సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42

తనబలపరాక్రమాలు చూపి చైత్య ప్రాసాదాన్ని నేలమట్టం చేసి తనవానర సేనా బల వివరాలు తెలియజేస్తూ ,అసలు కపి సైన్యం ఎంతుందో ఖచ్చితంగా రావణుడికి తెలియజేశాడు .అందులో కొందరు ఓఘం సంఖ్యకల ఏనుగుల బలం ఉన్నవారు అన్నాడు .ఓఘం అంటే సముద్రం అనే అర్ధం కూడా ఉంది .సముద్రం లోతు అంతుపట్టదు .అదేకాక ఓఘం అంటే 1057  .అంటే 10తర్వాత 57సున్నాలు పెడితే యెంత పెద్ద సంఖ్య వస్తుందో అంతసంఖ్యున్న ఏనుగులు యెంత బల౦ కలిగి ఉంటాయో  అంతటి బలమున్నవారు అని అర్ధం .ఈ సంఖ్యకంటే పెద్దది మహా ఓఘ0 అంటే 1062. ..

   కనుక ఆషామాషీ వ్యవహారం కాదు .అనంత బలసంపన్నమైన వానర సైన్యం అనంతంగా కడలి వస్తుందని హెచ్చరించాడు హనుమ .

  రావణుడి ఆజ్ఞతో ప్రహస్తునికొడుకు జంబుమాలి యెర్ర మాలలు వస్త్రాలు సకల ఆభరణాలతో పెద్దకోరలతో బయల్దేరి వచ్చి అల్లెత్రాటిని లాగి పిడుగులాంటి భీకర శబ్దాన్ని చేయగా ఆ ధ్వనిఅన్ని దిక్కులూ భూ నభోన్తరాలకు ప్రాకింది .రాగానే మహాకపి పై వాడి బాణాలు వేశాడు .అసలే ఎర్రనిముఖం ఆ బాణ ఘాతాలతో మరింత ఎర్రబడి శరత్కాల తామర పువ్వులా ప్రకాశించాడు –

తస్య తచ్ఛుశుభే తామ్రంశరేణాభి హతం ముఖం –శరదీవామ్బుజం ఫుల్లం విద్ధంభాస్కర రశ్మినా’’

 అసలే ఎర్రనిముఖం బాణపు దెబ్బలతో మరింత ఎర్రగామారి ఆకాశం లో రక్త చందన బిందువులతో తడుపబడిన పెద్ద తామర పువ్వూ లాగా శోభిల్లింది –

‘’యధాకాశే  మహాపద్మం సిక్తం చందన బిందుభిః –చుకోప బాణాభి హతోరాక్షసస్య మహా కపిః’’

  ఈదెబ్బలతో రెచ్చిపోయిన హనుమ అక్కడే కనిపించిన పెద్ద బండరాయి పీకి జ౦బు మాలిపై విసిరేస్తే వాడు 10బాణాలతో ముక్కలు చేశాడు .కోపం మరీపెరిగి విశాల సాలవృక్షం పెరికి గిరగిరా తిప్పి వాడిపై విసరగా వాడు ఐదు బాణాలతో దాన్ని ,ఒకబాణ౦ తో హనుమ భుజాన్నీ ,ఒకబాణ౦తో వక్షస్థలాన్నీ పదిన్టితో స్తనప్రదేశాన్ని కొట్టాడు .ఒళ్ళంతా బాణమయమైకోపోధృతి తో ఇనప గుదియ(పరిఘ ) వేగంగా తిప్పి వాడి రొమ్ముపై కొట్టాడు .ఆ దెబ్బతో వాడి తల ,చేతులు ,మోకాళ్ళు విల్లు ,గాడిదలు ,గుర్రాలు  చిరునామా లేకుండాపోయి ,వాడి అవయవాలు,ఆభరణాలు  పొడిపొడిఅయి జంబుమాలి  నేలపైబడి ,జముని దగ్గరకు చేరాడు.

‘’న ధను రణ రథోనాశ్వాస్తత్రా దృశ్యంత నేషవః –స హత స్సహసౌ తేన జమ్బుమాలీ మహాబలః ‘’

‘’పపాత నిహతో భూమౌ చూర్ణి తాంగ విభూషణః’’

  కింకరులు,మహాబలశాలి  జంబుమాలి  హనుమ చేతిలో చచ్చారన్న వార్తవిని రాక్షసరాజు  సహించలేక మంత్రిపుత్రులను హనుమపైకి యుద్ధానికి పొమ్మని ఆనతిచ్చాడు .

  ఇది 20శ్లోకాల 44 వ సర్గ .

 ఇదే మొదటిసారి హనుమకు ఒక మహా బలవంతుడితో లంకలో పోరాడటం .ఇందులోనూ విజయం సాధించాడు వాయుపుత్రహనుమ.

  ఇంతటి భీకర యుద్ధం లోనూ మహర్షి మనకు కాస్త వినోదం కోసం హనుమ ముఖం అసలే ఎర్రగా ఉన్నది వాడి బాణాల దెబ్బలతో మరింత ఎర్రబడటాన్నిచక్కని ఉపమానాలతో వర్ణించి కాస్త నవ్వుకూడా తెప్పించాడు .బండరాయి, సాల  వృక్షం కూడా జంబుమాలిని ఏమీ చేయలేకపోయాయి . చివరిగా  తన ఆయుధం పరిఘ మాత్రమె వాడి ప్రాణాలు తీయగలిగింది .అదీ వాడి అవయవాల,ఆభరణాల రథాలగుర్రాల గాడిదల  అడ్రస్ లేకుండా చేసి వాడిని భూశయం ముందే చేయించింది  .అదీ హనుమ వీర  విక్రమ పరాక్రమ ప్రతాపం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం

107-చైనీస్ సాహిత్యం -3

6-ప్రామాణిక గ్రంథ యుగం -1368-1890-విదేశీ మంగోలులపై తిరుగు బాటు చేసి చైనీయులు 1368లో వాళ్ళను సాగనంపిన మింగ్ వంశనాయకుడు చక్రవర్తి అయ్యాడు .వీరి పాలన 1644వరకు సాగింది .పాలన సుస్థిరమై శాంతిభద్రతలతో దేశం ఉన్నందున మళ్ళీ లలితకళలకు వికాస కలిగింది .కాని సాహిత్యం లో చెప్పుకోదగిన వికాసం రాలేదు .కొన్ని నవలలు నాటకాలు వచ్చినా ,అవి పూర్వయుగ అనుకరణలే .కాని ‘’యుంగ్ లోటా టైన్’’ ఒక విజ్ఞానసర్వస్వం కూర్చాడు .1403 చక్రవర్తి  ఈ బృహత్ ప్రణాళికకు 2వేలమంది రచయితలను సహాయకులుగా నియమించి ప్రోత్సహించాడు .అది 22,800పేజీలతో వెలువడిన అసాధారణ గ్రంథం .కాని ముద్రణఖర్చు తడిసి మోపెడు అవుతుందని అచ్చు కాలేదు .ఆకాలపు వాంగ్ యాంగ్ మింగ్ తాత్వికకవి .సృజన శీలతను గుర్తించాడు .ఇంద్రియజ్ఞానం కంటే విశిష్టమైన జ్ఞానం ఉన్నాదని విశ్వసి౦చాడు .ఈభావాలు జపాన్ లో బాగా వ్యాప్తి చెందినా చైనా పండితులకు నచ్చలేదు .శ్వూశ్వాంగ్ చిఅనే  క్రైస్తవ రచయిత’’నుంగ్ చెంగ్చవాన్ షూ’’అంటే బృహత్ సంహిత అనే మహా గ్రంథాన్ని60సంపుటాలుగా రాశాడు .దీనిలో వ్యవసాయం ,పశుపోషణ ,వివిధ శాస్త్ర సంబంధ విషయాలు ఉన్నాయి .

  ఇంతలో చైనా ను మంచూ సైన్యం ముట్టడించి మింగ్ వంశపాలనకు గుంటకట్టి గంట వాయించింది .మంచూ పాలకులు చైనీయుల సంస్కృతిని గౌరవించి ఆదరాభిమానాలు పొంది ప్రజా పాలన చేశారు .ఈ రాజులలో ఖాంగ్ శీ -1662-1722,చీన్ లూంగ్ 1736-96లు సాహిత్యాభి వృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు .పూర్వ గ్రంథాలన్నీ మళ్ళీ ముద్రణ పొందించారు .ఒక్కొక్కదానిలో 200 పేజీలున్న 1,628 సంపుటాలలో ఒక ‘’సచిత్ర విజ్ఞాన సర్వస్వం ‘’వచ్చింది .2200మంది కవుల రచనల సంకలనం తోపాటు సమగ్ర చైనీయ సాహిత్య సంబంధిత 18వేల పేజీల పద ప్రయోగ కోశం ,ప్రామాణిక నిఘంటువు ,771పేజీలలో చైనీయ సామ్రాజ్య సమగ్ర చరిత్ర ,300మంది పండితులతో 10,223 పేజీల చైనీయ సాహిత్య సమగ్ర చరిత్ర గ్రంథాలు వచ్చాయి .వీటిలో చివరది 1773లో మొదలై 1782నాటికి 9ఏళ్ళలో పూర్తయింది .ఇందులో ప్రామాణిక గ్రంధాలు,ఇతిహాసాలు ,తత్వ శాస్త్రాలు,సామాన్య సాహిత్యం అనే నాలుగు విభాగాలున్నాయి .

   ఈ యుగం లో ఇలాంటి సంకలిత గ్రంథాలు మాత్రమె కాక ,స్వతంత్ర రచనలూ చేసిన కవులున్నారు .వారిలో శీ ,కుఎన్ వులు ప్రముఖులు .హ్వాంగ్ చుంగ్ శీ  అనే రచయిత ఆనాటి వివిధ తాత్విక వాదాలను చర్చిస్తూ ‘’’’మెంగ్ జ్యూ క్యూ ‘’గ్రంథం రాశాడు .కు యెన్ వు కవీ పరిశోధకుడుకూడా .కొత్త రచనా ప్రక్రియ చేబట్టిన సాహిత్య విమర్శక అగ్రేసరుడు ,కావ్య రచనావేత్త’’ య్వాన్ మీ ‘’ .తత్వ శాస్త్రం లో నూతన విషయాలను ఆవిష్కరించినవాడు టాయ్ చెన్..నాటక రచనలో అగ్రేసరుడు’’చాంగ్ షిహ్ .‘’ప్రపంచ  ప్రసిద్ధ నవల –చ్వాన్ హంగ్ లౌమేంగ్ ‘’అంటే యెర్ర మందిరం లో ఒక కల రాశాడు .చాన్ శ్యూచిన్ .100అధ్యాయాల మహా నవల’’ ‘’ హ్వాయ్వాన్—అంటే అద్దం లో పువ్వులు’’రాశాడు లీ హూ చెన్.1800నుంచి 1890వరకు చైనీయసాహిత్య చరిత్రలో అంధకార యుగం .ఆడపాదడపా రచనలు వచ్చినా ‘’లైట్ తీసుకోనేవే ‘’

7-ఆధునిక యుగం -1890నుండి ఉన్నకాలమే ఆధునిక యుగం .ఖాంగ్ యూ లీ ,ల్యాంగ్ ఛీ చాన్ లు సంస్కరణ ఉద్యమం నడిపారు .విజ్ఞాన సాహిత్య రాకీయాలలో రావలసిన మార్పులను గురించి ప్రచారం చేశారు .వీళ్ళకు ముందే ‘’సన్యట్ సేన్’’దేశం లో ప్రజాస్వామ్యం రావాల్సిన అవసరాన్నితెలియ జేస్తూ  విస్తృతంగా ఉద్యమం  చేశాడు .తనసిద్ధాంతాలను గ్రంథాలుగా రాసి ప్రచారం చేశాడు  .

   క్రమంగా ప్రజలు మాట్లాడుకొనే సామాన్య భాష పై  ఆదరం పెరిగింది  సామాన్యభాష సాహిత్యభాష కావాలని’’ హూ షిహ్’’పండితుడు ఆందోళన లేవ దీయగా,విజయవంతమై రచనలో అనేక ప్రక్రియలు వచ్చాయి .ఈపరిణామాలన్నీ ‘’మే4ఉద్యమం ‘’లో  ఊపిరి పోసుకోన్నాయి .మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక జరిగిన ఒడంబడికను అనుసరించి చైనాలోని షాంటంగ్ ప్రాంతం లో జపాన్ ప్రభుత్వం ఉండేట్లు నిర్ణయం జరిగింది .దీన్ని ప్రతిఘటిస్తూ 1919 మే4 న ప్రారంభమైన ఉద్యమమే మే4ఉద్యమం చైనీయుల ఐక్యత సాధించటానికే సాహిత్యం ఉపయోగపడాలనేది ముఖ్య ఉద్దేశ్యం .దీన్ని మనస్పూర్తిగా రచయితలూ అనుసరించారు. నిత్యజీవిత విషయాలను సరళ సులభ శైలిలో రాయటం కూడా ఇందులో భాగమే .దీన్ని బాగా వ్యాప్తి చెందించి రాసిన వారిలో –లూశున్,చెన్టూష్యూ,చైన్శ్వాన్టుంగ్,హూసీ లు .లూశాన్ ప్రజాహృదయాలను విపరీతంగా ఆకర్షించాడు కమ్యూనిస్ట్ సిద్దాన్తవ్యాప్తికి రచన దోహదమైంది .యువ రచయితలలో చూచ్యు పాయ్ ముఖ్యుడు .

  కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడి ఉద్యమమహానాయకుడు ‘’మావ్ సే టుంగ్’’. సాహిత్య ఉద్దేశ్యాన్ని చర్చించి ఒక వివరణ పత్రాన్ని 1941లోఎనాన్ నగరంలో ప్రసంగించటం వలన ‘’ఎనాన్ ప్రసంగం ‘’గా పేరు పొందింది .దీన్ని  ప్రచురించాడు .కార్మిక కర్షక సైనిక జనాలకోసం సాహిత్యం ఉండాలని చెప్పాడు .ఏది చెప్పినా హేతువాదంతో చెప్పటం తో అందరూ ప్రేరితులయ్యారు .ఇలాంటి నవ్యరచయితలలో చ్వాంగ్ క్వాంగ్ జ్యూ ,హోయెహ్ పిన్ ,టైన్ హాన్,ఇన్ వూ ,పాటింగ్ మావ్ టున్,క్వామోజో మొదలైనవారు ఎందరో ఉన్నారు .1950లో చైనాలో ప్రజాగణ రాజ్య నూతన ప్రభుత్వం ఏర్పడి మావో ను అనుసరించిరచనలు వచ్చాయి .అనేక విదేశీ రచనలు చైనీస్ భాషలోకి అనువాదాలయ్యాయి .విశ్వ సాహిత్యం లో చైన్స్ సాహిత్య అరుణ పతాక  రెపరెప లాడింది .

  తర్వాత సాహిత్యం లో వచ్చిన పరిణామాలు ,సమకాలీన రచనలగురించి తరువాతతెలుసుకొందాం .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -6

బక దాల్భ్యుడు -6

కేశి అంటే పొడవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధాలున్నాయి .దీర్ఘ కేశాలు పట్టరాని శక్తికి,బ్రహ్మచారికి  సంకేతం .యాగ బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం చేయలేదు .జైమినేయ బ్రాహ్మణం లో కేశి కి మరోపేరుగా ‘’శీర్ష్యాన్యః ‘’అని ఉన్నది అంటే తలపైన ఉండేవి .కనుక తలకాయకు కేశికి అవినాభావసంబంధం ఉందనితెలుస్తోంది .శతపధ బ్రాహ్మణం లో కేశి శబ్దం కేశి దాల్భ్య వంశీకులుగా చెప్పింది .కాని కథక సంహిత మాత్రం ఒక్కడే కేశిగా పేర్కొని సోమయాగం లో శత్రువులను ‘’ఆషాఢ కైశి ‘’సాయంతో ఓడించినట్లు ఉంది .ఇందులో కేశి బృందం అంటే పాంచాల కేశి బృందం ఓడిపోయింది .వీరు నైరుతిభాగపు కౌంతేయులవలనఓడారు .అప్పుడు యాగం చేసినవాడు’’ శ్యాపర్ణ సాయకాయనుడు’’ తతః కౌన్తేయః పంచాలన్ అభిత్య జిన౦తి’’.కనుక ఎక్కడైనా కేశిదాల్భ్యుడనే పా౦చాలీయుడే ప్రముఖంగా కనిపిస్తాడు .

  ఋగ్వేదం 10.136 మంత్రం  దీర్ఘ కేశి ఐన కేశికి అంకితం .భగవత్ ప్రేరణపొందిన మునీశ్వరులు  గాలిలో ఎగురుతున్నట్లు చెప్పబడింది 10.136-2-‘’మునయోహ్వాతరాశానాః వాత శ్యాను ద్రాజీం యంతి’’.ఋగ్వేదం 10.136-6లో కేశి ప్రజల మానసిక విషయాలు తెలుసుకోవటానికి అప్సరస, గ౦ధర్వ మార్గం లో సంచరి౦చాడని,ఉన్నది –‘’అప్సరసాం గంధర్వానాం మార్గానం  చారణేచరన్ –కేశి కేతస్య విద్వాన్ ‘’.ఋగ్వేదం లో కూడా కేశి కి ఆకాశ చారణం ఉన్నట్లు చెప్పబడింది .మానవ జ్ఞానం కంటే విశేష విజ్ఞానం ఉన్నవాడు .అప్సరస గంధర్వుల యాగ రహస్యాలు గ్రహించి తనకు తెలిసినవి వారికి చెప్పాడు .వీరితోనేకాక  వన్య మృగాలతో నూ దోస్తీ ఉండేది .మరికొన్ని ఋగ్వేద విషయాలు మళ్ళీ తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41

   రావణ కింకరులను హతమార్చిన హనుమ ఇకపై ‘’కిం కర్తవ్యమ్ ‘’అని ఆలోచించి ‘’అశోకాన్ని విరచి శోక వనం చేశాను .ఇక చైత్య ప్రాసాదాల పనిపట్టి నేలమట్టం చేయాలి ‘’అనిమేరుపర్వత శిఖరాయమాన చైత్య ప్రాసాదం ఎక్కి మారుతి మరోమార్తా౦డుడిలాగా ,పారియాత్రం అనే కులపర్వత౦ లాగా భాసి౦చాడు .లంక అంతా వినిపించేట్లు పెద్దపెద్ద  శబ్దాలు  చేసి ఒడలు చరచుకొన్నాడు .ఆ ధ్వనికి కర్ణ భేరులు బ్రద్దలై పక్షులు పారిపోయాయి కావలివారికి స్పృహ తప్పింది .మళ్ళీ రికార్డ్ పెట్టాడు –

‘’రాజాజయతి సుగ్రీవో  రాఘవేణాభి పాలితః –దాసోహం కోసలేన్ద్రస్య రామ స్యాక్లిస్ట కర్మణః ‘’

సునాయాస కార్యసాధకుడు రాముడికి దాసుడిని వాయుపుత్రుడను హనుమంతుడను శత్రు సైన్య వినాశ కారణుడను.వేలాది రాళ్ళతో వృక్షాలతో నేనుకొడితే వెయ్యిమంది రావణులైనా నాకు యుద్ధం లో సాటికారు

‘’న రావణ సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్ –శిలాభిస్తుప్రహరతః పాదపైశ్చ సహస్రశః ‘’

లంక నాశనం చేసి ,సీతకు మొక్కి ,రాక్షసులు చూస్తుండగానే సఫలతతో తిరిగి వెడతాను ‘’అని బిగ్గరగా అరచి అందరికి గుండె దడపుట్టించి భయభ్రాంతులను చేశాడు .ఇది విన్న చైత్య రక్షకులైన వందమంది వివిధ ఆయుధాలతో హనుమపై దూకారు .హనుమ భీకరంగా మారి నూరుబంగారు  అంచులున్న ఆమహా ప్రసాదస్తంభాన్ని వేగంగా పీకి పారేసి దాన్ని గిరగిరా తిప్పగా అందులో అగ్నిపుట్టి అదంతా తగలబడిపోయింది .హనుమ అదే వేగంతో వందమంది రాక్షకులను పరిమార్చాడు .’’సుగ్రీవాజ్ఞ పాలించే మహా బలవంతులైన వానర ప్రముఖులు నా వంటి వారు వేలాది మంది భూమండలమంతాతిరుగుతున్నారు .మేమంతా సుగ్రీవాజ్ఞాను వర్తులమే .అందులో కొందరు 10ఏనుగులబలం , మరికొందరు వంద ఏనుగుల బల౦ ,కొందరు ఒఘమ్ అనే సంఖ్య ఉన్న ఏనుగుల బలమున్నవారు కోట్లాది వానర భల్లూక సైన్యంతో మారాజు సుగ్రీవుడువచ్చి మిమ్మల్ని మట్టి కరిపిస్తాడు .ఇక్ష్వాకురాజు రాముడి తో వైరం తో ఉన్న కారణంగానే మీరూ మీలంకా,మీరాజు  రావణుడు ఇక హుళక్కే అని భావించండి ‘’అని అరచి జబ్బలు చర్చి చెప్పాడు మహా బలహనుమ .

‘’మాదృశానాం సహస్రాణి విసృస్టానిమహాత్మనాం –అటంన్తి వసుధాం కృత్ష్నాం వయమన్యేచ వానరాః’’

‘’దశనాగ బలాః కేచిత్కేచి ద్దశ గుణోత్తరాః-కేచిన్నాగ సహస్రస్య బభూవు స్తుల్య విక్రమాః’’

‘’సంతిబౌఘబలాః కేచి త్కేచి ద్వాయు బలోపమాః-అప్రమేయ బలా శ్చాన్యే‘త్రాసన్హరి యూధపాః’’

‘’నేయమస్తి పురీ లంకా న యూయం న చ రావణః –యస్మా దిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మనా ‘’

ఇది 25శ్లోకాల 43 వ సర్గ

ఇప్పటికి వందమందిరాక్షస  కింకరులు,వందమంది చైత్య రక్షకులు హనుమ చేతిలో హతమయ్యారు .ఈ కౌంట్ క్రమంగా కరోనా మరణాల సంఖ్యలా పెరుగుతుంది తర్వాత తర్వాత .ఇక్కడ హనుమ ఏమి సాధించాడు ?చెట్లు చేమలు విరిస్తే కోతి చేస్టలుగా మిగిలిపోతుంది కనక మహా బలవంతుడు చేయాల్సిన పని చేయాలని చైత్య ప్రసాద విధ్వంసంతో అది సరిపోతు౦దనుకొని అదీ చేసి ఎదురొచ్చిన రాక్షకులను అందర్నీ చంపేశాడు .తానెవరో ,తన నాయకుడు ఎవరో ,వానర బలం ఎంతటిదో అరచి అరచి మరీ అందరికి లౌడ్ స్పీకర్ ప్రకటన లాగా చెప్పాడు .ఈ వార్తలన్నీ రాక్షసరాజుకు చేరాలనేదే ఉద్దేశ్యం .ఇంతటి వినాశనానికి కారణం కేవలం రాక్షసులు రాక్షరాజు రావణుడు మహా పరాక్రమశాలి ఇక్ష్వాకు వంశకులదీపం శ్రీరాముడితో వైరం పెట్టుకోవటమే అని దాని ఫలితం అందరి వినాశనమే ననీ తెగేసి అరచి చెప్పాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం

107-చైనీస్ సాహిత్యం -2

2-కన్ఫ్యూషియస్ యుగం –క్రీ.పూ.202-క్రీ.శ .220-మిహ్ వాంగ్ టీ కాలం లో తొక్కి పడేసిన కన్ఫ్యూషియస్  రచనలను హాన్ వంశీకులు బాగా పునరుద్ధరించి నందుకు దీనికి కన్ఫ్యూషియస్ యుగం అని పేరు వచ్చింది .కొత్త రచనలుకూడా ఎక్కువగా వచ్చాయి .ఐతిహాసిక రచనలు ఎక్కువ .స్యూమా చిన్ రాసిన ‘’పీ –ఛీ ‘’అంటే ఇతిహాస రచన ముఖ్యమైనది .మొదటి నుంచి తనకాలం వరకు ఉన్న చైనాచరిత్రను 120అధ్యాయాలలో రాశాడు .దీన్ని పరమ ప్రామాణిక రచనగా గుర్తించారు .ఈయన తర్వాత 200ఏళ్ళకు పుట్టిన ‘’పాన్ ప్యావ్ ‘’అక్కడి నుంచి మొదలు పెట్టి తనకాలం వరకు రాయటం ప్రారంభించి అకాల మృత్యువు పొందటం తో మధ్యలో ఆగిపోయింది .అతడి సోదరి మేడం చావ్ సోదరుడిపేరనే రాసి పూర్తి చేసి౦ది .తర్వాత   శిన్ షూ  -కొత్త రచనలు పేరుతో రాజనీతి గ్రంథం,చ్యాయి ‘’హ్వాయ్ నాన్ జూ’’పేరిటతావో మతవివరణ గ్రంథం ల్యూ అన్,కన్ఫ్యూషియస్ వాదాన్నీ ,టావో మతం తో సమన్వయ పరుస్తూ చూన్ చ్యూ ఫాన్ లూ అనే గ్రంథంవచ్చాయి . తుంగ్ చుంగ్ షూ కాల్పనిక వాదం తో మంచి శైలిలో పద్యకావ్యాలు రాశాడు .స్యూమా శియంగ్ జూఇతని సమకాలికుడు .మెయ్ షెన్  రాజకుమారుల భోగలాలస జీవితాన్ని వర్ణిస్తూ కావ్యం రాశాడు .హాన్ రాజుల కాలం లోనే క్రీ.శ.120లో’’ ష్వోవెన్.’’ అనే వ్యుత్పత్తి వివరణ శబ్దార్ధ నిఘంటువు వచ్చింది .

3-బౌద్ధ టావో మతప్రభావ యుగం –క్రీశ .220-590-.220లో హాన్ సామ్రాజ్యం మూడు ముక్కలై ,265లో ఈ మూడిటినీ జయించి చీన్ వంశీయులు జయించి సామ్రాజ్యం ఏర్పాటు చేశారు .దేశం లో శాంతి భద్రతలు ఏర్పరచటంలో విఫలం చెంది 420 లో అంతరించింది .తర్వాత 590వరకు అయిదు రాజవంశాలు కొంత ప్రదేశాన్ని పాలించాయి .కొంతప్రాంతం టపా అనే టర్కీ రాజవంశ పాలనలో ,ఉండటం ఎక్కడా స్థిర ప్రభుత్వాలు లేకపోవటం వలన దేశం అల్లకల్లోలమై అంధకారం అలముకొన్నది .అప్పుడే బౌద్ధ ,టావో మతాలు ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని ప్రసారం చేసి మనసులకు కొంత ఊరట కలిగించాయి .కుమార జీవ అనే భారతీయ బౌద్ధపండితుడు ,చిహ్ శీన్ మొదలైన చైనా పండితులు సంస్కృతం లో ఉన్న బౌద్ధగ్రంథాలను చైనీస్ భాషలోని అనువాదం చేశారు .టావ్ మతగ్రంధం’’టావ్ టే చింగ్ ‘’కు అనేక వ్యాఖ్యానాలు రాశారు .ప్రకృతి పై అనేకరకాల కవిత్వాలు అనేకకవులు రాశారు  .వీరిలో టాన్ చైన్ ముఖ్యుడు .వృక్ష పుష్ప పక్షి పర్వతాదులలో జీవిత రహస్యాలను ఆవిష్కరించి న భావకుడాయన. వృక్ష ,భూ విజ్ఞాన శాస్త్ర రచనలూ వచ్చాయి .ఈ యుగం చివరలో వెన్ శ్వాన్ఒక ప్రసిద్ధ సంకలన గ్రంథం ప్రచురించాడులియాంగ్ రాజవంశానికి చెందిన శ్యావో టుంగ్-500-531.4వ శతాబ్ది వరకు ఉన్న ఉత్తమ రచనలన్నీ ఇందులో చేర్చాడు .దీన్ని కావ్య ,లేఖ ,వ్యాస మొదలైనవాటిగా వర్గీకరించాడు .

4-కావ్యోల్లసన యుగం –క్రీ.శ.590-960-దేశం లోని కల్లోలాన్ని నివారించి ‘’సూయీ ‘’వంశీయులు 590లో ఏక ఛత్రాధిపత్య పాలన జరిపారు .618లో ఈరాజవంశాన్ని కూల్చి  టాంగ్ వంశీయులు పాలన సాగించారు .చక్రవర్తి టాయ్ చుంగ్-627-694లలితకళలను పోషించి ఆదరించాడు .మూడుమతాలను సమానంగ రాజపోషణ కలిగించాడు .అతని తరవాత వాళ్ళుకూడా అలాగే పాలన చేశారు .ఈకాలం లోనే చైనీయ సంస్కృతి కొరియా ,జపాన్ మొదలైన దేశాలలో వ్యాపించింది .పద్యకావ్యాలకు ఎక్కువ ఆదరణ కలిగింది .గేయం బహుముఖ వ్యాప్తి చెందింది .కొత్తకొత్త వృత్తాలు  సృష్టించికవిత్వాలు రాశారు .ఇవన్నీ తర్వాతకాలం లో ఒక  సంకలన గ్రంథంగా వచ్చింది .ఈయుగం లో దాదాపు 2200మందికవులు ,48,000 కావ్యాలు రాశారు .వీరిలో వాంగ్ వై,లీపో,పోచూయి , తూపూ ముఖ్యులు .వచనరచనా కొంత వచ్చింది దీనికి కొత్తశైలి నిర్మాత హాన్ హ్యూ  .ఈ శైలిని అనుసరించి రాసినవాడు –హూచింగ్ య్వాన్ ,.గణిత ఖగోళ శాస్త్ర గ్రంధ రచనా సాగింది .

5-సారస్వత సంపన్నతా యుగం –క్రీ.శ .960-1280-టాంగ్ వంశం 906లో టప్పు మన్నది .కొంతకాలం అస్థిరత రాజ్యమేలింది .960లో శుంగ్ వంశం సామ్రాజ్యాదిపత్యం తీసుకొని 13వశతాబ్దం వరకు అవిచ్చిన్నంగా పాలించింది .ఈ యుగ ముఖ్యకవులలో చూశి ,ఔయంగ్ శ్యూ,స్యూమాశ్వాంగ్ ,సూషీ ,లూయౌ ,లీ యిఅన్..చూశి కన్ఫ్యూ షియస్ వాదానికి కొత్త అర్ధాన్ని ,వ్యాఖ్యానంతో రాశాడు .కవి రాజకీయ వేత్త వ్యాస రచయితా కూడా .టాంగ్ వంశ రాజచారిత్ర తోపాటు ,అనేక పద్యకావ్యాలు వ్యాసాలూ రాశాడు .టాంగ్ వంశ  పతనం  వరకు చైనా చరిత్ర ను ఆకర్షణీయశైలిలో రాసినవాడు సూ మా క్వాంగ్ .సూషి కవి కవితా శిల్ప నిపుణుడు ,లేఖగాగ్రణి ,గేయ వ్యాస రచయిత.12వ శతాబ్ది అగ్రేసర కవి-లూయౌ .కవిత్వంలో దేశభక్తి రంగరి౦ చాడు.అగ్ర శ్రేణి కవయిత్రి –లీయీ అన్ .చాలా గ్రంథాలురాసినా కొన్నే లభించాయి.

6-నవలా-నాటక ( రూపక )యుగం -1280-1368-సాహిత్య పోషణ చేసిన సుంగ్ వంశం మంగోలుల ధాటికి ఆగలేకపోయింది 1277లో మంగోల్ నాయకుడు కుబ్లాయ్ ఖాన్ చైనా గద్దె ఎక్కాడు .చైనీయ సంస్కృతిని పోషించాడు .కాని అగ్రశ్రేణికవులు ఈ విదేశీయుని సేవి౦చ టానికి మనసొప్పక  మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి వాస్తవితకు దూరంగా కల్పనా కథా రచన చేశారు .అవి ఈనాటినవలలను పోలి ఉన్నందున నవల అనే అన్నారు .మూడురాజ్యాల ముచ్చట అనే –సాన్ క్వోచి ,మానవులంతా సోదరులు అనే –ష్విహూ చ్వాన్అనే నవలలు ఉత్తమోత్తమాలుగా భావిస్తారు .సామాన్య భాషలో అందరికీ అర్ధమయ్యేట్లు రాయబడ్డాయి .కథా బిగి౦పు లేకపోయినా శైలి ఆకర్షణీయం .నీతి బొధనే ఈనవలల ముఖ్యోద్దేశ్యం .రచయితలగురించి మాత్రం తెలియదు.

  మంగోలు రాజులు నాటకకళాపోషకులు .కనుక రూపక రచన ప్రోత్సహించారు చైనీ భాషలో .రాజపోషణ ఉన్నందున అనేకులు చాలానాటకాలు రాశారు .అందులో 100ప్రామాణిక నాటకాలున్నాయి .ఇవే తర్వాతకాలం లో ఐరోపాభాషలలోకి అనువాదం చెందాయి .ఉత్తమ నాటకాలలో ‘’శిశ్యాంగ్ చీ’’ అంటే పడమటింట ముచ్చట ముఖ్యమైనది. విద్యావంతయువకుడు ఒక అంద గత్తేతో జరిపిన ప్రణయ వ్యవహారమే ఇది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -5

బక దాల్భ్యుడు -5

జైమినేయ ఉపనిషత్ బ్రాహ్మణం 3.29-31ప్రకారం కేశి దాల్భ్యునికి తనమేనమామ ‘’ఉచ్చ్శ్రైస్వవస కౌపాయేయ ‘’మరణం తర్వాత కస్టాలు మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లుడి విచారం పోగొట్టి అదృశ్య మంత్ర శక్తిని బోధించి  దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సోమయాగం చేసి మంచి ఉద్గాతను ఎంచుకోమన్నాడు .అలాగే 12రోజుల యాగం మొదలుపెట్టి ‘’వ్యూధ ఛందస్’’మంత్రాలు ఉచ్చరించటానికి తగిన వాడికోసం తిరిగి స్మశానం లో పడిఉన్న ‘’ప్రాత్రదభాల్ల ‘’  ను చూశాడు –‘’స్మశానే వా వనే వావృతి శయనం ఉపాధవయాం చకార .’’అతడు అదృశ్యమంత్రోచ్చారణ నిర్దుష్టంగా చేయగలడని అతడినే తనయాగానికి ఉద్గాతగా ఎంచుకొన్నాడు కేశి దాల్భ్యుడు .ఈ కొత్తవాడిని కురుపాన్చాల బ్రాహ్మణులు అంగీకరించక ‘’కస్మా ఆయం ఆలం ‘’అంటే ఎవరి మంచికోసం అని ప్రశ్నించారు .కేశి అతడినే ఎంచుకొని ‘’తగినట్లు మంత్రోచ్చారణ చేయగలవాడు ‘’అనే అర్ధం వచ్చేట్లు ‘’ఆలమ్యైలా జ్యోద్గాత ‘’అని పేరుపెట్టాడు .ఆలం మహ్యం – అలమ్మ అయింది –ఆలం ను వై మహ్యం ఇతి తద్ అలమ్మస్యాల మత్వం ‘’.

  ఈ కొత్త వాడిని కురుపాన్చాల బ్రాహ్మణులు ఒప్పుకోలేదు .కనుక ఇప్పుడు కర్మకాండ నిష్ణాతులమధ్య పోటీ యే కానిఇక్కడ యజమానులమధ్యకాదు అని తెలుస్తోంది .ఈకథలలో ముఖ్య విషయం అలాంటి నిష్ణాతుడు స్మశానం ,సుదూర సముద్ర దీవి లలో సోమ రధం ప్రక్కన ఉన్న గొడ్డలి దగ్గర కనపడటం సామాన్య విషయం . వీళ్ళు  అచేతన స్థితిలో కనపడటం కూడా గుర్తించదగిన విషయం .బకుడు కళ్ళు మూసుకొని ధ్యానం లో ఉంటె ప్రత్రాడ ,అలమ్మలు నేలపై పడి ఉన్నారు .

  కేశి దాల్భ్యుని వృత్తాంతం బంగారు పక్షి కథలో కూడా వస్తుంది .కౌశీతకి బ్రాహ్మణం 7.4జైమిని బ్రాహ్మణం 2.53-54,వాధూలస 37లో కూడా ఉన్నది .కౌశికతమ్ లో ‘’హిరణ్మయ శకునం ‘’అంటే బంగారుపక్షి ఎగురుకొంటూ కేశి దాల్భ్యుని దగ్గరకు వచ్చి తనకు పవిత్రీకరించుకోవటం ఎలాగో తెలియదు అని చెప్పింది –‘’అదీక్షితో వా అసి ‘’.తనకు ఆ రహస్యం తెలుసుకాని ఆహూతులను పాడైపోకుండా ఉంచటం ఎలాగో తెలీదన్నది .అప్పుడు ఇద్దరూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞానం మరొకరికి తెలుపుకొన్నారు .ఈ రహస్యాన్ని తాను  శిఖండియజ్ఞాసేన రుషి నుంచి గ్రహించానని స్వర్ణపక్షి చెప్పింది .కౌశిక బ్రాహ్మణం 7.4.1.దీక్షలోఉన్న  సాంకేతికత ,తర్వాత ఇచ్చిన ఆహూతులు  పాడుకాకుండా కాపాడుకోవటం చెప్పింది -‘’సక్రదిస్టస్యా క్షితిః’’.జైమినేయం లో ‘’ఇస్టాపూర్తస్యాక్షితిం’’అని ఉన్నది.

 ఇదే కథవేరొక చోట మరో రక౦గా ఉంది .జే.బీ .2.53లో కేశి దాల్భ్యుడికి ప్రతిష్ట జ్ఞానం తెలీక దర్బలు ,ఆకులు మధ్య కూర్చుని దీక్ష చేశాడు –‘’కేశిహా దాల్భ్యో దర్భ పర్ణ  యోర్ దిదీక్షే’.అప్పుడు పక్షి వచ్చి తాను పూర్వ పా౦చాలరాజు  కేశికి ముందు ,ఇప్పటిరాజు సుత యజ్ఞసేన అని చెప్పింది –‘’అహం ఏతస్యై విషస్త్వత్పూర్వో రాజాసం ;.ఆపక్షి మొదలుపెడుతూనే కేశిని ‘’శూని ‘’అంటే వ్యభిచారి,తిరుగుబోతు గా సంబోధించగా మండి తాను పూర్వం పంచాలరాజు నని ,వయసులో పెద్దవాడినని ,దీక్షలో ఉన్నాననిచెప్పాడు తర్వాత విషయం అంతా ఇది వరకుకథల్లోలాగానే .

   వాధూలస 37లో సుత్వ యజ్ఞసేన  తాను పూర్వ శ్రంజ రాజు నని,దీక్ష విధానం తెలుసునని ,నాశనం కాకుండా ఉండే విధానం తెలియదని చెప్పి బంగారు పక్షిగా మారి ఆహూతులను తినటానికి కేశి దగ్గరకు వచ్చి పాన్చాలయువరాజా –‘’కేశి పాన్చాలరాజో యువతారా ‘’అని పిలిచి,ఇద్దరూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞానం మరొకరికి అందజేసుకొన్నారు .ఇప్పటిదాకా చెప్పుకొన్న కేశి దాల్భ్యుడు క్షత్రియరాజు అని అర్ధమౌతోంది .

   బకదాల్భ్యుడు మాత్రం- యాగ నిష్ణాతుడైన బ్రాహ్మణుడు .మరొక చోట బకుని వ్యతిరేకులు అజకేశినుల బృందం .ఇక్కడ జరిగిన క్విజ్ లో బకలేక గాలవ గ్లావ్యమైత్రేయ ఓడిపోతాడు .వేదకాలం తర్వాత బక,కేశి లపేర్లు రాక్షసుల లో కనిపిస్తాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40

‘’అల్పకార్య మిదం శేషం ‘’అని గురువుగారు హనుమ అన్నమాట లోకంలో ఒక నానుడిగా కూడా ఉన్నది –ఐనను పోయిరావలయు అస్తినకు ‘’అన్నట్లుగా .అల్పకార్యం అని చెప్పినా బృహత్ కార్యంతో అశోక వనధ్వంశం చేసి మొదటి సారి రాక్షసరాజుపై చావు దెబ్బకొట్టాడు .అక్కడి నుంచి ఇక ఏది చేసినా ప్రణాళికా బద్ధంగా నే చేసి రావణుడి క్రోధానికి కారకుడై ,లంకకే  చేటుతెచ్చే పను పనులుతన వీర శౌర్య పరాక్రమ  బుద్ధి బలాలతో చేశాడు .ఒక్కో పనితో ఒక్కో చావు దెబ్బ కొట్టాడు చచ్చిన వాళ్ళకే కాక వాళ్ళను  పంపిన ఆయనకు కూడా .ఆ వైభోగం దర్శిద్దాం .

పక్షుల,మృగాల  చెల్లాచెదరైన వాళ్ళ భయ ఆర్తనాదాలు విరిగి విరుగుతున్న చెట్ల ధ్వని  విని చూసి రాక్షస స్త్రీలు నిద్ర లేచి అశోకవనం లో హనుమను చూశారు .ఇప్పటిదాకా సీతఃకు ఒక్కదానికి మాత్రమె కనిపించాడు .ఇప్పుడు అందరికి కనిపించి సత్తా చూపుతున్నాడు .వాళ్ళను చూడంగానే గురుడు రెచ్చిపోయి వాళ్ళను భయ పెట్టేట్లు పెద్ద రూపం పొందాడు  .పర్వత సన్నిభ హనుమ ఆకారం చూసి వాళ్ళు సీతను ‘’ఎవడు వాడు ఎక్కడి నుంచి  ఎందుకు వచ్చాడు ?నీతో ఏం మాట్లాడాడు ?భయం లేకుండా చెప్పు ?’’అని ప్రశ్నించారు

‘’కోయం కన్య కుతోవాయం కిన్నిమిత్త మిహాగాతః  -కథం త్వయాసహానేన సంవాదః కృత ఇత్యుత ?’’

‘’ఆచక్ష్వనో విశాలాక్షీమా భూత్తే సుభగే  భయం –సంవాద మసితా పా౦గే త్వయా కిం కృత వానయం ?’’

  రక్కస వనితల ‘’టోన్’’మారింది మర్యాదగా సీతను విశాలాక్షీ ,అసితాపాంగే,కన్యా అనే విశిష్ట విశేషణాలతో సంబోధించారు .

  సీత ఏం చెప్పాలి ?ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో ?అని తెలిసి లౌక్యంగా నెపం వాళ్ళమీదే నెట్టి ‘’ఏమో !భయంకర రాక్షసులగురించి తెలుసుకొనే శక్తి నాకు ఎక్కడిది ?అతడు ఎవరో ఏమి చేయాలనుకున్నాడో మీరే తెలుసుకోండి పాముకాళ్ళు పాముకే తెలుస్తాయి ఇందులో అనుమానం లేదు .అతడిని చూసి నేను భయపడ్డాను .ఎవరో నాకు తెలీదు .కామరూపంతో వచ్చిన రాక్షసుడే అనుకొంటాను ‘’అన్నది .

‘’రాక్షసాంభీమ రూపాణాంవిజ్ఞాతే మమ కా గతిః-యూయమే వాభి జానీత యోయం యద్వాకరిష్యతి –అహి రేవ హ్యహేః పాదాన్విజానీతిన సంశయః ‘’

‘’అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం-వేద్మి రాక్షస మే వైనం కామరూపిణ మాగత౦ ‘’

ఇది పూర్తి అబద్ధమే అయినా అతికి నట్లు సరిపోయింది .ఆడవాళ్ళు అబద్దాలాడితే గోడకట్టినట్లు ఉంటుంది అనే లోకోక్తి ఇలాంటి వారివల్లే వచ్చి ఉంటుంది .అయినా అబద్ధానికి కొన్ని ఎక్సెంప్సన్షన్ లు  ఇచ్చారు మనపూర్వులు –ప్రాణ విత్త మాన భంగమందు బొంక వచ్చు నదిప ‘’మూడుకు ఇస్తే ఇంకెన్నైనా చేర్చవచ్చు కదా.ఇప్పుడు ఒక మహా కార్యం జరగాలి .అది తనమాన ప్రాణాలకు సంబంధించినది .ఇప్పుడే రట్టు చేస్తే రామకార్య భంగమవుతుంది ,దానివలన రాక్షసుల రాక్షసత్వం పెంపు ,మానవుల మానవత్వం కుదింపు జరిగి ధర్మానికే నష్టం కలుగు తుంది .కనుక సీత మాట్లాడిన తీరు సర్వతో భద్రమైనది .కనుక గుణ దోష చర్చ అప్రస్తుతం .

  సీత మాటలకు భయపడిన రాక్షసా౦గనలు  కొందరు అక్కడే ఉండి ,కొందరు భయంతో పరుగెత్తి కొందరు రాజుకు నివేదించటానికి వెళ్ళారు .వీళ్ళు రావణుడితో ‘’రాజా !అశోక వనం లో భయంకర శరీరం తో అంతులేని పరాక్రమ తో ఉన్న వానరుడు ఒకడు సీతతో మాట్లాడాడు .ఆమెను మేము అడిగితె వాడి గురించి తెలియ జేయటానికి ఇష్టపడలేదు . వాడు ఇంద్రలేక కుబేర   దూతకాని  లేక సీతాన్వేషణకు రాముడు పంపిన దూత కాని కావచ్చు .సీత కూర్చున్న చోటు కాక మన  ప్రమదావనం సర్వం నాశనం చేశాడు .సీతను కాపాడటానికి అలా చేశాడా లేక అలసటతో ఇక చేయలేక పోయాడో  తెలీదు .అయినా వాడికి శ్రమ ఏమిటి ?ఆమెను కాపాడటానికే అలా చేశాడు .సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని ఏమీ చేయలేదు.కనుక వాడి కి తీవ్ర దండన విధించు .ప్రాణాలపై ఆశలేనివాడుతప్ప సీతతో ఎవడు మాట్లాడగలడు?’’అన్నారు .తీవ్రకోపం పొంది తనతో సమాన బలం ఉన్న రాక్షస కింకరులను  హనుమంతుని పట్టుకోమని ఆనతిచ్చి  పంపాడు .

  80వేల మంది ఆ రాక్షస కింకరులు  భయంకర ఆకారాలతో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో హనుమపైకి అగ్నిలో దూకిన మిడతల్లాగా వచ్చి పడ్డారు . ఈఉపమాన౦  వలన వాళ్ళ చావు తప్పదు అని ముందే చెప్పాడు మహర్షి వాల్మీకి .హమ్మయ్య యుద్ధం చేసే అవసరం వచ్చింది అని సంబరంతో హనుమ శరీరం పెంచి కొండలాగా నిలబడి తోకను నేలమీద కొట్టి స్వేచ్చగా తోక కదిలి౦చగా ఆ భయంకర శబ్దానికి భయంతో పక్షులు ఎగిరిపోయాయి .అప్పుడు హనుమ –‘’జయత్యతి బలో  రామో లక్ష్మణశ్చ మహాబలః –దాసోహం కోసలేన్ద్రస్య రామ స్యాక్లిస్ట కర్మణః అని మొదలుపెట్టి పూర్వం లాగా 6శ్లోకాలు చదివాడు.చివరగా –

‘’సమృర్దార్దో  గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం-తస్య తన్నాద శబ్దేన తే భవన్ భయ శంకితాః’’’’అంటే సకల రాక్షస సమక్షం లో నేను ఈ లంకను పీడించి,సీతా దేవికి నమస్కరించి ,నాప్రయత్నాన్ని ఫలవంతం చేసుకొని పోతాను .అని గర్జించాడు .ఈ మహా గర్జనకు అక్కడికి యుద్ధానికి వచ్చిన కిమ్కర రాక్షసులు భయపడి హనుమ ఎత్తైన సంజమబ్బులాగా కనిపించాడు .అయినా ప్రభువు ఆజ్ఞప్రకారం హనుమతో వివిధ ఆయుధాలతో తలపడ్డారు .బయట ద్వారం వద్ద ఉన్న పెద్ద గద తీసుకొని హనుమ  ఆకాశం లోకి యెగిరి ,రాక్షసులని మోదాడు .ఆరాక్షస కింకరులు అందర్నీ నేలమట్టం చేసి మళ్ళీ బహిర్ద్వారం పై కూర్చున్నాడు .భయంతో కొందరు రాజు దగ్గరకువెళ్ళి చెప్పారు .అంతమంది చావు వార్త విని కొంచెం కంపించి  మహా బల పరాక్రమ వంతుడు ,అసాధ్యుడు  సహస్ర పుత్రుని  హనుమపైయుద్ధం చేయమని  ఆజ్ఞాపించాడు రావణుడు .  ఇది 43శ్లోకాల 42వ సర్గ

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్సాహిత్యం -1

చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి  వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ ,  ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి .. క్వాన్హ్వా కు ‘’మండారిన్ ‘’పేరు పాశ్చాత్యులు పెట్టారు .దీనినే 30కోట్లకు పైగా చైనీయులు మాట్లాడుతున్నారు .అయిదింట నాలుగు ప్రాంతాలభాష ఇదే .ఉత్తర ప్రాంత మాండలికం ‘’క్వోయూ ‘’అనే జాతీయభాష ను ఇప్పుడు చైనా అంతటా జాతీయ భాషగా వాడుతున్నారు .అడునికకాలం లోనూ దీనిలోనే రాస్తున్నారు .అంతకు ముందు ‘’వెన్ -లీ ‘’అనే భాష ప్రామాణిక భాషగా గుర్తింపు పొంది అందులోనే రచనలు చేసేవారు .

   చైనా భాషలో పొట్టి అచ్చులు ,వాటి దీర్ఘాలు కాకుండా ,మూడు అచ్చులు కలిగిన మిశ్రమ ధ్వనులున్నాయి మొత్తం మీద 21అచ్చులు ,23హల్లులు ఉన్నాయి డ,ద,బ,త,గ హల్లులు లేవు .హల్లుమీద స్ట్రెస్ ఎక్కువైతే అవి ప్రత్యేకాక్షరాలుగా భావిస్తారు భారతీయ ఒత్తు అక్షరాలలాగా ఉచ్చరించరు.

  ఇండో –యూరోపియన్ ,సెమెటిక్ ,ద్రావిడ మొదలైన భాషా కుటుంబాలకు ఉన్న వ్యాకరణం ఈ భాషకు లేనేలేదు .వాక్యంలో స్థానాన్ని బట్టి ఒకసారి ఒక భాషా భాగంగా మరో సారి ఇంకొకభాషాభాగంగా గుర్తిస్తారు.సంబంధ వాచక సర్వనామాలు లేవు .కాలాన్ని బట్టి క్రియలో మార్పులూ రావు .క్రియకు ముందు గతకాలం లేక గతదినం పదాన్ని కలిపి భూతకాలం గుర్తిస్తారు .మర్నాడు రాబోయే కాలం క్రియ ముందు పెట్టటం వలన భవిష్యత్కాలం గుర్తిస్తారు .

  చైనా లిపి ‘’చిత్ర లిపి వర్గం ‘’కు చెందింది .రోజు వారీ వ్యవహారాలలో ఉండే కొన్ని వస్తువులకు ,భావాలకు మౌలిక సంకేతాలు ఇచ్చారు .వీటిని కలిపి కొత్త పదాలకు గుర్తులు ఏర్పాటు చేస్తారు .దాదాపు 5వేల గుర్తులను గుర్తు ఉంచుకు౦టేనేకాని చైనాభాష కొరుకుడు పడదు .ఈ లిపి ధ్వన్యాత్మకం కాదు కాబట్టి ఉద్దేశించబడిన భావం విశాల చైనాలో ఏ మూల మాండలికం మాట్లాడే వాళ్ళకైనా అర్ధమౌతుంది .ఇల ఈ లిపి చైనా జాతి ఐక్యతను ఘనంగా కాపాడుతోంది .ఇంతకస్టమైనా చైనీయులు ఇష్టంగా నేర్వటం విశేషమే .ఈ లిపి కుడి వైపు నుంచి కిందికి రాయటం ప్రత్యేకత కూడా .

  చైనీయ సాహిత్యం –సజీవ ప్రపంచ భాషలలో అత్య౦త ప్రాచీన సాహిత్యం చైనీయ సాహిత్యానికి ఉన్నది .ఒక్కో యుగం లో వచ్చిన సాహిత్య ప్రక్రియలను బట్టి యుగ విభజన చేశారు .ఆదియుగం ,కన్ఫ్యూషియన్ యుగం ,బౌద్ధ టావో మతప్రభావ యుగం ,కావ్యోల్లాస యుగం ,సారస్వత సంపన్నతా యుగం, నవలారూపక యుగం ,ప్రామాణిక గ్రంథ యుగం ,ఆధునిక యుగం

1-       ఆదిమ యుగం –క్రీ.పూ .1523-క్రీశ 1027-కాలం లో చైనాపాలకులు షాంగ్ –ఇన్ వంశ రాజుల కాలం లో మొదటి సారిగా రెండు రచనలు –హిష్ చింగ్ –గీతాలు,షూచింగ్ –ఇతిహాస పత్రాలు లలో గేయాలు, నీతులు ఉన్నాయి. ఈ వంశం తర్వాత చౌ రాజవంశ౦ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసింది. సుస్థిర పాలనా అందించింది .ఈ కాల సాహిత్యం లో ఎక్కువ భాగం ‘ఇ-చింగ్ ‘’అనే మార్పులకూర్పు సంకలన గ్రంథంలో దొరుకుతుంది .క్రీపూ 771నుంచి రాజవంశప్రతిభతగ్గి  కొన ఊపిరితో కొట్టుకొంటూ క్రీపూ 3వ శాతాబ్దిదాకా దేకింది .ఈ క్షీణ యుగం లో దేశం అనేక సామంత రాజ్యాలుగా విభజింపబడింది .పేరుకు చౌ సామ్రాట్టులు ఉన్నా ,అధికారమంతా సామంత ప్రభువులదే .వీరు భోగలాలస ,ద్వేషాలతో ఉన్న్నాసాహిత్య వ్యాప్తికి తోడ్పడ్డారు .ఈయుగ తాత్విక గ్రంథ రచయితలుగా లావ్ జూ ,కన్ఫ్యూ షియస్,మోజూ ,మెంగ్ జూ ,షూన్ జూ లు ప్రసిద్ధులు .తాత్విక పితామహుడు అని పేరు పొందిన ‘’లావ్ జు ‘’రచించిన ‘’లావ్ జూ టావ్-టే చింగ్ ‘’గ్రంథంలో మంచి మార్గాలలో నడవటం దానివలన కలిగే మేళ్ళు చక్కగా వివరించాడు .ఇతనికంటే చిన్నవాడు కన్ ఫ్యూషి యస్ హేతువాదనలో ఉన్న గొప్పతనాన్ని మానవులకు నచ్చ చెప్పిన మహనీయుడు .ఈయన రాసిన –లూన్ యూ –ప్రవచనాలు ,టాశ్యూహ్-మహా విద్య ,చుంగ్ యుంగ్ –మధ్యే మార్గం లలో ఆయన ఉపదేశాలన్నీ దర్శించవచ్చు .మోజూ’’విశ్వ ప్రేమ ‘’బోధించాడు .మెంగ్ జూ కన్ఫ్యూ షియస్ మార్గం లో నడిచాడు .తనపేరుతో రాసిన ‘’మెంగ్ జూ’’గ్రంథం కన్ఫ్యూ షియస్ రచనలతోపాటు ప్రజాదరణ పొందటం విశేషం .ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ,నిర౦కుశ రాజులను  కూల ద్రోయటం ,ప్రజలకున్న సర్వహక్కులు గురించి ఇందులో వివరంగా రాశాడు .వీరికి భిన్నమైన వాడు –శూన్ జూ.తాత్విక కవి. తనపేరు మీదనే ఒక పుస్తకం రాసి వాస్తవికతకు ,నీతి తో జీవన విధానం మొదలైనవి పొందుపరచాడు .చక్కని శైలితో మహా ఆకర్షణీయంగా రాయటం ఇతడి నేర్పు .ఇంతటి ప్రతిభ లేకపోయినా ,షాంగ్ యాంగ్ ,హాన్ ఫై లు కూడా గుర్తింపదగిన వారే .రాజనీతి గురించి రాసిన వీరి పుస్తకాలు ప్రజలను ఆకర్షించాయి .వీరంతా క్రీపూ -500-200కాలం వారు .ఎల్లో రివర్ (పీతనది )ప్రాంతవాసులు .అప్పుడే యాంగ్ ఛీ నదీ ప్రాంతం మరొక సాహిత్య కేంద్రంగా వికశించింది .ఈ కేంద్రకవులలో –చూయ్వాన్ ,చాంగ్ చౌ లు ప్రసిద్ధులు .వీళ్ళు ‘’ఫూ ‘’అనే వృత్త గ్రంధి గద్యం లో రాశాడు పాడటానికి వీలుగా ఛందస్సు ఉండటం  దీనికి ఆకర్షణ .చూయ్వాన్ రాసిన ‘’లీ చావ్’’లో దుఖానుభూతి రమ్యంగా ఉంటుంది .చ్యాంగ్ చౌ ఆధ్యాత్మికస్వేచ్చా ప్రచారానికి ,చమత్కార హాస్యాలకు కవిత్వాన్ని బాగా ఉపయోగించాడు .

        క్రీ.పూ .200నాటికి సామంతరాజుల హవా తగ్గి చిన్ రాజ్య వంశీకుడు  ఒకడు  ఐక్యత సాధించి ఏకత్వ సామ్రాజ్యాన్నిస్థాపించాడు .’’షిహ్ హ్వాంగ్ టీ’’అంటే’’ ప్రథమ సార్వ భౌముడు ‘’అనే బిరుదు పొంది నా, సాహిత్యానికి ఆమడ దూరం .పైగా కన్ఫ్యూషియస్ మతవాదం పై ఒంటి కాలిమీద లేచేవాడు .ఆరచనలన్నీ ద్వంస౦ చేసిన త్రాస్డుడు..వీడుచాచ్చాక అరాజకమేర్పడి ‘’ల్యూపాంగ్ ‘’అనే సామాన్య పౌరుడు తిరుగుబాటు చేసి ,శాంతినెలకొల్పి చివరికి తానే చక్రవర్తి అయ్యాడు .ఈ వంశమే ‘’ హ్యాన్ వంశం’’ .క్రీపూ 200నుంచి దాదాపు నాలుగు శతాబ్దాలకాలం రాజ్యమేలింది .వీరికాలం లో మళ్ళీ చైనీస్ సాహిత్యం వికసి౦చింద.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం

పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్  .సేఫెస్ట్ దేశం .సంపన్న దేశం .డ్రగ్స్ నిషేధం .ఆయిల్ బావులే ఆదాయ వనరులు .

  మొదటినుంచి సాహిత్యం అంతా అరబిక్ భాషలో ఉన్నది .సౌదీ అరేబియా సాహిత్యమే ఇక్కడకూడా వర్తిస్తుంది .ఆధునిక సాహిత్యం గురించి బార్బరా మిఖలాక్ పికుల్స్కా అనే అరెబిక్ డిపార్ట్ మెంట్ హెడ్ ‘’మోడరన్ లిటరేచర్ ఆఫ్ దియునైటెడ్ ఎమిరేట్స్’’పుస్తకం రాసింది .ఆదేశ సంస్కృతీ భాష వివరాలపైనా కథానికలపైనా ,సమకాలీన కథాసాహిత్యం పైనా ,ఆధునిక ప్రోజ్ పోయెట్రిపైనా   ,అధారిటి ప్రైవసీ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ఇస్లాం ,1967నుంచి వచ్చిన ఆధునికసాహిత్యం అన్నిటిని సుదీర్ఘంగా వివరించింది .ఇది చదివితే ఆదేశ సాహిత్యం అంతా తెలిసినట్లే .

  ఆడెల్ ఖోజాం –కవి జర్నలిస్ట్ .14కవితా సంపుటులురాశాడు .బుద్ధునిజీవితంకూడా రాశాడు .ఖలీద్ అబ్డునూర్ –కబాటి కవిత్వ స్పెషలిస్ట్ .నౌరా అల్ నామాన్ –సైన్స్ ఫిక్షన్ రచయిత.అజ్వాన్ మందాన్ మొదలైన నవలలు బాలకతలుగా –కాటన్ దికిట్టేన్  ,కివి దిహెడ్జ్ హాగ్ వగైరా.సల్హా ఓబేద్ –అల్జిమీర్స్ అనే కథా సంపుటి రాసి యంగ్ ఎమిరేట్స్ ప్రైజ్ పొందింది పోస్ట్  మాన్ ఆఫ్ హాపినెస్ ,ఇ౦ప్లిసిటి ,వైట్ లాక్ హెయిర్ మొదలైన సంపుటులు రాసింది .మాల్తా హాల్ ఖయాత్ –బాలసాహిత్య రచయిత్రి .17పుస్తకాలురాసి ‘’మై ఓన్ స్పెషల్ వే’’కు అవార్డ్ పొందింది .పేరెంట్స్ నవాఫ్ అల్ జవాఫ్ రాసింది .నాడియా అల్ నజ్జర్ –ఫాక్ట్ ఫిక్షన్ కలిపి నవలలు రాసింది.మదీన్ అల్ లాఫా కు ఎమిరేట్స్ నవల అవార్డ్ వచ్చింది .నౌరా అల్ ఖూరి –ఖర్జూర చరిత్ర ,ఆల్ యాది ఆల్ బయాదా –దివైట్ హాండ్స్ -2016నవలలో ఇమ్మిగ్రంట్స్ పై చూపాల్సిన మానవత్వాన్ని గురించి రాసింది ,

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -4

బక దాల్భ్యుడు -4

పై పేర్లలో కేశి సత్యకామి పేరు కేశి దాల్భ్య విషయంలో చాలా సార్లు వస్తుంది .కథక సంహిత -30.2ప్రకారం ద్వాదశాహం ,గురించి అందులోని ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు .లుసాకపి ఖార్గలి ఏవిధంగా కేశి ‘’వంశ వ్రశ్చన’’పాంచాలుర ను మూడు రెట్లు పెంపు చేసింది వివరించాడు.పంచ వింశ బ్రాహ్మణం -17.4లో కూడా లుసాకపి పేరు వ్రాత్యఖండం లో వస్తుంది.ఇందులో అతడు జ్యేష్ట వ్రాత్య నిపుణ బృందాన్ని శపించినట్లున్నది .  కేశి సత్యకామి పేరు కేశిదాల్భ్య విషయంలో తరచుగా వస్తుంది .తైత్తిరీయసంహిత 2.6.2.3ప్రకారం కేశి దాల్భ్యుని యాగానికి సత్యకామి ముఖ్య నిర్వాహకుడు .ఇతడు కేశి దాల్భ్యుని వ్యతిరేకులను జయించటానికి 7పాదాల ప్రత్యేక ‘’శక్వారి ‘’మంత్రాలు చదువుతానని వాగ్దానం చేశాడు .మైత్రేయ సంహిత -1.6.5.ప్రకారం అగ్ని హోత్రం, అగ్జ్న్యా ధ్యేయం విషయం లో మళ్ళీ ఈ ఇద్దరూ  కనిపిస్తారు.కాని వారిపాత్రలు నిర్దుష్టంగా లేవు.కాని సత్యకామి ,కేశి తో తామిద్దరూ కలిసి ఒకప్పుడు అగ్ని హోత్రుని భోజన శక్తిని అగ్న్యా ధ్యేయం ద్వారా తగ్గించిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు .

   ఈ ఇద్దరితో పాటు ఆశ్వత్తి పేరుకూడా వస్తుంది .జైమిని బ్రాహ్మణం -1.285 ఆశ్చర్యంగా ఇద్దరు కేశి ల పాత్రలు మారుతాయి .కేశి ,ఆహీనస్ ఆశ్వత్తిలు క్షత్రియ సత్యకామతో పోటీపడతారు .వీరిలో కేశి చిన్నవాడు ,ఆశ్వత్తి పెద్దవాడు .ఇద్దరూ బ్రాహ్మణులే .ఆహీనసుడు సత్యకామికి  పురోహితుడు .అయినా అనుష్టుప్ ఛందస్సులో తనకున్న పరిజ్ఞానం బట్టి కేశి దాల్భ్యుడు క్షత్రియ హృదయం ఆకర్షించి ఆహీనసుడి నుండి లాగేసుకొన్నాడు .పాత్రలు మారినా కేశి చిన్నవాడైనా మొదట్లో విజయం సాధించాడు -3.312.కర్మకాండ పరిజ్ఞానమే విజయ నిర్ణయం కనుక కేశి దాల్భ్యుడు విజేత అయ్యాడు .

 బృహత్ సార సంహిత 18.26లో పాంచాలుర యాగానికి కురు బ్రాహ్మణ కుమారులు వ్రాత్య దాడి గా వెళ్ళారు .పెద్దలకు అగ్నిస్టోమం ,చిన్నవారికి ‘’ఉఖ్త్యా ‘’చెప్పబడినాయి .కథ ప్రారంభానికి ముందు దేవతలు, దేవ వ్రాత్యులు రెండు యాగాలకు పేర్కొనబడ్డారు. కురు బృందం తమ స్తపతి ‘’ఔపోదితి గౌపాలాయన ‘వైయాఘ్ర పద్య కేశి దాల్భ్యుని ఉపవసత అగ్ని వద్దకు ఎలా వచ్చాడో భూ వ్రాత్యుడు  వివరించాడు .మర్నాడు వారు పాంచాలురు అప్పటికే చేస్తున్న  యాగం లో  జోక్యం కలిగించుకొని ‘’బహిస్పవమాన ‘’తో పవిత్రులమౌదామనుకొన్నారు .చివరికి వ్రాత్య చెప్పిన దానికి ఆధార విషయం చెప్పలేక కురు బృందం ఓడిపోయింది .ఈ ప్రశ్న సంధించిన వాడు పా౦చాల బ్రాహ్మణ కుమారుడు .దీనితో ఈ యాగ నిష్ణాతుడు’’ గంధర్వాయన వాలేయ అగ్ని వేస్య’’ కురు బృందాన్ని శపించి ,వారి దండయాత్రకు అనుమతించిన పెద్దలను హెచ్చరించాడు .వీళ్ళు ఊరుకొంటారా వీళ్ళూ గంధర్వాయన ను శపించారు .ఈ వృత్తాంతం  లో కేశి పాత్ర ముఖ్యమైనదికాదు.కాని వ్రాత్యబృందం కార్యకలాపాలు మళ్ళీ పాంచాలురు,ఒకరిపై ఒకరు పోటీగా చేసిన యాగాలలో తెలుస్తాయి .ఏతా వాతా తెలిందేమిటిఅంటే కేశిదాల్భ్యుడు వ్రాత్య బృందాలతో కూడా సంబంధమున్నవాడు అని .

  ఇవేకాక కేశి విషయం లో అనేక ఆసక్తికర విషయాలున్నాయి .కేశిదాల్భ్యుని   ఎక్కడా బకదాల్భ్యునిలాగా సామవేద నిష్ణాతుడు  అని ప్రత్యేకించి చెప్పలేదు .కొన్ని సందర్భాలలో వేదగానం పోటీ పడటానికే కాక ప్రత్యేకత కూడా ఉన్నది .పంచ వింశ బ్రాహ్మణం 10.8.లో ‘’వార వంత్య సామం ‘’సోమ పురుష రూపంతో కేశి దాల్భ్యునికి దర్శనమిచ్చింది .కాని మంత్రోచ్చారణ లో నిర్దుస్టత లోపించింది అని చెప్పగా కేశి తనప్రక్కనే  హవిర్ధాన బండిలో ఉన్న’’ఆలమ్మ పరిజ్ఞాత’’ ను ‘’వార వంత్య’’సామ గానానికి తన ఉద్గాత గా ఎంచుకొన్నాడు –‘’అలమ్మ పరిజ్ఞాతమ్ పశ్చా దక్షం సాయనం’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39

తనను విపరీతంగా అభినందించిన సీతాదేవిని విడిచి ప్రయాణానికి బయల్దేరుతూ మనసులో ‘’రావణుడి నివాసానికి సంబంధించిన పని ఇంకా కొంచెం మిగిలే ఉన్నది .’’అనుకొన్నాడు ఇంతకు  ముందు సర్గలోనే ఆఅభిప్రాయం ‘’అల్పావశేషం ప్రసమీక్ష కార్యం ‘’అని మనకు అక్కడ సస్పెన్స్ కలిగించి ఇక్కడ దానికి తెర దించాడు .మనసులో ఇంకా’’రాక్షస బలాబలాలు ,రావణ హృదయం తెలుసుకోవాలి .దీనికి సామ దాన భేదోపాయాలు కుదరవు దండోపాయమే శ్రేష్టం –దండం దశగుణం భవేత్ .రాక్షసులు సామోపాయానికి లొంగరు.సమృద్ధిగా సంపదలతో ఉన్నారుకనుక  దానం కూడా వారి యెడల వ్యర్ధమే .బలగర్వితులు కనుక భేదానికి లొంగిపోయే ఘటాలు కాదు .కనుక చతుర్ధ ఉపాయం పరాక్రమమమే ఉపయోగించక తప్పదు .రాక్షసులలో కొందరిని చంపితే మిగిలినవారు ఎలాగైనా కొంత మెత్తపడతారు .నిర్దేశించిన పని చెడకుండా అనేకపనులు సాధించేవారే కార్యాచరణ యోగ్యులవుతారు –

‘’కార్యే కర్మణి నిర్దిస్టే,యో బహూన్యపి సాధయేత్ –పూర్వ కార్యా విరోదేన  స కార్యం కర్తు మర్హసి ‘’

ఒకేకారణం తో  చిన్నపని కూడా సాదిమలేము .మహాకార్యం ఎలా సాధ్యం ?ఎవడు అనేక హేతువులతో కార్యసాధన మొదలు పెడతాడో అతడు ఆపనిని సాధించటం లో సమర్ధుడు –

‘’న హ్యేకస్సాధకో హేతుః స్వల్ప స్యాహీప కర్మణః –యోహ్యర్ధం బహుదా వేద స సమర్దోర్ద సాధనే ‘’

  ఇక్కడ ఉండగానే మా యొక్క,శత్రువుల యొక్క యుద్ధ తారమ్యం తెలిసి ,బలాబల నిశ్చయం చేసి సుగ్రీవుని దగ్గరకు వెడితే నే స్వామి ఆజ్ఞ పూర్తిగా నెరవేర్చిన వాడినౌతాను .

‘’పరాత్మ సమ్మర్ధ విశేష తత్వ విత్ –తతః కృతంస్యా న్మమ భర్తృ శాసనం ‘’

‘’నాకు ఇప్పుడు రాక్షసులతో అప్రయత్నంగాయుద్ధం ఎలా  జరుగుతుంది ?ఇలా యుద్ధం జరిగితేనే రావణుడికి తనబలం ,మా రామ సుగ్రీవ బలం తెలుసుకో గలడు.ఇప్పుడు నేను రావణ ,మంత్రి సహిత సేనానులను యెదిర్చి ,సీత విషయం లో అతని మనో నిశ్చయం ,వాడి బలం పూర్తిగాతెలుసుకొని మాత్రమె లంకనుంచి నిష్క్రమిస్తాను .ఇది రావణ ఉద్యానం నందనవనంలా శోభాయంగా ఉన్నది .అగ్ని ఎండుకట్టెను కాల్చినట్లు నేను ఈ వనాన్ని దహించి పాడు చేసి రావణుడికి కోపం తెప్పిస్తాను .అతడికి కోపం వచ్చి పెద్ద సైన్యం నామీదకు పంపిస్తాడు .వాళ్ళతో యుద్ధం చేసి ,నా పరాక్రమ విక్రమాలను చూపించి ఆ సైన్యాన్ని పూర్తిగా చంపి కిష్కింధకు వెడతాను ‘’అని నిశ్చయం చేసుకొన్నాడు .

  తన ఊరువుల వేగం తో వనం లోని చెట్లను విరవటం మొదలుపెట్టి ,పక్షులు తీగలతో క్రిక్కిరిసిన ఆ ప్రమదా వనాన్నితుత్తునియలు చేశాడు .కాసేపట్లో ఆవనం విరిగిన చెట్లు ,కట్టలు తెగిన కొలనులు,పిండి చేయబడిన కొండలతో రోతగా కనిపించింది .లతా ,చిత్ర గృహాలు నశించి మహా సర్పాలు క్రూరమృగాలు చచ్చి ఎక్కడపడితే అక్కడ పడి.దావానలం చేత తగలబెట్టబడినట్లు , వ్యాకులం చెందిన స్త్రీలాగా ,ఉన్నాయి  .సౌందర్య వనం శోభకోల్పోయి ,విహార సీమ వల్లకాడుగా మారింది .దీనివలన రావణ హృదయానికి వ్యధ కలిగించి ,మహా బలవంతులైన రాక్షసులతో తానొక్కడే యుద్ధం చేయాలని సంకల్పింఛి ,అశోకవన బహిర్ద్వారం చేరాడు  హనుమ .

‘’త తస్య కృతార్ధ పతే ర్మహాకపి –ర్మహద్ద్వ్యళీకం మనసో మహాత్మనః –యుయుత్సు రేకోబహుభి ర్మహాబలైః-శ్రియా జ్వలన్ తోరణ మాస్థితః కపిః’’

 మొదటిపాదం లో మహాకపి అని రెండవ పాదం లో చివర కపి అనటం లో ఉద్దేశ్యం ఏమిటి ?మొదటి దానిలో ఆయన ఆంతర్యం కనిపిస్తే ,రెండవ దానిలో ఆయన చేసినపని కపిత్వం కనిపిస్తుంది .

ఇది 21శ్లోకాల 41వ సర్గ .

ఇందులో కార్య సాధకుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అది లోకం లో అందరికీ అనుసరణీయం .కృష్ణ రాయబారం లోకూడా కృష్ణస్వామికి కౌరవులకు పా౦డవుల బలం చెప్పి ,కౌరవుల బలం స్వయం గా తెలుసుకోవటమే ధ్యేయం .దీనికి త్రేతాయుగం లో నే హనుమ మార్గ దర్శనం చేశాడని భావించవచ్చు . మొత్తం మీద’’ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ‘’అనే సామెత సృస్టింఛి ఇచ్చాడు మనకు  హనుమ.సారీ ఆయనేమీ ఇవ్వలేదు .మనమే ఆయన పనికి దాన్ని కల్పించుకున్నాం .మంచి జరిగితే సామెత సార్ధకం .లేకపోతె పని పాడు చేశాడనే అర్ధం వస్తుంది .రెండువైపులా పదును ఉన్న సామెత ఇది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం

సౌదీ అరేబియా రాజ్యం పడమట ఆసియాలో ఉన్నది .అరేబియన్ అఖండ ద్వీపకల్పం .రాజధాని-రియాద్ –కరెన్సీ-సౌదీ రియల్ .జనాభా 3కోట్ల 40లక్షలు .ఇస్లాం మతం .భాషలు .అధికారభాష అరెబిక్ .అధిక ఆదాయం పెట్రోలియం నిధులు .టూరిస్ట్ లకు భద్రతఉంది .

   సౌదీ అరేబియన్ సాహిత్యం కవిత్వం వచనం అన్నీ అరబిక్ భాషలోనే ఉంటాయి .5వ శతాబ్దం నుంచి సాహిత్యం ఉన్నది .ఆభాష సంస్కృతులకు స్వర్ణయుగం కొరాన్ తో వచ్చింది  బాగ్దాద్ ను ‘’హౌస్ ఆఫ్ విజ్డం’’అంటారు .20వ శాతాబ్దిదాకా కవిత్వం ఎక్కువ .9వ శతాబ్దిలో ఐబాన్ ఆల్ నదీం అనే పుస్తక వ్యాపారి ‘’కితాబ్ అల్ ఫిహ్రిస్ట్’’అనే పుస్తకాల కేటలాగ్ తయారు చేశాడు .అబ్బాసిద్ కాలం లో అన్ని రకాల ప్రక్రియల పుస్తకాల సంకలనం బాగా జరిగింది .మేధావి అల్జహీజ్ చివరి మూడు సంకలనాలు రాశాడు .ఐబన్ కుతాబా -మర్యాదా మన్నన పాలన ,ఉద్యోగ నిర్వహణ ,రాసే విధానం మొదలైన వాటిపై శిక్షణ ఇచ్చాడు .సెక్స్ కూడా గొప్ప పాత్ర పోషించింది .ఘజల్ లేక ప్రేమ గీత౦ చాలాకాలం నుంచీ వస్తూ నే ఉంది.మిస్టికల్ , మత విషయాలూ వచ్చాయి . పేర్ఫ్యూమ్డ్  గార్డెన్ ,తక్  హాల్ హమామా వంటి సెక్స్ మాన్యువల్స్  ను ఐబాన్ హజీం ,నౌజట్ అల్లబాబ్  తెచ్చారు .పాపం లేకుండా శృంగారం ఎలా చేయచ్చో క్వయ్యిం ఆల్జాజియ రాశాడు.

  బుక్ ఆఫ్ ది జీనలాజీస్ ఆఫ్ నోబుల్స్ అనే జీవిత చరిత్రల సంపుటి అల్ బలాదూరి రాశాడు .ఉస్మాన్ ఐబాన్ మునికిద్-కితాబ్ అల్ లిటిబార్ అనే స్వీయ చరిత్ర రాసుకొన్నాడు .ఇందులో క్రూసేడ్ యుద్ధాలలో తన అనుభవాలు పొందుపరచాడు .ఈకాలం లోనే తబాకత్ అంటే జీవిత చరిత్ర నిఘంటువులు వచ్చాయి .ఐబాన్ ఖుర్దా దిహిబి అనే పోస్టల్ ఉద్యోగి యాత్రా పుస్తకాలు రాశాడు .యాత్రా సాహిత్యం పండించినవారిలో –ఐబాన్ హవాకల్ ,ఐబాన్ ఫదియన్,అల్ముకద్దసి మొదలైనవారున్నారు .జాగ్రఫీ హిస్టరీ రచనలూ వచ్చాయి .అల్ యకూబి ,అల్ తబరి చరిత్రమాత్రమే రాశారు .ఐబాన్ ఆల్ అజ్రాక్ మక్కా చరిత్ర ,ఐబాన్ అబి తాహిర్ టేఫర్ బాగ్దాద్ చరిత్ర రాశారు .ఐబాన్ ఖల్దూం రాసిన’’ముఖద్దిమా ‘’అనే చరిత్ర పుస్తకం లో సోషియాలజీ ఎకనామిక్స్ కూడా కలిపాడు.

  10వ శతాబ్ది ప్రారంభలో అరబిక్ డైరీ హవా వచ్చింది .ఇవాల్టి ఆధునికడైరీకి మాతృక 11వ శతాబ్ది ఐబాన్ బన్న డైరీ యే.సాహిత్య విమర్శ మతగ్రందాలపైనే ఎక్కువగా జరిగింది .మధ్యయుగ అరబిక్ కవిత్వం పై సాహిత్య విమర్శ విస్తృతంగా ఉన్నది .ఆల్ జహిజ్ ఇందులో ఘనుడు .అరబిక్ ఫిక్షన్ ఐబాన్ అబీద్ రబ్బీరాసిన ‘’ఆల్ ఐకద్ ఆల్ ఫరీద్ ‘’తో మొదలైంది .ఆరబ్ ప్రపంచం లో నాణ్యమైన భాషకు ,సామాన్యభాషకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది .తత్వ గ్రంథాలు  ఫిలసాఫికల్ నవలలు కూడా రచయితలురాశారు .అరబ్ భాషలోని వెయ్యిన్నొక్క రాత్రులు  లేక అరేబియన్ నైట్స్ ప్రపంచ ప్రసిద్ధి చెంది,వచనరచనకు ఆదర్శంగా నిలచింది తర్వాత అల్లాఉద్దీన్,ఆలీబాబా హాతిం తాయ్ కథలు విస్తృత వ్యాప్తి పొందాయి .ఇవి దాదాపు ప్రపంచాభాషలన్నిటిలోకి అనువాదమయ్యాయి.అరేబియన నైట్స్ ను అరెబిక్ ఎపిక్ అంటారు .

 వచనానికి కవిత్వానికి మధ్య ‘’మకామా ‘’ప్రక్రియ వచ్చింది .ఇది లయబద్ధ వచనం   అల్హమదాని దీనికి ఆద్యుడు .లైలా మజ్ను అరెబిక్ రొమాంటిక్ కవిత్వం .మరొకటి-అదిత్ బయద్ వా రియాద్ అంటే బాయాద్ రియాద్ ల ప్రేమ .మర్డర్ మిస్టరి కిఉదాహరణ షేహరాజాడే రాసిన ‘’దిత్రీ ఆపిల్స్ ‘’.అరెబిక్ సాహిత్యం లో వ్యంగ్యరచనకు ‘హిజా’’అనిపేరు .అస్సలామి మొదలైనవారు రాశారు .అరిస్టాటిల్ పోయేటిక్స్ అరేబియన్ అనువాదం వచ్చాక కామెడి సెటైర్ లు పర్యాయ పదాలయ్యాయి .మధ్యుగాలలో పప్పెట్ షోలు ఎక్కువ .తర్వాత నాటకశాలలేర్పడి నాటకాలు రాయటం ప్రదర్శించటం జరిగింది .సైన్స్ ఫిక్షన్ ఫిలాసఫికల్ నవలలూ రాశారు .స్త్రీలుకూడా రాశారుకాని స్పీడ్ తక్కువే .మర్యానా మరాహా, మే జియాదే,మేరి అజ్మి ఇప్పుడు దూసుకుపోతున్న రచయిత్రులు .సానియా సలీహా ఇప్పుడు గొప్పకవయిత్రి .సమకాలీనంగా నూ అన్ని ప్రక్రియలలో అందరూ రాసి అరెబిక్ సాహిత్య పోషణ చేస్తున్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -3

బక దాల్భ్యుడు -3

కేశి దాల్భ్యుని  విషయం లో ఇద్దరు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ  సామాన్యంగా కనిపిస్తుంది .ఈ కథలలో కేశి  ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తారు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తాయి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని వృత్తాంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే వ్రాత్యలేక సత్ర బృందాలతో కనిపిస్తాయి .

మైత్రేయని సంహిత లో కేశి దాల్భ్యుని కి అతని ప్రత్యర్దిఖాన్డిక ఔధారి కిమధ్య జరిగిన విషయం ఉన్నది-1.4.12  .. ఈ ఇద్దర్నియజమానులుగా పేర్కొన్నది .ఒక రోజు గంధర్వులు అప్సరసలు కేశి దాల్భ్యుని యజ్ఞం చేసేవాడు అతని ప్రత్యర్ధి స్థాయి పొందటం ఎలాగో తెలుసా అని అడిగారు .అది సర్వం తనకు తెలుసు అన్నాడు .అయినా వారికి సంతృప్తి కలగలేదు కారణం ఆ సత్తా తమకు మాత్రమె ఉన్నదికనుక .చివరికి వారు ఒకయాగం చేసి కేశికి సమర్పించగా ఖా౦డికుడిని ఓడించాడు .ఈ విషయంలో కేసి ప్రత్యర్ధిని ఓడించినా ,గ౦ధర్వ అప్సరసలకున్న విజ్ఞానం ముందు ఓడిపోయాడు .

మరో చోట అంటే బోధాయన శ్రౌత సూత్రం -17.54లో కూడా వీరిద్దరి మధ్య వైరంకనిపిస్తుంది .అది అధర్వవేద విషయం లో .అభిచార అనే కేశి యజ్ఞం లో అంటే భూత ఆవాహన తో కేశి ఖాండికుని  మంత్రం ముగ్దుడిని చేశాడు –‘’కేశి హా యత్ర ఖాన్డికం అభిచాచర ‘’.శతపథ బ్రాహ్మణం ఈ ప్రత్యర్దులమధ్య మరో వేరే కథ చెప్పింది 11.8.4.ఇక్కడ కేశి ఒక సత్రయాగం లో గ్రహపతిగా చెప్పింది.సత్రయాగాలు కర్మకాండ తెల్సిన రెండు బృందాల  మధ్య జరుగుతాయి కానీ ఇక్కడ కేశి ని క్షత్రియుడుగా పరిచయం చేశారు .కేశి బృందం యొక్క సామ్రాజ గోవు ను పెద్దపులి చంపితే దానికి వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది .ఇది తెలిసినవాడు ప్రత్యర్ధి బృంద నాయకుడు ఖాన్దిక ఔద్భారి ఒక్కడు మాత్రమె .కేశి ఆయన్నుకలిసి ప్రాయశ్చిత్తం జరిపించమని కోరాడు .ఖాన్డికుడు ధర్మ సంకటం లో పడి పోయాడు .ఆ రహస్యం చెబితే కేశి బృందం ఈ లోక  విజేత అవుతాడు తాను మరోలోక  విజేత ఔతాడు .చెప్పకపోయినా అంతే.చివరికి ఆ ప్రపంచమే కావాలనుకొని ఖాన్డికుడు కేశి కి ప్రాయశ్చిత్త కార్యం మంత్రాలతో నిర్వహించాడు .11.8.4.6.దీనితో కేశి తనయాగాన్ని కాపాడుకోగలిగాడు.ఈకథ ద్వారా కేశినులు ఇంకా పుట్టాలి  అని తెలుస్తోంది –‘’కేశినిర్ ఏవం అప్యేతర్హి  ప్రజా జాయంతే’’

వీరిద్దరి వైరం జైమినేయ బ్రాహ్మణం లో రెండు సార్లు వస్తుంది .కేశి దాల్భ్య లేక దార్భ్య మరియు ఖండిక ఔద్భారి లమధ్య పాంచాల భూమి యాజమాన్యం పై తగాదా వచ్చింది -2.122మరియు 2.279.-‘’పాంచాలేషు పస్ప్రధాతే’’.2.279-,280ప్రకారం వీరిద్దరిలో ఖాన్దికుడు బలీయుడు ,శక్తివంతుడు –‘’సహా ఖాన్డికా కేశినం అభి బభూవ ‘’అయినా కేశి వెంటనే మేనమామ కౌరవ ఉచ్చ్రైశ్రవసు ఆశ్రయం పొందాడు.ఇక్కడా వీరిద్దరికీ ఈలోకం పరలోకం పై అధికారం పైనే స్పర్ధ .మేనల్లుడిని దేనిపై పెత్తనం కావాలని అడిగితె ,ఈలోకంపైనే అని చెప్పాడు కేశి .కనుక మూడు రోజుల అంతర్వసు అనే సోమయాగాన్ని మేనల్లుడు కేశితో చేయించి శక్తిమాన్ ను చేసి ఖా౦డికుని   బయటికి పంపించేశాడు .

ఇలాంటిదే మరో స్పర్ధ వీరిద్దరి మధ్య జరిగినట్లు జైమినేయ బ్రాహ్మణం 2.122-124తెలిపింది .ఖాన్దికుడు తాను ‘’సద్యాహ్క్రి’’నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు  -‘’సహా ఖాన్డికః కేశినం అభి ప్రజిఘాయ-సద్యహ్క్రియయా వై స్యో యక్షతా ఇతి ‘’.కేసి కి ఈసారి బ్రాహ్మణ బృందం సలహా ఇవ్వగా వెంటనే ‘’పరిక్రీ ‘’అనే సోమయాగం చేశాడు .దీనితో మళ్ళీ కేశి విజయం సాధించి ఖాన్డికునికి పుట్టగతులు లేకుండా చేశాడు .కేశి దాల్భ్యుని పక్షాననిలబడిన నలుగురు బ్రాహ్మణులు- కేశి సత్యకామి ,ఆహీనస్ ఆశ్వత్తి,గాన్గినా రహక్షితా,లుసాకపి ఖార్గలి.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38

వెళ్లి పోతున్న మహాత్మ హనుమాన్ తో సీతాదేవి ‘’సగం వయసు వరకు పెరిగి ,ఆతర్వాత నీళ్ళు లేక శోషించి ,దైవికంగా కురిసిన వానతో కోలుకున్న పైరులాగా ,చాలా ప్రియ  వచనాలు పలికిన  నిన్ను చూసి చాలా సంతోషం కలిగింది .

‘’త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర –అర్ధ సంజాతసస్యే వ వృష్టిం ప్రాప్య వసుంధరా ‘’

చాలాసందర్భోచిత దివ్య ఉపమానం ప్రయోగించి సీతతో చెప్పించాడు మహర్షి వాల్మీకి .

‘’త్వరలో రామ దర్శనం సంఘటిల్లేట్లు చూడు .’’రామా !కాకి మీదతృణంప్రయోగించి దాని కన్ను హరించిన నువ్వు నన్ను పోయావా  .మరో విషయం కూడా గుర్తుకొచ్చింది  . .పూర్వం నేనునా నుదుట అలంకరించు కొన్న తిలకం గండం అనే పర్వత పార్శ్వం దగ్గర అరణ్యం లో తిరుగుతుంటే చెమటకు కరిగింది .అప్పుడు రామానువ్వు  మణిశిలతో చేయబడిన తిలకాన్ని అలంకరించావు .ఈ రెండవ అభిజ్ఞానం కూడా తప్పకగుర్తుంచుకో . .

‘’మనశ్శిలాయా స్తిలకో గండపార్శ్వే నివేశితః –త్వయా ప్రణష్టే తిలకే తమ్ కిల స్మర్తు మర్హసి ‘’

  మరో అభిజ్ఞాన౦ ఏదైనా ఇవ్వమని అడిగాడు హనుమ .దానికి ఆమె తానూ తలలో భద్రంగా దాచుకొన్న చూడామణి ని ఇచ్చాను దీన్ని చూసి రాముడు నీ మాటలపై విశ్వాసం తప్పక చూపిస్తాడు .’’అనగా సంతోషించి శరీరం పెంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే సీత మళ్ళీ ‘’

రాక్షసులమధ్య చిక్కి ఉన్న నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు .దివ్య చూడామణిని ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా కాపాడుకొన్నాను .ఇక్కడి కష్టాలను దాన్ని చూస్తూ సహిస్తూ నిన్ను చూసిన ఆనందాన్ని దానివలన పొందుతున్నాను .శ్రీమంతమైన రత్నాకరమైన సముద్రంలో పుట్టిన దివ్య మణి అది.దాన్ని నీకు ప్రత్యర్పణం చేస్తున్నాను .ఇక శోకం తో ఎక్కువ కాలం ఉండలేను .రాక్షసబాధలు ,ములుకుల్లాంటి మాటలు దుస్సహాలుగా ఉన్నాయి.నీకోసం వీటిని సహిస్తున్నాను .శత్రునాశక రామ రాజా ! ఒక్క నెలరోజులే బతికి ఉంటాను.

‘’ధారయిష్యామి మాసం తు జీవితం శత్రు సూధనా –ఊర్ధ్వం మాసా న్న జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ’’

  రాజా అనటంతో రాజ ధర్మం గుర్తు చేసింది సీత .ఆర్తత్రాణ పరాయణత్వం జ్ఞప్తికి తెచ్చింది

 .నాపై రావణ దృష్టి యోగ్యంగా లేదు .నువ్వు ఆలస్యం చేస్తున్నావని విని క్షణంకూడా జీవించలేను మహా ప్రభూ ‘’అన్నది .

   ఆమాటలకు చలించిన హనుమకన్నీరు కారుస్తూ ‘’దేవీ !నీ వియోగదుఖం  తో రాముడు అన్ని పనులకు విముఖుడుగా ఉన్నాడు .సత్యప్రమాణ౦ గా  చెబుతున్నాను రాముడు దుఖిస్తే తమ్ముడూ ఏడుస్తున్నాడు .

‘’త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే-రామే దుఖాభి భూతే తు లక్ష్మణఃపరి తప్యతే ‘’

ఎంతో శ్రమపడితే కాని నీ దర్శనం కాలేదు .ఇది దుఖి౦చేసమయం కాదు .ఈక్షణమే నీ దుఖం అంతమౌతుంది’’అన్నాడు మళ్ళీ ఆమె ‘’రాముడు ఎలానన్ను ఈ దుఃఖ సముద్రం దాటిస్తాడో దానికి తగినట్లుగా ఆయనతో మాట్లాడు ,నాశోకం ,రాక్షసుల బెదిరింపు వెళ్ళగానే క్షణం ఆలస్యం చేయకుండా చెప్పు .నీ ప్రయాణం సుఖమగుగాక ‘’అన్నది

‘’బ్రూయాస్తురామస్య గత స్సమీపం –శివశ్చ తే ద్వాంతుహరి ప్రవీర ‘’

   సీత ఇలా పలకగానే ఆమె సందర్శనం తో తాను కృతార్ధుడ నయ్యానని ఉప్పొంగుతూ ,ఇంకా చేయాల్సిన పని కొద్దిగా మిగిలి ఉందని గ్రహించి హనుమ ఉత్తర దిశగా బయల్దేరాడు

‘’సరాజపుత్త్ర్యా ప్రతి వేదితార్ధః –కపిః కృతార్ధః పరి హృష్ట చేతాః-అల్పావ శేషం ప్రసమీక్ష్య కార్యం –దిశం హ్యుదీచీం మనసా జగామ ‘’

  ఇది 24శ్లొకాల 40 వ సర్గ .

హనుమను ప్లవగోత్తమా ,హరిపున్గవం ,హరి గణోత్తమ అంటూ చాలా ప్రైజింగ్ గా సంబోధించింది .ఆయనమనసూ చల్లబడింది .మాయాబజార్ సినిమాలో ‘’అదే మన తక్షణ కర్తవ్యమ్ ‘’అని ఆర్ నాగేశ్వరరావు మాటమాటికీ అన్నట్లు  సీత రాముడికి వెళ్ళిన తక్షణమే తన స్థితి తెలియబర్చమని పదే పదే చెప్పి పంపించింది .రెండు అభిజ్ఞానాలు కాదు మూడోది కూడా అంటే గండశిలపర్వత౦  దగ్గర ఆమె నుదుట  మణిశిలా తిలకం అద్దటం జ్ఞాపకం చేసింది .పుణ్య స్త్రీ నుదుట క్షణకాలమైనా  బొట్టు లేకపోవటం అశుభం కనుక రాముడు వెంటనే స్పందించి స్వయంగా తిలకం పెట్టాడు .అది స్త్రీకి ఎంతో శుభం సౌభాగ్యదాయకం సర్వ మంగళకరం .దాన్ని జ్ఞప్తికి తెచ్చింది అంటే తనమా౦గల్యాన్ని మళ్ళీ కాపాడే సమయం వచ్చింది అని మరోసారి గుర్తు చేసింది .ఈ మూడూ చాలక ఇంకోటి ఏదైనా ఇమ్మన్నాడుహనుమ .ఆమె అక్కర్లేదు చూడామణి చూడగానే రాముడికి కర్తవ్యం వెంటనే బోధపడుతుంది అని చెప్పింది దాన్ని ఇంతకాలం ఎంత భద్రంగా దాచుకొన్నదో వివరిస్తూ ,దాని పవిత్రతనూ,దివ్యత్వాన్నీ  వివరించింది .

  హనుమ వాయు మార్గాన తిరిగి వెడుతున్నాడుకనుక ‘’బాన్ వాయెజ్ ‘’కూడా చెప్పి ప్రయాణం సుఖకరం కావాలని దీవించింది.హనుమంతుడు కూడా మనలాగే ఒట్టు పెట్టాడు దేనిమీద ?సత్యం మీద. అందుకే మనకు లోకం లో  ‘’సత్యప్రమాణకం’’గా అనే మాట వచ్చింది .  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

104-పాకిస్తాన్ దేశ సాహిత్యం

పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ .213మిలియన్ లతో ప్రపంచంలో అయిదవ అధిక జనాభా ఉన్న దేశం .33వ పెద్ద దేశం .రాజధాని –ఇస్లామాబాద్ –కరెన్సీ –పాకిస్తాన్ రూపాయి .బీద దేశం .న్యూక్లియర్ పవర్ సాధించింది  అత్యధిక ముస్లిం జనాభాలో రెండవ స్థానం  జాతీయ భాష ఉర్దు.పస్తూ, సింధు,  బలోచి వగైరా భాషల జనాలున్నారు .అందమైన ఆకర్షణీయ దేశం టూరిస్ట్ లకు భద్రత ఉంది .ప్రత్తి పంట ఫిషరీస్ ,అడవులు ఆదాయ వనరులు .    పాకిస్తాన్ సాహిత్యం 1947లో స్వతంత్రం పొందాకనే వచ్చింది .ఉర్దూ ఇంగ్లిష్ సాహిత్యం బాగా పెరిగింది .సర్దార్ హసన్ మాంటో-1912-55 దక్షిణ ఆసియా కధలురాశాడు ఇండో –పాక్ విభజన నేపధ్యంగా .తర్వాత 20వ శతాబ్దం లో పాకిస్తానీయుల కష్టాలూ కథలుగా రాశాడు .అక్కడి ఉర్దూ ఇంగ్లిష్ రచయితలు విషయాలను ఇంగ్లిష్ ఉర్దూ లనుండి గ్రహించారు .పాకిస్తాన్ అకాడెమి ఆఫ్ లెటర్స్ ఏర్పడి సాహిత్య పర్యవేక్షణ చేస్తోంది.

  పాకిస్తాన్ పీరియాడికల్స్ ను డైజెస్ట్ లు అంటారు .వీటికి కేంద్రం కరాచి .ఫిక్షన్ కూడా ఇక్కడి నుంచే .షకీల్ ఆదిల్ జాదా పల్ప్ ఫిక్షన్ చాలా రాశాడు .జనరల్ జియాకాలం లో స్వేచ్చ ఉండేదికాదు .అయినా లంచాలిచ్చి మేనేజ్ చేసేవారు .కొన్ని పత్రికలు  మానవ స్వభావానికి ఆత్మ శక్తికి వ్యతిరేకంగా ఉండేవి .ఇవి మధ్యతరగతి వారికి సెక్స్ మసాల బాగా దంచి అందించేవి .క్లాసికల్ ఉర్దూ లో దిట్టలు కూడా హ్యూమన్ సెక్సువాలిటి ని తరచి రాసినట్లు హసీబ్ అసీబ్ తెలియజేశాడు .

  ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ సాహిత్య వ్యాప్తికి ఫెస్టివల్ కరాచి లిటరేచర్ ,ఫెస్టివల్ లాహోర్ లిటరేచర్ నిర్వహించాడు .ఉర్దూలో చాలా రాశాడు .సింది సాహిత్యం లో కవిత్వం వ్యాసం బాగా వచ్చాయి .కార్గిల్ యుద్ధం లో దేశభక్తికవిత్వం ఏరులై పారింది  .ప్రోగ్రెసివ్ రైటర్స్ ఉద్యమమూ వచ్చింది .గుజరాతీ సాహిత్యమూ వెలువడింది

  ఉర్దూ కవులలో –అహ్మద్ ఫరాజ్ ,అహ్మద్ నజీం కాస్మి ,పర్వీన్ షకిర్ , జువాన్ ఎలియా ,షకీబ్ జలాలి,రాయస్ వార్సి మోయీన్ నిజామి మొదలైన వారు అగ్రస్థానం లో ఉన్నారు .

స్త్రీలలో ఫెహ్మిడా రియాజ్ ఒక్కరే .కామికల్ పోయెట్స్ లో అన్వర్ మసూద్ , దిలావర్ ఫిగర్ ,జమీర్ జఫ్రి ఉన్నారు .ఆంగ్లకవులలో దావూద్ కమాల్ ,ఆలంగిర్ హాష్మి ,జుల్ఫీకర్ ఘోష్ ,సాహిర్ సుహ్రవర్ది ,మకికురేషి ,కలీం ఒమర్ .పంజాబీ కవులలో –పీర్ నజీరుద్దీన్ నజీర్ ,బుల్లెష్ షా ,ఫరీదుద్దీన్ గంజాస్కర్ ,వారిస్ షా ,సుల్తాన్ బహు ,ఉస్తాద్ దమన్ . సరైకి కవులు –ఖవాజా ఫరీద్ ,సచాయ్ సర్మస్ట్ ,బుల్లెష్ షా ,సుల్తాన్ బహు,షకిర్ షుజా ఆబాది .సింధి కవులు –అదల్ సూమ్రో ,బేడిల్,ఇమ్దాద్ హుసేని ,మీర్జా క్వలీజ్ బేగ్ ,సవాన్ ఫకీర్ ,తజాల్ బేవస్,ఉస్తాద్ బుఖారి వంటి వారు చాలామంది

  ఫస్తూకవులు –ఖుశాన్ ఖాన్ ఖటక్,రహ్మా బాబా ,హమీర్ హంజా షిన్వరి ,ఖాన్ అబ్దుల్ ఘనీఖాన్ ,అజ్మల్ ఖట్టక్.బలూచి కవులలో గుల్ ఖాన్ నసీర్ ఒక్కడే కనిపిస్తున్నాడు

సాదత్ హసన్ మంటో-ప్రముఖ రచయిత.’’తమాషా ‘’కథా చక్రవర్తి .సెక్యులర్ భావాలు .’’డి.హేచ్ .లారెన్స్ ఆఫ్ పాకిస్తాన్’’ అంటారు .అతని తొండాగోష్ట్ కథ పాక్ లో అసభ్య నేర విచారణకు సంబంధించింది .అతని శైలి ‘’టెల్ ఇట్ ఆజ్ ఇట్ ఈజ్ ‘’అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పు అనేది 250 కధల్లోనూ కనిపిస్తుంది .42ఏళ్ళు సాహిత్య సేవ చేశాడు .2012లో ఆయన జయంతిని ఘనంగా జరిపారు.

 మొహసిన్ హమీద్ –యువ పాక్ రచయిత.2000లో ‘’మోత్ స్మోక్ ‘’నవల,2007లో ‘’ది రిలక్టేంట్ ఫ౦డమెంటలిస్ట్స్’’రాసి చాలా పేరు పొందాడు .మాత్ స్మోక్ నవలలో ఈ నాటి పాక్ లో సంస్కృతుల మధ్య వైరుధ్యం ,దీనివలన నేర ప్రవృత్తి పెరగటం రాశాడు .పాక్ న్యూక్లియర్ బలం సాధించటానికి వ్యతిరేక నేపధ్యంగా రాశాడు .ఈనవల హెమింగ్వే అవార్డ్ కు నామినేట్ అయి ,న్యూయార్క్ టైమ్స్ నోటబుల్ బుక్  ఆఫ్ ది యియర్ గుర్తింపు పొందింది .రెండవ నవలలో నాయకుడు చెంఘిజ్ ఇస్లాం ఫండమెంటలిజం- అమెరికన్ కేపిటలిజం మధ్య నలిగి పోవటం.మాన్ బుకర్ ప్రైజ్ కు ఎంపికయింది .ఇతనిపై హెమింగ్వే ,నోబకోవ్ లప్రభావం ఉన్నది

మహమ్మద్ హనీఫ్ –‘’ఎ కేస్ ఆఫ్ ఎక్స్ప్లో డింగ్ మాంగోస్ ‘’ సటైరికల్ నవల .ఇందులో జనరల్ జియావుల్ హక్ మరణానికి జరిగిన కుట్ర కుతంత్రం ఉంటాయి .మామిడి పళ్ళను ‘’నెర్వ్ గాస్ ‘’తో నింపి విమానంలో ఎక్కించి పైలట్ ను నాక్ డౌన్ చేసి ,విమానంకూలిపోయేట్లు చేసిన కుట్ర .ఈనవల సాహిత్య ప్రపంచంలో అత్య౦త అరుదైన హాస్య౦ తో   తీవ్ర తుఫాన్ సృష్టించి,కామన్ వెల్త్ బుక్ ప్రైజ్ తో సహా అనేక అవార్డ్ లు పొందింది.

రెండవనవల ‘’అవర్ లేడీఆఫ్ ఆలిస్ భట్టి ‘’2011 రోరింగ్ సక్సెస్ సాధించింది   An allegory for the plight of religious minorities in Pakistan, the book is interspersed with genuinely funny lines. A case in point is one of the characters’ take on love: ‘It’s futile to predict what love will make of you, but sometimes it brings you things you never knew you wanted. One moment all you want is a warm shower, and the next you are offering your lover your chest to urinate on.’ అని ప్రశంసలు పొందిన నవల .రచయిత విట్ అండ్ హ్యూమర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది .హనీఫ్ నాటకాలు కూడా రాశాడు. కరాచి బిబిసి ఉర్దూ విభాగం లో డైరెక్టర్ .

  కామిలా శంషీ-ఇతర దేశాలలోచదివి ఎదిగి ,ఇక్కడికి వచ్చి 5పుస్తకాలురాసింది .మొదటిది ‘’ది సిటి బై ది సీ’’ జాన్ లీవిల్లీ ప్రైజ్ కు ఎంపికయింది .అనిశ్చితరాజకీయంలో ఒక యువకుడు పడే పాట్లు ఇందులో అంశం .ఈమెకు చాలా అవార్డ్ లొచ్చాయి .

   డేనియల్ ముసీనుద్దీన్ –కథలు న్యుయార్కర్ మొదలైన పత్రికలలో ప్రచురితాలు .’’ఇన్ అదర్ రూమ్స్ ,అదర్ వండర్స్ -2009సంపుటులలో పాకిస్తాన్లోని జీవితాన్ని వివిధ మనుషుల కళ్ళ  లోంచి చూసి చెప్పాడు .ఇందులో వర్గ పోరాటాలు ,ఫ్యూడల్ వ్యవస్థ గురించి వర్ణించాడు .తనపై టాల్స్టాయ్ ,చెకోవ్ ల ప్రభావం ఎక్కువ అని ఈ న్యుయార్కర్ అన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -2

బక దాల్భ్యుడు -2

బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధోరణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తుంది .పంచ వింశ బ్రాహ్మణం-25-15-,3,షడ్వింశ బ్రాహ్మణం –1-4-6,గోపథ బ్రాహ్మణం -1-1-31లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తుంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లావుడు(గాలవుడు ?) ఉద్గాతకు సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు లోకేషుప్రత్య తిస్టన్’’.వాటికి మృతువు తప్పి, రహస్యంగా పుట్టల్లో దాక్కొనే బాధా తప్పి,స్వేచ్చగా ప్రాకుతున్నాయి -25-15-4-‘’ఏతేన వై సర్పాఅపమృత్యుం  జయంతి-తే హిత్వా జీర్ణం త్వచం అతి సర్పంతి అపహితే మృత్యుం అజయన్ ‘’ఈ సందర్భంలో అనేక పాములపేర్లు వస్తాయి .మహాభారతం లో పాములపై ద్వేషమున్న జనమేజయుడు సర్ప సత్రం చేసినట్లున్నది .ఈ యాగానికి ఇద్దరు ఆధ్వర్యులున్నట్లున్నది .ధృత రాష్ట్ర ఐరావత అనే బ్రాహ్మణుడు కూడా సర్పయాగం చేసినట్లున్నది .ధృతరాష్ట్ర విచిత్ర వీర్య 10-6.

   షడ్వింశ బ్రాహ్మణం 1-4-6లో గ్లావ మైత్రేయ సోమగానం ముందు రోజు ఉదయం జ్యోతిస్టో మం మొదలైన కర్మకాండ చేసినట్లున్నది .గ్లావుడు సదస్సులో విశ్వ రూప మంత్రాలు చదివినట్లు ,యాగానికి ముందురోజు రాత్రి ,యాగం రోజు ఉదయాన ఛందస్సులో మంచి చెడు లను వేరుచేశాడు .కనుక ఉద్గాతగా ఉన్నాడను కోవాలి .

  గోపథ బ్రాహ్మణం 1.1.31-38 లో మైత్రేయుడికి,సామవేద అనుయాయి  గ్లావ మైత్రేయుడికి  మధ్య పండిత చర్చ జరిగినట్లు చెప్పింది .ఇందులో గ్లావుడు ఓడిపోయాడు కారణం సావిత్రి ,గాయత్రి ఛందస్సుల ఆధారం చెప్పలేకపోవటమే ,వాటికి స్వర్గం సమానమైనవాటిని వివరించలేక పోవటమే ఓటమికి కారణం .ఈ రహస్యాలన్నీ మౌద్గల్యుడు చెప్పి గెలిచాడు .

  ఇప్పడు మనం చెప్పుకున్నవాటన్నిటిలో బక దాల్భ్యుని ఆసక్తికర సమాచారం ఎమీలేదుకాని .కురుపా౦చాల  ,నైమిశ సత్ర కూటమిలో ఉన్నాడని  సామవేద నిష్ణాతుడు అనీ తెలుస్తోంది .ఛాందోగ్య ఉపనిషత్ 1-2-13ప్రకారం బక దాల్భ్యునికి  ఉద్గాత సామర్ధ్యం పుష్కలం గా ఉండి,నైమిశారణ్యంలో ముఖ్య కర్మకాండ మంత్రం గాయకుడుగా ఉండేవాడు –‘’సహా నైమిశీయనాం ఉద్గాత బభూవ ‘’.తర్వాత మంత్రం 1.2.14లో ఓంఅక్షర ప్రాముఖ్యం ,ఉద్గీత ను పరిపుష్టం చేయటం లో  దాని పాత్ర వివరణ ఉన్నది .

      కేశి దాల్భ్యుడు

వేద గ్రంథాలలో ఇతర దాల్భ్యుల పేర్లు కూడా కనిపిస్తాయి .అందులో కేశి దాల్భ్యుడు ఒకడు .ఈయనపాత్రా కురు పా౦చాల నేపధ్యం ఉన్నదే .కేశి దాల్భ్యుడు పా౦చాలుడు ,బ్రాహ్మణుడు కాదు యాగ యజమాని,క్షత్రియుడు  .ఒక్కో సారి రాజుగా కనిపిస్తాడు .ఈయనకు సంబంధించిన గాథలు వేద మంత్రఉచ్చారణ ,శాపాలు గురించే .కర్మకాండలో యదార్ధ కర్మకాండ గురించిన చర్చలలో ఈయన ఉంటాడు .అందులోని రహస్యం స్పష్టంగా విప్పి చెప్పినవారిదే గెలుపు .

  జైమినేయ బ్రాహ్మణం 3.312లో కేశి దాల్భ్యుడు తనకు 12రోజుల కర్మకాండ నేర్పిన కబంధ ఆధర్వణుడి మధ్య చర్చ ఛందస్సు మార్పు పై జరిగింది –‘’వ్యూఢ ఛందసం ద్వాదశాహం ప్రవాచ ‘’.ఈ విజ్ఞాన పరీక్షలో పాంచాలురకే విజయం దక్కింది .వారు బీదవారైనా ,వారి జీవన విధానం మిగిలినవారికి బాగా నచ్చింది –తస్మద్ అనాధ్యయామపి ,సారం పాంచాలనాం     అభ్యేఏవాన్యేజీవితం ధన్యంతి ‘’.

  కబంధ అథర్వణ౦ కేశి ని  కర్మకాండ  విషయగ్రాహిగా,దాల్భ్యుని అధర్వ వేదం అనుయాయిగా కలిపింది . అథర్వ వేదం లోని మూడు మంత్రాలు  6.75-77 కబంధుని పేర ఉన్నాయి.అంతేకాక ఉపనిషత్ ద్రష్ట గా బృహదారణ్య ఉపనిషత్ చెప్పింది-3.7.1ప్రకారం కబంధ ఏవిధంగా పాంచాల ఆరుణి భార్యను స్వంత౦ చేసుకోన్నాడో చెప్పింది. గ౦ధర్వ రూపంలో ఆమెద్వారా శ్రోతలకు కర్మజ్ఞాన బోధ చేసినట్లున్నది .దీనివలన గంధర్వులకు శక్తివంతమైన కర్మకాండ రహస్యాలు తెలుసు అని అర్ధమౌతుంది .ఇందులో ముఖ్యవిషయం రెండు ప్రపంచాలను వాటిలోని సకల జీవరాసులను  సూత్రం చేత ఒకదానితో ఒకటి బంధించటం ఉన్నది .నిర్దేశికుడైన అంతర్యామి ఈ మూడు సత్తామాత్రాలను నియంత్రిస్తాడనీ  తెలుస్తుంది .

  గోపథ బ్రాహ్మణం లో కబంధుని కొడుకు విచారి పేరు రెండు  సార్లు వస్తుంది .మొదటి అధ్యాయం 1.2.10లో కొడుకుఆకలి గొన్నవాడిగా చెప్పింది .రెండవ చోట 1.2.18 విచారిని కర్మకాండ నిష్ణాతుడిగా ,మదించి పొగరుతో ఉన్న పెంకె గుర్రాన్నిశాంత్యుదక  పవిత్ర జలం తో సాధువుగా మార్చినవాడి గా చెప్పింది –.ఆ గుర్రమే అగ్నాధ్యేయం కు అవసరమైనది .ఈ గుర్రాన్నే భయంకర జలంనుంచి వాక్ ద్వారా సృష్టించారు .ఇందులో బక దాల్భ్య కథకు జైమినేయ అశ్వమేధ కథకు దూరపు సంబంధం కనిపిస్తుంది .ఒక అహంకార బ్రాహ్మణుడు పాండవులకు అలవికాని యాగాశ్వాలను  శాంతిపరచటం ,పోయిన ఆ  యాగాశ్వాలు  తిరిగిలభించటం సమానమైన కథలు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37

చూడామణి ప్రదానం చేశాక హనుమతో సీత ‘’ఈ అభిజ్ఞానంరాముడికి బాగా తెలుసు ,దీన్ని చూసి ఆయన మా తల్లిని ,నన్ను మామమగారిని స్మరిస్తాడు .నువ్వు వెళ్లి రాముడిని తొందరపెట్టి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చెయ్యి .నీ ప్రయత్నం సఫలమై నా దుఖం తీరాలి. దీనికి నువ్వే సమర్దుడివి .‘’అనగానే అలాగే అని చెప్పి హనుమ ఆమెకు నమస్కరించి బయల్దేర బోయాడు .అతడు వెళ్ళటం చూసి సీత  కన్నీరు కారుస్తూ ‘’, రామ సోదరుల,సుగ్రీవాదుల  క్షేమ౦  అడిగానని చెప్పు .నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి దాటించే,నన్ను బ్రతికించే  ఉపాయం రాముడికినీ వాచిక ధర్మం తో చెప్పు .నువ్వు రోజూ ఆయనకు ఉత్సాహం కలిగిస్తూ నన్ను చేరే పౌరుషం పెంచుకోవటానికి ప్రయత్నించు .నీమాటలు విన్న తక్షణం ఆయన పరాక్రమ౦ ప్రదర్శిస్తాడు ‘’అని చెప్పింది .శిరస్సంజలి మాదాయ గా హనుమ ‘’అమ్మా !రామదండు త్వరలోనే వస్తుంది .శత్రు నాశనం చేసి రాముడు నీ దుఖం నివారిస్తాడు నమ్ము .రాముడు సాగర పర్యంత భూమిని పాలించటానికి ఉత్సాహంగా ఉన్నాడు .నీకోసం లంకను జయిస్తాడు ‘’అన్నాడు.

‘’నహి సాగర పర్యంతాం మహీం శాసితు మీహతే -త్వన్నిమిత్తో హి రామస్య జయో జనక నందిని ‘’

 హనుమ వెళ్లి పోతుంటే మాటిమాటికీ అతన్ని చూస్తూ గౌరవిస్తూ భర్తను స్మరిస్తూ మళ్ళీ ‘’నీకు ఇష్టమైతే ఎక్కడో అక్కడ దాక్కుని విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళు .ఇంకొక్క రోజు ఇక్కడ నువ్వు ఉంటె నా మహా దుఖం కొంచెమైనా తగ్గుతుంది. కాదని నువ్వు వెడితే నా ప్రాణాలు నిలవటం కూడా అనుమానమే .నువ్వు కనబడకపోతే కలిగే దుఖం ఇప్పటి దాకా అనుభవించిన దుఖం కంటే ఎక్కువౌతుంది .నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నాకొక సందేహం కలిగింది దాన్ని తీర్చి వెళ్ళు .కోతులు ఎలుగులు మనుషులు మహా సముద్రాన్ని యెట్లా దాటగలరు .సముద్రం దాటటానికి నువ్వు నీ తండ్రి వాయువు ,గరుత్మంతుడు మాత్రమె సమర్ధులు .ఇంతటి కష్టమైన విషయాన్నిఎలా సాధ్యం చేయాలని ఆలోచి౦చావోచెప్పు కార్య సాధక ఉపాయజ్ఞులలో నువ్వు గొప్పవాడివి .అయినా సకల శత్రు నాశనానికి నీవు ఒక్కడివే సమర్దుడవు అని నాకు తెలుసు .కాని దీనివలన కీర్తి నీకు వస్తుంది కాని నాకు కాదు .రాముడే వచ్చి శత్రునాశనం చేస్తే నాకు కీర్తి కలుగు తుంది ‘’అన్నది .

 ఇదివరకు రాని సందేహాలపుట్ట దులిపిన సీతాదేవియుక్తికి సంతోషిస్తూ హనుమ ‘’వానర భల్లూక  సేనలకు రాజు సుగ్రీవుడు .నీ కార్యం సాధించటానికి వేలాది కోట్ల సైన్యంతో  సర్వ సిద్ధంగా ఉన్నాడు .ఆ సైన్యం లో పరాక్రమ ధైర్య మహా బల సంపన్నులు మనో వేగులు ఉన్నారు .వారంతా పైకి కిందికి అడ్డం నిలువు గా అడ్డు లేకుండా సంచరించగల సర్వ సమర్ధులు .ఆవానరులు ఇప్పటికే చాలాసార్లు వాయుమార్గాన సంచరిస్తూ పర్వత సముద్రాలతో ఉన్న భూమిని ప్రదక్షిణం చేసి వచ్చిన వాళ్ళు .నా కంటే అధికులు ,నాతో సమానులు అయిన వానరులు ఎందరో సుగ్రీవ సైన్యంలో ఉన్నారు .నా కంటే బలహేనుడుఒక్కడు కూడా లేడు.నేనే సముద్రం దాటి వస్తే, వారి విషయం లో అనుమానం ఎందుకు .వాళ్ళంతా ఒక్కగంతులో ఇక్కడికి వస్తారు నమ్ము .దుఖం మాని సుఖంగాఉండు  ఉదయ  సూర్య చంద్రులులాగా రామ సోదరులను నా వీపు మీద కూర్చో పెట్టుకొని నీ దగ్గరకు తెస్తాను .తర్వాత రామ సోదరులు తమ అవక్ర పరాక్రమంతో లంకాదహనం చేస్తారు ‘’అని అనునయిస్తూ దుఖం మాన్పి ప్రయాణానికి బయల్దేరి మళ్ళీ ‘’అమ్మా !త్వరలో రామాదులు లంకాద్వారం సమీపిస్తారు .రామ లక్ష్మణుల కంటే వీరుడెవడున్నాడు.ఈ లంకలో  ఎక్కువ కాలం ఉండవు నువ్వు .నీ పతి వస్తాడు త్వరలో .నేను వెళ్లి ఆయన్ను కలిసి నీమాట చెప్పేదాకా ఈ క్లేశాన్ని సహించు ‘’అన్నాడు .-

  ‘’రామా ద్విశిస్టఃకో న్యో స్తి కశ్చిత్సౌమిత్రిణా సమః –అగ్ని మారుత కల్పౌతౌ భ్రాతరౌ తవ సంశ్రయా ‘’

‘’నతేచిరా దాగమనం ప్రియస్య –క్షమస్వ మత్సం గమ కాల మాత్రం ‘’

 ఇది 53శ్లోకాల 39వ సర్గ .

 కార్య సాధనలో అనేక సందేహాలు రావటం సహజం .అంతాఅయి బయల్దేరి వెళ్ళబోతున్న హనుమను ఆపి మరో రోజు ఉండిపోమ్మనటం మనం అతిధులను ఇలాగే రేపు వెళ్ళచ్చు అని వాయిదా వేయించటం లాంటిదే .అతడు ఉంటె మరింత దుఃఖ ఉపశమనం తనకు .కాదని వెడితే అప్పటిదాకా అనుభవించిన దానికంటే అధిక దుఖం కలుగుతుంది .గృహస్తులు  గా  మనం చెప్పే మాటలూ ఇవే కాదా ?

  అలాగే అసలైన మరో గొప్ప సందేహం –కోతులు ఎలుగులు మనుషులు అసలు సముద్రం ఎలా దాటి రాగలరు ?ఇది తప్పక తీర్చాల్సిన సందేహమే .దీనికి హనుమ సంతోషించి తన బుద్ధి విశేషం తో చాలా  సంతృప్తి కరమైన సమాధానం చెప్పాడు –తనతో సమానులు తనకంటే ఎక్కువ పరాక్రమం ఉన్నవారు సుగ్రీవ సైన్యం లో ఉన్నారని చెప్పాడు .అంతవరకూ బానే ఉంది నమ్మచ్చు .కాని వాళ్ళు ఎప్పుడైనా చెట్లూ కొండలూ దాటి బయటికి వెళ్ళారా అనే ప్రశ్న వేస్తుందని ముందే గ్రహించి మతిమాన్ హనుమాన్ –వారంతా చాలా సార్లు భూ

 ప్రదక్షిణచేసిన ధీర వీర,సమర్ధ  పరాక్రమ శాలురు అని చెప్పి ఆ సందేహానికి లాక్ పెట్టేశాడు .ఇక్కడే ఆయన బహు ముఖీన వ్యక్తిత్వ ప్రతిభ జ్యోతకమౌతోంది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

103- బంగ్లా దేశ  సాహిత్యం

భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతం అంచున బంగ్లాదేశ ఉన్నది .పచ్చదనానికి పరవళ్ళు తొక్కే జలప్రవాహాలకు నిలయం .పద్మ (గంగ )యమునా మేఘన నదులు సస్యశ్యామలం చేస్తాయి .బోటుప్రయాణానికి అనుకూలం కూడా .దక్షిణాన సుందర వనాలు ,రాయల్ బెంగాల్ టైగర్ లకు ప్రసిద్ధి .రాజధాని –ఢాకా.కరెన్సీ –బ౦గ్లాదేశ టాకా.జనాభా -16.15కోట్లు .మెజారిటి ముస్లిం లు .బెంగాలి భాష అందరి భాష .జూట్ ,గార్మెంట్ పరిశ్రమ వ్యవసాయం టూరిజం ఆదాయ వనరులు .పేద దేశమే అయినా చాలా దేశాలకంటే నయమే .భద్రత ఉన్న దేశం .పారిశుద్ధ్యం బాగా తక్కువ మురికి కూపంగా ఉంటుంది .

    బంగ్లాదేశ సాహిత్యం శతాబ్దాల కాలంనుంచి బెంగాలీ భాషలో ఉన్నది .స్వతంత్రం ముందు ,వచ్చాక సాహిత్యం లో చాలామార్పులు వచ్చాయి .మధ్యయుగాలలో  ముస్లిం పాలకుల పోషణలో సాహిత్యం వెల్లి విరిసింది .ఆ నాటి కవులలో ఆలోల్, చండీ దాస్,దౌలత్ కాజి ముఖ్యులు .19శతాబ్ది చివర్లో బెంగాలీ సాహిత్యం రవీంద్ర నాద టాగూర్ ,కాజి వహ్డుల్ వదూద్,కాజి నజ్రుల్ ఇస్లాం, బంకిం చంద్ర చటర్జీ ,మీర్ మోసారఫ్ హుసేన్ లద్వారా   ఆధునిక మార్గం పట్టింది .టాగూర్ 60ఏళ్ళ సాహితీ సేవ చేశాడు .కవితలు పాటలు నాటకాలు నవలలు కథా సంపుటులు రచించాడు .వచన రచనలో రాజకీయం సైన్స్,సమాజం సాహిత్యం మతం మొదలైన విషయాలపై ఎన్నో ప్రామాణిక వ్యాసాలు  రాశాడు .చిత్రకళలో నిష్ణాతుడు .ఐరోపా,ఆసియా అమెరికాలలో   లెక్చర్ టూర్లు చేశాడు .సాహిత్యమేరు పర్వతం రవీంద్రుడు ఆయన గీతాంజలికి నోబెల్ పురస్కారం లభించింది .

   సంశూర్ రహ్మాన్ ను బంగ్లా దేశ మహా కవిగా భావిస్తారు .60కవితా సంపుటులు ప్రచురించాడు .బంగ్లా కవిత్వానికి నూతన దిశా నిర్దేశనం చేశాడు .జర్నలిస్ట్ అయిన ఆయన ఇంతటి కవిత్వం రాయటం అత్యంత ఆశ్చర్యం .స్వాదీనతా అవార్డ్ ,బంగ్లా అకాడెమి అవార్డ్ ,ఎకుషే పడక్ అవార్డ్ వంటి లెక్కలేనన్ని పురస్కారాలు పొందాడు .

  కాజి నజ్రుల్ ఇస్లాం రెబెల్ –ఆశ్విద్రోహి కోబి  కవి.  తన ‘’బిడ్రూచి ‘’కవిత్వం తో ఢంకాపగలకొట్టాడు .ఈకవిత్వం ప్రజాహృదయాలను తాకి చలి౦పజేసింది .మతం సాంఘిక బహు భార్యాత్వం,అణచి వేతమొదలైన వాటిపై  పై విరుచుకుపడ్డాడు .అతని గీతాలు పరవశింప జేశాయి .3వేలకు పైగా పాటలు రాసిన మహా కవి నజ్రుల్ .అతని రచనలలో ముఖ్యమైనవి చాయానత్ ,సంచిత ,అగ్ని వీణ, డోలన్ చంప .దరిద్రం పై ఆయన కవిత –

O poverty, thou hast made me great
Thou hast made me honoured like Christ
With his crown of thorns. Thou hast given me
Courage to reveal all. To thee I owe
My insolent, naked eyes and sharp tongue.
Thy curse has turned my violin to a sword…
O proud saint, thy terrible fire
Has rendered my heaven barren.
O my child, my darling one
I could not give thee even a drop of milk
No right have I to rejoice.
Poverty weeps within my doors forever
As my spouse and my child.
Who will play the flute?

 – Translated by Kabir Chowdhury[52

అన్నిమతాలనూ ఆహ్వానిస్తూ 1920లో జూగ్ బని పత్రిక సంపాదకత్వం లో ఇలారాశాడు

Nazrul was a Sunni Muslim . Nazrul wrote an editorial in Joog Bani in 1920 about religious pluralism,

Come brother Hindu! Come Musalman! Come Buddhist! Come Christian! Let us transcend all barriers, let us forsake forever all smallness, all lies, all selfishness and let us call brothers as brothers. We shall quarrel no more.

   బంగ్లా దేశ ఆంగ్ల రచన చాలా ఉన్నది .బేగం రోకియా ,తఃమీమా ఆనం,నియామత్ ఇమామ్  ,మోనికా ఆలి ,జియా హైదర్ రహ్మాన్ పూర్వ ఆంగ్ల రచయితలైతే ,ఇప్పుడు కైజర్ హక్ ,జియావుల్ హక్ లు ఇంగ్లీష్ లో  బాగా రాస్తున్నారు .బేగం రోకియ ఫెమిస్ట్ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి ‘’సుల్తాన్స్ డ్రీం ‘’తో ప్రపంచప్రసిద్ది చెందింది .

  1971 బంగ్లా విముక్తి ఉద్యమంలోభారత ప్రధాని ఇందిరాగాంధీ సహాయం చేసింది .విముక్తి నాయకుడు షేక్ ముజిబూర్ రహ్మాన్ మొదటి ప్రెసిడెంట్ అయి ”బంగ్లాదేశ పిత ”అయ్యాడు  బంగ్లా సాహిత్యానికి స్వర్ణయుగం తెచ్చారు ఆనం ‘’గుడ్ ముస్లిం ‘’రచన తో జియా హైదర్ రెహ్మాన్ నవలలతో .ఇతని ‘’ఇన్ ది లైట్ ఆఫ్ వాట్ వుయ్ నో’’జేమ్స్ టైట్ బ్లాక్ ప్రైజ్ పొందింది .మోనికా ఆలి రచన ‘’బ్రిక్ లేన్’’కు 2003లో బుకర్ ప్రైజ్ వచ్చింది ,ఫయేజా అసనత్ రాసిన ‘’ది బర్డ్ కాచర్ అండ్ అదర్ స్టోరీస్ ‘’కథా సంపుటి లో అస్తిత్వ వివేచనా ,స్త్రీప్రేమ ,అనుబంధం ఉన్నాయి .షాజియా ఒమర్ ‘’లైక్ ఎ డయమండ్ ఇన్ ది స్కై’’లో ఢాకా యూనివర్సిటి విద్యార్ధులు డ్రగ్స్ మొదలైనవాటికి బానిసలైన పట్టుబడిన విషయం ఉన్నది .రషిద్ ఆస్కారి ఇంగ్లిష్ ఫిక్షన్ రాశాడు .ఇతని ‘’నైన్టీన్ సెవెంటి వన్అండ్ అదర్ స్టోరీస్ ‘’-2011సంపుటి ఫ్రెంచ్ ,హిందీ లలోకి అనువాదం పొందింది

  సమకాలీనంగా కైజర్ హక్ బంగ్లా ఇంగ్లీష్ లలో అద్భుత కవిత్వం తో ముందున్నాడు .చాలా జర్నల్స్ వచ్చి సాహిత్య సేవ బాగానే చేస్తున్నాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1

బక దాల్భ్యుడు

బక దాల్భ్యుడు -1

వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి  కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం ధృత రాస్ట్రుని గురించి చెప్పింది కనుక .దీన్ని ఆల్బర్ట్ వెబర్ చాలా కాలం క్రితమే గుర్తించాడు .ఈ కథ మహాభారతం లో ఆ ఆతర్వాత ఇతర పురాణాల లోనూ పేర్కొన బడింది.

పై సంహిత  ప్రకారం వక దాల్భ్యుడు నైమిశీయ బృందానికి చెందిన వాడు నైమిశారణ్యం లో యజ్ఞయాగాలు చేసే మహర్షి .ఒక సారి సత్రయాగం చేశాక  ,తన వద్ద దక్షణ గా కురు పాంచాలురు ఇచ్చిన  27 యువ వృషభాలను తన బృందం వారికి వారిలో వారిని పంచుకోమని చెప్పి ,ఆ బృందాన్ని వదిలి ,ధృత రాష్ట్ర ,విచిత్ర వీర్యుల వద్దకు అమిత ఆశతో వెళ్ళాడు .రాజు ఏమీ దక్షణ ఇవ్వకుండా, రుద్ర పశుపతి చేత జబ్బు పొందిన ఆవులను ఇచ్చి వెళ్లి పొమ్మన్నాడు .పిచ్చి బాపనయ్య ఆవులు కోల్పోయానే అని బాధపడుతాడు అనుకొన్నాడు రాజు .కాని ‘’వక’’ ఆ పశువులను వండి,అమర్యాదగా ప్రవర్తించిన రాజుకు వ్యతిరేకంగా హోమంలో ఆహుతిచ్చాడు .మర్నాడు ధృత రాష్ట్ర సామ్రాజ్య వైభవం అంతా నశించింది .రాజపురోహిత మంత్రి గూఢచారులు దానికి కారణం వక చేసిన యాగమే అని రాజుకు చెప్పారు .ఆ మర్నాడే అత్యంత ధనరాసులతో వక మునిని సందర్శించి సమర్పించగా  .’’నైమిశీయ వక’’, రాజు కోసం మళ్ళీ యాగం చేసి ఒక అన్నం ముద్దను అగ్ని సురభి మత్ కు సమర్పించాడు.రాజు రక్షింప బడ్డాడు .

రెండవ ప్రాచీన గ్రంథాలు  ‘’జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణం ‘’లోఛాందోగ్య ఉపనిషత్ లో బక దాల్భ్య ప్రస్తావన కనిపిస్తుంది .రెండిటిలోనూ రెండుసార్లు ప్రస్తావన ఉంటుంది .జాబాలి బ్రాహ్మణం4-6-1 లో’’ రాజాకామ ప్రేణ యజ్ఞేనయక్ష్యమానసా ‘’ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరధుడు తనకోరిక తీరటానికి  యాగం   చేశాడు.యాగ సమయంలో కురు,పా౦చాల  బ్రాహ్మణులకు కర్మకాండ గురించి నాలుగు ప్రశ్నలు సంధించాడు .అందులో మహా వేదవేత్త బక దాల్భ్యుడు కూడా ఉన్నాడు -4-7-2.-‘’కురు పాన్చాలన౦ బకో దాల్భ్యో ఔచణస ‘’ వాటికి అవలీలగా ఆయన సమాధానాలు చెప్పాడు .సంతృప్తి చెందిన భగీరధుడు బక దాల్భ్యుడినే  తన యాగానికి నిర్వాహకుడు గా ఎంచుకొని  ప్రకటించాడు ,బకుడు ఉద్గీత ను గాయత్ర ఉద్గీత ఆధారం గా గానం చేయగా ,రాజు స్వర్గం చేరాడు -4-8-5’’స హైకరాద్ ఏవ భూత్వా స్వర్గం లోకం ఇయాయ ‘’.  బక దాల్భ్యుడు మూడవసారి జాబాలిఉపనిషత్ బ్రాహ్మణం మొదటి పుస్తకం1-3-9 లో వస్తాడు .ఒకేసారి రెండు సోమయాగాలు చేసే సందర్బం అది ,బకుడు ఇంద్రుని బలవంతంగా  విరోధి ఐన ఆజకేశినుల నుంచి  నెట్టేసి ,తానె ప్రణవం ఉచ్చరించాడు .దీనితో బకా దాల్భ్యుడు సామవేద గానం చేసినవాడు అంటే ఉద్గాత అయ్యాడు .

ఛాందోగ్య ఉపనిషత్ లో 1-12లో కూడా బక దాల్భ్యుడు సామ వేద ఉద్గాత గా కనిపిస్తాడు .ఉద్గాత శునకాల  వ్యంగ్య ప్రదర్శనలోనూ ఉన్నాడు .ఒకప్పుడు ఈయన వేద విద్యార్ధిగా ఉంటూ సంచారం చేస్తుంటే కుక్కల బృందాన్ని చూశాడు .అక్కడ ఒక తెల్లకుక్క వద్దకు  మిగిలిన కుక్కలుపరిగెత్తుకు రావటం చూశాడు .ఆకుక్కలు తెల్లకుక్కను ఆహారం కోసం పాడమని అడిగాయి -1-12-2-‘’అన్నం నో భగవాన్ ఆగాయతు’’.అప్పుడా తెల్ల శునకం వాటిని మర్నాడు ఉదయం  రమ్మని చెప్పింది .బక అక్కడే ఆ రాత్రి అంతా నిరీక్షిస్తూ  తెల్లారే వరకు కూర్చుని ఉన్నాడు .మర్నాటి ఉదయం ఆ కుక్కలు వరుసగా వచ్చిఒకదాని తోక ఒకటి పట్టుకొని బ్రాహ్మణులు ‘’బాహిస్పవామన సూత్రం ‘’ఉచ్చరిస్తున్నట్లు గా ఉన్నాయి -1-12-4-‘’తే హ యథై వేదం బహిస్ప వామనేన స్తోస్య మానః సంరబ్ధాః సర్పంతిత్యే ఏవంఆసస్పృహ’’

ఆకుక్కలు కూర్చుని’’ హిం ‘’అనే శబ్దం చేస్తూ  అన్నం,నీళ్ళ  కోసం ప్రార్ధన గీతం పాడాయి  .ఇక్కడే బక దాల్భ్యుని ‘’గ్లవ మైత్రేయ ‘’గా కూడా చెప్పింది -1-12-1 మరియు 1-12-3-తద్ ధ బకోదాల్భ్యో గ్లవవామైత్రేయః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36

హనుమ మనసు సంతృప్తి చెంది సీతతో ‘’అమ్మా నిన్ను చూస్తేనే శుభాలు కలుగుతాయి. స్త్రీ స్వభావ భయాలకు ,పతివ్రతా లక్షణాలకు తగినట్లు గా మాట్లాడావు .వీపుమీదఎక్కి నూరు యోజనాల సముద్ర౦ దాటటం స్త్రీలకు  శక్తికి మించిన పనే .రాముడిని తప్ప పర పురుషుని తాకను అని నువ్వు చెప్పిన మాట నీకే తగినది .నేను చూసిన నీ రామ విరహం ,రావణుని బెదిరింపు , నీ తృణీకారం నీ ఆత్మహత్యా ప్రయత్నం అన్నీ రాముడికి నివేదిస్తాను .నీ అంతు లేని దుఖానికి  అనేకకారణాలు స్వయంగా చూసిన నేను నాతో తీసుకు పోతాను అన్నాను కాని అన్యధా భావించ వద్దు .లంకలో ప్రవేశించటం సముద్రం దాటటం చాలా కష్టం కనుక ,నిన్ను సముద్రం దాటించే సమర్ధత నాకు ఉండటం వలన, నేను అలా మాట్లాడాను .వెంటనే నిన్ను రాముడి దగ్గరకు తీసుకు వెళ్ళాలన్న ఆలోచన రామునిపై భక్తీ,స్నేహాలవలన అలా చెప్పాను .నాతో రావటానికి ఉత్సాహం నువ్వు చూపకపోతే ,నేను ఇక్కడ నిన్ను చూశాను అని చెప్పటానికి తగిన అభిజ్ఞానం అంటే గుర్తు నాకు ప్రసాదించు ‘’అన్నాడు హనుమ .

రాముడికి ,తనకు ఏకాంతం లో జరిగిన వృత్తాంతం చెప్పబోయిన సీత బాష్పోద్రేకం  తో మాటలు తడబడుతూ నెమ్మదిగా ‘’ఇప్పుడు నీకు నేను చెప్పే ఈ అభిజ్ఞానాన్ని నా రాముడికి చెప్పు.చిత్రకూటం లో ఉండగా ఒక రోజు ఆపర్వతానికి ఈశాన్యం లో మందాకినీ నదీ సమీపాన సిద్ధులు నివశించే ,కందమూలాలు, జలం పుష్కలంగా ఉన్న తాపస ఆశ్రమం లో మేము ఉండగా జరిగిన కథను నామాటలతో ‘’నాథా!ఫలపుష్పాలున్న వనం లో విహరించి అలసి చెమటతో ఉన్న నీ తొడమీద కూర్చున్నాను .అప్పుడొకకాకి మాంసా పేక్షతో వచ్చి ,నా స్తనాంతరం పొడవటం ప్రారంభించి మాటి మాటికీ పొడుస్తూ ఎక్కడో దాక్కునేది .నేను మొలత్రాడు లాగి పట్టి ,నా వస్త్రాన్ని బిగుతుగా కట్టుకొని ,ఆకాకిని పారద్రోలే ప్రయత్నం చేస్తుండగా ,నా విఫల ప్రయత్నాన్ని చూసి నువ్వు నవ్వావు .దానికి ముందు నేను సిగ్గు పడ్డా ,కాకి మళ్ళీ నన్ను గీరటానికి  వస్తే  ,కోపం తో తరిమేసి మళ్ళీ నీదగ్గరకొచ్చి నీ తొడపై కూర్చున్నాను  .కోపించి అలసిన నన్ను నువ్వు ఊరడి౦చావు .కన్నీరు కారుస్తూ .తుడుచుకొంటూ కాకిపై కోపం చూపిస్తూ ఉన్న నన్నుచూశావు ‘’

‘’ హనుమంతా !కాకిపెట్టిన బాధ, శ్రమకు అలసి రాముడి తొడపై పడుకున్నాను .తర్వాత రాముడు కూడా నా తొడపై తలపెట్టి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొన్నాడు .మళ్ళీ ఆకాకి గోల చేయటం మొదలు పెట్టి,అప్పుడే లేచిన నన్ను అది మళ్ళీమళ్ళీ స్తనా౦తర౦   గీరగా ,రక్తం కారి రాముడు తడిసిపోయాడు .అది ఏ మాత్రంభయపడక నన్ను బాధిస్తూనే ఉన్నది .భరించలేక రాముడిని నిద్ర లేపాను .స్తనాల మధ్య కాకి చేసిన గాయం చూసి నిట్టూరుస్తూ రాముడు ‘’ఎవరు ఇ౦త దారుణానికి ఒడిగట్టారు ?’’అని అడిగి నాలుగు వైపులా చూడగా రక్తసిక్తమైన గోళ్ళతో ఉన్న కాకి కనిపించింది. ఆ కాకి ఇంద్రుని కొడుకు వాయు వేగంగా పోగలవాడు భూమి మీదకు వచ్చి ఈపని చేసి అదే వేగంతో పారిపోయాడు  .రామునికి తీవ్రమైన కోపం వచ్చి దాన్ని తీవ్రంగా శిక్షించాలనుకొని ,తన ఆసనం నుంచి ఒకదర్భను తీసి బ్రహ్మాస్త్రం తో మంత్రించి కాకాసురునిపై వదిలాడు.ఆదర్భాస్త్రం కాకిని వెంబడించగా భయపడి రక్షణ కోసం  ని వైపులకూ అన్ని లోకాలకు పరిగెత్తగా దర్భ దాన్ని   వెంబడిస్తూనేఉంది .మూడులోకాలలోని దేవతలు మహర్షులు దాని తండ్రి తల్లి బంధువులుఎవరూ రక్షణ ఇవ్వలేదు .తిరిగి తిరిగి,ఆత్మ రక్షణకోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై మళ్ళీ రాముడే దిక్కు అని శరణు వేడి పాదాలపై పడి పోయింది .దయాసిందు రాముడు ‘’నా బ్రహ్మాస్త్రం వృధా కాదు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు ‘’అని అడిగితె కాకి ‘’నా కుడి క౦టిని  నీ బ్రహ్మాస్త్రం తో హింసించు ‘’అని కోరితే ఆవాయసం కుదడికంటిని బ్రహ్మాస్త్రం పోగొట్టింది .చావు తప్పి ప్రాణాలు నిలిచి కుడికంటిని పోగొట్టుకొని అ కాకి బతికి పోయింది .

‘’కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసినవాడివి ,క్రూర రావణుడిని క్షమిస్తున్నవేమిటి ?నాపై దయ చూపి త్వరగా వచ్చి వాడిని చంపి నా దుఃఖ నివారణ చేయి ‘’

‘’మత్క్రుతే కాకమాత్రేతుబ్రహ్మాస్త్రం సముదీరితం –కస్మాద్యో మాం హర త్త్వత్తః క్షమాసే త౦ మహీపతే ‘’ గుర్తు చేసిన తెలివైన స్త్రీ సీత .

మహీపతే అంటే రాజా అని సంబోధించి రక్షణ రాజధర్మం

‘‘’హనుమా ‘!గొప్ప పరాక్రమ శాలి రాముడు రాక్షసులను ఎందుకు ఉపెక్షిస్తున్నాడు నాకోసం ఆమాత్రం చెయ్యలేడా ఈ తాత్సారం దేనికి  ? నేనేదో పాపం చేసి ఉంటాను .అందుకేరక్షించే సమర్ధత ఉన్నా రామ సోదరులు రాలేదు ‘’అని విలపించింది సీత .ఆమె ను ఊరడిస్తూ ‘’అక్కడ రాముడూ తమ్ముడూ దురంతా దుఖం లో ఉన్నారు వారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలీదు .వారు రావటం లంక నాశనమవటం తధ్యం ‘’అన్నాడు హనుమ .మళ్ళీ సీత ‘’రాముడి క్షేమమ అడిగానానని ప్రనమిల్లానని చెప్పు .లక్ష్మణ సమేతంగా అక్కడి వారందర్నీ కుశల అడిగానని తెలుపు .ఇంకొక నెల రోజులు మాత్రమె బతికి ఉంటానుఅని గట్టిగా నా నాదునికి చెప్పు ‘’అని తన చీర కొంగున ముడి పెట్టి దాచిన చూడామణి తీసి హనుమకు ఇవ్వగా తీసుకొనిభక్తితో వ్రేలికి పెట్టుకొని ,నమస్కరిస్తూ సీత చుట్టూ ప్రదక్షణాలు చేసి మనసులో రాముడిని తలచుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధపడి .పెనుగాలికి కంపించి ,ఆ గాలి తాకుడు నుంచి విముక్తమైన కొండ లాగా మనసంతా సుఖం నిండి ఉన్నాడు .

‘’మణివర ముప గృహ్య త౦ మహార్హం –జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ –గిరిరివ పవనావధూత ముక్త –స్సుఖిత మనాఃప్రతి సంక్రమం ప్రపేదే’’.

ఇది 72 శ్లోకాల 38వ సర్గ .

ఇప్పటివరకు రాముడు ఇచ్చిన ఉంగరం అంటే అంగుళీయకం సీత కు హనుమ ఇవ్వటం హనుమ కు సీత తన చూడామణి ప్రదానం చేసి రాముడికి గుర్తుగా పంపటం జరిగింది

తెలుగు దేశం లో తక్కువే కాని తమిళదేశం లో మణి తో పెరున్నవారు చాలామంది ఉన్నారు .మణిరత్నం వగైరా ..చూడామణి చిన్నగా ఉంటుంది కదా హనుమ వ్రేలికి ఎలా తొడుక్కున్నాడు అనే అనుమానం వస్తుంది అంటే అప్పటికి తన మహోన్నత రూపు తగ్గించుకొని మామూలు వానరంగా మారి ఉంటాడని బిట్వీన్ ది లైన్స్ మనం అర్ధం చేసుకోవాలి .

హనుమ కూడా తానూ సీతతో వీపు మీద కూర్చోపెట్టుకొని సముద్రం దాటిస్తాను అన్నమాట కు క్షమాపణ చెప్పుకొన్నాడు .బుద్ధిమంతుల లక్షణం అది తొందరపడినా తర్వాత తప్పు తెలుసుకొని లెంపలు వాయిన్చుకోవాలి  ఇది లోక సహజం .పర పురుషుని తాకను అని ఆమె చెప్పిన మాటకూ శిరసువంచి నమస్కరించి తన సంస్కారం తెలియజేశాడు .ఇందులో సీత రామ పరాక్రమాన్ని చాలాసార్లు తనివి తీరా వర్ణించి,తప్పక వస్తాడనే నిశ్చయానికి చేరింది

అభిజ్ఞానం గా సీత చెప్పిన కాకి వృత్తాంతంఆమె పడిన బాధ వేదన కు దృష్టాంతం .కొంత సూటిగా కొంత వేరుగా చెప్పటం లో కథగమనం కుదిరింది .ఆఫ్టరాల్ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన భర్త తనకోసం ప్రయోగించాకపోవటం ఏమిటని నిలదీసింది .అవును అవసరం వచ్చినప్పుడు అలా కడిగి పారేస్తేనేకాని ఉపశమనం పొందటం కుదరదు .కాకి ఏక కన్ను కాకి ఎందుకయిందో మనకు తెలుస్తుంది .కుడి కన్ను బ్రహ్మాస్త్రానికి బలి అయింది .లోకం లూకేకన్నున్నవాడిని ‘’ఏకాకన్నయ్య ‘’అంటారు .రోజులు మారాయి సినిమాలో ఆ పేరుతొ ఒక కేరక్టర్ ఉంది .

కాకాసురుడు అనిలోకం లో ప్రతీతి .అంటే వాడు రాక్షసుడు .కాని సీత వాడిని ఇంద్రుని కొడుకు అన్నది .ఇంద్రుడు అదితి కొడుకు .ఈలంకే ఏమిటో తెలీదు .వదిలేద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఎవరీ దాల్భ్యుడు?

ఎవరీ దాల్భ్యుడు?

పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు .

శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్  

రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్

పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి

  ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై శ్లోకం నాకు స్పురణకు వచ్చింది .చటుక్కున ఇందులో అందరు మహానుభావులూ, తెలిసినవారే  మరి దాల్భ్యుడు గురించిన చరిత్ర తెలియ లేదే అనే ప్రశ్న బయల్దేరింది .నాకే కాదు చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు అని పించి ,ఆయనకోసం దుర్భిణీ వేసి వెదకటం ప్రారంభిస్తే ఎడారిలో ఒయాసీస్ లాగా కొద్ది సమాచారం లభించింది .దీనినే అందరికీ పంచుదాం అని పించి తెలియ జేస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఉంటే తెలియ జేసి సమగ్రం చేయండి .

  చాలాకాలం క్రితం నైమిశారణ్య మహర్షులు ఒక హోమం నిర్వ హించటానికి పూనుకొని ధృతరాష్ట్ర మహా రాజు దగ్గరకు వెళ్లి కొంత ధనం కోరారు .ఈ మహర్షులకు నాయకుడు దాల్భ్యుడుఅనే మహా తపస్సంపన్నుడైన మహర్షి .ఈయననే ‘’బక ‘’అంటారు .ఈయనే రాజును డబ్బు అడిగింది .రాజు డబ్బు ఇవ్వకపోవటమే కాదు ,ఆయన్ను అవమానించాడు కూడా .ఈ పరాభవాన్ని సహించలేక దాల్భ్యమహర్షి ప్రతీకారం చేయాలని భావించి హోమం తలపెట్టి చేసి అందులో హవిస్సుగా ధృత రాష్ట్ర సామ్రాజ్యాన్ని అగ్నికి సమర్పించాడు .ఈ యాగాన్ని ‘’పృధూదక’’లో ‘’అవికీర్ణ మహా తీర్ధం ‘’లో చేశాడు .దీనితో  ధృత రాష్ట్ర  సామ్రాజ్యం పతనం చెందటం ప్రారంభించింది .మంత్రి ,పురోహిత,కార్తాంతిక  ముఖ్యులను సంప్రదించి ఇలా జరగటానికి కారణం విచారించాడు .వారందరూ దీనికి కారణం దాల్భ్యుని హోమం అని ముక్తకంఠంగా చెప్పారు  .కంగారు పడ్డ మహారాజు అంతులేని ధనరాసులతో పరివార సమేతంగా దాల్భ్యుడు హోమం చేసిన ‘’అవకీర్ణ మహా తీర్థానికి ‘’వెళ్ళాడు.తాను  తెచ్చిన సంపద అంతా దాల్భ్యమహర్షి పాదాల చెంత ఉంచి, తప్పు మన్నించమని వేడుకొన్నాడు .ఉదార హృదయం తో రాజు తప్పు మన్నించి, దాల్భ్యుడు మళ్ళీ హోమం నిర్వహించి అందులో హవిస్సుగా పాలు ,తేనె, సమర్పించగా ,సామ్రాజ్యంలో చనిపోయినవారంతా పునరుజ్జీవితులయ్యారు అని వామన పురాణ0లోని  39 వ అధ్యాయం లో ఉంది .అంతటి శక్తి సంపన్నుడు దాల్భ్యమహర్షి .

  మహా భారతం లో సభాపర్వం 4వ అధ్యాయం ,11వ శ్లోకం లో యుధిస్టిరుని కొలువులో దాల్భ్యమహర్షి ఉన్నట్లు తెలుస్తోంది .మరొక చోట సత్యవంతుని తండ్రి ద్యుమత్సేనుని  దాల్భ్యుడు సందర్శించి సత్యవంతుడు చిరాయువు కలిగి ఉంటాడని ఆశీర్వ దించినట్లు వనపర్వం 298అధ్యాయం 17వ శ్లోకం లో ఉన్నది.

  దల్భుని కుమారుడు దాల్భ్యుడు .దార్భ్య అనీ అంటారు .దండ్రి నుంచి వచ్చిన పేరు .పంచ వింశ బ్రాహ్మణం లో కేశి అనీ ,ఛాందోగ్య ఉపనిషత్,జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణంలో  చైకితాయన అనీ ,ఛాందోగ్య కథక సంహితలో ‘’వాక లేక బక ‘’గా పిలువబడినాడు .

  దాల్భ్య మహర్షి 160శ్లోకాల ‘’శ్రీ విష్ణు రపామార్జన స్తోత్రం ‘’రాశాడు.అపామార్జన అంటే శుద్ధి చేయటం ,పాపాలు తొలగించటం అని అర్ధం . .ఇందులో దాల్భ్య ,పులస్య సంవాదం ఉంటుంది –మొదటిశ్లోకం –

‘’భగవన్ప్రాణినః సర్వేవిషరోగాద్యుపద్రవైః –దుస్టగ్రహోప ఘాతశ్చసర్వకాల ముప ద్రుతాః’’

చివరి శ్లోకం –

‘’ధన్యో యశస్వీ శత్రుఘ్నః స్తవోయం ముని సత్తమ –పఠతాం,శృణుతాం చైవ దదాతి పరమాం గతిం’’

‘’ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ,విష్ణు రహస్యే ,పులస్త్య దాల్భ్య సంవాదే –శ్రీ విష్ణో రపామార్జన  స్తోత్రం సంపూర్ణం ‘

‘’ భక్త మాల’’ గ్రంథం లో విప్ర వరుడైన దాల్భ్యుడు దత్తాత్రేయ మహర్షి ఉపదేశం తో సీతారాముల భజన స్తోత్రం అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆర్తిగా చేశాడు .ప్రీతి చెందిన శ్రీరామ ప్రభువు దర్శనం అనుగ్రహించాడు .శ్రీహరి ఆశీస్సులు పొంది దైహిక ,దైవిక ,భౌతిక తాపాలు తొలగించుకొని ,సర్వ కార్య సిద్ధుడు అయ్యాడు .బహుశా ఈ మహాభక్త దాల్భ్యుడే మన భక్త శిఖామణుల శ్లోకం లో స్థానం సంపాదించి ఉంటాడు.

  నేను 23-6-14న రాసిన ‘’బ్రాహ్మణాలలో రాజులు’’ వ్యాసం ప్రకారం –

‘’ వ్రతర్దనుడు అనే రాజు యజ్ఞ విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రాహ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్దరు క్షత్రియులతో వాదం చేసినట్లు ఛాందోగ్యం చెబుతోంది .దాల్భ్యుని సోదరులు ‘’బక దాల్భ్యుడు’’ జైమినీయ బ్రాహ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రాహ్మణం లోను  కనిపిస్తారు.ఈ ముగ్గురి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే  కౌరవ రాజు సోదరి .తండ్రి శతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రాహ్మణం లో ఉన్నది .

ద్రుపద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు ‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తోంది .ద్రౌపదికి యాజ్ఞ సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్ఞులే ,కేశి దాల్భ్యుని సమకాలికులే.’’

 

సమాధిలో గోచరించు దసవిధినామములకు భ్రమింపకుము
పూర్వం శ్రీకృష్ణుడు ద్వారలో పదహారువేలమంది భార్యలతో సుఖంగా జీవనం కొనసాగిస్తుండేవాడు. ఒకనాడు కృష్ణుని కొడుకైనా సాంబుడు విహారానికి వెళుతుండగా.. పరమసుందరుడైన అతనిని చూసి.. ఆ పదహారువేలమంది కృష్ణభార్యలు మదనతాపం పడతారు. కృష్ణుడు తన దివ్యదృష్టితో అది గ్రహించి.. ‘‘మీరందరూ మీ తరువాత చోరుల ద్వారా అపహరించబడతారు’’ అని శపిస్తాడు. వారు ‘‘మాదాల్భ్యుడు అనే ముని కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు. ఆ ప్రకారం చేసి విముక్తి పొందుతారు’’ అని చెబుతారు.

ముసలితనం వచ్చి యాదవవంశం నశిస్తుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించగా.. అష్టమహిషులు అగ్ని ప్రవేశం చేశారు. అర్జునుడు పదహారువేలమందిని తీసుకుని హస్తినాపురానికి వెళుతుండగా.. చోరులు అతనికి ఓడించి ఆ స్త్రీలను అపహరిస్తారు. దాల్బ్యుడు, ఆ స్త్రీలు వున్న చోటుకి రాగా వారు అతనిని చూసి.. ‘‘స్వామీ! మేము శ్రీకృష్ణుని భార్యలమయి అంత బతుకు బతికినా.. మాకు ఈ చోరుల చేతిలో పరాభవం కలగడానికి కారణమేంటి’’ అని అడుగుతారు.

అప్పుడు ఆ ముని.. ‘‘కాంతలారా! పూర్వం మీరు వైశ్వానరుని పుత్రికలు. యవ్వనమదంతో వుండి, ఒకసారి జలక్రీడలు ఆడుతుండగా.. అటువైపు వచ్చిన ఒక నారదునిని ఆపి ‘‘మేము నారాయణునికి భార్యలము కావాలని కోరుకుంటున్నాము. దానిని ఉపాయం చెప్పు’’ అని అన్నారు. వినయవిధేయతలు లేని మీ అందరినీ చూసి, ఆ నారదుడు కోపంతో తన మనసులో ఇలా అనుకుంటాడు.. ‘‘చైత్రవైశాఖ మాసంలో శుద్ధ ద్వాదశీ దినంలో వ్రతం ఆచరించి, బంగారు పరికరంతో రెండు శయ్యలను విప్రులకు దానమిస్తే.. మీరు రాబోయే 28వ మహాయుగంలో శ్రీకృష్ణునికి భార్యలు అవుతారు. మీ మర్యాదలేని ప్రవర్తన వల్ల వేశ్యలవుతారు’’ అని పలికి వెళ్లిపోయాడు.

అలా ఆ విధంగా నారదుడు చెప్పిన విధంగా, రెండు శాపాలతో మీరు చోరుల చేతిలో పడి వేశ్యాత్వం పొందారు. ఇప్పుడైనా మీ ఇళ్లకు వచ్చే విటులని శ్రీహరి రూపంగా భావించి, వేశ్యాధర్మాన్ని పాలించి, తరించండి’’ అని దాల్భ్యుడు బోధించగా.. శ్రీకృష్ణుని భార్యలు వేరే గతిలేక వేశ్యలుగానే బ్రతికి, తమ దేహాలు చాలించి ముక్తి పొం

ఇంతటి అద్భుత విషయ చరిత్ర ఉన్న దాల్భ్య మహర్షిని మనం పట్టించు కోకపోవటం మన తప్పిదమేకాదా –

దాల్భ్య మహర్షి సూక్తి

సమాధిలో గోచరించు దసవిధినామములకు భ్రమింపకుము

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-20-ఉయ్యూరు  .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35

హనుమ మాటలకు సీత ‘’రాముడు నా వియోగానికి దుఖిస్తున్నాడని నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతం లాగా ఉంది .బాగా- ఐశ్వర్యం కలిగినా ,భరించరాని కష్టం వచ్చినా మనిషి స్వతంత్రుడు కాలేడు,దైవం వాడిని తాళ్ళతో కట్టినట్లు ఈడ్చుకు పోతుంది.దైవం నివారింప శక్యం కానిది .కనుకనే నేనూ రాముడూ ఆపదలలో చిక్కాం –

‘’ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే-రజ్జ్వేవ పురుషం బద్ధ్వా కృతాన్తః పరి కర్షతి ‘’

 ‘’విదిర్నూన  మసంహార్యః ప్రాణినాం  ప్లవగోత్తమ -సౌమిత్రిం మాం చ   రామంచ వ్యసనైః పశ్య మోహితాన్ ‘’ఇచ్చిన గడువు ఏడాది మాత్రమె ఎపుడు రాముడు వస్తాడో నన్ను ఎప్పుడు తీసుకు వెడతాడో .ఇప్పుడు పదో నెల గడుస్తోంది .ఈపాటికే నన్ను చంపేసేవాడు క్రూర రావణుడు .తమ్ముడు విభీషణుడు నన్ను విడిపించి రామునికి నన్ను సమర్పించమని హితవు చెప్పాడు .వాడు వినలేదు .వాడి వాలకం చూస్తె వాడు మృత్యువుకు ఎర అయ్యేట్లు కనిపిస్తోంది ‘

  విభీషణుడిపెద్దకూతురు’’ అనల ‘’ తల్లి పంపగా నాదగ్గరకు వచ్చి పై విషయం చెప్పింది

 ‘’జ్యేష్టా కన్యా నలా నామ  విభీషణ సుతా కపే-తయా మమేద మాఖ్యా త౦  మాత్రా ప్రహితయాస్వయం ‘’

నా అంతరాత్మ పరిశుద్ధమైనది .రాముడు తప్పక వస్తాడు అని చెబుతోంది .రాముడు లోకో  త్తరకార్య నిర్వాహ దక్షుడు దానికి తగ్గ పౌరుష ,బల ,క్షమ,శౌర్య ధైర్యయుక్తి గుణ విశేషాలు

 విశిష్టంగా ఉన్నవాడు –

‘’ఉత్సాహః పౌరుషం సత్వ మానృశంస్యం కృతజ్ఞతా –విక్రమశ్చప్రభావశ్చ సంతి వానర రాఘవే ‘జనస్థానం లో తమ్ముడు తోడు లేకుండానే రాముడొక్కడే 14వేల రాక్షసులను సంహరించాడు .అలాంటి మహా వీరునితో పగ పెట్టుకొని బట్టకట్ట కలిగే వాడు ఎవడు ఉంటాడు ?-‘’అంటూ చాలా ఎమోషనల్ గా ,ఎక్కువగా మాట్లాడుతున్న సీతను చూసి హనుమ మళ్ళీ అనునయించటం మొదలుపెట్టాడు –

‘’జనస్థానే వినాభ్రాత్రా శత్రుః కస్తస్య నో ద్విజేత్ –న స శక్యస్తు లయితుం వ్యసనైః పురుషర్షభః ‘’

‘’ఇతి సంజల్ప మానాంతాం రామార్ధే శోక కర్శితాం –అశ్రు సంపూర్ణ నయనా  మువాచ వచనం కపిః’’

‘’అమ్మా నేను వెళ్లి నీ విషయం చెప్పగానే వానర భల్లూక సైన్యాలతో రాముడు వెంటనే బ,యల్దేరి వస్తాడు .ఒక వేళ,రాడనీ కానీ  ,గడువు దాటాక వస్తాడేమో అనే అనుమానం నీకు ఉంటె ‘నువ్వు నా వీపు మీద కూర్చో .వెంటనే సముద్రం దాటి రాముడి దగ్గరకు చేరుస్తాని .నువ్వే కాదు సకల లంకా రాజ్యాన్నీ రావణుడితో సహా మోసుకు వెళ్ళే శక్తి సామర్ధ్యాలున్న వాడిని నమ్ము .హోమ ద్రవ్యాన్ని అగ్ని ఇంద్రునికి చేర వేసేట్లుగా నేను నిన్ను రాముడికి సమర్పిస్తాను .సందేహించక నా వీపు ఎక్కి మహా సముద్రం దాటి వేద్దాం .నా వెంటబడి వచ్చి నన్ను ఆపగల మొనగాడు ఇక్కడ లేడు .ఇక్కడికి యెంత సునాయాసంగా వచ్చానో అంతే తేలికగా నిన్ను తీసుకుపోగలను ‘’అని సందేహ నివృత్తి చేసి ,పరిష్కార మార్గం సూచి౦చ గానే సీతాదేవి పులకిత గాత్రియై ,’’వానరా ! నువ్వు నన్ను చాలా దూరం మోసుకు తీసుకు పోదామని భావిస్తున్నావు .ఇందులో నీ బుద్ధి సూక్ష్మత కంటే ‘’కపిత్వం ‘’ఎక్కువగా ఉన్నది .నీది చిన్న శరీరం ,దానితో ఇంతపెద్ద నన్ను ఎలా మోసుకు పోవాలను కొంటున్నావయ్యా పిచ్చి కపీ .’’అనగానే గురుడికి బల్బు వెలిగి ఇంతటి అవమానపు మాట ఇదివరకు ఎవరూ అనలేదని ,అదొక కొత్త పరాభవంగా భావించాడు .అప్పటిదాకా ‘’ప్లవగోత్తమ ‘’అని గౌరవించిన సీత అమాంతంగా’’ కపీ’’ అనటం  గుండెకు బల్లెం గుచ్చుకున్నంత బాధ కలిగించింది .ఆమెకు నమ్మకం కలిగించాలి .లేకపోతె మొదటికే మోస౦  కలిగింది  .వెంటనే తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు .అది మేరు పర్వతం మందర పర్వతం అంతపెరిగి ప్రజ్వరిల్లే అగ్నిలాగా ప్రకాశిస్తూ వామనుడు త్రివిక్రముడైనట్లు కనిపించాడు .-ఒకసారి హనుమ విశ్వ రూపాన్ని దర్శిద్దాం మనం కూడా –

‘’మేరు మందార  బభౌ దీప్తానల ప్తభః –అగ్రతో వ్యవతస్ధే చ సీతాయా వానరోత్తమః ‘’

‘’హరిః పర్వతసంకాశ స్తామ్ర వక్త్రో  మహాబలః –వజ్ర దంష్ట్ర నఖో భీమో వైదేహీ మిద మబ్రవీత్

‘’చూశావా అమ్మా నా విశ్వ రూపం .వనాలు పర్వతాలు కోటలు ,ప్రాకారాలు ,పురద్వారాలతో ఉన్న ఈ లంకను ,రావణుడి తో సహా ఎత్తుకొని తీసుకుపోయే సామర్ధ్యం నాది .ఇక ఊగిసలాట అనుమానం వదిలి స్థిర బుద్ధితో నేను చెప్పినట్లు చేసి శీఘ్రంగా రామ దర్శనం చేసుకో ‘’అన్నాడు .

ఇంతింతై వటుడింతయై అని వామనుడు పెరిగినట్లు పెరిగిన మహా భక్త చింతామణి హనుమ విశ్వరూపిగా పెరగటం చూసి సీత సంభ్రమ ఆశ్చర్యాలతో ‘’మహా కపీ ! నీ ధైర్య శౌర్య పరాక్రమ వాయు వేగాల అగ్ని సదృశ అద్భుత తేజస్సు  తెలుసుకొన్నాను .కనుకనే సముద్రం దాటి రాగలిగావు .నన్ను మోసుకొని సముద్రం దాటే శక్తి నీకుంది అని నాకు అర్ధమైంది .కానీ అంతా మంచే జరుగుతుందని అనుకోరాదు కీడెంచి మేలు ఎంచమన్నారు .నీ వాయు వేగానికి తట్టుకొనే సామర్ధ్యం నాకు లేదు. తెలివి తప్పి జారి పడిపోవచ్చు.అప్పుడు సముద్ర తిమింగిలాలు మొసళ్ళు నన్ను తినేయచ్చు .రక్షించాల్సిన వ్యక్తీ మరొకడున్నప్పుడు నీకుఆపద రావచ్చు .రాక్షసులు చూస్తె రావణ ఆజ్ఞతో నిన్ను వెంటాడుతారు .నన్ను మోసుకొని పోతూ ఆకాశం లో ఆయుదాలులేకుండా వాళ్ళతో ఎలా పోరాడగలవు  ?నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే భయపడి నీ వీపునుంచి జారి నేలమీద  పడిపోతానేమో  అప్పుడు రాక్షసులు నన్ను తీసుకు పోవచ్చు .నీ బలపరాక్రమాలు నాకు తెలిసినా జయాప యాలు దైవా ధీనాలు కదా .కనుక ఎటు చూసినా నన్ను తీసుకు పోయే నీ ప్రయత్నం  వృధా అవుతుంది .నువ్వు సర్వ రాక్షస సంహారం చేయగల సమర్దుడవే అనుమానం లేదు .కాని నువ్వు రామ దూతవు  .రాముడు చేయాల్సిన సంహార కార్యం నువ్వు చేస్తే రాముని కీర్తి మసక బారు తుంది కదా .లేకపోతె నీ భయంతో నన్ను రాక్షసులు ఇంకో చోట దాచి పెట్టవచ్చు .నేనెక్కడ ఉన్నానో ఎవరికీ తెలియకపోవచ్చు .కనుక ఇలా చూసినా నీ ఆలోచన సత్ఫలితమివ్వదు.నాపతి దేవుడు నీతో లంకకు రావటమే సర్వ విధాలా ఉత్తమం ,నా బ్రతుకుపైనే రామసోదరుల  సుగ్రీవాదుల వంశ క్షేమం ఆధార పడి ఉంది .

  నాకు ప్రాణాపాయం కలిగితే రామ సోదరులకు నా ఆశ లేక కృశించి వానర భల్లూకాలతో సహా ప్రాణాలు విడుస్తారు .నీ మనసులో ఒక సందేహం ఉండి ఉండచ్చు .నువ్వు పరపురుడివి కదా నిన్ను తాకుతూ  నేను కూర్చోవాలికదా మరి అలాంటప్పుడు రావణుడు ఎత్తుకొచ్చినప్పుడు అతని స్పర్శ తగలలేదా అను కోవచ్చు నువ్వు .నాపతి శరీరం తప్ప వేరొక పురుషుని శరీరం నేను తాకను తాకలేదు కూడా .రావణుడు బలాత్కారంగా  నన్ను జనస్థాన౦  నుంచి  ఎత్తుకొచ్చినప్పుడు నేను ఆశక్తురాలను నా భర్త దగ్గర లేడు.దుఃఖ పరవశత్వంతో నాకు శరీర స్పృహ లేనేలేదు . నేనేమీ చేయలేని స్థితి .

‘’భర్తు ర్భక్తిం పురస్కృత్య రామా దన్యస్య వానర –న స్ప్రుశ్యామి శరీరం తు పుమ్సో వానర పుంగవ’’

‘’  యదహం గాత్ర సంస్పర్శ్య౦ రావణస్య  బలాద్గతా-అనీశా కిం కరిష్యామి వినాథా వివశా సతీ .రాముడే రావాలి ఆయనే లంకరాజునుచంపాలి .రామ సోదరులకు ఎదురు నిలిచే వారు లేరు .కనుక నాయనా హనూ! .రామ లక్ష్మణ సుగ్రీవ కపి భల్లూక సైన్యంతో నువ్వు కూడా కలిసి త్వరలో రండి .నా శోకాన్నితీర్చండి .’’అని విస్పష్టంగా సందేహ రహితం గా సీతాదేవి హనుమకు చెప్పింది .

‘’సమే హరి శ్రేష్టసలక్ష్మణ౦ పతిం –సయూధపం క్షిప్ర మిహోప పాదయ –చిరాయ రామం ప్రతి శోక కర్శితాం –కురుష్వ మాంవానర ముఖ్య హర్షితాం ‘’

  ఇది 66 శ్లోకాల 37వ సర్గ

  ఇందులో హనుమ బలపరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు ముందు సీత తడిని అనేక సార్లు ‘’కపి ‘’అనే పిలిచింది .చిన్న కోతితనను మోసుకు పోవటం ఏమిటి  అని ఎద్దేవాచేయటమే కాదు అతని చపలత్వ కోతి ఆలోచనలనూ నిర్మొహమాటంగా చెప్పింది .హనుమ విశ్వరూపం చూశాక పూర్తి నమ్మకం కలిగి అతడిని వానర శ్రేస్టా,మహా కపీ ,కపి సత్తమ ,హరి శ్రేష్టఅని అత్యంత గౌరవంగా సంబోధించింది .హరి ఎలా విశ్వ రూపం ప్రదర్శించాడో ఈ హరి అంటే కపి వానరుడు కూడా విశ్వరూపం చూపించాడు .భగవంతుడికి భక్తుడికి భేదం లేదనీ తెలియ జేశాడు .వాల్మీకి మహర్షికూడా కపికి సాఫ్ట్ కార్నర్ గా సంబోధనలు మార్చాడు .

  తాను  వివశనై ఉన్నానుకనుక రావణుడు ఎలా తెచ్చాడో తనను అని చెప్పిహనుమ  సందేహం తీర్చి౦ది .’’ఎగిరిపోతే ఎంత బాగుంటుందో’’అను కొంటె సీత జీవితం కొల్లేరే .అక్కడే సంయమనం బుద్ధి లోకజ్ఞత ప్రదర్శించింది .వీపు మీద మోసుకు పొతే వచ్చే ప్రమాదాలన్నీ నీళ్ళలో పడితే జలచరాలకు ఆహారం అవటం భూమిమీదపడితే మళ్ళీ రాక్షుల పాలుకావటం ఈసారి మరింత కనపడరాని చోటు లో దాస్తే కనుక్కోవటం ఎవరికీ తెలియదనే వాస్తవం చెప్పింది .అయినా నువ్వెవడివి’’ కోన్ కిస్కా’’?మా ఆయనే రావాలి ఆయనే నన్ను రక్షించి రావణ సంహారం చేయాలి .ఆయనకు దక్కాల్సిన కీర్తి వేరొకరికి దక్కరాదు అనే మనో  నిశ్చయం  వస్తాడనే పూర్తినమ్మకం తెలిపింది .అంతటి పరాక్రమ వంతుడు హనుమ సాయంగా ఉంటె రామకార్యం సఫలమే కాని విఫలం కాదు అని భావించింది .ఆమె దుఖం త్వరలో తీర్చటానికి హనుమ చెప్పిన సూక్ష్మలో మోక్షం సూచన బానే ఉన్నా దానిలో ఉన్న ఇబ్బందులు ఆలోచించలేని ఆవేశ పరత్వం  కపిత్వం మరోమారు   మనకు కనిపిస్తుంది .ఆవేశం కన్నా ఆలోచన మిన్న అనే సత్యం సీత వాక్కులలో  ప్రతిధ్వనిస్తోంది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

101-వియత్నాం దేశ సాహిత్యం

వియత్నాం ఆగ్నేయ ఆసియాలో సౌత్ చైనా సముద్రం దగ్గర ఉన్న దేశం బౌద్ధ కట్టడాలకు బీచ్ లకు ఆకర్షణ .రాజధాని –హోచిన్ .ఆ దేశ మడమ తిప్పని మహా నాయకుడు హొచిమిన్ స్మారక మార్బుల్ మ్యూజియం  హోచి మిన్ సిటి లో ఉన్నది .కరెన్సీ –వియత్నమీస్ డాంగ్.జనాభా 9 .60కోట్లు .భాష –వియత్నమీస్ .మతం సెక్యులర్ అయినా బౌద్ధం టావొయిజం,కన్ఫ్యూషనిజం అనుయాయులున్నారు .ఎలెక్ట్రానిక్స్ మెషిన్రి ,ఫుట్ వేర్ ,వుదేన్ ,సీఫుడ్స్ ఆదాయ వనరులు .ఒకప్పుడు అతి బీద దేశం .ఇప్పుడు అభివృద్ధిచెందిమధ్య తరగతి రాబడి దేశమైంది .

  వియత్నమీస్ సాహిత్యం 11వ శాతాబ్దివరకు చైనా పెత్తనం లో ఉన్నది .అసలుసిసలైన వియత్నమీస్ సాహిత్యం మాత్రం 18వ శతాబ్దిలో వచ్చింది .17వ శతాబ్దిలో ‘’కోక నూగు ‘’స్క్రిప్ట్ ఉన్నా ,అది మిషనరీ గ్రూపులను దాటి రాలేదు .18వ శతాబ్దిలో వియత్నాం ప్రముఖ రచయితలూ ‘’చు నాం’’అనే అధికార భాషా స్క్రిప్ట్ లో రాశారు .20వ శతాబ్ది మధ్యలో కోక నూగు లో రాశారు .మధ్యయుగం లో చైనీస్ భాషా రచనలే .తమపూర్వీకులు –లాక్ లాంగ్ కువాన్ ,ఆకో ల కధలు ,సాంస్కృతిక వీరులు-సొన్ టిన్ అంటే మౌంటేన్ స్పిరిట్ ,తుయే టిన్ అంటే వాటర్ స్పిరిట్ మొదలైన జలవాయు పర్వత దేవతాగాథలు రాయ బడినాయి

 చైనానుంచి విడిపోయి స్వతంత్రం పొందాక వియత్నాం కవులు స్వేచ్చగా కవిత్వం రాశారు .ఒక సారి ఆదేశ సాహిత్య సోపానం చూద్దాం –

దీన్ దుయు చేయు -1010,నాన్ పోక సం హా -1077,ది విరాట్ సుకి -1272,డు చు టి టువాంగ్-1284,వాన్ డాల్ దొల్ నూగు -1773,ఫు బిన్ టాప్ లక్-1776,వియత్నాం వాంగ్ కోక్-1905

ఆధునిక సాహిత్యం -ట్రాన్ట్రాంగ్ కిం –స్కాలర్ పోలితిశియాన్ .వియత్నాం సామ్రాజ్యంలో కొద్దికాలం ప్రాదానమంత్రి .వు త్రాంగ్ ఫంగ్ –భాశాకోవిడుడు ఇతని రచనలు విద్యాలయాలో పాత్యపుస్తాకాలుగా ఉన్నాయి .సెటైర్ బాగా రాశాడు .బాల్జాక్ తో పోలుస్తారు .మూడు పుస్తకాలు అనువాదం చేశాడు .

వియత్నాం అంటే హో ఛిమిన్ జ్ఞాపకం వస్తాడు .అత్నిచరిత్ర సంక్షిప్తంగా

హొ చి మిన్ (Ho Chi Minh) (జననం: మే 19, 1890-మరణం: సెప్టెంబరు 3, 1969వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్.

హొ చి మిన్ 1890 మే 19న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే గ్రామంలో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న ఇండోచైనా ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత 1911లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత లండన్పారిస్‌ లలో పనిచేశాడు.

మొదటి ప్రపంచయుద్దం ముగిసిన తరువాత ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు మాస్కో వెళ్ళాడు. ఆ తరువాత 1924లో చైనా వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. 1930లో ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీను చైనాలో స్థాపించాడు. హాంకాంగ్లో కమ్యూనిష్టు ఇంటర్నేషనల్ ప్రతినిథిగా ఉన్న సమయంలో 1931 జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హొను అరెష్టు చేసి 1933 వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా సోవియట్ యూనియన్ వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. 1938లో మరలా చైనా వెళ్ళాడు.

1941లో జపాన్ వియత్నాంను ఆక్రమించినపుడు ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకుని వియెత్ మిన్ అనబడే గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో పోరాడాడు. 1945 ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోయిన తరువాత వియత్ మిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని హనోయ్ రాజధానిగా హొ చి మిన్ నాయకత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంను ప్రకటించింది. ఈ యుద్ద సమయంలో పెట్టుకున్న మారుపేరే హొ చి మిన్. ప్రకాశవంతమైనవాడు (Enlightener or He who shines) అని దీని అర్థం.

ఫ్రెంచ్ వారికి వారి వలసలను వదలుకోవటం ఇష్టంలేక పోవటంతో 1946 చివరలో ఇరుసేనల మధ్యన యుద్ధం ప్రారంభమైనది. 8సం.లు వియెత్ మిన్ గెరిల్లాలు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరకు వారిని దీన్ బీన్ ఫు యుద్ధంలో 1954లో ఓడించాయి. తరువాత జెనీవాలో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే వియత్ మిన్ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన ఉత్తర వియత్నాంలో హొ చి మిన్ సామ్యవాద సమాజాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు.

1960 వ దశకం ప్రారంభంలో సైగాన్ రాజధానిగా అమెరికా సహాయంతో దక్షిణ వియత్నాంను పరిపాలిస్తున్న కమ్యూనిష్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిష్టు గెరిల్లాలు యుద్దాన్ని ప్రారభించారు. ఈ యుద్దమే చరిత్రలో వియత్నాం యుద్దంగా పిలువ బడింది. ఉభయ వియత్నాంలను ఏకీకృతం చేయ తలపేట్టిన హొ ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అచటి ప్రభుత్వ సైన్యాలమీద, అమెరికా సైన్యాలమీద పోరాడుతున్న గెరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపినది.

హొచిమిన్ ఆరోగ్యం క్షీణించి సెప్టెంబరు 3, 1969లో మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు దక్షిణ వియత్నాం లోని కమ్యూనిష్టు గెరిల్లాలకు సహాయాన్ని కొనసాగించారు. హొచిమిన్ చనిపోయిన తరువాత ఆరేళ్ళకు 1975లో దక్షిణ వియత్నాంలో కమ్యూనిష్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాంలు కలిపివేయబడి సైగాన్ పట్టణానికి హొచిమిన్ సిటీగా నామకరణం జరిగింది.

102-ఆఫ్ఘనిస్తాన్ సాహిత్యం

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ మధ్య ఆసియాలో ఉంది .రాజధాని –కాబూల్ .జనాభా 3కోట్ల 75లక్షలు .కరెన్సీ –ఆఫ్ఘన్ ఆఫ్ఘని .ఉగ్రవాద నిలయం కనుక సేఫ్ కాదు .మద్య నిషేధం ఉన్నది .ఆఫ్ఘన్ పర్షియన్ భాష .వ్యవసాయమే ఆర్దికాధారం .మన పురాణాలలోని గాంధార దేశమే ఆఫ్ఘనిస్తాన్ .భారతంలో శకుని ,గాంధారి పుట్టినిల్లు. గాన్దారశిల్పం ప్రపంచ ప్రసిద్ధం

ఆఫ్ఘన్ సాహిత్యం  దారి,పాష్తోభాషలలో పూర్వ ముస్లిం శతాబ్దాలలో ఉన్నది .షానామ రాసిన ఫిరదౌసి అరెబిక్ భాషలో రాశాడు .లలాలుద్దిన్ మాహమ్మాద్ బల్కి అంటే’’ రూమి ‘’30-9-1207లో ఆఫ్ఘనిస్తాన్ లోని బలిఖ్   లో పుట్టాడు.మతాలన్నీ సమానమే నని చెప్పాడు .ఆయన రచన ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమాయింది

   ఐబన్ సినా  బహు ప్రక్రియల రచయిత.అల్ క్వానం ఫి అల్టిబ్ అనే అతని అద్భుత రచన 5భాగాల మెడికల్ ఎన్సైక్లో పీడియా .ఇతని మరో పుస్తకం-ది బుక్ ఆఫ్ హీలింగ్

అబ్దుల్ బారి జహాని –సమకాలీన పాస్తో భాషకవులలో అగ్రగణ్యుడు .1948లో కాందహార్ లో పుట్టాడు .ప్రైడ్ అనే కవిత –

 How sweet the tales of battlefields.
How easy the cries of praise and bravo.
How pleasing to talk of fearless men
and share legends of their heroic lives.
How soothing the old songs are to the ear
and the names of the lion hearts sung by maidens.
How proudly pretty girls, like bunches of flowers,
flock eagerly to the shrines of martyrs.
But has anyone asked the martyr about his wounds?
Has anyone talked to the hero about his suffering?
Has anyone looked in his eyes on the threshold of death and read their tale of thwarted hopes?
Has anyone seen the broken heart of the martyr’s mother?
Has anyone witnessed the ruined life of the young widow?
Has anyone stumbled on the rubble of a thousand dreams?
Has the poet who writes of chains and shackles
felt the chill of a dungeon at night?
Has he been thrown into a scorpion pit
to be stung to the bone again and again?
I can never forget what the wise man says:
‘The fires burns the land on which it ignites’.

అబ్దుల్ హాయ్ హబిబి -115పుస్తకాలు 500రిసెర్చ్ పేపర్లుకవిత్వం చరిత్ర ఫిలాసఫీ లింగ్విస్టిక్స్ మొదలైన బహు అంశాలపై   రాసిన వాడు .కాందహార్లో పుట్టాడు

గాంధార దేశ ప్రాముఖ్యత తెలుసుకొందాం

గాంధారా పురాతన భారత ఉపఖండం, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయువ్య భాగంలో పెషావర్ బేసిన్లో ఒక పురాతన రాజ్యం, మహాజనపదంగా ఉండేది. ఈ ప్రాంతం మధ్యలో కాబూలు, స్వాతు నదుల సంగమం వద్ద ఉంది. దీనికి పశ్చిమాన సులైమాను పర్వతాలు, తూర్పున సింధు నది సరిహద్దులుగా ఉన్నాయి. సఫేద్ కో పర్వతాలు దీనిని కోహత్ ప్రాంతం నుండి వేరు చేశాయి. ఇది గాంధార ప్రధాన ప్రాంతంగా “గ్రేటర్ గాంధార” సాంస్కృతిక కేంద్రంగా ఉంటూ ఇది సింధు నది మీదుగా తక్షశిలా ప్రాంతం, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్లోని కాబూలు, బామియను లోయల వరకు, ఉత్తరాన కరాకోరం శ్రేణి వరకు విస్తరించింది.[1][2][3] అంగుత్తారా నికాయ వంటి బౌద్ధ వ్రాత వనరులలో పేర్కొన్న పురాతన భారతదేశంలోని పదహారు మహాజనపదాలలో (పట్టణ, గ్రామీణ ప్రాంతాల పెద్ద సమ్మేళనం) గాంధార ఒకటి.[4][5] అచెమెనిదు కాలం, హెలెనిస్టికు కాలంలో దాని రాజధాని నగరంగా పుష్కలవతి (ఆధునిక చార్సద్దా) ఉంది.

తరువాత క్రీస్తుశకం 127 లో కుషాను చక్రవర్తి కనిష్క ది గ్రేట్ చేత రాజధాని నగరాన్ని పెషావరు [గమనిక 1] కు తరలించారు.

ఋగ్వేదం (క్రీ.పూ. 1500 – సి. 1200)నుండి గాంధార ఉనికిలో ఉంది.[6][7] అలాగే జొరాస్ట్రియను అవెస్టా కాలం నుండి గాంధార ఉనికిలో ఉంది. ఇది అహురా మాజ్డా వ్రాతలలో భూమి మీద సృష్టించబడిన ఆరవ అందమైన ప్రదేశమైన వాకరాటా అని పేర్కొనబడింది. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దంలో గాంధారాను అచెమెనిదు సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ 327 లో అలెగ్జాండరు ది గ్రేట్ చేత జయించబడినది. తరువాత ఇది మౌర్య సామ్రాజ్యంలో, తరువాత ఇండో-గ్రీకు రాజ్యంలో భాగమైంది. ఈ ప్రాంతం ఇండో-గ్రీకుల క్రింద గ్రీకో-బౌద్ధమతానికి, తరువాత రాజవంశాలలో గాంధారన్ బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. బౌద్ధమతం మధ్య ఆసియా, తూర్పు ఆసియాకు వ్యాప్తి చెందడానికి ఇది ఒక కేంద్ర ప్రదేశం.[8] ఇది బాక్టీరియను జొరాస్ట్రియనిజం, హిందూ మతం కేంద్రంగా ఉంది.[9] గాంధార (గ్రీకో-బౌద్ధ) కళ స్థానిక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన గాంధార 1 వ శతాబ్దం నుండి 5 వ శతాబ్దం వరకు కుషాను సామ్రాజ్య పాలనలో శిఖరాగ్రస్థాయిని సాధించింది. గాంధారా “ఆసియా కూడలిగా అభివృద్ధి చెంది” వాణిజ్య మార్గాలను అనుసంధానిస్తూ విభిన్న నాగరికతల సాంస్కృతిక ప్రభావాలను గ్రహిస్తుంది. ముందుగా ఇస్లాం ఆధిపత్యం చేసిన ఈప్రాంతంలో 8-9 వ శతాబ్దాల వరకు బౌద్ధమతం అభివృద్ధి చెందింది.[10] 11 వ శతాబ్దం వరకు పాకిస్తాన్ స్వాతు లోయలో బౌద్ధమతం ప్రాంతాలు కొనసాగాయి.[11]

చరిత్రకారుడు అల్-బిరుని పర్షియను పదం ” షాహి “[12] పాలక రాజవంశాన్ని [13] సూచించడానికి ఉపయోగించారు. ఇది కాబూలు షాహి నుండి స్వీకరించబడింది.[14]ఈ రాజవంశం 10 – 11 వ శతాబ్దాల ముస్లిం ఆక్రమణలకు ముందు కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించింది. క్రీ.శ 1001 లో ఘజ్నికి చెందిన మహమూదు దీనిని స్వాధీనం చేసుకున్న తరువాత గాంధార పేరు అదృశ్యమైంది. ముస్లిం కాలంలో ఈ ప్రాంతం లాహోరు నుండి లేదా కాబూలు నుండి పరిపాలించబడింది. మొఘలు కాలంలో ఇది కాబూలు స్వతంత్ర జిల్లాగా ఉంది

పేరు వెనుక చరిత్ర

పేరుకు ఒక ప్రతిపాదిత మూలం “గాంధ” అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్ధం “సువాసనా ద్రవ్యం”, “వారు [నివాసులు] వర్తకం చేసిన సుగంధ ద్రవ్యాలు, సుగంధ మూలికలను సూచిస్తుంది. దానితో వారు తమను తాము కూడా ఉపయోగించారు.” [18][19] గాంధార ప్రజలు ఋగ్వేదం, అధర్వవేదం, తరువాత వేద గ్రంథాలలో పేర్కొన్న తెగగ ఉంది.[20] ఇది జొరాస్ట్రియనిజం అవెస్టాను భాషలో వాకారాటా పేరుతో నమోదు చేయబడ్డాయి. పురాణాల సాంప్రదాయ సంస్కృతంలో గాంధారా అనే పేరు పేర్కొనబడింది.

మొదటి డారియసు చక్రవర్తి బెహిస్తును శాసనంలో గండారా అనే పేరు పర్షియను రూపం పేర్క్నబడింది. [21][22] బాబిలోనియా ఎలమైటు భాషలలో పరుపరేసన్న (పారా-ఉపారీ-సేనా, అంటే “హిందూ కుష్ దాటి”) అని అనువదించబడింది. అదే శాసనం.[16]

.[2 గాంధారి పేరు ధృవీకరించబడింది ఋగ్వేదంలో (RV 1.126.7 [6]). గాంధారిలు, బాల్హికలు (బాక్ట్రియన్లు), ముజవంతులు, అంగాలు, మగధులతో పాటు, అధర్వవేదంలో (AV 5.22.14) సుదూర ప్రజలుగా పేర్కొన్నారు. పురాణ, బౌద్ధ సంప్రదాయాల ఉత్తరాపాత విభాగంలో గాంధారాలను చేర్చారు. గాంధార రాజు నాగ్నాజితు ఐతరేయ బ్రాహ్మణుడు సూచిస్తాడు. వీరు విదేహ రాజు జనకునికి సమకాలీనుడు.[26] 3]

పురాతన భారతదేశంలోని పదహారు మహాజనపదాలలో గాంధార ఒకటి.[4][5] గాంధార ప్రాధమిక నగరాలలో పురసపుర (పెషావర్), తక్షసిలా (టాక్సిలా), పుష్కలవతి (చార్సద్ద) ఉన్నాయి. రాజధాని పెషావరుకు మార్చబడిన తరువాతి 2 వ శతాబ్దం వరకు గాంధార రాజధానిగా ఉంది. ఒక ముఖ్యమైన బౌద్ధ మందిరం కారణంగా 7 వ శతాబ్దం వరకు నగరం తీర్థయాత్రల కేంద్రంగా మార్చబడింది. పెషావరు లోయలోని పుష్కలవతి స్వాతు, కాబూలు నదుల సంగమం వద్ద ఉంది,

మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్త మౌర్య అలెగ్జాండరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు టాక్సిలాలో నివసించినట్లు భావిస్తున్నారు. సాంప్రదాయం ఆధారంగా అతను కౌటిల్య దగ్గర శిక్షణ పొందాడు. ఆయన తన పాలనలో కౌటిల్యుడు ప్రధాన సలహాదారుగా కొనసాగాడు. బహుశా మౌర్యచంద్రగుప్తుడు గాంధార, వాహికలను తన స్థావరంగా ఉపయోగించుకుని మగధ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించి క్రీ.పూ 321 లో పాటలీపుత్ర వద్ద సింహాసనాన్ని అధిష్టించాడు.

 అశోకుడు కూడా గాంధారాలో ప్రతినిధిగా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత అతను బౌద్ధుడయ్యాడై బౌద్ధ ధర్మాన్ని ప్రోత్సహించాడు. తన సాంరాజ్యంలో ఇతర విషయాలతో శాఖాహార ఆహారం, తన సామ్రాజ్యంలో గృహాలలోనూ అడవిలోనూ జంతువులను చంపడం నిషేధించాడు. అశోకుడు గాంధారలో అనేక స్థూపాలను నిర్మించాడు. యోనాసు, కాంబోజాలు, గాంధారాలతో సహా వాయువ్య సరిహద్దు మీద మౌర్య నియంత్రణకు చిహ్నంగా అశోకుడు వదిలిపెట్టిన శిలాశాసనాలు ఈ ప్రాంతం మీద మౌర్యుల ఆధిక్యాన్ని ధృవీకరిస్తున్నాయి. అధ్యయనకారులు గాంధారలు, కంబోజులు, [39][40][41] కురులు, కంబోజాలు, గాంధారాలు, బహ్లికాలు ఒకదానితో ఒకటి భాషా, సంప్రయ, సంస్కృతుల పరంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. వీరు అందరికీ ఇరానియన్ సంబంధాలు ఉన్నాయని కూడా వాదించారు.[42] లేదా గాంధార, కంబోజా ఒక సామ్రాజ్యంలోని రెండు ప్రావిన్సులు తప్ప మరొకటి కాదు కనుక ఒకరి భాషను ప్రభావితం చేస్తున్నారు. [43] ఏది ఏమయినప్పటికీ గాంధార స్థానిక భాష పాణిని సాంప్రదాయిక భాష (“భాష”)గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది కంబోజా ఇరానియను (అవెస్టాను) భాషకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.[note 1]

కుషానుల కాలం గాంధార స్వర్ణ కాలంగా పరిగణించబడుతుంది. పెషావరు లోయ, టాక్సీలాలు ఈ కాలపు స్థూపాలు, మఠాల శిధిలాలతో నిండి ఉన్నాయి. గాంధార కళ వృద్ధి చెందింది, భారత ఉపఖండంలో ఉత్తమమైన శిల్పాలను తయారు చేసింది. జాటకాల జ్ఞాపకార్థం అనేక స్మారక చిహ్నాలు సృష్టించబడ్డాయి.

మహాయాన బుద్ధిజం

కుహాన్ సన్యాసి లోకాకీమా మొట్టమొదటి బౌద్ధ సూత్రాలను చైనాభాషలోకి అనువదించడం ప్రారంభించిన సమయంలో క్రీ.శ 147 లోనే గాంధార ప్రాంతం నుండి మహాయాన ” స్వచ్ఛమైన భూ సూత్రాలు ” చైనాకు తీసుకువచ్చారు.[61] మొట్టమొదటి అనువాదం గాంధారి భాష నుండి అనువదించబడినట్లు సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి.[62]” ఆస్తాసహస్రిక ప్రజాపరమిత సూత్రం ” వంటి ముఖ్యమైన మహాయాన సూత్రాలను, అలాగే సమాధి అరుదైన ప్రారంభ మహాయాన సూత్రాలు బుద్ధ అకోభ్యా మీద ధ్యానం వంటి అంశాలను లోకాకీమా అనువదించాడు. లోకక్సేమా అనువాదాలు మహాయాన బౌద్ధమతం ప్రారంభ కాలం గురించి అంతరదృష్ట

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 100-సింగపూర్దేశ సాహిత్యం

 సింగపూర్ సావరిన్ రిపబ్లిక్ దేశం  ఆగ్నేయ ఆసియాలో ఉన్న సిటి స్టేట్ .జనాభా 56లక్షలు .కరెన్సీ –సింగపూర్ డాలర్ .చాలా ఖర్చు అయ్యే దేశం .ఆగ్నేయ ఆసియాకు సింహద్వారం సింగపూర్ .ఆధునికతకు,పారిశుధ్యానికి ప్లానింగ్  కట్టడాలు రోడ్లకు  ఆదర్శం.అన్నిరకాల బహిరంగ విసర్జన నిషేధం .బౌద్ధ హిందూ క్రైస్తవమొదలైన 10మతాలున్నాయి .మత స్వేచ్చ ఉన్నది .జాతీయ భాష –మలై.అన్నిరకాల భాషల వారూ ఉన్నారు .ప్రపంచంలో అఅత్యంత  సుస్థిర  ఎకానమీ ఉన్న దేశం సింగపూర్ .ఎలెక్ట్రానిక్స్ ,పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజం  ముఖ్య ఆదాయ వనరులు .

   సింగపూర్ సాహిత్యం ముఖ్యంగా మాలే, తమిళ్ ,ఇంగ్లిష్ ,స్టాండర్డ్ మా౦డారియన్ అధికార భాషలలో లభిస్తుంది .ఈమొత్తం సాహిత్యాన్ని’’సింగా ‘’అనే సాహిత్యపత్రికలో ప్రచురించి  1980,1990 లలో ఎడ్విన్ తుంబూ ,కో బాక్ సాంగ్ లు పుస్తకాలుగా ,ఆతర్వాత ‘’ఎ సింగపూరియన్ మిలీనియల్ ఆంధాలజి ఆఫ్ పోయెట్రి ని 2000లో తెచ్చారు .ఇవి మూడుసార్లు మూడు భాషలలో అనువాదం కూడా చేశారు .సింగపూర్ రచయితలు టాన్ స్విహియాన్ ,కువో పావ్ కున్ లు ఒకటికంటే ఎక్కువ భాషలలో రాశారు .సింగపూర్ బిజినెస్ టైం పత్రిక సింగపూర్ రచయితలు హైలీ  ఎక్స్ పరిమెంటల్ ‘’అన్నది .అంటే రాసింది వీడియోలుగా ఫోటోగ్రాఫులుగా మారుస్తున్నారు కూడా అని భావం .సొని లేవిస్ రాసిన గ్రాఫిక్ నవల ‘’ది ఆర్ట్ ఆఫ్ చార్లీ చాన్ హాక్ చై ‘’ మూడు ‘’ఐస్నార్ అవార్డ్స్ ‘’అందుకోవటమేకాక ,2017లో బెస్ట్  ఇంటర్నేషనల్ ల్ కామిక్ నవలగా గుర్తింపు పొందింది .

  సింగపూర్ చైనాకమ్యూనిటిలోపుట్టిన వారు ఇంగ్లీష్ లో రాయటంతో ఈదేశ సాహిత్యావిర్భావం జరిగింది .టియో పో లెంగ్త్ రాసిన ‘’FMS R’’అనే ఆధునికకవిత 1937లో లండన్ లో ప్రచురితం .తర్వాత వాంగ్ గుంగ్వు 1950లో ‘’పల్స్ ‘’రాశాడు .1965లో స్వతంత్రం పొందాక సింగపూర్ సాహిత్యప్రవాహం పరవళ్ళు తొక్కింది ఎడ్విన్ తుంబోఆర్ధర్ యాప్రోబెరి యియో ,గోపో సెంగ్ .లి జు ఫెంగ్ ,చంద్రన్ నాయర్ ,కృపాల్ సింగ్ లు రచనలు చేశారు .వీళ్ళే మొదటి తరం సింగపూర్ రచయితలు  .1980-90కాలం లో సైమన్ టే,లియాంగ్ లియు గేయోక్ కో బక్ సాంగ్ ,హోపో ఫన్ వగైరాలు కవులుగా ప్తసిద్ధి చెందారు .1990సింగపూర్ ఇంగ్లిష్ కవిత్వం వేగం పింజుకోవటమేకాక అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది .వీరిలో బోయే కిం చెంగ్,యాంగ్ షు హూంగ్ ,ఆల్విన్ పాంగ్ ,సిరిల్ వాంగ్ ,గ్రేస్ చియా ,టోపాజ్ వింటర్స్ ,పూజా నాన్సీ ,ఆల్ఫాన్ బిన్ సయాట్ ఉన్నారు

  ఏషియన్ సిరీస్ పేరిట అనేక ఆ౦థాలజీలూ వచ్చాయి .హిస్టారికల్ ఆంథా లజి ఆఫ్ సింగపూర్ 2009లో ఆన్జేలియా పూన్ ఫిలిప్ హాల్డేన్,షి ర్లి గియోక్ లిన్ లిం  ల సంపాదకత్వం లో వచ్చింది .ఇటీవల బాలసాహిత్యమూ వేగంగా వస్తో౦ది .దిడైరీ ఆఫ్ ఆమోస్ లీ ను ఎదేలిన్ ఫూ ,ది ఎలేలిఫెంట్ అండ్ ది ట్రీ –జిన్ పిన్ ,థోర్ దిగ్రేటెస్ట్ –డాన్ బాస్కో ,ప్రిన్స్ బేర్అండ్ పాపర్ బేర్ –ఎమిలి లిం రాశారు .జెస్సీ వీ ను పయనీర్ ఆఫ్ చిల్డ్రెన్ లిటరేచర్ అంటారు .ఈమె రాసిన ‘’మూటీ మౌస్ ‘’సిరీస్ ప్రసిద్ధమైనది .పాట్రీషియ మేరియా, టాన్చియా హీర్న్ చెక్ ,హో మైన ఫాంగ్ లూ బాల సాహిత్యం పండించారు

  కవి గో పో సెంగ్ నాటక,నవలా రచయితకూడా .రాబర్ట్ యియో ఆరు నాటకాలు రాశాడు .కువో ఆర్టిస్టిక్ డైరెక్టర్ దియేటర్ పునరుజ్జీవనం చేశాడు.ఇతని నాటకాలు –ది కాఫిన్ ఈజ్ టూ బిగ్ ఫర్ ది హోల్ ,లావోజు లు క్లాసిక్ నాటకాలు .ఎమిలి ఆఫ్ ఎమరాల్డ్ హిల్ నాటకం రాసిన స్టెల్లా కాంగ్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.టాన్ హౌ పొలిటికల్ సెటైర్ పండించాడు .

  గో పో సెంగ్ నవలలలకు ఆద్యుడు .ఇతని ఇఫ్ వుయ్ డ్రీం  టూలాంగ్ నవల అచ్చమైన మొదటి సింగపూర్ నవల .కేధరిన్ లిం  షార్ట్ స్టోరీలతోలతో బాగా పేరు తెచ్చుకొన్నది  -స్టోరీస్ ఆఫ్ సింగపూర్ ,దిలైట్నింగ్ గాడ్ కథా సంపుటులు పాఠ్యాంశాలు గా  కూడా చేరాయి .ఈమె నవలలు ది బాండ్ మెయిడ్ ,రాంగ్ గాడ్ హోం లు ప్రపంచ ప్రసిద్ధాలు .జోన్ హాన్ సైన్స్ ఫిక్షన్ రాసింది .స్టార్ సఫైర్ కు హై కమండేషన్ అవార్డ్ లభించింది .రెక్స్ షెల్లీ మొదటినవల –ది ష్రిమ్ప్ పీపుల్  కు నేషనల్ బుక్ ప్రైజ్ వచ్చింది .ఈమె ఐలాండ్ ఇన్ దిసెంటర్ ,రివర్ ఆఫ్ రోజెస్ నవలలో సౌతీస్ట్ ఆసియాలో యురేషియన్ కమ్యూనిటి గురించి రాసింది దీనికీ అవార్డ్ వచ్చింది .హ్వీహ్వీ టాన్ తన కాస్మోపాలిటన్ అనుభవాలను హ్యూమరస్ గా రాసింది .స్టాండ్ ఎలోన్ ,సిటి ఆఫ్ స్మాల్ బ్లెస్సింగ్స్ ఇటీవలవచ్చిన కథాసంపుటాలు .నవనాటకకర్తలలో ఫిత్ నెగ్ ,జోయెల్ టాన్లుకాస్ హో వగైరా ఉన్నారు .2010లో సెరీన్  టియో,క్రిస్టిన్ చెన్,బల్లి కౌల్ జస్వాల్  ,రాఖేల్ యంగ్,జింగ్ జింగ్ లీ మొదలైన మహిళా నవలాకారులున్నారు.గొప్ప ప్లానింగ్ లకు సింగ పూర్ ఆడర్శమైనట్లే అక్కడి రచనలూ ఆదర్శం గా ఉండటం విశేషం .

 మనవి – 11-12-19న ‘’ప్రపంచ దేశాల సారస్వతం ‘’శీర్షికతో ఆస్ట్రియా దేశ సాహిత్యం రాయటం మొదలు పెట్టాను .వీలైనప్పుడల్లా ఒక్కో దేశ సాహిత్యం రాశాను .20దేశాలవరకు ఏదో ఆషా మాషీగా రా రాశానేమో .12-3-20 వరకు ఆ ఇర్వి దేశాలగురించే రాయగలిగా .ఆతర్వాత గాప్ వచ్చి 12-3-20 న 21వ  ఆర్టికల్ అరబ్బీ  దేశ సాహిత్యం మొదలుపెట్టి  30 వ దేశం చిలీ దేశ సాహిత్యం దాకా రాశాను . కొంచెం నిదానంగా రాస్తున్నానేమోఅనిపించింది ..తర్వాత కరోనా,లాక్ డౌన్ హడావిడి  రావటం తో 4-4-20న 31వ ఆర్టికల్  గా నికారుగ్వా దేశ సాహిత్యం రాసి ,వేగం పెంచి 42 దేశాల సాహిత్యం రాసి ,అప్పుడు కొంత ఆలోచనవచ్చి కనీసం 100 దేశాల సాహిత్యమైనా రాద్దాము అనే నిశ్చయం కలిగి మరింత వేగం పెంచి రోజుకు మూడు నాలుగు దేశాలను కవర్ చేసి ఇవాళ 100 వ దేశం సింగ పూర్ దగ్గర కామా పెట్టాను .ఇప్పటికి లాటిన్ అమెరికా పూర్తిగా, ఐరోపాలో బ్రిటన్ తప్ప మిగిలిన దేశాలు, ఆసియాలో చైనా తప్ప చాలాదేశాలు రాయటం పూర్తయింది .ఇంకాకొన్ని రాయాలి. అక్కడో  గంతు,ఇక్కడో గంతుగా ఆస్ట్రేలియా ,ఆఫ్రికాలో కొన్ని దేశాలగురించీ రాశాను .

  అసలుఇలా ఈ దేశాల సాహిత్యం  రాయాలని అనుకోని వాడిని, రాయటం ప్రారంభించి ,రాయటం మానుకోలేని స్థితికి వచ్చాను .ఇది నా అదృష్టం .సంస్కృత కవుల ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణ౦’’ తర్వాత మేజర్ రచన ఇది .ఇదేదో రిసెర్చ్ వర్క్ అని నేను అస్సలు అనుకోను .నాకు తెలిసిన, తెలుసుకొన్న సమస్త విషయాలు పొందు పరచటమే నేను చేశాను .ఇంకా రాయాల్సింది ఎంతగానో ఉంటుంది .అయితే ఆ దేశాలలో ఆధునిక కాలం లోనూ వచ్చిన రచనలు రచయితలగురించి కూడా రాయగలిగాను .నోబెల్ అవార్డ్ వచ్చిన వారి గురించీ వాకబు చేసి రాశాను.ఒక్కోదేశం లో సమాచారం అత్యల్పం గాదోరికింది అనుకోకుండా అక్కడేదో లింకు దొరికి నాకు ఒకగని లభించినట్లు విషయ సంపద లభించి రాశాను .అంటే ప్రయత్న లోపం ఏమీచేయలేదని మనవి  .ఎక్కువ భాగం ‘’గూగుల్ సూతముని ‘’చెప్పిందే వేద వాక్కుగా గ్రహించాను .అవసరమైన  చోట్ల మన విజ్ఞాసర్వస్వం నాకు అమితంగా తోడ్పడింది . ప్రతి దేశం జనాభా, భాషలు,అధికార భాష ,మతం , కరెన్సీ ,ఆదాయ వనరులు ,టూరిజానికి  ఆకర్షణలు ,రక్షణ ఉందా లేదా కూడా రాశా .ఆ దేశ చిత్రం ,అక్కడి ఒకటిరెండు ముఖ్య ప్రదేశాలు రచయితల ఫోటోలు కూడా జత చేశాను ,ఏతా వాతా నేను చెప్పేది ఏమిటి అంటే –  ప్రపంచ దేశాల సాహిత్యం పై అభిరుచి ఉన్నవారికి ప్రాధమిక సమాచారం అందించాను అని మాత్రమే. కావాల్సినవారు దీనిపై ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు ..

   ఈ లాక్ డౌన్ కాలం లో ఉదయం 9-30కి కంప్యూటర్ ఎక్కితే  మధ్యాహ్నం 1గంటకు దిగి భోజనాదులు ,నిద్ర పూర్తి చేసి మళ్ళీ సాయంత్రం 3లేక 4కు ఎక్కి రాత్రి 7-30దాకా వాయించి ,మధ్యలోసంధ్య పూర్తి చేసి ,రాత్రి భోజనం, కాసేపు టివి అనుభవించి 8లేక 8-30కు మళ్ళీ లాప్ టాప్ఎక్కి సుందరకాండ లో హనుమ వ్యక్తిత్వం రాసి రాత్రి 9-30లేక 10కి మంచం ఎక్కటం బిజీ షెడ్యూల్ అయింది .

 అనుకొన్న ‘’శతమానం  ‘’పూర్తి చేశానుకనుక ఈరోజు నుంచి ప్రపంచ దేశాల సాహిత్యాన్ని కొ౦చెం  స్పీడ్ తగ్గించి రాస్తాను .నా వెంట నడచిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సూత శౌనకులు

    సూత శౌనకులు

ప్రతి పురాణం  ‘’సూతముని  శౌనకాది  మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల ఆలోచ్చించి ప్రయత్నించినా మనకు లభించే విషయం చాలా స్వల్పమే .ఇదొక నిరుత్సాహం .నాకూ న్తవరకు ఆ ఆలోచన రాలేదు ఇవాళ బల్బ్ వెలిగి తెలుసుకొనే ప్రయత్నం చేశాను .నాకుదోరికిన సమాచారం మీకూ అందిస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఎవరి దగ్గర ఉన్నా పంపించి దీన్ని నిరభ్యంతరంగా పరిపూర్ణం చేయవచ్చు .

                 సూత ముని

పృధు చక్రవర్తి పితామహ సంబంధమైన యజ్ఞాలు చేస్తుండగా శ్రీమహా విష్ణువు వచ్చి పౌరాణికుడై  సూతుడు అనే పేరుతొ పిలువబడ్డాడు .ఆతర్వాత అతని సంతతి వారందరికీ ఈపేరేవచ్చింది అని బ్రహ్మాండ పురాణ౦లో ఉన్నది .

  పృధు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలను చేద్దామను కొని బ్రహ్మావర్త దేశం లో సరస్వతీ నదీ తీరాన 99పూర్తి చేసి ,నూరవది మొదలు పెట్టగా, ఈర్షతో ఇంద్రుడు యాగాశ్వం అపహిరించి తీసుకు వెళ్ళగా ,అతడి కొడుకు ఇంద్రుని జయించి గుర్రాన్ని తెచ్చాడు .ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకు పోయాడు పృధువుకు కోపం వచ్చి  విల్లు బాణాలతో యుద్ధానికి బయల్దేరాడు .యాగం మధ్యలో వెళ్లరాదని మునులు చెప్పగా విరమించాడు .బ్రహ్మ వచ్చి ‘’మీరు ఏ దేవుని కోసం యాగం చేస్తున్నారో ఆయన అంశ ఉన్నవాడు ఇంద్రుడు కనుక వధార్హుడు కాడు.పృదువుకు 101యాగాల ఫలితం నేను అందిస్తున్నాను .ఇతడు నారాయణ అంశ సంభూతుడు .ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు ‘’అని చెప్పగా సంతృప్తి చెంది ,ఇంద్రునితో స్నేహం పాటించాడు .పరమేశ్వరుడు ఇంద్రునితో ప్రత్యక్షమై ‘’సత్పురుషులు దేహాభిమానంతో ఉండకూడదు .మత్సర వికారం పొంద రాదు ‘’అని ధర్మం బోధించి ఆశీర్వ దించారు .అలాగే పృధు చక్రవర్తి ధర్మ బద్ధంగా పాలించి రాజ్యం కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాడు

  భాగవతం లో రోమ హర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనీ ఈయనే శౌనకాదులకు పురాణాలు చెప్పాడనీ ఉన్నది .

  భారతం ప్రకారం కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసి ,తాను  వక్తగా ఉండకుండా నైమిశారణ్యం లో శౌనకుడు మొదలైన మహర్షులు దీర్ఘ సత్ర యాగం చేస్తుంటే ,వ్యాస శిష్యుడు రోమ హర్షణుడు కుమారుడైన సూత మహర్షిద్వారా సత్కాలక్షేపంగా పురాణాలు చెప్పించాడు .

మార్కండేయ పురాణం లో ఇలా పురాణ ప్రవచనం చేస్తుండగా శ్రీకృష్ణుని అన్న బలరాముడు వచ్చాడు .ఆయనను చూసి సూతుడు గౌరవంగా లేచి నిలబడ లేదు .బలరాముడికి కోపం నషాళానికి అంటి క్షణం ఆలోచించకుండా సూతుడిని సంహరించాడు .శౌనకాది మహర్షులు ప్రార్దిస్తే మళ్ళీ సూతుడిని బ్రతికించి పురాణ ప్రవచనం యధేచ్చగా జరిగేట్లు చేశాడు .

   శౌనక మహర్షి

శౌనక మహర్షి శనకమహర్షి కుమారుడు .శనకుడు గృత్స్నమదుడు అనే ముని కుమారుడు .శౌనకుని కుమారుడు ‘’బహ్వ్రచ ప్రవరుడు ‘’ .  శౌనకుడు నైమి శారణ్యం లో పన్నెండు సంవత్సరాలు సత్రయాగంనిర్వహించాడు .యాగ సమయం లోసూతముని చేత పుణ్య కథా  శ్రవణం చేయించాడు  పురాణ శ్రణమూ చేసిన ధన్యజీవి .అని భాగవత పురాణం లో ఉన్నది .

  భారతం లో శౌనకుడు కపి గోత్ర రుషి .ఇతడూ ,కక్ష సేన వంశం వాడైన ‘’అభి ప్రతారి ‘’అనే ముని కలిసి భోజనానికి కూర్చోగా ఒక బ్రహ్మ చారి భిక్షకు వచ్చాడు .వచ్చినవాడికి ‘’సంసర్గ విద్య ‘’ అంటే సాంఘిక శాస్త్రం లో నిష్ఠ ఉందో లేదో తెలుసుకొందామని వీరిద్దరూ భిక్ష ఇవ్వలేదు .అతడు శౌనకునితో ఆ విద్య పై వాదం చేశాడు .సంతృప్తి చెంది భిక్ష ఇచ్చారు .

  మహా భారతం లోనే మరో విషయం కూడా ఉన్నది .పాండవులు అరణ్య వాసం చేస్తూ గంగాతీరం చేరి అక్కడ ఒక వట వృక్షం క్రింద ఒక పూట గడిపి వెడుతుంటే ,అక్కడి బ్రాహ్మణులు తమ అగ్ని హోత్రాలు తెచ్చుకొని పాండవులతో పాటు వనవాసం చేస్తామని వచ్చారు .అప్పుడు ధర్మరాజు ‘’మహాశయులారా !నేనురోజూ బ్రాహ్మణులకు మృస్టాన్న భోజనం తో సంతృప్తి పరచేవాడిని .ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు.ఏమీ ఇవ్వలేను పోషించలేను మాతో రావద్దు  ‘’అని బాధ పడ్డాడు .అక్కడికి వచ్చిన శౌనకమహర్షికి ధర్మరాజు కు సుహృత్ వాతావరణం లో సంవాదం జరుగుతుంది .

   ఋగ్వేద రక్షణ కోసం శౌనక మహర్షి 1-అనువాకానుక్రమణి 2-అర్షాను క్రమణి 3-చందోను క్రమణి 4- దేవతాను క్రమణి 5-పాదానుక్రమణి 6-సూక్తాను క్రమణి7-రుగ్విదానం 8-బృహద్దేవతా 9-ప్రాతి శాఖ్యం 10-శౌనక స్మృతి రాశాడు .ఇందులో మొదటి 7’’అనుక్రమణిక వాజ్మయం’’లోకి చేరతాయి .

  జిజ్ఞాసువైన శౌనకమహర్షి అంగీరస మహర్షిని దర్శించి ‘’ఏది తెలుసుకొంటే అన్నీ తెలిసినట్లు ఔతుంది ?’’అని అడిగాడు .పర, అపరా విద్యలున్నాయి. పరా విద్య పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేది .అపరా విద్య లౌకిక ధర్మాలను వివరించేది .మొదటిదే గొప్పది .అది తెలిస్తే సంసార బంధ విముక్తి కలుగుతుంది ‘’అని ముండక ఉపనిషత్తు బోధించాడు .శౌనక మహర్షి ‘’ చరణ వ్యూహం ‘’అనే ధర్మశాస్త్ర కర్త కూడా .

 పద్మ పురాణ లో ఒక  రోజు ఒక మహర్షి శౌనకాశ్రమానికి వచ్చి విష్ణు కథా శ్రవణం చేస్తుంటే సూతమహర్షివచ్చాడు .అక్కడి వారందరికీ సూతమహర్షి ‘’పద్మ పురాణం ‘’అంతా వినిపించి వారిని బ్రహ్మానందపరచి ,తానూ బ్రహ్మానంద భరితుడు అయ్యాడని పద్మపురాణం లో ఉన్నది .ఇంతటి ఘన చరిత్ర ఉన్నవారు మన సూత శౌనక మహర్షులు .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ 24-5-20-ఉయ్యూరు c

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 98-కిర్జిస్తాన్సాహిత్యం

కిర్జిస్తాన్ అనే కిర్జి రిపబ్లిక్ దేశం మధ్య ఆసియాలో పర్వతాల నడుమ ఉన్నదేశం .ఉత్తరాన కజకిస్తాన్ పడమర ఉజ్బెకిస్తాన్ ఉంటాయి .రాజధాని –బిష్ కెక్.కరెన్సీ –కిర్జిస్తాన్ సోం.జనాభా 63లక్షలు .అధికారభాషలు –కిర్జిగ్ ,రష్యన్ .సున్ని ముస్లిం దేశం .వ్యవసాయం మినరల్స్ వనరులున్న మధ్యతరగతి దేశం .ఇక్కడి లేక్ ఇస్సికుల్ ను ‘’ది పెరల్ ఆఫ్ సెంట్రల్ ఏసియా ‘’అంటారు .

   కిర్జి సాహిత్యం 19వ శతాబ్దిలోనే ప్రారంభమైంది .మోల్డో నియాజ్  ఇక్కడి ప్రాచీన కవిత్వం ఓల్డ్ క్రీజ్ లో రాయబడింది .ఇందులోంచే మౌఖిక సాహిత్యం తరతరాలుగా వ్యాప్తి చెందింది .కొన్ని ముఖ్య రచనలు రచయితలగురించి తెలుసుకొందాం

1-ది ఎపిక్ ఆఫ్ మనస్ 2-ఖోజో జష్ లఘు ఎపిక్

3-ది డే లాస్ట్స్ మోర్ దాన్ ఎ హండ్రెడ్ యియర్స్ నవలను ను చిన్గిజ్ అట్మ టోవ్ 1980లోరాశాడు .దీనికి ప్రేరణ బోరిస్ పాస్టర్ నాక్ కవిత ‘’యునిక్ డేస్’’.ఇందులో ప్లాట్లు సబ్ ప్లాట్లు ఉన్నాయి .ఒక అమెరికన్ మరొక రష్యన్ వ్యోమగాముల అనుభవాల గురించి   సైన్స్ ఫిక్షన్ .

ప్రముఖ రచయితలు-చిన్గిజ్ అల్మటోవ్-రష్యన్ నుంచి ఈ భాషలోకి అనువాదాలు చేశాడు .పోస్ట్ వార్ జనరేషన్ వాడు. ది డే లాస్ట్స్ మోర్ దాన్ ఎ హండ్రెడ్ ఇయర్స్ ను  పోఎటిక్ లెజెండ్ అంటారు .ఇందులో రష్యన్ సామ్రాజ్యం నుంచి దేశం రిపబ్లిక్ గా మారటం విషయం .నక్కలతో సావాసం పై అనేక కథలున్న సంపుటి .దిప్లోమాట్ అయిన ఈయన ఏ డిఫికల్ట్ పాసేజ్ ,ఫేస్ టు ఫేస్,జమిలా టేల్స్ ఆఫ్ మౌన్ టెన్స్ అండ్ స్టెప్పర్స్ ,ది వైట్ స్టీం షిప్ వగైరా రాశాడు .

 జాన్ మమిటోవ్ –లవ్ సాంగ్స్ బాగా రాశాడు .సోవియెట్ అవార్డ్ ,జాతీయ అవార్డ్ పొందాడు .10దాకా కవితా సంపుటులు ఫిక్షన్ రాశాడు .అనువాద పుస్తకాలు ఏడు రాశాడు .

అలికిల్ ఒస్మనోవ్ –కవి కవిత్వాన్ని ఆధునీకరించాడు .సెక్యులర్ ధీమ్స్   ఎక్కువగా రాశాడు .స్టాలిన్ ప్రైజ్ విన్నర్ .

ఒక కవిత – Issyk-Kul, Kyrgyzstan, wave-lapped lake
Young girls on our shore much merriment make
Coral bracelets, lost long centuries since
Seem to shine in your depths, and brilliance wake.

ఆలీ టోకో౦ బేవ్-కవి నవలాకారుడు .లెనిన్ ,ఫ్లవర్స్ ఆఫ్ లేబర్ ఎర్లి పోయెమ్స్ ,కవితా సంపుటులు తెచ్చాడు .దినైపార్ ఎంటర్స్ ఇంటూ ది డీప్ సి ,దివూ౦డెడ్ హార్ట్ నవలికలు రాశాడు .1941-45యుద్ధం లో దేశభక్తి సందేశాత్మక కవితలెన్నో గుప్పించాడు .జారిజం –సోవియెట్ పాలన మధ్య కాలం లో బిఫోర్ దిడాన్- 2భాగాలుగా రాసి తన దేశం పడిన దుర్భర జీవితాన్ని చిత్రించాడు .మొత్తం 16పుస్తకాలు రాశాడు .ఆర్డర్ ఆఫ్ లెనిన్ ,ఆర్దరాఫ్ రెడ్ బానర్ ఆఫ్ లేబర్ ,ఆర్డర్ ఆఫ్ బాడ్జ్ ఆఫ్ ఆనర్ పొందాడు

99- కంబోడియా దేశ సాహిత్యం

కంబోడియా ఆగ్నేయ ఆసియాలో గోప్పమైదానాలు ,మెకాంగ్ డెల్టా,పర్వతాలు గల్ఫ్ ఆఫ్ ధాయ్ లాండ్ ఉన్న దేశం.రాజధాని –హోనోం పెన్.కరెన్సీ –కంబోడియా రియల్ .జనాభా –ఒకకోటి 62లక్షలు .బౌద్ధం అధికారభాష  .తెరవాద బౌద్ధం అనుసరిస్తారు .టెక్స్టైల్స్,టూరిజం ఆర్ధిక ఆధారాలు .చాలా బీద దేశం .ఒకప్పుడు రక్తపాతం తో తడిసిన దేశం. ఇపుడు ప్రశాంతతకు నిలయం .సోషల్ ఎన్విరాన్  మెంట్ సమస్యలు ఎక్కువ.కుక్క మాంస భక్షకులు .దేశం లో వందకు పైగా డాగ్ మీట్ రెస్టారెంట్స్ ఉన్నాయి .టిషర్ట్ లకు అనుమతి లేదు .బ్లాక్ మార్కెట్ ,దొంగ సారా ,డ్రగ్ నిషేధాలు .

  కంబోడియా సాహిత్యం లేక ఖ్మేర్ సాహిత్యంపురాతనమైండి .బౌద్ధ సన్యాసుల అనుమతి తోనే రచనలు చేశారు .కొందరు స్థానిక జానపదాలు రాశారు .ఇవీ బౌద్ధ ప్రభావితాలే .భారతీయ రామాయణ ,మహాభారతాలకు ఆదరణ ఎక్కువ .పూర్వ సాహిత్యం రాళ్ళమీద రాసిందే .ఖ్మేర్ వంశ చరిత్ర వీటి ఆధారంగానే రాయబడింది.పాళీబౌద్ధ గ్రంథాలు ఎక్కువ.వీటిని షుగర్ పాం లీవ్స్ పై సన్యాసులు రాశారు .దేశం లో అనేక ఆరామాలు క్షేత్రాలు ఉన్నాయి .ఖ్మేర్ రోగ్స్ వీటిని నాశనం చేశారు .

  రాం కేర్ అంటే రామాయణం ను16వ శతాబ్దిలో  కాంబోడియన్ భాషలో రాశారు. దీనినుంచి ‘’రోబన్ శోబన్ మచ ‘’ అనే నాట్య సంప్రదాయం ఏర్పాటు చేసుకొన్నారు .వీటిని బాగా ఆచరిస్తారు .హనుమాన్ దేవాలయాలున్నాయి .రెండవ తోరమచ రాజు -1629-1634 యువత కోసం సాంప్రదాయ కవిత్వం రాస్తే ఇప్పటికీ అనుసరిస్తున్నారు .అనగ్ డువాంగ్ రాజు-1841-60పాలనలోనేకాక గద్యపద్య కవిత్వం లోనూ ప్రసిద్ధుడు  .ఇతని ‘కా కేయి ‘’నవలను ధాయ్ లాండ్ లోని సియాం లో చదువుతుండగా రాశాడు  సంస్కృతంలో దీని అర్ధం స్త్రీ కాకి .భర్తపట్ల అవిదేయతకల భార్య జానపద కథ ఇది .ఈరాజు రాసిన ‘’పుథిసేన్నియాంగ్ కాంగ్ రెజ్ నవల జాతకకథ ఆధారగా రాసింది .

  ఆధునిక సాహిత్యం క్లాసికల్ టెక్స్ట్ ఆన్ విస్డం తో మొదలైంది .1911లో దిడాన్సింగ్ వాటర్ అండ్ ది డాన్సింగ్ ఫ్లవర్ వచ్చాయి .బిమ్బాస్ లామెన్టేషన్ నవల సౌ సేథ్ రాసింది .డావ్ ఎక్ ను 1942 లో నౌ కన్ రాసింది .సమకాలీనం లో  సొమాలి మాం ‘’దిరోడ్ టు లాస్ట్ ‘’నవలలో హ్యూమన్ సెక్స్ ట్రాఫికింగ్ నిరసించి,అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఈమెను అనుసరించి చాలామంది రాశారు .ఇతర దేశ సాహిత్య భాషానువాదాలు జరిగాయి .దిఖ్మేర్ రైటర్స్ అసోసియేషన్ పునరుద్ధరించి సాహిత్య పోషణ చేశారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం

ఆసియా ఐరోపా సరిహద్దులో కాకస్ పర్వతాల దగ్గరున్న దేశం జార్జియా .నల్ల సముద్ర బీచెస్ ,వార్డీజియా కేవ్ ,ద్రాక్షతోటలతో ఆకర్షణీయం .టిబిలిసి రాజధాని .కరెన్సీ –జార్జియన్ లరి.టూరిస్ట్ లకు సేఫ్ .పీనట్స్ పీ కాన్స్ ,పీచేస్ ల దేశం .అతి తియ్యని ఉల్లిపంట మరో ప్రత్యేకత .ధనికం కాదు బీదా కాని దేశం .వ్యవసాయం ,మాంగనీస్ ,కాపర్ ,గోల్డ్ ,ఆల్కహాల్ ,మేషిన్రి,కెమికల్స్ ఆదాయ వనరులు .37లక్షల జనాభా .ఆర్ధడాక్స్ క్రిస్టియన్ మతం .అధికార భాష జార్జియన్ .

  జార్జియన్ సాహిత్యం 4వ శతాబ్దిలో దేశం క్రిస్టియానిటి లోకి మారి ,జార్జియన్ ఆల్ఫబేట్  ఏర్పడ్డాక ప్రారంభమైంది .గ్రీకు ఆర్మేనియా మొదలైన దేశాల సాహిత్య అనువాదాలు చేశారు .470లో వచ్చిన ‘’సామేబా ,సామిడిసా సుషానికిసి డేడోప్లసా ‘’అంటే ది పాషన్ ఆఫ్ సెయింట్ క్వీన్ సుషానిక్ ను ఐకోబ్ సుర్టావేలి రాశాడు .10వ శతాబ్దిలో లాయోనే మెంఖి ,మైకేల్ మోడ రేకిలి లు 910లో  చర్చిఫాదర్స్ పై రాశారు . ది లైఫ్ ఆఫ్ సేరాపియాన్ ను బేసిల్ జర్జేమేలి ,గ్రిగేల్ ఖాండ టెలిస్స్కొవ్రేబా 950లో రాశారు .జ్యోర్గి మెర్కూలె-‘’గ్రిగోల్ ఆఫ్ ఖండ్ జట రాశాడు .10-13శతాబ్దాలలో క్రానికల్స్ చాలా వచ్చాయి వీటిలో ఆ దేశ చరిత్ర కొంత లభిస్తుంది .

  బైజాంటిన్ సామ్రాజ్యం బలహీనమయ్యాక 10వ శతాబ్దిలో దేశం ఆర్ధిక పరి పుష్టి పొంది ,సెక్యులర్ రచనలనూ ఆహ్వానించారు .నాలుగవ కింగ్ డేవిడ్ ,తర్వాత మనవరాలు రాణి తమర సాహిత్య సాంస్కృతిక పోషణ చేసి 11-13శతాబ్దాల కాలానికి  స్వర్ణయుగం తెచ్చారు .అన్ని కళలను పోషించారు .ముఖ్యంగా కవిత్వం వచనం బాగా వృద్ధి చెందించారు .పర్షియన్ కవి రాసిన షానామా అంటే రాజుల చరిత్ర కు ప్రేరణ పొంది రొమాంటిక్ కవిత్వం ఎపిక్ కవిత్వం విలసిల్లాయి .షోటా రుస్టవెలి1220లో వేప్ క్వివిస్టాకోసాని ‘’అనే రొమాంటిక్ కావ్యం నిర్మించి అత్యుత్తమకవిగా గుర్తింపు పొందాడు .తర్వాత దినైట్ ఇన్ ది పాన్థర్స్ స్కిన్ ‘’రాశాడు. మోస్ ఖోనేలి యుద్ధవీర నైట్స్ ల యుద్ధాలు రాశాడు

  చెంగిజ్ ఖాన్, తైమూర్ ల కాలం 1220-1390 లో స్వర్ణయుగ సాహిత్యం అంతరించింది .ఏదో నామమాత్రంగా మిగిలింది .17వ శతాబ్దిలో వచ్చిన పునరుజ్జీవనం ప్రారంభమై కవిత్వం మళ్ళీ ఓ వెలుగు వెలిగి ది బుక్ అండ్ పాషన్ ఆఫ్ క్వీన్ సెయింట్ కేట్వాన్ ను ఒకటవ కింగ్ టిమురజ్ రాశాడు .ఇందులో తనతల్లి వీరోచిత మరణం వస్తువు .

  18వ శతాబ్దిలో సుల్ఖాన్ సాబా ఓర్బెలియాని ,అతడి శిష్యుడు మేనల్లుడు 6వకింగ్ వకాట౦గ్ లు జార్జియాలో నూతన విద్యాలయం ,ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు .ఓర్బెలియాని ఆభాషలో మొదటి నిఘంటువు కూర్చాడు .బోధనాత్మక ఫేబుల్స్ పుస్తకం ‘’ది బుక్ ఆఫ్ విస్డం అండ్ లైస్’’రాశాడు .బెసికి మారుపేరుగల  బెసారియన్ గబషివిలి అలంకార శాస్త్రం రాస్తే డవిట్గురామిషివిలి వాడుకభాషలో రచనలు చేశాడు .

  రాష్యాపెత్తనం నశించి ఐరోపా సాహిత్యానికి తెరలు తీశారు .అలేగ్జాండర్ చావచవడేజ్ అంటే రష్యానాటకకర్త అలేక్జాండర్ సెర్జియో విచ్ మామ సృజనాత్మక కవిత్వ కర్త .నికోలస్ బరటాస్ విలి ఆంగ్లకవి కీట్స్ తో పోల్చదగిన విజనరీ కవి .1860లో  ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండూ బాగా వృద్ధిపొందాయి ,ఇలియా చావా చావా డేజ్,ఆకాకి సేరటేలిలు నైతిక ,బౌద్ధిక శక్తితో ఎన్నదగిన రచనలు తెచ్చారు ‘’ఈజ్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ?’’దిస్టోరి ఆఫ్ మై లైఫ్ ‘’అత్యద్భుత కథనాలు .

   19వ శతాబ్దం లో నాటక శాలలూ వచ్చి నాటకరచన ఉత్సాహంగా జరిగింది .గిగోర్గి ఎరిస్టవి సాహిత్య పత్రిక నడుపుతూ ,దియేటర్ నిర్వహణకూడా చేశాడు .దిమాడ్ వుమన్ ‘’నాటకం 1861లో రాసి ప్రదర్శించాడు .కామెడీలు –దావా ,అను తోచ్కా1850లో రాసి ప్రదర్శించాడు .దిలా సూట్ ,దిఫ్యామిలి సెటిల్మెంట్ నాటకాలూ రాశాడు.

  20వ శతాబ్దం లో వాజాషవేలా మారుపేరుతో లూక రాజి కాష్ విలి జార్జియాస్ గ్రేటెస్ట్ జీనియస్  .అతని ట్రాజిక్ నారేటివ్ పోయెమ్స్-హోస్ట్ అండ్ గెస్ట్స్ ,ది స్నేక్ ఈటర్ లలో కాకస్ ఫోక్ మిత్ ఉంటుంది .సింబాలిజం కూడా వచ్చి వజా షవేలా ఇమేజరీ కవిత్వం రాశాడు .స్నేక్స్ స్కిన్ లోఅస్తిత్వ అన్వేషణ ఉన్నది .

  దేశం స్వతంత్రం పొందాక చిలద్జే –అవలెంనవల 1995లో,2003 –దిబాస్కెట్ రాశాడు .2005లో జార్జియా ది బ్రిలియ౦ట్ హిస్టారిక్ నవలను అమిరేజిబి రాశాడు .ఆకా మోర్చిలడ్జే-‘’జర్నీ టు కరబాక్ ‘’మొదలైన నవలలు రాశాడు .లాశా బుగ్ద్జే అన్తర్జాయ ఖ్యాతి పొందిన రచయిత .న్యు అనరేషన్ కవులలో కోటే కుబనేష్ విలి ,రతిఅమఘో బెలి వంటి వారున్నారు

97-కువైట్ దేశ సాహిత్యం

కువైట్ పడమటి ఆసియాలో తూర్పు అరేబియా సముద్రానికి ఉత్తర చివర  టిప్ ఆఫ్ పెర్షియన్ గల్ఫ్ లో ఉన్న దేశం .రాజధాని –కువైట్ సిటి .జనాభా 42లక్షలు .కరెన్సీ –కువైట్ దీనార్ .ధనిక దేశం .సేఫ్ దేశం .ఆల్కహాల్ నిషేధం ఉన్నది .ఇస్లాం మతం .భాషలు .అధికార వ్యవహార భాష అరెబిక్ .క్రూడ్ ఆయిల్ తో మహా సంపన్నం .

 కువైట్ సాహిత్యం మొదటి సైన్స్ ఫిక్షన్ నవల అజ్మా ఇడిగ్రీ 1952లో రాసింది .దేశ చరిత్ర గురించి తక్కువే ఉంటుంది .ఆధునిక సమకాలీన రచయితలూ చాలామంది ఉన్నారు .ఈ దేశ సంస్కృతి ఫ్రెంచ్ ఇంగ్లిష్ లతో కలిసిపోయింది .అనువాదకులు – యాకూబ్ ఆలి అహమద్ ,ఫతిల్ ఖలాఫ్.కవులు –సులేమాన్ అల్ ఖులాఫీ ,తఫ్వీక్ అహమ్మద్ లు కవిత్వం తో పాటు ఫ్రెంచ్ ఇంగ్లిష్ సాహిత్యాన్ని మోలియర్ నాటకాలను అరేబిక్ లోకి అనువదించారు

  ఇస్మాయిల్ ఫహిద్ ఇస్మాయిల్- కువైట్ నావలిస్ట్ .కథారచయిత క్రిటిక్ కూడా .20పైగా నవలలు ఎన్నో కతలు రాసి ప్రచురించాడు

తలెబ్ అల్రెఫై-జర్నలిస్ట్ రైటర్ .ఇతడు షేడ్ ఆఫ్ ది సన్,సామర్స్ వర్డ్స్ మొదలైనవి రాశాడు

లైలా అల్ అట్మన్-నవల కత రచయిత్రి –ది వుమన్ అండ్ ది కాట్ ,వాస్మియ కమ్స్ ఔట్ ఆఫ్ సి ,ఎ గ్లిమ్స్ ఆఫ్ రియాలిటి,ఎడైరీ ఆఫ్ పేషేన్స్ అండ్ బిట్టర్ నెస్మొదలైన 8నవలలు,ఎవుమన్ ఇన్ యాన్ వేస్,ది డిపార్చర్ ,ఫతే చూజేస్ హర్ డిమైస్ మొదలైన 5కథా సంపుటులు రాసింది .ఈమెనవల వాస్మియ కమ్స్ ఔట్ ఆఫ్ సి ని 21వ శతాబ్ది ‘’టాప్100 అరెబిక్ నవలలు ‘’లో ఒకటిగా గుర్తింపు పొందింది .

ఏ హెచ్ అల్మనాస్ –ఆధ్యాత్మిక రచయిత అల్మనాస్ అంటే వజ్రం .దిఎలిక్సిర్ ఆఫ్ ఎన్లి  న్లైటేన్మేంట్ ,ఫెసేత్స్ ఆఫ్ యూనిటి,జర్నీ ఆఫ్ స్పిరితువాల్ లవ్ సిరీస్ ,దివాయిడ్ ది పాయింట్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ మొదలలైన15గ్రంథాలు,డయమండ్ హార్ట్ సిరీస్ గా 5,బాడీ సిరీస్ గా 3పుస్తకాలు రాసిన కువైట్ రచయిత అమెరికాలో ఉంటున్నాడు .

తాయి బాఆలి ఇబ్రహీం –సైన్స్ ఫిక్షన్ రాసింది .2008 కువైట్ మూడవ కాన్ష్టి ట్యుయన్సి  కి కాండిడేట్ .మతాన్ని రాజకీయాలకుదూరం చేయాలని పోరాడింది .దికర్స్ ఆఫ్ మని ,స్ప్రింగ్ థార్న్స్,క్రుయల్ హార్ట్ ,బివేర్ టుకిల్ వంటి 9రచనలు చేసింది

నజ్మా అబ్దుల్లా ఇడ్రీస్-మై లాంగ్వేజ్ ఫ్రాక్చర్స్ —ఐ గ్రో రాసింది .ఆరబ్ వుమన్ అవార్డ్ ,కువైట్ స్టేట్ అవార్డ్ పొందింది

ఫాత్మ యూసఫ్ ఆలి –జర్నలిస్ట్ కథరచయిత్రి . .మొదటి నవలరాసిన కువైట్ మహిళ .4కవితా స౦పుటులు తెచ్చింది .కువైట్ లిటరరీ అసోసియేషన్ సభ్యురాలు .మాగజైన్ సంపాదకురాలు

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33

హనుమ చెబుతున్నాడు ‘’రామ లక్ష్మణులు విల్లంబులతో ఋష్యమూక పర్వత సుందర ప్రదేశాలను చూస్తూ ఉండగా   సుగ్రీవుడు భయపడి శిఖరం పైకి పోయి ,నన్ను వారి దగ్గరకు పంపగా నేను వారిని చేరి నమస్కరింఛి సుగ్రీవుని పరిస్థితి తెలియజేయగా ,వారు సంతోషించగా వారిద్దర్నీ బుజాలపై కూర్చో  పెట్టుకొని సుగ్రీవుని చేరి ,వీరి వృత్తాంతం ఆయనకు వివరంగా చెప్పగా ,వారు పరస్పరం మాట్లాడుకొని స్నేహ హస్తం చాచుకొని ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకొని గుండె బరువు తీర్చుకొనగా రాముడు సుగ్రీవుని ఓదార్చగా ,రామానుజుడు మా రాజుకు రామ వృత్తాంతం చెప్పగా, సుగ్రీవుడు దుఖభాజనుడై ,తమకుదొరికిన  నేను ఏరి ఇచ్చిన  నీ ఆభరణాలు వారిద్దరికీ చూపగా ,చూసి రాముడు స్పృహ తప్పితెప్పరిల్లి ఒడిలో పెట్టుకొని ఏడ్చినేలపై పడి పోయాడు  .లక్ష్మణుడి కూడా చూపించి మళ్ళీ సుగ్రీవుడికి ఇచ్చేశాడు .నీ వియోగ దుఖాన్ని మాన్చటానికి ఎవరి తరమూ కాలేదు .వాలిని సంహరిస్తానని రాముడు ,నిన్ను వెదికిస్తానని సుగ్రీవుడు శపథం చేశారు .తర్వాత కిష్కింధకు వచ్చి వాలిని రాముడు చంపి ,సుగ్రీవుని కి రాజ్యం అప్పగించాడు .నేను వారిద్దరూ పంపిన దూతను .అన్నమాటప్రకారం సమస్త వానర సైన్యాన్ని నాలుగు దిక్కులు వెతకమని సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపాడు .వాలి కొడుకు  అంగదుడు ,మూడవ వంతు సైన్యం తో మేము భూమిపై వెతుకుతూ వింధ్య పర్వతగుహ చేరి బయట పడే మార్గం తెలీక కొన్ని రోజులు ఉండిపోయాం .తర్వాత బయటపడి మళ్ళీ అన్వేషణ సాగించి నువ్వుకనపడకపోయే సరికి ప్రాయోప వేశం చేదామని అనుకోగా అంగదుడు బాగా బాధపడగా అందరం మరణమే శరణ్యం అనుకోగా మా పాలి దైవంలా జటాయువు అన్న  సంపాతి మా బాధ చూసి అక్కడికి వచ్చి తన తమ్ముడి  మరణ వార్త విని,ఎవరు రుచంపారని అడిగితే ,రావణుడు అని  చెప్పగా దుఃఖించి అరుణపుత్రుడైన సంపాతి నిన్ను రావణుడు లంకకు తీసుకొని వెళ్ళాడని చెప్పాడు .ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ బయల్దేరాం .

 అందరం సముద్ర తీరం చేరి భయపడగా ,వారి భయాన్ని పోగొట్టి నూరు యోజనాలు యెగిరి వచ్చి లంకలో ప్రవేశించాను .జరిగింది అంతా పూస గుచ్చినట్లు చెప్పాను. నేను నిజంగా రామదూత హనుమాన్ నే .రామ లక్ష్మణులు  క్షేమం .అనుక్షణం రాముడు నిన్నే తలుస్తాడు .సుగ్రీవాజ్ఞ తో నేనొక్కడినే ఇక్కడికి వచ్చాను .నా భాగ్య వశం తో నిన్ను చూడగలిగాను .రామసోదరులు సుగ్రీవ సైన్యంతో త్వరలో ఇక్కడికి వచ్చి రావణ సంహారం చేస్తారు –

‘’రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వా మభి పత్స్యతే-సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం .

.ఉత్తమపర్వత౦ మాల్యవంతం పై నా తండ్రి కేసరి అనే వానర శ్రేష్టుడు దేవతల ఆజ్ఞచేత  గోకర్ణం వెళ్లి ,అక్కడ శ౦బసాదుడు అనే రాక్షసుని చంపాడు .ఆ కేసరికి ,అంజనాదేవికి వాయుదేవుని  వరంతో  జన్మించిన వాడను హనుమను ,వాయు సుతుడను నేను-

‘’మాల్యవాన్నామ వైదేహీ గిరీ ణా ముత్తమో గిరిః-తతోభ్యగచ్ఛద్గోకర్ణం పర్వతం కేసరే హరిః

‘’హతే సురే శంయతి  శంబ సాదనే –కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ –తతోస్మి వాయు ప్రభవో  హాయ్ మైథిలి-ప్రభావత సత్ప్రతి మశ్చవానరః ‘’

 ‘’అని సవిస్తరంగా చెప్పగా సీత శోకం పోయి రాహువు వదలిన చంద్రునిలా ప్రకాశించింది .హమ్మయ్య ఇప్పుడు సీతకు వానరుడు రావణుడు కాదు నిజమైన కపి వరుడే అనే నమ్మకం కలిగి౦ది .’’అమ్మా ! చెప్పాల్సింది అంతా చెప్పేశా ఇప్పుడు నేనేమి  చేయాలో ఆనతివ్వు . నేను వాయు దేవునితో సమానమైన ప్రభావమున్నవాడిని .సందేహించకుమమ్మా జానకీ మాతా ‘’అన్నాడు అత్యంత వినయంగా అనిల తనయుడు రామభక్త హనుమాన్ .

 ఇది 89శ్లోకాల 35వ సర్గ .

సీతకు మొత్తం సీను అంతా అర్ధమైంది .బైస్కోపులో చూపించినట్లు చెప్పాడు కదా .తానేమీ తక్కువ వాడిని కానూ అనీ చెప్పాడు .పంచభూతాలలో  భూదేవి సుత సీత అయితే, మరో భూతం వాయువు సుతుడు హనుమ . అంతటి పరాక్రమ వంతుడు. పవిత్ర మాల్య పర్వతం తండ్రి ఆవాస భూమి .కనుక తనపుట్టుక ఉన్నతమైందే .సీత సహనం భూదేవి సహనం అయితే హనుమ పరాక్రమం  ఎదురు లేని జంఝా  మారుతం .కనుక ధైర్య సాహసాలకు కొదవలేదు .అందుకే ఇంతకష్టసాధ్యమైన పని చేసి లంకలోకి సముద్రం లంఘించి వచ్చి ప్రవేశించాడు .ఇప్పటిదాకా తనకు తప్ప ఎవరికీ కనిపించని నేర్పుతో ప్రవర్తించాడు .రామ సుగ్రీవాజ్ఞ ఔదల దాల్చి వచ్చి సఫల మనో రధుడయ్యాడు సీతామాత దివ్య దర్శనం తో .ఇక కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు రామ సోదరులు రావటం ,లంకకు చేటు కలిగించటం తధ్యం అని సీత గట్టిగా నమ్మి సందేహాలన్నీ తీరి ఇక అతనితో మనసు విప్పి మాట్లాడుతుంది .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

93-మాల్దీవుల సాహిత్యం

రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ దక్షణ ఆసియాలో చిన్న ఐలాండ్ .శ్రీలంక ,ఇండియాలకు ఆగ్నేయంలో ఉంటుంది .రాజధాని –మాలె.కరెన్సీ –మాల్దీవియన్ రుఫ్ఫియ .జనాభా సుమారు 5లక్షల 16వేలు .సున్ని ముస్లిం దేశం .భాషలు –ధివేహి జాతీయ భాష .అరెబిక్ ,ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .ఆదాయ వనరులు –ఫిష్ ప్రాసెసింగ్ ,టూరిజం ,బోట్ బిల్డింగ్ ,కొబ్బరి ప్రాసెసింగ్ ,దుస్తులు చేతిపరిశ్రమాలు .

  మాల్దీవియాన్ సాహిత్యం మొదట్లో రాగిరేకులపైన 12వ శతాబ్ది నుంచి ఉన్నది .లోమఫాను అనేది అత్యంత ప్రాచీన గ్రంథం .

  ఆధునికకాలం లో హుసేన్ సలాఉద్దీన్’’షియా రతున్నభవియ్యాయ ‘’  మత గ్రంథం రాశాడు .కవి అడ్డూ బండేరిహసన్ మలికుఫాన్ ను ఆదేశ అత్యున్నత కవిగా భావిస్తారు .ఇతని గ్రంథం –దియోగే రైవారు.ఇతర ప్రముఖ కవులలో ఏదుర్ ఉమ్రావ్ మాఫైకలి గేఫాను ,మహమ్మద్ అమిన్ ,అసయ్యిదు బోడు ఫెన్ వాల్తుగే సీధీ .

  మరి కొందరు రచయితలలు -]

 నౌషాద్ వహీద్ ,ఇబ్రహీం హుసేన్ ,సైకురా ఇబ్రహీం నయీం లు 20వ శతాబ్ది వారు .

21వ శతాబ్దం లో –జెన్నిఫర్ లతీఫ్ ,అలీ రఫీక్,  ఇస్మాయిల్ ఖిలత్ రషీద్

94-సైప్రస్ దేశ సాహిత్యం

రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తూర్పు మధ్యధరాలో చిన్న ఐలాండ్ .రాజధాని –నికోషియా .కరెన్సీ .–యూరో .జనాభా -12లక్షలు మతం .ఆర్ధడాక్స్ చర్చి మతం .అధికారభాషలు –గ్రీక్ టర్కిష్ .సామాన్యులు సైప్రియాటిక్ టర్కిష్ మాట్లాడుతారు .టూరిజం సిమెంట్ జిప్సియం కెమికల్స్ కలప వగైరా ఆదాయ వనరులు .గ్రీకులున్న ప్రాంతం బాగా సంపన్నం ..

 సైప్రస్ దేశ సాహిత్యం ను సైప్రియట్ సాహిత్యం అంటారు మొదట అంతా గ్రీక్ లోనే రాయబడింది .తర్వాత టర్కిష్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ లోనూ వచ్చింది .ఎపిక్ ‘’సిప్రియా ‘’క్రీ.పూ 7వ శతాబ్ది ది .దీన్ని స్టాన్సి నస్ రాసినట్లు భావిస్తారు .మధ్యయుగంలో అస్సైజెస్ ఆఫ్ జెరూసలెం స్థానిక మాండలికం లో రాయబడింది .ఇది 1531లో ఇటాలియన్ లోకి తర్జుమా అయింది .ఇతర దేశాలో లాగానే చరిత్ర అంతా క్రానికల్స్ లోనే ఉన్నది .16వ శతాబ్దిలో ఫ్రాన్సిస్కో పెట్రార్కా ‘’’పోయెమ్స్ డి అమర్ ‘’ను మధ్యయుగ గ్రీకులో రాశాడు .

   ఆధునిక సైప్రస్ కవులుగ్రీక్ లోనే రాశారు వీరిలో ఒస్మాన్ టర్కే,ఒజ్కేర్ యాసిన్ ,నేసె యాసిన్ వగైరాలు  .నారా నడ్జారియాన్ సైప్రస్ లో పుట్టినకవి .సేవ్ గుల్ ఉలు డగ్ – ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ ,రొమాంటిక్ కవిత్వం లో దిట్ట .ఆండ్రియాస్ కౌమి,మిరండా హోప్లరోస్ ,స్టీఫెన్ లాటన్ ,క్రిష్టిలేఫ్టేరి,స్టెల్ ప్రోవియస్ మొదలైనవారు ఇంగ్లిష్ లోనూ రాశారు .ఇతర’ రాశాడు  దేశీయులూ రచనలు చేశారు .లారెన్స్ డూరెల్ సైప్రస్ లో 1952-56కాలం లో ఉంటూ ‘’బిట్టర్ లె’మన్స్’’నవలరాసి సెకండ్ డఫ్ కూపర్ ప్రైజ్1957లో  పొందాడు .గ్రీస్ దేశ నోబెల్ ప్రైజ్ విన్నర్ గ్లోర్గాస్  సెఫెరిస్సైప్రస్ దేశం పై విపరీతమైన అభిమానం తో ‘’సైప్రస్ వేర్ ఐ ఆర్డైన్డ్’’నవల ఇక్కడ డిప్లొమాటిక్ పనిలో ఉంటూ రాశాడు .ఇక్కడి విక్టోరియా హిస్లావ్ 2015లో ‘’ది సన్ రైజ్ ‘’నవల రాశాడు .

  సోడి జోన్స్ ‘’అవుట్ కాస్ట్’’నవల గొప్ప విజయం సాధించి ఆరంజ్ ప్రైజ్ పొందింది .కోస్టా ఫస్ట్ నవల అవార్డ్ కూడా పొందింది .ఈమె ‘’స్మాల్ వార్స్ ‘’నవల సంచలనమే సృష్టించింది .ప్రేమ ఫామిలి సెంటిమెంట్ ,డ్యూటీ వగైరాలు ఉంటాయి .నికి మరంగౌ –‘’ఎజౌల్ ‘’నవల రాసింది .ఇది ఇతరభాషానువాద౦  కూడాపొందింది .ఆ దేశ చరిత్రలోమరుగునపడిన  సగం విషయాలు బయటకు తెచ్చిన నవల .దిఐలాండర్ అండ్ గర్ల్ నవలారచయిత్రి నారా నోద్జరాన్ తన ఆర్టిస్టిక్ టేలెంట్ పుష్కలంగా చూపింది .ది డైరీ ఆఫ్ ఇన్ ఫిడిలిటి నవలాకారిణి-ఏమిలోస్ సొలోమో ఒక అబ్బాయి ముగ్గురమ్మాయిల ప్రేమకథ ఉత్సుకత కలిగేట్లు రాసింది

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-32

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-32

బహు సంతోషి ఐన సీతాదేవి హనుమతో వాత్సల్యంగా ‘’నువ్వు  రాముడిని  ఎక్కడ కలిశావ్ .కోతులైన మీకు నరులైన రామలక్ష్మణులతో స్నేహం ఎలా కుదిరింది .సోదరుల లక్షణాలేమిటో గుర్తులేమితో చెబితే నా దుఖం ఉపశమిస్తుంది  అనగా హనుమ ‘’రాముడి చిహ్న లక్షణాలు లక్ష్మణు వీ సమానమే  .రాముడు సర్వాంగ సుందర మూర్తి .కనులు తామర రేకులు .సకలజీవులకు మానసిక ఆనందం కలిగిస్తాడు .దాక్షిణ్యం ఆయన సహజ లక్షణం .సూర్య సదృశ తేజస్సున్నవాడు .సహనం లో భూమి కి సమానం. తెలివిలో బృహస్పతి, కీర్తికి దేవేంద్రుడు .ధర్మ రక్షకుడు .శత్రు పీడకుడు.సకల ప్రపంచాన్ని కాపాడే వాడు .ఐహికాముష్మిక భావ సంపన్నుడు .యజుర్వేదాసక్తి పరుడు .సర్వవేద వేదా౦గవేది.విశాలమైన  మూపు ,పెద్ద బాహువులు ,శంఖం వంటి మెడ,శుభకర ముఖం కనపడని మెడ క్రింది సంధి ఎముకలున్నవాడు. కొసలలో యెర్రని నేత్రాలున్నవాడు. భేరీ ధ్వనిలాంటి క౦ఠస్వరం .’’నీల మేఘచ్చాయ బోలు దేహము’’ వాడు .సమ౦గా విభజింపబడిన అవయవ పొంకం ఉన్నవాడు .శ్యామల వర్ణుడు .సాముద్రిక శాస్త్రం లో చెప్పినట్లు వక్షస్థలం,మణికట్టు ,పిడికిలి దార్ధ్యం ఉన్నవాడు కేశాగ్రాలు ,వృషణాలు  మోకాళ్ళు మూడు సమానంగా ఉంటాయి .ఎత్తైన ఉదరం ,నాభి చుట్టూ ఉన్న  ప్రదేశం ,రొమ్ము కలవాడు గోళ్ళు అరచేతులు కనుగొనలు ఎర్రగా ఉన్నవాడు .పాద రేఖలు ,శిరోజాలు ,లింగమణినున్నగా ఉన్నవాడు. స్వరం నడక నాభి గంభీరంగా ఉంటాయి .

  ఉదరం పై మూడు మడతలు ,పల్లంగా ఉన్న చూచుకం ,స్తనాలు పాద రేఖలున్నవాడు .దీర్ఘం కాని లింగం  బలుపు లేని పొత్తికడుపు ,మూడు సుడులతో ఉన్నతల .బొటన వ్రేలి మొదట ఉన్న నాలుగు రేఖలు చతుర్వేద విదుడని తెలియ జేస్తాయి. నుదురు ,పాదాలు ,అరచేతులలో నాలుగు రేఖలున్నవాడు .96అంగుళాల ఎత్తు,బాహువులు ,మోకాళ్ళు ,తొడలు ,చెక్కిళ్ళు సమానంగా ఉన్నవాడు .సమానమైన 14 జతల అవయవాలున్నవాడు .కోర దంతాలు నాలుగు. సింహం ,పులి ,ఏనుగు వృషభం వంటి నడక ఉన్నవాడు. దొండపండు వంటి పెదవులు ,బలమైన  చెక్కిళ్ళు ,పొడవైన   ఎత్తైన ముక్కు కలవాడు .కేశ నేత్ర ,దంత చర్మ పాద తలాలలో నిగనిగలున్నవాడు .పొడవైన వెన్నెముక ,శరీరం ,వ్రేళ్ళు ,చేతులు ముక్కు కళ్ళు చెవులు ప్రజనం ఉన్నవాడు

‘’పద్మాకృతి ముఖం కళ్ళు ,నోరు ,నాలుక ,పెదవులు ,దౌడలు స్తనాలు గోళ్ళు చేతులు పాదాలు అనే పది అవయవాలు ,రొమ్ము తల నుదురు మెడ భుజాలు మూపు ,బొద్దు ,ప్రక్కలు వీపు స్వరం అనే పది విశాల అవయవాలవాడు .తేజస్సు ,యశస్సు ,సంపద ,మూడు వ్యాపించిన వాడు .పరిశుద్ధ మాతా,పితృ వంశాలున్నవాడు .పూర్వాహ్ణ మధ్యాహ్న ,అపరాహ్న కాలాలలో ధర్మార్ధ కామాలు ఆచరించే వాడు .సత్య ధర్మాలు ఆసక్తిగా ఆచరిస్తాడు .ఆర్జించిన ధనాన్ని యోగ్యులకు ఇచ్చేవాడు .దేశాకాలాలను ఎరిగి ప్రవర్తిస్తాడు .అందరికి ఆనందం కలిగిస్తాడు .రాముని తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ .పరాజయం లేని వాడు .అనురాగ రూప గుణాలలో అన్నరామునికి సమానమైన వాడు .వీరిద్దరూ నిన్ను  వెతుకుతూ మమ్మల్ని కలుసుకొన్నారు .కిష్కింధ వానర రాజు అన్న వాలివలన రాజ్యం కోల్పోయిన ప్రియ దర్శనుడైన సుగ్రీవుడు ,ఋష్యమూక పర్వతం పై ఉండగా రామలక్ష్మణులు ఆయన్ను కలుసుకొన్నారు .రాజ్యభ్రస్టు డైన సుగ్రీవుని మేము సేవిస్తాము ‘’అని

   రామలక్ష్మణ సాముద్రిక లక్షణాలు ఏకరువు పెట్టి ,రాజ్యం అన్నవలన కోల్పోయిన సుగ్రీవుని సోదరులు కలిసిన విషయమూ చెప్పేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం91-కటార్దేశ సాహిత్యం

కటార్ దేశం ఆసియాలో అరబ్ పెనేన్సులా దేశం .ఇసుక ఎడారులు ,పెర్షియన్ గల్ఫ్ ఉన్న దేశం .బీచెస్ ,డ్యూన్స్-ఇసుక దిబ్బలు ఆకర్షణ .రాజధాని –దోహా ఆకాశ హర్మ్యాలకు ,ఆధునిక ఆర్కిటెక్చర్ కు  లైం స్టోన్  మ్యూజియం ల నిలయం .కరెన్సీ –కటార్ రియల్ .28లక్షల జనాభా .సున్నీలు 90శాతం .సేఫ్ దేశం .అత్యధిక వ్యక్తిగత ఆదాయమున్న దేశం .మద్య నిషేధం ఉన్నది .అరబిక్ భాష అన్నిటికీ .

కటార్ దేశ సాహిత్యం 7వ శతాబ్ది ఐబాన్ అల్ ఫూజా అనే జానపద హీరో ,రచయితబడౌనిలో  రాసిందే ప్రారంభం .1950లో సాధారణ విద్య అమలు అయ్యాక చిన్నకథలు ,తర్వాత నవలలు వచ్చాయి .స్త్రీలు కూడా రచనలు చేయటం ఆధునికకాలం లో వచ్చింది .18వ శతాబ్దిలో అబ్దుల్ జల్లి అల్ తబటబాయ్,మహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ ఉతెయమీన్ కవిత్వం రాశారు తబతబాయ్ రాసిన కవిత – For you God will suffice against
the pangs of separation from your dead ones,
Your longing and pining is like a fire burning
in your heart
Your longing is not hidden,
A longing for the southern wind.

 తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ముద్రణ జరిగింది .19వ శతాబ్దిలో అహ్మద్ బిన్ యూసఫ్ అల్ జబెర్ ,అబ్దుల్ రహ్మాన్ బిన్ కసామి అల్ మావ్డా లు మత రాజకీయ కవిత్వం రాశారు .ఆరబ్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ ను స్తుతిస్తూ కూడా రాశారు .1950లో దేశం లో మోడరన్ ఆర్ట్ ఉద్యమం వచ్చి ,ఆయిల్ డబ్బు పిచ్చగా పెరిగి జీవిత ,జీవన విధానం మారి విద్యా సక్తి కలిగింది .జాతీయ అస్తిత్వ స్పృహ వచ్చింది .స్త్రీల సాంఘిక ఉన్నతి జరిగింది .సాహిత్య సంస్థలు జర్నల్స్ వచ్చాయి .ఇతర దేశాల సాహిత్య సంపద ఇక్కడా వ్యాపించింది .1969మొదటి మేగజైన్ ‘’దోహా మేగజైన్ ‘’వచ్చింది .అబ్దుల్లా ఆల్ నిమ వారపత్రిక తెచ్చాడు .సంస్కృతీ వ్యాప్తికోసం ‘’అల్ అరుబా ‘’పత్రిక వచ్చింది .ఇప్పటికి సుమారు 20పీరియాడికల్స్ ఉన్నాయి ‘

  21వ శతాబ్దం లో కూడా కవిత్వం రాసి మెప్పించినవారిలో షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్ధాని,అసల హల్నామా ,అజర్ అహ్మద్ అజర్ .స్త్రీలలో కలితాం జబెర్ ,హెస్స అల్ అవధి ,జకియా మాల్ అలా ఉన్నారు .తాని రాసిన కవిత దేశ జాతీయ గీతం గా 1966లో గౌరవం పొందింది .1970లో యూసఫ్ నిమా కథా సంపుటి ‘’డాటర్ ఆఫ్ ది గల్ఫ్ ‘’ ,’’మీటింగ్ ఇన్ బయ్రుట్ తెచ్చాడు .కల్తం జబెర్ మొదటి కదా సంపుటి 1978లో రాసిన మహిళ.ఈ కథలలో కటార్  మహిళలు సాంఘిక సాంస్కృతిక వ్యాప్తికి తోడు పడటం ఉంటుంది .ఫాతిమా టర్కీ’’ఉమ్ అక్థం’’మారుపేరుతో మహిళా హక్కు ఉద్యమం నిర్వహించి రచనలతో చైతన్యం తెచ్చింది .దేశం మహిళల పట్ల చూపుతున్న ఉదాసీనతను ఎండగట్టింది .

  శు ఆ ఖలీఫా ఆమె సోదరి దలాల్ ఖలీఫా మొదటి నవలా రచయితలు  .1933లో మూడు నవలలు పాసేజ్ టు ట్రూత్ ,దిఓల్డ్ డ్రీమ్స్ ఆఫ్ ది సి ,దిమిత్ ఆఫ్ దిమాన్ అండ్ దిలేక్రాసి ముద్రించారు .తర్వాత 2000లో మరో నాలుగు రాశారు .వీటిలో ఆడవారు ఎదుర్కొనే సాంఘిక పరిమితులు ,పాత సంప్రదాయాలలో రావాల్సిన మార్పులు ,ఆయిల్ గనుల రాకతో సొసైటీ లో వచ్చిన గణనీయమైన మార్పులు చర్చించారు .తర్వాతకాలం లో స్వీయ చరిత్రలు వచ్చాయి .అందులో తమగురించే కాక  సమాజం దేశం విషయాలుకూడా రాసుకొన్నారు .రాచాకీయనవలలు కూడా రాసినవారిలో ఆహ్దాన్ అల్మనాఫీ-ది ఏమ్బ్రేసేస్ ఆఫ్ ఎక్సైల్ ,ఫాజి షహీద్ అల ఇస్లయ ఫై అల్ఖలీజ్ –దిమార్టీర్ ఆఫ్ రిఫార్మ్ ఇన్ గల్ఫ్ ,జమాల్ ఫిజి 2013లో రాసిన ‘’మడ్ ఫోం’’కొన్ని పుస్తకాలు నిషేధానికి గుఅరయ్యాయి .

చారిత్రాత్మక కటార్ నవలా రచయితలు  –అబ్డులజీజ్ మహమోద్ ,ఇస్సా అబ్దుల్లా .మొదటి ఆయన 2011లో రాసిన ‘’అల్ కర్సన్ ‘’కనకవర్షం కురిపించింది .ఇందులో పర్షియన్ గల్ఫ్ లో బ్రిటిష్ ప్రభుత్వ రాజకీయ పైరసీ ఉంటుంది ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డ్ అయింది .ఈసా అబ్దుల్లా 2013లో రాసిన ‘’సజిరాన్స్ ట్రెజర్ ‘’చారిత్రిక నవల వచ్చింది .కటార్ ప్రభుత్వం ‘’కటారా ప్రైజ్ ఫర్ అరెబిక్ నావెల్ ‘’2014లో ఏర్పాటు చేసి 2లక్షల డాలర్ల డబ్బు అందిస్తోంది .2015జూన్ లో 12మంది కటారి మహిళలు ,8మంది పురుషులు కలిసి 39నవలలు రాసి ప్రచురించారు .దేశం లో నవలలకే అగ్రస్థానం .మరో 6గురు నవలామణులూ నవలలు రాశారు .చాలా సాహిత్య సంస్థలు ఏర్పడి సాహిత్య పోషణ చేస్తూ విలువైన బహుమతులతో ఉత్సాహం కలిగిస్తున్నాయి .

92-టిమోర్ –లెస్ట్ దేశ సాహిత్యం

టిమోర్ లెస్ట్ లేక ఈస్ట్ టిమోర్ దేశం ఆగ్నేయ ఆసియాలో కోరల్ రీఫ్ లతో ఉంటుంది రాజధాని-డిలి.జనాభా 13లక్షలు .కరెన్సీ –అమెరికా డాలర్. పోర్చు గీస్ ,టేటున్ లు అధికారభాష లు. నేరాలు బీదరికం ఎక్కువ .సేఫ్ కాదు ,వర్జిన్ మేరీ విగ్రహం ఆకర్షణ .కేధలిక్ మతం .

టిమోర్ సాహిత్యం క్సనానా గుస్మావో అనే టిమోరీ నాయకుడు రాసిందే .రిపబ్లిక్ అయ్యాక కవిత్వం రాయటం మొదలైంది ‘’పోయెట్రి ఈజ్ ఎ సీరియస్ మాటర్ ‘’అన్నాడు ఆదేశ కవి ఏబ్ బెరెటో. అక్షరాస్యత 50శాతం ఉండటం వలన రచయితలు నెట్ లో బ్లాగ్స్ ఏర్పాటు చేసి రాయమని కోరాడు Words can heal and also can hurt people’’అన్నాడు .సమాజగాయాలను మాన్పటానికి ,ఉపశమనం కలిగించటానికి రాయమని కోరాడు .సమస్య పరిష్కారంగా ఉండాలేకాని సమస్యలను సృస్టించేవిగా రచనలు ఉండకూడదు ఆన్నాడు .రచయితలు  ‘’సోల్ కీపర్స్ ‘’గా ఉండాలి .కనుక ఆదేశ హృదయానికి మనసుకు హాయి కలిగించేవి రాయమని కోరాడు .ఇది లాండ్ ఆఫ్ క్రోకడైల్స్ .కనుక జాగ్రత్తగా లేకపోతెరచయితలకు ప్రమాదమే అనీ హెచ్చరించాడు

  ఈదేశపు కొన్ని ముఖ్య పుస్తకాలు ,రచయితలు  –ది క్రాసి౦గ్-లూయీ కార్డోసో,,ఫును-జోస్ రామోస్ ,’’ఈఫ్ యు లీవ్ అజ్ హియర్ వుయ్ విల్ డై—జియోఫ్రి బోహింసన్ ,యాన్ ఎ క్స్త్రే  మెస్-లింద్సి హిలూసం ,ది బ్రేవో వన్స్ –జాన్ బర్మింగ్ హాం ,బిలవ్డ్ ల్యాండ్ –గార్డెన్ పీక్

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20ఉయ్యూరు –

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాలసారస్వతం 89-ఆర్మేనియాదేశ సాహిత్యం

 ప్రపంచ దేశాలసారస్వతం

89-ఆర్మేనియాదేశ సాహిత్యం

 ఆర్మేనియా దేశం ఆసియాలో ఆసియా –యూరప్ లను వేరు చేసే కాకస్ పర్వతాల సమీపం లో ఉన్నది .అతిప్రాచీన క్రిస్టియన్ నాగరకతకు నిలయం .గార్నిలోని గ్రీకో –రోమన్ దేవాలయం ,ఈ దేశ  చర్చిహెడ్ క్వార్టర్ .4వ శతాబ్ది ఎచ్మియడిన్ కేధడ్రల్ ముఖ్య ఆకర్షణలు .రాజధాని –ఎరేవన్.జనాభా 30లక్షలు .కరెన్సీ –ఆర్మీనియన్ డ్రామ్.సేఫెస్ట్ కంట్రీ.ఆర్టిస్ట్ ,సింగర్స్ ,కంపోజర్స్ ,స్పోర్ట్స్ మెన్ లకు నిలయం .ప్రపంచ చెస్ చాంపియన్ -గారీ కాస్పరోవ్ ఇక్కడి వాడే .అధికారభాష ఆర్మీనియన్ .క్రిస్టియన్ మతస్తులు .50శాతం జనం పేదరికం లో ఉంటారు .   ఆర్మేనియన్ సాహిత్యం 4వ శతాబ్దిలో పాగన్ సంప్రదాయాన్ని వదిలి క్రిస్టియానిటి కి వచ్చాక  మేస్టాఫ్  ఆర్మేనియన్ ఆల్ఫబేట్ ఏర్పరచాక  బైబిల్ రచనతో  ప్రారంభమైంది .సెయింట్ గ్రెగరీ చరిత్ర పుస్తకం రాశాడు .కోర్యున్ ‘’హిస్టరీ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ సెయింట్ మిస్టోప్ రాశాడు .హీబ్రూ ,క్రిస్టియన్ సాహిత్యంతో అప్పుడు స్వర్ణయుగం ఏర్పడింది .చాలా సామ్రాజ్యాలు పాలించి అసలు భాషను ఎదగనివ్వలేదు .హోవాన్నెస్  టోమానియన్ 1902లో’’ది స్టోరి ఆఫ్ డేవిడ్ ‘’కావ్యం రాస్తే ఒక భాగమే లభ్యమైంది .ఫిలాసఫర్ గా పేరొందిన జాన్ ఒట్జే నేట్జి  సినోడల్ డిస్కోర్స్ రాశాడు కాని అలభ్యం 16వ శాతాబ్ద౦  లోనూ విదేశీపాలనే .అట్టోమన్-సఫావిద్ సామ్రాజ్యాల మధ్యకాలం లో ఆర్మేనియా ‘’ట్రబడూర్’’సంప్రదాయం ఆచరించింది .దీనిప్రకారం గ్రామగ్రామాన ఆర్మేనియన్ సంస్కృతీ భాషా ప్రచారం పద్యాలు ,పాటలు ప్రజలకు వినిపించటం ద్వారా జరిగింది .సయత్ నోవా దీనికి ఆద్యుడు .19,20శతాబ్దాలలో సియమెంటో,అగాప్ ,గోస్తన్జరియన్ నిఘోల్ అఘాపెలిన్ లు ప్రసిద్ధులు .జట్రాక్ అంటే రివైవల్ కాలం లో ఆ దేశ సంస్కృతి విస్తృతంగా వికశించింది .ఆ దేశ జాతీయ ఉద్యమం ప్రారంభమైంది.

   ఆధునిక ఆర్మేనియన్ సాహిత్యం లో కచటూరి ఆబో వియన్ సంప్రాదాయ కవిత్వం వదిలి ఆధునికకవిత్వం రాశాడు .అతని ‘’ఊన్డ్స్ ఆఫ్ ఆర్మేనియా ‘’లో ఆదేశం ఇతర దేశాల ఒత్తిడికి ఎలా నలిగిపోయిందో వివరించాడు .మైఖేల్ నేల్బాన్డియాస్ కవిత ‘’సాంగ్ ఆఫ్ ది ఇటాలియన్ గర్ల్ ‘’ఆ  దేశ జాతీయ గీతం మెర్ హాయ్రేనిక్ రఫీ అనే రొమాంటిక్ కవి రాయటానికి ప్రేరణ అయింది .ఆ దేశ చారిత్రిక వైభవాన్ని అత్యంత విశిష్టంగా శ్లాఘించాడు .ఇతని నవల ‘’స్పార్క్స్ ‘’లో దేశవిముక్తికి ప్రజల పోరాటం కనిపిస్తుంది .అలాగే జేలడీన్  ,ఫూల్ నవలలో విదేశీపాలనలో ప్రజల అణచి వేత ఉంటుంది .1890తో రివైవల్ పీరియడ్ అయిపోయి ,దేశం కల్లోల స్థితులలో ఉన్నది .

  తర్వాత రియలిజం వచ్చి ఓరిఎంట్  దినపత్రిక ఏర్పడింది .ఆర్పియర్ ఆర్పియరిన్ ,లెవాన్ పషాలినియాన్ ,కిజోర్జోహ్రాబ్ ,డిక్రాన్గామ్సరియన్ మొదలైనవారు ఆపత్రికద్వారా రచనలు అందించారు .ఈపత్రిక స్వాతంత్రానికి కూడా బాగా తోడ్పడింది .యదార్ధ జీవిత విషయాలను రాసే ఐడియాలజీ వచ్చి రాయటం ప్రారంభించారు .1960లియోనిడ్ బ్రెజ్నేవ్ నేతృత్వం లో యువరచయితలు వచ్చి 1920 ఆర్మేనియన్ హిస్టరీ ,జీనోసైడ్ లపై బహిరంగ చర్చలు జరిగాయి .పేరూర్ సేవక్ ,గేవోర్క్ ఎమిన్,సిల్వా కాప్తూలియన్,హావ్ హాన్నెస్షిరాజ్ లు కొత్త శకం సృష్టించారు .ఆధునికులతోపాటు అవ౦ట్ గార్డ్ కవులు రచయితలూ వచ్చారు .వీరిలో హెన్రిక్ ఇడోయన్  ,ఆర్టెం హరుత్యన్యన్ లు రైం,రిదంలేని సోషలిస్ట్ రియలిజం కాని కవిత్వం రాశారు .స్వతంత్రం వచ్చాక ఆర్మేన్ మేలికియన్ 2002లో మళ్ళీ వచ్చి అధికార అర్మేనియన్ భాషలో రచనలు చేశాడు .అతని ‘’జర్నీ టు వర్జిన్ లాండ్ ‘’అమెరికాలో 2010లో ముద్రించాడు .ఇందులో ఈదేశం  ఎదుర్కొంటున్న మూల విషయాలు ,జెండర్ రిలేషన్స్ ,మతకేంద్రీకరణ ,రాజకీయ అవినీతి వంటివి నిర్మొహమాటంగా చర్చించాడు .

90-ఎమెన్ దేశ సాహిత్యం

ఎమెన్ దేశం ఆసియాలో అరేబియన్ పెనన్సులలో దక్షిణాగ్రాన ఉన్న రిపబ్లిక్ .యమన్ అనీ అంటారు .రెండవ పెద్ద ఆరబ్ సావరిన్ రిపబ్లిక్ .తీరభూమి  2000కిలోమీటర్లు పైగా ఉంటుంది.రాజధాని –సనా .జనాభా 3కోట్లు. ముస్లిం మతం. భాష అరబిక్ .2015అంతర్యుద్ధంలో 16వేలమంది చనిపోయి 13లక్షలమంది ఆకలితో అలమటించారు ప్రయాణం సేఫ్ కాదు .పుష్కలంగా ఆయిల్ నిల్వలున్నాయి .

 యమన్ సాహిత్యం 1994లో దేశం ఐక్యం అయ్యాక ప్రారంభమైంది .నియంతృత్వ పాలన ,విపక్షాల చీలికలు ,సరైన ఎన్నిక విధానాలు లేకపోవటం ,ఆటవిక సమూహాల బెదరింపులు ఆదేశ అస్తవ్యస్తతకు  కారణమై సాహిత్యం పై దృష్టి కలగలేదు .

  యమన్ సాహిత్య చరిత్రలో ఆరుగురు రచయితలూ భాగస్వాములయ్యారు .’’దిపొలిటికల్ క్రైసిస్ అండ్ ఎమేన్స్ లిటరరీ రిసర్జెన్స్ ‘’పుస్తకం ఆ దేశ సాహిత్యాన్ని కొంతవరకు తెలియ జేస్తుంది ఇందులోని విషయాలు తెలుసుకొందాం .2014లో 20నవలలు యమన్ రచయితలు  రాశారు .ఆక్రితం ఏడాది 8 వచ్చాయి .ఆ దేశ ప్రజలు తమ దేశం ,అక్కడి సమస్యలు పై రచనలు కోరుతున్నారు .కథా సాహిత్యమూ రావాలని కోరారు .కొన్ని రచనలు నవలలు యుద్దాలగురించి కొన్ని అక్కడి గతవైభవ కాస్మాపాలిటన్ జీవితం గురించి ఉన్నాయి.కొందరు రచయితలు  సమాజ సంబంధాలు ,ఆడవారి అనాసక్తత పై రాశారు  ఇవన్నీ రివల్యూషన్  అనే ప్రిజం నుంచి చూసి రాసినవే .కొందరు రాజకీయ ఆర్ధిక అస్థిరత పై దృష్టి పెట్టి రాశారు .రాయాలి అనేతపన ఇంకా ఎక్కువగా రావాలని అందరి అభిప్రాయం .ఇన్ని అనర్ధాలు జరిగినా సాహిత్య క్షేత్రానికి 2014గొప్ప ఆశాకిరణంగా భాసించింది .కొద్దిగా ఆధునికత తొంగి చూసింది .అనువాదాలపై దృష్టి పడలేదు .అయినా కొందరు రచయితలకు ప్రాంతీయ ,అంతర్జాతీయ గుర్తింపు లభించింది .

  మొత్తం మీద 60మందిదాకా యమన్ రచయితలున్నారు .జయీద్ ముట్టి నవలా రచయిత.ది స్కార్పియన్ నవల ,దిబ్రిడ్జ్ –కథా సంపుటి తెచ్చాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-31

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-31

దురపిల్లుతున్న సీతను ఓదార్చే ప్రయత్నం లో హనుమ ఆమెతో ‘’అమ్మా !రాముడి సందేశం తెచ్చాను .ఆయన క్షేమం . మీ కుశలం అడిగాడు .మరిది లక్ష్మణస్వామి నీకు నమస్కారాలు చెప్పాడు ‘’అనగానే శరీరం పులకించి హనుమతో ‘’మనుషుడు బతికి ఉంటె నూరేళ్ళకైనా ఆన౦ద౦  కలుగుతుంది అని చెప్పిన పెద్దలమాట యదార్ధం-

‘’కళ్యాణీ బట గాథేయం లౌకికీ ప్రతిభాతిమా-యేతి జీవంత మానందోనరం వర్ష శతాదపి ‘’

ఇది వాల్మీకి కోటబుల్ కోట్స్ లో మరొకటి .

  చెట్టు దిగి నెమ్మదిగా అమ్మ దగ్గరకు చేరగా ఇంకా  అనుమానం తీరక రావణుడే అనుకొని ‘’నేను ఇతనితో మాట్లాడటం అనుచితం అనిపిస్తోంది వానర రూపం దాల్చిన రాక్షస రాజు  కాదుకదా ‘’అనుకోని ,చెట్టుకొమ్మను వదిలేసి నేలపైనే కూర్చోగా హనుమ మళ్ళీ నమస్కరించగా ,దీర్ఘ నిట్టూర్పులతో ‘’మారు వేషం లో వచ్చిన రావణుడివా .మళ్ళీ నన్ను దుఃఖ పెడితే బాగుండదు. జనస్థానం లో సన్యాసిగా  కామరూపం తో వచ్చావు .ఉపవాసాలతో చిక్కి శల్యమై దీనంగా బాధపడుతున్న నన్ను మరింత బాధించటం న్యాయం కాదు .ఒక వేళ నేను అనుకొన్నాది నిజం కాకపొతే ,నీ మాటలతో నా మనసు సంతోషం పొందింది .రామదూతవన్నమాట నిజమైతే నీకు శుభమస్తు .నాకు రామకథవినటం మహా దానందం .రామ కథ మళ్ళీ వినిపించు .నీమాటలు నా హృదయానికి ఆనందం కలిగించాయి .స్వప్నం యెంత మధురం .చాలాకాలం కిందటే ఇక్కడికి తీసుకు రాబడిన నేను ఇవాళ కలలో రాముడు పంపిన దూతను చూశాను ,కలలో రామ లక్ష్మణులను చూసి ఉంటె ఈదుఖం ఉండేదికాదు .స్వప్నం కూడా నాపై శఠించింది .కలలో కోతి ఆనందం కలిగించదు.మరి నాకు సంతోషం కలుగు తోందే .కనుక కలకాదు వాస్తవమే చూస్తున్నాను .చిత్తభ్రమకాని వాత ప్రకోపంకాని నాకు కలిగాయా ?లేక ఎండమావి యా?.ఇది ఉన్మాదం కాదు ,మోహమూ కాదు కారణం నన్ను నేను గుర్తిస్తున్నాను, వానరాన్నీ గుర్తిస్తున్నాను ‘’అనుకొని వానరుడు రావణుడే అని మళ్ళీ  భావించి  ఇక అతనితో మాట్లాడటం మానేసింది .

 ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే గండరగండ హనుమ ఆమె మనసులోని సంశయం అర్ధం చేసుకొని .సుమధుర వాక్కులతో ‘’అమ్మా !రాముడు సూర్య తేజస్సున్నవాడు చంద్రునిలా ప్రజకు ఆహ్లాదం కలిగిస్తాడు .కుబేరునిలా సకల లోకాదీశ్వరుడు .విష్ణు పరాక్రమ శాలి. సత్య మధుర భాషణలో దేవగురువు బృహస్పతి .-‘’ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంత శ్శశీ యథా-రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా’’

సౌందర్య రమణీయ ,కాంతి మంతుడు .మన్మధుని మరో రూపు ,నిగ్రహానుగ్రహ సమర్ధుడు .

‘’రూపవాన్ సుభగః శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ –స్థాన క్రోధఃప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః’’

బంగారు లేడి రూపం చూపించి రాముని ఆశ్రమానికి దూరం చేసి ,ఎవ్వరూ లేని సమయంలో నిన్ను అపహరించి తెచ్చిన రావణుడు  దీని ఫలితంగా  రాముని చేతిలో మరణిస్తాడు .అలాంటి తేజో శౌర్య పరాక్రమమూర్తి శ్రీరాముని దూతను నేను .నీ కుశలం అడగమన్నాడు రాముడు .తమ్ముడు నీకు ప్రణామాలు తెలియ జేశాడు .మా వానరరాజు సుగ్రీవుడు నీ క్షేమం అడిగాడు .వారు ముగ్గురు నిన్ను తలవని రోజు లేదు తల్లీ .-

‘’తద్వియోగేన దుఖార్త స్స త్వాంకౌశల మబ్రవీత్ –లక్ష్మణస్య మహా తేజా స్సుమిత్రానంద వర్ధనః –అభి వాద్య  మహాబాహూ స్సత్వాంకౌశల మబ్రవీత్

‘’నిత్యం స్మరతి రామస్త్వాంససుగ్రీవ స్సలక్ష్మణః-దిష్ట్యాజీవసి వైదేహి రాక్షసీ వశ మాగతః

రాక్షసులమధ్య చిక్కి దీనంగా బతికి ఉన్నావు .కొద్దిరోజులలో  ఆసోదరులు సుగ్రీవ సైన్యంతో ఇక్కడికి వస్తారు .నేను సుగ్రీవ మంత్రి హనుమ అనే కోతిని .నీ అన్వేషణలో ఈ మహా సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను .

‘’అహం సుగ్రీవస్య సచివో హనుమాన్నామ వానరః –ప్రవిష్ఠో నగరీ౦ లంకాంలంఘయిత్వా మహోదదిం ‘’

నా పరాక్రమం తో రావణుడి తలపై పాదం పెట్టి వచ్చినట్లు,లంక దేవతను ప్రసన్నం చేసుకొని  లంక ప్రవేశించాను .నేను ముమ్మాటికీ వానరుడనే రావణాసురుడను కాను .నీ అనుమానం వదిలి నామాట విశ్వ సించు సీతమ్మ తల్లీ ‘’అన్నాడు .-‘’

 ‘’కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః –త్వాం ద్రష్టు ముపయాతో –హం సమాశ్రిత్య పరాక్రమం ‘

‘’నాహమస్మి తథా దేవి యథా మా మవాగచ్ఛసి –విశంకా త్యజ్యతా మేషాశ్రద్ధ త్చ్వవదతో మమ ‘’

ఇది 39శోకాల 34వ సర్గ .

ఇందులో హనుమ రావణుడు ఏమో మాయా రూపం లో వచ్చాడేమో అనే సందేహం సీతకు కలగటం అత్యంత సహజం .పూర్వం  సన్నాసిగా వచ్చి మోసం చేశాడు .ల౦కలో అందరూ కామరూప విద్యలో ఆరితేరిన వారే .కనుక నమ్మక పోవటం లో ఏమీ దోషం లేదు .ఒకటికి రెండు సార్లు ఎసర్టైన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది .పూర్వం మాయ లేడి మోసం గ్రహించక రాముడిని తొందరపెట్టి పంపటం ,రాముడికి ఏమీ కాదని మరిది చేబిత అతని మాటలలో దోషం ఆపాదించి  వెంటనే పంపటం, చివరికి లక్ష్మణ రేఖ దాటటం, సీత చేసిన తొందర పాటు నిర్ణయాలే .వాటి  ఫలితమే కొంప కొల్లెరై లంకావాసం గతి పట్టింది .ఇప్పుడు నిదానించాలి అని గ్రహించింది .వానరుని శంకి౦చినా  నెమ్మది మీద సత్యం గ్రహించి మరో తోదరపాటు చర్యకు పాలుపడకుండా సవ్య౦గా ఆలోచించి అసలైన అడుగు వేసి ఫలితం పొందింది .ప్రమాదో ధీమతా మపి అని అన్నారు అందుకే .ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తేనే ఆపదలో పడకుండా ఉండగలుగుతాం .లేక లేడికి లేచిందే పయనం అయితే లాంకావాసమే గతి అవుతుంది .

  హనుమకూడా చెప్పిందే చెప్పి విసుగు కలిగించకుండా రామ కత బహు రక్తిగా చెప్పాడు ఆయన అవతార విశేషం చెప్పకనే చెప్పాడు .రాముడు వస్తాడు దుఖం తొలగించి రావణ వధ చేస్తాడు అనే సానుకూల వార్తా చెవినవేసి ఆమెకు తో శ్రీరామ కథామృత పానం చేయించాడు  .మహర్షి ఆ అమృతం మనకూ అందించి ధన్యులను చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 87-బ్రూనీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

87-బ్రూనీ దేశ సాహిత్యం

బ్రూనీ దేశం బోర్నియా ఐలాండ్ లో ఉన్న చిన్నఆసియా  దేశం .దీని చుట్టూ మలేసియా దక్షిణ చైనా సముద్రం ఉంటాయి .అందమైన బీచ్ లకు ,బయో డైవర్సిటికి ప్రసిద్ధి .రాజధాని –బందర్ సే బెగవాన్.బాల్కిష్ మసీదులు ,వాటి 29బంగారు డోమ్స్ ప్రత్యెక ఆకర్షణ .కరెన్సీ –బ్రూనీడాలర్ .జనాభా 4లక్షల 30వేలు.ఆయిల్ రిచ్ కంట్రీ.సూపర్ సేఫ్ దేశం .అసాంఘిక సెక్స్  నిషిద్ధం .ఆల్కహాల్ దొరకదు, అమ్మరు .మతం-సున్నీ ఇస్లాం .బన్నీ భాష ,మలే,ఇంగ్లిష్ మాట్లాడుతారు .

బ్రూనీ దేశ సాహిత్యం మాలే జాతీయ భాషగా వర్ధిల్లింది .1980లో బ్రూనీ భాష నవలా రచన పోటీలు నిర్వహించారు .2011లో కౌలాలంపూర్ లో జరిగిన సదస్సులో అబ్దుల్లా మాట్లాడుతూ అభి వృద్ధి చెందుతున్న దేశాలు ఒక మిలియన్ జనాభాకు కేవలం వెయ్యి పుస్తకాలు మాత్రమె పాఠ్య పుస్తకాలు అనువాదాలతో సహా వస్తున్నాయని ఆవేదన చెందాడు .

ఆ దేశ పుస్తకాలు రచయితలు –ది వైల్డ్ మెన్ ఆఫ్ దిఈస్ట్-సేలామాట్ మనప్-2009,ఫర్ కింగ్స్ –కిస్ట ఫర్ సన్-2011,ఫర్ లార్న్ అడ్వెంచర్ –అమీర్ ఫలేఖ్ -2013,రిటెన్ ఇన్ బ్లాక్ –కే హెచ్ లిం -2014

నాటకం -2012-ఇన్ ది స్పాట్ లైట్ –యాన్ అంథాలజి ఆఫ్ బ్రూనియన్ ప్లేయ్-గ్రేస్ చిన్

కవిత్వం -1998-అండర్ ది కనోపి అండ్ ఆదర్ పోయెమ్స్-వాగ్హన్ రపతహానా ,2009-ది స్వాన్ స్క్రిప్ట్స్ –షాహీ ఓమరాలి ,2009-యాంగ్ డ్రీమ్స్ –ఇజ్జాటిజమిల్ ,2012-ట్రిబ్యూట్ టు బ్రూనీ అండ్ ఆదర్ పోయెమ్స్-జాన్ ఒడు ఒదిహి,2015-ముమెంట్స్ ఆఫ్ నిల్-ఫ్లోరా టవు

88-బహరైన్ దేశ సాహిత్యం

బహరేన్ కింగ్డం ఆసియాలో పెర్షియన్ గల్ఫ్ లో సావరిన్ స్టేట్.33స్వయం సిద్ధ ఆర్చిపేలగో దీవుల ,మరో 51 కృత్రిమదీవుల సముదాయం .రాజధాని –మనామా .కరెన్సీ –బహ్రేనియాన్ దీనార్ .జనాభా 18లక్షలు .సురక్షిత దేశం .ఆయిల్ ,పెరల్స్ హెరిటేజ్ ల కేంద్రం .పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం. మాస్క్ లను చూడాలంటే సంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి .బీచెస్ కు షార్ట్స్ తో వెళ్ళచ్చు .హోటల్స్ లో  మాత్రమె మద్యం దొరుకుతుంది .దుబాయ్ లో కంటే హాయిగా ఉండచ్చు .డ్రగ్ నేరాలకు మరణశిక్ష ఖాయం .ముస్లిం క్రిస్టియన్ హిందూ బుద్ధిజం లు ఉన్నాయి .అన్నిటికీ అరెబిక్ భాష వాడుతారు ఇంగ్లీష్ కూడా వచ్చు

బహరేన్ సాహిత్యం అంతా మొదటి నుంచి ఆరేబిక్ లోనే ఉన్నది .క్లాసిక్ అరబిక్ లోనే ఖ్వాసిం అడ్డాద్ ,ఇబ్రహీం ఆల్అర్రఎద్,అహ్మద్ మొహమ్మదాలి రాశారు .యువకవులపై పాశ్చాత్య ప్రభావం పడి వచనకవిత్వం వచనం రాస్తున్నారు .ఏదిరాసినా అరెబిక్ లోనే .ఆలి అల్సర్క్వావి ని  లిటరరీ ఐకాన్ అంటారు

2004ఆగస్ట్ లో సూపర్ నేచురల్ ధ్రిల్లర్’’క్విక్సోటిక్’’ను బహ్రేని జర్నలిస్ట్ ఆలీ అల్ సయీద్ ఇంగ్లీష్ లో రాసి ప్రచురించి మొదటి నవలా రచయిత అయ్యాడు .2011లో ఈదేశ రచయితలూ ఈజిప్షియన్ రివల్యూషనరి ఉద్యమానికి మద్దతు పలికారు .20వ శతాబ్దిలో మహిళలు కూడా రాయటం మొదలుపెట్టారు .1925-85కాలం లోకవులలో ఆరవవంతు స్త్రీలే .వీరిలో ఫాతిమా అల్ టాయ్ టున్,ఫతియా అజిజాన్ ,హమ్డా కామిస్ ,ఫజిలా అల్సింది ప్రముఖులు.

20వ శతాబ్ది ఉత్తరార్ధం లో వచనకవిత్వం ,వచనం ముఖ్యంగా మహిళలలో ప్రాముఖ్యమైనాయి .అయినా 1969తర్వాతే మహిళా కవులు విజ్రుమ్భించారు .హమ్డా కంసి –షార్ప్ నెల్,మొదటికవితా సంపుటి తెచ్చింది .ఇమాన్ అసిరి మొదటి వచనకవితా సంపుటి రాసి ప్రచురించి రికార్డ్ స్థాపించింది .

ఈ దేశం గురించి ఎపిక్ ఆఫ్ గిల్మేష్ లో ఇక్కడే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ప్రస్తావన ఉన్నది .జేమ్స్ జాయిస్ ఫిన్నేగన్స్ వేక్ లో ,లూసి కాల్డ్వెల్ అవార్డ్ విన్నింగ్ నవల –ది మీటింగ్ పాయింట్ కు నేపధ్యం ఈ దేశమే .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాలసారస్వతం 85-వాటికన్ సిటి సాహిత్యం

 ప్రపంచ దేశాలసారస్వతం

85-వాటికన్ సిటి సాహిత్యం

వాటికన్ సిటి స్టేట్ ను రోమ్,ఇటలీలు పరివేష్టించి ఉంటాయి .రోమన్ కేధలిక్ చర్చి ప్రధానకేంద్రం .పోప్ నివాసస్థానం. ఆర్కిటెక్చర్ కు కేంద్రం .ప్రాచీన రోమన్ శిల్పాలకు నిలయం .కరెన్సీ –యూరో .జనాభా సుమారు 825.ప్రపంచంలోనే అతి చిన్న దేశం .ఇక్కడ ఎన్నికలు జరగవు వోటింగ్ హక్కు  ఉండదు .ప్రపంచంలోనే అతి సంపన్న దేశం .జిడిపి -116,799డాలర్లు .ఏ ఇతర దేశం కంటే 20వేలడాలర్లు ఎక్కువ .ఆయిల్ రిజర్వ్ ఎక్కువ .గ్లోబల్ సప్ప్లై లో 13శాతం దీనిదే .అధికార భాష –ఇటాలియన్ .అన్ని భాషలూ అక్కడ మాట్లాడుతారు .

  వాటికన్ సిటి సాహిత్యం వేరుగా ఉండదు ఉన్నదంతా కేధలిక్ సాహిత్యమే .అక్కడి కొన్ని పుస్తకాలు –ఏంజెల్స్ అండ్ డెమన్స్ –రాబర్ట్ లాంగ్డన్,కాంక్లేవ్-కిన్డిల్ ఎడిషన్ ,గాడ్స్ స్పై-ఫాదర్ ఆంటోని ఫ్లోవర్ ,అబ్జల్యూట్ మొనార్క్స్ –ఎ హిస్టరీ ఆఫ్ ది పాపసి ,మైకేలాన్జేలో అండ్ ది పోప్స్ సీలింగ్ ,ది డావిన్సి కోడ్-డాన్ బ్రౌన్ ,వెన్ ఇన్ రోమ్-రాబర్ట్ హచిన్సన్,ది థాట్ ఆఫ్ పాప్ బెనెడిక్ట్-16-ఎయిడన్ నికోలస్

  ఇంతకంటే అక్కడ సాహిత్యం లభించలేదు .

విన్నపం –ప్రపంచ దేశాల సారస్వతం పేరిట నేను రాసిన ఈ 85వ దేశం వాటికన్ సిటి తో యూరప్ లోని బ్రిటన్ సాహిత్యం తప్ప అన్ని దేశాల సాహిత్యం రాశాను .

   ఆసియా దేశాల సాహిత్యం కూడా కొంతరాశాను .మిగిలిన ఆసియా దేశాల సాహిత్యం లోకి  నాతోపాటు ప్రయాణం చేయమని ఆహ్వానిస్తున్నాను .

86-అజర్ బైజాన్ దేశ సాహిత్యం

అజర్ బైజాన్ రిపబ్లిక్ దేశం కాస్పియన్ సముద్రం ,కాకాస్ పర్వతాల దగ్గర ఉన్న ఆసియా దేశం .రాజధాని –బకు.మధ్యయుగ గోడల ఇన్నర్ సిటి.15వ శతాబ్ది రాయల్ రిట్రీట్.శతాబ్దాల నాటి పురాతన రాతి మైడెన్ టవర్ ఆకర్షణ .యానార్ దాగ్అంటే బర్నింగ్ మౌంటేన్ గొప్ప టూరిస్ట్ స్పాట్ .  రెన్సీ –అజర్ బైజాన్ మనత్.అధికార భాష –అజర్ బైజాన్ .ఇంగ్లీష్ మాట్లాడరు.జనాభా ఒక కోటి.85శాతం షియా ,మిగిలిన వారు సున్ని మతస్తులు

  అజర్ బైజాన్ సాహిత్యం  మొదట్లోఅంటే 14వ శతాబ్ది దాకా  అనటోనియన్ టర్క్ ల సాహిత్యమే –పెర్సో –అరెబిక్ స్క్రిప్ట్ లో రాసిందే .14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఈదేశ రచయితలు  ఆ సాహిత్యాన్ని  అభి వృద్ధి చేశారు.17వ శతాబ్దిలో కవిత్వం ప్రాముఖ్యత పొందింది .19వ శతాబ్దిచివరలో వార్తాపత్రిక వచ్చింది .ఇరాన్ ను రెజా షా పాలించే టప్పుడు ఈ దేశ సాహిత్యాన్ని నిషేధించాడు .స్టాలిన్ నియంత పాలన లో ఈ దేశ ఆల్ఫబేట్ ను బలవంతంగా క్రిల్లిక్ ఆల్ఫబేట్ లోకి మార్పించాడు .రిపబ్లిక్ అయ్యాక  మళ్ళీ  దేశీయ సాహిత్య వ్యాప్తి జరిగింది .

  అజర్ బైజాన్ సాహిత్యం రెండు సంప్రదాయాలుగా మారింది .జానపద సాహిత్యమే మొదట్లో పరవళ్ళు తొక్కింది .దీనిలో పాట ప్రాణం పోసుకోన్నది .జానపద సంగీతమూ ఇదే ధోరణిలో ఉన్నది .రెండవ సంప్రదాయం లో పర్షియన్ ,అరెబిక్ సాహిత్య ప్రభావం పడి 11వ శతాబ్దినుంచి ఇప్పటిదాకాకొనసాగుతోంది .అల్లుద్దీన్ కె కుబాద్ -1 రాజాస్తానకవి  డేహ్హాని ఉన్నత పెర్షియన్ సాహిత్యం సృష్టించాడు .16వ శతాబ్దిలో సఫావిద్ సామ్రాజ్యం ఏర్పడ్డాక కూడా ఇదే విధానం నడిచింది .తర్వాత అజర్ బైజాన్ ఛందస్సు ‘’అరుజ్ ‘’ను ఉపయోగించుకొని కవిత్వం రాశారు .పర్షియన్ అరెబిక్ పదాలను అజర్ బైజాన్ భాషలోకి ఎరువు తెచ్చుకొని భాషాభి వృద్ధి చేసుకొన్నారు .దీన్ని ‘’దివాన్ సాహిత్యం ‘’అన్నారు .

  అజర్ బైజాన్ భాషలో ఎపిక్స్ – ఆల్ఫమికష్, ‘’బుక్ ఆఫ్ డెడే కోర్కట్’’లు .రెండవ దానిలో రూసేన్ అలీ సాహస యాత్రలు వర్ణితం.సఫావిద్ లేక దివాన్ కవిత్వం లో సింబాలిక్ కళ ఎక్కువ .నైటింగేల్, రోజ్ మొదలైనవాటిని సింబాలిక్ గా ప్రయోగించారు .ఫజూలి కవి రెండుభాషల్లోనూ గొప్పకవిత్వం రాశాడు.బాకి ఆలంకారిక కవిత్వం లో దిట్ట .నెఫీ కవి పానేగ్రిక్ లో నిష్ణాతుడు .నయాబి సాంఘిక ఇతివృత్త కవిత్వం చెప్పాడు .టులిప్యుగ విప్లవకవి సాధారణ విషయాలకు కవితా రూపం ఇచ్చాడు .సేయే గాలిబ్ సూఫీ కవి గా సుప్రసిద్ధుడు .

 దివాన్ గజల్ సంప్రదాయాన్ని అజర్ బైజాన్ లో ది౦పినవాడు నేసిమి .ఆధునిక యుగం లో నారిమన్ హసన్ జేడె ,ఖలిల్ రాజా ,సఫైర్ నవ్రుజ్ ,అమ్రేలి మొదలైన వారున్నారు .అనరా వచనానికి ప్రాముఖ్యమిచ్చాడు సులేమాన్లి ,రాసుల జేడె వంటివారు వచనంలోనే రాశారు .దిధర్టీంత్ అపోజిల్ నవలను హేన్సిన్ హుసేన్ బెయిల్ రాశాడు .షా అబ్బాస్ ,నాదిర్ షా చారిత్రాత్మక నవలలూ రాశాడు .దేశం స్వాతంత్ర్యం పొందాక ‘’కారబాక్ మౌ౦టెన్స్ కాల్  అజ్ ‘’,ను కారాబాఖ్ రాస్తే ,అజర్ బైజాన్ డైరీ రాశాడు ఎల్బృస్ ఒజేరేవ్ . యుద్ధ ఉన్మాదం పై చాలారచనలు వచ్చాయి .2009లో ఆలి అండ్ నినో పబ్లిషింగ్ హౌస్ ఏర్పడి యువ రచయితలకు ఆసరాగా నిలిచింది .గజాక్ లో లిటరేచర్ మ్యూజియం కూడా ఏర్పడింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-30

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-30

ఎర్రని పగడపుకాంతి ముఖం తో మహా తేజశ్శాలి వాయునందన హనుమాన్ వినయంతో ప్రణమిల్లి శిరస్సుతో అంజలి ఘటించి మధురాతి మధురవాక్కులతో ‘’అనింద్య సౌశీల్యవతీ ఈ చెట్టుకొమ్మను పట్టుకొని వ్రేలాడే నువ్వెవరు తల్లీ .నీ కంటినుండి ఆ సతత బాష్పదారఎందుకు .దేవ యక్షకిన్నెర కిపురు షులలావులలో  ఏ జాతి స్త్రీ రత్నానివి నువ్వు ?నాకుమాత్రం దేవతలాగా కన్పిస్తున్నావు .దివిను౦డిజారిన వసిస్ట  మహర్షి ధర్మపత్ని అరు౦ధతివా ?ఎవరి గురించి నీ శోకం ?నీలో రాజలక్షణాలు కన్పిస్తున్నాయి .నీ సాముద్రిక  లక్షణాలను బట్టి ఎవరో గొప్పమహారాజు పట్ట మహిషివి అనిపిస్తోంది .ఒకవేళ జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతమ తల్లివా? .అలా ఐతే చెప్పు నీకు శుభం కలుగుగాక .నీ దైన్యం మానవాకారం తాపస వేషం చూస్తె శ్రీరామ ధర్మపత్ని సీత నువ్వే అనిపిస్తోంది ‘’అన్నాడు హనుమ .

  హనుమపలుకులకు ఆమె మనసు ఊరట చెంది పైకి చూస్తూ ‘’రాజ శ్రేష్టుడు ఆత్మ విదుదు దశరధ మహారాజు కోడలిని నేను .విదేహరాజు జనకుని కుమార్తె జానకిని సీతను .దీమంతుడైన రాముని భార్యను .అత్తవారింట్లో పన్నెండేళ్ళు సర్వ సుఖాలు అనుభవించి ,13ఏట మామగారు శ్రీరామపట్టాభి షేకం చేసే ఏర్పాటు చేస్తే ,ఆయనభార్యకైకేయి ఆయనతో ‘’రాముడికి పట్టాభి షేకం చేస్తే ఇక రోజనుంచి  నేను భోజనం నీరు త్రాగటం  మానేసి ఉపవసాలతో ప్రాణాలు వదుల్తాను .నాకిచ్చిన వరదానం ప్రకారం రాముడిని అడవికి పంపు ‘’అనగానే ఊహించని దశరధుడు తట్టుకోలేక మూర్ఛ  పోయాడు .తెప్పరిల్లి రాముని పిలిపించి ‘’నీకిస్తానన్న రాజ్యం మళ్ళీ నాకు ఇచ్చెయ్యి ‘’అని కోరాడు –

‘’తటస్త స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః –జ్యేష్టం యశస్వినం పుత్రం రుదన్ రాజ్య మయా చత’’

  రాముడు రాజ్యం కంటే తండ్రిమాటకే విలువ ఇచ్చి అమూల్య ఆభరణ వస్త్రాదులు విసర్జించి ,మనస్పూర్తిగా రాజ్యత్యాగం చేసి, నన్ను అత్తగారు కౌసల్యవద్ద ఉండమని చెప్పాడు .నేనూరుకొంటానా ఆయనకన్నా ముందే అడవికి బయల్దేరాను .ఆయన లేనిది స్వర్గం కూడా నాకు రుచించదు –

‘’సాహం తస్యాగ్రత స్తూర్ణంప్రస్థితా వానచారిణీ‘’నహి మే తేన హీనాయా వాసః స్వర్గే ఫై రోచతే ‘’

ఇంతలో ఈ విషయం తెలిసి రామానుజుడు లక్ష్మణుడు నార బట్టలు కట్టుకొని అన్నతో వెళ్ళటానికి సిద్ధమయ్యాడు .ఇలామేముముగ్గురం ఇది వరకు ఎప్పుడూ చూడని ఘోరారణ్యం లోకి ప్రవేశించాం .మేము దండకారణ్యం లో ఉండగా దుర్మార్గరాక్షసప్రభువు రావణుడు  నన్ను అపహరించాడు .వాడు నా ప్రాణం తీయటానికి ఇంకా రెండు నెలలు మాత్రమె గడువు పెట్టాడు .ఆ రెండు నెలలు అయిన మరుక్షణం నేను తప్పక ప్రాణాలు విడుస్తాను ‘’అని చెప్పింది .

ఇది 31 శ్లోకాల 33వ సర్గ .

హనుమ సీతకు యెంత టూకీగాజరిగిన  రామ చరిత్ర చెప్పాడో అంతే టూకీ గా సీత హనుమకు అప్పటివరకు జరిగిన తన కథ చెప్పింది .రెండు నెలలో ఏదో మార్పు రాకపోతే తనప్రాణాలు నిలవవు అని గట్టిగానే చెప్పింది .సూక్ష్మ గ్రాహులు సీతా ,హనుమలు .ఒకరు చెప్పింది ఇంకొకరు స్పష్టంగా అర్ధం చేసుకో గలరు .ఇక కాగలకార్యం ఫలవంతంగా తీర్చాలి ఎవరు యెట్లా అనేది సస్పెన్స్.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 84-యుక్రేన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

84-యుక్రేన్ సాహిత్యం

యుక్రేన్ తూర్పు యూరప్ లో పెద్ద దేశం .ఆర్ధడాక్స్ చర్చిల నిలయం .నల్లసముద్ర తీరం ,వృక్షాల పర్వతాలు ఆకర్షణ .రాజధాని –కీవ్ లో  గోల్డ్ డోమ్ 11వ శతాబ్ది కేధడ్రిల్ చర్చి ఉంటుంది .కరెన్సీ యుక్రేన్ హ్రివ్నియా .అధికార భాష యుక్రేనియన్..భయపడకుండా సందర్శించవచ్చు .4న్నర కోట్ల జనాభాలో నాలుగో వంతు ప్రజలు బీదలే .అతి పేద దేశం .అందరూ యుక్రెన్ భాషలోనే మాట్లాడుతారు .క్రైస్తవ మత దేశం .

 యుక్రెన్ సాహిత్యం అంతా యుక్రేనియన్ పై అనేక దేశాల పెత్తనం వలన  మౌఖిక వ్రాత సాహిత్యమంతా 17వ శతాబ్ది నుంచి 21వ శతాబ్ది వరకు  నేరంగా భావించబడింది .కానీ పోలిష్ –లిదూనియన్ కామన్ వెల్త్,పోలాండ్ ,రష్యా సామ్రాజ్య కాలం ,రొమేనియా రాజ్యపాలనలో ,ఆస్ట్రియా-హంగేరి సామ్రాజ్యం ,అట్టోమాన్ సామ్రాజ్య కాలం లో యుక్రేన్ భాషా సంస్కృతులకు దోహదం జరిగి,యుక్రెన్ రచయితలు  ఆభాషలో చాలా సంతోషంగా రాశారు .

  17 వ శతాబ్ది పూర్వం వరకు చాలామంది స్కాలర్లి భాషఅంటే లాటిన్ ,ఓల్డ్ స్లావానిక్ భాషలలో  రాశారు .వీరిలో హ్రియోరి స్కోవోరోడా,యురియ్ డ్రోహోబిక్,సెబాస్టియన్ క్లెనో విక్,జాన్ టొమా, పావియో రుసిన్ మొదలైనవారున్నారు .1770నాటికి దేశంలో విద్యా ఆలయాలు చాలా వచ్చాయి .1720లో జర్మన్ యాత్రికుడు రాస్తూ ఈత్మన్ డాన్యోఅపోస్టల్ కొడుకు ఏనాడూ యూక్రెన్ దాటి వెళ్లకపోయినా లాటిన్ ,ఇటాలియన్ ఫ్రెంచ్ జర్మన్ పోలిష్ రష్యన్ భాషలలో మహా ప్రతిభ ఉన్నవాడు అన్నాడు .16నుంచి 17వ శతాబ్ది మొదటిభాగం వరకు ‘’డూమి’’అనే జానపద ఎపిక్స్ బాగా వచ్చాయి .వీటిలో కోసక్కుల జీవిత వ్యవహారాలున్నాయి ఇవి మౌఖికంగా తరతరాలుగా వ్యాపించాయి .

  యూక్రేనియన్ భాషలో రాయబడి మొదట ముద్రణ పొందింది మాత్రం ఇవాన్ క్రోటీ లర్ విస్కీ 1798 లోరాసిన ‘’ఎనీడా ‘’కావ్యం.అందుకే ఈయనను ‘’యూక్రెన్ సాహిత్య జనకుడు’’అని గౌరవిస్తారు .ఆధునిక యూక్రేన్ వచననవల ‘’మరుస్యా ‘’ కు 1834లో శ్రీకారం చుట్టినవాడు-హ్రిహోరిక్విటివా  సోవియనేస్కో ‘

  1830లో యువ గలీషియన్ కవులు రచయితలూ ‘’రుధేనియన్ ట్రయడ్’’ నెలకొల్పి దేశం పశ్చిమభాగం లో సాంస్కృతిక పునరుజ్జీవనం కలిగించారు .వీరిలో ముఖ్యులు మార్కియన్ షషి కే విచ్ ,యాకివ్ హలో వట్స్కి,ఇవాన్ వహిలో విచ్ . వీరివలన యూక్రేనియాన్ చరిత్ర అన్వేషణ జరిగి గాల్లిక్ ,బుకోవినా ,ట్రాన్స్ కర్పాధియా లు అందరూ యూక్రేనియాన్ ప్రజలే అన్నారు .వీరికి స్వంత భాష మతం సంస్కృతీ,చరిత్రా  ఉన్నాయని తెలియజేశారు.వీరి వ్యాస సంపుటి ‘’రుసల్కా  డిస్త్రోవా ‘’  ,దీన్ని మౌఖిక యూక్రేనియాన్ భాషలో రాశారు .ఇదే అసలైన యూక్రేనియాన్ భాషలో సాహిత్య ప్రారంభం  .రోమా౦టిజం కూడా అప్పుడే ప్రవేశించి ఉద్యమానికి స్పూర్తికలిగించి సాహిత్య ఐక్యతకు తోడ్పడింది .ఇయాన్ కోటియారస్కి రచన ఎనీడా అందరిపై గొప్ప ప్రభావం చూపింది .ఈ యువ బృంద విశాలభావాలు ఇరుకు హృదయాల చర్చి పెద్దలకు నచ్చక తీవ్రంగా వేధించారు .ఈయువకుల పుస్తకం హన్గేరిలో ప్రింట్ చేశారు .జనపదాలు అనేక ప్రదేశాలలో  రికార్డ్ చేశారు .పాతతరం రచనలన్నీవెలుగు లోకి తెచ్చారు ‘

  యూక్రేనియన్ రొమాంటిక్ కవులలో టరాస్ చెవ్ చెంకో,పాంట లీమన్ కులిష్ ముఖ్యులు వీరితో జాతీయోద్యమం కూడా బలపడి సెవ్ చెంకో ను జాతీయకవి అన్నారు .తర్వాత పాప్యులిజం యువతను ఆకర్షించి౦ది .రాడికలిజం పదంలో రాడిక్స్అనే లాటిన్ ధాతువు అర్ధం వేరు –రూట్ .ఈ ఉద్యమం ఒక ఊపు ఊపి ,అగ్రేరియన్ సోషలిజం దారి చూపింది .మైఖేలియో డ్రహమ నోవ్ యూక్రెన్ రాడికల్ పార్టీ నాయకుడు అయ్యాడు ‘

  19,20వ శతాబ్దాలలో ఆధునిక భావజాల వ్యాప్తి జరిగి నవల కథ,నాటక  రచన ప్రారంభమయ్యాయి .కొంతకాలానికి బోర్ కొట్టి సింబాలిక్ కవిత్వం రాశారు .మైఖేల్ కొత్సుబియంకి రియలిజం మోడర్నిజం కు వారధి .ఒహ్లా కోబి నిస్కా నియో రొమాంటిక్ కవిత్వం తో ఉర్రూత లూగించింది .లిసోవా పిస్నియా 1911లో ఏ ఫారెస్ట్ సాంగ్ ‘’నాటకం రాసి నాటకాలకు తెరఎత్తాడు.ఇంప్రెష నిస్ట్ కథలురాసింది వాసిల్  స్టెఫనిక్.వొలోడి మిర్ విన్ని చెంకో మానసిక అనుభూతులు నైతికత కు ప్రాముఖ్యమిచ్చాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం

స్లోవేకియా లేక సొవక్ రిపబ్లిక్  మధ్య యూరప్ లో పోలాండ్ ,యుక్రెయిన్ హంగేరి ,ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న దేశం .49వేల చదరపుకిలోమీటర్ల భూభాగం .రాజధాని బ్రస్టి స్లావా .కరెన్సీ –యూరో .భాష –స్లోవక్.యూరో జోన్ లో రెండవ బీద దేశం .ఎత్తైన తాత్రార్ పర్వతాలు 2500 మీటర్ల శిఖరాలు, గుహలు  ,పచ్చని లోయలు  ,మౌంటెన్ బైకింగ్ యాత్రిక ఆకర్షణ  .ఇక్కడి ప్రజలు అద్భుత అ౦ద౦ తో ఉంటారు –కారణం ఆర్యన్ బేబీల సంతానం అవటమే .హిట్లర్ ఆర్యన్ బేబీలు రెం ప్ర యు.తర్వాత జర్మనీకి దగ్గరలో ఉన్న దేశాలలో స్థిరపడ్డారు .ఈబ్రీడ్ చాలా పెర్ఫెక్ట్ అని హిట్లర్ భావన .కేధలిక్ మతస్తులు .

 స్లోవేకియా దేశ సాహిత్యాన్ని స్లోవక్ సాహిత్యం అంటారు .మొదటి తరం అంటే గ్రేట్ మొరేవియాకాలం-8-10శతాబ్డులమధ్య  రచయితలలో సెయింట్ సిరిల్ ,సెయింట్ మేథోడియస్,క్లెమెంట్ ఆఫ్ ఆక్రిడ్ ముఖ్యులు .ప్రోగ్లాస్ కవిత్వం తో సహా క్రిస్టియన్ మత విషయరచనలే అన్నీ.11-15 శతాబ్దాల సాహిత్యం మధ్యయుగ సాహిత్యం .ఇదంతా లాటిన్ ,జెక్ ,స్లోవకైజ్డ్ జెక్ భాషలలో రాయబడినదే .లిరిక్ కవిత్వం పై ఇంకాచర్చి ప్రభావం పోలేదు .ఎపిక్ కవిత్వం లెజెండ్స్ ఆధారితం .జోహేన్నేస్ డీ థురోజ్ కవి –క్రానికా హన్గరోరం ,మారస్ రాశాడు .సెక్యులర్ రచనలుకూడా పురుడుపోసుకోన్నాయి కొన్ని .

  16వ శతాబ్దిలో జాతీయభావం మేల్కొన్నది ,అయినా లాటిన్ లోనేగిలికారు .ప్రాచీన గ్రీస్ ,రోమ్ లకు సంబంధిత రచనలుకూడా వచ్చాయి .స్లోవాక్ భాషలో ప్రింట్ అయిన మొదటిపుస్తకం ది బుక్ ఆఫ్ ఓత్స్-1561ను వాసిక్ జేలేస్కి రాశాడు .1560లోనే ‘’సల్లాడి అండ్ హడ్మాజి’’అనే ప్రేమకావ్యం అజ్ఞాతకవి రాసింది వచ్చింది .జురాజ్ ట్రానో విస్కీని ‘’ఫాదర్ ఆఫ్ స్లావాక్ హిమ్నొడి’’అంటారు  .ఇతడి సితారా సాన్క్టోరమ్  అంటే లైర్ ఆఫ్ ది సెయింట్స్  జెక్ భాషలో రాయబడి 1636లో లేవోకాలో అచ్చు అయింది .ట్రాన్సో విస్కీ రాసిన స్లోవక్ హైమ్స్ వలన జాతీయభావం ఏర్పడింది .

  డేనియల్ సినపియస్ హార్కికాలాటిన్ కవిత్వం, స్కూల్ డ్రామాలు,సామెతలు స్లావాక్ ఆధ్యాత్మిక గీతాలు, వచనం  రాశాడు .ఇతని వచనరచన జాతీయభావాన్ని ,దేశభక్తిని  మరింత ఉద్దీపిత౦  చేసింది  హుగోలిన్ గావ్లో విక్-నైతిక, విద్యా సంబంధ రచనలను పడమటి స్లోవక్ మాండలికం లో రాశాడు.ఇతని ప్రముఖ వలస్కా స్కోల, మ్రావువ్ స్టోడోలా  కావ్యాలలో 17,862 పద్యాలున్నాయి .వీటిలో ఎక్కువగా కప్లేట్స్ ఉండటం విశేషం .

  తర్వాత వచ్చిన క్లాసిజంకవిత్వంలో ఆంటాన్ బెర్నోలాక్ రాసిన గ్రమాటికా స్లావికా లో వెస్ట్ స్లోవాక్ డయలేక్ట్  వాడాడు .1879లోజురాజ్ ఫ్లండిల్’’యాన్ ఇంటిమేట్ ట్రీటిబిట్వీన్ ది మాంక్ అండ్ డెవిల్’’ను బెర్నోలాక్ స్టాండర్డ్ లో ముద్రించాడు .మొదటి హంగేరియన్ పత్రిక మాగిర్ హిర్మండో1780లో ,మొదటి స్లావిక్ న్యూస్ పేపర్ 1783లో వచ్చాయి .జోజేఫ్ ఇగ్నక్  బజరా మొదటినవల-రీనీ మేడిన్ కా ప్రిహోది అ స్కుసేనోస్టి రాశాడు .జాన్ కల్లార్ 150కవితల సంపుటి ‘’గ్లోరీస్ పాన్ స్లోవిక్ ఐడియల్స్1883లో వెలువరించాడు .ఇదే ఈయుగపు అత్యంత విలువైందిగా భావిస్తారు

  లోడోవిట్ స్టర్ చాలాపుస్తకాలురాసి 19వ శతాబ్ది జాతీయోద్యమానికి కారకుడయ్యాడు .అతడు ‘’స్లోవక్ డయలేక్ట్అండ్ ది నేసెసిటి టు రైట్ ఇన్ ఇట్’’రాసి జాతీయ చట్ట క్రోడీకరణకు తోడ్పడ్డాడు.1853లో సింగింగ్ అండ్ సాంగ్స్ అనే ఏకైక సంపుటి రాశాడు .జంకో క్రాఫ్ ఆధునిక స్లోవిక్ భాషలో రాసిన మొదటి కవి .జాన్ చౌలూప్కా మొదట జెక్ లో రాసినా తర్వాత స్లావిక్ లో రాసిజేక్ రచనలు చాలా స్లోవాక్ లోకి అనువదించాడు .

 పావోల్ ఆర్సజేగ్ 1860దాకా హంగేరియన్ లో రాసి ,1871లో వచ్చిన అల్మనాక్ కు స్లావాక్ లో ముందుమాట రాశాడు .స్లావిక్ కవిత్వం లో సిలబిక్ టోనిక్   ప్రవేశపెట్టాడు .రియలిజం కు ఆద్యుడయ్యాడు మార్టిన్ కుకుసిన్ .

  ఆస్ట్రో –హంగేరియన్ సామ్రాజ్యం కూలిపోయి జెకోస్లోవేకియా ఏర్పడ్డాక భాషా సంకుచిత్వం పోయింది .మొదటి యుద్ధకాలంలో కవిత్వ స్థానం వచనం ఆక్రమించింది .1927లో మిలో అర్బన్ రాసిన ‘’ది లివింగ్ విప్’’,జోజేఫ్ సిగేర్ హోనోస్కి 1933లో రాసిన ‘’జోజేఫ్ మాక్ ‘’నవల పల్లెజీవితం ,ప్రకృతికి గొప్ప స్థానం కల్పించింది .స్లోవాక్, జెక్ ల పునరుద్ధరణలో రెండు సాహిత్య ధోరణులతో ఉద్యమాలు వచ్చాయి .హోనోస్కి ,ఫ్రాంటి సెక్స్వాన్టేనేర్,చోరోబాక్ఒండ్రే జోవ్,మార్గిటా ఫిగులి లు  లిరికల్ ప్రోజ్ తోనూ ,స్టీఫన్ జేరి రుడాల్ఫ్ ఫాబ్రి, పావెల్ బంకాక్ మొ  దలైనవారు సర్రియలిజం లోనూ దూసుకు పోయారు

83-స్లోవేనియా దేశ సాహిత్యం

స్లోవేనియా దేశం మధ్యయూరప్ లో పర్వతాలు స్కి రిసార్ట్స్,సరస్సులతో ఆకర్షణీయంగా ఉంటుంది .మధ్యయుగ దుర్గాలు కోటల కు నిలయం.రాజధాని –లుబ్లిజాన .కరెన్సీ-యూరో .అధికారభాష –స్లోవేనియన్ .జనాభా 21లక్షలు  .మతం –క్రిస్టియానిటి.యాత్రికులకు ఖర్చు తక్కువ .సేఫ్టి దేశం .

 స్లోవేన్ సాహిత్యం మొదట్లో అంతా ఓరల్ సాహిత్యమే .జానపద గీతాలే .మొదటి వ్రాతప్రతి ఓల్డ్ స్లోవెన్ లో రాయబడిన 972-1022కాలపు ఫ్రీజింగ్ మాన్యు స్క్రిప్ట్ ను 1803లో  జర్మనీలో కనుగొన్నారు .క్రైస్తవ మతవ్యాప్తికోసం రాయబడింది .ప్రోటే స్ట౦ట్  రిఫార్మర్లు ‘’కేటా కిస్మాస్ ,అబ్సె డేరియం లు 1550లో రాసి స్క్వాబిక్ హాల్లో ప్రింట్ చేశారు .ట్రూబర్ దీన్ని స్లోవెన్ లోకి తర్జుమా చేశాడు .తర్వాత న్యు టెస్టమెంట్ అనువాదం చేశారు .16వ శతాబ్ది ఉత్తరార్ధం లో ఈ భాష యూరోపియన్ దేశాలకు తెలిసింది .వివిధ భాషా నిఘంటు ను హిరోనమస్ మేగిసేర్ తయారు చేశాడు .దీనితో ఈభాషలో రాయటానికి రచయితలూ బాగా ము౦దుకొచ్చిరాశారు .

  ప్రక్క దేశాలతో పాటు ఇక్కడా అన్నిరకాల సాహిత్య ఉద్యమాలూ వచ్చి వివిధకవులు అందులో రాయటం జరిగింది .నియో రియలిజం లో సిరిల్ కోస్మాక్, టోన్ సీస్కర్ మొదలైనవారు రాశారు .ఇంటిమిజంలో లోజ్కే క్రాకర్ మొదలుపెడితే క్లైమాక్స్ కు చేర్చి౦ది మాత్రం ‘’పోయెమ్స్ ఆఫ్ ది ఫోర్’’తో జేనేజ్ మేనార్ట్ .అడా స్కేరి –పోస్ట్ వార్ రివల్యూషన్ కు వ్యతిరేకంగా సబ్జెక్టివ్ ,పెసిమిస్టిక్ కవిత్వం రాసింది .

  ఆధునిక కవులలో ఎద్వార్డ్కోకేక్ ,వితోమిల్ జుపాన్ వగైరా ప్రసిద్ధులు .పోస్ట్ మోడర్నిజం లో బోరిస్ నోవాక్ ,మార్కో క్రవోస్,జా౦కో ఫెర్క్,ఒవేట్కా లిపస్వగైతాలు గొప్పగా రాశారు      .1990తర్వాత రాసినవారిలో అలేస్ డేబెజక్,జోస్సిప్ ఓస్టి  ,జానీ విర్క్,బాంకో పుల్కో ఉన్నారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

తెల్లని వస్త్రాలు మెరుపుల సమూహం లాంటి పింగళ వర్ణం కల ఆ హనుమను చూసి మొదట భయపడిన సీత ,చాలా వినయంగా ప్రియవచనాలు పలుకుతూ అశోక పుష్ప కాంతి కలవాడై మేలిమి బంగారంలా  ప్రకాశి౦చె కళ్ళతో ఉన్న హనుమను దర్శించింది  .అతడి భయంకర వానర రూపం చూసి భయపడి ,చూడరానిదేదో చూశానే అనుకొన్నది .తెప్పరిల్లి రామ లక్ష్మణస్మరణ చేసి నెమ్మదిగా ఏడ్చింది .తానూ చూసింది కల అని భావించింది .మళ్ళీ మరోసారి కపి వరాఖ్యుని తేరి పారచూసి ,తెలివి తప్పినట్లు పడిపోయింది .మళ్ళీ తెప్పరిల్లి కోతి కలలో కనిపిస్తే  అనిష్టం అ౦టారుపెద్దలు. తనవలన రామ సోదరులకు,తనతండ్రి కి  ఆపత్తు ఏమీ రాలేదు కదా అనుకోని ,శుభం కలగాలని కోరుకొన్నది .అంటే ఆపత్తు తనకోచ్చినా పరవాలేదు తనవారికి రాకూడదు అన్నదొడ్డ  భావం సీతామాతది.

  అసలు తనకు కల రావటం ఏమిటి ?నిద్ర పోయే వారికే కదా కలలు వచ్చేది. రామవిరహంతో తానెప్పుడూ నిద్రే పోలేదు కదా .తనకు  కల రావటం అసంభవం  తనరాముడినే ప్రతిక్షణం తలచుకొంటూ ,మనో నేత్రాలతో చూస్తూ తానె రాముడిని తలుస్తూ ఉంటె ,ఆయనననే స్మరిస్తున్నాను కదా అనుకొన్నది .-స్వప్నోహి నాయం నహి మే స్తి నిద్రా –శోకేన దుఖేన చ పీడితాయాః-సుఖం హాయ్ మే నాస్తి యతోస్మి హీనా –తేనే౦దు పూర్ణ ప్రతిమాననేన ‘’

ఈ రామనామం పలికేది తన అభిలాష మాత్రమె అను కొన్నది .మళ్ళీ ఆలోచించి అదీ కాదు అనుకోని తనమనసుకు రూపం లేదుకదా అని భావించి ,పైన చెట్టు ఆకులమధ్య కూర్చున్న వానరం తనకి స్పష్టంగా కనిపిస్తోంది ,అతనిమాటలు వినిపిస్తున్నాయి కదా అని ఊరడిల్లి౦ది

‘’రామేతి రామేతి సదివ బుద్ధ్యా –విచి౦త్య వాచాబృవతీ తమేవ –తస్యాను రూపాం చ కథా తమర్ధ –మేవం ప్రపశ్యామి తథా శృనోతి’’

‘’అహం హితస్యాద్య మనోభవేన –సంపీడితా తద్గత సర్వభావా –విచింతయంతీ సతతం తమేవ  –తథైవ పశ్యామితథా శృణోమి’’

‘’మనో రథః స్యాదితిచింతయామి –తథాఫై బుధ్యా చ వితర్కయామి –కిం కారణం తస్య హి నాస్తి రూపం –సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం’’

 ,ఇక చేయాల్సింది అంతా దేవతలకే అప్పచెప్పాలి. తాను  నిమిత్తమాత్రురాలను అనే ఎరుక కలిగి బ్రహ్మ దేవేంద్ర అగ్ని దేవతలకు నమస్కరించి ఆ వానరుడు పలికింది అంతా యదార్ధమవుగాక ,కల కాకుండు గాక అని గాఢంగా మనసులో భావించింది సీతాదేవి .-‘’నమోస్తు వాచాస్పతయే స వజ్రిణే-స్వయంభువే చైవ హుతాశనాయచ –అనేన చోక్తం యదిదం మమాగ్రతో –వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా’’

ఇది 14శ్లోకాల 32వ సర్గ .

ఇందులో తనకు కలలు రాకపోవటానికి చక్కని కారణాలు పేర్కొనటం విశేషం . ‘’ఈ రామ ‘’మనసంతా ‘’ఆరామ ‘’మయమే ఐతే ,ఆయనుస్మరించని క్షణమే లేకపోతె ఆమె ఉచ్చ్వాస నిస్వాసాలలో రామ శబ్దమే వినిపిస్తుంటే ఇక రాముడు బయట ఎక్కడున్నాడు ?మనసులో స్థిరంగా కొలువై ఉన్నాడు .కానీ మనసులోని తనరామ రూపం భావి౦చటానికే ఉపయుక్తం. అసలురాముడు భౌతికంగా ఇక్కడికి రావాలి ఆమె దుఖానికి ఉపశమనం కల్గించి రావణ దర్ప వినాశనం చేయాలి అప్పుడే తనకూ లోకానికి శాంతి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

80 సాన్ మెరినో  దేశ సాహిత్యం

  సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి ఐక్యతా ఉద్యమం లో ఈ దేశం నాయకుడు గారిబాల్డి తో సహా శరణార్ధులకు వసతికల్పించినందుకు 1862లో స్వతంత్రం పొంది రిపబ్లిక్ అయింది .ఇటాలియన్ భాష మాట్లాడుతారు .

 సాన్ మెరినో సాహిత్య౦ ఇటాలియన్ భాషలో ఉంటుంది .ఈ దేశం చుట్టూ ఉన్న దేశాలు ఈ దేశ సంస్కృతిని పీల్చేశాయి .అందుకే ఇటాలియన్ సంస్కృతీ భాష మిగిలాయి .మిరలీనా ఏర్కోలని –సమ్మరినీస్ కవి తనకవితా సంపుటి పర్నాసస్ లండన్ లో ప్రింట్ చేసింది .రెండు నవలలు రాసి౦ది కాని అనువాదం పొందలేదు .ఒకదానికి ఇంగ్లిష్ అనువాదం తెచ్చే ప్రయత్నం లో ఉన్నది .కార్లో లుకారేల్లి ఈ రిపబ్లిక్ లో ఉన్నాడు .పాల్ అనే కనడియన్ బ్లాగ్ నిర్వాహకుడు ఈ దేశ కథను తన బ్లాగ్ లో పొందుపరచాడు .సాన్ మెరీనా యూనివర్సిటి లో చదివే టినాచెప్పిన దానిప్రకారం ఈ దేశ చరిత్రను ఇటాలియన్ లో గుసేప్ రోస్సి రాస్తే తర్వాత ఇంగ్లిష్ అనువాదం వచ్చింది .1970లో ప్రచురింపబడిన కరపత్రం లో ఈ దేశ చరిత్ర కొంత కనబడింది .ఈ విషయాలన్నీ బ్రిటన్ కు చెందినఆన్ మోర్గాన్ తెలియ జేసింది .

  ఈ దేశాన్ని గురించి 7పుస్తకాలలో ఉన్నది -1-ట్రావెల్ జర్నల్-ఇ.లాకేన్  2-ఏ ఫ్రీక్ ఆఫ్ ఫ్రీడం –జేమ్స్ ధియో డేర్ బెంట్ 3-ది రిపబ్లిక్ ఆఫ్ సాన్ మెరినో –కార్లో డీ బ్రూక్ 4-ది గ్లాడియేటర్-హారీ తర్తెల్ డోవ్5-సబ్లిమినల్ -2-కి నివిన్ 6-ఫ్రం రోమ్ టు సాన్ మెరినో-ఆలివర్ నాక్స్7-స్మోక్ ఇంటు ఫ్లేం-జేన్ ఆర్బర్ .

  ఇంతకంటే ఈ దేశ సాహిత్య వివరాలు తెలియలేదు .

81-సెర్బియా దేశ సాహిత్యం

సెర్బియా రిపబ్లిక్ దేశం సెంట్రల్-సౌత్ ఈస్ట్ యూరప్ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది .రాజధాని-బెల్గ్రేడ్ .కరెన్సీ –సెర్బియన్ దీనార్ .అనేక మైనారిటీలున్న దేశం .సేఫ్ కంట్రీ.ఆరబ్ సంస్కృతీ ఎక్కువ .2003లో రిపబ్లిక్ అయింది .క్రిస్టియన్ మతం .70లక్షల జనాభా .

  సెర్బియన్ సాహిత్యం అంటే బాల్కన్ ప్రజలసాహిత్యమే .12వ శతాబ్దిలో మతరచనలతో ప్రారంభమైంది  .ఓల్డ్ చర్చ్ స్లావానిక్ సాహిత్యం బైజాంటిన్ మోడల్ లో వచ్చింది .సిరిల్ మేదోడియస్ వాళ్ళస్లావ్ మతాధికారులు ,  శిష్యులు దీనికి ఆద్యులు .కర్మకాండలకు చెందిన హగియోగ్రఫీ ,హోమేలిటిక్స్,హిమ్నోగ్రఫీ లు వచనం అలంకార ,కవిత్వ శాస్త్రాలు .సెయింట్ సావా 12వ శతాబ్దిలో మతరచనలు తీర్చిదిద్దాడు .మొదటినుంచి మౌఖిక సాహిత్యమే తరతరాలుగా వచ్చింది .14వ శతాబ్ది కొసొవో యుద్ధం ,విశేషాలతో సెర్బియన్ ఎపిక్ కవిత్వం వచ్చింది .తర్వాత నాటకం వచనం కూడా వచ్చాయి .

  తర్వాత బోరోకి ,క్లాసిసిజాలు వచ్చాయి వాస్తిజి 3,మొదలైనవారు ఇన్దులొఘనులు .1848లో రోమా౦టిజం, రియలిజం వచ్చి డేస్తేజి ఒబ్రడోవిక్ బాగా రాశాడు .సెర్బియన్ స్వతంత్ర ఉద్యమం వచ్చి ,రిపబ్లిక్ అయ్యాక అసలైన సెర్బియన్ సాహిత్యానికి బీజావాపన జరిగింది .పెటార్-2రాసిన ‘’మౌంటేన్ రీత్ ‘’సెర్బియా సాహిత్యం లో ఎపిక్ గౌరవం పొందింది .దీనిలో లయతోకూడిన జానపద గీతాలూ ఉన్నాయి .వాన్ గోధేజానపద గీతాల సంకలన కర్తగా ,ఎపిక్స్ కవిగా పేరుపొందాడు .వుక్ కరాడ్ జికి సెర్బియన్ ఫైలాలజిస్ట్ .డూరో డాన్సిసి తోకలిసి ఆధునిక సెర్బియన్ భాషా నిర్మాణం చేశాడు .

  20వ శతాబ్దిలో ఆధునిక సాహిత్యంవచ్చింది .సింబాలిజం తో సైకలాజికల్ నవలా రచనలు వచ్చాయి. జొవాన్ డుసిసి ,మిలాన్ రాకిక్ దీనిలో నిష్ణాతులు .అలెక్సాసా౦టిక్ విషాదాత్మక కవిత్వం అల్లాడు .మిలూటిన్ బోజిక్ ,మిలాన్ కర్సిన్ డానికామార్కొవిక్ వంటి వారెందరో ఉన్నారు .వచనం పచనం చేసినవారు –స్వెటోజర్ కోరోవిక్ ,వేజికో మాలిసేవిక్ ,బోరిసావ్ స్టాంకోవిక్ వంటి వారు చాలామ౦చి నాటక రచయితలున్నారు ఇంప్యూర్ బ్లడ్ నాటకం రాసిన బోరిసావ్ అత్యంత పేరు ప్రతిష్టలు పొందాడు ఈనాటకం జనం నోళ్ళలో బాగా నానింది .పెటార్ కోకిక్ హై లిరికల్ ప్రోజ్  రాశాడు .మిలూటిన్ ఉస్కకోవిక్,వేలిమిర్ రాజిక్ పెట్కోవిక్ డిస్ కూడా ముఖ్యరచనలు చేశారు .గోర్డానా కూయిక్ .స్వెత్లానా వేల్మేర్ ,లు ఈనాటి ఫేమస్ మహిళా నవలాకారిణులు.అన్ని ప్రక్రియలలో ఇవాళ సెర్బియన్ సాహిత్యం వర్ధిల్లుతోంది .మిలోరాడ్ పావిక్ .కఝార్స్ నిఘంటువు కూర్చి ఎంతో పేరుప్రఖ్యాతులు పొందాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

79-రొమేనియా దేశ సాహిత్యం

రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు 2కోట్లు .

  రొమేనియన్ సాహిత్యం  16వ శతాబ్ది వరకు స్లావోనిక్ భాషలో ఉంటుంది .రొమేనియన్ భాషలో మొదట రాయబడిన గ్రంథం ప్రశ్నోత్తర రూపం లో డీకన్ కోరేసిఅనేపేరుతో ప్రొటెస్టెంట్ మతానికి చెందినది .1559లో ఫిలిప్ మోల్డో వెనుల్ ముద్రించాడు .1673లోరొమేనియన్ లో మొదటి చందోరూప సాల్టర్ .వచ్చింది .17వశతాబ్దిదాకా బైబిల్ పూర్తి అనువాదం రాలేదు .యూరోపియన్ హ్యూమనిజం పోలాండ్ నుంచి ఇక్కడికి చేరింది .మిరాన్ కోస్టిన్ మోల్డావియ చరిత్ర రాశాడు .18వ శతాబ్దిలొఅట్టోమన్ సామ్రాజ్యం చేత ఈదేశం  అణగ ద్రోక్కబడింది.గ్రీకు ప్రభావం పెరిగింది .అలేకు వకారేస్కు ప్రేమ గీతాలు రాశాడు .తండ్రి లేనా చిటా రొమేనియన్ గ్రామర్ రాస్తే .కొడుకు లంకు మహాకవిగా గుర్తింపు పొందాడు .ఆంటన్ పాన్ హ్యూమన్ కామెడి ,జానపదం పండి౦చాడు.తర్వాతి తరం కవులు ఘేర్ఘే అనాఖి ఇయాన్ బుడాల్ డేలాను ,డోనికు గెలేస్కు ‘’యూరోపియన్ ఇల్ల్యూమినిజం ‘’కవిత్వం అల్లారు .

  జాతీయ ఉద్యమం ప్రారంభమై కవులు రచయితలూ విప్లవ వాదులతో చేతులు కలిపారు .స్కోలా ఆర్దేలీనా రోమానిక్ అస్తిత్వ వాదం మేల్కొల్పి ,ఆభాషా విద్యాలయ స్థాపనకు తోడ్పడ్డాడు .బుఖారెస్ట్ లో నేషనల్ ధియేటర్ ఏర్పడింది. అసిలి అలేక్జాన్డ్రి.మిహై ఏమినేస్కు లు రొమేనియా సాహిత్యాన్ని ఆదేశ కవిత్వంతో ముంచెత్తారు.జానపద సాహిత్య సంపుటులు వెలువరించారు .1863లో లిటరరీ సర్కిల్ ఏర్పడి ఆ దేశ సాహిత్యానికి వెన్నెముకగా కవులు రచయితలూ నిలబడ్డారు .ఇయాన్ లూకా కారగిగేల్ అద్భుత కామెడీలు రాశాడు .ఇయాన్ క్రియాంగా సంప్రదాయ కధలు రాశాడు .జార్జి కాస్బుక్ కవి అనువాదకుడు టీచర్ జర్నలిస్ట్ పల్లె జీవన సౌందర్యాన్ని వర్ణించాడు .అలాగే అలేకు రుస్సో ,  లోన్ స్లావికి ,హస్డేయు వంటి చాలామంది ఈతరం రచయితలున్నారు

   1918లో జాతీయ సమైక్యత ఏర్పడి సాహిత్యానికి స్వర్ణయుగం తెచ్చింది .రొమేనియన్ నవల ఆవిర్భావమైంది .లివియు రెబ్రేనుస్రాస్కోలా 1932లో ది అప్రైజింగ్ నవల రైతు తిరుగు బాటుకు దారిచూపింది .ఫారేస్ట్ ఆఫ్ దిహాన్గ్ద్ నవల ఆదేశం మొదటి ప్రపంచయుద్ధం లో పాల్గొనటానికి ప్రోత్సహించింది. ఆధునిక నవల –హార్టేసియా పపడట్, బెంగేస్కు రాసిన ‘’బాచ్ కన్సేర్ట్ ‘’.కామిల్ పెట్రేస్కు-ది లాస్ట్ నైట్ ఆఫ్ లవ్ ,ది ఫస్ట్ నైట్ ఆఫ్ వార్ రాశాడు .జార్జ్ కోలేనేస్కు నాటక నవలా రచయిత ,కవి ,క్రిటిక్ ,జర్నలిస్ట్ సాధికార మోనోగ్రాఫ్ ను ఎమేనేస్కు ,క్రిఎంగా లపై రాశాడు .వెయ్యిపెజీల రొమేనియన్ సాహిత్య చరిత్ర రాసి మహోపకారం చేశాడు .మిహైల్ సాడోవినా రియలిస్ట్ రైటర్ .అనేక కాలాల మాల్డోవాచరిత్రరాశాడు .ఎమేనేస్కు తర్వాత మళ్ళీ 50ఏళ్ళకు టుడర్ అర్గేజి కవిఆధునిక  రొమేనియన్ కవిత్వం రాసి మార్గ దర్శకుడయ్యాడు.లుసియన్ బ్లాగా –కాంప్లెక్స్ ఫిలసాఫిక్ సిస్టం లో రచనలుచేశాడు ఇప్పటికీ ఇదేమిటో అర్ధంకాక బుర్రలు బద్దల కొట్టుకొంటున్నారు .మిర్సియా ఎలేడే ను  గ్రేటెస్ట్ హిస్టోరియన్ అంటారు .మిస్టిక్ నవలలు రాశాడు .

  ట్రిస్టాన్ జారా డాడాయిజం కారకుడు .ఆభాషలో ‘’అవును అవును’’ అన్నదానికి సంకేతమే డాడాయిజం.తర్వాత దీన్ని వదిలేసి సర్రియలిజం,మార్క్సిజం  ను కావలించుకొని రచనలు చేశాడు .దీనితో ఈ దేశం పాశ్చాత్య సంస్కృతికి కవాటాలు తెరిచినట్లయింది .డాడాయిజం సర్రయిలిజం లు  అవంట్ గార్డే అంటేవిప్లవాత్మక అత్యాధునిక కవిత్వానికి తెరలేపింది .ఈ ధోరణి లో రాసినకవులలో ఇయాన్ మినిలేస్కు ,ఘేరాసిం లూకా,ఉర్ముజ్,గెలలు నౌమ్ మొదలైనవారు .జార్జి బకోవియా సింబలిస్ట్ కవి స్థానిక సింబాలిక్ ఉద్యమానికి దోహదపడ్డాడు .ఇతనికవిత్వం ఇక్కడి రోమానియన్ మోడర్నిజానికి పూర్వగామి అంటారు .వాసిల్ వోకిలేస్కు కవి నాటక కథాకర్త ,ఫిజిషియన్.సెజెర్పెట్రేస్కు అన్నిటితోపాటు బాలసాహిత్యంకూడా రాశాడు .ఇతని ‘’ఫ్రార్ ది పోలార్ బేర్’’ అనేది సర్కస్ జంతువు గురించి .ఎలెన ఫెరాగో కూడా బాలలకోసం రాశాడు .

  కమ్యూనిస్ట్ కాలం లో మారిన్ ప్రేడ పోస్ట్ వార్ రొమాంటిక్ నావలిస్ట్ .అతని మొరోమేటే ఫామిలి నవల యుద్ధం ముందు ఆతర్వాత కమ్యూనిస్ట్ కాలం లో ఇబ్బందులుపడిన రైతు కుటుంబ గాధ.కమ్యూనిస్ట్ క్రూర పాలనపై రాసిన నవల ‘’ది మోస్ట్ బిలవ్డ్ఆఫ్  ఎర్త్ లింగ్స్ ‘’.జహారిన స్టంకు 1948లో ప్రసిద్ధ ‘’బేర్ ఫుట్’’నవల రాశాడు .ఆధునిక కవులు –నికితా స్టెనెస్కు,మారిన్ సోరెకస్,లేనాయిడ్డిమోవ్.

  సమకాలీన రచయితలలో కొందరు –గేబ్రిలా ఆడామెన్ స్టావ్ , స్టీఫెన్ అగోపియాన్,గ్రిడ్మోడార్సియ,ఇయాన్ స్ట్రాటన్,డోనియా రుస్టి.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

దుఃఖ భారం తో ఉన్న సీతాదేవి ఎడమకన్ను చేప చేత కొట్టబడిన కమలం,ఎడమ భుజం   ఎడమ తొడకూడా బాగా  అదిరి రాముడు ఆమె ముందే ఉన్నాడు అని సూచించాయి . –

‘’తస్యాశ్శుభం వామ మరాళ పక్ష్మ-రాజీవృతం ,కృష్ణ విశాల శుక్లం –ప్రాస్పంద తైకం నయనం సు కేశ్యా-మీనాహతం పద్మమి వాభి తామ్రం’’

‘’భుజశ్చచార్వంచిత పీన వృత్తః-పరార్ధ్య కాలాగరు చందనార్హః –అనుత్తమే నాధ్యుషితః ప్రియేణ-చిరేణ వామ స్సమవేపతా శు ‘’

గజేంద్ర హస్త ప్రతిమశ్చ పీన –స్తయోర్ద్వాయో స్సంహతయా స్సుజాతః-ప్రస్పంద మానః పునరూరు రస్యా –రామం పురస్తాత్ స్థిత మాచ  చక్ష్యే’’

  ఆమె చీర కొంచెం జారింది .’’అన్నీ మంచి శకునములే శ్రీ రామదర్శన  లాభ శూచనలే ‘’అని పించింది మనసుకు .వేసవి ప్రతాపానికి వాడిన చిన్న మొలక తొలకరి వర్షం తో తెప్పరిల్లి ఆకులు తొడిగినట్లు ఉన్నది .ఆకులు అంటే ఆమె ఆశలు మారాకులు తొడిగాయి అన్నమాట .ఆమె ముఖం రాహువు చే కబళింప బడిన చంద్రుడు మళ్ళీ బయటికి వచ్చినంత ప్రకాశ మానం గా ఉన్నది .శుభ సూచనలతో మనసు తెప్పరిల్లి ఆశలమోసులు తొడిగి  ఆనంద పారవశ్యం తో చంద్రోదయం తో శోభిల్లిన శుక్లపక్ష రాత్రిలా కనబడింది .

  ఇది ఎనిమిదే శ్లోకాలున్న 29 వ సర్గ .

  చెట్టుపై ఆకులమాటున ఎవరికీ కనిపించకుండా ఉన్న హనుమ ,ఇప్పటి దాకా జరిగిన సర్వ విషయాలు ప్రత్యక్షం గా చూసి ,సీతా శోకానికి కలత చెంది ,రహస్యం గా తాను లంకలో చూసిన విషయాలు, రావణ దర్పం అన్నీ గుర్తు చేసుకొని ,సీతా దేవి దుఖం మా౦చకుండా కిష్కింధకు  వెళ్ళ రాదు అనుకొన్నాడు  .సీతా దర్శన శుభవార్త రామ చంద్రునికి నివేదించి ఆయన దుఖం పోగొట్టాలి అని నిశ్చయించాడు .ఆ రాత్రి ఆమెను ఊరడి౦చకపోతే మర్నాడు ఉదయానికి ఆమె బతికి ఉంటుందో లేదో అని సందేహించాడు .సీతా సందేశం ఏమిటి అని రాముడు అడిగితె నా దగ్గర సమాధానం ఉండదు కదా .ఆమెను చూసి,చెప్పిన మాటలు విని ఆయనకు చెప్పకపోతే ఒక్క చూపుతో నన్ను కాల్చి మసి చేస్తాడు .సీతను వోదార్చకుండా ,కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడిని  స సైన్యంగా ఇక్కడికి తెస్తే ప్రయోజనం లేదు ,కనుక ఇక్కడే ఉండి,రాక్షసులు చాటు అయినప్పుడు ఆమెతో మాట్లాడి ఓదారుస్తాను ‘’అని ఒక నిర్ణయానికి వచ్చాడు హనుమ .

   ఇంతవరకు బానే ఉంది మరి ఆమెతో మాట్లాడటం ఎలా అనే సందేహం వచ్చింది .తాను  అతి చిన్న కోతిగా ఉన్నాడు .మానవులు మాట్లాడే సుసంస్కృత భాషలో మాట్లాడాలి .అలాకాక బ్రాహ్మణ భాష లో మాట్లాడితే నన్ను రావణుడు అని సందేహింఛి భయపడవచ్చు .ఒక వేళ నేను అలామాట్లాడినా కోతి  ఏమిటి సంస్కృతం ఏమిటి అని కూడా అనుకోవచ్చు .కనుక ఇవన్నీ కుదరదు మానవ భాషలో అర్ధవంతం గా మాట్లాడితే ఇబ్బంది ఉండదు .కాక సంస్కృతం లో మాటాడితే ,నా రూపం భాష లకు మరింత భయపడి ,మారు వేషం లో ఉన్న రావణుడు అనుకొని భయంతో గట్టిగా అరవ వచ్చు అప్పుడు కావలి రాక్షస స్త్రీలు పరిగెత్తుకొచ్చి పెద్దచెట్ల మొదళ్ళతో నన్ను పచ్చడి చేయచ్చు .అప్రయత్నాలు తప్పించుకోవటానికి నేను అటూ ఇటూ పరిగెత్తితే ,వాళ్లకు అనుమానం మరీ ఎక్కువై ,నా వెంటపడి తరిమి ,నా వికృత రూపం చూసి మరింత భయం తో రావణ గృహ కావలి వారిని పిలిపిస్తే వాళ్ళంతా వివిధ ఆయుధాలతో నాపైకి దాడికి వస్తే ,నేను వాళ్ళను ఎదిరించగలనుకాని అలసి పోయి  సముద్ర లంఘనం తో అవతలి ఒడ్డుకు చేరలేనేమో .అప్పుడు నాకంటే వేగంగా నాపై దూకి నన్ను పట్టుకొని హింసి౦చి బంధిస్తే అసలు నేను వచ్చిన పని హుళక్కి అవుతుంది .నామీద కోపం సీత మీద చూపించి ఆమెను చంపేస్తారుకూడా .మా రాజు ,రాముడు నాకు అప్పగించిన పని భ్రస్ట  మైపోతుంది .నన్ను ఇక్కడ చంపేస్తే రాముడికి సీత విషయం చెప్పే వారెవరూ ఉండరు .నేను చనిపోతే నూరు యోజనాల సముద్రాన్ని దాటి రాముడి దగ్గరకు చేరేవాడు లేనేలేడు .అనుమానం వచ్చిన చోట అనాలోచితం గా ఏపనీ చేయరాదు .యజమాని ఏది కర్తవ్యమో ఏది కాదో మంత్రులతో ఆలోచించి దూతను పంపితే వాడు తామే వాళ్ళకంటే తెలివి గలవారమని భావించి ఆ దూత  కృత్యాన్ని చెడ గొట్టే బుద్ధి హీనులు ఉంటారు .కనుక స్వామికార్యం స్వకార్యం సఫలం అవ్వాలి .అందుకే శ్రీరాముని కీర్తిస్తూ ,ఆయనపైనే మనసు పెట్టుకొని ఉన్న సీత భయపడకుండా చేస్తా .ఇది ఉభయ తారకం .అని నిశ్చయించి ,ఇక ఆలస్యం చేయరాదని భావించి –

‘’ఇక్ష్వాకూణా౦ వరిష్ఠస్య రామస్య విదితాత్మనః –శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్

‘’’’శ్రావ ఇష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం –శ్రద్ధాస్యతి యథా హీయం తథా సర్వ౦  సమాదధే

‘’ఇతి స బహువిధం మహాను భావో –జగతి పాతేః ప్రమదా మవేక్ష్య మాణః-మధుర మవితథం జగాద వాక్యం –ద్రుమ విటపాంతరమాస్థితో హనూమాన్ ‘’

ఇది 44శోకాల 30 వ సర్గ

‘’రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ –పుణ్య శీలో మహాకీర్తి ర్రుజు రాసీ న్మహాయశాః’’

రాజర్షీణా౦ గుణ శ్రేష్ట స్తపసా చర్షిభిస్సమః –చక్రవర్తి కులే జాతః పురందర సమో బలే ‘

‘’అహింసా రతి రక్షుద్రో  ఘ్రుణీ సత్య పరాక్రమః –ముఖ్యే శ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీ వాన్ లక్ష్మి వర్ధనః

‘’పార్ధివ వ్యంజనైర్యుక్తం పృథుశ్రీః పార్ధి వర్షభః –పృధివ్యాం చతురంతాయాం విశ్రుత స్సుఖద స్సుఖీ- ‘’తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్సర్వ ధను ష్మతాం –

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా -రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః

‘’తస్య సత్యాభి సంధస్య వృద్ధస్య వచనా  త్పితుః-సభార్యస్య హ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనం ‘’

అని మొదలుపెట్టి ఏకబిగిన 13శ్లోకాలు చెప్పేశాడు .

’’రాజా దశరథో నామ ‘’మొదలైనవి మరి రెండుమూడు చోట్ల హనుమ పలుకుతాడు ‘

ఈ శ్లోకాలలో ఇక్ష్వాకు వంశం లో మహా బలపరాక్రమ సంపన్నుడైన దశరథ మహారాజు అయోధ్యా పాలకుడు,అహింసా ఉదాత్తత దయ పరాక్రమం కలవాడు .సుఖాలు అనుభవిస్తూ సుఖాలు కలిగిస్తాడు .ఆయనపెద్ద కొడుకు రాముడు సర్వ విద్యాపార౦గ తుడు జనహితుడు .సత్యప్రతిజ్ఞ తో వృద్ధుడైన తండ్రి మాట విని భార్య సీత తమ్ముడు  లక్ష్మణుడి తో అరణ్యాలకు

వెళ్ళాడు .అక్కడ మునులకోరికపై ఎందరో రాక్షసులను సంహరించి మునుల తపస్సుకు ఇబ్బంది కలుగకుండా చేశాడు .జనస్థానం లో ఖరదూషణాదిరాక్షసులను చంపగా ,రావణుడికికోపం వచ్చి ,మాయామృగ రూపం తో మారీచుని పంపి ,రాముడిని మోసపుచ్చి సీతాపహరణం చేయగా ,రాముడు ఆమె కోసం వెదుకుతూ సుగ్రీవ వానరరాజు మైత్రి పొంది ,అతని అన్న వాలిని చంపి ఆరాజ్యం సుగ్రీవుడికి అప్పగించగా ,సుగ్రీవాజ్ఞ చేత వేలాది  వానరులు అన్నిదిక్కులా సీతకోసం పంపబడ్డారు .సంపాతి చెప్పిన మాటలు విని నేను శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి ,నాకు చెప్పిన లక్షణాలను బట్టి సీతా దేవిని చూసి గుర్తించాను ‘’అని ఏకబిగిని అప్పటిదాకా జరిగిన సీతా రామ   వృత్తాంతం ఏకరువు పెట్టి ఊరుకున్నాడు .

  ఆ కమ్మని మధురవాక్కులు విన్న సీత ఆశ్చర్యపడి ,ఒకసారి మొహం పైకెత్తి శింశుప చెట్టు కొమ్మలవైపు చూసి ,ఆన౦దించింది .క్రూర రాక్షసులకు కనపడకుండా ఇక్కడికి రాగలిగినందుకు అతని బుద్ధిని మెచ్చింది .పైకి ,కిందికి అన్ని దిక్కులూ చూసి మహా బుద్ధిమాన్ అనుకోని స్వతంత్రం లేని దూత ,స్వజాతి రాజు సుగ్రీవుని మంత్రి హనుమ ఉదయిస్తున్న సూర్యుడి లాగా ఆమెకు కనిపించాడు –

‘’సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తా –న్నిరీక్ష మాణా తమ చింత్య బుద్ధిం –దదర్శ పింగాదిపతే రమాత్యం –వాతాత్మజం సూర్య మివోదయస్థం’’

ఇది 19 సర్గల 31వ సర్గ

అమ్మయ్య 30సర్గల కాలం దాటి 31వ సర్గ లో హనుమ నిశ్చయ బుద్ధితో సీతా మాతదర్శనం చేసి ధన్యుడయ్యాడు .అసలు’’ హనుమ మార్గశిర శుద్ధ త్రయోదశి ‘’నాడు  సీతా అమ్మవారిని చూశాడు .ఇవాళ వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమ జ్జయంతి పర్వదినం నాడు హాయిగా సీతా దర్శనం చేయించాను అదొక సంతృప్తి .

  ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలని వితర్కి౦చు కొని హనుమ హరినామ స్మరణ అనే  శ్రీరామ చరిత్రను తెలియ జేసి ,తన బుద్ధిని చాటి ఆమె మనసుకూ బుద్ధి మంతుడు అనే మార్కులు మొదటి సారే కొట్టేశాడు .అదీ  ఆయన వ్యక్తిత్వం .ఇలా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడితే రసాభాస అయ్యేది .కార్యసాధకుడికి ఉండాల్సిన సర్వ లక్షణాలు హనుమలో మనం దర్శిస్తాం .

  సశేషం

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28

‘’రాక్షసులు నన్ను ఇలా   బాధ పెడుతున్నా పాపం చేశానేమో బతుకు తున్నాను .నేను ఆత్మహత్య చేసుకొంటే దోషం ఏమీ లేదు .రావణుడి చేతిలో చావు ఎలాగైనా తప్పదు.దానికంటే ఆత్మహత్య మేలే కదా .వాడు ఇచ్చిన రెండు నెలల గడువు లోపు రాముడు ఇక్కడికి రాకపోతే ఈ అయోగ్యుడు కడుపు లోనుంచి బయటికి రాని శిశువును శస్త్ర చికిత్సతో మృత శిశువును తీయటానికి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్లు  ,వాడి అయిన ఆయుధాలతో రాక్షసరాజు నా అవయవాలు ముక్కలు ముక్కలు చేస్తాడు .రామా ,లక్ష్మణా అత్తా కౌసల్యా సుమిత్రా సముద్రంలోసుడిగాలికిచిక్కిన ఓడలాగా దుఖాలు అనుభవిస్తున్నాను .రామ సోదరులు నాకారణంగా లేడి రూపంలో ఉన్న దుష్ట ప్రాణి చేత చంపబడ్డారేమో .యముడే అప్పుడు లేడి గా  వచ్చి  నన్ను ప్రలోభపెట్టగా సోదరులను పంపాను .రామా నన్ను రాక్షసులు చంపుతారని నీకు తెలీదు కదా .రాక్షసుల తీవ్రమైన మాటలు, భూశయనం, ,నువ్వే రక్షకుడవని నమ్మి నియమాలతో జీవించటం అనే ఈ వ్రతం అంతాకృతఘ్నులకు చేసిన ఉపకారం లా వ్యర్ధమయిందా.నా ధర్మాచరణ ,ఏకపత్నీ వ్రతం నిష్ప్రయోజనం  నిరర్ధకం అయ్యాయి .వనవాస కాలం తీరి అయోధ్యలో వలచినస్త్రీలను పెళ్ళాడి నువ్వు సుఖిస్తావు .కాని నేనిక్కడ ఏ ఫలితమూ దక్కక ఉపవాసాలతో క్రుంగి కృశించి చనిపోతా .లేకపోతె విషం తాగి వాడి ఆయుధం ఉపయోగించి ఆత్మహత్య చేసుకొంటా .నాకు విషంకాని ఆయుధం కాని ఇచ్చే వారే లేరిక్కడ ‘’అనుకొంటూ శింశుప చేరి తనపొడవైన జడతో ఉరి పోసుకోవటానికి సిద్ధపడింది సీతాదేవి .కొమ్మను గట్టిగా పట్టుకొని ‘’ఈ కొమ్మ’’సీతమ్మ  తన వంశాన్ని స్మరిస్తూ ఆత్మహత్యా ప్రయత్నం లో ఉండగా శుభ సూచనలు ,శుభ శకునాలు కనిపించాయి .

‘’ఉపస్తితా సా మృదు సర్వ గాత్రీ –శాఖాం గృహీత్వా థ నగస్య తస్య –తస్యాస్తూ రామం ప్రవిచింత యంత్యా –రామానుజం స్వం చ కులం శుభా౦ గ్యాః’’

‘’శోకా  నిమిత్తాని తథా బహూని –ధైర్యార్దితాని  ప్రవరాణి లోకే –ప్రాదుర్నిమిత్తాని తదాబభూవుః-పురాపి సిద్దా న్యుపలక్షితాని’’

ఇది 20 శ్లోకాల 28వ సర్గ .అన్ని ప్రయత్నాలూ ,అన్ని ఆశలూ విఫలమైతే చివరికి ఆత్మహత్యకు పూనుకోవటం లోక రివాజు .అవతలివారికి ఎన్నో చెప్పగలరు కాని తమ దగ్గరకు వచ్చేసరికి అవి అన్నీ మర్చిపోయి ఇదే రకంగా ప్రవర్తిస్తారు మానవులు .సీతకూడా మానవ మాత్ర స్త్రీయే .కనుక చివరగా ఆప్రయత్నం చేసింది .తన ఆత్మహత్యను తన కారణాలతో సమర్ది౦చు కొన్నదికూడా .ఇదే లోక సహజ విషయమే .అలా సమర్ధించుకొని ఆత్మను సంతృప్తి పరచుకోలేకపోతే ,ఆప్రయత్నం చేసే ధైర్యం రాదు కదా .ఇది వరకే చెప్పుకు న్నట్లు క్లైమాక్స్ లో సుభ శకునాలు శుభ సూచనలు కనిపించి ఆ ప్రయత్నానికి బ్రేక్ పడుతుంది అలాగే   ఇప్పుడు సీత విషయం లోనూ జరిగింది .మానవ మనసులోని ఆంతర్యాలను ,ముఖ్యంగా స్త్రీ హృదయపులోపలి పొరల్ని  మహా కవులు చక్కగా ఆవిష్కరిస్తారు .వాల్మీకి మహర్షి కవీ, క్రాంత దర్శి కనుక ఇలా ముగించాడు .

   సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

77-మొనాకో దేశ సాహిత్యం

మొనాకో దేశం ప్రిన్సిపాలిటి  ’సావరిన్ సిటీ స్టేట్ పశ్చిమ యూరప్ లో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు మిగిలినభాగం మధ్యధర సముద్ర తీరం  లో ఉన్నది . కరెన్సీ –యూరో .భవ్య జీవన విధానానికి భేషైన దేశం .ఇన్కం టాక్స్ నామమాత్రమే .అందుకే వందకు పైగా దేశాలు దీనితో సంబంధాలు కలిగి ఉన్నాయి .ఇక్కడి ప్రజలు ప్రపంచం లోనే అత్యధిక ధనవంతులు .మూడో వంతు జనం మిలియనీర్లె .జిడిపి -165,420 డాలర్లు .ప్రపంచం లో రెండో స్థానం .

  మొనాకో సాహిత్యం ను అక్కడి రచయితలు – ఫ్రెంచ్ ,ఇటాలియన్ ,మొనేగాస్క్ భాషలలో రాశారు .లూయీ నోటరి ఒక్కడే ఫ్రెంచ్ ,మొనేగాస్క్ భాషల్లో రాసి ఆదేశ సాహిత్యానికి ప్రేరణ కలిగించాడు .ఇతడు రాసిన లిరిక్స్ లో ఒకటి జాతీయ గీతంగా గౌరవి౦ప బడింది .అప్పటిదాకా మాట్లాడే భాషగా ఉన్న ఆదేశభాష ఇతనితో వ్రాతభాషగా రూపు దాల్చింది .లూయీ ఫ్రోల్లా ‘’పీస్ డిరెసిస్టన్స్’’ అనే మొదటి వ్యాకరణం రాశాడు .ఫ్రెంచ్- మొనేగాస్కో  నిఘంటువు కూర్చాడు .స్థానిక రచయితలు తక్కువే .ఈ దేశ నేపధ్యంగా చాలామంది రాశారు .ప్రతి ఏడాది సాహిత్య బహుమతులు ఇస్తున్నారు .కాని ఏ పుస్తకమూ పబ్లిష్ కాకపోవటం ఆశ్చర్యమే .

  కొందరు ప్రముఖ రచయితలు –రిచర్డ్ మొనాకో ‘’నైట్స్ టేల్స్’’,ఫైనల్ క్వెస్ట్ రాశాడు .ఇవి పులిట్జర్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాయి .ఎరిక్ రాబర్ట్ మోర్స్ –మొనాకో నవల రాశాడు .డఫ్నే డు మారియర్ –రెబెక్కా ,డోనాల్డ్ స్పోటో-హై సొసైటి,గ్రాహం గ్రీన్ –లూజర్ టేక్స్ ఆల్ ,క్రిస్టియాన డి మాస్టి-పాలస్ ,మైలైఫ్ ఇన్ ది రాయల్ ఫామిలి ,జియార్జియో ఫెలేట్టి-ఐవో ఉక్కిడో,అన్ని ఎడ్వర్డ్స్ –ది గ్రిమాల్డిస్ఆఫ్ మొనాకో ,లూయీ మాస్టర్స్ –ది బన్నీ అండ్ ది బిలియనీర్  వగైరా .

 గ్రిమాల్డి రాజకుటుంబం శతాబ్దాలపాటు పాలించి కళలు ,వాటి సంబంధిత విషయాలను ప్రోత్సహించింది .’’ఇంటర్నేషనల్  కాంటే౦పరరి  ఆర్ట్ ప్రైజ్ ‘’ఏర్పాటు చేసి నిపుణులకు ఇస్తోంది ,దేశం చిన్నదేకాని వీధులన్నీ దియేటర్ల ,మ్యూజియంలతో నిండి ఉంటాయి .మొనాకో ఫైన్ ఆర్ట్స్ ,మొనాకో మోడరన్ ఆర్ట్స్ లతో గాలరీలు నిండుగా ఉంటాయి

78-మా౦టెంగ్రో దేశ సాహిత్యం

మా౦టెంగ్రో దేశ౦ బాల్కన్ కంట్రీ.ఎగుడు దిగుడు పర్వత మయం .అడ్రియాటిక్ తీరంలో చిన్న బీచెస్ ఉంటాయి .రాజధాని –పొడిగోరికా .కరెన్సీ-యూరో .నేరాలుఎక్కువేకాని పటిష్టపోలీస్ భద్రతఉంది .కవి లార్డ్ బైరన్ దీన్ని ‘At the birth of the planet the most beautiful encounter between land and sea must have been on the Montenegrin  అని వర్ణించాడు .గొప్ప టూరిస్ట్ స్పాట్ .ప్రజలు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతారు .క్రిస్టియానిటి మతస్తులు .జనాభా- 628,021 .జనాభాలో 20శాతం ముస్లిమ్స్ .,సేర్బులు అల్బెనియలు రోమాలు ఎక్కువగా ఉంటారు

  మా౦టేగ్రోనియన్ సాహిత్యం అక్కడి విభిన్నభాషలలో ఉంటుంది .దేశభాష సౌత్ స్లావిక్ భాషాజన్యం .2006లో దేశం స్వాతంత్రం పొందాక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది .పావ్లె గోరోనోవికి రచయిత ఆ దేశానికి ఆపేరు రావటానికి కారణం దట్టమైన నల్లని అరణ్యాలు .దేశంలో సగం అడవులే .ప్రపంచంలో మొదటి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ యీ దేశంలోనే వచ్చింది .మా౦క్స్ దీన్ని నిర్వహించారు అని రాశాడు. ప్రకృతికవిగా గుర్తింపబడ్డాడు .వాట్ బుక్స్ స్మెల్ లైక్ లో తీవ్ర నాస్టాల్జియా ఉంటుంది .ఇతని మరో పుస్తకం –ఆర్నమెంట్స్ ఆఫ్ ది నైట్ -1997..మూడవది –బుక్ ఆఫ్ అపారిషన్స్- 2002.

  టాంజా బాకిక్ –15వ ఏట మొదటి అయిదు భాగాల కవితా సంపుటి రాసి వెలువరించింది .కవిత్వంలో వైవిధ్యం ఉంటుంది .ఎన్నోపుస్తకాలకు ముందుమాటలు రాసింది. చాలావాటికి సంపాదకత్వం వహించింది .సైంటిఫిక్ పేపర్స్ రాసింది .మెటాఫిజికల్ ,రొమాంటిక్ కవుల సాహిత్యాన్ని అనువాదం చేసింది .ఆమె ఇమేజరీ మహా ఉన్నతం .ఆమె కవిత –సీడ్ అండ్ అదర్ పోయెమ్స్ -2012లో ‘A Black lace
On the white wall –
The ocean’s scent
The light is still
Falling on us,
Announcing,
The presence of the day’

కవిత హైలైట్ అంటారు .2008లో ఆమె రాసిన వ్యాసం –టు బి ఎ రైటర్ ఇన్ మంటే నెగ్రో’’లో ఆమెకూ ,జాతీయ సాహిత్యానికి ఉన్న అమూల్య బంధం తెలుస్తుంది .ఆమె ప్రతి రచన హృదయాన్ని తాకి ప్రభావితం చేస్తుంది .

  ఒగ్నేజేన్ సాఫిక్ –పోడిగోర్సికాలో 1977లో పుట్టి ,ఫిలాసఫిలో గ్రాడ్యుయేట్ అయి ,2005లో మొదటి నవల ‘’హాన్సేన్స్ చిల్డ్ర న్ ‘’ తో ప్రసిద్ధుడయ్యాడు. ట్రాజిక్ ,సర్రియల్ రచనలేకాక షార్ట్ స్టోరీస్ తోనూ ప్రఖ్యాతుడయ్యాడు .రోమానియన్ ఓవిడ్ ఫెస్టివల్ ప్రైజ్ ,మేసాసేలిమోనిక్ ప్రైజ్ లు అందుకున్నాడు .మైక్రో బాక్టీరియం లేపేరే ను 1873లో వేరు చేశాక లెప్రసీ అదుపులోకి వచ్చింది .లేప్రసితోబాధపడే పిల్లల దయనీయ గాథలను తన కథలలో చిత్రించాడు .అతని ‘’ఆఫ్టర్మత్ ఆఫ్ దిక్లోత్స్ ఆఫ్ టెక్ష్ట్స్’’కత అప్పటికే చితికిపోయిన  వివాహ బంధ ఆత్మహత్యలతో ఉన్న కుటుంబంలో పుట్టిన వాడి ది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

75-మాల్టా దేశ సాహిత్యం

మాల్టా దేశం ఆర్చిపిలగో  సెంట్రల్ మెడిటరేనియన్ లో సిసిలి ,ఉత్తర ఆఫ్రికా మధ్య ఉంది .రోమాన్స్ ,మూర్స్ ,క్రీ.పూ 4 వేలఏళ్ళ క్రిందటి ఫ్రెంచ్ ,బ్రిటిష్ సెయింట్ జాన్ యోధుల అనేక చారిత్రాత్మక కట్టడాలు ,దేవాలయాలున్న దేశం .ఆనాటి పెద్దపెద్ద హాల్స్ ,బరియల్ చేమ్బర్స్ చూస్తె  దిమ్మ తిరిగిపోతుంది  .రాజధాని –వాలెట్టా .కరెన్సీ-యూరో .జనాభా -5లక్షలు .భయం లేకు౦డాహాయిగా సందర్శించతగిన దేశం.అత్యంత సంపన్న దేశాలలో ఒకటి .ఖర్చు తక్కువ .ఎలెక్ట్రానిక్స్ ,ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి తో గొప్ప ఆదాయం వస్తుంది .

  మాల్టా సాహిత్యాన్ని మాల్టీస్ సాహిత్యం అంటారు .11వ శతాబ్దం చివర్లో సిసిలిరాజు కౌంట్ రోజర్ 1 ఆరబ్ పాలనకు స్వస్తి చెప్పిన తర్వాత కొద్దిగా సాహిత్య జిజ్ఞాస పెరిగింది .శతాబ్దాలుగా వస్తున్నా మాల్టేస్ భాషకు అవరోదాలుకలిగి  లాటిన్ ను తలకెత్తుకొన్నారు.సెయింట్ జాన్ పాలనలో ఫ్రెంచ్ ,ఇటాలియన్ లకే ప్రాముఖ్యం .బ్రిటిష్ కాలని ప్రభుత్వం లో ఇంగ్లిష్ పెత్తనం చేసింది .1936లో మాల్టేస్ భాష అధికార భాషగా గుర్తింపు పొందింది . మాట్లాడేభాషను వ్రాతభాషగా మైకేల్ ఆంటన్ వస్సాలి19వ శతాబ్దిలో మార్పు చెందించాడు .

  చరిత్ర పూర్వకాలం నున్చిఈ  దేశ సంస్కృతిని ‘’డిగ్లోస్సియ ‘’ఆటంకపరుస్తూనే ఉన్నది.శతాబ్దాలుగా ఈదేశభాష ‘’వంటింటి ,వర్క షాప్ భాష ‘’గా ముద్ర వేసి,చదువులో పాలనలో రాజకీయంగా  న్యాయస్థానాలలో ఇటాలియన్ భాషకే ప్రాముఖ్యమిచ్చారు .అందుకే ఈ దేశీయులుకూడా20వ శతాబ్ది వరకు  అదే భాషలో రాసేవారు గత్యంతరం లేక  .

మాల్టేస్ భా షలో ఉన్న అతి ప్రాచీన రచన పెట్రు కాస్గరో కవిత ‘’2కాన్టినా-1470-1485.తర్వాత గియాన్ ఫ్రాన్సేస్కో బోనమికో తన గ్రాండ్ మాస్టర్ నికోలస్ కోటోనర్ ను పొగుడుతూ1672లో  రాసిన ‘’మేజ్జుగి బ్లేర్ ఉ జహార్ ‘’అంటే మే చంద్రుడు ఆరంజ్ పూల వికాసం తో వచ్చాడు . లార్డ్స్ ప్రేయర్ కు అనువాదం 1780లో జోహేన్నెస్హీన్రిచ్ మాలు రాశాడు .ఐ యాం టాకింగ్ టు యు మాల్టా గేయాన్ని 1749లో అజ్ఞాతకవి రాశాడు .ఇది బానిసల కుట్రకు సంబంధించింది .1752లో డాన్ ఫ్రాన్సేస్కో  టీచింగ్స్ ప్రచురింప బడ్డాయి .తర్వాత బర్లుస్కు కవితలు గా ‘’మారేజ్ ఇన్ దిమాల్టీస్ స్టైల్ ‘’మొదలైనవి డన్ ఫెలిక్  డిమార్కోరాశాడు A child of the Romantic movement, Maltese patriot Mikiel Anton Vassalli (1764–1829) hailed the emergence of literary Maltese as “one of the ancient patrimonies…of the new emerging nation” and saw this nascent trend as: (1) the affirmation of the singular and collective identity, and (2) the cultivation and diffusion of the national speech medium as the most sacred component in the definition of the patria and as the most effective justification both for a dominated community’s claim to be a nation and for the subsequent struggle against foreign rulers.

   తర్వాత ఫ్రెంచ్ ఆక్రమణలో దేశం ఉండగా ‘’ఓడ్ టు ది ట్రయంఫ్ ఆఫ్ లిబర్టి ‘’ను సిటిజన్ లా కోరేట్టేరీ ని రాసి బాస్టేల్లి డే న పబ్లిష్ చేశాడు .మాల్టేస్ భాషలో ఎపిక్ పోయెం ‘’ది టర్కిష్ కారవెల్’’ను వాసిల్లి రాసి 1842లో ముద్రించాడు .లెజెండ్స్ అండ్ జోక్స్ కూడా రాశాడు .ఆదేశ భాష లో మొదటి చరిత్రపుస్తక౦ ‘’పీపుల్స్ హిస్టరీ ఆఫ్ మాల్టా ‘’ ఆయనే1862లో  రాశాడు.1863లో ఆ భాషలో మొదటి నవల ‘’ది లవ్ ఆఫ్ ఎ టిరంట్’’గుసేప్పీ ఫోలేరియో డీ లూనా ఆన్టన్ 1889లో రాశాడు

కొందరు ముఖ్య మల్టేస్ రచయితలు-క్లేర్ అజ్జో పార్డి,జాన్ బెనేల్లో ,డేనియల్ మస్సా ,రోజర్ బుఫ్ఫా ,విక్టర్ ఫెనేక్ ,గార్గ్ పిసాని ,త్రేవోర్ జెహ్రా మొదలైనవారు

76-మాల్డోవా దేశ సాహిత్యం

మాల్డోవా తూర్పు ఐరోపాలో ఉన్న దేశం .రాకీహిల్స్ ఫారేస్ట్స్ ,వైన్ యార్డ్స్ కు ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధ సెల్లార్ లకు నిలయం .రాజధాని –సిసునవు .కరెన్సీ –మల్డో వియన్ లేయు .జనాభా 36లక్షలు. అధికారభాష రొమేనియన్ .స్వంత కాళ్ళమీద నిలబడుతున్న దేశం .ప్రయాణం కష్టం .బోర్ కొట్టేదేశం .అద్భుతనాణ్య మైన వైన్ కి కేంద్రం .దేశ సంస్కృతిలోనే ఆనందం సంతోషాలు లేవు .నిరాశ రాజ్యమేలే దేశం .బీదాతిబీద దేశం .

  మాల్డోవా సాహిత్యం లో 10,11శతాబ్దాలనాటి గొప్ప జానపద గీతాలు,ఫైరీ టేల్స్,కుటుంబ కర్మకాండ కవిత్వం కు  ప్రసిద్ధం .సామెతలు నుడులు నానుడులూ ఎక్కువ .మియోరిటా అ దేశ ఎపిక్ లిరిక్ .మధ్యయుగాలలో ‘’ది లైఫ్ ఆఫ్ సేయి౦ట్ జాన్ ,న్యు ప్రీచిన్గ్స్ ఆఫ్ గ్రెగరీ సంబాక్ రాసిన క్రానికల్స్ .15వ శతాబ్ది ఉత్తరార్ధం లో దేశ చరిత్రలు ఆభాషలో వచ్చాయి .16వ శతాబ్దంలోనూ క్రానికల్స్ వల్లనే చరిత్ర తెలిసింది .14నుంచి 18శాతాబ్దిదాకా రాజులు,వారిగగొప్పలు స్మృతిచిహ్నాలు అన్నీ వచ్చాయి .గ్రిగేర్ యురోకి ,మిరాన్ కోస్టిన్,ఇయాన్ నుకుల్సి ల క్రానికల్స్ ది బెస్ట్ అనిపించుకోన్నాయి .డిమిత్రి కాన్టిమేర్ టర్కుల చరిత్రసమగ్రంగా రాశాడు .

  ఘేర్గే సిన్కాయ్ ,పెట్రు మేజర్ లుజాతీయభావానికి దోహద పడ్డారు .మిడీవల్ నేషనల్  మ్యూజికల్ స్టైల్ ‘’డోనియా ‘’ప్రాచుర్యం పొందింది .లేనాచితావకారేస్కు ,కొడుకు అలుకు వచారిస్కు లు ప్రాచీన గ్రీక్ శైలిలో లవ్ సాంగ్స్ రాశారు .దీనిలో దిమాపింగ్ డవ్ ప్రసిద్ధమైంది .19వ శతాబ్దిలో మొదటి న్యూస్ పేపెర్ ‘’రోమానియన్ బీ ‘’ని ఘియోర్గే అసాచి1829లో  స్థాపించగా అందులో రాసి అలేకు దోనిసి , అలేకు రుస్సో ,మిహలి కోగాల్సినావు లుబాగా పాప్యులర్ అయ్యారు . లిటరరీ  డేసియ జర్నల్  హిస్టారికల్ జర్నల్ పెట్టి కోగాల్సినావు చాలామందికి ప్రోత్సాహం కల్పించాడు .ఆధునిక వచనానికి నేగ్రుజ్జి సంస్థాపకుడు .తర్వాత దేశం వదిలి పుష్కిన్ ప్రభావానికి లోనయ్యాడు .జాతీయ ఉద్యమనాయకకవి నాటకకారుడు వసిలే అలేక్సాన్డ్రి మాల్డోవా –వలాచియా ఐక్యత కోసం కృషి చేశాడు .1848విప్లవం లో పాల్గొన్నాడు .ఎలెనా సేవస్టోస్-మాల్దోవాసాన్గ్స్ రాసి ప్రచురించింది .

  యుద్ధానంతర కాలం లో అనేక సాహిత్యప్రక్రియలలో  రచనలు వచ్చాయి .స్పీకింగ్ టు చిల్డ్రన్ ,స్టోరిఆఫ్ ఫోర్ బాన్షిస్,సాంగ్ ఆఫ్ ది డాన్.ఇయాన్ డ్రుటారాసిన ‘’లీవ్స్ ఆఫ్ సారో ‘’వ్లాడిమిర్బెసేలీగా బ్రోకెన్ ఫ్లైట్ ,అనడనా  స్లాలార్ రాసిన పీపుల్ అండ్ డేస్టినీస్1958.ఫ్లైట్ లెస్ బర్డ్స్ ,దిబిట్టర్ నెస్ ఆఫ్ లవ్,చిల్ద్రెన్ అండ్ ఆపిల్స్ ,బర్డ్స్ ఆఫ్ అవర్ యూత్ వంటివి చెప్పుకో దగ్గవి డ్రుటా రాసిన ‘’బాలడ్స్ ఆఫ్ ది స్టేప్పీస్,బుకోవో కవితా సంపుటి ప్రెసెంట్ డే,ఫ్యూచర్ డే,లుపాన్ రచన లాస్ ఆఫ్ హాస్పిటాలిటి,డామియన్ సాసిన -రూట్స్  ,విక్టర్  టేలేకువా – డీర్ఐలాండ్ ,1966అన్నీ లేటెస్ట్ రచనలే .

  ఆధునికంగా నికోలే పోపా –దిప్లేన్ స్మేల్స్ఆఫ్  ఫిష్ నవల పోస్ట్ మోడరన్ సింబాలిక్ రచన .తన దేశప్రజలు పడిన కస్టాలు కన్నీళ్లు పోయిజీవిస్తున్న  ప్రశాన్తజీవనంఉంది. డుమిట్రు  క్రుడు రచన –మాసకర్ ఇన్ జార్జియా –ఐరానిక్ రిఫ్లెక్షన్ ఆన్ అన్ చేంజింగ్ నేచర్ ఆఫ్ హిస్ కంట్రీ.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

  ’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment