యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25 యోగ బోధ

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25

     యోగ బోధ

ఒక రోజు బ్రహ్మవేత్తలతో ఉన్న యాజ్ఞవల్క్యుని గార్గి ‘’యోగతత్వాన్ని సంపూర్ణంగా తెలియ జేయండి ‘’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేను పూర్వం బ్రహ్మ వలన విన్నదే మీకు చెబుతాను .జ్ఞానానికి ప్రవర్తకం, నివర్తకం అని రెండుమార్గాలను వేదం చెప్పింది .కామ సంకల్పక పూర్వమైన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తకం అంటారు .ఇది అవలంబిస్తే స్వర్గం లభిస్తుంది .కాని పుట్టుక చావు నిరంతరంగా ఉంటుంది .కామ సంకల్పం ,విధ్యుక్తమైన కర్మ నివర్తకం .దీన్ని అచరిస్తే ముక్తి లభిస్తుంది .శ్రుతులలో బ్రాహ్మణులకు నాలుగు ,క్షత్రియులకు మూడు ,వైశ్యులకు రెండు శూద్రులకు ఒకటి ఆశ్రమాలు చెప్పబడినాయి .బ్రాహ్మణుడు బ్రహ్మ చర్య వ్రతం చేస్తూ ,వేద, వేదాంగాలు అధ్యయనం చేసి ,స్నాతుడై సవర్ణ స్త్రీని వివాహమాడి ,పుత్రులను పొంది విదిప్రకారం భార్యతో కలిసి హోమం చేస్తూ ,చివరికి నిర్జన ప్రదేశం లో నిత్యమూ అగ్నిహోత్ర సమక్షం లో తపస్సు చేస్తూ ,ఆత్మలో అగ్నిని ఆరోపించుకొని విధి ప్రకారం సన్యసించి పరమాత్మ క్షేత్రియుడు అయ్యే వరకు నిత్యకర్మ చేయాలి .

  క్షత్రియుడు సన్యాసాశ్రమం వరకు ,వైశ్యుడు వానప్రస్థాశ్రమం వరకు ,శూద్రుడు శుశ్రూష తో నిత్యం గృహస్తాశ్రమంలో ఉండాలి .నాలుగు ఆశ్రమాలలో ఉన్నవారు కోరికలు లేని విధ్యుక్త కర్మలే చేయాలి అని నాకు బ్రహ్మ బోధించాడు ‘’అన్నాడు .గార్గి ‘’జ్ఞానం తో విధ్యుక్త కర్మ చేసేవారికి ముక్తికలుగుంది అన్నారు కదా ఆ జ్ఞానం ఎలాంటిది ?’’అని అడిగింది .మహర్షి ‘’జ్ఞానం యోగాత్మకమైంది .అది అష్టాంగ సంయుతం .జీవాత్మ ,పరమాత్మల సంయోగమే యోగం .దానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి అనే ఎనిమిది అ౦గా లున్నాయి .యమ నియమాలు మళ్ళీ పదేసి రకాలు. ఆసనాలు ఎనిమిది అందులో ఉత్తమోత్తమాలు మూడు .ప్రాణాయామం  మూడు రకాలు.ప్రత్యాహారం అయిదురకాలు.ధారణ అయిదురకాలు .ధ్యానం పదహారు విధాలు .సమాధి ఒకే విధానం ‘’అని వివరించాడు .

మహర్షులంతా యోగీశ్వరుడు అంటే వాజసనేయ యాజ్ఞవల్క్యమహర్షి మాత్రమే కాని వేరెవరూకాదన్నారు .మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కణ్వ గురువైన యాజ్ఞవల్క్య మహర్షికి  యోగీంద్ర పట్టాభి షేకం జరిగి నట్లు  ‘’సహస్రనామావళి ‘’అనే గ్రంధం లో ఉన్నదని శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రాశారు . .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు   

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పిండారీలు

           పిండారీలు

బలవంతంగా దౌర్జన్యంగా హింసించి ధనాన్ని అపహరించే సాయుధ అవ్యవస్దిత గుర్రపు రౌతు మూకలే పిండారీలు .ఆహారం, డబ్బుకోసం దోపిడీ చేసే ముఠా.17వ శతాబ్ది ముస్లిం పాలన నుంచి 19శతాబ్ది వరకు ఉన్నారు .ముస్లిం సైన్యానికి దారి చూపించేవారు .తర్వాత మరాఠా సైన్యానికి సహాయ పడ్డారు .1817-18లో వారెన్ హేస్టింగ్స్ నాయకత్వం లో వీరిని అణగ తొక్కి అంత౦ చేశారు .హత్యలు దోపిడీలు  కొల్లగొట్టటాలు వీరి నిత్య కృత్యం .పిండారీ అనే మాట పింద్ర అంటే మత్తుకలిగించే ద్రవం అనే మరాఠీ మాట లోంచి పుట్టింది .ఇది  గడ్డిమోపు  , తీసుకొనే వాడు అనే రెండుమాటలలోంచి కూడా ఏర్పడిందిఅంటారు  .వీరికి ఆశ్వికదళమే కాక కాల్బలమూ ఉండేది .వీరి ఆహార్యం –నెత్తిపై టర్బన్ తో అర్ధ దిగంబరంగా నడుం చుట్టూ వస్త్రం తో మాత్రమె ఉండేవారు .చేతిలో నిశితమైన ఖడ్గం అంటే తల్వారు ఉండేది. కాళ్ళకు పాదరక్షలు ధరించేవారు .శత్రు సైన్యం రహస్యాలను ,కదలికలను పసిగట్టి తాము నమ్మిన వారికి అందించటం లో ఆరి తేరిన దిట్టలు .ఔరంగజేబు పాలన లో వీరి గురించి ప్రస్తావన మొదట వచ్చింది .తర్వాత ,మరాఠా సైన్యానికి మద్దతు నిస్తూ  మొఘల్ సామ్రాజ్య  పాలనపై ఎదురు తిరగటం తో పిండారీలపాత్ర బాగా ప్రచారమైంది .శత్రు భూభాగం లోకి తేలికగా చొచ్చుకుపోయి  వారిని కల్లోలపరచి కకావికలు చేయటం లో సిద్ధహస్తులనిపించారు .ఐతే 1791లో  శృంగేరిశారదా పీఠంపై పిండారీల దాడి వారిని దూషణకు గురి చేసింది .శివాజీ పాలనలో వారి అధికారాలకు కళ్ళాలు బిగించాడు .

  పిండారీలు ముఖ్యంగా ముస్లిం లు . కాని వారి ముఠాలో అన్ని వర్ణాలవారినీ చేర్చుకొన్నారు .ఔరంగ జేబు చావుతో మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యాక ,నవాబులు, హిందువులు బహిరంగం గా యుద్ధాలు చేశారు .స్థానిక భూస్వాములు స్వంతఖర్చుతో సైన్యాలను ఏర్పాటు చేసుకొన్నారు  .మఠాలు, మఠాధిపతులు వారికి అండగా నిలిచారు .దేవాలయాలు నివాసాలయ్యాయి .మధ్యభారతం లోదక్కన్ , గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సాలలో పిండారీలు దండిగా వ్యాపించారు .19వ శతాబ్ది ప్రారంభం లో పిండారీ నాయకుల ,దళాల  నిర్వహణ కోసం డబ్బు బాగా అవసరం వచ్చి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గంగా దోపిడీలు బందిపోటుదొంగతనాలు ,హత్యలు చేసి డబ్బు కూడబెట్టేవారు .క్రీ.శ. 1800-15కాలం లో పిండారీల  సంఖ్య  20వేలు నుంచి 30 వేలు ఉండేది .పల్లెటూళ్ల పై విరుచుకుపడి,అందిన౦తా దోచుకొని పోయేవారు.అమాయక ప్రజలను బానిసలు చేసి డబ్బుకు అమ్ముకొనేవారు .ఈ దౌర్జన్యాలతో స్థానిక నవాబుల హిందూ రాజులబ్రిటిష్ అధికారుల  గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేవారు .

  పిందారీలను అణచి వేయగానే వారు అనేక ప్రదేశాలకు వలస పోయారు .అక్కడి ప్రజలు  పిండారీ స్త్రీలకు ఆవాసాలు  ఏర్పరచి జీవించటానికి తోడ్పడుతున్నారు ఆస్ట్రేలియాలో ని బ్రిస్బేన్ లో ఇలాంటి వసతి గృహాలున్నాయి .పిండారీ విమెన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పరచి వారి అభివృధికి జీవనోపాధికి వీలుకల్పిస్తున్నారు .ఆస్ట్రేలియాలోని స్ప్రింగ్ హిల్స్ లో పిండారీ వుమెన్ హాస్టల్ ఉంది .

  హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో పిండారీ నది ఉన్నది .దీని ప్రవాహం 105కిలోమీటర్ల వ్యాప్తిలో ఉండి తీరప్రాంతాలలో మన్మట్టి ,నంద కేసరి ,భాగోలి మొదలైన పట్టణాలున్నాయి .కర్ణ ప్రయాగ లో పిండారీనది అలకనంద నదిలో సంగమిస్తుంది .అక్కడినుంచి అలకనంద పేరుతొ నే పిలువబడుతుంది .

  ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ పిండారీ హిమానీ నది ట్రెక్కింగ్ లో 24మంది మహిళా బృందం ఇండియన్ నేవీ ఆధ్వర్యం లో 2018మార్చి 24నుంచి ఏప్రిల్ 2 వరకు నడిచి వెళ్ళింది .ఇది మహిళా సాహసికులకు గొప్ప అవకాశమైంది .మార్చి 26న లోహార్ కోట్లో ట్రెక్కింగ్ ప్రారంభమైంది .మంచు రాళ్ళు కొట్టుకుంటూ దారి చేసుకొంటూ ధకూరి ఖాతి దవాలి గుండా ప్రయాణించారు .అక్కడినుంచి ముందుకు నడవటం ప్రాణాంతకమైన పనే అయినా ధైర్యం కోల్పోకుండా ఆరు లాండ్ స్కేప్ జోనులను దాటి ముందుకు సాగారు .మార్చి 30న 3353 మీటర్ల ఎత్తులో ఉన్న పిండారీ  గ్లేషియర్ జీరో పాయింట్ చేరారు .ఈ హిమానీ నది ఒకటిన్నర కిలోమీటర్ల వెడల్పు ,మూడుపాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు ఉన్నది .కమాండర్ ప్రియా ఖురానా ప్రేరణతో ఈ మహిళా అధ్యయన బృందం విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేసి పిండారీ నది మార్గాన్ని సులువు చేసి  విఖ్యాతి  చెందింది .మార్చి8 మహిళా దినోత్స్వసందర్భంగా ఆ మహిళా సాహసిక బృందానికి అభినందనలు .

  మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24 వివాహం సంతానం

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24

  వివాహం సంతానం

గార్గి తన అన్న మిత్రుని తో కూతురు మైత్రేయి వివాహ విషయం కదిలించింది .యుక్తవయసు వచ్చి౦ది కనుక  వివాహం చేయాలని ఆమె మనసులో మాట కనుక్కోమని సోదరికి చెప్పాడు .ఆమె అడిగింది .దానికి మైత్రేయి ‘’బిడ్డల అభిప్రాయం తలి దండ్రులకు తెలిసే ఉంటుంది ‘’అన్నది .గార్గి ‘’మాకు తెలిసినా నీ నోటి లోనుంచి ఆ మంచి మాట వినటం మాకు సంతోషం కదా ‘’అంది .అప్పుడు మైత్రేయి తాను యాజ్ఞవల్క్యమహర్షి వాదన విన్నాక అయన బ్రహ్మ వేత్త అని అందరూ నిర్దారించారుకనుక ఆయననే పెళ్లి చేసుకొంటే ఉచితంగా ఉంటుందని పిస్తోందని అన్నది .మిత్రుడు ‘’యాజ్ఞవల్క్యుడు ఇప్పటికే కాత్యాయని ని వివాహమాడి అన్యోన్యంగా కాపురం చేస్తున్నాడు .అలాంటివాడు మళ్ళీ మన అమ్మాయిని పెళ్లి చేసుకొంటాడా ?’’అని సందేహించాడు .దీనికి గార్గి పూర్వం జరిగిన ఒక విషయం గుర్తు చేసింది .ఒకసారి యాజ్ఞవల్క్యుడు తపస్సు చేసుకొంటుంటే పెద్ద పులి ఆయనపై దూక బోతుంటే మిత్రుడు తన సహచరుల చేత దాన్ని చంపించగా మహర్షి అతడిని పొగిడిన విషయం ఇది వరకే తానూ చెప్పిన అసంగతి గుర్తు చేసి ,ఇప్పుడు మనపిల్లను పెళ్లి చేసుకోమని అడిగితె కాదనడు అని ధైర్యం చెప్పింది .అతడు ‘’అలాంటి మహర్షిని ఏ క్రూర మృగం హాని చేయలేదు .నాకు ఆయనను కాపాడే  అవకాశమిచ్చాడు అంతే .ఇదొక గొప్ప విషయం కాదు ఆయనకు చెప్పటానికి .కానీ నాప్రయత్నం నేను చేస్తాను ‘’అన్నాడు .

  వెంటనే యాజ్ఞావల్క్యుని చేరి,తానొక కోరికతో వచ్చానని దాన్ని తీర్చమని   విన్నవించాడు .’’మీ కోరిక తెలిస్తేనే కదా నేను ఆలోచించి చెప్పగలను ‘’అన్నాడు .’’నాకుమార్తె మైత్రేయి నా సోదరి గార్గి పెంపకం లో పెరిగి జ్ఞానురాలై జనక సభలో మీ చర్చ చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని సంకల్పించి మాకు తెలియజేసింది ‘’అన్నాడు .ఆయన ‘’ఈ శరీరం ఒక వనితకు ఇదివరకే ఇచ్చేశాను .ఇప్పుడు దానిపై నా పెత్తనం లేదు ‘’అన్నాడు .’’మహాత్మా !కాత్యాయిని దేవి అనుమతిస్తే మీకు అభ్యంతరం లేదని మీ మాటలవలన అర్ధమయింది ‘’అనగా ‘’అవును ఆమెయే తన సొత్తును ఇతరులకిచ్చే అధికారం కలిగి ఉంది ‘’అన్నాడు. సంతోషించి సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు .

   జరిగిన విషయం గార్గి మొదలగు వారితో చెప్పి ,మైత్రేయిని వెంటబెట్టుకొని యాజ్ఞవల్క్య గృహానికి వెళ్లి కాత్యాయానికి కూడా విషయమంతా నివేదించాడు .మైత్రేయిపై గల వాత్సల్యం తో తాను  తప్పక వారిద్దరి వివాహానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేసింది .ఒకరోజు కాత్యాయని భర్తతో ‘’స్వామీ !నా కోరిక ఒకటి మీరు తప్పక తీర్చాలి ‘’అన్నది .అదేమిటో చెప్పమన్నాడు .’’నా చెలికత్తె మైత్రేయి ఎప్పుడూ నా దగ్గర ఉండేట్లు మీరామెను పెళ్లి చేసుకోవాలి ‘’అని చెప్పింది .ఆయన ‘’పిచ్చిదానిలాగా ఉన్నావు .నీ భర్తను వేరొకరికిస్తావా ?’’అన్నాడు .’’మేము వేరుకాదు .ఒక్కరమే .నా శరీరానికి నేను సుఖం చే కూర్చుకో కూడదా ?’’అని అడిగింది .’’ఐతే నీకోరిక తీరుస్తాను ‘’అనగా  ఆ సంతోష వార్త వెంటనే గార్గికి తెలియ జేసింది కాత్యాయని .మిత్రుడు పెళ్లి ఏర్పాట్లు చేసి ఒక శుభ ముహూర్తం లో మైత్రేయీ యాజ్ఞవల్క్య వివాహం ఘనం గా జరిపించాడు.జనక రాజు మహర్షులు వివాహానికి విచ్చేసి పరమానంద భరితులయ్యారు .యాజ్ఞావల్క్యుని బ్రహ్మ విద్యా వ్యాప్తికి అన్నివిధాలా సహకరించే సహధర్మ చారిణి మైత్రేయి అని అందరూ మెచ్చుకున్నారు ..

    యాజ్ఞవల్క్య ,మైత్రేయి తరచుగా బ్రహ్మవాదం లో కాలం గడిపారు .కాత్యాయినీ యాజ్నవల్క్యులకు చంద్ర కాంతుడు ,మహా మేఘుడు ,విజయుడు అనేముగ్గురు లోక ప్రసిద్ధులైన కుమారులు జన్మించారు అని శేషధర్మం ,సంశయ తిమిర దివాకరం లలో ఉన్నది –యాజ్ఞవల్క్య సుతా రాజన్ త్రయో వై లోక విశ్రుతాః-చంద్ర కాంత మహా మేఘ విజయా బ్రాహ్మణోత్తమాః   ‘’(శేష ధర్మం )

‘’మైత్రేయీ అనపత్యా ,కాత్యాయన్యాశ్చచంద్రకాంత –మహా మేఘ ,విజయ నామా స్త్రయః పుత్రా అభూవత్ ‘’(సంశయ తిమిర దివాకరం )

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-19-ఉయ్యూరు 

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23

శాకల్యుడు ‘’శరీరం హృదయం దేనిలో ప్రతిస్టింప బడ్డాయి ?’’ యాజ్ఞవల్క్యుడు ‘’ప్రాణవాయువు లో .అది అపానవాయువులో .అది వ్యానవాయువులో .అది ఉదాన వాయువులో అది సమానవాయువులో ప్రతిష్టింప బడినాయి ‘’అనగానే ఇక మాట్లాడక ఊరుకున్న మేనమామను ‘’ఔపనిషద పురుషుని గురించి నువ్వు వివరించిచెప్పు ..చెప్పకపోతే తలపగిలి చనిపొతావు ‘’అన్నాడు .శాకల్యునికి ఆ వివరం తెలియకపోవటం తో తలపగిలి చచ్చాడు .బ్రాహ్మణ్యం అంతా మహర్షి వేతృత్వాన్ని వేనోళ్ళ  పొగడి , శాకల్యుని అజ్ఞానాన్ని అహంకారాన్ని దూషించారు .అవతారపురుషుడు యాజ్ఞవల్క్యుడని మెచ్చారు .శాకల్యుని శిష్యులు గురువుకు జరిగిన పరాభవం  మరణం గురించి బాధపడి ఆయన అస్థులనుమూటకట్టి  ఉత్తరక్రియలకోసం తీసుకు వెడుతుంటే దొంగలు అందులో డబ్బు ఉందనుకొని ఎత్తుకొని పారిపోయారు .బ్రహ్మ వేత్తలను ద్వేషిస్తే ఇహ, పరాలు దక్కవు అని అందరికి అర్ధమైంది .

  శాకల్యుని కథ సమాప్తి చెందటం తో జనకరాజు ఆస్థానానికి వచ్చిన వారు ఇక నోరు మెదపకుండా కూర్చుంటే యాజ్ఞవల్క్యుడే ‘’మీలో ఇంకెవరైనా కానీ ,కొందరుకానీ అందరూ కలిసి కానీ సందేహాలుంటే అడగండి .మీరు అడగకపోతే నేనే మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది ‘’అన్నాడు .కిమిన్నాస్తి .ఎవ్వరూ మాట్లాడలేదు .అప్పుడు మహర్షి యాజ్ఞవల్క్యుడే వారందరితో ‘’పురుషుడిని వనస్పతి తో పోల్చవచ్చు .ఎలాగంటే శరీరానికి  వెంట్రుక   లున్నట్లు వృక్షాలకు ఆకులున్నాయి .పురుషుడికి జన్మ ఉన్నట్లు చెట్టుకూ ఉంది .పురుషునికి రక్తం కారినట్లే చెట్లకూ బంక కారుతుంది .మనకు మాంసం ఉన్నట్లే వాటికి శకలాలున్నాయి .మన నరాలలాగే వాటికీ దృఢమైన కీనాటం ,ఎముకలులాగా వాటిలో దారువులు ,మనకు కొవ్వు ఉంటె వాటికి చేవ సమాన ధర్మాలుగా ఉన్నాయి .చెట్టును నరికితే ,మూలం నుంచి మళ్ళీ పుడుతుంది .మృత్యువు చేత చేది౦పబడితే మనిషి ఏ మూలం నుంచి పుడతాడు ?.రేతస్సు అని చెబుతారేమో ?బ్రతికి ఉన్నవాడికే రేతస్సు ఉంటుంది .చెట్టు చచ్చిపోయినా బీజం వలన మళ్ళీ పుడుతుంది . వ్రేళ్ళతో పెకలిస్తే మళ్ళీ పుట్టదు .చనిపోయినవాడు ఏ మూలం నుంచి పుడతాడు ?పుట్టినవాడు మళ్ళీ పుట్టడు కనుక ఈ ప్రశ్న అసంబద్ధం అంటారా ?కాదు .పుట్టినవాడు చనిపోయాక జన్మమే లేకపోతే వాడు చేసిన పుణ్యపాపాలకు ఫలం నశించటం  చేయని వాటికి ఫలం రావటం జరుగుతుంది .కనుక చచ్చినవాడు మళ్ళీ పుడతాడు అనే చెప్పాలి .అప్పుడు అతడిని ఎవరు పుట్టిస్తారు ?’’అని ప్రశ్నలు సంధించగా తెల్లమోహాలేసి ఎవరూ మారు మాటాడలేదు .కనుక ఇందులో తేలిన సారాంశం –అన్నిటికీ మూల విజ్ఞాన గుణ ,ఆనంద స్వరూపం పర బ్రహ్మమే .యాజ్ఞావల్క్యమహర్షి ని బ్రహ్మ వేత్త గా ,అధిగమించరాని పండితోత్తమునిగా అందరూ భావించి ప్రశంసించారు .అతడినే అనుసరించి జన్మలు చరితార్ధం చేసుకోవాలి నిర్ణయించుకొన్నారు .

  అప్పుడు జనక చక్రవర్తి యాజ్ఞవల్క్య మహర్షి తో ‘’పరమ పురుషా !శతకోటివందనాలు .నీ దశావతార మహిమ తెలియక కొందరు అపోహపడి భంగపడ్డారు .వేలకొలది విద్వా౦సు లున్న ఈ సభలో ‘’బ్రహ్మిస్టుడవు ‘’అని ఖ్యాతి గడించావు .మా పురం లో ఉంటూ బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తూ ,పరబ్రహ్మ తత్వాన్ని నాకు వివరంగా బోధించి నన్ను ధన్యుడిని చెయ్యి ‘’అని సభాముఖంగా ప్రకటించాడు .యాజ్ఞవల్క్యుడు ‘’సార్వ భౌముడు తలచుకొంటే కానిదేమున్నది ‘’అని తన అంగీకారం తెలిపి ,చాలాకాలం మిధిలానగరం లోనే ఉంటూ జనకునికి బ్రహ్మ విద్య నేర్పుతూ జనులకు ఐహికాముష్మిక జ్ఞానమార్గం బోధించాడు .గార్గి తనతో వచ్చిన మైత్రేయి దృష్టి అంతా యాజ్ఞావల్క్యుని పైనే ఉన్నదని ,ఆమె మనసంతా అతడు వ్యాపించి ఉన్నాడని ఆమె అతడిని గాఢంగా ఇస్టపడుతోందని ,ఇంటికి వెడుతూ గ్రహించింది .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21

గార్గి రంగ ప్రవేశం చేసి తాను రెండు ప్రశ్నలు యాజ్నవల్కుని అడుగుతానని ,ఆయన సరైన సమాధానాలు చెబితే అతడిని ఇక ఎవరూ జయించలేరని  సభలోని వారికి చెప్పగా వారంతా అంగీకరించగా ‘’దేనిలో ద్యులోకానికి పైన ,భూమికి కింద ,అండకపాలానికి మధ్య ఉంటూ భూమి అంతరిక్షాలను ప్రవర్తి౦ప చేసేది చేయగలిగేది ,ఏకీభవించేది అనేదాన్ని యాగాలను బట్టి చెబుతారో అది అంతా దేనిలో ఓత ప్రోతమౌతుంది ?’’అని ప్రశ్నించింది .’’వాయువులో ‘’అని ఠక్కున చెప్పాడు .సరైన సమాధానమే అని ‘’వాయువు దేనిలో  ఓతప్రొతమౌతు౦ది  ‘’అని అడుగగా ‘’ఆకాశం లో ‘’అనగా ,అది దేనిలో అనగా ‘’అక్షరాలలో –అక్షరాస్వరూపం లావు పొట్టి రంగున్నది స్నేహం నీడ చీకటి వాయువు ఆకాశం సంగమం కాదు. రసం వాసన కళ్ళు చెవులు వాక్కు మనసు తేజస్సు లేనిది .ప్రాణం లేనిది .ముఖం, పరిమితి ,రంధ్రం బాహ్యం లేనిది .దేన్నీ తినదు దేని చేతా తినబడదు .ఈ అక్షర ప్రకాశం వలననే సూర్య చంద్రులు క్రమం తప్పక సంచరిస్తారు .నిమిషాలు ముహూర్తాలు రాత్రి పగలు నెలలు సంవత్సరాలు కలుగుతాయి .నదులుకొన్ని తూర్పుకు కొన్ని పడమరకు ప్రవహిస్తాయి .దేవతలు యజమానుని ,పితృ దేవతలు దర్వీ హోమాలను అనుసరిస్తారు .ఈ అక్షర తత్త్వం తెలీకుండా హోమం యాగం తపస్సు చేస్తే కర్మఫలం వలన నాశనమౌతారు .అక్షర స్వభావం తెలీకుండా చనిపోతే దీనుడై జనన మరణాల సుడి గుండం లో పడిపోతాడు .అక్షర రహస్యం తెలిస్తే బ్రాహ్మ వేత్త ఔతాడు .అక్షరం చూడబడనిది అయినాచూస్తుంది .వినబడనిదైనా వింటుంది తలపబడనిదైనా తలుస్తుంది. తెలిసికోబడనిదైనా తెలుసుకొంటు౦ది .కనుక ఈ అక్షరం కంటే వేరే ఏదీ చూసేది తలచేది తెలుసుకొనేది లేనే లేదు .ఆకాశం ఈ అక్షరం లోనే ఓత ప్రోతమౌతుంది ‘’అనగానే గార్గి పరమానందం తో అక్కడి బ్రాహ్మణులతో ‘’మీలో ఎవరూ యాజ్ఞావల్క్యుని జయి౦చేవారు లేరు కనుక ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవటం శ్రేయస్కరం ‘’అని తీర్పు చెప్పింది .

కాని మేనమామ విదగ్ధ శాకల్యుడికి ‘’ఎక్కడో ‘’మండి’’దేవతలుఎందరు ?’’అని అడిగితె ‘’విశ్వ దేవ శాస్త్రం నివిత్తులో చెప్పబడినట్లు  ,మూడు వందలముగ్గురు ,మూడువేల ముగ్గురు అనీ దేవతల  సంఖ్య చెప్పే మంత్రాన్ని నివిత్తం అంటార’’ని .చెప్పాడు తర్వాత  వీరిద్దరి మధ్య ప్రశ్నోత్తర సరళి ఇలా సాగింది –దేవతలెందరు ?ముప్ఫై ముగ్గురు .దేవతలలెందరు?ఆరుగురు ‘’,దేవతలెందరు ?ముగ్గురు ‘’,దేవతలెందరు ?’’ఇద్దరు ‘’,దేవతలెందరు ?’ఒకటిన్నర ‘’దేవతలెందరు ?ఒక్కరు ‘’మూడువేల ముగ్గురు మున్నూతముగ్గురు దేవతలేవారు ?’’ముప్పది ముగ్గురా యొక్క విభూతియె ఆ దేవతలు .అసలు దేవతలు ముప్పది ముగ్గురే .’’వాళ్ళెవరు ‘’?’’ఎనిమిదిమంది వసువులు పదకొండు మంది రుద్రులు ,12మంది ఆదిత్యులు.’’వసువు లెవరు ?’’అగ్ని భూమి ,వాయువు అంతరిక్షం  చంద్రుడు నక్షత్రాలు అనేవే వసువులు .వీటిలో వసువు  అంటే దనం రూపం లో జగత్తు ఉండటం చేత వసువులు అని పిలువబడ్డాయి .ఈ ఎనిమిది అధీనం లోనే ధనం ఉందని  భావం ,.’’రుద్రులెవరు ?’’పురుషునిలోని ప్రాణ అపానాది దశ ప్రాణాలు ,ఆత్మ కలిసి పదకొండుమంది రుద్రులు .మరణ సమయం లో ఇవి శరీరం నుంచి లేచిపోతాయి .అప్పుడు పుత్రాది బంధు వులు రోదనం చేస్తారుకనుక రుద్రులు అనబడుతాయి ‘’.ఆదిత్యులెవరు ?’’ సంవత్సరం లోని పన్నెండు నెలలే ద్వాదశ ఆదిత్యులు .ప్రాణుల ఆయువు కర్మఫలాలను గ్రహించి పోవటం వలన ఆదిత్యులు అన్నారు .’’ఇంద్రుడు అంటే ?’’గర్జించే మేఘం ‘’ప్రజాపతి అంటే ?’దర్శ పూర్ణ మాసాది యజ్ఞమే. ప ‘’.’’స్తనయత్నువు ?’’అంటే ‘’ఆశని ‘’.యజ్ఞం అంటే ?’’పశువులే యజ్ఞం .’’ఆరుగురు దేవతలేవారు ?’’అగ్ని భూమి వాయువు అంతరిక్షం ఆదిత్యుడు ద్యులోకం ‘’మళ్ళీ ఆరుగురు దేవతలలెవరు ?’’ పైన చెప్పబడినవారే ‘’ముగ్గురు దేవతలలెవరు ‘’?’’మూడులోకాలే ‘’వీటినుంచే దేవతలుద్భవిస్తారు .’’ఇద్దరు దేవత లెవరు ?’’అన్నం, ప్రాణం .’’అధ్యర్ధమైన దైవతం ఎవరు ?’’వీచే గాలి ‘’ఎందుకు అయింది ?’’వాయువు వలననే సకలం వృద్ధి పొందు తుంది కనుక .’’ఇదివరకు చెప్పిన దేవత ఏది ?’’ప్రాణమే బృహత్ స్వరూపమైన పర బ్రహ్మ౦ .’’ఈ విధంగా శాకల్య యాజ్ఞవల్క్య చర్చ కొనసాగింది .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .

సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్-6-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుల కు కీ శే . విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి నివాళి

మా తండ్రిగారు కీ .శే .విద్వాన్ గబ్బిట  మృత్యుంజయ శాస్త్రిగారు అనంతపురం జిల్లా హిందూపురం ఎడ్వర్డ్ కారోనేషనల్  హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్  గా 1950లో పని చేస్తున్నప్పుడు ”త్యాగ ధనులు ”అనే పుస్తకం రచించారు .దీనికి ఉయ్యూరు లోని ఉమాప్రిస్  నిర్వాహకులు ,మా నాన్న గారి ముఖ్య స్నేహితులు శ్రీ ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు గారు సహాయకులేకాక వారి ప్రెస్ లో పుస్తకం ముద్రించారు . 118 పేజీలున్న ఈ పుస్తకం  వెల 14 అణాలు . ఈ పుస్తకం అప్పుడు కృష్ణా జిల్లా బోర్డు హై స్కూళ్లలో  ఉపవాచకం -నాన్ డిటైల్డ్ గా బోధింపబడేది . ఇందులో1-నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 2- భీష్ముడు 3-శ్రీరాము డు 4  -విజయలక్ష్మీ పండిట్ 5-ఖాన్ సోదరులు  చేసిన త్యాగం గురించి వివరించారు . త్యాగధనుని త్యాగాన్ని కీర్తిస్తూ ఒక  ఆటవెలది పద్యం రాసి, తర్వాత వచనం లో విషయం తెలియ జేశారు .ఇప్పుడు ఆ పద్యాల గురించి మాత్రం తెలుసుకొందాం .

 

https://archive.org/details/ThyagaDhanulu

            1-నేతాజీ సుభాష్ చంద్ర బోసు
”రాష్ట్రపతి పదవి విరక్తి తో త్యజియించి -దొరల కన్ను  లందు దుమ్ముకొట్టి
 తెల్ల దొరలవాడల దేశీయ సైన్యంబు  -నడిపి నట్టి  బోసె  నాయకుండు ”
            2-భీష్ముడు
”తనదు రాజ్యమెల్ల  త్యాగంబు జేసియు -బ్రహ్మ చర్యమనెడి వ్రతము పూని
 స్థిర  మనస్కు  డగుచు  దేవ వ్రతుండును-భీష్ము డనుచు బెద్ద  పేరు గాంచె ”
           3- శ్రీరాముడు
”ప్రజలు కోరుకొనిరి రాముడె  రాజని -రాము డెంచె బ్రజల బ్రాణములుగ
 ప్రజలు  మెచ్చనట్టి పని జేయనొల్లని -రాము వంటి ప్రజల ప్రభువు వలయు ”
          4-విజయలక్ష్మీ పండిట్
”భారతీయ కాంగ్రెసు గౌరవముల నంది – భారతీయ విజ్ఞాన సంపత్తి నెల్ల
 నితర దేశము లందు బోధించినట్టి -విజయ లక్ష్మి పండిట్ బోలు వెలది కలదె ”
           5- ఖాన్ సోదరులు
”జాతిమతములతోడ  ప్రసక్తి  లేక -గాంధిజీ యాశయముల గలసి మెలసి
యున్న ఖాన్ సోదరులవంటి యుత్తములగు -మానవు లరుఁదు కద !ముసల్మాను లందు ”
 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-3-19-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20

వచక్నుని కుమార్తె గార్గి ,తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంటబెట్టుకొని వచ్చి ‘’యాజ్ఞవల్క్యా !అంతా ఉదకాలలో ఓత,ప్రోతాలుఅయ్యాయని అంటారు .ఉదకాలు దేనిలో ఓతప్రోతాలయ్యాయి ?’’అని ప్రశ్నించింది .ఇక్కడఓత పోతాలు అవటం అంటే వస్త్రం లో ఉండే పడుగు పేక లాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం .యాజ్ఞవల్యుడు ‘’వాయువులో ‘’అన్నాడు వాయువు దేనిలో?’’అంతరిక్షం లో ‘’.అంతరిక్షం దేనిలో ‘’?’’గ౦ధర్వ లోకం లో ‘’,అది దేనిలో ?’’’’ఆదిత్యలోకం లో ‘’అది దేనిలో ‘’?’’చంద్రలోకం లో ‘’,అది దేనిలో ?’’నక్షత్ర లోకం లో ..’’అది దేనిలో ?’’’’దేవలోకం లో ‘’అది ఇంద్రలోకం లో అది ప్రజాపతి లోకం లో ,అది బ్రహ్మలోకం లో ‘’అని చెప్పాక ‘’బ్రహ్మలోకం దేనిలో ఓతప్రోతమౌతుంది ‘’?అని గార్గి అడిగితె ‘’గార్గీ !న్యాయం మీరి అడగకు అలా చేస్తే నీతల పగిలిపోతుంది ‘’అనగానే గార్గి నోరు మెదపలేదు .

  ఈ సంవాదానికి శ్రీ భాగవతుల లక్ష్మీ పతిశాస్త్రిగారు అర్ధవంతమైన వివరణ ఇచ్చారు .దాన్ని పరిశీలిస్తేనే అసలు భావం తెలిసేది .-అంతరిక్షం అంటే శరీరాకాశం .గంధర్వలోకం అంటే సూర్య కిరణాలు .వేడిలేకపోతే నీరు వాయువు ఉన్నా బీజం మొలకెత్తదు .శరీరం లోని వేడినే గ౦ ధర్వ శబ్దం .జఠరాగ్ని యే ఆదిత్యుడు .చంద్రలోకం మనసు .పంచేంద్రియాలు నక్షత్రలోకం .కళ్ళు చెవులు మొదలైనవాటికి అది దేవతలే దేవలోకం .జీవాత్మ ఇంద్రలోకం .ప్రజాపతిలోకం అంటే శుభాశుభకర్మలు .బ్రహ్మ అంటే పరబ్రహ్మ .

  అరుణ పుత్రుడు ఉద్దాలకుడు ‘’మేము పత౦జలుని  ఆశ్రమం లో యజ్ఞ శాస్త్రం చదువుతూ ఉంటె అతనిభార్య గాంధర్వ గృహీతగా ఉంటె ఎవరని అడిగితె గాంధర్వ పుత్రుడను కబంధుడను  అన్నాడు.అతడుపత౦జలు నేకాక  మమ్మల్నీ ప్రశ్నించాడు  ‘’లోకం ,పరలోకం సకలభూతాలు ఏ సూత్రంతో గుచ్చబడినాయి ?’’అని అడిగితె పతంజలి తనకు తెలీదన్నాడు ‘’తర్వాత ’’అంతర్యామి అయిన పరమాత్మ తెలుసా ?అని అడిగాడు .తెలుసుకోలేదన్నాడు .అప్పుడు కబంధుడు ‘’ఆ సూత్రం లో ఉన్న అంతర్యామిని కనుగొన్నవాడే బ్రహ్మవేత్త .వాడే లోకవిదుడు వేదవిదుడు .తర్వాత అతడి ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకొన్నాం .యాజ్ఞవల్క్యా ! నీకు ఆ సూత్రం తెలీకుండానే గోవుల్ని స్వంతం చేసుకోవాలనుకొన్నావు .తోలుకు వెడితే తలపగిలి చస్తావు ‘’అన్నాడు .

  యాజ్ఞవల్క్యుడు ‘’ఉద్దాలకా !నాకు ఆ సూత్రస్వరూపం అంతర్యామి తత్త్వం పూర్తిగా తెలుసు ‘’అనగా ‘’తెలుసు అంటే చాలదు ఎలా తెలుసో వివరించు ‘’అన్నాడు .మహర్షి ‘’ ఆ సూత్రం అంటే వేరే ఏదీకాదు వాయువే .వాయువే అన్నిటినీ దారంతో పూలు గుచ్చినట్లు గుచ్చుతుంది .వాయువు శరీరాన్ని వదిలేస్తే మరణమే .సంతోషించి’’అంతర్యామి తత్త్వం వివరించమనగా ‘’అది దైవత స్వరూపాలైన భూమి నీరు అగ్ని అంతరిక్షం వాయువు ద్యులోకం ఆదిత్యుడు దిక్కులు చంద్ర తారకలు ఆకాశం అంధకారం తేజస్సు – అది భూతాలైన –సకల భూతాలూ ,ఆధ్యాత్మ స్వరూపాలు ప్రాణం వాక్కు ,కన్ను చెవి మనసు చర్మం విజ్ఞానం రేతస్సు ఇవన్నీదేనికి శరీరమై ఉందొ ,ఏది వాటికి అంతరంగా ఉండి వాటిని నియమిస్తోందో అదే నాశనం లేని అంతర్యామి స్వరూపం .అంటే భూమి ఆకాశాలకు అంతరంగా ఉంటూ వాటినన్నిటినీ నియమిస్తూ వాటి చేత తెలియబడకుండా విలక్షణంగా ఉండే నాశరహిత అంతర్యామి స్వరూపమే ఆత్మ’’అని వివరించాడు .

    సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -54

74-సిద్ధ తీర్ధం

పులస్త్య వంశ సంజాతుడు రావణుడు అన్ని దిక్కులూ జయించి ,సోమలోకం పైకి దండెత్తాడు .అప్పుడు బ్రహ్మ తానొక మంత్రం ఇస్తాను యుద్ధం విర మించమని చెప్పాడు .శివుని  అష్టోత్తర శతనామాలతో ఉన్న మంత్రం ఉపదేశించాడు .మంత్రం గ్రహించి చంద్రలోకాన్ని జయించి  అన్ని చోట్లా విజయం సాధించి కైలాసం వెళ్ళాడు .కైలాస వైభవానికి దిమ్మతిరిగి దాన్ని లంకకు పెకలించుకు పోతానని పట్టు బట్టాడు .రావణమంత్రులు మంత్రాంగం చేసి అతనితో అది తగనిపని అని హితవు చెప్పారు .కాని వారి మాట వినకుండా పుష్పక విమానం తో కైలాసగిరిపైకి దూకి దాని మూలాన్ని పెకలించే ప్రయత్నం చేశాడు .రావణ గర్వాన్ని ఖర్వం చేయాలనుకొని కైలాసపతి కాలి బొటన వ్రేలితోఅదుమగా  రసాతలం లో పడిపోయాడు .

   గాయాలపాలైన దశకంఠుని చూసి ఉమామహేశ్వరులు నవ్వుకొని ,ప్రసన్నుడై అడిగిన వరాలిచ్చాడు .పుష్పకమెక్కి  లంకకు పోదలచి శివుని పూజించటానికి గంగా నదిని చేరాడు .గంగలో స్నానం చేసి భక్తితో శివపూజచేయగా భోళా శంకరుడు ప్రత్యక్షమై ఒక అద్భుత ఖడ్గం ,సిద్ధి సర్వ సంపదలు అనుగ్రహించాడు .బ్రహ్మ ఉపదేశించిన శివమంత్రం తో శంభుని స్తుతింఛి సంతోషం తో లంక చేరాడు .గొప్ప సిద్ధి కలిగించేది కనుక ఇది సిద్ధి తీర్ధంగా ప్రసిద్ధమైంది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .

  75-పరుష్ణీ సంగమ తీర్ధం

  అత్రి ముని బ్రహ్మా విష్ణు మహేశ్వరులను ఆరాధించగా ప్రీతి చెంది దర్శనమివ్వగా వారు తమకు పుత్రులుగా జన్మించాలని కోరాడు .అలాగే అని పుత్రులను ప్రసాదించారు త్రిమూర్తులు .అత్రికి ఆత్రేయీ అనే కన్య ,దత్తుడు సోముడు దుర్వాసుడు కుమారులు కలిగారు .అగ్నికి అంగీరసుడు పుట్టాడు .నిప్పు కణం నుంచి పుట్టాడుకనుక అంగీరసుడు .అత్రి తనకూతురు ఆత్రేయి ని  అంగిరసుడి కిచ్చి పెళ్లి చేశాడు . ధర్మపత్నిగా భర్తకు సకలోపచారాలు చేసింది   .బలసంపంనులైన పుత్రులు జన్మించారు .కాని అతడు ఆమెను పరుష వాక్కులతో బాధించేవాడు .కొడుకులు శాంతపరచేవారు .

  భరించలేక భర్తపై మామగారైన అగ్ని కి  ఫిర్యాదు చేసింది .ఆయన అర్ధం చేసుకొని ఆమె భర్త ఎప్పుడు అగ్ని దగ్గరకు వస్తాడో అప్పుడు జల రూపంతో ము౦చేయమని చెప్పాడు .సాధ్వి అలా చేయటం తగదని తనకు తన భర్త శాంతి మాటలే కావాలని చెప్పింది .అప్పుడు అగ్ని ‘’అమ్మా అగ్ని నీటిలో ,శరీరంలో ,స్థావర జంగామాలలో ఉంటాడు .నీ భర్తకు ఆశ్రయం నేను ,తండ్రిని నేను .జల అంటే మాతృ దేవతలు ‘’అన్నాడు .కోడలు ‘’జలం తల్లి అయితే నేను మీ అబ్బాయికి తల్లినీ భార్యనూ ఎలా అవుతాను ?’’అని ప్రశ్నించింది .అగ్ని ‘’పెళ్లి అవగానే స్త్రీ పత్నిఅవుతుంది .పాలన పోషణవలన భార్య అవుతుంది .సంతానం కని జాయా అవుతుంది .గుణాలచేత కళత్రం అవుతుంది .కొడుకు పుట్టగానే స్త్రీ మాత్రమేకాదు తల్లి అవుతుంది .స్త్రీ ఇన్ని రూపాలుగా ఉంటుంది .కనుక నేను చెప్పినట్లు చెయ్యి సందేహించకు ‘’అన్నాడు.

  మామగారైన అగ్ని దేవుడు చెప్పినమాటలకు సంతృప్తి చెంది కోడలు ఆత్రేయి అగ్ని రూపం పొందిన తనభర్త అగీరసుని నీటితో ముంచేసింది .దంపతులు గంగా సంగమం వలన శాంత రూపాలు పొంది ఉమా మహేశ్వర, రోహిణీ చంద్రులులాగా శోభించారు .ఆత్రేయి అమృత స్వరూపం పొందింది .ఆ రూపం పరుష్ణీ నదిగా ప్రసిద్ధమై ,స్నానమాత్రం చేత వంద గోవులను దానమిచ్చే ఫలితమిస్తుంది .ఇక్కడ చేసే వాజిపేయయాగం కంటే స్నానం ఎక్కువ ఫలిత మిస్తుంది  అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

సశేషం

మనవి- పవిత్ర మాఘమాసం  ఈ రోజుతో పూర్తి కనుక  ఈ ‘’75వ తీర్ధ వివరణ’’తో గౌతమీ మహాత్మ్యానికి ప్రస్తుతం విరామం ప్రకటిస్తున్నాను .మళ్ళీ అనుకూలమైన సమయంలో కొనసాగిస్తానని మనవి చేస్తున్నాను .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -19

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -19

లహ్యుని పుత్రుడు భుజ్యుడు ‘’మేము అధ్యయనం కోసం వ్రతం చేస్తూ ,మద్ర దేశం లో కసి గోత్రజుడు పతంజలి ఇంటికి వెళ్లాం .అతని కూతురు అమానుష గాంధర్వ గ్రహా ష్టయైఉంటుడగా అతడిని ఎవరు అని అడిగితె తాను  ఆంగీరస గోత్రజు డైన సుధన్వుడను అని చెప్పాడు .అతడి గురించి తెలుసుకోవాలని ‘’పరీక్షిత్ కొడుకులు ఏ లోకం లో ఉన్నారు ?అని అడగగా అతడు వారెక్కడ ఉన్నదీ సవిస్తరంగా వివరించాడు .యాజ్ఞావల్క్యా పారీక్షితులు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పగలవా ?’’అని అడిగాడు .’’వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన వారు పోయే లోకానికి పోయారని మీకు ఆగంధర్వుడు చెప్పలేదు కదా ?’’అని ఎదురు ప్రశ్నవేశాడు యాజ్ఞవల్క్యుడు .’’అశ్వమేధం చేసేవారు ఎక్కడికి పోతారు ?’’భుజ్యుని ప్రశ్నకు మహర్షి ‘’ప్రాణుల కర్మఫలం అనుభవించే స్థానం ,విరాట్ పురుషుని శరీరం లోకాలోక పర్వతం చేత  చుట్టుకో బడి ముప్ఫై రెండు దేవ రధాహ్మ్యముల పరిమితి కలిగి ఉంటుంది .దీనికి రెండింతల పరిధి తో భూమి చుట్టుకొని ఉంటుంది .వీటిని చీల్చుకొని అశ్వమేధ యాగం చేసినవారు పోతారు  ‘’అని చెప్పగా ‘’ఆ రంధ్రం పరిమాణం యెంత ?’’అని ప్రశ్నించగా ‘’క్షురకుని కత్తివాయి యెంత పరిమాణం ఉంటుందో అంత సూక్ష్మ పరిమాణం ‘’అన్నాడు .ఈ మార్గం ద్వారా పరమేశ్వరుడు పరీక్షిత్ కొడుకులు భీమ సేన ,ఉగ్రసేన ,శ్రుత సేన లను పక్షి రూపం లో మోసుకు పోయి ,లోపలా బయటా సమష్టి వ్యష్టి రూపం లో ఉన్న వాయువుకు అప్పగించాడు .వాయువు వారిని తనస్వరూపంగా మార్చుకొని అండకపాలం మధ్యలో ఉన్నఅతి సూక్ష్మ మార్గం నుంచి ,దాని బయట ఉండే లోకాలకు తీసుకు తీసుకు వెళ్ళాడు .ఇదంతా మీకు గంధర్వుడు చెప్పి వాయువును ప్రశంసించాడు కదా .ఆ వాయువు వ్యష్టి ,సమష్టి రూపం అని తెలుసుకొన్నవాడు పునర్జన్మ రహితుడు అవుతాడు ‘’అనగానే భుజ్యుడు మళ్ళీ ప్రశ్నించలేదు .   ఉపనిషత్తులలో వాయువు అద్భుత గుణ శక్తి,చాలక శక్తి  కలదని  వర్ణించబడింది .ఇది సాధారణగాలి కాదు   .భూమి ,సూర్యాదులు ఏ శక్తివలన చలిస్తున్నారో అలాంటి చాలక శక్తికల వాయువు .దీనిలోనే ముక్త జీవులందరూ సంచరిస్తారు .ఈ వాయువే ఆ జీవిని నిజ స్థానానికి పంపుతుంది .ఇది లేకుండా క్షణం కూడా ఉండలేము .అదే జీవనం .అదే అశ్వమేధం చేసినవారు సంచరించే స్థానం .

  జక్రుని పుత్రుడు ఉషస్తుడు’’కొమ్ములను బట్టి ఆవు అని చెప్పవచ్చు .శబ్దాలతో ప్రత్యగాత్మను ఎలా చెప్పగలవు ?’’ అని అడుగగా ‘’దేహే౦ద్రియాలతో ఉన్న ఆత్మసర్వా౦తరమైనది ‘’అనగా ‘’సర్వానికి లోపల ఉండే ఆత్మ ఏది ?’’అని ప్రశ్నించగా మహర్షి ‘’నాశికతో ప్రాణవ్యాపారం ,ఉదానం తో ఉదాన వ్యాపారం ,ఏది చేస్తుందో అదే లోపలుండే విజ్ఞానమయమైన ఆత్మ స్వరూపం .అంటే దేహం ఇద్రియాదులకు విలక్షణమైన విజ్ఞానమే ఆత్మ చేత అధి  స్టింపబడి ప్రాణమున్న మనుష్యాదులచేత రధం మొదలైన వాటికి చలనం కలిగినట్లు కలిగిస్తుంది .దేహెంద్రియాది సముదాయం కంటే ఆత్మ వేరైన విజ్ఞానం కలిగి ఉంటుంది .ఈ ఆత్మనే సమీపం ,ప్రత్యక్షం ,బ్రహ్మము ,సర్వా౦తరము ,ప్రత్యగాత్మ అనే విశేషాలతో ఉంటుంది .ఇదే సర్వా౦తర మైన ఆత్మ స్వరూపం ‘’అని చెప్పాడు .

  సమాధానం స్పష్టంగా లేదని మరింత వివరించమని కోరగా ‘’ఆవు గుర్రాలను చూసినట్లు ఆత్మను చూడలేవు ,వినలేవు తలపలేవు .బుద్ధితో తెలుసుకోలేవు .ఆత్మకానిది ప్రతిదీ నశి౦చేదే .ఆత్మకంటే వేరైనా కారణ శరీరాన్ని కరణాత్మక లింగం అంటారు’’అనగానే నోరు మెదపలేదు ప్రాశ్నికుడు .

  కుషీతుని కొడుకు కహోళుడు ‘’సన్నిహితం ,ప్రత్యక్షం ,సర్వాంతరం అయిన ఆత్మఏదో స్పష్టంగా చెప్పండి ?’’అని అడిగాడు .’’ఆత్మస్వరూపం సర్వా౦తర మైనది ‘’అన్నాడు .’’దాని స్వరూపం ఏది ?’’అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’భోజనం ,ప్రాణం పై ఇచ్చ ,శోక మోహ ముదిమి మృత్యు వులను అతిక్రమింఛి  ఆత్మ స్వరూపం తెలిసి పుత్ర విత్త ,లోకాలపై కోరికలేక భిక్షాటనం చేస్తున్నారు .బ్రాహ్మణుడు గురువు ,ఆగమాలు పాండిత్యం లతో ఆత్మజ్ఞానం పొందిబాల్యం తో అంటే ఆత్మ విజ్ఞాన బలం తో ఉండగోరి ముని అవుతాడు .మౌనం, అమౌనం లగురించి బాగా తెలుసుకొని బ్రాహ్మణుడు అవుతాడు అంటే సర్వం బ్రహ్మ స్వరూపమే అనే జ్ఞాని అవుతాడు ‘’అని ఆత్మజ్ఞాన విషయం కూలకషంగా వివరించగా కహోళుడు మారు మాట్లాడలేదు .మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సింది –ఆత్మకంటే వేరైనది నశిస్తుంది .కనుక సర్వం వదిలి ఆత్మ చింతన చేస్తే ముక్తి లభిస్తుంది .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -18

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -18

జరత్కార గోత్రుడు ,రుతభాగుని కొడుకు ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని ‘’గ్రహాలెన్ని ?అతి గ్రహాలెన్ని ‘’?అని అడిగాడు .గ్రహాలూ అతిగ్రహాలు ఎనిమిదేసి అన్నాడు మహర్షి .వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు ‘’’ఘ్రాణ ఇంద్రియమే గ్రహం .దానికి సంబంధించిన గంధమే అతి గ్రహం .లోకం నిశ్వాస వాయువు చేత తీసుకోబడి వాసన అనుభవిస్తుంది .వాగింద్రియమే గ్రహం .అది వ్యక్తం చేసేదే అతి గ్రహం .వాగింద్రియగ్రహం వ్యక్తం చేసేఅతిగ్రహం తో  వ్యాప్తి చెందుతుంది .నాలుక గ్రహం దానికి చెందిన రసం   అతిగ్రహం .నాలుక రసం చేత వ్యాపిస్తుంది .కన్ను గ్రహం రూపం అతి గ్రహం .చెవి గ్రహం వినికిడి అతిగ్రహం .మనసు గ్రహం. కాలం అతిగ్రహం .హస్తద్వయం గ్రహం .కర్మ అతిగ్రహం .చర్మం గ్రహం .స్పర్శ అతిగ్రహం .ఈ ఇంద్రియాలవలననే సుఖ దుఖాలు కలుగుతాయి ‘’అని స్పష్టంగా చెప్పాడు .

‘’మృత్యువు కు అన్నీ ఆహరం కదా ఆ మృత్యువు ఏ దేవతకు అన్నం అవుతోంది ?’’అనిఅడగగా మహర్షి ‘’అగ్నియే మృత్యువు .అది ఉదకాలకు అన్నం అవుతోంది.పరబ్రహ్మ వేత్త అయిన పురుషుడు మృత్యువును జయిస్తాడు ‘’అని చెప్పి మళ్ళీ దానికేది మృత్యువు అనే ప్రశ్న పరంపరరాకుండా కట్ చేసి ఉపాయంగా బ్రహ్మానికి మృత్యువు లేదు అని ఖండితంగా చెప్పి ఆరకమైన ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టించాడు .ఆర్తభాగుడు మళ్ళీ ‘’బ్రహ్మవేత్త అయిన పురుషుడు మృతి చెందితే అతడి ప్రాణాలు లేచిపోతాయా పోవా ?’’అని అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పురుషుని ప్రాణాలు ఇక్కడే పరమాత్మలో లీనమవుతాయి .అతడు నిద్రిస్తాడు .బాహ్యవాయువు చేత పూరి౦పబడి ,మరణం పొంది పడుకొని ఉంటాడు .అంటే సంసార బంధ విముక్తుడు ఎక్కడికీ పోడనీ లోకమంతా వ్యాపించి ఉంటాడని భావం ‘’అన్నాడు . ‘’ బ్రహ్మ వేత్త ఐన పురుషుడు మరణిస్తే అతడిని విడువకుండా ఉండేది ఏది ?’’.ఆర్తభాగుని ప్రశ్న .యాజ్ఞవల్క్యుని సమాధానం –‘’అతడిని విడువకుండా ఉండేది పేరు .నామాలు అనంతం విశ్వేదేవులూ అనంతమే .అంటే గొప్పవారు మృతి చెందినా వారి పేరు ప్రఖ్యాతులు నిలిచే ఉంటాయని భావం .బ్రహ్మవేత్త కాని వాడు మరణిస్తే ?అనే ప్రశ్నకు మహర్షి ‘’అజ్ఞాని మళ్ళీ మళ్ళీ పుట్టటానికి కొందరు స్వభావమని కొందరు యాదృచ్చికమని ,కర్మ, దైవం అని అంటారు .దీన్ని జనసమూహం లో నిరూపించటం కుదరదు .’’అన్నాడు .ఇద్దరూకలిసి ఒక  ఏకాంత  ప్రదేశం లో చర్చించారు .చివరికి అజ్ఞాని అయిన పురుషుడు దేహేన్ద్రి యాదులు పొందుతాడని నిశ్చయించారు .దేహాంతర ప్రాప్తికి కర్మమే ముఖ్యకారణమని తేల్చారు .చివరగా యాజ్ఞవల్క్యుడు పుణ్య కర్మలతో పుణ్యం పొందినవాడు బ్రహ్మణాది జన్మలను ,పాపకర్మలతో పాపాత్ముడైనవాడు కుక్క  పంది మొదలైన జన్మాలు పొందుతాడు ‘’అని చెప్పగానే ఆర్తభాగుడు ఇక ప్రశ్నించలేదు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -53 72-కపిలా సంగమ తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -53

72-కపిలా సంగమ తీర్ధం

ముల్లోకాలలో ఉత్తమోత్తమమైనది కపిలా సంగమతీర్ధం .కపిలముని క్రూరుడే అయినా ప్రసన్నుడు .గౌతమీ తీరం లో తపస్సు చేసుకొంటున్న ఆయనదగ్గరకు వేనుని సంహరించి ,రాజ్యం అరాజకంగా ఉండటం చేత వామదేవాది మునులు వచ్చి వేదాలు యజ్ఞయాగాదులు ఆదరణకు నోచుకోవటం లేదని చెబితే ,వేనుని తొడ చిలికితే పరి ష్కారంలభిస్తుందని చెప్పగా అలాగే చేయగా వేనుని  తొడనుంచి నల్లని మహాపాపం బయటికి రాగా భయపడి ‘’నిశీదస్వ ‘’అంటే కూర్చో అన్నారు .అతడే నిషాదుడు –బోయవాడు అయ్యాడు .అతని సంతానమే నిషాదులు  .తర్వాత మునులు వేనుని దక్షిణ బాహువు ను చిలికారు .దాని నుండి సర్వ లక్షణమైన స్వరం తో సిరిగల పృధు రాజు పుట్టాడు .దేవతలు వచ్చి ఆశీర్వదించి ఆయనకు కావాల్సినవన్నీ ఇచ్చారు అతడిని ‘’పృథువు’’అని పేరుపెట్టి జీవులకు ,వోషధులకు  ఆహారం ఇవ్వమని ఆదేశించారు .అతడు ధనుస్సు తీసుకొని భూమిని ఆమె మింగిన ఓషధులను ఇవ్వమన్నాడు .తాను మింగేసిన వాటిని మళ్ళీ ఇచ్చే సమర్ధత తనకు లేదని భూమి చెప్పింది .తనమాట విని ఇవ్వకపోతే సంహరిస్తా అని పృథువు పృధివిని భయపెట్టాడు .తాను  లేకుండా దేన్ని  పాలించగలవని ప్రశ్నించింది .

   అతడు ఒకరి చావు అనేకులకు మేలు అయితే దోషం లేదంటారని ,ప్రజలను తపస్సుతో ధరిస్తానని చెప్పాడు .ఇంతలో దేవతలు ,ఋషులు అక్కడికి వచ్చి రాజును  ఓదార్చి భూదేవితో ‘’గోవు రూపం పొంది ,పాలరూపం లో నీలోని ఓషధులను పిండి రాజుకు సంతోషం కలిగగించి ప్రజారక్షణం ,క్షేమం కలిగించు ‘’అన్నారు .భూమి ఆవురూపం పొంది కపిలముని దగ్గర నిలబడింది .ఆ ఆవు పొదుగునుండి పృథువు మహా ఓషధులను ,నర్మదా సరస్వతి భాగీరధి ,గోదావరి మొదలైన నదులను పాలరూపం లో పిండాడు .పృథువుతో పిండబడిన పృధివి పుణ్యజలాలు కల నదిగా మారి గౌతమీనదితో కలిసిపోయింది .అప్పటిను౦చి అది కపిలాసంగమ తీర్ధమై ,ఎనిమిది వేల  తీర్థాలతో వర్ధిల్లింది అని బ్రహ్మ నారదునికి ఉవాచ

   73-దేవస్థాన తీర్ధం

కృతయుగం మొదట్లో జరిగిన దేవదానవ యుద్ధకాలం  లో ‘’సింహిక ‘’అనే రాక్ష స్త్రీ ఉండేది .ఆమె కొడుకు రాహువు మహా బలవంతుడు .అమృతోద్భవం జరిగినప్పుడు రాహువు ఖండించబడ్డాడు .అతడికొడుకు మేఘ హాసుడు దుఖం భరించలేక గంగాతీరం లో తపస్సు చేయ సంకల్పించాడు   .సహజంగానే భయపడిన దేవతలు అతడిని సమీపించి తపస్సు వద్దని అతని మనసులోని కోరికలన్నీ తీరుతాయని చెప్పారు  .అలాగే చేస్తానుకానీ తనతండ్రి కి న్యాయం చేయమని , ఇకనుంచి వారిమధ్య వైరం ఉండరాదని ఆతీర్ధం తనపేర విరాజిల్లాలని కోరగా  సరే అని రాహువును గ్రహం గా చేశారు . అదే మేఘ హాస తీర్ధం ,దేవస్థాన తీర్ధం ,దేవతీర్ధం .ఇక్కడ 18తీర్దాలేర్పడి ప్రసిద్ధి చెందాయని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రుద్ర తాండవ ఆంతర్యం

రుద్ర తాండవ ఆంతర్యం

కాస్మిక్ డాన్స్ అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం లోని ఆంతర్యం తెలుసుకొందాం .రుద్రతాండవం  గతిశీలక ,స్థిరమైన శక్తి ప్రవాహమే .అందులో అయిదు శాశ్వత శక్తులు అంటే సృష్టి ,స్థితి ,లయం ,మాయ ,విముక్తి ఉంటాయి .శివుడు చేసే రుద్రతాండవం లయానికి సంబంధించింది .అందులో అగ్ని కీలలు మెరుపులు ఉరుములతో విశ్వమంతా వ్యాపించి ,సూర్యుని చంద్రుని గ్రహగోళాలను  కూడా చెదరగొట్టి  వ్రేలాడే  శిరోజాలతో,  నుదుట విభూతితో ,త్రిశూలం ,మద్దెల  తో ఎడమకాలు పైకెత్తి ,అజ్ఞాన రాక్షసునిపై ,సమతౌల్యంతో నిలబడి ,చేతుల,కాళ్ళపై సర్పాలు ఆడుతూ,అల్లినట్లున్న జటాజూటం  అహంకారానికి ప్రతీకగా శివుడు తాండవ నృత్యం చేస్తాడు.కుడి చేతిపైభాగం లో డమరుకం స్త్రీ పురుష కీలక సూత్రానికి భాష్యంగా ,క్రిందిభాగం అభయ ప్రదానంగా ఉంటుంది .చేతిలోని లేక శిరసుపై కపాలం మృత్యువుపై విజయానికి సంకేతం .జటాజూటం లోని గంగ పవిత్ర జలానికి సంకేతం .శివుని త్రినేత్రం నిత్యజాగృతికి ,విజ్ఞానానికి సంకేతం .అంతమాత్రమేకాదు అదుపుతప్పి ప్రకృతి విలయానికి పాల్పడే వారిని దహించే అగ్నికూడా .

  శివతాండవం లో ఉధృత స్థితి గురించి పైన తెలుసుకున్నాం .ఇప్పుడు లాస్యం అనే సున్నితమైన నాట్యం గురించి తెలుసుకొందాం .దీనినే ఆనంద తాండవం అంటారు .తాండవం లో సర్వం లయం చెందగానే లాస్యం లేక ఆనంద తాండవం లో  సృష్టి జరుగుతుంది .ఈ రెండు రూపాలశివ  తాండవం మనకు  చిదంబరం నటరాజ దేవాలయం లో కనిపిస్తుంది .చిత్ అనేది అంబరం అంటే  ఆకాశం గా ఉన్నదే చిదంబరం .అంటే మనసు లేక బుద్ధి ఆకాశంగా కలది అన్నమాట .అనగా ఇది హృదయం లోని చైతన్య కేంద్రం కు ప్రతీక .

   శివుడు లేక బ్రహ్మం విశ్వ చైతన్యానికి ప్రతీక. శివుని శరీరమంతా ప్రాకుతూ ఉండే సర్పాలు మానవ శరీరం లోని నాడీ సముదాయాలే .కుండలిని శక్తి కేంద్రాలే . ప్రతిమానవునిలో ఉండేవే .ఈ కుండలిని మేలుకొల్పటం అంటే ఏడు శక్తి  చక్రాలను  ఉద్దీపనం చేయటమే . సాత్విక రాజస తామస గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఈ విశ్వం లో ప్రాణి రూపాలనుసృష్టిస్తాయి అని భగవద్గీతలో చెప్పబడింది .దైవీ తత్త్వం తొమ్మిదిభాగాలుగా విభజింపబడుతుంది .కాని అందులో ఎనిమిది అంటే భూమి  నీరు అగ్ని  వాయువు ఈధర్ ,బుద్ధి అహంకారం లను  మాత్రమే  మనం అవగతం చేసుకోగలుగుతున్నాం .తొమ్మిదో దైవీ శక్తి మాత్రం సృష్టి విచిత్రం లో శాశ్వతంగా కప్పి వేయబడింది .

  1972లో Fritjof Capra అనే రచయిత తన ‘The Tao of Physics’పుస్తకం లో వేదవిజ్ఞానాన్నీ , ఆధునిక శాస్త్రాన్ని తులనాత్మకం గా పరిశీలించి భారత దేశం లో చెప్పబడిన శాస్త్రీయ విజ్ఞానం అంతా ప్రతీకాత్మకమైనదన్నాడు .’’ప్రతి ఉపపరమాణువు (సబ్ అటామిక్ పార్టికల్ )శక్తి నాట్యం చేస్తుంది ,తానే శక్తి నాట్యమౌతు౦దికూడా .సృష్టి కార్యంలో ఇది సృష్టి లయల  స్థిర నిరంతరశాశ్వత  ప్రవాహ విధానం .కనుక ఆధునిక భౌతిక శాస్త్ర వేత్తలకు శివ తాండవం ఉపపరమాణువు నాట్యమే .

   2004లో జెనీవాలో జరిగిన ‘’యూరోపియన్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్ ‘’లో రెండు మీటర్ల నటరాజ విగ్రహాన్ని  ఆవిష్కరించారు .తాండవ నాట్యం చేసే ఈ శివుని విగ్రహం సృష్టి లయాల వలయానికి ప్రతీక గానేకాక ,సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క గతిశక్తికి సంకేతం అనీ ,ఇదే విశ్వ సృష్టికి  ఆధారమని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ భావిస్తున్నారు .జై నటరాజ జైజై నటరాజ .

   ఆధారం –‘’విస్పరింగ్ మైండ్ ‘’రచయిత కే.పి. శశిధరన్ వ్యాసం .

  మహాశివరాత్రి శుభాకాంక్షలతో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17

  మేనల్లుడిపై మాటల విషం కక్కుతూ శాకల్యుడు అక్కడి రుషిగణంతో ‘’తానొక్కడే విద్వాంసుడను అనే గర్వతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు .ఇప్పుడు జనకమహా రాజుఆహ్వాన పై కురు పాంచ దేశాలను౦ డి  ఎందరెందరో వేదవిదులు వచ్చారు. వారి ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం ‘’అన్నాడు ఒక రోజు మహారాజు వెయ్యి ఆవులను అక్కడ నిలిపి ,ఒక్కో ఆవుకొమ్ముకు ‘’పదేసి పాదాల బంగారం ‘’కట్టించి నిలబెట్టించి ‘’మీలో బ్రహ్మిస్టు   డైనవాడు ఈ గోసహశ్రాన్ని హాయిగా ఇంటికి తోలుకుపోవచ్చు ‘’అని ప్రకటించాడు .ఎవరికివారు వితర్కి౦చు కొని తమ అర్హతను బేరీజు వేసుకొని తమకు అంత ‘’దృశ్యం ‘’లేదని గ్రహించి  వాటినితోలుకు పోవటానికి సాహసించి ముందుకు రాలేదు .

  అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తనదగ్గర సామవేదం చదువుతున్న ‘’సోమ్యుని తో ‘’ఆవులను మన ఇంటికి తోలుకు వెళ్ళు ‘’అని పురమాయించగా ,అతడు తోలుకు పోతుంటే సభ్యులు గుంజాటన పడుతూ ప్రశ్నించే ధైర్యం లేక కకావికలయ్యారు .అప్పుడు యాగానికి హోత అయిన అశ్వలాయనుడు ‘’యజ్ఞం లో బ్రహ్మ అనే ఋత్విజుడు దక్షిణం లో బ్రహ్మాసనంపై కూర్చుని ఎందరు దేవతలచేత యజ్ఞాన్ని కాపాడుతున్నాడు ?’’అని ప్రశ్నించగా యాజ్నవల్క్యుడు ‘’ ఒక్క దేవతతో ‘’అని చెప్పగా, ఆదేవత ఎవరు అని అడిగితె ‘’మనస్సు ఆ దేవత .మనస్సు అనంతమైనది దేవతలూ అన౦తమైనవారు .బ్రహ్మ ,ఋత్విజుడు మనస్సు లో విశ్వే దేవ దృష్టితో ధ్యానించటం చేత అనంతమైన లోకాన్నే జయిస్తున్నారు ‘’అన్నాడు .

   అశ్వలాయనుడు ‘’ఈయజ్ఞ౦లొ ఉద్గాత ఎన్ని స్తోత్రియాలను స్తుతిస్తున్నాడు ?’’అనగా ‘’మూడు ‘’అని చెప్పగా అవేమిటి అంటే పురోను వాక్యాదులు ‘’అనగా అవి కర్తలో ఎలా ఉన్నాయని అడిగితె ‘’అధ్యాత్మం లో ప్రాణమే పురోను వాక్యం .అపానమే యాజ్య ,వ్యానమే శన్య ‘’అనగా పురోను వాక్యాలతో కర్త దేన్ని  జయిస్తాడని ప్రశ్నించగా ‘’పురోను వాక్యాలతో భూలోకాన్నీ ,ఆజ్య చేత అంతరిక్షాన్నీ ,శన్య చే భూలోకాన్నీ జయిస్తాడు ‘’అంటూ తడబాటు లేకుండా యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు చెప్పాడు .ఇక ప్రశ్నించటానికి ఏమీ లేక అశ్వలాయనుడు మాటాడకుండా ఉండి పోయాడు  .

                     అశ్వల బ్రాహ్మణాశయం

జనులు అజ్ఞానం తో యజ్ఞ కామ్య కర్మలమీదే ఆసక్తి కలిగి ఉన్నారు .ఈ యజ్ఞాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అన్వయించి చెపుతాడో చూద్దామనుకొని అశ్వలాయనుడు ఆ విషయమై ప్రశ్నించాడు .మహర్షి ఆధ్యాత్మ యజ్ఞమే యజ్ఞం .ద్రవ్యమయ యజ్ఞం యజ్ఞం కాదు అని నిరూపించి చెప్పాడు .యజ్ఞ సాదృశ్యం వలన ద్రవ్యాలతో చేసే యజ్ఞం లో హోత అధ్వర్యుడు,ఉద్గాత ,బ్రహ్మ అనే నలుగురు ఋత్విజులేకాక యజమాని అయిదవ వాడుగా ఉంటాడు .వాక్కు చక్షువు కర్ణం మనస్సు నాలుగూ నలుగురు ఋత్విజులు .అవి పవిత్రం అయితే వాటి అధిదైవతాలైన అగ్ని ఆదిత్యుడు ,వాయువు చంద్రుడు అనే పేర్లతో పిలువబడుతారు .అప్పుడు యజమాని అయిన ఆత్మకు మోక్షం కలగటానికి అభ్యంతరం ఉండదు .అప్పుడే పురుషుడు జ్ఞాని అనిపించుకొంటాడు .మృత్యువు మొదలైనవి జ్ఞానిని బంధించలేవు .దేవ ,పితృ మనుష్యులు ఈ శరీరం లోని భాగాలే .శిరస్సు దేవలోకం .మధ్య శరీరం పితృ లోకం .కటికి కిందిభాగం మనుష్యలోకం .దిట్టమైన బ్రహ్మవలననే యజ్ఞం సాంగం అయినట్లుగా ,మనసు వివిధ విషయాలపైకి పోనీయకుండా నిలిపితేనే ఆత్మ అనే యజమాని కి మోక్షం లభిస్తుంది ‘’అని తగిన సంతృప్తికరమైన సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు .

   సశేషం

 మహాశివరాత్రి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -52

70-ఖడ్గ తీర్ధం

గౌతమీ నది ఉత్తరతీరం లో ఖడ్గతీర్ధం స్నాన దానాలచేత మోక్షాన్నిస్తుంది .కవషుని పుత్రుడు కైలూషుడు యాచనతో కుటుంబపోషణ చేస్తున్నాడు .కాని తగినంత ఆదాయం రాక వైరాగ్యం పొంది ,తండ్రిని జ్ఞానఖడ్గం తో క్రోధ మోహాలను ఖండించే ఉపాయం చెప్పమని అడిగాడు .ఈశ్వరుని నుండి జ్ఞానం పొందాలని తండ్రి చెప్పాడు .అలాగే శివారాధన చేసి మెప్పించి రప్పించి జ్ఞానాన్ని పొంది ముక్తి ఇచ్చేకథలు చాలా చెప్పాడు .అందులోకొన్ని. తృష్ణ బహు రూపంగా ఉండే మాయ .పాపాలు చేయిస్తూ సంసారం లో బంధిస్తుంది .తృష్ణను చేదిస్తేనే మానవుడికి సుఖ శాంతులు లభిస్తాయి .ఆసక్తి అధర్మం .ఆత్మకు అది పరమ శత్రువు .దాన్ని జ్ఞానఖడ్గ౦ చేత చేదించి శివైక్యం పొందాలి .ఆశ పిశాచం లాగా ఆత్మలో ప్రవేశించి సుఖాలను దహిస్తుంది .ఆశనుకూడా జ్ఞానఖడ్గం తో చేదించి   జీవన్ముక్తి పొందాలి .ఇలా చాలా చెప్పాడు పైలూషుడు .

  చివరికి గంగాతీరం చేరి జ్ఞానఖడ్గం చేత మోహ విముక్తుడై ముక్తి పొందాడు .ఇదే ఖడ్గతీర్ధంగా ప్రసిద్ధి పొందింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

71-అన్వింద్ర ఆత్రేయాది తీర్ధం

ఆత్రేయ మహర్షి గౌతమీ ఉత్తర తీరం లో మునులతో కలిసి సత్రయాగం ప్రారంభించాడు .అగ్ని హోత ,హవ్యవాహనుడు .యజ్ఞం పూర్తి చేసి, మహేశ్వరీ ఇష్టి కూడా చేసి మహదైశ్వర్యం సర్వత్ర గతి పొందాడు .తపః ప్రభావం చేత ఇంద్ర లోకానికి ,రసాతలానికి స్వేచ్చగా వెళ్లి వచ్చేవాడు .ఒక సారి ఇంద్రలోకం లో సిద్ధ సాధ్యులచే స్తుతి౦ప బడుతూ  సేవలుపొండుతూ నృత్యగానాలతో సంతోషిస్తున్నశచీదేవి ,కొడుకు జయ౦తుడితో ఉన్న  ఇంద్రుడి వైభోగం చూసి  ,ఇంద్రభోగం పొందాలని వా౦ఛించాడు .స్వర్గం లో ఆత్రేయుడు గొప్పగా సత్కారాలు పొంది ,మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు .

  భార్యతో దేవేంద్ర వైభవాన్ని వర్ణించి చెప్పి ఆ వైభవం చూశాక ఇంట్లో ఏమీ తినాలని పించటం లేదన్నాడు .తనప్రభావం చేత బ్రహ్మనే తనవద్దకు రప్పించి తనకు ఇంద్రపదవి ఇప్పించమని కోరాడు .క్షణాలలో అపర దేవేంద్ర లోకాన్ని త్వష్ట సృష్టించి ఇచ్చాడు .భార్యను శాచీదేవిగా భావించాడు .అన్ని స్వర్గసుఖాలు  అప్సరసలపొందుతో సహా అనుభవించాడు .ఆత్రేయ వైభవం చూసి దానవ రాక్షసులకు అసూయ కలిగి  ఇంద్రపురం అనే ఆపురాన్ని చేరి అస్త్ర శాస్త్రాలతో బాధింఛి చంపటానికి సిద్ధపడ్డారు .భయపడిన ఆత్రేయుడు తాను  ఇంద్రుడిని కానని అదంతా బ్రహ్మ సృష్టించిన మాయా లోకమని చెబుతూ విష్ణువును స్తుతించాడు .అతనిమాటలు నిజమేనని గ్రహించి ఇలాంటి అనుకరణవలన ప్రాణ,మాన హాని కలుగుతుందని హెచ్చరించి అసురులు వెళ్ళిపోయారు .

   బుద్ధి తెచ్చుకొన్న మైత్రేయుడు త్వ స్టను స్తుతిస్తే ఆయన వస్తే ఈ మాయాలోకం వలన తనకు ప్రాణహాని తప్ప సుఖం లేదని కనుక వెంటనే దాన్ని ఉపసంహరించి తన పూర్వపు ఆశ్రమాన్ని ఇస్తే హాయిగా సంతృప్తిగా జీవిస్తాను అని వేడుకొన్నాడు .త్వష్ట బ్రహ్మకోరికపై అలానే చేయగా రాక్షసులు వెళ్ళిపోయారు. బతుకు జీవుడా అనుకొంటూ ఆత్రేయుడు భార్యా శిష్యులతో గౌతమీ తీరం లో తపస్సు చేశాడు .అక్కడ ఒక గొప్ప యజ్ఞం జరుగుతుంటే సిగ్గుతో ‘’మోహం యెంత చెడ్డది ?తపస్సు చేసే నాకే భ్రాంతి కలిగించింది’’అనగా దేవతలు విని గతం గతః .ఇక నుండి ఈ తీర్ధం ఆత్రేయ తీర్ధంగా పిలువబడి సుఖ శాంతులు జ్ఞానం కలిగిస్తుంది ‘’అని దీవించి స్వర్గం చేరారని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

  సశేషం

 మహాశివరాత్రి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4- 3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

4-3-19 సోమవారం శివరాత్రి ఉదయం మా ఇంట్లో నాతోపాటు అభిషేకం చేసిన మామనవాడు చరణ్

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

శివరాత్రి శుభాకాంక్షలు

image.png

 

image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16

మహారాజు కోరికకు  మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’సార్వభౌమా !లోకం లో ఒకరిని మించినవారొకరుంటారు అన్ని విధాలా అధికుడైనవాడినే గురువుగా చేసుకొని బ్రహ్మ విద్య నేర్వాలి. కురు ,పాంచాల దేశాలలో ఎందరో అలాంటి మహానుభావులున్నారు .వారిని పిలిపించి ఎంచుకొంటే గొప్ప గురువు లభించకపోడు ‘’అనగా ‘’లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్యగురువులెవరు ‘’?అనగా ‘’ఏదైనా నిండు సభలోనే తేలాలి ‘’అన్నాడు మహర్షి .అలా అయితే అందరూ  వచ్చే మార్గం తెలియజేయమని అడుగగా ‘’సార్వ భౌముడు చేయాల్సిన బహు దక్షిణ యాగం చేయి .చక్రవర్తి తలపెట్టి యాగం చేస్తుంటే అందరూ తమంతకు తామే వస్తారు ‘’అన్నాడు .సరే అన్నాడు జనకుడు .

యాగ సంభారమంతా సిద్ధం చేసుకొని మంత్రి మిత్రయుని కురు,పా౦చాల దేశాలలోని విప్రులనందర్నీ సగౌరవంగా ఆహ్వానించామని చెప్పాడు ,.అలాగే ఆహ్వానించాడు మంత్రి .మైత్రేయుని కుమార్తె బుద్దిమతి అయిన మైత్రేయి ఉంది .ఆమె పెదతల్లి  గార్గి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి బ్రహ్మవాదిని ని చేసింది . బ్రహ్మ వేత్తలంతా సమావేశమయ్యారు .అందులో అశ్వలాయనుడు ‘’మా అందరిలో నువ్వే బ్రహ్మ వేత్తవా ?’’అని అడిగాడు దానికి యాజ్ఞవల్క్యుడు ‘’నేను బ్రహ్మ వేత్తనుకాను . హౌత్రార్ధం గోవులు కావాలనే వచ్చివాటిని తోలుకుపోతున్నాను .అంతేకాని బ్రహ్మిస్టఅనుకొనినికాదు అన్నట్లుగా చెప్పగా ఆశ్వలాయనునికి ధైర్యం వచ్చి వాదానికి దిగాడు .

అశ్వలాయనుడు ‘’యాజ్ఞావల్క్యా !యజ్ఞం అంతా మృత్యువుతో వ్యాప్తి చెందింది .యజమాని దాని వ్యాప్తిని ఎలా అధిగమిస్తాడు ?’’అని ప్రశ్నించాడు .మహర్షి ‘’యజమాని వాక్కే హోత .,అగ్నికూడా .అగ్నినే హోతగా భావించి కర్మ సాధనాలన్నీ హోతాగ్నులకు అది దేవత అయిన అగ్ని రూపం తో చూడటమే అతి  ముక్తి ‘’అన్నాడు .అశ్వలాయనుడు ‘’యజమాని అహోరాత్ర వ్యాప్తిని ఎలా అదిగమించగలడుడు?’’అనగా ‘’అధ్వర్యుడు అనే నేత్ర రూపుడైన సూర్యుని మృత్యువు అతిక్రమిస్తాడు కనుక ఆదిత్యుడే ముక్తి అతిముక్తీ కూడా.ఆధ్వర్య ఆదిత్యుల నిద్దర్నీ ఆదిత్యునిగా చూడటమే మృత్యువును అతిక్రమించటం .అధ్వర్యుడు అంటే యజుర్వేదం బాగా తెలిసిన ఋత్విజుడు ‘’అన్నాడు .అశ్వలాయనుడు ‘’అంతా శుక్ల కృష్ణ పక్షాలచేత స్వాధీనమై ఉన్నాయికదా ,దాని వ్యాప్తిని ఎలా అతిక్రమించాలి ?’’అన్న ప్రశ్నకు మహర్షి ‘’యజమాని అయిన ఉద్గాత ,ఋత్విజుడు వాయు రూప ప్రాణం చేత మృత్యువును అతిక్రమించి ప్రకాశిస్తారు .యజమాని ప్రాణమే ఉద్గాత .అదే వాయువు .అదేఉద్గాత .అదే ముక్తి అదే అతిముక్తి ‘’అన్నాడు .

‘’ ఆకాశానికి ఆధారం లేదుకదా ,యజమాని దేని నాధారంగా స్వర్గాన్ని అతిక్రమిస్తాడు ‘’అడిగాడు అశ్వలాయనుడు .’’బ్రహ్మ ఋత్విజుడు ,మనసు అయిన చంద్రుని చేత స్వర్గాన్ని అతిక్రమించి ముక్తుడౌతాడు .యజమాని మనస్సు బ్రహ్మ అనే ఋత్విక్కు .ఆ మనస్సు చంద్రుడు .ఆ చంద్రుడే బ్రాహ్మణే ఋత్విజుడు అతడేముక్తి అతిముక్తి ‘’అన్నాడు .’’ఇప్పు’’డీ యజ్ఞం లో హోత ఎన్ని రుగ్మంత్రాలతో హోత్రం చేస్తాడు ?’’అనగా ‘’మూడిటితో’’అనగా అవేవో చెప్పమంటే ‘’మొదటిది పురోను వాక్యం అంటే యాగం కంటే ముందు చెప్పే రుగ్వేదమంత్రాలు.రెండోది యాజ్య అంటే యాగం లో ప్రయోగం కోసం చెప్పేఋగ్వేద మంత్రాలు ,మూడవది శన్య  అంటే యాగం లో శస్త్రం కోసం చెప్పే మంత్రాలు’’అని బదులిచ్చాడు.ఈ మూడిటితో దేన్ని  జయిస్తాడు అనిఅడుగాగా సకల ప్రాణి సముదాయాన్నీ జయిస్తాడు ‘’అనగా ‘’ఇప్పుడీ యాగం లో ఎన్ని హుతులను వ్రేలుస్తారు ‘’అని ప్రశ్నిస్తే ‘’మూడు అనగా అవేమిటి అంటే ‘’బాగాప్రకాశించే సమిధాహుతులు ,బాగా శబ్దం చేసే మాంసం మొదలైనవి ,భూమికి౦దికి  పోయే పయస్సు సోమాహుతులు ‘’అన్నాడు .వీటితో దేన్ని  జయిస్తాడు అనే ప్రశ్నకు ‘’మొదటి ఆహుతులతో దేవలోకాన్నీ ,రెండవదానితో పితృలోకాన్నీ ,మూడవదానితో మనుష్య లోకాన్నీ జయిస్తాడు ‘’అని చక్కని సమాధానాలు చెప్పాడు .ఇంతలో కురుపా౦చా ల దేశాలలోని బ్రాహ్మణ్య  గణ౦  యాగం ఆహ్వానం తో  గుంపులు గుంపులుగా యాగ శాలకు చేరుకొనగా  ,యాజ్ఞావల్క్యుని మేనమామ శాకల్యుడు,ఆయన  ముఠావాళ్ళు యాజ్ఞవల్క్యుని ఎలాగైనా ఓడించి పరాభవించాలని అత్యుత్సాహం తో చేరారు .తరవాత ఏమి జరిగిందో తర్వాత తెలియ జేస్తాను .

సశేషం

రేపు మహా శివరాత్రి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు

 

.

 

 

 

.

.

.

 

 

 


 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15

చనిపోయినవాడు పొందే స్థానాల గూర్చి వివరించమని యాజ్ఞవల్క్యమహర్షినిజనకమహారాజు  అడిగాడు .ఆయన ‘’ఆత్మ-పాదాలనుంచి నిష్క్రమిస్తే విష్ణువు యొక్కయు ,పిక్కలనుండి పొతే వసువుల యొక్క,మొకాలినుంచి అయితే మహా సాధ్యులయొక్క,గుదం నుండి అయితే మిత్రునియొక్క,జఘనం నుంచి అయితే భూమి యొక్క ,పార్శ్వాలనుండి అయితే మరుత్తులయొక్క,నాశిక నుండి అయితే చంద్రుని యొక్క,వక్షం నుంచి అయితే రుద్రుని యొక్క ,మెడనుంచి అయితే రుషి శ్రేష్టుడైన నరుని యొక్క ,ముఖం నుంచి అయితే విశ్వే దేవతలయొక్క ,చెవులనుంచి అయితే దిక్కులయొక్క ,ముక్కునుంచి అయితే వాయువు యొక్క ,కళ్ళనుంచి అయితే సూర్యుని యొక్క ,కనుబొమలనుండి అయితే అశ్వినీ దేవతల యొక్క ,లలాటం నుంచి అయితే పితృ దేవతల యొక్క,మూర్ధం నుండి అయితే బ్రహ్మయొక్క స్థానాలను పొందుతారు ‘’అన్నాడు .

‘’మనీషులు విధించిన అరిస్టాలేవి?’’వివరించండి ‘’అని రాజు ప్రశ్నిస్తే మహర్షి ‘’కనిపించే అరుంధతి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే ,దీపకాంతులు కుడిప్రక్కకు చీలినట్లు కనిపిస్తే మనిషి ఆయుర్దాయం ఒక సంవత్సరం మాత్రమె .తన ప్రతిబింబాన్ని ఇతరుల కళ్ళల్లో చూడలేకపోయినా ఏడాది లోపు బాల్చీ తన్నేస్తాడు .తనలోని కాంతిని, అతి ప్రజ్ఞను ,తనస్వభావం లోపలాబయటా మారితే, అరునెలలే బతుకుతాడు .దేవతలను పూజించక బ్రాహ్మణులతో వైరం పెట్టుకొంటే ,నల్లని రంగు తెల్లబడితే బతుకుఇక ఆరునెలలే .చంద్ర బి౦బ౦ లోకాని, సూర్య బింబం లోకాని సాలెపురుగు అల్లికలో లాగా రంద్రాలున్నట్లు కనిపిస్తే వారంకంటే బతకడు .దేవాలయం లో సుగంధం శవగంధంగా అనిపిస్తే వారంలో ఖాళీ .చెవులు ముక్కు వాలిపోయి ,పండ్లు చూపులు వసివాడితే ,సంఖ్యజ్ఞానం మర్చిపోతే ,లోపలి వేడి చల్లారిపోతే వెంటనే చావు ఖాయం .అకస్మాత్తుగా ఎడమకంటి నుంచి నీరు ధారగా కారటం ,తలనుండి పొగవచ్చినవాడు ఆరోజే టపాకడతాడు. కనుక పగలు రాత్రి తన ఆత్మను పరమాత్మలో అనుసంధానం చేసుకోవాలి .అప్పుడే  మృత్యుంజయుడు అవుతాడు  .ఆత్మజ్ఞానమున్నవాడు సాంఖ్యుల పధ్ధతి ప్రకారం ఆత్మను పరమాత్మతో యోచన చేసి చావును జయిస్తాడు .చివరికి అక్షయ అవ్యయ శాశ్వత స్థానం పొందుతాడు ‘’అని వివరించాడు ‘ జనకుడు అవ్యక్త పరబ్రహ్మ గురించి వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు –‘’నేను సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొంది శిష్యులకు బోధించి,బ్రహ్మ ను గూర్చి చి౦తిస్తుంటే విశ్వావశువు వచ్చి ప్రశ్నించగా ,ఆయనకు చెప్పినదంతా నీకు బోధిస్తాను అని చెప్పిబోధించి  ద్విజాదులవలననే మోక్షసాధన జ్ఞానం పొందవచ్చు ‘’అన్నాడు .

 ఒక రోజు జనకుడు గౌతమ రాహూ గణుడు ‘’వేదాంగాలు బాగా తెలిసి ఎవరు ఇష్టి చేసి దాని ఫలితం పొందారో తెలుసుకొని .వాళ్లకు వెయ్యి బంగారునాణాలు ఇస్తాను ‘’అని అంతటి విశిష్ట వ్యక్తీ యాజ్ఞావల్క్యుడే అని గ్రహించి తాను  అన్నధనాన్ని ఆ మహర్షికిచ్చి సంతృప్తి చెందాడు .ఆయనతో ఆయన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ఋషులవలన విని కొంత తాను ఆయనతో చర్చి౦చి కొంతా తెలుసుకొన్నానని, కర్మ బ్రహ్మలను గురించి పూర్తిగా తెలిసినవాడు ఆయనే అని .లోకోద్ధరణకు ఉద్భవించిన అవతార పురుషునిగా తాను  ఆయనను భావిస్తానని వినయంగా చెప్పి తనను శిష్యునిగా స్వీకరింఛి మోక్షమార్గం ప్రసాదించమని  యాజ్ఞవల్యుని ప్రార్ధించాడు .దీనికి ఆయనేమన్నాడో ,ఆతర్వాత ఏమి జరిగిందో తర్వాత తెలుసుకొందాం .

   సశేషం

 రేపు 4-3-19 సోమవారం మాఘబహుళ  చతుర్దశి ’’ మహా శివరాత్రి ‘’శుభాకాంక్షలు

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -51

69-భాను వాది సహస్ర తీర్ధం

శర్యాతి అనే రాజు ధార్మికుడు .భార్య స్థవిష్ట.విశ్వామిత్ర గోత్రజుడు ,’’మధుచ్చందుడు ‘’అనే పేరున్న బ్రహ్మర్షి పురోహితుడు .ఇద్దరూ కలిసి ఒకసారి దిగ్విజయ యాత్ర చేశారు .ఒక చోట విడిది చేసి పురోహితుడు అన్యమనస్కంగా ఉండటం గ్రహించి రాజు కారణమేమిటి అని అడిగాడు .భార్య తనకై ఎదురు చూస్తూ ఉంటుందనే దిగులుతో ఉన్నానని చెప్పాడు .అనిత్య సుఖాలపై ఆరాటం పనికి రాదని రాజు హితవు చెప్పాడు .మధుచ్చందుడు’’రాజా !దంపతులు అనుకూలంగా ఉంటె ధర్మార్ధకామాలు వృద్ధి చెందుతాయి .సుఖం దూషణంకాదు  మాన్యమైనదే ‘’అన్నాడు . మళ్ళీ ఇద్దరూ  రాజ్యానికి తిరిగివచ్చి ,పురోహితునిప్రేమను పరీక్షించాలనుకొని వార్తాహరునిద్వారా’’ రాజు ,మంత్రిని  ఒక రాక్షసుడు అపహరించి పాతాళానికి తీసుకు వెళ్ళాడు’’ అని వార్తా పంపాడు .రాజుభార్య ఆ వార్తలోని నిజం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే, ఆవార్తవిన్న పురోహితుడి భార్య ప్రాణాలు విడిచింది .ఈ వార్తను వార్తాహరుడు రాజుకు చెప్పాడు .

  పురోహితుని భార్య శవాన్ని కాపాడమని తానూ పురోహితుడు అక్కడికి వస్తున్నామని చెప్పిపంపాడు .విచారం లో ఉన్నరాజుకు ఆశరీరవాణి’’ సకలపాపాలు ,దుఖాలు పోగొట్టుతుంది  గంగానది’’ అని పలికింది  .రాజు గౌతమీ నదిని చేరి స్నానించి బ్రాహ్మణులకు దానాలిచ్చి ‘’నేనేదైనా పుణ్యం చేసినా దానం చేసినా సత్యం పాటించినా నా ఆయుస్సు పోసుకొని మధుచ్చ౦ద పురోహితుని సాధ్వీ సతీమణి జీవి౦చు గాక ‘’అని సిద్ధం చేయబడిన అగ్నిలో దేహత్యాగం చేయటానికి అగ్ని ప్రవేశం చేయగానే  ,అక్కడ పురోహితునిభార్య బ్రతికి అందరికి ఆశ్చర్య౦ కలిగించింది  .తనభార్యకోసం రాజు ప్రాణత్యాగంచేయటం జీర్ణించుకోలేని పురోహితుడు ముందుగా రాజును బ్రతికించి తర్వాతే తన ధర్మపత్ని దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకొని సూర్యుని –‘’నమోస్తు తస్మై సూర్యాయ ముక్తయే  అమిత తేజసే -ఛందోమయాయ  దేవాయ  ఓం కారార్దాయ తేనమః ‘’-‘’విరూపాయ సురూపాయ త్రిగుణాయ త్రిమూర్తయే –స్థిత్యుత్పత్తి నాశానాం  హేతవే ప్రభవిష్ణవే ‘’అంటూ  స్తుతించాడు .

  ప్రీతి చెంది భానుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే రాజును తన ప్రియభార్యను బ్రతికించ మని కోరాడు .వెంటనే సూర్యుడు శర్యాతి రాజును ,పురోహితునిభార్య ను బ్రతికించి ఇచ్చాడు .రాజు,  రాణి, పురోహితుడు, భార్య అందరూ నగరానికి చేరి సుఖ సంతోషాలతో వర్దిల్లారు. ఇదే భాను తీర్దమని , మృత సంజీవినీ తీర్ధమని ,శర్యాత తీర్ధమని మధుచ్చంద తీర్ధమని  పేరుపొంది మూడు వేల తీర్దాలతో విరాజిల్లుతోందని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం

గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం

28-2-19 గురువారం ఉదయం గుడ్లవల్లేరు A.A.N.M.And V.V.R.S.R. ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 31వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘’సాహితీ దినోత్సవం  ‘’లో ముఖ్య అతిధిగా ఆహ్వాని౦పబడి నేను మాట్లాడదామనుకొన్న ప్రసంగం  -పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల సాగుదల, ‘’మైకాసురుని ‘’ భీభత్సం,  షామియానాల క్రింద ఏర్పాటు చేయబడిన సభ కావటం తో పైన ఉరుముతూ చినుకుతూన్న ఆకాశం  తో, సింహభాగం కాలం హరించుకు పోగా ,నాకు మిగిలిన ‘’పావుగంట’’ లో నాలుగు ముక్కలు మాట్లాడాను.కాని దీనికి ప్రిపరేషన్ బాగా చేసుకొని సిద్ధపడ్డాను .నాకూ వాళ్ళకూ దక్కింది అదే .ఆ కాసేపట్లోనే ఆప్రాంతపు 172 ఏళ్ళ క్రిందటి మహాకవి బహుశా ఈతరం పెద్దవారికికూడా  గుర్తు ఉండని శ్రీ దాసు శ్రీరాముల గారి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశాను .ఇప్పుడు మీకు నాప్రసంగ౦ వివరాలు తెలియ జేస్తున్నాను .సాహితీ ప్రియులుగా మనమందరం  గ్రహించాల్సిన విషయాలివి . –

   ‘’మహాకవి శ్రీ దాసు శ్రీరాములు గారు 8-4-1846 న కృష్ణాజిల్లా కూరాడ గ్రామంలో శ్రీ దాసు  కన్నయ్య శ్రీమతి కామమ్మ దంపతులకు జన్మించారు .ఆయన వాగ్గేయకారులు ,ప్రతిభకల ఉపాధ్యాయులు ,ప్రముఖ న్యాయవాది ,సంఘ సంస్కర్త ,పత్రికా నిర్వాహకుడు ,ధర్మ శాస్త్ర ,జ్యోతిశ్శాస్త్ర ,నాట్యశాస్త్ర విద్వాంసుడు ,ఆయుర్వేద శాస్త్ర పరిశోధకుడు .సంఘ సంస్కర్తలు వీరేశలింగం ,గురజాడ లకు సమకాలీనుడు .దాసుగారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు పొంగిపోయిన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి ‘’శ్రీరాములుగారు మనకు దక్కిన రెండవ శ్రీనాథుడు ‘’అంటే ,శ్రీ విశ్వనాథ ‘’ఆయన లోకానుభావం బహు దొడ్డది ‘’అనగా ,శ్రీ విశ్వనాథ వెంకటేశ్వర్లు ‘’ఎ వర్సటైల్ జీనియస్ ‘’అని అంటే ‘’అద్యతన ఆంధ్రవాజ్మయ నిర్మాత ‘’అని శ్రీ నిడదవోలు వెంకటరావు ,’’అభినవ భాసుడు ‘’అని డా .శ్రీ జి.వి సుబ్రహ్మణ్యం  ,’’రామ నీ సమాన మెవరు ‘’అన్న కీర్తనకు అన్నివిధాలా పాత్రుడు ‘’అని శ్రీ దాసు వామన రావు గార్ల చే  ప్రశంసలు పొందిన ప్రతిభా మూర్తి .

  కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం ‘’అల్లూరు ‘’అగ్రహారీకులైన దాసువారు తండ్రి వద్ద ,శ్రీ అడవి సుబ్బారాయుడు గార్లవద్ద ప్రాధమిక విద్య నేర్చారు . బాల మేధావి అయిన శ్రీరాములుగారు 12వ ఏటనే ‘’సోమలింగేశ్వర శతకం ‘’ను ప్రౌఢం గా రచించిన సాహసమూర్తి .13వ ఏట శ్రీమతి జానకమ్మగారిని శ్రీరాములు గారు పరిణయమాడి ఆదర్శ ‘’జానకీ రాములయ్యారు ‘’.14వ ఏట ‘’సాత్రాజితీ విజయం ‘’అనే యక్షగానం రాసిన సంగీత సాహిత్య శిరోమణి .సంస్కృత వ్యాకరణం నేర్వాలనే కోరిక విపరీతమై ,ఇంట్లో చెప్పకుండా ఆగిరిపల్లి వెళ్లి సంస్కృత పాఠశాలలో చేరి,  సంస్కృత వ్యాకరణం నేర్చారు .వారు అందుకొన్న స్కాలర్షిప్ ఆరోజుల్లో అర్ధరూపాయిమాత్రమే .

  గుడివాడలో ఇంగ్లిష్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా    ఉద్యోగం ప్రారంభించి ,ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూనే స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకొన్న సమర్ధులు .తర్వాత కౌతవరం లో ఉపాధ్యాయుడుగా పని చేశారు .దీనికి దగ్గరలోనే ఉన్న డోకిపర్రు గ్రామస్తులు దాసుగారి వద్దకు తమ గ్రామం లో పిల్లలు చదువుకోవటానికి బడి లేదని చెబితే స్వంతఖర్చులతో హైస్కూల్ ఏర్పాటు చేసి ,అక్కడే టీచర్ గా పని చేశారు .స్వయంగా చదివి ఇంగ్లీష్ పరీక్షలు ,ప్లీడరీ పరీక్షలు రాసి పాసయ్యారు .1878లో డోకిపర్రు వదిలి బందరులో న్యాయవాది గా ఉండటానికి వెడుతుంటే శ్రీరాములుగారు తమ గ్రామానికి చేసిన అమూల్య సేవలకు  కృతజ్ఞతగా గ్రామ స్తులు బంగారు పూలతో పాద పూజ ,శిరస్సుపై పూజ చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకొన్నారు .అంతే కాదు పూలపల్లకీ లో శ్రీరాములుగారిని గౌరవంగా ఆశీనులను చేసి గ్రామపెద్దలు ఆపల్లకీని మోసి ఊరేగించి చరిత్ర సృష్టించారు .ఇంతటి ఘనమైన వీడ్కోలు   మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి  రాధాకృష్ణన్ గారికి ఆయన విద్యార్ధులు  చేశారని మనం చదువుకొన్నాం .

  1878లో బందరులో ప్లీడరీ గా ప్రాక్టీసు మొదలు పెట్టారు  .అయిదేళ్ళ తర్వాత  1883లో బందరు వదిలి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో స్థిరపడి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ గా 1907వరకు 24ఏళ్ళు పేరు పొందారు .ఏలూరులోని దాసు గారి సువిశాలమైన స్వగృహం ఆతర్వాత ‘’గాంధీ ఆంధ్రరాష్ట్ర జాతీయ విద్యాలయం ‘’అయింది .ఆకాలంలోనే ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుశ్రీ బసవరాల రామబ్రహ్మం గారిని  మేనేజిమెంట్ అక్రమంగా తొలగించేస్తే ,ఆయనవచ్చి శ్రీరాములుగారితో మొరపెట్టుకోగా ,వెంటనే ‘’హిందూ పేట్రియాటిక్ స్కూల్ ‘’ను స్వయంగా స్థాపించి ఆ మా స్టారినే హెడ్ మాస్టర్ ను చేసిన ఉదార శీలి కార్య నిర్వహణ దక్షులు శ్రీరాములుగారు .సమాజ అభి వృద్ధికి స్త్రీలు దోహదపడాలని వా౦ఛి౦చారు .అందుకే స్త్రీ విద్యా, స్త్రీ స్వాతంత్ర్యం లపై అనేక చోట్ల ప్రసంగించి చైతన్య పరచారు .దీనిప్రభావం వలన పల్లెలలో కూడా బాలికా పాఠశాలలేర్పడ్డాయి .

  వీరేశలింగం గారి లాగానే వితంతువుల పట్ల కూడా సానుభూతి ఉండేది .వితంతు పునర్వివాహాన్ని సమర్ధిస్తూ ప్రచారం చేశారు .అంతే కాదు వితంతువుల కు శిరోముండనం చేయించటం పై తీవ్ర అభ్యంతరం చెప్పారు .దీనికోసం ‘’రండాముండన ఖండం ‘’అనే అద్భుతమైన వ్యాసం రాసి ,కనువిప్పు కల్గించారు .బాల్య వివాహాలపై కూడా శ్రీరాములు గారు విరుచుకు పడ్డారు .ఇలా సంఘ సంస్కణోద్యమ౦ లో కూడా తనదైన ప్రత్యేక పాత్ర పోషించారు .  వాగ్గేయ కారులుగా దాసువారి ప్రతిభను చూద్దాం .ఉయ్యూరుదగ్గర ,కృష్ణా నదీ తీరం లో ఉన్న తొట్లవల్లూరు సంస్థాన రాజధాని  తోట్లవల్లూరు లోని శ్రీ వేణు గోపాల స్వామి కి అంకితమిస్తూ ‘’కృతులు ,పదాలు ,జావళీలు ‘’రాసి వాగ్గేయకారుల సరసన స్థానం సంపాదించుకొన్నారు శ్రీరాములుగారు ‘’అభినయ దర్పణం ‘’అనే నాట్య శాస్త్ర గ్రంథం రాసి నాట్యం లో తనకున్న ప్రావీణ్యతను తెలియజేశారు .ఏలూరులో స్వయంగా ‘’సంగీత పాఠశాల ‘’స్థాపించి,సమర్ధులైన శ్రీ నల్లాన్ చక్రవర్తుల తిరు వేంగడా చారి  గారిని ప్రధానోపాధ్యాయులను చేశారు .ఎందరో విద్యార్ధులు ఇక్కడ సంగీతం అభ్యసించి గొప్పవారయ్యారు .ఎంతోమంది  సంగీత విద్వాంసులను పోషించారు .శ్రీఆదిభట్ల నారాయణ దాసు, శ్రీ  చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వంటి ఉద్దండులను ఆ పాఠ శాలకు ఆహ్వానించి ,విద్యార్ధులకు ప్రబోధాత్మకమైన ప్రసంగాలు చేయించి సత్కరించారు .

   శ్రీరాములుగారు అనేక ప్రక్రియలలో 30దాకా రచనలు చేశారు .వారి శతకాలలో మయూర మహాకవి సంస్కృతంలో రాసిన ‘’సూర్యశతక౦ ను  అనువదించిన  ‘’సూర్యశతకం ‘’,తెలుగు నాడు’’ఉన్నాయి .అచ్చ తెలుగు శతకం ‘’చక్కట్ల దండ ‘’రాశారు .చక్కట్లు అంటే సామాజిక నీతులు అని అర్ధం .దండ అంటే హారం, మాల .ఇందులో సమాజం లోని ఎన్నో అంశాలపై ఘాటైన  విమర్శ చేసి నీతులు బోధించారు .హాస్యం మేళవించి  పసందు చేశారు .సంస్కృత’’ దేవీభాగవత౦ ‘’ను మృదు  మధురమయిన  తెలుగు భాషలోకి అనువదించి దేవీ భక్తుడనిపించారు ‘’వైశ్య ధర్మ ప్రదీపిక ‘’’’విగ్రహారాధన ‘’రాశారు .’’తారామణి’’ అనే ధర్మ శాస్త్ర గ్రంథం రచించారు .ఆయుర్వేద వైద్య విధానం లో తమకున్న మక్కువను ప్రదర్శిస్తూ ,పరిశోధనాత్మకమైన రచన ‘’   భ్రు౦గ రాజ మహిమ ‘’రాశారు .  

  శ్రీరాములుగారు తాను  చిన్నతనం గడిపిన అల్లూరు అగ్రహారం గురించి దేవీ భాగవతం కృతి మొదట్లో ‘’నా బాల్యంబు న నాకు నానావిధ సౌఖ్యంబులకు నాట పట్టై,నన్నలరించిన ‘’అల్లూరు ‘’అగ్రహారంబునభి వర్ణించెద’’అనే భాగాన్ని ఒక ఖండ కావ్యంగా రాశారు .’’గ్రామ ప్రకృతినే వర్ణనగా  రాస్తే దాన్ని ‘’పాస్టోరల్ పోయెట్రి ‘’అంటారని , ఇంగ్లీష్ లో స్పెన్సర్ ,మాధ్యూ ఆర్నోల్డ్ ,మిల్టన్ వంటి కవులు ఇలాంటి కవిత్వం రాశారని దాసుగారిపై ఆప్రభావం ఉందని అందుకే అంతగొప్పగా తమ అగ్రహారం అల్లూరును వర్ణించారు ‘’అని శ్రీరాములుగారి రచనలపై పరిశోధన చేసి ‘’మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు –సమీక్ష ‘’అనే పరిశోధన గ్రంథం రచించి పిహెచ్ డి అందుకొన్న ఆయన మనవరాలు శ్రీమతి వెలగపూడి వైదేహి తెలియ జేశారు.

  శ్రీరాములుగారి కవిత్వ సౌందర్యం కొంత చూద్దాం .సూర్య శతకం లో ఒక పద్యం –

‘’ముల్లోకమ్ముల జ్ఞానదీపములు  తమ్ముల్ జిమ్ము నూత్నారుణో-త్ఫుల్ల శ్రీలకు నంగ రక్షకములున్ ,పూర్వాద్రి దాతుద్రవా –

భ్యుర్లాసమ్ముల తోడు నీడ లును ,వేల్పుం దంతి సింధూర దీ-వ్యల్లీలా కృతులైన భాను ,రుచులైశ్వర్యమ్ము మీకిచ్చుతన్ ‘’.

  పెళ్ళిలో మగపెళ్ళివారు ‘’సదస్యం ‘’నిర్వహిస్తున్నారు .అది అతి బాల్యవివాహం .పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లను చూసి అక్కడి సంప్రదాయ శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు చెవులు కొరుక్కుంటూ బుగ్గలు నొక్కు కొంటూ మాట్లాడుకోవటం ను అక్షర రమ్యం  చేశారు ‘’షభాష’’ లో –‘’అస్సే ,చూస్సిషి వషే,నోసే చెవుడషే,అష్లాగషే,ఏమిషే ,-విస్సావఝలవారి ‘’బుర్రి నష’’,యా విస్సాయి కిస్సారుషే’’ ఇందులో హాస్యం వ్యంగ్యం ఎత్తిపొడుపు ,బాల్యవివాహ నిరసన త్రివేణీ సంగమమై శ్రీరాములుగారి కవిత్వం లో ప్రవహించింది  .

మరో పరభాషా ప్రయోగం –‘’గూస్సు ,నాన్సేన్సు యూ గో అవే ,ఖబడ్దార్ ,బాత్ నఖో ,కౌన్ పకడా –మొద్దొక పల్లె కు మున్సఫీ చేయుచు గాడ్దె కొడుకు పన్ను కట్టమనగా ‘’ .

  ఇలా ఎంతో వైవిధ్యమైన రచనలు చేసిన మహాకవి దాసు శ్రీరాములుగారు 16-5-1908న 62ఏళ్ళ వయసులోనే ‘’దివిజకవి వరుల గుండియల్ దిగ్గురనగ’’అన్నట్లు శ్రీనాధ మహా కవి సార్వభౌముడిలాగా  అమరపురికి అరిగారు .

  హైదరాబాద్ లోని వారి మునిమనవలు శ్రీ దాసు అచ్యుతరావు సోదరులు ‘’మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి ‘’ఏర్పాటు చేసి ,ముత్తాతగారి అరుదైన గ్రంథాలను వెలువరించారు .ఫిబ్రవరి 6వ తేదీ శ్రీ దాసు అచ్యుతరావు గారు నాకు ఫోన్ చేసి ,పరిచయం చేసుకొని ,శ్రీరాములుగారి పుస్తకాలు 6 సెట్లు నాకు పంపుతామని చెప్పి వెంటనే కొరియర్ లో పంపారు .వారి కోరికపై ఒకటి ఉయ్యూరు లైబ్రరీకి ,మరొకటి అమరవాణి హైస్కూల్ లైబ్రరీకి ,ఇంకొకటి సాహితీ ప్రియులు శ్రీ కట్టు కోలు సుబ్బారెడ్డిగారికి అందించి ,ఒక్క పుస్తకం మాత్రం గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లైబ్రరీకి ప్రిన్సిపాల్ శ్రీ మూర్తి  గారి రిద్వారా నిన్న వేదికపై అందజేశాను .

  శ్రీ దాసు శ్రీరాములుగారిపై ఈ వ్యాసానికి ఆధారం ఆ గ్రంథాలే . శ్రీ అచ్యుతరావు గారికి ధన్యవాదాలు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు  .

.

image.png
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -50

67-విష్ణు తీర్ధం

ముద్గాలమహర్షి కుమారుడు మౌద్గల్య మహర్షి ఒకభార్య జాబాలి. మరొక ఆమె భాగీరధి .ప్రతిరోజూ గౌతమీతీరం లో  శమీ పుష్పాలు ,కుశలు తో  విష్ణుపూజ చేసేవాడు .ఆయన ఆహ్వానం అందుకొని గరుత్మంతుని ఎక్కి అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవాడు .విష్ణువు మౌద్గల్యునికి అనేక చిత్రకథలు చెప్పేవాడు .మధ్యాహ్నం కాగానే ముని అలసిపోయినట్లు భావించి ఆశ్రమానికి వెళ్ళమని తనూ వెళ్ళిపోయేవాడు వెన్నుడు .తనకు వచ్చిన డబ్బును విష్ణు పాదార్పితం చేసి భార్యకిచ్చేవాడు .ఆమె పతికి ఆశ్రమవాసులకు అతిధి అభ్యాగతుల భోజనాలకు దాన్ని వినియోగించేది .అందరి భోజనాలైనతర్వాత ఆమె భోజనం చేసేది. రాత్రివేళ మౌద్గల్యుడు భార్యకు తనకు విష్ణువు చెప్పిన కథలన్నీ వినిపించేవాడు .

ఒక రోజు ఏకాంతం లో భర్తతో భార్య జాబాల ‘’నిత్యం విష్ణువు మీదగ్గరకు వస్తున్నాడు కానీ మనకస్టాలు తీరటం లేదు కారణం అడగండి ‘’అన్నది .ఒక రోజు ధైర్యం చేసి విష్ణువుతో ‘’స్మరణ మాత్రం చేత అన్నీ ఇచ్చే నువ్వు ,రోజూ నాకు కనిపిస్తున్నా నా విపత్తు తొలగక పోవటానికి కారణమేమిటి ?’’అని అడిగాడు .దానికి విష్ణువు ‘’ఎవరైనా కర్మఫలం అనుభవించాల్సిందే .విత్తును బట్టి ఫలమొస్తుంది .గోదావరి ప్రక్కనే ఉంటున్నా నువ్వు గంగ పూజ చేయటం లేదు .భక్తితోనే ముక్తి వస్తుంది ‘’అనగా ముని భక్తితో ముక్తికలిగితే తనకు ముక్తి కావాలని చెప్పాడు .

విష్ణువు ‘’నన్ను స్మరిస్తూ యాచకుడికి ఇచ్చింది అక్షయమౌతుంది ‘’అని చెప్పి గరుత్మంతుని ధాన్యపు గింజలు  తెమ్మనగా ఆతడు వెళ్లి తేగా వాటిని విష్ణువు చేతిలో దానం చేశాడు .అతన్ని   ఇంటికి  వెళ్ళమనిచేప్పాడు .ఆశ్రమం చేరగానే ధనకనక వస్తువాహనాలు అతని దృష్టిలో పడి అదంతా దానఫలం విష్ణు కటాక్షం గంగ అనుగ్రహం గా భావించాడు .చాలా కాలం తలిదండ్రులతో భార్యాపిల్లలతో ఐశ్వర్యం అనుభవిస్తూ విష్ణు పూజ క్రమం తప్పక చేస్తూ ముక్తినిపొందాడు .ఇదే మౌద్గల్య లేక విష్ణు తీర్ధం గా ప్రసిద్ధమైందని నారదునికి  బ్రహ్మ ఉవాచ . .

68-లక్ష్మీ తీర్ధం

సిరి సంపదలు పెంచేది లక్ష్మీ తీర్ధం .పూర్వం లక్ష్మీ దేవికి దరిద్రదేవతకు వివాదం వచ్చి ,విరోధం పెరిగి ఇద్దరూ భూలోకం చేరారు .ఈ ఇద్దరు ఎవరికివారే తనదే ఆధిక్యం అని పోటీ పడుతున్నారు .నేనే ము౦దు పుట్టానని దారిద్ర దేవత అంటే, నేను లేకపోతె ప్రాణులు జీవించలేరని లక్ష్మీ దేవి అన్నది .దరిద్రదేవత ‘’ముల్లోకాలు నా అధీనం లో ఉన్నాయి .నేనున్నచోట కామక్రోధాలు భయం ఈర్శ్యా  ఈర్ష్యాదులు  ఉండవు ‘’అన్నది. లక్ష్మీ దేవి ‘’అందరికి గౌరవం కలిగించేది నేనే .నిర్ధనుడు లోకంలో చులకన అవుతాడు .దేహి అనే మాటద్వారా బుద్ధి సంపద వినయం శాంతి కీర్తి అనే అయిదుగురు దేవతలు నిష్క్రమిస్తారు .యాచనలేని  వాడి గుణం గౌరవి౦పబడుతుంది.ఉత్తముడు  సర్వలోక పూజ్యుడు అనిపించుకొంటాడు.కనుక నేనే అధికురాలను ‘’అన్నది .దీనికి దరిద్రదేవత ‘’నువ్వు ఎక్కడపడితే అక్కడ వాలిపోతావు ఉచ్చనీచాలు పాటించవు .వినాశం చేసేవారికి వత్తాసు పలుకుతావు ‘’అని దెప్పగా ,తగాదా తీరక ఇద్దరూ బ్రహ్మ దగ్గర ఫిర్యాదు చేశారు .

ఇద్దరి వాదనలు విన్న బ్రహ్మ ‘’నాకంటే పురాతనమైనది భూమి .దానికంటే నీరు ప్రాచీనం ఇలాంటి తగాదాలు స్త్రీలలోనే వస్తాయి .నీటికంటే బ్రహ్మకమండలం లోని గంగాజలం ప్రాచీనమైనది .ఆ గోదావరి నది అన్ని కోరికలు తీరుస్తుంది ,సందేహ నివృత్తి చేస్తుంది’’అన్నాడు  .భూమి జలం లతోకలిసి వారిద్దరూ గంగా తీరం చేరి తమ అభియోగాలను వినిపించగా గౌతమీనది ‘’సృష్టిలో శ్రేష్టమైన ప్రతిదీ లక్ష్మీ దేవికే చెందుతుంది .ఆమె లేకపోతె ఏమీ ఉండదు .అలాంటి లక్ష్మీ దేవితో కలహించటం అవివేకం ‘’అని దరిద్రదేవతను తరిమేసింది .అప్పటినుంచి గంగ దరిద్రానికి శత్రువు అయింది .గౌతమిని సేవి౦చి పూజించకపోతే అలక్ష్మీ ఆవహించి బాధిస్తుంది .పూజిస్తే దరిద్రం తొలగించి సంపదలతోపాటు ముక్తినీ ఇస్తుంది .అదే లక్ష్మీ తీర్ధం అని బ్రహ్మనారడుడికి చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-3-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -49 65-చక్రతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -49

65-చక్రతీర్ధం

స్మరణం చేతనే పుణ్యం ముక్తికలిగించేది చక్రతీర్ధం .వసిస్టాది మునులు ఒకప్పుడు గౌతేమీ తీరం లో ఆశ్రమం నిర్మించుకొని సత్ర యజ్ఞం చేశారు .దానవులు దారుణంగా విఘ్న ధ్వంసం చేస్తుంటే బ్రహ్మ దగ్గర మొరపెట్టుకోగా దానవ వినాశనం కోసం ఒక స్త్రీని సృష్టింఛి మునులకు అందజేశాడు .జన్మరాహిత్యం కలిగి కృష్ణవర్ణం రక్తవర్ణం కలిసిన రంగుతో ఉన్న ఆస్త్రీ ముల్లోకాలను సంమోహితపరచే మాయా రూపిణి.మునులు స్వస్తమనస్కులై యజ్ఞ దీక్ష చేబట్టారు .రాక్షసులు యధాప్రకారం విఘ్న ధ్వంసానికి వచ్చారు .అక్కడున్న అతిలోక సౌందర్యవతి అయిన మాయా రూపిణిని చూసి ,అతిగర్వం తో నాట్యం చేశారు ,ఆడారు ,పాడారు నవ్వారు ఏడ్చారు .అందులో శంబరుడు అనే రాక్షసరాజు  ఆమెను అమాంతం తినేశాడు .మళ్ళీ యజ్ఞ విధ్వం జరిగినందున మునులు విష్ణువుకు చెప్పుకొన్నారు .ఆయన సుదర్శన చక్రప్రయోగం చేసి ,దనుజ రాక్షస సంహారం చేశాడు .మునుల యజ్ఞ౦ పరిసమాప్తమైంది .విష్ణువు తన సుదర్శన చక్రాన్ని గంగానదిలో కడిగాడు .అదే చక్రతీర్ధం .ఇక్కడ స్నానం  సత్రయాగ ఫలితమిస్తుంది అని బ్రహ్మనారడుడికి చెప్పాడు .

66-వాణీ సంగమ తీర్ధం

హరుడు వాగీశ్వరుడైన తీర్ధమే వాణీ సంగమ తీర్ధం .ఒకప్పుడు బ్రహ్మా  విష్ణువుల మధ్యఆధిపత్యం కోసం  తీవ్ర వాదోపవాదాలు జరుగగా శివుడు జ్యోతిస్వరూపుడుగా అవతరించాడు  .అప్పుడొక ఆశరీరవాక్కు ‘’ఎవరు ఆక్కడున్న జ్యోతిస్వరూపం యొక్క అంతాన్ని చూస్తారో అతడే గొప్పవాడు’’అని వినిపించింది .బ్రహ్మపైభాగానికి విష్ణువు కి౦దిభాగానికి వెళ్ళారు . .విష్ణువు అతిత్వరగా తిరిగి వచ్చిజ్యోతి దగ్గర కూర్చున్నాడు .బ్రహ్మ ఎంతదూరం వెళ్ళినా అంతం దొరకక అలసిపోయి ,చూడలేదని అంటే తనకు జ్యే స్టత్వం దక్కదేమో నని ,మరీ అబద్దం  ఆడటానికి సాహసించలేక అయిదవముఖమైన గార్ధభ ముఖం పొంది అక్కడే కూర్చున్న విష్ణువుతో అంతాన్ని చూశానని,కనుక  జ్యేస్టత్వం తనదే అని  చెప్పించాడు  .అప్పుడు హరిహరులిద్దరూ ఒకే దివ్య  తేజస్సు తో ఉండటం చూసి విస్మితుడై వారిద్దరిని స్తుతి చేశాడు .

కాని వారు శాంతించక కృద్ధులై గార్ధభ వాక్కుతో ‘’పాపాత్మురాలా అసత్యం కంటే దోషం లేదు .నువ్వు నదిగా మారిపో ‘’అనగా బ్రహ్మ తప్పు తెలుసుకొని ఆమెను అదృశ్యం కమ్మన్నాడు .ఆమె వారిద్దరిని ప్రార్ధిస్తే  గంగానదితో సంగమం పొందినప్పుడు మళ్ళీ పవిత్ర శరీరం పొండుతావని అభయమిచ్చారు .ఆనదినే వాణీ లేక సరస్వతి నది అంటారు .గంగా వాణీ సంగమం ముక్తి హేతువు అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -14

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -14

యాజ్ఞవల్క్యుడు ‘’జనకరాజా !ముండ్ల దుబ్బు ,ముండ్ల గడ్డి వేరు వేరు అయినట్లే ,పురుషుడు ,ప్రకృతి వేరు వేరు .వీరి పరస్పర సంయోగం వలన వేరు అనిపిస్తారు .మేడిపండుపై ఉన్న దోమ ఆపండు లో భాగం కాదు .నీటిలోని చేప నీటికంటే వేరు .కుంపటి అందులోని అగ్ని వేరువేరు అని  సాంఖ్యులలభావన .ప్రకృతి,పురుషుడు భిన్నంకాదు .యోగులు ఎలా దీన్ని భావిస్తారని రాజు అడగగా మహర్షి ‘’సాంఖ్యానికి యోగానికున్న బలం లేదు .కానీ రెండూ ముక్తికి మార్గాలే .ఈ రెండు భిన్నం కాదు ఒక్కటేఅని నేనుభావిస్తాను .యోగులు దేన్ని  దర్శిస్తారో సాంఖ్యులు కూడా దాన్నే దర్శిస్తారు .ఈ రెండిటిని ఒక్కటిగా చూసేవాడే నిజమైన తత్వ వేత్త .యోగం లో ప్రాణవాయువుకేకాక ఇంద్రియాలు ప్రధాన్యముంది .ఈ రెండిటిని అణగించుకొనియోగులుఅంతటా స్వేచ్చగా సంచారం చేస్తారు .స్థూల దేహాన్ని నశి౦ప జేసు కొని అణిమాది సిద్దులతో సూక్ష్మ దేహం పొంది ,ఆ దేహం లోనే అన్ని సుఖాలుపొండుతూ అన్నిటా సంచరిస్తారు .యోగం లో ఎనిమిది గుణాలున్నాయి ,ఎనిమిది అ౦గాలున్నాయి .

  ‘’ఉత్తమ యోగుల తీరు సగుణ ,నిర్గుణ అని  రెండురకాలు .మనసుని పదహారింటి లో ధారణ చేయాటమే  మొదటిదైన సగుణయోగం  .రెండవదైన నిర్గుణం లో  ప్రాణాయామాన్నీ చిత్తాన్నీ ధ్యాత ధ్యేయం  భేదం నశి౦చేట్లు ఏకాగ్రత్వం పొంది ఇంద్రియ నిగ్రహత్వం తో ఉండటం .మొదట సగుణాన్నీ తర్వాత నిర్గుణాన్నీ అభ్యాసం చేయాలి .రాత్రి మొదటి యామం లో 12 ప్రాణాయామాలు ,నిద్రించాక చివరియాములో 12ప్రాణాయామాలు ఉన్నట్లు చెప్పారు .దాంతుడు, శాంతుడు ఈ 24విధాల ప్రాణాయామాలను నిరోధిస్తాడు .అప్పుడుపరమాత్మలో ఆత్మను విలీనం చేయగ లుగుతాడు .ఇంకా చాలా వివరాలున్నాయి మళ్ళీ  చెబుతా  ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధన్యవాదాలు AANM And VVR SR ఇంగిలీషు మీడియం గుడ్లవల్లేరు హైస్కూల్ ప్రిన్సిపాల్

AANM And VVR SR ఇంగిలీషు మీడియం గుడ్లవల్లేరు హైస్కూల్ ప్రిన్సిపాల్  ఆత్మీయులు శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తిగారికి  నమస్సులు .నన్ను మీ సాహితీ దినోత్సవ సభ కు ముఖ్య అతిధిగా   ఈ రోజు 28-2-19 గురువారం ఆహ్వానించి ,నాతొ మీ బాలబాలికలకు నాలుగు మంచిమాటలు అందునా ఆ ప్రాంతపు కవి మహాకవి శ్రీ దాసు శ్రీరాములు  గారిపై నాకు మాట్లాడే అవకాశమిచ్చినందుకు ,మీ విద్యా కుటుంబాన్ని పరిచయం చేసినందుకు ,గౌరవించి నందుకు  ధన్యావాదాలు  .వారందరి సౌజన్యానికి  అభినందనలు ..

  ఉదయమే కాక మధ్యాహ్నం జరిగిన సైన్స్ డే  కార్యక్రమం లో కూడా సైన్స్ మాస్టర్ అయిన  నాకు బాధ్యత కలిపించి ఎవరికీ పెద్దగా తెలియని  ఆంధ్ర శాస్త్రవేత్తలు  1-కెమోటాలజి పిత  డా కొలచల సీతారామయ్య 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు 3-117 వ మూలకం టెన్నెస్సిన్ (Tn ) కనిపెట్టిన  అణు  శాస్త్ర వేత్త  డా.ఆకునూరి వెంకట రామయ్య గారు ల గురించి సైన్స్ డే నాడు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ,అలాగే డా రామయ్య గారి పరిశోధనాంశం ”నూతనవధూవరులకు దక్షిణ భారత దేశం లో  వివాహం రోజు రాత్రి అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం లోఅంతరార్ధం” పై మాట్లాడించి నందుకు   మీకు ,మీ సైన్స్ శాఖ వారికి  విద్యార్థినీవిద్యార్థులను ధన్యవాదాలు .ఇంజనీరింగ్ కాలెజి వైస్ ప్రిన్సిపాల్ డా శ్రీ ప్రసాద్ గారితో ,యువ సైన్స్ కెరటం కుమారి శ్రావ్య తో వేదికపై కూర్చునేఅరుదైన అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు . కుమారి శ్రావ్య విద్యాకల్పవల్లి . మూర్తీభవించిన ఆమె సౌజన్యం చూసి నాకు ముచ్చటవేసింది .ఆమెకు నా హృదయపూర్వక ఆశీస్సులు .త్వరలోనే ఆ చిరంజీవికి తనకు కావలసిన దానిలో ప్లేస్ మెంట్ లభించాలని ఆమె  భవిష్యత్తు  ఉజ్వలంగా ప్రకాశించాలని కోరుతున్నాను . .
  మీ విద్యా కుటుంబమే కాదు మీ కుటుంబమూ ఆదరణకు ఆప్యాయతకు,ఆతిధ్యానికి  నిదర్శనమని మీరూ ఈ శ్రీమతి గారు రుజువు చేశారు .అన్నపూర్ణ లాగ వారు  వండి వడ్డించిన భోజనం మరిచిపోలేనిది .
 మరొక్క మారు మీ అందరికీ ధన్యవాదాలు -గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-19 -ఉయ్యూరు 7-20P.M
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దొడ్లో ఇవాళ ఆపరేషన్ ఉసిరి

This gallery contains 7 photos.

  ఉసిరి ఆఫ్టర్ ఆపరేషన్

More Galleries | Tagged | Leave a comment

సాహితీ దిగ్గజం ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా )అస్తమయం

image.png

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13

  అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి  చెప్పమని జనకుడు అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా ,దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు .సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి  సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు .జనకుడు ‘’ఆ ఇద్దరిలో ఒకరు అచేతనం గా ఎందుకు ఉంటారు .మరొకరు చేతనకల్గి క్షేత్రజ్ఞుడు అని ఎలా పిలువబడుతాడు ?వివరించు ‘’అనగా మహర్షి ‘’జపాకుసుమం దగ్గరున్న స్పటికం దాని రంగులు పొందినట్లు గుణాలు పొంది గుణవంతుడు అవుతాడు .ఆ పుష్పం దగ్గర లేకపోతె శుద్ధ స్పటికంగా నిర్గుణుడై నిజ స్వభావం తో ఉంటాడు .అవ్యక్త ప్రకృతికి ఏమీ తెలియదు .స్వాభావికంగా పురుషుడికే అన్నీ తెలుసు .అజ్ఞానం చేత పురుషుడు మళ్ళీ మళ్ళీ గుణాలతో కలిసిఉంటాడు .కనుక నిజ స్వరూపం తెలియక ముక్తిపొండలేడు .ప్రకృతి యొక్క కర్తృత్వం కలవాడై ప్రకృతి ధర్మ కలవాడౌతాడు .గుణాలను ప్రసవి౦చేవాడుకనుక ప్రసవ ధర్ముడు అనీ ,ప్రళయం కలిగించేవాడు కనుక ప్రళయ ధర్ముడు అనీ అంటారు .అన్నిటికీ తానె సాక్షి తనకంటే వేరేది లేనందువలన ,తానె ప్రకృతి అనుకోవటం వలన ఆధ్యాత్మ విదులు అతడిని అద్వయుడు నిత్యుడు అంటారు .కారణ రూపం చేత అవ్యక్తుడు ఆస్థిరుడు కార్య రూపం లో వ్యక్తుడు .సాంఖ్యులు మోక్షానికి జ్ఞానాన్నీ, భూతదయను అవలంబిస్తారు .వారు వారు ప్రకృతికి ఏకత్వం ,పురుషుడికి నానాత్వం చెపుతారు  అంటే ప్రకృతి ఒక్కటే కాని పురుషుడు అనేకం అని  వాళ్ళభావం .కాని ప్రకృతికంటే పురుషుడు వేరే .ప్రకృతి అధ్రువం అయినా ద్రువమైన దాని లాగా కనిపిస్తుంది .దీన్ని వివరంగా వివరిస్తాను .’’అన్నాడు .

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -48

64- శుక్ల తీర్ధం

భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు  యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా  ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా మారిపోతావని  శపిస్తే ,నేను ప్రాధేయపడగా మునులు నన్ను అమృతదారతో అభిషేకిస్తే శాపవిమోచనం కలుగుతుందన్నాడు ‘’అని వివరించాడు భారద్వాజముని ‘’నువ్వు నా మిత్రుడవు యజ్ఞ సంరక్షణం ఎలా జరుగుతుందో చెప్పు .లేక సులభోపాయం ఉంటె  తెలియజేయి ‘’అని ప్రాధేయపడ్డాడు ..వాడు తనను అమృతప్రాయమైన బంగారం ,ఆవునెయ్యి ,సోమరసం లలో ఒకదానితో  అభిషే కి౦చ మన్నాడు .కుదరకపోతే గోదావరి జలమే అమృతం కనుక దానితో అభిషేకి౦చ మని ఉపాయం చెప్పాడు .

 భరద్వాజ మహర్షి గంగాతీరం చేరి గంగాజలం చేతిలోకి తీసుకొని యజ్ఞం లో ఆ రాక్షసునికి అభిషేకం చేశాడు .యజ్ఞం లోని యూపస్తంభం యజ్ఞ  పశువు, రుత్విక్కులపైనా ఆజలాన్ని చల్లాడు .నల్లని వాడైన ఆ రాక్షసుడు తెల్లనివాడుగా మారిపోయాడు .యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్త  మైంది .అందర్నీ సత్కరించి పంపేసి ముని యూప స్తంభాన్ని గోదావరిలో పడేశాడు .ఇప్పటికీ అది కనిపిస్తుంది .రాక్షసుడు భారద్వాజునితో ‘’మహర్షీ !నల్లని నన్ను తెల్లనివాడిగా చేశావు .ఈ శుక్ల తీర్ధం లో స్నాని౦చిన వారి అభీష్టాలు సిద్ధిస్తాయి ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ 7వేల తీర్దాలేర్పడినాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

 సశేషం

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12

‘’ఆధ్యాత్మ ,అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ,గమనం అది భూతం విష్ణువు అది దైవతం .పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం .ఉపస్థ అధ్యాత్మం ,దాని ఆనందం అధిభూతం ,ప్రజాపతి అధి దైవం .చేతులు అధ్యాత్మ అవి చేసే పనులు అధిభూతం ,ఇంద్రుడు అధిదైవం .వాక్కు ఆధ్యాత్మ .మాట్లాడటం అదిభూతం అగ్ని అధి దైవం .కన్ను అధ్యాత్మ రూపం అదిభూతం సూర్యుడు అధి దైవం .చెవి అధ్యాత్మం ,శబ్దం అధిభూతం దిక్కులు అధిదిదైవాలు .జిహ్వ అధ్యాత్మ రసం అధిభూతం జాలం అది దైవతం .ఘ్రాణం అధ్యాత్మ గంధం అది భూతం ,పృథ్వి అధిదైవతం .చర్మం అధ్యాత్మ స్పర్శ అదిభూతం ,వాయువు అది దైవం మనస్సు అధ్యాత్మ ,మంతవ్య౦ అది భూతం చంద్రుడు అదధి దైవం .ఆహ౦ కారం అధ్యాత్మ  అభిమానం అదిభూతం ,బుద్ధి అధిదైవం .బుద్ధి అధ్యాత్మ బోద్ధవ్యం అధిభూతం క్షేత్రజ్ఞుడు అధి దైవం .రాజా !భగవానుడిని ఆది మధ్యాన్తాలలో చూపిస్తూ విభూతులన్నిటినీ యధాక్రమ౦గా చెప్పాను .

  ‘’ప్రకృతి తనంత తాను  కోరికతో అనేక   వేల గుణ వికారాలు కలిగిస్తుంది.అది దాని సహజ లక్షణం  .ప్రకృతి పురుషుని యొక్క సత్వ రజస్ తమో గుణాలకు అనేక వికృతులు కలిగిస్తుంది .సత్వం ఆనందం ఉద్రేకం ,ప్రీతి ఆరోగ్యం సంతోషం శ్రద్ధ క్షమా కార్పణ్యం సమత్వం,నిర్దయ ,దానహీనబుద్ధి హింస వైరం ,ధర్మ ద్వేషం మొదలైనవన్నీ కలిగించి మనిషిని చికాకు కలిగిస్తుంది ‘’అని చెప్పాడు .

  జనకుడు సాత్వికాది గుణాలో తేడాల విషయం స్పస్టపరచమని అడిగాడు .మహర్షి ‘’ సత్వ రజస్తమోగుణాలు ప్రకృతి గుణాలు .అవి విడిచిపెట్టకుండా లోకం లో ఉంటూనే ఉంటాయి .అవ్యక్త రూప భగవానుడు ఈ గుణాలవలననే కోటానుకోట్ల జీవ రాశులలో ఉంటున్నాడు .వీటిలో సాత్వికం ఉత్తమ౦  రాజసం మధ్యమం, తామసం అధమం .మనిషికి పుణ్యం చేత ఊర్ధ్వగతి, పాపం చేత అధోగతి కలుగుతాయి .రజస్సు సత్వం తో ,తమస్సు రజస్సుతో సత్వం తమస్సు తో కలిస్తే ,లేక మూడూ సమానంగా కలిస్తే కానీ అవ్యక్తమైన ప్రకృతికూడా కలుస్తుంది .అవ్యక్త పురుషుడు సత్వం తో ఉంటె దేవలోకం లోనూ ,రజస్సు తమస్సు కలిగి ఉంటె మనుష్యలోకం లోనూ ,రజస్సు తమస్సులతో కలిస్తే పశు పక్ష్యాదులలోను పుడతాడు .మూడిటిలోనూ కలిసి ఉంటె మనుష్యత్వం కలుగుతుంది .పుణ్య పాపాలు లేని మహాత్ములు శాశ్వత అవ్యక్త అక్షయ స్థానం పొందుతారు .జ్ఞానులు ఉత్కృష్ట జన్మ పొందుతారు .అపుడు అచ్యుత అతీంద్రియ అజ్ఞానరహిత ,జన్మ మృత్యు తమోరహితం గా ఉంటారు ..’’అని వివరించాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -47

62- యమతీర్ధం

పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ .దేవతల యజ్ఞాలకు పోషి౦పబడే పశువులను సురమ కాపలా కాసేది .యజ్ఞ పశువులను రాక్షసులు ఆమెను మోసగించి దొంగిలించారు .సరమ దేవతలకు విషయం విన్నవించింది .బృహస్పతి ఆమెదే దోషమన్నాడు .నిజమని నమ్మి ఇంద్రుడు ఆమెను పాదం తో తన్నాడు .ఆ ఘాతానికి సరమ శునక ముఖం నుంచి పాలు కారాయి .రాక్షసులు అపహరించిన ఆవుపాలు ఆమె తాగిందికనుక ,వాటిని తీసుకొచ్చే బాధ్యతా ఆమెదే అన్నాడు .దానికి ఆమె  ఇందులో తనది కాని ఇతరులదికాని తప్పు లేదని తాను  కాపలా లో నిర్లక్ష్యం చూపలేదనీ బలవంతులైన రాక్షసులు తనను బంధించి గోవులను ఎత్తుకు పోయారని చెప్పింది .దేవగురుడు ధ్యానించి ఆమె నిజంగా దుస్టురాలని ,శత్రు పక్షం లో చేరిందనిఅనగా ఇంద్రుడు ఆమెను   మానవ లోకం లో ఆడకుక్కగా పుట్టమని శపించాడు .అలాగే ఆడకుక్కగా భయంకరమైనదిగా పుట్టింది .

  యజ్ఞ గోవుఅలను తెచ్చే ప్రయత్నం చేస్తూ ఇంద్రుడు విష్ణువును దర్శించి నివేదించాడు .ఆయన దోషులైన దైత్య దనుజ ,రాక్షసులను సంహరించటానికి  శార్ ఙ్గ ధన్సుస్సుతో  బయల్దేరి దండకారణ్యం లోఉన్న దేవ దనుజ రాక్ష సంహారం చేశాడు .అప్పటినుంచి విష్ణువుకు శార్ ఙ్గపాణి అనే పేరొచ్చింది .విష్ణువుకు భయపడ్డ రాక్షసులు దక్షిణ దిక్కుకు పారిపోయారు .గరుడవాహనమెక్కి  విష్ణువు వారిని వెంబడించి గంగ ఉత్తర  తీరం లో తన ధనుర్బాణాలతో చంపేశాడు  .అపహరింపబడిన గోవులను దేవతలకు ఇచ్చాడు .ఇదే గో తీర్ధం లేక బాణ తీర్ధం .గ౦గ దక్షిణ తీరం లో గోవులు యజ్ఞ పశువులయ్యాయి .దేవతలంతా ఇక్కడే గంగలో మునిగి మధ్యభాగం లో ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేసి దేవతాయజ్ఞం చేశారు .ఇదే యజ్ఞ తీర్ధం ,గోరక్షక తీర్ధం అయింది .

  నాలుగు కన్నులున్న సరమ కొడుకులు యముడికి జరిగినదంతా చెప్పారు .యముడు వారిద్దరినీ తీసుకొని తన  తండ్రి  సూర్యుడి దగ్గరకు వెళ్ళాడు .ఆయన గంగా తీరం చేరి పవిత్ర స్నానం చేసి బ్రహ్మా విష్ణు మహేశ్వరుల ధ్యానం చేయమన్నాడు .అలాగే చేశాడు శునకాలతో సహా .సరమ శాప విమోచనమై సుఖ శాంతులు పొందింది .

  63-యక్షిణీ సంగమం

  యక్షిణీ సంగమ౦లో స్నాదోషనివారణం సకల అభీస్ట  దాయకం .పూర్వం విశ్వావశువుకు పిప్పలా అనే సోదరి ఉండేది .ఆమెకు బిగ్గరగా నవ్వటం అలవాటు .ఒకసారి ఆమె గంగా తీరం లో ఋషులు చేస్తున్న యజ్ఞాన్ని చూడటానికి వెళ్లి వాళ్ళను పరిహాసం చేస్తూ ‘’నౌ షడ్, శ్రౌ షడ్’’అంటూ బిగ్గరగా అపస్వరం తో పలికింది .కోపించిన ఋషులు ఆమెను నదిగా మారమని శపించారు .నదిగా మారి యక్షిణి పేరుతొ పిలువబడింది .ఇది తెలిసిన ఆమె సోదరుడు విశ్వావశువు ఋషులను, ముక్కంటిని పూజించి  యక్షిణి నదిని గంగలో కలిపేసి శాపవిమోచనం కావించాడు .ఇక్కడే విశ్వావశువుకు ఉమామహేశ్వరుడు సాక్షాత్కరించాడుకనుక ఇది శైవ తీర్ధం, దుర్గా తీర్ధంగా పిలువబడింది .సమస్త దుర్గతులు పోగొట్టే ఈ తీర్ధం ముఖ్య తీర్ధమైనదని బ్రహ్మ నారదుడికి చెప్పాడు  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11

సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు .అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే  వసిస్టుడయ్యాడు .మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం  గురించి చర్చించారు..అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు .తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు .అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని అడిగితె వ్రీహి తో అనగా ,అదీ లేకపోతె అంటే ఓషదులతో  అనగా అవీ లేకపోతె అంటే నీళ్ళతో అంటే అవీ లేకపోతె ఏం చేస్తావు అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’సత్యాన్ని శ్రద్ధలో హోమం చేస్తాను ‘’అన్నాడు .

  ప్రకృతి మొదలైనవాటి గురించి చెప్పమని రాజు అడిగితె మహర్షి ‘’అవ్యక్తం మహస్సు ,అహంకారం ,పృథ్వి ,నీరు ,తేజము వాయువు ఆకాశం అనే ఎనిమిది ప్రకృతులు అంటారని చెవి చర్మం ,జిహ్వ ,ముక్కు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ,వాక్కు హస్తాలు పాదాలు పాయువు మేఢ్ర౦ లను వికృతుల౦టారని ,వీటిలో   శబ్దము మొదలైన పంచ భూతాల వలన పుట్టినవి విశేషాలు అంటారని జ్ఞానేంద్రియాలు అవిశేషాలనీ ,మనసు పదహారవదిగాఆధ్యాత్మ చింతనాపరులు భావిస్తారని ,ఈ మొత్తం 24లను తత్వాలు అంటారని శ్రుతులు చెప్పాయన్నాడు  .

   జనకుడు నవవిధ సృస్టుల గురించి చెప్పమని అడగగా మహర్షి ‘’అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుంచి మహాదాత్మ పుట్టింది .ఇదే మొదటి సృష్టి .మహత్తు నుంచి అహంకారం పుట్టి బుధాత్మకమైన ద్వితీయ సృష్టి అయింది .అహంకారంనుంచి ఆకాశం మొదలైన భూతాత్మక

మనస్సు  పుట్టి అహంకారిక తృతీయ సృష్టి అయింది .మనసు నుండి మహాభూతాలు అయిదు పుట్టి మానసిక నాల్గవ సృష్టి అయింది .శబ్ద స్పర్శ రస గంధ రూప మైన భౌతిక పంచమ సృష్టి ఏర్పడింది. శ్రోత్వ చక్షు త్వక్ జిహ్వ ఘ్రాణం అనే చి౦తాత్మక ఆరవ సృష్టి జరిగింది .కర్మేంద్రియాలు పుట్టి ఐంద్రియ సప్తమ సృష్టి అయింది .ఊర్ధ్వంగా పుట్టే వాయువు అంటే ప్రాణం  అడ్డంగా పుట్టే వాయువులు అంటే అపాన ఉదాన వ్యానాలు పుట్టి ఆవర్జక ఎనిమిదవ సృష్టి అయింది .తర్వాత అడ్డం గా పోయే వాయువులు అనగా సమానం దానం వ్యానం ,క్రిందుగా పోయే అపానం వాయువులు పుట్టి అనార్జవం అనే తొమ్మిదవ సృష్టి అయింది ‘’ అని వివరించాడు .

  సంతృప్తి చెందిన జనకరాజు గుణాలు కాలం గురించి వివరించమని కోరాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పది వేల కల్పాలు అవ్యక్త పురుషుడికి ఒక పగలు ,రాత్రి కూడా అంతేపరిమాణం కలది .రాత్రి గడవగానే అతడు సకలప్రాణులకు జీవాధారమైన ఓషధులను సృష్టిస్తాడు .తర్వాత హిరణ్మయమైన అండం నుండి బ్రహ్మ౦ ను సృష్టిస్తాడు. ఇతడే సర్వభూతాలకు మూర్తి .ఒక సంవత్సరకాలం ఆ అండంలోనే ఉండి,తర్వాత బయటికి వచ్చి ఆ అండంలో సగం స్వర్గం గా సగం భూమిగా చేశాడు అని వేదాలే చెప్పాయి .ఈ  రెండిటికి  మధ్య ఆకాశం ఏర్పరచాడు .ఏడు వేల ఏనూరు కల్పాలు బ్రహ్మకు ఒకపగలు అంతేకాలం రాత్రి .మహత్తు అనబడే బ్రహ్మం  అహంకారం ,తర్వాత తన శరీరం నుండి నలుగురుపుత్రులు అంటే మన పితరులకు పితరులను పుట్టించాడు .జ్ఞానేంద్రియాలు అంతఃకరణ ఈ పితరులనుండే పుట్టినట్లు ,చరాచర జగత్తు అంతా ఆ మహా భూతాలచేత నిండింప బడినట్లుగావింటున్నాము .అహంకారం అయిన పరమేస్టి పంచభూతాలను సృజించాడు. ఆ అహంకారం కు అయిదు వేలకల్పాలు పగలు అయిదు వేలకల్పాలు రాత్రి అవుతాయి .శబ్ద స్పర్శాదులు  పంచమహాభూతాలతోచేరుతాయి .ఈ అయిదు ప్రాణులలో చేరి స్నేహం అతిక్రమణ మాత్సర్యం కలిగిస్తాయి .ఇవి అవ్యయాలను హరిస్తాయి ,గుణాల చేత పురిగొల్పబడి,ఒకదాన్ని ఒకటి చంపుతూ తిర్యక్ వ్యోమాలలో ప్రవేశించి ,ఈలోకం చుట్టూ తిరుగుతాయి .వీటికి మూడువేలకల్పాలు పగలు మరో మూడు వేలకల్పాలు రాత్రి అవుతాయి .ఇంద్రియాలను పురికొల్పినప్పుడు మనస్సు అన్ని వస్తువులపైకిపోతుంది .ఇంద్రియాలు ఒకదానినొకటి కనుక్కోలేవు. మనస్సు మాత్రమే వాటిమూలంగా విషయాలు తెలుసుకొ౦టుంది.కన్ను మనసు సాయం తో రూపాన్ని చూస్తుంది .మనసు పని అయిపోతే ఇంద్రియాలపనీ ఆఖరు .కనుక ఇంద్రియాలు మనసుకు లోబడే ఉంటాయి .మనసే ఇంద్రియాలకు ఈశ్వరుడు .జగత్తులో ఉన్న 20భూతాలూ ఇవే ‘’అని చెప్పాడు .

  గంభీర విషయాలను కూడా సునాయాసంగా అరటిపండు వొలిచి చేటిలో పెట్టినట్లు చెప్పిన యాజ్ఞావల్క్యుని జ్ఞానానికి   అబ్బురపడి జనక మహారాజు భూత సృజన ,సంహారం అనాదినాధుడు బ్రహ్మ ఎలా చేస్తాడని ప్రశ్నించాడు .యాజ్ఞవల్క్యుడు ‘’ రాత్రి కాగానే బ్రహ్మ నిద్రపోతాడు .భూత సంహారం కోసం ఒక రుద్ర రూపుడిని ఏర్పాటు చేస్తాడు .ఆ మహారుద్రుడు వందలకొద్దీ సూర్యులై జ్వలించే 12అగ్నులరూపం గా  మారుతాడు .తన తేజస్సుచే జరాయుజాలు  అండజాలు స్వేదజాలు ఉద్భిజాలనే నాలుగు రకాల జంతువులను దహిస్తాడు ఒక రెప్పపాటుకాలంలో స్థావర జ౦గమాలన్నీ నశిస్తాయి. అప్పుడు భూమి నాలుగు ప్రక్కలకు తాబేటి చిప్పలాగా మారుతుంది .భూమిపై నాలుగు వైపులా నీటిని ప్రవహి౦ప జేస్తాడు .తర్వాత ప్రళయ కాలాగ్ని పుట్టించి భూమిని ముంచేసి ,నీటిని ఇగురి౦ప జేస్తుంది .జలాలు లేకపోవటం తో ఆమహాగ్ని అంతటా ప్రజ్వరిల్లుతుంది .సప్తాగ్ని జ్వాలలను ఎనిమిది మూర్తులతో వాయువు భక్షి౦చి కిందకు మీదికి అడ్డంగా నాలుగు ప్రక్కలకు పరుగులు తీస్తుంది .అతి విస్తృతి చెందిన వాయువును ఆకాశం మింగేస్తుంది .మనసు ఉల్లాసం తో ఆకాశాన్నే మింగేస్తుంది .ప్రజాపతి మనస్సును మింగితే ,అహంకారం మనస్సును మింగగా మహదాత్మ  అహంకారాన్ని మింగేస్తుంది .అప్పుడు  ప్రజాపతి ,అణి మహిమాది  విభూతి సంపన్నుడైన శంభుడు మహదాత్మను మింగేస్తాడు . అతడి చేతులు ,పాదాలు నేత్రాలు శిరస్సు ముఖం  చెవులుకలిగి అన్నిట్లో వ్యాపిస్తాడు .అన్ని భూతాలకు హృదయమై అంగుస్టమాత్ర పరిమితమై ఉంటాడు .అన౦తుడు మహాత్ముడు ఐన ఈశ్వరుడు ఈ విధంగా జగత్తు నంతా మింగుతున్నాడు .చివరికి అక్షయం ,అవ్యయం అప్రణవం, భూత భవిష్యత్తులను సృష్టించే అనఘుడైన పరబ్రహ్మం ఒక్కటే మిగిలి ఉంటుంది ‘’అని సవిస్తరంగా సృష్టి ప్రయోగ ఉపసంహారాలను వివరించాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-19-ఉయ్యూరు .      .

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -46

61- ఆపస్తంభ తీర్ధం

స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు  .అగస్త్యుడు ‘’సర్వ వేదాలు  ఎవరిని కీర్తిస్తాయో ,జన్మమృత్యువులు లేనివాదడేవరో అతడే ‘’పరుడు ‘’అంటే పరబ్రహ్మ .ఆతడే సృష్టి స్థితి లయాలకోసం బ్రహ్మ  విష్ణు మహేశ్వర రూపం పొందుతాడు .వీరికి ఆకృతిలో మాత్రమె భేదం .ముగ్గురూ ఒక్కరే .అలాంటి పరబ్రహ్మనే పూజించాలి ‘’అన్నాడు .తనకు సరిగా అవగాహన కాలేదని పూర్తిగా వివరించమని ఆపస్తంభుడు కోరాడు .దీనికి అగస్త్యముని ‘’త్రిమూర్తులలో తేడా లేకపోయినా ఆనంద స్వరూపుడైన శివుని వలననే సర్వ సిద్ధి కలుగుతుంది కనుక శివధ్యానం అన్నిటికీ ఉత్తమం .గంగా తీరం లో ఆయనకోసం తపస్సు చేస్తే అన్నీ సిద్ధిస్తాయి ‘’అన్నాడు .

  తన అనుమానాన్ని  తీర్చిన  అగస్తునికి ఆపస్తంభుడు కృతజ్ఞత చెప్పి గంగా తీరం చేరి పవిత్ర స్నానం చేరి శివధ్యానం లో మునిగిపోయి –

‘’కాస్టేషు వహ్నిః   కుసుమేషు గంధో-బీజేషు వృక్షాది దృషత్సుహేమః –భూతేషు సర్వేషు తదాస్తి యావైః-తమ్ సోమనాథం  శరణం వ్రజామి —‘’నిత్యం శరణ్యం సకలస్య పూజ్యో –నిత్యం ప్రియో యః శరణాగతస్య –నిత్యం శివో యః సకలస్య రూపం –సోమేశ్వరం తమ్ శ  రణం వ్రజామి –‘’మొదలైన స్తోత్రాలతో సంతృప్తి పరచాడు .శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .ఆపస్తంభుడు ‘’ఈ తీర్ధం లో స్నానం చేసి శివధ్యానం చేసే  వారి అభీస్టాలన్నీ పొందేట్లు వరం ప్రసాదించు శివా ‘’అని వేడుకొన్నాడు .అప్పటినుంచి అనాది అజ్ఞాన రూప అంధకార సమూహాన్ని నిర్మూలించటం లో సమర్ధమైన ఆపస్తంభ తీర్ధంగా ఇది విరాజిల్లింది అని బ్రహ్మ నారడుడికి తెలియ జేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం

మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం

ఐస్ లాండ్ దేశం ధృవ ప్రాంత దేశం యూరప్ లో ఉంటుంది .నిత్యం మంచు కరిగి ,ఇవాళ ఉన్న ప్రదేశం రేపు కనిపించదు .అంటే నిత్య అభద్రతా పరిస్థితి అన్నమాట .క్రీ.శ.874లో నార్వీజియన్ చీఫ్ ఇంగోల్ అమర్సన్ లో మొదటి పర్మనెంట్ సెట్లర్ .తర్వాత నార్వీజియన్ లు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొన్నారు .తమతో త్రాల్స్ అనే బానిసలనూ తెచ్చుకొన్నారు .నార్వేజియన్ లది  గాలిక్ మూలం .13వ శతాబ్దం లోఇండిపెండెంట్ కామన్ వెల్త్ నార్వీజియన్ ప్రభుత్వమేర్పడింది 1397లో నార్వే స్వీడెన్ డెన్మార్క్ ఐస్ లాండ్ లు కలిసి సంయుక్త ప్రభుత్వ మేర్పడింది .ఫ్రెంచ్ విప్లవం నెపోలియన్ యుద్ధాలలో ఐస్లాండ్ బాగా దెబ్బతిని ,1918లో స్వాతంత్ర్యం ప్రకటించుకొని 1944లో రిపబ్లిక్ అయింది .20వ శతాబ్దం వరకు చేపలు ,వ్యవసాయం వీరికి ముఖ్య వృత్తి.రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచం లోనే అత్యంత సంపన్న దేశంగా ఎదిగి యూరోపియన్ ఎకనామిక్ ఏరియా లో భాగమైంది .వీరిది స్కాండినేవియన్ సంస్కృతి.

అయితే ఈ దేశ ప్రజలున్నంత ఆనందంగా ప్రపంచం లో ఏ దేశం వారూ ఉండరని అనేక సర్వేలు తెలియజేశాయి .దీనికి కారణం ‘’Language is an immense source of joy ‘’అని ఆదేశ౦వారి నమ్మకం .’’The part of the brain that controls language is ,like the part that controls  happiness ,relatively new in evolutionary terms ‘’అని అమెరికాలోని విస్కాన్సిన్ యూని వర్సిటి వాళ్ళు పరిశోధించి చెప్పారు ..వారానికి కనీసం 50గంటలు పని చేసే కస్టజీవులే వారంతా .ఉష్ణోగ్రత సాధారణం గా -10డిగ్రీలసేంటి గ్రేడ్ ఉంటుంది .సున్నా డిగ్రీలకే నీరు గడ్డ కడుతుందని మనకు తెలుసు .ఇక్కడి వర్షం కూడా బలే సరదాగా సమాంతరం గా( హారిజాంటల్ )గా పడుతుంది .

  ఐస్  లాండ్ దేశం లో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండటం మరో ప్రత్యేకత .ఈ దేశభాష ‘’వైకింగ్ భాష ‘’.వైకింగులుఒకప్పుడు  గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పాలించి యూరప్ దేశాలను గజగజ వణికించిన  సముద్ర జీవులైన గొప్ప పోరాట యోధులు .వైకింగ్ సామ్రాజ్య పతనం తర్వాత ఈ దేశం బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది .వీరికి తమభాష అంటే మహా ప్రాణం .దేశం కంటే భాషకే అధిక ప్రాధాన్యమిస్తారు . ఈ దేశం లో ఒక సామెత ఉంది .’’Better to go barefoot than without a book ‘’ అంతటి పుస్తక ప్రియులన్నమాట .ఇంగ్లీష్ కు చాలాతక్కువ ప్రాధాన్యమిస్తారు .

  మామూలుగా వాడుకొనే వస్తువుల కు ఇంగ్లిష్ పేర్లు వాడనే వాడరు .తమమాతృ భాషలోనే ఆ పేరును సృష్టించుకొని వాడుకొంటారు .ఉదాహరణకు సినిమా ,హెలికాప్టర్ టెలివిజన్ ,కంప్యూటర్  ఫోన్ లకు ఇంగ్లీష్ మాటలు వాడరు .అవి చేసే పనిని బట్టి తమభాషలో పేరు పెట్టుకొంటారు .ఇందువలన మాతృభాషా పరి రక్షణలో వీరు ప్రపంచానికే ఆదర్శ ప్రాయులయ్యారు .కంప్యూటర్ ను వీరు’’ VOLVA ‘’అంటారు వారి వైకింగ్ భాషలో .అంటే అర్ధం Prophet of numbers ‘’అనగా సంఖ్యా దర్శిని .టెలిఫోన్ ను వైర్ అంటే దారం అనే అర్ధం వచ్చేట్లు ‘’SIMI ‘’అంటారు .

  వీరి మరో ప్రత్యేకత పుస్తక ప్రచురణ .ప్రపంచం లోనే సంవత్సరానికి ఎక్కువ పుస్తకాలు ప్రచురించే దేశం ఐస్ లాండ్.కుటుంబం లో ఆడవాళ్లే మార్గదర్శకులుగా ఉంటారు .ఇందులోనూ ప్రపంచం లో ఆ దేశం ప్రత్యేకత పొంది ఆదర్శవంతమైంది. అక్కడి కవులదీ ప్రత్యేకతే –‘Land Nation .Language is the only Trinity ‘’అని అక్కడికవుల నమ్మకం .అందరూ తమ  భాషను ప్రాణప్రదంగా,పవిత్రంగా  కాపాడుకొంటారు .భాష పలచన పడటానికి అంగీకరించరు .తమ భాషా పదాల సృష్టి కోసం ,అర్ధవంతమైన మాటలకోసం అకాడెమిక్ కమిటీ లను ఏర్పాటు చేసుకొంటారు .దీనివలన సరైన ఐస్లాండిక్ పదాలు భాషలోకి వచ్చి చేరుతాయి .తమభాష అంటే అంతటి తపన వారికి ఉంది .

  ఐస్ లాండ్ లో భాష ఒక మాధ్యమం (మీడియా )మాత్రమే కాదు ,భావ నినిమయం –The essence of Culture ‘’అంటే సాంస్కృతిక సారం కూడా .ప్రజలకు ఒక గొప్ప అభి ప్రాయం ఉంటుంది –‘’Icelandic Language is more noble ,than that of any other language ‘’అని వారి ప్రగాఢ విశ్వాసం .ఈ దేశంలో నోబెల్ పురస్కారం పొందిన కవి ‘’Holdar King Zan Laxness ‘’ఉన్నాడు.

    21-2-2011 న మాతృభాషా దినోత్సవం నాడు ప్రనగం కోసం రాసుకొన్న వ్యాసం మళ్ళీ మీకోసం –

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-19-ఉయ్యూరు

 image.png

‘’image.png

image.png
Posted in సైన్స్ | Tagged | Leave a comment

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.

బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంత కాలంగా బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శనివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఫిబ్రవరి 10న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. బద్దం బాల్ ‌రెడ్డి మృతి వార్తతో బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బీజేపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగిన బద్దం బాల్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 వరకు కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

కార్వాన్‌ నియోజకవర్గంలో ఆది నుంచి ఎంఐఎం ప్రభావం ఎక్కువ. ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్న నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థిగా ఆయన రికార్డు సృష్టించారు. హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ ప్రాబల్యం పెంచిన వారిలో బాల్ రెడ్డి ఒకరు. అభిమానులు ఆయణ్ని గోల్కోండ సింహంగా పిలుచుకుంటారు.

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -45

60-ఇంద్ర తీర్ధం

ఇంద్ర తీర్ధంలో వృషా కపము ,ఫేన్యాది సంగమం హనూమత తీర్దాలున్నాయి .నముచి ఇంద్ర శత్రువు. నముచి తలను నురుగును వజ్రాయుధం చేసి  ఛేదించాడు ఇంద్రుడు .ఆతల గంగ దక్షిణ తీరం నేలపై పడి,భూమిని చీల్చుకొని పాతాళం చేరింది .అఫేనం అంటే నురుగే ఫేనానది గా ప్రవహించింది .ఫేనా గంగా సంగమం పవిత్రమైనది .హనుమంతుని దాది(ఉపమాత )ఇక్కడ స్నానం చేయటం వలన విష్ణు గంగల ప్రసాద ఫలితంగా ఆమె పిల్లి రూపం పోయింది .దీనిని మార్జర లేకమర్జాల తీర్ధమంటారు .దీనికే హనుమత్ తీర్ధమనే పేరుకూదావచ్చింది .దైత్యులకు పూర్వజుడు బలవంతుడైన హిరణ్యుడు .దేవతలు వీడిని జయి౦చ లేక పోయారు.వీడికొడుకు ‘’మహా శని’’ నీ దేవతలు గెలవలేకపోయారు  .వీడి భార్య పరాజిత .ఎన్ని సార్లు యద్ధానికి వచ్చినా ఇంద్రుడు వీడిన జయి౦చ న్చాలేకపోగా వాడే  ఇంద్రుడిని ఐరావతం తో సహా బంధించి  ఇంద్రుని భార్య ఇంద్రాణి ని చూసి క్రూరత్వం వదిలి తండ్రికి చెప్పాడు .తండ్రి ఇంద్రుడిని పాతాళం లోపెట్టి గట్టికాపలా ఏర్పాటు చేశాడు .

  ఇంద్రుని జయించిన మహాశని వరణుడిపై దాడి చేశాడు .తెలివిగా తనకూతురు వారుణి నిచ్చి పెళ్లి చేసి అల్లుడిని చేసుకొన్నాడు .తానుడే సముద్రాన్ని కూడా అల్లుడికిచ్చేశాడు ..వరుణుడి సహకారం తో మహాశని మహా పరాక్రమశాలి ఎదురులేని వాడయ్యాడు.ఇంద్రుడు లేని దేవలోకం లో ఉండలేక దేవతలు సమాలోచన చేసి విష్ణువును సందర్శించి,మహా శని ని జయించటం తమకు అసాధ్యంగా ఉందని మొరపెట్టుకొన్నారు .శ్రీహరి వరుణుడి దగ్గరకు వెళ్లి ఇంద్ర విముక్తి తక్షణ కర్తవ్యమన్నాడు .చేసేది లేక ఆయన అల్లుడి దగ్గరకు వెళ్లి ,సన్మానింప బడి,రాక కు కారణం అడుగగా అన్నీ వివరింఛి ఇంద్రుడిని వదిలేయమని కోరాడు .ఐరావతం తో సహా ఇంద్రుని విడుదల చేశాడు అల్లుడు మహాశని .విడిచిపెడుతూ ‘’  ఇంద్రా !అన్నీ ఉన్నా కూడా నువ్వు కేవలం వరుణుడి దయతో బందీ గా విడుదలయ్యావు .నీకు సిగ్గు అనిపించటం లేదా ?పౌరుషహీనమైన బతుకూ ఒక బతుకేనా ? నిన్ను విడిపించిన నా మామ వరుణుడు ఈ రోజు నుంచీ నీకు గురువు .ఆయనకు ఎప్పుడూ అణగి బతుకు .లేకపోతె మళ్ళీ బంధించి పాతాళం లో పడేస్తా ‘’అని దులిపేసి వదిలేశాడు .

  సిగ్గుపడుతూ వంగి వంగి దొంగ నమస్కారాలు చేస్తూ ఇంద్రలోకం చేరి జరిగింది పూసగుచ్చినట్లు శచీదేవికి చెప్పాడు ఇంద్రుడు .తనపరాభవానికి ప్రతి క్రియ ఏమిటో  ఆమెనే చెప్పమన్నాడు .ఆమె ‘’నీ శత్రువు మా పెదన్న హిరణ్యుడి కొడుకు .తపోబలంతో బలగర్వితుడయ్యాడు .కంగారు పడకు .నీకూ తపస్సే తరుణోపాయం.దండకారణ్యం దగ్గర గంగానది కి వెళ్లి శివుని కోసం తీవ్ర తపస్సు చెయ్యి అన్నీ తీరుతాయి ‘’అని  సలహా చెప్పింది  ఇంద్రాణి .ఇంద్రుడు దేవగురుడు ,భార్య లతోకలిసి గౌతమీ తీరం చేరి పుణ్య స్నానాలు చేసి శివునికై తపస్సు చేశాడు . . స్తోత్రానికి శివుడు పరవశించి వరం కోరుకోమన్నాడు .తన శత్రువు మహాశనిని జయి౦చేఉపాయ౦  చెప్పమని అడిగాడు ఇంద్రుడు .శివుడు ఈ పని తనొక్కడితో జరగదని విష్ణువు సహకారం కూడా కావాలికనుక ఆయన్ను ప్రసన్నం చేసుకోమన్నాడు .

 ఇంద్ర ద౦పతులు ఆపస్త౦భ మహర్షితో కలిసి గంగ దక్షిణ తీరం లో శ్రీహరి కోసం తీవ్ర తపస్సు చేశాడు .హరి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితె దానవ  సంహారానికి ఉపాయం అడిగాడు .ఇచ్చాను అన్నాడు. అప్పుడే గంగా శివ విష్ణు అనుగ్రహం తో గంగనుంచి ఒక పురుషుడు ఉద్భవించి చక్ర శూలాలు ధరించి రసాతలం చేరి మహాశని సంహారం చేసి ఇంద్రునికి స్నేహితుడయ్యాడు .ఈయనే వృషాకపి .ఈ దోస్తీ మైక౦లొ  ఇంద్రుడు శచీదేవినే మరచిపోగా ,ఆమెకు కోపం రాగా ఇంద్రుడు ‘’వృషాకపి ని వదిలి ఉండలేను .ఇప్పటినుంచి నేను అచ్యుతుడనైన ఇంద్రుడిని .వృషాకపి దయవల్లే మళ్ళీ ఇంద్రపదవి దక్కింది .ఇకనుంచి ఈ  ఇంద్రేశ్వరం అబ్జకం తీర్దాలు సర్వ సిద్ధిదాయకాలౌతాయి ‘’అనగానే దేవతలుకూడా తధాస్తు అన్నారు అని బ్రహ్మ నారదునికి తెలిపాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు పుస్తకాలు

A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు పుస్తకాలు

A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లైబ్రరీకి సరసభారతి పుస్తకాలు ఆ స్కూల్ లెక్కలమాస్టారు ద్వారా 21వ తేదీ సాయంత్రం ఉయ్యూరులో అందజేసిన ఫోటో

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -44

59-తపో వనాది తీర్ధం

గోదావరి  దక్షిణ  తీరం లో నందినీ సంగమస్థానాన్ని తపోవన తీర్ధం ,సిద్దేశ్వర తీర్ధం శార్దూల తీర్ధం అంటారు .పూర్వం దేవతల హవ్యాన్ని ధరించే అగ్ని హోతగా ఉండేవాడు.అతనిభార్య దక్షుని కూతురు స్వాహాదేవి .సంతానం కోసం తీవ్ర తపస్సు చేస్తే భర్త సంతోషించి త్వరలోనే కొడుకులు పుడతారని చెప్పగా తపస్సు చాలించింది .తారకా  సురుడు లోకాన్ని గగ్గోలు పరుస్తున్నాడు. శివపార్వతులకు చాలాకాలం  ఏకాంతం లో గడుపుతున్నారు .సంతానం కలగలేదు .దేవతలు కార్యసిద్ధికోసం అగ్ని దగ్గరకొచ్చి మహేశ్వరుడికి తారకాసురిని చేష్టలు తెలియ జేయమన్నారు .శివ మిధునం ఏకాంతం లో ఉండగా వారికి ఇబ్బందికలిగితే శివుడి మూడోకన్నుకు ఆహుతి కావాల్సిందే అన్నాడు .దేవతలు తారకుడే భయంకరుడైతే ఇక అసలు భయం దేనికి?మారు రూపం లో  వెళ్లి దేవకార్యం తెలియ జేయమన్నారు .

   అగ్ని శుక రూపం లో వెళ్లి ,లోపలి వెళ్ళే సాహసం లేక కిటికీదగ్గరే ఆగిపోయాడు .శివుడు చూసి పార్వతితో నవ్వుతూ ‘’దేవతాకార్యం కోసం అగ్ని చిలుక రూపం లో వచ్చాడు చూడు ‘’అన్నాడు .పార్వతి సిగ్గుపడింది .అగ్నిని పిలిచి శివుడు తనకు అన్ని విషయాలు తెలుసునని అధిక మొత్తం లోతన  రేతస్సును అగ్ని ముఖం లో వేశాడు .ఆ  భారం భరించలేక ,గంగా తీరం చేరి అందులో కొంతభాగాన్ని  కృత్తికలలో ఉంచాడు .దీనివల్ల పుట్టినవాడు కార్తికేయుడు అయ్యాడు .మిగిలిన దాన్ని రెండుభాగాలు చేసి  సంతానార్ది ఐన తనభార్య స్వాహా కుఇచ్చాడు శివ తేజం వలన ఆమెకు సువర్ణుడు అనే బాలుడు, సువర్ణ అనే బాలిక కవలలుగా జన్మించారు .అగ్ని దేవుడు తనకూతురు సువర్ణ ను ప్రజ్ఞావంతుడైన ధర్ముడు అనే వాడికిచ్చి పెళ్లి చేశాడు  సువర్ణుడికి   సంకల్ప అనే కన్యతో వివాహం చేశాడు .ఈ కొడుకు వీర్య సమ్మిశ్ర దోషం వలన కామరూపం తో  కనిపించిన స్త్రీనల్లా అనుభవించేవాడు .పతివ్రతల దగ్గరకు కూడా వారి భర్తల రూపాలలో వెళ్లి స్వేచ్చగా రతి క్రియ చేసేవాడు . సువర్ణ కూ  ఈ లక్షణాలే వచ్చి కనిపించినవాడినల్లా కామించి రమించేది . వీరిద్దరి  చేష్టలకు  దేవతలు  క్రోధం పొంది ఇద్దర్నీ  వ్యభిచారులవ్వమని శపించారు . ,

  కొడుకు కూతురుకు కలిగిన శాపం తెలిసి తండ్రి అగ్ని బాధపడి బ్రహ్మకు నివేదించాడు  .బ్రహ్మ అగ్నిని గౌతమీ తీరం చేరి శివుని పూజించమన్నాడు  .గౌతమీ స్నానం చేసి అగ్ని శివుని –‘’విశ్వస్య జగతో ధాతా,విశ్వ మూర్తి ర్నిరంజనః-ఆదికర్తా స్వయంభూ శ్చత౦నమామి జగత్పతిం ‘’-‘’యోగ్నిర్భూత్వా సంహారతి స్రస్తా వై జలరూపతః –సూర్య రూపేణయః పాతిత౦ నమామి చ త్రయంబకం ‘’అని స్తుతించాడు .శివుడు ప్రత్యక్షమై తే ‘’నీ తేజస్సు నాలో ఉంచావు .దానివలన నాకు కొడుకు కూతురుపుట్టి  వ్యభిచారం తో దేవతలా శాపం పొందారు .వారికి శాపవిముక్తి కలిగించు ‘’అని వేడాడు .

  శివుడు లింగ రూప లో ప్రత్యక్షమై అగ్ని కోరిక తీర్చాడు  .సువర్ణ భర్త ధర్మువుతో ఆన౦ద౦ గానూ సువర్ణుడు భార్య సంకల్ప తో సుఖంగా ఉన్నారు .ధర్ముడిని శార్దూలుడు అనే రాక్షసరాజు జయించి సువర్ణ  ను పాతాళానికి తీసుకువెడితే ,మామా అల్లుడు విష్ణువును ప్రార్ధిస్తే ,హరి శార్దూలుని శిరస్సు చక్రాయుధం తో ఖండించి సువర్ణ  ను శంకరుడికి అప్పగించాడు  చక్రం కడగబడిన చోటు చక్రతీర్ధ౦ శార్దూల తీర్ధమైంది .విష్ణువు  సువర్ణ  ను శంకరుని దగ్గరకు తీసుకు వెళ్ళిన చోటు శంకర ,వైష్ణవ తీర్ధమయింది .కూతురు లభించిన సంతోషం తో అగ్ని కార్చిన ఆన౦దాశ్రువులు పారి ఆనంద నది ,నందిని అయింది .నందినీ గంగా సంగమం లో శివుడుంటాడు.సువర్ణ కూడా ఉంటుంది ఆమెయే దాక్షాయణి శివా ఆనేయ ,అంబిక జగదాధారా ,కాత్యాయని ,ఈశ్వరి మంగళప్రద అనే పేర్లతో పిలువబడ్డది .ఉత్తర తటం లో 14వేలు ,దక్షిణ తీరం లో 16వేలు తీర్దాలేర్పడ్డాయి .వీటిలో చేసిన ఏపని అయినా సకల పుణ్యప్రదం ముక్తిదాయకం అని బ్రహ్మ నారదునికి ఉవాచ .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

      గ౦ధర్వ రాజు విశ్వావసువు యాజ్ఞవల్క్యుడు చెప్పినదానికి సంతృప్తిపడి,ఆయన మనసు ఎప్పుడూ బుద్ధి తో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళాడు .దేవలోకం లోనూ ,భూలోక ,అధోలోక వాసులకూ విశ్వావసువు యాజ్ఞవల్క్య దర్శనాన్ని బోధించినట్లు మహా భారతం లో ఉంది.

  మిధిలా నగర రాజు జనకుడు  దేశాంతరం నుంచి వచ్చిన ఆరుణి కొడుకు శ్వేత కేతుడు ,సత్యయజ్ఞుడికొడుకు సోమ శుష్ముడు ,యాజ్ఞవల్క్యులను తన ఆస్థానానికి పిలిపించి అగ్ని హోత్ర విషయాన్ని చర్చించాడు .ముందుగా వారిని తాము అగ్ని హోత్రం ఎలాచేస్తారో చెప్పమని అడిగాడు జనకుడు .శ్వేతకేతువు తాను  అగ్న్యాదిత్యులలోనే హోమం చేస్తానని చెప్పాడు .అదెలాగా అని అడిగాడు రాజు .అతడు ‘’ఆదిత్యుడే తేజము .సాయం వేళ ఆదిత్యునికే అగ్నిలో హోమం చేస్తాను .అగ్నికూడా తేజస్సు కనుక ఆ అగ్నికోసం ఉదయం సూర్య ఘర్మం అంటే తేజస్సులో హోమం చేస్తాను .అంటే హవిస్సుచేత అగ్నిని తృప్తి చెందిస్తాను ‘’అన్నాడు .ఇలా చేస్తే ఏమిటి ఫలమని ప్రశ్నించాడు జనకుడు .శ్వేతకేతువు ‘’ఎప్పుడూ లక్ష్మి కీర్తితో కలిసిఉ౦డటమేకాక అగ్ని, ఆదిత్యుల సాయుజ్యం సమానమవుతుంది .అంటే ఐహిక ఆముష్మిక ఫలం కలవాడు అవుతాడు ‘’అని చెప్పాడు .

   సోమ శుష్ముడు ‘’తేజాన్నే తేజం లో హోమం చేస్తాను ‘’అనగా అదేట్లాని ప్రశ్నిస్తే ‘’ఆదిత్యుడే తేజం. అందుకే సాయంకాలం అగ్నిలో హవిస్సులు వేసి తృప్తికలిగిస్తా .అగ్ని తేజస్సు కనుక ప్రాతః కాలం లో అగ్ని తృప్తికిసూర్యుని యందు హోమం చేస్తాను ‘’అనగా దీనివల్లకలిగే ఫలితమేమిటి అని అడగ్గా ‘’శ్రీమంతుడు కీర్తిమంతుడు అయి వారి సాయుజ్యాన్నిఅలోకత్వాన్నీ పొందుతాడు ‘’అన్నాడు .

   యాజ్ఞవల్క్యుడు ‘’నేను ఆహవనీయాగ్నిని గార్హత్యాగ్ని నుంచి తీస్తాను .అ౦గోపాంగ సహిత అగ్నినే ఉద్దరిస్తా .అప్పుడు ఆదిత్యుడు అస్తమించటం చూసి దేవతలంతా అతని వెంట పోతారు .మళ్ళీ వారంతా నేను ఉద్ధరించిన అగ్నిని చూసి తిరిగి వస్తారు .అప్పుడు సృవాది పాత్రలు కడిగి వేదిపైఉంచుతాను ‘.అగ్ని హోత్రి అయిన ధేనువు పాలు పితికి  దేవతలను చూసే నేను ,నా వంక చూసే దేవతలను హవిస్సు తో తృప్తి చెందిస్తాను ‘’ ’అని చెప్పాడు .దీనికి జనకుడు సంతోషించి అతడు అగ్ని హోత్ర స్వరూపాన్ని బాగా నే అవగాహన  చేసుకొన్నాడని మెచ్చాడు .అతనికి వంద ఆవులనిస్తాను అని చెప్పి ,’’అగ్ని హోత్ర ఆహూతుల ఉత్క్రమణ కాని ,ప్రతి స్టకాని ,తృప్తినీ ,పునరావృత్తి ,ప్రతిపక్ష లోకం కాని నీకు తెలియదు ‘’అంటూ రధం ఎక్కి వెళ్ళిపోయాడు జనకమహారాజు .రాజు తమల్ని అతిక్రమించి  అవమానపరచాడని   భావించి శ్వేతకేతువు ,సోమశుష్ముడు రాజును  తమతో బ్రహ్మవాదానికి రమ్మని సవాలు చేద్దా౦ అందులో రాజు తమముందు ఓడిపోతాడు అన్నారు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’మనం బ్రాహ్మణుల౦  .అతడు రాజు .మనమే జయిస్తే జాతి తక్కువవాడిని జయించిన వాళ్ళం అవుతాం. అతడే జయిస్తే బాపలను రాజు జయించాడని లోకమంతామనల్నే  గేలి చేస్తుంది.కనుక ఆమాట తలపెట్టవద్దు ‘’అని సలహా ఇచ్చాడు .తర్వాత యాజ్ఞవల్క్యుడు రధమెక్కి జనకుడి దగ్గరకు వెళ్ళాడు .

 ఎందుకు వచ్చావంటే అగ్ని హోత్రం గురించి తెలుసుకోవటానికే వచ్చానన్నాడు యాజ్ఞవల్క్యుడు .జనకుడు చెప్పటం ప్రారంభించాడు ‘’మహర్షీ !ఉదయం చేసే అగ్ని హోతాహూతులు అంతరిక్షానికి పోయి ఆహవనీయం చేస్తాయి .వాయువును సమిధలుగా మరీచులను ఆహూతులుగా చేసి అంతరిక్షాన్ని తృప్తి చెందించి స్వర్గానికి పోతాయి .అక్కడే ఆహవనీయంగా ఆదిత్యుని సమిధగా చంద్రుని శుద్ధ ఆహూతిగా చేసి దివాన్ని తృప్తి చెందిస్తాయి .దివి నుండి భువికి  వచ్చి భూమినే ఆహవనీయాగ్నిగా ,అగ్నిని సమిధగా ఓషధులను శుద్ధ ఆహూతులుగా చేసి భూమిని తృప్తి చెందిస్తాయి .భూమినుండి పురుషుని చేరి ,అతని నోటిని ఆహవనీయంగా నాలుకను సమిధగా ,అతడు తిన్న ఆహారాన్ని శుద్ధ ఆహూతిగా చేస్తాయి .ఈ విధంగా ముఖం మొదలైనవి ఆహవనీయ ఆదిత్య రూపం అని తెలిసిన పురుషునికి అగ్నిహోత్రం హుతమౌతుంది .అక్కడినుంచి స్త్రీలో ప్రవేశించి ,ఆమె ఉపస్థను ఆహవనీయంగా,దారకాలను సమిధలుగా ,శుక్రాన్ని ఆహతిగా చేసి స్త్రీని తృప్తి చెందిస్తాయి .కారణం ప్రజాపతి వీటి చేతనే ప్రజలను భరిస్తాడుకనుక .ఇది తెలిసిన విద్వాంసుడు మిధునాన్ని పొందుతాడు అంటే ప్రియను కలుస్తాడు .అతడి అగ్నిహోత్రం హుతం అవుతుంది .అప్పుడు స్త్రీలో పుత్రుడు పుడతాడు  .ఈ పుట్టినవాడే మళ్ళీ పుట్టే లోకం .అగ్ని హోత్రం అంటే ఇదీ .ఇంతకంటే ఏమీ లేదు ‘’అని చెప్పగా యాజ్ఞవల్క్యుడు మిక్కిలి సంతోషించి జనకుని అభినందించి వరం అడగమని రాజునే కోరాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుడ్లవల్లూరు A.A.N.M.And V.V.R.S.R.Eng Medium High School సాహితీ దినోత్సవ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని నుండి పొందిన యజుస్సులను ఇతరులకోసం సంస్థాపించి ,బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు .అప్పుడు విశ్వా వసువు అనే గ౦ధర్వరాజు  ఆయన వద్దకు వచ్చి ‘’వేదాంత శాస్త్రం లో బ్రాహ్మణోక్తమైనది,సత్యమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయండి ‘’అని అడిగాడు .ఇదేకాక వేదాలను గురించి 24ప్రశ్నలు ,అన్వీక్షకి గురించి మరొక ప్రశ్న ఆడిగాడు  .దానికి కాసేపు మనసులో సరస్వతీ దేవిని ధ్యానించి యాజ్ఞవల్క్యుడు చెప్పటం ప్రారంభించాడు .

‘’ముముక్షువులకు భయం కలిగించేది ,జననమరణాలు కలిగిస్తూ అవ్యక్తమైనదే విశ్వం .దానికి సత్వ రజస్ తమోగుణాలు  మహత్తు మొదలైన గుణాలు కలిగిస్తుంది .అవిశ్వం అంటే నిర్గుణ పురుషుడు  .అశ్వ అంటే స్త్రీ .అశ్వం పురుషుడు .అంటే ప్రకృతి పురుషులన్నమాట .ప్రకృతి అవ్యక్తం .పురుషుడు నిర్గుణుడు .మిత్రుడు పురుషుడు .వరుణుడు ప్రకృతి .జ్ఞానం ప్రకృతి .జ్ఞేయం పురుషుడు.పురుషుడు జీవుడైఅజ్ఞుడు అవుతాడు నిర్గుణుడై’’ జ్ఞుడు ‘’అవుతాడు .క  అంటే పురుషుడు .తప అంటే  ప్రకృతి.అవేద్యం ప్రకృతి. వేద్యం పురుషుడు .చలం ప్రకృతి .అది వికారం పొంది సృష్టి స్థితి లయాలకు కారణమౌతోంది .అచలం పురుషుడు .అతడు  వికారాలకు లోనుకాడు .సర్గ ,ప్రళయాలకు తోడ్పడతాడు .కొందరి దృష్టిలో వేద్యం ప్రకృతి అవిద్య పురుషుడు .ప్రకృతి ,పురుషులు ఇద్దరూ అజ్ఞులు ,ద్రువులు ,అక్షయులు ,అజులు ,  నిత్యులు అని ఆధ్యాత్మ గతిలో  నిశ్చయం ఉన్న వారు అంటారు .సృష్టి విషయం లో అక్షయం అనేదాన్ని బట్టి అజం అయిన ప్రకృతి అవ్యయం అంటారు .పురుషుడు అక్షయుడు .కారణం క్షయం లేకపోవటమే .ప్రకృతిలోని గుణాలే క్షయమౌతాయి కాని ప్రకృతి క్షయించదు కనుక అక్షయమన్నారు విద్వాంసులు .ప్రకృతి వికారం పొంది సృష్టికి కారణమౌతోంది ,మరుగు పడుతూ ఉంటు౦ది .ప్రకృతి అలాకాక పోవటం చేత అదీ అక్షయమే అనబడుతుంది ‘

  ‘’అన్వీక్షకి వలన ,గురు సుశ్రూషవలన  వేదాలను పొంది ,విధులు అనుస్టిస్తూ వేదాధ్యయనం చేయాలి .వేదాలను సాంగోపాంగంగా చదివి సకల జీవరాశికి పుట్టే చోటు,,ప్రళయం లో లయించే చోటు ,వేదాలన్నీ ఒక్కటై వేద్యమైన పరమాత్మను తెలుసుకోన్నవారి ,వేదం ప్రతిపాది౦చ బూనినవాని ఎరుగక పొతే వారి వేద పఠనం నిరర్ధకం .అలాంటి వారు వేదాల బరువు మోసే  వాళ్ళుగానే మిగిలిపోతారు .వెన్నకావల్సినవాడు గాడిదపాలను మధిస్తే వచ్చేది కంపుమాత్రమే కానీ మీగడా వెన్న రావు .వేదాలన్నీ చదివి ప్రకృతి ,పురుషుడు అంటే తెలియని వాడు మూఢమతి అనిపించుకొంటాడు .ప్రకృతి పురుషులను గూర్చి ఊరికే చింతిస్తూ ఉంటె పుట్టటం గిట్టటం మళ్ళీ పుట్టటం చావటమే జరుగుతుంది .కనుక అక్షయం అయిన యోగధర్మం అవలంబించాలి .జీవాత్మ ,దానికి పరమాత్మతో సంబంధం పై ఆలోచించేవాడు నిర్గుణ పరమాత్మ దర్శనం పొందుతాడు .ష డ్వింశకుడు ,పంచ వి౦శకుడు వేరు అని భావించే వారు మూఢులు .జనన మరణాలకు భయపడి ,జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని సాంఖ్యులు ,యోగులు భావిస్తారు ‘’అని సవిస్తరంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు .

  అప్పుడు విశ్వావసువు ‘’జీవాత్మ అక్షయం ,పరమాత్మకంటే వేరుకాదు అన్నారుమీరు .దీన్ని స్పష్ట పరచండి .నేను జైగీష వ్యాధుడు,మా తండ్రి కాశ్యపులవలన ఈ విషయం విన్నాను .రుద్రాదులు చెప్పిందీ విన్నాను .వారంతా నిత్యమైన వేద్యాన్ని మాత్రమె చెబుతారు .నువ్వు మతిమంతుడవు .శాస్త్రాలలో దిట్టవు. సకల శ్రుతులకు నిధివి .నిన్ను దేవలోకం పితృలోకం శ్లాఘిస్తున్నాయి .బ్రహ్మలోక మహర్షులు ,జ్యోతులకు పతి అయిన ఆదిత్యుడు  నీకు ఈ జ్ఞానం బోధించారని అంటారు .నువ్వు సాంఖ్యం ,యోగ శాస్త్రాల  లోనూ ప్రవీణుడవే.చరాచరాలు తెలిసిన నువ్వే ఈ జ్ఞానాన్ని విస్పష్టంగా చెప్పగలవు .కనుక చెప్పవలసింది ‘’అని అడిగాడు ,

  యాజ్న్య వల్క్యుడు ‘’నీకు అన్నీ తెలుసు .కానీ తెలియనివాడివిగా ఉన్నావు .నేను విన్నది విన్నట్లు గా చెబుతాను .పంచ వి౦శకుడు అంటే జీవాత్మ అప్రబుద్ధ అయిన ప్రకృతిని తెలుసుకొంటాడు .కాని ప్రకృతి జీవుని తెలుసుకోలేదు .జీవుడు ప్రకృతిలో ప్రతిబి౦బిస్తాడు కనుక సాంఖ్యులు, యోగులు వేదం నిదర్శనంగా దీన్ని ప్రధానం అంటారు .జీవుడు  చతుర్వి౦శాన్ని అంటే ప్రకృతిని చూడ దలచి ,పంచ వి౦శను అంటే ఆత్మను చూస్తున్నాడు .చూడాలనే ఉద్దేశ్యం లేకుండా షడ్వింశకుని చూస్తున్నాడు .జీవుడు తనకంటే అధికుడు లేడని పొరబాటు పడుతున్నాడు .నిజంగా వాడు చూస్తున్నా కూడా షడ్వింశకుడిని చూడడు.జ్ఞానులైన మానవులు ప్రకృతిని జీవుని గా భావించ కూడదు .నీటిలోని చేప నీటికంటే భిన్నమైనట్లే ,ఆత్మ దానికంటే భిన్నుడు .పరమాత్మతో తనకున్న ఐక్యం తెలియక ,ప్రకృతి సంసర్గం తో సహవాసం ,స్నేహం ,అభిమానాలతో సంసారం లో మునిగిపోతాడు .మమకారం వదిలేస్తే మునగకుండా పైకి తేల్తాడు .తాను  ఉండే ప్రకృతి వేరు,  తాను  వేరు అనే జ్ఞానం కలిగితే పరమాత్మ దర్శనం పొందుతాడు .ఇక పునర్జన్మ ఉండదు .

‘’  రాజా !జీవాత్మ వేరు పరమాత్మ వేరు .పరముడు జీవుడిలో అంతర్యామిగా ఉండటం వలన జీవాత్మ ,పరమాత్మ ఒకటే అని సాధువులు భావిస్తారు .అందుకే యోగులు సాంఖ్యులు చావు పుట్టుకలకు భయపడి శుచులై ,పరమాత్మ పరాయణులై జీవుని చ్యుతి లేనివానిగా భావిస్తారు .జీవుడు కేవలుడై ,పరమాత్మను చూసినప్పుడే సర్వ వేత్త , విద్వాంసుడు అయి పునర్జన్మ పొందడు .ద్రస్ట కు ,దృశ్యానికి దృష్టికి దృశ్యానికి భేదం ఎంచనివాడే కేవలుడు ,అకేవలుడు అయి పంచ వి౦శకుడు అవుతున్నాడు .ఇవన్నీ నేను విన్నవీ , కన్నవీ . నీకు అన్నీ  చెప్పాను ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పెళ్లి రోజు

This gallery contains 5 photos.

ఈ రోజు మా వివాహ వార్షికోత్సవానికి మా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ శర్మ దంపతులు మీడియా పర్సన్ శ్రీ సురేష్

More Galleries | Tagged | Leave a comment

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

New Doc 2019-02-21 10.50.09

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -43

57-తపస్తీర్ధం

  తపస్సును వృద్ధి చెందించేది తపస్తీర్ధం .ఒకప్పుడు రుషులమధ్య జలం అగ్ని ల విషయం లో సంవాదం జరిగింది .కొందరు అగ్ని గొప్ప అంటే, మరికొందరు నీరు గప్ప అన్నారు.తగాదా తీరక బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడిగారు .బ్రహ్మ ‘’అగ్ని,  జలం ఇద్దరూ పూజనీయులే .వారివల్లనే జగత్తు ,హవ్యకవ్యాలు అమృతం కలుగుతున్నాయి .ఇద్దరూ సమానమే ‘’అని చెప్పగా సంతృప్తిపడక వాయువును అడగగా అగ్ని యే జ్యేస్టుడు,సర్వం అగ్నిలోనే ఉన్నాయన్నాడు .సంతృప్తి చెందక భూమాతను అడుగగా ‘’సనాతనమైన నీరే నాకూ ఆధారం .అన్నీ నీటిలోనుంచే వస్తాయి కనక నీరే శ్రేష్టం ‘’అన్నది .ఇదీ నచ్చక విష్ణువును అడిగారు .అప్పుడు అశరీర దేవీవాక్కు ‘’తపో  భక్తీ నియమాలతో జలాగ్నులను ఆరాధించండి .ఎవరి సిద్ధి మొదట జరిగితే ఆ మహాభూతమే సర్వ శ్రేష్టం అని గ్రహించండి ‘’అన్నది .సరే అని వెళ్ళిపోయారు .

   ఋషులంతా గంగా తీరం చేరి జలదేవతాభక్తులు, అగ్ని దేవతాభాక్తులు తమ తమ దేవతా పూజలో యజ్ఞం లో  కూర్చున్నారు .అప్పుడు వేదమాత వాగ్దేవి సరస్వతి వారితో ‘’అగ్నికి జలం స్థానం .జలం చేతనే పవిత్రత కలుగుతుంది .నీరు ఉంటేనే కర్మలు చేయగలరు .జలాలు మాతృ భూతాలని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నీరే శ్రేష్టం ‘’అన్నది .వేద మాత వాక్కు వేదవాక్కు గా భావించి అందరూ నీటికే శ్రేస్ట త్వమిచ్చారు .మహర్షులు యజ్ఞం చేసిన ఈ తీర్ధమే తపస్తీర్ధం .తపస్సును పెంచి మోక్షాన్నిస్తుంది అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

58-దేవ తీర్ధం

గంగానదికి ఉత్తరాన దేవతీర్ధమున్నది .గుణ శ్రేష్టుడైన ‘’ఆర్ష్ట షేణుడు’’అనే రాజు  భార్య జయ .కొడుకు ‘’భరుడు వేద,ధనుర్వేదాలలో  నిష్ణాతుడు .భార్య సుప్రభ .రాజ్యం కొడుక్కు అప్పగించి రాజు ప్రదానపురోహితుని ఆధ్వర్యం లో యజ్ఞానికి పూనుకొన్నాడు .’’మిధువు ‘’అనే రాక్షసుడు యాగ ధ్వంస౦చెసి ,అందరినీ బాధించి రాజును రసాతలానికి ఎత్తుకు పోయాడు .పురోహితుడి కొడుకు ‘’దేవాపి ‘’తండ్రికోసం బెంగ పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టి తల్లిని అడిగాడు .రాజుతోపాటు అతని తండ్రినీ రాక్షసుడు పాతాళానికి తీసుకు వెళ్ళాడని చెప్పింది .

   అతడు రాజకుమారుడైన భరుడు తో ఆలోచించి తాను యజ్ఞం చేసి  ఎలాగైనా రాజునూ తనతండ్రినీ తీసుకొని వస్తానని ,రాజ్యాన్నీ ,తన తల్లినీ జాగ్రత్త గ చూడమని చెప్పి ,అనుజ్ఞ పొంది ,మంచి రుత్విక్కులను ఎన్నుకొని ,వారు చెప్పినట్లు అగ్నిని పూజించి తనకోరిక తెలియజేశాడు .అగ్ని తానూ కూడా దేవతలపరి చారకుడను మాత్రమే నని ,దేవతల హవ్యాన్ని భరించేవాడినే అనీ, హవ్య భోక్తలు దేవతలే అనీ చెప్పాడు .దేవాపి దేవతలదగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పాడు .దేవతలు తాము  వైదిక మంత్రాల ద్వారా ఆహ్వాని౦పబడి వచ్చే వాళ్ళమే కాని స్వతంత్రులంకామనీ ,వేదాలనే అడగమని చెప్పారు .వేదాలను ప్రసన్నం చేసుకొని అడిగాడు .వేదాలు ‘’మేము ఈశ్వర వశం లో ఉంటామేకానీ స్వతంత్రులం కాదు .మహేశ్వరుడే జగత్కర్త భర్త హర్త ‘’అన్నాయి .

  దేవాపి దేవదేవుడైన మహేశ్వరుని మెప్పించి  ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’నా తండ్రినీ నా రాజునూ యాగం నుండి బలాత్కారంగా ఎత్తుకు పోయి పాతాళం లో దాచిన మిధు దైత్య సంహారం చేయాలని ఉందని చెప్పగా తధాస్తు అని నందిని  తన శూలాన్నీఇచ్చి   పంపాడు  శివుడు.పాతాళం చేరి నంది రాక్షస సంహారం చేసి రాజును దేవాపి తండ్రినీ సురక్షితంగా భూమి పైకి తెచ్చి అప్పగించాడు .రాజు  ’ఆర్ష్ట షేణుడు’’ గౌతమీ తీరం లోనే అశ్వమేధ యాగం చేసి ,దేవతల౦దర్నీ మెప్పించాడు .శివుడు ప్రత్యక్షమైన ఈ తీర్ధమే దేవతాతీర్ధం .ఇక్కడ పదిహేను వేల వంద తీర్దాలు వెలశాయి .ఇక్కడ ఏది చేసిన  ఉత్కృష్ట ఫలితం  కలుగుతుందని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

20-2-19బుధవారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరుణాల లో తాతా ,మామ్మ, మనవరాలు రమ్య

20-2-19బుధవారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరుణాల లో తాతా ,మామ్మ, మనవరాలు రమ్య

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6660102266475163921/6660102267411701074?authkey=CILHy6rJ1p3AwQE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా పెళ్లి రోజు

ఇవాళ 21-2-19గురువారం  మా దంపతుల 55వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధు మిత్రులకు సాహితీ బంధువులకు అభిమానులకు శుభ కామనలు -దుర్గాప్రసాద్, ప్రభావతి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment