దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం By Santhosh Kumar Bojja| Updated: Friday, August 2, 2019, 17:50 [IST] యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. యానం సమీపంలోని కనకాల పేటలో జననం 1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమారంగం వైపు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు ఎందరికో శిక్షణ నటీనటులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్‌పాండ్యన్, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. దేవదాస్ కనకాల కుటుంబం దేవదాస్ కనకాల 1971లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే . వీరికి కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ ఉన్నారు. రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ వివాహం యాంకర్ సుమను పెళ్లాడారు. More RAJEEV
వీక్షకులు
- 1,148,928 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.16 వ భాగం.16.5.26.
- అగ్నిపర్వతారోహణ(త్రివేణి)
- రెండవ లోక్ సభ స్పీకర్ బహుముఖ ప్రజ్ఞా శాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు శ్రీమాన్వమాడాభూషిఅనంతశయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.2 వ భాగం.15.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.7 వ భాగం.15.5.26.
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.15 వ భాగం.15.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య. 196 వ భాగం.15.5.26.
- మొదటి లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రెండవ లోక్ సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు. శ్రీమాన్ మాడభూషి అనంత శయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.1 వ భాగం.14.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.6 వ భాగం.14.5.26.
- శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం.14 వ భాగం.14.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.195 వ భాగం.14.5.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,007)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
