దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం

సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 మొదటిభాగం 201 ఆంజనేయ దేవాలయాలతో 2015 శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆవిష్కరింపబడిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది .

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం -241  ఆంజనేయ దేవాలయాలతో  వస్తోంది .దీనిలో చేర్చటానికి శ్రీ ఆంజనేయ వైభవం ”పై పద్యాలు రాసి పంపని
1-డా.రామడుగు  వేంకటే శ్వర శర్మ ,2- శ్రీ మంకు శ్రీను 3- శ్రీ తుమ్మోజు  రామ లక్ష్మణాచార్యులు 4- శ్రీ పంతుల వెంకటేశ్వర రావు 5-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య 6–మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ 7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ గార్లను   కోరగా  సహృదయం తో స్పందించి ,రచించి ,వెంటనే నాకు పంపారు .వారందరికీ ధన్యవాదాలు  .ఆ పద్య సుమాలన్నీ ఈ గ్రంథ0 లో చోటు చేసుకొని ,స్వామికి అలంకారమౌతాయని భావిస్తున్నాను .
  గ్రంధా విష్కరణ సరసభారతి 31-3-2019 న నిర్వహించే శ్రీ వికారి,ఉగాదిపురస్కారాలు, కవి సమ్మేళనం వేడుకలలో జరుగు తుందని తెలియ జేస్తున్నాను  –
  దీనితోపాటునేను రాసిన బుక్ లెట్స్ (కరదీపికలు ) 1-అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య (117వ మూలకం టెన్నిస్సిన్  -కనిపెట్టిన ఆంద్ర శాస్త్ర వేత్త-ఈ కరదీపిక ఈ సంవత్సరం అక్టోబర్ 16 న టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లో శ్రీ రామయ్యగారి స్వగృహం లోనూ , ,17వ తేదీ దీని స్పాన్సర్ అయిన సరసభారతి కి ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాలకృష్ణగారి హంట్స్ విల్(అలబామా రాష్ట్రం ) దగ్గరున్న మాడిసన్ లోనూ మన ఎం .ఎల్ . సి.  శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు )   2–కాంతి ప్రయోగ పిత  డా పుచ్చా వెంకటేశ్వర్లు(ఆలీఘర్ ముస్లిం యూని వర్సిటీ,కాన్పూర్ ఐ ఐటి ,అలబామా అగ్రికల్చరల్ ఆండ్  మెకానికల్ యూని వర్సిటీ ల స్థాపకులు ,లేజర్ కిరణాలపై ప్రముఖ పరిశోధకులు)   పుస్తకాలు కూడా ఆవిష్కరింపబడుతాయి ..అంటే మూడు పుస్తకాలు ఒకే సారి సరసభారతి ఆవిష్కరింప బోతోందని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది
  సరసభారతి పై మీకున్న అభిమాన ఆధరాలకు  ధన్యవాదాలు -దుర్గాప్రసాద్ -13-12-18-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4  342-   ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం )

  గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

 342-   ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం )

 దక్షిణ దేశ  సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ ఆర్యలతో ఈ పుస్తకాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శాస్స్త్రి శ్రీ మానవల్లి రామకృష్ణయ్య పంతులు గార్లు పరిష్కరించి ప్రచురించారు .దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు తెలుగు లోకి అనువదించారు .

  ‘’పాండ్యు ని సంస్కృత కవిత్వం అలతి అలతి పదాల కూర్పుబిగువుతో శోభాయమానంగా  ఉంటుంది చివరి  –‘’ఇమాం కాంచన పీఠస్ధాం స్నానయంతి వధూమివ ‘’శ్లోకాన్ని బట్టి ఈ గ్రంథం’’తమిళ సంగం ‘’చేత బంగారు పీటమీద కనకాభి షేకం పొందిందని తెలుస్తోంది .

 పాండ్య కవితా వైభవం

1-మూర్ధాః-న ద్రస్టవ్యాః –ద్రష్టవ్యాశ్చేన్నతైస్తు సహతిస్ఠేత్-యది తిస్టేన్నతుకథ యేత్-యఅలసతి కథయేన్మూర్ధ వత్ కథ యేత్’’

దీనికి రాళ్ళపల్లి వారి అనువాదం –మూర్ఖులను జూడ బోరాదుమొదలు ,చూడ –వలసెనా,కూడి వారితో నిలువ దగదు –నిలువ వల నేనియు బల్కవలదు-పల్క-,వలసె బోమూర్ఖునట్లె తా బలుకవలయు ‘’

మరో శ్లోకం –శబ్దార్ధ సూక్ష్మ వసనా – సత్యాభరణా,విచిత్ర హేత్వంగీ-విద్వన్ముఖ నిష్క్రాంతా-సుస్త్రీవ విరాజతే వాణీ’’

అనువాదం –‘’చిత్ర హేతు ఘటన చెలుంపు మేను,స-త్యంబు తొడవు ,పద పదార్థ  రచన –సన్న వలువ గాగ ,సత్కాంత పోలిక –వెలయు   బుధుల నోటవెడలు మాట ‘’

ఆధారం -1971జులై భారతి మాసపత్రికలో శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి సమీక్ష –సుందర పాండ్య విరచితా –ఆర్యా ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆడపిల్లలను కాసే చెట్లు

ప్రపంచం లో ఒక చోట ప్రత్యేకంగా కొన్ని చెట్లు ఆడపిల్లల శరీరం లాంటి పుష్పాలను పూస్తూ ,పండ్లను కాస్తూ   అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయట. వీటిని ‘’నారీ లత పుష్పాలు  ‘’అంటున్నారు .పసుపు రంగు పూసుకున్న పచ్చటి అమ్మాయిలు లా  చెట్లకు వ్రేలాడు తున్నట్లు   ఆపుష్పాలు ఫలాలు  కనిపించటం వింత .ఈ వి౦త చెట్లు హిమాలయ పర్వతాలలో ఉన్నాయని అంటున్నారు .వీటిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసి ‘’హల్ చల్ ‘’సృష్టిస్తున్నారు  .నారీలత పుష్పాల క్రింద కూర్చుని మునులు తపస్సు చేస్తే తప్పక తపోభంగం కలుగుందని నమ్మేవారట.ఈ వృక్షాలు థాయ్ లాండ్ దేశం లో ఉన్నాయని చెబుతున్నారు .వీటిని వారు ‘’నారీ పోల్ ‘’అని పిలుస్తారట .పూర్వం  వీటిని యజ్ఞయాగాదులలో ఉపయోగించేవారట .బాంగ్ కాక్ కు 500కిలోమీటర్ల దూరం లో ఉన్న పెసాబుల్ లో నారీ పోల్ వృక్షాలున్నాయని కొందరు చెబుతున్నారు .ఈ పుష్పాలు రకరకాల స్త్రీ శరీరభంగిమలు కలిగి ఉన్నట్లు ఫోటోలు వస్తున్నడున ఇవి నిజంగా ఉన్నాయా లేక గ్రాఫిక్ మాయాజాలమా అనే సందేహం నెటిజన్ లకు వస్తోంది .వీకీపీడియాలో ఎక్కడా దీని జాడలేదని ,దీని రహస్యం బట్టబయలు చేస్తే యువతి రూపం లో ఉన్న ఈ అరుదైన ‘’రియల్ గ్రీన్ పండ్లు’’ అసలు విషయం తెలుస్తుందని సోషల్ మీడియా భావిస్తోంది . .

   బౌద్ధ పురాణాలు పవిత్రమైన ‘’ నారీ పోల్ పండ్లు’’  థాయ్ లాండ్ లో ఉన్నట్లు  పేర్కొన్నాయి .కొందరు ఈపండ్లు హిమపోన్ అడవులలో ఉండేవని చెబుతున్నారు  .ఆ పురాణం ప్రకారం ఇంద్రుడు ,భార్య జస్వంతర ,ఇద్దరు పిల్లలతోకలిసి హిమపోన్ అరణ్యాలలలో ఉండేవారు ,ఒక రోజు జశ్వంతర ఆహారం తేవటానికి అడవిలోకి వెళ్ళింది .ఆమెను చూసి అక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నమునులు వ్యామోహపడ్డారు.వీళ్ళ ధ్యాసను మరల్చటానికి ఇంద్ర ,అచ్చంగా తన భార్యను పోలి ఉండే ఫలాలనిచ్చే 12నారీ పోల్ వృక్షాలు సృష్టించాడు .మునుల వ్యామోహం జస్వంత మీదనుంచి ఈ పండ్లమీద పడి, ఆమెను మర్చేపోయి, ఈ పండ్లుతింటూ గడిపారట .అవితిన్న ఆమునులు నాలుగు నెలలపాటు నిద్రలోనే ఉండి పోయారట .మత్తు వదిలి నిద్ర లేచేసరికి మునులు తమకున్న  సర్వ శక్తులూ కోల్పోయారట .

   ఆతర్వాత ఇంద్ర అతనిభార్య జశ్వంతర మరణించాక ఆ  అడవి, ఆ నారీపోల్ వృక్షాలు కనిపించకుండా పోయాయట .ఇంతకాలానికి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయని అంటున్నారు .బ్యాంకాక్ దగ్గర సిందూరి బౌద్ధలాయ ఆవరణ లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయట .అసలా నారీ ఫల చెట్లు ఉన్నా లేకపోయినా ,అదొక కమ్మని మధుర అనుభూతి అనిపిస్తుంది .అందుకే ‘’చెట్లకు అమ్మాయి అందం కాస్తుంది ‘’అన్నారు కొందరు

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-18-ఉయ్యూరు ..

image.png

Posted in సేకరణలు | Tagged | Leave a comment

 గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984)

 గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984)

9-7-1910న శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు  ఓరుగంటి నరసింహ మహోదయ ,అప్పలనరసమ్మ దంపతులకు విజయనగరం లో జన్మించారు .విజయనగర సంస్కృత కళాశాల లో విద్యఅభ్యసించారు  .వీరి వ్యాకరణ గురుదేవులు –మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి,మహామహోపాధ్యాయ శ్రీ నౌడూరి వేంకట శాస్త్రి ,వ్యాకరణ శిరోమణి శ్రీ అప్పల జోగన్న శాస్త్రి గార్లు .ఓరుగంటి వారు న్యాయ ,మీమాంసా శాస్త్రాలను శ్రీ గంటి  సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .

  గుంటూరు హిందూకళాశాల పాఠశాలలో 1936నుండి తొమ్మిదేళ్ళు 1947వరకు పని చేశారు .గుంటూరు హిందూ కళాశాలలో పండితోపన్యాసకులుగా 1947నుండి 24ఏళ్ళు 1971వరకు ఉన్నారు .1972లో గుంటూరు కె.కె.సంస్కృత కళాశాల పండితులుగా ,ఆంద్ర విశ్వ విద్యాలయం పిజి సెంటర్ –గుంటూర్ యుజిసి గౌరవాచార్య పదివిలో సేవలందించారు .

  శాస్త్రిగారు సంస్కృతం లో –శ్రీ కళ్యాణానంద స్వామి వారి ‘’అక్షర దర్శనం ‘’అనే సంస్కృత సూత్ర గ్రంథానికి సంస్కృతం లో ‘’లోచన ‘’వ్యాఖ్యానం రచించారు .తెలుగులో బాలవ్యాకరణం ,కళ్యాణ లీల –అక్షర సమామ్నాయము ,లోచానవ్యాఖ్య ,శ్రీ విద్యారణ్యుల ‘’సూత సంహిత ‘’కు తెలుగు వ్యాఖ్యానం ,తిక్కయజ్వ హరిహరనాథ తత్త్వం రాశారు .వీరి రచనలు భారతి వంటి ప్రముఖ సాహిత్యపత్రికలలో ప్రచురితాలు .ఇవికాక శాస్త్రి గారి అముద్రిత గ్రంథాలు 60కి పైనే ఉన్నాయి .

     నీలకంఠ శాస్త్రిగారు శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతి శ్రీశ్రీ కళ్యాణానంద భారతీ స్వాములవారి వద్ద మంత్రదీక్ష తీసుకొని ప్రస్థానత్రయం లో సాధన చేశారు  ..వీరికి వ్యాకరణ విద్యాప్రవీణ ,,ఉభయ భాషా  ప్రవీణ ,వేదాంత పారీణ సార్ధక బిరుదులున్నాయి .శ్రీ విరూపాక్ష మఠానికి,శ్రీ  కళ్యాణాన౦దస్వామివారికి ఆంతరంగిక కార్య దర్శిగా మహోన్నత సేవలందించారు .శాస్త్రి గారు 74 వ ఏట 1984 ఫిబ్రవరి 14న పరమపదించి నీలకంఠ సన్నిధానం చేరుకొన్నారు.

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)

భార ద్వాజస  గోత్రీకులైన వెల్మకన్నెవారి మూలపురుషులు గోపాళంగారు మంత్రం శాస్త్ర పారంగతులు .వీరి దత్తపుత్రుడు రామయ్యగారు జ్యోతిష్ శాస్త్రవేత్త .వీరికుమారుడు తాతగారి పేరుతొ నటనా వైదుష్యంతో ‘’వేషాల గోపాల౦ ‘’గా పేరుపొందారు .వీరిపెద్ద కొడుకు గోపయ్య అని పిలువబడే   గోపాలం గారే శ్రీ హన్మాన్ శర్మగారి తండ్రిగారు .వీరికి 20ఏళ్ళవయసులో  మాడేపల్లికి చెందిన10 ఏళ్ళ వయసున్న  శ్రీ రామోజ్జల నరహరి గారి కుమార్తె  శ్రీమతి సత్యమ్మగారితో పెళ్లయింది .ఈ దంపతులకు లింబాద్రి శ్రీ నరసింహస్వామి అనుగ్రహం తో నరహరి .కొండగట్టు శ్రీ హనుమాన్ అనుగ్రహం తో మన హన్మాన్ శర్మగారు 8-8-1951 నజన్మించారు .వీరి సోదరి భూజాత.

  వేములవాడ లో జన్మించిన శర్మగారిది 8కిలోమీటర్లలో ఉన్న లింగం పల్లి .కుటుంబానికి దాదాపు 30ఎకరాల  పొలమున్నా సరైన సేద్యం లేక కుటుంబ పోషణ కష్టంగా ఉండేది . తండ్రిగారు వ్యవసాయం తోపాటు పౌరోహిత్యమూ చేసేవారు .మూలపురుషుడు లింగంపల్లి గోపాళం గారు శ్రీ వేణుగోపాలస్వామి శ్రీ రాజరాజేశ్వరదేవాలయంగా పిలువబడే శివపంచాయతనం ,శ్రీ జగన్నాథదేవాలయం శ్రీ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాలు నిర్మించిన పుణ్యమూర్తి .శర్మగారి తండ్రిగారు వీరి పదవఏటనే మరణించగా తల్లిగారు కుటుంబం ఆలనాపాలనా చూశారు .

     విద్యాభ్యాసం –వివాహం –ఉద్యోగం

శర్మగారి చదువు  లింగం పల్లిలోనే శ్రీ హన్మంతరావు గారివద్ద అక్షరాలూ నేర్చి ,5వ తరగతి వరకు మాడెపెల్లిలో అమ్మమ్మ, చిన్నమ్మల వద్ద సాగింది .1960లో సిర్సిల్లలో 6 ,7 తరగతులు  చదివి ఉత్తీర్ణులై,1992లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల లో చేరి ,బాగా చదవటం వలన డబుల్ ప్రమోషన్ పొంది, 8 చదివి 1965-66కు ఎంట్రన్స్ పరీక్షరాశారు .ప్రాచార్యులైన శ్రీమాన్ కోవెల్ కందాలై శఠగోప రామానుజా చార్యులు,  దిగ్గజాలవంటి శ్రీ వంగీపురం రామానుజా చార్యులు ,  శ్రీమాన్ మరిగంటి రంగాచార్యులు ,శ్రీమాన్ సముద్రాల శ్రీనివాసాచార్యులు ,శ్రీ అమరవాది కృష్ణమాచార్యులు ,శ్రీమాన్ శేషాచార్యులు ,శ్రీ అణ్ణ౦గ రాచార్యులు,బ్రహ్మశ్రీ ఖండవెల్లి నరసింహ శాస్త్రి ,శ్రీ వర్ ఖేట్ కర్కృష్ణమాచార్యులు మొదలైన పండిత ప్రకా౦డులవద్ద విద్యనేర్వటం  తన అదృష్టం అన్నారు శర్మగారు  హైదరాబాద్ సీతారా౦ బాగ్ లోని వివేక వర్దినీ సంస్కృత కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు . .శ్రీ మల్యాల తిగుళ్ళ  గంగయ్య ,శ్రీమతి  సుశీలమ్మగార్లకుమార్తే శ్రీమతి భవానిగారితో శర్మగారికి 11-12-1967నవివాహం జరిగింది .దురదృస్టవశాత్తు డి.వో.ఎల్ .రెండో సంవత్సరంలో  శర్మగారి  భార్య 8 నెలలకే మరణించగా  విద్యాభంగమౌతుందని తెలియజేయనందుకు కుమిలిపోయారు .

  1969లో డి .వో. ఎల్. పూర్తి చేసి ,బివోఎల్ లో చేరి ,కాలేజి మాసాబ్ టాంక్ కు మారగా విద్యార్ధి నాయకులై అందరినీ కలుపుకు పోతూ 1972లో పూర్తి చేశారు.వెంటనే  శ్రీకాకుళం జిల్లాపరిషత్ పాతశాలలో సంస్కృత పండితులుగా ఉద్యోగం వచ్చినా దూరాభారమని తల్లి పంపటానికి అంగీకరించలేదు .వదినగారి తమ్ముడు శ్రీహరి  శర్మతో బాంధవ్యమేకాక ,నేస్తం కూడా ఉండటం తో ,ఆయన ప్రోత్సాహంతో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్కృత కళాశాలలో లెక్చరర్ పోస్ట్ పొంది, 1973లో చేరి ఒంటరి జీవితం గడుపుతూ ,ధూళికట్ట వాస్తవ్యులు శ్రీ మల్లోజ్జల దామోదరశర్మ గారి జ్యేష్ట పుత్రిక శ్రీమతి లక్ష్మీ కుమారిగారిని  ద్వితీయ౦ వివాహం  చేసుకున్నారు . వీరికి శ్రీమతి గీర్వాణి ,శ్రీమతి శర్వాణి కుమార్తెలు .వీరి వివాహాలు చేసి మనవళ్ళు మనవ రాళ్ళతో సుఖజీవనం గడిపారు .  జీతాలు సరిగా ఇవ్వని యాజమాన్యం లో ఉండలేక లెక్చరర్లు వెళ్ళిపోగా శర్మగారే ఇన్ చార్జి ప్రిన్సిపాల్ గా ఒక ఏడాది పనిచేయాల్సి వచ్చింది .

  అనేక వొడి దుడుకులను ఎదుర్కొని కాలేజి 1981లో స్వంతభవన౦ఏర్పడి ,  యూనివర్సిటీ పరీక్షాకేంద్రం కూడా వచ్చి , డా.సంగనభట్ల నరసయ్య గారు ప్రిన్సిపాల్ అయ్యారు .1987లో శర్మగారు ‘’రాజ శేఖరుని కృతులు ‘’పై పరిశోధన చేసి ఉస్మానియా యూని వర్సిటి నుండి పిహెచ్ డి పూర్తిచేసి డాక్టరేట్ పొంది రీడర్ రికగ్నిషన్ సాధించారు .ఈ కళాశాలలో శర్మగారు 37సంవత్సరాల 7నెలలు విద్యా సేవ అందించారు .విద్యాబోధనచేస్తూనే తెలుగులో బివోఎల్ ,ఏం వో ఎల్ ,సంస్కృతం లో ఏం ఏ సంస్కృతం లో పిహెచ్ డి ,తెలుగులో ఎం .ఏ సాధించారు .వారి దీక్ష తపనకు  విద్యా తృష్ణ శ్లాఘనీయం .

  17-1-1971న లెక్చరర్ గా చేరి ,20-1-1987నుండి రీడర్ గా ,16-10-1974నుండి 26-7-1982వరకు  ప్రిన్సిపాల్ గా పని చేశారు .

 –పూనే ,లక్నో వరంగల్ విశ్వవిద్యాలయాలలో  రిఫ్రేషర్ కోర్సులు చేశారు

                   రచనా హనూమంతం

శ్రీ హన్మాన్ శర్మగారు హైదారాబాద్ రేడియో కేంద్రం నుండి అమరవాణి కార్యక్రమలో పలుసార్లు సంస్కృతం, తెలుగులలో ప్రసంగించారు  .వీటిలో ‘’సందేశకావ్యాని ,మమ్మటోక్తకావ్యభేదా,భారకవేః నయన కోవిదత్వం ,జగన్నాథ పండిత రాయస్య చాటూక్తయః,ప్రాచీన కావ్యాలలో భౌగోళిక జ్ఞానం ,ముద్రారాక్షసం లో రాజనీతి మొదలైనవి ఉన్నాయి .

  శర్మగారి వ్యాసాలలో –దత్తాత్రేయ దేవాలయం –ధర్మపురి ,అభిజ్ఞాన శాకున్తలే కణ్వ మహర్షేః లోకజ్ఞతా ,పుష్కర మాహాత్మ్యం ,ముద్రారాక్షసే రాక్షసస్య రాజనీతిః,గోదావరీ పుష్కర మాహాత్మ్యం మొదలైనవి ఉన్నాయి

సంస్కృత రచనలు – శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారు రచించిన ‘’శ్రీగణ పురా౦జనేయ స్తుతి ‘’కి సంస్కృత వ్యాఖ్యానం రాశారు . శ్రీ లింగంపల్లి వేణుగోపాల సుప్రభాతం-మంగళాశాసన,స్తోత్ర ప్రపత్తి తోసహా రాశారు .

తెలుగు రచనలు -స్కంద పురాణాంతర్గతమైన ‘’సింహస్థ మహాత్మ్యం ‘’ను తెలుగులోకి అనువదించి 2003గోదావరీ పుష్కరాలలో ప్రచురించారు .ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి ఆధ్వర్యం లో ,సహ  సంస్కృతోపన్యాసకులు ప్రిన్సిపాల్  శ్రీ కోరిడే విశ్వనాధ శర్మగారితో కలిసి ‘’లింగపురాణం ‘’ఆంధ్రీకరించారు..శ్రీ మదానంద సరస్వతీ పీఠాధిపతులు సంకల్పించి ప్రోత్సహించిన శ్రీమద్భాగవత౦  శ్రీధరీయ వ్యాఖ్యతోసహా  7స్కంధాలకు  తెలుగు అనువాదం చేసిన అమృత మూర్తి శర్మగారు .మంత్ర పుర(మంథెన )వాస్తవ్యులు  శ్రీ గట్టు నారాయణ గురూజీ ఆదేశంతో ‘’గౌతమీ మాహాత్మ్యం ‘’ను శ్రీ కోరిడే విశ్వనాధ శార్మగారితోకలిసి ఆంధ్రీకరించారు . లింగంపల్లి గోపాళం చరిత్ర .

   హన్మాన్ శర్మగారి శేముషి

ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు –‘’వైదిక ధర్మ ప్రవణః  శర్మన్ –పూతో సి కర్మణాపిత్వం –లింగ౦పల్ల్యభిజన  రాడ్రాజేశ్వర రక్షి తోసి సకుటుంబః’’

‘’విద్యా ధీత్యా  బోధై రాచరణై  రన్వహం ప్రచారై శ్చ-కాలం కిలానయ స్త్వం భవ హైందవ ధర్మ రక్షణో ద్యుక్తః’’

డా.శ్రీ కోరిడే రాజన్న శాస్త్రిగారు –

‘’జయతాద్ హనుమాన్ శర్మా –ఖ్యాతో భాషాద్వయ పండితాగ్రవినుత్యః-వేదాంతే ఔపనిషదే-పురాణ నియ యేషుసూక్ష్మ దర్శీచ ‘’

ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ ,మల్లినాథ సూరిపై అద్భుత పరిశోధన చేసిన శ్రీ ప్రమోద్ గణేష్ లాల్యే –

‘’హనుమాన్ శర్మ మహోదయో నివృత్తి మాసాదయితీతి జ్ఞాత్వా ఆనందోలితం మమ చేతః  హర్ష ణో ది౦చ ,ఏనచ కృత్స్నో జీవితే ఘ్రు త వ్రతో  దీక్షిత ఇవ స స్వకార్యం నిర్యూదయాన్-‘’

శ్రీ శివనూరి విశ్వనాథ శర్మ –

‘’నిర్మధ్య రాజషేఖరకవి కావ్యాని స్వబుద్ధి మంధ దండేన-శ్రీమాన్  శ ర్మాగాత్  తద్వైషిస్టాఖ్య మమృత మపి సుదీభ్యః ‘’-హనూమాన్ బుధ చంద్రః భాతి విశిస్టో దివా నిశం భాతి-రుజు రకలంకో యస్మాత్ గురుమిత్ర హితో గుణాకరః శివాంఘ్రి మూలస్ధః’’

శ్రీ దోర్బల ప్రభాకర శర్మ –

‘’ఆబాల్యం హరిభక్తి రణ్య విషయా నాసక్తి రాధ్యాత్మిక –శ్రేరక్తిః స్థిరబుద్ధి రుత్తమజనాసంగఃసతాం గతిః ‘’

శ్రీ కోరిడేరామయ్య –‘’బహుముఖ ప్రజ్ఞాశీలి ,సాదుగుణ శీలి శర్మగారు ‘’

డా.సంగనభట్ల నరసయ్య –‘’సంస్కృత కావ్య నాటకాలు కరతలామలకం గా విద్యార్ధులకు బోధించిన అనుభవశాలి

డా.పి.టి.జి.వి .రంగాచార్యులు –

‘’శ్లిస్టాక్రియా  కస్య చిదాత్మ సంస్థా సంక్రాంతి రన్యస్యవిశేషయుక్తా –యస్యోయభయం చారు ,స శిక్షకాణా౦ ధురి ప్రతిస్టాపయితవ్య ఏవ’’అంటే విశేషజ్ఞానం ఉన్నా కొందరు చెప్పలేరు,కొందరు  తమకు తెలిసింది కొంచెమైనా బాగా చెప్పగలరు .విశేష పాండిత్యం ఉండి,ఇతరులకు బాగా చెప్పగలవారు అధ్యాపక వరేణ్యులు .అలాంటి విశిష్ట వ్యక్తి శర్మగారు

శ్రీ కోరిడే విశ్వనాథ శర్మ –

‘’గీర్వాణా౦ధ్ర సువాజ్మయాది నిపుణో,యో నంత విద్యానిధిః-‘’శర్వాణీ ‘’పతిపాదభక్తి రమణో వాగర్చిత శ్రీధరః –శ్రీ లక్ష్మీ నరసింహదత్త విభవో,జ్యోతిర్విదాం యోవరః-సోయం పండిత వేల్మకన్ని హనుమచ్చర్మా సదామోదతాత్ –సకల జనభిరామ ,బహు సద్గుణ శీల వికసిత హృత్సరోజ,వరపండిత మండిత సత్య భూషణా-సహజ దయార్ద్ర చిత్త శుభ వాజ్మయ సేవిత వేణుమాధవ –నుతబుధ ఛాత్ర తేహి విజయార్ధమాహం  శశిభూషణం భజే ‘’

 వంటి ప్రశంసలననెన్నిటినో శర్మగారు పొంది ధన్యులయ్యారు  .

 తమ ప్రతిభా పా౦డిత్యాలకు అర్హమైన బిరుదులూ ,పురస్కారాలు పొందారు .బోర్డ్ ఆఫ్ స్టడీస్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఓరియెంటల్ లెర్నింగ్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ ఫర్పిజి అండ్ యుజి కోర్సెస్ లో మెంబర్ .కాకతీయ యూనివర్సిటి ఫాకల్తి ఆఫ్ ఆర్ట్స్ లో సభ్యులు

  శర్మగారి గీర్వాణ వాణీవైభవం

1-శర్మగారి మాతా పితృ వందన౦ –

2-శర్మగారు తమ వెల్మకన్నె వంశచరిత్రను సంస్కృతం లో 61శ్లోకాలో రచించి వంశ ప్రతిష్టకు కీర్తి చంద్రికలల్లారు .

1-గణాధిపం నమస్కృత్య విఘ్నధ్వాంత వినాశకం-వక్షతే వంశ వృక్షోయం వెల్మకన్నేకులస్యవై అని ప్రారంభించి

61-గోపాలః కరుణాకరో మమ పితాపూజ్య స్త్వమాయాపరః-కౌటిల్యస్య నిరాలయో హితకరోహ్యాబాల వృద్ధస్యచ –మన్మాతా హిత కాంక్షిణీ,శుభకరీ లోకస్య రక్షాప్రదా-నౌమ్యేతౌ హనుమాన్ హం మమప్రియౌ ధన్యోస్మి తత్పుత్రకః ‘’

అని ఇలవేల్పు శ్రీ వేనుగోపాలస్వామికి కృతజ్ఞాతాపూర్వక నమస్సు లందజేశారు .

3-శ్రీ లింగంపల్లి వేణుగోపాల సుప్రభాతం

1-ఉత్తిష్ట వేణు గోపాల లింగంపల్లి మహాప్రభో –ఉత్తిష్ట రుక్మిణీకాంత ఉత్తిష్ట జగతాం పతే ‘’

5-భక్తార్తి నాశనపటోర్భవ ముక్తి హేతో –అభ్యాగాతా స్సురపతే స్తవ దర్శనార్ధం –బ్రహ్మేంద్ర రుద్ర మరుత స్సుర సిద్ధ స౦ఘైః-గోపాలకృష్ణ భాగావంస్తవ సుప్రభాతం ‘

21-బాలాశ్చర౦తి సుభగా బహు కేళి లగ్నా –శ్చానంద పూర్ణ మనసస్తవ మందిరా గ్రే-పారావతాశ్చ సతతం తవ గోపురాగ్రే –

31-అజ్ఞానినం ప్రబల  మోహవశం త్వదీయం –భక్తం భవాబ్ధి పతితం హనుమంత మేనం –ఆదృత్య పాహి కరుణాకర లోకపూజ్యే –గోపాలకృష్ణ భాగవం స్తవ సుప్రభాతం .

స్తోత్రం –మధురాదిపమాధవ ధీరమతే –కమలాయత లోచన గోపపతే –నిఖిలాగమ కీర్తిత విశ్వపతే –విజయీభవ గోపా కిశోర విభో ‘’

మయాబహూనిపాపాని- జ్ఞానాజ్ఞాన కృతానిచ –కృపమా వేణుగోపాల –క్షమస్వ కరుణామయ ‘’ప్రపత్తి -1-శ్రీక్రిష్ణామల పాదపద్మ యుగళీ భ్రు౦గీభవ న్మానసాం-శ్రీదేవీం కమలాలయాంభగవతీం క్షీరాబ్ధి పుత్రీం రమా౦ –విష్ణోర్భక్తి సుపూత నిర్మలమతిం భక్తార్తి విధ్వంసినీం –వందేహం హరిహృన్నివాస రసికాం శక్తి స్వరూపాం శ్రియం

16-భక్తి ప్రయోసి వరదోసి ,జగచ్చరణ్యః-బ్రహ్మాసి , విష్ణురసి శంభురసి త్వమేవ –ఏవం స్తువంతి విదుషో య మనంత రూపం –తద్బాల కృష్ణ చరణం చరణౌ శరణం ప్రపద్యే .

మంగళాశాసనం -1- మంగళం వాసుదేవాయ గోకులానంద కారిణే-మంగళం బాలకృష్ణాయ లక్ష్మీనాథాయ మంగళం

14-శ్రీకరాయ సురేశాయ బాలవీరాయ మంగళం –గోపాలాయ రమేశాయ శ్రీకృష్ణాయాస్తు మంగళం

15-సుప్రభాత మిదం దివ్యం –నిత్యం యః పఠతే నరః –తస్య నశ్యంతి పాపాని –కృష్ణ సాయుజ్య మిష్యతే’’

  శర్మగారిని నిండు మనసుతోఆశీర్వది౦చిననవారిలో శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ ఎస్ .సుదర్శన శర్మ ,శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాదిపతులు శ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ,ధర్మపురి  శ్రీపీఠం పీఠాదిపతులు శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి మొదలైన ఆధ్యాత్మిక మహోదయులున్నారు .

 గీర్వాణ వాణీ పద సమార్చనలో జన్మ ధన్యం చేసుకొన్న ,వారి కుమార్తె శ్రీమతి దోర్బల గీర్వాణి గారు చెప్పినట్లు ‘’కొండంత విషయాన్ని గోరంతగా కూడా చెప్పుకోని మహోన్నత వ్యక్తిత్వ మూర్తి ‘’డా. శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మగారు 62 ఏళ్ళ వయసులో   3-6-2012న   నిత్యం తాము ఆరాధించే శివ సాన్నిధ్యం చేరారు .ఆధారం –నేను హన్మాన్ శర్మగారి విద్వత్తును గూర్చిన వివరాలు తెలియజేయమని కోరిందే తడవుగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీ కోరిడే విశ్వనాథ శర్మగారు ,హన్మాన్ శర్మగారి కుమార్తె శ్రీమతి దోర్బల గీర్వాణి గారికి తెలియ జేయటం, ఆమె నాకుఫోన్ చేసి మాట్లాడి,వెంటనే మెయిల్ లో పంపిన  శ్రీ కోరిడే విశ్వనాథ శర్మగారి సంపాదకత్వం లో వెలువరించిన  తమ తండ్రిగారు  శ్రీ వెల్మకన్నెహన్మాన్ శర్మ గారి ‘’పదవీ విరమణ అభినందన ‘’సంచిక.

  సశేషం

  -గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-18-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు

శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో అధ్యాపకులుగా ప్రవేశించారు .ప్రముఖ చారిత్రిక నవలా రచయిత,ప్రసిద్ధ చిత్రకారుడు ,జర్నలిస్ట్ అయిన ‘’శ్రీ అడవి బాపి రాజు-నవలా సాహిత్యం ‘పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.అందుకొన్నారు.ఆచార్య పదవి చేబట్టాక ఎన్నో గురుతరబాధ్యతలు స్వీకరించి ,విద్యార్ధులను తీర్చి దిద్ది, వారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు మార్గ నిర్దేశం చేసిన మనీషి .ఏక సంథాగ్రాహి ఆయన మన్నవ  ,తన పుట్టు అంధత్వాన్ని జయించి ,విద్యార్ధుల, సాహితీ ,సంగీత మూర్తుల హృదయాలలో చోటు సంపాదించారు .ప్రతి పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదివి౦చుకొని ,అందులోని విషయాన్ని కరతలామలకం చేసుకొనే అద్భుత నేర్పున్నవారు .వారి నిశిత పరిశీలన కు అందరూ ఆశ్చర్యపోయే వారు .సంపాదించిన జ్ఞానాన్ని,విజ్ఞానాన్నీ  మస్తిష్కం లో నిక్షిప్తం చేసుకొన్న’’ విజ్ఞానఖని ‘’మన్నవ మాస్టారు .తమ ప్రజ్ఞా సంపన్నతతో 19 ఎం ఫిల్ డిగ్రీలు ,10 పి.హెచ్ .డి డిగ్రీలు పొందేట్లుగా విద్యార్ధులకు శిక్షణ నిచ్చిన వారి తీరు మరువ రానిది.

నిరంతర విద్యార్దియైన మన్నవ వారు అనుక్షణం నేర్చుకొంటూనే ఉంటారు .వారిది అనుభావాలప్రోది ..వారి సహవాసం తో వారి’’ పరిపూర్ణత్వాన్ని’’ అనుభవించగలం .ఏ వ్యక్తితోనైనా పది నిమిషాలు మాట్లాడితే చాలు  ఆమనిషి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అంచనా వేయగల గొప్ప నేర్పున్న ‘’మానసిక శాస్త్ర వేత్త’’ .జీవితం లో ఎన్నో కస్టాలు అనుభవించారు .ఆ కస్టాలను పంచుకొనే మిత్రసమూహమూ వారికి ఎక్కువే .ముక్కుసూటిగా మాట్లాడే నైజం .నరనరానా నిర్భీతి ఉన్నవారు .మన్నవ వారి అంత స్సౌ౦దర్యానికి ఎవ్వరైనా’’ ఫిదా ‘’కావలసిందే .

బాల్యం నుండి సంగీతంపై మక్కువున్నా ,నేర్చుకోవటానికి ప్రయత్నించినా ,ఆటంకాలేర్పడి కొనసాగించలేక పోయారు  వారి సంగీత జిజ్ఞాసకు జేజేలు పలికారు అందరూ .రేడియో, సిడిలు వింటూ .సంగీతజ్ఞానం పెంచుకున్న’’ ఏక లవ్య శిష్యు’’లాయన .ముఖ్యంగా ఘంటసాలమాస్టారు అంటే  ఆయన గానమంటే ,సంగీత దర్శకత్వమంటే ఈ మాస్టారు గారికి వల్లమాలిన అభిమానం  ఆరాధనా . .మన్నవ వారికి సాహిత్యం ద్వారా కొందరు, సంగీతం ద్వారా కొందరు చేరువయ్యారు .సరస్వతి రెండు కళ్ళు సాహిత్య సంగీతాలైతే ,కళ్ళు లేని మా స్టారు గారికి ఆ రెండు అంతర్నేత్రాలయ్యాయి.’’ఆచర్యాత్ పాదమాదత్తే,పాదం శిష్యస్య మేధయా –పాదం సబ్రహ్మ చారిభ్యః ,పాదం కాలక్రమేణ చ ఇతి ‘’అంటే ఆచార్యులు సావయస్కులు ,శిష్యబృందం ,కాలం లనుండి జ్ఞానాన్ని నేర్చుకొంటారు అన్నది వేదం అలాంటి జ్ఞానమంతా మన్నవవారి సహవాసం తో అనాయాసంగా లభిస్తుంది అని వారి అంతేవాసుల ప్రగాఢ విశ్వాసం .  ఆచార్య మన్నవ  గారు 27-1-2014న పదవీ  విరమణ చేశారు .

ప్రముఖ సాహిత్య ,సంగీత సభలకు మన్నవ వారు విచ్చేసి ఆసా౦త౦ ఉండటం వారి ప్రత్యేకత . వారి ప్రసంగాలు  అందర్నీ ఆకట్టు కొంటాయి .అంతర్జాలం లో తెలుగు గురించి వారు చేసిన ప్రసంగం తననెంతో ఆకట్టుకోన్నదని మన శాశన సభ ఉపసభాపతి మాన్యులు శ్రీ మాండలి బుద్ధ ప్రసాద్  చెప్పారు .పునశ్చరణ తరగతులను  ,జాతీయ సదస్సులను  మన్నవ వారు కడు సమర్ధంగా నిర్వహించారని వైస్ చాన్సలర్ శ్రీ వియ్యన్నా రావు మెచ్చుకొన్నారు .ఉత్తమభావాలు ,ఉన్నత ఆదర్శం ఉదాత్త ఆశయాలు అంకితభావం మన్నవ వారి సొత్తు .వీరి సంగీత పరిజ్ఞానాన్ని గుర్తించి విజయవాడ రేడియో కేంద్రం వారిని ‘’ఆడిషన్ కమిటీ సభ్యుని చేసి గౌరవి౦చిదని స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అన్నారు .’’నా రచనలన్నిటిమీదా పరిశోధన జరిపిన ఘనత మన్నవ వారిదే ‘’అన్నారు శ్రీ గొల్లపూడి మారుతీ రావు.రేడియో ప్రయోక్తలపై కార్యక్రమాలపై విద్యార్ధులకు మార్గ నిర్దేశం చేసినందుకు తమకెంతో ఆత్మీయులయ్యారని మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి ము౦జులూరి కృష్ణకుమారి అన్నారు .’’నన్ను గౌరవంగా ఆహ్వానించి  సకల మర్యాదలు చేసి ,నాతో  శ్రీ శ్రీ పై సమగ్రంగా మాట్లాడించి, వైస్ చాన్సలర్ సమక్షం లో సన్మానించిన ‘’జ్ఞానేత్రుడు’’ మన్నవ గారు ‘’అని మురిసిపోయారు స్వర్గీయ  శ్రీ అద్దేపల్లి రామమోహనరావు.డా సంజీవ దేవ్ ‘’మన్నవవారి మాటలు మనో వైజ్ఞానిక సత్యాలతో నిండి ఉంటాయి .ధోరణి స్వతంత్ర మౌలిక దృక్పధం కలిగి ఉంటుంది .చక్షువులు చూడరాని లోతుల్ని వీరి మానస చక్షువులు దర్శిస్తాయి .స్పటిక స్వచ్చ సత్యాన్ని అందుకొంటారు సత్యనారాయణగారు ‘’అని కీర్తించారు .’’బాపిరాజుగారు నాతొ చెప్పిన ఎన్నో అంశాలు మన్నవ ఆయా పాత్రల గూర్చి వెలిబుచ్చిన తీర్పుతో సరి పోల్చుకొంటే ఈ అంధ గ్రంథకర్తఅంతటి సత్యానికి ఇంత దగ్గరగా ఎలా చేరుకొన్నాడు అనే  ఆశ్చర్యానందాలు కలిగాయి ‘’అచ్చపు బుద్ధికి లేవు  అగమ్య ముల్’’ అనే  పింగళిసూరన చెప్పినమాట జ్ఞాపకమొస్తుంది .వీరి పరిశోధన ఆధునిక ఆంద్ర వాజ్మయం అధ్యయనం చేసేవారికి దీపస్తంభం గా ఉపకరిస్తుంది ‘’అని హృదయపు లోతులనుంచి శ్లాఘించారు శ్రీ నండూరి రామ కృష్ణాచార్య వర్యులు .శ్రీ మధునాపంతుల సత్యనారాయణ ‘’బాపిరాజుగారి సారస్వత జీవితానికి ,నవలా రచనకు మన్నవ వారి పరిశోధన మనో ముద్రితమైన మన్నన ‘’అని కితాబిచ్చారు .కరుణశ్రీ ‘’జిజ్ఞాసువు , ప్రజ్ఞాచక్షువు ,విజ్ఞాననిధీ , వివేకశాలీ ,వినయశీలి .సమీర కుమారునిలా ఆటంకాలను అధిగమించిన ‘’చిరంజీవి’ .ఆయన రచన రమణీయం ,కథనం కమనీయం ,శైలి స్తవనీయం ,భావ ప్రకటన ప్రశంసనీయం ‘’అని మందారమకరంద మాధుర్య పదాలతో నిండుమనసుతో దీవించారు .ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ‘’కళ్ళున్న పరిశోధకులకన్నా ,కళ్ళులేని ఈ ‘’మన్నవ’’ మిన్న .అందుకే అతడు మా మన్నవ ‘’అని ఆశీస్సులిచ్చారు .

’’నవతామూర్తి ,నిరంతరాధ్యయన సందానైక  చిత్తుండు,మా-నవతా మూర్తి  ,సమస్త శిష్య దిషణా నవ్యాబ్జ భానుండు మ-న్నవ తారా పథ పూర్ణ చంద్రుడు ‘’అని మురిసిపోయారు డా .పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ . శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ‘’సంగీత సాహిత్య సాంగత్యమున కొక సమరస మానస సరసి బెనిచి –వివిధ కళాక్లిస్ట విషాద కీర్తి యడవి బాపిరాజున కర్ఘ్యపాద్యమిచ్చారని ‘’ సంతసించారు .డా .రామడుగు వేంకటేశ్వరశర్మగారు’’సాహిత్య వాగ్ధారణ న్సాహిత్య బోధనన్ –సమయపాలన తోడ జరుపు గురుడు ‘’అంటూ గురువందనం చేశారు .తెలుగు విభాగానికి ఆచార్యుడు అనే గర్వం లేని హుందాతనం మన్నవ గారి ప్రత్యేకత అన్నారు అన్నమాచార్యప్రాజేక్ట్ విశ్రాంత ప్రదానగాయకుడు శ్రీ జి.నాగేశ్వరరావు నాయుడు .అరవిందులు చెప్పిన ‘’యూనివర్సల్ మైండ్ ‘’మన్నవ గారిదన్నారు శ్రీ పింగళి వెంకట కృష్ణారావు . ‘’మన్నవ వారికి మా వారు స్వర్గీయ మల్లాది సూరిబాబు గారి స్మారక పురస్కారం అందజేసినందుకు నాకెంతో సంతృప్తినిచ్చింది ‘’అన్నారు శ్రీమతి మల్లాది రుక్మిణీ సూరిబాబు .’’పలు పరిశోధనలకు స్వీకృతి పలికిన వాక్ ఝరి.మాటల్లో తియ్యదనం చేతల్లో చల్లదనం వారి స్వంతం ‘’ఆన్నారు డా పుట్టపర్తి నాగపద్మిని .’’నిశ్శబ్దం లోనూ మనసు ను హాయిగా ట్యూన్ చేసుకొని సంగీతం వినగల సమర్ధుడు ‘’అన్నారు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి .’’వినికిడితో గ్రహించి పరీక్షలలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం వారి ప్రజ్ఞ’’అన్నారు శ్రీ రావి కొండలరావు .’’ ‘’అంతర్నేత్రుడు’’, అంధుడైనా  అఖండుడు’’ మన్నవ ‘’అంటారు శ్రీ బులుసు కామేశ్వరరావు .’’చిలకమర్తిలాగా మన్నవ కూడా అమోఘ విజయాలు సాధించారు ‘’అన్నారు శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి .’’అ౦దరూ తక్కువగా చూసే ‘’ ఈల ప్రక్రియ’’కు నేను ప్రాణం పోస్తే ,మీరు భాష కు ప్రాణం పోసి చిత్తశుద్ధితో సంకల్ప సిద్దితో ఉన్నత స్థానం  సాధించారు .మాలాంటి సంగీత కళాకారులకు మీరు మార్గ దర్శి ‘’అన్నారుర శ్రీ కొమరవోలు శివ ప్రసాద్  పులకించిన డెందం తో.మన్నవవారు నాతో ‘’శివప్రసాద్ గారు మంచి ఆత్మీయులు ‘’అన్నారు .’’జ్ఞానా౦జన శలాక ‘’అని శ్రీ గణేష్ ,’’షావుకారు సినిమాలో ‘’మీ అందరికీ వెలుతురూ చీకటి –నాకు మాత్రం అంతా వెలుతురే ‘’అనేపాత్ర లాగా .నాకున్న అతికొద్ది మంది సాహితీ మిత్రులలో మన్నవ ఒకరు ‘’అన్నారు స్వర్గీయ పెద్దిభొట్ల సుబ్బరామయ్య .’’నేను పద్యం చదివే పోకడనచ్చి,నా నాటకపద్యాలన్నీ రికార్డ్ చేయించి ఇచ్చేదాకా ఊపిరి సలపని’’ సంగీత పిపాసి ‘’అన్నారు శ్రీ పొన్నాల రామ సుబ్బారెడ్డి .’’రసాస్వాది ‘’అని సామ వేదం వెంకట మురళీకృష్ణ ,’’మానవతావాది’’అని శ్రీ కోడూరుపాటి శ్రీ పాండురంగారావు ,’’మాది శబ్దమైత్రి ‘’అని ఆకాశవాణి జయప్రకాష్ ,’’సాహితీ కృషీవలుడు’’ అని శ్రీ చల్లా సాంబి రెడ్డి ,’’బ్రెయిలీ పుస్తకాలు కూడా అందుబాటు లేని రోజుల్లో మానసికంగా ,శారీరకంగా శ్రమించి ,పట్టుదలతో సాధించిన దీక్ష వీరిది .గొప్ప’’కళా తృష్ణ ‘’ఉన్న వ్యక్తి ‘’అన్నారు సత్యవాడ సోదరీమణులు .’’ఉషశ్రీ ప్రవచనాలకు ఆకర్షితులై ప్రేరణ పొంది ,పరిచయం పొంది ఎక్కడ ఆకార్యక్రమమున్నాహాజరై ,ఆయన్ను సభకుపరిచయం చేసే బాధ్యత తీసుకొనేవారు ‘’అన్నారు డా ఇరపనేని మాధవి .’’మానవేతిహాసం లో అన్ని శక్తులకన్న అక్షర శక్తిమిన్న ‘’అన్న’’ ఎరుక’’ మన్నవను ఉన్నత స్థితికి చేర్చింది ‘’అంటారు ఆచార్య కే సత్యనారాయణ .ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ వికలాంగ ఉద్యోగవిద్యార్ది సమాఖ్యకు అధ్యక్షులుగా, రాష్ట్ర వ్యాప్త వికలాంగుల సమావేశాలు విజయవంతంగా నిర్వహించినఘనత వారిది గుండెనిబ్బరం ఆత్మ స్థైర్యం గొప్ప సుగుణాలు ఆచార్య మన్నవ వారికి  ‘’అని మెచ్చారు డా నారి శెట్టి వెంకట కృష్ణారావు .

‘’వరగంగార్భటివాక్ప్రవాహము లతో వర్ధిల్లి –సూక్ష్మమ్ములౌ –పరమాశ్చర్యపు శోధనమ్ములకు నీ వత్యంత దక్షు౦ డవై –గురు నిర్దేశక బాధ్యతల్నేర్పిన గుర్వగ్ర ‘’అన్నారు డా గుమ్మా సాంబశివరావు .’’Blindness is not an issue to me ,only pursuit of literature mattaers ‘’అన్నది మన్నవ వారి దృక్పధ౦-‘’అంధ జగత్సహోదరుల ఆదర్శపురుషుడు’’ అన్నారు శ్రీ నూతక్కి వెంకటప్పయ్య .’’మన్నన –మన్నవ శీలం ‘’అని  శ్రీఆముదాల మురళి అంటే ‘’మా మెగా మాస్టారు ‘’అని  డా గొరిపర్తి నాగరాజు,’,’మన్నవ మహాతపస్వి’’అని శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ ,’’జ్ఞానదీప౦  ఆచార్యమన్నవ’’అని శ్రీమతి వాడవల్లి విజయ లక్ష్మి మొదలైనవారు మన్నవ మాస్టారు గారిపై ప్రశంసల పూల జల్లు కురిపించి తమ ఆత్మీయతను స్నేహాన్ని ,గురుభక్తిని ప్రకటించారు .ఇందరి మన్ననలు అందుకున్న మన్నవ మాస్టారు ధన్యులలో  ధన్యతములు .

మన్నవ వారిని సత్కరించినవారిలో శ్రీ వేటూరి సుందరామ మూర్తి ,చైతన్య విద్యానికేతన్ ,నటుడు చంద్రమోహన్,గుంటూరు లయన్స్ క్లబ్ , సినీనటుడు బాలయ్య ,నటుడు రంగనాద్ ,మంత్రి గీతారెడ్డి ,భీమవరం లో జరిగిన అఖిలభారత చిత్ర  కళోత్సవ సంఘం , తాడేపల్లి  గూడెం సాహిత్య సంస్థ ,భీమవరం లోజరిగిన బాపిరాజుశత జయంతి సంఘం ,కర్నూలుజిలల్లా తెలుగు రచయితల సంఘం ,అడవి బాపిరాజు లలితకళా పరిషత్ ,చిరంజీవి జన్మ దినోత్సవ సంఘం ,తెనాలి విజ్ఞాన వేదిక ,మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి ,మంత్రి మాణిక్య వరప్రసాద్ ,పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,గణితాచార్యులు భావనారి సత్యనారాయణ ,ఉయ్యూరు సరసభారతి మొదలైనవారున్నారు  .

అనేక అవధానాలలో మన్నవ వారు పృచ్చకులుగా రాణించారు .  ఎప్పుడు ఫోన్ చేసినా ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు మన్నవ గారు .’’ఏమైనారాశారా ? ఏమైనా పుస్తకాలు వేశారా?సరసభారతి అంటే నాకు మహా ఇష్టం .మీ గీర్వాణకవుల కవితా గీర్వాణం మీ రచనలో హై లైట్ ‘’అని నిండు హృదయంతో మెచ్చుకొనే సంస్కారవంతులు ,సహృదయులు ,సాహితీ సుసంపన్నులు.ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు .

ఈ తరానికి ,నేటి యువతకు ,ముఖ్యంగా దివ్యా౦గులకు ఆచార్య మన్నవ సత్యనారాయణగారి జీవితం ,అధ్యయనం స్పూర్తి ,ప్రేరణా కల్గించి మార్గ దర్శకం చేయాలనే తలంపుతో రాసిన వ్యాసం .

ఆధారం -8-12-18శనివారం  ఉదయం దుగ్గిరాలలో ఆచార్య మన్నవ వారిని వారింట్లో నేనూ మా బావమరిది ఆనంద్  కలిసినపుడు వారు ఆప్యాయంగా అందజేసిన వారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక –‘’విపంచి ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-12-18-ఉయ్యూరు

.

 

 

 

 

 

 

 

 

 



Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక

సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక

image.png

సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్

సాంఘిక సేవా కార్యకర్త,రైతుకూలీల సంక్షేమం కోసం కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన్ సంఘాన్ని స్థాపించిన నాయకురాలు శ్రీమతి అరుణ్ రాయ్ 26-5-1946 చెన్నైలో జన్మించింది .తండ్రి ప్రభుత్వోద్యోగి అయినందున ఆమె ఢిల్లీ లొ పెరిగింది .ఢిల్లీ యూని వర్సిటి కాలేజిలో ఇంగ్లిష్ లిటరేచర్ చదివి డిగ్రీ పొందింది .ఇండియన్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్ లో సివిల్ సర్వెంట్ గా 1968లో చేరి 1974వరకు ఆరేళ్ళు పనిచేసి౦ది .

పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి ,పేద ,బడుగు వర్గాల వారి సమస్యలపై దృష్టి పెట్టింది.రాజస్థాన్ టినోలియా లోని ‘’సోషల్ వర్క్ అండ్ రిసెర్చ్ సెంటర్ ‘’లో చేరి౦ది .అరుంధతీ రాయ్ 1987లో నిఖిల్ డే,శంకర్ సింగ్ మొదలైన ఉత్సాహవంతులతో కలిసి’’ మజ్దూర్ కిస్సాన్ శక్తి సంఘటన్’’సంస్థ ఏర్పాటు చేసింది .ఈ సంఘటన ద్వారా కూలీలసమాన హక్కులు న్యాయమైన జీతాలకోసం పోరాటం చేసింది .దీనివలననే ‘’సమాచార హక్కు చట్టం ‘’ఏర్పడింది .సమాచార హక్కు కోసం దేశవ్యాప్తం గా అనేక చోట్ల ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి , ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది .ఈ నిరంతర ఉద్యమ ఫలితంగానే 2005 లో కేంద్ర ప్రభుత్వం ‘’సమాచార హక్కు చట్టం’’ తెచ్చింది .దీనివలన పౌరులందరికీ ప్రభుత్వ ఆఫీసులలో జరిగే విషయాలను తెలుసుకొనే హక్కు లభించింది .ఎన్నో లొసుగులు బయటపడి ప్రభుత్వాల తీరు తెన్నులేమిటో పారదర్శకంగా ప్రజలకు తెలుస్తోంది .దీనికి ఆమెకు మనమందరం ఎంతో రుణపడి ఉన్నాం .

పేద, అట్టడుగు వర్గాల ప్రజల హక్కులకోసం అరుణ్ రాయ్ నాయకత్వం వహించి, దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది .ఇందులోపనిచేసే హక్కు ,ఆహార హక్కు , సమాచార హక్కు లూ కలిసే ఉన్నాయి .ఇటీవలి కాలం లో ‘’పెన్షన్ పరిషత్ మెంబర్ ‘’గా ‘’వ్యవస్థీ కృతం కాని’’వ్యవస్థ(అన్ ఆర్గనైజేడ్ సెక్టార్ )లలోని ఉద్యోగుల ‘’నాన్ కాన్ట్రి బ్యూషన్ పెన్షన్ ‘’కోసం తీవ్రంగా ఉద్యమాలు చేసింది .దీనితోపాటు ‘’విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ లా’’ ( ప్రభుత్వోద్యోగుల అవినీతి ,అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరిపటం ,వారిని బాధ్యతాయుతంగా పనిచేయించటం , ఆరోపణ చేసినవారికి భద్రతకలిగించాటం తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకొనే యంత్రాంగం ) మరియు ‘’గ్రీవెన్స్ రెడ్రేస్ యాక్ట్ ‘’( ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలపై పౌరులు ఇచ్చే ఫిర్యాదులకు రసీదు ఇవ్వటం, దర్యాప్తుజరపటం నిందితులపై తీసుకున్న చర్యలువివరించటం ) అమలు కోసం పోరాడి సాధించింది .ఈ రెండూ 2011 లో చట్టరూపం దాల్చాయి .ఇదంతా ఆమె అకుంఠిత పోరాట దీక్షా ఫలితమే ..

అరుణ్ రాయ్ ‘’నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ‘’కు మెంబర్ గా20 06 లో రిటైర్ అయ్యేదాకా పని చేసింది .మజ్దూర్ కిస్సాన్ శక్తి సంఘటన్ ద్వారా గ్రామీణ పనివారల హక్కులు సాంఘిక న్యాయం ,సృజనాత్మక అభివృద్ధి కోసం ,చేసిన సేవలకు 1991 లో ‘’టైమ్స్ ఫెలోషిప్ ‘’అవార్డ్ అందుకొన్నది .సమాజ నాయకత్వానికి గాను 2,000లో ‘’రామన్ మేగసేసే’’పురస్కారం పొందింది .పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ,అకాడేమియా అండ్ మేనేజ్ మెంట్ లలో అత్యున్నత సేవకు 20 10 లొ లాల్ బహదూర్ శాస్త్రి ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది .టైమ్స్ మేగజైన్ 2011 లోవందమంది ప్రపంచ ప్రసిద్ధ ప్రభావితుల లో ఒకరుగా అరుణ్ రాయ్ ని ప్రకటించింది .20 17 సెప్టెంబర్ లొ ఇండియా టైమ్స్ పత్రిక ‘’మానవ హక్కులు కార్యక్రమలో ఇతరులు గౌరవంగా జీవించటానికి కృషి చేసిన 11 మంది ప్రసిద్ధులలో అరుణ్ రాయ్ ఒకరుగా గుర్తించింది .బడుగు బలహీనవర్గాల ,కూలీ, రైతుల హక్కుల కోసం ,గౌరవప్రదమైన సమాన వేతనాలకోసం ఉద్యమించి ,సమాచార హక్కు చట్టాన్ని సాధించిన మహిళా మాణిక్యం అరుణ్ రాయ్ .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889)

పూర్వాశ్రమం లో శ్రీ గంటి బాలకామేశ్వర శర్మగా చిత్రభాను సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి నాడు శ్రీ  గంటి చినకామేశ్వరుడు ,శ్రీమతి పార్వతీ దేవి దంపతులకు జన్మించిన శ్రీ కళ్యాణానంద స్వామి బి ఏ .చదివారు .వ్యాకరణము ,శాస్త్రాలు శ్రీ తాతాసుబ్బారాయ శాస్త్రిగారి వద్ద నేర్చారు .మంత్రోపదేశం శ్రీ రాణి చయనులుగారి వద్ద జరిగింది .శ్రీమతి సోమిదేమ్మతో వివాహమైంది .వీరి సన్యాస గురువులు జగద్గురువులు శ్రీ బోధానంద భారతీ మహాస్వామి .సన్యాస నామం’’ శ్రీ కళ్యాణానంద భారతి’’ .జగద్గురు పట్టాభిషేకం 23-12-1923-రుధిరోద్గారి మార్గశిర పూర్ణిమ .

  బిరుదనామములు –శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ,షడ్ దర్శన స్థాపనా కార్య వ్యాఖ్యాన సి౦హాసనాదీశ్వర ,సకల వేదార్ధ ప్రకాశిక ,.

  స్వామీజీ పూర్ణ మీమాంసా దర్శనం (సవృత్తికం )తోపాటు బ్రహ్మ సూత్ర సంజీవిని ,శారీరక మీమాంసా సంగ్రహః ,కళ్యాణ సంహితా ,కళ్యాణ స్మృతిః,,ప్రాయశ్చిత్త పశు నిర్ణయం ,ఆపస్తంభీయ గృహ్య సూత్రం, అహంకార ద్వంసినీ ,తంత్ర జ్యోత్స్నా ,శ్రీ కలా దర్శనం ,శ్రీ చక్ర దర్శనం ,శ్రీ యాగ సూత్రం ,మహారుద్ర యాగత్రయం ,సర్వ దేవ ప్రతిస్టావిది ,శ్రీ రామతారకోపాసన విధి ,గణపత్యుపాసన విధి ,శ్రీ యాగాను క్రమణిక,ఆపస్తంభీయ దర్శపూర్ణ మాస వ్యాఖ్యాన టీకా సంజీవిని ,శ్రీ గుణ నీకా దీధితిః వంటి 50అపురూప సంస్కృత గ్రంథాలు రచించారు .దీన్నిబట్టి స్వామివారి సంస్కృత పాండిత్యం అపారం అని తెలుస్తుంది .ఈ గ్రంధాలన్నీ శ్రీ పరిమి నారాయణ శర్మ –తెనాలి ప్రచురించారు

  స్వామివారు ఆంగ్లం లో- Theosophy unveilled ,Modern ignorance ,Mnava rahasyam ,Untouchability ,kamakalaand magic sequences ,constitution of Aryavarta ,Manu smruti saarah ,Sovereign Democratic Republic of Bharta varsha వంటి 21అమూల్య గ్రంథాలు రాశారు.

 విరూపాక్షపీఠం గుంటూరులో ఉన్నది .స్వామివారు అపర శంకరులే అని నమ్మకం .వీరు సంస్కృతం లో రచించిన ‘’పూర్ణ మీమాసాగ్రంథం’’వేద వ్యాసులవారి బ్రహ్మ సూత్రాలతో వ పోల్చదగినదిగా భావిస్తారు .బృహదారణ్య కోపనిషత్ లోని-

 ‘’పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదత్యచే –పూర్ణస్యపూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే అగాహన చేసుకోనేట్లు ‘’‘’మంత్రాన్ని ఆధునికుల అవగాహన కోసం క్షేత్ర గణితం తో వివరించారు .సంస్కృత సూత్రాలతో రచించిన ఈ గ్రంథంను సంస్కృత వృత్తితో వివరించి ,ఉపోద్ఘాతంగా ఇంగ్లిష్ లో సూత్రార్ధాన్ని కూడా వివరించటం విశేషం .కనుక ఆధునిక వైజ్ఞానికులకు తత్వ సాధనలో బాగా ఉపయోగపడుతుంది –

‘’వృత్త మీశ్వర మీశ్వరః ‘’ఏకమేవ ద్వితీయం ‘’,’’పద బీజ సంఖ్యా రేఖా ణాముత్తరోత్తరం బలీయం ‘’మొదలైన వారి సూత్రాలు భారతీయ వేదవేదాంత శాస్త్ర పరిజ్ఞానాన్నేకాక ,దాన్ని ఆధునికులకు క్షేత్ర గణిత ప్రామాణ్య౦ గా  వివరించిన తీరు స్వామివారి గణిత శాస్త్ర ప్రావీణ్యత  కు నిదర్శనం .దీనిని డా.కొల్లూరు అవతార శర్మగారు సులభ బోధకంగా తెలుగులోకి అనువదించి గొప్పమేలు చేశారు .ఇదంతా శ్రీ విద్యా ప్రతిపాదికం .ఆది ,అంతాల ఐక్యతే చక్రం అని ఇందులోని భావం .’’యచ్చక్రాణా౦ అధిష్టానం ‘’అనే విశేష లక్షణం పూర్వ మీమాంసా దర్శనం లో ఉన్నదని,సమన్వయ ఆవశ్యకత లేని రూపమే వృత్తం అనీ ,అంటే వృత్తం ‘’సర్వాదిస్టానం ‘’అని భావమని ,  .’’వ్రుత్త త్రికోణం హిరణ్యగర్భః ‘’అనీ ‘’వృత్తా త్సర్వ వ్యవహార వ్యన్జకం సమత్రిభుజం ‘’అనీ వివరింపబడింది .దీనివలన ‘’ఏకం సత్ విప్రా బహువదంతి’’అనే న్యాయం రుజువైందనిఈ గ్రంథాను వాదానికి ము౦దుమాటలు రాసిన –రిటైర్డ్ సైంటిఫిక్ ఆఫీసర్ శ్రీ గురజాడ సూర్యనారాయణ మూర్తిగారు తెలియజేశారు  .

  ఆధారం- తొలితెలుగు చారిత్రకనవలా రాచయిత శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు,నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్దాపక అధ్యక్షులు ,శ్రీ విద్యోపాసకులు  , శ్రీ కళ్యాణానంద భారతీ పురస్కార గ్రహీత ,శ్రీ విద్యా రత్నాకర , బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త ,ప్రచురణకర్త ,బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్స్త్రి ఎం .ఇ. గారు నాకు 18-11-18ఆదివారం హైదరాబాద్ లో వారిని స్వగృహం లో కలిసినప్పుడు  అనేక గ్రంథాలతోపాటు అందజేసిన ‘’పూర్ణ మీమాసా దర్శనం ‘’-ఆంధ్రీకరణ గ్రంథం.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ

ఆచార్య శ్రీ కొల్లూరు అవతార శర్మ విజయనగరం లో శ్రీ కొల్లూరు లక్ష్మణ మూర్తి శర్మ ,శ్రీమతి లక్ష్మీ సోమిదేవమ్మలకు జన్మించారు .డిగ్రీ వరకు విజయనగరం మహారాజా వారి విద్యా సంస్థలలో చదివి ,ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు సాహిత్య విద్యా ప్రవీణ ,రాష్ట్ర భాషా ప్రవీణ ,సంస్కృత భాషా కోవిద ,విద్యావారిది (పి హెచ్ డి –వ్యాకరణం ,శిక్షా శాస్త్రాలు )సంస్కృతం లో ,తెలుగులో ఎం.ఏ ల తో పాటు బి .ఎస్. సి .బిఎడ్.కూడా ‘’.సంస్కృతం –అలంకార’’ శాస్త్రం పై పరిశోధన చేసి పిహెచ్ డి అందుకున్నారు .

 అవతార శర్మగారు సంస్కృతం లో ‘’మందాక్రాంత సౌందర్య లహరి ,దశ మహావిద్యాదిస్తోత్రకదంబం రచించారు .

  .తెలుగులో పానణినీయ శిక్ష ,ఆంద్ర ప్రదేశీయ ద్రావిడుల చరిత్ర ,సంస్కృతీ ,శ్రీ సారంగదేశ్వరాలయ చరిత్ర ,జ్ఞానపూర్ణిమ ,శివోహం శివోహం శివ కేశవోహం ,ఐశ్వర్య విద్యా సర్వస్వం ,ఆంజనేయ ముపాస్మహే ,అయ్యప్ప దర్శనం ,శ్రీ పాదుకాకల్పం ,హనుమత్తత్వ రహస్యోపనిషత్ ,ఉపనయనం ఎందుకు ,సూర్య శతకం ,అమ్మతో ముఖాముఖి ,ఐశ్వర్య శ్రీ కల్పం ,శివాష్టకం ,శ్రీ బాలాశతకం,,శ్రీపాదుకా సత్యదేవం రచించారు .

  శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులుశ్రీ శ్రీ కళ్యాణానందభారతీ మా౦తాచార్య మహాస్వామి సంస్కృతం లో రచించిన ‘’పూర్ణ మీమాంసా దర్శనం ‘’ను  శ్రీ అవతార శర్మగారు తెలుగులోకి అనువదించారు .గణిత శాస్త్ర నిపుణులు ,  ,తైత్తిరీయోపనిషత్ ను గణిత శాస్త్ర పరంగా వివరించిన మేధావి శ్రీ కళ్యాణానంద  స్వామి వారి రచనను ఆంధ్రీకరించటానికి సంస్కృత భాషాపరిజ్ఞానం ,గణితం లో నిష్ణాతులయిన  వారికే సాధ్యం .శర్మగారు ఈ రెండిటిలోనూ అసామాన్య  పాండిత్యవారు కనుకనే బ్రహ్మనోరిచారితబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ,శ్రీ విద్యోపాసకులు ,శ్రీ విద్యారత్నాకర శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఈ బాధ్యతను శర్మగారిపై ఉంచారు .తగ్గట్టుగా గొప్పన్యాయం చేకూర్చారు శర్మగారు  .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )

గౌతమీ మాహాత్మ్యం -29

41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )

పిప్పలాదుడు గౌతమీ తీరం లో శివునికై ‘’    ఏకాగ్రతతతో సుషుమ్నలో మనసు నిల్పి ,నాభిలో స్వస్తిక రూపం లో హస్తం ఉంచి ,క్రమంగా తీవ్రతరం చేస్తూ ,శివుని మహా తేజస్సును ధ్యానిస్తూ ,యోగ సాధనద్వారా శివుని త్రినేత్రాన్ని దర్శించాడు .చేతులు జోడించి శివ స్తోత్రం చేశాడు –

‘’శంభునా దేవ దేవేన వారో దత్తః పురా మమ-తార్తీయ చక్షుషోజ్యోతిర్యదా పశ్యసి తత్ క్షణాత్-సర్వం తే ప్రార్ధితం సిద్దే దిత్యా దిత్యాహ త్రిదశేశ్వరః – తస్మాద్రిపు వినాశాయ హేతుభూతాం ప్రయచ్ఛమే’’-తన త్రినేత్రాన్ని చూడగలిగితే నేను కోరినదంతా సిద్ధిస్తుంది ‘’అని పరమేశ్వరుడు చెప్పాడు నేను ఆ జ్యోతిని సందర్శించాను కనుక శత్రు వినాశ శక్తి నాకు ప్రసాదించు .

అప్పుడు పిప్పల వృక్షాలు,  వాడవ ‘’పరుల నాశనం కోసం ప్రయత్నించేవారు నరకానికి పోతారు ‘’అనగా కోపం వచ్చి ,ఆమె మాట వినకుండా ,తనకోరిక తీరాల్సిందే అని పట్టుబట్టాడు .శివుని నేత్రం నుంచి ‘’కృత్య ‘’వెలువడి  ఆడగుర్రం గా మారి ,ఆ కృత్య కూడా అతని తల్లి లాగా అగ్నిని చేరి ,మహా రౌద్రాకారం లో కనిపించి పిప్పలాదుని తానేమి చేయాలని అడిగింది .తన శత్రులైన దేవతలను తినమని కోరాడు .కృత్య వెంటనే పిప్పలాదుని గ్రహించగా బిత్తర పోయి ,ఇదేమన్యాయం అని అడిగితె ‘’నీశరీరమూ దేవతలచే చేయ బడింది కాదా ?’’అని అడిగితె శరణు శరణు అని ప్రాధేయపడి,శివుని ధ్యానించగా ఆయన కృత్యతో యోజన దూరం లో ఉన్న వారి జోలికి పోవద్దని ఆపై ఆమె ఇస్టమని  శాసించాడు .

  అప్పుడా పిప్పలా కృత్య పిప్పలా తీర్దానికి తూర్పుదిశగా యోజన దూరం వరకు వెళ్లి పోయింది.బడబా రూపం లో ఉన్న ఆకృత్య నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహించటం ప్రారంభించింది .తల్లడిల్లి వారంతా శంభోమహా దేవా అంటూ శరణు కోరగా ,యోజన ప్రాంతం లో సుఖంగా ఉండచ్చు అని చెప్పగా  స్వర్గం వదలి ఇక్కడ  యెలా ఉంటామని అంటే, ప్రత్యక్ష దైవం సూర్యుడే కనుక ఆరాధించమని కోరగా, పారిజాత వృక్షాలకర్రలతో సూర్యుని తయారు చేయాగా విశ్వకర్మ సూర్యునితో అక్కడే ఉండిపొమ్మని కోరగా, ముప్ఫై కోట్ల అయిదు వందల దేవతలు అర అంగుళానికి ఒకరు చొప్పున నివశించారు .ఈ ఏర్పాటు నచ్చక మళ్ళీ శివుని, పిప్పలాదుని శాంత పరచమని వేడగా, సరే అంటూ పిప్పలాదునితో ‘’నీ తండ్రి దీవతల సం తృప్తికై ప్రాణం త్యాగం చేశాడు .మళ్ళీ తిరిగి రాడు .నీతల్లి కూడా మీనాన్న తో స్వర్గం చేరింది ‘అనగా శా౦తపడి తలొగ్గాడు .ఆయన గంగలో స్నానం చేసిన వారికి కైలసం పొందే వరమివ్వమన్నాడు .పిప్పలాదుని  తమతో దేవతలు స్వర్గానికి తీసుకు వెళ్ళారు  .అక్కడ తలిదండ్రులను చూశాడు. తండ్రి అతన్ని పెళ్లి చేసుకొని సంతానం పొందమని  చెప్పి ,కృత్యను శాంతింప జేయమని కోరగా, అది తాను  చేయలేనని చెప్పగా ,కృత్యనే శాంతించమని కోరగా తానేదో ఒకటి భక్షి౦చకుండా ఉండలేని అంటే, బాడవ నదీ రూపం పొంది బడవానలంగా మారి,పంచభూతాలలో మొదటిదయింది .దేవతలు బాడబను సముద్రుని ఆహారంగా  భుజించమన్నారు .నీళ్ళున్న చోట, తను యెలాఉండగలను అని, గుణవతి ఐన  కన్య తనను బంగారు కలశం లో ఎక్కడికి తీసుకు వెడితే  అక్కడికి  వెడతానన్నది అగ్ని .దేవతలు సరస్వతిని ప్రార్ధింఛి అగ్నినితీసుకు వెళ్ళమని కోరగా ,తాను ఆశక్తురాలనని  వరుణాలయానికి తీసుకు వెళ్ళమని చెప్పింది .గంగా ,యమునలు కూడా తమ అశక్తత చెప్పాయి  .అప్పుడు గంగా యమునా సరస్వతీ తపతీ నదులతోకూడిన హిరణ్య కలశం లో అగ్నిని ఉంచి ,వరుణాలాయానికి తీసుకు వెళ్ళారు .అక్కడినుంచి ప్రభాస తీర్ధంచేరి అగ్నిని కలిపారు .అగ్ని నెమ్మదిగా జలాలను తాగటం మొదలెట్టింది .శివుడు దేవతలతో దేవతలు పాపవిముక్తులైన చోటు పాప నాశనమని ,గోవులు పావనమైన చోటు గోతీర్ధమని ,దధీచి అస్థికలు పవిత్రమైన చోటు పితృ తీర్ధమని ,పిలువబడుతాయని శివుడు చెప్పాడు .

  దేవతలు దినకరుడు ప్రతిష్ట చెందిన చోట దేవతలంతా ఉన్నట్లే అని చెప్పి పిప్పలాదుని శివుని అనుమతితో స్వర్గం చేరారు .పిప్పలాదుడు గౌతముని కుమార్తెను పెళ్ళాడి సంతానం, సంపదా పొందాడు .అప్పటినుంచి ఇది పిప్పల తీర్ధమైంది .ఈ ముఖ్య ఆఖ్యాయాన్ని చదివినా విన్నా దీర్ఘాయుస్సు  పొంది ధనవ౦తు డౌతాడు  ‘’అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

మనవి -పవిత్ర కార్తీకమాసం ఇవాల్టితో పూర్తికనుక  ప్రస్తుతానికి గౌతమీ మాహాత్మ్యానికి విరామం ప్రకటిస్తున్నాను .వీలున్నప్పుడు మళ్ళీ ప్రారంభిస్తాను .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -29

41- పిప్పల తీర్ధం

శివుడు విష్ణువు యెడ ప్రసన్నమైనదే  పిప్పల తీర్ధం .ఒకప్పుడు దధీచి మహర్షి అర్ధాంగి,అగస్త్యముని భార్య లోపాముద్రకు సోదరి ఐన  గభస్తిని తో  భాగీరధీ తీరం లో తపస్సు చేస్తున్నాడు ఈమెకు ‘’వడవా ‘’అనే పేరుకూడా ఉంది .మహర్షి ప్రభావం వలన ఆ ప్రాంతం లో శత్రువులు ,రాక్షసులు లేరు .ఒకసారి దైత్యమర్దన చేసిన దేవతలు ,రుద్ర ,ఆదిత్యులు ముని ఆశ్రమానికి వచ్చి ,స్తుతించి అతిధి సత్కారం పొంది మహర్షితో ‘’రాక్షస సంహారం చేసి , మీ దగ్గరకు వచ్చాం .ఇప్పుడు మాఆయుదధాలతో పని లేదు .వీటిని మీ ఆశ్రమ లో దాచటానికే వచ్చాం .వాటిని దాచి ,రక్షించే సమర్ధత మీకే ఉంది ‘’అనగా సరే అన్నాడు .భార్య వివేకం తో ‘’మహర్షీ !దేవతలఆయుధాలు ఇక్కడ దాస్తే ,రాక్షసులకు మనపై కోపం వచ్చి శత్రువులౌతారు .ఒకవేళ ఆయుధాలను ఎవరినా అపహరిస్తే దేవతలకు శత్రువులమవుతాం .ఇతరుల సొమ్ము దాచటం సజ్జనులు చేయరాదు ఆలోచించండి ‘’అనగా ముని ‘’దేవతలమాటకు సరే అని ఇప్పుడు కాదనటం న్యాయం కాదు ‘’అని చెప్పి ఆయుధాలు దాచటానికిఅనుమతినివ్వగా సంతోషించిన దేవతలు తమ ఆయుధాలు దధీచి మహర్షి ఆశ్రమం లో భద్రంగా దాచి స్వర్గానికి సంతోషంగా వెళ్ళిపోయారు .

  వెయ్యి సంవత్సరాలు గడిచాయి .ఒకరోజు భార్యతో మహర్షి  దేవతాయుధాలు తమవద్ద దాచటం వలన దైత్యులు ద్వేషిస్తున్నారని చెప్పి ,సురలు అస్త్రాలను తీసుకు వెళ్ళటం లేదని బాధపడి ఉపాయం చెప్పమన్నాడు .అన్నిటికీ భర్తయే సమర్ధుడని ఆమె చెప్పగా, దధీచి మంత్రజలం తో ఆ అస్త్రాలను కడిగి ,తేజోమయం చేసి  ఆ మంత్రజలాన్ని తాగేశాడు .అస్త్రాలు నిర్వీర్యాలై క్రమ౦గా నశించి పోయాయి .కొంతకాలమయ్యాక  సురలు  మహర్షి దగ్గరకు వచ్చి తమకు రాక్షస భయం ఎక్కువైందని ,అస్త్రాలనిస్తే వెళ్లి యుద్ధం చేసి జయిస్తామని చెప్పగా ,తాను  అస్త్రాలను తాగేశానని చెప్పాడు .

 సందిగ్ధం లో పడిన దేవతలు ‘’మహాత్మా !అస్త్రాలు వద్దనీ చెప్పలేము ,ఇమ్మని అడగటానికి వీలుకూడాకాకుండా ఉంది .మేము దేవలోకం లో తప్ప ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు .మీముందు మాట్లాడటాని అశక్తులం ‘’అని వినయంగా విన్నవించారు .అప్పడు గౌతముడు తన ఎముకలలో లో అస్త్రాలున్నాయని వాటిని తీసుకోమని చెప్పగా వాటితో తాము దానవ భంజన చేయలేమన్నారు .దధీచి ‘’నేను యోగం తో ప్రాణాలు వదిలేస్తాను .నా అస్ది రూపమైన ఉత్తమోత్తమమైన అస్త్రాలు తీసుకోండి ‘’అన్నాడు .అలాగే అన్నారు. ఆసమయం లో గర్భవతి అయిన ఆయన ధర్మపత్ని అక్కడ లేదు .ఆమె వస్తే అభ్యంతరం చెబుతు౦దేమోననే సందేహం తో మహర్షిని వెంటనే ప్రాణాలు వదిలేయమని తొందరపెట్టారు .దధీచి ‘’నా దేహాన్ని మీరు ఎలాకావాలంటే అలా వాడుకోండి ‘’అని చెప్పి,పద్మాసనం లో కూర్చుని ,నాసాగ్రం పై దృష్టి నిలిపి ,ప్రసన్న చిత్తం తో యోగం ద్వారా సుషుమ్నను జాగృతం చేసి ,శరీరరగత వాయువు అగ్ని ఉద్దీపి౦ప జేసి  నెమ్మదిగా హృదయగహ్వరం లో ప్రవేశపెట్టి ,పరబ్రహ్మము పై  బుద్ధినిల్పి పరబ్రహ్మ సాయుజ్యం పొందాడు .

  ‘’ సుందరానికి తొందరెక్కువ ‘’అన్నట్లు  సురులు  హడావిడి పడుతూ త్వష్ట ను పిలిచి దధీచి శరీరం తో అస్త్రాలు చేయమని చెప్పారు .త్వష్ట ‘’ఇది బ్రాహ్మణ కళేబరం .నేను చీల్చి అస్త్రాలు చేయలేను .ఎవరినా  అస్దు లను వేరు చేస్తే ,చేసిస్తాను ‘’అన్నాడు పాలుపోక వాళ్ళు గోవులను పిలిచి దేవకార్యం కోసం ముని అస్ధులను వేరు చేయమని వేడుకొన్నారు .అవి వెంటనే ఎముకలను వేరు చేసి బాగా నాకి  శుభ్రం  చేసి దేవతలకిచ్చాయి .దేవతలు సంతోషం తో ,గోవులు విధి నిర్వర్తి౦చామన్న సంతృప్తితో వెళ్లి పోయారు .త్వష్ట దధీచి ఎముకలతో దేవతలకు కావాల్సిన అస్త్రాలు తయారు చేసి వెళ్ళిపోయాడు .

  చాలాకాలం తర్వాత గర్భవతి దధీచి మహర్షి పత్ని భర్త కోసం ఆశ్రమానికి వచ్చింది .దారిలో పిడుగుపడి ఆలస్యమైంది .భర్త కనపడక పోయే సరికి అగ్నిని ప్రశ్నించింది .జరిగినదంతా ఆమెకు తెలియజేశాడు అగ్ని .దుఖితురాలై నేలపై మూర్చపోయింది. తేరుకొని తాను  దేవతలను శపించటానికి సమర్ధురాలను కాను కనుక అగ్ని ప్రవేశమే మంచిదనుకొని ,కాసేపు వితర్కి౦చు కొని తనభర్త పరోపకారం కోసం శరీర త్యాగం చెసిఉత్తమ లోకాలు పొందాడు ,విధి రాత తప్పి౦పరానిది అని ఊరట చెందింది .దధీచి మహర్షి అవశిస్టాలైన రోమాలు ,చర్మ౦ ఒక చోట చేర్చి ,తనకడుపు చీల్చి అందులోని బాలకుడిని చేతిలోకి తీసుకొని గంగానది ,భూమి ,ఆశ్రమం ,వృక్షాలకు వోషధులకు నమస్కరించి –

‘’పిత్రాహీనో బందుభి ర్గోత్రజై శ్చ ,మాత్రాహీనో బాలకః సర్వఏవ-రక్షంతు సర్వేపి చ భూత సంఘా స్తథౌషద్యో బాలకాం లోకపాలకం ‘’—ఏ బాలకాం మాత్రు పితృప్రహీణం,స నిర్వి శేషం స్వతను ప్రరూ ఢైః-పశ్యన్తి రాక్షన్తిత ఏవ సూన౦ ,బ్రహ్మాది కనామపి వందనీయాః’’అని ప్రార్ధించింది –తండ్రి బంధువులు గోత్రం  లేని ఈబాలుడు మాతృ హీనుడు .మీరంతా వేడిని రక్షించాలి .స్వంతబిడ్డ లాగా వీడిని చూసినవారు బ్రహ్మాదులచేతకూడా నమస్కరింప దగినవారు .

  అని పలికి పిప్పల వృక్షం కింద బాలుని వదిలేసి ,,అగ్ని ప్రదక్షిణం చేసి ,యజ్ఞపాత్రతో భర్త తో అగ్ని లో ప్రవేశించి ,భర్తతో స్వర్గం చేరి౦ది .ఈ కరుణార్ద్ర సన్నీ వేశానికి ప్రకృతి కూడా విలపించింది .తండ్రిలాంటి దధీచి,తల్లిలాంటి ఆయన అర్ధాంగి ప్రాతి ధేయి లేకుండా ఆశ్రమం లో ఉండటానికి మృగాలు ,పక్షులు ఓషధులు కూడా ఇష్టపడక  తమ రాజైన సోముని ఆశ్రయించి అమృతం కోరగా ఇచ్చేయగా ఆబాలుడికి అమృతం ఇచ్చారు .ఆ వృక్షాలే అతన్ని పెంచాయి పిప్పల  వృక్షాలచే పెంచబడిన ఆబాలుడు ‘’పిప్పలాదుడు ‘’అయ్యాడు .చెట్టు విత్తనం నుంచి ,పక్షి గుడ్డు నుంచి పుడితే తాను వృక్షాలనుండి ఎలా పుట్టాను అనే సందేహం కలిగి వాటిని అడిగితె అతని తలిదండ్రుల చరిత్ర అంతా పూసగుచ్చినట్లు చెప్పాయి .సంతృప్తి చెందిన బాలుడు తన పితృ హత్య చేసినవారి పై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పగా ,అవి సోముడి దగ్గరకు తీసుకు వెళ్ళాయి .సోమునిస్తుతి౦చ గా  సంతోషించి మంచి విద్య నేర్వటానికిసహకరిస్తానన్నాడు .తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆవిద్యలు తన కెందుకన్నాడు .భుక్తి, ముక్తి శివునివలననే కలుగుతాయి .అనగా బాలుడనైన తానెట్లా ఆపని చేయగలనని అడిగితె, గౌతమీ నదికి వెళ్లి చక్రేశ్వర హరుని  స్తుతి౦చమంటే,పిప్పల వృక్షాలు ఆబాలుని తీసుకొని వచ్చి దింపి వెళ్ళాయి.

  పిప్పలాదుడు గౌతమీ  స్నానం చేసి శుచియై ,శివునికై తపస్సు చేసి మెప్పించి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తన తండ్రి హంతకుల పై ప్రతీకారేచ్చ వెల్లడించగా త్రినేత్రుడు అతన్ని తన మూడవకంటి ని చూడగలిగితే దేవతలను సంహరించే శక్తి వస్తుందని చెప్పగా ,మనస్సు నిల్పి ప్రయత్నం చేసి ,సాధ్యంకాక పోతే శివుడే తపస్సు చేసి సాధించమని చెప్పి అదృశ్యమయ్యాడు .      సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో

మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు 

ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు

విద్యావారిధి డా.శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో గొప్పకవి శేఖరులు .30కి పైగా గ్రంథాలు రాశారు .వారి విద్వత్తుకు వెలకట్టటం అసాధ్యం . వేద,శాస్త్ర పురాణాదులలో విస్తృత పరిశోధన బహు గ్రంథాలపరిశీలన చేసి ఇటీవలే ‘’ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు ‘’అనే చిన్నపుస్తకం ప్రచురించి ,నాకు  ఆత్మీయంగా నవంబర్ 20 న పంప,వెంటనే చదివేశాను .వారి లోతైన అవగాహన కు ఆశ్చర్యపోయాను .వారేది రాసినా అంతటి నిశిత పరిశీలన ఉంటుంది .అందరికి అర్ధమయ్యే తీరులో చక్కగా రాశారు .అందుకు అభినందనలు .అందులోని ముఖ్య విషయాలు మీకు అందజేస్తాను .

  ప్రారంభం లోనే శాస్త్రిగారు భోజమహారాజు చెప్పిన ఒక శ్లోకాన్ని ఉల్లేఖించి తమ ప్రణాళికను అమలు చేశారు –‘’ఉచ్చ్చైర్గతి ర్జగతి సిద్ధ్యతి ధర్మ తశ్చేత్-తస్య ప్రమాచ వచనైః కృత కేతరై శ్చేత్-తేషాం ప్రకాశన దశా చ మహీసురై శ్చేత్-తా నంతరేణ నిపతే త్క్వనుమత్ప్రణామః –‘’

భావం –ప్రపంచం లో ఉన్నతమైన ధర్మం వలన నే మానవులకు లభించేట్లయితే ,ఆ ధర్మ స్వరూపం వేదాలచే చెప్పబడితే ,ఆ వేదాలు బ్రాహ్మణుల వలననే లోకం లో ప్రచారమౌతుంటే ,ఆ బ్రాహ్మణుడికి తప్ప నానమస్కారం ఇంకెవరికి చెందుతుంది?

  కాళిదాసు సరస్వతీ అవతారం. భోజుడు బ్రహ్మ అవతారం .అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు ?’’బ్రహ్మత్వం బ్రహ్మ విజ్ఞానాత్ ‘’అంటే పరబ్రహ్మ జ్ఞాన౦ కలవాడే బ్రాహ్మణుడు .మహాభారతం ‘’యః క్రోధ మోహౌత్యజతి తమ్ దేవా బ్రాహ్మణం విదుః’’అంటే రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను  జయించినవాడు బ్రాహ్మణుడు అని దేవతలు చెబుతున్నారు అన్నది .బ్రాహ్మణ ఆచార విధానాలు అనుసరించినవాడు ద్విజుడు .వేదం నేర్చి విప్రుడు ,బ్రహ్మజ్ఞానం పొందటం వలన బ్రాహ్మణుడు ఔతాడు .బ్రాహ్మణ ధర్మాలు చాలాఉన్నాయి. అన్నీ పాటించటం కష్టం .కనీసం వాటిని తెలుసుకోవాలి .ఒకసారి గరుత్మంతుడు బోయ వాళ్ళనందర్నీ తింటూ ఒక వ్యక్తిని తినలేక కక్కేస్తే, తల్లి వినత ‘’అతడిని తినలేవు ఎందుకంటె అతడు బ్రాహ్మణుడు ‘’అని చెప్పిందని శంకరాచార్యులు తమ బ్రహ్మ సూత్ర వేదాంత భాష్యం లో ‘’రక్షితే హిబ్రాహ్మణత్వేరక్షిత స్స్యాత్సర్వతో హి వైదికో ధర్మః ‘’అని చెప్పారు .

  ధర్మ శాస్త్రాలలో మను ధర్మ శాస్త్రం ప్రాచీనమైనది. బ్రహ్మ దేవుని నుంచి మనువు అవతరించాడు ‘’యద్వైకిం చ మను రవదత్ తద్ భేషజం ‘’అన్నది వేదం ప్రపంచం లో అధర్మం అనే అనారోగ్యాన్ని పోగొట్టే దివ్యౌషధమే మనువు చెప్పాడు .మను చక్రవర్తి,శత రూప అనే తన ధర్మపత్నితో బ్రహ్మావర్త క్షేత్రం లో బర్హిష్మతి నగరం లో దర్భాసనంపై కూర్చుని  ,ఏకాగ్రమనసుతో ,యజ్ఞ పురుషుని ధ్యానిస్తూ , విష్ణుకథలు వింటూ భ్రుగువు మొదలైన మహర్షులకు ధర్మతత్వం బోధిస్తూ 71యుగాలకాలం భూమండలం పై యోగులు ప్రాణ శక్తిని రక్షించు కొన్నట్లు రక్షించాడు .భ్రుగువు నుండి శిష్యులకు ,ప్రశిష్యులకు మనుధర్మం వ్యాపించి ‘’మను స్మృతి ‘’అయింది .దీనికి ‘’కుల్లూక భట్టు ‘’’’మన్వర్ధ ముక్తావళీ’’అనే గొప్ప వ్యాఖ్యానం రాశాడు .

 ముఖ్య బ్రాహ్మణ ధర్మాలు –వేద, శాస్త్ర పురాణాలు నేర్వటం వాటిని ఇతరులకు బోధించటం,యజ్ఞాలు చేయటం చేయించటం ,దానాలు గ్రహించటం, దానాలివ్వటం అనే ఆరు షట్కర్మలు విధిగా చేయాలి ..బ్రాహ్మణులకు ఆచారం ముఖ్యం .అంటే తనకు తానూ క్షేమం కలిగించుకోనేదే ఆచారం ..ధర్మాలను ఆచరిస్తే ఈలోకం లో కీర్తి ,పరలోకం లో ఉత్తమ స్థితి కలుగుతుంది  .బ్రహ్మావర్త దేశం అంటే ?భారతదేశం లో సరస్వతి ,దృషద్వతి నదులమధ్యభాగం .దీని తర్వాత బ్రహ్మర్షిదేశం  గొప్పది .కురుక్షేత్రం మత్స్య నగరం ,పాంచాల శూర దేశాలే  బ్రహ్మావర్తం .తూర్పున బంగాళాఖాతం ,పశ్చిమాన అరేబియా సముద్రం ,ఉత్తరాన హిమాలయం దక్షిణాన వింధ్య పర్వతాల మధ్య ఉన్నదే ఆర్యావర్తం .

   గృహస్తులు అయిదు యజ్ఞాలు –వేదాలు నేర్వటం  నేర్పటం ,పితృదేవతలకు పిండాలు, నీటితో తృప్తి చెందించటం ,హోమం అనే దేవ యజ్ఞం చేయటం ,భూతబలి అంటే చిన్నప్రాణులకు ఆహారం ఇవ్వటం ,మనుష్యయజ్ఞం అంటే అతిధులను గౌరవించి తృప్తి పరచటం చేయాలి .బ్రాహ్మణ జీవిత విధానం ఎలాఉండాలి ?ఇతరులకు ద్రోహం చేయరాదు ,సత్యం  తో జీవించాలి .లభించినదానితో సంతృప్తి చెందాలి .ఆత్మ సంతృప్తియే అన్ని సుఖాలకు మూలం అని గ్రహించి జీవించాలి .అగ్ని హోత్రాన్ని నోటితో ఊదకూడదు .అపవిత్రవస్తువులు అందులో వేయరాదు .విధి యజ్ఞం కంటే జప యజ్ఞం పది రెట్లు గొప్పది మానసిక జపం శ్రేష్టం .మితభోజనం మంచిది .ప్రతినమస్కారం చేయటం తెలియనివాడికి నమస్కారం చేయరాదు .ఎవరినైనా ‘’క్షేమంగా ఉన్నారా ?’’అని పలకరించాలి .విద్యకు,  వయసుని బట్టి గౌరవం చూపాలి .జ్ఞానం వలననే గొప్పతనం వస్తుందని తెలియాలి. సన్మానం అంటే భయపడాలి..

 తల్లిగర్భం నుంచి వచ్చినది మొదటిజన్మ .ఉపనయనం తర్వాత రెండవ జన్మ .యజ్ఞాలలో దీక్షవహిస్తే మూడవ జన్మ .వేద శాస్త్రాలు చదివే ముందు గాయత్రి చెప్పాలి .నిత్యస్నానం విధి .భారతం కర్ణ పర్వం లో శివుడు త్రిపురాసుర సంహారానికి భూమి రధంగా ,సూర్య చంద్రులు చక్రాలుగా గాయత్రి రధానికి పైనకట్టే త్రాడుగా ‘’గాయత్రీ శీర్ష బంధనా ‘’గా మారారని ఉంది .’’కస్సవితాకా సావిత్రీ స్తన యిత్నురేవ సవిత్రీ విద్యుత్సావిత్రీ సయత్ర  స్తన యిత్నుః’’-‘’తద్వి ద్యుద్యత్రవావిద్యు త్తత్ర స్తన ఇత్యుస్తే ద్వేయో నీతదేకం మిధునం ‘’అనే సావిత్త్ర్యు పనిషత్ లో చెప్పినట్లు మేఘాన్ని సవిత్రుడని ,మెరుపును సావిత్రిఅని భావన చేయాలి చంద్రుని సవిత్రునిగా ,నక్షత్రాలను సావిత్రిగ భావించాలి .గాయత్రి గురించిన జ్ఞాని శాశ్వతుడౌతాడని భీష్మ  పర్వం లో ఉంది .’’యోవా ఏతాం సావిత్రీ మేవ౦ వేద స పునర్మ్రుత్యుం జయతి’’గాత్రీ మంత్ర తత్వాన్ని గుర్తించినవాడు మృత్యువును జయిస్తాడని వేదమే చెప్పింది .

 ప్రపంచకర్త ఈశ్వరుడే .తార్కికులు’’జగతాం యది నో కర్తా కులా లేన వినాఘటః  ,చిత్రకారం వినా చిత్రం  స్వత ఏవభవేత్తతః ‘’అన్నారు –చిత్రకారుడు లేకుండా చిత్రం ,కుమ్మరి లేకుండా కుండా, రానట్లే ఈశ్వరుడు లేకుండా ప్రపంచం రాదు .చిత్ శక్తి , చేతనా శక్తి ,జడ శక్తీ అన్నీ శక్తి రూపాలే అని సప్త శతి చెప్పింది –‘’చిచ్చక్తి శ్చేతనా రూపా శక్తిర్జ డాత్మికా’’

   సంధ్యావందనం లో’’ హరి ,హర అభేద స్మరణం ‘’అనే అంశం ఉన్నది.

  ఇంకా చాలా చెప్పారు శాస్త్రిగారు .కాని అందులో చాలా వాటిని ఇప్పుడున్నకాలమాన పరిస్తి  స్థితులనుబట్టీ  ,ఉద్యోగ ధర్మాలను బట్టీ, అంటే నైట్ డ్యూటీలు, షిఫ్ట్ డ్యూటీలు ,ఒక్కోసారి ఇరవైనాలుగుగంటల డ్యూటీలు ఉన్న వాళ్ళు ,అలాగే అపార్ట్మెంట్ కల్చర్ లో ,మహిళలకు ఉన్న రుతుసంబంధ ఇబ్బందులు ,ఆడవాళ్ళూ ద్యూటీలలో ఉండటాలు  ,తప్పని సరి విదేశీయానాలు ,అక్కడ ఉద్యోగాలు మొదలైనవాటివలన అనుసరించటం కష్టం అని నేను వాటి జోలికి పోలేదు . దీనికి శాస్త్రిగారు మన్నిస్తారని భావిస్తాను .

  ఈ అమూల్యగ్రంథాన్ని(వెల-60రూపాయలు )పొన్నూరు బ్రాహ్మణ మహాసభ కార్యదర్శి ,ఆంద్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి శ్రీ పులిపాక వెంకట సత్య  సాయి వరప్రసాద్ గారు ప్రచురించి శాస్స్త్రిగారికి కుడిభుజంగా నిలిచారు .ఈ పుస్తకం ప్రతి బ్రాహ్మణుడికి అంది, మానసిక పరిణతి ,ఆధ్యాత్మికాభి వృద్ధి కలుగుతాయని విశ్వాసంతో రచయిత శాస్త్రిగారు, ప్రచురణకర్త వరప్రసాద్ గారు ఉన్నారు .వారి ఆశయం సఫలమవ్వాలని ఆశిద్దాం

శ్రీ గాయత్రీమాత సుందర ముఖచిత్రం తో పుస్తకం తేజో విరాజమానంగా ఉండటం ప్రత్యేకత .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం –

గౌతమీ మాహాత్మ్యం -28

40చక్ర తీర్ధం –

దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి దేవతలంతా హాజరవగా ,యజ్ఞ భోక్త శివుని అందరి ముందు దూషించి ద్వేషం పెంచుకొని ,పిలవకపోయినా వచ్చినకూతురు  దాక్షాయణి ని అవమాని౦చగా  ఆమె కోపోద్రేకం తో తండ్రిని వారించినా  ఆ మొండి ఘటం  వినకపోతే తనభర్త సర్వలోక శుభంకరుడైన శంభుని తనఎదుటే నిందావాక్యాలు పలకటం సహించలేక ఇక బ్రతకటం సతీ ధర్మం కాదని భావించి అక్కడికక్కడే తాను భస్మమై పోయింది .ఈ విషయం నారదుడు శివునికి తెలిపాడు .కోపించిన రుద్రుడు జయ ,విజయలను దక్షయజ్ఞం విశేషాలు అడిగి తెలుసుకొన్నాడు .

  ఉద్రేకుడైన రుద్రుడు ప్రమధగణాలతో ,భూతనాదులతో కలిసి దక్ష వాటికకు బయల్దేరి వెళ్ళాడు .దక్ష యజ్ఞానికి ఆహ్వాని౦పబడిన ఇంద్ర ,ఆదిత్యాది వసువులు ,రుగ్ యజు స్సామాలతో శ్రద్ధా తుష్టి ,పుష్టి ,శాంతి ,రుషా ,ఆశా జయా మతీ మొదలైన దేవకాంతలు లజ్జా సరస్వతీ భూమి ద్యౌ,శర్వరీ శాంతీ ,క్షాంతి ,సురభి నందినీధేనువు ,కామధేనువు ,కామ దోహిని, కల్ప వృక్షం ,పారిజాతం కల్ప లతాదులతో దేదీప్యమానంగా శోభాయమానంగా ఉంది .ఇంద్ర ,పూషా హరి లు మఖ పర్యవేక్షణ చేస్తున్నారు .అందరూ ఎవరికి ఇవ్వబడిన పనులు నెరవేరుస్తూ సందడి సృష్టిస్తున్నారు .

  అంతటి సంరంభంగా గా జరుగుతున్న దక్షవాటికకు  ,ముందుగా భద్రకాళీ సమేత వీరభద్రుడు ,ఆ వెనుక పినాకపాణి శూల దారి శివుడు వెళ్ళాడు .మహేశ్వరుని చుట్టూ వ్యాపించిన భూతగణాలు  క్రతు విధ్వంసం చేశారు .గొప్పకలకల౦  సృష్టించగా భయపడి కొందరు  పారి పోవటానికి ప్రయత్ని౦చారు  .కొందరు శివుని చుట్టూ చేరి స్తోత్రాలు చేశారు .కొందరు శంకరుని దూషించారు .ఇదంతా చూసి పూష శివుని చేరగా అతడి దంతాలు పీకేసి ఇంద్రుని వెంటపడితే’’ దౌడో దౌడు’’.వీరభద్రుడు భగమహర్షి కళ్ళు పీకి,సూర్యుని చేతులతో గిరగిరా తిప్పి భయంకర వాతావరణం కలిగించగా దేవతలంతా విష్ణువును శరణు వేడారు.శివుని రౌద్రాన్నుంచి తమందర్నీ రక్షించమని వేడారు .

   మహేశ్వర సంహారానిఅకి విష్ణువు చక్రాన్ని ప్రయోగించాడు .శివుడు దాన్ని అమాంతం మింగేశాడు .కాళ్ళు వణుకుతూ దక్షుడు మామగారి కాళ్ళు పట్టుకొని –

‘’జయ శంకర సోమేశ జయ సర్వజ్ఞ శంభవే –జయ కళ్యాణభ్రుత్ శంభో జయ కాలాత్మనే నమః –ఆది కర్త నమస్తే స్తు నీలకంఠ నమోస్తు తే –త్రిమూర్తయే నమో దేవత్రిథామ పరమేశ్వర –సర్వ మూర్తే నమస్తే స్తు త్రైలోక్యాదార కామద’’అంటూ గుక్క తిప్పుకోకండా స్తుతించాడు .ఆగకుండా మళ్ళీ అందుకొని –

‘’నమో వేదాంత వేద్యాయ నమస్తే పరమాత్మనే – యజ్ఞ రూప నమస్తే స్తు యజ్ఞ దామ నమోస్తుతే –యజ్ఞ దాన నమస్తేస్తు హవ్యవాహ నమోస్తుతే – యజ్ఞ హర్త్రే నమస్తేస్తు ఫలదాయ నమోస్తుతే ‘’

అని బుర్రతిరిగి  యజ్ఙ పురుషు  డెవరో ఎరుక కలిగి అహంభావమంతా వదిలి అల్లుడైన దక్షుడు మామగారు పరమ శివుని స్తోత్రించాడు .ఇంతటితో ఆగక –

‘’త్రాహి త్రాహి జగన్నాధ శరణాగత వత్సల –శంకరః సర్వభూతాత్మా కరుణా  వరుణాలయః’’అని శంకర నిజతత్వాన్ని ఆవిష్కరిస్తూ రక్షించు రక్షించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు .భోళాశంకరుడు ప్రసన్నుడై ఏం కావాలని కోరగా తనక్రతువు సంపూర్ణ  మవ్వాలని కోరగా సరే అని యాగం పూర్తి చేయించి ,భూతగణాలతో కైలాసం వెళ్ళిపోయాడు  ఆకరుణామయుడు.

  దైత్యులంతా వైకుంఠంచేరి శ్రీహరిని చేరి ప్రస్తుతించి మెప్పించగా వారికోరిక అడిగి తెలుసుకొని దానవ సంహారానికి తన చక్రాన్ని శివుడు మిగేశాడు కనుక తానేమీ చేయలేనని ఊరడించి పంపేశాడు .

  తర్వాత శ్రీహరి తన చక్ర సాధనకు గౌతమీ తీరం చేరి మహేశ్వర ధ్యానం చేస్తూ ,రోజూ సహస్ర సువర్ణ  కమలాలతో ఉమామహేశులను అర్చించాడు .ఒక రోజు వెయ్యికి ఒక కమలం తగ్గింది .వెంటనే కమలాదళాయతాక్షుడు తన కన్ను ఒకటి పీకేసి వాటికి చేర్చి సహస్ర కమలాతో పూజ పూర్తి చేయగా,శ్రీహరి అనన్య శివభక్తికి ఆనంద పరవశుడై ఉమా సహితంగా మహేశ్వరుడుప్రత్యక్షమవగా –

‘’త్వమేవ దేవా జానీషేభావ అంతర్గతం నృణాం-త్వమేవ శరణో ధీశోత్రకా భవేద్విచారః ‘’అని స్తుతించాడు –మానవ హృదయ భావం తెలిసినవాడివి ,అధీశుడివి ఐన నువ్వే నాకు శరణు .

  ఇలా స్తుతించి ఆన౦దా శ్రువులతో విష్ణువు శివునిలో లీనమయ్యాడు .భవానీ  సమేత శివుడు ప్రత్యక్షమై హరిని గాఢం గా హృదయానికి హత్తుకొని హరి కోర్కెలన్నీ తీర్చాడు .ఆ నేత్రమే మళ్ళీ విష్ణు చక్రమయింది .దేవతలంతా వచ్చి హరి హరులను స్తుతించి ఆశీస్సులుపొందారు . ఈ తీర్ధమే చక్ర తీర్ధంగా పేరు పొందిందని ,ఇప్పటికీ అది చక్రా౦కితమ౦ గా దర్శన మిస్తుందని సర్వకామాలను తీరుస్తుందని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2

గౌతమీ మాహాత్మ్యం -27

40-ఇలా తీర్ధం -2

బుధుడు తల్లి ఇలాకాంతను  ఏమికావాలని అడిగితె పుత్రుని ఇవ్వమని కోరగా లోక ప్రసిద్ధుడైన క్షత్రియ పుత్రుడు జన్మిస్తాడని చెప్పగా కొంతకాలానికి బుధ ,ఇలాకాంత లకు కుమారుడు జన్మించగా స్వర్గ లోకమంతా దిగి వచ్చి ఆశీర్వదించగా ఆబాలుడు గట్టిగా అరవటం చేత అతడికి ‘’పురూరవుడు’’ అని పేరుపెట్టి బుధుడు ప్రయోగ సహిత ధనుర్విద్య నేర్పాడు.తల్లి దుఖిస్తుండగా అతడు కారణం అడిగితె ఆమె ‘’పూర్వం నేను పొందిన దుఖం జ్ఞాపకం వచ్చింది ‘’అనగా దాన్ని వివరిచమని కోరగా ఆమె సవిస్తరంగా జరిగిందంతా చెప్పేసి,ఆమెకు పుంస్త్వం ఎలాగు వస్తుందని అడగగా బుధుని అడగమని పంపగా ,తండ్రిని చేరిఅడుగగా  ‘’మహా ప్రాజ్నా పుత్రా  !నాకు ఇలుడు తెలుసు.అతడు ఎలా స్త్రీ అయిందీ తెలుసు .దీనికి నువ్వు శివపార్వతులను ఆశ్రయించు వారే మార్గ దర్శకులు ‘’అనగా వాళ్ళను చేరటం ఎలా అని అడిగితేశివ పార్వతులు గౌతమీ తీరం లో ఉంటారని వారిని మెప్పించమని హితవు చెప్పాడు .

బుధ పురూరవులు ఇలా  గంగానదిని చేరిఉమాశంకరులను స్తోత్రాలతో మెప్పి౦చారు –

‘’యౌ కుంకుమేన స్వశరీరజేనస్వభావ హేమ ప్రతిమౌ సరూపౌ –యా వర్చితౌ స్కంద గణేశ్వరాభ్యాం ,తౌ మే,శరణ్యౌశరణం భవేతాం’’

‘’సంసార తాపత్రయ దావా దగ్ధాః-శరీరణో యౌపరి చింత యంతః-సద్యః పరాంనిర్వృతిమాప్ను వంతి-తౌశంకరౌ మే శరణం భావేతాం ‘’అంటూ బుధ, ఇలా లు స్తుతించారు భావం –బంగారు వన్నె శరీరం నుంచి పుట్టిన కుంకుమ తో సమానమైన రూపం కలవారో ,ఎవరు స్కందుని ,గణపతి చేత పూజింప బడినారోఅలాంటి పార్వతీ పరమేశ్వరులకు శరణు .

సంసార తాపత్రయ మనే దావాగ్ని చే దహింప బడే మానవులు ,ఎవరిని భావించి ,పరమానందం తృప్తీ పొందుతారో అలాంటి ఉమామహేశ్వారులు మాకు శరణు  .

పురూరవుడు కూడా ‘’ఎవరివలన ఈ ప్రపంచం పుట్టి పెరిగి లయమౌతుందో అలాంటి గౌరీ శంకరులను శరణు వేడుతున్నాను ‘’అని ప్రార్ధించాడు .ఉమాదేవి ఇతడిని ఏం కావాలని అడగగా ఇలా రాజు తెలియక ఉమావనం లో ప్రవేశించిస్త్రీగా మారాడు.ఆయనకు పుంస్త్వం ఇవ్వు ‘’అని కోరగా ఆమె శివాజ్ఞతో సరేననగా శివుడు వారిని గౌతమీ స్నానం చేస్తే  అంతా సుఖమౌతుందని చెప్పాడు .

అలాగే వారు గౌతమీ  స్నానం చేయగా బుధుని భార్య శరీరం నుంచి నీరు స్రవించి అయే లో నుంచి నృత్య గీత లావణ్యాలతో  గంగాజలం లో కలిసిపోయింది .అక్కడి నుండి నృత్య ,గీత లావణ్య (సౌభాగ్యా )నదులేర్పడి గంగలో సంగమించాయి .ఇవే పుణ్య సంగమ త్రయం .

ఉమామహేశ్వర వరం తో ఇలాకాంత ఇలారాజుగా మారి రాజు మహాభ్యుదయం  కోసం అశ్వ మేధ యాగం చేశాడు .అప్పుడు చతుతురంగ బలాలను ,రాజ్యాన్ని దండకారణ్యం లో ఉ౦చేశాడు.అక్కడ వెలసినదే ‘’ఇలాపురం ‘’.తర్వాత తన పుత్రులకు రాజ్యపాలన అప్పగించి ,పురూరవునికి ఈ కొత్త రాజ్యం కు రాజును చేశాడు .ఇలభూపతి పుంస్త్వం పొంది ,యాగం చేసి ,ఎక్కడ నృత్యగీత సౌభాగ్యనదులేర్పడి గంగా సంగమం చేశాయో ఆ గౌతమి ఉభయ తీరాలలో 16శుభ తీర్దాలేర్పడ్డాయి .ఇక్కడే ఇలేశ్వర శివుడు కొలువై ఉన్నాడు .ఇక్కడ చేసిన అన్ని కార్యాలు సర్వ శుభాలనిస్తాయి .అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్  -5-12-18-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -26

గౌతమీ మాహాత్మ్యం -26

39-ఇలాతీర్ధం

బ్రహ్మహత్యాదిపాపాలను తొలగించే ఇలా తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ చెప్పాడు .వైవశ్వత మన్వంతరం లో ఇలుడు అనే రాజు సైన్యం తో వేటకు వెళ్ళాడు .అక్కడ మంత్రులతో వాళ్ళందరినీ తనకొడుకు పాలిస్తున్న స్వదేశానికి తిరిగి వెళ్ళి తనకొడుకు రక్షణగా ప్రజాపాలనలో సహకరించమని  చెప్పి ,తాను  హిమాలయానికి వెళ్లి రత్నాలతో ఉన్న ఒక గుహలో  మన్యువు అనే యక్షుడు భార్య ‘’సమా ‘’తోఉంటున్న గుహలోకి  వెళ్ళాడు .భార్యాభర్తలు మృగ రూపం లో హాయిగా విహరించటం చూశాడు .తన సైన్యం తో ఇలా రాజు  ఆగుహలో కూర్చున్నాడు .

యక్షుడు భార్యతో తిరిగి వచ్చి తనగుహను ఇలుడు ఆక్రమించటం సహించక ,అతని సైన్యాన్ని ఎదుర్కొనే దమ్మూ లేక ,తన వాళ్ళతో ఎలాగో అలా ఇలుని బయటికి పంపే ఏర్పాటు చేయమన్నాడు .వాళ్ళు రాజుదగ్గరకు వచ్చి గుహ వదిలి వెళ్ళమని లేకపోతె యుద్ధం లో ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు .రాజు యక్ష గణంతో యుద్ధం చేస్తూ పది రాత్రులున్నాడు .యక్షుడు అడవుల్లో మృగరూపలతో సంచరిస్తూ ఇల్లూ లేక,సైన్యమూ లేక విచారించాడు .భార్యతో సంప్రదింఛి ఆమెను ఆడలేడిగా మారి  ఉమావనం లో సంచరించమని  ,రాజు వేట నెపం తో అక్కడికి వచ్చి స్త్రీ రూపం తోదగ్గరకు చేరతాడని చెప్పగా యక్షిణి’’నువ్వు ఎందుకు వెళ్ళలేవు ?’’అని ప్రశ్నించగా యక్షుడు ‘’హిమాలయాలో శంకరుడు దేవగణంతో సచారిస్తుంటే పార్వతీ దేవి ఏకాంతం లో ఆయనతో తనకు రహస్యంగా సంచరి౦చటానికి ఒకవనం ఏర్పాటు చేసి దానికి ఉమావనం పేరుపెట్టి  గణపతి ,కార్తికేయుడు, శివుడు సహా ఎవరు అందులో ప్రవేశించినా స్త్రీ రూపం పొందేట్లు చేయమని కోరింది .శివుడు అలాగే చేశాడు. కనుక పురుషులకు ఆవనం లో ప్రవేశం లేదు కనుక నేను వెళ్ళలేను ‘’అని వివరించాడు .

భర్త మాట విని యక్షిని ఆడ లేడి యై ఉమావనం లో తిరుగుతుంటే ఇలామహారాజు ఆలేడి ని వేటాడటానికి వెంబడించిఉమావనం ప్రవేశించి స్త్రీ రూపం పొంది ఆశ్చర్యపోగా ఎదుకు తనకు ఇలా జరిగిందని లేడిని అడిగితె అది ‘’హిమవత్పర్వతగుహలో నా భర్త యక్షుడున్నాడు .నువ్వు సైన్యం తో గుహ ఆక్రమిస్తే నేను నిన్ను బయటికి పంపటానికి ఆడలేడి రూపం తో వచ్చాను .ఉమావనం లో ప్రవేశించిన పురుషుడు స్త్రీగా మారుతాడని శివుని శాపం ఉంది ‘’అనగా స్పృహతప్పి కిందపడితే యక్షిణి ఓదార్చి మళ్ళీ మగరూపం రాదుకనుక  స్త్రీ విద్యలైన నృత్య సంగీతాలను నేర్చుకోమని చెప్పింది .తను మళ్ళీ పురుషునిగా మారే విధానం చెప్పమనగా ‘’సోముని పుత్రుడు బుధుడు ఈవనానికి తూర్పున ఉన్న ఆశ్రమ౦ లో ఉన్నాడు ,రోజూ తండ్రి  ఆశీర్వచనం కోసం  ఈమార్గం లోనే వెడతాడు ,నువ్వు అతనిని ప్రసన్నం చేసుకొని ఫలితం సాధించు ‘’అని చెప్పి అంతర్ధానమై గుహను చేరి భర్తకు చెప్పి ఆనందం కలిగించింది .

ఉమావనం లో ఆడ రూపం లోని ఇలుడు నృత్యగానాలతో కాలక్షేపం చేస్తూ ఉండగా బుధుడు రావటం చూసి మోహపడి తనభార్యవు కమ్మని కోరగా అంగీకరించగా ఇద్దరూ బుధ నివాసంలో హాయిగా సుఖించారు  .

సశేషం

మీ-గబ్బిట-దుర్గాప్రసాద్ -4-12-18-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి

ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి

 

Beneath North Sea 8,000 Years Ago Reveals Its Secrets

A vast plateau of land between England and the Netherlands was once full of life before it sank beneath what is now the North Sea some 8,000 years ago. Archaeologists now hope to find out what the vast landscape looked like before it slipped beneath the salty water so long ago.

To do this, they’ve hauled up cores of sediment from the bottom of the North Sea in an area called Doggerland. It’s named for the shoal called Dogger Bank in the southern part of the North Sea, which in turn is named for a type of medieval Dutch fishing boat called a dogger. The land became ice-free about 12,000 years ago, after the end of the last ice age.

More recently, about 8,000 years ago, the plateau of land between what is now the east of England and the Netherlands was flooded by the sea. This brought an end to the forests and animal life that had colonized the region from other parts of Europe, including early human communities. [See Images of a Treasure Trove Found Beneath North Sea]

The chief marine geoarchaeologist for Wessex Archaeology, Claire Mellett, said that 10 of the sediment cores taken by an offshore wind-farm developer from the North Sea contained ancient deposits of peat. This organic material can form only in marshes on land.

Those cores are now being studied for clues about the flooded region. This research includes studies of ancient pollen grains and other microscopic fossils contained in the peat samples, which would reveal details of the landscape and climate of Doggerland before it sank.

The latest sediment cores were taken from the Norfolk Boreas site, a wind farm about 45 miles (72 kilometers) from the shore at its nearest point that covers 280 square miles (725 square km). Mellett said that the sediment cores containing ancient peat deposits covered a fairly wide area of around 32 square miles (85 square km) of the flooded Doggerland region. This was the first time that sediment cores covering such a wide area were recovered from the underwater region, she said

Researchers say that the sediment cores contain an environmental record of the flooded Doggerland region over more than 4,000 years, from the end of the last ice age about 12,000 years ago.

Researchers say that the sediment cores contain an environmental record of the flooded Doggerland region over more than 4,000 years, from the end of the last ice age about 12,000 years ago.

Credit: Wessex ArchaeologyThe researchers cross-referenced the core locations with remotely sensed images of the seafloor where the samples were taken, which could show the hidden structure of the flooded landscape.

“The remote sensing provides us an image of the seabed, but no physical material — so when we get the cores, that gives us the actual evidence,” Mellett told Live Science.

“We can see where the old rivers are. We can see the peat lands, and we can see the extent of them, so we know how big they are. We’re essentially reconstructing the geography of the North Sea around 10,000 years ago,” she said.

The peat deposits were particularly important because they contain an environmental record of the changing landscape and climate of the area, spanning from about 12,000 to 8,000 years ago, Mellett explained. [30 of the World’s Most Valuable Treasures That Are Still Missing]

The Doggerland region, now beneath the North Sea, was home to forests, wildlife, and early humans from after the last ice age, about 12,000 years ago, until it flooded about 8,000 years ago.

The Doggerland region, now beneath the North Sea, was home to forests, wildlife, and early humans from after the last ice age, about 12,000 years ago, until it flooded about 8,000 years ago.

Credit: Wessex Archaeology“Not only is the peat hard evidence of a former land surface, [but] it [also] has excellent preservation of microscopic fossils — and that is what gives us the information to reconstruct climate, sea levels and what trees were growing in the area,” she said.

“We also look at things like microscopic charcoal, so we can see when there has been a big burning event. We don’t know whether that burning was driven by humans or whether it was a natural forest fire, but we can all see all that within these peat deposits,” she said.

Some human remains — including part of an ancient skull and several human artifacts, like fragments of stone tools — have been recovered by fishing and dredging operations in the parts of the North Sea that cover the flooded Doggerland region.

The work being done by Wessex Archaeology could help scientists find more potential sites of early human habitation in Doggerland, Mellett said.

“Our ultimate endgame will be to produce maps of the area at different time periods, so we’ll do one for just after the ice age. We expect it will be quite a sparse landscape without many trees, a bit like Arctic Canada today.

“And then, the trees start to come back as the climate warms. We know that the woodland was quite open and that there were wide areas where we had marshlands growing, so we’ll do another reconstruction for that.”

Finally, she said, “we can see when the sea level starts to rise and the area floods. And then you get drowning of the area. You get tidal creeks, and you get bits of coastline.”

One of the lasting mysteries of Doggerland is just how quickly the region flooded, and the sediment studies by Mellett and her colleagues will try to answer that question.

“The life span of the people at this time was about 30 years, so [even] if sea level was rising, they probably wouldn’t have been able to observe it,” Mellett said. “But in geological history, it’s one of the fastest-rising sea levels that we’ve ever experienced.”

It might have taken only a few centuries for Doggerland to go from a forested plateau to being completely covered by the sea: “[it was] less than 1,000 years, and it might be closer to 500 years,” she said.

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం

గౌతమీ తీర్ధం -25

38-వృద్ధాసంగమ తీర్ధం

వృద్ధేశ్వర శివుడున్నదే వృద్ధాసంగమ తీర్ధం .వృద్ధ గౌతమమహర్షి కి ముక్కు లేని కొడుకు పుట్టాడు .వాడు వైరాగ్యంతో దేశ సంచారం చేసి ఏ గురువువద్దా చేరకుండా సిగ్గుపడి ,మళ్ళీ తండ్రిని చేరగా ఉపనయనం చేశాడు .బ్రహ్మ సూత్రం మాత్రమె ధరించి బాల గౌతముడు వేదా ధ్యయనం లేకుండా చాలాకాలమున్నాడు .కాని నిత్యం అగ్నికార్యం మాత్రం శ్రద్ధగా చేసి బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు .వయస్సు పెరిగిందికాని పిల్లనిస్తానని ఎవరూ ముందుకు రాలేదు .తీర్ధ యాత్రలు చేస్తూ పుణ్య తీర్ధాలలో మునుగుతూ శీత గిరి చేరి ,అక్కడొక గుహ లో ప్రవేశించాడు .

  ఆ గుహలో ఒక శిధిల అ౦గాలున్నకృశించిన ఏకాంతంగా తపస్సులో ఉన్న వృద్ధ ఉత్తమ స్త్రీ  కనిపింఛి ,ఆమెకు   నమస్కరించబోతే వారించి ‘’నువ్వు నాకు గురువు అవుతావు కనుక నమస్కారం చేయద్దు ‘’అనగా అప్రయత్నంగా నమస్కార భంగిమలో ‘’నువ్వు తపస్వివి వృద్దురాలివి ,గుణ గరిస్టవు .అల్పవిద్యా, అల్ప వయస్సు ఉన్న నేను నీకు ఎలా గురువు నౌతాను ?’’అని ప్రశ్నించగా ఆమె ‘’ఆర్స్టి ణేషుడనే ఆయన ప్రియ పుత్రుడు ధర్మవంతుడు ,శూర ,క్షత్రియ ధర్మావలంబి .మృగయావినోదం లో వేటకు వెళ్లి సైన్యం తో సహా  ఈ గుహలోనే విశ్రాంతి తీసుకున్నాడు .ఆ రాజు గ౦ధర్వ రాజ కన్య సుశ్యామ ను చూసి కామింఛి సుఖించి ఒక ఆడపిల్లను నన్ను  కని, మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు . మా అమ్మ ఎవడు ఈ గుహలో ప్రవేశిస్తే వాడే నీ మొగుడు అవుతాడు ‘’అని చెప్పి మా  ఆమ్మసుశ్యామ కూడా వెళ్ళిపోయింది .ఇంతవరకు ఈ గుహలో ఏ పురుషుడూ ప్రవేశించలేదు. నువ్వే ఇక్కడికి వచ్చినమగాడివి .నా తండ్రి వెయ్యి ఎనిమిదేళ్ళు రాజ్యపాలన చేసి ,,ఇక్కడే తపస్సుచేసి స్వర్గం చేరగా, ఆయన తమ్ముడు రాజ్యానికి వచ్చి వెయ్యి పదేళ్ళు రాజ్యమేలి స్వర్గం చేరాడు .నేను అప్పటినుంచి ఒక్కదాన్నే ఇక్కడే ఉన్నాను .నేను  తలిదండ్రులు లేని ఒంటరి దాన్ని .స్వతంత్రురాలను. ఇంతవరకూ పెళ్లి చేసుకొనే లేదు .సదాచార సంపన్ననైన క్షత్రియ పుత్రికను .పురుషార్ధ వ్రతస్తురాలిని కనుక నన్ను పెళ్ళాడు ‘’అన్నది .

  గౌతముడు తాను వందేళ్ళ వయసువాడనని ,ఆమె తనకంటే ఎక్కువ వయసున్న వృద్ధ అనీ జతకుదరదని చెప్పాడు .ఆమె ‘’పూర్వమే నువ్వు నాకు భర్తగా నిర్దేశి౦ప బడ్డావు  .ఇంకొకరిని చేసుకోను .నిన్ను బ్రహ్మ నాకు ఇచ్చాడు .నువ్వు  పెళ్ళాడకకపోతే నీ ఎదుటే ఆత్మహత్య చేసుకొంటాను ‘’అనగా గౌతముడు తాను విద్యా,ధన విహీనుడనని,కురూపినని ,తపస్సు చేయని వాడినని కనుక వరుడిగా తగనని  తనకు మంచి రూపమిచ్చి విద్యా తపస్సు కలిగిస్తే వివాహం చేసుకొంటానని చెప్పాడు .

 వృద్ధ తాపసి ‘’నేను తపస్సుతో సరస్వతీ దేవిని ,రూపవంతుడైన వరుణుని ,రూప దాత అగ్నిని ప్రసన్నం చేసుకొన్నాను .వాగీశ్వరి నీకు విద్య ,అగ్ని దేవుడు నీకు సుందర రూపం ప్రసాదిస్తారు ‘’అని చెప్పి వారిద్దరిని,సూర్యుని  ప్రార్ధించి గౌతముని విద్యా రూప గుణసంపన్నునిగా చేసింది .అప్పుడు ఆ ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .అనేక సంవత్సరాలు ఆ వృద్ధ తాపసితో అ విప్రోత్తముడు  ఆ గుహలోనే స్వర్గ సుఖాలు అనుభవించాడు .కొంతకాలానికి వసిష్ట వామదేవాది మునులు తీర్ధ యాత్రలు చేస్తూ ఆగుహలోకి వచ్చారు .ఈదంపతులు వారందరికీ స్వాగత సత్కారాలు చేశారు .అందులో కొందరు ఈ ‘’ముసలిపెళ్ళాం ,పడుచు మొగుడు ‘’జంటను చూసి నవ్వి ఆమెను ‘’అతడు నీకు కొడుకా మనవడా ఏమౌతాడు’’అని పరిహాసంగా అడిగారు .కొందరు మాత్రం ‘’వృద్దునికి యౌవనవతి భార్యకావటం విష తుల్యం .వృద్ధురాలికి యువకుడు భర్త అవటం అమృత తుల్యం .చాలాకాలానికి ఇష్ట, అనిష్ట సమాయోగం చూశాం ‘’అని  వారి ఆతిధ్యం తీసుకొని వెళ్ళిపోయారు .వారిమాటలకు ఇద్దరూ బాధ పడ్డారు..ప్రాజ్నులవటం వలన సిగ్గు కూడాపడ్డారు .తర్వాత ఇద్దరూ అగస్త్య మహర్షిని  సందర్శించి ‘’శ్రేయస్సు భుక్తీ ముక్తీ ఇచ్చే తీర్ధం తెలియజేయమని’’ కోరగా ఆయన ‘’’’గౌతమీనదికి వెడితే, మీ కోరికలు తీరుతాయి. మీ గుహకు వచ్చిన మునులు అన్నమాటలు విన్నాను .నా మాట విని గౌతమీస్నానం చేసి అన్నీ సాధించుకొండి’’అని ఆశీర్వది౦చి పంపాడు . వృద్ధభార్యతో యువ గౌతమ మహర్షి  గౌతమీనదిని చేరి ,శివ ,విష్ణు  గంగానదికోసం  తీవ్ర తపస్సు చేసి మెప్పించాడు .

‘’భిన్నాత్మానాం మత్ర భవే త్వమేవ శరణం శివ –మరుభూమాధ్వగానాం విటపీవప్రియాయుతః –ఉచ్చా వచానాం భూతానాం సర్వథా పాపనోదనః –సస్యానాం నిఃశ్రేణి స్త్వం పీయూష తరంగిణీ –అథో గతానాం తప్తానాం శరణం భవ గౌతమీ ‘’  అని స్తుతించాడు .

 భావం –పార్వతీ పతీ శివా !మరుభూమిలో బాటసారులకు వృక్షంలాగా ,ఈ సృష్టిలో భిన్నాత్ములకు నువ్వే శరణు .ఓ కృష్ణా !అనావృష్టి తో ఎండే పంటలకు మేఘం లాగా ,ఉచ్చ –నీచ ప్రాణుల పాపాలను తొలగించ గల సమర్దుడవు .అమృత మయీగౌతమీ !వైకుంఠానికి నిచ్చెన ఐన నువ్వు అధోగతి పాలైనవారికి ,బాధా తప్తులకు శరణం అవ్వాలి ‘’

  స్తుతికి సంతోషించిన గౌతమి ‘’సకలోపచారాలతో ,మంత్రయుక్తంగా నా జలంతో నీ భార్యను అభిషేకించు .సుందర రూపం తో ,యవ్వనవతి అవుతుంది .ఆమె కూడా నిన్ను అభిషేకిస్తే నువ్వూ సర్వ లక్షణ సంపన్నుడవై,ఆకర్షణీయ రూపం పొందుతావు ‘’అని ఇద్దరికీ చెప్పింది అలాగే ఇద్దరూ చేయగా ఇద్దరూ సుందరరూపాలు పొందారు .వారిద్దరూ ఎక్కడ అభిషిక్తులయ్యారో అదే’’వృద్ధా నదీ ‘’గా ప్రసిద్ధమైంది .గౌతముడు అందరి చేత’’ వృద్ధగౌతముడు ‘’అని పిలువబడ్డాడు .గౌతముని భార్య వృద్ధా ‘’అమ్మా గౌతమీ!ఈ నది నాపేర ‘’వృద్ధానది’’గా పిలువబడాలి .నీతో జరిగే సంగమం ఉత్తమ తీర్ధమవ్వాలి .ఈ సంగమం రూప సౌభాగ్య సంపదలతో ,పుత్ర ,పౌత్ర ప్రవర్ధన కారియై ,ఆయురారోగ్య కళ్యాణీ హేతువై ,జయ ప్రీతి వృద్ధికరమై ,స్నాన హోమాదుల చేత పితరులకు పావనకారియై విలసిల్లేట్లు చేయి ‘’అని ప్రార్ధించగా గంగ తథాస్తు అన్నది .ఇక్కడ గౌతముడు స్థాపించిన లింగం ‘’వృద్ధా’’అని పిలువబడుతోంది .అప్పటినుండి ఇది వృద్ధా సంగమ తీర్ధం అయింది అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి

గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి

ప్రవరా నదీ సంగమం లో సిద్దేశ్వర శివుడుంటాడు .ఇక్కడే దేవదానవులకు మహా సంగ్రామం జరిగింది .ఇద్దరి మధ్య సదవగాహన కోసం మేరు పర్వతం చేరి సమాలోచన జరిపారు .అందరూకలిసి అమృతం ఉత్పత్తి చేసి తాగి అమరులై లోకపాలన చేద్దామని ,ఇక యుద్ధాలు చాలిద్దామని ,వైరం వదిలి సఖ్యం తో మెలిగి స్నేహంగా సంతోషంగా ఉందామని ,గతం గతః గ శత్రుత్వాన్ని మర్చిపోదామని ,స్నేహంగా ఉంటే త్రిలోకాధిపత్యం కైవల్యం కూడా సాటి రాదనీ భావించారు  .మంధర పర్వతాన్ని కవ్వం గా ,వాసుకిని తాడుగా చేసిసముద్ర మధనం చేయాలని నిశ్చయించి మధించటం ప్రారంభించారు .

 సముద్ర మధనం లో ముందుగా అమృతం లభించింది .వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు ముందు అందరూ కలిసి అమృతం సమానంగా జుర్రేద్దామనుకొన్నారు .మళ్ళీ ఒక చోట శుభముహూర్తం లో చేరి అమృతం పంచుకొందామను కొని వెళ్ళిపోయారు .రాక్షసులు వెళ్ళిపోగా దేవతలు ఎట్టి పరిస్థితి లోనూ అమృతం రాక్షసులకు దక్కరాదనుకొనగా గురువు బృహస్పతి సరే అని ,దానవులకు దక్కకుండా  అమృతాన్ని తాగేయమన్నాడు .ఎక్కడ తాగాలని అడుగగా,బ్రహ్మ దగ్గరకు వెళ్ళమన్నాడు బ్రహ్మతోకలిసి హరి దగ్గరకు వెళ్ళగా ,త్రిమూర్తులు దేవతలు ,గంధర్వులుకిన్నెరరాలు మేరు పర్వత గుహ చేరి హరి రక్షకుడుగా అమృత పానం మొదలుపెట్టగా ఆదిత్యుడికి అమృతపానానికి యోగ్యులేవరో  నిర్ణ యించేఅధికారమిచ్చారు  .శివుడు అమృతం పోసేవాడు .ఈ విషయం అత్యంత రహస్యం .కాని రాహువుకు మాత్రం తెలిసి ,దేవ రూపం పొంది వాళ్ళ సరసన కూర్చున్నాడు .గ్రహించిన సూర్యుడుశివుడికి చెప్పాడు .అప్పటికే సోముడు రాహువుకు అమృతం పోశాడు .శివుడు విష్ణువుకు చెప్పగా చక్రాయుధం తో రాహువు తలనరికాడు .వాడి శిరస్సు అమరమైంది .

  శిరస్సు లేని రాహువు శరీరం నేలమీద గౌతమీనది దక్షిణ ఒడ్డు న పడి భూమిని కంపిప జేసింది  .  రాహుదేహమూ అమృతమైంది .అమిత బలపరాక్రముడైన రాహువు శిరస్సు మొండెము కలిపితే వాడు లోకాన్ని నాశనం చేస్తాడు కనుక వాడి దేహాన్ని దహనం చేద్దామనుకొన్నారు దేవతలు .శివుడు తన అర్ధాంగి ,మాతృకలతో పంపాడు .ఆమె శివుని ఆయుధం ధరించి భూమిపై వాడి దేహం  భాక్షించాలను కొన్నది .దేవతలు శిరస్సును మేరు పర్వతం మీద కాపలాకాశారు .రాహు శరీరం తో దేవి చాలాకాలం యుద్ధం చేసి౦ది ..రాహు శిరస్సు దేవతలతో ‘’నా శరీరం చీల్చి అందులోని ధనరాశులను లాగేస్తే నా శరీరం క్షణం లో భస్మమౌతుంది ‘’అని ఉపాయం చెప్పింది .ఆనంది౦చిన సురలు రాహువును  గ్రహంగా చేశారు .ఈశ్వరీ శక్తి రాహువు మొ౦డాన్ని చేదించి ధనరాశులు లాగేసి వాడి శరీరాన్ని భక్షించింది .ఈ శక్తికే భద్ర కాళి , కాళరాత్రి అనే పేర్లున్నాయి .అంబిక లో ఉన్న ఉత్కృష్ట రసం ప్రవహించి ప్రవర అనే నది అయింది .ఆ శరీరం లోని  లోని అమృతాన్ని దేవి భక్షించింది .

  రాహు దీహం నుండి ఉత్పన్నమైన రుద్రుని శక్తితో కూడిన ప్రవరానది అమృత నది అయింది .ఇందులో అయిదు వేల తీర్ధలున్నాయి .అన్నిటిలో శివుడు ఉంటాడు .దేవతలంతా ఆనదిని దీవించారు .ప్రవరా నది గంగతో కలిసిన సంగమం ప్రవరాస౦గమం .ప్రవరా నది మహా నదిగా వర్ధిల్లింది అని బ్రహ్మ నారదుని తెలియజేశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు

గౌతమీ మాహాత్మ్యం -22

35-విశ్వామిత్రాది తీర్దాలు

ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుని దగ్గరకు నారద ,తు౦బురులొచ్చి ,ఆతిధ్యంపొంది అయన అడిగిన ‘’పుత్రులతో ఏం పని ‘’?ప్రశ్నకు సమాధానం ఒకవిధంగా, వందవిదాలుగా, వెయ్యి విధాలుగ ఉందనీ  ,పుత్రుడు లేకపోతె మోక్షం రాదనీ ,పుత్రుని పొందిన తండ్రి స్నానం చేస్తే దశ అశ్వ మేదాలు అవబ్రుధ స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని ,పుత్రుని వలన ఆత్మ ప్రతిష్ట కలుగుతుందని ,అతడు అమరోత్తముడు అవుతాడని ,దేవతలు అమృతం తో అమరులైతే బ్రాహ్మణులు పుత్రునిచే అమరులౌతారని ,పుత్రుడు దేవ రుషి పితృ ఋణం తీర్చి తరి౦ప జేస్తాడని ,పుత్రుడు లేకపోతె వేదమూ వ్యర్ధమే నని స్నానతర్పణలు పనికి రావని  గడ్డాలు మీసాలతో నిష్ప్రయోజనమే నని ,స్వర్గ ప్రాప్తి, మోక్షం పుత్రుని వలననే కలుగుతాయని ,పుత్రుడే ధర్మార్ధ కామ మోక్షాలు ,పరలోకం ,పరం జ్యోతి ,సర్వ ప్రాణులను తరింప చేసేవాడు పుత్రుడే .కనుక పుత్రుడులేని జన్మ వ్యర్ధం ‘’అని నిష్కర్షగా చెప్పారు .

  ఈ సమాధానానికి ఆశ్చర్య పోయి హరిశ్చంద్రుడు తనకు పుత్ర సంతానం కలిగే ఉపాయం చెప్పమని వేడుకొన్నాడు  .క్షణకాలం తపస్సు చేసి వారిద్దరూ గౌతమీ స్నానం చేసి ,వరుణుని ప్రార్ధిస్తే కోరిక తీరుతుందని చెప్పారు .అలాగే చేశాడు. సంతసించిన అపాం పతి’’నీకు లోక త్రయాలంకారుడైన కొడుకునిస్తాం .ఆపుత్రునితో నువ్వు యజ్ఞం చేస్తే నీకు పుత్రుడు పుడతాడు ‘’అన్నాడు.అలాగే అని చెప్పి వరుణ సంబంధమైన చారు ద్రవ్యాన్ని సిద్ధం చేసి  భార్యకిచ్చాడు రాజా హరిశ్చంద్ర .దీనితో అతనివలన కుమారుడు జన్మించాడు .వరుణుడు వచ్చి ఆ పుత్రునితో యాగం చేయమని చెప్పాడు .రాజు ‘’దంతాలు రాని పశువు యజ్ఞానికి పనికిరాదుకదా ,వాడికి దంతాలొచ్చాక చేస్తా ‘’అన్నాడు .కొడుక్కి  పళ్ళురాగానే  మళ్ళీ  జ్ఞాపకం చేశాడు వరుణ .పూర్తిగా పళ్ళు వచ్చాక చేస్తానని సాకు చెప్పి పంపించేశాడు .అన్ని పళ్ళూ వచ్చాక వచ్చి మళ్ళీ జ్ఞాపకం చేస్తే ,పాతపళ్ళు  రాలి కొత్తవి వచ్చాక చేస్తాననగా వెళ్లి మళ్ళీ వచ్చి గుర్తుచేయగా వాడు ధనుర్విద్య నేర్వగానే చేస్తానని పంపేశాడు .

  హరిశ్చంద్రుని కుమారుడైన రోహితుడు అస్త్ర శస్త్రాది విద్యలు నేర్చి ,శత్రునాశ సమర్దుడై ,వేద శాస్త్రాలలో నిష్ణాతుడై 16ఏళ్ళకు యువరాజయ్యాడు .వరుణుడువచ్చి అతనితో కలిసి యాగం చేయమని చెప్పగా ,అతడిని పిలిచి వరుణునికోసం యాగం చేద్దాం రమ్మనగా  ఇదేమిటి అని ప్రశ్నిస్తే జరిగినదంతా కొడుక్కి చెప్పాడు .రోహితుడు తండ్రితో తాను  ముందుగా వరుణుడిని పశువుగా చేసి విష్ణువు కోసం యాగం చేస్తానన్నాడు  .దిమ్మ తిరిగిన వరుణుడికి కోపమొచ్చి హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి కలిగేట్లు  శపించాడు  .వెంటనే రోహితుడు ధనుర్బాణాలు ధరించి  గంగానదికి  తండ్రి తనను పుత్రునిగా పొందిన చోటుకువెళ్ళాడు .అ  ఆరేళ్ళ తర్వాత  ,తండ్రి వ్యాధి జ్ఞాపకం వచ్చి ,తనజన్మవలన తండ్రికి సుఖం లేకుండా పోయిందని చింతించి ,గంగాతీరం లో ఉన్న మహర్షులలో ఒకడైనముగ్గురు కొడుకుల తండ్రి  అజీగర్తుని చేరి ఆయన కృశించి ఉండటం చూసి కారణం అడిగాడు .తనకు కుటుంబ పోషణకు తగిన ఆదాయం లేదని ఏమి చేయాలో చెప్పమని రాకుమారుని అడిగాడు .అతడు అసలు ముని మనసులో ఏముందని ప్రశ్నించగా తానూ భార్య ముగ్గురుకోడుకులను పోషించ లేని పరిస్థితి లో ఉన్నానని ,వాళ్ళలోఎవరినైనా అమ్మేద్దమన్నా కొనే వారు లేరనగా, ఆమాట నిజమే అయితే తానుకొంటానన్నాడు .ముగ్గురిలో ఒకకోడుకును తనకు అమ్మమన్నాడు .పెద్దకొడుకు తనకు, చివరికొడుకు భార్యకు ఇష్టం కనుక  మధ్యవాడైన   ‘’’’ శునశ్శేఫుని  అమ్ముతానన్నాడు .వెల చెప్పమంటే ‘’వేయి ఆవులు వేయి నాణాలు ,వేయి వస్త్రాలు ‘’ఇస్తే ఇస్తానన్నాడు .అడిగినదంతా ఇచ్చేసి వాడిని కొని తండ్రిని చేరి అతడితో యాగం చేయమని చెప్పాడు .హరిశ్చంద్రుడు  బ్రాహ్మణుడు  యజ్న పశువుగా చేస్తే కులం వంశం క్షయమౌతాయి కనుక తానాపని చేయనని వాడిని తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు తండ్రి .ఇంతలో అశరీర వాణి ‘’ద్విజులతో ,మహర్షులతో కొడుకుతో గౌతమీ తీరానికి వెళ్లి క్రతువు చేయి  ‘’అన్నది .

  విశ్వామిత్ర  వశిస్టాది మునులతో హరిశ్చంద్రుడు గంగాతీరం చేరి’’ నర మేధయాగం ‘’చేయటానికి సంకల్పింఛి శునశ్శేఫు ని  యూప స్తంభానికి కట్టి యాగం మొదలు పెట్టబోగా విశ్వామిత్రుడు ‘’ శునశ్శేఫుని  యజ్ఞపశువుగా అంగీకరించండి .అతని శరీరం లో ప్రతిభాగం హవిస్సు అవుతుంది ‘’అనగా  హరిశ్చంద్రుని  సహా అంతా అంగీకరించారు .శునశ్శేఫుడు గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం చేసి ,యాగ హవిస్సులు భుజించే దేవతలను స్తుతించాడు .అప్పుడు దేవతలు ‘’ శునశ్శేఫుడు  లేకుండానే యాగం పూర్తి అవుతుంది ‘’అన్నారు .అందరూ జయజయ ధ్వానాలు పలికారు .హరిశ్చంద్ర యాగం నరమేధం లేకుండానే పూర్తయింది .విశ్వామిత్రుడు అందరి సమక్షం లో శున స్షేఫుని తన జ్యేష్ట పుత్రునిగా స్వీకరించాడు .మిగిలిన కొదుకులలో కొందరు  అయిష్టతను ప్రదర్శిస్తే వారిని శపించాడు . అంగీకరించిన కొడుకులను మెచ్చుకున్నాడు ముని .కౌశికుడు వరాలిచ్చాడు .ఇదంతా గౌతమీ నది దక్షిణ తీరం లో జరిగింది .ఇక్కడే హరిశ్చంద్ర ,శునశ్శేఫ ,విశ్వామిత్ర ,రోహిత మొదలైన ఎనిమిది వేల పద్నాలుగు తీర్దాలేర్పడ్డాయి  .ఈ కథ విన్నా, చదివినా పుత్ర సంతానం కలిగి ,మనసులోని కోరికలు తీరుతాయి అని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .

   సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-18-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం)

సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి పి.హెచ్ .డి .అందుకొని  ,హైదరాబాద్ పటేల్ కళాశాల ఉపన్యాసకులై ,సంస్కృత నలచరిత్ర,,ధర్మపురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ,మొదలైన సంస్కృతాంధ్ర గ్రంథరచన చేసిన ‘’సంస్కృత సాహిత్య రత్న ‘’విద్యాప్రవీణ ,ఒకప్పటి కరీం నగర్ ఇప్పటి జగిత్యాలజిల్లా ధర్మపురి వాస్తవ్యులు డా.కొరిడె రాజన్న శాస్త్రి ,శ్రీమతి సులోచనా దేవి గార్ల  పుత్రరత్నమే   . కొరిడెవిశ్వనాథశర్మ గారు .తండ్రికి దీటైన ,కొండొకచో తండ్రిని మించిన సంస్కృతాంధ్ర భాషా పండితులు. ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యాపకులుగా ప్రవేశించి, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన విద్వన్మూర్తి ,పరిపాలనా దక్షులు శర్మగారు ..

విశ్వనాధ శర్మగారు 4-6-1958 న కొరిడె వారి సంస్థానం  ,పవిత్రగోదావరీ తీరంలోని  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ధర్మపురిలో జన్మించారు .సంస్కృతం లో బి .వో.ఎల్ .,ఎం.ఏ .డిగ్రీలు పొందారు .’’లింగ పురాణం –విమర్శనాత్మక పరిశీలనం ‘’పై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్. డి.పరిశోధన కై రిజిస్త్రషన్ చేసి యున్నారు వ్యక్తిగత కారాణాలవలన గ్రంథంపూర్తి చేయలేక పోయారు .

సంస్కృతం లో 1- శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా )  2-పెద్దాపురం లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా ) ౩-దోమకొండ చాము౦డేశ్వరీ సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణి క్షమాపరధన స్తోత్రం తో పాటు )4-‘’ధర్మపురి వర్ణనము ‘’కావ్యం (అసంపూర్ణం )  రచించారు .తెలుగులో 1- భర్తృహరి సద్భావ లహరి(పరిశీలన వ్యాసాత్మక గ్రంథం) రాశారు. .శర్మగారు ప్రసిద్ధ అనువాదకులుకూడా  .1-లింగ పురాణం ను కీ.శే .డా .వి హన్మాన్ శర్మగారితో కలిసి అనువదించారు .2-బ్రహ్మ పురాణా౦తర్గతమైన 108 అధ్యాయాల బృహత్ సంస్కృత గ్రంథం ‘’గోదావరీ మహాత్మ్యం ‘’ను కూడా శ్రీ హనుమాన్ శర్మగారితో కలిసి అనువాదం చేశారు .మహా పౌరాణికులైన శర్మగారు తమ పితృపాదులు రచించిన ‘’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం ‘’కు తెలుగు వ్యాఖ్యానం రచించి సాహిత్య పిత్రూణ౦ తీర్చుకొన్నారు .తమ తండ్రిగారి జీవిత ,పాండిత్య సాహిత్య వైశిష్ట్యాన్ని ‘’బహుముఖ ప్రజ్ఞాశాలి ,,ఉభయకవిమిత్రుడు ,సంస్కృత సాహిత్య రత్న డా.కోరిడేరాజన్న శాస్త్రి గారు (మా నాన్నగారు )అనే వ్యాసం ద్వారా వెలువరించి పితృ భక్తిని ప్రకటించారు

.ప్రస్తుతం 1-కీ.శే .తు౦గూరి శివరామ శర్మగారి అసంపూర్తి పద్యకావ్యం ‘’కాదంబరీ సంగ్రహం ‘’కు 2-భర్తృహరి విజ్ఞాన శతకం కు 3-కీ.శే. శ్రీ తెలకపల్లి రామ చంద్ర మూర్తి (నల్గొండ )వారి ‘’హయగ్రీవ శతకం ‘’కు  తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నారు.తాను 38ఏళ్ళు పనిచేసిన కళాశాల విశిష్టతను తెలియ జేస్తూ ‘’సంస్కృతాంధ్ర విద్వజ్జన నిలయం ధర్మ పురీ సంస్కృతాంధ్ర విద్యాలయం ‘’పేరిట కళాశాల చరిత్ర రాశారు .

శర్మగారి సంపాదకత్వం లో 1-డా.వి.హన్మాన్ శర్మగారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక’’ 2-కవితా శ్రీ శిల శ్రీనివాస్ -3సంస్కృత ప్రొఫెసర్ ,ప్రసిద్ధ అవధాని డా. మాడ్గుల అనిల్ కుమార్ గారి ‘’కాదంబరీ చరిత్ర ‘’లోనూ ,4.శ్రీ సంగనభట్ల రామ కృష్ణయ్యగారి’’శ్రీ నృహరి శతకం ‘’5-శ్రీ గొల్లపల్లి రాం కిషన్ గారి ‘’లబ్ డబ్ ‘’ మొదలైన తదితర గ్రంథాలలోను భూమికలు రాశారు  .ముఖ పుస్తకములో పలు సంస్కృత గ్రూపు లలో వారి అభ్యర్ధన మేరకు ‘’సంస్కృత కృద్వృత్తులు  ‘’,సంస్కృత ఛందో వృత్తములు ‘’పేరిట అనేక పాఠములురచించారు .’’లఘు సిద్ధాంత కౌముదీ’’పాఠాలద్వారా వ్యాఖ్యానం అందిస్తున్నారు  .ఆకాశవాణి నుండి సుమారు 15సాహిత్య ప్రసంగాలు చేశారు .సప్తగిరి, ఆరాధనహనుమ ,మాలిక పత్రికలలో  వ్యాసాలు  రాశారు .మాంచి భావకవి ఐన శర్మగారు కొన్ని ముద్రిత ,అముద్రిత భావకవితలు రాశారు.సంస్కృత శ్లోకాలతోపాటు తెలుగులో శతాధిక సమస్యాపూరణాలుచేశారు .వీరి కవిత్వ ప్రశస్తికి జగిత్యాల తెలుగు భాషా సంరక్షణ సంఘం ,కౌసల్య తెలుగుపండిత శిక్షణశాఖ సంయుక్తంగా ‘’కవితా శశాంక ;;బిరుదప్రదానం చేసి సత్కరించాయి .

.ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లలో పరిశోధక పత్రాలు రాసి సమర్పించారు .  శర్మగారి విద్యాభ్యాసం అంతా ధర్మపురి లోనే జరిగింది .ఓరియెంటల్ స్కూల్ శ్రీ సీతారామలింగేశ్వర దేవాలయం అనే శివాలయం లోనే చాలా కాలం ఉండేది. ఇక్కడే చెట్లక్రింద అరుగులమీద చదువు సాగేది .కాలేజీ కూడా ఇక్కడే ప్రారంభమైంది .తర్వాత నూతనభవనాలలోకి మారింది .శార్మగారికీ శివాలయానికి అవినాభావ సంబంధం చాలాఉంది.వారి తాతగారి కాలం నుంచి ప్రతిదినశివార్చన నైవేద్యం సంప్రదాయం కొనసాగిస్తున్నారు .శివాలయం లోనే కార్తీక ,మాఘ మాసాలలో ,దత్త నవరాత్రులలో పురాణ ప్రవచనాలు చేస్తారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో బ్రాహ్మీ ముహూర్తములో జరుగు ధనుర్మాస విశేష పూజలో అంతర్భాగం గా ‘’ధనుర్మాస మాహాత్మ్య పురాణ ‘’ప్రవచనం చేస్తున్నారు  . .ప్రస్తుతం ఒక గృహిణి కోరికపై వారింట్లో తాము అనువదించిన  ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ .పురాణం చెబుతున్నారు ..పౌరాణిక శేఖరులు శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ఆధ్వర్యం లో అనేక పురాణ ప్రవచనాలు చేశారు .ఇది వారి వృత్తికాదు, ధార్మిక ప్రవృత్తి ..స్ఫురద్రూపం తో, వెడల్పు ముఖంతో, నుదుట తీర్చి దిద్దబడిన  విభూతి రేఖలతో ,చక్కని వెడల్పు అంచు మల్లెపూవులాంటి ధోవతీ,  అడ్డంగా భుజాలపై వ్రేలాడే ఉత్తరీయం తో బ్రహ్మ వర్చస్సు వెలిగిపోతూ  ,బ్రాహ్మీమయ మూర్తిగా ,రాజసం ఉట్టిపడే నడకలో మరో శ్రీనాధ కవి సార్వభౌమునిలా , అపర కాశీ విశ్వనాథునివలె  ఈ ధర్మపురి  విశ్వనాథ  శర్మ గారు గోచరిస్తారు . మంచి స్థితి పరులైన శర్మగారు బంగారానికి తావి అబ్బినట్లు, ఉదార గుణ సంపన్నులు .తమ ‘’కొరిడె సాహితీ సంస్థాన విజయాలకు చిహ్నంగా ,తమ కుటుంబ ,వంశ కీర్తి ప్రతిష్టలకు ,వినయవివేక సంపత్తికి గౌరవ భూషణ౦ గా ,  తమ రెండస్తుల మేడకు ‘’విజయ భూషణం ‘అని సార్ధక నామకరణం చేశారు .

శర్మగారిధర్మపత్ని  శ్రీమతి జయ లక్ష్మిగారు శర్మగారి కళాశాలలో శిష్యురాలు . గొప్ప విదుషీమణి .ఈ దంపతులు అతిధి మర్యాదలకు పెట్టిందిపేరు  .బ్రాహ్మణ్యం ఎవరొచ్చినా తమ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టకుండా పంపరు .ఆమె ప్రవరాఖ్యుని ధర్మపత్ని లాగా ‘’వండనలయదు వేవురు వచ్చి రేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి  ,నడికి రేయైన’’ అనే సంప్రదాయం పాటించే ఉత్తమ గృహిణి .

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు .మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .

ఆధారం –శ్రీ విశ్వనాథ శర్మగారు నాకు ధర్మపురిలో 28-10-18 ఆదివారం వారింటిలో ఆత్మీయంగా అందజేసిన బృహద్గ్రంథం-‘’గౌతమీ మహాత్మ్యం

గీర్వాణ కవితా విశ్వనాథీయం ‘’.

శర్మగారు’సంస్కృతం లో ’1-బాల్య స్మృతిః’’అనే 7శ్లోకాలు రాసి ,తమ చిన్ననాటి జ్ఞాపకాలను అక్షర బద్ధం చేశారు . అ౦దు లో మొదటి, చివరి శ్లోకాలు –

1-‘’అహం బాల్యకాలే సదామిత్రవర్గో –సమీపస్థ గోదావరీ  వారి మధ్యే –ప్రభాతే నిమజ్జ ర్ధ మేవాగమం తు –జలే క్రీడనాయ వ్యతీతోహి తుస్టయా’’

7-తదీయాచ్చ విద్యాలయాన్మోదపూర్ణః –వినిర్గత్య సాయం పునర్మందిరం చ-వ్యతీతోహి కాలః ముదా క్రీడనాయ-అహో బాల్యకాలః  స్మృతి ర్మాధు రీ హి.’’

ఇలా బాల్య కాలక్రీడా ,విద్యలపై తమకున్నమక్కువను  స్పష్టంగా తెలియ జేశారు .

2-చాము౦డేశ్వరీ సుప్రభాతం –

‘’జాగృహిత్వం మహాదేవి –జాగృహి దేవి చండికే –జాగృహి దోమ కొండేశి-లోక రక్షణ హేతవే ‘’

‘’రాత్రా వాప్త తమః సుదీర్ఘ పటలైః హ్యందీ కృతం వారిజం –ప్రాతర్ భాస్కర రశ్మిభిఃస్వనయనా  వున్మీల్య తత్పంకజం –సామీప్యం తవ పాదయోశ్చగమితుం భక్తా గ్రహస్తే స్థితం-చాముండేశ్వరి దోమకొండ నిలయే తే సుప్రభాతం శివే  ‘’

స్తోత్రం -భక్తకల్పవల్లికే ! సుభక్తకోటిపాలకే !

భక్తవైరిభంజని ! త్వమార్తిబాధవారిణీ,ఋ

శిష్టకర్మమోదినీ విరక్తమోక్షదాయినీ

దోమకోండచండికే ! జయోఽస్తు తే నిరంతరమ్.

ప్రపత్తి-1) ఆద్యా త్వం జగతాం త్వమేవ జననీ మాయా పరాదేవతా
త్వం శక్తిత్రయరూపిణీ త్వమనఘా విద్యా హ్యవిద్యా పరా
క్షేత్రజ్ఞా హ్యపరా త్వమేవ భవతి !  జ్ఞేయా పరబ్రహ్మణీ
చాముండేశ్వరి ! దోమకోండనిలయే ! పాదౌ ప్రపద్యే తవ

మంగలాశాసనమ్

1.వేదవేదాంతవేద్యై తే వైదికాచారసంస్తుతే ,

దోమకొండాధివాసిన్యై చాముండేశ్వరి ! మంగలమ్ .

3-శ్రీ లక్ష్మీ నరసింహ గీతః

హరినరాకృతిం సైంహికాననం

జలధిపుత్రికా సేవితాంఘ్రికం,

భరణభూషితం భూషిత ప్రభమ్,

నరహరిం భజే ధర్మపూర్విభుమ్.1

కలివిమర్దనే కల్కిదేహినం.

అభయరూపిణం ఆశ్రితాశ్రయం

నతముఖోఽస్మ్యహం నైకధాకృతిం

నరహరిం భజేధర్మపూర్విభుమ్.11

4-శృంగేరి శ్రీ భారతీతీర్ధ స్వామికి స్వాగత శ్లోకాలు

శ్లో. సకలనిగమశాస్త్రావాస! పుంభావవాణే! ,

ప్రణతనిజముఖస్త్వ ద్దర్శనాసక్తచిత్తః  |

వదతి సహృదయం సుస్వాగతం ధర్మపుర్యాం ,

పురజనసముదాయో భారతీతీర్థ యోగిన్ ! ||1||

శ్లో. విధువదన! భవంతం తంగిరాలాబ్ధి వంశః ,

నిజసుతముపగమ్యోత్తుంగవీచీయశస్కః |

సకలజనహితాయ ప్రాపయత్ ఋష్యశృంగం ,

సుతమివ వసుదేవో బంధనాత్ నందగేహమ్ || 3 ||

5-శ్రీధర్మపురి రామలి౦గేశ్వరసుప్రభాతమ్

2-అయి కరికర్ణిక ! మూషికవాహన!!  పర్వతజాసుత ! సాంబప్రియ !
నుతజనపోషక ! షణ్ముఖసేవిత !   శంకరచుంబితఫాలతట!|
వరచతురాననదేవగణార్చిత ! దానవభంజక ! దాసరత!
జయ గణనాయక ! విఘ్నవినాశక ! ధర్మపురీజనపాల విభో!||2||
5-త్రిపురాంతక ! చాంధకరాక్షసహన్ !
ప్రళాయాంతక ! భీతకృతాంత ! విభో ! |
వరతాండవనందితభక్తతతే !
జయ రామప్రతిష్ఠితలింగ ! శివ !  || 5 ||

6-భస్మోద్ధూలితవిగ్రహోఽపి సతతం భక్తేభ్య ఐశ్వర్యదః ,
నామ్నారుద్రకమూర్తిరప్యవిరతం శాన్తస్వభావశ్చ యః |
దారాయత్తశరీరకోఽపి నియతైః సంస్తూయతే ఽహర్నిశం ,
వందే ధర్మపురీ స్థితం భవహరం త్వాం రామలింగేశ్వర ! || 6 ||
10-తిథ్యాదికం శుకముఖాత్ పఠతీహ జీవః
తే నారదః పికముఖాత్ కురుతేఽత్ర గానమ్ |
భృంగీ చ నృత్యతి ముదాఽత్ర మయూరరూపః,
శ్రీ రామలింగభగవన్ ! తవ సుప్రభాతమ్|| 10 ||

భస్మోద్ధూలితవిగ్రహోఽపి సతతం భక్తేభ్య ఐశ్వర్యదః ,
నామ్నారుద్రకమూర్తిరప్యనిరతం శాన్తస్వభావశ్చ యః |
దారయత్తశరీరకోఽపి నియతైః సంస్తూయతే ఽహర్నిశం ,
వందే ధర్మపురీ స్థితం పురహరం త్వాం రామలింగేశ్వరమ్ ||(గౌరీహృతార్ధాంగకమ్)

రామలింగేశ్వరాయ రామచంద్ర పూజితాయ
రాజమౌళిశోభితాయ దేవ ! మంగళమ్

దండకారుణ్యవాహి గౌతమీ తీరనిలయ !
ధర్మపూర్వాస ! తే సాంబ మంగళమ్ .

పార్వతీయుక్తదేహ ! పర్వతాగ్రవాస దేవ !
పాపవారకాయ తే పరమ మంగళమ్ .

విశ్వనాథ ! వినుతదేవ! విశ్వలోకరక్షకాయ
వేదశాస్త్రవిదితదేవ ! విభవ !మంగళమ్

ఇవన్నీ వారి అచంచలభక్తికి ,అమృత దారాకవితోక్తికి గొప్ప ఉదాహరణలు .అన్నీ అన్నే .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-18-ఉయ్యూరు


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970)

డా.మాడుగుల అనిల్ కుమార్ 1970 జూన్ 3న బ్రహ్మశ్రీ మాడగుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి సరోజనమ్మ దంపతులకు అనంతపురం లో జన్మించారు .తండ్రిగారు వేదపండితులు పురోహితులు.  తల్లి  సంస్కృత ఆంధ్రాలో  పండితురాలు ,సంగీత  విద్వాంసురాలు .అనిల్ కుమార్ పెదతండ్రి బ్రహ్మశ్రీ మాడుగుల వెంకట శివ శాస్స్త్రిగారు బహు గ్రంథకర్త .కనుక శర్మగారికి జన్మతః కవిత్వం అబ్బింది .సాధనతో ప్రావీణ్యం సాధించారు .

అనంతపురం శ్రీ విద్యారణ్య ప్రాచ్యోన్నత పాఠశాలలో10వ తరగతి వరకు చదివి ,గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ పూర్తీ చేసి ,1987-91కాలం లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించి ,శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం లో ఏం ఏ .డిగ్రీ పొంది ,తిరుపతి కేంద్రీయ విద్యాపీతంలో బి.ఎడ్.అయి ,హిందూపురం లో కొంతకాలం సంస్కృత అధ్యాపకుడుగా పనిచేసి ,శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ  విద్యాలయం లో కులపతి శ్రీ సన్నిధానం సుబ్రహ్మణ్య శర్మగారి పర్య వేక్షణలో ‘’రఘువంశ మహాకావ్యం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్. డి.సాధించారు .

 అవధాన పితామహులు శ్రీ సి వి సుబ్బన్నగారి ‘’అవధాన విద్య ‘’గ్రంథాన్నిఅవలోడనం చేసుకొని ,అవధాన విద్యలో పరిణతి సాధించి 1901నవంబర్ 1న మొదటి అవధానం చేశారు .1997లో తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలలో సంస్కృత అధ్యాపకులై ,క్రమంగా పదోన్నతి సాధించి ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల లో సంస్కృత విభాగ అధ్యక్షులుగా ఉన్నారు .ఇప్పటికి తెలుగు సంస్కృతాలలో ,అంతర్జాలం  లో చేసిన దానితోసహా 19 అవధానాలు చేశారు.

 తమ విద్వత్తుకు తగిన సంస్కృతాంధ్ర గ్రంధ రచన చేశారు  .సంస్కృతం లో – , రఘు వంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః –పరిశోధన గ్రంధం .సంస్కృతం లో వివిధ ఛందస్సులతో అష్టకాలు స్తోత్రాలు రచించి ఆకడంబానికి ‘’’’వసంత కుసుమాన్జలిః అనిసార్ధక నామం పెట్టారు .అందులోని వి – శ్రీ ర్దినమనణే నవరత్నమాలః,శ్రీ రఘు రామ నవరత్నమాలాస్తోత్రం ,,శ్రీ వరదా౦జనేయాస్టకం  ,శ్రీ గణేశా స్టకం,శ్రీ శారదా స్టకం,శ్రీ విద్యారణ్యస్తోత్రం ,శ్రీ వేంకటేశాస్టకం,శ్రీమచ్ఛంకర దేశికాస్టకం ,శ్రీ కృష్ణ మాలాస్తోత్రం ,మాతృభూమిస్తుతి

తెలుగులో శ్రీ వెంకటేశ్వర అక్సరమాలా స్తోత్రం ,శ్రీ రాఘవేంద్ర  అక్షర మాలా స్తోత్రం , ఆన౦దమందాకిని ,శ్రీ వెంకట రమణ శతకం ,శ్రీరామనామ రామాయణం ,శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం(పురుష సూక్తానుసారం )శ్రీ సప్తమాతృకా వ్రతం  ,వాల్మీకి (అనువాదం )చంద్రపీడా చరిత్ర ( సంస్కృత రచనకు తెలుగు తఅనువాదం )అవధాన పాంచజన్యం మొదలైన 21 గ్రంధాలు రాశారు’

 అష్టావధాని శర్మగారికి అవధానరత్నసార్ధక  బిరుదు లభించింది .గుత్తి నారాయణ రెడ్ది స్మారక అవార్డ్ అందుకొన్నారు

డా.అనిల్ కుమార శర్మగారి సంస్కృత కవిత్వ పాటవం చూద్దాం – .

1 -శ్రీర్దిన మణే నవరత్నమాలః –

1-స్పృహ ణీయ రూపమదితి ప్రియాత్మకం –నయనం హరేర్వరమయూఖ వర్షిణం-హనుమద్గురుం శ్రిత జనేషు వత్సలం –కరుణాకరం దినమణి౦ భజామ్యహం ‘’

8-గవేషణామే సఫలౌ బభూవ –యా దేవతా కామదుఘా ఇనానాం –తాం త్వాం ప్రపద్యే శరణాగతార్దీ –మాతారమా మంగళ మాతనోతు’’

2-శ్రీ రఘురామ నవరత్నమాలాస్తోత్రం

1-ఇనవంశ పయోనిధి సంజనిత –ద్విజరాజ మణే ద్విపరాడ్వరద-రఘురామ నమామి  తవాన్ఘ్రియుగం ‘’

5-ప్రియ దర్శన భూత హితైకమతే –దశకంఠ విమర్దన నామతనో –హనుమద్ధ్రుదయం నిలయం భవతః –రఘురామ నమామి తవాంఘ్రి యుగం ‘’

3-శ్రీ వరదా౦జ నేయాస్టకం

4-వజ్ర సన్నిభ వక్షసం మృగరాజ మధ్యమవిగ్రహం  -బ్రహ్మ సూత్ర విలంబినం దృఢ దంస్ట్రకం నగదారిణ౦—హారనూపుర కుండలై స్సమలంకృతం సువిలోచనం –శ్రీ ప్రభంజననందనం వరదాంజనేయ ముపాస్మహే .

4-శ్రీ గణేశాస్టకం

అగజయా నుతయా౦బికయా కృతం –వరమనోహర సుందర విగ్రహం –సరసిజాభముఖేన విభాసితం –గణపతిం శివపుత్ర ముపాస్మహే .

5-శ్రీ శారదాస్టకం

3-కరతలకమలాభ్యాం కచ్చపీవాదయంతీ—సురవర జన బృందైర్నిత్య మభ్యర్చమానా –స్పతికమణి నిభాసా మక్షమాలాం దధానా –నివసతు హృదయే మే శారదా సుప్రసన్నా ‘’

6-శ్రీ విద్యారణ్య స్తోత్రం

2-జ్ఞానం దత్వాచ బాల్యౌ త్ప్రభ్రుతి మయి గిరాం సంస్కృతం  సంస్కృ తిం చ –నిక్షి స్యాన్త పూజ్యో విజయనగర సద్రాజ్య సంస్థాపకశ్చ-అధ్యాప్యంతే ధరిత్యాః నివసతి యశసా మండిత జ్ఞానభాన్డః-విద్యారణ్యో మునీన్ద్రః  నిగమవన తటీ  పాదపస్తం నమామి .

7-శ్రీ వేంకటేశాస్టకం

8-ఆనంద ఇత్యభి హితో నిలయ స్త్వదీయః-కాలుష్యపూర్ణ భువనం విమలం కరోతి –పాత్రీ కరోతు మయి భక్తి విశేషమిత్ధం –శ్రీ వేంకటేశ మమదేహి తవప్రసాదం’’

8-శ్రీ మచ్చంకర దేశికాస్టకం

1-విభూతి రేఖాంకిత ఫాల దీపితం –ఉరః ప్రదేశేచ తథాక్షమాలయా –దృశా ప్రసాదామలయా చకాసతం –నమామి శ్రీ శంకర దేశికోత్తమం .

8-నియమిత పద బంధైః స్తోత్ర ముక్తావలై స్త్వాం –కలుష రహిత భక్త్త్యౌ యాచనార్ధీ సిషించే-విలసతు  ధిషణాయాం భావనాలోల లీలా-నివసతు హృదయే మే శారదా సంప్రసన్నా’’

9-మాత్రు భూమిస్తుతిః

1-శ్రీశైలం దక్షిణే భాగే వారణాసీం తదోత్తరే –ధృత్వా వపుషి దీప్తాం తాం వందే భారత మాతరం

6-పాణినే ర్ముని వర్యస్య చాస్టాధ్యాయీ విరాజతే –తయా విభ్రాజమానాం తాం వందే భారత మాతరం

10-శ్రీ కృష్ణ నవరత్నమాలా

1-శ్రీమద్వల్లవ పారిజాత విటపీ చూడామణి౦ రుక్మిణీ -హృన్మందార .ప్రదేశ విభ్రమ మహా భ్రుంగం యశోదా సుతం –

వందేహం జలజేక్షణం మురరిపుం భక్తౌఘ రక్షావరం –కృష్ణో రక్షతు మాం చరాచర జగత్క్రీడా విలాసొహరిః’’

  ఈ స్తోత్ర ,అష్టకాలలో పండిన భక్తీ ,ఆరాధన ,ఆత్మనివేదన లను ,అమృతోపమానమైన పదబంధం తో రసగ గుళికలులాంటి శ్లోకాలతో ,ఛందో వైవిధ్యంతో  అనిల్ కుమార శర్మగారు వర్ణించి తాను  తరించి ,మనలనూ ధన్యులను చేశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి పి.హెచ్ .డి .అందుకొని  ,హైదరాబాద్ పటేల్ కళాశాల ఉపన్యాసకులై ,సంస్కృత నలచరిత్ర,,ధర్మపురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ,మొదలైన సంస్కృతాంధ్ర గ్రంథరచన చేసిన ‘’సంస్కృత సాహిత్య రత్న ‘’విద్యాప్రవీణ ,ఒకప్పటి కరీం నగర్ ఇప్పటి జగిత్యాలజిల్లా ధర్మపురి వాస్తవ్యులు డా.కొరిడె రాజన్న శాస్త్రి ,శ్రీమతి సులోచనా దేవి గార్ల  పుత్రరత్నమే  డా . కొరిడెవిశ్వనాథశర్మ గారు .తండ్రికి దీటైన ,కొండొకచో తండ్రిని మించిన సంస్కృతాంధ్ర భాషా పండితులు. ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యాపకులుగా ప్రవేశించి, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన విద్వన్మూర్తి ,పరిపాలనా దక్షులు శర్మగారు ..

విశ్వనాధ శర్మగారు 4-6-1958 న కొరిడె వారి సంస్థానం  ,పవిత్రగోదావరీ తీరంలోని  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ధర్మపురిలో జన్మించారు .సంస్కృతం లో బి .వో.ఎల్ .,తెలుగులోఎం.ఏ .డిగ్రీలు పొందారు .’’లింగ పురాణం –విమర్శనాత్మక పరిశీలనం ‘’పై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్. డి.పరిశోధన కై రిజిస్త్రషణ్ చేసి యున్నారు వ్యక్తిగత కారాణాలవలన గ్రంథంపూర్తి చేయలేక పోయారు .

సంస్కృతం లో 1- శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా )  2-పెద్దాపురం లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా ) ౩-దోమకొండ చాము౦డేశ్వరీ సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణి క్షమాపరధన స్తోత్రం తో పాటు )4-‘’ధర్మపురి వర్ణనము ‘’కావ్యం (అసంపూర్ణం )  రచించారు .తెలుగులో 1- భర్తృహరి సద్భావ లహరి(పరిశీలన వ్యాసాత్మక గ్రంథం) రాశారు. .శర్మగారు ప్రసిద్ధ అనువాదకులుకూడా  .1-లింగ పురాణం ను కీ.శే .డా .వి హన్మాన్ శర్మగారితో కలిసి అనువదించారు .2-బ్రహ్మ పురాణా౦తర్గతమైన 108 అధ్యాయాల బృహత్ సంస్కృత గ్రంథం ‘’గోదావరీ మహాత్మ్యం ‘’ను కూడా శ్రీ హనుమాన్ శర్మగారితో కలిసి అనువాదం చేశారు .మహా పౌరాణికులైన శర్మగారు తమ పితృపాదులు రచించిన ‘’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం ‘’కు తెలుగు వ్యాఖ్యానం రచించి సాహిత్య పిత్రూణ౦ తీర్చుకొన్నారు .తమ తండ్రిగారి జీవిత ,పాండిత్య సాహిత్య వైశిష్ట్యాన్ని ‘’బహుముఖ ప్రజ్ఞాశాలి ,,ఉభయకవిమిత్రుడు ,సంస్కృత సాహిత్య రత్న డా.కోరిడేరాజన్న శాస్త్రి గారు (మా నాన్నగారు )అనే వ్యాసం ద్వారా వెలువరించి పితృ భక్తిని ప్రకటించారు

.ప్రస్తుతం 1-కీ.శే .తు౦గూరి శివరామ శర్మగారి అసంపూర్తి పద్యకావ్యం ‘’కాదంబరీ సంగ్రహం ‘’కు 2-భర్తృహరి విజ్ఞాన శతకం కు 3-కీ.శే. శ్రీ తెలకపల్లి రామ చంద్ర మూర్తి (నల్గొండ )వారి ‘’హయగ్రీవ శతకం ‘’కు  తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నారు.తాను 38ఏళ్ళు పనిచేసిన కళాశాల విశిష్టతను తెలియ జేస్తూ ‘’సంస్కృతాంధ్ర విద్వజ్జన నిలయం ధర్మ పురీ సంస్కృతాంధ్ర విద్యాలయం ‘’పేరిట కళాశాల చరిత్ర రాశారు .

శర్మగారి సంపాదకత్వం లో 1-డా.వి.హన్మాన్ శర్మగారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక’’ 2-కవితా శ్రీ శిల శ్రీనివాస్ -3సంస్కృత ప్రొఫెసర్ ,ప్రసిద్ధ అవధాని డా. మాడ్గుల అనిల్ కుమార్ గారి ‘’కాదంబరీ చరిత్ర ‘’లోనూ ,4.శ్రీ సంగనభట్ల రామ కృష్ణయ్యగారి’’శ్రీ నృహరి శతకం ‘’5-శ్రీ గొల్లపల్లి రాం కిషన్ గారి ‘’లబ్ డబ్ ‘’ మొదలైన తదితర గ్రంథాలలోను భూమికలు రాశారు  .ముఖ పుస్తకములో పలు సంస్కృత గ్రూపు లలో వారి అభ్యర్ధన మేరకు ‘’సంస్కృత కృద్వృత్తులు  ‘’,సంస్కృత ఛందో వృత్తములు ‘’పేరిట అనేక పాఠములురచించారు .’’లఘు సిద్ధాంత కౌముదీ’’పాఠాలద్వారా వ్యాఖ్యానం అందిస్తున్నారు  .ఆకాశవాణి నుండి సుమారు 15సాహిత్య ప్రసంగాలు చేశారు .సప్తగిరి, ఆరాధనహనుమ ,మాలిక పత్రికలలో  వ్యాసాలు  రాశారు .మాంచి భావకవి ఐన శర్మగారు కొన్ని ముద్రిత ,అముద్రిత భావకవితలు రాశారు.సంస్కృత శ్లోకాలతోపాటు తెలుగులో శతాధిక సమస్యాపూరణాలుచేశారు .వీరి కవిత్వ ప్రశస్తికి జగిత్యాల తెలుగు భాషా సంరక్షణ సంఘం ,కౌసల్య తెలుగుపండిత శిక్షణశాఖ సంయుక్తంగా ‘’కవితా శశాంక ;;బిరుదప్రదానం చేసి సత్కరించాయి .

.ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లలో పరిశోధక పత్రాలు రాసి సమర్పించారు .  శర్మగారి విద్యాభ్యాసం అంతా ధర్మపురి లోనే జరిగింది .ఓరియెంటల్ స్కూల్ శ్రీ సీతారామలింగేశ్వర దేవాలయం అనే శివాలయం లోనే చాలా కాలం ఉండేది. ఇక్కడే చెట్లక్రింద అరుగులమీద చదువు సాగేది .కాలేజీ కూడా ఇక్కడే ప్రారంభమైంది .తర్వాత నూతనభవనాలలోకి మారింది .శార్మగారికీ శివాలయానికి అవినాభావ సంబంధం చాలాఉంది.వారి తాతగారి కాలం నుంచి ప్రతిదినశివార్చన నైవేద్యం సంప్రదాయం కొనసాగిస్తున్నారు .శివాలయం లోనే కార్తీక ,మాఘ మాసాలలో ,దత్త నవరాత్రులలో పురాణ ప్రవచనాలు చేస్తారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో బ్రాహ్మీ ముహూర్తములో జరుగు ధనుర్మాస విశేష పూజలో అంతర్భాగం గా ‘’ధనుర్మాస మాహాత్మ్య పురాణ ‘’ప్రవచనం చేస్తున్నారు  . .ప్రస్తుతం ఒక గృహిణి కోరికపై వారింట్లో తాము అనువదించిన  ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ .పురాణం చెబుతున్నారు ..పౌరాణిక శేఖరులు శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ఆధ్వర్యం లో అనేక పురాణ ప్రవచనాలు చేశారు .ఇది వారి వృత్తికాదు, ధార్మిక ప్రవృత్తి ..స్ఫురద్రూపం తో, వెడల్పు ముఖంతో, నుదుట తీర్చి దిద్దబడిన  విభూతి రేఖలతో ,చక్కని వెడల్పు అంచు మల్లెపూవులాంటి ధోవతీ,  అడ్డంగా భుజాలపై వ్రేలాడే ఉత్తరీయం తో బ్రహ్మ వర్చస్సు వెలిగిపోతూ  ,బ్రాహ్మీమయ మూర్తిగా ,రాజసం ఉట్టిపడే నడకలో మరో శ్రీనాధ కవి సార్వభౌమునిలా , అపర కాశీ విశ్వనాథునివలె  ఈ ధర్మపురి  విశ్వనాథ  శర్మ గారు గోచరిస్తారు . మంచి స్థితి పరులైన శర్మగారు బంగారానికి తావి అబ్బినట్లు, ఉదార గుణ సంపన్నులు .తమ ‘’కొరిడె సాహితీ సంస్థాన విజయాలకు చిహ్నంగా ,తమ కుటుంబ ,వంశ కీర్తి ప్రతిష్టలకు ,వినయవివేక సంపత్తికి గౌరవ భూషణ౦ గా ,  తమ రెండస్తుల మేడకు ‘’విజయ భూషణం ‘అని సార్ధక నామకరణం చేశారు .

శర్మగారిధర్మపత్ని  శ్రీమతి విజయ లక్ష్మిగారు శర్మగారి కళాశాలలో శిష్యురాలు . గొప్ప విదుషీమణి .ఈ దంపతులు అతిధి మర్యాదలకు పెట్టిందిపేరు  .బ్రాహ్మణ్యం ఎవరొచ్చినా తమ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టకుండా పంపరు .ఆమె ప్రవరాఖ్యుని ధర్మపత్ని లాగా ‘’వండనలయదు వేవురు వచ్చి రేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి  ,నడికి రేయైన’’ అనే సంప్రదాయం పాటించే ఉత్తమ గృహిణి .

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు .మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .

ఆధారం –శ్రీ విశ్వనాథ శర్మగారు నాకు ధర్మపురిలో 28-10-18 ఆదివారం వారింటిలో ఆత్మీయంగా అందజేసిన బృహద్గ్రంథం-‘’గౌతమీ మహాత్మ్యం

గీర్వాణ కవితా విశ్వనాథీయం ‘’.

శర్మగారు’సంస్కృతం లో ’1-బాల్య స్మృతిః’’అనే 7శ్లోకాలు రాసి ,తమ చిన్ననాటి జ్ఞాపకాలను అక్షర బద్ధం చేశారు . అ౦దు లో మొదటి, చివరి శ్లోకాలు –

1-‘’అహం బాల్యకాలే సదామిత్రవర్గో –సమీపస్థ గోదావరీ  వారి మధ్యే –ప్రభాతే నిమజ్జ ర్ధ మేవాగమం తు –జలే క్రీడనాయ వ్యతీతోహి తుస్టయా’’

7-తదీయాచ్చ విద్యాలయాన్మోదపూర్ణః –వినిర్గత్య సాయం పునర్మందిరం చ-వ్యతీతోహి కాలః ముదా క్రీడనాయ-అహో బాల్యకాలః  స్మృతి ర్మాధు రీ హి.’’

ఇలా బాల్య కాలక్రీడా ,విద్యలపై తమకున్నమక్కువను  స్పష్టంగా తెలియ జేశారు .

2-చాము౦డేశ్వరీ సుప్రభాతం –

‘’జాగృహిత్వం మహాదేవి –జాగృహి దేవి చండికే –జాగృహి దోమ కొండేశి-లోక రక్షణ హేతవే ‘’

‘’రాత్రా వాప్త తమః సుదీర్ఘ పటలైః హ్యందీ కృతం వారిజం –ప్రాతర్ భాస్కర రశ్మిభిఃస్వనయనా  వున్మీల్య తత్పంకజం –సామీప్యం తవ పాదయోశ్చగమితుం భక్తా గ్రహస్తే స్థితం-చాముండేశ్వరి దోమకొండ నిలయే తే సుప్రభాతం శివే  ‘’

స్తోత్రం -భక్తకల్పవల్లికే ! సుభక్తకోటిపాలకే !

భక్తవైరిభంజని ! త్వమార్తిబాధవారిణీ,ఋ

శిష్టకర్మమోదినీ విరక్తమోక్షదాయినీ

దోమకోండచండికే ! జయోఽస్తు తే నిరంతరమ్.

ప్రపత్తి-1) ఆద్యా త్వం జగతాం త్వమేవ జననీ మాయా పరాదేవతా
త్వం శక్తిత్రయరూపిణీ త్వమనఘా విద్యా హ్యవిద్యా పరా
క్షేత్రజ్ఞా హ్యపరా త్వమేవ భవతి !  జ్ఞేయా పరబ్రహ్మణీ
చాముండేశ్వరి ! దోమకోండనిలయే ! పాదౌ ప్రపద్యే తవ

మంగలాశాసనమ్

1.వేదవేదాంతవేద్యై తే వైదికాచారసంస్తుతే ,

దోమకొండాధివాసిన్యై చాముండేశ్వరి ! మంగలమ్ .

3-శ్రీ లక్ష్మీ నరసింహ గీతః

హరినరాకృతిం సైంహికాననం

జలధిపుత్రికా సేవితాంఘ్రికం,

భరణభూషితం భూషిత ప్రభమ్,

నరహరిం భజే ధర్మపూర్విభుమ్.1

కలివిమర్దనే కల్కిదేహినం.

అభయరూపిణం ఆశ్రితాశ్రయం

నతముఖోఽస్మ్యహం నైకధాకృతిం

నరహరిం భజేధర్మపూర్విభుమ్.11

4-శృంగేరి శ్రీ భారతీతీర్ధ స్వామికి స్వాగత శ్లోకాలు

శ్లో. సకలనిగమశాస్త్రావాస! పుంభావవాణే! ,

ప్రణతనిజముఖస్త్వ ద్దర్శనాసక్తచిత్తః  |

వదతి సహృదయం సుస్వాగతం ధర్మపుర్యాం ,

పురజనసముదాయో భారతీతీర్థ యోగిన్ ! ||1||

శ్లో. విధువదన! భవంతం తంగిరాలాబ్ధి వంశః ,

నిజసుతముపగమ్యోత్తుంగవీచీయశస్కః |

సకలజనహితాయ ప్రాపయత్ ఋష్యశృంగం ,

సుతమివ వసుదేవో బంధనాత్ నందగేహమ్ || 3 ||

5-శ్రీధర్మపురి రామలి౦గేశ్వరసుప్రభాతమ్ కూడా  విశ్వనాథ శర్మగారు రచించారు

ఇవన్నీ వారి అచంచలభక్తికి ,అమృత దారాకవితోక్తికి గొప్ప ఉదాహరణలు .అన్నీ అన్నే .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-18-ఉయ్యూరు


 

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -20

31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం

సుపర్ణ(వినత ) ,కద్రూ సంగమ తీర్దాలగురించి బ్రహ్మదేవుడు నారదర్షికి తెలియజేశాడు .ఇక్కడే అగ్ని ,రుద్ర ,విష్ణు ,సూర్య ,చంద్ర ,బ్రహ్మ ,కుమార ,వరుణ కుండాలున్నాయి .అప్సరానదీ సంగమం కూడా ఇక్కడే ఉంది .పూర్వం వాలఖిల్య మహర్షులు ఇంద్రునిచే పీడింపబడి ,కశ్యపమహర్షి దగ్గరకు వెళ్లి తమతపస్సులో సగభాగం ఆయనకిచ్చి దేవేంద్రునితో సమానుడైన పుత్రుడిని కనమని చెప్పగా ఆయన సరే అన్నాడు .కశ్యపుడు తనభార్యలు సుపర్ణ , కద్రువలకు గర్భాదానం చేసి ,తాను  వేరొక చోటికి వెళ్ళే పని ఉందని ,వారిద్దరిని బయట తిరుగవద్దని  తిరిగితే శాపగ్రస్తులౌతారని హెచ్చరించి వెళ్ళాడు .

  గంగాతీరం లో బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే చూడాలని ఈ ఇద్దరూ వెళ్ళారు .అక్కడ యవ్వనమదమత్తులై,బ్రాహ్మణులు వద్దని చెబుతున్నా ,హవిస్సులను ,మంత్రాలను వికృతం చేస్తుంటే ,వారి అపామార్గ ప్రవర్తనకు నదులు కమ్మని శపించగా కద్రూ వినతలు నదులైపోయారు .ఇంటికి తిరిగొచ్చిన కశ్యపప్రజాపతి ,ఋషులవలన జరిగింది తెలిసి ,వాలఖిల్యులకిచ్చిన మాట గుర్తుకొచ్చి వారికి చెప్పగా వాళ్ళు గౌతమీస్నానం చేసి,మధ్యమేశ్వరుడు అనే పేరుతొ అక్కడున్న  మహేశ్వరుని ధ్యానిస్తే మంచి జరుగుతుందని చెప్పగా ,అలాగే చేయగా ,కరుణించిన శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమనగా తనభార్యలను మళ్ళీ ప్రసాదించమని కోరాడు ముని .శివుడు నదీ రూపాలు పొందిన కద్రూ వినతలు గంగాసంగమం వలన స్వస్వరూపం పొందుతారన్నాడు ,అలాగే భార్యలు పూర్వ రూపాలు పొందారు .

  కశ్యపుడు భార్యలను పొంది ,గౌతమీ తీరం లోనే విప్రుల సమక్షం లో భార్యలకుసీమంతం జరిపింఛి  మృష్టాన్నభోజనాలు పెట్టించాడు .కద్రువ బుద్ధిమారక బ్రాహ్మణులను ఒక కంటితో పరిహసి౦చగా ,ఆకన్ను చితికి పోతుందని శపించగా కద్రువ గుడ్డిది అయింది. ఈమెయే పాములతల్లి ..అప్పటినుంచే పాములకు కళ్ళు కనిపించటం లేదు .కశ్యపుడు అనుగ్రహించమని వేడుకోగా  వారు అనుగ్రహించగా గౌతమీ స్నానం చేసి అందరూ పవిత్రులైనారు .ఈతీర్ధమే వినతా కద్రువ తీర్ధం అయింది .

32-సరస్వతీ సంగమ –పురూరవ –సబ్రహ్మ –సిద్దేశ్వర తీర్ధ౦

ఒకసారి పురూరవ మహా రాజు  బ్రహ్మ దగ్గరకు వెళ్లి ,అక్కడనవ్వుతున్న  దేవనది సరస్వతి ని చూసి  ,కారణమేమిటని ఊర్వశిని అడిగాడు .‘’ఈమె బ్రహ్మపుత్రిక సరస్వతి .రోజూ ఇక్కడికి వచ్చిపోతుంది ‘’అని చెప్పగా ఆమెను తనదగ్గరకు తీసుకొని రమ్మని ఎంతో ధనమిచ్చి పంపగా  ,ఆమె వెళ్లి  చెప్పగా ,అలాగే వస్తానని వెళ్ళింది .సరస్వతీ నదీ తీరం లో పురూరవరాజు ఆమెతో చాలా ఏళ్ళు సుఖించగా ,వారికి సరస్వతుడు అనే కొడుకు కలిగాడు .ఇతనికొడుకు బృహద్రధుడు .రోజూ రాచగృహానికి వెళ్ళే సరస్వతిని చూసి కోపించి మహానది గా మారమని శపించగా ,తన శాపం తొలగించుకోవటానికి గంగానదిని చేరి వివరించగా ,కనికరించి  గంగ బ్రహ్మతో’’శాపమిచ్చిన నువ్వే శాపవిమోచనం చేయాలి స్త్రీలు చంచలస్వభావులని నీకు తెలుసు ‘’అనగా బ్రహ్మ శాపం ఉపసంహరింఛి ‘’సరస్వతి  దృశ్యమగుగాక ‘’  అన్నాడు .అప్పటినుంచి సరస్వతీ నది దృశ్య, అదృశ్యంగా ఉంటోంది .

  శాపతాప్త సరస్వతి గంగానదితో కలిసిన చోట ,పురూరవమహారాజు తపస్సు చేసి ,సిద్దేశ్వర హరుని అర్చించి ,గంగా దేవి అనుగ్రహం తో ,శంకరుని కరుణతో సకల కామాలు సిద్ధింప జేసుకొన్నాడు .ఆనాటి నుండి అది పురూరవ తీర్ధమైనది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-18-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరగ్రహార యోగి -ఫరీద్ మస్తాన్ ఔలియా –గబ్బిట దుర్గాప్రసాద్ -గురుసాయి స్థాన్ -నవంబర్

‘సిద్ధ యోగి పుంగవులు ”పుస్తకం లోని కరగ్రహారా యోగి మస్తాన్ ఔలియా వ్యాసం ఈ నవంబర్ గురు సాయి స్థాన్  లో ప్రచురితం -దుర్గాప్రసాద్ 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -19

29-అగ్ని తీర్ధం

సర్వక్రతు  ఫలాన్నిచ్చే అగ్ని తీర్ధ విశేషాలు బ్రహ్మ నారదమహర్షికి తెలియ జేశాడు .అగ్ని సోదరుడు జాతవేదసుడు గొప్ప హవ్య వాహనుడు .ఒకసారి ఋషులు గౌతమీ తీరం లో చేసిన యాగ హవ్యాన్ని దేవతలకు తీసుకు వెడుతుంటే ,దితికొడుకు మధువు అనే వాడు నేర్పుగా అందరూ చూస్తుండగానే సంహరించగా దేవతలకు హవ్యం చేరలేదు .తనసొదరుడు మరణించాడని తెలుసుకొన్న అగ్ని కోపం తో గంగా జలంలో ప్రవేశించగా దేవతలు ,మానవులు అందరూ ప్రాణాలు కోల్పోయారు .పితృ దేవతలు మిగిలిన దేవగణం,ఋషులూ ఆ ప్రదేశానికి వచ్చి అగ్ని లేకుండా జీవి౦చలేము అని బాధపడి అగ్నిని –

‘’దేవాజ్జీవయ హవ్యేన,కవ్యేన చపిత్రూ౦స్తథా-మానుషానన్నపాకేన బీజానాం క్లేదనేనచ’’

అగ్ని దేవా !హవ్యాలతో దేవతలను ,కవ్యాలతో పితరులను ,అన్నం వండటానికి ,బీజాలను క్షేదనం చేయట౦ ద్వారా మానవులను బ్రతికించు .’’అని స్తుతించగా అగ్ని ‘’ఈపనులన్నీ సమర్ధంగా చేసే నాతమ్ముడిని చంపేశారు .నేను హవ్యవాహనుడనైతే నన్నూ చంపేస్తారేమో ?’’అనగా దేవతలు ఆలోచించి ‘’అగ్నీ !మేము నీకు ఆయుస్సు కార్యం లో ప్రీతి ,వ్యాప్తి లో శక్తి ,ప్రయాజాలు ,అనుయాజాలు (యజ్ఞభాగాలు )కూడా ఇస్తాం .నువ్వు దేవతల ముఖానివి .కనుక మొదటి ఆహూతి నీకే .తర్వాతే హవ్యా ద్రవ్యాన్ని మేము పొందుతాము ‘’అనగా అగ్ని సంతోషించి దేవతలకోరికపై సర్వ వ్యాపకుడై సర్వ సమర్దుడయ్యాడు .అప్పటినుంచి అగ్ని దేవుడు –జాత వేదసుడు ,బృహద్భానుడు ,సప్తార్చి ,నీలలోహితుడు ,జలగర్భుడు , శమీ గర్భుడు ,,యజ్న గర్భుడు అనే పేర్లతో పిలువబడ్డాడు .తదాది ఇహ ,పరాలలో అగ్నిసర్వ గతుడయ్యాడు .దేవతలు అగ్నిని ప్రతిష్టించిన తీర్ధమే అగ్ని తీర్ధం .ఇక్కడే ఏడువందల పుణ్య తీర్దాలున్నాయి –

‘’అగ్ని ప్రతిస్టితం లింగం తత్రాస్తే అనేక వర్నవత్ – తద్దేవ దర్శనాదేవ సర్వ క్రతు ఫలం భవేత్ ‘’

అగ్ని చే ప్రతిస్టింపబడిన శివలింగం అనేక వర్ణాలతో శోభిస్తుంది .అలాంటి శివ దర్శనం  వలన సమస్త క్రతువులు చ సినంత ఫలం కలుగుతుంది .

30-ఋణవిమోచన తీర్ధం

కక్షీవంతుని కొడుకు పృధు శ్రవసుడు వైరాగ్యభావం తో పెళ్లి చేసుకోలేదు .అందుకని అగ్నికార్యమూ చేయలేదు .ఇతని చివరి తమ్ముడు అన్నకు పెళ్లి కాకపోవటం వలన ‘’విరి విత్తి’’గా ఉంటూ పెళ్లి చేసుకోవటానికి సందేహింఛి అగ్నికార్యమూ చేయలేదు .పితృదేవతలు వారిద్దరినీ వివాహాలు చేసుకొని తమ రుణ విముక్తి చేయమని చెప్పారు .పెద్దవాడు  ‘’నేను పెళ్లి చేసుకోను .ఋణం ఏమిటి ?మనిషికి ఎందుకు మూడు రుణాలు ?’’అంటే చిన్నవాడు అన్నకు పెళ్ళికాకుండా తానూ చేసుకోను అన్నాడు . అప్పుడు పితరులు వారిద్దరినీ గౌతమీ స్నానం చేసి తర్పణాలు విడవమని సలహా చెప్పారు .

  కక్షీవంతుని పెద్దకొడుకు పృధు శ్రవసుడు ,గంగాస్నానంచేసి శ్రద్ధతో పితరులకు తర్పణాలు వదిలి ముల్లోకాలరుణాలు తీర్చుకొన్నాడు .అప్పటినుంచి అది ఋణవిమోచన తీర్ధంగా ప్రసిద్ధి చెందిందని నారదమహర్షికి బ్రహ్మ తెలిపాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-18-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -18

28-పౌలస్త్య తీర్ధం

విశ్రవసువు పెద్దకొడుకు కుబేరుడు సకల సంపదలతో తులతూ,గుతూ ఉత్తర దిశాదిపతిగా ,లంకాధిపతిగా ఉన్నాడు .ఇతని సవతిపుత్రులే రావణ కుంభకర్ణ విభీషణులు .వీళ్ళు రాక్షసస్త్రీ యందు రాక్షసులుగా విశ్వవసువుకు పుట్టారు .బ్రహ్మ ఇచ్చిన విమానం తో ధనదుడు రోజూ వచ్చి బ్రహ్మ దర్శనం చేసుకోనివెళ్ళేవాడు .ఒకరోజు రావణాదులతల్లి ‘’మీ నడవడి బాగాలేదు  తలవంపులుగా ఉంది. సవతి పుత్రునితో స్నేహం ఏమిటి .ఏదైనా గొప్పపని సాధించండి ‘’అన్నది .వెంటనే ఘోరాటవిలో ఘోరతపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గొప్పవరాలు పొందారు .మేనమామ మరీచి మాతామహుల చెడు ఆలోచనా ప్రభావం తో అన్న కుబేరుని లంకారాజ్యం ఇమ్మన్నారు .ఇవ్వననగా యుద్దం చేసి ,కుబేరుని జయించి లంకనాక్రమించి రాక్షస పాలనలోకి తెచ్చుకున్నారు .

 కుబేరుడు తాత పులస్త్యబ్రహ్మకు మొరపెట్టుకోగా గౌతమీస్నానం చేసి శివధ్యానం చేయమనగా  ,అలాగే చేసి స్తోత్రాలతో మెప్పించి వరం కోరుకోమనగా ఆశరీరవాణి’’ధనపాలత్వం కోరుకో ‘’అని చెప్పగా  .దానినే శివునివేడగా ఇవ్వగా సోమేశ్వర లింగపూజ చేసి దిక్పాల పతియై ,దనాదిపతియై దాతృత్వశక్తిగల  పుత్రులను పొందాడు కుబేరుడు .అప్పటినుంచి ఆతీర్ధం పౌలస్త్య తీర్ధంగా,ధనద,వైశ్రవస తీర్దం గా  పలువబడింది .ఇక్కడస్నానం చేసి  ఏ చిన్నదానంచేసినా  విశేషఫలితమిస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు

గౌతమీ మాహాత్మ్యం -17

27-ఇంద్రాది  సహస్ర తీర్దాలు

బ్రహ్మహత్యాపాతకంపోగొట్టే   ఇంద్ర తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ వివరించాడు –పూర్వం దేవేంద్రుడు వృత్రాసురసంహారం చేసి బ్రహ్మహత్యాపాతఃకం పొంది ,దాన్ని వదిలించుకోవటానికి అన్ని ప్రదేశాలు తిరిగాడు .ఆపాపం అతని వెంటే వెళ్ళేది .ఒకసరస్సులో దూకి పద్మ౦  యొక్క నాళం లో దూరి అందులో ఒకదారంగా మారి వెయ్యేళ్ళు దాక్కున్నాడు . అతనికోసం బ్రహ్మ హత్యాపాతకం కూడా అన్నేళ్ళూ అక్కడే  వేచి ఉన్నది .ఇంద్రలోకం ప్రభువు లేనిదైపోగా దేవతలు బ్రహ్మను ఉపాయం చెప్పమనగా ఇంద్రుడిని వెతికి గౌతమీ జలం తో పవిత్రం చేయమన్నాడు .వెతికి పట్టుకొని స్నాన౦ చేయించబోతుంటే ,గౌతముడికి కోపమొచ్చి’’ పాపిష్టి ఇంద్రునికి గంగాజలం తో అభిషేకం చేసే ప్రయత్నం చేస్తే రూ భస్మమైపోతారు ‘’అనగానే దేవతలు భయపడిఇంద్రుని తీసుకొని  వెళ్ళిపోయారు .

  ఇంద్రునితోనర్మదానదీ తీరం చేరి అభిషేకం చేయాలనుకొంటే మాండవ్య మహర్షి అభ్య౦తరమ్ చెప్పగా ,తరుణోపాయం చెప్పమంటే శాంతించి అక్కడే చేయటానికి ఒప్పుకోగా ,అక్కడే ఇంద్రునికి యమునాజలంతో అభిషేకించి పాపాలు పోయేట్లు చేయగా,ఆ ప్రదేశం ‘’మాళవ దేశ’’మైంది .తర్వాత గౌతమిలోనూ ముంచి, బ్రహ్మహత్యాపాతకం పూర్తిగా వదిలించి ,దేవతలు మునులుకూడా స్నానం చేసి పవిత్రులైనారు .ఇక్కడే ‘’సిక్తా’’నది యమునతో కలుస్తుంది .ఈరెండూ గంగలో సంగమిస్తాయి .ఇదే పుణ్య సంగమ తీర్ధం ,ఇంద్ర తీర్ధం .ఇక్కడే ఏడువేల పుణ్య తీర్దాలేర్పడ్డాయి .ఇవి అక్షయ ఫలదాయకాలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -16

26-శుక్ర తీర్ధం

ఆంగీరస ,భ్రుగు మహర్షులు పరమపావనులు .వీరికుమారులు జీవుడు ,కవి బుద్ధి రూప గుణాలలో గొప్పవారు .అంగిరసుడు ఆ ఇద్దరుపిల్లలకు సమబుద్ధి తో విద్యనేర్పిస్తాన౦టే,సరే అన్నాడు భ్రుగువు.కాని అన్నమాట నిలబెట్టుకోకుండా ఇద్దరికీ వేరేవేరే గా నేర్పాడు. కవి అనే శుక్రుడు అలా చేయటం తగదన్నాడు .ఇకచాలు వేరే గురువువద్ద నేర్చుకొంటా అని అనుమతిపొంది సహాధ్యాయి బృహస్పతికి కూడా చెప్పి ,తగిన గురువు గౌతముడు అని నిశ్చయించి చేరి తనకు తగ్గ గురువెవరో సెలవిమ్మనగా ‘’జగద్గురువు శంకరుడే ‘’అనగా ,ఎక్కడ ఉంటాడో అడిగి తెలుసుకొని గౌతమీ తీరం చేరి శుచిగా శివ ధ్యానం చేయగా పరమేశ్వరుడు ప్రసన్నుడై వరం కోరమనగా ‘’బ్రహ్మాది దేవతలకు ఋషులకు గోచరంకాని విద్య ప్రసాదించు నాకు ‘’అనగా మృత సంజీవనీ విద్య నేర్పాడు ..ఈ విద్యనేర్చి తండ్రిని చేరి దైత్యగురువయ్యాడు

  ఆ తర్వాత ఎప్పుడో బృహస్పతి కొడుకు కచుడు కవి కి శిష్యుడై సంజీవనీ విద్య నేర్చుకున్నాడు .ఇతనినుండి దేవతలు నేర్చారు .అదే మృత జీవనీ విద్య గా ప్రసిద్ధమైనది .శివుని పూజించి శుక్రుడు ఎక్కడ ఆ విద్య నేర్చాడో అదే శుక్రతీర్ధం .ఆయురారోగ్యాభి వృద్ధి కలిగిస్తుంది ‘’అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -15

25-శ్వేత తీర్ధం

గౌతమ మిత్రుడు శ్వేతుడు అతిదిపూజలో తరించాడు .శివభక్తి పరాయణుడు.అతన్ని తీసుకుపోవటానికి యమ దూతలు వచ్చారు .కాని ఇంట్లోకి ప్రవేశించలేక పోయారు .వారిలో చిత్రకుడు యమునికి నివేదించగా  మృత్యువే  స్వయంగా వచ్చినా అతనికి  మృత్యువుకాని కాని యమకింకరులు కాని వచ్చినట్లు తెలియదు .స్వేతుని దగ్గరున్న దండధరుడైన పురుషుడు ఎందుకోచ్చావని అడుగగా చెప్పగా ,మృత్యువుకు అక్కడ పని లేదు వెళ్లిపోమ్మన్నాడు .వినక, పాశం వదిలాడు. దండి మృత్యువును కొట్టగా మృత్యువు పడిపోగా దండి యమునికి చెప్పగా యముడే స్వయంగా రాగా, నంది జరిగినదంతా శివునికి తెలియజేయగా ,యమ శివులమధ్య భయంకర యుద్ధం జరుగగా ,కార్తికేయుడు యమకింకర సంహారం చేయాగా మిగిలినవారు సూర్యునికి విన్నవించగా ,ఆదిత్యాదులు బ్రహ్మను చేరగా అంతా కలిసి  గంగా తీరం లొ మృతి చె౦ది ఉన్న  యముని చేరి,భయపడి శంకరుని స్తుతించగా ప్రత్యక్షమై ఏమికావాలని అడిగితే ,యముని బ్రతికించమని కోరగా  ‘’యముడు నామాట వింటే మీకోరిక తీరుస్తాను .అందరికీ నేనే స్వామిని గౌతమి ,విష్ణు భక్తులజోలికి  యముడు పోకూడదు .వారికి ఆదివ్యాదులు ఉండరాదు .శివుని శరణు పొందినవారు తక్షణమే ముక్తి చెందుతారు ‘’అన్నాడు . గౌతమీ జలాలతో శివుని అభిషేకించమని చెప్పగా అలా చేయగా యమునితో సహా చచ్చినవారంతా బ్రతికారు. అందరూ శివునిపూజించి ఎవరి దిక్కులకు వాళ్ళు వెళ్ళిపోయారు .

  గౌతమి ఉత్తర దిక్కున  సుర దేవతా గణం  శివునిపూజిస్తున్నారు అక్కడ లక్షా ఇరవై వేల తీర్దాలున్నాయి . దక్షిణ తీరం లొ 30 వేల తీర్ధాలు న్నాయి. ఇదే శ్వేత తీర్ధ విశేషం అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 -11-18 కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం -14 3-పాప ప్రణాశన తీర్ధం

  గౌతమీ మాహాత్మ్యం -14

23-పాప ప్రణాశన తీర్ధం

ధృతవ్రతుడనే బ్రాహ్మణుడు మహీ అనే సుందరిని పెళ్ళాడి ,సూర్య ప్రతాపం ఉన్న కొడుకు’’సనాజ్జతుడు ‘’ను కనీ చనిపోయాడు .మహి గాలవ మహర్షికి కొడుకునప్పగించి  స్వేచ్చా చారిణిగా మారి తిరుగుతోంది .గాలవుని వద్ద ఉన్న ఆమె కొడుకు కు తల్లిగుణాలబ్బి వేశ్యాలోలుడై నానాజాతులతో ఉండే జన స్థానాకి వెళ్లి అక్కడ వేశ్యగాఉన్న మహి తో తల్లి అని తెలియదు కనుక కామ కేళిలో ఉన్నాడు .

 కొడుకులో ఎక్కడో వాసనా రూపంగా తండ్రి లక్షణాలు ఉండటం వలన వాడు బ్రాహ్మీ ముహూర్తం లొ గౌతమీ స్నానం చేసి  సంధ్యావందనం చేసి ,విప్రులకు నమస్కరించి తర్వాత తన విద్యతో డబ్బు సంపాదించి తనవార కాంత  ఐన తల్లి మహిని పోషిస్తున్నాడు సుఖిస్తున్నాడు .ఒక రోజు గాలవముని గౌతమీ నదికి స్నానానికి వెళ్ళినపుడు వికృత రూపం లొ కుష్టు రోగి ఒకడు ఒళ్ళంతా చీము నెత్తురూ కారుతూ గంగలో స్నానం చేసి బయటికి వచ్చాక అందంగా సూర్యకా౦తితో కనిపించేవాడిని చూశాడు .అతడికి ఈ రెండు రూపాల విషయం తెలియదు .గాలవమహర్షి స్నానం చేసే చోటే అతడూ చేసి మునికి నమస్కరించి వెళ్ళేవాడు .గాలవుడు కనిపెడుతూనే ఉన్నాడు .ఒకరోజు ముని అతని గురించి అడిగాడు .’’రేపు చెబుతాను ‘’అని వెళ్ళిపోయాడు .

  రాత్రి తనకు పడకసుఖం ఇస్తున్న తల్లి మహితో ‘’మన ఇదరికి ఒకరిపై ఒకరికి సమాన ప్రేమ ఉంది .నీపేరు ,కులం ఊరు బంధువుల గురించి చెప్పు ‘’అని అడిగాడు .ఆమె తాను  ధృత వ్రతుని భార్య అని ,తనకొడుకు సనాజ్జతుడిని గాలవమునికి అప్పగించి స్వైరిణిగా తిరిగి వేశ్యనయ్యానని  తానూ బ్రాహ్మణ స్త్రీనే అని చెప్పింది .ఈ మాటలువిన్న విటరూపం లొ ఉన్న కొడుకు తట్టుకోలేక కిందపడిపోగా , కారణం అడుగగా తానూ ధృత వ్రాత ,మహీల కుమారుడుసనాజ్జాతుడ నని  దైవ వశం లొ తానూ తల్లితో కామకేలి చేస్తున్నానని  చెప్పగా విధి ఆడిన వి౦త నాటకానికి ఇద్దరూ తట్టుకోలేక విలపించారు.తెల్లవారగానే గాలవ మునిని సందర్శించి రాత్రి జరిగిన విషయం వాడు చెప్పాడు. గాలవుడు ‘’దుఖించకు.నీరెండు రూపాలు రోజూ నేను చూస్తూనే ఉన్నాను .అందుకే నిన్ను అడిగాను .నేనేది తెలుసుకొన్నానో దానినే నువ్వూ చెప్పావు .ఈ తీర్ధ మాహాత్మ్యం వలన ,గంగానుగ్రహం  వలన నువ్వు పవిత్రుడవయ్యావు .నీ ఉదయరూపం నువ్వు పగలూ రాత్రి చేసిన పాపాలతో కూడినది .గౌతమీ స్నానాన౦తర రూపం ఉత్తమ గుణ శోభితమైనది .నీతల్లి కూడా తన పాపం తెలుసుకొని పస్చాత్తపపడింది  కనుక నిష్కృతి పొందింది  .ప్రాణికోటి కి విషయ వాంఛ సహజం .  సత్సంగం  పుణ్యాన్నిస్తుంది. సత్సంగత్వమే  మోక్ష హేతువు .నీతల్లి కూడా గంగా స్నానం చేస్తే పాపాలు దూరమౌతాయి .మహికూడా గంగాస్నానం కొడుకుతో సహా చేసింది.ఇద్దరూ   పవిత్రులై నారు కనుక ఇది ‘’దౌత పాప తీర్ధం ‘’అయింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు’

 24-విశ్వామిత్ర తీర్ధం

 నారదుని బ్రహ్మ విశ్వామిత్ర తీర్ధ విశేషాలు చెప్పాడు –ఒకప్పుడు విపరీతమైన అనావృస్టి ఏర్పడింది .విశ్వామిత్ర మహర్షిభార్య ,పిల్లలు  శిష్యులతో గౌతమీ తీరం చేరి ఆకలికి అల్లల్లాడుతూ శిష్యులను వెతికి తినటానికి ఏదో ఒకటి తెమ్మన్నాడు .ఎంత వెదికినా తినటానికి ఏమీ దొరక్క ,చచిపోయిన కుక్క కనిపిస్తే  తీసుకొచ్చారు .శుభం అంటూ దాన్ని చేతితో తాకి ‘’ముక్కలు చేసి చక్కగా వండండి .పితరులకు, రుషి, దేవతలకు హోమాగ్నిలో హవనం చేసి ,అతిధులకు ,గురువులకు తృప్తిగా పెట్టండి .మిగిలింది మనమందరం తిందాం ‘’అన్నాడు .శిష్యులు ‘’శ్వ మాంసం ‘’వండుతుండగా అగ్ని దేవుడు మిగిలిన దేవతలదగ్గరకు వెళ్లి విషయం వివరించగా ,ఇంద్రుడు డేగ రూపం లొ వచ్చి మాంసం ఉడికే గిన్నె తన్నుకు తీసుకు పోయాడు .మునికి చెప్పగా కోపం తో ఇంద్రుని శపించటానికి కౌశికుడు సిద్ధమవగా ,భయపడిన ఇంద్రుడు దానిని  అమృతం తోని౦పి యధాప్రకారం నిప్పులపై ఉంచగా ,మధుపాత్ర అని తెలిసిన ముని ‘’కుక్కమా౦సమే మాకు ఇవ్వు మధువు నువ్వే తీసుకో .లేకపోతె భస్మ౦  చేస్తా నిన్ను ‘’అని ఆగ్రహంగా అన్నాడు..ఇంద్రుడు ‘’హాయిగా మధుపానాన్ని నువ్వూ నీకొడుకులు భార్యా  చేసి తృప్తి చెందక కుక్కమాంసం కావాలనటం వివేకమా ‘’అన్నాడు .విశ్వామితుడు ‘’అమృతం మేమే తింటే నన్ను నమ్ముకున్న శిష్య ముని గురు గణం ఏమవ్వాలి  .ప్రజలంతా అన్నమో రామ చంద్రా అని అలమటిస్తుంటే నేను హాయిగా అమృతపానం చేసి సుఖపడలేను మేమంతా కుక్కమా౦సమే తింటాం ‘’అని భీష్మించాడు.సాటి మనుషులపై మహర్షికి ఉన్న అనుకంపను అర్ధం చేసుకొని ఇంద్రుడు తక్షణమే మేఘాలను పిలిపించి కుంభ వృష్టి కురిపించి అనావృస్టి తొలగేట్లు చేసి ప్రజలకు తృప్తి కలిగించాడు .

 విశ్వామిత్రుడు ఇంద్రుడు అందజేసిన అమృతాన్ని ముందుగా దేవతలకు అర్పించి తృప్తి పరచి ,తర్వాత మూడులోకాలను తృప్తి పర,చి  ఆతర్వాత భార్యా పుత్రులు శిష్యులతో అమృతం సేవించాడు .ఇంద్రుడు అమృతాన్ని తెచ్చి ఇచ్చిన ఈ ప్రదేశం విశ్వామిత్ర ,మధు ,ఇంద్ర, శ్యేన ,పర్జన్య తీర్ధం గా  ప్రసిద్ధి చెందింది .ఈ తీర్ధం లోనే రాముడు సీతాసమేతంగా పితరులకు తర్పణం చేశాడుకనుకపిత్రుతీర్డం అంటారు .ఇక్కడే శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని పూజించాడు కనుక విశ్వామిత్ర తీర్ధం అయింది

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం

 గౌతమీ మాహాత్మ్యం -13

                                  21-గరుడ తీర్ధం

ఆది శేషుని కుమారుడు మణినాగుడు గరుత్మంతునికి భయపడి శంకరుని భక్తితో మెప్పించి ,వరం కోరుకోమనగా ,గరుడుని వలన అభయం కోరగా సరే అన్నాడు .ఇక గరుడభయం లేదని క్షీర సముద్ర సమీపంలో గరుడు ఉండే చోటికి వెళ్ళాడు .వాడిని గరుడుడు నాగపాశంతో బంధించి తన ఇంట్లో ఉ౦చేశాడు .నందీశ్వరుడు ఈశ్వరునితో మహానాగుడు సురక్షితంగా ఉండవచ్చు లేక శాశ్వతంగా బందీ అయి ఉండవచ్చునన్నాడు .శివుడికి విషయం తెలిసి ,విష్ణుమూర్తి ని స్తుతించి ,నాగుడిని విడిపించి తీసుకురమ్మన్నాడు .నంది విష్ణువుకు చెప్పగా ,ఆయన గరుడుని నాగుడిని నందితోపంపమని చెప్పగా అతడు ఇవ్వనని మొండికేసి ,నిష్టూరంగా ‘’ఇతర ప్రభువులు అడిగినవన్నీ ఇస్తావు .నాకేదీ ఇవ్వవు .పైగా నేను తెచ్చుకొన్నది లాక్కుం టావు  .శివుడు చూడు నందిద్వారా నాగుని విదిపించుకొంటున్నాడు .నువ్వేమో నా సంపాదన నందికి దోచిపెడుతున్నావు .ఎల్లకాలం నిన్ను మోస్తున్నందుకు నాకు దక్కే ప్రతిఫలం ఇంతేనా ?సజ్జనులు సేవకులకు అడిగినా అడక్కపోయినా ఇస్తారు .నువ్వు ఇవ్వనూ ఇవ్వవు . పైగా నాది అప్పనంగా ఇతరులకు అప్పచెబుతావు నాబలమవలన యుద్ధాలలో గెలిచినా ,నువ్వే గొప్ప వీరుడవని పొగుడుకొంటావు’’అని రెచ్చి పోయాడు .పన్నగ శయనుడు చిరునవ్వు నవ్వి నంది ,లోకపాలుర సమక్షం లొ ‘’నువ్వు బుద్ధిమంతుడివి .మహా బలవంతుడివి .నేనే నిజంగా అశక్తుడిని .నా చిటికెనవ్రేలిని మోసుకొని నంది దగ్గరకు వెళ్ళు ‘’అని ,గరుడుని నెత్తిపై తన చిటికెన వ్రేలు ఉంచగా అతడి శిరస్సు పొట్టలోకి దూరిపోయింది. పొట్ట పాదాల దగ్గరకు చేరి గరుత్మంతుడు పొడిపొడి అయ్యాడు .

    తన ‘’లావు’’ ఏమిటో  తెలిసిన గరుడుడు ఏడుస్తూ ‘’పొరపాటైంది లోకనాధా !.సర్వ లోకభర్త, కర్తానువ్వే .అపరాధాలు చేసేవారిని క్షమించే కరుణాకరుడవని మునులు నిన్ను స్తుతిస్తారు .ఆర్తుడనైన నన్ను రక్షించు ‘’అంటూ ప్రాధేయపడ్డాడు .లక్ష్మీ దేవి ‘’ఆపదలో ఉన్న ఈ సేవకుని కరుణించు ‘’అనగా మురారి నందితో గరుడుని తీసుకొని శంకరుని చేర్చమనగా ,గరుడుడితో సహా నాగాన్ని శంకరుని వద్దకు తీసుకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు .

శివుడు గరుత్మంతునితో ‘’గౌతమీ నదిలో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకో ‘’అని చెప్పగా గంగానదిలో మునిగి పాపదూరుడై శివ కేశవులను స్తుతించి ,బంగారు రెక్కలు పొంది ,వజ్ర శరీరుడు,మహాబలుడు ,అతి వేగగామి,సర్వ శక్తిమంతుడై గరుత్మంతుడు విష్ణులోకం చేరి మళ్ళీ సేవాకార్యంలో చేరాడు .గరుడుడు స్నానించిన చోటు గరుడ తీర్ధం గా ప్రసిద్ధి చెందిందని ,అక్షయ ఫలమిస్తుందని బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించాడు .

    22 –గోవర్ధన తీర్ధం

 నారదునికి బ్రహ్మ గోవర్ధన తీర్ధ మహిమ వర్ణిస్తూ –జాబాలి అనే బ్రాహ్మణుడు పొలం దున్నుతూ ,మిట్టమధ్యాహ్నమైనా అలసి వగరుస్తున్నా   ఎద్దులకు విశ్రాంతి ఇవ్వకుండా అవి ఏడుస్తున్నా వదలకుండా కొడుతూ  బాధించేవాడు .ఆ మూగజీవుల బాధ చూసి కామధేనువు ,సురభి నందికి చెబితే ,ఆయన శివుడికి విన్నవిస్తే ,ఆయన ఆజ్ఞతో నంది సమస్త  గోగణాన్నితెచ్చి దాచేశాడు .లోకాలన్నీ తల్లడిల్లి సురులు బ్రహ్మకు చెప్పగా ఆయన శివుడిని వేడుకోమనగా  వెళ్లి సుప్రసనన్నుని చేసుకొనగా నందిని అడగమని చెప్పగా ,తమకు ఉపకారం చేసే గోవు ను ఇవ్వమని కోరగా ‘’గో సవము ‘’ఆనే క్రతువు చేయని చెప్పగా ,వారు గౌతమీ తీరం లొ’’ గోసవ క్రతువు ‘’ చేయగా గౌతమీ నది శుభ పవిత్ర పార్శ్వభాగం లో దివ్య ,మానుష గోగణాలు వృద్ధి అవటం ప్రారంభించాయి .అప్పటినుండి  గోవులు వర్ధనం చెందిన  ఈ తీర్ధం ‘’గోవర్ధన తీర్ధమయింది.దీనిమహిమ అనంతం ‘’అని బ్రహ్మ నారదుని తెలియ జేశాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21 11-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -12

19-జనస్థాన తీర్ధం

నాలుగు యోజనాల జనస్థాన తీర్ధం స్మరణతోనే ముక్తినిస్తుంది .వైవస్వత మన్వంతరం లోజనకమహారాజు వరుణునిపుత్రికను  పెళ్ళాడాడు .ఆయన తనపురోహితుడు యాజ్ఞ్యవల్క్యుని ‘’భుక్తివలన ,సుఖం వలన ముక్తి ఎలా లభిస్తుంది ?’’అని అడిగాడు .దాని కతడు ఆయనమామగారైన వరుణుని అడగమని సలహా ఇచ్చాడు .ఇద్దరూకలిసి వరుణుని చేరి అడిగారు .వరుణుడు ‘’ముక్తి రెండురకాలుగా లభిస్తుంది .ఒకటి కర్మద్వారా రెండు ఆకర్మద్వారా .వేదాలన్నీ ఆకర్మమార్గం కంటే కర్మమార్గమే శ్రేస్టమన్నాయి. ధర్మార్ధ కామమోక్ష పురుషార్ధాలన్నీ కర్మబద్ధాలే .కర్మ రాహిత్యం తో ముక్తి వస్తుందనేది అపోహమాత్రమే .కర్మ చేతనే ఏదైనా సిద్ధిస్తుంది. మానవులు మనోవాక్కాయ ములచేత వైదిక కర్మలు చేయాల్సిందే దీనివలన భుక్తితోపాటు ముక్తికూడా లభిస్తుంది.  ఆకర్మకంటే కర్మ పుణ్య ప్రదం .బ్రహ్మ చర్యాది ఆశ్రమకర్మలన్నీ విశేష పుణ్య ప్రదాలే .వీటిలో గృహస్థాశ్రమ౦ మిక్కిలి శ్రేష్టం దీనివలననే భుక్తీ ముక్తీ కలుగుతాయి ‘’అని చెప్పాడు .

  వరుణుని వీరిద్దరూ ‘’భుక్తి ముక్తి ఇచ్చే దేశం, తీర్ధం ఏవి ?’’అని అడుగగా ‘’భూమిపై భారతవర్షం అందులోనూ దండకారణ్య ప్రాంతం పుణ్య దాయకం .ఇక్కడ చేసే కర్మ భుక్తి ముక్తి హేతువౌతుంది .తీర్ధాలలో గౌతమి అనే గంగ శ్రేష్టమైనది .మానవులకు ముక్తినిస్తుంది ఇక్కడ చేసే యజ్న దానాలవలన భుక్తి ముక్తులు లభిస్తాయి .’’అన్నాడు ఇద్దరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు .జనకుడు తర్వాత గంగా తీరం వెళ్లి  యాజ్ఞ్యవల్క్యుని ఆధ్వర్యం లొ ఆశ్వమేధాది యాగాలు చేసి ముక్తిపొందాడు ఆయన వంశం లొ అనేక జనకరాజులు గౌతమీ నదివలన ముక్తి చెందారు  .జనకుడు  యజ్ఞం చేసిన నాలుగు యోజనాల ప్రదేశం ‘’ జనస్థానం’’ అయింది .స్మరణ మాత్రం చేత కోర్కెలను తీరుస్తుంది అప్పటినుంచి ఇది’’ జనకతీర్ధం’’ అయిందని బ్రహ్మనారదునికి తెలిపాడు .

20 –అరుణా –వరుణా సంగమ ఆశ్వభాను తీర్ధం

  కాశ్యపుని పెద్దకొడుకు ఆదిత్యుడు అనే సూర్యుడు. త్వష్ట పుత్రిక ఉషను పెళ్ళాడాడు .వీరిపుత్రులే వైవస్వతమనువు ,యముడు .యమునా కూతురు .ఉష  సూర్య ప్రతాపాన్ని భరించలేక పోతోంది.ఉపాయంగా తన చాయను తన రూపం తో సమానమైనదాన్ని చేసి ,ఆమెనే భర్తకు ప్రీతికలిగిస్తూ సంతానాన్ని సాకమని ఈ  విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పి అమె అంగీకరించగా సూర్య గృహం నుండి ఉష వెళ్లి పోయింది .

  ఉష తన తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది .ఆయన ‘’స్త్రీలకు  తగినపనికాదు నువ్వు చేసింది .స్వేచ్చా ప్రవృత్తి వినాశహేతువు .నువ్వు ఇక్కడ ఉండరాదు.నీ భర్తదగ్గరకే వెళ్ళు ‘’అని నచ్చ చెప్పాడు .ఆమె వినక ఉత్తర కురు దేశం వెళ్లి ఆడగుర్రం రూపంతో భర్తను గురించి  తపస్సు చేసింది.అక్కడ చాయదేవితో సూర్యుడు సంసార సుఖాలు అనుభవిస్తున్నాడు .వీరిద్దరికీ సావర్ణి ,శని కొడుకుకులుగా,విస్టి అనే దుస్టకన్య కూతురుగా  పుట్టారు .అప్పటినుంచి సవతి సంతానంపై భేదభావం  చూపించేది .యముడుగ్రహించి చాయను కాలితో తన్నాడు .ఆమె యముడిని అతనిపాదం చిన్నమై పోతుందని శపించింది .ఏడుస్తూ తండ్రికి చెప్పుకొన్నాడు .

  విషయం అర్ధమై ఆదిత్యుడు ఉత్తర కురు దేశానికి వెళ్లి బాడబ అంటే గుర్రం రూపం లో తపస్సు చేస్తున్న ఉషను పురుష అశ్వ రూపం లొ  చేరి  సకిలించాగా ,ఆమె భర్త గుర్రం రూపం లొ వచ్చాడని గ్రహించి పారిపోగా ,వెంబడిస్తూ ఇద్దరూ వింధ్యపర్వతం దాటి దక్షిణం వైపు పరిగెత్తుతూ గౌతమీనది దగ్గరకు చేరగా ,అక్కడ జనస్థానం లొ ఉన్న మునిబాలురు గుర్రాన్ని ఆపేశారు .భానుడు కోపంతో ఋషులను కొడుకులను వట వృక్షాలు గా మారమని  శపించగా,మునులు దివ్య దృష్టితో గ్రహించి సూర్యుని స్తుతించగా అతడు ఆడగుర్రం దగ్గరకు చేరి ,భర్త అని తెలుసుకొని ఇద్దరూ గౌతమిలో దిగి సుఖించగా ,ఆమె ముఖం నుంచి వీర్యం కారగా అది గంగాలోపడి అశ్వినీ దేవతలు పుట్టారు .

  ఈ మహా సంఘటనకు ఆశ్చర్యపడి దేవ ముని ఓషధి, దిశాదేవాతలు,త్వష్ట మొదలైన  అందరూ అక్కడకు చేరగా మామగారితో సూర్యుడు తనను సానబట్టి తన తేజస్సును తగ్గించి ఉషకు అనుకూలం చేయమని కోరాడు .త్వష్ట అలాగే చేయగా ‘’ప్రభాస తీర్ధం ‘’ఏర్పడింది .బాడబ రూపాలలో ఉషా ఆదిత్యులు గంగానదిలో సంగమించి,అశ్వినీ దేవతలా జన్మకు కారణ మైన చోటు ‘’అశ్వినీ తీర్ధం ‘’అయింది .యమునా, తాపీ లు తండ్రిని చూడటానికి వచ్చిన ప్రదేశం ‘’భాను తీర్ధం ‘’.అరుణా ,వారుణా నదులు గంగను కలిసిన చోటు లన్నీ 27 వేల తీర్దాలయ్యాయి –‘’స్మరణా త్పఠనా ద్వాపి శ్రవణాదపి నారద –సర్వపాపవినిర్ముక్తో ధర్మవాన్స సుఖీభవ ‘’అని బ్రహ్మ నారదమునికి వివరించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20 11- 18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

   .   ,

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

  జనన విద్యాభ్యాసాలు

తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్  శ్రీ నోరి నరసింహ శాస్త్రి  ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ 1958లోఎల్. సి .యి .లో చేరి 1961లొ ఉతీర్ణులై డిప్లోమాపొంది , ఉస్మానియా యూని వర్సిటి నుండి 1968లొ బి యి ను ,అదే యూని వర్సిటి నుండి 1976 లొ ఎం .యి.డిగ్రీలు అందుకొన్నారు .

               ఉద్యోగం

హైదరాబాద్ లొ ఇండియన్ ఇన్ ష్టి ట్యూట్యూట్

కెమికల్ టెక్నాలజీ (ఐ .యెన్ .సి .టి.)లొ 1962లొ ఇంగానీర్ గా ఉద్యోగం ప్రారంభించి ,21సంవత్సరాలు మాత్రమే ఉద్యోగించి ,1983లొ స్వచ్చంద పదవీ విరమణ చేశారు .అప్పటినుంచి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులుగా కన్సల్టేన్సీ చేస్తున్నారు . చార్టర్డ్ ఇంజినీర్ కూడా అయిన శాస్త్రిగారు ప్రభుత్వ ఆప్రువ్డ్ వాల్యుయర్ .అనుక్షణ పరిశ్రమ వీరి దీక్షకూడా .

               వివాహం సంతానం

13-6-1953న శ్రీమతి అన్నపూర్ణ గారిని వివాహమాడి శ్రీ కళ్యాణ్ సుందర్ ,శ్రీ రాజశేఖర్ కుమారులను ,శ్రీమతి లలితా సావిత్రి కుమార్తెను సంతానంగా పొందారు .మనవలు మనవ రాళ్ళతో ఆనందం అనుభ విస్తున్నారు.

            శ్రీ విద్యోపాసన –మంత్రోపదేశ, పాదుకాంత దీక్ష

  వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన శ్రీ శాస్త్రిగారువంశపారంపర్యంగా వచ్చిన శ్రీ విద్యోపాసన కొనసాగించి 1953లొ శ్రీ శృంగేరీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మా౦తా చార్యమహాస్వామి వారిచే మంత్రోప దేశం పొంది ,మహా పాదుకాంత దీక్షను శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠాదీశ్వరులు శ్రీ నృసి౦హానంద మహా భారతీ స్వామి వారిచే 1988లో గ్రహించి దీక్షానామం ‘’పూర్ణాన౦ద నాభ ‘’పొందారు .స్నేహపురిలో అందమైన రెండు అంతస్తుల భవనం కట్టుకొని ,పై అంతస్తులో ఉంటూ ,అమ్మవారి పీఠం పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో సుమారు 650కి పైగా శ్రీ చక్రార్చన చేసిన మహోపసకులు.శాస్త్రిగారు

      సామాజిక సేవ

 స్నేహపూరి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా కాలుష్య నివారణ సేవలో అగ్రగామిగా ఉన్నారు. ఆర్ .ఆర్ .లాబ్ లొ సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  ,స్నేహపూరి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గా 12ఏళ్ళు పని చేసి కాలనీ అభివృద్ధికి సేవ చేసిన అవిశ్రాంత సేవామూర్తి .

                 సాహితీ సేవ

 . నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు తండ్రి గారి రచనలన్నిటినీ పునర్ముద్రించారు .

 సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆధ్యాత్మిక గ్రంథాలనురచించారు ప్రతి విషయాన్నీ వారు శ్రీ చక్ర దృష్టితో విశ్లేషించి గ్రంథ రచన చేసి ఎవరూ చేయని సాహితీ సేవ చేసి తమ ప్రత్యేకత చాటుకొన్నారు . ఈ లోచూపు అంతా గురువులు శ్రీ కల్యాణానంద భారతీ స్వామి కృపాకటాక్ష౦ శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహమే  నని వినయంగా తెలియ జేస్తారు.వీరి గ్రందాల పేర్లు చదివితేనే వీరెంతటి మహోన్నత రచనలు చేశారో అర్ధమవుతుంది .లోపలి వెళ్లి తరచి చూస్తె అలౌకిక ఆనందమే అనుభవైక వేద్యమవుతుంది .

                  నోరి ట్రస్ట్ కార్యక్రమాలు

ప్రతియేటా వేదసభలను నిర్వహించి వేదపండితులను నగదు పురస్కారాలతో  సత్కరిస్తారు .తెలుగు లొ ప్రసిద్ధకవులను గుర్తించి నగదు పురస్కారం తో సన్మానిస్తారు .యువ పద్యకవులను ప్రోత్సహించి సత్కరించి నగదు పురస్కారమిస్తారు .

               ప్రచురించిన గ్రంథాలు-

1-ఆన౦దో బ్రహ్మేతి 2-శ్రీ కళ్యాణ హృదయము ౩-ఆత్మ తత్త్వం 4 శ్రీ శంకర హృదయం 5 బీజాక్షర నిఘంటువు 6 –శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము నామాక్షర ఛందో వైశిష్యము 7-శ్రీ భగవద్గీత విభూతి అధ్యాయం లొ శ్రీ విద్యా రహస్యాలు 8-మధు విద్యా దర్శనం 9-షట్చక్ర రహస్యాలు 10-శ్రీ దేవీ ఖడ్గమాలా రహస్యాలు 12-నమక చమకాలలొ శ్రీ విద్యా రహస్యాలు  13-దుర్గా సూక్తం – శ్రీ విద్యా రహస్యాలు 14  – అరుణము –శ్రీ విద్యా రహస్యాలు 15 –అగ్ని ,సూర్య ,సోమ కళలు –బీజాక్షర రహస్యాలు 16-సదాశివానుగ్రహం –నవల17-సుధా –సాంఘిక నవల

  శాస్త్రిగారి సంపాదకత్వం లొ 16 పుస్తకాలు ప్రచురించారు .ప్రస్తుతం తండ్రిగారి పుస్తకాలన్నిటినీ ఎమెస్కో వారిచేత పునర్ముద్రణ చేయిస్తున్నారు .

   శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్యాత్మిక సేవకు తగిన బిరుదులు

-1-శ్రీ విద్యా రత్నాకర 2-శ్రీ విద్యానంద ౩-శ్రీ చక్రార్చన పరాయణ 4 ఆర్ష విద్యా రత్నాకర మొదలైన సార్ధక బిరుదనామాలు అందుకొన్నారు .

  పురస్కారాలు

జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీస్వామి వారి పురస్కారం అందుకొన్న విద్వద్వరేణ్యులు  శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .దేశం లోని ఎన్నో ఆధ్యాత్మిక సేవాసంస్థల దృష్టిలో  ఇతర పీఠాదిపతుల దృష్టిలో శాస్త్రిగారు పడకపోవటం ఆశ్చర్యమే.

   శాస్త్రి గారితో నా పరిచయం

14 -11- 18 బుధవారం శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నాకు హైదరాబాద్ నుండిఉయ్యూరుకు  ఫోన్ చేసి తమకు మద్రాస్ లొ ఉన్న శ్రీ నోరి రామకృష్ణయ్యగారు  2011 లొ నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు ‘’లోనితిలక్ గీతారహస్యాన్ని తెలుగులోకి అనువదించిన  నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాసం తనకు పంపారని ,అంతకంటే వారి గురించి అదనపు సమాచారం ఉంటె తెలియ జేయమని కోరారు .నేనూ మా అబ్బాయి శర్మా ప్రయత్నించాం ఏమీ దొరకలేదు . తాను నోరి నరసింహ శాస్త్రి గారబ్బాయినని ,హైదరాబాద్ లొ హెచ్ ఎం టి నగర్ దగ్గర ఉంటానని చెప్పారు. అప్పుడునేను సరసభారతి గ్రంథద్వయం రేపల్లెలో 24 -12 -17  న ఆవిష్కరించామని అవేదికకు శ్రీ నోరి నరసింహ శాస్స్త్రి సాహిత్య వేదిక ‘’అని పేర్కొన్నామని చెప్పగా చాలా సంతోషించారు .వీరి గురించి 5-9-18 ఉయ్యూరులో శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  గురువరేణ్యుల గురుపూజోత్సవం లో సరసభారతి సన్మానించినకవి రాజమౌళి  శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు చెప్పి తనకూ శాస్త్రిగారు హైదరాబాద్ లొ నోరి చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం అందజేశారని నాకు చెప్పారు ..    తర్వాత మేము  శుక్రవారం బయల్దేరి హైదరాబాద్ మల్లాపూర్ వస్తానని  ఆదివారం వీలయితే   వారిని కలుస్తానని చెప్పగా ఆనందంగా తప్పక రమ్మన్నారు

  ఈ రోజు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి నేనూ, మా పెద్దబ్బాయి శాస్త్రి వారింటికి వెళ్లాం .మాటల సందర్భం లో తిలక్ ’’ గీతారహస్యం’’ అనువదించిన శాస్త్రిగారు  మద్రాస్ నోరి రామకృష్ణయ్యగారు బంధువులా అని అడిగితె, కాదని తాము గుంటూరు జిల్లానోరి వారమని కృష్ణయ్యగారు కృష్ణాజిల్లావారని గీతారహస్య శాస్త్రిగారి గురించి తెలీదని  చెప్పారు .సరసభారతి పుస్తకాలు వారికి అందజేయగా ,వారు తమ తండ్రిగారివీ,తమవీ గ్రంథాలు నాకు ఇచ్చారు . అన్నీ అత్యంత  విలువైనవే . శాస్త్రిగారి కొన్నిఆధ్యాత్మిక  పుస్తకాలు ఉయ్యూరు లైబ్రరీ లోతీసుకొని చదివాను .కానీ ఆయనే ఈయన అని తెలియలేదు. ఈ విషయం వారికీ చెప్పాను .నవ్వారు .సరసభారతి ఉగాది వేడుకలకు రమ్మని ఉగాది పురస్కారం అందుకోమని  ఆహ్వానిస్తే తప్పక వస్తానన్నారు .సంభాషణలో శ్రీ అందుకూరి శాస్త్రిగారి ప్రస్తావన వచ్చింది ఆయన తనకు బాగా తెలుసునన్నారు .అందుకూరి వారికి అక్కడి నుంచే ఫోన్ చేస్తే వారి శ్రీమతిగారు అందుకొని కాసేపట్లో వస్తారని చెప్పగా మళ్ళీ చేసి ఆమాట ఈ శాస్త్రిగారికి చెప్పాను .ఇంటికి వచ్చాక అందుకూరి వారే ఫోన్ చేసి శాస్త్రిగారితో తమకు దూర బంధుత్వమూ ఉందని చెప్పగా ఉయ్యూరు ఆహ్వానించానని చెబితే తప్పక అలాంటి వారిని సన్మానించాలన్నారు .  అందుకూరి వారు మా ఇద్దర్నీ వారింటికి ఆహ్వానించారు .21 మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నానని  ,శుక్రవారం బాచుపల్లి మా రెండో అబ్బాయి శర్మ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయి౦చటానికి  వెడతామని, వీలుని బట్టి అక్కడినుండి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాను .నోరివారు మంగళవారం సాయంత్రం 6 గంటలకు త్యాగరాజ గాన సభలో ఒక సభ తన అధ్యక్షతన జరుగుతుందని తప్పక రమ్మని చెప్పి  5 గంటలకు వారింటికి వస్తే తామే కారులో తీసుకు  వెడతామనగా సరే అన్నాను

   ఈ విధంగా అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక వేత్తను ,తండ్రిగారి పేరు నిలబెడుతున్నకుమారరత్నం అయిన బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సందర్శించిన మహద్భాగ్యం నాకు  కలిగింది .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

—   
— 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

   శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ తెలంగాణా మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చపేట లొ శ్రీ నాగ లింగ శాస్త్రి ,శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లొ ఉంటున్నాడు .వేములవాడ రాజరాజేశ్వరీ కళాశాలనుంచి సంస్కృత౦ లొ బి. ఏ.,ఉస్మానియా యూనివర్సిటినుండి తెలుగు సంస్కృతాలలో  ఎం ఏ . డిగ్రీలుపొంది కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఎం ఫిల్ అందుకున్నాడు .

 శంకర శర్మబాల్యమిత్రుడు ముదిగొండఅమరనాధ శర్మతో కలిసి   సంస్కృతం లొ మహాకాళీ సుప్రభాతం ,శ్రీ రామ చంద్ర సుప్రభాతం ,చాము౦డేశ్వరీ స్తోత్రం రాశాడు . ముదిగొండ అమరనాధ శర్మతో కలిసి 10 సంస్కృత ఆంద్ర అస్టావవధానాలు చేశాడు .భువన విజయ సాహిత్య రూపకాలలో  ధూర్జటి ,పెద్దన ,గా 50 ప్రదర్శనలిచ్చాడు .వైదిక ధర్మ కర్మ నిష్ణాతుడు .20 07 లొ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ‘’కలాసుబ్బారావు స్మారకపురస్కారం ,20 08  లొ సద్గురు శివానంద మూరర్తిగారి సమక్షం లొ శైవ క్షేత్రం లొ అమరనాధ శర్మతో కలిసి అష్టావధానం చేసి పురస్కారం పొందాడు 2009లోసత్యసాయి సేవాట్రస్ట్ బూర్గుపల్లి గజ్వేల్ వారిచే ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం ,సిద్ధిపేట స్వర సాధన వారి చే ‘’ఉపాధ్యాయ రత్న ‘’పురస్కారం ,2011 లొ వంశీ అంతర్జాతీయ సంస్థచే ఉగాది పురస్కారం ,గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఉత్తమ భాషోపాధ్యాయ పురస్కారం ,కలెక్టర్ చే సన్మానం అందుకొన్నాడు ఆకాశవాణిలో అమరవాణిసంస్కృత ప్రసంగాలు చేశాడు శైవమత ప్రబోధిని మాసపత్రికకు అయిదేళ్లుగా సహాయ సంపాదకుడు .

334-శ్రీ నోరి నరసి౦హోదాహరణకర్త –ముదిగొండ అమరనాథ శర్మ (1968 )

 దుబ్బాక వాస్తవ్యుడైన ముదిగొండ అమరనాథ శర్మఅనర్గళంగా సంస్కృత రచన చేయగల దిట్ట . 15-7-1968 న మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చం పేట లొ జన్మించాడు తలిదండ్రులు శ్రీమతి శ్రీ సిద్ధమణి శివారాధ్య .6 వ తరగతినుంచి బియే ఓ ఎల్ వరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ సంస్కృత కళాశాలలో చదివాడు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి  తెలుగు సంస్కృతంలలో ఎం ఏ డిగ్రీలను ,పిహెచ్ డి  పొందాడు .సికందరాబాద్ సర్దార్ వల్లబాయి పటేల్ డిగ్రీకాలేజి లొ సంస్కృత ఉపన్యాసకుడు .

  మా టివిలో ‘’శివ గీతా ప్రవచనం ‘’అమరవాణీ ప్రసంగపాఠాలు రేడియో ప్రసంగాలు శ్రౌత శైవంపై ఉపన్యాసాలు ఇస్తున్నాడు భువన విజయం లొ ధూర్జటి పాత్ర పోషిస్తాడు .బాల్యమిత్రుడు ముత్యంపేట గౌరీ శంకర శర్మతోకలిసి సంస్కృత తెలుగు అష్టావధానాలు 10 చేశాడు .ఈ జంటకవులు శ్రీ మహాకాళీ సుప్రభాతం  శ్రీ రామ చంద్ర స్వామి సుప్రభాతం ,శ్రీ చాము౦డేశ్వరీ సుప్రభాతం ,సద్గురు శివానందాస్టకం  రాశారు .శ్రౌత శైవ  సేవలో  జీవితం ధన్యం చేసుకొంటున్నారు .శైవ మహా పీఠం ఆస్థాన పండితుడు .సద్గురు శ్రీ శివానందమూర్తి  శ్రీ నారా చంద్ర బాబు గార్లనుండి సంస్కృత పండిత పురస్కారాలు అందుకొన్నాడు .

 .సంస్కృతం లొ చాలారచనలు చేసినా   నోరి నరసింహ శాస్త్రి గారి 114జయంతి సందర్భంగా శాస్త్రిగారిపైసంస్కృతం లొ  ‘శ్రీ నరసి౦హోదాహరణ ‘’అనే స్తుతి లఘు కృతి రాశాడు .దీనికి డా ముదిగొండ శివప్రసాద్ ఆశీరామోదం రాశారు . సాధారణంగా ఉదాహరణ రచన చేయటానికి కవులు ఇష్టపడరు .ముఖ్యంగా దేవతా స్తుతికే ఉదాహరణ రాస్తారు .ఒక్కోసారి మానవోత్తములపైనా రాశారు .రుషి తుల్యుడైన కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారిపై రాసినది కనుక గ్రంధము సుగంధమైనది అన్న ముదిగొండ శివ ప్రసాద్ గారి మాట అక్షర సత్యం .అమరనాధశర్మ రచన గుణబందురమై శోభిల్లింది ఇందులోని ఒకటి రెండు ఉదాహర శ్లోకాలను ఉదహరిస్తాను

-నోరి వంశ కులోత్పన్నం –కవి  సమ్రాద్విభూషితం –నరసింహ శాస్త్రిణ౦ వందే –నానా శాస్త్ర విశారదం ‘’

1-ప్రధమా విభక్తిః-

శ్రీమన్నోరి కులోద్భవో విజయతే శ్రీ నారసి౦హాభి ధో –ధీరోదాత్త కవిత్వ తత్వ లసితో రమ్యార్ధభావాన్వితః

సచ్చారిత్ర వినూత్న లక్షణయుతో సత్యవ్రతీ సాత్వికో –శ్రీ చక్రాంకిత మానసో గురువరో విజ్ఞాన కోశాన్వితః

మహా లక్ష్మ్యా సుపుత్రోయం హనుంచ్చాస్త్రి తోషకః –నరసింహ మహా ప్రాజ్ఞః జీయా దాచంద్ర తారకం ‘’

ప్రశస్త స్తోత్రియ ప్రమాణ విద్యయా విరాజతే –వివేక నిత్య సత్య తత్వ చిన్మయాఖ్య దీక్షయా

సమగ్ర కావ్య నాటకాది నవ్యభావనాన్వితో –నృసింహ సత్కవీశ్వరోహి నిత్య నూత్న భావుకోః’’

2-సప్తమీ విభక్తిః

రాస్ట్రే స్మిన్ ‘’త్వయి ‘’కావ్య దివ్య రచనా నిర్మాణ పారీణతా –లోకేస్మిన్ భవదీయ దివ్య గరిమా భో భూయతే సర్వదా

విశ్వేస్మిన్ వరగేయ నాటిక కథా’’యుష్మాసు ‘హృద్యాన్వితా –శ్రీ విద్యాచ ‘’భవత్సు ‘’శాక్తమహిమా నిత్యం దారీ దృశే ‘’

శ్రీ శృంగేరీ విరూపాక్ష –పీఠాదీశ్వర సన్నిధౌ –శాస్తార్ధ చింతనం కృత్వా –కృత కృతాశ్చశాశ్వతం ‘’

పా౦డిత్యే ‘’కవనే ‘’పురాణ కథనేశ్రీ చక్ర నిత్యార్చనే –వేదాంతే శృతి గోప్య దివ్య విషయే వాక్యార్ధ చర్చాన్వితే

వక్తృత్వేచకుటుంబ పోషణ విదావధ్యాపనే దార్మికే –సర్వత్రాపి ‘’భవత్సు ‘’నవ్య పటుతా సందృశ్యతే సర్వదా ‘’

3-సార్వ విభక్తికం

‘’విశ్వేస్మిన్ కవిరాట్ ‘’త్వమేవ ‘’గణవాన్ జ్ఞానీతి’’త్వామేవ ‘’హి-త్వయ్యే తత్ప్రతి భాతిశబ్ద నిచయో ‘’తుభ్యం ‘’నమోసజ్జనాః

‘’త్వద్వైనూత్న’’ విశేష భావ మఖిలం సంప్రార్ధ్యతే సర్వదా –పాండిత్యం ‘’తవ ‘’సార్వకాలికమహో ‘’త్వయ్యై వ ‘’విజ్ఞానిదీ   సర్వత్రాపి విరాజతే బహుదా స్తోతుం సమాయా౦తిచ

ముదిగొండ సువంశేన –అమరానాదాఖ్య శర్మణా-రచితం నరసింహస్య –ఉదాహరణ వాజ్మయం ‘’

ఈ సంస్కృత ఉదాహరణ శ్లోకాలకు ఆయన మిత్రుడు శ్రీ ముత్యం పేట గౌరీ శంకరశర్మ తెలుగు అనువాదమూ చేశాడు .

ఆధారం -ఈ పుస్తకాన్ని నిన్నసాయంత్రం బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శర్మగారు నాకు అందజేయగా దాని ఆధారంగా ఈ ఇద్దరు గీర్వాణకవులపై రాశాను.

335-శ్రీ నృసింహ సాంఖ్య దర్శన కర్త –శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ (1860)

శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ గారే శ్రీ శృంగేరీ విరూపాక్ష పీతాదిపులైన జగద్గురు  బోధానంద భారతీ స్వామి .వీరు 1860 డిసెంబర్ 13 తూర్పు గోదావరిజిల్లా ఎనుగులమహల్ అగ్రహారం లొ శ్రీ రాణీ అనంత శాస్త్రి శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు శ్రీ నరసింహస్వామి వర ప్రసాదంగా  జన్మించారు . 8 వ ఏట ఉపనయనం జరిగి శ్రీ కర్రా సింహాద్రి శాస్త్రిగారి వద్ద సంస్కృత సాహిత్య ,జ్యోతిష విద్యలను నేర్చారు .12 వ ఏట పూనా లొ ‘’కేరో లక్షణ ఛత్రే’’గారి శిష్యులై పదేళ్ళు  వేద వేదా౦గ  పారీణులయ్యారు  . లోకమాన్య బాలగంగాధర తిలక్ వద్ద ఆంగ్లవిద్య నేర్చారు .

   12 వ ఏట తలిదండ్రులతో దేశాటన చేస్తూ ఒరిస్సాలోని కటక్ లొ జ్యోతిశ్శాస్త్ర పండితులను వాదం లొ ఓడించి సత్కారం పొందారు 22 వ ఏట విజయనగరం మహారాజా ఆనందగజపతి సంస్థాన పండితులయ్యారు .ప్లవనామ సంవత్సర అధికమాస వివాద సందర్భంగా రాజమండ్రి జ్యోతిష సభలోపాల్గొని తనవాదానికి విజయం పొంది ‘’దైవజ్ఞ సార్వ భౌమ ‘’బిరుదుపొందారు .రాజావారి ఆస్థానంలో ఉంటూనే చిన్నవయసులోనే ‘’ఆహితాగ్ని ‘’అయి ,యజ్ఞం చయనం,బృహస్పతి నవాన్తరాది శ్రౌతకర్మలలోప్రసిద్ధి చెంది ‘’నరసింహ మహాగ్ని చిత్ (చయనులు )అయ్యారు. విశాఖ అంకితం జగ్గారావు సంస్థానం లొ ‘’దివాను ‘’పదవి పొంది అసమాన లౌకిక ప్రజ్ఞతో అపర యుగంధర మహామంత్రి అనిపించారు .కశింకోట సంస్థానాధిపతి శ్రీ మారెళ్ళ వేంకట చలం పంతులు గారి అభ్యర్ధనపై ‘’వైదిక బోర్డ్ ‘’ప్రెసిడెంట్ గా  రెండేళ్ళు న్నారు.

  మహాగ్ని చిత్ గారు సంస్కృతం లొ ‘’నృసింహ సాంఖ్య దర్శనం ‘’ అనే శంకరాద్వైతాన్ని గణిత శాస్త్రం తో నిరూపించే భాష్య ప్రయుక్త సూత్ర గ్రంథం రచించారు .వీరి విజ్ఞాన ప్రాభవానికి జగద్గురు  పీతాధిపతులు ‘’సాంఖ్యా చార్య ‘’బిరుదుతో సత్కరించారు .37వ ఏట ‘’సూర్య గ్రహణము –శుద్ధాద్వైత ప్రతిపాదకము ‘’అని నిరూపిస్తూ ‘’చిత్సూర్యా లోకము ‘’అనే సంస్కృత నాటకాన్ని వేదాంతపరంగా ,శృంగారపరంగా రాశారు .ఇవే కాక తిధికల్పవల్లి ,చూడామణి కాలమానోపపత్తి మొదలైన అరుదైన జ్యోతిష గ్రంథ రచన చేశారు .’’యోగ దర్శనం ‘’అనే వేదాంత గ్రంథమూ రాశారు .భార్య మరణించగా మూడు తరాలనుండీ వస్తున్న  సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీ విశ్వావసు సంవత్సర సంక్రమణ పర్వదినాన తురీయాశ్రమాదిపతులై శ్రీ శృంగేరీ విరూపాక్ష మఠం ను తూర్పు గోదావరిజిల్లా మండపేట లొ అధిస్టించి 17 సంవత్సరాలు పీఠాదిపతిగా ఉండి ‘’పరతత్వో పన్యాసం ‘’గ్రంథాన్ని శంకరాద్వైతానికి సంధానిస్తూ రచించారు .పీఠానికి శ్రీ కళ్యాణా నంద స్వామి వారిని అభి షిక్తులను చేసి విరమణ పొందారు .ఇప్పడు ఈపీఠం గుంటూరులో విరాజిల్లుతోంది .తర్వాత ఎనిమిదేళ్ళు బ్రహ్మ నిస్టా  గరిస్టులై విజయవాడ దుర్గా క్షేత్రం లొ ప్రజోత్పత్తి చైత్ర బహుళ అష్టమి గురువారం సిద్ధి పొందారు .కృష్ణ లంకలో వీరి సమాధి దర్శించవచ్చు

336-హంస కిరణావళీ కర్త –  శ్రీ రాణీ వేంకటాచలపతి ప్రసాద మహాగ్ని చిత్(1890 )

  శ్రీ రాణీ వేంకటాచలపతి ప్రసాద మహాగ్ని చిత్ గారు శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ గారి పుత్రులే .కోనసీమ వాడ పాలెం లొ 11 9-1890 జన్మించారు.బాల్యంలోనే వేదవేదాంగాలు నేర్చారు .విజయవాడ చేరి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ గా 36సంవత్సరాలు సేవ చేశారు .విద్యార్ధులకు వైద్య విద్య నేర్పటం లొ వీరి విధానం ఆసక్తిగా ఉండేది .విదేశాలను౦డికూడావచ్చి వీరివద్ద శాస్త్రాలు నేర్చుకొనేవారు .

  ప్రసాద మహాగ్ని చిత్ గారు సంస్కృత గ్రంథాలు చాలా రాశారు .అందులో శ్రీ చక్ర ప్రాసాదము ,మాతృకా ప్రాసాదము ,సాంఖ్య వేదాంతప్రాసాదీయ భాష్య ముక్తాఫలము ,బ్రహ్మావగత్యో  పన్యాసము ,హంస కిరణావళీ,భానభాస్కరము విమర్శనామృతము ,సారోప దర్శనం మొదలైనవి ,  వీరి సంస్కృత గ్రంధములు అంత తేలికగా కొరుకుడు పడవు .ఇది గ్రహించి తర్వాత వారే తెలుగు అనువాదాలు రాసి సరళం చేశారు .తండ్రిగారి ‘’నృసింహ సాంఖ్య దర్శనం ‘’కూడా అర్ధం చేసుకోవటం కష్టమే .దీనికి ‘’చక్రవాకీ ‘’అనే తెలుగు తాత్పర్యం రాసి జ్జ్ఞాసులకు అందుబాటులోకి తెచ్చారు .వీరి సారోపదర్శనం ,భానభాస్కరం లకు కూడా తెలుగు తాత్పర్య గ్రంథాలను శిష్యమండలి ప్రచురించారు   తండ్రిగారిలాగానే యజ్ఞయాగాది చయ బృహస్పతి నవాంత కర్తలు .పండిత శిరోమణి .శ్రీ విద్యా బ్రహ్మవిద్యా విద్వద్వరే ణ్యులు వీరుసన్యాసం స్వీకరించి శ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీ స్వామి ‘’నామధేయులై  ప్రస్తుతం తురీయాశ్రమం స్వీకరించి విజయవాడలో ఉంటున్నారు .

   ఆధారం –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిన్న సాయంత్రం నాకు అందజేసిన ;;శ్రీ రాజ్ఞీ నృసింహ మహాగ్నిచిత్ ప్రణీత ‘’నృసింహ సాంఖ్య దర్శనం’’(సంస్కృత తెలుగుచక్రవాకీ  వ్యాఖ్యానం ),శ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీ స్వామి వారి ‘’సారోప దర్శన ,భానభాస్కర శ్చ ‘’.

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19 11- 18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -11

18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం

బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా  పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు .ఆమెను ఇంద్ర అగ్ని వరుణాదులుతమకే ఇమ్మని కోరారు .అందరూ ఆమెకావాలన్నారు .ఎలాగైనా ఇంద్రుడు దక్కించుకోవాలని ఉన్నాడు .బ్రహ్మ అన్నీ ఆలోచించి ఆకన్యకకు  గౌతముడే తగినవాడని నిశ్చయించి   అందరి ని పిలిపించి  ,ఆ బాలికచేత అందరి బుద్ధి ,ధైర్యం  మధించ బడింది కనుక ఆమెకు ‘’అహల్య ‘’అనే పేరుపెదుతున్నానని ,ఎవరు ముందుగా భూ ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఆమెను భార్యగా ఇస్తానని ప్రకటించాడు .సుర గణమంతా ప్రదక్షిణకు వెళ్ళారు .గౌతముడు మాత్రం అక్కడనుండి కదలలేదు .

  ఇంతలో కామధేనువు అర్ధ ప్రసూత అయి అక్కడికి వచ్చింది .దానినే భూమిగా భావించి కామధేనువు చుట్టూ ప్రదక్షిణం ,లింగ ప్రదక్షణం చేసి గౌతముడుబ్రహ్మ దగ్గరకు వెళ్లి తన భూ  ప్రదక్షిణ పూర్తయిందని చెప్పగా  .అప్పటికి దేవతలెవరూ భూప్రదక్షిణ చేసి తిరిగి రానందున ధ్యానయోగం తో గౌతముడు చెప్పినది సత్యమే నని గ్రహించి అహల్యను గౌతమునికి ఇచ్చి వేద్దామనుకొని ఆయనతో ‘’అర్ధ ప్రసూత ఐన కామధేనువు సప్త ద్వీపవతి ఐన భూమి అవుతుంది .లింగ ప్రదక్షణకూడా భూ ప్రదక్షిణకు సమానం’’అని చెప్పి అహల్యను గౌతమమహర్షికి ఇచ్చేశాడు బ్రహ్మ .అహల్యా గౌతముల వివాహం అయిపొయింది .

  అప్పుడు దేవతలంతా తిరిగి వచ్చి వారి దాంపత్యాన్ని  అభినందించి ,ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళారు. బ్రహ్మగిరిపై అహల్యా గౌతములు హాయిగా కాపురం చేస్తున్నారు .ఇంద్రుడు ఇక్కడి వీరి వైభవానికి అసూయ చెంది ,ఏదో ఒక రూపంలో గౌతమభవనం చేరాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు .ఒకరోజు గౌతముడు పూర్వాహ్న క్రియలు నిర్వర్తించి శిష్యులతో ఆశ్రమం వదలి ,బయటికి వెళ్ళాడు .ఇదే అదను అనుకోని గౌతమ వేషంతో ఆశ్రమం ప్రవేశించి ,ఆమెతో సరసల్లాపాలు చేస్తూ ఉన్నా ఆమెకు వాడు ఇంద్రుడని తెలియక వాడితో రమించింది ..గౌతముడు తిరిగి రాగా ఆమె యధాప్రకారం ఎదురు  రాలేదని గ్రహించగా ,ముని వనితలు ఆయనతో ‘’బయటా ,లోపలా మీరే ఉన్నారేమిటి స్వామీ . బహు వేషం ఆశ్చర్యంగా ఉందే ‘’అన్నారు .ఏదో కొ౦పమునిగిందని అహల్యను బిగ్గరగా పిలిచాడు .విషయం అర్ధమైన అహల్య మాయా గౌతముడిని ‘’గౌతమముని రూపం లొ వచ్చి మోసం చేసిన నువ్వెవరు ‘’అనగా కంగారు పడి బిడాల రూపం పొందాడు .  మహర్షిభార్యను  ‘’ఎందుకీ సాహసం చేశావు ?’’అని అడుగగా ఆమె మారాడక సిగ్గుతో నిలబడి పోగా, బిడాలాన్నితానెవరని ప్రశ్నించగా ‘’ఇంద్రుడిని .నేనే పాపం చేశాను .క్షమించు ‘’అనగా క్రోధంతో ‘’భగ ప్రీతితో పాపం చేశావు కనుక సహస్ర భగాలు కలవాడివైపో’’అనీ , అహల్యను ‘’ఎండిన నదిగా మారిపో ‘’అనీ ఇద్దర్నీ శపించాడు ముని.

  అహల్య తన నిర్దోషిత్వాన్ని మునికి చెప్పింది’’అన్య పురుషులను కోరే స్త్రీలు అక్షయనరకం పొందుతారు .వాడు మీ రూపం లొ వచ్చాడు .దీనికి సాక్ష్యం రక్షకులే ‘’అనగా వాళ్ళు కూడా అహల్య సత్యమే చెప్పిందని చెప్పారు .జాలిపొందిన మహర్షి ఎండిన రూపం లొ ఉన్న అహల్యానది ఎప్పుడు గౌతమి నదితో కలుస్తుందో అప్పుడు స్వస్వరూపం పొందుతుందని చెప్పాడు .ఆమె అలాగే నదిగా మారి, ఎండిపోయి, గౌతమితో  సంగమించగా , మళ్ళీ పూర్వ రూపం పొంది౦ది .ఇంద్రుడు గౌతముని ప్రార్ధించగా గౌతమీనదిలో  స్నానం చేస్తే దోషం హరిస్తుందని చెప్పగా అట్లాగే చేసి మళ్ళీసహస్రాక్ష  దేవేంద్ర రూపం పొందాడు .అప్పటినుంచి ఈ తీర్ధం అహల్యాసంగమం అనీ ,ఇంద్ర తీర్ధమని పేరు పొందింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు ‘’

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నోరి వారింట్లో

8-11-18ఆదివారం సాయంత్రం హైదరాబాద్ హెచ్ ఏం టి నగర్ లో తొలితెలుగు చారిత్రకానవలా రచయిత స్వర్గీయ నోరి నరసింహ శాస్త్రి (రేపల్లె )గారికుమారులుశ్రీ చక్రోపాసకులు ,శ్రీ విద్యా రత్నాకర ,,శ్రీవిద్యానందాది బిరుదాంకితులు బహు ఆధ్యాత్మిక గ్రంధకర్త నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వగృహం లో నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦

గౌతమీ మాహాత్మ్యం -10

17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦

బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం .వాడితోపాటే మరణి౦చాలనుకొన్నారు .వారి కడుపుశోకం విన్నయముడు మనసుకరిగి ‘’డ్యూటీ మానేసి’’ గోదావరీ తీరం చేరి నిష్టతో జనార్దన ధ్యానం చేశాడు .దీనితో మరణాల సంఖ్యతగ్గి జనాభావృద్ధి చెంది భూభారం విపరీతంగా పెరిగింది .భరించలేని భూదేవి దేవేంద్రునికి మొరపెట్టి కారణం అడిగింది .తనకు తెలియదన్నాడు .అయితే ప్రజలను సంహరించేట్లు యముని ఆదేశించమని కోరింది .యముడిని త్వరగా తీసుకురమ్మని ఇంద్రుడు సిద్ధ కిన్నరులను పంపాడు .యమపురానికి వెళ్లి యముడు కనపడక ఇంద్రుడికి చెప్పారు .ఇంద్రుడు యముని తండ్రి ఐన సూర్యుని అడుగగా గోదావరీ తీరంలొ తీవ్ర తపస్సులో లొ ఉన్నాడని చెప్పాడు .కారణం మాత్రం తెలీదన్నాడు .ఇంద్రుడు తనపదవికి యముడు ఎసరు పెట్టబోతున్నట్లు భావించి మామూలు ప్రకారం తపోభంగానికి అచ్చరలను పంపాలను కొని వారిలో ఎవరు సమర్ధులు అని అడిగితె వాళ్ళు మాట్లాడలేదు .అప్పుడు తానె దేవ సైన్యం తో వెళ్ళాడు .ఇంద్రుని విషయం తెలిసి శ్రీహరి యమునికి రక్షగా చక్రాన్ని నిలిపాడు .అక్కడ చక్రతీర్ధమేర్పడింది .మేనక స్వామి భక్తితో తాను వెళ్లి తపోభంగం చేస్తానన్నది .సరే పొమ్మన్నాడు .రూపంమార్చి యముని దగ్గరకొచ్చింది .విలాసంగా ,కవ్వింపుగా హిందోళ రాగం తో అవ్యక్త మధురంగా పాడి నాట్యమాడింది .ఇంకేముంది’’ యముండ’’అని ప్రగల్భాలు పలికేవాడి మనసు చంచలమై ,కామాగ్ని దగ్దుడై మేనక పై మరులు చూపగా ,ఆమె అదృశ్యమై, నదీ రూపం పొంది ,గౌతమీ నదిలో చేరి దేవ విమానం లొ స్వర్గానికి బయల్దేరగా యముడు ఆశ్చర్యపోగా ,సూర్యుడు వచ్చి ‘’నీ పరి రక్షణ బాధ్యతమళ్ళీ చేబట్టు .ఎవరి విధి వారు చేయకపోతే జీవిత చక్రం నడవదు .నేనూ బ్రహ్మా భూదేవి మా విధిని ఎన్నడూ వదలలేదు .’’అనగానే యముడు ‘’క్రూరమైన కార్యం చేయల్సి వస్తోంది.చేయలేకపోతున్నాను ‘’అనగా తండ్రి ‘’మేనక గోదావరీ స్నానం చేసి స్వర్గానికి వెళ్ళటం చూశావు కదా .నువ్వు తీవ్ర తపస్సు చేశావు .తపస్సుకు అంతం లేదు .యమపురానికి వెళ్లి మళ్ళీ విధిలో చేరి పాలన సాగించు ‘’అని హితవు చెప్పి ,గౌతమీ స్నానం చేసి స్వర్గం చేరాడు భానుడు .యముడు కూడా గోదావరీ స్నానం చేసి యమపురి చేరాడు . అప్పటిదాకా యముడికి రక్షక చక్రంగాఉన్న విష్ణు చక్రం తన విధి పూర్త యినందున మళ్ళీ శ్రీ మహా విష్ణువును చేరింది .ఈ చక్రతీర్ధ కథవిన్నా, చదివినా ,ఆపదలు నశించి ,దీర్ఘాయుస్సుతో జీవిస్తారని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లైబ్రరీ వారోత్సవం 3 వ రోజు

లైబ్రరీ వారోత్సవం 3 వ రోజు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -9 15వ అధ్యాయం –పైశాచ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -9

15వ అధ్యాయం –పైశాచ తీర్ధం

బ్రహ్మ ‘’గౌతమీనది దక్షిణ తీరాన ,బ్రహ్మగిరి ప్రక్కన ఉన్న అంజన పర్వతం పై శాపగ్రస్త యైన’’అంజనా ‘’అనే  ఒక అప్సరస ఉంది.ఆమె తలవానర తల .భర్త కేసరి .ఇతనికి ‘’అద్రికా ‘’అనే మరోభార్యకూడా ఉన్నది .ఈమె కూడా శాపగ్రస్త అప్సరసయే .ఈమె కూడా ఇక్కడే ఉంటోంది .ఒకసారి కేసరి దక్షిణ సముద్రానికి వెళ్ళగా ,అగస్త్యముని ఇక్కడికి రాగా ఈ ఇద్దరూ భక్తితో పూజించారు .సంతోషించి వారిని వరం కోరమనగా ఇద్దరూ ‘’అందరికంటే బలవంతులు శ్రేస్టులు ,లోకోపకారులు ఐన పుత్రులను ప్రసాదించ ‘’మని కోరారు ‘’అలాగే ‘’అని ఆయన వెళ్లి పోయాడు .

ఒకరోజు ఈ స్త్రీలు నాట్యం చేస్తూ ,పాటలుపాడుతూ వినోదిస్తుండగా అప్పుడు వాయుదేవుడు నిరుతి చూసి చిరునవ్వు నవ్వగా ,వీరు కామంతో దగ్గరకు చేరబోగా తాము దేవతలమని వారిద్దరూ తమకు భార్యలౌతారని అనగా’’ సరే ‘’అన్నారు .అంజనకు వాయు దేవుని ప్రభావంతో హనుమంతుడు ,నిరుతి ప్రభావం తో అద్రికా కు ‘’అద్రి’’అనే పిశాచ రాజు పుట్టారు భర్తలు తిరిగి రాగా విషయం చెప్పి ,తమ తలచేత రూపం వికృతమై౦దని మొరపెట్టుకోగా గౌతమీ స్నాన దానాలు శాపమోచనం అని చెప్పి అదృశ్యమయ్యారు. పైశాచ రూపమైనఅద్రి అంజనను హనుమంతునిగౌతమీ స్నానం చేయించగా హనుమ అద్రిక నుకూడా తీసుకొచ్చి  స్నానం చేయించాడు. అప్పటినుంచి ఇది ‘’పైశాచ తీర్ధం ‘’అయింది.’’వృషాకపి తీర్ధం ‘’అనే పేరుకూడా ఉన్నది . ‘’అన్నాడు నారదునితో .

16వ అధ్యాయం –క్షుధా తీర్ధం

నారదునికి బ్రహ్మ క్షుధా తీర్ధ విశేషాలు తెలియజేస్తూ ‘’ఒకప్పుడు కణ్వ మహర్షిఆకలితో అన్ని చోట్లలో తిరిగి సర్వ సమృద్ధమైన గౌతమాశ్రమం చేరి ఇక్కడి వైభవం చూసి ఆశ్చర్యపోయి తానూ గౌతముని వంటి ముని శ్రేస్టుడనే ,కనుక ఆయనను భిక్ష యాచించను అనుకోని గంగానదికి వెళ్లి స్నానం తో శుచియై, దర్భాసనం పై కూర్చుని గంగను, క్షుదను  –‘’నమస్తేస్తు గంగే పరమార్తి హారిణే నమః క్షుధేసర్వజనార్తికారిణి-నమో మహేశాన జటోద్భవే శుభే నమో మహా మృత్యు ముఖాద్వినిః సృతే-క్షుధా రూపేణసర్వేషాం తాపపాప ప్రదే నమః –నమః శ్రేయస్కరీ దేవి నమః పాపప్రతర్దిని –నమః శాంతి కరీదేవి నమో దారిద్ర్య నాశిని ‘’  అంటూ స్తుతించాడు  .ప్రీతి చెంది గంగ  మనోహరాకృతిలో,  క్షుద భీషణాకారం తో  ప్రత్యక్షమై నారు.కణ్వమహర్షి నమస్కరించి’’సర్వమంగళ మాన్గల్యే బ్రాహ్మి మహేశ్వరి శుభే –వైష్ణవి త్ర్యంబకే దేవి గోదావరి నమోస్తుతే ‘’-సర్వ పాప కృతాం పాపే ధర్మకామార్ధ నాశిని-దుఃఖ లోభ మయీ దేవి క్షుదే తుభ్యం నమోనమః ;;అని కీర్తించాడు .ఇద్దరూ ప్రసన్నులై కావాల్సిన వరం కోరుకోమనగా ‘’దేహి దేవి మనోజ్ఞాని కామాని విభవం మమ-ఆయుర్విత్తం చ భుక్తిం చ ముక్తిం గంగే ప్రయచ్చమే ‘’అంటే ‘’నాకు మనోజ్ఞమైన కామనలు,సంపదా,ఆయుస్సు ధనం భుక్తి ,ముక్తి ఇవ్వు ‘’అని .  గంగను –

‘’మయి మద్వంశజే చాపి క్షుధేతృష్ణే దరిద్రిణి-యాహి పాపతరే రూక్షేన భూయాస్త్వం కదాచన – అనేనస్తవేన యేవైత్వాం స్తువంతిక్షుధాతురాః-తేషాం దారిద్ర్య దుఖాని న భవేయు ర్వరో పరః ‘’   అంటే ‘’పాపురాలా తృష్ణా, దరిద్ర దేవీ రూక్షురాలా వెళ్ళిపో .నన్నూ నావంశం వాళ్ళనూ ఎప్పటికీ కలవద్దు .ఆకలిగొన్న వారెవరైనా ఈ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళ దరిద్రం దుఖం కలుగకుండా చెయ్యి ‘’అని క్షుదను కోరాడు .అంతేకాక ఈ తీర్ధం లొ స్నానాదులు చేసినవారికి లక్ష్మి ప్రసన్నంకావాలనిఈ స్తోత్రాలను ఇంట్లోకాని తీర్ధంలో కాని పఠింఛిన వారికి దారిద్ర్యం ,దుఖం ,భయం కలుగాకు౦డుగాక ‘’అని కోరగా’’ అలాగే’’ అన్నారు వారిద్దరూ .అప్పటినుంచి ఇది కాణ్వ తీర్ధమని ,గాంగా అని క్షుధా తీర్ధమని ప్రసిద్ధమై సర్వపాపహరంగా ,పితరుల ప్రీతి వర్ధకంగా విలసిల్లు తోంది ‘’అని బ్రహ్మ చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం-9 పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం

   గౌతమీ మాహాత్మ్యం-9

పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం

బ్రహ్మ నారదునితో  కార్తికేయ తీర్ధ  వివరాలు చెప్పాడు- ‘’తారకాసుర సంహారం జరిగాక స్వర్గం లో మామూలు పరిస్థితులేర్పడి  పార్వతీ దేవి కుమారస్వామితో తండ్రి, తన అనుగ్రహం వలన ముల్లోకాలలో మనసుకు నచ్చినచోట భోగాలను అనుభవించమని చెప్పింది .తల్లి’’ పచ్చ జెండా ‘’ఊపగానే   , దేవ స్త్రీలను,దేవపత్నులను వారి ఇష్టం తో, బలాత్కారం గా కూడా అనుభవించాడు .అతడిని వారిచటం ఎవరి వల్లాకాలేక పార్వతీ దేవితో చెప్పుకొన్నారు .తల్లి చాలా సార్లు చెప్పినా ,దేవతల శాపం తగుల్తుందని వారించినా వినలేదు .ఇక ఇలా లాభం లేదనుకొని కుమారుడి దృష్టి ఏ స్త్రీమీదపడితే ఆ స్త్రీ రూపం తానుపొంది తనరూపం  వాళ్ళకిచ్చింది .ఇప్పుడతనికి తాను  కామించిన స్త్రీలో తల్లి రూపే కనిపించి సిగ్గుపడి జగత్తు అంతా మాతృమయం అనే ఎరుకకలిగి , వైరాగ్యభావం పొంది ,తర్వాత తనకు బుద్ధి చెప్పటానికే అలాచేసిందని గ్రహించి, తల్లి చేసిందంతా హాస్యాస్పదం గా తోచి గౌతమీ తీరం చేరి ‘’అమ్మా గౌతమీ !ఈ క్షణం నుంచి ఏ స్త్రీ అయినా నాకు తల్లి తో సమానం అని శపథం చేస్తున్నాను ‘’అన్నాడు .శివుడికి తెలిసి, జరింగేదో జరిగిపోయింది అలాంటి ఆలోచన మానుకొమ్మన్నాడు .అందరితో అయన ‘’నేను సురపతిని సేనాపతిని ,నీపుత్రుడిని నాకు ఇంకే వరమూ అక్కరలేదు .కాని ఎవరైనా గురు పత్నిని సంగమించి మహాపాతకం చేస్తే, వారు గౌతమీ స్నానం చేస్తే పాపప్రక్షాళన పొందేట్లు ,కురూపులు మంచి రూపాన్ని పొందేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .తధాస్తు అన్నాడు తండ్రి .అప్పటినుంచి ఇది కుమార తీర్ధమయింది .  

13-కృత్తికా తీర్ధం

బ్రహ్మ ‘’తారకాసుర సంహారం లో అగ్ని శివుని రేతస్సును తాగాడు .రేతో గర్భుడైన అగ్నిని చూసి  రుషిపత్నులు మోహ౦  చెందారు.అరు౦ధతీదేవి తప్ప, మిగిలిన ఆరుగురు మునిపత్నులు అగ్ని స్పృహమాత్రాన గర్భవతులయ్యారు .చేసిన తప్పుకు బాధపడుతూ చేసేదిలేక గంగానదికి వెళ్లి గర్భాలను పిండుకొన్నారు .ఆ గర్భాలు నురుగు రూపం లో నీటిలో చేరాయి .గాలి వలన  ఆరూ కలిసి’’షణ్ముఖునికి జన్మనిచ్చాయి.కడుపులు ది౦చేసుకొన్న మునిభార్యలు ఇళ్ళకు చేరగా, భర్తలు చీత్కరించి వెళ్ళిపోమ్మన్నారు.దిక్కులేక విలపిస్తుంటే నారదుడువచ్చి ‘’కార్తికేయుని శరణు పొందండి ‘’అని హితవు చెప్పాడు .వెళ్లి తమబాద చెప్పుకొన్నారు .జాలిపడిన తారకాంతకుడు ‘గౌతమి అనే గంగానదికి వెళ్లి స్నానం చేసి  పునీతులై శివుని పూజించండి ‘’అని చెప్పాడు .వారు అట్లాగే చేసి స్వర్గం చేరారు అని నారదుడికి బ్రహ్మ చెప్పాడు .  

14-దశాశ్వమేధ తీర్ధం

నారదునికి బ్రహ్మ దశాశ్వమేధతీర్ధ వివరాలు చెబుతూ ‘’విశ్వకర్మకొడుకు విశ్వ రూపుడు.ఇతని మొదటి భార్య కొడుకు ‘’భౌవనుడు ‘’ ఇతని పురోహితుడు కశ్యపుడితో తనకు పది ఆశ్వమేధ యాగాలు చేయాలనే కోరిక ఉందని చెప్పగా బ్రాహ్మణ శ్రేస్టలు  ఎక్కడెక్కడ చేయమంటే అక్కడ చేయమని చెప్పాడు .అన్ని సంబారాలతో దశాశ్వమేదాలు విధి విధానంగా ఒకే సారి ప్రారంభించాడు.కాని అనేక విఘ్నాలవలన  అవి సంపూర్ణం కాలేదు.గురువును సంప్రదిస్తే ,ఇద్దరూకలిసి బృహస్పతి పెద్దన్నగారు సంవర్తనుడు దగ్గరకు వెళ్ళారు .ఆయన బ్రహ్మ దగ్గరకు పంపాడు .ఆయన గౌతమీతీరం లో కశ్యపమహర్షి ఆధ్వర్యం లో ఒక అశ్వమేధం చేయమని లేక అందులో స్నానం చేస్తే చాలు పది అశ్వమేధాలు చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు .

 భౌవనుడు గౌతమీ తీరం లో హయమేధం ప్రారంభించి పూర్తి చేశాడు .భూమిని దానం చేయాలని సంకల్పించగా ‘’కశ్యపమహర్శికే శైల వన ,కాననాలతో కూడిన పృద్విని దానం చేస్తానని అనటమే చాలు భూ దానం చేసినట్లే .కనుక ఆప్రయత్నం వదిలి అన్నదానం చేయమని  గంగా నది ఇసుకతిన్నెలపై చేసే అన్నదానికి మించిన పుణ్యం లేదని అనుమానం వద్దని  ఆశరీరవాణి వినిపించింది .అప్పుడు భూదేవి రాజుతో ‘’నన్ను మాటిమాటికీ దానమిస్తే నేను నీళ్ళలో మునిగిపోతాను కనుక నన్ను దానమివ్వద్దు ‘’అని చెప్పింది .ఏదానం చేయాలో చెప్పమని అడిగితే ‘’గౌతమీనదీ తీరం లో చేసిన దేదైనా  అక్షయమైన దానం అవుతు౦ దికనుక అన్నపు ముద్ద దానం చేయి దానివలన అన్నీ దానం చేసిన ఫలితం వస్తుంది ‘’అన్నది .ఆమె మాటలను ఆచరణలోపెట్టి బ్రాహ్మణులకు విశేషంగా అన్నదానాలు చేశాడు .ఆతీర్ధమే దశాశ్వ మేధ తీర్ధం అయింది .అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-18-ఉయ్యూరు    

  

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

15-11-18గురువారం సరసభారతి 133కార్యక్రంగాలైబ్రరీ లో వారోత్సవాలు రెండవ రోజు ”గ్రంథాలయఉద్యమం” పై ప్రసంగాలు

15-11-18గురువారం సరసభారతి 133కార్యక్రంగాలైబ్రరీ లో వారోత్సవాలు రెండవ రోజు ”గ్రంథాలయఉద్యమం” పై ప్రసంగాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గ్రంథాలయవారోత్సవాల మొదటి రోజు 14-11-18-బుధవారం ఉయ్యూరు కీ.శే.శ్రీ మైనేని వెంకట నరసయ్య శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతుల స్మారక ఎ.సి.గ్ర౦థాలయంలో ప్రారంభోత్సవ సభలో శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారితో నేనూ

గ్రంథాలయవారోత్సవాల మొదటి రోజు 14-11-18-బుధవారం ఉయ్యూరు కీ.శే.శ్రీ మైనేని వెంకట నరసయ్య శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతుల స్మారక ఎ.సి.గ్ర౦థాలయంలో ప్రారంభోత్సవ సభలో శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారితో నేనూ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు

కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు

 

క్రింద శ్రీమాన్ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యుల చిత్రాలను పొందుపరుస్తున్నానండి.
చిత్రంలో వరుసగా …
  • శిరస్సునందు కపిలవాయి పెదరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద అన్నయ్య } గారు
  • హృదయం లో కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారు
  • వామపక్షంలో కపిలవాయి చినరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న అన్నయ్యగారు
  • దక్షిణ పక్షంలో కపిలవాయి గణపతిశాస్త్రి గారు
  • పుచ్ఛం (తోక భాగం) లో,  కపిలవాయి వేంకటేశ్వర శాస్త్రి గారు ( కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద కుమారులు),  కపిలవాయి రామశాస్త్రి కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న కుమారులు ) గారు మరియు కపిలవాయి గణపతి శాస్త్రి గారి అబ్బాయి కపిలవాయి రామకృష్ణశాస్త్రి గారు
భవదీయుడు
– శశి కుమార్ 
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment