కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం   10

భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

భారతీయ మహర్షుల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన ఉపనిషత్తులు అందులోని రహస్య విజ్ఞానం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞానం అందరికి అర్ధంకాదు .ప్రత్యక్షం నే  ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే బౌద్ధులు సామాన్యజనాలను ఆకర్షించి తమవైపు కు తిప్పుకొన్నారు .వీళ్ళను ప్రతిఘటించి ,వేద ఉద్ధరణకు బయల్దేరిన  ఆస్తికమతాలలో కర్మకాండ  నిశ్శ్రేయస సాధనం అని ,ఆత్మికజ్ఞానమే ముక్తి సాధకం అని చెప్పే జైమిని పూర్వమీమాంస సూత్రాలు ,జ్ఞానకాండ గొప్ప తనాన్ని చెప్పే బాదరాయణుడి ఉత్తర మీమాంస సూత్రాలు ,గౌతముని న్యాయ సూత్రాలు ,కణాదుని వైశేషిక సూత్రం ,కపిలుని సాంఖ్య సూత్రం ,పతంజలి యోగసూత్రాలు వచ్చాయి .వేద వేదా౦గా లలోని విషయాలను పరిశీలించి ,అవగాహన చేసుకొని ,చేతనాచేతన వస్తువు యొక్క మూల రహస్యాలను దర్శించే నెపం తో రచించిన శాస్త్రాలు కనుక ఈ ఆరింటిని ‘’దర్శనాలు’’(షడ్దర్శనాలు) అన్నారు .

  వేదం ప్రామాణ్యాన్ని స్థాపిస్తూ జైమిని రచించిన కర్మ మీమాంస సూత్రాలకు మొట్టమొదటగా గొప్ప భాష్యం రాసిన శాబర మహర్షి ఆంధ్రుడే .శబరులు ఆంధ్రులేకనుక దీనికి తిరుగులేదు .అంతేకాదు యజ్ఞ యాగాది కర్మకాండతో కూడిన వైదిక మతాన్ని పోషించి ,స్వయంగా తానె పౌ౦డరీకాది క్రతువులను చేసి ,ఈమత వ్యాప్తి చేసి ,దక్షిణభారతం లో కృష్ణా గోదావరీ నదుల మధ్య దేశం లో ఆమతాన్ని నెలకొల్పిన వారు ఆంధ్రరాజులే .గౌతమీ పుత్ర శాతకర్ణి మొదలైనవారనేక యజ్ఞాలు చేసి గోవులను పోషించి దానాలిచ్చారు. అందులో ఒకరిపేరు యజ్ఞశ్రీ అవటం ఆయనకు వీటిపై ఉన్న మక్కువకు గౌరవానికి గొప్ప నిదర్శనం .వీరి తర్వాత పాలించిన రాజవంశాలుకూడా వీరి మార్గాన్నే అనుసరించి పరమత సహనాన్ని పాటించారు .అందుకే జైమిని సూత్రాలకు ,శాబర భాష్యానికి కూడా భాష్యంగా చెప్పబడే ‘’తంత్ర వార్తికం ‘’అనే గ్రంథాన్ని రాసిన కుమారిలభట్టు ఆంధ్రే దేశం వాడే అయి ఉంటాడు –‘’ఆంధ్రోత్కలా నాంసంయోగే  పవిత్రే ,జయమంగళే,ఆంధ్రజాతి స్తిత్తిరో మాతా చంద్రగుణా,సతీ యజ్నేశ్వరః పితాయస్య ‘’అని ‘’జిన విజయం ‘’లో చెప్పబడటం చేత ఆతడు పదహారణాల ఆంధ్రుడే అని భావించవచ్చునని కోరాడ వారి తీర్పు .ఈ మతాన్ని ఖండించి న దిగ్నాగుడి ‘’ప్రమాణ సముచ్చయం ‘’పై ‘’న్యాయ బిందువు ‘’అనే వ్యాఖ్యరాసిన ధర్మకీర్తి  కూడా ఆంధ్రుడే అనే అభిప్రాయం ఉన్నది .కర్మ అనేది జ్ఞానానికి సాధనం కనుక మొదటిది అయిన కర్మను గూర్చి చెప్పేది ‘’పూర్వ మీమాంస ‘’అని ,బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పే వేదాంత మీమాంస’’ ఉత్తర మీమాంస ‘’అని  ప్రసిద్ధి కెక్కాయి .ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని బాదరాయణ వ్యాసమహర్షి రచించిన 552బ్రహ్మ సూత్రాలే దీనికి ఆధారం .వీటికి శంకర రామానుజ మధ్వాచార్యులు రాసిన భాష్యాలను బట్టి అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతాలేర్పడ్డాయి .శంకరాచార్యలు అద్వైత సూత్రాలకే కాక ,దశోపనిషత్తులకు ,భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు .ఈమూడిటిని ‘’ప్రస్థాన త్రయం ‘’అంటారు .శంకరులు అద్వైతభావ వ్యాప్తికి అనేక శ్లోకాలు ,స్తోత్రాలు గ్రంథాలు కూడా రాశారు .

  ఆదిశంకరుల అద్వైత గ్రంథాలకు వేదాంత పంచదశి వివరణ ,ప్రమేయ సంగ్రహం ,జీవన్ముక్తి వివేకం మొదలైన భాష్యాలు ,వేదానికి భాష్యం కూడా రాసిన విద్యారణ్య మహర్షి ఆంధ్రుడే అనే భావన ఉన్నది .బ్రహ్మ సూత్రాలకు ‘’అణుభాష్యం’’రాసిన  వల్లభాచార్యుడు ఆంధ్రుడే .ఈతని పూర్వీకులు గోదావరి నదీతీరం లోని కా౦కరవాడ వాస్తవ్యులు .వెలనాటి బ్రాహ్మణుడు .తండ్రిలక్ష్మణభట్టు  .గురువు  పురుషోత్తమభట్టు .యితడు జైమిని సూత్రాలకు వ్యాఖ్య ,భాగవతానికి ‘’సుబోధిని ‘’వ్యాఖ్య రాశాడు .మాయావాదాన్ని ఖండించి సాకార బ్రహ్మవాదాన్ని వ్యాప్తి చేశాడు .విజయనగర శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లో వాదంలో అద్వైతవాదుల్ని ఓడించి , వైష్ణవాన్ని స్థాపించి రాజు చేత కనకాభిషేకం పొంది ఆచార్యపీఠం అధిరోహించాడు.ని౦ బార్కర్  నుంచి రాధాకృష్ణ తత్వాన్ని గ్రహించి శుద్ధాద్వైత వాదాన్ని ప్రచారం చేశాడు .మాయావాదం సమర్ధించిన శంకరునిది ‘’ఆశుద్దాద్వైతం ‘’అని గేలి చేశాడు .కృష్ణుడే పరబ్రహ్మమని ,విశుద్ధభక్తితో ఆయనకు చేసిన సేవయే ఆయనవద్దకు చేరుస్తుందని నమ్మి ప్రచారం చేశాడు .ని౦బార్కరుడు కూడా తెలుగు వాడేనండోయ్.కాని బృందావనం లో స్థిరపడ్డాడు .వేదాంత సూత్రాలకు ‘’వేదాంత పారిజాతం ‘’అనే వృత్తి రాశాడు .ఇతడి కృష్ణుడు విష్ణువు అవతారం కాదు .పరబ్రహ్మయే .గోలోకం లోని రాధ ,బృందావనం లో కృష్ణుడి భార్య .ఇతనివాదాన్ని ‘’భేదాభేద తత్త్వం ‘’అంటారు .తనమత సిద్ధాంతాలను ‘’దశశ్లోకి ‘’ కావ్యంగా రాశాడు .

  సశేషం

ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త్రమునకు ఆంధ్రుల సేవ ‘’వ్యాసం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-19-ఉయ్యూరు   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –

శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె  భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే వ్యాసుడు భాగవతం రాసినట్లు ఉంది .రెండిటికీ కర్త వ్యాసుడే అయినప్పుడు ఈ మీమాంస ఎందుకు వచ్చిందని కోరాడ రామకృష్ణయ్యగారు తనను ఇంటర్వ్యు చేసిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారిని ప్రశ్నించారు.

  శర్మగారుఅదొక చిక్కుప్రశ్న అని దాన్ని మరింత జటిలం మాత్రమె చేయగలనని చెప్పి ,భరతం చివరిభాగం హరివంశం ,ఇందులో కృష్ణ జననం మొదలైన భాగవత కథలన్నీ ఉన్నాయని  భారత భాగవతాలకు ముందే వ్యాసుని తండ్రి పరాశర మహర్షి విష్ణుపురాణం రాశాడని ,అందులో కథలన్నీ భాగవత కృష్ణలీలలే కదా అని జవాబిచ్చారు .’’అందుకేనేమో లోకం లోభాగవతం వ్యాసుడు రాయలేదని ఎవరో బోపదేవుడు రాశాడనే మాట ప్రచారం లో ఉంది అన్నారు కోరాడవారు .,బోపదేవుడు రాశాడు అనేది అర్ధం లేనిమాట అని .అతనికాలం 13వ శతాబ్ది అని, అంతకు పూర్వమే మధ్వాచార్యులు మొదలైనవారు భాగవతాన్ని ప్రమాణ గ్రంథంగా స్వీకరించారని ,శైలిలో తేడా ఉండటం వలన ఈ ఊహ వచ్చి ఉండచ్చు అన్నారు శర్మగారు .దీనితో ఏకీభవిస్తూ కోరాడవారు ‘’భారత మిషమున బలికితి ,వేదార్ధ భావమెల్ల మునుకొని ,స్త్రీ, శూద్ర ముఖర ధర్మములందు  తెలిపితి నే జెల్ల –దీని జేసి ఆత్మ సంతసమందదు,ఆత్మలో ఈశుండు సంతసి౦పక యున్నజాడ దోచె-హరికి ,యోగివరుల కభిలషి త౦బైన ,భాగవతంబు బలుకనైతి ,మోసమయ్యే’’అని వ్యాసుడు తృప్తి లేకుండా ఏడుస్తూ కూర్చుంటే ,నారదమహర్షి వచ్చి ఓదార్చి భాగవతం రాసి సంతృప్తి చెందమని ప్రోత్సహించాడని ,కానీ హరివంశం లోనే శ్రీ కృష్ణుడు మహా విష్ణువు అవతారం అని ,అతడు చేసినవన్నీ మానవాతీత చర్యలని వర్ణించిన వ్యాసునికి ఈ అసంతృప్తి శోకం ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదని కోరాడవారు రాళ్ళపల్లి వారిని ప్రశ్నించారు .

  ‘’నిజమే .భారత, హరివంశాలలో శ్రీ కృష్ణ మహత్వం అంతా ఉంది కాని వాటిలో భక్తి భావన అంతతీవ్రంగా లేదు .భాగవతం లో ఆ రసానుభవం తీవ్రంగా నిర్వహించబడింది .భారత హరివంశాలు వీలైనప్పుడల్లా శివ ,కేశవుల అభేదాన్నే వివరించాయి ,హరివంశం లో శ్రీ కృష్ణుడు సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేసిన ఘట్టం లో హరి హరులకు పూర్తిగా అభేదం చెప్పబడి౦ది కూడా.కాని భాగవతం లో ఈ కథ లేనేలేదు .కనుక శ్రీ కృష్ణుడే పరబ్రహ్మ అనే తత్వాన్ని చెప్పటానికే వ్యాసర్షి భాగవతం రాశాడు అని పిస్తోందన్నారు శర్మగారు .శ్రీ కృష్ణుడు శివునికి తపస్సు చేసినవిషయం విష్ణు పురాణం లో లేదుకదా అన్నారు కోరాడవారు .అందుకే ఈ చిక్కు  విడి పోయేది కాదు  అని ము౦దే చెప్పానని, ఎవరు రాసినా శ్రీకృష్ణునిపై అనన్యభక్తిని ప్రచారం చేసింది భాగవతం మాత్రమె నని దీన్ని తన అసాధారణ కవిత్వ ధారతో పోతన్నగారు తలపొలం దాకా ,ఈడ్చుకు వెళ్ళాడని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మం ను పూజించి అతని గుణగానాలను మననం చేస్తే,పూజిస్తే మోక్ష సాధనమని ,ధర్మమార్గ మని   శర్మగారన్నారు .

  కోరాడవారు అందుకొని  కృష్ణభక్తిని భాగవతం సాధించినంతగా భారతం సాధించలేదనీ , బాలకృష్ణ లీలలు, యవ్వన విలాసాలు భారతం లో లేకపోయినా ,ఆయన అసాధారణ ప్రజ్ఞా ఆశ్రిత వాత్సల్యం ,ధర్మ దృష్టి,నీతిపా౦డిత్యం ,స్వార్ధం లేని లోకకల్యాణ దృష్టి,అందరినీ ఆకర్షించే ధీర లలిత శా౦తత్వం ,క్లిస్టసమయాలలోకూడా చెడని మనోబలం భారత కృష్ణుని లక్షణాలు అన్నారు రామకృష్ణయ్యగారు .దీన్ని కొనసాగిస్తూ అనంత కృష్ణ శర్మగారు శ్రీ కృష్ణుడు సార్వకాలిక సందేశంగా అందించిన భగవద్గీత లో స్థిత ప్రజ్ఞతను మహోదాత్త గుణం గా చెప్పగా గాంధీ మహాత్ముడు ఆ శ్లోకాలను నిత్యపారాయణ చేసి అమలు పరచుకొన్నాడు .ఈ స్థిత ప్రజ్ఞత్వం మహా భారత కృష్ణుని కి శోభాయమానమైన అలంకారం. ఆయన భగవానుడు అనటానికి ఇదొక్కటి చాలు అన్నారు .

  దీన్ని సమర్ధిస్తూ కోరాడవారు  లోక కల్యాణానికి ,ఆత్మానందానికి ఆ గుణాలు యెంత యెక్కువగాఉంటేఅంత దివ్యత్వం ఆ వ్యక్తిలో కనిపిస్తుందని పూతన సంహారం ,కాళీయమర్దనం  గోవర్ధనోద్ధరణం మొదలైనవి ,భగవదవతారమని భావి౦చబడే వ్యక్తిలోచిన్న చిన్న చిల్లరపనులుగా వివేకవంతులు భావిస్తారని, అవతారం అంటే విష్ణువు వైకుంఠానికి తాళం పెట్టేసి ,క్రిందికిదిగి మనిషిగా పుట్టాడని ,కానీ ,అక్కడా ,ఇక్కడా రెండు శరీరాలలో ఏకకాలం లో వర్తి౦ చేవాడని భావించటం’’ ‘ రమణీయం కదా అన్నారు .,శర్మగారు అవిచారం అయినా రమణీయం అనే మాట గొప్పగా ఉందని ,అదే భక్తులుకోరుకోనేదని ,ఆ రమణీయతా గుణమేసామాన్యభక్తులకు జీవనం అనీ ,ఆధ్యాత్మికమైన అతీంద్రియ తత్వాన్ని ,ఆది భౌతికంగా భావించి అనుభ వించటమే భక్తి స్వరూపం అనీ ,అందుకే శ్రీ కృష్ణుని బాల,తరుణ లీలలు లోకాన్ని అంతగా ఆకర్షించాయని అన్నారు .

  రామ క్రిష్ణయ్యగారు వెంటనే ఆది భౌతికభావనలను ,ఆధ్యాత్మికంగా సంస్కరించుకోకపోతే ,అవి మరీ సంకుచితమైపోతాయని గుర్తించాలి అంటూ ,శ్రీ కృష్ణభక్తులు ఆయన జార.చోర లీలలతో ఆగిపోయి ,చరితార్దులమయ్యామని భావిస్తారని ,మనం ఉపాసించే దేవతా లీలలు మన ధర్మార్ధ కామాల సంస్కరణ కు సాధకం కాకపొతే ఆ భక్తివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని నిర్మొహమాటంగా చెప్పారు ..శర్మగారు భారత కృష్ణుని మహాత్యాన్ని అర్ధం చేసుకొని ఉపాసి౦చటానికి పూర్వరంగంగా భాగవత కృష్ణమూర్తి చిత్రి౦ప బడినాడని కోరాడవారి భావమా ?అని ప్రశ్నించారు ,.అవునని కోరాడవారనగా ,శర్మగారు తనదీ అదేఅభిప్రాయం అని బలపరఛి ,భారత కృష్ణుడే ఎక్కువ గంభీరంగా ,ధర్మాన్ని ,నీతినీ రెండిటినీ సమానంగా నిర్వహించి ,భోగ ,యోగాలు రెండూ పరస్పర ఉపకారకాలుగా చెప్పిన మహా వ్యక్తి భారత కృష్ణుడే అనీ ,ద్రౌపదీ స్వయంవర ఘట్టం లో ‘’అమూర్తి ‘’గా ఉండి,రాయబారం యుద్ధం లలో ,తత్వ చర్చలో ,వినోదం లో ‘’అత్యత్తిస్ట దశాంగులం’’అని వేదం చెప్పినట్లు అందరినీ మించి ,అందరితో చేరి ,నవ్వుతూ జీవితం గడిపాడు అన్నారు .

  కోరాడవారు కోరస్ గా ‘’సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ –అహం త్వా౦  సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః ‘’అని అందుకే అన్నాడు ,అనగలిగాడు అని చెప్పి

‘’క్ర౦దు కొను సర్వ ధర్మ,వికల్పములను –నెడల విడిచి ,దృఢంబుగ నేనొకండ-శరణముగ నాశ్రయి౦పుము సకల దురితములకు   – దొలగింతు నిన్ను బ్రమోదమంద’’అని భారత యుద్ధం లో గీతోపదేశం లో అర్జునునికి శ్రీ కృష్ణుడు నిర్భయంగా ,నిస్సందేశం గా చేసిన ఉపదేశం మనదేశంలో అందరూ మహా మంత్రంగా జపిస్తారు అన్నారు .శర్మగారు ఔనంటూ,దానికి మించిన సందేశం లేనే లేదని ,శ్రీ కృష్ణుడు తప్ప దాన్ని చేయగల సమర్ధుడు వేరొకరు లేరని విస్పష్టంగా చెప్పారు .

  శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మననం చేసుకోదగ్గ మంచిమాటలు

ఆధారం –కృష్ణాష్టమి సందర్భంగా ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి తో రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి ఇంటర్వ్యు  ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టేపొంగలి ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు  ఏర్పాటు చేయబడినాయి .

సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్  లెక్కల మాస్టారు శ్రీ ఆయాచితుల త్రినాథ శర్మ గారి చే  ‘’కృష్ణ చరితం ‘’పై ధార్మిక ప్రసంగం ,అనంతరం బాల బాలికల చేత రాధా ,గోపికా ,కృష్ణ వేషధారణ ప్రదర్శనగా  ‘’శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ‘’నిర్వహించబడుతాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త

ఉయ్యూరు -20-8-19

image.png
image.png

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం

మచిలీపట్నానికి చెందిన ప్రముఖ విద్యావేత్త తెలుగు సంస్కృతం ఇంగ్లిష్ హిందీ భాషావేత్త బహు గ్రంధకర్త  మహా వక్త గొప్ప ఆలోచనా పరులు సహృదయశీలి ,అమృతహృదయులు నాకూ సరసభారతి మిక్కిలి ఆప్తులు డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ లో 19-8-19 సోమవారం మరణించినట్లు సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి నిన్నరాత్రి 9 గంటలకు హైదరాబద్ లో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పింది ,వారి ఆత్మకు  శాంతి కలగాలని  కోరుతున్నాను -దుర్గాప్రసాద్ -20-8-19-ఉయ్యూరు

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

18-819 ఆదివారం సాయంత్రం హైదారాబాద్ ఈస్ట్ ఆన0దబాగ్ లో వేలూరి పవన్ అత్తగారింట్లో పవన్ ,రాధ దంపతులు,కూతుళ్ళు ,అత్త,మామ గార్లు ,మేమిద్దరం ,మాపెద్దబ్బాయి శాస్త్రి

18-819ఆదివారం సాయంత్రం హైదారాబాద్ ఈస్ట్ ఆన0దబాగ్ లో వేలూరి పవన్ అత్తగారింట్లో పవన్ ,రాధ దంపతులు,కూతుళ్ళు ,అత్త,మామ గార్లు ,మేమిద్దరం ,మాపెద్దబ్బాయి శాస్త్రి

 

https://photos.google.com/share/AF1QipN0VPD70vtnkzE-5Tmyb0TiBpS4iuEbcAQVTg9qeDrmOoPXGuAfyvwLohQMzFRLwQ?key=bm9qa0g0NkZMVEo3d1dRNjRrelY0T0tGaXlfZjVR

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(మూడు సవరణలతో ఫైనల్)

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-19  గురువారం  సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి 144 వ కార్యక్రమంగా,  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

image.png

image.png

ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –

–శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్   ,శాసనమండలి సభ్యులు

ఆత్మీయ అతిధులు –   శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు , శ్రీకోట రామ కృష్ణ గారు ,శ్రీ  కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

శ్రీ మధుసూదన పిళ్లే-ప్రిన్సిపాల్ శాంతినికేతన్ హైస్కూల్ –ఉయ్యూరు

శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి –తెలుగు అధ్యాపకులు ,ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ జూనియర్ కాలేజి –ఉయ్యూరు

 

కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-శ్రీ బొడ్డపాటి  విశ్వేశ్వరరావు –93 సంవత్సరాల పౌరాణిక నాటక రంగ స్థల నటులు –గుడివాడ

2-శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు –రిటైర్డ్   కెమిస్ట్రి లెక్చరర్ –ఉయ్యూరు

3-శ్రీ యు.రా౦ ప్రసాద్  –   రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ –ఉయ్యూరు

4-శ్రీ పేర్నేటి గంగాధరరావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,ఆధ్యాత్మిక గ్రంథ కర్త-మచిలీపట్నం

5-శ్రీ కోసూరు ఆదిరాయణ రావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –   కోసూరు

6-శ్రీ మతి కొల్లి భారతీ దేవి –విశ్రాంత ప్రధానోపాధ్యాయిని     -మచిలీపట్నం

7శ్రీమతి వి.కస్తూరి బాయి –విశ్రాంత ప్రధానోపాద్యాయిని –విజయవాడ

8-శ్రీ గబ్బిట రామనాథ బాబు –విశ్రాంత ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు –ఉయ్యూరు

9-  అమరవాణి   ఉపాధ్యాయులలో ఒకరు

 

ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార‘’ప్రదానం

 

1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు

2- అమరవాణి పాఠశాల విద్యార్థిని  -కుమారి   ఎస్.సాహితి   10/10 –కు  2,000 రూపాయలు

3-..అమరవాణి పాఠశాల  విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు  2,000 రూపాయలు

.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

4-కుమారి .కె.తిరుపతమ్మ –   బి.ఎ.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు

5-చి.మీరావలి  –    బి.కాం.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు

6-కుమారి ఎన్.ఫాతిమా –బి ఎస్.సి.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ  డిగ్రీ  కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు
. .-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట  ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి   10,116 గా ఏర్పాటు చేసిన  స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

7–2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.9

/10మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక . నారాయణ  జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గబ్బిట  రమ్య కు 10,116రూపాయలు

8-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8.8/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక చైతన్య  జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చి. యనమండ్ర రోహిత్ కుమార్ కు 10,116 రూపాయలను

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

9-సరసభారతి అందజేయు ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కారం

2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక శ్రీనివాసా హైస్కూల్ నుంచి 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  కుమారి  ఐలూరు హర్షిత కు 5,116 రూపాయలు

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

 

ఆహ్వాని౦చు వారు

గబ్బిట దుర్గా ప్రసాద్ సరసభారతి అధ్యక్షులు

,

పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి హైస్కూల్ ,ఉయ్యూరు

 

-19-8-19 ఉయ్యూరు

గమనిక –మచిలీ పట్నం ,గుడి వాడ నుండి వచ్చేవారికి ఉయ్యూరు సెంటర్ ,వీరమ్మతల్లి గుడి దాటాక ఎడమ వైపు న ,,విజయవాడ నుంచి వచ్చేవారికి వీరమ్మ తల్లి గుడి దాకా వెళ్ళకుండానే కుడివైపున ’’ కాకాని నగర్ కాలని ‘’పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది .అందులోనుంచి వస్తే సరాసరి అమరవాణి హైస్కూల్ కు చేరుకోవచ్చు .

సంప్రదించాల్సిన సెల్ నంబర్లు –గబ్బిట దుర్గాప్రసాద్ – .9989066375

పివి నాగరాజు       -9440636357

ఎం.శివ లక్ష్మి       -9395379582

— 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మోసం గుర్రో

మోసం గుర్రో

గురు –ఏందిభాయ్ !పాలన సురుగ్గా సాగిస్తున్నావా ?

శిష్య –అంతా నీ ఆశీర్వాదం అన్నా .మూడు కూల్చివేతలు ఆరు దౌర్జన్యాలు రోజూ జరిగిపోతున్నాయి .కిక్కురుమంటే బొక్క లిరగగొట్టిస్తున్నాను .

గురు –ధిల్లీ పోయోచ్చినావా ?

శిష్య –నాలుగైదు సార్లుపోయా .ప్రత్యేకహోదా అంటూ వెళ్ళిన ప్రతిసారీ వాల్యూం తగ్గించి ‘’సార్ సార్ ప్ల్లెజ్ ప్లీజ్ మంత్రం జపించినా .ఉలుకూలేదు పలుకూ లేదు .నువ్వు పోయి౦ డ్లేదా  హస్తినకు?

గురు –అక్కడ మనమొహం ఎవడు సూస్తార్రా బయ్యా .అదోలోకం .నాపై కక్ష కట్టినట్లున్నారు అక్కడి జంట.

శిష్య –మనదీ అదే పరిస్థితి .ఇక వాగ్దానాలన్నీ బుట్టలో పడేసి చాణక్యం ప్రయోగించాలి .అయినా అన్నా గిప్పుడు ఫోన్ చేశావేంది?

గురు -నీ ఎలక్షన్ లో నాలుగంకెల కోట్లు అప్పగించాను .గేపకం తేటానికి ఫోన్ చేశా  .

శిష్య –యాదమరిస్తే గదన్నా .మీరుణ౦ నా చర్మంతో  చెప్పులు కుట్టి తీరుస్తా .

గురు –అదేవడికి గావాల్రా భయ్యా .ఇంకేదైనా ?

శిష్య –హైదరాబాద్ లో మా భవనాలన్నీ ఇచ్చేశాను రూపాయి అడక్కుండా .మాకు నీనుంచి రావాల్సిన కోట్ల రూపాయల బాకీలడక్కుండా గుమ్మునుండా .

గురు –ఇంతేనా .లక్షన్నర కోట్ల గోదావరి ప్రాజెక్ట్ తెలంగాణలో కడదాం .ఖర్చు చెరిసగం .ఎవరివాటా వాళ్ళదే .

శిష్య –దానికేం అభ్యంతరం ?నా మాట వేదవాక్కు .ఇంజనీర్లు అక్కర్లేదు .నువ్వు పెద్దిన్జనీర్ నేను చిన్నిన్జనీర్ .మన పద్ధతిలో కడదాం .మా వాళ్ళు కిక్కురు  మనకుండా నాదీ పూచీ .

గురు –ఇంతేనా ?

శిష్య –వాన్పిక్ నీకే అని చెప్పా .బందరు రేవూ నీకే అన్నాగా అన్నా ?

గురు –అవుననుకో .నావల్ల జాతీయ స్థాయి కూటమి కుదరలేదు .అడుగులోనే హంసపాదై౦ది మనిద్దరం కలిసి యాంటి మోడీ గా కలిసి సాగుదాం .ఇంకేంటి ప్లాన్స్ ?

శిష్య –వండర్ఫుల్ ఐడియా .నేనూ అలానే అనుకొంటున్నా .కాశ్మీర్ సమస్య తీర్చి తలాక్ కు తలాకులిచ్చి అరివీర  భయంకరుడైనాడు మోడీ .మనమాట చెవిటివాడిముందు శంఖమే .అమరావతి కి గుడ్ బై పోలవరానికి రివర్స్ టెండరింగ్, అన్నాకాంటీన్ల క్లోజ్ , పెన్షనర్లకు  చేయ్యివ్వటం,ఆశాలకు నిరాశా ,రేషన్ కు పరేషాన్ ,ఇసుక  పైకి చిమ్మటానికి కూడా లేకుండా మావాళ్ళ పైరవీలు .

గురు –ఒకేఒకే నన్నే మించావ్ శిష్యా .అవును నిజం .సోనియా ను  పొగిడి ,తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చి విద్యార్ధుల ఆత్మబలిదానాలను హైలైట్ చేసి  ,కాంగ్రెస్ తో కలిసిపోతానని నమ్మించి తీరా తెలంగాణా ఇచ్చాక ‘’తూ నా బొడ్డు’’అని వదిలేసి ,దళితముఖ్యమంత్రి అని చేసిన ప్రచారానికీ తిలోదకమిచ్చి నేనే రెండు సార్లు సిఎం అయ్యా .కాని ఎపి లో పిచ్చోడు బాబు మొదటిసారి అయి రెండో సారి బొక్కబోర్లపడ్డాడు నావల్లా నీవల్లా మోదీవల్లా. కాని బాబు గ్రేటేనయ్యా కమలం వికసించకుండా నలిపేశాడు .ఆపరాభవం తట్టుకోలేక పోతున్నారు పైనున్న జంట  .అందుకే నాకూ నీకూ ఎసరు పెట్టె ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది .

శిష్య –ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు గురూ ?

గురు –ముందుజాగ్రత్త కోసం .మనం ఇద్దరం బెసకకుండా ఫెవికాల్ బంధంగా బిగుసుకుపోతే మనల్ని పీకే వాడు ఉండడు.అందుకని .

శిష్య –ఒకే గురూ .కలిసి పని చేద్దాం కలిసి కసి తీర్చుకొందాం కలిసి గోదారిలో మునుగుదాం అంటే ప్రాజెక్ట్ కడదాం .

గురు –గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్ నీదీ నాదీ ఒకటే మాట ఒకటే బాట .

శిష్య –ఔను చరిత్ర  సృస్టిద్దాం .మనబంధం ఫెవికాల్ .మన బలం సెరిలాక్ ,మన ధ్యేయం ‘’సిరి లాక్ ‘’

గురు –బాగా చెప్పావ్ శిష్యా .నీ లాంటి ,నా లాంటి   వాళ్ళుంటే అవినీతి ఆమడ దూరం .

శిష్య –మనం వినీతులం అన్నా .’’అ’’ ని ముందు చేర్చిమనల్నిదేబ్బతీస్తున్నారు అలగా  జనం .గురూ మోడీ, షా  లకు షా పెట్టటం ఖాయమేగా ?

గురు –నూటికి వెయ్యిశాత౦ శూర్ భయ్యా .ఫికర్ మత్.మై హూనా.

శిష్య –ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి  తెలుగువారికి శుభోదయం జరుగుతోంది !

గురు –గ్రేట్ మైండ్స్ ధింక్ఎలైక్ అన్నమాట రుజువు చేశాం .ఎవరో ఫోన్ చేస్తున్నట్లున్నారు .తర్వాత మాట్లాడతా .

శిష్య –సరే గురూ .

శిష్య –గురూ గురూ ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదేం?

అవతలి నుంచి –సార్ కు షా గారు ఫోన్ చేసి అర్జెంట్ గా ధిల్లీ రమ్మంటే వెళ్ళారు .మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేయద్దని గట్టిగా చెప్పారు .

శిష్య -మోసం గుర్రో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-19-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8   వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8

వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )

రాజరాజ నరెంద్రునికాలం లో కులోత్తుంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది .కులోత్తు౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా యుద్ధాలు చేసి జయించినట్లు తెలుస్తోంది .వంగదేశ కావ్యాలలో గంగా ప్రసాద్ ,సాగర సేన ,హంసవర ,రాజవల్లభ నౌకలపేర్లు కనిపిస్తాయి .ధనపతి సింహళం వెళ్ళేటప్పుడు 7 నౌకలతో వెళ్ళాడని అందులో మధుకర నౌక చాలాపెద్దదని  దానిలోపల బంగారు పూత ఉన్నదని తెలుస్తోంది .దుర్గావర ,సింహముఖి ,చంద్రసాన నౌకలు కూడా పెర్కొనబడినాయి  .క్రీస్తుశకం మొదటి నుంచి మోటుపల్లి రేవు విఖ్యాతి చెందింది .కాకతి గణపతి దేవుడు నావికుల రక్షణకోసం అభయ శాసనం వేయింఛి పన్ను కొంతతగ్గించి వ్యాపారాభి వృద్ధికి  తోడ్డాడు .

  రెడ్డి రాజులకాలం లో  ఎల్లాప్రగడ మల్లారెడ్డి ని గురించి ‘’ఉత్సాహోదగ్రుడు మోటుపల్లి గొని ,సప్తద్వీప సద్వస్తు సందోహముల్ తనకిచ్చు నెచ్చెలి సముద్రుం బ్రీతి గావి౦చుచున్ ‘’అన్నాడు .కుమారగిరిరెడ్డి సుగంధ భండారాధ్యక్షుడు అవచి తిప్పయ్య సెట్టి విదేశీ వ్యాపారాన్ని శ్రీనాధుడు వర్ణించి చెప్పాడు –‘’తరుణా సీరతవాయి గోప రామణాస్థానంబులన్  ,చందనాగరుకర్పూర ,హిమాంబు కుంకుమ ,రజః కస్తూరికా ద్రవ్యముల్ –శరదిం గప్పలి జోగులన్ విరివిగా సామాన్ల దెప్పించు నేర్పరి –యేవైశ్య కులొత్తముం డవచి తిప్పం డల్పుడే ఇమ్మహిన్ ‘’ఇందులో కప్పలి ,జోగులు అనేవి రెండురకాల నౌకలపెర్లు .

  గోల్కొండ నవాబులకాలం లో మైసోలియా గా ప్రసిద్ధి చెందిన కృష్ణానదీ ముఖద్వారం లోని మచిలీ బందరుకు మళ్ళీ  గొప్ప పేరు వచ్చింది .17వ శతాబ్దిలో ఫ్రాన్స్ నావికుడు టేవెర్నియర్అనేవాడు బంగాళాఖాతం లో ఇంతటి ప్రసిద్ధ రేవు ఇంకేదీ లేదని ,లోతైన సముద్రం కనుక ఓడల రాకపోకలకు చాలా అనువుగా ఉందని ,ఇక్కడి నుంచే చైనా మక్కా హార్మాజ్ పట్టణాలకు ,మడగాస్కర్, సుమత్రా ,మైనిల్లా దీవులకు నౌకాయానం జరిగేదని రాశాడు. ఇతర యాత్రికులుకూడా దీన్ని ప్రసిద్ధ రేవుపట్టణం అన్నారు .గోల్కొండ నవాబులకు ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా శోభించింది .నవాబులు ఇతర దేశాలనుంచి, ద్వీపాలనుంచి ఏనుగులను తెచ్చుకోనేవారు .ఒక్కో ఓడలో 25 ఏనుగులు  దిగుమతి అయ్యేవట.వెయ్యి టన్నుల బరువుగల  ఓడలు కూడా వాళ్లకు ఉండేవి .బందరు నుంచి ‘’మసూలా ‘’అనే తేలిక రకం ఓడలు ఎక్కువబరువు తరల్చటానికి బాగా ఉపయోగపడేవి .ఒకే తెరచాప కల పడవలను  తెడ్లతో కళాసులు  నడిపేవారు .

  బందరు తర్వాత నరసాపురం రేవు పెద్దది .నౌకనిర్మాణానికి పనికొచ్చే కర్ర గోదావరి వరదల్లో కొట్టుకువచ్చి లభించేది .ఇక్కడ గోదావరి చాలా లోతుగా ఉండటం తో బ్రిటిష్ నౌకాదళం అంతా ఇక్కడే ఉండేదని మారిస్ దొర రాశాడు .17వ శతాబ్దం లో బ్రిటిష్ వాళ్ళు కూడా తమ పెద్ద పెద్ద ఓడలను ఇక్కడే కట్టించుకొనే వారట .నక్షత్రాలను బట్టి నౌకల్ని చక్కగా నడపగలిగే సామర్ధ్యమున్న నావికులు నరసాపురం లో ఉండేవారట .దీనికి దగ్గరలోనే ఉన్న కోరంగి ,తాళ్ళరేవు కూడా ప్రసిద్ధ నౌకాశ్రయాలే .బ్రిటిష్ నౌక ఆల్బట్రన్ కు ఇక్కడ మరమ్మతులు  చేశారట .విశాఖ ,కళింగపట్నం కూడా గొప్ప నౌకాశ్రయాలే .సహజ నౌకాశ్రయమైన విశాఖ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందింది .

   4వ శతాబ్ది చైనాయాత్రికుడు జావా ద్వీపం అంతా హిందువులతో నిండి ఉంది అని రాశాడు .తాను జావానుంచి శ్రీలంక , అక్కడి నుంచి చైనాకు వెళ్ళినప్పుడు బ్రాహ్మణ నావికులు నడిపిన ఓడలలోనే ప్రయాణం చేశానని చెప్పాడు .14వ శతాబ్దికి చెందిన ప్రయర్ ఒడోరిక్ అనేవాడు గుజరాత్ లోని రాజపుత్రనావికులు 700మంది జనం తో ఉన్న నౌకలను అత్యంత లాఘవంగా నడిపారని ,సోమ నాథ్ నుంచి చైనాకు పోయే నౌకలను రాజపుత్రులే నడిపేవారని రాశాడు .ఒక్కో ఓడకు వందలాది కళాసులు ఉండేవారు .ఓడ ప్రధానాదికారి లేక కెప్టెన్ ను ‘’నఖూదా’’అనేవారు .నడిపే వాడిని మాతి౦గుడు అనీ ,కళాసులపై అధికారిని తండేలు అనీ ,ఎగుమతి దిగుమతులను చూసేవాడు సరంగు అని పిలిచేవారు .నీళ్ళు తోడేవాళ్ళు, లెక్కలు రాసేవాళ్ళు ఉండేవారు . వారిధి లోని ద్వీపా౦తరాలలో, ఖండాంతరాలలో వ్యాపారం చేసిన మన నౌకల ,నావికుల చరిత్ర అత్యద్భుతం అంటారు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .

  సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

56ఏళ్ళ క్రితం 19 63లో మోపిదేవి హైస్కూల్ లో నా శిష్యుడు ,అప్పర్ ప్రయిమరి హెడ్ మాస్టర్ గా రిటైరై ,చల్లపల్లి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్న అడవి శ్రీరామ మూర్తి ఇంట్లో 15-8-19 గురువారం మధ్యాహ్నం ఆతను ,అతనిభార్య, 90 ఏళ్ళ అతని తల్లిగారితో నేనూ,,శ్రీ మాదిరాజు శర్మగారు

56ఏళ్ళ  క్రితం 19 63లో మోపిదేవి హైస్కూల్ లో నా శిష్యుడు ,అప్పర్ ప్రయిమరి  హెడ్ మాస్టర్ గా రిటైరై ,చల్లపల్లి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్న అడవి శ్రీరామ మూర్తి ఇంట్లో 15-8-19 గురువారం మధ్యాహ్నం ఆతను ,అతనిభార్య, 90 ఏళ్ళ అతని తల్లిగారితో నేనూ,,శ్రీ మాదిరాజు శర్మగారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7     

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7

వారిధి చూపిన వసుధ -2

దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ భిక్షువులు మతప్రచారం కోసం దక్షిణ బర్మాకు  వెళ్ళారు .అతి ప్రాచీనకాలం నుంచి భారత్ లో నౌకాయానం ఉన్నట్లు తెలుస్తోందికాని నౌకానిర్మాణం గురించి విషయాలు తెలియదు .భోజరాజు రచించినట్లుగా చెప్పబడుతున్న ‘’ యుక్తి కల్పతరువు ‘’లో అశ్వ,గజ, రత్న పరీక్షలతో పాటు నౌకానిర్మాణ విషయం కూడా ఉన్నది .నౌకా నిర్మాణానికి కావలసిన కలపలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులున్నట్లు ,అందులో బ్రహ్మజాతిది తేలికగా మృదువుగా ,క్షత్రియ జాతిది తేలికగా గట్టిగా ,ఉండటం చేత ఇదే ప్రశస్తమని ,అగాధ సముద్ర ప్రయాణాలకు అనువైందని ,సుఖ సంపదలనిస్తుందని చెప్పబడింది ..చెక్కల బిగి౦పు కు ఇనుపమేకులు వాడ రాదనీ ,నదులలో వెళ్ళేవి సామాన్యాలు ,సముద్రం లో నడిచేవి విశేషమైనవని చెప్పి వాటి కొలతలు ,వాటి భేదాలపేర్లు  బంగారు, వెండి అలకరణలు ,వేసే రంగులు ,వాటి అగ్రభాగాన చెక్కాల్సిన సింహ, గజ ,వ్యాఘ్ర ,పక్షి భేదాకృతులు ,సర్వ మందిరాలు మధ్యమందిరాలు ,అగ్రమందిరాలు ,వాటిలో భేదాల వివరణలున్నాయి .సర్వ మందిరాలు రాజుల ధనం గుర్రాలు , వాటిని నడిపే జనాలను తీసుకు   వెళ్ళటానికీ ,మధ్యమందిరాలు వర్షాకాలానికి ,రాజులు విలాస ప్రయాణాలకు ,అగ్రమందిరాలు నౌకాయుద్ధాలకు వాడుతారని చెప్పారు .

  మౌర్యకాలం లో నౌకానిర్మాణం ప్రభుత్వమే భారీఎత్తున చేబట్టింది .చంద్ర గుప్తుని యుద్ధ కార్యాలయం లో ఉన్న ఆరు విభాగాలలో నౌకాధికార వర్గం ఒకటి అని  నావాధ్యక్షపదవి చాలా బాధ్యతలతో కూడినదని ,కౌల్యుని అర్ధ శాస్త్రం లో ఉంది .అలేగ్జాండర్ అపార సేనావాహిని దేశీయులు తయారు చేసిన 3 వేల నావల మీదనే సి౦ధు నదిని దాటింది.ఆంధ్రరాజుల నాణాలమీద ఉన్న రెండు కొయ్యలున్న పెద్ద ఓడలే గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ మొదలైనవారు చేసిన నౌకా వాణిజ్యాలకు  సముద్రం పై వారి ఆధిపత్యానికి తార్కాణం .మార్కోపోలో కూడా హిందూమహాసముద్రం మొత్తం మీద విహరించే నౌకలనిర్మాణ౦  గురించి రాశాడు .వీటిని దేవదారు కర్రలతో చేసేవారని ,బిగి౦పు కు ఇనుపమేకులు వాడారని ,ఖాళీలలో జనపనార దూర్చి, ఒకరకమైన  చెట్టు  నూనెతో సున్నంకలిపి కీలులాగా పూసేవారని ,ఈనావలు చాలా విశాలంగా ఉండి ,దాదాపు మూడు వందలమంది నావికులు తెరచాపలు తెడ్లతో నడిపేవారని ,వీటివెంట రెండు ,మూడు ఓడలు ,ప్రక్కల పది పన్నెండు నావలు వ్రేలాడగట్టి తీసుకొని పోయేవారని ,పైభాగం అంటే డెక్ కు కింద ఉన్న అంతస్తులో వర్తకులకోసం 20 గదులు ఉండేవని ,దీని కిందిభాగం లో దెబ్బతగిలినా ,లోపలి  నీళ్లు రాకుండా చిన్న చిన్న గదులుగా చేసి చెక్కలు బిగి౦ చేవారని రాశాడు మార్కోపోలో ..ఫిరోజ్ షా తుగ్లక్ భట్టి రాజ్యం పై దండ యాత్ర చేసినపుడు 90 వేల ఆశ్వసైన్యాన్ని ,480 ఏనుగులను ,సుమారు 5000ఓడలలో సి౦ధు నదిమీద పంపాడట .

  సశేషం

  ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి  వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు నావికులు ‘’

 స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవతార పురుషుడు మెహర్ బాబా ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం

అవతార పురుషుడు మెహర్ బాబా

అవతార పురుషుడు మెహర్ బాబా

నేను రాసిన” సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”అవతార పురుషుడు మెహర్ బాబా ”వ్యాసం ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదేళ్ల కిందటి ”ఎలర్జీ ”మళ్ళీ జూన్ తెలుగు విద్యార్థిలో ప్రత్యక్షం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వారిధి చూపిన వసుధ

 వారిధి చూపిన వసుధ

మనం ఉండే భూమిని సముద్రమే చూపించింది అంటే సముద్రం లోనుంచి బయట పడిందన్నమాట .సృష్టిక్రమంలోనూ ఆకాశం నుంచి వాయువు వాయువునుంచి అగ్ని ,అగ్నినుంచి నీరు ,నీటినుంచి భూమి పుట్టినట్లు ‘’ఆకాశాద్వాయుః—-‘’బట్టి తెలుస్తోంది .ఒకప్పుడు ప్రపంచమంతా జలమయం .ఆ చీకటిలో ఆమున్నీటిమధ్య విష్ణుమూర్తి వటపత్ర శాయి గా ఉంటాడని ,సృష్టి సమయం లో భూమి బరువెక్కి నీటిలో మునిగిపోతే ,దాన్ని పైకెత్తి పాములరాజు తన  పడగలపై  నిలబెట్టాడని ఒక గాధ ఉన్నది. దీన్నిబట్టి వారిధినుంచే వసుధ వచ్చిందని చెప్పవచ్చు .భూగోళం పై కొంత నీరు కొంతభూమి ఉన్నాయి .సముద్రం లోనుంచి ఏ భూభాగం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పలేము .కాని సముద్రాలమధ్య ఉన్న భూ భాగాలలోని మానవులు సముద్రాలను దాటి ఇతరభూభాగాలకు ఎలా,ఎప్పుడు  చేరారో తెలుసుకోగలిగాము .

  అతి ప్రాచీనకాలం నుంచీ మానవుడు సముద్రాలుదాటి ఇతరభూభాగాలకుచేరి వర్తకవాణిజ్యాలు చేశాడని  వాటిని ఆక్రమి౦చు కొన్నాడని తెలుసు .దీనికి నౌకాయానమే అతని ముఖ్య సాధనం .పోర్చుగీస్ ఇంగ్లాండ్ స్పెయిన్ మొదలైన దేశాలవారైన వాస్కోదగామా , డ్రేక్ మొదలైనవాళ్ళు కొత్త భూభాగాలను కనిపెట్టారని సంతోషించామేకాని భారత దేశం లో ప్రాచీన నౌకానిర్మాణం నౌకాయానం దాన్ని చేసిన సాహసులగురించి తెలుసుకొనే ప్రయత్నం మనం చేయనే లేదు .రాధా కుముద్ ముఖర్జీ అనే వంగదేశ పండితుడు హిందూ దేశ నౌకాయాన చరిత్ర తెలిపే అనేక విషయాలను  తెలియజేశాడు . దీన్ని బూలర్ పండితుడు కూడా అంగీకరించాడు .రుగ్వేదకాలం లోనే మనకు నౌకాయానం ఉంది . ఋగ్వేదం  లో వరుణుడికి నౌకలు పోయే సముద్రమార్గాలన్నీ తెలుసునని ,ఆకాలం లోనే డబ్బు కోసం వర్తకులు దూర దేశాలలో వర్తకం కోసం సముద్రం నాలుగుమూలలకు నౌకలు పంపుతారని ఉన్నది .తుగ్రుడుఅనే రాజర్షి భుజ్యుడు అనే కొడుకును దూర ద్వీపాల శత్రువులపై నౌకలతో  దండయాత్రకు పంపాడని ,అవి సముద్రమధ్య లో తుఫానుకు భగ్నం అయిపోతే ,శతాదిత్రాలు అంటే నూరు తెడ్లుగల ఓడలలో అశ్వినీ దేవతలు వచ్చి అతడిని కాపాడినట్లు ఋగ్వేదం 1వ మండలం 116 వ సూత్రం లో ఉన్నది.

  రామాయణ కిష్కింధ కాండలో సుగ్రీవుడు వానర సైన్యాన్ని పంపుతూ ‘’సముద్ర మన గాఢాంశ్చపర్వతాన్ పత్తనానిచ ‘’అని సముద్ర ద్వీప పర్వత పట్టణాలలో ఎగిరే దారులు ,’’భూమిశ్చ కోషకారాణా౦’’కోషకారుల భూమిని కూడా వెతకమని చెప్పాడు .కౌషేయాలు అంటే పట్టుదారాలపురుగులను ఉత్పత్తి చేసే భూమి అంటే చైనా దేశాన్ని కూడా వెతకమన్నాడు .’’చీనా౦ శుకమివ  కేతోః’’ అని కాళిదాసు అనేకాలానికి పట్టు ప్రసిద్ధమైపోయింది .సప్త రాజ్యోప శోభితమైన యవద్వీపం సువర్ణ రూప్యక ద్వీపం కూడా రామాయణకాలం లో ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి .మహాభారతం లో విదురుడు రహస్యంగా పంపిన జనం ,ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్న పాండవులు  గంగానది ఒడ్డున నిర్మించిన ఓడలో తప్పించుకొని పారిపోయినట్లు ఆదిపర్వం లో ఉంది .’’పార్దానాం దర్శయా మాస –మనో మారుతగామినీం –సర్వ వాత సహాం నావం –యంత్ర యుక్తాం పతాకినీం –శివే భాగీరధీ తీరే నరైర్వింశ్ర౦ షిభిః కృతాం’’మనోవేగం కలది అన్నిరకాల గాలులను తట్టుకోనేది యంత్రం తో నడిచేది ఐన ఓడలో తప్పించుకు వెళ్ళారు .ఎంతటి డెవలప్ మెంట్ ఉన్నదో ఆనాడే !

  కానీ మరికొంతకాలానికి బోధాయన ఆపస్తంభమొదలైన సూత్రకారులు బ్రాహ్మణులకు సముద్రయానం నిషేధించారు .మనువు మరింత ముందుకు వెళ్లి సముద్రయానం చేసిన బ్రాహ్మణుడు శ్రాద్ధకర్మలో భోక్తకు అర్హుడు కాదు అని చెప్పాడు .బౌద్ధ జాతక కధలు సింహళ గాధలు క్రీ,పూ 500కు పూర్వమే విజయుడు అనే వంగదేశ రాజకుమారుడు దేశ బహిష్కృతుడై ,700మంది అనుచరులతో అనేక నావలలో ప్రయాణం చేసి సింహళం చేరి రాజ్యస్థాపన చేసినట్లు ,తామ్రలిప్తి ,సింహళం మధ్య ఆ నాడే నిరంతరం ఓడలలో రాకపోకలు జరిగేవని తెలుస్తోంది .కళింగ దేశం లోని దంతపురం నుంచి బుద్ధుని దంతాన్ని సింహళానికి తీసుకుపోతున్న దంతకుమారుడి ఓడలు కృష్ణా ముఖద్వారం లో వజ్రాల దిన్నె దగ్గర మెట్టఎక్కగా ,ఒక తెలుగు నాగరాజు స్వాగతం పలికి ఆదరించి మళ్ళీ ఓడలు ఎక్కి౦చి పంపినట్లు అమరావతీ శిల్పచిత్రాలలో కనిపిస్తుంది .అప్పటి వోడలు 300మంది సామాన్లతో సహా సుఖంగా ప్రయాణం చేయటానికి అనువుగా ఉండేవట .పారశీక రాధాని బాలి(బి)లాను తో వ్యాపారం జరిగేదని ,గ్రీస్ ఈజిప్ట్ రోమ్,అస్సీరియా మొదలైన యూరప్ ఆఫ్రికా దేశాలకు సుగంధ ద్రవ్యాలు మణులు ముత్యాలు కాశ్మీరు శాలువలు రవసెల్లాలు మొదలైనవి ఎగుమతి చేస్తూ భారతదేశం అపారధనాన్ని సంపాదించి సుభిక్షంగా సుసంపన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇండియాలోని మజ్లిన్ లపై రోమ్ దేశ స్త్రీలు ఎక్కువ మక్కువ పడేవారట .ఇండియానుంచి దిగుమతి అయ్యే విలాస వస్తువులను కొంటూ ఏటా అపారధనాన్ని కోల్పోతున్నారని ప్లీనీ యాత్రికుడు ఏడుస్తూ రాశాడు .

  క్రీ పూ. వెయ్యి ఏళ్ళకు పూర్వమే ,ఇండియా ను౦చి ,కలప,ఏనుగు దంతాలు సుగంధద్రవ్యాలు నెమలి ఈకలు,వస్త్రాలు ఈజిప్ట్ దేశం కొనేది అని చరిత్ర తెలియజేస్తోంది .ఇవన్నీ దక్షిణ దేశం నుంచే ఎగుమతి అయ్యేవి .హీబ్రూ భాషలోని అహలిం ,తూకి అనేపదాలు తమిళ పదాలైన అగిల్ ,తోకై లనుంచి వచ్చినవే .భారత దేశ నౌకాయానం వాణిజ్యం కు దక్షిణభారత దేశమే ముఖ్యస్థానం .క్రీస్తు పూర్వం 7వ శతాబ్దిలో ఇండియానుంచి హిందువులు కొందరు ఓడలలో చైనాకు వెళ్లి అక్కడ ‘’లాంగ్ గా ‘’అనే వలస జాతిని ఏర్పరచారని  ,ఆ ఓడల ము౦దు భాగాలు పక్షులు , జంతువుల ముఖాలులాగా ఉండేవని చైనా దేశ చరిత్ర చెబుతోంది .క్రీశ లో బోధధర్మ అనే దక్షిణ దేశ రాకుమారుడు 3 వేలమంది బౌద్ధ భిక్షువులతో చైనాలోని కాంటన్ నగరం చేరి బౌద్ధం ప్రచారం చేసి  వాళ్లకు సంస్కృతం కూడా  నేర్పాడట .క్రీస్తు శకం మొదటి శతాబ్దిలో ఆంద్ర సామ్రాజ్యకాలం లోనే  కంట కోసల ,కూడూరు రేవులనుండి ఆంధ్రులు జావా సుమత్రా బర్మా కంబోడియా ద్వీపాలలో వలస రాజ్యాలను ఏర్పరచారు .అక్కడ బౌద్ధ ,బ్రాహ్మణ మతాలను ,హిందూనాగరకతను, చిత్రకళను వ్యాప్తి చేశారు .

   సశేషం

  ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి  వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు నావికులు ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-19-ఉయ్యూరు

.

Posted in సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(ఫైనల్ Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

                       గబ్బిట దుర్గాప్రసాద్ – ఉయ్యూరు –

                  1-అజ్ఞానం నశిస్తే అంతా అమృత మయమే

మనలో ఉన్న చెడు భావాలు ,హింసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి .వాటిని తొలగించుకొంటే ,చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గ దర్శనం చేస్తాయి . అందరూ కలిసి ఆలోచిస్తే ,కలిసి పని చేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది .కలసి ఉంటె కలదు సుఖం అన్నారు .మనం ఉన్న సమాజానికి మేలు చేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి .మనసు మాలిన్య రహితంగా ఉంచుకొంటేనే ,ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది .నిర్మలమైన మనసులో  నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది .మానవ జీవిత గమ్యం  ఆ దివ్య జ్యోతి సందర్శనమే .చిత్త శుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగదు .అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభిస్తుంది .ఇదే చిరంతనమైనది ,శాశ్వతమైనది .దీనికి మించింది లేదు .ఈ విషయాన్ని గుర్తింఛి  మనం రుజుమార్గం లో ప్రయాణించి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి .కఠిన మనస్కులతోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి  పరిపూర్ణత సిద్ధిస్తుంది .మంటలమాటున మంచు ఉంటుందని ,కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవటమే వివేకం .వివేకం వికశిస్తే మానవత కు సార్ధక్యం .దీన్ని తెలియ జెప్పే చిన్న కథ తెలుసుకొందాం .

 ఒక ఊళ్ళో ఊరికి అంతటికీ పనికొచ్చే ఒకే ఒక మంచి నీటి బావి ఉంది .దాని నీరు అమృత తుల్యం .అందుకని గ్రామప్రజలు ఇక్కడికే వచ్చి నీళ్ళు తోడుకొని ఇళ్ళకు తీసుకు వెడతారు .అందరూ దాని లోని నీటిని వాడుకోవటమే కాని ,దాని చుట్టూ గోడకాని, గిలక కాని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోలేదు .  ముసలి, ముతక ,పిల్లా జెల్లా అందరూ  ఆ బావి ఒడ్డున ఒంగి బిందెలతో, కడవలతో  నీళ్ళు  చేదుకోనేవారు .

  ఒక రోజు అర్ధ రాత్రి ఒక కుక్క అక్కడ  తిరుగుతూ నేలబారుగా ఉన్న ఆ బావి లో పడి,,బయటకు వచ్చే ప్రయత్నాలన్నీ చేసి ,విఫలమై ఆ నీటిలో మునిగి చనిపోయింది  .ఈ విషయం గ్రామం లోని వారికి తెలియదు .మర్నాడు ఉదయం గ్రామస్తులు యదా ప్రకారం నీటికోసం బావి దగ్గరకు వచ్చారు  .నీళ్ళు తోడుతుంటే విపరీతమైన దుర్వాసన వచ్చింది .ఆ నీటిని తాగితే జబ్బులు వచ్చి ప్రాణహాని జరుగుతుందని ఆలోచించి ,ఇంటికి ఒకరు వంతున, బావి నీరు తోడే కార్యక్రమం మొదలు పెట్టారు .ఎన్ని నీళ్ళు తోడినా, దుర్వాసన పెరిగిందే కాని తగ్గలేదు .

  బావిలో చచ్చిన కుక్క ఉన్నదన్న సంగతి తెలియదుకనుక ,నిరంతరం నీరు తోడుతూనే ఉన్నారు .కిం కర్తవ్యమ్ అని ఆలోచించారు .బావిలోపల ఏదో జంతువు చచ్చి పడి ఉంటుందని గ్రహించి ,నూతి పూడిక తీసేవాడిని పిలిపించి బావిలోకి దింపారు .వాడు బాగామునిగి తేలుతూ ,కుక్క శరీరాన్ని గుర్తించి ,అందరి సాయంతో బయట  లాగి పడేశాడు .అందరూ కలిసి బావికి చాలాదూరం లో దాన్ని పాతిపెట్టారు .మళ్ళీ నీళ్ళు తోడి పారబొయ్యటం  ప్రారంభించారు .కొంత సేపటికి అతి స్వచ్చమైన, దుర్వాసన లేని మంచి నీరు వచ్చింది. హమ్మయ్య అనుకొన్నారు .తమ తప్పు తెలుసుకొని బావి చుట్టూ ,పిట్టగోడ కట్టి, గిలకలు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత కూడా చేబట్టారు .

  బావిలో చచ్చిన కుక్క కళేబరం ఉన్న౦తదాకా, నీరు ఎంతతోడినా వాసన పోనట్లే ,మనలోని అజ్ఞానం అనే వాసన పోయే వరకు మనసు నిర్మలం కాదు ,జ్ఞాన జ్యోతి వెలగదు అని మనం గ్రహించాలి .  తన గురించి తనకే తెలియకపోవటం అజ్ఞానం .అది తెలుసుకొంటే జ్ఞానం .జ్ఞానాన్ని అన్వయి౦చు కోవటం విజ్ఞానం .అనుభవానికి కారణమైన దాన్ని తెలుసుకోవటం సుజ్ఞానం .

జ్ఞానులు  నిరంతరం నిర్మలమైన మనసుతో ఉంటూ, ఆనందాన్ని ఆనందలహరిని అనుభవిస్తారు .  .అందరూ కలిస్తే ఎంతపనైనా సులువుగా చేయవచ్చు .పుట్టలోని చీమలన్నీ కలిసి పుట్టలో ప్రవేశించే పామును చంపుతాయి .గడ్డిపరకలు విడిగా ఉంటే ,ఏమీ చేయలేవు .వాటిని వెంటిగా పేనితే , దానితో మదించిన ఏనుగును కూడా బంధించవచ్చు .ఐకమత్యమే అనంత బలం సంఘానికీ దేశానికీ కూడా .

  .                2-ఉదార గుణమే ఉన్నతాశయం

‘.శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది .

వీళ్ళు నావాళ్ళు , వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు .ఉదార స్వభావులకు ఈ జగమంతా ఒకే కుటుంబంగా గోచరిస్తుంది అని తాత్పర్యం .కర్తవ్య దృష్టి ఉంటేనే ఇహపర సాధనం .

బాగా డబ్బున్న లోభికంటే ,ఉదార గుణం ఉన్న పేదవాడు గొప్ప అన్నాడు 17-18 శతాబ్దాలకు చెందిన  గువ్వల చెన్న శతకకర్త –

‘’కలిమి గల లోభికన్నను –విలసితముగ పేద మేలు వితరిణి యైనన్

చలి చెలమ  మేలు గాదా  –కుల నిధి యంబోధి కన్న ,గువ్వల చెన్నా ‘’

  సముద్రం లో ఎంతనీరున్నా ,దాహమైతే గుక్కెడు నీళ్ళు కూడా తాగటానికి  పనికి  రాదు. .అందులో నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నా, తాగటానికి పనికి రాని ఉప్పునీరే ఉంటుంది .చలి చలమలో నీళ్ళు తక్కువగా ఉన్నా ,ఆ నీటిని తాగితే , చల్లగా ,మధురంగాఉండి  దాహ శా౦తినిచ్చి ,ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త నీరు ఊరుతూ, ఎందరెందరికో ఉపయోగపడుతుంది .కనుక కలిమి ఉన్న లోభి కంటే, ఉదారగుణం ఉన్న పేద వాడు శ్రేష్టుడు అని కవి వివరించాడు .. ..  నిత్యజీవితం లో డబ్బు అవసరమే, కాని ధనమే జీవితం కాకూడదు .డబ్బు సంపాదన పై శ్రద్ధ ఉండాలి కాని ,ఆర్జనే అర్ధానికి మూలం కారాదు .సంపాదించిన డబ్బు ఖర్చు చేసేటప్పుడు మనిషి విజ్ఞత చూపాలి .ఆర్జన ,వినియోగం మనిషి స్వభావానికి ,ఔన్నత్యానికి ,సార్ధక్యానికి అద్దం పడతాయి .వ్యక్తికి  ఈ రెండిటిపై గొప్ప అవగాహన ఉండాలి .

  ధనాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అప్పుడే  మనశ్శాంతి , సౌఖ్యం ,పేరు ప్రతిష్టలు కలుగుతాయి .లేకపోతే ఆ ధనమే శీలహానికి, అపకీర్తికి, పాపానికి, మానసిక క్షోభకు  కారణమౌతుంది .ఆర్జనతోపాటు అనుభవ యోగమూ ఉంటేనే పరమార్ధం .అంటే తనకు, తన కుటుంబానికి ఖర్చుచేస్తే చాలదు .తోటివారికి, బాధలలో ఉన్నవారికీ  సాయపడి  వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు పూయించాలి .అప్పుడే  ఆ ధనం సార్ధకమై  ,మానసిక ఆనందాన్నిస్తుంది .

అంతమాత్రం చేత,  ఎవడికి పడితే వాడికి డబ్బు ఇచ్చి, అపాత్ర  దానం చేసి ,అనర్ధాన్ని తెచ్చుకోకూడదు .దానం వెనుక ఉన్న మనసు చాలా ముఖ్యం .దానం లో గర్వం ఉంటే ,పతన హేతు వౌతుంది . .వ్యక్తికి సాయం చేసే అదృష్టం కలిగింది అని భావిస్తే ,ఆ దానం పవిత్రమై ఆనందాన్నిస్తుంది .ఆత్మీయత ,అనురాగం, మనసు పంచుకోవటం వలన ఐహిక ఆనందం కలుగుతుంది .ఇదే లేకపోతే ,జీవితం రసహీనమై  నిరర్ధకమని పిస్తుంది .కర్మ, జ్ఞాన, భక్తులు ఆముష్మికానికి యెంత అవసరమో ,ఆర్జన, అనుభవం ,ఆనందం, ఐహికానికి అంత ముఖ్యం. రైల్వే లో పనిచేసే పాముల నరసయ్యగారు ఒక్క గారుడీ మంత్రం తో  ,ఒకే ఒక్క ఫోన్ కాల్ తో , పాముకాటుకు గురైన వేలాది మంది జనాలకు  ప్రాణదానం చేసి, ప్రాణదాత అయ్యారు .దీనికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు .నిస్వార్ధ సేవ చేసి చరితార్దులై ఉదాత్త పురుషులయ్యారు ..’’మనం ఇతరులకు మన స్పూర్తిగా సాయం చేయాలనుకొన్నప్పుడు ,సహాయం చేస్తున్నప్పుడు మన మనస్సు ,బుద్ధీ పరిశుద్ధమౌతాయి .ఈ ప్రతిఫల౦ ఒక్కటే చాలు చేసే సాయానికి ‘’అంటారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు . ‘’ఎప్పుడూ నీటిలోనే ఉండే చేప దుర్గంధంతో నిండిన నీచును దూరం చేసుకోలేనట్లే మనిషి, సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా ,మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని  భక్త కబీరు చెప్పాడు. కబీర్ సూక్తులే  తనకు ఆదర్శం అన్నాడు మహాత్మాగాంధీ .

  మనం వీటిని అన్నిటిని  సమన్వయ పరచుకొంటూ ,ఉన్నంతలో ఒక చలి చలమ లాగా  ఆర్తులకు ఉపయోగ పడుతూ  జీవితం గడిపితేనే ,జీవితానికి నిండుదనం, శోభ ,సార్ధకత  కలుగుతాయి  అని గువ్వల చెన్న ‘’  చెన్నా’’ అంటే బాగా  చెప్పాడు .,అంతే కాదు తెలుగు పద్యం శాశ్వతత్వాన్ని కూడా ఇలా చెప్పాడు .

గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును,, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న, గువ్వల చెన్నా!

                       3-గురువు గరిస్టత

‘’గురు రాది రనాదిశ్చ గురుః పరమ దైవతం –గురోః పరతరం నాస్తి –తస్మైశ్రీ గురవేనమః ‘’అని ‘’విశ్వ సార తంత్ర ‘’చెప్పింది .సృష్టికి ఆది, అనాది ,పరమోత్తమ దైవం గురువు .గురువుకు మించింది లేదు ‘’అని భావం .గురువు అంటే నాలుగు ముఖాలు లేని బ్రహ్మ అంటే జ్ఞాన ,చైతన్య ప్రదాత .నాలుగు భుజాలు లేని విష్ణువు .అంటే రక్షకుడు, అపమార్గం నుంచి తప్పింఛి సరైనదారిలో పెట్టే మార్గ దర్శి .మూడు నేత్రాలు లేని  శివుడు కూడా .అనగా అజ్ఞానాన్ని లయం చేసేవాడు  .కనుక గురువు త్రిమూర్తి అవతారం .ప్రత్యక్ష దైవం కనుక  ఆచార్య దేవుడు అంటారు . .గురు దీవన బలమైనది .వ్యక్తి ఉన్నతికి సోపానం కూడా. గురువుకు ఏమైనా కొమ్ములున్నాయా అంతగా ఆరాధిస్తారు .అనే ప్రశ్న రావచ్చు.

 అవును నిజంగానే  ఈ ప్రశ్న వచ్చింది భేతాళుడికి.ఒక సారి విక్రమార్క మహారాజు రాజభవనం నుంచి సరాసరి, ఒక కుటీరం లో చిన్న అంగవస్త్రం తో కూర్చుని ధ్యానం చేసుకొంటున్నఒక మహర్షిని  సందర్శించి, కుశల ప్రశ్నలు  వేసి, తనసాయం ఏమన్నా కావాలా అని అడగటం, ఆయనేమీ మాట్లాడక ,ఆశీర్వదించటం  భేతాళుడు గమనించాడు .అప్పుడు విక్రమార్కుని తో ‘’ఎప్పుడో చిన్నప్పుడు ఆయన వద్ద చదువుకొని ఉంటావు .ఇప్పుడు నువ్వు చక్రవర్తివి .ఆయనపాదాలపై పడాలా ?నీ కంటే ఆ బికారి గొప్పవాడా ?ఆయనకు ఏమన్నా కొమ్ములున్నాయా ?’’అని నిలదీశాడు .

  చిరునవ్వు నవ్వుతూ గురువును స్మరించి ‘’అవును  భేతాళా.! గురువుకు కొమ్ములే ఉంటాయి .గురువు అనే మాటలో ఉన్న’’ అన్ని అక్షరాలకు కొమ్ములున్నాయి’’ కదా’’ అని సరదాగా అంటూ  ‘’గురువు అనే స్థానానికి అంతకు మించిన  విశేషాలున్నాయి .ఆయనకు ఉన్న మొదటి కొమ్ము’’ జ్ఞానం’’ .లోకం లో జ్ఞానానికి మించిన సంపద లేదని నీకు తెలియదనుకొంటా . .అంటే ఆయన సర్వ సంపన్నుడు .నా సామ్రాజ్యం, వైభవం శాశ్వతం కాదు .ఎవరైనా ఎప్పుడైనా కొల్ల గొట్టవచ్చు .కాని ఆయన ప్రసాదించిన జ్ఞానాన్ని ఎవ్వరూ ఎప్పటికీ అపహరించలేరు. అది పంచిన కొద్దీ పెరిగేదేకాని ,తరిగేదికాదు ‘’అన్నాడు .

    ఆశ్చర్య పోతున్న భేతాళుడితో మళ్ళీ ‘’ఆచార్యుని రెండవ కొమ్ము ‘’అనుభవం’’ .ఇదే జ్ఞానాన్ని విజ్ఞానంగా మారుస్తుంది .కొన్ని సార్లు గురువును మించిన జ్ఞానం శిష్యులకు  లభించి , గురువును మించిన శిష్యులని పించుకోవచ్చు .కాని అనుభవం మాత్రం గురువుకు స్వంతం .ఇది వయసు ,విజ్ఞతలను బట్టి వస్తుంది .ఎంత జ్ఞాని అయినా, అనుభవమున్న గురువు ముందు ‘’ లఘువే’’ ఔతాడు ‘’.అన్నాడు విక్రమార్క మహారాజు .

 మరింత ఆశ్చర్యపడిన భేతాళునితో విక్రమార్కుడు ‘’గురువుకున్న మూడవ కొమ్ము ‘’త్యాగం ‘’.తనను నమ్మి వచ్చిన శిష్యులకు తాను పొందిన జ్ఞాన ,విజ్ఞానాలను ధారపోసి ,వారి అజ్ఞాన, అహంకారాలను  సహించి,క్షమించి ,ఔదార్యం తో  మార్గ దర్శనం చేస్తాడు .వారి ఉన్నతికి సోపానమే అవుతాడు . శిష్యుడు  తనకు మించి ఎదిగితే , సంతోషించి  ,అతని చేతిలో ఓటమికి  కూడా మనస్పూర్తిగా ఆన౦దిస్తాడు .ఎంత ఆధునికత పెరిగినా ,గురువైన ఆచార్యుడి స్థానం ఆయనదే .  గురువును నొప్పించినా ,మనసును గాయపరచినా, భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు.అయినా నువ్వు ఏ గురువు వద్దా చదువుకోక పోవటం వలన,భయంకరమైన  ఈ భేతాలుడిగా చెట్టుకు వ్రేలాడుతూ ఉండిపోయావు .గురువును వేళాకోళం చేయక ,వినయంగా ప్రవర్తించు .’’చండాలోస్తు ,సతు ద్విజోస్తు,గురు రిత్యేషా, మనీషా మమ’’అన్నారు శ౦కరాచార్య  .అంటే జ్ఞానం కలవాడు ఎవరైనా, ఏ కులం వాడైనా నాకు గురువే ‘’అని అర్ధం .   ఎంతమంచి రూపం ,యవ్వనం,సంపదా ఉన్నా, విద్యలేకపోతే సువాసనలేని మోదుగ  పువ్వులాగా శోభించలేదు .విద్యలేనివాడు వింతపశువు ‘’’అని హితబోధ చేశాడు శక పురుషుడు విక్రమార్క చక్రవర్తి ..

  శీ కృష్ణుడు తనగురువు సాందీపని మహర్షిని ,శ్రీరాముడు వశిష్ట మహర్షిని ,విశ్వ విజేత అలెగ్జాండర్ తనగురువు అరిస్టాటిల్ ను ,స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంసను ,భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రామేశ్వరం లోని తనగురువును ఎన్నడూ మర్చిపోలేదు . ఆ గురు గౌరవమే  వారి ఔన్నత్యానికి శోభనిచ్చింది .

      4- త్రికాలజ్ఞానం  సుఖం కలిగిస్తుందా ?

   కలిగించదు అని తెలియ జేసే కథ తెలుసుకొందాం . ద్వాపర కాలం లో భార్గవుడు అనే ముని కుమారుడికి ఇల్లూ ,వాకిలీ,  ఆశ్రమం  వంటివి ఏవీ లేవు .లోకం తో పనిలేకుండా  తన వీణను మీటుకొంటూ ప్రదేశాలన్నీ తిరుగుతూ నిత్య బాల్యం తో , ప్రకృతితో పరవశమై , అన్నికాలాల్లోనూ  వీణా వాదనతో లోకాన్ని సమ్మోహ పరచేవాడు .మహర్షులు, పురజనులు ,అధికారులు అతని గీతారాగ బ్రహ్మానందం అను భవించి పరవశులయ్యేవారు .కాని ఎవరూ అతడిని పలకరించే వారు కాదు .  అతడు జ్ఞానియో ,ఆజ్ఞానియో కూడా తెలియదు .అద్భుత అనుభూతి అతని రాగం లో ప్రవహించేది .

  కొంతకాలానికి సృష్టి అద్భుతం అతనికి దుస్సహంగా మారి , త్రికాల జ్ఞానం సాధించాలనుకొన్నాడు .వెంటనే స్వరం గద్గదమై ,వీణ తీగలు సడలి స్వరహీన మయ్యాయి . వేద వ్యాస మహర్షిని సందర్శించి ‘’త్రికాలజ్ఞత ‘’ప్రసాదించమని వేడుకొన్నాడు.మహర్షి ఆ కోరిక అనర్ధాలకు దారి తీస్తుందని యెంత నచ్చ చెప్పినా , వినక పోవటం చేత ,ముందుగా’’ భూత కాలజ్ఞత’’ ప్రసాదించాడు .ఇప్పటిదాకా బాలుడుగా ఉన్న భార్గవుడు , కౌమార దశ పొందగా అంతా ఆశ్చర్యపోయారు .అతని వీణాగానం లో మాధుర్యం తగ్గింది .మహావిష్ణు ,సదాశివుల లీలా విశేషాలు, పురాణాలను అంటే గతవైభవాలను  మాత్రమే  గానం చేశాడు .జనం గుంపులుగా అతని వెంటపడి ఆనందించారు .భూతకాలం లోని విశేషాలన్నీ పాడాక, వాటిపై కూడా  మోహం తగ్గి ,అతని వీణ పలకటం మానేసింది .మళ్ళీ వ్యాసుని దర్శిం చాడు  . తన దగ్గరకు ఇక రావద్దని కఠినంగా  చెప్పినా, వినక బ్రతిమాలి  ‘’వర్తమాన కాలజ్ఞానం ‘’పొందాడు .

  ఇప్పుడు యవ్వనావస్థ లో ఉన్న భార్గవుడు వర్తమానమంతా కళ్ళకు కడుతున్నందున వాటినే  పాడాడు .అతని గీతాలు,రాగాలు  లయను అతిక్రమించాయి .కాని  అతని ఆనందం సంతోషంగా మారింది .  సరైన దారిలో పడ్డాడు అని జనం మెచ్చారు .నిరంతర గీత ,వచన, రచన తో,వీణా గానం చేశాడు .ఈ  తృప్తికూడా ఎక్కువకాలం నిలవలేదు .బడలిక పెరిగి ,కంపనం వచ్చి, వీణస్వరం ఆగి పోయింది . అతనికి తెలియకుండానే అతని కాళ్ళు వ్యాసుని చెంతకు తీసుకు వెళ్ళాయి .ఏడుస్తూ పాదాలపై పడ్డాడు .అతని దీనావస్థ,  మనసులోని కోరిక గ్రహించి, వాత్సల్యం తో ‘’నువ్వు కోరే భవిష్యత్ జ్ఞానం నీ వినాశ కారణం అవుతుంది ‘’అన్నాడు .అయినా అనుగ్రహించమని కోరాడు భార్గవుడు ‘’నీఖర్మ అనుభవించు ‘’అని అనుగ్రహించ గానే అతడు కఠోర స్వరం తో కెవ్వున కేక వేశాడు  ,అతని దివ్యవీణ నేలమీద పడి బ్రద్దలై, తీగెలు తెగిపోయాయి .ముసలితనం వచ్చి ,జుట్టుతెల్లబడి, పళ్ళు ఊడిపోయి త్రికాలజ్ఞుడయ్యాడు  .లోకం లో తెలియనిది ,అద్భుతమైనది కనిపించక ,,సృజన తగ్గిపోవటం తో  అతని హృదయం శూన్యమైపోయింది .కాలక్రమం లో అతన్ని అందరూ మర్చే పోయారు .

    మనిషికి కావాల్సింది తృప్తి .ఆశకు విరుగుడే తృప్తి .తృప్తిలో ఉన్న ఆనందమే మోక్షానికి రాజమార్గం .దేన్ని కోరుతున్నామో దానిపై విచక్షణ తో ఆలోచిస్తే ,ఆ కోరిక బలహీనమై ,క్రమంగా నశిస్తుంది .మనసును స్థిరంగా ఉంచుకొంటే, ప్రశాంతత లభించి ,హృదయం విశాలమై, మనిషి ‘’మనీషి ‘’అవుతాడు .మనసు కోరికల పుట్ట ,చంచలమైనది .అభ్యాసం ,వైరాగ్యం వలన మనసు స్వాధీనం లోకి వస్తుందని గీతలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించాడు .కోరికలకు మూలం అయిన మనసును బుద్ధి అనే ఆయుధంతో నియంత్రించాలి .తనపై తనకు అదుపు ఉన్నవాడు వెయ్యి ఏనుగుల బలవంతుడు అన్నారు పెద్దలు.మనసు నియంత్రణలో ఉంటె నిర్మలత్వం తప్పక  సిద్ధిస్తుంది ..

’’మన లోపాలను మనం సంస్కరించు కోకపోతే ,లోక క్షేమం కోసం ప్రయత్నించే అధికారం మనకు ఉండదు ‘’అన్నారు నడిచే దైవం  కంచికామకోటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి .  బుద్ధి కూడా నిజం తెలిసేదాకా అటూ ఇటూ ఊగుతుంది .నిజం తెలిశాక శాంతిస్తుంది .

   నిరంతర కాంక్ష ,తృష్ణ ల వలన మనసుకు  సంతృప్తి ,విశ్రాంతి ,శాంతి లభించదు . లోకం లో అజ్ఞాతమై, అద్భుతం కలిగించే విశేషాలు ఉంటేనే కవికి ,గాయకునికి జీవితం ఆనందమయం అవుతుంది అని తెలియ జేసే ఈకథను తెలుగు తొలి.చారిత్రక నవలా రచయిత బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు రాశారు .

  గబ్బిట దుర్గా ప్రసాద్

  సరసభారతి అధ్యక్షులు

 2-405 శివాలయం వీధి

 ఉయ్యూరు -521165

సెల్ -9989066375

20-7-19

— 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ

నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు .నన్నయకు ముందు దేశీ పధ్ధతి అంటే నాటు పధ్ధతి ఉంది .ఆయనకు పూర్వం ఒక శతాబ్దికాలం లో రన్న ,పంప మొదలైనవారు  మార్గ ,దేశీ మార్గాలను రెండిటినీ జోడించి భారతం ఆదిపురాణం కన్నడం లో రాశారు .అప్పటికి తెలుగు దేశం లో దేశీయమే వాడుకలో ఉందని యుద్ధమల్లుని బెజవాడ శాసనం తెలియ జేస్తోంది .ఇందులో భాష, ఛందస్సు, రచనా రీతి దేశీయం లోనే సాగాయి .తెలుగుకు సంస్కారం అప్పటికి రాలేదుకాని, కన్నడానికి 9వ శతాబ్దికి పూర్వమే వచ్చినట్లు కనిపిస్తోంది .భాషా ,చ్చంద సంస్కారాలతో కూడిన మార్గ పధ్ధతి రచన 8వ శతాబ్దిలోనే శాసనాలలో కనిపించింది .9వ శతాబ్దిలో రాష్ట్ర కూట రాజు నృప తు౦గుని చేత ‘’కవిరాజమార్గం ‘’అనే లక్షణ గ్రంథంప్రతిపాదింపబడింది .ఈతని తర్వాత యాభై అరవై ఏళ్ళకే పంపకవి మార్గం లోఉద్గ్ర౦థ రచన చేసి ‘’ఆదికవి పంపడు ‘’అని పించుకొన్నాడు .ఇంతకంటే పూర్వం నుంచే పంప, పొన్న ,రన్న  అనే కవిరత్నాలచేత ఆదరి౦పబడి సాఫు తేరిన కన్నడ కవిరాజుల మార్గాన్ని అనుసరించే ,నన్నయభట్టు ఆంద్ర దేశీయ సంప్రదాయాను సారంగా వాజ్మయపథాన్నితీర్చి దిద్దాడు .

 కవితా మార్గానికి ఛందస్సు ఒక ఆలంబనం .రైలు పట్టాలవంటిది .ఇంతకు  పూర్వం ఉన్న మార్గం నన్నయ కవితాదాటికి ఆగేదికాదు .దాన్ని శక్తివంతం చేయటానికి కన్నడకవులలాగా సంస్కృత ఛందస్సు లను కూడా తీసుకొని ,ఆంద్ర దేశీయ సంప్రదాయ బద్ధంగా జోడించి మరింత ద్రుఢత్వం కలిగించాడు .అంతకు ముందేఉన్నపాద నియమాలు లేని  దేశీయ ఛందస్సు లో ఉన్న ద్విపద మొదలైనవాటికి నాలుగు పాదాలు కల్పించి తరువోజ ,అక్కర ,సీసము, గీతము,ఆటవెలది మొదలైన  వృత్తాలను పోలిన పద్యాలను ఏర్పరచాడు .వీటిలో మూడు భాగాల వేగమే ఉండగా సంస్కృత చందోమార్గాన్ని జోడించి ,మీటర్ గేజి ని బ్రాడ్ గేజిగా మార్చినట్లు ,సంకుచిత మార్గాన్ని విశాల దృఢ తర  మార్గం గా మార్చి తెలుగు కవిత్వ శకటాన్ని  శక్తి వంతమైన రెండు పట్టాలపై ధారాళం గా అప్రతిహతంగా పరుగు లెత్తించాడు  .కన్నడంలో లేని అక్షర సామ్యమైన యతి లేక వడి ని కల్పించటంతో సంస్కృత  వృత్తాలులుకూడా దేశీయ వృత్తాలలాగా వింత సొగసుతో విరాజిల్లాయి .అవసరమైన చోట్ల యతి స్థానం మార్చి వేగానికి అనువుగా చేశాడు .ఇలాంటి వాటిలో పృధ్వీ వృత్తం, శిఖరిణి ,భుజంగ ప్రయాతం ,పంచచామరం, మహాస్రగ్ధర, తరళ ఉదాహరణలు .

  ఇలా నన్నయ సంస్కృత వృత్తాలను తెలుగులోకి మార్చినపుడు తెలుగు భాషకు అనువైన మార్పులు చేశాడని గ్రహించాలి .సంస్కృతం లో ప్రచారం లేక  మూల పడిఉన్న చంపకమాల ,ఉత్పలమాల లను కూడా గ్రహించి  విపులంగా ప్రచారం చేసి అందలం ఎక్కించి సొబగులు అద్దాడు .తరువోజ నాలుగుపాదాలున్న ద్విపద వంటిదే అని భావించి ద్విపద రచన చేయలేదు నన్నయ .సీస పద్యాలలో ఉన్న సర్వప్రాస మొదలైన నియమాలను జాగ్రత్తగా పాటించాడు .శాసనాలలో, కన్నడం లోనూ ఉన్న అక్కర కు యతి పాటించి రాశాడు .ఈ అక్కర అరణ్య పర్వ శేషాన్ని రాసిన ఎఱ్ఱనకు తప్ప నన్నెచోడ ,తిక్కనాదులకు దాని ‘’అక్కర ‘’ లేకుండా పోయింది .యుద్ధమల్లుని బెజవాడ శాసనం  అక్కర లో ఉన్నట్లు అయిదవ గణం మొదటి అక్షరం పై యతి ని పాటించాడు .కన్నడం లో లేని యతికి ,తెలుగులోపూజనీయ  ‘’యతి మర్యాద ‘’కల్పించి ఆంద్ర దేశ సంప్రదాయాన్నే పాటించాడు ‘నన్నయభట్టు .

ఆధారం –కోరాడ  రామ కృష్ణయ్యగారి ‘’ప్రథమాంధ్ర కవితా శిల్పి –నన్నయభట్టు ‘’వ్యాసం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )

విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తుండగా రామకృష్ణయ్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్ ఉల్లాల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ  ద్రావిడ భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రావిడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి కాలేజి మాగజైన్ లో ‘’ద్రావిడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు  .దీనితో రామకృష్ణయ్యగారు ‘’తొలి ద్రావిడ భాషా తులనాత్మక పరిశీలకుని ‘’గా మార్గదర్శిగా, వైతాళికునిగా పేరుపొందారు .తర్వాత  వర్ణోత్పత్తి మొదలైన వ్యాసాలూ రాశారు .సాహిత్యవ్యాసాలు ,విమర్శలు ఆంద్ర పత్రిక సంవత్సరాది సంచికకు  భారతి కి పుంఖానుపుంఖాలుగా గా రాశారు .అప్పటికి తెలుగు భాషా శాస్త్రం – ఫైలాలజి పై గిడుగురామమూర్తిగారు ,చిలుకూరి నారాయణరావు గారు మాత్రమె కృషి చేస్తున్నారు .వీరికి ద్రావిడభాషా శాస్త్రం పై అవగాహన లేదు .ఒకే మూల ధాతువు నుంచి తెలుగు తమిళ,కన్నడ పదాలు ఏర్పడ్డాయని సోదాహరణంగా రామకృష్ణయ్యగారు రుజువు చేశారు .దీనితోపాటు శ్రీనాథుడు –సంధియుగము ,భీమేశ్వరపురానం ,రస చర్చ మొదలగు వ్యాసాలూ రాసి తమ అసమాన పాండిత్యాన్ని లోకానికి చాటారు .1921లో ‘’ సంస్కృతాంధ్ర భాషలు అభిమాన విషయంగా ఎం. ఏ .పాసయ్యారు .1924లో మద్రాస్ లో జరిగిన  ‘’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’కు కాలేజి తరఫున ప్రతినిధిగా వెళ్ళారు .ఆతర్వాత ఇలాంటి సభలకు చాలావాటికి వెళ్లి ,బెంగాల్ రాష్ట్ర  శాసనసభ అధ్యక్షుడు ,ద్రావిడ భాషా శాస్త్ర వేత్త సునీత్ కుమార్ చటర్జీ తో పరిచయం పొందారు .12ఏళ్ళు విజయనగరం కాలేజిలో పనిచేసి ,1947లో దర్భాంగలో జరిగిన 14వ ఓరియెంటల్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు .

మద్రాస్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. అందులో తెలుగు తమిళ కన్నడ భాషల శాఖలు ప్రారంభించి  ఫైలాజికి ప్రోత్సాహం కలిగించాలని భావించి ‘’కోలిన్స్ ‘’అనే పాశ్చాత్య భాషా శాస్త్ర వేత్తను ఆహ్వానించి ప్రేరణాత్మక ప్రసంగంచేయించారు .రామకృష్ణయ్య గారి ప్రతిభా పాండిత్యాలు తెలిసిన నాయుడుగారు తమ యూని వర్సిటిలో చేరమని ఆహ్వానించి ,విజయనగర రాజా దివాన్ శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారికి ఉత్తరం రాసి రామ కృష్ణయ్యగారిని తమ యూని వర్సిటీ లో చేరటానికి పంపమని కోరారు .కృష్ణయ్యగారికి  ఉన్న చోట బాగానే ఉందికదా ,కదలటం ఎండుకనుకొని వెళ్లాలని లేక దరఖాస్తు చేయలేదు .మళ్ళీదివాన్ గారికి నాయుడు గారు ఉత్తరం రాస్తే ఆయన ఈయనతోమాట్లాడి,దరఖాస్తుపెట్టించి ఇక్కడ ఉద్యోగానికి భద్రత కల్పించే పూచీ తీసుకొన్నారు .విజయనగరం వదలలేక వదలలేక భార్యాభర్తలు మళ్ళీ తిరిగి వస్తామనే ధీమాతో   సామానంతా హెడ్ మాస్టర్ చెరుకూరి జోగారావుగారింట్లోఒక  గదిలో సర్దేసి మద్రాస్ వెళ్ళారు .

1927లో  మద్రాస్ యూని వర్సిటిలో రీడర్ గా చేరిన కృష్ణయ్యగారికి పెద్దగా పని ఉండేదికాదు నెలకు 150రూపాయలు జీతం .ఉదయం 11నుంచి సాయంత్రం 4వరకు డ్యూటి.1950లో సీనియర్ లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు .తిరుపతి ప్రాచ్య పరిశోధనాలయం లో రీడర్ గా నియమితులై ,6ఏళ్ళు పనిచేసి మొత్తం 40ఏళ్ళు ఆంధ్రభాషా వాగ్మయ సేవలో తరించారు .భాషా పరిశోధన అభిమాన విషయం గా ఉన్న వీరు ‘’స్టడీస్ ఇన్ ద్రవిడియన్ ఫైలాలజి ‘’అనే మొదటి పుస్తకం రాసి ప్రచురించారు .1950లో మద్రాస్ ప్రభుత్వం వీరి భాషాకృషికి 500రూపాయల నగదు పారితోషికం అందజేసింది .కాళిదాసు ని కళా ప్రతిభలు మొదలైన వ్యాసాలూ రాశారు .’’ప్రాజ్న్ నన్నయయుగం  లో తెలుగుభాష ,భాషా చారిత్రకవ్యాసాలు ,సంధి ,ద్రవిడభాష సమాన శబ్దాలు (ద్రవిడియన్ కాగ్నేట్స్)మొదలైన భాషాశాస్త్ర గ్రంథాలు రాశారు .సాహిత్య విమర్శ గ్రంథాలలో   –1‘’ఆంధ్రభారత కవితా విమర్శనం’’మహా పండితుల విమర్శకుల  విశ్లేషకులను అలరించి ఆయన ప్రతిభకు ఊయల అయింది  ,2-దక్షిణ దేశ భాషా సాహిత్యములు 3-సారస్వత వ్యాసములు 4-తెలుగు లిటరేచర్ అవుట్ సైడ్ దితెలుగు కంట్రీ(తెలుగు దేశానికి వెలుపల తెలుగు సాహిత్యం )5-కాళిదాసుని కళాప్రతిభలు ఉన్నాయి

నవనాథ చరిత్ర ,పరతత్వ రసాయనం,వల్లవాభ్యుదయం నన్నెచోడునికుమారసంభవం మొదలైన 15ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి విపుల పీఠికలతోప్రచురించారు ..వెంకటాద్రిమహాత్మ్యం శ్రీనివాస విలాస సేవధి పరిష్కరించి తిరుపతిలో ఉన్నప్పుడు ప్రచురించారు .మన సంస్కృతికి చెందిన తాళిబొట్టు ,మంగళసూత్రం,అక్కమహాదేవి వచనాలు దక్షిణాపద సంస్కృతీ  మొదలైన ఎన్నో వ్యాసాలూ రాశారు .1940మార్చి లో తిరుపతిలో  జరిగిన ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’లో తెలుగు విభాగానికి రామకృష్ణయ్యగారు అధ్యక్షత వహించి చేసిన 37పేజీల అధ్యక్షోపన్యాసం లో తెలుగుభాషా సాహిత్యాల చరిత్ర జరుగుతున్న పరిశోధనలువివరించి భావికి దిశా నిర్దేశనం చేశారు .

రామ కృష్ణయ్యగారి జీవితం  నిండుగోదావరి గాసాగింది .నిరాడంబరత, మితభాషణం, అజాత శత్రుత్వం ఆయనకు అలంకారాలు .సాధారణ వస్త్ర ధారణా, దేనికీ తాపత్రయపడని నైజం ,ఉద్యోగాలు ఆయన  వెంటపడ్డాయికాని, ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు .సంపూర్ణ ఆరోగ్యం ఆయన కవచం .ఉద్యోగం లో సెలవు పెట్టలేదు .కరుకైన క్రమ శిక్షణ ఆయనది .తోటలంటే మహా ఇష్టం .ప్రతి వేసవిలో సకుటుంబంగా అమలాపురం వెళ్లి చెట్లకు నీరుపెడుతూ ,పంటపండిస్తూ ఆనందంగా గడిపేవారు .తిరుపతిలో ఉద్యోగ విరమణ తర్వాత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడిపారు .పవిత్ర జీవనం ,సత్యనిస్ట,శ్రద్ధా సమావిస్ట,పవిత్ర త్రివేణీ సంగమమైనది  రామకృష్ణయ్యగారి జీవితం .ఇంతటి పవిత్ర ఆదర్శ సార్ధక జీవితం గడిపిన కోరాడ రామకృష్ణయ్యగారు 28-3-1962 న 71వ ఏట కీర్తి శేషులయ్యారు .

సహృదయత చిత్తశుద్ధి ,ప్రామాణికత భాషా సాహిత్య రంగాలలో  ప్రధములురామ క్రిష్ణయ్యగారు సాహిత్య వ్యాసంగాన్ని జీవిత పరమార్ధాన్ని సాధించే తపస్సుగా కొనసాగించిన రుషి వరేణ్యులు .తెలుగు కన్నడ తమిళ భాషలకు ఒకే రకమైన’’ ఛంద స్సాహితీ సంప్రదాయం’’ఉందని చెప్పి నిరూపించటానికి గ్రంధం రాశారు .పరిశోధనలో వారిది సత్యైక దృష్టి .  రామకృష్ణయ్యగారి రెండవ కుమారుడుఆచార్య డాక్టర్  కోరాడ మహాదేవ శాస్త్రిగారు ఎంయే ఎకనామిక్స్ పసి సిమ్లాలో కేంద్ర కార్మిక శాఖలో పని చేసి  ఉద్యోగం మానేసి కలకత్తావిశ్వవిద్యాలయం లో సునీతికుమార్  చటర్జీ పర్యవేక్షణలో ‘’ది హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు ‘’పై పరిశోధించి డిలిట్ పొందారు .కొంతకాలం జర్మనీలో భాషా శాస్త్రాచార్యులుగా ఉన్నారు .శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో ఆంద్ర శాఖాచార్యులుగా ,అధ్యక్షులుగా చేసి పదవీ విరమణ చేశారు .తండ్రిని మించిన తనయులనిపించుకొని తండ్రిగారు వ్రాయ  సంకల్పించిన  ‘’చరిత్రక వ్యాకరణం ‘’రచించారు .వర్ణనాత్మక ఆధునిక ఆంధ్రభాషా వ్యాకరణం (డిస్క్రిప్టివ్ గ్రామఅండ్ హాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు )ను విదేశీయులకోసం రాశారు .

మొదట్లోనే చెప్పుకొన్నట్లు  కోరాడ వారి వంశం లో శ్రీశైల భ్రమరాంబికా వరప్రసాద లబ్దులైన మహాదేవ శాస్త్రి గారు అమ్మవారిని కోరినట్లు,  ఈ మహాదేవ  శాస్త్రి గారి నుంచి ఇప్పటితరం  అంటే రామకృష్ణయ్యగారికుమారులు మహాదేవ శాస్త్రి గారివరకు అందరూ సరస్వతీ పుత్రులే జన్మించి వంశకీర్తిని  ఇనుమడింప జేసిన వారే .వీరందరినీ స్మరించటమే  నిజమైన సరస్వతీ పూజ .

ఆధారం –‘’ కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం’’అనే ఈ నాలుగుభాగాల ధారావాహికకు ఆధారం శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి శతజయంతి వేడుకల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక ‘’కోరాడ రామ కృష్ణయ్య శత జయంతి –సాహితీ నీరాజనం ‘’లో ఆచార్య తిరుమల రామ చంద్ర రాసిన వ్యాసం ‘’కోరాడ రామకృష్ణయ్య గారి వంశం –జీవితం –రచనలు ‘’.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

.

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ

కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3

కోరాడ రామకృష్ణయ్యగారు 2-10-1891ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధపాడ్యమి చిత్రా నక్షత్రం నాడు అమలాపురం లో మాతామహులు గొడవర్తి నాగేశ్వరావధానులు గారింట జన్మించారు .వెంకటేశ్వరస్వామి మహా భక్తులైన  గొడవర్తివారు అమిత నిస్తాపరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె ఉంచేవారు .భక్తులకానుకలతో అది నిండగా,మరో బిందె పెట్టేవారు .ఈ డబ్బుతో నాలుగు గోడలపై పాక నిర్మాణం చేశారు .తర్వాత అది మండపంగామారి ,ఆతర్వాత వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగి గుడి నిర్మాణం అయి ,గుడి చుట్టూ ఇళ్ళు ఏర్పడి , వెంకటేశ్వర అగ్రహారమై పెద్ద క్షేత్రంగా రూపు దాల్చింది .

 రామకృష్ణయ్యగారు బందరులో తలిదండ్రులు లక్ష్మీ మనోహరం సీతమ్మగారి వద్ద పెరిగారు తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు అని మనకు తెలుసు .తాతగారి గాంభీర్య గౌరవాలు గ్రంథరచనాపటిమ ,పాండిత్య ప్రభావాలు మనవడిలో ఏర్పడ్డాయి .బందరులోనే ప్రాధమిక విద్య నేర్చారు .అప్పుడు ‘’మొద్దు రాచిప్ప’’లకు బండకొయ్యలు ,కొదండాలు శిక్షగా ఉండేవి .తోటిపిల్లలు ఈ శిక్షలకు గురైతే నిర్విణ్ణులై  దుఖి౦చేవారు .తర్వాత నాదెళ్ళ పురుషోత్తమ కవిగారి ప్రాధమిక పాఠశాల లో చేరి చదివి ,హిందూ హైస్కూల్ లో మూడవఫారం వరకు చదివారు .నాలుగవ ఫారం నోబిల్ హైస్కూల్ లో చదివి ఆకాలేజీలోనే బి.ఏ చదివి పాసయ్యారు  .బ్రహ్మయ్య లింగం గారు తెలుగు ,కుంటి రంగాచార్యులుగారు సంస్కృత గురువులు .హెడ్ మాస్టర్ కుంభకోణం కృష్ణమాచార్యులుగారి ‘’ బెత్తం హవా ‘’భయంకరంగా ఉండేది .అందరికీహడల్ .ఆయన ఆంగ్లపాండిత్యం, బోధనా కూడా హడలెత్తించేవి.తెలుగుక్లాస్ లో  వేళాకోళాలు అల్లర్లు ఉత్సాహంగా ఉండేవి .టెన్నిస్ పోటీలు బాగా జరిగేవి  .

  స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉన్న ఆకాలం లో మహా వక్త బిపిన్ చ౦ద్రపాల్ దేశమంతా తిరుగుతూ బండరులోనూ ప్రసంగాలు చేసి ఉర్రూతలూగించాడు .కౌతా శ్రీరామ శాస్త్రిగారు మచ్చుల చావడిలో జాతిప్రధకప్రసంగాలు చేసి యువకులలో జాతీయభావం రగుల్కొల్పారు .బందరు హిందూ హైస్కూల్ ఇసుక తిన్నెలపై మహాత్మ గాంధి ప్రసంగించాడు .రామకృష్ణయ్యగారి సహాధ్యాయి శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వరదా చార్యులుగారు గాంధీకి 500రూపాయలు నగదు అందజేయటం ,ఆంధ్రజాతీయ కళాశాల స్థాపన ప్రయత్నం ,దేవాలయాలలో వేదాంత ఉపన్యాసాలు ,మిషనరీల మతమార్పిళ్లు ,దానికి జరిగిన వ్యతిరేక ఉద్యమాలు ,శివగంగ మహిషాసుర మర్దినీ ఉత్సవాలు ,ఏనుగు అ౦బారీలు తాలిమ్ఖానాలు ,దీపావళినాడు ‘’తోటాల లడాయీలు ‘’అన్నీ రామకృష్ణయ్యగారికి పరమ ఆకర్షణీయంగా ఉండి,విద్యార్ధి దశ బహు చమత్కారంగా గడిచింది .మెట్రిక్  చదువు తుండగానే అమలాపురం దగ్గర ముంగండ కు చెందిన ఖండవల్లి రామమూర్తి గారి కుమార్తెతోఅన్నపూర్ణా౦బ తో   వివాహం జరిగింది .

   రామకృష్ణయ్యగారి బాబాయి నాగేశ్వరశాస్త్రిగారికి సంతానం లేకపోవటంతో ఈయననే కొడుకులా భావించారు .కాలేజీలో ,ఇంట్లో కూడా గురువుగా ఉండేవారు .తమ ‘’భారత కవితా విమర్శనం ‘’లో రామకృష్ణయ్యగారు ‘’శ్రీరామ చంద్ర కృతినం-ద్వంద్వాతీతం గురోర్గురుం –యోగీశ్వరం జ్ఞానధనం –  వందే నాగేశ్వరం గురుం ‘’అని పినతండ్రిగారిని ప్రస్తుతించారు .అప్పుడే ఇంటర్ (ఎఫ్ .ఎ.)బోధన కొత్తగా వచ్చి తెలుగు సంస్కృతం చరిత్ర చదివే మహదాకాశం వచ్చి లెక్కలబాద తప్పింది .బియేతెలుగు తీసుకొని సంస్కృతాంధ్రాలు నేరుస్తూ ఇంట్లో కావ్యశాస్త్ర పాఠాలు బాబాయ్ గారివద్ద నేర్చారు.అప్పుడు వీరిక్లాసులో ఇద్దరే విద్యార్ధులు ఉండేవారు .బి.ఎ .పాసవగానే అదే హైస్కూల్ లో తెలుగుపండితులుగా చేరారు  .అప్పుడే వరదా చార్యులుగారు విజయనగరం సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు .అప్పుడే బి ఏ లో పార్ట్ 111 తెలుగు –సంస్కృతం మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టారు .దీనికి ఆనంద గజపతి మహారాజు ప్రోత్సాహం ఉన్నది .అప్పుడు వియనగరం రాజమండ్రి బందరు అనంతపురం లలో మాత్రమె కాలేజీలున్నాయి . పండితుల వాగ్వాదాలలో తానుకూడాపాల్గొని పరీక్షకులుగా వ్యవహరించి ,విద్వత్తును గుర్తించి బహుమతులివ్వటం ,పాశ్చాత్య దేశాలలో జరిగే భాషా చర్చలపై అవగాహన ఉన్నవారు ,మాక్స్ ముల్లర్ మహాపండితుడు ఋగ్వేదాన్ని నాగరలిపి ముద్రించటానికిప్రోత్సాహక  ద్రవ్య సహాయం చేసినవారు ,ఇండో –యూరోపియన్ ఏక భాషా కుటుంబ అవగాహన ఉన్నవారు ఆనంద గజపతి గారు . స్నేహితుడు వరదా చార్యుల పిలుపు ,రాజాగారి ప్రోత్సాహం , ప్రిన్సిపాల్ శ్రీ రామావ తారం గారి పట్టుదలతో రామకృష్ణయ్యగారికి విజయనగరం మహారాజా కాలేజిలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా ఉద్యోగం లభించి వెంటనే చేరారు ఇక్కడ సంస్కృత భాషాశాస్త్రం ,ద్రావిడ వ్యాకరణం కూడా బోధించాల్సి రావటంతో అధిక శ్రమ చేసేవారు .వీరి సాహిత్య రచనా విశేషాలు తరువాత తెలుసుకొందాం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-19-ఉయ్యూరు

.

— 

 


  1. గబ్బిట దుర్గా ప్రసాద్

    https://sarasabharati.wordpress.com
    http://sarasabharativuyyuru.wordpress.com
    http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2

బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి  తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే  వివాహం కోసం వందరూపాయలు ఇస్తాననగా   వాక్యార్ధం చేసి ,ఆయన వాద౦ జటిలం అని గ్రహించి సమర్ధించక ,ఒక అంశం లో ఏకీ భావం కుదరక  మానేస్తే ఆయన ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు .శాస్త్రిగారి మిత్రులు ఆయనకు నచ్చ చెప్పినా వినక ఆయన వాదం దుర్బలం అని చెప్పారు .కాని వఠెంవారే తర్వాత వచ్చి వంద రూపాయలు ముట్టజెప్పారు .ఈ డబ్బుతో స్వగృహానికి బయల్దేరి దారిలో అమలాపురం లో గొడవర్తి నాగేశ్వరావదానులుగారు శాస్త్రిగారి ప్రతిభ తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేస్తాననగా ,తలిదండ్రుల అనుమతి పొంది చెబుతానని నడవపల్లికి వెళ్ళారు .ఈయన ప్రతిభకు సంతోషించిన వారితో పాటు అసూయపడిన వారూ ఉన్నారు అక్కడ .శాస్త్రిగారిని అత్యవసరంగా అవధానం చేయమని అసూయా గ్రస్తులు కోరగా తాను  చెప్పే పద్యాలు రాసుకొనే వారు కావాలి అనగా ,67మంది ఆకులతో ఘంటాలతో వచ్చారు .దేవాలయం లో సమావేశమై శాస్త్రి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కపాదం చెబుతూ,సూర్యాస్తమయానికి 107పద్యాలు చెప్పగా ‘’ఇంకా చెప్పగలరా ?’’అని ప్రశ్నిస్తే ‘’ఈతకు లోతేమిటి ?’’అని అనగా ఆశ్చర్యపడి అప్పటికప్పుడు నలభై రూపాయలు అందజేశారు .అప్పటికి శాస్త్రి గారు మధ్యాహ్న భోజనం కూడా చేయనే లేదు .మరికొంత డబ్బు సంపాదించి గొడవర్తి వారమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు .

ధన సంపాదన కోసం నిజాం వెడుతూ దారిలో బందరు వెళ్లి  నోబుల్ హైస్కూల్ తెలుగుపండిట్,తనమిత్రుడు పసుమర్తి ఉమామహేశ్వర శాస్త్రిని కలుసుకోవటం ,ఆయన అప్పన్న శాస్త్రి గారి ప్రయత్నం తో ఆ స్కూల్ లో ఖాళీగాఉన్న తెలుగు పోస్ట్ లో నెలకు 7రూపాయల జీతం తో నియమి౦ప బడి మొదటి ఉద్యోగం లో చేరి క్రమక్రమంగా జీతం పెరిగి ఏకంగా 43 ఏళ్ళు నిరాఘాటంగా నోబుల్ హైస్కూల్ లో పని చేసి’’ నోబుల్ పండిట్ ‘’ అనిపించుకొన్నారు  .అది కళాశాలగా మారినప్పుడు ప్రధాన ఆంద్ర పండితునిగా పని చేసి ,గ్రంథ రచన చేస్తూఅనేక సంస్కృత ఆంధ్ర గ్ర౦థాలు రాసి ,  జీవితం సద్వినియోం చేసుకొన్నారు  .ఆయన నైష్టికతను ,సదాచారాన్ని మిషినరి యాజమాన్యం గౌరవించి ఆయనతో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉంటూనే మాట్లాడుతూ గౌరవం పాటించి తమ భక్తిప్రపత్తులు తెలియజేసేవారు .శాస్త్రిగారు ఆత్మాభిమానమున్న వ్యక్తి.ఒకసారి నోబుల్ దొరఎవరితోనో ఒకపద్యం పంపి దాని భావం చెప్పమని కోరితే   శాస్త్రి గారు వివరించిపంపారు .ఇంకోరకంగా చెప్పకూడదా అని దొర మళ్ళీ పంపితే కుదరదు అని చెప్పగా ,నోబుల్ గారే వచ్చి అడిగితె ‘’తప్పు తప్పే మీరు వచ్చినంతమాత్రాన తప్పు ఒప్పుకాదు’’అని ఖచ్చితంగా చెప్పేసరికి అహం అడ్డమొచ్చి  ,ఆయన్ను ఉద్యోగం లోంచి పీకేసే ప్రయత్నం చేస్తే దొరస్నేహితులు ‘’శాస్త్రిగారి పాండిత్యం అగాధం .మిమ్మల్ని ధిక్కరించాలని ఆయన అలాచెప్పలేదు .అంతటిపండితుడు మళ్ళీ మనకు దొరకరు ‘’అని చెప్పి శాంతింపజేశారు.

శాస్త్రిగారికి కీర్తి, కనకాలపై ఆసక్తి తక్కువ .ఏక సందాగ్రాహి ,విద్వానిత్య మొదలైన బిరుదులున్న మాడభూషివెంకటాచార్యులు శాస్త్రిగారు పనిచేస్తున్నకాలేజీలోని తనశిష్యులకు

‘’చి౦తకాయ ,కలేకాయ  బీరకాయత మారికే-ఉచ్చి౦తకాయ వాక్యాయ సాధకాయ తమంజలిం ‘’మొదలైన  శ్లోకాలు  పంపి ‘’పండితుడు ఎవరైనా ఉంటె వీటి అర్ధం వ్రాసుకురండి ‘’అని పంపారు .వాటికి అనేక రకాల అర్ధాలు చెప్పి రాయించి తాము –

‘’కమల  సమ శయానః పాద్వి రాడాశయానః –స్వభరణ యశ యావః ప్రోజ్జ్హితో సంశయానః

వరమధిక శయానః క్షత్ర పాత్రాశయానో-వ్యధి జలది శయానః పాతుపక్షీ శయానః ‘’అనే తమపూర్వుల శ్లోకం తోపాటు మరోశ్లోకాన్ని ఇచ్చి ఆచార్యులవారితో అర్ధం రాయించుకొని రమ్మని పంపగా వాటికి బదులే రాలేదు .శాస్త్రి గారికి శిష్టు వారికీ ఉన్నసాన్నిహిత్యం గొప్పది .తమ ‘’దేవీ విజయం ‘’కావ్యంలో వీరిని ఇంగువవారినీ స్తుతించారు .వీరిద్దరిశిష్యులై  రాణి౦నట్లు  విదుషీమణి ,కవితిలక ,కవితావిశారద శ్రీమతి కాంచనపల్లి కనకా౦బ గారు

‘’వర కోరాడ సుధా పయోధి నిదుడై –వాణీ పుమాకారమై –పరమేశ ప్రతిమానుడై జపతప –స్స్వాధ్యాయ లోలాత్ముడై –సురభాషా కవి చంద్రుడై  సకలుడై –సుశ్లోకుడై మించె సు-స్థిరుడై యచ్యుతరామ పూజ్యుడగుచున్ –శ్రీరామ చంద్రు౦ డహో’’అని కీర్తించారు .

శాస్త్రిగారి ఉపజ్నకు దీటుగా ‘’మంజరీ మాధుకరీయం ‘’నాటికను 1860లో రచించారు .అప్పటికి ఎలకూచి బాలసరస్వతి ‘’రంగ కౌముది ‘’మొదలైన నాటకాలు రాసినట్లు ప్రచారం లో ఉన్నా ,వాటి చిరునామా లేనేలేదు .శాస్త్రిగారి నాటిక స్వకపోల కల్పితం, అపూర్వం .  దీనికి పురాణమూలం లేదు .అంతకుముందే శాకుంతలం ,వేణీ సంహారం ,ముద్రారాక్షస నాటకాలను ఆంధ్రీకరించారు .తెలుగు వచనరచన చేసిన తొలితరం వారిలో శాస్త్రిగారూ ఒకరు .పంచతంత్ర నిగ్రహం కు అనువాదంగా ‘’నయప్రదీపం ‘’రాశారు .1-27ఉల్లాసాల మహాకావ్యం కుమారోదయ  చంపు ,2-శృంగార సుధార్ణవ భాణం3-రామచంద్ర విజయ వ్యాయోగం 4-సంస్కృత విద్యార్ధులకు ఉపయోగపడే వ్యాకరణం ‘’ధీ సౌధం ‘’5-శృంగారమంజరి 6-కమనానంద భాణం 7-పుమర్ద సేవధి కావ్యం 8-దేవీ విజయ చంపు ,9-ఘన వృత్తం 10-వచన పరశురామవిజయం11-స్వోదయం అనే స్వీయ చరిత్ర  మొదలైన 31 రచనలు చేశారు .వీటిలో ఘనవృత్తం అనే సంస్క్రుతకావ్యం , మంజరీ మధుకరీయం తెలుగు నాటకం విశేష ప్రాచుర్యం పొందాయి .కాళిదాసు మేఘసందేశం తర్వాత మేఘుని  వృత్తాంతం ను వర్ణిస్తూ శాస్త్రిగారు ‘’ఘనవృత్తం’’రాశారు .’’శాస్త్రిగారి మంజరీ మధుకరీయం నాటకం ప్రధమ ఆంద్ర రూపకం ‘’అని తీర్పు చెప్పారు సుప్రసిద్ధ నాటక శాస్త్రజ్ఞులు ఆచార్య పోణ౦గి శ్రీరామ అప్పారావుగారు .శాస్త్రిగారి ఆత్మకథ ‘’స్వోదయం ‘’19 శతాబ్దిలో సంస్కృతం లో రాయబడిన మొదటి స్వీయ చరిత్ర కావ్యంగా రికార్డ్ సృష్టించింది . .1900 శార్వరి శ్రావణ బహుళ పాడ్యమినాడు రామచంద్ర శాస్త్రిగారు 84వ ఏట శివైక్యం చెందారు .

రామ చంద్రశాస్త్రిగారికి లక్ష్మీ మనోహరం,రామకృష్ణ శాస్త్రి ,దుర్గా నాగేశ్వర శాస్త్రి అనేకుమారులు ,ఇద్దరుకుమార్తెలు .లక్ష్మీమనోహరంగారు సంస్కృతం నేర్చి  మెట్రిక్ పాసై , రెవిన్యు ఉద్యోగి అయ్యారు  .రామకృష్ణ శాస్త్రిగారు సంస్కృత ఆంగ్లభాషలలో పాండిత్యం సాధించి అల్పవయస్సులోనే  మరణించారు.దుర్గా నాగేశ్వర శాస్త్రి తండ్రిని మించిన తనయుడు .సహజ పాండిత్యం  ఉన్నవారు .తండ్రివద్ద సంస్కృతం నేర్చి ,తండ్రి అనారోగ్యం తో కాలేజీకి  వెళ్ళలేకపోతే  పండితుడిగా చేరి ,కాలేజీ విద్యార్ధులకూ సమర్ధవంతంగా పాఠాలు బోధించి తండ్రిని మించినవాడు అనిపించారు .ఈయన బోధనను క్లాసు బయటనుంచి గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయన తండ్రిగారికి సంతోషంగా తెలియేసేవారు .కొద్దికాలం లోనే సర్వశాస్త్ర పారంగతులై  యోగ౦లొనూ అనితర ప్రతిభ చూపిన నిరాడంబరులు ,పారమార్ధిక చింతన ఉన్నవారు .మిషనరీల అభిమానాన్ని తండ్రిగారిలాగానే పొందుతూ 33 ఏళ్ళు అక్కడే పని చేశారు .కాంచనపల్లి కనకాంబ గారు ‘’అతిశాంతుడు మహామహుండు ముని యోగానంద నాధు౦డు ,సా-దిక సర్వార్ధుడు ,దేశికా౦ఘ్రియుగభక్తిక్రీత ముక్త్యా౦గ నాయుతుడేకాంతుడు ,రామచంద్ర పరిచర్యోత్సాహి నాగేశుడ-ప్రతిముండుత్తము డాద్యయోగిజన సంభవ్యాంత రంగు౦ డహో ‘’అని ‘’శ్రీనివాస త్రిలింగ మహా విద్యా పీఠం గురుపరంపర’’లో ప్రస్తుతించారు .

రామచంద్ర శాస్త్రిగారు కొడుకు నాగేశ్వర శాస్త్రిగారు బందరు నోబుల్ కాలేజీలో 75ఏళ్ళు ఆంద్ర ఉపాధ్యాయులుగా పని చేసిన ఘనకీర్తి పొందారు .నాగేశ్వర శాస్త్రిగారి సమకాలికులు శ్రీ చెళ్ళపిళ్ళ  వెంకట శాస్త్రిగారు   చెళ్ళపిళ్ళ వారు తమ ‘కధలు గాధలు ‘’లో ఈతండ్రీ కొడుకులగురించి ముచ్చటించారు .నాగేశంగారి కొడుకులకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు .ఎవరైనా అడిగితె ‘’గాయత్రి ‘’జపించుచాలు’’అనేవారు.దీన్ని వేదవాక్కుగా తీసుకొని లక్ష్మీ మనోరంజనం గారి రెండవకుమారుడు శేషావధాని గాయత్రిజపించి ,తైత్తిరీయం మొదలైనవి చదువుతూ చివరికాలం లో ‘’సోహం ‘’భావం పొంది 1960లో గతించారు .రామచంద్ర శాస్త్రిగారి పెద్దకుమారుడు ,కోరాడ రామక్రిష్ణయ్యగారి తండ్రీ అయిన లక్ష్మీ మనోహారం గారు మెట్రిక్ పాసై ,బందరుతాలూకా ఆఫీస్ లో గుమాస్తాగా చేరి ,ఎన్నో సార్లు ప్రమోషన్ వచ్చినా తండ్రి సేవకు దూరమౌతానని  బందరు వదలక తండ్రి సేవలో ధన్యులై హెడ్ గుమాస్తాగా రిటైర్ అయిన త్యాగమూర్తి .1861లో జనించిన ఈయన 12ఏట సీతమ్మగారిని వివాహమాడి ,రామకృష్ణయ్య శేషావధానులు అనే ఇద్దరు కుమారులకు జన్మ నిచ్చారు .వీరిలో పెద్దకుమారుడైన కోరాడ రామ కృష్ణయ్య గారి గురించి తెలుసుకొనే ప్రయత్నం లో ఆ వంశఘన చరిత్ర అంతా అవగతం చేసుకొని పునీతులమయ్యాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-19-ఉయ్యూరు

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం

          కోవిదుల నిలయం కోరాడ వంశం

image.png

జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ వంశాన్ని గురించి ‘’కేశవనిధ్యాన విశుద్ధాంతరతా ప్రవృత్తి తో విశదః –కోరాడ ఇతి చ సంతతి రభవత్తస్యా మాభూ న్మహాదేవః ‘’అని చెప్పుకొన్నారు .అంటే కోరాడ వంశం కేశవధ్యాన విశుద్ధమైన మనః ప్రవృత్తికలది .ఆ వంశంలో మహాదేవ శాస్త్రి జన్మించారు అని భావం .మహాదేవ శాస్త్రిగారు శ్రీ విద్యోపాసకులు ,,శ్రీదేవతా పాదపద్మ భ్రమరాయ మాణుడు,తనవంశం లో పుట్టేవారెవరూ విద్యా విహీనులు కారాదని ,విద్యాజ్ఞానవంతులు కావాలని భావించి శ్రీశైలం లో భ్రమరాంబికా దేవి సన్నిధిలో ఎండు మారేడు దళాలను మాత్రమె భుజిస్తూ 27రోజులు అద్భుత తపస్సు చేశారనీ ,అమ్మవారు ప్రత్యక్షమై ‘’ఏమి నీ కోరిక “”?అని అడిగితె ‘’విద్యాం విధేహి దయయా మృత సారవత్యాం-హ్యాసప్తమా న్మమకులోద్భవ పూరుషాణా౦’’అని అర్ధించారు .’’భాగీరధుని  వెన్నంటి వచ్చిన గంగానదీ సహచరియిన,అమృత సారవతి ఐన విద్యను  తమవంశం లో ఏడుతరాలవరకు అనుగ్రహించు అని భావం .అమ్మవారు అలానే అనుగ్రహించింది కనుక కోరాడవారి వశం అంతా పండిత శిఖామణులతో కోవిదులతో విరాజిల్లింది .

  మహాదేవ శాస్త్రిగారి తర్వాత ‘’అపరిగ్రహ దీక్షితుడు అల్లాడ’శాస్త్రి ’సకల శాస్త్ర పారంగతులైనా  ,ఎవరినీ చేయి చాచి యాచి౦చ కుండా పేదరికం లోనే జీవించాడు .ఆయనకు 60ఏళ్ళు వచ్చి షష్టిపూర్తి చేసుకోవాలనే కోరికకలిగితే, గ్రామస్తులు గ్రహించి ఆయనతో ‘’శతఘంటా శతావధానం ‘’చేయించి ‘’శతఘంటా చూడామణి ‘’బిరుదునిచ్చి ,పుట్టెడు ధాన్యం పండే భూమిని ఆయన ఎంతవద్దని చెప్పినా వినిపించుకోక ఇచ్చి తమవదాన్యత చాటారు గ్రామ ప్రజలు .అల్లాడ శాస్త్రిగారి కుమారుడు జగన్నాథ శాస్త్రి ‘’నిజాన్తర్వాణిత్వ ప్రథిమ విధూతా శేష  విభవా విరాజంతే కీర్తి స్థగిత సకలాశాంత వివరాః’’అంటే దిగంతపరివ్యాప్త కీర్తి శేముషులుకలవాడుగా ప్రసిద్ధి చెందాడు .ఈయన పెద్దకొడుకు సూరి శాస్త్రి కాశీకి వెళ్లి ‘’గౌతమ తర్కం ‘’లో అఖండ పాండిత్యం సంపాదించాడు .పిల్లలు లేరు .చిన్నకొడుకు అ౦బాశాస్త్రికి సూరి శాస్త్రి, లక్ష్మణశాస్త్రి సంతానం .సూరి శాస్త్రి వేదాధ్యయనం చేద్దామనుకోన్నాడుకాని తండ్రి గతించటం తో చేయలేక ,కరువుకాటకాలతో అల్లాడి తిండీతిప్పలు లేకపోవటంతో తల్లి గతిలేనివారికి రాజే దిక్కు అనుకోని కొడుకు లిద్దర్నీ తీసుకొని కాటిరేవు కోనరాజు వద్దకు బయల్దేరగా దారిలో దొంగలు తల్లినీ, సూరి శాస్త్రినీ  చంపగా, లక్ష్మణశాస్త్రి ఎలాగో తప్పించుకొని రాజును చేరి ,కొలువులో ఉద్యోగం పొందాడు .రాజు నాలుగు వేలరూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు .కాని రాజుకూ సోదరులకు వచ్చిన తగాదాలలో ఇవ్వలేకపోతే ,శాస్త్రి అక్కడ ఉండటానికి మనసొప్పక ఆడబ్బును అడగకుండానే ,  దేశాటనం చేస్తూ ఒక యోగి వద్ద రామ తారకమంత్రం ఉపదేశం పొంది ,జపించి పెళ్లి చేసుకొని అత్తారింట్లో ఉండిపోయాడు .ఈయన పెద్దకొడుకు రామచంద్ర శాస్త్రి ,రెండవవాడు రామకృష్ణ శాస్త్రి ,మూడవవాడు సుబ్బరాయుడు .

   రామకృష్ణ శాస్త్రికి చదువు అబ్బకపోతే అన్న రామ చంద్ర శాస్త్రి చెంపలు వాయించేవాడు .రోషం వచ్చి ఇల్లువదిలి దేశాలు తిరిగి కాశీ వెళ్లి శాస్త్రాధ్యయనం చేసి ఒక్క ఏడాదిలోనే వ్యాకరణశాస్త్ర ప్రవీణుడయ్యాడు.మరో ఏడాదిలో న్యాయం మొదలైన శాస్త్రాలు నేర్చి కాశీ రాజుకొలువులో పండితులతో శాస్త్ర చర్చలు  చేసి, గెలిచి ,ఎప్పటికప్పుడు ఉత్తరాలద్వారా ఇంటికి విశేషాలు తెలియ జేసేవాడు .తమ్ముడు ప్రయోజకుడైనందుకు శాస్త్రి సంతోషించి పెళ్లి ప్రయత్నాలు చేశారు .మరికొంతకాలానికి ఇండోర్ మాహారాజు ఆహ్వానించి ,  ఆస్థాన పండితుని చేశాడని ,ఆతర్వాత హఠాత్తుగా మరణించాడని తెలిసింది .తమ్ముడి చావు శాస్త్రిని పిచ్చివాడిని చేయగా దుఖావేశంలో వీధుల్లో దుమ్మూ ధూళిలో లో పొర్లుతూ ,మైమరచి తిరిగే వాడట ‘

                     కోరాడ రామ చంద్రశాస్త్రి

కోరాడ వంశ ఉజ్వలమణిపూస రామ చంద్ర శాస్త్రి 1816లో ఆశ్వయుజ శుద్ధ దశమి గోదావరిజిల్లా అమలాపురం తాలూకా కేశనకుర్రు గ్రామం లో జన్మించారు .12వ ఏట తండ్రివద్ద శ్రీరామమంత్రం ఉపదేశం పొంది ,జపించి మాతామహుని వద్ద రఘువంశం చదివి ,తర్వాత తండ్రిగారి స్వగ్రామమం నడవపల్లి చేరి సోమయాజుల సూరన్నగారి వద్ద కావ్య వ్యాకరణాలు అభ్యసిస్తూ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద అలంకార శాస్త్రం చదువుతూ కవిత్వం చెప్పటం నేర్చారు .సూరన్న శాస్త్రిగారితో పొలం వెళ్లి కావ్య పాఠం నేర్చుకొంటూనే ,తిరిగి వచ్చేటప్పుడు కొన్ని శ్లోకాలురాసి సూరన్నగారికి చూపించగా కవిత్వం గంగా సదృశ ప్రవాహంగా ఉందని అందులో దోషాలు వెతకటం తనకు కానిపని చెప్పి ఆయనే ఈయన శిష్యుడైపోయాడు .సూరన్న శాస్త్రిగారి గురించి ‘’శ్రీ శిష్టు వంశాబ్ధి శశికరుడు ,సకలవిద్యా అనమ సద్మాయ మాన జిహ్వా౦చలుడు ,అమిత కావ్యాళికర్త శ్రీ కృష్ణమూర్తి పదాబ్జ సేవనాత్త సద్గ్రంథ కల్పనాయత్త సుమతి విరచిత  శ్రవ్త్య దృశ్యాత్మ వివిధ కావ్యుడు ‘’అని తనను గురించికూడా చెప్పుకొన్నారు రాచంద్ర శాస్త్రి .

    ‘’ నీ తండ్రి బీదవాడు .నీకు పెళ్లి చేయలేడు.నువ్వు సాహిత్య ,కవిత్వ నిదివి   వాగ్మివి,చెన్నపట్నం వెడితే ,ఆంగ్లేయులు నీ విద్వత్తుకు డబ్బు ఇస్తారు .దానితో అనుకూలవతిని పెళ్లి చేసుకో ‘’అని స్నేహితులు సలహా ఇస్తే , సరేనని బయల్దేరగా సూరన్న శాస్త్రిగారికి తెలిసి  రామచంద్రాపురం రాజుకు సిఫార్సు చీటీరాసి ఒక బంట్రోతు ద్వారా రామ చంద్ర శాస్త్రిగారికి పంపారు .దాన్నితీసుకొని రాజు దగ్గరకు వెడితే అక్కడ క్షామం ఉండటంవల్ల రాజు ఆస్థానం లో రెండు నెలలు ఉండమని కోరితే ,మనసొప్పక  చెన్నపట్నం లో మునసబు గిరీ ఇస్తారనే ఆశతో మళ్ళీ మద్రాస్  బయల్దేరి దారిలో మచిలీపట్నం వచ్చి ,తెచ్చుకున్నడబ్బంతా ఖర్చుకాగా తిండికూడా లేక ,ఎవరినీ యాచించలేక సాయంకాలం గొడుగుపేట మల్లేశ్వరస్వామి దేవాలయం చేరి శివునిపై శ్లోకాలు అనర్గళంగా ఉచ్చైస్వరంతో చదువుతుంటే ,  ప్రభల అప్పన్న శాస్త్రి అనే ఆయన వచ్చి ‘’మీరెవ్వరు “’?అని అడిగితె ‘’నేనెవరైతే మీకేం “’అని  ఎదురు ప్రశ్న వేయగా ,ఆయన బుజ్జగించి విషయం తెలుసుకొని ‘’ఒక్కపూట భోజనానికే ఇతరులను అడగలేని నువ్వు ,మద్రాస్ వెళ్లి మున్సఫీ సంపాదిస్తావా “’అని ఛలోక్తి విసిరి ,ఇంటికి తీసుకువెళ్ళి పుత్రవాత్సల్యం తో ఆదరించాడు అప్పన్న శాస్త్రి

    సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-19-ఉయ్యూరు

image.png

— కోరాడ రామకృష్ణయ్యగారు 

image.png

కోరాడ రామ చంద్ర శాస్త్రిగారు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ?

శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ?

‘’భగవాన్ శ్రీ కృష్ణ దేవిని అర్చించే వాడని  మార్కండేయ  పురాణా౦తర్గత మైన దుర్గా సప్తశతి లో ఉన్నది .అందులోని అర్గళ స్తోత్రం లో ‘’రూపందేహి ,జయం దేహి ,యశో దేహి ,ద్విషో జాహి ‘’అని ఉంది.దీన్ని పఠించినవారికి అది కవచంగా రక్షణ కల్పిస్తుందనీ చెప్పబడింది .’’కృష్ణేన సంస్తుతయ  దేవీ శశ్వద్  భక్త్యా తథాంబికే-రూపం దేహి జయం దేహి  యశో దేహి ద్విషోజాహి ‘’దీని భావం ‘’అమ్మా పరాదేవీ !నిన్నుఅచంచల భక్తి విశ్వాసాలతో కృష్ణభగవానుడు ఆరాధించాడు .మాకు చక్కని రూపం ,అన్నిటా విజయం ,అ౦తులేనికీర్తి కలిగించి  మా అజ్ఞానాన్ని కోరికలను సంహరించు’’ .

  శ్రీదేవి నిజంగా కృష్ణుడిని రక్షించిందని భాగవత పురాణం  చెబుతోంది కదా  దేవకీ ఏడవగర్భం ను విష్ణుమూర్తి తనమాయతో రోహిణి గర్భంలో ప్రవేశపెట్టగా బలరాముడు జన్మించాడు ..ఎనిమిదవగర్భంగా కృష్ణుడు ,పరాశక్తి ఇద్దరూ అష్టమినాడే  జన్మించారు .ఆరోజే  శిశువైన కృష్ణుని    తండ్రి వసుదేవుడు  నందవ్రజం లోని యశోద దగ్గరకు చేర్చాడు .కంసుడు ఆ రోజునే ఆమెను చేతిలోపట్టుకొని పైకేగరేసి  ఖడ్గం తో నరుకుదామనుకొన్నాడు కాని వాడి చేతులకు చిక్కకుండా మాయమైంది .

  ఇక్కడ కంసుడు లోని ఆహ౦కారానికి,కృష్ణుడు ఆనందానికి ,దుర్గాదేవి అధ్యాశక్తికి ప్రతీకలు ,.ఆహ౦కారం చేతనను (దేవి ) ఆన౦దాన్ని (కృష్ణుడు )చేజిక్కి౦చు కోలేదు  అని అర్ధమౌతోంది .పరాశక్తి ఐన దేవి  కంసుని అహంకారం  అణగ గొట్టేవాడు  అప్పటికే పుట్టాడని త్వరలోనే రాబోతున్నాడని సూచనప్రాయంగా భవిష్యత్తు చెప్పేసింది .ఆహ౦కారానికి విరుగుడు ఆనందమే .కంసుడనే ఆహ౦కారాన్నిశ్రీ కృష్ణుడు అనే ఆనందమే జయిస్తుందని భావం .

  జీవితం లో సంపూర్ణ ఆనందం నిండితే అహంకారానికి తావు అనేది ఉండదు .ఆన౦ద యోగికి ఆహ౦కార౦  ఆమడ దూరం .మనసులో అహంకారం రాజ్యం చేసేటప్పుడు తానూ బాధపడి లోకాన్ని బాధపెట్టి భయంకరుడౌతాడు .వాడి మనసు అనుక్షణ క్షోభ తో ,తనను ని౦ది౦చు కొంటూ  అనవసరంగా ఇతరులను నిందిస్తూ ఉంటాడు .అయినా వాడి ఆహ౦కారం చేతనను నాశనం చేయలేదు .కారణం చేతన శాశ్వతమైనది కనుక .

  విశ్వం లో చేతన శక్తిని తగ్గించేది కాని నాశనం చేసేది కాని లేదని గ్రహించాలి .అది నిరంతరం ఉండే శాశ్వత శక్తి .సైన్స్ తెలిసినవారికి ఈ విషయం  బాగా అర్ధం అవుతుంది .శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం శక్తి సృస్టింపబడదు , నాశనం కాబడదు .రూపాంతరం చెందుతుంది .అలాగే చేతనకూడా సృష్టింప బడదు ,నాశనం చెందదు.దానిని సృష్టించే ప్రయత్నం నాశనం చేసే ప్రయత్నం  నిష్పల మౌతుంది .చేతనమాత్రమే శాశ్వతం’’అని గురు శ్రీ రవిశంకర్ తెలియ జేశారు . .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-19-ఉయ్యూరు

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాఇంట్లో వరలక్ష్మి వ్రతం

This gallery contains 6 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

image.png

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

91ఏళ్ళ రైతుపేద్ధ ,వితరణశీలి ,అభివృద్ధిమాంత్రికుడు శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు మృతి .

కృష్ణాజిల్లా ఇబ్రహీం పట్నం (అడ్డరోడ్డు )సర్పంచ్ గా 48ఏళ్ళు సేవ చేసి ,200కోట్ల రూపాయల విలువైన, 76 ఎకరాల భూమిని పేదప్రజల నివేశస్థలాలకు పంచటానికి ప్రభుత్వానికి స్వాధీనం చేసిన వితరణ శీలి ,ఇబ్రహీం పట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం , రాయనపాడు ,హెవీ మిషనరీ సంస్థ ,గుంటుపల్లి రైల్వే వర్క్ షాప్ ,జాకిర్ హుస్సేన్ కళాశాల స్థాపన లకు కృషి చేసిన  అవిశ్రాంత కృషీవలుడు  అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ  కార్టర్ వ్యవసాయక్షేత్రం లో ఆయనకు అతిధిగా 3 నెలలున్న అరుదైన ఘనత పొందినవారు  ,కే0ద్ర పంచాయితీశాఖనుంచి రాష్ట్రపతి అవార్డు,గ్రహీత ,ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ బోర్డు డైరెక్టర్ ,కృష్ణా జిల్లా రైతుపెద్ద  ,ఆదర్శ చెరకు  రైతు ,  శ్రీ మల్లెల అనంత పద్మనాభ రావు 91ఏళ్ళవయసులో 7-8-19 బుధవారం స్వగృహం లో మృతి చెందారు . ఉయ్యూరు లో జరిగిన అనేక చెరుకురైతుల సభలలో వారిని చూశాను  వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతున్నాను -దుర్గాప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మనుడి ఆగస్టు

అమ్మనుడి ఆగస్టు

అర్థతాత్పర్యాలతో మధునాపంతులవారి ”ఆంధ్రపురాణం ”ప్రచురణ

జెన్ బోధిధర్ముడు తెలుగువాడే -డా ఈమని శివనాగిరెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ రామకృష్ణప్రభ -ఆగస్టు

దేహం లో శ్రీరాముడు కొలువున్నకనకమ్మగారు -జులై ఆగస్ట్ శ్రీరామ కృష్ణ ప్రభ

 

 

తంత్ర్యోద్యమ ధీర బెంగాలీ నారి మాతంగిని హాజ్రా –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం 

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం

ఉదార గుణమే ఉన్నతాశయం

‘.శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది .

వీళ్ళు నావాళ్ళు , వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు .ఉదార స్వభావులకు ఈ జగమంతా ఒకే కుటుంబంగా గోచరిస్తుంది అని తాత్పర్యం .కర్తవ్య దృష్టి ఉంటేనే ఇహపర సాధనం .

బాగా డబ్బున్న లోభికంటే ,ఉదార గుణం ఉన్న పేదవాడు గొప్ప అన్నాడు 17-18 శతాబ్దాలకు చెందిన  గువ్వల చెన్న శతకకర్త –

‘’కలిమి గల లోభికన్నను –విలసితముగ పేద మేలు వితరిణి యైనన్

చలి చెలమ  మేలు గాదా  –కుల నిధి యంబోధి కన్న ,గువ్వల చెన్నా ‘’

సముద్రం లో ఎంతనీరున్నా ,దాహమైతే గుక్కెడు నీళ్ళు కూడా తాగటానికి  పనికి  రాదు. .అందులో నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నా, తాగటానికి పనికి రాని ఉప్పునీరే ఉంటుంది .చలి చలమలో నీళ్ళు తక్కువగా ఉన్నా ,ఆ నీటిని తాగితే , చల్లగా ,మధురంగాఉండి  దాహ శా౦తినిచ్చి ,ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త నీరు ఊరుతూ, ఎందరెందరికో ఉపయోగపడుతుంది .కనుక కలిమి ఉన్న లోభి కంటే, ఉదారగుణం ఉన్న పేద వాడు శ్రేష్టుడు అని కవి వివరించాడు .. ..  నిత్యజీవితం లో డబ్బు అవసరమే, కాని ధనమే జీవితం కాకూడదు .డబ్బు సంపాదన పై శ్రద్ధ ఉండాలి కాని ,ఆర్జనే అర్ధానికి మూలం కారాదు .సంపాదించిన డబ్బు ఖర్చు చేసేటప్పుడు మనిషి విజ్ఞత చూపాలి .ఆర్జన ,వినియోగం మనిషి స్వభావానికి ,ఔన్నత్యానికి ,సార్ధక్యానికి అద్దం పడతాయి .వ్యక్తికి  ఈ రెండిటిపై గొప్ప అవగాహన ఉండాలి .

ధనాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అప్పుడే  మనశ్శాంతి , సౌఖ్యం ,పేరు ప్రతిష్టలు కలుగుతాయి .లేకపోతే ఆ ధనమే శీలహానికి, అపకీర్తికి, పాపానికి, మానసిక క్షోభకు  కారణమౌతుంది .ఆర్జనతోపాటు అనుభవ యోగమూ ఉంటేనే పరమార్ధం .అంటే తనకు, తన కుటుంబానికి ఖర్చుచేస్తే చాలదు .తోటివారికి, బాధలలో ఉన్నవారికీ  సాయపడి  వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు పూయించాలి .అప్పుడే  ఆ ధనం సార్ధకమై  ,మానసిక ఆనందాన్నిస్తుంది .

అంతమాత్రం చేత,  ఎవడికి పడితే వాడికి డబ్బు ఇచ్చి, అపాత్ర  దానం చేసి ,అనర్ధాన్ని తెచ్చుకోకూడదు .దానం వెనుక ఉన్న మనసు చాలా ముఖ్యం .దానం లో గర్వం ఉంటే ,పతన హేతు వౌతుంది . .వ్యక్తికి సాయం చేసే అదృష్టం కలిగింది అని భావిస్తే ,ఆ దానం పవిత్రమై ఆనందాన్నిస్తుంది .ఆత్మీయత ,అనురాగం, మనసు పంచుకోవటం వలన ఐహిక ఆనందం కలుగుతుంది .ఇదే లేకపోతే ,జీవితం రసహీనమై  నిరర్ధకమని పిస్తుంది .కర్మ, జ్ఞాన, భక్తులు ఆముష్మికానికి యెంత అవసరమో ,ఆర్జన, అనుభవం ,ఆనందం, ఐహికానికి అంత ముఖ్యం. రైల్వే లో పనిచేసే పాముల నరసయ్యగారు ఒక్క గారుడీ మంత్రం తో  ,ఒకే ఒక్క ఫోన్ కాల్ తో , పాముకాటుకు గురైన వేలాది మంది జనాలకు  ప్రాణదానం చేసి, ప్రాణదాత అయ్యారు .దీనికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు .నిస్వార్ధ సేవ చేసి చరితార్దులై ఉదాత్త పురుషులయ్యారు ..’’మనం ఇతరులకు మన స్పూర్తిగా సాయం చేయాలనుకొన్నప్పుడు ,సహాయం చేస్తున్నప్పుడు మన మనస్సు ,బుద్ధీ పరిశుద్ధమౌతాయి .ఈ ప్రతిఫల౦ ఒక్కటే చాలు చేసే సాయానికి ‘’అంటారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు . ‘’ఎప్పుడూ నీటిలోనే ఉండే చేప దుర్గంధంతో నిండిన నీచును దూరం చేసుకోలేనట్లే మనిషి, సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా ,మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని  భక్త కబీరు చెప్పాడు. కబీర్ సూక్తులే  తనకు ఆదర్శం అన్నాడు మహాత్మాగాంధీ .

మనం వీటిని అన్నిటిని  సమన్వయ పరచుకొంటూ ,ఉన్నంతలో ఒక చలి చలమ లాగా  ఆర్తులకు ఉపయోగ పడుతూ  జీవితం గడిపితేనే ,జీవితానికి నిండుదనం, శోభ ,సార్ధకత  కలుగుతాయి  అని గువ్వల చెన్న ‘’  చెన్నా’’ అంటే బాగా  చెప్పాడు .,అంతే కాదు తెలుగు పద్యం శాశ్వతత్వాన్ని కూడా ఇలా చెప్పాడు .

గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును,, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న, గువ్వల చెన్నా

 మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -6-8-19 -ఉయ్యూరు  

Posted in రేడియో లో | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా   5-9-19   సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,144 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

 

ముఖ్య అతిధి –

–శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

ఆత్మీయ అతిధులు –   శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

మొదలగు ప్రముఖులు

 

కార్యక్రమ వివరం

 

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-శ్రీ బొడ్డపాటి  విశ్వేశ్వరరావు –93 సంవత్సరాల పౌరాణిక నాటక రంగ స్థల నటులు –గుడివాడ

2-శ్రీ పెర్నేటి గంగాధరరావు –విశ్రాంత ప్రధానొపాధ్యాయులు ,ఆధ్యాత్మిక గ్రంథ కర్త-మచిలీపట్నం

3-శ్రీ కోసూరు ఆదిరాయణ రావు –విశ్రాంత ప్రధానొపాధ్యాయులు –   కోసూరు

4-శ్రీ మతి కొల్లి భారతీ దేవి –విశ్రాంత ప్రదానోపాధ్యాయిని     -మచిలీపట్నం

5శ్రీమతి వి.కస్తూరి బాయి –విశ్రాంత ప్రదానోపాద్యాయిని –విజయవాడ

6-శ్రీ గబ్బిట రామనాథ బాబు –విశ్రాంత ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు –ఉయ్యూరు

మొదలైనవారు

 

ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

 

1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు

2- అమరవాణి పాఠశాల విద్యార్థిని  -కుమారి   ఎస్.సాహితి   10/10 –కు  2,000 రూపాయలు

3-..అమరవాణి పాఠశాల  విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు  2,000 రూపాయలు

4.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం(పేర్లు తరువాత ప్రకటిస్తాం ) –

 

.-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి   5,116 గా ఏర్పాటు చేసిన  స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

5-2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.5/10మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక . నారాయణ  జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గబ్బిట  రమ్య కు 5,116రూపాయలు

5-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఛి .యనమండ్ర రోహిత్ కుమార్ కు 5,116 రూపాయలను

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

 

మిగిలిన వివరాలతో  అంతర్జాల ఆహ్వానం ఆగస్ట్ చివరివారం లో అంద జేస్తాము .

 

ఆహ్వాని౦చు వారు

గబ్బిట దుర్గా ప్రసాద్ సరసభారతి అధ్యక్షులు

,

పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

 

ఉయ్యూరు -5-8-19 ఉయ్యూరు

 

— 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131

           ధ్వజస్తంభ ప్రతిష్ట

వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ జాలాది దాన్యాదివాసాలు ,ప్రతిష్ట ,హోమాలు అన్నీ ఆగమోక్తంగా జరగాలి . దైనందిన  దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏటికేడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది .ధ్వజ ప్రతిష్ట ఎప్పుడుఅని అడుగుతూనే ఉన్నారు .సమయం రావాలి అని చెప్పేవాళ్ళం . ధనుర్మాస  ఉత్సవాలు కూడా చేబట్టాం .దీనితో భక్తులలో ఔత్సుక్యం మరింత పెరిగింది .ఆలయానికి ఏ రూపంగా నైనా సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు .మార్గశిర శుద్ధ   త్రయోదశి నాడు శ్రీ హనుమద్ వ్రతాన్ని మూడు రోజుల కార్యక్రమ౦గా చేస్తున్నాము .

 ఈనోటా ,ఆనోటా చినవోగిరాల వాస్తవ్యులు వదాన్యులు సంపన్నులు శ్రీ పాలడుగు నాగేశ్వర దాసు గారు చాలా దేవాలయాలకు ధ్వజ స్తంభాన్ని కొని అందజేసినట్లు విన్నాం. వారే ఉయ్యూరు రోటరీ క్లబ్ వారు కాటూరు రోడ్డు లో నిర్మించిన రోటరీ కంటి ఆసుపత్రికి ,జనరల్ హాస్పిటల్ కు తమ పొలాలను ఉచితంగా అందజేసిన పూజ్యులు .ఆయన ఇంటి క్షురకుడు నాదస్వర బృందం నాయకుడు మాకు పరిచయమై మమ్మల్ని ఒక సారి దాసుగారిని కలవమని ఈలోపు ఆయన చెవిలో విషయం వేసి ఉంచుతానని చెప్పాడు .అలాగే ఒకరోజు మేము ముగ్గురం ఆయనవద్దకు చినవోగిరాల వెళ్లాం .ఆయన, భార్యగారూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆలయ విశేషాలు అడిగి తెలుసుకొన్నారు .అప్పుడు మేము వారి దృష్టికి ధ్వజస్తంభం విషయం తీసుకోచ్చాము .రెండోమాట లేకుండా ‘’నేనే మీ గుడికి ధ్వజం కర్ర కొని ఇస్తాను .ప్రతిష్ట ఏర్పాట్లు మీరు చేసుకోండి ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పి తిరుగివచ్చాం .

   ఒక రోజు దాసుగారి నుంచి ఫోన్ వచ్చింది .మర్నాడే తెనాలి వెళ్లి ‘’అడితీ’’లో ధ్వజస్తంభం టేకు కర్ర కొని ఇప్పిస్తాను తనకారులో వెడదామని చెప్పారు .అలాగే వారికారులోనే మర్నాడు ఉదయమే  అందరం కలిసి తెనాలి వెళ్లాం .కాలువ వొడ్డున అన్నీ అడితీలే .ఆయన ఎప్పుడూ కొనే అడితీలో నాణ్యమైన టేకు దూలం ,మా ఆలయానికి కావలసిన ఎత్తు ఉన్న సాఫీగా ఉన్న కర్ర సెలెక్ట్ చేశాం .ఆయనే డబ్బు చెల్లించి రసీదు తీసుకొని ,అడితీ వారికే ఉయ్యూరు చేర్చే బాధ్యత అప్పగించారు .దాన్ని దీవాలయం దగ్గర బయట పడేస్తే చెదలు పట్టి ఒకవేళ ప్రతిష్ట ఆలస్యం అయితే వానకు తడిసి ఎండకు ఎండి దెబ్బ తింటుందని ముందుగానే భావించి పెద్ద వంతెన దగ్గరున్న రామకోటయ్యగారి అడితీ ప్రక్కనున్న మరో అడితీలో వారిని సంప్రదించి అక్కడ ఉంచుతామని చెప్పగా ఆయన గొప్పభక్తుడు , దాసుగారికి మంచి మిత్రుడు అవటం తో ఒప్పుకోగా అక్కడికే డైరేక్ట్ గా తోలించి చేర్చమని చెప్పగా అలాగే చేశారు .దాసుగారి దాతృత్వానికి జోహార్లు .

  ధ్వజస్తంభం కర్ర వచ్చింది .అది పాడుకాకుండా వరిగడ్డి వెంట్లు చుట్టించి భద్రం చేశాము .ఇక ఇత్తడి తొడుగు తయారు చేయించటం ,ప్రతిష్ట జరగాలి .మళ్ళీ మేమే పీటలమీద కూర్చోకుండా వేరెవరికైనా ఆసక్తి ఉన్నవారికి అప్పచెబుదాం అని నా ఆలోచన . మా నాయనమ్మ గారి తండ్రిగారుకూడా ఆలయ ప్రతిష్ట ఆయన చేసి ధ్వజప్రతిస్ట ,ఆయన చిన్నకుమార్తే కుమార్తె శ్రీమతి  సూరి సౌభాగ్యమ్మ దంపతులతో చేయించారని మా అమ్మగారు చెప్పేవారు .మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం . సహాయం కోసం కరపత్రాలు వేసి  పంపిణీ చేశాం .ఏమీ జరగకుండానే నాలుగేళ్ళు యిట్టె గడిచిపోయాయి .ఐదో ఏడు ప్రవేశించింది .ఏమైనా సరే ప్రతిష్ట జరపాలి అని పూర్తి నిర్ణయానికి వచ్చాం . శైవులైన వడ్లమాని సిద్దా౦తిగారు సంజీవరావు గారికి బంధువులు .బాగా పరిచయం ఉన్నవారు .ఆయనా విశ్వ ప్రయత్నం చేశారు. సిద్ధాంతిగారిని ఒకసారి ఆలయానికి పిలిచి మాట్లాడాం .త్వరలోనే ప్రతిష్ట జరుగుతుంది అని అభయం ఇచ్చారు .వారితోనే ముహూర్తం పెట్టిద్దామనుకొన్నాం .మరి ప్రతిష్ట చేసేదేవరో తెలియాలి .వారి పేరు నక్షత్రాలకు కుదరాలి .అప్పుడు అందరూ ‘’రత్తయ్య ‘’అని పిలిచే ,శ్రీ దొడ్డా వెంకటరత్నం మాతో తమదంపతులు కూర్చుని ప్రతిష్ట చేస్తామని ముందుకు వచ్చారు .హమ్మయ్య అనుకొని సిద్ధాంతి గారి చేత ముహూర్తం పెట్టి౦చాము  .ఒకసారి ధ్వజాన్ని పాతిపెడితే మళ్ళీ తీయటం కుదరదుకనుక కష్టమో నిస్టూరమో దానికి ఇత్తడి తొడుగు కూడా చేయించి ప్రతిష్ట చేయాలని నిర్ణయించాం .ఇందులో నాకుకాని వీరభద్రరావు కుకాని అనుభవం లేదు .సంజీవరావు గారికే బాధ్యతా అప్పగించాం .ఆయన అన్ని చోట్లా విచారించిగుంటూరుజిల్లా  ఫిరంగిపురం లేక పిడుగురాళ్ళ సాయిబులు బాగా చేస్తారని తెలుసుకొని ,మా ద్వారా ఆ మేస్త్రీకి డబ్బు అడ్వాన్స్ ఇప్పించారు .

   ఫిరంగిపురం బాచ్ వచ్చింది .వాళ్లకు విష్ణ్వాలయం లో ఉండటానికి వసతి ఏర్పాటు చేయించాం .రోజూ వాళ్లకు రెండుపూటలా కాఫీ టిఫిన్లు ,భోజనాలు అన్నీ ఏర్పాటు చేశాం .కావలసిన నాణ్యమైన ఇత్తడిని బెజవాడ వన్ టౌన్ ఇత్తడి కొట్లో కొని అందించాం .కొలిమి ఏర్పాటుకు, బొగ్గులకు  వెలిగారం వగైరా లకు సహకరించాం  ..ధ్వజస్తంభం కర్రను ఉయ్యూరు అడితీ నుంచి తీసుకువచ్చి గుడిదగ్గర పెట్టించాం. .చాలా కస్టపడి ఇత్తడి కుందులు ధ్వజస్తంభం సైజును బట్టి తయారు చేశారు.స్వామి విగ్రహానికి ఎదురుగా వచ్చేకుందిపై ఒంటె బొమ్మ నగిషీ ,ప్రక్కల స్వస్తిక్ మార్కు చెక్కిన్చాం .ఇదంతా సంజీవరాయ మహిమే .మాకేమీ ఇందులో ఓనమాలు తెలియవు . జరుగుతున్న పనిని చూసి అందరూ  సంతోషించారు .ధ్వజం ప్రతిస్టించ టానికి లోతుగా గొయ్యి తీయి౦చా౦.ధ్వజాన్ని అందులో కూర్చోపెట్ట టానికి   క్రేన్ కావాలని ,పంపమని  కెసీపి కి వెళ్లి ప్లాంట్ మేనేజర్ బసవయ్యగారికి కోరాం  .ఆయన సరే అని ముహూర్తం సమయానికి ఒకగంట ముందు క్రేన్ ,ఆపరేటర్ వస్తారని చెప్పారు.

 స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్సర జ్యేష్ట బహుళ నవమి 13-6-1993  ఆదివారం ఉదయం 7-29గం.లకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ యందు ఇత్తడి తొడుగుతో సహా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా  అశేష జన సందోహం జయజయ ద్వానాలమధ్య కన్నులపండుగాలాగా జరిగింది . స్వర్గీయ  శ్రీ దొడ్డా వెంకటరత్నం దంపతులు ,శ్రీ పరాశరం రామకృష్ణమాచార్యులవారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట చేశారు . స్వర్గీయ మండా వీరభద్రరావు ,స్వర్గీయ లంకా సంజీవరావు గారల అవిశ్రాంత కృషి ,అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలంగా నిలిచాయి .స్వామివారి కరుణాకటాక్షం చెప్పనలవికానిది . ఈ పవిత్ర కార్యానికీ చందాలు వరదలా పారాయి .అంతా సద్వినియోగపరచాము .ఇత్తడి తొడుగు చేసినవారికి నూతన వస్త్రాలు ,మిగిలిన డబ్బు ఇచ్చి సంతృప్తి పరచాం .ఈ సారి నేనే ఎప్పటికప్పుడు జమాఖర్చులు రాసి ,వారిద్దరికీ  చూపించి లిస్టు తయారు చేసి ముగ్గురం సంతకాలు పెట్టి జమాఖర్చులు తెలియ జేసే తేదీ ప్రతిష్ట జరిగిన మూడు రోజులకే ప్రకటించి వచ్చినవారికి చదివి వినిపించి బోర్డ్ మీద అంటించి బాధ్యత తీర్చుకొన్నాం . ఒకమహత్తర యజ్నంలాగా విగ్రహ ప్రతిష్ట ,ధ్వజ  ప్రతిష్ట జరిగి మాకు  అత్యంత  ఆనందాన్ని కలిగించాయి .జీవితం లో ఈ రెండూ మరచిపోలేని మరువరాని పవిత్ర ఘట్టాలై మమ్మల్ని మా కుటుంబాన్నీ  తరి౦పజేశాయి .

  ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణం

అప్పటినుంచి వందలాది భక్తులు నిత్యం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించి సేవించి తరిస్తున్నారు .ప్రతి మంగళ, శనివారాలలో నాగవల్లి అంటే తమలపాకు పూజ ,విశేషంగా జరుగుతుంది .ధనుర్మాసం లో వేలాదిభక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి ,తమ మనో భీస్టాన్ని స్వామిని నివేదించి ,అభీష్ట సిద్ధి పొందుతున్నారు .ప్రాతః కాలపూజ ,గోదాదేవి తిరుప్పావై , కుల శేఖర ఆళ్వార్ ముకుందమాల ,సుందరకాండ స్తోత్ర పారాయణలతో ఆలయం మరింత పవిత్రత చేకూర్చు కొంటున్నది .స్వామి భక్తులపాలిటి కొంగుబంగారం .

  భోగినాడు శాకంబరిపూజ ,శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ గోదా రంగనాధ స్వాముల శాంతి కల్యాణం నిర్వహించి ఒంటె వాహనం పై గ్రామోత్సవం చేస్తాం .ప్రతి ఏడాది జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం నాడు ఉదయాన్నే స్వాములకు లడ్డూలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా అందజేస్తాము .జనవరి 10న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవ సందర్భంగా అరిసెలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా పెడతాము .స్వామికి గారెలదండ అంటే వడమాల మామూలే .భక్తులు ఎప్పుడూ చేయించి వేయిస్తూనే ఉంటారు .ప్రతిమంగళవారం స్వామికి అత్య౦త ప్రీతికరమైన అప్పాలు చేయించి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తాం .తులసిమాలలు నిమ్మకాయమాలలు ,జిల్లేడు వ్రేళ్ళతో జిల్లెడుపూలతో ,పుష్పహారాలతో స్వామి దివ్య సు౦దర౦ గా , దేదీప్యమానంగా శోభిస్తాడు ,భాసిస్తాడు .భజనలు, కోలాటాలు హనుమాన్ చాలీసా,లలితా, విష్ణు సహస్ర  పారాయణాలు సామూహిక కుంకుమ, గంధ సిందూరం పూజలు మా ఆలయం ప్రత్యేకత .

   స్వామి నక్షత్రం పూర్వా భాద్రనాడు మన్యు సూక్తం తో ప్రత్యేక అభిషేకం జరుపుతాం .వైశాఖ బహుళ దశమి  శ్రీ హనుమ పుట్టినరోజు నాడు శ్రీ హనుమజ్జయంతి ని మూడురోజుల కార్యక్రమంగా త్రయాహ్నికంగా నిర్వహిస్తాము .మొదటి రోజు స్వామివారికి   అష్ట కలశ  స్నపన ,  మన్యు సూక్తం తో అభిషేకం నూతన వస్త్ర ధారణా అన౦తరం గంధ సిందూరం మల్లెపూలతో ,  ,రెండవరోజు రసం మామిడి పండ్లతో ,మూడవరోజు శ్రీ హనుమత్ జయంతినాడు తమలపాకులతో విశేష పూజ జరుపుతాము .తరువాత  స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం .సాయంకాలం చాలీసా పారాయణ ,స్వామికి వడమాల ఉంటాయి .

ప్రతి శ్రీరామనవమికి శ్రీ సీతారామ కల్యాణం ,శ్రీ  కృష్ణాష్టమి కి బాలబాలికల వేషధారణ వేడుకలు  ,శంకరజయంతి  త్యాగరాజారాధనోత్సవ౦  జరుపుతాం ,కార్తీకమాసం ప్రతిమంగళవారం దీపాలంకరణ  ,పౌర్ణమినాడు లక్ష దీపాలంకారం ఉంటాయి .మాఘమాసం లోఒక ఆదివారం నాడు  ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తాం .దసరా నవరాత్రులలో అమ్మవారిని ఏర్పాటు చేసి రోజుకొక  అలంకరణ చేసి సాయం వేళ సహస్రనామ అష్టోత్తరపూజ అమ్మవారికీ సువర్చలాన్జనేయస్వాములకు చేస్తాం.విజయదశమినాటి రాత్రి శమీ పూజ ఉంటుంది . ముక్కోటి   ఏకాదశినాడు తెల్లవారుఝామున  స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగాజరుగుతుంది .వందలాది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసి పులకించి పోతారు .  మార్గ శిరశుద్ధ  త్రయోదశినాడు శ్రీ హనుమద్ వ్రతం అత్యంత వైభవంగా మూడురోజులు నిర్వహిస్తాం . ఇలా ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అభివృద్ధి చెందుతోంది . ధనుర్మాసంలో అపర వైకుంఠంలాగా ,నవరాత్రులలలో సకల శక్తి  వంతుడు అభయప్రదాత స్వామి శ్రీ లలితా పరమేశ్వరి కొలువైఉన్న అపర శక్తి క్షేత్రంగా ,కార్తీకమాసం అపర కైలాసంగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం శోభిల్లుతుంది. స్వామి శివ విష్ణు శక్తి అంశ సంభూతుడుగా దర్శనమిస్తాడు ,ఉగాది ఉదయం పంచాంగ శ్రవణం ప్రత్యేకత .సంక్రాంతి ఉదయం సంక్రాంతి పురుష స్వరూపస్వభావాల వివరణ జరుగుతాయి .

   పత్యేక కార్యక్రమ నిర్వహణ

ఆలయ నిర్మాణం జరిగి 20ఏళ్ళు దాటిన సందర్భంగా 11రోజల ప్రత్యేకకార్యక్రమం జరిపిచాం .ప్రతి రోజు ఉదయం మన్యుసూక్తంతో స్వామివారలకు అభిషేకం   హోమ౦ , సహస్రనామార్చన ,సాయంత్రం మళ్ళీ హామ౦ ,స్వామి వారలకు శాంతి కల్యాణం జరిపాం .భక్తుల స్పందన అపూర్వం .గీతామందిరం అర్చకస్వాములు శ్రీ స్వర్ణ నాగేశ్వరరావు గారిఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏలూరుకు చెందిన వేదపండితులు అత్యంత శ్రద్ధాసక్తులతో పరమ నైస్టికంగా మహా వైభవంగా  మా దంపతులతో నిర్వహింప జేశారు .మా  దంపతులతోపాటు  సాయంత్రం శాంతికల్యాణానికి 11రోజులు ఒకరిద్దరు దంపతులు పాల్గొని మహద్భాగ్యం పొందారు

  2015లో 5 రోజులపాటు శ్రీ హనుమజ్జయన్తిని ఉదయ౦ హోమం,పుష్పయాగం ,మామిడి పళ్ళపూజ  ,సాయంత్రం కల్యాణం తో నిర్వహించాం .జయంతి రోజున నేను రాసిన సరసభారతిప్రచురించిన  201దర్శనీయ ఆంజనేయ దేవాలయ పుస్తకం ఆవిష్కరింప జేశాం .2016లో శ్రీ హనుమజ్జయంతిని ,నిత్య సాయం కల్యాణం తో 3 రోజులు జరిపాం .సరసభారతి కార్యక్రమాలు ఎక్కువభాగం ఆలయం లోనే జరుపుతాం  .ఆలయం లో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులు  ఆసక్తిగా ముందుకు వచ్చి అన్నివిధాలా సహకరి౦చి జయప్రదం చేస్తున్నారు .అర్చకస్వామి ఛి వేదాంతం మురళీ కృష్ణ నా శిష్యుడు .బాధ్యతగా అన్నీ నిర్వహిస్తూ భక్తులకు సంతృప్తి కలిగిస్తున్నాడు .2017ధనుర్మాసం లో ప్రభాత సీవ లో వెన్నపూస తో మూల విరాట్ కు అభిషేకం జరిపించి తర్వాత ప్రసాదంగా పంచి పెట్టి ,ప్రతియేడూ అలానే చేస్తున్నాం .

  శ్రీ సువర్చలాంజ నేయ స్వామిపై శతకం రాయి౦చాలన్న కోరిక నాకు ఉండేది .స్వామి అనుగ్రహం తో శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులు చేత ‘’శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకం ‘’,మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారిచే ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకం ‘’శ్రీ మంకు శ్రీనుగారిచే ‘’శ్రీ సువర్చలేశ్వర శతకం ‘’రాయించి, సరసభారతి తరఫున ముద్రించి  2017 ఫిబ్రవరి 5వ తేదీ మాఘశుద్ధ నవమి  ఆదివారం   ఉదయం ఆలయం లో సామూహిక పాలు పొంగింపుకార్యక్రమం చేసి , 9 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపి ఉదయం 11-30గంటలకు పై శతక త్రయాన్ని స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యుడు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరిమ్పజేసి,కవులకు తలొక 10వేలరూపాయలు ,పట్టుబట్టలు శాలువాలతో   సత్కరించి    కృతజ్ఞత తెలుపుకున్నాం  .మొదటిశతకం  లో  నూటపదహారు రూపాయలు ఆపైన ఇచ్చిన దాతల పేర్లు గోత్రనామాలతో ప్రచురించాం. రెండవ శతకం శ్రీ గోవిందరాజు శ్రీనివాస్ శ్రీ వేణుమాధవ్ సోదరులు తమ తండ్రిగారు స్వర్గీయ  గోవిందరాజు  పరబ్రహ్మానంద శర్మ గారి జ్ఞాపకార్ధం స్పాన్సర్లు గా ఉండటానికి ముందుకు వచ్చారు .మూడవదానిని మా దేవాలయమే ముద్రించింది .శతక త్రయాన్ని శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకే అ౦కితమిచ్చాం .అందరికి కమ్మని విందు భోజనం ఏర్పాటు చేసి సంతృప్తి చెందాం .భక్తుల తోడ్పాటు తో ఇన్ని కార్యక్రమాలు  ఆలయం లో నిర్వహిస్తున్నాము .వీటన్నిటికి శ్రీ సువర్చలాన్జనేయస్వాముల సంపూర్ణ కరుణా కటాక్షాలే మాకు రక్ష .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130

ఎయిత్ వండర్ Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -129 సువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా దారి తీరు -129

శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని  ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు రావిచెట్టుబజారు లో ,పుల్లేరు కాలువకు ఇవతల ఉన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ‘’గబ్బిట’’వారి దేవాలయంగా ప్రసిద్ధమైంది .సుమారు 300 ఏళ్ళక్రితం మా నాన్నగారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారి మాతామహులు అంటే మా నాయనమ్మ నాగమ్మగారి  తండ్రిగారు శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులుగారు ఇప్పుడు ఆలయం ఉన్న చోట స్వంత స్థలం లో స్వంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించి ,ఉత్సవ మూర్తులనూ,ధ్వజస్తంభ ప్రతిష్ట చేసి ,ధూప దీప నైవేద్యాలకు కొరత లేకుండా ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి శ్రీ ఆ౦జ నేయస్వామి పుట్టినరోజు ‘’శ్రీ హనుమజ్జయంతి ‘’తో పాటు శ్రీ సువర్చలాన్జనేయస్వాముల శాంతికల్యాణాన్నీ ఘనంగా నిర్వహించేవారు .ఆలయం లోనే ఈశాన్యభాగాన  రోడ్డుకు దగ్గరగా కళ్యాణ మంటపం ఉండేది .కోరిన రోరికలు తీర్చే దైవంగా అండా,దండా గా  స్వామి సుప్రసిద్దుడయ్యాడు .అర్చకస్వాములు కూడా అత్య౦త భక్తీ శ్రద్ధలతో స్వామి కైంకర్యం చేసి పునీతులయేవారు .నరసి౦హావధానులుగారి మరణానంతరం ,మా తండ్రిగారు ఆలయ ధర్మకర్త గా ఉండి, అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరిపించేవారు .ఐతే ఆలయంతూర్పు వైపుకు  బాగా ముందుకు ఉండి,వెనుక పడమర వైపు ఎక్కువ ఖాళీ ఉండటం వలన ,ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగేదికాదు. అయినా కల్యాణం ,హనుమజ్జయంతి ఘనంగానే జరిగేవి .ఈలోగా కాలక్రమంలో ఆలయానికి ముందున్న రోడ్డు ఎత్తు పెరగటం ,ఆలయం లోతుగా ఉండటం తో వర్షాకాలం లో నీరు అంతా ఆలయం లోనే ఉండిపోయి,లోపలి వెళ్లి దర్శనం చేయటం కూడా దుర్లభమైంది .నిజంగా చెప్పాలంటే ఆ బురద వాసన నీటిలో ఈదుతున్నట్లుగా  బట్టలు పైకి మడిచి ,వెళ్ళాల్సి వచ్చేది .దక్షిణ ప్రక్కన పందుల పెంపకం వాళ్ళు ఉండేవారు .కనుక ఆ పందులన్నీ ఆలయం లో బురద నీటిలో చేరి పిల్లాపాపలతో జుగుప్స కలిగించేవి .ఇదంతా భరిస్తూనే ఉన్నాం .పూజారులకు, మాకూ , భక్తులకు అందరికి  చెప్పలేని అసౌకర్యం కలిగేది .స్వామి ఎలా భరించాడో ఆశ్చర్యమేస్తుంది  .అయినా నిత్య ధూప దీప నైవేద్యాలు యధాప్రకారం జరిగేవి .గర్భాలయం ఇటుకలతో  సున్నం తో కట్టబడి, శిఖర,విమానాలు ఉన్నాయి .ముందుభాగం చిన్న తారసరాయి డాబా .దానికే ఘంట .కూర్చోటానికి నాపరాళ్ళు .నిర్మించి చాలాకాలం అవటంతో ఆలయగోడల రాళ్ళు ఊడిపోవటం, సున్నం రాలిపోవటం, కళ్యాణమండపం కూడా దెబ్బతినిపోవటం ,తో ఆలయం ఎప్పుడు కూలిపోతుందో అనే భయం ఏర్పడింది .1961లో మా తండ్రిగారి నిర్యాణం తర్వాత నేను వంశపారంపర్య ధర్మకర్తగా  బాధ్యతలు చేపట్టాను .జయంతి, కల్యాణం జరుపుతూనే ఉన్నాము .ఆలయం లోకి ప్రవేశించాలంటే భయపడే పరిస్థితి .రోజు రోజుకూ శిధిలమై పోవట౦ ,తాపీ మేస్త్రిని పెట్టి   ఏదో బొక్కలు పూడ్పిస్తూ కాలక్షేపం చేశాము .అదొక రకమైన నిస్సహాయ స్థితి .మా కుటుంబం ఒక్కరివల్లా అయ్యేపనికాదని పించింది .ఒకసారి ఉయ్యూరు విష్ణ్వాలయం లో అందరినీ సమావేశ పరచి ఆలయ దుస్థితి వివరించి సహకారం కోసం అర్ధించాము .కాని స్వామి అనుగ్రహం కలగలేదు . ఒకరూపాయి, రెండు రూపాయలు మాత్రమె చందాలు ఇచ్చారు.ఒకరిద్దరు దాతలు వందరూపాయలు ఇచ్చారు .ఇదంతా సుమారు ఏడెనిమిది వందలు అయి ఉంటుంది .నాకు అత్యంత ఆప్తుడు ,ఎల్ ఐసి ,సేవింగ్స్ నిర్వహించే ,నిఖార్సైన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ,ధర్మానికి, న్యాయానికి, నిజాయితీకి నిలబడే మా బజారులోనే రాజాగారి కోటదగ్గర స్వంత డాబాలో చిల్లర కొట్టు నడిపే   శ్రీ మండా వీరభద్రరావు  నాకు పూర్తి సహాయకారి .మా ఇద్దరి జాయంట్ అకౌంట్ లో ఆ డబ్బును స్టేట్ బాంక్ లో జమ చేశాము .నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతూనే ఉన్నాయి .అర్చకస్వాములు ఎప్పటికప్పుడు నన్ను కలిసి హెచ్చరిస్తూనే ఉన్నారు .స్వామిపై అచంచల విశ్వాసం భక్తులకు ఉండేది .తమ అనుభవాలను చెప్పుకొనేవారు కూడా .

                         నూతన ఆలయ నిర్మాణం

    భక్తరామ దాసు సినిమాలో మహా భక్తురాలు పోకల దమ్మక్క ‘’మన సీతారామ స్వామికి మంచి గడియలు  వచ్చేశాయి . ‘’అని పాడినట్లు ,మా ఆలయానికీ మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నాం .పదేళ్ళ తర్వాత ఆలయానికి ముందున్న రోడ్డుకు దక్షిణాన  పుల్లేరుకాలువ పై వంతెన నిర్మించారు .అప్పుడు నాకూ మా కుటుంబ సభ్యులకు ,శ్రేయోభిలాషులకు ,గ్రామస్తులకు బలీయమైన ఆలోచనకలిగి ,స్వామి అనుగ్రహం తోడై ,ఒక కమిటీ ఏర్పడి నూతన ఆలయం నిర్మించాలన్న దృఢ మైన సంకల్పం కలిగింది .ఈ సారి స్వామి అందరి మనసులలో స్థిరంగా కూర్చున్నాడేమో ఇప్పుడు ఎవరిని  అడిగినా 1,116రూపాయలు కు తక్కువ చందా ఇవ్వలేదు. అప్పుడు మా మనసు కుదుట బడింది .నాకూ వీరభద్రరావు కు ఉయ్యూరు ఎలేక్త్రిసిటి  డిపార్ట్మెంట్ లో లైన్ మాన్ చేసిన మహా  హనుమ భక్తుడు శ్రీలంకా  సంజీవరావుగారి సహకారం లభించింది ..

           మహా భారతం లో అర్జునుని ధర్మ సంకటం లో నేను

   రసీదు పుస్తకాలు అచ్చు వేయించాము .డబ్బు ఇచ్చినవారికి రసీదులిస్తున్నాము .మేముముగ్గురం కాలికి బలపం కట్టుకొని నేను లూనామీద ,వాళ్ళిద్దరూ వీరభద్రరావు టివిఎస్ మీద ఉయ్యూరులో చుట్టుప్రక్కల గ్రామాలలో కరపత్రాలు పంచుతూ ,ఇచ్చినడబ్బుకు రసీదులిస్తూ  సమకూరిన ధనాన్ని స్టేట్ బాంక్ లో మళ్ళీ నాపేర వీరభద్రరావు పేరా ఇద్దరి జాయింట్  అకౌంట్ లో జమ చేస్తున్నాము .కొంతవరకు ఆశా జనకంగా పనులు మొదలు పెట్టటానికి తగిన ధనం చేకూరింది .మా కుటుంబం తరఫున 10 వేల రూపాయలు అందజేశాను .

   నూతన ఆలయం నిర్మించాలి అంటే పాతఆలయాన్ని కూల్చాలి .ఆస్వామిని వేరొక చోట తాత్కాలికంగా పెట్టి నిత్యదూప దీప నైవేద్యాలు కలిగించాలి అని పూజారులు చెప్పారు .సరే అని పూజారి శ్రీ వేదాంతం వాసుదేవాచార్యులు గారి సలహాతో మేము నలుగురం బందరు వెళ్లి ఆలయ శాస్త్రంలో ఘనాపాటి ,ఆయుర్వేద వైద్యం లో మేటి ,ఇంట్లో శ్రీ హయగ్రీవ ఉపాసనతో ఎందరెందరికో జబ్బులు నయం చేసిన జ్యోతిష్ శాస్త్రవేత్త ,పంచాంగ కర్త శ్రీమాన్ వేదాంతం అనంత పద్మనాభాచార్యులవారిని దర్శించి మంచి  ముహూర్తం పెట్టమని కోరాం.వారు మేము చెప్పినదంతా ఆలకించి ,తాము ఒకసారి ఆలయం సందర్శించి వచ్చి ముహూర్తం పెడతానన్నారు .సరే అని వారికి కారు ఏర్పాటు చేసి రప్పించి ఆలయం అంతా చూపించాం .వారు కొలతలుకొలుచుకొని వెళ్లి ,పాత ఆలయం తీసేయటానికి ,నైరుతిపెరగకుండా నూతన ఆలయ నిర్మాణానికి సుమూహుర్తం పెట్టారు వారిని యధాశక్తి సత్కరించి ముహూర్త పత్రాలు తెచ్చుకోన్నాము .

  ఇంతవరకు బాగానే ఉంది .పనులలో నేను పాల్గొంటున్నాకాని ,మనసులో ఏదో బాధగా ఉంది .పాత ఆలయం కూల్చే ముహూర్తానికి సుమారు రెండు నెలలక్రితమే మా అన్నయ్యగారి అబ్బాయి చి.రామనాధ బాబు కు మద్రాస్ లో  ఉండేమా పెద్దక్కయ్య బావలు శ్రీమతి గాడేపల్లి లోపాముద్ర శ్రీ కృపానిధి దంపతుల  రెండవకుమార్తె చి.ల.సౌ .జయలక్ష్మి నిచ్చి ఉయ్యూరులోనే వివాహం జరిపించాం.మా అన్నగారు రామనాథ్ నెలపిల్లాడప్పుడే నేచనిపోవటం చేత ,మా అమ్మానాన్న ఆకుటుంబాన్ని  వాడినీ వాడి అక్క శ్రీమతి వేదవల్లిని పెంచి పెద్ద చేశారు .అంతా ఉమ్మడి కుటుంబమే.కనుక  మానాన్నగారు మరణించారుకనుక వేదవల్లి పెళ్లి ,వీడి పెళ్లి  మా దంపతులు పీటలమీద కూర్చుని వివాహం చేశాం .కనుక నాకు ఒక ధర్మ సందేహం పీడిస్తోంది .పెళ్లి జరిగి కనీసం ఆరునెలలు కాలేదు ఇప్పుడు ఆలయం కూల్చటం బాగుంటుందా ?మనసుకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాను .గుంజాటన పడ్డాను .ముహూర్తం పెట్టించుకొచ్చిన మర్నాడు ఉదయమే వీరభద్రరావు దగ్గరకు వెళ్లి పాత ఆలయం కూల్చటానికి మనసు ఒప్పటంలేదని ,కొత్త ఆలయం నిర్మాణం మనవల్లకాదని కనుక ఇంతటితో పనులు ఆపేద్దాం అని అర్జున విషాద యోగం చూపించాను .అతడు చాలా తాపీగా  నాకు అన్ని విధాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు .అయినా నా మొండి పట్టు వదలలేదు .చివరికి ‘’మాస్టారూ !మీ కుటుంబం లో మీరు తప్ప ఇంకెవరూ ఈ పనికి పూనుకోరు .పూనుకోలేరు .మీ వల్లనే కొత్తాలయ నిర్మాణం సాధ్యం .స్వామి మనకు మంచి దారి చూపించాడు .ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చి ఇప్పుడు ఇలా కాడి పారెయ్యకండి .మేమంతా మీ వెనుక ఉంటాం .కష్ట నష్టాలు భరిద్దాం .మంచి అవకాశం ,ఇక వెంక అడుగు వేయకండి .’’అని చెప్పాక మనసుకుదుటబడి   పొంగినహనుమ లాగా సంతోషంతో ఆలయ నిర్మాణ పూనిక నిశ్చయంతో ఇంటికి తిరిగి వచ్చాను . అంతే మళ్ళీ వెనకడుగు వేయనే లేదు అన్నీ యధాప్రకారం స్వామి అనుగ్రహంతో చకచకా పనులు జరిగిపోయాయి .

   ఆలయ నిర్మాణ పర్యవేక్షణ భావన నిర్మాణం లో అనుభవమున్న ,భక్తులు శ్రీ కొల్లి సుబ్బారావు గారికి అప్పగించాం .తమాషా ఏమిటి అంటే తాపీ మేస్త్రి ముస్లిం .అతడే మిగిలినవారి తోడ్పాటుతో కూలీలతో పాత ఆలయాన్ని తీసేశాడు .కొత్తదికట్టాడు . స్వామిని విష్ణ్వాలయం లో పంచపట్టాభి రామస్వామి సన్నిధిలో ఉంచి ,అర్చకస్వామి వేదాంతం రామా చార్యులవారికి ధూప దీప నైవేద్యాల బాధ్యత అప్పగించాం .ఆయన అంతేశ్రద్ధగా నిర్వహించారు .ఆలయ ప్లాన్ కూడా సుబ్బారావు గారిదే .కొందరు జియ్యర్ స్వామిని ,మరికొందరు వేరొక స్వామీజీ ని తీసుకొచ్చి చూపిస్తే మంచిది అని సలహా ఇచ్చారు .మేము  వాటిని పెడ చేవినపెట్టి సుబ్బారావుగారికే పూర్తి స్వేచ్ఛ  ఇచ్చి ఆలయ నిర్మాణం చేయించాం . మరికొంతమంది కొత్తగుడి కడుతున్నారుకదా స్వామి విగ్రహం కూడా కొత్తది చేయించి  పెడితే బాగుంటుంది అన్నారు .నేను ససేమిరా అని ‘’ఈ స్వామి పై మనకు అపారమైన విశ్వాసం ఉంది .ఆయన మనలో ప్రవేశించకపోతే ఇంతటి పని మనవల్ల అయ్యేదికాదు .కనుక ఆస్వామినే పునః ప్రతిస్టిద్దాం.రెండోమాటలేదు  ‘’అని తెగేసి చెప్పిఅలానే పూర్వపు అడుగున్నర  నల్లరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్నే పునః ప్రతిష్టించే ఏర్పాటు చేశాము .తెనాలి వెళ్లి విగ్రహ నిర్మాణ నిపుణులైన శ్రీ  అక్కల కోటయ్య గారిని కలిసి ఉత్సవ విగ్రహాలకు  కిరీటాలకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం .కనుక కల్యాణానికీ ఇబ్బంది లేదు .ముందుజాగ్రత్తగా ఆలయాన్ని రోడ్డులెవెల్ కన్నా దాదాపు మూడు గజాల ఎత్తున నిర్మించాం .గర్భాలయం తో పాటు అంతరాలయమూ ఏర్పాటు చేసి ,దానితర్వాత కూర్చోవటానికి హాలు నిర్మించాము. దీనికి గ్రిల్ ను  మా అమ్మగారి బాల్య స్నేహితురాలు  శ్రీమతి చోడవరపు అమ్మన్నగారిపేరిట కుమారులు ఏర్పాటు చేయించారు .

  స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర నిజ  జ్యేష్ట నవమి గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరా౦శ  యందు 23-6-1988 న శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ  విధానం లో ఆలయ నిర్మాణ ప్రతిస్టాదికాలలో నిష్ణాతులు శ్రీమాన్  వేదాంతం శ్రీ రామాచార్యుల వారి ఆధ్వర్యం లో నేనూ ,నా ధర్మపత్ని శ్రీమతి ప్రభావతి శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశాము .ఆ నాటి కెసీపి ప్లాంట్ మేనేజర్ ,మహా భక్తులు సౌజన్య శీలి శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు ,శాసన సభ్యులు శ్రీ అన్నే బాబూ రాగారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు  .ఆలయ నిర్మాణం లో అన్ని రకాల సహకారాలు అందించిన కెసీపి వారి వదాన్యత ,ఉయ్యూరు ,పరిసర గ్రామస్తుల దాతృత్వం ,సహాయ సహకారాలు మర్చిపోలేనివి . ఉయ్యూరులోని ఊర ,పువ్వాడ ,వెంట్రప్రగడ ,మండా ,వాగిచర్ల ,చోడవరపు మొదలైన కుటుంబాలవారు ,వారూ వీరూ అని ఏమిటి  సమస్తజనం ఇది తమ ఇంటి శుభాకార్యంగా భావించి,పెద్దమనసుతో ఈ పవిత్ర భగవత్ కార్యానికి  అండగా నిలిచి చేయూత నిచ్చారు .ఉత్స విగ్రహాలతో ఆలయం శోభాయమానం అయింది . లారీతో ఇసుక ఉచితంగా కొందరుభక్తులు తోలిస్తే ,కొందరు సిమెంట్ బస్తాలు అందజేశారు .స్వామిపై ఉన్న అచంచల విశ్వాసమే  భక్తీ తాత్పర్యాలే మా అందరి చేత ఇంతటి బృహత్కార్యక్రమాన్ని చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనంతో ,సేవలతో సహకరించారు .

  ఆలయ నిర్మాణ సమయం లో నేను జగ్గయ్యపేట దగ్గర వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది పని చేస్తున్నాను .ప్రతివారం ఉయ్యూరు రావటం నిర్మాణ వ్యవహారాలను చూడటం ,అవసరమైన డబ్బు బాంక్ నుంచి తీసి ఇవ్వటం బండీలమీద మేముముగ్గురం చందాలకు తిరిగి పోగు చేయటం  మళ్ళీ  సోమవారం ఉదయం డ్యూటీకి వత్సవాయి వెళ్ళటం జరిగేది .నేను ఇక్కడ లేకపోయినాపూర్తిబాధ్యత తీసుకొని స్వర్గీయమండా వీరభద్రరావు  స్వర్గీయ లంకా సంజీవరావు గారు పనులన్నీ సక్రమంగా జరిగేట్లు చేశారు .ఆలయ నిర్మాణానికి సుమారు సంవత్సర కాలం పట్టింది . భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది .స్వామిపై విశ్వాసం  పది రెట్లు పెరిగింది .శ్రీ వాగి చర్ల నాగేశ్వరరావు గారు గర్భాలయం లో ఖరీదైన మంచి టైల్స్ వేయించారు .బయట హాలులో మార్బుల్స్ పరిపించారుశ్రీ బూరగడ్డ కృష్ణమోహన్ .శ్రీ ఊర మోహనరావు స్వామికి వెండి తొడుగు చేయించారు .తర్వాత అర్చకులు శ్రీ వేదాంతం లక్ష్మణ దీక్షితుల సహాయం తో ఉస్ట్ర వాహనాన్ని తెనాలి అక్కలవారితో చేయించి తెచ్చాం .తమకోరికలు నేరవేరుస్తున్నందుకు స్వామివార్లకు ఏదో ఓకే రకమైన ఆభారణమో,అవసరమైన స్టీలు ,వెండి సామగ్రియో సమకూరుస్తున్నారు .ఎస్ టి వో ఆఫీస్ లో పని చేసే ఒక అటెండర్ పంచ పట్టాభి రామ స్వాముల సిమెంట్ విగ్రహాలు కొని తెచ్చి సమర్పించాడు .దీనితో శ్రీరామనవమినాడు సీతారామ  కల్యాణం కూడా చేసే వీలుకలిగింది .ఇవి కొంత దెబ్బతింటే బిటెక్ చదివి ,ఉద్యోగిస్తున్న అప్పటికుమారి ఇప్పటి శ్రీమతి గుర్రాల శ్రీదేవి నాలు గేళ్ళక్రితం కొత్త విగ్రహాలు కొని అందించింది .శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు ,ఆయన కుమారుడు కళ్యాణ్ కుటుంబం చిన్న వెండి  ఆంజనేయస్వామిని  తయారు చేయించి సమర్పించారు .కుమారి బిందు దత్తశ్రీ ప్రయాగలో భగవద్గీతా పఠనం లో పాల్గొని సేవ చేసినందుకుశ్రీ గణపతి సచ్చిదాన౦ద స్వామి అనుగ్రహం తో బహూకరించిన వెండి శ్రీ కృష్ణ విగ్రహాన్ని తలిదండ్రులు శ్రీమాదిరాజు శ్రీనివాస శర్మ, శ్రీమతి శివ లక్ష్మి దంపతులు మన ఆలయానికి భక్తితో సమర్పించారు .ఇలా ఎందరో భక్తులు తమకానుకలతోస్వామి అనుగ్రహం పొందుతున్నారు .

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దేవదాస్ కనకాల కన్నుమూత:

దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం By Santhosh Kumar Bojja| Updated: Friday, August 2, 2019, 17:50 [IST] యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. యానం సమీపంలోని కనకాల పేటలో జననం 1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమారంగం వైపు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు ఎందరికో శిక్షణ నటీనటులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. దేవదాస్ కనకాల కుటుంబం దేవదాస్ కనకాల 1971లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే . వీరికి కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ ఉన్నారు. రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ వివాహం యాంకర్ సుమను పెళ్లాడారు. More RAJEEV

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

కవయిత్రి ,నవలా రచయిత, అమృతా ప్రీతం పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది .1919 ఆగస్ట్ 31నలో ఆ నాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో అమృత కౌర్ జన్మించింది .తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ సింగ్ హిత్కారి స్కూల్ టీచర్,పత్రికా సంపాదకుడు ,సిఖ్ మత ప్రచారకుడు .11 యేళ్లకే తల్లి చనిపోతే తండ్రి తోపాటు లాహోర్ చేరి,1947లో జరిగిన దేశ విభజన దాకా అక్కడే ఉన్నది .ఆ సమయం లోనే ‘’అమృత్ లేహ్రాన్ ‘’(అమృత తరంగాలు )కవిత 1936లో 16 వ యేటనే రాసి ప్రచురించింది .ఆ వయసులోనే ప్రీతం సింగ్ అనే సంపాదకుని వివాహం చేసుకొని అమృతా ప్రీతంగా పేరు మార్చు కొన్నది. 1936-43 మధ్యకాలం లో అమృత ఆరు కవితా సంపుటాలు రచించి వెలువరించింది .

రొమాంటిక్ కవితలతో ప్రారంభించి, తర్వాత అభ్యుదయవాద కవిత్వం రాయటం మొదలుపెట్టింది .1943లో వచ్చిన ఘోరమైన బెంగాల్ కరువు కు స్పందించి 1944లో ఆమె వెలువరించిన ‘’లోక్ పీడ్’’ (ప్రజా వేదన )కవిత సంపుటిలో స్పష్టంగా ఈ మార్పు కనిపిస్తుంది .అభ్యుదయవాద కవిత్వోద్యమంలో అమృత పాలుపంచుకొన్నదికూడా .విభజనకుపూర్వం లాహోర్ రేడియో స్టేషన్ లో కొంతకాలం పని చేసింది .దేశ విభజన తర్వాత దంపతులు ఢిల్లీచేరి సాంఘిక సేవాకార్యక్రమాలలోనూ పాల్గొని గురు రాధ కృష్ణ నెలకొల్పి,బాలరాజ్ సహానీ ,అరుణా ఆసఫాలీ లు ఆవిష్కరించిన నమొట్టమొదటి జనతా గ్రంథాలయం కార్యక్రమంలో చురుకైన పాత్ర వహించింది .ఇప్పటికీ ఈ లైబ్రరీ క్లాక్ టవర్ ప్రాంతం లో ఉండి,,ప్రజలకు అందుబాటులో ఉంది.నటుడు ,దర్శకుడు ,దేశ విభజనపై ‘’గరం హవా ‘’సినిమా తీసిన ఎం. యెస్. సత్యు అమృతా ప్రీతం నటన కవిత్వాలకు నివాళి ఆర్పిస్తూ ‘’ఏక్ ధీ అమృతా ‘’అని ప్రశంసించాడు .

1947లో జరిగిన దేశ విభజన తర్వాత 1948 లో లాహోర్ వదలి పంజాబీ శరణార్థి గా 28వ యేట గర్భవతిగా ఉన్న అమృతా ప్రీతం , కొడుకుతో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి చేరింది .తన ప్రయాణ బాధలను, వేలాది శరణార్థుల కస్టాలను కళ్ళకు కట్టినట్లు ఒక కాగితంపై ‘’అజ్జ్ అఖాన్ వారిస్ షాహ్ ను ‘’(వారిష్ షా ను ఇవాళ అడుగుతున్నా )కవిత రాసింది . .ఈ కవితను 16 వ శతాబ్దపు ప్రముఖ పంజాబీ సూఫీ కవి,’’హీర్ అండ్ రంజా ‘’ అనే విషాద కావ్య నిర్మాత ,లాహోర్ లో తన ఆరాధ్య కవి అయిన వారిష్ షా ను ఉద్దేశించి స్మారక కవిత గా (ఎలిజీ) గా రాసింది .

అమృత 1961వరకు ఢిల్లీ ఆకాశ వాణిలో పని చేసింది .1960 లో భర్తతో విడాకులు తీసుకొన్నతర్వాత స్త్రీవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది .ఆమె కవితలలో కధలలో తన విఫల దాంపత్య జీవితాన్నే చిత్రించింది .పంజాబీ ,ఉర్దు భాషలలొ రాసిన ఆమె రచనలన్నీ ఇంగ్లీష్, ఫ్రెంచ్, డేనిష్ ,జపనీస్ ,మండారిన్ మొదలైన వివిధ భాషలలోకి అనువాదం పొంది విశ్వ వ్యాప్తమై ఘన కీర్తి పొందాయి .ఆమె స్వీయ చరిత్ర ‘’బ్లాక్ రోజ్ ,‘’రసీదీ టికెట్ (రెవెన్యూ స్టాంప్ )రచనలు కూడా అనువదింపబడి ఆమె ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి అయింది .ఆమె నవల ‘’ధర్తి సాగర్ తే సిప్పియాన్ ‘’ను ‘’కాదంబరి ‘’సినిమాగా 1965లో మొదటగా తెర కెక్కించారు .తర్వాత ‘’ఉనాహ్ కి కహానీ ‘’ని ప్రముఖ దర్శకుడు బాసు భట్టాచార్య ‘’డాకూ’’ (బందిపోటు )గా తీశారు . ఆమె రాసిన ‘’పింజర్ ‘’(ఆస్తి పంజరం )నవలలో పార్టిషన్ సమయంలో ఇండియా ,పాకిస్తాన్ లలో జరిగిన ఘోరాలు అవమానాలు దౌర్జన్యాలు ,స్త్రీలు పడిన అంతులేని బాధలు చిత్రించింది .ఇందులో ‘’ప్యూరో ‘’అనే పాత్ర స్త్రీలపై చేసిన దుష్కృత్యాలకు ,,హింసకు ప్రతినిధి గా మలచింది .దీన్ని చంద్ర ప్రకాష్ ద్వివేది చలన చిత్రంగా అద్భుతంగా తీయగా అందులోని మానవత్వ విలువలకు ఈ సినిమా అవార్డ్ పొందింది .రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలైన రాజస్థాన్ ,పంజాబ్ లలో దీన్ని చిత్రించారు .ఆమె ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలలోనూ అభిమాన రచయిత్రిగా గౌరవం పొందింది .పాకిస్తాన్ లో తన సమకాలీన రచయితలైన మోహన్ సింగ్, శివకుమార్ బటాల్డి లతో సమమైన కీర్తి, గౌరవాలు అందుకొన్నది .ఆమె కూడా అలాగే రెండు దేశాలమీద అభిమానం చూపింది .

‘’నాగమణి ‘’అనే పంజాబీ మాసపత్రిక సంపాదకురాలుగా అమృతా ప్రీతం 33 యేళ్ల సుదీర్ఘకాలం పని చేసింది .ఇండియా వచ్చాక హిందీలోనూ రాయటం ప్రారంభించింది .తర్వాత ఆమె ఓషో బావ లహరికి దగ్గరై ‘’ఏక్ ఓంకార్ సత్నామ్ ‘’వంటి అనేక రచనలు చేసింది .ఆధ్యాత్మిక పుస్తకాలుగా ‘’కాల్ చేతన ‘’అజ్నాత కా నిమంత్రణ్’’మొదలైనవి రచించింది .తన జీవిత చరిత్ర మూడోభాగ౦ గా ‘’అక్షరోమ్ కె సయీ ‘’(మాటల నీడలు )రాసింది .

సాహిత్య కృషికి తగిన పురస్కారాలు ప్రీతం అందుకొన్నది .మొదటగా ‘’పంజాబ్ రత్తన్ అవార్డ్ ‘’ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతులమీదుగా అందుకొన్నది .1956లో’’సునేహాదే ‘’(సందేశాలు )రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని మొట్టమొదటి మహిళా రచియితగా రికార్డ్ సృష్టించింది .’’కాగజ్ తే కాన్వాస్ ‘’రచనకు భారతీయ జ్ణానపీఠ్ అవార్డ్ కూడా ఆమెను వరించి కీర్తిని మరింత ఇనుమడింపజేసింది .భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ ,తర్వాత పద్మ విభూషణ్ పురస్కారాలు అందించి గౌరవించింది .2004లో సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ,ఢిల్లీ యూని వర్శిటీ,విశ్వభారతి ,జైపూర్ యూని వర్శిటీ ల నుండి గౌరవ డి.లిట్.అందుకొన్న మహిళా మణి అమృతా ప్రీతం .

అంతర్జాతీయ అవార్డ్ లుకూడా అందుకొన్నది .బల్గేరియా ప్రభుత్వం ‘’వాప్సరోవ్ ‘’అవార్డ్ ను 19 79 లో, 19 87 లో ఫ్రెంచ్ ప్రభుత్వం ‘’డిగ్రీ ఆఫ్ ఆఫీసర్స్ డెన్స్ ‘’అవార్డ్ ,అందజేశాయి .భారతప్రభుత్వం ఆమెను రాజ్య సభకు నామినేట్ చేయగా 1986 నుండి 92 వరకు ప్రజా సేవ చేసింది .జీవిత చరమాంక౦ లో ఆమెకు పాకిస్తాన్ లోని పంజాబ్ అకాడెమీ ఆమెకు అవార్డ్ ఇచ్చింది దీనిపై స్పందిస్తూ ఆమె ‘’నా మాతృదేశం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు నన్ను గుర్తించింది ‘’అన్నది .పాకిస్తాన్ సిక్కు సమాజం ఆమెకు ప్రముఖ సూఫీ కవి వారిస్ షా , బుల్లే షా ,సుల్తాన్ బాహూ ల సమాధులపై కప్పే పవిత్ర వస్త్రాలను ఆమెకు పంపారు .

భర్తనుంచి విడిపోయాక అమృతా ప్రీతం ఒంటరితనం బాధ అనుభవించి ,ప్రముఖ కళాకారుడు రచయిత ఇమ్రోజ్ కు దగ్గరై , చివరి నలభైయేళ్లు అతనితో కలిసి జీవించింది .అతనే ఆమె పుస్తకాల డిజైనర్ .ఆమె రచనలను పెయింటింగ్స్ గా చిత్రించాడు .వీరిద్దరి ప్రేమ జీవిత చిత్రణ గా ’’అమృతా ఇమ్రోజ్ ఎ లవ్ స్టోరీ ‘’పుస్తకం రాసింది .86 యేళ్ళ వయసులో తొలి పంజాబీ రచయిత్రి పద్మ విభూషణ్ శ్రీమతి అమృతా ప్రీతం శాశ్వత కీర్తి గడించి మరణించి అమృతత్వాన్ని పొందింది .

అమృతా ప్రీతం రచించిన కవితలను ప్రసిద్ధ హిందీ సినీ పాటల రచయిత గుల్జార్ తన గొంతుతో అద్భుతంగా గానం చేసి రికార్డ్ చేసి 2007 లో విడుదల చేశాడు .60 యేళ్ళ సుదీర్ఘకాలం రచయిత్రిగా రాణించిన అమృతాప్రీతం 28 నవలలు ,18 జీవిత చరిత్రలు ,అయిదు కధా సంపుటాలు,16 ఇతర రచనలు రచించింది .

image.png

-గబ్బిట  దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .అయితే నాకు బాగా ఇష్టుడైన రచయిత ఆచార్య ఎస్వి జోగారావు గారు పట్టిన ‘’నీరాజనం ‘’లో అన్ని విషయాల్లు ఉన్నందున ,’’ఏది తెలిస్తే సకలం తెలుస్తుంది ‘’అన్న ఉపనిషత్ వాక్యం పై నమ్మికగా ,దానిలోని ముఖ్యవిషయాలతో సాహితీ బంధువులకు, ఈ తరం పాఠకులకు శ్రీవారి శేముషిని తెలియ జేస్తున్నాను .

  ‘’పువ్వాడ వారి రచనలు ప్రాచీన ,అధునాతన రీతుల సమ్మేళనం .సంప్రదాయం ,నవ్యత్వాల సమన్వయము .సంస్కృతాంధ్ర పదాల పోహళింపు తో వారి పద్యాలు మధుర గంభీర ప్రసన్న ధారా విలసితాలు. కవితా శైలి లాలిత్య ,ప్రౌఢ గుణ శోభిత౦గా  ,వైదర్భీ రీతితో సహృదయ రంజకాలుగా ఉంటాయి .కవిత ,పాలవెల్లి ,శతపత్రం ఖండికలు ,గోవత్సం ,తాజమహలు ,దారా ఖండకావ్యాలు ఆకాశవాణి ద్వారా విస్తృత ప్రచారం పొందాయి .రాసిన 15 నాటికలలో 9మాత్రమె ముద్రితాలు .వ్యాస సంపుటులుగా ఏరువాక ,మధుకలశం ,ఆంద్ర తేజం మొదలైనవి ఆయన శేముషికి నిదర్శనాలు . ముఖ్యంగా చారిత్రిక వస్తువులను తీసుకొని కవిత రూపకం నవలలు గా రసరమ్య శైలిలో మలచారు .వీరికి అత్యంత అభిమాని సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణ దేవరాయలు .ఆయనపై ప్రచారం లో ఉన్న గాథలకు అక్షర రూపమిచ్చి ‘’ఔరా !,ఎవరు ? చారిత్రిక నవలలు అల్లారు .ఆంద్ర సామ్రాజ్యం రాయలనాటి చారిత్రిక విషయమైన పద్యకావ్యం .రాయలనేకాదు,మహామంత్రి తిమ్మరుసు వ్యక్తిత్వాలను ఉదాత్తంగా  వర్ణించి  శోభ కూర్చారు .పాలవెల్లిలోని ‘’ఆంద్ర భోజ ‘’,ఆంద్ర తేజం లోని ‘’రాయలు –తిమ్మరుసు ‘’కూడా విజయనగర సామ్రాజ్య గాథలే .ప్రతాప రుద్రమదేవి కాకతీయ వీరుల ,సహపంక్తి పల్నాటి వీరుల చారిత్రిక నాటికలే .కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత తెలంగాణాలో జరిగిన సంఘటనలకు స్పందించి ‘’రక్త తర్పణం ‘’బుర్రకథ’రాశారు .ఇందులో వారి పరిశోదనా దృష్టి గోచరమౌతుంది .పువ్వాడ వారి విమర్శ వివేకానికి అద్దంపట్టేవి తిక్కన ,శ్రీనాధ ,పోతనలపై వ్యాసాలు .

 ‘’  దేశ భక్తి పులకా౦కితులై జాతీయ నాయకులైన లాలాలజపతి రాయ్ మహాత్మా గాంధీ మున్నగు వారిపై ప్రశంసా కవితలు కూర్చి మూర్తీభవించిన తమ జాతీయాభిమానాన్ని చాటారు .’’గోవత్సం ‘’కరుణ రస స్వతంత్ర కావ్యం .భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీక .ధర్మం నాలుగుపాదాలతో వర్ధిల్లాలి అన్నట్లుగా నాలుగు భాగాలుగా విజ్ఞతత తో రాశారు .విభాగ శీర్షికలలో  ప్రజ్ఞ కనబరచి, కృతులకు సౌస్టవాకృతి కూర్చారు .’’దారా ‘’కావ్యం అయిదుఖందాలు గా రాయటం లో నాయకుని పంచప్రాణాలు ప్రకృతిలో విలీనం కావటాన్ని సూచిస్తుంది .అలాగే ‘’ఆంద్ర సామ్రాజ్యం ‘’లో అయిదు సర్గలు –రాజాజ్న,అసిధార ,ధర్మ సూచీ ,ఉపదేశం ,అభిషేకం ఈ దృష్టి నే సూచిస్తాయి .కావ్యం అసంపూర్ణమే అయినా రాయల పట్టాభి షేకం తో ముగిసి సమగ్రరూపం పొందింది .లాక్షణికుల పంచ సందుల సూత్రాన్ని ఒడిసిపట్టుకొని రాశారు .చోడవరపు జానకి రామయ్యగారితో కలిసి అల్లిన ‘’కవిత ‘’సంపుటి లో శీర్షికలు తొలిచూపు ,మలిచూపు,తుది చూపు అర్ధవంతాలై ప్రత్యేకత కనపరుస్తాయి .

 ‘’ జాతీయాభిమానం పుష్కలంగా ఉన్న పువ్వాడవారు సంకుచిత మనస్కులు కారు .మొఘల్ సామ్రాజ్య షాజహాన్ ,దారా ల కరుణ గాథను కళ్ళకు కట్టించారు .వీరి తాజమహల్ ,దారా కావ్యాలను జంటకావ్యాలనవచ్చు ,జాషువాగారి ‘’ముంతాజమహల్’’తర్వాత అంతటి  ప్రాచుర్యం పొందింది పువ్వాడవారి ‘’తాజమహల్ ‘’.జాషువా గారి ‘’రాణి విడచిపోయె రాజు నొంటరి జేసి-రాజు విడిచిపోయె రాజ్యరమను –రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర-తాజీ విడువ లేదు రాజసంబు ‘’అనే చివరిపద్య భావానికి , పువ్వాడ వారి –‘’మొగలు ప్రభుత య౦తర్హితమగుట కేమి –చందురుని చల్వతో తాజి చలువ   నిలుచు –కాలవాహిని తాజి మ్రింగగలనాడు –నిలుచు నీ తాజిప్రణయ సందేశగీతి ‘’పొడిగింపుగా ఉందన్నారు ఆచార్య ఎస్వీ .జాతీయ సమైక్యతకు ప్రాతినిధ్య మైన పువ్వాడ వారి గోవత్సం,తాజమహల్ ,దారా లు కరుణ రస పోషణలో ఆయన వైదగ్ధ్యాన్ని ఎలుగెత్తి చాటాయి అని ఎస్టిమేట్ చేశారు .

‘’  బందరులో 40 ఏళ్ళు గడిపిన శేషగిరిరావుగారికి బందరు అంటే పంచప్రాణాలు ,వీరాభిమానం ‘’రస ప్రబుద్ధులకు స్వస్థాన వేషభాషలు సహజాలంకారం ‘’అన్నాడట ఆదికవి నన్నయ .అలాగే రావు గారు బందరుపై ‘’  బృందావనం’’శీర్షికతో కోపల్లె హనుమంతరావు ,పట్టాభి సీతారామయ్య ,ముట్నూరి కృష్ణారావు ప్రభ్రుతుల పై ప్రశంసా పద్య లహరి పారించారు .బందరును సాహితీ సుక్షేత్రంగా మలచిన కవితా గురుపీఠాలైనచెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి ,పింగళి లక్ష్మీకాంతం ల పైనా ఆరాధనాభావ పద్య సుమమాలలల్లారు .విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో తన నాటికా ప్రసారానికికి ప్రోత్సహించిన శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారిని విశిష్టంగా స్మరిస్తూ ‘’సహపంక్తి ‘’రూపకాన్ని అంకితమిచ్చారు .

‘’సృష్టిలో కాని ,విమర్శలోకాని ఏదైనా  వైశిష్ట్యం లేకపోతె రచయితకు కలం పట్టవలసిన పని లేదు ‘’అని పువ్వాడ వారిసిద్ధాంతం.

‘’నీ జగన్నాధ పండితరాయలె షాజహాన్ ఆస్థానకవిమణి,నీ శిల్ప చాతుర్యమే ముంతాజ్ వెండి  కుంకుమ బరిణ,నీ అమరావతీ అఖిల విద్యలే ఖండఖండా౦తరాక్రాంత కళలు ,నీ త్యాగరాజ వాణి మరందమే దక్షిణ దేశ సంతర్పణ –

‘’భారతీయుల సంస్కృతి ప్రాభవమున –నాడు నేడును ,నీవాడు నాణె గాడు

నాడు మరువకు ,నేడు వెన్కాడ బోకు –  రమ్ము రమ్మాంధ్ర  కొమ్ము నీరాజనమ్ము ‘’అని తెలుగు దేశానికి నీరాజనం పలికి ,తెలుగువారిని ఎలుగెత్తి పిలిచారు కవిపాదుషా.’’

 ఇంతవరకు చెప్పినది అంతా శ్రీ ఎస్వి జోగారావుగారి గారు చెప్పిందే .నేను  పుస్తకం ,ఆయన సాహిత్య వ్యక్తిత్వాలన్నీ చదివి  రాయాల్సిన పెద్దపని ఆచార్యశ్రీ వ్యాసం తప్పించింది .వారికి నమోవాకాలు .

  ఇవికాక కొన్ని విషయాలు .కృష్ణాజిల్లా మొవ్వలో శేషగిరిరావుగారు 12-7-1906లో శ్రీమతి అన్నపూర్ణమ్మ ,శ్రీ సుందరరామయ్య దంపతులకు జన్మించారు .స్వయం కృషితో ఉభయభాషా ప్రవీణ ,పిఒఎల్ పట్టాలు పొందారు .విజయవాడలో 1928నుంచి 34వరకు ,6ఏళ్ళు ,బందరుహిందూ హైస్కూల్ లో 1934నుంచి -35వరకు తెలుగుపండితులుగా 1 ఏడాది ,ఉద్యోగించి ,బందరు హిందూ కళాశాలలో 1935నుంచి 47వరకు 12ఏళ్ళు ,విజయనగరం మహారాజా కాలేజిలో 1947నుంచి 51 వరకు 4ఏళ్ళు,మచిలీ పట్నం ఆంద్ర జాతీయ కళాశాలలో 1951నుంచి 70వరకు 19ఏళ్ళు  ఆంధ్రోపన్యాసకులుగా ,మొత్తం 42సంవత్సరాలసుదీర్ఘకాలం తెలుగు భాషా బోధనచేసిన ఘనచరిత్ర వారిది .సాహితీ క్షేత్రం లో తనకై ఒక విశిష్ట స్థానం సంపాదించుకొని 75 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 24-5-1981న ‘’దివిజ కవివరుల గుండియల్ దిగ్గురనగ దివిసీమలో జన్మించిన  ‘’కవిపాదుషా  పువ్వాడ శేషగిరిరావుగారు  దివిని చేరారు.

 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు పువ్వాడవారికి బందరులో శిష్యులు. పువ్వాడ వారిలాంటి గురు ప్రముఖులను స్మరించటానికి 1973-74లోనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురుపూజోత్సవంగా ప్రకటించారు మండలి .నాటిముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి సమక్షం లో తమ గురుదేవులైన పువ్వాడ వారిని అత్య౦త భక్తి శ్రద్ధలతో గౌరవంగా సత్కరించి గురూణ౦  తీర్చుకొన్నారు .

  భ.రా.గో పువ్వాడవారికి’’ విజీనగరం’’ లో శిష్యుడు.1950డిసెంబర్ లో హాఫ్ యియర్లి తెలుగుపేపర్లు దిద్ది ,కట్ట తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో టేబుల్ మీదపెట్టి, పువ్వడమాస్టారు నిలబడే ఉన్నారు. ఆయన కూచు౦టేనే అందరూ సిట్ డౌన్.గురూజీ కూర్చోలేదు. శిష్యులూ అంతే.ఉన్నట్లుండి పువ్వాడవారు ‘’నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను ‘’అన్నారు  . అవాక్కయింది విద్యార్ధి బృందం  .వారిలో ముదురు వయసు వాసుదేవరావు ‘’బందర్లో బాగాలేదని ఇక్కడికొచ్చారు .మీ పిల్లలు చిన్నవాళ్ళు .మీరు రాజీనామా చేస్తే —?’’అని అర్దోక్తిగా అన్నాడు .అప్పటికీ మాస్టారి గుండె కరగలేదు .నిలబడే ఉండి,కట్టలోంచి ఒక ఆన్సర్ పేపర్ తీసి ‘’రామగోపాలానికి నూటికి 9మార్కులొచ్చాయి .ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేయన్రా “?అన్నారు .అందరూ భ.రా.గో.ను హీనంగా చూసి ఏవగించుకొన్నారు . గోపాలం రెక్కట్టుకొని వాసు స్టేజి పైకి తీసుకెళ్ళి మాస్టారిని కుర్చీలో కూర్చోపెట్టి ,పిల్లల్ని కూచోమని సంజ్ఞ చేయగా, వాళ్ళూ కూర్చున్నారు .తనకు తక్కువ మార్కులు రావటానికి సంజాయిషీ చెప్పాడు గోపాలం .డిసెంబర్ 15లోపు బి.ఏ .పరీక్ష ఫీజు 60 రూపాయలు ఫైన్ లేకుండా కట్టాలని యూని వర్సిటి హుకుం .ఎలాగో అలా తంటాలుపడి  రెండు  నెలల ముందునుంచి కస్టపడి 55 రూపాయలు కూడబెట్టాడు .ఇంకొక్క అయిదు రూపాయలు కావాలి .14సాయంత్రం ‘’గండ కత్తెర వ్యాపారస్తుడు’’గా పేరుపొందిన బత్తుల వజ్రం గారిని కలిసి గోడు చెప్పుకున్నాడు .తానూ 5 రూపాయలు ఇస్తానని , ఆ రోజు దీపాలు పెట్టేశారుకనుక మర్నాడు పొద్దున్న 9 గంటలకు వస్తే ఇస్తా అన్నాడు  షావుకారు .ఉదయం 8 కే తెలుగు క్వశ్సిన్ పేపర్ ఇస్తారుకనుక ,అరగంట దాటితే కాని ,బయటకు పంపరు కనుక  ఎనిమిదిన్నర వరకు రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసి  ఆన్సర్ పేపర్ ఇచ్చేసి, షావుకారు దగ్గరకెళ్ళి వాగ్దానం చేసిన 5రూపాయలు తెచ్చుకున్నానని సవివరంగా చెప్పాడు కుర్ర భరాగో .ద్రవించిన పువ్వాడ తెలుగుమాస్టారు’’అలా చెప్పు .లేకపోతె నీకు 70 మార్కులు రావాలి .అవునూ ఆ ఐదు రూపాయలు నన్నెందుకు అడగలేదు “’అన్నారు అని భరాగో ‘’  మా తెలుగు మాస్టారు ‘’వ్యాసం లో రాశారు .ఇందులో తాను బోధించిన సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినదుకు బాధ ,అవమానం ,బాధ్యతా ,అంకితభావంతో పాటు ,  ఆడబ్బు తానె ఇచ్చేవాడిని అనే కారుణ్యం  స్పష్టంగా కనిపిస్తాయి  .సమర్ధుడైన ,తర్వాతకాలం లో కరుణా విలసితుడైన ,హాస్య రచనలో సమర్ధుడైన మంచి శిష్యుడు భరాగో ను  తయారు చేసిన పువ్వాడ మాస్టారు  అభిన౦దనీయులు .

   చివరగా ఆచార్య ఎస్వి ఉటంకించిన మధురకవి మూలా పేరన్న శాస్త్రి గారి

‘’ధారా శుద్ధి ,రస ప్రవృద్ధి ,పదసంధాన క్రియా చాతురీ –పారీణత్వవిశుద్ధి ,భక్తిగుణ సంపన్మాధురీ వృద్ధి ,సం

స్కారోదార కవిత్వ సంభ్రుత కళాసంబద్ధ చిత్రోక్త్యలం—కారాత్యంత సమృద్ధి,తత్కవితలో గర్భించు సంశుద్ధిగా ‘’

పద్యంతో పువ్వాడ వారికి నీరాజనం పలుకుతున్నాను –

 తొలి శ్రావణ శుక్రవార శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది  నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి కనుక  దానికి పూర్తి న్యాయం చేశారు .వృద్ధ దొమ్మరిసాని వర్ణనలో –

‘’ప్రత్యక్ష పాంచాల ,బాహానటనల –ప్రాస యతి చ్ఛేక పాకశయ్య

దేవ భాషా గ్రామ్య దేశ్యప భ్రంశల –తత్సమానా౦ ద్రోక్తుల దప్పకుండ

నవరసాలంకార నానార్ధ శబ్దముల్ –వగలయ క్రియలు నగుపడంగ

గూడార్ధ భావముల్ రూఢిగా  దెల్పుచు-బర తత్వ సిద్ధాంత పటిమ నెరయ

బహు చమత్కార యుక్త వాచా ప్రగల్భ్య –స్పుట నిరాఘాట పద గు౦ఫ పటిమ యొదవు’’

అని చెప్పిన దాన్ని బట్టి అవన్నీ ఆయనకవిత్వం లో రాశీ భూతమైనాయి .

  సంప్రదాయ విధానం లో శ్రీకారం తో పద్య రచన ఆరంభించి ,ఇష్టదేవత స్తుతి ,శేష గరుడ విశ్వక్సేనాదుల వర్ణన ,పూర్వకవి స్తుతి కుకవినింద ,కృతిపతి ఐన నల్లగొండ జిల్లా పెద్దవూరమండలంచిన్న గూడెం దగ్గర గుహలో వెలసిన తమ కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రశంసా చేసి  షష్ట్యంతాలు చెప్పారు .తమకావ్యాన్ని మహా ప్రబంధంగా పేర్కొన్న కవిగారు గురు సేవ మోక్షప్రసాది కనుక  ఆచార్య ప్రాశస్త్యాన్ని తెలియజేసి శ్రీహరి చిద్రూప ధారాకృతి తో ప్రజలను దీమంతులను చేయటానికి  ‘’దేశికాకృతి’’దాలుస్తాడని ఒక పద్యం చెప్పారు –

‘’ఆరున్మూడును ,రెండు నేడు,నొకటిన్నజ్ఞాన సంబందమై –జేరం గన్గొని,చిత్తగించి ,,హరియుం జిద్రూప ధారా కృతిం

గారుణ్యంబున ,దేశికాకృతి యు నై,గన్పట్టె నీ ధాత్రిలో –దీరోదారత చేత నౌఘములనున్ దీమంతులుం జేయగా ‘

’  క్షాత్ర వంశం లో పుట్టినా క్షాత్ర ధర్మానికి దూరమై ,మహాపాపియై  ‘’క్షత్రబందు ‘’అనే చెడ్డపేరు తో ఉపనయనం అయినా తీరుమారక   కొడుకుకు చెప్పలేక తండ్రి వానప్ర స్థాశ్రమం తీసుకోగా ,ఏక చత్రాది పత్యంగా పాలిస్తూ మరింత పాపియై స్త్రీ హింస కూడా చేయించాడు . ధర్మ భ్రస్టత సహించని వ్యాసమహర్షి   వచ్చి హితోపదేశం చేసినా మారలేదు .కోపంతో ఆయన రాక్షసుడివి కావలసినదని శపించాడు .కాళ్ళమీద పడితే 12ఏళ్ళు రాక్షసుడి వై జీవించి ‘’దుర్జన సహవాసముచే –నిర్జన ప్రధమా౦గ మున ను ,నెగడుచు ధరణీ

నిర్జరు సహవాసముచే –నర్జర రిపు రూపు వదలు నీకు నృపాలా “’అని శాప విముక్తి అనుగ్రహించాడు.

 వాడు అలాగే 12ఏళ్ళు భ్రస్ట జీవితం గడిపి ,తర్వాత ఒక రోజు పుండరీక ముని ఆదారిలో వస్తూ దుర్వాసన గమనించి ఆ ఆవాసం వాడిదే అని గ్రహించి  వెళ్లగా వాడు చంపి తింటాను అని బెదిరించాడు .కానీ ఆయన వాడిని పట్టుకొని మంచిమాటలు చెప్పి ,గౌతమీ స్నానం చేయించి  తిరుపు౦డ్రాదులు  ధరింపజేసి శిష్యుడిని చేసుకొని ,శాప విముక్తుడిని చేసి ,విష్ణు గాధలు బోధించి తనతో తీసుకు  వెడతాడు .

  చివరి భాగం లో తిరుమంత్ర ప్రభావం వలన క్షత్ర బంధు  దీనుల హీనులను సేవించి భానుమతిని పెళ్ళాడి సుమిత్రుడు అనే పుత్రుని పొంది ,సర్వ సౌఖ్యాలు పొందాడు .దొమ్మరులకు కూడా తిరుమంత్రార్ధం బోధించి పునీతుల్ని చేస్తాడు .ఇలా కథను క్లిష్టత లేకుండా రసబందురంగా సులభరీతిలో రాశారు కవి

  ప్రబంథం కనుక అష్టాదశ  వర్ణనలు ఉన్నాయి .కరువును వర్ణిస్తూ అది ‘నిఖిల నరశుష్క కాంతార వ్రాతంబు దహించే వహ్ని ‘’ఆని ,’’లేమి గాదిది మనుజ హామిక శైలాలి పాటనం బనరించు పవి యనంగ ‘’క్షామం కాదు ఇది ‘’ప్రాణుల విలయం చేసే హాలాహలం ‘’అని వర్ణించారు .వసంతం ను వర్ణించే ఆరుపద్యాలు రసగుళికలే –

‘’అంత,నిశాంత కాంతిశిశిరాంత దినా౦తమునన్ ,దిగంతులన్ –వింతగ ,నంతతంటను వేడ్క దలిర్ప నుద్భవిల్లె,శ్రీ

మంతము ,సద్విజ ప్రకర మానస రంజిత నవ్య సౌరభా –క్రాంతము ,నామిళింద వరగాన సుమంతము  నా వసంతమున్ ‘’

  రాక్ష రూపం పొందిన క్షత్ర బంధు  ను ‘’సురపొన్నలతోసారి తూగే తల పర్వత శిఖరంగా ,తామరతూడులవంటి  బాహువులు ఏనుగు తొండాలు ,సింహమధ్యమం అయిన నడుము పటువైన గోలెం లాగా అరటి బోదెలవంటి తొడలు గానుగ దూలాలులాగా ,మేఘమండలం దాకా పెరిగిన శరీరం ,కందెన నూనె వంటి రంగు గాడిద  వొండ్రలాంటి స్వర తో పెనుభూతంగా మారాడు .కవి సారాలంకారం తోపాటు అన్ని అలంకారాలు వాడాడు  .సామెతలు జాతీయాలు గుదిగ్రుచ్చారు .నాటకీయత తో రక్తికట్టించారు .విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పరిపోషించి కథకు గొప్ప న్యాయం చేకూర్చారు .బహుముఖీన పాండిత్యం తో దారాశుద్ధికవిత్వం తో సంప్రదాయానుసరణంగా  ఈ మహా ప్రబంధాన్ని శ్రీ నరసింహా చార్యులవారు తీర్చి దిద్దారు .ఇంటిపేరు లోఉన్న ‘’ఆ సూరి ‘’లోని ‘’సూరి ‘’పదానికి సార్ధకత చేకూర్చారు.

  ఇన్ని విషయాలను తన సిద్ధాంత గ్రంథం లో పొందుపరచిన డా .సర్వా సీతారామ చిదంబర శాస్త్రిగారు అభినందనీయులు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లాది వారి  భారత  ప్రవచనం 

మల్లాది వారి  భారత  ప్రవచనం

గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర వివరణలతో ఆసాంతం  శ్రవణ పేయంగా ,మార్గ దర్శనంగా భాసించి , ఒక దంపుడుకు ,పల్లీ బఠాణీల కు తావు లేకుండా మహదానంద0 కలిగిస్తోంది . ఆసక్తి ఉన్న వారు చూసి ధన్యులు కాగలరు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం

ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని అపూర్వ విషయాలు క్లుప్తంగా మీకు అందజేస్తున్నాను .

ఈ ఉపాఖ్యాన కర్త ఆసూరి  నరసింహా చార్యులు . భగవద్రామానుజుల వారి  గృహనామమే ఇది .ఆసూరి ఇంటిపేరుకు కవిగారి పూర్వీకులు ‘’భట్టర్ ‘’చేర్చి ‘’ఆసూరి భట్టరు ‘’వారయ్యారు .కొంత కాలానికి ‘’మఱిం గంటి ‘’పదం కూడా చేర్చుకొని ‘’ఆసూరి భట్టరు మఱిం గంటి ‘’అయ్యారు .తర్వాత ఎందుకో భట్టరు వదిలేసి ‘’ఆసూరి మఱిం గంటి ‘’ని ఇంటిపేరుగా ఖాయం చేసుకొన్నారు .కనుక మనకవి గారి పేరు ఆసూరి మఱిం గంటి నరసింహ చార్యులు .అసలు ఈ మఱిం గంటి పదం ఎందుకు ఎలా వచ్చి దూరింది ?అనే దానిపై తలొకమాటా చెప్పినా చివరికి ఒకదాన్ని అందరూ అంగీకరించారు .వీరి పూర్వులైన లక్ష్మణ దేశికులవారు 12 వేలమంది త్రిదండి సన్యాసులు ,7 వేలమంది జనవరులు ,74పేర్లున్న గురువులు ,ఒక లక్ష తిరునామ ధారులతో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తూ, భక్తులను అనుగ్రహిస్తూ ,దుస్ట శిక్షణ శిస్ట రక్షణ గావిస్తూ శ్రీ రంగనాధ స్వామి దర్శనార్ధం శ్రీరంగం వెళ్ళారు .అప్పటికే రామానుజా చర్యులవారు ,కొందరు సాదు భట్టారకులు ,కూర నాయకులు ,ముదలి యా౦డాన్ తో కలిసి అక్కడ ఉన్నారు .శ్రీ రంగనాధుడు రామానుజులవారితో ‘’మిమ్ములను గంటిని ,మీ వెంట వచ్చిన ఈ ఘనుల ‘’మఱిం గంటిని ‘’అన్నాడు .అప్పటి నుంచి ఆసూరి వారి గృహనామంలో ‘’మఱిం గంటి ‘’చేరింది . ఈవిషయాన్ని మఱింగంటి సింగరాచార్యులు తనకావ్యాలన్నిటిలో రాశారు .

‘’క౦టిన్ లక్షణమునివరు –గంటిన్ గూరేశ దేశిక స్వామి –‘’మఱిం

గంటి’’ వీరెవ్వరన  ‘’మఱిం –గంటి మహాన్వయము దనరె  గణ్య౦బగుచున్   ‘’అని రాశారు .క్షత్ర బందూపాఖ్యానం లో నరసింహా చార్యులుకూడా –

‘’భాష్య కారుల వెంట బనివిని  శ్రీరంగ –ధాముని సేవించ దలచ దయ దలిర్ప

గంటి కంటి ‘’మఱిం గంటి ‘’ వీరెవ్వరు –ననెడు శ్రీ సూక్తియే నన్వయముగ’’అని రాశారు .రంగనాధుడు తెలుగులో ఈ మాట అన్నాడా ?అనే కుశంక అక్కరలేదు .మనకవులకు దేవుళ్ళు కలలో కనపడి తెలుగులోనే కావ్యాలు రాయమని ఆనతిచ్చిన సంగతి మర్చి పోరాదు .’’యదన్నా వై మానవాః-‘’తదన్నావై దేవతాః ‘’అంటారుకదా అలాగే ‘’ యద్భాషావై మానవాః తద్భాషావై దేవతాః’’అవకూడదా?అని నా చిన్నబుర్రకు తోచింది .

మన కవి కాలం క్రీశ -1710-1770గా సర్వా వారు సర్వే రాయిపాతినట్లు ఖచ్చితంగా తేల్చారు.తెలంగాణలో ‘’కనగల్లు ‘’లో ఉండి,తర్వాత మిర్యాలగూడెం తాలూకా ‘’అనుముల ‘’గ్రామం చేరారు .వీరిది మౌద్గల్యస గోత్రం . ఈ గోత్రజుడు ఆది శేషుని అవతారంగా భావించే మాధవాచార్యులు జన్మించి అరణ్యాలలో ఏనుగులను ,పులులను బాధిస్తున్నబ్రహ్మ రాక్షసుని చేత సపర్యలు చేయి౦చుకొంటూ సూర్యసమాన తేజస్సుతో విరాజిల్లుతూ అనేక దాన ధర్మాలు చేసేవారు అని ఈ ఉపాఖ్యానం లో రాశారు .ఈయన పుత్రులు  తిరుమలాచార్యులు ,భట్టరు ,సింగరాచార్యులు  .భట్టార్ గారికొడుకు తిరువెంగళ ,.ఈయనకు తిరుమల ,భట్టరు కొడుకులు .తిరుమలాచార్యులకు తిరు వెంగళాచార్యులు ,నరసింహా చార్యులు ,అనంతాచార్యులు ,సింగరాచార్యులు అనే నలుగురు కొడుకులు .వీరిలో సంపన్నుడైన వెంగళాచార్యులు’’యాత వాకిళ్ళ ‘’గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి మండపం  గోపురం కట్టించాడు .ఇలా వీరి వంశం అభి వృద్ధి చెంది వెంకటార్య ,రంగామాంబ దంపతులకు   మనకవి నరసింహా చార్యులు జన్మించారు .

ఆసూరి మఱిం గంటి నరసింహా చార్యులు కావ్య ,భాణ,నాటకాలు16 రాసినట్లు చెప్పుకొన్నా11మాత్రమె లభ్యం .శ్రీనాధుని ‘’చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు ‘’పద్య౦ లో లాగా ఈకవీ –

‘’పదియేండ్ల  వాడనై,బహు చమత్కృతియైన –‘’శల్వ పింగ ళరాయ చరితమొకటి ‘’

వ్రాసితి పదియొక్క వత్సరంబున నేను –‘’నంద నందన శతానంద ‘’మొకటి

పది రెండు వర్షముల్ పరగ ‘’నలంకార కృష్ణ విలాసమున్ ‘’గృతియు నొకటి

యైదైదు మూడును హాయనంబులలో –‘’జనకరాయని బిడ్డ చరిత మొకటి ‘’అంటూ రాశారు కానీ పద్యం పూర్తిగా దొరకలేదు .పైన చెప్పినవికాక –విష్వక్సేన ప్రభాకరం ,శ్రీ రామానుజాభ్య్దయం , జాంబవతీ కుమారా శృంగార విలాసం ,శ్రీ కృష్ణ తులాభారం ,తారక బ్రహ్మ రాజీయం,పద్మినీ కన్యకాభ్యుదయం మొదలైనవిఉన్నాయి .  తన గ్రంథాలనన్నిటినితమ కులదైవమైన ‘సిరిసెన గండ్ల నరసింహ స్వామి కే అంకితమిచ్చారు .12 చాటువులు చెప్పినట్లున్నా, రెండుమాత్రమే లభ్యం.

‘’ క్షత్ర బందూపాఖ్యానం ‘’కు మాతృక భవిష్యోత్తర పురాణం అని కవి చెప్పుకొన్నా  ,సర్వా వారు ఎంతవెదికినా అది దొరకలేదట .అది అష్టాదశ పురాణాలలోనిదికాదు. 30 ఉపపురాణాలలో కూడా దాని పేరు లేదట . కవిగారికాలం లో ఉండి తర్వాతకాలం లో లుప్తమై ఉండచ్చు అంటారు సర్వాజీ .అయితే విప్రనారాయణాచార్యులు  రాసిన ‘’తిరుమాల ‘’లో ఒక పాశురం లో క్షత్రబందు గూర్చి ఉందని ,అతనికంటే పాపి భూమి మీద లేడని, కానీ గోవింద నామోచ్చరణతో   పరమగతి పొందాడని దాని తాత్పర్యం .బ్రాహ్మణులలో అధముడిని ‘’బ్రహ్మ బంధు ‘’అన్నట్లే క్షత్రియాధముడిని ‘’క్షత్ర బంధు’’అనటం ఉన్నది .ఇలాంటివారి పేరు వినిపిస్తే చెవులు మూసుకోనేవారట .

పద్మ పురాణం 97 అధ్యాయం లో దీని మూల కథ ఉంది .’’సూర్య వంశం లో విశ్వరదుడి కొడుకు క్షత్రబంధువు మహాపాపి .అడవులలో తిరుగుతూ ,జీవహి౦స తో పొట్టపోసుకోనేవాడు .ఒకరోజు బాగా అలసిపోయి, అటు వైపు వస్తూన మహామునికి సపర్యలు చేయాగా , అయన ‘’గోవింద ‘’నామం ఉచ్చరించమన్నాడు  .అలా స్మరించి తర్వాత జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి సంసారం వదిలేసి గోవింద పద ధ్యానం తో ముక్తిపొందాడు అనేది ముఖ్య కథ.

తెలుగుభారత౦  ఆనుశాసనికపర్వం లో 101అధ్యాయం లో 9పద్యాలలో క్షత్రబందుకథకొంచెం మార్పుతో  ఉంది. అతని దర్శనం తో ఒకమాలవాని శాపం పోయి బ్రాహ్మణత్వం పొందినట్లు ఉంది .బ్రాహ్మణుడికోస౦  క్షత్రబందు ప్రాణాలు విడవటం ‘’పూర్వ గాథాలహరి ‘’లో భారత కథగా ఉంది  . కాని పైకథలో ఈ విషయం లేదు .ఏతావాతా  తేలినదేమిటి అంటే యెంత పతితుడైనా సత్సంగత్వం తో ముక్తుడౌతాడు .పుండరీక ముని వలన క్షత్రబందు  భగవద్భక్తుడై ముక్తిపొం దాడని ఈ ఉపాఖ్యానం లో నరసింహా చార్యులవారు చక్కగా వివరించారని సర్వా శాస్త్రిగారు ఉవాచ .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి

 ఎత్తైన విగ్రహం  ,అంతే ఎత్తైన సాహితీ మూర్తిమత్వం ,నల్లని పలుచని శరీరం ,చిన్న కళ్ళు అయినా కాటుక రేఖలతో పొందిన  కాంతిమత్వం ,చేతులకు గాజులు ,తలలో పూలు ,నుదుట బొట్టు ,ముదురు రంగు పట్టు చీర ,దానికి తగిన జాకెట్టు ,కోలముఖం ,నవ్వు తూ ఉండే పలువరస ,సాంప్రదాయ భారతీయత ఉట్టిపడే చీరకట్టు ,ముఖం లో సౌమ్యత ,పలకరింపు లో ఆప్యాయత ,సౌజన్యం ,మాట తీరు లో  మల్లెల సౌరు ,ఆకర్షణలో జూకామల్లె తీరు ,చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి అయ్యే స్పురద్రూపం ,ప్రసంగం లో’’విపుల ‘’ విద్యా వైదుష్యం ,చర్చలలో’’ చతుర ‘’సంభాషణా ,పదునైన ఆలోచనా ధోరణి ,నడిచి వచ్చే వాణీ  స్వరూపమా అనిపించే ఆ సాహితీ సరస్వతి వేరెవరోకాదు, కే.బి.లక్ష్మిగా అందరూ పిలిచే డా .కొల్లూరు భాగ్య లక్ష్మి .

   కేబి లక్ష్మి గారిని మొట్ట మొదట సారిగా హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో అమెరికా చిట్టెన్ రాజు గారు ప్రపంచ తెలుగు సభలు ,బాపు –రమణల స్నేహ షష్టి పూర్తీ కలిపి నిర్వహించినపుడు మొదటి రోజు ఉదయం భోజన విరామ సమయానికి ముందు, ఆమె కిచ్చిన 10 నిమిషాల సమయంలో కరుణశ్రీ గారి ‘’విజయశ్రీ ‘’గురించి అద్భుతంగా మాట్లాడి ,భోజన సమయం లో బయటకు వచ్చినప్పుడు దగ్గరకు వెళ్లి అభినందించాను .అదే మొదటిసారి చూడటం ,మాట్లాడటం .అప్పటిదాకా ఆమె ఎవరో నాకు తెలీనే తెలీదు .నా అభినందనకు కారణం కూడా ఉంది .ఎవరు మాట్లాడినా కరుణశ్రీ రాసిన ఉదయశ్రీ గురించే చెబుతారుకాని నాకు అత్యంత ఇష్టమైన ‘’విజయశ్రీ ‘’గురించి మాట్లాడకపోవటం ,ఆమె దానికి నూటికి వెయ్యి శాతం న్యాయం చేయటం ,పద్యాలను అలవోకగా చదవటం ఆశ్చర్యం కలిగించి ఆమె పై అభిమానం కలిగింది . ఆ సభలో శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కూడా ఉన్నట్లు జ్ఞాపకం .విజయశ్రీ లో కరుణశ్రీ కవితా వీర విహారం చేశాడు .అందులోని మొత్తం పద్యాలు నాకు కంఠతా వచ్చు .అంతేకాదు ఉయ్యూరు సాహితీ మండలి సమావేశం లో ఒకసారి అందులోని పాత్రలకు ఆ పద్యాలు రాసి ఇచ్చి చిన్న ప్రదర్శనగా చేయించి  అందరి మెప్పూ పొందాను . విజయశ్రీ పై అంతటి వీరాభిమానం నాకు .

   క్రమంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం సమావేశాలకు వెళ్ళటం ,నాకూ వారు తగిన పాత్ర ఇచ్చి ప్రోత్సహించటం జరిగింది .వారి అన్ని ప్రచురణలలో నాతో విలువైన వ్యాసాలు  రాయించారు శ్రీ పూర్ణచంద్.ఆ సభల్లో లక్ష్మిగారితో సాహితీ బంధం బలపడింది .ఒక సారి అకస్మాత్తుగా ఆమె ‘’నేను  మీ ఫాన్  ను .మీ బ్లాగ్ చదవకుండా ఉండను .ప్రొద్దున్నే మేము పేపర్లు తిరగేయ్యాల్సిన పని లేకుండా ముఖ్యవిశేషాలు లు సాహిత్యం మీరు పోస్ట్ పెడుతున్నారు .అవి చదివి యెన్ లైటన్ అవుతున్నాను .మీ పోస్ట్ లన్నీ ఒక ఫైల్ లో ఉంచుతున్నాను ‘’అన్నప్పుడు ‘’ములగచెట్టు ఎక్కిస్తున్నారేమో ‘’?అని భయపడ్డాను .కాదని అవి ఆమె హృదయం లోతుల్లోంచి వచ్చిన మాటలే  అని గ్రహించాను .మరో సారి ఆమె  తమ్ముడు  కూడా బెజవాడలో ఆమెతో పాటుకనిపించి తానూ సరసభారతి బ్లాగ్ ఫాలోయర్  అనటం మరింతగా ఆనందాన్నిచ్చింది .

 లక్ష్మి గారికి బందరు చుట్టుప్రక్కల పొలాలు ఉండటం ,సుబ్బారావుగారు క్లాస్ మేట్ అవటం వారి కుటుంబాలు చాలాసఖ్యతతో ఉండటం వలన ఆమె ప్రతి ఏడాది బందరువచ్చి రైతులనుంచి పంట డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళేవారు .ఒకసారి వేసవి లో ఆమె వస్తున్నట్లు నాకు తెలియజేసి ఏదైనా సాహిత్య కార్యక్రమ౦ ఏర్పాటు చేయగలరా అని సుబ్బారావు గారు ఫోన్ చేస్తే, వేసవిలో  జనం రావటం కష్టమని చెప్పి, జులై లో ఫ్లోరా స్కూల్ లో సరసభారతి కార్యక్రమ౦ ఏర్పాటు చేసి సుబ్బారావు గారి అధ్యక్షతన ఆమెను మహిళాభ్యుదయం పై మాట్లాడించి చిరు సత్కారం చేశాం .

  నేను రాసిన ప్రతి ఆర్టికల్ ఆమె చదివి స్పందించేవారు .సరసభారతి ప్రచురణలు ఆమెకు పోస్ట్ లో పంపేవాడిని .ఆమె తన ‘’జూకా మల్లి ‘’నాకు పంపారు .  ఆపుస్తకానికి తగిన జూకామల్లి చిత్రం అచ్చు అవలేదని బాధపడి , నన్ను వెతికి పంపమని కోరితే,  హైదరాబాద్ లోని దేవరాజు మహారాజుగారికి ఫోన్ చేసి ,దాని బొటానికల్ నేం సంపాదించి గూగుల్ లో ఆపూల ఫోటోలు వెతికి పట్టుకొని, ఆమెకు పంపితే పరమానందం పొంది ‘’మీకు చెబితే ఏదైనా సాధిస్తారు ‘’అని కితాబిచ్చారు  . మరోసారి మా దొడ్లో ‘’శంకు పూలు ‘’ఫోటో పెడితే చూసి, ఆ విత్తనాలు కావాలని కోరితే పోస్ట్ లో పంపితే సంతోషించారు .మరొకసారి చినుకు మాసపత్రికలో ఆమె ‘’కవులైన కథకులు’’  శీర్షికలో ఎందేరెందరో మహానుభావులను గురించి ధారావాహికగా  రాస్తూ ,ఎవరో కవి గురించి, ఆయన పుస్తకాలు గురించి వివరాలు కావాలని కోరితే    హైదరాబాద్  అమీర్ పేట దగ్గర జైన దేవాలయం దగ్గర ఉన్న నాకు అత్యంత ఆప్తుడైన శ్యాం సుందర్ గారి ఫోన్  నంబర్ ఇచ్చి వెళ్లి కలవమని చెప్పి ఆయనకూ ఫోన్ చేసి చెబితే , ఆమె వెళ్లి కావలసిన ఇన్ఫర్మేషన్   అంతా ఆయననుంచి సంపాదించుకొన్నది . చాలాసార్లు ఎన్నో విషయాలపై నన్ను వివరాలు అడిగితె నాకు తెలిస్తే వెంటనే చెప్పటం, లేకపోతె తెలుసుకొని చెప్పటం జరిగేది.దానికే  ఆన౦దించే అల్ప సంతోషి ఆమె . మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ  ,సరసభారతి,మా పెరటి చెట్ల వైభోగం ,ఉసిరి చెట్టుకింద కార్తీక వనభోజనాలు ,బంధువుల రాక ల ఫోటో లన్నీ చూసి ముచ్చట పడేవారు .  వెంటనే స్పందించేవారు . లక్ష్మిగారు శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారింటికి వెళ్లి చేసిన ఇంటవ్యు మా శ్రీమతికి చాలా ఇష్టం .ఈ ఇద్దరిపై ఆమెకున్న అభిమానం అది .

   సుమారు నాలుగైదు ఏళ్ళనుంచి ఆమె ఆరోగ్యం లో ఏదో మార్పు గమనించాం నేనూ మాశ్రీమతీ .ఆమె కనబడినప్పుడు అడిగితె నవ్వి ఊరుకొనేది .ఈ కాలం లోనే ఆమె నుంచి ఫోన్లు ,మెయిల్ తగ్గాయి .నేనూ సరసభారతి పుస్తకాలు పంపలేదు .సభలలో కలిసినప్పుడు ఇచ్చేవాడిని .శ్రీమతి చలసాని వసుమతి గారు విజయవాడలో పుస్తకం  ఆవిష్కరణ సభలో  లక్ష్మిగారికి ,శ్రీ విహారి గారికి వారి ఫౌండేషన్ తరఫున చెరి 10వేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించినపుడు మేమిద్దరం వెళ్లి అభినంది౦చా౦ . అప్పుడు వారి కుమారుడు,కుమార్తె లను కూడా చూశాం .  మే 17న గుడివాడ లో పుట్టివారి పురస్కారం  ‘’ఆమెకూ నాకు మరికొంతమందికి ఒకే వేదికపై జరగటం నాకు మహద్భాగ్యం .ఆమెకు ‘’కథా కల్పవల్లి ‘’బిరుదు నిచ్చారు .జులై 14ఆదివారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాజగాన సభలో గురు పౌర్ణమి సందర్భంగా నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు నాకు గురు పురస్కారం గా ‘’కళా సుబ్బారావు అవార్డ్ ‘’అందజేసినపుడు కేబిలక్ష్మిగారు వేదికపై ఉన్న నా దగ్గరకు వచ్చి పలకరించి అభినందించి అక్కడి వారితో ‘’దుర్గాప్రసాద్ గారుమా గురువు గారు ‘’అని చెప్పటం ఇంకా చెవులలో మారు మోగుతూనే ఉంది .అంతటి సంస్కారం ఆమెది .పదిహేను రోజుల్లో ఆమె మనముందు నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు అంటే ఊహించ లేకపోతున్నాము  .ఇక బెజవాడలో ఆమె లేని సాహిత్య సభలను ఊహించటం కష్టం .కృష్ణా జిల్లా రచయితల సంఘ సారధులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ గార్లు ఆమె మరణం జీర్ణించుకోవటం కష్టమే .

  విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన కేబి లక్ష్మిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం లో తెలుగు ఎం .ఏ .చేసి ,ఆచార్య యెన్ గోపి పర్యవేక్షణలో ‘’అచ్యుతవల్లి కథలు  ‘’పై పరిశోధన చేసి పిహెచ్.డి.పొందారు .విపుల,  చతుర మాసపత్రికలలో  మూడు దశాబ్దాలు పనిచేసి శ్రీ చలసాని ప్రసాద్ పదవీవిరమణ తర్వాత సంపాదక బాధ్యత వహించారు. ఆమె వేలకొద్దీ కథలను ఎడిట్ చేసి ఉంటారు .తన స్వీయ కథలను ‘’మనసున మనసై ‘’,జూకామల్లి ‘’అనే రెండు సంపుటాలు, కవితలను ‘’వీక్షణం ‘’,గమనం ‘’అనే రెండు సంపుటాలుగా ప్రచురించారు .ఇందులో ‘’గమనం ‘’ప్రముఖ సాహితీవేత్త శ్రీ సుధామ చేతి రాతతో వెలువడటం విశేషం .1967నుంచి ‘’యువభారతి ‘’లో వనితా విభాగ అధ్యక్షురాలు .సాహిత్యాభిమాని శ్రీ భీమాని కామేశ్వరరావు గారిని ప్రేమించి పెళ్ళాడి ,ప్రవీణ్ ,సమీర లను సంతానంగా పొందారు .అందరితో స్నేహం గా ఉండటం ఆమె సహజ లక్షణం కనుక ఇంటికి ‘’స్నేహ నికుంజ్ ‘’సార్ధకనామం పెట్టుకొన్నారు .

 ఏ విషయం పైనైనా అనర్గళం గా  ‘’విపులం ‘’గా ,’’చతురం ‘’గా మాట్లాడే నేర్పు లక్ష్మి గారిది .ఆమె ‘’గమనం ‘’లో ఆమె కున్న గమనించే లక్షణం ,ఆమె గమనమూ ,లోక గమనమూ కనిపిస్తాయి ,ఆమె ‘’వీక్షణం ‘’తీక్ష్ణ మైనది .నిశిత దృష్టి వీక్షించవచ్చు .ఆమె స్నేహం ‘’మనసునమనసై ‘’పరిమళిస్తుంది .మల్లెలు చాలా రకాలైనా ఆమెకు ‘’జూకామల్లె ‘’పై అభిమానం ఎక్కువ . ఆ పువ్వునే ’’ రాదా మనోహరం ‘’అంటారని మాశ్రీమతి ఉవాచ .కొంచెం నీలిరంగు తెల్లపువ్వే జూకా మల్లి .మనోహరమైన అందం ,మనసును పరవశపరచే పరిమళం దాని ప్రత్యేకత .లక్ష్మిగారికీ ఈ సుమ లక్షణాలు ఉండటం వలన అంత అభిమానం . ఈ కథలలో  వాటిని  పంచిపెట్టారు .’’దాంపత్య జీవిత సౌరభాన్ని వెదజల్లే ఆణి ముత్యాలు ఆమె కథలు ‘’అన్న సుధామ మాటలు  అక్షర సత్యాలు .’

’జర చాయ్ తాగి పో’’కవితలో ఆమె కవితా విశ్వ రూపం  కనిపిస్తుంది .తెలంగాణా యాస అక్షర రమణీయం గా ఉంది ,పరకాయ ప్రవేశం చేసి రాశారా అనిపిస్తుంది .ఎన్నెన్నో ఊసులు కలిపి మరగించిన చాయ్ నాకు మాత్రం మహా రుచిగా ఉంది .’’చారణా చాయ్ కు  చాలీస్ రుపయా  విలువ కలిగించి ఫిదా చేశారామే .ఆమెకు ఆత్యంత ఇష్టమైన ‘’జూకా మల్లి ‘’ని భువి నుండి దివికి పాకించిన నట్లుగా , సాహితీ మూర్తి కె.బి.లక్ష్మి  గారు జులై 22 సోమవారం 70 వ ఏట అకాల మరణం  చెంది సాహితీ లోకానికి  తీవ్ర దిగ్భ్రమ కలిగించారు .ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు

image.png

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం భయోత్పాతం

‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే ద్రవ ధనాన్ని ,మందుగుండు సామగ్రిని ,చంపటానికి లైసెన్స్ లతోపాటు ప్రపంచమంతా  దమ్మిడీ ఖర్చులేకుండా పర్య టి౦చటానికి పాస్ పోర్ట్ లు, వీసాలు అవకాశాలు పుష్కలంగా సమకూరుస్తుంది .

 ముఖ్యమైన వాటి నిర్వచనాలు

ముఖ్యంగా మూడు రకాల ఉగ్రవాదాలున్నాయి .అవి 1-తిరుగుబాటు(ఇన్సర్జెంసి ) 2-తీవ్రవాదం(మిలిటెన్సి ) 3-ఉగ్రవాదం (టెర్రరిజం) .ఇందులో తిరుగుబాటు లో విప్లవం ,గెరిల్లా కార్యక్రమాలు దేశ మిలిటరీ శక్తిపై జరపటం ఉంటాయి .మిలిటెన్సి అనే తీవ్రవాదం, పైదానికన్నా చాలా శక్తి వంతమైన ఒక పార్టీ విభాగం .దీని లక్ష్యం దేశ  మిలిటరీ ,పారామిలిటరీ ,యంత్ర సామగ్రి ,సాయుధ సైనికులు ,పోలీస్ సిబ్బంది పై దాడులు .తమ లక్ష్య సాధనకు యెంత కైనా తెగించే తీవ్ర లక్షణం .టెర్రరిజం అనే ఉగ్రవాదం అమాయక ప్రజా సమూహాలను  నిర్దాక్షిణ్యంగా నిర్హేతుకంగా  సంహరింఛి అంతటా భయోత్పాతం కలిగించి  పాలకుల దృష్టిని ఆకర్షింఛి, తాము అనుకొన్న కొన్నిటిని సాధించటం .ఈ మూడు విధానాలు వినాశ కారణాలైన హింసాత్మక  చర్యలే . సందేహం లేదు  ఈ  నిర్వచనాలను ఇండియాలోని సీనియర్ ఎయిర్ ఫోర్స్ ,సైనిక పోలీస్ ఆఫీసర్ల తోనూ , దేశ విదేశాలలోని అనేక అకాడమీ, యూని వర్సిటీ లతో  ఎన్నో ఏళ్ళు జరిపిన  ఇంటర్వ్యూల ఫలితం గా ఇవ్వబడినవే  .

           కార్య కలాపాలు

 ఈ రోజుల్లో టెర్రరిస్ట్ లు ఫైవ్ స్టార్ హోటళ్ళలో దర్జాగా అన్నీ సుఖాలు అనుభవిస్తూ ,టెర్రరిస్ట్ కార్య కలాపాలు జరుపుతున్నారు తప్ప భయంకర  అడవులలోనో , లోయలలోనో ఉండి కాదు అని గ్రహించాలి .పోలీస్ ,సైన్యం ,ఎయిర్ ఫోర్స్ ,ఇంటలిజెన్స్ సర్వీసులు  (నిఘా విభాగాలు )రోజు రోజుకూ తీవ్రమౌతున్న తీవ్ర వాదాన్ని అదుపు చేయ లేక పోతున్నాయి  అన్నది పూర్తి యదార్ధం.

  సంఘటిత వ్యూహం (ఫెడరేటేడ్ నెట్ వర్క్ )

  టెర్రరిస్ట్ ల నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ,సమర్ధ వంతమైన శాఖలతో ,కేంద్రాలతో ప్రతి దేశం నుంచి పకడ్బందీ వ్యూహం తో జరుగు తోంది .టెర్రరిస్ట్ లు  లెక్కలేనంత నకిలీ కరెన్సీ కలిగి మాంచి ఆర్ధిక పరి పుస్టితో బాగా బలిసి ఉన్నారు .అమెరికా డాలర్లు ఇండియా,రూపాయలు బ్రిటిష్ పౌండ్లు  ,ఒక టేమిటి అన్ని దేశాల కరెన్సీని కొన్ని వంచక(రోగ్) దేశాల  సాయంతో క్షణాలమీద అచ్చుగుద్దేసి వినియోగం లోకి తెస్తున్నారు  .ఇంతేకాదు మాదక ద్రవ్యాల సరఫరా  అండర్ వరల్డ్  యాక్టివిటీస్, స్మగ్లింగ్ ,అనైతిక ఆయుధ వ్యాపారం ,కిడ్నాపింగ్ , దోపిడీ  ,డాన్  గిరీ మొదలైనవాటితో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సమకూర్చుకొంటున్నారు .వీటిని అదుపు చేసే నాధుడే లేడు .

  ఉగ్రవాద దీవులు

ఇప్పుడు టెర్రరిస్ట్ లు జాతీయ ,అంతర్జాతీయ బాంక్ సేవలను ఆపేస్తున్నారు .సామూహిక హనన ఆయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్  డిస్ట్ర క్షన్-W.M.Ds)కూడా సమకూర్చుకొని  దేశాలను భయపెడుతూ ,ఎదుర్కోవటం ఒక సమస్యగా మార్చి ,.ప్రపంచమంతా ఉగ్రవాద దీవులుగా మార్చేశారు .

  సామూహిక వినాశనం

ఈరోజుల్లో టెర్రరిజం ఒక ఫాషన్ ,ఒక వృత్తి ,ఒక సంస్థ అయింది .జోసెఫ్ కాన్రాడ్ దీనిపై తీవ్రంగా స్పందించి ‘’బాంబు దౌర్జన్యం ప్రజాభిప్రాయం పై ఎలాంటి ప్రభావం కలిగించదు.దీని పరిధిని దాటి ప్రతీకారం ,ఉగ్రవాదాల ఉద్దేశ్యం వైపు తిరిగి ఆలోచించాలి .ప్రభుత్వాలు కొత్త ఆయుధాలు సమకూర్చుకొంటే ఉగ్రవాదులుకూడా అదే వేగంతో వాటిని తమ స్వంతం చేసుకొంటున్నారు .ఇప్పుడు టెర్రరిస్ట్ లు  బాధ్యతారాహిత్యంగా అణ్వాయుధాలను సమకూర్చుకొంటే  ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి ?ఇది చాలా కల్లోలం రేపే సమస్య అయి౦దిప్పుడు.వాస్తవం ఏమిటంటే చాలా టెర్రరిస్ట్ గ్రూపులు కెమికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడాయి .1995 జపాన్ లోని  టోక్యో  సబ్ వె సిస్టం లో ‘’సిన్రిక్లియోస్ ‘’ను వాడారు .  ‘’క్వాడే నెట్ వర్క్ ‘’క్వేడా ఇన్ స్పైరేడ్ గ్రూప్ ‘’లు కొత్త తరహా యుద్దానికి సన్నద్ధం  అవుతున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి .

  టెర్రరిస్ట్ లు ప్రపంచ వ్యాప్త నెట్ వర్క్ సమాచారాన్ని కలిగి ఉన్నారు .దేశం యెంత భద్రంగా ఉంటుందో  వాళ్ళు కూడా అంతర్జాతీయంగా ఎవరికీ కనిపించకుండా తమ తీవ్రవాద చర్యలు చేస్తూ భద్రంగా ఉన్నారు .దేశం, అది స్పాన్సర్ చేసే టెర్రరిజం గ్రూపులు ,,కౌంటర్ టెర్రరిజం సూటిగా ,రహస్యంగా ఒక దాని ఆధారంగా ఒకటి నడుస్తున్నాయి ,బతుకు తున్నాయి .ఇదొక పెద్ద విషవలయమైపోయింది .దీని నియంత్రణ ఎలా అన్నది అనూహ్యం గా మారింది .వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే టెర్రరిజ అంతమొందాలి అంటే అహింసా శక్తిపై తిరుగు లేని విశ్వాసం పెరగాలి .ఈ విశ్వాసం ప్రతి వ్యక్తిలో,సమాజం లో, ప్రతి  సంస్థలోనూ ఏర్పడాలి .

  అసలు ప్రమాదం

   21 వ శతాబ్దం   ప్రపంచీకరణ  ఫ్లడ్ గేట్ లను టెర్రరిజాన్ని తెరచుకొని దూకి వచ్చింది .అమెరికాలో సెప్టెంబర్ 11 విషాదం సామూహిక హింస ,సామూహిక హనన ఆయుధ ఫలితమే .ఇది ఒక  దృష్టాంతమై ,చర్యలకు దారి తీసింది .ఐతే ట్రెండ్ సెట్టర్ లు ఇందులోని యదార్ధం గమనించలేదు .ఈ రకమైన హింస ఒక అంటువ్యాధి గామారి ,క్రమంగా చాలావరకు  ప్రొఫెషనల్ అయి పోయింది .మహాత్ముడు చెప్పినట్లు ఉగ్రవాదాన్ని ,దానిపై  అత్యంత సహనం తోనే ఎడుర్కొవాలే తప్ప వేరే గత్యంతరం లేనే లేదు .

       సమాప్తం

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

            గాంధి వ్యూహం

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ  బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం ఐతే ఇవి గాంధీ పోరాట సిద్ధాంతానికి విఘాతం కలిగించేవి ,సమస్యా పరిష్కారానికి అవరోధం కలిగించేవి .టెర్రరిజం  వెనుక ఉన్న సమస్యలకు ఆయన మార్గాలు కొన్ని ఉన్నాయి ,ఉగ్రవాద కార్యాలపై ఊర్తిగా దృష్టి కేంద్రీకరించాలి .జాతి ద్వేషం నిలువరించటానికికి పూనుకోవాలి .ఉగ్రవాదానికి పూను కొనే వారు అలా ప్రవర్తించటానికి వెనుక ఉన్న కారణాలు అన్వేషించాలి .

  ఉన్నతమైన నీతి తో ప్రవర్తించాలి . వారి విశుద్ధ ప్రవర్తన అపమార్గ గాములకు కను విప్పు కలిగిస్తుంది .అధికారులు హింసా విధానం తో ప్రవర్తిస్తే బలప్రయోగానికి దారి తీస్తుంది .అందుకే గాంధీ నెత్తీ నోరూ కొట్టుకొని నైతిక లక్ష్యం మాత్రమె సమస్యకు మార్గ దర్శనం చేస్తుంది అన్నాడు .వినటానికి ఈ నీతి సూత్రాలు బానే ఉంటాయి .అవి పని చేసి ,ప్రభావం చూపుతాయా అనేది మిలియన్ డాలర్ల  ప్రశ్న .బలమైన హి౦సాత్మకత ముందు అహింసా విధానాలు చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లుగా నిష్పలమౌతాయని చాలామంది అనేక సందర్భాలలో ఆయన్ను ప్రశ్నించారు .ఇజ్రాయిల్ లో పాలస్తీనా హింసకు కఠిన ప్రతిస్పందన  హమాస్ కు ఉప్పెనలాగా ఉపయోగపడి ,టెర్రరిస్ట్ కార్యాలను పెంచాయి . అమెరికాలో సెప్టెంబర్ 11 దాడి తర్వాత, జిహాదీ ఉద్యమంపై ప్రతీకార చర్య ,ఉగ్ర  దాడులు  ప్రపంచ వ్యాప్తంగా తగ్గ క పోవటం మనకు అనుభవమే . టెర్రరిజం పై  అమిత బలప్రయోగం మంచి ఫలితాల నిచ్చిన దాఖలాలు పెద్దగాలేవు .

   హింస హింసనే  సృష్టిస్తుంది .పూర్తి హింస పూర్తి  వినాశనమే కలిగిస్తుంది .కానీ అహింస హింస మూలాలనే  ఛేదిస్తుంది .అహింస శాంతి కి మార్గమై అంతిమ విజయం చేకూరుస్తుంది .ఇందులో కోల్పోయిన వారు గాయపడరు . బ్రిటిష్ ప్రభుత్వ టెర్రరిజం పై గాంధీ అహింసా పద్ధతులతోనే అనేకసమస్యలపై  పోరాటాలు చేసి ,ఘన విజయాలు  మనకు సాధించి పెట్టాడు .ఒక్కోసారి గత్యంతరం లేని పరిస్థితులలో హింసను ప్రయోగించటం .తప్పదని ఆయన చెప్పిన విషయం ఇదివరకే తెలుసుకొన్నాం .ఏది ఏమైనా హింస స్వయం వినాశకం .అహింస చిరంజీవి .హింస మనుష్యులను చంపితే ,అహింస మనుష్యులను చంపనే చంపదు.అందుకనే  ఐక్యరాజ్య సంస్థ  మొదలైనవి అహింసా విధాన పరిష్కారాలకోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.దీనికి సహన శీలత తో కూడిన రాజకీయ విజ్ఞత ,పూనిక ,నిశ్చయ బుద్ధి ,ఓపిక ,పట్టుదల ,తోపాటు అహింసపై పూర్తి  విశ్వాసం  కావాలి .హింస  ఎప్పుడూ విజయం సాధించదు.

   ఆధునిక ఉగ్రవాదం ఎవరో ఒక వ్యక్తీ లేక  అలాంటి  వ్యక్తుల సమూహం  అడపాదడపా చేసే  హింసా  కృత్యాలు కాదు .అది జాతీయ సీమలను దాటి ఉన్న సుశిక్షితులైన  అత్యాధునిక ఆయుధ సైనిక పటాలం.వాళ్ళ సిద్ధాంతాలు వారివి .వారి నైతికత,వారిది   .వారి నెట్ వర్క్ ,ఆయుధ సామగ్రి నుంచే వాళ్ళ అసలైన బలం వస్తుంది .దానినే నమ్మి మిగిలినవారిని ఆకర్షించి శిక్షణ నిచ్చి ఉగ్రవాదం పెంచుతున్నారు .అదే మంచి అని నమ్ముతున్నారు .వాళ్ళ ఈగోలను  తృప్తి పరచుకొంటున్నారు  . పిచ్చి వాళ్ళ స్వర్గం అనే ఊహా స్వర్గం లో విహరిస్తూంటారు.వీరిని కూడా అహింసా విధానం లోనే ఎదుర్కోవాలి .బలమైన యదార్ధ నైతికత వారి మనసులను మారుస్తుంది అప్పుడే జనజీవన స్రవంతిలో కలిసిపోతారు .లేకపోతె టెర్రరిజం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.తాము నమ్మిన కుహనా సిద్ధాంతాన్నే నమ్ముకొంటూ టెర్రరిస్ట్ లు మరింత పేట్రేగి క్రూర హింసకు పాల్పడుతారు అంటాడు   ఆవేదనతో ఆహి౦సామూర్తి మహాత్మా గాంధీజీ .

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

   సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు

 .

ఎనుక

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఘర్షణ పై గాంధీ అభిప్రాయం

ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ మాత్రమె’’ అని స్పష్టం చేశాడు .అదే సమయం లో భారత ఉపఖండానికి  బ్రిటిష్ సర్కార్  రోడ్ల నిర్మాణం దగ్గర్నుంచి ,ఆఫీస్ పరిపాలన దాకా చేసిన  మంచిపనులను మెచ్చాడు .

  పరిష్కారం ఊహించాక ,రెండవ దశ పోరాటం దాన్ని సాధించటం గురించి .అంటే పోరాటమే .ఐతే అది స్థిర పరిష్కారం కోసమే అవ్వాలి .’’లక్ష్యం సాధన ను సమర్ధిస్తుంది ‘’అనేదాన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు .సాదనా ,లక్ష్యమూ చివరికి ఒకటిగా నే ఉంటాయి అని వాదించాడు .హింసతో పోరాటం చేస్తే ,ఉత్తమ  లక్ష్య సాధనకూ హింసా విధానమే శరణ్యం అనే తప్పుడు భావన కలుగుతుంది .’’టెర్రరిస్ట్ లు బ్రిటిష్ వారిని తరిమేసి విజయం సాధిస్తే  వారి బదులు దేశాన్ని ఎవరు పాలిస్తారు ?”’అని ప్రశ్నించాడు .ఆయనే సమాధానం చెప్పాడు ‘’బహుశా ఇండియా విముక్తికి  హంతకు లైనవారు పాలిస్తారేమో ?,అలా అయితే హంతకుల వలన ఇండియాకు ఏమీ లాభం ఉండదు ‘అని ఖచ్చితంగా చెప్పాడు .

 పోరాటం శక్తి మంతంగా తరచుగా ప్రదర్శనలతో మొదలవ్వాలి .అవమాన పరచే వాటికి  నిరభ్యంతరంగా సహకరణకు తిరస్కరించాలి .అయినా హింసాత్మకంగా ఉండకూడదు .ఈ నాశనకర విధానాలు ఘర్షణ పరిష్కార విజయానికి   ధనాత్మక ఫలితాలు ఇవ్వక పోవచ్చు.పోరాటం సత్యమార్గం లో మొదలైతే, అది క్రమంగా అది వ్యక్తీ శీలాన్ని  ,విధానాన్ని  క్రమంగా  పెంచుతుంది ఆలోచనాపరిది విస్త్రుతమౌతుంది .ఉదాత్త  లక్ష్యసాధనకోసం మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోయి దిగజారి ప్రవర్తి౦చకూడదు అని అభిప్రాయ పడ్డాడు .ఇదే ఉగ్రవాదానికి ఆయన సమాధానం .  మొదలు పెట్టటానికి ఏదో రకమైన  ప్రతిస్పందన  రావాలని గట్టిగా కోరాడు .ఏమీ చేయకు౦ డాచేతులు కట్టుకొని కూర్చోమని ఏనాడూ ఆయన చెప్పలేదు ‘’ అగ్ని ప్రమాదం లో  క్రియా శూన్యత క్షమి౦చరానిది ‘’అన్నాడు.

  దిక్క్కారం అడుగున

‘’ధిక్కారం అడుగున పిరికి తనం ఉంటుంది .హింసలేని పోరాటం అనైతికం ఎన్నడూ కాదు .కాని పిరికితనం అనైతికమే ‘’అన్నాడు గాంధీ .’’ పిరికితనానికి  హింసకు మధ్య దేన్ని ఎంచుకోవాలి అని నన్ను అడిగితె నేను హింసనే ఎంచు కోవాలి గట్టిగా చెబుతాను అన్నాడు ఒక్కోసారి  హింస మాత్రమే పరిష్కారం అనిపిస్తుంది .పిచ్చి కుక్క వల్ల సమాజానికి ప్రమాదం దాన్ని అదుపులోనైనా పెట్టాలి లేదా చంపనైనా చంపాలి .వేరే దారి లేదు .దారుణ మానభంగాలు చేసిన ‘’మృగాడు .’’ స్పాట్ లో దొరికితే ,నిర్దాక్షిణ్యంగా వాడిని హతం చేయాలి . వీరోచిత హింస ,పిరికివాడి అహింస కన్నా తక్కువే అన్నాడు మహాత్ముడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీవేత్త ,స్నేహశీలి ,భేషజం లేని వ్యక్తి ,వ్యక్తిత్వమే ఆభరణంగా ఉన్న శ్రీమతి కె బి లక్ష్మి (70)హఠాన్మరణం

నాకు అత్యంత సాహితీ ఆప్తురాలు ,ఒకరకంగా నా ఫాన్ ,నేనూ ఆమె మాట రచనలకు ఫిదా అయ్యే అభిమానిని ..మే 6 గుడివాడలో ”దుర్గాప్రసాద్ గారు ఉయ్యూరులో నాకు సరసభారతి సన్మానం చేయలేదు ”అని అలకగా బుల్లి మూతి పెట్టి , జులై 14 హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నా కు కళా సుబ్బారావు అవార్డు ఇచ్చినప్పుడు వచ్చి ప్రత్యేకంగా వేదిక మీద నన్ను  పలకరించి ,అభినందించిన సహృదయురాలు ,”దుర్గాప్రసాద్ గారు మా గురువు గారు ”అని అక్కడ అందరికి నవ్వుతూ చెప్పిన లక్ష్మి గారు సాహితీ  లక్ష్మీ   సరస్వతుల ప్రతి రూపం . ప్రతి సభలోనూ నాతో ఫోటో దిగటం ఆమెకు చాలా ఇష్టం గా ఉండేది శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణచంద్ నేనూ లక్ష్మిగారు చాలాసార్లు కార్ లో సభలకు వెళ్ళటం ఆమె తో సంభాషణ ఒక ఎడ్యుకేషన్ గా ఉండటం మరువలేనిది . సరసభారతి బ్లాగ్ లను ఆమె నిత్యం చదివే వారు దానికి ఒక ఫైల్ ప్రత్యేకంగా పెట్టుకున్నానని చాలా సార్లు నాకు చెప్పారు . ఉయ్యూరులో ఆమెకు ఘన సన్మానం చేద్దామనే ఆలోచనలో నే ఉన్నాను ఒక సారి సుబ్బారావు గారి అధ్యక్షతన ఉయ్యూరు ఫ్లోరా స్కూల్   లో మహిళా విషయం పై మాట్లాడించి సరసభారతి చిరు సత్కారం మాత్రమే చేయగలిగింది . ఇంతలో ఈ  అశనిపాత వార్త.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ  , వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్

image.png

Posted in రచనలు | Tagged | Leave a comment