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాలనుంచీ భక్తులను అశేషంగా ఆకర్షిస్తున్నది.

శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె, అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగుబంగారము, నమ్మినవారికి నమ్మినంత వరాలనిచ్చే అమృతస్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు.

11- ‘’రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవోణ్ణి’’అంటూ వేదికలేక్కిన బుర్రకధ నాయకుడు,నటుడు ,నాటక కధారచయిత డాక్టరేట్ ,కామధేను పత్రిక పులికంటి సత్కృతి స్థాపకుడు –శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి

పులికంటి కృష్ణారెడ్డి (జూలై 30, 1931 – నవంబర్ 19, 2007) కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా “రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవాణ్ణి” అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి[1].
జీవిత విశేషాలు
1931, జూలై 30 న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. పులికంటి గోవిందరెడ్డి, పాపమ్మ దంపతులు ఇతని తల్లిదండ్రులు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదోనలోనే సాగింది. ఉన్నతపాఠశాల విద్యకోసం తిరుపతిలోని తిరుపతి దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాల (నేటి ఎస్వీ ఉన్నత పాఠశాల) లో చేరాడు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు. నాటకాలు వ్రాయడంలో, వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమాలు నేర్పింది చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ.

రచనలు
ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు. రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. ఇతని కథలు ఇంగ్లీషు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ళ మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది. ఈయన రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి. ఇతడు ఎన్నో జాతీయ కవిసమ్మేళనాలలో పాల్గొని తన కవితాగానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవాడు.

నాటకరంగం, బుర్రకథలు
ఇతడు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. నాటకరచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందాడు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇతడిని నటనాగ్రేసరుడు అని కొనియాడాడు. ఇతడు బుర్రకథ గాయకుడు కూడా. కమ్మని గానంతో, చమత్కారవ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతడిని పొగడ్తలతో ముంచెత్తినారు. ఇతడు మంచి వక్త కూడా. జానపద వాజ్మయం మీద, నాటకరంగం మీద ఈయనకు మంచి పట్టు ఉంది.

కామధేను
ఇతడు తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్యపత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపాడు. ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా కవులకు, ఇతర రచయితలకు ప్రోత్సాహం కలిగించాడు. ఈ పత్రక చేసిన సాహిత్యసేవ గణనీయమైనది.

పురస్కారాలు
అగ్గిపుల్ల’ నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్‌ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించాడు. నటుడిగా, రచయితగా కవిగా పలుబిరుదులు, సన్మానాలు అందుకున్నాడు. ఈయన రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పీహెచ్‌డీ, ముగ్గురు ఎంఫిల్‌ పట్టాపొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఈయనను గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. తన సాహితీ, కళారంగాల కృషికిగాను ఎన్నో ఆవార్డులు, రివార్డులు పొందిన ఈయన పులికంటి సాహితీ సత్కృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించాడు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాలు పేరుతో పుస్తకంగా తెచ్చాడు.

మరణం
తిరుపతిలో 2007 నవంబరులో జరగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా సన్మాన గ్రహీతల్లో కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఈ లోపే, 2007, నవంబర్ 19 న పులికంటి కన్నుమూశాడు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316

316- బైజుబావరా హేందీ సినీ చాయాచిత్రదర్షక ఫేం ,ఇంటికి దీపం ఇల్లాలే దర్శకుడు –శ్రీ వి.ఎన్.రెడ్డి

వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు.[1] ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. వి.ఎన్.రెడ్డి 1907లో వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో జన్మించాడు. 20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయగ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఎస్.హర్‌దీప్ వద్ద సహాయకునిగా మడ్, చరణోంకీ దాసి, వసంతసేన సినిమాలలో పనిచేశాడు. ఐదేళ్లు కృషిచేసిన తర్వాత 1952లో ఛాయగ్రాహకునిగా పనిచేసే అవకాశం వచ్చింది.[2] రాజ్‌కపూర్ నటించిన ఆగ్ సినిమాకు వి.ఎన్.రెడ్డి కైయారొస్కూరో (Chiaroscuro) లైటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి అందించిన అత్యద్భుత ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలందుకున్నది[3] “వెలుగు నీడలను వెండితెరపై విభజించి వాటితో దాగుడు మూతలు ఆడుతూ ప్రేక్షకున్ని విస్మయంతో వినోదింపజేయగల ఘనత” వి.ఎస్. ది అని రూపవాణి పత్రికలో ఒక సినీ విలేఖరి అన్నాడు.[2]

రెడ్డి దర్శకత్వంలో కూడా ప్రవేశించి గంగా గౌరీ సంవాదం (1958),[4] సెంగొట్టయ్ సింగం (తమిళం – 1958)[5] ఇంటికి దీపం ఇల్లాలు (1961), ఆనంద జ్యోతి (తమిళం – 1963),[6], జహ్రీలీ (1977) తదితర సినిమాలు తీశాడు.[7]

ఈయన ఆరుగురు సంతానంలో ఒకడైన రవికాంత్ రెడ్డి 13-14 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద ఛాయాగ్రహణంలో అప్రెంటిసుగా శిక్షణ పొంది, ఆ తరువాత తనూ ఛాయాగ్రాహకుడయ్యాడు[8]

చిత్రసమాహారం
ఛాయాగ్రాహకుడిగా

· దిల్ కి రాణీ (1947)

· ఆగ్ (1948)

· హల్‌చల్ (1951)

· బైజూ భవరా (1952)

· చోరీచోరీ (1956)

· చిరంజీవులు (1956)

· కష్మీర్ కి కలీ (1964)

· ఉప్‌కార్ (1967)

· లాట్ సాహిబ్ (1967)

· యాద్‌గార్ (1970)

· పూరబ్ ఔర్ పశ్చిమ్ (1970)

· దో చోర్ (1972)

· ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే (1974)

· కాలిఘటా

· జాన్వర్

దర్శకునిగా

· సెంగొత్తయ్ సింగమ్ (తమిళం) (1958)

· గంగా గౌరీ సంవాదం (1958)

· ఇంటికి దీపం ఇల్లాలే (1961)

· మనప్పందనాళ్ (తమిళం) (1961)

· ఆనంద జ్యోతి (1963)

· జహ్రీలీ (1979)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం42- అజ్ఞోక్తి

హాస్యానందం
42- అజ్ఞోక్తి
అజ్ఞానం వలన అన్నమాటలు నవ్వుపుట్టి౦చటమే అజ్ఞోక్తిఅన్నారు మునిమాణిక్యంగారు .ఒకసారి ఆయనక్లాసుకు వెళ్లి ‘’నైషధం రాసింది ఎవరు ?’’అని అడిగితె ఆపద్యాలు వారి పాఠ్యగ్రంధం లో ఉన్నా ఒఖరూసమాధానం చెప్పకపోతే ,ఎక్కడోకాలింది మాస్టారికి .ఒక చిన్న కుర్రాడివంక ఉరుముతూ చూసి’’ఎవర్రా నైషధం రాసి౦దీ’’అని అడిగితె వాడు కంగారుతో భయపడి ‘’సార్ నేను రాయలేదండి మదర్ ప్రామిస్ ‘’అన్నాడు .పిల్లల తెలివి తేటలు ఇలా అఘోరించాయికదా అని హెడ్ మాస్టారి దగ్గరకి వెళ్లి చెప్పగా ఆయన తనతోపాటు నవ్వి ‘’చిన్న వెధవ భయపడి లేదన్నాడు కానీండి వాడేరాసి ఉంటాడు ‘’అన్నాడు ట .ఇదే అజ్ఞానోక్తి .ఇంకోక దాహరణ ఆయనే చెప్పారు .పూర్వం జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ లు ఉండేవారు. చదువులేకపోయిన ,ధనవంతులైన కారణంగా పలుకుబడితో వోట్లు పోగేసుకొని ప్రెసిడెంట్ అయ్యేవారు .అలాంటి ఒక జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ గురించి చెప్పిన కథ .జిల్లాలో కలరా వ్యాపించింది చావుల రిపోర్ట్ వచ్చింది .అందులో కలరాచావులు 12.5శాతం అని తేలింది .ఈ పాయింట్ ఫైవ్ సంగతి ఆయనకు అర్ధంకాక బుర్ర వేడెక్కింది .అందర్నీ అడిగి ఎవరూ చెప్పలేకపోతే చివరికి వైస్ ప్రెసిడెంట్ నుపిల్చి 12తర్వాత చుక్కపెట్టి 5ఎందుకు రాశారు అని అడిగాడు .ఆయన కాసేపు ఆలోచించి ‘’కలరావల్ల నూటికి 12మంది ,చనిపోయారు అని తెలుస్తోందికదా .ఇంకో అయిదుగురు చావటానికి సిద్ధంగా ఉన్నారని కాస్త చుక్క అడ్డం పెట్టారన్నమాట .ఇహనో రేపో ఆ అయిదుగురూ టపాకడతారన్నమాట ‘’అన్నాడు .
మూర్ఖోక్తి –అంటే మొండి యుక్తి అన్నారు ముని సార్.ఉదాహరణ ఆయనే చెప్పారు –నేను మద్రాస్ కు వెడుతుంటే మా ఆవిడ వచ్చి ‘’ఎలాగూ వెడుతున్నారుకనుక బెజవాడలో దిగి మా అన్నయ్యను చూసి రండి.ఈమధ్యనే జబ్బుపడి లేచాడు.చూడకపోతే బాగోదు ‘’అన్నారు .సరే అన్నారు మాస్టారుకానీ వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కుదరక బెజవాడలో దిగలేక ఆయన్ని చూడకుండానే వచ్చేశారు .ఇంటికిరాగానే అడిగితె ‘’శుక్రవారం సాయంత్రం 6.౩౦ కి చూశాను అని అబద్ధమాడి, దాన్ని నిలుపుకోటానికి మళ్ళీ అరడజలు అబ్దాలు ఆడాల్సి వచ్చింది .ఆవిడ ఆవలిస్తే పేగులు లేక్కేసే గడుసరి. గురూగారు అబద్ధం ఆడారని గ్రహించి ‘’ఎందుకండీ అబద్ధమాడుతారు “”?అంది .తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ .’’శుక్రవారం సాయంత్రం ఆరుకు మా అన్నయ్యను బెజవాడలో చూశామనే అంటారు కదా ?అనగా’’ఆరున్నరకు ‘’అని సవరించారీయన .’’వాళ్ళ ఇంట్లోనే చూశారా ?’’ఆమె ప్రశ్న .’’ఓ.నిక్షేపంగా వాళ్ళింట్లోనే బెజవాడలో చూశా ‘’మేస్టారి బుకాయింపు .ఆవిడ ‘’ఆ రోజు ఆ వేళప్పుడు మా అన్నయ్య బందర్లో మని౦ట్లోనే ఉన్నాడు .గురు వారం సాయంత్రం మీరు మద్రాస్ బయల్దేరితే ఆయన శుక్రవారం ఉదయం ఇక్కడికి వచ్చాడు .ఆ రొజ౦తా ఉండి శనివారం సాయంత్రం వెళ్ళాడు .ఆయన ఇక్కడే ఉంటె మీకు బెజవాడలో ఎలా కనపడ్డాడు ?’’అంది .ఈయన దబాయింపు సెక్షన్ జోరు చేసి ‘’ఆ జ్ఞానం మీ అన్నయ్యకు ఉండాలి. బందర్లో నీకు కనిపించిన రోజే ,బెజవాడలో నాకు కనుపించకూడదని .అయినా మీ అన్నయ్య ఎక్కడబడితే అక్కడ ఎవరికీ బడితే వాళ్లకు కనబడుతూనే ఉంటాడు ‘’అన్నారు ఈమొండి జవాబుకు ఆవిడ ఫకాల్న నవ్వి ఊరుకొంది.మూర్ఖోక్తి లేక మొండి యుక్తి అంటే ఇదే మహానుభావా అన్నారు మాస్టారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కంచివరద రాజ శతకం  

కంచివరద రాజ శతకం  

అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి ద్రవ్యసహాయం చేత ప్రచురించానని ,ఇంకా చాలాపుస్తకాలు తాను  రాసినవి ముద్రణ భాగ్యం పొందాల్సి ఉన్నాయని పరిటాల నుంచి తెలిపారు .

 ఈ శతకమకుటం –‘’భాను కోటితేజ వరద రాజ ‘’

‘’శ్రీశు గొలిచి కావ్య సిద్ధికి పలుకుల –వెలదిదలచి పొగడి విఘ్నరాజు

నమల చరిత శతక మారంభ మొనరింతు-భానుకోటి తేజ వరద రాజ ‘’అంటూ మొదటిపద్యంలో ముగ్గురు దేవతల్ని సూటిగా సుత్తి లేకు౦డా స్తుతించి  కవి శతకం ప్రారంభించాడు .లేతది అని దేన్నీ లెక్క చేయకపోతే లేతముదిరి ప్రాణఘాతమౌతుందని ,నిమిషమైనా మనసు కుదురు లేకపోతె బ్రహ్మవిద్య సాధ్యంకాదనీ ,.సుకృతం చేయకుండా మడి మైల అంటూ ప్రాకులాడితే ముక్తిరాదన్నాడు  .గుడిసె ,భవనం ఉంటాయికాని ‘’పాప పుణ్యములకు బట్టన మున్నె?’’మనసులోనే సకలం ఉంది అన్నాడు .కొత్తదేదీ లేదు అన్నీ జీవుడు అనుభవించి వదిలేసిందే .’’జన్మమేసకలార్తులకు కొంప-కష్టమైనా సుఖమైనా –‘’పారుడైన నేమి శ్వపచు డుగానేమి ‘’?అని తత్వరహస్యం చెప్పాడు .వేదాలు వల్లించినా జ్ఞానికాకపోతే ముక్తిరాదుకనుక వేదపఠనం మాలమాదుగులకు ఎందుకు ?అని ప్రశ్నించాడు .ధర్మం వల్లనే ఉన్నతస్థితి కలుగుతుంది .పారులు స్వకులధర్మ౦విసర్జిస్తుంటే బ్రాహ్మణవిధులపై మిగిలినవారికి ఆశ ఎందుకు ?’’బొమ్మ యగునే మూల పురుషుడు –బొమ్మగూర్చి వెలికి బొమ్మటంచు’’మాలను బాపడు తరమటం దేనికి అని భక్తనందనార్ లాంటి చరిత్ర గుర్తు చేశాడు –‘’సాగకపోతే సాధువై నంతమాత్రాన కుటిలబుద్ధిపోతుందా ‘’అన్నాడు  .నాబట్టే లోకం అనుకోరాదు .తానూ పరుల క్షేమం కోరేవాడే అయినా ‘’తనను జంపు దొంగ ధనము కోరి ‘’అనిలోక రీతి  చెప్పాడు ..దరిద్ర దేవత తలపై నర్తిస్తుంటే ,చెడుమనసుతో ఇంకోర్ని దోచుకుంటే ‘’వ్రాత పోనే ?గోచిపాతయే గతిగాక’’ ?అని జీవితరహస్యం చెప్పాడు .

  28వ పద్యం లో ‘’వెంకటాద్రి మీకు కై౦కర్యమును జేసి –నట్టి భక్తుడతని యన్వయుండ’’నేనుకొత్తకాదు దాసకోటిలోని వాడినే అని  చిరునామా చెప్పుకొన్నాడు వరదయ్యకు .’’తండ్రివైతి వీవు తల్లి పేరుందేవి –తల్లిదండ్రి బాల్యదశ గతింప-నున్న దంతియే స్థితి విన్నవి౦చిన దంతె’’అని తేల్చేశాడు .వెంకటాద్రి పాద పంకేరుహమే నౌకగా పాపసాగరం దాటి-అద్వయ కనుగొందు నీ ద్వీపమున నిన్ను ‘’అని తన అన్వేషణ చెప్పాడు .’’నాకు దొడ్డ కలిమికావాలి .మనుష్యుడు ఇవ్వగలడా “”అని ప్రశ్నిస్తాడు .’’విలవిల యన బట్టి పీకుకదిను –ప్రాణి బ్రాణి –సృజన పరచితేల –జీవ హి౦సయే విశేషమా ?’’అని హింసా విధానం పై బాధపడ్డాడు .

  ‘’భాగవతుల చెలిమి లేకుండా ఈశ్వర జ్ఞానం కలుగదన్నాడు కవి .మగాళ్ళను అన్నదమ్ముల్లా ,ఆడువారిని అక్క చెల్లెళ్ళు చూసే మంచి బుద్ధి ఇవ్వు. అదే పది వేలన్నాడు .స్థిర౦ కాని సృష్టి వైచిత్రికి భ్రమపడి చి౦తల్లోముంచి వినోదం చూస్తావు .’’ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాడో ,ఇక్కడ పుట్టి ఎక్కడికి వెడతాడో జీవుడు ?అన్ని ప్రాణులకు అసలు ఆట పట్టేది ?’’’’కరువు చేత డబ్బు కటువైన ,బోగము –ముండలకడ  ,కల్లు కుండలకడ –  నాటపట్టు దప్పదు అక్షయ లక్ష్మికి ‘’అని నిష్టూరం వేశాడు .మందులు అనేకం అయ్యాయి కాని రోగం కుదిర్చే వాడు దొరకటం లేదు. కనుక ‘’నీవుపూనుకొనుము నెమ్మది౦చును రుజ ‘’అని భక్తవరదుని పైనే భిషగ్వర భారం వేశాడు వ్యంగ్యంగా కవి .నీకరుణ ఉంటె చాలు ‘’దేవతల ఐరావతంకూడా ఎక్కను.నా వైద్యులు ఆశ్వినీదేవతలే ‘’.అనంత బాహుడివి ‘’నాతలపై పెట్టటానికి నాలుగు చేతులైనా లేవా సామీ ?పోనీ కనీసం ఒక్కచెయ్యి కూడా లేదా భగవాన్ అని చమత్కరించాడు.

‘’నన్ను గావురమ్మునా వినకు౦దువు –  కరిని గావ నైతె పరగినావు?దాని సేవ నీ కృతార్ధత కాబోలు ‘’అని మేలమాడాడు .జ్ఞానికి చావుపుట్టుకలు నిద్రపోయి లేచినట్లే ఉంటాయి .మరణభీతి లేశ మాత్రం ఉండదు .

చివర్లో ఆంగీరసనామ సంవత్సరం విజయదశమినాడు  వరద రాజస్వామికి అ౦కిత మిచ్చానని ‘’అందుకొని నిలువుమా కల్పము౦దాక ‘’అని సభక్తికంగా అంజలి ఘటించాడు .

106వ చివరిపద్యం లో –‘’అప్పగింప శతకమల్లి –యల్లూరిరా-జేశ్వరకవి ,దీని శాశ్వతముగ-నిలుపు మంకితంబు నీకిడు గడు బ్రీతి –భాను సమాన తేజ వరద రాజ ‘’అని శతకం ముగించాడు భక్తకవి .శతకం లో తనగురించి ఏమీ చెప్పుకోలేదు .ఆ ఒక్కటితప్ప మిగిలినవి  ఏమేమి రాశాడో కూడాలేదు .వరదరాజస్వామి గురించీ లేదు .ఆస్వామికే ఎందుకు అ౦కిత మిచ్చాడో కూడా లేదు .ఈ శతకం గురించి ఈకవి గురించి మనవారెవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .కవిని శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .లలితపదజాలం సూటి కవిత్వం ఆత్మవిశ్వాసం ,వరద రాజ పద భక్తీ ప్రతిపద్యంలో కనిపిస్తుంది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం.

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2
6-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడు
సా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. “ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా” అంటాడు. తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!
కాలము
గువ్వల చెన్న శతక కర్తృత్వం గురించి, కవికాలాదుల గురించి చరిత్రలో నిర్థిష్టమైన అభిప్రాయం లేదు. శతక కవుల చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు అభిప్రాయం ప్రకారం ఈ శతకం 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించాడు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. శతక నామావళి ననుసరించి గువ్వల చెన్నడు ఈ శతకాన్ని రాసినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఉదహరించబడిన పాశ్చాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావం పరిశీలించిన పిదప ఈ శతకం బహుశా 18వ శతాబ్దినాటిదని భావించవచ్చు.[
7-భారత దేశ రెండవ మహిళా చర్చి బిషప్ –రెవరెండ్ ఎగ్గోని పుష్పలత
రెవరెండ్ ఎగ్గోని పుష్పలత మహిళా బిషప్‌. నంద్యాల చర్చి బిషప్‌. పుష్పలలిత భారతదేశంలో చర్చి బిషప్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ[4].
పదవులు
ఐర్లాండ్ చర్చి బిషప్‌గా ఒక మహిళ రెవరెండ్ ప్యాట్రిక్ స్టోరేను నియమించిన తర్వాత రోజే పుష్పలలితను నంద్యాల చర్చి బిషప్ నియమించడం జరిగింది.సెప్టెంబర్ 30న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి బిషప్ జి. దేవకదాశం చేతులమీదుగా పుష్పలలిత బాధ్యతలు స్వీకరించారు[5] .
బాల్యం
.కర్నూలు జిల్లాలోని దిగువపాడు గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించింది[6] . నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్న ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ మిషనరీల ప్రభావాన్ని ఆమె గుర్తించింది మరియు ఆమె అలాంటి జీవితాన్ని గడపాలని చాలా కోరుకుంది మరియు CSI ఆర్డర్ ఆఫ్ సిస్టర్స్‌లో సభ్యురాలైంది . పుష్పలలిత 1984లో క్రైస్తవ మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు చర్చి సమాజాలకు పుష్పలలిత ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 2005 నుంచి రెండేళ్లపాటు నంద్యాల చర్చి ప్రాంతీయ పరిధిలో కోశాధికారిగా కూడా ఆమె విధులు నిర్వహించారు. 400 గ్రామాల్లోని ప్రజలకు విద్యా, ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించారు. దేశంలో రెండో బిషప్‌గా పుష్పలలిత నియామకం కాగా మొదటగా 1996లో రెవరెండ్ అలివేలి కాదక్షమ్మను గుడ్ సమరిటన్ ఎవంజిలికల్ లూథరన్ చర్చి తన బిషప్ గా నియమించుకుంది[7]
పుష్ప లలిత తన మినిస్ట్రీ ఏర్పాటు చేశారు .  ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ , హైదరాబాద్‌లో మొట్టమొదటి  యూనివర్శిటీకి అనుబంధంగా ఉంది , సెరాంపూర్ కాలేజ్ (యూనివర్శిటీ) యొక్క సెనేట్ పాత నిబంధన పండితులు , విక్టర్ ప్రేమసాగర్ కాలంలో ఆమె చదువుకుంది. సెల్లీ ఓక్ కాలేజీలు , బర్మింగ్‌హామ్ , యునైటెడ్ చర్చ్ ఆఫ్ జమైకా , కేమాన్ ఐలాండ్స్‌లో పరిచయం కలిగింది . ఆమె బెంగుళూరులోని విశ్రాంతి నిలయం డైరెక్టర్‌గా మరియు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్నారు . ఆమె డీనరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.ఎగ్గోని పుష్ప లలిత నంద్యాల డియోసెస్ బిషప్‌గా 25 సెప్టెంబర్ 2013న నియమితులయ్యారు. ఆమెను 29 సెప్టెంబర్ 2013న నంద్యాలలోని ఆంగ్లికన్ కేథడ్రల్‌లో మోడరేటర్ జి . దేవకాదశం డిప్యూటీ మోడరేటర్ జి. దైవాశీర్వాదం ద్వారా బిషప్‌గా నియమించారు[8]

8-భారత అగ్రగణ్య విప్లవకారుడు –శ్రీ చండ్ర పుల్లారెడ్డి
చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవకారులలో అగ్రగణ్యులు. సిపి అనే పేరుతో పిలవబడేవారు.
పుట్టుక-విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగోడు గ్రామంలో 1917 జనవరి 19 న జన్మించారు.[1] మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీపీ గారు ఐదవ తరగతి వరకు వెలుగోడులో, ఆపైన మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ విద్యను కర్నూలు ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్యకై మద్రాస్ గిండి ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు.
ఉద్యమ జీవితం
అక్కడ ఇంజనీరింగ్ చదువుతూవుండగా నాటి బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు.దాంతో కాలేజీ యాజమాన్యం ధర్నాకు ముఖ్య కారకులైన చండ్ర పుల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి గార్లను క్షమాపణ చెప్పాలనికోరగా వారు నిరాకరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వారిరువురిని కాలేజీ నుండి బహిష్కరించారు.అప్పటికే స్వతంత్ర భావాలు,నాటి మద్రాస్ కమ్యూనిస్టు నాయకులు కుమారమంగళం లాంటి వారి ప్రసంగాల వల్ల కమ్యూనిస్టు భావజాలం సీపీ గారిలో బలంగా ఉండేవి.1937 మే 1 వ తేదీన నాటి ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా కొత్తపట్నంలో 15 రోజులపాటు జరిగిన రాజకీయ పాఠశాలలో వెలుగోడు గ్రామం నుండి ఔత్సాహిక యువకులతో పాటు చండ్ర పుల్లారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.ఆ రాజకీయ పాఠశాలకు పుచ్చలపల్లి సుందరయ్య,చండ్ర రాజేశ్వరరావు వంటి ప్రభుతులు అధ్యాపకులుగా ఉండేవారు.1941 నాటికి పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారి కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడిగా వున్నారు.1946 లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1949 మధ్యకాలంలో డిటెన్యూ కింద అరెస్టు కాబడి 1951లో విడుదలయ్యారు.1952 మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి ,కాంగ్రెస్ అభ్యర్ధి, భూస్వామి అయిన మద్దూరు సుబ్బారెడ్డి మీద 10000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఎమ్మెల్యేగా మద్రాస్ అసెంబ్లీలో రాయలసీమ వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ సీపీ గారు చేసే ప్రసంగాలకు ముఖ్యమంత్రి రాజగోపాలచారి గారిచే ” రాయలసీమ తరుపున పోరాడడానికి గట్టివాడే దొరికాడే ” అని అనిపించుకున్నాడు.1953 రాష్ట్ర విభజన తరువాత 1955 లో పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ 1962 లో జరిగిన ఉప ఎన్నికల్లో మిడుతురు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అది మొదలు సీపీ గారు తన చివరి శ్వాస వరుకు ఎన్నడూ ప్రత్యక ఎన్నికల్లో పాల్గొనింది లేదు.1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు.1964 లో భారత కమ్యూనిస్టు పార్టీలో మొదలైన సైద్ధాంతిక విభేదాల్లో పుచ్చలపల్లి సుందరయ్య ,మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి గార్లతో కలిసి సీపీఎం వైపుకు వచ్చారు. జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.1975లో సి.పి., సీపీఐ (ఎం-ఎల్) కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 1979లో యస్.యన్.యస్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ కాగలిగారు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.[2]
మరణం
కార్మిక సంఘాల సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రైలులోనే కలకత్తా లో 1984 నవంబర్ 9 న తీవ్ర గుండెపోటుతో మరణించారు.[2]
రచనలు
• మానికొండ సుబ్బారావుతో కలిసి ‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం – దాని పరిణామం’
• వి.ఆర్.బొమ్మారెడ్డి తో కలిసి ‘ మావో సూక్తులు’ అనువాదం
• మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం – దాని గుణపాఠాలు.
• ఎన్నికల సంఘటనలు గుణపాఠాలు
• సీపీఐ, సీపీఎం, ఎపిసిసిసిఆర్ లలో వున్నప్పుడు ‘ జనశక్తి ‘ లో , సీపీఐ ( ఎం.ఎల్ ) లో తన పార్టీ పత్రిక విమోచన లోనూ అనేక సిద్ధాంత వ్యాసాలు రాసారు.
• సిద్ధాంత వ్యాసాలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి.
• 9- ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ స్థాపకుడు –శ్రీ తరిమెల నాగి రెడ్డి

జననం
అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917న రైతు కుటుంబములో జన్మించాడు.
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము, స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు జైలుకు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. [1] జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, సి.పి.ఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్ (ఎ.పి.సి.సి.ఆర్) – ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారతదేశం). నాగిరెడ్డి 1976, జులై 28న మరణించాడు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అరెస్టు చేశారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు

’కొండను అద్దం’’ లో -3
శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు  
అమెరికాలో ఆస్టిన్ నగరం లో ఉంటున్న శ్రీ డొక్కా రాం గారు నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి ఇనిమనవడు –అంటే మునిమనవడిగారబ్బాయి .సాఫ్ట్ వేర్ ,సాహిత్యం అనే జోడు  గుర్రాల స్వారీ  చేయగల దిట్ట .కవిత్వం, విమర్శ చేయగల సవ్యసాచి .ఈ మధ్య ఇండియా వచ్చి నాకు పంపిన 9పుస్తకాలపై స్పంది౦చ మనికోరగా రాస్తున్ననాలుగు మాటలివి .ఈ తొమ్మిదీ 2022మార్చి నుంచి జులై లోపు వచ్చిన తాజా నవరత్నాలు .అంటే ఎంత వేగంగా పుస్తకరచన జరిపి ,ప్రచురించారో మనకు అర్ధమౌతుంది .ప్రతి పుస్తకం మంచి గెటప్ తో ఆకర్షణీయంగా ఉండటం మరీ ప్రత్యేకత నాణ్యతకు పట్టాభి షేకం జరిగిందన్నమాట .
1-పద్య సఫారీ ,పలుకు కచేరీ –సోదరులిద్దరూ ఆఫ్రికా పర్యటన చేసి పొందిన అనుభూతి .రాం గారు సఫారీ,ఫణి గారు కచేరీ చేశారు .కలర్ ఫోటోలతో వన్య మృగ దర్శనమూ చేయించారు .మొదటి దానిలో ‘’సఫారీ ‘’అనే అన్య దేశ్య పదాన్ని మకుటం చేసి రాయటం కొత్త .ఇందులో తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటన అనుభవ సారం చూసిన ప్రదేశాలు జంతువులూ వాటిపేర్లనుపద్యంలో ఇరికించటం ఒక పెద్ద సఫారీ .చక్కగానిర్వహించారు రాం .జంతుప్రపంచం చేరగా పిలిచిందట పరుగు లంఘిచు ప్లావి అంటే జింక ,చోరులబాధలేదు .తరుణము రానంతవరకూ వేటాదబోదు భారి అంటే సింహం .వినుటకు చేటల చెవులు ,కనుటకు లఘు నేత్రయుగలి తినుటకు గరికలే చాలు –మనిషికి ఆదర్శం ‘’కరియోగి ‘’ఖద్గంరుగాల ఖడ్గ మృగాల కొమ్ములు దోచే దొంగలు ‘’దొమ్ము వడ’’అంటే వాటి బలం క్షీణి ౦ చేదాకా కా తరిమి చంపి దొంగరవాణా చేస్తారు .ప్రకృతి సమతుల్యత నిలబెట్టే జంతుజన్మ ను చూసి మనిషి గుణపాఠం నేర్చుకోవాలి .’’నడి రాతిరి వినవచ్చెను –చిడిముడి తడబడు నటులుగసింహపు గర్జల్ ‘’వినిపించాయి .పోతన స్టైల్ కనిపించింది .కిలిమంజారోపర్వతాలు మెరుపులమధ్య వెలిగే మేరు నగంలా ఉందట తూర్పు టాంజనీయాకు తురగ౦ అంటే హృదయం జాంజిబార్ ‘’.వావలె ననుకొను నావలు –జీవనమిదే ఆటుపోటు చిట్టా అంటే ఆశ్చర్యం చిత్రం .ఇలా కందాల్లో సఫారీని బంధించారు రాం.
  మాటలకచేరీలో ఫణీంద్ర యాత్రా విశేషాలు రాశారు. ఆఫ్రికా అంటే నలుపు అన్నారు .అనిశ్చిత మనిషిని నడుపుతుందని జీవితం పై ఆసక్తి రేకెత్తిస్తుందన్నారు .
2-పాట వెలది –పలుకు నర్తనకుపద్య పరివర్తన –తెలుగు సినీ పాటలకు రాం గారి పద్య కూర్పు .ఆత్రేయ గీతం –తేట తేట తెలుగులా –తెల్ల వారి వెలుగులా –తేరులా సెలయేరులా కలకలాగలగలా –కదిలి వచ్చింది కన్నె అప్సరా –వచ్చి నిలిచింది కనులము౦దరా ‘’దీనికి పద్యాలు –తేట తేట తెలుగు తెల్లవారి వెలుగు –తేరు వలెను సాగి ఏరువలెను –కదిలి వచ్చి నిలిచే కన్నె అప్సర తానె –అందమంతా కనుల విందు చేసి ‘’అద్భుతపద్య పరివర్తనం .చివరి 21వ పాట దిలయన్ కింగ్ ఇంగ్లీష్ సినిమాలో –హుకూమా మటాటా –వాట్ ఎ వండర్ఫుల్ ఫ్రేజ్ –హుకుమా మటాటా –Aint nopassing craze ‘’కు అను వార్తన పద్యం –‘’అందరకు హాయి అంత మేలుజరుగు –దృష్టి శుభము గనిన సృష్టిశివమే –తల్లడిల్ల నేల తలపులందున చిక్కి –చింతలేల ?చిన్ని జీవితమున ?’’
  బహుశా ఇలాంటి పద్య పరివర్తన ఎవరూ చేసి ఉండరు. రాం గారి ఆలోచన పరిపక్వంగా నెరవేరి మార్గదర్శనం చేసింది .
3-అమెరికావాసి –తన ప్రవాస జీవిత గాథను శతకపద్యాలలో పడమటి సంధ్యారాగం గా వినిపించారు రాం.’’ప్రాచ్యం అప్రాచ్యం అనే ఏహ్యభావాన్ని మనసులోనుంచి తుడిచిపారేసి విశ్వ మానవతను ప్రతిబింబింప జేశారు .’’అమెరిక వాసి’’ అనేదిమకుటం.మచ్చుకు కొన్ని పద్యాలు –‘’ఎన్నారై మొనగాడని –ఎన్నో చానళ్ళు బొగడ నేమి ఫలంబో ?-నిన్నే నమ్మిన తమ్ముల –కన్నా చేయూతనిడక యమరిక వాసీ ‘’.పోలీసులే’’ కాపు’’లనగ –కాలొక్కటి చేసినంత కదనాశ్వములై –వాలుదురే క్షణమందున –నాలస్యము చేయకుండ’’అక్కడ పోలీస్ లను కాప్ అంటే అది రక్షణ అర్ధంగా కాపు ను వాడి వాళ్ళ డ్యూటీమైన్దేడ్ నెస్ ను బాగా చెప్పారు .ప్రతిశీర్షిక బాగుంది .ఉపసంహారం లోచివరగా –‘’వందల వేల ప్రవాసుల –కందువ జీవన గతులను కథగా జెప్పన్ – డెంద౦బులు మురిసినవా ?అందరికివే వందనంబు లమెరిక వాసీ ‘’అని ఫీడ్ బాక్ గా అడిగారు .ఇందులోనే శంకరాచార్య మాతృపంచకం దుఃఖ నివృత్తి ,గుర్వస్టకం మొదలైన శ్లోకాలకు తేట తెనుగు పద్యానువాదం చేసి జగద్గురువులను మనకు అతి సన్నిహితం చేశారు .
4-ప్రవాసి –ఆధునిక ప్రవాస జీవన పద్యకావ్యం –ఇది నవావరణ కావ్యం .మొదటిది వందనం లో సీతమ్మ మాయమ్మ అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ,గురు వందనం అందే వేదమాతరం శివపంచ రత్నాలు  అనే 17శీర్షికలు .రెండవది జ్ఞాపకం లో ప్రవాస భారతి విశ్వభారతి అజ్ఞాతవాసం గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ –మొదలైన 12శీర్షికలు మూడవది –ప్రవాసీ జీవనం –లో వీకేండోపాఖ్యానం ,ఆటవెలది ఎంకి ,సంసార వేదాంతం ,పేకాట వైరాగ్యం శారద నీరద కేళి వంటి 24శీర్షికలు నాల్గవది బంధనం లో లాక్ డౌన్ మాయాబజార్ ,కరోనా ,వర్క్ ఫ్రం హో౦,కు౦జరయూధం లాంటి 8,అయిదవది –పద్య నైవేద్యం లో పడగెత్తిన పద్యం ,పద్యం ఎలాఉండాలి?పద్యపాన ప్రియుడు ,సాహిత్య పెత్తందార్లు సన్మాన రహస్యం ,ఒహోహోం ఒహోహోం వంటి 14శీర్షికలు ,ఆరవ ది-అక్షర సేద్యం లో బంగారుతల్లీ ,భాష –బెత్తం,tellgoతెలుగు ,త్రీ చీర్స్ టుపద్యం తెలుగు బడి వంటి 18శీర్షికలు ,ఏడవది –సంబరం లో –ఉగాది అమెరికందాలు ,దీపావళి దసరా,సూపర్ బౌల్ ,సభాయైనమః వంటి 12శీర్షికలు ,ఎనిమిది-భోజనం లో-ఆరురుచులు ఆట వెలదులు ,కాఫీకాఫీ ,పచ్చడి పలుకులు ఆవకాయ డాట్ కాం ,హాచ్చి కందములు ,కవితా కన్జేక్టివై టిస్ వంటి 20 శీర్షికలు  ,నవమావరణం –నీరాజనం లో ఓమేధావికి పాఠం ,శ్రీశ్రీ ,మనాత్రేయ ,పివి శతజయంతి ,బాలగంధర్వుని కి పద్య నీరాజనం ,గరికి పాటికి పద్య పట్టాభిషేకం వంటి 8శీర్షికలు ఆల్ మొత్తం 133శీర్షిలతో కావ్యం పూర్తి చేశారు . మచ్చుకు కొన్ని పద్యాలు ఆస్వాదిద్దాం .
సీతమ్మగారిపై పద్యం –1-అన్నమా అది కాదు ,ఆప్యాయతల ముద్ద-లన్నపూర్ణ గ నోటి కందజేసె –మజ్జిగా అదికాదు మనసు కవ్వము జిల్కే –మానవత్వపు తేట మంచిమాట
పప్పు ధప్పళములు ,పచ్చడి ,వ్రతముగా –పరుల కడుపు నింపె –పరమ సాధ్వి –ఆకలి రక్కసి నంతమొందగా జేసే –నాత్మ చాపపు నారి అమ్మ సీత
వండి వాత్సల్యమే పంచె వంటగరిటె–కాశిగా కొనసీమాయే వాసి కెక్కె
ఖండములు దాటి నీఖ్యాతి గన్నవరపు –లంక మెరసిన భారత రత్నమీవు ‘’
2-లాక్డౌన్ చిత్రం –‘’మంచినీరు పాలు మరచిరి మనవారు-లాకు డౌను మంచి లాభ సాటి
లైనుకట్టే రయ్యోవైను షాపు లెదుట –మందు కొనుట యందె ముందు చూపు ‘’
3-అమ్మను మింగినదా౦గ్లము –క్రమ్మెను సంస్కృతికి మబ్బు ,కాలపు మహిమల్
నమ్మిన వారికి గలవిట-అమ్మకమునకాధరువులు నాప్యాయతలున్ ‘’
4-తెలుగు వాడి నీది తెలుగు వేడియు నీది –తెలుగు మరువ వలదు తెలుగు బిడ్డ ‘’5-‘’మన ఆత్మ గౌరవ౦బును –మనకారము చాటి జెప్పు మన పచ్చళ్ళున్
మన పెరటి కూరలందున –మనసెరిగిన ఆకు కూర మన గో౦గూరే ‘’
6-జబ్బలు చరుచుచు నిలిచెను-పబ్బపు వంటలను రాజు ,పందెము గెలిచెన్
‘’బొబ్బట్టే’’ నెగ్గెను పెడ –బొబ్బలు పెట్టగ నితరులు పోటీ ముగిసెన్’’
7-ఒటేల్ భోజనం –‘’ఉడుకు ఉడుకు అన్న ముడకనియ్యని కూర –ఉప్పుమిరియ౦పు పొడులున్న వచట ‘’.
శుచియే ముఖ్యమాయే రుచులు కానేకాదు –కడుపు నిండలేదు కనులవిందు ‘’
8-అమ్మ వంటి గ్రామ మనురాగ సంపదే –చూసిరండి మీరు సుఖముగాను ‘’
9-దీపావళి –‘’రేపన్న ప్రమిద చిత్తము –జ్ఞాపకమను చమురుపోసి ,జ్ఞానపు వత్తిన్
దీపము వలె వెలిగించు డి-దీపావళి దివ్యకాంతిదిక్కులు నిండన్ ‘’
  అక్షరలక్షలు చేసే పద్య రాజమిది .
10-‘’పండితుండు త్రాగు పలుకు సారాయినే –మాటలందు మత్తుమందుకలిపి
పరవశమ్ము జెంద భావ లాహిరులలో –మద్యమేల మనకు పద్య ముండ ‘’
ఇది మరో ఆణిముత్యం .
5-చిత్రపది-శతాధిక చిత్ర –పద్య లహరి –కొన్ని పద్య చిత్రాలు –
1-అమ్మకు సృష్టికి ,మూలపు –టమ్మకు,జగదేకమాతకా మువ్వురి జే –జమ్మకు వందన శతములుజయమెల్లరకున్ ‘’
2-వేల గోపికల కు వెలుగైన స్వామికి –గన్నులేల ?నెమలి కన్ను చాలు
మధురభక్తి నిండె మదిలోన కేశవా –స్థాణువైన నీకు వేణు వేల ?’’
3-కాస్త నిలువుమయ్య కాశీకిపోనేల ?పెళ్లి జేసి నీకు బిల్లనీయ
కన్ను విప్పు గలుగు గానబడు దైవంబు –తత్వమొదవి ,జన్మ ధన్యమగును ‘’
5-చిలికితి పద్యంబొక్కటి-చిలిపిగా స్ఫురియించే నటులే చిత్రము జూడన్
అలిగితివో బట్టతలలు ?-గలహము వలదయ్య నేను ఖర్వాటుడనే ‘’
ఈ పుస్తకంలోనూ ఒక కొత్తదనం ఉంది కనిపించిన బొమ్మపై చక్కని పద్యం అల్లటం .అంటే చిత్ర పద్యలహరి .ఇందులోనూ భేషని పించారు రాం.
6-తటిల్లతలు – రాంమనోఫలకం పైతళుక్కుమన్న భావకవితా దీపికలు.ఇవి .మనమూ కొన్ని అనుభవాలు పంచుకొందాం –
1-కాలచక్రపుదారి పరిగిది ,కఠిన మార్గపు గాడి తిరిగెడు – అనుభవమ్ములపుస్తకం నేనాలాపించే గీతం
2-హీరో వర్షిప్ –‘’అరవీసం సాధించిన వాడికి అర సున్నా భక్తులమౌదాం –ఆకాశానికి ఎత్తేద్దాం ఆ దేవుని గానే చేసేద్దాం ‘’
3-గుడిపాటి వెంకట చలం –శేష జీవితం అరుణా చలం ‘’
4-ఇరవయ్యోకటవ శతాబ్దం లోకి శరవేగంగా దూసుకుపోతున్నాడు –అయిష్టంగా నైనా అందరినీ మోసుకు పోతున్నాడు ‘’
5-సరంగు జీవితం –‘’నిత్యం నడి రేవు బ్రతుకు దరిజేరే దారిలేదు –అచంచల ఆత్మ విశ్వాసం ,ఆశల చుక్కాని తప్ప ‘’
6-బాపురే బాపు –‘’నాల్గుగీతలు గీసి –నవ్వించి కవ్వించి –హాస్య రసాయనము –నెక్కి౦చి పొక్కించి –నాలాంటి బుడుగులను –ఉర్రూతలూపావు –ముళ్ళపూడి జతను –ముత్యాల సరులు –అట్టమీది బొమ్మ –లెన్ని అల్లర్లు –కొంటె తెలుగు చూపు –లెక్కించు కైపు –వేదా౦త ముంది ఆ –చిలిపి గీతల్లో –గుండెలను కదిలించు –చింపి రాతల్లో (ఫాంట్ )-గీతాచార్యుడివే కదా –మహాబాపు
7-పెళ్లి –‘’అనురాగం ,అభిమానం పడుగుపేకల్లా –మనసు మగ్గం పై నేసిన మధుపర్కాలు –గారాల దారాలు ,నునుసిగ్గు సరిగంచు –మేనిపై జలతారు చీనా౦బరాలు ‘’అద్భుత భావగరిమ ఇది .బాపు ఉండిఉంటె ,ఈయన్ని కవిగా పెట్టుకొని పాటలు రాయి౦చేవారు.
8-కోనసీమ –గోదారిమాతకు గోమాత సేవకు –తొలికోడి కూతకు తొలిప్రొద్దు పొడుపుకు –తోలకరిజల్లుకు తెలిలి వెన్నెల  సొ౦పుకు –అందాల సీమ మా కోనసీమ ‘’
7-అవ్యక్తం –తానెవరో తెలుసుకొంటానని ,తన్ని తానె ప్రశ్నించుకొంటాననీ ,తనతో తాను  మాట్లాడుకొంటాననీ తనలోని అంతర్యామిని దర్శించే ప్రయత్నం చేస్తాననీ లోపలా బయటా ‘’ఆయన ‘’ ఉనికినిగుర్తిస్తాననే తపనతో రాం గారు రాసిన 50 కవితలివి .ఇందులోనూ కొన్ని తాకి చూద్దాం –
1-పదానికిపదానికి మధ్య తొంగి చూసేది –శబ్దానికి శబ్దానికి నడుమ ప్రవహించేది –భాష భావం ఏమీ అవసరం లేనిదీ –తన ఉనికేదో చెప్పకుండానే ఇద్దరినీ కలిపేది –అదే అసలు కవిత్వం –అదే అవ్యక్తం .’’
2-అడుగుకు మడుగు లోత్తుతూనే –నా అహంకారపు పుండును –చిదిమేశావ్ –ఆశల పర్వతాలనెక్కిస్తూనే అవసరాలలోయల లోకి త్రోసేశావ్ ‘’
3-ప్రవాసీయం –‘’నడి సంద్రం లో –ఈదడం నేర్చుకొన్నాను –ఏ తీరమైనా నాకొకటే –విశ్వమంతా నాయిల్లే అందరూ నా వాళ్ళే –సంస్కృతి నీకు వ్యాపారం కావచ్చు –నాకు సదాచారం –దేశభక్తి నీకొక ఎజెండా కావచ్చు –నేనే నాదేశపు జెండా –ఎక్కడ నాటినా రేపరెపలాడుతాను ‘’
  అద్భుతభావాలకు పరమాద్భుత పద చిత్రణ
8-ఆకు చుట్టిన ప్రకృతి 
సాహిత్యం లోసహజీవనం చేయాలంటే భావ సముద్రంలో మునకలు వేయటమేకాదు ,కొంతసారాన్ని అవపోసనపట్టటంమే చాలదు. అ బిందువు సుడులు అలలు ఆవిరి అందులో సమస్త జీవరాశి మనమే నని గుర్తించాలి నిత్యం మారుతున్న ఆనీటి స్వరూపం లో మమేకమై ,మనం ఆకాశానికి పర్వతాలకు పైకి అరణ్యాలలో అలవోకగా ప్రయాణం చేయాలి .అప్పుడే ప్రకృతి మనతో మాట్లాడుతుంది ‘’అని అర్ధం చేసుకొన్న రాం రాసిన 27అనుభవ గీతాలివి .దీనికి అనుబంధంగా ‘’ఐస్ ల్యాండ్ అందాలు ‘’అనే నైస్ గా చెప్పిన 13కవితలున్నాయి.మంచి బొమ్మలూ ఉన్నాయి .
1-అలా తలుపు తట్టిందెవరు ?అజ్ఞానమా .ఆత్మజ్ఞానమా –ఆపిలుపు నిచ్చిందెవరు –వీడేనా లోపలి వాడా?-అందరిలో ఆకు చుట్టిన ప్రకృతిని –అక్షరం సాక్షిగా –ఆస్వాదిస్తున్న –అడుగడుగునా ఆవిష్కరింప బడుతున్న అద్భుతాన్ని-అంతరంగం లోకి ఆహ్వానిస్తున్నాను ‘’
మిస్టిక్ పోయిట్రీ,టాగూర్ స్రవంతిలా ఉంది
2 ఒక్కటే సత్యం –ఎన్నిపరదాలను తప్పించినా –ఇప్పుడెవరికీ కాకు౦ డాపోయింది –కాళ్ళ ఎదుట ప్రత్యక్షమై ఉన్నా-ఒక్కరికీ కనపడకుండా పోయింది
3-  ఐస్ లాండ్ లో వేడి నీటి బుగ్గ –లోపల ఎంత కుతలాడితే –అ౦తెత్తు ఉబికి వస్తావ్ ?అరక్షణం లో –ఆకాశాన్ని చేరుకోవాలనే తహతహ –నిన్ను నిలువెల్లా దహించి వేస్తోంది కాబోలు ‘’చక్కని కవిత్వం. ఆయన అంతరంగంనుంచి ఉబికి ఉవ్వెత్తున ఎగసి వచ్చింది.
4-వజ్రాల్లా మెరిసిపోతూ –వారధి ఒడ్డున మురిసిపోతూ –వచ్చి పోయేవారిని –పలకరించటం కోసం –నిత్యమంగళ స్నానాలు చేస్తూ –వాయు భక్షణలు చేస్తున్న –వింత విగ్రహాలు –ఇదీ ఐస్ లాండ్ లోదే
5-తలుపులు లేని గుమ్మమ్ములు –వాస్తు విశేషములుకావు –వాస్తవామీ కట్టడములు –క్రైస్తవ మత చిహ్నమ్ములు ‘’
9-తొమ్మిదవ చివరిపుస్తకం –పలకరించే పద్యం ‘’-అని ‘’మాస్టారూ !ఒక్ఖపద్యం ‘’అని ఊరించారు రాం .ఇందులో పద్యలహరిలో 41,అవధానాలు సాహితీ సదస్సులలో చెప్పినపద్యాలు 42,ఆచార్యులతో పద్య సంభాషణ లో -20,పొడుపుకథలు –లో 20,బొమ్మ -బొరుసు పద్యాలు -6,సమస్యాపూరణక౦దాలు  -115,ఆటవెలదులు -56,తేటగీతులు 47,వృత్తపద్యాలు -15,ఉత్పలమాలలు -8,శార్దూల౦ -1మత్తేభాలు 3.ఉన్నాయి .పద్యమంటే చెవికోసుకొనే వారికి పసందైన పక్కా విందు భోజనం అందించారు రాం డొక్కా.ఇందులో వాచవికి ఒకటి రెండు .
1-మది మెచ్చెన్ మరి చందమామ గనుచున్ మా రాము డానాడితన్ –ఇది ‘’ఇస్రో ‘’జయకేతనంబు గనుడీ ఈ నాటి శాస్త్రజ్నులే –కదిలించన్ ఘన అంతరిక్ష పదమున్ ,కాలూన  సిద్ధంబిటన్ –ఉదయించెన్ రవి చంద్రమండలములో నొప్పారు మేఘాకృతిన్ .
2-కోవిదమ్మ నేర్ప కొత్త వ్యాపారముల్ –పాతమాస్కులిచ్చి పాత్రలడిగే –అసలు తెలివియున్న అమెజాను లోనైన –బలుసుకూరనమ్మి బ్రతకవచ్చు
3-దాసాను దాసులేకడ –ఊసులకే ఊరి పెద్ద లుత్త కబుర్లే –వేషాలే మగవారివి –మీసాలవి స్త్రీకే సొబగు మీరేమన్నన్ ‘’
ఇలాంటి పద్యాలసోబగులు ఎన్నెన్నో ఉన్నాయి .రాం గారి కవిత్వ ధార,ఆయనపుట్టిన రాజమహేంద్ర గోదావరీ ప్రవాహంలా ,తానున్న  నయాగరా జలపాతం లా సాగింది .అందులో తళుకులు బెళుకులు ఉరుకులు హోరు ,మానసిక ఆనందం మేధో పరిణతి గోచరిస్తాయి .నిజానికి ఆయన అవధానం చేయ గల సమర్దులే .ప్రాక్ తీరం నుంచి పడమటి తీరానికి చేరిన జ్ఞాన మార్తా౦డులే .ఆయన ఆప్యాయతకు ,మంచి మనసుకు ఈపద్య లహరి లేకకవితాలహరి తార్కాణం .మరిన్ని వన్నె వాసికల పుస్తకాలు వెలువరిస్తారని భావిస్తూ ,వెలువరించాలని కోర్తున్నాను .ఇప్పుడు వారి చరిత్ర తెలుసుకొందాం –
పేరు డొక్కా రామభద్రశర్మ అమ్మానాన్నలు-శ్రీమతి బాలాత్రిపురసుందరి శ్రీ సూర్యనారాయణ గార్లు .పుట్టింది-తూగోజి ధవళేశ్వరం .అక్షరాభ్యాసం –రాజమండ్రి ,విద్యాభ్యాసం –అమలాపురం హైదరాబాద్ .ఉన్నత విద్య –బెంగుళూరు, అమెరికా .మొదటిఉద్యొగ౦  –భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ –ఇస్రో  .ప్రస్తుత నివాసం –ఆస్టిన్ నగరం –టెక్సస్ అమెరికా  .వృత్తి –ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్ .ఐటి ప్రాజెక్ట్ మేనేజిమెంట్ .ప్రవృత్తులు –అక్షరారాధన ,సాహిత్యాధ్యయనం భాషా సాహచర్యం ,అధ్యాపకత్వం ఆధ్యాత్మిక తత్వ విచారణ .సాహిత్య ప్రక్రియలలో సేద్యం ,సాహితీ సదస్సులు నిర్వహించటం హాజరవటం అవధానాలకు  సంచాలకత్వం , నిర్వహన , మాతృభాష బోధన ,పాఠ్యప్రణాళిక ,అంతర్జాతీయ తెలుగు బడి నిర్వహణ .
ఇంతటి ప్రతిభా వంతుని అక్కడి సంస్థలు గుర్తించి సన్మానించాయి .మనదేశామూ,మన రాష్ట్రమూ ఆహ్వానించి  సత్కరించి మనం ధన్యులమవాలి .ఆ రోజు త్వరగా రావాలని ఆశిద్దాం .


.మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

మీ ఆత్మీయ స్పందనకు, ఆశీరక్షతలకు ధన్యవాదాంజలులండి.🙏

యాదేవీ సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు అర్థరూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు భావరూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు భాషారూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా..

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః..🙏🕉️🙏

అమ్మ అపార కరుణాకటాక్షవీక్షణలు, 

అనంతభావధారలై, పద్య, వచన కవితా 

సంకలనాలుగా రూపొంది, 

అమ్మ-నాన్న చేతులమీదుగా,

జూలై 31వ తేదీ, 2022 నాడు,

ఎందరో పెద్దలు, ఆచార్యులు, 

పండితులు, సాహితీవేత్తలను  

సమాదరిస్తూ “అక్షరతాంబూలాలు”గా 

ఆవిష్కరింపబడ్డాయి.   

1.  మా ఆఫ్రికా యాత్ర (పద్య సఫారీ, పలుకు కచేరీ) 

2.  చిత్రపది (శతాధిక చిత్రపద్యలహరి) 

3.  పాటవెలది (పలుకునర్తనకు పద్య పరివర్తన) 

4.  అమెరిక వాసి శతకం 

5.  ప్రవాసి (ఆధునిక జీవన పద్యకావ్యం)

6.  పలకరించే పద్యం

7.  తటిల్లతలు

8.  అవ్యక్తం 

9.  ఆకుచుట్టిన ప్రకృతి 

10. ఆత్మారామం (ద్వితీయ ముద్రణ) 

11. ఆత్మానందం (అద్వైత జీవన కవితా మకరందం, 2017)

12. శ్రీ సాయి సురభి పద్యకావ్యం (తమ్ముడు చి. ఫణి డొక్కా రచన) 

వీటిని, అందరికీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని, చదువుకొనేందుకు వీలుగా క్రింది లంకెలో పొందుపరచాము.

https://acchamga-telugu-ebooks.blogspot.com/2022/09/?m=1

పుస్తకాలకు ముందుమాటలనందించిన పుంభావసరస్వతులకు, అందమైన ముఖచిత్రాలను అందించిన కుంచె సోదరుడు శ్రీ కూచి సాయిశంకర్ కు, లోపలిచిత్రాలను అపురూపంగా చెక్కిన శ్రీ ఉలి గారికి, పుస్తకాలను అనతికాలంలో, అతి చక్కగా ముద్రించి, ఆన్ లైన్ లో కూడా పొందుపరచిన “అచ్చంగా తెలుగు” ప్రచురణల అధినేత్రి, సోదరి శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గార్లకు అనేకానేక ధన్యవాదములు. 

పుస్తకములను చదివి మీ మీ అక్షరాశీస్సులు, ఆత్మీయస్పందనలు అందజేస్తారని ఆశిస్తున్నాను. 

ఈ జన్మలో ఇంతటి అపురూపమైన సాహితీబంధుత్వాన్ని  అద్భుతమైన వరంగా ప్రసాదించిన సరస్వతీమాతకు సహస్రకోటి ప్రణామములు. 

– రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు

1-కళంకారీకి అలంకారం తెచ్చిన తులసీ సమ్మాన్ గ్రహీత ,శిల్ప గురు ,పద్మశ్రీ-శ్రీ జొన్నల గడ్డ గురప్ప శెట్టి

జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) ఉత్తీర్ణులు అయ్యారు.

గుర్తింపులు :

· 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

· 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారము తో సత్కరించబడ్డారు.

· కలంకారీ కళకి ఆయన చేసిన విశిష్ఠసేవలకి గానూ ఆయనకి శిల్పగురు బిరుదు వరించింది.

2-తంజావూర్ శైలి చిత్రకారుడు ,శిల్ప గురు ,పద్మశ్రీ –శ్రీ పన్నూరు శ్రీపతి

పన్నూరు శ్రీపతి : చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గలదు. పలుభాషలలో వ్రాయగల దిట్ట. హైదరాబాదు లోని తెలుగు లలిత కళాతోరణంలో సభ్యుడు కూడానూ.

సత్కారాలు
· పద్మశ్రీ : ఇతని కళా తపస్సును గుర్తించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.

· శిల్పగురు : భారత ప్రభుత్వం ఇతనికి 2008 శిల్పగురు అవార్డు ప్రదానం చేసింది.[1]

ఇతని శిష్యగణం కూడా కళారంగంలో రాణిస్తోంది.

3-మహాదాత శ్రీ బుడ్డా వెంగళరెడ్డి

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి 1900 డిసెంబరు 31న శివసాయుజ్యాన్ని పొందాడు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం
ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, “అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది” అన్నారు. కానీ బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ, దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటే మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.

· ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి గురించి నాకు తెలిసిన పూర్వీకులు చెప్పిన మాటలు చివరి దాన ధర్మములు.

· ఒకానొక రోజు ఒక నిరుపేద బ్రాహ్మణుడు దూర ప్రాంతం నుండి తన కూతురి వివాహం కోసం కొంత డబ్బులు అవసరం పడ్డాయి అంటా, అప్పుడు దానకర్ణుడు మన బుడ్డా వెంగళరెడ్డి గురించి ఎవరో చెబుతుంటే విన్నారంటా, విని ఆయనను కలిసి తన బాధ తెలిపి ఆయనను దానం చేయమని అడగాలని నిశ్చయించుకున్నారు. పూర్వం బైకులు, కార్లు, మరియు ఏ ఇతర సౌకర్యాలు లేవు. ఆయన కాలినడకన వచ్చి తన బాధ చెప్పుకుని తనకు కొంత డబ్బులు సహాయం చేయమని చాలా బాధపడుతూ విన్నవించాడు ఆ నిరుపేద బ్రాహ్మణుడు. అప్పుడు మీ కూతురి వివాహానికి సంబంధించిన ఖర్చులు మొత్తం డబ్బులు నీకు సహాయం చేస్తాను అని బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఫలానా రోజు రమ్మని సెలవిచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి ఆ దేవుడు తనువు చాలించారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆ బ్రాహ్మణుడు కూతురి వివాహం నిశ్చయించుకున్నారు, ఆ నిరుపేద బ్రాహ్మణుడు కాలినడకన నడుస్తూ ఆ ఉయ్యాలవాడ గ్రామ సమీపానికి చేరుకున్నాడు, ఆ దారి మద్యలో ఆ దైవ స్వరుపుడూ ప్రత్యక్షం అయ్యాడు.

అప్పుడు ఏం స్వామి చాలా రోజులు తర్వాత వస్తున్నావు అని ఆ నిరుపేద బ్రాహ్మణుడిని అడిగారు , అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొద్దిగా వివాహానికి ఆటంకాలు ఎదురై ఆలస్యం అయ్యింది అయ్యా గారు అని జరిగినా విషయం తెలియజేశారు. సరేలే నీ డబ్బులు ఫలానా గదిలో మూటకట్టి దంతెల మద్యలో ఉంచాను , మా కుటుంబ సభ్యులకు నేను చెప్పినాను అని చెప్పండి మీ కోసం దాచినా డబ్బులు మీకు ఇస్తారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి సంతోషంగా మీ కుమార్తె వివాహం జరిపించండి అని తెలియజేస్తారు , ఆ దేవ దేవుడు బుడ్డా వెంగళరెడ్డి గారు.

ఆ బ్రాహ్మణుడికి ఆయన పరమాత్మను చేరుకున్న విషయం తెలియదు. బుడ్డా వెంగళరెడ్డి ఆస్థానంకు ( నివాసం ), వెళ్ళి దారి మద్యలో ఎదురై ఈ విధంగా చెప్పారు, మా కుటుంబ సభ్యులను అడగండి మీ డబ్బులు ఇస్తారు అని చెప్పారని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెబుతాడు ఆ బ్రాహ్మణుడు, ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పిండడు,కాని దారిలో ఆయన చివరి దాన ధర్మం విజయవంతం కావాలి, ఆ బ్రాహ్మణుడికి ఫలితం దక్కాలని ఆయన కైలాసం నుండి బ్రాహ్మణుడి కోసం భువి కి, దిగివస్తాడు ఆ దేవుడు. జరిగిన సన్నివేశం ఒక మిస్టరీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు డబ్బులు లేవు ఏం లేవు మాకు పోయేటప్పుడు మాకు చెప్పలేదు ,నీ మాటలు మేము నమ్మమము అని బదులిస్తారు. ఆ బ్రాహ్మణుడు చాలా బాధ పడుతూ కన్నీరు మున్నీరుగా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్ళక పోతే, మా కూతురి వివాహం ఆగిపోతుంది అని చాలా చాలా రోదిస్తాడు, అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పెది నిజమేనని భావించి మళ్ళీ ఒకసారి ఆయనను అడిగి విషయం తెలుసుకోని ఆ గదిలోకి వెళ్ళి ఫలానా దంతెను తొలగించి చూస్తారు, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఒక మూటలో భద్రపరిచిన డబ్బులు కనిపిస్తాయి, వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి బాధపడకు అని సానుభూతి తెలియజేసి అ డబ్బును అ బ్రాహ్మణుడికి అందజేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాకోసం ఆ పరమాత్మ స్వరూపుడైన బుడ్డా వెంగళరెడ్డి గారు నా కోసం అదేపనిగా వచ్చి నాకు దర్శన భాగ్యం కల్పించడూ అని చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.

అలా ఆ దానకర్ణుడు ఇచ్చిన మాట కోసం తన ఆయన కోసం దాచిపెట్టిన దానం వృథా కాకుండా ఆ బ్రాహ్మణుడి కోసం భూవికి వచ్చి తన మాటను నిలబెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు తెలిసి ఈ కలియుగం ఉన్నంతకాలం మన హృదయాలలో ఎప్పటికీ ఆ దైవ స్వరుపుడూ చిరకాలం కలకాలం బ్రతికే ఉంటారు.

· ఆయనను తలుచుకోని దానధర్మాలు చేస్తే చాలు ఆయన ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మనకు లభిస్తాయి.

4-ఆంధ్రా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి –శ్రీ చల్లా కొండయ్య

చల్లా కొండయ్య (Challa Kondaiah) (జ. జూలై 4, 1918 – ?) ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.[1]

వీరు అనంతపురం జిల్లాలోని చల్లావారిపల్లె గ్రామంలో చల్లా వెంకట కొండయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1918 సంవత్సరంలో జన్మించారు. వీరు తాడిపత్రిలో మెట్రిక్యులేషన్, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, చెన్నై లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. చెన్నైలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితికి ప్రధాన కార్యదర్శిగా కృషిచేశారు.

1944లో న్యాయవాదిగా నమోదుచేసుకొని కోకా సుబ్బారావు గారి వద్ద జూనియర్ గా చేరారు. 1948 నుండి సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. చెన్నై, గుంటూరు, హైదరాబాదు పట్టణాలలో తమ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారు. 1958లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సిల్ గా ఎనిమిది సంవత్సరాలు తమ విధి నిర్వహించారు.

1967లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1976లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, 1977లో తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. వీరు మార్చి 1979 నుండి జూలై 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి కాలంలో అనేక విజయాలు సాధించారు:

· హౌసింగ్ బార్డు జడ్జిమెంట్ ఆర్టికల్ 226 ని 151 ఐ.పి.సి.తో కొట్టేసి విజయం సాధించారు.

· భారత ఎమర్జన్సీ కాలంలో అక్రమ కేసులను కొట్టేయించారు.

· 12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శక సూత్రాలను సూచించారు.

· అర్బన్ లాండ్ సీలింగ్ ఛైర్మన్ గా ఆస్తుల పరిరక్షణకు న్యాయపరంగా సహాయం చేశారు.

· వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఛైర్మన్ గా ఉండి దేవాలయాలలో వారసత్వం హక్కును తీసేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి ఆధ్వర్యాన జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ను నియమించింది. దేవాలయాల ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం 1987 లో దేవాదాయ చట్టాన్ని చేసింది.[2]

· తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నిత్యాన్నదాన పథకాన్ని అమలుచేశారు.

· అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్సులోని ఆడిటోరియాన్ని ఇతని పేరుమీద జస్టిస్ చల్లా కొండయ్య ఆడిటోరియం గా నామకరణం చేశారు.[3]

5-పౌర మానవ హక్కుల ఉద్యమనేత –శ్రీ కె.బాలగోపాల్
కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.
జీవితచరిత్ర
విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి, వరంగల్‌లోని ఆర్ఈసీ నుంచి గణితంలో పీహెచ్‌డీ, 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిక, 1985లో ఉద్యోగానికి రాజీనామా, అప్పటినుంచి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు. మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రియాకాలనీలో నివసించారు. ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయురాలు. కుమారుడు ప్రభాత్. బాలగోపాల్ దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడ్డారు. 8.10.2009 గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

హక్కుల ఉద్యమ రంగం
పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాలగోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు. గణితశాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలువలకోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన నాయకుడాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తేవడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్‌గా ముద్రవేశారు. కొత్తగూడెంలో ఓసారి ఆయనపై దాడికి పాల్పడిన పోలీసులు చనిపోయాడని భావించి మురికికాల్వలో పడేసి వెళ్లగా పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆయన్ను కాపాడారు.

పౌరహక్కుల నుంచి మానవహక్కుల వైపు
రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. మార్క్సిజం నుంచి ఆయన పక్కకు పోవడంపై అప్పట్లో రచయిత్రి రంగనాయకమ్మ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ పుస్తకం రాశారు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం’, ‘చీకటి కోణం’ పుస్తకాలు సంచలనం సృష్టించాయి.

ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.

మేధోశక్తి, వ్యక్తిత్వం
26-27 సంవత్సరాలకే గణితశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అసమాన ప్రతిభా సంపన్నుడు. చదివింది గణితశాస్త్రం అయినా.. సామాజిక శాస్త్రాలు, పౌరహక్కులు, చరిత్ర, సాహిత్యం, రాజ్యాంగం.. ఇలా భిన్నరంగాల్లో లోతైన అవగాహన గల మేథావి. నిరాడంబరుడు. సామాజిక పరిస్థితుల అధ్యయనంలో భాగంగా వందలాది కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. విఖ్యాత రాజనీతిజ్ఞుడైన బెర్ట్రాండ్ రస్సెల్ దార్శనికత స్ఫూర్తిగా ప్రతి సామాజిక సంక్షోభంలోనూ ప్రజల తరఫున నిలబడటానికి ప్రయత్నించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలను, డీడీ కోశాంబి వంటి తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తకాలు రాశారు. హైకోర్టులో పేదలు, కార్మికులు, నిర్వాసితుల వంటి బాధితుల పక్షానే వాదించారు. నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి సంపదను కోట్లాది మంది జీవనోపాధికి ఉపయోగించాలి. సెజ్‌లు వంటి అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం స్థానిక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని, వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని నిర్భయంగా చెప్పే వాడు. ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.

రచనలు
· దళిత

· నిగాహ్

· మతతత్వం పై బాలగొపాల్

· రాజ్యం సంక్షేమం

· సాహిత్యం పై బాలగొపాల్

· హక్కుల ఉద్యమం

· ముస్లిం ఐడెంటిటీ : హిందుత్వ రాజకీయాలు

· కల్లొల లోయ

· జల పాఠాలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

హాస్యానందం 41- ప్రత్యుక్తి (రిపార్టీ-2

41- ప్రత్యుక్తి (రిపార్టీ-2
ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లగా అక్కడి పధ్ధతి నచ్చక డాక్టర్ పై ‘’ఏమయ్యా నువ్వు గొడ్ల డాక్టర్ వటగా ‘’అన్నాడు ఒక విసురు విసరాలని. ఆయన తక్కువవాడా ‘’అవునుకానీ,నీ జబ్బేమిటో చెప్పు .’’అన్నాడు పరమ ప్రశాంతంగా .’.మునిమానిక్యంగారు తనస్వంత అనుభవం ఒకటి చెప్పారు .’’నేను స్కౌట్ ట్రెయినింగ్ కు వెళ్లాను రావాల్సిన మాస్టర్లు ఇంకా రాలేదు .నాకంటే ముందుగా ఒక్కడ౦టే ఒక్కడే వచ్చాడు. ఆయన ఆస్కూల్ హెచ్ ఎం .ఆయనే ఆచంటసత్యనారాయణ .ఆయనే ముందు నన్ను పలకరించి తన ఊరుపేరూ వగైరా చెప్పాడు .’’నువ్వు ఎవరివిరా అబ్బాయీ ‘’అన్నాడు పుచ్చా పూర్ణా నందం గారిలాగా .’’నేను ‘’నా పేరు మునిమాణిక్యం నరసింహారావు ‘’ఆమాటకు బోల్డు ఆశ్చర్యపోయి వెనక్కి విరుచుకొని ‘’ఆ ! ఆ !అంటే నువ్వు ఆ కథలు గట్రా రాసేవాడివా ?’’అంటే అవునని ఒప్పెసుకొన్నాను .ఆయన కాసేపు గుడ్లు మిటకరించి చూస్తూ ‘’అయితే నువ్వు వాడి వే నన్నమాట .నీ కథలు చదివి నువ్వు ఎంతగొప్పవాడివో అనుకొన్నాను .ఓరి నీ దుంప తెగ నువ్వు వాడివేట్రా ?ఇట్లా అఘోరించావెం ?’’అన్నాడు .’’ఎట్లా ఉన్నాను ?’’అన్నాను .అమాయకం ఉట్టి పడుతూ .ఆయన నన్నో వింత మృగాన్ని చూసినట్లు చూసి ‘’ఎట్లా ఉన్నావా ?వెర్రి వెధవాయిలాఉన్నావు ‘’అన్నాడు .నాకు కోపం రాలేదు ఆయన మాట్లాడే పద్ధతిలో, ఆకంఠస్వరం లో ఏదో మాధుర్యం ఉంది ప్రేమ ఆప్యాయత కనిపించాయి .కాసేపు నవ్వుకొని ఇద్దరం స్నేహితులయ్యాం .
ఆచంట సత్యనారాయణ గారు అంటే మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడు 1954-55లో మా హెడ్ మాస్టారి పేరు ఆచంట సత్యనారాయణ గారే .ఇలాగే మాట్లాడేవారు ఆయనే ఈయనేమో !అయినా ఇలాంటి వారు చాలామంది ఉండిఉంటారు .
ట్రెయినింగ్ వారం రోజులూ ఇద్దరూ కలిసే తిరిగారు ఆయన వట్టి వెర్రి వాడిలాగా ప్రవర్తించాడు అందరూ ఇళ్ళకు వెళ్ళే రోజు వచ్చింది అప్పుడు నేను ఆయనతో ‘’ఏమయ్యా !మొదటి రోజున నన్ను వెర్రి వెంగళప్పలా ఉన్నావని అన్నావు .ఈ వారంరోజుల్నుంచి చూస్తున్నాను నువ్వూ వెర్రి వెధవాయి వే’’అన్నాను .మాటకు మాట అప్ప చెప్పాకదా అని సంబర పడ్డాను .ఆయన నన్ను మళ్ళీ వెర్రివాడుగా చూస్తూ ‘’ఈ సంగతి కనిపెట్టటానికి వారం రోజులు పట్టిందిరా సన్నాసీ!అనిఅనగా నా గూబ గు౦యి మన్నట్లయింది .అయితేనేం ఈ శబ్ద వ్యాపారం పరమ మనోహరంగా ఉంది ‘’అన్నారు మాస్టారు .
రిపార్టీలు రెండు రకాలు. ఒకసారి మనది అండర్ హాండ్ అవుతుంది దీన్ని డేరగోటరి రిపార్టీ అంటారు .మరోసారి మనదే పై చేయి అవుతుంది అప్పుడు దాన్ని కా౦ప్లి మెంటరి రిపార్టీ అంటారని మాస్టారు భాష్యం చెప్పారు .దీనికీ తనే ఉదాహరణ అంటూ ‘’హెడ్ మాస్టర్ కావాలని నాకు మహా ఉబలాటంగా ఉండేది .ఒక ప్రకటన చూసి మంగళగిరి జిల్లా పరిషత్ కు ఇంటర్వ్యు కు వెళ్లాను .ఏదో నామమాత్రపు ఇంటర్వ్యు .తమవాడికెవడికో దాన్ని కట్టబెట్టాలని కమిటీ ఆల్రేడి ననిర్ణ యించిందట .రోట్లో తలపెట్టాగా ?.వెళ్లి కమిటీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నా ..అది వాళ్లకు అవిధేయతగా తోచింది. నన్ను ఏడిపించాలనుకొన్నారు పరిషత్ అధ్యక్షుడు ముఖం చిట్లించి ‘’ఆకథలూ కాకరకాయలు రాసేవాడివి నువ్వేనన్నమాట ‘’అన్నాడు అవును అన్నాను .’’కథలు గీకేవాడివి హెడ్ మాస్టర్ గా ఎలా పనికొస్తావ్ ‘’అన్నాడు .నేను తలవంచుకొని అతి వినయంగా ‘’మాస్టారు గా పనికి రానని నాకూ తెలుసు కనీసం హెడ్ మాస్టర్ గానైనా పనికొస్తానని –అనీ ‘’అంటూ నసిగాను .ఇందులోనాదే పైచెయ్యి అయింది చివరికి .వాళ్ళ అహం దెబ్బతిని షాక్ అయ్యారు ‘’వెళ్ళండి మీ సంగతి మాకెందుకు?’అంటే ,’’’నేనూ అదే అనుకొన్నాను’’అంటే .మీ సంగతి నాకూ తెలుసు ‘’అంటూ బయటికి వచ్చేశాను .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-22-ఉయ్యూరు .

Posted in రచనలు | Tagged | Leave a comment