అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి
—
చేబ్రోలు సరస్వతీదేవి
జననం [[]] 1900
పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా
నివాస ప్రాంతం నీలగిరి
భార్య / భర్త చేబ్రోలు రాజగోపాలం
తండ్రి రాజగోపాలనాయుడు
కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.
ఈమె భర్త నూజివీడు జమీందారైన రాజా గోపాలమనాయుడు. ఈమెకు ముగ్గురు కుమారులు.
సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు.
ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసింది.
సాహిత్యకృషి
సరస్వతీ రామాయణము
శ్రీ సరస్వతీశతకము
సత్యనారాయణ వ్రతకల్పము
ఆత్మోపదేశము
పతివ్రతాశతకము
పురస్కారాలు
గృహలక్ష్మి స్వర్ణకంకణం (1939)
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,213,564 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసు శ్రీరాములు గారి ‘’ఉత్తరరామ చరిత ‘’పరిచయం
- మధ్యయుగపు ఒక సాధువు(త్రివేణి)
- వాస్తవికవాద స్ఫూర్తి(త్రివేణి)
- దీపావళి అంటే టపాసులే కాదు –రేడియో ప్రసంగం 08.11.2026 -7:30AM ఆకాశవాణి విజయవాడ
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక రచయిత శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర-4
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,637)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు






