త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )
1930లో హనుమంతరావు గారు కొండా వెంకతప్పయ్యగారి ఇంటి ఆవరణలో ఉప్పు సత్యాగ్రహం చేశారు .ఆరోజు అరెస్ట్ చేయలేదు .తర్వాత ఏడుగురితో కలిసి నమ్బూరుదగ్గర కంతేరు గ్రామం వెళ్లి ,తాటిచెట్ల కున్న కల్లు లోట్టెలు పగుల గొట్టింఛి నందుకు అరెస్ట్ చేసి ,మంగళగిరి సబ్ జైలులో పెట్టారు .తర్వాత విచారించి 9నెలలు కఠిన శిక్ష వేశారు ..తర్వాత రాజమండ్రి జైలుకు ,తర్వాత ఒకనెలకు మద్రాస్ రెసిడెన్సి కి మార్చారు .ఇక్కడ రెండు నెలలున్నారు .తర్వాత బిక్లాస్ కు మార్చి రాయవెల్లూరు జైలుకు పంపగా అక్కడే శిక్షాకాలం పూర్తీ చేసుకొన్నారు .వెల్లూరు జైలులో కాలం హాయిగా గడిచింది .నిత్య గ్రంధ పఠనం,సాయంత్రం షికారు .షికారులో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మామగారు శ్రీ పురాణం సూరి శాస్స్త్రి గారితో మంచి కాలక్షేపం .ఆయన శాస్త్ర విషయాలను సైంటిఫిక్ గా రుజువు చేసేవారు
శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ,కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరు కృష్ణారావు ,శ్రీ రాజాజీ ,బెజవాడ గోపాల రెడ్డి గార్లు అదే జైలులో ఉండేవారు .అందరి వద్దా అనేక పుస్తకాలు ఉండేవి .రావు గారి వారిని అడిగి తీసుకొని చదివి తిరిగి ఇచ్చేవారు .ద్విజేంద్ర లాల్ రాయ్ రాసిన హిందీ నాటకాలు చదివారు. రెడ్డి పిచ్చయ్యగారికి రోజూ భాగవతం చదివి వినిపించేవారు రావుజీ .శ్రీరామ కృష్ణ పరమహంస గారి గ్రంథాలన్నీ చదివారు .
జైలు నుంచి విడుదలయ్యాక రావు గారికి పుట్టిన మగపిల్లాడికి’’రామ కృష్ణ ‘’పేరుపెట్టుకున్నారు భక్తిగా ,.తర్వాత ఆడపిల్ల .హిందీ విశారద పాసై మేనల్లడిని పెళ్ళాడి ,పది నెలలు కాపురం చేసి స్ఫోటకం తో జాల్నాలో చనిపోయింది రెండవ ఆడపిల్ల .1931లో పెద్దకొడుకు 1936లో మూడో ఆడపిల్ల పుట్టారు .యితడు ఎల్సియిపాసై తెనాలిలో ఉద్యోగిస్తున్నాడు .రెందోకొడుకు 1935లో మూడో వాడు 1942లో జన్మించారు .అందరికి వివాహాలు చేసి మనవళ్ళతో మనవరాళ్ళతో హాయిగా ఉన్నారు .
ఉప్పు సత్యాగ్రహం లో జైలుకు వెళ్ళినప్పుడు కృష్ణాశ్రమం బాధ్యత శ్రీ వింజమూరి భావనాచార్యులకు రావుగారు అప్పగించారు .ఆయన వృద్ధాప్యం వలన సరిగ్గా నిర్వహించలేక ఒక క్రిష్టియన్ ఉపాధ్యాయు డికిఅప్పగించగా ,జైలు నుంచి వచ్చి ఆయన్ను తొలగించటానికి రావు గారు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది .పరిశ్రమలు ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించటానికి కొన్న ఇనుపస్తంబాలు రేకులు అన్నీ అమ్మి ఆచార్యులు అప్పులన్నీ తీర్చేశారు .జైల్లో ఉన్నప్పుడు తానూ చదివిన టాల్ ష్టాయ్ నవల ‘’వాట్ దెన్ మస్ట్ వుయ్ డు’’లో చెప్పబడిన పంటలను పండించే వారికంటే దాన్ని అనుభవించే వారు ఎక్కువైపోవటం వలన ఆభారం అంతా రైతే భరించాల్సి వస్తోంది ,కాళ్ళూ చేతులు పని చేసే వారంతా రోజుకు కనీసం మూడు గంటలు పని చేస్తే లోకం లో దరిద్రం ఉండదు .అందరూ కూడూ గూడూ లభించి సుఖంగా ఉంటారు అనే సిద్ధాంతం రావు గారికి బాగా నచ్చి,పల్లెటూరి వ్యవసాయం చేయాలని కోరికకలిగి నౌలూరులో ఉన్న భూమిలో చాలాభాగం కరిగిపోగా ,ప్రాతూరులో పినతల్లి ఇచ్చిన పొలం సాగు చేయాలనుకొని ఆమెకు చెబితే అంగీకరించలేదు .
శ్రీకొండా వారు ,శ్రీ కోట లక్ష్మయ్య గారికుమారుడు శ్రీ వెంకటేశ్వర్లు శ్రీ మద్ది వెంకట రంగయ్యగార్లతో ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసి కార్యదర్శి పదవికి రాజీనామా చేసి రావుగారు కృష్ణాశ్రం ను వారికి అప్పగించారు ,రాజీనామా చేయవద్దని అందరూ ఎంత బలవంత పెట్టినా రావుగారు అంగీకరించలేదు .తానూ నెత్తిమీదకు తెచ్చిపెట్టుకొన్న శివశంకర శాస్త్రి గారు చేసిన అల్లరి చాలా బాధించింది .ట్రస్ట్ బోర్డ్ రావు గారి రాజీనామాను అత్యంత బాధాకరంగా అంగీకరించింది .తాను గుంటూరులో కట్టుకొన్న ఇంటిని కూడా అమ్మేసి అప్పులన్నీ తీర్చి ఆశ్రమం తో సంబంధం పూర్తిగా తెన్చేసుకొని 1936వరకు గుంటూరులోనే ఉన్నారు .
మద్ది వారి ఆధ్వర్యం లో ఆశ్రమం లో వడ్రంగం ఇనుపపనులు సిమెంట్ పనులు నేర్పే పారిశ్రామిక పాథశాలగా దాన్ని మార్చారు .ఆయన చనిపోయాక ఎం ఎల్ సి అయిన శ్రీ మద్ది సుదర్శనం గారి ఆధ్వర్యం లో నడుస్తోంది .హరిజన నాయకులను తయారు చేసిన సంస్థ ,ఆశ్రమం లో తయారైన పరికరాల అమ్మకాల వలన విపరీతమైన లాభాలు గడించింది .ఆశ్రమం వదలవద్దని వెంకటప్పయ్య పంతులు గారు ఎంత చెప్పినా రావు గారు వినలేదు .ఆ రోజుల్లో ఆశ్రమం లో చదువుకొన్నవారు చాలా చోట్ల హరిజన హాస్టల్స్ స్థాపించి నిర్వహించారు కొందరు నాయకులై,సంఘ సేవకులై డాక్టర్లు నర్సులు ఉపాధ్యాయులై వెలిగారు .ఒకతను కర్ణాటకలో కలెక్టర్ అయ్యాడు .ఒకాయన అసెంబ్లీలో ,మరొకాయన పార్లమెంట్ లో సభ్యులయ్యారు .
1937లో పినతల్లి అంగీకరించగా రావుగారు ప్రాతూరులో వ్యవసాయం చేశారు .ఖర్చు బారెడు ఆదాయం మూరెడు గా నష్టాలోచ్చాయి రెండేళ్ళు అలాగే గడిపారు .తనకు ఏదైనా పని ఇమ్మని అఖిలభారత హరిజన సేవా సంస్థకు రాశారు .బెజవాడలో శ్రీ వేములకూర్మయ్యగారు నడుపుతున్న హరిజన బాలిక హాస్టల్ బాధ్యత వదులు కొంటున్నందున దాన్ని నడిపే బాధ్యతా తీసుకోమని రావుగారికి ఆర్డర్ పంపారు .1939లో కాపురం బెజవాడకు మార్చారు .కూర్మయ్యగారు హాస్టల్ అప్పగించటం లేదు .ఈ విషయం పైకి తెలియజేస్తే నెల్లూరు వెళ్లి చేరమని ఆర్డర్ పంపగా ,1940లో నెల్లూరు వెళ్ళారు .నెల్లూరు టౌనులో బాలుర హాస్టలు ,బాలికల హాస్టలు బుచ్చిరెడ్డిపాలెం లో ఒకటి కందుకూరులో ఒకటి హాస్టల్స్ ఉన్నాయి .కాపురం పెట్టి వీటి అజమాయిషీ చేస్తూ ఒక ఏడాది గడిపారు హనుమంతరాగారు .
ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సి 1941లో బెజవాడ వచ్చేశారు .రెండేళ్లలో ఇద్దరి పెళ్ళిళ్ళు చేశారు .ఇందులో పెద్దపిల్ల పెళ్లి అయిన కొన్నిరోజులకే స్ఫోటకం తో చనిపోయింది. రెండో అమ్మాయి సిరిసంపదలతో గుంటూరులో సుఖంగా కాపురం చేసుకొంటోంది .1942లో ఈయనమిత్రుడు సంపత్ విధ్వంసక ఉద్యమానికి నాయకత్వం వహించి ఉత్తర భారతమంతా తిరిగి ప్రచారం చేస్తూ పోలీసుల కళ్ళుకప్పి తిరుగుతూ ఒక సారి రావుగారికి ఒక ఉత్తరం రాసి ‘’కొండపల్లి రైల్వే స్టేషన్ లో నా సామాను ఉంది మీరు తీసుకురండి ‘’అని చెప్పాడు .కొండపల్లి సత్రం లో దిగగా అక్కడ గంజాయి పీల్చే సాదువుకనిపించి రావు గారిపేరు చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే ,వచ్చి అరెస్ట్ చేసి గదికి తాళం వేసి రైలులో బెజవాడ తీసుకు వెళ్ళారు రాత్రి ఏడున్నరకు .సంపత్ వివరాలు అడిగారు తనకు తెలీదన్నారు .పోలీసులు ఒక ఇంటి కి తీసుకువెళ్ళి తలుపు తట్టగా లోపల నుంచి సంపత్ రాగా అరెస్ట్ చేసి గవర్నర్ పెట్ పోలీస్స్టేషన్ సెల్ లో పెట్టారు .అది దుర్వాసనతో భరించరాని కంపుతో ఉంది .తెల్లార్లూ ముక్కుమూసుకొని గడిపారు రావుగారూ మిత్రుడూ .ఉదయం కాల కృత్యాల తర్వాత సి ఐడి ఇన్స్పెక్టర్ దామరాజు వెంకటేశ్వరావు వచ్చి కావాల్సిన ముద్దాయి దొరికాడుకనుక ముసలాయన తో మనకేం పని వదిలెయ్యండి అని రావుగారి ని వదిలేశారు .
1948లో బెజవాడ పట్టాభి గారికి సంబంధమున్న ‘’జన్మభూమి ‘’దినపత్రిక స్థాపించారు .మోచర్ల కృష్ణమూర్తిగారు ,చిత్తర్వునాగేశ్వర రావు గారు దీన్ని నిర్వహించేవారు .పట్టాభి గారి రికమండేషన్ వలన అందులో సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది .నెలకు వంద జీతం రెండేళ్ళు పని చేశారు .పత్రిక ఆగిపోగా ,ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అవతారం కూడా ఎత్తి1955వరకు లాగారు .హరిజన సేవకు చేసిన సేవను గుర్తించి గాంధీ స్మారకనిది వారు రావు గారికి నెలకు 75రూపాయల ఆర్ధిక సాయం గ్రాంట్ చేశారు .1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్లదగ్గర మూరకం పాడులో రాజకీయ బాధితుడికి దేశ సేవకు గుర్తింపుగా 5ఎకరాల భూమి ఇస్తే సాగు చేయటానికి బాపట్లలో కాపురం పెట్టి మూడేళ్ళు సాగు చేసి ఫలితం అనుభవించారు 1961లో దాన్ని మంచి ధరకు అమ్మేసి,ప్రాతూరులో ఆ డబ్బుతో ఆరున్నర ఎకరాల మెట్ట భూమి కొని ,పినతల్లి ఇచ్చింది కూడా కలిపి మొత్తం 8ఎకరాలు సాగు చేస్తూ ,ప్రాతూరులోనే పిల్లా జెల్లా తో సుఖంగా గడుపుతున్నారు .
నిరంతర గ్రంధపఠనం ,భవత్ చింతన తో కాలక్షేపం చేశారు .తన కుటుంబానికీ బాదితులకూ ప్రకృతి వైద్యం చేస్తూ వ్యాధులను నివారించారు .45 ఏళ్ల రావు గారమ్మాయి ఋతుస్రావం వలన కడుపులో గుల్మం ఏర్పడి ,మధుమేహంకూడా రాగా ఆహార నియమాలతో ప్రకృతి వైద్యంతో నయం చేశారు. కేన్సర్ క్షయ బిపి నపు౦స కత్వాలను కూడా ఈ చికిత్సతో నయం చేసి ఎందరికో దేవుడు అనిపించుకొన్నారు .ఉప్పు సత్యాగ్రహం లోపాల్గొని జైలుపాలైనందుకు రావుగారికి భారత ప్రభుత్వం తామ్రపత్రం తోపాటు నెలకు 200 ఫించన్ 1972ఆగస్ట్ 15నుంచి ఇచ్చారు .86ఏళ్ల వయసులోనూ త్యాగధనులు శ్రీనల్లపాటి హనుమంతరావు గారు ఆరోగ్యంగా ప్రశాంతంగా సుఖంగా ఉన్నారు .
ఆధారం –శ్రీ నల్లపాటి హనుమంతరావు గారి స్వీయ చరిత్ర
సమాప్తం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

   మ మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11

     మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11

11-సంగీత నటనా దర్శక దిగ్దేశకులు –శ్రీ  దైతా గోపాలం

కృష్ణా జిల్లా ఆంద్ర మహా విష్ణు క్షేత్రమైన శ్రీకాకుళం లో  పాపనాశనం అనే శివారు గ్రామం లో దైతా వెంకటాచలం ,అన్నపూర్ణమ్మ దంపతులకు దైతా గోపాలం 1900లో జన్మించారు .అక్కడ ప్రదర్శించే కూచి పూడి వారి యక్షగానాలను బాల్యం నుంచి చూసి మోజు పెంచుకొన్నారు .జన్మతహా  మధుర గాత్రం ,విచక్షణా శక్తి ఉన్నాయి .చిన్న చిన్నమాటలతో నాటకం రాసి తోటి పిల్లల చేత నటిమ్పజేస్తూ తానూ నటించి ఒక నాటకం ప్రదర్శించారు .ఇది తెలిసిన తండ్రి బడితే పూజ చేశారు .ఈయన మేనమామ సత్యనారాయణ ఇదే ఈడు వాడు .తమకలాపిపసకు పెద్దలు అడ్డు తగులుతున్నారని మామా అల్లుళ్ళు భావించి తమ తృష్ణ తీర్చేది బెజవాడ అని అక్కడికి చేరారు .ఆకాలం లో మైలవరం జమీందారు ఆధ్వర్యం లో మైలవరం నాటక సమాజం దిగ్విజయంగా నడుస్తోంది .అందులో శ్రీ యడవల్లి సూర్యనారాయణ ,శ్రీ ఉప్పులూరి సంజీవరావు ,శ్రీ గురజ నాయుడు మొదలైన ప్రముఖ నటులు ఉండేవారు .కవి శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి .సంగీత దర్శకులు శ్రీ బాపట్ల కాంతయ్య .ఈ సమాజం లో చిన్న చిన్న పాత్రలకు అవకాశం వచ్చింది గోపాలం గారికి .

 దీనితో నాటకానుభవం కలిగి శకుంతల నాటకం లో శిష్యుని పాత్ర వేశారు .తరువాత పాదుకా పట్టాభిషేకం లో భరతుడు గా నటింఛి అమోఘమైన నటనతో జనామోదం పొందారు .శ్రీ మల్లాది అచ్యుతరామ శాస్త్రి గారు రచించిన ద్రౌపదీ వస్త్రాపహరణం లో విదుర పాత్ర ధరించి వాచకం అభినయంలతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశారు .ఆయన విదుర నీతులు చెబుతుంటే కలా ,నిజమా ఆయన మానవ మాత్రుడా లేక నిజంగానే విదురుడు దిగివచ్చి బోధిస్తున్నాడా అని ప్రేక్షకులు అబ్బుర పడేవారు .అక్రూర పాత్ర ధారణా చేసి  సెహబాస్ అనిపించుకొన్నారు .అంటే సాత్విక పాత్రలను నటించటం లో ఆయన మేటి నటులు .రంగస్థలం మీద బయట ఇతర  వ్యవహారాల్లో కూడా గోపాలం పరమ సాధువులుగా ఉండేవారు కనుక పాత్రలు పండేవి .ఈ సమాజం ఆర్ధిక చిక్కుల్లో పడి చెల్లా చెదరైంది .

  అచ్యుతరామ శాస్త్రిగారు అప్పుడే సక్కుబాయి నాటకం రాసి దైతావారి కళాభి రుచి గుర్తించి ఆయనకు  ఇచ్చారు .శాస్త్రిగారికి కృతజ్ఞత తోకొంత డబ్బు అందజేసి,నాటకం సర్వహక్కులూ పొందారు .జొన్న విత్తుల శేషగిరిరావు , జొన్న విత్తులసత్యనారాణ ,తు౦గలచలపతిరావు,సూరవరపు వెంకటేశ్వరరావు మొదలైనవారితోకలిసి తానె ఒక కొత్త నాటక సమాజాన్ని స్థాపించి తనకున్న సంగీతానుభావంతో ఆ నాటకానికి కీర్తనలు ,స్వయంగా రాశారు .ఒక ఏడాది పాటు నటులను తీర్చి దిద్ది ప్రదర్శించారు .కీర్తనలు  నటుల హావభావాలు రసజ్ఞలోకాన్ని ఉర్రూత లూగించాయి. ఈ ట్రూప్ తో ఆంద్ర దేశం లో వందలాది సక్కుబాయి నాటక ప్రదర్శనలు నిర్వహించారు .సుప్రసిద్ధ సంగీత దర్శకుడుశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి సక్కుబాయిపాత్రను నేర్పి నటి౦పజేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు .గోపాలం గారు ఈ నాటకం లో పాడిన – విష్ణు పాదాన జన్మించి ,కమనీయ భూమి భాగములు అనే రెండు పద్యాలూ ఆయన గానం చేసిన తీరు అత్యద్భుతం అనిపిస్తాయి ,

కొంతకాలాని సమాజ సభ్యులమధ్య కలతలు ఏర్పడటం తో సమాజం మూత పడింది  .

   పట్టు వీడని విక్రమార్కునిలా సమాజ పునరుద్ధరణకు ప్రయత్నించినా ఫలించక అప్పుల ఊబిలో కూరుకుపోయారు .ఎందఱో పండితుల  కీర్తనలకు దైతా గోపాలం గారు స్వర కల్పనా చేసి అందించారు .ఎందరెందరో నటులకు పద్యాలు అర్ధ భావ యుక్తంగా పలకటం లో  శిక్షణ ఇచ్చారు ,. అమరగాయకులు ఘంటసాల ,మహానటుడు అక్కినేని వంటి అగ్రశ్రేణిసంగీత దర్శకులు ,నటులు దైతా గోపాలంగారిని సంప్రదించి సలహాలు సూచనలు పొందేవారు .

ఆంద్ర నాటక సంస్కృతిని విస్తృత పరచిన గోపాలంగారు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారి నాటకం ఆధారంగా సి.పుల్లయ్య గారి దర్శకత్వం లో1939లో  వచ్చిన   వరవిక్రయం సినిమాలో  నటించారు.దీనిలో భానుమతి శ్రీరంజని ,పుష్పవల్లి ,బలిజేపల్లి లక్ష్మీ కా౦తకవి గార్లతోపాటు తమసహచర నటులు కొచ్చర్లకోట సత్యనారాయణ ,దాసరి కోటిరత్నం ,తుంగల చలపతి రావులు కూడా నటించారు .  

శ్రీ రాజ రాజేశ్వరి ఫిలిం కంపెని అధినేత శ్రీ కడారు నాగ భూషణం గారి ఆదరణపొంది,ఆ సంస్థ 1941లో నిర్మించిన సతీ సుమతి 1954లో నిర్మించిన సక్కుబాయి ,1955లో నిర్మించిన శ్రీ కృష్ణ తులాభారం చిత్రాలకు రచయితగా  పని చేసి తన పాండిత్యాన్ని ,రచనా పాటవాన్ని చూపించి అప్రతిభులను చేశారు .సతీసుమతి చిత్రానికి గోపాలం గారు రాసిన ‘’నిన్న సాయంత్రము ‘’అనే పాట గొప్ప పేరు తెచ్చింది.కాశీనాథ్ ప్రొడక్షన్స్ బానర్ పై 1958 శ్రీ ఎన్ ఎస్ ఆచార్య దర్శకత్వం లో అమరనాథ్ ,శ్రీరంజని, మీనాకుమారి నటులుగా  నిర్మించిన శ్రీ రామాంజనేయ యుద్ధం లో దైతా గోపాలం గారు ,తాండ్ర సుబ్రహ్మణ్యం ,ఎస్ విఎన్ ఆచార్య పాటలు రాయగా ,శ్రీ జంధ్యాల సంగీతం సమకూర్చారు .ఇదే గోపాలం గారి చివరి సినిమా .దీనిలో సుప్రసిద్ధ రేడియో గాయకుడు శ్రీ మల్లిక్ –స్వామి తోడనా సంగ్రామంఅనే గీతాన్నీ , ,భండన భీము డార్తజన బాంధవ అనే భక్త రామదాసుగారి పద్యాన్ని పాడారు .

  1958లో రచయిత, నటుడు ,గీతరచయిత  మహా శిక్షణా నిపుణుడు ,సంగీతం మెళకువలు ఎందరికో తెలియజెప్పిన శ్రీ దైతాగోపాలంగారు అస్తమించారు .ఈతరం వారికి వారి గురించి ఏమాత్రమూ తెలియదనే, వారి గురి౦చి ఈ  చిరు పరిచయం

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-22-ఉయ్యూరు .

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-6

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-6 శ్రీ హనుమంతరావు గారు నిర్మించిన కృష్ణాశ్రమం నిర్వహణ కోసం ఎందఱో దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక ఆర్ధికేతర సహాయ సహకారాలు అందించారు .జిల్లాలేబర్ ఆఫీసర్ సి౦గారు వేలు మొదలియార్,మేనేజర్ భాగవతుల అన్నప్ప శాస్త్రి చేదోడు వాదోడుగా నిలిచారు .పొగాకు వ్యాపారి శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు ‘’డబ్బులకు ఇబ్బంది పడవద్దు ఎప్పుడు ఎంతకావాలంటే అంతా ఇస్తాను తీసుకు వెళ్లి ఖర్చుచేయండి మీ గ్రాంట్ రాగానే ఇచ్చేయండి ‘’.అన్నారు గుంటూరులో స్థలం కోసం మూడు వేలరూపాయలు అప్పుగా ఇస్తూ వడ్డీ వద్దని అసలు ఇస్తే చాలని చెప్పారు .ఈ డబ్బు తీర్చగలనో లేనో అనే భయం తో రావుగారు గుంటూరులో కొన్న 5ఎకరాల భూమి ,పెదపాలెం లో బిల్డింగ్ తో సహా ఒక యకరం భూమి,ఆయన పేర తాకట్టు దాస్తా వేజు రాయించి ,క్రయ ,తాకట్టు దస్తావేజులు ఒకే రోజున రిజిస్టర్ చేయించారు రావు జీ .అదీ నిబద్ధత అంటే . లక్ష్మయ్య నాయుడు గారి వద్ద తీసుకొన్న మూడు వేలకు ,అప్పుగా తీసుకొన్న వెయ్యి కలిపి గుంటూరు జూట్ మిల్ దగ్గర అయిదెకరాల పొలం కొన్నారు రావు గారు .మంచి ఉత్సాహం ,ఊపుతో విద్యాలయం ఆశ్రమం నడుపుతున్నారు .శ్రీ కొండా వెంకటప్పయ్య గారు తిలక్ స్వరాజ్య నిధి నుంచి 5వేలుఇవ్వగా ,ఆశ్రమంలో భవనం కట్టటానికి ఖర్చుపెట్టగా ఒక వెయ్యి మాత్రమె మగిలితే ఆశ్రమం ఖాతాలో జమ చేశారు రావు గారూత్తరాది యాత్రకు వెళ్లి ఢిల్లీలో స్వామి శ్రీ శ్రద్ధానందస్వామి స్థాపించిన ‘’కాంగ్రీ గురుకులం ‘’దర్శించి వారితో హరిజనోద్ధరణ ఉద్యమం గురించి మాట్లాడారు .పూనాలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారిని ఇంటి వద్దనే కలవటానికి వెడితేతే, ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తున్న లాలాలజపతి రాయ్ గారిని ఆహ్వానించటానికి బొంబాయి వెళ్ళినట్లు తెలిసి ,వారి మేనల్లుడు అన్ని రకాల సదుపాయాలూ కలిపించినా అక్కడే ఉన్న విశాల ఆవరణలోవేరే వంటచేసుకొని తిన్నారు. అక్కడే కేసరి ,మరాటా పత్రికలూ ముద్రి౦చబడుతాయి. తిలక్ స్వంత లైబ్రరీలో కొన్ని వేల ఇంగ్లీష్ ,సంస్కృత గ్రందాలున్నాయి .తిలక్ రాగానే వారి౦ ట్లోనే భోజన ఏర్పాటు చేశారు .పైన డాబా లో విశ్రాంతి తీసుకొనే గదికి వెళ్లి తిలక్ గారిని కలిసి రావు గారు మాట్లాడారు .అంటరాని తనం నిర్మూలించటానికి మార్గం ఏమిటి అని ప్రశ్నించారు ‘’హరిజనులు బాగుపడాలి అంటే వారికోసం వారున్న చోట్ల అగ్రకులాల వారు స్వచ్చందంగా గుడులు కట్టి తరచుగా తాము వెళ్లి దర్శిస్తూ ,ఆతర్వాత వారినికూడా మామూలు దేవాలయలకు ఆహ్వానించి దర్శనం కల్గిస్తే అంటరానితనం క్రమంగా మాయమవుతుంది ‘’అని చెప్పారు తిలక్.తిలక్ గారికి వచ్చిన బహుమతుఅలన్నీ ప్రదర్శనగా ఏర్పాటు చేయగా రావు గారు చూసి ధన్యతచెందారు .అప్పటికే ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నది ..మర్నాడు పూనాలో బంగ్లాలో ఉండటానికి బయల్దేరారు ఒకరిద్దరు పట్టుకొని ఎక్కిస్తే కాని బండీ ఎక్క లేక పోయారు .ఆతర్వాతకొన్ని నెలలకే తిలక్ అమరులయ్యారు . 1921లో రావు గారు దక్షిణాది వెళ్ళినప్పుడు శ్రీ అరవి౦దులను దర్శించారు .’’పూర్ణయోగం మీరుకని పెట్టిందా ?లేక పూర్వం నుంచీ ఉన్నదా ?’’అని అడిగితె ‘’పూర్వ గ్రంథాలనుంచి తీసుకొన్నదే ‘’అన్నారు అరవి౦ద యోగి .అంతటి మేధావితో తానేమి మాట్లాడగలను అనుకొన్నారు రావుజీ . 1922లో రావుగారి భార్య కాపురానికి వచ్చారు .తర్వాత కొన్ని నెలలకే తండ్రికి నంజు వ్యాధి వచ్చి ,మంచం దిగలేని స్థితి దీనితో అతిసారం పట్టుకొన్నది . ఎక్కడికీ వెళ్ళకుండా ఆయన సేవలోనే రావు గారు ఉండిపోయేవారు మలమూత్రాలను తీయటం పక్క మార్చటం అన్నీ యధావిధిగా చేసేవారు రోజూ వేడి నీటి స్నానం చేయించి ,తెల్ల వస్త్రాలు కట్టి ,సాంబ్రాణి పొగ వేసి మంచం పై పడుకోబెట్టేవారు ఆయన ఏది తి౦టానంటే దాన్ని వండించి పెట్టేవారు ఈ సీవకు పరవశుడై తండ్రి ‘’నాయనా !నేను పుడితే నీకు కొడుకుగానే పుడతానురా ‘’అనేవారు ఆ మాటకు ఒకప్రక్క ఆనందం మరోపక్క బాధ కలిగేవి రావుగారికి ‘’నాన్నా !నువ్వు నాకు లక్ష రూపాయల ఆస్తి ఇచ్చినా ఇంత సంతోషం కలిగేది కాదు ‘’అంటూ ఆనంద బాష్పాలు రాల్చేవారు రావుగారు .కొద్దిరోజులకే తండ్రి చనిపోయారు .రావు గారు హరిజనులతో కలిసి తిరుగుతున్నందు వలన ఆయన శవాన్ని మోయటానికి ,మంత్రం చెప్పటానికి బ్రాహ్మణులు ఎవరూ రాలేదు కొలకలూరి లోని మేనమామలు వచ్చి అన్నీ నిర్వర్తించారు .అయితే ఆఊరి బ్రాహ్మణ్యాన్ని ఎదిర్చి తండ్రి గారి ప్రాణమిత్రుడైనబ్రాహ్మణుడు వచ్చి నిలబడి కర్మకాండ ,ఉత్తరక్రియలు జరిపించాడు .గోదాన ,అన్నదానాలు యధా విధిగా జరిపించాడు. తండ్రి అనారోగ్యం లోనే ఉన్నప్పుడు ఒకరోజు కొడుకుతో ‘’నాయనా !నేను ఇంకా బతుకుతానా ?గుడి కట్టిస్తానా ?’’అన్నారు ఆయన పుణ్యకార్యాలు చేయలేక పోయాననే బాధలో ఉన్నారని రావు గ్రహించారు తండ్రిగారు పోయాక భార్యతో పెదపాలెం లో కాపురం పెట్టారు రావుగారు ..నౌలూరు నుంచి వచ్చే అయివేజు ఏమాత్రం చాలేదికాదు .ఆశ్రమం నుంచి డబ్బు తీసుకోవటం ఇష్టం లేదు అ సమయం లోశ్రీ పుతు౦బాక కృష్ణయ్య గారు ఏలోటూ రాకుండా చూసుకొన్నారు . ఆశ్రమం నుంచి ప్రతిఫలం తీసుకోవచ్చా అని కొండా వారినిఅడిగితే ‘’తప్పేమీ లేదు ‘’అని చెప్పారు .అప్పటి నుంచి నెలకు కుటుంబం లోని పెద్దలకు 15చొప్పున ,పిల్లలకు 5రూపాయలచోప్పున గౌరవ వేతనం –ఆనరోరియం తీసుకొనేవారు . శ్రీ వింజమూరి పార్ధ సారధి గుంటూరు నుంచి కృష్ణాశ్రమం చూడటానికి వచ్చి ఆ విశేషాలు భారతి మాసపత్రిక లో రాశారు . ‘’హనుమంతరావు గారి ఆహ్వానం అందుకొని ఆశ్రమం చూడటానికి వెళ్లాను రేవేంద్ర పాడు పోయే బకింగ్ హాం కాలువ చేరి బల్లకట్టు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరాను .బల్లకట్టు దిగుతూనే వెనకనుంచి ఎవరో ‘’తాకుతా వయ్యా నీ ఇల్లు బంగారం కానూ ‘’అన్నాడు .’’ఏం తాకితే ?’’అన్నాను .’’ఓహో స్వదేశపు మనుసులు గామాలే ‘’అంటూ వికటంగా నవ్వాడు ..పంచముల దౌర్భాగ్యస్థితి చూసి గుండెలో గునపం గుచ్చినట్లనిపించి కన్నీరు తన్నుకొచ్చింది .గబగబా నడిచి పెదపాలెం వెడుతున్నాను .మొహం నిండా విభూతి పెండి కట్లు తో ఏవో మంత్రాలు చదువుకొంటూ వెళ్ళే ఒక బ్రాహ్మణుడు నా వైపు చూసి తమరిదేవూరు ?’’అంటే ‘’గుంటూరుకాపురం ‘’అనగా ‘’ఎక్కడికి ?’’అంటే ‘’పెదపాలెం ‘’అనగా ,’’మాల వాళ్లకు బ్రాహ్మలు చదువు చెప్పెచోటికా ?’’అనగా ‘’ఔను అక్కడికే ‘’అనగా కాసేపాగి ‘’వినాశకాలే విపరీత బుద్ధి ‘’అని చివర విసర్గ లేకుండా అని ‘’మాల వాళ్లకు బ్రాహ్మలు చదువు చెప్పటం ఏమిటి మీదుమిక్కిలి వాళ్ళను తాకటం .ఎంతటి దురవస్థ పట్టిందండీ మనకులగోత్రాలకు ?’’అని వాపోయాడు . ‘’తరతరాలనుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పుడు మార్చాలంటే శ్రోత్రియ బ్రాహ్మణులు వేదాలే తప్ప వేరేదీ శరణ్యం లేదనే వాళ్ళు ఎలావొప్పుకొంటారు ?’’అన్నాను నేను .ఆయన ‘’వేదాలలో అక్కడా అక్కడా చండాలురుఅంటే బ్రాహ్మణ స్త్రీకి శూద్రుని వలన పుట్టినవారు అని ఉంది వాళ్ళే అంటరాని వాళ్ళు .ఈ దోషానికి పరిహారం కూడా శృతి స్మృతులలో ఉన్నాయి .’’అన్నాడు నేను ‘’వేదాల్లో పంచములను పెర్కొన్నారా ?మన విప్రచరిత్ర అంతా ఈ రంకు మీదే ఆధార పడింది కదా ‘’అన్నాను .??ఇంకా చాలా చెప్పారు పార్ధసారదిగారు ఆవివరాలు రేపు తెలుసుకొందాం . సశేషం 2022 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-1-2022-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10 10- –మొట్ట మొదటి డైలాగ్ కింగ్,స్టేజి స్టార్ -శ్రీ వేమూరి గగ్గయ్య వేమూరి గగ్గయ్య (1895 ఆగష్టు 15 – 1955 డిసెంబర్ 30) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందారు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు[1]. సావిత్రి (1933) సినిమాతో రంగప్రవేశం చేసి శ్రీకృష్ణలీలలు, ద్రౌపదీ వస్త్రాపహరణం తదితర సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ధరించి ప్రసిద్ధి పొందారు. గగ్గయ్య కంఠం, ప్రతినాయక పాత్రల్లో నటన తెలుగు ప్రేక్షకులపై గాఢమైన ముద్రవేసింది. బాల్యం, నాటక రంగం ఇతను 15 ఆగష్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం – నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగాడు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు ఉండి నాటకాలు ప్రదర్శించారు. తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్య నటనాశక్తిని గుర్తించి బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు. కంఠానికి పదునుపట్టి, తారాస్థాయిలో పద్యం చదవడం అలవాటు చేసుకున్నారు. మైకులూ, స్పీకర్లూ అన్నవి ఎరగని రోజులు గనక, పాత్రధారులందరూ గట్టిగా పద్యాలు చదవడం, సంభాషణలు చెప్పడం ఉండేది. అటువంటి రోజుల్లోనూ నటులందరిలోనూ గగ్గయ్య గాత్రం మాత్రం ఎంత దూరానికో వినిపించేది. ప్రతినాయక పాత్ర అభినయించడం ఆరంభించిన దగ్గర్నుంచి ఆ పాత్రధారణకు అతనే సాటి అన్న పేరు తెచ్చుకున్నారు. యముడుగానో, కంసుడుగానో, అతను రంగప్రవేశం చెయ్యడంతోటే ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు. ఖంగుమనే కంఠంతో, ప్రతి అక్షరాన్నీ సుస్పష్టంగా పలుకుతూ, రాగ భావ యుక్తంగా పాడి వన్స్‌మోర్‌లు కొట్టించుకునేవాడు గగ్గయ్య. అతనిది పెద్ద శరీరం కాదు, కాని పాత్రలో గంభీరాకృతితో ‘పర్వతప్రమాణం’లో కనిపించేవారు. కళ్లు పెద్దవి, పాత్రలో కణకణలాడుతున్న చింతనిప్పుల్లా కనిపించేవి. అందుకనే అందరూ ముందు వరుసల్లో కూర్చుని గగ్గయ్య నాటకాలు చూడాలని చెప్పుకునేవారు. నాటకంలో ఎవరున్నా లేకపోయినా, గగ్గయ్య వున్నాడని తెలిస్తే చాలు గ్రామాలనుంచి ప్రజలు బళ్లమీద తరలివచ్చేవారనీ, నాటకాల్లో నటిస్తున్నప్పుడే అతనికి ‘స్టేజిస్టార్‌’గా గుర్తింపు వుండేదనీ చెబుతారు. సినీ జీవిత సావిత్రి సినిమాలో వేమూరి గగ్గయ్య ఈస్టిండియావారి సావిత్రి (1933)లో యమధర్మరాజు పాత్రతో గగ్గయ్య సినిమారంగప్రవేశం జరిగింది. అతను సావిత్రి నాటకంలో యముడి పాత్ర సమర్థంగా పోషించడంతో సినిమాల్లోకి తీసుకున్నారు. ఆ చిత్రంలోని “పో బాల పొమ్మికన్‌, ఈ మృగారణ్యమున రావలదు, రా తగదు, రాచనదు పో బాల పొమ్మికన్‌” అని లయబద్ధంగా మాటలు విరుస్తూ విసుర్తూ తీవ్ర కంఠంతో సావిత్రి పాత్రని ఉద్దేశిస్తూ పాడిన పాటకి – ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు కొట్టి వెర్రెత్తిపోయారు. అది సినిమా అని తెలిసినా, ఆయన చదివిన పద్యాలకి ‘వన్స్‌మోర్‌’లు కొట్టారు. ఆ చిత్రం తొలి తెలుగు చిత్రం భక్తప్రహ్లాద (1931) కంటే విజయవంతం అయింది. శ్రీకృష్ణలీలలు (1935)లో కంసుడి పాత్ర ఇంకా ఆకర్షించింది. “ధిక్కారమును సైతునా కుటిలజనధిక్కారము సైతునా” అని కంసుడి క్రోధకంఠంతో పాడిన పాటను ప్రజలు పాడుకునేవారు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)లో శిశుపాలుడుగా ఆయన “స్నానంబు సలుపు లేజవరాండ్ర చీరెలు కాజేసినందుకా” అని చదివిన పద్యాలూ, చెప్పిన సంభాషణలూ ఆ సినిమాలు చూసినవారందరికీ గుర్తుండిపోయాయి. సతీ తులసి (1936)లో జలంధరుడు, భక్త మార్కండేయ (1936)లో యముడు, జరాసంధ (1938)లో జరాసంధుడు, మైరావణ (1940)లో మైరావణుడు, దక్షయజ్ఞం (1941)లో దక్షుడు, భక్తప్రహ్లాద (1942) లో హిరణ్యకశిపుడు వంటి పాత్రల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా తొలిచిత్రం సీతారామ జననం (1944)లో గగ్గయ్య రెండు పాత్రలు ధరించారు – రావణుడూ, పరశురాముడూ. నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఆయన పద్యాల్నీ, పదాల్నీ గ్రామఫోను కంపెనీలు రికార్డు చేసి, విరివిగా అమ్మి విపరీతంగా సొమ్ముచేసుకున్నాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా – అవే సినిమా పాటలు మళ్లీ రికార్డులుగా వస్తే అవీ అలాగే ఆకర్షించాయి. మొదట్లో ఆయన హరికథలు కూడా చెప్పేవారు, సినిమా నటుడైన తర్వాత కూడా చెప్పడం కొనసాగించారు. స్వభావం అంతటి ప్రతినాయక పాత్రధారి బయట మాత్రం సౌమ్యుడు. మామూలు మాట అతి సరళం. ఇతని కుమారుడు వేమూరి రామయ్య కూడా ప్రసిద్ధుడైన రంగస్థల నటుడు.[2] ఇతను మహారథి కర్ణ నాటకంలో చాలా కాలం కర్ణ పాత్రధారిగా నటించారు. కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. ధరించిన పాత్రలకీ, ఇతని గుణగణాలకీ ఏమీ సంబంధం లేదనీ, ఎన్నో గుప్తదానాలు చేశాడనీ, ఎందరో పేదవారి పిల్లలకి చదువు చెప్పించాడనీ రామయ్య చెబుతూ ఉంటాడు. విశేషంగా కనిపించేది ఏమిటంటే – ఎక్కువగా దైవదూషణ చేసే పాత్రలే ధరించినా, గగ్గయ్య గొప్ప దైవభక్తుడు. దైవకార్యాలమీద అమిత శ్రద్ధాభక్తులుండేవి. దైవకార్యాల నిమిత్తం ఎవరొచ్చి ఏమి అడిగినా సంతోషంగా సహాయం చేసేవారు. ఆ రోజుల్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిది “గగ్గయ్య కంఠం” అనేవారు. కోపిష్టి గురించి చెప్పడంలో “ఆయనా? కోపంలో గగ్గయ్యే!” అనేవారు. అలా కోపానికీ, గంభీరకంఠానికీ గగ్గయ్య మారుపేరుగా కీర్తిపొందాడు. పెద్దగా చదువుకోలేదు. కాని, నాటకాలకు జీవితాన్ని మళ్లించుకున్న తర్వాత, కావ్యాలూ, ప్రబంధాలూ, పురాణాలూ చదివి భాషనీ, భావాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.అంగిక చలనం తో పాటు ,సాత్విక చలనమూ ప్రస్ఫుటమయ్యేది .భవానీ శంకరుడి పాత్రలో ‘తాతలనాటి క్షేత్రములనెల్ల ‘’పద్యం బాగా క్లోఇక్ అయింది .ఆది శంకరాచార్య విరచిత ‘’భజ గోవిందం ‘’శ్లోకాలు గగ్గయ్య స్వరం లో అమృతాలు జాలువారి నట్లు తాత్విక ప్రభ విన్చినట్లు గానం చేశారు . తమిళ నాటకాల్లో క్రూరపాత్రధారుల్లో మేటి అనిపించుకున్న ఆర్‌.యస్‌.మనోహర్‌ “తనకి తెలుగు రాకపోయినా గగ్గయ్య నాటకాలు చూసే తాను ప్రభావితుడినయ్యాననీ – తన రౌద్రపాత్రధారణకు ఆయనే స్ఫూర్తి” అనీ చెప్పాడు. మరణ౦ తెలుగు చలన చిత్ర రంగం లో ‘’మొదటి డైలాగ్ కింగ్ ‘’ గా ప్రసిద్ధుడైన వేమూరి గగ్గయ్య 1955 డిసెంబర్ 30న కేన్సర్ వ్యాధితోమరణం పొందారు.గగ్గయ్య పేరు వింటేనే ఆరోజుల్లో పసిపిల్లలు కాళ్ళ వెంబడి కార్చుకోనేవారని చెబుతారు .ఆ కంఠ ధ్వనివంటే చాలు పరవశించి వచ్చి నాటకం ,సినిమా చూసి మనసారా మెచ్చుకొనేవారు నటించిన సినిమాలు 1. భక్త శిరియాళ (1948) 2. గరుడ గర్వభంగం (1943) 3. భక్త ప్రహ్లాద (1942) —> హిరణ్యకశిపుడు 4. సీతారామ జననం(1942) —> రావణాసురుడు[,పరశురాముడు 5. దక్షయజ్ఞం(1941) —> దక్షుడు 6. చండిక (1940) —> గిరిరాజు 7. మైరావణ (1940) —> మైరావణుడు 8. జరాసంధ (1938) 9. మార్కండేయ (1938) —> యముడు 10. మోహినీరుక్మాంగద (1937) 11. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) —> శిశుపాలుడు 12. సతీ తులసి (1936) 13. శ్రీకృష్ణ లీలలు (1935) —> కంసుడు 14. సీతా కల్యాణం (1934) 15. సావిత్రి (1933) —> యముడు

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9 9-ఆకాశవాణి గాయని ,స్నూకర్ క్రీడాకారిణి ,రంగస్థలనటి సినీనటి కళాప్రపూర్ణ టిజి కమలాదేవి టి.జి.కమలాదేవి (డిసెంబర్‌ 29, 1930 – ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది. కమలాదేవి 2012 ఆగస్టు 16 న చెన్నైలో82వ ఏట మరణించింది. టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్‌ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకు మార్చాడు. తండ్రికి పుత్తూరులో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ తిరిగి ఐదవక్లాస్‌ స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది. పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు. ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది. బాల్యం ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్‌ తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది. టి.చలపతిరావు ఈమెకు నేను కనలేని జీవితము… అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నై లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది. బహుముఖ ప్రఙ్ఞాశాలి రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది. సినిమాలు 1939వ సంవత్సరంలో పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డితో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణి చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో 1941లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. తెనాలి రామకృష్ణ సినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందింది. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలో అహల్యగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో నే ధన్యనైతిని రామా అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది. రంగస్థలం కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వథ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే కనకతార వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది. లవకుశ సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. వయసు పెరిగే కొద్దీ సావిత్రి, వరూధిని, కీచకవధ వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించింది. అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకంలో కమలాదేవి రుక్సానా పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా బందాకనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్‌, ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది. అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి. 1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆకాశవాణిలో ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. 1945 నుంచే ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావు బాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. అనార్కలి నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించింది. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946 అక్టోబరులో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటోంది. ఆటలు 1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకుంది. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది[2]. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తో బెంగళూరులో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది. 1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో 1991లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది[3]. ఇతర విశేషాలు • పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా ఆ అతిసాహసులే ఉన్నారా గీతాన్ని ఆలపించింది • ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా అన్న దేవులపల్లి గీతాలు పాడింది • దొంగలున్నారు జాగ్రత్తలో జి.వరలక్ష్మికి, భక్త రామదాసులో కన్నాంబకు, గొల్లభామలో అంజలీదేవికి నేపథ్య గానం చేసింది. • సంపూర్ణ రామాయణంలో పద్మినికి, పాండురంగ మహత్యంలో బి.సరోజాదేవికి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. • కంజన్‌ అనే తమిళ సినిమాలోనూ నటించింది. • 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పనిచేస్తూంది. • చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీకి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూంది.[4] సినిమాల జాబితా కమలాదేవి దాదాపు 50 తెలుగు, తమిళ సినిమాలలో నటించింది[2]. 1941లో దక్షయజ్ఞం లో రోహిణి ,చూడామణి ,బాలనాగమ్మలో మండులమాణిక్యం ,సీతారామ జననం లో అహల్య ,గరుడ గర్వభంగం మాయాలోకం ,ముగ్గురు మరాఠీలు,తమిళ సినిమా కంజన్ లో మరగతం ,గుణ సుందరికధలో పార్వతీ దేవి ,1951లో వాహినీ వారి బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ సినిమా మల్లీశ్వరిలో భానుమతి ఇష్టసఖి జలజగా గొప్పగా నటించింది భాను హృదయం అర్ధం చేసుకొని రామారావు తో కలిసే ఏర్పాటు చేసిన సాహసిగా చిరస్మరణీయ నటన ప్రదర్శించింది .పాతాళభైరవి లో హెచ్చరికో హెచ్చరిక పాటతో వీరుల చరిత్రను పాడే పాత్రగా ,చంద్రవంక ,పల్లెటూరు తోడూ దొంగలు లో రాముని భార్య ,చక్రపాణి సినిమాలో మనవరాలు ,తెనాలి రామకృష్ణ ,పార్వతీ కల్యాణం ,కంచుకోట ,అసాధ్యుడు బంగారు పంజరం ,బంగారు సంకెళ్ళు కధానాయకుడు ,పెత్తందార్లు పెళ్ళికూతురు ,1975లో వచ్చిన అభిమానవతి సినిమాలలో నటించింది పల్లెటూరు ,గుణ సుందరి కథ ,మల్లీశ్వరి, దొంగలున్నారుజాగ్రత్త భక్తరామ దాసు ,గొల్ల భామ సినిమాలో నేపధ్యగాయనిగా తన ప్రతిభ చాటింది . మా పెద్దక్కయ్యశ్రీమతి గాడేపల్లి లోపాముద్ర ,బావగారు శ్రీ కృపానిధి కుటుంబం మద్రాస్ లో షినాయ్ నగర్ లో ఉండేది .మా అక్కయ్య ఉయ్యూరు వచ్చినప్పుడల్లా కమలాదేవి గురించి చెప్పేది తరచుగా కలుసుకొనే వారట .బాగా ఆప్యాయంగా మాట్లాడుతుందని చెప్పేది .కమల ఫామిలికూదాషినాయ్ నగర్ లోనే ఉండేవారు సాయిబాబా గుడిలో గురువారం సాయంత్రం కలిసేవారట గాయని శ్రీమతి జానకి కూడా అక్కడికి వచ్చేవారట . సినిమాను తన పాట చుట్టూ తిప్పు-కొన్న మేటి నటి టి.జి.కమలాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలిని . సశేషం మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-21-ఉయ్యూ

Posted in సినిమా | Tagged | Leave a comment

నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం

నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం

రేలంగి అంటే నవ్వుల అంగీ తొడుక్కున్నాయనో ,ధర్మం చేయి బాబూ,కానీ ధర్మం చేయిబాబు అని పాడే దేవయ్య అనో ,వట్టి బద్రయ్య అనో అనుకుంటాం కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు ,ఉదార హృదయుడు తనింట్లో లక్ష్మీ దేవులు లాగా ఆడపిల్లలు తిరుగుతూ ఉండాలని కోరుకున్నవాడు ,ఇంట్లో కాని బయట బంధువుల ఆడపిల్లల పెళ్ళిళ్ళను ఘనంగా చేసి కనీసం వందకాసుల బంగారైనా పెట్టి సంతోషించే వారు రేలంగి దంపతులు .మొదటి సారిగా ఆడపిల్ల పుడితే అప్పుడు రేలంగి మలేషియా తెలుగు సభలలో పాల్గొనటానికి వెడితే వార్త

 తెలిసి పరవశం చెందాడు ‘’మా ఇంట్లో లక్ష్మి పుట్టింది’’అని అక్కడ సందడేకాదు  డాన్స్ కూడా చేసినవాడు .అక్కడినుంచి తాడేపల్లి గూడె౦ స్వంత ఇంటికి వస్తూ పిల్లకు ఊయలగా ‘’బంగారు ఉయ్యాల ‘’తెచ్చాడు .బంగారు పల్లకిలో ఊపకూడదని పురోహితుడు చెబితే కొద్దిగా చిన్న బుచ్చుకొన్నా సాంప్రదాయాన్ని గౌరవి౦చిన వాడు. మాంచి నగిషీ ఉన్న టేకు ఉయ్యాల చేయించి ,ఆఉత్సవం ఘనం గా చేయించాడు .

  మద్రాస్ లో ఇప్పుడున్న విజయా గార్డెన్ రేలంగిదే .ఈ విషయం మనకు దాదాపు తెలియనే తెలియదు .తనకు సినిమాలో వచ్చిన డబ్బును మొదటసారిగా పొలం మీద పెట్టి 23 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి కొన్నాడు .దాన్లో పండిన ధాన్యంతో లంకంత కొంపలో దాదాపు రోజూ వందమందికి తక్కువకాకుండా భోజనం చేసే వారికోసం వినియోగించి మహా సంతృప్తి చెందేవాడు .తన తండ్రి పొలం కొనే  స్తోమతు లేనివాడు. తాను అలాకాకుండా భూవసతి ఏర్పాటు చేసుకొని దాని ఫలసాయాన్ని  పదిమందికి  పంచి సంతృప్తి పొందాలన్న ఆరాటం ఆయనది .అందుకే మద్రాస్ లో ఆ పొలం కొన్నాడు .దాన్ని యజమానులు ముస్లిం లు ఇతరరాష్ట్రాలలో ఉన్నవారు వారందర్నీ ఒప్పించి కొన్న భూమి అది .రేలంగి విజయా నాగిరెడ్డి కుటుంబం చాలా అన్యోన్యంగా ఉండేవారు ఒకరినొకరు బావ బావా అని ఆప్యాయంగా పిల్చుకోనేవారు .వాహినీ కూడా విజయాలో భాగమే .ఇన్ కం టాక్స్ ఇబ్బందులవలన వాహినీ, విజయా వేరు చేసుకొన్నారు .విజయా నాగిరెడ్డి కొడుకులు రేలంగి ఒక్కగానొక్క కొడుకు సత్యనారాయణ బాబు మంచి స్నేహితులు .నాగిరెడ్డికి రేలంగి పొలం లో స్టూడియో కట్టాలని ఉండేది .ఆమాట కొడుకులద్వారా బాబు కు చెప్పించారు .బాబు తండ్రికి చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు .ఆ పొలం లో ఫలసాయం తన కుటుంబంలోని వాళ్ళు తరతరాలుగా అనుభవించాలన్న ఏకైక లక్ష్యం తో కొన్న పొలం అది .రేలంగి ఇష్టపడలేదు .’’బ్రహ్మయ్య అండ్ కో ఆడిటర్స్’’ ఇరు వైపులా మధ్యవర్తిత్వం చేసి రేలంగి పొలం అమ్మకుండా ,ఆ పొలాన్ని లీజుకు 20ఏళ్ళు విజయావారికి ఇచ్చేట్లు ప్రతినెలా రేలంగిబాబు కు  500 రూపాయలు అద్దె కింద ఇచ్చేట్లు ఆ కుటుంబం లో పుట్టి బతికిన వారందరికీ భవిష్యత్తులో అందులో హక్కు ఉండేట్లు ఎవ్వరికీ అమ్మే హక్కు లేకుండా అనుభవించటానికి మాత్రమె హక్కు ఉండేట్లు పకడ్బందీ గా ఆలోచించి ఆడపిల్లలకు కూడా తన ఆస్తిలో హక్కు 1956లోనే ఏ చట్టం రాకముందే కల్పించిన విశాల హృదయుడు రేలంగి .కొడుక్కి నెలనెలా అయిదు వందలు వచ్చేట్లు అతనికి న్యాయం చేకూర్చాడు .ఇదంతా కార్యరూపం దాల్చాటానికి ఆరునెలలు పట్టింది రేలంగి బిజీ షెడ్యూల్ ,ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేర్చటం వలన .

  నాగిరెడ్డిచేతికి రాగానే విజయా స్టూడియో కట్టాడు బయట నుంచి లోపలి ఎంట్రన్స్ వద్ద ‘’రేలంగి భూమి ‘’అని ఇప్పటికి ఒక బోర్డ్ ఉంటుంది .లోపల స్టూడియోవద్ద నాగి రెడ్డి పేరు ఉంటుంది .20ఏళ్ల లీజుయిపోతే, పరస్పరం అంగీకారం తో  మళ్ళీ  10ఏళ్ళు లీజు పెంచారు .రేలంగి చనిపోయాడు ,నాగి రెడ్డీ పోయాడు. కొడుకులూ ఒకరిద్దరు పోయారు .కానీ ఖాళీ చేసి రేలంగి వారసుడైన బాబుకు అప్పగించలేదు .బాబుఅల్లుడు శ్రీ పులి శంకరరావు ది కృష్ణాజిల్లా కూచిపూడి ని ఆనుకొన్న పెదపూడి.ఈయన ఇంజనీర్ .బందరులో కొనకళ్ళ గణపతి గారు ఈయన మాతామహుడు. ఇప్పటి ఎంపి శ్రీ కొనకళ్ళ నారాయణరావు మేనమామ .శంకర్  తనమామ గారు బాబుకు నచ్చ చేప్పి ఒకటి రెండుసార్లు నాగి రెడ్డికొడుకులతో మాట్లాడినా ప్రయోజనం లేక ఆఖరి సారి వెడితే ,ఎవరో కొత్త వారిని చూసినట్లు ప్రవర్తిస్తే గత్యంతం లేక ఆభూమిపై హక్కుకై కోర్టుకు వెళ్ళారు .వాయిదాలు నడుస్తున్నాయి .ఆఆఆఆఆఇదే రేలంగి వ్యవసాయక్షేత్రం లో ఉన్న విజయా గార్డెన్స్ కదా కమామీషు.

  మద్రాస్ లో ఒక ధియేటర్ కట్టి, కొడుకు బాబుకు ఇవ్వాలని  రేలంగి ఎంత ప్రయత్నించినా బేరాలు కుదరక ,విసిగి చివరికి ఎక్కడో ఎందుకు తమ తాడేపల్లి గూడెం లోనే కడదామని 50ఎకరాల స్థలం కొని,అందులో రేలంగి చిత్రమందిర్ నిర్మించి కోరిక తీర్చుకొన్నాడు రేలంగి .కొడుకు బాబు దాని వ్యవహారాలు  చూసేవాడు .ఒకప్పుడు రేలంగి కుటుంబం నిరుపేద స్థితిలో ఉన్నా ,మామగారు గొప్ప స్థితితిపరులైనా పిల్లనిచ్చి రేలంగికి పెళ్లి చేశారు .ఆ కృతజ్ఞత తో ఆతర్వాత మామగారి కుటుంబం ఆర్ధికంగా చితికి పోయి తమ కుటుంబం  బాగా ఉన్నత స్థితిలోకి వచ్చినా ,బావమరది కూతురు తో తనకొడుకు పెళ్లి చేసి తన కృతజ్ఞత చూపాడు .ఈ పెళ్ళికి మద్రాస్ చీఫ్ మినిస్టర్ కామరాజ నాడార్ కూడా రావటం రేలంగిపై ఉన్న అభిమానం  .గొప్ప విశేషం  .ఇప్పుడు ఈ సినిమా హాల్ స్థలం లో ఆధునిక వసతులతో రెండు దియేటర్లు 50 షాపింగ్  మాల్స్  ఒక కళ్యాణ మ౦డపం తో నిర్మించి రేలంగి ఆస్తికి సార్ధకత తెచ్చారు .

  మద్రాస్ పొలం అలా విజయావారి స్టూడియోకి  దక్కితే, తనకు భూమి మీద పంట మీద ఉన్న ఆపేక్షతో రావులపాలెం రావిపాడు మధ్య 89ఎకరాల దివ్యమైన మాగాణి భూమి యకరం 3వేలకు  కొని, తన కులంవారికే కౌలుకు ఇచ్చి ఫలసాయం పొందేవాడు రేలంగి. కొన్నేళ్ళ తర్వాత రైతులు సరిగ్గా ఫలసాయం అప్పగించకపోతే ,విసుగు చెంది వాళ్ళకే యకరం వెయ్యి రూపాయల వంతున అమ్మేసి సంతోషించాడు .కొంతమంది డబ్బులు చెల్లించకుండా భూమిని అనుభవిస్తున్న వారూ ఉన్నారు .వారిపై ఎ చర్య తీసుకోలేదు .

  ఆకాలం లో అక్కినేని నందమూరి లకు సినిమాకు కనీసం 30వేలు ఇస్తే రేలంగికీ అలాగే ఇస్తామంటే ‘’వాళ్ళు హీరోలు .వాళ్ళు లేకపోతె సినిమాలు ఉండవు .కనుక నాకు వాళ్ళకన్నా ఒక వెయ్యో రెండు వేలో తగ్గించి ఇవ్వండి ‘’అని నిర్మాతలకు నచ్చచెప్పి తీసుకొన్న ఔదార్యం రేలంగిది .తిరుపతి వెంకటేశ్వర యూని వర్సిటికి 4లక్షల విరాళం ,కేరళ యూనివర్సిటికి 2లక్షల విరాళం ఇచ్చిన ఉదారుడు రేలంగి .తిరుపతి కి వెళ్ళిన యాత్రీకులు ఆకాలం లో మద్రాస్ వచ్చి నాగేశ్వరరావు రామా రావు లను చూసి భోజనం మాత్రం రేలంగి ఇంట్లో చేసి వెళ్ళేవారు. ఎంతమంది వచ్చినా అక్కడ గొప్పమర్యాదగా భోజనాలు కల్పించేవాడు .స్వంత పొలం లో పండిన వడ్లను అక్కడే మర పట్టించి రైలు లుద్వారా మద్రాస్ కు తెప్పించుకొని స్వంత బియ్యం వండించి భోజనం పెడుతున్న గొప్ప సంతృప్తిపొందేవాడు . వచ్చిన వారిని  వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా లేదో అడిగి తెలుసుకొనేవారు   ఆర్ధిక ఇబ్బండులలౌన్నామని వారు చెబితే ,  వెంటనే వెయ్యి లేక రెండు వేలు చేతిలోపెట్టి బాగా చదివి౦చమని ప్రోత్సహించేవారు  .ఆడపిల్లలకు పెళ్లిళ్లకు ధన సాయం చేసేవారు .అందరిఇళ్ళు పిల్లా జెల్లా తో కళా,కా౦తులతో  ,ఆనంద ఉత్సాహాలతో సంతృప్తి  వెల్లి విరియాలని రేలంగి గోప్పమనసు ఆరాట పడేది. .మద్రాస్ లోఎమ్జి రామచంద్రన్ రేలంగిని ఏనుగు పై ఊరేగించి తాను  తాడుపట్టుకొని దానిముందు నడుస్తూ మహా గొప్ప గౌరవం కల్పించాడు .య౦గ్ మెన్స్ హాపీక్లబ్ లో రేలంగి అంజలి  భర్త ఆదినారాయణరావు ఎస్వి రంగారావు  మొదలైన వారంతా మెంబర్స్ .అందర్లో రేలంగి అందరితో చనువు మంచి మాటకారితనం ఉండటం తో ఏ నిర్మాత, డైరెక్టర్ అయినా రేలంగికి చెబితే తగినవారిని ఆయన ఒప్పించి నటి౦ప జేసేవాడు .ఇలా ఎందరికో జీవిక కల్పించిన మహాదారుడు రేలంగి .

   ఈ విషయాలన్నీ నిన్న’’ లయన్ న్యూస్ చానల్’’ లో  శ్రీ పులి శ౦కరరావు అంటే రేలంగి మనవరాలిభర్త అంటే కొడుకుబాబు  కూతురి భర్త ఇంటర్వ్యు లో చెప్పిన సంగతులు ఆసక్తిగా చూసి మీకోసం అందించాను .

2022నూతన సంవత్సర శుభా కాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-21-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8                                                        

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8                                                        

8-లాలిత్య కోమలత్వాలతో తెలుగు సినీ పాటను సంపన్నం చేసిన- అశ్వత్ధామ

తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గుడిమెట్ల అశ్వత్థామ 21-8-1927న పగోజి నరసాపురం లో వరదాచారి రుక్మిణి దంపతులకు జన్మించారు . తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి సైన్యం వదిలి సన్యాసులలో కలిసి పోవడంతో ఇతని తల్లి తన పిల్లలను తీసుకుని మద్రాసులోని ఆమె తమ్ముని ఇంట చేరింది.  బాల్య జీవితం చాలా కష్టంగా గడిచింది. కుటుంబ పోషణ కోసం ఏవేవో చిన్నచిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవారు. చిన్నతనం నుండే సంగీతంపట్ల మక్కువ ఉండేది.  దెందులూరి శివరామయ్య, మహావాది వెంకటప్పయ్య, టైగర్ వరదాచారి, ద్వారం వేంకటస్వామినాయుడుల వద్ద సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.  మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు ఆదరించారు

1951లో కమలను వివాహం చేసుకున్నారు. ఈమె వీణావాదనలో డిప్లొమా చేసింది. ఈమె కొంతకాలం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కళాకారిణిగా పనిచేసింది. వీరికి విజయరాఘవన్ అనే ఒక కొడుకు, గాయత్రి, శ్యామల అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఇతని కుమార్తెలు ఇరువురు కూడా ప్రముఖ వీణా విద్వాంసురాళ్ళు. గాయత్రి తమిళనాడు సంగీత, లలిత కళల యూనివర్శిటీ ఉపకులపతిగా పనిచేస్తున్నది.

ఈయన  50కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. భాగ్యలక్ష్మి, త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించారు .తరువాత సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసి సంగీత దర్శకుడిగా ఎదిగారు.తెలుగుతో పాటు తమిళ మళయాళ సినిమాలకూ సంగీత దర్శకత్వం వహించారు

  చిన్నవయసు 48ఏళ్లకే 21-5-1975 న మద్రాస్ లో మరణి౦చారు .లాలిత్య కొమలత్వాలను సినీ గీతాలకు అద్ది అజరామరం చేశారు అశ్వత్ధామ . సినీ సంగీతంలో ఐరావతంఆయన .

మిలటరీ కమాండర్ గారి అబ్బాయి కనుక ‘సరిగమపదని’ స్వరాల్ని సరిగ పదమని ఆదేశించే ప్రజ్ఞా ‘పాట’వం అతనికుండేది.తండ్రిపేరు మరో గురువుపేరు కూడా వరదా చారి కావటం విశేషం .నాగయ్యగారి త్యాగయ్యసినిమాలో బాల శ్రీరాముడు వేషం వేసింది అశ్వత్ధామ యే.

అశ్వత్ధామ సంగీతం అంటే నాకు మహా గొప్ప ఫాసినేషన్ .ఆయన గురించి ఎంతో చెప్పాలని ఉంది .కానీ నాకంటే ముందే 2013లో డా.తాతిరాజు వేణుగోపాల్ గారు అద్భుత మైన విశ్లేషణ చేశారు దీన్ని మా అబ్బాయి శర్మ వెతికి నాకు పంపాడు దాన్ని యధాతధంగా మీకు అందిస్తున్నాను అంతకు మించి ఏమైనా ఉంటె నేను రాస్తాను బహుశా ఉండక పోచ్చు

డాతాతిరాజు వేణుగోపాల్,  19 మే 2013  గారు రాసిన అద్భుత విశేషాలు –  

అశ్వత్ధామ పాతి కేళ్ళుమాత్రమే సంగీత దర్శకత్వం చేసినా అది మూడు దశలలో సాగింది . 1950 నుంచి  1959 వరకు తొలిదశ, 1960  నుంచి 1967 వరకు మధ్య దశ, 1970 నుంచి  1973 వరకు తుది దశ! డబ్భయిల నాటి స్కూల్ పిల్లందరికి ఆ నాలుగేళ్ల పాటు అశ్వత్థామ ట్యూన్స్  అన్నీకంఠస్థమే. ముఖ్యంగా అప్పట్లో ఎల్లారీశ్వరి ఎల్లరి ప్రియతమ గాయని కదా.  ముక్కు చూడు ముక్కందం చూడు(మానవుడు దానవుడు), కంచెకాడ మంచెకాడ, నీ సన్నిధే నా పెన్నిధి (ప్రేమపక్షులు), అందుకో కలకల కిలకిల జిలిబిలి నగవులు నూరేళ్ళు(బాలుతో-పసిడి మనసులు) – అశ్వత్థామ మలచిన జానపద, పాశ్చాత్య కలగలుపుల్లో  ఇవి కొన్ని మాత్రమే. ఏసుదాస్ గొంతు నుంచి ‘తెల్లరేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే తగువెట్టా తీరేదే తలుపు తీయవే భామా(ప్రేమ పక్షులు)’ పాట రావడం, అదీ రేడియో శ్రీలంక నుంచి సాయంత్రం ప్రసారం కావడం అదో అందమైన జ్ఞాపకం ఆ రోజుల్లో.

  సుశీలమ్మ  పాడిన కానడా నడక  – శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా (విచిత్ర దాంపత్యం)–స్టేజి మీద కదిలితే  పాడే  అమ్మాయికి, నాట్యమాడే అమ్మాయిలకి   ఆ రోజుల్లో మొదటి బహుమతి తప్పని సరిగా వచ్చేసేది.

పచ్చని మనకాపురం పాల వెలుగై మణి దీపాల వెలుగై (మానవుడు దానవుడు), కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు (మాయని మమత), నా మనసే వీణియగా పాడనీ (విచిత్ర దాంపత్యం)….వంటి కళ్యాణ రాగ గీతికలు వినిపించని ఇల్లే ఉండేది కాదు.

చిన్నారి నీ చిరునవ్వు విరిసిన  మల్లెపువ్వు పొన్నారి నీ అందం పూచిన పూడెందం (పసిడి మనసులు) అని పగలు పాడుకుంటూ మురిసి పోయిన యువకుడు   రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం (మాయని మమత) – పాట పాడుతూ కుమిలిపోని రాత్రి ఉండేది కాదు.

అమ్మా లాంటి చల్లనిది లోకామొకటి ఉందిలే (మానవుడు దానవుడు) – అని ఏ తల్లి పాడినా పిల్లలు హాయిగా ఆకలి మరచిపోయి నిదరోయేవారు. అణువు అణువునా వెలసిన దేవా కను వెలుగై మము నడిపింప రావా(మానవుడు దానవుడు) – చంద్ర కౌ(జ్ రాగ  లాలిత్యం ఎందరో డాక్టర్లని దేశభక్తులుగా మార్చింది.

‘ఎవరికోసం ఎంతకాలం ఈ జాజిపూలు రోజు రోజు పూసి పూలు పూచేది ఎవరికోసం’ (విచిత్ర దాంపత్యం) –శివరంజని రాగంలో ఈ పాట ఆయన స్వర పరచి ఎంత కాలమో కంట తడి పెట్టించారు. 

ఈయనెవరో బలే ఇస్తున్నాడు పాటలు – అని పొందుతున్న ఆ ఆనందం అట్టే కాలం నిలవ లేదు. 1975 మే నెల రానే వచ్చింది. అశ్వత్థామ  శాశ్వతంగా విశ్వ శయ్యపైన మేను వాల్చారు. అశ్వశక్తి ఉన్న అశ్వత్థామ సంగీతం ఒక చరిత్ర అయిపోయింది.

మధ్య దశలో ఎన్నెన్ని మాణిక్యాలు మలిచారూ… కవీశ్వరులు మల్లాది రచనలే అసామాన్యం అనుకుంటే వాటికి ఈయన అందించిన స్వర రచన అసాధారణం!  ఈ సంగీత సాహిత్య దిగ్గజాల (అందులో ఒకరి పేరే అచ్చంగా అశ్వత్థామ) మధ్య  ఏమిటీ ‘అన్యోన్యం?’. ఇప్పటికీ అది ‘unknown’యం!

ధర్మమే జయం’ లో కొన్ని పాటలు ఈయనవే. ఆ సినిమానే వెతుక్కోవడం ఇప్పుడు కష్టం. అందులో ఈయన చేసిన మూడు పాటలేవన్నది చెప్పడం మరీ కష్టం.

పద్మశ్రీ వారి ‘జగన్నాటకం’ అనే సినిమా ఒకటుందని ఎందరికి తెలుసు? అందులో మల్లాది వారి ఇష్ట పదాలైన  మగరాయ, మరుమల్లె మరో దశకంలోనూ వికసించాయి. ‘జగన్నాటకం’ చిత్రం తోనే ఒక మెయిన్ గాయనిగా ఎల్లారీశ్వరి నలుగురికీ తెలిసింది. 

మంజీరా వారి ‘చివరకు మిగిలేది’ – సినిమా పేరు అదేమీ చిత్రమో కాని (ఆ సినిమాలోని ప్రధాన భూమిక పోషించిన) నటీమణి సావిత్రికి నిజ జీవితంలో చివరకు మిగిలిందేమిటీ అని బాధపడని తెలుగువాడు ఉండడు. ఒక్కటి నిజం – అప్పటికీ ఇప్పటికీ అనే కాదు ఎప్పటికీ ‘చివరకు మిగిలేది’ మల్లాది వారి పద సంపదా, అశ్వత్థామ వారి స్వర సంపద మాత్రమే.  ఇందులోనే జమునారాణి  ఆలపించిన ‘అందానికి అందం నేనే – జీవన మకరందం నేనే’ అనే పాట ఉంది. ఆ పాటలో స్వాతిశయం ఉంది. అహంకారం కాదు.  దాన్ని అంతే అందంగా అంటే ఒక మోహన గీతంగా మలచిన అశ్వత్థామ గారికి జోహారు.

 అందానికి అందం – అని మల్లాది వారు చల్లిన  విత్తనం తరువాతి కాలంలో అందానికి అందానివై (దత్తపుత్రుడు –దాశరథి), అందానికి  అందం ఈ పుత్తడి బొమ్మ (సిరిసిరిమువ్వ – వేటూరి) వంటి మరో రెండు గీతాలకి జన్మ నిచ్చింది.  అయితే  వీటి స్వర కర్తలు – చలపతి రావు గానీ, మహదేవన్ గానీ అశ్వత్థామ స్వర రచన అనుసరించక పోవడమే విశేషం. ఎందుకంటే అశ్వత్థామ స్వర నడక ‘రూటే’ వేరు!

మల్లాది గురువుగారు పాటలకి  అచ్చ తెనుగు జిలుగులద్దితే వాటికి తెలుగు జాతీయాల సొగసు చూపించింది  శిష్యుడు ఆరుద్ర గారే.  ఒక్కసారి పింగళి వారి రుచికర సాహిత్యం (వివాహ భోజనంబు) గుర్తొచ్చి ఆయన రాయకుండా వదిలేసిన గోంగూరను చేరదీశారు ఆరుద్ర. దేవాంతకుడు రాకెన్ రోల్  వరసలో ‘మనసారా’ ‘మనసా రా’ అంటూ పాడిన  ‘గో గో గో గోంగూర’ అశ్వత్థామ స్వర వంటకమే. గోగోగో—అంటే క్విట్ ఆంధ్రా అని కాదిక్కడ. అందుకే జై ఆంధ్రా అన్నారు ఆరుద్ర. ఇదిగో ఇదిగో ఇదిగో అనేదానికి సంక్షిప్త రూపం అనుకుందాం. గోంగూర పులుపో కాదో తెలియదు కానీ ఆ పాట మనసారా కోరుకున్నది ఆ చిత్ర దర్శకులు ‘పుల్లయ్య’ గారే.

  చంద్రికా వారి శ్రీకృష్ణ రాయబారం లో మళ్ళీ కృష్ణుడు ‘దైవరాయ’ అని అనిపించుకున్నాడు మల్లాది వారి దయ వల్ల. అశ్వత్థామ స్వర కర్త. మళ్ళీ – అని అనడం ఎందుకంటే అంతకు ముందు ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా ….దైవరాయ నిదుర లేరా’ (చిరంజీవులు) అని అందుబాటులో ఉన్న జానపదానికి తనవైన ‘దైవరాయ’ సొగసులద్ది  ఇచ్చినది మల్లాది వారే. ఆ చిరంజీవులు చిత్ర స్వర కర్త ఘంటసాల. మల్లాదివారి దృష్టిలో ఘంటసాల,అశ్వత్థామ ఇద్దరూ చిరంజీవులే. ఆయు:ప్రమాణ దృష్ట్యా చూస్తే  అశ్వత్థామ, ఘంటసాల, మల్లాది వారు శ్రీకృష్ణ రాయబారమో ఏమో భగవత్ గీతా లోకానికి తొందరగా తరలిపోయిన ధన్య జీవులు. నిజానికి అశ్వత్థామకి తెలిసిన దైవరాయడు నాగయ్య గారే. తొలినాళ్ళలో ఈ అపర ‘త్యాగయ్య’ కి సహాయకుడిగా ఉండేవారు. అటువంటి నాగయ్య ‘భక్త రామదాసు’ చిత్రం తలపెట్టి, తీసిన సినిమాని ఆర్ధిక వనరులు కుదరక అవతల పెట్ట వలసి వస్తుంటే తలా ముందుకొచ్చి సాయపడ్డారు. అలా ఆ రామభక్త చిత్రానికి సంగీత దర్శకుడైన నాగయ్య గారికి సంగీత సహకార మందించిన వారు –  సినీ సంగీతానికి ఆద్యుడైన ప్రభాకరశాస్త్రి, నాలుగవ పేరుగా  చెప్పుకునే ఓగిరాల రామచంద్రరావు లైతే ఉడతా భక్తిగా అశ్వత్థామ కూడా నిలబడ్డారు. అందులో మహమ్మద్ రఫీ ఆలపించిన కబీరు తత్వాలు ఈయన స్వర పరచినవే. 

   నవశక్తి వారికి అశ్వత్థామ గారి అశ్వ శక్తి మీద ఎంత నమ్మకమో. తెలుగు సినీ గీతాల సిలబస్ అంటూ ఒకటుంటే తప్పక అందులో మొదటివిగా చెప్పుకోదగ్గ పాటలు వారి ‘కలిమి లేములు’ సినిమా ద్వారా వినిపించారు. అవి మల్లాది వారి రచనలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ‘కొమ్మల మీద కోతికొమ్మచ్చు లాడింది తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ’(పిల్లల భాషలో వచ్చిన ఏకైక పిల్లల పాట), ‘అయ్యారే ..చూడ చక్కని చక్కనయ్య ఓర చూపులే చూశేవు’ (అచ్చమైన కోలాటం పాట), గాలిలో తేలే పూల డోలలో …చిననాటి ఆనందసీమలో (అమలిన స్నేహ బాంధవ్య గీతం) – మూడు పాటలు చాలు తెలుగు కీర్తి బావుటా ఎగరడానికి. కలిమికీ,లేమికీ  తప్పనిసరి అయిన గంగిగోవుపాలు అందించిన కామధేనువు అశ్వత్థామ సంగీతం..

‘గాలిలో తేలే’ పాట ఒక రకంగా గజల్ లా సాగుతుంది. ఆ సంప్రదాయం అశ్వత్థామ గారికి ఎంత ఇష్టమో చివరకు మిగిలేది లోని కొన్ని పాటల ద్వారా తెలుసుకున్నాం. అని నీవన్నది విన్నానోయి….అటువంటిదే. అంతగా తెలియని ముక్కామల సునంద గారి నోట ఆ పాట రావడం, అందానికి అందం నేనే – పాట జమునారాణి గారు పాడడం, కవి కోకిల – పాటని సుశీలమ్మ చేత పాడించడం, తత్వాన్ని ఎమ్మెస్ రామారావు గారికివ్వడం, సిస్టర్ – అని తాగుబోతు ప్రేలాపన మధ్య ఆవేదన జొప్పించి పాడే చేవ ఉన్న ఘంటసాల వారిని ఎంచుకోవడం – సంగీత దర్శకుడిగా అశ్వత్థామలో అంతర్గతంగా ఉన్న ప్రతిభని చూపిస్తున్నాయి. ఒక్కొక్క భావం ఒక్కొక్క గళంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా రాణిస్తుంది. అలా గల నిర్ణయం చెయ్యడంలోనే స్వరకర్త గొప్పతనం తెలిసేది, అంతేకాని నిర్మాత ప్రమేయం ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్చ ఉంటే స్వర కర్త హృదయం పెడతాడు – అని నిరూపించిన వారు అశ్వత్థామ!

  వీలునామా’ సినిమాకి ఈయనే స్వరకర్త. ఒక్క పాటైనా వినే వీలు కలుగుతుందా, ప్రయత్నించాలి. మణులు ఊరికే దొరకవు. వెతుక్కోమంటాయి.

అప్పటికే మాస్టర్ వేణు వరవడి గా ప్రవేశపెట్టిన  వలజి రాగానికి ముగ్దుడైపోయి  అశ్వత్థామ ‘మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా …రాం రాం సీతారాం’ పాట చేసి ‘మా వదిన’ కిచ్చారు, కలలు కనే వేళ ఇదే కన్నయ్యా – పహాడీ లో అమ్మ ఆలపిస్తే ఆ అమ్మ ఒడి అనే లోయలో హాయిగా పవళించే భాగ్యం ఆ కాలం చంటి పిల్లలది. ‘సిసలైన చిన్నావాళ్ళం’ – అని ఈ సినిమాలోని పాట పాడుతూ కాస్త పెద్ద పిల్లలు ఇళ్ళలో హడావుడి చేస్తే ‘ఉండండ్రా’ అని అమ్మమ్మలు కేకలు వేసిన కాలమది.

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7

7-సినిమాపాటకు శ్రావ్యత ,వేగమూ పెంచిన కొదండపాణి

మానవ జీవితంపై భారతీయ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెలియజేసే ‘’ఇదిగో దేవుడు చేసిన బొమ్మ-ఇది నిలిచేదేమోమూడు రోజులు –బందధాలేమో పదివేలు ‘’—రాగం ద్వేషం రంగులురా –భోగం భాగ్యం తళుకేరా-కునికే దీపం తొణికే ప్రాణం –నిలిచే కాలం తెలియదురా ‘’అనే మైలవరపు గోపి రాసిన పాటకు స్వీయ సంగీత దర్శకత్వంలో సుశీల గారితో కలిసి   ‘ అందులోని విషాదభావాన్ని గుండెలు కరిగీలా ఆవిష్కరించి ’ పండంటి కాపురం సినిమాలో పాడి వెండి తెరకు పరిచయమైనారు ఎస్పి కోదండపాణి అనే  శ్రీపతి పండితారాధ్యుఅల కోదండ పాణి .గుంటూరు జిల్లాలో జన్మించి బాల్యమంతా అక్కడే గడిపారు చిన్నప్పుడే సంగీతం నేర్చి తర్వాతహార్మోనియం అభ్యసించారు .తన గాత్ర ,హార్మోనియం లతోందర్నీ అలరి౦పజేసేవారు .శ్రీ పీసపాటి, శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గార్ల పౌరాణిక నాటక బృందాలలో కలిసి పని చేశారు .ఆయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టాల్సింది అంత గొప్పగా పాడేవారు .పాటకచేరీలలో తానూ ఒకటి రెండు పాడుతూ ఉండేవారు .స్తబ్దుగా ఉన్న కచేరీలను తనగాత్రం తో హుషారేక్కించి ఎలేక్ట్రిఫై   చేసేవారు .

  తనలోని కళను తానె గుర్తించి ఇక్కడకంటే మద్రాస్ లో బాగుంటుందని భావించి చేతి ఉంగరం అమ్మి మద్రాస్ చేరారు .ఎందఱో  సంగీత దర్శకుఅలను కలిసినా ,ప్రయోజనం లేకపోయింది .అనుకోకుండా శ్రీ అద్దేపల్లి రామారావు గారి చిత్ర నిర్మాణ సంస్థ రేణుకా పిక్చర్స్ వారి ‘’నా ఇల్లు ‘’సినిమాలో 1953లో బృందగాగానం లో పాడే అవకాశం మాత్రం మొదటి సారిగా దక్కింది .రెండేళ్ళు గుంపులో గోవిందా గా బృందగానం తోనే గడిపారు .కసి పెరిగింది తనకంటూ ఒక ప్రత్యేకత సాధించాలని నిశ్చయానికి వచ్చి పట్టు వీడని విక్రమార్కునిలా అనేకరకాలైన పాటలను సాధన చేశారు .

  అదృష్టం తలుపు తట్టి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీసుసర్ల దక్షిణా మూర్తి గారివద్ద సహాయకునిగా ,హార్మోనిస్ట్ గా అవకాశం వచ్చి పని చేశారు .సుసర్ల వారి వద్ద పొందిన అనుభవంతో ఆయన సంగీత దర్శకత్వం లో 1955లో వచ్చిన ‘’సంతానం ‘’చిత్రం లో పాడే అవకాశం వచ్చింది .తర్వాత స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారి వద్ద అయిదేళ్ళు తపోదీక్షతో బాధ్యతలు నిర్వర్తించారు. స౦గీతం లోని మెలకువలన్నీ ఔపోసనం పట్టారు .

ఆ సమయం లో హాస్యనటుడు శ్రీ  బి పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేరుతొ అనేక నాటకాలు ప్రదర్శించేవారు ఆ సంస్థలో సంగీత దర్శకులుగా కొదండపాణి తన ప్రతిభనంతా చాటి సంగీతం సమకూర్చారు ఈ సంస్థలో పొందిన అపార అనుభవం, కీర్తి వలన 1961లో వచ్చిన ‘’కన్నకొడుకు ‘’చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు .1962లో కళా వాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారు నిర్మించిన ‘’పదండి ముందుకు ‘’సినిమాకు స౦గీత దర్శకులయ్యారు .ఇందులో సినారె రాసిన ‘’ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి ‘’,పాటకు కూర్చిన బాణీ ,సాహిత్యం హృదయాలను ద్రవింపజేస్తుంది .మైలవరపు గోపి రాసిన ‘’గాంధీ పుట్టిన దేశం –ఇది రఘురాముడు ఏలిన రాజ్యం –ఇది సమతకు మమతకు సందేశం ‘’పాటను సుశీలగారితో పాడించి అద్భుతమైన ఎఫెక్ట్ తెప్పించారు .ఇందులోనే ‘’ఓరోరి గుంటనక్కా –ఊరేగే ఊరకుక్కా ‘’సరదాగా సాగే దాశరధి గారిపాట .సిచుయేషన్ కు తగ్గ రీతిలో మలిచారు ‘’చిత్ర నిర్మాత భావనారాయనగారి మంచి రోజులొస్తాయి ,బంగారు తిమ్మరాజు ,తోటలో పిల్ల కోటలో రాణి,లోగుట్టు పెరుమాళ్ళకెరుక  సినిమాలకు వరుసగా సంగీతం అందించారు

  బాలుగా పిలువబడే శ్శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ను పద్మనాభంగారు తీసిన ‘’శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ‘’సినిమాలో మొదటిఆవకాశమిచ్చి పాడించారు. బాలు సంగీత  ప్రస్థానానికి తొలిఅడుగులు  వేయించింది కోదండ పాణి గారే చాలాకాలం వరకు ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే అని ఇద్దరికీ తెలీదు .తానూ సంగీతం చేసే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలనీ,సాహిత్య విలువ ఏమాత్రం దెబ్బతినకూడదని కొదందపానణి  దృఢమైనాభిప్రాయం .మంచి బాణీల వోణీలు వేసినకోదందపాణి అరుడైనసంగీతదర్శకులు .బొమ్మను చేసీ ,ప్రాణము పోసి అనే దేవతలోనిపాట సుఖ దుఖాలలో ఇది మల్లెల వేళ యనీ ,శ్రీరామకధలో జగమే రామమయం,జ్వాలాద్వీప రహస్యం లో చుక్కలన్నీ చూస్తున్నాయి గీతాల మాధుర్యం ఎప్పుడూ హాంట్ చేస్తూనే ఉంటుంది . .

అదృష్ట దేవతలో వీటూరి పాటకు ఘంటసాలగారి చే పాడించిన ‘’కాలం కలిసివస్తే ‘’మంచి హిట్ సాంగ్ .బస్తీ బుల్ బుల్  సినిమాలో చేసిన ట్యూన్స్ అన్నీ బల్ బలేగా ఉన్నాయి –ఈ కళ్ళలో ఈ గుండెలో ఈమదురాలబాధ నిండెనులే ,ఏ ఎండా కాగోడుగుపట్టు రాజా  సైటైరికల్ గా రాత,గానం ఉంటాయి .పద్మనాభం నిర్మించిన కథా నాయకి మొల్ల కు కొదండపాణి సంగీతం కూర్చి సుమధుర స్వరాలు పూయించారు .జగమే రామమయం మనసేఅగణిత తారక నామ మయం ,అద్భుతంగా ఉంటె –‘’తిక్కన్న పెళ్ళి కొడుకాయేనే మా మొల్లమ్మ పెళ్లి కూతురాయేనే ‘’పాటకవ్విస్తే మొల్ల రాసిన ఆణిముత్యపు పద్యాలు సుశీలమ్మతో పాడించి దైవత్వం కల్పించారు .గోపాలుడు భూపాలుడుసినిమాలో టి.ఎం.సౌందరరాజన్ తో ‘’ఇదేనా తరతరాల చరిత్రలో జరిగినదీ ‘’పాట పాడించి గత చరిత్రను ముందు నిలిపారు .ఇందులో బాగా హిట్ అయినపాట ‘’కోటలోని మొనగాడా వేటకు వచ్చావా –జిన్కపిల్లకోసమో ఇంకా దేని కోసమో ? సినారే రాయగా మహా హుషారుగా సుశీల ఘంటసాల గార్లతో పాడించారు .మంచిమిత్రులు సినిమా కు మ్యూజిక్ అందించి –సినారె రాసి న –ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురౌతుంటే –ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే –ఇంకా తెలవారదేమి ఈ చీకటి వ విడిపోదేమీ ?’మాధుర్యం, స్పీడ్ భావ పరవశ్శత్వం ఉద్వేగం మిత్రుల ఆరాటం అన్నీ కలగలుపుగా ఘంటసాల బాలుతో పలికించిన తీరు ఆపాటను చిరస్థాయిని చేసింది .పద్మనాభం తీసిన శ్రీరామకద చిత్రం లో నారదుడు వేసిన పద్మనాభం శ్రీరామజననం నుంచి సీత వియోగం దాకా తల్లడిల్లే రాముని గతం గుర్తు చేసే పాట తో సినిమా ప్రారంభమౌతుంది .కొదండపాణి సంగీత దర్శకత్వం వహించి వీటూరి రాసిన భక్తీ భావం పొంగిపొరలే సుశీలతో కలిసిపాడిన –‘’రావేలా కరుణాలవాలా డరిసెన మీయగ రావేలా –నతజనపాల సన్నుతగుణ లీలా  -కమలాలోలా కాంచన చేల ‘’ బహుకమ్మని గీతం ,సర్వకళా సారము నాట్యము,మాధవా మాధవా నను లాలించరా ‘’మరో భక్తిమందార౦ .సీనియర్ సముద్రాల రాసిన ‘’రామకధా శ్రీరామకద –ఎన్నిమార్లు ఆలించినగానీ ఎన్నిమార్లు దరిసిన్చినగానీ –తనివి తీరాదీ దివ్య కథా ‘’బాలుతో పాడించి చిరయశస్సు చేకూర్చారు .పేదరాసి పెద్దమ్మ చిత్రం లో శ్రీశ్రీ రాసిన –కులుకు నడకల చినదానా –తళుకు బెళుకుల నెరజాణా’’,,పిఠాపురం మాధవ పెద్దిలతో కొసరాజు రచన –వీరులమంటే వీరులం రణ శూరులమంటే ‘’అనే సరదా గీతం ,చిల్లర భావనారాయణతో రాయించి  శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణగారితో పాడించిన –శివ మనో రంజనీ వరపాణీస్వరవాణీ కనవే ‘’భక్తికి పరాకాష్టగా ఉంటుంది .నేనంటే నేను సినిమాలో ఆల్ టైం రికార్డ్ పాట-ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే-పక్కనున్న వాడిమీద నీకు దయరాదటే—గుంతలకిడి గుంతలకిడి గుమ్మా ‘’ గుంతలకిడి విన్యాసంతో ఊపేశారు బాలు కొసరాజు రచనకు .మంచి కుటుంబం  సినిమాలో ‘’ఎవరూ లేని చోటా ఇదిగో చిన్నమాట ‘’త్యాగశీలవమ్మా  మహిళా అనురాగ శీలవమ్మా –తోటివారికి సకలము నొసగే కరునణామయివమ్మా ,మనసే అందాల బృందావనం వేణు ‘మాధవుని పేరే మధురామృతం ‘’,’’నీలోఏముందో ఏమో ఏమో మనసు నిన్నే వలచింది ‘’వంటి పాటలకు తెనేలోలకే బాణీలు కూర్చారు .అలాగే ఇందులోనే ‘’తుళ్ళి తుళ్ళి పడుతోంది మనసు ,నరాననెరా నెరబండీ జరాజరా నిలుపుబండి,డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ ,ప్రేమించుట పిల్లలవంతు వంటి కిలాడి సరదాపాటలకూ జీవం పోశారు పొట్టిప్లీడరు సినిమాలో సన్నీ వేశానికి తగ్గ ట్యూన్ కట్టి హిట్ చేశారు .దేవత సినిమాలో ‘’ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈజగతికి జీవనజ్యోతి ,కన్నులలో మిసమిస కనిపించనీ ,తొలివలపే పదే పదే  గీతాలకు బాణీలతో అజరామరం చేశారు .జ్వాలాద్వీప రహస్యం లో –ఎన్నడు చూడని అందాలు కన్నులముందర తోచెనులే ‘’పాటను సుశీలగారితో గొప్పగా పాడించారు .పదండిముందుకు సినిమాలో తమాషా దేఖో తస్సాదియ్యా ‘’,మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా పాటకు జానకమ్మతో  భలేగా పాడి౦చటమే కాదు ,,మహమ్మద్ రఫీ గారితో నిర్మాత నటుడు జగ్గయ్య రాసిన ‘’మంచికి కాలం తీరిందా ,మనిషికి హృదయం మాసిందా’’ హృదయాలను తాకింది

  1961లో జగ్గయ్య దేవిక కృష్ణకుమారి ల కన్నకొడుకు సినిమాలో జగ్గయ్యరాసిన ‘’రుణరుణ కింకిణిచరణా’’,నామదిలోని కోరికలు అల్లెను పూలమాలికలు ,పూవులు పాపులు దేవుని చిరునవ్వులే నేలపైన చుక్కలు ,మొదలైన గీతాలకు శ్రావ్యమైన బాణీలు కట్టి విజయం సాధించారు .1955లో వచ్చిన సంతానం సినిమాలో బృందగానం లో నాగయ్యగారి  నా ఇల్లు సినిమాలో నేపధ్యగానం లో కొదందపాణి పాల్గొన్నారు

మొత్తం 101సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన కొదడపాణి అతి తక్కువవయసు 42.ఏళ్ళకే 5-4-1974 న గంధర్వ లోకం చేరుకొన్నారు .గాన గాంధర్వ బాలసుబ్రహ్మనం గారిని వెండి తెరకు పరిచయం చేసిన ఈ మహనీయుని  జ్ఞాపకార్ధం బాలు మద్రాసులో   కొదందపాణి రికార్డింగ్ దియేటర్ నెలకొల్పి తన కృతజ్ఞతచాటుకొన్నారు .కోదండపాణి శ్రీరాముని కోదండం నుంచి శరాలు లక్ష్యం వైపు వెళ్లి సాధించి తిరుగులేనివి అనిపించుకున్నట్లు ,కోదండ పాణి శ్రావ్యమైన వేగంతో కూడిన బాణీలు కూడా ప్రేక్షక హృదయాలను పూల బాణాలుగా తాకి ,అలరించి మెప్పించి మహదానందంతో పరవశం కలిగించాయి.ఆ పేరుకు ఆయన సార్ధకత్వం తెచ్చారు .

సశేషం –

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-21-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6

6-మూడున్నర దశాబ్దాలు వెండి తెరను ఏలిన ముక్కుమాటల విలన్ ముక్కామల

ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 – జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. యన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. తల్లిదండ్రులు భార్య భారతి. కుమారుడు సుబ్బారావు. ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ.

సినీరంగం
ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. బహుశాఆనాటకం లోనే ఎంటి ఆర్ ఎమోషన్ తో ముక్కామలను కత్తితో నిజంగానే పొడిస్తే అదృష్టవశాత్తు లోపలి దిగలేదు దీనితో వారిద్దరి మధ్య మాటలు చాలాకాలం లేవు .తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు .ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్‌ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్‌ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్‌.శర్మ ఎన్టీఆర్‌, జగ్గయ్య లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్‌, నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరి, ‘ మాయా మచ్ఛీంద్ర’ చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా సినీ నటన ప్రారంభించారు. అసిస్టెంట్ డైరక్టర్గా కూడా ఉన్నారు .1949లో భరణీ పిక్చర్స్ పేరిట భానుమతి నిర్మించిన ‘లైలా మజ్ను’లో భానుమతి తండ్రిగా నటించారుమంచి రూపం తో చాలా కర్కశంగా మాట్లాడి పాత్ర క్రూరత్వానికి ప్రాణం పోశారు . అరబ్ షేక్ గా లూజు దుస్తులతో అద్భుతమైన గెటప్ తో మాటల మాయాజాలం తో ప్రేక్షకాదరణ పొందారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. ‘మరదలుపెళ్ళీ,’ఋష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్‌ వేయడం ముక్కామల హాబీలు.

భక్త కబీరు నాటకం ఆయనే రాసి ప్రదర్శించి గొప్ప పేరుపొందారు .షేక్స్ పియర్ ఒదేల్లో మెక్బెత్ ఆంగ్ల నాటకాలలో నటించిగుర్తింపు పొందారు .లా చదవటానికి గుంటూరు నుంచి మద్రాస్ వెళ్ళారు .అక్కడ నటనపై మరీ మోజు పెరిగింది

ముక్కామల లాయర్ నటుడైనారు .చాలా విజయవంతమైన నటుడుగా గుర్తి౦పు మ్పుపొందారు .1945లో వచ్చిన మాయ మచ్చీన్ద్ర బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినా లో గోరక్ నాథ్ గా అయన చేసిన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి .పుల్లయ్య గారిదగ్గరే ఉంటూ దర్శకత్వ శాఖలో పని చేశారు .తెలుగు చలన చిత్ర పిత శ్రీ హెచ్ ఎం రెడ్డి ఈయనలో ఉన్న నటనకు ఆకర్షితుడై ,అప్పటిదాకా విలన్ గా దూసుకుపోతున్న ముక్కామలకు నిర్దోషి చిత్రం లోహీరో లాయర్ పాత్ర ఇవ్వగా భేషుగ్గా నటించి సత్తా చూపి తనముద్ర చూపించారు .జానపద పౌరాణిక సాంఘికాలు ఏవైనా ఆయన తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించారు శ్రీ కృష్ణార్జున యుద్ధం ,సీతాకల్యాణం కురుక్షేత్రం మొదలైన సినిమాలలో అగ్రశ్రేణి నటులతో అగ్రశ్రేణి బానర్స్ లో దర్శకులతో పని చేశారు .దాదాపు ఆయననటించిన సినిమాలు విడుదలైన థియేటర్ల బయట ఎప్పుడూ ‘’హౌస్ ఫుల్’’ బోర్డ్ ఉండటం విశేషం .గురువును మించిన శిష్యుడు సినిమాలో ముక్కామల పాత్ర చిరస్మరణీయం .

1950లో వచ్చిన స్వప్న సుందరి మాంత్రికుని పాత్ర ధరించి విలన్ గా స్థిరపడ్డారు 1953లో పరోపకారం లో హీరో పాత్ర వచ్చినా ప్రజామోదం పొందలేదు .ఏదిపాపం ,పాప పరిహారం సినిమాలలో హీరో వేషమూ జనానికి పట్టలేదు .

