గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

156-భోజుని తండ్రి సింధు రాజ (950)

పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా .  భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు  రాసిన ‘’నవసాహసాంక’’ చరిత్ర లో కొంత వివరం ఉంది .అయితే దీనికి చారిత్రిక ఆధారాలు లేవు . 4 వ శతాబ్ది కవి మే రుదత్తుడు రాసిన ‘’ప్రబంధ చింతామణి ‘’ప్రకారం సింహద0త భట్ట కుమారుడు .ముంజరాజు తండ్రికి పెంపుడుకొడుకు .ముంజరాజు అనంతరం సింధు రాజ రాజ్యానికి వచ్చాడు .సింధు రాజా కు’’ నవ నారాయణ ‘’,సాహసాంక ‘’బిరుదులున్నాయి .సింధుల సింధాల పేర్లు కూడా ఉన్నాయి .ఆయన్ను ‘’సింధు రాజ దేవ’’అని సంబోధిస్తారు

 సింధురాజ  చాళుక్య సత్యాశ్రయ రాజును ఓడించి ముంజరాజుతైలపుడికి  కోల్పోయిన రాజ్యాలను తిరిగి స్వాధీనం చేసుకొని ,హూణ  రాజునూ జయించాడని ‘’ఉదయ పూర్ ప్రశస్తి ‘’లో ఉన్నది .కొంకణా శిలహారాలపై కూడా దండయాత్ర చేశాడు .దక్షిణ గుజరాత్ లోని’’ లాట ‘’ను స్వాధీనం చేసుకొన్నాడు .సింధు రాజ మహా సేనాని  మహా రాజే కాక మహాకవి కూడా .కళలను ,సాహిత్యాన్ని ప్రోత్సహించి కుమార భోజునికి ఆదర్శ ప్రాయమై నిలిచాడు ..భోజుడు తండ్రిని మించిన తనయుడిగా జగత్ ప్రసిద్ధమైన సంగతి మనకు తెలిసిందే ..

157-యజుర్వేద భాష్యం రాసిన -ఊవటుడు (1000 )

 భోజుని ఆస్థానం లో ఊవటుడు అనే కాశ్మీర పండితుడుండేవాడు .ఈయన శుక్ల యజుర్వేదానికి భాష్యం రాశాడు

 ఇతనితోపాటు ‘’చిత్తపకవి ‘’కూడా భోజ రాజాస్థానం లో ఉండేవాడని భోజుని సరస్వతీ కంఠాభరణం లో ,శృంగార ప్రకాశం లోను ఉన్నది

158-లోచన వ్యాఖ్యాన కర్త – అనంత దాసు -(1350)

సాహిత్య దర్పణం కర్త విశ్వనాధ కవిరాజు కపింజల గోత్రుడు .తండ్రి చంద్ర శేఖరుడు ఛ0దోవేత్త ,కవి  14 భాషలలో ప్రవీణుడు ..ఒరిస్సా గజపతిరాజుల ఆస్థానకవి .. విశ్వనాధుని కుమారుడు అనంత దాసు తండ్రి రాసిన సాహిత్య దర్పణం కు ‘’లోచనం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు..ఇందులో తన తండ్రి ప్రతిభను ‘’కపింజల వంశ పయోనిధి  రాకా చంద్రుడు ,త్రికళింగ పాలకుని అమాత్యుడు ,,పలుభాషా కోవిదుడు ,సాహిత్య పారావారాన్ని తరింపజేసే  మార్గ దర్శి ,ధ్వని సిద్ధాంత నాయకమణి 18 భాషలలో దిట్ట  ,అన్నిటికి మించి మహాకవి ‘’అని తెలిపాడు  . .అనంత దాసు తన తండ్రి విశ్వనాథుడు విజయ నరసింహుని పై ఒక గ్రంధాన్ని రాశాడని చెప్పాడు -’’ఆహవే జగదుద్ధ0డ  రాజా మండల రాహవే -శ్రీ నృసింహపాల స్వస్త్యస్తు తవ బాహవే ‘’.బహుశా ఈ పద్యం ఆగ్రంధం లోనిదే  అయి ఉండవచ్చు .

159- మహా కవులైన  విశ్వనాధ కవిరాజు తాత ,చిన తాత తండ్రి ,(1350)

విశ్వనాధుని కపింజల వంశం ఒరిస్సాలో సాహిత్య వ్యాసంగానికి  ప్రసిద్ధి చెందింది .విశ్వనాధుని తాత నారాయణ దాసు జయదేవుని గీత గోవిందం కు ‘’సర్వాంగ సుందరి ‘’వ్యాఖ్య రాశాడు ..నారాయణ దాసు తమ్ముడు చండీదాసు ‘’కావ్య ప్రకాశానికి ‘’దీపికా ‘’అనే వ్యాఖ్యానం ,. ‘’ధ్వనిసిద్ధాంత సంగ్రహం ‘’లు రాశాడు .చండీ దాసు పెదనాన్న కూడా బహు గ్రంథ కర్త .

 విశ్వనాధుని తండ్రి 14 భాషలో ప్రసిద్ధుడు .పుష్పమాల ‘’,భాషార్ణవం ‘’గ్రంధాలు రాసి నాట్లు సాహిత్య దర్పణం లో ఉంది .ఈయన రాసిన ఒక పద్యం లో ‘’ఉమా వల్లభ ‘’అనే పదం ఉన్నట్లు సాహిత్య దర్పణం లో ఉల్లేఖితమైంది .దీనికి రెండు అర్ధాలు ఉమా పతియైన శివుడు ,ఉమా అనే రాణి కి భర్త అయిన భామదేవ రాజు .ఇతడే మూడవ భానుదేవుడు 1352-1378 వరకు పాలించాడు

160-వాసుదేవ విజయ కర్త -వాసుదేవుడు (1600 )

1600 కాలానికి చెందిన వాసుదేవ కవి కేరళకు చెందినవాడు .’’వాసుదేవ విజయం’’ కావ్యం రాశాడు .ఇది శ్రీ కృష్ణునికధ  మాత్రమేకాక వాసుదేవ కవి విజయం కూడా .పాణిని వ్యాకరణ సూత్రాలకు సందేశాత్మక ఉదాహరణలు తెలియ జేయటమే ఇందులో ముఖ్యోద్దేశ్యం .ఇది అసంపూర్తి రచనేకాని నారాయణీయం రాసిన మేలత్తూర్ నారాయణ భట్ట  రాసిన దాతుకావ్యాలలో చోటు చేసుకొన్నది .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

141-నట సూత్ర రాసిన జంటకవులు  -శిలానిన్  కృశస్వ (క్రీ.పూ 600)

.క్రీ పూ. 6 వ శతాబ్దానికి చెందిన ‘’శిలాలినన్ ‘’,’’క్రిశ స్వ’’లు నటుల గురించి ,వారి విధులగురించి ‘’నట సూత్ర ‘’అనే గ్రంధం రాశారని పాణిని పేర్కొన్నాడు .కానీ అది లభ్యంకాలేదు .పాణిని ఆ గ్రంధం లో ఉన్న విషయాలను కానీ గ్రంథకర్తల జీవిత విశేషాలు కానీ ఏమీ చెప్పక పోవటం దురదృష్టం.

142-నాట్య శాస్త్ర ప్రామాణికులు -భరతుని పుత్రశతం (క్రీ .పూ. 500 )

నాట్య శాస్త్ర కర్త భరతముని స్వర్గం నుంచి భూమికి రూపక కళను  తెచ్చిన ఋషి అని ,ఆ కళను తన పుత్ర శతం అయినకొహల , దత్తి లక అస్మకుట్ట ,నఖ కుట్ట మొదలైన వారికి బోధించాడని ఐతిహ్యం వీరిలో పేర్కొనబడిన పేరున్నవారు దానిలో ప్రవీణులని ప్రామాణికులని తెలుస్తోంది .వీరు గ్రంధాలు రాశారని అలభ్యమని అంటారు

143-కవిత్వ నియమాలు నిర్దేశించిన -మేధావి ,రుద్ర ,రామశరణు

భామహునికంటే ముందే కవిత్వ నియమాలను చెప్పినవారు మేధావి ,రుద్రా ,రామ శరణు అంటారు .వీరికాలం కానీ రచనలు కానీ తెలియదు

144-శబర భాష్యకర్త -శబరుడు (క్రీ శ 200)

పూర్వ మీమాంస ,ఉత్తర మీమాంస అనే రెండు మార్గాలున్నాయి వాటికి గ్రంధాలున్నాయి మీమాంస అంటే గౌరవమైన ఆలోచన .సత్యాన్ని ,జ్ఞానాన్ని తెలుసుకొనే ఉత్తమ ఆలోచనా మార్గం . వేదాలలో మొదటిభాగాలను పూర్వ  మీమాంస రెండవ భాగాలను ఉత్తర మీమాంస తెలియ జేస్తాయి పూర్వ మీమాంసకు కర్మ మీమాంస అని ఉత్తర మీమాంసకు  బ్రహ్మ  మీమాంస అని అంటారు  ,క్లుప్తంగా పూర్వ మీమాంసకు మీమాంస అని ఉత్తర మీమాంసకు వేదాంతం అని పిలుస్తారు ..మీమాంస సూత్రాలను రాసినవాడు జైమిని మహర్షి .ఇది 12 అధ్యాయాలతో 2500 సూత్రాలతో ఉంటుంది .అర్ధమవటం కష్టం. కనుక భాష్యం అవసరం .మీమాంస పై చాలామంది భాష్యాలు రాసినా కాలగర్భం లో కలిసిపోయాయి .లభించిన మొట్టమొదటి భాష్యం శబర భాష్యం .దీన్ని శబర స్వామి రాశాడు .ఇదే తర్వాత వచ్చిన అన్ని భాష్యాలకు ఆధారమైంది .కుమారుల భట్టు ,ప్రభాకరుడు శబర భాష్యానికి వ్యాఖ్యానాలు రాశారు .మండ న మిశ్రుడు కుమారుల భట్టు ను అనుసరించాడు . భట్టుకూడా దీనిపై వ్యాఖ రాశాడు కానీ ఆది శంకరాచార్యుల చేతిలో ఓటమిపాలై సురేశ్వరాచార్యులై దీన్ని వదిలేశాడు .

145-సాహిత్యకారులు మూలసేన ,సర్వ సేన ,ప్రవర సేనులు -క్రీ శ 600 )

దండి ఉదాహరించిన సాహిత్యకారులలో సర్వ సేన ,ప్రవర సేనులున్నారు ప్రవర సేనుని  ప్రాకృత కావ్యం సేతుబంధం ప్రసిద్ధమైనది .కాళిదాసుతో సమానమైన ప్రతిభ ప్రదర్శించాడు .దీని వ్యాఖ్యాత 16 వ శతాబ్దికి చెందిన రామ దాస భూపతి బాగా మెచ్చాడు .ఇది 15 అష్వకాలలో తో 1291 శ్లోకాల కావ్యం .ఈ కవి రెండవ ప్రవర సేన మహారాజని 410-440 మధ్య రాజ్యమేలాడని అతనికవిత్వ ప్రతిభ శ్రేష్టతరమనే భానుడు దండి కూడా మెచ్చారని అంటారు .

146 -దండికే సమాధానం చెప్పిన -విజ్జిక (క్రీ శ 600)

దండి చెప్పిన సాహిత్యకారులు జాబితాలో కన్నడ దేశ సంస్కృత కవయిత్రి విజ్జిక లేక విజ్జి అనే విదుషీమణి ఉంది ..భావోద్వేగ  రచన లెన్నో చేసింది . బహుశా ఆమె శరీర ఛాయ నలుపు అవ వ చ్చు .ద0డికి సమాధానంగా చెప్పినట్లు ఒక శ్లోకం ప్రచారం లో ఉంది -’’నీలోత్పల దళ శ్యామాం విజ్జాకామ్ మామ జా నతా – వృద్ధై వ దండి నా ప్రోక్తం సర్వ శుక్లా సరస్వతీ ‘’

దండి తనకావ్యం లో సరస్వతీదేవిని శ్వేత  వర్ణం కలదిగా వర్ణించాడు .తాను సరస్వతీ దేవి అవతారమని భావించే విజ్జికకు ఇది నచ్చలేదు నల్లకలువ దళాలవలె నల్లగా ఉన్న సరస్వతీ స్వరూపమైన విజ్జికను యెరుగకుండా దండి సరస్వతి ని తెలుపు వర్ణంగలదాని నిగా వర్ణించాడు అన్నది .విజ్జికయే సరస్వతి అని తెలిస్తే అలా వర్ణించేవాడుకాదు అని భావం -’’ఆచార్య దణ్డినో వాచమాచా నామృత సంపదాం -వికాసో వేధసః పరన్యా విలాపం మణి  దర్పకం  ‘’అంటే మృత వాక్కుల దండి వాక్కు యొక్క తేజస్సు అద్దం  లో మెరిసిన సరస్వతీ దేవి యొక్క ఆభరణాల సోయగమే

147 -ఇద్దరు వామనులు (క్రీ. శ . 700 మరియు 779-813)

పాణిని వ్రాసిన సంస్కృత వ్యాకరణానికి’’కాశిక ‘’పేరుతొ  వ్యాఖ్యానం రాసిన  వామనుడు క్రీ శ  700 కాలం వాడు . రాజశేఖరుడు ,అభినవ గుప్తుడు మరొక వామనుడిని  ప్రస్తావించారు  క్రీ శ779-813 మధ్యకాలం లో కాశ్మీరాన్ని పాలించిన జయప్డుని మంత్రి వామనుడు అనే వాడున్నాడు అయితే ఈ వామనుడి కాశిక రాశాడనటానికి .ఆధారం లేదు . అలంకార శాస్త్రం రాసిన వామనుడు ,పాణినీయం కు కాశిక వ్యాఖ్య రాసిన వామనుడు ఒక్కరు కాదు అని తెలుసుకోవాలి . 7 వ శతాబ్ది కి ప్రారంభం లో .

 హుయాన్ త్సాంగ్ భారత దేశ సందర్శనం ముందే ‘’కాశిక ‘’వ్రాయబడింది

148 -రాజ శేఖరుని పూర్వీకులైన కవులు (క్రీ. శ 900)

    9 వశతాబ్దపు రాజశేఖరుని పూర్వీకులు అకాల జాలాద ,శూరానంద ,తరళ  ,కవిరాజ అనే నలుగురికి తనపూర్వీకులుగా ,కవులుగా పేర్కొన్నాడు .కొన్ని సంస్కృత సంకలనాలలో వారు కొన్ని చాటుపద్యాలు రాసినట్లు ఉంది .వీరు జబల్  పూర్ దగ్గర ఉన్న తివార్ అనే త్రిపుర ను పాలించిన కాలచూరి రాజులకొలువులో ఉండి  ఉండవచ్చు .

149 -శైవ శాస్త్ర నిష్ణాతుడు -అత్రిగుప్తుడు (క్రీశ 720 )

  ప్రముఖ ఆలంకారికుడు అభినవ గుప్తుని పూర్వీకులలో ‘’అత్రి గుప్తుడు ‘’అతి ప్రాచీనుడు ..-730-740 ప్రాంతం లో కనౌజ్ ను పాలించిన యశోవర్మ కాలం లో గంగా యమునాల మధ్య ప్రాంతమైన అంతర్వేది లో ఆయన ఉండేవాడు . అన్ని విద్యలు తెలిసిన పండితుడుగా ,ముఖ్యంగా శైవ శాస్త్రాలలో నిష్ణాతుడుగా అత్రిగుప్తునికి ప్రఖ్యాతి ఉంది .721 -765కకాలం లో కాశ్మీర్ ను పాలించిన లలితాదిత్యుడు అత్రిగుప్తుని పాండిత్యాన్ని విని తెలుసుకొని ,తన ఆస్థాన పండితుని చేసి గౌరవించాలని భావించాడు .యశోవర్మను జయించాక తనతో కాశ్మీరానికి రమ్మని అర్థిస్తే  . ఇలా  వెళ్ళాడు.ఇలా అత్రిగుప్తుని కుటుంబం కన్యా కుబ్జ0  నుంచి కాశ్మీర్ కు వెళ్ళింది .రెండువందల ఏళ్ళ తరవాత శైవాచార్యుడైన అభినవ గుప్తుడు వీరి వంశం లో జన్మించాడు

150 -అభినవ గుప్తుని గురు ప్రముఖులు  (960)

 శైవాచార్య అభినవ గుప్తుని తండ్రి నరసింహ గుప్తుని వద్ద వ్యాకరణం ,వామనాధుని వద్ద ద్వైత తంత్రాలు ,భూతి రాజా వద్ద బ్రహ్మ విద్య ,భూతి రాజు కుమారుని వద్ద ద్వైతాద్వైత సిద్ధాంతం ,లక్షణ గుప్తునిదగ్గర క్రమ ,త్రిక పద్ధతులు ,ఇందురాజా వద్దాధ్వని ,భట్ట తౌత వద్దనాటక కళ ,శంభునాధుని వద్ద కుల సిద్ధాంతం అభ్యసించిన జీవన్ముక్తుడు

151 -రసాను భూతి వివరించిన -శ్రీ శంకుకుడు (850)

అభినవ గుప్తునికి ముందే రస విషయాన్ని వివరించినవారిలో భట్ట లల్లటుడు ,శ్రీశంకుకుడు ,భట్ట నాయకుడు ఉన్నారు .  వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తన రస సిద్ధాంతాన్ని అభినవ గుప్తుడు ప్రతిపాదించాడు .లక్ష్యం తో కూడిన కధా  సంవిధానం ,నాయకుడు ,అభినయానికి సంబంధించిన మార్పులు ,నాటక ప్రదర్శనలో చూసేవారికి కలిగే రసాను భూతి,ఎలా కలుగుతుందో చెప్పాడు .అనుమాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .శిక్షణ ద్వారా విభానుభావాలను అభినయించి సభికునిలో పాతజ్ఞాపకాలను జ్ఞప్తికి తేవచ్చు కానీ ప్రధాన రసాన్ని ప్రదర్శించి చూపలేము .ప్రధానరసం గమ్యం .మిగిలినవి గమకాలు ..ఇతని సిద్ధాంతాలలో అసంగత విషయాలను తెలుసుకొని మార్పు చేసి తనదైన రస సిద్ధాంతం చెప్పాడు అభినవ గుప్తుడు .

152 -ఈశ్వర ప్రజ్ఞాభిజ్ఞ కారిక కర్త -ఉత్పలాచార్యుడు(900).

ఈశ్వర ప్రత్యభిజ్న కారిక రాసిన ఉత్పలాచార్యుడు అయిదు అలౌకిక తత్వాలు శివ ,శక్తి సదాశివ ,ఈశ్వర ,విద్య ,అయిదు ఆత్మాశ్రియస్థితులు ,-కళ  ,విద్య ,రాగనియతి ,కాల ,వేదాంతం గుర్తించిన మాయ ,సాంఖ్యులు ప్రవచించినపురుషుని నుంచి  పృథ్వి వరకు గల 25 తత్వాలు మొత్తం 36 తత్వాలతో కూడిన ది ఈ సృష్టి అని చెప్పాడు .అభినవ గుప్తుడు 37 వ దైన ‘’అమత్తర తత్త్వం ‘’ప్రతిపాదించి ఇదే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని చెప్పాడు  .

153 -మమ్మట కుటుంబ కవులు (1100 )

  కావ్య ప్రకాశిక ర్రాసిన మమ్మటుని కుటుంబం కావ్య కుటుంబానికి చెందినదే .మమ్మటుని తండ్రి జైయట ,తమ్ముళ్లు కైయట ,ఉచట లు వేదాలకు వ్యాకరణ శాస్త్రానికి యేన లేని సేవ చేసిన  కాశ్మీరీయులని . .  వీరికాలానికి 500 ఏళ్ళతరువాతివాడైన భీమసేనుడనే కవి చెప్పాడు కైయటుడు  మహా భాష్యానికి ,ఊచటుడుశుక్ల యజుర్వేద సంహిత కు వ్యాఖ్యానాలు రాశారు . తమ్ముళ్లకు అన్నగారు మ. మ్మటుడే గురువు ..ఊచటుని రచనల వ్రాత ప్రతులలో గద్య లో ముగింపు పద్యం లో తండ్రిపేరు ‘’వజ్రటుడు ‘’అని ఉంది .తాను ఉజ్జయినిలో భోజుని ఆస్థానం లో ఉన్నకాలం లోనే వ్యాఖ్యానం రాసినట్లు చివరిపద్యం లో ఉంది .మమ్మటుడు భోజరాజుకంటే పెద్దవాడే కాక సమా కాలికుడుకూడా .

154 -మమ్మట కావ్య ప్రకాశిక లో కొంత భాగం రాసిన -అల్లట లేక అలక (1100)

  మమ్మటుడు రాసిన కావ్య ప్రకాశిక లో వృత్తి మాత్రమే రాశాడని కొందరు,కొందరు మమ్మటుడు ‘’పరికార ‘’ వరకే రాశాడని మిగతా దాన్ని అల్లటుడో లేక అలకుడో రాశాడని అంటారు

155-అలంకార సర్వస్వ కర్త సముద్ర బంధుడు (1070)

కుంతకుని తర్వాతకాలం 1100 కు చెందిన సముద్ర బంధుడు ‘’అలంకార సర్వస్వము ‘’రాశాడు .సంస్కృత అలంకార శాస్త్రం లో అయిదు భిన్న సంప్రదాయాలున్నట్లు చెప్పాడు అవి అలంకార ,గుణ ,కవి వ్యాపార ,భోజకత్వ వ్యంగ్యాలు .సముద్ర బంధుడు మూడవదైన ఫణి తీ  వైచితర్యా నికి సంబంధించిన కవితాకలాపం కావ్యానికి ఉండే విశిష్ట గుణంగా వక్రోక్తి జీవితకారుడు కుంత కుడుగుర్తించాడని చెప్పాడు .

 ..

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)

 

Inline image 1

ప్రాచీన తత్వవేత్త గార్గి పేరు వేదసాహిత్యం  లో కూడా ప్రసిద్ధమైనది .ఆమెకాలం క్రీ పూ 700 గా భావిస్తారు వేదాలను అత్యంత సహజంగా వివరించి చెప్పే నేర్పున్న మహిళా బ్రహ్మవాదిని అని గార్గి ని గౌరవంగా సంబోధిస్తారు బృహదారణ్యక ఉపనిషత్ లో ఆరు ఎనిమిది అనువాకాలో ఆమె పేరు ప్రత్యేక్ష మౌతుంది .విదేహ రాజు జనకుని   ఆస్థానం లో జరిగిన ‘’బ్రహ్మ యజ్ఞ ‘’చర్చలో గార్గి యాజ్ఞవల్క్యునితో సవాలు చేసి నిలిచింది .గార్గి ఋగ్వేదం లో చాలా సంహితలు  దర్శించినట్లు ఉన్నది   .హిందూ ధర్మాన్ని మనసా వాచా అనుసరించిన మహోత్కృష్ట మహిళ గార్గి

 గర్గ వంశానికి చెందిన వాచహ్నుని కుమార్తె గార్గి .తండ్రి గార్గి వాచాహ్నవి అని పేరుపెట్టారు .బాల్యం నుండి అసమాన మేధస్సుతో వేదం వేదాంగ విషయాలను నేర్చి ఆనాటి సమాజం లో ఉకృష్ట మహిళగా విరాజిల్లింది .ఉపనిషత్తులలో గార్గి ,,వాడవ ప్రతిహేయి ,,సులభ మైత్రేయి పేర్లు తరచుగా కనిపిస్తాయి .ప్రాచీన మహిళా విద్యావేత్తల పేర్లలో వీరు ముగ్గురు పేర్లే ముందు చెబుతారు వేద విద్యా మహిళా త్రయం గా వీరిని పేర్కొన వచ్చు . అశ్వలాయన గృహ్య సూత్రాలలో ,కూడా గార్గి పేరు తరచుగా కనిపిస్తుంది .కుండలిని మేల్కొల్పి బ్రహ్మజ్ఞానంతో ఆత్మజ్ఞానంపొందిన మహిళా మాణిక్యం గార్గి

.విద్యా వ్యాప్తికి గార్గి సేవలు నిరుపమానం  .జనకమహారాజు రాజా సూయ యాగం చేసి దేశం లోని మహర్షులను రాజులను ఆహ్వానించి తానూ బ్రహ్మజ్ఞాని కనుక ఇందరు మహానుభావులు తన ఆస్థానానికి రావటం లో పరవశించి  బ్రహ్మ జ్ఞాన  చర్చను అందరి సమక్షం లో నిర్వ హించాలని భావించాడు .గెలుపొందినవారికి 1000 గోవులను ఒక్కో ఆవు కొమ్ములకు 10 గ్రాముల బంగారాన్ని తగిలించి కానుకగా ఇస్తానని చాటాడు .ఇలా కుండలిని మేల్కొల్పి ఆత్మజ్ఞానం సాధించిన బహు శాస్త్ర వేద నుపనిషత్ నిధి యాజ్ఞవల్క్యుడు కూడా ఉన్నాడు .తనతో వాదం లో ఎవరూ జయించలేరన్న ధీమాతో గెలుపుతనదేనని భావించి ఆ సహస్ర గోగణాన్ని తన ఆశ్రమానికి తోలుకు వెళ్ళవలసినదిగా శిష్యుడు సం శ్రవుడిని ఆదేశించాడు .అక్కడున్న చాలామంది వాదం లేకుండా యాజ్ఞవల్క్యుడు ఇలా ‘’ప్రయిజ్  మని  ‘’ తీసుకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా వాదించే దమ్ములేక గమ్మునుండి పోయారు .చివరికి గార్గి తో ఎనిమిది మంది జనకుని పురోహితుడు  అశ్వ లుడు ,ఆర్తభాగుడు ,భూ జ్యుడు ,ఉషష్ఠ  ఉద్దాలకుడు ,గార్గి  ,మాత్రమే మిగిలారు  .ఉద్దాలకుడు వాదం ప్రారంచాడు .చివరికి గార్గి యాజ్ఞవలయునిగొప్ప తనాన్ని ఆధిక్యాన్ని సవాలు చేసి నిరూపించుకోమన్నది .ఆమె ఆధిభౌతిక విషయాలపై ప్రశ్నలు సంధించింది పర్యావరణం పై ప్రశ్నలు కురిపించింది .ప్రపంచమంతా నీటిపై ముందుకు వెనకకూ అల్లబడిందంటారుకదా ఈ ముందువెనుకలు దేని పై ఆధారపడ్డాయి ?వాళ్ళిద్దరి సంభాషణ ఇలా జరిగింది -గాలిమీద అన్నది గార్గి గాలి దీనిపై ఆధారం ? మధ్యనున్న ప్రదేశం పైన .అందులోని ప్రదేశాలు ?గాంధర్వ లోకంపైనా అని గార్గి సమాధానం  బృహదారణ్యక ఉపనిషత్ లోకూడా  ఉంది .అలాగే గార్గి సూర్య ,చంద్ర ఇంద్ర ప్రజాపతులపై ప్రశ్నలు అడిగింది .యజ్ఞవాల్యుని గార్గి ఆకాశంపైన ఏమి ఉంది  భూమిక్రింద ఏముంది గతం వర్తమానం భవిష్యత్తు  అంటే ఏమిటి , వీటినికలిపే పడుగూపేకల నేత ఏమిటి ?అని ప్రశ్నిస్తే యాజ్ఞవల్క్యుడు -’’అంతరిక్షం ‘’అని సమాధానం చెప్పాడు .సంతృప్తిపడక గార్గి  చివరగా బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగితె .సమాధానంగా ఇంతకంటే ముందుకు వెళ్ళటం మంచిదికాదని  వెడితే ఆమె మానసిక స్థితి దెబ్బతింటుందని చెప్పి వాదాన్ని ముగించాడు .ఈ ఆకస్మిక ముగింపు ఆమెకు నచ్చక ‘పోయినా యాజ్ఞవల్క్యుని అపార మేథా  సంపత్తిని మెచ్చి అక్కడి బ్రహ్మవేత్తలతో ‘’మీరందరూ యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానానికి తలవంచవలసిందే .అందులో ఆయన్ను ఓడించగలిగే వాడు లేడు ‘’అని చెప్పింది

 గార్గికి ఉన్న ఆత్మజ్ఞాన విషయాలు చాందోగ్యోపనిషత్ లో కూడా దర్శనమిస్తాయి .యాజ్ఞవల్క్య గార్గి సంవాదం ‘’యోగ -యాజ్ఞవల్క్య ‘’గ్రంధంగా వెలువడింది . జనక మహా రాజు ఆస్థానం లోని నవరత్నాలలో గార్గి ఒకరై  విశేషస్థానం పొందింది

140-అద్వైత వేదాంతిని -సులభ మైత్రేయి (క్రీ;పూ 700)

  మైత్రి మహర్షి పుత్రిక సులభ మైత్రేయిగా అశ్వలాయన గృహ్య సూత్రాలలో మైత్రేయి పేరు కనిపిస్తుంది . కాలం క్రీపూ 700.  గృహ్య సూత్రాలలో కూడా వేదకాలపు మహిళలతో మైత్రేయి పేరు కనిపిస్తుంది .తండ్రి విదేహ రాజ్య రాజధాని మిథిలలో  జనక మహారాజు ఆస్థాన మంత్రిగా ఉండేవాడు . బృహదారణ్యక ఉపనిషత్ లో మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్యగా చెప్పబడింది.ఆయన రెండవ భార్య కాత్యాయని .మహాభారతం లో మాత్రం మైత్రేయి అవివాహిత గానే చెప్పబడింది .జనకునికి బ్రహ్మజ్ఞానం బోధించి జీవితాంతం యోగినిగా ఉండి పోయిందని ఉంది .సంస్కృత సాహిత్యం ఆమెను బ్రహ్మవాదిని అన్నది .కాత్యాయనితో యాజ్ఞవల్క్య మహర్షి సంసార జీవితాన్ని అనుభవిస్తుంటే మైత్రేయి బ్రహ్మజ్ఞానం తో ఆత్మజ్ఞానం సాధించింది

 ఋగ్వేదం లో 10 మంత్రాలను  మైత్రేయి దర్శించినట్లు చెప్పబడింది . బృహదార ణ్యక  ఉపనిషత్ లో మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం ఉన్నది ..ఆత్మనుంచి ప్రేమ జనించి ఆత్మ స్వభావం బ్రహ్మం లను చర్చించి ఈ రెంటి ఐక్యతను తెలియ జేయటమే ఇందు లోని సారాంశం .ఇదే అద్వైత  సిద్ధాంతం .మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం రెండు భాగాలగ్రంధం  మాధ్యమ దిన , కాణ్వ  సిదాంతాలుగా కొద్దిమార్పులతో మారింది

 యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ చర్య గృహస్థ ,వానప్రస్థాశ్రమాల జీవితానుభవం తర్వాత ముసలితనం లో సన్యాసాశ్రమం సవీకరించాలని భావించి  భార్య మైత్రేయిని పిలిచి తనకున్న ఆస్తిని చెరిసగంగా ఇద్దరు భార్యలకు ఇస్తానన్నాడు .మైత్రేయి తనకు న శ్వరమైన మైన ధనం  కంటే అశ్వరమైన మోక్షం కావాలని చెప్పింది .అప్పుడు మైత్రేయి  యాజ్ఞవల్క్యుల మధ్య జరిగిన సంవాదం ఇలా నడిచింది -స్వామీ !ప్రపంచం లోసంపదంతా నాకు చెందితే నాకు మోక్షం వస్తుందా ?అని అడిగింది .లేదు ‘’అని చెప్పి మోక్షానికి ధనం తో సంబంధం లేదన్నాడు  యాజ్ఞ  వల్క్యుడు .అశాశ్వతమైన దానికోసం నాకు ప్రాకులాటలేదు శాశ్వతమైన ముక్తి కావాలంటే మార్గం చెప్పండి ?అడిగింది .సంతోషించిన భర్త భార్య మైత్రేయికి ఆత్మజ్ఞానం బోధించి నిరంతరం మననం చేయమన్నాడు

 బృహదారణ్యక ఉపనిషత్ లోని ఈ సంవాదానికి అబ్బురపడిన శంకరాచారా దానికి చక్కని భాష్యం రచించారు .మైత్రేయి యాజ్ఞవల్క్యసంవాదం పై సురేశ్వరాచార్యులు ‘’వార్తికం ‘’రాశారు ..ఢిల్లీలో మైత్రేయి పేరిట ఒక విద్యాలయం తమిళనాడులో ‘’మైత్రేయి వేదిక్  విలేజ్ ‘’అనే రిట్రీట్ ప్రదేశం ఉన్నాయి  ..

 సశేషం

మీ-గబ్బిట దుర్గా  ప్రసాద్   -6-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

 Inline image 2Inline image 3

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం )

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం )

మల్లినాథుని  దండాన్వయ విధానం

ఉదాహరణలు అనేకమైనప్పుడు ,మల్లినాథుడు మరొక విచిత్ర విశేష విధానశైలి  అవలంభిస్తాడు .ఈ రకమైన అర్ధాన్వ యానికి ‘’దండాన్వయం ‘’అంటారు .దీనిపై ప్రత్యేక కృషి సల్పి  ప్రొఫెసర్ ఎన్ .పి .ఉన్నిత్రి  రాసిన మ హత్తర వ్యాసం నుండి కొన్ని విషయాలను ప్రొఫెసర్ లాల్యే  అందించాడు .ఇందులోని రెండుమాటలను వివరించి చెప్పాడు .ఖండాన్వయ విధానాన్ని మీమాంసకారులు అవలంబించారు .ఇందులో మూల గ్రంధాన్ని వివరించి చెప్పటానికి ప్రశ్నోత్తర విధానం ఉప యోగిస్తారు ..దానిప్రకారం ముందుగా క్రియను తీసుకొ0టారు..తర్వాత విభక్తుల విషయం లో ప్రశ్నలు సంధించి  శ్లోకాన్ని ‘’ఆకాంక్ష ‘’ అంటే వచన క్రమం (ప్రోజ్ ఆర్డర్ )లో రాసి తర్వాత పాదాలకు అర్ధ తాత్పర్యాలు వగైరా  వివరిస్తారు .

  దండాన్వయ విధానం లో నయ్యాయకుల పద్ధతినే ఇంచు మించుగా అవలంభిస్తారు ..కానీ మొదట కర్త ను తీసుకొని దాన్ని బట్టి ప్రోజ్ ఆర్డర్ రాసి అప్పుడు వివరిస్తారు .. పూర్వపు వ్యాఖ్యాతలందరికంటే మల్లినాథుడు దండాన్వయ విధానాన్ని ప్రయోగించి దానికి విస్తుతమైన ప్రఖ్యాతిని కావ్యాలద్వారా కలిగించాడు .

 ఇప్పటి దాకా మనం చూసినవాటిని బట్టి మల్లినాథుని వ్యాఖ్యానాలు ఒక ప్రత్యేకవిధానంగా ఉంటాయని నిర్ణయానికి వస్తాము .ఆయన సంస్కృత భాషలోని సూక్ష్మ భేదాలను కూలంకషంగా సాధారణంగాను మహా కావ్య కవుల కవిత్వ సూక్ష్మ భేదాలను ప్రత్యేకంగా వివరించాడని అర్ధమవుతుంది .కవుల కవిత్వ శైలి  లాగానే మల్లినాథుని  వ్యాఖ్యాన శైలి లో కూడా పాకం లేక శయ్య ఉంటుంది -’’రసాస్వాదనోచితశబ్ద నిష్యన్తి  పాకః -పరి వృత్తి వే  ముఖ్యం నినిమయసహి ష్ణుత్వం -ఏత  దేవ మైత్రీ శయ్యేతి కయ్యతే ‘’.  మల్లినాథుని  శైలి మార్పును అంగీకరించదు  .ఆయన వ్యాఖ్యానాలు పదం యొక్క అర్ధాన్ని స్పష్టం సరళం  చేయటమేకాకుండా  వాటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా సమర్ధిస్తాయి .ఈ ఖచ్చితత్వం వలననే మల్లినాథుడు మిగిలిన వ్యాఖ్యాతలందరికంటే అధిగమించి సమున్నత స్థానం లో ఉండి  వెలుగుతున్నాడు ..కావ్యాలు ,ఇతర రచనల అవగాహనకు మల్లినాథ వ్యాఖ్యానమే  శరణ్యం తప్పని సరి  .మళ్ళీ మల్లినాథుడు లాంటి  వ్యాఖ్యాత  జన్మించనే లేదు.వ్యాకరణ సూత్రాలను ,అలంకారాలను  తెలియ జేయటమే కాదు మల్లినాథుడు  ,కవిత్వ వ్యక్తీకరణల ప్రాముఖ్యతలను కూడా తెలియ జేశాడు .కవి లాగానే ఆయన వ్యాఖ్యాన విధానానికి ఒక క్రమ పధ్ధతి ,హుందాతనం ,రూప లావణ్యం ,గతిత్వం ,స్పష్టత ఉన్నాయి .

                                 ఉపసంహారం

మొదట్లోనే  వివిధ సంస్కృత రచనలపై మల్లినాథ సూరి వ్యాఖ్యానాలను పేర్కొన్నాం .అనేక గ్రంథాలనుండి మల్లినాథుడు తన వ్యాఖ్యలకు బలంగా ఉదహరించిన వాటిని చూస్తే ఆయన అపార పాండిత్య ప్రకర్ష మనకు స్పష్టంగా  తెలుస్తోంది .అందుకే మల్లినాథుడు అసమాన వ్యాఖ్యత (ఏ కామెంటేటర్ పార్ ఎక్స్ లెన్స్ ) వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు ఆయనను ..ముఖ్యంగా 7 కావ్యాలపై  అనేక కోణాలనుంచి ఆయన రాసిన వ్యాఖ్యానాలు ,వాటిలోని లోతుపాతులు వెలికి తీసిన  వైశద్యం దిగ్భ్రమ కలిగిస్తుంది  .వ్యాఖ్యానం పదానికున్న నిర్వచనాలు కొన్ని తెలుసుకొందాం -1-’’త0 త్రాతిశయ వర్ణనమితి వ్యాఖ్యానం -విష్ణు ధర్మోత్తర పురాణం  2-వ్యాఖ్యానం నామ సంక్షేపోత్త రస్యార్ధస్య   విస్తరేణా ఖ్యానం వ్యాఖ్యానం -నీల మేఘుని తంత్ర యుక్తి విచారః 3- వ్యాఖ్యానం నామ యత్సర్వం బుద్ ద్యావిషయం వ్యాక్రియతే -చరక సంహిత .

 వ్యాఖ్యాన కర్త పాఠకుల దృష్టిని ఒక శ్లోకం ,లేక ప్రకరణం లో ఉన్న ముఖ్య విషయాలపై దృష్టిని కేంద్రీకరింప జేస్తాడు ..వాటి వైభవ వివరణ లను తగిన వ్యాకరణ సూత్రాలను వాటి అర్హత న్యాయబద్ధతలను బట్టి బేరీజు వేసి చెప్పి ఒప్పిస్తాడు .అందులోని అతిశయాలను అంటే ఔన్నత్యాలను పాఠకులకు తెలియ జేస్తాడు ..ఈ ప్రత్యేకతలను మనం మల్లినాథుని వ్యాఖ్యానాలు అన్వయిస్తే కవిలోని గొప్పతనాన్ని ఆయన కవితో సమానంగా అనుభవించి చెప్పినట్లు కవికి కావ్యానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించినట్లు అర్ధమవుతుంది ..మూలానికి వ్యాఖ్యానానికి మధ్య ఉన్న ఒక రకమైన ‘’సమర్ధ సమర్ధకా భావ 0 ‘’ద్యోతకమవుతుంది .ఈ సమర్ధన వ్యాకరణ స్థాయిలో ఛందస్సులో ,నిఘంటు స్థాయిలో ,దర్శన స్థాయిలో  మనకు ప్రత్యక్షమవుతుంది .కవితో మల్లినాథ వ్యాఖ్యాత తాదాత్మ్యం చెందినట్లు భావిస్తాం ..వ్యాఖ్యాత అనేక శాస్త్ర దర్శనాదుల జ్ఞాన విజ్ఞానాలలో  ఉద్దండ పండితుడైనప్పుడే సంపూర్ణ వ్యాఖ్యాత కాగలడు.

  ఈ చిరు గ్రంధం మల్లినాథుని అనేక శాస్త్ర గ్రంథ పాండిత్య గరిమను విద్యా వేత్తల దృష్టికి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నం .ఇది లేకపోతె గ్రంథ స్వారస్యాన్ని అనుభవించటం కష్టం ..వ్యాఖ్యానాలు రాయటమేకాక మల్లినాథుడు స్వయంగా  ‘’రఘు వీర చరిత ‘’కావ్యాన్ని వైశ్య వంశ చరిత్ర కావ్యాన్ని రాశాడు .ఏకావలికి ,తార్కిక రక్షా కు సూరి చేసిన వ్యాఖ్యానాలు ఆయన చర్చా సామర్ధ్యానికి ,తార్కిక క్రమంలో తన భావాలను చెప్పటం లోని నైపుణ్యాలకు గొప్ప ఉదాహరణలు ..దీనివలన మల్లినాథుడువిభిన్న శాస్త్ర గ్రంథ అవగాహనలో ,  బహుముఖ ప్రజ్ఞాశాలి అని  అందుకే ఆయన ఉదహరించిన విషయాలు కవి చెప్పినభావానికి వెలుగునివ్వటానికి బహుళంగా తోడ్పడ్డాయని తెలుస్టుంది . మల్లినాథుని మహా కావ్య వ్యాఖ్యానాలు మహాకావ్యాల స్పష్టార్థ గూడార్ధాలను వివరించటం లో సూర్య రశ్మిలాగా ప్రసరించి తేజోమయం చేశాయి .చరకుడు చెప్పిన ‘’తంత్ర యుక్తులు ‘’మల్లినాథుని విషయం లో అన్వర్ధాలు అనిపిస్తాయి .

‘’ కవ చాల్ప విష్యామితిహ్ ‘’ అని రఘువంశం లో చెప్పినట్లు ఈ చిన్న పుస్తకం పరిధి తక్కువే .. మల్లినాథుని వ్యాఖ్యానాలను హేమాద్రి పండితుని ,చరిత్ర వర్ధనుడు మున్నగు వారి  వ్యాఖ్యానాలతో పోల్చవచ్చు .వాటిని కూడా శైలి దృష్టిలో చదవ వచ్చు .మిగిలిన వ్యక్తిగత వ్యాఖ్యానాలు  విడిగా తెలుసుకో వచ్చు. మల్లినాథుని వ్యాకరణ సూక్ష్మ భేదాలను అధ్యయనం చేయవచ్చు .నేను మాత్రం నాకు అందుబాటులో ఉన్న వ్యాఖ్యానాలను ఆధారంగా మల్లినాథుని వైదుష్యాన్నీ ,మనీష ను అంచనా వేసే ప్రయత్నం చేశాను .సంస్కృతం లో ఉన్న విస్తృత వ్యాఖ్యాన సాహిత్యం లోతైన అధ్యయన0  చేయదగినదే  ..ఈ చిరు పొత్తం సంస్కృత విద్యా వేత్తలకు ప్రేరణ ,స్ఫూర్తి, ఆసక్తి కలిగి0చి ,వారిని  ఈ మహా వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష  ఫై మరింత సమగ్ర, సంపూర్ణ అధ్యయనానికి ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను ‘’అని ముగించాడు డా .ప్రమోద గణేష్ లాల్యే ..

 నా మనవి -మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ సిరీస్ లో భాగంగా ఉస్మానియా యుని వర్సటీ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ బహు గ్రంధకర్త ,పూనాలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైక్రో ఫిలిం ప్రాజెక్ట్ సారధి   డా ప్రమోద గణేష్ లాల్యేఆంగ్లం లో  రచించిన ‘’మల్లినాథ ‘’గ్రంధాన్ని నా అభిమాని ,సాహిత్య ప్రేమికులు సౌజన్య హృదయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారు కొని నేను చదవాలని నాకు 10-10-2016 న పంపారు  .మల్లినాథునిపై అప్పటికే కొన్ని పుస్తకాలు తెలుగు ఇంగ్లీష్ లలో చదివాను . కానీ ఇది నన్ను బాగా ఆకర్షించి ఏక బిగిని 128 పేజీల పుస్తకాన్ని 25-10-16 కు కేవలం 15 రోజుల్లో చదివి పూర్తి చేశాను .ఇంత సమగ్రమైన పుస్తకం మల్లినాథునిపై తెలుగు లో లేదే అనే దుగ్ధ కలిగి  దీన్ని స్వేఛ్ఛాను వాదం వెంటనే ప్రారంభించి నెట్ లో ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష ‘’పేరుతో రాయటం మొదలు పెట్టాను .మైనేనిగారు బాగా వస్తోంది కొనసాగించండి అనిప్రోత్సహించారు . .మధ్య మధ్యలో ఇతర వ్యాపకాలు పుస్తక ప్రచురణల హడావిడిలో ఆగుతూ సాగుతూ ఇదిగో ఇప్పటికి అంటే సుమారు 7 నెలలు పట్టింది పూర్తి చేయటానికి  ఇంత  శ్రమ కు కారణం  మల్లినాథుని వంటి మహా ప్రజ్ఞాని మన తెలుగు వాడు అవటమే .ఆయన గురించి గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం లోనే రాశాను .. అది గుంపులో గోవిందా చందంగా ఉన్నదే.ఇప్పుడుఇది ‘’వ్యాఖ్యాత చుక్కల్లో మల్లినాథ చంద్రుడు’’గా ప్రత్యేకంగా భాసిస్తున్నాడు .దాదాపు అయన సర్వతోముఖ వ్యక్తిత్వ దర్శనం లభించి నా జన్మ చరితార్ధమయ్యిందని విశ్వ శి స్తున్నాను  . ఈ జన్మకు నాకు ఇది గొప్ప వరమే . సరస్వతీ దేవి నా వెంట ఉండి నడిపించింది .నాకున్న అత్యల్ప సంస్కృత పరిజ్ఞానం తో నాగరలిపి లోని శ్లోకాలను వ్యాఖ్యలను  కస్టపడి ఇష్టపడి చదివి అర్ధం చేసుకొని రాయగలిగటం  మా ఇలవేలుపు శ్రీ సువర్చ లాన్జనేయ స్వామి ఆశీర్వాద ఫలితమే ఈ గ్రంధం .తెలుగులో మల్లినాథునిపై సమగ్ర గ్రంధం లేదన్న కొరత తీరిందని నమ్ముతున్నాను ..దీన్ని అంతర్జాలం లో చదివి ఆస్వాదించి,ఆదరించిన  సంస్కృత ,ఆంద్ర సాహిత్య బంధువు లందరికి,ముఖ్యంగా   నాకు ఈ ఆంగ్లగ్రంధం పంపి చదివించి ,రాయటానికి ప్రోత్సహించిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞతలు ..

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష’’   సంపూర్ణం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

  Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు -2(చివరి భాగం )

 కొన్ని సందర్భాలలో మల్లి నాధుని వ్యాఖ్యలలో చివర్ల పురాణ విషయ వివరణలు ఉంటాయి .కవులు తమ కావ్యాలలో రామాయణ ,మహా భారతాలనుండి ,కొన్ని పురాణాలనుండి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తారు .ఆ సంఘటనలను తమకావ్య సంఘటనలతో పోల్చి చెప్పటం పరిపాటి .ఆ ప్రత్యేక విషయాన్ని దానికి సామ్యమైన పై వాటి నుంచి గ్రహించి అక్కడ నిక్షిప్తం చేసి తమ కావ్యాలను ఉన్నతీకరించే ప్రయత్నం చేస్తారు ..వీటిని పురాణ ఆశ్రితాలు (మైథలాజికల్ కారె లేషన్స్ ) అంటారు .కవులు వాటిని తమకావ్యాలలో ఊరికే ప్రస్తావిస్తారు తప్ప వాటి గురించి వివరణ ఇవ్వరు ..మ ల్లినాథుడు ఆ సన్నివేశాలు లేక సంఘటనల పూర్వాపరాలను చర్చించి వివరించి సుబోధకమయ్యేట్లు చేశాడు .. వీటికి సంబంధిత పూర్వ ఆధారాలు లేక మూలలను కూడా తెలియ జేశాడు .

 రఘు వంశం లో కాళిదాసు చంద్రుడిని వర్ణించాడు .ప్రజలు రాజును చూశారు కానీ వారికీ సంతృప్తి  కలగక అసంతృప్తితో ఉన్నారు ..ఆయన్ను ప్రజలుఅప్పుడే పైకొస్తున్న  ఔషద్గీ  ప్రభువైన చంద్రుడుగా కనిపించాడు -’’నాధామివౌషధీనాం ‘’.దీనికి వివరణ  తప్పనిసరి .పాపుహ్ అనే క్రియ సోమ కు చంద్రునికి ఉన్న అభేదాన్ని,ఏకత్వాన్ని  తెలియ జేస్తుంది.దీనికి మల్లినాథుడు వ్యాసుడిని ఉదహరించారు -’’తమ్ చ సోమం పర్యయేణ నుపూర్వశహ్ -అంటూ ‘’అత్య శ్శాద దును రిత్యర్ధహ్ ‘’’అన్నాడు ..సోమకు  ఉన్న విశేషణాలు చంద్రునికి కూడా వర్తిస్తాయి ఉదాహరణకు అదృశ్యమవటం అంటే శరీరం ప్రజలకోసం క్షీణించటం  లో రెండిటి లక్షణాలు ఉన్నాయి అన్నాడు మల్లినాథుడు -’’ఆదర్శనం -ప్రజార్ధ  వ్రత కర్శితాంగ  ‘’

 మరో సందర్భం లో రాణి సుదక్షిణ గర్భాన్ని గంగానది అగ్ని హోత్రుని తనలో దాచుకొన్నట్లు ధరించింది అంటాడు కాళిదాసు ..ఈ సందర్భంకు తగినట్లు  మల్లినాథుడు హరి వంశం లోని ఒక శ్లోకాన్ని ఉదహరించారు .రెండవ సందర్భం లో రామాయణ శ్లోకం ఉటంకించాడు .లోకపాలుర ప్రకాశాన్ని వర్ణించే సందర్భం లో మనుస్మృతి నుంచి ఉదాహరణ చూపాడు .వ్యాఖ్యానం చివర మల్లినాథుడు వీటిని ఉదహరించడం ఆయన ప్రత్యేకత మాత్రమేకాక ఆయన ప్రత్యేక శైలి కూడా .మల్లినాథుని ప్రత్యేక వివరణ వ్యాఖ్యానం చదివిన వారెవరికైనా  హాయిగా తాజాగా ఊపిరి పీల్చుకున్నట్లు సంతోషిస్తారు .గహన విషయాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పీ ఆయన పద్ధతికి హేట్సాఫ్ . కొన్ని యెడల విషయం కూడా .ఒక చోట వేరెవరో వ్యాఖ్యాతల వ్యాఖ్యానాలను తిరస్కరించాడు సూరి మల్లినాథుడు   .రంగ రాజు వ్యాఖ్యానాలు కూడా సూరి చేతిరస్కరింపబడ్డాయి .-’’రంగ రాజస్టు ‘’న చక్ర మర్యక్రమతాధికం ఘరమ్ ‘’ఇత్యుప రిస్టదా ద న్వయఇత్యాహ -తదసత్ ‘’గుణానాం చ పదర్ద్త్వాత్ ఇతి న్యాయ దారుణ్యాదివ ప్రత్యేకం ప్రదాన్వయీనాం క్రియహ్ – సంబంధ యోగాది త్యలం  శాఖా చంక్రమణేన పురా కిల రావణః కామయే కా మ్యే కర్మాణి పశుపతి ప్రీణనాయ నవ శిరస్తా గ్రై హుత్వా దశమారంభే సంతుష్టత్వస్మాత్ త్రైలోక్యాధిపత్యం వప్రే ఇతి పౌరాణికీ కథా మాను సంధేయా  ‘’

 ఈ రంగరాజే మరొక చోట తీవ్ర విమర్శకు గురయ్యాడు .పూర్వ రంగం ను రాజు నిర్వచించాడు -’’పూర్వరాజ్యతే అస్మిన్నితి పూర్వ రేంగే నాట్యశాలా తస్త0 కర్మాపి పూర్వరంగ  ఇతి దశ రూపకే -అతః పూర్వరంగే నామ రంగ ప్రధానాఖ్యే రంగ విధ్న  శాంతికరీ నాందీ పాఠ  గీతి వాది త్రాధి నే కాంగ విశేషే నాప్యాదౌ కర్తవ్య విశేషహ్ ‘’అని శిశుపాల వద్ద వ్యాఖ్యానంలో స్పష్ట0  చేశాడు .దశరూపకకర్త రంగ రాజు నిర్వచనాన్ని అధిక్షేపించాడు .మల్లినాథుని నిర్వాకాహన వ్యాఖ్యానం దశరూపకం వంటి నాటక రంగ శాస్త్రాలకు  అను బ0ద్ధంగా సంతృప్తిగా స్పష్టంగా ఉంది  ..కొన్ని పురాతన కధలను ఉదహరిస్తూ వాటిని మల్లినాథుడు ‘’పౌరాణిక కథా ‘’అని పేర్కొన్నాడు … వీటికి సంబంధించిన ఖచ్చితమైన ప్రకరణాలను  మల్లినాథుడు పేర్కొనేవాడు .అదే పేరుతొ చెప్పేవాడు .రావణ శబ్దానికి అర్ధాన్ని రామాయణం లోని ఒక శ్లోకం ఆధారంగా శబ్దోత్పత్తి శాస్త్రమర్యాదతో తెలిపాడు -’విశ్వవసోత్పత్యం పుమాన్ రావణః -పౌరాణికాస్తు రావయతీతి వ్యుత్పా దయన్తి ’  ‘’విశ్రయ-శ్వ   ఆదేశా’’

 మల్లినాథుడు ప్రతిదానికి ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇస్తాడు ..ఆ శ్లోకాన్ని అందులోని భావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు .ఆయన వ్యాకరణ వివరణ సుదీర్ఘం  .కీలక భావనలు  సరళ స్పష్టాలు ..కొన్ని ఉదాహరణలు –

‘’మహా భూత సమాధినా ‘’అనే రఘువంశ వాక్యాన్ని ఒక వ్యాఖ్యతో చక్కగా విడగొట్టాడు .-’’తస్య రాజా సర్వే గుణాః రూపరసాది మహాభూతగుణా వదేవ పరార్ధహ్ పర  ప్రయోజన మీ వైకం ముఖ్యం ఫలం యేషాం తే తయాక్తా అసన్ ‘’

 బ్రహ్మ దేవుడు దిలీపుని పంచభూతాత్మకంగా సృష్టించాడు .అందువలన వాటి లక్షణాలు ఆయనకు జన్మతహా అలవడ్డాయి ..చివరలో ఒక సాధారణ సూత్రాన్ని కూడా చెప్పాడు -’’మహా భూత గుణోప మేన కారణగుణాః కార్యే సంక్రమన్తీ న్యాయహ్ సూచితః ‘’

 ఒక్కోసారి కీలక పదాన్ని పట్టుకొని దానిపై అద్భుత వ్యాఖ్యానం రాస్తాడు సూరి .రఘువంశం లో రాజరిక తేజం రఘు మహారాజుతో పూర్తిగా ప్రేమలోపడి ఆయన అనుమతి కోసం ఎదురు చూస్తోంది .ఇది ఎలా ఉందంటే తండ్రిఅనుమతికోసం కన్నె పిల్ల ఎదురుచూస్తున్నట్లు ఉందట . .ఇందులో క్రియాసంబంధలక్షణాలు  ఫలిత సంబంధ లక్షణాలుగా మార్పు చెందాయి ..ఇక్కడ అనుజ్ఞ అంటే వివాహానికి ఆమెకున్న అర్హత అని మల్లినాథుడు అర్ధం చెప్పాడు .-’’అనుజ్ఞా శబ్దాత్ పితృ పరతంత్య్ర ముపమామ్ సామర్ధ్యత్ పాణిగ్రహణం యోగ్యతా చ ధ్వన్యంతే ‘’

  రఘువంశం లో సీతా పరిత్యాగం సందర్భం లోలక్ష్మణునివలన  విషయం తెలిసి సీతాదేవి భూమిపై మూర్ఛపోయింది .తల్లి ఒడిలో పడుకున్నట్లున్నది .నిజంగానే భూమాత ఆమె తల్లియే .దీనిపై వ్యాఖ్యానిస్తూ సూరి -స్త్రీణామాపాది  మాతేవ శరణమితి భావః ‘’అని చక్కగా చెప్పాడు

రాజును ప్రస్తుతించే ఒక సందర్భం లో అజామహా రాజా !లక్ష్మీ దేవి  నువ్వు నిద్రలో ఉన్నా నీలో చేరి ఓదార్పు పొందింది .ఆ చంద్రుడు పడమట దిక్చక్రమ్ వైపుకు పరిగెత్తుతున్నాడు .నీ ముఖ సౌందర్యం వీడిపోతోంది -’’నిద్రావశేన భవతాప్యన వేక్షమాణ -పర్యుత్సు కత్వ మబలా నిశి ఖండితేవ -లక్ష్మీర్వినోదయతి యేన దిగంత  లంబీ -సోపి త్వదానన రుచిం విజహాతి చంద్రహ ‘’ఇక్కడ లక్ష్మిని అజుని భార్యగా కవి చెప్పాడు అని నన్దర్గికర్  వ్యాఖ్యానించాడు -’’చంద్రారవింద రాజ వదనాదయో లక్ష్మీ నివాస స్థానానీతి ప్రశిద్ధి మాశ్రిత్యో చ్యతే -స చంద్రేపి దిగంత లక్ష్మీ పశ్చిమాశామ్ గతః సన్ -అస్తం గచ్ఛన్నిత్యర్ధహ్ -ఆతో నిద్రాం విహాయతామ్ లక్ష్మీ మన్యన్య శరణో పరిగృహా ణో త్యర్ధః ‘’

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-17 కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

 శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి  .ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా  కిరణ  ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇట్టె లభిస్తాయి ..దక్షిణామూర్తి లాగా ఆయన మౌన వ్యాఖ్యాన పరబ్రహ్మ .ఆయన సందర్శనం లో మనం ‘’సవికల్ప సమాద్ధి ‘’పొందుతాం ..’’రమణ మహర్షి  భౌతిక గురు మూర్తికారు ..మహా గొప్ప పవిత్రమైన మూర్తి ఇంతటి అరుదైన వ్యక్తి ఒక శతాబ్దకాలం లో భారత దేశం లో జన్మించలేదు ‘’అన్నారు మన రాష్ట్రపతి డా రాధాకృష్ణన్ ..ఆయన్ను ఒక్కసారి చూస్తే చాలు మన హృదయాలు ప్రక్షాళనమై పవిత్రవంతాలవుతాయి .

  శ్రీ రమణ మహర్షిది ఒకటే ప్రశ్న -’’నేను ఎవరిని ?’’అది వేసుకొంటే సాధకునికి ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఈ విధానం ప్రాచ్య  పాశ్చాత్త్య  విధానం లో ఉన్నా ,దీనిని  మళ్ళీ తెరపైకి తెచ్చినవారు ఆయనే ..వేదాంత తత్త్వం లోని దంతా ఆయన ఆచరణ సాధ్యం చేసుకొన్నారు .ఒకరకంగా చెప్పాలంటే ‘’ఇలియడ్ ను ఒక్క మాటలో చెప్పారు అంటాడు స్వామిరామా .తనను తాను తెలుసుకున్నవాడికి విశ్వమంతా  తెలుస్తుంది .ఇదే అద్భుత చిన్న సూక్ష్మ విధానం ఆత్మ జ్ఞానానికి .దీనినే అన్ని తత్వ శాస్త్రాలు చెప్పాయి ..

నాలుగు  రోజులు తన బృందం తో   రమణా శ్రమం లో ఆధ్యాత్మిక అనుభూతిలో గడిపాక నాసిక్ కు తిరిగొచ్చి ,తాను ఉన్న శంకరా చార్య పదవిని విసర్జించేయాలనే గట్టి ఆలోచన మనసులో స్థిరపడింది .ఆచార్య పదవిలో క్షణం తీరిక లేకుండా వచ్చిమీద పడే జనాల బాధ తో భారంగా బోరింగ్ గా భావించాడు .అరుణాచలం లో రమణ మహర్షి దర్శనం తో ఆ లోపలి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ‘’త్యజించు అనుకొన్నది సాధించు  ‘’అనేది మనసు హృదయాలలో మారు మోగిపోతోంది ..నాశిక్ లో ఉన్నకాలం మరీ ఇబ్బంది కలిగించింది ..పీఠం త్యజించి బాధ్యతలన్నీ వదిలేసి  పారి పోవటం ఆంత తేలికైన విషయం కాదు ..కానీ ఒక రోజు వచ్చి ఆ పనే చేయించింది .నాశిక్  వదిలి  ఒక్కసారిగా మళ్ళీ హిమాలయాలకు వెళ్లి పోయాడు . .

 ఎవరూ వేరొకరికి జ్ఞాన ప్రకాశం కలిగించలేరు అనిపించింది .యోగులు మాత్రం ప్రేరణ  కలిగించి అంతర్బలాన్ని కలిగించగలరు .అది లేక పోతే ఆత్మ జ్ఞానం సాధించటం  అసాధ్యం .  .ఇవాళ్టి కాలం లో మార్గ దర్శనం చేసే వారు కనిపించటం లేదు .మనకు ప్రేరణ కలిగించి దారి చూపేవారు లేరు .అందుకే ఆత్మజ్ఞానం అందుకోవటం కష్టమౌతోంది .కనుక  మహర్షులు ,యోగులు ప్రేరణకు మూలాలై ఆత్మజ్ఞానఉద్దీ పకులౌతారు అని పించింది స్వామిరామాకు

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-17 -కాంప్ -షార్లెట్-అమెరికా

Inline image 1Inline image 2

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు )

వీక్లీ  అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు )

రుద్రాభిషేక వారం

29 సోమవారం ఉదయం మైనేనిగారు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు విషయం మాట్లాడి కొన్ని మార్పులు చేయమంటే చేశాను … వారి బావమఱఁదిగారి భార్యతో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి హాయ్ చెప్పాను …మంగళవారం ‘’వుమెన్ సెయింట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ‘’కొంత చదివా ..దాసరి నారాయణ రావు మరణ వార్త విన్నాను .స్వర్గం నరకం తాతామనవడు తుగ్లక్  మేఘ సందేశం ,శివరంజని మాత్రమే నాకు నచ్చాయి మిగిలినవన్నీ ‘’పైత్య0 ‘’అనిపిస్తాయి .నటన బాగుంటుంది .డైలాగ్ డెలివరికూడా  .మెసేజ్ లో ‘’సరిలేని దాసరి ‘’అని రాశాను ..మల్లినాథ సూరి 48 ,ఆపన్న హస్తాలు ,దివ్య ధామం రాశాను .. విజ్జి వాళ్లకు తెలిసినాయన సిద్ధిపేట వారు శ్రీ గ్రంధి హరి  రాత్రి వచ్చి శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో బి టెక్ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళబ్బాయి కి ఎంబి బి ఎస్ సీట్ సాధన కోసం  రుద్రాభిషేకం చేస్తున్నామని  ఆశీర్వదించి దగ్గరుండి అన్నీ చూడమని సంకల్పం పూజ విధానం వగైరా చేయించమని   కోరాడు.  సరే అన్నా .వచ్చి తీసుకు వెడతానన్నాడు .

బుధవారం ఉదయం శ్రీ ఎల్లాప్రగడ వారు కారీ నుంచి ఫోన్ చేసి  మమ్మల్నిద్దర్నీ రైలులో కార్తీకి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేస్తానని ఆయన మేము రిట్రీట్ కు వెళ్లిన ఫయ టేవిల్  లో యూనివర్సిటీలో అకౌంట్స్ ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యానని ,చెప్పారు . ఫోన్ మా అమ్మాయికిస్తాను మాట్లాడుతుంది అని చెప్పి ఇచ్చాను .పిల్లలకు జూన్ 10 వరకు పరీక్షలని అవి అయ్యాక తానె మమ్మల్ని తీసుకు వస్తానని చెప్పగా ఆయన చాలా సంతోషించారు ..సూరి 48 ,లండన్ థియేటర్లు -1 అఘోరీ -1 రాశా .లేటెస్ట్ ఫ్యన్ బకెట్ 87 చూశా రాత్రి .

1-6-17  .గురువారం ఉదయం అప్పారావు గారు వస్తే  మా అమ్మాయి మమ్మల్ని  గుంటూరాయన  ఇంటికి తీసుకు వెళ్ళింది .పుట్టపర్తి ఆయన తల్లికి జబ్బుగా ఉందని తెలిస్తే వెళ్లిపోయారని చెప్పాడు .కనీసం లోపలి రమ్మని లేదు .డిక్కీ లో అంటే గారేజ్ బయట కుర్చీలేసి కూచోపెట్టి తన సోది వాయించాడు .నాకు చిర్రెత్తుకొచ్చింది .ఒక్కమాట కూడా వినలేదు పాపం అప్పారావు గారు బలయ్యారు .పావు గంట తర్వాత వెడదామని నేను ముందు బయల్దేరితే ఆయన కూడా వచ్చారు .ఎలా వెడతారు అని కూడా గుంటూరు పశువు -ల డాక్టర్ అడగలేదు .మా ఇంటికి దగ్గరే అయినా ,మేమిద్దరం నడిచి దారి తప్పి దారిలో ఒక ఇల్లు రిపేర్ చేస్తున్నఅమెరికన్ అతనిని రిక్వెస్ట్ చేస్తే చాలా సంతోషంగా కారు లో తీసుకు వచ్చి ఇంటి దగ్గర దింపాడు .ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాం . ఇద్దరం చెమటలు కార్చాం మా అమ్మాయి అప్పారావుగార్ని వాళ్ళ అమ్మాయి గారింట్లో దింపి వచ్చింది . సాయంత్రం గుంటూరు మరో అడ్డాడ దగ్గరాయన్ను వెంటేసుకొని వాకింగ్ లో మా ఇంటికి వచ్చి వెళ్ళాడు .పొడి పొడిగా మాట్లాడి పంపేశాను .సూరి 49 అఘోరీ 2 ధియేటర్ 2 రాశా

               ఎల్ బి శ్రీరామ్ ఇంటర్వ్యూ

 రాత్రి యు ట్యూబ్ లో నాటక రచయితా డైరెక్టర్ అనేక అవార్డుల విన్నర్ సినీ డైలాగ్ రచయిత 400 సినిమాల హాస్య, కేరక్టర్ నటుడు  ఎల్ బి శ్రీరామ్ ఇంటర్వ్యూ చూశా .అద్భుత అనిపించింది .7  గురు అన్నదమ్ములలో 6 వవాడు శ్రీరామ్ .పెద్దన్న మిగిలినవాళ్ళల్లో ఒక్కొక్కరిని హైదరాబాద్ తీసుకు వెళ్లి చదివించి ప్రయోజకులను చేశాడని ,తానూ 22 ఏళ్ళు నాటక రచయితగా  ప్రొడ్యూసర్గా డైరెక్టర్ గా మంచి పేరు పొందానని తమనాటకాలు ఏ పోటీకి వెళ్లినా బహుమతి రాకుండా ఉండలేదని ,తనకు ,తనికెళ్ళ  భరణి  నాటకాలకు  విపరీతమైన పోటీ అని తమకు ఫస్ట్ ప్రయి జ్ వస్తే అతని సంస్థకు సెకండ్  లేకపోతె అటూ ఇటూ మారేవి .కాని  మధ్యలో ఏ ఒక్క సంస్థకూ మొదటి లేక రెండు బహుమతులు వచ్చేవికావని  చెప్పాడు .నాటక రంగం లో తన గురువు శ్రీ దేశిరాజు హనుమంతరావు గారని  తమ కుటుంబ సభ్యులందరూ నటులవటం వలన తమ కుటుంబాన్ని ‘’మినీ సురభి ‘’కుటుంబం అనేవారని ఆత ను చెబుతుంటే కన్ను ఆర్పకుండా అతన్నీ చూడాలని పించింది .ఆకళ్ళల్లో స్వచ్ఛత నిజాయితీ నిర్భీకత  ఆముఖం లో వర్చస్సు నన్ను బాగా ఆకర్షించాయి .

 నాటక రంగం ఆకర్షణ తగ్గిపోగా శ్రీరామ్ తమ్ముడు అన్నకున్న తపన జ్వాల ఆగి పోకూడదని ప్రోత్సహించి మద్రాస్ పంపి ఖర్చులన్నీ తానె పెట్టుకొని ఆతర్వాత కుటుంబాన్ని అక్కడికి చేర్చి ,ఆఖర్చులూ  తానె రెండేళ్లు భరించి నిల దొ క్కు కొనేట్లు చేశాడని .,ఆశపెట్టుకున్న కోట శ్రీనివాసరావు ఏ సహాయమూ చేయలేదని ఉద్యోగి నటుడు విద్యాసాగర్ తనను ఆదరించి ప్రోత్సహించి దారి హుపాడని ఇలా తన పెద్దన్న తన తమ్ముడు నిస్వార్ధంగా ఆలోచించబట్టి వాళ్ళేమీ పెద్ద ఉద్యోగస్ట్లుకాకపోయినా కుటుంబాలను ఆదు కొని పైకి తెచ్చినవారని ఎంతో కృతజ్ఞతగా చెప్పాడు .ఈ వి వి సత్యనారాయణ వి వి వినాయక్ తనను సినిమాలలో ఉన్నత స్థితికి తెచ్చారని  డైలాగ్ రైటర్ గా నే సినీ అరంగేట్రం చేశానని దానికోసమే వచ్చానని  భగవంతుని దయవల్ల సాధ్యమై తన రచనా శక్తి చూపగలిగానని ఎవరికిందా ‘’ఘోస్ట్ రచయిత ‘’గా పని చేయలేదని తర్వాత నటించటం ప్రారంభించి అందులోనూ వెరైటీ డైలాగ్ డెలివరీ పండించానని చెప్పాడు

                 మిధునం కిరికిరి  .

 నాకు తెలియని ఇంకో విషయం కూడా ఎల్బీ చెప్పాడు -హాస్యరచయిత శ్రీరమణ రాసిన మిధునం కథను తనికెళ్ళ భరణి డైరెక్ట్ చేసిన సినిమాలో మొదట అందులోని ముసలాయన పాత్రకు తననే భరణి ఎంపిక చేశాడని  నువ్వే చేయమని శ్రీరామ్ అంటే కాదు నువ్వు చేస్తేనే ఆ పాత్ర పండుతుంది అని నిర్మొహమాటంగా చెప్పాడని స్క్రీన్ ప్లే కూడా తనతోనే రాయించాడని  ,లక్ష  వత్తులు  వెలిగించే సీను లో వాళ్ళందరూ అన్ని వత్తులు ఒక దానిలోనే  పెట్టి వెలిగిద్దామని అంటే అలా బాగుండదు విడి గా ప్రమిదల్లో పెట్టి వెలిగిస్తే శోభ వస్తుందని కన్విన్స్ చేసి మార్పించానని ,అందులో తనపాత్ర తనభార్య చనిపోయే ముంది ‘’పాహి పాహి పాహి ‘’అనే వేదపనస  ఘన పనసలో చదువుతుందని ,దాన్ని సుస్వరంగా ఉచ్ఛరించటానికి తాను  హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్ లో ఉన్న తన తండ్రిగారి శిష్యుడైన ఘనాపాటీ వద్ద నెల రోజులు నేర్చుకున్నానని , సినిమాలో ఆపాత్ర ఆంగ్లం లో కూడా మాట్లాడుతుందని అందుకని అందులోనూ ఏ దోషాలూ లేకుండా ఉండాటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ వద్ద నెల రోజులు శిక్షణ పొందానని ,సినిమాను వాళ్ళు వేసవి లో తీద్దామని ప్లాను  వేస్తె  ఆ కధకు సరైన వాతావరణం కావాలంటే వింటర్లో  ప్రకృతి  మధ్య తీయాలని సూచించానని సరే అంటూనే కాలయాపన చేశారని ,తాను  మిధునం పై ముఖ్యపాత్ర కోసం ఒక్క ఏడాది విపరీతంగా కష్టపడ్డానని చెప్పాడు .తనకు జోడీ అయిన హీరోయిన్ కోసం వెదకటం లో కాలం గడిచి పోయిందని రెండు సార్లు  నిర్మాతలు  మారిపోవుటటం ,లక్ష్మిని లేడీ కేరక్టర్ గా ఎన్నిక చేయటంజరిగిందని  , భరణికి మాత్రం పురుషపాత్ర నేను  చేస్తేనే  బాగుంటుంది అనిఉన్నా ప్రొడ్యూసర్ల ఒత్తిడి కి లక్ష్మికి తాను  తగనని భావించి బాలు ను పెట్టుకొన్నారని ఇది తన జీవితం లో అత్యంత చేదు ఘటన అని చెప్పాడు తనకు అడ్వాంసు గా చాలా పెద్ద మొత్తమే ముందుగానే ఇచ్చారని దాన్ని మొత్తం తిరిగి ఇచ్చేసి చేతులు దులుపుకొని బయటికి వచ్చేశానని చెప్పాడు .ఇందులో శ్రీరామ్ నిజాయితీ ఆ కద పట్ల ఉన్న తపన అర్ధమయింది .ఎవరిపైనా ఆయన నెపం వేయక పోవటం నన్ను ఆశ్చర్యపరచింది . నేను మిధునం సినిమాపై రివ్యూ రాసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది .బాలు ఆపాత్రలో ఒక ”బండ ఆరవాయన” లాగా ఉన్నాడుకాని శ్రీరమణ  సృష్టించిన తెలుగాయన లాగా లేడన్నాను శ్రీరామ్ వేసి ఉంటె ఆపాత్ర నూటికి వెయ్యి శాతం తెలుగు దనం తెలుగు తేజం ఉట్టిపడేది . బాలు లక్ష్మి లు’’ అరవ మొగుడు అచ్చతెలుగు పెళ్లాలు’’గా ఉన్నారు .ఈ  మనోబాధతో గాయపడిన హృదయం తో తాను  మిధునం సినిమా ఇప్పటి వరకు చూడనే లేదని  చూసి అవతలివారిపై ఈర్ష్య  ద్వేష అసూయలు పెంచుకోవటం తనకు నచ్చని పని కనుక చూడలేదని నిజాయితీగా చెప్పాడు  మిధునం సినిమా లో ఇంతమలుపు  ఉన్నదని  మొదటి సారిగా ఎల్బీ ఇంటర్వ్యూ వల్లనే నాకు తెలిసింది .అందుకే ఇంత  తపన పడి  రాశా .

2-6-17  గురువారం మధ్యాహ్నం  టివి నటుడు వినోద్ బాల ఇంటర్వ్యూ చూశా .అతనిది మరీ వింత పరిస్థితి బుల్లి తెరకు ఒక వెలుగు తెచ్చినవాడు .రామ్ గోపాల్ వర్మ హాండిచ్చాడని చెప్పాడు .నాకు ఇతని నటన బాగా ఇష్టం

మైనేనిగారుపంపిన నీల్ డి గ్రాసీ రచన ‘’ఆస్ట్రో ఫిజిక్స్ ఫర్ పీపుల్ ఇన్ ఏ హర్రీ ‘’పుస్తకం చేరింది .చదవటం మొదలుపెట్టా బాగుంది .. గబ్బిట మాణిక్య శాస్త్రికి పూరీలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది  డిపార్ట్ మెంట్ గా ప్రమోషన్ వచ్చినట్లు మెయిల్ రాస్తే సంతోషించి ఆశీర్వ దించా .శుక్రవారం సూరి 50 ధియేటర్ 3 రాశా .మా మనవడు చి భువన్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్ పరీక్షలో 9..4 /10 మార్కులతో పాసయ్యాడని  తెలిసింది . వీడి అన్న సంకల్ప్ కు అమెరికాలో 4-6-18 వరకు ఉండి పని చేయటానికి వర్క్ పర్మిట్ వచ్చింది . కొంత టెన్షన్ తగ్గింది .. కాలిఫోర్నియాలోని మా మేనల్లుడు శాస్త్రి ‘’లఘు పూజా విధానం ‘’పంపమంటే పంపాను  .

         రుద్రాభిషేకం

3- 6-17 శనివారం ఉదయం ఆస్ట్రో ఫిజిక్స్ కొంత చదివా .సాయంత్రం4-30కి  శ్రీ హరి గారు వచ్చి కారులో మా ఇద్దర్ని వాళ్ళ ఇంటికి రుద్రాభిషేకానికి తీసుకు వెళ్లారు . పూజ మొదలు పెట్టేసరికి 5 30 అయింది గణపతి అష్టోత్తర పూజ చేయించి శి భవానీ శంకర దేవుల ఆవాహన అష్టోత్తర పూజ చేయించి లఘున్యాసంచదివి 11 సార్లు రుద్రాభిషేకం శ్రీహరి శ్రీమతి విజయ దంపతుల చేత ప్రారంభించాను మా అల్లుడు అవధాని వద్ద దాదాపు ఏడాది కాలం ఇంటి వద్ద  వేదం నేర్చుకున్న 6 గురు నమక చమకాలు చక్కని స్వరం తో సామూహికంగా పలికి నిండు దనం తెచ్చారు . పండ్ల రసం పాలు తేనే చక్కర కొబ్బరి నీళ్లతో ఘనంగా అభిషేకం జరిగింది నేను కూడా నా  స్పటిక లింగాన్ని విష్ణుపాదాలను సాలగ్రామాలు ఆ0జ నేయస్వామి విగ్రహాన్ని శ్రీచక్రాన్ని  పూజలో పెట్టి అభిషేకం వీటికీ చేయించాను . వచ్చినవారంరి చేత అభిషేకం చేయించారు . అభిషేకజలాన్ని వేరే పాత్రలో తీయించి అన్నిటినీ కడిగించి అష్టోత్తర శతనామాలు లలితఅష్టోత్తరం చేయించి నైవేద్యం హారతి మంత్రం పుష్పం ఉద్వాసన లతో కార్యక్రమాన్ని రాత్రి 9 గంటలకు ముగించాము  .తర్వాత ఒక అరగంట భజన చేశారు .ఆ పిమ్మట భోజనాలు .సుమారు 80 మందిదాకా వచ్చారు . చపాతి పూరీకూరా ఇడ్లీ లు  శ్వీటు వెజ్ బిర్యాని ,పప్పు ,కూర ,వాంగీ బాత్  సాంబారు ,,మాంగో ఐస్ క్రీమ్ .నాకు పెద్దగా తినాలనిపించక తినలేక పోయాను  . అందరు భోజనాలు చేసేసరికి రాత్రి 10 30 అయింది .నేను సాయ0కాలం  వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శ్రీ సువర్చలేశ్వర శతకం హరిగారికి అందజేశాను ..

 కార్య క్రమం అవగానే చాలామంది ‘’అంకుల్ చాలా బాగా చేయించారు ‘’అని అన్నారు చిరునవ్వే నా సమాధానం . నా స్పీడ్ కు కుర్రకారు ఆశ్చర్య పోయారు . నాకు శ్రీహరి దంపతులు ‘’ఘనమైన తాంబూలం ‘’ఇచ్చి వాళ్ళబ్బాయితో సహా మా ఇద్దరికీ పాదాభి వందనం చేసి ఆశీస్సులు అందుకొన్నారు . కొందరు దగ్గరకొచ్చి నమస్కారాలు పెట్టి వెళ్లారు .హరి  దంపతులు  చాలా ఆనందించారు సంతృప్తి చెందారు అదే కావలసింది వారి శ్రద్ధ భక్తులే దీనికి కారణం .పవన్ కారులో మేమందరం బయల్దేరి అప్పారావుగారిని వారింటివద్ద డ్రాప్ చేసి  మమ్మల్ని మా ఇంటిదగ్గర దింపి పవన్ ‘’పుష్పక విమానం ‘’తనఇంటికి తన కుటుంబంతో చేరింది .రాత్రి 11 దాటింది . అప్పారావుగారు మా పెద్ద మేనల్లుడు అశోక్ తోపాటు సిద్ధిపేట స్టేట్ బాంక్ లో పనిచేసినట్లు ఈ రోజే ఆయన ,పవన్ మాట్లాడుకొంటుంటే తెలిసింది . .తెల్లవారుజామున 3- 30 కే  మెలకువ వస్తే లేచి మైనేనిగారి మెయిల్స్ కు సమాధానం రాసి యు ట్యూబ్ లో సూర్య స్తుతి పెట్టుకొని మాగన్నుగా వింటూ నిద్రలోకి జారుకున్నాను .

4-6-17 ఆదివారం -మల్లినాథ 52 రాశా రాత్రి కొద్దిగా వర్షం పడింది . ఉదయ0  బాగానే ఎండ వచ్చింది .వీక్లీ  -9 సాయంత్రం రాశా .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్-4-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 5

  Inline image 1 Inline image 2

 Inline image 3Inline image 4

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52

మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు

సంస్కృతం లో న్యాయ సూత్రాలకు గొప్ప ప్రాభవం విలువ ఉన్నాయి .సామాన్య సంఘటనలలో ని అనుభవాలు వాటిలో కనిపిస్తాయి ముఖ్య సిద్ధాంతాలు సంఘటనలను తెలియజేయటం వలన వాటి ప్రభావం చాలా ప్రయోజన కరం గా ఉంటుంది .తన వ్యాఖ్యానాలతో మల్లినాథుడు అలాంటి సిద్ధాంతాలను చాలా ఉపయోగించాడు .తరల’’వ్యాఖ్యానం లో 10 సిద్ధాంతాలు మాత్రమే చెప్పాడు .ఇందులోకొన్ని  ఆచూకీ (రిఫరెన్స్ )కోసం  తెలుసుకొందాం .వీటి సహాయం తో మల్లినాథుడు తనదైన ప్రత్యేక చర్చను చాలా అర్ధవంతం చేశాడు .

1-నిమిత్తాన్తరం నైమిత్తికం –అంటే ఫలితంలేక ప్రభావం  మరొక కారణం -2-ధర్మ కల్ప నతో వరం ధర్మ కల్ప నేతి -న్యాయాభిదాయా ఏవ -తాత్పర్యామ్ తర  కల్పనం వరఇత్యభిప్రాయహ్ అంటే -గుణం లేక లక్షణాన్ని ఊహించటం ఒక విషయాన్నీ ఊహించటానికి ప్రాధాన్యమౌతుంది దీన్ని అనుసరించి ఉచ్చారణ అర్ధాన్ని ఊహించవచ్చు .-3-తదపి  వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తిరీతి న్యాయేన -అంటే -ఇది కూడా సిద్దాంతం  ప్రకారమే ఉంది -అందులోని ముఖ్య లక్షణాలు వివరణతో నే తెలుసుకోవచ్చు  4-జతుకాషు న్యాయహ్ -లక్కకు చెక్క కు ఉన్న విడదీయ లేని సంబంధం లాంటిది 5-అదగ్ధ దహన న్యాయ -బాగా మండుతున్నది -అంతకు ముందు మండనిది 6-బ్రాహ్మణాశ్రమణ న్యాయం -సన్యాసి ని కూడా పూర్వాశ్రమంలో బ్రాహ్మణుడే అంటారు.-7-దండ పూప న్యాయం -ఎలుక పిల్ల కర్రను తిన్నది అన్నట్లు -అది దానిపై ఉన్న రొట్టెను కూడా తిన్నట్లు చెప్పటం  8-కాకతాళీయం న్యాయం -కాకి తాటిపండుపై ఎక్కితే రాలి పోయినట్లు 9-తిల త0డుల న్యాయం – బియ్యం నువ్వులు కలిస్తే వాటిని తేలికగా వేరు చేసినట్లు 10-ఖలే  కపోతన్యాయహ్ -నూర్పిడి ధాన్యం నుంచి పావురాలు ఒకే సారి ఎగిరినట్లు 11-పాన కరస న్యాయం- పానకం లోని వివిధ పదార్ధాల రుచి తెలియక వాటి మొత్తం రుచి తెలిసినట్లు .

 ఒక్కోసారి మల్లినాథుడు రెందు శ్లోకాల మధ్య ఉన్న సంబంధాన్ని తర్వాతఉన్న శ్లోకం లోని పాదాలను ముందుపెట్టి తెలియ జేస్తాడు .ఈ విధానం వలన సంబంధ విషయం చాలా స్పష్టమౌతుంది ..దీన్ని కవి చెప్పి ఉండడు ..దీన్ని తంత్ర యుక్తిలో ‘’వూహ్యం ‘’అన్నారు.అంటే మినహాయింపు లేక ఊహ అని అర్ధం .-’’ఊహం నామ యది నిషిద్ధం గ్రంధే ప్రజాయా  తర్క త్వేనోపదిశ్యతే-చరక సంహితా ‘’.ఈ టెక్నీక్ ను శాస్త్ర విషయం చర్చలో బాగా ఉపయోగించాడు ఇది మల్లినాథ వ్యాఖ్యానాలతో మహా ప్రాచుర్యం పొందింది .శ్లోకాలమధ్య ఉన్న సహజ సంబంధం ను వ్యాఖ్యాత చక్కగా తెలియ జేస్తాడు .ఇలా చెప్పటం లో వ్యాఖ్యాత యొక్క విశ్లేషణాత్మక ప్రతిభ వ్యక్తమౌతోంది .దీనితో గ్రంధం యొక్క ఏకత్వానికి ప్రత్యేక సన్నివేశానికి సరైన సంబంధం లభిస్తుంది .సంబంధం యెంత బలీయమైతే శ్లోకం అంత  అందమై రాణిస్తుంది ..

ముక్తక కవుల మాదిరిగా కాకుండా మహా కావ్య కవులు గ్రంధం లోని  విషయ  ఐక్యతకు మిక్కిలి ప్రాధాన్యమిస్తారు .వారి మనసులోని అభిప్రాయాలను మల్లినాథుని వంటి మహా వ్యాఖ్యాన కర్తలు గ్రహించి లోకానికి తెలియజేస్తారు .ఇది బాగా అర్ధమవటానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం –

 కిరాతార్జునీయం లో శత్రువులతో   వ్యవహరించాల్సిన ముఖ్య విధానం గురించి చర్చ ఉంది అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది .యుద్ధ రీతి  ప్రాముఖ్యత సాధికారత ఏమిటి ?మనువు కూడా శత్రువులతో యుద్ధాన్ని నివారించుకోవటం మంచిద న్నాడు .తర్వాత శ్లోకం లో  యుద్ధ రీతి లేక వీరత్వం గురించి కవి చెప్పాడు ..కనుక ఈ సందర్భం లో ఈ రెండు శ్లోకాలను కలిపి అర్ధం చెప్పాలి మొదటి దానిలో ప్రశ్న  రెండవదానిలో సమాధానం ఉందన్నమాట .ఈ సంబంధాన్ని  మల్లినాథుడు ప్రశ్నను ముందుపెట్టి  సమాధానం తర్వాత చెప్పాడు -’’నను సామ్నేవ సిద్దౌకిమ్ క్షత్రేణ యధా హ్  మనుహ్  – సామ్నదానేన భేదేన సమస్తై రథవా పృథక్ -విజేతుం ప్రయాతేతా రీన్న యుద్ధేన కదాచన ఇతి ‘’.వీరపురుషుడు ఎవరిపైనా ఆధారపడరాదు అనిభావం -’’నహి తేజస్వినః పరాయట వృత్తిత్వం యుక్తం -మనువచనం త్వశూ రవిషయమితి భావః ‘’  .అదే సర్గ లో యుధిష్ఠిరుడు ఒక ఆలోచనాత్మక విషయాన్ని ప్రతిపాదించాడు –  ఒక్కోసారి యుద్ధం లో వీరుడు విఫలుడైనా అతని పరాక్రమం కొని యాడ బడుతుంది .ఈ రెండిటిని మల్లినాథుడు చక్కగా అతికించాడు -’’ఏవం విమృశ్య కుర్వతో దేవాదన ర్యాగ మోపి న కశ్చిద పరాధ ఇత్యాహ ‘’మల్లినాథుడు వివరిస్తూ -’’దేవి కేషు పురుస్యాను పాల భ్యత్వా దితి భావః -యయాహ కామాంధకః -యంతు సమ్య గూపక్రాంతం కార్య మేతి విపర్యయం -పురుషత్వ నుపాలమ్యో దేవతరిత పౌరుషహ -ఇతి ‘’

 శిశుపాల వధలో రాజ విధానాల చర్చ ఉంది .నిర్లక్యం లేక ప్రమాదం రాజు కు క్షమించరాని విషయం  .మరి జాగ్రత్త ఉన్న రాజు లక్షణాలు ఏమిటి ?దీన్ని సమాధానంగా రెండవ శ్లోకంతో లంకె పెట్టి చెప్పాడు . జాగ్రత్తగల రాజు అంటే తెలివి తేటలే ఆయుధంగా గలవాడు ,మంత్రివర్గం శరీరంగా  అత్యున్నత గోప్యనీయత శక్తివంతమైన కవచంగా కలవాడు అని చెప్పాడు -బుద్ధి సత్వహ్ శస్త్రహ్ ప్రకృత్యంగే ధన సంవృతి కంచుకః ;’’.

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా ;

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51

మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3

మల్లినాథునికున్న  సంస్కృత భాషా,సాహిత్య  పాండిత్యం అద్వితీయం,అనన్య సామాన్యం ,అనితర సాధ్యం .తన వ్యాఖ్యానాలను అనేక ఉల్లేఖనాల (కొటేషన్స్ )తో సుసంపన్నం చేశాడు .ఆయన వ్యాఖ్యానాలు అనేక సంస్కృత పుష్ప నవ సుగంధాలను స్రవిస్తాయి .దండి ,క్షీరస్వామి ,దక్ష ,జయమంగళాకార ,ధన్వంతరి ,నిరుక్తకార ,న్యాసాకార ,భట్టా మల్ల,భరత , భాష్యకార ,భోజ ,యాజ్ఞవల్క్య ,వాగ్భట ,వామన ,వార్తికార ,  సబర ,సాకటా యన ,శ్రీధర ,సుబోధి  నికార హేమ చంద్ర ,మొదలైన అఖండ ప్రజ్ఞా వంతుల ప్రసిద్ధ రచనలనుండి  ఉదాహరణలు  ఇచ్చి ,ప్రముఖ సంస్కృత సాహిత్య సరస్వతీ స్వ  రూపులైన కేశవ ,కయ్యాట ,దండి ,వాగ్భట ,భట్ట మల్ల ,భరత,యాజ్ఞ్యవల్క్య ,వల్లభ ,సంబర ,హేమ చంద్రుల సారస్వతం నుండి అవసరమైన చోట్ల ఉల్లేఖనాలు జోడించి తన వ్యాఖ్యానాలు నిండుదనం పరిపుష్టి సాధికారత కలిపించాడు సూరి .

 మల్లినాథుని ప్రవాహ శైలి ఆయన విశ్లేషణలో కూడా దర్శనమిస్తుంది .పదాలు   ,వాటి దిగుమతి ,చాలా చోట్ల పునరావృత్తమౌతాయి .ఆయన చేసే పునరావృత్తికి ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి సరదాగా చేయడు ..వాటికి పరస్పరాశ్రయాలు (కారిలేటివ్స్ )లేక సమానార్ధకాలు ఉంటాయి .కనుక ఇవి భావాన్ని వ్యాప్తి చెందించటానికి బాగా ఉపయోగపడతాయి .ఒక భావం లేక వ్యక్తీకరణపై వెలుగు ప్రసరింపజేస్తాయి .సమానార్ధక పదాల ను పునరుక్తి మాత్రమే చేశాడు ..

 బ్రూక్స్ అండ్ వారెన్ లు ఈ సమానార్ధకాలను బాగా ‘’ఫండమెంటల్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ ‘’లో సమర్ధించారు.ఛందస్సులో వ్యాకరణ నిర్మాణ సర్దుబాటు అతి సరళ పదవిన్యాసం లో సమాంతర పదాలు అర్ధాలకంటే మరింత బలీయమై నిర్మాణానికి ఖచ్చిత అ వసరాలౌతాయి -.ఇవి కవితలలో అవసరం అయినా వ్యాఖ్యా సాహిత్యం లో కూడా అవి చోటు పొంది రాణించాయి . మరింత శక్తి వంతంగా భావాన్ని ఇవి తెలియ జేస్తాయి ..మల్లినాథుని వ్యాఖ్యానాలతో సమా0 తర పదాలులేక మార్పులు  మూలానికే గొప్ప వన్నె తెచ్చాయి  .మోర్గాన్ ‘’రైటింగ్ అండ్ రివైసింగ్ ‘’గ్రంధం లో ‘’modifiers are words that limit the meaning of other words ..A djectives modify nouns or pronouns ‘’అన్నాడు .మల్లినాథుడు  ఈ మార్పులు చేశాక తనమార్పులకు నిఘంటుకారులనుండి ఉల్లేఖనాలు ఇచ్చి సమర్ధించుకొన్నాడు .ఆయన వ్యాఖ్యానాలతో ఇవి గొప్ప నిధులు  .కొన్ని ఉదాహరణలు -శిశుపాల వద్ద లో -తస్య రావణస్య నర్మ సచివ్య0 -క్రీడా సంబంధ కారిత్వే సచేస్ట త్వం-లీలా క్రీడా చ నర్మ చ ఇత్యమరః ‘’

‘’తంత్ర వాపౌ స్వపర రాష్ట్ర చింతనం -అన్యత్ర తంత్రవాపం శాస్త్రోపధ ప్రయోగం చ వా యస్తేన తంత్ర వాపా దివా -తంత్రం స్వరాష్ట్ర చింతయామావాపః పర చింతనే -శాస్త్రో పధామ్ త ముఖ్యేషు మంత్రం ఇతి వైజయంతీ ‘’

 తంత్రం అంటే తన దేశం లేక ఇతర దేశాల వ్యవహారాలపై ఆలోచన చేయటం .శా స్త్రాలను లేక మందును ప్రయోగించటం  అనే అర్ధమూ ఉంది .విశ్వ జనీన ‘’మాటను సమర్ధించటానికి మల్లినాథుడు పాణిని సూత్రాలను ఉదహరించారు ఆధిక్యతా పదాన్నీ చక్కగా వివరించాడు .మహాకావ్య నిర్మాతలలో కాళిదాసమహాకవి కవిత్వమే సరళ సుందరం ..భారవి మాఘులు అందుబాటులో లేనికఠిన  పదప్రయోగ కర్తలు . .మల్లినాథుడు వీటి విషయం లోనూ ఏమీ తక్కువ చేయలేదు వాటి సరైన అర్ధాలను వెతికి మరీ తెలియ జెసి న్యాయం చేశాడు  .దీనికి మల్లినాథుని విపుల నిఘంటు పరిచయం తోడ్పడింది .వీటికి సమానార్థకపదాలు సులభంగా భావాన్ని తెలియ జేయగలవు .వీటి వ్యాకరణ నిర్మాణాన్ని పాణిని సూత్రాల నాధారంగా సూరి సాధించి తెలియ జేశాడు .-

చామరం ను వివరిస్తూ -జవాత్ ప్రకీర్ణో రిమిత ప్రకీర్ణకైహ్ -ప్రకీర్ణకి త్సామరైహ్ ‘’(శిశుపాల వద్ద )

కూబర పదానికి అమరం నుంచి ఉదాహరణ ఇచ్చాడు -’’పాదైహ్  పురః  కూబరీణాం విదారితాః -కూబరీణాం స్థనం కూబరుస్తు యుగంధర ఇత్యమరః   .

‘’గోమతల్లి కా’’అనే విచిత్ర పదానికి -’’ప్రశస్త గామ్ గోమాతల్లికామ్  .ప్రశస్తమైన ఆవును గోమతల్లి అంటారు .-’’భద్రా గోగోర్మతల్లికా  -ఇత్యమరః    అని చెప్పాడు .

బల్లికి’’ క్షుద్ర ‘’అంటారు దీన్ని సమర్ధిస్తూ సూరి -’’క్షుద్రాభి రక్షుద్ర తరాభి రాకులం అనే శిశుపాల వధలోని దానికి -క్షుద్రా వ్యం డగా నటీ వేశ్యా ,సరఘ ,కంటకారికా ,-ఇత్యమరః

కిరాతార్జునీయం లోని ‘ అర్ధం సాధిస్తూ -’’వసవన్నవాధి శివేపి దేశే ‘’-’’న తితిక్షా సమమస్తి సాధనం -తితిక్షా సమం క్షమా తుల్యం  నాస్తి -క్షాన్ తిః  క్షమా తితిక్షాచ ‘’ఇత్యమరః

పాణిని సూత్రాలతో -’’తి జ్ నిశానే ఇతి ధా తొహ్ గుప్తి జిక దభ్యహ్ సన్ ఇతి క్షమార్ధే సన్  ప్రత్యయహ్ ‘’

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )

 ఈ హోదాలు సగం చట్ట సంబంధ0గా సగం రహస్యంగా ఉండేవి .ఇవి సాంఘిక ఆర్ధిక అభి వృద్ధి పరిణామ సూచికలుగా   ఉంటూనే  గిల్డ్ ఆర్గనైజేషన్ ల లాగా ,స్వీయ నియంత్రణ సంప్రదాయం ఉన్నవిగా , కళాకారుడికి వ్యక్తి గతంగా తోడ్పడుతున్నట్లుగా ఉంటూనే కాపిటలిస్ట్ సంస్థల మూస నమూనాలుగా ఉండేవి . షేక్స్ పియర్ కంపెనీ ఒక జాయింట్ స్టాక్ కంపెనీ .ఇందులో వ్యక్తులు డబ్బు పెట్టుబడి పెడతారు ..షేక్స్పియర్ తెలివి తేటల్ని కాపిటల్ గా కూడా  వాడుకొనేవాళ్ళు .కళాకారుల్ని నియమించుకొని ,తమ పెట్టు బడులపై లాభాలను సంపాదించుకొనే వారు  .ఈ అభి వృద్ధి మార్పు వలన నటులు, ధియేటర్ కంపెనీలు సంప్రదాయ గిల్డ్ నిర్మాణ  చట్రానికి వెలుపల ఉండి ,కొంత వరకు రాజరిక ఫ్యూడల్ వ్యవస్థ లో  ,వారి కుటుంబ పరివార సంస్థలుగా యజమాని -సేవక పద్ధతిగా ఉండేవి .ఈ విపరీతమైన వింత ఆర్ధిక సాంఘిక స్వతంత్రత వలన ధియేటర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ,క్రమ పధ్ధతి లేకుండా , వికృత ప్రవర్తనలతో భయంకరంగా ,ప్రమాద భరితంగా తయారై చివరికి అనేక సాధికారిక సంస్థలేర్పడి లండన్ మెట్రో పాలిటన్ ,,మతపరమైన (ఎక్లస్టికల్ ) వ్యవస్థలు ,ఒక్కోసారి రాజాస్థానాలు  కూడా వాటిని నియంత్రించలేక  రద్దు చేయలేక చేతు  లెత్తేయాల్సి వచ్చేది .

 న్యూ సెన్స్ కు కారణమైనందువలన  ధియేటర్ లలో రౌడీ మూకలు  చెలరేగటం వాటి మధ్య పోరాటాలు ,విపరీతమైన ధ్వని కాలుష్యం ,అల్లరి ఆగడాలు జరగటం వలన  ,వీటిని మూసేయాలని ప్రభుత్వాధికారులు భావించేవారు ..కానీ వీటికి రాజుగారి బామ్మర్ది లాంటి వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉండటం ,రాజకీయంగా ఎదురుదాడికి దిగటం ,సాంఘికంగా తిరుగుబాటుతనం తో ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది ..ఇంగ్లా0డ్  లో అంతర్యుద్ధ కాలం వరకు ధియేటర్ వ్యతిరేక శక్తులు వాటిని మూసేయించటానికి అశక్తులై నారు దీనికి కారణాలు – పర్య వీక్షణకు తగిన సిబ్బంది లేకపోవటం ,పోలీస్ బలగం  తగినంత లేకపోవటం టెన్షన్లు ,ఏజెన్సీల మధ్య విపరీతమైన పగా ,ప్రతీకారాలు ,చెక్ చేయటానికి  దారిలో గాడిలో పెట్టటానికి తగిన మార్గ దర్శకాలు ,లేకపోవటం .మరొక ముఖ్యకారణం ధియేటర్ ల తిరుగు లేని పాప్యులారిటీ ..ఏ కార్యక్రమాన్ని నియంత్రించాల్సి వచ్చినా అవి రోమన్ చక్రవర్తుlలు సర్కస్ లను పరిమితం చేసి ప్రయత్నాలు చేయటం ,ట్యూడర్ స్టువర్ట్ ప్రేక్షకులు   పెద్ద సంఖ్యలో లేకపోవటం ,సాంఘికంగా భిన్నాలక్షణాలుండటం స్త్రీలకూ కూడా అవకాశాలు వచ్చాయి .పబ్లిక్ వినోద ప్రాబల్యాన్ని ఈ కాలం లో తక్కువగా అంచనా వేశారు .కానీ నిజానికి  జాతరలు ఉత్సవాలు సెలవులు ,ఆటలు  ,క్రీడలు ఆధునిక కవాతు ప్రదర్శనలు ,అసహజ (ఫ్రీక్ )ప్రదర్శనలు ,వీధి ప్రదర్శనలు ,అన్నీ విపరీతమై పోయాయి కాని ,ధియేటర్ మాత్రం తరచుగా విస్తృతమైన వినోదంగా అన్ని తరగతులవారికి ఆలంబనం, అందుబాటు  అయింది .ఈ విషయం లో అది పరిమాణం లో అది కల్పించిన భయం  కోపాలకు సహాయ కారి అయింది .

  1562-16 42 కాలపు ఇంగ్లా0డ్  ధియేటర్ ను’’ ఎర్లీ మోడరన్ ఇంగ్లిష్ ధియేటర్’’లేక’’ ఎలిజబెథెన్ ధియేటర్ ‘’ లేక ‘’ఇంగ్లీష్రినైసెన్స్ ధియేటర్ ‘’ అన్నారు .వీటిలోని షేక్స్పియర్ క్రిస్టఫర్ మార్లో ,బెంజాన్సన్ నాటకాలు ఆడారు.బ్లాంక్ వర్స్  లో ఉన్న’’గోర్బో డక్ ‘’అనే ఇంగ్లీష్  నాటకాన్ని మొదట ప్రదర్శించారు .ఇంగ్లా0డ్ కు వెలుపలే ధియేటర్ జీవితం గడిచింది .కారణం సిటీలో ధియేటర్ ను నిషేధించారుకనుక .ఇంగ్లిష్ నాటకకంపెనీలు జర్మనీ ,డెన్మార్క్ లలో పర్యటించి అక్కడ కూడా నాటకాలు ఆడేవారు .మొదటి పర్మనెంట్ ధియేటర్ రెండుచోట్ల ఉండేవి  .సత్రాలలో ఉన్న ప్రదేశాలలో ,,రాజాస్థానాలని ఇన్స్ లో అంటే ఇన్నర్ టెంపుల్స్  లో  .

 రెడ్ లయన్ అనే మొదటి పెర్మనెంట్ ధియేటర్ 1567 లో ఏర్పడి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది . 1576 లో ‘’ది  ధియేటర్ ‘’అనే శాశ్వత ధియేటర్ ఏర్పడి లాభాలు బాగా గుంజింది  .తర్వాత వచ్చిన థియేటర్లు బాగా ప్రాచుర్యం పొంది థామస్ మిడిల్టన్ రాసిన ‘’ఏ గేమ్ ఆఫ్ చెస్ ;;నాటకం తొమ్మిది ప్రదర్శనలతర్వాత అందులో ఆ కాలపు రాజకీయం ఉందని నిషేధించారు . 1592 లో  రోజ్ ధియేటర్ లో’’ లార్డ్ స్ట్రేంజర్స్ మెన్ ‘’నాటకం ఫిబ్రవరి 19 నుంచి జూన్ 23 వరకు వారానికి 6 ప్రదర్శనలతో విజయ వంతంగా ఆడారు .ఇక్కడే 23 విభిన్ననాటకాలు ప్రదర్శించారు .స్పానిష్ ట్రాజెడీ ‘’హీరోనీమా-1 ‘’నాటకం 15 సార్లు ఆడారు .ఏ నాటకాన్నీ రెండు రోజులు మించి ఆడేవారుకాదు .ఎడ్వార్డ్ అలీన్  అనే ముఖ్య నటుడికి విశ్రాంతి ఉండేదికాదు .అందరూ మగాళ్లే .ఆడేవారు .ఆడవేషాలను ఆడాలసెంట్ బాయ్స్ ఆడ దుస్తులతో నటించేవారు .నాటక రచయితలూ ఆక్స్ ఫర్డ్ లోనో ,కేం బ్రిడ్జ్ లోనో చదివిన విద్యావంతులు షేక్స్పియర్ బెన్ జాన్సన్ లు దేనికి విరుద్ధంగా స్వీయ ప్రతిభతో నాటకాలు రాసి పండించారు .ఈకాలం లో రాయబడిన నాటకాలు చాలా కాలగర్భం లో కలిసిపోగా కేవలం 600 మాత్రమే మిగిలాయి

 నాటకరచయితలకు రాసేకాలం లో ఇంక్రిమెంట్ లు ఇచ్చేవారు .ప్రదర్శన రోజున వచ్చిన డబ్బులో కొంత ముట్ట చెప్పేవారు వారికి ఓనర్షిప్ హక్కు లేదు ,షేక్స్పియర్ బెంజాన్సన్ లు కూడా  నటించేవారు.దుస్తులు ప్రదర్శన మార్పులు చేర్పులకు ప్రచురణ ల విషయం లో  నాటక కర్తకు బాధ్యత హక్కు లేమీ  ఇచ్చేవారు కాదు . 1600 లో హెన్స్లీడేవి  అనే నటుడికి రోజుకు 7 డాలర్లు ఇచ్చేవారు . 1630 లో రిచర్డ్ బ్లూమ్ కు ఏడాదికి 3 నాటకాలు రాసే ఒప్పందం సాలిస్బరీ కోర్ట్ ధియేటర్ తో కుదిరిందికాని దాన్ని నెరవేర్చలేక పోయాడు .షేక్స్ పియర్ ఒక్కడే జాక్ పాట్ కొట్టాడు 20  ఏళ్ళు 40  ఏకాంకికలు రాసి డబ్బు బాగా సంపాదించాడు .ఆయన నటుడుగా ,షేర్ హోల్డర్ గా ఫైన్సార్ గా కూడా రాణించాడు.. బెంజాన్సన్ఆ నాటి  సాంఘిక రాజకీయవిషయాలపై  నాటకాలు రాసి సొమ్ము చేసుకున్నాడు .జార్జి పీలే ,రాబర్ట్ గ్రీన్ లు ఫైనాషియల్ సక్సెస్ సాధిస్తే ,ఫిలిప్ మాసింజెర్ డబ్బురాక పేదరికం లో కుంగి పోయాడు .

 ఇలా మూడు నాటకాలు ఆరు ప్రదర్శనలతో వర్ధిల్లిన రినైజెన్స్ ధియేటర్ ప్యూరిటన్ ఉద్యమం 1642లోని ,మొదటి సివిల్ వార్  సమయం లో పార్లమెంట్ లో అధికారం లో ఉన్న ప్యూరిటన్ పార్లమెంటేరియన్ పార్టీ  దేశం లో జరుగుతున్న వీధిపోరాటాలు అల్లర్లు ఆగడాలు ఊరేగింపులు విసిగిపోయి ధియేటర్ లను నిషేధించింది .దీనితో రినైసెన్స్ నాటక థియేటర్లు మూతబడి ఆశకానికి సమాప్తి పలికాయి .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50

మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -2

  న్యాయ నిర్ణయం లో మల్లినాథుని ప్రతిభ అద్వితీయం  .జడ్జిమెంట్ చాలా క్లుప్తంగా ,అర్ధవంతమైన వాక్యాలలో ఉంటుంది ..ఈ విధాననైపుణ్యం  అన్ని గ్రంధాల వ్యాఖలలోనూ అలాగే ఉండేట్లు జాగ్రత్తపడ్డాడు సూరి .సూరి నిర్ణయం రూప లావణ్య శోభితం (గ్రేస్ ).సాధారణ సంస్కృత వ్యాఖ్యాతల శిల్పం ఇదే .వ్యాఖ్యానాలతో టీకా ,భాష్యం లేక వార్తిక0 లు కూడా తాత్విక గ్రంధాల విషయం లోనూ అలాగే ఉంటుంది .భాష్యాలలో చాలా విస్తృత విశ్లేషణ భాష్యకారులు లేక ఆచార్యులు సూత్రాన్ని స్ప్రింగ్ బోర్డు లాగా తీసుకొని లోతైన ఊహా గానాలతో  విహరిస్తారు..కావ్య ,నాటక ,స్తోత్ర మొదలైన వాటి విషయం లో వాళ్ళు ముఖ్యంగా వాటి నిర్మాణం ,ఉపయోగించిన పదజాలం పై ద్రుష్టి పెడతారు .మల్లినాథుని వంటి వ్యాఖ్యాతలు నిర్మాణ విశ్లేషణపై ద్రుష్టి ఎక్కువగా సారించారు .ఈ నిర్మాణం నిఘంటు ,వ్యాకరణ  గ్రంధాలు ,శబ్ద వ్యుత్పత్తి శాస్త్రాల ఆధారంగా ఉన్నాయో లేదో చూస్తారు .ఇదంతా బాహ్య లేక క్రమబద్ధ విధానం  (ఫార్మల్ )

 గ్రంధం యొక్క ప్రాముఖ్యం లేక అందులోని ముఖ్య లక్షణాలను కూడా  పాఠకుల అవగాహనకోసం  తెలియ జేయాలి .దీనికోసం మూల్యా0కణం  లేక విశ్లేషణ అవసరం .దీని వలన విషయం పై పాఠకునికి ఒక కీలక అభిప్రాయానికి  రావటానికి వీలౌతుంది .ఇదే విశ్లేషణాత్మక వ్యాఖ్యానం ..వ్యాఖ్యాతలు ముందుగా శ్లోకానికి ప్రోజ్ ఆర్డర్ రాసి ,ఒకటి రెండు వాక్యాలలో విశ్లేషిస్తారు .ఇది అభినందించడానికి సాధనమవుతుంది ..ఇప్పుడు చెప్పినదానికి మల్లినాథుని వ్యాఖ్యలను చూస్తే అర్ధమవుతుంది .

 కుమార సంభవ0  లో కాళిదాస మహాకవి శివుని దృష్టి పార్వతిపై పడింది అని చెప్పే -’’త్రిభిరపి లోచనైహ్ సాభి లాషామద్రాక్షీ దిత్యర్ధహ్ ‘’-ఏ తేవ భగవానో రతి భావోదయా ఉక్తహ్ ;;..లో కిందిపెదవి బింబ అంటే దొండ పండులా ఉంది అన్నాడు ..ద్రుష్టి పడటం అనేది ప్రతీకాత్మక వర్ణన (సింబాలిక్ డిస్క్రిప్షన్ ). అందులోనే శివుడు బ్రహ్మ చారి వేషం లో పార్వతిని తన శరీరాన్ని ఒక సారి చూసుకోమని చెబుతూ శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అంటాడు .దీన్ని మల్లినాథుడు చాలా ఉదాత్తంగా సమర్ధించాడు -’’సతి దేహే ధర్మార్ధ కామ మోక్ష లక్షణాశ్చతు ర్వర్గః  సాధ్యంతే -అత  ఏవ  సతతమాత్మా నమేవ గోపాయీత ఇతి శ్రుతేహ్ -అయిథా  బలమారంభో నిదానం క్షయ సమ్మాద0 -ఇతి భావః అని వివరించాడు సూరి ..దిలీప మహారాజును వర్ణిస్తూకాళిదాసకవి  అర్ధ కామాలు   దిలీపునికి ధర్మం వంటివే అన్నాడు -’’అప్యర్ధ కామో తస్యాస్తమ్ ధర్మ ఏవ మనీషీణాం ‘’ భౌతిక సుఖాలఅనుభవం కూడా దిలీపునికి ధర్మకార్యమే అని పించిందని భావం .న0దార్గికర్ అనే వ్యాఖ్యాత పండితుని వాక్యాలను యధా తధంగా ఉదహరించారు .-దిలీపుని దృష్టిలోధర్మార్ధ కామాలలో    రెండిటిని పొందటం మానవ ధర్మం .తాను  ప్రభువును కనుక  వివాహితుడుకనుక ,మూడవదైన ధర్మాన్ని పొందటానికి మొదటి రెండు కారణ భూతాలౌతాయని మంచిపరిపాలన ,సక్రమ న్యాయ నిర్వహణ వలన ఆ ఫలితం పొందుతానని అర్ధం .ఇక్కడ మల్లినాథుని వ్యాఖ్య స్వీయ వ్యాఖ్యానమే .దిలీపుని ఉత్కృష్ట సమర్ధత ను 1-ఐశ్వర్యం -పరి పాలన -ప్రజాక్షేమ0 ,-ధర్మం

2-సౌఖ్యం -వివాహం -సంతానం -ధర్మం గా విశ్లేషించవచ్చు . ఈ మూడింటిలో  ధర్మమే  ఉత్రకృష్టమైనది .మిగిలినవి దానికి ఉపకరణాలు లేక సాధనాలు .-’’’అర్ధ కామ సాధన ర్యో దండవివాహ యో ర్లోక స్థాపన ప్రజోత్పాదన  రూప-ధర్మార్ధత్వేనా నుష్ట నాదర్ద కామావపి ధర్మ శ్రేష్ఠ తా మపాదయాన్ స రాజా -ధర్మోత్తరో భూదిత్యర్ధహ్ ‘’.

 కాళిదాసు పార్వతి తపస్సు ను 5 వ సర్గలో వర్ణిస్తూ ,తొలకరి చినుకులు పార్వతి పై పడి వరుసగా ఎలా కిందికి జారాయాయో తెలియ జేసే శ్లోకం  లో మొదటి నీటి బిందువులు ఆమె కను బొమ్మల వెంట్రుకల పైనా  తర్వాత కిందిపెదవిపైన ,పిమ్మట పయోధరాలపైనా ,చివరికి నాభిపైనా జారిపడినట్లు చెప్పాడు .దీనిని వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు ప్రతి సందర్భ వర్ణనలో సాధికారతను వివరించి చెప్పాడు .శ్లోకం -’’ప్రదమే ఉద బిన్దవః —’’ప్రధమ అనే పదం అరుదుకు చిహ్నం తరువాతి పదం లోని బహువచనం మరీ అసాధారణమైనది .క్షణం పక్షమసు స్థితాః ‘’లో ఆమె కనుబొమలవెంట్రుకలు  ఎంత దట్టంగా ఉన్నాయో చెబుతుంది .అవి వాటికి అంటుకు పోవటాన్ని సూచిస్తుంది ..తాడితా ధరా –   ఆమె కింది పెదవి మెత్తదనాన్ని సూచించి నీటి బిందువులు చీలి స్థనాలపై పడటం అంటే వారి బలిష్ఠతకు గుర్తు .తర్వాత అవి తొట్రుపడి శరీరం పై  చేరాయి అనటం లో వళుల అసమాన స్థితికి సంకేతం .నాభిం ప్రపేదిరే -లో అక్కడ నీటి బిందువులు బలంగా అడ్డకోబడ్డాయని ,చివరికి నాభి కి చేరి మరింక కిందికి జారలేదని చెప్పటం తో ఆమె నాభి ఎంతో లోతైనది అంతరార్ధం ..

 కొన్ని చోట్ల మల్లినాథుని వ్యాఖ్యానం ఇతరుల వ్యాఖ్యానం కంటే చాలా స్పష్టంగా సంతృప్తికరంగా కనిపిస్తుంది .రఘువంశం లో చంద్రుని వర్ణించే శ్లోకం -’’నిద్రా వశేన భవతాప్య నావేక్షమాణా -పర్యుస్త కత్వమబలం  నిశి ఖణ్డితేన -లక్ష్మీర్వినోద యతి యేన దిగంత  లంబీ -సోపి త్వదానన రుచిం విజహాతి చంద్రహ ‘’పై నన్దర్గికర్ వ్యాఖ్య  రాస్తూ లక్ష్మి అజుని భార్యగా వర్ణించ బడింది .అజుడు నిద్ర సుఖం లో ఉ0డి లక్ష్మిని అలక్ష్యం చేశాడు ,అందుకని ఆమె అతన్ని వదిలి వెళ్లాలనుకొంటే  చంద్ర బింబం లాంటి అతని ముఖ సౌందర్యం కదలనీయ లేదు .అప్పుడే వైతాళికులు అజుని మేల్కొలుపులతో నిద్ర లేపుతుంటే ఆమెకు ఆనంద సంతోషాలు కలిగాయి అని రాశాడని లాల్యే పండితుడు పేర్కొన్నాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమతి డొక్కా సీతమ్మ దంపతుల ఫోటో

Posted in మహానుభావులు | Tagged | 6 Comments

  అఘోరీ బాబా -2

అఘోరీ బాబా -2

రెండు గంటలు  అఘోరీ బాబా వద్ద ధ్యానం చేశాక స్వామిరామా ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు .బాబా అత్యున్నత మేధావి అని అర్ధమయింది .ఆయన సంస్కృత భాష సంక్షిప్తంగా కఠినంగా ఉండేది అందుకని ఆగి ఆగి వివరించేవాడు .మహాజ్ఞాని అని తెలిసింది .తాను  చూసిన సాధువులలో విచక్షణ సాధువని పించాడు ..అధర్వ వేదం లో అఘోర మార్గం ఉన్నది కానీ ఏ శాస్త్రం లోను మనిషి మాంసం తినమని లేదు .మీరు ఎందుకు ఇలాంటి జీవితం గడుపుతున్నారు ”అని రామా ప్రశ్నిస్తే ”అది మృత శరీరం అని ఎందుకు అనుకొంటున్నావు ?అది పనికి రాదని పార వేయబడిన పదార్ధం మాత్రమే .మీరు దాన్ని మనుషులకు ఆపాదిస్తున్నారు .ఎవరూ దాని జోలికి పోరుకానుక నేను ఉపయోగిస్తున్నాను .నేను ప్రయోగాలు చేసే శాస్త్ర వేత్తను ..పదార్ధం దాని శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకొనే ప్రయోగం చేస్తున్నాను ఒక రూపం లో ఉన్న పదార్ధాన్ని మరొక రూపం లోకి మారుస్తున్నాను ,నాకు ప్రకృతే మాత .ఆమె అనేక రూపాలు సృష్టిస్తుంది .నేను రూపాలను మార్చే ప్రయోగాలు చేస్తూ ఆమె బాటలోనే నడుస్తున్నాను .దీన్ని ఇందాక ఎందుకు చేశానంటే పండిట్ వెళ్లి ఊళ్ళో వాళ్ళని ఇక్కడికి రాకుండా హెచ్చరిస్తాడని మాత్రమే .ఈ గుహలో 21 ఏళ్ళనుంచి ఉంటున్నాను .ఇంతవరకు ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు.  నా రూపం చూసి ప్రజలు భయపడతారు .నేను మురికి పంది నని  మృత కళేబరాలను పీక్కు తింటానని అనుకొంటారు .నేనెవరికీ అపకారం చేయలేదు గులకరాళ్ళతో బెదిరించానే కానీ ఎవ్వర్నీ గాయ పరచలేదు” .అన్నాడు
బాబా బాహ్య రూపం భయంకరం అంతర  రూపం సౌందర్యమయం అని పించింది .తనదగ్గరికి వచ్చి ప్రశాంతతకు భంగం కలిగించకుండా అలా ప్రవర్తిస్తాడు .ఆయన స్వాస్థ్యము తప్పినవాడు కాదు .ఎవరిపైనా ఆధారపడకుండా జీవించే స్వతంత్రేచ్ఛ ఉన్నవాడు .ఆ రోజు రాత్రంతా బాబా అఘోర మార్గాన్ని స్వామి రామాకు వివరించి చెప్పాడు .పదార్ధాన్ని అనేక రూపాలలోకి మార్చే  సమర్ధుడు ఆయన .రాయిని పంచదార స్పటికం చేయగలడు .మర్నాటి ఉదయం ఇలాంటి అద్భుతాలెన్నో చేసి చూపించాడు .అక్కడ ఉన్న ఇసుకను తాకమన్నాడు తాకితే జీడిపప్పు బాదం పప్పుగా మారింది  .ఇందులో శాస్త్రీయ సిద్ధాంతాలున్నాయన్నది కాదనలేని సత్యం .
  మధ్యాహ్నం మళ్ళీ నిన్నటి పదార్ధం కాకుండా కుండ లో నుంచి మరొక తీపిపదార్ధం బయటికి తీసి తినిపించాడు .ఈ తంత్ర విద్య గురించి అడిగితె ”ఈ శాస్త్రం నశించిపోతొ0ది .పండితులు దీన్ని అభ్యాసం చేయటం లేదు . కొద్దికాలానికి ఇదికాలగతి లో కలిసి పోతుంది ”అని నిర్వేదం ప్రకటించాడు అఘోరీబాబా ..
   ”ఇలాంటి ప్రయోగాలవలన ఉపయోగం ఏమిటి  ?”అని అడిగితే ”ఉపయోగం అంటే ?అని ప్రశ్నించి ”ఇది సైన్స్ .ఈ  సైన్స్  తెలిసిన సైన్టిస్ట్ ఈ విజ్ఞానాన్ని రోగ నివారణకు ఉపయోగిస్తాడు .ఇతర సైన్టిస్ట్ లకు పదార్ధాన్ని శక్తిగా శక్తిని పదార్థంగా మార్చవచ్చునని తెలియ జేయాలి ..ఈ రెండిటికి ఉన్నది ఒకే సూత్రం .అన్ని పేర్లు రూపాలకు అంతర్గతం గా ఏకీకృత సిద్ధాంతం ఉన్నది ,దీన్ని ఆధునిక శాస్త్ర వేత్తలు ఇంకా కనిపెట్టలేక పోయారు ..ఈ అంతర్గత జీవిత సిద్ధాంతాన్ని ప్రాచీన సైన్స్ అయిన వేదాంతం స్పష్టంగా చెప్పింది .ఉన్నది ఒకే ఒక ప్రాణ శక్తి అన్ని నామాలు రూపాలు దాని విభిన్న శక్తులే .రెండుపదార్ధాలమధ్య సంబంధం తెలుసుకోవటం కష్టమేమీ కాదు కారణం వాటిలోమూల  ద్రవ్య రాసి ఒక్కటే కనుక ..నీరు గడ్డకట్టి మంచు అవటం వేడిచేస్తే ఆవిరి అవటం లాంటిదే ..చిన్నపిల్లలకు ఇవి వేర్వేరు పదార్ధాలనిపిస్తాయి .కానీ వాటిలోని కూర్పు -కంపొజిషన్ ఒకటే ..రూప భేదమే.ఇవాళ్టి సైన్టిస్ట్ లు అలాంటి పిల్లలే .వాళ్లకు పదార్ధం  వెనుక ఉన్న ఐక్యత అర్ధం కాదు .వాటిని ఒకదానిలోనుంచి మరొక దానిలోకి మార్చే సూత్రాలూ తెలియవు . ” స్వామి రామాకు తెలుసుకోదగిన పదార్ధమంతా తెలిసింది .ఆయన దగ్గర సెలవు తీసుకొని దగ్గర గ్రామానికి చేరి పండిట్ భయం పోగొట్టాలని అనుకోని ఆయన్ను కలిస్తే పండిట్ తానూ అఘోరీ బాబా మార్గదర్శనం నచ్చి, ఆయన శిష్యుడనవుతున్నానని చెప్పగా స్వామి రామా అవాక్కయ్యాడు .
  అఘోరీల కుల దేవత ”హింగ్లా జీ మాత ”వీరి ముఖ్యకేంద్రం వారణాసి లోని కీనా రామ్ ఆశ్రమం .దీనిపూర్తిపేరు బాబా కీనారం స్థలం .వీరి విశ్వాసం ప్రకారం బాబా  సిద్దార్ధ నాధ గౌతమ్  మళ్ళీ కీనారామ్ గా జన్మించాడని .వీరు సాధారణంగా  స్మశానం లో సంచరిస్తారు .శవాల చితాభస్మాన్ని ఒంటినిండా పూసుకొంటారు  చనిపోయిన మానవ శరీరం లోని ఎముకలను కాపాలాలనుసేకరిస్తారు .కపాల మాల ధరిస్తారు .వీరి సంఖ్య 70 అని గణాంక శాస్త్ర వేత్తలు లెక్కించి చెప్పారు
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా  

Inline image 1


Inline image 2Inline image 3
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2

ఈ నాటి నాటక ధియేటర్ చూసిన వారికి పాతకాలపు ఆరుబయలు నాటక శాల వింతగా అని పిస్తుంది .అప్పుడు శాలలో చాలాభాగం  శి ల్పీ కరించటమో రంగులు వేయబడి మార్బుల్ లాగా అనిపించేట్లు చేయటమో ,స్టేజి మీద నక్షత్రమండలం ,గ్రహమండలం ఉండటమో జరిగేది ..నాటకానికి సన్నివేశాలకు తగిన కాన్వాస్ పెయింటింగులు వేలాడ  దీయబడేవి  .ట్రాజెడీ నాటకాలకు నల్లరంగు చిత్రాలు ,ముడుతలతోరణాలు వేలాడ  దీసేవారు ..ఇవాళ్టి సీనరీ బదులు  ,ఖైదీలు నిలబడే బార్ లు ,ప్రేమికులు విహరించే అందమైన ప్రదేశాలు ,రథం ,ఉరి ,టేబుళ్లు ,చెట్లు  మంచాలు పరుపులు ,సింహాసనాలు  వ్రాత బల్లలు మొదలైనవి అవసరాన్ని బట్టి వాడేవారు ..నాటకసన్నివేశం  ఎక్కడ జరుగుందో తెలియ జేయటానికి సైన్ బోర్డు మీద ”ఎధేన్స్ ”మొదలైన పేర్లు ఉండేవి అంటే అక్కడ ఈ సన్నివేశం జరుగుతోందని ప్రేక్షకులు అర్ధం చేసుకొనేవారు … కాస్ట్యూమ్స్ చాలాఖరీదైనవి వాడేవారు .వీటికంటే ఖరీదైన యుద్ధసామగ్రి ఖడ్గాలు బల్లాలు  షీల్డ్ లు ,గౌన్లు ,పొడవైన వస్త్రాలు (రోబ్స్)కిరీటాలు ఉపయోగించేవారు .
  షేక్స్పియర్ కాలపు ప్రేక్షకులకు మాజిక్ బాగా నచ్చేది .ఇవాళ్టికీ అంతే ..కనుక నాటక శాలలో భ్రా0తిజనకాలు , అద్భుతాలనిపించేవి ఉండేవి .అటకపై వీల్ అండ్ ఆక్సిల్ అనే హెవెన్స్ ఉండేవి  .వీటిని నటులు కిందకి దించేవారు .దానిలోనుంచి దేవుళ్ళు దేవతలు స్టేజిమీదకు దిగి  నిజంగా ప్రత్యక్షమైన  భ్రా0తి కలిపించేవారు ..స్టేజి కింద ప్రక్క ద్వారాలను ”హెల్స్ ”అనేవారు  .నటులు విగ్గులు ,గడ్డాలు ,పేస్  పెయింట్ లతో సామాన్యమైన మేకప్ మాత్రమే వేసుకొనే వారు.   గాయం నుంచి రక్తం కారుతున్నట్లు చూపటానికి  పిగ్ బ్లాడర్స్ లో జంతువుల రక్తాన్ని నింపి  నిజరక్తం భ్రమ కలిగించేవారు . స్టేజి పై ఉరితీసే ఏర్పాటుకూడా నిజమే అన్న భ్రమ కల్గించేది .లోహపు షీట్లను వేగంగా కదిలించి ఉములు ,మెరుపుల ధ్వని,కాంతి కలిపించేవారు.తేలికగా అంటుకొనే  వాయువులను ట్యూబులలో నింపి మండించి కాంతి సృష్టించేవారు ..గాలిలో దెయ్యాలు భూతాలూ తిరుగుతున్న భ్రమను టపాకాయల పేలుళ్లతో కలిపించేవారు .తోకచుక్కలు ,షూటింగ్ స్టార్స్ అనేక మంది సూర్యుల్ని  చూపటానికి  ఫైర్ వర్క్స్ ను పెద్ద ఎత్తున వాడి ఎఫెక్ట్ కలిపించేవారు ..గుర్రాల డెక్కల చప్పుళ్ళు డ్రమ్ వాయిద్య ఘోష ,ఘాంటానాదం ,గడియారం ఫిరంగి ప్రేలుళ్ళు ,,తుపాకీ తూటాశబ్దాలతో అద్భుత సౌండ్ ఎఫెక్ట్ కలిపించేవారు .సంగీతానికి వయోలాలు ,కార్నేట్లు ,సన్నాయి ల రికార్డార్లు వాడేవారు . మన సురభి కంపెనీలూ ఇలాంటి గొప్ప ఎఫెక్ట్ లతో నాటకాలు రక్తి కట్టించిన సంగతి మనకు తెలుసు
   1570-1590 ,1599-1614 మధ్య స్వల్ప వ్యవధికాలాలలో ఆరుబయలు రంగస్థల నాటక శాలలకు ప్రయివేట్ లేక ఇండోర్ నాటక శాలల  మధ్య తీవ్రమైన పోటీ ఉండేది ..ఇండోర్ శాలలో బాలబాలికల చదువు పాటలపై  శిక్షణ జరిగేవి.వీరు రాజస్థానలో చర్చిలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు .వీటిలో రెండువిషయాలలో ఒకటి సిబ్బంది ,రెండు నాటక శాల విస్తీర్ణం లలో   ఆరుబయలు నాటక రంగశాలల కంటే భిన్నంగా ఉండేవి . బహిరంగ నాటక శాలలలో వయోజన యువకులు మొగ  వేషాలు ఆడ వేషాలూ వేసేవారు కానీ ప్రయివేట్ శాలల్లో చర్చి లో రాజదర్బార్ లో  పాడే 8 నుంచి 16 ఏళ్ళ బాలురు ఉండేవారు .వృత్తినాటక కంపెనీలు స్ట్రీలను తీసుకొనే వారు కాదు .ఈ నాటి ఆధునిక శాలలలో విస్తీర్ణం పాత బయలు నాటకరంగ శాలల విస్తీర్ణం కంటే నూ ,తర్వాతి ఇండోర్ నాటక శాలలకంటే ఎక్కువే ..అవి దీర్ఘ చతురంగా ఒక వైపు స్టేజి తో మిగిలిన ప్రదేశం లో ప్రేక్షక స్థానాలతో నిండి ఉండేది .పబ్లిక్ ధియేటర్లకంటే ఇక్కడ ప్రదర్శనలు తక్కువే జరిగేవి ,దాదాపు వారానికి ఒకే ప్రదర్శన .వీరి ప్రేక్షకులు 200 నుంచి 600 వరకు మాత్రమే ఉంటె” ఆరుబయట ”బాగోతానికి ”ప్రేక్షకులు 2500 మించి వచ్చేవారు ..పోషకులు పాట్రన్స్ తక్కువైతే ఆదాయం తక్కువ ..దీనికి తోడు ప్రయివేట్ ధియేటర్ల వాళ్ళు టికెట్ రేటు ఎక్కువ పెట్టేవారు .. వీళ్ళు ఆరు పెన్నీలు పెడితే బయటివాళ్ళు ఒక పెన్నీయే వసూలు చేసేవారు .
  గాలి, వాన ప్రభావం ఉండదుకనుక ఇండోర్ వాళ్ళు మధ్యాహ్నం దాటాక ప్రదర్శన పెట్టేవారు .కృత్రిమ కాంతి  సీన్లలో కాండిల్స్ లేక కాండీలాబ్రా లు ఉపయోగించేవారు ..కాండిల్స్ కరిగిపోతే కొడి రాల్చి మళ్ళీ వెలిగించటానికికి సమయం పడుతుందికనుక నాటకం మధ్యలో విరామాలు ఎక్కువగా ఉండేవి ..ఇలాంటి విశ్రాంతి లేక బ్రేక్ లు నాటక అభిమానులకు బాగా నచ్చేవి పాకెట్ బుక్స్ తీసుకొని చదువుకొని కాలక్షేపం చేసేవారు .ఈ బ్రేక్ సమయాలలో లిక్కర్ ,ఆరంజ్ జ్యుస్ అమ్మి సొమ్ము చేసుకొనేవారు .ఎంజాయ్ చేస్తూ వీళ్లూ పుచ్చుకొనేవారు .అదే తర్వాత కూడా ఇంటర్మిషన్  కు దారి చూపింది .పుర్వాధునిక ప్రయివేట్ ధియేటర్ లలో బ్రేక్ సమయం లో సంగీత కచేరి నిర్వహించేవారు .స్టువర్ట్ ధియేటర్ లో ”జార్గాన్   ”  లేక అర్ధం పర్ధం లేని వాగుడు కార్యక్రమం ఉండేది దీన్ని” యాక్ట్స్ ”అనేవారు .
   17 వ శతాబ్ది మొదటి దశాబ్దం అంతం లో ఇండోర్ ,ఔ ట్ డోర్ ధియేటర్ల మధ్య విచక్షణ లేక వ్యత్యాసం లేకుండా పోయింది .అనేక సాంస్కృతిక ఆర్ధిక రాజకీయ కారణాలవలన వ్యక్తిగత కంపెనీలు ఇండోర్ అవుట్ డోర్ ధియేటర్ల పై పూర్తి ఆధిపత్యాన్ని పొంది ,వయోజనులు బాలురను ప్రయివేట్ వాళ్ళనుంచి తీసుకొన్నారు .బాయ్స్ కంపెనీల ,  వారి అత్యంత సృజనాత్మక ధియేటర్ ల (బెన్ జాన్సన్ ,జార్జి చాప్మన్ జాన్ మారుస్టా న్  వంటి నాటకకర్తలు )చావు జరిగినా వాటి ప్రభావం తర్వాత వచ్చిన వాటిపై విపరీతంగా పడింది  ..బ్రేక్ సమయాలలోరాజకీయ ,సాంఘిక సెటైర్ లు వచ్చాయి . ట్రాజెడీలలో కూడా నటుల ప్రభావాలు ,వారు ప్లే స్పెస్ లలో హాయిగా తిరగటాలతో కొత్త జవ జీవాలుపొందాయి .
  ఇప్పుడు మనం చెప్పుకొంటున్న షేక్స్పియర్ కాలపు ధియేటర్ ప్రపంచ ముచ్చట్లు సాంఘిక రాజకీయ పరిణామం  నాటక రంగస్థల మార్పులను గురించి చెప్పక పొతే అసంపూర్ణం అవుతుంది .వారసత్వ ,ఉన్నత గౌరవ స్థితి మనోభావాలున్న ఆనాటి సమాజం లో వృతినటులకు ,వారి సాహసాలకు గౌరవం లభించేదికాదు ..చట్టం నుంచి కాపాడుకోవటానికి పోషణకు వీలులేక వాళ్ళు నోబుల్ మెన్ ల సేవకుల్లాగా ఉండాల్సి వచ్చేది . కనుక 1590 లో  లార్డ్ చెంబర్లేన్ మెన్ కు షేక్స్ పియర్ రాసిన నాటకాలు ముందుగా రిహార్సల్స్ గా రాజ దర్బారులో ఉన్నతాధికారుల సమక్షం లో ప్రదర్శించి తర్వాత మాత్రమే పబ్లిక్ గా డబ్బుకోసం వేయాల్సి వచ్చేది . 1959 నుంచి

ప్రీవీ కౌన్సిల్  ధియేటర్ కంపెనీలకు లైసెన్స్ మంజూరు చేసి ,1603 తర్వాత మొదటి జేమ్స్ రాజు పట్టాభి షేకం  తోకంపెనీలకు రాజ్యాంగ భద్రత  ఎలిజబెత్ మహారాణి కాలం లో క్వీన్స్ మెన్ కు కలిగినట్లు కలిగి ఊపిరి పీల్చుకున్నాయి ..ఛాంబర్లేన్ మెన్ ఇక కింగ్స్ మెన్ అయ్యారు .మిగిలిన కంపెనీలకు మిగిలిన రాయల్ ఫామిలీ మెంబర్లు పేట్రన్లు అయ్యారు .

     సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –  1-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49

మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -1

మల్లినాథ సూరిని మహా వ్యాఖ్యాన చక్రవర్తి అని  ,అద్భుత టీకాకారుడని భావిస్తారు .సంస్కృత  సృజన గ్రంధాల వివరణను టీకా అంటారు .ఇది ‘’టిక్ ‘’ధాతు జన్యం .-’’టీకా వా ఆత్మ  సోట్ టీకతే ఆటీ  కిష్ట -టీకా స్త్రీ -టీక్యతే గ్రంధార్ధనాయ ‘’—విషమ పద వ్యాఖ్య రూపే గ్రంథ భేదే -వాచస్పత్య కోశా .హేమ చంద్రుడు ఈ ధాతువును గతికి చిహ్నంగా భావించాడు -’’టీకా గతో సమయత్యర్ధన్ టీకా సుగమానాం విషమాణాం చ నిరంతరం వ్యాఖ్యా యస్మామ్ సా తదా -అభిధాన చింతామణి ‘’టీకా పదానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి .-’’నిరుక్తం ,భాష్యం ,వ్యాఖ్యా ,వార్తికం ,అవచూర్ణం ,వివరణం ,టిప్పణి ,ఫవికకా .  డా పిఎన్ .ద్వివేది –కాళిదాస కీ కృతియొమ్ పర మల్లినాథ కీ టీకాయోమ్ కా విమర్శ ‘’ద్వివేది ఈ పాదాలన్నిటికి  వివరణలు చెప్పాడు ’ .టీకా పదానికి మూలం బ్రాహ్మణాలలో ఉందని చెప్పి  టీకా ,భాష్యా లపై కొన్ని వ్యాఖ్యలను అందజేశాడు  . ఈ సందర్భం లో డా శ్రీమతి పెంధార్కర్ పేర్కొన్న టీకా లను పునరుత్పత్తి చేసి తెలిపాడు ఈ లిస్ట్ పెరిగింది ..వీటిలో ఒకదానితో ఒకటి కలిసేవి కూడా ఉన్నాయి ‘’శృంఖలా టీకా ,శాస్త్రీయ టీకా ,తులనాత్మక టీకా వ్యవస్థాపిక టీకా ,అనుగామినీ టీకా ,స్వతంత్ర టీకా ,వ్యాపక టీకా ,రసగ్రహణాత్మిక టీకా’’.

 మల్లినాథుని వ్యాఖ్యానాలు రెండవ ,మూడవ నాలుగవ ,ఏడవ ,ఎనిమిదవ విభాగాలకు చెందిన లక్షణాలు కలవి  . ఇందులో ఎనిమిదవది నిర్వచనానికి దగ్గరలో ఉన్నది  .మల్లినాథుడు టీకా ను యెంత తక్కువగా వీలయితే అంత  తక్కువగా చెప్పాడు .అనేక గ్రంథాలనుండి తన వ్యాఖ్యానాన్ని సమర్ధించే వాటిని ఉదాహరిసంచాడు .ఆయన  అతి విస్తృత  జ్ఞాన్నాన్ని సంగ్రహావలోకనం ఇదివరకే చేశా0 .ఇప్పుడు కొన్ని ముఖ్య సిద్ధాంతాలను గురించి మాత్రమే తెలుసుకొందాం ..సాధారణంగా ప్రతి వ్యాఖ్యాత పాఠాన్ని  సంక్షిప్తం  చేసి   దానికి న్యాయం చేకూర్చి ,అభినందించి ,అందులో కవి ప్రయోగించిన పదాలు పదబంధాలు మెచ్చుకొంటాడు ..మల్లినాథుడు పెద్దగా కొరుకుడు పడనీ  గ్రహణ సాధ్యం కాని  పంచ మహాకావ్యాలను వ్యాఖ్యానాలు రాయటానికి  ఎంచుకున్నాడు .సూటిగా స్పష్టార్ధాలను అనేక పద్ధతులలో  తెలిపాడు .ఆయనకున్న అపారజ్ఞానం క్రమపద్ధతిలో వాటిని వ్యాఖ్యానించటానికి బహువిధాలుగా తోడ్పడింది ..ఆ క్రమ విధాలేమిటో ,అందులో ని ప్రత్యేకతలేమిటో ,ఆయన ఖచ్చితత్వాన్ని ,నుడి సౌందర్యానికి అవి ఎలా దర్పణాలుగా భాసించాయో తెలుసుకొందాం . ’’పద చ్చే దః పదార్ధ శ్చ వాక్య యోజనా -ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం షడ్విధమ్ విదుః -సర్వ తంత్ర సిద్ధాంత లక్షణ సంగ్రహం ‘’

1-పదాలు సంయుక్తంగా కాక ఏకపదాలైతే మల్లినాథుడు మొదటగా దాని పర్యాయ పదాలు చెప్పి ,వాటికి ఆధారాలను ఉదహరించాడు .-తతో రఘురభాష్యాన్ సూర్య ఇవ శరైర్బాణై రాస్త్రేహ్ కిరణోరివ –కిరణో సమయు రవా 0శు గభస్తి  ధృణి దృశ్యయహ్ ఇత్యమరం ‘’

2- సంక్లిష్టపదాల విషయం లో ముందు ఆ పదాన్ని చెప్పి ,తర్వాత వివరణలేక పర్యాయ పదాలను  ఇచ్చాడు -’’ప్రతి ప క్ష జన్మాన్ ‘’ను ప్రతి పక్షా శ్శ్రస్త్రోహ్ జన్మ యస్యాం భూర్భి ర్యమభూమి రవిషయః నిర్భీక ఇత్యర్ధహ్ ‘’

3-సంక్లిష్ట పదాన్ని వ్యాకరణ పద్ధతిలో విడగొట్టి  దాని భాగాలను వేరు చేసి వాటి విభక్తి ప్రత్యయాలను ప్రత్యేకంగా  తెలిపాడు . అవ్యయీ భావ ,నిత్యసమాసాల విషయం లో మినహాయింపు ఇచ్చి వాటిని వేరుగా పరిష్కరించాడు .దీని వలన ఒక ప్రత్యేక సంక్లిష్టపదం  కవి ఎందుకు వేయాల్సి వచ్చిందో వివరించేవాడు .వెంటనే పర్యాయ పదాలు చెప్పేవాడు .నైషధం లో -భాఖండశ కరీరతాం సూర్య కులాంకురత్వం ఉజ్జ్వల వేణ్య కూరత్వం చ (దధత్ అతి తేజశ్వీ )ద్వౌ వంశో కూలమకర కర్తీ వంశా0కురే కరీ రాజ్వీ ఇతి చామరేహ్ .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-17- కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అఘోరీ బాబా -1

  అఘోరీ బాబా -1

బదరీనాధ్ కు దగ్గరలో ఉన్న శ్రీనగర్ కు దగ్గర గంగానది ఒడ్డున ఒక శక్తి దేవాలయం దానికి దగ్గర్లో అఘోరీ బాబా గుహ ఉన్నాయి .అఘోర విధానం తాంత్రికమైనది అర్ధం చేసుకోవటం చాలాకష్టం .కొద్దిమంది యోగులకు స్వాములకు ఆమార్గంబాగా తెలుసు.అది గూడార్ధమైన  ఖగోళ శాస్త్ర సంబంధ రహస్య శాస్త్రం .దీన్ని జబ్బులు నయం చేయటానికి వాళ్ళు ఉపయోగిస్తారు . జీవితంలోని అత్యున్నత స్థాయి శక్తులపై ఆధిపత్యం పొందటానికి చేసే సాధన .ఇది ప్రాణాయామ0  కంటే శ్రేష్ఠమైన మార్గం .ఈ జీవితానికి ,తర్వాత దానికి మధ్య అది ఒక వంతెన లాటిది .అఘోరి శాస్త్రాన్ని చాలా కొద్దిమంది యోగులు మాత్రమే సాధన చేయగలరు .కానీ వారి విధానాలు విని తెలుసుకొని చూసి సామాన్యులు భయానికి గురౌతారు

  శ్రీనగర్ చుట్టు ప్రక్కగ్రామాల ప్రజలు అక్కడ గుహలో ఉన్న అఘోరి బాబా అంటే భయంతో హడలెత్తి పోతారు .ఆయన పేరు చెబితేనే ”కార్చేస్తారు.    ” .అటువంటప్పుడు ఆయన దగ్గ్గరకు వెళ్ళే  సాహసమే చేయరు .ఒక వేళ ఆయన దగ్గరకు వెడితే బ0డ బూతులు తిట్టి ,గులకరాళ్ళతో కొట్టి పంపిస్తాడు .ఇలాంటి అఘోరి బాబా ను చూడటానికి స్వామి రామా కాలినడకన వెళ్ళాడు .బాబా 6 న్నర అడుగుల పొడవు తో బలిష్టమైన శరీరం తో దాదాపు 75 ఏళ్ళ వయసుతో పెద్దగడ్డ0 గో నె  తో నేసిన అంగోస్త్రం తో   కనిపించాడు .గుహలో గోనె పదార్ధం తప్ప మరేమీ లేవు.స్వామిరామా తనతోపాటు స్థానిక పురోహితుడిని వెంట తీసుకు వెళ్ళాడు .ఆయన భయపడుతూ వణుకుతూ నే వచ్చాడు .బయలుదేరేముందు రామా తో ”వీడు దొంగ సన్యాసి మురికి మనిషి .నువ్వు చూడదగిన మనిషి కాదు ”అని హెచ్చరించాడు
  ఇద్దరూకలిసి చీకటి పడే ముందు సాయంకాలానికి బాబా దగ్గర కు చేరారు .తనగుహకు గంగానదికి మధ్యనున్న ఎత్తైన రాయి మీద అఘోరి కూర్చుని కన్పించాడు .వీళ్ళిద్దర్నీ తనప్రక్కనే కూర్చోమన్నాడు .వెంటనే ”నా వెనకాల నువ్వు నన్ను నానా బూతులు తిడతావు ,ఇప్పుడు కపట వినయంగా చేతులు ముడిచి దండాలు పెడుతున్నావే ?”అన్నాడు పండిట్ ను తీవ్రంగా  .కంగారుపడ్డ పండిట్ నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తుంటే -”వెళ్ళద్దు .నదికి వెళ్లి నాకు మంచినీళ్లు కుండతో తీసుకురా ”అని చెప్పగా వెళ్లి తెచ్చాడు .పండిట్ చేతికి  మా0సం నరికే పెద్దకత్తి ఇచ్చి ”నదిలోఒక శవం తేలుతోంది .వెళ్లి  దాన్ని ఒడ్డుకు లాగి దాని తొడ ,కాలి  పిక్క మాంసాన్నికొన్ని కిలోలు  నరికి  నాకు తీసుకురా ”అని ఆజ్ఞాపించాడు బ్రాహ్మణ పండితుడైన ఆయన జీవితం లో ఎప్పుడూ కలలో కూడా ఊహించనిపని .ఆయనతోపాటు స్వామి రామాకూడా వణికి పోయారు ..అడుగు ముందుకు వేయలేకపోయారు పండిట్ . .అఘోరీకి ”ఎక్కడో”కాలిపోయింది .తీవ్ర స్వరం తో  ”నువ్వు వెళ్లి ఆ మాంసం తేకపోతే నేనే నిన్ను చంపి తినేస్తా .నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి ”అన్నాడు .
 గత్యంతరం లేక పండిట్ వెళ్లి ఆ శవం లో కోరిన మాంసాన్ని ఖండించి ,ఈ నరుకుడు అలవాటు లేనందున తన రెండు చేతి వ్రేళ్ళు తెగి రక్తం కారుతూ తీసుకొచ్చాడు .పండిట్ కానీ రామా కానీ సహజ స్థితి లో లేరు .పండిట్ దగ్గరకు రాగానే అఘోరీబాబా అతని తెగిన వ్రేళ్ళను తన చేతితో తడిమాడు .వెంటనే రక్తం కారటం ఆగిపోయి వ్రేళ్ళు బాగు   పడ్డాయి . చిన్న మచ్చ కూడా కనిపించలేదు .
  ఒక మట్టి కుండలో తెచ్చిన మాంసం ముక్కలు వేసి ,పొయ్యి మీద పెట్టి ఒక చిన్న రాయిని మూతగా పెట్టమన్నాడు .అలానే చేస్తుండగా ”ఒరే  పంతులూ !  ఈ కుర్ర స్వామికి ఆకలిగా ఉందని తెలీదా నీకు  నీకు ఆకలి వెయ్యటం లేదా ?”అని విరుచుకుపడ్డాడు .ఈ ఇద్దరూ ‘బాబా మేము పూర్తి శాకాహారులం ”అని గొణిగారు .దీనికి మళ్ళీ మండి పోయిన బాబా ”నేను మాంసం తింటాననుకొన్నార్రా బడుద్ధాయిలూ ?ఇక్కడి ప్రజలు అనుకొంటున్నట్లు నేను మురికి ముండా  వాడిగా కనిపిస్తున్నానా?నేనూ శాకాహారినేరా భడవల్లారా ”అన్నాడు .మరి ఈ వింత ప్రవర్తన ఏమిటో ఈ ద్వయానికి  అర్ధం కాలేదు  .. పదినిమిషాలు మాంసం ఉడికాక పండిట్ ను ఆకుండను తన దగ్గరకు తెమ్మన్నాడు .దగ్గరలో ఉన్న చెట్టు పెద్దఆకులు మూడు కోసుకురమ్మని భూమి మీద పరవమని  వాటిలో కుండలోని మాంసం వడ్డించమని చెబితే బెంబేలెత్తుతూ పండిట్ యెంత కర్మ  కాలిందిరా బాబూ  అనుకొంటూ ..తర్వాత అఘోరి గుహలోకి వెళ్లగా పండిట్ ,రామా చెవుల్లో ”ఇంత  ఘోరం నా జన్మలో చూడలేదు స్వామీ .ఎలాంటి కులం లో పుట్టాను ఎలాంటి నీచమైన పని చేశాను ఇక నేను బతకటం వ్యర్థం ””అంటే రామా ”ఇక ముయ్యి .ఇక్కడినుంచి మనం తప్పించుకొనే వీలే లేదు .ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు .ఇంతలో బాబామూడు చిన్న మట్టి ముంతలు బయటికి తెచ్చాడు పండిట్ ను కుండలోని మాంసాన్ని ఆకుల్లో వడ్డించమన్నాడు .
  పండిట్ కుండపై ఉన్న మూత  తీసి చేతులు లోపల పెట్టి  రామా ఆకులో వడ్డించగా ఆశ్చర్యం అది రసగుల్లా లు గా కనిపించింది .అది రామా కు అమిత ఇష్టమైన పదార్ధం బాబా గుహకు వస్తుండగా రసగుల్లా గురించి ఎందుకో ఆలోచన వచ్చింది స్వామిరామాకు .ఆయనకు కావాల్సిందే తయారైందన్నమాట.  తెల్లమొహాలు వేసిన రామాతో అఘోరి ”ఇది స్వీటే    .  మాంసంకాదు అనుమానించకుండా తినండి ”అన్నాడు .ఇద్దరూ అతి రుచికరంగా ఉన్న రసగుల్లా లను చాలా ఇష్టంగా తిన్నారు మిగిలిన దాన్ని పండిట్ కు ఇచ్చి గ్రామం లో అందరికి పంచిపెట్టమని పంపాడు ఇదంతా హిప్నాటిక్ టెక్నీక్ అనిపించింది స్వామిరామా కు  .రామా బాబా దగ్గరే ఉండి యోగ సాధన చేశాడు .మిగిలిన కధ  తర్వాత.
సశేషం
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Inline image 1Inline image 2
Inline image 3Inline image 4
 . 

Inline image 5Inline image 6

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1

అనేక శతాబ్దాలపాటు ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన లాభ పేక్ష లేకుండానే జరిగింది .క్రాఫ్ట్ గిల్డ్ లనేవి మత సంబంధ నాటకాలను  మిస్టరీ నాటకాలను ఆడించేవి .ఉత్సవాలలో స్కూళ్లు  ,కాలేజీ యూనివర్సిటీలలో క్లాసికల్ ,నియోక్లాసికల్ డ్రామాలను లాటిన్ ,ఇంగ్లీష్ భాషలలో విద్యా0శాలలో భాగంగా  ప్రదర్శించేవారు .ఈ రూపాల్లో నాటకం బాగా స్థిరపడి జనామోదం పొందింది .దీనికి విరుద్ధంగా ప్రొఫెషనల్ థియేటర్లు సంఘం లో బలపడ్డాయి నాటక కంపెనీలు సంచారం చేస్తూ ,ఖాళీ ప్రదేశాలలో ,అరిష్టాక్రసి వారి విశాల మైన హాళ్లలో,టౌన్  స్క్వేర్ లలో ,అతిధి గృహాలలో ,జాతరలలో ,బహిరంగ  ప్రదేశాలలో ప్రదర్శించేవారు ఆదాయం స్పాన్సర్లు ,పెట్రన్ల  సహకారాన్నిబట్టి మారుతూ  ఉండేది  . ఆనాటి నటులు దేశ ద్రిమ్మరులకంటే కాస్త నయం .కానీ తరచుగా అరెస్ట్ అవుతూ  బహిష్కరింపబడుతూ ఉండేవారు .
1560-1570 మధ్యకాలం లో ఇంగ్లీష్ వృత్తి నాటక శాలలు క్రమంగా గౌరవ స్థానం పొందాయి . నాటకం పై మోజున్న డబ్బున్న మారాజులైన లార్డ్ అడ్మిరల్ ,లార్డ్ చెంబర్లేన్ వంటి అరిస్టోక్రాట్లు నాటక కంపెనీలను తమ అధీనం లోకి తెచ్చుకొని ,నటులను వారి ఇంటిమనుషులుగా చూసుకునేవారు .కనుక నటులు సంచారులుగా ఉండి ,అరెస్ట్ అయి ఇల్లు లేని వారుగా ఉండే బాధ తప్పింది కూడు గుడ్డా నీడా ,అజమాయిషీ లభించాయినటులకు . తర్వాత శాశ్వత నాటక శాలలు అంటే ధియేట్టర్లు నిర్మించబడి ,కంపెనీలకునిర్వహణ బాధ్యత ఇచ్చి ప్రదర్శనకు టికెట్ పెట్టి డబ్బు వసూలు చేసుకొనే సౌకర్యం కలిగింది ,
  షేక్స్పియర్ జీవనాధారం ,ఆయన అద్భుత ప్రయోగ ప్రక్రియ ,వాటిల్లో ఆయన భాగస్వామ్యం ,ఆచరణాత్మక విధానం ,శిల్ప నైపుణ్యం అంతా ఇక్కడే ప్రదర్శితమైంది .వృత్తినాటక శాలలు ప్రదర్శనకు డబ్బు వసూలు చేయాలా వద్దా అనే దానిపైన అధికారం కలిగిఉండేవి ..వారి మనోభావాలకు విరుద్ధంగా కంపెనీలు ప్రవర్తించే వీలు ఉండేదికాదు .నటులకు సరైన పారితోషికం ఇచ్చే వారుకాదు .దుస్తులు అంటే కాస్ట్యూమ్స్ వడ్డీ వ్యాపారుల పరమయ్యేవి .కనుక ప్రొఫెషనల్ ధియేటర్ అనేది నామమాత్రంగా పేరుగా మిగిలింది .అందుకని 1560-70 కాల0లో  ఆర్ధికావసరం ప్రాధాన్యత పొంది,పబ్లిక్ లేక బహిరంగ నాటక ప్రదర్శన శాల ల (యాంఫి ధియేటర్ )  

స్థాపన అవసరం కలిగింది .పరిశోధనా ఫలితంగా ప్రముఖమైన షేక్స్ పియర్ నాటకాలను ప్రదర్శించినలండన్ లోని ” గ్లొబ్  ధియేటర్ ” ,క్రిస్టోఫర్ మార్లే నాటకాలు కొన్నిఇతర  షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శించిన” రోజ్ ధియేటర్ ”లు పూర్వపు 1567నాటి రెడ్ లయన్ ధియేటరే ..ఆర్కియాలజీ సర్వే ప్రకారం గ్లోబు ,రోజు థియేటర్లు బహుకోణీయంగా  14 నుంచి 24 వేదికలుగా  బహు అంతస్తులతో 75 నుంచి 100 అడుగుల వ్యాసం తో  ఎత్తుగా ఉండి ,పాక్షికంగా కప్పబడిన వెనుకభాగం (థ్రస్ట్ ) తో పే ట్రన్లు నుంచునే వీలుగా(గ్రౌండింగ్స్ )  పైన కప్పబడిన గాలరీ తో సుమారు 2 500 మంది ప్రేక్షకులు కూర్చునే వీలుగా  బహిరంగ నాటక శాలలుగా ఉండేవి .
  ఈ థియేటర్లు సామాన్యంగా ఏ రోజైనా సగం మంది తో నిండిఉండేవి .నాటకాన్ని గూర్చి బాగా ప్రచారం చేసినా  పా0 ఫ్లెట్లు వేసి పంచిపెట్టినా సెలవు రోజుల్లో నైనా జనం బాగా హాజరయ్యేవారుపూర్వపు  స్టువర్ట్ ,తర్వాతి ట్యూడర్ లాతోకలిపి లండన్ మెట్రోపాలిటన్ జనాభాలక్షా యాభై వేలనుంచి రెండున్నర లక్షలదాకా ఉండేది .వీరిలో వారానికి కనీసం 15 వేలమంది నాటకానికి హాజరయ్యేవారు .అంటే జనాభాలో పది శాతం హాజరన్నమాట ప్రేక్షక ఆదరణ కోరికలపై నాటకాలను మార్చేవారు 1595 లో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు లార్డ్ అడ్మిరల్ జనం కనీసం విభిన్నమైన 18 నాటకాలను 28 సార్లు ప్రదర్శించేవారు
  సహజ సిద్ధ కాంతి తోనే ఈ ధియేటర్ లకు వెలుగు అందజేసేవారు .ప్రదర్శనలు మిట్ట మధ్యాహ్నం 12 లేక మధ్యాహ్నం 2 కు మొదలుపెట్టి నాన్ స్టాప్ గా 3 గంటలు ఆడేవారు .చివరలో ఒక తమాషా ఊపు కుదుపులేక ఫెన్సింగ్ ప్రదర్శన ,లేక నాటక సంబంధం లేని ప్రదర్శనతో ముగింపు పలికేవారు .వాతావరణ పరిస్తతులనను సారించి ఈ ఆరుబయట నాటకశాలలు నడిచేవి .ఆదివారం తో సహా ప్రతి రోజూ ప్రదర్శన ఉండేది .ఈస్టర్ పండుగకు 45 రోజులముందు ,ప్లేగు వ్యాధివచ్చినప్పుడు ,ఒక్కోసారి వేసవిలో కోర్టులు సమావేశం కానప్పుడు  లండన్ లోని ధనిక సంపన్న భూస్వాములు అధిక సంఖ్య లో లండన్ లో ఉండనప్పుడు ప్రదర్శనలు ఉండేవికావు . సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1


 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి-2 (చివరిభాగం )
మల్లినాథుని ”నాశా విరో క ”పాఠం చాలా సవ్యమైనదే అనిపిస్తుంది .మరోపాఠం లో ”నాశా వీరేకా ”ఉంది దీన్ని అశ్లీలార్ధమ్ వచ్చే పద మని సూరి తిరస్కరించాడు .కొన్ని చోట్ల తానూ తిరస్కరించిన సందర్భాలలో వ్యాఖ్యాతల పేర్లు చెప్పాడు ..కొన్ని సందర్భాలలో మల్లినాథుని పాఠం చాలా భిన్నంగా కనిపిస్తుంది -”దీప తుల్యహః ప్రబంధోజ్యం శబ్ద లక్షణాచ క్షుషామ్ -హస్తామర్ష ఇవాంధానం భవేద్ వ్యాకరణావృతే ””హస్తామర్ష ”బదులు మల్లినాథుడు ”హస్తాదర్శ ”ను ఆమోదించాడు గుడ్డివారికి చేతిలో అద్దమున్నా నిష్ప్రయోజనమే .అలాగే కావ్యం ఒక దీపం వ్యాకరణం మాత్రమే చూసేవారి దృష్టిలో .
రఘు వంశం లో రాముడు పరశురాముని -”గ్రహణా శాస్త్రం యది సర్గ ఏషతే ”అన్నాడు.అంటే నాతొ యుద్ధం చేయాలని నిశ్చయించుకొంటే ఆయుధం ధరించు అని అర్ధం .మరొక పాఠం లో ”సర్గ ”కు బదులు ”గర్వ ”అని ఉంది గర్వ అనే పదాన్ని అంగీకరిస్తే రాముడు కావాలనే పరశురాముడినిగర్విష్టి అన్నట్లు భావించటం జరుగుతుంది ఇక్కడ అలాంటి సందర్భం లేదు .పరశురాముడు తనతో యుద్ధ చేయాలని నిశ్చయించుకొంటే తానూ యుద్ధం చేస్తానన్నాడు రాముడు .కనుక పోరాటారంభానికి కారణం రాముడుకాదు .ఈ విషయ0 ”సర్గ ”అనే పదం లో అంతర్గత భావం గా తెలియ బడింది .
భట్ట కావ్యం లో -”సుకృతం ప్రియకారీ త్వం కం రహస్యు ప తిష్ఠసే -పుణ్య కృచ్వా దుకారస్తే కింకర సురతేషు కః ”లో కింకర అనే పదం వ్యుత్పత్తి విషయం లో అభిప్రాయం భేదాలున్నాయి .జయమంగళుడు పాణిని సూత్రం ప్రకారం ”దివా విభా ”టి అనేది చేరుతుంది ధాతువుకు ”అక్” వచ్చి చేరుతుంది అన్నాడు.-”కిమ్ యంత ద్ బహుషు క్రణో జ్విధానం ఇతి సత్సస్త్రీ విషయే ద్రష్టవ్యం ”. కానీ మల్లినాథుని ప్రకారం ”కి మ్యత్తా ద్బహుషు ”అనేది సూత్రానికి మినహాయింపు అన్నాడు కనుక దివా విభా లు కింకర లోచివరి అచ్చును సమర్ధిస్తాయి .జయమంగళుడు కింకర శబ్దం తప్ ప్రత్యామ్యాతో అంతమై దాని స్త్రీలింగానికి యోగ్యమవుతుంది .అందుకని అక్ అనేది ఆదేశంగా వస్తుంది ”అంటాడు -”యంతు ఆడినైవ ట ప్రత్యయహ్ -ఆజ్వివిధానం స్త్రీ మాత్ర విషయం ఇతి జయమంగళాకర వ్యాఖ్యానం తదృ త్తావచ్ ప్రత్యయాంత త్వాభి వ్యకార్త్యర్ధం కింకరా యత్కరీతి ట బంతో దాహరణా దర్శనాద భ్రాతమి చ్యు పేక్షయం ”
మల్లినాథునికి శిశుపాల వధ కావ్యం లో అనేక అవాస్తవిక శ్లోకాలు కనిపించాయి .ఆ 34 శ్లోకాలకు మల్లినాథుడు వ్యాఖ్య రాయలేదు .వాటికి వల్లభ దేవుని వ్యాఖ్యానమే పుస్తకం లో చేరింది .ఈ శ్లోకాల వాస్తవికతపై మల్లినాథునికి వల్లభదేవునికి భేదాభిప్రాయం ఉన్నది .ఈ కావ్యంలో 15 వ సర్గ లో శిశుపాలుడు శ్రీకృష్ణుని దూషించటం ఉంది .మొదటి 27 శ్లోకాలు శ్రీ కృష్ణుని బాల్య క్రీడలున్నాయి .వీటిని శిశు పాలుడు ఆక్షేపించాడు మల్లినాథుడు న్యాయబద్హం కావు అని చెప్పిన వాటికి రెండురకాల భావాలున్నాయి .మొదటి దానిప్రకారం కృష్ణునిపై ఆక్షేపణలుగా అనిపిస్తాయి మరో భావం లో శ్రీ కృష్ణుని నిర్గుణత్వానికి ప్రతీకగా కనిపిస్తాయి.కనుక వాటిలో నిందా స్తుతి లు ఉన్నాయన్నమాట .అంతగొప్పగా పదాల అమెరికా వాటిల్లో ఉంది .ఇవి ఎందుకు అవాస్తవికాలో మల్లినాథుడు కారణాలు చెప్పలేదు .శ్రీ కృష్ణుని అలౌకికత్వానికి ,ఆయన మహిమకు ఈ ద్వంద్వార్ధాలు అలంకారాలు కావని ముఖ్య కధకు శోభించవని మల్లినాథుడు భావించి ఉండవచ్చు అన్నాడు లాల్యే పండితుడు . సందర్భానికి ఇవి తగవు అని భావించి ఉండచ్చు .శ్రీకృష్ణ కీర్తి స్తవానికి ఈ పదాడంబరం మాటల సర్కస్ శోభనివ్వదని ”భావం అబాస పాలు(భావాభాస ) అవుతుందని
సూరి భావించాడు అంటాడు లాల్యే .. నిజంగానే ఈ శ్లోకాల చేర్పు ముఖ్యంగా ద్వంద్వార్థ పదాల ఆడంబరంకావ్యం లోని ముఖ్య ఇతి వృత్తానికి అనునాదం గా ఉండక ఎబ్బెట్టుగా ఉందని అదీకాక శిశుపాలుడి దూషణలకు అంతరార్ధాలు ఉండటం కావ్యమర్యాద కాదని మల్లినాథ మనీష అందుకే అంగీకరించలేదని డా పిజి లాల్యే నిర్మొహమాటంగా చెప్పాడు .
దీనితో మల్లినాథునిగ్రంథ విమర్శనా సరళి పూర్తయింది.తర్వాత మల్లినాథుని వ్యాఖ్యాన విధాన పధ్ధతి గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవతల దివ్యధామం 

దేవతల దివ్యధామం

హిమాలయాలలో 8 నెలలు నరసంచారం ఉండని,కాని అన్నిసమయాలలో కొద్దిమంది యోగులు మాత్రమేధ్యాన సమాధిలో  ఉండే ప్రదేశమే ”జ్ఞానగంజ్ ” తినటానికి బంగాళాదుంపలు మాత్రమే లభిస్తాయి చిన్న చిన్న కర్ర ఇళ్ళు  మాత్రమే నివాసానికి ఉపయోగపడేవి గా ఉంటాయి .ఈ ప్రదేశం లో ఇండియన్ ,టిబెటన్, నేపాలీ సాధువులు మాత్రమే ఉంటారు ఈ యోగులుహిమాలయ సరిహద్దులో  టిబెట్ ,పితోరా ఘర్  లమధ్య ఉంటారు .ఈ ప్రదేశానికి తప్ప ప్రపంచం లో మరే  ప్రదేశానికి జ్ఞానగంజ్ అనే పేరు లేదు .ఒక్కొక్కసారి అత్యధిక హిమపాతం  మంచు చరియలు విరిగి పడటం జరిగి భయానకంగా ఉంటుంది . దేవతల  సాయం తో నే వెళ్ళగలం .
  దారిలో ”రాక్షస స్థలం ”ఉంది ఇక్కడ ఉన్న సరస్సుకు రాక్షస సరస్సు అని పేరు .అకస్మాత్తుగా మంచు కొండలు విరిగి హిమానీ నదాలు విజృంభించి నీటి మట్టం ఉవ్వెత్తున పైకి ఎగసిపడుతుంది .ఒక రోజు బాగుందికదా అనుకొంటే మర్నాడు భీభత్సం సృష్టిస్తుంది .బ్రతుకు దైవా దీనం అని నమ్మి ధైర్యంగా ముందు అడుగు వేయాలి ..మన మంత్రాలకు అక్కడ చింతకాయలు రాలవు మన ప్రార్ధనలు అక్కడ పని చేయవు ..ఒక్కోసారి కొన్ని రోజులపాటు తినటానికి ఏమీ దొరకదు . దివ్య జీవులు మాత్రమే  చక్కగా మనల్ని అక్కడికి తీసుకు వెళ్ళగలరు .. ఒకసారి స్వామి రామాకు దారి చూపించిన ఆతను దగ్గరలోనే ఆగ్రామం ఉందని చెప్పి  అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు .ఇలాంటి సంఘటనలు ఈ దేవ భూమిలో సహజమే ..రామాతో వచ్చిన బృందం ఇక సాహసం చేయలేక వెనక్కి వెళ్ళిపోతే రామా ఒక్కడే జ్ఞాన గంజ్ వైపుకు నడిచి వెళ్ళాడు అక్కడున్న ఒక సాధువు ఆశ్రయమిస్తే నెలన్నర అక్కడ గడిపాడు .ఈ ప్రదేశం భుట్టో ఎత్తైన హిమ శిఖరాలున్నాయి .అవి మబ్బులతో దోబూచులాడుతూ పరమ రమణీయంగా కనిపించాయి .ఇంతటి అందమైన ప్రదేశం పృథ్వి లో ఎక్కడా చూడలేము .
  జ్ఞానగంజ్ నుంచి తిరిగి వస్తూ కైలాస పర్వతానికి కిందభాగం లో ఉన్న మానస సరోవరం దగ్గరకు నడుచుకుంటూ చేరాడు .అక్కడ కొందరు భారతీయ టిబెట్ యోగులు కలిశారు .లామాలతో కొన్ని వారాలు ఉన్నాడు .అక్కడ గొర్రెలు మేపే వారితో కలిసి నడిచాడు .వాళ్ళు ఈ దేవ భూమి ని గురించి అనేక కధలు గాధలు చెప్పారు .వీళ్ళే దేవతలు .ఈ దేవతలు జ్ఞాన అజ్ఞాన జీవితం అంచున  సంచరిస్తూ ఉంటారు.వీరు  తీవ్ర సాధకులకు భౌతికంగా దృశ్యమానమై మార్గ దర్శనం చేస్తారు .కానీ వాళ్ళు అభౌతిక తలం (నాన్ ఫిజికల్ ప్లేన్ ) లోనే ఉంటారు . వారి ఉనికికి తగిన తలం ఉంటుంది   .రహస్య (ఈసోటెరిక్ )సైన్స్ ,తాంత్రిక శాస్త్రాలు  ఈ రహస్య జీవుల గురించి విస్తృతంగా వివరించాయి .కానీ ఆధునిక శాస్త్ర వేత్తలు వీటిని కాకమ్మ కబుర్లుగా తోసి పారేస్తున్నారు .కానీ శాస్త్ర వేత్తలు జీవితం లో అన్ని పార్శ్వాలపైనా పరిశోధనలు ఇంత  వరకు చేయలేదు .మెదడు దాని లోపలి ప్రదేశాలపైనమాత్రమే చేసారు .కానీ మానసిక శాస్త్రం లోపారమార్ధిక లేక ఇంద్రియాతీత సైకాలజీ పై దృష్టిపెట్టలేదు ..ఇది నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు అందని విషయం . శాశ్వత సైకాలజీ (పెరెన్నియల్ సైకాలజీ ) శతాబ్దాల నుండి మన ప్రాచీనులు,మహర్షులు  చెబుతూనే ఉన్నారు .ఇదే సరైన అసలైన విజ్ఞానం .అది జ్ఞానం లో అత్యున్నత శ్రేణికి చెందిన అంటారు దృష్టి లేక అంతశ్చేతన.. భౌతిక విజ్ఞాన  శాస్త్రాలకు పరిమితి ఉంది .వాటి పరిశోధనాఫలితాలు పదార్ధ బాహ్య విషయం పైనా , శరీరం ,మెదడు పైన మాత్రమే ఉన్నాయి అంతకు మించి లోతు వాళ్లకు తెలియదు
   మీ- దుర్గాప్రసాద్ -30-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Inline image 1

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆపన్న హస్తాలు

హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది ,ఊళ్ళో వాళ్ళు వాళ్ళను చూసి నవ్వుకుంటారు ..తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా .నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది .చీకట్లు అలముకున్నాయి .ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు .చేతిలో బాటరీ లైట్ కూడా లేదు .కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది .. నిలువైన కొండ అంచు నుంచి జారిపోయాడు .ఇంతలో పొడవుగా  తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డం తో ఉన్న ఒక ముసలాయనఆపన్న హస్తాలు   అందించి పైకి లాగి  బయటకు చేర్చికాలిబాట పట్టించి  రామా తో ”ఇది దివ్య ధామం .రక్షిత ప్రదేశం .నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని ”చెప్పి పది నిమిషాలలో  బయట  దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకు వెళ్ళాడు  ఇద్దరూకలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు .స్వామి రామా ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు ..ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు .ఇంతలో గుడిసె లో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి ,తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు .వెచ్చదనం కోసం లోపల  మంట  మండుతోంది  .

  రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు .సాధువు కన్నీరు కారుస్తూ ”నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా ?ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశం లోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను .నీకు కనిపించిన మహానుభావుడే  నన్నూ  ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు .మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు .ఆయనను నేను ”సిద్ధ బాబా ”అని పిలుస్తాను .నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి ”అన్నాడు గద్గద స్వరం తో .
  మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు .తాను  జారిన ప్రదేశం దగ్గర వెతికాడు .తాను  జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు.ముసలాయన పద చిహ్నాలు లేవు .  .ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా . తాను  బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు ..దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు .అక్కడి వారందరికీ తమకుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ  ప్రమాదాలనుంచి కాపాడే వాడు ఆ సిద్ధ బాబాయే  అనే నమ్మకం లో ఉన్నారని తెలుసుకొన్నాడు  .
  ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరం లో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు .అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు .గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా  ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది .ఆయన సిద్ధిపొందాక ఆ ప్రదేశం లో ఆరు అడుగుల చతురం లో గుడికట్టారని ,లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని ,అప్పటినుంచి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించిసిద్ధబాబా ను స్మరించి వెడతారని ,ఆసిద్ధ బాబాయే  తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు .ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ,ధ్యానాలు చేశాడు .   స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోందికనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు ..కూలీలు వచ్చి గుడి ని పడ  గొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు …అడుగు లోతు  నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి .తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ లోపలి తవ్వారు .లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగి0దేకాని తగ్గలేదట.దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయం లో దీపం వెలిగించి,మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట .ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు ,దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది .కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు ..ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతం గా ఉన్నాయని  గ్రహించి త్రవ్వకం ఆపేశారు .
  పోనీ శివలింగాన్ని త్రవ్వి పీకి పారేద్దామని ప్రయత్నం చేశారట .8 అడుగులు తవ్వారు .”అంబ” పలక లేదు యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియ లేదట . కనుక పీకలేక తోక ఝాడించేశారు  .ఒక రోజు రాత్రి ఇంజనీర్ కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి ”ఈ శివ లింగం అత్యంత మహిమాన్వితమైనది .దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు .ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు ”అని చెప్పాడట .అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా  రిపేర్ చేసి  లెంపలు వాయించుకొన్నారట .అందమైన ప్రకృతి  మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిత,మహిమాన్విత శివాలయం అది దానికే తారకేశ్వరాలయమనీ పేరుంది
  ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం .దీన్ని శివ సిద్ధ క్షేత్రమనీ పేరుకూడా ఉంది .తరువాతకాలం లో తాండ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు
.
Inline image 1
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా     

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -47

మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి

ప్రాచీన సంస్కృత గ్రంధాలు దేశం లో విభిన్న ప్రాంతాలలో ఉన్నవారు రచించారు … అందుకని వాటిలో అనేక రకాలపాఠాలు  ఉన్నట్లు కనిపిస్తుంది . వ్రాయసగాని అశక్తత ,లేక అక్షరాలను అర్ధం చేసుకో లేకపోవటం కారణాలుకావచ్చు ..మరోసారి అనుకున్న భావం ఆపదం తెలియ జేయలేకపోయిందని రాసేవాడు మరో పదాన్ని దాని బదులు చేర్చి ఉండచ్చు ..మన క్లాసికల్ సాహిత్యం ప్రతి దానికీ అనేక పాఠాలు  కనిపిస్తాయి .. వేదానికి ఒక్క దానికి మాత్రమే  ఈ అనేక పాఠాలు కనిపించవు .అది ఎక్కడైనా ఒకే రకమైన పాఠంగా దర్శన మిస్తుంది ..కనుక సాహిత్య గ్రంధాలలో పాఠక  భేదాలు కనిపిస్తాయి .దీనికి కారణాలు -1-ఒకే రకమైన అక్షరాలూ ,అక్షర సముదాయాలు 2-పదాలను తప్పుగా విడగొట్టటం లేక కలపటం 3-అక్షరాల మార్పిడి 4-ఉచ్చా రణలో దోషాలు 5-కొత్తపదా లను అర్ధం తెలీకుండా కూర్చటం 6-పంక్తుల మధ్య ,రాసింది కప్పి వేయబడటం

ఇవి కాక’’ కార్తె’’ మరి కొన్ని కారణాలు చెప్పాడు .మరి కొందరు మరిన్ని కారణాలు కనుగొన్నారు ..వ్యాఖ్యాత తానూ దేనిపై వ్యాఖ్యానం రాయ బోతున్నాడో దాని సరైన పాఠాన్ని ఎన్ను కుంటాడు ..పాఠక భేదాలుంటే పదం అర్ధం భావం కూడా మారిపోతాయి ..దీనివలన వ్యాఖ్యాతల మధ్య అభిప్రాయం భేదాలేర్పడతాయి .తమకు నచ్చినదాన్ని తీసుకొని మిగిలిన వాటిని ప్రక్కకు పెట్టటమే ,లేక లెక్క చేయకపోవటంతో జరుగుతుంది .ఇవన్నీ గమనించిన మల్లినాథుడు పాఠక భేదాలన్నీ తెలుసుకొని ,చర్చించి మంచి  చెడు  తేల్చి వాటిలో గుణగ్రాహకమైన వాటిని స్వీకరించాడు  .సరైన పాఠాన్ని గ్రహించటానికి మల్లినాథుడు మూడు పద్ధతులు పాటించాడు -1-ఒక్కోసారి వాటిని గూర్చి ఊరికే చెప్పటం 2-మరోసారి వాటిని క్షుణ్ణంగా చర్చించి నిగ్గు తేల్చటం 3-తనకు నచ్చిన పాఠాన్ని గ్రహించి మిగిలిన వాటిని ,వాటిపై వ్యాఖ్యానం రాసిన వారినీ తిరస్కరించటం -రఘు వంశం లో 1-19 లో మల్లినాథుడు’’ శాస్త్రేష్వ కుణి ఠతా వృద్ధిహ్ ‘’ను ఇచ్చి వ్యాపృత పాఠ0 అన్నాడు ..రఘు వంశం -5-23 లో ‘’ప్రత్యగ్రహీత్సంగ గర మగ్రజ న్మా ‘’అనే దానికి ‘’తాంగిర0 ఇతి కేచిత్ పఠన్తి ‘’అని వ్యాఖ్యానించాడు

 మరికొన్ని చోట్ల మల్లినాథుడు కారణాలు ముఖ్యంగా వ్యాకరణ విషయం లో తెలియజేసేవాడు -కుమార సంభవం లో 5-13 లో సూరి ‘’ద్వయీ ‘’అనే మాటను తిరస్కరించి ‘’ద్వయే ‘’ను సమర్ధించాడు .పాణిని ప్రకారం ద్వయీ అనేది  ద్వయ మొదలైన వాటి స్త్రీలింగం అని దాని అర్ధం -’’ద్వై అవయవై యస్యాహః సా ‘’అని అంటే రెండు అవయవాలున్నదని భావం అని ఇది సందర్భానికి తగిన మాట కాదని చెప్పాడు .

 కుమార సంభవం లో  ‘’శుభ్రు ‘’పదాన్ని గురించి ‘’విమానానా శుభృకృతః పితుగృహే ‘’లో శుభ్రు పద ప్రయోగం లో అవమానం ఏమీ లేదు ‘’అందమైన కనురెప్పలుగల  పితృగృహం లో ఉన్న ఓ పార్వతీ ‘’అనటం లో తప్పేమీ లేదని సమర్ధించాడు .కొందరు వ్యాఖ్యాతలు శుభ్రు అనేది వ్యాకరణ విరుద్ధ శబ్దం అన్నారు .మరొక పాఠాన్ని తీసుకొని వారివాదాన్ని సమర్ధించుకున్నారు ..మల్లినాథుడు వారి వాదాలను నిర్ద్వంద్వముగా తిరస్కరించి శుభ్రు నే సమర్ధించాడు .మేఘ దూతం లో కాళిదాసు ‘’సగంధ ‘’ పదం వాడితే లక్ష్మీ నివాసుడు ,మహిమాగని మొదలైన వ్యాఖ్యాతలు ‘’సగర్వ ‘’అన్న పాఠక భేదాన్ని సమర్ధించారు ..ఆపదం  పై మల్లినాథుడు విభేదించలేదు కారణం రెండూ ఆ సందర్భం లో సమాన అర్ధాన్నే ప్రతిపాదిస్తున్నాయన్నాడు .దీనికి ‘’విశ్వ కోశం ‘’నుంచి ఉదాహరణ  చూపించాడు -’’గంధో  గంధక ఆమోదే లేశే సంబంధ గర్వయోహ్ ‘’.శాకుంతలం లో కూడా కాళిదాసు ‘’సగంధ ‘’శబ్దమే వాడాడు .

 మరికొన్ని చోట్ల ఇతర వ్యాఖ్యాతలు ఉదహరించిన పాఠక భేదాలను తిరస్కరిస్తూ కారణాలు చక్కగా స్పష్టపరచాడు మల్లినాథుడు ..అలాకామ్ పదాన్ని దక్షిణావర్త నాధుడు ఒప్పుకున్నాడు .ఉత్తర మేఘం లో ‘’ఆలకే  బాల కుందాను విధ్వం ‘’పై మల్లినాథుడు వ్యాఖ్యానిస్తూ -’’’’అలక మితి ప్రధమాంత పాఠే సప్తమీ ప్రక్రమ భాంగః స్యాత్ -నాధ స్తు నియత పుంలింగతా హానిశ్చేతి  దోషాన్తరా మహతా దసత్ -స్వాభావ వక్రణ్య లకాని పారిత మురహ్ -కృత్సనీ ధరహః ఖండితః ఇత్యాదిషు ప్రయోగేషు నపుంసక లింగ గతాదర్శనాత్ ‘’

 మరొక చోట ‘’మహాభాగా ‘’పదాన్ని మల్లినాథుడు సంబోధక ప్రధమా విభక్తిగా భావిస్తే ,భక్తి హేమాద్రి ,చారిత్రిక వర్ధనుల ’’తాయా ‘’ను  తీసుకొని రెండూ నైరూప్య నామవాచకం యొక్క విభాగాలు అన్నాడు .-’’భక్తిహ్ ప్రతీక్షేషు కులోచితా తే పూర్వాన్ మహాభాగ తాయాతి శేషే ‘’-’’పూర్వాన్ మహా భాగవతయా విశేషే ‘’.

మేఘ దూతం లోని ‘’కామార్త హి ప్రక్రుతి కృపణా శ్చేతనా చేతనేషు ‘’వాక్యాన్ని ‘’ప్రణయక ప్రనాహ ;;పాఠం నువ్యాఖ్యాత  వాసుదేవ అంగీకరించాడు ప్రణయ పదం ప్రార్ధన అనే అర్ధాన్ని ఇస్తోందికూడా .దీన్ని విక్రమోర్వశీయం లో కూడా కాళిదాసు వాడాడు .మల్లినాథుడు ప్రక్రుతి ప్రాణాహుని పాఠాన్ని గ్రహించాడు .ప్రేమికులలో ఉండే జ్ఞాన అజ్ఞాన వివరణలను  ఇది సూచిస్తుందని మల్లినాథుని భావన .ఇక్కడ  ప్రార్ధన  అనే అర్ధం సరికాదు అని చెప్పాడు సూరి

 రఘు వంశం లోని ‘’మరుత్సఖస్యేవ బలాహకస్య గతిర్విజ ధ్నే నహి తప్రతస్య  ‘’వాక్యం తప్పనిసరిగా పరిశిలింప దిగింది ..వసిష్ఠుని శరీరం శక్తిని ప్రదర్శిస్తోంది దాన్ని గాలి గాలి అడ్డుకోలేక పోతున్నాయి ఇక్కడ మారుత్సఖ పదాన్ని బహువ్రీహిగా భావిస్తే పదం అందం చల్లారెట్లు పెరుగుతుంది పాణిని ప్రకారం అది తత్పురుష .మల్లినాథుడు పాణిని నే అనుసరించాడు హేమాద్రి ,చరిత్ర వర్ధను లు కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నారు -’’మరుతః సఖేతి తత్పురుషో ,బహువ్రీహో సమాసాంతా భావత్ ‘’

మల్లినాథుడు అనేక చోట్ల అన్య పాఠాలను తిరస్కరించాడు శిశుపాల వధలో బాహ్లికుని అశ్వాలు రేపిన ధూళి  వర్ణన ఉంది .భూమిపై గుర్రం యొక్క కదలిక లు ప్రేయసీ ప్రియుల సంధానంలాగా ఊహించాడు కవి .గుర్రం  నిస్శ్వాసం దుమ్ముకణాల వెదజల్లుడుగా ఊహించాడు  . భూమిపై వెంట్రుకల వ్యాప్తిలా అనిపించింది .ముక్కు పుటాలు ఎగర వేయటం రోమాలు నిక్కబొడుచుకొని మరింత ధూళి లేవటంగా అనిపించింది -’’నాసా విరొక పవనోల్లసితంతమీ యో -రోమాంచనామివ జగన్ రజః పృధివ్యాహ్ ‘’

 సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా అమరవీరుల సంస్మరణ దినం

Inline image 1Inline image 2Inline image 3


Inline image 4
Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వీక్లీ అమెరికా ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )

వీక్లీ అమెరికా -8-(2)

ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )

22-5-17 నుంచి 28-5-17 వరకు

       శని ఆది సోమవారాలలో కార్యక్రమ వివరాలు

27 28 తేదీలలో ఉదయం 5-30 కు ధ్యానం ,6-నుంచి 6-30 వరకు సుప్రభాతం 6-30 నుంచి 7 వరకు నగర సంకీర్తనం ,7 నుంచి 8 వరకు ఉపాహారం  8 నుంచి 8-40 వరకు భజన 9 నుంచి 10-15 వరకు శ్రీమతి గీతారామ్ ప్రసంగం ,10-20 నుంచి 10-50 వరకు బ్రేక్ ఫాస్ట్ ,11 నుంచి 12-30 వరకు ‘’పని కొ ట్లు’’ అంటే వర్క్ షాప్స్ ,12-30 నుంచి 1-45 వరకు భోజనం మధ్యాహ్నం 2 నుంచి 3-30 వరకు మళ్ళీ ‘’పని దుకాణాలు ‘’,3-30 నుంచి 4 వరకు టీ బ్రేక్ ,4 నుంచి 5 వరకు శనివారం నాడు కొస్బి పావెల్ ప్రసంగం 5నుంచి -6-15 వరకు రోమెల్ చిత్తూరి  ఉపన్యాసం 6-20 నుంచి 7 వరకు భక్తి గీతాలాపన రాత్రి 7-నుంచి 8 వరకు -డిన్నర్ ,,రాత్రి 8-15 నుంచి  10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ,ఆదివారం ఉదయం మధ్యాహ్నం శ్రీమతి గీతా రామ్ ప్రసంగాలు 4-నుండి 5 వరకు టామ్ లసంటా  ఉపన్యాసం 5 నుంచి 6 వరకు గీతా రామ్ తో ముఖా ముఖి మిగిలినవన్నీ పై విధంగానే

29-5-17 సోమవారం -ఉదయం ధ్యానం ,సుప్రభాతం  నగర సంకెర్తన  బ్రేక్ ఫాస్ట్ తర్వాత రిట్రీట్ పై సమాలోచనం 8-40 నుంచి 9 వరకు హారతి తో మూడురోజుల రిట్రీట్ సమాప్తం .

 మొత్తం 600 మంది ఈ రిట్రీట్ లో స్వంత  ఖర్చులు పెట్టుకొని వచ్చి ,డబ్బు పెట్టి హోటల్ రూమ్స్ లో ఉంటూ ,కార్యక్రమాలలో పాల్గొని తమ అకుంఠిత సాయి ఆరాధనను చాటుకున్నారు .ఇంతమందికి విసుగు విరామం లేకుండా ఇక్కడ సేవలు అందజేశారు .సాయి భావ దీప్తికి నిదర్శనమే నిలిచారు రిట్రీట్ ను జయప్రదం చేశారు . ప్రసంగాలన్నీ ఇంగ్లీష్ లోనే అని మరువరాదు .తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటె మధ్యలో తెలుగు పదాలు ఎక్కడైనా రావచ్చు తప్ప అంతా ఆంగ్లం లోనే అందరికీ అర్ధమయ్యేటట్లే ప్రసంగాలు చేస్తారు . ఇక్కడ ఏ సభలో నైనా అంతే అని గమనించాలి . ఏ ప్రసంగాన్ని అయినా అత్యంత శ్రద్ధతో విన్నారు .’’పిన్ డ్రాప్ సైలెన్స్’’ పాటించి సంస్కారాన్ని చాటారు .దీనికి అందర్నీ తప్పక అభినందించాలి .

 రాలీ సెంటర్ వాళ్ళు మాకు 100 ఆపిల్ పళ్ళు ఉన్న పెద్ద బాక్స్ ‘’ప్రసాదం ‘’  అని చెప్పి ఆదివారం మేము ఇంటికి బయల్దేరే టప్పుడు వాళ్ళే తీసుకొచ్చి కారులో పెట్ట్టారు .ఇంకో బాక్స్ కూడా ఇస్తామంటే మేమే  వద్దన్నాం . ఈ వంద ఆపిల్స్ ను ఎలా సద్విని యోగం చేయాలో మా అమ్మాయి ఆలోచించింది .వచ్చేశనివారం తెలిసినవాళ్లు ఇంట్లో రుద్రాభిషేకం భోజనాలకు ఆహ్వానించారట అక్కడ సద్వినియోగం గా ప్రసాదంగా పంచి బెట్టాలని నిర్ణయించింది .చక్కని గ్రామీణ వాతావరణం లో పరిశుభ్రత ,పారిశుద్ధ్యం  భక్తి ,ప్రేమ సేవ ల మధ్య మనసులకు తాకే ప్రసంగాలతో  భక్తిభావ భజన లతో  ఆప్యాయత వర్షించే ఆతిధ్యం తో రెండు  రోజులు గడిపి మానసిక ఆనందాన్ని పొంది రీకూప్ అయి ఇంటికి తిరిగి వచ్చాము . ఇప్పుడు ప్రసంగ విషయాలు రాస్తాను ..

 జార్జియా కు చెందిన కాస్బి పావెల్ ప్రసంగం లో 1979 లో సత్య సాయిని మొదటి సారి దర్శించినట్లు ,తర్వాత బెంగుళూరులో 20 వేల  మంది ఉన్న సభలో ఉపన్యాసమిచ్చిన సాయి ని చూసి నట్లు ,తానూ ఒకసారి కస్టమ్స్ అధికారులవలన ఇబ్బందులు పడుతుంటే తెల్ల దుస్తులతో వచ్చి పరిష్కరించిన సాయిని చూసినట్లు ,పుట్టపర్తి రాగానే తనకేమీ తెలియ నట్లు ‘’నీకు కస్టమ్స్ వారి వాళ్ళ ఏదైనా ఇబ్బంది కలిగిందా అని అడిగినట్లు ,I+I=WEఅని సాయి చెప్పారని ,సాయి ఉపన్యాసాన్ని ఒకామె ఇటాలియన్ భాషలోకి అనువదించి చెబుతుంటే ఆమెకు సరైన పదం దొరక్క ఇబ్బంది పడుతుంటే బాబా అర్ధవంతమైన ఇటాలియన్ పదాన్ని సూచించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన సర్వాంతర్ వ్యాపి అనటానికి  ‘’లవ్ ఈజ్ గాడ్ ‘’అనటానికి ఇది నిదర్శన మని తన అనుభవాన్ని తెలియ జేశాడు

 గ్రీన్స్ లాండ్ సెంటర్ ప్రెసిడెంట్ గిరీష్ జంధ్యాల బాబాతో తన అనుభవాన్ని 10 నిమిషాలలో చెప్పాడు .ప్రసాదం గా పులిహోర అడిగి అడిగి మరీ పంచమని తనకు బాబా ఇస్తే అందరికీ పంచానని ,కానీ బాబా రెండుమూడు సార్లు రెట్టించి అడిగి అక్కడ ఒక కుర్రాడికి తక్కువే పెట్టావు వాడు దాన్ని వాళ్ళ అమ్మకు కూడా పెట్టాలి .అని చెప్పటం తనకు ఆశ్చర్యం కలిగిందని గొప్ప అనుభూతితో తెలియ జేశాడు .

శ్రీ రోమెల్ చిత్తూరి  ముస్లిం .అమితమైన సాయి భక్తుడు భజనలతో పరవశిస్తాడు . 2012 రిట్రీట్ లో ఆయన్ను చూశా .మాట్లాడా .తానూ రాసిన పుస్తకాలు కూడా ఇచ్చాడు . చక్కని ప్రాసంగికుడు . మాటలప్రవాహం లో కొట్టుకు పోవాల్సిందే . i +i=we కాదని Iమాత్రమే అవుతుందన్న ఉపనిషత్సారం చెప్పాడు రోమెల్ .భక్తులు పార్ట్  టైం గా కాక పూర్తి భక్తులుగా మా రాలని ,తనను బాబా ఐ ఎస్ పరీక్షకు తయారు కమ్మని ఆదేశిస్తే రోజుకు 16 గంటలు స్వామి సేవ చేస్తూ చదువుతూ పాసయ్యానని చెప్పాడు .తనకు గుండె ఆపరేషన్ జరిగితే స్వామి వచ్చి తన చెయ్యి పట్టుకొని ధైర్యం కలిగించారని ,తానూ సి బి ఐ ఆఫీసర్ గా దేశమంతా పనిచేశానని విదేశాలలో కూడా పని చేశానని ఎక్కడ చేసినా సాయి సత్సంగాలు నిర్వహించి సాయి పుస్తకాలు పంచి ప్రజలలో సాయి అవేకెనింగ్ తెచ్చానని ,తనపై అభి యోగాలు మోపితే అవి అన్నీ తప్పుడు వేనని స్వామి కృపవలన రుజువై తనజీవితం  మచ్చలేని జీవితంగా బాబా మలచారని ,రువాండాలో తానూ రిట్రీట్ చేస్తుండగా సత్య సాయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసినట్లు అక్కడి వాళ్ళు తనకు చెప్పారని వాళ్లకు బాబా ఎవరో అసలు తెలియదని దీన్ని బట్టి నమ్మిన వారికి బాబా ఎంత చేరువలో ఉంటారో తెలిసిందని ,ఆయనపట్ల శరణాగతి ఉంటె అన్నీ ఆయనే చూస్తారని ,తానూ డిగ్రీ చదివిన మూడేళ్లు అన్ని వ్యసనాలకు బానిసయ్యానని ,తన పాత్ర ఏమిటో లోకానికి తెలియ జేయటానికి బాబా తనను ఆ  చెడు  అభ్యాసాలనుంచి దూరమయ్యేట్లు చేసి ఐ ఎస్ చదివించారని కృతజ్ఞతతో చెప్పాడు ‘’take active roll the rest He would do ‘’అటూ ప్రచార ఆర్భాటాలు వద్దు ,ఆయనకు ఇష్టం ఉండదు అతి వినయంగా ఉండాలి ప్రతి ఇంట్లో సాయిబాబా కు ఒక కుర్చీ వేసి పవిత్రంగా ఉంచితే ఆయన అన్నీ  చూస్తాడు .తాను  ఒక దొంగతనం కేసులో ప్రభుత్వ దనం కోట్లాది రూపాయలను దొంగలనుంచి స్వాధీన పరచుకొంటే ప్రభుత్వం తనకు 3 లక్షల నగదు పారితోషికమిస్తే దాన్ని బాబా పాదాలవద్ద ఉంచి దాన్ని కనిపెట్టించింది నువ్వే కనుక ఇది నీదే అని సమర్పించానని ,కానీ ఒక ధనికుడు 25 లక్షల చెక్కు పంపిస్తే అన్యాయపు సొమ్ము అది దాన్ని తగలబెట్టమని తగల బెట్టించారని ఆయనకు విలువలతో కూడిన జీవితమే ఇస్ట మని  చెప్పాడు .

20–3-2011 న సత్య సాయి అందరికి రెండు చేతులు ఎత్తి  నమస్కరిస్తూ చివరి దర్శనమిచ్చారని ,మనం కూడా అలాంటి ప్రేమతో అందర్నీ పలకరించాలని ,స్వామి శివానంద ను  పుట్టపర్తిలోని డాక్టర్ నర్సింహన్  ఒకప్పుడు బాబా దర్శనం వలన ఏమిటి ప్రయోజనం అని అడిగితె ‘’సత్య సాయి సందర్శనం లక్ష దేవుళ్ళ దర్శనం తో సమానం ‘’అని చెప్పారని ,తానూ ఒకసారి పాలం బాగ్ లో  లో నగర సంకీర్తనం చేస్తుంటే ఉదయాన ఆకాశం నుంచి వింతకాంతి భూమి మీద ప్రసరించటం అందరూ చూసి పులకించారని ,అందుకే బాబాకు సంకీర్తన చాలా ఇష్టమని చెప్పాడు ..’’భారత దేశం ధర్మ రాజు అయితే అమెరికా అర్జునుడు ‘’అని గొప్ప గా రోమెల్ అభి వర్ణించాడు  .’’మూడు సి ‘’లను దూరం చేసుకోవాలని అవే కంపారిజన్ ,క్రిటిసిజం ,కంప్లెయింట్ అని వివరించాడు .ఈ మూడూ దూరమైతే  ఇలపై  స్వర్గమే నర్తిస్తుంది .చివరగా ;’’;వన్  లవ్ ,వన్ ఫ్యామిలీ వన్ వరల్డ్ ‘’అనేది బాబా ఆదర్శమని అందరం దాన్ని అనుసరించి అందరికి సంతోషం కలిగిద్దామని చెప్పి రోమెల్  హర్షధ్వానాల మధ్య ప్రసంగం పూర్తి చేశాడు . స్ఫూర్తి దాయకమైన గొప్ప ప్రసంగం .

టామ్  లసంటా  ప్రసంగం సంతృప్తిగా లేదని పించింది .

బాలు కరణం 8 నిమిషాలలో తనకు ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చి జీతం 5 వేలు నుంచి 25 వేలకు పెరిగినా ఒక నాస్తికుడైన బాస్ దగ్గర పని చేయటం ఇబ్బంది అనిపించి బాబాకు చెబితే ‘’వాడు ఎవడైతే నీకేమి .నీ పని నువ్వు చెయ్యి ‘’అని ప్రోత్సహించిన  వృత్తా0 తాన్ని  చక్కగా నాటకీయంగా చెప్పి మెప్పించారు

చివరగా శ్రీమతి గీతా రాం మూడు సార్లు చేసిన ప్రసంగ సారాంశాన్ని తెలియ జేస్తున్నాను .ఇందరిలో ఆమె స్టార్ స్పీకర్ అని పించారు హృదయాలకు హత్తుకొనేట్లు ప్రసంగించటం ఆమె కున్న గొప్ప లక్షణం ‘’షి .కాప్టి వేటేడ్ ది  ఆడియెన్స్ ‘’ సరస్వతీ దేవి ఆమె నాలుకపై నిజంగా నే నర్తించింది అనిపిస్తుంది

గీతా రామ్ ‘’బాబా అంటే బి అలెర్ట్ ,బి అవేర్ అరౌండ్ యు అండ్ ఇన్ ‘’అని అర్ధమని సాయి అంటే ‘’సాయి ఆల్వేస్ ఇన్ యు ‘’అని భావమని ,సత్యసాయికి సోనమ్మ అనే 80 ఏళ్ళ ముసలావిడ స్నానానికి నీళ్లు పెడుతూ ,ఆయన తిన్న పాత్రలు కడుగుతూ సేవ చేసేదని ,ఆమెకు ఒక సారి జబ్బు చేస్తే తన తండ్రిగారి కారులో ముందుబాబా వెనక ఆమె ,గీతా పెనుగొండ కు తీసుకు వెడుతుంటే గతుకుల మట్టి రోడ్డుపై కారు దిగిపోయి ఆగిపోతే బాబా ఒక్క వేలితో దాన్ని తోస్తే ముందుకు కదిలేదని ఇదేమిటి స్వామీ అని తన తండ్రి అడిగితె ‘’గోవర్ధనపర్వతాన్ని చిటికెన వేలుపై నిలబెట్టిన నాకు ఇది పెద్దకష్టమా ‘’అన్నారని ,గతుకుల రోడ్డులో సోనమ్మ బాధతో సాయీ సాయీ అని అంటుంటే ‘’సోనియామ్మా నేను నీ దగ్గరే ఉన్నానమ్మా ‘’అంటూ అనునయిస్తూ బెంగుళూరు లో డాక్టర్ కాలప్ప హాస్పిటల్ కు తీసుకు వెడితే వెంటనే ఆపరేషన్ జరగాలని చెబితే ,ఎనస్తీషియా ఇచ్చే డాక్టర్ ఆది వారం అవటం తో రాలేడే మో అని కాలప్ప అంటే ‘’మందుతాగి వాడే ఎనస్తీసియాలో ఉంటె వాడొచ్చి చేసేదేమి ఉంది ‘’అని బాబా చెప్పి సోనమ్మను నిద్రపొమ్మని చెప్పి ఆపరేషన్ చేయాల్సిన చోట తన వ్రేలు పెడితే అది మొద్దుబారగా డాక్టర్ కాలప్ప ఆపరేషన్ పూర్తి చేశాడని ,తన తండ్రి డా  పద్మనాభన్  ఇంటికి బాబా ను తీసుకు వెళ్లారని ఆయనకు వ0ట రాకపోతే బాబా తానె మిరియాల చారు కాచారని అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందని తండ్రి బాబా తో ‘’ఈ పనేదో మీరే ఆమెకు పుట్టపర్తి లో చేయచ్చుకదా ‘’అని అడిగితె ‘’కాలం కర్మ కలిసిరావాలి పద్మనాభం ‘’అన్నారని చెప్పింది .

ఒక సారి ఒకమ్మాయిని పేరేమిటని అడిగితె ఆమె జాయ్ అని చెప్పిందని దానికి బాబా ‘’జీసెస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ,యు లాస్ట్ ‘’అనే అర్ధం చెప్పారన్నారు .నమ్మకం కావాలి నీ నమ్మకం లో నీకు విశ్వాసం ఉండాలి ,క్రమశిక్షణ అంతటా ముఖ్యమన్నారని . తనను అమెరికా వెళ్ళమని చెప్పింది బాబా యే  నని చెప్పింది గీతా రామ్ ..

‘’వాక్ విత్ వాల్యూస్ ‘’అనే   మరో ప్రసంగం లో గీతా రామ్ బాబా ఎప్పుడూ తానూ ఒక అయస్కాంతం అని భక్తులు ఇనుప రజను అని దాన్ని ఆకర్షించటం తన లక్షణమని కానీ రజను తుప్పు పడితే ఆకర్షింప బడదని కనుక కల్మషం అనే తుప్పును ఎప్పటికప్పుడు వదిలించుకోమని చెబుతారన్నది .ఒక సారి ఒక విద్యార్థి తానూ యుద్ధానికి వెళ్లి అక్కడ సేవ చేస్తానని బాబా కు చెబితే ముందు చదువు పూర్తి చేయి తర్వాత నీ ఇష్టం అని హితవు చెప్పారని తానూ అన్నీ గమనిస్తూనే ఉంటానని ‘’foot steps of the ant is a thunder in my ears ‘’‘’అని తన మనోభావాన్ని తెలియ బరచారని   యెంత గొప్ప ఉన్నత విద్యావంతులైన ఉద్యోగస్తులైనా సేవలో ధన్యత చెందుతారని ఇంజనీర్ దశరధ రామి రెడ్డి రోజూ  పుట్టపర్తి లో పాలు కొని తీసుకువచ్చి బాబా భక్తులకు అందజేసేవాడని చెప్పారు .ఆయన భార్య  పుష్పాలతో చక్కని హారాలు అల్లేవాఁ రని   రోజూ 5 సార్లు ఆదండాలు బాబాకు వేసేవారని ఒక దందడ ను పోలి మరొక దండ  ఉండకుండా ఆమె అల్లేవారని చెప్పారు కానీ ఏనాడు ఆమె తన చేతులతో బాబాకు హారం వేసేవారుకాదని ,ఇతరులు వేస్తె చూసి ఆనందించేవారని అయన చనిపోతే భార్య ను  బాబా ఆశ్రమం లోనే ఉంచారని  చెప్పారు కొంతకాలానికి 1980లో బాబా హారాలు వేయవద్దన్నారని ఆమెకు ఆపని లేకుండా పోయిందని ఆతర్వాత 22 ఏళ్ళు అక్కడే ఉన్నా బాబాను ముసలివారు దర్శించే ‘’బుడ్డీ క్యూ ‘’లోనే వెళ్లి చూసేవారని చెప్పారు ఆమెతో బాబా ఎప్పుడూ మాట్లాడని లేదని అన్నారు . కానీ ఒకసారి బాబా బెంగుళూర్ లో ఉండగా ఇద్దరు కుర్రాళ్లను ఆమెను కారులో బెంగుళూరు తీసుకురమ్మని చెప్పి పంపారని వాళ్ళు వచ్చి రమ్మంటే రాంగ్ అడ్రస్ కు వచ్చారేమోనని తిప్పి పంపిందని బాబాకు చెబితే తిట్టి కారులో వెంటనే తీసుకు రమ్మని మళ్ళీ పంపారని ,అప్పుడామె నమ్మి వెళ్లిందని ,ఆయన ఆమెను బట్టల షాపులో 15 చీరెలు జాకెట్లు కొనిపించారని ,కావాల్సినవన్నీ కొనిపించారని విమానం లో ఆమెకు చాలా ప్రదేశాలు చూపించి మళ్ళీ పుట్టపర్తి చేర్చారని ఆమె స్వాయంగా గీతారామ్ కు వివరించినట్లు చెప్పారు .కనుక మనం ఆయన దృ ష్టి పడాలని ఎదురు చూడక్కర లేదు ఆయనకు అందరూ తెలుసు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అలా  ఇస్తారు అన్నారు గీతా

 సాయి సాయి సాయి అనవే -సర్వం బ్రహ్మమనవే -బాబా బాబా బాబా అనవే భక్తితో మహిమతో పాల్గొనవే -రామ రామ రామ అనవే రాక్షస గుణములు పొమ్మనవే -కృష్ణా కృష్ణా కృష్ణా అనవే కష్టములు పోగొట్టుకొనవే -శివా శివా శివా శివా అనవే శివ కేశవులు సమమనవే ‘’-హరి ఓమ్  హరి ఓమ్  ఓమ్ హరి ఓం అనవే ఆత్మా రాముని కనుగొనవే ‘’అనే కీర్తన బాబా రాశారని ఇది దేశ విదేశాలలో బాగా ప్రచారమైంది చెప్పారు .ఒకసారి ఒక కెనడియన్ బృందం విని పులకించి అందులోని భావ ఔన్నత్యానికి పొంగిపోయారని గీత అన్నారు .సేవ అంటే ఆధ్యాత్మికతకు దారి .save లోని అక్షరాలను మారిస్తే seva అవుతుంది ..సాయిని ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి .అని నమ్మిన వారికి బాబా ఎంతటి ఆప్తుడుగా ఉంటారో వివరించారు గీతా రామ్ .

 సాయంత్రం ప్రశ్నోత్తరాలకు ముందు మళ్ళీ గీతారామ్ మాట్లాడుతూ ఒకసారి బాబా తమను హార్స్లీ హిల్స్ కు తనతో తీసుకు వెళ్లారని ,అక్కడ నీటికి ఇబ్బంది అని అందరం 8 గదుల్లో ఉన్నామని ఇంతమందికి నీళ్లను రెండు దున్నపోతుల కు అటూ ఇటూపెద్ద డ్రమ్ములు కట్టి3 మైళ్ళు  కిందనుంచి  రోజుకు మూడు సార్లు తెప్పించేవారని తమతో డాక్టర్ కస్తూరి కూడా ఉన్నారని 10 రోజుల రిట్రీట్ తర్వాత అందరం ఇంటికి బయలుదేరటానికి కార్లు ఎక్కి కూర్చున్నామని కానీ బాబా ఆ బంగాళా వెనక్కి వెళ్లి అక్కడ నీళ్లు మోసిన దున్న పోతుల వీపులు తట్టి పది రోజులుగా తమకు నీళ్లు మోసి తెచ్చినందుకు కృతజ్ఞత చెప్పి ,ఏడవ  వద్దని చెప్పి తానూ మళ్ళీ వస్తానని అభయమిస్తుంటే కస్తూరి గీతా లు స్వామి ఏమి చేస్తున్నారో చూడటానికి వెడితే ‘’దున్నపోతుల్లారా నేనేదో ఇక్కడ చేస్తుంటే మీరెందుకు వచ్చి చూశారు అనిచిరుకోపం ప్రదర్శిస్తే మేము చూడకపోతే ఈ విషయ0 లోకానికి ఎవరు రాసి చెబుతారు అంటే నవ్వేశాడట బాబా .అదీ సత్య సాయి కృతజ్ఞతా భావం .అన్నారు .

 తన వివాహ సంబంధం బాబానే కుదిర్చారని ఆయన అన్ని వస్తువులు కొని కావలసిన పదార్ధాలన్నీ చేయించి దగ్గరుండి వివాహం జరిపించారని చెప్పారు గీతా రామ్ .వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారట .

 అమెరికాలో ఒక సభలో తాను  మాట్లాడుతుంటే ఒక కాంగో జంట కు బాబా వాళ్ళ భాషలో దాన్ని చెప్పారని వాళ్ళు వచ్చి తనకు అభినందనలు తెలిపారని ‘’హి  హస్   ఏ ఫోకస్ ఆన్ ఎవరి థింగ్ .ఆలాగే రష్యన్లకూ బాబా తన ఆంగ్లప్రసంగాన్ని వాళ్ళభాషలో అర్ధమయ్యేట్లు చేశారని చెప్పింది ;’’సాయి కి అందరి హృదయ భాషలు తెలుసు ‘’అన్నది ‘’అన్నారు

.బాబా 70 వ పుట్టిన రోజుకు రమ్మని గీతను ఆహ్వానిస్తే రాలేనని అమెరికాలో నే జరుపుతున్నానని  అంటే ‘’అయితే నేనే వస్తాను ‘’అని చెప్పారని ,ఆ రోజు ఉదయం బాంక్ కు వెళ్లి ఏ టి ఏం లో డబ్బుతీసుకొని కారు ఎక్కగా ఎవరో నల్లని ఆగంతకుడుముసుగేసుకుని  కారులో ఎక్కి కూర్చుని కత్తి  మెడమీద పెట్టి అరవవద్దని చెప్పగా అనుకోకుండా కారులో ఉన్న సత్యసాయి చిన్న ఫోటో కాళ్లకు తన బొటన వ్రేలు తగిలిందని ఇంతలో పోలీసుకారు రావటం ,తానూ కంగారు పడకుండా ఉండటం ,తనను వాడు డ్రైవ్ చేయమంటే చేయలేననటం ,వాడే పోలీసుల హడా విడి చూసి డోర్ తెరుచుకు దిగటం వెంటనే పోలీసులు కారులోకి నెట్టేసి ఎక్కించుకోవటం తనకు భయం లేకపోయినా  పోలీసులు ఎస్కార్ట్ తో ఇంటి దగ్గర దింపటం మూడు నాలుగు నిమిషాల వ్యవధిలో జరిగిపోవటం అంతా బాబా మహిమగా ఆమె చెప్పారు అప్పటికే సాయి జన్మదినం ఇండియాలో జరగటం వాళ్ళమ్మ బాబా దర్శనం చేయటం ‘’గీత బాగుందా ‘’అని తెలియనట్లు అడగటం తానూ అక్కడికి వచ్చేముందే ఫోన్ చేసిందని చెప్పటం గీత ఇంటినుంచి బెంగళూర్ లోని తండ్రికి విషయంమంతా చెప్పటం తో విషయం తెలిసింది సాయంత్రం తండ్రిని బాబా జరిగిన విషయం చెప్పమంటే రెండే రెండు నిమిషాల్లో చెప్పటం అప్పుడు బాబా పూస గుచ్చినట్లు జరిగిన విషయమంతా వివరించటం ఆమె నన్ను ఒక్క సారి తలచుకొంటే నేను ఆమెకు ట్రిప్లికేట్ లో బదులిచ్చానని మొదటగా ఆమెలో స్థిర చిత్తాన్ని , తర్వాత పోలీస్ లను రప్పించటం మూడవది దొంగ కు బుద్ధి వచ్చేట్లు చేసి వాడంతట కు వాడే కారు దిగిపోవటం అనే ట్రిపుల్ బెనిఫిట్  కలిపించానాని సత్యసాయి వివరించార ని ఈ మొత్తం ఉదంతాన్ని చాలా నాటకీయంగా ,ప్రదర్శన పూర్వకంగా సస్పెన్స్ భరితంగా గీతా రామ్ వివరించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు ..తనను పోలీసులు హాట్ లైన్ నంబర్ ఇచ్చి అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయమని చెబితే గీత ‘’నా హార్ట్ లైన నంబర్  బాబా ‘’ఉన్నారని చెప్పిందట ..ఎందుకు భయపడలేదని అడిగితె స్వామి ఉండగా నాకు భయమెందుకు .జీవితం శాశ్వతం కాదు అని బాబా నేర్పారు అన్నది .చివరగా సత్యసాయి బాబా చెప్పిన ‘’నీ పని నువ్వు చేస్తే నా పని నేను చేస్తా ‘’అన్న స్ఫూర్తిదాయకమైన మాట తో ప్రసంగం పూర్తి చేసి హర్షధ్వానాలు అందుకొన్నారుశ్రీమతి  గీతారామ్ .ఇలాంటి వారితో పరిచయమవ్వటం మాతో ఫోటో తీయించుకోవటం మా అదృష్టం .

         మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29–5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Inline image 1

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి రిట్రీట్ వారం -22-5-17 నుంచి 28-5-17 వరకు

వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి  రిట్రీట్ వారం  -22-5-17 నుంచి 28-5-17 వరకు

22- సోమవారం -వర్షం బాగా పడింది .సాయంత్రం పుట్టపర్తి లో ఉంటున్న కాకినాడ వాసి శ్రీ అప్పారావు గారు ,అమ్మాయి వచ్చి రిట్రీట్ కు వెళ్లేవిధానం మా అమ్మాయి విజ్జి తో చర్చించి వెళ్లారు ..”మధ్యయుగాల వైద్య విధానం ”పై నెట్ లో రెండు ఎపిసోడ్ లు రాశా .”నోర్సే మైథాలజీ ”చదివా .రాత్రి అమృతం సీరియల్ కాసేపు చూసాం .
మంగళవారం ఉయ్యురు కు ఫోన్ చేసి మా అన్నయ్యగారి అబ్బాయి , రాంబాబు మనవడు   ,కళ్యాణ్ తో మాట్లాడాం .నా ”సుందర కాండ పారాయణ” వీడియో చూశామని చాలా బాగుందని చెప్పారు .” నా దారి తీరు ”లో కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్ లను ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గా రాసిన రెండు ఎపిసోడ్ లు చదువుతుంటే వాళ్ళను ప్రత్యక్షము గా చూస్తున్న అన్హుభూతి కలిగింది అన్నాడు రామ్ బాబు . మా అబ్బాయి రమణ ఫోన్ చేసి హైదరాబాద్ లో ఉన్న మా మేనకోడలు చి సౌ పద్మకు 3 బాక్సులతో శ్రీ హనుమజ్జయంతి నాడు పూజ చేసిన  మామిడిపళ్ళు సుమారు 200 కు పైగా ట్రావెల్స్ బస్ లో  పంపానని అందినట్లు పద్మ ఫోన్ చేసిందని చెప్పాడు పద్మ నాకు వాట్సాప్ లో పళ్ళు అందాయిమామయ్యా అందరికి ప్రసాదం గా పంచాం అని మెసేజ్ రాసింది సంతోషం అన్నాను ..”వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -45”ఎపిసోడ్  తోపాటు  ,”నోర్సే  గాడ్స్ ” రాత్రి రాశా ..రాత్రి ”అన్నోన్ ఫాక్టర్స్” లో మిస్టరీ ఆఫ్ ద్వారక, హిమాలయాల్లో స్వర్గం ,పద్మవ్యూహం చూసాం చాలా వివరణాత్మకంగా ఉన్నాయి మైనేనిగారినీ చూడమని మెయిల్ రాశా ..గోపాల కృష్ణగారుపంపిన -మైరా మాక్డొ నాల్డ్ ”రాసిన ”హైట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ”పుస్తక0 అందింది
  బుధవారం యు ట్యూబ్ లో కాదంబరి కిరణ్ ఇంటర్వ్యూ చూస్తుండగా  మధ్యాహ్నం 2 గంటలకు నెట్ పోయింది .వర్షం పడుతూనే ఉంది .నెట్ లేకపోవటం తో” స్వామి రామా”  అంతా ప్రత్యక్షరం చదివి రాత్రికి పూర్తి చేశా.
 గురువారం రాత్రి 7 గంటలకు మళ్ళీ నెట్ వచ్చింది .మధ్యాహ్నం మన ప్రక్కనున్న రవి గారి నాన్నగారు రాఘవేంద్రరావు  సుగుణ కామాక్షి దంపతులతో  వాళ్ళు ఇక్కడికొచ్చిన 3 వారాలకు మాట్లాడా .అయిదేళ్ల క్రితం వాళ్ళు ఇక్కడే పరిచయమయ్యారు .రమణ ఫోన్ చేసి నిన్న ఆర్ ఐ గారి రెండవ అబ్బాయి ఇవాళ కుమారిగారమ్మాయి వడ దెబ్బకు చనిపోయారని ఇద్దరి కుటుంబాలకు డబ్బు అంద  జేశానని చెప్పాడు .. ”యోగి భోగి రోగి ”,యేసు క్రీస్తు కాశ్మిర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ?”రెండు ఎపిసోడ్ లు రాశా .గోపాల కృష్ణ గారు పంపిన క్లియరెన్స్ డార్రో రచన ”ది  స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”అందింది .
  శ్రీ సత్య  సాయి వార్షిక రిట్రీట్ (సింహావలోకనం )విశేషాలు
 సైన్యం కు శత్రువు భయంకరంగా కనిపించినప్పుడు రిట్రీట్ అవుతుంది అంటే వెనక్కి తగ్గుతుంది .తర్వాత శక్తి యుక్తులు సమకూర్చుకొని మళ్ళీ విజృంభిస్తుంది ఇది రాజనీతి . .సింహం అయిదారు అడుగులకోసారి వెనక్కి తిరిగి చూసుకొంటుంది .ఎందుకంటె తాను మృగరాజు అయినా ఎక్కడినుంచి ఏ ప్రమాదం మీదపడుతుందో ననే సంకోచం .దీన్నే ”సింహావ లోకానాం ”అంటారు . అలాగే ఏ సంస్థ అయినా ఒక ఏడాది పని చేశాక ,తనప్రగతి గురించి సమీక్ష చేసుకొని ,లోటుపాట్లు సరిదిద్దుకొని ,మరింత బలం చేకూర్చుకొని ప్రగతి పదం లో నడిచే ప్రయత్నం చేస్తుంది .ఇదే రిట్రీట్ . .దీనిలో పెద్దలు అనుభవజ్ఞులచేత స్ఫూర్తి పూర్వక ప్రసంగాలు ఉంటాయి . సత్సంగం భజనలు ,పిల్లలకు ఆటాపాటా వారి సృజనకు వేదికగా కార్యక్రమాలు వారి కళా సంస్క్రుతులకు  ఉద్దీపనగా  నాటకాలు ,పాటలు ,ఉంటాయి ఇక్కడ . .అంటే ఒక రకంగా ”రి చార్జి ”చేసుకోవటం మనభాషలో ”పునరంకితం అవటం ”అన్నమాట
 అమెరికా లోని అన్నిప్రాంతాల సత్య సాయి సెంటర్లన్నీప్రతి ఏడాదీ సోమవారం వచ్చే ” మెమోరియల్ డే”ముందు వచ్చే శని ఆదివారాలతోకలిసి మూడు రోజుల సత్యసాయి రిట్రీట్  నిర్వ హిస్తారు  .మెమోరియల్ డే అంటే ”స్మారక దినం ”దేశ స్వాతంత్రానికి ,స్వాతంత్ర రక్షణకు .ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణలో అసువువులు బాసిన వారందర్ని స్మరించే రోజు అన్నమాట .మనం మహాత్మా గాంధీజీ అమరవీరుడైన జనవరి 31ను  ”మృతవీరుల సంస్మరణ దినోత్సవం ” జరుపుకొంటాం .అలాగే ఇక్కడ కూడా .ఆ రోజున వారందరి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధిస్తారు దేశం మొత్తం శలవు దినంగా ప్రకటిస్తుంది . ఇలా మూడు రోజులు సెలవలు కలిసి వస్తే ఇక్కడ వీళ్ళు ”లాంగ్ వీకెండ్ ”అంటారు . శుక్రవారం మధ్యాహ్నం  నుంచే ఆఫీసులు వదిలేసి చక్కగా మూడురోజులు ఎంజాయి చేయటానికి టూర్లు వెడతారు కుటుంబాలతో
  సత్య సాయి సెంటర్ ల రీజియన్ 3 అంటే సౌత్ జోన్ లో ఉన్న 7 రాష్ట్రాలు -అలబామా ,నార్త్ కరోలినా ,సౌత్ కరోలినా ,జార్జియా ,.ఫ్లారీడా  ,టెన్నెస్సీ  వర్జిన్ ఐలాండ్స్ రాష్ట్రాల లోని సాయి సెంటర్ల వారందరికీ నార్త్ కరోలినా రాజధాని రాలీలోని సాయి సెంటర్ వారు దానికి ఒక గంట ప్రయాణ దూరం లో”కంబర్లాండ్ కౌంటీ ”లో  ఉన్న ”ఫయెట్టీ విల్ ”అనే చోట 27-5-17 నుండి 29-5-17 వరకు శని ,ఆది సోమవారాలలో వార్షిక రిట్రీట్ నిర్వహించారు . 2012 లో మేము షార్లెట్ కు వచ్చినప్పుడు గ్రీన్ హిల్స్ లో జరిగిన రిట్రీట్ లో పాల్గొన్నాం . ఫయెటీవిల్ నార్త్ కరోలినా లో  అమెరికా ఆర్మీకి నార్త్ వెస్ట్ భాగ0 లోని ”ఫోర్ట్ బ్రాగ్ ”దళానికి ప్రాముఖ్యమున్న చోటు .నేషనల్ సిటీ లీగ్ నుంచి మూడుసార్లు ఫయెట్టే విల్ ”ఆల్ అమెరికన్ సిటీ అవార్డు ”పొందింది .కేప్ ఫియర్ నది దగ్గర్లో సాండ్ హిల్స్ లో ఉన్నప్రాంతమిది . సౌత్ ఈస్టర్న్ నార్త్ కరోలినా లో ఇది పెద్ద మెట్రోపాలిటన్ పట్టణమే కాక  నార్త్  కరోలినా రాష్ట్రం లో 5 వ పెద్ద పట్టణం కూడా .అంతేకాక సియోవన్  నేటివ్ అమెరికన్ల ఆవాస భూమి  .హైలాండ్ స్కాట్స్ ఇక్కడే మొదట స్థిరపడ్డారు .అమెరికా అంతర్యుద్ధకాలం లో ప్రసిద్ధిపొందింది .ఇక్కడి ఎయిర్ బార్న్ స్పెషల్ ఆపరేషన్ మ్యూజియం ,వార్ మెమోరియల్ మ్యూజియం ,పో హౌస్ మొదలైనవి  దర్షింప తగిన ప్రదేశాలు .అందుకనేనేమో రాలీ సెంటర్ వారు ఈ చారిత్రిక ప్రదేశాన్ని రిట్రీట్ కోసం ఎన్నుకొని ఉంటారని పించింది .  ఇక్కడి RAMADAహోటల్ లో రిట్రీట్ ఏర్పాటు చేశారు .చక్కని విశాలమైన ప్రాంతం 250 గదులు ,కింద 400 మంది కూర్చుని భోజనాలు చేసే ఏర్పాట్లు ,పైన 800 మంది కూర్చునే వీలున్న విశాల మైన సభా మందిరం ఉన్నది . రాలీ వాళ్ళు షార్లెట్ లో జరిగిన సాయి ఆరాధనకు వచ్చి నప్పుడు 3 రోజుల రిట్రీట్ కు అందర్నీ ఆహ్వానించారు .
 ఫయెట్టేవిల్ కు మా ప్రయాణం
 మా అమ్మాయి ముందుగానే ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసింది .. మా మనవళ్లకు26 శుక్ర వారం మధ్యాహ్నం దాకా వార్షిక పరీక్ష ఉన్నందున  పవన్ కారులో మేమిద్దరం వాళ్ళమ్మ మామనవాడు సంకల్ప్ మధ్యాహ్నం  3 గంటలకు బయల్దేరి దారిలో కొత్తగా కట్టబోయే షిర్డీ సాయి మందిరానికి భూమి పూజ జరిగిన చోటు ,మీదుగా హైవే  నుంచి సింగిల్ లైన్ గుండా కొంత దూరం ప్రయాణం చేస్తూ దారిలో రెండు వైపులా పచ్చని జొన్న ,కోతకు సిద్ధమైన గోధుమ పంటలను కోళ్ల ఫారాలను మధ్యలో ఫియర్ నదిని దాటి మళ్ళీ హైవే  పై కొంతదూరం వెళ్లి మళ్ళీ డొంక రోడ్డు మీద ఒక 50 మైళ్ళు ప్రయాణం చేసి 3 గంటల ప్రయాణం తర్వాత సాతంత్రం 6-15 కు” రమడా ”చేరాం .మా అమ్మాయి పవన్ భార్య రాధా వాళ్ళ పిల్లలతో  సాయంత్రం 6 కు బయల్దేరి రాత్రి 9 కి చేరారు .
  మేము చేరే సరికే డిన్నర్ సిద్ధం గా ఉంది .రిజిస్ట్రేషన్ అయ్యాక భోజనం చేశాను .హాలులో టేబుల్స్ వాటి ముందు కుర్చీలతో ఏర్పాటు ఉంది .ర్యాలీ నిర్వాహకులు అందర్నీ చక్కని నవ్వు ముఖాలతో ”సాయిరాం ”  అంటూ పలకరిస్తూ పూరీ కూరా పరవాన్నం పులిహోర ఆవకాయ ,పెరుగన్నం ఆరంజ్ ఆపిల్ ,అరటిపళ్ళతో అడిగి అడిగి మరీ వడ్డించి తినిపించారు .పైన కాసేపు భజన చూసి అందరం మేము బుక్ చేసుకున్న రెడ్ రూఫ్ ఇన్ హోటల్ కు వెళ్లి అక్కడ పడుకున్నాం .
  ఎవరికి వాళ్ళు తమ రూమ్ లను హోటల్ లో స్వంత  ఖర్చులతో బుక్ చేసుకోవాలి .మూడు రోజులకు రెండుపూటలా భోజనం ,టిఫిన్ ,కావాల్సినప్పుడల్లా కాఫీ లకు మనిషికి కేవలం 65 డాలర్లు మాత్రమే కాలేజీ స్టూడెంట్ లకు 25 .పిల్లలకు ఫ్రీ .అంటే దాదాపు ఉచితం గా భోజనం పెట్టినట్లే .సాయి సెంటర్ వాళ్ళు లాభా పేక్ష లేకుండా ”లవ్ ఆల్  సెర్ప్ ఆల్ ”మోటో తో పని చేస్తారు .శుక్రవారం సాయంత్రం ,సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంతా నిర్వాహకులే భరిస్తారు  శని ,ఆదివారాలు దగ్గర లోని హోటల్ లో కేటరింగ్ కు ఆర్డర్ ఇచ్చి తెప్పించి తామే పూటకు ఒక సెంటర్ వాళ్ళు వడ్డన లో ఉండేట్లు ఏర్పాటు చేశారు ..చిన్నపిల్లలా దగ్గర్నుంచి 80 ఏళ్ళు దాటినా స్త్రీ  పురుష సాయి భక్తులందరూ మగవారైతే తెల్లని పాంట్ షర్ట్ లతో ఆడవాళ్లు చీర జాకెట్, నిండుగా కప్పుకున్న కొంగులతో అత్యు0త సాంప్రదాయ బద్ధంగా చెదరని చిరునవ్వుతో సాయిరాం పలకరింపులతో ఆప్యాయం గా ఆదరంగా ఆహ్వానించటం కూర్చోబెట్టటం లేవలేనివారికి వారే తీసుకొచ్చి అందించటం ఇంకో పండు తినండి ,ఇంకాసిన పళ్లముక్కలు తినండి పెరుగన్నం మరి కాస్త వేయమంటారా , ఆపిల్ కోసి ఇవ్వమంటారా అంటూ మహా మర్యాద గా చూశారు .వారందరి సేవ మరువ రానిది .ఈ సేవలో పాల్గొన్నవారికి మిగిలిన కార్యక్రమాలు ఎలా జరిగాయో తెలియటం కష్టమేమో అనిపించింది కానీ వారు డ్యూటీ చేస్తూనే వాటిని చూసి ఉంటారు .కాఫీ కలిపి ఇవ్వమ0టారా షుగర్ సరిపోయిందా ,పాలు కాసిని పోయినా అంటూ ఆప్యాయత చాటారు . మూడు రోజులూ రెండు పూట్లా భోజనాలకు టిఫిన్లకు ఇదే పధ్ధతి .ఎవ్వరి ముఖం లోను అలసట కనిపించలేదు కస్టపడి పోయామన్న భావం లేదు సేవలో తరించామన్న సంతృప్తియే గోచరించింది . ఆదివారం రాలీ నిర్వాహకులతో ఒకరైన శ్రీమతి మాధవి ఆలపాటి తో నేను ఈ విషయం చెబితే ఆమె ఎంతో సంతోషించారు ఆమెతో పాటు పని చేసినవారిని నన్ను పరిచయం చేస్తే వారితోనూ ఈమాట అంటే పులకించిపోయారు వారు . మాధవి గారు తన సెల్ లో నేను చెప్పిన ”it is not only retreat ,t is good well done treat  satisfactory  successful  resourceful retreat”మాటలను రికార్డ్ చేసుకొన్నారు .అభిప్రాయం సేకరణ పుస్తకం లోనూ అదే రాశాను
  శనివారం ఉదయం నేనుస్నానం చేసి  సంధ్య ,పూజా చదివి మా హోటల్ వాళ్ళు ఫ్రీ గా మాకు పెట్టిన టిఫిన్ కాఫీ తీసుకొని హోటల్  మారుద్దామని  మాతోపాటు వచ్చిన అప్పారావు గారి అమ్మాయితో వాళ్ళు ఉంటున్న దగ్గర హోటల్ లో రూమ్ బుక్ చేయించి ఇక్కడ చెక్ అవుట్ చేసి మధ్యాహ్నం అక్కడ చెకిన్ చేసాం .రమడా హోటల్ లో మామూలుగా అయితే లాంగ్ వీకెండ్ లో రూమ్ రెంట్ 90 డాలర్లు ఉంటుందట .కానీ ఇక్కడ రిట్రీట్ జరుగుతున్నందున 60 డాలర్లకు కన్సెషన్ రేట్ లో ఇచ్చారట .పవన్ వాళ్ళు ,చాలా మంది ఇక్కడే బుక్ చేసుకున్నారు . . రెండుపూటలా భజన ఉపన్యాసాలు  వర్క్ షాప్ లు జరిగాయి వర్క్ షాప్ లకు నేను వెళ్ళలేదు సాయి గ్రంధాలు అక్కడ పెట్టారు .కావాల్సినవాళ్లు ఉచితంగా తీసుకోవచ్చు నేను 9 పుస్తకాలు-women saints ,life is a game -play it ,Satya sai speaks loving god ,satyam sivam sundaram ,footprints in shirdi and parthi ,the dharmik challenge premavahini ,పుస్తకాలు తీసుకున్నాను . లక్ష్మీదేవి ఫోటోలు కృష్ణుని ఫోటోలు కూడా కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు .
  ఆదివారం ఉదయమే లేచి సంధ్య ,పూజా కానిచ్చి షార్లెట్ నుంచి తెచ్చుకున్న ఉప్మా  వేడి చేసుకొని తిని స్టార్  బక్స్ లో కాఫీ  తాగి రమడా కు చేరి ,ఉపన్యాసాలు విని పిల్లల వాక్ చూసి కాసేపు విశ్రాంతి . భోజనాలు తర్వాత  మళ్ళీ గీతా రామ్ ఉ పన్యాసం ,తర్వాత పిల్లలు ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి ,సాయంకాలపు స్నాక్స్ కాఫీ తీసుకొన్నాం .శ్రీమతి గీతారా0 ,,జ్ఞానభాస్కర్ భార్య మా టేబుల్ దగ్గరే కూర్చున్నారు .నన్ను వాళ్లకు పవన్ పరిచయం చేశాడు .నేను గీత గారితో ”అమ్మా మీ నాలుకపై సరస్వతీ దేవి నర్తించి నట్లుంది అంత బాగా మాట్లాడారు ”అన్నాను ఆమెసంతోషించి ”ఈ విషయం బాబా గారికి చెబుతాను అయనఎంతో  సంతోషిస్తారు ”అన్నది .భాస్కర్ భార్య తానూ బందరు లో డిగ్రీ చేశానని ఒక సారి ఫ్రెండ్ ను చూడటానికి ఉయ్యురు వచ్చానని అని పవన్ నా బ్లాగు విషయం చెబితే  అడిగి  తెలుసుకున్నది .శనివారం మధ్యాహ్నం  బాలు అనబడే శ్రీ కరణం  బాలకృష్ణ గారిని పవన్ నా దగ్గరకు తీసుకు వచ్చి పరిచయం చేశాడు ఆయన్ను ఆరాధనా దినోత్సవం నాడు షార్లెట్ లో చూశా కలిసి ఫోటో దిగాం అది జ్ఞాపకం చేసుకొని తానూ బాబాపై ఒక శతకం రాశానని దాన్ని చూసి అభిప్రాయం రాయాలని కోరారు .మహద్భాగ్యం అన్నాను ..రాలీ సెంటర్ ముఖ్య పాత్ర దారిని శ్రీమతి ఆలపాటి మాధవి మెయిల్ ఐడి తీసుకొని  వీక్లీ  అమెరికా పంపిస్తాను చూడమంటే దానికోసం ఎదురు చూస్తాను అన్నారు .ఇంతమంది సజ్జనులతో సాహచర్యం ఆనందాన్నిచ్చింది .పెడన దగ్గర ముంజులూరు ఆయన బెజవాడ  ఆయన  కనిపించి పలక రించారు  . ఒక వీల్ చైర్ లో వచ్చిన ఒక అమ్మాయి మధ్యాహ్నం మా దగ్గర కూర్చున్నప్పుడు స్వామిరామా గురించి అప్పారావు గారితో చెబుతుంటే శ్రద్ధగా విని సాయంత్రం నా దగ్గరకొచ్చి తన తండ్రిగారు బెంగుళూరు లో డాక్టర్ గా ఉన్నప్పుడు స్వామి రామా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నారని చెప్పింది భలే సంతోషమేసింది ఈ అమ్మాయి  వాళ్ళు ప్రస్తుతం ఫ్లారిడాలోని మయామి లో ఉంటున్నామని చెప్పింది.
              పోయి దొరికిన ఉంగరం
  శనివారం మధ్యాహ్నం మా శ్రీమతి చేతి ఉంగరం రామడా లో ఎక్కడో జారిపోయింది దాన్ని ఆదివారం మధ్యాహ్నం కానీ పోయిందని తెలుసుకోలేదు .అప్పుడు రాధకు చెబితే తనకే దొరికిందని దాన్ని ఇక్కడి నిర్వాహకుడికి అందజేశామని మైకులో చాలాసార్లు కటించారని చెప్పింది .అప్పుడు విజ్జి ఎవరికి ఇచ్చిందో ఆయన్ను కనుక్కొని  ఆయన జాగ్రత్తగా దాచి ఇస్తే తీసుకు వచ్చింది దానిపై శ్రీ షిర్డీ సాయి బాబా బొమ్మ ఉంది .కనుక మా ఆవిడ నమ్మకం ఆయనే తెప్పించి ఇస్తాడని .అలాగా జరిగింది .
  అసలు కార్యక్రమ వివరాలు ప్రసంగాల సారాంశం తర్వాత భాగం లో తెలియ జేస్తాను
Inline image 1
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-17-
.


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ?

అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి భద్రపరచబడిన  వ్రాతప్రతి లో ఈ విషయం ఉందని కాశ్మీర్ లో ప్రచారం లో ఉంది ..తర్వాత దీన్ని ఒక రష్యన్ రచయిత రష్యన్ భాషలోకి అనువదిస్తే తర్వాత ఇంగ్లీష్   లోకి పైన చెప్పిన పేరుతో అనువదించారు . ఇక్కడి హిమాలయ ప్రాంతవాసులందరూ యేసు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేశాడనే నమ్ముతారు .కాదని ఎవరూ అనలేరు . దీనికి కారణాలు 3 ఉన్నాయని అక్కడి గైడ్ లు తెలియజేస్తారు . -జీసెస్ ధరించిన దుస్తులు అచ్చంగా కాశ్మీరీలు ధరించిన దుస్తువులవంటివే .-2-ఆయన జుట్టు శైలి కూడా కాశ్మీరీ శై లే .-3-ఆయన ప్రదర్శించిన మహిమలు అచ్చంగా కాశ్మీర్ లోని తంత్ర విద్యా మహిమలే .
  జీసెస్ తన 13 వ ఏటా ఆసియా మైనర్ ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని ,ఎక్కడికి వెళ్లిందీ ఎవరికీ తెలియదని ,కానీ ఆయన కాశ్మీర్ లోయకు వచ్చి 30 వ ఏడు దాకా అంటే 17 ఏళ్ళు ఉండిపోయాడానన్నది యదార్ధమని భావిస్తారు ..జీసెస్ తపస్సు చేసినట్లు చెప్పబడే ఒక చిన్న ప్రార్ధనామందిరం  ఎత్తైన పర్వతం  మీద కనిపిస్తుంది .దీనినే యేసు ప్రార్ధనామందిరం అంటారు . ఇది కాదనలేని యదార్ధం అని స్వామి రామా కూడా అన్నాడు .కాశ్మీర్ లోఒక చోటు నుంచే  జీసస్ స్వర్గానికి వెళ్లాడని  ,అక్కడ   సమాధి నిర్మించబడి ఉన్న ప్రదేశాన్ని ”రోజా బాల్ ”అంటారని అంటే గౌరవ  సమాధి (అనర్డ్ టుంబు )అని అర్ధమని ,దీన్ని క్రైస్తవు లు  మహమ్మదీయులు కూడా నమ్ముతారని అంటారు .
   కాశ్మీర్ శైవానికి జీవగడ్డ .ఎన్నో శైవాగమ గ్రంధాలు ఇక్కడివే .కానీ ఇంకా చాలా గ్రంధాలు వెలుగు లోకి రాలేదని రామా అంటాడు వీటిని అర్ధం చేసుకోవటానికి అందులో బహు నిష్ణాతులైన పండితుల సహాయం కావాల్సిందే వీటిలోని తాత్వికభావం ఏమిటి ?.ఆత్మ ,మనసు శరీరం ,విశ్వం లోని సత్యం యొక్క అన్ని స్థాయిలు ప్రాధమిక స్పందన లేక యాదృచ్చిక కంపనం యొక్క  అవతారాలే ..ఈ గ్రంధాలలో మూల విషయం ”శక్తిపాతం ”దీనివలన  నిద్రాణమై  ఉన్న శక్తి జాగృతమవుతుంది . అమరనాధ్ ఆలయం కాశ్మీర్ లో ప్రసిద్ధ మైనది .ఇక్కడ విశేషం ఒక గుహలో ఏర్పడే మంచు శివ లింగం .ఆలయం వేసవిలో దర్శిస్తారు అప్పుడు  ఆలయం లో రెండు తెల్లని పావురాల జంట దర్శనమిచ్చి ఆశ్చర్య పరుస్తాయి .అమరనాధ గుహలో శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని అమరత్వాన్ని గురించి బోధించాడని అక్కడే ఉన్న జంట తెల్లపావురాల జంట దాన్నివిని మోక్షం పొందాయని ,అందుకే అవి ఎప్పుడూ ఆ గుహలోనే ఉంటాయని ఐతిహ్యం  .ఈ జంటను దర్శించిన  భక్తులు కూడా మోక్షం పొందుతారని అంటారు .కొందరి కధనం ప్రకారం అమరనాధ గుహ తెరవబడినపుడే ఈ తెల్లపావురాలజంట స్వామి దర్శనం కోసం వచ్చి ఇక్కడే ఉండిపోతాయని .
  అమరనాధ స్వామి దర్శనానికి 25 ఏళ్ళ వయసులో ఉన్న ఒక యువ యోగి ప్రతి సంవత్సరం వస్తాడాని స్వామి రామ తెలిపాడు ఆయనతో మాట్లాడాడు కూడా ఆయన పూర్ణ ప్రజ్ఞుడని రామా అన్నాడు  .శరీరం పై ఒక్క అంగోస్త్రం తప్ప ఆయనవద్ద ఏమీ ఉండవట .ఆయన చెంపలు కెమ్పుల్లా ప్ర కాశించేవన్నాడు ..యోగ శాస్త్రం లో మహా నిష్ణాతుడు . నడిచే ఎంతదూరమైనా కాలికి ఏ ఆచ్చాదనా లేకుండా హిమాలయాలలో తిరుగుతాడు . 12  వేల అడుగుల ఎత్తువరకూ నడిచే వెడతాడు .చలి ఆయన్ను ఏమీ బాధించదు .ఈ యువ సన్యాసిని అక్కడివారు ”బాల భగవాన్ ”అంటారు. ఆయనకు ఇవేమీ పట్టవు నిత్య సంచారి. రామాగురువు బెంగాలీ బాబా ఈయనకు తెలుసు .కొంతకాలం ఆయన వద్ద ఉన్నాడుకూడా .కళ్ళు చికిలించకుండా కనీసం 10 గంటలు కూర్చోగలడు  .యోగ సాధనలో ఆయన సుమారు మూడు అడుగుల ఎత్తుకు గాలిలో లేవగలడు . స్వామిరామా ఆయన్ను దీన్ని గురించి ప్రశ్నిస్తే ”ఇది ఆధ్యాతిక సాధన కాదు .ప్రాణాయామం లో ఉన్నతస్థాయి సాధన బంధనాలు ఛేదన మాత్రమే .బరువుకు ద్రవ్యరాశికి మధ్య భేదం తెలిసిన వారెవరైనా దీన్ని సాధించవచ్చు .కానీ చాలాకాలం సాధన చేయాల్సి ఉంటుంది ”అని చెప్పాడు .
  ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటని స్వామి రామా ప్రశ్నిస్తే బాల భగవాన్ ”ఇంద్రియాలు పూర్తిగా వశం చేసుకొని ,ప్రపంచ దృష్టినుంచి వాటిని దూరం చేసుకొ0టే ఇంద్రియ అవగాహన మనసులో యే  రకమైన  ప్రతిబింబాలను కలిపించలేదు .అంటే అప్పుడు మనసు ఏకాగ్ర చిత్తమవుతుంది .ఎప్పుడైతే ఆలోచన ప్రభావం అణగారిపోతుందో మనసు సమతా స్థితి పొంది ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది .సత్వ గుణం తోనే దీన్ని సాధించగలం ధ్యానం,విషయవాసనా రాహిత్యం రెండు ముఖ్య సాధనాలు .జీవితాన్ని ఒక క్రమ విధానం లో నడపాలి .మధ్యలో బుద్ధి , గుడ్డి  నమ్మకాలు పెడదారులు పట్టిస్తాయి  జాగ్రత్తపడాలి  .ఈ రెండూ కూడా గొప్ప శక్తులే కానీ ముందు వాటి గురించి సంపూర్ణ జ్ఞానం సంపాదించాలి .తర్వాత విశ్లేషించి సరైన మార్గాన సాధన చేయాలి .అన్నిటికీ మార్గ దర్శి అంతశ్చే తన  మాత్రమే అంటారు అంటే అంటారు దృష్టి   మాత్రమే .కనిపించేదంతా యదార్ధం కాదు సత్యం వీటి వెనక దాగి ఉంది దాన్ని తెలుసుకోవాలి .
Inline image 1Inline image 2
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-5-17- కాంప్-షార్లెట్-అమెరికా .


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత వేదాంతం

గణిత వేదాంతం

గణితానికి వేదాంతానికి సంబంధం ఏమిటి ?బోడిగుండుకు  మోకాళ్ళకు ముడి పెట్టటం లాగా ఉందనుకొంటున్నారా .దిగితేకాని లోతు తెలియదు .లెక్కలలో 1 సంఖ్య ఉంది .మిగిలిన అన్ని సంఖ్యలు దీని గుణకాలే .అలాగే ఉన్నది ఒకే ఒక్క శుద్ధ సత్యం .ఆ శుద్ధ సత్యం యొక్క గుణకాలే విశ్వం లో  విభిన్న నామాలు, రూపాలు  ..జీవితం సమ భుజ త్రిభుజం .శరీర కోణం ,శరీరాంతర్గత స్థితి కోణాలు ,బాహ్యప్రపంచ కోణం కలిస్తే సమాన కోణ  సమానభుజాలున్న జీవితం యొక్క సమబాహు త్రిభుజం ..సంఖ్య లన్నీ ఒక స్థిర బిందువునుంచి వచ్చినట్లే ,ఆ బిందువును కొలవలేనట్లే ,ఈ విశ్వమంతా గణింప శక్యం కాని  శూన్యం నంచి ఏర్పడింది .జీవితం ఒక చక్రం .దీన్ని  సున్నా  లేక వృత్తం తో పోల్చవచ్చు. వృత్తం అంటే బిందువు యొక్క పరి వ్యాప్తి అన్నమాట .అయితే జీవితం లో రెండు బిందువులున్నాయి ఇవే  పుట్టుక ,మరణం .ఈ రెండు బిందువులను  కలిపే సరళ రేఖయే జీవితం.జీవితం యొక్క తెలియని భాగమంతా అనంతం రేఖ .
  ముందు ఒక సున్నా పెట్టి దానితరువాత 1 అంకె వేస్తే 01 అవుతుంది .ఒకటి వేసి దానితర్వాత సున్నా పెడితే 10 అవుతుంది .సున్నాలు పెంచిన కొద్దీ విలువ పెరుగుతుంది 100 1000 వగైరా ..ముందు ఒకటి  లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా ఆ సున్నాకు విలువే లేదు .సృష్టిలో అన్ని వస్తువులు సున్నాలే .ఏక పరబ్రహ్మ సత్య భావన లేకపోతే ఈ వస్తువులకు దేనికీ విలువ లేదు .ఆ ఏక సత్య పరబ్రహ్మ ఎరుక కలిగితే జీవితం విలువైనది అవుతుంది .లేకపోతే భారమవుతోంది  .
  కనుక గణితం ధనాత్మక సైన్స్ .అన్ని సైన్స్ లకు మూలాధారం .ఇది సాంఖ్య వేదాంతం పై ఆధార పడిందే ..వేదాంతాలలో అతి ప్రాచీనమైనది సాంఖ్య 0  . ఇది శరీరాన్ని అందలి లోపలి విషయాలను  మనసు చేసే క్రియలను తెలుసుకోవటానికి ఉపయోగ పడుతుంది యోగ అనేది ఆచరణాత్మక విజ్ఞానం (ప్రాక్టికల్ సైన్స్ ).ఇది అతీంద్రియ చేతన(సూపర్ కాన్షస్ ) కలిగిస్తుంది .సందేహ నివృత్తికి  సాంఖ్య  యోగం తప్పని సరి .
   ఈ విషయాలన్నీ స్వామి రామాకు ”చక్ర వర్తి ”అనే  గణిత శాస్త్ర వేత్త అయిన స్వామి బోదించాడు .ఆయన గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ .చక్రవర్తీస్ మాధేమాటిక్స్ ”గ్రంథ రచయిత..తర్వాత జీవితం లో సారం లేదని గ్రహించి సన్యసించి హిమాలయ గుహలలో తపస్సులో గడిపాడు .ఆయనకు మరొక గొప్ప శక్తి ఉంది అదే  ”తదేక దృష్టి ”. దేనిమీద అయినా ఆయన దృష్టిపెడితే దానిప్రభావం గొప్పగా ఉంటుంది .దీనిని ”త్రాటకం ”అంటారు ..ఇంగ్లీష్ లో గేజింగ్ అంటారు .ఈ దృష్టి బయట వాటిపై కేంద్రీకరిస్తే  దాన్ని త్రాటకం అంటారు అదే దృష్టిని అంతర్ముఖ చేస్తే  దాన్ని ఏకాగ్రత అంటారు ..కేంద్రీక రింపబడిన మనసుకు అత్యంత శక్తి లభిస్తుంది .కొందరు దృష్టిని భృమధ్యమం  లో కేంద్రీకరిస్తారు .శివుడు మూడవ కంటి దృష్టిని కేంద్రీకరిస్తేనే మన్మధుడు కాలి  బూడిదయ్యాడు .భూతద్ద0 తో సూర్యకాంతిని కేంద్రీకరిస్తే కాగితం ఫిలిం  దూది మొదలైనవి తగలబడటం మనకు అనుభవమే ..
  స్వామిరామా దీన్ని ప్రత్యక్షం గా చూపించమనికోరాడు  .సరేనని దగ్గరలో ఉన్న కోర్టులో ఏ ఖైదీ అయినా అనవసరంగా అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్నాడేమో చూసి వచ్చి చెప్పమన్నాడు .సరే అని వెళ్లి అక్కడి లాయర్లద్వారా పాపం ఒకతను ఏ నేర మూ చేయకుండా కోర్టులో విచారణకు గురౌతున్నాడని తెలుసుకొని స్వామి చక్రవర్తి కి చెప్పాడు .అప్పుడు చక్రవర్తి ”ఆ ఖైదీ విడుదలవుతాడు .జడ్జి చెప్పే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నీకు ప్రత్యక్షరం తెలియ జేస్తాను కాగితం మీద రాసి టైప్ చేసి ఎవరికీ తెలియ కుండా జాగ్రత్త చేయి .జడ్జిమెంట్ రాగానే నేను చెప్పింది జడ్జి చెప్పింది పోల్చి చూడు ”అని చెప్పటం రామా రాయటం టైప్ చేయటం అందులో మూడు టైప్ తప్పులు దొర్లటం జరిగాయి .రెండుమూడు రోజులతర్వాత జడ్జి తీర్పు చెప్పాడు దాని కాపీ తెప్పించి రామా తానూ టైప్ చేసిన దానితో పోల్చి చూశాడు అక్షరం పొల్లు పోకుండా తానూ చేసిన మూడు తప్పులతో సహా జడ్జి మెంట్ కాపీ ఉంది . ఆశ్చర్యపోయి చక్రవరి త్రాటక విద్య అమోఘమైనది గ్రహించాడు .అంటే ఎక్కడో సుదూరం లో ఉండికూడా మనసును కేంద్రీకరించి అవతలి వారిపై ప్రభావం చూపించవచ్చు అని అర్ధమయింది .అప్పుడు రామా ”స్వామీ !మీరు ఈ ప్రపంచ గతిని మార్చగలరా ?”అని అడిగాడు .దానికాయన ”అది నా పనికాదు అతడు అన్యాయంగా కేసులో ఇరుక్కున్నాడనే జాలితో నా దృష్టిని జడ్జి మనసుపై కేంద్రీకరించి ప్రభావం చూసి జడ్జి మెంట్ అలా వచ్చేట్లు చేయగలిగాను ..మనిషి నిగ్రహం తో ఉంటె ఎక్కడున్నా ,యెంత దూరం లో ఉన్నా అవతలివారి మనసుపై ప్రభావం కలిగించవచ్చు అని నీకు తెలియ జేయటానికే ఇలా చేశాను ”అన్నాడు
 చక్రవర్తి యోగి సంఖ్యామానం లోని సున్నా నుంచి 100 వరకు ప్రతి అంకెను ఉపనిషత్ లోని ఒక్కొక్క శ్లోకం తో జత చేసి వ్యాఖ్యానించి చెప్పేవాడు .వాటిలోని  వేదాంత భావనలను విశదీకరించేవాడు
   మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .. ..
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి భోగి రోగి

హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు .వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు .అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు .ఒకసారి  స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో  హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్హుకోమని పంపాడు .సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు .ఆయన కన్నెత్తి కూడా చూడలేదు .ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు ..ఆయన నిన్ను ఆయన గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ” . అదెలా సాధ్యం ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు .ఆయన ఒక జీవం లేని కర్రముక్కో  రాయిలాగానో  ఉంటాడు చలనం లేదు ”అని ఫిర్యాదు చేశాడు .”కాదులే అక్కడే ఉండు ”అని భరోసా ఇచ్చాడు గురువు .ఒక రోజు హరి ఓం స్వామి  కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్క నా ,రాయినా ?”అన్నాడు .కంగుతిన్నాడు స్వామిరామా .తనగురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని  బోల్డు ఆశ్చర్యపడ్డాడు .మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందం లో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానన్దం కలిగిస్తుంది  ఆ విశ్వ చైతన్యం లో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను ”అన్నాడు  .ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి .హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా  భావించి అనుభవించాడు .

  ఓం హరి స్వామి ఒక సారి కళ్ళు తెరిచినప్పుడు కొన్ని మంత్రాలు చదివి అర్ధం చెప్పాడు .దానిభావ0 , లోకం అంతా రాత్రి వేళ నిద్ర పోతుంటే యోగులు ,ఆత్మజ్ఞాన సంపన్నులు మేలుకొని ఉంటారు .ఇది ఉపనిషత్ వాక్యం ..తర్వాత దానిపై వివరణ ఇస్తూ ”రోజు మొత్తం మీద మంచి కాలం నిశ్శబ్ద రాత్రి వేళ మాత్రమే .అయితే దాని లోని అందాన్ని ఆ నిశ్శబ్ద భావాన్ని కొద్దీ మంది మాత్రమే అనుభవించగలరు .రాత్రి వేళల లో ముగ్గురు మాత్రమే మెలకువ గా ఉంటారు .వారే యోగి భోగి  రోగి .యోగి నిశీది లో  సమాదిగతుడై పరమానందాన్ని పొందుతాడు .భోగి ప్రాపంచిక సుఖాలలో రాత్రిళ్ళు నిద్రపోకుండా  ఆనందం అనుభవిస్తాడు .రోగి జబ్బుతో ముక్కుతూ మూలుగుతూ నిద్ర లేకుండా గడుపుతాడు .యోగిది  శాశ్వతా నందం భోగిది  క్షణికానందం రోగి ది బాదానందం . ”
  మరి యోగికి నిద్ర క్కరలేదా అని అడిగాడు రామా .దానికి ”మనసులో ఏమీ లేకుండా కళ్ళు మూసుకొంటే అది నిద్ర .కావాలని  కళ్ళు మూసుకొని దేనిపైన నైనా  దృష్టి పెడితే  అదిధ్యానం .యోగి కళ్ళుమూసుకొని ఇంద్రియ భావాలను దూరం చేసుకొంటాడు అప్పుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితి కలుగుతుంది కళ్ళు మూసుకోవటం అంటే యోగికి  అంతరేంద్రియమైన కన్ను ను తెరవటమే . అందరు రెండుకళ్ళతో ప్రపంచ వస్తువులు చూస్తే యోగి సర్వ దేహమూ కన్ను గా మారుతుంది సర్వ ప్రపంచం దర్శనీయమౌతుంది” .అని స్వామిరామా సందేహ నివృత్తి చేశాడు .
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46

  రఘు వీర చరితం -5(చివరిభాగం )
కావ్యం లో ఉపమాలంకారాలు ఎక్కువగా వాడాడు మల్లినాథుడు ..రామునిపై రాక్షసులు వేసేబాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లు న్నాయి   -”పయోద  బృందాన్ని సగర్జితాని ధారాదిపాతేరివ శైలరాజం ”ఇందులో బాణాలు ఉపమేయం ,వర్ధధార ఉపమానం .సమానధర్మం అభిపాతం .8వ సర్గ లో రూపకాన్ని చక్కగా ప్రయోగించాడు .రామ లక్ష్మణులు సుగ్రీవుని కలిశాక సోదరులను చూసి వానరారాజు మహా ముచ్చట పడ్డాడట అందం ముత్యాలరూపం లో పలువరుసనుండి వెలువడుతోంది అన్నాడు .చంద్ర కాంతి రాత్రి కలువ మనసు అతి తెల్లగా స్వచ్ఛ గంగా జలం  తనను  స్నానం చేయిస్తున్నట్లు ఉందన్నాడు  ఇక్కడ ముఖ వర్చస్సు చంద్రకాంతితో ,దంతాలు ముత్యాలతోను సామ్యం చెప్పాడు .9 వ అధ్యాయం లో సూరి యాకంగా రఘువంశంలో లాగా యమకాన్ని నింపేశాడు .ఈ యమకం దృత విలంబిత శ్లోకానికి  పరమ రామణీయకాన్ని తెచ్చింది -కమలినీ మాలినీ లిత పంకజం -శశమయం  శమయంత మనుక్షపం -స్తపురితం పురితం కవ చ సానుభిః  ”.మరొక చోట దృష్టాంతాలంకారం వాడాడు -భవిష్యత్తులో పెరిగే అవకాశమున్న శత్రువును  ముందే తుద  ముట్టించాలి -లేత మొక్కను గోటితోనే గిల్లేయవచ్చు ,కాలం గడిస్తే మొక్క మానై శాఖోపశాఖలై బలపడి పదునైన గండ్ర గొడ్డలితో ఛేదించాల్సి వస్తుంది -”రిపో రిభిః వ్యాజ్జిత వృద్ధే ఋత్యానమేవ ప్రధమం నిరోధ్యం -నఖ ప్రభేద్యే తు  తరు ప్రరోహే కాలేన కృష్టా హి కుఠార ధారా ”
అర్ధాంతరన్యాసాన్నికూడా  శరదృతు వర్ణనలో సమర్ధవంతంగా ప్రయోగించాడు .లక్ష్మణుడు రామునితో యుద్ధానికి వస్తానన్నాడు -పెద్దలను అనుసరిస్తే ఈ లోకం లోను ,పైలోకం లోను మంచిఫలితాలుంటాయి -”అను వృత్తి ర్గురూణాం హి లోకద్వయ ఫలప్రదా ”.  మరో చోట హనుమ తో -”నహి కృత్యవతామ్ చేతః  ప్రాయహ్ కర్మాంతర క్షమం ”అనిపిస్తాడు ..రాముని మాటలలో ఉత్ప్రేక్ష ను బాగా పలికించాడు ..సీత తనకు దూరమైతే వృక్షాలు కూడా కన్నీరు కారుస్తున్నాయి అని తుమ్మెదల రొద  రోదన ధ్వనిలా ఉందని ఉత్ప్రేక్షించాడు -”ఏ తేవత్ ప్రియతమా విహరాపకల్పం మమీ క్షమీ  క్షమా లిభిర్విహితా తేనాదః -ముజ్వంతి బాష్ప సలిలాని మహీరుహోపి పుష్పేద రస్రు తమరంద మిషేణ నూనం ”
  ఈ మహాకావ్యం లో సంఘటనలు ,పాత్రలు రామాయణం లో ఉన్నట్లే రాశాడు .కొత్తదారి తొక్కలేదు .హనుమ పాత్ర అంటే మల్లినాథునికి చాలా ఇష్టం అని పిస్తుంది .మొదటిసారిగా 8 వ అధ్యాయం లో హనుమ కనిపించి రామునికి అన్నిరకాల సాయం చేస్తానని చెప్పాడు .దీనికి రాముడు పరమాన0దం  పొందాడు  .హనుమను ధీరోదాత్తుడు,స0యమి   అన్నాడు .అతడు అరణ్యం లో ఉండటం రుద్రుని సేవించిన0త సంతోషంగా ఉందన్నాడు  .-”సర్వా తీతస్య వశినస్తవ శక్తిమతః ప్రభో-భైక్ష చర్యణా రుద్రస్య శోభతే వనవాసినా ”
  రామ హనుమల  స్నేహ బంధం అగ్ని సాక్షిగా  జరిగింది .రామకార్యాన్ని నిర్వర్తించమని జాంబవంతుడు హనుమకు హితోపదేశం చేశాడు .రాముడు విష్ణు అవతారమని ఆయన పూర్వ అవతారాలు తనకు తెలుసునని చెప్పాడు .సృష్టికర్త మొదటగా రాముని సృష్టించి ,తర్వాతే స్వాయంభువ ,మొదలైన మనువును సృష్టించాడని చెప్పాడు . 1 1వ అధ్యాయం లో హనుమ జన్మకు ముందున్న పరిస్థితుల వివరణ ఉంది .హనుమలో వాయు ,ఇంద్ర ,బ్రహ్మ వామన లక్షణాలు గుణాలున్నాయన్నాడు -”పితురివ బల వేగయో రముష్య స్థితి రామరాధిపతే రివారు తేజహ్ -కమల భావ ఇవోద్యసః సమాధౌ కపట బటోరివ కామ రూపతా ”.హనుమ యొక్క విశ్వాస ధైర్యాలు ,అనుమానాలను గొప్పగా వర్ణించాడు .హనుమ మహత్కార్యాలన్నీ వైభవోపేతంగా మిగిలిన అధ్యాయాలలో సంపూర్ణంగా వివరించాడు మల్లినాథుడు ..ఏతా  వాతా  తేలిందేమిటి అంటే ఇదిపేరుకి రఘువీర చరితమే కానీ అసలు హనుమ వీర చరితమా అన్నట్లు రాశాడనిపిస్తుంది .హనుమ శక్తి యుక్తులు బలపరాక్రమాలు రామునిపై గల అత్యున్నత భక్తి విశ్వాసాలు చాలా గొప్పగా సూరి వర్ణించాడు .మిగిలిన కావ్యాలలో ఉన్నట్లు వ్యర్ధమైన వర్ణనలేమీ చేయలేదు చక్కని కావ్యమర్యాదను సంయమనాన్ని పాటించి మల్లినాథ సూరి తన కవితాప్రతిభా సర్వస్వ0గా రఘువీర చరితమహాకావ్యాన్ని తీర్చి దిద్ది సెహబాష్ అనిపించుకున్నాడు .
              మల్లినాథుని శైలి ,ఊహా శక్తి
మల్లినాథుని శైలి ఊహా శక్తి ఎప్పుడూ ఆడంబరానికి గురికాలేదు కాళిదాస మహాకవిలాగా భారంకాని  దీర్ఘ0కాని   సంయుక్త పదాలనే వాడాడు కనుక మల్లినాథునిది వైదర్భి శైలి .సరళం గా సూటిగా ఉంటుంది .వాడిన అలంకారాలు తేలికైవై సులభగ్రాహ్యమైనవి కూడా క్లాసికల్ యుగానికి కొద్దీ దూరంగా మల్లినాథుడున్నాడు కనుక ఈ కావ్యం లో కృత్రిమతా ,పదాడంబరాలు లేవు .మల్లినాథుడికి ఆదర్శం కాళిదాసమాహా కవి .రాముని సీతా విరహవేదన రఘువంశం లో ఇందుమతీ విరహ వేదన పొందిన అజుని విరహ వేదన లా ఉంటుంది . సీత పాద భూషణాలు చూసి దుఃఖించటం విక్రమోర్వశీయం లో 5 వ అంకాన్ని గుర్తుకు తెస్తుంది .
  కాళిదాసు మానవ భావాలను సహజ విషయాలుగా భావించి చెప్పాడు .ప్రకృతికి ,మానవ ప్రకృతికి ఉన్నభావోద్రేక  సంబంధాన్ని తరచి  వివరించాడు .మల్లినాథుడు ప్రకృతిని మానవ భాషలో వర్ణించాడు పంపానదినిసుందర కన్యగా అభి వర్ణించాడు .మాల్యవంతుడు స్వర్గానికి తొందరపడి వెళ్లకుండా పంప  అడ్డు పడిందన్నారు .ఈ పట్టణం పంపాతీరాన పదభాగం లో ఉంది .అందుకని పర్వత పదాలను తాకి వేగం తగ్గించుకొన్నద ని భావం ..పాద శ్లేష నుపయోగించి పంపానాయకిపాత్రకు ఔచిత్యం ఘటించాడు .నదిపై మంచు ఆమె కనుబొమలఅల్లికలా ఉందట .నదిలోని తామరపుష్పాలుఆమె హస్తాలు ,కాళ్ళు  ముఖం ,కళ్ళు .సుడులు ఆమె బొద్దుపై వళులు  చక్రవాక ద్వయం ఆమె చనుకట్టు సౌందర్యం .-”ఉద్యతస్య దివం ప్రాప్తం నిరోద్రుమివ సదు  గతిం  -మహీ భూతొ మాల్యవతః పాదాశ్లేషం వితంవా తీ0 –  వీచీ భి ర్భూ లతా0  పా ద్యైహ్  పాణిపాద ముఖ క్షేణ 0 -ఆవర్త  నైనాభి విన్యాసం స్థనాశ్రయం” .
 లతలు చెట్లను పెనవేసుకొన్నప్పుడు రాముడు మరింత వియోగ బాధ పడ్డాడు .ఇక్కడే రామ లక్ష్మణుల సుదృఢ దేహ సౌష్ఠవ సౌందర్యాలను తనివి తీరా వర్ణించాడు .సాధారణంగా కావ్యనిర్మాతలు అనేక రసాలను కావ్యం లో పోషిస్తారు .ఆలంకారికుల సిద్ధాంతం ప్రకారం ఒకటే రసం శృంగార రసం అంగిరసంగా ,మిగిలినవి అంగ రసంగా ఉండాలి .ఈ  కావ్యం లో చాలా దృశ్యాలు యుద్ధ దృశ్యాలే .కనుక వీరరసమే ఇక్కడ ప్రధానం .మిగిలిన రసాలు సందర్భానుసారం పోషించబడ్డాయి .యుద్ధ భూమిలో పీనుగు కుప్పలు భయానకంగా భీభత్స రస ప్రధానంగా వర్ణించబడ్డాయి .రాక్షసులతో యుద్ధాలు భయానక రసాన్ని పోషించాయి ..
  రావణ వద్ద తర్వాత అందరు పుష్పక విమానం లో తిరిగి వస్తున్నప్పుడు దారిలో కనిపించిన వాటినన్నిటిని మల్లినాథుడు ఒకే అధ్యాయం లో వర్ణించి ఔచిత్యం పాటించాడు .రాక్షస గణాలు , ,గరుడ వేగ గమనం ,హనుమ ప్రత్యంగ వర్ణన లలో స్వభావోక్తి అలంకారమే ఉపయోగించాడు .వర్ణనీయ వస్తువుకు తగిన పదాలను ఎన్నుకొని సంపుష్ఠి సంతృప్తి కలిగించాడు .. తరువాతకవులలో ఉన్న అతిశయోక్తి పదాడంబరం మల్లినాథునిలో లేదు .కావ్యమంతా అతి నిదానంగా మెత్తగా ,అవసరమైన చోట్ల విగర్  పొగరు లతో సాగుతుంది .కాళిదాసాదుల లాగ మల్లినాథుడు మంచి శుభాషి తాలను ప్రతి వస్తూపమా లేక అర్ధాంతర న్యాసాలతో అందంగా   కావ్యం లో చెప్పాడు -1-పరిమా చేతు కరణేషు నాతి కాంక్ష్యా 2-అను వృత్త గురూణాం హి  లోక లోక ద్వయ ఫలప్రదా 3-అల్పేనాని నిమిత్తేన సౌభ్రాత్రం క్రియతే నృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే 4-నహి కృత్యవతామ్ చేతః ప్రాయహ్ కారమంటారాక్ష్మమం”
  దీనితో మల్లినాథుని ”రఘవీర చరితం”మహాకావ్యం పై విశేష విషయాలు సమాప్తం  

   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నోర్సేగాడ్స్

నోర్సేగాడ్స్

నోర్సే అంటే  నార్త్ అంటే ఉత్తర ప్రాంతం . అక్కడి ప్రజలను నోర్సే మెన్ అంటారు . వీరి భాష ఓల్డ్ నోర్సే భాష లేక ఐస్లాండిక్  భాష అంటారు  ఇది ఇండో యూరోపియన్ భాషలో ఉత్తర జర్మనీ భాష .ఈనాటి స్కాండినేవియన్ భాషకు ప్రాచీన భాష  వీరు మధ్య ,ఉత్తర స్కాండినేవియా దేశపు ఆటవిక సముద్ర సాహస జాతి .నార్వే ,డెన్మార్క్ ఐస్ ల్యాండ్  స్వీడన్  దేశాలవారిని అందర్నీ ఇదే పేరుతొ పిలుస్తారు వీరు మధ్యయుగాల  బ్రాన్జ్ యుగ ప్రజలు .విచిత్రంగా నోర్సే అంటే పడమటి నోర్సే అని అంటే ఐస్ లాండ్ లో స్థిరపడిన వారని అర్ధం రూఢ మైంది .వీళ్ళుఅమెరికా నార్మాండి  గ్రీన్లాండ్ ,స్కాట్లాండ్ ,ఐర్లాండ్ ,వేల్స్ లలో కాలనీలు ఏర్పరచారు వీళ్ళనే తూర్పు నోర్సే లనీ అంటారు వీళ్ళను డేన్స్ ,స్వీడిష్ లనీ అంటారు  .వీరు ఇంగ్లాండ్ ష్కాట్ ల్యాండ్ ,ఐస్ ల్యాండ్ వేల్స్ ఫారో ఐలాండ్స్ ఫిన్లాండ్ ,ఐర్లాండ్ రష్యా ,గ్రీన్ ల్యాండ్ ,ఫ్రాన్స్ ,జర్మనీ   బెల్జియం యుక్రేన్ ,జర్మనీ ,పోలాండ్ కెనడా ,దక్షిణ ఇటలీలలో ర స్థావరాలు ఏర్పాటు  చేశారు,పాలనా చేశారు  .వీరంతా వైకింగ్ లకు పూర్వం వారు

  వీరి సంస్కృతిని ”నార్డిక్ కల్చర్ ‘అంటారు . ఈ ప్రజలు యుద్ధ వీరులు వ్యవసాయ దారులు ,సముద్ర  దొంగలు ,అన్వేషకులు .మంచి వాణిజ్య నిపుణులు . జంతు రోమాలు అంటే ఫర్ అమ్మకాలతో కుబేరులయ్యారు .వాల్రస్ చేపల దంతాలు ,ద్రువపు ఎలుగుబంటి చర్మాలను రాజులకు అమ్మి పిచ్చగా సంపన్నులయ్యారు .వీరిది స్వతంత్ర ప్రవ్రుత్తి .ఎవరివద్దా బానిసలుగా కానీ పని కానీ చేసేవారుకాదు . గ్రామాలకు గ్రామాలనే  బందీ చేసి ప్రజలను బానిసలను చేసి అమ్మటం వీరి ప్రత్యేకత .బంగారం వెండి రాయి కలప లతో అద్భుత సృజనాత్మక  వస్తువులు చేసేవారు .ఇప్పటికీ ఇవి సజీవంగా ఉన్నాయి అయితే ఆడవారికి రాజకీయా ,న్యాయ విషయాలలో ప్రవేశం లేదు .వాళ్ళు పొలం పనులు చేపల పరిశ్రమ కే  పరిమితం భర్తలు వారాలు నెలలు సంవత్సరాలతరబడి ఇంటికి దూరంగా ఉంటె కుటుంబ బాధ్యత స్త్రీలదే ..కథలు చెప్పటం వీరిలో తరతరాలుగా వర్ధిల్లిన కళ ..నోర్సే  పురాణ గాధలను వీరుల చరిత్రలను కంఠతా వచ్చి తర్వాత తరాలకు ఆకధలను చెప్పి స్ఫూర్తి కలిగించేవారు . 13 శతాబ్దం దాకా వారికీ  లిఖిత సాహిత్యం లేదు .కధలు గాధలు కవితాత్మకం గా  చెప్పే వారంటే వారికి పరమ ఇష్టం .వీరిని ”స్కాల్డ్స్ ”అంటారు .వీళ్ళు పురాణ గాధల్ని ,హీరోల చరిత్రలను రాసి పాడి వినిపించేవారు
  నోర్సే  గాడ్స్ అంటే దేవుళ్ళు అందమైన ” ఆస్కార్డ్ ”అనే బంగారు భవంతులలో ఉంటారు . వీరిలో” ఓడిన్ ”దేవుడు ముఖ్యుడు  దీన్ని వేరేరకంగా చెప్పాలంటే నోర్సే పాంథియన్ లలో(దేవతా గణం  ) ఓడిన్ ముఖ్య అధిపతి ,అతని కొడుకు ”ధార్ ”ఉరుముల దేవుడు ”.ఫ్రే”  సంతానోత్పత్తి దేవత ఫ్రే కవల సోదరి  ఫ్రేయ  .పోడియం కు జంతు మానవ బలి ఇష్టం .ఇతని భార్య ఫ్రిగ్గా ” ముఖ్య దేవతా రాణి .ఈమె కొడుకు బాల్డర్ మంచితనం కాంతులకు దేవుడు కవిత్వానికి దేవత బ్రాగి .యుద్ధ దేవత ”టైర్ ”దేవతల దూత  ”వాలియంట్ హెర్మోడ్ ”..నోర్సే లు పాతాళ లోకం ఉందని దాన్ని  క్రూర రాక్షసులు పాలిస్తారని ,వారిలో ”లోకి ”చాలా ప్రమాదకరమమైన వాడని అతని కూతురు” హెల్ ”  చనిపోయిన  గౌరవం లేని చీకటి రాజ్య0 ” నిఫ్తీమ్” కు రాణి అని నమ్ముతారు . నోర్సే  దేవతలకు,  సాధారణ మానవులకు ”ఈవిల్  ఫ్రాస్ట్ జయింట్స్ ”నిరంతరం భయం బాధ కలిగిస్తారని భావిస్తారు  .ఇదంతా మన పురాణాలకథలే .పేర్లు తేడా అని పిస్తుంది .
  ఈ పురాణ గాధలకు ఆధారం పొయెటిక్ ఎడ్డా లేక ఎల్డర్ యెడ్డా.ఇందులోని కథలు సిగార్డ్  లేక్ సీగ్  ఫ్రెడ్ అనే  డ్రాగన్ కిల్లర్ అయినవీరుని   సాహస గాధలు . ఎల్డర్  ఎడ్డా లో విశ్వం పుట్టుక ,సకల గోల్డెన్ ఆస్కార్డ్ దేవతలు మరణించే డూమ్స్ డే వర్ణనా  ఉన్నాయి . అదే మన ప్రళయం లాంటిది .ఈ గాధాలహరి 1000 -1100 కాలం లో రాయబడింది .ఇదికాక మరో లిఖిత గ్రంధం ”యంగర్  ఎడ్డా ”ను 1200 లో కవి ,చరిత్రకారుడు ,రాజాస్థానం లో ఉన్న స్నోర్రి స్ట్ర ర్లు సన్ రాశాడు . దీన్ని వచన ఎడ్డా అని కూడా అంటారు ..ఇందులో కవులకు కావలసిన చిట్కాలతోపాటు ముఖ్య దేవతల వర్ణన వుంది . ఈ కాలం లో నోర్సే దేవతలైన ఓడిన్ ,ధార్ ,మొదలైన వారి కధలను వైకింగ్ లతో జోడించి చెబుతున్నారు .
  911 లో వైకింగ్ చీఫ్  హ్రాల్ఫ్ కు ఫ్రెంచ్ రాజు కొంత ప్రాంతాన్ని ఇచ్చేశాడు అదే నార్మండి  ..తర్వాత ఇంగ్లాన్డ్ ను ,ఇటలీ లో కొంత భాగాన్ని జయించాడు .. యుద్ధం లో చనిపోయిన నోర్సే  వీరులు దేవతాధిపతి ఓడిన్ కు ”వల్ల హల్లా ”లో అతిధులుగా ఉంటారని నమ్ముతారు ..ఇదే వారి  అమర వీరుల స్వ ర్గం .మనకూ ఇదే కద ఉన్నది కదా . ఇక్కడ అమర వీరులకు సకల సౌకర్యాలు ,”విందు ,మందు పొందు” లభిస్తాయి   .ఐస్ ల్యాండ్ లో 130 అగ్నిపర్వతాలున్నాయి 2010 లో ఒక వాల్కనో బ్రద్దలైతే దాని పొగయూరప్ దాకా  ఆకాశమంతా కమ్మేసి అనేక వారాలు విమాన ప్రయాణాలు రద్దయినాయి .నోర్సి మైథాలజీ ఇలాంటి భయోత్పాతాలవలన ప్రభావితమైనదే ..ఇంగిలీషు నిఘంటువులో వీళ్ళ మాటలు ఎన్నో చేరాయి .Enthral అంటే అతి నిశ్శబ్దంగా ఉండటం.లేక సంభ్రమంలో బందీ అవటం  .ఇది ఓల్డ్ నోర్సే పదం ”త్రాల్” అంటే బానిస నుంచి వచ్చిందే   వైకింగ్ ల డ్రాగన్ షిప్ లంటే శత్రువులకు టెర్రర్ ..వైకింగ్ లు మహా నావికులు . 1984 లో నార్వేజియన్ రెగ్నార్  దోర్ సేత్ తన కుటుంబం తో వెయ్యేళ్ళ నాటి” వైకింగ్ నార్  ”అనే నౌకలో గంటకు 16 కిలోమీటర్ల వేగం తో ప్రపంచాన్ని అంతటిని 2 ఏళ్లలో చుట్టి  వచ్చాడు  .    వారానికి ఆంగ్లం లో ఉన్న ట్యూస్  డే  వెన్స్ డే దర్స డే ఫ్రై  డే రోజులు కూడా నోర్సే  దేవ భాషా జన్యాలే -టైర్(టియు )ఓడిన్ (వోడేన్ ) ధార్ ,ఫ్రిగ్గా లకు సాంకేతికాలు టైర్ యుద్ధ దేవత ,ఓడిన్ దేవాధిరాజు ,ఇతనికొడుకు ధార్  ఫ్రిగ్గా  ఓడిన్ భార్య క్వీన్ ఆఫ్ గాడ్స్ .ధార్ ప్రజా దేవత వైకింగ్ వీరుల ఆరాధ్య దేవత .ఒక గాధ ప్రకారం హాటిల్దా  ది హన్ ఒక నది ఒడ్డున 434 లో టైర్ దేవత యొక్క  భూమిలో పాతబడి ఉన్న ఖడ్గాన్ని  గుర్తించి  బయటికి తీశాడు . రోమన్ ,గాల్  అంటే నేటి ఫ్రాన్స్ సామ్రా జ్యాలకు హాటిల్దా  అతని బార్బేరియన్ గుంపు అంటే సింహస్వప్నం ..
  స్కాండినేవియాలో రాత్రివేళల్లో ఆకాశం ప్రకాశమానంగా ఉన్నప్పుడు ఫ్రిగ్గా దేవత రాట్నాన్ని నక్షత్రాలలో చూడవచ్చు నని చెబుతారు .దీన్నే గ్రీకులు ఓరియన్ బెల్ట్ నక్షత్ర సముదాయం అన్నారు ..ఓరియన్ అంటే గ్రీకు పురాణ వీరుడు .యితడు చంద్ర దేవత  ఆర్టిమెస్ చేత  చంపబడ్డాడు  . 1903 లో ఒక నార్వేజియన్ రైతు పొలం లో ఓక్ తో చేయబడ్డ వైకింగ్ షిప్ ఓస్ బెర్గ్ భూమిలో లోతుగా తవ్వితే బయట పడింది . ఆ షిప్ లో అందంగా వస్త్రాలంకరణ చేసుకొన్న ఇద్దరు యువతుల శవాలు కొన్ని విలువైన వస్తువులు ఒక బకెట్ నిండా ఆపిల్ పళ్ళు కనిపించాయి ఆపిల్ పళ్ళు సంతానానికి చిరాయువుకు చిహ్నాలు  .ఓడిన్ దేవతకు” స్వస్తికా ”చిహ్నానికి సంబంధం ఉంది ఈ చిహ్నం డెన్మార్క్ లో ఆంగ్లో సాక్షం రాజుల ఖడ్గాలపిడి పై కనిపించింది .ఈ చిహ్నం ఉంటె యుద్ధం లో విజయం తధ్యమని నమ్మిక .20  వ శతాబ్దం లో జర్మనీ నాజీలు స్వస్తికా ను తమ జండా చిహ్నంగా స్వంతం   చేసుకొన్నారు
  నార్డిక్ ప్రజలు దేవతలకు గుర్రాలను బలి ఇచ్చేవారు ..రోమ్ లో పూర్వం రథాల పోటీ ఫీల్డ్ ఆఫ్ మార్స్ అనే చోట ప్రతి అక్టోబర్ లో జరిగేది .గెలిచిన టీమ్ రైట్ హాండ్ హార్స్ ను మార్స్ దేవతకు  మంచి పంట కోసం బలి ఇచ్చేవారు .ఇక్కడ ఒక తమాషా విషయం జ్ఞాపకానికి వచ్చింది .ఈ మధ్య  మైనేని గారు పంపిన హారీ .జి ఫ్రాంక్ఫర్ట్ రాసిన ”రీజన్స్ ఆఫ్ లవ్ ”చదువుతుంటే అందులోగ్రీకు తత్వవేత్త గణిత శాస్త్రజ్ఞుడు అరిస్టాటిల్” 2 కు వర్గమూలం రేషనల్ నంబర్ కాదు”అని తాను రుజువు చేసినందుకు అమితానందపడి ఆయన మత క్రియలను బాగా ఆచరించేవాడుకానుక వెంటనె తన అను అనుచరుల్ని 100 ఎద్దులను దేవతకు బలి ఇప్పించాడని ,ఆతర్వాత అప్పటినుంచి ఏ శాస్త్రజ్ఞుడు కొత్త విషయాన్ని కనిపెట్టినా  తమ ప్రాణాలు అన0త  వాయువుల్లో కలిసిపోతాయేమోనని ఎద్దులు వణికి పోయే వని  చమత్కరించాడు రచయిత..ఇందులోనే మరో విషయం ప్రముఖ శాస్త్ర వేత్త నీల్స్ బోర్ చెప్పిన ట్లు ప్రచారం లో ఉన్న  ”  one should never speak more clearly than one can think ” సూక్తి నచ్చింది
 అడవి పంది  అంటే పూర్వ నోర్సేలకు మహా గౌరవం .అది చాలా ప్రమాదకర ,కపట జంతువు . దాని వాడియైన దంతాలు మనుషుల్ని ,కుక్కల్ని గుర్రాల్ని చీల్చిపారేస్తాయి .అడవి పంది  తలకాయను నార్థన్ కింగ్స్ ,వీరులు టోపీ గా పెట్టుకునేవారు .అది వీరత్వానికి ఘనమైన చిహ్నం  . danelawఅనే పదం ఒకప్పుడు బ్రిటిష్ ఐ ల్స్  లో వైకింగ్ లున్న ప్రాంతాలకు గుర్తుగా వాడేవారు .తర్వాత కాలాంతరం లో స్కాండినేవియన్ శబ్దజాలం లో  law, bylaw ,outlaw పదాలు ఏర్పడి  అవే  ఇంగ్లీష్    పదాలుగా వాడబడుతున్నాయి  .కెనడాలో నోర్సే కాలనీ స్థాపించిన ప్రముఖులలో” ఫోర్బ్ జర్నర్న దొట్టిర్”ఒకామె . 11 శతాబ్ది మధ్యలో ఆమె రోమ్ పర్యటన చేసి0ది  పోప్ తో సెటిల్ మెంట్ గురించి మాట్లాడి ఉంటుంది అంటారు .కనుకనే తర్వాత కేథలిక్ బిషప్ నుగ్రీన్ ల్యాండ్ లో ఏర్పాటు చేశారని ఆయన కింద ఐస్ లాండ్  లోఅప్పటికి  పేరు పెట్టని ప్రదేశాలు కూడా ఉన్నాయని భావిస్తారు . ప్రపంచం లో ”లౌడెస్ట్  బాండ్ ”   వైకింగ్ ఫ్లైర్ గా గిన్నెస్ బుక్ లో చోటు చేసుకొన్నది.వారి  ” సన్  ఆఫ్ ఓడియన్  ఆల్బమ్”   ను 2006 లో,గాడ్స్ ఆఫ్ వార్ ఆల్బమ్ 2007 లో విడుదలయ్యాయి
  సాహిత్యం లో హేన్రి రైడర్ హెగ్గర్డ్ ప్రసిద్ధ రచయిత.అతని కింగ్ సా ల్మన్ మైన్స్,షి నవలలు గొప్ప పేరుపొందాయి .జె ఆర్ ఆర్ టోల్ కెన్ అనే బ్రిటిష్ రచయితతన హాబీబిట్ ,లార్డ్ ఆఫ్ రింగ్స్ నవలలో నోర్సే కధలకు అందమైన రూపం ఇచ్చాడు .కాలిఫోర్నియాలో లేక్ టాహో వద్ద ”వైకింగ్స్ హోల్మ్ కాజల్ ఉంది దీన్ని 1929 లో స్వీడెన్   ఆర్కిటెక్ట్   లోరానైట్ నిర్మించాడు  నీల్ గయమన్అనే అమెరికన్ రచయిత రాసిన అవార్డు నిన్నర్  రచన ”అమెరికన్ గాడ్స్ ”లో పాత్రలందరూ పాత నోర్సే  దేవతలకు ఆధునిక పెర్సనానిఫికేషన్స్   నోర్సే  దేవతలైన  ధార్  ,మొదలైన వారి పేర్లు ఇప్పుడు వీడియో గేమ్స్ ,కామిక్స్ ,టివి షో లలో దర్శన మిస్తూ .నోర్సే  దేవతలను చిరంజీవులు చేస్తున్నారు ..లాంగ్ లివ్ నోర్సే  గాడ్స్ ”
Inline image 1Inline image 2Inline image 3Inline image 4
   మీ –  గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -45

      రఘు వీర చరితం -4

పదవ అధ్యాయం లో శరదృతు వర్ణన చేశాడు మల్లినాథుడు . సుగ్రీవుని తాత్సారం పై మొదట్లో రాముడు సందేహించినా ఆతర్వాత రావణ సంహారానికి సుగ్రీవుడు అనంత వానర సైన్యాన్ని సిద్ధం చేశాడని తెలిసి సంతోషించాడు .విజయం హనుమవల్లనే సాధ్యమని రాముడు హనుమతో అన్నాడు .తన అంగుళీయకాన్ని హనుమకిచ్చి  సీతాదేవికి ఇవ్వమన్నాడు ..ఆమె తో చెప్పవలసిన విషయాన్ని వివరించి చెప్పాడు .వానర సైన్యం దక్షిణానికి కదిలి సముద్ర తీరం చేరింది .అప్పుడు హనుమ వానర నాయకులతో తాను  విష్ణు మూర్తి అనేక అవతారాలకు  ప్రత్యక్ష సాక్షి నని  అని చెప్పి వానరులకు ఆశీస్సులు పలికాడుహనుమ .
 11 వ అధ్యాయం లో లంకకు ప్రయాణమయ్యే హనుమ వైఖరిలో భిన్నత్వం గోచరిస్తుంది  .ఖగోళ దివ్య మూర్తులందరు హనుమ విజయాన్ని కాంక్షించి శుభం పలికారు .హనుమ సముద్ర  లంఘనంవిష్ణుమూర్తి  ఆదివరాహం ను జ్ఞప్తికి తెస్తుంది ..దారిలో ఆయన చేసిన సాహస కృత్యాలు లంకలో ప్రవర్తించిన తీరు కవితాత్మకంగా సూరి వర్ణించాడు .సీత జాడ ఎక్కడా కనపడనందున కొంత నిరాశ చెందాడు .సేవకునిగా కర్తవ్యమ్ చేయలేకపోయానని బాధ పడ్డాడు -ఫల్ల0తి చే త్స్వామి గుణా హ్ సమస్తాః క్రియా విమూడా యది భృత్య దోషాహ్ -నిరంతర కలేశనిదాన భూతా దిగీ దర్షిం కిడంకర తమానాయాం ‘. ఆత్మా న్యూనతా భావం తో ఆత్మహత్యకూ సిద్ధమయ్యాడు . మళ్ళీ స్థిర చిత్తుడై సీత ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీరుతాను అనుకున్నాడు ..అశోక వనం లో రాక్షస స్త్రీల మధ్య దీన వదనం తో ఉన్న స్త్రీని చూసి సీతా దేవి యే అని నిర్ణయానికి వచ్చాడు .
   13 వ అధ్యాయం సీతాంజనేయ సంభాషణం .సీతాపహరణం దగ్గర నుంచి జరిగిన విషయాలు హనుమ సీతకు వివరించి చెప్పాడు .సీతా విరహం తో రాముడు పొందిన వేదనను వివరించాడు .ఒకసారి నెమలి ఈకలను చూసి సీత తలలో అలంకరించుకున్నరాలిన  పుష్పాలుగా  భ్రమించి వెంటపడ్డాడని చెప్పాడు .సీత లేని రాముడు రాముడు కాదన్నాడు .సీతను చూడటానికి మాత్రమే లంకకు తానూ రాలేదని రామ ముద్రికను ఇచ్చి ఆమెకు సంతృప్తి కలిగించటానికి వచ్చానని అన్నాడు ..తనపై దయ చూపమని .ఆమె గుణ గణాలను సంబోధన ప్రధమా విభక్తిలో వర్ణించాడు -”స్వామిని స్థిర శుచి వ్రతే సతీమార్గ సంచరణా పూర్వ గామిన్ -విప్ర యుక్త రఘునాధ జీవిత మ్లాని హరిణి  దశా పునీహి మామ్ ”.
  సీతా దేవి కాకాసుర వృత్తాన్తమ్ జ్ఞప్తి చేసి తనను అలక్ష్యం చేయట0 తగదని  ప్రార్ధించి చెప్పానని చెప్పమన్నది .తర్వాత లంకాదహనం మళ్ళీ అంగదాదులతో రామ సుగ్రీవ సందర్శనం  సీత ఇచ్చిన చూడామణి రామునికివ్వటం ,అందరు లంకపై దాడికి సిద్ధమై సముద్ర లంఘనం చేయాలనుకోవడం నలుని నాయకత్వం లో వారధి నిర్మించటం వర్ణితం .
 14 వ సర్గ లో లంకలో రాక్షస వానర భీకర యుద్ధం ,విద్యుజ్జి0హుడు ఒక భూతాన్ని సృష్టించి వానరులను భయపెట్టటం ,మాయ రామ  తలకాయ తెచ్చి సీతను బెదిరించటం .నాగ సైన్యాన్ని రామ సైన్యంపై ఉ సిగొల్పటం గరుత్మంతుడు దీన్ని ఛేదించి కాపాడటం గరుత్మంతుడు రావణ కుటుంబ సర్వ నాశనాన్ని ఊహించి చెప్పటం ,తర్వాత ఎన్నో క్షిపణులతో ఘోర సంగ్రామం జరగటం కుంభకర్ణ వద్ద తో సమాప్తం .
  16 వ అధ్యాయం రావణ సేనానులైన అతికాయాదుల  మరణం ,ఇరువైపులా అనేక యోధుల హతహమ్ మేఘనాధుడు యుద్ధానికి రావటం భయంకర యుద్ధం లో వానరులు వీరోచితంగా పోరాడటం హనుమాన్ వానరులకు ఉత్సాహం తెప్పించటం బ్రహ్మాస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే లక్ష్మణుడు దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేయటం ,కుంభకర్ణ ఇంద్రజిత్ వగైరా చనిపోయాక రావణుడు సూటిగా  రాముని తో తలపడటం ,రావణుడు మంత్రం శక్తిని ప్రయోగించి రామునిపై వేయటం ,అగస్త్య ముని వచ్చి సూర్య తేజం తో విఫలం చేయటం ,రాముడు దశ కంఠ  రావణ శిరచ్చేదం చేయటం -”శిరామి తత్స లూనాని తేన సర్రవాని రేజిరే -శిఖర ణీవ నీలాద్రే ధాతు లిప్తాని వాజిణా ” రవాణా సంహారణాన్తరం శివ బ్రహ్మాది దేవతలు వచ్చి రామ పరాక్రమాన్ని ప్రస్తుతించటం ,సీత అగ్ని పునీత యై రావటం ,విభీషణుని లంకా పట్టాభిషేకం ,హనుమంతుడు తెచ్చిన పుషప్పక  విమానం లో అందరు ఎక్కి అయోధ్యకు బయల్దేరటం తో పూర్తి .
  17 వ అద్యాయం లో ఆకాశ విమాన ప్రయాణం ముఖ్యమైన ప్రదేశాలు రాముడు సీతకు చూపించటం ,వింధ్యపర్వతాలు ,పంపానది మతంగ ముని ఆశ్రమం  గోదావరినది ,పంచవటి భరద్వాజ,శరభంగా శ్రమాలు ,పవిత్ర గంగా యమునా సరయు నదులు,చిత్రకూట పర్వతాదులు చూపిస్తూ గాధలను వివరించి చెప్పాడు రాముడు సీతకు . రాముడు అయోధ్యలో కాలుపెట్టగానే ప్రజలు సంతోషం తో బ్రహ్మ రధం పట్టటం  ,కౌసల్యాది మాతలు గురువు వశిష్ఠమహర్షి మంత్రి సుమంత్రుల పరమానందం ,వసిష్ఠ మహర్షి ఆధ్వర్యం లో సర్వ సాగర నదీ జలాలతో అభిషేకించి శ్రీ రామ పట్టాభిషేకం చేయటం తో రఘువీర చరిత కావ్యం సమాప్తమవుతుంది. .
  రఘువీర చరితం మహాకావ్యం లో ముఖ్య విశేషాలు
1-ఇతర మహా కావ్యాలలాగానే వాల్మీకి రామాయణం ఆధారం గా రాయబడింది
  2- కావ్యమర్యాదలన్నీ పాటించి వర్ణనలు చేశాడు సుతీక్ష్ణ ఆశ్రమం దండకారణ్యం అగస్త్యాశ్రమం పంచవటి వర్ణనలు మహా కవి లాగా మల్లినాథుడు చేశాడు ప్రకృతి  వర్ణనలకు ”కులక ”శ్లోకాలను .చక్కగా ఉపయోగించాడు .
3-ప్రతి అధ్యాయం లో ఒక్కొక్క ప్రత్యేక ఛందస్సును ఉపయోగించాడు .అధ్యాయం చివర ఒకటి రెండు శ్లోకాలను వేరేఛందస్సులో రాశాడు
4-సాధారణం గా మహా కావ్య నాయకుడు దివ్య క్షత్రియ వంశ సంజాతుడై ఉంటాడు కానీ ఇందులో శ్రీరామ ,లక్ష్మణ ,,హనుమ లు ముగ్గురూ నాయకులే అవటం విశేషం
5-కావ్యం లో అనేక అలంకారాల శోభ ఉంటుంది..శబ్దాలంకారమైన అనుప్రాస ఒక శ్లోకం లో మహా ,హర్ష ,సమ్ ,ద్ ,నిశ్చిత్ అనే పదాలు పునరా వృత్తమై,కొత్తరకమైన అందమైన ప్రాస కు జీవం పోసింది   -”తయేతి  నిశ్చిత్య స నిశ్చితాయోమ్ మహీయ సస్తత్య మహేంద్ర వీర్యహ్ -ప్రహర్ష వర్షేన్దుర  ధీర్మ  హర్షే రుపాశదంత  పాద సరోజ రేగుణం ”  .
  సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )

మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )

1322లో పారిస్ లో  అయిదుగురు మహిళలనులైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారని  అరెస్ట్ చేసి విచారణ జరిపారు . అందులో జాక్వెలిన్ ఫెల్సీ అల్మెనియా ను రోగులను పరీక్షిస్తూ నాడి  చూస్తూ  మూత్రపరీక్ష చేస్తూ ,వాళ్ళ అవయవాలను ముట్టుకొంటున్నందుకు విచారించించగా ఎనిమిదిమంది రోగులు ఆమె వల్లనే తమ జబ్బులు నయమయ్యాయని మగ డాక్టర్లు చేయలేని పని ఈమె చేసిందని సాక్ష్యమిచ్చారు .కానీ జడ్జి మాత్రం ”ఆడవాళ్లకంటే మగ  డాక్టర్ జబ్బుల్ని బాగా నయం చేస్తాడు ”అని చెప్పి ఆ అయిదుగురు  మహిళలను చర్చిలో ప్రార్ధన చేయరాదని వాళ్ళు చచ్చాక నరకానికి పోతారని   బహిష్కరించాడు .
  ఫ్రెంచ్ సర్జన్ గైడి చలియాక్ డాక్టర్లకు కొన్ని నియమాలు సూచించాడు -నిరంతరం నేర్చుకోవాలి  మర్యాద గా మన్ననగా ఉండాలి ,కస్టపడి పని చేయాలి ,పేద ధనిక భేదం లేకుండా వైద్యం చేయాలి .రోగి డబ్బు ఇస్తే తీసుకోవాలి . వద్దు అనరాదు .ఇవ్వకపోతే అడగరాదు . చికిత్స సమయం లో విన్నది అంతా  రహస్యంగా నే ఉంచాలి ”
  ఆ కాలం లో అనాటమీ  ఫిజియాలజి లను పుస్తకం చదివే తెలుసుకునేవారు విద్యార్థులు .కోసి చూస్తే కొత్తగా తెలుసుకొనేది ఉండదని అభిప్రాయం ..ప్రిన్స్ ఆఫ్ మెడిసిన్ అని పిలువబడిన గాలేన్  దృష్టిలో మానవ శరీరం లో ప్రతి భాగాని కి ఒక ప్రత్యేక కర్తవ్యమ్ ఉంది .అని చెప్పాడు .గాలెన్ ను ప్రశ్నిస్తే దేవుడిని ప్రశ్నించినట్లే అని మతాధికారులు హెచ్చరించేవారు  . 4 వ శతాబ్దిలో అభిప్రాయాలు మారి కొత్తవాటికి స్థానం లభించి బొలోనా యూనివర్సిటీ లో మొదటిసారిగా డిసెక్షన్ ను విద్యార్థులు చూసే అవకాశం కలిపించారు .. తర్వాత వారే డీసెక్ట్ చేసే స్థితి వచ్చింది   సర్జన్ గై డి చాసిలియా చాలా వైద్య గ్రంధాలు రాసి ,అనాటమీ జ్ఞానం అనేది పుస్తకాలు చదివి సంపాదించవచ్చు  డీసెక్ట్ చేసి సంపాదించవచ్చు అని తెలియ జేయటం తో దృక్పథమే మారి పోయింది .జాన్ ఆఫ్ సాలిస్ బరి డాక్టర్లను ”రోగి జబ్బుతో ఉన్నప్పుడే మీ ఫీజు నొక్కేయండి వాడు ఛస్తే మీ నోట మట్టే ”వంటి హెచ్చరిక చేశాడు .మెదడు లో రక్తం గడ్డ కట్టితే జలగలను అతికించి చెడు  రక్తం పిండించేవారు .మనవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు .కంటి రెప్ప మీద గడ్డ లేస్తే సమానపాళ్ళలో  ఉల్లి వెల్లుల్లికలిపి నూరి సమపాళ్లలో వైన్ , ఎద్దు పిత్తాశయ సారం కలిపి దానిలో పైన తయారు చేసిన చూర్ణం కలిపి ఇత్తడి పాత్రలో పెట్టి తొమ్మిది రాత్రులు ఉంచి గుడ్డతో వడపోసి రాత్రిపూట పక్షి ఈకతో దీన్ని కంటి రెప్పపై లేచిన కురుపు పై  అద్దాలి .అది చక్కగా పని చేసి కురుపు మటుమాయం అయి ఆశ్చర్యం కలిగించేది .
బ్లాక్ డెత్ అని పిలువబడే ప్లేగు నుండి బతికి బయట పడటం ఉండేదికాదు దైవ చేస్ట గానే  దాన్ని భావించేవారు ,1365 లో దీనిపై జాన్ ఆఫ్  బర్గండి ఒక పుస్తకం రాశాడు .అందులో ప్లేగు బారినుంచి తప్పించుకోవటానికి ఎక్కువగా తినద్దు తాగద్దు స్నానం మానేయాలి ,చలికాలం లో  వేడికోసం  మంటలు వేసుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెర్ ఫ్యూమ్స్ పీల్చి వెళ్ళాలి వేసవిలో ప్లేగు వస్తే చల్లని పదార్ధాలు తినాలి తిన్నదానికంటే ఎక్కువగా నీళ్లు తాగాలి ,మిరియాలు ,ఉల్లి వెల్లుల్లి వంటి వేడిని ఎక్కువ చేసే వస్తువులను వాడరాదు ,పిల్లలు తలిదండ్రులను ఎదిరిస్తున్నందున దేవుడు వాళ్ళని తీసుకు పోవటానికే  అంటురోగాలు కలిగిస్తున్నాడు ”అని హెచ్చరించాడు  .తరువాత  తరువాత ప్లేగు రోగులను విడిగా దూరం గా ఉంచటం ,ఇంట్లో ఎలుకలు చావటానికి మందుగాస్ పెట్టటం వచ్చాయి .పరిశుభ్రత పాటిస్తే కొంతనయ0 .
  కాంటర్ బరి స్టోరీస్ లో చాసర్ శరీరం లోని నాలుగు హుమర్స్ గురించి కవిత్వం చెప్పాడు .గ్రీకులు మానవ శరీరం లో నాలుగు మూల  ద్రవ్యాలు  ఉన్నాయని అవి  సమాన పాళ్ళలో ఉంటె   శరీరం ఆరోగ్యంగా ఉంటుందని బాలెన్స్ తప్పితే రోగాలు వస్తాయని చెప్పారు . అవే  బ్లాక్ బైల్   ,ఎల్లో బైల్ ఫ్లీజిం అనే కఫము ,రక్తం ,మన ఆయుర్వేదం లోనూ వాత  పిత్త  కఫ  రక్తం  ఉన్నాయి . .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

మధ్య యుగాల వైద్య విధానం -1

మధ్య యుగాల వైద్య విధానం -1

గ్రీకు ,రోమన్ సామ్రాజ్య హవా  ఒక వెయ్యేళ్ళు అంటే క్రీ పూ. 1500 నుంచి క్రీ.  శ . 400 వరకు సాగింది  గ్రీకుల” హిపోక్రటీస్”  ,రోమన్ల” క్లాడియస్ గాలేన్”లు అప్పుడు గొప్ప వైద్యులు  ఈ రెండిటి పతనం తర్వాత 5 వ శతాబ్ది ప్రారంభ0 నుంచి మరొక వెయ్యేళ్ళ కాలాన్ని  మధ్యయుగాల అన్నారు .మధ్యయుగాలలో మొదటి వైద్యుని వైద్య పిత అని రెండవ ఆయనను వైద్య యువరాజు అన్నారు ..ఇద్దరు గొప్ప వైద్య గ్రంధాలు రాశారు ఏవ్ మధ్యయుగాలకు ఆదర్శమైనాయి ఈజిప్టు ఇండియా ,చైనా  వైద్య గ్రంథాలెన్నో అనువాదం పొందాయి .కుటుంబ స్త్రీలే చిన్న చిన్న జబ్బులు నయం చేసేవారు .వీరికి పరంపరాగతంగా వచ్చిన వైద్య విజ్ఞానం తోడ్పడింది ..పక్షవాతం వస్తే సూర్యాస్తమయం తర్వాత మీద వద్ద చిన్న గాయం పెట్టి రక్తాన్ని బయటికి పంపి  మూడుసార్లు నీటితో పుక్కిళింపజేసి మంత్రాలు చదివి నయం చేసేవారని 900 లో రాయబడిన ఆంగ్లో సాక్సన్  రెమిడీస్ అనే పుస్తకం లో ఉంది . అంటే వైద్యం లో మందు ,మతం కలిపి ఉండేవన్నమాట ..డామియన్ ,కాస్మస్ వైద్య దేవతలయ్యారు వాళ్ళు సైలీషియా కు చెందిన సోదరులు మన అశ్వినీ దేవతలులాగా .వాళ్ళు అద్భుతాలు చేస్తారని ఒక నల్లవాడికాలు ను తీసి గాయం తో దెబ్బతిన్న తెల్లవాడి లాలికి అమర్చిన అద్భుత శక్తి వాంతులని నమ్మేవారు ..భారత దేశం లో ఆయుర్వేదం అప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండేది శాస్త్ర చికిత్సలు దిగ్విజయంగా చెయ్య గలిగే వారు . 1793  లో ఇద్దరు  ఆంగ్ల సర్జన్లు ఇలాంటి ఆపరేషన్ ను చూసి బ్రిటిష్ దేశానికి ఆ విధానమంతా రాసి పంపించి అలా చేయమని తెలియ జేశారట ..కౌస్జీ అనే ఆయన ఇంగ్లిష్ ఆర్మీ కి వైద్యుడుగా ఉండేవాడు .ఈయన్ను భారత రాజు బందీ చేసి మోసం నేరం మీద ఒక చెయ్యి ,ముక్కు కోయించాడు  . భారతీయ శస్త్ర వైద్యులు అతని ముఖ చర్మాన్ని తీసి ముక్కుకు అమర్చి సరిచేశారు .ఇంగ్లిష్ సర్జన్లు ఈ అమోఘ గ్రాఫ్టింగ్ విధానాన్ని ముక్కున వేలేసుకొని చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,ఆ విధానాన్ని పూస గుచ్చినట్లుగారాసి బ్రిటన్ రాజుకు పంపి అక్కడ అమలు చేయమని చెప్పారట  .భారతీయ వైద్యం లో వైద్యులు రోగికి సంబంధిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేసేవారు .చరక సంహిత వైద్య గ్రంధం లో మర్యాద ,మంచితనం తెలివి తేటలు ,వ్యక్తిత్వ్వం  వైద్యం లో నేర్పు ఉన్నవాడే గొప్ప వైద్యుడు అని ఉంది .ఏ మొక్కా వృధా కాదు .ప్రతిదానిలో వైద్య గుణాలున్నాయని తెలుసుకొని వనమూలికలు మందులలో వాడేవారు ..
  చైనాలో హాన్ డైనాస్టీక్రీ.పూ. 200 నుంచి  క్రీ శ200 వరకు ఎన్నో వైద్య గ్రంధాలు రచింప బడ్డాయి .చైనా వైద్యులు ”చి ” వాళ్ళభాషలో ”క్వి ”అనేది వైటల్ ఎనర్జీగా నమ్మేవారు .అలాగే శరీరం లోని ”యిన్ ”మరియు ”యాంగ్ ”లు సమ తుల్యం లో ఉండాలని చెప్పేవారు .ఈ రెండు మన చుట్టూ ఉంటాయని ,కానీ అవి కాంతి -చీకటి లాగా  చలి-వేడి లాగా శీతాకాలం -వేసవికాలం లాగ పరస్పర వ్యతిరేకంగా శక్తి వంతంగా ఉంటాయని భావించేవాళ్లు ..కనుక డాక్టర్లు పేషేంట్ లను ఈ రెండిని ఎలా బాలన్స్ గా ఉంచుకొని ఆరోగ్యం కాపాడుకోవాలో చెప్పేవారు ..క్రీ పూ. 400 లోరాయబడిన  ”ఎల్లో ఎంపరర్ మాన్యువల్ ”లో వీటి గురించి ఉంది ..శరీరం వెలుపల యాంగ్ ఉంటుంది .లోపల యిన్ ఉంటుంది ..కాలేయం గుండె ,ప్లీహం (స్ప్లీన్ ),ఊపిరి తిత్తులు ,మూత్ర పిండాలు యిన్ కు చెందినవి .మిగిలిన అయిదు ఖాళీ భాగాలు ,గాల్ బ్లాడర్ ,,ఉదరం ,లోపలి ప్రేవులు వగైరా యాంగ్ వి .స్ప్రింగ్ లో వచ్చే వ్యాధులకు కారణం యిన్ అధీనం లో ఉన్నవాటివల్లా ఆటం లో జబ్బులు యాంగ్ ప్రభావ భాగాల్లో వస్తాయి .ఆకు పంక్చర్ వైద్యం తో ఈ రోగాలు నివారిస్తారు .
   మధ్య యుగాలలో క్రైస్తవ ,మహమ్మదీయ మతాలు విద్య రంగం లో గణనీయ  సేవ చేశాయి ..మొనాస్టరీలు వైద్య గ్రంధాలను భద్రపరచాయి ”రోగి సేవ అన్నిటికంటే ప్రధానం ”అని బెనా డికేటైన్ మాంక్స్ చెప్పేవారు . మాంక్స్ కు చికిత్స మొనాస్టరీలలోనే చేసేవారు .శరీరం లో ప్రతిభాగం లో ఒక సెయింట్ ఉంటాడని అక్కడ జబ్బు రావటానికి కారణం మౌతాడని నమ్మేవారు .వెన్ను నొప్పి వస్తే సెయింట్ లారెన్స్ ను , ప్లేగు జబ్బుకు సెయింట్ సెబాస్టియన్ ను ప్రార్ధించేవారు .పంటినెప్పికి సెయింట్ అప్పొల్లోనియా  .ఈ పే ట్రన్ సెయింట్ ను మతం మార్చుకోనందుకు రాజు అన్ని పళ్ళను పీకించి హింసించాడట .బాల్యం లో బిడ్డల్ని కనేవాళ్ళు సెయింట్ మార్గ రెట్ ఆఫ్ యాంటి  యోక్  ను ,ప్రార్ధించేవారు .ఒకసారి ఒక దెయ్యం మార్గరెట్ ను మింగేస్తే ,ఆమె కడుపులోనే క్రాస్ చిహ్నాన్ని గీసిందని అదే తర్వాత క్రైస్తవ మత చిహ్నం క్రాస్ కు మూలమని    ఆ దెయ్యం కడుపు చీల్చుకుని  సెయింట్ మార్గ రేట్ బయటికి వచ్చిందని నమ్మేవారు
  1000-1300 కాలం లో  యూరప్ వాతావరణం బాగా ఉంది మంచిపంటలు ,పండటానికి కావలసినంత వర్షాలు ప్,అనుకూల ఉష్ణోగ్రత కలిగి ఉండేది .భూస్వాములు అధిక పంటలతో బలిసిపోయారు .సంపన్ను లైన వీరు చర్చి లలో బిషప్పులు  అబ్బట్ లయ్యారు .  తమ దగ్గరున్న ధనాన్ని అద్భుత కెదెడ్రల్ విద్యాలయ వైద్యాలయాల నిర్మాణం చేశారు . 1110 లో పారిస్   1158 లో బొలోనా,1167 లో ఆక్స్ ఫర్డ్ ,1209 లో కేం బ్రిడ్జి ,1222 లో పావుడా లలోయుని వర్సిటీలు నిర్మించి వైద్యానికి ప్రాముఖ్యమిచ్చారు మోదట్లో స్త్రీలకూ ప్రవేశార్హత ఉండేదికాదు .చర్చి వ్యతిరేకించేది . మగవారు వ్యతిరేకించేవారు కానీ క్రమంగా  వారు పోరాటాలల్తో స్థానం సాధించి చదివి డాక్టర్లు సర్జన్లు అయ్యారు . 1250 లో లండన్ లో కేథరిన్ అనే ఆమె మొదటి మహిళా సర్జన్ గా రికార్డ్ కు ఎక్కింది ,  ఆమె తండ్రి సోదరులుకూడా  సర్జన్ లే .. 1380 లో మాస్టర్ సర్జన్ లు సర్జరీతో ఆదా మెగా భేదం చూపాము అని ప్రమాణం చేయటం వచ్చింది .జర్మనీలో బింజెన్ లోని హైడ్ గార్డ్ అనే  1098-1179 కాలపు నన్ వైద్యం చేసి వైద్య గ్రంధాలు రాసింది .సాధారణ మొక్కలు మూలికలను ముందుగా ఎలా వాడవచ్చో వాటిలో రాసింది .. 1420 దాకా  బ్రిటన్ లోనూ ఆడవాళ్లు ముందుకు రాలేకపోయారు . ఇంగ్లాండ్ లోని ప్రముఖ డాక్టర్లు నాలుగవ శతాబ్ది జాన్ ఆఫ్ మారిఫీడ్ అభిప్రాయాన్ని సమర్ధిస్తూ పార్లమెంట్ కు ఒక పిటీషన్ సమర్పించి అందులో ”విద్యకు వైద్యానికి   ఆడవాళ్లు పనికి రారు వారికి సహజ తెలివి తేటలు వృత్తినైపుణ్యం లేవు .వీటితో పేషేంట్ లను బాధ పెట్టి చంపేస్తారు .మూర్ఖత్వం అజ్ఞానం వారిసొమ్ము కనుక వారిని ఉన్నత విద్యలకు అనుమతించవద్దు ”అన్నారు మృగ మహా రాజులైన వైద్యో నారాయణో హరులు -మహిళాహక్కు హరులు .
     సశేషం
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in సైన్స్ | Tagged | Leave a comment

భయాందోళనలు ఎలా పోతాయి ?

భయాందోళనలు ఎలా పోతాయి ?

స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది . 1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ   తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున ధ్యానమగ్నమయ్యాడు దాదాపు మూడుగంటలు సమాధిలో ఉండిపోయాడు ఉదయం ఏడున్నర అయ్యేసరికి కళ్ళు తెరిచి చూడగా పెద్ద నాగుబాము పడగా విప్పి రెండు అడుగుల దూరం లో స్వామిరామాపై తీవ్ర దృష్టి పెట్టి కనిపించింది .భయపడ్డాడు ఏం చేయాలో తోచక మళ్ళీ ధ్యానం లో పడ్డాడు .మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పాము అక్కడే అదే పొజిషన్ లో ఉంది .ఇక లాభం లేదనుకొని భయపడి పరిగెత్తాడు అదీ వెంటబడి పొదల్లో దూరింది ..గుహకు వెళ్లి గురువుకు చెప్పాడు .ఆయన  నవ్వుతూ ”బ్రతికి ఉన్న ఏ జంతువుకైనా ధ్యాన మగ్నమైన వాని ముందు ధ్యానం స్థితిలో ఉండి పోతుంది ”అని సత్యం చెప్పాడు . మరో వింత అనుభవం ఆయనకు ఎదురైంది .గురువు దక్షిణభారత దేశం లో కొంతకాలం గడిపి రమ్మని ఆదేశిస్తే వెళ్లి ఒకరోజు ఒక దేవాలయం కు లో  రాత్రి పడుకోవటానికి ఆశ్రయం ఇవ్వమని కోరాడు .అప్పుడు పూజారి ”నువ్వు స్వామీజీవి అయితే ఆశ్రయం ఎందుకు ”?అని అడిగాడు .ఇంతలో ఒక స్త్రీ తన వెంట వస్తే ఉండటానికి చోటు చూపిస్తానన్నది ..ఆమె రామా ను ఆరడుగుల గుడిసె చూపించి ఉండమన్నది .అప్పడు ఆయనవద్ద ఉన్నవి కూర్చోటానికి జింక చర్మం ,ఒక శాలువా  ఒక అంగోస్త్రం మాత్రమే  ..ఆ గుడిసెలో తలుపులాంటి ఖాళీ నుంచి వెలుగే తప్ప ఏదీ లేదు .కాసేపటికి ఒక నాగుబాము ముందు పాకుతూ కన్పించింది .తర్వాత ప్రక్కన ఒకటి ,మరికాసేపటికి గుడిసె నిండా పాములే పాములు .ఒళ్ళు జలద రించింది స్వామికి .అది సర్ప దేవాలయమేమో నను కున్నాడు ..చాలా భయమేసింది బహుశా ఆ అమ్మాయి తాను  నిజమైన స్వామో కాదో  పరీక్షకోసం ఈ గుడిసెకు పంపించి ఉంటుంది అనుకున్నాడు ..అప్పటికి రామా పూర్తిగా స్వామి కాలేదు .అప్పుడప్పుడే అభ్యాసం  లో ఉన్నాడు . భయపడి పారిపోతే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలి ?పారిపోతే ఇక ఆఊళ్లో ఏ సాధకుడికి ఎవరూ భిక్ష పెట్టరు .కనుక చావో రేవో పాములమధ్య గుడిసెలోనే ఉండి పోవాలను కొన్నాడు ..తనను ఇక్కడకు తీసుకొచ్చిన ఆవిడ జ్ఞాని కాదు కానీ ధైర్యంగా పాముల గుడిసెలోకి రా గలిగింది .కనుక తానూ అక్కడే పాముల మధ్యనే రాత్రి గడపాలని కొని ఉండి పోయాడు ..అలానే ఉన్నాడు .కానీ తన ధ్యానం మర్చి పోయి పాముల ధ్యానం లో ఉన్నాడు పాములు ఆయన జోలికే రాలేదు . ..తెల్లవారాక బయటికి వెళ్ళాడు ఆయనను పాములు ఏమీ చేయలేదు కానీ భయం మాత్రం పోలేదు .తర్వాత మనసులో వితర్కించుకొన్నాడు .తాను  బ్రహ్మ సూత్ర భాష్యం తేలికగా బోధిస్తున్నాడు కానీ మనసులో పిరికి తనం పోలేదు ..ఈ భయం ఎలా ఉందంటే ధ్యానం పూర్తి చేసి కళ్ళు తెరిచి చుట్టూ పాములున్నాయేమో నని వెదికేవాడు .భయాన్ని పోగొట్టుకోవాల్సిందే అనుకున్నాడు ..గురువును చేరి దీనికి మార్గమేమిటో తెలుసుకొందామన్నాడు .ఆయన రామాను చూడగానే ”నీకేమి కావాలో నాకు తెలుసు .నీకు పాములంటే భయం కదా ”అన్నాడు మనసులో మాటకనిపెట్టి .”నీకు భయమని నా కెప్పుడూ చెప్పలేదే అన్నీ నాకు చెప్పేవాడివి దీన్ని ఎందుకు దాచావు ?”అన్నాడు .ఎందుకో కానీ  గురువుకు తనకున్న పాముభయం గురించి చెప్పలేదు .

అడవిలోకి తీసుకు వెళ్లి  ”రేపు ఉదయం నుంచి మనం మౌనం పాటిస్తున్నాం .తెల్లవారు జామున మూడున్నరకే లేచి నువ్వు అడవి ఆకులు పూలు ఏరి తేవాలి .వాటితో మనం ప్రత్యేక పూజ చేద్దాం ”అని చెప్పాడు .అలాగే లేచిచీకటిలోనే  అక్కడ పోగుపడిన ఆకులు చూసి వాటిని చేతిలో పట్టుకున్నాడు ఆకులతోపాటు ఒక నాగు పాము చేతికి చుట్టుకు పోయింది .చెమటలుపట్టాయి భయం తో  తప్పించుకొనే అవకాశం లేదు .ఇంతలో గురువు చూసి దాన్ని తనదగ్గరకు తీసుకురమ్మన్నాడు ..అసలే వణికి పోతున్నాడు భయం తో .గుర్వాజ్ఞ తో మరీ భయం పెరిగింది ”అది నిన్ను కరవదు తీసుకురా ”అన్నాడు .రామాకు చేతిలో మృత్యువే ఉందనిపించింది నమ్మకం కంటే భయం బలీయమైంది .గురువును చేరగా ”నువ్వు పాములను ఎందుకు ప్రేమించలేవు ?”అని అడిగాడు . ”భయం తో చస్తుంటే ప్రేమ ఏమిటి నా బొంద ”అన్నాడు .భయపెట్టే వారిని మనం ప్రేమించలేము ఆదిలోకసహాజం . అప్పడు గురువు ”ఇది అందమైన జంతువు .  అన్ని చోట్ల తిరుగుతుంది .అయినా చూడు అది ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉందొ .ప్రపంచ జీవులలో పాము ఒక్కటే అత్యున్నత స్వచ్ఛమైన జీవి . ”అన్నాడు .అందం సరే  ప్రమాదం సంగతి ?”అన్నాడు స్వామిరామా .మనిషి పాముకంటె అతి మురికి ,విష జంతువూ కూడా .ప్రతిక్షణం కోపం పగలతో రగిలి అవతలివారికి హాని చేస్తూ ఉంటాడు .పాము ఆత్మ రక్షణకు మాత్రమే కాటేస్తుంది ..నువ్వు నిద్రలో ఉంటె నీ వ్రేళ్ళు కళ్ళను పొడుస్తాయా ,నీ నాలుకను పళ్ళు కొరుకుతాయా ?లేదే .శరీర భాగాలన్నిటికి ఒక చక్కని అవగాహన ఉంటుంది .అలాగే సకల చరాచరం ఒకటే అన్న భావన కలిగితే ఏ  జంతువూ వలనా భయమనేది  ఉండదు . ”అన్నాడు గురువు చెప్పిన0తసేపు నాగుపాము స్వామి చేతిలోనే ఉంది క్రమంగా భయం తగ్గింది .మనసు లో ”నేను పామును ఏమీ చేయక పొతే పాము నన్నేం చేస్తుంది ?అనే ఎరుక కలిగింది .అంతే పాము నెమ్మదిగా జారీ ఎటో వెళ్ళిపోయింది .అప్పటి నుంచి పాము అంటే భయం పోయింది .ఏ జంతువైనా తనకు అపకారం జరిగితే తప్ప మీద పడవు .వాల్మీకి ,సెయింట్  ఫ్రాన్సిస్  బుద్ధుడు మొదలైన వారందరూ జీవ ప్రేమికులే ..యోగ సూత్రాలలో మొదటిది అహింస .అహింస అంటే చంపక పోవటం ,హాని చేయకపోవటం ,గాయం చేయకపోవటం.ఆత్మ శక్తికి మించిన బలం లేదు .
   ”నేను హిమాలయాలలో ,అరణ్యాలలో ఎన్నో చోట్ల తిరిగాను..నాకు తెలిసినంతవరకూ నేను వున్నంతవరకు ఏ సాధువు, యోగి, స్వామిలపై ఏ క్రూర జంతువూ దాడి చేసినట్లు చూడలేదు వినలేదు ఈ మహానుభావులు తమను తాము రక్షించుకోవటానికి ఏ సాధనాలు లేనివారు ..వీరిని హిమపాతాలు,ప్రక్రుతి ప్రళయాలు  కూడా ఏమీ చేయలేదు  . వారి బలీయమైన ఆత్మ శక్తికి అన్నీ తలవంచుతాయి . ఈ నిర్భయత్వమే వ్యక్తిగత చేతన ను అధిగమించి విశ్వ చేతనలో చేరటానికి దారి చూపిస్తుంది .ఎవరు ఎవరిని చంపుతారు ?ఆత్మ అనంతమైనది .శరీరం ఎప్పుడోఅప్పడు మట్టిలో కలిసిపోయేదే .హిమాలయ యోగులు ఏ శాఖ వారైనా ఈ గొప్ప భావం తోనే జీవించి తరించారు ”అంటాడు స్వామిరామ .
  స్వామి రామ తారై భవాల్  నుండి నేపాల్ లోని ఖాట్మాండుకు ఒక్కడే నడుచుకుంటూ బయలుదేరాడు ..రోజుకు సుమారు ముప్ఫయి మైళ్ళు నడిచేవాడు .సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చితులు పేర్చి   మంట   వేసుకొని ,ధ్యానం చేసి విశ్రాంతి తీసుకొని, మళ్ళీ తెల్లవారుజామున నాలుగింటికి లేచి నడక సాగించిపది గంటల వరకు నడిచి ఏదో చెట్టుకింద ఆగి మధ్యాహ్నం మళ్ళీ బయల్దేరి సాయ0త్రం ఏడు దాకా నడిచేవాడు .చెప్పులు లేకుండా  ఒక దుప్పటి ,పులిచర్మం ,చిన్న కుండలో నీళ్లు ఇవే  ఆయన సామాగ్రి ..ఒక రోజు సాయంత్రం ఆరింటికి అలసి పోయి చిన్న గుహలో విశ్రాంతి కి వెళ్ళాడు .అది చీకటి గుయ్యారం .లోపల మూడు పులిపిల్లలు కనిపించాయి అవి పుట్టి 15 రోజులు మాత్రమే అయి ఉంటుంది .అవి స్వామి దగ్గరకు వాళ్ళ అమ్మ ఏమో ననుకొని వచ్చి నాకుతున్నాయి .భయపడకుండా వాటిని మచ్చిక చేసుకున్నాడు .కూర్చోగానే గుహ ద్వారం దగ్గర వాటి తల్లి వచ్చి నుంచుని ఉండటం చూశాడు .మొదట్లో అది  లోపలికొచ్చి తనమీద పడి చంపేస్తుందేమో ననుకొన్నాడు .తర్వాత మనసులో ”నేను ఈ పులి కూనలకు  ఏఅపకారం  చేయలేదు .పులి దారిఇస్తే నేను బయటికి వెళ్ళిపోతాను ”అని అనుకోని దుప్పటి నీళ్లకుండా తీసుకొని లేచి నిలబడ్డాడు .ఈయన్ను చూసిన పులి దారి ఇస్తున్నట్లుగా గుహ ద్వారం నుండి పక్కకు తప్పుకున్నది ..స్వామి రామ గుహ లోంచి బయటికి వచ్చి పదడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే పులి నెమ్మదిగా గుహలోకి ప్రవేశించి పిల్లలను చేరినట్లు గమనించాడు .దీన్ని బట్టి జంతువులూ అతి తేలికగా హింసను  భయాన్ని వాసన చూడగలవు .అప్పుడే అవి అతి తీవ్రంగా ఆత్మ రక్షణకు ఎదురు దాడి చేస్తాయి .సాధారణంగా జంతువులు  చాలా రక్షణ నిచ్చి సహాయం చేస్తాయి మనుషులు ప్రమాద సమయాలలో ఒకరిని ఒకరు వదిలేసి పారిపోతారు .కానీ జంతువులూ అలా ప్రవర్తించవు .ఆత్మా రక్షణ సకల జీవులకు ఉంటుంది .కానీ మనుషులకంటే జంతువులు ప్రేమకు అంకితమై ఉంటాయి వాటి మిత్రత్వం నమ్మదగినదే .,షరతులు లేనిదే .మానవుడు అలాకాదు
Inline image 1Inline image 2
  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in సైన్స్ | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -7 -55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం

వీ క్లీ  అమెరికా -7

55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం
15-5-17 నుండి 21-5-17 వరకు
15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ  కృష్ణ  కాంభోజి రాగాలాపన అందులో తన రచన ”ఏమి పాలింప జాలము ?”విని పరవశించాను . రాత్రి  LOL లో రౌడీ -బ0డ  ,పెళ్లి ఎగగొట్టటానికి ఎత్తులు చూసాం సరదాగా ఉన్నాయి యెంత మంది దగ్గర ఎంతటి టేలెంట్ ఉన్నదో రుజువు చేసేవి ఇవి ..
  మంగళవారం మామూలుగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి శ్రీ రామ లక్ష్మణా చార్యుల ”సువర్చలా వల్లభ శతకం ”పఠించాను . సాయంత్రం ఇన్నయ్యగారి ఫోన్ పలకరింపు . ఆయన భార్య కోమలగారు రాసిన ”మై లైఫ్”చదివాను  .ఆవిడ పామర్రు దగ్గర కొండి పర్రు ఆశ్రమం లో హిందీ చదివారు . ఆమె హైదరాబాద్ లో ఉండగా రేడియో స్టేషన్ ప్రోగ్రామ్ ఎక్సి క్యూటివ్ శ్రీ వేలూరి సహజానంద గారు ఆమెను కొందరు విదేశీ రచయితలను శ్రోతలకు పరిచయం చేయమని కోరగా కాఫ్కా  ఆల్బర్ట్ కాము మొదలైన వారిని చక్కగా పరిచయం చేసినట్లు రాశారు .శ్రీ సహజా నంద మా రెండవ బావ గారు వేలూరి వివేకానంద గారి పెదనాన్న గారి అబ్బాయే . తేలప్రోలు  దగ్గర చిరివాడ అగ్రహారం వాసి .సహజ శ్శ్రీ అరవింద భక్తులు .అరవింద దర్శనం పై పుస్తకాలు రాశాడు వీరి తమ్ముడు సదానంద .ఈ అన్నదమ్ముల్ని మా బావ గారి కుటుంబం సహజ ,సదా అని పిలిచేవారు ఇద్దర్నీ  చూశాను .ఇన్నయ్యగారి పెద్దబ్బాయి శ్రీ రాజు నరిశెట్టి మా పెద్దబ్బాయి శాస్త్రికి గుజరాత్ లోని” ఇర్మ ” లో క్లాస్ మేట్ అని మా మనవడు సంకల్ప్ గుర్తించి చెప్పాడు .
17 బుధవారం నుండి 5 రోజుల న 55 వ సుందరకాండ పారాయణ మొదలు పెట్టాను .నిత్యపూజ ఆంజనేయ అష్టోత్తర ,శతనామ పూజ తర్వాత పారాయణ ప్రారంభించాను .మొదటి రోజు సంక్షిప్త రామాయణం ,తర్వాత శ్రీరామ జననం ,సీతారామ కళ్యాణం ,సీతా రామ సుఖ జీవనం సర్గలు చదివి సుందరకాండ ప్రారంభించి 15 సర్గలు పూర్తి చేశి  మంకు శ్రీనుగారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”చదివి పూర్తి చేశాను అయిదు రోజులూ పానకం వడపప్పు చలిమిడి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం .7 గంటలకు ప్రారంభిస్తే పూర్తి అయేసరికి 10-30 అయింది తర్వాతే టిఫిన్ .ఉదయం 11 -30 కి డా.  యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేశారు .ఏం చేస్తున్నారని అడిగితె పారాయణ సంగతి చెప్పా .ఆయన నిత్యం సంధ్యావందనం పూజ చేస్తారట .నేను చెప్పాక పారాయణ కూడా చేద్దామని అనుకొన్నారటగాని 83 ఏళ్ళ వారు  అంతటి శ్రమ వద్దమని కుటుంబ సభ్యులు వారించారట అందుకని చేయటం లేదని తర్వాత గోపాల కృష్ణ గారు మెయిల్ రాశారు .మైనేనిగారు పంపిన ”Harry G.Frankfurt  రచన ”డి రీజన్స్ ఆఫ్ లవ్ ”అందింది చదివాను పెద్దగా చెప్పిందేమీ లేదని పించింది ..రాత్రి ఫన్ బకెట్ లో ”వుయ్ వాంట్  జస్టిస్ ”అని బాహుబలి -3 తీయాలంటూ నిరాహార దీక్ష చేసిన  సరదా ఎపిసోడ్ చూసి పగలబడి నవ్వుకున్నాం ..
గురువారం -రెండవ రోజు పారాయణ లో 27 వ  సర్గ  వరకు చేసి ముదిగొండ సీతారావమ్మగారి ”శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా .దాదాపు మొత్తం 3 గంటలు పట్టింది   ”నా దారి తీరు ”లో కృష్ణా జిల్లాలోని ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గురించి రెండు ఎపిసోడ్ లు రాశాను ..రాత్రి నర్మదా నదీ తీర”కరి వీర పీఠం”శంకరాచార్య శ్రీ స్వామి రామా గురించి ”పీఠాధిపత్యం బందిఖానా గా భావించి పారిపోయిన పీఠాధిపతి ”అని రాశా .  పారిపోయిన రామా గురువు బెంగాలీ బాబా ను దర్శించి విషయం  చెప్పగా  ”సాధకుడికి ఈ అనుభవమూ కావాలనే నేను నిన్ను నర్మదా తీరానికి 6 నెలల తపస్సుకోస0  పంపాను .దనం వ్యామోహం పదవీ ఎంత బాధకు గురి చేస్తాయో నీకు అనుభవం రావాలనే పంపాను ”అంటాడు
శుక్రవారం -ఉదయం 7-30 కే  పూజ ప్రారంభించి 10-15 కు మూడవరోజు పారాయణ 38 వ సర్గ వరకు చేసి సీతారావమ్మగారి ” ‘శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా..దీనిని మా అమ్మాయి వీడియో తీసి పేస్  బుక్ లో పెట్టిందిట నాకు తెలీదు మామూలు గా చేసే పానకం వడపప్పు చలిబిడి తోపాటు రవ్వకేసరి ప్రసాదం నైవేద్యం 10-15 కు పూర్తిఅయింది . . మధ్యాహ్నం మైనేనిగారి ఫోన్ .తర్వాత నేనూ చేసి మాట్లాడాను
 రాత్రి శ్రీ బులుసు సాంబమూర్తి పద్మ దంపతుల ఇంట్లో డిన్నర్ .వాళ్ళ అమ్మాయి ప్లస్ -2 కు సెలెక్ట్ అయి ర్యాలీ లో సీట్ వచ్చిన సందర్భంగా ఈ ఏర్పాటు .ఇలా సెలెక్ట్ అయినవారి చదువు హాస్టల్ ఖర్చు అంతా  ప్రభుత్వమే భరిస్తుంది స్టేట్ లో 300 మందికే ఆ ఛాన్స్ దాన్ని పొందటానికి అందరూ తీవ్రంగా  కష్ట  పెడతారట  ఒరిస్సా లోని  తెలుగు వారు .ఇక్కడే బరం పురం తెలుగు వారైన రాయప్రోలు వారూ కలిశారు .మేమూ ,పవన్ ,రాంకీ  కుటుంబం గెస్ట్ ల0 అదనంగా . పప్పు ఆలూ కూర ,తమాషా పాయసం ,పునుగులు ,పులిహోర ,సాంబారు ,పెరుగు పండ్ల ముక్కలతో పాటు వాళ్ళ స్పెషల్ ”అప్పడాలపిండి ఉండలు ”వేశారు ఒరిస్సా ప్రాంత తెలుగువారిళ్ళల్లో విందులూ వినోదాలలో అప్పడాల పిండి ఉండలు వడ్డించకపోతే మహా తప్పుట చెప్పారు వాళ్ళు .అలాగే తద్దినాలలో మనం ఆవ పచ్చడి ,నువ్వుల పొడి తప్పక చేస్తాం .కానీ వాళ్ళు ఉసిరి గింజల పచ్చడి పెరుగుతో కలిపి ,ఉసిరి గింజల పొడి చెయ్యటం తప్పదట . మనకు కొత్తగా ఉంది కానీ ఏ ప్రాంతం వారి అలవాటు వారిది .మనకు ఎవరైనా చనిపోతే దినవారాలలో 12 వ రోజు శుద్ధి నాడు ఉసిరి పొడి నెత్తిమీద రాసుకొని స్నానం స్నానం చేసి శుద్ధి అవటం ఉంది ‘
 శనివారం నిత్యపూజ ఆంజనేయ స్తోత్త్ర శతనామ పూజ తర్వాత నాల్గవ రోజు పారాయణ ఉదయం 7-30 కు ప్రారంభించి 54 వ సర్గ వరకు పారాయణ చేసి మామిడిపండ్లు ఆరంజ్ పీచు అరటిపళ్ళ తో పూజ  చేసి  మంకు శ్రీను గారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”పఠించా .అదనపు ప్రసాదం ”చిట్టిగారెలు ”11 గంటల వరకు సాగింది  సంకల్ప్ ను మా అమ్మాయి యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చింది .

మా మనవడు శ్రీకేత్ 9 లో ఉన్నాడు .కనుక ఏం సెట్ లాంటి దాని కోచింగ్ కు షార్లెట్ యూనివర్సిటీ దగ్గర ”రమణ ”అనే లెక్చరర్ దగ్గర లెక్కల కోచింగ్ కు శని ఆదివారాలలో ఉదయం 7 గంటలకు వెళ్లి 12 దాకా ఉండి వస్తాడు మా అల్లుడో  అమ్మాయో  తీసుకుని వెళ్లి మళ్ళీ తీసుకు వస్తారు  .మా వాళ్ళ ఇంటినుంచి 45 మైళ్ళు అంటే సుమారు 70 కిలోమీటర్లు . మైనేని గారుపంపిన ”క్లియరెన్స్ డారో ”రచన ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”బృహద్గ్రంథం అందింది మొదలు పెట్టాను .సాయంత్రం మా అమ్మాయి మనవాళ్లతో లైబ్రరీకి వెళ్లి 7 పుస్తకాలు తెచ్చుకున్నాను చదవాలి .

21-5-17 ఆదివారం వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి -ఉదయం 6-45 కే నిత్యపూజా ,ఆంజనేయ అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి 5 వ రోజు అంటే చివరి రోజు పారాయణ ప్రారంభించి 68 వ సర్గతో సుందరకాండ పూర్తి చేసి తర్వాత నాగ పాశ  విమోచనం  ఆదిత్య హృదయం ,రామ రావణ యుద్ధం రావణ సంహారం ,దేవతలుచేసిన శ్రీరామ స్తుతి ,శ్రీ రామ పట్టాభి షేకం తో మొత్తం సుందరకాండ పారాయణ పూర్తి చేసి రామ లక్ష్మణాచార్యుల ”శ్రీ సువర్చలా వల్లభ సుందర వాయు నందన శతకం ”పఠించే సరికి ఉదయం 10-45  గంటలు అయింది  దీనితో శతక త్రయం ను రెండు సార్లు పఠించినట్లయింది  పావు గంట విశ్రాంతి తీసుకొని శ్రీ సువర్చలాంజ నేయ శాంతి కళ్యాణం    పుణ్యాహ వాచనం ,దిక్పాల  నవగ్రహ పూజ  కన్యావరణం ,ప్రవర మాంగల్యా పూజ ,ప్రవర చూర్ణిక మహా సంకల్ప0 మంగళాష్టకాలతో  సహా చదివి తంత్ర రహిత మంత్రం సహిత కళ్యాణం చేసి స్వామి వారల ఫోటోకు నేను తెచ్చుకున్న శ్రీ ఆంజనేయస్వామికి ప్రక్కనే పెట్టిన పసుపు తో చేసిన సువర్చలాదేవికి అక్షతారోపణ అంటే తలంబ్రాలు పోసి కళ్యాణం పూరి చేసాం అంతా అయ్యేసరికి 12 45 అయింది అంటే  ఉదయం నుంచిసుమారు 6 గంటల కార్యక్రమం నిర్వహించాం .నిత్య ప్రసాదాలతోపాటు పులిహోర ప్రత్యేక ప్రసాదం ఆ అమ్మాయి ,మనవడు పీయూష్ రాత్రి కూర్చుని స్వామికి పూల హారాలు కట్టారు. ఇవాళ పూలతో మామిడిపండ్లతో  చక్కగా అలంకరణ చేసి శోభాయమానం చేసింది  మా అమ్మాయి  . భోజనానికి పవన్ కుటుంబం గోసుకోండ అరుణ కుటుంబాన్ని పిలిచాం వాళ్ళూ వచ్చి స్వామిపాదాలకు తలంబ్రాలు పోసి భోజనం చేసి వెళ్లారు .భోజనం లోకి మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,చిక్కుడుకాయ కూర పెరుగు పచ్చడి టమేటా చట్నీ చారు ,జున్ను .వడ్డించాం .కళ్యాణ విందుకూడా జరిగింది అనుకోకుండా
  శనివారం రాత్రి కాలిఫోర్నియా నుంచి మా మేనల్లుడు శాస్త్రి ,భార్య  ,అత్తగారు ఫోన్ చేసి మా అమ్మాయి పేస్ బుక్   లో పెట్టిన వీడియో చూసి ముచ్చటపడి ఆనందిం చామని అభినందనలు తెలిపారు మొత్తం మీద షార్లెట్ లో నా 55 వ సుందర కాండ పారాయణ  హనుమజ్జయంతి స్వామివార్ల అనుగ్రహం తో దిగ్విజయంగా జరిగింది
    ఉయ్యూరు  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 19 వ తేదీ నుండి మూడు రోజులు 21 వ తేదీ వరకు శ్రీ హనుమజ్జయ0తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు మా అబ్బాయి ఏ పూటకాపూట ఫోన్ చేసి చెబుతూ ఫోటోలు పెడుతూ తెలియ జేశాడు మొదటి రోజు ఉదయం స్వామివార్లకు అభిషేకం . సాయంత్రం శతకత్రయ పోటీకి ”ఒక్క పురుగు ”కూడా రాలేదట .శివాలక్ష్మి శ్రీ రామ లక్ష్మణ్చ్చర్యులు గారు నిర్వహించటానికి వచ్చారు వారికి శాలువాలతో సత్కారం జరిగింది .రెండవ రోజు 1000 రసం మామిడిపండ్లతో పూజ కనుల పండువుగా జరిగిందని  రాత్రికి మా శ్రీమతి కంటి డాక్టర్ శ్రీ మతి జయశ్రీ గారి కుటుంబం పూజలో పాల్గొన్నారని ,వారి అబ్బాయి అమ్మాయి చక్కగా పాటలు పడ్డారని మామానవరాలు హర్షితాఞ్జని కూడా పాడిందని శ్రీమతి శారదా గారు కూడా చక్కగా గానం చేశారని తెలిసింది  మూడవ రోజు ఉదయం 200 తమల పాకు కట్టలతో  అన్ని రకాల పుష్పాలతో అర్చన ఘనంగా జరిగిందని  స్వామివార్ల శాంతికల్యాణాన్ని మా రెండవ అబ్బాయి శర్మ ఇందిరా ద0పతులు  మూడవ కుమారుడు మూర్తి రాణి దంపతులు పీటలమీద కూర్చుని ఘనంగా నిర్వహించారని తెలిసి చాలా సంతోషించాం . రాత్రి  శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు సంకల్పించి స్పాన్సర్ చేసిన 25 కిలోల మినపపప్పు తో స్వామివార్లకు గారెల దండలు అద్భుతః  అనిపించాయి .కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా చాలా భక్తిగా చేశారు అక్కడ మేము లేకపోయినా మా రమణ అన్ని  బాధ్యతలు నిర్వహించి కార్యక్రమాలకు నిండుదనం తెప్పించాడు . ఈ వారానికి స్వస్తి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

21-5-17 ఆదివారం షార్లెట్ లో హనుమజ్జయంతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయునికి నాగవల్లి పూజ

This gallery contains 100 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలురాసిన అన్నమయ్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య  (1409-1503)
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల  సంకీర్తనలు  రచించినా లభ్యమైనవి 12 వేలు  మాత్రమే  అందులో శృంగార భక్తి జ్ఞాన  నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై అందులోని మకరందాన్ని గ్రోలి మనకు అందించిన సంకీర్తనాచార్యుడు . కులమతాలకు అతీతమైన భావ వ్యాప్తి చేసిన సంస్కారి . .”బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే” అని ఎలుగెత్తి చాటిన వేదోపనిషత్ వ్యాఖ్యాత ”.ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి”అని అందరూ ఒక్కరే నాన్న వసుధైక విహావం వ్యాప్తి చేసైనా పూర్ణ ప్రజ్నడు . పదకవితా సాహిత్యానికి పట్టాభిషేకం చేసి  పదకవితా శారదను బంగారు పల్లకి లో  ఊరేగించినవాడు అన్నమయ్య. కలకండ తెలుగుకు మరింత తియ్యదనాన్ని అందించినవాడు.సర్వ దారి సంవత్సర   వైశాఖ శుద్ధ పొర్ణమి 22-5-1409న ఈ నాటి కడప జిల్లా లోని తాళ్ళపాక లో  జన్మించి 95  వ ఏట,దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి   4-5-1503 న శ్రీ వెంకటేశ్వర పద సన్నిధికి చేరిన పుణ్యాత్ముడు .భార్య  తిక్కమ్మ ”సుభద్రా కళ్యాణం ”రాసిన తొలి తెలుగు కవయిత్రి .కొడుకు పేద తిరుమలాచార్యుడు ,మనవడు చిన్నయ్య కూడా కవులే .కర్ణాటక సంగీత కూర్పుకు పాదకవితలతో  ఒక సంచలనం సృష్టించినవాడు అన్నమయ్య.     సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య సంస్కృతం లోనూ కీర్తనలు రాసి తన గీర్వాణ పాండిత్యాన్ని ప్రకటించాడు .సుమారు వంద సంస్కృత కీర్తనలు రాసినట్లు తెలుస్తోంది .అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం
1-పృథుల  హేమ  కౌపీనధర-ప్రథిత  వతృమే బలం పాతు
సూపాసక్తః సుచి శ్శు లభః-కోప విదూరహ-కులా ధికః
పాపభంజకహ పరాత్పరోయం -గోపాలో  మే  గుణం పాతు
తరుణః చత్రీ దందా కమండలు-ధర పవిత్రీ దయా పరః
సురాణాం సంస్తుతి మనోహరః -స్థిర శ్శు ద్ధీర్మే ధృతిం పాతు
త్రివిక్రమః శ్రీ తీరు వెంకట గిరి -నివాసోయం నిరంతరం
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే -దివా నిశాయాం థియమ్ పాతు ”

-వామన మూర్తి పై కీర్తనయుడి దీన్ని లతా మంగేష్కర్ పాడారు

2-భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింత ఏయం సదా –
కటి ఘటిత మేఖలా ఖచిత మని ఘంటికా -పాతాళ నినాదేన   విభ్రాజమానం
కుటిల పద ఘటిత  సంకుల శింజితేన తం -చేతుల నటనా సముజ్వల విలాసం
నిరత కర కలిత నవనీతం  బ్రహ్మాది సుర నికర భావనా శోభిపదం
తిరు వేంకటాచల స్థిత0 అనుపమమ్ హరిం -పరమ పురుషం గోపాలబాలం  –
మరో కీర్తన చూద్దాం
3-దేవ దేవం భజే దివ్య ప్రభావం -రావణాసుర వైరి రవి పుంగవం
   రాజవరం శేఖరం రవి కుల సుధాకరం -ఆజానుబాహు నీలాగ్రకాయం
   రాజారి కోదండ దీక్షా గురు0 -రాజీవ నేత్రం రామచంద్రం ,రామం
   నీల జీమూత సన్నిభ శరీరం -విశాలవక్షం నిబాల జలజ నాభం
   కాలాహి నాగ హరమ్ ధర్మ సంస్థాపనం -గో లలనాధిపమ్  భోగి శయనం రామం
   పంకజాసన వినుత పరమ నారాయణం -శంకరార్జిత జనక చాప దళనం
  లంకా  విశోషణం లలిత విభీషణం వెంకటేశం సాదు వినుత వినుతం రామం –
మరో ఆణిముత్యం –
4- మాధవ కేశవా మాధవ విష్ణో శ్రీధరా- పదనఖ0 చిన్తయామి యూయం
    వామన గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న -రామరామ కృష్ణ నారాయణాచ్యుత
    దామోదరానిరుద్ధదైవ పుండరీకాక్ష -నామాత్రయాధీశ నమోనమో
    పురుషోత్తమ పుండరీకాక్ష -దివ్య హరి సంకర్షణ అధోక్షజ
    నరసింహ హృషీ కేశ నగధర త్రివిక్రమ – శరణాగత రక్ష జయ జయ సేవే
    మహిత జనార్దనా మత్స్య కూర్మ వరాహా -సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
    విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం -అహమిహ తవపద  అనిశం భజామి
     అంటూ  విష్ణు అవతారాలను చక్కగా స్తుతించాడు అన్నమయ్య కీ ర్తనలో 
    సశేషం 
   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో త్రాయహ్నికంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. తొలిరోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివార్లకు మాన్యు సుక్తంతో స్నపన,నూతన వస్త్ర ధారణ, పుష్ప పూజలు ఆలయ అర్చక స్వామి వేదాంతం మురళీకృష్ణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44

 రఘువీర చరితం -3
ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  వేషం లో వచ్చి సోదరుల శరీర దారుడ్యానికి ,శూర పరాక్రమ ఛాయలకు సంతసించాడు -” దంత మౌక్తిక నిష్ఠ యుతా మనః కుముద కౌముదీ -కాంతి ర్గండు గాంబు గౌరీ వ వామేషా స్నాపయతీవ మామ్ ” అనుకోకుండా హనుమ  వారిదేహ చ్చాయలను వర్ణించాడు -సుగ్రీవుని వద్దకు సోదరులను హనుమ చేర్చాడు ..మనసు విప్పి రామ సుగ్రీవులు మాట్లాడుకున్నారు .వాలితో ఉన్న అనుబంధాన్ని సుగ్రీవుడు వివరించాడు సోదరభావం ఒక చిన్న కారణం తో విరిగి పోయిందని అది  యెంత గొప్పవాడికైనా  మళ్ళీ అతికించటం సాధ్యం కానిపని అన్నాడు -అల్పేనాపి నిమిత్తేన సౌభ్రామం భిద్యతే తృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే ”
 తన విషాద జీవితగాధ వివరించాడు వానర రాజు ..రామ సుగ్రీవుల మధ్య స్నేహం గాఢమైన పిమ్మట సుగ్రీవుడు సీతాన్వేషణకు సహాయ పడతానన్నాడు . ప్రవాసితుడైన సుగ్రీవుడు నిబ్బరం గల బలశాలి అని రాముడు గ్రహించాడు ..అప్పుడు హనుమ ”రాముని కోరిక తీగ పుష్పించి ఫలిస్తుంది ”ఆనాడు-”స్ఫీత చాపల సంపర్క మర్కటే స్మిన్  ప్రసారితా -కేవలాతే  కృపా వల్లీ  ఫలం భధ్నాతు మా చిరం ”.రామాహనుమలు తమకు సూర్యుని తో సంబంధాన్ని గుర్తుకు చెచ్చుకున్నారు  వాలిని చంపి వానర రాజు తో స్నేహాన్ని బలీయం చేసుకొంటాను అని సుగ్రీవునికి రాముడు అభయమిచ్చాడు .
   తొమ్మిదవ అధ్యాయం లో రఘు వీర మహాకావ్యంను మల్లినాథుడు  కాళిదాసు రఘువంశ 0లో తొమ్మిదవ సర్గ ను పూర్తిగా అనుకరించి రాశాడు .ముఖ్యంగా యమకాన్నిఅదే కోవలో దట్టించాడు .రఘువంశ వ్యాఖ్యానం రాసిన హేమాద్రి పండితుడు యమకాన్ని మహా గమకంగా నిర్వచించాడు –స్పాత్పాద పద వర్ణనామావృత్తిహ్  సంయుతా యుతా -యమకం భిన్న వాచ్యానామాది మధ్యాంత గోచరం -ఇతి వాగ్భటహ్ . ఇందులో యమకాలున్న శ్లోకాలు పదకొండుమాత్రమే రాముని దుఃఖ పరాకాష్టగా పర్వతాలను ,మేఘాలను  నెమళ్లను మొదలైన వాటిని తన సీతను తనకు తెచ్చి ఇవ్వమని వేడు కోవటం వింత గా ఉంటుంది  .
  సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా       

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ  తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ  గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో ఖేరిఘాట్ కు దక్షిణానఉన్న అరణ్యం కు వెళ్ళాడు .అక్కడి నర్మదా నది మొసళ్లమయంగా ఉండేది .ఉదయాన సాయం వేళల మొసళ్ళు హాయిగా నది ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడుకునేవి ఈ శిష్య స్వామి అక్కడే ఆరు నెలలు ధ్యానం లో గడిపాడు .కానీ ఒక్కనాడూ ఆయన తపస్సుకు ధ్యానానికి అవి భంగం కలిగించలేదు .ఈ యువ సాధకుడివద్ద ఒక చిన్న నీళ్ల కుండ ,ఒక దుప్పటి  ,రెండు అంగోస్త్రాలు మాత్రమే ఉండేవి ..ఆరుమైళ్ళ దూరం లో ఉన్న గ్రామస్తు లు   యువ స్వామికి పాలు  గోధుమ రొట్టె రోజుకొకసారి తెచ్చిపెట్టేవారు .ఇలా ఆరునెలలు అతి   కఠోర  నియమ నిష్ఠలతో ధ్యాన తపస్సులలో గడిపాడు .ఒకరోజు పెద్ద వేటగాళ్ల బృందం అక్కడికి  వచ్చి సుమారు రెండుమూడు గజాల దూరం ఉన్న  మొసళ్ళమధ్య ఏకాంతం గా చలనం లేకుండా  ధ్యాన నిమగ్నమైన స్వామిని చూసిఆశ్చర్యపోయి స్వామికి తెలియకుండా  ఫోటో తీసి పేపర్లకు పంపారు .అవి అన్ని వార్తా పత్రికలలో ప్రచురితమై సంచలనాన్ని కల్గించింది . అదే సమయం లో కరివీర  పీఠ శంకరాచార్యస్వామిడా. శ్రీకూర్కొటి . గీతా రహస్యం రచించిన బాలగంగాధర తిలక్ కు సన్నిహితుడు    తమ వారసునిగా ప్రతిష్టించటానికి పదవికి తగిన వారికోసం   అన్వేషిస్తున్నారు ..ఈ యువ స్వామి విషయం తెలిసి కొందరు పండితులను రహస్యంగా పంపి స్వామి చర్యలను గమనించమన్నారు  .వాళ్ళు దగ్గర గ్రామం లో రహస్యంగా ఉంటూ స్వామి గురించి వింటూ చూస్తూ తెలుసుకొన్నారు .స్వామి కుటుంబ నేపధ్యం చదువు గురువు పవిత్రత  అన్నీ  తెలుసుకొని అసలు విషయం చెప్పి పీఠానికి వారసులుగా ఉండటానికి అంగీకారరించమని ప్రాధేయపడి   యువస్వామిని కూర్కొటి వద్దకు తీసుకు వెళ్లారు ఆయనకు స్వామి నచ్చినట్లు కనిపించింది .వెంటనే యువస్వామి తమ గురువు ను దర్శించి ఆయన అనుమతి, ఆశీర్వాదం పొందాడు
  18 రోజులు అనేక మంత్ర తంత్రాలతో స్నానాదులతో అన్ని రకాల మత సంబంధ విధులు నిర్వ హీంప జేసి కరి వీర పీఠ జగద్గురు  శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అభినందిస్తూ వేలాది టెలిగ్రాములు వచ్చాయి .రోమ్ నుంచి పోప్  సందేశం తోపాటు  ఎందరో మత గురువులనుండి  ఎన్నో సందేశాలు అందాయి.రంగ రంగ వైభవంగా కార్యక్రమం జరిగింది .అప్పటికి ఈ యువ  శంకరా చార్య  వయసు 30 సంవత్సరాలే .ఆరు  నెలల ఒంటరి  కఠిన  నియమ తపస్సు ఇంతటి గొప్ప పదవిని కట్ట బెట్టింది .
  డా కూర్కొటి సాంఘిక మత సంస్కరణలు చాలా చేశారు .మఠం  ఫైల్స్ అన్నీ అప్పగించారు విలువైన సమాచారం చాలా ఉంది ఎందరెందరికో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాల్సి వచ్చేది .ఎన్నెన్నో బృందాలవారు  వచ్చి సందర్శించి ఆశీర్వాదాలు అభిభాషణలు చేయమని కోరేవారు .దేశాటనం చేస్తూ ధార్మిక ప్రసంగాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా గడపాల్సి వచ్చేది . పీఠం లో ఉదయం సాయంత్రం వేలాది భక్తులకు దర్శనం ఇవ్వాల్సి వచ్చేది .ఈ బిజీ షెడ్యూల్ లో తనకు స్వేచ్ఛ అనేది లేదని అర్ధమయింది కొత్త శంకరాచార్య స్వామికి .. తన ఏకాంతం, ధ్యానం తపం ఎగిరిపోయాయి  ఇది నచ్చ లేదని పించింది . ఈ సుఖం సుఖం కాదనుకున్నాడు అంతరాత్మ ”నీకు తగిన పదవికాదు వదిలెయ్యి ”అని ప్రబోధించింది .  రెండేళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా చేతిలో పైసా కూడా లేకండా కట్టుబట్టలతో బయటికి వచ్చి హాయిగా మళ్లీ హిమాలయాలలో ఒంటరిగా తపస్సు చేసుకొందామని తాను  చేరాల్సిన గమ్యానికి చేర్చే రైలు లో మూడవ తరగతి పెట్టె ఎక్కి కూర్చున్నాడు .టికెట్ కొనటానికి చిల్లి గవ్వలేదు బైరాగి టికెట్ అంటారే అలా ఉంది పరిస్థితి .కాసేపయ్యాక కండక్టర్ వచ్చి టికెట్ ఏది అనిఅడిగితే లేదని చెబితే ఖరీదైన శంకరాచార్య దుస్తులు చూసి తర్వాత స్టేషన్ లో దిగిపొమ్మంటే దిగిపోయాడు .కానీ తానెవరో మాత్రం చెప్పలేదు .జీవితం లో ఆయన ఎప్పుడూ టికెట్ కొనకుండా ప్రయాణం చేయలేదు .కండక్టర్ కు వంగి నమస్కరించి ”నా మీద కేసు పెట్ట నందుకు కృతజ్ఞతలు ”అని చెప్పి దిగిపోయాడు .
  ఇంతకీ ఈ స్వామి ఎవరో తెలుసా ?స్వామి రామా .అసలు పేరు బ్రీజ్ కిషోర్ దస్మన    గురువు బెంగాలీ బాబా .స్వామి రామ 1925 లో   ఘర్వాల్ హిమాలయాలలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి   1996 లో చనిపోయాడు .లివింగ్ విత్ ది  హిమాలయన్ మాస్టర్స్ ”అనే గొప్ప గ్రంధం రాశాడు .అమెరికాలో పెన్సిల్వేనియారాష్ట్రం లో హాన్స్ డేల్  అనే చోట సుమారు అయిదువందల ఎకరాలలో ”హిమాలయన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ యోగ సైన్స్ అండ్ ఫిలాసఫీ ”స్థాపించాడు అనేక దేశాల పర్యటన చేశాడు అక్కడా బ్రా0చీలను  ఏర్పాటు చేశాడు .
  Inline image 1Inline image 2Inline image 3
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా     



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 –

గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )
 ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే ఉమా మహేశ్వరరావు గారికి మేనమామ .కృష్ణారావుగారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయం నవ్వు ముఖం తో   చూడగానే  రెండు చేతులు జోడించాలనిపిస్తుంది . స్నేహం సౌశీల్యం ఆదర్శం ఆయన సొత్తు అతి నిరాడంబరులు నెమ్మదిగా స్పష్టం గా మాట్లాడేవారు .ఏం ఎల్సీ ఎన్నికలలో కొల్లూరి కోటేశ్వర రావు గారికి నేనూ ఆయన శ్రీ ఆర్ ఎస్ కె మూర్తి శ్రీ గౌతమేశ్వరరావు గారు కలిసి ప్రచారం చేసినప్పుడు పరిచయమయ్యారు తర్వాత కాటూరు హెచ్ ఏం గా మరింత చేరువై వారి అభిమానినయ్యాను .ఆర్ ఎస్ ఎస్ లో సుశిక్షితులైన కార్యకర్త .మంచి బౌద్ధిక్  అంటే సంఘ సమావేశాలలో బుద్ధిని వికసింప జేసే ప్రసంగాలను చేసేవారిని బౌద్ధిక్  అంటారు .ఎన్నో విషయాలు లోతుగా చర్చించేవారు . శ్రీ గౌతమేశ్వరరావుగారు కాటూరులో సోషల్ మాస్టారుగా నాతోపని చేసి ప్రమోషన్ పై రెడ్డిగూడెం హెడ్ మాస్టర్ అయ్యారు .నిబద్ధత ఉన్న ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి . అలాగే కపిల కాశీపతిగారు కైకలూరు ప్రాంతం లో ప్రసిద్ధులు . శ్రీ మారెళ్ల సుబ్బారావు గారు ఆకునూరు హెడ్ మాస్టర్ .పంచ  చొక్కా పై పై కోటు వేసేవారు.పిలక ఉండేది .నాకు బాగా పరిచయం .మంచి ఉపన్యాసకులు .అనలిటికల్ బ్రెయిన్ ఆయనది లోతులను తరచి మాట్లాడేవారు .
  మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తిగారి తండ్రిగారు చతుర్వేదుల సదా శివ మూర్తిగారు అతిపవిత్ర జీవి  .తాడంకి వల్లూరు హెడ్ మాస్టర్ చేసి శ్రీ కాకాని వెంకటరత్నం గారి అభ్యర్థనపై ఆకునూరు హెడ్ మాస్టర్ గా చేశారు డిసిప్లిన్ కు మంచి విద్యా శిక్షణకు జిల్లాలోనే పేరెన్నిక గన్న హెడ్ మాస్టర్ . ఎవ్వరినీ లెక్క చేసేవారుకాదు .అందరికి హడలు .మనిషి భారీ పర్సనాలిటికాదు  సరిసమానంగా తెల్లటి పంచ చొక్కా ఉత్తరీయం మెడలోనుంచి ముందువైపుకు దోపి ,ముఖాన పెద్ద బొట్టు తో  పిలక తో ఉండేవారు . ఇంగ్లీష్ , లెక్కలలో ఆయన వద్ద చదివిన వారు తప్పటం అనేది ఉండేదికాదు .బడితెలవంటి వాళ్ళు కూడా కుక్కిన పేనుల్లాగా తల వొంచి వినయంగా ఉండేవారు .నాకు బాగా పరిచయం .ఆకునూరు నుంచి పడమట వెళ్లి అక్కడే రిటైరయ్యారు .రిటైరయ్యాక ఆయన్ను లెక్కల ట్యూషన్ చెప్పమని బ్రతిమాలితే ఇంటి దగ్గరే ట్యూషన్ లెక్కలు ఇంగ్లీష్ బోధించారు యాభై మందికి తక్కువ ఉండేవారుకాదెప్పుడూ . ఒక ఇన్ స్టి  ట్యూషన్ లాగా నడిపారు  అలాగే కపిలేశ్వర పురం లో హెచ్ ఏం అయినా శ్రీ ఉమా రామ లింగమూర్తి గారికి జిల్లాలో పెద్దపేరు .చామన ఛాయ గోచీ పోసి పంచె కట్టు ,కోటు ,ఉత్తరీయం మెడలో మడిచి స్ఫురద్రూపంగా ఉండేవారు . సంప్రదాయం సౌశీల్యానికి పెట్టిందిపేరు . జిల్లాలో ఆయన పెద్ద దిక్కు . సలహా సంప్రదింపులకు ఆయన వద్దకే వెళ్లేవారు .ఆయన మేనల్లుడూ అల్లుడూఅయిన  శ్రీ  రామ గోపాలం గారు కూడా హెడ్మాస్టర్ . కపిలేశ్వరపురం లో చేసి గన్నవరం లో రిటైర్ అయ్యారు .నేను సైన్స్ మాస్టర్ గా గన్నవరం లో [అని చేసిన పది పది హేను రోజుల్లో నన్ను జాయిన్ చేసుకొని రిలీవ్ చేసింది ఆయనే .మూతి మీద చిన్న మొరిక ఉండేది .పొట్టిగా నే ఉండేవారు పంచెపై చేతుల గ్లాస్కో బనీను వేసేవారు .ఇది తమాషాగా ఉండేది .సైన్స్ టీచర్ గా పెద్ద పేరు
శ్రీ పుచ్చా శివయ్యగారు గ్రాండ్ ఓల్డ్ హెడ్ మాస్టర్ .కపిలేశ్వర పురవాసి . లెక్కలు ఇంగ్లీష్  లలో ధరో  నాలెడ్జ్ ఉన్నవారు . క్రమశిక్షణకు మారుపేరు . రిటైరయ్యాక ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజీ ని శ్రీ అన్నే హనుమంతరావు గారితో కలిసి స్థాపించారు .మానాన్నగారు రిటరయ్యాక ఇక్కడే తెలుగు పండిట్ గా చేశారు ఆదిరాజు పున్నయ్యగారుకూడా ..మాతమ్ముడు కూడా కొద్దీ కాలం చేశాడు . .  శివయ్యగారితో అప్పుడే పరిచయం .
  ఉయ్యూరులో నేను ఎస్ ఎస్ ఎల్ సి చదివినప్పటి హెడ్మాస్టర్ శ్రీ కామినేని రాధాకృష్ణ మూర్తిగారు పెడసనగల్లు వాసి .సూటూ బూటూ టై తో ఉండేవారు .బాల్డ్ హెడ్ .ఆయన్ను ”దసరా బుల్లోడు ”అనేవారు ..ఇంగ్లీష్   ఆల్జీబ్రా  చెప్పారు .అర్ధంకాక నోట్స్ ఇవ్వక పొతే కాటూరు వెళ్లి హెడ్మాస్టార్ గా    ఉన్న శ్రీ సీత0  రాజు కామేశ్వరరావు గారి దగ్గరకు వెళ్లి వారమ్మాయి నోట్స్ అడిగి తీసుకొని రాసుకొని తిరిగి ఇచ్చేవాడిని అందుకే మార్కులు ఆ రెండు సబ్జెక్ట్ లలో తక్కువ వచ్చేవి . .రాధాకృష్ణమూర్తిగారిని నాగిరెడ్డి అనిస్టుడెంట్ స్కూల్ లోనే కొట్టాడు కారణం తెలియదు . కానీ ఆతర్వాత ఆ రెడ్డికి నడుం పట్టేసి  వంకరగా  జీవితాన్తమ్ నడిచేవాడు యాకమూరు వాసి . కామేశ్వరరావు గారు మేము టెన్త్ లో ఉండగా లెక్కలు చెప్పేవారు ఆయన పాఠం  చెబితే అక్కడికక్కడే రావాల్సిందే ఒక్క స్టెప్ కూడా వదలకుండా బోర్డు మీద రాసేవారు . కనుక యావరేజ్ వాడికి గొప్ప అవకాశం .ఆయన ఉయ్యూరులో మా బజార్లోనే కాపురముండేవారు మా నాన్న గారి శిష్యుడనని చెప్పేవారు నేను వారి శిష్యుడను .ఇంటివద్ద వక్కపొడి తయారు చేసి అమ్మేవారు .పంచ చొక్కా తో ఉండేవారు చాలా మర్యాదస్తులు  .వారమ్మాయి నా క్లాస్ మేట్ .” గురువుగారబ్బాయ్ ”అనే నన్ను పిలిచేవారు .పొట్లాలు నిలువుగా ఉండి  అడుగునా పైనా మూత లుగా చిన్న అట్టముక్కలుండేవి . చుట్టూ  గ్లేజ్ కాగితం అతికించి ఉండేది .
   ఉయ్యూరులో పని చేసిన శ్రీ కె ఎస్ ప్రకాశరావు గారికి మంచిపేరు. అలాగే రాళ్లబండి సత్యనారాయణ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు .పంచెపై కోటు .భారీ పర్సనాలిటీ . ఎవరినీ లెక్క చేసేరకంకాదు .శ్రీ ఎస్ కె వెంకటేశ్వర్లుగారు నల్లగా ఆజానుబాహువుగా పంచెకట్టుతో ”సెల్ఫిష్ జయంట్  ”గా ఉండేవారు .ఆయన సంతకం ”జిలేబి చుట్ట”లా  ఉండేది . స్కూల్ లోనే హెడ్ మాస్టర్ రూమ్ లో ఒకప్రక్క ఉండేవారు .వైష్ణవులు .బ్రాహ్మణమాస్టార్ల ఇంటికి ప్రతి రోజు నాకో సూరి రామశేషయ్య గారికో అటెండర్ తో చిన్న చీటీ పంపేవారు ‘అందులో  ”ప్లీజ్ ఆరెంజ్ మీల్స్ టు  డే ”అని ఉండేది .అలానే చేసేవాళ్ళం .మందిని బాదుకోవటం సరదా .ఎక్కడ పని చేసినా స్పెషల్ ఫీ  ఫండ్స్ ”హూష్ కాకి ” నాకేసేవారని జిల్లాలో పెద్దపేరు . ఉయ్యూరులోనూ లేపేశారు .ఎవరికీ తెలిసేదికాదు .ఆయన ఉన్నప్పుడే బ్రహ్మనంద రెడ్డి  డిటెన్షన్ సిస్టం రద్దు చేశాడు .తర్వాత ఈ పాసులను బ్రహ్మానంద రెడ్డి పాస్  అనేవారు
  చెయ్యెత్తి మొక్కాల్సిన మరో హెడ్ మాస్టర్ శ్రీ ఏ బలరామ మూర్తి గారు .ఆయన శారీరక మానసిక ష్వచ్చత కు ఆయన అతి తెల్లని పంచ చొక్కాలు సాక్షి .జిల్లాలోనే తిరుగు లేని వారు ఆయన డ్రాఫ్ట్ రాస్తే తిరుగు లేదు టీచింగ్ లో డిసిప్లిన్ లో ఆయనకు సాటి ఎవరూ లేరు .ఇంటివద్ద మానసిక రోగి అయినా భారయకు అన్నీవండి పెట్టి   బడికి వచ్చేవారట .హేట్సాల్ఫ్ అనిపిస్తుంది .  సమయపాలన ఆయన విధి . స్టాఫ్ మీటింగ్ అంటే అయిదేఅయిదు నిమిషాలు చెప్పాల్సింది పాయిట్స్ గా రాసుకొని వచ్చి చెప్పేసి ఇలా చేయాలి . అంటారు అంతే సుగ్రీవజ్జనే .ఉయ్యుయూరులో కొద్ది కాలమే ఉన్నారు అప్పుడు వారివద్ద పని చేసే అదృష్టం నాకు దక్కింది  .
  ”హాఫ్ కార్ట్ ”  అనే బట్టతలఆయన పేరు బి కామేశ్వరరావు  సోషల్ మేష్టారు తరవాత హెడ్ అయ్యారు  అలాగే శ్రీనివాసరావు గారనే ఆయన రా గ్రాడ్యుయేట్ గా ఉయ్యురు లో సైన్స్ టీచర్ తర్వాత హెడ్ అయ్యారు .వారు  నేనుహెడ్  అయ్యాక మళ్ళీ పరిచయమయ్యారు  ఉయ్యూరు లో హెడ్ అయిన శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు తమాషా గా ఉండే బుల్లి మూతితో మినీ ఎస్వీ రంగారావు గా అనిపించేవారు మంచి సైన్స్ ఇంగ్లీష్  టీచర్ .ఇక్కడే రిటైరయ్యారు ఆయన పాలనను” అక్బర్ పాలన” అనేవాడిని . స్కూల్ లో కొత్త బిల్డింగ్ లు నీటి సరఫరా గ్రౌండ్  మెరక  టిఫిన్ షెడ్ మొదలైనవి కెసిపి సహకారం తో ఏర్పడ్డాయి .అయన ఇద్దరు కూతుళ్లు మానికొండలో నా స్టూడెంట్స్
  చై ర్మన్ పిన్నమనేనిగారి కుడిభుజం  రుద్రపాక హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు గారు మంచి వాలీబాల్, బాడ్మింటన్ ప్లేయర్ .టీచర్స్ బదిలీల్లో పిన్నమనేనిని ముఖ్య సలహాదారు   ఒకసారి నాకు  ముప్పాళ్లనుంచి పామర్రు రావటానికి తోడ్పడ్డారు .సరదాగా మాట్లాడే నేర్పు విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి యుక్తులు హై పర్సెంటేజ్ సాధించే  నేర్పు  ఓర్పు ఉన్నవారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు తర్వాత పునాదిపాడు వచ్చారు . వారబ్బాయిల్లో ఒకరు ఉయ్యురు కాలేజీ తెలుగు లెక్చరర్ ,రెండవనాయన కె సిపి ఉద్యోగి తరుచు ఉయ్యురు వచ్చేవారు .ఈ ఇద్దరు వెంకటేశ్వరరావు గార్లు వామభావ పక్షపాతులు .శ్రీ పి .శ్రీరామ మూర్తిగారి అనుచరులు . అసలు శ్రీరామమూర్తిగారే హెడ్ మాస్టర్ గా గొల్లపల్లి లో పనిచేసి టీచర్స్ తరఫున ఏం ఎల్ సిగా పోటీ చేసి గెలిచారు .మంచి పర్సనాలిటీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు .మేమందరం కొల్లూరి గారి మనుషులం అయినా నాతో  మూర్తిగారు చాలా ఆప్యాయంగా ఉండేవారు .ఒకటి రెండుసార్లు సరసభారతి సమావేశాలకు ఉయ్యురు వచ్చారు . అరుదైన వ్యక్తిత్వం వారిది .కానీ గిల్డ్ తరఫున పని చేసి మేము రెండుసార్లు కొల్లూరి ని గెలిపించి ఆయన్ని ఓడించాం .లెఫ్ట్ భావాలున్న శ్రీ పి .జనార్దనా రావు గారు శ్రీ నెక్కలపూడి కోటేశ్వరరావు గారు మంచి హెడ్మాస్టర్లుగా ప్రసిద్ధులు . అంగలూరు హెడ్ మాస్టారు శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు అందరికీ ఆదర్శ ప్రాయులు .ఆంగ్ల బోధనలో నిష్ణాతులు రూల్స్ లో నిధి .అలాగే మంగళాపురం హెడ్ మాస్టర్ గా చేసి రిటైరైన శ్రీ జోశ్యులుగారు జిల్లా లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా స్కౌట్స్ ట్రెయినింగ్ లో మేటి
      జగ్గయ్యపేట దగ్గర శ్రీ రెబ్బా సత్యనారాయణ గారికి మంచిపేరుంది .గన్నవరం ఆత్కూరు లలో శ్రీ ఆళ్ళ కోటేశ్వరరావు గారు ప్రసిద్ధులు .లేడీస్ లో శ్రీమతి పి .ప్రమీలారాణిగారు అరుదైన వ్యక్తి .గన్నవరం గర్ల్స్ స్కూల్ ను తీర్చి దిద్దారు .ఆమెను మేము హెచ ఏం  అసోసియేషన్  ప్రెసిడెంట్ గా ,కామన్  ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసాం . రెండితోనూ సమర్ధ వంతంగా పని చేసి రాణించారు .ఆమె చెల్లెలు సరోజినీ దేవిగారు నందిగామ లో పేరు పొందారు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి విజయ లక్ష్మిగారు కలుపుగోలు మనిషి
  ఉయ్యురు లో హెడ్ గా పని చేసిన తాడంకి నేటివ్ శ్రీ కోడెబోయిన సూర్యనారాయణ గారు నీట్ గా చొక్కా నలక్కుండా చేతికి మట్టి అంటకుండా పని చేశారు లెక్కలమేస్టారుగా మంచిపేరు  తెల్లని గ్లాస్కోపంచె అంతే  తెల్లని చొక్కా ఉత్తరీయం చేతిలో గొడుగు నెత్తిపై అటునుంచి ఇటు తిరిగిన నాలుగే నాలుగు వెంట్రుక లు ఆయన ప్రత్యేకత  . ఏం జరిగినా సంబంధ లేనట్లుండటం ఆయనకే చెల్లింది .ఆయన సమయం లో స్కూల్ లో హిందూ ముస్లిం స్టూడెంట్స్ కొట్లాట వస్తే బెదిరిపోతే నేనూ ,వల్లభనేని రామకృష్ణారావు గారు అన్నే పిచ్చిబాబు  గారు మొదలైన టీచర్స్ పూనుకొని ఘర్షణ లేకుండాకాపాడాం . ఆయన్ను అందుకే ”ఉపాయం మేష్టారు ”అనేవారు
  మంచి హెడ్మాస్టర్ లలో శ్రీ మంగళగిరి శాస్త్రిగారు ప్రసిద్ధి గొప్ప చెస్ బాడ్ మింటన్ వాలీబాల్ ప్లేయర్ .లెక్కలు  ఇంగ్లీష్ టీచింగ్ లో సూపర్ . గిల్డ్ ప్రెసిడెంట్ ను చేసాం తాడంకి హైస్కూల్ కు వన్నె తెచ్చి అక్కడే రిటైరయ్యారు .ఎన్నో సెమినార్లు నిర్వహించారు ..శ్రీ అన్నే ఉమామహేశ్వరరావు శ్రీ ఘంటా కోటేశ్వరరావు లు ట్యూషన్ మాగ్నెట్స్ .హెడ్స్ గా బాగా రాణించారు ..పెనమకూరు వాసి శ్రీ సూరపనేని వెంకటేశ్వరరావు శ్రీ విల్సన్ గార్లు ,నా ఎస్ ఎస్ సి క్లాస్ మేట్  శ్రీమతి చందా నిర్మల  ఆమె భర్త సామ్యుల్ గారు వత్సవాయి దగ్గర పోలం పల్లి లోను , గుడివాడ దగ్గర మోటూరు లో హెడ్స్ గా చేశారు . నా ” బెడ్ ”ట్రెయినింగ్ మేట్స్  హనుమంతరావు ఆండ్రు పాల్  బండిరామారావు చౌదరి , ,  శ్రీ పి ఆంజనేయశాస్త్రి ,లు హెడ్స్ గా ప్రసిద్ధులు శ్రీ కోకా మా ధవరావు గారు తాడంకి హెడ్మాస్టర్  ఎప్పుడూ ముక్కుపొడీపీలుస్తూ పంచెకు తుడుచుకొంటూ ఉండేవారు . మంచి టీచర్ కుసుమహరనాధ భక్తులు . భార్య  కూడా సౌజన్య  శీలి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు .అలాగే శ్రీ వీరయ్య ,శ్రీ యెన్ అంజయ్య ,వి రఘురాములు ,శ్రీపే టేటి జగన్నాధరావు మొదలైనవారు నాకు సహా ప్రధానోపాధ్యాయలు .ఇప్పటిదాకా చెప్పబడిన వారంతా కృష్ణా జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు .
  ఇప్పుడు ప్రయివేట్ హై స్కూల్ హెడ్మాస్టర్ ల గురించి నాకు తెలిసింది తెలియ జేస్తా .గుడివాడ టౌన్ హై  స్కూల్ వ్యవస్థాపక హెడ్ మాస్టర్ శ్రీ యి ఎస్ యెన్ వి మూర్తి గారనీజ్ఞాపకం కృష్ణా జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర పతి పురస్కార గ్రహీత . మూర్తీభవించిన స్వచ్ఛత . ఆయన ప్రత్యేకత . తర్వాత సోమంచి రామం గారికి  ఈ పురస్కారం వచ్చింది .టౌన్ హై స్కూల్ కె చెందిన మరో హెచ్ ఏం శ్రీ యెన్ వెంకటేశ్వరరావు గారూ పొడుగ్గా పలచగా ఉండేవారు .సౌజన్య మూర్తి . గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నిర్మల గారుకూడా సమర్ధులని పేరుపొందారు .  . మచిలీపట్నం లో శ్రీ చోడవరపు బింధుమాధవరావు గారు జిల్లాలోనే లెక్కలలో ప్రసిద్ధులు .లెక్కలపుస్తకాలు రాశారు . ఆయన తమ్ముడు శ్రీ సి హెచ్  వి రామా రావుగారు ఇంగ్లీష్   లెక్కలలో దిట్ట .మా నాన్న  గారితో  ఉంగుటూరు లోపనిచేసి  తర్వాత  పెనమకూరు హెచ్ ఏంగ కొంతకాలం పని చేసి మళ్ళీ గుడివాడ వైపువెళ్లారు నవ్వుముఖం నాకు బాగా పరిచయం .  బెజవాడ లో హిందూహై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారావుగారు కామ న్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసి టెస్ట్ పరీక్ష పేపర్లు కూడా అమ్మేశారని రుజువైతే మేమ0దరం ఎదురు తిరిగి ఆయన చేతిలోంచి దాన్ని తప్పించి శ్రీ నూకల శ్రీ రామమూర్తిగారు డి యి వోగా ఉన్నప్పుడు ప్రమీలా రాణిగారికి ఇప్పించాం .తేలప్రోలురాజా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రసాదరావుగారు  ఆంగ్ల  బోధనలో ,ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించటం లో  నిష్ణాతులు   వివేకానంద్ స్కూల్ హెడ్ శ్రీ నర్సింహ మూర్తి  గారిది  ఆకర్షణీయ వ్యక్తిత్వం .వానపాముల హెడ్మాస్టర్ సామ్యుల్ గారు భార్య  కూడా   హెడ్స్ .
  పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణ ”చాకు” .హెచ్ ఏం అసోసియేషన్ కు ఆయన్ని నేనే సెక్రెటరీని ప్రమీలారాణిగారిని అధ్యక్షురాలిని చేయటం లో నడుం కట్టాను  ఇద్దరూ దానికి గొప్ప వైభవం తెచ్చారు .శ్రీ మద్దూరి విశ్వం  శ్రీ వై వి రాజు  శ్రీ రమణారావు శ్రీమతి బి సుగుణ కుమారి గార్లు హెడ్ మాష్టార్లుఅయి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్లు గా పదోన్నతి పొందారు .సుగుణగారి భర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్స్ బోధనలో ప్రవీణులు అంగలూర్ హెచ్ ఏం అయ్యారు అందులో రాజు గారు నీతి  నిజాయితీకి ఆభరణం . అలాగే వెలగలేరు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు గారు లెక్కల మేస్టారుగా మంచి పేరు ఉన్నవారు . భార్య కూడా హెడ్ మిస్ట్రెస్ . నా మోపిదేవి శిష్యురాలు బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి భారతీ దేవిని  మేంఅంతాకలిసి ప్రమీలా రాణిగారి తర్వాత  హెచ్ ఏం అసోసియేషను ప్రెసిడెంట్ ను  చేశాము . మస్తాన్ రావుగారు మాతోపాటు మోపిదేవిలో లెక్కల మేస్టారుగా పనిచేసి దివితాలూకా హెడ్మాస్టర్ అయ్యారు .స్వ ర్గీయ శ్రీ టి ఎల్ కాంతారావు గారిమామగారు  పెనమకూరు హెడ్మాస్టర్ గా చేస్తూ చనిపోయారు . అక్కడే పని చేసిన శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తిగారు లెక్కల టీచర్ గా సుప్రసిద్ధులు భారీపర్సనాలిటీ . ఇక్కడే శ్రీ విల్సన్ గారు చేశారు . తోట్లవల్లూరు హెడ్ మాస్టర్ పేరుజ్ఞాపకం లేదుకానీ సిగరెట్టూ గుప్పిటిలోపెట్టి పొగ పీల్చేవారు  .తమాషాగా ఉండేది . శ్రీ చలపతిరావుగారు కపిలేశ్వరపురం ఎంకన్నవీడు ల్లో హెచ్ ఏం . శ్రీ నర్రా బాబూరావుగారు టీచర్ గా హెడ్ మాస్టర్ గా గుడివాడ చుట్టుప్రక్కల ప్రసిద్ధులు వాళ్ళబ్బాయి ఉయ్యూరులో నా శిష్యుడు తర్వాత   అడ్డాడలో లెక్కలమేస్టర్ .ఇలా ఎందరో మహాను భావులైన ప్రధానోపాధ్యాయులు అందరికి వందనములు  .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా           


Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105

             గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1
అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి వారి జీవితాలపై  రాయమని కృష్ణా జిల్లా సీనియర్ హెడ్మాస్టర్  రాష్ట్ర ప్రధానోపాధ్యా సంఘానికి అధ్యక్షులు మా లాంటి  వారికి మెంటార్  బాలసాహిత్యాన్ని అద్భుతంగా రాసినవారు రేడియో నాటికల ప్రసిద్ధులు ,హెడ్ మాస్టర్స్ కు కరదీపిక రాసినవారు ”సోమంచి రామం ”అని అందరిచే పిలువబడే  శ్రీ సోంచి శ్రీ రామ చంద్ర మూర్తి గారిని చనువుతో చాలా సార్లు అడిగాను .చూద్దాం అన్నారు కానీ జరగలేదు .వీరి తర్వాత ఇన్ని విషయాలూ తెలిసిన వారు  కృష్ణా జిల్లాటీచర్స్ గిల్డ్ కార్య దర్శి అధ్యక్షపదవులలో రాణించిన గన్నవరం సీనియర్  హిందీపండితులు ,అమెరికా ”తానా ”కు అధ్యక్షులుగా పని చేసిన శ్రీ తోటకూర ప్రసాద్ గారి తండ్రి శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారినీ అడిగాను చాలా సార్లు ఫోన్ కూడా చేశాను .కదలలేదు .నేను సర్వీస్ లోకి రాకముందు ఎందరెందరో గొప్ప హెడ్ మాస్టార్ల పేరు వినేవాడిని ,నేను పని చేస్తున్నప్పుడూ పని చేసినవారు చాలా మందిఉన్నారు .వీరిలో కొద్దీ మంది గురించి మాత్రమే కొన్ని విషయాలు విన్నాను కొందరిని ప్రత్యక్షంగా ఎరుగుదును . నిజంగా వీరందరి పూర్వా పరాలు నాకు పూర్తిగా తెలియనే  తెలియవు .అయినా వారిని గురించి చెప్పాలనే తాపత్రయం ఉండటం వలన సాహసం చేస్తున్నాను .వారి పేర్లనైనా స్మరించటం ధర్మం అని ప్రయత్నిస్తున్నాను .  ఇందులో తప్పులు ఉండచ్చు .సరైన సమాచారం ఇవ్వలేక పోవచ్చు  పెద్దమనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను .మీకు తెలిసినవారెవరైనా ఉన్నా నేను మర్చి పోయిన వారున్నా తెలియ జేయండి . ముఖ్యంగా మునిసిపల్ సర్వీస్ లో ఉన్నవారు ప్రయివేట్ స్కూల  హెడ్ మాస్టర్లలో నాకు తెలిసిన వారు వ్రేళ్లమీద లెక్క పెట్టవచ్చునేమో -ఇది  ఆరంభమే అంతం కాదని తెలియ జేస్తున్నాను  .  ముందుగా శ్రీ వెంపటి పురుషోత్తం గారు ప్రధానోపాధ్యాయులుగా ప్రాతస్మరణీయులు .శాసన మండలికి ఉపాధ్యాయ ప్రటిందీహి గ ఎన్నికై విద్యా సేవ చేశారని విన్నాను . ఆ తర్వాత నేను చదివిన ఉయ్యూరు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ గురించి చెప్పాలి .నేను 1953 లో 8 వక్లాస్ లోకి ఎంట్రన్స్ పరీక్ష రాసి చేరాను .అప్పుడు హెడ్ మాస్టారు శ్రీ బులుసు గౌరీపతి  శాస్త్రి గారనిజ్ఞాపక0 .కుదమట్టంగా ముతక ఖద్దరు పంచ లాల్చీ  తో ఉండేవారు వెడల్పు ముఖం . చామన ఛాయ  .అసెంబ్లీలో ఏదైనా పిల్లలకు చెప్పాలంటే ”ఓ చిన్న అనౌన్స్ మెంటోయ్ ”అనేవారు అది వారి ఊతపదం నవ్వు కొనేవాళ్ళం .ఆయనతర్వాత శ్రీ ఆచంట సత్యనారాయణ గారు వచ్చారు మా తొమ్మిదోక్లాస్ లో ఆయన ఎర్రగా గ్లాస్కో పంచ లాల్ఛీ తో నెహ్రూగారి చారల అరకోటు  తో గుబురు మీసాలతో హుందాగా ఉండేవారు  ఇంగ్లీష్  లెక్కలలో దిట్ట .కానీ ఒకసారి ”గోంగూర పాట ”క్లాస్ లో ఆయనపాడితే విద్యార్థినులు చెంప పగలకొట్టారని విన్నా .కటకటాల మేష్టారి ఇంట్లో ఉండేవారు . అసలు ఉయ్యూరు స్కూల్ 1951 లో ప్రారంభించినవారు శ్రీ వై  గోపాలరావు అనే హెడ్మాస్టర్ .ఈయన కమ్యూనిస్ట్ అభిమాని .తర్వాత గొడవర్రు హై స్కూల్ లో పని చేసి అక్కడ  క్వేశ్చిన్ పేపర్ల లీకు లో ఇరుక్కునికి సస్పెండయి  బయట పడ్డారు నాకు బాగా పరిచయం వెడల్పు ముఖం తెల్లని పంచె లాల్చీ తో ఉండేవారు లెక్కలు ఇంగిలీషు లో నిధి అంటారు .చివరికి ఉయ్యూరులోనే చనిపోయారు . వాళ్ళబ్బాయికి కంపాష నేట్ గ్రౌండ్స్ పై జిల్లా పరిషత్ లో గుమాస్తా ఉద్యోగమిస్తే చక్రం తిప్పి దున్నిపారేశాడు ”అన్నివిధాలా”   తర్వాత శ్రీ కె వి ఎస్ ఎల్ నరసింహారావుగారు ఈయనఉన్నప్పుడే నేను ఎనిమిదిలో చేరాను ,ఈయన పెంటపాడు వాస్తవ్యులు .ఈ జిల్లాలో స్థిరపడిపోయారు కవి,నటుడు గాయకుడు నాటక రచయిత నాట్యం చేసేవారుకూడా .అందుకని ”నాట్యాచార్య ”అనేవారు . నేను  తర్వాత మారి గౌరీనాధ శాస్త్రిగారు వచ్చారని గుర్తు . ఆయన రాసిన ”పాకీ వాణ్ణం డోయ్  బాబూ పాకీ వాణ్ణండి ”పాట బాగా పాప్యులర్ వార్షికోత్సవానికి దాన్ని వేషం వేయించి పాడించేవారు .వీరితో కలిసి ఇదే స్కూల్లో పని చేసిన అదృష్టం నాది .జూనియర్ కాలేజీ ఆకునూరులో లెక్చరర్ అయి ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు నేనంటే పిచ్చ అభిమానం .ఆయన నడక నాట్యం చేస్తున్నట్లుండేది భారీగా పొడవుగా మంచి మీస కట్టుతో తెల్ల ఖద్దరు పంచ చొక్కాతో ఉండేవారు నవ్వు ముఖమే .ఆయనే తనగురించి తాను ”జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ ”అని చెప్పుకునేవారు  మాకు ఫామిలీ ఫ్రెండ్ కూడా .గొప్ప సాయి భక్తులు ఎన్నో పుస్తకాలు రాశారు .సాహితీయామండలికి సరసభారతి ఆప్తులు . ఆయన్ను సన్మానించిన అదృష్ట వంతుడిని ..వీరి తోడల్లుడుగారు శ్రీ టి .తరుణీ రావు గారు మంచి పేరున్న హెడ్మాస్టర్ .తాడంకి లో పని చేశారు .తర్వాత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా  రిటైరయ్యారు .మంచి బాడ్  మింటన్ ,వాలీ బాల్  సెంట్రల్  ప్లేయర్  షాట్ దిగకపోతే కోపంతో బాత్ విరగ్గొట్టేవారు అయితే టీమ్ నడిపించటం లో నేర్పరి
  అవనిగడ్డలో గొప్ప హెడ్మాస్టర్లు పనిచేశారు  వారిలో నా స్నేహితుడు పెద్దిభొట్ల ఆదినారాయణ మామగారి అన్నగాఋ శ్రీ ఏడిద సత్యనారాయణ గారికి  మంచిపేరుండేది  . కూన పులి సుబ్రహ్మణ్యం గారు ఇంగువ కృష్ణ మూర్తిగారు రాయసం సుబ్బారావు గారు కామన్   ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీ శ్రీ టి వి సుబ్బారావు   పెడన హై  స్కూల్ హెడ్ మాస్టర్  చాలాకాలం కామన్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరిగా సమర్ధవంతం గా నిర్వహించిన  శ్రీ విష్ణు వర్ధనరావు  సబ్ జెక్ట్ లోనూ పేరున్నవారు లావుగా వెడల్పు ముఖం తో మల్లుపంచె తెల్ల చొక్కాతో ఉండేవారు సీరియస్ ముఖం ఆయనతో మాట్లాడటం అంటే భయం అనేవారు .
  పామర్రులో చాలా కాలం హెచ్ ఏం గా పని చేసిన శ్రీ రావు సాహెబ్ సుబ్బారావు గారికీ పేరుబాగానే ఉంది .రావు సాహెబ్ అనేది బిరుదేమో !ఆయన గురించి ఒకమాట చెప్పుకొనేవారు .గుమాస్తా ఏదైనా సంతకం కోసం వస్తే ”ఎద్దుచ్చా ?మేక  పెంటికా
“?అని అడిగేవారట .ఎద్దుచ్చ అంటే పొడుగు సంతకమా అని మేక పెంటిక అంటే పొట్టి సంతకమా అని భావం ట .అక్కడే చాలాకాలం పని చేసిన శ్రీ ఆరికపూడి పూర్ణ చంద్ర రావు గారు చెవుల నిండా బొచ్చుతో భారీ పర్సనాలిటీ తో ఖద్దరు వస్త్ర ధారణతో ఆకర్షణీయంగా ఉండేవారు . టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా చాలాకాలమున్నారు .నేను సర్వీస్ లో చేరిన కొత్తలో . ఆయన ఒంటెత్తు పోకడలు నచ్చక మెజారిటీ టీచర్లు ఆయన్ను వ్యతిరేకించగా గిల్డ్ రెండు గా చీలింది .అప్పుడు శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అయ్యారు అప్పటికి ఆయన మోపిదేవి హెడ్మాస్టర్ నా సర్వీస్ సైన్స్ మాస్టర్ గా అక్కడే  ప్రారంభం .  .చక్కని పలువరుసతో ఎత్తుగా తగినంత బలంగా ఖద్దరు పంచె ,లాల్చీ  ఉత్తరీయం చేతిలో తాళం చెవుల గుత్తి తో కనిపించేవారు బోళామనిషి క్షణాలమీద కోపం వచ్చేది .నేనంటే మహా అభిమానం .ఒక ఏడాది అక్కడ పని చేసి ఉయ్యూరుకు ప్రయత్నిస్తుంటే తెలిసి ”మా అమ్మాయి ప్రభావతి ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చింది మీ బోధనా నాకు  అమ్మాయికీ ఇష్టం మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు ప్రయత్నం చేసినా ఆపేస్తా .అనటం తో ఆ అభిమానానికి పులకించి ఉండి పోయా . తర్వాతెప్పుడో కాటూరు హెడ్ మాస్టర్ గా అయన ఉన్నప్పుడు నేను మానికొండలో సైన్స్ టీసీగార్ గా ఉండగా నన్ను కాటూరు వేయించుకోవాలని కమిటీ వారికి చెప్పి ,నర్రా వెంకటరత్నం లాంటి వాళ్ళు అడ్డుపడ్డా   నాకోసం మానికొండ వచ్చి అక్కడ లేనని ఉయ్యూరు వచ్చానని తెలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి విషయం చెప్పి రిక్వెస్ట్ రాయించుకొని నాలుగు రోజుల్లో ఆర్డర్ తెప్పించిన ఉన్నత వ్యక్తిత్వం .తర్వాత గజిటెడ్ హెడ్ మాన్స్టర్ గా ప్రొమోషన్ పొందారు .అప్పుడూ ఎక్కడ కనిపించినా రిక్షా దిగి పలకరించిన  సంస్కారం ఆయనది . వాళ్ళమ్మాయి అబ్బాయి ఇద్దరూ మోపిదేవిలో నా శిష్యులే . బి పి  ఉన్నట్లుగా ప్రవర్తించేవారు క్షణిక కోపం . యిట్టె చల్లారేది . తర్వాత చనిపోయారు   ఈయన బంధువే తూమాటి  వెంకటరామయ్య  నల్లగా తెల్ల పంచ చొక్కాతో ముదునూరు,ఘంటసాలలో హెడ్ గా పని చేసిన  వారుండేవారు . లెక్కలు ఇంగ్లీష్ లలో దిట్ట ఎన్నో సెమినార్లలో కలిసేవార0 .సబ్ జెక్ట్లపై అధారిటీ .పెద్దమనిషిగా మంచిపేరు .
   శ్రీ మోచర్ల పూర్ణ చంద్ర రావు పామర్రులో ,నున్నలో చేశారు భారీ పర్సనాలిటీ .తెల్ల ఖద్దరు పంచ లాల్చీ  స్ఫోటకమాచల ముఖం తో   ఉత్తరీయం తో చాలా హుందా గా ఉండేవారు .వీరిదగ్గర పామర్రులో పని చేశాను .మంచి వాలీబాల్  బాడ్  మింటన్       ప్లేయర్ .పంచె మోకాళ్ల    పైకి ఎగకట్టి ఆడేవారు .సరదాగా మాట్లాడేవారు క్రమశిక్షణ బాగా పాటించేవారు .రోజూ బంద రు నుంచే వచ్చినా ఏనాడు లేటుగా వచ్చేవారుకాదు  పామర్రులో పనిచేసిన మరో ప్రసిద్ధ హెడ్ మాస్టర్ శ్రీ వేమూరి రామ కృష్ణయ్యగారు . ఎర్రగా  అంచుప0చ  తెల్ల చొక్కా ఉత్తరీయం తో నవ్వు ముఖం తో ఉండేవారు మహా సహన శీలి . కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఎలకుర్రు వాస్తవ్యులు గొప్ప స్థితిపరులు .వారబ్బాయి హర్ష నా దగ్గర పామర్రులో టెన్త్ చదివాడు . వీరికి కోపం అంటే ఏమిటో తెలీదు .ఎవ్వరికీ అపకారం తలపెట్టేవారుకాదు . ఇంగ్లీష్     లో నిధి .స్టాఫ్ మీటింగ్  లు గంటలకు గంటలు పెట్టేవారు .విసుగ్గా ఉండేది ఆయనకు తెలియని విషయం లేదు .పి  శ్రీరామ  మూర్తిగారి అభిమాని కానీ మిగతావారిలా బయట పడేవారుకాదు .ఆయన వ్యక్తిత్వానికి అందరూ జోహారు పలికేవారు . తరవాత ఉయ్యూరు హెడ్ మాస్టర్ గా కూడా పని చేశారు అప్పుడు మా పెద్దబ్బాయి శాస్త్రి టెన్త్ చదివాడు . ధర్మ రాజు అనేవారు రామకృష్ణయ్యగారిని . పామర్రులో పని చేసిన మరో హెడ్మాస్టారు శ్రీ హయగ్రీవంగారు .సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ .రూల్స్ బాగా తెలిసినవారు లౌక్యులు .తెల్లపంచె చొక్కాతో నిండు కుండలాఉండేవారు బెజవాడ కాపురం . ఒకటి రెండుసార్లు నాకోసం ఉయ్యూరువస్తే ఆయనకు గారెలు ఇస్తామని చెబితే మా ఆవిడ వండింది ఇష్టంగా తిన్నారు అందుకని ఆవిడ ”గారెలమాస్టారు ”అనేది
  శ్రీ ఇంగువ కృష్ణ మూర్తి గారు ,శ్రీ పి  .సీతారామ శర్మగారు అంటే నా మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి బావగారు మల్లుపఞ్చ కొక్కాతో ఉండేవారు గొప్ప ఇంగ్లీష్    టీచర్ గా పేరు బందరులో ఉండేవారు  శ్రీ పచ్చళ్ళ శర్మ అనే వారు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఉండేవారు ఆరుగొలను ,లో పని చేసిన జ్ఞాపకం .
  మొవ్వ కు చెందిన శ్రీ మొవ్వ వెంకట కృష్ణా రావు గారు ఎప్పుడు ముతక  ఖద్దరు  పంచ లాల్ఛీ ఉత్తరీయంతో ఉండేవారు .దేవుడుమేస్టారు  అనేవారు . నేను మోపిదేవిలో పని చేస్తున్న కొత్తలో ఒక సారి ఆయనమిత్రులైన మా హెడ్మాస్టారు తూమాటి వారిని కలవటానికి వచ్చారు .మా హెచ్ ఏం నా గురించి నా ఎదుటే ఆయనకు చాలామంచిగా పొగుడుతూ చెప్పారు .ఆయన ”కోటేశ్వర రావు ! ఇది పాలపొంగు కొత్త కదా .మొదట్లో బానే పని చేసినట్టే కనిపిస్తారు .తర్వాత ఆపొంగు ఉండదు ”అన్నారు ఏమాత్రం సంకోచం లేకుండా .వెంటనే కోటేశ్వరరావు ”ఇదుగో చెబుతున్నాను చూడు .మా ప్రసాద్ గారు జీవితాంతం ఇదే నిబద్ధతతతో పని చేస్తారని గ్యారంటీ ”అన్నారు నాకు ఆశ్చర్య మేసింది నేను చేరి రెండు నెలలు కూడా దాటి ఉండదు ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్య పోయా .కానీ అదే నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది .కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నానంటే ఇదే కారణం .
  మోపిదేవిలో నేను చేరేసరికి సోషల్ మేష్టారు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు పెదప్రోలు వాసి మంచి ఆస్తిపరులు .తర్వాత కొన్ని నెలలకే ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టారై  వెళ్లిపోయారు   .కానీ కుటుంబం అక్కడే ఉంది ఆతిధ్యానికి పెద్దపేరు నన్ను లెక్కల మేష్టారు శ్రీ జమ్మలమడక రమణారావుగారినీ వారం రోజులు వారింట పెళ్లి భోజనాలవంటి సకల మర్యాదలతో మాకు ఆతిధ్యమిచ్చారు గొప్ప సంస్కారి .నలగని తెల్లని మిల్లు పంచె చొక్కా తో ,పై పంచె తో ఎర్రగా కుది మట్టంగా  ఉండేవారు చతురోక్తులతో అలరించేవారు  .తర్వాత పడమట హెడ్ మాస్టారై  మా అందరి అభ్యర్ధనతో గిల్డ్ ప్రెసిడెంట్ అయి జిల్లాలోనే ఆదర్శ హెడ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు . ఆయన చెల్లెలు తమ్ముడు మోపిదేవిలో నా శిష్యులు . పెదప్రోలు వారే శ్రీ పింగళి ఆంజనేయులు గారు  ఇక్కడినుంచే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ తో వెళ్లారు .అలాగే లెక్కలమేస్టారు బదిలీయై అవనిగడ్డకు వెళ్లిన  శ్రీ నరసింహ మూర్తిగారికి మంచి టీచర్ గా  పేరు తర్వాత హెడ్ మాష్టర్ అయ్యారు చామన చాయగా పంచ చొక్కాతో నవ్వు ముఖం తో ఉండేవారు రెండేళ్ల క్రితం మోపిదేవి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం లో వారిని చూశాను . పెదప్రోలువాసే వేమూరి  మార్కం డేయులు గారు .ముతక ఖద్దరుపంచె చొక్కాలో ఎర్రగా ఉండేవారు .నూజివీడు హై  స్కూల్ హెడ్ గా రిటరయ్యారు .ఈజీ  గోయింగ్ అనేవారు .గుర్రప్పందాల పిచ్చ ఎక్కువని చెప్పుకొనేవారు .ఉయ్యూరు కాపురం వాళ్ళబ్బాయిలు అమరనాధ్ ,అమ్మాయిలూ మాకు బాగా పరిచయం .మరికొందరి గురించి తర్వాత .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

మల్లినాథుని రఘువీర చరితం
  5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస  సంహార గాథ   వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి రాశాడు . వాళ్ళశరీరం లో బాణం దూసుకు పోవటం ,బయటికి రావటం  ఒకే సారి జరిగిపోయాయట .  .రామబాణాలు యమ దూతలు అనిపించాయట . కొందరు రాక్షసుల తలకాయలు కాళ్ళు ,అరచేతులు అడ్రస్ దొరకలేదట .త్రిశురలనూ అదే పరాక్రమంతో రాముడు సంహరించాడు రావణుడు స్వయంగావచ్చి చూసి తనబలగానికి జరిగిన నష్టం తెలుసుకొన్నడ్డు మారీచుడిని ఒకడినే రావణుడు నమ్మాడట . రాముడు అప్పటికే ఈ రాక్ష దళనాయకులను చంపేశాడు . దేవతలు ,మునులు రాముని వీరత్వాన్ని బహుధా పొగిడారు .శూర్పణఖ శత్రువులను చూసి భయపడక వారి సంహారం ఆలోచించమని చెప్పింది .రావణుడినే బంగారు లేడి రూపం లో సీత మనసును  ఆకర్షించమని  ఏదో మిషకల్పించి రామ సోదరులను సీతకు దూరం చేస్తే పని సులువౌతుందని హితవు చెప్పింది  .ఈ పన్నాగాన్ని మారీచుడు  హర్షించలేదు  శీలవతి,రామపత్ని  సీతను అపహరించటం వినాశనమని చెప్పాడు.రావణుడు లోక రావణుడు కనుక వాడి మాట పెడ  చెవిని బెట్టి తాను  చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించాడు ..అప్పుడు మారీచుడు బంగారు మచ్చల మాయలేడి వేషం ధరించి సాయంకాంతిలో ధగధగ మెరిసిపోతూ కనిపించి చూసేవారికెవరికైనా పరవశం కలిగేట్లున్నాడు .మాయలేడి వర్ణన మల్లినాథుడు 10 శ్లోకాలలో రమణీయంగా వర్ణించాడు ..లేడిని చూసిన సీత వ్యామోహం తో దాన్నితీసుకురమ్మన గానే  పట్టటానికి వెంటనే  వెళ్ళాడు .మధ్యలో  ఒక బాణాన్ని దానిపై సంధించాడు . ఆదెబ్బకు గిలగిలా తన్నుకుంటూ అది ”హా సీతా హా లక్ష్మణా ”అని మగగొంతుకతో మాయగా అరిచింది .అది రాక్షసమాయని లక్ష్మణుడికి తెలిసి ఆమె కు చెప్పినా నమ్మక తనభర్త రాముడు ప్రమాదం లో ఉన్నాడనుకొని నమ్మి అతనిని  సహాయంగా వెళ్ళమని బలవంత పెట్టింది .ఎంతకూ కదలకపోతే చాలా నీచంగా మాట్లాడింది .–”నాహం వయస్య మిహిరవ్యపాతోదినాశ్రియహ్ పావక మావి శ0త్యాహ”   ఇక ఆగలేక అతడు వెళ్ళగానే రావణుడు వచ్చి సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు  .దారిలో జటాయువు రావణ బారినుండి సీతను రక్షించే ప్రయత్నం చేశాడుకాని విఫలుడయ్యాడు   .సీత దుఃఖం తో విలపిస్తుంటే ప్రపంచమంతా దుఃఖం తో శోకం తో కన్నీళ్లతో విలపించింది అన్నాడు మల్లినాథుడు ..
  7 వ  సర్గ  లో  రామ లక్ష్మణుల దిగులు విచారం వర్ణితం  .సీతాపహరం తో రాముని వియోగ వేదన వర్ణనాతీతమై ఆమె స్మృతులను నెమరేసుకొంటూ తిరిగాడు తమ్ముడితో . .సీతా వియోగాన్ని భరించలేకఆమె ప్రతి లతా చెట్టు  పక్షి ,నెమలితో స్నేహంగా మెలిగిన దృశ్యాలను జ్ఞాపకం చేసుకొంటూ మరింత కుమిలి పోయాడు  ”అభిసంగ విహ్వలుడనైననన్ను ఎడబాసి ఉండవద్దన్నాడు మరింత గా మానసికంగా కుంగి  స్వీయనిందను  మోపుకొంటూ సీతను క్షమించమని రెండు చేతులూ ఎత్తి  నమస్కరించి ప్రార్ధించాడు రాముడు అని రాశాడు మల్లినాథుడు ..దుఃఖం లో మునిగి వివేకం కోల్పోవద్దని  లక్ష్మణుడు అన్నతో అన్నాడు . సీతాన్వేషణలో సోదరులిద్దరూ దండకారణ్యం లో అడుగడుగు వెతుకుతుకు ముందుకు వెళ్లగా అవసాన దశలో ఉన్న జటాయువు కన్పించి రావణుని సీతాపహరణాన్ని వివరించాడు .
  క్రమంగా రాముని మానసిక స్థితి మారి ఆగ్రహం తో రగిలిపోయాడు .రావణుడు సీతను ఎత్తుకు పోయి ఇంకా వాడు బతికి ఉండటం  చూసి తన విల్లు ఏమీ చేయలేక అవమానం తో వంగిపోయింది అనుకొన్నాడని మల్లినాథుని రాసిన శ్లోకం మెచ్చదగింది .భావ లోలత్వానికి గురికావద్దని తమ్ముడు చెబుతూనే ఉన్నాడు మానవ జీవితం లో సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి నిబ్బరంగా ఉండాలి .వివేకమున్నవాడు బాధపడడు  కర్తవ్యమ్ ఆలోచిస్తాడు .దైవ నిర్ణయాన్ని  శిరసా  వహించమని , విధికి ఎవరైనా తలవంచాల్సిందేనని ధైర్యం చెప్పాడు ..సీత కాలి  ఆభరణమైన కడియాలు కనిపించగానే మళ్ళీ గొల్లుమన్నాడు.  జ్ఞాపకాలలో కూరుకు పోయాడు . మళ్ళీ తమ్ముడు అన్నకు దుఃఖం కానీ సుఖం కానీ శాశ్వతం కాదు అని ”తలంటాల్సి ”వచ్చింది .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment