ప్రపంచం లో ఒక చోట ప్రత్యేకంగా కొన్ని చెట్లు ఆడపిల్లల శరీరం లాంటి పుష్పాలను పూస్తూ ,పండ్లను కాస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయట. వీటిని ‘’నారీ లత పుష్పాలు ‘’అంటున్నారు .పసుపు రంగు పూసుకున్న పచ్చటి అమ్మాయిలు లా చెట్లకు వ్రేలాడు తున్నట్లు ఆపుష్పాలు ఫలాలు కనిపించటం వింత .ఈ వి౦త చెట్లు హిమాలయ పర్వతాలలో ఉన్నాయని అంటున్నారు .వీటిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసి ‘’హల్ చల్ ‘’సృష్టిస్తున్నారు .నారీలత పుష్పాల క్రింద కూర్చుని మునులు తపస్సు చేస్తే తప్పక తపోభంగం కలుగుందని నమ్మేవారట.ఈ వృక్షాలు థాయ్ లాండ్ దేశం లో ఉన్నాయని చెబుతున్నారు .వీటిని వారు ‘’నారీ పోల్ ‘’అని పిలుస్తారట .పూర్వం వీటిని యజ్ఞయాగాదులలో ఉపయోగించేవారట .బాంగ్ కాక్ కు 500కిలోమీటర్ల దూరం లో ఉన్న పెసాబుల్ లో నారీ పోల్ వృక్షాలున్నాయని కొందరు చెబుతున్నారు .ఈ పుష్పాలు రకరకాల స్త్రీ శరీరభంగిమలు కలిగి ఉన్నట్లు ఫోటోలు వస్తున్నడున ఇవి నిజంగా ఉన్నాయా లేక గ్రాఫిక్ మాయాజాలమా అనే సందేహం నెటిజన్ లకు వస్తోంది .వీకీపీడియాలో ఎక్కడా దీని జాడలేదని ,దీని రహస్యం బట్టబయలు చేస్తే యువతి రూపం లో ఉన్న ఈ అరుదైన ‘’రియల్ గ్రీన్ పండ్లు’’ అసలు విషయం తెలుస్తుందని సోషల్ మీడియా భావిస్తోంది . .
బౌద్ధ పురాణాలు పవిత్రమైన ‘’ నారీ పోల్ పండ్లు’’ థాయ్ లాండ్ లో ఉన్నట్లు పేర్కొన్నాయి .కొందరు ఈపండ్లు హిమపోన్ అడవులలో ఉండేవని చెబుతున్నారు .ఆ పురాణం ప్రకారం ఇంద్రుడు ,భార్య జస్వంతర ,ఇద్దరు పిల్లలతోకలిసి హిమపోన్ అరణ్యాలలలో ఉండేవారు ,ఒక రోజు జశ్వంతర ఆహారం తేవటానికి అడవిలోకి వెళ్ళింది .ఆమెను చూసి అక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నమునులు వ్యామోహపడ్డారు.వీళ్ళ ధ్యాసను మరల్చటానికి ఇంద్ర ,అచ్చంగా తన భార్యను పోలి ఉండే ఫలాలనిచ్చే 12నారీ పోల్ వృక్షాలు సృష్టించాడు .మునుల వ్యామోహం జస్వంత మీదనుంచి ఈ పండ్లమీద పడి, ఆమెను మర్చేపోయి, ఈ పండ్లుతింటూ గడిపారట .అవితిన్న ఆమునులు నాలుగు నెలలపాటు నిద్రలోనే ఉండి పోయారట .మత్తు వదిలి నిద్ర లేచేసరికి మునులు తమకున్న సర్వ శక్తులూ కోల్పోయారట .
ఆతర్వాత ఇంద్ర అతనిభార్య జశ్వంతర మరణించాక ఆ అడవి, ఆ నారీపోల్ వృక్షాలు కనిపించకుండా పోయాయట .ఇంతకాలానికి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయని అంటున్నారు .బ్యాంకాక్ దగ్గర సిందూరి బౌద్ధలాయ ఆవరణ లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయట .అసలా నారీ ఫల చెట్లు ఉన్నా లేకపోయినా ,అదొక కమ్మని మధుర అనుభూతి అనిపిస్తుంది .అందుకే ‘’చెట్లకు అమ్మాయి అందం కాస్తుంది ‘’అన్నారు కొందరు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-18-ఉయ్యూరు ..