స్వయంగా చిత్రాలు నిర్మించి దర్శకత్వమూ చేశారు .1952లో’’మరదలు పెళ్లి చిత్రానికి నిర్మాత దర్శకుడు ముక్కామలగారే .’’హిచ్ కాక్’’ శైలిలో ఉందని ప్రశంసలు వచ్చినా ,ప్రేక్షకులు ఎక్కలేదు ..1961లో హరనాథ్ ను రుష్యశృంగునిగా ఋష్యశృంగ చిత్రాన్ని నిర్మించి ,డైరెక్షన్ చేసినా మెప్పించ లేకపోయారు ..సంపాదించిన డబ్బు అంతా సినిమాలు తీయటం లో ఖర్చై జీవితం చివర్లో ఆర్ధిక బాధలు అనుభవించారు .టినగర్లో ఉన్న పెద్ద బంగాళా ఇంటిని అమ్ముకొని చిన్న అద్దె ఇంటిలో ఉండాల్సి వచ్చింది కుటుంబ పోషణ కోసం .ఎవరినీ డబ్బు సాయం చేయమని అడగని మొహమాటస్తుడు .నటిస్తూనే మరణించారు . ముఖాన చిరునవ్వు ,చేతిలో సిగరెట్ ఆయన ఆభరణాలు .వ్యక్తిగతంగా చాలా నెమ్మదస్తులు .నాటకాలు వేసే తీరిక లేకపోవటం తో ఎక్కడైనా నాటక ప్రదర్శన ఉంటె వెళ్లి చూసి ఆనందించేవారు

1972లో అప్నా దేశ్ ,1986లో ప్యార్ కా సిందూర్ హిందీ చిత్రాలలో ముక్కామల నటించారు .బాపూగారి సీతాకల్యాణం ,శ్రీరామాంజనేయ యద్ధం ,లలో విశ్వామిత్రమహర్షి ,సీతాస్వయం వరం లో వశిష్టమహర్షి గా మంచి పేరొచ్చింది బాపుగారి ముత్యాలముగ్గులో కామరాజుగా విలక్షణ పాత్ర పోషించారు .హలం డాన్స్ కు స్టెప్పులేయటం కడుపుబ్బా నవ్విస్తుంది .నందమూరి విరాట్ పోతులూరి లో సయ్యద్ మేనమామ ,భక్తకన్నప్ప లో పెద వేమారెడ్డి ,శ్రీ కృష్ణావతారం లో కంసుడుగా జీవించారు .మర్యాదరామన్న లో మహారాజు ,పరమానందయ్య శిష్యులులో మంత్రి శివానందం ,నాటకాలలో బుస్సీ గా రాణించి బొబ్బిలి యుద్ధం సినిమాలోకూడా బుస్సీ గా నటించటం అదృష్టం .నర్తనశాలలో బామ్మర్ది కీచకుడి దయవలన రాజ్యపాలన చేస్తున్న విరాటరాజుగా ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో దుర్యోధనుడుగా ,జగదేక వీరుని కథలో మహారాజుగా ,జయభేరిలో ధర్మాధికారిగా ,తెనాలి రామకృష్ణలో తాతాచార్యులుగా శృంగారాన్ని, రాయల గురువుగా ,గురుత్వాన్ని ,పేరున్నకవులపై అసూయ ఉన్నవాడిగా గొప్పగా పోషించారు .ధర్మ దేవతలో రఘునాథవర్మ గా నిండుగా నటించారు .అప్పు చేసిపప్పు కూడులో అప్పులు చేయటం లో దిట్ట అయినకొడుకు సి.ఎస్ .ఆర్. నుఅదుపు చేయలేక కొడుకు చేత గదిలో బందీ గా ఉంటూ మనవడు జగ్గయ్య ను తండ్రికి బుద్ధి చెప్పమని ప్రేరేపణ చేసే పాత్రలో తండ్రిగా ముక్కామల చక్కగా నటించారు .1954లో ఎస్ ఎం శ్రీరాములు నాయుడు దర్శకత్వం లో భానుమతి నందమూరి నటించన అగ్గి రాముడు సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ముక్కామల ,హెడ్ గా రేలంగి కడుపుబ్బా నవ్విస్తారు . 1966లో ఎస్ డి లాల్ దర్శకత్వం లో వచ్చిన భీమాంజనేయ యుద్ధం లో కుబేరుడు గా, దండమూడి రాజగోపాలరావు భీముడుగా కామినేని ఈశ్వరరావు ఆ౦జ నేయుడుగా ,చలం మొదటిసారి చివరిసారిగా నారడుడుగా చేశారు.శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసి పి. చంద్ర శేఖరరెడ్డి దర్శకత్వం వహించిన మానవుడు –దానవుడు సినిమాలో శోభన్ బాబు ను, అక్క కృష్ణకుమారిని తీర్చిదిద్దిన ‘’దాదా’’ పాత్రలో ముక్కామల చిరస్మరణీయ నటన ప్రదర్శించారు .జగపతివారి అన్నపూర్ణలోసీరియస్ విలన్ ‘నారయ్యగా-నరహరి గా గంభీరమైన నటన చూపించారు .ఉషాపరిణయం లో బాణాసురుని రాజగురువు గా బాగా నటించారు ,మహామంత్రి తిమ్మరుసులో ప్రతాపరుద్ర గజపతి పాత్రలోజీవం నింపారు .గులేబకావళి లో చంద్ర సేన రాజుగా ,బభ్రువాహనలో నాగరాజు మంత్రి ధృత రాష్ట్రుడుగా రాజధర్మం సమర్ధవంతంగా నిర్వహించే గా౦భీర్యమైన నటన ప్రదర్శించారు .పాండవవనవాసం లో దుర్వాస మహర్షి గా తనదైన సహజ కోపాన్ని గొప్పగా ప్రదర్శించారు . ఇలా ఎన్ని పాత్రలని చెప్పగలం ?అన్ని పాత్రలను అత్యంత సమర్ధంగా నటించి ప్రాణం పోసి చిత్ర విజయాలకు కారకు లయ్యారు .

పాలిష్డ్ విలనిజానికి నేనే ఆద్యుడ ను అని ముక్కామల అంటే కాదు నేనే అని రాజనాల వాదులాడిన సందర్భం ఉంది. నిజంగా విలన్ పాత్రకు ఒక రూపు ,చూపు డైలాగు గాంభీర్యం ఇచ్చిన మొదటినటుడు ముక్కామల అనటం లో అనుమానం లేదు .అందుకే హీరో గా ఆయన్ను ఆక్సెప్ట్ చేయకుండా విలన్ గా ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులు ఆరాధించి నీరాజనాలు పలికారు .

మాంచి భారీ పర్సనాలిటి , కోటేరు ముక్కు ,ముక్కుమాట ,చూపుల్లో గాంభీర్యం ఉన్న విలక్షణ నటుడు విలన్ రచయత ,నిర్మాత ,దర్శకుడు శ్రీ ముక్కామల కృష్ణమూర్తి 67వ ఏట మద్రాస్ లో మరణించారు .ఒక నట ధ్రువతార రాలింది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-12-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5
శ్రీ హనుమంతరావు గారు ‘’మోడరన్ రివ్యు ‘’పత్రిక తెప్పించి చదివేవారు .అందులో ఇండియానుంచి అమెరికా వెళ్లి ఎంతో కష్టపడి చదువుకొన్న వారి చరిత్రలు ఫోటోలతో సహా ప్రచురించేవారు .అందులో శ్రీ మాగంటి బాపినీడు గారి చరిత్ర చదివి ప్రేరితులై తానూ కూడా అమెరికావెళ్లి చదివి తిరిగివచ్చి దాదాపు 500ఎకరాల పొలం కొని టస్కజీ వంటి సంస్థ స్థాపించి హరిజన సేవ చేయాలని పించింది .అప్పుడు అమెరికా వెళ్ళాలంటే 2 వేలరూపాయలు కావాల్సి వచ్చేది అంత దమ్ము వీరి కుటుంబానికి లేదు .తెనాలి తాలూకా పెదపాలెం నుంచి గుంటూరు వెడుతూమధ్యలో మంగళగిరి మీదుగా వెళ్ళే ఇద్దరు భూస్వాములతో పరిచయం కలిగి తన మనసులోని కోరిక వారికి చెప్పగా వారు తప్పక సహాయం చేస్తామని మాటిచ్చారు .వారికోసం వారానికో సారి పెదపాలెం వెళ్ళేవారు .1916అంతా ఈ తిరుగుడు కే సరిపోయింది .ఈ తిరుగుడులోఆవూరిలోనే ఉన్న శ్రీ పుతు౦బాక శ్రీరాములు గారితో పరిచయం కలిగి ఆయన ఎందుకు ప్రతివారమూ వచ్చి వెడుతున్నారని అడగ్గా విషయం చెప్పగా వాళ్ళమాటలు ఎవరూ నమ్మరు .మీకెంత స్థలం ,డబ్బు కావాలి అని అడిగితె,కనీసం ఒక ఎకరమైనా కావాలి అన్నారు .
శ్రీరాములుగారు సద్గుణ సంపన్నులైన పండితకవులు.చదవని గ్రంథమే లేదు తమిళం లోనూ నిష్ణాతులై తిరుప్పావై ని తెలుగు పద్యకావ్యంగా రాశారు. ద్వైత అద్వైత విశిష్టాద్వైతాది మతలాను ఆకళించుకొన్నారు.దేశాభిమానం ఉన్న వారు .గ్రంథాలే ఉద్యమం రాకముందే ఆయన స్నేహితులతో కలిసి పెదపాలెంలో ‘’ఆర్యబాల ‘’అనే పౌరగ్రంథాలయం స్థాపించగా ఇప్పడు అది కొన్ని వేల గ్రంథాలతో వర్ధిల్లింది . సుందర రూపులు. బుద్ధి తేజోమయం. మేలిమి బంగారు చాయతో అపర నున్నగా గీసిన తలతో రామానుజులు లాగా కనిపించేవారు.అయిదు అడుగుల 7అంగుళాల పొడవైన సన్నని శరీరం , కోటేరు తీసినట్లు నాశిక .తామరరేకుల కనులు .తెల్లని ఖద్దరు పంచ తెల్ల ఉత్తరీయం,ఆకు చెప్పులతో మహా ఠీవిగా ఉండేవారు .శాంత స్వరూపులు వదాన్యులు .రావు గారు చెప్పిన హరిజనోద్ధరణ కార్యక్రమం ఆయనకు బాగా నచ్చింది .ఆయనకు నరసయ్యగారనే అన్న ,క్కృష్ణయ్యగారనే తమ్ముడు ఉన్నారు .తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యత నరసయ్యగారే వహించారు .కృష్ణయ్యగారు శ్రీరాములుగారిని అనుసరించేవారు .ముగ్గురూ వైష్ణమతాన్ని తీసుకొని చక్రాంకితాలు వేయించు కొని గురూపదేశం తో దివ్య జీవనం గడిపేవారు .వారిఇల్లు పరిసరాలు శుచి శుభ్రతకు ఆనవాళ్ళు .బందుగణ౦తో నిత్యం కలకలలాడుతూ ఉండే ఇల్లు .
శ్రీరాములుగారు అన్నను తమ్ముడిని సంప్రదించి రావు గారుకోరిన ఎకరం భూమి కొనివ్వటానికి సిద్ధపడి ,గ్రామానికి పడమర కృష్ణ కాలువ వెంబడి ఉన్న భూమిని కొన్నారు .ఆ రోజుల్లో అందరివద్దా డబ్బు పుష్కలంగా ఉండేది .స్త్రీలు విద్యావంతులు సంస్కార వంతులు .వీరి సాయంతో పోగైన సొమ్ముతో ఒకపాకను నిర్మించి రావుగారు హరిజన బాల,బాలికల కోసం ‘’1917లో ఒక చిన్న పాఠ శాల స్థాపించి ‘’శ్రీ కృష్ణాశ్రమం ‘’అని పేరుపెట్టారు .ఆకాలం లో హరిజనులు చదువుకోవాలంటే తప్పక క్రైస్తవమతం తీసుకొని వారి బోర్డింగ్ స్కూల్స్ లోనే చదవాలి .ఈపిల్లలకు భోజన వసతికూడాకలిపించాలని చందాలరూపంగా పది వేలరూపాయలు వసూలు చేసి ,1923లో పెద్ద భవనం ,కొన్నిపాకలు నిర్మించి 50మంది విద్యార్ధులకు భోజన వసతి కల్పించారు రావుగారు .ఎక్కువమంది మాలమాదిగ దాసుళ్ళ పిల్లలే చేరారు .దాసులు పౌరోహిత్యం ,వైద్యమూ చేసేవారు.చదువు వలన లాభమేమిటో గ్రహించారు .బోర్డింగ్ లో ఉన్నవారే కాక మరొక అరవై మంది రోజూ బడికి వచ్చి చదువుకొనేవారు .హాస్టల్ బాలురందరూ నున్నగా గొరిగిన తలలతో ఊర్ధ్వ పు౦డ్రాలతో ,ఉదయమే కాలువ స్నానంతో పవిత్రంగా ఉండేవారు .రామభజన చేసి జావతాగి తరగతులకు హాజరయ్యేవారు .కాలవగట్టున నడిచి వెళ్ళే బాటసారులు ఈ పిల్లలు అందరూ వైష్ణవులే అని భ్రమపడేవారు .దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు ,ఆంధ్రకేసరి ప్రకాశంపంతులుగారు ఈ విద్యాలయాన్ని దర్శించి ఆనంద పరవశులయ్యారు .
మంగళగిరిలో ఉన్నప్పుడు రావుగారు పోస్ట్ మాస్టారి తో స్నేహం వలన ఎక్కువకాలం పోస్టాఫీస్ లోనే గడుపుతూ ఎవరికైనా ఉత్తరాలు రాసిపెట్టాలన్నా మనియార్డర్లు పూర్తీ చేయాలన్నీ ఉచితంగా చేసేవారు. వాళ్ళు డబ్బు ఇస్తామన్నా తీసుకొనే వారు కాదు. రావు గారికి 15-16ఏళ్ల వయసులో విపరీతంగా జబ్బుచేస్తే ఊరి పోస్టు మాష్టారి సలహాతో తొట్టి స్నానం చేసి ఆరోగ్యం పున్జుకొన్నారు అప్పటికి ఈస్నానం గురించి మనదేశం లో పెద్దగా ఎవరికీ తెలియదు .జర్మనీ డాక్టర్ కూనేదీనిపై గొప్ప పుస్తకం రాశాడు .మద్రాస్ లా కాలేజిలో చదివే శ్రీ గంధం కృష్ణారావు తెప్పించి చదివి ఆరోగ్యం పొందగా ఆ వైద్యం వ్యాపించింది .రావుగారుకూడా దాన్నిచదిడవి ఆకలింపు చెసుకొనిఎవరికి ఏజబ్బు చేసినా ప్రకృతి చికిత్సతొ ఈజీ గా నయం చేసేవారు ,
1916లో పెదపాలెం కమ్మవారిళ్ళల్లో ఘోషా పధ్ధతి ఉండేది .ప్రతి ఇంట్లో ఒక తెర ఉండేది. ఆ తెర వెనకనుంచి మాత్రమె స్త్రీలు పరపురుషులతో మాట్లాడేవారు.ముసలి స్త్రీలుకూడా పరపురుషుడు కనబడితే ప్రక్కలకు తప్పుకొని పోయేవారు లేదాసందులలోకి వెళ్ళేవారు ,దాక్కొనే వారు .ఈ పధ్ధతి సంస్కారం రావాలనుకొనే రావుగారికి వింతగా అనిపించేది.ఈయన్ను చూసి సందు గొందులలోకి తప్పుకొనే ముసలమ్మలను చూసి ‘’అమ్మా నేను మీ మనవడి లాంటి వాడిని .నన్నుచూసి దాక్కోటం ఎందుకమ్మా ?’’అంటే ముసిముసి నవ్వులు నవ్వుకోనేవారు .రావు గారు ఈ గ్రామం లో ప్రవేశించిన తర్వాత ఈ ఘోషా క్రమక్రమ౦గా తగ్గిపోయింది .తర్వాత ఘోషా పాటించటం మానేసి ‘’మీరు వచ్చాక మాకు కొంత స్వేచ్చ దొరికింది ‘’అని కృతజ్ఞత చెప్పి సంతోషించేవారు .
1917జనవరిలో ముక్కోటి ఏకాదశినాడు పుతు౦బాక శ్రీరాములుగారి ఇంటి స్త్రీలు బంధువులతో వచ్చి దేవాలయానికి ఉత్తరానున్న పెరకలపూడి సత్రం లో బసచేశారు .రావుగారు దేవాలయ గదిలోతాను స్థాపించిన గ్రంథాలయం లో నిద్రించి ఉదయం స్నానాదులు పూర్తీ చేసుకొని సత్రానికి వెడుతుంటే దారిలో ఒక బంగారు గొలుసుకనిపించి విచారించగా అది శ్రీరాములుగారి భార్యగారిదని తెలిసి వెళ్లి ఇచ్చేశారు .ఆమె ‘’అయ్యా రావు గారూ!గొలుసు మీకు దొరకబట్టి నాకు తిరిగి ఇచ్చేసి నా ప్రాణాలు కాపాడారు .లేక పొతే నాగతి ఏమయ్యేదో ?”’అన్నారు .పుతు౦బాకవారి కుటుంబం లోని ఆడా ,మగా రావు గార్ని తమస్వంత మనిషిగా భావించేవారు .ఆప్యాయతగా ఉండేవారు .శ్రీనరసయ్యగారు ఏదో పనిమీద వచ్చి రావుగారి నాయనగార్నికలిసి ‘’మేము ఇదివరకు ముగ్గురన్నదమ్ములం .ఇప్పుడు హనుమంతరావు గారితో కలిసి మేము నలుగురన్నదమ్ములం ‘’అన్నారట .వీరి తండ్రి ఆనంద పరవశులయ్యారట .
రావుగారి వివాహం 1919లొ తెనాలిదగ్గర శిరిపూడిలో మద్దాలివారి ఆడపడుచు కనక దుర్గాంబ గారితో జరిగింది .మామగారుపురుషోత్తమరావు గారు సంపన్నులు.నైజాం లోని జటప్రోలు సంస్థాన పోలీస్ ఇన్స్పెక్టర్ చేసి రిటైరయ్యారు అయిదుగురు బావామరుదులు . శ్రీనివాసశిరోమణి అనే కరణం శ్రీనివాసరావు ఈయనకు షడ్ధకుడు .రెండవ బావమరది జటప్రోలు రాణీ వద్ద పియే.మూడవ ఆయన్ను కృష్ణాశ్రమ లో గుమాస్తాగా తీసుకొన్నారు .అందరూ ప్రయోజకులే .అందరూ నరసరావు పేటలో స్థిరపడ్డారు .
1919లో గుంటూరు జిల్లా కలెక్టర్ హిల్ దొర హరిజన ఉద్ధరణకు పాటుబడే హిందూ సంస్థ ఉంటె మంగళగిరిదగ్గర కురుకల్లు గ్రామంలో సుమారు నాలుగు వందల ఎకరాలు పట్టా భూమి ఇస్తామని గుంటూరు ఆర్ డివోగుండూరావు గారికి తెలియజేయగా ,ఆయన రావుగారికి తెలియజేస్తే,అంగీకరించి ఇద్దరూ కలిసి వెళ్లి ఆ భూమిని చూసి వచ్చారు ఇంతలో 1920 అసహాయోద్యమం ఉద్ధృతంగా సాగుతూండగా రావుగారిలోని జాతీయభావాలుఆ భూమిని తీసుకోటానికింగీకరించక గుందూరావుగారికి తెలి య జేయగాఆయనకు విపరీతంగా కోపమొచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5

5-ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ

చదలవాడ కుటుంబరావు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ చదలవాడ అంటే అందరికీ  తెలుసు . అంటే ఇంటిపేరుతోనే చలామణి అయిన  హాస్యనటుడు శ్రీ చదలవాడ కుటుంబరావు . కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో జన్మించారు .పెరిగింది చదివిందీ ఇక్కడే .  .ప్రజా నాట్యమండలి నాటకాలలో నటించి   ఆ  అనుభవం సంపాదించిన తర్వాతనే చిత్ర రంగం లోకి ప్రవేశించారు .నాటక రచయిత శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి గారి ‘’పల్లెపడుచు ‘’నాటకంలో చదలవాడ ‘’పిచ్చయ్య ‘’గా నటించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు పొందారు .ఈ నాటకం లో ఊర్వశి శారద ,ఆంధ్రా దిలీప్ చలం మొదలైనవారు కూడా నటించారు .ఇదే సినిమా రంగ ప్రవేశానికి మార్గం చూపింది .ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు దృష్టిలో పడ్డారు .ఆయన తన స్వంత జనతా పిక్చర్స్ తో  తీసిన ‘’నిరుపేదలు ‘’సినిమాలో చదలవాడకు అవకాశామిచ్చారు .ఆయనే తీసిన పరివర్తన సినిమాలో అక్కినేని ,సావిత్రి లతో కలిసి చదలవాడ తో నటి౦ప జేశారు ..సావిత్రి నాగేశ్వరరావు చెల్లెలుగా నటించటం విశేషం .   

  మొదటి చిత్రం 1944లో విడుదలైన తాసీల్దార్ .తర్వాత స్వర్గ సీమ లో ఆతర్వాత 1949లో మనదేశం లో ‘’మధు ‘’పాత్రలో నటించారు .దాదాపు ఆయన నటించిన పాత్రలన్నీ నౌకరు పాత్రలే అంతకు మించి ఆయనకు ప్రమోషన్ దొరకపోవటం బాధ కలిగిస్తుంది .తమాషా అయిన యాస తో అందులోనూ కృష్ణా జిల్లాయాస తో  ఆయన పగలబడి  నవ్వించారు .చూస్తేనే నవ్వు పుట్టేది .విజయా  సంస్థలో నెల జీతానికి పని చేశారు కనుక వారి చిత్రాలలో తప్పక ఉండేవారు .1951లో వచ్చిన పాతాళభైరవి ,1952 లోని పెళ్లి చేసిచూడు లో తన యాసతో నవ్వించి కూసాలు కదిలించారు .’’అబ్బాయా ‘’అంటూ చేసే నటన గిలిగింతలు పెట్టిస్తుంది .’’తేడా ‘’గా కూడా కొన్ని సినిమాలో బాగా చేశారు .వ్యక్తిగతంగా కూడా చమత్కారి ఆయన సెట్ లో ఉంటె నవ్వులపూల వర్షమే కురిసేది .జమీందారు వేషం వేసినా యాస మార్చే వారు కాదు .నిర్మాత ,దర్శకులనే పాత్ర లక్షణాన్ని మార్చమనే వారు .ప్రతి సందర్భం లోనూ వ్యంగ్యం లేకుండా డైలాగ్ ఉండేది కాదు .మాయా బజారులో ఘటోత్కచని గురువు రమణా రెడ్డి శిష్యుడు’’ లంబు’’ గా  ,’’జంబు ‘’పాత్రధారి నల్లరామ మూర్తి తోకలిసి పోటీ పడి ‘’వీర తాళ్ళు ‘’వేయించుకొనే సందర్భం లో హాస్యం ఉరకలేస్తుంది . ‘’దుసత చతుసతయం ‘’అంటూ దుష్ట చతుష్టయాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు చేసిపలికినప్పుడు ఘతోత్కాచుడే సెబాస్  అంటే  నవ్వలేక చస్తాం .హస్తినాపురం లో ఈ త్రయం సృష్టించిన హాస్యవల్లరికి కడుపుబ్బా నవ్వుకొంటాం .పెళ్లి నాటి ప్రమాణాలలో ప్రకటనలు అమ్మకాలు పాత్రలలో చదలవాడ ,అల్లు రామలింగయ్య హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది .  ఆయనపాత్ర ఆయకట్టు కొంటుంది .కొంపలు కూల్చే పనికన్నా కొంపలు నిలబెట్టే పనులు చేసే పాత్రలే ఎక్కువగా పోషించారు చదలవాడ.ఆయన నటించిన పాత్రలన్నీ గుర్తింపు పొందినవే. చెరగని ముద్ర వేసినవే .అప్పు చేసి పప్పు కూడు సినిమాలో సియేస్ ఆర్ ఇంటి నౌకరు  చెంచయ్య పాత్రలో జీవించి యాజమాని  ,కోడలు జమునకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక ,ఆమెను సమర్ధిస్తూ ,విదేశాలనుంచి తిరిగి వచ్చిన యజమాని కొడుకు జగ్గయ్య కు జమున విషయం లో న్యాయం చేయటానికి పూర్తీ మద్దతు నిస్తూ ,మానవత్వం చూపిస్తూ నటించిన తీరు  హాట్సాఫ్ అని పిస్తుంది .నవరాత్రి ,తిరుపతమ్మ కథ చిత్రాలలో ఆయనవి గుర్తుండి పోయే పాత్రలే .ఆదుర్తి సుబ్బారాగారి దర్శకత్వం లో వచ్చిన ఆడపెత్తనం సినిమాలో డామినేటింగ్ కన్నాంబ గారికి అణగి మణగి ఉండే   ‘’హెన్ పెక్కేడ్ హజ్బండ్ ‘’గా ,మొదట్లో అంత పెద్ద నటికీ భర్తగా తానా ?అనికంగారుపడినా,కన్నాంబ ,ఆదుర్తి  ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం తో  ‘’ఇరగదీసి ‘’నటించి  హాస్యం పండించి, ప్రేక్షక సానుభూతి పొందారు . భార్యా భర్తలు సినిమాలో విలన్ వేసిన హాస్యనటుడు పద్మనాభం కు వ్యతిరేకంగా  కీలక సాక్ష్యం చెప్పి   నేరారోపణ పై జైలులో ఉన్న హీరో అక్కినేనిని  విడుదల అవటానికి దోహద పడిన   పాత్ర లో చదలవాడ అద్భుతంగా ,అవలీలగా, సునాయాసంగా తనదైన చమత్కార  ధోరణిలో నటించి చరితార్ధం చేశారు.ఈ మంచి పాత్ర ఆయనకు గొప్పపేరు తెచ్చింది  .మొనాటనీ లేకుండా ఎప్పటికప్పుడు హాస్యానికి కొత్త దనం  చివుళ్ళు తొడుగుతూ  నటిస్తూ మెప్పించారు . శ్రీ కృష్ణార్జున యుద్ధం లో ‘’మంచి బుద్ధి ‘’పాత్రలో తాను ప్రేమించే బాల సరస్వతిని పెళ్లి చేసుకోటానికి చినముని అయిన అల్లును ‘’ఓ ఏరో ,ఎంట్రికో  మీ బూడిదో  దయ సేయండి దాన్ని తాకించి నా దాన్ని సేసుకొంటా ‘’అనే డైలాగ్ ,సుభద్రను రధం మీద ఎక్కించుకొని అర్జునుడు పారిపోయిఅనప్పుడు ‘’మోసం గురూ ‘’అని బలరాముడికి చెప్పినప్పుడు చదలవాడ వైవిధ్యభరిత నటన ప్రదర్శి౦చారు.1959లోవచ్చిన జంపన వారి కృష్ణ లీలలు లో వెర్రి యాదవుడిగా  అలవోకగా నటించి నవ్వించారు .జయభేరిలో ‘’డప్పుల రాఘవులు ‘’పాత్రను హాస్యపు డప్పుతో మెప్పించారు .పల్లెటూరు సినిమాలో ప్లే బాక్ సింగర్  .పరివర్తనలో పిచ్చివాడుగా ,పెద్దమనుషులు లో శేషావతారంగా ,కన్యాశుల్కం లో గురజాడ వారి మర్చి పోలేనిపాత్ర పోలిసెట్టిగా ,చరణ దాసీ లో హనుమంతుగా ,తోడి కోడళ్ళు లో తిరుపతయ్యగా ,1957లో వచ్చిన సంకల్పం లో లక్ష్మయ్యగా ,అన్నా తమ్ముడు లో బ్రహ్మాండంగా ,మా బాబులో రాముగా ,సిరి సంపదలు లో అ౦జయ్యగా ,ఆత్మబలం లో ఆనంద్ తండ్రిగా ,మర్మయోగిలో బైరాగిగా ,ఆస్తిపరులలో మిరియాల పరాత్పర రావుగా ,1967లో వచ్చిన ఆడపడుచులో సుఖాలుగా ,1968లో విడుదలైన లక్ష్మీ నివాసం లోనూ చదలవాడ చెరగని ముద్ర తో నటించి పాత్రలకు జీవం పోశారు .అమాయకపు చిరునవ్వు ,మెలికలు తిరుగుతూ మాట్లాడటం ,కళ్ళలో కొంటెతనం ,ముతకపంచ అరచేతుల చొక్కా పైన తుండు సాధారణంగా ఆయన వేషం .

 స్నేహితుడు శ్రీరామ మూర్తి ,ఇతరుల ప్రోత్సాహం తో  చదలవాడ ‘’సతి తులసి ‘’పౌరాణిక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు తనకు ప్రజానాట్యమండలి లో సహచరుడు అయిన శ్రీ వి .మధుసూదనరావు ను దర్శకునిగా పరిచయం చేస్తూ  సీనియర్ కేరక్టర్ నటుడు శ్రీ గుమ్మడిని ‘’జలంధర ‘’పాత్రకు ఒప్పించి  నిర్మించారు .

   విక్టరి మధు సూదనరావు అనబడే డైరెక్టర్  శ్రీ వి.మధుసూదనరావు  చదలవాడ గారి అల్లుడే .మొత్తం సుమారు 150 సినిమాలో వైవిధ్యభరిత పాత్రలనుపోషిస్తూ నటించిన చదలవాడ 1968లోరాత్రి పూట సినిమా షూటింగు కు వెడుతూ  తెలుగు చలన చిత్ర సీమనుంచి చదలేటి  స్వర్గ సీమకు తరలి వెళ్ళారు .   

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని .’’అప్ ఫ్రం స్లేవరి ‘’పుస్తకం చదివాక అమెరికా వెళ్లాలనిపించింది . .ఒకా నీగ్రో తన జాతిని ఉద్ధరించిన కథ ఇది .తాను కష్టపడి చదివివిద్యావంతుడై 1200 ఎకరాలభూమికొని ‘టస్కజీ ఇన్ ష్టిట్యూట్ స్థాపించి ,అనేక వృత్తి విద్యలు నేర్పి తనజాతిని ఉద్ధరించిన యదార్ధ గాధ ..’’వాట్ దెన్ మస్ట్ డు’’చదివాక సేవాధర్మం తో జీవితం ధన్యం చేసుకోవాలని పించింది .మంగిపూడి వెంకటేశ్వర శర్మగారి ‘’నిరుద్ధ భారతం ‘’చదివాక హరిజనోద్ధరణకోసం ఒక సంస్థ స్థాపించాలని కోరిక కలిగింది . నండూరి శేషాచార్లు పరమమిత్రులై సోదరునిలా రావు గారిని చూసుకోనేవారు .ఆయనతో మాట్లాడటానికి 1913లో మద్రాస్ వెళ్లి ,ఆయన మద్రాస్ మెడికల్ కాలేజిలో చదువు తుండగా కొన్నాళ్ళు ఉన్నారు ,అక్కడ దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వరావు గారు గులాబీ రంగు రఫ్ కాగితం మీద ఆంద్ర పత్రిక వారపత్రిక పెద్ద సైజులో బొంబాయి ను౦చి ప్రచురించేవారు .దాన్ని మద్రాస్ లో దినపత్రికగా తెస్తున్నారన్న వార్త తెల్సి ,ఆయన మద్రాస్ వస్తే అపరభగవంతుడుగా ధన్వంతరిగా భావింపబడే పండిత దీవి గోపాలా చార్యుల వారింట్లో ఉంటారని తెలిసి ఆయుర్వేద కాలేజిలో పంతులుగార్నికలిసి తాను దేశాభిమాని పత్రికలో పని చేశానని చెప్పగా పత్రిక మద్రాస్ లో ప్రచురించే సమయం లో వచ్చి కలవమని చెప్పారు .1914లో పత్రిక మద్రాస్ లో ముద్రణ ప్రారంభించగా తెలిసి పంతులు గారిని కలవగా ,ఈయన తెనుగుసేతకు సంతృప్తి చెంది ,నెలకు 30 రూపాయల జీతం తో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలం శ్రద్ధగా పని చేశారు .అద్దె ఇంట్లో పత్రిక వెలువడేది .తర్వాతతంబు చెట్టి వీధిలో బిల్డింగ్ ను వాయిదాలమీద ఆచార్యుల వారి పలుకు బడితో కొన్నారు .పత్రిక బాగా క్లిక్ అయింది .అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది .అప్పుడు శ్రీకోట౦ రాజు పున్నయ్య ,శ్రీ అవటపల్లి నారాయణ రావు గార్లు సబ్ ఎడిటర్లు .ట్రిప్లి కేన్ లో నెలకు పది రూపాయల బాడిగ తో ఒకగదిలో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్ళివచ్చేవారు .పని వత్తిడి వలన జబ్బు చేసిసెలవుపెట్టి మంగళగిరి వెళ్ళారు . అమెరికా సుప్రసిద్ధ ప్రకృతి చికిత్సానిపుణుడురాసిన ‘’ది సుపర్బ్ వైటాలిటి ‘’పుస్తకం అమెరికా నుంచి తెప్పించి పూర్తిగా చదివి అందులో ఉన్నప్రకారం చేస్తే ఆరోగ్యం కుదుటబడింది .రోజూ పానకాలస్వామి గుడిమెట్లు ఎక్కగలిగినంత ఎక్కి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,ఆతర్వాత పూర్తీ మెట్లు ఎక్కే బలం పొందారు .ఇంట్లో చల్లని నీటితో తొట్టి స్నానం చేసి ,గోధుమ రొట్టె కూరలు పండ్లు ఆవుపాలు తీసుకొంటూ బలం పున్జుకొన్నారు .సాయంకాలం తాడేపల్లి రోడ్డులో రెండు మైళ్ళు నడిఛి వచ్చి మళ్ళీ తోట్టిస్నానం చేసి భోజనం చేసేవారు రెండు నెలలో పూర్తీ ఆరోగ్యం పొందారు . సశేషం మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని .’’అప్ ఫ్రం స్లేవరి ‘’పుస్తకం చదివాక అమెరికా వెళ్లాలనిపించింది . .ఒకా నీగ్రో తన జాతిని ఉద్ధరించిన కథ ఇది .తాను కష్టపడి చదివివిద్యావంతుడై 1200 ఎకరాలభూమికొని ‘టస్కజీ ఇన్ ష్టిట్యూట్ స్థాపించి ,అనేక వృత్తి విద్యలు నేర్పి తనజాతిని ఉద్ధరించిన యదార్ధ గాధ ..’’వాట్ దెన్ మస్ట్ డు’’చదివాక సేవాధర్మం తో జీవితం ధన్యం చేసుకోవాలని పించింది .మంగిపూడి వెంకటేశ్వర శర్మగారి ‘’నిరుద్ధ భారతం ‘’చదివాక హరిజనోద్ధరణకోసం ఒక సంస్థ స్థాపించాలని కోరిక కలిగింది . నండూరి శేషాచార్లు పరమమిత్రులై సోదరునిలా రావు గారిని చూసుకోనేవారు .ఆయనతో మాట్లాడటానికి 1913లో మద్రాస్ వెళ్లి ,ఆయన మద్రాస్ మెడికల్ కాలేజిలో చదువు తుండగా కొన్నాళ్ళు ఉన్నారు ,అక్కడ దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వరావు గారు గులాబీ రంగు రఫ్ కాగితం మీద ఆంద్ర పత్రిక వారపత్రిక పెద్ద సైజులో బొంబాయి ను౦చి ప్రచురించేవారు .దాన్ని మద్రాస్ లో దినపత్రికగా తెస్తున్నారన్న వార్త తెల్సి ,ఆయన మద్రాస్ వస్తే అపరభగవంతుడుగా ధన్వంతరిగా భావింపబడే పండిత దీవి గోపాలా చార్యుల వారింట్లో ఉంటారని తెలిసి ఆయుర్వేద కాలేజిలో పంతులుగార్నికలిసి తాను దేశాభిమాని పత్రికలో పని చేశానని చెప్పగా పత్రిక మద్రాస్ లో ప్రచురించే సమయం లో వచ్చి కలవమని చెప్పారు .1914లో పత్రిక మద్రాస్ లో ముద్రణ ప్రారంభించగా తెలిసి పంతులు గారిని కలవగా ,ఈయన తెనుగుసేతకు సంతృప్తి చెంది ,నెలకు 30 రూపాయల జీతం తో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలం శ్రద్ధగా పని చేశారు .అద్దె ఇంట్లో పత్రిక వెలువడేది .తర్వాతతంబు చెట్టి వీధిలో బిల్డింగ్ ను వాయిదాలమీద ఆచార్యుల వారి పలుకు బడితో కొన్నారు .పత్రిక బాగా క్లిక్ అయింది .అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది .అప్పుడు శ్రీకోట౦ రాజు పున్నయ్య ,శ్రీ అవటపల్లి నారాయణ రావు గార్లు సబ్ ఎడిటర్లు .ట్రిప్లి కేన్ లో నెలకు పది రూపాయల బాడిగ తో ఒకగదిలో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్ళివచ్చేవారు .పని వత్తిడి వలన జబ్బు చేసిసెలవుపెట్టి మంగళగిరి వెళ్ళారు . అమెరికా సుప్రసిద్ధ ప్రకృతి చికిత్సానిపుణుడురాసిన ‘’ది సుపర్బ్ వైటాలిటి ‘’పుస్తకం అమెరికా నుంచి తెప్పించి పూర్తిగా చదివి అందులో ఉన్నప్రకారం చేస్తే ఆరోగ్యం కుదుటబడింది .రోజూ పానకాలస్వామి గుడిమెట్లు ఎక్కగలిగినంత ఎక్కి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,ఆతర్వాత పూర్తీ మెట్లు ఎక్కే బలం పొందారు .ఇంట్లో చల్లని నీటితో తొట్టి స్నానం చేసి ,గోధుమ రొట్టె కూరలు పండ్లు ఆవుపాలు తీసుకొంటూ బలం పున్జుకొన్నారు .సాయంకాలం తాడేపల్లి రోడ్డులో రెండు మైళ్ళు నడిఛి వచ్చి మళ్ళీ తోట్టిస్నానం చేసి భోజనం చేసేవారు రెండు నెలలో పూర్తీ ఆరోగ్యం పొందారు . సశేషం మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండితెర మహానుభావులు -4

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4

4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల

అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి తో ఆగిపోయినా ,స్వశక్తితో తెలుగు సంస్కృతం హిందీ భాషలలో ప్రశంసార్హమైన పరిచయం సాధించారు .ఏ గురువు దగ్గర నేర్చుకోకపోయినా సంగీత నాట్యాలలో ప్రజ్ఞ సాధించారు .కలువ రేకుల్లాంటి విశాలమైన కనులు ,కలస్వన మాధుర్యాన్ని చిందే గాత్రం ,రూప లావణ్యం మెచ్చి దర్శకుడుశ్రీ  సి.పుల్లయ్య 1935లోకాశీ ఫిలిమ్స్ వారి ‘’శ్రీ కృష్ణ తులాభారం ‘’సినిమాలో మిత్ర వింద భూమికను ఇచ్చారు .డైరెక్టర్ వైవి రావు .ఆ చిత్రం విజయం పొందకపోయినా ,కాంచనమాల రూపు రేఖలు ,నటనా సామర్ధ్యం చిత్ర నిర్మాతలను విపరీత౦ గా ఆకర్షించాయి .అందరి చూపు తనవైపు ఆకర్షించేట్లు చేశారామే . అంబాలా పటేల్ హిందీలో తీసిన అభిమన్యు ఆధారంగా తెలుగులో తీసిన వీరాభి మన్యులో ఈమెను వెతికి పట్టుకొని హీరోయిన్ చేశారు .  

 1936 లో వీరాభిమన్యులో నాయకి పాత్ర,1937విప్రనారాయణ ,లో దేవ దేవిగా  తన అందాలు వొంపు సొంపులతో విప్రనారాయణ ను మాత్రమే కాక యావదాంధ్ర ప్రేక్షకలోకాన్నీ మైమరపించి నటించారు .

అభ్యుదయ భావాలున్న శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ౦ గారు1938లో సారధీ పతాకం క్రింద తాను  తీసిన ‘’మాలపిల్ల ‘’సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇచ్చారు .ఈ సినిమా అన్నిటా విజయం సాధించటం తో కాంచనమాల ఒక తారగా స్థిర పడ్డారు .ఈ సినిమాలో ఆమె కట్టినచీర ,గాజులు జాకెట్లు ‘’కాంచనమాల చీర జాకెట్ గాజులుగా  ‘’గా ప్రఖ్యాతిపొంది  వ్యాపారులు అలాంటి బ్రాండ్ పేరుతొ   హాట్ కేకుల్లా అమ్మి విపరీతమైన లాభాలు గడించారు .’’మాలపిల్ల ఇంత అందంగా ఉంటె ఎవరు పెళ్లి చేసుకోరు ‘’అని ఎందరి చేతనో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమం కాలం లో ఈ సినిమా తీయటం అందులో అంతటి గ్లామర్ క్వీన్ నటించటం సాహసమే .సినిమా సెకండ్ హాఫ్ లో ఆమెను  విద్యావంతురాలుగా తీర్చి దిద్దారు .ఒక సీన్ లో స్లీవ్ లెస్ జాకెట్ తో  చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్  వేలాది కాలెండర్ లపై  ప్రింట్ అయి,విపరీతంగా అమ్ముడయ్యాయి .అదే సమయంలో గృహ లక్ష్మి సినిమాలో వాంప్ పాత్రలో కనిపిస్తే విమర్శలు ,ప్రశంసలూ కూడా వచ్చాయి   .  ఆ నాటి మేటి హీరో చిత్తూరు నాగయ్యగారి రెండవ సినిమా వందేమాతరం లో ఆయన  సరసన  దీటుగా నటించారు  .ఈ సినిమా ఇద్దరికీ చాలా పేరు తెచ్చింది. తర్వాత 1939లో వచ్చిన మళ్ళీ పెళ్లి చిత్రం లో వితంతువుగా నటించినా బహు అందంగా కనిపించారు ,1940లో  మైరావణ లో నటించినా,బాక్సాఫీస్ దగ్గర ఫట్ అయింది .ఇల్లాలు ,మైరావణ , లలో గుర్తింపు తెచ్చే పాత్రలు పోషించారు .1942లో జెమినీ వారి ‘’బాలనాగమ్మ ‘’మెయిన్ కారెక్టర్ బాలనాగమ్మ గా నటించి నటనలో  హిమాలయ శృంగం గా నిలిచారు .అప్పటికే ఆమెను ‘’ఆంధ్రా గ్రేటా గార్బో’’ఉంప్ గరల్ అని గొప్ప పేరు పొందారు .గ్రేటా స్వీడిష్ –అమెరికన్ గ్లామర్ హీరోయిన్ ..ఎందఱో నిర్మాతలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గోల్డెన్ పీరియడ్ అది  ,జెమినీ అధినేత వాసన్ తో  జెమినీ చిత్రాలలోనే నటిస్తానని పొరబాటున అగ్రిమెంట్ రాసివ్వటం తో కాంచనమాల బంగారు భవిష్యత్తు దెబ్బతిన్నది .ఈ అగ్రిమెంట్ వలన వచ్చిన ఆఫర్లను తిరస్కరించాల్సి వచ్చింది .పోనీ వాసన్ కూడా కొత్త సినిమాలు తీసే ఆలోచనలోనూ లేడు.ఆమెను ఇబ్బంది పెట్టె పరిస్థితి కల్పించాడు .ఈ సినీ మాయాజాలం ఆమెకు తెలీదు .అగ్రిమెంట్ రద్దు చెయ్యమని వాసన్ తో మర్యాదగా చెప్పింది. ఆయన కుదరదుపొమ్మన్నాడు .మాటామాటా పెరిగి కాంచనమాల ‘’నీదిక్కున్న చోట చెప్పుకో .కొటీశ్వరుడవైతే నాకేంటి ?’’అని ధైర్యంగా పలికింది మాయలమారి ఆయిన వాసన్ ఈ మాటలు చాటుగా రికార్డ్ చేయించి ఆమెకే వినిపిస్తే అవాక్కై౦ది .ఈ టేపుతో కోర్టుకెక్కి ఆమె అంతు చూస్తానన్నాడు వాసన్ .ఇది ఆమెకు ఊహించని షాక్ .అదే సమయం లో ఆమె నటించిన బాలనాగమ్మ రిలీజ్ అయి అఖండ విజయం తో కనకవర్షం కురిసి వాసన్ అప్పులన్నీ తీరి  బయట పడ్డాడు.బాలనాగమ్మ పాత్ర కాంచనమాల నటనకు గీటురాయిగా నిలిచింది .హీరోయిన్ గా అదే ఆమె ఆఖరి చిత్రం అయింది .ఆంద్ర ప్రేక్షకుల నయనాలన్నీ తనవైపుకే తిప్పుకొన్న ఆమె కళ్ళు ఆ షాక్ తో శూన్యం లోకి చూడటం మొదలు పెట్టాయి ,ఇంట్లో నుంచి బయటికి చాలాకాలం రాలేదు .హిందీ సినిమాలో కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చినా ,తిరస్కరించి,తెలుగు మీద మమకారం తో తెలుగు సినిమాలలోనే అంకితభావంతో నటించిన అందాల నటికి ఇంతటి దుస్థితి రావటం అత్యంత విచారకరం దారుణం .ఒకరకం గా మతి స్థిమితం కోల్పోయింది .ఇలా ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయవ్యాధితో మరణించటం గోరు చుట్టుపై రోకటి పోటై ఆమెనుమరింత కుంగదీసింది .కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు .

 కాంచనమాల స్నేహితురాలు లక్ష్మీ రాజ్యం గారి బలవంతం మీద వారు 1963లో నిర్మించిన ‘’నర్తన శాల ‘’సినిమాలో ఒక చిన్న పాత్రలో చివరిసారిగా కాంచనమాల నటించారు  .ఆమె నటిస్తోందన్న వార్త విపరీతంగా వ్యాపించి వేలాది అభిమానులు ఆమెను చూడటానికి వస్తే  ఎవరినీఆమె గుర్తు పట్టక పోవటంతో తీవ్ర నిరాశ చెందితిరిగి వెళ్ళిపోయారు .దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాకోసం మేకప్ వేసుకొన్నా ,ఆమెలో ఏమాత్రం ఆనందం కనిపించలేదు

   కాంచనమాల నటించిన ఇల్లాలు సినిమా గొప్పగా విజయం సాధించకపోయినా ,ఆంద్ర పత్రిక ఫిలిం బాలెట్ లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు .లవ్ మారేజ్ ,జింబో హిందీ సినిమాలో కూడా కాంచనమాల నటించిమెప్పించారు .కేవలం 12 సినిమాలో  మాత్రమె నటించినా  ఆమె పేరు చిరస్థాయిగా నిలిచింది .

  స్వంతవూరు తెనాలిలో ఆమె  ఎంతో ఇష్టంగా కట్టించుకొన్న స్వంత ఇల్లు  ‘’శాంతి భవనం ‘’లో ఉంటున్నా పక్కింటి వారికి ఆమె ఎవరో తెలీకుండా గడిపారు .కాంచనమాల నటనతో స్పూర్తి పొందిన నటీమణులలో  శ్రీమతి జి వరలక్ష్మి ఒకరు తొలితరం నటీమణి కృష్ణవేణి గారు తీసిన ‘’దాంపత్యం ‘’సినిమా సెట్ లో కా౦చన మాలపై ఉన్న అభిమానంతో ఆమె ఫోటో ను సెట్ లో పెట్టిఅరుదైన  గొప్ప గౌరవం కల్పించారు . వడ్లబస్తా కేవలం 3రూపాయలు అమ్మే ఆ కాలం లో కాంచనమాల సినిమలో పారితోషికంగా 10వేల రూపాయలు తీసుకొనే వారు .1975లో హైదరాబాద్ లో జరిగిన ‘’ప్రపంచ తెలుగు మహా సభలు ‘’లో కా౦చన మాలకు ఘన సత్కారం చేసినా ,ఆమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరి దేనినీ చూడలేదు మహాకవి శ్రీశ్రీ ఆమె పై రెండు కవితలు అల్లి ఆరాధన తెలియ బర్చాడు .అందాలనటి కాంచనమాల జీవితం ఒక విషాద గాధ గా మిగిలి మనసులకు బాధ కలిగించింది .

  24-1-1981 న అందానికే భాష్యం చెప్పిన  అందాలరాణి నిజంగా వెండి  తెర వేలుపు కాంచనమాల అందరానంత దూరం వెళ్లి పోయారు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు, సినిమా | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3 నౌలూరు గ్రామకరణీకం హనుమంతరావు గారి పెదతండ్రి హయాం వరకు ఈ కుటుంబంలోనే ఉంది .రావుగారి తల్లి గారిపుట్టిల్లు కొలకలూరు .భర్తే పూడి వారి ఆడపడుచు .అవంశం లో అబద్ధం ఆడటం తెలియదు .అన్నిట్లో నిక్కచ్చిగా ఉండేవారు .ఈ రెండు లక్షణాలు తల్లి రాజమ్మ గారికి ,అబ్బాయి రావు గారికీ అబ్బాయి. నౌలూరులో తండ్రీ కొడుకులు ఉండేవారు. తండ్రే వంట చేసేవారు .పైపనులు రావు గారు చేసేవారు .ఆడుకోవటానికి ఇంట్లో ఆయన ఈడు వారెవరూ లేనందున రావు గారు స్నేహితుల ఇళ్లకో బంధువుల ఇళ్లకో వెళ్లి వస్తూండేవారు .ఒక్కోసారి బంధువులఇళ్ళల్లో చాలా రోజులు ఉండిపోయేవారు .ఇరుగుపొరుగు జనం ‘’నరసింహం గారు చనిపోతేకొడుకు ఎక్కడున్నాడో ఉంటాడో ?’’అని పరిహాసం చేసేవారు .ధర్మవ్యాధుని కధను తండ్రి మాటిమాటికీ కొడుకుతో చదివించి బాధ్యత గుర్తు చేసేవారు . హనుమంతరావు గారికి వందే మాతరం ఉద్యమ౦ వలన జాతీయభావాలుకలిగి స్వదేశీ వస్త్రాలే కట్టు కొనే వారు .బ్రహ్మసమాజ ప్రభావంతో సంస్కార బీజాలు పడ్డాయి .అక్కడక్కడ జరిగే విధవా వివాహాల గురించి ప్రజలు గోరంతలు కొండంతలుగా చెప్పుకొనేవారు .విగ్రహారాధనపై అయిష్టత కలిగింది .ఎప్పుడైనా లాంచన ప్రాయంగా గుడికి వెళ్ళేవారు .భక్తీ అంకురించలేదు .నీతినియమాలు పాటిస్తూ సత్యం మాట్లాడుతూ జీవించటం చిన్నతనం నుంచి అలవాటైంది . చదువుకొనే రోజుల్లో శ్రీ అక్కిరాజు ఉమామహేశ్వర విద్యా శేఖరులు ,వారిద్వారా శ్రీ నండూరి శేషాచార్యులు తో పరిచయం కలిగింది .వారు అప్పుడు ఎఫ్ ఎ చదువుతున్నారు .ఉమాకాంతం గారి గది తెలుగు గ్రంథాలతో నిండి ఉండేది స్వయంగా తెలుగుకావ్యాలన్నీ చదివి గొప్ప పండితులయ్యారు. శేషాచార్యులుగారు ఇంగ్లీష్ లో రైనాల్డ్ రాసిన నవలలు ఊపిరి సలపకుండా చదివే వారు .రావు గారూ ఆ రెండురకాల పుస్తకాలనూ చదవటం నేర్చారు .బంకిం నవలలు ,కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రికా మండలి వారి పుస్తకాలు ఉమాగారి భాండారం నుంచి తీసుకొని చదివారు .చిలకమర్తి ,వీరేశలింగం గార్ల రచనలన్నీ తిరగేశారు .ఆకాలం లో ప్రతి ఏడాదీ మండల సభలు ,సంఘ సంస్కరణ సభలు జరిగేవి .తప్పక హాజరయ్యేవారు .ఉన్నవావారితో దుగ్గిరాల వారితో కాలం గడిపేవారు .గ్రంథాలయోద్యమ ప్రభావం కూడా పడి మంగళ గిరిలో దేవస్థానం వారి గదులలో ఒక గదిలో శ్రీ లక్ష్మీ నరసింహ గ్రంధాలయం హనుమంతరావు గారు ఏర్పరచారు .దాదాపు నాలుగు వందల గ్రంధాలు సేకరించి లైబ్రరీకి అందజేశారు .రావు గారుయా వూరు వదిలాక అసమర్దుల చేతిలో పడి నీరుగారిపోయింది . ఉన్నవ వారు గుంటూరులో ప్లీడరీ చేస్తున్నా ,,అప్పుడప్పుడు మంగళగిరి సబ్ కోర్ట్ కు వచ్చి కేసులు వాదించేవారు .ఆయన్ను ఆహ్వానించి కాఫీలు టిఫిన్లు ఇంటివద్ద ఏర్పాటు చేసేవారు రావు గారు .ఏదో రాయాలని ఒక నవల రాసి ఉన్నావ వారికి వినిపిస్తేసంతోషించారు .గుంటూరులో శ్రీ దేవాబత్తుని శేషా చలపతి రావు ‘’దేశాభిమాని ‘’వార పత్రిక స్థాపించి నడుపుతున్నారు .గొప్ప ప్రపంచజ్ఞానమున్న మధ్వ పండితులాయన .గుంటూరులో అందరిగౌరవం పొందినవారు .వ్యవహారం లో పూర్వాచార పరాయణులైనా వితంతు వివాహం చేసుకొన్న ఆదర్శమూర్తి .ఆయన వ్యాఖ్యలు చురకత్తులే.ఎదుట పడి మాట్లాడేసాహాసం ఎవరికీ ఉండేదికాదు .బహు సౌమ్యులు .పత్రికలలో దేశాభిమానపూరిత వ్యాసాలూ రాసి స్పూర్తి కలిగించేవారు .ఆయన్ను జనం పేరుతోకాక ‘’దేశాభిమాని ‘అనే గౌరవంగా పిలిచేవారు .ఉన్నవవారు రావు గారిని ఆయనకు పరిచయం చేసిఉపస౦పాదక ఉద్యోగం ఇప్పించారు .మొదటి నెలజీతం 15వెండిరూపాయలు రావు గారిచేతికిస్తే ఆన౦దానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. .ఈ డబ్బు తండ్రిగారి చేతికిస్తే బ్రహ్మానంద భరితులై నిండుమనసుతో ఆశీర్వ దించారు .ఆపత్రికలో ఒక ఏడాది పని చేశారు. వందేమాతరం ,మొదటి ప్రపంచ యుద్ధం రోజులవి .చేతిలో డబ్బు లేకపోయినావార పత్రికను దినపత్రికగా మార్చి యజమాని ,చేతులుకాల్చుకొని ,చాలా నష్టం పొంది తర్వాత ప్రచురణ మానేశారు .అప్పుడు దుగ్గిరాలగోపాలకృష్ణయ్యగారు చదువుకు ఎడింబరో వెళ్ళలేదు .గుంటూరు కొత్తపేటలో అవ్వారి రామయ్య గారి మేడలో ఆయన, ఆయన నాయనమ్మ రాజమ్మగారు ఉండేవారు . మేడ గదిలో శ్రీ జొన్నవిత్తుల గురునాథం అనే రాజకీయ వేత్త ఉండేవారు .ఆయనదగ్గరకు ఉన్నవవారు నడింపల్లి నరసింహారావు శీరం వెంకట సుబ్బారావు మద్ది రాధాకృష్ణయ్య వంటి యువకులు వచ్చేవారు .రావుగారుకూడా అప్పుడప్పుడు వారితో కలిసేవారు ..జోన్నవిత్తులవారు ,న్యాపతి నారాయణ రావు గార్లు హిందూ పేపర్ లో ‘’ఆంధ్రరాష్ట్రం ఎందుకు కావాలి””? అనే వ్యాస పరంపర రాసి ఉత్తేజితులను చేసేవారు . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3

3-సకల కళా సరస్వతి సురభి కమలాబాయి

4-4-1908న హైదరాబాద్ లో కృష్ణాజీరావు వెంకూ బాయి  దంపతులకు కమలాబాయి జన్మించారు .తల్లి వెంకూ బాయి ‘’నల దమయంతి ‘’నాటకంలో గర్భవతిగా దమయంతి పాత్రలో నటిస్తుండగా ,పురిటి నొప్పులు రాగా ,తెరదించి రంగస్థలం మీదనే కమలాబాయి ని ప్రసవించటం గొప్ప విశేషం .ప్రేక్షకులు అదీ నాటకం లో ఒక భాగమే అను కొన్నారు .తీరా విషయం తెలిశాక చంటి బిడ్డపై డబ్బులవర్షం కురిపించారు ప్రేక్షక మహాశయులు .పుట్టటం తోనే కనకాభి షేకం జరుపుకొన్న అదృష్ట శాలి కమలాబాయి .తండ్రి గారి స్వంత సురభి నాటక కంపెనీ ఉండటంతో ఆమె ఆ నాటక ప్రదర్శనలు జరిగే చోట్లకు వెళ్ళటం చిన్నతనం నుంచి అలవాటైంది .బాలకృష్ణ ,ప్రహ్లాద ,లవ పాత్రలను పోషించారు .సహజ సౌందర్యం ,శ్రావ్యమైన కంఠం,స్వచ్చమైన ఉచ్చారణ పుష్కలమైన నటనాకౌశలం  ఉండటం తో పాత్రలకోసం ఆమె ప్రయత్నించాల్సిన అవసరం లేక పోయింది .యుక్త వయసురాగానే సురభి సమాజం లో నాయకి పాత్రలన్నీ ఆమె ధరించి పరి పూర్ణమైన న్యాయం చేకూర్చారు .ఆమె నటజీవిం లో కొన్ని వందల సువర్ణ,రజత పతకాలు గెలుచుకొన్న మహా నటీమణి కమలాబాయి .ప్రదర్శనాల మధ్య వచ్చే విరామ సమయం లో అద్భుతంగా నృత్యం చేసి మెప్పించేవారు .బొంబాయిలో పరశురాం వద్ద హిందూస్తానీ సంగీతాన్ని అభ్యసించి  ‘’అమరగాయని ‘’బాలగంధర్వ ‘’ప్రశంసలు  పొందిన శేముషీ మహిళ.

    రంగస్థలం పై తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి కమలాబాయి మొదటి సారిగా మొదటి టాకీ సినిమా1931లో శ్రీ హెచ్ ఎం రెడ్డి నిర్మించిన  ‘’భక్త ప్రహ్లాద ‘’లో లీలావతి గా  హిరణ్య కశిపుని గా నటించిన శ్రీ మునిపల్లె వెంకట సుబ్బయ్య సరసన    నటించి మెప్పించారు .తర్వాత సర్వోత్తమ బాదామి దర్శకత్వం లో సాగర్ ఫిలిమ్స్ వారి ‘’పాదుకా పట్టాభి షేకం ‘’లో సీతాదేవి గా,శ్రీరాముడి వేషం ధరించిన  ప్రముఖ నటుడు శ్రీ అద్దంకి  శ్రీరామమూర్తి ప్రక్కన నటించారు .సాగర్ ఫిలిమ్స్ వారు నిర్మించి సర్వోత్తమ బాదామి దర్శకత్వం వహించిన ‘’శకుంతల ‘’సినిమాలో మరో ప్రసిద్ధ నటుడు శ్రీ యడవల్లి సూర్యనారాయణ తో శకుంతల గా నటించారు  .శ్రీ బి.వి .రామానందం దర్శకత్వం లో కృష్ణా ఫిలింస్ నిర్మించిన ‘’సావిత్రి ‘’లోటైటిల్ రోల్ పోషించారు .సరస్వతి సినీ టోన్ వారి ‘’పృధ్వీ పుత్ర

లో ముఖ్య పాత్రపోషించారు.

 కమలాబాయి  నటప్రతిభను గుర్తించి ,ముగ్ధుడైన  సాగర్ ఫిలిమ్స్ అధినేత కమలాబాయి ని బొంబాయికి ఆహ్వానించగా వెళ్లి పదేళ్ళు ఉండి వాళ్ళ మహాభారతం మొదలైన 25సినిమాలలో నటించి గొప్ప కీర్తి సాధించారు ..ఇక్కడే ఆమెకు సిగరెట్ తగాటం అలవాటై  షాట్ షాట్ కు మధ్య పక్కకు వెళ్లి గుప్పు గుప్పున ఆదరాబాదరా సిగరెట్ తాగి వచ్చి నటించేవారు . .సిగరెట్ తనకు కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పేవారు . .  

  1939లో విడుదలైన భక్త జయ దేవ సినిమా లో మళ్ళీ తెలుగు చిత్రాలో నటించటం మొదలుపెట్టారు.విశాఖ ఆంధ్రా సినీ టోన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ,బెంగాలీ భాషలలో నిర్మించింది.రెండు భాషలలోనూ కమలాబాయే హీరోయిన్ .శ్రీ రెంట చింతల సత్యనారాయణ హీరో  .అంత౦త మాత్రం సినీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బెంగాలీ హీరెన్ బోస్ దర్శకుడు .చిత్ర నిర్మాణం సరిగ్గా సాగక ,భారీ నష్టాలకు గురయ్యే పరిస్థితులు గమనించిన కమలాబాయి దర్శకత్వం తో పాటు ఎడిటింగ్ కూడా చేసి తన సర్వజ్ఞత్వ ప్రతిభ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది .టైటిల్స్ లో మాత్రం హీరేన్ బోస్ పేరే ఉంచి ఆయన గౌరవాన్ని కాపాడిన స్థిత ప్రజ్ఞురాలు .1940లో వచ్చిన మరో ద్విభాషా చిత్రం ‘’భక్త తుకారాం ‘’ తెలుగు వెర్షన్ లో నటించారు .ఇప్పటిదాకా కధానాయకి పాత్రలే వేసిన కమలాబాయి ,క్రమంగా కేరక్టర్ పాత్రలను ధరించటం మొదలు పెట్టారు.ఈ చిత్రాలో పత్ని ,మల్లీశ్వరి ,లక్షమ్మ,,పాతాళభైరవి సంక్రాంతి ,అగ్ని పరీక్ష మొదలైనవి ఉన్నాయి .  పెహర్ కా జాదూ లో లైలా ,దో దివానే ,బేబరాబ్ జాన్ ,లలో సుమారు 22 సినిమాలలో  నటించారు  

 .తెలుగుతో పాటు తమిళ ,హిందీ సినిమాలలోనూ కమలాబాయి నటించి ఒప్పించారు  .మద్రాస్ లో  17-1-1957న జరిగిన భారత చలన చిత్రోత్సవ౦ లో దక్షిణ భారత నటీ నట సమాఖ్య వారు ప్రప్రధమంగా తెలుగు చిత్రాలలో నటించి నందుకు సురభి కమలాబాయి కి ఒక షీల్డ్ సన్మానపత్రం అందించి ఘనం గా సత్కరించారు ఏలూరులో ఆంద్ర నాటక కళాపరిషత్ ,వై ఎం హెచ్ఎ  వారు నాటక ,సినీ రంగాలకు ఆమె చేసిన సేవలకు ఘనసన్మానం చేశారు .కమలాబాయి హిందూ స్థానీ  సంగీతం తోపాటు హార్మనీ,సారంగీ ,వయోలిన్ మొదలైన వాద్యాలను అమోఘంగా వాయించే నేర్పున్న విదుషీ మణి .సినిమాలద్వారా సంపాదించిన డబ్బు 30 వేల రూపాయలు భవిష్యత్తులో ఉపయోగ పడుతుందని ఒక బాంక్ లో డిపాజిట్ చేస్తే ,అ బాంక్ దివాలా తీయగా ,డబ్బంతా కోల్పోయి జీవిత చరమాంకం లో ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు .వయసు మీద పడి అవకాశాలు తగ్గి పోతూ ఉండటం తో ,ఇంట్లో ఊరికే కూర్చోలేక తన అక్క కూతురు  సురభి బాలసరస్వతి తో కలిసి షూటింగ్ లకు వెళ్ళేవారు .

ఏలూరులో స్వగృహం లో తొలి తెలుగు హీరోయిన్ ,గాయని ,సకల కళా సరస్వతి సురభి శ్రీమతి కమలాబాయి 30-3-71న 65వ ఏట మరణించారు .

మల్లీశ్వరి చిత్రంలోఅమ్మలక్కగా  ‘’అయినా ఎవరెట్లా పొతే నాకేమి ?’’అనే డైలాగ్ బాగా పండింది .నర్స్ వేషం ,సోది చెప్పే అమ్మి వేషాలలో బాగా మెప్పించారు.అందమైన వెడల్పు ముఖం ,కాణీకాసంత బొట్టు ,ఊరించే కాటుక కళ్ళు,కొప్పు ముడి ,పటుత్వమైన డైలాగ్ డెలివరి కమలాబాయి స్వంతం .నటనకు భాష్యం చెప్పినట్లు ఉండే వారమే .ఆమెలో నట సరస్వతి కనిపించేది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-21-ఉయ్యూరు   

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2

హనుమంతరావు  గారి తాతగారు సుబ్బరాజు గారు తమ మాతామహస్థానమైన మంగళగిరి వద్ద నౌలూరుకు  కుటుంబాన్ని తరలించి సంతానం లేనందున దౌహిత్రుని కరణీకం అప్పగించారు .అతి వృష్టి అనావృష్టి ,కృష్ణ వరదలతో జీవితాలు అస్తవ్యస్తమై ఉండేవి .కొడుకులు నరసింహం ,రామదాసు గార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు .మంగళగిరి నరసింహస్వామిని దర్శించటానికి ఉత్తరాది నుండి భక్తులు విశేషంగా వచ్చేవారు .ఎంతపానకం పోసినా సగంమాత్రమే స్వీకరింఛి భొళుక్కు మని సంతృప్తి ధ్వని  వినిపించే  పానకాలస్వామి పై భక్తులకు బాగా విశ్వాసం .పుట్లకు పుట్ల బెల్లం కలిపి పానకం పోస్తున్నా, కొండమీద ఒక్క చీమ కూడా కనపడక పోవటం విచిత్రం .ఇది గంధక పొరలున్న కొండ అని అంటారు .మధ్యాహ్నం 12కు ఆరాధన పూర్తి చేసి అర్చకులు కొండదిగి వెళ్ళిపోతారు .మళ్ళీ మర్నాడు ఉదయమే దర్శనాదులు .కొండ దిగువ నరసింహాలయం వద్ద దక్షిణ భారత దేశం లోనే అతి పెద్దదైన గాలి గోపురం విశేష ఆకర్షణ .ఏడాది పొడుగునా ఎదో ఒక ఉత్సవం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది .మానసిక వ్యాధులను కూడా స్వామి మటు మాయం చేస్తాడని పేరు. చైతన్య ప్రభువు, నారాయణ తీర్ధులు దర్శించిన క్షేత్రం .ఫాల్గుణ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి .దీనికి తొట్లవల్లూరు జమీందార్ శ్రీ బొమ్మ దేవర నాగన్న నాయుడు చతురంగ బలాలతో తప్పక వచ్చి,నౌలూరులో విడిది చేసి  పాల్గొని దర్శించి వెళ్ళేవారు .అప్పుడు జరిగే తిరుణనాళ్ళకు విశేష ఆకర్షణ ఉంది . సుబ్బరాజుగారు ఆ ఏర్పాట్లన్నీ స్వయం గా చూసేవారు .వీరి సాయానికి మెచ్చి నౌలూరులో ఒక పెంకు టిల్లు కట్టించి ఇచ్చారు .ఒకసారి ఆయన ఇక్కడ విడిది చేసినప్పుడు అడవి పందివచ్చి పంటలను ,ప్రజలను బాధించటం చూసి గుర్రమెక్కి వెంబడిస్తే తోతాద్రి చుట్టూ అది తిరిగితే మూడు సార్లు కొండ చుట్టూ తిరిగి దాన్ని చంపి రక్షణ కల్పించారట .

  హనుమంతరావు గారి చిన్నతనం లో మంగళగిరిలో చదువు ప్రైమరీ వరకే ఉండేది .ఆతర్వాత 40ఏళ్లక్రితం చింతక్రింది కనకయ్యగారు అనే సాలె వర్తక శిఖామణి తనపేర ఒక హైస్కూల్ కట్టించారు .అది బాగా అభివృద్ధి చెందింది .తర్వాత మునిసిపాలిటి అయింది . చేబ్రోలు దగ్గర కోవెలమూడి వాస్తవ్యులు శ్రీ చెన్నా ప్రగడ బలరామ దాసు గారు మంగళగిరి వచ్చినిరతాన్న దాత  కైవారం బాలాంబ గారింట్లో ఉంటూ ,దేశమంతా తిరిగి చందాలు వసూలు చేసి ఆ డబ్బుతో కిందనుండి పానకాలస్వామి గుడివరకు మెట్లు కట్టించారు .కైవారం బాలాంబ గారు నిరతాన్న దాత ,మహా భక్తురాలు .అతిధుల యోగ క్షేమాలు కనుక్కొంటూ చక్కగా వండిన పదార్ధాలను ‘’అన్నం కాస్త తిను నాయనా ఆకూర బాగుంటుంది తిను అమ్మా ‘’అని బలవంతం చేసి కడుపు నిండా భోజనం చేసి తృప్తి చెందించి తానూ సంతోషించేది .ఎవరొచ్చినా అక్కడ ఉచిత భోజన ప్రసాదం తిని వెళ్ళాల్సిందే .50ఏళ్ల క్రితం నూతక్కి వాసి మల్లాది సుబ్బదాసు గారు గాలిగోపురానికి కిందినుంచి పైదాకా మరమ్మత్తులు చేయించారు .1864లో వచ్చిన బందరు తుఫానుకు రెండు శిఖరాలు పడిపోగా ,మిగిలిన తొమ్మిది శిఖరాలను కూడా క్రిందికి ది౦పించి,మేలిమి బంగారు పూత పూయించి మళ్ళీ ప్రతిష్టించారని హనుమంతరావు గారు జ్ఞాపకంచేసుకొన్నారు .మంగళ గిరి బావులలో నీరు పాతాళం లో ఉన్నట్లు ఉంటాయి .ఒక బొక్కెన నీరుతోడటానికి ఒంట్లో ఉన్న శక్తి అంతా ధారపోయాలి .చాంతాడు కూడా చాలా పెద్దది కావాలి .అందుకే ఏదైనా పొడుగ్గా ఉంది అని చెప్పటానికి ‘’మంగళగిరి చాంతాడంత పొడుగ్గా ఉంది ‘’అనే లోకోక్తి వచ్చింది .

  నౌలూరులో యాదవ ,మహమ్మదీయ సాలీల ,కమ్మ కుటుంబాలు కూడా ఉండేవి .అన్నీ మెట్ట పొలాలే.తూర్పున పోతరాజు చెరువు దక్షిణాన గంగానమ్మ చెరువు ఉన్నాయి .కొండలపై కురిసిన వర్షం నీటితో ఇవి నిండుతాయి .వీటి కింది కొద్దిగా మాగాణి సాగు ఉంటుంది .కృష్ణానదికి కరకట్ట పోయకముందు ప్రతి ఏడాదీ వరద భీభత్సమే .బీద గ్రామం .ఇక్కడి నాగేశ్వరస్వామి దేవాలయానికి రావు గారి వ౦శీకులే ధర్మకర్తలు .రుషి తుల్యుడైన పానకాలయ్య గారు అర్చకులు .ఆయన ఆగమం, సంగీతం లో నిపుణుడు .వీరిద్దరి కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉండేవి . రావు గారి తండ్రి నరసింహం గారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా కృష్ణా జిల్లా తిరువూరులో పని చేస్తున్నప్పుడు 1893లో హనుమంతరావు గారు పుట్టినట్లు తల్లి రాజమ్మ గారు చెప్పేది .ఈయనకు ఒక అక్క ,చెల్లి ఉన్నారు .మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోగా ,నాయనమ్మ గారు నౌలూరు వచ్చారు .ఈ ముగ్గుర్నిఅమ్మమ్మ చేతిలో   పెట్టి అప్పగించి   రాజమ్మగారు కనుమూశారు .తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ..రావు గారి నాయనమ్మ నూరేళ్ళు జీవించింది మంగళగిరి గాలి గోపురం కట్టటం ఆమెకు బాగా గుర్తు . అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించిన ఈ గోపురాన్ని ఆయనే వచ్చి ప్రారంభించారు .అంత ఎత్తు గాలి గోపురమూ ఎక్కి, పై అంతస్తు నుంచి రూపాయలు వెదజల్లారట .అందులో ఒక రూపాయి వీరి తాతగారి తలపాగాలో పడిందని మామ్మగారు చెప్పారట .

  ఒక్కడే కొడుకు అవటం తో రావు గారు గారాబంగా పెరిగారు. తప్పు చేస్తే తండ్రి తోలు తీసే వారట  .చదువుకోసం రావు గారి తండ్రిమంగళగిరికి మకాం మార్చారు .ప్రైమరీ పరీక్ష గవర్నమెంట్ నిర్వహించేది అది రాసి పాసైనారు .చిలిపి పనులు చేయటం,తండ్రికి తెలిసి వొళ్ళు చీరేయటం మామూలే .  గుంటూరు లో ఎ.యి. ఎల్. ఎం .కాలేజి హైస్కూల్ లో చేరి ఎస్. ఎస్. ఎల్సి. చదివి పాసయ్యారు .లెక్కలు బుర్రకు పట్టకపోవటంతో చదువు ఆపేశారు .1901నుంచి -06వరకు గుంటూరులో ఆయన చదువు సాగింది .అప్పుడు ఫస్ట్ ఫారం  ఫీజు నెలకు రూపాయి పావలా.పూటకూళ్ళమ్మ నెలకు నాలుగు రూపాయలిస్తే కమ్మని  నెయ్యి గడ్డపెరుగు,కంది పప్పు ,నాణ్యమైన కూరలు పచ్చళ్ళతో కమకమ్మని భోజనం మూడు పూటలా పెట్టేది  .మిషన్ కాలేజిలో హరిజనులతో కలిసి చదువుకొన్నారు .అదేమీ ఇబ్బంది గా ఉండేదికాదు వాళ్ళ బోర్డింగ్ లకు వెళ్లి పరిశీలించి వచ్చేవారు .   1905లో లార్డ్ కర్జన్  బెంగాల్ ను విభజించగా  ,నిరసనగా బెంగాలీలు వందే మాతరం ఉద్యమం చేబట్టారు .అన్ని రాష్ట్రాలో వందేమాతరం ప్రతిధ్వనించింది .స్వదేశీ వస్తువాడకం, జాతీయ విద్యాలయాలో చదువు ,ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదు ,చేతిపనులకు ప్రోత్సాహం ఆఉద్యమ ముఖ్యోద్దేశాలు .రాజా రామ  మోహన రాయ్ బ్రహ్మ సమాజ ఉద్యమం ,వీరేశలింగం గారి వితంతు పునర్వివాహ ఉద్యమం వలన ప్రజలలో సంస్కారం మీద ధ్యాస పెరిగింది .మాలపల్లి నవలా రచయిత శ్రీ ఉన్నావా లక్ష్మీ నారాయణ పంతులు గారు అప్పుడు ఆదర్శ పురుషులు గా గౌరవం పొందేవారు .ఆంద్ర పత్రిక ,ముట్నూరి వారి కృష్ణా పత్రిక ,వివిధ ఉపయుక్త గ్రంథాలు చదివి రావు గారు ప్రభావితులయ్యారు .అబ్రహాం లింకన్ ,బంకి౦ చంద్రుని  ఆనందమఠం నవలలతో ప్రేరణ పొంది భారత స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనాలని హనుమ౦తరావు గారు ఉవ్విళ్ళూరారు .

   సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2
2-కన్నాంబ
శ్రీమతి పశుపులేటి కన్నాంబ 1912లో పగోజి ఏలూరులో జన్మించి 7-5-1964న 52వ ఏట కన్నుమూశారు.నావేల్ నాటక సమాజం వారి నాటకాలలో బాలపాత్రలను ధరించి 12వ ఏట రంగప్రవేశం చేశారు. కొద్ది కాలం లోనే అగ్రశ్రేణి నటీమణిగా పేరు ప్రతిష్టలార్జించారు.సతీ సావిత్రి ,అనసూయ ,చంద్రమతి పాత్రలు పోషించి సహృదయ ప్రశంసల౦దు కొన్నారు .ఆ కాలంలో కన్నాంబ పాడి రికార్డైన ‘’కృష్ణం భజ రాధా ‘’పాట ఆంద్ర దేశాన్ని ఉర్రూతలూగించింది.ప్రేక్షక హృదయాలలో ఆమె సుస్థిర స్థానం సంపాదించటానికి దోహద పడింది .
1935 లో చలన చిత్ర రంగప్రవేశం స్టార్ కంబైన్స్ వారి ‘’హరిశ్చంద్ర ‘’సినిమాలో చంద్ర మతి గా నటించటం తో ప్రారంభమైంది .అదే ఏడాది ద్రౌపదీ వస్త్రాపహరణం లో ద్రౌపది గా ,నట విశ్వ రూపం చూపించి నటనతో ప్రేక్షకులను అలరించారు .పౌరాణిక జానపద చారిత్రాత్మక ,సాంఘిక చిత్రాలలో ప్రముఖ పాత్రలను ధరించి హీరోయిన్ గా ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా గణనీయ మైన నటన ప్రదర్శించారు .చాలా భాగం సాఫ్ట్ కార్నర్ పాత్రలో అత్తగా అమ్మగా ,తోడికోడలుగా నటింఛి మెప్పించారు .భక్తిని ఎలా పండించారో రౌద్ర ,కరుణ రసాలనూ అదే స్థాయిలో పండించి ఆ చిత్రాల ఘన విజయాలకు ముఖ్య కారణమయ్యారు .150 చిత్రాలలో నటించి తనకు సాటి తానె అని నిరూపించారు –అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలు –చండిక ,కనకతార గృహలక్ష్మి తల్లిప్రేమ ,పల్నాటి యుద్ధం లో నాగమ్మ గా బ్రహ్మనాయుడుగా నటించిన గోవిందరాజుల సుబ్బారావు గారితో పోటీ పది నడించి మెప్పించారు . మనోహరలో తల్లిగా కన్నాంబ నటన ఉన్నత శిఖరాలు తాకింది. ఆ హావ భావ ప్రదర్శన,,సంభాషణలు పలికే చాతుర్యం న భూతో అనిపించింది .అనార్కలిలో అక్బర్ భార్యగా ,దక్షయనం లో దక్షుని భార్యగా ఆమె చిరస్మరణీయ నటన ప్రదర్శించారు .సౌదామిని ,నవజీవనం ,పేదరైతు మాంగల్యబలం కృష్ణ-కుచేల ఆత్మ బంధువు సినిమాలు ఆమె నటనకు హైలైట్ గా నిలిచాయి .తెలుగు ,తమిళ సినిమాలో దాదాపు పాతిక సంవత్సరాలు అద్వితీయమైన మహానటిగా కీర్తి పొందారు .ఆనాటి తమిళ స్టార్ హీరోలైన పియుచిన్నప్ప ,ఎ0.జి. రాధా ,నాగయ్య ,ఎం జి రామ చంద్రన్ ,శివాజీ గనేశన్ ,ఎం ఎస్ రాజేంద్రన్ లతో పోటాపోటీ గా నటించి చిత్రవిజయాలకు ధ్రువ తారగా నిలిచారు .1963లో వచ్చిన వివాహబంధం సినిమా కన్నా౦బగారి ఆఖరి సినిమా.
కన్నాంబ నునటిగా తీర్చి దిద్దిన వారు భర్త కడారు నాగభూషణం .ఈ దంపతులు ‘’రాజరాజేశ్వరి ‘’సంస్థను ప్రారంభించి 30తెలుగు ,తమిళ సినిమాలను నిర్మించి రికార్డ్ నెలకొల్పారు .దర్శక నిర్మాతగా నాగభూషణం గారికి గొప్ప పేరు ఉండేది .వీరిచిత్రాలు –సుమతి ,పాదుకా పట్టాభిషేకం ,సౌదామిని ,పేదరైతు ,లక్ష్మీ, సతీ సక్కుబాయి ,శ్రీకృష్ణ తులాభారం, నాగపంచమి వగైరా .ఈ కంపెనీకి మంచి పేరుండేది .స్టాఫ్ కు నెలాఖరు రోజునే ఠంచన్ గా ఆ నెల జీతాలివ్వటం ప్రత్యేకత .ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండ్ లో కార్లు ,వాన్ లతో కళకళ లాడుతుండేది .ఆ రోజుల్లో’’ కన్నాంబ లోలాకులు ,కాంచనమాల గాజులు ‘’కు క్రేజ్ ఎక్కువగా ఉండేది.కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతు రాలనీ,పోపుల డబ్బాలమధ్య డబ్బాల లో బంగారుకాసులు పెట్టుకొనేదనీ చెప్పుకొనేవారు .
నేపధ్యగాయనిగా కన్నాంబ సుమతి ,తల్లిప్రేమ గృహ లక్ష్మి సినిమాలో పాటలు పాడారుకూడా .
చండిక సినిమాలో చండిక గా ‘’నేనే రాణి నైతే ఏలనె ఈ ధర ఏకధాటిగా ‘’అంటూ గుర్రం పైస్వారీ చేస్తూ ఒక చేత్తో కత్తిపట్టుకొని వీరావతారం తో ధాటిగా ఠీవిగాకళ్ళు ఎర్రజేస్తూ కన్నాంబ పాడిన పాట ఝాన్సీ లక్ష్మీ బాయ్ ని గుర్తుకు తెస్తుంది అన్నారు రావికొండలరావు .ఈ సినిమాలోనే ‘’ఏమే కోకిలా ఏమో పాడెదవు ఎవరే నేర్పినది ఈ ఆట ,పాట ‘’అని నవ్వులు రువ్వుతూ ఒయ్యారం వలపు వలకబోస్తూ పాడారామే .మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు మరెవ్వరూ నవ్వలేరు అని ఆనాడు చెప్పుకొనేవారు .ఆనవ్వు ఆమెకే ప్రత్యేకమై నిలిచింది .
సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ –సిరి తా బోయిన బోవును కరిమింగిన వెలగ పండు గదరా సుమతీ ‘’అన్నట్లు కన్నాంబ మరణించగానే అంతటి ఐశ్వర్యమూ ఏమై పోయిందో తెలీదు .ఆమె కంపెనీతో సహా అన్నీ పోయాయి .ఒక్కటీ నిలవలేదు .భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉండేవారు .చూసేవారికి కడుపు తరుక్కు పోయేది .ఆయనకు ఒక ట్రంక్ పెట్టె,ఒక కుర్చీమాత్రమే ఆగదిలో ఆస్తి .నేలమీదే పడుకొనేవారు .కన్నాంబ పార్ధివ దేహాన్ని సర్వాభరణాలతో వారి కులాచారం ప్రకారం పూడ్చిపెడితే దొంగలు నగలతోపాటు శవాన్నికూడా మాయ చేశారు .భర్త నాగభూషణం 73 వ ఏట మరణించారు .తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కన్నాంబ ,నాగభూషణం దంపతులు ఒక స్వర్ణయుగాన్ని స్థాపించారు .
కన్నాంబ పొడవుగా ,దానికి తగిన శరీరంతో, కోటేరు తీసిన ముక్కుతో హుందాగా చీరకే మహా వైభోగం కల్పించేట్లు గా, నుదుట పెద్ద కుంకుమ బొట్టు చేతులకు గాజులతో దేవతా మూర్తిలాగా కనిపించేవారు .అంతటి గొప్ప పర్సనాలిటి లేనే లేదనిచేప్పవచ్చు.నేటి నటీమణులలో అనుష్క కు కన్నాంబ గారికి ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయని నాకు అనిపిస్తుంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1 సి.ఎస్.ఆర్ చిలకల పూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీడుకాని సి ఎస్ ఆర్ అంటే తెలియని వారు ఉండరు .ఆ ముక్కుమాట నక్కవినయపు చూపులు మాటలో మెత్తదనం మనసులో గుండెలు తీసే బంటుతనం ఆయనకు స్వతహాగా వంటపుట్టిన సొమ్ములు .11-7-1907 న గుంటూరు జిల్లా నరసరావు పేట లో జన్మించారు .ఎస్.ఎస్ ఎల్.సిపాసై కోఆపరేటివ్ శాఖలో శిక్షణ పొంది ఉద్యోగించారు .చిన్నప్పటి నుంచి వీధిభాగవతాలు ,నాటకాలు బాగా చూడటం తో ఉద్యోగానికి రిజైన్ చేసి ,17వఏట నాటకరంగం పై ‘’రాధా కృష్ణ ‘’నాటకం లో కృష్ణుడుగా కాలు మోపి ,నటనతో అలరించి ప్రేక్షకాభిమానం పొందారు .తర్వాత రామదాసుగా ‘’రామదాసు ‘’భవానీ శంకరుడుగా ‘’చింతామణి ‘’సారంగధరుడు గా ‘’సారంగధర ‘’శ్రీరాముడుగా ‘’పాదుక ‘’సత్యవంతుడుగా ‘’సతీ సావిత్రి ‘’విజయరామ రాజుగా ‘’బొబ్బిలి యుద్ధం ‘’,తుకారాం గా ‘’భక్త తుకారాం ‘’,పర దేశి గా ‘’పతిత పావన ‘’నాటకాలలో నటించి విశేషమైన హావ భావాలతో ,కొత్త వరవడులను సృష్టించి ,సామాన్యులనుంచీ ,మాన్యులదాకా,కళాభిజ్ఞుల మెప్పించి సెభాష్ అని పించుకొన్నారు .నటనతో నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు .తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు .పాత్రలకు జీవం పోసిన నట శిల్పి ఆయన .అప్పటికే నాటక రంగం పై వీర విహారం చేస్తున్న స్థానం నరసింహారావు గారికి సమఉజ్జీ అని పించారు .అపూర్వ నటనా వైదుష్యం ఆయన ప్రత్యేకత .మాటలను అర్ధవంతంగా విరిచి పలికి ,అవసరమైనంత మెల్లగా స్పష్టంగా పలకడం కన్నులతో హావభావాలు కురిపించటం లో దిట్ట. తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి తనదైన బాణీ తో ,విలక్షణ నటనతోఒప్పించి మెప్పించారు .అన్ని అయన ప్రతిభకు గీటు రాళ్ళే. ఈస్ట్ ఇండియా కంపెని 1933లో నిర్మించిన రామదాసు సినిమాకు సియేస్ ఆర్ హీరో రామదాసు .1936లో ద్రౌపదీ వస్త్రాపహరణం లో శ్రీ కృష్ణుడుగా నటించి నటనా వైదుష్యాన్ని చాటారు .అయితే 1946లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సారధీ వారి ‘’గృహప్రవేశం ‘’సాంఘిక చిత్రం ఆయన జీవితాన్ని గొప్పమలుపే తిప్పింది.కామెడీ విలనీ ని పండించారు ఆయన .’’మై డియర్ తులశమ్మక్కా’’అంటూ అక్కను బుట్టలో వేసుకొనే పాత్రలో ఆయన జీవించారు .సినీవిమర్శకుల పొగడ్తలను విపరీతంగా అందుకొన్నారు .ఆ డైలాగ్ ఆనాడు ఆంధ్ర దేశమంతా మారు మోగింది .’’జీవితం ‘’సినిమాలో ఆయన చెప్పిన ‘’ఆకాలం లో నేను కాలేజీలో చదివే రోజుల్లో ‘’డైలాగ్ కూడా అందరికి హాస్యపు తారకమంత్రమే అయి అందరి నోళ్ళల్లోనూ నాని౦ది. ఆయనకు ఫేం ,నేం రెండూ తెచ్చిన గోల్డెన్ డైలాగ్ లు అవి .జగదేక వీరుని కధ సినిమాలో రాజనాలను ‘’హే రాజన్ !అంటూ సంబోధించటం వారిద్దరి మధ్య పింగళి వండి వడ్డించిన హాస్యం ను వీరిద్దరూ పండించి మనకు మానసిక ఆనందాన్ని పంచిపెట్టారు .ఉత్కృష్టమైన హాస్యానికి అది ఒక మచ్చు తునకగా నిలిచింది .విజయావారి అప్పు చేసి చేసి పప్పుకూడు చిత్రంలో సియేస్ ఆర్ అప్పుకే ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించారు .పెద్ద మొత్తాన్ని ఒకరి దగ్గరే అప్పు తీసుకోవాల్ట . వడ్డీ తీరుస్తూ అసలు అడగకుండా కాలక్షేపం చేయచ్చు నట .ఇందులో ప్రతి సన్నివేశం లో ఆయన నటన నభూతో గా ఉంటుంది .. ఆయన నటనకు శిఖరాయమానం మాయాబజార్ లో శకుని పాత్ర .’’ముక్కోపానికి ముఖ స్తుతి ఉండనే ఉంది ‘’అనే డైలాగ్ డేలివరిలో ఆయన నటన తారస్థాయి తాకుతుంది .కన్యా శుల్కం లో రామప్ప పంతులు ,ఇల్లరికం లో మేనేజర్ ,జయం మనదేశం లో మతి మరుపు రాజు ,కన్యాదానం లో పెళ్ళిళ్ళ పేరయ్య గా,చక్రపాణి లో పిసినారి తాతగా, పాతాళ భైరవిలో రాజుగా ,భక్త కుచేలలో ‘’కుచేలుడు’’గా ,గూడవల్లి రామబ్రహ్మంగారి మాయాలోకం లో నవభోజ రాజుగా ఆయన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు .ఆయన విలనీలో హాస్యం పండించి కొత్తమార్గం చూపారు .పూర్వకాలం లో 1939లో తీసిన వెంకటేశ్వర మహాత్మ్యంలేక బాలాజీ లో ఆయన విష్ణుమూర్తి వేషం వేసి సొయగాలుఆరబొశారు.అందులో భ్రుగు మహర్షి పాత్రను మా పెద్దక్కయ్య మామగారు’’ పండిట్ రావు ‘’అనే శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ గారు పోషించారు .భ్రుగుమహర్షి పాదంలో ఆయన అహంకారానికి చిహ్నమైఉన్న కన్ను ను కృష్ణుడిన సీస్ ఆర్ చిదిమేసే ఫోటో మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో నేను చూశాను .నేను బెజవాడ ఎస్ ఆర్ ఆర్ సివి ఆర్ కాలేజీ లో 1956-58 లో ఇంటర్ చది వేటప్పుడు ఆయన విజయా టాకీస్ దగ్గర ఒక బడ్డీ కొట్టుదగ్గర సిగరెట్ తాగుతూ ఉండగా రెండు మూడు సార్లు చూసి ,పలకరించాను .చాలా మర్యాదగా మాట్లాడారు .తెల్లటి గ్లాస్గో పంచె విరిచికట్టి,తెల్లని లాల్చీ తో పంచె కొంగు ఒకటి లాల్చీ జేబులో ఉండేట్లు దోపి కనిపించారు .ఆయనతో మాట్లాడి నట్లు అందరికీ గొప్పగా చెప్పుకొనే వాడిని.దాదాపు 50 సినిమాలలో ఆయన నటించారు .ఆంగిక వాచక అభినయాలకు కొత్త అర్ధాలు చెప్పిన మహానటుడు ఆయన .రాముడుగా కృష్ణుడుగా ,శివుడుగా నటించి మెప్పించినమహానతుడు . ‘’శివ గంగ ‘’,అగ్నిమంత్రం ‘’,రిక్షావాలా ‘’ అనే మూడు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు సిఎస్ఆర్ .కానీ కారణా౦తరాలవలన అవి విడుదలభాగ్యానికి నోచుకోలేదు .నాటక ,సినిమా రంగం లో దాదాపు అయిదు దశాబ్దాలు నట జ్యోతి గా వెలిగిన ఆయన 8-10-1963న 56ఏళ్లకే మరణించటం దురదృష్టం . సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్-21-12-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు

అనే స్వీయ చరిత్రను విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ,సాహితీ వేత్త డా .గూడూరు నమశ్శివాయ సేకరిస్తే ,హైదరాబాద్ సుల్తాన్ నగర్ గాంధీ జ్ఞానమందిర్ కు చెందిన గాంధీ సాహిత్య ప్రచురణాలయం వారు విజయవాడ లోని పటమట లో ఉన్న సర్వోదయ ప్రెస్ 1983లో ప్రచురించింది .వెల –నాలుగు రూపాయలు . ప్రకాశకుల నివేదనలో’’గాంధీకి ముందే శ్రీ వేమూరి రామ్జీరావు ,శ్రీ గూడూరు రామచంద్రుడు ,శ్రీ నల్లపాటి హనుమంతరావు గార్లు అస్పృశ్యతా ,హరిజన సేవకు అత్యద్భుత కృషి చేశారు .గూడూరు నమ  శ్శివాయగారు రాంజీరావు ,రామచంద్రుడు గార్ల జీవిత విశేషాలను సేకరించి గ్రంథాలురాశారు .హనుమంతరావు గారి చరిత్రను ఆయనతోనే రాయించారు .నమశ్శివాయ గారి కృషి అనన్య సాధ్యం .శ్రీ పాతూరి నాగభూషణం గారికి ధన్యవాదాలు ‘’అని రాశారు గాంధీ సాహిత్య ప్రచురణ కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణ రావు .

  విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రఖ్యత సాహిత్య విమర్శక ,పరిశోధకులు శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు రాసిన పీఠిక లో ’’బ్రాహ్మణా బ్రాహ్మణేతర కులాల వారు అట్టడుగు కులాలవారరైన మాల మాదిగలను అస్పృశ్యులుగా భావించి ,వారికి సామాన్య మానవులకు కావాల్సిన కనీస సౌకర్యాలను కూడా లేకుండా చేసి గ్రామాలకు దూరం గా గూడాలలో ఉండే స్థితి కల్పించారు .గ్రామాలలోని బావి నీరు వారికి వాడుకొనే అర్హత ఉండేది కాదు.ఎవరైనా పుణ్యాత్ముడు వారి గూడెం లో బావి తవ్విస్తేనే వాళ్లకు నీళ్ళగతి .లేకపోతె పశువులను కడిగే, బట్టలు ఉతికే చెరువులలోని మురికి నీరే వారి గతి గా ఉండేది .తాగే నీరే లేనప్పుడు స్నానానికి నీరు ఎక్కడ ?కనుక శుచి శుభ్రతలకు దూరంగా ఉండేవారు .ఆ రెండు కులాలు లేకపోతె రైతుల వ్యవసాయం అంగుళం కూడా ముందుకు సాగదు.మోటు పనులన్నీ  వాళ్ళే చేయాలి .వారికి జీవన భ్రుతి అత్యల్పంగా ముట్ట చెప్పేవారు కామందులు .చచ్చిన గొడ్లను తీసుకు వెళ్లి తోళ్ళనువొలిచి ఆర బెట్టటం తో మాదిగ గూడాలు  చాలా అపరి శుభ్రంగా ఉండేవి .మాల మాదిగల మధ్య కూడా గొడవలు ఎక్కువగానే ఉండేవి.

  మాలలు రామభక్తి వైష్ణవ సంప్రదాయం పాటించేవారు .మాదిగలు శివభక్తి తత్పరులు జంగాలు వీరి గురువులు .మాల ,మాదిగ దాసులు మతాచారాలు పాటిస్తూ పౌరోహిత్యమూ ,వైద్యమూ చేసేవారు .శ్లోకాలు దండకాలు కంఠస్తం చేసేవారు .సామాన్యులు అక్షరజ్ఞాన శూన్యులుగానే ఉండేవారు .కానీ వారిలో పెద్దలు మన పురాణ ఇతిహాసాలు వినటం చేత వేదాంతం వంటబట్టి హిందువులుగానే ఉండిపోయారుతరతరాలుగా .బ్రిటిష్ పాలనలో క్రైస్తవ బోధకులు ఈ అంటరాని తనాన్ని గుర్తించి ,హిందూ సాంఘిక ఆచారాలను విమర్శిస్తూ ,అగ్రకులాలు ఈ  నిమ్న కులాల వారిని నీచంగా చూస్తున్నారని వాళ్ళ మనస్సులలో నాటి ,క్రైస్తవం లోకి కలుపుకొనే ప్రయత్నం చేశారు .ప్రయత్నం కొంత ఫలించినా మెజార్టీ హిందువులుగానే మిగిలారు .ఇంగ్లీష్ పాలకులు మనలో జాతి కులమత భేదాలు కల్పించి రాజ కీయ స్వాంత౦త్ర్య౦  ఇవ్వటానికి సాకులతో అడ్డు చెప్పారు .మిత్రభేదం పాటింఛి 1947దాకాగాడిపి గత్యంతరం లేక మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు .

  1950లో స్వతంత్ర భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి అస్పృశ్యత రద్దు చేయబడి ప్రజలందరూ సమానులే అన్న భావానికి బలం చేకూర్చారు అప్పటినుంచి అట్టడుగు కులాల ఉద్ధరణ,రక్షణ ,సౌకర్యాలకోసం కోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేసినా నిజమైన అభి వృద్ధి జరగనే లేదు .మాలమాదిగలు అసెంబ్లీ ,పార్లమెంట్ సభ్యులు మంత్రులు అయినారు .అయినవారు అన్నీ అనుభవిస్తూ భోగభాగ్యాలతో తులతూగుతున్నారు .కాని నోరులేని బక్క జీవుల స్థితి ఏమాత్రమూ మారకపోవటం శోచనీయం .కనీస సౌకర్యాలు కూడా వారికి దక్కనే లేదు .దీనికి కారణం డా అంబేద్కర్ వంటి త్యాగమయులు విద్యాధికులు వారిలో లేకపోవటమే  .వీరి ఈ దుస్థితి గుర్తించి మహాత్మాగాంధీ సామూహిక హరిజనోద్ధరణకు పూనుకొన్నాడు .వారిని ఉద్ధరించే సంఘాలు ఏర్పడ్డాయి .వీటిలో బ్రాహ్మణ బ్రాహ్మణేతరులుకూడా దేశభక్తులు సభ్యులుగా ఉన్నారు.గ్రామాలలో  అస్ప్రుశ్యులకు న్యాయం చేకూరింది .

  కానీ గాంధీ కంటే ముందే హరిజనోద్ధరణ కు కంకణం కట్టుకొని కృషి చేసిన సత్పురుష త్యాగమూర్తులున్నారని  చాలామందికి తెలియదు  వారి జీవిత విషయాలు సాధించిన మహత్కార్యాలు కూడా అసలు తెలియదు .మాలమాదిగల స్థితి గతులను వివరించే గ్రంథం శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి ‘’మాలపల్లి నవల ‘’ఒక్కటే .  ప్రజా ప్రభుత్వం లో అన్నికుకులాల వారితో పాటు వీరూ జీత భత్యాలు పెంచమని ,రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలనీ కోరుతున్నారు .అంతే తప్ప అట్టడుగు వర్గాల సంక్షేమం పై వాళ్ళకూ దృష్టి లేకపోవటం శోచనీయం .వారి సేవలో అవకతవకలు చాలా ఉంటున్నాయి .

  ఆంద్ర దేశం లో అన్ని జిల్లాలో మాలమాదిగలలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు మాదిగాలే అయినా ,వీరికంటే మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం ,పలుకుబడి సౌకర్యాలు లభించాయని మాదిగ నాయకులు సభలు జరిపిచైతన్యం  తెస్తున్నారు .  పోరాట సమితులు ఏర్పడ్డాయి .అయినా గొంగళి అక్కడే ఉంది .అస్పృశ్యులలో  అస్పృశ్యులు ఉన్నారని చరిత్ర పరిశోధకులు గుర్తించారు .ఇవాళ వారి గురించి ఏపత్రికలో ,శాసనసభలో ప్రకటింపబడటం లేనేలేదు.జనాభాలెక్కల్లో,ప్రభుత్వ నివేదికలో నూ వీరి గురించి వివరాలు లేవు  .1961లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన ETNOLOGICAL FIELD  SURVEY లో కోస్తా ,రాయలసీమ జిల్లాలో మాలమాదిగలలో ఎల్లమ్మ దేవత కు అంకితం చేయబడిన ‘’మాతంగులు ‘’అనే అవివాహిత స్త్రీలున్నారనీ ,వీరికి పుట్టిన బాలికలు మాతంగులుగానే ఉండిపోతున్నారనీ ,గ్రామ దేవతల ఉత్సవాలలో పాల్గొంటున్నారనీ మగపిల్లలు మాలమాదిగకులాల లో  కలిసిపోతున్నారనీ ,కోస్తా రాయల సీమలో 392మాతంగి స్త్రీలు ,250మంది మాతంగి పురుషులు ఉన్నారనీ ప్రకటించింది. తెలంగాణా లో ఫీల్డ్ సర్వే జరగలేదు.మాతంగి స్త్రీ ఎల్లమ్మ దేవత అవతారంగా భావిస్తారు .ఈ స్త్రీజరిపే తుడుపులవలన  పిశాచాది బాధలు తొలగిపోతాయని ,మాలమాదిగలే కాక, ఇతరకులాల వారుకూడా ఇలా తుడుపులు చేయిచుకొంటారని ఆ రిపోర్ట్ చెప్పింది .

  కుల తార తమ్యాలు మన దేశం లోనే కాదు అన్ని దేశాలలో ఏదోరూపం లో ఉంది .దీనివలన దేశానికి నష్టం కలగకూడదు .ఇటీవల బ్రాహ్మణేతరుల ఉద్యమాలలో బ్రాహ్మణులను కించపరుస్తున్నారు .కానీ బ్రాహ్మణ ఆచారాలను ఉల్లంఘించి మాలమాదిగలకు సేవ చేస్తూ ,బ్రాహ్మణ కులంచేత నానాఅవమానాలు అగచాట్లు పడుతున్న త్యాగ మూర్తులు కూడా ఉన్నారు .అలాంటి ధన్యజీవులలో  శ్రీ నల్లపాటి హనుమంతరావు ,శ్రీ గూడూరు రామ చంద్రుడు ,శ్రీ వేమూరి రాంజీ రావు గార్లు అగ్రగణ్యులు .వారి కృషి విశేషాలను చెప్పే ఈ పుస్తకం అతి విలువైనది ‘’అని తన మేధో పాండిత్యాన్నీ ,పరిశోధన విశేషాలను అరటిపండు వొలిచి చేతికి అందించారు ప్లీడర్ దిగవల్లి వెంకట శివరావు గారు .ఈ పీఠిక ఈ పుస్తకానిక్ శిరో భూషణం .

  శ్రీ నల్లపాటి హనుమంతరావు గారి చరిత్ర

  ఆరువేల నియోగులు, గౌతమ గోత్రులు నల్లపాటి వారు గుంటూరు జిల్లా నల్లపాడు కరణాలు.వీరిలో ఒక శాఖ దగ్గరలో ఉన్న యంగళాయ పాలానికి తరలి వెళ్ళింది .నల్లపాటి రమణ రాజు మూల పురుషుడు .వారికి కృష్ణం రాజు  ఈయనకు సుబ్బరాజు కొడుకులు .సుబ్బరాజుగారి అయిదుగురు కొడుకులు కోటయ్య ,వెంకటప్పయ్య, నాగరాజు, నరసింహం ,రామదాసు .నరసింహం గారి కొడుకే మన  హనుమంతరావు గారు .వాసి రెడ్డి రామన్న అనే జమీందారు వీరి మూలపురుషుడు రమణ రాజు గారికి గుంటూరు దగ్గర లాల్ పురం లో 27ఎకరాల భూమి ఇనాం గా ఇచ్చాడు .లింగాయపాలెం గ్రామం లో 30ఎకరాల చెరువు బహుమతిగా ఇచ్చాడు .ఈనాం భూమిపై వచ్చే ఆదాయంతో చెరువు మరమ్మత్తులు చేయాలని అర్ధం .ఇప్పటికీ ఈ చెరువునల్లపాటి వారి ఆధీనంలోనే ఉంది వారే ధర్మకర్తలు .ఈ చెరువులో 8ఎకరాలలో మాత్రమె నీరు నిలుస్తుంది .మిగాతాదిఖాళీ .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం )

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం )

శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో ,షోడశ కళలతో జన్మించి సంపూర్ణావతారం అని చాటాడు .శ్రీరాముడు 14 కళలతో జన్మించాడు .మిగిలిన రెండు కళలుపరశురాముని వద్ద ఉన్నాయి .ఈయన విష్ణు ధనుస్సును చేతితో పట్టుకోవటంతో ఆయనవద్ద ఉన్న ఆ రెండు కళలు రాముని చేరాయి .కోదండ రామాలయం లొ14 స్తంభాలు రాముడి కళలకు ప్రతిరూపం .14 భువనాలకూ కావచ్చు .ముందున్న రెండు స్తంబాలను కలిపితే 16అయి ‘’షోడశ కళానిధికి షోడశోపచారాలు ‘’అనే మాట సార్ధకమౌతుంది.గర్భ గుడి సాక్షాత్ వైకుంఠం లా ఉంటుంది . ద్వార౦పై శ్రీరామ శ్రీరామ శ్రీరామ  సువర్ణాక్షరాలతో ఉంటుంది.గడపపై గరుడ ఆంజనేయులు చెరొక వైపున ఉంటారు .రాముడికి దక్షిణ భాగం లో సీతాదేవి ఎడమభాగం లో లక్ష్మణ స్వామి ఉంటారు . లక్ష్మణస్వామి  ధనుస్సుకూ ఏడు గ౦టలున్నాయి .రామస్వామి విగ్రహం కొలతలు తిరుమల బాలాజీ కొలతలు ఒకటే .అందుకే ఎఏడుకొండలాయనకు చేయించిన కిరీటం కోదండ రాముడికి సరిపోయిందట .తిరుమల వెంకన్నకు కోదండం తగిలిస్తే  అచ్చంగా కోదండ రామస్వామిగానే ఉంటాడని అర్చకస్వాములు ఉవాచ .రాముడి వక్షస్థలం పై మహా లక్ష్మీదేవి ముద్ర ఉండటం తో తిరుమలయ్యకు రామయ్యకు భేదం లేదు .కోదండరాముని చూసి మోహనాకారుడని పొంగిపోతారు భక్తులు .తిరుమల వెంకన్నను చూసి బయటికి రాబుద్ధికానట్లు ఈ రామయ్యను చూసినా అంతే.ఫిదా అయిపోతారు .

  భద్రాచల రాముడు నాలుగు భుజాలతో ఆసన భంగిమలో ,వెంకన్న చతుర్భుజాలతో స్థానక భంగిమలో ,కోదండరామస్వామి ద్విభుజుడై ఉంటారు .తిరుమల మూల విరాట్ కు ధనుర్బాణాలు ధరించిన చిహ్నాలు చారలుగా భుజాలపై కనిపిస్తాయట .సీతా దేవి విగ్రహం లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది .రాముడికి ఎడమవైపున్న సీతమ్మను కొలిస్తే ఐశ్వర్యాభి వృద్ధి ,కుడివైపున్న సీతమ్మను కొలిస్తే మోక్ష ప్రాప్తి అని శాస్త్రం .వైఖానస సంప్రదాయం లో అమ్మవారు అయ్యవారికి కుడి ప్రక్కన ఉంటుంది –‘’సీతాయ దక్షిణే  పార్శ్వే లక్ష్మణస్యచ పార్శ్వతః ‘’అని శాస్త్రం .తిరుమలలో సీతారామ ఉత్సవ మూర్తులు ఇలానే ఉంటాయి .ఆమె ప్రక్కనే ఉన్నా ,కోదండం ధరించి ఉన్నా రాముడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉంటాడు .తిరుమలలో అర్చన తర్వాత దర్శనం శయన మందిరం నుంచి ఉన్నట్లుగానే కోదండరామాలయం లోకూడా అలాగే ఉండటం విశేషం .

  తిరుమలలో బాలాజీ ఆలయం మెట్లు ఎక్కి ఎదురుగా బేడీ ఆంజనేయ దేవాలయం లో స్వామిని చూసినట్లే   కోదండ రామాలయానికి ఎదురుగా మెట్లెక్కి ఎదురుగా ఉన్న హనుమను దర్శించాలి .అక్కడ తిరు సన్నిధి ఉన్నట్లే ఇక్కడ రామ సన్నిధి ఉంది .రాముడికి ఎడమవైపు ఉండటం వలన తూర్పు కుతిరిగి హనుమ౦తస్వామిని చూస్తూ ఉంటాడు .ఒకప్పుడు ఆలయం బయటినుంచి ఎలా అరిస్తే లోపల అలా ప్రతిధ్వని వినిపించేది .ప్రతిశనివారం శ్రీరామ ఉత్సవ విగ్రహాలూరేగింపు ఉంటుంది .కొదందరామునికి నివేదించిన ప్రసాదాలను హనుమకు కూడా నివేదించి ఆటర్వాతే భక్తులకు ప్రసాదం పెడతారు .తిరుమలలో స్వామికి నివేదించి బేడీ ఆంజనేయస్వామికి నివేదన పెడతారు .

 తిరుపతిలో గోవిందరాజస్వామి దేవేరి ఆండాలమ్మ ఉత్సవం జరిగేటప్పుడు ప్రతిరోజూ ఉదయం ,సాయంత్రం కోదండ రామాలయానికి వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్ళటం ఆచారం .ధనుర్మాసం లో ప్రతి ఉదయం వెండి బిందెలతో తీర్దాన్నిఏనుగుపై ఊరేగిస్తూ తీసుకు వెళ్లి  గోవింద రాజ స్వామికి అందిస్తారు.కొదంద రామాలయం దగ్గర రామ చంద్ర గుంట లేక తీర్ధం నుంచి గోరువెచ్చని నీటిని సీతమ్మవారి అభిషేకానికి తీసుకు వెడతారు .దీనినే ‘’నీరాట్టం ‘’అంటారు .గోవిందరాజ ఆలయంలో పార్ధసారధి దగ్గరున్న బీబీ నాంచారమ్మ ఉత్సవిగ్రహం ,కొదందరామాలయానికి రావటం విశేషం .బాలాజీకి ,రాముడికి భేదం లేదని చాటటానికేమో !కోదండ రాముని  గుడికి దగ్గరలో అన్నమాచర్య కళామందిరం,త్యాగరాజాలయ మండపాలున్నాయి . అన్నమయ్య జయంతికి త్యాగరాజ ఉత్సవాలకు కొదందరాముడే స్వయంగా హాజరౌతాడు .గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు వెళ్ళేటప్పుడు స్వామి పాదాలు కొదందరాముడికి మహా ప్రదక్షణ౦ గా వెళ్ళటం ,మోహినీ రూప వాహనం పై ఊరేగేటప్పుడు స్వామి కొదందరామాలయాంకి రావటం గొప్ప విశేషాలు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-2

తిరుపతి వెంకటాద్రి రాముడు-2
శ్రీ కోదండ రామాలయం రెండవ ప్రాకారం పై వరాహ ,ఖడ్గ ,గోడలపై సూర్యుడు ఉండటాన్నిబట్టి దీన్ని కృష్ణ దేవరాయలు కట్టించాడని భావిస్తారు .మొదటిప్రాకారం పై ఉన్న మత్శ్యాలు గమనిస్తే పల్లవులు కట్టించినట్లు అనిపిస్తుంది .టిటిడి వారి వెబ్ సైట్ లో ఆలయం 10వ శతాబ్ది చోళరాజులు కట్టినట్లు ఉంది .
ఆలయ ప్రధాన గోపురం పడమటి ద్వారం కలిగి తూర్పు ఉత్తర దక్షిణ మాడ వీధులమధ్యచాలా విశాలం గా ఉంది .ఎదురుగా భక్తాన్జనేయస్వామి ఆలయం దక్షిణ మాడ వీధిలో స్వామివారి రధం ఉన్నాయి .మూడు ప్రాకారాల ఆలయం .మొదటిది దీర్ఘ చతురశ్రంగా ,పైమూలలావు గరుత్మంతుని విగ్రహాలు నమస్కార భంగిమలో ఉన్నాయి ..పడమట ఆలయ ద్వారం ఉంది ప్రాకారాన్ని ఆనుకొని ఉద్యానవనం ఉంది .ఆగ్నేయం లో వంటశాల రెండవ ప్రాకారం లో స్వామి వారి ఆస్థాన ముఖ మండపాలు ,మూడులోగర్భాలయం శయన మందిరాలున్నాయి .తిరుమలలో లాగా ఇక్కడా నిత్యపూజలో పంచ కుబేర మూర్తులున్నాయి .ఏకాంత సేవకు కృష్ణుడి విగ్రహం ఉంది .తిరుమల హాదీరాం బావాజీ వెండిపడి కావలి గోపురానికి అంటే సీతారామ గోపురానికి ,ఈ గోపురానికి ఏదో సంబంధం ఉన్నట్లని పిస్తుంది ,.ఆ గోపురం కిందభాగాన శ్రీ సీతారామ పట్టాభిషేకం దృశ్యం శిల్పంగా చెక్కబడింది .తిరుపతి పట్టణం మధ్య ఇంత విశాల ప్రశాంత వాతావరణం ఉన్న దేవాలయం ఉండటం మహాద్భుతం .
సామాన్య ఆలయ గోపుర కలశాలు3,5,7,11 ఉంటాయి ఈ ఆలయానికి 7కలశాలుండటం సప్తగిరులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది .ఈఆలయ ధ్వజ స్తంభం బలిపీఠం తిరుమలో లాగానే ఉంటాయి .ఇక్కడి బలిపీఠం బంగారు తొడుగుతో మహా సుందరంగా ఉంటుంది .ధ్వజానికి కింద స్వామికి ఎదురుగా గరుడ ,దక్షిణం లో శ౦కు చక్ర గదా ,మరోప్రక్క ఆంజనేయస్వామి చెక్కబడ్డాయి .ధ్వజానికి 70ఏళ్ల క్రితం బంగారు తొడుగు వేయించారు .ధ్వజం ఏర్పడిన బిందువు నుంచి ప్రాకారానికి సరళ రేఖ గీస్తే ,అది స్వామికి ఎదురుగా అచ్చం తిరుమలలో లాగానే ఉండటం,ప్రాకారం రెండు సమానభాగాలుగా విభజించటం విశేషం .ఇక్కడి అశ్వత్ద వృక్షం సుమారు 150ఏళ్లనాటిది .దీని ప్రదక్షణం సంతాన ప్రాప్తికి నిదర్శనం .
ఇక్కడి ఆస్థాన మండపం తిరుమల గరుదడాల్వార్ మండపం లాగానే ఉంటుంది .ఆస్థాన సేవకు అరుగుకూడా ఉంది .భక్తులు కోదండరాముని దర్శించి ‘’హి భగవాన్ బాలాజీ ‘’అనేవారట .విష్వక్సేన ఆలయం లో పెద్ద విగ్రహం ఉంది .ఇక్కడి విఘ్నేశ్వరుడు కాణిపాక వినాయకుని గుర్తుకు తెస్తాడు .ఇక్కడి రుషి విగ్రహాలు రాజర్షులు లాగా ఉంటారు .ఇక్కడి స్తంభాలు 18 భారతపర్వాలను భాగవత స్కందాలను గుర్తుకు తెస్తాయి.
శ్రీరామ భంగిమను ‘’త్రిభంగి మధురాకృతి’’అంటారు .ఆయన కోదండం లో 7గంటలు,ఏడుకొండలకు ప్రతీక .రాముడు , వేంకటేశ్వరుడు ఒక్కరే అని చెప్పటం కూడా .స్వామి కేశాలకు వెనక రాజ ముడి ఉంటుంది .ఎడమ చేయి భుజానికి ఆనించి ధనుస్సును పట్టుకొన్నట్లు ఉంటుంది .ధనుస్సు భుజం వరకే చెక్కబడింది.కుడి చేయి కిందకు పక్కకు తిరిగ బాణం ధరించినట్లు ఉంటుందికాని ఇక్కడ బాణం లేదు .దీన్ని జ్ఞానముద్ర అంటారు .కోదండం లేకుండా కోదండ రాముడు ఏమిటి అని అనుమానం వస్తుంది .కోదండం అంటే దేని చేత క్రీడింప బడుతుందో అది .రాముడు బాణ ప్రయోగం చేస్తున్నట్లు ఎవరికీ తెలియదు .28మహాయుగాలలో ద్వాపరయుగం లో పుట్టిన అర్జునుడు కూడా ఇలాంటి శక్తికలవాడు .ఈ మన్వంతరం లో 24వామహాయుగం లో త్రేతాయుగం లో జన్మించిన శ్రీ రాముడీకే’’కోదండ రాముడు అనిపేరు .బాణాన్ని లస్తకం వింటి మధ్యభాగం ఎడమ చేతి పిడికిలి తోపట్టుకొనే చోటును ప్రదరం అంటారు .రాముడికి లస్తకం తో పని లేదు .చాపం మొదలు చివర ,ధనుస్సు చివర మొదలు లలో ఏభాగమైనా ఆయనకు లస్తకమే .ఆయన బాణప్రయోగాబ్ది అంటే బాణాలు ప్రయోగించటం లో సముద్రుడు .విల్లు ఎలా ఉన్నా బాణం దూసుకు పోతుంది విల్లా తానా ఎవరు ముఖ్యం అంటే ఆయనే ముఖ్యం ..మరి విల్లు ఎందుకు ? విలుకాడు అని చెప్పుకోవటానికే .కాకాసురినిపై గడ్డిపరక ప్రయోగించాడు .కోదండ రాముడు అని పించుకోవటానికి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం

 నవంబర్ 14ఆదివారం ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ 1976-77 బాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్ధుల సమావేశం లో సూరి బుచ్చిరాం ను చూసేదాకా ,అతడు నా శిష్యుడు అని గ్రహించలేకపోయాను .ఈ సమావేశ రూపశిల్పి, స్టీరింగ్ హెడ్,ఆల్ అండ్ ఆల్ బుచ్చిరాం అని గ్రహించాను . ఎంతసేపటికీ నా స్నేహితుడు సూరి నరసింహం అన్నగారి అబ్బాయనీ ,మరో మిత్రుడు,ఇండియాలో  హాం రేడియో స్థాపకుడు సూరి శ్రీరామమూర్తి టీం లో పని చేసిన వాడు, అతని అన్నగారబ్బాయి అనే అనుకొన్నాను .ఆరోజు తెలిసింది అతడి విశ్వరూపం .వినయం ,కార్యశూరత్వం ,పాదాభివందనం చేసిన గురుభక్తి మూర్తీభవించిన నా’’ అపూర్వ పూర్వ విద్యార్ధి ‘’అని తెలిసి ఆనంద భరితుడనయ్యాను .అతడికి సరసభారతి పుస్తకాలు అంద జేయగా అతడు నాకు ‘’ఎస్. బి .రాం –ది సోషల్ సోల్జర్ ‘’అనే తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేసే కలర్ఫుల్ కలర్ పుస్తకం ఇచ్చాడు దీన్ని ఇవాల్టి వరకు నేను చూడనే లేదు .ఇవాళ లైబ్రరీకి ఇస్తే అందరూ చదివి స్పూర్తి ,ప్రేరణా పొందుతారని పించింది,. అరే.ఇంత ఆత్మీయంగా భక్తిగా పుస్తకం ఇస్తే చదవకుండా లైబ్రరీకిస్తే ఏం బాగుంటుందని పించి చదివాను .చదివాక అతని గురిచి రాయకపోవటం భావ్యం కాదనిపించి శీర్షిక కోసం ఆలోచిస్తే పై శీర్షిక తట్టి వెంటనే రాయటానికి అంటే అతన్ని మీ అందరికి పరిచయం చేయటానికి ఉపక్రమిస్తున్నాను .

ఎస్బి రాం అనే సూరి బుచ్చిరాం (తాతగారిపేరు )21-6-1961 న ఉయ్యూరులో సూరి రామకృష్ణ ,సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు .ఉయ్యూరు హైస్కూల్ లో టెన్త్ పాసై ,ఆంధ్రా యూని వర్సిటి నుంచి 1982 లో  గ్రాడ్యుయేట్ అయ్యాడు .భారత ప్రభుత్వ౦  లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సైంటిఫిక్ అడ్వైజర్ అయిన డా సూరి భగవంతంగారికి అతిసమీప బంధువు.ఒక రకంగా మనవడి వరుస .గోవా వీరుడు సూరి సీతారం ఇతని కజిన్ బ్రదర్ కుమారుడే కనుక ఇతనికి కజిన్ .సీతారం గోవా విమోచన ఉద్యమం లో పాల్గొని 15-8-1955న పోలీస్ కాల్పులలో మరణించి అమరుడైన సంగతి మనకు తెలిసిందే .

  బుచ్చి రాం శ్రీ మతి శాంతిని1987లో  వివాహం చేసుకొని ఇద్దరమ్మాయిలకు ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు .వీరందరికీ వివాహాదులు జరిగి ముచ్చటైన ముగ్గురు మనవళ్ళతో ఆనందిస్తున్నాడు .భారత ప్రభుత్వ ,ఆంద్ర ప్రభుత్వాలకు చెందినఎన్. జి .వో .కు అంటే నేషనల్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో-హైదరాబాద్ కు వ్యవస్థాపక సభ్యుడు .ఈ సంస్థ కు పూర్తి సహకారమందించిన వారు స్వయంగా ఎమెచ్యూర్  రేడియో ఆపరేటర్ కూడా అయిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ .ఈ సంస్థలో తన పినతండ్రి  ‘’హాం సూరి ‘’గా పిలువబడే సూరి శ్రీరామ మూర్తి వద్ద 22ఏళ్ళ వయసు నుంచి 46 వ ఏడు వచ్చేదాకా 24 సంవత్సరాలు దాని అభి వృద్ధిలో భాగస్వామి అయి గొప్ప అనుభవం తో పాటు పేరు ప్రఖ్యాతులు పొందాడు .హాం రేడియో ద్వారా దేశం లో జరిగిన అన్ని రకాల ప్రకృతి విపత్తులలో  ఎమెర్జెన్సి కమ్యూని కేషన్ లను అత్యంత సమర్ధ వంతంగా నిర్వహించి ,ప్రజా సేవలో ధన్యుడయ్యాడు .గుజరాత్ లోని భుజ్ ప్రాంతం లో వచ్చిన భూకంపం ,,ఒరిస్సాను వణికించిన సూపర్ సైక్లోన్ ,గుజరాత్ భూకంపం, అండమాన్ ,నికోబార్ దీవులలో సంభవించిన సునామీ ,అనేక తుఫాన్లలో ,ఆంద్ర ప్రదేశ్ ను ముంచి అల్లకల్లోలం చేసి ప్రజా జీవితాలను ఛిద్రం చేసిన అనేక తీవ్రమైన వరదల నుంచి ప్రాణ నష్టం జరగకుండా ,ముందు జాగ్రతలు తీసుకోవటానికి ప్రజలను హాం రేడియో సేవలద్వారా ప్రభుత్వాలకంటే ముందే హెచ్చరికలు చేసి ,ఆతర్వాత నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించటం లో మానవ సేవయే మాధవ సేవగా చేసిన శ్రీరామ మూర్తి బుచ్చిరాం వాళ్ళ హాం రేడియో సేవలు నిరుపమానమైనవి ,ప్రభుత్వాల గుర్తింపు పొంది ఘనమైన ప్రశంసలు అందుకొన్నాయి .సునామీ సమయం లో చేసిన సేవలకు ఈ బృందాన్ని నాటి రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు రాష్ట్ర పతి భవనానికి ఆహ్వానించి గౌరవించటం చిరస్మరణీయం .ప్రధాని డా మన్మోహన్ సింగ్ గారుకూడా ఆహ్వానించి ఈ టీం చేసిన సేవలను ప్రస్తుతించి సత్కరించటం,హామ్ రేడియోకు ,  మానవ సేవకు దక్కిన అపూర్వ గౌరవం .

  మన బుచ్చి అమెరికా ,జర్మని ,కెనడా ,ఢాకా లలో జరిగిన  అనేక జాతీయ అంతర్జాతీయ సేమినార్లలకు హాజరయ్యాడు.పారిస్, ఆమ్ ష్టర్ డాం , బెర్లిన్, శ్రీలంక లను సందర్శించాడు .అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తో సహా భారత దేశమంతా తిరిగి సేవలు అందించిన అనుభవం అతడిది .నేపాల్ లో వచ్చిన భారీ భూకంపసమయం లో  ఈ టీం ద్వారా హైదరాబాద్ లో ‘’నేషనల్ ఎర్త్ కేక్ రిలీఫ్ కాంప్ ‘’ఏర్పరచి దుప్పట్లు ,అత్యవసర మైన మందులు ,ఆహారం సేకరించి నేపాల్ కు పంపి ఆదుకొన్నాడు  .

   24ఏళ్ళు సుదీర్ఘ సేవలు ఎమేచ్యూర్ రేడియో సంస్థకు అందించిన బుచ్చిరాం 2007లో అక్కడి తన ఉద్యోగానికి రాజీ నామా చేసి ,స్వంతంగా ‘’స్పందన బిజినెస్ సొల్యూషన్స్ ‘’అనే కన్సల్టన్సి సంస్థను స్థాపించి ఆర్ధిక ,ఇన్సూరెన్స్ సర్వీసెస్ లను 5 వేలమంది కి పైగా కష్టమర్ లకు అందించి వారి సంతృప్తికి కారణ మయ్యాడు .భారత దేశ ఎల్. ఐ. సి. హైదరాబాద్ డివిజన్ కు కి అత్యున్నత చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్  అడ్వైజర్ లలో ఒకడుగా ఉన్నాడు .’’మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ ‘’కు నాలుగు సార్లు క్వాలిఫై అయిన ఘనత బుచ్చిది.2010లో ఈ సంస్థ సమావేశం కెనడాలోని వాంకూవర్ లో జరిగితే హాజరై గుర్తింపు పొందాడు .ఇన్సూరెన్స్ ఇండష్ట్రి లో అనేక మైలు రాళ్ళను దాటి ,చాలా మంది చేత ప్రశంసలు ,సర్టిఫికెట్లు అందుకొన్న ‘’సాంఘిక సైనికుడు ‘’.ఇతని అనితర సాధ్యమైన సేవను గుర్తించి ఇటీవలే’’ హైదరాబాద్ ఆణి ముత్యం ‘’బిరుదు ప్రదానం చేశారు .

  బుచ్చిరాం సెవలు ఏదోఒకటి రెండు సంస్థలకే పరిమితం కాలేదు .హైదరాబాద్ లోని రామకృష్ణా మఠం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు తనవంతు సేవలందిస్తున్నాడు .హైదరాబాద్ లోని  వెనుక బడిన విద్యార్దులకు నిత్యాన్నదానం పధకంలో భాగస్వామి .అమృత గంగ ప్రాజెక్ట్  క్రింద రంగారెడ్డి జిల్లా అదలపు గ్రామం లో పెద్ద బావి త్రవ్వించి గ్రామస్తులకు మంచి నీటి వసతి కల్పించాడు .దీన్ని స్వామి శ్రీ సువివరానంద జీ మహారాజ్ 10-6-16న ప్రారంభించారు .శంకరపల్లి దగ్గర గాజులపల్లి లో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించ రక్షిత మంచి నీటి సరఫరా చేయిస్తున్నాడు .ప్రభుత్వ స్కూళ్ళలోని వందలాది  వెనుకబడిన విద్యార్ధులకు  పుస్తకాలు, సూల్ బాగ్స్ ఉచితంగా అందిస్తున్నాడు .వెనుకబడిన బాలికా విద్యార్ధులు  గ్రూప్ , సివిల్స్ పరీక్షలకు తయారవటానికి   ‘’సిస్టర్ నివేదిత రీడింగ్ రూమ్ ‘’ ను అశోకే నగర్ లో ఏర్పాటు చేశాడు .

  ఇన్ని రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న బుచ్చిరాం కు తగిన గుర్తింపు ,పురస్కారాలు అందుకొన్నాడు .సాంఘిక సేవలో 30 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసినందుకు కళా నిలయం సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ‘’ఎన్.టి. ఆర్ .ఎక్స్ లెన్సి అవార్డ్ ‘’అందించి సత్కరించింది .హైదరాబాద్ రామ కృష్ణ మఠం ,మిషన్ జనరల్ సెక్రెటరి శ్రీస్వామి సువిరానంద మహా రాజ్ బుచ్చి రాం చేబట్టిన అమృత గంగ ప్రాజెక్ట్  సందర్భంగా  గౌరవించి సత్కరించారు .హైదరాబాద్ లోని జియోరిసోర్సేస్ టెక్నాలజీస్ కన్సల్టెన్స్ తరఫున ఏర్పాటైన ‘’Fullerence’’ ప్రాజెక్ట్ కు ఆనరరి పిఆర్ వో గా సేవ లందించాడు .హైదరాబాద్ లోని ‘’సనాతన ఎంటర్ప్యూనర్స్అసోసియేషన్ ‘’కు జాతీయ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తూ సనాన ధర్మాన్ని కాపాడుతున్నాడు .

  బాబాయి సూరి శ్రీరామమూర్తి కాంగ్రెస్ పార్టీ లో చేరి ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ మొదలైన ప్రధానులతో  ,రాష్ట్ర పతులతో ,ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టి.అంజయ్య గార్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు .అలాగే అబ్బాయ్ బుచ్చిరాం మాజీ ప్రధాని శ్రీ నరసింహారావు గారితోనే కాక , ఇప్పుడు బిజెపి లో చేరి ,ఆ పార్టీ కి చెందిన రాష్ట్ర ,జాతీయ నాయకులతో సంబంధాలను కలిగిజాతీయ స్థాయిలో  ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నాడు .’’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్’’ బుచ్చిరాం ఇంకా అభి వృద్ధి చెంది ,దేశ సేవలో తరిస్తూ ,తను పుట్టిన ఉయ్యూరు అభి వృద్ధిలోనూ ప్రత్యెక శ్రద్ధ కనబరచాలని కోరుతూ ,ఇలాంటి సేవా పరాయణుడైన వ్యక్తి  నాకు శిష్యుడైనందుకు గర్వపడుతూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-21-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

24-పేరడీ కవిత్వ హాస్యం

24-పేరడీ కవిత్వ హాస్యం

ఉదయ రాజు రాఘవ రంగారావు గారి ‘’మత్కుణోపాఖ్యానం’’దేవీ ప్రసాద్ ‘’భక్షేశ్వరీ శతకం ‘’,జరుక్ శాస్త్రి అనబడే శ్రీ జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి కృష్ణ శాస్త్రి గారి పేరడీ కవిత్వం పేరడీ కవిత్వం లో ముందు వరుసలో ఉన్నాయి .కాళోజి నారాయణరావు గారు కూడా ‘’ఏదేశమేగినా ఎందుకాలిడినా చూడరా నీ బొజ్జ పూడు మార్గంబు ‘’అని రాయప్రోలు వారి కవిత్వానికి పేరడీ రాశారని మునిమాణిక్యంగారువాచ .కొత్త పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు తలిదండ్రులు ఎన్నోజాగ్రతలు చెబుతారు .దీనికీ పేరడీ పిసిగాడోకవి –మొగుడితో ఎలా ప్రవర్తించాలో చెబుతూ ‘’నీ మాట వినబడ్డ నిమిష౦బు నందు అడలిపోయే-ట్లు అతని భయపెట్టు –పతికోప్పడిన పడియు౦డబోకు-అంతకు పది రెట్లు అతని మర్దించు -ఇరుగు పొరుగువారు ఏమైనా అంటే –ఏడవక వేయి రెట్లు దుమ్మేత్తిపోయ్యి-భర్తను వంచుకోగల భార్యగౌరవ మెన్న-రారాజులకు నైన రమణి రో లేదు –ఇవి ఎల్ల మరువక ,ఏమాత్రము అలయక సుఖ పడు చుండుమో సొగసు పూదీగ ‘’.

  ఒక యువకవి సుమతీ శతకానికిపేరడీ గుప్పించాడు –‘’తినదగు నెవ్వరు పెట్టిన –తినినంతనే తేన్పులిడక స్థిమిత పడదగున్ –తిని రుచియు నరుచియు నెరిగిన మనుజుడే పో మహిలో  సుమతీ ‘’-‘’ఎప్పటి కకెయ్యేది దొరికిన ఆ తిండి తినుచు –అన్యులతోన్ –చెప్పించక తా  చెప్పక –తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘’-‘’అప్పచ్చులతోడ సుష్టుగ భోజనము పెట్టు ఇల్లో, హోటలో –చొప్పడిన యూర నుండుము-చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ ‘’-‘’అక్కరకు రాని బస్సును –చక్కగ సినిమాకురాక సణిగెడి భార్యన్ –ఉక్కగ నుండెడు యింటిని –గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ‘’.

  వచనానికీ చక్కని పేరడీ రాసినవారున్నారు .శ్రీరమణ,జొన్నవిత్తుల మొదలైనవారు .విశ్వనాథ వారి వచనానికి ఎలా పేరడీ పచనం చేశాడో ఒక తుంటరి చూడండి –‘’వాడు మానిసి .కర చరణాదులున్నవి.కనులు మూసుకొని నిద్ర పోవు చున్నట్లున్నది.నిద్ర యనగా పంచేంద్రియ వ్యవహారోప సంహృతి .నిద్రలో అతని మనసు ఆడుచునే యున్నది .ఇది ఇంద్రియ విషయిక నిద్రాస్థితి .జీవుడు మేల్కొని యున్నాడు .సర్వ వ్యవహారములకు యోగ్యుడై యున్నాడు .కాని వ్యవహారము  నిర్వహించ లేడు.నిద్ర పోవుచున్నట్లు అతనికి తెలియునా ?తెలియదు ,తెలియునుకూడా .మేల్కొనగానే నిద్రించిన అభిజ్ఞ అతనికి కలిగినది .అనగా పూర్వముకూడా అతనికావిషయము తెలిసియె యుండవలయును .నిద్ర పోవునట్లతనికి నిద్రలో కూడా తెలియునా ?తెలియును తెలియదు.ఇది ఒక చమత్కారము ‘’ఇది చదివి మనకు వచ్చే నిద్రకూడా దూరమౌతుందేమో ఏమో అదోచమత్కారము .(చమత్కారమన్న నేమి?చమస్సులో కారమా ?కారములో చమస్సా ? ఏదైననూ  కావచ్చును కాకపోవచ్చును ఇలా ఏడిసింది మన తెలివీ.అసలు తెలివి యన్నది ఒక బ్రహ్మ పదార్ధము దాని విషయము కాళిదాసుకు తెలుసు భవ భూతికి తెలుసు దిగ్నాగునికి మూడు వంతులు ,నన్నయ్యకు అర్ధభాగం తెలియును .తెలియుటలోనే తెలివి యున్నది .తెలివి తెలివి నీ తెలివి తెల్లవారినట్లే యున్నదిలే అఘోరించుము ) ఈ బ్రాకెట్ లోని దంతా నాపైత్యం క్షమించండి .

  మూలం లోని పద్య పాదాన్ని అనుకరణ చేసిన పాదం తోకలిపితే ఒకరకమైన హాస్యం వస్తుందన్నారు మాష్టారు –ఉదాహరణ ‘’సదమల మణిమయ  సౌద భాగంబుల ‘’అనే పద్య పాదాన్ని ‘’సద్దల్లో మన్ను వోయ సుద్దా భాగ౦బుల ‘’అని మారిస్తే హాస్యం చిప్పిలుతున్దన్నారు సారూ .

 సంధ్యావందనం లో ‘’ఉత్తమే శిఖరే జాతే ‘’అనే దాన్ని ఒక పారడిష్టు ‘’ఉత్తమే శిఖరే జాతే –కోన్ జాతే బులావురే ‘’అని అనుకరించాడట.’’అమృతాభిదానమసి-రౌరవే పుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం –అర్ధినాముదకం దత్తం అక్షయ్య ముపతిష్టతు’’అనే భోజనానంతర మంత్రానికి –‘’అమ్మితే వృధా అదన్తమసి అంబు గజము పట్టుకోన్నదే –అరచి చచ్చినా నిన్ను విడువదే-అచ్చమ్మా ఇక తిట్టకే ‘’  అని పేరడీ పెసరట్టు వేశాడొకడు అన్నారు మాష్టారు .ఇప్పటిదాకా మనం చెప్పుకొన్నది అంతా’’శబ్దాశ్రయ హాస్యం ‘’.

 రైలుబండిలో వైతాళికులు అనే ప్రహసనంలోనిది:
శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి-
“ఎవరు మీరు” అన్నాడు టి.వాడు
“భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను”
“కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా” అన్నారెవరో.
“నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది”
“కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది” అన్నాడు టి.టి.ఇ.
“మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను…”
“అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు”
“ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం”
అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్ళీ హరీన్‌ఛట్టో లోకి వెళ్ళిపోయారు.

‘కోయకుమీ సొరకాయలు/ వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్‌/ డాయకుమీ అరవఫిలిం/ చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా’’- ఇది శ్రీ శ్రీ పేరడీ

తొలి పేరడీ కవిగా తెనాలి రామకృష్ణుడినే చెబుతారు. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలును పోల్చుతూ మొల్ల చెప్పిన ‘‘అతడు గోపాలకుం డితడు భూపాలకుం/ డెలమినాతని కన్న నితడు ఘనుడు/ అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు/’’ పద్యాన్ని అనుకరిస్తూ.. శివుణ్ని, ఎద్దును పోలుస్తూ ‘‘ఆతడంబకు మగం డితడమ్మకు మగండు/ నెలమి నాతనికన్న నితడు ఘనుడు/ అతను శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు/ నెలమి నాతనికన్న నితడు ఘనుడు/…’’ అనే పద్యాన్ని వికటకవి చెప్పాడంటారు

శ్రీశ్రీ ‘నవ కవిత’ను ‘సరదా పాట’గా మార్చి, ‘‘మాగాయీ కంది పచ్చడీ/ ఆవకాయి పెసరప్పడమూ/ తెగిపోయిన పాత చెప్పులూ/ పిచ్చాడి ప్రలాపం, కోపం/ వైజాగులో కారాకిళ్లీ/ సామానోయ్‌ సరదాపాటకు/ తుప్పట్టిన మోటర్‌ చక్రం/ తగ్గించిన చిమ్నీ దీపం/ మహవూరిన రంపప్పొట్టూ/ పంగల్చీలిన ట్రాం పట్టా/ విసిరేసిన విస్తరి మెతుకులు/ అచ్చమ్మ హోటల్లో చేపలు/ సామానోయ్‌ సరదాపాటకు/ నడి నిశిలో తీతువు కూతా/ పడిపోయిన బెబ్బులి వేటా/ కర్రెక్కిన నల్లినెత్తురూ/ జుర్రేసిన ఉల్లికారమూ/ చించేసిన కాలెండర్‌ షీట్‌… సరదాపాటకు’’ అంటూ మూల రచన ముక్కుపిండేశారు శాస్త్రి. అలాగే, ‘అద్వైతం’ గీతానికి ‘విశిష్టాద్వైతం’ పేరుతో ఆనందం అంబరమైతే/ అనురాగం బంభరమైతే/ అనురాగం రెక్కలు చూస్తాం/ ఆనందం ముక్కలు చేస్తాం….’’ అంటూ వర్గ ఘర్షణను చిత్రించారు. ‘‘నేను సైతం కిళ్లీకొట్లో/ పాతబాకీ లెగరగొట్టాను/ నేను సైతం జనాభాలో/ సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను; ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడీలెన్నో; ప్రపంచమొక సర్కస్‌ డేరా/ కవిత్వమొక వర్కర్‌ బూరా’’ లాంటివి శ్రీశ్రీ కవితాపాదాలకు జరుక్‌ శాస్త్రి పేరడీ పంక్తులు ‘చోటా హజ్రీ నమస్తుభ్యం/ వరదే కామరూపిణి/ కాఫీ పానం కరిష్యామి/ సిద్ధిర్భవతు మే సదా..’’ లాంటివి ఆయన హాస్య ప్రియత్వానికి మచ్చుతునకలు. ‘

ఏ రోడ్డు చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం?/ రహదారి చరిత్ర సమస్తం/ ధూళి ధూసరి పరిన్యస్తం!/ రహదారి చరిత్ర సమస్తం/ యాతాయాత జనసంయుక్తం/ రహదారి చరిత్ర సమస్తం/ పథిక వాహన ప్రయాణసిక్తం/ భూంకారగర్జిత దిగ్భాగం/ చక్రాంగజ్వలిత సమస్తాంగం/ రహదారి చరిత్ర సమస్తం/ పైజమ్మాలను పాడుచేయడం-అని శ్రీశ్రీ కవిత్వానికి  దేవీ ప్రసాద్ పేరడీ . ‘తొక్కిన కదలని సైకిలు/ పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్‌/ యెక్కకె పారెడి గుఱ్ఱము/ గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అంటూ నవ్వులవాన కురిపించారు.

‘‘ఏ ల్యాబ్‌ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం/ శాస్త్రజ్ఞుల చరిత్ర సమస్తం/ పరదూషణ పరాయణత్వం…./ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో/ విద్యార్థుల జీవనమెట్టిది/ ప్రొఫెసరచ్చేసిన పేపర్‌ కాదోయ్‌/ దాన్ని వ్రాసిన విద్యార్థెవడు?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవన శర్మ. ‘‘దినపత్రిక దిక్కుల వ్రాతలు/ దీవించే సంపాదక నేతలు/ అర్థానికి అకాడమీ దాతలు/ పలు భాషల ప్రచురణ కర్తలు/ కౌగిలి కోరే కృతిభర్తలు/ కృత్రిమ సంఘం, కుంటి నడకలు/ కావాలోయ్‌ నవీన కవులకు…’’ అంటూ ఆధునిక కవులను ఏకేశారు కాట్రగడ్డ. కవి, సినీ నటుడు తనికెళ్ల భరణి అయితే ‘‘స్కాచ్‌ విస్కీ, స్పెన్సర్‌ సోడా/ స్టేటెక్స్‌ ప్రెస్, గ్యాసు లైటరూ/ తెల్లగ్లాసూ, చల్లని ఐసూ/ మటన్‌ చిప్స్, బాయిల్డెగ్సూ/ కావాలోయ్‌ నవకవనానికి…’’ అన్నారు. శ్రీశ్రీ ‘జయభేరి’ గేయానికి ‘గుండుభేరి’ పేరడీ సృష్టించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. ‘‘నేను సైతం/ తెల్లజుట్టుకు/ నల్లరంగును కొనుక్కొచ్చాను/ నేను సైతం/ నల్ల రంగును/ తెల్లజుట్టుకి రాసి దువ్వాను/ యింత చేసీ/ యింత క్రితమే/ తిరుపతయ్యకు జుట్టునిచ్చాను’’ అంటూ వాపోయారాయన. కృష్ణశాస్త్రి కవిత ‘‘సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు?’’కు ‘సందియం’ పేరుతో ‘‘జఠర రసమేల స్రవియించు జఠర గ్రంథి?/ అడవిలో యేల నివసించు నడవి పంది?/ ఏల పిచ్చికుక్క కరచు? కాకేల యరుచు/..’’ అనే పేరడీ రాశారు జొన్నవిత్తుల. ఆత్రేయ పాట ‘‘కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్ల’’ పాటకి.. ‘‘పరిగెత్తుకొచ్చిందీ పిచ్చికుక్కా/ అది కరిచిందీ కచ్చగా కాలిపిక్కా’’ అంటూ అందరినీ నవ్వించారు. ఇంకా ఆరుద్ర, మాగంటి వంశీమోహన్, జాగర్లపూడి సత్యనారాయణ, వివి సుబ్బారావు తదితరులెందరో శ్రీశ్రీ కైతలకు పేరడీలు కట్టారు. 
      పేరడీలతో కవులను అల్లల్లాడించిన జరుక్‌ శాస్త్రి మీద 19 పద్యాలతో ‘రుక్కుటేశ్వర శతకం’ తెచ్చారు శ్రీశ్రీ, ఆరుద్ర. ‘‘రుక్కునకు, ఆగ్రహముగల/ ముక్కునకు, విచిత్ర భావముఖురిత వాణీ/ భాక్కునకున్, తెగవాగెడి/ డొక్కునకున్‌ సాటిలేని డుబడుక్కునకున్‌…’’ అంటూ శాస్త్రిని ఆటపట్టించారు. ఇందులోని పద్యాలు ‘జరూ!’తో అంతమవుతాయి. శ్రీశ్రీ విడిగా ‘సిరిసిరి మువ్వ’ శతకాన్ని రచించారు. ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే సుమతీ శతక పద్యానికి పేరడీగా ఇందులో ‘‘ఎప్పుడు పడితే అప్పుడు/ కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్‌/ చొప్పడిన యూరనుండుము/ చొప్పడకున్నట్టి  యూర చొరకుము మువ్వా’’ అంటూ  కాఫీ దాతలను కీర్తించారు. 

సినారె శైలిలో ఓ ప్రేమలేఖ రాశారు శ్రీరమణ. ‘‘మధుర రసైక ధారావాహినీ:/ నమస్తే: నమస్తే: ప్రియసఖి/ నేనే. నేనే నారాయణ రెడ్డిని/ కవిని. రవిని- నిను కోరే ప్రియుణ్ని/ నీ చూపులు వలపు సేతువులు/ నీ రూపులు రామప్ప శిల్పాలు…’’

ఇప్పటిదాకా మనం చెప్పుకొన్నది అంతా’’శబ్దాశ్రయ హాస్యం ‘’.

ఇక  భావాశ్రయ హాస్యానికి తెరతీద్దాం .

  శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు

అనే తిరుపతి కొదండరామ స్వామి దేవాలయ విశిష్టత

అనే పుస్తకాన్ని శ్రీ తలుపూరు రామ రమేష్ కుమార్ రచించగా తిరుమల తిరుపతి దేవస్థానం 2004లో ప్రచురించింది ,వెల-ఉచితం .దీనిని సీతా లక్ష్మణ భక్తాంజనేయ సమేత శ్రీ కోదండరామికి అంకితమిచ్చారు .దీనికి మున్నుడి వ్రాస్తూ భక్తా౦ఘ్రిరేణువు శ్రీ సింగరాజు సచ్చిదానందం ‘’ఒకప్పుడు తిరుపతి కపిల తీర్ధం దగ్గర విజయ నగర సామ్రాజ్యం కాలం లో అచ్యుత రాయపురం అని పిలువబడేదని,అప్పటి మహమ్మదీయ దండయాత్రలో అక్కడి కోదండరామాలయం శిధిల మవగా , తిరుపతి నడి బొడ్డున ఈనాటి కోదండ రామాలయం పునర్నిర్మితమైంది అని రచయిత రాసినమాటలు యదార్ధం .ఆలయం వంట శాలలో వకుళమాలిక విగ్రహం ఉండేదని,రాముడికి ఎదురుగా ఆస్థాన మండపం ,ఆంజనేయ దేవాలయం ,వీరికి జరిగే నిత్యోత్సవ ,పక్షోత్సవ ,మాసోత్సవాదులన్నీ వివరించి  రాశాడు .కోదండ రాముడిని ‘’వెంకటాద్రి రాముడు ‘’అనటం అత్యంత సముచితం ‘’అని రాశారు .

  రచయిత ఈ ఆలయ విశేషాలు వివరిస్తూ రిరుమల వెంకన్నకు జరిగినట్లే కోదండ రాముడికీ ఆగమ విధానం లో బ్రహ్మోత్సవాలతో సహా అన్నీ జరిగేవి అని చెప్పాడు .స్థానిక స్థలపురాణ విషయాలన్నీ క్రోడీకరించి తాను ఈ పుస్తకం రాశానన్నాడు .రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాలక్ష్మణ సుగ్రీవ హనుమ జాంబవంత అంగద సమేతంగా తిరుమలకు వచ్చిన సందర్భంగా ఈ ఆలయం నిర్మించబడింది .భవిష్యత్ పురాణం లో సీతాన్వేషణ సఫలమైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు .అందుకే రామస్వామి పడమర వైపుకు తిరిగి ,తూర్పు వైపు చూస్తున్న బాలాజీకి ఎదురుగా నిలుచుని ఉన్నాడు .ఆనాటి పడమటి వైపున్న గుంట నే ఇప్పుడు రామచంద్ర తీర్ధం లేక కోనేరు అంటారు .జనమేజయ చక్రవర్తి ఈ తీర్ధం లో స్నానానికి దిగినప్పుడు ఈ ఆలయ విగ్రహాలు దొరికినట్లు వాటిని స్థాపించి దేవాలయం నిర్మించినట్లు చెప్పుకొంటారు .ఇది జాంబవంతుని ప్రతిష్ట అనీ అంటారు. ఒంటిమిట్ట కొదందరాముని,వాయల్పాడు పట్టాభి రాముడిని కూడా జాంబవంతుడే ప్రతిష్టించాడని అంటారు .శ్రీసాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీనిపై విశేష కృషి చేసి రాసిన ‘’తిరుపతి వెంకటేశ్వర ‘’  పుస్తకం లో ‘’సవాల్ ఎ జవాబ్ పట్టీ ‘’అధ్యాయలం లో కొదండరామాలయచరిత్ర ఉంది .త్రేతాయుగం లో రాముడు వానర సైన్యంతో ఇక్కడ ఒకరాత్రి విశ్రమించాడు .అప్పుడు ఆ౦జనేయాదులు వైకుంఠ గుహనుంచి వెలువడుతున్న తేజస్సు చూసి రాముడికి చెబితే ఈ పర్వతం అంతా తేజోమయమే అన్నాడు .రావణ వధ తర్వాత మళ్ళీ వచ్చికొంతకాలం ఉండి గుర్తుగా  తిరుపతిలో కోదండరామాలయం నిర్మించాడు .రామ,సీతా  లక్ష్మణ హనుమ విగ్రహాలు నెలకొల్పారు .

జనమేజయ చక్రవర్తిశిధిలావస్థలో ఉన్న  ఈ ఆలయాన్ని వైభవోపేతంగా పునర్నిర్మించాడు .యాదవ రాజులు క్రీశ 834లో మండప ,ప్రాకారాలు కట్టించారు .ఆలయ చరిత్ర చెప్పే శాసనాలు దొరకలేదు .ఆలయం ఉత్తర గోపురం దగ్గర అచ్యుత దేవరాయలు సమర్పించిన  రథం గురించి ఒకటి ,వంటశాలలో పెద్ద రాతి గిన్నె పై నారాయణన్ అనే నేలటూరు గ్రామస్థుడు స్వామికి ఒక గిన్నె సమర్పించినట్లు ఉన్నది .గోవిందరాజస్వామి ఆలయం లో ‘’కూరత్తాల్వార్’’మండపం ఉత్తరగోడ లోపలిభాగం లో దొరికిన శాసనాలలో కోదండరామాలయ విశేషాలు ఎక్కువగా ఉన్నాయి .క్రీ శ.1480లో శఠ గోప దాసర్ నరసింహమొదలియార్  అనే ఆయన నరసింహ ఉడయ్యార్ కాలం నాటి సంస్కృతీ సంప్రదాయాల చిహ్నంగా ‘’రఘునాథుడు ‘’అనే పేరుతొ రాముడి విగ్రహాన్నిచ్చి ,గోవిందరాజాలయానికి ఉత్తరాన కోదండ రామాలయం నిర్మించాడు  .ఇతడే వీర సాలువ నరసింహరాయలు అని సాధు సుబ్రహ్మణ్యంగారు గుర్తించారు .ఈ రాయాలే అవిలాల గ్రామం లో 15ఎకరాలు స్వామి వారి కై౦కర్యాలకోసం ఇచ్చినట్లు శాసనం ఉంది .1494లో ఈరాయలు ,కొడుకు ఇక్కడికి వచ్చి మార్చి 9న మొదటిసారిగా శ్రీరామనవమి ఉత్సవం జరిపి ఒక ‘’అప్పపడి’’స్వామికి సమర్పించి హనుమంతునికి కూడా నైవేద్యం సమర్పింఛి ఉత్సవ మూర్తులకు వైభవోపేతంగా ఊరేగింపు అనే గ్రామోత్సవం జరిపారని శాసనం ఉంది .’’కనుప్పొడి’’రోజున సీతాదేవి అభిషేకం చేసి ,రెండు సార్లు ‘’తిరు పోనక్కం ‘’నైవేద్యం పెట్టారు .అంటే శ్రీరామనవమి ఉత్సవాలుఏ కోదండ రామాలయం లో సుమారు 560ఏళ్ల నుంచీ జరుగుతున్నాయని తెలుస్తోంది .14-1-1529న అచ్యుతదేవరాయలు శ్రీ కుమార రామానుజ అయ్యర్ ఆధ్వర్యం లోఫల్గుణి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉపయోగించే  ఒక అద్భుత కొయ్య రథాన్నిసమర్పించాడు   .నాలుగు మాడ వీధులలో స్వామి వారిని ఊరేగించేవారు .అంటే బ్రహ్మోత్సవాలుకూడా సుమారు 500 ఏళ్లుగా ఇక్కడ చేస్తున్నారన్నమాట .1859లో ఉద్దాన ధార్వర్ ఉళగప్పన్  అనే భక్తుడు ‘దివ్య ప్రబంధ పారాయణం ‘’చేసే ‘’అధ్యయ నోత్సవం జరిపాడు.ఆరవ రోజున రామానుజ అయ్యంగార్ ‘’శాత్తుమొర’’జరిపించారు తెప్పోత్సవం ఒక రోజు జరిగింది .తాళ్ళపాక పేద తిరుమలాచార్య కుమారుడు ,వెంకటేశ్వరస్వామి ఆస్థాన గాయకుడు శ్రీ తాళ్ళపాక తిరుమలాచార్యులు ‘’ఇడ్డలిపడి’’అనే స్పెషల్ నైవేద్యం 1547లో సమర్పించాడు .1540నుంచి తిరువే౦గడ రామానుజ జియ్యర్ గారి ఆధ్వర్యం లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లికార్జున శతకం

మల్లికార్జున శతకం

మల్లికార్జున శతకం
కవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి రాసిన ‘’మల్లికార్జున శతకం ‘’15-3-1936 న పుత్రశతకం కంటే ముందే ప్రచురించాడు .మకుటం ‘’మల్లికార్జునా ‘’.
మొదటి పద్యం –‘’శ్రీ జలజోద్భవా౦డజముల జెన్నలరారు త్వదీయ శక్తియే –యా జలజాప్తుగా బరగి ,యాదరమొప్ప మదీయ చిత్త వాం
ఛా జల౦బు లన్నిటికి సత్ఫలమియ్య బతిత్వ మంది నన్- భూజన వంద్యు జేయగదదెభోగి విభూషణ మల్లికార్జునా !’’అని ప్రారంభించి ‘’అక్షయ దుష్ట శిక్షణ యజాండ నివాస త్రిలోకపాలనా –ధ్యక్ష ,మునీశ రక్ష,నిగమాంత విహార రమేశ మిత్ర రా
గక్షయ దీనపక్ష ,సురకమితడాయి శశాంక మౌళి దు-ర్దక్ష మదాపహార యని ధ్యానమొనర్చెద మల్లికార్జునా ‘’అంటూ క్షకార ప్రాసతో సునాయాసంగా పద్యం నడిపాడు .కొండ నివాసం కొండ చాపం ,కొండ మామ ,కొండకూతురే సతి ,కు౦భజులు భక్తులు ,భూమి రధం ,అయిన ‘’నీ దండికి జాలి నట్టి ఘన దైవము లేడు’’అన్నాడు .’’తిట్టియు గొట్టిమొట్టినను నిను బాధ బెట్టినన్ –చుట్టమె యక్కిరీటి ?’’కాదు సొంపుగా కాచావు ‘’అన్నాడు దిట్ట తనంగా .జూదం వద్దు సత్యం పలుకు ,తండ్రిమాట విను ,కోపం నాశనకారణం , మూర్ఖ స్నేహం వద్దు అనిహితవు చెప్పాడు .ప్రతిభ ఉంటె దేనినైనా జయించ వచ్చు .దొడ్డ గుణాలున్నవాడి దగ్గరకు దుర్భర శత్రువు వచ్చినా, కీడు ఒడ్డక కోరికలు తీర్చి పంపుతాడు ఎలాగంటే దుడ్డుతో మోది బంధం వేసి పాలు తీసే దుష్టుడికైనా దొడ్డగ ధేనువు పాలిచ్చినట్లు అని దొడ్డ సూత్రాన్నే చెప్పాడు .రౌద్ర సత్తక్క ,సిరియాలుడు ,భల్లాణ రాజు ,కన్నప్ప ల లాగా రాళ్ళతో కొట్టటం తెడ్డుతో బాదటం బాలుడినికోసి వండి భోజనం పెట్టటం కనులు పీకి అమర్చటం చేయలేని అసమర్దుడిని కనుక నాపై కటాక్షం చూపు అని ఎనేక్డోట్స్ లను బాగా ఉపయోగించాడు .ఇలాంటి పద్యాలు శైవ సాహిత్యం లో కోకొల్లలే .
భక్తిలేని ప్రవిమలజ్ఞానం ,మంచి ధ్యానం ,ఉప్పులేని వంటకంరుచి నివ్వనట్లు ముక్తినివ్వదు.సిరిబాగా ఉంటె బంధు జనం కుప్పలు తెప్పలుగా వచ్చి వాల్తారు ,సిరి పొతే కనీసం పలకరించటానికి కూడా ఎవరూ రారు అనే కఠోర సత్యం చాటాడు .జననం కర్మ బద్ధం .సంపదలు ఎండమావులు .దారాపుత్రాదులు రుణానుబంధాలు.సంసారం చెరసాల .కనుక మనుషుడికి శాంతి ఎక్కడ ?అని ప్రశ్నించాడు ..’కృపగనగా వలెన్ దానను గీర్తమ జేసిన వాని నెట్లోకీ-డపరమితంబుగా నొసగునట్టి దురాత్మకు నేని దొల్లి క్రూ
ర ఫణచయంబునన్ ,గరువరా విదిలించి ,పదాన ద్రోక్కినన్ –గృప గనుమన్న కాళియుని కృష్ణుడు కావడె మల్లికార్జునా ?’’అని కాళీయమర్దనం లో శ్రీ కృష్ణ దయామృతాన్ని చూపించాడుకవి .దుష్టుడు అని తెలిసినా కొడుకును సమర్ధిస్తే వంశనాశనమేజరుగుతుంది .గుడ్డిరాజు చూపిన పుత్రా వ్యామోహం కురువంశ నాశనానికి కారణమైనట్లు అని సందర్భ శుద్ధిగాచేప్పాడు .సభలో ఎందరున్నా ,గుణ సంపద ఉన్న పండితుడు లేకపోతె రంజకం కాదు .ఆకాశం లో తారలెన్నిఉన్నా ,చంద్రుడులేకపోతే శోభ లేనట్లుగా .ఘనుడైన వాడి గౌరవాన్ని భంగపరిస్తే –నవనందులు ధనగర్వం తో చాణక్యుని అవమానించి నంద వంశ నిర్మూలనం చేజేతులా తెచ్చుకొన్నట్లు సర్వ నాశనమౌతారు .’’మాతకు మ్రొక్కటం,తండ్రిని గౌరవించటం తాతకు సేవ చేయటం తాపస వర్యులను చేరి కొలవటం ,భూత దయ చూపటం సజ్జనులకు సహజ సిద్ధమైన లక్షణాలు .
‘’బొట్టు విభూతి భూషణము భోగి ,సఖుండు కుబేరుడాలియౌ-గట్టుల రేని బిడ్డ ,నిజకార్ముకమాహరి ,తేరుభూమినీ
పెట్టెడి పువ్వు చంద్రుడును ,పెక్కులు నిట్టివి గల్గి యుండగా –గట్టిగ భిక్ష మెత్తుటకు కారణమేమిర మల్లికార్జునా ?’’ ,అంటూ వ్యాజ స్తుతి చేశాడు .
‘’ప్రవిమల జ్ఞాన వహ్నిని యవారణ వృక్షరాజముల్ –దవిలి దహించి భస్మమును దాల్చి త్వదీయస్వరూప లింగమున్ –భవముల బాసి కంఠమునభక్తిని గట్టెద భక్తులన్దరిన్ –భువిని దలంచి కొల్చెదను బ్రోవర శ్రీగిరి మల్లికార్జునా ‘’అని తన నిశ్చయాన్ని తెల్పాడు .ఏ మతం లో ధర్మలో ఉంటూ ,శాంత౦గా నియమం తోజపిస్తారో ,కామాన్ని జయించి దీక్షతో విద్య నేర్చే వారుంటారో,ఆ మతం భూమిపై పూజ్యత పొందుతుంది అన్నాడుకవి .
చివరగా ‘’జయజయ భక్త దీనజన సాదు మునీంద్రాసురాలిరక్షణా –జయజయ వీరశైవమతసంతత వర్ధితమూల కారణా
జయజయ మంగళ ప్రద నిశాకర శేఖర పాప నాశనా –జయజయ స్రష్ట శౌరి నుత సంపద శ్రీ గిరి మల్లికార్జునా ‘’అని జయం పలికి
‘’మంగళహారతుల్ గొనియు ,మామక కర్మము ద్రుంచి ప్రేమతో –మంగళముల్ జెలంగపరమార్ధ మొసంగుచు బ్రోవవే వెసన్
అ౦గజభంగలింగ ,నగజాధిప క౦జభవాండ రక్షశ్రీ –రంగనుత ప్రదీపముని రంజిత శ్రీగిరి మల్లికార్జునా ‘’అని మంగళం 102వ పద్యం తో పాడి శతకం ముగించాడు కవి .వీర శైవం బాగా జీర్ణించుకొన్న ఈ కవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి.ధారాపాతంగా భక్తిభావ కవిత్వాన్ని ప్రవహింపజేసి తన ప్రతిభా వ్యుత్పత్తులను ప్రదర్శింప జేశాడు .ఈ శతకం వీర శైవ సాహిత్యం లో ప్రముఖమై విరాజిల్లి ఉండాలి .మన వారెవరూ ఉదాహరించినట్లు కనిపించదు .రసగుళికలే పద్యాలన్నీ .నిన్న ఈకవి పుత్ర శతకాన్ని, ఇవాళ శ్రీ మల్లికార్జున శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’

అనంతపుర కవి, విమర్శకులు,రిటైర్డ్ తెలుగు లెక్చరర్,సహృదయ మిత్రులు  డా . శ్రీ రాధేయ తో నా పరిచయం పాతికేళ్ళుగా ఉంది .మొదటిసారిగా  ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మూడు రోజుల  సభలలో  పరిచయమయ్యారు .నేనూ ఆయనా ,మరో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండి సభలకు హాజరయేవాళ్ళం  .ఆతర్వాత విజయ వాడ లో జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం జాతీయ ,అంతర్జాతీయ సభలలో తప్పక కలిసే వాళ్ళం .వారి శ్రీమతితో కూడా అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఆమెను చూసిన జ్ఞాపకం ఉంది .ఆయన రాసిన ‘’మగ్గం బతుకులు’’కవితా సంపుటి చదివి నేను స్పందించాను .సరసభారతి పుస్తకాలు పంపేవాడిని . నేను అమెరికా వెళ్లి రాసిన ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’గురించి విని పంపమంటే పంపాను .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .సాహిత్యం అంటే ఆయనకు ప్రాణం. తానుఎన్నో పురస్కారాలు పొందినా ,తన ఇంటిపేరిట ‘’ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డ్ ‘’ ‘’ఏర్పరచి  కవులనుంచి కవితా సంపుటులను ఆహ్వానించి ,అసలైన న్యాయ నిర్ణేతలతో ఎంపిక చేయించి ‘’ఫియర్ ఆర్ ఫేవర్ ‘’కు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతం గా అవార్డులు అంద జేసేవారు .ఉమ్మడి శెట్టి పురస్కారం అంటే అది సాహిత్య అకాడెమి పురస్కారం కంటే ఘనమైనదని స్వీకర్తలు భావించే వారు .అంతటి గౌరవం పురస్కారానికి కలిగించిన ఘనత రాధేయ గారిది.నవంబర్ 21 బందరు లో జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలలో వారిని నేను ఉదయం పూట సభలకు వెళ్ళక పోవటం వలన చూడ లేక పోయాను .ఇవాళ పోస్ట్ లో రాధేయ రాసిన ‘’సత్యా రాధేయం ‘’ పుస్తకం నాకు చేరింది. అందగానే ఆయనకు ఫోన్ చేసి చెప్పాను .వారి భార్య మరణించిన సంగతి పుస్తకం తీస్తే కాని  తెలియలేదు .సానుభూతి ప్రకటించాను .’’చదివి అభిప్రాయం రాయండి ప్రసాద్ గారూ ‘’అన్నారు .వెంటనే చదివి  రాస్తున్నాను .

  ఇది రాధేయ భార్య సత్యా దేవికి స్మృత్యంజలి .’’యాన్ ఎలిజీ ఆన్ ది డెత్ ఆఫ్ హిజ్ బిలవ్డ్ అర్ధాంగి సత్య ‘’.ముఖ చిత్ర రచన శ్రీ గిరిధర్ చేసి సత్య గారికి జీవం పోసి ఆమె మరణి౦చనే  లేదు ,మనమధ్యే ఉంది అనిపించారు .హాట్సాఫ్ టు గిరి .రాధేయ చెప్పుకొన్నట్లు ఇది ‘’సత్యారాదేయుల సత్య గాధ.అతుకు పడని ఒకపట్టు పోగు కథ పావుకోళ్ళ కన్నీటి లేఖ.క్షతగాత్రుని శ్వేతపత్రం ,వియోగి అంతర్మధనం .మానిషాద అనిపించిన క్రౌంచ పక్షి దీనాలాపం .కనుక రామాయణం అంతటి పవిత్ర వియోగ కావ్య౦.మాటలు కోల్పోయిన మహా శూన్యం లోంచి మొలిచిన హృదయ నివేదనం .ఆత్మ వేణువు పలికిన విషాద మోహనం .ఓ ప్రాణ వాయువు కత .’’ఉమ్మడి శెట్టి –ఉమ్మడి చెట్టు’’గా ఎదిగి కవిత్వ ఫలాలందించిన కథ. వారిద్దరి తొలి పరిచయం నుండి ‘’ఆమె ఆఖరి మజిలీ ‘’వరకు ఉన్న ఎన్నెన్నో జ్ఞాపకాల  వసంతం .

  ఆమెను  పెళ్లి చూపులలో చూడగానే ‘’చిన్ని కుటుంబం చింతలు లేని కుటుంబం ‘’భావనలో ఆమె వెంటనే నచ్చేసింది .రాధేయ నిర్ణయాన్నిఇరువైపులా స్వాగతించారు .30-5-1979 న సత్య ,రాధేయ లు ఒక్కటై ‘’సత్యా రాధేయం ‘’అయ్యారు .వివాహాన్ని కవులు హర్షించి అక్షరాక్షతలు జల్లారు .’’సత్యాదేవిని వెతికి పట్టుకొన్నావ్ ‘’అని కుందుర్తిఅంటే , ,’’మీ కల్యాణం కమనీయం ‘’అని సినారె ఒకపాటే రాశారు .పెళ్ళినాడు కవిసమ్మేళనం కూడా జరిపించి పెళ్ళికొడుకుగా కవి సమ్మేళనానికి అధ్యక్షుడుగా రాధేయ ద్విపాత్రాభి నయనంచేసి సవ్య సాచి అనిపించుకొన్నాడు ..ఆమె తన చిటికెన వ్రేలు పట్టుకొని తనకవిత్వ ప్రేమనగరి లోకి ఆడు గుపెట్టిందని మురిసిపోయాడు .పులిచెర్ల ఆడపడుచు ఉమ్మడి శెట్టి వారి కోడలై౦దని సంబర పడ్డాడు .ఆమె బడి పంతులు కూతురు ,తనకు తెలిసిన ‘’బతుకు నేత’’ తెలియంది  .మగ్గం వీళ్ళ జీవన వేదం .ఆయన్ను పేరుపెట్టి పిలవలేను, ఏమండీ అనటం ఇష్టమూ లేదు కనుక ‘’అయ్యా ‘’అని పిలుస్తాను అంటే ఆ ఆర్ద్రత కు పులకించి పోయాడు .గ్రేడ్ వన్ హిందీ పండిట్ గా ఉద్యోగం లో చేరగా ‘’అవధులు లేని ఆనంద కవితా విహారి ‘’అయి ,అప్పటిదాకా స్నేహితులైన ఆకలీ ,పేదరికం తనకు తలలు వంచి చేతులు జోడించాయి .

  రాధేయ పుట్టి పెరిగిన ‘’యామవరం ‘’కవిగా ఆయన ఉనికి చాటితే ‘’పందిళ్ళ పల్లి ‘’పెళ్లి పందిరిగా అవార్డ్ కు శ్రీకారం చుట్టింది .మాస్టారైన ఆమె తండ్రి ఆమెచదువును స్కూల్ విద్యతో ఎందుకు ఆపెశాడో తెలీక ఆమెను చదూకోమంటే ‘’నా కెందుకయ్యా చదువులు ?ఇంటిని చక్కదిద్దుకొనే చదువు ఉంది. నువ్వు చదివి పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకో మన జీవితాలు బాగు పడతాయని హితవు చెప్పిన అసలైన అర్ధాంగి ‘స్వయం సిద్ధ ‘’సత్య .ఆరేళ్లలో ఎ౦ .ఎ .కూడాపాసై ,డాక్టరేట్ కూడా సాధించి ఆమె నమ్మకాన్ని నిజం చేశాడు .

  ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ‘’ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డ్1988లో  స్థాపించి ,ప్రతి ఏడాదీ అర్హులకు అవార్డ్ పాతికేళ్ళుగా ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా ,తాను  రిటైర్ అయినా,పెన్షన్ డబ్బుతో   అందిస్తూ,’’అవార్డ్ రజతోత్సవాన్నిఘనంగా విశేషంగాహాజరైన కవుల మధ్య జరిపి ‘,ఆమె వేదికపైన ‘’అనివార్య పరిస్థితుతల లోఅవార్డ్ విరమించాలని అనుకొన్నాం ‘’అని ప్రకటించగానే .సభాసదులు పెద్ద ఎత్తున అసమ్మతి తెలియ జేస్తే ‘’ఈ వార్డ్ రావాలని ప్రతి తెలుగు కవీ ఎదురు చూస్తాడు కనుక కొనసాగాలి ‘’అనికోరితే అవాక్కై ‘’చెప్పుకోలేని కుటుంబ సమస్యలున్నాయి .మీ అభిమానం ముందు మేము ఓడిపోక తప్పటం లేదు. కొంతకాలం అవార్డ్ ను కొనసాగిస్తామని మా వారితరఫున మాట ఇస్తున్నాను.క్షమించు ‘’అయ్యా ‘’అనగానే  శ్రోతల ఆగని చప్పట్ల తో ఇద్దరూ తడిసి పోయారు అశ్రునయనాలతో .

  విధి ఎప్పుడు ఏ వింత ఆట ఆడుతుందో తెలియదు .బెంగుళూర్ లో జరిగిన బైక్ ప్రమాదం లో సత్య మృత్యువు అంచుకు చేరి ,మెమరీ కోల్పోయి ,మద్రాస్ లో వైద్యం కోసం కొడుకు దగ్గర ఉండాల్సి వచ్చి ఇద్దరి మధ్య ఎడబాటు తప్పలేదు .26వ సభ పలమనేరులో బాలాజీ జరిపిన అవార్డ్ సభకు హాజరై ప్రముఖ కవి శ్రీ కే శివారెడ్డిని గుర్తించి అపలకరిస్తే ఆయన అప్రతిభుడై ఆమె బాగా కోలుకున్నదని భరోసా ఇచ్చాడు .సత్యా రాధేయ దంపతులకు బాలాజీ దంపతులు వేదికపై వేదాశీస్సులు ఇప్పింఛి చిరస్మరణీయం చేశారు .’’అవార్డ్ త్రిదశాబ్ది సభ’’ జరిపే ఆలోచన చేసి రిటైర్ మెంట్ లో దాచుకొన్న డబ్బుతో దాన్ని నిర్వహించి ఆనందం ఆర్ణవమైనట్లు దంపతులు భావించారు .రాష్ట్ర, రాష్ట్రేతర కవులు పెద్ద పెట్టునవచ్చి ‘’కృష్ణ దేవరాయల స్వర్ణయుగం ‘’ను కళ్ళకు కట్టించి౦చారు  .ఆ సభలో సత్యాదేవి ‘’ఎన్నో కష్టనష్టాలతో ముప్పై ఏళ్లుగా అవార్డ్ క్రమ౦ తప్పకుండా ఇస్తున్నాం .ఎంతోమంది కవులకు ఆతిధ్యమిచ్చే అదృష్టం మాకు దక్కింది .మా పిల్లలు పూనుకొంటే అవార్డ్ కొనసాగిస్తాం నాకు కవిత్వం ఏమీ తెలీదు ‘’అయ్య’’మంచి పని చేస్తాడుకనుక నా శక్తి కొలదీ సహకరించా ‘’అనగా అందరి హృదయాలు ఆర్ద్రమయ్యాయి .అదేఆమే చివరి మాటలు అని ఎవరూ అనుకోలేదు .ఆమె కు మద్రాస్ లో  ఉండాలని పించక ఆమాటే చెబితే చలించిపోయాడు రాధేయ .మంత్రాలయం చూసి వచ్చారు .ఆయన గుండె బలం ఆమె అయినా ,ఆమె బలాహీనమైన గుండెతో బతుకుతోందని డాక్టర్ చెపితే నమ్మలేక పోయాడు .అన్ని సభలలో తనకు గుండేధైర్యమిచ్చి నిలబడి’’తనకు ముందు నడిచి’’ఒకే చరణం యుగళగీతమై’’ కేటలిస్ట్ అయి  నడిపించిన ప్రియ సత్య గుండె అంత బలహీనమా అని ఆశ్చర్యపోయాడు .నాలుగు దశాబ్దాలు ఆయనతో చేయి చేయి కలిపి నడచిన అర్ధాంగి సత్యాదేవి కానరాని లోకాలకు చేరింది .’’ఈమలి సంధ్యలో నా ఆఖరి మలుపు ఎక్కడో ‘’?అని రాధేయ విచారించాడు .మందహాసాన్ని జారవిడుచుకొని ప్రశ్నార్ధకాలను  మోసుకొంటూ తిరుగుతున్నాడు .ఆయన ధైర్యం కవిత్వం దీనంగా కనిపిస్తోంది .బతుకు మగ్గం వణకి,పడుగు పేక చిక్కుబడి పోయాయి .ఆమె ఆయన కళ్ళ ముందు లేని వేళ,  తడారి పోయిన పెదాలను తడుపుకొంటూ తమకన్నీటి కథ. రాశాడు .

  ఈ పుస్తకం చివరలో ప్రముఖ కవుల ,ఆప్తుల అభిప్రాయాలున్నాయి . అద్భుతమైన కవితా రూప దాంపత్య కథ గా ‘’సత్యా రాధేయం ‘’నిలిచిపోతుంది .శ్రీ రాధేయ కుంగిపోకుండా ,మరింత ధైర్యబలం తెచ్చుకొని సాహితీ ప్రస్థానం కొన సాగించాలని కోరుతున్నాను .ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియ జేస్తూ ,సత్యాదేవి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-21-ఉయ్యూరు     

Posted in సమీక్ష | Tagged | Leave a comment

23-ఛాందస పద ప్రయోగ హాస్యం

23-ఛాందస పద ప్రయోగ హాస్యం

పామరులకున్నట్లుగానే ,పరమ ఛాందసులకూ ఒక ప్రత్యెక భాష ఉండి,పరిహాస ,ప్రహ్లాద జనకంగా ఉంటుంది .ఉదాహరణ –‘’అస్సే సూస్తి వషె బలే చౌక షె,విన్నావషె,కాదషే విస్సావజ్జల వారి బుర్రినష మన విస్సాయి కిస్తారషె’’.ఇలాఉండేది పూర్వపు చాందస వైదీకుల భాష అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఒక పండితుడు ఒక ముసలావిడతో మాట్లాడుతూ ‘’ప్రాడ్వివాకుడు ‘’అనే మాట వాడితే ఆవిడ దాని అర్ధం ఏమిటని అడగితే ఆయన చెప్పగా ‘’అదా దర్జీ అనకూడదూ హాయిగా ‘’అందట .గోదా రంగేశుల కళ్యాణ సమయం లో భోజనానికి సిద్ధమైన బ్రాహ్మణుల మధ్య జరిగిన సంభాషణ –‘’సుబ్బం భోట్లూ !విన్నావషరా !చూడి కోడ్త పెళ్లషరా.అబ్బాయినీ ,అచ్చయ్యను ,మన అవధాన్లనూ కేకేయ్యరా .సంతర్పణ లష.సంతస మొదవగగొంతు వరకు తిందాం .ముంత మామిడి పప్పు మిషాయష .పద పోదాం ‘’దీన్ని ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు సేకరించారని మాష్టారన్నారు .

  అనుకరణ పద ప్రయోగ హాస్యం –ప్రసిద్ధ కవుల పద్యాలను రచనలను అనుకరించి రాస్తే నవ్వు తన్నుకొస్తుంది .ఆ మార్పుల్లో వేరొక అర్దాంతరం  కూడా రావచ్చు .ఇది ఎక్కువగా ఇంగ్లీష్ సాహిత్యం లో ఉంది .దీనినే పేరడీ అంటున్నారు ..తెలుగులోనూ పేరడీ రచనలున్నాయి .పోతనగారి గజేంద్ర మోక్షం లోని ‘’లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యె ‘’ప్రసిద్ధ పద్యానికి ఒక కవి శృంగార రసాత్మకంగా పారడీ పద్యం చెప్పాడు చూడండి –‘’పూవిల్కాని సరోజ బాణముల నమ్భోజారిమై చాయలన్ ,భావంబెంతయు డస్సె ,మేను బడలెన్ ,తాపంబు రెట్టించే –నే నీవాడన్ ,మధురారసం బొసగవే –నిక్కంబు నన్నేలవే –రావే మానిని కావవే తరుణీ సంరక్షించు చంద్రాననా ‘’.ఇందులో పద్యం మాత్రమె అనుకరణ భావం వేరే .

  మరొక ప్రసిద్ధ –‘’కరయుగమునుచరణ౦బులు ‘’పద్యానికి ఒక పేరడీ కవి  -‘’కరయుగము ను చరణంబులు ,ఉదరము,లలాట స్థల౦బు ,ఉన్నత భుజముల్ –సరి ధరణి మోపి మ్రొక్కిరి మరి మరి నీ శత్రులెల్ల మల్కిభ రామా ‘’అని రాశాడు .నాయని సుబ్బారావు గారి ‘’ఎవ్వడా క్రూర కర్ముడేవారు –నీల జలజ నిర్ముక్త శై శిర శర్వరీ ప్రశాంత –మలవాటు పడిన నిశాన్తమందు –అకట నట్టింట దీపంబు నార్పి నాడు ‘’అన్న దానికి ఒకకవి అన్ని పంక్తులూ అలానే ఉంచి చివర పాదంమాత్రం ‘’అకటా నీల్ కాల్ సిరా బుడ్డి తన్నేసినాడు ‘’అని మార్చి నవ్వు తెప్పించాడు .నాయనిగారిదే ‘’ఎవ్వడే నీ గళ మ్మునందు దిరవు కొనక నేను విసిరిన ప్రేమ ప్రసూన మాల నడుమ –నీవు చూడగ బట్టినలిపి వైచి ,నీ కనుల యందు నెత్తురుల్ నింపినాడు ‘’పద్యానికి ఒక తు౦టరికవి  -‘’ఎవ్వడా తుంటరి నీవు చదువుకొనగ  -నేను రచించు చున్న ప్రేమ కావ్యమును ఫర్రున చించి వైచి ,పైపెచ్చు నలిపి వైచె –నా కనులయందు నెత్తురుల్ నింపినాడు ‘’అనగా నవ్వక చస్తామా .

  బిరుదు రాజు వారు జానపదం లో ఒక పేరడీ ని చూపించారని మునిమాణిక్యం అన్నారు .’’చిక్కుడు చెట్టుకూ తీగ లందమ్ము –శ్రీ కృష్ణుడి తమ్మూడికీ తిరుమణ౦ దమ్ము –పడతికి పది నెలల బాలు డందమ్ము –కాకర తీగకు కాయల౦దమ్ము-కన్న తల్లెట్టిన సొమ్ము లందమ్ము’’అనే జానపద గీతానికి హాస్యాను కరణ గా దంపుళ్ళ పాట శైలిలో ఒక కవి –‘’సువ్వి సువ్వన్నా సొగసు వల్లన్నా –బీరపాదుకు పిందేల౦దమ్ము –మా వారి ముక్కుకూ పక్కు లందమ్ము –పొట్ల పాదుకూ పూవు లందమ్ము-కాట్లకుక్కా మొగుడు కాంత కందమ్ము –మా వారి పొగ చుట్ట నాకు అందమ్ము ‘’. పేరడీ అంటే మనకు గుర్తొచ్చే మొదటికవి జరుక్ శాస్త్రి . మిగిలిన విషయాలు రేపు’’ రేవు పెడదాం ‘’..

  మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -10-12-21-ఉయ్యూరు  

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పుత్ర శతకం

పుత్ర శతకంకవిరత్న శ్రీ లక్కెన మల్లికార్జునుడు రచించి ,వల్లూరుపాలెం గ్రామ ప్రెసిడెంట్ శ్రీ కొడాలి పున్నయ్య చౌదరికి అంకితం చేసిన కందాలతో కూర్చిన  ‘’పుత్ర శతకం ‘’1938లో ఎ.జి. ప్రెస్ విజయవాడ లో ముద్రింపబడింది. వెల.3అణాలు .బాలబాలికలకు ఉపయోగ పడేట్లుగా శతకాన్ని రాశానని కవి చెప్పారు .దీనికి వీర శైవగురుకులం భూషణులు ‘’వేద కావ్యస్మృతి దర్శన తీర్ధ సాహిత్య విశారద శివశ్రీ పండిత చిదిరిమఠంవీర భద్ర శర్మగారు ముందు మాటలు రాస్తూ ‘’ఉపాధ్యాయుడైన ఈ కవి బాలుర హృదయాలను గ్రహించి సరళంగా ఈశతకం రాశారు .దీన్ని విద్యాధికారులు అనివార్య పాఠ్యం గా నిర్ణయించాలి ‘’అన్నారు .విజయవాడ సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వేదమూర్తులు శ్రీ కుప్పా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘’ఈ కవి మల్లికార్జున శతకం ,శ్రీ సీమంతిని ,,కరి బసవేశ్వర బోధామృతం కూడా రచించారు .పుత్రశతకం ప్రాధమిక స్థాయిలో తప్పక బోధింప వలసిన పుస్తకం .ఇందులో నీతి ,సత్సంఘం దైవ భక్తీ చదువు వినయ సంపద అభిమానం ధైర్యం ఉపకారం మొదలైనవన్నీ వివరించారు .ప్రతి పద్యం అర్ధ గాంభీర్యం తో ఉంది ‘’అన్నారు .మచిలీ బందరుకు చెందిన వ్యాకరణ విద్యా ప్రవీణ శ్రీ బివి వరప్రసాద రాయ వర్మ ‘’శతకం సరస వచో లాలిత్యంగా ఉంది ;శైలి హృద్యం’’అన్నారు .వల్లూరు పాలెం బోర్డు ఉన్నత ప్రాధమిక పాఠశాల ప్రధానొపాధ్యాఉలు శ్రీ లొల్ల బాలకోటేశ్వరరావు ‘’రసవంతమైన పద్యాలతో నీతికి నిధిగా ఉన్న శతకం.బాలుర కోమల హృదయాలలో ఈ పద్య భావాలు నాటితే వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లటం ఖాయం..సత్ప్రవర్తన అలవడుతుంది .విద్యా శాఖాధికారులు ఈ శతకాన్ని 2,3తరగతులకు పఠనీయ గ్రంథం గా తప్పక చేయాలి ‘’అన్నారు .ఈ బాలకోటేశ్వర రావు గారు నేను సైన్స్ మాస్టర్ గా మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ లో మొదటి సారిగా1963లో  ఉద్యోగం లో చేరినప్పుడు అక్కడ సెకండరి  గ్రేడ్ టీచర్ ,గా ఉండేవారు. వీరిని మా హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు ‘’గురువుగారు ‘’అని చాలా భక్తితో పిలిచేవారు .మోపిదేవిలో ఉండగానే ప్రభావతి తో నా వివాహం జరిగింది ..ఆయన సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి దేవాలయం లో ఒక నెలరోజులు రోజూ ఒక దంపతుల చేత కల్యాణం చేయించారు .మా దంపతులతో కూడా చేయించి ఆ పుణ్యాన్ని మాకు దక్కించారు .వీరి పెద్ద కుమారుడుశ్రీ శ్రీరామమూర్తి జూనియర్ తెలుగు పండితులుగా మాతో పని చేశారు. ఇంకొక కుమారుడు మా హైస్కూల్ లో అప్పుడు 9వ  తరగతి చదివేవాడు.తెల్ల  పంచే తెల్ల లాల్చీ ఉత్తరీయ౦  ,పిలకా తరచూ ముక్కుపోడుం పీలుస్తూ  తో  తమాషాగా ఎడమకన్ను మూసి కనిపి౦చేవారు.ఆయన ,ఆ పరిసర ప్రాంతాల వారందరికీ గురు  సమానులే . .ఆయుర్వేద శిరోమణి శ్రీ మద్దాలి వెంకటేశ్వరరావు ‘’భక్తీ యుక్తి ముక్తి తో సరస పద గు౦ఫిత౦గా  శతకం ఉంది.చిరుతలపాలిటి’’జేజేల మ్రాకు ‘’అనవచ్చు ‘’అన్నారు .   ఆ తర్వాత కవి కృతి కర్తపై పద్యాలు రాసి ‘’మృదు మధుర స్వభావి ,శాంతమనస్కుడు ,గ్రామాభ్యుదయానికి పాటుపడినవాడు ,లోకజ్ఞాని ,సంపదలతో తులతూగే వాడు కీర్తి సాంద్రుడు అయిన గ్రామ ప్రెసిడెంట్ శ్రీకొడాలి పున్నయ్య చౌదరి అని కీర్తించి –‘’ఎన్నో శుభముల నాతడు –నెన్నగ నా కొసగి యుంట నిది యర్పింతున్ –చెన్నుగ నిలగలదాకను-మిన్నగ నలరారునట్లు మేదిని యందున్ ‘’అని శుభం పలికారు .   ఆ తర్వాత శివ ,శివా విఘ్నేశ  బ్రహ్మ వాణీ స్తుతి చేసి ,శ్రీనాథ నన్ని చోడ సోమనాథ భవభూతి ,నన్నయ తిక్కనాది కవులను స్మరించి ,వీర భద్ర గురుదేవుని కీర్తించి ‘’పుత్రా ‘’మకుటంతో మొదలు పెట్టాడు .ధర్మం వేదం శాస్త్రాలు వీరశైవం గురించి చెప్పి –‘’శ్రీకర విద్యల గరపుచు –ప్రాకటముగ నీతిగరపి భవ్య శుభంబుల్ –చేకూర చేయు వారలు – నీకెప్పుడు దైవ సములు నిక్కము పుత్రా ‘’అని దైవసమానుల గురించి ఘనం గా చెప్పారు .తలిదండ్రులు గురువులు జ్ఞానం తెలిపేవారు, అగ్రజులుపెద్దలు దైవ సమానులే అన్నారు .భారతం నీతులకు పెన్నిధి .అభి వృద్ధికోసం సత్సంఘాన్ని నెరపాలి .పండిత గోష్టిలో ధర్మం మెండుగా గ్రహించాలి .’’చదువే జ్ఞానమొసగును-  చదువే గురు భోగ భాగ్య సంపదలొసగున్ –చదువే పాత్రత నొసగును –చదువే సత్కీర్తి నొసగు చదువుము పుత్రా ‘’అని పుత్ర వాత్సల్యంగా చదువుకొని బాగు పడమన్నారు .వినయం బహుజన మైత్రిని సంపాదిస్తుంది ,కోరిన కోర్కేలిచ్చి సద్గుణాలు కలిగిస్తుంది .సంపాదనకంటే ఖర్చు తక్కువగా ఉంటేనే పురోగతి ఉంటుందని హెచ్చరిక చేశారు .’’మన యాంధ్ర భాష మీదను –మన యాంధ్ర జనంబుమీద మహిమాస్పదమౌ –మన యాంధ్ర భూమిమీదను –మనుజున కభిమాన ముంట మంచిది పుత్రా ‘’  అని ఆంధ్రం ఆంద్ర భాష పై అభిమానము౦డాలని 80ఏళ్ల క్రితమే చెప్పిన గొప్పభాషాభిమాన కవి.పరహితం చూడక ,పరులకు నష్టం కలిగిస్తే ‘’పరమేశుడే నిను జెరచుపుత్రా ‘’అన్నారు.      ‘’నీరము కానని పంట కు –నీరదముల్ గురియ ఫలము నెగడిన రీతిన్ –దీరాత్ముల కిడివిత్తము –దారుని సత్కీర్తి ‘’పొందు అన్నారు .గురువులకు ఎదురాడవద్దనీ ,అధికారులవద్ద అబద్ధాలు చెప్పద్దనీ ,పుణ్యప్రదమైన ధర్మమూ మరువ వద్దనీ ‘’హితవు చెప్పారుకవి .’’యాచకుల బాధ బెట్టకు –మాచారము వదలబోకు ‘’శత్రువుతో మర్మం చెప్పకు ,త్రాచులతో స్నేహం చేయకు అన్నారు .పొడవటానికి వచ్చే దున్నల్ని శిక్షించినట్లే దుర్మార్గులకు గుణ పాఠం చెప్పాలి.’’నడవడి కీర్తికి మూల – మ్మడకువమూలంబు విద్య లార్జి౦చుటకున్-తొడవగు ధర్మము కలిమికి –చెడుటకు మూలమ్ము చెడ్డ చేతలు పుత్రా ‘’అని కారణాలు చెప్పారు .’’సభలలో పలుకే పస –కులుకే పస వేశ్యలకు కుజనులకెంతో-యలుకే పస భోగులకును-వలపే పస దీని తెలియ వలయు పుత్రా ‘’అని ససిగా పస ను పనసపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు .దొంగల్ని రాజు కొరత వేయిస్తాడు .చొరత్వంతో సిరి దూరమై పోతుంది .చోరత్వం లేకపోతె శుభాలు కలుగుతాయి .పరనింద చేస్తేదురితాలు,క్రూర దుఖం ,విరోధం ,ఆపదకలుగుతాయి కనుక వద్దు అన్నారు .కన్యాదానం కంటే ‘’దీనులకు అన్నం పెట్టటం అధిక పుణ్యం అన్నారు కవి ..సత్యం పల్కితే కీర్తి పెరుగుతుంది సద్గతి సత్కీర్తి ,సకల సుఖాలు లభిస్తాయి .’’మురికియే వ్యాధులకు మూలము –మురికియే దారిద్ర్య దుఖమూలముధరలో –మురికియె గౌరవహీనము –మురికిని కలనైన నుంచ బోలదు పుత్రా ‘’ఇదే కరోనాలో మనకు గుణ పాఠమైంది .సర్వజీవులను ప్రేమిస్తే ఘనకీర్తి వస్తుంది .’’తన పేరు నిల్ప జాలిన తనయుం –డొక్క డైన జాలు తండ్రికి పెక్కం-డ్రెనయగ  నీచులు గల్గిన –తన పేరును పాడు చేయు తధ్యము పుత్రా ‘’అని సాంఘిక నీతి చెప్పారు .  శతకం చివరలో కవి తన గురించి చెప్పుకొన్నారు .తల్లిపేరు నాగమ్మ .మంగళం లో –జయజయ లోకా ధీశ్వర –జయజయపరమేశ ఈశజయ భవ నాశా –జయజయ శంకర యంచును –జయముగా బఠియించు చుందు సతతము పుత్రా ‘’’’మంగళమో విశ్వంభర -మంగళమో శ్రీ గిరీశ మాధవ మిత్రా –మంగళమో శశి ధర యన –మంగళములొసంగు మీ’’కుమాపతి ‘’పుత్రా ‘’అంటూ 113వ కందం తో శతకాన్ని ముగించారు కవి .  పుత్ర శతకం భావ గర్భితం .నీతి,భక్తీ ,మర్యాద వినయ  నడవడి సద్గుణ సౌశీల్య ,బోధకం సరళం సుందరం సురుచిరం .సుమతీ శతకం, కరుణశ్రీగారి తెలుగు బాలశతకం వంటి ఉత్తమజాతి శతకాలలో సమాన స్థాయి పొందదగినది .మా కృష్ణా జిల్లాలో, మా తొట్లవల్లూరు దగ్గర కాలువ వొడ్డున వున్న వల్లూరు పాలెం కు చెందిన కవిరత్న లక్కన మల్లికార్జున సత్కవి రాసిన గొప్ప శతకం .ప్రేరణ కలిగించేది .అత్యంత ఉపయుక్తమైనది .ముందు మాటలలో పెద్దలు చెప్పినట్లు ఈ శతకం ప్రాధమిక స్థాయిలో పాఠ్యాం శం గా పెట్టారోలేదో తెలీదు .పెట్టి ఉంటె అభినందనీయులే .ఈశతకం ,ఈ కవి గురించి కూడా ఎక్కడా మనవాళ్ళు ఉదాహరించిన దాఖలాలు కనపడ లేదు .ఈ కవినీ ,ఈ శతకాన్ని పరిచయం చేయటం నాకు అబ్బిన మహద్భాగ్యంగా భావిస్తున్నాను .మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -10-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

          నాటక కర్త

‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా  సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు లేకపోవటం తో వినోది౦చాడు ‘’ .మానవ ప్రకృతి విడ్డూరాలు చూపాడు .అస్సామీ లో తొలి నాటకకర్తలలో ఒకడైన హెచ్. సి.బరువ రాసిన కన్యాకీర్తాన్ నాటకం హాస్యనాటకాలకు దారి చూపింది .మనవాడు రాసిన నోమల్,లిటికాయ్ వంటివి సామాజిక ప్రయోజనం లేని తక్కువ స్థాయివే .రక్తికట్టే రంగస్థల నాటకాలు రాసినా సార్ధకాలు అనిపించుకోలేదు .గ్రామ్య నుడికారాలు ,మాల్ ప్రాప్ అస్తవ్యస్త పదాలు ఎక్కువ .పౌరాణిక సందర్భాలను కొన్ని చోట్ల అపభ్రంశం చేశాడు కూడా .సమాజం లో కొన్ని విలువలు తారుమారై మనో దౌర్బల్యాలవలన ఏర్పడిన విడ్డూరాలను అపహాస్యం చేశాడు .’’ప్రహసనం మనల్ని అభూత కల్పనలతొ ఆనందింప జేస్తుంది   ‘’అన్న డ్రైడేన్ ఇతడికి ఆదర్శం .శబ్దాలగారడీ ,సన్ని వేశాలకల్పన అమోఘం .’’రచయిత వ్యక్తిత్వపు రంగుతోదిద్దిన భిన్న వ్యక్తిత్వాలు ‘’గా ఉంటాయి .బర్మీయులు అస్సాం పై దాడి చేసిన చారిత్రిక పూర్వ రంగాన్ని ‘’బెలిమర్ ‘’నాటకంగా రాశాడు .ఆనాటి సంఘం ఎముకలు కుళ్ళి ,రక్తపాతం అల్లకల్లోలంగా ఉన్నదాన్ని గొప్పగా చిత్రించాడు .అహోం వంశ రాజులపాలన అంతం కావటంతో నాటకం ముగుస్తుంది .ఇది దేశ ప్రజల విషాద గాధ.శిల్ప రీత్యా ‘’జయమతికువారి ‘’నాటకం రసోద్దీప్తి కలిగిస్తుంది .’’సంఘర్షణ నాటకానికి ఆత్మ ‘’అన్న ఆలర్డిస్ నికోల్ ను అనుసరించాడు .చంగ్ మయ్ హృదయం మానవ కారుణ్య క్షీరం తో పొంగిపొరలుతుంది .స్త్రీపాత్రల్ని వాస్తవంగా చిత్రించాడు .అస్సాం పల్లపు ప్రాంతాల దుర్బల వాస్తవికత ,సంఘర్షణ ,,కుట్ర,కుతంత్రాలు ,పర్వత ప్రాంతాలలో భావనామయ సౌందర్యాలను చిత్రించాడు .అతడి అమర సృష్టి ‘’దాలిమ ‘’పాత్ర.ప్రస్తుతం ఉన్న విజ్ఞాన దృష్టితో గతాన్ని చూసే ప్రయత్నం తో ‘’చక్రధ్వజ సింహ ‘’రాశాడు .సమాజం అంతరాత్మను మేల్కొల్పాడు .చారిత్రకనాటక సీరియల్స్ ను అకలంక దేశ భక్తితో రాశాడు .షేక్స్పియర్ ప్రభావం కనిపిస్తుంది .’’చరిత్ర అంటే ఘనీ భవించిన క్షణాల గురించి తెలిపే సాంకేతిక రచన కాదు ‘’అంటాడు .మొత్తం మీద హాస్యప్రధాన మైనవీ చారిత్రిక అంశాలతో ఉన్నవీ అయిన నాటకాలు రాశాడు .

  కథా రచయిత

ఆధునిక కథ ఎలా ఉంటుందో బెజ్బరూవా రచనలు తెలియ జేస్తాయి .జానపదానికి తనప్రతిభకు మంచి లంకె వేశాడు .బెంగాలీలో రాయటం మొదలుపెట్టి ,దమ్ము చాలక అస్సామీలో రాశాడు .అదే అస్సామీసాహిత్యానికి ఎనలేని కీర్తి సాధించింది .బాల సాహిత్యం లో పిల్లల మనస్తత్వాలను బాగా చూపించాడు .శక్తివంతమైన పాత్ర చిత్రణ చేశాడు .జానపదాలు నిరక్షరాస్యుల ఆత్మ కథలు అన్నట్లుగా రాశాడు .నీతిలేకున్నా ,మానవత స్పర్శ ఉంటుంది .అమాయకత్వం ,భావ స్నిగ్ధతా ఉన్న లోకాన్ని ఫోటో తీసినట్లు రాశాడు .అసంభవాన్ని సంభావ్యం చేస్తాడు .ఇతని జానపద కథల సంపుటి 1912లో’’కకదోతాఅరునటిలోరా’’గా వెలువడింది .అప్పుడే ‘’సురవి ,తర్వాత ఏడాది జాన్ బిరి సంపుటులు తెచ్చాడు .’’సాంప్రదాయక దృష్టి తో వ్రాయబడిన బెజ్బరూవా కథలు జీవితాన్ని సహజ భావ ఉద్వేగాలతో సుఖ దుఖాలతో వర్ణించిన మొట్ట మొదటి ప్రయత్నం .నవీనులం అనుకోని విదేశీయత తో చలికాచుకొంటూ అదే నిజమని నమ్మే బుద్ధిహీనత ప్రదర్శించటం ,దేశాభిమానానాన్ని రగుల్కొల్పటం చేశాయి .స్విఫ్ట్ రచనా విధానం లో ఈదడిత్ సిట్వేల్ అన్నట్లు  ‘’చదువుతుంటే పళ్ళు పులిసిపోతాయి ‘’.ఆధునికత మోజులో వికృతమైన పేర్లు పెట్టుకోవటం ,సంప్రదాయాలను పూర్తిగా తె౦చు కోవటం మొదలైన వాటిని ఉతికి ఆరేశాడు .పాత్రలను తమాషాగా చూశాడుకానీ ఈసడింపు తో మాత్రం కాదు .అమృత జీవనంగా ఉండేట్లు రాశాడు .’’అస్సామీ యుడిని అనే ఎరుకతో రాసిన అస్సామీయుడు ఆయన’’ .అతడి ప్రతిభ విమర్శనాత్మకమేకానీ సృజనాత్మకం కాదంటారు .ఏరాబరి కథశిల్ప సౌష్టవం సాంఘిక నైతిక ప్రయోజనం ఉన్నది .కలకత్తా లోని ‘’కోలులు ‘’,’’ముందా ‘’ల వంటి వారితో అతడికి పరిచయం ఏర్పడి ఆ అనుభవ సారం రచనల్లో ప్రతిబింబించింది .మిస్టర్ ఫిలిప్ సన్ లో టీ తోటల లో పని చేసే వారిజీవితం ఆంగ్లో ఇండియన్ల మేనేజర్ నీతి బాహ్యతా చూపాడు .అస్సామీ నాగరక సమాజం ,బ్రిటిష్ పాలన లో వంగ దేశం లో మారుతున్న సమాజం గురించి  రాసినవే ఇవన్నీ .అనివార్యమైనఒక సంకర మనస్తత్వాన్ని చూపించాడు .విదేశీ సంస్కృతిని అడ్డుకోవటానికి  సర్వ శక్తులా  కృషి చేశాడు .’’పాపా’’అని తన పిల్లల చేత పిలిపించుకోనేవాడు  .కులీన కుటుంబాలమధ్య సంఘర్షణ ‘’పదుం కువారి ‘’కద.

                        కవి

గేథే కాలం లో జర్మన్ సాహిత్యం వికసించినట్లు బెజ్బరూవా ,అగర్వాల్ కాలం లో అస్సామీ సాహిత్యం వికసించింది .ప్రణయ గీతాలు ,ప్రకృతి పద్యాలు ,పాటలు దేశ భక్తీ గీతాలు రాశాడు బెజ్బరూవా.’’ప్రియ తమ సౌందర్య ‘’కావ్యం లో భావ చిత్రాలద్వారా ప్రేయసి లావణ్యాన్ని ఆవిష్కరించాడు .ప్రేమకు సౌందర్యానికి పెన్నిధి ప్రకృతి అంటాడు .టాగూర్ లాగా ‘’ప్రేమే జయిస్తుంది-మృత్యువు దాని బానిస ‘’అన్నాడు .శిల్పం తెలిసిన కవితాలోకం లో ,సహజ సుందర జానపద కవితాలోకం లో విహరించాడు .’’పాదం కింద నలిగే ప్రతి దర్భామ్కురం –దైవత్వం తో చైతన్య భరితంగా ఉంటుంది ‘’అన్నాడు .మిస్టిక్ కవి మాత్రం కాదు .కవిత్వం అంటే ‘’విషాద గీతి  ,గద్గద కంఠం-భగ్నహృదయుని రుతి –కళ్ళ చివర బాష్పాలు –వేదనాభరిత అశాంతి ‘’అని కవిత్వాన్ని నిర్వచించాడు .’’విదేశీ ప్రభావితం తాలూకు పిల్లకాలువలు –కొద్దికాలం లో మహా నదిలో కలిసిపోతాయి ‘’అని  ధైర్యంగా చెప్పాడు .కర్షక గీతాలతో ఉర్రూతలూగించాడు .’’ధన్ బరు అరురతని ‘’గొప్ప భావావేశ౦ తో ఉన్న ముగ్ధ ప్రణయ గాధ .

   అస్సామీ జాతీయ గీతం ‘’ఓమోఅసోన దేశ్ ‘’రాసి తన దేశ భక్తిని ప్రకటించాడు .రాబర్ట్ బ్రౌనింగ్ లాగా దేశభక్తి భావం ఉజ్వలంగా ఉంటుంది –‘’ఓ నా మాతృభూమీ –సల్లలిత ధునీపరివృతా –మధుర ఫల సమృద్ధా – ప్రియతమ భూమీ ‘’అని కీర్తించాడు .ఎన్నో దేశభక్తి గీతాలురాశాడు .’’మనం పేదలం కాము –ఎన్నటికీ కాలేము –మనకు అన్నీ ఉండేవి ,ఉన్నాయికూడా-మనం వాటిని గుర్తించే ప్రయత్నమే చెయ్యటం లేదు ‘’అన్నాడు .’’చెట్టు ఆకులు తొడిగినంత సహజంగా కవిత్వం పుట్టుకు రాకపోతే-ఆకవిత్వం  అసలు రాకపోవటమే మేలు ‘’అన్నాడు కీట్స్ కవి .ఇలానే సహజ సుందరంగా ఉంటుంది బెజ్బరూవా కవిత్వం ‘’.దృష్టిలో ,శ్రవణం లో ,హృదయాను భూతిలో ,హావ భావాల్లో రచనలో డికెన్స్ లాగా ‘’కార్లైల్ లాగా ‘’ఆకలించుకొనే కన్నూ ,చిత్రిన్చేహస్తమూ ‘’ఉన్నవాడు .అస్సామీ దేశ సాహిత్యం లో జానకి పత్రిక మైలు రాయి అయితే ,అందులో బెజ్బరూవా సాహిత్యం అర్ధ శతాబ్ది పాటు సొగసులు గుప్పించింది .సమాజానికి దారీ తెన్నూ ,ఏకత్వం కల్గించాడు ..అతని దృష్టి నుంచి చూస్తె వస్తువు స్వరూపం  వికటించి నట్లు కనిపిస్తుంది ,అతనిలాగా అస్సామీ జీవితాన్ని  వేళాకోళం చేసిన వారు లేరు .అర్ధ శతాబ్దికాలం సాహిత్యాన్ని ఏలిన మహానుభావుడు .వస్తు స్వరూప దర్శనం లో అభినివేశం ,దానికి తగిన శైలి,పరిశీలనాత్మక మానవతా గుణం ,దృష్టి వైశాల్యం బెజ్బరూవా సాహిత్య సృష్టికి విశిష్ట సౌందర్యాన్ని చేకూర్చాయి .

  ఈయన చనిపోయిన మార్చి 26 ను ‘’సాహిత్య దివస్ ‘’గా గౌరవప్రదంగా జరుపుకొంటున్నారు .ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ప్రత్యెక స్టాంప్ విడుదల చేసింది .

ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు హేమ్ బారువా అస్సామీ భాషలో రాసిన పుస్తకానికి శ్రీ ఆర్ .ఎస్ .సుదర్శనం  తెలుగులోకి అనువదించిన ‘’లక్ష్మీ నాథ బెజ్బరూవా ‘’పుస్తకం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

22-మరుపు లో హాస్యం

22-మరుపు లో హాస్యం

మరుపున్నవాడు కూడా అసంబద్ధంగా మాట్లాడి హాస్యకారకు డౌతాడు .ఇదీ అసంబద్ధ ప్రలాపమే .ఒకడు డాక్టర్ దగ్గరకెళ్ళి తన మరుపు జబ్బు గురించి చెప్పుకొన్నాడు ‘’మా ఆవిడ బజారుకెళ్ళి ఎదో తెమ్మంటు౦ది .కాస్త దూరం వెళ్ళగానే ఆవిడ ఎక్కడకు  వెళ్ళమన్నదీ, ఏది తెమ్మన్నదీ గుర్తుకు రాదు .’’అని మొరపెట్టాడు .’ఎన్నాళ్ళయింది ఈ జబ్బు వచ్చి ‘’అని అడిగితె ‘’ఏమి జబ్బు ?’’అని డాక్టరుకు బిపి తెప్పించాడు .

  తాగుబోతు హాస్యం –తాగుబోతుల ప్రలాపాలూ ఇలానే ఉండి,హాస్య స్ఫోరకాలౌతాయి .ఇద్దరు ఫ్రెండ్స్ బార్ కి వెళ్లి  పూటుగా లాగించి బయట కూచుని ఆకాశం వైపు చూస్తూ ఒకడు ‘’అరె చంద్రుడు ఉదయిస్తున్నాడు చూడ్రా’’అంటే ‘’అరె బేవకూఫ్  అతడు చంద్రుడు కాదు సూర్యుడు .సూర్యుడు సముద్రం లోకి దూకుతున్నాడు చూడు చోద్యం ‘’అన్నాడు .ఇంతలో బార్ లోంచి ఒకడు తాగి బయటకు వచ్చి ,మధ్యవర్తిత్వం  చెయ్యమంటే  ‘’ఒరే భాయీ !మాది ఈ వూరుకాదు.కనుక నాకు తెలీదు ‘’అని తప్పించుకొన్నాడు .

  మరో చోట ఒక తాగుబోతు వీధిలోతూలుతూ  నడుస్తూ ఉంటె, పోలీస్ ఎదురై ‘’ఇలా నడుస్తున్నావేమిటి ?ఒకకాలు సైడు కాలువ గట్టు మీద ,రెండోకాలు కాలవలో పెట్టీ ‘’అని అడిగాడు .తాగుబోతు ‘’బతికిన్చార్ సార్ !నాకాళ్ళ లో ఒకటి పొడుగ్గా ,ఒకటి పొట్టిగా ఉ౦దేమిటబ్బా ,అని బుర్ర బద్దలు కొట్టుకొంటున్నాను ‘’అని చెప్పి మామూలుగా నడిచి వెళ్ళాడు .

మరో తాగుబోతోపాఖ్యానం –ఒకడు ఫుల్ గా తాగి బల్లముందు కూచుని ఆలోచిస్తూ ఏదో రాస్తున్నాడు .స్నేహితుడు వచ్చి ‘’ఏం రాస్తున్నావ్ ?’’అని అడిగితె ‘’ఉత్తరం ‘’అంటే ఎవరికీ అంటే నాకే అనగా .ఏం రాస్తున్నావ్ అంటే ‘’ఎలా తెలుస్తుంది ఇది పోస్ట్ బాక్స్ లో వేస్తె రేపుకానీ నాకు అందదు కదా.అప్పుడు చదివి చెబుతా ‘’అన్నాడు .ఇదీ  అస౦బద్ధ ప్రలాపమే .

 అవివేకి పద ప్రయోగ హాస్యం –వ్యాకులం మరుపు ఎదో విషయంలో వివేకం కోల్పోయి ఉచితానుచితాలు చూడక ,అసభ్య అనుచిత మాటలు మాట్లాడితే నవ్వు తన్నుకొస్తుంది అంటారు మునిమాణిక్యం మాస్టారు .ఉదాహరణ –ఒక అల్లుడు పండక్కి అత్తారింటికి వెళ్ళాడు .అత్తగారు ‘’మీ మామగారు పనిమీద బయటికి వెళ్ళారు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అవుతుంది .ఇప్పటికే పన్నెండు అయింది .అరిసెలు మినపసున్ని ఉండలు రెడీగా ఉన్నాయి తింటావా లేకపోతె ఇంకో గంటలో పిల్లలు చద్దన్నాలు తింటారు వాళ్ళతో తింటావా ?’’అని అడిగితె’’అత్తగారూ !ఇప్పుడు అరిసెలు సున్ని ఉండలు పెట్టండి తిని ,పిల్లలతో చద్దన్నం తిని ,మామగారు రాగానే ఆయన పంక్తిలో కూచుని భోజనం చేస్తాను ‘’అన్నాడు అత్తగారు ఏమనుకొంటు౦ది అనే జ్ఞానం లేకండా .

  అబద్ధాలాడే వాడూ ఈ జాతి లోకే వస్తాడన్నారు మాస్టారు .ఒకతప్పు తప్పించుకోటానికి ఒక అబద్ధం ఆడి దాన్ని నిలబెట్టుకోటానికి మరిన్నిఆడతాడు .దీనికి ఉదాహరణ మునిమాణిక్యమే చెప్పారు ‘’నా స్నేహితుడు సౌందర్య పిపాసి .దొరికిన స్త్రీలతో కామకలాపాలు చేయటంలోదిట్ట .ప్రజా సంబంధమున్న ఆఫీసులో పనిచేస్తున్నాడు .అతనితో సరసానికి ఆడ వాళ్ళు సిద్ధంగా ఉండేవారు .ఇది పై అధికారికి తెల్సి చీవాట్లు పెట్టి ‘’ఎవరైనా పరాయి అమ్మాయితో కనిపిస్తే తక్షణం ఉద్యోగం పీకేస్తా ‘’ఆన్నాడు .పరాయిస్త్రీ అన్నాడుకదా  స్వ, పర భేదం ఆయనకేం తెలుస్తుందని’’ లైట్ తీస్కుని’’ మామూలుగా సాగిస్తూనే ఉన్నాడు .ఒక రోజు ఒక సుందరితో బీచ్ లో తిరుగుతుంటే ఆ అధికారి ఎదురురాగా ,మొదట కొంచెం తత్తరరపడ్డా ,తేరుకొని బె ఫర్వాగా ఎదురు పడి’’సార్!ఈ మె నా భార్య ‘’అనగా అధికారి నిప్పులు కక్కుతూ ‘’స్కౌండ్రల్ ’ఈవిడ నా పెళ్ళాం .మళ్ళీ నీ మొహం నాకు చూపించకు ఫోఫో ‘’అన్నాడు ‘’చివరికి ఏమైందో మనకు అక్కర్లేదుకానీ మనకు సురుచిర హాస్యం అందింది .ఔచిత్యం కోల్పోయి అబద్ధాలు ఆడటం అనే ఈ వ్యాపారం హాస్యం సృష్టించింది అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మాష్టారు .

శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

               వ్యాసకర్త

ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ కవుల కోవకు చెందినవాడుగా గుర్తింపు పొందాడు .ఇతని మేలిమి గుణాలు స్వయం ప్రకాశకాలు .’’శిక్ష వెయ్యటం సంఘ విధ్యుక్త ధర్మమే  అయినా ,సంస్కరించి మళ్ళీ చేర్చుకోవటం అంతకంటే గొప్ప ధర్మం ‘’అన్న డేవిడ్ ఎస్.జోర్డాన్ భావం తో ఈయన రచనలో హాస్య అవహళనాలున్నా ,మనిషిని సం స్కరించటమే ధ్యేయం .మాధ్యూ ఆర్నోల్డ్ ‘’ఒక్కొక్క గాయాన్నీ ,ఒక్కొక్క బాధనీ గమనించి వ్రేళ్ళతో తట్టి తడిమి ,పట్టి చూసి ‘’ఇదిగో నీ జబ్బు ఇక్కడ ఉంది ‘’అని చెప్పినట్లు  ఈయన అవహళనను సంస్కరణ కోసమే ఎంచుకొన్నాడు .’’హేళనాత్మక రచయిత ప్రేమిస్తూ ఏవగించు కొంటాడు ‘’అంటుంది కేధరిన్ రీన్ .ఈయన రచనల్లో హేళన ఉన్నా విదేశీయులపై అభిమానమూ కనిపిస్తుంది .మానవుల బలహీనతల్ని దోషాలను ఎండకట్టటం లో ఎక్కడా  దురహంకారం ప్రదర్శించలేదు .మానవత్వానికి సంక్రమించిన  విడ్డూరాన్ని  చూసి నవ్వేశాడన్నమాట.అతని దృక్పధం –మానవత, సామాజిక అవగాహన .అతని పాత్రలు ‘’ఫాల్ స్టాఫ్’’వంటివి. హేతుబద్ధతకు పెద్ద పీట వేశాడు , డబ్ల్యు హెచ్ ఆడెన్ లాగా ద్వేషం ,ప్రేమ కలగలసిన పాత్రలు .అనటోల్ ఫ్రాంక్ వోల్టైర్ గురించి ‘’వోల్టైర్ వ్రేళ్ళ మధ్య కలం నవ్వుతూ పరిగెత్తు తుంది ‘’అన్నమాట ఈయనకూ పూర్తిగా వర్తిస్తుంది.ఒకరకంగా బ్రాండే అన్నట్లు  ‘’నవ్వులతో చంపేశాడు ‘’చమత్కారాన్ని ఆంతర్యం లో ప్రసరించే మెరుపు తీగ’’లాగా వర్ణిస్తాడు .ఆ కాలం లో ఇలాంటి  శిల్పం ఎవరూ ప్రదర్శించలేదు .

  సజాతీ విజాతీ భావాలలో మన  సమాజం విజాతీ ధోరణులలో పడిపోతుంటే ,మన సంస్కృతిలో అంతర్భూతమైన విలువలను చక్కగా గుర్తింప జేశాడు .హోమర్ రాసిన ‘’ఇలియడ్ ‘’,’’ఒడిస్సీ ‘’కావ్యాల్లాగా  మారుతున్న సమాజం మధ్యతరగతి కి దిగువన ఉన్న అస్సామీయులను జీవిత విధానాలను వాస్తవంగా చిత్రించాడు .ఇంగ్లీష్ కవి ఛాసర్  సమకాలీన సమాజాన్ని అంగీకరించాడనీ ,విమర్శించలేదని ‘’ఆల్డస్ హక్స్లీ ‘’చెప్పాడు .కాని ఈయన విమర్శించకుండా దేనినీ అంగీకరించలేదు.’’హేళన చేసే రచయిత తానూ స్పృశించిన ప్రతి దానిపైనా తనముద్ర వేస్తాడు .అతని దృష్టి మనలో కూడా కలిగించి కృతకృ  త్యుడౌతాడు’’అన్నాడు జాఫ్రే బుల్లో  .అలాగే ఇతని రచనలలో ఒక ప్రధాన భావమో ,ఉద్రేకమో ఉంటూ దాన్ని ఆలంబనం చేసుకొని భిన్న దొణులను ,భిన్న విషయాలనూ కలుపుతాడు .’’శాతురా’’ ప్రక్రియలో సామాజిక జాగృతి పొంగి పొరలుతుంది .  అస్సాం సాహిత్యం లో ‘’ఆహోం’’తర్వాత ఏర్పడిన స్తబ్ధత తర్వాత ఈయన వచ్చి చైతన్యం కలిగించాడు ..

  బెజ్బరూవా హాస్యం లో లాలిత్యం ఉండదు .కడుపు చెక్కలయ్యే హాస్యం భళ్ళున వస్తుంది ,కత్తికోత హేళన ఉంటు౦దికొన్ని చోట్ల . చమత్కారం యాదృచ్చికమే .ఆయనది అద్దం లాగా ప్రతిఫలించే తెలివి అంటారు .ఆయన కృషి విలువలు సాహిత్య పరమైనదే కాకుండా ,మానసిక తత్త్వం దృష్ట్యా కూడా ఎన్నదగినది .వికట హాస్యం కిందిపొరల్లో సూక్ష్మగ్రాహ్య విమర్శ దోబూచులాడుతుంది .

 భీమ చరిత చమత్కార ఉల్లాస వినోదాలున్న వైష్ణవీయ రచన .శంకర దేవ్ ,రుక్మిణీ హరణ్ లలు ఈ ప్రభావ రచనలే .అస్సామీ సాహిత్యం లో హాస్యానికి ప్రత్యెక స్థానం కల్పించినవాడు బెజ్బరూవా .ఈహాస్యం లో 1-నవ్వటమే ముఖ్యం 2-అపహాస్యం విసుర్లతో నవ్వు పుట్టించటం అనే రెండు పాయలు ఉన్నాయి .అతడిది దృష్టి వైశాల్యం ,విషయ పరిజ్ఞానం ,శైలీ పాటవం .అతడిది హద్దుమీరని ఏవగింపు .అన్నిట్లో తటస్థ స్వభావం ,భావ స్వాతంత్ర్యం .సమాజ పునరుద్దీపనకు ,సమైక్య సిద్ధాంతానికీ ఆలంబనాలు .క్రోధం లేకుండా దెబ్బతీయటం ఆయన ప్రత్యేకత .

  ఇతడి రచనలు -1-మేధస్సుతో ఉన్న క్లుప్త రచనలు 2-ఉరకలేసే ఉప్పొంగే హాస్యంతో ఉన్నరచన  అని రెండురకాలు .హాస్యాన్ని నిర్దాక్షిణ్యంగా ప్రయోగించిన’’డ్రైడన్ ‘’అంత దౌర్జన్యంగా లెంపలు వాయిన్చేట్టుగా దాడి చేయలేదు.అర్ధ శతాబ్దిక్రితం  ‘’ఉద్రేకం వచ్చిన బుర్రలు ఎలా పని చేశాయో ‘’అతని రచనలు ప్రతిధ్వనించి చూపుతాయి .కపోతర్ తపాలా  వ్యాసం సామాజికం . దైనందిన  జీవన పరిధిలోకి దాన్ని లాక్కొచ్చి ,జనసామాన్యానికి పరిచితమైన సమ్మోద ప్రక్రియగా మార్చాడు .లాంబ్ ,డీక్వీన్సేన్సి ల లాగా ఇతడి వ్యాసం సన్నిహిత భావ ప్రకటనకు అనువైన సాధనమైంది .ఇతని ఆత్మాశ్రయ వ్యాసాలు  నాలుగు సంపుటాలుగా వచ్చాయి .అవే-బర్బకోవార్ కకోతర్ కపోతా ,ఒవతాని ,బర్బరోవర్ భావర్ బర్బురాని ,బర్బురోవర్ బులాని .’’అస్సామీలాగా బతుకు.అనుకరణ వద్దు  ‘’అని శాసిస్తాడు  .సామాజిక్ లో బూటక ఆచారాలు నకిలీ దేశాభిమానం ,వ్యక్తిగత దురహంకారం లను దుయ్యబట్టి ,అస్సామీ భాషకు హృదయం అర్పించాడు .భాషాప్రయోగం లో మడికట్టుకొన్నా ,ఇతరభాషాపదాలనుచేర్చుకోవటం లో ఉదారత చూపాడు .ఒవతాని లో సంఘ సంస్కరణ అన్ని చోట్లా కనిపిస్తుంది .ఈ నాలుగు సంపుటాలలో అతడి భావ పరిధి విస్తరణ కనిపిస్తుంది .అతడిది శబ్ద ప్రధాన హాస్యం భాకారా మాస్టారిలా .’’నిష్టమైన ప్రేమ అంటే దేవుడి మీద ప్రేమ .ప్రేమ ఒక్కటే ఆత్మను అచంచల నిర్మల ఆనందం తో నింపుతుంది .’’అని వైష్ణవ సాహిత్య అధ్యయనం ద్వారా గ్రహించాడు .దర్శనానికి అధ్యయనానికి అభేదం గుర్తించాడు .మామూలు మనిషికి అలవికాని భావాలు ఆశయాలు తేట తెల్లంగా చక్కని నుడికారం తో చెప్పటం ,ధార్మిక ,దార్శనిక విషయాలను సూక్ష్మగ్రాహకంగా సహజ పాండిత్యం తో చెప్పటం అనే రెండు విధాల సాహిత్యానికి ఆయన సవ్య సాచిగా విలసిల్లాడు .భాషా స్రష్ట అయ్యాడు .

  ‘’అర్చనా  వేదికపై బలి ఇవ్వటం పనికి రాదు ‘’అని ఎలుగెత్తి చాటిన అరిష్టాటిల్ పై ఏధేన్స్ నగరం లో నేరం మోపినట్లే ,ఇక్కడ నిర్మాణాత్మకమైన సందేహాలతో ఉత్ప్రేరి తుడైనశంకర దేవ్ ,మాధవ దేవ్ కూడా రాజాగ్రహానికి గురై తూర్పుఅస్సాం నుంచి పశ్చిమ అస్సాం కు వలస పోయి వైష్ణవాన్ని ప్రచారం చేశాడు .ఈ మహానుభావుని చరిత్రను బెజ్బరూవా రాసి ధన్యుడయ్యాడు .’’కృష్ణ అంటే ఇహం లో మహాదానందాన్నిచ్చేవాడు ‘’అని శ్రీధరస్వామి చెప్పాడు .ఈవిషయాన్ని ఈయన ‘’కృష్ణ తత్వ ‘’లో సంపూర్ణంగా రాసి ఆవిష్కరించాడు .అతి గహనమైన ‘’రాస లీలాతత్వాన్ని ‘’బుద్ధికి పదునుపెట్టి ఉదాత్తంగా రాశాడు ‘’శృంగార రసంలో నిబద్దులైనవారు నిర్మల మతులు ఔతారు ‘’అని బోధించాడు శంకరదేవ్ .గీతా తత్త్వం లో భగవద్గీత విశేషాన్ని వివరించాడు .తత్వ కథలో ధార్మిక మతవిషయాలు రాశాడు .దీన్ని సంయమనంతో సూటిగా అర్ధవంతంగా రాశాడు .వర్షం తర్వాత వచ్చే ఎండలా స్నేహభావం తో ఉంటుంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

మాటమంతీ మొహనారాగంచరిత్రలో ఈ రోజు…భారత సాయుధ దళాల పతాక దినోత్సవం ఫ్లాగ్ డేఅంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డేసందర్భంగా సరసభారతి అధ్యక్షులు ప్రధాన వక్తగా స్వర మీడియా ప్రత్యక్ష ప్రసారం

మాటమంతీ మొహనారాగం
చరిత్రలో ఈ రోజు…భారత సాయుధ దళాల పతాక దినోత్సవం ఫ్లాగ్ డే
అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డే
సందర్భంగా సరసభారతి అధ్యక్షులు ప్రధాన వక్తగా స్వర మీడియా ప్రత్యక్ష ప్రసారం

Posted in సరసభారతి | Tagged | Leave a comment

 మాడభూషి సాహిత్య కళా పరిషత్  సాహిత్యంతో నా సహవాసం 

🏵️

 సాహిత్యంతో నా సహవాసం 

🎤

 శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ 

💐

 మాడభూషి సాహిత్య కళా పరిషత్

🏵️

 సాహిత్యంతో నా సహవాసం 

🎤

 శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ 

💐

 మాడభూషి సాహిత్య కళా పరిషత్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం. 7వ తేదీ, మంగళ వారం ఉదయం 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం..

Inbox

స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం.

  సోమ వారం నుండి శనివారం వరకు. (ఆదివారాలు మినహాయించి) ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు.

ప్రతీ రోజూ ఇదే లింకులో మీరు పాల్గొనవచ్చును.

https://us02web.zoom.us/j/87873642779

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

21-అపలాప పద ప్రయోగ హాస్యం

21-అపలాప పద ప్రయోగ హాస్యం

అపలాపం అంటే మోసపుచ్చటం .ఈ మోసం చేయటం తమాషాకు చమత్కారసాధనానికీ ,మాత్రమె .దీనివలన సహృదయ సమాదరణీయమైన మధురానుభూతి కలుగు తుంది .ఉదాహరణ –సామాన్య అయిన నాయిక ప్రియుడితో ‘’ఒకరికి చేయి, మరొకరికి కాలు ,మరొకడికి నడుమిచ్చి కూర్చున్నాను బావా ‘’అన్నది అంటే ఆమె ఎవరినొఆదరి౦చి౦ది అనుకోవాలని ఆమె భావం .నిగ్గు తేల్చుకోవటానికి ‘’ఎవరికి చేయి, కాలు ,నడుమిచ్చి కూకున్నావే పిల్లా ‘’?అని అడిగాడు .ఆమె గడుసుగా ‘’గాజులకు చేయిచ్చి ,అఅందెలకు కాలిచ్చి  వడ్డాణానికి నడుమిచ్చి కూకున్నా ‘’అంది .అన్ని అలంకారాలతో అతడికోసం వేచి ఉన్నానని సూటిగా చెప్ప కుండా వ్యంగ్యం గా  అదే విషయాన్ని తెలియ జేసింది అన్నమాట .దీనినే వ్యంజనం అంటారని మునిమాణిక్యం మాస్టారువాచ .

  అసంబద్ధ ప్రయోగ హాస్యం –వివేకరహిత౦గా , అస౦బద్ధంగా పిచ్చివాడు, తాగుబోతు మాట్లాడుతారు .వాళ్ళమాటలు జుగుప్స కలిగించినా ,నవ్వు పుట్టిస్తాయి .ఒక సారి నెహ్రు ఒక పిచ్చాసుపత్రి సందర్శనకు వెళ్ళాడు .అందులో ఒక మంచి డ్రెస్ వేసుకోన్నవాడిని ఆస్పత్రి అంతా తిరిగి చూపించటానికి ఏర్పాటు చేశారు .అతడు అంతా చూపించాక నెహ్రు ‘’నేనెవరో తెలుసా ?’’అని అడిగాడు .అతడు తెలియదు అంటే ‘’జవహర్ లాల్ నెహ్రు ను ‘’అన్నాడు .ఆపిచ్చి పెద్దాయన ‘’భయం ఏమీ లేదు .నీకు త్వరలోనే నయమౌతుంది .నేనూ మొదట ఇక్కడికి వచ్చినప్పుడు నేను మహాత్మా గాంధీ అని చెప్పుకొనే వాడిని డోంట్ వర్రీ ‘’అంటే నెహ్రు పగలబడి నవ్వకేం చేస్తాడు ?.

   ఇద్దరు పిచ్చివాళ్ళు ఆస్పత్రి ఆవరణలో చెట్టుకింద కూచుని మాట్లాడుకొంటున్నారు. ఒకడు పిడికిలి మూసి ‘’నా చేతిలో ఏముందో చెప్పు ‘’అనగా రెండో వాడు ‘’పొద్దున్న మీఆవిడ వచ్చింది కదా ఆమెనే గుప్పిట్లో దాచావ్ ‘’అన్నాడు వాడు గలగలా నవ్వి మళ్ళీ ఆలోచించి చెప్పు అంటే ‘’ఏనుగు ‘’అనగా కాదు అంటే నేను చెప్పలేను నువ్వే చెప్పు అంటే వాడు ‘’స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ‘’అని పగలబడి నవ్వాడు .మొదటివాడు ‘’నీ చేతిలోకి ఎలా వచ్చింది పోద్దునేగా నేనుదాన్ని జాగ్రత్తగా జేబులో దాచుకొన్నాను .ఆదినాది నాకిచ్చేయ్ ‘’అన్నాడు .విన్నవాళ్ళు పళ్ళు ఇకిలించి నవ్వుకొన్నారు .

  మునిమాణిక్యంగారు ఒకసారి పిచ్చి ఆస్పత్రికి వెళ్లి అక్కడ తెలిసినవాడిని ‘’ఏరా రామూ ‘’అంటే వాడు ‘’నేను రాముకాదు’’అంటే ఆశ్చర్యపోయి మాష్టారు ‘’అయితే నువ్వెవరు ?’’అంటే ‘’నేను ఫ్రాన్స్ రాజు నెపోలియన్ ‘’అన్నాడు .నవ్వుకొన్నమాష్టారు ‘’ఎవరు చెప్పారు ?’’అంటే ‘’దేవుడు దేవుడు చెప్పాడు ‘’అని గట్టిగా అరిస్తే ,పక్కగదిలోనుంచి ఒకడు పరిగెత్తుకొచ్చి ‘’నేను నీకు ఎప్పుడు చెప్పాన్రా వెధవా ?’’అన్నాడు ఈ సంభాషణలో ఒకరి మనసు ఒకరు నొప్పించలేదు క్షుద్రభావమూ లేదు .నిర్మల స్ఫుహనీయ హాస్యం ఇది అన్నారు మాష్టారు .

 శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-21-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2

అర్ధం చేసుకొనే తండ్రి ఉన్న మంచి గృహ వాతావారంలో బెజ్బారువా బాల్యం గడిచింది వైష్ణవసాహిత్యం ,సంస్కృతీ ,ఆంగ్ల సాహిత్యం ఉదార మానవతా వాదం అనే రెండు లోకాలలో పెరిగాడు .ఇంట్లో ఉన్న ధర్మ శాస్త్ర గ్రంథాలైన ‘’పుటులు’’చదివి ప్రభావితుడయ్యాడు .తండ్రి ‘’గురు చరిత్ర ‘’అనే కవి శంకర దేవ్ చరిత్ర రాశాడు .ఆతర్వాత ఈయన ‘’శంకర దేవ్ –మహా పురుష శంకర దేవ్ ఆరు శ్రీమాధవ దేవ్ ‘’ ‘’పుస్తకాలు రాశాడు .కలకత్తా రిప్పన్ కాలేజిలో చదువుతుండగా పాల్ గ్రేవ్ రాసిన ‘’గోల్డెన్ ట్రెజరీ ఆఫ్ లిరిక్స్ ‘’పాఠ్య గ్రంథమై, ఆంగ్లకవుల స్వర్ణ రాజ్యం లో ప్రవేశించాడు .బైరన్ ,కీట్స్ ,షెల్లీలను చదివి జీర్ణించుకొన్నాడు .టాగూర్ కవిత్వాన్ని అధ్యయనం చేశాడు .వక్తల ఉపన్యాసాలను విని నోట్ చేసుకొని వల్లించేవాడు .ఇంగ్లీష్ సాహిత్యం లో మేలిమిని ,అందాల్నీ అర్ధం చేసుకొన్నాడు .1890-1930 కాలం సంధికాలం .మార్పులతో లక్ష్య సిద్ధి లేని లోకానికి ఒక స్వరూపం, ఏకాగ్రత చేకూర్చినవాడు బెజ్బరూవా .అందుకే  ఆ కాలాన్ని ‘’బెజ్బరూవా యుగం ‘’అన్నారు విశ్లేషకులు అత్యంత గౌరవంగా ..అ యుగ చైతన్యాన్ని తన ప్రతి రచనలోనూ ప్రదర్శించి చూపాడు .విక్టర్ హ్యూగోలగా ఈయన మహా కాంతి  కేంద్రమయ్యాడు .తన సమకాలికులు సి.కె .అగర్వాల్ ,హెమ్ గోస్వామిలను దాటి ముందుకు వెళ్ళాడు .నవ చైతన్యానికి కేంద్రమైన కలకత్తా లో 1889లో ఆధునిక అస్సామీ సాహిత్య ఉద్ధరణ కోసం ‘’జానకి ‘’పత్రిక స్థాపన అగర్వాల్ చేశాడు ..దీనికి అండ గా నిబడ్డాడు బెజ్బరూవా. ఆ పత్రికలో ఆయన సృష్టించిన పాత్ర ‘’కృపా వర్ బరువా ‘’తో అరంగేట్రం చేశాడు .

   25-8-1888 న బెజ్బరూవా. ఆధ్వర్యం లో ‘’అస్సామీయ భాషా ఉన్నతి  సాధినీ సభ ‘’ఏర్పడింది .ఇది అపురూప భావ చైతన్యానికీ ,సంచలనానికి వేదిక అయింది .ఆస్సామీ విద్యార్ధులు ప్రతి ఆదివారం సమావేశమై గోష్టి జరుపుకొనే వేదికగా మారింది .దీనికి ఒక ఏడాది కార్యదర్శిగా పని చేశాడు .ఈ సభ ధ్యేయాన్ని ‘’జానకి పత్రికలో 1889 లో ప్రచురించాడు .అవి- అస్సామీ భాషను,సాహిత్యాన్నీ అభి వృద్ధిచేయటం , వ్రాతప్రతులు సేకరించి ప్రచురించటం ,యూని వర్సిటీలలో అస్సామీ భాష బోధనా భషగా ఉండేట్లు చేయటం ,భాషను సాహిత్యానికి అనుగుణంగా వ్యవస్థీకరించటం ,వైష్ణవ సాహిత్యం లోని భాష్యాలను క్రోడీకరించటం ,అస్సాం సాహిత్య రాజకీయ మత చరిత్రలను సమకూర్చటం ,సంస్కృత సాహిత్యాన్ని అస్సామీ లోకి అనువదించటం ,అస్సామీ భాషలో వార్తాపత్రికలు ,విజ్ఞాన పత్రికలను ప్రచురించటం .

  కలకత్తాలోని అస్సామీ విద్యార్ధులు మొదటిసారిగా షేక్స్ పియర్ రాసిన ‘’ది కామెడి ఆఫ్ ఎర్రర్స్ ‘’నాటకాన్ని అస్సామీ లోకి ‘’భ్రమరాంగ ‘’గా బెజ్బరూవా ఆధ్వర్యం లో ఆర్.డి. బారువా ,ఆర్. కే. బర్కకతిజి బారువా ,జీ.స్. బారువాలు  , వచనం గా అనువదించి మార్గదర్శనం చేశారు. ‘బ్లాంక్ వెర్స్ ఇంకా అడుగుపెట్టలేదు .సంప్రదాయ పద్ధతిలో పెరిగి కలకత్తా వంటి కాస్మోపాలిట్ మహా నగరం లో ఉన్నా ,విజాతీయత స్వేచ్చ కొంత సడలించినా తీవ్ర ధోరణులలోకి  మాత్రం చేరలేదు .ఈ కొత్త సంపర్కం ఆయన మేధా నైశిత్యాన్నీ ,అవగాహనా పటుత్వాన్నీ బగా పెంచింది .అస్సామీ ప్రజలకు సేవ చేయాలనే మహత్తర ఆశయం బలంగా మనస్సులో నిలిచింది .గుండె నిబ్బరం కల వాడుకనుక రాబర్ట్ బ్రౌనింగ్ లా జీవితం పట్ల ఆశాభావం ,విశ్వాసం పెంచుకొన్నాడు .ఎదురు దెబ్బలు తగిలినా నిరాశా నిస్పృహ పొందకుండా ముందుకే అడుగులు వేసిన ధీరో దాత్తుడు .. బెజ్బరూవా రచనల్లో దేశాభిమానం,సామాజిక ఆదర్శాలు కనిపిస్తాయి .అస్సామీజీవిత విధానాన్ని గొప్పగా చిత్రించాడు .జీవన విధానాన్నీ సంస్కృతిని పునరుద్దీపింప జేసి, నవ సమాజ సృష్టి జరగాలనే ఆలోచన ప్రజలలో కలిగించాడు .మహా కావ్యం ,మహా నాటకం రాయక పోయినా ,జయమతి కుమారి ,చక్రధ్వజ్ సింహా తప్ప ,మిగిలినవన్నీ దేశ భక్తీ ప్రబోధకాలే . జీవితానంతర మార్గ దర్శిగా ఉన్న మాధ్యూ ఆర్నోల్డ్ లాగా కాకుండా ,తన జీవితకాలం లోనే ఒక మహా సంస్థగా రూపొందాడు .ఆయన విమర్శలు, చెంప దెబ్బలు ప్రజలకు ఎంతో మధురంగా ,మార్గ దర్శకం గా ఉండేవి .’’జాతీయుల సమక్షం లో ఆయన పేరెత్తితే,అది జాతీయ పతాకోత్సవమే అవుతుంది’’అని  నార్వేజియన్ రచయిత ‘’బ్యోన్ సన్’’గూర్చి బ్రాండే చెప్పినమాటలు ఇక్కడ  బెజ్బరూవా కు కూడా పూర్తిగా వర్తిస్తాయి .

   అస్సాం లోని ఇసుకతిన్నె పై ఉన్న దిబ్రూగర్ లో బెజ్బరూవా26-3-1938న 70వ ఏట మరణించాడు .అక్కడే దహన సంస్కారాలు జరిగాయి .’’ఆయన చెప్పిన దాంట్లో లోపాలు,పొరబాట్లు ఉండచ్చు కానీ మనిషిగా చూడటానికి ఆ మనిషి లేడు.ఉన్నది నిత్యానుభవమైన ఒక భావ సంవృతి మాత్రమె ‘’అని ఫ్రాయిడ్ గురించి ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ అన్నమాటలు అక్షరాలా బెజ్బరూవా కు వర్తిస్తాయి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-21-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అవస్యందిత పద ప్రయోగ హాస్యం

అవస్యందిత పద ప్రయోగ హాస్యం

విచిత్రంగా హృదయాహ్లాదంగా నడిచే సంభాషణ అవస్య౦దితహాస్యం కిందకు వస్తుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఉదాహరణ –శివుడు గంగను  నెత్తికి ఎత్తించు  కొన్నాడు .’’ఎవరయ్యా నెత్తి మీద రమణి ?అని పార్వతి అడిగితె ,’’ఆమె మనిషికాదు గంగ ‘’ వేసవిలో నీరు దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా తెచ్చి దాచాను ‘’అన్నాడు  శివుడు .’’నీరు అయితే మొహం కనిపిస్తోంది ఏమిటి ?’’అని మళ్ళీ ప్రశ్న .’’అది ముఖం కాదు కమలం ‘’అన్నాడు .’’పువ్వు అయితే ఆ మిలమిల్లాడే కళ్ళు ఏమిటి ?”’’’అవి కళ్ళు కాదు బంగారం! అవి చేపలు ‘’అన్నాడు .నవ్విన శాంకరి ‘’తెల్లని కంఠం కనపడుతో౦దేమిటి ?’’.’’అది శంఖం లే ‘’అన్నాడు .ఇలా సాగుతుంది .ఆమెకు అసలు సంగతి తెలుసు .కానీ మొగుడితో వేళాకోళ౦ ‘’ఆడటమే .ఇందులో ముఖం కమలం ,క౦ఠం శంఖం గా పోల్చటం కవి సమయం .ఇందులో గంగ వర్ణనతో పాటు ,పార్వతి ని ఉడికించటం కూడా ఉంది .ఇదంతా ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పుస్తకం నుంచి గ్రహించానని మునిమాణిక్యం చెప్పారు .

  మరో ఉదాహరణ –భార్యా భర్తలు ఉదయం కాఫీ తాగుతున్నారు .ఆమె ‘’ఏమండీ రాత్రి అంతా పక్క మీద దొర్లుతూనే ఉన్నారు .నిద్ర పట్టలేదా ?కళ్యాణీ అని కలవరించారేమిటి ? చెబితే ,నేనూ సంతోషిస్తాను కదా ‘’అన్నది .అతడు ‘’నిన్నసాయంత్రం కల్యాణి అనే గుర్రం పై వంద రూపాయలు పందెం కాశాను రెండు వందలు వచ్చాయి ఆ సంతోషం తో నిద్రరాక దొర్లాను .నాకు వచ్చిన దాన్లో సగం వంద నీకిస్తాను ‘’అని కవరింగ్ ఇచ్ఛి ,వంద చేతికిచ్చాడు .ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త తో ‘’మీరు పందెం కట్టిన గుర్రం కల్యాణి మధ్యాహ్నం ఫోన్ చేసింది ‘’అన్నది అతడు ‘’దేశం తెలివిమీరింది .గుర్రాలు కూడా ఫోన్లు చేస్తున్నాయి ‘’అని తప్పించుకొన్నాడు నిజం ఇద్దరికీ తెలుసు .భార్యాభర్తలమధ్య ,జరిగిన సురుచిర ,సుషమ హాస్యంఅన్నారు మాష్టారు .ఇదంతా ఒక క్రీడాత్మక వ్యాపారం.’’నోరు జారిన మాటకు వేరే అర్ధం చెప్పటం అవస్యందిత హాస్యం ‘’అంటారు అని ముట్నూరు కృష్ణారావు గారు అర్ధం చెప్పారని మునిమాణిక్యం అన్నారు .కావాలనే ఒక మాట అని ,ఒక రకం గా అర్ధం చేసుకో నిచ్చి ,,మళ్ళీ దానికి రమణీయ మైన అర్ధం చెప్పటానికి అవస్యందిత హాస్యం అంటారు అని వివరణ ఇచ్చారు మాస్టారు .ఇది కాంతా సంమితమైన క్రీడ గా ,,మనోహర వాగ్విలాసంగా భావింప జేయటం లో సాహిత్య పరమైన సొగసు ఉంది ..ఇందులో భావ వక్రత లేదు ,అర్ధ వైభవమూ లేవు.కొన్ని శబ్దాల ప్రయోగం వలననే హాస్యం సాధించ బడింది .ఇదీ శబ్దాశ్రయ హాస్యమే అంటారు మాస్టారు .

     శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-21-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికా హారర్ నవలారాణి-షిర్లీ జాక్సన్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

1916 డిసెంబర్ 14 న లిస్లి జాక్సన్ ,గెరాల్డిన్ దంపతులకు జన్మించి 1965 ఆగస్ట్ 8న చనిపోయిన అమెరికా హారర్, మిస్టరి నవలారాణి షిర్లీ జాక్సన్ . తల్లి అమెరికన్ రివల్యూషనరి వార్ హీరో నథానియల్ గ్రీన్ కుటుంబానికి చెందింది .ఈమె తాత అలాస్కా సుపీరియర్ జడ్జి .జాక్సన్ ముత్తాత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ .

ఆరునవలలు రెండు జ్ఞాపకాలు ,200కు పైగా కథలు రాసింది .కాలిఫోర్నియాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరం లో పుట్టిన ఈమె న్యుయార్క్ సిరాక్యూజ్ యూనివర్సిటిలో యూనివర్సిటి లిటరరీ మాగజైన్ నిర్వహణ లో పని చేసింది .అక్కడే తనకు కాబోయే భర్త స్టాన్లీ హెడ్గార్ హైమన్ తో పరిచయం కలిగి గ్రాడ్యుయేషన్ అయ్యాక పెళ్ళాడి కొత్త జంట న్యూయార్క్ లో కాపురం పెట్టి ‘’ది న్యుయార్కర్ పత్రిక ‘’లో పని చేశారు .జాక్సన్ ఫిక్షన్ కు ,హైమన్ ‘’టాక్ ఆఫ్ ది టౌన్ ‘’ కు బాధ్యత వహించారు.

1945లో జాక్సన్ దంపతులు వెర్మాంట్ లోని నార్త్ బెన్నింగ్టన్ లో స్థిరపడ్డారు .భర్త బెన్నింగ్టన్ కాలేజి ఫాకల్టి లో చేరాడు .1948లో జాక్సన్ ‘’ది రోడ్ థ్రు ది వాల్ ‘’అనే ప్రఖ్యాత నవలను కాలి ఫోర్నియాలో తన బాల్య౦ గురించి పాక్షిక జీవిత చరిత్ర గా రాసింది .రెండవ నవల ‘’హాంగ్ సమన్’’1951లో రాసింది .ఇందులో అదృశ్యమైన ఒక యువకుడి జాడ కనిపెట్టలేక పోవటం గురించి రాసింది .దక్షిణ వెర్మాంట్ లో గ్లాస్బరి మౌ౦టెన్స్ దగ్గర ఘోరారణ్యం లో జరిగిన యదార్ధ సంఘటన .ఈ సంఘటన ఆమె రాసిన ‘’ది మిస్సింగ్ గర్ల్ ‘’కథకు ప్రేరణ . తర్వాత ‘’లాటరి ‘’అనే కథ ను అమెరికా గ్రామీణ జీవితం గురించి రాసింది .1950-60కాలం లో అనేక చిన్న కథలు చాలా మేగజైన్ లకు రాసింది .వీటిలో కొన్నిటిని జ్ఞాపకాలుగా 1953లో ‘’లైఫ్ అమాంగ్ సావేజేస్ ‘’సంపుటి గా ప్రచురించింది .1959లో ‘’ది హంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ ‘’ ను సూపర్ నాచురల్ హారర్ నవలగా రాసింది .ఇది ఇది వరకు ఎవరూ రాయని బెస్ట్ ఘోస్ట్ స్టోరి గా పెద్ద ఏరు తెచ్చింది .గుడ్ హౌస్ కీపింగ్ ,వుమెన్స్ డే,కొల్లియర్స్ రచనలు కూడా చేసింది ఆమె కథలు true-to-life funny-housewife stories” of the type later popularized by such writers as Jean Kerr and Erma Bombeck .తన జీవిత చరిత్ర రాసుకోవటం ఇష్టం లేదనీ ,తన రచనలు దాదాపు తన సెమి ఆటో బయాగ్రఫి అని తేల్చి చెప్పింది .1962లో చివరి నవల ‘’ఉయ్ హావ్ ఆల్వేస్ లివెడ్ ఇన్ ది కాజిల్ ‘’ అనే గోథిక్ మిస్టరి నవల రాసింది .దీన్ని టైం మేగజైన్ 1962లో పది ఉత్తమనవలలో ఒకటిగా ప్రశంసించింది .తర్వాత ఏడాది పిల్లల బొమ్మలపుస్తకం ‘’నైన్ మాజిక్ విషెస్ ‘’నవల రాసి ఉత్సాహం ఉన్న ఒక బాలుడికి ఒక మజీషియన్ అనేక గమ్మత్తిన్ విషయాలు చేసి చూపింఛి ఆశ్చర్యపరచటం గా రాసింది

ఆడవారు బయట ప్రపంచం లో పని చేయటానిఇంకా కి ప్రోత్సహించని కాలం లో ,కుటుంబానికి సంపాదన పరురాలైన స్త్రీగా పని చేసి భర్త ప్రోత్సాహం తో కన్న నలుగురు పిల్లలను బాధ్యతగా పెంచింది .ఎప్పుడూ రచనలో మునిగిఉన్నా కష్టపడి పని చేయటం ఆమెకు చాలా ఇష్టం .వంటా వార్పూ అన్నీ యథా తధంగా ఠంచన్ గా టైంకి జరిగిపోయేవి .హాయిగా పిల్లలను నవ్విస్తూ జోకులు పేలుస్తూ ఉల్లాసంగా ఉండేది .కార్టూన్లు చూసి పగలబడి నవ్వేది .ఒకభర్త కడుపుతో ఉన్న భార్యను కష్టపడద్దు అని చెబుతూ వీసమెత్తు సాయం కూడా పనిలో చేయని కార్టూన్ ఆమెకు బాగా నచ్చేది .మంచి నవలారచయ్త్రిగానేకాడు ఉత్తమ గృహిణి గా తనబాధ్యతలను నిర్వహించింది జాక్సన్ .1960లో జాక్సన్ ఆరోగ్యం క్రమంగా గుండె జబ్బు వలన క్షీణి౦చింది.1965లో ఆగస్ట్ 8 న తన 48వ ఏట జాక్సన్ అంతు లేని తీరాలకు చేరింది .ఆమె రచనా ప్రభావం నీల్ గైమన్ ,స్టీఫెన్ కింగ్ ,సారా వాటర్స్ ,నిగెల్ క్రియేల్,క్లైర్ ఫుల్లర్ ,జోయాన్నే హారిస్ ,రిచార్డ్ మెద్ సన్ వంటి ప్రసిద్ధ రచయితలపై అపారంగా ఉన్నదని విశ్లేషకులు గుర్తించి చెప్పారు.

1968లో జాక్సన్ భర్త ‘’కం అలాంగ్ విత్ మి’’అనే ఆమెచివరి అసంపూర్తి నవల,పూర్వం ప్రచురింపబడని ‘’లూసా , ప్లీజ్ కం హోం’’,వంటి 14 కథలు, ఆమె రచయితల సభలలో ప్రసంగించిన మూడు ప్రసంగాలు కలిపి ఆమె స్మృతి చిహ్నంగా ప్రచురించాడు . జాక్సన్ ఇంటి వెనక ఉన్న బారెన్ హౌస్ లో దొరికిన కథలు ,అంతకుపూర్వం సేకరి౦ప బడని మాగజైన్లలో పడిన కథలు అన్నీకలిపి 1996లో’’జస్ట్ యాన్ ఆర్డినరి డే’’గా ప్రచురించారు .ఈ పేరు ఆమె రాసిన ఒక కథపేరే .లైబ్రరికా౦గ్రెస్లో ఆమెరచనలు అన్నీ అందుబాటులో ఉన్నాయి .న్యుయార్కర్ పత్రిక 2013 ఆగస్ట్ 5న ఈ లైబ్రరీలో లబ్ధమైన ఒకకథ ‘’పారనోలా ‘’ను ముద్రించి వెలుగులోకి తెచ్చింది .మిగిలిన ప్రచురితం కాని జాక్సన్ రాసిన కథలన్నీ ‘’లెట్ మి టెల్ యు ‘’సంపుటిగా 2015లో ప్రచురితమైంది. ఆమె మొదటిసారి ‘’ది స్ట్రాండ్ మేగజైన్ ‘’కు రాసిన కథ ‘’అడ్వెంచర్ ఆన్ ఎ బాడ్ నైట్ ‘’.2020 డిసెంబర్ లో పబ్లిష్ అయింది .జాక్సన్ రాసిన ‘’లాటరి ‘’కథ అన్నిమాధ్యమాలలో విపరీతంగా ప్రచారం ప్రసారమూ అవటమేకాక మూడు సార్లు సినిమాగా తీశారు .మొత్త౦ మీద 7నవలలు ,7షార్ట్ ఫిక్షన్ రచనలు ,200కు పైగా కథలు ,బాలసాహిత్యం 4రచనలు ,3 జ్ఞాపకాల దొంతరలు షిర్లీజాక్సన్ రాసి అమెరికన్ హారర్ నవలా మహారాణి అనిపించుకొన్నది .

జాక్సన్ తన రాచనలకు ఎన్నో అవార్డ్ లు పురస్కార గౌరవాలు అందుకొన్నది .బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరి అవార్డ్ నాలుగు సార్లు ,,,ఓహెన్రి అవార్డ్ ,న్యూయార్క్ టైం బుక్ రివ్యు అవార్డ్ మూడుసార్లు ,నేషనల్ బుక్ అవార్డ్ ,మిస్టరి రైటర్స్ ఆఫ్ అమెరికా ఎడ్గార్ అల్లాన్ పో అవార్డ్ రెండు సార్లు , ,టైం మాగజైన్ అవార్డ్ ,రెండు సార్లు షిర్లీ జాక్సన్ పొందింది .ఆమె పేరుమీద షిర్లీ జాక్సన్ అవార్డ్ ను 2007లో ఏర్పాటు చేసి సైకలాజికల్ ,సస్పెన్స్ ,హారర్ ,డార్క్ ఫన్టాస్టిక్ రచనలో ఉత్తమ రచన చేసినవారికి ప్రతి ఏడాది అందజేసి గౌరవిస్తున్నారు .ఆమె రచనలన్నీ టిపైనా ఎందఱో పరిశోధనలు చేసి కొత్త విషయాలు వెలుగులోకి తెస్తూనే ఉన్నారు ఆమెభర్త హేమన్. ఆమె స్వభావాన్నీ ,అంతరంగాన్నీ ఆవిష్కరించాడు-చూడండి-. Jackson’s husband wrote in his preface to a posthumous anthology of her work that “she consistently refused to be interviewed, to explain or promote her work in any fashion, or to take public stands and be the pundit of the Sunday supplements. She believed that her books would speak for her clearly enough over the years”. Hyman insisted that the dark visions found in Jackson’s work were not, as some critics claimed, the product of “personal, even neurotic, Cold War era in which she lived, “fitting symbols for [a] distressing world of the concentration camp and the Bomb”.[89] Jackson may even have taken pleasure in the subversive impact of her work, as indicated by Hyman’s statement that she “was always proud that the Union of South Africa banned ‘The Lottery’, and she felt that they at least understood the story”.

Posted in అమెరికా లో | Tagged , | Leave a comment

19-అనులాప పద ప్రయోగ హాస్యం

19-అనులాప పద ప్రయోగ హాస్యం

దీనినే’’ ముహుర్భాషా’’అంటారనీ ,ఒకే అర్ధం కల రెండుమాటలను కలిపితే వచ్చేది హాస్యాస్పదం అవుతుందని మునిమాణిక్య గురూప దేశం .ఉదాహరణ –కిరసనాయిల్ నూనె ,హోలు మొత్తమ్మీద , చీకటి గుయ్యారం ,మగ పురుషుడు ,చీకటి గాడాంధకారం ,తీపిమధురం ,అగ్గినిప్పు ,పేపరు కాయితం ,చేదు విషం ,పులుపు రొడ్డు ,చచ్చిన శవం ,చచ్చిన చావు ,వంటి మాటలు వింటే గలగలా కాకపోయినా ముసిముసిగా నవ్వు పూస్తుంది .ఇలా మాటలని కలపటాన్ని ఇంగ్లీష్ లో టాటోలజి’’-tautology అంటారని మాస్టారు భాష్యం చెప్పారు .Tautology is ,using two or more words to express the same meaning ‘’example –female women  అని నిర్వచనమూ ఉటంకించారు .

బధిర సమాధాన పద ప్రయోగ హాస్యం

 మనం ఒకటి చెబితే చెవిటి వారికి అది ఏదోగా వినిపించి సంబంధం లేని మాటలు మాట్లాడితే నవ్వు తో చస్తాం .  లింవీరేశ లింగం గారు దీనిపై ఒక ప్రహసనమే రాశారు .చెవిటి వాడొకడు పూట కూళ్ళమ్మ ఇంటికి వస్తాడు ‘’అయ్యా ఇప్పుడే ఇల్లు నిండిపోయింది బస కు చోటు లేదు ‘’అని అంటే ,చెవిటాయన ‘’మెడ మీద గది అయితేనేమండీ నాకు అభ్యంతరం లేదు .నేను ముసలివాడినికాడు ఎక్క లేక పోటానికి ‘’అంటూ మేడ మెట్లెక్కి ఆవిడ వాడుకొంటున్న గదిలోకి వెళ్లి విశ్రమిస్తాడు .భోజన సమయం లో అందరికీ అరటిపళ్ళు వేస్తూ ‘’మీకూ రెండు వేయనా ఖరీదు నాలుగు అణాలు ‘’అంటే వాడు ‘’ఊరికే వేస్తానంటే ఎవరొద్దంటారు ‘’అని పెద్దగా నవ్వాడు .ఆమె బిత్తరపోయి ‘’ఊరికే కాదు నాలుగణాలు ‘’అంటే ‘’నువ్వు డబ్బు తీసుకొను అంటే నేనుమాత్రం ఏం చేస్తా సరే అలానే కానీ ‘’ఇందులో ఒకరిమాటకు ఇంకోరిమాటకు పొత్తు కుదరదు.వినేవాళ్ళ చెవులకు బోలెడంత విందు .ఇందులో ఆయన పూర్తి బధిరుడు .

  మరికొందరికి సగం సగం వినిపించి ఏదో చెబితే మనకు నవ్వొస్తుంది .తల్లిని ఇంటిపంనుకట్టాలి డబ్బు ఇవ్వమని అంటే ‘’తొంటి పన్ను కట్టట మేమిట్రా.నాదగ్గర డబ్బులు దానికోసం ఎందుకు ?డాక్టర్ దగ్గరకు వెళ్లి ఒక రూపాయిస్తే పన్ను హాయిగా పీకేస్తాడు ‘’ అంటే విన్నమనం 32పళ్ళతో ఇకిలిస్తూ నవ్వకుండా ఉండగలమా ?

  ఒకాయన ఒక చేవిటావిడ ఇంటికి వస్తే ‘’మా ఇల్లు ఎలా కనుక్కొన్నావు ?’’అని అడిగితె ‘’జవాను తీసుకొచ్చాడు ‘’అంటే ‘’అదేమిటీ శవాన్ని మోసుకోచ్చినవాడివి స్నానం చెయ్యకుండా అన్నీ ముట్టుకున్నావు .మేము బస్తీలో ఉన్నా ఇంకా ఆచారం వదలలేదు .నూతి దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా ‘’అంటే విని నవ్వక చస్తామా ?ఒకసారికోర్టు వారు ఆమె కొడుక్కి సమన్లు పంపారు .ఆమెకు కాగితం ఇచ్చి కొడుక్కి ఇవ్వమన్నాడు అమీను .ఆమె ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా తీసుకోకపోతే ‘’ముసలమ్మగారూ మీరు తీసుకోకపోతే కాగితం గోడకి అంటించి చక్కా పోతాను ‘’అంటే ‘’ఏమి ప్రేలావురా ?ఒళ్ళు కొవ్విందా ?ఆ వెధవకాగితం నేను పుచ్చుకొను అంటే మా కోడలికి అంటించి వెడతానంటావా ?మా అబ్బాయి రానీ నీ భరతం పట్టిస్తాను ‘’అంటే అమీనుతోపాటు మనమూ పగలబడి నవ్వుతాము .

  శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-21-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా గొప్ప దేశభక్తుడు ,కవి ,నాటకకర్త, కథకుడు వ్యాస రచయిత.ఈయన జీవిత చరిత్రను అస్సామీ భాషలో అస్సామీ సాహిత్య చరిత్ర రాసిన ఆచార్య హేమ్ బారువా రచించగా ,శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా కేంద్ర సాహిత్య అకాడెమి 1972లో ప్రచురించింది .వెల రూ -2-50 ముఖ పత్ర  రచన ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రే, ముఖ చిత్ర రచన శ్యామల్ సేన్ చేశారు .

 సంగ్రహ జీవిత చరిత్ర

1868నవంబర్ శరత్కాలం లో లక్ష్మీ నాథ బెజ్బారువా  జన్మించి, నవంబర్ లో పుట్టిన వారంతా బహుముఖ ప్రజ్ఞా వంతులు అవుతరాన్న జ్యోతిష్ శాస్త్ర విషయాన్ని రుజువు చేశాడు .తండ్రి దీనా నాథ బెజ్బరువా బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి . ఆకాలం లో ప్రయాణాలన్నీ నదులమీదే .ఉద్యోగ రీత్యా బదిలీఅయి తండ్రి కుటుంబాన్ని నౌగాంగ్ నుంచి పల్లపు ప్రాంతమైన బార్ పేటకు పడవలపై వెడుతూ రాత్రిళ్ళు బ్రహ్మపుత్రా నదీ తీరం లోని ఇసుకతిన్నెలపై పడవలను కట్టి విశ్రాంతి తీసుకొన్నారు .అలాంటి సమయం లో ఆహతాగురి అనే ఊరు దగ్గర ఇసుక తిన్నె ను ఆనుకొని ఉన్న పడవలో మన బారువా జన్మించాడు .బ్రహ్మపుత్ర నిర్ఝర ధ్వనుల లో ,ప్రకృతి కాంత అంద చందాల మధ్య ,సంగీతమూ వెన్నెల తాండ వించే ‘’లక్ష్మీ రాత్రి’’ వేళలో అస్సామీ నవ్య సాహిత్యానికి విక్టర్ హ్యూగో లాంటి యుగ కర్త పుట్టాడని లక్ష్మీ నాథ అని పేరుపెట్టారు .అక్కడ పుట్టటమే ఒక మధుర కావ్యం .కుటుంబం లో అయిదవ సంతానం యితడు .

   అస్సామీ వైష్ణవ సంస్కృతికి వారణాసి అయిన బార్ పేట లో తండ్రి మూడేళ్ళు పని చేసి ,కొండలు లోయలు ప్రకృతి కి గని అయిన తేజ పూర్ వెళ్ళాడు.పిల్లల్ని చూడటానికి మతవిషయాలు జానపద సంస్కృతీ  కరతలామలకం గా ఉన్న   

రవినాథ్ అనే కుర్రాడిని నియమిస్తే ,అతడు క్రమశిక్షణ నేర్పి మనవాడిని గొప్పగా ప్రభావితం చేశాడు . జానపద గేయాలూ ,పౌరాణిక గాధలు బాల బారువాకు నేర్పాడు.ఇవే తర్వాత ఆయనకు ప్రేరణగా నిలిచాయి .పిల్లలకోసం రాసిన కథల్లో వీటి ప్రభావం బాగా ఉన్నది .ఇంకా ఎగువనున్నలోయలోని లఖిం పూర్  ప్రాంతానికి తండ్రి కుటుంబాన్ని మార్చాడు.వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న కంసాలి సిద్దేశ్వర్ చేసే నగలు, కొలిమి నిప్పురవ్వలు పనితనం చూసి మనవాడు బాగా ఆకర్షితుడయ్యాడు .ఒక రాగి నాణెం ఇచ్చి, చిన్న గిన్నె అతనితో చేయించుకొనేవాడు .పొరుగున ఉన్న దుర్గేశ్వరశర్మతో’’సుతులి ‘’అనే మట్టి వాయిద్యం చేయి౦చు కొన్నాడు .దీనితో సంగీత సాధన చేస్తూ తృప్తి పొందేవాడు .ఆకంసాలి కూతురు జయ అతనితొఆటలాడుకొనెది .ఆమెపై ఆతర్వాత ‘’మాలతి ‘’అనే మధురకవిత రాశాడుకూడా .డాంటే కవికి ‘’బియాట్రిస్’’ పట్ల ఉన్న ఆరాధనే ఇక్కడ మనకవికీ ఆమెపై ఉంది-‘’ఆమె చిరునవ్వుతో నవ్వుతాను –ఆమె కన్నీటితో ఖేదిస్తాను –ప్రియమాలతి ఒడిలో తలవాల్చి కనుమూస్తాను ‘’అనేదే ఆకవిత .

   గౌహతీలో మొదటి సారిగా బడికి వెళ్ళాడు .తర్వాత చదువు శివ సాగర్ లో .తండ్రి రిటైర్ కాగానే ఇక్కడే స్థిరపడ్డాడు.ఆకాలం లో అస్సామీయులపై బెంగాలీ భాష ప్రభావం ఎక్కువ .ప్రభుత్వం ప్రాధమిక బెంగాలీ పాఠశాలల్ని ఏర్పాటు చేసింది .ఆ భాష నేర్వటానికి మొదటిపుస్తకం తర్కాలంకార్ రాసిన ‘’శిశు శిక్ష  ‘’  .అప్పుడు అస్సాం లో ప్రభుత్వ భాష బెంగాలీయే .కనుక అన్నీ బెంగాలీలోనే నేర్పేవారు .కానీ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ,ఆనంద రాం ధేకియల్ , ఫోకన్ వంటి వారి నిర్విరామ ప్రయత్నాలతో బెంగాలీ బదులు అస్సామీ భాష ప్రవేశించి మహోపకారం చేసింది .అస్సామీ అంటే బెంగాలీ భాష మాండలికమే అని,స్వతంత్ర భాష కాదని  వాదించేవారు .దీనిపై తిరుగుబాటు చేసి తన రచనలు వ్యక్తిత్వం ద్వారా నిర్మాణాత్మక కృషిద్వారా  అస్సామీ భాషకు పట్టాభి షేకం చేసిన వాడు బెజ్బారువా

  తండ్రి సంప్రదాయ హిందువే అయినాసమాజం, జీవితం పట్ల  ఉదార హృదయుడు. హేతుబద్ధత ,పురోగతి ఆయనకు ఇష్టం. అదే మార్గం కొడుకు చేబట్టాడు . వైష్ణవం  ఇతివృత్తంగా చాలా రచనలు చేసినా ,అది ప్రత్యామ్నాయం అనీ మిగిలిన శాఖలకు విరుద్ధమనీ ఎక్కడా చెప్పలేదు బెజ్బారువా .గతం లోని మంచిని  తీసుకొని ముందుకు వెళ్లాలని తండ్రీ కొడుకుల భావన .తండ్రికి ఇంగ్లీష్ పరిజ్ఞాన బొత్తిగా లేనే లేదు కానీ ఇంగ్లీష్ ను తిరస్కరించలేదు .పిల్లల ఇంగ్లీష్ చదువులకు అడ్డు చెప్పలేదు .అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు శివ సాగర్ లో ఇంగ్లీష్ స్కూల్ పెట్టినట్లే ,తండ్రి దీనానాథ్ ఉత్తర లఖిం పూర్ లో ఇంగ్లీష్ స్కూల్ పెట్టించాడు .బెజ్బరువా విద్యలో ఆస్తికత అంతర్వాహిని గా  ఉండాలని అభిలషించాడు.

  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 1866లో ప్రవేశ పరీక్ష పాసయ్యాడు బారువా .తర్వాత కలకత్తాలో చదివి ఎఫ్ .ఎ. 20వ ఏట పాసయ్యాడు కలకత్తా జనరల్ అసెంబ్లీ కాలేజి లో చదివి 1890 లో పట్టభద్రుడయ్యాడు.ఇంగ్లాండ్ వెళ్లి పై చదువులు చదువుకోవాలనుకొన్నా ,కుటుంబ ఆచారాల వలన వెళ్ళలేక పోయాడు .కనుక కలకత్తాలోనేఎం ఏ,ఆతర్వాత బిఎల్ చేశాడు .కలకత్తా రిప్పన్ కాలేజి న్యాయశాస్త్ర విద్యార్ధిగా రోజూ హైకోర్ట్ కు వెళ్ళేవాడు .అక్కడ లోక వ్యవహారాలపై అనుభవం సంపాదించాడు .బిఎల్ పరీక్ష తప్పాడు కారణం ఆ పరిక్షలు అయ్యాక మినిమం మార్కులను పెంచేశారట .హైకోర్ట్ లో సిండికేట్ పై దావా వేశాడు .కాని గెలవలేదు .లాయర్ ఆశ తీరలేదు నిరుత్సాహపడ్డాడు .ఆంగ్లకవి బ్రౌనింగ్ గురించి ‘’న్యాయవాదిగానో ,రాయబారిగానో ,మేధాశక్తి ప్రధానమైన వృత్తిలో రాణి౦ప దగిన వాడు ‘’అని  లాండర్,కార్లైల్ అన్నమాటలు మన బెజ్బారువా కు వర్తిస్తాయి .

   కలకత్తాలో బి .బరోవ తో కలిసి కలప వ్యాపారం పెట్టాడు .ఇద్దరి మధ్య కెమిష్ట్రీ బాగా కుదిరి సంపన్నులయ్యారు .బెజ్బారువా మహర్షి దేవెంద్రనాథ ఠాకూర్ మనవరాలు ప్రజ్ఞా సుందరీ దేవిని బ్రహ్మ సమాజపద్ధతిలో 11-3-1891న  పెళ్ళాడాడు  మామగారు పదివేలు కట్నం ఇస్తామన్నా వద్దన్నాడు .వరకట్నం బెంగాలీ సమాజాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ దురాచారం అస్సాం లో లేదు .కట్నాల గురించి తర్వాతకాలం లో వ్యాసాలూ రాశాడు .’’ఆత్మ సంతృప్తి కన్నా ఆనందం లేదు ‘’అన్న అరిస్టాటిల్ మాట పాటించి ఆత్మతృప్తీ ,ఆనందం చిన్నప్పటినుంచి  పొందుతూనే ఉన్నాదు .సమకాలికుడైన సి.కె .అగర్వాల్ కంటే ప్రతిభకలవాడు కాకపోయినా ,జర్మన్ సి౦ఫనిమా౦త్రికుడు బీథోవెన్ లాగా అస్సామీ సాహిత్యానికి అంకితమై, మకుటం లేని రారాజయ్యాడు బెజ్బారువా .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-21-ఉయ్యూరు   

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్

పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్

కెవి శంకర్ 10భారతీయ భాషలసినిమాలకు నృత్య దర్శకులుగా పనిచేసి ఎన్నో అద్భుతమైన డాన్స్ లకు కొరియోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు .ముఖ్యంగా అనేక దక్షిణాది భాషల చిత్రాలకు ఆయన నాట్య గురువు .7-12-1948 న మద్రాస్ లో  జన్మించిన ఆయన 28-11-21న 74వ ఏట హైదరాబాద్ లో కరోనా బారి పడి,కోలుకోకుండా,.అక్కడే శివ సాన్నిధ్యం  చేరారు .మొత్తం 800కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన మహానుభావుడు .తలిదండ్రులు కళ్యాణ సుందరం ,కోమల అమల్.భార్య సుగణ్యా.203లో తమిళ సినిమా ఆలయ్ లో నటుడుగా పరిచయమై తెలుగు తమిళ చిత్రాలలో కేరక్టర్ యాక్టర్ గా ,కమెడియన్ గా నటించారు .చాలా టివి షోలకు ,రియాల్టి షో లకు జడ్జిగా సమర్ధంగా వ్యవహరించారు .

  1975లో ‘’పాట్టు భారతమం ‘’తమిళ సినిమాకు అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్ గా వెండి తెరకు పరిచయమయ్యారు .రెండేళ్ళ తర్వాత 1977లో ‘’కురివికూడు ‘’సినిమాకు నృత్యదర్శకులై ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు .అన్నీ హిట్ చిత్రాలే .మన తెలుగు సినిమాలు అల్లరిపిడుగు,అరుంధతి ,మగధీర ,బాహుబలి ,మహాత్మా ,అమ్మోరు ,సూర్య వంశం,వరుడు మొదలైన వాటికి   డాన్స్ డైరెక్టర్ శివ శంకర్ మాస్టారే .చిరంజీవి సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అద్భుతం అనిపిస్తుంది .మగధీర సినిమా లో ‘’ధీర ధీర ధీర ‘’పాటకు ఆయన చేసిన కోరియోగ్రఫికి జాతీయ పురస్కారం అందుకొన్నారు మాస్టారు .

  తెలుగులో శివశంకర్ మాష్టర్ –నేనే రాజు నేనే మంత్రి,నిను వీడని నీడను నేనే ,సర్కార్ ,ఎన్టి ఆర్ కధానాయకుడు ,రాజుగారి గది ,అక్షర మొదలైన సినిమాలో నటించారు .

  సుమారు 12ఏళ్ల క్రితం హైదరాబాద్ రామోజీ ఫిలిం స్టూడియో లో జరిగిన ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ లో శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం మా కుటుంబానికి దక్కింది .అందులో కనిపించని పాత్రధారులం మేము .మా మనవడు హర్ష  చిన్నతనం లో అల్లు అర్జున్ వేషం వేశాడు. వాడు బాగానే కనిపిస్తాడు .అప్పుడు వేటూరిపాటకు అల్లు అర్జున్ ఎనర్జికి తగిన కొరియోగ్రఫీ చూసి అబ్బురపడ్డాం.ఫుల్ జోష్ తో అర్జున్ చేసి అద్భుతం అనిపించాడు .హావభావాలు చూపిస్తూ నటించి చూపిస్తూ మాష్టర్ నాట్యకళా శాస్త్రాన్ని ప్రదర్శిస్తుంటే అవాక్కయ్యాం .ఆయనను కలిసి మాట్లాడాం కూడా .ఆయన నృత్య విధానాన్ని ప్రశంసి౦చా౦ .నుదుట  వెడల్పైన నిలువు కుంకుమబొట్టు  ఆయన ప్రత్యేకత .’’ఏస్ కొరియాగ్రాఫర్’’అని హిందూ పత్రిక ఆయన్ను శ్లాఘించింది .

  ఓంకార్ నిర్వహించిన రియాల్టి షో లలో శివ శంకర్ మాస్టర్ ఒక ప్రత్యెక ఆకర్షణ గా ఉండేవారు . అందుకేనేమో  శివ శంకర్ పార్ధివ దేహాన్ని శ్మశానానికి స్వయంగా మోసి ఓంకార్ గురు ఋణం తీర్చుకున్నాడు .

మన్మథ రాజా మన్మథ రాజా’… పక్కా మాస్‌ పాట. రగులుతోంది మొగలి పొద’…. శృంగార గీతం.., ‘ధీర ధీర ధీర మనసాగలేదురా’… మంచి రొమాంటిక్‌ సాంగ్‌. దేవ దేవ దేవం భజే’… చక్కని భక్తి పాట… భు భు భుజంగం.. ది ది తరంగం’…. అరాచకుడ్ని అంతం చేయడానికి పాట… పాట ఏదైనా శివ శంకర్‌ మాస్టర్‌ స్టెప్‌’ అందుకు తగ్గట్టే ఉంటుంది. అందుకే ఆయన నృత్యధీర’. వెండితెరపై తారలతో అద్భుతమైన స్టెప్పులేయించిన ఈ మాస్టర్‌ ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు.

డ్యాన్స్‌పైమమకారంపెరిగి..
శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారు. దీంతో శంకర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలన్న పట్టుదల పెరిగిపోయింది.

దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్‌ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట.

ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్‌ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు, వదిలెయ్‌’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు.

 నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్‌ మాస్టర్‌ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు.

  శివ శంకర్ మాస్టర్ అనేక ఆర్ధిక కుటుంబ పరమైన ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో జయించి నిలబడ్డారు . ఆయనకీర్తి అజరామరం .ఆయన ఆత్మకు శాంతికలగాలనీ కోరుతూ ,ఆయన కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )

  దిగువ మధ్యతరగతి తండ్రి, కాలేజిలో లేక్కలలలెక్చరర్ ,ఇంటి లో ఉన్న  14మంది మందీ మార్బలాన్ని పోషించటానికి గడియారం ముల్లులాగా ఒక మానవ యంత్రంలాగా అహర్నిశలు కష్టపడుతూ తెల్లవారుజామునను౦ డి,కాలేజీకి వెళ్ళేదాకా ,వచ్చాక మళ్ళీ రాత్రి పదిదాకా ,అదీ చాలక అర్ధరాత్రి ఒకటిన్నరకు డిగ్రీ పిల్లలకు మాత్స్ బోధిస్తూ  బహు కష్టపడుతుంటే ,నీకు సిగరెట్ అలవాటై కొనుక్కోటానికి ఆయన్నే డబ్బు అడగటం నామోషీ అయి ,అనుకోకుండా దొరికిన టెలికమ్యూనికేషన్ ఉద్యోగం లో చేరి ఝాం ఝాం న దమ్ములాగుతూ ,కవిత్వం చిలికిస్తూ అదే లోకమని భావించి’’ ఆకాస్టాలే ‘’నీ ఊపిరి తిత్తులపాలిటి సమిధలై దహిస్తాయని తెలీకుండా గడిపావా ?తెలిసినా ‘’జగమంతా కుటుంబం ‘’అనే వ్యామోహం లో ఉండిపోయావా ?నాన్న దీపం లాగ వెలిగితే, నువ్వు కొవ్వొత్తి అయి కరిగి కవిత్వపు వెలుగునిస్తూ కరిగిపోయావా రాముడూ !తండ్రి వద్ద నేర్చిన సంస్కృతం,ధాతుమంజరి నీకు వంటబట్టి శబ్ద ధాతు పుష్టి కలిగిందా ? .అందుకేనేమో మధ్యతరగతి బాధలు నీకు కరతలామలకాలై అమృతమయమైన ‘’అమృతం ‘’సీరియల్ కు టైటిల్ సాంగ్ రాసి ,బాధలు కస్టాలు కన్నీళ్లు తోడిపోశావ్ ‘’మన చేతుల్లో లేదా రిమోట్ కంట్రోల్ ‘’అని ,’’ఏడుపుగొట్టు ప్రోగ్రాములు మార్చి కన్నీళ్లు తుడుచుకొందామన్నావ్’’. వచ్చే కస్టాలు  వార్తల్లో వచ్చే హెడ్ లైన్స్ – అయోడిన్ తో అయిపోయే గాయాలే మనగండాలు అని భరోసా ఇచ్చావ్ .గాలైనా రాని ఇరుకు అద్దె ఇంట్లో ‘’కాలైనా పెడుతుందా పెను తుఫానసలు ?’’అని సవాల్ చేశావ్ . మనం ఈదేది ఒక  చెంచాడు భవసాగరాలే ‘’కరెంటు,రెంటు ఎట్సెట్రా మనకష్టాలు ,నైటంతా దోమలతో మనకు గ్లోబల్ వార్ ‘’అని అన్నీ’’ లైట్ తీసుకొని’’ నవ్వుకోరా భాయ్ అని వేదాంతం చెప్పావ్ బాసూ .మధ్యతరగతి మందహాసానికిది ‘’ఊరటోపనిషత్’’అని పించింది .ఈ టైటిల్ సాంగ్ ఆ సీరియల్ పాలిటి సిరివెన్నెలై ,మూడు వందలకు పైగా ఎపిసోడ్ లతో తెలుగువాళ్ళను సంమోహ పరచింది .గుణ్ణం గంగరాజును ‘’గుర్రం ఎగరావచ్చు ‘’అనే మాయలో పడేసింది బ్రదరూ .

  సిరివెన్నెల ,స్వర్ణకమలం మొదలైన సినిమాలో క్లాసిక్ సాంగ్స్ రాసి ఉన్నత మధ్యతరగతిప్రేక్షకులకు రసానందం కలిగించి ,మాస్ కూడా అర్ధం కాకపోయినా ,అదే ఆనందాన్ని పొందేట్లు చేశావ్ .శివ సినిమాలో యూత్ కోసం ‘’బాటనీ క్లాస్ ఉంది మాటినీ ఆట ఉంది ‘’రాసి వాళ్ళలో క్రేజ్ సృష్టించావ్ .ఈపాటతో ఒక ఊపు తెచ్చింది జనాల్లో ఆ శివ .నిజంగా యూత్ శివమెత్తి పోయారంటే నమ్ము .ఇంగ్లీష్ పదాలను యడా పెడా వాడుతూ ‘’భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ సోలో బతుకే సో బెటరూ’’అని కోట కు మనీ లో రాసి  జోష్ తెచ్చావ్ .’’కాసుముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది –పైసలతో ప్రపంచమంతా పడగ్గదికొస్తుంది ‘’ఆని ఆధునికతా రహస్యం చెప్పావ్ ‘’   

గేయ రచయితవైన నువ్వు కథా రచనా చేశావంటే కొందరు నమ్మలేక పోతున్నారు .రాసిన యాభై లో 15మాత్రమె ‘’ఎన్నో రంగుల తెల్లని కిరణం ‘’ సంపుటిగా ప్రచురితమయింది అంటే  ఆశ్చర్యమే .

‘’ఔనా అమ్మకు చెల్ల’’అంటూ కృష్ణతత్వాన్ని ‘’ఆనందలాల ‘’గా అలవోకగా ఆద్బా౦ధవుడు  లో చెప్పావ్ . ‘’చిలకా ఏ తోడు లేక-ఎటేపమ్మ వొంటరినడక  -తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
 అమృతమే  చెల్లించి  ఆ విలువతో 

హలాహలం కొన్నావే అతి తెలివితో 

కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే

తీరా నువు కను తెరిచాక  తీరం కనపడదే యింక’’’’గీతాన్ని శుభలగ్నం సినిమాలో మహా తాత్వికతతో రాసి  ఏడిపించావు గదయ్యా నీ తస్సా చెక్కా .

శ్రీకారం సినిమాలో హాలాహలం లాంటి పాట జేసుదాస్ కి రాశావ్ –

 మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని
మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు ఎవరులేరని
చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!

నిండు నూరేళ్ళు జీవి౦చాలి వేటాడే వేళతో పోరాడాలని గుండెకు ధైర్యం చెప్పావ్ .

 అర్ధ శతాబ్దపు స్వాతంత్ర్యం మనకేమిచ్చిందని నిలదీశావ్’’ సిందూరం’’ లో –దాన్ని అజ్ఞానం ,ఆత్మ వినాశపు అరాచకం అన్నావ్ ;శాంతికపోతం గొంతు తెంచి తెచ్చిన బహుమానం అనీ ,సమూహ అంటే ‘’మాస్ క్షేమం’’ పట్టని స్వార్ధం ఇరుకుతనం లో ముడుచుకుపోయినందుకు బాధపడ్డావ్ .ఇది ఆనాధ భారత౦ అనీ,ఆత్మ వినాశాపు అరాచకాన్నిస్వరాజ్యం అని సలా౦ చేద్దామా ?అని దేప్పావ్ .’’తనలో ధైర్యం అడవికి ఇచ్చి –తనధర్మ౦  చట్టానికి ఇచ్చి – కలహం చూస్తూ –సంఘం శిలగా నుంచుంటే –నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం  -ప్రశ్నించటం మానుకొన్న ఈ కబోది జాతిని ఆవేశం నడిపించినా –ఆ హక్కు తమదే అంటుంది అధికారం ‘’అని రక్త సిందూరప్పాట రాసి జనజాగృతి తెచ్చావ్ సీతారాముడూ హాట్స్ ఆఫ్ భాయ్ .

  ప్రేమ కథ లో ‘’ఆమెతో అతడు కలిసి నడిచేదాకా దేవుడు కరుణిస్తాడని తెలియలేదనీ –ఆమెలేక పొతే జీవితం ఎటు వేళ్ళే దో తెలీదని ‘’నిర్వేదాన్నిపండించావ్ .దేవుడు కరుణిస్తాడనే హమ్మింగ్ తో పాట చరితార్ధమైంది

 గమ్యం చిత్రం లో మన గమ్యమేమిటో ఎరుక పరచావ్ –

 ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

మనకిలా ఎదురైన ప్రతివారు

మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషీ అంటే ఎవరూ

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

మనసులో నీవైన భావాలే

బయట కనిపిస్తాయి దృశ్యాలై

నీడలు నిజాల సాక్ష్యాలే

శత్రువులు నీలోని లోపాలే

స్నేహితులు నీకున్న ఇష్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే

అని రుతుగీతం పాడావ్

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం’’అని

మనుషుల మందహాసం తో చేలిమికలిమి బలిమి సౌఖ్యం అని తేల్చి చెప్పావ్

చక్రం లో చక్రి స్వరకల్పనలో ‘’జగమంత కుటుంబం నాది ‘’వైతాళిక గీతం రాసి మురిపించావ్ – కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ

కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిసినై

నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ

వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హ్రుదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి’’

 ఇప్పుడు నే  ఉదహరించినవన్నీ అవార్డ్ విన్నింగ్ లిరిక్కులే రామయ్యా .800సినిమాలకు 2450 దాకా అపురూప గీతాలు రాసి ,అశ్లీలం ద్వంద్వార్ధాల జోలికి పోకుండా నిప్పులా రాసిన కవి అనిపించావ్ రాముడూ .భారతప్రభుత్వ ‘’పద్మశ్రీవి’’నువ్వు సిరివెన్నెలా ..300పాటలతో ‘’శివకావ్యం ‘’రాస్తూ ముగించకుండానే,శివసాయుజ్యం చేరావా ?నువ్వుపుట్టింది 20-5-1955,సాయుజ్యాన్నిపొందింది 30-11-21.ఇవి కాలగణనానికే కాని నువ్వు అమరుడవు చిరంజీవివి ..

నీ కవితా ప్రస్థానం లో నాకు రెండు పరిధులు –ప్లేన్స్ కనిపిస్తున్నాయి –ఒకటి సిరివెన్నెల ,స్వర్ణకమలం వగైరాక్లాసిక్స్ లో నీది ఉత్తమోత్తమ క్లాసిక్ కవిత్వం .పండిన భక్తికవితా వేశం . తర్వాత ప్లేన్ లో నీది జగమంత  కుటుంబీకుడివి అయ్యావు .జనసామాన్యం లో మెలిగావ్ .వాళ్ళ కస్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలకు వకాల్తా పుచ్చుకోన్నావ్ . యాభై ఏళ్ల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటె చిర్రెత్తి, చికాకుపడి స్వాతంత్ర్యం అంటే ఏమిటో విడమరచి చెప్పావ్ . మా విధులు బాధ్యతలు గుర్తు చేశావ్ .ప్రజాకవివి ,ప్రజారవివి అనిపించుకొన్నావ్ .జనజాగృతి కై పరితపించావ్ .

  నమ్మకు నమ్మకు ఈ రేయినీ అని పారాహుషార్ చేశావ్ .జామురాతిరి జాబిలమ్మ అందాలు చూపావ్ ,క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ అని మందలి౦చావ్ .నిన్నే పెళ్లాడుతానంటూ చిలిపి చిందులు తోక్కి౦చావ్  , కళ్ళల్లో కళ్ళు పెట్టి దోబూచులాడి౦చావ్ ,ఆకాశం దిగి వచ్చి ఊరంతా పెళ్లిపందిరి వేయించి గ్రామీణ వాతారణం లో సంపన్నుల పెళ్లి జరగాలని ఊహించి ఊరి౦చావ్  .సీతమ్మ అందాలూ రామయ్య చందాలూ అంటూ ఆ ఆదర్శ దంపతుల దాంపత్య వైభవం కళ్ళకు కట్టించావ్ .యువతకు హితవుగా ప్రేరణగా ‘’ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ ‘’అని ఒక పెద్దన్నయ్యలా హిత బోధ చేశావ్ .ఉత్సాహంగా రెండు మూడు’’సినేమాలలో’’ నటించి నీ పాట నువ్వే పాడుకొని సిరివెన్నెల కురిపించావ్ .పాత భావ స్ఫోరకంగా ఎలా పాడాలో నేర్పావ్ .అనుభూతి కలిగించావ్

 ఇప్పుడు అందనంత దూరానికి ‘వినీల గగనపు  వేదిక ‘’పైకి చేరుకొన్నా ,పాడుకోటానికి,అనుభవించటానికి  నీ పాటల ‘’ వెన్నెల సిరి’’ మాకు అప్పగించావ్  సిరివెన్నెల సీతారాముడూ ! ఏమంత వయసైపోయిందని వెళ్లిపోయావయ్యా .ఇంతలోక జ్ఞానం సంపాదించి పాటలలో పంచిపెట్టిన నువ్వు ‘’ధూమపాన బలహీనత ‘’కు బలై పోవటం జీర్ణించుకోలేక పోతున్నాం .ఇదీ లోకానికి ఒక హెచ్చరికగా మిగిల్చావా రాముడూ! .మీ కుటుంబానికి మా సానుభూతి .నీ ఆత్మకు ప్రశాంతి కలగాలని నువ్వు తిరస్కరించిన ఆ ‘’ఆది భిక్షువు’’నే అర్దిస్తున్నాం .

జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |

నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం 

విషయ పరిజ్ఞానం పూర్తిగా పొంది మంచిపనులచే సిద్దులైనవారి కీర్తికి ముసలితనం మరణం వలన భయం లేదు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-21-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | Leave a comment

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ!

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ!

హాట్రిక్ గా మూడు, మొత్తం 11 నందులను కైవశం చేసుకొని ,ఆనందికే ప్రభువైన వాడిని ‘’ఆది భిక్షువు వాడి నేది కోరేదీ ?బూడిదిచ్చే వాడి నేది అడిగేది ?”’’’అని ప్రశ్నించి , ‘’విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం.మ్మ్..’’అని ప్రణవానికి నిర్వచన ప్రవచనం చేసి ,ప్రాణనాడులకు స్పందన కలిగించి ,యద కనుమలలో ప్రతిధ్వనించే ‘’ఆ విరించి విపంచి గానాన్ని ఆవిష్కరించి తొలి చిత్రంతో నే మనకొక మహా కవి మళ్ళీ ఆత్రేయ ,వేటూరి తర్వాత పుట్టి ఆధునిక సినీ కవిత్రయాన్ని స్థాపించాడని ముచ్చట పడ్డాం .తెలుగు సినీ లిరిక్కులకు సిరివెన్నెలై ,దాదాపు 35ఏళ్ళు సినీ వినీలాకాశాన్ని ఏలినవాడు’’ చెంబోలు సీతారామ శాస్త్రి ‘’,కాకినాడ వాసి .ఆ నీళ్ళలోనే అన్నీ ఉన్నాయి దాన్ని సార్ధకం చేశాడు .సంగీతం సామం నుంచి పుట్టిందని మనకు తెలిసినా ‘’ సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది’’అని సంగీతం తో చెప్పిన ఘనుడు .విశ్వ కావ్యానికి భాష్యంగా ‘’ ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..

జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… ‘’

పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము ‘’అయి౦దన్నాడు మనోహరంగా .పుట్టగానే ప్రతి శిశువు పలికే జీవన నాదతరంగం ట.’’ చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం…

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..

సాగిన సృష్టి విలాసము’’గా అపూర్వంగా ధ్వని౦పజేశాడు ‘’అంతే కాదు శాస్త్రి ‘’నా ఉచ్చ్వాసం కవనం ,నా నిశ్వాసం గానం ‘’అని చిరునామా కూడా తెలియజేసి మహా కవుల కోవలోకి చేరాడు .’’తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది?’’ కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది?’’బండరాళ్లకు  చిరాయువిచ్చితేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది?ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ‘’అని వ్యాజస్తుతి సినిమాలో చేసి సేబాష్ అనిపించాడు సీతారాముడు  .ఆవూరివారంతా తనవారు అని ‘’ ననుగన్న నా వాళ్ళు… ఆ… ఆ… నా కళ్ళ లోగిళ్ళు’’అనీ ,ఎన్నాళ్ళో గడిచి ఇప్పుడు కలిశాక ‘’ ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక “”అని తాను పుట్టి పెరిగిన ఊరును ,తనవవాళ్ళ గొప్ప నాష్టాల్జియా తో అభివర్ణించాడు .అతడి వేణుగానానికి పరవశించిన ఆ చిన్నది’’కన్నె మూగమనసు కన్న స్వర్గస్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగనగళము నుండి అమర గానవాహిని “
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి  ‘’అయిపోయి ఆ మురళిలో తన హృదయమే స్వరాలుగా మారిపోయింది ‘’అని మహా భావుకతతో చెప్పించాడు .ఆ దృశ్యాన్ని విశ్వనాథీ కడు మనోజ్ఞంగా చిత్రించి సాఫల్యం చేకూర్చాడు .అలాగే ప్రకృతికా౦తకు ఎన్నెన్ని హొయలు వగలు సోయగలు ఉన్నాయో చెప్పాడు మరోపాటలో ‘’ సిరివెన్నెల నిండిన ఎదపై
సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగరావేళా… నిను నే కీర్తించే వేళా’’అని పరవశించిపాడాడు ఆమెనూ పిలిచి పొంగిపోమ్మన్నాడు.’’ అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగమూ
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ’’అని అనురాగ రాగాల మేళవింపు కూర్చాడు .ఈపాట చిత్రీకరణలో విశ్వనాథ్ప్రతిభ పతాక స్థాయి చేరింది . ఫోటోగ్రఫీ నిండుతనం చేకూర్చింది .’’ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో’’అని ఆ ఆనంద హేలలో మనల్నీ మైమరపిస్తాడు శాస్త్రి .విశ్వనాథ్ ,సిరివెన్నెల ,మహదేవన్,బాలు  ‘’ విశిష్ట చతుష్టయం ‘’ ‘’సాధించిన అద్భుత  దృశ్య,శ్రవ్య ,సంగీత కావ్యం చేశారు సిరివెన్నెల సినిమాను.ఏమిచ్చి మనం వాళ్ళ ఋణం తీర్చుకోగలం?

  ‘’బలపం పట్టి భామ వొళ్ళో అ ఆ ఇఈ ‘’నేర్చుకొన్నా ,పంతం పట్టి ప్రేమ వొళ్ళో ఆహా ఓహో పాడుకోనేట్లు ‘’చేసిన శాస్త్రి ప్రేమ బడిలో ‘’అయితే గియితే వద్దని వారించి ,సరసం ఇంకా ఎక్కువైతే ఛాచా చీఛీ’’దాకా వస్తుందని ముందు జాగ్రత్త చెప్పాడు .అన్నమయ్య పాటా అని పించే ‘’తెల వారదేమోస్వామి నీ తలపుల మునుకలో ‘’పాట రాశాడు .’’ చెలువము నేలగ చెంగట లేవని

కలతకు నెలవై నిలచిన నెలతకు

చెలువము నేలగ చెంగట లేవని

కలతకు నెలవై నిలచిన నెలతకు

కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి,

అలసిన దేవెరి అలమేలు మంగకూ …. ‘’

 అంగజు కేలిని పొంగుచు తేల్చగ

మక్కువ మీరగ అక్కున చేరిచి

అంగజు కేలిని పొంగుచు తేల్చగ

ఆ మత్తునె మది మరి మరి తలచగమరి మరి తలచగ’

 అని అన్నమయ్య స్థాయి కవిత చిలికి౦చాడు.

  స్వర్ణకమలం లో కవితా స్వర్ణ కమలాలు వికసి౦ప జేశాడు. అందులో అందరూ మెచ్చే పాట’’అందెల రవమిది పదములదా ?అంబరమంటిన హృదయానిదా?’’అమృతతగానమిది పెదవులదా,అమితానందపు యద సడిదా’’అని ఆశ్చర్యపోయేట్లు రాశాడు .’’ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా  -బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ‘’అని దాని సార్ధకత వివరించాడు చిక్కని చక్కని పద సంయోగంతో అర్ధభావ గాంభీర్యంతో .మువ్వలు ఉరుముల సవ్వడిఅవ్వాలని , మెలికలు మెరుపుల మెలకువలై –మేను హర్ష వర్ష మేఘమై ,మేని విసురు వాయువేగమై –అంగభంగిమలు గంగ పొంగులై –హావభావాలు నింగి రంగులై –లాస్యం సాగే లీల రస ఝరులు జాలువారరేలా-జంగమమై జడ పాడగా –జలపాత గీతముల తోడుగా –పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతికాగా ‘’అందెల రవళి సాగాలని అతడు కోరాడు అలానే ఆమె ఆడింది నయనమనోహరంగా ప్రకృతిలో .’’    నయనతేజం నకారంగా ,మనోనిశ్చయ౦   మకారంగా ,శ్వాస చలనమే శికారంగా , వాంచఛితార్ధమే వకారంగా,యోచన సకలం యకారంగా  ,నాదం నకారమై ,మంత్రం మకారం, స్తోత్రం శికారం ,వేదం వకారం ,యాగం యకారం ,ఓం నమశ్శివాయ ‘’అంటూ అందులోని పరమార్ధాన్ని మహా వైభవంగా వర్ణించి శివకవుల స్థాయి చేరాడు సిరివెన్నెల .చివరగా ‘’ భావమే మౌనపు భావ్యం ,భరతమే నిరతరభాగ్యం ,ప్రాణ పంచమమే పంచాక్షరిగా,పరమ పదము ప్రకటించగా –ఖగోళాలు పద కింకిణులై –దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా ‘’అని రాసిన పాట శివతాండవం గా శివమనోహరంగా ,శివ హృదయ సాక్షాత్కారంగా ,శివతత్వ విచారంగా ,పరమపద సోపానమార్గంగా రాయటం సామాన్యకవులకు అలవి అయ్యే విషయం కాదు .హృదయం అంతా శివమయమైనప్పుడే సాధ్యమయ్యే మహనీయ గేయం ఇది .శివ పూజకు పనికి వచ్చే నీరాజనమిది .సుభాష్ సిరివెన్నెలా ‘’స్వర్ణకమలం ‘’లో సిరివెన్నెల మెరుపులు మెరిపించి ఆ పరమశివునే మెప్పించావ్ .’’బూడిద పూసుకొనే వాడి ‘’విభూతి,ఐశ్వర్య దర్శనం చేసి ,మాకూ ఆ అనుభూతినిచ్చావ్ .సుదీర్గంగా సాగే ఈపాట నృత్యం ఎక్కడా బిగువు సడలలేదు .విశ్వనాథ్ టేకింగ్ మహాత్మ్యం అది .పాటకుపరమ సార్ధకత తెచ్చారు భానుప్రియ, వెంకటేష్  .అతడి ఆలోచనలకు తగిన ప్రతిఫలం ఆమె పొంది తండ్రి కోరిక తీర్చి సుస్థిరయశస్సు సాధించింది అతడి ప్రేరణా ,సాహచర్యంతో .ఈ సినిమా అద్భుతమైన క్లాసిక్ .విశ్వనాద్ కీర్తి కిరీటం లో మరో సిరి వన్నెల చిన్నెల కలికితురాయి .

  అలాగే స్వాతి కిరణం సినిమాలో ‘’ఆనతీయరా ప్రభూ ,తెలిమంచు కురిసిందీ,వైష్ణవి భార్గవి, భవానీ శివానీ ‘’గీతాలకు ప్రాణం పోశాడు .’’ఆనతీయరా పాటలో ‘’ సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా…

సన్నిధి చేరగా… ఆనతి నీయరా.. హరా, నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ’’

అలాగే -తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
 దోవపొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువలా వందనంల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ

భానుమూర్తి… నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశృతిని
పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని    //తె

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలుభూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు’’

మరో గోప్పపాట -శృంగారం తరంగించు… సౌందర్యలహరివని …
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని …
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని…
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని…
కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు
సలుపలేని.. నీ సుతుడనే శివాని
శిరౌద్రవీర.. రసోద్రిక్త … భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి.. అభయపాళి నీవనివాని.. భవాని.. శర్వాణి..

భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివని…
అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు
సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

 ఇవన్నీ శివ ,శివానందలహరి గీతాలే అమృతపు సోనలే .మానసిక ఆన౦దాన్ని చేకూర్చే గీతాలే .హృదయపు లోతుల్లోంచి పెల్లుబికిన మృత ఝరీ ప్రవాలే .సిరివెంనేలకు పెట్టిన కీర్తి కిరీటాలే .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-21-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | 2 Comments

5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం

5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment