ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అందుకొన్నారు .

   రాజమండ్రి లోని సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ,టెక్నికల్ శాఖలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా 1955లో చేరారు .పనిచేసిన 41 సంవత్సరాలలో 7 సార్లు పదోన్నతి పొంది ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ,శాఖాధిపతి గా  ఎదిగారు .పొగాకు రంగం లో అవిశ్రాంత కృషి చేసి 1996 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు .తర్వాత గుజరాత్ అగ్రికల్చరల్ యూని వర్సిటి లో ఇన్విజి లేటర్ గా ,జాతీయ అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికా సంపాదకులుగా ఉన్నారు .

  రమణారావు గారు 1968లో రాజమండ్రి నుంచి ,మేలురకం వర్జీనియా పొగాకు విత్తనాలను కర్ణాటకలోని ‘’బైలె కుప్పె’’గ్రామానికి తీసుకు వెళ్లి సాగు చేసి నాణ్యత పెంచారు.దీనితో కర్నాటక రైతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మేలురకపు సిగరెట్ పొగాకు ఉత్పత్తిలో అగ్రగాములై మనదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా సాధించి పెట్టారు .పొగాకుకు వచ్చే బూడిద రంగు తెగులు నివారణకు జపాన్ నుంచి తెప్పించిన రెండు జన్యువులను మన పొగాకులో ప్రవేశ పెట్టి  విజయం సాధించారు .అలాగే’’ సీతాఫలం’’ తెగులు నివారణకు ‘’వేమర్ -50’’అనే విత్తనం లోని జన్యువును ప్రయోగించి ,అనేక మేలుజాతి  వంగడాలను రూపొందించారు  .

  1969లో మనరాష్ట్రం తరఫున ఒరిస్సా వెళ్లి అక్కడ వర్జీనియా పొగాకు సాగు కు శ్రీకారం చుట్టారు .అక్కడి రైతులు ఈ పొగాకు ను అత్యధికంగా పండించి ఇబ్బడిముబ్బడి లాభాలు పొందారు .మన  రాష్ట్రానికీ ,కర్ణాటక రాష్ట్రానికీ కలిపి 10 రకాల మేలు జాతి వంగడాలు రూపొందించిన ఘనత  వెలువలి వారిదే .వీరు జాతీయ అంతర్జాతీయ సైన్స్ మేగజైన్ లలో 32పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .2005మార్చిలో రష్యాలోని అజార్ బైజాన్ సందర్శించి , వర్జీనియా పొగాకు ఉత్పత్తి పెంపుదలకు ,మార్కెటింగ్ కు అవకాశాలను విశ్లేషించారు .

  రమణారావు గారి ప్రతిభకు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .రాజమండ్రి లోని ‘’ది ఇండియన్ సొసైటీ ఆఫ్ టుబాకో సైన్స్ ‘’1955లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది . ఈ సంస్థ కార్య దర్శిగా ఉన్న1990- 1993కాలం లో రాజమండ్రిలో పొగాకు సదస్సు నిర్వహించారు .వేప చెట్టు గుణాలు ,విశేష ప్రయోజనాలు తెలియ జేయటానికి బెంగుళూరు లో ‘’వరల్డ్ నీమ్ కాన్ఫరెన్స్ ‘’నిర్వహించారు .1976నుంచి ‘’ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ‘’సంస్థలో సభ్యులుగా ఉన్నారు .

  వ్యవసాయ సైన్స్ తో పాటు రావు గారికి చిత్రలేఖనం పైనా విశేష అభిరుచి ఉంది .ఇందులో చేసిన కృషికి దామెర్ల రామారావు ఆర్ట్ స్కూల్ వారు వెండిపతకం బహూకరించారు .లలిత సంగీతం లోనూ ప్రావీణ్యం ఉన్న వీరికి ఆంధ్రా యూని వర్సిటి  వెండికప్పు ,వెండిపతకం అందజేశారు .ఢిల్లీ లోని కృషి అను సంధాన పరిషత్ వారు స్కాలర్ షిప్ ఇచ్చారు .1971లో గుజరాత్ లోని ఆనంద్ అగ్రికల్చరల్ కాలేజి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధుల వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి పొందారు .’’హెమ’’అనే మేలురకం వర్జీనియా పొగాకు వంగడం రూప కల్పన చేసినందుకు ‘’డా.జి.ఎస్.మూర్తి అవార్డ్ ను రావుగారు 1992లో అందుకొన్నారు .పొగాకు వ్యవసాయం లో ఇంతటి అద్భుత కృషి చేసిన వెంకటరమణారావు గారి గురించి మనకెవ్వరికీ పెద్దగా తెలియకపోవటం ఆశ్చర్యమే .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు  27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు

  1. 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

  భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 మార్కులొచ్చాయి .పరిశోధనపై ఆసక్తితో జపాన్ వెళ్లి ఒక ఏడాది పరిశోధన  విషయాలపై అవగాహన పెంచుకొన్నారు .

  ఇండియాకు తిరిగొచ్చి ,కలకత్తా లో ప్రముఖ రసాయనిక  శాస్త్రవేత్త డా ప్రఫుల్ల చంద్ర రే(పి.సి.రే.) గారిని చేరి ఉత్తమ శిక్షణ పొందారు .జపాన్ అనుభవం తో మాంగనీస్ మొదలైన ఖనిజ విశ్లేషణ లో ఘనాపాఠీ అయ్యారు .ఖనిజాల ఎగుమతులను అధ్యయనం చేసి ,దానికి సంబంధించిన వ్యాపార సంస్థను నెలకొల్పి  సాగక దెబ్బ తిన్నారు .తర్వాత మద్రాస్ ప్రభుత్వ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో కెమికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ,తగిన విద్యార్హతలు లేకపోయినా ,రసాయనిక శాస్త్రం లో చేసిన కృషిని తెలుసుకొని నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చారు .ఇక్కడితో ఆయన పరిశోధన దిశ కొత్త మలుపు తిరిగింది .నిరంతర పరిశోధన చేస్తూ ,మొదటి  ప్రపంచయుద్ధం లో డెప్యుటేషన్ పై ఇరాక్ సందర్శించారు .  తిరిగొచ్చి మళ్ళీ ఉద్యోగం లో చేరగానే ప్రభుత్వ వ్యవసాయ శాఖలో రసాయనిక శాస్త్ర వేత్తగా నియమి౦ప బడ్డారు .ఇక్కడ పని  చేస్తూ భూసార పరిరక్షణపై గణనీయ పరిశోధనలు చేశారు .ఢిల్లీలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో    ఎర్త్ సైన్సెస్ విభాగ హెడ్ అయ్యారు .ఇక్కడ 1934నుండి 11ఏళ్ళు 1944 వరకు ఉండి,అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు .తొలి తెలుగు వాడూ అయినందున మనకూ గర్వకారణమే .రిటైర్ అయ్యాక దేశం లోని అనేక ప్రాంతాలలోని వ్యవసాయ రంగాలలో అత్యున్నత పదవులలో రాణించారు .

   తర్వాత 1944-47 కాలం లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్  డైరెక్టర్  గా ,బెనారస్ హిందూ యూని వర్సిటి అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ గా ,అగ్రికల్చరల్ కాలేజి ప్రిన్సిపాల్ గా,రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సలహాదారుగా  సేవలందించారు  విశ్వనాద్ . దేశం లోనే ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త గా గుర్తింపు పొందారు .కేంద్రం లో  కె.ఎం. మున్షీ మంత్రిగా ఉన్నకాలం లో ప్రారంభమైన ‘’వనమహోత్సవాలు ‘’కార్యక్రమం లో భాగస్వాములయ్యారు .కేంద్ర ప్రభుత్వ అధీనం లో ఉన్న అనేక ప్రణాళిక కమీషన్ లలో ,సలహా సంఘాలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు .భూ వినియోగం మొదలైన అంశాలపై పలు మార్గ దర్శక సూచనలు చేశారు .24 వ ఇండియన్ కాంగ్రెస్ వ్యవసాయ విభాగానికి అధ్యక్షత వహించి ,వ్యవసాయ శాస్త్రవేత్తలకు మార్గ దర్శనం చేశారు .జర్మనీ ప్రభుత్వం కూడా వీరి నుండి వ్యవసాయ అభి వృద్ధికి సూచనలు తీసుకొన్నది .

    తన సమర్ధతకు తగిన ఉన్నతపదవులెన్నో భాగవతులవారికి దక్కాయి .ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ శాఖ లోని బోర్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ కి గౌరవ రీజినల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కమీషనర్ గా ,కార్యదర్శిగా 1950-51కాలం లో పని చేశారు .ప్లానింగ్ కమిషన్ లో అగ్రికల్చరల్ ప్రోగ్రాం కు గోరవ సలహాదారుగా ,1951-52లో ,ఇండియన్ కౌన్సిలాఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ వారి సాయిల్ సైన్స్ కమిటీకి అధ్యక్షులుగా 1952నుంచి 56 వరకు నాలుగేళ్ళు ఉన్నారు .భూసారపరిరక్షణలో ,వ్యవసాయ పైశోధన  రంగం లో అవిశ్రాంత కృషికి చాలా  సంస్థలు వీరిని ప్రోత్సహించాయి .ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,,ఇండియన్ అకాడేమిఆఫ్ సైన్స్ మొదలైన సంస్థలలో ఫౌండేషన్ ఫెలోగా ఉంటూ పరిశోధనలు చేశారు .

 సాయిల్ సైన్స్ ,ఫెర్టిలైజర్ ప్లాంట్ ,యానిమల్ న్యుట్రిషన్ ,షుగర్ కేన్ రిసెర్చ్ రంగాలలోనూ విశేష పరిశోధనలూ చేశారు .వ్యవసాయ ఉత్పత్తులను  ,వ్యర్ధ పదార్ధాలను ఆర్ధికం గా ఎలా సద్వినియోగ పరచాలో అద్వితీయంగా వివరించారు .తగిన శాస్త్రవేత్తలతో కలిసి దేశం లోనే మొదటి సారిగా ‘’సాయిల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ‘’తయారు చేసి కీర్తి శిఖరాలను అధిరోహించారు .చెరకు అధిక దిగుబడి ఉత్పత్తికి విశేష పరిశోధనలు చేశారు .చెరుకు గానుగ ఆడటానికి పక్వ స్థితిలో ఉన్నదో లేదో పరీక్షించే ‘’షుగర్ కేన్ రిఫ్రాక్టో మీటర్ ‘’తయారు చేసి విప్లవాత్మకమార్పుకు నాంది పలికారు .

 జొన్న పంట దిగుబడి పెరగటానికి ,సింధటిక్ రబ్బర్ ఉత్పాదన లో భాగవతులవారి  కృషి అద్వితేయమైనది .రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,భూసారం పెంచి ఇతోధికంగా పంట దిగుబడి సాధించటానికి రైతులకు అనేక నూతన విషయాలను సూచించి ఆచరి౦ప జేసి అధిక దిగుబడిలో ఇండియా ‘ అగ్ర భాగాన నిలిచింది .భాగవతులవారికి బ్రిటిష్ ప్రభుత్వ౦ 1935లో ‘’కింగ్స్ సిల్వర్ జూబిలీ మెడల్ ‘’1936లో ‘’కింగ్స్ మెడల్ ‘’ అందజేసింది .ఆంధ్రా యూని వర్సిటి ‘’డాక్టర్ ఆఫ్ సైన్స్ అవరిస్ కాజ్ ‘’గౌరవ డిగ్రీ అందించింది .కేంద్ర ప్రభుత్వం రావు బహదూర్ ,C.I.E.గౌరవ పురస్కారాలిచ్చింది .

  భాగవతులవారు ‘’The Effect of Manufacturing crop of negative and Re productivecapacity of the seed ‘’పరిశోధన వ్యాసం మంచి పేరు తెచ్చింది .ఇది జర్మని భాషలోకి అనువాదం పొందింది జొన్న ,వరి లపై కూడా రచనలు చేశారు .విజయనగరం లో ఒక రసాయనిక పరిశ్రమ స్థాపించారు.ఇలాంటి పరిశోధకవ్యాసాలు 100కు పైగా రాశారు .దేశానికి పూర్తిగా అంకితమైన వీరుఆంధ్ర రాష్ట్ర౦ లో నూ సేవలందిస్తూ ,బాపట్ల అగ్రికల్చరల్ కాలేజి స్థాపనలో ఎంతో సహాయం చేశారు .ఇన్ని విధాలుగా భారత వ్యవసాయ రంగం లో తనదైన ముద్ర వేసిన వీరికి చరిత్రలో తగిన స్థానం లభించకపోవటం ఆశ్చర్యంగా ఉంది .శ్రీ భాగవతుల విశ్వనాథ్  ఢిల్లీ లో 75 ఏట 1-2-1964న మరణించారు .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురు –శిష్య -2

గురు –శిష్య -2

గురు –ఎపి లో పాలన ఎలా ఉందిరా ?

శిష్య –అదుర్స్ గురు –ముప్పై యుటర్న్ లు ,పది మానభంగాలు ,పదహారు దోపిళ్ళు ,అన్తెవేగంగా కూల్చివేతలూ  గా దినదిన ప్రవర్ధమానంగా ఉంది .

గురు –అరేయ్ ఆయనోచ్చి పాపం నెల కూడా కాలేదు .అప్పుడే బేరీజు వేసి ఇన్ని అభా౦ డాలా ?నాకేం నచ్చలేదు .

శిష్య –రచ్చ రచ్చ గా ఉన్నా నీకు చీమకుట్టినట్లైనా లేదా ?

గురు –నాకు అంతా బాగా ,ప్రశాంతంగా నే కనిపిస్తోందే .

శిష్య –కళ్ళు మూసుకొన్నావా ?అరకంటి తో చూస్తున్నావా ?నాకేమీ నీ ధోరణి అర్ధం కాటం లేదు గురవా .

గురు-సరేకాని నవరత్నాల పంపిణీ బాగా జరుగుతోందా ?

శిష్య –ఇంకా సాగినట్లు లేదు .ఆఫీసర్లు బుర్రలు పగలకొట్టుకు౦టున్నారు ,జుట్లు పీక్కుంటున్నారు .వీటికి మనీ ఎక్కడ అని !మోడీ ఏమీ ‘’చేపేట్లు’’లేడు .పైగా ఇప్పటికే ‘’కుర్రాయన ‘’మీదసానుభూతిపోయి కారాలు మిరియాలు నూరుతున్నాడని అనుకొంటున్నారు .ప్రస్తుతం నవ రత్నాల బదులు రూపాయికి ఒకటిచ్చే ‘’నవరత్న ఆయిల్ పాకెట్స్’’ ప్రజలకు ఇస్తే చిరంజీవి యాడ్ లో చెప్పినట్లు ‘’చల్లచల్లగా కూల్ కూల్ గా’’ ఉంటారేమో?

గురు –అరే!అప్పుడే యు టర్నా? కొత్త జంట ఎలా నడుస్తున్నార్రా ?

శిష్య –అంటే జగన్ కెసిఆర్ లనేగా నీ ఉద్దేశ్యం .ఆరు కౌగిలింతలు ,పదహారు ఇకిలింతల్లా ఉంది వాళ్ళ అన్యోన్యం .

గురు-కాళేశ్వరం పై తాజా వార్తలే౦ట్రా?

శిష్య –ఆ  ఏముంది గురవా !మసి పూసి మారేడుకాయ .బుడ్డాడిని బుట్టలో వేసుకొని ఆటలాడే చాణక్యం .మనకు బొక్క ,వాళ్లకు నక్క తొక్కుడు .మనకు నష్టం వాళ్లకు బోల్డు లాభం .

గురు –ఎక్కడున్న ఆస్తులు అక్కడి వాళ్ళవే అన్నాడట గులాబీ సామి ?

శిష్య –అవును గురూ .అందుకే భవిషత్తులో గోదారి -శ్రీశైలం అనుసంధానం తమదే అంటే ‘’అన్నీ మూసుకు కూర్చోవాల్సిందే ‘’అని గోలగా ఉంది ఆంధ్రాలో .

గురు –మరి ఆంధ్రాజనం గాజులు తొడుక్కుని కూర్చుంటారా ?

శిష్య –కూర్చోరు .ఇప్పుడిప్పుడే’’ సన్నాయి నొక్కుడు ‘’ప్రారంభమైంది .దీనికి సరైన నాయకత్వం కావాలి.

గురు –‘’అమిత’’ బలుడు’’ షా’’ కొత్తపాచికలే౦టిరా?

శిష్య –గులాబీ దండుపై చాణక్య ప్రయోగం లో ఉన్నాడని ,గులాబీ లో ఒకబాచ్ అధినేతకు తెలియకుండా ,ఆయన చెంత చేరి చెవిలో జోరీగల్లా రొద పెడుతున్నారని  గులాబీ నేత లూప్ హోల్స్ అన్నీ వాళ్ళే అందిస్తున్నారని ,అందులో మొన్నటి ఇంటర్ పరీక్షాఫలితాలు విద్యార్దులమరణాలు కూడా ఉన్నాయని మీడియాలో జోరుగా ఊహాగానాలు హల్ చల్ చే     స్తున్నాయి .పైగా మోడీని పిలవకుండా కాళేశ్వరం ఓపెన్ చేయించి శనీశ్వరం చుట్టి౦చు కున్నాడని బలంగా అనుకొంటున్నారు .

గురు –మేనల్లు డే౦  చేస్తున్నాడు ?

శిష్య –సమయం కోసం కాచుక్కూచున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు .

గురు –ఇక్కడ అలాంటి ప్రమాదం లేదుకదా ?

శిష్య –ఓరి నాపిచ్చ గురూ ! కింగ్ మేకర్ ఢిల్లీలో చక్రం తిప్పుతూ  ఇక్కడొక కన్ను వేసి ఉంచుతూ  టైంకోసం ఎదురు చూస్తున్నాడని అంటున్నారు .

గురు –అరే!ఇంకా నెలలు నిండని పసిగుడ్డు పాలన .అప్పుడే అంత ప్లాన్ వేస్తారా ?

శిష్య –మనకు కొత్తేమీకాదుకద గురూ ,నమ్మిన  నాదెండ్ల  అన్న ఎన్టి వోడిని ముంచేసింది మర్చావా ?అధికారం దక్కించుకోవటం లో  ఉచ్చనీచాలు ఉండవు గుర్వా.

గురు –సరేరా .  మోడీ సెంట్రల్ లో ,జగన్ రాష్ట్రం లో అన్ని సీట్లు ఎలా సంపాదించారని నాకు ఇంకా అనుమానంగానే ఉందిరా !

శిష్య –నీకేనేమిటి ?ప్రజలు కూడా అసలు మేము వాళ్లకు వోట్లు వేయనేలేదు  ఎలాగెలిచారబ్బా ఇన్ని సీట్లు ?అని ఇప్పుడు లబోదిబో మంటున్నారట .

 గురు –అదేరా నాకూ మిలియన్ డాలర్ల సందేహం .

శిష్య –ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఇలాగే భారీ మెజారిటీ సీట్లు, వోట్లతో గెలిచాడట .ఎలెక్షన్ అయిన కొన్నినెలలకు’’  వాటర్ గేట్ కుంభ కోణం ‘’బయటపడి ,తలవాచి, పరువు గంగలో కలిసి  రాజీనామా చేసిన ఉదంతం ఇప్పుడు బాగా వైరల్ అయింది గురూ .ఏ బొక్కలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక ?

 గురు –ఒకేదేశం ఒకే ఎన్నిక బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు గదరా మోడీ ?

శిష్య –అవును గురూ .2022-23లో ఒకేసారి దేశం లో ఎన్నికలు అన్నాడు పిఎం .జ్యోతిష్కులు  పంచా౦గ కర్తలు  టివిలలో ‘’శని ప్రభావం అధికంగా ఉన్న సమయం లో దేశం లో  ప్రదాని,ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు .ఇది మూన్నాళ్ళ ముచ్చటే .అయిదేళ్ళూ అధికారం లో ఉండరు .శని మార్పుకు కూడా కారకుడు .కనుక ఏదో ఒక కారణం తో మధ్యంతర ఎన్నికలు దేశం లోనూ , మనరాష్ట్రంలోనూ వస్తాయని ఢంకా బజాయించి చెబుతున్నారు .అయినా మోడీకి కేదార్ నాథ్ గుహ ,జగన్ కు స్వరూపానంద స్వామి ఉన్నారు .భయమేల గురు ?అయినా మళ్ళీ నాతోనే రహస్యాలన్నీ చెప్పించి చల్లగా జారుకొంటున్నావు గురూ .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు .

  కొద్దికాలానికే రిజర్వ్ బాంక్ లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ,పరిశోధనలలో పండిపోయారు .13 ఏళ్ళు రిజర్వ్ బాంక్ లో సేవలందించి తనపరిశోధన లలో నిష్ణాతులై ,రిసెర్చ్ ఆఫీసర్ గా ,డిప్యూటీ డైరెక్టర్ గా ఎదిగారు .తర్వాత ఇండ స్ట్రియల్ డేవలప్ మెంట్ బాంక్ (I..D. B.L.)లో1977లో  చేరి రిసెర్చ్ డివిజన్ ,,ప్లానింగ్ కార్పోరేట్ ,ఫైనా౦షియల్  భాగాలలో ఉత్కృష్ట సేవలందించారు .

  మర్చెంట్ బాంకింగ్ డివిజన్ చీఫ్ జనరల్ మేనేజర్ అయి ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ అయ్యారు .ఈ పదవులలో ఉంటూ మానవ వనరుల అభి వృద్ధికి ,పెట్టుబడి దారుల సంబంధాలను మెరుగు పరచటానికి ,ట్రెజరీ అండ్ ఫండింగ్ ప్రక్రియల నైపుణ్యానికి అద్వితీయమైన కృషి చేశారు నరసింహం గారు .తర్వాతకాలం లో ఇండస్ట్రియల్ కార్పోరేషన్  ఆఫ్ ఇండియా లిమిటెడ్ (I.F.C.I)ప్రెసిడెంట్ గా 16-7-1998 న పదవీ బాధ్యతలు చేబట్టి తన విశేష ప్రతిభా విశేషాలు ప్రదర్శించారు .దీని అనుబంధ సంస్థలకు గౌరవ సభ్యులుగా ఉంటూ సలహా సంప్రదింపులతో వాటి అభి వృద్ధికీ తోడ్పడ్డారు .ఆర్ధిక శాస్త్రవేత్తగా ,బాంకింగ్ రంగ నిష్ణాతులుగా పి.వి. నరసింహం ప్రపంచ ప్రఖ్యాతి పొందారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు

← Back

Thank you for your response. ✨

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి నూతన ఆవిష్కరణలు చేశాడు .

అందులో ముఖ్యమైనది గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసే ప్రక్రియ ముఖ్యమైనది దీనితో ప్రపంచ ప్రసిద్ధ  శాస్త్ర వేత్తల సరసన చేరాడు .అమెరికాలో గ్లిజరిన్ ఉత్పత్తి అత్యధికంగా ఉన్నా వాడకం బాగా తక్కువై నిల్వలు ఎక్కువైపోయాయి .ఆయన దృష్టి దీనిపై పడి,పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసి  తర్వాత భారీ గా ఉత్పత్తికి తోడ్పడ్డాడు .దీని కెమికల్ ఫార్ముల – C3H8O2 అమెరికా ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు దాసరి పసాద్ గారికి పలురకాల అవార్డ్ లు రివార్డ్ లు అందించి గౌరవింఛి పేటెంట్ ను మంజూరు చేసింది .

  దాసరి సాధించిన ప్రోపిలిన్ గ్లైకాల్ కు అమెరికాలోనే కాక అనేక దేశాలలో గొప్ప డిమాండ్ ఉంది .విమాన పైభాగాలపై మంచు పేరుకు పోకుండా అప్పటిదాకా ఇథలిన్ గ్లైకాల్ వాడేవారు  .కాని ఇందులో పర్యావరణానికి హానికలిగించే విషపదార్దాలున్నట్లు గుర్తించారు .దాసరిప్రసాద్ తయారు చేసిన ప్రోపిలిన్ గ్లైకాల్  లో విషపదార్ధాలు లేకపోవటంతో ఇప్పడు దీనినే వాడుతూ పర్యావరణ రక్షణ కల్పిస్తున్నారు .అంతే కాక ఇది జీవ సంబంధ ఉత్పత్తి .సోయాబీన్ ఆయిల్ ను దీనికి ఉపయోగిస్తున్నారు అంటే ఆర్గానిక్ ప్రొడక్షన్ కనుక ఏ ఇబ్బందులు ఉండవు .దాసరి మేధా శక్తిని గుర్తించి ‘’ది ప్రేసి డేన్షియల్ గ్రీన్  కెమిస్ట్రి  అవార్డ్ ‘’అందజేశారు.

    ప్రోపిలిన్ గ్లైకాల్ ను  వాహనాల బ్రేక్ ఫ్లూయిడ్ లలో ,సౌందర్య సాధనాలలో ,ఆహార ఉత్పత్తులలో ,లిక్విడ్ సోప్ తయారీలోకూడా  వాడుతున్నారు .శీతలీకరణాన్ని (ఫ్రీజింగ్ )నివారించటానికి’’ యాంటి ఫ్రీజర్ ‘’గా భారీ ఎత్తున  ఉపయోగిస్తున్నారు  .అనేక రకాల పోలిమేర్స్ తయారీలో ,బిల్డింగ్ మెటీరియల్స్ లో ,లేజర్ ప్రింటింగ్ లో టోనర్ గా ,ఫార్మకాలజిలో ,చర్మవ్యాదులకుపయోగించే ఆయింట్ మెంట్ లలో ఎక్కువగా ప్రోపిలిన్ గ్లైకాల్ వాడకం ఉన్నది .. ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం లో 18-10-1931న జన్మించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి హైదరాబాద్ లో స్థిరపడినా తన స్వగ్రామాన్ని మరచిపోలేదు .కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. టెలికం పరిశోధకులు.

పూణెలో (1974-75), ఆంధ్ర ప్రదేశ్ లో (1978-83) టెలీఫోన్స్ శాఖ ప్రధానాధికారిగా ఉంటూ దేశవ్యాపితంగా ఎస్.టీ.డీ , ఐ.ఎస్.డీ ల వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ఈయన కృషి ఫలితంగా ఈ రోజున దేశంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా ఎస్.టి.డి, ఐఎస్‌డి, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్సు, ఐఎస్‌డీ ఎన్ లైన్లు విస్తృతమయ్యాయి. “నాట్” గురించి పార్లమెంటు సభ్యులకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర మంత్రులకు అవగాహన కల్పించారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొట్టతొలి చైర్మన్ గా, మేనేజింగ్ డైరక్టరుగా దేశ వ్యాప్తంగా టెలీ కమ్యూనికేషన్ ల శకానికి నాంది పలికారు.

1989 లో టెలీ కమ్యూనికేషన్స్ మేనేజిమెంటు అండ్ స్టడీస్ సెంటరు నెలకొల్పారు. నేషనల్ టెలీకాం పాలసీ ఎన్.టీ.పీ కి సంబందించిన డ్రాప్టు పాలసీని 1989 లో రూపొందించారు. సెంటరు తరపున ఒక హౌస్ జర్నల్ ను నెలకొల్పి దానికి ఎడిటర్ గా కొంతకాలం వ్యవహరించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ను సవరించి దానికి ప్రత్యామ్నాయంగా టెలికం లా కు రూపకల్పన చేసి 1992 లో ప్రవేశపెట్టేందుకు కృషి జరిపారు.

టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బిల్ ను డ్రాఫ్టింగ్ చేసిన ఈయన ప్రైవేటు రంగంలో టెలికం పరిశ్రమ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించి, దేశీయ టెలికం వ్యవస్థకు నూతన శకం ఆవిర్భవింపజేశారు. జాతీయ, అంతర్జాతీయ టెలికం సదస్సులు అనేకంలో పాల్గొని టెలికం పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా నూతన పోకడలను అంకితం చేశారు. ఇంటర్నేషనల్ టెలికం యూనియన్ (జెనీవా) కు గౌరవ సభ్యులు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఏషియన్ టెలికం మహాసభలో (సింగపూర్,హాంకాంగ్,జెనీవాలలో 2001,02,03లలో) పాల్గొని మనదేశపు టెలికం రంగపు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దాదాపు 20 దేశాలలో జరిగిన టెలికం సదస్సులలో ప్రధాన వక్తగా పాల్గొని, ఎప్పటికప్పుడు టెలికం అభివృద్ధి పథకాలను సూచించారు.

ఇంటెల్ సాట్ (వాషింగ్టన్) ,ఇన్మార్ సాట్ (లండన్) లకు గవర్నర్ గా వ్యవహరించారు. గయానా, యెమెన్ మొదలైన వర్ధమాన దేశాలకు ప్రణాళికలను రచించి తెలికం ఇంటర్నేషనల్ టీం కు నేతృత్వం వహించారు. 1995 లో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి, 2000లో నేపాల్ ప్రభుత్వానికి టెలికం సలహాదారుగా దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాం (1997-04) లో రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా యున్నారు. భారతీయ విద్యా భవన్ కు (హైదరాబాదు శాఖ) ఛైర్మన్ గా, “ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీర్స్” కు జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా, న్యూయార్క్ సంస్థకు గౌరవ సభ్యులుగా పనిచేసారు. సిటిఎమ్‌ఎస్ కు డైరక్టరుగా పనిచేశారు.

రచించిన గ్రంథములు
· India, understrain, India, U.P

· India Explorations, In True Conscience.

అవార్డులు
· ఎల్.వి.రామయ్య అవార్డు గ్రహీత.2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది .

హోమియో పతి వైద్యం లోతులుతరచి ఈనాడు పత్రికలోచాలాకాలం ధారావాహికంగా ఆ వైద్య విధానం గురించి రాసి పుస్తకరూపం లో ప్రచురించారు హోమియో కిట్ రూపొందించారు .తెలుగు విద్యార్ధి మాసపత్రికలో జాబులు జవాబులు శీర్షిక నిర్వహిస్తున్నారు .జాతీయ మేధావుల సంస్థ గా ‘’ప్రజ్ఞా భారతి’’స్థాపించి ,చైర్మన్ గా ఉంటూ జాతి భవిష్యత్తుకు దిశా నిర్దేశనం చేస్తున్నారు 89 ఏళ్ళ వయసులో కూడా చాలా చలాకీగా టివి కార్యక్రమాలలో గోస్టులలో,చర్చావేదికలలో పాల్గొంటున్న అనుక్షణ క్రియాశీలి హనుమాన్ చౌదరి .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురు శిష్యులు ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?

గురు శిష్యులు

గురు -శిష్యా! ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?

శిష్య -అయిదుగురుకదా గురూ
గురు -మరి సీఎం లు ఎందర్రా ?
శిష్య – ఐదారుగురు  గురూ
గురు -అదేంట్రా ఒక్కరే ఉండాలి కదా
శిష్య -ఉండాలి నిజమే .అసలు సీఎం జగన్ .కీ సీఎం  విజయసాయి ,సూపర్ సీఎం కేసీఆర్ సుప్రీం సీఎం మోదీషా . వీరికి పైన రాజగురు  స్వరూపానంద సామి .
గురు-బాగుందిరా .ఏపీ కి హోదా వస్తుందా ?
శిష్య -రానట్లే ఉంది గురూ . ఇప్పటికి మూడు సాలు పీఎం ను ”కలిసి సార్ సార్ -ప్లీజ్ ప్లీజ్ ”మంత్రం పఠించినా ఫలితం తేలక నీరసపడడ్డాడు సీఎం .
గురు -మరి వేరే ఉపాయం లేదా ?
శిష్య -ఉంది గురూ .జగన్ ఎంపీలందరూ ఢిల్లీలో ఒక నెలరోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్పక వస్తుంది .లేక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికైనా వసద్ది  .
గురు -అంత  సాహసం చేస్తార్రా ?
శిష్య -చెప్పటం తేలికేకాని చేయటం కష్టంకదా గురూ
గురు -వేరే ఉపాయ0  లేదా  ?
శిష్య -భేషుగ్గా ఉంది . విశాఖ సాములోరు  స్వరూపానంద జీ -జగన్ ను కేసీఆర్ ను యాగాలు యజ్ఞాలు చేసి రికార్డ్ మెజారిటీలతో గెలిపించానని చెప్పారు కదా ఆయనకు ఒక యాభై కోట్లు ఇచ్చి పూజాపునస్కారాలు యజ్ఞ యాగాలు మోదీషా  మనసు మార్చే యంత్రాలు కట్టించి విభూతి పంచిపెడితే  గ్యారంటీగా రావచ్చు
గురు -కేసీఆర్ ,,జగన్ లు గోదారి  అంతు  చూస్తాం అంటున్నారు ?
శిష్య -కాళేశ్వరం కడితే శనేశ్వరమే తప్ప చుక్క నీరు లేదట .ఇక్కడ బాబు పట్టిసీమ నీళ్లు రాయలసీమదాకా పారించి ఆంద్ర అంతా సస్యశ్యామలం చేశాడు .ఆ కడుపుమంటతో ”పసి వాణ్ని ”దువ్వి జలసిరి పొంది తనమగసిరి చూపించాలన్నతాపత్రయం గురూ .చివరికి ”కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అనే సామెత రుజువవుతుందేమోనని భయంగా ఉంది గురూ
గురు -ప్రజాదర్బార్ అర్ధరాత్రి కూల్చేశారు .దానికి కోట్లు ఎందుకు ఓట్లు వేసినవారంతా కలిస్తే ఉఫ్ఫ్మని ఊదేసి వాళ్ళుకదా   ?
శిష్య – -అంత ”ఔడియా వచ్చి ఉండదు ”లేక ”స్వామి” ఆదేశించి ఉండరేమో
గురు – కరకట్ట వెంబడి సచ్చిదానంద ఆశ్రమం మంతెనరాజు గారి విల్లాస్ ,ఇస్కాన్ వారి భారీ భవంతులున్నాయి వాటినీ కూల్చేస్తారా ?
శిష్య -”కూల్చేసుకోండి లేదా కూల్చేస్తాం ”స్లోగన్ ఫ్లోట్  చేశారుకదా .చూద్దాం .అత్యంత కీలక విషయాలన్నీ నాతోనే చెప్పించి తప్పించుకొన్నావ్ గురూ .
  మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి ,ఎం ఏ .లు చదివారు .ఇండియాకు తిరిగివచ్చాక దక్షిణ భారత దేశం లోనే పేరుపొందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా కీర్తిపొందారు .

కృష్ణా జిల్లా  గుడివాడ దగ్గర సిద్ధాంతం లో వేలాది ఎకరాల భూస్వామి ,ఉయ్యూరులోనూ భూములున్న  శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య అనే సంపన్న వ్యవసాయ దారుడు 1932లో ఉయ్యూరులో సుగర్ ఫాక్టరీ నిర్మించారు . ఆయన నిర్వహణలో ఫాక్టరీ నడిచినా   టెక్నికల్ అనుభవం  లేనందున కుంటినడకే నడిచింది .రైతులకు, ఆయనకూ కూడా నిరాశే మిగిల్చింది .  రామకృష్ణ గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు  రాష్ట్రం  పారిశ్రామిక రంగం లో పురోగమించాలన్న తలంపుతో ఉయ్యూరులో తనభార్య శ్రీమతి దుర్గాంబ తండ్రి అంటే తన మామగారు స్థాపించిన షుగర్ ఫాక్టరీ అనుకొన్న లక్ష్యాలను సాధించటం లో విఫలమై వెనకడుగు లో ఉండగా  వెలగపూడి రామకృష్ణగారు  ఉయ్యూరు షుగర్ ఫాక్టరీని మామ గారి కోరికపై  నిర్వహణ బాధ్యతలు1941లో చేబట్టి కెసీపి లిమిటెడ్ గా నామకరణం చేశారు   లాభాలలో నడిపించి ఆసియా ఖండం లోనే అతిపెద్ద షుగర్ ఫాక్టరీ గా తీర్చి దిద్దారు .ఈవిధంగా రామకృష్ణగారు మద్రాస్ రాష్ట్రం లో తోలి పారిశ్రామిక వేత్తగా గుర్తింపుపొందారు .ఫాక్టరీ సామర్ధ్యాన్ని600 T.C.D.కి పెంచారు .ప్రస్తుతం కెపాసిటి న 7,500 T.C.D.కే పెరిగింది .ఇలా దినదిన౦గా  గణనీయమైన అభి వృద్ధి సాధించింది కేసిపి ., చెరుకు రైతులలో విశ్వాసం పెంచి చెరుకు నాటటానికి తగిన ప్రోత్సాహకాలు రైతులకు అందించారు

వెలగపూడి వారి ప్రోత్సాహం తోనే తణుకులో సర్వారాయ షుగర్ ఫాక్టరీ ,ఆంధ్రా సుగర్స్ , డెక్కన్ సుగర్స్ చక్కర పరిశ్రమలు ఏర్పడి వాణిజ్యరంగం లో కొత్త పుంతలు తొక్కాయి  మద్రాస్ లో సెంట్రల్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు .కెసీపి సిమెంట్ ఫాక్టరీ మాచర్లలో నెలకొల్పారు షుగర్ లో ఎంత పేరుందో కెసీపి సిమెంట్ కూ అంత నాణ్యతా గిరాకీ ఉంది .ఇతర దేశాలలో షుగర్ ఫాక్టరీలను కూడా ఉయ్యూరు కెసీపి నిర్మించి గొప్ప పేరు సంపాదించింది

..కృష్ణా కమ్మర్షియల్ ప్రాడక్ట్స్ అంటే కె .సి.పి.పంచదార ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పొందింది .ఇక్కడి షుగర్ క్రిస్టల్స్ నాణ్యత మరే పంచదారకూ లేదు .దీనికి అనుబంధంగా సోడా గాస్ ,రెక్టిఫైడ్ స్పిరిట్ ,ఉత్పత్తిలోనూ పేరు పొందింది .ఉయ్యూరు సోడా వాటర్ తాగినవారికి ఇంకెక్కడి సోడా నచ్చనే నచ్చదు.కన్ఫెక్షనరి అంటే’’పంచదార  బిళ్ళలు’’కూడా ప్రసిద్ధి చెందాయి . కొంతకాలం తర్వాత బిళ్ళలవీటి ఉత్పత్తి ఆగిపోయింది ‘.ప్రస్తుతం అసిటిక్ యాసిడ్ ప్లాంట్ గణనీయమైన లాభాలు గడిస్తోంది .

రామకృష్ణగారి మరణం తర్వాత రామ కృష్ణగారి ఇద్దరు కుమారులు శ్రీ మారుతీ రావు  శ్రీ లక్ష్మణదత్ .కుమార్తె శ్రీమతి రాజేశ్వరి .కొన్నీల్లు ఫాక్టరీలను సమర్ధవంతంగా నడిపారు .తర్వాత  అన్నదమ్ముల వాటాలలో ఉయ్యూరు చల్లపల్లి, షుగర్ ఫాక్టరీలు శ్రీ మారుతీ రాగారికి  మాచార్ల సిమెంట్ ఫాక్టరీ మద్రాస్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ దత్తుగారికి లభించాయి .మారుతీ రావుగారు గొప్ప టెక్నీషియన్ .మాన్ పవర్ తగ్గించి ఫాక్తరీని ఆధునికత జోడించి సమర్ధంగా నడిపారు . రైతులు డబ్బుకోసం ఫాక్టరీ చుట్టూ తిరుగకుండా  బాంకులలో రైతులపెర అకొంట్ లు తెరిపించి  సరాసరి నగదు ఆ అకౌంట్ లలో జమ అయ్యేట్లు చేశారు .ఇది రైతులకు వరప్రదాయిని అయింది.  ఉయ్యూరులో ఒక పారిశ్రామిక విప్లవమే వచ్చినట్లైంది .మారుతీ రావు  గారి మరణం తర్వాత  ఉయ్యూరు కెసీపి బాధ్యతలు ఆయనభార్య శ్రీమతి ఇర్మ్ గార్డ్ చేబట్టారు .శ్రీ దత్తు ఫిక్కీ అధ్యక్షులయ్యారు  దత్తుగారి భార్య ముక్త్యాలరాజా కుమార్తె శ్రీమతి ఇ౦దిరాదత్తు.ప్రపంచ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షురాలు .వెలగపూడి రామకృష్ణగారమ్మాయి  శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ జయపూర్ చక్కర కర్మాగారానికి మేనేజింగ్ డైరెక్టర్ .వీరికుమారుడు శ్రీ ఆర్ ప్రభు తమిళనాడు ఊటీ (నీలగిరి )పార్లమెంటరీ స్థానానికి 5 సార్లు ఎన్నికై ,ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు .

వెలగపూడి రామకృష్ణ గారు జయపురం సంస్థానానికి దివాన్ గా పని చేశారు . మద్రాస్ ప్రభుత్వం లో అభి వృద్ధికమిషనర్ .గా సేవలందించారు .జిల్లాకలేక్టర్ గా ,లేబర్ కమీషనర్ గా ,పరిశ్రమల కమీషనర్ గా ,పార్లమెంట్ సభ్యునిగా ప్రజా సేవలో పునీతులయ్యారు .

వదాన్యులైన రామకృష్ణగాఋ   జన్మించిన చోట ఆయన బహుముఖీన సేవలకు గుర్తింపుగా ’’నగరం ‘’లో  ‘’వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజి’’ఏర్పాటైంది.తెనాలిలో విఎస్ ఆర్ ,అండ్ యెన్ వి ఆర్ కాలేజి స్థాపించారు .విజయవాడలో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి స్థాపన జరిగింది .మద్రాస్ లో ఆంధ్రా చేంబర్ ఆఫ్ కామర్స్ ఆయన పేరిట నిర్మించారు .ఇంతటి పారిశ్రామిక దిగ్గజం శ్రీవెలగపూడి రామ కృష్ణ గారు 72వ 1968 ఏప్రిల్ 18న మరణించారు .

తణుకు కు చెందిన పండిత శ్రీ పెనుమెచ్చ సత్యనారాయణ రాజుగారు ‘’ తెలుగు రాజు కృతులు ‘కావ్యాన్ని మంజరీ ద్విపదలో మనోహరంగా రాసి  తన మిత్రుడు వెలగపూడి  రామకృష్ణగారి  58 వ జన్మ దినోత్సవం సందర్భంగా ‘’  రామ కృష్ణము ‘’పేరుతొ పద్యాలు రాసి  అంకితమిచ్చారు . దీనికి ప్రముఖ శాస్త్రవేత్త రక్షణశాఖ కు సలహాదారు ,ఉస్మానియా యూని వర్సిటి వైస్ చాన్సలర్  రాజుగారికి తన చిన్నతనం లో శిష్యుడు ,రాజా విక్రమ దేవవర్మగారి సౌజన్యంతో ఆంద్ర విశ్వ విద్యాలయ౦  లో ప్రొఫెసర్ గా పని చేసిన  డా శ్రీ సూరి భగవంతం గారు ,ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు ముందుమాటలు రాశారు .

రామకృష్ణగారిపై  రాజు గారు రాసిన కొన్ని పద్యాలు రుచి చూద్దాం .

‘’గోదావరీ తీర కేదారములుపోవ –ఇంద్రావతీ భూములిచ్చినావు

‘’కాకరపర్రు’’లోనున్న గృహంబు ను వీడ –కోటపాడు న ఇల్లు కూర్చినావు ‘’

యుద్ధకాలమున౦దు ఉద్యోగ మొనగూర్చి –దోసిళ్ళతో సొమ్ము పోసినావు

నరసిన నా తల నరసి సోడా గ్యాసు –నేజెన్సి యిచ్చి పోషించు చుంటి

విన్ని  యుపకారములు చేయుచున్న కతన –నస్మదీయాంధ్ర కృతి కన్య నాత్మసఖుడ

వైన నీ కిచ్చినాడ  నేన౦కితముగ-ప్రేమతో శ్రీ వెల్గ పూడి రామకృష్ణ

‘’ఆరాధనంబుతో నీరాజనంబిచ్చి –యావేదనంబును నందజేసి

విజయంపు శ్రీతోడ రుజుభావమందించి –చంపకమాలినీ చరితమొసగి

పండిత రాట్చాటుభావాల గైసేసి –సరస రసాలంపు జవుల జూపి

భీమేశు శతకంబు నామెత గావించి-విక్రమ శతకంబు విశద  పరచి

ప్రేమతోడ జ్ఞానాంజలి పెట్టి దీని –‘’రామ కృష్ణము ‘’గావించి రామకృష్ణ

దేశదేశాల నీ కీర్తి తేజరిల్ల –నంకితము జేయుచుంటి నీకందుకొనుము ‘’

‘’పుత్రుని ‘’రామకృష్ణ ‘’యని ముద్దిడు కొంచును  నీదు పేరుతొ

బుత్రిక తెల్గురాట్కృతి ని మోదముతో నిడి నీకు  ,జన్మ తా

పత్రయ మీగ గంటి,భవ బంధములన్నియు ద్రెంచుకొంటి,స’

న్మిత్రమ ! రామ కృష్ణ కనుమీ !ధనధాన్య చిరాయుతున్నతుల్ ‘’

‘’ఏబది యెన్మిదైన భవదీయ జయంతికి నంకితంబుగా –నేబడది యైదు వత్సరము  లించ జనించిన నా’’ కుమారికన్’’

కూబర వృత్త రీత గుణ గుంఫిత రత్న మయూఖ దీపికన్ –నీ బహుమాన హస్తమున నేనిడితిన్ గొను రామ కృష్ణుడా ‘’

‘’ఢిల్లీ కోటలుదాటి నీదు గుణ మల్లీ వల్లికల్ హిందూ భూ –వాల్లభ్యధ్వజ దండమండన కళాపాండిత్య మార్జి౦చు టల్

సల్లాపామృత,రామ కృష్ణ !సతిగా సౌహిత్య సాహిత్య సం-పల్లావణ్య  వతిన్  కృతీంది నిడితిన్ బాణిం గ్రహింపం గదే’’

‘’దుర్గా౦బా ‘’దరహాస చంద్రికలలో దూగాడుచున్ గూడ శ్రీ –స్వర్గంగా లహరీ ప్రభావ కవితా భామా రమా కేళిమై

దుర్గా గంగలతోడి ఈశుడటు సంతోషంబు రేకెత్తగన్  -దిర్గన్ వచ్చును ‘’రామకృష్ణ ‘’గైకొ నీ తెల్గు రాట్పు త్రికన్ ‘’

ఇతి శివం

పండిత పెను మెచ్చ సత్యనారాయణ .

ఇలా రామకృష్ణగారు ఇన్ని మంచిపనులు చేశారని ,ఆయనకు ఒక కృతి అ౦కిత మివ్వబడిందనీ ఈ నాటి వరకు నాకే కాదు ఇక్కడి వారెవరికీ తెలియదు .రాజుగారి కావ్యాన్ని మా అబ్బాయి శర్మ లింక్ ద్వారా నిన్న పంపాకే నాకు తెలిసింది .

ఆధారం తెలుగు వీకీపీడియా  కొంత నాకు తెలిసిందీ ,మిగిలినది రాజు గారి కావ్యం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు

ఆంద్ర రాష్ట్రం లో 1960లో పుట్టి న మండవ సురేంద్ర బాబు తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ పట్టభద్రులై ,చండీ గడ్ లోని సెమి కండక్టర్ కాంప్లెక్స్ లో ఉద్యోగం లో 1983లో చేరి మూడేళ్ళు పని చేస్తూ పరిశోధన రంగం లో అడుగుపెట్టారు .సెమి కండక్టర్ పరిశోధనలో 17 ఏళ్ళ విశేష అనుభవం పొంది సిర్రజ్ లాజిక్ సంస్థలో ఇంటిగ్రేటెడ్ చీఫ్ డిజైనింగ్ పని చేస్తూ ,డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ తయారీ  విభాగ మేనేజర్ అయ్యారు .జిలాగ్ సంస్థలో ఆయన చేసిన పరిదోధనలకు మూడు పేటెంట్ లు పొందారు .

 కెనడాలో పిహెచ్ డి పొంది ,అట్టావాలో బెల్ నార్తాన్ రిసెర్చ్ సంస్థలో   చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ పదవి పొంది  కెనడాలోని మాట్రాక్స్ సంస్థ నుండి ‘’చిప్ మేకర్ ‘’మొదలైన గౌరవ పురస్కారాలెన్నో అందుకొని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్నునిగా గుర్తింపు ను అందుకొన్నారు .

   1997లో  సిర్రజ్ లాజిక్స్ సంస్థను వదిలి ,మరో ఇద్దరు శాస్త్ర వేత్తలతో కలిసి ‘’ సెంన్టిల్లం ‘’సంస్థను స్థాపించారు .ఈ కొత్త సంస్థ 2000 మే నాటికి పబ్లిక్ ఇస్స్యు లో మంచి పేరు పొందింది .బ్రాడ్ బాండ్ లో సురేంద్రబాబు గారికి, ఆయన సంస్థ సెంటిల్లం కు గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

image.png

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు- ప్రభాకర్,,అప్పారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు-  ప్రభాకర్,,అప్పారావు  –

బండారు ప్రభాకర్ ,ఎం.అప్పారావు లు ప్రవాస ఆంధ్రులు .ఎలెక్ట్రానిక్స్ దిగ్గజాలు .ఇద్దరూకలిసి ట్రాన్సిస్టర్ రూపకల్పన చేసి చరిత్ర సృష్టించారు .ప్రభాకర్ విజయవాడకు చెందినవాడు .హైదరాబాద్ వెళ్లి ఒక పబ్లిక్ స్కూల్ లో చదివి  ఖర్గపూర్ ఐ ఐ టి లో చదువు అయ్యాక అమెరికా లోని కాలిఫోర్నియాకుయూని వర్సిటి లో పదార్ధ విజ్ఞాన శాస్త్రం లో పిహెచ్ డి సాధించాడు  అదే యూని వర్సిటీ లో పని చేస్తూ y ఆకారం లో ఉండే నానో ట్యూబుల విద్యుత్ ధర్మాలను గుర్తించే అనేక పరిశోధనలుచేశాడు .ఆ పరిశోధనా ఫలితం గా కొత్త సాధనాలు రూపొందించాడు .

  ఎం.అప్పారావు కూడా ఆంధ్రుడే .ఇక్కడ చదువు పూర్తి చేసి ముంబై యూని వర్సిటి లో ఉన్నత విద్య తర్వాత అమెరికా  వెళ్లి కెంటకి యూని వర్సిటి నుంచి పిహెచ డి పొందాడు . .మాసా చూసేట్స్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా చేరి పని చేస్తున్నాడు .సౌత్ కారోలీనా లోని   ఈక్లెమెన్స్ యూని వర్సిటి లో ఎన్నో పరిశోధనలు చేశాడు .

  కాలిఫోర్నియాలోని ప్రభాకర్ ,సౌత్ కరోలీనా లోని అప్పారావు కలిసి ఒక గ్రాడ్యుయేట్ విద్యార్ధిని సాయంగా పెట్ట్టుకొని  ‘’నానో టెక్నాలజీ ‘’లో గొప్ప కృషి,పరిశోధన  చేశారు.ప్రపంచం లోనే అతి చిన్నదైన ట్రాన్సిస్టర్ ని నానో ట్యూబ్ లతో తయారు చేసి ప్రపంచాన్ని నివ్వెర పోయేట్లు చేశారు .నానో ట్యూబులు వెంట్రుక  కన్నా సన్నంగా ఉంటాయి .దీని నిర్మాణంతో ‘’అల్ట్రా మినియేచర్  ఎలక్ట్రానిక్ ‘’పరికరాల తయారీకి మార్గం సుగమమైంది .వై ఆకార నానో ట్యూబులతో తయారైన ఈ బుల్లి  ట్రాన్సిస్టర్ కు సంబంధించిన వివరాలు విశేషాలను ఈ జంట శాస్త్ర వేత్తలు 2005 సెప్టెంబర్ ‘’నేచర్ మెటీరియల్స్ ‘’మాసపత్రికలో ప్రచురించారు .

  సాధారణంగా ట్రాన్సిస్టర్ సైజు తగ్గినకొద్దీ  వాటిలో వాడే చిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది .కానీ నానో టెక్నాలజీ తో తయారైన ఈ ట్రాన్సిస్టర్ అనూహ్య రూపం లో అతి సూక్ష్మ౦గా  ఉండటమే కాక అత్యంత సమర్ధవంతంగా పని చేసింది .ఈ జంట ప్రవాసాంధ్ర శాస్త్రవేత్తలు ‘’ఐరన్ –టైటానియం ‘’రేణువుల కోసం ప్రత్యెక తరహా రసాయనాలు వాడి ,వినూత్న నానో ట్రాన్సిస్టర్లు   తయారు చేసి ,ప్రపంచం లో ఎలెక్ట్రానిక్స్ దశను, దిశనూ మార్చి అభి వృద్ధిలో మార్గ దర్శుకు లయ్యారు .వీరిద్దరూ ఆంధ్రులవటం మనకు గర్వకారణం .

ఆధారం –శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

   సశేషం

image.pngimage.png

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -28-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ సోపానాలు నిర్మల -ఇక ప్రశాంత లోకానికి

 
 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు-21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు-21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ

21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ

శ్రీ కోట హరినారాయణ 1943లో  బరంపురం  లో జన్మించిన తెలుగు వాడు .బెనారస్ హిందూ యూని వర్సిటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు .బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి , బొంబాయి  ఐ .ఐ.టి.లో పిహెచ్ డి చేశారు .న్యాయశాస్త్రమూ చదివి పట్టా చేబట్టారు .విద్యాభ్యాసం అంతా స్వదేశం లోనే చేసిన ఆంద్ర శాస్త్ర వేత్త కోట .

  1967లో హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లో ఉద్యోగం పొంది1970లో రక్షణ పరిశోధన ,అభి వృద్ధి సంస్థ  D.R.D.O.లో చేరి సుమారు 12ఏళ్ళు కీలకపదవులలో రాణించారు .1982లో మళ్ళీ H.A.L. లో చీఫ్ డిజైనర్ గా నాసిక్ లో పని చేశారు .మిగ్ విమాన ఆయుర్దాయం పెంచే ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించారు .దాని సామర్ధ్యాన్ని బాగా పెంచి  బరువును కూడా బాగా  తగ్గించారు .దీనితో మిగ్-21 విమానాల విడిభాగాల ఉత్పత్తి మనదేశంలోనే చేయటానికి సాధ్యపడింది  .

  కోట గారు 1985లో బెంగుళూరు లోని ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ A.D.E;కి  డైరెక్టర్ అయ్యారు .అప్పటికే ఆయన పరిశోధన ప్రభావం వలన తేలిక రకం యుద్ధ విమానాలు అంటే లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ L.C.A.మనదేశం లో నిర్మించే ప్రాజెక్ట్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా హరినారాయణ గారిని  నియమించి పూర్తి బాధ్యతలను అప్పగించింది .ఎల్ సి ఏ కి రూపకల్పన చేసి వివిధరకాల ఫ్లైట్ పరిక్షలునిర్వహించి  దిగ్విజయంగా  పూర్తి చేశారు .దీనితో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తో భారత దేశం లో ప్రపంచ దేశాలకు దీటుగా మొదటి యుద్ధవిమాన౦ లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారై౦ది .ఇదంతా కోటవారి శాస్త్ర సాంకేతిక సామర్ధ్యానికి, ముందు చూపుకు నిదర్శనం  .1995లో ఆయనను ప్రముఖ శాస్త్ర వేత్తగా గుర్తించారు .ఇండియా చైనాయుద్ధం లో వోడిపోవటానికి ఇలాంటి యుద్ధ విమానాలు లేకపోవటమే కారణం .పాకిస్తాన్ యుద్ధం లో గెలవటానికిఇలాంటి  యుద్ధ విమానాలే కీలకమయ్యాయి  .L.C.A.నిర్మాణం తో భారత్ యుద్ధ విమా న రంగం లో అగ్రరాజ్యాల స్థాయికి చేరింది .2002లోవీటి నిర్మాణానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధి మంజూరు చేసింది .తేజస్ ప్రోగ్రాం లోకూడా వీరి పాత్ర గణనీయంగా ఉంది .కోటగారు హైదరాబాద్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా కూడా పని చేశారు .డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనై జేషన్ నుంచి ‘’డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్  అవార్డ్ ‘’అందుకొన్నారు .2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది .

image.png

   ఆధారం- శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు 

ఇవాళ నా పుట్టిన రోజు

కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు సాహితీ బంధువులకు -ఇవాళ జూన్ 27గురువారం నా పుట్టిన రోజు . 78 వెళ్లి 79వచ్చిన సందర్భంగా అందరికి శుభకామనలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

‘’అర్జున టాంక్ ‘’రూప శిల్పి –దొనకొండ హనుమన్న

‘’అర్జున టాంక్ ‘’రూప శిల్పి –దొనకొండ హనుమన్న

అనంతపురం జిల్లా  తిమ్మనచర్ల గ్రామం లో జన్మించిన దొనకొండ హనుమన్న అనంతపురం లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ,వరంగల్ రిజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో మెషీన్ టూల్ డిజైనింగ్ లో ఎం .టెక్ .అయ్యారు .మొదట పూనాలోని ఒక విదేశీ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం ప్రారంభించి ,అనేక పరీక్షలు రాసి పూనా దగ్గర అహ్మద్ నగర్ లోని కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ‘’కంట్రోలరేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వెహికల్స్ ‘’విభాగం లో గ్రేడ్ టు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా  నియమితులై పని చేశారు .వెహికల్ ఇంజనీరింగ్ లో గొప్ప పరిశోధన అధ్యయనం చేసి ప్రవీణులయ్యారు .

               సైనికులు కొనుగోలు చేసే వాహనాలు ,వాటిపని తీరు ,నైపుణ్యం లను క్షుణ్ణంగా పరీక్షించారు .నాలుగేళ్ల ఈ పరీక్షానుభవం పరిశోధనలకు దారి చూపింది .ఈ అనుభవంతో మద్రాస్ లోని సీనియర్ సైంటిఫిక్ గ్రేడ్ వన్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేబట్టారు .అప్పుడు తయారౌతున్న ‘’వైజయంతి టాంక్ ‘’ ను పర్య వేక్షించి కొన్ని మార్పులు చేశారు.1980  డిసెంబర్ లో  ‘’కాంటాక్ట్ వెహికల్ రీ సెర్చ్ అండ్ డెవలప్ మెంట్  ఎస్టాబ్లిష్ మెంట్ ‘’లో  ‘’గ్రేడ్ సి’’శాస్త్రవేత్తగా  చేరారు .ఇదొక సువర్ణ అవకాశంగా మారింది .తన సునిసిత మేధవలన చకచకా గ్రేడ్ లను అధిగమించి హనుమన్న తన   అవక్ర విక్రమాన్ని ప్రదర్శించి ‘’స్పెషల్ గ్రేడ్ శాస్త్ర వేత్త ‘’గా గుర్తింపు పొందారు .ఇది అత్యంత కష్టతరమైన ప్రాసెస్ ఆయినా అవలీలగా సాధించారు. అంకితభావం తో ఆయన చేసిన అవిరళ కృషికి తగిన గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘’విశిష్ట శాస్త్ర వేత్త ‘’పురస్కారం అందించి గౌరవించి సత్కరించింది .ఆ సంస్థలో ఉన్న 51ఉపశాఖలలో మొత్తం 6వేల మంది శాస్త్ర వేత్తలు ఉండగా ,కేవలం 20మందికి మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ లభించటం విశేషం .అందులో ఆంధ్రులైన హనుమన్నగా రికి రావటం మరింత విశేషం .

  అప్పడే భారత ప్రభుత్వం శత్రు  విచ్చేదక మల్టి పర్పస్ స్పెషల్ యుద్ధ టాంక్ ‘’అర్జున ‘’నిర్మించే ప్రయత్నం లో  రూప కల్పన చేస్తూ ఆ ప్రాజెక్ట్ ముఖ్య బాధ్యతను హనుమన్నగారికి అప్పగించింది .దీనినిర్మాణ౦  లో అనితరసాధ్య ప్రతిభను ,అంకిత భావాన్ని  ప్రదర్శించి దిగ్విజయంగా పూర్తి చేసి తన సమర్ధతను, టాంక్ సమర్ధతను చాటి ,అపూర్వ సత్కారం అందుకొన్న శాస్త్ర సాంకేతిక శాస్త్ర వేత్త హనుమన్నగారు .అత్యుత్తమ టాంక్ గా అర్జున టాంక్ గుర్తి౦పబడి భారత ప్రభుత్వ యుద్ధ టాంక్ లలో మణి రత్నమే అయి  ,అపూర్వ విజయాలు సాధించిపెట్టింది .ఈ విజయవంత మైన ప్రాజెక్ట్ తర్వాత మరొక 124 టాంక్ ల నిర్మాణానికి అనుమతి పొందటం మరో విశేషం .

   35ఏళ్ళు సుదీర్ఘ పర్యవేక్షణ నిరంతర పరిశోధన అనంతరం హనుమన్నగారు  చాలా ఆలస్యంగా 52వ ఏట పిహెచ్ డి అందుకొన్నారు .వీరి కృషికి లెక్కలేనన్ని అవార్డ్ లు రివార్డ్ లు లభించాయి .కేవలం స్వదేశీ పరిజ్ఞానం తో అపూర్వమైన అర్జున ట్యాంక్ రూపకల్పన చేసి నిర్మించి భారత దేశ యుద్ధ పరికరాలలో   విశిష్టమైన అర్జున టాంక్ ను చేర్చారు .ఆనాటి క్రీడి అయిన అర్జున పరాక్రమంతో, ఈ నాటి  అర్జున  టాంక్ వీర విహారం చేస్తూ రూపశిల్పి దొనకొండ హనుమన్నఅకు౦ఠిత దీక్షకు సేవతత్పరతకు శోభాయమానమై నిలిచింది.

ఆధారం –శ్రీవాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-19-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

బందరు లో ‘’ఆంధ్రా  సైంటిఫిక్ కంపెనీ’’ స్థాపకులు –అయ్యగారి రామమూర్తి

బందరు లో ‘’ఆంధ్రా  సైంటిఫిక్ కంపెనీ’’ స్థాపకులు –అయ్యగారి రామమూర్తి

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర పాలగుమ్మి లో 20-10-1895న జన్మించిన శ్రీ అయ్యగారి రామమూర్తి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పట్టభద్రులు .తరువాత్ కృష్ణాజిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలలో సైన్స్ టీచర్ గా పని చేశారు .సైన్స్ ను డ్రై సబ్జెక్ట్ గా కాకుండా తగిన పరికరాలను ఇన్నో వేటివ్ గా తయారు చేసి వాటి తో బోధించి సబ్జెక్ట్ పై విద్యార్ధులకు మంచి అవగాహన కల్పించేవారు ,

1924,25 రెండేళ్ళు బందరు హిందూ హైస్కూల్ సైన్స్ మేస్టర్ గా పని చేశారు .విద్యార్ధులలో శాస్త్ర విజ్ఞానం పై  అభిరుచి ,ఆసక్తి  అనురక్తి కలిగించారు . ప్రయోగ శాలలో ఉన్న పరికరాలతో ప్రయోగాలు చేసి చూపిస్తూ వారితోనూ చేయిస్తూ గొప్ప స్పూర్తి కలిగించారు .ఆనాడు ఏమాత్రమూ శాస్త్ర ,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు .కాని ఆసక్తికల అయ్యవారు అయ్యగారి  రామమూర్తి  అనేక విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉన్న పదార్దాలనుపయోగించి తయారు చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించారు .అనేక అధ్యయనాలు ,పరి శోధనలు చేసి బందరు లాంటి  పట్టణం లో సైన్స్ పరికరాల ఉత్పత్తి చేసే కంపెనీ ఉంటె బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారు .అప్పటికే పాఠశాలల డిప్యూటీ ఇన్ స్పెక్టర్ గా ఉన్న ఆయన దానికి 1926లో రాజీనామా చేసి  బందరులోనే ‘’ఆంధ్రా సైంటిఫిక్ కంపెని ‘’స్థాపించారు .ఆంద్ర రాష్ట్రం లోనే ప్రప్రధమంగా సైంటిఫిక్ ఎక్విప్ మెంట్ కంపెనీ ‘’మచిలీ బందరు ‘’లో ఏర్పడింది అంటే ఆయన ముందు చూపు అర్ధమౌతోంది . కొద్ది స్థలం లో మాత్రమె రూపు దిద్దుకొన్న ఈ కంపెనీ తర్వాత సువిశాలమైన ప్రాంగణం లో అన్ని హంగులతో నిర్మితమై  అందరి అవసరాలు తీర్చింది .ఇక్కడ తయారైన విద్యుత్ పరికాలకోసం  విదేశాలనుండి కూడా   ఆర్డర్స్ వచ్చేవి  అంటే అంతటి డిమాండ్  ఉండేదన్నమాట  .

క్రమంగా దీన్ని  ప్రభుత్వం తీసుకొనగా , యుద్ధ పరికరాలకు కావలసిన యంత్ర సామగ్రిని కూడా సమ కూర్చే సమర్ధమైన సంస్థగా ఎదిగింది .సామాన్య  సైన్స్ టీచర్ రామమూర్తిగారి  దార్శనికత కు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ అద్దం పడుతుంది  ఫిజికల్ బాలన్స్ లు కెమికల్ బాలెన్స్ లు స్ప్రింగ్ బాలెన్స్ లు లెన్సులు  మిర్రర్లు ,ఇంక్లైండ్  ప్లేన్లు  బున్సెన్  బర్నర్స్  విద్యుత్ పరికరాలు ,కెమికల్స్ ,బ్యూరేట్స్ పిపెట్స్  క్లానికల్ ఫ్లాస్క్లు ,  రౌండ్ బాట్టండ్ ఫ్లాస్క్స్  శోధననాలికలు అనబడే అన్ని రకాల టెస్ట్ ట్యూబ్స్  వగైరా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అంతా అన్ని స్కూల్స్ ,కాలేజీ వాళ్ళు ఇక్కడే కొనేవారు . ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ని సందర్శించటానికి స్కూల్, కాలేజీ విద్యార్ధులు తండోప తండాలుగా వచ్చేవారు .తరవాత కొంతకాలం మూతపడినట్లు జ్ఞాపకం . అప్పుడే లోబెజవాడలో  వివిధ పేర్లతో  సైన్స్ ఎక్విప్ మెంట్ కంపెనీలు వచ్చాయి .  కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరున్న కంపెనీలో ఎక్కువగా కొనేవాళ్ళం .

రామమూర్తిగారు సైంటిఫిక్ కంపెనీతో ఆగలేదు. ఆయన ఆలోచనలను  వివిధ విషయాలపై కేంద్రీకరించారు .బందరులోని చిలకలపూడిలో రసాయనాలు  అంటే కెమికల్స్ తయారు చేసే ‘’నేషనల్ కెమికల్స్ ‘’ సంస్థ ను కూడా స్థాపించి నడిపారు .దీనితర్వాత బందరులో  ‘’ఆంధ్రా గ్లాస్ ప్రాజెక్ట్ ‘’సంస్థను నెలకొల్పటానికి దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి సూత్రప్రాయంగా ప్రారంభించారు . ఈ రెండుకంపెనీలు ప్రారంభ దశలో ఉండగానే  దురదృష్ట వశాత్తు అయ్యగారి రామమూర్తిగారు అస్తమించారు .వీరి మృతితో అవి మూతపడ్డాయి .

రామమూర్తిగారి మేధస్సు అద్వితీయం ఎ.ప్పటికప్పుడు నూతన పరికరాలను తయారు చేయటం ఆయనకు హాబీ  ,వ్యసనం  .సముద్ర వాతావరణమున్న బందరులో ‘’సోడా యాష్ ఫాక్టరీ ‘’నిర్మించాల్సిన అవసరం ఉందని అన్ని వివరాలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ,తానొక్కడి వలన అదిసాధ్యంకాదని ,కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని ఎంతో  ఆశతో కేంద్రానికి పంపారు .అది బుట్ట దాఖలై ఆయనకు ,అందరికి నిరాశ మిగిల్చింది .బందరులో ఒకప్పుడు గొప్ప ఓడ రేవు ఉండేదని  ఇక్కడినుంచే డక్కామజ్లిస్ మొదలైన సున్నితమైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని కనుక మళ్ళీ ఇక్కడ పోర్ట్  నిర్మించాలని నిర్మాణాత్మక సలహాలు  విధి విధానాలు వ్రాత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అదీ  ప్రభుత్వానికి బధిర శంఖారావమే అయింది  .అనేక మంది ముఖ్యమంత్రులు హడావిడిగా శంఖుస్థాపన చేయటం వారు  పదవి నుంచి దిగాక  పోర్ట్   ఎవరికీ పట్టని విషయమే అయింది .ఈ మద్య చంద్రబాబు కూడా పోర్ట్ కు శ్రీకారం చుట్టినా ,ఆయన పాలనకు స్వస్తి జరిగింది ,మళ్ళీ బందరు పోర్టు తంతు మామూలే అయింది .

ఆనాటి భారత ఉపరాస్ట్ర పతి డా సర్వేపల్లి రాదా కృష్ణ బందరు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ కి 1953 జనవరి 4న జరిగిన రజతోత్సవాలకు హాజరై .శ్రీ అయ్యగారి రామమూర్తిగారి అవిరళ  కృషిని  అవిశ్రాంత పరిశోధన లకు ముగ్ధులై ప్రశంసల వర్షం కరిపి౦చి ఆ మహనీయుని సేవలను ప్రజల ముందు౦చి  ,  ఆహూతులకు ఉత్తేజం కలిగించగా వారి హర్షధ్వానాలతో  ప్రాంగణం మారు మ్రోగింది .అయ్యగారి రామమూర్తి అమర్ రహే .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్ట్రక్చరల్ ఇంజినీర్ –పట్నాయకుని ఇందు భూషణ్

స్ట్రక్చరల్ ఇంజినీర్ –పట్నాయకుని ఇందు భూషణ్

విజయనగరం జిల్లా పార్వతీపురానికి సమీప గ్రామం నిడుగల్లు లో పట్నాయకుని ఇందు భూషణ్ జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,కాన్పూర్ ఐ ఐ టి నుంచి ఎం .టెక్  అందుకున్న ఘనులు .1970లో ఆస్ట్రేలియా చేరి అక్కడే ఉండిపోయి మాతృభాష తెలుగుకు అవిరళ కృషి చేశారు .

  ఆస్ట్రేలియా లోనిస్త్రక్చారాల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ,మెల్ బోర్న్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోను పనిచేసి అనేక పరిశోధనలో నిమగ్నమయ్యారు .స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి కొత్త ఊపిరులూదారు .తన పరిశోధనలు నూతన ఆవిష్కరణలు చేస్తూనే మాతృభాష తెలుగు పై ప్రేమాభిమానాలు పెల్లుబికి 1991లో తెలుగు అసోసియేషన్ స్థాపించారు .ఆస్ట్రేలియాలో జన్మించిన తెలుగు పిల్లలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని తెలుగు విద్యా బోధనకు నడుం కట్టారు .ఆస్ట్రేలియా లోని ‘’ఎథినిక్ రేడియో సర్వీస్ ‘’లో రోజూ ఒక గంట సేపు తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేయించే కార్యక్రమం చేబట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు .మెల్ బోర్న్ లో ఉన్న 400 తెలుగు కుటుంబాలకు ,ఇతర ఆస్ట్రేలియన్ల కు తెలుగు నేర్పడం లో తన శాస్త్ర సాంకేతికతను అద్భుతంగా విని యోగిస్తున్నారు

   తెలుగు వారి అభి వ్రుద్ధికోసం ఆస్ట్రేలియాలో ‘’తెలుగు విద్యాలయం ‘’నెలకొల్పిన మార్గ దర్శి క్రాంత దర్శి ఇంజనీరింగ్ విద్యా భూషణ్ గారు .దౌన్ అండర్ ప్రాంతం లో ఉంటూ తెలుగు భాషా మాధుర్యాన్ని పంచుతున్న పట్నాయకుని ఇందుభూషణ్ గారికి జేజేలు .

హైబ్రిడ్ ఇంజన్ రూప శిల్పి –కర్రి విశ్వనాథ్

కర్రి విశ్వనాథ్అనకాపల్లిలో జన్మించి ,హైదరాబాద్ ఉస్మానియాలో మెకానికల్ ఇ౦జ నీరింగ్ పూర్తీ చేశారు .ఆస్ట్రేలియా  వెళ్లి పిహెచ్ డి ,,ఎంఏఐ ఎస్ టిఇడి,ఎంఏ ఐ ఏ ఎఫ్ సి ,ఏం ఎస్ ఏ ఏం యి ,ఏం ఐ ఐ వంటి అనేక డిగ్రీలు ఆర్జించారు  .ఉస్మానియాలో చదువుతూనే ఇంజనీరింగ్ రంగం లో పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు .

 ‘’ఇ౦టలిజేంట్ కార్ ప్రోగ్రాం ‘’లో కర్రి ఆలోచనలు కొత్త ప్రక్రియలకు దారి చూపటం తో ఆయన పేరు ప్రఖ్యాతులు బాగా ప్రచారం పొంది,అంతర్జాతీయ పరిశోధకులుగా గుర్తింపు పొందారు .ఇంధన సమస్యలు తీర్చటానికి ‘’దీజెల్ –హైడ్రోజెన్ ‘’మిశ్రమం తయారు చేశారు .పర్యావరణాన్ని రక్షిస్తూ   అత్యంత  శక్తివంతంగా పని చేసే ‘’హైబ్రిడ్ ఇంజన్ ‘’ నిర్మాణ బృంద నాయకులుగా, రూప శిల్పిగా  విఖ్యాతులయ్యా రు .ఈ ఇంజన్ వలన ఇంధన వినియోగం 70శాతం తగ్గి, ఇంజన్ సామర్ధ్యం 20 శాతం పెరిగి వాడకం దారుల పాలిటి కల్ప వృక్షమే అయింది .ఈ పరిశోధన ‘’హైబ్రిడ్ ఎకానమి’’కి నాంది పలికింది .

  కేవలం ఒక స్పూన్ డీజెల్  ఉపయోగించి ఇంజన్ ను హైడ్రోజెన్ తో నడిపిస్తే దాని శక్తి సామర్ధ్యం 20 శాతం పెరుగుతుందని శ్రీ కర్రి ప్రయోగపూర్వాకం రుజువు  చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యం లో ముంచేశారు .హైడ్రోజెన్ లో డీజల్ కలపటం అనేది అంతర్జాతీయంగా నూతన విషయంగా ఖ్యాతి పొంది విశ్వనాథ విజయానికి ప్రపంచం శిరసు వంచింది .ఇది ‘’పునర్వినియోగ  ఇంధన పరిశోధన’’కు మార్గ దర్శనం చేసి ‘’డాక్టర్ వి.పి.’’గా జగత్ ప్రసిద్ధులయ్యారు . ‘’కర్రి సృష్టి’’ ఇంధన ‘’వర్రీ’’లను దూరం చేసింది .అంతర్జాతీయ స్థాయిలో’’ ప్రగతి చోదక చక్రంగా ‘’ హైడ్రోజెన్ –డీజెల్ ‘’ఇంజన్ సృష్టి కర్త   40 ఏళ్ళ వయసు మాత్రమే ఉన్న ఆంద్ర శాస్త్రవేత్త  శ్రీ కర్రి విశ్వనాథ్ కు దక్కటం మనకు గర్వకారణం .పర్యావరణం కాపాడటం లో ఇంజన్ సామర్ధ్యం పెంచటం లో ఈ కృషి  అత్యంత  విలువైనది మన దేశానికి మన రాష్ట్రానికి కీర్తికారణమైనది .

ఆధారం –శ్రీ వాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంకేతికశాస్త్ర వేత్త- చంద్రు పట్ల తిరుపతి రెడ్డి

సాంకేతికశాస్త్ర వేత్త- చంద్రు పట్ల తిరుపతి రెడ్డి

శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి ఉస్మానియా యూని వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,బొంబాయి లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  డిజైన్ అండ్ మాన్యు ఫాక్చరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి ,మొదటగా హిందూస్థాన్ మెషిన్ టూల్స్ లో ఉద్యోగం లో చేరి ,ఐఐటి ఫాకల్టిలో పని చేశారు .

  అమెరికా వెళ్లి ఆస్టిన్ లో ఉన్న టెక్సాస్ యూని వర్సిటీ నుండి పిహెచ్ డిఅందుకొన్నారు తర్వాత తనకు అభిమానమైన మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధనలు నిర్వహించారు .ఇంజనీరింగ్ కోర్సు కు మూడు పాఠ్య గ్రంథాలు రాశారు .ఇవి పరమ ప్రామాణికంగా ఉండటం వలన అనేక విదేశీ భాషలలోకి అనువాదం పొంది ప్రాచుర్యం పొందాయి .ఇంజనీరింగ్ లో రెడ్డిగారు ఆవిష్కరించిన రెండు కొత్త పరికరాలకు పేటెంట్ లు పొందారు .ఆయన ప్రతిభను గుర్తించి అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్,అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ , సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్స్ మొదలైన ప్రామాణిక సంస్థలు ఆయనకు గౌరవ సభ్యత్వమిచ్చిఘనంగా  సత్కరించాయి .

  తిరుపతి రెడ్డిగారు న్యు జెర్సీ లోని రోవాన్ యూని వర్సిటి లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా చాలాకాలం పని చేశారు .ఈ యూనివర్సిటిలో మెకానికల్  ఇంజనీరింగ్ వి  భాగానికి  దిశా, దశ కల్పించిన ఘనత రెడ్డి గారిదే .ఈ యూని వర్సిటీ లో అంతర్జాతీయ ఖ్యాతి  గడించిన  ప్రొఫెసర్స్ ఎందరో ఉన్నారు .కాని 2006సెప్టెంబర్ లో మహా ప్రతిష్టాత్మకమైన ‘’లిండ్ బ్యాంక్ ఎక్స్ లెన్సి’’   ’’అవార్డ్ ను తిరుపతి రెడ్డిగారికి అందించి అరుదైన గౌరవం కల్పించారు .శాస్త్ర బోధనలో అత్యంత నిపుణులకు మాత్రమే  ఈ అవార్డ్ ను’’క్రిస్టియన్ ఆర్. మేరి ఆఫ్ లిండ్ బ్యాంక్ ఫౌండేషన్ ‘’వారు అందించే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది  ,సుమారు 40సంవత్సరాలు  రోవాన్ యూని వర్సిటీ సుదీర్ఘ సేవలు అందించి, బహుముఖ వ్యాప్తికి తోడ్పడి తనకు, తన ఇంజనీరింగ్ విభాగానికి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టిన ఆంద్ర సాంకేతిక దిగ్గజం  రెడ్డి గారు  .

  రెడ్డి గారు రాసిన ‘’యాన్ ఇంట్ర డక్షన్ టు ఫైనిట్ ఎలిమెంట్స్ ‘’గ్రంథం 2006నాటికే మూడు సార్లు పునర్ముద్రణ భాగ్యం పొందింది అంటే దాని విలువ ఏమిటో అర్ధమౌతుంది .ఇదిస్పానిష్ ,కొరియా భాషలలోకీ  మరికొన్ని విదేశీ భాషలలోకి అనువాదం పొందింది .  రెడ్డి గారిమరో దొడ్డ రచన ‘’క్వాలిటి అండ్ రిలియబిలిటి’’గ్రంథం 2007లో లో ప్రచురితమైంది.

      సాంకేతికంగా గానే కాక సాహిత్య రంగం లోనూ ఆయన ప్రతిభ విశేషమైనదే .తన అనుభవాలకు కవితా రూపమిచ్చి ‘’మనోగతం ‘’కవితా సంపుటి వెలువ రించారు .వీరి సాహితీ సేవకు గుర్తింపుగా ‘’డెట్రాయిట్ తెలుగు అసోసి ఏషన్’’సాహితీ పురస్కారం అందించి సత్కరించింది .వంశీ ఇంటర్నేషనల్  దాశరధి కృష్ణమాచార్యుల  అవార్డ్ లను 2004లో ,తానా ఇంజనీరింగ్ అవార్డ్ 2005లోనూ అందుకొన్న ప్రతిభామూర్తి .సిలికాన్ లోయ లోతులు తరచి ,కంప్యూటర్ యవనికనూ  శోధించి ,శాస్త సా౦కేతిక శాఖల కు మెరుగులు దిద్ది ,సాహితీ జగత్తులోనూ విహరించిన బహుముఖ ప్రతిభాశాలి శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి గారు .

ఆధారం –శ్రీ వాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

నా దారి తీరు -128 మా కుటుంబం

నా దారి తీరు -128

మా కుటుంబం

ఇప్పటిదాకా నా చదువు ఉద్యోగం ,స్కూల్స్, అభి వృద్ధికి  సాహిత్యానికి చేసిన కృషి నాకు గుర్తున్నంతవరకు రాశాను .కొందరిపేర్లు మరచి పోయి ఉండచ్చు. కొన్ని సంఘటనలు మరుగున పడి ఉండచ్చు  .కచ్చితమైన తేదీలు నెలలు సంవత్సరాలు రాయక పొయి ఉండవచ్చు .అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్ళలేదు .అయితే ఇవన్నీ యదార్ధ సంఘటనలే .వీటికి సాక్షంగా ఉన్న విద్యార్ధులు తమ మనోభావాలను నాతో పచుకొంటున్నారు  నిన్నటి 127వ ఎపిసోడ్ లో నా రిటైర్మెంట్ ఫంక్షన్ కు వచ్చినవారిలో మా బావమరది ఆనంద్ కూడా ఉన్నాడని రాయటం మర్చిపోయాను .అలాగే గండ్రాయి హైస్కూల్ అని రాయటానికి బదులు ముప్పాళ్ళ అని  బాలమురళి మేనల్లుడి పేరు పారుపల్లి రంగనాద్ అనటానికి బదులు పారుపూడి రంగనాద్ అనీ రాశాను .ఇలా నా లైఫ్ స్టోరీ  నెట్ లో రాస్తున్నానని ఈ మధ్యనే మా ఇంటికి వచ్చిన శ్రీ  పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారికి చెబితే  ‘’అవన్నీ ఎలా జ్ఞాపకం ఉన్నాయి ప్రసాద్ గారూ ‘’ అని ఆశ్చర్యపోయారు  .నా పోస్ట్ లను రెగ్యులర్ గా చదివే మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ నిన్న మాఇంటికి వచ్చి ‘’ఇన్ని విషయాలు సంఘటనలు వ్యక్తులు నీకు గుర్తున్నాయి అంటే చాలాగ్రేట్ బాబాయ్’’అన్నాడు .ఇవన్నీ నేను రాయాల్సినవి నేను మాత్రమే రాయగలిగినవి .శేర్షిక పెట్టి లాప్ టాప్ లో    రాయటం మొదలు పెడితే  అలా ప్రవాహంలాగా రాసుకొంటూ పోవటమే తప్ప ఏ ఆధారమూ చేతిలో ఉండదు .బహుశా సరస్వతి మాత అనుగ్రహమే ఇది .మా శ్రీ సువర్చలా౦జ నేయ స్వాముల కరుణాకటాక్షమే .మా తలిదండ్రుల చల్లని దీవెనలే  తప్ప నా గొప్పతనం మాత్రం కాదు .ఆ అనుభవాలు అలా రాయించాయి నా చేత  .వాటి వైలక్షణం ,ప్రత్యేకతా కూడా కావచ్చు .

మా ఇంటిపేరు గబ్బిట.మాది ఆంగీరస, అయాస్య, గౌతమ త్రయార్షి ప్రవరాన్విత గౌతమస గోత్రం .కృష్ణ యజుర్వేద శాఖ .తెలగాణ్య  శాఖ బ్రాహ్మణులం.

మా ముత్తాత గారు శ్రీ దక్షిణామూర్తి శాస్ట్రీ గారు వారి భార్య కనకమ్మ వారికీ మా తాత గారుజన్మిచారు

మా తాతగారు గబ్బిట దుర్గాపతి శాస్త్రిగారు .ఏలూరు ప్రక్కన దెందులూరు మండలం లో రామారావు గూడెం అగ్రహారీకులు .అక్కడ మాకు ఒక చిన్న శ్రీ ఆ౦జనెయ  స్వామి దేవాలయం ఉండేది.పొలం వ్యవసాయగొడ్లు గోదా పాడి పంటా పాలేర్లు నిఘామాన్లు ఉండేవారు .మా నాయనమ్మ నాగమ్మ గారు ఉయ్యూరుకు చెందిన గుండు లక్ష్మీ నరసి౦హావదానులగారి కుమార్తె .మా తాతగారితో మా నాయనమ్మ గారి వివాహం ఉయ్యూరు లో ధూమ్ ధాం గా జరిగిందట .సదస్యం నాడు బ్రాహ్మణులకు మాతాతగారు వాళ్ళు బంగారు నాణాలు ఇచ్చారట .ఈ దంపతులకు మానాన్న గారు మృత్యుంజయ శాస్త్రిగారు జన్మించటం, కొద్దికాలానికే మాతాతగారు చనిపోవటం   ఆస్తి అంతా ఆయన అన్నదమ్ముల విభాగాలలో ఆయనకు కొంత దక్కటం  మా మామ్మగారు ఉయ్యూరువచ్చి పుట్టింట్లో ఉండటం జరిగింది .మా నాయనమ్మగారికి ఒక అక్కయ్య,  ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు .మామామ్మగారి తండ్రి వీరిలో ఎవరికి ముందుగా మగపిల్లాడు పుడితే వారికి తన యావదాస్తీ రాసిస్తానని చెప్పి ,ముందుగా మా మమ్మగారికి మానాన్నగారు జన్మించటం చేత దౌహిత్రుడైన ఆయనకు తనకున్నఉయ్యూరు కాటూరు వీరవల్లి లలో ఉన్న  పొలాలు ఉయ్యూరులో ఉన్న పెంకుటిల్లు డొడ్డి  , వగైరా అంతా  రాసి మాట నిలబెట్టుకొన్నారు .ఇలామాకు రామారావు గూడెం అగ్రహార భూములు, ఉయ్యూరులోనిగుండు లక్ష్మీనరసి౦హావదానులగారి ఆస్తి సంక్రమించాయి .ఈ యనే  ఉయ్యూరులో రావి చెట్టుబజారులో ఉన్న స్థలం లో శ్రీ సువర్చలాన్జేయస్వామిని ప్రతిష్టించి దేవాలయ నిర్మాణం చేసి, ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు .ఆయన మరణం తర్వాత మానాన్నగారువంశాపాం పర్య ధర్మకర్తగా ఉన్నారు  ఆయన చనిపోయాక నేను   వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యహరిస్తున్నాను .మానాన్న  గారిని పెంచి పెద్దను  చెసి చదువు చెప్పించి  మా ఇంటికి ఉత్తరపు వైపునే ఉన్న గుండువారి ఆడబడుచు అయిన మా అమ్మ గారు భవానమ్మగారి నిచ్చి వివాహం చేశారు  .మా అమ్మగారి తమ్ముడు గుండు గంగయ్యగా ప్రసిద్ధుడైన గంగాధర శాస్త్రిగారు మా మేనమామ .మా అమ్మ పచ్చని పసిమి .మామామయ్య నల్లని నలుపు .

 

 

 

 

 

 

మా నాన్నగారు ఉయ్యూరులో నూతక్కి నుంచి వచ్చి స్థిరపడిన నూతక్కి శాస్త్రులుగారు లేక చెరుకుపల్లి శాస్త్రులుగారు అని పిలువబడే చెరుకుపల్లి న్లక్ష్మీ నరసింహ శాస్త్రిగారి వద్ద వేదం శాస్త్రాలు నేర్చి తెలుగులో విద్వాన్ అయి ఉయ్యూరు సిబియెం స్కూల్ లో కొంతకాలం పని చేసి అనతపురం జిల్లా హిందూపూర్ లోని యిసియెం హై స్కూల్ లో సీనియర్ తెలుగుపండిట్ గా 22 ఏళ్ళు పని చేసి ఆ సర్వీస్ తో కృష్ణా జిల్లా బోర్డ్ హైస్కూల్ జగ్గయ్యపేట కు శ్రీ కాకాని వెంకటరత్నంగారి పూనికతో ట్రాన్స్ ఫర్ అయి, తర్వాత ఉయ్యూరు కు బదిలీ అయి ఇక్కడే రిటైర్ అయ్యారు . మా నాన్నగారు జిల్లాలోనే గొప్ప తెలుగు పండిట్ అనీ వేద ప్రమాణం లో ఘటికులని ,మంత్రార్ధ వివరణలో మేటి అనీ అందరూ చెప్పుకోగా వినే వాడిని .

మా అమ్మకన్న 12మంది సంతానం లో మా అన్నయ్య  లక్ష్మీ నరసింహశర్మకు పోలసానిపల్లి  పుల్లాభొట్లవారి ఆడబడుచు శ్రీమతి కమల వదినతో వివాహం జరిగి  వేదవల్లి ,రామనాధ బాబు కూతురు కొడుకును కన్నారు   హోస్పేట రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేసి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తో మా అన్నగారు మా రాంబాబు పుట్టిన పదిహేను రోజులకే చనిపోయాడు .ఆ కుటుంబ బాధ్యత అంతా మా అమ్మానాన్న  వహించారు .అలాగే మా అన్నయ్యకంటే పెద్దదైన వేదవల్లి అక్కయ్య  వివాహమైనతర్వాత రాజమండ్రిలో చనిపోయిందని మా అమ్మ చెప్పటం వలననే తెలిసింది .మగవాళ్ళలో నేనూ ,మా తమ్ముడు కృష్ణమోహన్ ,

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆడవాళ్ళలో మా పెద్దక్కయ్య లోపాముద్ర చిన్నక్కయ్య  దుర్గా మిగిలాం .                పెద్దక్కయ్యను ఏలూరుకు చెందిన హిందీ నాటకరంగ నటులు రోషనార ,చంద్రగుప్త వంటి నాటకాలలో పాత్రధారి  పాత వేంకటేశ్వరమాహాత్మ్యం సినిమాలో భ్రుగుమహర్షి ,నిర్దోషి సినిమాలో వేషధారి ,లా పుస్తకాలను లాయర్లకు అందజేసే గాడేపల్లి  పండిట్ రావు అని పిలువబడే గాడేపల్లి  సూర్యనారాయణ సత్యవతి దంపతుల  పెద్ద కుమారుడు  గాడేపల్లి  కృపానిధి బావగారి  గారికిచ్చివివాహం చేశారు .వీరికి సత్యకళ,జయలక్ష్మి శ్రీనివాస్  సంతానం .బావగారు మద్రాస్ కార్పోరేషన్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్సి రిటైరయ్యారు .కార్పోరేషన్ ఇచ్చిన స్వంతిల్లు షినాయ్ నగర్ లో ఉంది  .కళను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే చంద్రశేఖర్ కిచ్చి పెళ్లి చేయగా బాలాజీ జన్మించాడు .చంద్ర శేఖర్ రిటైరయ్యాడు .బాలాజీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు .జయ కు మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ్ కిచ్చి మేనరికం పెళ్లి చేశాము .వీళ్ళకు కళ్యాణ్ కొడుకు .బాబు ఉయ్యూరు విఆర్ కే ఏం హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా  పని చేసి ఈ ఏప్రిల్ లో రిటైరయ్యాడు .కళ్యాణ్ కు    రెండేళ్ళక్రితం పెళ్లై, కెసీపి లో ఉద్యోగిస్తున్నాడు .మేనల్లుడు శీను మద్రాస్ లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకొని సెటిలయ్యాడు .మా పెద్దబావగారు సుమారు 20ఏళ్ళక్రితం ,మా పెద్దక్కయ్య 2008లో చనిపోయారు .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మా అన్నయ్యగారమ్మాయి  వేదవల్లి ని చిరివాడ వేలూరు వెంకటేశ్వర్లుగారి పెద్దబ్బాయి శ్రీ రామకృష్ణ కిచ్చి మేమే వివాహం చేశాం .ఆతను గరివిడి ఫెర్రో ఎల్లాయ్స్  లో అకౌంటెంట్ . రిటైర్ అయి పదేళ్ళు అయినా ,ఆయన మీద ఉన్ననమ్మకంతో అంకితభావం తో చేసిన సేవకు  ఇప్పటిదాకా ఉద్యోగం లో ఉంచారు .మా అమ్మాయి వేదవల్లి కి పెళ్లిచేసేనాటికి పియుసి తప్పింది తర్వాత స్వయం కృషితో డిగ్రీ ,బి ఎడ్ పాసై అక్కడే స్కూల్ లోసోషల్ టీచర్ గా   పని చేసి రిటైర్  అయి  అయిదారేళ్ళు అయింది .ప్రివేట్ గా లా చదివి లా ప్రాక్టీస్ కొంతకాలం చేసింది . వీళ్ళ పెద్దబ్బాయి  రవి ఎంబి ఏ చేయగా   గుంటూరు కుచెందిన ఏం ఎస్ సి పాసైన  గాయత్రితోవివాహం జరిపించగా ఒక కొడుకు పుట్టాడు .రవి మంచి ఉద్యోగం తో హైదరాబాద్ లో కుటుంబం తో సెటిల్ అయ్యాడు . రెండవవాడైన హరి మన భీమవరం లో బిటెక్ చదివిపాసై అమెరికా వెళ్లి  ప్రస్తుతం ర్యాలీ దగ్గరున్న కారీ లో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోగా  వాడికీ వివాహం చేయగా ఇద్దరబ్బాయిలు కలిగారు .ఇదీ మా అన్నయ్య ,పెద్దక్కయ ల  కుటుంబ విశేషాలు .

 

 

 

 

 

 

 

 

మా చిన్నక్కయ్య దుర్గను చిరివాడ కు చెందిన  ,శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారి తమ్ముడు  మిల్లు కృష్ణమూర్తి గా ప్రసిద్ధులు అయిన శ్రీ వేలూరి కృష్ణమూర్తిగారి రెండవకుమారుడు ఉయ్యూరు పాలిటెక్నిక్ లో ఎల్ సియి చదివిపాసైన శ్రీ వేలూరి వివేకానంద గారికిచ్చి వివాహం చేశారు .మా బావగారు మొదటగా ఒరిస్సాలోని హీరాకుడ్ డాం వద్ద సూపర్వైజర్ గా చేరి క్రమంగా ప్రమోషన్స్ పొంది పాట్నా ,జమ్తారా ,మొదలైన చోట్ల సెంట్రల్ వాటర్ కమిషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ ,అయి హైదరాబాద్ కు చేరి డివిజనల్ ఇంజనీర్ గా రిటైరయ్యారు .వీరికి అశోక్ పెద్దకొడుకు . ఉయ్యూరులో మా ఇంట్లోనే ఉండి ఒకటవ క్లాస్ ను౦ఛి ఎస్ ఎస్ ఎల్సి వరకు చదివి  బందరు గుంటూర్ లలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం పొంది , శ్రీమతి సంద్యారాణి ని పెళ్ళాడి  సిద్దిపేటలో చాలాకాలం పనిచేసి తర్వాత హైదరాబాద్ చేరి ,ఓల్డ్ బోయిన్ పల్లి లో  స్వంత గృహం ఏర్పాటు చేసుకొన్నాడు   .వీళ్ళ అమ్మాయి భార్గవి ఏం ఏ .బి ఎడ్, ఏం ఎడ్ .ప్రైవేట్ స్కూల్ లో హైదరాబాద్ లో పని చేస్తోంది .ఈమె భర్త విశ్వనాధ సత్యనారాయణగారి తమ్ముదు వెంకటేశ్వర్లుగారి కుమారుడదు ఉయ్యూరులో నా శిష్యుడు అయిన శ్రీనివాస్  కుమారుడు మురారి  .వీరికి ఇద్దరబ్బాయిలు .అశోక్ కొడుకు ప్రత్యూష్ బిటెక్ చేసి వివాహమై ప్రస్తుతం  ఆస్ట్రేలియాలో ఇద్దరు మగపిల్లలతో భార్యతో కాపురమున్నాడు .

మా చిన్నక్కయ్యవాళ్ళ చిన్నకొడుకు పేరు నాన్నగారిపెరే మృత్యుంజయ శాస్త్రి  .ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి రిజర్వ్ బాంక్ లో   కొంతకాలం పని చేసి , శ్రీమతి విజయలక్ష్మిని పెళ్ళాడి స్నేహితుల ప్రోత్సాహం సహకారం  తో సుమారు 25ఏళ్ళక్రితం అమెరికావెళ్లి  మిచిగాన్ యూనివర్సిటిలో చదివి సుమారు 20ఏళ్ళనుంచి కాలిఫోర్నియాలో  ఫ్రీమాంట్ నగరం లో సెటిల్ అయి స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకొన్నాడు .విజయకూడా అక్కడ ఉద్యోగాస్తురాలే.  వీరికి కృష్ణ, వీణ సంతానం  .కృష్ణ చదువుపూర్తి చేసి మంచి కంపెనీలో ఉద్యోగిస్తున్నాడు .వీణ నృత్యం లో అరగేట్రం కూడా చేసి గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగం చేస్తోంది .

మా చిన్నక్కయ్యవాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి పద్మ . వీణలో ప్రసిద్ధురాలు .గ్రాడ్యుయేట్ .హైదరాబాద్ లో గణపవరపు రామకృష్ణ అనే రియల్ ఎస్టేట్ నడిపే అతని కిచ్చిపెళ్లి  చేశారు .వీరికి రవళి అనే అమ్మాయి రవి తేజ అనే కొడుకు కవలలు .రవళి  బిటెక్ చేశాక ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి చేశారు వీరికే ఒక స్వంత కంపెనీ కూడా ఉంది ఒక కొడుకు కూడా పుట్టాడు  జరిగి  రవి తేజ  కూడా బిటెక్ చేసి ప్రస్తుతం  హైదరాబాద్ లోనే పనిచేసి ఈమధ్యనే బెంగుళూర్ లో బెంగుళూరు లో పని చేస్తున్నాడు .మా అచిన్నక్కయ్య శ్రీమతి దుర్గ 12-4-18 న హైదరాబాద్ లో మరణించింది .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మాతమ్ముడు కృష్ణమోహన్  విజయవాడ బందర్ లలో డిగ్రీ చదివి పూనా వెళ్లి కెమిస్ట్రీలో ప్రైవేట్ గా  ఏం ఎస్ సి చేసి ,అక్కడ  ఆర్డినెన్స్  ఫాక్టరీలో చేరి శ్రీమతి సునీతను పెళ్ళాడి ఆమెకూడా ఉద్యోగం చేస్తూ సుమారు 15ఏళ్ళక్రితం హైదరాబాద్ చేరి ఇక్కడి డిఫెన్స్ కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యాడు .కర్మాన్ఘాట్ లో ఒక ఇల్లు ,సోమాజీ గూడా లో ఒక ఫ్లాట్ ఉన్నాయి  ఒక కూతురు అనూరాధ ,కొడుకు రాజ శేఖర్  .రాజు బికాం చదివి  అమెరికా వెళ్లి సెటిల్ కాలేక  తిరిగొచ్చి హైదరాబాద్ లోనే ఉద్యోగం లో చేరి ప్రస్తుతం అందరూ సోమాజీ గూడాలోనే ఉన్నారు .వీడికి ఇద్దరు అబ్బాయిలు. ఒకడు ఏం బి బిఎస్ చదువు తున్నాడు. రెండోవాడు మొన్ననే ఇంటర్ పాసయ్యాడు .

మా నాన్నగారు 1961లో మా అమ్మగారు 1982లో మరణించారు .మానాన్నగారు ఉండగానే మా అన్నయ్య శర్మ మరణం జరిగింది  . ఈ రెండు శోకాలు భరిస్తూ కుంగి కుమిలిపోతూ సంసారాన్ని మా అమ్మగారు జాగ్రత్తగా నడిపి మమ్మల్ని పెంచారు ప్రయోజకులను చేశారు  . మా నాయనగారు చనిపోవటం వలన మా నాయనమ్మగారు నా చేతులమీదుగా చని పోయారు .

నాసంతానం

మా  అమ్మగారి చెల్లెలు మనవరాలు (కూతురి కూతురు ) అంటే మా పద్మావతక్కయ్య, శ్రీ తూటుపల్లి ప్రకాశ శాస్త్రి దంపతుల కూతురు శీమతి ప్రభావతితో నా పెళ్లి 21-2-1964న నూజి వీడుదగ్గర వేలుపు చర్లలో జరిగింది .అప్పటికి ఆవిడ చదువు 8వ తరగతి

.మా పెద్దబ్బాయి పుట్టగానే మా నాన్నగారి పేరు మృత్యుంజయ శాస్త్రి పేరు పెట్టాం .ఉయ్యూరు హైస్కూల్ లో చదివి టెన్త్ టాపర్ గా మండలం లో మొదటివాడుగా వచ్చి ,ఇంటర్ మా ఊళ్లోనే చదివి ,కర్నూల్ సిల్వర్ జూబిలకాలేజి లో సీట్ రావటం తో అక్కడ బిఎస్ సి చదివి పాసయ్యాడు ..తర్వాత బాంక్ పరీక్షల్లో పాసై స్టేట్ బాంక్ లో ఉద్యోగం వచ్చినా  చేరకుండా గుజరాత్ లోని ఆనంద్ వెళ్లి ఇర్మాలో (Institute Of Rural Manege ment )చదివి కొద్దికాలం అక్కడే ఉద్యోగం చేసి ,తరవాత ‘’టి .సి .ఎస్ .‘’ లో మద్రాస్ లో ఉద్యోగించి ,హైదరాబాద్ బదిలీ అయ్యాడు .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ములగలేటి శివరామకృష్ణ శర్మ శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల ఏకైక కుమార్తె  బికాం చదివిన శ్రీమతి సమత తో వివాహం జరిపించాం.ఇంటికి పెద్దకోడలుకనుక  ఒకటికి రెండు సార్లు అందరం చూసి  ఆమెనే నిశ్చయించాం .తర్వాత మా కోడలు  బిఎడ్ , తెలుగు ఏం ఏ పాసై   ప్రస్తుతంహైదరాబాద్ లో  ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తెలుగు టీచర్ గా పని చేస్తోంది .మల్లాపూర్ లో స్వంత ఫ్లాట్ కొన్నారు .మా పెద్దమనవడు సంకల్ప్.అక్కడే చదివి ,బిటెక్ తంజావూర్ దగ్గర శాస్త్ర యూని వర్సిటిలో చదివి ,టిసిఎస్ లో జాబ్ సంపాదించి ‘’గేట్’’కూడా దూకి  అమెరికాలో మా అమ్మాయి వాళ్ళు ఉంటున్న షార్లెట్ లోని నార్త్ కరోలినాయూని వర్సిటిలో ఏం ఎస్ చేసి 2017మేలో మేమిద్దరం అక్కడ ఉండగా గ్రాడ్యుయేషన్ అయి, జూన్ లో చికాగోలో ఉద్యోగం సంపాదించి అక్కడే పని చేస్తున్నాడు  .రెండవమనవడు భువన్ సాయి తేజ  ఈ ఏడాదే ఇంటర్ పాసై  ఎం సెట్ లో కంప్యూటర్ కోర్స్ కు కావలసిన రాంక్ సాధించి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు .వీడిది మాం—–ఛి కంప్యూటర్ బ్రెయిన్ .

మా రెండో అబ్బాయి శర్మకు మా అన్నగారిపేరు లక్ష్మీ నరసింహ శర్మ పెట్టాం .ఉయ్యూరులో టెన్త్ ,ఇంటర్  పాసై  బెజవాడ లయోలాకాలేజ్ లో బిఎస్ సి హాస్టల్లో ఉండి చదివి , ఎంఎస్ సి సీట్ సంపాదిస్తాను అంటే రెండు వేలు ఇచ్చి పంపితే ఉత్తర భారతం అంతా తిరిగి హర్యానాలో ని ‘’రొహ్ టక్ ‘’ లో ఉన్న  మహర్షి దయానంద యూని వర్సిటి  లో సీట్ సాధించి నెలరోజులతర్వాత ఉత్తరం రాశాడు .తర్వాత ఉయ్యూరువచ్చి ,అన్నీతీసుకు వెళ్లి ,అక్కడే హాస్టల్ లో ఉండి చదివి మాస్టర్ డిగ్రీ తీసుకొన్నాడు .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తర్వాత ఉయ్యూరు విశ్వశాంతిలో కొన్నాళ్ళు లెక్కలమేస్టారుగా పని చేస్తూ ,రోజూ బెజవాడ వెళ్లి NI Tలో కంప్యూటర్ కోర్స్ నేర్చి  భీమవరం కాలేజీలో, హార్స్లీహిల్స్ లో పని చేసి హైదరాబాద్ చేరి రాజ్యలక్ష్మి మిల్స్ లో పని చేశాడు .బెజవాడకు చెందిన ఒరిస్సాలోని జైపూర్ లో బల్లర్షా పేపర్ మిల్స్ లో పని చేస్తున్న  శ్రీ కోట రామలింగేశ్వర శాస్త్రి ,శ్రీమతి భువనేశ్వరి ద౦పతుల ఏకైక కుమార్తె  ఎం.కాం.పాసైన   శ్రీమతి ఇందిరకు ఇచ్చి   శర్మ  పెళ్లి చేశాం .ఈమె మాతామహుడు ‘’ఫైవ్ పండిట్స్ తెలుగు గైడ్’’రాసిన శ్రీనోరి శ్రీనాధ సోమయాజులుగారు .తెలుగుపండిట్ గా మేడూరు హెడ్ మాస్టర్ గా పనిచేసి ,రిటైరయ్యాక బెజవాడ దగ్గర తాడిగడప లో సెటిలయ్యారు .ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు సరళమైన వ్యాఖ్యానం తెలుగులో రాసిన జ్ఞాని ఆయన .తర్వాత శర్మకు  ఐ బి ఏం లో పర్మనెంట్ ఉద్యోగం రావటం  రెండేళ్ళు బెంగుళూరులో పని చేయటం మేము ఒకనెల అక్కడికి వెళ్లి ఉండి మైసూర్, హలీబేడ్ ,శ్రావణ బెల్గోలా,ఒకప్పుడు అంటే  50ఏళ్ళక్రితం మేమున్న హిందూపూర్ చూడటం  నేను హోసూర్ వెళ్లి అక్కడి డా  వసంత్ మొదలైన తెలుగు పరిరక్షణ సమితివారితో కొన్ని గంటలు గడపటం జరిగింది .మా వాడు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఐబిఎం కు ఇంట్లోనుంచే పని చేస్తున్నాడు .మా శర్మకు హర్ష సాయి కొడుకు. హర్షితాంజని కూతురు. మా మనవడు హర్ష టెన్త్ క్లాస్ లో ఉండగా ఒక స్నేహితుడు  టు వీల  ర్ ఎక్కి౦చు కొని యాక్సిడెంట్ చేయటం  బ్రెయిన్ కి చాలాతీవ్రగాయాలవ్వటం  .వెంటనే హాస్పిటల్ లో చేర్చటం మేజర్ సర్జరీజరిగి ప్రాణగండం తప్పటం  తర్వాత  ఏడాది టెన్త్ రాసి పాసవటం ఈ ఏడాది  ఇంటర్ కూడా పూర్తవటం అంతా కూడా వండర్ ,మిరకిల్  .ఈ విషయాలు మీకు తెలుసు .మనవరాలు హర్షిత టెన్త్ పాసై ఇప్పుడు ఇంటర్ సెకండ్ యియర్ లో ఉంది .

మా మూడవ అబ్బాయి నాగ గోపాల కృష్ణ మూర్తి .మా నాయనమ్మగారు నాగమ్మ గారి పేరు కలిసి వచ్చేట్లు పేరు పెట్టాం .ఉయ్యూరులో టెన్త్ చదివిపాసై ,బెజవాడ ఐ .టి.ఐ.లో చేరి మిణకలేక  , ఒక  హాస్పిటల్ లో చేరి వైద్యం నేర్చి స్వయంగా  R.M.P.అయి ,మైలవరం దగ్గర కొన్నేళ్ళు పని  చేశాడు .మంచిప్రాక్టీసు ,పేరు ఉండేది .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హైదరాబాద్ బిహెహ్ యి ఎల్ లో పని చేసి రిటైర్ అయిన శ్రీ బొమ్మకంటి సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి దేవి దంపతుల రెండవ కుమార్తె శ్రీమతి రాణి నిచ్చి వివాహం చేశాం .తర్వాత వాళ్ళు ఉయ్యూరులో సెటిల్ అయ్యారు .ప్రస్తుతం మా స్థలం లో వాటర్ ప్లాంట్ పెట్టి నడుపుతున్నారు .మామనవాడు గౌతమ్ శ్రీచరణ్ ఇక్కడే టెన్త్ ,నారాయణలో ఇంటర్ చదివి ప్రస్తుతం పరిటాలలోని అమృత సాయి అటానమస్ కా   లేజిలో  కంప్యూటర్ కోర్స్ లో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రోజూ ఉయ్యూరును౦చి కాలేజి బస్ లో వెళ్లి వస్తాడు . వీడిదీ గొప్ప కంప్యూటర్ బ్రెయినే . మనవరాలు రమ్య ఈ ఏడే టెన్త్  పాసయి నారాయణ కాలేజిలో ఇంటర్ లో చేరింది .

మా నాలుగవ అబ్బాయి వెంకటరమణ .టెన్త్ పాసై ,ఐటి ఐ లో చేరి మానేసి హైదరాబాద్ వెళ్లి మా అబ్బాయిలు శాస్త్రి శర్మల దగ్గర ఉంటూ అక్కడ కో ఆపరేటివ్ సంస్థలో పని చేసి త్రిఫ్ట్ సొసైటీ నడిపే విధానం బాగా అవగతం  చేసుకొని ఉయ్యూరు వచ్చి పోస్టాఫీస్ ఎదురుగా 17 ఏళ్ళక్రితం ‘’జాగృతి పొదుపు సహకార సంస్థ ‘’స్థాపించి  బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి లాభ సాటిగా నిర్వహిస్తూ ఎం .డి . గానూ సంఘం లోనూ  మంచి పేరుపొందాడు .

 

 

 

 

 

రమణ కు గుంటూరు లోని దుగ్గిరాల కృష్ణమూర్తి దంపతుల మూడవ అమ్మాయి శ్రీమతి మహేశ్వరి తో వివాహం జరిపించాం.

అందరిలో ఆఖరుగా విజయదశమినాడు పుట్టిన మా అమ్మాయి విజయలక్ష్మి టెన్త్ ఇక్కడే చదివిపాసై గుంటూరు గర్ల్స్ పాలిటేక్నిక్ లో కంప్యూటర్ అండ్ అకౌంటింగ్  లోడిప్లోమా చదివి పాసైంది .ఖర్గపూర్ ఐ ఐ టి లో లెక్కల ప్రొఫెసర్ శ్రీ కోమలి సూర్యనారాయణ శాస్త్రి గారి పెద్దకుమారుడు  అక్కడే బిటెక్ చదివి పాసైన శ్రీ సా౦బావధానికి ఇచ్చి వివాహం చేశాం .అవధాని గారుఅప్పుడు  హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పెళ్ళైన ఏడాదికే అమెరికాలోని మాసా చూసేట్ రాష్త్రం  ఆమ్ హార్ట్ లో స్కాలర్షిప్ తో చేరి  యూనివర్సిటీలో చదివాడు .మా అమ్మాయి కూడా వెళ్ళింది .తర్వాత టెక్సస్ రాష్ట్రం లోని హూస్టన్ లో ఉద్యోగం లో చేరి పని చేశాడు .అక్కడే మా పెద్దమనవడు శ్రీకేత్  పుట్టాడు .వాడు పుట్టిన మూడునెలలకు మమ్మల్నిద్దర్నీ అమెరికా కు 2002 జూన్ లో తీసుకువెళ్ళారు ఆరునెలలు అక్కడ ఉన్నాం . మా ఉయ్యూరుకు చెందినమా అప్పలకొండమామయ్య కూతురు శ్రీమతివావిలాల లక్ష్మి దంపతులతో పరిచయం జరిగింది .స్పేస్ సెంటర్ వగైరాలు చూశాం .తర్వాత మా వాళ్ళు మిచిగాన్ స్టేట్ లోని డెట్రాయిట్ కు చేరారు .మా కవల మనవలు అశుతోష్ ,పీయూష్ లు 2005లో  పుట్టినప్పుడు అక్కడే ఉన్నాం .అప్పుడు అక్కడ తెలుగు కుటుంబాలతో సందదేసందడి .మూడోసారి మా వాళ్ళు అదే రాష్ట్ర౦ లోని  స్టెర్లి౦గ్ హైట్స్ లో ఉన్నప్పుడు 2008లో వెళ్లాం .ఇక్కడా చాలా మంది తో మంచికాలక్షేపం , శ్రీమైనేనిగారితో ఫోన్ సంభాషణ ఉండేది .నాలుగోసారి నార్త్ కేరోలీన షార్లెట్ లో స్వంత ఇల్లు కొనుక్కున్నప్పుడు 2012 ఏప్రిల్ లో వెళ్లాం .సత్యసాయి భజనలతో పులకి౦చా౦ .  ఇక్కడే ఈల విద్వాంసుడు శ్రీ కొమరవోలు శివప్రసాద్  మృదంగ విద్వాంసుడు శ్రీ ఎల్లా వెంకటేశ్వరారావుగార్లతో పరిచయం కలిగింది . ఇక్కడే మా చిన్నబావ గారి అన్నగారు వేలూరి ముకుందం గారబ్బాయి పవన్ కుటుంబం ఉంది  ముకు౦దం గారు చనిపోతే, ఆకుటుంబ బాధ్యత అంతా మా అక్కా బావ తీసుకొని ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు .పవన్ ను మా మేనల్లుడు శాస్త్రి అమెరికా తీసుకువెళ్ళి చదివించాడు .ఇప్పుడతను బాంక్ ఆఫ్ అమెరికాలో పెద్ద ఉద్యోగి . భార్య రాధ కూడా ఎంప్లాయి .ఈ కుటుంబంతో మంచి సాన్నిహిత్యమేర్పడింది  .ఐదవసారి2017 ఏప్రిల్ లో షార్లెట్ కే వెళ్లాం. ఈ సారి ససభారతి స్థాపన అయిదు కార్యక్రమాల నిర్వహణ ,నేను రాసిన ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’   పుస్తకావిష్కరణ  అక్టోబర్ 1ఆదివారం మధ్యాహ్నం 2-30నుంచి రాత్రి 7-30వరకు అయిదుగంటలు ‘’దసరా సరదా వేడుకలు ‘’నిర్వహణ ,వ్యాస జయంతి  శంకరజయంతి ,కృష్ణాష్టమి వేడుకలు సుందరకాండ పారాయణ రుద్రాభిషేకాలు సత్యనారాయణ స్వామి వ్రతలు  తో ఊపిరి సలపని కార్యక్రమాలు జరిపించాం .మా పెద్దమనవడు శ్రీ కేత్ హైస్కూల్ లో 12వ క్లాస్ కు వచ్చాడు .కవలమనవలు ఆశుతోష్ ,పీయూష్ లు 8పూర్తి చేసి హైస్కూల్ లో 9లో చేరారు.మా అల్లుడు అవధాని బాంక్ ఆఫ్ అమెరికాలో పని చేస్తూ కొన్నిటికి కన్సల్టెంట్ గా ఉన్నాడు .ఇవీ మా సంతాన విశేషాలు

http://www.familyecho.com/?p=START&c=166x3z3oxjo&f=965188546844566143

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా పసాద్ -24-6-19-ఉయ్యూరు  .

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

”అవధాన మార్తా0డ ”పాలపర్తి

అవధాన మార్తా0డ ”పాలపర్తి and

అమెరికాలోని అట్లా0టా లో త్రిగళ అవధానం జారింది అందులో అచ్చతెనుగు లో అవధానం చేసిన అవధాన చక్రవర్తి డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి ”అవధాన మార్తా0డ”బిరుదిచ్చి సత్కరించారని వార్తా వచ్చింది తెలుగు వారికి గర్వకారబాణం  ఆయనకు అభినందనలు -దుర్గాప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

దారి తీరు -127ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ

నా దారి తీరు -127

ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ

ప్రధానోపాధ్యాయునిగా 11సంవత్సరాలు పని చేసిన నేను 7ఏళ్ళు ఆడ్డాడలోనే పనిచేశాను .మిగిలిన నాలుగేళ్ళలో మొదటి సారిగా ప్రమోషన్ పొందిన వత్సవాయి ,తర్వాత మంగళాపురం ,చిలుకూరివారి గూడెం ,మేడూరులలో పని చేశాను .కనుక లా౦గెస్ట్ ఇన్నింగ్స్ అడ్డాడలోనే నన్నమాట .కావాలనే మేడూరు నుంచి అడ్డాడ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పై వచ్చాను .నేను చేరేనాటికి స్కూల్ లో కరెంట్ లేదు ,చేరిన మర్నాడే వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవానికి ఎగరెయ్యటానికి జాతీయ జెండా కూడా లేదు .అలాంటి స్కూల్ ను అన్ని విధాలా  ఏ రకంగా  అభి వృద్ధి చేసిందీ 107వ ఎపిసోడ్ నుంచి  ప్రొద్దున రాసిన 126వ ఎపిసోడ్ వరకు 20 ఎపిసోడ్ లలో రాశాను .అంత రాయాల్సి వచ్చింది అన్నమాట .21వ ఎపిసోడ్ అయిన ఈ 127ఎపిసోడ్ లో నా పదవీ విరమణ   విశేషాలు రాస్తున్నాను .

ఆకస్మికంగా వచ్చి సమసిపోయిన సంక్షోభం

అది1998 మార్చి నెల మొదటివారం అని గుర్తు .మార్చి 21నుంచి పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమౌతాయి .మార్చి మొదటివారం లో ఒక రోజు నేను ఉదయం 9-30కు స్కూల్ కు వచ్చేసరికి విద్యార్ధినీ విద్యార్ధులంతా స్కూలు బయట రోడ్డు మీద గుమికూడి ఉన్నారు .నేను మామూలుగా నా రూమ్ లోకి ప్రవేశించి అటెండర్ గురవయ్యను విషయం ఏమిటి అని అడిగాను .అతడు ‘’అయ్యగారూ !మొన్న మీరున్నప్పుడు ఆడపిల్లలకు ఇద్దరు టెన్త్ క్లాస్ కుర్రాళ్ళు లవ్ లెటర్ రాశారని ఆపిల్లలు  మీకు కంప్లైంట్ ఇస్తే  మీరు డ్రిల్ మాస్టారుగారినీ ,వీరభద్రరావు గారినీ ఎంక్వైరీ చేయమని చెప్పారు .వాళ్ళు విచారణ చేసి  వాళ్ళు తప్పు చేసినట్లు నిర్ధారించి మీకు చెబితే వాళ్ళతో క్షమాపణ పత్రం రాయించుకొని జాగ్రత్త చేశారు .కాని నిన్న సాయంత్రం నుంచి స్టూడెంట్స్ అంతా గుసగుసలాడుకొని స్కూల్ బాయ్ కాట్ చేయాలని   నిర్ణ యించుకోన్నారని అందుకే ఎవరూ లోపలి రాలేదని తెలిసింది ‘’అన్నాడు .

అప్పుడు నేను సెకండ్ బెల్ కూడా కొట్టించి గేటు బయటికి వెళ్లి స్కూల్ ప్రారంభమౌతుంది ,అసెంబ్లీ జరపాలి లోపలి రమ్మని చెప్పాను .మొహాలు మొహాలు చూసుకున్నారుకాని ఎవరూ లోపలి వచ్చే సూచన కనిపించలేదు .ఆడపిల్లలతో మీకేమీ భయం లేదు నేనున్నాను ధైర్యంగా లోపలి రండి అని చెప్పగా వచ్చారు .అసెంబ్లీ పూర్తి చేసి యధా ప్రకారం స్కూల్ ప్రారంభించి  టీచర్స్ ను క్లాసులకు పంపించా  .అటెండెన్స్ ను హాజరు  పట్టీలోకాకుండా కాగితం మీద తీసుకోమని చెప్పా  .అలాగే చేశారు వాళ్ళు . డ్రిల్ మాస్టర్ , వీరభద్రరావు లను నా రూమ్ కు పిలిపించి మాట్లాడి విషయం అడిగా .వాళ్ళు చెప్పారు .లవ్ లెటర్ రాసిన ఇద్దర్నీ కొట్టామని చెప్పారు .అందుకే బాయ్ కాట్ చేస్తున్నారని చెప్పారు .

నేను కొందరు మగపిల్లలను లోపలకు రమ్మనమని అటెండర్ తో కబురు చేయించా .వాళ్ళు వచ్చారు .వాళ్ళ నోటితోనే విషయం రాబట్టాను . ఆ ఇద్దరు మేస్టార్లు తమకు అపాలజీ చెబితేనే స్కూల్ లో అడుగు పెడతాం అన్నారు .నేను టీచర్స్ తో ఆపని చేయించలేను చేయించనుకూడా.ఇది డిసిప్లిన్ కు సంబంధించిన విషయం .ఇప్పటిదాకా ఇన్నేళ్ళు మిమ్మల్ని ఎలా చూశామో ఏమేమి చేశామో మీకోసం మీకు తెలుసు .పబ్లిక్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి .మీకు నంబర్లు హాల్ టికెట్స్ ఇస్తేనే పరీక్షకు కూర్చోగలరు లేకపోతె ఇంతే సంగతులు .ఒకవేళ మీరు పరీక్ష ఏదోరకంగా రాసినా టిసిలు ఇచ్చేటప్పుడు  కాండక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ఈ ఉదంతం తో ఏదైనా  చెడ్డగా నేను రాస్తే మీకు కాలేజిలో ఎవరూసీట్ ఇవ్వరు. ఉద్యోగాలలో చేర్చుకోరు .ఇప్పటి దాకా స్కూల్ వాతావరణం చాలాబాగుంది .ఇప్పుడు దాన్ని చెడగొట్టి కలుషితం చెయ్యవద్దు.కావాలంటే మీ పెద్దవాళ్ళను తీసుకు రండి మాట్లాడతాను ‘’అని అనునయంగా చెప్పాను .కొంత మనసు మారిందని పించినా కాకమీదున్నారు కనుక ‘’లేదు సార్! ఆ ఇద్దరు టీచర్లు మాకు క్షమాపణ చెప్పాల్సిందే ‘’అన్నారు .నేను మొండిగా ‘’వాళ్ళతో అపాలజీ చెప్పించే సమస్యే లేదు. కావాలంటే నేనే వాళ్ళతరఫున క్షమాపణ చెబుతా .లేదు కాదు కూడదు అంటే ఈక్షణ౦ లోనే నేను రాజీనామా చేసి వెళ్లి పోతా .మీ ఇష్టం అయినా మీ పెద్దలకోసం కబురు పంపాను వాళ్ళ సమక్షం లో నే తేలుస్తా ‘’అన్నాను ‘’సార్!మీరు మాకు దేవుడు లాంటివారు .మిమ్మల్నిఅపాలజి చెప్పమని అంటే మా మూర్ఖత్వం .మీరు కొడతారు తిడతారు అంతకంటే చాలా ఎక్కువగా మా బాగు కోరి చదువు చెబుతారు .మీరు రిజైన్ చేస్తే ,మేమూ ఈ స్కూల్ లో చదవం కూడా ‘’అన్నారు .

కాసేపటికి తలిదండ్రులు ఒకపాతికమంది వచ్చారు .మొదట్లో వాళ్ళూ  చాలా ఉద్రేకంగా మా టీచర్స్ పై మాట్లాడారు .వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు .నేను ము౦దు గాస్వరం తగ్గించి మాట్లాడి విషయం  చెప్పి మా టీచర్స్ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు ఇది స్కూల్ డిగ్నిటీకి ,టీచర్ ప్రొఫెషన్ కు .సంబందిన్చినవిషయం ఇందులో రాజీ లేదు .కావాలంటే వాళ్ళతరఫున నేను అపాలజీ చెబుతా .అదీ మీకు నచ్చకపోతే ఈ క్షణం లో రాజీనామా చేసి వెళ్ళిపోతా ‘’అన్నాను .వాళ్ళు అందరూ ముక్త కంఠం గా ‘’హెడ్ మాస్టారూ!మీరు ఎంతకస్టపడి పని చేస్తున్నారో ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మాకూ తెలుసు .ప్రతి విషయం లోనూ మా సలహా కోరుతున్నారు .మేమూ ఉడతాభక్తి స్కూల్ అభి వృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాం .మీరు మా పిల్లల బాగు కోరేవారు .మీరు మా పిల్లల్ని తిట్టండి కొట్టండి నరికి చంపండి .మిమ్మల్ని ఏమీ అనం .మీరంటే మాకు అంత గౌరవం .కాని ఆ టీచర్స్ అపాలజీ చెప్పాల్సిందే ‘’అని మళ్ళీ మొదటికే వచ్చారు  .అప్పుడు బీరువా తీయించి ఆ ఇద్దరు కుర్రాళ్ళ మీద ఇదివరకున్న కంప్లైంట్లు   నేను ఇచ్చిన వార్ని౦గులు ,డిసిప్లిన్ కమిటీలో ఆ ఇద్దరు టీచర్లు ఉండటం వారిచ్చిన రిపోర్ట్ లు    నేను ఆ పిల్లలతో  రాయించితీసుకొని భద్రంగాఉంచిన     అపాలజీ లెటర్స్ అన్నీ ఉన్న ఫైల్ తీసి అన్నీ చదివి వినిపింఛి ‘’ఇప్పుడు చెప్పండి .మేము క్షమాపణ చెప్పాలా ?’’అన్నాను .అందులో ఉన్న సంజీవరావు గారనే స్కూల్ కమిటీ మెంబర్ పిల్లలతో ‘’దొంగ నాకొడుకుల్లారా బాగా చదువుకోమని స్కూల్ కు పంపుతుంటే ఈ లత్తుకోరు వేషా లేన్ట్రా .చీల్చి పారేస్తాను ‘’అని ఆ ఇద్దరుకుర్రాళ్ళను అందరి ఎదుటా నాలుగు పీకి ‘’సార్!మా వాళ్ళదే తప్పు .మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి దొంగనాకోడుకుల్ని కన్న౦దు కు .మళ్ళీ ఇలా జరక్కుండా మేము జాగ్రత్త పడతాం. మీకు ,స్కూల్ కు ఏ చెడుపేరు రాకుండా చూస్తాం ‘’అన్నారు .హమ్మయ్య అనుకోని తీవ్రంగా పట్టిన మబ్బు యిట్టె విడిపోయినందుకు అందరం సంతోషించాం .ఒక గంటతర్వాత అందరూ స్కూల్ లోకి వచ్చారు. యధాప్రకారం స్కూల్ నడిచింది .ఇక ఎవరిపైనా ఎవరికీ కోపం ద్వేషం లేవు. అందరం కలిసి పని చేశాం. స్టాఫ్ మీటింగ్ పెట్టాను .అంతానన్ను సపోర్ట్ చేసి ఇన్ ష్టి ట్యూషన్ గౌరవం  టీచర్ల మర్యాదా  కాపాడినందుకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు .ఎవ్వరిమీదా ఏ రకమైన కక్ష సాధింపు చర్యలూ మేము తీసుకోలేదు .మర్నాటి నుంచి విద్యార్ధులంతా మా టీచర్స్ తోనూ చాలా గౌరవంగా ఉన్నారు .హెడ్ మాస్టర్ గా నా వ్యక్తిత్వం ఇంతటి సంక్షోభం నుండి బయట పడేసినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను .ఇలా బయటపడకపోతే రచ్చరచ్చ అయి స్కూల్ పరువు మాపరువు ఇప్పటిదాకా మేమంతా కస్టపడి సాధించిన పేరు ఒక్క దెబ్బతో తుడిచి పెట్టుకు పోయేవి .

రిటైర్ మెంట్

1998 ఏప్రిల్ మే నెలలో వేసవి సెలవలలో మేము కేదార్ బద్రీ మొదలైన యాత్రలు చేసి వచ్చామని ము౦దేరాశాను. జూన్ 27నా పుట్టినరోజు కనక రిటైర్ మెంట్ డేట్ కూడా  అప్పుడే అవ్వాలి .కొన్నేళ్ళ క్రితం అందరికీ రిటైర్ మెంట్ డేట్ ఆనెలలచివరి రోజునే అనే జివో రావటం వలన ఆనెల జీతం పూర్తిగా ఇచ్చి చివరి రోజున సాగనంపటం జరుగుతోంది .వేసవి సెలవలతర్వాత జూన్  13స్కూల్ రిఓపెనింగ్ జరిగింది .అప్పటికే రికార్డ్ లన్నీ సిద్ధం చేయటం ,కాష్ లెక్కలన్నీ తయారు చేసి పాస్ బుక్స్ అప్ డేట్ చేయటం ,లెక్కలు ,సైన్స్  లైబ్రరి ,డ్రిల్ మాస్టార్ ల వద్ద ఉన్న స్టాక్ అంతా అప్ డేట్ స్టాక్ రిజిస్టర్ల లో  వాళ్ళు సంతకాలు చేశాక నేను కొంతర్ సైన్ చేయటం  జరిగిపోయాయి .స్కూల్ స్టాఫ్ ఒక రోజు నాకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు నేను మరో రోజు వాళ్లకు పార్టీ ఇచ్చాను .

జూన్ 30న లాంచనంగా స్టాఫ్ విద్యార్ధుల సమక్షం లో రిటైర్ మెంట్ జరిగింది .కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రామబ్రహ్మంగారు ,కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి శ్రీరాజుగారుశ్రీ ఆదినారాయణ గుడివాడి ఉపవిద్యా శాఖాధికారి శ్రీ టి శ్రీరామ మూర్తిగారు ఆహ్వానితులుగా విచ్చేశారు .హైదరాబాద్ నుంచి మా పెద్దమేనల్లుడు ఛి వేలూరి అశోక్,ఉయ్యూరులోని మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ మా పెద్ద, రెండవ రెండవ అబ్బాయిలు శాస్త్రి శర్మలు కోడళ్ళు సమత ,ఇందిర,మామూడు నాలుగుఅబ్బాయిలు మూర్తి రమణ  ఉయ్యూరును౦చి కార్లలో  అడ్డాడ వెళ్లాం  .కామన్ హాల్ లో మీటింగ్ .స్టాఫ్ తరఫున నూతనవస్త్రాలు పూలదండ శాలువా కప్పారు .మా మేనల్లుడు నాకు బట్టలుపెట్టాడు .ఆదినారాయణ రాజుగార్లు శాలువాలు కప్పారు .స్టాఫ్ అంతా చాలా బాగా మాట్లాడారు .విద్యార్ధినీ విద్యార్ధులూ తమ అనుభవాలను బాగా పంచుకొన్నారు .డి.వై .యి. వో గారు నాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్   60 వేల రూపాయల చెక్కు నాకు అందించి నాగురించి మంచిమాటలు చెప్పారు  .ఒకా ఆత్మీయ సమావేశంగా కార్యక్రమ౦ దాదాపు రెండు గంటలు జరిగింది .మా తలి దండ్రుల పేరిట ఏటా టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చిన    విద్యార్ధికి 500రూపాయలు ఇస్తానని  రిజల్ట్స్ రాగానే నాకు కార్డ్ రాస్తే  పంపిస్తాననీ  చెప్పి  ఆ ఏడు 1998 మార్చిలో స్కూల్ ఫస్ట్ గా ,అన్నిట్లోనూ అద్భుత ప్రావీణ్యం చూపిన  మా స్కూల్ లోనేను పని చేస్తున్నప్పుడు  6వ క్లాస్ లోచేరి పదవక్లాసు దాకా చదివి పాసై  ఇంటర్ లో చేరిన మా అందరికి అత్యంత ఇష్టమైన ఆల్ రౌండర్   కుమారి చీలి నాగ లక్ష్మికి మొదటి సారిగా అయిదువందల రూపాయల నగదు పారితోషికం ఉపవిద్యాశాఖాదికారి గారి చేతులమీదుగా ఆఅమ్మాయి తండ్రిగారు శ్రీ వెంకటేశ్వరరావు(రిటైర్డ్ సోషల్ మాస్టర్ ) గారి సమక్షం లో ఇప్పించాను .తర్వాత నాలుగైదు సంవత్సరాలు స్కూల్ ఫస్ట్ కు నగదు బహుమతులు ఇచ్చాను .ఆతర్వాత నేనే చొరవ తీసుకొని ఉత్తరాలురాసి , ఫోన్లు చేసినా స్కూల్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఇవ్వటం ఆపేశాను .ఆతర్వాత నేను మేడూరు  హెచ్ ఎంగా ఉన్నప్పుడు లేక్కలమేస్టార్ అయిన శ్రీ ప్రసాద్ హెడ్ మాస్టర్ అయి మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే వెళ్లి అక్కడ స్కూల్ టాపర్ కి అయిదువందలు ఇచ్చి నాలుగేళ్ళు  కంటిన్యు చేశాను .తర్వాత వాళ్ళూ నాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం తో ఆగిపోయింది .అలాగే ముప్పాళ్ళ లోని ఓల్డ్ స్టూడెంట్ బాబ్జీ అనే బెజవాడ ఫిజిక్స్ లెక్చరర్  ప్రస్తుతం ప్రిన్సిపాల్   ఆగస్ట్ 15  జండా పండగ స్కూల్ లో తన బాచ్ విద్యార్ధులతో చేయిస్తూ నన్ను ఆహ్వానిస్తే వెళ్లి టెన్త్ టాపర్ కు అయిదువందల రూపాయలు ఇచ్చి నాలుగేళ్ళు ఆ హెడ్మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పగానే  బాబ్జీ తో  డబ్బు పంపించి ఇప్పించాను .తర్వాత అదీ ఆగిపోయింది .

నా తర్వాత స్కూల్ లో సీనియర్ అయిన లెక్కలస్టారు శ్రీ యెన్ .సీతారామ రాజుగారికి బాధ్యతలు , స్కూల్ తాళాలు అప్పగించాను .అడ్డాడ విద్యార్ధులు అప్పుడప్పుడు బస్సుల్లో కనిపిస్తుంటారు .వాళ్ళంతా గొప్ప అభిమానం చూపిస్తారు .పాము సురేష్ ఫేస్ బుక్ లో పకరిస్తున్నాడు  .మద్రాస్ లో ఉన్ననాగ లక్ష్మి మూడేళ్లక్రితం ఫోన్ చేసి మాట్లాడిని .అమెరికాలో ఉన్న కోడూరి పావని రేగ్యులరా ఫోన్ చేసే మాట్లాడేది   నా సర్వీస్ లో బాగా కస్టపడి ,స్కూల్ కు  నాకూ మంచి పేరు సాధించిన అడ్డాడ హైస్కూల్ ను మరవటం కష్టం .అందుకే దీనిపై అంతఇష్టంగా 21 ఎపిసోడ్ లు రాసి సంతృప్తి చెందాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-19-ఉయ్యూరు

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.


You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9aKX2qsKj5XTMU4rj7vqerKdV8yBdZuEpbxfpi9vVfyw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Anand mavayya vacchadu

Show quoted text

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -126 పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం

నా దారి తీరు -126

పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం

 1998 జూన్ 30కి నాకు 58 ఏళ్ళు నిండుతాయి కనుక జూన్ నెలాఖరుకు నా రిటైర్ మెంట్ .అప్పటికే నా కంటే జూనియర్స్ నాకంటే ఎక్కువ జీతః తీసుకొంటున్నట్లు తెలిసి ,ఆ వివరాలుసేకరించి   కంపారటివ్ స్టేట్మెంట్ తయారు చేయించి   వాళ్ళుపొందుతున్న జీతాల  ఆర్డర్ కాపీలు సంపాదించి వాటినకళ్ళు జత చేసి జిల్లాపరిషత్ కు పంపాను .దీనికంతకూ మంచి సహకారం అందించాడు జూనియర్ అసిస్టెంట్ బాబు .అతనే బందరు వెళ్లి చెయ్యాల్సిన పని అంతా చేసి సాంక్షన్ చేయించాడు .ఈ తేడా లకోసం బిల్ చేయటానికి నేను పని చేసిన ఇతర స్కూళ్ళ నుండి నాన్  డ్రాయల్ సర్టిఫికెట్లు పొందాలి .ఆ స్కూళ్ళ హెడ్ మాస్టార్లకు అఫీషియల్ గా లెటర్స్ పంపించి తెప్పించి  బిల్స్ చేసి జిల్లాపరిషత్ కు పంపి సాంక్షన్ చేయించాము .పెంజేండ్ర హెడ్మాస్టర్ శ్రీ వి రఘురాములు అంతకు ముందు పామర్రులో మేమిద్దరం అసిస్టెంట్స్ గా పని చేసినప్పటినుంచి పరిచయం . ఇప్పుడు నాకంటే ఎక్కువ జీతం డ్రా చేస్తున్నట్లు మాటల సందర్భంగా చెప్పాడు .తనదగ్గరున్నసాంక్షన్ ఆర్డర్స్ నాకు పంపటం తో ఇదంతా అమలు జరగటానికి వీలైంది .

          అలాగే కుటుంబ నియంత్రణ ఇన్సెంటివ్ లకోసమూ పని చేసిన అన్ని స్కూళ్ళ నుండి నా డ్రాయల్స్ తెప్పించాలి ఆయా స్కూల్స్ హెడ్ మాస్టర్స్ సౌజన్యం వలన  అవీ సకాలం లో రావటం బిల్స్ చేసి సాంక్షన్ చేయించుకోవటం జరిగింది .22ఏళ్ళ ఆటోమాటిక్ ఇంక్రిమెంట్ ,హెడ్ మాస్టర్స్ స్కేల్ ఫిక్సేషన్ ,ఈ స్కేల్ లో రావాల్సిన చివరి ఇంక్రిమెంట్  కూడా పరిషత్ విద్యాశాఖాదికారి గారితో సకాలం లో మంజూరు చేయించాము .ఇక పెన్షన్ పేపర్స్ తయారు చేసి జిల్లాపరిషత్ కు ,డి.యి .వో .గారికి పంపాలి  .దీనికీ మా గుమాస్తా చకచకా ఫారాలు పూర్తీ చేయించి పంపించేశాడు .అప్పటిదాకా పెన్షన్ ఫిక్సేషన్ చివరి పదినెలల ఆవరేజ్ పే మీద లెక్కించి ఇవ్వటం  ఉన్నది. అలాగే పేపర్స్ తయారు చేసి సబ్మిట్ చేశాం .పంపిన తర్వాత ప్రభుత్వం తో ఉద్యోగ సంఘాల నిరంతర పోరాటం వలన పెన్షన్ ను చివరినెల లో తీసుకొన్నబేసిక్ పే పైనే ఫిక్స్ చేయాలి అని ఆర్డర్ వచ్చింది .మా గుమాస్తా బాబు అత్యంత వేగంగా డియివో ఆఫీస్ కు వెడితే ,నా పెన్షన్ పేపర్స్ హైదరాబాద్ పంపకుండా అక్కడే ఉన్నట్లు తెలుసుకొని ,వాటిని తీసుకొచ్చి టెన్ మంత్స్ ఆవరేజ్ ను ,లాస్ట్ మంత్ పే ఆధారంగా మార్చి మళ్ళీ డియివోఆఫీసులో సబ్మిట్ చేసి  వాళ్ళ చేతిలో మామూళ్ళు పెట్టి ఇక ఆలస్యం కాకుండా హైదరాబాద్ పంపేట్లు చేశాడు .అతడు ఇంత స్పీడ్ గా పని చేయటం వలననే  నాకు పెన్షన్ లాస్ట్ మంత్ పే మీద ఫిక్స్ అయి వచ్చింది .ఇలా చేయనివారికి మామూలుగా టెన్ మంత్ ఆవరేజ్ పే మీద పెన్షన్ సాంక్షన్ అయింది .నామిత్రుడు శ్రీ పి.ఆంజనేయ శాస్త్రి గారికిఇలా జరిగి ,ఈమధ్యనే అందరికీలాస్ట్ మంత్ పే మీదనే ఇవ్వాలని జి వో ఇస్తే ఇప్పుడు ఎరియర్స్ తో సహా పొందారు .నాకుమాత్రం నేను రిటైర్ అయిన రోజునుంచే అమలైంది .ఇదంతా ఒక పెద్ద ప్రహసనం ,ప్రాసెస్ .పెన్షన్ పేపర్స్ తయారు చేయటానికి డియివో ఆఫీసులోఒకరిద్దరు   బెజవాడ బందరు గుడివాడ ఉయ్యూరు మొదలైన చోట్ల కొందరు అనుభవజ్ఞులు ఉంటారు వీరి చేతిలో రెండు వందలుపెట్టి ఇన్ఫర్మేషన్ అంతాఇస్తే , ఇకమనం సంతకాలు పెట్టటం తప్ప మరే పనీ ఉండదు .చలామంది ఇలాంటి వారి తోనే చేయిస్తారు .వీళ్ళు చేస్తే డియివోఆఫీస్ లోకూడా ‘’కొర్రీలు’’ పడవు .వెంటనే సాంక్షన్ కోసం పైకి పంపేస్తారు .లేకపోతె ‘’వర్రీస్’’ తప్పవు .కనకవల్లి వాసి ,ఉయ్యూరు ,పెనమకూరు లలో నాతొ పని చేసిన  తెలుగుమేస్టారు శ్రీ వెంపటి శర్మగారికి చాలాకాలం పెన్షన్ సాంక్షన్ కాకపొతే ఉపాయం చెబితే ,మొదట్లో భీష్మి౦చినవాడు తర్వాత దారికొచ్చి పెన్షన్ పొందగలిగాడు  .

   సుమారు 40ఏళ్ళక్రితం మా  ఇంటిప్రక్కన ఉన్న  మా పెంకుటింట్లో కాపురమున్న శ్రీ మల్లాది రామకృష్ణయ్యగారు ఉయ్యూరు సమితిలో ఎలిమెంటరి స్కూల్ మేస్టర్ గా పని చేస్తూ కాపురమున్నారు.చాలా అభిమానవంతులు .నలుగురు మగపిల్లలు .వారందర్నీ బాగా చదివించారు. జీతాలకోసం డి.యే .కోసం స్ట్రైక్ లు జరిగితే ,ఆయన పరిస్థితి గమనించి అందరం సాయం చేసి మేము బియ్యం డబ్బూ కూడా  ఇచ్చి పస్తులు ఉంచకుండా చూశాము .దీనికి ఆకుటుంబం ఎంతోకృతజ్ఞతాభావం తో ఉండేవారు .అద్దె కూడా ఇచ్చినప్పుడే తీసుకోనమనేది మా అమ్మగారు . ఆ తర్వాత ఆయన రిటైర్ అవటం పెద్దబ్బాయి శాస్త్రి ఎ .జి.ఆఫీస్ లో ఆఫీసర్ అవటం మిగతావారంతా కూడా హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలలో సెటిల్ అవటం జరిగింది .ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళకు మేము వెళ్ళటం ,వాళ్ళు మా ఇంటికి రావటం జరుగుతోంది. ఫోన్ లో మాట్లాడుకోవటమూ ఉంది .మల్లాదిమేస్టారు ముందుగా ,తర్వాత భార్య శ్రీమతి వెంకట లక్ష్మి గారు కూడా  చనిపోయారు .వాళ్ళ రెండో అబ్బాయి రామకృష్ణ శాస్త్రిని మేమంతా ‘’ఎంఆర్కే’’అంటాం  రెండు నెలలక్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు . తర్వాత వాడు సత్యం .చివరివాడు  వెంకటేశ్వర్లు .తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతాడు .ఇటువైపువస్తే ఉయ్యూరువచ్చి చూసి వెడతాడు .

  మల్లాది మేస్టారి పెద్దబ్బాయి శాస్త్రి  ఏజీ ఆఫీసు లో ఆఫీసర్ గా ఉండటం, అతని దృష్టికి నా పెన్షన్ పేపర్ల సంగతి తీసుకు రావటం తో కానీ ఖర్చు లేకుండా ఏజీ ఆఫీసులో నా పెన్షన్ సాంక్షన్ అయి అక్టోబర్ నుండి చేతికి వచ్చింది  .కృతజ్ఞతా భావాలకు ఇవన్నీ పరాకాష్ట లు .మనుషులమధ్య డబ్బు సంబంధంకంటే మానవీయ విలువల సంబంధం ఉంటె ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి .కొన్ని దశాబ్దాల క్రితం మా ఇంట్లో నెలకు 6 రూపాయలకు  అద్దెకున్న కుటుంబం లో అందరూ కస్టపడి పైకొచ్చి అందరికీ ఆదర్శంగా ఉన్నారు .లేమిలోంచి కలిమిలోకి ఎదగటం అందునా హైదరాబాద్ లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు .మా అమ్మగారన్నా, మేమన్నా ఆకుటుంబానికి ఆరాధనా భావం .మాకు వారంటే విపరీతమైన అభిమానం .వారి సౌజన్యం మాకు ఆకర్షణ  .మల్లాది వారి వంటి కుటుంబాలు అత్యంత  అరుదుగా ఉంటాయి .

            సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -125 తీర్ధ యాత్ర

నా దారి తీరు -125

            తీర్ధ యాత్ర

కృష్ణా పుష్కరాలు

గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి .కృష్ణానదికి  1992లో పుష్కరాలు వచ్చినప్పుడు  అడ్డాడలో పని చేస్తున్నాను .ఆదివార౦ నాడు  ఉదయమే ఉయ్యూరులో 4గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి  ,రెండు రౌండ్లు కాఫీ తాగి ,ఇంట్లో తయారు చేసుకొన్నా టిఫిన్ బాక్స్ లో  పెట్టుకొని  మంచినీళ్ళతో సహా మేమిద్దరం బస్ ఎక్కి నాగాయలంక లో రేవులో ,పెదకళ్ళేపల్లి ,శ్రీకాకుళం ,అవతలి ఒడ్డున గుంటూరు జిల్లాలోనిచిలుమూరు  రేవు లలో పవిత్ర పుష్కర స్నానం చేసి,దేవాలయ దర్శన౦ చేసి ,వీలున్నప్పుడు తెచ్చుకొన్నది తిని, లేక పళ్ళు తిని సాయంకాలందాకా ఇలా గడిపి రాత్రికి ఇంటికి చేరేవాళ్ళం .మరో రోజు ముక్త్యాల వెళ్లి స్నాన దర్శనాలు చేశాం .ఒక రోజు బెజవాడ కృష్ణాస్నానం చేశాం .  ఇలా ఆ 12 రోజుల్లో వీలైనన్ని రోజులు కృష్ణా పుష్కరస్నానం చేశాం .రాత్రి ఇంటికి వచ్చే వండుకొని భోజనం చేయటం. పగలెక్కడా హోటల్ లో భోజనం కాని టిఫిన్ కానీ చేసేవాళ్ళం కాదు.1980 కృష్ణా పుష్కరాలకు మాకు దగ్గరలో ఉన్న  తోట్లవల్ల్లూరు  ఐలూరు వెళ్లి పుష్కర స్నానాలు చేశాం. మా చిన్నక్క శ్రీమతి దుర్గ , బావ శ్రీ వివేకాన౦ద్ గారు హైదరాబాద్ నుంచి వస్తే వల్లూరులో అందరం కలిసి పుష్కర శ్రాద్ధం కూడా పెట్టాం అప్పుడు మా ఇంటి పురోహితులు శ్రీ కోట కృష్ణ మూర్తిగారు .ఈ పుష్కరం లోనే బెజవాడ లో శ్రీ చిట్టిబాబు వీణకచేరీ చూశాం ఆయనతో మాట్లాడాం .ఆయన కచేరీ ‘’రసపుష్కరం లో వోలలాడినట్లుంది’’అని బస్ టికెట్ వెనకాల ఎవరినో పెన్ను అడిగి రాసి ,సభాధ్యక్షులు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారికిస్తే  ఆయన చదవలేక ‘’ఈ మేష్టారు ఏదో గొప్పగా రాశారు ఆయనే వేదికపైకి వచ్చి చదివితే బాగుంటుంది ‘’అని నన్ను ఆహ్వానిస్తే  ఆమాటతోపాటు మరికొన్ని మాటలు కూడా చెప్పగా చిట్టిబాబుగారు రెండు చేతులూ ఎత్తి నమస్కరించారు .అదే మొదటిసారి చివరి సారీ ఆయన్ను చూడటం  . ,శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథా గానం కూడా మధ్యాహ్నం జరిగితే విన్నాం .అలాగే శ్రీబాలమురళిగారి మేనల్లుడు  పారుపూడిరంగనాథ్ ? అన్నమయ్య కీర్తనలూ విన్నాం .ఆయన తానె నాకు బాలమురళి మేనల్లుడిని అని చెప్పి బాగా మాట్లాడారు .అక్కడే తిరుమల దేవస్థానం వారు నిర్మించిన శ్రీవారిఆలయాన్నీ స్వామినీ దర్శించాం .2016పుష్కరాలు ప్రారంభానికి ముందు ఎవరో స్వామీజీ పుష్కరఘడియలు రావాల్సిన ఆగస్ట్ 12కంటే ముందే వచ్చాయని  కృష్ణా పుష్కర స్నానం చేశారని పేపర్లో చదివి మా అమ్మాయి వాళ్ళ అమెరికా ప్రయాణం సరిగ్గా12వ తేదీ నే అవటంతో ఆగస్ట్ 8న కారులో ఉయ్యూరులో ఉదయమే బయల్దేరి  ముక్త్యాల వెళ్లి కృష్ణా పుష్కరస్నానం   మా అమ్మాయి విజ్జి  మనవళ్ళు శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్  నేనూ చేసి మా శ్రీమతి అప్పటికి కంటి ఆపరేషన్ చేయించుకోవటం వలన పుష్కర పవిత్ర జలం చల్లి స్నానమంత్రాలన్నీ నేనే చెప్పి పుష్కర కృష్ణా నీటిని బాటిల్స్ లో పట్టుకొని  శ్రీ ముక్తేశ్వర స్వామి ని దర్శించి తెచ్చుకొన్న టిఫిన్ తిని ,కోటిలింగాల క్షేత్ర దర్శనం చేసి ,దారిలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దర్శనమూ చేసి ,పరిటాల శ్రీ బృహత్ ఆంజనేయ దర్శనం చేసి ఫెర్రి వెళ్లి గోదావరి కృష్ణా  సంగమ క్షేత్రం చూసి మొదటి సారి చూసి చంద్రబాబు అకు౦ఠిత దీక్ష కు జేజేలు పలికి ,సంగమ జలాలు పట్టుకొని రాత్రికి ఇంటికి చేరాం  .10 ఉదయం అందరం కారులో హైదరాబాద్ వెళ్లి ,12ఫ్లైట్ కు మా అమ్మాయి వాళ్ళను  అమెరికాకు పంపించాము .

  మా అబ్బాయి శర్మ కోడలు ఇందిరా మనవడు హర్ష మనవరాలుహర్షిత  ఒక ఆదివారం  వాళ్ళకారులో సుమారు 150కిలోమీటర్ల దూరం లోఉన్న బీచుపల్లి వెళ్లి గలగలపారే  కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసి నేనే పోరోహిత్యం వహించి  శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించి ,భోజనం చేసి మధ్యాహ్నం అలంపురం లో శ్రీ జోగులా౦బ  దర్శించి రాత్రి 9కి మా వాళ్ళు ఉండే బాచుపల్లి చేరి పుష్కర స్నాన ఫలితం తెలంగాణా లో పొందాం .ఏర్పాట్లు ఏవీ సరిగ్గలేవు .ఉచిత భోజనాలులేవు ఆంధ్రాలోలాగా. రోడ్లు కనాకష్టం. టోల్స్ తీసేస్తానన్న కేసి ఆర్ మాట నిలబెట్టుకోలేదు  బాదుడేబాదుడు. ఇలా ‘’బాచుపల్లి టు బీచుపల్లి ‘’యాత్ర చేశాం .

     గోదావరి పుష్కరాలు

గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కర శోభ వస్తుంది .2003 కు వచ్చిన పుష్కరాలకు మాత్రం మేమిద్దరం హనుమకొండలో మా పెద్దబ్బాయి శాస్త్రి అత్తారింటికి వెళ్లి మా రెండవ మనవడు భువన్ ను చూసి మేమిద్దరం ,మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మి గారు ఒకరోజు బస్ లో ఉదయమే 5గంటలకు  దక్షినకాషి లేక రెండవ కాశి కాళేశ్వరం వెళ్లి గోదావరి ,ప్రాణహిత నదుల సంగమం లో  పుష్కరస్నానం  అక్కడి శ్రీ కాళేశ్వరస్వామిని దర్శింఛి సాయంత్రానికి తిరిగివచ్చాం .మర్నాడు మేము ముగ్గురం అలాగే బస్ లో ధర్మపురి వెళ్లి గోదావరీ పుష్కరస్నానం చేసి  శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ,రాత్రికి ఇంటికి చేరాం ,విపరీతమైన జనసమ్మర్దం బస్సులు సమయానికి లేకపోవటం తో ప్రయాణాలు విసుగెత్తాయి .ఒకసారి మా బామ్మర్ది ఏలూరులో ఉన్నప్పుడు అందరం కొవ్వూరు వెళ్లి పుష్కరస్నానం చెఇ రాజమండ్రి చూసి ఇంటికి చేరాం .

            2015గోదావరి పుష్కరానికి మేమిద్దరం, మా మూడోకోడలు శ్రీమతి రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య కారులో ఉదయం 5గంటలకే బయల్దేరి మొదట రావులపాలెం దగ్గర గౌతమీ నదీ స్నానం చేసి ,వసిష్ట నదీ దర్శనమూ చేసి, వెంట తెచ్చుకొన్న టిఫిన్ తిని కాఫీ తాగి ,సరాసరి కోటిపల్లి వెళ్లి అక్కడా గోదావరిలో మధ్యాహ్నం 12-30 కు దేవతలంతా నదిలో కొలువై ఉంటారన్న నమ్మకం తో పుష్కర స్నానం చేసి ,రద్దీ ఎక్కువగా ఉండటం తో శ్రీ సోమేశ్వరస్వామిని దర్శించకుండానే కొంతదూరం ప్రయాణం చేసి ఒకరి పాక ముందున్న అరుగులపై మేము తెచ్చుకొన్న భోజనం ఆరగించి డ్రైవర్ కూ మాతోపాటే అన్నీ పెట్టి ,ద్రాక్షారామ౦ ,పాలకొల్లు లలో  లో స్వామి దర్శనం చేసుకొని ,రాత్రికి ఇంటికి చేరాం

  కేదార్ నాథ్ బదరీనాథ్ యాత్ర

ఇదీ అడ్డాడలో పని చేసినప్పుడే జరగటం తమాషా .చాలసార్లుమా  చిన్నక్కయ్యా,బావా కేదార్ నాథ  బదరీనాథ యాత్రలకు వెడదామనటం ఆలాగే అనటం  తో సరిపోయింది .1998జూన్ నెలాఖరికి నా రిటైర్ మెంట్ .కనుక అందరం వేసవి లో తప్పక  వెళ్ళాలనుకొన్నాం. మేమిద్దరం వాళ్ళిద్దరూ. మా బావే అన్నీ కనుక్కోవటం బుక్ చేయటం చేశారు’’ రావు ట్రావెల్స్’’వాళ్ళు బాగా చూపిస్తారని ఆయన తెలుసుకొని దానికి బుక్ చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ మనం చేరితే పికప్ చే సుకోవటం దగ్గర్నుంచి అన్నీ చూపించి మళ్ళీ ట్రెయిన్ ఎక్కి0చేదాకా వాళ్ళదే బాధ్యత .యాత్ర మే నెల మొదటివారం లో ప్రారంభమౌతుంది .కనుక మేము హైదరాబాద్ కు ముందే ఆ అబ్బాయి శర్మా వాళ్ళింటికి చేరాం .కావలసినవన్నీ తీసుకొన్నాం చలిను౦చి  రక్షణకు ఏర్పాట్లు చేసుకోన్నాం  ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరాం .దారిలో తినటానికి తిఫిన్లకు అన్నీ సిద్ధంగా ఉన్నాము .వేసవికాలం కూలింగ్ వాటర్ కోసం మిల్టన్ వాటర్ పాట్ ఉంచుకోన్నాం .ఢిల్లీ చేరగానే రావు ట్రావెల్స్ వాళ్ళు స్టేషన్ కొచ్చి పికప్ చేసుకొని ఒక బెంగాలీ డార్మేటరిలో  ఉంచారు .భోజనం కొన్నాం కాని చేపలకంపు ఉప్పుడుబియ్యం అవటం తో లోపలి పోలేదు .చపాతీ ఇస్తే తిన్నాం .రాత్రి 9 గంటలకు  రావు ట్రావెల్స్ వాళ్ళ వాన్ వచ్చింది ఇందులోనే మా ప్రయాణం .వంట వడ్డన ఏర్పాట్లన్నీ ఉన్నాయి .రావుగారు  మిలిటరిలో పని చేసి రిటైరయ్యాక టూరిజం లో ప్రవేశించి ఇలా టూర్స్ నడుపుతున్నారు .తెలుగువాడే మాతో చాలామర్యాదగా మంచి తెలుగులో మాట్లాడారు .రాత్రి 10గంటలకు కొబ్బరికాయకొట్టి మా అందరికి స్వీట్లు పెట్టి హాపీ జర్నీ చెప్పి మమ్మల్ని పంపారు .ప్రయాణీకులం 13మందే ఉన్నాం .అన్ని రకాల భాషలవాళ్ళు ఉన్నారు తెల్లారేసరికి రుషీ కేశ్ చేరాం  అక్కడగంగ ఒడ్డు ఆపి ,  టిఫిన్ కాఫీ తయారు చేసి ఇచ్చారు గంగాస్నానం చేసి దేవాలయాలు   నాకు చాలా ఇష్టమైన స్వామి శివానంద ఆశ్రమం చూసి ,మధ్యాహ్నభోజనం పెడితే తిని సాయంత్రం ప్రయాణం సాగించి ,రాత్రికి ఒక చోట డార్మేటరిలో బస చేసి మళ్ళీ ఉదయమే అయిదింటికి బయల్దేరి దారిలో పెట్టిన కాఫీ టిఫిన్లు లాగిస్తూ ,అలక్ నందా  భాగీరధీ నదుల సంగమ స్థానం  దేవప్రయాగ ,దాటి  దారిలో మాకు పూజలు చేయించే పండిట్ ను ఎక్కించుకొని గౌరీ కుండ్ చేరి పోనీలను 600రూపాయలకు మాట్లాడుకొని మంచు దారిలో ఇనుప సీటుపై ముడ్డి మంట ఎత్తుతుంటే,ఒరిగిపదడిపోతామనే భయంతో, గుర్రాల జీన్లుపట్టుకొని నడుస్తూకాలినడకన వాటి యజమానులు  చల్ చల్ మంటూ అదిలిస్తూ 14కిలోమీటర్లు ప్రయాణం చేసి కేదార్ నాథ్ చేరాం. రాత్రి ఒక హోటల్ లో మకాం .చలికి వణికి పోతున్నాం .వెళ్ళగానే కమ్మని కాఫీ ఇచ్చారు చాలాబాగుంది. తాగితే కొంత అలసట తగ్గింది .వెంటనే మంచు దిబ్బలదారి లో కేదారనాధుని దర్శించి అక్కడ గుడిలో నేను రెండుగంటలు మహాన్యాసం నమక చమకాలు ఉపనిషత్తులు చదువుతూ దేవుడి ఎదురుగా కూర్చున్నా. జనం బాగానే ఉన్నారు .హోటల్ రూమ్ కు వచ్చి పడుకొన్నాను.  రజాయిలు అన్నీ ఉన్నాయి కరెంట్ ఇంకా సరిగ్గా లేదు చీకటి . పళ్ళు అదిరిపోతున్నాయి చలికి .మాతోపాటే  పండిట్ కూడా  ఉన్నాడు  .నిద్రలేదు .నాలు గింటికే లేచివేన్నీళ్ళు లేకపోతె ఆ చన్నీరే చల్లుకొని స్నానం అయి౦దని పించాం .పండిట్ వచ్చి అందరికీ దర్శనానికి పూజకు డబ్బులు కట్టించుకొని దర్శనం అభిషేకం చేయించి ప్రసాదం ఇచ్చి ,మళ్ళీ మాతో బయల్దేరాడు.పోనీలవాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని  వాళ్ళ పోనీలపై కూర్చోపెట్టుకొని మధ్యాహ్నం 12కు గౌరీరీకుండ్ చేర్చారు .బస్సులు వాన్లు చాలాదూరం లో పార్క్ చేసి ఉంచుతారు .అక్కడికి చేరి ఎక్కాము   వెళ్ళేటప్పుడు గౌరీకుండ్ లోనే తినటానికి అన్నీ కట్టించి ఇచ్చాడు కుక్.కానే దేన్నీ తినలేదు మేముమాత్రం  .మా బావ గారుపోనీ ఎక్కకుండా నడిచి ఎక్కి నడిచి దిగారు .గౌరీకుండ్ లో హిమాలయ సౌందర్యం అద్భుతం .ప్రవరుడు హిమాలయం వచ్చినప్పుడు పెద్దనగారు రాసిన ‘’అటజనికాంచె భూమిసురుడు ‘’పద్యం కళ్ళకు కడుతుంది. అత్యున్నత హిమ శృంగాలు జలపాతాలు సెలయేళ్ళు మంచు దారులు  మనతోపాటే ప్రవహిస్తూ వచ్చే గంగానది పర్వత సానువులపై గోదుమపంట ,అనేక రకాల వృక్షజాతులు ఫల పుష్పజాతులు కనువిందు చేస్తాయి . దేవ భూమి అనే నమ్మకం నిశ్చయంగా కలుగుతుంది .ఆకలి దాహమూ ఉండవు .ఇక్కదిగాలి చాలు అనిపిస్తుంది .అందుకే మహర్షులు ఇక్కడ తపస్సు చేసేవారు .

   సాయంత్రం బయల్దేరి పండిట్గారింట్లో  బస చేసి మాబస్సువాళ్ళు  పెట్టిన భోజనం  తినాలనిలేకపోయినా కుక్కుకొని ,పడుకొని ఉదయాన్నే లేచి వాన్ ఎక్కి దేవప్రయాగ చేరి అలకనంద భాగీరధి సంగమ స్నానం చేసి , నేనూ మాబావా ప్రక్కనే చిన్నగ గుట్టమీదా అగస్త్యమహర్షి ప్రతిష్టించిన అగస్త్యేశ్వరస్వామికి అభిషేకం చేసుకొని ,టిఫిన్ తిని ,కాఫీ తాగి  మళ్ళీ బయల్దేరి సాయంత్రానికి బద్రీ నాథ్ చేరి అక్కడ కర్నాటక సత్రం లో దిగి ‘’ఉష్ణ కుండం ‘’కు నడిచివెళ్ళి అక్కడ స్నానం తో వొంటి నొప్పులన్నీ మటుమాయంకాగా ,నారద ప్రతిష్టిత శ్రీబద్రీ నాథ స్వామిని కనులారా దర్శించి రూమ్ కు చేరుకోగా నేనుమాత్రం వాన్ లోనే కూర్చొని ఎదురుగా కళ్ళముందు అద్భుతంగా కనిపించే  ‘’నీల కంఠ పర్వత’’ శోభను సాయం వేళ దర్శిస్తూ సాక్షాత్తు కైలాసమే చూస్తున్నానన్న అనుభూతిపొంది నాదగ్గరున్న ఉపనిషత్తులు స్తోత్రాలు మహాన్యాసం నమకచమకాలు చదువుతూ కూర్చుని రాత్రి 10గంటలకు రూమ్ కు   చేరి పడుకొన్నాను .మర్నాడు ఉదయం బ్రహ్మకపాలం లో నేనూ మాబావా పిండ ప్రదానం చేశాం .అక్కడి లకానంద నదిలో గడ్డకట్టే చలిలో స్నానం చేశాం అదొక దివ్యానుభూతి .మళ్ళీ బద్రీ విశాల్ దర్శనం చేసి రూమ్ కు చేరి అందరం భోజనం చేసి మధ్యాహ్నం వాన్ లో బయల్దేరి దారిలో హనుమాన్ ఘాట్ ,జ్యోతిర్మఠం దర్శించాము శ్రీ శంకర భగవత్పాదులు దేశం లో నాలుగు వైపులా ఏర్పాటు చేసిన పీతాలలో ఇది చాలాముఖ్యమైనది .ఈ ప్రాంతం అంటా బార్డర్  సెక్యూరిటీ ఫోర్స్ అధీనం లో ఉంటుంది. ప్రక్కనే చైనా  .ఇక్కడ హిందువులకు మఠం లేకపోతె వారిని ప్రక్కదేశాలవారు తమమతం లోకి మార్చవచ్చు .అందుకే  ఇది చాలా స్ట్రాటజిక్పాయింట్ .  రాత్రిఒక చోటాగి మరునాడు ఉదయం మళ్ళీ ప్రయాణం సాగించి సాయంకాలానికి గంగానది అప్పటిదాకా హిమాలయ పర్వతాలలో ప్రవహించి భూమికి చేరిన హరిద్వారం చేరాం .గంగా స్నానం చేయగానే అందరికి కమ్మటి పూరీలు బంగాళా దుంప కూర  తయారు చేసి వేడివేడిగా ఇచ్చాడు మా వెంటవచ్చిన మలయాళీ కుక్ .ఆరగా ఆరగా కడుపునిండా తిని కాఫీ త్రాగి దేవాలయ దర్శనం చేసి రోప్ వె లోపైకి  వెళ్లి ధ్రిల్ ఫీల్ అయి శ్రీ మానసాదేవి అమ్మవారిని దర్శించి ఆకాశం నుంచే హరిద్వార్ సౌందర్య వీక్షణ చేసి  కిందకువచ్చి గంగా హారతి చూసి, మేమూ ఇచ్చి , అనూరాధా పోద్వాల్ గంగాహారతి పాటలు విని పులకించి పోయాం    మళ్ళీ వాన్ లో బయల్దేరి మర్నాడు ఉదయం ఢిల్లీ చేరి రూమ్ లో ఉన్నాము .నేను తీసుకువెళ్ళిన హోమియో మందులను  తలతిరుగుడు  విరేచనాలు  జ్వరం  ఆకలి లేకపోవటం మలబద్ధకం దగ్గు జలుబు వచ్చిన వారికి ఇచ్చి ఉపశమనం కలిగించి తృప్తి చెందాను వాడినవారంతా  రిలీఫ్ ఫీల్ అయి ధాంక్స్ చెబుతుంటే మహదానందం కలిగేది .

               జైపూర్ ఆగ్రా మధుర బృందావన్ సందర్శనం

 మర్నాడు రావు ట్రావెల్స్ వారితో కారు ఏర్పాటు చేయించుకొని ,రాజస్థాన్ రాజు జై సింగ్  1727లో కట్టిన  రాజధాని   పింక్ సిటీగా గుర్తింపుపొందిన జైపూర్ చేరి ,అక్కడి డైరెక్టర్ విశ్వనాథ్ ‘’సిరివెన్నెల’’ సినిమా తీసిన గోవింద్ దేవి దేవాలయం , జంతర్ మంతర్ సిటీ పాలెస్ ,హవామహల్  సరస్సులో ఉన్న రాజమహల్ మొదలైనవి చూసి హోటల్ భోజనం కక్కాలేక మి౦గా లేక కతికి,రాత్రి హోటల్ లో పడుకొని ఉదయమే కారులో ఆగ్రా వెళ్లి ఎన్నో ఏళ్ళనుంచి చూడాలని  కలగంటున్న  తాజ్ మహల్ చూసి ,ఆగ్రాఫోర్ట్ ,హిమాదుద్దౌలా ,అక్బర్ సమాధి ఫతేపూర్ సిక్రీ  కూడా చూసి ,తర్వాత సరాసరి శ్రీ కృష్ణ  జన్మ స్థానం  మధుర లో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేసి ,బృందావన విహారమూ పూర్తిచేసి  మళ్ళీ ఢిల్లీ చేరి హోటల్ లో ఉన్నాము .మర్నాడు ఢిల్లీ లో రెడ్ ఫోర్ట్ ,కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ వగైరాలు చూసి మా బావగారి బంధువులఇంటికి వెళ్లి ,మర్నాడు కన్నాట్ సర్కస్ కు వెళ్లి  ఆంధ్రా భవన్ లో ఉయ్యూరు దుర్గా ఫోటో స్టూడియో చలంగారబ్బాయి అక్కడ కనిపిస్తే అక్కడి హోటల్ తన బావదే అని చెప్పి మాకు దగ్గరుండి భోజనం వడ్డించి కొసరి కొసరి తినిపించాడు .దాదాపు ఇరావై వెరైటీలు అన్నీరుచిగా శుచిగా ఉన్నాయి .కొని తింటే భోజనం 35 రూపాయలే .అక్కడున్న .అప్పటి లోక్ సభ మెంబర్ శ్రీ వద్దే శోభనాదీశ్వరరావు దగ్గరకు తీసుకు వెళ్లగా ఆయన మాకు హైస్కూల్ లో జూనియర్  మా బజారు లోనే ఉంటాడుకనుక బాగా పరిచయమూ ఉండటం  వలన  బాగా మాట్లాడి  ఏదైనాకావాలంటే చెప్పండి అన్నాడు మాకేమీ వద్దని చెప్పి ,రూమ్ కు చేరి మళ్ళీ ఎపి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ చేరి రెండుమూడు రోజులు ఉండి ఉయ్యూరు చేరాము .ఇంత స్పీడ్ గా ఊపిరి పీల్చకుండా   మాతో కలిసి యాత్రా సందర్శనం చేసిన మీ అందరికి ధన్యవాదాలు .ఈ స్పీడ్ కు కారణం ఈ యాత్రా విశేషాలన్నీ సుమారు 30అరఠావుతెల్లకాగితాలపై పూసగుచ్చినట్లు వివరించి రాసి అమెరికాలో ఉన్న మా అమ్మాయి విజయలక్ష్మి కి సుమారు 20 ఏళ్లక్రితమే పంపాను  .ఇక్కడ అందరికీ చదివి వినిపించాను .దీనినే నేనురాసిన, శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)స్పాన్సర్ చేయగా సరసభారతి ప్రచురించి మైనేనిగారి మెంటార్ తెనాలికి చెందిన అడ్వొకేట్ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అ౦కిత మిచ్చిన  ‘’దర్శనీయ క్షేత్రాలు ‘’పుస్తకం లో చివర ‘’యాత్రా సాహిత్యం ‘’గా ప్రచురించాము. చాలామంది చదివి ఇన్స్పైర్ అయి ఫోన్ చేసి జాబులు రాసి ,కలసినప్పుడుకూడా  నన్ను అభినందించారు .కనుక మళ్ళీ చెప్పి విసుగు తెప్పించటం ఇష్టం లేక అలాఅలా పైపైనే కథ నడిపించాను .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-19 –ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -124 ఉయ్యూరులో ధార్మిక ప్రవచనం

 నా దారి తీరు -124

ఉయ్యూరులో  ధార్మిక ప్రవచనం

నేనూ ,నా బోధనా, స్కూలు ,చదువు రాత లతో సమయం సరిపోయేది .మా సువర్చలాన్జనేయస్వామి ఆలయ నిర్మాణం పునః ప్రతిష్ట లతో కొంతకాలం గడిచింది .ధనుర్మాసం లో ఉదయం దేవాలయం లో పూజ .నేను సుందరకాండ పారాయణ ,ఎవరు విన్నా వినకున్నా స్వామినే శ్రోతగా చేసుకొని నెలరోజులు చేసేవాడిని .ఇలాగడిచింది కొంతకాలం .మా గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న విష్ణ్వాలయం కి వెళ్లి పంచపట్టాభిరామస్వామిని, శ్రీ రాజ్యలక్ష్మీ వేణుగోపాలస్వామిని దర్శించి వెళ్ళటం అలవాటు .అక్కడి పూజారులు మా గుడిలోనూ పని చేసినవాళ్ళు .కొందరు నా శిష్యులు కూడా. ఒకరోజు ఇక్కడిపూజారి ఛి వేదాంతం రమణాచార్యులు ‘’మాస్టారూ !విష్ణ్వాలయం లో మీ ప్రవచనం ఏర్పాటు చేయమని చాలామంది అడుగుతున్నారు .మీరు ఒప్పుకుంటే మైక్ లో అనౌన్స్ చేస్తాను ‘’అన్నాడు .అడగకుండా వచ్చిన సదవకాశం .సరే అన్నాను .

ఒక  ధనుర్మాసం  లో రోజూ సాయంత్రం 6-30నుండి 8గం లవరకు శ్రీమద్రామాయణం ధార్మిక ప్రవచనం ప్రారంభించాను .సరిగ్గాఆరున్నరకు ప్రార్ధనతో ప్రారంభం చేసేవాడిని .ఎవరు వచ్చినా రాకపోయినా దేవుళ్ళూ ,పూజారి రమణ ఉన్నారుగా అని నమ్మకం .క్రమంగావినే వాళ్ళూ పెరిగారు  ‘’గాస్ పంతులు’’గా అందరికీ పరిచయంగా ఉన్న  సూరి వెంకటేశ్వర్లు అనే రమణ  వెంట్ర ప్రగడ వారి మహాలక్ష్మీ గాస్ కంపెనీలో మేనేజర్ గా ఉండేవాడు .సాయంత్రం డ్యూటీకాగానే స్నానం చేసి నిత్య శ్రోతగా మారాడు .ఆడవాళ్ళు బాగానే వచ్చేవారు. కొందరు మగవారు రెగ్యులర్ శ్రోతలుగా ఉండేవారు .ఒక రోజురమణ  ‘’బాబాయ్ !నీ పురాణం వింటుంటే మీ మేనమామ గంగయ్యగారి పురాణం వింటున్నట్లుగా ఉంది. అంతకంటే స్పష్టంగా కూడా ఉంది ‘’అన్నాడు .అతడు సూరి శోభనాచలపతిగారబ్బాయి .మా ఇంటి సందుకు ఎదురిల్లు .ఇతని అన్నగారు’’ గోవా వీరుడు రామం ‘’.రమణ నేను ఒకరినొకరం ‘’బాబాయ్ అని పిల్చుకోవటం అలవాటు .ఒక శ్రోతకు నచ్చింది కదా  పురాణం అని సంతోషించాను .జనం మీద నా  దృష్టి ఉండేదికాదు .నాన్ స్టాప్ గా చెప్పటమే పని .పేపర్లలో రామాయణం పై వచ్చిన విశేషాలను ఆధ్యాత్మ రామాయణం, రామాయణ కల్పవృక్షం లనుంచి కూడా సందర్భానికి తగినట్లు విశేషాలను తెలిపేవాడిని .కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్ జత చేసి చెప్పేవాడిని .ధనుర్మాసం చివరి రోజున నాకు పూజారి శాలువ కప్పి సత్కరించి కొంత నగదు కూడా ఇచ్చిన జ్ఞాపకం .

  మరుసటి ఏడు వేదాంతం దీక్షితులు పూజారి .అతడు కూడా ప్రవచనం చెప్పమని కోరాడు భాగవతం పై ప్రవచనం చేశాను .తర్వాత మరో ఏడాది  సుందరకాండ ,ఇంకో ఏడు జైమిని భారతం చెప్పాను .మళ్ళీ రమణ వంతు వచ్చి చెప్పమని కోరితే ‘’ఆముక్తమాల్యద ‘’చెప్పి గోదా దేవి చరిత్రను ఉయ్యూరు లో మొట్టమొదటిసారిగా పూర్తి వివరాలతో చెప్పి రికార్డ్ సృష్టించాను .అప్పటికే మా దేవాలయం లో ధనుర్మాసం ఉదయాన శ్రీతిరుప్పావై పఠించటంప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ధనుర్మాసం నెలరోజులు తిరుప్పావై కులశేఖర ఆల్వార్ రాసిన ముకుందమాల చదువుతూనే ఉన్నాను .ఇప్పటికీ ధనుర్మాసం నెలరోజులూ ఇవన్నిటితోపాటు  సుందరకాండ పారాయణ చేస్తున్నాను .ధనుర్మాసం నెలలో కనీసం మూడు సార్లు అయినా పారాయణ చేస్తాను .ఇక్కడేకాదు అమెరికా వెళ్ళినా ఈ మధ్య అలాగే చేస్తున్నాను . గడచిన  2019ధనుర్మాసం తో సహా ఇప్పటికి నేను సుందరకాండను 64సార్లు పారాయణ చేసినట్లు గుర్తు .భక్తులు కోరితే కొందరికి 9రోజులు కొందరికి 5రోజులు పారాయణ చేసి కల్యాణం కూడా జరిపించాను .దాదాపు 2002వరకు  విష్ణ్వాలయం లో   పురాణ ప్రవచన చేసినట్లు జ్ఞాపకం .ఆతర్వాత అమెరికా వెళ్ళటం ,ఇతరకార్యక్రమాలవలన ఆపేశాను .

  సాహితీ మండలి కార్యక్రమాలకు పామర్రునుంచి తెలుగుమేస్టారు శ్రీ నల్లూరి బసవలింగం గారు వచ్చిపాల్గొనేవారు ,ప్రసంగించేవారు పద్యాలురాసి వినిపించేవారు ఆయన ను ‘’అపర ఘంటసాల ‘’అనేవాడిని .అదే బాణీలో అంతే కమ్మగా పాటలు, పద్యాలు పాడి జనరంజకం చేసేవారు .మంచి హరికథకులు .కూడా చాలాచోట్ల హరికథాగానమూ చేసేవారు .భీష్మ సినిమాలో ఘంటసాల పద్యాలు అద్వితీయంగా పాడేవారు .కరుణశ్రీ జాషువా పద్యాలు వీనులవిందుగా పాదేనేర్పు ఆయనది .పింగళి సూరన కళాపూర్ణోదయం ఆయనకు వాచో విదేయం .చేతిలో పుస్తకం అక్కరలేకుండా అనర్గళంగా పద్యాలు వచనాలు అందులోని సౌందర్య  కథా విశేషాలు అలవోకగా  తడబాతులేకుండా చెప్పేవారు .రేడియోలో దీన్ని ధారావాహికంగా చెప్పారు .మాసాహితీ మండలిలోనూ చెప్పారు. చాలా చోట్ల చెప్పారు .ఆయనకు ఆయనే సాటి నవ్వు ముఖం నల్లగా ఉన్నా సరదామనిషి కన్నడం లో దిట్ట కన్నడం నేర్పేవారు .దీనికి ప్రభుత్వం డబ్బు ఇచ్చేది. వేసవి సెలవులలో బెంగుళూరు వెళ్లి అక్కడ కూడా బోధించేవారు .నాకు పరమమిత్రుడు .ఉయ్యూరువస్తే మా ఇంటికి వస్తే  భోజనం చేయకుండా పంపించే వాళ్ళం కాదు.వచ్చినదగ్గర్నుంచి వెళ్ళేదాకా పాట లేక పద్యప్రవాహం జరగాల్సిందే .కమ్మని హాస్యం తో ప్రసంగించేవారు .పిట్టకథలు బగా చెప్పేవారు .బందరు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో తెలుగుపండితులకు ఆయన సమక్షం లో సందడే సందడి.అడ్డాడ హైస్కూల్ కు బసవలింగం గారిని ఆయన రిటైర్ కాకము౦దూ , రిటైర్ అయ్యాకా పిలిపించి సత్కరించాము .ఉయ్యూరు సాహితీమండలిలోనూ మా తలిదండ్రుల స్మారక పురస్కారం అందేశాము .అరుదైన వ్యక్తి ఆయన .

  అలాగే ఉయ్యూరు దగ్గర పెద వోగిరాలకు చెందిన శ్రీ వోగిరాల వెంకట సుబ్రహ్మణ్యం గారు గన్నవరం దగ్గర పెదవుటపల్లి లో ఉండేవారు .ఆయన చింతలపాటి సోదరులు దివి సీమలో కోసూరు  మొవ్వ చల్లపల్లి కూచిపూడి లలో  భారతీయ సాహిత్యపరిషత్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు జరుపుతూ నన్ను ఆహ్వానించేవారు .ఒక సారిఅలా వెళ్లి  వస్తుంటే బస్సులో సుబ్రహ్మణ్యం  గారితో పరిచయమేర్పడి ఆయన మరణించేదాకా కొనసాగింది  .ఆయనను మండలికి పరిచయం చేసి పురస్కారమిచ్చి గౌరవి౦చా౦ ..ఆయన రాసిన భక్తిశతకాలకు నాతొ ముందుమాటలు రాయించేవారు. ఒకశతకాన్ని ఆనాటి శాసన సభ్యులు గద్దె రామమోహనరావు గారు ఆ ఊళ్లోనే ఆవిష్కరించారు .ఆసభకు నన్నూ రమ్మంటే వెళ్లి మాట్లాడాను .ఒకరకంగా ఆయన మాకు  ఫామిలీ ఫ్రెండ్ అయ్యారు .ఆయన భార్య పిల్లలు బాగా పరిచయస్తులయ్యారు .వారింట్లో వివాహాలకు మేము మా ఇంట్లో పెళ్లిళ్లకు గృహప్రవేశానికి ఆయనా భార్య పిల్లలు  హాజరవటం తప్పని సరి .నాకంటే పెద్దవారైనా ఆయనకు నేను అంటే  విశేషమైన గౌరవం ఉండేది .మా ఇంటికి వస్తే జామపళ్ళు రేగిపళ్ళు తేకుండా ఉండేవారుకాదు .వారి అబ్బాయిలూ అంతటి అభిమానం గా ఉండేవారు .సుమారు పదేళ్ళక్రితం సుబ్రహ్మణ్యం గారు మరణించారు .తెల్లపంచే తెల్లచొక్క ఖండువా తెల్లజుట్టు ,చేతిలో సంచి ఆయన  ప్రత్యేకత .

  మరొక విశేష వ్య క్తి ఉయ్యూరు ఆంధ్రాబాంక్ లో చీఫ్ అకౌంటెంట్ గా ,మేనేజర్ గా పని చేసిన శ్రీ జానకి రామశర్మగారు  ఇంటిపేరు గుర్తు లేదు .విశ్వనాథ వారు అంతేవాసి .వారి సాహిత్యాన్ని ఔపోసనపట్టినవారు. అనర్గళంగా   మాట్లాడగలవారు .పద్యాలు రాయటం లో ఆయన శైలి విభిన్నం .అందీ అందకుండా ఉండేది. సాహితీమండలికి ఆయన ఆభరణం .రిటైరయ్యాక తెనాలిలో స్థిరపడ్డారు .మా ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తే శ్రమపడి వచ్చేవారుకూడా .

  ఉయ్యూరుకు చెందిన శ్రీ కూచిభొట్ల శ్రీరామ చంద్రమూర్తి గొప్ప సాహిత్య జ్ఞానమున్నవారు .ఆయన్ను శ్రీనాధుడు అనేవాడిని .అ౦తాతనకే తెలుసుననే భావన ఉండటం వల్ల దూరమయ్యారు  .యువకులలో త్రినాథ్ అనే మా హైస్కూల్ శిష్యుడు కూడా వచ్చేవాడు .అతన్ని కవిత్వం రాయమని బలవంతపెడితే తప్ప రాసేవాడు కాదు. మాట్లాడమని ఎన్నో సార్లు చెబితేనే మాట్లాడేవాడు .ఇవాళ ఉయ్యూరు హై స్కూల్ లెక్కలమేస్టారుగా బాగా రాణిస్తున్నాడు .మంచి వక్త కూడా అయ్యాడు .అలాగే సురేష్ ?అనే కుర్రాడు రెగ్యులర్ గా వచ్చి సహాయమూ చేసేవాడు . రాదా కృష్ణ  కుంటికాలు ఉన్నా కర్రలు  చేతుల్లో ఉన్నా , నడవటం కష్టమైనా క్రమం తప్పకుండా వచ్చి పాల్గొని తర్వాత  ఆయనే సంస్థను పూర్తిగా నిర్వాహించే స్థాయి సంపాదించాడు .గరికపర్రు కో ఆపరేటివ్ బాంక్ లో పని చేసి రిటైర్ అయిన శోభనాద్రిగారు కూడా మాలో కలిసిపోయి సుదీర్ఘమైన కవితలు వినిపించేవారు .మా గురువుగారు శ్రీ గరుడాచలం గారూ హాజరయ్యేవారు .అలాగే గరికపర్రు అప్పర్ ప్రైమరీ హెడ్ మాస్టర్ శ్రీ రంగారామానుజం గారు రెగ్యులర్ కస్టమర్. మధ్యలో నిద్రపోయినా చివరిదాకా ఉండేవారు .తర్వాత అధ్యక్షులుగా పని చేశారు .తెలుగు లెక్చరర్ గా  పశ్చిమ గోదావరిజిల్లాలో పని చేసిరిటైర్ అయ్యాక ఉయ్యూరు లో బిల్డింగ్ కట్టుకొని స్థిరపడ్డ శ్రీ పి.విజయసారధి ని సంస్థకు నేనే పరిచయం చేశాను .ఆయన మంచి ఉపన్యాసకులు .అన్నీ బాగా ప్రిపెరై చక్కగా మాట్లాడేవారు .ఇంతమంది  సాహిత్యకారులకు సాహితీమండలి  వేదికగా నిలిచింది .తర్వాతవచ్చిన శ్రీ భవానీశంకరరావు, శ్రీ గిరిరెడ్డిచురుకుగా పాల్గొని తర్వాత సంఘ బాధ్యతలూ చేబట్టారు .కృష్ణా జిల్లా రచయితల సంఘ సమావేశాలకు మేమందరం కలిసే వెళ్ళేవాళ్ళం .మా వంతు పాత్ర నిర్వహించేవాళ్ళం

  పెన్షనర్స్ అసోసియేషన్

బసవాచారి గారు చనిపోయాక పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వీర్యమై పోయింది .అప్పుడు శ్రీ కే.కోటేశ్వర శర్మగారు అనే రిటైర్డ్ క్రాఫ్ట్ మాస్టర్ గారు అధ్యక్షులయ్యారు .నేను  రిటైర్ అయ్యాక .రిటైరీలందరం శ్రీ వీరమ్మ తల్లి దేవాలయం అరుగులమీద సాయంకాలలో చేరేవాళ్ళం .పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ కొంతకాలం గడిపి పెన్షనర్స్ అసోసియేషన్ ను బలపరచాలని నిర్ణయించి శర్మగారికి సాయంగా శ్రీ కృష్ణమూర్తి గారనే హెల్త్ డిపార్ట్మెంట్ లో క్లార్క్ గా రిటైరైన కృష్ణ మూర్తిగారిని  సెక్రెటరి,  నేను వైస్  ప్రెసిడెంట్  శ్రీ పారుపూడి శ్రీరామమూర్తి మొదలైనవారు సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి బాగానే కృషి చేశాం. శర్మగారికి కృష్ణమూర్తిగారికి రూల్స్ బాగా తెలుసు .సభ్యత్వ చందా వసూలు చేయించి రసీదులు రాయించి ,ప్రతి సమావేశం లో జమాఖర్చులు చెప్పి౦చి పకడ్బందీగా నడిపాం .శర్మగారు ఏదో తన పుట్టిన రోజు అనో పిల్లలపుట్టినరోజు అనో దాదాపు ప్రతినెలా వాళ్ళింట్లో మంచి అల్పాహార విందు ఇచ్చేవారు .మేమూ వీలైనప్పుడల్లా అలానే చేసేవాళ్ళం .పెన్షనర్ల ఫిక్సేషన్  అరియర్స్ వగైరాలకోసం ఎలిమెంటరి టీచర్స్ రంగరామానుజం గారి దగ్గరకు చేరేవారు .ఆయన్ను మాలో కలుపుకొని సాగాం .నిలవడబ్బు పోస్టాఫీస్ లో జాయింట్ అకౌంట్ తెరచి జమ చేయి౦ చేవాళ్ళం .ఇలా చేయకపోతే నేను ఊరుకోనేవాడిని కాదు . రాష్ట్ర సంఘానికి మా సంఘాన్ని అనుబంధంగా మార్చాం .వారి నుంచి డైరీలు పొందేవాళ్ళం .

 పెన్షనర్స్ వాయిస్ మాసపత్రిక

   బసవా చార్యులుగారు నడిపిన ‘’రిటైరీ’’మాసపత్రిక ఆయన మరణం తో ఆగిపోయింది .దాన్ని ‘’పెన్షనర్స్ వాయిస్ ‘’అనే మాసపత్రికగా మార్చి నేను దాని ఉపసంపాదకుడిగా శర్మగారు సంపాదకుడుగా కొంతకాలం బాగానే నడిపాం .నేను ఎడిటోరియల్స్ కొన్ని ముఖ్యసాహిత్య వ్త్యాసాలు రాసేవాడిని .శర్మగారు సమస్యలపై చర్చించి రాసేవారు మేదూరుకు చెందినా జ్ఞాన వయో వృద్ధులు శ్రీమాధవరావుగారు ఆధ్యాత్మిక విషయాలు రాసేవారు ఆయన మంచి సలహాదారు నేను అంటే బాగా అభిమాన౦ గా ఉ౦డేవారు నిరుడే చనిపోయారు  .నాలుగైదేళ్ళు బాగానే నడిచి౦ది పత్రిక .కానీ చందాలు సకాలం లో రాకపోవటం ప్రింటింగ్ ఖర్చు,పోస్టల్ చార్జీలు పెరగటం చందాదారులు పెరగకపోవటం వలన శర్మగారు ఆర్ధికంగా చాలా బాధ పడ్డారు .ఆయనే  బెజవాడ వెళ్లి పత్రిక ప్రింట్ చేయించి తెచ్చి అందరికి ప౦ పేవారుఇచ్చెవారు .తలకు మించినభారం అవటం ,పేపరు రు రెన్యు చేయకపోవటం తో పత్రిక ఆగిపోయింది .కాని పెన్షనర్స్ కు ఆశాజనకంగా నడిపాం నడిపినన్నాళ్ళు’’అదో తుత్తి’’ .

  పెన్షనర్స్ కో ఆపరేటివ్ సొసైటీ

మా అబ్బాయి రమణ హైదరాబాద్ లో త్రిప్ట్ కో ఆపరేటివ్ సొసైటీలో పని చేసి అనుభవం సంపాదించి ఉయ్యూరు లో ;;జాగృతి పొదుపు సహకార సంస్థ ‘’ప్రారంభించాడు .బాగానే నడుస్తోంది .వాడిని ఒకసారి పెన్షనర్స్ సమావేశానికి పిలిచి కో ఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పించాను .చాలాబాగుంది మనం కూడా పెడదాం అని అందరూ అన్నారు .సరే అని ఒక ఆదివారం మా ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసి శర్మగారినే దానికి ప్రెసిడెంట్ గా కృష్ణమూర్తిగారు  అకౌంటెంట్ గా నేను వైస్ ప్రెసిడెంట్ గా కమిటీ ఏర్పాటు చేసి ప్రతినెలాసభ్యులు 100రూపాయలు కట్టాలని అకౌ౦ట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలని కమిటీ ఎవరికి లోన్ ఇవ్వాలో నిర్ణయి౦చి తీర్మానం చేస్తేనే  డబ్బు ఇవ్వాలని హామీ దారు ఉండాలని బై లాస్ అన్నీ రాసి ప్రారంభించాం .ఒకరకంగా బయటివారిదగ్గరకు డబ్బుకోసం ఎక్కువవడ్డీ తో డబ్బు తీసుకోవటానికి పోకుండా  ఇదొక సువర్ణ అవకాశం రిటైరీలకు .మూడేళ్ళు బాగానే జరిగింది .నేనూ లోన్ తీసుకొన్నాను అమెరికా వెడుతూ .నిల్వ సొమ్ము పోస్టాఫీస్ లో జాయింట్ అకౌంట్ ఖాతాలో ఉంచాం .తర్వాతతర్వాత శర్మగారు మాకు చెప్పకుండా ఎవరికి పడితే వారికి లోన్లు ఇచ్చి, వాళ్ళు కట్టక మేము ఆయన్ను నిలదీస్తే నోటమాటరాక ‘’పరపతి సంఘం పరపతి తిరపతి ‘’అయింది .చూసి చూసి చెప్పి చెప్పి విసిగెత్తి అందర్నీ ఎలర్ట్ చేసి ముందుగా నేను కట్టినడబ్బు అంతా తీసేసుకొన్నాను .తర్వాత ఒకరి తర్వాత ఒకరు లాగేశారు .కట్టేవారు లేరు అప్పులూ లేవు .చివరికి లెక్కలన్నీ తేల్చి ఎవరికీ నష్టం రాకుండా చూసి కో ఆపరేటివ్ సొసైటీని మూసేశాం .కాని మా అబ్బాయి జాగృతి దినదిన ప్రవర్ధమానంగా ఇప్పటికీ మంచి లాభాలతో విస్తృతంగా వ్యాపించి నడుస్తోంది .

  శర్మగారు ఆర్దికబాధలు తట్టు కోలేక ఆత్మ హత్య చేసుకొన్నారు .దీనితో పెన్షనర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ వాయిస్ ,కో ఆపరేటివ్ సొసైటీ అన్నీ ఆగిపోయాయి .తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ రామానుజంగారి ఆధ్వర్యం లో నేనూ కొంతమంది కలిసినిలబెట్టి కొంతకాలం లాక్కోచ్చాం .ఎక్కడ తప్పటడుగు వేసినా ప్రశ్నించే నా నైజానికి రామానుజంగారు జీర్ణించుకోలేక నన్ను దూరం చేసి తొట్టిగాంగ్ ను దగ్గర చేర్చుకొని పెన్షనర్స్ డే నాడు లావిష్ గా ఖర్చు చేసి జమా ఖర్చులు చెప్పకుండా నడిపారు ,అనేక అక్రమాలకూ పాలుపడ్డారనే అభియోగంతో ప్రభుత్వం ఎంక్వైరీచేసి  అరెస్ట్ చేసి జైలు పాలు చేసినసంగతి నేను అమెరికాలో ఉండగా ఎపార్లద్వారా తెలిసింది   .నిర్దుష్టంగా ఉండకపోతే ఏ సంఘమూ నిలవదు అని గ్రహించాలి .ఆయనతర్వాత ఇప్పుడు పెన్షనర్స్ కు సంఘం ఉందొ లేదో నాకు తెలీదు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ – 21-6-19-ఉయ్యూరు


— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -123  అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

నా దారి తీరు -123

అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

సాహితీ మండలి

అడ్డాడ హై స్కూల్ లో  చేరటానికి ముందే 1987లో మాకు ఉయ్యూరు హైస్కూల్ లో గురువుగారు, నాకు ఎనిమిదవతరగతి క్లాస్ టీచర్ ,ఆతర్వాత నేను ఆ స్కూల్ లో పని చేసినప్పుడు నాతోపాటు సోషల్ మాస్టర్ గా, ఇంచార్జి హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాక పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ కోసం ప్రత్యెక మాసపత్రిక నడిపిన  నేన౦టే అమిత ఆప్యాయత చూపించే  శ్రీ లంకా బసవాచారి మాస్టారు గారు ఎందుకు ఎలా ఆలోచించారో తెలీదుకాని ఒక రోజు మా ఇంటికి వచ్చి ‘’ప్రసాదూ !మనం ఒక సాహిత్య సంస్థ నడపాలి  నెలలో ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం సభ జరపాలి .నీలాంటి వారి సాయం ఉంటె బాగుంటుంది ‘’అన్నారు .’’మంచి ఆలోచన మాస్టారూ !మీ నాయకత్వం లో కలిసి పని చేద్దాం.’’అన్నాను .ఆయనే ఊళ్ళో  అందరి ఇళ్ళకు వెళ్లి చెప్పటం ,అందరం మూడవ ఆదివారం సాయంత్రం 4గంటలకు ఉయ్యూరు విష్ణ్వాలయం లో ఆయన అధ్యక్షతన సమావేశం జరపటం మొదలు పెట్టాము .సభ అరిగే ఆదివారం ఉదయం మళ్ళీ ఆయనే అందరిళ్ళకు వెళ్లి గుర్తు చేసేవారు .అంత నిబద్ధత ఉండేది ఆయనలో .ఇంత సాహిత్యాభిలాష ఉందని అప్పటిదాకా తెలీదునాకు .అయితేనేమి ఒక సంస్థకు బీజం నాటారు .అప్పుడు నా సహాధ్యాయి మా గురువుగారబ్బాయి శ్రీ వేమూరి దుర్గయ్యనే దుర్గాప్రసాద్ ,నేనూ ,శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,శ్రీ పీసపాటి కోటేశ్వరరావు మేమందరం మునసబు గారుఅనిపిలిచే శ్రీ గూడపాటి కోటేశ్వరావు ,మా అన్నయ్యగారి అబ్బాయి   రామనాధబాబు ,శ్రీ అప్పలాచార్యులు ,విష్ణ్వాలయం పూజార్లు ,కెసీపి ఉద్యోగులు , శ్రీ సూరపనేని రాధాకృష్ణ ,వెంట్రప్రగడ సోదరులు ,ఆంధ్రాబాంక్ లో పని చేసిన ఆయన ,ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రీ దగ్గుబాటి శ్యామసు౦దరరావు  ప్రముఖ గాంధేయవాది స్వాతంత్ర్య సమరయోధుడు  శ్రీ మల్లాది శివ రామ శాస్త్రి ,అప్పలా చారి తండ్రిగారు ,మొదలైన సుమారు ఇరవై మంది దాకా హాజరయ్యేవాళ్ళం .కొన్ని నెలలు మా మాస్టారు అందరికీ బిస్కెట్లు తెచ్చి ఇచ్చేవారు .వీలయితే టీ కూడా .మొదట్లో ఎవరో ఒకరిని ఇష్టమైన విషయం మీద మాట్లాడమనే వారు   సంఘానికి రెండు మూడేళ్ళ  దాకా పేరు కాని ,సభ్యత్వ రుసుముకాని కార్యవర్గం కాని లేదు  .రుసుం వసూలు మాస్టారికి అసలు ఇష్టమే ఉండేదికాదు. దానివలన తగాదాలొస్తాయనేవారు .ఆయనమాట మాకు సుగ్రీవాజ్ఞ.ఒక కాగితం మీద సమావేశానికి హాజరైన సభ్యుల సంతకాలు తీసుకొనేవారు .అందరం అప్పటికి ఒకటి రెండుసార్లు మాట్లాడే ఉన్నాం .కనుక దీన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది .

ఒక సారి సమావేశం లో నేనే ‘’ఎవరు ఏ విషయం మాట్లాడాలో ముందే తెలియజేయాలి అప్పుడు ప్రిపరేషన్ కు సమయం బాగా ఉంటుంది . గంట గంటన్నర లో కార్యక్రమం పూర్తవ్వాలి .ప్రతినెలా మనలో ఒకరం అందరికీ ఆతిధ్యమివ్వాలి .ఇక్కడ జరిగే  కార్యక్రమాలు  నమోదు చేయటానికి మినిట్స్ పుస్తకం ఉండాలి .మాస్టారికి వయసు మీద పడుతోంది ఆయనకు శ్రమ ఇవ్వకుండా  ఎవరు ఏ విషయంపై మాట్లాడేది మొదలైన కార్యక్రమవివరాలు కార్డ్ పై రాసి అందరికి పోస్ట్ లో పంపాలి .సంస్థకు ఒక పేరు పెట్టాలి .ఉత్సాహవంతులు అధ్యక్షులుగా  కార్యదర్శిగా ఉండాలి .మాస్టారు మనకు సుప్రీం కనుక ఆయన కన్వీనర్ గా ఉండిమనకు మార్గ దర్శనం చేయాలి ‘’అని చెప్పాను .అందరు బాగుందిబాగుంది తక్షణం అమలు చేద్దాం అన్నారు .సంస్థకు అనేక పేర్లు ఆలోచనలోకి వచ్చినా ‘’సాహితీ మండలి ‘’పేరును ఖాయం చేశాం .బహుశా ఈ ఆలోచనా నాదేనని గుర్తు .మొదటి అధ్యక్షుడిగా దుర్గయ్య ను కార్యదర్శిగా పీసపాటి ని ఎన్నుకొని షురూ చేశాము .నేనే సుమారు 50కార్డులు కొని ఇచ్చి పని ప్రారంభి౦పచేశా .

మరికొ౦తకాలం తర్వాత నాకే ఆలోచన వచ్చి ‘’ఏదో డ్రైగా కార్యక్రమాలు జరుగుతున్నాయి క ,పాత సాహిత్యమేపెత్తనం చేస్తోంది కనుక మార్పు రావాలి ‘’అని చెప్పి శ్రీ శ్రీ ఆరుద్ర ,తిలక్ మొదలైన వారి కవిత్వాలపైనా కరుణశ్రీ ,జాషువా ,దేవులపల్లి మొదలైన వారి కవిత్వం పైనా మాట్లాడే ఏర్పాట్లు చేశాం .రామకృష్ణమాచార్యులు ఆముక్తమాల్యద, మను, వసు చరిత్రలపై అధారిటీ. ఆయన మాట్లాడుతుంటే కొత్త లోకం లో విహరిస్తున్నట్లు  ఉండేది  .ఆయన నా అభిమాన సాహితీవేత్త  .మా తలిదంద్రుల పేరిటమొదటిపురస్కారం ఆయనకే అందించాను పీసపాటి నీతి శతకాలలో దిట్ట .గూడపాటి క్షేత్రయ్యపై లోతైన అవగాహన ఉన్నవాడు ,రాధాకృష్ణ పద్యనాటకాలపై బాగా మాట్లాడేవాడు .మల్లాది వారు తాము చేసిన అవధానాలు బెజవాడ కనకడుర్గమ్మపై  రాసిన సుప్రభాతం విని పించేవారు .డా శ్యాం సుందర్ ఆరోగ్య విషయాలపై మంచి అవగాహన కల్పించేవారు .ఆంధ్రాబాంక్ ఆయన విశ్వనాథకు అంతేవాసి .కల్పవృక్షం పై ప్రసంగించేవారు ఇలా అన్ని రకాల సాహిత్యం పరవళ్ళు తొక్కింది .ప్రతినెలా మూడవ ఆదివారం కార్యక్రమాలు చాల ఉత్సాహవంతంగా జరుగుతున్నాయి .ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం

మళ్ళీ నాకే ఆలోచనవచ్చి ‘’సంక్రాంతికి ,ఉగాదికి కవి సమ్మేళనం ‘’నిర్వ హిద్దాం యువకవులకు అవకాశం కలిగిద్దాం ‘’అని చెప్పాను .అలాగే కవి సమ్మేళనాలు జరిపాం మొదటి ఉగాది కవి సమ్మేళనం మా పాత పెంకు టింట్లోనే హాలు అంతా నిండిపోయిన కవులతో జరిగింది .హైస్కూల్లో నాకు హెడ్ మాస్టర్ ,నేను సైన్స్ మాస్టర్ అయినప్పుడుకూడా హెడ్ మాస్టర్ అయిన శ్రీ కేవిఎస్ ఎల్ నరసింహారావు ,టెలిఫోన్ ఎక్చెంజిలోపని చేసిన ఒక ఆయన కుమార్తె ,కెసీపి లో కెమిస్ట్ శ్రీ టివి సత్యనారాయణ మొదలైనవారంతా విచ్చేసి కవిత్వం చదివి అందరికి ఆనందం పంచారు .బొబ్బట్లు పులిహోర టీ  లతో నేను ఆతిధ్యమిచ్చాను .ఇలా సాహితీమండలి జైత్రయాత్ర జరుగుతోంది .మళ్ళీ నేనే ‘’ఒక వ్రాత పత్రిక ను అందరి రచనలతో తెస్తేబాగుంటుంది ‘’అని సూచించాను .ఆబాధ్యత  ఆచార్యులు పీసపాటి గార్లకు అప్పగించిన జ్ఞాపకం .బాగానే తయారైంది .తర్వాత మా గురువుగారు ,మా మాస్టారు మా సారధి సచివులు శ్రీ బసవా చారి గారు గుండె జబ్బుతో మరణించారు. మాకు ఆశనిపాతం అయింది .ఆయన దినవారాలయ్యాక వారి స్మృతి నివాళిగా ఒక వ్రాత ప్రతి తెచ్చే బాధ్యత నాకు అప్పగించారు .దాదాపు 70పేజీల పుస్తకంగా ఫోటోలు నివాళి గీతాలు వ్యాసాలూ తో  సహా మంచి పుస్తకం రూపొందించాను .దీనికి ఆచార్యులు పీసపాటి గొప్ప సహకారం అందించారు .సాహితీ మండలి కార్యక్రమం లో ఎవరు ఏ విషయం పై ప్రసంగిస్తారో ముందే తెలుస్తోందికనుక నేను ప్రతి విషయం పైనా కొత్తకోణాలలో ఆధునిక విశ్లేషకుల అభిప్రాయాలను సేకరించి కనీసం అరగంట అయినా ప్రధాన వక్త తర్వాత మాట్లాడేవాడిని .ఇదంతా నోట్స్ గా నాదగ్గర ఉండేది .మంచి వ్యాసాలూ రాయటానికి ముడి సరుకుగా ఉపయోగపడేది .అంతేకాదు ఆనేలలో అప్పటిదాకా జరిగిన ముఖ్య సాహితీ విశేషాలు రచయితల పుట్టినరోజులు  మరనిన్చినవిషయాలు వారిప్రతిభా నూతన పుస్తకావిష్కరణలు అన్నీ నోట్ చేసుకొని చెప్పేవాడిని కనుక రొటీన్ కు భిన్నంగా నావేల్టి గా ఉండేది .మండలి లో ప్రసంగించిన ప్రతివిషయం పైనా నా దగ్గర నా నోట్స్ ఉండేది .అంత కృషి చేసేవాడిని నూతనత్వం ఉండాలని నా తపన .

మాస్టారుగారి మృతికి ముందే శ్యామసు౦దరరావు గారు కారం చేడు వెళ్ళిపోవటం మిగిలినవారు ట్రాన్స్ ఫర్ అవటం తో నెలవారీ సమావేశాలకు హాజరు పలచబడింది .మరోరెండు స్పెషల్ వ్రాతప్రతులు తెచ్చిన గుర్తు .ఒకటి బీరువాల రెడ్డిగారు అని పిలువబడే ,మంచి సాహిత్యాభి రుచి వేలకొలది పుస్తకాల స్వంత గ్రంధాలయం ఉన్న శ్రీ కట్టుకోలు సుబ్బారెడ్డి రూపొందించారు .ప్రతి ఏడాది మార్చిలో శ్రీ బసవాచారి గారి స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయాలని చెప్పినా ఎవరి చెవికీ ఎక్కలేదు .హాజరు పెంచటానికి కృషీ జరుగలేదు . సభావేదిక కూడా విష్ణ్వాలయం నుంచి కొంతకాలం మా శ్రీ సువర్చలాన్జనేయసామి గుడికి అక్కడినుంచి ఉయ్యూరు హై స్కూల్ కు ,ఆతర్వాత కాలేజీ గ్రౌండ్ కు చివరికి ఎసి లైబ్రరీకి మారింది .హైస్కూల్ లో సభలు జరిపేటప్పుడు హెడ్మాస్టర్ శ్రీ పి.వెంకటేశ్వరరావు ,కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీరాయుడుగారు మంచి సపోర్ట్ ఇచ్చారు .మా శిష్యుడు ,మా గురువుగారు డ్రాయింగ్ మాస్టారు శ్రీ శేషగిరిరావు గారబ్బాయి ఫణి చేత గణిత అష్టావధానంఅరంగేట్రం చేయించి  మంచి పేరుపొందాం .దీనికి టివి, రెడ్డిగార్లు స్పాన్సర్లు .శాసనసభ్యులు శ్రీ అన్నే బాబూరావుగారి సమక్షం లో సర్వభాషా కవి సమ్మేళనం నిర్వహించాము .సాహితీ మండలి అధ్యక్షులుగా ఆచార్యులుగారు, గూడపాటి,రాదాకృష్ణ  ,ఏ సాహిత్య పరిజ్ఞానమూ లేని కాటూరు నివాసి మైనర్ గారు అనబడే శ్రీ వేమూరి కోటేశ్వరావు చాలాకాలం అధ్యక్షులయ్యారు ..  2008లో మూడవసారి అమెరికా వెళ్ళినప్పుడు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి బావగారు డా రాచకొండ నరసింహ శర్మగారు అమెరికాలో ఉన్నారు .తరచూ మాట్లాడేవారు. సరసభారతికి 10వేల రూపాయల చెక్కు నాకు అందజేశారు .రాగానేఆంధ్రాబాంక్ లో అకౌంట్ తెరచి డిపాజిట్ చేశాను  .నేను కన్వీనర్ గా శ్రీ కాట్రగడ్డ వెంకటేశ్వరరావు కార్యదర్శిగా చాలామంచి కార్యక్రమాలు నిర్వహించాం .సాహితీమండలి 100వ సమావేశాన్ని అత్యంత వైభవోపేతంగాజరిపాం .గుడివాడ కాలేజి సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారిని ఆహ్వానించి సన్మానించి విశ్వనాధపై మహత్తర ప్రసంగం చేయించాం .2008 డిసెంబర్ లో ఉయ్యూరు వాస్తవ్యులు  ప్రముఖ అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రవేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చ౦ద్ గారిని ఆహ్వానించి  పట్టుబట్టలు పెట్టిఘన సన్మానం చేశాం .దీనిఖర్చు అంతా మా శ్రీ మైనేని గోపాలకృష్ణ గారిదే .ఇందులో మిగిలినడబ్బు 20వేలరూపాయలు మచిలీపట్నం లో కొత్తగా ఏర్పాటైన కృష్ణా విశ్వ విద్యాలయం తెలుగు శాఖ కు శ్రీమైనేని గారి పేరిట విరాళం అంద జేశాం .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్పాన్సర్ చేసిన శ్రీ విహారి గారి ‘’సుందరకాండ ‘’ఆవిష్కరణ సభ నిర్వహించాం .డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు ,డా గుమ్మా సాంబశివరావు ,డా జివి పూర్ణచంద్ వంటి వారిని ఆహ్వానించి ఆపుస్తకం పై ప్రసంగాలు చేయించాము .ఆహ్వాని౦పబబడిన  ప్రాసంగీకులైన  అతిధులకు మా తలిదంద్రులపేరర పురస్కారం నగదుకానుక నూతనవస్త్రాలు అందజేశాను  ఇలా పురాస్కార౦  అందుకొన్నవారిలో శ్రీమతి వి శ్రీ ఉమామహేశ్వరి ,శ్రీ గంధం వెంకాస్వామి శర్మ ,శ్రీ యాజ్ఞావల్క్యశర్మ ,శ్రీమతి బెల్లంకొండ శివకుమారి డా మడక సత్యనారాయణ మొదలైనవారెందరో ఉన్నారు

ఎసి లైబ్రరీ నిర్మాణం

ఉయ్యూరు  లైబ్రరీకి శ్రీ మైనేనిగారు ఇచ్చిన భూరి విరాళం తో నేను కన్వీనర్ గా   వారి అన్నగారు  శ్రీతాతయ్యగారు కోశాధికారిగా మా శిష్యుడు వైవిబి రాజేంద్రప్రసాద్ కోరగా పని చేసి దక్షిణభారతం లోనే మొట్టమొదటి ఎసి లైబ్రరీని కట్టించాము .2004 జులైలో దీని ప్రారంభోత్సవానికి మంత్రులు జిల్లాపరిషత్ చైర్మన్ ,శాసన సభ్యులు హాజరయ్యారు .దీనిఖర్చు అంతామైనేనిగారిదే .ఆయనా అమెరికానుంచి వచ్చారు .దాదాపు రెండులక్షల రూపాయల ఖరీడదుకల విలువైన పుస్తకాలు సిప్పింగ్ లో మైనేనిగారు మా ఇంటికి పంపారు .వీటిని జాగ్రత్త చేసి ప్రారంభోత్సవంనాడు లైబ్రరీకి అందజేశాను .

గ్రంధాలయ వారోత్సవాలు తోడ్పాటు

అప్పటినుంచి లైబ్రరీలో జరిగే ప్రతికార్యక్రమమాన్ని నా సహకారం తో మిర్వహించారు లేడీ లైబ్రేరియన్. శ్రీమతి సుజాతగారు రేడియో ఆర్టిస్ట్ శ్రీ ఎబి ఆనంద్ ,శ్రీ గుత్తికొండ శ్రీ పూర్ణచంద్ ,,శ్రీ సామల రమేష్ బాబు ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రం మొదలైన వారిని ఆహ్వాని౦పజెసి  లైబ్రరీ వారోత్సవాలు ఘనంగా నిర్వహింప చేయించాను. ఆర్దికసాయమూ అందించాను .

కృష్ణాజిల్లా రచయితల సంఘం లో

కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చురుకుగా పాల్గొన్నాను. వారు ప్రచురించిన అన్ని పుస్తకాలో నా చేత విలువైన ఆర్టికల్స్ రాయించారు శ్రీ పూర్ణచంద్ .అందులో ‘’కృష్ణా జిల్లా సంస్థానాలు సాహిత్య సేవ ‘’హై లైట్ .తర్వాత ‘’తెలుగు మణిదీపాలు ‘’లో ఘంటసాలపై రాసిన సుమారు ఇరవై పేజీల వ్యాసం ముఖ్యమైనది . జనం రావటం లేదుకనుక మండలి కార్యక్రమాలు  ఆపేద్దామని గూడపాటి చాలా సార్లు అంటే మంచి చర్యలు తీసుకోవాలికాని దుకాణం మూసేస్తే ఎలా ?అని వాదించేవాడిని .చాలా సార్లు చెప్పి చూశా .సాహిత్య గంధం లేని వాళ్ళు ప్రెసిడెంట్ సేక్రేటరిగా ఉంటె సంస్థ కు గౌరవంకాదని పిలిచిన అతిధికి కనీసం ఖర్చులకోసం కొంతనగదు ఇచ్చి శాలువాకప్పటం కనీస ధర్మమని పోరాడాను .ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారి వెళ్ళటం క్రమగా తగ్గించి 2009నవంబర్ 24’’సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ఏర్పాటు చేయటం ఆతర్వాత దాని ప్రగతి మీకు తెలిసిన విషయమే మరికొన్ని విషయాలు తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-19-ఉయ్యూరు

 

 


 

 


Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

నా దారి తీరు -122

అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

 నిజంగా ఇదొకఅద్భుతం .అడ్డాడ హై స్కూల్ చరిత్రలో సువర్ణాధ్యాయం .అసలే ఎకనమికల్ గా ఎకడమికల్ గా బాగా వెనుకబడిన హైస్కూల్.ఎలాగో అలా తంటాలుపడి ,అందరి సహకారంతో జిల్లాలోనే మంచి పేరు పొందిన స్కూల్ గా తీర్చి దిద్దాము .మా డ్రిల్ మాస్టర్ శ్రీ  నాగేశ్వరరావు రెండుమూడేళ్ళనుంచి ‘’సార్!ఉపాధ్యాయులు  బాలబాలికలు ఆటలలో జిల్లా లెవెల్ లో ఎన్నో ప్రైజులు సంపాదించాం .అద్దాడ అంటే ఆటల్లో మేటి అని గుర్తింపు వచ్చింది మంచి గ్రౌండ్ ఉంది .సహకరించే స్టాఫ్ ఉంది .మనం జిల్లాస్థాయి ఆడపిల్లల ఆటల పోటీ నిర్వహణ తీసుకొందాం .దాన్ని అద్భుతంగా నిర్వహిద్దాం .అన్ని రకాల సహకారం మనకు లభిస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొద చేస్తూనే ఉన్నాడు .చూద్దాం చూద్దాం అని వాయిదా వేస్తున్నాను .సరిగ్గా నిర్వహించక పొతే ఇప్పుడు స్కూలు పొందిన కీర్తి వైభవం మట్టి కొట్టుకు పోతుందని బెరుకు .తర్వాత ఇందులో ఏదో మిగుల్చుకున్నారని లాభపడ్డారని నెపం వేసేవాళ్ళు ఎక్కువ .అప్పటికే చాలా స్కూళ్ళు ఆ అపవాదు తో తలదిన్చుకోలేని స్థితికలిగింది .కనుక ‘’అడుసు త్రోక్కనేల కాలు కడుగనేల ‘’?అని పించింది .డ్రిల్ మాస్టర్ తోపాటు స్పోర్ట్స్ మన్ అయిన స్టాఫ్ సెక్రెటరి శ్రీ డి వీరభద్రరావు  ,సైన్స్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు ,లేడీ టీచర్స్ ,ఆడపిల్లలు కూడా ఒత్తిడి చేశారు .కనుక దీనిపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందిఅని పించింది .ప్రాధమిక అడుగులు వేయాలని నిశ్చయించాను .

   స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రపోజల్ ను అందరి ముందు ఉంచాను .అందరూ తప్పకుండా మనం నిర్వహిద్దాం ఎలాంటి సహాయ  సహకారాలకైనా సిద్ధం అని ముక్తకంఠం తో చెప్పారు .స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామబ్రహ్మం గారిని పిలిపించి విషయమ౦ చెప్పాం .’’మంచి ఆలోచన తప్పకుండా చేద్దా౦ నా వంతు కృషి నేను చేస్తాను ‘’అని హామీ ఇచ్చారు .తరువాత స్కూల్ అసెంబ్లీ లో విద్యార్ధులకు వివరించి చెప్పాను .వాళ్ళు అందరూ  ఏమాత్రం సందేహించకుండా ‘’చేసేద్దాం  చుట్టుప్రక్కల ఊళ్లకు వెళ్లి పెద్దవారందరినీ కలిసి  ఆర్ధిక సహాయం చేయమని మేమంతా అడుగుతాం  మీతో కలిసి నడుస్తాం’’అని భరోసా ఇచ్చారు .సరే వాతావరణం బాగానే ఉంది .కనుక డియివో కాన్ఫరెన్స్ లో ప్రపోజల్ పెట్టి ఔను అనిపించుకోవాలని నిర్ణయించాము .అయితే మా నాగేశ్వరరావు ‘’సార్!మనం ఎవరికీ పోటీ గా ఉండద్దు అందరూ  మనకే  ఇచ్చేట్లు తెరవెనుక నా ప్రయత్నం గా ఇతర డ్రిల్ మాస్టర్స్ తో నేను మాట్లాడుతాను  ‘’అన్నాడు సరే అన్నాను .బహుశా 1996లో జనవరి లో బాలికల ఆటలపోటీలు అడ్డాడ హైస్కూల్ నిర్వహిస్తుంది ‘’అని డియివో గారితో ప్రపోజల్ చేయించాం .శుభం భూయాత్ .

        నిర్వహణ

  ఆడపిల్లల జిల్లాస్థాయి ఆటలపోటీలు ను ‘’గర్ల్స్ మీట్’’అంటారు .ఇవి గ్రిగ్ మెమోరియల్ పోటీలు .ప్రతి ఏడాది జరుగుతాయి .మగపిల్లలకు వివిధ జోన్ లలో అంటే పటమట జోన్ ఆకునూర్ జోన్ గుడివాడ కైకలూర్ నాగాయలంక ఉయ్యూరు నందిగామ ,జగ్గయ్యపేట బందరు  మైలవరం తిరువూరు  మొదలైన  చోట్ల  బాయ్స్ కు ఉపాధ్యాయులకూ జరుగుతాయి .ఫైనల్స్ మాత్రం సెంట్రల్ జోన్ లో బాయ్స్ కు టీచర్స్ కు జరుగుతాయి స్పోర్ట్స్ కూడా సెంట్రల్ జోన్ లోనే .

  కానీ ఆడపిల్లలకు జిల్లా అంతా ఒకే యూనిట్ .అంటే ఒకే ఒక్క చోట మూడురోజులు జరుగుతాయి .బాడ్మింటన్ త్రోబాల్  సాఫ్ట్ బాల్  ,టేన్నికాయిట్అనే రింగు ఆట , షటిల్,కబాడీ ఖోఖో మొదలైన వాటిల్లో పోటీలు ఉంటాయి .జిల్లాలోని వివిధస్కూల్స్ నుంచి పాల్గొనే జట్లకు వసతి  టిఫిన్ భోజన సదుపాయాలూ ఉచితంగా సమకూర్చాలి .ప్రైజ్ లు,జ్ఞాపికలు  అందేయాలి  .సహాయపడిన డ్రిల్ మాస్టర్లకు కూడా ఇవన్నీ సమకూర్చాలి .కోర్ట్ లు వేయాలి .బాల్స్ నెట్ లు ,రింగులు ,ఖోఖో పోల్స్ ,సున్నం తాళ్ళు వాలంటీర్లు వీరందరికీ పైవారికి లాగానే భోజనాలు మధ్యమధ్యలో టీ కాఫీలు  సాయం వేళ స్నాక్స్ అందించటం  మంచి నీటి సౌకర్యం టాయిలెట్స్ సమకూర్చటం అన్నీ సక్రమంగా చేస్తేనే సక్సెస్ లేకపోతె బండబూతులు తినాలి .ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి .టిఫిన్లు భోజనాలలో ఏమాత్రం కక్కుర్తి పనికి రాదు ఏ క్లాస్ గా అన్నీ ఉండాలి అని నా ,మా అభిప్రాయం .మూడు రోజులకు  కనీసం ఖర్చు 30వేలరూపాయలు అని అంచనా వేశాం .ఇంతడబ్బు సమకూర్చుకొని రంగం లోకి దిగాలి .ఇవన్నీ ఎప్పటికప్పుడు చిన్న కమిటీ వేసుకొని అందరం కలిసిఆలోచించాం .అందరం ఇక వెనక అడుగు ప్రశ్నే లేదు ము౦దుకు దూకటమే అనుకొన్నాము .

          ముందుగాస్టాఫ్ మెంబర్లు అందరూ జీతం లో కట్ చేసుకొనే విధం గా తలొక వెయ్యి రూపాయలు విరాళంగా అందజేశారు .రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించి రసీదులిచ్చాం .రామబ్రహ్మ౦గారు ,కమిటీ మెంబర్లు కూడా డబ్బు ఇచ్చారు .డా శ్రీ అప్పారావు గారు అడ్డాడ వారే పామర్రులో హాస్పిటల్ నడుపుతున్నారు మంచి వితరణ శీలి ఆయనా  విరాళం ఇచ్చి  అక్కడ కలవాల్సినవారి పేర్లు మాకు చెప్పి కలవమన్నారు అలాగే కలిశాం. అందరూ ఉడతాభక్తి సాయంచేశారు .స్కూల్ విద్యార్దులంతా తలొక పది రూపాయలు వసూలు చేసి లీడర్ల ద్వారా అందించారు .ప్రతిరోజూ సాయంత్రం మూడున్నరకు నలుగురైదుగురు మేస్టార్లు నేను, విద్యార్ధి విద్యార్ధినీ నాయకులు సైకిళ్ళమీద చుట్టుప్రక్కల  పెంజేండ్ర,కొమరవోలు ఐనంపూడి రిమ్మనపూడి .గొల్వేపల్లి ,మొదలైన గ్రామాలకు వెళ్లి పెద్దలనుకలిసి కరపత్రాలు ఇచ్చి విషయం చెప్పటం వారు వెంటనే స్పందించి డబ్బు ఇవ్వటం, లేక మర్నాడు విద్యార్ధులతో పంపించటం చేశారు .అప్పుడు చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ లో నంబర్ వన్,ఆడపిల్లల లీడర్ మాత్రమేకాక స్కూల్ లీడర్ కూడా అయిన కె.పావని ఇచ్చిన సహకారం చేసిన సేవ మరుపురానివి .ఇప్పుడా అమ్మాయి అమెరికాలో ఉంటోంది భర్త ఇద్దరుపిల్లలతో. 2017లో అమెరికాలో ఉన్నప్పుడు  తరచుగా ఫోన్ లో మాట్లాడేది .గొప్ప సంస్కారం ఉన్నామ్మాయి .అలాగే చీలి నాగలక్ష్మి  సోషల్ మాస్టర్  శ్రీ వెంకటేశ్వరరావుగారమ్మాయి . ఆటా పాటా చదువు అన్నిట్లోనూ దూసుకుపోయేది  .మగపిల్లల పేర్లు పెద్దగా గుర్తులేవు ఒకరేమిటి అందరూ గొప్పగా కృషి చేశారు సేవలు అందించి తాము చదుకున్న చదువుకొంటున్న విద్యా సంస్థ ఋణం తీర్చుకొన్నారు .అడ్డాడ కు చెందినహార్ట్ స్పెషలిస్ట్ వియవాడ లో ఉన్నారని తెలిసి స్టాఫ్ముగ్గురం వెళ్లి  కలిసి చెప్పాం .వారూ గొప్పగా స్పందించారు .అడ్డాడ  డాక్టర్ గారు ఖమ్మం లో ఉంటె లెటర్ రాస్తే డబ్బు పంపారు ఆయన ప్రతిఎదాడీ స్కాలర్షిప్ లు ఇస్తారుకూడా .   రైస్ మిల్ యజమానులు డబ్బెకాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చారు .కూరాగాయలు వచ్చాయి .పాడి పంటకు కొదవేలేదు. నాణ్యమైన నెయ్యి కూడా వచ్చింది  .చేతిలో డబ్బు కు ఇబ్బంది లేకపోవటం తో అన్ని పనుల్లోనూ అత్యున్నతమైన నాణ్యతే లక్ష్యంగా పనిచేశాము .

   బిల్డింగ్ లకు వెనక  గాడిపొయ్యితవ్వించి కట్టెలు సేకరించి గాస్ పొయ్యి  గాస్ సిలెండర్లు కూడా ఏర్పాటు చేయించాం .మా క్రాఫ్ట్ మాస్టర్ శ్రీ కే మల్లికార్జునరావు వంటలో స్పెషలిస్ట్ . వంట వాళ్ళనుపిలి పించటం వడ్డించటం ,ఏ పూటకు ఆపూట వెరిటీ మార్చటం  ,స్వీట్లు హాట్లు ,గడ్డపెరుగు తాజాకూరలు అన్నీ అదుర్స్ గా ఏర్పాటు జరిగింది .వాలంటీర్లు జగ్గులు పట్టుకొని నిరంతరం క్రీడాకారులకు అతిధులకు మంచి నీళ్ళు అందిస్తూ  రిఫరీలకు  ఆరగాఆరగా కాఫీలు అందిస్తూ సేవ చేశారు .వివిధ స్కూల్స్ ను౦చి ఆటలలో పాల్గొనటానికి వచ్చినఆడపిల్లలకు మా స్కూల్ పై అంతస్తులో రూమ్ లు ఇచ్చాం .స్నానాలకు వేడినీరు సరఫరా చేశాం . ఏ ఇబ్బందీ లేకుండా చేశాం .అదనపు లెట్రిన్ సౌకర్యం కలుగ  జేశాం .ఎవ్వరూ ఏ ఇబ్బందీ పడరాదని మా అభి ప్రాయ౦ .అందరూ హోమ్లిగా ఫెల వ్వాలని ఆరాటం .లేడీ టీచర్స్ వంట పనీ ఆటలు ఆడే ఆడపిల్లల  విషయం లో శ్రద్ధ బాగా కనపరచారు .స్కూల్ అంతా ఒక యూనిట్ గా సమైక్యతత తో పని చేశాం .

  ఆటలపోటీలు ఇంకో నాలుగు గు రోజుల్లో ప్రారంభం అవుతాయనగా మా  డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు  స్టాఫ్ సెక్రెటరి  వీరభద్రరావు నా దగ్గరకు వచ్చి ‘’సార్!మనం అనుకోన్నదానికన్నా డబ్బు బాగానే వచ్చింది .ఇంతవరకు ఏ జోన్ లోనూ పెట్టని విధంగా మనం అడేవారికి, అతిధులకు అందరికి ‘’నాన్ వెజ్ ‘’, ఉడికించిన కోడి గుడ్డు  కూడా పెడితే బాగుంటుందని పిస్తోంది .మీరు ఒకే అంటే ఏర్పాట్లు ప్రారంభిస్తాం ‘’అన్నారు .’’నేను తినక పోయినా ఇంతమందికి మీరు ఇలా పెడతామంటే నాకేమీఅభ్యంతరం లేదు .అందులో ఫ్రెష్ గా ఉన్నవాటిని తెప్పించి చేయించి వడ్డించండి .అడ్డాడ భోజనం అంటే ‘’అడ్డడ్డా’అదుర్స్’’అనిపించేట్లు జాగ్రత్త తీసుకోండి గో ఎహెడ్’’అన్నాను సంతోషంగా మూడు రోజులు  నాన్ వెజ్ తో మోతమోగించారు .నేనుమాత్రం ఉయ్యూరు నుంచి తెచ్చుకొన్న కారియర్ భోజనమే చేశా .బ్రతిమిలాడితే ఇక్కడ వంటలో చేసిన స్వీట్స్  లేక గారేలను రుచి చూశా  .

   డ్రిల్ మాస్టర్ ను  సైన్స్ వెంకటేశ్వరరావు ను బెజవాడ పంపించి మంచి నాణ్యమైన బహుమతులు కొని పించి తెప్పించాను .ఆటవస్తువులు నెట్లూ బాల్స్ అన్నీ నాణ్య   మైనవే తెచ్చారు .ఆడుతున్నప్పుడు ,బహుమతులు తీసుకొంటున్నప్పుడు పిల్లలలో ఆనందం సంతృప్తి కళ్ళల్లో మెరిసింది. అంతకంటే కావాల్సి౦దేమిటి ?

  కోర్టులు వేసిన డ్రిల్ మాస్టర్లకు అన్నీ దగ్గరుండి నిర్వహించిన వెంట్రప్రగడ యెన్. డి .ఎస్ .విష్ణు అని అందరి నోళ్ళలో నానే నిరంతర కృషీవలుడు డ్రిల్ మాస్టర్లలో పెద్దన్నగా భావింపబడే శ్రీ విష్ణు వర్ధనరావు సహకారం మరువలేనిది .అలాగే గుడివాడ పెంజే౦ డ్ర మొదలైన స్కూల్స్ నుంచి వచ్చిన ఆట రిఫరీలైన స్త్రీ పురుషులను  అత్యంత గౌరవంగా  చూశాం .చుట్టు ప్రక్కల ఉన్న హై స్కూల్స్ ప్రదానోపాధ్యాయుల సలహాలు సేవలు అందుకొని వారినీ యధాశక్తి గౌరవిన్చాం .ఆటలు చూడటానికి వచ్చినవారికీ సంతృప్తిగా భోజనాలు పెట్టాం  .మూడు రోజుల ఆటలు తో స్కూల్ పండుగ వాతావరణం నే తలపించింది .మూడు రోజులు  మూడు నిమిషాల్లాగా గడిచిపోయినట్లు అందరూ అనుకొన్నారు .చివరి రోజు డియివో శ్రీ హనుమంత రెడ్డిగారికి  పరిషత్ చైర్మన్ గారికీ ?ఘన సత్కారం చేశాం  ‘’ విష్ణు’’గారికి విశిష్ట సన్మానం చేయాలని మా డ్రిల్ మాస్టర్ తో చెప్పి డియివో గారి చేతులమీదుగా చేయించి మురిసిపోయాం ఆయన వద్దన్నా మేము వినలేదు .ఆయనకు నాపై అత్యంత గౌరవం .ఆయన స్పోర్త్మన్ స్పిరిట్ అంటే నాకు మహా ఇష్టం .ఎక్కడ ఆటలపోటీలు ఏరూపం లో జరిగినా విష్ణు గారి పాత్ర లేకుండా ఉండదు .విష్ణు ఉంటె ప్రతిదీ పకడ్బందీ గా జరుగుతుందని నమ్మకం .అదీ ఆయన స్పెషాలిటి .డియివో గారు నాకు కూడా సన్మానం చేసినట్లుగుర్టు .మాస్టాఫ్ అంతటికీ ప్రత్యేక అభిందనలు చెప్పాము. విద్యార్ధి వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రోత్సాహకాలిచ్చినట్లున్నాం .ఇంతమంది సమస్టి కృషి తో జిల్లాస్థాయి బాలికల ఆటల పోటీలను రంగరంగ వైభవంగా నిర్వహించి ‘’నభూతో ‘’అనిపించి అడ్డాడ హై స్కూల్ కీర్తి కిరీటం లో అరుదైన మాణిక్యాన్ని చేర్చాం .

   మూడురోజుల ఆటలపండగ పూర్తి అవగానే దీనికోసం  ఏర్పాటు చేసిన కమిటీతో స్టాఫ్ మీటింగ్ రోజున లిఖితపూర్వకంగా లెక్కలను చెప్పించి ,జమా ఖర్చు వివరాలను అందరికీ వినిపించి  ,అందరూ ఆమోదించాక సర్క్యులేట్ కూడా చేయించి అందరి సంతకాలు తీసుకొన్నాను .దీనితోఆటలపోటీల  చాప్టర్ క్లోజ్ .సుమారు 36 వేలరూపాయలు రాబడి . ఖర్చులు సుమారు 32 వేలరూపాయలు అని,మిగిలిన 4వేలరూపాయలు కామన్ గుడ్ ఫండ్ లో జమ చేశామని జ్ఞాపకం .దీనితర్వాత  నా హయాం లో మరోమేజర్ కార్యక్రమం ఏదీ జరగలేదని గుర్తు .మళ్ళీ అడ్డాడ హైస్కూల్ లో ఇంతటి భారీ కార్యక్రమం కూడా ఎవ్వరూ చేబట్ట  లేదనే తెలిసింది .ఇదంతా అందరి కృషి సహకారం  సేవ ,అంకితభావ ఫలితమే .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సిటీకేబుల్ లో సరసభారతి పుస్తకపరిచయం 

సిటీకేబుల్ లో సరసభారతి పుస్తకపరిచయం

సాహితీబంధువులకు మొన్న నే తెలియజేసినట్లు ఉయ్యూరు సిటీకేబుల్ అనే మన చానెల్ లో మొన్నడా.  రామయ్య గారిపుస్తకం  నిన్న డా పుచ్చా వారిపుస్తకం పరిచయం చేశాను ఇవాళ,రేపూ  డా కొలచల వారి పుస్తకం పరిచయం చేస్తాను .ఆతర్వాత వరుసగా మిగిలినవి చేస్తాను ప్రతి ఎపిసోడ్ కనీసం  15నుంచి 20 నిమిషాలు వస్తోంది .కనుక వార్తల సమయం లో ఉండే 3 లేక 4  నిమిషాలవ్యవధిలో ప్రసారం చేయకుండా  విడిగా ఖాళీ సమయాలలో ప్రైమ్  టైం  లో వీటిని ప్రసారంచేస్తామని నిన్న నాకు వీడియోగ్రాఫర్ శ్రీకాంత్ చెప్పాడు .కనుక అందరం వేచి చూడాల్సిన్నదే-దుర్గాప్రసాద్  .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా గురు పురస్కారంగా 14-7-19 ఆదివారం -సాయంత్రం 6గం .లకు లకు హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ అందించే కళాసుబ్బారావు అవార్డు

గురు పౌర్ణమి సందర్భంగా గురు పురస్కారంగా 14-7-19 ఆదివారం -సాయంత్రం 6గం .లకు లకు హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ అందించే కళాసుబ్బారావు అవార్డు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నా దారి తీరు -121

 గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండగా ,గుడివాడ డివిజన్ డిప్యూటీ విద్యా శాకాది కారులు కొందరుమారి కొత్తవారు వచ్చారు .శ్రీమతి ఇందీవరం గారి తర్వాత ఎవరొచ్చారో గుర్తులేదుకాని శ్రీ ఏసుపాదం గారు రావటం బాగా జ్ఞాపకం .ఆయన రావటం తోనే చాలాహడివిడి చేసి  మీటింగులు పెట్టి  డివిజన్ లో ఏవేవో గొప్పమార్పులు తేవాలని తీవ్ర ప్రయత్నం చేశారు .హెడ్ తలాడిస్తే  తోకలూఊపాల్సినదేకద.మేమూ  తలాడించి పనిచేశాం .ఆయన ‘’గాడ్ ఫియర్ ‘’పర్సన్ గా కనిపించారు .అప్పుడే కొత్తగా పబ్లిక్ పరీక్షలకు వెళ్ళే విద్యార్ధులకు కరదీపికగా హాండ్ బుక్ తయారు చేయటం ప్రారంభమైనదని జ్ఞాపకం .దీనికిగాను సబ్జెక్ట్ లో కాస్త పట్టు ఉన్న హెడ్ మాస్టర్లు అసిస్టెంట్ లు కలిసి సబ్జెక్ట్ కమిటీలుగా ఏర్పాటై పరేక్షలలో  వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు  వాటి సమాధానాలతో ఏ సబ్జెక్ట్ కు ఆ సబ్జెక్ట్ కు తయారు చేసే పనిపట్టాం .నేను ఇంగ్లీష్ ,ఫిజికల్ సైన్స్ కమిటీలలో ఉన్నాను .ఇంగ్లీష్ లో నిధి అంగలూరు హెడ్మాస్టర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తిగారు మాకు ఇంగ్లిష్ కమిటీ హెడ్ .ఫిజిక్స్ కు నారాయణశర్మగారు అనే శ్రీ కూచిభొట్ల లక్ష్మీ నారాయణ శర్మ గారు హెడ్ అని గుర్తు .వీరు నామిత్రులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారికి తోడల్లుడు .సబ్జెక్ట్ లో నిధి .అన్ని విషయాలు  వ్రేళ్ళమీద ఉండేవి .చైన్ స్మోకర్  ప్రైవేట్ కాలేజీలో ఫిజిక్స్  లెక్చరర్ గా సాయం కాలాలో పని చేసేవారు .ఆయన తెల్లటి మల్లు పంచే తెల్ల హాఫ్ హాండ్స్ షర్ట్ తో ఉండేవారు .కొంచెం నలుపురంగుగా ఉన్నా  చిరునవ్వు ముఖం .చాలా సరదాగా మాట్లాడేవారు . జోక్స్ పేల్చటం ఆయన హాబీ .ఆయన నవ్వు కూడా విటగా ఉండేది .లోకల్ ప్రైవేట్  హై స్కూల్ లో సైన్స్ టీచర్ . ఎవరికి ఏ సందేహమోచ్చినా తీర్చగలసత్తా ఉన్న వ్యక్తీ .నేను రిటైరయ్యాకే ఆంజనేయ శాస్త్రి  గారికి ఈ శర్మగారు తోడల్లుడు అని తెలిసింది .అంతటిదాకా తెలీదు  నేన౦టే  పరమ ఆత్మీయంగా ఉండేవారు . మీటింగ్ లలో ఇద్దరం ప్రక్కప్రక్కనే కూర్చునే వాళ్ళం .ఆయన పలకరింపు ఒక పులకరి౦పే .రిటైరయ్యాకకూడా ఫోన్ లో పలకరించుకొనే వాళ్ళం . అతిగా సిగరెట్లు తాగటం వలననో ,ఏమోఆయన సుమారు పది, పదిహేనేళ్ళ  క్రితమే  మరణించారని విన్నాను .

    నేనూ, అంగలూరు సైన్స్ మాస్టర్ శ్రీ పొట్లూరి రాజేంద్రప్రసాద్ మొదలైనవాళ్ళం ఫిజిక్స్ బాచ్ లో ఉన్నాం  .మేము సలహాలుఇస్తే రాజేంద్రప్రసాద్ గారు బాధ్యత అంతా తానేతీసుకొని పూర్తి చేసేవారు .ఇక్కడే చిరివాడకు చెందిన సోషల్ మేస్టర్ వేలూరి ఆయన (కృష్ణమూర్తి ?)బాగా పరిచయమయ్యారు .అలా అన్ని సబ్జెక్ట్ ల వారూ తయారు చేసి డివిజన్ తరఫున ప్రింట్  చేయించి ప్రతిస్కూల్ కు అక్కడున్న విద్యార్ధుల సంఖ్యను బట్టి సరఫరాచేసే ఏర్పాటు జరిగింది .జనవరి ,ఫిబ్రవరి ,మార్చి నెలలో ఈ పుస్తకాలు చదివితే ఉత్తీర్ణత గారంటీ అనే అభిప్రాయం తో తయారైనపుస్తకాలివి .వీటిని ప్రతి స్కూల్ లోను ఆవరేజ్, బిలో ఆవరేజ్ విద్యార్ధులతో బాగా చదివించి లెక్కలు అయితే చేయించి పాస్ అవటానికి మార్గం సుగమం చేశారు .దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన డివిజన్స్ వాళ్ళూ  అనుసరించారు  .తర్వాతతర్వాత ఏ డివిజన్ కు ఆ డివిజన్ వాళ్ళు శ్రమపడి తయారు చేశారు .శ్రీ ఏసుపాదం గారు తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి అయ్యారు .అప్పుడు జిల్లాలోని సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్శ్ కూర్చుని జిల్లాకంతటికీ ఈ సోర్స్ బుక్స్ లేక గైడ్ బుక్స్ తయారు చేయించి పంచిపెట్టి౦చి నట్లు జ్ఞాపకం .తర్వాత కొన్నేళ్ళు ఈ జాతర కొనసాగింది .కృష్ణా జిల్లా ప్రదానోపాధ్యాయ సంఘం కూడా కీలక బాధ్యతలు చేబట్టి ఈ బృహత్ప్రయత్నానికి యధా శక్తి సాయం చేసింది .తరువాత తర్వాత దీనిపై మోజుతగ్గి మొహం మొత్తి విరమించారని విన్నాను .ఏసుపాదంగారు ఇక్కడ ఉండగానో లేక ఏలూరు బదిలీ అయ్యాకో ‘’అవినీతి కుంభకోణం’’ లో బుక్ అయి సస్పెండ్ అయ్యారని తెలిసింది .ఒకప్పుడు 1970దశకం లో జాన్ గారనే డియివో కూడా ఇలాగే దెబ్బతిన్నారు .అధికారులు పైకి నిర్దుష్టంగా  ,లోపల లోపభూయిష్టంగా ఉండటమే దెబ్బతినటానికి కారణం .

   నేను రిటైరవ్వటానికి ముందు గుడివాడ  డిప్యూటీ ఎడ్యుకేషనల్ఆఫీసర్ గా  శ్రీ టి. శ్రీరామమూర్తిగారు  వచ్చారు  .మితభాషి . సజావుగా చక్కగా పని చేసి అందరి మన్ననలు అందుకొన్నారు .ప్రతిస్కూల్ కు విజిట్లు, వార్షిక తనిఖీలు పెండింగ్ లేకుండా చేసి విద్యా రంగానికి మార్గదర్శనం చేశారు .పరీక్షలు నిర్దుష్టంగా జరిపించారు .మంచి మనిషిగా బాధ్యత గల ఆఫీసర్ గా గుర్తింపు పొందారు .మా అడ్డాడ హైస్కూల్ ఇన్స్పెక్షన్ కూడా చేసి బాగా సంతృప్తి చెందారు .మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలాఉందని మిగిలిన స్కూల్స్ లో చెప్పేవారు .నా రిటైర్మెంట్ రోజున మా ఆహ్వానం పై వచ్చి ,నా పి.ఎఫ్. (ప్రావిడెంట్ ఫండ్ )నుంచి రావాల్సిన 60 వేల రూపాయల డబ్బు ను చెక్కు రూపంగా తెచ్చి నా చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేశారు .ఇలాంటి ఆఫీసర్లు ఉంటే పని చేసేవారికి ఆనందం సంతృప్తి .మనసులు గెలవటం అంటే ఇదే .

   సశేషం

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-19-ఉయ్యూరు



— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త 

సాహితీ బంధువులకు శుభవార్త

నిన్నసాయంత్రం ఉయ్యూరు సిటీ కేబుల్ అనబడే ”మన ఛానల్ ”కు చెందిన జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ నన్నుకలిసి ”మాస్టారూ !సరసభారతి ప్రచురణలన్నీ ”మనఛానల్ ”ద్వారా ప్రసారం చేద్దాము మీకు ఎప్పుడు వీలు ఉంటుందో చెబితే కెమెరామన్ ను మీ ఇంటికి పంపిస్తాను ”అన్నారు .సంతోషం అని థాన్క్స్ చెప్పాను .ఇవాళఉదయం కెమెరామన్ శ్రీకాంత్ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితె ”నీకు వీలున్నప్పుడు రా ”అన్నాను ”ఐతే సాయంత్రం 4గంటలకు వస్తాను ”అన్నాడు ఒకే అన్నాను
  అన్నట్లుగానే వచ్చాడు మొదటగా  ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకాన్ని పరిచయం చేశాను .సుమారు 15 నిమిషాలలో .ఇది ఈరోజు రాత్రికి ప్రసారం అవుతుందని చెప్పాడు .సరే అన్నా .రేపు”ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత  డా పుచ్చా వెంకటేశ్శ్వర్లు ”గారి పుస్తకం పరిచయ చేస్తాను .తర్వాత ”కెమోటాలజి పీత కోలాచల సీతారామయ్య ”గారి పుస్తకాన్ని ఆతర్వాత వరుసగా మరికొన్నిటిని పరిచయం చేస్తాను .దీనికి ప్రకాష్ గారి ఉత్సాహానికి ,సరసభారతి పై ఆయనకు మా ఛానల్ కూ ఉన్న  ఆదరాభిమానాలకు, వీడియో తీసిన శ్రీకాంత్ కు ధన్యవాదాలు -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

నా దారి తీరు -120

సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్ శాంక్షన్ గుమాస్తాకు లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే కాని జరిగేదికాదు .అలాగే ఎవరైనా హెడ్మాస్టర్ లీవ్ పెడితే ,అది శాంక్షన్ అవటానికి ,జాయినింగ్ పర్మిషన్ పెడితే దాన్ని ఆమోదించి విధులలో చేరమని ఆర్డర్ ఇవ్వటానికీ కూడా ఇదే ‘’ఆమ్యామ్యా ‘’తంతు జరిగేది .బందరు దగ్గరున్నవాళ్ళు ఈ పని తేలికగా చేయి౦చు కొనేవాళ్ళు .దూరంగా ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చి గుమాస్తానుకలిసి ‘’చేతులకు తడి అంటించి ‘’వెడితే కాని ఇవేవీ గ్రాంట్ అయ్యేవికావు .పరిషత్ విద్యాశాఖాధి  కారి అంటే పియివో ఎవరొచ్చినా దీన్ని ఆపగలిగేవారుకాదు .కృష్ణా జిల్లా గిల్డ్ ,పి.ఆ.ర్టి,కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ నాయకులు కూడా ఏమీ చేయలేక  వాళ్లవంతు ప్రయత్నం చేసేవారు .జరిగితే సరి లేకపోతెఖర్మ అన్నట్లు ఉండేది .ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి శ్రీ పి.వెంకటేశ్వరరావు అనే లెఫ్ట్ నాయకుడు రోజూ జిల్లాపరిషత్, డియివోఆఫీసుల చుట్టూ తిరిగి  వాళ్ళవాళ్లకు దమ్మిడీ ఖర్చు లేకుండా పనులు చేయించేవారు .ఆయన సహృదయుడు మాటకారి సంస్థ వెన్నుదన్ను బలంగా ఉన్నవాడు .కనుక ఆయన చెబితే చేయకపోతే ధర్నానో నినాదాలో వీధి పోరాటాలకో దిగుతాడని భయపడి ఆయన చెప్పిన పనులన్నీ,అన్ని కేడర్ల వారికీ  దాదాపు చేసేవారు .ట్రాన్స్ ఫర్స్ విషయం లోనూ ఆయనమాట చెల్లుబడి అయ్యేది .మిగిలినవారికి ‘’ప్రసన్నం ‘’చేసుకోవటమే సొల్యూషన్ గా ఉండేది .ఈ బాధలు తీర్చేవారెవరు అని మా  సంఘం  ఎదురు చూసేది .

ఆపద్బాంధవుడు శ్రీ పివి .రామారావు

పరిషత్ విద్యా శాఖాదికారిగా శ్రీ పెండ్యాల వెంకటరామారావు గారు గోదావరి జిల్లానుంచి బదిలీ అయి వచ్చారు .రూల్స్ బాగా తెలిసినమనిషి .పనికంటే మాటలు ఎక్కువ .కానిమంచి వారు సహృదయులు .ఒకసారి నేనూ ఆదినారాయణ  విశ్వం కలిసి సాయంవేళ ఆయన్ను ఆఫీసులో కలిసి మాట్లాడాము .జిల్లాలో పెండింగ్ సమస్యలు గుర్తు చేశాము .వచ్చినవారందరికీ టీ బిస్కెట్లు తనస్వంత ఖర్చుతో ఇచ్చాకనే ఆయన  మాట్లాడేవారు .ఎప్పుడైనా ఇది తప్పకుండా జరిపే విధానంగా ఉండేది .మేము వెళ్లేసరికి ఆయన టేబుల్ నిండా ఇటూ అటూ, టేబుల్ కిందా ప్రక్కనా అటూ ఇటూ కనీసం ఒకవంద ఫైళ్ళు ఉన్నాయి .ఆయన ముందు అందర్నీ మాటల్లోకి ది౦చేవారు ఆప్రవాహం లో ఆయన అనుభవాల ధారలో అలా కొట్టుకు పోయేట్లు చేసేవారు .ఈ మాటల్లో అసలు ఫైళ్ళు ముట్టుకునేవారుకాదు గుమాస్తాలు వచ్చి గోలపెట్టేవారు చూస్తాను చూస్తాను అని వాయిదాలపై వాయిదాలు .దీనితో అక్కడి స్టాఫ్ లో అసంతృప్తి పైగా  బ్రాహ్మణుడుకనుక మరీ చులకనయ్యారు .మేము రెండు మూడు సార్లు ఈ పరిస్థితిని గమనించాం .ఇకలాభం లేదని ‘’సార్!ఇలా పెండింగ్ రామారావుగా పెండ్యాలరామారావు మారితే జిల్లా లో కలకలం బయల్దేరి   అసంతృప్తిపెరిగి ,మాకు మీపై ఉన్న సాఫ్ట్ కార్నర్ తొలగి మేమూ అందరితోకలిసి యాజిటేషన్ చేయాల్సి వస్తుంది. దయ చేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు .మీకు సాయంకావాలంటే మేము వస్తాం దగ్గరుంటాం ఫైల్స్ క్లియర్ అయ్యేదాకా ఎన్ని రోజులైనా మా స్కూల్ డ్యూటీ ముగించి మీదగ్గరకు వచ్చి కూర్చుంటాము .మీరు ‘’ఆపరేషన్ ఫైల్ క్లియరింగ్ ‘’ప్రారంభించాల్సిందే .మళ్ళీ ఇంకో సారి చెప్పము ‘’అని వార్న౦గ్ లాంటి సలహా ఇచ్చాము .’’ఏకళన‘ఉన్నారో’’ ఆయన ‘’ఒకే. మీరు ఇంతగా చెప్పారు కనుక రేపటించే ఫైల్ క్లియరింగ్ మొదలెడతాను .రేపు సాయంత్రం మీరు .రండి ఇక్కడ ఎవరి పర్మిషన్ మీకు అక్కర్లేదు .డైరె క్ట్ గా నా ఆఫీసు రూమ్ కి రండి’’అన్నారు .హమ్మయ్య అనుకొన్నాం  .

అనుకోన్నట్లే మళ్ళీ మర్నాడు ఆయన ఆఫీసుకు వెళ్లి కూర్చున్నాము .నిన్నటి ఫైల్స్ కుప్పలన్నీ అలాగే ఉన్నాయి .కిందపెట్టిన ఒక కుప్పదగ్గర తేలు కూడా కనిపించింది .అంటే ఫైల్స్ ఉన్నాయని ఊడవటం కూడా చేయలేదన్నమాట .మమ్మల్ని చూసి ఇక చకచకా ఫైల్స్ చూడటం క్లియర్ చేయటం అనుమానాలోస్తే గుమాస్తాని పిలవటం నివృత్తి చేసుకోవటం సంతకాలు పెట్టి వెంటనే వాటికి ఎవరికి పంపాలో అదేశాలివ్వటం జరిగింది. రాత్రి 9వరకు అలా కూర్చునే ఉన్నాం .ఆయన మాతో ఏదో హస్క్ కొడుతూనే ఉన్నారు .మధ్యలో నేను ‘’సార్ ఫైల్ ‘’అంటూనే ఉన్నాను .ఇకాయనకు సంతకాలు పెట్టీపెట్టీ చేతులు నొప్పెట్టి ‘’అయ్యా ఇవాల్టికి ఆపేద్దాం ‘’అన్నారు .బహుశా ఇలా నాలుగైదు రోజులు ఎవరో ఒకరం ఆయన ఆఫీసులో ఆయనవద్ద కూర్చుని మొత్తం ఫైల్స్ అన్నీ క్లియర్ చేసి ఆయనకు బాడ్ నేం రాకుండా మాపరువు పోకుండా కాపాడుకున్నాం .సమర్ధత ఉన్నా ఆయన అలసత్వం వల్ల జరిగిన డిలే ఇదంతా.

సైన్స్ పరికరాల కొనుగోలు

ప్రతి ఎదాదికానీ ,రెండేళ్ళకోసారి కాని జిల్లాపరిషత్ సైన్స్, లెక్కలు ,సోషల్ పరికరాలుకొని స్కూళ్ళకు సరఫరా చేస్తుంది .వీటిలో అనవసరమైనవి పనికిరాని గతఏడాది ఇచ్చినవీ కక్కూర్తిపడి కంపెనీల ప్రలోభానికిఆఫీసర్లు లొంగి కొన్నవీ సప్ప్లై చేసేవారు .రామారావుగారిని కలిసినప్పుడల్లా ఈ విషయాలు దృష్టికి తెచ్చేవాళ్ళం .ఒకసారి ఆయన నన్నుపిలిపించి ‘’కొత్తపరికారు కొనబోతున్నాము .ఇండెంట్లు ,ఖరీదు వివరాలు కంపెనీలు పంపాయి .మీరు వీటిని చెక్ చేసి ఆవస్తువుకు ఆధర తగినదాకాదా అవి ప్రస్తుతానికి అవసరమా ,ఇవికాక ఇంకా ఏమైనా కావాలా తేల్చాలి’’అన్నారు .’’నేనొక్కడినే చేస్తే మన  ఇద్దరికీ లాలూచీ అని నిందవేస్తారు .కనుక దీనికి ఒక కమిటీ వేయ౦డి  .ఆకమిటీ విచారించి  నిగ్గు తేల్చి మీకు రిపోర్ట్ ఇస్తుంది అప్పుడు ప్రాబ్లెం ఉండదు ‘’అన్నాను .’’మంచి సలహా .తప్పక అలాగే చేద్దాము ‘’అని ఎవరేవరైతే బాగుంటుందో నన్ను సలహా అడిగీ ఆయనా విచారించి కమిటీ వేయటం మేముమోహమాటం లేకుండా నిర్దుష్టంగా రిపోర్ట్ ఇవ్వటం మంచి అవసరమైన నాణ్యమైన పరికరాలు అ౦దుబాటుధరలో కోనేట్లు చేయటం జరిగింది .ఇది శ్రీ పెండ్యాలరామారావు గారి ఘనత.ఆయన ఒక నిర్ణయం తీసుకొంటే వెనక్కి తిరగటం ఉండేదికాదు. అంతటి మొండిమనిషికూడా  .ఆమ్యామ్యా లకు తావులేకుండా మంచితనం తో పనిచేశారు .

ఆయన రిటైర్ అయ్యాక జిల్లా ప్రధానోపాధ్యా సంఘం జిల్లాలోని ఇతర  సంఘాలను కలుపుకొని జిల్లాపరిషత్ మీటింగ్ హాల్ లో చైర్మన్  గారి అధ్యక్షతన ఘన సన్మానం చేశాం .

కార్డ్ కాంపైన్

నేను 1998 జూన్ లో ప్రధానొపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసేవరకు  కృష్ణా జిల్లా  ప్రధానోపాధ్యాయ సంఘం లో  ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు జ్ఞాపకం .రిటైర్ అయ్యాక కూడా సంఘానికి శ్రీ రామం గారితోపాటు నన్ను సలహా సంఘ సభ్యుడిని చేశారు .పదవిలో ఉన్నప్పుడూ ,రిటైర్ అయ్యాకకూడా సంఘ కార్యక్రమాలకు తప్పని సరిగా హాజరై ,నా అభి ప్రాయాలను సూచనలు తెలియ జేసేవాడిని  .కార్యక్రమాల వివరాలు శ్రీ ఆదినారాయణఎప్పటికప్పుడు ముందుగా ఫోన్ చేసి లేక కార్డ్ రాసి తెలియజేసి నన్ను తప్పక రమ్మని కోరేవారు .నేనూ అలానే వెళ్ళేవాడిని .కార్యక్రమాలలో ఏదైనా మంచి జరిగితే దానినీ ఏదైనా సవ్యంగా లేకపోతె దానినీ ఇంటికి వచ్చి శ్రీ ఆదినారాయణ కు ‘’కార్డు ‘’మీద నా అభి ప్రయాలు రాసేవాడిని .కార్డు లో మిల్లీమీటరు ఖాళీ కూడా లేకుండా రాయటం నా అలవాటు .అవన్నీ జాగ్రత్తగా చదివి మరుసటి సమావేశం లో ఆదినారాయణగారు  నేను రాసిన విషయాలు సభ్యులకు తెలియ జేసేవారు  .తీసుకున్న దిద్దుబాటు చర్యలు కూడా చెప్పేవారు .నేను ఇలా చాలాఉత్తరాలు ఆయనకు సంఘ అభివృద్ధి ,చేయాల్సిన కార్యక్రమాలు మర్చిపోయిన మనుషులు ,గుర్తి౦పు పొందని  హెడ్ మాస్టర్లు  ఇంకా పకడ్బందీగా సంఘం పని చేయటానికి ఎంతనే పరిష్కరించటానికి మార్గాలు  సూచనలు  హెడ్ మాస్టర్లు  నాకు ఫోన్ చేసికాని ఉత్తరాలద్వారాకాని తెలియజేసినవారి సమస్యలు  వాటిని సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ,పే స్కేల్స్ పై సమావేశాలు ,అమలు జరపటానికి మార్గాలు ఇలా ఒకటేమిటి సమస్త విషయాలు నేను సెక్రెటరి శ్రీ ఆదినారాయణ కు ‘’కార్డ్ కాంపై న్’లాగా కార్డు మీద మాత్రమె రాశాను .దాదాపు ఒక యాభై దాక రాసి ఉంటాను .ఆయన వీటిని అతి జాగ్రత్తగా భద్ర పరచుకొన్నారు .ఈ విషయం ఆయనే చాలా సార్లు నాకు ,సంఘానికి సమావేశాలలో తెలియ జేసేవారు .అవన్నీ ఆయనకు ‘’ఒక ట్రెజర్ ‘’అని పొంగిపోయేవారు .గట్టున ఉండి సలహా లు ఇవ్వటం తేలికే .కాని పని చేసి మెప్పించటం చాలాకష్టం .అందరి బాధ్యతా సంక్షేమం తనది సంఘానిదీ అని ఆయన పడిన కష్టం శ్రమ తపన బదులు తీర్చుకోలేనిది .జిల్లా హెడ్ మాస్టర్లు అందరూ ఆయన సేవకు రుణపడి ఉంటారు .సందేహం లేదు .

గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రమోషన్లు

జిల్లాపరిషత్ ,ప్రైవేట్ మేనేజిమెంట్ లలో పని చేస్తున్న బిఎడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ గా ప్రమోషన్లు ,హెడ్ మాష్టర్లకు గేజేటెడ్ హోదా ,వారికి డేప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గా ,D.I.E.T.లెక్చరర్లు ప్రిన్సిపాల్స్ గా ,ప్రమోషన్లకోసం దాదాపు ఇరవై ఏళ్ళుగా చేసిన పోరాటం ఫలించి ఆ ప్రమోషన్లు లభించాయి .జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లు అందరూ గేజేటేడ్ హోదా దక్కింది. పచ్చసంతకం చేసే అర్హతలభించింది . దీనికి అన్ని సంఘాలూ కృషి చేసినా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కృషి శ్లాఘనీయం .జిల్లాపరిషత్ లో సీనియర్ హెడ్ మాస్టర్లు పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా ప్రమోషన్ పొందారు .అలాంటివారిలో శ్తీ వై విరాజు ,శ్రీ విశ్వం ,శ్రీ రమణారావు ,శ్రీమతి సుగుణకుమారి మొదలైనవారున్నారు .గోదావరిజిల్లానుంచి మన జిల్లాకు ప్రమోషన్ పై  వచ్చిన  హెడ్ మాస్టర్లున్నారు .అలాంటివారిలో మొవ్వ హెడ్ మాస్టర్గా వచ్చిన రాజుగారు ,కృష్ణా జిల్లాపరిషత్ విద్యాశాఖాధికారిగా వచ్చిన సూర్యనారాయణ రాజు ?గారు ఉన్నారు .వీరందరికీ హార్దిక స్వాగతం చెప్పాము .పియివో రాజుగారు మహా నిక్కచ్చిమనిషి . సూటిగా నడిచే మనస్తత్వం .కనుక జిల్లాపరిషత్ లో పైరవీలు సాగలేదు. అర్హులకు దక్కాల్సినవన్నీ దక్కాయి .వాళ్ళిద్దరూ రిటైర్ అయి వెళ్ళిపోయినా ఈ జిల్లాతో, మాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు .బెజవాడ డివిజన్ విద్యా శాఖాదికారిగా శ్రీ వైవి రాజు తన  సమర్ధతను ఒత్తిడిలోనూ చాటి ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన వ్యక్తిత్వాన్ని  నిలబెట్టుకొన్నారు .వచ్చిన అరుదైన అవకాశం ఇది హెడ్ మాస్టర్లకు .దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొన్నారు .వీరి ప్రమోషన్ లకు బదిలీలకు పోస్టింగ్ లకు మా సంఘం చేసిన కృషి అద్వితీయం హైదరాబాద్ లెవెల్ లోకూడా మాకు సానుభోతిపరులుఆఫేసర్లు ఉండటం బాగా కలిసొచ్చింది వీరి తర్వాత వచ్చినవారు అవినీతి బంధు ప్రీతికి పాలై పరువు గంగలోకలిపారని అనుకోన్నారుజనం . వీరి ప్రమోషన్ లకు .

స్పాట్ వాల్యుయేషన్లో ఆఫీసర్ హోదా

పదవతరగతి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో దేప్యోటీ కా౦ప్ ఆఫీసర్లుగా జిల్లాపరిషత్ సీనియర్ హెడ్ మాస్టర్లను  కూడా నియమించాలని  చేసిన ఆందోళన ఫలించింది .వాల్యుయేషన్ కు రెమ్యూనరేషన్ పెంచాలనీ చీఫ్ కు మిగిలినవారికీ తేడా ఉండాలన్నకోరికకూడాతీరింది.

ఉత్తమ ఉన్నతపాఠ శాలల ఎంపిక

చాలాకాలం నుండీ జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించి అన్నిటా ముందున్న స్కూళ్ళను గుర్తించి ఆ స్కూల్స్ కు ఆ ప్రదానోపాధ్యాయులకు బహుమతులు అందజేస్తామని జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ కడియాల రాఘవరావు గారు చెప్పారుకానీ అమలుకాలేదు .ఇప్పుడు పియివోగా ఉన్న రాజుగారి దృష్టికి తెచ్చాము .ఆయన ఏమైనా సరే ఈఏడాది అమలు చేద్దాం అనిహామీ  ఇచ్చారు .రామంగారు, ఆదినారాయణ ,నన్ను  ,వైవిరాజు  లతో ఒకకమిటీ వేసి ఒక కారు ఇచ్చి ముఖ్యమైన స్కూళ్ళు సందర్శించి అక్కడి చదువు తీరు ఉత్తీర్ణత శాతం ఆటలు ,పొందిన బహుమతులు  మొదలైన విషయాలపై క్షుణ్ణంగా నిష్పక్షపాతంగా పరిశీలించి రిపోర్ట్ ఇమ్మన్నారు .అందరం కారులో తిరిగి చూసి మొదటి ,రెండు ,మూడు స్థానాలకు ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి రిపోర్ట్ ఇచ్చాము  .అప్పటికే నేను రిటైరయ్యాను .తర్వాత ఆ బహుమతులు ఇచ్చే ఉంటారని  భావిస్తాను .సమర్ధులు అధికారం లో ఉంటె  సాధించలేనిది  ఏదీ ఉండదు అని చెప్పటానికి ఇదిఒక నిదర్శనం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-19-ఉయ్యూరు

శ్రీ దేవినేని మధుసూదనరావుగారి స్పందన

Devineni Madhusudana Rao

Sun, Jun 16, 6:51 PM (17 hours ago)
to me, sahitibandhu@googlegroups.com, Andukuri, Vani, Vasanth, Vuppaladhadiyam, kasturi, Bharathi, Sugunakumari, adinarayana_kosuru, Bharathi, mrvs, Murali, Vishwanatha, dr.Madugula, Dorbala, Sastri, Gopala, Krishna, akunuri, Radha, Lavanya, Padma, Padmasri, laxmi

Dear Durga Prasad Garu

Thank you for mentioning about me in the note shared by you and shared the nostalgia. I don’t deserve so much praise. It is all happened but for your interest to improve school education.  I feel I was lucky to get associated with all good people like you to come to my house whenever I requested and deliberate on the issues faced by school education.  If you are were there for few more years in the system, we might have made more contribution.

Two important things emerged are 1. Conducting annual Head Masters conference meaningful and useful, than mere formality and give voice to all HMs.  2. The present day Academic Calendar was born out of all your efforts and contribution made byShri Ramam Garu and Mrs P Prameela Rani Garu, can’t be measured by any yardstick.

Shri MVP Sastri IAS then Secretary Education and Shri N Srirama Murthy then DEO has not only encouraged us and allowed us in doing the work to make improvements. If we all continued for few more years you all might have made solid foundation which could not have been reversed.

Great Memories and thank you and all of our friends for contributing the cause of education

I hope all your family members are doing well.

నమస్తే మధుసూదనరావు గారు -గుర్తుకొ చ్చిన విషయాలు రాసే ప్రయత్నం చేశాను .నిజంగా మనం చేసింది తలచుకొంటే ఇంతటి మహత్కార్యాలు మనవల్ల జరిగాయా  అని మనమే ఆశ్చర్య పడేట్లున్నాయి .ఇది అందరి సమష్టి కృషి .అందరూ అభినందనీయులే -దుర్గాప్రసాద్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

నా దారి తీరు -119

కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

శ్రీ రామం గారు ఎప్పుడు  సంఘం మీటింగ్ పెట్టినా హాజరైనవారి సంఖ్య20లోపలే ఉండేది .ఇది మంచిదికాదని మేము తీవ్రంగా ఆలోచించి మెంబర్షిప్ డ్రైవ్ చే బట్టాం .డివిజన్ల వారిగా హెడ్ మాస్టర్స్ లో చురుకైన వారికి  సభ్యులుగా చేర్చే బాధ్యత అప్పగించి ,రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించి ,ప్రతినెలా జీతం చెక్కులను కలెక్ట్ చేసుకొనే సెంటర్లలో  హెడ్ మాస్టర్ల తో మాట్లాడించి సభ్యులుగా చేర్పించే ఏర్పాటు జరిపించా.ఇలా గుడివాడ బందరు ఉయ్యూరు బెజవాడ నందిగామ జగ్గయ్యపేట మైలవరం నూజివీడు తిరువూరు కైకలూరు  మొవ్వ మోపిదేవి కోడూరు  నాగాయలంక  మొదలైన చెక్ సెంటర్లలో బలమైన కార్యకర్తలైన హెడ్ మాస్టర్లకు బాధ్యత అప్పగించాం .వారంతా శక్తి వంచన లేకుండా పని చేసి జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం లో సభ్యులుగా చేర్పించారు .దీనితో సంఘబలం పెరిగింది. ఆర్ధిక పరి పుస్టికలిగింది. ఏదో రకం గా సేవ చేయాలనే దృక్పధమేర్పడింది .ప్రైవేట్ హైస్కూల్స్, మునిసిపాలిటీ మొదలైన వాటిలో పని చేసే హెచ్ ఏం లుకూడా సభ్యులై సంఘ బలాన్ని మరింతపెంచి మానమ్మకానికి మద్దతు నిచ్చారు .దీనితో మీటింగ్ లు కూడా వేర్వేరు డివిజన్స్ లో  ఏర్పాటు చేసి  వారికీ, మిగిలినవారికీ గొప్ప ఉత్సాహం ,ప్రేరణా కలిగించాం .ఎక్కడ మీటింగ్ జరిగినా బిలబిలలాడుతూ హెడ్ మాస్టర్లు హాజరయ్యేవారు. సభలు కళకళ లాడేవి సంస్థకు గొప్ప జవజీవాలేర్పడ్డాయి .సంఘబలమే వ్యక్తిబలం అని నిరూపించాం .మమ్మల్ని నమ్మి మా అభిప్రాయాలతో ఏకీభవించి మాతో కాలుకదిపి నడిచినందుకు ప్రధానోపాధ్యాయులను ముఖ్యంగా అభినదించాలి .కరేస్పాన్డేన్స్  ,కమ్మ్యూనికేషన్ బాధ్యత శ్రీ ఆదినారాయణ సమర్దవంతం గా నిర్వహించి అందరికి తలలో నాలుకై గౌరవాన్ని పొందారు .

   కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ తో సంఘం కలిసి పని చేయటం

 సి.యి. బోర్డ్, హెచ్ ఎమ్స్ అసోసియేషన్ శ్రీమతి ప్రమీలారాణిగారి ఆధ్వర్యం లో చాలా ఆదర్శంగా పని చేసి సభ్యుల ,పాలకుల ఉపాధ్యాయుల విద్యార్ధుల మన్ననలు అందుకొన్నారు .అనవసర వ్యయం లేకుండా సిలబస్ పుస్తకాలు తయారు చేయటం ,ప్రశ్నాపత్రాలు, ప్రోగ్రెస్ కార్డుల ప్రింటింగ్ ,సరఫరా అన్నీ పకడ్బందీ గా జరిగాయి .జిల్లాలోఇందుకు సమర్దులైనవారిని ఆమె ఎంపిక చేసుకొని ,అన్నీ సవ్యంగా సక్రమంగా జరిగేట్లు చేశారు .ఎక్కడా క్వస్చిన్ పేపర్ల లీకులు ,అమ్మకాలు లేవు .బురద గుంటలో పడి కంపుకోట్టుకు పోయిన వ్యవస్థను సుపరిపాలనా సుగంధం తో పరిమళభరితం చేయటం తోప్రమీలారాణి నిజంగానే రాణి అనిపించారు .

        సిలబస్ ,పబ్లిక్ ప్రశ్నాపత్రాలలో మార్పులు –పునశ్చరణ తరగతులు

కొత్త సిలబస్ తో బరువైన పాఠ్య పుస్తకాలు వచ్చాయి .నా లాంటివాళ్ళు డిగ్రీలోకూడా  చదవని అంశాలు ఫిజిక్స్ లో ఉన్నాయి .అలాగే లెక్కలు జీవశాస్త్రం ఇంగ్లీష్  సోషల్ లోనూ ఉన్నాయి మేమైతే ఎలాగో అలా నేర్చుకొని చెబుతాం .కానీ  విద్యార్షులకు అర్ధం చేసుకొనే స్థాయి కూడా ఉండాలికదా  .అందుకని ముందుగా జిల్లా విద్యాశాఖాదికారికీ ,పై అధికారులకు విన్నపాలు పంపాం .సిలబస్ పై టీచర్లకు ఓరిఎన్ టేషన్ క్లాసులు చాలా ఇంటెన్సివ్ గాఏర్పాటు చేసి సబ్జెక్ట్ విషయం లో అవగాహన కల్పించమని కోరాం .చివరికి వారికీ తెలిసివచ్చి ముందు జిల్లాస్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు కాలేజీ లెక్చరర్ల తో పునశ్చరణ తరగతులు నిర్వహి౦పజేసి సబ్జెక్ట్ లపై ఆధిపత్యం వచ్చేట్లు చేశారు .మాలో కొందరు రిసోర్స్ పెర్సన్స్ గా కూడా వ్యవహరించి సాయం చేశారు .ఇంత చేసినా కొన్ని సబ్జెక్ట్ లలో కొన్ని టాపిక్స్ బోధించటం చాలాకస్టంగా  ఉండేది..సెమినార్లుపెట్టి  వాటిని సిలబస్ నుంచి ఉపసంహరింప చేయించాం .

  పబ్లిక్ ఇంగ్లిష్ ప్రశ్నా పత్రం లో డైలాగ్ రైటింగ్ ఉండేది .మూడునాలుగేళ్ళు చూశాం .నూటికి తొంభై మంది దాన్ని వదిలేసేవారు .రాసే ప్రయత్నమే చేసేవారుకాదు .కనుక దీన్ని తొలగించాలని కోరాం.తప్పని సరి అయి  తొలగించేశారు .అలాగే లెటర్ రైటింగ్ కూడా చాలా ఆబ్స్ట్రాక్ట్ గా ఉండేది .దానిలోనూ మార్పులు చేయించాం .మా అందరి ఉద్దేశ్యం ఒక్కటే .సబ్జెక్ట్ బోధనా నిర్దుష్టంగా అర్ధవంతంగా జరగాలి .ప్రశ్నాపత్రాలు విద్యార్ధుల అజ్ఞానాన్ని పరీక్షించేవికాకుండా వారికి ఏమి తెలిసిందో ఏది నేర్చుకున్నారో దానిపై పరీక్ష జరగాలని .ఇది అమలుకావటానికి మా సంఘం తీవ్ర కృషి చేసింది .రాష్ట్రం లో జిల్లాకొక ప్రధానోపాధ్యాయ సంఘం ఉన్నది .కొన్నిట్లో నామమాత్రపు సభ్యులే ఉండేవారు .కాని నాయకులు బలమైనవారు .ముఖ్యంగా రాయలసీమ లో నాయకత్వం బలీయంగా ఉండేది .వాళ్ళే డిసైడింగ్ ఫాక్టర్ గా ఉండేవాళ్ళు .కాని కృష్ణాజిల్లా సంఘం బలీయమై పోవటం వల్ల వాళ్ళ వాయిస్ తగ్గి మాకు అవకాశాలు హెచ్చాయి .మామాటే అమలులోకి వచ్చేవి .కనుక జిల్లా సంఘబలం ముందు రాస్త్రసంఘ బలం పేలవమై పోయింది .రాష్ట్ర సంఘ సమావేశాలకూ మేము వెళ్ళేవాళ్ళం .మా వాయిస్ వినిపించి అందరికీ న్యాయం జరిగేట్లుచేసేవాళ్ళం .ఇందులో మా నాయకులు శ్రీ రామం గారే .మేమంతా ‘’శ్రీరామభక్తులం ‘’ఆయనమాటకే విలువ,గౌరవం ఇచ్చేవాళ్ళం.ఆయన అతిమంచితనం  సాఫ్ట్ కార్నర్ వలన  మా జిల్లాసంఘానికి కొన్ని సార్లుక్ చేదు అనుభవాలు మిగిలాయి .ఆయన్ను మంచి చేసుకొని మాపై మిగిలిన జిల్లాలవాళ్ళు పెత్తనం చేయటం మొదలుపెట్టారు .త్వరలోనే గ్రహించి రామంగారికి అసలు విషయం తెలిపి మాతో సంప్రదించకుండా ఏ నిర్ణయమూ చేయవద్దనీ ,బయటివారి ప్రభావం మనపై ఉండరాదని నచ్చ చెప్పి ఇబ్బంది లేకుండా చేయగలిగాము .

             స్కూళ్ళు మూసేనాటికి పాఠ్య పుస్తకాలు

  ప్రతిఏడాది ఎకడమిక్ యియర్ ప్రారంభమైన రెండుమూడు నెలలదాకా టెక్స్ట్ బుక్స్ వచ్చేవికావు .ప్రభుత్వ అలసత్వం ,పర్యవేక్షణ లోపం ,సరఫరాలో ఇబ్బందులు వలన విద్యార్ధుల చేతికి పుస్తకాలు అందే సరికి పుణ్యకాలం కాస్తా దాటి పోయేది .వీటిని తెచ్చుకోవటానికి జిల్లాకేంద్రాలకు వెళ్లి పడిగాపులుకాసి ,స్వంతఖర్చులతో తెచ్చుకోవాల్సి వచ్చేది .ఇదంతా తడిసి మోపెడై ఉచిత పుస్తకాలైనా ఆపుస్తకాలకు ఎంతోకొంత డబ్బు విద్యార్దులనుంచి వసూలు చేయక తప్పేదికాదు.నిజంగా  ఇది నేరమే కానీ స్కూల్స్ లో డబ్బు నిలువ ఉండేదికాదు .కనుక తప్పని సరి అయింది .కొందరు ఎక్కువ వసూలు చేసి ఫిర్యాదులతో హెడ్ మాస్టర్లు ఇబ్బంది పడటం జరిగింది .వీటికి నివారణోపాయం ఆలోచించాము .కాని వినే నాధుడూ ఉండాలికదా .

     విద్యా మంత్రిగా స్వర్గీయ దేవినేని వెంకటరమణ

కృష్ణాజిల్లాకు చెందిన శ్రీ దేవినేని వెంకటరమణ విద్యాశాఖ మంత్రి అయ్యారు .ఈయన మా దేవినేని మధుసూదనరావుగారికి బాగా పరిచయం ఉన్నవారు .అదే సమయం లో హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సదస్సు జరిగింది .మంత్రిగారిని ఆహ్వానించారు .జిల్లా తరఫున రామంగారు ఆదినారాయణ ప్రమీలా రాణి, రాజుగారు విశ్వం నేనూ మొదలైనవాళ్ళం తప్పక వెళ్లాలని ఆదినారాయణ హుకం .అందరికి సంఘమే ఖర్చు పెడుతు౦దని,లేకపోతే తానె స్పాన్సర్ చేస్తానని ఫోన్లు చేశాడు .నేను వెంటనే స్పందించి ‘’ఎవరి డబ్బు వాళ్ళు పెట్టుకొని వెడదాం.ఎవరిపైనా భారం పడరాదు .మీరు పెట్టుకొంటాననటం భావ్యం కాదు .ఇలా ఎన్ని సార్లు ఎన్ని సభలకు పెడతారు డబ్బు ?అది మంచి సంప్రదాయం కాదు ‘’అని నిష్కర్షగా చెప్పాను .ఆయన ‘’మీ మాట మాకు శిరోధార్యం ‘’అన్నారు .అలా ఎవరిఖర్చులు వారే భరించి వెళ్లాం .సభ బాగా జరిగింది .మంత్రిగారు చాలా ఆదర్శప్రాయంగా మాట్లాడారు .ఈయన ఉంటె విద్యారంగం గొప్ప అభి వృద్ధి చెందుతుంది అన్నభావన మాకు కలిగింది .

   కృష్ణా జిల్లా సంఘబాద్యులను మాట్లాడమని మంత్రిగారు కోరగా ,అప్పటికే ఏమేమి మాట్లాడాలో రిహార్సిల్స్ వేసుకోన్నాం కనుక రామంగారిని ,ప్రమీలా రాణి ఆదినారాయణ లను మాట్లాడమన్నాం .ముఖ్యంగా మేము చెప్పింది ‘’స్కూళ్ళు మూసేనాటికి, లేకపోతె కనీసం స్కూళ్ళు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు స్కూళ్ళకు చేరేట్లు చర్యలు తీసుకోవాలి .సుమారు పది   ఒక సెంటర్ స్కూల్ ను ఎంపిక చేసి పుస్తకాలు జిల్లాదికారులే అక్కడికి చేర్పించాలి అక్కడినుండి స్కూళ్ళకు తెచ్చుకోవటం తేలిక. ఖర్చు ఉండదు ‘’అని చెప్పాం ‘’వెరీ వెరీ గుడ్ సజెషన్ .తప్పకుండా ఈ ఏడాది నుంచే అమలు చేయిస్తాను ‘’అనగానే హాలంతా హర్షధ్వానాలతో మారు మోగింది .ఈ ఆలోచన ఏజిల్లావారికీ రాకపోవటం  కృష్ణా జిల్లావారే సూచించటం అమలు చేస్తానని మంత్రిగారు హామీ ఇవ్వటం మా జిల్లా ప్రధానోపాధ్యాయ  సంఘ౦ సాధించిన అద్భుతఘన విజయం .

      విద్యా వాలంటీర్ల నియామకం

  తరువాత నేను మాట్లాడుతూ ‘’స్కూళ్ళు మూసేసినతర్వాత విద్యార్ధులకు దాదాపు రెండునెలలు ఏ పనీ, వ్యాసంగం లేకుండా పోతోంది .పైతరగతి సబ్జెక్ట్ లు ఏముంటాయి ఎలాఉంటాయి అనే ఉత్సుకత ఉంటుంది .కనుక తక్కువ ఖర్చుతో ప్రభుత్వం వేసవి సెలవులలో విద్యార్ధులకు తరువాతక్లాసు లోని విషయాలు అవగాహన కలిగించటానికి  ఉత్సాహవంతులైనవారిని నియమిస్తే బాగుంటుంది’’అని చెప్పాను .’’వెరీ నావెల్ సజెషన్ ‘’అని ఇదీ ఈసంవత్సరం నుండే అమలు చేస్తామని చెప్పారు దీనితో ‘’విద్యా వాలంటీర్ ‘’ల వ్యవస్థ ప్రారంభమైంది. దీనికీ కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘమే మార్గదర్శి అవటం మాకు గర్వకారణం .సదస్సు అవగానే మధుసూదనరావుగారు మమ్మల్ని మంత్రిగారికి  పరిచయం చేసినట్లు గుర్తు .తర్వాత ఆయన స్వంతకార్లలో మమ్మల్ని పెద్ద స్టార్ హోటల్ కు తీసుకు వెళ్లి విందు ఇచ్చారు .ఆతర్వాత సోమాజిగూడా లోని ఆయన స్వంత ఇంటికి  తీసుకు వెళ్లి భార్య , కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు .మధ్యాహ్నం టిఫిన్ జ్యూస్ ఇచ్చి అందరిని  ఇళ్ళకు సాగనంపారు .నేను రావటం మా అబ్బాయి శర్మ ఇంటికే వచ్చి మళ్ళీ అక్కడినుంచే ఉయ్యూరు వెళ్లాను .

         శ్రీ మధుసూదనరావుగారి విద్యారంగ  వ్యాసంగం

తెన్నేరుకు చెందిన శ్రీ దేవినేని మధుసూదనరావుగారు విద్యావంతులు .గన్నవరం దగ్గర పెద అవటపల్లి లో’’ హై టెక్ ప్రింట్స్ ‘’అనే సంస్థ ఉండేది .అక్కడ నాణ్యమైన పేపర్ తయారయ్యేది .సర్టిఫికెట్స్ ,బాంక్ ట్రాన్సాక్షన్ పేపర్స్  చెక్కులు మొదలైనవన్నీ హైక్వాలిటితో ప్రింట్ చేసేవారు ప్రభుత్వం తో మంచి పరిచయాలు ఉండేవి .విద్యారంగానికి ఏదో చేయాలనే తపన ఆయనలో నిరంతరం జ్వలించేది .శ్రీ దేవినేని వెంకటరమణ గారు విద్యామంత్రి అయ్యాక ఈ తపన మరింత పెరిగి కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ తో బాగా పరిచయాలు పెంచుకొని మా అందరితో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకొన్నారు .డియివో ఏర్పాటు చేసే జిల్లా ప్రధానోపాధ్యా య సంఘ సమావేశానికి ఆయనే స్పాన్సరయి అన్ని  ఏర్పాట్లు చేసేవారు .ఖర్చు ఎంతైనా లెక్క ఉండేదికాదు .సమావేశానికి కావలసిన ఎజెండా ,దానికి ప్రెసెంట్ చేసే పేపర్స్ తయారీ కోసం  ఆయన ఇంటికే మమ్మల్ని ఆహ్వానించి కార్లలో తీసుకువెళ్ళిభోజన భాజనాదులు ఏర్పాటు చేసేవారు .అందరినీ అత్యంత గౌరవంగా చూసేవారు ఆయన శ్రీమతీ  అంతే.వారిల్లుమాకు అతిధి గృహం కాదు స్వంత ఇల్లు అనిపించేది .పెద్ద లైబ్రరీ ఆయనది పుస్తకాలు ఇతరులకివ్వటం ఆయనకు హాబీ  .హెచ్ ఎమ్స్ కాన్ఫరెన్స్ లో పుస్తకాలు, ఫైల్స్ , లెటర్ పాడ్స్ నోట్ బుక్స్ , మంచిపెన్నులు అందరికి ఇచ్చేవారు .ఉదయం సుమారు 9గంటలకు మేము వారింటికి వెడితే రాత్రి 8గంటలకు బయటపడేవాళ్ళం ప్రతి  దానిలో పెర్ఫెక్షన్ కోరేవారు .మేము తయారు చేసే పేపర్స్ కు సహాయం చేసేవారు .ఆయనతో గడపటం ఒక ఎడ్యుకేషన్ గా ఉండేది .

   ఒకసారి ప్రధానోపాధ్యాయ సమావేశానికి విద్యామంత్రి శ్రీ దేవినేని రమణ గారిని శ్రీ శ్రీ చినజియ్యర్ స్వామీజీ ని ఆహ్వానించాము .స్వామీజీని సభకు పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు .ఆమీటింగ్ గ్రాండ్ సక్సెస్ .

  విద్యార్ధులకు అసైన్మెంట్స్ తయారు చేయించారు .విద్యా విషయాలపై మా అభిప్రాయాలను రాయమని ప్రభుత్వానికి పంపేవారు .అంటే మాకు ప్రభుత్వానికి లైజాన్ ఆఫీసర్ గా వ్యవహరించేవారు .వారితో పని చేయటం మాకు చాలా సరదాగా ఇష్టంగా ఉండేది .

  తనతల్లిగారి పేర ట్రస్ట్ ఏర్పరచి అనేక సత్కార్యాలు చేసేవారు. పుస్తకాలు అచ్చువేసి అందరికీ పంచేవారు .శ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’ను బాపు స్వదస్తూరితో రాసిన పుస్తకాన్ని అచ్చు వేసి అందుబాటులోకి తెచ్చారు .బాలబందు శ్రీ బివి నరసింహారావు గారి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించి అందరికి ఇచ్చారు .కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రి  గారి ‘’స్వీయ చరిత్ర ‘’ మొదలైనవి  మళ్ళీ ముద్రించిన సాహిత్యాభిమాని .

     నవ్యాంధ్ర ప్రదేశ్ లో శ్రీ చంద్రబాబు ముఖ్యమంత్రిత్వం లో రాష్ట్ర ఉన్నత విద్యాదికారులన్దరితో పరిచయం పెంచుకొని ఎన్నో విద్యా సంస్తలు ,సందర్శించి సెమినార్లలో పాల్గొని, తన నాయకత్వం  లోనూ  ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలోని  D.I.E.T సంస్థలనూ చూసి వాటి అభి వృద్ధికి మార్గదర్శనం చేసి ,అవి ఉపాధ్యాయుల విద్యార్ధుల భవితవ్యానికి ఇతోధికంగా తోడ్పడేట్లుచేసిన నిత్య విద్యా కృషీవలుడు .

  అదుకే మేమ౦దర౦  రిటైర్ అయి పదేళ్ళు దాటినా మాతో అత్యంత అభిమాన స్నేహితునిలా వ్యవహరిస్తారు .కనీసం ఆరుననెలలకోసారి తెన్నేరులో వారింట్లో సమావేశమై వారి ఆర్గానిక్ ఫుడ్ ఆస్వాది౦చకపోతే ఊరుకోని మనస్తత్వం ఆయనది .’’మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ?“’ అనేదే ఆయనుండి వచ్చే ప్రశ్న .ఇ౦తటి ఉదార హృదయుడు ,స్నేహ శీలి ,  విద్యారంగంపై అత్య౦త మక్కువ ఉన్నవారు ,ఇంకా ఏదో చేయాలన్నతపన ఉన్నవారు మధుసూదనరావు గారు మాకు స్పూర్తి ప్రేరణ ,ఆదర్శం ,మార్గదర్శి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118

కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా బాలసాహిత్యం లో తనదైనముద్ర వేసినవారు.  బందరు లో ఫోర్ట్ రోడ్లో ఉండేవారు .నాకూ శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి వంటి మా అందరికి ఆదర్శం .ఒకరకంగా హెడ్ మాస్టర్ లకు గైడ్ ,ఫిలాసఫర్ .హెడ్ మాస్టర్స్  హాండ్ బుక్ రాసి కొత్తగా ప్రమోట్ అయిన  హెడ్ మాస్టర్లకు  రూల్స్ ,విద్యాలయాల నిర్వహణ వార్షిక తనిఖి అనే ఇన్స్పెక్షన్  పరీక్షల,స్కూల్ ఫీజులనిర్వహణ మొదలైన అంశాలపై గొప్ప అవగాహన కలిపించారు .ఆ పుస్తకం అనేక ముద్రణలు పొందింది .అసలు జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆయన శ్రీ ఏ వి సుబ్బారావు గారు ఆయన ప్రాతస్మరణీయులు .తర్వాత దాన్ని రాష్ట్ర సంఘంగా తీర్చిదిద్ది జిల్లా సంఘాలకు ప్రాతినిధ్యం కలిపించారు .ఆయన  రిటైరయ్యాక శ్రీరామం  గారు జిల్లా సంఘం నాయకులుగా రాష్ట్ర సంఘం నాయకులుగా ఎంతో కాలం విశిష్ట సేవలు అందించి అందరికి చేరువయ్యారు .జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి ఏడాది, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం  వార్షిక సమావేశం ఏర్పాటు చేయటం ,అందులో ఉత్తమ ఫలితాలు సాధించిన  హైస్కూల్స్ ,ప్రధానోపాధ్యాయులు ,సబ్జెక్ట్ టీచర్స్ ,విద్యార్ధులకు కు సన్మానం చేయటం, తర్వాత వచ్చేఏడాది ఆటలపోటీలకు సబ్ జోన్లు, సెంట్రల్ జోన్ ఏర్పాటు వ్యాయామోపాధ్యాయుల సహకారం తో జరిగేది  .ఇవనీ అయ్యాక జిల్లా ప్రధానోపాధ్యాయుల  సంఘ సమావేశం జరిగేది .అన్నిటిలో క్రియా శీలకపాత్ర పోషించేవారు రామంగారు ,డియివోలకు తలలో నాలుకగామీటింగ్  ఎజెండా తయారు చేయటం అమలు పరచటం లో ఆయన పాత్ర అద్వితీయంగా ఉండేది .

  చివరికి జరిగే సంఘ సమావేశానికి మాత్రం హెడ్ మాస్టర్లు  వ్రేళ్ళమీద  లెక్కించ తగినట్లుగా మిగిలేవారు .నాబోటి వాళ్లకు చాలా బాధగా ఉండేది .కానీ ఏమీ చేయలేము .రామం గారు రిటైరయ్యాక పెనమలూరు హెడ్ మాస్టర్ శ్రీ ప్రసాద్ ,నున్న హెడ్ శ్రీ రమణారావు వగైరా ఆరునెలలు ,ఏడాది పని చేసి తప్పుకోవటం వలన సంఘం కుంటి నడక  నడిచింది .దీన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన ఆసక్తికల మాందరికీ వచ్చింది .అయితే ‘’హు బెల్స్ ది కాట్ ?’’అన్నది సమస్య.

   దీనికి తోడు జిల్లా కామన్ ఎక్సామినేషన్ బోర్డ్  పరిస్థితీ బాగాలేదు .చాలాకాలం దీన్ని పెడన జిల్లాపరిషత్ హై స్కూల్ హెడ్  మాస్టర్ , జిల్లాలో చాలా సీనియర్ మోస్ట్ హెచ్ ఏం శ్రీ  వీరమాచనేని విష్ణువర్ధనరావు గారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు .అయన ఒకకాలు కుంటి కాని తెల్లని పంచ తెల్లచొక్కా ఖండువాతో వెడల్పు ముఖం దబ్బపండు మై చాయతో చాలా ఆకర్షణీయంగా  హుందాగా ఉండేవారు .ఆయనంటే భయంగా కూడా ఉండేది .అన్ని రకాల పరీక్షలు చాలా పకడ్బందీ గా జరిగేవి .పేపర్లు లీక్ అవటం అనేది లేదు. సమర్ధులైన  హెడ్ మాస్టర్లు , సబ్జెక్ట్ టీచర్ల చేతక్వస్చిన్  పేపర్స్ తయారు చేయి౦ చేవారాయన .కక్కుర్తి లేని పాలనగా ఉండేది .ఆయనతర్వాత ఎవరెవరు మారారో గుర్తు లేదుకాని మేము ప్రమోషన్ పొందేనాటికి బెజవాడ ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ నరసింహారావు గారున్నారు .ఆయన చేస్టలగురించి అప్పటికే కధలు గాధలు ప్రచారం లో ఉండేవి .అందులోనూ కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ జిల్లా పరిషత్ వాళ్ళ చేతుల్లోంచి జారిపోయి ప్రైవేట్ మేనేజిమెంట్ వారి చేతుల్లోకి వచ్చింది .దీన్ని నియమించేది డియివో .ఆయనను ఏదో రకంగా ప్రసన్నం చేసుకొని పొందే పదవి అయిపొయింది. పరువు పాతాళానికి పోయింది. ఇది మా బోటివారికి నచ్చని విషయం .పైగా క్వార్టర్లీ హాఫియర్లీ యాన్యువల్ పరీక్ష పేపర్లే కాదు ప్రతినెలా జరిగే టెస్ట్ పేపర్లు కూడా లీకై బజారు లో విక్రయాలు జరుగుతున్నట్లు పేపర్లన్నీ కోడై కూశాయి .ఇంతటి అవినీతి అసమర్ధత కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ లో  విశ్రుంఖలంగా  విజ్రుమ్భించటం తో జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్లు గా సహి౦చ లేకపోయాం .ఏదో చేయాలి ఏదో చేయాలనే తలంపు తీవ్రమైనది .

   ఒకసారి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ హనుమారెడ్డి గారు పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ సందర్శించినపుడు అడ్డాడ హెడ్ మాస్టర్ గానేను ఆయనను కలిసి  కామన్ బోర్డ్ తంతూ తమాషా అంతా వివరించి ,ఆపదవిని మెజారిటీ హెడ్ మాస్టర్లు ఉన్న సమర్ధుడైన జిల్లాపరిషత్  హెడ్ మాస్టర్ కు అప్పగించి అవినీతి పంకిలం నుంచి ఆపదవిని ఉద్ధరించాలని చెప్పాను .ఆయన ప్రశాంతంగా నేను చెప్పినదంతా విన్నారు .’’మంచి ఆలోచన  హెడ్ మాస్టారూ  !తప్పకుండా దీన్ని అన్ని కోణాలలోనూ పరిశీలించి తగిన న్యాయమైన నిర్ణయం చేస్తాను ‘’అన్నారు .కొంత ఊరట లభించింది .కాలం కూడా కలిసిరావాలికదా .అప్పుడు పామర్రు హెడ్ మాస్టర్ శ్రీ సుబ్బారెడ్డి గారని గుర్తు

        నాందీబీజం

  ఒకసారి బందరు హిందూ హైస్కూల్లో పదవతరగతి పరీక్షపేపర్ల  స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు నేను ఇంగ్లీష్ -1పేపరుకు చీఫ్ ఎక్సామినర్ గా ఉన్నాను .నాకు అసిస్టెంట్స్ గా ఉన్నవాళ్ళల్లో పెదముత్తేవి ఓరిఎంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణరావు ఒకరు .రోజూ మాట్లాడుకొనే విషయాలలో హెడ్మాస్టర్ సంఘం గురించి మాటలు వచ్చెవి . అతని సమర్ధత స్పీడ్ చాతుర్యం నిబద్ధర అంకితభావం నన్ను బాగా ఆకర్షించాయి . ఆ సందర్భం లో ఒకరోజు నేను ‘’మీరు సంఘ కార్యదర్శిగా ఉంటె మంచి భవిష్యత్తు ఉంటుంది ,సమర్ధులను అధ్యక్షులుగా  ఎన్నుకొందాం ,వారికే కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ కూడా అప్పగిస్తే మరీ బాగుంటుంది ‘’అన్నాను .ఆయన నాతో ‘’మీరే సమర్ధులు మీరు ఉండండి మేమంతా సహకరిస్తాం ‘’అన్నారు .కాసేపు ఇలా ఇద్దరం అనుకొన్నాక ఆయనే నా మాట విని ఉండటానికి ఒప్పుకొన్నారు .కనుక సమర్ధుడు కార్యదర్శి అవుతున్నాడని అందరం హాయిగా ఊపిరి పీల్చా౦  .

    కలిసోచ్చినకాలం

  మళ్ళీ ఒకసారి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో బహుశా సర్కిల్ పేట దగ్గరున్న మిషన్ హైస్కూల్ లో మేమంతా ఈ సెంటర్ లోనే జిల్లా ప్రదానోపాధ్యాయ   సంఘ అధ్యక్ష కార్య దర్శులను  ఎన్నుకోవాలనీ కామన్ యెక్సామినేషన్ బోర్డ్ కూడా జిల్లాపరిషత్ కు సాధించాలని నేనూ ఆదినారాయణ మొదలైన లైక్ మైండెడ్ మిత్రులం నిర్ణయించాం .అనుకోకుండా అప్పుడే కొత్త విద్యాశాఖాధికారిగా శ్రీ నూకల శ్రీరామమూర్తి గారు రావటం మా అదృష్టంగా మారింది .ఆయన లోగడ పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సమర్ధంగా పని చేసిన ఆఫీసర్ .ముక్కు సూటిమనిషి. జిల్లాలో అందరి సంగతీ బాగా తెలిసినవారు .మా రామంగారికి చాలా ఇష్టమైన ఆఫీసర్ కూడా. ఇద్దరి మధ్య గొప్ప అన్యోన్యత ఉండేది .మూర్తిగారు  స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ బాధ్యతలో ఉన్నారు .పటమట హైస్కూల్ ప్రదానోపాధ్యాయిని శ్రీమతి ప్రమీలారాణి,గన్నవరం గరల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రేస్ గా చాలామంచి  పేరు పొందారు. నిర్దుష్టంగా ఉంటారు .దేనికీ లొంగని వ్యక్తిత్వం .సమర్ధత ఆమె సుగుణం .’’లేడీ లయన్ ‘’.ఆమె కూడా ఈ స్పాట్ లో మాతో ఉండటం ఇంకా కలిసొచ్చింది .ఒకరోజు స్పాట్ లో ఆమెను నేను ఆదినారాయణ మొదలైనవాళ్ళం కలిసి మా ప్రపోజల్ చెప్పాము .ఆమె ముందు వద్దన్నా మా పైఉన్న అభిమానం తో అంగీకరించారు .కామన్ బోర్డ్ కూడా ఆమె తీసుకోవాలని కోరాం. సరే అన్నారు .

   ఈ విషయం వెంటనే లీకైంది . కొడాలి హెడ్మాస్టర్  శ్రీ గోపాలరావు గారు నాదగ్గరకు వచ్చి ‘’ప్రసాద్ గారూ !నరసింహారావు గారిని మార్చి సి.యి .బోర్డ్ వేరెవరికో ఇవ్వాలని  మీరూ కొందరూ అనుకొంటున్నట్లు చెప్పుకొంటున్నారు .ఆయన్ను ఈ ఏడాదికూడా కంటిన్యు చేస్తే బాగుంటుంది  రిటైరైపోతారు .నన్ను మీతోమాట్లాడమని పంపించారు .మీరు చెబితే అందరూ వింటారని కూడా అంటున్నారు ‘’అన్నారు .నేను ‘’గోపాలరావు గారూ !ఇప్పటికే నరసింహారావు గారి అవినీతి కంపుకొట్టి భరించారానిదిగా ఉంది .ఇక ఒక్క క్షణం ఆయన్ను ఆపదవిలో ఉంచటానికి మేమెవ్వరం ఒప్పుకోము .దయచేసి ఆప్రపోజల్ మానేయండి .మాతో సహకరించండి ‘’అని నిర్మొహమాటంగా చెప్పాను .ఆయన మొహం కందగడ్డ అయినా మా ముందు ఆయన బలహీనుడై ఇక మాట్లాడలేక వెళ్ళిపోయారు .కనుక మాకు లైన్ క్లియర్ అయింది .

   సాయంత్రం స్పాట్ పూర్తయ్యాక శ్రీ రామం గారిని పిలిపించి మా ప్రాపోజల్ చెప్పి ఆయన అధ్యక్షతగా మీటింగ్ పెట్టి ప్రమీలారాణిగారిని కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా ,శ్రీ కోసూరి ఆదినారాయణరావు కార్యదర్శిగా నేను ఉపాధ్యక్షుడిగా కొత్త బాడీని ఏర్పాటు చేసుకోన్నాము అందరూ సంతోషించారు .కొందరు ‘’ఆడది ఈ అని సమర్ధంగా చేస్తుందా ?/అని గోనుక్కున్నవాల్లూ ఉన్నారు .తర్వాత డియివోగారిని కలిసి ఈ విషయం చెప్పి ఆయనతో రామంగారు మేమూ కామన్ బోర్డ్ పదవికూడా ప్రమీలారాణిగారికిస్తే మళ్ళీ జిల్లాపరిషత్ చేతిలోకి పదవి వచ్చి మెజార్టీ కి న్యాయం జరుగుతుందని ఈరెండు పదవులు ఒకరి చేతిలోనే ఉంటె ఖర్చుతక్కువ సేవలు బాగా సమర్ధవంతంగా జరుగుతాయి అని చెప్పాము .ఆయనా మా ప్రపోజల్ అంగీకరించి ఆమెకే కామన్ ఎక్సామినేషణన్ బోర్డ్ పదవికూడా ఖాయం చేసి ఎన్నాళ్ళనుంచో ఉన్న మాకోరికి తీర్చారు .ఇలా ‘’టు బర్డ్స్ యట్ వాన్ షాట్ ‘’తో సాధించాము .మా సంఘం అత్యంత శక్తివంతంగా జవజీవాలతో సమర్ధవంతంగా పని చేసింది .మేము రిటైర్ అయినా నా శిష్యురాలు శ్రీమతి కొల్లిభారతీదేవి ని ,తర్వాత కాజ హెడ్మాస్టర్ శ్రీశర్మగారిని  ప్రెసిడెంట్ చేశాం .మా సంఘం విద్యాప్రణాలిక అమలు, పరీక్షపెపర్ల తయారీ, క్వస్చిన్ బాంక్, సోర్స్ బుక్స్ తయారు పబ్లిక్ పరీక్ష పేపర్ల లోని లోపాలు తొలగించటం ,లెక్కలు ,ఫిజిక్స్ ,ఇంగ్లిష్ పుస్తకాలలో కష్టతరమైన విషయాలనుతొలగి౦ప జేయటం   స్కూళ్ళను సమర్ధవంతంగా నడపటం లో సహాయం అందించటం సబ్జెక్ట్ టీచర్లు లేకపోతె ఆదినారాయణ వంటివాళ్ళు వెళ్లి లెక్కలు, ఇంగ్లీష్ బోధించటం లలో  బాగా కృషి చేసి మెప్పుపొందింది మా బాచ్ లో శ్రీ రాజు, శ్రీ ఆ౦జనేయులు, శ్రీ విశ్వం ,శ్రీమతి సుగుణకుమారి శ్రీమతికస్తూరి  శ్రీ రాజేంద్రప్రసాద్ మున్నగు సమర్దులేందరో ఉన్నారు   .ప్రాతిఏదాది సంఘ సమావేశం చాలా మందితో కళకళలాడుతూ జరిగేది .రిటైరయినవారిని ఘనం గా  సత్కరించేవాళ్ళం .అదొక గోల్డెన్ పీరియడ్ .తర్వాత సంఘం మా చేతుల్లోంచి జారిపోయింది .అయినా కనీసం పదిమందిమి తరచూ కలుస్తాము .దీనికితెన్నేరుకు చెందిన శ్రీ దేవినేని మధుసూదనరావుగారు  మాకు ఆత్మీయ సహకారం అంది౦చారు .ఇప్పటికీ  ఇస్తున్నారు .   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు

No

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ఖండకావ్యం  గా రాసిన ‘’ ’సామాజిక సమస్యలు’’ కవితా సంపుటి డిసెంబర్ 2017లో ప్రచురితమై, ఆయన దాన్ని నాకు ఎప్పుడిచ్చారో తెలీదుకాని, ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే బయటపడింది .నాకు అభిమాన వ్యక్తీ, రచయితా, కవి వెంకటప్పయ్య .బేతవోలు ,శ్యామలానంద ,చక్రాల ,పూర్ణచంద్ వంటి సాహితీ దిగ్గజాలు దీనికి ముందుమాటలు ,అభినందనలు, ప్రోత్సాహక ప్రశంసలు రాశారంటేనే వెంకటప్పయ్య అలాంటిలాంటి కవికాడు అని అర్ధమౌతుంది .చిన్నప్పుడే తండ్రి మరణిస్తే అన్నీ తానె అయి చూసి, పెంచి,పెద్ద చేసి, జీవితాన్ని తీర్చి దిద్ది ,ఇక తనవంతు కర్తవ్యమ్ ముగిసిందని  ఇహలోక౦ వీడిన అన్నగారు శ్రీ టేకుమళ్ళ లక్ష్మీ నరసి౦హ౦గారికి అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నాడు .

‘’నేతలందరి లక్ష్యంబు మేతకాగ –దేశమేగతి కేగునో తెలియరాదు ‘’అని కార్మిక సంక్షేమం కోసం మొసలి కన్నీరు కార్చే ప్రాభుత్వాల నేతల డొల్లతనాన్ని బయటపెట్టాడు.కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరరని వకాల్తాగా చెప్పి , బాధ్యత తగ్గని జీవితాలతో ‘’తీరని బాధలే మిగులు తీరం చేరవు మీ కథల్’’అన్నాడు .కార్మిక హక్కులు చాలాఉన్నాయని ,అదరక బెదరక ఐక్యతతో వాటిని సాధించుకోమని ‘’శాంతి జీవనమెన్నుమా ‘’అని  హింసా దౌర్జన్యాలు శ్రేయంకాదన్నభావంగా హితవు చెప్పి ‘’దేశనేతలు మారుతారని ,కృషికి తగ్గ ఫలితం లభిస్తుందని భరోసా ఇచ్చాడు .జలవనరులు సద్వినియోగం చేసుకొంటేనే ప్రగతి అంటూ ‘’మానవజాతికిన్ మిగుల మ్రాకుల వృద్దియే వర్ధన౦బుగా’’అని చెట్లు పెంచమని ,’’జలము వ్యర్ధంబు జేయంగ జాతినలిగి –కస్టనస్టంబు పాలగు –కరువు హెచ్చు ‘’అని ఘోషించాడు .వృద్ధుల ఆలలనా,పాలనా చూడక కొడుకులుంటే వాళ్ళ అధోగతికి బాధపడుతూ ‘’కాలము దీరగన్  దుదకు గట్టెగ మారెను గా౦చకే సుతుల్ ‘’ఇలాంటి తల్లిని డాలరుమత్తులో ఉన్న కొడుకు చూద్దామని ఊరికివస్తే జనులు తిట్టి శాపనార్ధాలు పెడితే ‘’కూలెను కుప్పగా నతడు కొట్లకు  లభ్యమే తల్లి దీవెనల్ ‘’అని  తల్లి దీవెనలోని ఉత్క్రుస్టత తెలిపాడుకవి .

దేశానికి వెన్నెముక రైతు అంటూ నినాదాలేకాని అతని ఆత్మహత్యలను పట్టించుకున్నవాడు లేడని బాధపడ్డాడు –‘’అన్నదాత లిట్టు లాత్మహత్య కు బూన –భావితరపు జనుల బ్రతుకు లుడుగు ‘’అని ప్రశ్నించి ,రాబోయే అనర్ధాన్ని కళ్ళకు కట్టించాడు.లక్షలు పోసి కార్పోరేట్ విద్యా సంస్థలో చదివేవారికి వచ్చేది’’పేలవమ్మగువిద్య ‘’మాత్రమేనని ఉచితంగా చదువు చెబుతూ ఉత్తమ ఉపాధ్యాయులు బోధించే సర్కారు బడులు నాణ్యమైనవీ ,మాన్యమైనవీ అని చెప్పి ‘’చదువుకొనెడి శ్రద్ధ ,చైతన్యమగు బుద్ధి ‘’ఉంటేచాలు ఘనత లభిస్తుందని చెప్పాడు .ప్రేమ కరువైతే భావిపౌరులు దొంగలు ,తీవ్రవాదులు గా మారుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారనీ’’భిన్న ధృవమ్ములన్  గలిపి పెద్లిని జేసినా పెద్దలు ‘’కంట్లో వత్తులు వేసుకొని కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలనీ చిన్న విషయాలు పెద్దవికాకుండా ‘’చిక్కులు దీర్చెడి వారె దేవతల్’’అని కితాబిచ్చాడు .సమాజ శ్రేయస్సే కర్తవ్యంగా పిల్లల్ని పెంచాలని ‘’చిన్ననాడే మనసు చిగురించు వేళలో –చెత్తనాట దగదు చిత్తమందు ‘’అని మనకూ బుద్ధి చెప్పి పరులకస్టాలలలో బాగులు కోరే బుద్ధి నేర్పమని సలహా ఇస్తాడు .మోసం చేసే సీరియళ్ళకు మూతలు బిగి౦చ మన్నాడు .’’ఆంగ్ల భాష మోజు అసలుకే మోసమ్ము’’’’వెలుగులనిచ్చు భాష మరి వీడుట ధర్మమే ?’’అని ప్రశ్నించాడు .కార్పోరేట్ వైద్యం వెర్రి తలలను స్పృశిస్తూ ‘’ఆపరేషను జేయుట యవసరమ్ము –గంటలోపల సొమ్మును గట్ట  వలయు –తలలు తాకట్టుబెట్టి యా ధనమునీయ –చాల శ్రద్ధగ నటియించి శవము నిచ్చు ‘’

భావ ప్రకటన స్వేచ్చ వికృత చేస్తను ఎత్తి చూపాడుకవి –‘’చట్టము లోగల లోసగుల –గట్టిగ కెలకంగాబూన’’ గబ్బే’’ మిగులున్ ‘’అని వేలుపెట్టి వాసన చూసే  వెర్రినాగన్నలకు  గున పాఠం చెప్పాడు .

అనుబంధంగా ఉన్నవాటిలో ‘’చీరే సొగసు చూడ తరమా ?’’లో స్త్రీచీరకట్టుకొంటే అందం రెట్టింపు అవుతుందనీ అదే చీరే కొంగు ఎండ వేడికి గొడుగౌతుందని ,కూలిపనికి తలపై చీర చుట్ట బరువు  జీవితభారం మోయటానికి సహకరిస్తుందని ,చివరికి అ౦తులేని బాధలతో ఉన్నవారికి ‘’ఉరి’’ కి కూడా ఉపయోగపడుతుందనిఅందంగా అర్ధవంతంగా బాధగానూ  చెప్పాడు .జడపై పద్యం చెబుతూ ‘’జడ య౦దము స్త్రీలకు –జడయల్లినయపుడే దాని ‘’జాణ’’న సబబౌ ‘’అంటాడు .ఇవికాక ఈశ్వరవైభవం ,ధనుర్మాస విశిష్టత ,దేశభాషలందు తెలుగులెస్స,పోలవరం, వ్యాస వైభవం ,నేటియువత, కర్తవ్యమ్ శీర్షికలతో అర్ధవంతమైన పద్యాలున్నాయి .

ఈ కవితా సంపుటిలో ప్రతి శీర్షికకు ఉపోద్ఘాతం, దానికి తగ్గ మంచి శ్రీ చిత్రం ఉండటం విశేషం .సమాజాన్ని అన్నికోణాలలోనూ దర్శించి ,జరుగుతున్న అన్యాయాలకు ,కుళ్ళిపోతున్నవ్యవస్థ ,కుటుంబం , సమాజానికి ,మానవ వనరులు సద్వినియోగపడకపోవటానికి సంక్షేమం మాటలలోనే కాని చేతలలో కనిపించకపోవటానికి, భావదారిద్ర్యానికి ,తెలుగు భాష దీనస్థితికి ,కార్పోరేట్ కారుమేఘాలు కమ్ము కోవటానికి ,బాధలు గుండె గొంతుదాటి బయటకు రాకపోవటానికి , సగటు మనిషి  ఏమీ చేయలేక కార్చిన’’ కన్నీటి బొట్టును ‘’అర్ధవంతమైన ముఖ చిత్రంగా మలచిన చిత్రకారుడు ‘’ శ్రీ అలహరి రాము ‘’కవితోపాటు మిక్కిలి అభినందనీయుడు .

‘’పూజా నైవేద్యం లేకుండా ఉన్నాడుకాని మా దేవుడు మహా గొప్పవాడు’’అని ఒక సామెత ఉంది  .ఇది మిత్రుడు వెంకటప్పయ్య విషయం లో పూర్తి యదార్ధం .అతడు సంస్కృతాంధ్రాలలో  నిష్ణాతుడు .ఆ రెండుభాషలలో కవిత్వ సవ్యసాచి . ఇంతవరకు కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం  మొన్ననే పుట్టిన ప్రపంచ తెలుగు రచయతల సంఘం , ఆంద్ర దేశం లోని మరి యే సాహితీసంస్థ వెంకటప్పయ్య సాహితీ ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వకపోవటం శోచనీయం .సరసభారతి మాత్రం ఆ గౌరవం దక్కి౦చు కొన్నది .అ మధ్య నాతోమాట్లాడుతూ శ్రీ టేకుమళ్ళ తాను  ‘’సాంఘిక ప్రబంథం’’రాస్తున్నానని త్వరలోనే పూర్తవుతుందని చెప్పాడు .శుభం భూయాత్ .గరికపాటివారి’’ సాగర ఘోష ‘’లోలాగా ఈయన ప్రాంతమైన నెల్లూరు దాని ప్రక్కనున్న పినాకినీ నదీ ఘోష ,,ప్రస్తుతం ఉంటున్న విజయవాడలోని కృష్ణానదీ ఘోష కలిసి అందులో ప్రతిధ్వనిస్తాయని ఆశిస్తూ ,మరిన్ని మంచి పద్యరచానలతో అలరించాలని  టేకుమళ్ళ వారిని కోరుతూ-

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది .ఇది మదురైలోని శైవ సంప్రదాయానికి సంబంధించింది .కవిత్వం ఒకే తీరున సాగకపోయినా సంస్కృతం పై ఆమె పట్టు కనిపిస్తుంది .అనుప్రాసలతో కవిత్వం అలరించింది .

479-రామ చరిత కర్త -కామాక్షి(20వ శతాబ్దం )

పంచాపకేశాచార్య కుమార్తె ,జి.యే.ముత్తు కృష్ణ అయ్యర్ భార్య కామాక్షి తంజావూర్ కు చెందినకవి .కాళిదాసదాస సాహిత్యంపై గొప్ప అధారిటీ ఉన్న సంస్కృత విద్వాంసురాలు  .కాళిదాసశబ్దాలు పద సమూహాలు ఉపయోగించి ‘’రామ చరిత ‘’అనే చిన్న కావ్యం రాసింది.

480-బుద్ధ చరితామృతం కర్త -మందాయం ధాటి అలమేలమ్మ(20వ శతాబ్దం )

బుద్ధ చరితామృతం అనే కావ్యం రాసిన మందాయం ధాటి అలమేలమ్మదక్షిణభారత కవయిత్రి .20వ శతాబ్దం .481-రాధా గోవింద శరద్ రస కర్త – రాధాప్రియ (20 వ శతాబ్దం )

ఒరిస్సా రాజు రఘునాధదేవవర్మ కుమారుడు విశ్వనాధ దేవవర్మ మహారాణి రాదాప్రియ .భర్తతో కలిసి ‘’ రాధా గోవింద శరద్ రస’’రచించింది .ఇది  రాధా కృష్ణుల శరత్కాలవిహార కేళి .భర్త రాసిన ‘’రుక్మిణీ పరిణయం ‘’అనే 11 కాండలకు విపులమైన వ్యాఖ్యానమూ రాసింది .

482- లక్ష్మీశ్వర చంపు కావ్యకర్త -రమాబాయి(19వ శతాబ్దం )

మైసూర్ రాజ్యం లో గంగామూల లో రమాబాయి జన్మించింది .తండ్రి అనంతసూరి .తల్లి అంబ.  ఈమె’’ లక్ష్మీశ్వర చంపు’’ కావ్యం రాసింది .ఇది 1879-80లో ప్రచురితమైంది కనుక కాలం 19వ శతాబ్ది మధ్యకాలం .దర్భంగా అంటే మిదిలరాజు కలకత్తా సందర్శించినపుడు రమాబాయిని ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు .దీనికి సంతృప్తి చెందిన ఈమె, రాజు పట్టాభి షేక విషయాలను కావ్యంగా రాస్తానని చెప్పి ‘’లక్ష్మీశ్వర చంపు ‘’రాసింది .ఇదే ఆమె మొదటి కావ్యం. రాజసత్కారం పొందిందంటే ఆమె ప్రతిభా   సంపన్ను రాలే అయి ఉంటుంది .దక్షిణభారత దేశానికి చెందిన ఆమె కవిత్వం మిధిలా కలకత్తా వరకు ప్రాకి గుర్తింపు పొందింది .

   ఈ కావ్యం లో 5స్తబకాలున్నాయి .దర్భంగా నగర వర్ణన లక్ష్మీశ్వరరాజు ,ఆయనతండ్రి  వర్ణన .రాజు జన్మించటం వేడుకలు బాల్యం తండ్రి చనిపోవటం తల్లి సతీ సహగమనం మొదలైనవి మొదటి సర్గలో ఉన్నాయి .రెండవ సర్గలో రాజు బెనారస్ చదువు రాజ్యశ్రీ తో వివాహం,వేడుకలు ,సుఖమయ దాంపత్యం .సమర్ధతతో రాజ్యపాలన ,రానణికోరికై కొద్దికాలం పాలనకు దూరమై ఉద్యానవన విహారం  ఉంటాయి .మూడులో కొత్తదంపతుల హనీ మూన్ విశేషాలు,  ,నాలుగులో ప్రకృతివర్ణన ,అయిదవ సర్గలో రాజ్య పట్టాబిషేక  విశేషాలు ,రాజదర్బారు విదేశీరాయబారులు వగైరా ఉన్నాయి .

  ఇంతున్నా తేదీలు సంవత్సరాల విషయం రాయలేదు .చారిత్రాత్మక సంఘటనలు లేకపోవటం తో నిరాశకలుగుతుంది .చరిత్రకారిణికాకపోయినా అలంకార శాస్త్రం లో బహు ప్రజ్ఞావంతురాలనిపిస్తుంది గౌడీ –వైదర్బి రీతులకు మధ్యగాఉండే’’పాంచాలీ ‘’రీతిలో కావ్యరచన చేసింది .హుందాగా శబ్దార్ధమాదుర్యంగా కవిత్వం  భాసించింది  .శబ్దానికున్న అన్ని రకాల అర్ధాలను సందర్భోచితంగా వాడటం ఆమె ప్రత్యేకత .చక్రబంధం మిశ్రఘటకబంధం ,గోమూత్ర ,గవాక్ష బంధాలను సమర్ధంగా ప్రయోగించి తన పాండితీ గరిమ చాటింది .వివిధ చందస్సులను సమయానుకూలంగా ఉపయోగించింది .

483-చంపు భాగవత కర్త -శ్రీదేవి బాలరాజ్ఞి

భాగవత పురాణం లోని ముఖ్యవిషయాలను తెలుపుతూ శ్రీదేవి బాలరాజ్ఞి ‘’చంపు భాగవతం ‘’రచించింది .

484-కామాక్షామృత కర్త సునమణి దేవి

‘’కామాక్షామృత’’అనే మతగ్రందాన్ని సునమణి దేవి రాసింది. వివరాలులేవు .

485-రామాయణ చంపు కర్త -సుందరవల్లి

మైసూర్ కు చెందిన సుందరవల్లి-నరసింహ అయ్యంగార్ కూతురు ,కస్తూరి రంగాచార్య శిష్యురాలు .6కాండల ‘’రామాయణ చంపు కావ్యం’’రాసింది .

486-యాదవ –రాఘవ –పాండవీయ త్ర్యర్దికావ్యకర్త –త్రివేణి

దక్షిణభారతానికి చెందినా త్రివేణి ‘’యాదవ –రాఘవ –పాండవీయ౦ ‘’అనే త్ర్యర్ది కావ్యం రచించింది .ఈమె  ఉదయేంద్రపురానికి చెందిన అనంతాచార్య కుమార్తె .భర్త శ్రీ పెరు౦బుదూర్ కు చెందిన వేంకటాచార్య .భర్త ,కుమారుడు అకాలమరణం చెందాక ప్రాపంచిక జీవితానికి దూరంగా భక్తీ రచనలతో జీవించింది  .ఈమె రాసినవి చాలాఉన్నాయి అందులో కొన్ని-లక్ష్మీ ,రంగనాధ సహస్రనామావళి  ,శుకసందేశం , భ్రుంగసందేశం ,రంగాభ్యుదయం, రంగరాట్ సముదాయ ,తత్వముద్రా భద్రోద్య’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

మనవి-గీర్వాణకవుల కవితా గీర్వాణం మొదటి మూడుభాగాలలో 1090మంది సంస్కృతతకవులపైన నేను రాయటం, సరసభారతి తరఫునగ్రంథ రూపంలో  ప్రచురింఛి ఆవిష్కరించటం , ఈ మూడింటికి సరసభారతికి, నాకు మిక్కిలి ఆత్మీయులు శ్రీ మైనేని గొపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )  స్పాన్సర్లుగా ఉండటం  మీకు తెలుసు .

   ,నాలుగవ భాగం గా అంతర్జాలం లో ఇవాల్టికి రాసిన 486మందికవుల తోకలిపి 1576మంది గీర్వాణకవులపై రాసే అవకాశం ,అదృష్టం నాకు  కలిగింది .ఇదంతా మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి ,శ్రీ సరస్వతీ మాత అనుగ్రహమే .

  ఈ నాలుగవభాగం లో నాకు కావాల్సిన విషయాలను అన్ని రకాల సోర్సులనుండి ఏరి కూర్చి నాకు పంపి రాయటానికి సహకరించిన మా రెండవ అబ్బాయి శర్మ ,మనవడు హర్ష లకు అభినందనలు .

 ప్రస్తుతం ఈ ధారావాహికకు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,సమాచారం లభిస్తే ,మరింతమందిగీర్వాణ  కవుల గురించి  రాస్తానని మనవి చేస్తూ –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన  రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు  రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి .వారే -1-కామలీల 2కనకవల్లి 3-లలితాంగి 4-మధురాంగి 5-సునంద 6-విమలాంగి .వీరిలో లలితాంగి విమలాంగి ,మధురా౦గి లు మాత్రం మాళవ దేశానికి చెందినవారని తెలుస్తోంది .

472-ప్రభు దేవిలాటి(880కుపూర్వం )

క్రీశ 880-920కాలం వాడైన రాజ శేఖరుడు ‘’ప్రభు దేవిలాటి ‘’గురించి పేర్కొన్నాడు .ఈమె లాట దేశానికి చెందినది. ఆమెకున్న బహుముఖ ప్రజ్ఞను ఆకాలం లో అందరూ మెచ్చుకొన్నారు .తన రసరమ్యకవిత్వంద్వారా ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచింది .ప్రేమకవిత్వంలోనేకాక న్ని రకాల కళలలోనిష్ణాతురాలు .

‘’సూక్తీనాం స్మరకేలీనాం కలానాంచవిలాసభు –ప్రభుదేవీ కవి ర్లాటీ గతాపి హృది తిస్టతి’’

473-వైజయంతి (17వ శతాబ్దం )

జయ౦తిగా కూడా పిలువబడిన వైజయంతి 17వ శతాబ్దం లో ఫరీద్ పూర్ నివాసిని .మూరభట్ట కూతురు .సంస్కృత విద్వా౦సురాలేకాక మీమా౦సశాస్త్రం లో అద్వితీయురాలు .సంస్కృత మహా విద్వాంసుడైన కృష్ణనాధుని భార్య .ఈమె రాసినట్లుగా చెప్పబడే శ్లోకాలు చాలా ఉన్నాయి .భర్తతో కలిసి ‘’ఆనంద లతిక చంపు ‘’రాసింది .కాని అలభ్యం .

1-‘’ఆహిరయం కల ధౌత గిరభ్రమాత్ –స్తనమగాత్ కిలనాభి హృదోత్సితః

ఇతి నివేదయితుం నయనేహి యత్ –శ్రవరా శ్రీమణీ కిం సముపస్తితే ‘’

2-‘’వహ్ని కోరాగతేభానుః శీతాత్ సాక్కచితం దినం –వైశ్వానరో నరక్రోడే రాజాన్ శీతస్య కా కధా

3-‘’ఆనంద లతికా  చంపూర్యేనాకారి స్త్రియా సహ-

474-విజయా౦క (10వ శతాబ్ది పూర్వం )

కర్నాటకకు చెందిన’’ విజయాంక’’10వ శతాబ్దికి పూర్వం ఉండేది ఈమె శ్లోకాలు రాజశేఖర చరిత్రలో ఉన్నాయి .ఈమెను సరస్వతీదేవి అపర అవతారమని భావించేవారు .వైదర్భి శైలిలో ఆమెకవిత్వం కాళిదాసునుమరపిస్తుంది

‘’సరస్వతీ కర్నాటీ విజయాఖ్యా జయత్యసౌ –యా వైదర్భః గిరాం వాసుః కాళిలిదాసానంతరం ‘’

-ఆధునిక సంస్కృత కవయిత్రులు

475-అనసూయా కమలాబాయి బాపట్ (

మరాఠాకు చెందిన అనసూయా కమలాబాయి బాపట్ ‘’శ్రీ దత్త పంచామృతం ‘’అనే దత్తాత్రేయ నిత్య పూజా విధానాన్ని రాసింది .మొదటి రెండు అధ్యాయాలు ఆమె స్వయంగా సృజించి రాసినవే .మిగిలినవి వివిధగ్రంథాలనుంది సేకరించినవి

476-బాలాంబిక

సిస్టర్ బి.బాలంబాళ్ మద్రాస్  ప్రెసిడెన్సిలో డా.వైద్యనాధ శాస్త్రి కుమార్తె .తల్లి సంస్కృత విద్వాంసురాలు .తల్లివద్ద సంస్కృతం నేర్చింది .సంస్కృతం లో 1-‘’సుబోధ రామ చరిత ‘’,2-ఆర్యరామాయణ3-గానకదంబ4-దేవీ త్రయత్రి౦శ న్మాల రాసింది .ఆమె కవిత్వం సరళసుందరం .

సుబోధ రామ చరిత లో కవిత్వం

‘’కున్జరవదన కువలయనయన –కురు పరసుఖమనిశం మే –

చంచల శ్రవో౦జిల ప౦చికరంజిత ,పున్జితకరుణా-భంజిత ప్రత్యహ-అంచిత గతి యుత -వంచిత దురిత –  రంజిత శ్రితజన –భంజితవరగా

477-వెన్నెలకంటి హనుమా౦బ

నెల్లూరుకు  చెందిన వెన్నెలకంటి హనుమాంబ శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామిశిష్యురాలు  .భక్తితో ‘’బ్రహ్మానంద సరస్వతి స్వామి పాదుకా పూజన ‘’రాసింది .శ్లోకాలు వచనం ప్రయోగం పధ్ధతి కలిసిఉంటాయి .ఇదేకాక ‘’శంకర భగవత్ పాద పూజ’కూడా రాసింది .ఇందులో ఆదిశంకరాచార్యుల వివిధ గుణ, సాధన, విశేషాలను  సహస్రనామావళి గా కూర్చింది .మరొకటి ‘’దత్తపూజాకదంబం ‘’దత్తాత్రేయస్వామిపై రచించిన కీర్తనలకదంబ మాలిక ఇది.

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా  ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా ,మౌనంగా ఉన్నారు లేక తమ తలరాతకు బాధ పడ్డారే తప్ప మగవాళ్ళను ని౦ది౦చలేదు .ఈ విషయం లో ‘’ఈసి దాసి’’ రాసిన  కవిత్వం లో ఆమె ముగ్గురు భర్తలు ఒకరితర్వాత ఒకరు ఆమె తప్పు ఏమీ లేకపోయినా క్రూరంగా ప్రవర్తించి దూరం చేసినా ,వారికి నిస్వార్ధమైన  సేవ చేసి,తన విధేయతను కాపాడుకొన్నది .గతం లో తాను చేసిన తప్పులను తానె ని౦దిచు కొన్నది కానీ , పూర్వపు భర్తలను ఏమీ అనకపోవటం గమనిస్తాం .వారు స్వయం నియంత్రణ పాటించక అధిగమిస్తే ,వాళ్ళ అతిని ఎత్తి చూపక ,వారిలోని మానసిక బలహీనతలను అంగీకరించింది .’’సీహా ‘’తన కామవా౦చలను నియంత్రించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.రాజాస్థానం లోని’’ విమల ‘’  తనగత దుస్చే స్టలను  ఒప్పుకున్నదికాని ఎవరినీ ని౦ది౦చలేదు .వారి తప్పేమీ లేకపోయినా మన్మదుడనే మారుడు తమను హింసించినా ,భౌతికసుఖం అనుభవం మొదలైన తమ బలహీనతలను తెలుసుకొని  వాటికి అతీతంగా ప్రవర్తించి మంచి దారిపట్టారు .’’సుభ జీవ కంబానిక ‘’దుస్ట యువకుడి కామ కబంధహస్తాలలో నలిగిపోయినా,దూషణగా ఒక్కమాటైనా అనకపోగా ,అందంగా ఆకర్షణగా ఉన్న తన రెండు కళ్ళవలెనే అనర్ధం జరుగుతోందని గ్రహించి రెండుకళ్ళనూ ఇంకెవరూ ఆకర్షించకుండా ఉండటానికి  తానె పీకేసుకోన్నది  .’’సుమేధ ‘’తాను తపస్సులో ఉండగా భంగం చేసిన ప్రియుడిపై కోపంతో ద్వేషం తో విరుచుకు పడి హడావిడి చేయకుండా అత్యంత ప్రశాంత చిత్తం తో సహనం తో అతడి ప్రవర్తనను మార్చింది .

  ఇంతటి విశాల హృదయం,సహనం క్షమా  ఉన్నవారు  కొద్దిమంది మాత్రమె కనిపిస్తారు .కాని మెజారిటీ బౌద్ధ సన్యాసినులు ఆడవారిపై అఘాయిత్యాలు ,పురుషులను లొంగ దీసుకొనే ప్రయత్నాలను దారితప్పిన మగవారికి ఈ బుద్ధులు పనికిరావని వాటిని వదులుకొని జీవించాలనే  బోధించారు .ఇలా రెండురకాలుగా ఉన్న గాథలలో స్త్రీలకూ పురుషులకు మధ్యఉన్న మౌలిక భేదాన్నిచాటి చెప్పి అన్ని వయసులలో ఉన్నస్త్రీల సహజాత లక్షణాలను రక్షించుకోవాలని చెప్పారు .సంస్కృత ,ప్రాకృత కవయిత్రులు ప్రేమను ప్రేమించారుకనుక  వారి విషయం లో అర్ధం చేసుకోవచ్చు .అలా ఎందుకు ఉండలేక పోతున్నారో కూడా రోహా శశిప్రభలు  చెప్పారుకూడా .కాని బౌద్ధ సన్యాసిని కవయిత్రులకు పురుషులనుండి  ఏమీ ఆశించలేదు కనుక వీరిమార్గం పూర్తిగా భిన్నమైనదే .పురుషులను దూరం చేసుకొంటేనే ముక్తి అని భావించారు కాని పురుషద్వేషం వారిలో లేదని తెలుస్తుంది .స్త్రీ సహజమైన వాత్సల్యం ,సహిష్ణుత,సహనం లకు  ఇంతకంటే గొప్ప ఉదాహరణలేముంటాయి ?   

  గాథలలో మరో ముఖ్యవిషయం గా ఉన్న స్త్రీత్వం ఎక్కడైనా ఒకటే అనిపిస్తుంది .మనసులోని అంతర్గత కోరికలు మంచి గృహిణిగా ఉండటానికే ఇస్టపడుతాయికాని ,గుహలలో బంధింపబడి ఒంటరిగా పవిత్ర కార్యాలకు పరిమితం కారాదని పిస్తుంది .గృహం లో గృహిణి పొందే ఆనందం సంతృప్తి ఇంకెక్కడా లభించవు .దీన్నివదిలి ఇంకేదో ఉన్నతమైనదాని దానికోసం ఆరాటపడదు.

   గాథలలో కొన్ని ‘’నిర్హేతుక వైరాగ్యం ‘’అంటే సహజ వైరాగ్యం  బోధించాయి .దీనికి ఉదాహరణ ‘’ధమ్మా ‘’  .ఈమె తగినవరుని పెళ్లాడినా ,ప్రాపంచిక సుఖాలపై ఏవగింపుకలిగి ,భర్త అనుమతిపొందలేక , అతని మరణానంతరం సన్యాసి అయింది .’’అనోపమ’’సుందరమైనదీ ,అందరి ప్రేమకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వివాహం చేసుకోరాదని నిర్ణయి౦చు కొన్నది .అలాగే ‘’గుత్తా ‘’ రోహిణి’’లు ధనిక స్త్రీలైనా పెండ్లికి విముఖత చూపారు .’’సుమేధ ‘’రాజకన్య తనను పెండ్లి చేసుకోవాలనుకొన్న రాజును కాదని బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది .ఇవన్నీ నిర్హేతుక వైరాగ్యానికి ఉదాహరణలు .

 ఇప్పుడు ‘’సహేతుక వైరాగ్యం’’ గురించి తెలుసుకొందాం .ఈ వైరాగ్యం కోరికలు తీరనప్పుడు ,జీవితం లో అలసిపోయినప్పుడు ,కొంపలో విపరీతమైన చాకిరీ ,దా౦పత్య సౌఖ్యం , ఇంటి సుఖం లేకపోవటం ,కుటుంబంలో మరణాలవల్లకలిగే దుఖం ,దరిద్రం మొదలైన దుర  దృష్టాలవలన జీవితం పై విరక్తికలిగి సన్యాసం తీసుకోవటమే ‘’సహేతుక వైరాగ్యం’’ .దీనికి మంచి ఉదాహరణ ‘’ఈసి దాసి’’.మూడుసార్లు పెళ్ళాడి, ముగ్గురుభర్తలు దూరం చేస్తే ప్రపంచం మీద విరక్తితో ఆశాభంగం ,ఏవగింపు లతో ప్రపంచాన్ని వదిలేసింది .గూని వాడి భార్య ‘’ముత్తా,,పెళ్ళికి ముందే వరుని మృతికి తల్లడిల్లిన ‘’నందా ‘’, క్రూరుడైన భర్తకు  భార్య  ,ఇంటిచాకిరితో విసిగి వేసారిన’’సుమంగళ తల్లి ‘’,స్నేహితురాలి మరణంతో శొకమూర్తి ఐన ‘’సామా ‘’,ఒకే ఒక కూతురు చావుతో దుఖం ఆపుకోలేక   ‘’ఉబ్బిరి ‘’ ,భర్త ,సంతానం,సోదరులు , తలిదండ్రులను కోల్పోయిన ‘’పటకార ‘’,పిల్లలు ,స్నేహితులు లేని బీద విధవరాలు ‘’చందా ‘’,కొడుకును కోల్పోయిన ‘’వైసిత్తి’’,భర్త ,కొడుకు మరణం పాలైన ‘’కీస గోతమి ‘’,స్వీయ భద్రతాభావం తో భర్తను చంపిన ‘’భద్దా కుండలకేశ’’,విధి వైపరీత్యం వల్ల అల్లుడినే పెళ్ళాడిన ‘’ఉప్పలవన్నా ‘’,మొదలైనవారు .గృహ సౌఖ్యం బాగా ఉండిఉంటె ,ప్రపంచాన్ని వదిలి శాంతికోసం నిర్వాణ మార్గం పట్టే వాళ్ళు కాదని చెప్పటానికి ఆధారాలు లేవు .

  పైన చర్చి౦చిన అనేక విషయాలను బట్టి  ప్రాచీనభారత దేశ స్త్రీలు అంటే వేద ఋషీమణులు బౌద్ధ సన్యాసినులు ప్రాకృత కవయిత్రులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ అపూర్వమైనది.  సన్యాసినులైనా ఊహాలోకంలో విహరించకుండా ,సాహిత్యం లో ఇతర రంగాలలో అంటే  నాటకం ,చరిత్ర స్మృతి తంత్ర ,వేదాంతం వైద్యం ఖగోళశాస్త్రం గణితం మొదలైన రంగాలలో లోకూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు .ప్రతిరంగాన్ని అంతర్ దృష్టితో వీక్షించి  సహేతుకంగా నిర్దుష్టంగా నిష్పక్షపాతంగా అద్భుత వివరణలతో  రాసి పరిపూర్ణత చేకూర్చారు .ప్రపంచం లో ఏ దేశం లోనూభారత దేశం లో లాగా  మహిళల చేత  ప్రాచీన సాహిత్యం వర్దిల్లలేదు అన్నది నిర్వివాదమైన  అంశం.దీనికి మనం గర్వపడాలి .మనలాగాసంపూర్ణ సంస్కృతి మహిళల చేత ఉత్తుంగ శృంగంగా పోషి౦ప బడిన  దేశం ప్రపంచం లో లేనే లేదు .ఇంతటి ఉన్నత సంస్కృతిని మన మహిళామణులు మనకు వారసత్వంగా అందించినందుకు మనం ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం ?వాటిని అనుసరించి ఆచరించి  భద్రపరచి వారసులమని రుజువు చేసుకొని గర్వపడాలి .

  ఇటీవలికాలం లో భారత దేశంలోనూ బయట ప్రపంచం లోనూ ఆనాటి భారతీయ మహిళా గౌరవం అతితక్కువ ,బూజుపట్టింది అనే అభిప్రాయం ఉంది .ఇంట్లోను సమాజం లోను వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమైనదే .బాగా విద్యావంతులేకాక గొప్ప సృజన శీలురు .వారిమేధ అద్వితీయంమాత్రమేకాదు ఉత్తమ కళా సృజన చేసిన మహిళామణులు కూడా ..ఇంతటి ఉన్నత ఉత్తమ సృజన తో సమాజానికి మార్గ దర్శకులై ధృవతారలుగా నిలిచారు వారు. ‘’ఉత్త జమానా సరుకు ‘’కాదని గ్రహించాలి .పుతులతో సమానంగా  కూతుళ్ళనూ  చదివించి తీర్చి దిద్దిన విదుషీమణులు వారు  .సోదరులులాగే సోదరిలుకూడా ప్రతిభా విశేషాలతో  వన్నెకేక్కారు .భర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ఉత్తమ గృహిణులు అనిపించారు .చదువు సమస్కారాలతో పిల్లలను తీర్చి దిద్ది ఆదర్శ మాతృమూర్తులు ,గురువులు అయ్యారు .ప్రజాసేవలో పునీతులయ్యారు .దక్షత ఉన్న ద్రష్టలయ్యారు .విద్యావేత్తలై సంఘం లో నైతికవిలువలకు మూలస్తంభాలయ్యారు .నిత్య సమాజోన్నతికి బద్ధ కంకణ ధారులై మార్గ నిర్దేశం చేశారు  .వారి కృషి ,అంకితభావం మహత్తరం .మహిళాభ్యున్నతిలేని సమాజం,దేశం ఏ విధంగానూ అభి వృద్ధి చెందదు అని అందరం గుర్తించాలి గ్రహించాలి  .భారతజాతి ధార్మిక పునరుజ్జేవనానికి పురుషునితోపాటు స్త్రీలకూ సమాన హక్కులు బాధ్యతలు ఉండాలి .అప్పుడు వారు సాధించలేనిది ఏమీ ఉండదు ..’’ఆడాళ్ళూ మీకు జోహార్లు ‘’

  సంస్కృత ప్రాకృత వేద బౌద్ధ సన్యాసినుల కవిత్వ పరిశీలన సమాప్తం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -3

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -1

సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ  సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు ఈ లోకాన్నీ అమితంగా ప్రేమించారు .ఈ ప్రపంచం లోని అందాలు సుఖాలు విశిష్టతలను ప్రేమించారే తప్ప అలౌకిక విషయాలపై ధ్యాస లేదు ..కానీ బౌద్ధ సన్యాసినుల దృష్టి వీరికి భిన్నంగా ఉంటుంది . జీవితం  పునరపి జననం పునరపి మరణం కస్టాలు దుఖాలు బాధలమయం కనుక వీటికి అతీతమైన శాశ్వతమైన లోకాన్ని అన్వేషించి అందులో ఉండిపోవాలని నిర్వాణమే మార్గమని నమ్మి అలా జీవించారు .ఎప్పుడైతే భౌతికలోకాపేక్ష లేదో, ఇకవారికి ఈలోకం లోని సుఖం సంతోషం నూతనత్వం తాజాతనం ల తలుపులు మూసేసుకొని ఉండిపోయారు .

   వీరికి భిన్నంగా సంస్కృత కవయిత్రులు ప్రకృతి మానవుడు ,ప్రేమమొదలైన  అనేక అంశాలపై ఉత్తమమైన శ్రేష్టమైన కవిత్వం రాశారు .కాని బొద్ద సన్యాసినుల కవిత్వం దీనికి భిన్నంగా ఒకే విధమైన, మార్పులేని మూస కవిత్వం (మొనాటనస్ )రాశారు .బుద్ధుడు బౌద్ధ సిద్ధాంతాలు మరుజన్మలేని నిర్వాణం  పైనే దృష్టిపెట్టారు .ఆపరిధిని దాటలేదు .తమ చుట్టూ ఉన్న ప్రకృతినే వీరు పట్టించుకోలేదు కాని సంస్కృత కవయిత్రులు ప్రకృతిని ఆరాధించారు మమేకమైనారు .బొద్ద సన్యాసినులు  సన్యాసినులే అనిపించారుకాని కాని ,కవయిత్రులు గా గుర్తింపు పొందలేక పోయారు .అంతేకాదు మనిషిని కూడా నిర్లక్ష౦ చేశారు. ఎక్కడో చాలా అరుదుగా బిడ్డ చనిపోతే తల్లి రోదన ,భర్త దౌష్ట్యానికి బాధపడిన భార్య లపై రాసినా మనిషిని కర్త, కర్మగా సరైన దృక్పధంతో ఆలోచి౦చ లేదనే చెప్పాలి .

  సంస్కృత కవయిత్రులు మాత్రం స్త్రీత్వ సహజ విషయాలకు ప్రాదాన్యమిచ్ఛి  .ప్రేమకు పట్టాభి షేకం చేశారు .కాని బౌద్ధ  సన్యాసినులైన కవయిత్రులకు ప్రేమా దోమా జాన్తానై.’’ లైట్ .‘’తీసుకొన్నారు .అది అసలు వారికి విషయమే కాకుండా పోయింది .సంస్కృత కవయిత్రులు సహజ ప్రకృతి ధర్మాలను విస్మరించకుండా వాటిని పండించి ఫలవంతం చేశారు .మానవ ప్రేమకు మహోత్సవం జరిపారు .ప్రేమలోని సౌందర్యాన్ని ,ఆన౦దాన్ని ఆకాశానికి ఎత్తేశారు .దీనికి పూర్తి విరుద్ధంగా బౌద్ధ సన్యాసినులు ప్రవర్తించారు .అభిరుచి ఆసక్తి అన్ని అనర్ధాలకు మూల కారణం అనీ, కనుక దాన్ని త్యజించాలని భావించారు . కోరిక అభిరుచి భౌతికప్రేమ ,దాని వికార రూపం ,మలినత్వం పై పదే పదే విరుచుకు పడ్డారు .కనుక సంస్కృత కవయిత్రులకవిత్వం అత్య౦త తీవ్రమైన స్త్రీత్వపు హృదయం అందులోని సంతోషం ఆనందం బాధలు కన్నీళ్లు ,అల్ప సంతోషం,కడగండ్లు మొదలైన మానవత్వ విషయాలతో   ఘనంగా  పరిమళి౦చి౦ది .కాని బౌద్ధ సన్యాసినుల ‘’గాథాకవిత్వం’’ లో లక్ష్యాన్ని చేరుకొని ,ప్రశాంతత తో సంతృప్తి సాధించి,భౌతికానంద ,సుఖాలను పరిత్యజించి ,సుఖ దుఖాలకు అతీతంగా  ఆడ మగఅనే   భేదభావం లేని రుషిత్వం తో, కేవలం ఋషిగానే ,వ్యక్తులకు ప్రాధాన్యతలేని సర్వమానవ ప్రేమ దయ కరుణ లే ముఖ్యంగా భావించారు, జీవితాలు సాగించారు .

  సన్యాసినుల గాథలలో సహజ సరళ భావ వ్యక్తీకరణ ,కొన్ని చోట్ల పరమాశ్చర్యం కలిగించే ‘’ఉపమ’’ లతో ఉంటాయి .అయినా వాటిలో సహజ సదృశమైన అందం  సంగీతం ,లావణ్యం లోపించి మనసులను ఆకర్షించలేదు .ఈ విషయంలో సంస్కృతకవయిత్రులకవిత్వం సర్వాంగ సుందరం అనిపిస్తుంది .ఒక్కసారి పునశ్చరణ చేస్తే- సంస్కృతకవయిత్రులకవిత్వం అనేకానేకంశాలతో బహు కుతూహలంగా  రమ్యంగా ఆకర్షణీయంగా ఉంటె ,బౌద్ధ సన్యాసినుల గాథలలో కవిత్వం ఒకే ఒక్క విషయంపైనే దృష్టిపెట్టి రాసింది .మొదటి వానిలో లక్ష్యం ,స్పష్టత ఉండి,బాహ్యవిషయాలపై ఆసక్తి కనిపిస్తుంది .రెండవదానిలో ఎక్కువగా విషయపరమై ,నైరూప్యంగా అంటే ఆబ్స్ట్రాక్ట్ గా అనగా లోపలి అనుభవాలను చిత్రీకరించాయి మొదటి వాటిలో ఇంద్రియపరమైనవిగా భావగీతాలుగా మనసుకు హత్తుకొంటాయి .రెండవ రకమైనవాటిలో గంభీరత తీవ్రత ,సందేశాత్మక బోధనగా ఉంటాయి .మొదటివి ఆసక్తి రేపి ,సజీవంగా ఉంటె రెండవ రకానివి గంభీరంగా ప్రశాంతంగా ఉంటాయి .మొదటివాటిలో’’ ఫెమినైన్ టచ్’’అంటే స్త్రీత్వ స్పర్శ తో వైయక్తికమైతే రెండవవీ సహన దయాశీలం సార్వకాలికంగా దేనికీసంబంధంలేనట్లు౦ టాయి .మొదటివి సాధారణంగా మధురంగా ఉంటె  రెండోవి కూడా సరళ౦గాఉన్నా  నిరాడంబరంగా కఠినంగా కనిపిస్తాయి .మొత్తం మీద మొదటి వాటిలో  మక్కువ ఉద్వేగ ఉద్రేకాలు ఉంటె, రెండవవాటిలోలోతైన,గాఢమైన అభినివేశాలుంటాయి .మొదటివి చురుకుతో సజీవమైతే  రెండవవి గంభీరంగా ఉన్నతమైంది.మొదటిది ఈ లోకం గురించే ఆలోచిస్తూ తెలీని మరోలోకం వైపు చూడలేదు .రెండవది ఈ లోకాన్ని తృణీకరించి పరలోక మార్గాన్వేషణ చేసింది  .రెండురకాల కవిత్వాలను మహిళలే రాసినా పూర్తి వైరుధ్యం దర్శనమిస్తుంది .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్రుని అతిపెద్ద బిలం లో కప్పుకుపోయిన అతిపెద్ద ”హవాలి ”

An ‘Anomaly’ the Size of Hawaii Is Buried Beneath the Moon’s Biggest Crater

Earth’s moon is hiding an enormous secret on its storied dark side. Deep below the moon’s South Pole-Aitken basin (the largest preserved impact crater anywhere in the solar system), researchers have detected a gargantuan “anomaly” of heavy metal lodged in the mantle that is apparently altering the moon’s gravitational field.

According to a study of the mysterious blob, published April 5 in the journal Geophysical Research Letters, the anomaly may be the heavy leftovers of the asteroid that crashed into the far side of the moon and created the giant South Pole-Aitken crater some 4 billion years ago. However, all that researchers can say for sure at this point is that the blob is big — likely weighing somewhere in the neighborhood of 2.4 quadrillion US tons (2.18 quintillion kilograms).

“Imagine taking a pile of metal five times larger than the Big Island of Hawaii and burying it underground,” lead study author Peter James, assistant professor of planetary geophysics at Baylor University’s College of Arts & Sciences, said in a statement. “That’s roughly how much unexpected mass we detected.” [10 Interesting Places in the Solar System We’d Like to Visit]

James and his colleagues discovered the blob while comparing maps of lunar topography with data collected by NASA’s Gravity Recovery and Interior Laboratory (GRAIL) mission — a 2011 experiment wherein two satellites orbited the moon in tandem, mapping the precise strength of its gravitational pull at various locations.

The GRAIL readings revealed something very heavy tugging down the bottom of the South Pole-Aitken crater by more than half a mile.Whatever it was, the offending anomaly was buried hundreds of miles below the moon’s surface.

In the new study, the researchers ran impact simulations to show that this underground debris could, theoretically, be the remnants of a heavy iron-nickel asteroid that got stuck part way to the lunar core.

“We did the math and showed that a sufficiently dispersed core of the asteroid that made the impact could remain suspended in the Moon’s mantle until the present day,” James said.

Measuring about 1,553 miles (2,500 kilometers) wide, the South Pole-Aitken crater is already one of the moon’s largest mysteries. Not only is it the biggest impact crater in the solar system, but its towering rim and deep basin also contain the moon’s highest and lowest elevations.

Researchers aren’t totally sure what the vast bowl of dusty rock is made of, but think it could include some chunks of lunar mantle amidst the upper layers of crust and dust. China’s Chang’E-4 lander, which reached the far side of the moon earlier this year, recently began analyzing soil near the crater, giving scientists their first peek at what the moon’s innards might be made of. As a moon-walker might say, that’s one small step towardunderstanding the blob.

LiveScience
Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2

   సంస్కృత –వేద కవయిత్రులు-2

‘’సాస్వతి ‘’కవయిత్రి అభిప్రాయం పైదానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది .ఆమెలో సర్వసమర్పణ ,అంకితభావం భర్తపట్ల పూర్తీ విధేయత ,భర్త చేసిన పాపాలకు పరిహారంగా తాను వ్రతాలు నోములు చేసి పాపవిముక్తుడిని చేయటం ,అతడు పూర్తిగా మంచి మనిషిగా మారాక అంతులేని ఆనదాన్ని సంతోషాన్ని పొందటం కనిపిస్తుంది (8-1-34)

ఒక  సుదీర్ఘ మంత్రం లో కొత్త పెళ్ళికూతురు గురించి కొన్నిప్రసిద్ధ  వివాహమంత్రాల గురించి ఉన్నది .గృహిణిగా ఇంటి పెత్తనాన్ని పొంది కొడుకులు కోడళ్ళు మనవలతో ఆమె పొందే ఆనందం వర్ణింపబడింది (10-35).అగస్త్యుని సోదరి కుమారులకోసం ఇంద్రుని తల్లులను ప్రార్ధించటం ,వారు తమ పుత్రుల ఘనత ,సాధించిన విషయాల ను  గర్వంగా చెప్పటం వర్ణించబడింది (4-18,10-153).

మరికొన్ని మంత్రాలలో స్త్రీ జీవితం లో వివిధ దశల వివరణ మరికొన్నిటిలో అనేక తరహాల స్త్రీలు వర్ణించబడ్డారు .’’గోధా’’అనే ఆమె ఇంద్రుని భక్తురాలుగా ,ఆయనపైనే ఆధారపడినదానిలాగా  కనిపిస్తుంది(10-134).’’యామి’’ చెప్పినట్లుగా ప్రచారం లో ఉన్న మరొక మంత్రం లో  మక్కువ ,ఉద్రేకం ,విలాసం, ఉన్న స్త్రీ చివరికి తన సోదరుడిని సైతం మోహింఛి చెడగొట్టిన వర్ణన ఉన్నది  (10-10).శీలం చెడినఒక  స్త్రీ శృంగారం పై తనకున్న నీచ అభిప్రాయాన్ని చెప్పి ఇతరులకు కూడా అదే భావాన్ని కలిగించి దాన్ని నీచంగా ప్రచారం చేయటం   కనిపిస్తుంది (10-95). ‘’సరమా ‘’చెప్పినట్లున్న మరొక మంత్రం లో  విశ్వాసమున్న దూత వ్యక్తిత్వ వర్ణన ఉన్నది (10-108).

  కనుక సంస్కృత కవయిత్రులులాగానే వేదఋషీమణులుకూడా వివిధ విషయాలపై నా, స్త్రీ జేవితం లోని వివిధదశలపైనా అంటే ముసలి పనికత్తెపెళ్ళికి ఆరాటపడటం(ఘోష ) ,కొత్త పెళ్ళికూతురు (సూర్యా),పతివ్రత అయినభార్య (సాస్వతి ),అసూయాపరురాలైన ఇల్లాలు (ఇంద్రాణి ),విలాస స్త్రీ (రోమసా,లోపాముద్ర )జబ్బుపడ్డ భార్యను దూరం చేసినభర్త (ఆపాలా ),సంతృప్తితో జీవించే గృహయజమానురాలు (విశ్వవార )పుత్రుల పరాక్రమాలకు గర్వపడే తల్లి (అగస్త్యుని సోదరి ,అదితి ఇంద్రమాతలు )కవితలు చెప్పారు .మత ధర్మాలకు అంకితమైన పతివ్రత  ( గోధ ) వేశ్య (యమి )శీలం చేడ్డ స్త్రీ (ఊర్వశి ),విశ్వాసపాత్రురాలైన  దూత (సరమా )లగురించీ మంత్రాలలో చెప్పారు .వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ,స్త్రీకి ఉన్న అపార మానవతా దృష్టి ,పూర్తిగా జీవం కలగజేయటం ,శక్తి ఓజస్సు ,కట్టలు తె౦చు కొనే ఉద్రేకం అన్నీ గుండెలోతుల్లోంచి పెల్లుబికి వస్తున్నట్లు తెలుస్తుంది .

  కాని వీరు ఇంత వైవిధ్యంగా ప్రకృతిని దర్శించి చెప్పింది చాలాతక్కువే .కొన్ని చోట్ల అగ్ని రాత్రి మొదలైన వర్ణనలు అద్భుతంగా చేశారు .సంస్కృత కవయిత్రుల కవితలను ,ఋషీమణులైన కవయిత్రుల మంత్రాలతో పోలిస్తే -స్త్రీ మనసు ,సహజమైన ఆత్మభావన ఎక్కడో కొన్ని ప్రత్యెక విషయాలను మినహాయిస్తే సమానంగానే కనిపిస్తాయి .తరువాత తరువాత వచ్చిన మంత్రాలు పూర్వపు వాటికంటే చాలా మోటుగా ఘాటుగా ,ఉద్రేకపూరితం మమకారం గా అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి .మొదటివి కళాత్మకంగా ,నగిషీలతో మెరిస్తే ,తరవాత వచ్చినవాటిలో  ఆ నిండుదనం ,శోభ ,కళ తగ్గినట్లనిపిస్తాయి .

  దీనితర్వాత సంస్కృత కవయిత్రుల, ,బౌద్ధ భిక్షిణుల కవిత్వానికి ఉన్న తేడాలను తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన

సంస్కృత ప్రాకృత కవయిత్రులకు ప్రేమ అతిముఖ్యమైన అంశం .ఇద్దరికీ అగమ్య గోచరమైన విధి ,దేవుడు విషయాలపై ఉదాసీనంగా ఉన్నారు .వీటికోసం కవితా మేధస్సును వృధా చేసుకోరాదని భావించారు .అజ్ఞాతం అజ్ఞాతంగానే ఎప్పుడూ ఉండిపోతుందని , .దీనికోసం ఆరాటం వృధా అనుకొన్నారు .

  ప్రాకృత కవయిత్రులు రెండు నూతనమైన ప్రేమమార్గాలను తెలిపారు .ఈపని సంస్కృత కవయిత్రులు చేయలేకపోయారు .అంటే ప్రియుడి పై ఆధిపత్యం సాధించలేకపోయారు .దీనికి బదులు వారు అణగిమణగి ఒదిగి ఉండిపోయారు ప్రియులకు .అందులోనే ఆనందాన్ని సంతృప్తి ని అనుభవించారు .భర్త లేక ప్రియుడి భావాలకు అభిప్రాయాలకు విలువనిచ్చి తమమనోభావాలను లోలోనే అణచి వేసుకొన్నారు .ప్రియుడి నిర్వచనం విషయం లో సంస్కృతకవయిత్రులకంటే ప్రాకృత కవయిత్రులకే అగ్రతాంబూలం .

 మొత్త౦మీద ప్రాకృత కవయిత్రులుతమ సోదరీమణులైన సంస్కృత కవయిత్రులకంటే స్వీయ నియంత్రణ కలవారు .ప్రేమ విషయంలో జాగ్రత్తలో ఉండేవారు .ప్రాకృత కవయిత్రులు లాగానే ఆ స్త్రీలు ప్రియుని దూషించటం చేయలేదు .మగవాళ్ళు లేక ప్రియులు పరిపూర్ణమైన లేక సమగ్రమైనవారు కాకపోయినా వారు క్షమించారు .వారిని వేధించలేదు ,కతఠినంగా విమర్శించనూలేదు .పైపెచ్చు తమపైనే నింద మోపు కొన్నారు .తమప్రియుల కోసం తమను తాము త్యాగమూ చేసుకొన్నారు .

  సంస్కృత ,ప్రాకృతకవయిత్రులు సెక్స్ విషయం లో అత్యున్నతమైన స్త్రీత్వ స్పర్శ  కనపరచారు  .ఆడంబరమైన పదాలు ,సంక్లిష్ట సమాసాల జోలికి వెళ్ళలేదు .స్పష్టత ,లావణ్యాలకు ప్రాధాన్యమిచ్చారు .లోతైన పరిశీలన ,అంతర్ దృష్టి ఈ కవయిత్రులకు అద్భుతంగా ఉండటం సహజం సుందరం సత్యం .

   సంస్కృత –వేద కవయిత్రులు-1

సంస్క్రుతకవయిత్రులను అనేకఋగ్వేద  మంత్రాల ద్రస్టలైన  వేద రుషి కవయిత్రులతో పోల్చటం తమాషాగా ఉంటుంది .అనూచానంగా వచ్చిన మంచి సంప్రదాయం ,సంపూర్ణ పాండిత్య౦, సంపూర్ణ వికాసం లకు  వారసులైన మహిళా వేదకవయిత్రులు ,స్త్రీత్వ సహజమైన కోరికలు భావాలు ఆన౦దానుభవం ,సౌందర్యం ,వినోదం ,సురుచికరమైన హాస్యం సంపూర్ణంగా అనుభవించారు .ఈ లోకం అందించినవాటిని అందిపుచ్చుకోవాలనే భావించారు .వీరందరికీ ప్రేమ అతిముఖ్యమైన విషయమే .దాంపత్య సౌఖ్యం గొప్పవరంగా భావించారు .మతం  భొతిక ఆన౦ద సుఖాలకు,సంక్షేమానికి  చేతి పనికత్తె గా అనుకొన్నారు .కనుక వేద రుషీమణులైన ఈ కవయిత్రులు చేసిన ప్రార్ధనలు స్తోత్రాలు అన్నీతగినభర్త లభించాలని ,భర్తప్రేమ అందుకోవాలని , భౌతిక సుఖానందం పొందాలనే భౌతిక వాంచలు తీరటం కోసమేనని అర్ధమౌతుంది  .ముక్తి ,మతోద్ధారణ అలౌకిక ఆన౦దాలకోసం మాత్రం కాదు .’’

 ‘’ విశ్వవార ‘’అనే వివాహిత స్త్రీ అగ్నిని భౌతికసుఖం ,రక్షణ జీవితం కోసం ప్రార్ధించింది (ఋగ్వేదం 5-28). ఘోష అనే రాజకన్య తనకు సోకిన కుష్టు వ్యాధినుంచి విముక్తికల్గించి మంచి వరునితో వివాహం జరిగేట్లు చేయమని ,తాను వంటరిగా ఇంట్లోనేముసలితనం ఆక్రమిస్తూ ఉండిపోయానని ,తనకు  వ్యాధి నయం చేసి, కురూపం పోయి సురూపం వచ్చేట్లు చేసి ,ధనవంతుడైన ప్రముఖునితో వివాహం జరిపించమని అనేకమంది దేవతలకు ,మనుషులకుఈవ్యాధిని నివారించిన అశ్వినీ దేవతలను ప్రార్ధించింది (10-39). .అంతేకాదు అశ్వినులు తనకు సంతృప్తిగా కాముకతను రసికతతో కూడిన ప్రేమపై మంచి అవగాహన కలగ జేయమని ,పరిస్థితులప్రాబల్యం వలన అవన్నీ తనకు దూరమైనాయని దీనంగా వేడుకొన్నది .కన్య మనసులోని కోరికలు పురి విప్పి నాట్యం చేసినట్లుగా ఘోష తన ఘోషను మంత్రాలలో దివిజ భిషగ్వరులైన అశ్వినీ దేవతలకు విన్నవి౦చు కొన్నది .

    అలాగే ‘’ఆపాల ‘’కూడా ఘోషలాగానే తన దీనగాధను  వెళ్ళబోసింది .శారీరకవ్యాది బహుశా బొల్లి తో బాధపడుతూ ,భర్తతో సహా అందరికి దూరమై, భర్త ప్రేమ  గగన కుసుమమై  చివరికి ఇంద్రుని తన జబ్బు నయం చేసి తనను భర్తతో కలిపి ,భర్తతో దాంపత్య సుఖం   ప్రసాదింపజేయమని ప్రార్ధించింది .ఆమె ప్రార్ధనమన్నించి ఇంద్రుడు ఆమె చర్మవ్యాధిని నయం చేసి శరీరానికి స్వచ్చమైన సూర్యకాంతి వంటి కాంతిని ప్రసాదించి  భర్తకు దగ్గర చేసి ఆమె కోరికతీర్చి ఉపశాంతిని కలిగించాడు .ఆపాలా  ప్రార్ధించిన మంత్రం లో భర్తకు దూరమైన భార్య వేదన ,మళ్ళీ అతనితో సమాగమవ్వాలనే గాఢవాంఛ కనిపిస్తాయి .

  ఇలాగే మరికొందరున్నారు .’’రోమాసా ‘’తన అపరిపక్వతవల భర్త కోపానికి బలై,తర్వాత తనతప్పు తెలుసుకొని పరిపక్వత సాధించి యవ్వనోద్రేకాన్ని కురిపించి  భర్త మెప్పు పొందింది .సుఖసంతోష స౦తృప్తి పొందింది .అగస్త్యమహర్షి పత్ని లోపాముద్ర ముసలివాడైనతనభర్తవలన రతి సౌఖ్యం పొందలేక నిర్లక్ష్యానికి గురై ఒకమంత్రం లో ఆయననను తన దగ్గరకు వచ్చి శృంగారకేళి జరిపి సౌఖ్యం ప్రసాదించమని కోరింది .ఆ మంత్రభావ౦ ‘’మనం చాలాయేళ్ళుకృషి చేశాం చాలా  శ్రమించాం.ముసలితనం మీదపడింది .ఇప్పుడైనా జీవితం లోని ఆనందం , సుఖం అనుభవిద్దాం .’’అని ఆహ్వానించింది .’’ఇంద్రాణి ‘’అరుదైన తన అందాన్ని, సౌందర్యాన్ని  విశేషమైన మధురానుభవాలను జ్ఞాపకం చేసి  భర్తను మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేసింది .ఈ తపస్విని రెండుమంత్రాలలో అసూయాపరురాలైన భార్య ప్రవర్తన చూపించింది .మొదటి దానిలో తనభర్తకు అత్యంత ప్రియురాలైన తన సవతిని దూరం చేయటం కోసం ఒక మూలికను మంత్రించి సవతిని దూరంగా తరిమేసి భర్తప్రేమకు తానే సర్వాదికారిణి కావటం .ఇందులోని ప్రతిపదం లో ఆశాభ౦గం పొందిన అసలుభార్య మనసు లోతుల్లో సవతిపై ఉన్న ద్వేషం, పగా, ప్రతీకారం కన్పిస్తాయి .రెండ మంత్రం లోనూ మానవ సహజ గుణాలు కనిపిస్తాయి .అసూయాపరురాలైనభార్య ,సవతిని తట్టుకోలేక ,ఓర్చుకోలేక పోటమేకాదు, తనభర్త తనకన్నాస్నేహితుడిని ఆదరించటతమూ సహించ లేకపోతుంది .అతని దృష్టి మరల్చటానికి చేయని ప్రయత్నం ఉండదు .నెమ్మదినెమ్మదిగా భర్త మనసులోఅనేక విధాలుగా  విషం ప్రవేశపెడుతుంది.ముందుగా తన వ్యక్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని గుర్తుకు తెచ్చి ,అతని స్నేహితుడు భర్త అధికారాలనుఅన్యాయంగా  లాగేస్తున్నాడని చెప్పి అతని స్నేహితునిపై సానుభూతి చూపటం మానేయమని ,ప్రతీకారం తీర్చుకోమని హితవు చెబుతుంది .అతనిలో కోపాగ్ని బాగా రగిల్చటానికి భర్త శౌర్య ప్రతాపాలను కీర్తిస్తుంది .పరాకాష్టగా భర్త స్నేహితుడు తన అంద చందాలపై కన్ను వేశాడని ,ఇకతాను భర్తకు దక్కకుండా పోతానేమోనని ,తనభర్తకు దక్కాల్సినతన సౌందర్యం ,సుఖం వేరొకరికి దక్కటం తనకు ఇష్టం లేదని రెచ్చగొడుతుంది  .అసూయ నిండిన భార్య సైకాలజీ ఇక్కడ స్పష్టంగా ప్రత్యక్షమౌతుంది .భర్తమనసు మార్చటానికి, సవతిని దూరం చేయటానికి అసూయ కలభార్య యెంత దూరమైనా వెడుతుందని , ఎంతటి మాయోపాయాలైనా చేస్తుందని ఈ మంత్రాలు మనకు తెలియజేస్తాయి .ఇవన్నీ భౌతికానందం కోసమే  నని మరువరాదు .మిగిలినవారి మనస్తత్వమేమిటో తరువాత తెలుసుకొందాం

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469-‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

469‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)

రామాయణార్య లేక ‘’అసేచనక రామాయణం;; రాసిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట వద్ద కడయక్కుడి గ్రామం లో జన్మించాడు .కౌశిక్ గోత్రానికి చెందిన సామవేది .రామభద్ర దీక్షితుని మామ చొక్కనాధ దీక్షిత వంశంవాడు .గొప్ప వ్యాకరణ వేత్త అయిన రామభద్ర దీక్షితులు జానకీ పరిణయ కావ్యం రాశాడు .ఈ వంశీకులంతా తిరుచినాపల్లి తాలూకా బొమ్మసముద్రం దగ్గరున్న ‘’నాచికురిచి ‘’గ్రామానికి చెందినవారు .ఇక్కడినుంచి పుదుక్కోటరాజ్యం లో ని’’ పిన్నంగుడి’’ కి వలసవెళ్ళారు .మనకవి తండ్రి శంకరనారాయణ శాస్త్రి కడయక్కుడి లో స్థిరపడ్డాడు .ఇక్కడే ఉన్న స్వామి అయ్యంగార్ వద్ద కావ్య నాటక అలంకార శాస్త్రాలు,తంజావూర్ జిల్లా అనంతగిరి తాలూకా కారవాయాల్ లో ఉన్న   శ్రీనివాస శేషాచార్యవద్ద వ్యాకరణం నేర్చాడు సూరి .వీటన్నిటిలో నిష్ణాతుడై కవిత్వ ,చిత్రలేఖన సంగీతాలలోనూ అద్వితీయుడనిపించాడు .వీటితోపాటు హరికథాగానం లోనూ,రచనలోను  సిద్ధహస్తుడు .ఎన్నో హరికథలు స్వయంగా రాసి గానం చేసి సభలలో మెప్పించాడు .పుదుక్కొట రాజాగారికాలేజిలో సంస్కృత అసిస్టెంట్ గా 19-1-1894న చేరి ,16-2-1910లో శాఖాధిపతి అయ్యాడు .

  అసేచనక  రామాయణం తోపాటు ,వల్లీ బాహులేయం నాటకం ,’’చతుష్పదీ చతుశ్శనీ ‘మన్మధమధనం అనేభాణం,పూర్వాదునిక్ వృత్తపద్యాశికా ,వృత్తనామ సంగ్రహం ,కారకాణి రచించాడు .సంగీత రూపకాలుగా రామావతారం సీతాకల్యాణం ,రుక్మిణీ కల్యాణం,పార్వతీకల్యాణ౦  వగైరా రాశాడు .రామ చంద్ర పద్య పంచరత్నం ,శుక సూక్తి ,సుధారసాయనం డోలాగీతాని  మొదలైనవి రచించాడు .అయితే వీటిలో కొన్నిమాత్రమే తనవద్ద ఉన్నాయని సూరిగారి కుమారుడు మద్రాస్ లోని అకౌంటెంట్ జెనరల్ ఆఫీస్ సూపరిం టే౦డెంట్ శ్రీ ఎస్.శంకరనారాయణ 1932లో తెలియజేశారు .

సుబ్రహ్మణ్య సూరి రాసిన అసేచనక  రామాయణం లేక రామయాణార్య ఆర్యా ఛందస్సులో రాయబడిన కావ్యం .ప్రతిశ్లోకం లోని మూడుపాదాలలో కధాంశం ఉంటె నాలుగవపాదం లో వీటి లోని నీతి ఉంటుంది అదీ ప్రత్యేకత. ఇంతకీ అసేచనక అంటే ఏమిటి ?మిక్కిలి సుందరమైనది అని అర్ధం .సుందరకాండ మాత్రమేకాదు రామాయణ కాండలన్నీ బహు సుందరమైనవని తెలియ జేసి ,రచనలో రుజువు చేశాడు సూరి . కావ్యానికి అందమైన పేరు పెట్టటం లోనూ తన ప్రత్యేకత చూపించాడు .

బాలకాండ లో శ్లోకాలు –

యః పూర్వమాధ్యాం కవితోచ్చశాఖామారుహా రామేత్య శక్రుచ్చకూజ-రసం చ రసాక్షరమత్ర వందే వాల్మీకినామాద్రుత కొకిలం నమ

నారదః పయోదే ర్వాల్మీకీ రామ చరిత మయమమృతం –యన్నం వినేవ లేభే సాధుజన౦ సాధ్యమేవ సఫలయతి

క్రౌన్చమిదునా త్విలైకం వాల్మీకిః కాముకం కిరాతహతం –హ్రుశ్వ సుశోచ దయయా  భూతదయా భూతాదియానీ పుంసాం ‘’

200వ శ్లోకం –‘’కేసరికా పిజయాయం శ్వసనేనో ప్యాదితో౦జనా రవ్యాయతమ్ – దాసస్తవ రామాయం సద్దార్మికో హి మార్జరః  

ఫలహరణాయ జనన్యాం చాలితాయాం శోశవేయమానిలసుతః –ఫలబుధ్యతా ర్కముపాగమత్ బాలో వత్సోభయం న జానాతి ‘’

చివరిశ్లోకం –‘’ప్రతియుగ మవనాయ సతాం కతిపయ శఠ శిక్షణాయచ శ్రీశః-అవతారతి రఘోర్వంశేనివసతి నైకత్ర రాక్షకో నృణాం’’

‘’ఇతి ఉత్తరాకాండః

ఇతి కడయకుడి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి కృతంశ్రీ మదసేచనక రామాయణం సంపూర్ణం ‘’ఓం తత్సత్ ‘’

ఇలా రామయణాన్ని బహు సుందరబందురంగా 289శ్లోకాలో కవిత్వీకరించి’’ అసేచనక రామాయణం’’ అనే అన్వర్ధనామాన్ని ఉంచి సమర్ధంగా, బహుజనరంజకంగా ఆర్యావృత్తం’లలో నిబంధించి సొగసు చేకూర్చిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి ధన్యుడు .

ఆధారం -సుబ్రహ్మణ్య సూరి కుమారుడు శంకరనారాయణ వ్యాసం

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2

ఇప్పుడు వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కావ్యం లోరాణీ దేవకుమారిక కవితా ప్రాభవం చూద్దాం

మొదటి ప్రకరణ లోని వంశ వర్ణన –

1-‘’శివంసాంబ మహం వందే విద్యా విభవ సిద్ధయే-జగత్ సూతిహరం శంభు సురాసుర సమర్చితం ‘’

2-గుజ్జద్ భ్రమద్భ్రమరరాజ విరాజితాస్యాం-స్తంబే రామాననమహం నిరతాం నమామి

యత్ పాదపంకజపరాగ పవిత్రతానాం-ప్రత్యూష సమయైవ ప్రధమం ప్రయాన్తి ‘’

3-శారదా వస్తూ శరదంబుజ –స్వాననా మామ ముఖామ్బుజీ సదా

యత్ కృపాయుతకటాక్ష భాగయతో-భాగ్యలోపమయమేతి  మానవః ‘’

4-‘’స భూయాద్ ఏకలింగేశో జగతో భూతయేవిభుః-యస్య ప్రసాదాత్ కుర్వన్తి రాజ్యం రాణాభువఃస్థిరం ‘’

5-‘’యదేకలింగం సమభూత్ పృధివ్యాం-తేనేక లింగో త్యభిదాభ్య ధాయి ‘’

 చతుర్దశీ మాఘ భవాహికృష్ణా –తస్తాం సముద్రభూతిరాభూక్త్వస్య ‘’

6-‘’తదా సునీనాం ప్రవరస్త పస్వీ –హారేతనామ శివభక్త ఆసీత్

  స ఏకలింగం విధివత్ సపర్యా -విధోరతోషిష్ట శివేషు నిష్టః

కావ్యం లో చివరి రెండు శ్లోకాలు –

‘’హరిశ్చ౦ద్ర నామాహి జన్మాభ్యభాగోత్ –ఇదం వైద్యనాదాస్టకంభక్తియుక్తః

ప్రభాతే పరేత్ స్తోత్రఏతన్నరోయోస్పనేవా భ్సితార్ధం ససిద్ధం లభేత్

‘’ఇతి దేవకుమారికా నామ రాజ మాతృహుత వైద్యనాధప్రసాద ప్రశస్తి ప్రతిష్టాప్రకరణం పంచాస్వం ‘’-సమాప్తేయం ప్రశస్తిః’’

468-సంతానగోపాల కావ్యకర్త –లక్ష్మీ రాజ్ఞి(19వ శతాబ్దం )

ఉత్తర మలబార్ పాలకులు కటత్తన్నత్తు రాజుల   ఏకావలట్టుశాఖకు చెందిన లక్ష్మీ రాజ్ఞి సంతాన గోపాలకావ్యం రాసింది .45ఏళ్ళక్రితం రాసి 21ఏళ్ళక్రితం చనిపోయింది .19వ శతాబ్దం లో ఉన్నది .ఈమె ఇతరరచనలు అలభ్యం .రాజారవి వర్మపై ఉన్న అభిమానం తో అనారోగ్యం పాలబడినా రాసింది .ఇది మూడు సర్గల  130శ్లోకాలకావ్యం  .భాగవతం ఆధారంగా రాసింది .

 కధ-ఒక బ్రాహ్మణుడి8మంది సంతానం చనిపోతే చివరికి శ్రీ కృష్ణుని దర్శించి రెండుసార్లు మొరపెట్టుకొన్నా లాభం లేక9వ సంతానమూ నష్టమైతే , దారిలో అర్జునుడు కనిపించి వివరం తెలుసుకొని పదవ సంతానాన్ని ఎలాగైనా రక్షిస్తానని ,అలాచేయలేకపోతే అగ్నికి ఆహుతౌతానని అభయమిచ్చి,పదవ శిశువు ప్రసవానికి ఇంటిచుట్టూ బాణాలతో కోటకట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నప్పటికీ శిశువుజన్మించటం వెంటనే చావటం జరిగిపోగా, సంతాన శోకంతో ఉన్న బ్రాహ్మణుడు తిట్టని తిట్టకుండా క్షోభపెడితే అవమానం తో అర్జునుడు అగ్నికి ఆహుతయ్యే ప్రయత్నం  చేయగా కృష్ణుడు ప్రత్యక్షమై నివారించి ,తామిద్దరం  ఆ శిశువును వెతికి తెద్దామని బయల్దేరారు .

  రెండవ సర్గ లో కృష్ణార్జునులు శ్రీహరి దర్శనం కోసం బయల్దేరి లోకాలోక పర్వతం దాటి హరిని దర్శించగా విషయం తెలిసి తనలోకం లో,తన దర్శన౦చేసినందున పునర్జన్మ ఉండదని చెప్పి శిశువులను తెచ్చి అప్పగిస్తాడు .మూడవ సర్గ లో బ్రాహ్మణుడు తాను  కోల్పోయిన పది మంది సంతానం శ్రీ కృష్ణార్జున సాయంతో తిరిగి పొందినందుకు మిక్కిలి సంతోషించి అర్జునునికి ఆశీర్వాదం కృష్ణపరమాత్మకు నమస్కారం  స్తోత్రం చేసి కృతజ్ఞత వెల్ల డించుకోవటం తో కావ్యం పూర్తవుతుంది .

  కవయిత్రి లక్ష్మీ రాజ్ఞి మాతృహృదయమున్న మహిళ కనుక కురుక్షేత్ర సంగ్రామం లో కృష్ణార్జునులవలన నరసంహారం విపరీతంగా జరిగిందని దానికి తగిన ప్రాయశ్చిత్తం పొందాలని ,కురుక్షేత్ర విజయగర్వం ఎక్కువకాలం నిలవదనీ ,అందుకే కృష్ణార్జునులు హరిలోక సందర్శన చేశారని చెప్పింది .లక్ష్మి కవిత్వం సరళ సుందరం .మూడవ సర్గ ను  యమకం తో యమహాగా రాసింది .ఆమెకు పౌరాణిక అనుభవం పుష్టిగా ఉంది .వసంత తిలక మాలిని ఉపేంద్రవజ్ర ఉపజాతి పుష్పితాగ్ర ,ద్రుత విలంబిత పృథ్వి,శిఖరిణి వృత్తాలను సందర్భోచితంగా ప్రయోగించింది .

సంతానగోపాలం లో లక్ష్మీ కవిత్వ విలసనం చూద్దాం –

మొదటిసర్గ ప్రారంభ శ్లోకాలు –

‘’ఆసీ చ్చూయా విజిత నిర్జర రాజాపుర్యా౦ –కయితుపురా ద్విజ కిల కృష్ణా పుర్యాం

సోయం స్వధర్మనిరతః సహధర్మపత్న్యా –రేమే సుఖం హరి పదాంబుజదత్తచిత్తః ‘’

చవరి శ్లోకం –‘’త్యజ విజయ విషాదం సంప్రతం సర్వమేవ –ప్రియ సఖ తరసా యాన్చితంసాధయిష్యే

ఇతి సుమధుర వాచాసాన్త్వయిత్వా తమేనం –కరతలమవలంబా ప్రస్తుతో వాసుదేవః ‘’

చివరిదైన మూడవ సర్గ ప్రారంభ శ్లోకం –

‘’అధ తదా హరి లోకవిలోకనా –తుదితతత్వ ధియామ ధనున్జయః

కృతహరి స్తుతి రంత మదోయిగద్-ద్విజగృహే లఖహే పురాముదం’’’

చివరిశ్లోకం  –

‘’రోగా౦త రవివర్మ కుమారకస్య –జాతాదరేణ మనమా వచసి ప్రకామం

మౌఖ్యం సమప్యం విగ గాత్య కృతం మయేతత్-కావ్యం ముదా బుధవరాఃపరిశోధయన్తు

 

 

ఇతి తృతీయః సర్గః-సమాప్తం చేదం కావ్యం ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాటక సినీ నటుడు ,రచయితా గిరీష్ కర్నాడ్ మరణించాడు (81)

Actor-playwright Girish Karnad passes away

Actor-playwright Girish Karnad passed away on Monday. He was 81.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )

వైద్యనాధ ప్రసాద ప్రశస్తి ని రాసింది దేవకుమారిక అని మహామహోపాధ్యాయ హరిప్రసాద శాస్త్రి ధృవీకరించాడు .ఈ శ్లోకాలు వైద్యనాథ దేవాలయం గోడలపై చెక్కబడి ఉన్నాయి .చిత్తూర్ రాణాఅమరసి౦హునిపట్టమహిషి రాజకుమారిక .జయసింహుని కోడలు .సంగ్రామ సి౦హ, చంద్రకుమారికల తల్లి  , శబలసి౦హుని  కూతురు ,సుల్తాన సి౦హుని  సోదరి .కాలం 17వశతాబ్దం చివరలేక 18 శతాబ్ది ప్రారంభం .ఆమెకుమారుడి పట్టాభిషేకం 1710-11లో .భర్తమరణి౦చినతర్వాతకాల౦లొ 1716 లో వైద్యనాధ దేవాలయం నిర్మించింది .

 ఈమె రాసిన ప్రశస్తికావ్యం లో వంశవర్ణన ,సంగ్రామ సింహ పట్టాభిషేకం ,దానప్రశంస ,చాహూవానోదయ ,ప్రతిష్టఅనే 5ప్రకరణలున్నాయి .దీన్ని వైద్యనాధ దేవాలయ నిర్మాణ ప్రతిష్ట  సమయం లో రాసింది .మొదటిప్రకరణలో రాజవంశ చరిత్ర రాసింది .రాణాఅనేపేరును మొదట రాహప్ప ఉపయోగించాడనీ, అప్పటినుంచి అదే ప్రచారం లో ఉందని చెప్పింది .సంగ్రామ సింహునికొడుకు ఉదయసి౦హుడు ఉదయపురం నిర్మించాడు .క్షత్రియరాజులందరూ చేతులు ముడుచుకొని కూర్చుంటే రాణాప్రతాప సింహుడు హిందూమత సంరక్షణకోసం దిల్లీపాదుషా అక్బర్ తో పోరాటం ప్రారంభించి జీవితాంతం పోరాటం చేశాడు .కర్ణ సి౦హుని  కొడుకు జగత్ సింగ్ రాజప్రాకారం మధ్య అత్యున్నత విశేషమైన విష్ణు మూర్తి ఆలయం నిర్మించాడు .ఇతనికొడుకు రాజసింహ రాజసముద్ర తటాకం నిర్మించాడు .ఢిల్లీ చక్రవర్తికి చెందిన అజ్మీర్ సరిహద్దు మాల్పూర్ ను జయించి వశపరచుకొన్నాడు .ఇతనికొడుకు అమరసింహుడు ‘’వరసద్విలాసం ‘’అనే మహా అందమైన రాజ అంతపురం జగన్మందిర దేవాలయం కూడా  కట్టించాడు .సాహాపురం కూడా జయించి కీర్తి ఉద్ధృతంగా ఉన్న సమయం లో మరణించాడు .ప్రకరణ శీర్షిక ‘’రాణా’’గాపెట్టటం మేవాడ్ రాజ వంశ ధీర వీర గాధలను చిత్రించటం తగినట్లు ఉన్నది .

  రాహప్ప తర్వాత పాలించిన నరపాలుని ధైర్యసాహసాలకు దినకర అంటే సూర్య ప్రతాపం కు తగినట్లు బిరుదుపొందాడు .నాగపాలుని గజసైన్యం అమోఘమై౦దికనుక కూడా అతనికి నాగపాల సార్ధకం .పూర్ణపాలుడు ప్రజారంజకంగా పాలించాడు .పృధ్వీ పాలుడు శత్రువులనందర్నీ ఓడించి సామ్రాజ్యవ్యాప్తి చేశాడు .భీమసి౦హుడు అరి వీర భీకరుడై శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు .లక్ష్మణ సింహ శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుని తలపి౦ప జేశాడు .అరిసి౦హుని పాదాలు శత్రు రాజుల ఏనుగుల రత్నాలతో అల౦క రింప బడ్డాయి .లక్ష్మీ సింహ లక్షమంది ని చంపి లక్షనాణాలు ముద్రించాడు .మోకాల సింహుడు శివ విష్ణు స్వరూపంగా ప్రజలు భావించారు .రాణాకు౦భకర్ణ అగస్త్యుని అంతటి వాడు .రాయమల్లుని సాటి ఎవరూ లేరు .ప్రతాప సింహునికొడుకు అమరసింహుడు దేవతలనే మెప్పించగా కొడుకు కర్ణ సింహ దానకర్ణునే మరపించాడు .

   రెండవ ప్రకరణం సంగ్రామ సి౦హుని పట్టాభి షేక వర్ణన.వృద్ధ రాజపురోహితుడు’’సుఖరామ ‘’ఆధ్వర్యం లో పట్టాభిషేకం ఘనాతిఘనంగా జరిగింది .కాయస్తరాజు కాన్తజిత్ మేవాతిస్ లతో పోరాటానికి సాయం చేశాడు .యుద్ధంలో సంగ్రాముడు ,శత్రువు దాలేలఖాన్ ఇద్దరూ చనిపోయారు .చివరివిజయం రాణా దే .రెండవ సంగ్రామ సింహుడు చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ జయించాడు .మంత్రి విహారిసింహ తెలివి గలవాడు బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు. రాజుకు చక్కగా దిశా నిర్దేశంచేసి   రాజనీతితో  ప్రజా సంక్షేమాన్ని అమలుపరచాడు .విద్యా సంస్కృతులను ప్రజలలో బాగా విస్తరించేట్లు చేశాడు .రాజు మంత్రి పరస్పర సహకారం తో రాజ్యం లో ధర్మపాలన సాగింది  .సంపద పెరిగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి  సంగ్రామ సి౦హుని  కీర్తి దశ దిశలా వ్యాపించింది .

 మూడవ ప్రకరణం లో సంగ్రామసి౦హు ని దాన ధర్మ కార్యాలు .విద్వాంసులకు సన్మానాలు ,అందులో ముఖ్యంగా దక్షిణాదికి చెందినా దక్షిణామూర్తికి,బెనారస్ కు చెందిన దినకర్ (1724-25),తర్క వేత్త సుఖానంద ,వేద కార్యనిర్వహణలో ప్రతిభ చూపిన పుండరీక ,దేవరామ ,జ్యోతిష పండితుడు కమలాకాంత భట్ట  మున్నగువారికి  ఘనసత్కారం దేదీప్యమానమై చరిత్రలో నిలిచాయి .

 నాలుగవ ప్రకరణం లో సంగ్రామ సి౦హుని మాతామహుల వంశ విశేషాలు .రచయిత్రి దేవకుమారిక జీవిత విశేషాలు ఉన్నాయి .అయిదవ ప్రకరణలో 1716లో వైద్యనాధ దేవాలయ ప్రారంభోత్సవ వైభవం హాజరైన కోటరాజు భీమ ,దుంగార రాజు రామ సింహ ,సమర్ధులైన పురోహితుల చే అత్య౦తనవైభవంగా జరిగిన తీరు ,రాజమాతగా దేవకుమారిక చేసిన మత విధులు మంత్రి హరాజి ,ఆమెచెలి కత్తే ‘’ప్రేమ’’  కుమారుడు’’ ఊదా ‘’అందించిన సహకారం ,దేవాలయ ప్రతిస్టామహోత్సవం .చివరలో రాజమాత నాలుగవసారి జరుపుకున్న తులాదానం చివరలో హరిశ్చంద్ర రాసిన శివ   అష్టోత్తరం తో కావ్యం పరిసమాప్తిఅవుతుంది .మిగిలిన విశేషాలు తరువాత తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment