గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

438-పంచసంధి వ్యాకరణ కర్త  -బనార్సి దాస్(1587-1643)

1587 లో జన్మించి 1643 లో మరణించిన బనారసీ దాస్ తన జీవిత చరిత్ర ‘’అర్ధ కథానక ‘’గ్రంధం  రాశాడు .అందులో జైన దేవాలయాలలో జరిగే పూజలు ,ఉత్సవాల గురించి వర్ణించాడు . 1635 లో జైన గురువు పండిట్ రూప్ చ0ద్ ఆధ్వర్యం లో జరిగిన జైన సెమినార్ గురించి కూడా పేర్కొన్నాడు .ఆగ్రా జైన సంస్కృతికి పట్టుగొమ్మగా ఉండేదని ,1594 లో పండిట్ భగవాన్ దాస్ తన రామ్ నగర్ నుండి ఆగ్రాకు యాత్రగా వచ్చాడని ,ఈ మహానగరం లోని ‘’జిన వన్దన0 ‘’ను చక్కగా వర్ణించాడు .అప్పుడు ఆగ్రాలో 48 దిగంబర జైన దేవాలయాలున్నట్లు తెలిపాడు .వీటిలో రెండు భట్టారక పీఠాలు .భట్టారక సుఖ కీర్తి తిహునా సాహు జైన దేవాలయం లో ఉండేవాడని ,భట్టారక జగత్ భూషణ్ సాహు నారాయణి దేవాలయం లో నివసించేవాడని చెప్పాడు .నగరం లోని జైన దేవాలయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరి ఆధీనం లో ఉండేవి .భట్టారకులు పండితులనుఎంపిక చేసి నియమించి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహింప జేసేవారు .ఈ పూజారులుతాంత్రిక పూజలూ నిర్వహించేవారు .ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రాలుగా ఉండేవి .ఉత్తర భారతం లోని ప్రతి దిగంబర దేవాలయం లో లోపలా బయటా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ,సామూహిక పూజా కార్యక్రమాలకు ప్రసంగాలకు అనువుగా ఉండేవి .బలభద్ర జైన్ ఆగ్రా గురించి ‘’ప్రతి జైన దేవాలయం లో ఉదయ , సాయం సమయాలలో జైన మత గ్రంధాలపఠనం ఆరాధనజరిగేవి .తరచుగా తత్వ గోష్ఠి నిర్వహించేవారు ‘’అని రాశాడు .

  బనారసీ దాస్ తనగ్రంధం లో ‘’పండిట్ రూప్ చంద్ జైన గ్రంథ నిష్ణాతుడు ఆగ్రాకు వచ్చి తిహున్ సాహు నిర్మించిన దిగంబర దేవాలయం లో ఉన్నాడు .ఈయన ఆధ్వర్యం లో గొప్ప దిగంబర జైన సభ జరిగింది . అందులో ఆయన ‘’గొమ్మట సార’’పై గొప్పగా ప్రసంగించి స్ఫూర్తి కలిగించాడు .ఇది భట్టారక పీఠం . ‘’ఆధ్యాత్మిక గోష్ఠులను ‘’విచార ‘’లేక విచార గోష్ఠి అనేవారు.దీనినే మనం ఇప్పుడు సింపోజియం అంటున్నాం .కుంద కుందా చార్య రాసిన ‘’సమ్మత సార’’పై కూడా గోష్ఠి జరిగేది .ఆరాత్ మల్ ధోర్ అనే ప్రముఖ జైన ఆచార్యుడు తనకు హితోపదేశం చేసినట్లు బనారసీ దాస్ రాసుకున్నాడు .బనారసీ దాస్ ‘’భాషా అర్ధ బొచరై చిత్త ‘’అనే గ్రంథాన్ని తానె స్వయం గా చదివాడు .కానీ పూర్తిగా  అర్ధం చేసుకోలేక పోయానని ,గోమ్మట  సారను రూప్ చాంద్ మార్గ దర్శకత్వం లో చదివి న తర్వాత సమయసారం పూర్తిగా అర్ధమయింది రాశాడు .తన అర్ధ కథానకలో బనారసీ దాస్ ‘’ఇప్పటికి సన్మార్గం లో పడ్డాను .దేవుని స్వభావం ఏమిటో తెలిసింది .ఈ ఆనందం ,తపన తో ‘’సమయచార నాటకం ‘’రాశాను’’అని చెప్పుకొన్నాడు దాస్ .నాటకం చివర విపులమైన వివరణ ఇచ్చాడు

 జైన మత గ్రంధాలపై అవగాహన బాగా ఉన్న పంచ మహానుభావుల సంభాషణలు గోష్ఠులను గురించి సవివరంగా రాశాడు .సమయ సారకు వ్రజభాష అనువాదం కూడా బనారసీదాస్ రాశాడు .దీనికి ఆధారంగా అమృత చంద్రుని సంస్కృత వ్యాఖ్యను ఎంచుకున్నాడు బనారసీ దాస్ రాసిన సమయ చార నాటకం ఆగ్రా జైన పీఠాలలో గ్రంధమై పోయింది .బనారసీ దాస్ మిగిలిన రచనలను ఆయన మరణానంతరం సేకరించి మొఘల్ సామ్రాజ్య దివాన్ జగ్జీవన్ పంచ మహానుభావుల నే జ్ఞాన మండలికి  అందజేశాడు .ఇందులో పీతాంబరుడు అనేకవి 1630 లో బనారసీ దాస్ పై స్తుతిగా చెప్పిన కవిత్వం బనారసీ విలాస్ అనే జ్ఞాన్భా వని  అనే ది ఉంది దీనిలో దాసు గొప్ప వాణిజ్య వర్తక వేత్త మాత్రమేకాక భక్తిగా గానం చేయగల సత్తా ఉన్నవాడిని మంచికవి అని వర్ణించబడింది .సుమారు 15 మంది ఆసక్తి ఉన్నవారు బనారసీ దాస్ ఇంటికి వచ్చి ఆయన ఆలపించే కుట్ బాన్ రచించిన ‘’మృగావతి ‘’ని ,మం జాన్ రాసిన మధుమాలతి ని  ఆసక్తిగా వినేవారట  .ఈ రెండూ సూఫీకవుల కవిత్వాలు .

  దాస్ -జాన్ పూర్ లో  పండిట్ దేవ దత్తు వద్ద జ్యోతిష ,గణిత ,ఖాండ స్పూట  విద్యలు  నేర్చాడు  .నానార్ధాల ‘’నామ మాల ‘’ను ‘’అనేకార్థ కోశం ‘’ను అధ్యయనం చేశాడు .అలంకార శాస్త్రం లఘుకోశం పై ఒక ఏడాది దీక్షగా కృషి చేసి సారం గ్రహించాడు .స్వే తాంబర గ్రంధాలు శ్రుత బోధ ,చంద్ర కోశ లను ప్రసిద్ధ బౌద్ధా చార్యులు బాం చంద్ ,రామ్ చంద్ ల వద్ద నేర్చాడు .తాను  సంస్కృత ప్రాకృతాలను నిర్దుష్టంగా పలకగలనని మాట్లాడగలనని వాటిలో రాయగలనని చెప్పుకొన్నాడు .స్వయంగా తీర్చి దిద్దుకోబడిన కవి దాస్ .వెయ్యి పద్యాలున్న హిందీ అలంకార శాస్త్ర గ్రంథం రాశాడు .నవ రసాలను చర్చించాడు .జాన్ పూర్ గవర్నర్ చిన్ని కిలిక్ బనారసీ దాస్ శిష్యరికం చేసి ఎన్నో గ్రంధాలు అభ్యసించాడు .సంస్కృత వ్యాకరణం ‘’పంచ సంధి ‘’రాశాడు .జిన సహస్రనామం  సూక్తి ముక్తావళి రాశాడు.

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-17- కాంప్ -షార్లెట్-అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామమూర్తి జయంతి

Inline image 1

—  సరసభారతి, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరు కెసిపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో 29-8-17 మంగళవారం సాయంత్రం4 గం లకు   తెలుగు  భాషా దినోత్సవ  కార్యక్రమం నిర్వహింపబడుతోంది .తెలుగు భాషా ప్రియులు విచ్చేసి జయప్రదం చేయప్రార్ధన

                         కార్యక్రమం
 1-అతిధు లకు ఆహ్వానం
  2- వందేమాతరం ప్రార్ధన
  3-మా తెలుగుతల్లికి ప్రార్ధన గీతం
  4- దీప ప్రదీపనం
  5 గిడుగువారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ
   6 అధ్యక్షుని తొలి పలుకులు-శ్రీ జి వెంకటేశ్వరావు -సి ఓ ఓ -కెసిపి
    7- గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం పై ప్రసంగం
        1-లయన్ శ్రీ బందా  వెంకట కటరామారావు -కవి ,రచయిత విమర్శకులు
         2-డా .శ్రీ గుంటక వేణుగోపాల రెడ్డి-తెలుగు ఉపన్యాసకులు
          3- శ్రీ చలపాక ప్రకాష్ -ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి, కవి రచయిత ,రమ్యభారతి పత్రిక సంపాదకులు
           4- శ్రీమతి మాది రాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి
8 – అతిధులకు భాషోద్యమ సత్కారం
9- వందన సమర్పణ
10  – జనగణ మన
                                              గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు
                                                   మరియు రోటరీ ప్రెసిడెంట్ -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

                  మూడవ రుద్రాభిషేకం

శ్రీ కృష్ణాష్టమి నాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం జరిగిన భజనకు వచ్చిన శ్రీ గౌడు రఘు గారి భార్య శ్రీమతి సుచిత్ర 26-8-17 శనివారం సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం ఉందని నన్ను చేయించమని మా అమ్మాయికి మాకు చెప్పారు .సరే అన్నాను .ఇది ఇక్కడ నేను చేయించిన మూడవ రుద్రాభిషేకం . వీరి అమ్మాయే కుమారి రచిత కిందటినెలలో కూచిపూడి రంగప్రవేశం చేస్తే వెళ్లి చూసాం

నిన్న మధ్యాహ్నం 2-45 కు వాళ్ళు పంపిన శ్రీ వెంకట్ అనే అనంతపురం జిల్లా ఆయన కారులో మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని ,దారిలో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి భార్యను పిల్లలలను ఎక్కించుకొని సుమారు 45 మైళ్ళదూరం అంటే దాదాపు 70 కిలోమీటర్లదూరం లో ఉన్న రఘు గారింటిలో దింపారు .వెంకట్ గారిభార్య కృష్ణా జిల్లా ఘంటసాల వాసి .అక్కడి హై స్కూల్ సైన్స్ మేష్టారు ,తర్వాత హెడ్మా స్టర్ అయినా శ్రీ మూల్పూరి  చిన్నారావు గారు నాకు మంచి స్నేహితులుడు .ఆయనదగ్గర ఈమె చదివింది అవి గుర్తు చేసుకున్నాం దారిలో . .చెన్నారావుగారబ్బాయిశ్రీ వెంకటేశ్వరరావు  అమెరికాలో  ఉంటారు .ఘంట శాల గ్రామం ఆ పాఠశాల అభిరుద్దికి తండ్రీ కుమారులు చేసిన సేవ నిరుపమానం . చెన్నారావుగారు మరణించి సుమారు ఆరునెలలు పైనే అయింది .

 రఘు గారింటికి వెళ్లేసరికి అంతా  రెడీ గానే ఉన్నారు . రఘు దంపతులకు ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’అంద  జేశాను . సాయ0త్రం 4-30 కు గణపతి పూజ చేయించి ,శివుని ప్రతిష్టించి అష్టోత్తర శతనామ పూజ ,లలితా అష్టోత్తరం చేయించేసరికి 5-30 అయింది అప్పుడే రుద్రం చదివేవారు సుమారు 10 మందిదాకా వచ్చారు . మా శ్రీమతిని శ్రీ గ్రంధి హరి కుటుంబం వారు ఇంటికి వచ్చి సాయంత్రం 4-30 కు పికప్ చేసుకొని రఘుగారింటికి తీసుకు వచ్చారు . అభిషేకం ప్రారంభించే ముందు నన్ను రుద్రం గురించి చెప్పమని అక్కడి రవీంద్ర గారు అడిగితే  చెప్పాను .ఈయన రఘుగారింట్లో ప్రతి ఆదివారం రుద్రం నేర్పుతున్నారు తర్వాత  లఘున్యాసం ,నమక చమకాలతో  ఏకాదశ రుద్రాభిషేకం పాలు ఫలరసం తేనే పంచదార పెరుగు నెయ్యి  నీరు లతో చేయించి వచ్చినవారందరితో (సుమారు 70 మంది)చేయించి లింగాలను కడిగించి తర్వాత మళ్ళీ షోడశోపచార పూజ అష్టోత్తరం చేయించి నైవేద్యం పెట్టించి హారతి ఇప్పించి ,మళ్ళీ నేను లింగం అంటే ఏమిటి అభిషేకం ఎందుకు చేయాలనే విషయాలతోపాటు సరసభారతి విషయాలూ చెప్పి ,ఏకాదశ రుద్రాలను పుస్తకం చేతిలో లేకుండానే చక్కగా మాతో స్వరం కలిపి చదివిన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు  అమ్మాయి శ్రీమతి  కాకాని లక్ష్మి భక్తికి ,స్పష్టమైన ఉచ్చారణ ను మెచ్చి ఆమెకు సరసభారతి తరఫున 1 116 రూపాయలు (వెయ్యిన్నూట పదహారు రూపాయలు )నగదు కానుక ప్రకటించి ,వీలయినప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిసరసభారతి పుస్తకాలతో సహా  తీసుకోమని సభా ముఖంగా తెలియజేసి ,ఆతరవాత మంగళహారతి ,మంత్రం పుష్పం అందరు  లేచి నిలబడి ఏక కంఠంగా చెప్పించి  ఉద్వాసన చెప్పించాను .రఘుదంపతులకు నా చేతులమీదుగా తీర్ధ ప్రసాదాలు అంద  జేశాను . దంపతులు  వారితోపాటు అందరూ ఎంతో బాగా చేయించానని నన్ను అభినందించారు . నాకు కూడా ఇప్పటికి చేయించిన మూడు రుద్రాలలో ఇది చాలా సంతృప్తి నిచ్చింది .రుద్రం గురించి విపులంగా చెప్పే అవకాశమూ వచ్చి అందరికిఆనందాన్ని ,సంతృప్తి ని కలిగించగలిగాను . తర్వాత  -కర్ణాటక స్పెషల్ అయిన హోళిగలు  బేడల చారు, గారే పప్పు కూర సాంబారు పెరుగులతో మంచి భోజనం అందరికి . అయ్యాక నాకు ‘’ఘనమైన నగదు కానుక ‘’నిచ్చి రఘుదంపతులు మా దంపతుల కాళ్లకు మొక్కి పిల్లలతో కూడా మొక్కించి ఆశీర్వాదాలుపొందారు . గ్రూప్ ఫోటో తీసుకున్నారు అలాగే వెంకట్ కుటుంబం హరి కుటుంబం మొదలైనవారు కూడా .అంతా అయేసరికి రాత్రి 11 అయింది .రాత్రి 11-30 కు ఇంటికి చేరుకున్నాం . నేను రుద్రం గురించి చెప్పిన విషయాలు తెలియ జేస్తాను .

                          శ్రీ రుద్రం

‘’నమకం లో 11 అనువాకాలు ,చమకం లో 11 అనువాకాలు కలిస్తే రుద్రం లేక రుద్రాధ్యాయం లేక శత రుద్రీయం అంటారు . శాత అంటే వంద అనికాదు చాలా అని అర్ధం .  అంటే అనంతమైన రుద్రుల గురించి చెప్పేది అని  .రుద్రుడు రోదసి లేక అంతరిక్షం కు అధిపతి . 11 రూపాలతో వ్యక్తమవుతాడు .ఇవే  ఏకాదశ రుద్ర రూపాలు .వీరిని ‘’Gods of vibration ‘’అంటారు . దివి లేక ఆకాశానికి సంబంధించిన 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు  .వీరు  ‘’Gods of radiation ‘’.భూమికి సంబంధించిన 8 మంది దేవతలను అష్ట వశువులు అంటారు వీరికి ‘’Gods of materialization ‘’అని పేరు . సృష్టికి కారణభూతమైనవారు భీష్ముడు ఒక వసువు రూపమే . వీరిని బట్టే సంస్కృత ఛందస్సులు ఏర్పడ్డాయి 12 అక్షరాల ఛందస్సును త్రిష్టుప్ అని,11 అక్షరాలా జగతి ,8 అక్షరాలా గాయత్రి  16 అక్షరాల  అనుష్టుప్ ఛందస్సులు ఏర్పడ్డాయి.

  శత రుద్రీయం అమృతత్వ సార్ధకం .శివ అంటే అవాజ్మానస గోచర సత్య ,జ్ఞాన ఆనంద లక్షణ పరబ్రహ్మం . అంటే అమృతత్వ భావన -మోక్షానికి మార్గం .ఇదే శ్రీ విద్యా రూపం కూడా .నమకమ్ మొదటి అనువాకం -’’నమస్తే రుద్రమన్యవ ఉతోషత ఇశవే నమః ‘’మంత్రం తో ప్రారంభమవుతుంది .ఇందులో అన్ని వ్యసనాలకు మూలకారణం అయినక్రోధానికి నమస్కారం చెప్పబడింది . తర్వాత బాధను కలిగించే శివ ధనుస్సుకు బాణానికి దాన్ని చేబట్టే చేతులకు నమస్కారం చెప్పారు . అంటే ఈ జగత్తును లయం చేసే రుద్రుడు అయిన శివుని యొక్క ‘’ఘోర రూపం ‘’వర్ణించబడింది .శివుడు ‘’అఘోర రూపం ‘’లో కూడా ఉంటాడు -’’అఘోర ఘోర తరే భ్యహ ‘’రెండవ అనువాకం లో సుఖాన్ని కలిగించే శాంత  స్వభావం వర్ణించబడింది    8 వ అనువాకం లో శివ పంచాక్షరీ ఉంది . ఇది బంధ విచ్చేదనం చేసి జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తుంది . అందుకనే రుద్రాధ్యాయంలో  దీన్ని మణిపూస అంటారు .క్రోధం నశిస్తే శాంతికలుగుతుంది అని భావం.  శాంతి ఉంటె సకల సౌఖ్యాలు కలుగుతాయి .విష్ణువును ‘’శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ‘’అనే శ్లోకం తో, శివుడిని ‘’శాంతం పద్మాసనస్థం శశిధర నయనం పంచ వక్త్రం త్రినేత్రం ‘’అనే శ్లోకం తో ప్రార్థిస్తాం రెండింటిలోనూ శాంతమే మొదటి పదం .నమకం అంతా అనేక రూపాల రుద్రునికి నమస్కారాలను తెలియ జేస్తుంది .

చమకం ‘’ఆజ్ఞా  విష్ణూ సజో ష  సేమా  వర్ధంతు వాంగిరః -ద్యుమ్నై ర్వాజే భి రాగతం ‘’అనే మంత్రం తో ప్రారంభమవుతుంది .చమకం లో శివుడికి మన కోరికల చిట్టా విప్పుతాం . నాకు అదివ్వు  ఇదివ్వు  అని వేడుకొంటాం .దీన్ని ‘’చమే ‘’పదం సూచిస్తుంది . దీని అర్ధం అదికూడా అని .మనకోరికలలిస్ట్ చాలా  ఉంటుందికనుక ‘’చమే ‘’చాలా సార్లు వస్తుంది ..ఇందులోనే ;;కల్పతాం ‘’అనే మాటకు అర్ధం కలుగుగాక ..రుద్రం లో రెండు వాక్యాలమంత్రాన్ని ఋక్కులని ఒకే వాక్యం ఉంటె యజుస్సు అని అంటారు .శివ తమా అంటే శివ తత్త్వం -అంటే మోక్షమే .రుద్రుడు ధరించే ధనుస్సు మొదటి సగం మన శిరసులోని బ్రహ్మ రంధ్రం నుంచి ముందువైపుకు భ్రూమధ్యం వరకు ఉంటుంది .ఇక్కడే ‘’మన్యువు ‘’అనే శక్తి ఉంటుంది రెండవ సగం భ్రూమధ్యం నుంచి మెడవరకు ఉంటుంది . .కనుబొమలనుండి మెడ వరకు అడ్డంగా పుర్రెపై  వ్యాపించి ఉన్న రేఖయే  శివధనుస్సు .అందుకే శివుడు ‘’కపాలం ‘’చేతిలో ధరిస్తాడు ఇది సాంకేతికం ..ఆకాశం లో సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పయనించేదారి ఒక ఆర్క్ లాగా ఉండే శివ ధనుస్సే  .దీనివలన పగలు రాత్రి ఏర్పడుతాయి .శివుడు కాలస్వరూపం .మహా కాలుడు అంటారు ఉజ్జయిలో ఉన్న శివుడు మహా కాళేశ్వరుడు .మన ఇంద్రియ శక్తులు కపాలం నుంచి రుద్ర గ్రందివరకు అంటే మెడుల్లా మీదుగా పని చేస్తాయి అందుకే మెడుల్లా చాలా ముఖ్యమైనది . అది పని చేయకపోతే  జీవితం వ్యర్థం . 5జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనసు ను ఆశ్రయించి ఉన్న రుద్రుని 11 రూపాలే శివుని 11 బాణాలు .

‘’నా రుద్రో రుద్ర మర్చయేత్ ‘’  అంటే రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించటానికి అర్హుడు కాదు .అందుకే రుద్రుని యొక్క విభూతిని అంటే బూడిదకాదు ఐశ్వర్యాన్ని మన శరీరం లో ఒక్కొక్క అవయవం లో ఉంచుకొని అంటే న్యాసం చేసి మనం రుద్రులం అయి అప్పుడు రుద్రాభి షేకం చేస్తాం . దీన్నే మహాన్యాసం అంటారు . గొప్పగా ఉంచుకోవటం .. ‘’దేహో దేవాలయ ప్రో క్తో జీవో దేవ స్సనాతనః ‘’అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతను డైన పరమేశ్వరుడు . శివుడు  వ్యోమ కేశుడు అంటే ఆకాశమే జుట్టుగా కలవాడని భావం  .దిక్కులే ఆయన వస్త్రాలు కనుక దిగంబరుడు అంతేకాని  బట్టలు విప్పుకొని తిరిగే వాడు అని అర్ధం కాదు .ఆయన జటాజూటి -అన్ని రహస్యాలు తెలిసినవాడు ..

 ఇప్పటిదాకా రుద్రార్చనా విధిని తెలుసుకున్నాం ,ఇప్పుడు శివలింగం గూర్చి దానికి ఎందుకు అభిషేకం చేయాలి అనే దాన్ని  తెలుసుకొందాం  .

          శివ లింగం

శివుడే లింగం  ,శివుడైన లింగం శివ లింగం.  లింగాన్ని పూజించాలి అని శివ పురాణం లో ఉంది .శివ లింగం లో ప్రజ్ఞానం లో బ్రహ్మ ,పాదం లో విష్ణువు ,హస్తం లో హరుడు ,బాహువుల్లో ఇంద్రుడు ,జఠరం లో అగ్ని ,హృదయం లో శివుడు ,కంఠం లో వనవాసి ,నాలుకతో సరస్వతి ,ముక్కులో వాయువు ,కళ్ళల్లో సూర్య ,చంద్రులు ,చెవులలో అశ్వినీ దేవతలు  లలాటం లో రుద్రుడు ,మూర్ధ భాగం లో ఆదిత్యుడు ,శిరసులో మహాదేవుడు ,పృష్టం లో పినాకిని ,ముందు శూలి ,ప్రక్కల శివుడు ,శంకరుడు , అన్నిటా వాయువు ,దాని బయట అగ్ని జ్వాలా ,సర్వాంగాలలో సర్వ దేవతలు యధా స్థానం లో ఉండి  నన్ను రక్షించుగాక యజమానులు రక్షించుగాక ‘’అని ఆవాహన చేసి ప్రార్థిస్తాం  . ‘’లిం  గమయతే ఇతి లింగహ్ ‘’అంటే దేనిలో నుంచి విశ్వం ఆవిర్భవించి దేనిలోకి లయం అవుతుందో అదే లింగం .ఆది మధ్యాంత రహితమై అవాజ్మానస గోచరమైనది లింగం

 లింగాన్ని ఎందుకు పూజించాలి ? దీనికి మహా భారతం ద్రోణ పర్వం లో ఒక విషయం ఉంది .ద్రోణుడు మరణించాక కొడుకు అశ్వత్ధామ తీవ్ర కోపావేశ0  తో  పాండవ సైన్యం పై విరుచుకుపడి ఒక అక్షౌహిణి సైన్యాన్ని సంహరించి ప్రళయకాల రుద్రుడుగా చెలరేగి పోయాడు అతన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేక పోయారు .ఆగ్నేయ బ్రహ్మాస్త్రాలతో భీభత్సం సృష్టించాడు . చివరికి నరనారాయణులైన కృష్ణార్జునపై యుద్ధం ప్రారంభించాడు .చాలా సేపు యుద్ధం చేశాడు . కానీ దీటుగా అర్జునుడు సమాధానం చెబుతున్నాడు .ఇక ఆగలేక చివరి అస్త్రంగా నారాయణాస్త్రం ప్రయోగించాడు ఇద్దరిపైనా .కృష్ణార్జునులు రథం దిగి ఆయుధాలు వదిలేసి దానికి భక్తితోనమస్కరించారు .అది వారిని ఏమీ చేయకుండా నిసఫలమై వెనక్కి వెళ్లి పోయింది .నారాయణాస్త్రం తో ఇదివరకు ఎందరినో జయించిన అశ్వత్ధామకు ఎందుకు ఇలా జరిగిందో తెలీక బుర్ర గోక్కొని వ్యాసమహ ర్షిని ప్రార్ధించాడు ఆయన ప్రత్యక్షం అవగానే కారణం అడిగాడు దానికి ఆయన పూర్వ జన్మలో మీరు చేసిన శివ పూజా ఫలితమే ఇది .కృష్ణార్జునులు మట్టితో శివలింగం చేసి పూజించి అభిషేకాలు చేశారు ..నువ్వు శివుని బొమ్మ తయారు చేసి పూజించావు .లింగ పూజ ప్రతిమ పూజ కన్నా శ్రేష్టం .అందుకే వారిని శివుని వరం వలన నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది -’’వారలు లింగాధిష్టా-నారూడుం గా నొనర్చి యర్చించిరి -భవ్యారాధన వరులై మును -గౌరీపతిని అతుల నియామకల్పన వెలయన్ ‘’

‘’శుభ్రమగు నుర్వి మృత్తిక సురు  చిరంపు -బ్రతిమగావించుకొని ,యందు బరము నావహించి -పూజలు  విశేషంబులెల్ల జేసి – దీవు దొలు మేన  గొలిచితి నిష్ఠ తో డ ‘’

‘’లింగంబు నందు బూజించుట -యర్చయందారాధించుట కంటే -ననేక గుణంబు లెక్కువ ‘’అని తిక్కనగారు వ్యాసునితో చెప్పించారు .అందుకే లింగ పూజ సర్వ శ్రేష్టం .

  లింగానికి అభిషేకం పుణ్యఫలం .బ్రహ్మా0డం  అండా కారం లో ఉంటుంది .శివునిశిరసు పై గంగ ,చంద్రవంక ఆయనకు చల్లదనాన్ని కల్గిస్తాయి . శివుడు కృత్తికా నక్షత్రం లో పుట్టాడు అది అగ్ని నక్షతరం . ఆయన మూడవ కన్ను కూడా అగ్ని గోళమే .అందుకని ఆవేడిని చల్లబరచటానికి ఎప్పుడూ నెత్తిన నీళ్లు పోస్తూండాలి అంటే అభిషేకం చేయాలి .ఆయన చల్లగా ఉంటె లోకాలు చల్లగా ఉంటాయి .కనుల్లనే శివలింగం పై ఎప్పుడూ నీటిధారపడే ఏర్పాటు ఉంటుంది .శివాలయం లో శివలింగానికి ఎదురుగా కూర్చున్న నంది విగ్రహం ఉంటుంది . దీని ఉచ్చ్వాస నిశ్వాసాలు శివలింగాన్ని చల్లబరుస్తాయి . మన మనసులోని కోరికలవలన మనసులు కూడా వేడెక్కుతాయి వీటిని చల్లబరచటానికి అంటే కోరికలు తీర్చుకోవటానికి అభిషేకం చేస్త్తామ్ లేక చేయిస్తాం .పంచామృతాభిషేకం అంతరాత్మ శుద్ధినిస్తుంది .ఇందులోని ఆవుపాలు జ్ఞానానికి గుర్తు .జ్ఞానప్రదాత .తేనే ఆపాత మధురం ఎక్కువ వాడితే మత్తు ఎక్కుతుంది అది విషయం వాంఛలకు ప్రతి రూపం .విషయం వైరాగ్యం కలగాలని ప్రార్ధించాలి .పంచదార అహ0కారానికి ప్రతిరూపం దాన్ని తొలగించమని ,వినయం ఇవ్వమని ప్రార్ధించాలి .ఆవునెయ్యి పాప హరణం .పాపాలను తొలగించమని కోరుకోవాలి .ఇదీ అభిషేకం లో ఉన్న అంతరార్ధం ‘’

 పుష్పదంతుడు అనే  గంధర్వరాజు  మహా శివ భక్తుడు .కామ రూపం ధరించే సిద్ధి ఉన్నవాడు .మహా సంగీత విద్వా 0సుడు .అందుకే ఇంద్రుడు ఆస్థాన గాయకుని చేశాడు .ఒక సారి భూలోకం లో కామ రూపం లో సంచరిస్తూ ఒక రాజు గారి పూలతోటలో శివ పూజకు పెంచుతున్న పుష్పాల సుగంధానికి పరవశుడై రాత్రివేళ వాటికి కోసుకు పోతున్నాడు .రాజుకు శివపూజకు పూలు చాలక నిఘా పెట్టించి పూల ల్లమొక్కల వద్ద నేలపై మారేడు దళాలను పరపించాడు .పుష్పదంతుడు రాత్రివేళ పూలు కోయటానికి మొక్కలవద్దకు వెడుతూ మారేడు దళాలను తొక్కాడు ,కైలాసం లో శివుని తపస్సుకు భంగం కలిగి అతని శక్తులన్నీ లాగేశాడు .దీనితో కాపలా వాళ్లకు పట్టుబడగా రాజు కారాగారం లో బంధించాడు .జరిగిన దానికి చింతిస్తూ శివమహిమలపై స్తోత్రం రాశాడు . అదే ‘’శివ మహిమ్న స్తోత్రం ‘’.  స్తోత్రం పూర్తికాగానే మెచ్చిన శివుడు అతని  శక్తులను మళ్ళీ ఇచ్చివేశాడు.  రాజుకు క్క్షమాపణలు చెప్పి మళ్ళీ గాంధర్వ లోకానికి వెళ్ళాడు . ఆ స్తోత్రం లో ఒక శ్లోకం చాలా తమాషాగా బాగా ఉంటుంది

‘’యత్కృత్యమ్ తన్నకృత్యం యదకృత్యం కృత్య వదాచరితం -ఉభయో ప్రాయశ్చిత్తం శివ ,తవనామాక్షర ద్వయోచ్చరితం ‘’

 భావం -శంకరా !జీవితం లో తప్పకుండా చేయాల్సిన పనులు చేయ లేకపొయాను . ఆచరించ కూడనివి తప్పనిసరిగా ఆచరించాను .ఈ రెండూ దోషాలే ,పాపాలే శిక్షార్హాలే .వాటికి పరిహారం నీ పేరులోని రెండు అక్షరాలైన ‘’శివ ‘’అనే నామం భక్తితో పలకటమే’’ అదీ శివ మహిమ అంటే .

  ఈ  వీక్లీ  ఇంతటితో సమాప్తం .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా  ..

 

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం .

‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని నమ్మిన ఆలయ పరిపాలనా దక్షునిగా భక్తులకు ఎన్నెన్నో సేవలు అందించి ముఖ్యమంత్రుల సెక్రెటరీగా ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు నిర్వహించి ,ప్రధాని నరసింహారావు కార్య దర్శిగా సాహసోపేత నిర్ణయాలకు సూత్రధారి అయిన శ్రీ పత్రి  రామకృష్ణ ప్రసాద్ అంటే పి .ఆర్.కె .ప్రసాద్ మరణించారు .ఆయన సేవలగురించి మూడు నాలుగు వ్యాసాలూ నిరుడే నేను నెట్ లో రాశాను .సర్వ సమర్ధుడు అయిన ఒక మహా భక్త  శిఖామణిని  సేవకుని మరణం తీవ్రమైన లోటు.  ఆ మహామహుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం .

 మా అబ్బాయి రమణ ఫోన్ చేసి సోమవారం ఉదయం లాయర్ గోవింద రాజు శ్రీనివాస్ గుడివాడలో హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు హై స్కూల్ లో నా శిష్యుడు మా అబ్బాయి క్లాస్ మేట్ , మా లాయర్ కూడా శ్రీనివాస్ . శ్రీనివాస్ తండ్రి అబ్బి అనే శర్మ నాకు క్లాస్ మేట్  . శీను తమ్ముడు వేణు కూడా శిష్యుడే .ఈ సోదరులు తమ తండ్రి శర్మగారి స్మారక0గా శ్రీ సువర్చలా మారుతి శతకానికి స్పాన్సర్ లు గా ఉన్న సంగతి మీకు తెలుసు .శ్రీనివాస్ఆత్మకు శాంతి కలగాలని ఆకుటుంబ0 ఈ విషాదాన్ని తట్టుకొని ధైర్యం గా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం .

  గీర్వాణం -3 లో 427 వరకు రాశాను .

మంగళవారం -సుమారు 30 ఏళ్ళ క్రితం రామ గుండం  నుంచి మంచి చదువుకోసం ఉయ్యూరు వచ్చి హైస్కూల్ లో చేరి  నాదగ్గర ట్యూషన్ చదివిన  నా శిష్యుడు ,నా క్లాస్ మేట్ స్వర్గీయ చేవూరి సుదర్శన రావు మేనల్లుడు   వజ్రాల జస్వంత రావు ఉయ్యూరులో కనపడ్డాడని మా అబ్బాయి రమణ ఫోన్ చేసి అతని నంబర్ నాకు ఇస్తే రాత్రి  ఫోన్ చేసి మాట్లాడాను  ఆతను అంటే నాకు మంచి అభిమానం .చాలా వినయంగా ఉండేవాడు .హెవీ మెషిన్ లపై ట్రెయింగ్ ఇచ్చే ఆఫీసర్ గా రామ గుండం లో ఉన్నాడట .కాసేపు ఆ నాటి సంగతులు మాట్లాడుకున్నాం .

 గీర్వాణం -3 లో 433 వరకు రాశా . సుప్రీం కోర్ట్ మూడు సార్లు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ముస్లిం మహిళలకు ఊరట కలిగించింది . మా బావమరిది ఆనంద్ తో మాట్లాడాం .

బుధవారం -దేవుళ్లను ‘’పులిగాపు ‘’చేసి వినాయక చవితికి సిద్ధం చేసాం ..ఫన్ బకెట్ ను అభినందిస్తూ రాస్తే వాళ్ళు ఏవైనా జోక్స్ పంపమని రాస్తే వెంటనే నేను’’ కుట్టిన’’6 జోక్స్ రాసిపంపాను . రాత్రి 2-30 వరకు ఎందుకో నిద్రపట్టలేదు శ్రీ కృష్ణ కర్ణామృతం వింటూ తర్వాత నిద్రపోయాను .

21 సోమవారం జరిగిన నంద్యాల ఉపఎన్నిక లో 80 శాతం ఓట్లు పోలయ్యాయి తెలుగు దేశమే 10 వేలనుంచి 20 వెలవరకు మెజార్టీ తో గెలుస్తుందని లగడపాటి సర్వె చేయించి ప్రకటించాడు .రాత్రి వర్షం బాగానే పడింది ..

 గురువారం -గీర్వాణం -3 లో 435 వరకు కవుల గురించి రాశా . కస్తూరి రాసిన462పేజీల  ‘’లవింగ్ గాడ్ ‘’పుస్తకం పూర్తి చేశాను . ఉయ్యూరులో కూడా వర్షాలు బాగా పడుతున్నాయని రమణ ఫోన్ చేసి చెప్పాడు .

  శ్రీ వినాయక చవితి

25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి -ఉదయమే లేచి మామూలు పూజ తోపాటు శ్రీ  వినాయక చవితి వ్రతం చేశాను .మా అమ్మాయి తెల్ల వారుఝామునే లేచి ఉండ్రాళ్ళు పరవాన్నం పులిహోర వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,మైసూర్ పాక్ చేసి ఉదయం 8 గంటలకు ఆఫీస్ కు వెళ్ళింది .మా అల్లుడు నిన్నరాత్రి ఇవాళ పొద్దున పిల్లలతో గణేష్ పూజ చేయించి సంస్కృత శ్లోకాలు నేర్పాడు .

  ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ లలో గణేష్ విగ్రహం పెట్టుకొని సామూహిక పూజ నిర్వహిస్తున్నారు .అలాంటి ఒక పూజ’’ టాం  షార్ట్ ‘’సెంటర్ లో జరుగుతుంటే అందరం వెళ్లి నమస్కారాలు చేసి కాసేపు కూర్చుని అటునుంచి జగదీశ్, లక్ష్మి దంపతుల ఇంట్లో సాయి భజనకు వెళ్లాం . 7 గంటలకు మొదలు పెట్టి 8 కి పూర్తి చేశారు . 60 మందికి పైనే వచ్చారు నన్ను కాసేపు మాట్లాడమంటే గణేశుని ప్రశస్తి గురించి చెప్పాను ..ఆతర్వాత భోజనాలు -లడ్డూ మైసూర్ పాక్, గారే ,ఆవడ కొబ్బరన్నం పూరి  వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,పరవాన్నం వగైరా .అంతా అయి  ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 30 అయింది .జగదీశ్ దంపతుల కూతురు ‘’డోలా ‘’కు ఐర్లాండ్ లో మెడికల్ కాలేజీ  సీట్ వచ్చింది .సోమవారం చేరటానికి వెడుతున్న సందర్భంగా ఈ భజన భోజనాలు . ఆడవాళ్లందరి కొబ్బరికాయ జాకెట్ స్టీల్ ప్లేట్ పళ్ళు ఇచ్చారు మా దంపతులకు ఆ దంపతులు అమ్మాయి అబ్బాయి కూడా కాళ్లకు నమస్కారాలు చేసిఆశీస్సులు అందుకొన్నారు . ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల సారాంశం రాస్తున్నాను –

                        వినాయకుడు

‘’మనం ఏ కార్యక్రమాన్ని అయినాచేసేముందు ముందుగా గణపతి పూజ చేసి ప్రారంభిస్తాం ఆయన విఘ్నాలను నివారిస్తాడని  మనం అనుకొన్న పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తాడని విశ్వాసం …కానీ ఆయన వికృత మైన రూపం కలవాడు .అట్రాక్షన్ లేనివాడు. కానీ అగ్ర పూజ ఆయనకే .ఇందులో పరమార్ధం ఉంది . బాహ్య సౌందర్యం ముఖ్యంకాదు ఆ0తరంగిక సౌందర్యం ముఖ్యం అనే గొప్ప సత్యాన్ని ఆయన చాటి చెబుతున్నాడన్నమాట .పెద్ద బాన లాంటి గణేశుని పొట్ట పరిపూర్ణమైన ఈ విశ్వానికి ప్రతీక .ఏనుగుతల ,సన్ననికళ్ళు సునిశిత పరిశీలనకు  ,మేధస్సుకు సంకేతాలు .వక్ర తుండం ప్రణవం అయిన ఓం కారానికి ప్రతీక .ఏనుగు లాంటి ఆ శరీరాన్ని మోసేది అనింద్యుడు అనే చిట్టెలుక .ఇది విడ్డూరం అదే ఆత్మ .ఇంతపెద్ద మనశరీరానికి కదలిక నిచ్చేది హృదయం ఆత్మ .శరీర పరిమాణం లో దాని స్థానం ఎంతో  అత్యల్పం .అది లేనిది ఇంతటి శరీరం ఏపనీ చేయలేదు అంతటి ప్రాముఖ్యం దానిది అదే ఎలుక . అదే ఎలుక లేక మౌస్ మన కంప్యూటర్ ను ఆడిస్తుంది నడిపిస్తుంది ఇప్పుడు టచ్ స్క్రీన్ వచ్చాక మన వేలే మౌస్ గా మారింది అంతే తేడా ..

 గణపతి పొట్ట చుట్టూ నాగుపాము బెల్ట్ లాగా చుట్టు కొని ఉంటుంది . నాగుపాము శక్తికి చిహ్నం .భారత దేశం లో నాగుపాము పూజ అనాదిగా ఉంది . జంట పాముల విగ్రహాలను పూజిస్తాం నాగుల చవితికి పాలు పోస్తాం నాగ పంచమి జరుపుతాం . ఆ జంట పాములు ఇడా  ,పింగళా నాడులకు  సాంకేతికాలు ..జగత్తు అంతా  వ్యాపించిన మాయాశక్తి కూడా నాగుపాము గుర్తు ..అయన చేతిలోని పాశం అంకుశం బుద్ధిని మనసును సన్మార్గం లో నడిపించే సాధనాలు .మరో చేతిలో ఉన్నదంతం ఆయనదే .మహా భారతం రాసేటప్పుడు వ్యాసభగవానుని వ్రాయసకాడుగా గణపతి ఉండి ,తన దంతవిరిచి దానితో  తో రాశాడు . మరొక చేతిలో ఉండ్రాయి లేక వెలక్కాయ (కపిత్ధం )ఉంటుంది . ఉండ్రాయిని ‘’మోదకం’’ అంటారు -ఆనంద హేతువు. పైన గట్టిదనం ఉన్నా లోపల గుజ్జు మహా మెత్తగా తియ్యగా రుచికరం గా ఉండటం వెలగ పండు ప్రత్యేకత .గణేశుని మూడవ కన్ను జ్ఞాన నేత్రం .చేట లలాంటి చెవులు ప్రత్యేకమైనవి .భక్తుల కోరికలు ఎన్ని ఉన్నా వినటానికి అవి ఉపయోగిస్తాయి అంతే కాదు చేట తో పొల్లు తప్పా తాళి చెరిగేసి నికార్సైనమంచి దాన్ని తీయటానికి ఉపయోగపడుతుంది .అలాగే మనకోరికలలో స్వార్ధ పూరితమైనవి హానికలిగించేవాటిని వీచెరిగేసి మంచి వాటినే స్వీ కరిస్తాడని భావం మొత్తం మీద వినాయకుని ఆకారం మనం విజ్ఞానం కోసం ,త్యాగం కోసం చేయాల్సిన కృషిని బోధించే రూపం అని గ్రహించాలి

 ఆయన సౌందర్యం వినోదం ఇస్తుందేకాని సుందర రూపం కాదు .కనుక మనసు సౌందర్యమే ముఖ్యం బయటి ఆకారం కాదు అని మనకు గట్టిగా తెలియ జేస్తుంది .బాహ్య సౌందర్యానికి ,అంతరంగ సౌందర్యానికి సంబంధం లేదు అనే జ్ఞానాన్ని కలిగించటమే .అంటే జ్ఞాన బోధ చేయటమే ఆయన శరీరం లో ఈ వికృతత్వానికి గుర్తు ..సాధారణం గా మనం ఏవైనా తప్పులు చేస్తేదేవుడి ముందు  చెంపలు వేసుకొంటాం .కానీ వినాయకుని ముందు మన తప్పును ఒప్పుకొంటూ గుంజీలు తీస్తాం అంటే మనకు మనమే శిక్ష వేసుకొంటాం అని అర్ధం ఈ ఆచారం తమిళనాడులో ఎక్కువ అక్కడ గణేష్ ,మురుగన్ ఆరాధన బాగా జాస్తి .

  గణపతికి కృత యుగం లో 10 చేతులు ,సింహవాహనుడు గా ఆరాధింపబడితే ,త్రేతాయుగం 6 చేతులతో నెమలి వాహన 0తో  పూజింపబడ్డాడు.  ద్వాపరం నుంచి నాలుగు చేతులు ఏనుగు ముఖం ఎలుక రౌతు అంటే గుర్ర0 గా ఆవాహన చేయబడినాడు .పరశురాముడి ,గణపతికి జరిగిన యుద్ధం లో ఆయన గండ గొడ్డలితో ఈయన దంతాన్ని నరికేసినట్లు పురాణకథనం .చంద్రుడు అవమానిస్తే దంతం పీకి చంద్రుని పై విసిరాడనీ ఉంది .ఏక  దంతం అంటే -’’ఏక శబ్దాత్మి కా మయా తస్యం -సర్వం సముద్భవం  భ్రాతి మోహదం పూర్ణం -నానా ఖేలాత్మికమ్ కిలః ‘’ఏక అంటే మాయ -దంత అంటే నిజంగా ఉండేది .అంటే సత్తా మాత్రుడుగా  చాలాకుడు -అంటే నడిపించేవాడుగా ఆయన ప్రపంచాన్ని నడిపిస్తాడు .మాయతో ప్రపంచాన్ని నడిపించే చాలకుడు అంటే ‘’మూవర్ ‘’గణేశుడు  .

  వైష్ణవ ఆలయాలలో గణేశుని విష్ణు మూర్తిగా ,మధ్యప్రదేశ్ లో ‘’మండేసేరు ‘’ప్రాంతం లో ,కన్యాకుమారిదగ్గరున్న శుచీన్ద్రం లో ,మధుర సుందరేశ్వరాలయం లో గణపతిని స్త్రీ మూర్తిగా పూజిస్తారు .చైనా బర్మా  కాంబోడియా  మెక్సికో  అమెరికాలలో కూడా గణపతి ఆలయాలున్నాయి .’’ గాణాపత్యం ‘’అనే ఆరాధనా విధానం ఉంది . షణ్మతాలలో ఇదొక్కటి

  గణ+ఈశ -గణేశ గ అంటే జ్ఞానం ఈశ  అంటే అధిపతి అంటే జ్ఞానానికి  అధిపతి గణ అంటే ఇంద్రియాలు అని కూడా అర్ధం అంటే ఇంద్రియాధిపతి అని కూడా అర్ధం శ్రీ కృష్ణుని పరిపూర్ణ అవతారం గణేశుడు . హేరంబా -అంటే ఓ రక్షకుడా దీన రక్షకా అని అర్ధం .ఏక ద0తాః అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి -శూర్పకర్ణా -చేట లంత చెవులవాడా -చెడును చెరిగేసి మంచిని ఉంచేవాడా .మనకు నాలుక బయట ఉంటుంది చెడుమాటలకు మూలమై అవతలివారి గురించి  చెడు గా మాట్లాడటం దాని లక్షణం .మనసు అనే నాలుక చివరను మనవైపే త్రిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనమే తెలుసుకొంటే ముక్తి లభిస్తుంది. యోగులు నాలుకను ఈ విధంగా ఉంచుకొని అందులో స్రవించే అమృతాన్ని త్రాగుతూ ఏ ఆహారం లేకుండా ఎంతకాలమైనా జీవించగలుగుతున్నారు .గణపతి జిహ్వాగ్రము కంఠం వైపుకు ఉండటం ప్రత్యేకత.  అలా ఉండమని మనకు మార్గ దర్శకం చేస్తున్నాడన్నమాట .

పరశురాముడిని తన తొండం తో బంధించి సర్వ బ్రహ్మా0డ  దర్శనం చివరికి గోలోక0 లో శ్రీ కృష్ణ  దర్శనం చేయించాడు గణపతి అని బ్రహ్మ వైవర్త పురాణం ‘’గణేశ  ఖండం ‘’లో ఉంది .

శ్రీ కృష్ణ గణేశులు అభిన్నులు .అంటే వేరు వేరుకాదు ఒక్కరే .నిర్గుణ సగుణ బ్రాహ్మలు ఆయన అధిపతి . ‘’ఓం నమస్తే గణపతయే త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ‘’అని గణపతి అధర్వ శీర్ష కృతి చెబుతోంది .

 శ్రీ కృష్ణ దర్శనం చేసి వస్తున్న గణేశుని ధర్మధ్వజుని కూతురు తులసి చూసి తాను  నారాయణుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొని గణపతి కృష్ణునికి అభిన్నుడ కనుక తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది .ఆ కోరిక తీరదు అన్నాడు.  అప్పుడు ‘’నీకు పెళ్లి అవుతుంది ‘’అని శపించింది ఈయన వెంటనే ప్రతిగా ‘’నువ్వు రాక్షసివై పుడతావు ‘’అని శపించాడు .బ్రతిమిలాడితే వృక్ష రూపం పొంది అందరి చేతా ఆరాధింపబడుతావు అని  విమోచనం కలిగించాడు . తర్వాత జన్మలో శంఖ చూడుడు అనే రాక్షసుని భార్య  గా పుట్టింది. రాక్షసుని ఆగడాలు మితిమీరుతుంటే శివుడు త్రిశూలంతో సంహరించాడు .తన  కళా0శం తో తులసి వృక్ష రూపం పొందింది .ముక్తికి కారకురాలైంది.  అందుకే తులసి దళాలు  గణపతి పూజకు నిషిద్ధాలు . వినాయక చవితికి మాత్రం తులసి  దళాలతో తో పూజ చేయవచ్చు . మిగిలినప్పుడు పనికిరావు . విష్ణు పూజకు తప్పని సరి  . కృష్ణ తులసి సర్వ శ్రేష్టం .

‘’గణాలలో గణపతివి  కవులకు కవి ,అన్నాన్ని సమృద్ధిగా కలవాడు   ఇచ్చేవాడు   ,అందరికంటే ముందే ప్రకటితమైనవాడు ,వేద మంత్రాలలో ప్రకాశించేవాడు అయిన గణపతికి మా నమస్కారం .మా ప్రార్ధనలు విని అన్ని శక్తులతో మా ఇంటిలోకి రావయ్యా ‘’అని గణపతిని ఆహ్వానించే మంత్రానికి అర్ధం ..

 మహారాష్ట్రలో ‘’గణపతి బప్పా మోరియా ‘’అని పాటలు పాడతారు . బప్పా అంటే తండ్రీ దేవుడా అని అర్ధం .మోరియా అంటే ఏమిటి ?దీనికి ఒక యదార్ధ కథ ఉంది 14 వ శతాబ్దం లో మహారాష్ట్ర పూనా లోని చించివాడ లో మొర్యా గోసావి ‘’అనే గణపతి భక్తుడు ఉండేవాడు ఆయనవలన సిద్ధులు పొందాడు ఆయన. ఈతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గణపతి పేరుతోపాటు తనపేరు కూడా శాశ్వతం చేయమని కోరాడు . అలాగే అన్నాడు.  అప్పటినుంచి గణపతిని పిలిచినప్పుడల్లా మోరియా పేరు దానికి కలపి పలకమని గణపతి శాసించాడు .అందుకనే గణపతి బప్పా మోరియా ‘అయింది .

  చిత్తూరు జిల్లాలో తిరుపతికి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో కాణి పాకం లోనూతిలో వెలసిన  వరసిద్ధి వినాయకస్వయం భూ విగ్రహం ఉంది . చాలా పవర్ఫుల్ దేవుడు .ఎవరైనా అబద్ధ సాక్ష్యం ఆయన ముందు చెబితే వాళ్లకు ఏదో కీడు తప్పక జరుగుతుంది .అందుకని ఆయన ఎదుట నిలబడి నిజాన్నే చెబుతారు అబద్ధం చెప్పరు కోర్టులు కూడా ఈ సాక్షాన్ని పరిగణలోకి  తీసుకొనేవి .  ,అంటే ఇక్కడ వరసిద్ధి వినాయకుడే సుప్రీం జడ్జి అన్నమాట .ఈ గుడి ప్రక్కన ఉన్న నదికి ‘’బహుదా నది ‘’అనిపేరు .దీనికి ఒక కథ ఉంది .పూర్వం శంఖుడు ,లిఖితుడు అనే అన్నదమ్ములు కాణి  పాకం కి నడుచుకొంటూ వస్తుంటే దారిలో తమ్ముడికి ఆకలి బాగా ఎక్కువై అక్కడ కనిపించిన మామిడి తోటలో పండుకోసుకు తింటానని అన్నకు చెబితే  అడగ కుండా కోయరాదు అని అన్న చెప్పినా వినక కోసి తింటే దాన్ని రాజుగారికి  అన్న తెలియ జేస్తే రాజు అతని తమ్ముడు లిఖితుడి  రెండు చేతులు నరికించాడు చిన్నతప్పుకు ఇంతపెద్ద శిక్షా అని బాధ పడుతూ అన్న తమ్ముడిని ఓ దారుస్తూ కాణి పాకం చే రి అక్కడి నదిలో స్నానం చేయగానే తమ్ముడి చేతులు వచ్చేశాయి .బాహువులను దా  అంటే ఇచ్చిన నది కానుక బాహుదా అయింది ,కాలక్రమాన బహుదా నది అయింది’’ .

  రెండవ భాగం లో శ్రీ గౌడ రఘు దంపతుల ఇంట్లో శనివారం సాయంత్రం జరిగిన  రుద్రాభిషేకం విశేషాలు తెలియ జేస్తాను .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది  .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే  గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . . కనుక గ్రామనామమే ఆయన పేరు అయి ఉంటుంది .క్రీ పూ 8 లో పుట్టి 33 వ ఏట జైన మతాచార్యుడై 52 ఏళ్ళు ఆచార్యత్వం లో ఉండి  85 ఏళ్ళు జీవించి క్రీశ 44 లో నిర్యాణం చెందాడు  .రెండవ భద్రబాహు ,అర్ధబలి ,జినసేనుల సమకాలికుడు అంటారు ..బోధ ప్రహుదా లో తాను భద్ర బాహు శిష్యుడనని చెప్పుకొన్నాడు .  ఈ భద్రబాహు క్రీపూ 37-14 వరకు జీవించాడు .  జైనం లో స్వేతాంబర దిగంబర మూల సంఘానికి  నాయకుడు .  . ఆయన రాసిన గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందాయి .జైన మతాచార్యులలో మహావీరుడు ,గౌతమగంగాధరుని తరవాత స్థానం కుంద కుంద  దే . స్వయం కృషితో దిగంబర జైన దర్శనాలను సృజించిన మేధావిగా వినుతికెక్కాడు . దిగంబర జైనులు మహావీర , గౌతమగంగాధర లతోపాటు కుంద కుంద ను స్మరించి ధన్యులౌతారు . ‘’మంగళం భగవాన్ వీరో  మంగళం గౌతమమ్ గని -మంగళం కుంద కందాయ జైన ధర్మో స్తు  మంగళం ‘’ అని జైనులు స్మరిస్తారు . భద్రబాహు ,విశాఖ లకంటే ఉన్నతస్థానాన్ని కుంద కుంద కు కల్పించారు .అంతటి ప్రతిభా సంపన్నుడు . ఆయన రాసిన’’ ప్రవచన సార’’లో సత్యానికున్న రెండు పార్శ్వాలను చెప్పాడు 1-వ్యావహారన య -అంటే మొహం 2-నిశ్చయాయన అంటే పారమార్ధం లేక శుద్ధ సత్యం .

 ప్రాకృత భాషలో కుంద కుంద  రాసిన గ్రంధాలు మూడు రకాలు  -మొదటి వర్గం లోనివి -సారం కలవి -1-నియమసార -ఇందులో 187 శ్లోకాలున్నాయి 2-పంచస్తికయ సార లో 153 శ్లోకాలున్నాయి . 3-సమయసార -లో 439 శ్లోకాలున్నాయి 4-ప్రవచనసార -లో 275 శ్లోకాలున్నాయి .

రెండవ రకం లో -జైన ఆచార్యులపై భక్తిపూర్వకం గా రాసిన శ్లోకాలు ,జైన గ్రంధాలపై రాసినవి సాధకులు పాటించాల్సిన నియమాలు ఉంటాయి  -వీటినే చరిత భక్తి ఉన్న శ్లోక కదంబంఅంటారు .   .వీటిని స్వే తాంబర దిగంబర జైనులు నిత్యపూజా విధానం లో విధిగా పఠిస్తారు ,పాటిస్తారుకూడా .

మూడవ రకానికి చెందిన వాటిని ‘’ప్రభ్రత’’అంటారు -ఇందులో 8 చిన్న చిన్న గ్రంధాలున్నాయి .ఇవి  పూర్వీకులు రాసిన వాటి నుండి సేకరింపబడినవి – వీటిలో దర్శన ప్రభృతలో 26 శ్లోకాలు చరిత ప్రభృతలో 44 ,సూత్ర ప్రభృత లో 27 శ్లోకాలు అలాగే మిగిలినవాటిలోనూ ఉన్నాయి .అనేక జైన గ్రంధాలలో కుంద కుందా చార్య 84 ‘’పాహుర్ ‘’లు రాసినట్లు ఉంది .కానీ అన్నీ లభ్యం కాలేదు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

–Inline image 1– Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

అక్బర్  నవరత్న మంత్రులలో ఒకడైన  కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ  ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన వైదుష్యం కూడా ఆయనది .ఆయన పుట్టిన ఊరు ఖాన్ ఖానా గా ప్రసిద్ధమైంది .ఇది పంజాబ్ రాష్ట్రం లో నవాన్  షాహి జిల్లాలో ఉంది . అక్బర్ కు నమ్మకస్తుడు ,మార్గదర్శి అయిన బైరం ఖాన్ కు రహీం కొడుకు .ప్రవాసం నుండి బయట పడి  ఇండియా వచ్చిన హుమాయూన్ తన రాజోద్యోగులను జమీందార్ల కూతుళ్లను పెళ్లి చేసుకోమని హుకుం ఇచ్చాడు .తానూ హర్యానాలోని మేవత్ జమీందార్ జమాల్ ఖాన్ పెద్ద కూతుర్ని పెళ్ళాడి తే ,బైరం ఖాన్  చిన్నకూతురును పెళ్లి చేసుకొన్నాడు .బైరం ఖాన్ కు ,జమాల్ ఖాన్ కూతురైన భార్యకు పుట్టిన వాడే రహీం . .గుజరాత్ లోని పాఠన్ యుద్ధం లో భైరం ఖాన్ చనిపోయాక ,ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు తీసుకొని రాబడ్డాడు .తర్వాత అక్బర్ కొలువులో రహీం మంత్రి అయ్యాడు .మీర్జాఖాన్ అని పేరుపెట్టారు .రహీం మారుటి తల్లి సలీమా సుల్తాన్ బేగం, కజిన్ అయిన అక్బర్ ను పెళ్లాడింది .అక్బర్ కు  రహీం  ఈ విధంగా కొడుకు వరుస అయ్యాడు  .తన నవరత్న మంత్రులలో ఒకనిగా అక్బర్ రహీం ను చేశాడు .

 రాణా ప్రతాప్ ముస్లిం మహిళలకు రక్షణ కల్పించటం రహీం పై ప్రభావం కలిగించి  ముస్లిం అయినా రహీంఖాన్శ్ కృష్ణ భక్తుడు అయి ఒక కావ్యం రాసి అంకితమిచ్చాడు.దాతృత్వం లో రహీం చేతికి ఎముక ఉండేదికాదు .దీన్ని తులసీదాసు గమనించి కవిత్వం లో బంధించాడు .రహీం ఇద్దరు కొడుకులను అక్బర్ కొడుకు జహంగీర్ అక్బర్ మరణం తర్వాత తాను  చక్రవర్తి అవటానికి అడ్డు వస్తున్నారని భావించి చంపేశాడు .

  రహీంఖాన్ సంస్కృతం లో 1-ఖేట కౌతుకం 2-ద్వాత్రి0శద్యోగావళి కావ్యాలు రాశాడు .ఉర్దూలో లెక్కలేనన్ని దోహాలురాశాడు . బాబర్ జ్ఞాపకాలైన బాబర్ నామా ను పర్షియన్ భాష లోకి అనువదించాడు .రహీం సమాధి మధుర వెళ్లే దారిలో నిజాముద్దీన్ కు తూర్పున హుమాయూన్ సమాధిప్రక్కన ఢిల్లీలో ఉంది .దీన్ని 1598 లో రహీం తన భార్య కోసం  కట్టిస్తే ,1627 లో అందులో రహీం పార్థివ దేహాన్ని పెట్టారు .జహంగీర్ చక్రవర్తిగా సలీం సింహాసనం ఎక్కినప్పుడు అతనివద్దకూడా రహీం మంత్రిపదవి నిర్వహించాడు

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా

–Young Abdul Rahim Khan-I-Khana being received by Akbar, Akbarnama.jpg–

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవులపల్లి రామానుజరావు

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్  అబీది  (1961)

1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం  అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం ఏ డిగ్రీ సాధించింది .అడ్వొకేట్  ఇహ్తేషామ్ ఆబిదీ ని వివాహం చేసుకున్నాక దంపతులు వారణాసి లో కాపురం పెట్టారు .. మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ నుంచి పి హెచ్ డి  పొందింది .ఆమె ధీసిస్ ‘’వేద సాహిత్యం లో అశ్వినుల రూపం ‘’రాసి ప్రచురించింది

 2005 లో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో చేరి ,జీతం లేకుండా లెక్చరర్ గా పని చేసింది .తర్వాత మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ లో రోజు వారీ వేతనం పై పార్ట్ టైం లెక్చరర్  చేసింది .సంస్కృత లెక్చరర్ గా పని చేసిన మొట్టమొదటి ముస్లిం సంస్కృత విద్యా వేత్తగా   రికార్డ్ పొందినా ,ఉద్యోగం లో వివక్షతకు గురై ఇబ్బందిపడింది   2008 లో మొదటిపుస్తకం ‘’సాంస్క్రిట్ సాహిత్యమే రహీం ‘’ సంస్కృత సాహిత్యం లో లోతులు తరచిన అబ్దుల్ రహీం ఖాన్ -ఏ ఖానా పై రాసింది .తర్వాత పుస్తకం మీర్జా గాలిబ్ రాసిన ‘’చైరాగ్ ఏ ధైర్ ‘’ను సంస్కృతం లో ‘’దేవాలయస్య దీప ‘’గా అనువాదం చేసింది . మూడవ పుస్తకం 50 ఉపనిషత్తుల ను మొగల్ యువరాజు దారా షికొ పర్షియా భాషలోరాసినదానికి    హిందీ అనువాదం ‘’సిర్ర్  ఏ అక్బర్ ‘’. దారా  పెర్షియన్ భాషలో అనువదించిన వేదాంత గ్రంధానికి , దారా రాసిన సూఫీ గ్రంధాలకు హిందీ అనువాదం చేసింది . నహీద్  అబీదీ  భర్త , పిల్లలతో కాశీలోని శివపురిలో కాపురం ఉంటోంది .

  నహీద్ సంస్కృత సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2014లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసి సన్మానించింది .లక్నో యూనివర్సిటీ ‘’డి .లిట్ .ఇచ్చి గౌరవించింది .సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ఆమెను ఎక్సి క్యూటివ్ కౌన్సిలర్ ను చేసి0ది .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం డా నహీద్ అబీదీ  కి ‘’యష్ భారత్ ‘’పురస్కారమిచ్చి 11 లక్షల నగదు  అంద  జేసింది . 2007లో రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం ఆమెను రాష్ట్ర పతి భవనానికి ఆహ్వానించి సత్కరించారు .

 సశేషం

  వినాయక చవితి శుభా కాంక్షలతో

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Image result for dr nayeed abidi
Image result for dr nayeed abidiImage result for dr nayeed abidi

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి  సంగీతం పై మమకారం పెంచుకొన్నారు .వరంగల్ శ్రీ  విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చదివి ఉత్తీర్ణులై అక్కడే ఉపన్యాసకులుగా చేరి విద్యా బోధనచేశారు .వీరి ముఖ్య శిష్యులు శ్రీ అష్టకాల నరసింహ శర్మ ,డా శ్రీ కె. కోదండ రామాచార్యులు .విద్యార్థిగా ఉన్నప్పుడే ‘’మనోరమ ‘’నవల రాసి తోటి విద్యార్థులకు చదివి వినిపిస్తూ విశ్లేషణ చేసి చెబుతూ బెనారస్ లోని ముకుంద భట్టాచార్య ,మల్లావఝల సుబ్బరామశాస్త్రి  కారపాత్ర స్వామి ,పశుపతినాథ శాస్త్రి వేదాల తిరువెంగళా చార్య వంటి సంస్కృత ప్రకాండుల మన్ననలు అందుకొన్న ప్రజ్ఞానిది .కాశీ ,కాశ్మీర్ విద్యా పీఠ పండిత ప్రశంసలూ పొందారు .వాగ్వాదినీ సరస్వతి వీరికి సుప్రసన్నురాలు

  1980 లో కలకత్తా సంస్కృత విద్వత్సభలో విజయసారధి గారు ‘’ఆకతి  మందాకినీ ,చకతి మందాకినీ-తకతి మందాకినీ మధురేణ  పూరేణ -చలతి మందాకినీ ,జలతి  మందాకినీ

సలతి మందాకినీ  విమలేన సలిలేన’’అంటూ కావ్యగానం చేసి దాతు ప్రయోగవైచిత్రికి భావజాలానికి పండితప్రకాండులను మంత్ర ముగ్ధులను చేసి మందాకినీ నదిసోయగాలను  కనుల  ముందు నిలబెట్టారు .దీనికి పరవశించి మహా మహోపాధ్యాయ తర్క వాగీశ భట్టా చార్య –

‘’యుగ కర్తా -యుగో ద్ధర్తా -చక్రవర్తీ యుగస్యచ -సరస్వతీ సుతోత్తంసః -జీయాత్ విజయ సారథిహ్ ‘’అని మనః పూర్వకంగా ఆశీర్వదించి  విజయ సారధిగారు రాసే ప్రతి రచనలోనూ ఈ ఆశీర్వాద శ్లోకాన్ని ముద్రించమని అనునయ శాసనం చేశారు .సభలోని పండిత వరేణ్యులు కరతాళ ధ్వనులతో ఆ ఇద్దరినీ అభినందించారు .

శ్రీ భాష్యం వారు జ్యోతిష ,వాస్తు అలంకార ,వైదిక మంత్రార్ధ వివరణ లపై గొప్ప  గ్రంథాలు రాశారు .రాజకీయ నాయకులపై ‘’విషాద లహరి ‘’రాశారు .అందులో

‘’సాధూన్ దీన దరిద్ర భారత జవాన్ మాయావినో నాయకాః -సమ్మే ళేషు మృషాదయోక్తి  కుశలాస్తాన్ పఞ్చయిత్వా పరం ‘’

‘’సంచిస్వంతి లోక రాజ్య పరిషత్ స్థానాన్య నూనాని భోహ్ -కష్టం ప్రాప్త మనన్యవార్య మధునా శంభాలాయైనాన్ ప్రభో ‘’

భారత్ సైనికుల త్యాగనిరతిని -’’యస్య శక్తి ర్మహా కాళరాత్రి -విభీత భారత పాలన దీక్షితౌ బభూవ

పరమ భారత స్వాతంత్య్ర  సమరవీర -వివిధ సైనిక  నికురంబ మానతోస్మి ‘’అని శ్లోకం తో వారి త్యాగానికి జేజేలు పలికారు

‘’రూప సూక్తం ‘’లో రూపాయ మహిమ వర్ణిస్తూ -’’అక్షరాన జ్నోపి ,సేవ్యాయతే కోపి -అక్షరాభి జ్నోపి సేవకీయతి  కోపి ‘’అని చమత్కరించారు -అంటే అక్షరజ్ఞానం లేకపోయినా డబ్బూ ,పదవీ ఉంటె మనిషి పూజింపబడుతున్నాడు /అక్షరజ్ఞాని ఉద్యోగం లో సేవాకా వృత్తి చేస్తున్నాడని వ్యంగ్యం .

 భగద్రామానుజా చార్యుల   సుందర రూపం మధురమానసం ,మాట వైదగ్ధ్యాలను వర్ణిస్తూ –

‘’జయతి భువన దీప సంహృతార్తాను తాపాహ్  -నియమ ధృత వికారో నిశ్చి ఠామ్నాయ సారః –

ప్రియా వచన వితానః   ప్రీత సూరి ప్రతాపః -స్మయహర  యతి వర్యస్వామి యతి రామానుజార్యహః  ‘’అని శ్లోకం చెప్పారు . భావ జాలం తరుముకొస్తూ ఉంటె కొన్ని వేల  శ్లోకాలు రాసి సరస్వతీ కంఠాభరణం చేశారు శ్రీ భాష్యం విజయ సారధిగారు .

మనోరమ తోపాటు సుశీల నవల ,దంభ  యుగం ప్రహసనం ,ఆర్ష భారతి ఏకాంకిక ,అమర సందేశహ్  నాటకం ,రామ ,రామానుజ ,రఘునాధ దేశిక ఉదాహరణ కావ్యాలు ,11 సుప్రభాతాలు ,ప్రహేళికలు వంటివి ఎన్నో రాశారు .అముద్రిత గ్రంధాలూ చాలా నే ఉన్నాయి .

   శ్రీ బొమ్మ వెంకటేశ్వర్ ఇచ్చిన స్థలం లో ‘’సర్వ వైదిక సంస్థానం ‘’అనే సంస్థను స్థాపించి యజ్ఞ వరాహ స్వామి ,రత్నగర్భ గణపతి ,రమాసహిత సత్యనారాయణ స్వామి,అనంత నాగేంద్ర స్వామి ,వసుధా లక్ష్మి  నవ దుర్గ ,వాగ్వాదిని సరస్వతి ,అభయ ఆంజనేయస్వామి లతో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించి ‘’సంగచ్చ్ధధ్వగమ్ ,సంవద ధ్వగమ్ ‘’అంటూ సర్వమత సామరస్యాన్ని ప్రబోధించారు శ్రీ భాష్యంవారు . ఈ పుణ్య ప్రాంగణం లో శ్రీరామాయణ మహా క్రతువు ,చతుర్వేద హవనం ,ప్రజాపత్య విజయం ,సారస్వత ,రక్షోఘ్న వంటి ఇష్టులు ,క్రతువులు ఎన్నెన్నో నిర్వహించి ఆస్తిక జనములకు మార్గ దర్శనం చేస్తున్నారు

 వీరి సాహిత్య ధార్మిక సేవకు సాహిత్య అకాడెమీ ,తెలుగు విశ్వ విద్యాలయం బిర్లా ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ సంస్థలు పురస్కారాలు అందజేసి సన్మానించాయి .తమ విద్వత్తుకు నీరాజనంగా ‘’కవి చక్రవర్తి ‘’,మహాకవి ,వాచస్పతి ,వైదిక కర్మానుష్టాపనా చార్య మొదలైన బిరుదులూ అందుకున్నారు . ఈ ఏడాది ఆగస్టు 15 న భారత స్వాతంత్ర దినోత్సవం నాడు సరస్వతీ సమార్చనా తత్పరులు  జ్ఞా వయో వృద్ధులు శ్రీ భాష్యం విజయ సారధి మాన్య మహోదయులను తెలంగాణా ప్రభుత్వం ఘనంగా సత్కరించి గౌరవించింది .

‘’కవి మూర్ధన్యుడు పండిత ప్రముఖుడై కావ్యాశు సంక్రీడ ,వాగ్భవ కూలంకష గీష్పతి ప్రతిభుడున్  గైర్వాణ వాణీ ప్రభా –

ప్రవరుండవ్యయ భావుడున్ విజయ సారధ్యాహ్వయు డున్నేడు తా-స్టవ నీయు0 డయె ముఖ్య మంత్రి కర కంజ స్నాతుడై   వెల్గెడున్ ‘’(అష్టకాల నరసింహ శర్మ )

 సశేషం

  ఆధారం -20 17 సెప్టెంబర్ దర్శనం -మాసపత్రికలోడా.  శ్రీ కె .కోదండ రామాచార్యుల ‘’సంస్కృత విజయ కేతనం శ్రీ భాష్యం ‘’వ్యాసం

   వినాయక చవితి శుభా కాంక్షలతో

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

–Inline image 1– Image result for ganesh chaturthi greetings in telugu

Image result for ganesh chaturthi greetings in teluguInline image 2
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విప్లవ విజ్ఞుడు వేద విదుడు -దాశరధి రంగా చార్య

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు

              పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  ఏమో కాని వ్యధ పంచిపెడ తావేమోనని బాధ అన్నా .మూతి బిగించి వాడు” అదే నీతో వున్న చిక్కు .బావమరిదిని కదా నన్ను ఎంకరేజ్ చెయ్యవ్ .ఎప్పుడూ ,నీ పేరు ,ప్రఖ్యాతులేనా మేమూ వున్నాం బాబూ .మమ్మల్నీ కనిపెట్టాలి” అన్నాడు నిష్టూరం గా .సరేరా అసలు విషయం ఏమిటి అడిగాను .వాడు”.ఇవాళ వినాయక చవితి కదా సాయంత్రం ఒక సాహితీ సభ జరుగు తోంది.  అందులో నన్నూ పాల్గొనమని కబురు చేశారు .నీకు వేరే ప్రోగ్రాం ఉందటగా .నీ బదులు నేనట” .”ఇంతకీ ఏమిటి ప్రోగ్రాం ?అన్నాను .”హాస్యం వండి వడ్డించాలి  .మనకు ఎప్పుడు అలవాటు లేదాయే .నువ్వున్నావనే ధైర్యం తో ఒప్పుకొన్నాను బావా నీవే తప్ప  ఇతః  పరంబెరుగ ”ఆన్నాడు  బేలగా ,పీలగా .”సరేరా .నువ్వెంతవరకు రాశావు ?” అని అడిగా .వెంటనే ఒక చిట్టా జేబులోంచి తీసి చేత్తో పట్టుకొన్నాడు .”బావా -ఈ మధ్య కొన్ని కంపెనీలు యాడ్  ల   కోసం రాయమనే పేపర్ ప్రకటన చూసి కొంత రాశా” .”పంపావా” అని అడిగాను .”పంపాను తిరుగుటపా   లో వచ్చేశాయి”అన్నాడు కూల్ గా .అర్ధమైంది వాడి పరిస్థితి . రోట్లో తలపెట్టేశాగా . ఇంక రోకటి పోట్లకు వెరవటం ఎందుకు ?.సరే చిట్టా విప్పమన్నాను .”బావా నవ్వద్దు .ఎంకరేజ్ చెయ్యి బావా .మర్రి చెట్టుకింద మొక్కను చేసి నన్ను పెరగకుండా  ఎదగనీయకుండా చేస్తున్నావు  ” అని మళ్ళీ  గగ్గ్గోలు .సరే కానిమ్మన్నాను

     పోటాష్ తయారు చేసే కంపనీ కి ఒక స్లోగన్ రాశా .విను అన్నాడు .ఒదులు అన్నా.”వాడండి మీ చేలకు పోటాష్ -లేకుంటే మీరు అవుతారు మటాష్ ”అని చదివాడు .నోర్ముయ్యి ”కామోష్” అన్నా భరించలేక .ఇంకోటి చూడు .”అవతలి వాడి ప్రతిభ అంటే నీకు ఈర్ష బావా మొదట్నించీ” .అని, రెండోది చెప్పాడు ”వినాయక చవితికి ఉండ్రాళ్ళు -తింటే బిడ్డలను కంటారు  గొడ్రాళ్ళు  ”అన్నాడు .”రాళ్ళతో ఊడగోడ్తారు నీ ముప్ఫయి రెండు పళ్ళు ” అన్నాను.  .కొంచెం చిన్న బుచ్చుకొని మూడోది లంకించుకొన్నాడు .”పెరిగింది పెరిగింది అవినీతి –నీతి అతిగా  పెరిగితే వచ్చేదే అవినీతి ”అని చల్లగా వినిపించాడు ”.నీ మతి మండితే వచ్చేదే ఈ కపి నీతి ”అని అడ్డకట్ట వేశాను .సరే ఇంకోటి విడుస్తా విను అన్నాడు .”నీకున్న సిగ్గు లజ్జా వదులు చాలు అదే పెద్ద హాస్యం”  అన్నా.వాడు ఊరుకోంటాడా ?
”అన్నా హజారే –అరె అరె -దేశం బేజారే-ఆయన మాట అంటే జీ హుజూరే –దేశానికి ఆయన ఒక కొత్త వజీరే ” అన్నాడు .కొంచెం దగ్గిరికి వచ్చావురా అన్నా .బావా నువ్వు అండ గా వుంటే చెలరేగుతాచూడు   అన్నాడు .”అంత చెలగాటం వద్దు నాయనా” అని సర్ది చెప్పా .”నాగం గురించి ఒకటి రాశా” అన్నాడు . ”సరే విడు” అన్నా ”అన్నా నాగం -నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆగం –నీతో కష్టం వేగటం -మీ ఆవిడ యెట్లా భరిస్తోందో నీ  ఆగడం ”పర్లేదు కానీ ”అని ఉత్చాహ పరిచాను .”అందరి మీదా కాలు దువ్వె కే.సి ఆర్.–కిక్కురు మనకుండా వున్నావేమిటి యార్ ”ఒరే దవడ పగలగోడతారు  టేక్ కేర్”   అని వారించాను .సరే .”ఉద్యోగుల సమ్మె మళ్ళీ వాయిదా –వాళ్ల కేమి పోయింది ఫాయిదా ”అన్నాడు ”అర్ధం ఏమిటీ ”అన్నాను .”ఏదో ప్రాస కలిసింది కదానని వాయించా ”అన్నాడు .”నిన్ను వాయించేస్తారు ఖాయలా పడతావు ”అన్నాను .”పాలైతే నువ్వు జైలు –ఎవడో ఇప్పించక పోడు  బెయిలు ”- వహ్వా వహ్వా అన్నా.వాడు యెగిరి గంతేశాడు .”పావలాకే పంట ఋణం –అదీ పండితే గా తీర్చేది ఋణం ”భేష్ అన్నాను ..మా వాడు రెచ్చిపోయాడు .”మన్యాన్ని ఒణి కిస్తున్న డెంగ్యు –చెయ్యాలి దానితో కుస్తీ  కుంగ్ ఫ్యూ ”సెహబాష్ అన్నాను .”అవినీతి లో ఆఫీసర్ బీల –దొరికి పొతే అయాడు  బేల .”ఇంకా వుంది నీ కడుపు లోకక్కెయ్యి అన్నా ..”అవినీతి వర్గం పై  ఉమ్మేయ్యి  అన్నాడొకడు –తీరా ఉమ్మేస్తే పడేది వాడిమీదే  కదా అన్నాడు ఇంకోడు  ” —
”తెలుగును ఉద్ధరించాలి మనం – కానీ రోజూ పెడుతున్నారు ”దినం -తద్దినం -ఇదే మన ఖర్మ -ఎవడో రావాలి శర్మ ”. దారిలో పడ్డాడు మా వాడు అని లోపల కొంత సంతోషం .బయటికి అంటే మరీ రెచ్చిపోతాడని వూరుకొన్నాను .”గణపతి విగ్రహాలకు వాడండి మట్టి –లేకుంటే పర్యావరణం  నోట్లో మట్టి ”అని చదివాడు .ఇంక ఆపక పొతే చంపేస్తాను నీ నోరు కుట్టి  మరీ  నిన్ను కొట్టి కొట్టీ ” .అని వాడి హాస్య ప్రయత్నానికి పెట్టించాను ఫుల్ స్టాప్ .పాపం బిక్క మొహం తో వెళ్లి పోయాడు వాడు . కనీసం వెళ్తానని చెప్పకుండా వాళ్ల అక్కతో కూడా మాట్లాడకుండా .
రాత్రి లోకల్  ఛానల్ లో మా బావ మరిది ”హాసపు ఉండ్రాళ్ల ”కు  ప్రధమ బహుమతి వచ్చింది అని చూశాను , విన్నాను .అంటే తెలుగు హాస్యం ”యెంతబాగా” వృద్ధి చెందిందో నని   బాధ పడ్డాను .
ఇది చదివి నవ్వు రాక పొతే తప్పు  నాది కాదు  –.నవ్వక పొతే తప్పు మీదే   .
             వినాయక చవితి   శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -11 .
  దీన్ని ఈ వినాయక చవితికి” దుమ్ము దులిపి” మీకు పంపిస్తున్నాను . దుమ్ముకు తుమ్ములు వస్తే బాధ్యత నాదికాదు -దుర్గాప్రసాద్ -23-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

:–Inline image 1

Posted in రచనలు | Tagged | Leave a comment

ముస్లిం మహిళల విజయం-భూమి

ముస్లిం మహిళల విజయం

ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ ‘ముమ్మారు తలాఖ్’- ట్రిపుల్ తలాఖ్- సంప్రదాయం సర్వమత సమభావ వ్యవస్థ కల మనదేశంలో ఇంతకాలం కొనసాగడం సామాజిక, జాతీయ వైపరీత్యం. ఈ వైపరీత్యాన్ని మంగళవారం నాడు తొలగించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం సభ్యులు సామాజిక సమానత్వాన్ని మరోసారి ధ్రువీకరించారు. ఈ సామాజిక సమానత్వం ఇస్లాం మతస్థులలో స్ర్తి, పురుష వివక్షను దూరం చేయడానికి దోహదం చేయగలదు, సామాజిక న్యాయసాధనకు మార్గం కాగలదు. ధర్మాసన స్థితులైన న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్, యుయు లలిత్ ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతి తక్షణం రద్దు కావాలని చెప్పిన తీర్పుతో ధర్మాసన అధ్యక్షుడైన ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, ఎస్ అబ్దుల్ లతీఫ్ కొద్దిగా విభేదించడం దురదృష్టకరం. ఆరునెలల వరకూ యథాతథస్థితి కొనసాగాలని ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై సమగ్రమైన చట్టం చేయాలన్నది ‘విభేదించిన’ న్యాయమూర్తుల అభిప్రాయం. కానీ అల్పసంఖ్యాక మతవర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక అధికారాల దృష్ట్యా ఇన్నాళ్లుగా ప్ర భుత్వాలు ఇలాంటి చ ట్టాలను చేయలేకపోవడం ముస్లిం మహిళలకు శాపంగా మా రిందనడం నిరాకరింపజాలని నిజం. రాజ్యాంగం ని ర్దేశిస్తున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’ని ఇంతకా లం రూపొందించలేక పోవడానికి కారణం ప్ర భుత్వ రాజకీయ నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యం. ‘ఉమ్మడి పౌర స్మృతి’నే రూపొందించలేని వారు ముస్లిం వ్యక్తిగత, మత సంప్రదాయాలలోని లోపాలను సవరించే సాహసం చేయలేరన్నది బహిరంగ రహస్యం! అందువల్ల న్యాయ ప్రమేయం ద్వారా తప్ప ప్రభుత్వాల చొరవ వల్ల ఇస్లాం మహిళలకు న్యాయం జరగదన్నది ధ్రువపడిన వాస్తవం. దశాబ్దుల తరబడి వేలాది ముస్లిం మహిళలు ఈ ఘోరమైన ‘ట్రిపుల్ తలాఖ్’ అన్యాయానికి బలైపోయారు. ప్రభుత్వాలు వౌన ప్రేక్షకపాత్ర వహించడం తప్ప చేసింది లేదు. మహిళల హక్కుల ఉద్యమ నేతలు, మహిళా సాధికార సాధన సంస్థలు, సామాజిక దురాచార వ్యతిరేక సంఘర్షణలు- వీరందరికీ కూడా ముస్లిం మహిళలకు జరిగిన అన్యాయం గురించి పట్టకపోవడం ‘నకిలీ సర్వమత సమభావాని’కి సాక్ష్యం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఇస్లాం మత వౌలిక సూత్రాలకే విరుద్ధమని పలువురు విద్వాంసులు ప్రచారం చేసిన ‘ట్రిపుల్ తలాఖ్’ స్వతంత్ర భారత్‌లో ఏడు దశాబ్దుల పాటు ఇస్లాం మహిళలను ఏడిపించడం మానవీయతకే కళంకం! ఈ కళంకం ఇప్పుడు గతం, ముగిసిన పీడకల..
‘ట్రిపుల్ తలాఖ్’ ద్వారా ఇస్లాం మతస్థురాలైన మహిళకు ఆమె భర్త విడాకులివ్వడం ఆ మహిళల ప్రాథమిక రాజ్యాంగ అధికారాల- ఫండమెంటల్ రైట్స్-కు భంగకరమన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. ఈ హక్కులకు డెబ్బయి ఏళ్లుగా భంగం కలగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటైన కఠోర వాస్తవం. స్ర్తి, పురుష సమానత్వం గురించి మహిళల సాధికారత గురించి ఉద్యమకారులు, ఉద్యమకారిణులు చేసిన దశాబ్దుల పోరాటాల ఆర్భాటాల పరిధిలో ఇస్లాం మహిళలు లేరు. సర్వోన్నత న్యాయస్థానం 2015 అక్టోబర్ 16న ఈ ‘ఇస్లాం మత వ్యతిరేక’ ట్రిపుల్ తలాఖ్‌లోని ఔచిత్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేసే వరకూ సమాజంలో కదలిక రాలేదు! ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతిని సమీక్షించడానికై సర్వోన్నత న్యాయస్థానం తనంతట తానుగా- సూయోమోటో- ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది, విచారణ చేపట్టింది. దీని తరువాత మాత్రమే ఉద్యమకారులకు ధైర్యం వచ్చింది, ‘టిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించాలన్న ధ్యాస కలిగింది. ‘ట్రిపుల్ తలాఖ్’కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించడం కూడ రాజకీయాల్లో వచ్చిన విప్లవ పరివర్తన- రెవల్యూషనరీ ఛేంజ్-కు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ విధానం మంగళవారం నాటి సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయమైనదని, సమంజసమైనదని ధ్రువపడింది. తీర్పు వెలువడిన తర్వాత సుప్రీం కోర్టుకు మాత్రమే కాక, కోర్టులో ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు చెప్పడం పరివర్తన క్రమంలో వర్తమాన ఘట్టం..
సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చెప్పిన తీర్పు ఇంతకాలం ‘అక్రమ సంతుష్టీకరణ రాజకీయాల’ను నిర్వహించిన అనేక జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలకు కనువిప్పు! షాబానో అనే ముస్లిం మహిళకు విడాకులిచ్చిన ఆమె భర్త ఆమెకు జీవనభృతి చెల్లించాలని 1980వ దశకంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పును వమ్ము చేయడానికి అ ప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఇస్లాం మతస్థులను అక్రమంగా సంతృప్తి పరిచే రాజకీయాలలో భా గం! ఇలా ‘అక్రమ సంతుష్టీకరణ’కు పా ల్పడిన, పాల్పడుతున్న రాజకీయ వే త్తలు, రాజకీయ పక్షాలు ఇస్లాం మతం జనాభాలో సగమైన మహిళలకు ఘోరమైన అన్యాయం చేశారనడానికి చరిత్ర ప్రత్యక్ష సాక్షి! ‘ట్రిపుల్ తలాఖ్’ ఇన్నాళ్లపాటు కొనసాగడానికి అధికార రాజకీయ పక్షాల అన్యాయం ప్రధాన కారణం. ఈ అన్యాయ విధానాన్ని విడనాడి ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అభినందనీయం. తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం వందనీయం!
పురుషాధిక్యపు పంజరంలో బందీలుగా అలమటించిన ఇస్లాం మహిళలకు ఈ తీర్పు నైతిక విజయం, సమానత్వదాయకమైన సామాజిక విజయం. ధైర్యంగా అన్యాయాన్ని ఎదిరించగలిగిన, సుప్రీం కోర్టులో వినతిపత్రాలను, న్యాయ యాచికలను దాఖలు చేయగలిగిన ముస్లిం మహిళలు సాధికార పథంలో దారిచూపుతున్న కరదీపికలు. షయారా బానో అనే ముప్పయి ఐదేళ్ల మహిళ ఈ న్యాయ సంఘర్షణలో అగ్రగామి, అన్యాయంగా ‘ట్రిపుల్ తలాఖ్’కు గురైన మరో నలుగురు మహిళలు ఆఫ్రీన్ రెహమాన్, గుల్షన్ ఫర్‌వీన్, ఇస్రాత్ జహా, అతియా సబ్రీ కూడ ఈ దుష్ట సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకెక్కడం మహిళా చైతన్యానికి నిదర్శనం. ‘స్పీడ్‌పోస్ట్’ ద్వారా ‘తలాఖ్.. తలాఖ్.. తలాఖ్’ అని పత్రం పంపడం, దూరవాణి సంభాషణల ద్వారా ముమ్మారు తలాఖ్ చెప్పడం వంటి దుశ్చర్యలకు పాల్పడి భార్యను కడగండ్ల పాలుచేసే ధూర్తులకు సర్వోన్నత న్యాయ నిర్ణయం చెంపపెట్టు! ‘ఉమ్మడి పౌరస్మృతి’ని రూపొందించడం అనివార్యం అన్న దానికి ఇది తొలిమెట్టు..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)

జి యెన్ బి గా లబ్ధ ప్రతిష్ఠుడైన జి యెన్ బాల సుబ్రహ్మణ్యం తమిళనాడు మాయవరం లోని గుడలూర్ లో 6-1-1910జన్మించాడు తండ్రి నారాయణ స్వామి అయ్యర్ సంగీతజ్ఞుడు .అరియకపూడి రామానుజ అయ్యర్ మానసిక గురువు .లా పాసై మద్రాస్ లజ్ కార్నర్ లో లాయర్ గా బాగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు .ఇంగ్లిష్ లో బి ఏ ఆనర్స్ పాసై ,అన్నామలై యూనివర్సిటీలో సంగీతాన్ని టీఎస్ సబేష అయ్యర్ వద్ద అభ్యసించాడు .అనారోగ్యం వల్లా మానేసి మద్రాస్ యూనివర్సిటీలో డిప్లమా కోర్స్ చేసి ప్రిన్సిపాల్ టైగర్ వరదా చారి అభిమానం పొంది కచేరీ చేయ టానికి తగిన విద్వత్తు సాధించి  1928  లో మొదటి కచేరి చేశాడు .భామావిజయం  సినిమాలోనూ ,శకుంతల సినిమాలో ఏం ఎస్ సుబ్బు లక్ష్మి తోను నటించాడు .జి యెన్ బి శైలికి ఏం ఎస్ ఆకర్షితురాలై మొదట్లో అదే బాణీలో పాడేది . తర్వాత సంగీతానికి అంకితమయ్యారు బాలు .సంస్కృత తెలుగు తమిళాలలో 250 కి పైగా కృతులు రాశాడు .కొత్తరాగాలు కనిపెట్టాడు వందలాదిమందికి సంగీతం బోధించి లెక్కలేనన్ని కచేరీలు చేశాడు .మద్రాస్ రేడియోలో కర్ణాటక సంగీత డెప్యూటీ చీఫ్ ప్రొడ్యూసర్ గా పని చేశాడు .అప్పుడు లలిత సంగీత ప్రొడ్యూసర్ గా  మంగళంపల్లి బాలమురళీకృష్ణ , సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ కర్ణాటక సంగీత ప్రొడ్యూసర్ గా ఉండేవారు . 1964లో కేరళ తిరువనంతపురం లోని స్వాతి  తిరుణాల్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . 55 ఏళ్ళ వయసులో 1-5-1965న మరణించాడు . గమకాలను తగ్గించి లయకు అత్యంత ప్రాధాన్యమివ్వడం తో జి యెన్ బి సంగీతం కర్ణ పేయంగా ఉండేది .

సంస్కృతం లో ఆయన రాసిన -మోహనరాగం లోని -’’భువనత్రయ’’,నాట రాగం లో -’’కరిముఖ వరద ‘’,పూర్వి కల్యాణిలో -’’మధురాపురి కల్యాణి ‘’,మోహన లో ‘’సదా పాలయ సారసాక్షి ‘’సరస్వతిరాగం లో -సరస్వతి నమోస్తుతే ‘’,శివ శక్తిరాగం లో -’’చక్రరాజ నిలయే ‘’,కామ వర్ధనిలో -’’శివానంద కామవర్ధని ‘’,హంసధ్వనిలో -’’వరవల్లభ రామ ‘’కృతులకు సంగీత సాహిత్యాలతో ప్రాణ ప్రతిష్ట చేశాడు .

432-  భావ ,లయలకు ప్రాణం పోసిన -ఏం డి బి రామనాధన్ (1923-1984)

ఏం డి బి గా ప్రసిద్ధుడైన మంజప్ర దేవేశ భాగవతార్ రామనాథన్ 20-5-1923 న తమిళ నాడు లోని పాలకాడు  జిల్లామంజప్ర  గ్రామం లో జన్మించి ,భావ లయాలకు ప్రాధాన్యమిచ్చిన వాగ్గేయకారుడిగా పేరుపొందారు .తండ్రి దేవేశ భాగవతార్ సంగీత ఉపాధ్యాయుడు .పాలక్కాడు విక్టోరియాకాలేజిలో చదివి ఫిజిక్స్ లో   డిగ్రీ పొంది ,మద్రాస్ వచ్చి తండ్రివద్దనే సంగీత మర్మాలు గ్రహించాడు .అదే సమయం లో రుక్మిణి అరండేల్ కళాక్షేత్రం లో సంగీత శిరోమణి కోర్స్ 1944 లో ప్రారంభిస్తే  మొదటి బాచ్ కి ఎన్నికైన ఏకైక విద్యార్థి మన ఏం డి బి ఒక్కడే .అక్కడి గురువు టైగర్ వరదాచారి ముఖ్య ఏకైక శిష్యుడై సంగీత0 తో మరీ దగ్గరయ్యాడు .అక్కడే అసిస్టెంట్ గా చేరి సంగీత ప్రొఫెసర్ అయి కళాక్షేత్ర ఫైన్  ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు . నెమ్మదిగా పాడటం ప్రారంభించి శ్రోతలను తనతోపాటు తీసుకువెడుతూ సాహిత్యం లోని అందాలను అనుభవించేట్లు చేయటం ఈయన ప్రత్యేకత .కధాకళీ లోని విలంబిత కాలగానం తనను బాగా తీర్చి దిద్దిందని చెప్పేవాడు ..ప్రముఖుల కృతులు పాడేటప్పుడు సాహిత్యాన్ని మార్చిపాడి విమర్శకు గుయారయ్యేవాడు .మరో ప్రత్యేకత అనుపల్లవితో ప్రారంభించి తర్వాత పల్లవి పాడటం .ఇది బాగా నచ్చేది అందరికి ..మూడుభాషలలో 300 కుపైగా కృతులురాశాడు . 1984 ఏప్రిల్ 27 న 61 ఏళ్ళవయసులో చనిపోయాడు .

ఏం డి బి రచించిన సంస్కృత కృతులు -బేహాగ్ రాగం లో -’’భజభజ మనుజ ‘’,ఆరభిలో -భారతేశ నుతే ‘’,శ్రీ రాగం లో -’’దుర్గాదేవి ‘’,హంసధ్వనిలో -’’గజవదన ‘’కానడ లో -’’గురు చరణం ‘’,ధన్యాసి లో ‘’గురువారం భజ మనసా ‘’,ధీర శంకరాభరణం లో -’’జనని నతజనపాలి ని ‘’-బాగేశ్వరిలో -’’సాగర శయన విభో ‘’,కాపీరాగం లో తిల్లాన ,కేదారం లో-’’త్యాగరాజ గురుం ‘’,

1974లో పద్మశ్రీ ని కేంద్ర సంగీత అకాడెమీ పురస్కారాన్ని ,1976 లో సంగీత శిఖామణి ,1983 లో సంగీత కళానిధి బిరుదు పొందాడు .

433- సంగీత దర్పణ కర్త -వి . రామ నాథం (1917 -2008 )

సంగీత కళాకారుడు రచయితా టీచర్ ప్రిన్సిపాల్ వి రామనాధం 1917 లో జన్మించి 70 ఏళ్ళు సంగీత 0లో మునిగి తేలి 2008 లో చనిపోయాడు .మైసూర్ సంగీతరత్న శిష్యుడై ,మైసూర్ యూనివర్సిటీ మ్యూజిక్ డాన్స్ కాలేజీ మొదటిప్రిన్సిపాల్ అయి  1987 లో రిటైరయ్యాడు .సుమారు 25 కృతులు సంస్కృత తెలుగు కన్నడాలలో రాశాడు . 3 గ్రంధాలు స్వయంగా కానీ ఇతరులతోకలిసి కాని రాశాడు .కర్ణాటక సంగీత శాస్త్రం పై విలువైన గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి -సంగీత దర్పణం ,కర్ణాటక సంగీత సుధ,సంగీత శాస్త్ర పరిచయం ,కర్ణాటక సంగీత లక్ష్య లక్షణ సంగ్రహం ,అపూర్వ వాగ్గేయ కృతిమంజరి మొదలైనవి ..

  సశేషం

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

–Image result for g n balasubrahmanyam– Image result for m d b ramanadhan


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)

తంజావూర్ కు చెందిన చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం వడివేలు అనే నలుగురు సోదరులను తంజావూర్ సంగీత చతుష్టయ0 అంటారు .భరతనాట్యం కర్ణాటక సంగీత వ్యాప్తికి వారి కృషి మరువలేనిది .తంజావూర్ మహారాజు షెర్ఫోజి ఆస్థాన సంగీత విద్వా0సులుగా ఉండేవారు . తరువాత తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ కొలువులో చేరారు .దీక్షితార్ వంటి మహా విద్వా 0సుల వద్ద సంగీత శిక్షణపొంది లోతులను తరచారు . వీరిలో వడివేలు పిళ్ళై ఏక సంధాగ్రాహి అని ముత్తుస్వామి దీక్షితార్ ప్రశంసించాడు .గురువుగారికి కానుకగా ‘’నవరత్న మేళ’’కూర్చారు సోదరులు .వడివేలును ఆస్థాన గాయకునిగా స్వాతి తిరుణాల్ నియమించాడు .వడివేలు మహాజ్ఞాని . వయోలిన్ కూడా నేర్చి స0స్థానం లో వాయించి రాజు మెప్పుపొందాడు .కల్పిత సంగీతాన్ని మనోధర్మ సంగీతాన్ని వయోలిన్ పై పలికించవచ్చునని రుజువు చేశాడు వడివేలు .ముత్తుస్వామి దీక్షితులు సోదరుడు బాలు స్వామి ఒక పాశ్చాత్యు నివద్ద వయోలిన్ నేర్చి రాజు కొలువులో వాయించగా వడివేలు  ‘’మోహిని అట్టం ‘’ను సృష్టించి ఆడించాడు అప్పటివరకు కేరళలో కథాకళి మాత్రమే ఉండేది అదీ మగవారికి మాత్రమే పరిమితం .రాజు స్వాతి తిరుణాల్ తోకలిసి వడివేలు మోహినీ అట్టం ను సమగ్రంగా తీర్చి దిద్దాడు .దీనితో ఆడవారికి కూడా నాట్యం చేసే అవకాశం కలిగింది .

 ఈ తంజావూర్ సంగీత చతుష్టయం సంస్కృత ,తెలుగు భాషలలో కృతులు ,వర్ణాలు అనేకం రాశారు .అందులో ముఖ్యమైనవి -నీలాంబరి లో అంబ సౌరాంబ, అంబ నీలాంబ ,పూర్వీకళ్యాణిలో -’’సాటిలేని  ‘’.

429-72 మేళ కర్త రాగాలతో రాగమాలిక అల్లిన-మహా వైద్యనాధ శివన్  (1844-1893)

అలవోకగా మహా సంగీతం పాడే గొప్ప సంగీతకర్త మహా వైద్య నాధశివన్  1844 లో తంజావూర్ జిల్లా వియచేరి గ్రామం లో పుట్టాడు .తండ్రి దొరైస్వామి అయ్యర్ గొప్ప సంగీతజ్ఞుడు .ఆనై అయ్యా బ్రదర్స్ వద్ద సంగీత శిక్షణ పొందాడు .తర్వాత త్యాగరాజస్వామి శిష్యుడు మానాంబు  చావడి వెంకట సుబ్బయ్యర్ వద్ద మెళకువలు గ్రహించాడు .రాగాలాపనలో శివన్  శివమెత్తి స్తాడు .తమ్ముడు రామస్వామి శివన్ తో కలిసి కచేరీలు చేసి కర్ణాటక సంగీత తొలి  జంటగా రికార్డ్ సృష్టించాడు .’’గుహదాస ‘’అనే ముద్ర తో రాశాడు . సంస్కృతం తెలుగు తమిళం లో చాలా కృతులురాశాడు .సంస్కృతం లో జన రంజని రాగం లో -’’పాహిమాం రాజ రాజేశ్వరి ‘’రాగమాలికలో -’’ప్రణతార్తి హర ప్రభో పురారే ‘’,నాగ స్వరాలిలో -’’శ్రీ శంకర గురువరం ‘’శివన్ సంగీత పాండిత్యానికి  మచ్చు  తునకలు . సారాంగిరాగతెలుగు  కృతి -’’నీ కేల దయరాదు ‘’సుప్రసిద్ధమైనది .

430-’’జయతి జయతి భారత మాత ‘’దేశభక్తి గీతకర్త – మయూరం విశ్వనాధ శాస్త్రి (1893-1958)

తమిళనాడులోని మయూరం గ్రామం లో 1893 లో పుట్టినవిశ్వనాధ శాస్త్రి రచించిన దేశభక్తి గీతం ‘’జయతి జయతి భారత మాత ‘’తో సుప్రసిద్ధుడయ్యాడు .ఆనాడు  పాడని కర్ణాటక సంగీత గాయకులు  ఉండేవారుకాదు .నామక్కల్ నరసింహ అయ్యంగార్ ,కాసవాద్యం వెంకట రామ అయ్యంగార్ వంటి వద్ద సంగీతం అభ్యసించాడు .తెలుగు సంస్కృతాలలో 160 దాకా కృతులురాశాడు . 65 ఏళ్ళు జీవించి మరణించాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పిఆర్కే ప్రసాద్ ఇకలేరు

clip

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా 12 ఏళ్ళు ఉన్నానని  ‘’నరహరి యతి చరిత్ర ‘’లో చెప్పుకున్నాడు. శ్రీకూర్మం ,సింహాచలం దేవాలయ శాసనాలు ఆయన మంత్రిత్వాన్ని రుజువు చేస్తున్నాయి .కన్నడం వాడుకాకపోయినా ఆయన రచనలు కన్నడం లోనే ఎక్కువగా ఉన్నాయి .కళింగ ఆంద్ర లలో చాలామందిని మధ్వ మతం లోకి మార్చినట్లు ఆధారాలున్నాయి .ఆయన వారసులు ఇప్పటికీ సాగరాంధ్రలో ఉన్నారు .హరిదాసు ఉద్యమానికి ఈయనే ఆద్యుడు అంటారుకాని శ్రీపాద రాయలే ఆద్యుడని ఎక్కువమంది భావిస్తారు . కానీ యక్షగానాలు సృష్టికర్త నరహరి తీర్ధ మాత్రమే అలాగే బాయలత నృత్యానికి ఆద్యుడు ఆయనే .ఈ సంప్రదాయం ఇప్పటికి కర్ణాటక లో కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం లో ఉన్నాయి .ఈయన కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు వెలసిన చోట మఠాధిపతి గా ఉన్నాడని కూచిపూడి నృత్య ప్రదాత అని ప్రచారం లో ఉంది .సంస్కృతం లో ‘’దసరాపదాలు ‘’  రాశాడు .

427-గురు కృతి కర్త -ఊత్తుక్కాడు వేంకటకవి (1700-1765 )

ఊత్తుకాడు  వెంకటసుబ్బయ్య అయ్యర్ 1700లో తమిళనాడులో జన్మించి గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడయ్యాడు .వెంకట కవిగా ప్రసిద్ధుడు . సంస్కృత ,తమిళ మరాఠీ భాషలలో 500 కు పైగా కృతులు రచించాడు . ఇవి ఆయన సంగీత శాస్త్ర పాండిత్యానికి ఉదాహరలుగా నిలిచాయి .కావడి చిందు ,తిల్లానా ,కృతులు ఆయన ప్రత్యేకం . పురన్దరదాసుకు కర్ణాటక సంగీత త్రయానికి వారధిగా వేంకటకవి ని భావిస్తారు .సంగీతం లో సరైన గురువును అన్వేషిస్తూ చాలాకాలం గడిపి చివరికి ఊత్తుక్కాడు కళింగ నర్తన ఆ లయం లో శ్రీకృష్ణుడిని గురువుగా భావించాడు . కృష్ణ భగవానునుని ప్రేరణ చెంది ఆరభి రాగం లో ‘’గురుపాదారవిందం కోమలం ‘’కృతి రాశాడు .తన గురుదేవుడైన కృష్ణుడిపై కనీసం 15 గురు  కృతులు రాసి అంకితమిచ్చాడు .ఆయన ఫిలాసఫీ ‘’భక్తియోగ సంగీతమార్గమే పరమపావన మహునే ‘’. అనేక రాగాలను ఉపయోగించాడు .అరుదైన బాలహంస, రసమంజరి రాగాలను ఆలపించి కృతులురాశాడు .మధ్యమావతిలో ‘’శ0కరి రాజరాజేశ్వరి’’సుందర నంద కుమారకృతులు మాధుర్యానికి పరాకాష్ట .ఖండ ధ్రువ ,సంకీర్ణ మధ్యమ వంటి అనేక తాళా ల పై గొప్ప ప్రయోగాలు చేశాడు .సాహిత్య వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా పోషించాడు .ఉదాహరణకు అభోగి  రాగ పల్లవి ‘’మహశ్యాయ హృదయ ‘’మాధ్యమకాల విధానం లో 1-మధుకర చంపక వన విహార మనమోహన మధుసూదన నవభూషణ 2-మధుకర చంపక వనవిహార నవపల్లవ పదకర  మదన గంభీర 3-మధుకర చంపక వనవిహార గోవర్ధనధర భుజగ నర్తన చరణ ‘’

ఇదేకాక గౌళరాగం లో ‘’అగణిత మహిమ ‘’లో కూడా ఇలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు .ధన్యాసిరాగం లో కూర్చిన ‘’భువనమోహన’’లో ఆరుసార్లు పునరావృత్తమై 11 సార్లు వినిపించి అలౌకిక ఆనందాన్ని సృష్టించాడు .సంస్కృతం లోని ఈరచన కర్ణామృతమే -’’అతినూతన కుసుమాకర ,వ్రజమోహన సరసీరుహ దళ లోచన మమమానస పటు చోరసు -స్వరగీతసు -మురళీధర సుర మోదిత  భవమోచన ‘’/ఆయన సంస్కృత పాండిత్యం అమోఘం .దానిలోని సొగసులన్నీ కృతులలో దింపేశాడు .ఆయన ప్రసిద్ధ తమిళకృతి తోడిరాగం లోని ‘’తాయి యశోద’’సంగీతకచేరీలలో తప్పని సరి అయి శ్రీ కృష్ణలీలకు  పరమ భాష్యమై నిలిచింది .ఇందులో 8 చరణాలున్నాయి .ఒక్కో చరణం  లో ఒక్కో లీల దర్శనమౌతుంది .రాధా కృష్ణకల్యాణాన్ని కృతి మాధ్యమంగా రాశాడు .మహాభారతం దక్షయజ్ఞం ప్రహ్లాద చరితం లకూ కృతి గౌరవం కల్పించి శాశ్వతత్వం చే కూర్చాడు .సామూహిక కృతులైన సప్త రత్న ,కామాక్షి నవ రత్నం ,ఆంజనేయ రత్నం వంటివీ రాశాడు .మాధవ పంచకం ,నృసింహ పంచకం ,రంగనాధ పంచకం వంటి స్తోత్రాలుకూడా రాశాడు .’’త్యాగ రాజ పంచరత్నాలు’’వంటి ‘’సప్త రత్న కృతులు ‘’రాశాడు -1 నాట రాగం లో ‘’భజనామృత 2-గౌళ రాగం లో ‘’అగణిత మహిమ ‘’,3-కళ్యాణిరాగం లో ‘’మాధవ హృది కేళిని ‘’4-కీరవాణిరాగం లో ‘’బాలసరస మురళి ‘’5-తోడి రాగం లో ‘’జటధార  6-పరాస్ రాగం లో ‘’అలవ0దె న్నెలో  7-మాధ్యమావతి రాగం లో ‘’సుందర నంద కుమార’’.

  ఆంజనేయ సప్తవర్ణ సంస్కృత కృతులలో హనుమ వైభవ విశేషాలన్నీ చూపించాడు-

1-వసంత రాగం లో -’’పవన కుమార 2-కేదార గౌళ లో -’’వీక్షితోహం 3- తోడిరాగం లో -’’అంజనానందన అమ్బోధి చంద్ర 4-సురటి రాగం లో -శ్రీరాఘవ దూతం 5-మాధ్యమావతి రాగం లో -’’భక్త భాగ ధేయ  ‘’6-రసమంజరి రాగం లో -’’సత్వ గుణ విరచితాంగ 7-మలయ మారుత రాగం లో ‘’వాహిని తట  ‘’.

 దసరాలలో శ్రీ విద్య పై పాడే నవ వర్ణకృతులు  వినాయక స్తుతి ,ధ్యాన స్తుతి ఫలస్తుతి కూడా రాశాడు .కూచిపూడి భరతనాట్య ,కథక్ ,ఒడిశా నృత్యకళాకారులు ఆయన కృతులకు నాట్య ఆకృతులను కూర్చి బహుళ వ్యాప్తి చేశారు. అందులో  వైజయంతిమాల ,కమలా లక్ష్మణ్   బిర్జు మహారాజ్ పద్మా సుబ్రహ్మణ్యం వెంపటి చినసత్యం వంటి వారెందరో ఉన్నారు .ఆయన రాసిన హరికథలను శ్రీ కృష్ణ ప్రేమి అన్న ,గురు హరిదాసు గిరి వంటి హరికథా కళాకారులు వీనుల విందుగా వినిపించి ప్రచారం చేశారు .ఆయనకే ప్రత్యేకమైన -’’కళింగ  నర్తన నటంగం,కృష్ణ పాదాది కేశాంతవర్ణనం ‘’నభూతో అనిపిస్తాయి .భజన సంప్రదాయం లోకూడా వేంకటకవి రచనలు స్థానం పొందాయి .  ,శివ తాండవం ఆయన సంస్కృత భాషా పటిమకు  పరమ భక్తికి తార్కాణంగా నిలీచింది .  .నిత్య జీవితం లో పారాయణకు తోడ్పడి ప్రతి ఇంటా  మార్మోగుతూ వినిపిస్తాయి . 65 సంవత్సరాలు జీవించి శ్రీ కృష్ణ శిష్యుడైన వేంకటకవి 1765లో శ్రీ కృష్ణ ధామం చేరాడు

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

 కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర  గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను  షేక్స్పియర్ ఓదెల్లో నాటకాన్నీ కన్నడీకరించాడు .’’కర్ణాటక నాటక పితామహ ‘’బిరుదాంకితుడు . తన రత్నావళి ,ఉత్తరరామ చరిత నాటకాలకు చాలాపాటలు కూర్చాడు . 1891 లో చనిపోయాడు .

  తంజావూర్ చిన్నయ్య (1803-1856 )తంజావూర్ జిల్లాలో పుట్టి మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .సంస్కృతం తెలుగులలో  లో వర్ణాలు కృతులు జావళీలు విశేషంగా రాశాడు .ఆయన ఆరభిరాగం లో రాసిన ‘’అంబాసౌరంబ ‘’నీలాంబరితో రాసిన ‘’అంబా నీలాంబరి ‘’కృతులు చిత్త స్వరాలతో విశేష ప్రాభవాన్ని తెచ్చాయి .

420-సంస్కృత కృతి కర్త  -వీణ పద్మనాభయ్య   (1842-1900 )

కర్ణాటక చిత్తనాయక హళ్ళికి చెందిన వీణ పద్మనాభయ్య 1842లో జన్మించి 58 వ ఏట  1900 లో మరణించాడు .సంస్కృతం ఆంధ్రం లలో అనేక స్వరాలు కృతులు  జావళీలు వర్ణాలు  ,తోడిరాగం లో సప్త తాళేశ్వరం రచించాడు .నాట కురంజి రాగం లో ‘’శ్రీ హేరంబ మీడే ‘’,నాగేశ్వరావళి  రాగం లో   ‘’భావయామి తవపాదం ‘’బాగా ప్రసిద్ధమైనవి .కన్నడం లో ఒకేఒక్క జావళి రాశాడు .మిగిలినవి సంస్కృతం ,తెలుగు లలో రాశాడు .

421-సంగీత సుబోధిని కర్త -మైసూర్ కరగిరిరావు (1853 -1927 )

1853లో కర్ణాటక తుంకూర్ లో పుట్టిన కరగిరి రావు సంగీత నిధి . 200 ల దేవర నామాలకు సంగీత స్వరాలు కూర్చాడు ఆయన కృతులన్నీ చిత్త స్వరాలతో చిత్తాన్ని ఆకర్షిస్తాయి .సంగీత సుబోధిని ,గాన వాద్య రహస్య ప్రకాశిని అనే గొప్ప సంగీత  గ్రంథాలు రాశాడు .మోహనరాగం లో ‘’నెనరుంచిర ‘’,సరస్వతి రాగం లో ‘’సరస్వతి భగవతి ‘’కృతులు మంచి పేరు తెచ్చాయి . 74 వ ఏట మరణించాడు .

422-108 చాముండీ అష్టోత్తర కృతులురాసిన -ముత్తయ్య భాగవతార్ (1877-1945 )

సంస్కృత కన్నడ తెలుగులలో అనేక కృతులురాసి హరికథ గానం తో ప్రేక్షకులను పరవశం కలిగించిన హరికేశ నల్లూరు ముత్తయ్యభాగవతార్ 1877 లో తిరునల్వేలిలో పుట్టి 20 వ శతాబ్దపు ఉత్తమ సంగీత స్వరకర్తగా పేరుపొందారు .వర్ణాలు కృతులు రాగమాలికలు తిల్లానాలతో వైవిద్యరచన చేసి మెప్పుపొందాడు .నిరుపనం ,పాదం లకు ఆయన పెట్టిందిపేరు . 108 చాముండేశ్వరి అష్టోత్తర కృతులురాసిన మహా భక్తుడు .ఖామాస్ రాగం లో ‘’మాతే మలయధ్వజ ‘’ కర్ణ రంజనిలో ‘’వాంఛతోను నా ‘’బాగా పేరు తెచ్చాయి .నిరోష్ట ‘’వంటి అనేక కొత్తరాగాలు సృష్టించాడు . 68 వ ఏట చాముండేశ్వరి సన్నిధానం చేరుకొన్నాడు .

423-వీణ శివ రామయ్య (1886-1946)

వీణ పద్మనాభయ్య కుమారుడు శివరామయ్య . మైసూర్ రాజ్య ఆస్థాన

సంగీత విద్వా0సుడు .సంస్కృత తెలుగు కన్నడాలలోచాలా కృతులు జావళీలు స్వరాలు కూర్చాడు 72 మళ రాగ కృతులురాశా డు. శ్రీరాగం లో ‘’వాణీ వీణాపాణి ‘’,ధర్మావతి రాగం లో ‘’శ్రీరాజ రాజేశ్వరి ‘’సుప్రసిద్దాలు . ,

424-కొత్త సంగీత రూపం ‘’నగ్మ’’సృష్టికర్త -వీణ వెంకట గిరియప్ప (1887-1952 )

కర్ణాటకలో హెగ్గేడ  దేవకోటలో పుట్టి మైసూర్  పాలస్ ఆర్కెస్ట్రా డైరెక్టర్ అయిన వీణ వెంకట గిరియప్ప 1887 లో పుట్టాడు .వీణ లో అసాధారణ ప్రతిభ సాధించి భారత దేశమంతా పర్యటించి తన వీణాగానమాధుర్యాన్ని పంచాడు .సంస్కృత ,తెలుగు ,కన్నడాలలో చాలా కృతులు రాశాడు .కొత్త సంగీత రూపం ‘’నగ్మా ‘’ను సృష్టించాడు .ఇది హిందూస్థానీ గతులను కలిగి ఉండటం విశేషం .ఈయన కృతులలో భువన గాంధారి రాగం లోని ‘’లలితాంబికే శ్రీ మాతే ‘’బేహాగ్ రాగం లో ‘’శ్రీ జయలలితే ‘’ప్రత్యేకంగా పేర్కొనదగినవి .

425-సంస్కృత తిల్లానాలు రాసిన -టి .చౌడయ్య (1894-1967 )

చోడయ్యావయోలిన్ అంటే చెవులు కోసుకోవటం అందరికి తెలిసిందే .మైసూర్లోని కావేరీ తీరం లో తిరుముక్కడాల్ నర్సిపురం లో 1894 లో జన్మించి వయోలిన్ కు విశ్వ విఖ్యాతికలిగించి ఎన్నో పురస్కారాలు బిరుదులూ సన్మానాలు అందుకొన్న టి చౌడయ్య 73 వ ఏట మరణించాడు .బెంగుళూర్ లో ఆయన పేరఒక వీధి ఉంది .మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సుడు ,గాన విశారద బిడారం కృష్ణప్ప శిష్యుడు .వయోలిన్ మాధుర్యం పెంచటానికి తార షడ్జమ ,మంద్ర షడ్జమ మొదలైన కొత్త తీగలను ఏర్పాటు చేసి సప్త తంత్రులతో వయోలిన్ వాయించేవాడు .దీన్ని గురువు బిడారం అంగీకరించక ఎందుకుఈ ప్రయోగం అనిఅడిగితే బాగా వెనక ఉన్నవాళ్లకూ  స్పష్టంగా వినబడటానికే అన్నాడు .వీణ శేషన్న దీన్ని అంగీకరించగా చివరికి గురువుకూడా సంతోషం తో ఒప్పుకున్నాడు .లెక్కలేనంతమంది శిష్యులను చౌడయ్య తయారు చేశాడు .సంగీత కళానిధి సంగీత శిఖామణి బిరుదులు పొందాడు 19-1-1967 నమహా వాయులీన విద్వా0సుడు   చౌడయ్య మరణించాడు . చౌడయ్య సంస్కృత తెలుగు కన్నడాలలో కృతులు రచించాడు అందులో ప్రసిద్ధమైనవి-కాంభోజి రాగం లో ‘’శ్రీ వేణుగోపాల ,’’   ధన్యాసి రాగం లో ‘’దేవి పూర్ణ మంగళ ‘’చెప్పుకోదగ్గ కృతులు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

T Chowdiah.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

ఇంతింతై ఎదిగిన యశస్వి ఎస్వి

కృష్ణా జిల్లా గుడివాడ లో వడ్రంగం లో అద్భుతాలు సృష్టించిన శ్రీ శిరందాసు గంగయ్య ,శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కు 1936 లో శ్రీ రామారావు.జన్మించారు .చిన్నతనం నుండే బొమ్మలు వేస్తూ ,తొలిగురువు   శ్రీ.కే వేణుగోపాల్ గారి  గురుత్వం లో13 వ ఏడు వరకు  బాగా రాణించారు  .  గుడివాడ ఎ.యెన్ ఆర్ కాలేజీ లో ఇంగ్లీష్ బోధించిన వైస్ ప్రిన్సిపాల్ శ్రీ యడవల్లి సన్యాసి రావు గార౦టే ఎస్వి గారికి వీరాభిమానం .ఎకనామిక్స్ ,కామర్స్ లలో డబుల్ గ్రాడ్యుయేట్ అయి ,1955 నాటికే  ఆర్ట్ లో 4 డిప్లమాలు సాధించారు .తండ్రిగారే ఆయన కు స్పూర్తి ప్రదాత .మద్రాస్ వెళ్లి ప్రముఖ చిత్రదర్శకుడు, కదా రచయితా, స్నేహితుడు మాధవ పెద్ది గోఖలే సలహా పై మద్రాస్ ఆర్ట్ కాలేజ్ లో చేరారు . ప్రిన్సిపాల్ శ్రీ దేవీ ప్రసాద్ రాయ్ చౌదరిని తన కళా ప్రదర్శనతో మెప్పించి 6ఏళ్ళ కోర్సు గా ఉన్నదానిలో సరాసరి 3 సంవత్సరం కోర్స్ లో  చేరారు ..ఫణిక్కర్ ,ధనపాల్, రాం గోపాల్ సంతాన రాజ్ ,మునిస్వామి వంటి ప్రముఖుల చిత్రాలు పరిశీలిస్తూ ఎంతో నేర్చారు. 1960 లో డ్రాయింగ్ లో డిప్లొమా పొందారు. భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ వరుసగా మూడేళ్ళు  పొందారు  .కామన్వెల్త్ ఫెలోషిప్ కు భారత దేశం మొత్తం మీద 315మంది పోటీ పడితే ,రామారావు ఒక్కరే ఎంపికైన ఏకైక వ్యక్తిగారికార్డ్ సృష్టించారు .అప్పుడు ఆయన  వయసు కేవలం 23 మాత్రమే.

కళా నిష్ణాత  -శైలీ నిర్మాత

1962 లో  లండన్ వెళ్లి అత్యున్నత ప్రమాణాలకు నిలయమైన’’  స్స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్’’ లో చేరి, సర్ విలియం కోల్డ్ స్ట్రీం ,విలియం రోజర్స్ ,బెర్నార్డ్ కోహెన్ వంటి లబ్ధ  ప్రతిష్టులవద్ద కళా విద్యా రహస్యాలు గ్రహించారు.ఆయన చిత్రాలు ప్రచురించని ప్రసిద్ధ పత్రిక ఉండేదికాదు .తన చిత్రాలపై ‘’ఆర్య దేవ’’అని సంతకం చేసేవారు .‘’అక్కడ ఈయన గీసినచిత్రాన్ని ప్రిన్సిపాల్ ఇండియాలో గొప్ప ఆర్ట్ క్రిటిక్ శ్రీ రామన్ కు ఎస్వి పేరుకనిపించకుండా చేసి ‘’ఇది ఎవరు గీసింది ?’’అని అడిగితే‘’పికాసో ‘.అని చెబితే ‘’కాదు –మీ దేశ చిత్రకారుడు ఎస్వి రామారావు చిత్రించినది ‘’అని చెప్పగానే  ఆశ్చర్య పోయాడు రామన్.సమకాలీనుడైన పికాసో తో పోటీపడాలని భావించి  బోర్డ్ మీదనే ఆసియా కళ ఆధారంగా బొమ్మలు వేస్తూ ,తనదైన స్వంత శైలికోసం తపిస్తూ ,మ్యూజియం లో బొమ్మల్ని చూస్తూ లైబ్రరీలలో అధ్యయనం చేస్తూ, ప్రపంచ చిత్ర కళా రీతులను అవగాహన చేసుకొన్నారు .వివిధ దేశాల చిత్రకళా రీతులనుండి తనకు కావలసిన అంశాలు ఎన్నుకొని తనదైన చిత్ర ప్రవాహాన్ని సృష్టించుకొన్నారు .ఆఫ్రికా జానపదుల మాస్క్ లనుండి పికాసో ముడి సరుకు తీసుకొన్నట్లు ,రామారావు గారు మొఘల్ ,రాజపుట్  కళ నుంచి అలంకరణ రీతిని ,జపాన్ చిత్రకళ నుండి రేఖలను తీసుకొని వాటి మేళ వింపు తో  చిత్రాలు గీశారు. రామారావు గారి చిత్రకళపై వ్యాఖ్యానిస్తూ’ ఇలస్ట్రే టెడ్ వీక్లీఆఫ్ ఇండియా ‘’ ‘’సంపాదకుడు శ్రీ ఏ.ఎస్.రామన్’’For as artist ,in his style ,idiom and technique Rama Rao is as Western as any of his Western counterparts ,in spite of his passion for basic Indian values ‘’అన్నాడు .

 

1966 లో’’ మోస్ట్ అవుట్ స్టాండింగ్  లితోగ్రాఫర్ ‘’’’గా గుర్తింపు పొందారు.  1965 కు కోర్సు పూర్తి చేసి ‘’వర్ణ చిత్ర రచనలో నూతన  శైలీనిర్మాత  ‘’ ఇన్వెంటర్  ఆఫ్ స్టైల్ ఇన్ ఆయిల్ పెయింటింగ్ ‘’అని కీర్తి పొందారు .’1965లోవిఖ్యాతమైన ‘’ లార్డ్ క్రాఫ్ట్స్ అవార్డ్ ‘’అందుకొన్నారు  .

పికాసో  సరసన

కామన్ వెల్త్ ఆర్ట్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ,లండన్ కౌంటి కౌన్సిల్ లో పెయింటింగ్ డ్రాయింగ్ లను 1965నుండి  -69 వరకు బోధించారు  .

లండన్ లోని ‘’న్యు విజన్ సెంటర్ గాలరీ వారు ‘’ఆల్ఫబెట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’పై నిర్వహించిన ఎక్సి బిషన్ లో శ్రీ రామారావు పాల్గొన్నారు.  ఆనాటి ప్రముఖ ఆర్టిస్ట్ లైన పాబ్లో పికాసో,బ్రాక్ ,మీరో, డాలి, మాక్స్ ఎర్నెస్ట్ జాక్సన్ పొలాక్ వంటి హేమా హేమీ ఆర్టిస్ట్ లచిత్రాల సరసన రామారావు గారి చిత్రాలు చోటు చేసుకొన్నాయి అంటే అద్భుతః అనిపిస్తుంది . . . ఆసియా మొత్తం మీద ఎస్వి ఒక్కరికే ఈ అరుదైన అవకాశ౦ లభించటం ఆయన ప్రతిభకు తగిన పురస్కారం . లండన్ లో జరిగిన .ప్రతిష్టాత్మకమైన ‘’బ్రిటిష్ ఇంటర్నేషనల్ ప్రింట్ బైన్నియల్ ‘’ప్రదర్శనకు పికాసో చిత్రాలతో పాటు ఇండియన్ పికాసో ఎస్వి గారి చిత్రాలు కూడా ఎంపికయ్యాయి .ఇది తన అదృష్టం అని వినయంగా చెప్పారు ఎస్వి .ఈ  ఎంపిక ను చిత్రకారులు నోబెల్ బహుమతి తో సమానంగా భావిస్తారని రామారావు గారు అన్నారు  .ఎన్నో దేశాలలో తన చిత్రాలను ప్రదర్శించారు .అధిక ధరలకు అవి అమ్ముడయ్యాయి .

కళా బోధన- పద్మశ్రీ పురస్కార౦

 

శ్రీ ఎస్వి 1969 లో అమెరికా వెళ్లి టఫ్త్స్ ,బోస్టన్ ,సిన్సినాటి, వెస్ట్ కెంటకి  యూని వర్సిటీలలో1978  వరకు బోధించారు   డాక్టర్ శ్రీమతి  సుగుణ  గారిని వివాహమాడి  చికాగోలో ఉంటున్నారు  .వీరి కుమార్తె శ్రీమతి పద్మావతి  భరత నాట్యం లో గొప్ప నర్తకీమణి   అల్లుడు డా హర్షవారధి  .

రామారావు గారికి 2001 లో బారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని  నాటి రాష్ట్ర పతి శ్రీ కె ఆర్ నారాయణగారి చేతులమీదుగా  ప్రదానం చేసింది .పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ,గౌరవ డాక్టరేట్ అంద జేసింది.

.   తిరుపతి లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల లో రాష్ట్రపతి శ్రీప్రణబ్ ముఖర్జీ గారి చేత సత్కార సన్మానాలు అందుకొన్నారు. అమెరికాలోని నార్త్ టెక్సాస్ తెలుగు సంస్థ మొదలైన ప్రసిధ సంస్థలచేత సత్కారం పొందారు  . శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో ఏర్పాటు చేసిన నేతాజీ శత జయంతికి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ సభలకు హాజరై సన్మానాలు అందుకొన్నారు .

రామారావు గారి కి తెలుగు సాహిత్య  కళా రంగాలలో  లబ్ధ ప్రతిస్టుల౦దరి తోను గాఢమైన పరిచయం ఉంది ..ఆయన ఏనాడూ మూలాలను విస్మరించలేదు. శ్రీ ఆచంట జానకిరాం ,శ్రీ కొడవటి గంటి కుటుంబరావు ,శ్రీమతి కె రామ లక్ష్మి ,శ్రీ సొంఠి సదాపూర్ణ ,శ్రీ శివలెంక శంభు ప్రసాద్  శ్రీ వాకాటి పాండురంగారావు వంటి దిగ్గజాలతో ఆయనకున్నఆత్మీయత మరువ లేనిది .వీరంతాఎస్విగారి  సృజనశీలతను బహుధాప్రశంసించినవారే .ఆంద్రపత్రిక, భారతి,లసంపాదకులు శ్రీశివలెంకశంభుప్రసాద్ గారికోరికపైశ్రీరామారావుకళారహస్యాలపైప్రత్యేకమైనవిశ్లేషణాత్మకవ్యాసాలు భారతికి ,రాసి,తెలియనిఎన్నోవిషయాలను లోకానికిఎరుకపరచారు .వీటినిచదివిఅబ్బురపడినఅమెరికాలోబెర్కిలీలోని కాలి ఫోర్నియా యూనివర్సిటిఇంగ్లీష్ ప్రొఫెసర్ వీటిలో ముఖ్యమైన వాటినిఇంగ్లీష్ లోకి అనువాదంచేసిరామారాగారి భావాలకువిశ్వవ్యాప్తికలిగించారు.

మూర్తీభవించిన మానవీయత

ప్రపంచ ప్రఖ్యాతచిత్రకారులైన శ్రీ రామారావుగారు వ్యక్తిగాఅతిసున్నిత మనస్కులు .ఎవరికి యే బాధా,ఆపదా కలిగినా తనది గానే భావించి, వెంటనే స్పందించి,స్నేహహస్తంచాఛి,ఆదుకొనే సహృదయత ఉన్నసంస్కారంవారి విశిష్టలక్షణం .మానవతమూర్తీభవించిన ఉత్తమ కళాకారులాయన .1977 కృష్ణా జిల్లా దివిసీమనుఅల్లకల్లోలంచేసిన ఉప్పెన విషయం తెలిసి,ఇక్కడిబాధితులనుఆదుకోవటానికి అమెరికాలోతెలిసినవారందరివద్దస్వచ్చందంగావిరాళాలుసేకరించి పంపించినమానవతామూర్తిశ్రీ రామా రావు  ‘ఆనేక కవితలుఆంగ్లం లోను తెలుగు లోను  రాసి పుస్తకాలుగా తెచ్చారు ఎస్వి .

నైరూప్య చిత్రకళా యశస్వి

రామారావు గారి నైరూప్య చిత్రాల ప్రత్యేకత గురించి తెలుసుకొనే ముందు అసలు నైరూప్య చిత్రాలు అంటే ఏమిటో తెలియాలి .’’ఆకారాలలో కనిపించేది అబద్ధం, అశాశ్వతం కనుక వస్తు రూపమే మిధ్య ‘’అనే భావన కిందటి శతాబ్దం మధ్యలో పుట్టి అదే ఒక రూపం గా ఎదిగింది .ఈ భావన మొదట చిత్రకళలో ,తర్వాత శిల్పం,సంగీత ,సాహిత్యాలలో ప్రవేశించి  విలక్షణమైన భావోద్రేకాలను ప్రకటించే విధానంగా రూపొందింది .సహజ రూపాన్ని వదిలేసి ,అందులోని ప్రాధమిక రూపాన్ని విశ్లేషించే బొమ్మలు గీసే విధానమే నైరూప్య చిత్రకళ.అంటే చిత్రకళలో ఒక విలక్షణ ప్రక్రియ నైరూప్య చిత్రకళ.వాస్తవాన్ని వదిలిపెట్టి కళ లోని ఊహల వర్ణనలను సూచిస్తు౦దన్నమాట .మనకు వచ్చే కలలలో నైరూప్య చిత్రాలు అంటే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి .ఆ కలల స్వభావాన్నీ ,వాటికీ నిజ జీవితానికీ ఉన్న సంబంధాన్ని మనం అన్వయించుకొంటాం . ఈ చిత్రాల్లో మనకు పరిచయమున్న రూపాలేవీ కనిపించవు .అంతా రేఖల ,రంగుల ఇంద్రజాలంగా అనిపిస్తుంది .ఇందులో ప్రసిద్ధుడైన వాడు ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో .ఎస్వి రామారావు గారు ఈ నైరూప్య చిత్ర కళలో కొత్త శైలిని అలవరుచుకొని ‘’ఇండియన్ పికాసో ‘’గా విఖ్యాతులయ్యారు .

. డాక్టర్ రామారావు చిత్ర లేఖన ప్రతిభ క్రమంగా స్వీయ వ్యక్తిత్వాన్నిఏర్పరచుకొని ,ఎన్నో దశల ప్రయోగాలు దాటి నైరూప్య –ఆబ్స్ట్రాక్ట్ చిత్రకళా రూపం లో పతాక సదృశ౦ గా నిలిచింది .కవి ,రచయిత విమర్శకులు అయిన రామారావు బహుముఖ ప్రజ్న అనితర సాధ్యమని పిస్తుంది ‘’అన్నారు డా సి నారాయణ రెడ్డి గారు .ఆధునిక చిత్రకళా ప్రపంచం లో  ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో ధ్రువతార .ఇవాళ ఎస్వి గారిచిత్రకళా విశ్వరూపాన్ని దర్శించిన వారు ఆయనను  ‘’ఇండియన్  పికాసో ‘’ అంటారు .కాని ఆయనమాత్రం ‘’నేనుపికాసో కు వీర అభిమానిని .ఆయనే నాకు మార్గ దర్శి ’అని సగర్వంగా చెప్పుకున్నారు .అది ఆయన సంస్కారానికి  నిదర్శనం .’

నేటి నవ్య కళ ఎన్నో యుగాలకిందటి నీగ్రో మూర్తి కళలో కన్పిస్తుంది .ఈనీగ్రో మూర్తికళ నుంచే ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’అనిపిలువబడే పికాసో స్పూర్తి పొందాడు.సహజ రూప చిత్రణ కంటే అసహజ రూప చిత్రణకు ప్రతిభను పదునుపెట్టి నవ్య చిత్రకళా నిష్ణాతు డైనారుశ్రీ రామా రావు . నవ్య చిత్రకళ విశ్వజనీనమై తైల వర్ణ చిత్రాలలో ఒదిగి పోయింది .ఇందులో రూపం కంటే రంగుకే ప్రాధాన్యం ఎక్కువ .రంగుల ఇంద్రజాలందీని విలక్షణత్వం అన్నారు సంజీవ దేవ్ ..

క్యూబిజం ఇంప్రెషనిజం ఎక్స్ప్రెష నిజం సర్రియలిజం లోనూ అనేక ప్రయోగాలు చేసి ఎస్వి ,చిత్రాలలో మంచి టెక్చర్ అంటే స్పర్శి౦చదగిన పైభాగం సృష్టించటం లో మహా నిష్ణాతులయ్యారు .తాను మనో చక్షువులతో చూసే రూపాన్ని చర్మ చక్షువులకు అందించే నేర్పు అద్వితీయం .స్వయంగా చిత్రకళా మర్మజ్ఞులు  కూడా  అయినందున , కళావిమర్శకులకు అందని లోతులు ఆయన అందుకోగలిగారు  . ’సామాన్యంగా నైరూప్య చిత్రాలు ఏదో ఒక వ్యక్తికో వస్తువుకో, స్థలానికో చెంది ఉండవు .కాని ఎస్విగారి నైరూప్య చిత్రాలు విషయాలకు సంబంధించినవిగా ఉంటాయి . ‘’లండన్ లో మొదటి చిత్ర ప్రదర్శనకు’’ కృష్ణానది’’ని వస్తువుగా తీసుకొని ‘’ఆప్టికల్ ఇల్యూజన్ తో ధారావాహిక చిత్రాలు గీసి అద్భుతం అనిపించారు . కృష్ణానది మనకు తెలిసినా ఆయన చిత్రించిన కృష్ణానది మనకు తెలియదు .అంటే ఆనదీ ప్రవాహం ,ఒడ్డు, కెరటాలు ,వేగం వంటి స్థూల రూపాలు కాకుండా, సూక్ష్మ రూపం,  దాని నైరూప్య రూపాన్ని చిత్రిస్తారన్నమాట.ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి వారు దీనిపై కవిత్వం రాశారు . ‘’లేపాక్షి, ఉషోదయం చిత్రాలూ పెద్ద పేరు తెచ్చుకోన్నాయి .

’   తర్వాత పూర్తిగా అమెరికాలో స్థిరపడి ప్రయోగ శీలతతో తైల, నీటి రంగుల చిత్రాలలో కోమలత్వ,మార్దవత్వాలేకాకవిశిష్టమైన వర్ణ సంగీతాన్ని సృష్టించారు .నీటి రంగుల్లో మాత్రచే కనిపించే పార దర్శక వాష్ పద్ధతిని ,ఆయిల్ పెయింటిం గ్  లో తెచ్చి అబ్బురపరచారు .పేలట్ నైఫ్ కాని ,  కుంచె కాని వాడకపోవటం  ఎస్విగారి మరో ప్రత్యేకత .వీటిబదులు గుడ్డ పీలికలతో రంగులు పట్టిస్తారాయాన .దీనివలన  పాలరాతి నునుపుదనం రావటమేకాక మేఘాల తెరలలాంటి  వాయు నీయత ప్రత్యక్ష మౌతుంది అన్నారు సంజీవ దేవ్ .‘’భారతీయ దృశ్య కవితా సారాన్ని 20 వశతాబ్దపు నైరూప్య చిత్రాలలో చూపటం పై దృష్టిపెట్టారు .ఇది విలక్షణ కృషి . .ప్రాక్ పశ్చిమాలకు ఒక దృఢమైన సేతువు అయ్యారు రామారావు . ఆయన చిత్రం ‘’వసంత ఋతువు ‘’లో అమెరికాలోని ప్రాణస్పందన ,ఉల్లాసం ,మధుర రసానందం, నైసర్గిక శోభ అన్నీ కూడా ఆధునిక నైరూప్య వాయునీయ వర్ణాలలో ప్రదర్శితమౌతుంది. ‘’ఉషోదయం ‘’చిత్రం లో ఉష్ణ వర్ణాలతో చిత్రింప బడి ,వెచ్చని పశ్చిమ పవనాలతో మృదువర్ణ లయతో తాండవించే చెట్లూ కొండలు పూత పూస్తున్నట్లు ఉంటాయి.

 

శ్రీ ఎ .కృష్ణా రెడ్డి, శ్రీ  ఎస్వి రామారావు లు ఇద్దరే ఇద్దరు తెలుగు  చిత్రకారులు ఇతర దేశాలలో స్థిరపడ్డ వారు . .ఇండియాలో ఉండగానే ఎస్వి చిత్రకళ వాస్తవంనుండి కల్పనకు ఎదిగి పాశ్చాత్య దేశాలలో నైరూప్యానికి విస్త రించింది. వర్ణ చిత్రకారు లైన శ్రీ రామారావు వర్ణ వ్యతిరేకతలనూ వర్ణాల ఐక్యతనూ సమతూకంగా చిత్రించారు . ఆయనది అమెరికన్ నైరూప్యాకలకు అనుకరణకాదు’’ప్రాచ్య రీతులున్న నైరూప్య కళ ‘’అన్నారు విశ్లేషకులు. తెలిసిన రూపాన్ని తెలియని రూపాల లో చిత్రి౦చటమే రామారావు గారి కళాసృస్టి’’అన్నారు చిత్రకళలో పండిపోయినశ్రీ సంజీవ దేవ్ .

 

.శ్రీ రామారావు గారిని ‘’ An important color-based non-figurative artist.అంటారు

’కుండలిని మేలు కొలుపు ,సాగర మధనం, ఎర్ర మట్టిలో నదీ ప్రవాహం, వెన్నెలలో నది ,నల్లడవిలో నీలి నది వంటి చిత్రాలలో రంగులు మహావేగం గా ప్రవహించేట్లు చేశారు .ఆయన చిత్రాలను ‘’పొయేమ్స్ ఇన్ పిగ్ మెంట్స్ అంటే వర్ణ ద్రవ్య కవిత్వం ‘’అంటారు. పంచ భూతాలలో నీరు, గాలి ,అగ్ని అనే మూడింటిని చక్కగా ఉపయోగించుకొన్నారు శ్రీ రామారావు.నీరు  ఆవిరై మేఘాలను చేరి కుంభ వృష్టి కి కారణ మౌతుందని ,తానెప్పుడూ తెలుపు రంగును ఉపయో గించ నేలేదని, అదే తన పేపర్ నియంత్రణకు కారణమయిందని నలుపు రంగు ఉపయోగించటమూ చాలా కష్టమే నని, కాని మిగిలినరంగులకు డెప్త్ ను ఇవ్వటానికే వాడతానని, పెర్షియన్ బ్లూ  ,క్రి౦సన్  లేక్ రంగులు వాడి సూర్యాస్తమయ సమయం లో బంగారు మేఘాల ను సృష్టిస్తానని వివరించారు. రెండవదైన గాలిని గూర్చి చెబుతూ మనచుట్టూ ఉండి ఉచ్చ్వాస నిశ్వాసాలకు కారణమైన గాలి , అదే ప్రళయ  జంఝ గా ,ప్రశాంతమలయానిలం గా ఉండే  రీతిని వర్ణిం చానని చెప్పారు మూడవదైన అగ్ని హిందూ పురాణాలకు సంబంధించినదని ,పృద్విని రక్షించే ఎనిమిది మూలకాలలో అతి ముఖ్యమైనదని ,అది శాశ్వతత్వానికి, తాత్కాలికానికి చిహ్నంగా తన చిత్రాలలో జ్వాలలుగా కనిపిస్తుందన్నారు.

భారతీయతకై ఆరాటం

ఇంతగా ప్రపంచ ప్రసిద్ధి పొందినా, తనను భారతీయులు మనస్పూర్తిగా ఆదరించ లేదని భావించి గత కొన్నేళ్లుగా ఢిల్లీ లో ఉంటూ, స్వదేశీయులకోసం 80 చిత్రాలు గీశానని ,మరో 20 పెయి౦టింగ్ లు వేస్తానని ఎస్వి అన్నారు .ఇప్పుడు తన చిత్రాలు భారతీయ స్పిరిట్ ప్రకారం కొత్త రూపాన్ని దాల్చాయని అంటారు .ఆర్ట్ లోని ప్రక్రియలు తెలియని వాళ్ళనూ ఆకర్షించేలా ప్రతిదీ వైవిధ్యంగా రూపొందించారు . ‘’నేచర్స్ ఆబ్ స్ట్రాక్ట్ గ్లోరీ ‘’పేరిట ఢిల్లీ లో దూమిమల్ ఆర్ట్ గాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టు కొన్నారు .   భారతమాజీ  రాష్ట్ర పతి,  భారత రత్న డా ఎ.పి.జె ‘అబ్దుల్  కలాం గారు ఎస్వి గారి ‘’సోలో ఎక్సిబిషన్ ప్రారంభించారు .ఈసందర్భంగా డా కలాం తమ తదుపరి రచన ముఖ చిత్రం పై శ్రీ ఎస్వి రామారావు గారి పెయింటింగ్ ను ముద్రి౦చుకొంటానని సగర్వంగా తెలియజేశారు.నిరంతర ప్రయోగ శీలి అన్వేషకులు పద్మశ్రీ ఎస్ వి.రామారావు గారి కళ  .భారతీయులకు ,భారతీయతకు  దగ్గరవ్వాలన్న వారి ఆకాంక్ష నెర వేరు తున్నందుకు అందరం సంతోషం తో అభినందిద్దాం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-16 –ఉయ్యూరు –9989066375

2-405  శివాలయం వీధి –ఉయ్యూరు -5 21165

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు -2-9-16 న ఉయ్యూరులో ఘన సత్కారం

-నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.

సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి

–

 

యువత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

రియో ఒలింపిక్స్ లో  రజిత,కా0 స్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలాంటి  క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు

DSCN1891DSCN1892DSCN1852

DSCN1855
DSCN1866
DSCN1869
–DSCN1877
 DSCN1879
DSCN1880
DSCN1881DSCN1890
DSCN1889

అమెరికాలో ఉంటూ ఉయ్యూరు ,సరసభారతి పట్ల విశేష అభిమానం కల శ్రీ మైనేని గోపాలకృష్ణగారు నగదు కానుక గా పంపిన 11 ,116 రూపాయలు సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ పద్మశ్రీ శ్రీ ఎస్వీ రామారావు గారికి సభా ముఖంగా అందజేశారు .

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

           భజనవారం 

14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని హమ్మింగ్ పాటలతో కొడైకెనాల్ బాక్ డ్రాప్ గా సినిమా కనుల పండువుగా ఉంది ..
15-8-17   మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి –
ఉదయమే మా శ్రీమతి ముగ్గుతో వాకిలి నుంచి ఇంట్లోకి బాల కృష్ణుని పాదాలు వేసి కన్నయ్యకు ఆహ్వానం పలికింది .నేను మా మూలు సంధ్యావందనం చేసి తర్వాత మంగళవారం కనుక శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణా అష్టోత్తర ,విష్ణు సహస్ర నామ పూజ చేశా .కృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవాలయాలలో ప్రసాదంగా పెట్టె ”కట్టెకారం ”మా ఆవిడ చేయగా దానితోపాటు అటుకులు బెల్లం పాలు పెరుగు నెయ్యి వెన్న పండ్లతో సహా నైవేద్యం పెట్టాము .  తర్వాత కృష్ణలీలలు శ్రీకృష్ణ కర్ణామృతం జయదేవుని అష్టపదులు  జానకి పాడిన కస్తూరిరంగా పాటలూ  సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామ స్తోత్రం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు మాడుగులచదివిన పోతన  భాగవత0   వగైరా వింటూ సాయంకాలం దాకా కాలక్షేపం చేశాను
           సాయం భజన
 సాయంకాలం7 గంటలకు  మా అమ్మాయి ఇంట్లో సాయి సెంటర్ వాళ్ళను ఆహ్వానించి భజన ఏర్పాటు చేసింది .శ్రీమతి గోసుకోండ అరుణ ఇంట్లోని పెద్ద శ్రీ కృష్ణ విగ్రహాన్ని వాళ్ళఅబ్బాయి తెచ్చాడు .దాన్నీ అలంకరించి సిద్ధం గా ఉన్నాం .దేవుళ్ళ అలంకారం మా అమ్మాయి బాగా చేసింది . ఇంట్లో ఉన్న డబుల్ స్పీఎకర్ లతో నాలుగు మైకుల ఏర్పాటు మా మనవళ్లు శ్రీకేత్ అశుతోష్ పీయూష్ లు సిద్ధం చేశారు .   అకస్మాత్తుగా సాయ0కాలం  6-30 నుంచి  పెద్ద వర్షం పడింది .అప్పటికే సాయి సెంటర్ హెడ్  సుబ్బు వచ్చేశారు . మిగిలినవాళ్లు వస్తారా రాగలరా అను కొంటుంటే ఉరుములు మెరుపులు వచ్చి వర్షం అంతే  సడన్ గా 6-50 కి ఆగిపోయింది . హమ్మయ్య అనుకొన్నాం .సరిగ్గా 6-55 కు  సాయి సెంటర్ నిర్వాహకురాలు శ్రీమతి జయ రాగా ఖచ్చితంగా 7 గంటలకు సుబ్బు జయ మా అమ్మాయి విజ్జి భజన ప్రారంభించారు .. ఆ తర్వాత అందరూ వచ్చేశారు దాదాపు 75 మంది .అందరూ ఏకకంఠంగా భజనలు చేశారు శ్రీ కృష్ణ భజనలు ఎక్కువగా చేశారు చిన్నపిల్లలూ చాలా శ్రావ్యంగా పాడారు మంచి నిండుదనం వచ్చింది .ఖచ్చితంగా రాత్రి 8 గంటలకు భజన ఆపేశారు . తర్వాత జయ రెండు నిమిషాలు మాట్లాడాక  మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే కృష్ణాష్టమి ,భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యం పై 9 నిమిషాలు మాట్లాడాను .అందరూ తెలుగు తెలియని తమిళ కన్నడిగులు కూడా బాగుందని అన్నారు . ఇంకా ఒకఅరగంట మాట్లాడితే బాగుండు నన్నారు.  అది సమయం కాదు అంతా” ఫుడ్ కోర్ట్ లో చేతికీ  మూతికీ బాటింగ్ హడావిడి ”లో ఉన్నారన్నాను .కాదు భోజనాలయ్యాక మాట్లాడాలి అన్నారు సరే అన్నా.  భోజనం లో  పూరీ ,బంగాళాదుంపకూర ,మామూలు ఇడ్లీ రాగి రవ్వ ఇడ్లీ ,సాంబారు గోంగూర పచ్చడి ,అటుకులపులిహోర ,చట్నీ  జున్ను ,ఫ్రూట్ సలాడ్ ,ఫ్రూట్ జ్యుస్ ,అన్నం ,పెరుగు ,పెరుగన్నం  పుచ్చకాయ ముక్కలు చక్రపొంగలి   , వగైరాలతో కమ్మని భోజనం .
  భోజనాలు అయ్యాక ఒక పది మంది నేను మాట్లాడాలని కోరగా హాలులో కూర్చునిరాత్రి 9-30కు మొదలుపెట్టి  సుమారు 20 నిమిషాలు బ్రహ్మ వైవర్త పురాణం లోని  గోలోకం విశేషాల ,మరికొన్ని విషయాలు మాట్లాడాను చాలా శ్రద్ధగా విన్నారు మా అమ్మాయి రాధ లక్ష్మి ,ఉషా ,సురేఖా  నీలిమ , పవన్ ,,రాంకీ అవధాని  జగదీశ్ మొదలైనవారు . అభి రుచి ఉన్నవారికి నాకు  తెలిసినవి  నాలుగు ముక్కలు చెప్పటం లో నాకు ఆనందం అలాగే అందరూ ఆనందాన్ని సంతృప్తిని   పొందారు .రాంకీ  ఉషా విజ్జి వీడియో తీసి లైవ్ గా మా వాళ్లకు పంపారు  .అంతా  అయ్యేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . మంచికార్యక్రమం అనుకోకుండా జరిగింది . వర్షం హర్షం ఆనందం పంచింది .
  బుధవారం -నిన్నటి విశేషాలన్నీ ”కృష్ణం  వందే  జగద్గురుమ్”గా రాశాను  . రాజ్ తరుణ్ సినిమా ”ఉయ్యాల ;జంపాల ”యు ట్యూబ్ లో చూశా .కొత్తకుర్రాడు  చాలా  ఫ్రెష్  గా ఈజీగా చేశాడు అనిపించింది చక్కని గోదావరి పల్లెటూరు కూనవరం బాక్ గ్రౌండ్ గా తీసిన చిత్రం ప్రకృతి అందాలన్నీ ఒడిసిపట్టి చూపించాడు . దర్శకుడు .సంగీతం వీనులవిందు ఫోటోగ్రఫీ నయనానందకరం ..
17-8-17 గురువారం -మా అన్నయ్యగారి మనవడు చి కళ్యాణ్ ఛిసౌ మీనా ల  వివాహం ఈ రోజు ఉయ్యూరులో  ఉదయం 9 గంటలకు జరిగింది . మా బంధువులందరూ వచ్చారట .గ్రాండ్ గా జరిగిందని రమణ ఫోన్ చేసి చెప్పాడు . .మా మేనల్లుడు అశోక్ ,మేనకోడలు  పద్మ మా అబ్బాయి శాస్త్రి ,మనవడు భువన్  తమ్ముడు మోహన్ భార్య సునీత  మా అన్నయ్య మనవడు రవి ,హైదరాబాద్ నుంచి ,మా పెద్ద మేనకోడలు కళ , భర్త చంద్రశేఖర్ ,కొడుకు బాలాజీ ,మేనల్లుడు శ్రీనివాస్ ద0పతులు చెన్నై నుంచి,  గరివిడినుంచి మా అన్నయ్య కూతురు వేదవల్లి భర్త రామకృష్ణ మొదలైన బంధుగణం హాజరై దగ్గరుండి వివాహం జరిపించారు .
శుక్రవారం -”ట్యూబ్ లో శాతకర్ణి హిందీ సినిమా చూసి ఆనందించా .
శనివారం -త్రిపురనేని గోపీ చ0ద్ దర్శకత్వం లో ఘంటసాల సంగీతం తో ,కృష్ణవేణీ నారాయణరావు నాయికా నాయకులుగా శోభనాచల వారి  శ్రీ లక్ష్మమ్మ చూశాము గోపీచంద్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే నీట్ గా ఉన్నాయి .   . తర్వాత కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ కూడా చూశాను . ఎందరెందరినో చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణీ భర్త మీర్జాపురం రాజా వారిది .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురంఅని ఉండేది చాలాకాలం .
గీర్వాణం -3 లో 415 వరకు రాశా .
 మా అమ్మాయి తో సహా ఇక్కడి  సాయి సెంటర్ వాళ్ళు గ్రీన్స్ బరో లో నిర్వహించిన ఒక రోజు వాలంటరి  టీచర్స్ ప్రోగ్రామ్ కు  ఉదయం 5-30 కి బయల్దేరివెళ్లి రా త్రి 7-30 కు వచ్చారు .
  మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లు నెల రోజుల టెన్నిస్ కోచింగ్ పూర్తి అయిన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన కాంప్ కు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చారు మా పెద్దమనవడు శ్రీకేత్ శని ,ఆదివారాలలో ఉదయం మాథ్స్ ఇంటెన్సివ్ కోచింగ్ కు వెళ్లి ,ఆ తర్వాత వై ఏం సి లో ఆడుకొని వస్తున్నాడు .ఇక్కడి స్కూళ్ళు  ఈ నెల 28 నుంచి ప్రారంభం   మళ్ళీ హడావిడి . .
 20-8-17 ఆదివారం -గీర్వాణం -3 లో 418 వరకు కవులగురించి ఇవాళరాశాను
  ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మట్టిబండి కన్యాశుల్కం -రామతీర్థ

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ  భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు మెచ్చి ఆస్థాన విద్వా 0సుని చేశాడు . .క్షేత్ర సందర్శనం చేసి ప్రతి దేవునిపైనా కృతులు చాలాభాగం తెలుగులో కొన్ని సంస్కృతం లో రాశాడు .స్వరజతులు వర్ణాలు కృతులు తిల్లానా లు సంస్కృత తెలుగు భాషలలో రాశాడు .ఆయన కృతులన్నీ రాగభావం తో సాహిత్య సౌందర్యం తో అలరిస్తాయి .హరికాంభోజి రాగం లో రాసిన సంస్కృత కీర్తన -’’సాకేత నగరనాధ ‘’శ్రీమతి ఏం ఎస్ .సుబ్బులక్ష్మి గాత్రం తో బహుళ ప్రచారం పొందింది .తెలుగులో మాయామాళవ గౌళరాగం లోని ‘’దేవాది దేవ ననుకావ సమయమురా ‘’,ఆఠణా రాగం లో -’’వాచామ గోచరుండని ‘’,కమాస్ రాగం లో -’’పరమాధ్బుతమైన నీ సేవ ‘’హంసధ్వనిలోని స్వరజతి -’’రామాభిరామా ‘’   మొదలైనవి ఆయన ప్రతిభకు స్వరగోపురాలు   . 1879 80 ఏళ్ళ వయసులో  మరణించాడు .

417-సప్త తాళేశ్వర కర్త -వీణ వెంకట సుబ్బయ్య (1750-1838)

మైసూర్ లోని ప్రసిద్ధ వైణిక కుటుంబం లో 1750 లో తంజావూర్ జిల్లా కపిస్తలం లో  జన్మించిన వీణ వెంకటసుబ్బయ్య మైసూర్ ను పాలించిన హైదరాలి కాలం వాడు తర్వాత మూడవ కృష్ణరాజ ఒడియార్ కు సంగీతగురువై ,ఆస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .దివాన్ పూర్ణయ్యపంతులు మైసూర్ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలాగా సాంస్కృతిక కేంద్రం చేయాలని చాలా కృషి చేశాడు . వెంకటసుబ్బయ్య రీతి గౌళరాగం లో  ఎనిమిది సులాది తాళాలతో రచించిన ‘’సప్త తాళేశ్వర గీతం ‘’ సుప్రసిద్ధమైనది . 88 ఏళ్ళు జీవించిన వీణ వెంకటసుబ్బయ్య జీవిత వీణ 1838 లో   ఆగిపోయింది .

418-లింగ రాజ అర్స్ (1823-1874 )

 మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాజ ఒడియార్ అల్లుడు అలియ లింగ రాజ అర్స్ కన్నడ సంస్కృతాలలో అందెవేసిన చేయి .సంగీతకర్త .హెగ్గద  దేవనకోట వాస్తవ్యుడు .లలితకళాభిజ్ఞుడు .అనేక నాటకాలు ,యక్షగానాలు  ,50 కి పైగా కృతులు రచించాడు . లింగ ,లింగేంద్ర ,లింగరాజ అనే కలం పేరుతొ రాసేవాడు .సంస్కృతం లో పంచ వింశతి లీల ‘’అంబకీర్తన   బాగా ప్రసిద్ధం . అతని నీలాంబరి రాగం చిత్త స్వరం లో ‘’ శృంగార లహరి’’ సంస్కృత కృతి అత్యద్భుతం . 51 ఏళ్ళు మాత్రమే జీవించి అర్స్ 1874 లో అసువులు బాశాడు ..

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్ (1815-1892 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్  (1815-1892 )

 

కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్  కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా .స్వాతి తిరుణాల్ రాసిన వాటికి  పరమేశ్వర్ నకలు   రాసేవాడు .గొప్ప వీణ విద్వా 0సుడు .స్వరబత్ వాయిద్యం లోను దిట్ట . హరికథాగానం తో జనాలను ఉర్రూత లూగించేవాడు . స్వాతి రాజాస్థాన సంగీత విద్వా0 సుడు  గురువు  వడివేలు మరణించాక భాగవతార్ ను ఆస్థాన విద్వా0సుని చేశాడు రాజు పరమేశ్వర భాగవతార్  సంస్కృతం లో కీర్తనలు రాశాడు . అవి అచ్చు స్వాతి తిరుణాల్ ,ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలాగానే ఉంటాయి .అనేక వర్ణాలూ రాశాడు .ఆయన రాసిన కీర్తనలలోనాటరాగం లోని  ‘’సరసిజనాభ’’,శ్రీ మహా గణపతిం భజే ‘’కీర్తనలు మంచి గుర్తింపు తెచ్చి కచేరీలు వరమయ్యాయి . 87 వ ఏట 1892 లో భాగవతార్ మరణించాడు . మలయాళం లో కూడా కీర్తనలు రాశాడు .

413-తిరువనంత స్థల పురాణకర్త -కుట్టికుంజన్  తంగాచి (1820-1904 )

కుట్టికుంజన్  తంగాచి ఇరై మాన్ తంబీ ఏకైక కుమార్తె .కేరళలో 1820 లో పుట్టి 1904 లో చనిపోయింది . తండ్రి స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా0సుడు .తండ్రి వద్దే సంగీతం నేర్చింది .హరిప్పద  కోచిప్పిల్ల వారియర్ వద్ద సంస్కృతం అభ్యసించి సంస్కృత ,మళయాళ భాషలో గొప్ప విదుషీమణి అయింది . నృత్యం కూడా తండ్రివద్దే నేర్చి దాని లోనూ ప్రతిభ చాటింది . .పార్వతీపరిణయం శ్రీమతి స్వయంవరం  అనే అట్టకాలు రాసింది  .సంస్కృతం లో తిరువనంతపురం స్థలపురాణం ,గజేంద్ర మోక్షం ,నలచరిత్రం రాసింది .అనేక కృతులు ,వర్ణాలు రచించింది అందులో కాంభోజిరాగం లో ‘’కాత్యాయని మాం ‘’కళ్యాణిరాగం లో ‘’సామజహరే ‘’మంచి గుర్తింపుపొందాయి  .సంస్కృత తిల్లానా కూడా రాసింది . కేరళలో కీర్తనలు రాసిన ప్రధమ మహిళావాగ్గేయకారిణిగా   ఆమె గుర్తిపు పొందింది.  84 వ ఏట1904 లో మరణించింది .

414-108 రాగాలలో 108 కీర్తనలు రాసిన -ఎన్నపాదం  వెంకటరామ భాగవతార్ (1880-1961)

కేరళలో కొచ్చిన్ లోని ఎన్నపాదం లో వెంకటరామ భాగవతార్ 1880 లో జన్మించి 1961 లో 81 వ ఏట మరణించాడు . హరికథాగానం లో సాటిలేనిమిటి .సంస్కృత తెలుగు కన్నడ మిళ మళయాళ భాషలో హరికథలు రాసి  చెప్పి ఒప్పించినహరికథా సరస్వతి .తిరువనంతపురం కొచ్చిన్ మైసూర్ ,బరోడా మొదలైన సంస్థానాలలో హరికథా గానం చేసి మెప్పుపొంది సత్కారాలు అందుకొన్నాడు .అనేక కొత్తరాగాలు సృష్టించాడు . కృష్ణ అష్టోత్తర శతనామ కీర్తనలు ‘’108 రాగాలలో 108 కీర్తనలు అంటే నామానికి ఒక్క కీర్తనగా రచించిన భక్త శిఖామణి . ప్రకాశిని రాగం లో ‘’గుహం ఆశ్రయామి ‘’,సుముఖిరాగం లో ‘’మాతంగ ముఖం ‘’కీర్త నలు  ప్రసిద్ధి చెందాయి .

415-మణిప్రవాళ శైలి కృతి కర్త -తమస్సేరి కృష్ణన్  భట్టాత్రి (1890-1963 )

1890 లో పుట్టి 1963 లో చనిపోయిన తమస్సేరి  కృష్ణన్  భట్టాత్రి కేరళలో జన్మించాడు .సంస్కృత మళయాళభాషలలో గొప్ప ప్రజ్ఞావంతుడు . ఈ రెండు భాషలు కలిపి మణిప్రవాళ శైలిలో కృతులు  రాశాడు .బేగడ  రాగం లో ‘’శ్రీరాఘవ పరిపాలయ ‘’,ఆనంద భైరవిలో ‘’ఆనంద నంద నందనం నమామి ‘’మొదలైనవి ప్రసిద్ధ కీర్తనలు .

416-దేవయాని చరిత నాటక కర్త -కుట్టు ముత్తు కుంజు కురుప్ (1880-1943)

కేరళలో కనియూర్ లో 1880 లో పుట్టి 63 ఏళ్లకు  1943లో చనిపోయిన కుట్టుముట్టు కుంజు కురుప్ సాహిత్య సంగీతాలలో మహా విద్వా 0సుడు . సంస్కృతం లో దేవయాని చరిత నాటకం ,విద్యా శ0ఖ ధ్వని ,బాలగోపాలం  వంటివి ఆయన ప్రతిభా ప్రదర్శనాలు .తననాటకాలలో 300 కు పైగా కృతులు రాసి స్వరపరచిన  మేధావి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-17 -కాంప్–షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
“శంకరాభరణం“
నేపధ్య సంగీతం  :

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ, నేత్రానంద రస స్ఫోరక కళా భిజ్నత . ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పాదాల ల సవ్వడిలో మంద్రగానం ధ్వని0ప జేయటం  అతని లోని కళాభిజ్ఞతకు ,నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది . తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే ” అన్న  నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ ఊహ కు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాట  ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని  దృష్టి .  ”శ్రీ రమణీ కుఛ దుర్గ విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట.  మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది . ఇది మహ దేవన్  విశ్వనాధ్  ల అపూర్వ భావ సంయోగ ముక్తా ఫలం .
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి గాం భీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయేటట్లు జీవి0 చేట్లు  నటించాడు” కలెక్టర్” సోమయాజులు . అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం, నేపధ్యం గా సాయ పడింది . అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత.  సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు . అదో తపస్సు గా ,యోగ సమాధి గా నిర్వహించాడు.”నట సోమయాజి ”అనిపించాడు .
అసలు ఆ పాత్ర ఏమి  చెప్పదు  .అ0తా  మనం ఊహించు కోవలసిందే .ఊహా  సామ్రాజ్యమే. అంతా  . వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి  తప్ప లోకానికి భయపడను  .  నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి  తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  charector  ను విశ్లేషిస్తుంది . తులసి రైల్ ఎక్కేటప్పుడు, మైసూర్ లో పరాభవం   జరిగినప్పుడు, ఎక్కడా   తొణకడు , బెణకడు ఎవర్ని ఏమీ అనడు  ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు  తొట్రుపడడు .  .
తనకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయనా  విచారించడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితే  ఆ గంభీరం  వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహినిగా  ప్రవహిస్తుంటుంది .అది సంస్కార  చేతన .  అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు  అందనిది   అంత ఉత్తమమైనది .  .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర శి ష్టాచార  పరాయణు డైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత సాహిత్య మూర్తి అందించే సారాంశం . .సంగీతానికి భాష, భేదం లేదని  ,అది ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుందా  తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ,ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి  కూతురు వెన్న రాస్తుంటే  సుజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన  శిఖరారోహణం  చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం  .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన ,అదే నటన అనిపించింది . సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యడయాడు
చివరి సీన్ లో ”దొరకునా  ఇటువంటి సేవ ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత కు ,నా నమోవాకాలు ఆ ళాభిజ్ఞతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమౌతుంది .  బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసులో .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు . అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవదరించరా ,,విని తరించరా  ”అని అనిపించిన పాత్ర అది . తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు  విశ్వనాధ్  కళా  విశ్వ నాధ్  అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా   విశ్వనాధ్  సృష్టికర్తగా ,కళా నరాజనాలు అందుకొన్నారు .  ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతుందో  తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి న మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుందని  ఎవరూ ఊహించలేక పోయారు  ఊహించలేదుకూడా .  .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో  కాసేపే నాట్యం చేసినా  బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి  విశ్వనాధ్  చేతిలో మనోజ్ఞ మనోహర  శిల్ప మూర్తిగా  గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .ఉన్నా చాల పొదుపు .అంతా సాత్విక అభినయమే  .ఊహాలోక  సంచారమీ .  .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి  రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చత .  అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకా లకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు, శంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట  గట్టి నపుడు, ,తిట్టినపుడు, ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించుకోవటం చాలా కష్టమే   .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శం కర శాస్త్రి రాగానికి తాను భావించిన, ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ  చిత్రాలుగా  దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలు పరమ మనోహరాలు. శంకర   శాస్త్రికి సన్మానం జరిగేటప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా   భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది.మనసులో చెరగని ముద్ర వేసింది . .
”బ్రోచే వారెవరురా ”పట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు, సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరా ననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆనందం  తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న  సంతృప్తి  వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback  లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన  చూపుతో అర్ధమవుతుంది .  అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు  కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె  ఆత్మానందాన్ని  ప్రతీక .
జమీన్  దారును  హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆధనాకృతి  ఆకృతి  గా నిలబడాలన్న తపన అది .తనమూలం గా శంకరశాస్త్రికి   మరింకే కళంకం రాకూడదనే ఆరాటం . ఒక మూగమనసుగా  మనసున్న  వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose  చేసిన కళా తపస్వి  విశ్వనాధ్  పరిశీనా  దృష్టికిహట్స్ ఆఫ్.
అల్లు రామ లింగయ్య :
శి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు . సృష్టి లో తీయనిది స్నేహం . అది యెంత విషమ పరిస్థితులలో అయినా  పరిక్షలకు తట్టు కొని నిలబడుతుంది .   .ఆ స్నేహ బంధం  వీడదు .వాడదు  శంకర మాధవులు దేవతా స్వరూపులుగా  స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రధారికి   కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళా జీవి ధన్యుడయాడు ”వాడెంత ?నేను  గట్టిగా  కన్నెర్ర  జేస్తే గడగడ లాడ్తాడు ” అంటాడు శాస్త్రి ఎదురుగా లేనప్పుడు . అలా  డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కా  పోతాడు .
ఇలా యెంత చెప్పినా  తరగనిగని , ఘని  శంకరాభరణం . చూసి  పులకి0చా ల్సిందేకాని , చెప్పి ,మెప్పించలేము.అయినా ఇదొక చిన్న ప్రయత్నం .
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03- 99  న స్వర్గీయ శ్రీ వేటూరిసుందరరామ మూర్తి  కృష్ణా  జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకళ్ళే  పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నే  చూపించాను.  చదివి బాగుంది అని నా పుస్తకం లో ఆ కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం.
          కళాతపస్వి రాజర్షి శ్రీ కాశీనాధుని విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం ”దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ”అంద  జేసి చాలా నెలలు అయినా ,ఆ వ్యాసాన్ని దుమ్ముదులిపి మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా ,

—

Inline image 1Image result for sankarabharanam of visvanadh
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది పోర్చుగీసు అధికారం తో పెత్తనం చెలాయిస్తున్న సాలాజార్ కబంధ హస్తాలనుండి విడుదలై భారత దేశ విముక్తి కోసం పోరాడుతున్న యావద్భారత దేశం తోపాటు గోవా కూడా కలిసి అడుగులు వేయాలని నిశ్చయించింది .సాలాజార్ ప్రజల నోరు నొక్కి బహిరంగ సమావేశాలకుకాని ,భావప్రకటనకు కానీ అవకాశం ఇవ్వకుండా పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించాడు .అన్ని హక్కులను నిషేధించి తన క్రూర పైశాచిక నియంతృత్వాన్ని చెలాయించాడు .రాజకీయ సమావేశం జరపాలంటే గవర్నర్ దగ్గర ముందు అనుమతి పొందాల్సి వచ్చేది . 1933 కలోనియల్ యాక్ట్ ద్వారా ప్రజల సర్వ హక్కులు నిషేధానికి గురయ్యాయి . స్వేచ్చాప్రియులైన గోవన్లు దీన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు చేయాల్సి వచ్చింది’ అంతకంటే వారికి గత్యంతరం కనిపించలేదు .
క్రమంగా సంస్థలు ఏర్పడి ,జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు .ఈ ఉద్యమం లో మహిళలు తామేమీ పురుషుల కు వెనుకబడిలేమని తెలియజేస్తూ ముందుకు దూకి స్వాతంత్రేచ్ఛతో రగిలిపోయారు .గోవా ,డయ్యు డామన్ ల విముక్తికి సంఘటిత0గా నడుం కట్టి కదిలారు .
.అందులో పౌరహక్కుల ఉద్యమ ప్రధమమహిళా నాయకురాలుగా ప్రమీలా కాంత్ జంబోలికర్ అగ్ర శ్రేణిలో నిలిచింది .గోవా సేవా సంఘం ఆధ్వర్యం లో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళా చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది . 1946లో ఆమె గోవా జాతీయ కాంగ్రెస్ సభ్యురాళ్ళలో ప్రధమ స్థానం పొందింది . 21.-7-1946 న ఆమె మడగావ్ లో ”ప్రభాత భేరి ”ఉద్యమానికి నాయకత్వం వహించింది .పోర్చుగీస్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి హింసించింది .కస్టడీ లో ఉండగా పోలీస్ కమాండెంట్ అడిగిన ప్రశ్నలకు అత్యంత ధై ర్యం గా సమాధానాలు చెప్పి దిమ్మ తిరిగేట్లు చేసింది .మళ్ళీ ఉద్యమాలు చేస్తే బాలిక అనికాని మహిళఅనికాని చూడకుండా బట్టలు విప్పించి బాదేస్తానని భయపెట్టాడువాడు . వదిలేశాక ఆమె రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ ఉద్యమం చేసి అరెస్ట్ అయి ఏడాదిపాటు జైల్లో ఉంది
మహిళా కార్య కర్తల ఉద్యమపోరాట0 18-6-1946 న రామ మనోహర్ లోహియా మార్మగోవాలో ప్రసంగించిన సభతో తీవ్ర రూపం దాల్చింది .గోవన్ల పౌరహక్కుల కోసం ప్రభుత్వం తో పోరాటం చేయాలని లోహియా తీవ్ర స్వరం తో ఉద్రేకంగా మాట్లాడి గొప్ప ప్రేరణ కలిగించాడు .అప్పటిదాకా గోవాలోనియంతృత్వసాలజార్ పోర్చుగీసు పాలనలో ఎవరూ ఏ మార్పును తేలేరు అనుకొన్న నమ్మకాన్ని బద్దలు చేశాడు లోహియా . ఆయన కాలు పెట్టటం తో అంతా ఒక్క సారిగా మారిపోయింది .అంత గొప్ప ప్రేరణ కలిగించాడాయన .స్వాతంత్ర పిపాస విజృంభించింది .అన్ని నిషేధాలను ఉల్లంఘించి గోవా నాలుగు చెరగులా ఉన్న గోవన్లు వెల్లువగా ఉద్ధృతప్రవాహంలా దూసుకొచ్చి సభలో పాల్గొని ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పారు .చేసేదేమీలేక ప్రభుత్వం లోహియాను అరెస్టుచేసింది .ఆయనతోపాటు వత్సలా పాండురంగ కీర్తనీ అనే యువతి కూడా ఉపన్యాసం ఇవ్వటానికి ముందుకు రాగా అరెస్ట్ అయింది .పోలీస్ కమాండెంట్ ఫిగారేడో ఆమెను ”ఎందుకు జై హింద్ అని అరిచావు ?”అని అడిగితే ఆమె ”జై హింద్ నినాదం మాలో స్వాతంత్రేచ్ఛ ,దేశభక్తి కలిగించి ధైర్యాన్నిస్తుంది ”అని భయపడకుండా చెప్పింది .ఈమె అరెస్ట్ అయ్యాక 40 మంది మహిళలు ఊరేగింపుగా వెళ్లి జై హింద్ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను చుట్టు ముట్టి వత్సలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతె తమనుకూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు . అత్యంత నాటకీయంగా జరిగిన దీనికి కమాండెంట్ గుక్క తిప్పుకోలేక ఆమెను విడుదల చేశాడు . కానీ ఆమె మాత్రం లాకప్ నుంచి బయటకు రానని భీష్మించింది .అప్పుడు ఆఫీసర్ ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా బయటికి నేట్టేసి ఊపిరి పీల్చుకున్నాడు .
గోవా జాతీయ కాంగ్రెస్ ,గోవా సేవా సంఘం ,గోమంతకీయ తరుణ సంఘం మొదలైన రాజకీయ సంస్థలు గోవాలోని బాలికలను స్త్రీలను పౌరహక్కుల కోసం బా గా ప్రభావితం చేశాయి .వీరందరూకలిసి ఎన్నో ప్రభాత భేరీలు సత్యాగ్రహాలు ,మూడురంగుల జండా ఎగరేయటాలు ,కరపత్రాలు పంచటాలు తో ఉద్యమానికి గొప్ప ఊపు తెచ్చారు . జూన్ 18 ఉద్యమంలో లలితా కాంటక్ ,(లలితామాధవ్ ,వెలింగకార్ )కూడా ముఖ్యపాత్ర పోషించింది . ఆమె మార్ గోవాలో మీటింగులపై నిషేధాన్ని ఎత్తేయాలని రోజూ ప్రభాతభేరి నిర్వహించేది . 1946 జులై 21 న ప్రమీలాబాయ్ జమ్బోల్కర్ ,లలితా కాంటక్ ల ఆధ్వర్యం లో భారత జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం చేస్తూండగా పోలీసులు అడ్డుకొని వాళ్ళ చేతుల్లోని జెండాను బలవంతంగా లాగేసి వాళ్ళనుచితకబాదారు .
పౌరహక్కుల ఉద్యమం లో వీరితో పాటు చేతులు కలిపినమహిళలలో కృష్ణ హెగ్డే ,వితా హెగ్డే ,,కృష్ణ లోతిల్కర్ ,ముక్తా ఖరాపుర్కర్ ,ఉమాబాయి శ్రీరాలి ,ఇందిరా భైసే ,జీవన్ కరపుర్కర్ వంటి త్యాగ-శీల మహిళా మాణిక్యాలెందరో నిరంకుశ సాలాజార్ పోర్చుగీస్ పాలననుండి విముక్తికై అవిశ్రాంతంగా ఉద్యమించి చరితార్ధులయ్యారు .ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారిని ఒకసారి స్మరించి ప్రేరణ పొంది ధన్యులమవుదాం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

—

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణం వన్డే జగద్గురు0

నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి  71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న మామూలు నైవేద్యానికి అదనంగా నైవేద్యం పెట్టాను . సాయంత్రం మా అమ్మాయి భజన ఏర్పాటు చేసింది . సాయి సెంటర్ వాళ్ళందరూ దాదాపు 75 మంది వచ్చి భజనలు చేశారు .అందులో కృష్ణభజనలూ ఉన్నాయి . మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే 9 నిమిషాలు కృష్ణతత్వాన్ని గురించి చెప్పాను .చాలా  బాగుంది  ఇంకా చెబితే బాగుండేది అని చాలామంది ముఖ్యంగా శ్రీమతి లక్ష్మి ,ఉష ,రాధా అడిగారు .సరే నని భోజనాలయ్యాక రాత్రి 9-30 నుండి 9 50దాకా మళ్ళీ హోలిక విశేషాలు చెప్పాను .అందరూ సంతోషంగా ఆనందం తో రాత్రి 10 గంటలకు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . నేను మాట్లాడిన దాని సారాంశం తోపాటు మరికొంత సమాచారం తో దీన్ని ”కృష్ణం వ0దే  జగద్గురుమ్ ”గా అందజేస్తున్నాను .

” రాధనురా ప్రభూ ,నిరపరాధనురా ,అనురాగ భావనారాధన మాగ్న మానసనురా ”’
  ”ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగదోయి  యుష్మదీయ వేణు నాద  రసోదయ  రాగ డోలికలతో  జగమ్ము విస్మయమ్ముగ నిదురించే -కాంక్ష ”మర్రాకయి తేలేరా ప్రభూ ,రమ్ము ఒక్క క్షణమ్మేని  నిదురింతువుగానిరమ్ము  తెరచి యుంచితి నా హృదయ కుటీరమ్ము తలుపు ”అని రాధ ఆనందమయ గాధను కళ్ళకు కట్టించారు కరుణశ్రీ కవి .
  అసలు కృష్ణ అని అనగానే మనముందు నీలమేఘచ్చాయ తో ముగ్ధ మోహన రూపం తో” వ్యస్తష్టపాదం ” తో పెదాలవద్ద వేణువు తలలో నెమలి పించం మెడలో తులసిమాల  ,ప్రక్కన గోమాత ఉన్న నందనందన యదునందనుఁడు గోపాల కృష్ణుని దివ్య మంగళ రూపం కళ్ళ ముందు దర్శనమవుతుంది .ఆ రూపానికి జగత్తు అంతా పరవశించింది . ఆయన దేహచ్చాయ నీలవర్ణం .అనంతమైన ఆకాశం సముద్రం రంగు కూడా నీలమే .కనుక అది అనంతత్వానికి ప్రతీక -సింబల్ .అంతేకాదు అన్ని రంగులూ నీలం లో లయమవుతాయి .నిరాకార పరబ్రహ్మ తత్వానికి అదేప్రత్యేకత ..భాగవత రచన ప్రారంభిస్తూ వ్యాసమహర్షి కృష్ణుడు దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కోసం మాత్రమే అవతరించలేదు -అజ్ఞానం ,విషయం వాంఛలతో ,సుఖ భోగ లాలసత్వం సంసారం లో మునిగితేలేవారికి తనలీలలద్వారా తరించే మార్గం చెప్పటానికి అవతరించాడు అంటే స్మరణ మాత్రం తో మొక్షాన్నిస్తాడని అర్ధం .అంతేకాదు ఇన్ని అవతారాలున్నాయి ఏ అవతర0 లో లేని లీలలు కృష్ణావతారం లో కనిపించి ఆ కృష్ణ లీలలకు సమ్మోహితులమవుతాం మన మనసు శరీరం అంతా ఆయన వశమైపోయే తాదాత్మ్య స్థితి అనుభవిస్తుంటాం .అదీ కృష్ణావతార పరమార్ధం . మేనమామకు  గండం ఉన్న రోహిణీ నక్షత్రం లో  ఆదివారం నాడు అడ్డ కాళ్లతో పుట్టాడు .పుట్టగానే తనను చంపటానికి సిద్ధపడిన ఏడుగురు దాసీలను చంపేశాడు . పూతన చనుబాలుతాగి దాని ప్రాణాలు తోడేశాడు దాని చనుబాలలో ఉన్న విషయాన్ని కూడా తాగేసి ,అంటే పాపాలన్నీ తాగేసి దాని శరీరానికికి పుణ్యమే మిగిల్చాడు పూతన దేహాన్ని తగలబడుతుంటే ”అగరువత్తుల సుగంధం వచ్చిందట . ”పునాతి దేహం పూతన ”అంటే దేహాన్ని పవిత్రం చేసేది అని అర్ధం . ఆమె విషం ఈయనకు అమృతం అయింది అందుకే ఏ పదార్ధమైనా భగవంతుడికి ”అమృతమస్తు ”అంటూ నైవేద్యం చేసి తింటాం అది అమృత స్వరూపంగా మారుతుంది అదే ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం అంటే భోజనం పవిత్ర భోజనం శకటాసుర తృణాసుర ,కాళీయుల ను సంహరించాడు .అహంకారం తో ప్రకృతిపూజను అవహేళన చేసిన ఇంద్రుడికి గోవర్ధనపర్వతం కొనగోటిపై నిలబెట్టి వరుణుడి గర్వాన్ని అణచి గోవులకు గోపాలురకు రక్ష కల్పించాడు . గోపాలకులతో కలిసి చద్దన్నాలు తిన్నాడు . దీన్ని చూసిన నారదుడు ”మహా మునీశ్వరులు కూడా దర్శించలేని కృష్ణపరమాత్మతో ఈ గోపీగోపాలురు హాయిగా ఆటలాడుకొంటున్నారు కలిసి ఎంగిలి కూడు తింటున్నారు వాళ్ళ అదృష్టం యెంత గొప్పదో ”అన్నాడు .పోతన్నగారైతే ఏకంగా కృష్ణుడితో  ఆవకాయ మాగాయ పచ్చళ్ళుతినిపించాడు  దీన్ని చూసిన వ్యాసభగవానుడు కృష్ణుడితో ”కన్నయ్యా  నువ్వుమరీ తెలుగుకృష్ణుడివి అయిపోయావు ”అని అన్నాడని కరుణశ్రీ ”భాగవతః వయజన్తిక”లో సరదాగా రాశారు . ఏ ప్రాంతం వారికీ ఆ ప్రాంతపు కృష్ణుడుగా కనపడటం ఆయన ప్రత్యేకత . ఎంత ఆకర్షణ లేకపోతే భక్తమీరాలాయి సూరదాసు వంటి మహా భక్తులు తమహృదయాలలో ఆయనకు గుడికట్టి పూజించారు .అంతటి ఆకర్షణ ఉన్న అవతార పురుష్ఘుడు లేదు రామావతారం లో రాముడు నీలమేఘ శ్యాముడే .ఆయన మర్యాదా పురుషోత్తముడు .తానూ ఎలా ధర్మాన్ని పాలిస్తూప్రవర్తించాడో జనం అలా నడవాలని ఒక ఆదర్శ మూర్తిగా మార్గదర్శిగా నిలిచాడు కృష్ణుడు ఆచరింపజేశాడు . ధర్మ చ్యుతి కలిగితే నిర్దాక్షిణ్యంగా బంధువైనా సరే సంహరించాడు .అలా సంహరింపబడినవారిలో మేనమామ కంసుడు  మేన బావ శిశుపాలుడు లను చంపాడు .  బావలవరుస అయినసమస్త కౌరవులు అర్జునుంచేత భీమునిచేతసంహరింపజేశాడు .చివరికి ధర్మ భ్రష్ఠులైన యాదవుల ప్రవర్తన సహించలేక యాదవ కులం లో ముసలం (రోకలి )పుట్టించి వారందరి నాశనానికి కారకుడయ్యాడు ఆయన ధర్మ పక్షపాతం అంతటి విశిష్టమైనది అందుకే ”ధర్మ సంస్థాపనార్ధం సంభవాయై యుగే యుగే ”అని అభయమిచ్చాడు . ఇంతటి ఆకర్షణీయ పురుషునికి అంతటి పాగా ద్వేషమా అని అని అని పిస్తుంది అది ధర్మ సంస్థానార్ధమే అని గ్రహించాలి .
  నంద వంశ పురోహితుడు గర్గ మహర్షి నంద బాలుడికి ”కృష్ణ ”అని నామకరణం చేశాడు  .”కృష్ అంటే శాశ్వతత్వం ఉన్నవాడు” ణ ” అంటే చిదానందమైనవాడు అంటే శాశ్వత చిదానంద రూపుడైనవాడు అని అర్ధం .. ఇంకో అర్ధం సర్వాన్ని ఆకర్షించేవాడు .కృష్ -ఆకర్షణీయే.అధవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావరం జంగమం -కృష్ణం ”అని గర్గముని తెలియజేశాడు .ఆయనే ”నామ్నా0 భగవతో నందః కోటీనాం స్మరణేచ యత్ ”అని వివరించాడు స్మరణ మాత్రం చేత తరింపజేసేవాడు .కృష్ణ అంటే సమస్త  సమ్మోహ పరచేవాడు ,ఆకర్షించేవాడు .సకాలానికి ఆత్మా అయినవాడు -ఆయనే ఆదిపురుషుడు . ..కృష్ణంధర్మం సనాతనం ” అంటే కృష్ణుడే  ధర్మం .మనకు రాముడుకాని కృష్ణుడు కానీ వాళ్ళ ధర్మాన్ని ఏదీ కొత్తగా బోధించలేదు సనాతన వైదిక ధర్మాన్నే వాళ్ళమాటలలో చెప్పారు అని మనం తప్పకుండా గ్రహించాలి ..వ్యాసుడు ”నిష్కల్మషులైన గోపా గోపీ జనాలకు ఆయన అతి దగ్గరవాడయ్యాడు ”అన్నాడు  .
  శ్రీ కృష్ణుడు తాను పుట్టిన దగ్గర్నుంచి ప్రతి సందర్భం లో తన పరమేశ్వరతత్వాన్ని ,సర్వ సాక్షిత్వాన్ని ,సర్వజ్ఞత్వాన్ని ,సర్వ కారణత్వాన్ని ప్రదర్శించిన సంపూర్ణ అవతారం .అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అన్నారు .జగద్గురుత్వం అంటే ఎవరు ఎలా పూజిస్తే ,వాళ్ళను ఆ ప్రకారం అనుగ్రహిస్తాడని అర్ధం . ఎవరు ఏ మార్గం లో సేవించినా  ,ఆ దారి తననే చేరుతుంది అని స్పష్టంగా చెప్పాడు .అందుకే అన్ని ధర్మాలను అన్నిమార్గాలను సమన్వయము చేస్తూ ”భగవద్గీత ”అర్జునిద్వారా మనకు బోధించి తన అవుతార తత్వాన్ని తెలియజేశాడు. పూర్ణ కళలతో భగవంతుడు కృష్ణావతారం దాల్చాడు  .
  జరాసంధుడు 18 సార్లు ప్రతిసారీ 23 అక్షౌహిణుల సైన్యం తో మధురపై దాడి చేశాడు . ఆసైన్యాన్ని అంతటినీకృష్ణ బలరాములు ఇద్దరే సంహరించారు .ఒక అక్షౌహిణి అంటే 10 వేల  రథాలు ,20 వేల  గుర్రాలు 40 వేల  కాల్బలం  . అంటే23 x 18=414 అక్షౌహిణుల సైన్యాన్ని బలరామకృష్ణులిద్దరే సంహరించారు .దేనికోసం ధర్మ సంస్థాపనకోసమే . అంటే కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం కృష్ణావతారం …
  స్వామి త్యాగీశానంద గొప్ప వేదాంతి  మహా గొప్ప సన్యాసి . ప్రాక్ పశ్చిమ వేదాంతాలను క్షుణ్ణంగా చదివి లోతులు తరచినవారు .ఆయన కృష్ణుని గురించి చెబుతూ ”The lord of the autumn moon ”శరత్ చంద్ర ప్రభువు అన్నారు అంటే శరత్కాలం పౌర్ణమి వెన్నెల మనోహరంగా హృదయాహ్లాదంగా పరవశంగా ఉంటుంది అలాంటి పున్నమిచంద్రుడు కృష్ణుడు అని అర్ధం . ఆయనే శ్రీ కృష్ణుడు గొప్ప రాజకీయ నిపుణుడు – స్టేట్స్ మన్ అన్నారు ఆయనే ఆయన జగదురుత్వాన్ని గురించి చెబుతూ ”Krishna is the first teacher in the  history of the world to discover and proclaim the grand truth of love for love’s sake    and duty for duty’s sake ”అని గొప్పగా కృష్ణ గురుత్వాన్ని ఆవిష్కరించారు .అందుకే కృష్ణం వ0దే  జగద్గురుమ్ .               గోలోకం
మనలో చాలామందికి భాగవత భారతాలగురించి తెలుసు .కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఒక లోకమే ఉందని తెలియక పోవచ్చు .బ్రహ్మ వైవర్త  పురాణం ”లో శ్రీ కృష్ణ ఖండం ”లో ఆ వివరాలన్నీ ఉన్నాయి .కొద్దిగా ఆ వివరాలు తెలుసుకొందాం .గోలోకం అన్ని లోకాలకంటే పైన ఉన్నది .అందుకనే ఆశీర్వదించేటప్పుడు ”గోలోకే నిత్యనివాస శాశ్వత సిద్ధి రస్తు ”అని దీవిస్తారు .వైకుంఠ లోకానికి 500 మిలియన్ యోజనాల దూరం లో అంటే 4,00000,0000మైళ్ళు .దాని విస్తీర్ణం(ఏరియా ) 30మిలియన్ యోజనాలు అంటే 24,00000,0000 మైళ్ళు .
  గో లోకం లోరాధా కృష్ణులు ఉంటారు . వీరిద్దరితో సహా గోప గోపికల   అందరి వయసు 16 సంవత్సరాలే దీనికి ”కిశోర ప్రాయం ”అంటారు .అదీ ఈలోగా ప్రత్యేకత ..చేతిలో మురళి వక్షస్థలంపై కౌస్తుభ మణి  ధరించి గోప వేషం లో శ్రీ కృష్ణుడు గోపీ జనం తో సదా రాసమండల విహారిగా సర్వ సిద్ధి స్వరూప ,సర్వసిద్ధి ప్రదాత ,ఆదిపురుష అవ్యక్త స్వరూపంగా ఉంటాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది ..రాస లీలలు అంటేవిశృంఖల శృంగారం(రిబాల్డ్రీ  ) కాదు ,అది జీవాత్మపరమాత్మల సంధానమే అని నిరూపిస్తూ ఒక పుస్తకం రాసి అందరి కళ్ళు తెరిపించింది  అనీబిసెంట్  .  శ్రీ కృష్ణుని కుడి భాగం నుండి సత్వ ,రజస్ ,తమో గుణాలు  వాటి నుంచి అహంకారం ,పంచభూతాలు ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి. తరువాతా నారాయణుడు   జన్మించాడు .ఆయన ఎడమభాగం నుంచి లక్ష్మీదేవి పుట్టి భార్య అయింది ..కృష్ణుని ఎడమభాగం నుంచి ”సదాశివుడు ”అయిదు ముఖాలతో దిక్కులే వస్త్రాలుగా (దిగంబరం )సకల సిద్ధేశ్వరునిగా ,గురువుకే గురువుగా ఉద్భవించాడు ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు ..నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ కమండలం ,జపమాలతో పుట్టి  జీవుల ప్రాణదాత అయ్యాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ” ఈయన ఎడమభాగం నుంచి ”మూర్తి ”పుట్టి ఆయన భార్య అయింది ..కృష్ణుని ముఖం నుంచి వీణా,పుస్తక ధారని సరస్వతి షోడశ వర్ష కన్యగా జన్మించి బ్రహ్మ భార్య అయింది .మనసునుంచి మహా లక్ష్మి  బుద్ధినుంచి ”మూలప్రకృతి -ఈశ్వరి ”జన్మించి వెయ్యి భుజాలతో దుర్గతి నాశిని దుర్గగా భాసించింది .ఈమె సర్వ శక్తులకు మూలం శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .
  శ్రీ కృష్ణుని నాలుక చివర వేదమాత గాయత్రి జన్మించింది .మనసునుంచి మన్మధుడు ,అతని ఎడమభాగం నుంచి రతీదేవి పుట్టి భార్య అయింది .శ్రీ కృష్ణ వామభాగం నుంచి రాధ జన్మించింది .ఈమె కిశోర వయస్క .కృష్ణుని రోమాలనుంచి గోపాలుడు రాధ రోమాలనుంచి గోపికలు పుట్టారు .కృష్ణుని మనసునుంచి నారదుడు పుట్టి పుట్టగానే నారం అంటే నీటిని ఇచ్చాడు నారం అంటే జ్ఞానం కూడా .జ్ఞానప్రదాత నారదుడు ..బ్రహ్మ కంఠం నుంచి ”నరదులు ”అంటే మానవులు పుట్టారు .ఈ విధం గా అఖిల ప్రపంచాన్నీ సృష్టించి పాలించి ,తనలో లయం చేసుకొంటాడు శ్రీ కృష్ణ పర బ్రహ్మ . ఇంతటి అఖండ పరమానంద స్వరూపమైన శ్రీ కృష్ణుని మనసారా పూజించి గుణగానం చేసి ఎందరో మహాత్ములు పునీతులయ్యారు .
   చింతామణి అనే వేశ్య వలయం లో చిక్కిన బిల్వ మంగళుడు చివరికి తన తప్పు తెలుసుకొని సన్యాసియై ”లీలా శుక” నామం ;;తో ”శ్రీ కృష్ణ కర్ణామృతం ”రాసి ధన్యుడయ్యాడు .మనకు పరిచయమైన”కస్తూరీ తిలకం లలాట ఫలకె ”శ్లోకం అందులోనిదే .ఆయనే తిరువనంతపురం (త్రివేండ్రం )లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం పొంది మొదటగా పూజించిన పుణ్యశాలి ,అనంత పద్మనాభునిలో త్రిమూర్త్యాత్మకం రూపం మూడు తెరలనుండి దర్శిస్తాం . శ్రీ కృష్ణుడు ద్వారక మునిగిపోయేటప్పుడు సోమనాధ్ లో ఒక అడవిలో నేలపై పడుకోగా ఆయన కాళ్ళను లేడికళ్ళు అని భ్రమించిన వేటగాడిబాణం తో ప్రాణాలు విడిచాడు . ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి .కృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి తన రూపాన్ని విగ్రహం గా చేసి ,మునిగిపోయే ద్వారకను వదిలి ఎక్కడైకైనా వెళ్ళిపోయి అనువైన చోట ప్రతిష్టించమని చెప్పాడు .ఆయన తిరిగి తిరిగి పరశురాముని సాయం తో శివుని అనుజ్ఞతో కేరళలోని ”గురువాయూర్ ”లో ఆ విగ్రహం ప్రతిష్టించాడు ..ఇది గొప్ప కృష్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడి నారాయణ భట్టు కవి ”నారాణీ యం ”రాశాడు

లీలాశుకుని శ్లోకం తో సమాప్తి చేస్తా –

హి గోపాలక హే  కృపా జలనిధే  హే  సింధు కన్యాపతే -హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే  మాధవ-హే  రామానుజ హే” జగత్రయ గురో ”హే పుండరీకాక్ష మామ్ -హే  గోపీ జననాధ పాలయ పరం జానామి న త్వామ్ పరం ”

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జాతీయ పతాక పిత పింగళి వెంకయ్య

clip
Posted in వార్తా పత్రికలో | Leave a comment

 సంసారంలో రిగమపదనిసలు 

సంసారంలో రిగమపదనిసలు

ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని  భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట  ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ  బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు .  .

 ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని మా అయన పెళ్లయి నాలుగేళ్లయినా ఇంట్లో ఇంతవరకు ఒక్క ”వికెట్ ”కూడా తీయలేదు ”అంది . వెంటనే బాట్స్ మన్ పెళ్ళాం ”నా బాధ ఏం చెప్పుకొను ? ఆటలో సెంచరీలపై సెంచరీలు చేస్తున్నాడు .మూడేళ్లయింది కాపరానికొచ్చి ఎప్పుడూ ”డకౌటే ”నా ఖర్మకాలి అని ముక్కు చీదుకొన్నది . వెంటనే వికెట్ కీపర్ భార్యఅందుకొని ”గ్రౌండ్ లో ఏ బాలూ మిస్ కాకుండా కాచ్ పడతాడు . ఒంట్లో బాల్స్ సంగతి పట్టించుకోడు నేనెవరికీ చెప్పుకోను ”?అంది బొటబొటా కన్నీళ్లు కారుస్తూ . అంపైర్  పెళ్ళాం రంగం లోకి దూకి ”ఫోర్ కి ,సిక్స్ కి వైడ్ కి  అవుట్ కి చేతులు చాపే  మాఆయన మంచం మీద మాత్రం చేతులు  చెప్పనే  చాపడు .ఇంకపిల్లలేం పుడతారు మామ్మా “‘అంది గోడు గోడు మంటూ .

  ఆటగాళ్ల పెళ్ళాల వంతు అయ్యాక వాద్య  కారుల  భార్యలు బాధా ఆరోణ అవరోహణాలు మొదలుపెట్టారు .ముందుగా  తబలా ఆయన భార్య ”సంగీతం అంటే పరిగెత్తుతాడు .మృదంగం రెండు కాళ్ళమధ్యా పెట్టుకొని ఎడా పెడా వాయిస్తూ, పాడేవాడికి చక్కని సహకారం అందిస్తాడు మాఆయన .కానీ సంసారం లో నేను సహకరిస్తున్నా దులభరిస్తూ  దూరం జరుగుతాడు .ఇక వాయింపుకేం నోచుకోను ”అని గోడుగోడుమంది . వయోలిన్ కళాకారుడి భార్య ”బామ్మా !తీగలు మీటటం లో ఉన్న ఆనందాన్ని తనువు  తీగ మీటటం లో చూపించటం లేదు .ఇక శ్రుతికలీసే దెప్పుడు  సంతానం కలిగేదేప్పుడే బామ్మో బామ్మ ”అని కన్నీరు కార్చింది . వెంటనే గాప్ లేకుండా వీణ ఆయన పెళ్ళాం అందుకొని ”కిందోబుర్ర ,పైనో బుర్రా ఉన్న తీగలపై టింగ్ టింగ్ మని గోళ్ళతో మీటు  తాడేకాని రెండు బుర్రలూ పక్కపక్కనే ఉన్నా తాకనైనా తాకేదే బామ్మా ఇక మీటుడు  సంగతే0 చెప్పను  .చెప్పుకొంటే సిగ్గుచేటు ”అని కన్నీరొలికించింది . .తర్వాత విరామం లేకుండా ఘటం –సారీ  ,సారీ  ఘటం వాయించే ఆయన పెళ్ళాం ”ప్రాణం లేని మట్టి కుండఒళ్ళో పెట్టుకొని .తలకాయ అటూ ఇటూ తిప్పుతూ సంగీతానికి తగినట్లు వాయించే మా ఆయన ,కళ్లెదుట సజీవ  బాండాలున్నా తకధిమి తో0 అనటంలేదు మామ్మో ”అన్నది .
  ”ఒసే పిల్లల్లారా !మీ బాధ విన్నాను .గుండె కరిగి పోతోందే .. నేను ఒక సలహా చెబుతా .పట్టు వదలకుండా సాధన చేయాలి ”అన్నది బామ్మ బాలమ్మ . ”చెప్పు బామ్మా -తూచా తప్పకుండా పాటిస్తాం ”అన్నారు అందరూ ఏక కంఠం తో .అయితే వినండి ”మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ మొగుళ్ళు చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు .మీరూ ఇంకా మంచి వాళ్ళుగానే అనిపించారు .కానీ ఒత్తి వాజమ్మలు అనిపించింది నాకు . ఆట అవతలివాడు మొదలు పెట్టక పోతే మనమే ముందు మొదలు పెట్టాలి అంతే  కానీ నంగ నాచి  తుంగ బుర్రల్లాగా ఉంటె ఫలితం ఉండదు ”అన్నది . అప్పుడు అందులో ఒకావిడ ”బామ్మా !ఇందులో నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటె చెప్పు .ప్రాక్టికల్ ఫిలాసఫీ మంచిదికదా ”అంది .దానికి బామ్మ ”నిజమేనర్రా .నేనే దీనికి ఉదాహరణ .మీభాషలోరోల్ మోడల్ అనుకోండి . మా ఆయన కుస్తీ ఫహిల్వాన్ .ఎప్పుడు ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వెళ్లి పోయేవాడు అక్కడే తయారు తిండి తిని పోటీలో పాల్గొని గెలిఛీ ఓడీ వస్తూ ఇంటికొచ్చి గుర్రుపెట్టేవాడు .రెండేళ్లు ఓపికపట్టా . ఒక రోజు అనుకోకుండా మా బామ్మ వచ్చింది .ఆవిడ దగ్గర మీలాగానే నా బతుకు వెళ్ళ  బోసుకొన్నా .ఆవిడ తేలిగ్గా తీసుకొని ఉపాయం చెప్పింది .దాన్ని బెసగ కుండా  మా ఆయనపై ప్రయోగించా .ఏడాది తిరిగేటప్పటికీ కోడి రామమూర్తిలాంటి కొడుకు పుట్టాడు .ఆ కిటుకే ఇప్పుడు మీకు చెబుతా విని ఆచరించండి . మీ మొగుళ్ళు అటాక్ ఇవ్వకపోతే మీరే అడ్వాంస్ అవ్వాలి .నయానా భయానా కాలం దాటి పోయింది .ఇక వీర విజృంభణమే చెయ్యాలి మీరు . ఇంట్లో విజయం లేకపోతె బయటి విజయానికి సహకరించమని భీష్మించండి బెసఁగఁ నీయకండి . ఉడుం పట్టుపట్టండి . అనుకొన్నది సాధించండి మొహమాట పడద్దు . వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపారేయండి . ముందుకు దూకండి .ఆతర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు బోలెడు సినిమా సీరియళ్ల అనుభవాలున్నమీరు ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డలతో నాకు కనబడాలి .ఈ లోపు మీ మొహాలు కూడా నేను చూడను ”అన్నది .అందరికి బల్బ్ వెలిగింది .దూకుడుగా ఇళ్లకు వెళ్లిపోయారు బామ్మకు తాంక్స్ చెప్పి .
  సరిగ్గా ఏడాదికి మళ్ళీ వాళ్లంతా  చంకలో  పిల్లనో ,పిల్లాడినో ఎత్తుకొని బామ్మ తో సమావేశమయ్యారు .అందరి ముఖాలలో నవ్వు వరదలై ప్రవహిస్తోంది .అందరూ ముక్త కంఠం తో ”బామ్మా !నీకు  థాంక్స్ . నువ్వు చెప్పినట్లే చేసి పిల్లల్ని సాధించాం ”అన్నారుఆనందంగా . ‘ఒసే బానే ఉంది కానీ పిల్లలకు ఏం పేరు పెట్టారే ”అని అడిగింది .వాళ్ళు బామ్మ పేరుమీదుగా ఆడపిల్లకు బాలమ్మ అని మగపిల్లాడికి బాలయ్య అని పేరు పెట్టినట్లు ఉత్సాహంగా చెప్పారు  .పాపం ఇప్పుడు బాలమ్మబామ్మ కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు  కారిపోయాయి .ఇందరు మనవాళ్ళు మనవరాండ్రను చూసే సరికి . వాళ్లందరికీ మర్నాడు భర్తలతో సహా తన ఇంట భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నిండా తినిపించారు బాలమ్మ దంపతులు. పిల్లలందరికీ కొత్త చొక్కాలాగు లంగా లు కొని వాళ్లకు ఇచ్చి తొడిగించారు .  . వీళ్ళు ఊరుకుంటారా అందరూ ఆ దంపతులకు తమ శక్తికొద్దీ కొత్తబట్టలు పెట్టి ఆశీర్వాదం పొందారు
   శ్రీ కృష్ణాష్టమి, భారత 71 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభా కాంక్షలతో .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా . 

— Image result for krishnam vande jagadgurum sri krishnaPakistan hoists biggest flag on border with India to mark independence day

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారత స్వాతంతత్య్ర దినోత్సవం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

50+ Adorable India Independence Day 2017 Wish Pictures And Images


Happy sri krishnashtami 2016 wishes in telugu latest whatsapp messages, greetings, below 10 MBGokulashtami
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోతుకూచికి నివాళి

clip

—

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -20(-7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు

-కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది .

-7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే ఉన్నాం . మా జీవితం లో ఇంత లాంగెస్ట్ మామిడి సీజన్ ఇదే . మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో పండ్లు కనబడటం ఆలస్యం కొని తెచ్చి తినిపిస్తోంది ..గీర్వాణం -3 లో 394 వరకు రాశా ..ఇవాళ శ్రావణ పౌర్ణమి జంధ్యాలపౌర్ణమి .నూతన యజ్నోపవీతం  ధరించాను

మంగళవారం -..మచిలీపట్నం హిందూకాలెజ్ హిస్టరీ హెడ్ శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆధునిక ప్రపంచానిర్మాతలు కు ముందుమాట రాయమని కోరగా వెంటనే అంగీకరించటం వారికి ఫైల్ ను ఫార్వార్డ్ చేయటం జరిగిపోయింది అవధాన సరస్వతి .శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి గీర్వాణం -3 కు ముందుమాటరాయమని  మెయిల్ పెట్టిన వెంటనే జవాబు ఇస్తూ తప్పక రాస్తానని తెలియజేశారు . వారు ఆగస్టు 27 అమెరికావచ్చి సెప్టెంబర్ 27 మళ్ళీ ఇండియా చేరుతారు . కనుక ఆతర్వాత ఆపని చేస్తానంటే సరే అన్నాను .
  91 ఏళ్ళ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు మరణించిన వార్త చూశాను .ఆయన ఆంద్ర పత్రిక లేక ప్రభ వీక్లీ లో సీరియల్ గా  రాసిన ”ఏడు రోజుల మజిలీ ”నవల బాగా నచ్చింది .10 ఏళ్ళక్రితం ఒకసారి ఆయనకు ఫోన్ చేసి హైదరాబాద్ లో వారింటికి వెళ్లి ఒక అరగంట సేపు మాట్లాడాను .మంచి సంభాషణా చతురులు ఆయన .ఒక మాసపత్రిక కూడా నడిపేవారు .
 బుధవారం -గీర్వాణం -3 ను 410 వరకు లాగించా .
  గురువారం -”కస్తూరిసేవా పరిమళ వ్యాప్తి ”రెండుభాగాలు రాశా .ఇంద్రజ ,నారా రోహిత్ ,లవకుశ నాగరాజు ల ఇంటర్వ్యూలు చూశా .నాగరాజు తన స్నేహితుడు హైదరాబాద్ ఝాన్సినగర్ లో కట్టించిన శ్రీ షిరిడీ సాయిబాబామందిరం లో భార్యతో  సేవలో  ఉంటున్నాడట .ఇంద్రజ కూ  ఇద్దరుబాబాలు పూజనీయులేట .”గొట్టం” లో  నారా నటించిన రౌడీ ఫెలో చూశా కొల్లేరు సరస్సు ,ఆక్రమణపై కథ  బాగా చేశాడనిపించింది .
11-8-17 శుక్రవారం -వెంకయ్య 15 వ ఉపరాష్ట్ర పతిగా ప్రమాణ స్వికారం   చేశాడు .అఖిల భారతీయవిద్యార్థి పరిషత్ లో క్రియా శీలకం గా  పని చేసినవాడు అత్యున్నత పదవిని అలంకరించటం మనకు గర్వకారణం . అత్యున్నత పదవులలో ఈనాడున్న అత్యంత సామాన్యులు ప్రధాని మోడీ  ,రాష్ట్రపతి కోవింద్ ,ఉపరాష్ట్రపతి ఉషాపతి వెంకయ్య . స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కూడా కలిపితే బిజె పి నాయకులు నలుగురు అత్యున్నత పీఠాలపై ఉండటం ఆపార్టీకి గర్వకారణం  మోడీ ,షా ల చాకచక్యం .చాణక్యం
  సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ కోట గురుదేవుల గురు పూజోత్సవ కార్యక్రమం తయారు చేసిపంపాను. కస్తూరి 3,4 రాశా .
                 అరంగేట్రం
12-8-17 శనివారం – కస్తూరి 5 రాసి ముగించా .
  ఇక్కడ మా కమ్యూనిటీ లోనే ఉన్న గుజరాతీ దంపతులు ప్రేరా ,అనుపమ పటేల్ లకుమార్తె కుమారి త్విషా పటేల్ భరతనాట్యం శ్రీమతి రాధికా ఉన్నితన్ వద్ద నేర్చి ఈ రోజు హాల్టన్  ధియేటర్ లో అరంగేట్రం చేసింది .అందరం వెళ్లాం 4-45 కు బయల్దేరి చూడటానికి  .సరిగ్గా 5గంటలకు ప్రారంభమైనది . షణ్ముఖ ప్రియ రాగం లో గణేశఅంజలి ముందుగా చేసింది .తర్వాత నాటరాగం లో అలరిపు (అలరింపు ),రసాళిరాగం లో జతిస్వరం ,రాగమాలికలో శబ్దం, ధన్యాసిరాగం లో వర్ణం లను కృతులు కీ ర్తనలకు తగినట్లుఒక గంట సేపు  అభినయించింది .
  తర్వాత ఒక 20 నిమిషాలు విశ్రాంతి-అందరికి సమోసా మాంగో జ్యుస్ , టీ  ఇచ్చారు .
  విరామానంతరం  హిందోళ  రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి”మామవతు”  సరస్వతీ దేవీ స్తుతి ,తర్వాత శివ తాండవానికి శివా అంటే పార్వతీదేవి చేసే ”లాస్యం ” చివరగా తిల్లాన కు నాట్యం చేసి , ఆతర్వాత  తండ్రికోసం గుజరాతీ పాటకు, తల్లికోసం హిందీ పాటకు నృత్యాభినయం, చేసి చివరకు నా ట రాగం లో మంగళం లో దేవుడికి గురువుకు ప్రేక్షక దేవుళ్ళకు విన యాంజలి ఘటించి  ఒక గంటలో ముగించింది .గురువు శ్రీమతి రాధికగారు నట్టువాంగం చేస్తూ ప్రోత్సహించింది . హావ భావాలు బాగానే ఉన్నాయి .కానీ ప్రతి అంశం  7లేక 8 నిమిషాలకంటే లేకపోవటం ,ఏదో చేసేసి వెళ్ళిపోదాం అన్నట్లు చేయటం గా నాకు అనిపించింది.  భరతనాట్యం పధ్ధతి ఇంతేనేమో నాకు తెలియదు   తర్వాత అందరికి డిన్నర్ . రోటీ ,రెండునాకుకూరల పులుసులు సువీత్ ,పులిహోర ,బిర్యానీలాంటిది ,అప్పడం .కావాల్సినవాళ్లకు కోకాకోలా .  రోటీ ఒకటిన్నరముక్క స్వీట్ అప్పడం తో లాగించా అంతే .      .
  ఇంతకు ముందు మేము చూసిన కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశమే  నాకు బాగా నచ్చిందేమో అనిపించింది . మనకు నచ్చటం నచ్చకపోవడం అటుంచి ఇంగ్లిష్ లో చదువుతూ ,క్షణం ఖాళీ లేని విద్యా జీవితం గడుపుతూ ఇ0త  ఉత్సాహంగా అంకితభావం తో తమదికాని భాషలో ,తమభాష కాని  గురువువద్ద క్రమశిక్షణతో నృత్యం నేర్వటం ఆ చిన్నారుల పట్టుదల క్రమశిక్షణ ,అకుంఠిత దీక్ష కు జోహార్లు .మన సంస్కృతిని ఇక్కడ ఇంత గొప్పగా ప్రదర్శిస్తూ మన్ననలు అందుకోవటం సామాన్యమైన విషయంకాదు .ఆ పిల్లల తలిదండ్రులకున్న అభిరుచి గురువుపై నమ్మకం , ఎన్నో వేలడాలర్లు ఖర్చుపెట్టి నేర్పించటం ,రంగప్రవేశ అరంగేట్రాలకు కూడా సంకోచంలేకుండా డబ్బు ఖర్చు చేయటం చూస్తుంటే వీరందరికి ఉన్న ఉత్తమాభి రుచికి మనస్ఫూర్తిగా తప్పక అభినందనలు తెలియ జేయాల్సిందే . మేరా  భారత్ మహాన్ .
  13-8-17 ఆదివారం -ప్రొద్దున ,మధ్యాహ్నం ”శంకరాభరణం పాలెస్ ”కిట్టుగాడున్నా డు జాగ్రత్త” యు ట్యూబ్ లో చూశా . సరదాగా ఉన్నాయి . రమణ ఫోన్ చేసి ఉయ్యూరులో సేవింగ్స్ ఏజెంట్  మండా  ప్రసాద్ భార్య శ్రీమతి పావని చనిపోయినట్లు తెలిపాడు.పాపం ఆమె రెండేళ్లనుంచి కేన్సర్ తో బాధ పడుతోంది . వైద్య లోపం ఏమీలేదు .ఖరీదైన వైద్యమే చేయించారు . నేను మార్చి చివర్లో ఆమెకు రీకరింగ్ డిపాజిట్ కట్టాను కూడా ..అలాగే ఈవారం లోనే మా పెద్దకోడలు అమ్మక్కయ్యగారు శ్రీమతి భవానిగారు కూడా చనిపోయినట్లు తెలిసింది  .ఈ ఇద్దరి ఆత్మలకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను . ఆకుటుంబాలకు మా సానుభూతి తెలియ జేస్తున్నాను
  వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్య సంస్కృతం లో కృతులు రాశాడని తెలుసుకొని గీర్వాణం 3 లో 411 వ కవిగా ఇప్పుడే ఆయన గురించి రాశాను.. ఈ వీక్లీ సమాప్తం .
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ  బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత  విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు .సంస్కృతం వ్యాకరణ కావ్య అలంకార ,తర్క పురాణ ,ఇతిహాసాదులను మహారాజా సంస్కృత  కళాశాలలో విడిగా సంగీతం నేర్చుకొంటూనే  అభ్యసించాడు . మహారాజూ అందజేసిన పారితోషికం తో ప్రసిధ్ధ సంగీత విద్వా0సుడు పట్నం సుబ్రహ్మణ్య పిళ్ళై దగ్గర ,కావేరి డెల్టా లోని అనేక ప్రసిద్ధ సంగీత విద్వా 0సులవద్ద సంగీతపు లోతులు తరచి తెలుసుకొన్నాడు  .

 వాసుదేవాచార్య సంగీత విద్వత్తుని గుర్తించిన మహారాజు ఆస్థాన సంగీత విద్వా0సుని చేసి గౌరవించాడు . గురువు వద్ద నేర్చిన మాధ్యమకాల తానం లో మహా నిష్ణాతుడయ్యాడు .గురువు పట్నం ,శిష్యుడు మైసూర్ ను కీర్తనల రచనల విషయం లో  సలహాలు తీసుకునేవాడు. ఇది శిష్యుడికి బాగా ఉపయోగపడి వాగ్గేయకారుడవటానికి తోడ్పడింది . వాసుదేవాచార్య కర్ణాటక సంగీతం లోని రాగం ,తానం ,ఆలాపన ,పల్లవి  ,కల్పనస్వరాలలో సాటిలేనివాడయ్యాడు

 వాసుదేవాచార్య తాను  రచించిన సంస్కృత ,తెలుగు కృతులు 200 లను ‘’వాసుదేవ కృతి మంజరి ‘’గా ప్రచురించాడు .ఈ రెండుభాషలలో ఆయనరాసినవి సుమధురంగా  భాషా పరిజ్ఞానంతో భాసిస్తాయి .తెలుగు  హృదయం లోకి ప్రవేశించటం త్యాగరాజ గురు భిక్ష అని వినయంగా చెప్పుకొనేవాడు .ఇతర దాస కూట ద్వైత గీతాలలాగా కాకుండా ఈయన గీతాలు  ‘’పరమపురుష వాసుదేవ ‘’లేక ‘’వాసు దేవ’’అనే విష్ణు నామం తో విరాజిల్లటం విశేషం . అదే ఆయన ‘’ముద్ర ‘’కూడా .త్యాగరాజ శిష్యపరంపర లోని వారిలాగే ఈయనా శ్రీ రామునిపైనే ఎక్కువ కృతులు ,కీర్తనలు  రాశాడు.వర్ణాలు ,తిల్లాన శ్లోకాలు కూడా రాశాడు .కర్ణాటక సంగీత త్రిమూర్తులలో అద్వితీయుడైన త్యాగ బ్రహ్మం గారిని కళ్యాణిరాగ కీర్తనలో ‘’శ్రీ మదాది త్యాగరాజ గురువారం ‘’అంటూ స్తుతించాడు .ఒక రాగమాలికలో శ్రీరామ చంద్రుని మరి రెండు రాగమాలికలో ముత్తుస్వామి దీక్షితులు ,శ్యామశాస్త్రి ని కీర్తించాడు .వాసుదేవాచార్య కృతులు చక్కర పాకం లాగా మధు మధురంగా ఉండటం విశేషం .

 కన్నడం లో తన జీవిత చరిత్ర ‘’నేనపు గలు ‘’(జ్జ్ఞాపకాలు )పుస్తకం ,తనకు తెలిసిన సంగీత విద్వా 0సుల జీవిత చరిత్రలను ‘’నా కంద కలవిదరు ‘’గ్రంథం గా రాశాడు .వృద్ధాప్యం పైనబడినా శ్రీమతి రుక్మిణీదేవి అభ్యర్థనపై ఆమె కళాక్షేత్రం లో ముఖ్య సంగీత విద్వా 0సుడిగా సంగీతం బోధించాడు .సంస్కృత రామాయణానికి సంగీతం కూర్చాడు. ఆయన మరణం తర్వాత మనవడు రాజారామ్ బాధ్యతలు తీసుకొని తాతగారు మొదటినాలుగుకాండలకు సంగీతం కూర్చితే మిగిలినవాటికి సమకూర్చాడు . మరోమనవడు కృష్ణ మూర్తి ఆకాశవాణిలో పనిచేస్తూ తాతగారు రాసిన స్మృతులను ఆంగ్లం లోకి అనువదించాడు . వాసుదేవాచార్య  సంగీత విద్వత్తుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందించి గౌరవించింది . కమాస్ రాగం లో ‘’బ్రోచే వారెవరురా ‘’,సునాద వినోదిని రాగం లో ‘’’దేవాధిదేవ ‘’,హిందోళం లో ’మామవతు సరస్వతీ’’,అభేరీరాగం లో ‘’భజరే రే మానస ‘’అనే ఆయన కృతులు  ఆనంద పులకితు లను చేస్తాయి  .ఆయన భాషా పాండిత్యానికి కైమోడ్పులు సమర్పించేట్లు చేస్తాయి .  96 ఏళ్ళ నిండు జీవనం గడిపిన ఆ సంగీత సాహిత్య సరస్వతి మైసూర్ వసుదేవాచార్య 17-5-1961న తానునమ్మిన వాసుదేవ పదం చేరుకొన్నాడు .

సంస్కృతం లో మైసూర్ వాసుదేవాచార్య కీర్తన సొబగులు చూద్దాం –

1-గంభీర నాట రాగం లో -’’గిరిజా రమణా నటరాజ న శరణ -కరుణారస పూర్ణ స్మరహర నాగాభరణా-

పరవాసుదేవ రధనా ధురీణ కార ధృత హరిణా కలిమల హరణా -మహా పంచాక్షరీ మంత్ర మూర్తే మహాభక్త కౌంతేయ నుత కీర్తే

మహాగణపతి గుహ సేవిత మూర్తే -మహాదేవ  పరిహృత దీనజన ఆర్తే -మహానంది భృంగాది నాట్య ప్రదర్శక కైలాసపతే ‘’.

2-అభేరీరాగం లో -’’గోకుల నిలయ ‘’

3-హిందోళయం లో -’’మామవతు సరస్వతీ ‘’

4-గౌరీమనోహరిరాగం లో -’’వరలక్ష్మి నమోస్తుతే ‘’

5-బిళహరి రాగం లో -శ్రీ చాముండేశ్వరి

6-గరుడ ధ్వని రాగం లో -దేవి కమలాలయే   మొదలైనవి .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— mysore vasudevacharya 1865 1961 mysore vasudevacharya was a great ...

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూరి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా దూసుకు  వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గర దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్తలు విని అందులోని ముఖ్య విషయాలను కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు . అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్ వచ్చాడు .ఈవార్తను చదివే అనౌన్సర్ ‘’శ్రోతృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని తప్పుగా చదివాడు …దీనికి కస్తూరి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942 ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్  బులెటిన్ కస్తూరి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్ వార్త.వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రాడికిచ్చి స్టేషన్  కు పంపాడు . ఈ వార్తలు విన్న జనం అప్పటికే బజార్లలోకి వచ్చి ముర్దాబాద్  నినాదాలు  ఇచ్చారు .కంగారుపడ్డాడు కస్తూరి . తాను  విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం తో ఊపిరిపీల్చుకున్నాడు  .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది .

  వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు పట్టుకోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన స్వార్ధమూ ఉంది .కస్తూరితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసేవాడు ..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తుంటే అరిస్టోక్రాట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డాడు కూడా …దసరా ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దుష్టంగా సిద్ధం చేశాడు కస్తూరి .   నాలుగు రోజుల ప్రసార0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తిడి చేశాడు .తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూరి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్ స్వామి కస్తూరిస్థానం లో మరొకరిని నియమిస్తున్నానని చెప్పాడు .ఇలా   అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రోతల నుండి అనూహ్యమైన మద్దతు కస్తూరికి లభించింది . దీన్ని ఓర్వలేక పోయాడు డైరెక్టర్ ..కోపం తీరక మలేరియా విస్తృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్ కాలేజీకి కస్తూరి ని తన్నాడు ..ఆ ప్రాంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా  ఇస్తారు .

 కస్తూరి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం.  విపరీతమైన వర్షాలు పడతాయి .రుతుపవన వర్షాలతో కావేరితుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తాయి .కొండలన్నీ పచ్చ తివాచీ పరచినట్లు ఆహ్లాదంగా కనిపిస్తాయి . నిప్పు సెగలవద్ద ప్రజలు  వెచ్చ దనాన్ని అనుభవిస్తారు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా  కర్ణాటక సంఘ కన్వీనర్ విష్ణుభట్ ,కస్తూరి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తులై షిల్లాంగ్ లో ఇది వరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షాగమ మహోత్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ తేదీని కర్ణాటక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది .అదీ వర్షం లోనూ  మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూరి పరిమళం .

 మరో విషయం లోనూ కస్తూరి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రాం టు )నాటకాల పోటీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు  కోసం నిర్వహించాలని ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి అందులో ఏదో ఒకదానిపై  తయారవటానికి  ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తారు ..గ్రామీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూరి దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం ఉరకలు వేసి పాల్గొని బహుమతులు పొందారు . మరొక పోటీ ‘’జోక్ క్రాకర్స్ డే ‘’’(నవ్వుల టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూరి ‘’హాస్య చటాకి ‘’అనే చక్కనిఅర్ధవంతమైన  కన్నడ పేరు పెట్టాడు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద0 అనుభవించాలని కస్తూరి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య కదంబానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రొఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి ,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్లతో జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్దం తో పేలి ,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తులు ,రిపార్టీల ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది .. ఇది కర్ణాటక అంతా పాకి మెట్రోలలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపోయింది .కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రారంభించింది .కస్తూరిహాస్య  ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూరి  బెంగుళూర్ లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్  సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ  ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు బోధించాడు .మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి ,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూరి ..

 సమాప్తం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా



—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో 14-8-17  సోమవారం రాత్రి 7 గంటలకు సరసభారతి ఆధ్వర్యం లో బాలబాలికలకు శ్రీ కృష్ణ ,రాధా ,గోపిక వేష ధారణపోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయబడును . ఉత్సాహ వంతులైన తలిదండ్రులను తమ పిల్లలను దీనిలో పాల్గొనేట్లు చేయవలసినదిగా కోరుతున్నాము . కార్యక్రమాన్ని సరసభారతి కోశాధికారి శ్రీ గబ్బిట వెంకటరమణ ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,అర్చకస్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ నిర్వహిస్తారు .
                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       మరియు ఆలయ ధర్మకర్త

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూరి  మిత్రుడు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణాటక పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్తలుగా తీసుకొన్నారు .అందులో ఒకడు బ్రాహ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పోగొట్టటానికి కస్తూరి అతనిని ముందుగా అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె నిండుగా హరిభక్తి తో చేస్తున్న రామభజన చూసి ఆశ్చర్యపోయాడు .వారికి  హిందూ ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్లవెంట ఆనంద బాష్పవాలు ధారాపాతంగా కారిపోయాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి హరిజనవాడలో నే కస్తూరి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రాహ్మణ కుర్రాడు ఆనందంగా వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూరితో ‘’సార్ !ఈ చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞతగా ..

 గ్రామీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూరి తనబృందం తో యూనియన్ తరఫున ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రోగ్రామ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రామం లో లో నిర్వహించాడు .బస్సులో   ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్దరు ముగ్గురుకలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్లి మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు  ఉత్తమ వ్యక్తుల జీవిత గాథలు గ్రామం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్ హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం  రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రాంగిల్ మొదలైనవి చూపించేవారు .ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూరి బృందం వారికి ఆత్మీయ మిత్రులు సోదరులైపోయారు .వార0దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదే .. ఇన్ని పనుల్లో మునిగిఉన్నా కస్తూరికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది . ,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం  గాలికొట్టిన ఫుట్ బాల్  తాను అని అనుకునేవాడు  .

 యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లుకన్నడం లో  రాసేవాడు కస్తూరి . మాండ్యా  కు చెందిన యువకుడొకడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టాలుతప్పినా, పొగ వదులుకొంటూ ముందుకు కదిలే బొమ్మ వేయించి ,పుస్తకం లోపలి తనభావాలు’’ pricking bubbles ,pulling legs ,drawing carpets ,from under feet ,minimising mountains into mole-hills ,holding mirrors to the face ,explosing clay feet ,buldozing castles built in the air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూరి .. కస్తూరిరాసిన కన్నడ పుస్తకాలు ‘’అల్లోలకల్లోల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు గాలిగోపురం ,శ0ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్ ,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్ లో పాతమాటలకు కొత్తపదాలు సమకాలీనమైన సరికొత్తపదాల సృష్టి ,పాత సామెతలకు కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సోషల్ ఆంత్రోపాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను మోనోగ్రాఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణాటక ‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూరి పరిశోధక సృజన పరిమళం వ్యాపించింది ..

‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు   డా.శివరాం అనే హాస్య రచయిత పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సోది చెప్పే అమ్మాయి అని అర్ధం . కస్తూరిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు . అంగీకరించి కస్తూరి  10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి గిలిగింతలు పెట్టాడు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు ‘’కస్తూరి ‘’గుబాళింపు తో ఉండేవి.  .కస్తూరి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక మొదలైన  ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె  లక్ష్మణ్  కార్టూన్లు గీసేవాడు .నాదిగ్ అనే మరో కార్టూనిస్ట్ కూడా వేసేవాడు .

 .శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తున్నాడని  దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తున్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధతిలో పంచ్ రాస్తానననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా  కొన్ని పంపగలనని రాశాడు  కస్తూరి . దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గమే నిర్వహిస్తుందని  కనుక అవకాశం ఉండకపోవచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0జి ‘’లో తాను  కన్నడం లో రాసిన ‘’ఊరిగలు ‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్  పోస్టులో పంపాడు.  అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రాటిల్ ‘’(కేవలం తడబాటు )శీర్షికలో కస్తూరి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో  శంకర్ వేసిన కార్టూన్ క్రింద కస్తూరి హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూరి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తుంది ,మురిపిస్తుంది .

  మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూరి చేసే బహువిధ కార్యక్రమాలను దగ్గరగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూరిని ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూరిని ‘’కామెల్  ఆఫ్ ది కాలేజ్ ‘’ (కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూరి మోస్తున్నాడని అర్ధం .ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తినా కాదు అనకుండా మోయటం కస్తూరి ప్రత్యేకత .గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్సిమిటర్  తెచ్చాడు .  ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు రోజుకు ఒకగంటసేపు గ్రామీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూరికి అప్పగించాడు  . ఏ కొత్తదైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూరి గాలిలో కూడా కస్తూరి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి ‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం ఇస్తానని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రాంతాలవారికి  వినే  సౌకర్యం కలిగింది .ఒక రోజు స్టాఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం చెప్పమనిభావం . కస్తూరి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో సహా అందరికీ ఆపదం  నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది కస్తూరి చలువవలన   .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం కస్తూరి  జీవిత చరిత్ర చదివాకే  తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

–              shankar

–   First content item page

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోట మాస్టారి గురుపూజోత్సవం 

కోట మాస్టారి గురుపూజోత్సవం

గురుపుత్రులకు నమస్కారములు -మా గురుదేవులు మీ పితృదేవులు కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవంఉయ్యూరులో  5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మధ్యాహ్నం 3 గం లకు సరసభారతి ,శ్రీ అమరవాణీ తెలుగు ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ పాఠశాల ఆవరణలోముఖ్య అతిధి  శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్   ,లయన్స్  క్లబ్ అధ్యక్షులు సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్ల ఆధ్వర్యం లో జరుగుతుంది . కనుక తాము తమ కుటుంబ సభ్యులతో ఆత్మీయ అతిథులు గా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయప్రార్ధన .

             కార్యక్రమం
1-గురు దేవుల చిత్ర పటానికి పుష్పమాలాంకరణ ,అతిథులు ,గురుపుత్రులచే చిత్రపటానికి పుష్ప సమర్పణ .
 2-. అతిథుల చే గురుపూజోత్సవ ,ఉపాధ్యాయ దినోత్సవ సందేశాలు
 3- .శ్రీ కోట గురుదేవుల ప్రియతమ  శిష్యులు  శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన ”శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలు  సరసభారతి ద్వారా   ప్రదానం
   1- అమరవాణి  పాఠశాలలో  10   వతరగతి చదువుతున్నఎంపిక చేసిన  పేద, ప్రతిభకల   విద్యార్థికి -కీశే .కోట సూర్యనారాయణ శాస్త్రిగారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం
2- శాంతినికేతన్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థినికి  కీశే .కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం .
4-కోట గురుదేవుల పుత్రులు  శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు ,శ్రీకోట  గాయత్రీ ప్రసాద్ గారు, శ్రీకోట సీతారామాంజనేయులుగారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తమ మాతా పితల స్మారక నగదు బహుమతి10 వేల  రూపాయలు  వారి చేతులమీదుగా -ఇంటర్ మీడియట్ చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థి /విద్యార్థిని కి  బహూకరణ .
5–కోట  గురుపుత్రులకు   సత్కారం
6-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం
  1-శ్రీ పి . నాగరాజు- ప్రిన్సిపాల్ అమరవాణి పాఠశాల
   2- శ్రీనాగరాజుగారి సతీమణి -సైన్స్ టీచర్ -అమరవాణి  పాఠశాల
    3 తెలుగు పండితులు  –అమరవాణి పాఠశాల
    4-శ్రీ ఏ .త్రినాథ శర్మ -గణిత ఉపాధ్యాయులు -జిల్లాపరిషత్ పాఠశాల
     5-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి –సాహిత్య సేవ
                                                                 ఇట్లు
                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       పి .నాగరాజు -ప్రిన్సిపాల్ -అమరవాణి పాఠశాల
    వీలును బట్టి మరిన్ని వివరాలతో ఆహ్వానపత్రిక ఆగస్టు 20 నాటికి అందజేయ బడుతుంది
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి  నాడు ఉదయం  9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన శివ గీతాన్ని పాడుతూ తన్మయంగా నృత్యం చేయటం చూశాడు ‘’అని కస్తూరి ఎప్పుడో చదివింది గుర్తుకొచ్చింది .మహా పురుషుల సందర్శనభాగ్యం తో పులకించిపోయారు .ఆయన కస్తూరికి ‘’శ్రీ రామ కృష్ణ మంత్రోపదేశం ‘’చేశాడు .కానీ కొద్దికాలానికే కుదురుగా ఆసనం వేసి జప0  చేయటం  తనవల్ల కాదని గ్రహించాడు .కర్మయోగమే తనకు నచ్చిన పని అనుకొన్నాడు .రామ కృష్ణ పరమహంస దిండుకింద ఎప్పుడూ అష్టావక్ర గీత పుస్తకం ఉండేదనిదాన్ని తీసి వివేకానంద కు ఇచ్చి చదవమని చెప్పేవారని సుబ్రహ్మణ్య అయ్యర్ పాల్ బ్ర0ట న్ కు చెప్పాడట .. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చి ఒకఏడాది పియుసి ,మూడేళ్ళ డిగ్రీ ,రెండేళ్ల మాస్టర్ డిగ్రీ వచ్చింది .దీనివలన కస్తూరిని మైసూర్ యుని వర్సిటీ కి స్కూల్ యాజమాన్యం 1928 జూన్ లో అప్పగించింది .తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కు బదిలీచేసింది . 17  ఏళ్ళు ఎంతో సంతృప్తి జీవితం ఇక్కడ గడిపానని కస్తూరి రాసుకున్నాడు .స్టాఫ్ వాళ్లకు కస్తూరి ఒక  సాహసుడనిపించాడు .అతని ఇన్నోవేషన్ కు ఫ్లాట్ అయ్యారు .

 కస్తూరి స్టాఫ్ మెంబర్లనందర్నీ ఒప్పించి డ్రెస్ ,మాట లపై కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు పరచాడు .అందులో డ్రెస్ విషయం లో నేక్ టై కట్టుకోకూడదని  కోట్ పై గుండీ లను పెట్టుకోకూడదని 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్ణయించుకొన్నారు ..ప్రతిసోమవారం ఆరంజ్ తినాలి .అవతలివారితో కన్నడం లో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదం ఉచ్చరిస్తే మాటకు ఒక పైసా ఫైన్ కట్టాలి .కన్నడ భాష వాడకాన్ని వేగంగా పెంచే చర్యలు తీసుకొన్నారు కస్తూరి బృందం .షెల్లీ కవి రాసిన ‘’డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ ‘’,కార్లైల్ ‘’ఆన్ హిస్టరీ ‘’రస్సెల్ ‘’ఫ్రీమాన్స్ వర్షిప్ ‘’మొదలైనవి కన్నడం లోకి అనువదించారు .పిక్నిక్ లకు వెళ్ళినప్పుడు ,లేక భోజనాళత్రవాత్ వీటిని చదివి వినిపించేవారు .అందరూకలిసి ‘’యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ‘’ఏర్పరచి కస్తూరిని సెక్రెటరీ చేశారు

  .’’ఎక్స్టెన్షన్ లెక్చర్ వీక్స్ ‘’ను జరపాలని నిర్ణయించి దూరపు పట్టణాలలో ఉన్న లైబ్రరీ సొసైటీలద్వారా ప్రచారం ప్రారంభించారు .దీనిలో మంచి ప్రోత్సాహంకలిగి చాలా వేగంగా అనుకొన్నది సాధించగలిగారు .సామాన్యమానవునికి సమాచారం అందించాలని ,ప్రభావితం చేయాలని వీళ్ళ సంకల్పం .కాలేజీలో సోషల్ ఆంత్రోపాలజీ బోధిస్తున్న కస్తూరి వివాహ పద్ధతులు ,కులాలు ,అవినీతి ,నేరాలు ఘోరాలు ,దెయ్యాలపై నమ్మకం , అంత్యక్రియల ఆర్భాటాలు మొదలైనవాటిపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి మెప్పించాడు హిస్టరీ లెక్చర ర్ కూడా కనుక అశోకుడు అక్బర్ ,చైనా యాత్రికులు ,చైనాలో భారతీయ బౌద్ధ గురువులు భారతీయ సంస్కృతి  చైనా బయట వ్యాప్తి చెందిన విధానం వగైరాలపై ఉపన్యసించి మనసులను గెలిచాడు ..

  ఆ కాలం లో కన్నడిగులు మరాఠా  ,ఉర్దూ ,తెలుగు ,తమిళ రాజుల నవాబుల వారి పాలనలో ఉండేవారు . తమిళుల దాస్టికం ఏక్కువగా ఉండేది .పాలకులను సంబోధించటం లో డాబు దర్పం అతి విధేయత చూపాల్సి వచ్చేది . .నైజాం నవాబ్ తనను ‘’హిజ్ హై నెస్ ‘’అనికాక ‘’హిజ్ ఎక్సాల్టెడ్  హై నెస్ ‘’అని పిలవాలని ,తర్వాత మరింత గౌరవంగా ‘’హిజ్ మెజెస్టి ‘’అనాలని బలవంతం గా అనిపించేవాడు .. దీన్ని వ్యతిరేకించాలనే ఉద్యమం చేబట్టారు కస్తూరి అండ్ పార్టీ అంటే యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ..బానిసత్వ భావనకు వ్యతిరేకత అందరినుంచి వచ్చి సైనికులతోసహా అందరూ దీన్ని ఆహ్వానించారు .

 గ్రామాలలో సంఘాలు కస్తూరిని ఆహ్వానించి రామ కృష్ణ వివేకానందులపైప్రసంగాలు చేయించేవారు .రోవర్స్ క్లబ్ వాళ్ళు ,కోచింగ్ క్లాస్ వాళ్ళు వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో కస్తూరిని వచ్చిమాట్లాడమని కోరేవారు . కస్తూరికి మరొక గొప్ప ఆలోచన ‘’గ్రామ పునరుద్ధరణ ‘’వచ్చి వాలంటీర్లను తయారు చేశాడు .యూనివర్సిటీ యూనియన్ ను ఆషామాషీ గా కాకుండా ఆ క్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూనియన్ ల స్థాయిలో ఒక ఎన్నికైన స్తూడెంట్ సెక్రెటరీ ,,ప్రిన్సిపాల్ నియమించిన స్టాఫ్ సెక్రెటరీ లతో ఏర్పాటు చేశాడు  . లెక్కల లెక్చరర్ టి కృష్ణమూర్తి వయోజన విద్య కార్యక్రమాలు చేసేవాడు .కస్తూరి కొత్తగా విద్య నేర్చుకొనేవారికి ఉపయుక్తంగా కన్నడ ప్రాధమిక విద్యా పుస్తకాలను రాశాడు .వీటిని నగరం లోని చాముండిపుర లో వారికి నేర్పేవాడు . విద్య ద్వారా జాగృతం చేయటానికి ఎన్నిప్రయత్నాలు చేసినా గ్రామీణులను ఆకర్షించటం కష్టం అని గ్రహించి వారికి ఇష్టమైన నాటకం సంగీతం ద్వారా వారికీ దగ్గరవ్వాలని ఆలోచించాడుకస్తూరి . .

 శని ఆదివారాలశెలవులలో కస్తూరి తనకొడుకుతోసహా కొందరు ప్రతిభా సంపన్నులైన విద్యార్ధులతోకలసి గ్రామాలకు వెళ్లి అస్పృశ్యత ,ను భక్త నందనార్  తిరుప్పాణాళ్వార్ చరిత్రతో.మూఢనమ్మకాలను పోగొట్టటానికి మంకాసుర వధ  కథ  ,విద్యాప్రోత్సాహానికి ‘’సాంబు ‘’కథ లను వీధుల్లో నాటకాలుగా ఆడి వారిని చైతన్యం చేశాడూకస్తూరి .ఇవన్నీ పౌరాణిక చారిత్రాత్మక విషయాలు కనుక జానపద నాటక ,గేయాలతో ,సంప్రదాయబద్ధమైన వేష ధారణతో ప్రదర్శించి మనసులను దోచేశాడు కస్తూరి .వీటిలోని సంభాషణలు ముందుగా రాసి పెట్టుకొన్నవికావు సమయం సందర్భాన్నిబట్టి అప్పటికప్పుడు  వేదికమీద అలవోకగా చెప్పినవే .స్పాంటేనిటీ ఉండటం తో బాగా ఆకర్షవంతమైనాయి . అనుకొన్నది సాధించగలిగారు .వీటిలో దేవతలు మునులు అకస్మాత్తుగా రంగం పైకి రావటం పోవటం ,హాస్యం వ్యంగ్యం చెమక్కులూ దట్టించటం తో బాగా పేలాయి .

 ఇంతటితో ఆగితే కస్తూరి గొప్పేముంది .ఆ రోజుల్లో హరికథకు మంచి ఆదరణ ఉండేది . దాన్నీ వదల్లేదు కస్తూరి .మహర్షుల జీవితాలు వారిప్రబోధలు ,పురాణ నాయకులు ,అవతారపురుషుల విషయాలను పాటలు చక్కని మాటలు తో హరికథ గా చెప్పేవాడు కస్తూరి .తన గొంతు సంగీతానికి సహకరించిందని గ్రహించి సంగీతం పాడటానికి కొందరు విద్యార్థులను తయారు చేసివాళ్లతో పాడించేవాడు .వీటన్నిటితో గ్రామీణులను మూవర్స్ అండ్  షేకర్స్ గా  మార్చానకి చెప్పాడూకస్తూరి .బుద్ధ ,రామకృష్ణ పరమహంస ,గీత ,తిరుప్పాణాళ్వార్ ,నందనార్, వివేకానంద ,మీరాబాయి ,అక్కమహాదేవి వేషాలు వేసి వారిపై మాట్లాడి అద్భుత ఛైతన్య స్ఫూర్తి కలిగించాడు  పల్లె టూళ్ల లో ..బెంగుళూరు  దావనాగిరె పట్టణాలలోనూ సిటీ ప్రేక్షకుల మనసు దోచాడు కస్తూరి .కస్తూరి సుగంధానికి పరవశులు కానీ వారెవరుంటారు?వీటి విజయాలకు తనకొడుకుతోసహా తనతోఉన్న సంగీత బృందమే కారణం అంటాడుకస్తూరి .రాజాస్థాన పండితుల వద్ద నుంచి తీసుకొన్న జిగ్ జిగేల్ మనే కాశ్మీ ర్ శాలువా ,యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బహూకరించిన వెండి చిడతలు తో తనవేషం  మహాబాగా  ఆకర్షణీయంగా ఉండేదని పల్లెప్రజలు వీటితో  రంజిల్లి ఫ్లాటై పోయేవారని అంటాడు కస్తూరి .

 ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా అమ్మవార్లకు జంతుబలి నివ్వరాదని అట్టడుగు వర్గాలవారిని సమాజానికి దూరంగా ఉంచరాదని ,అధికసంతానం తో జనాభా  విస్ఫోటనం   కలిగించవద్దని  ,పురాణాలనుండి వేద,ఉపనిషత్తుల నుండి మహాత్ముల జీవితాలనుండి వారి బోధలనుండి విషయసేకరణ చేసి అందరికి మనసులకు నచ్చేవిధంగా చెప్పటం వలన తాను విజయం సాధించగలిగానని కస్తూరిరాశాడు ..యుని వర్సిటీ లెక్చరర్ ఒకరు మొట్టమొదటిసారిగా వీధుల్లో హరికథ చెప్పటం కస్తూరికే సాధ్యమైంది .దీన్ని కొందరు తప్పుపట్టి ఉన్నత విద్య భోధించేవాడు ఇలా బజార్లలో వేషాలేయటమేమిటి పరువు తక్కువ అని ఆక్షేపించారు .ఇదంతా ప్రచారంకోసం మెప్పూ మెహర్బానీ కోసమే అన్నారు .మరికొందరు తనను పల్లెటూరి బైతులన్నారు .చాలామందిమాత్రం హరికథను యూనివర్సిటీ గౌరవ కలిగించాడు కస్తూరి అని హృదయ పూర్వకంగా మెచ్చుకొన్నారు .ఇన్ని రంగాలతో  జన జాగృతి కలిగించి మానవ సేవే  మాధవ సేవగా భావించి చేశాడు కనుకనే కస్తూరి గురించి ఆయన సేవా పరిమళం  గూర్చి  రాయాలనిపించి రాస్తున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే అతడు కొచ్చిన్ స్కాలర్షిప్ ఉంచుకొని యూనివర్సిటీ దాన్ని వదిలేశాడు  ఇది కస్తూరి ఆశలపై నీళ్లు చల్లింది ..త్రివేండ్రం చేరి మహారాజా కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలో చేరి ,సత్రం లో తింటూ సుబ్బయ్యర్ హితోపదేశం పై ఇండియన్ హిస్టరీ ని స్పెషలైజ్ చేసి అక్కడ రామ కృష్ణ వివేకానంద బృందం తో పరిచయమేర్పడి అక్కడి సంస్కృత పండిట్  హిస్టరీ హెడ్ కె వి రంగస్వామి అయ్యంగార్ దృష్టిలో పడ్డాడు .. 1916 లో తానుఉంటున్న త్రిపుత్త రకు త్రివేండ్రం 150 మైళ్ళు 32 గంటల ప్రయాణం అయితే,మద్రాస్ మూడు రె ట్ల దూరం అయినా రైల్ లో 26 గంటలప్రయాణం అనిపించింది ..అదృష్టవశాత్తు మద్రాస్ యూనివర్సిటీ త్రివేండ్రం లో హిస్టరీ ఆనర్స్ కోర్స్ ప్రవేశపెట్టింది .ప్రొఫెసర్ రంగస్వామి క్షణం ఆలస్యం చేయకుండా కస్తూరిని అక్కున చేర్చుకొన్నాడు .ప్రిన్సిపాల్ కస్తూరికి గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్ నెలకు 12 రూపాయలు మూడేళ్లకు మంజూరు చేశాడు . అక్కడే మేనమామ కూడా టీచర్ గా  ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది . ప్రొఫెసర్ గారి ఇంటి లైబ్రరీ కస్తూరికి బాగా ఉపయోగపడింది ..ఇక్కడే బెనర్జీ అనే రామకృష్ణా మిషన్ వ్యక్తితో పరిచయమై ,అందులో సభ్యులను చేర్పించి నిధి సేకరణకు తోడ్పడ్డాడు .. ప్రొఫెసర్ గారి రెండెడ్ల బండిలో ఆయనతోపాటు అనంతపద్మనాభ దర్శనం ,బీచ్ లకు వెళ్ళేవాడు .ప్రొఫెసర్ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు . అది కస్తూరి మనసుపై గొప్ప ప్రభావం చూపింది .ప్రొఫెసర్ స్కోల్లోస్ రినైసెన్స్ ను ,ప్రో సహస్రనామం ట్రాజి, కామెడీలను బోధించారు ..మూడవ ఏడాది టైఫాయిడ్ వచ్చి మేనమామ ఇంట్లో వాళ్లకు భారమే అయినా ఉండాల్సి వచ్చింది . తాత చనిపోగా తల్లి ఇక అక్కడ ఉండలేక పోయింది .ఇప్పుడు తల్లిని కూడా తెచ్చి మేనమామకు మరింత బరువు నెత్తికెత్తాడు .

‘

 21 వ ఏటా హిస్టరీ ఆనర్స్ డిగ్రీ చేతబట్టి తల్లిని పెళ్ళాన్ని పోషించుకోవటానికి త్రివేండ్రం హై స్కూల్ టీచర్ అయ్యాడు . 1919లో కుటుంబం పెట్టాడు . మద్రాస్ ప్రెసిడెన్సీమొత్తం లో  ఆనర్స్ లో రెండవ స్థానం  పొంది ఇక్కడ బతకలేక బడిపంతులయ్యాను అనుకొన్నాడు  .ప్రొఫెసర్ గారు ఐ ఏ ఎస్ పరీక్షలు రాయమన్నాడుకాని ‘’విత్తులు ‘’లేక  లా కాలేజీలో ఉదయం సాయంత్రం క్లాసులకు హాజరై చదివాడు . అదృష్టం తలుపుతట్టి మాస్టర్ ఉద్యోగ జీతం యాభై శాతం పెరిగింది ..అక్కడ దామోదరన్ పొట్టి అనే ‘’డబ్బులావు ‘’  మనిషి పరిచయమై  తానూ సంపాదకుడుగా ఉన్న ‘’పీపుల్స్ ఫ్రెండ్ ‘’పత్రికకు ’’ ఘోస్ట్ రైటర్’’గా ఉండమని కోరాడు ..తనతరఫున తెచ్చే ప్రతిపత్రికకు 15 రూపాయలు ముట్ట చెబుతానని ఆశ చూపించాడు .సరే నని హాస్య వ్యంగ్య రచనలు పంచ్ డైలాగులూ రాసి పత్రికకు వన్నె తెచ్చాడు ..సంఘ వ్యతిరేకులమీద అవినీతిపరులు దేశ ద్రోహులపైనా తీవ్రంగా రాయమని కోరేవాడు ఆ ‘’దేశభక్తపొట్టి  . ‘’అలాగే  రెచ్చి పోయి రాసేవాడు .’’దీనితో వందేమాతర భావం వైరస్ లాగా నాకు సోకింది ‘’అంటాడుకస్తూరి .పొట్టి కోరికపై సేలం ఆయనతో వెళ్లి మహమ్మదాలీ షౌకత్ ఆలీ ల భుజాలపై చేతులు వేసి నడఁడుస్తున్న గాంధీని ,రాజాజీ ఏర్పాటు చేసిన స్వదేశీ ఎక్సి బిషన్ ,చూశాడు .

ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లికి మసూచికం సోకి కోలుకొన్నది .. టీచర్ ఉద్యోగం చేస్తూ లా చదువుతూ ,స్కూల్ లో విద్యార్థుల చేత తాను రాసిన ‘’షాజహాన్ ‘’నాటకం తనదర్శకత్వం లో వేయించటం వంటి సాంఘికకార్య క్రమాలతో గడిపాడు ..లా కాలేజీ లో చదువుతున్నప్పుడే మామగారిమామ గారు ఎప్పుడూ  ‘’లాయర్ కా వద్దు చీట్ చేయద్దు . టీచ్ చేయి  . గురువుజీవితం ఈ లోకం లోను ,పైలోకం లోను హాయిని సంతృప్తిని ఇస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొదపెట్టేవాడు..కనుక దేశం లో చాలా ప్రాంతాలనుండి ఆహ్వానాలు వచ్చినా వదిలేసి మైసూర్ డి బి హెచ్ .హై స్కూల్ లో హిస్టరీ  లెక్చరర్ గా చేరాడు . ఇప్పటివరకు ఎందరెందరిపైనో ఆధారపడ్డాడు కనుక ఇప్పుడు ఎవరికైనా ఆశ్రయం కలిగించాలని అనుకోగానే వాళ్ళ అమ్మ పల్లెటూళ్ళో నీళ్లుకారే రేకుల షెడ్ లో దరిద్ర జీవితం గడుపుతున్న తన అమ్మ అంటే కస్తూరి అమ్మమ్మ ను తమతో ఉంచుకుందామనగానే సరేనన్నాడు ..

 మైసూర్ వెళ్లి ధర్మ భానుమయ్య హై  స్కూల్ కు హెడ్మాస్టర్ ను కలవగానే ఆయనే రెండు చేతులతో నమస్కరిస్తూ ‘’వారుంగొ వారుంగొ ‘’అన్నాడు .మంచి  ఇల్లు తీసుకొని భార్య ,తల్లీ అమ్మమ్మలతో కాపురం పెట్టాడు .హిస్టరీ భోధించేవాడు .అక్కడి గోపాలకృష్ణయ్యర్ ,కృష్ణయ్యర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దారని కస్తూరి కృతజ్ఞతగా చెప్పాడు .ఉదయం అసెంబ్లీలో పా డాల్సిన ‘’ప్రార్ధన జీతం ‘’రాసి పిల్లతో రోజూ పాడించేవాడు .చంద్ర హాస ‘’నాటకం రాసి తాను క్రూర మంత్రిగా నటిస్తూ పిల్లలతో ఇంగ్లిష్ నాటకం వేయించి డైరెక్ట్ చేశాడు .వైస్ ఛాన్సలర్ చూసి చాలామెచ్చాడు .స్తూడెంట్ పార్లమెంట్ ,స్కూల్ మేగజైన్  నిర్వహించాడు ..స్నేహితుడు శంకరరావు తోకలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పిల్లల చదువు వారికివ్వాల్సిన ప్రోత్సాహం గురించి చెప్పేవాడు మైసూర్ లో యుని వర్సిటీకాలేజిలో చేరే విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులను సర్వే  చేశాడు ..కుటుంబం తో చాముండి అమ్మవారి దర్శనం  చేసేవాడు . 1923లోమొదటిపుత్ర సంతానం కలిగింది .స్కూల్ వ్యవస్థాపకుడు మునిసిపల్ ఎన్నికలలో నిలబడి టీచర్లను తనకు ప్రచారం చేయమనటం అసహ్యంగా ఇబ్బందిగా ఉంది  . ప్రచారం కోసం సెలవు ఇమ్మనేవాడు .గదులన్నీ వాళ్ళకే కేటాయించమనేవాడు

 దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకొంటుంటే స్నేహితుడొకడు గాంధేయ వాది  ,మైసూర్ మహారాజా  కాలేజీ లాజిక్ లెక్చరర్ డా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రియశిష్యుడు న్యాయవాద వృత్తి చేబట్టమని సలహా ఇచ్చాడు . అతని తండ్రి మైసూర్ రాష్ట్రం లో 50 గ్రామాలకు గురువు .కాదనలేక 350 మైళ్ళ దూరం లో ఉన్న సిద్దనహళ్లి వెళ్ళాడు  ,తనకు కన్నడం రానందువలన ,సివిల్ ప్రొసీజర్ కోడ్ పాసవనందువలన ఇప్పటిదాకా లా ప్రాక్టీస్  పెట్టలేదు .ఇప్పుడు లాయర్ గా  నమోదు చేయమని కోరాడు ..కానీ ఈగండం నుంచికూడా బయటపడ్డాడు .

 ఒక రోజుడిసెంబరునెల  ఉదయానే శంకరరావు గోపాల మారారు ను వవెంటపెట్టుకొని వచ్చాడు  ఆత ను తన సహాధ్యాయి  రాజా వంశీకుడు . మద్రాస్ లో చదివి డిగ్రీ పొందాడు .సన్యసించి రామకృష్ణా మిషన్ లో చేరి సిద్ధేశ్వరానంద గా వచ్చాడు .బేలూర్ మఠం  ఈయన్ను మైసూర్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేయమని పంపింది ..బెంగుళూర్ లో అందర్నీ అడిగి కస్తూరి గురించి వాకబు చేసి ఇక్కడికి  వచ్చాడు .సిటీ టౌన్ హాల్  లో ఒక సమావేశమేర్పాటు చేసి ఆయనతో ప్రసంగం చేయించాడు .కొన్ని నెలలో  ఆశ్రమం  తగిన వసతులతో  ఏర్పడి వర్ధిల్లింది .కాలేజీ విద్యార్థులకు ,తలిదండ్రులకు పరిచయం చేశాడు .మొదటి విస్తృత సమావేశం లో కస్తూరి ముందుగా కన్నడం లో తర్వాత సిద్దేశ్వ రానంద ఆంగ్ల0 లో అందరికి నచ్చేట్లు మాట్లాడారు . ఎందరో ప్రముఖులు హాజరయ్యారు .

 తర్వాత యువత ను ఆకర్షించే ప్రయత్నం చేశారు .వివేకానంద రోవర్స్ స్కౌట్ ఏర్పరచి ట్రెయినింగ్ ఇచ్చాడుకస్తూరి .నిధి సేకరణ చేశారు .ఒక రోజు అకస్మాత్తుగా దగ్గరున్న స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది .కస్తూరి యువ బృందం వెంటనే రంగ ప్రవేశం చేసి మంటలనార్పి పెద్ద ప్రమాదం తప్పించారు .మిల్లు డైరెక్టర్ తో సహా ఎందరో కస్తూరికి అభినందనలు తెలిపారు .మైసూర్ లో జరిగిన స్టేట్ రాలీ ఆఫ్ స్కౌట్స్ లో కస్తూరి యువజన రోవర్ బృందం పోలి కిట్టి ‘’నాటకం ప్రదర్శించి మహారాజు జయచామరాజ ఒడియార్ మన్నన పొందారు .కస్తూరి రాసి,డైరెక్ట్ చేసిన మరోనాటకం ‘’ది హెడ్ మాస్టర్స్ డాటర్ ‘’కూడా ప్రదర్శించారు . ఈ విధంగా రోవర్స్ క్లబ్ అటు జనానికి ,ఇటు ఆశ్రమానికి రాజకుటుంబాలకు బాగా దగ్గరైంది .గోపాల్ మహారాజ్ ప్రెసిడెంట్ గా కస్తూరి సెక్రటరీగా సేవ లందిస్తున్నారు .కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు .రెగ్యులర్ గా రాని  వారిని గుర్తించి కారణాలను కనుక్కొని కావాల్సిన సదుపాయాలూ కల్పించి వచ్చేట్లు చేస్తున్నారు .కె వి పుట్టప్ప అనే కవి కొన్ని సమావేశాలకు రాలేదని గ్రహించి ఆయన ఉండే చోటును వెతుక్కొని వెళ్లి చూస్తే టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడని గ్రహించి డాక్టర్ ను సంప్రదించి కృష్ణరాజేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు . వారం తర్వాత తగ్గిపోయింది . తాను  ఆశ్రమం లోనే విశ్రాంతి తీసుకొంటానని ఆయన అన్నాడు .పుట్టప్ప భారతీయ సంస్కృతికి  ప్రతినిధి .ఆయనకవిత్వం ఆశ్రమ వాతావరణం లో పుష్పించి వికసించి ఫలించి లబ్ధ ప్రతిష్ఠుతుని చేసింది .సిద్ధేశ్వరానంద మైసూర్ ప్తజల హృదయం లో శాశ్వత స్థానం సంపాదించాడు ..ఇద్దరూకలిసి వైస్ ఛాన్సలర్ వీరాజేంద్రనాధ్ ను గీతపై ప్రసంగించవలసిందిగా కోరగా వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు .యుని వర్సిటీ ,కాలేజీ లలో  సంస్కృత విద్యాలయాలలో ఉన్నసై కాలజి ఫిలాసఫీ ప్రొఫెసర్లు లెక్చరర్లు వచ్చి ఆశ్రమం లో ప్రసంగించి ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కల్గించేవారు .యుని వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్య అయ్యర్ సిద్ధేశ్వరానంద శిష్యుడయ్యాడు .తాను  సెక్రెటరీ గా ఇలాంటి ఉన్నతులమధ్య గడపటం తన అ దృష్టం అన్నాడు కస్తూరి . తూర్పు పడమటి తత్వ శాస్త్ర రహస్యాలు ,ఉపనిషత్ సందేశాలు ,గీతారహస్యాలు ,అద్వైత ద్వైత వాదాలు మానసిక శాస్త్రం అన్నింటిపైనా విలువైన ప్రసంగాలు చేయించాడు కస్తూరి స్వామీజీతోకలిసి .సన్యాసులకు రెండేళ్ల శిక్షణ ప్రారంభించారు .మైసూర్ మహారాజా సుబ్బరామయ్యర్ ను ఘనంగా సన్మానించి ఆశ్రమానికి భూరి ధన సహాయమందించాడు … అనుకొన్న విధంగా సిద్ధేశ్వరానంద కస్తూరి సహాయం తో ఆశ్రమాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చేయగలిగాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

కేరళలో పుట్టి ,మద్రాస్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ0 చేసి ,పుట్టపర్తి చేరి శ్రీ సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్టమొదటి బాబా జీవిత చరిత్రను ఆయన ప్రేరణతోనే రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ  సారధియై  ఆలిండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్టని ఎన్నో సేవా కార్యక్రమ  కస్తూరికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొఫెసర్ నారాయణ కస్తూరి  బహుభాషా కోవిదుడు .

 అందరి చేతా  ఆప్యాయంగా ‘’కస్తూరి ‘’అని పిలువబడే నారాయణ కస్తూరి కేరళలో కస్తూరి రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రుడిగా 25-12-1897న ఉత్తర తిరువాన్కూర్ లో ని త్రిపునిత్తూర లో జన్మించాడు.  పుట్టిన11 వ రోజున తల్లి అర్జునుడు ప్రతిష్టించిన స్థానిక పార్ధసారధి  దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది .ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తుకొని వెళ్లి స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్ ..పెళ్లినాటికి  తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తుగా కొడుకుకు ‘’కస్తూరి రంగనాధ ‘’అని పేరుపెట్టారు .ఇంతవరకు కస్తూరి పేరు ఆ ఇంట ఎవరికీ లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూరి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూరి అని షార్ట్ నేమ్ పెట్టుకొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొట్టు కస్తూరితో పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తుంది .అలాగే ఈ కస్తూరి సేవా పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..

 చిన్నప్పుడే తండ్రికి మసూచికం సోకి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ కొడుకు ఉండేవారు . తాత చండ  శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్టం లేనివాడు . కానీ తల్లిప్రోత్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో బ్రాహ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తురకు మార్చి అక్కడ అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూరిని అక్కడ  హై స్కూల్ లో చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపోయింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్ తీసుకొని ‘’అన్నసత్రాన్ని కొనసాగించాడు  . 1903 లో చేరి 1914 వరకు కస్తూరి చదివిన స్కూల్ రాష్ట్రం లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రాతిపదికపై ఎంపిక చేసేవారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్లకు కుర్చీలు డెస్క్ లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’  డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూరి క్లాస్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లాసుకు 30 మందిమాత్రమే విద్యార్థులు  .ఉపాధ్యాయులు నిష్ఠగా బోధించేవారు ..హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు  ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్ బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి వచ్చేది . అప్పుడే  అన్నన్  రాసిన   ‘’పార్లమెంటరీ ప్రాక్టీస్’’  అనే పుస్తకాన్ని ప్రచురింపబడగా కస్తూరి కొని చదివేశాడు . 1921  లో మైసూర్ కాలేజియేట్ హై  స్కూల్ లో హిస్టరీ బోధిస్తూ కస్తూరి విద్యార్థుల చేత ‘’స్తూడెంట్ పార్లమెంట్ ‘’అంటే మోడల్ పార్లమెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం  చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా  విద్యార్థుల చేత చేయించి శెభాష్ అనిపించుకున్నాడు కస్తూరి .ఇలా అక్కడ పని చేసిన కాలం అంటే 1928 వరకు ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్ ‘’వారన్  హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థులతో చేయిస్తే కస్తూరి ,ఎడ్మ0డ్  బర్క్ ఆంగ్ల ప్రసంగాలు విద్యార్థులచే చేయించేవాడు  . వాగ్ధాటికి బర్క్ నే ముందు పేర్కొంటారని మనకు తెలుసు  .

స్టూడెంట్ అసోసియేషన్ లో వక్తృత్వ పోటీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం చర్చించబోయే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థుల అవగాహనకు  అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి  అని అడిగితె ‘’The dippressed classes and the supression of the oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ అభినందనగా చప్పట్లు కొట్టారు .డిబేటింగ్ రసవత్తరంగా అర్ధవంతంగా జరిగి మంచి ఫలితాన్నిచ్చింది అని కస్తూరి గుర్తు చేసుకొన్నాడు  .

 పాఠశాల  గ్రంథా లయం లోని విలువైన పుస్తకాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్ ‘’బాగా ఇష్టం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913లో ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్తకం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దాడని .నిజాయితీగా చెప్పాడు . ఇంటిదగ్గర తాతగారు కూడా కథల పోగు .రోజూ ఏదోఒకటి చెప్పేవాడు .. ఈ తాత మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని  తీర్ధయాత్రలు అని చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గర డబ్బు దండుకొని ,యాత్ర చేసివచ్చి మిగిలిన డబ్బును రెండు మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..

 కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూరితోపాటు అయిదుగురిని సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు  ఇచ్చింది .దీనితో అతని నాలుగు అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్టర్ పిలిచి పారితోషికం గా విక్టోరియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి  నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని చమత్కరించాడు కస్తూరి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక  రోజు  పూర్ణా నదిలో కస్తూరి ఈదటం చూసి బాలశంకరులను మొసలి పట్టుకున్నట్లు మనవడిని పట్టుకొని సన్యాసం తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి  600 రూపాయల కట్నం తో పెళ్లి కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దామని ముసలాడి ముదురుఆలోచన . కస్తూరి తల్లి బ్రేకే వేసి  ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు ఉపయోగించిందని చెప్పాడూకస్తూరి .ఎర్నాకుల0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి మలయాళం సాహిత్యం హిస్టరీలలో రాష్ట్రం లో మొదటిమార్కు మొత్తం మీద 5 వ రాంకు  సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల  రెండేళ్ల  స్కాలర్ షిప్ కు అర్హత పొందాడు . ఎర్నాకుల0 లో  లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక  ఒక విధవరాలింట్లో చిన్నగది తీసుకొని ఆమె వండిపెట్టింది తింటూ చదువుకున్నాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

కేరళలోని ఓలాపమన్న మన్న  వంశీకుడైన నారాయణన్ నంబూద్రి పండిత వంశ సంజాతుడు . 1910 లో జన్మించి 1989 లో చనిపోయాడు .ఋగ్వేదం లో మహా నిష్ణాతుడు .త్రిచూర్ బ్రాహ్మణ సర్వస్వ0 అధ్యక్షుడు .ఋగ్వేదాన్ని కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా నేర్పిన ప్రయోగ శీలి . ‘’ఋగ్వేద లక్షణార్చన ‘’ప్రారంభకుడు .ఆయన సంస్కృత రచన ‘’ఋగ్వేద భాష్యా భాష్యం ‘’ను ఆయన మేధోసర్వస్వము గా భావిస్తారు .ఆయన పేరిట ‘’దేవీ ప్రసాదం ట్రస్ట్ ‘’ఏర్పరచి ప్రతి యేటా వేద ,సంస్కృత ,సంగీత ,కథాకళీ లలో నిష్ణాతులకు పురస్కార సమ్మానాలు అందజేస్తున్నారు .

409-భారతీయ శాస్త్ర దర్శనకర్త -జి .విశ్వనాథ శర్మ (1912-1998 )

కేరళ లోని మంగుళూరు లో 1912 లో జన్మించిన విశ్వనాథ శర్మ సంస్కృతం శాస్త్రాలను విద్వా0సు లైన గొప్ప పండితులవద్ద అభ్యసించాడు .కాలడిలోని ఆశ్రమ విద్యాలయం  తీపిని తూర సంస్కృత విద్యాలయాలలో  రామాపురం టీచర్స్ ట్రెయింగ్ సెంటర్ లో సంస్కృత ఉపాధ్యాయుడుగా పనిచేశాడు .  వేదాంతం లో స్వర్ణపతకం పొందిన మేధావి .విద్యాభూషణ ,పండిత రత్న బిరుదాంకితుడు .ఆయన సంస్కృత రచనలు -భారతీయ శాస్త్ర దర్శనం ,సంస్కృతాధ్యాపనం .

410-సామవేద ఘనాపాటీ – త్రోత్తం  ఆర్యన్ నంబూద్రి (1930

కేరళలోని పంజాల్ లో జన్మించిన ఆర్యన్ నంబూద్రి సంప్రదాయ బద్ధంగా సామవేదం నేర్చి వేద పండిత బిరుదుపొంది ,కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో పనిచేసి ,సామవేదాన్ని పఠించటానికి ఇంగ్లా0డ్ నుండి ఆహ్వానం అందుకొని ,అక్కడ పఠించి మన్ననలు పొంది తిరిగివచ్చాడు .కంచి శ్రీ జయేంద్ర సరస్వతి నంబూద్రికి ;;కీర్తి ముద్ర ‘’బంగారు పతకం ప్రదానం చేశారు .కాలడి శ్రీ శంకరాచార్య సంస్కృత విద్యాలయం కోసం సామవేదాన్ని పఠించి రికార్డ్ చేశాడు . కేరళ దేశాన్ని ఈ మహానుభావులందరూ వేద వేదాంగ శాస్త్ర సారం తో పునీత0 చేసిన పుణ్య మూర్తులు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

కేరళకు చెందిన సాంబశివ శాస్త్రి ‘’చిత్రోదయమణి ‘’కావ్యం రాశాడు .తిరువనంతపురం మహారాజు చిత్ర తిరుణాల్ ,ఆయన వంశ పురుషుల గురించి రెండు సర్గలలో వర్ణింపబడిన కావ్యం .చేర రాజులలో చెంగుత్తవన్ ప్రస్తావన చేసి ఆయనను చేరమాన్ పెరుమాళ్ అన్నాడుకవి .తర్వాత ముకుందమాల కర్త కులశేఖర ఆళ్వార్ ను ప్రస్తుతించారు .మిగిలిన రాజులైన స్తాను రవి ,భాస్కరరవి ,గోవర్ధన మార్తా0డ  ,సంగమాది రవివర్మ ,కేరళవర్మ ,మార్తా0డ వర్మ ,శ్రీమూలం తిరుణాల్ ,చిత్ర తిరుమాళ్ మహారాజుల జీవిత వర్ణన చేశాడు

407-మార్తా0డ శతక  కర్త -మార్తా0డ వర్మ (1705-1758 )

111 శ్లోకాలున్న మార్తా0డ  శతక  కర్త రాజా వీర మార్తా0డ వర్మ .ఇది తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ మార్తా0డ వర్మ చరిత్ర .మొదటిశ్లోకం లోనే అయన వంశం వర్ధిల్లుగాక అని మొదలు పెట్టాడు .కార్తీక మాసం అశ్వినీ నక్షత్రం లో పుట్టాడని చెప్పి నాలుగవ శ్లోకం లో భారత దేశ రాజులలో గ్రాడ్యుయేట్ అయినమొట్టమొదటి  రాజు ఆయనేనని ,8 వ శ్లోకం లో ఆయన అన్నగారు కేరళవర్మ గురించి ,తర్వాత రాజమాతమరణం  పిమ్మట రాజు దేశాటనం లో హిమాలయ సందర్శనం రాసి మిగతాదానిలో ఆయన గుణగణాలను ప్రజాహితపాలనను వర్ణించాడు .మంత్రులు హితైషులు ఎందరు ఉన్నా నిర్ణయాలు స్వయంగానే తీసుకొనేవాడని ,అబద్ధాన్ని సహించేవాడుకాదని కవి తెలియజేశాడు .

408- పద్మనాభోదయ కావ్య కర్త -శంకుకవి (18 వ శతాబ్దం )

శంకర లేక శంకుకవి కేరళకు చెందిన 18 వశాతాబ్దిపూర్వభాగపు కవి ..తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్ర మహాత్మ్యంగా ‘’పద్మనాభోదయ ‘’కావ్యంయువరాజు రామవర్మ అభ్యర్థనపై  రాశాడు.కవి తమిళనాడు బ్రాహ్మణుడు . కావ్యం నాలుగుపద్ధతులు అంటే  భాగాలలో  142 శ్లోకాలలో ఉంది .దివాకర యతి అనుగ్రహం తో అనంత పద్మనాభ స్వామి అనంత వైభవాన్ని ఆనంద పారవశ్యంగా రాశాడు .రామవర్మ మాట తనకు దైవ శాసనమే అన్నాడు .రామవర్మ రాజు మూర్తీభవించిన ధర్మస్వరూపం అని ,ధర్మాన్ని నిత్యజీవితం లో ఆచరించి మార్గ దర్శకుడవటం వలన ఆయన శీల  ప్రవర్తనాదులవల్ల ఆయనను రామవర్మ అనికాకుండా ధర్మరాజు అనే ప్రజలు పిలిచేవారని చెప్పాడు

409-కేరళ విల్లాస  కావ్యాలు

కేరళకు చెందిన 19 వ శతాబ్ది మనవిక్రమకవి కేరళపై కేరళవిలాస కావ్యం రాశాడు.ఈయన కాలికట్ వాడు .కేరళోల్పత్తి ఆధారంగా దీన్ని 105 శ్లోకాలలో రాశాడు .ఏళత్తూర్ కు చెందిన రామస్వామి శాస్త్రి 1882లో వైశాఖం తిరుణాల్ మహారాజా కాశీ యాత్రను వర్ణిస్తూ ‘120 శ్లోకాల కాశీయాత్ర వర్ణన రాశాడు .సుబ్బరామ పట్టారు ‘’ఆ పద్దీప  ‘’అనే 33 శ్లోకాల కావ్యాన్ని జమోరిన్ రాజ్యాన్ని విడిచి వెళ్లిన ఒక దీన బ్రాహ్మణకుటుంబ గాధను వారు కొచ్చిన్ మహారాజు ఆశ్రయం పొందటానికి సహకరించిన అద్భుత అదృశ్య శక్తి గురించి చెప్పాడు .తిరువాన్కూర్ రాజవంశ చరిత్రను గణపతి శాస్త్రి లఘుకావ్యంగా ‘’శ్రీమూల చరిత్ర ‘’రాశాడు .అనంతగిరి ‘’గురు దిగ్విజయ ‘’పేరిట ఆది శంకరాచార్య చరిత్రను ,తుళు బ్రాహ్మణులు తుళునాడు వదలి కొళత్తూర్ ఉదయవర్మ రాజ్యానికి చేరే కథను ‘’బ్రాహ్మణ ప్రతిష్ట ‘’కావ్యంగా ,కొళత్తూనాడు ఉదయవర్మపై 8 శ్లోకాల ‘’దేశ్యాస్ట కం ‘’,కొచ్చిన్ కు చెందిన పరీక్షిత్ తంపురాన్ రాసిన చిన్నకావ్యం ‘’మాల ‘’,వైశాఖం తిరుణాల్ మహారాజాపై కేశవన్ వైద్యం రాసిన ‘’విశాఖ విలాసం ‘’మద్రాస్ గవర్నర్ లార్డ్ నేపియర్ 1883 లో త్రివేండ్రం సందర్శనను ఏళత్తూర్ రామస్వామి శాస్త్రి ;;గౌణ సమాగమం ‘’కావ్యంగా ,కడ త్తనాడు రాజు నిర్వహించిన మహా మృత్యుంజయ యాగాన్ని వర్ణిస్తూ మీథలే మాదం కు చెందిన శంకరవారియర్ రచించిన ‘’మహా మృత్యుంజయ చరిత్ర ‘’,కొచ్చిన్ మహారాజు మహా వాగ్ధోరణిని ,షష్టిపూర్తి ఉత్సవాన్నీ వర్ణిస్తూ నెల్లూరుకాండీ కి చెందిన కృష్ణన్ నంబూద్రి రాసిన ‘’మాతామహిషా షష్టి పూర్తి దశకం ,తిరువాన్కూర్ వైశాఖం తిరుణాల్ మహారాజు చేసిన సేతుయాత్రపై టి. గణపతి శాస్త్రి రాసిన ‘’సేతుయాత్రావర్ణన ‘’మొదలైనవి కేరళలో ఉద్భవించిన సంస్కృత లఘు విలాస కావ్యాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందాయి .

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

King Of Travancore sct.jpg
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముందుమాటలు

సాహితీ బంధువులకు శుభకామనలు-నేను రాసిన1- ”ఆధునిక ప్రపంచనిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంథానికి   మచిలీ పట్నం హిందూకళాశాల చారిత్రిక శాఖాధ్యక్షులు డా. శ్రీ ఎస్ .వెంకటేశ్వరరావు గారు 2-గీర్వాణకవుల కవితగీర్వాణం -3 మూడవ భాగం  గ్రంథానికి  అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ముందుమాటలు రాయటానికి దయతో అంగీకరించారని తెలియ జేయటానికి సంతోషిస్తూ వారిద్దరి సౌజన్యానికి సరసభారతిపై ఉన్న ఆదరణ,అభిమానాలకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను . ఇవి సరసభారతి ప్రచురించ బోతున్న 26 27 పుస్తకాలని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3 401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3

401-కామ సందేశ కర్త -మాతృ దత్త  (16వ శతాబ్దం

 కేరళకు చెందిన మాతృ  దత్త కవి ‘’కామ సందేశం ‘’కావ్యం రాశాడు .మేల్పత్తూర్ కు చెందిన ఈ కవి వ్యాకరణ వేత్త .నారాయణ భట్ కుటుంబానికి చెందినవాడు .కావ్యం మొదటిభాగం లో 66 ,రెండవభాగం లో 69 శ్లోకాలున్నాయి .భార్యతో ఆనందంగా గడుపుతున్న అతనిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి చిదంబరం లో ఉంచుతాడు .అక్కడ కామ దేవుని కలిసి తిరునావయ లో తన భార్య చంద్ర లక్ష్మికి  అతనిద్వారా సందేశం పంపటం ఇతి వృత్తం . అందరు  సందేశకర్తలలాగానే ఈ కవీ రూట్ మాప్ ఇచ్చి పంపిస్తాడు .దారిలో రెండు సార్లు కొచ్చిన్ రాజు రామవర్మప్రస్తావన ఉంది .కావేరి నదికి ఉపనదిని  కొల్లిదం  అంటారు  .కొచ్చిన్ రాజుకు పోర్చుగీసు వారికి మధ్య జరిగిన టోల్ ఒప్పందం కూడా ఇందులో ఉంది . 16వ శతాబ్దం లో త్రిచూర్ లో కొచ్చిన్  రాజభవన్ నిర్మాణాలు ,పాత రాజభవనాల విషయమూ ఉంది .రామవర్మ అంటే 1764 నుంచి 1801వరకు పాలించిన కేశవ రామ వర్మ అని గుర్తించారు . 1774లో కోట గోడలు మట్టితో నిర్మించటం అగడ్తలు త్రవ్వటం కూడా కవి రాశాడు . ఈయనకాలం లోనే పోర్చుగీసులతో ఒప్పందం కుదిరింది . రాజు ముసలితనం లో కాశీ యాత్ర కు వెళ్లి అక్కడే కైలాసం పొందాడు .ఈ సందేశం లో కాలికట్ నాయకరాజుల ,జమెరియన్ రాజుల వర్ణన ఉన్నది .కావేరి నాదీ తీర బ్రాహ్మణులూ ,వివిధ వృత్తులవారు అచ్యుతప్పనాయకుని ప్రశస్తి ఉన్నాయి .

402-శుభగ సందేశ కర్త -నారాయణ (16 వశతాబ్దం )

కేరళ త్రిసూర్ కు చెందిన నారాయణకవి శుభగ సందేశం రాశాడు .అంతకంటే జీవిత విశేషాలు తెలియవు .ఏవోకొన్ని అనివార్య కారణాలవల్ల దెయ్యంబారిన పడి   కన్యాకుమారిలో ఉండవలసి వచ్చి త్రిసూర్ లో ఉన్న భార్యకు దూరమయ్యాడు .విరహవేదన తట్టుకోలేక పోతున్నాడు కన్యాకుమారి అమ్మవారి పూజారి స్నాతక బ్రాహ్మణుడైన సుభగ పరిచయమవగా భార్యకు అతనితో సందేశం పంపటమే కథ .కవి జయసింహనాడు పాలకుడు రామవర్మ ఆశ్రితుడు .రాజు ఆశ్రిత పోషణ గురించి వర్ణించాడు . పరిశోధకుడు ఉల్లూర్ ఈ రామవర్మ అంటే విజయనగర రాజులతో యుద్ధం చేసిన ఉదయ మార్తా0డ  వర్మ సోదరుడు అని చెప్పాడు .కొట్టాయం లోని  చంపకా స్సేరి దేవాల0 , దాని కోశాధికారి యజ్ఞనారాయణను రాజా రామవర్మ నియమించటం ఉన్నాయి …

403-చాతక సందేశ కర్త – ఒక బ్రాహ్మణకవి

కేరళ  మలబార్ ప్రాంత తిరువంతం కుంజు లోని నంబూద్రి  బ్రాహ్మణకవి తిరువాన్కూర్ మహా రాజ రామవర్మకు ఒక చాతకపక్షి ద్వారా తనకు ఆర్థికసాయం చేయమని పంపిన సందేశం . 1787లో టిప్పూ సుల్తాన్ మలబారును ఆక్రమించినపుడు ఈబ్రాహ్మణుడు తిరువాన్కూర్ మహారాజు కార్తీక తిరుణాల్ ఆశ్రయం పొందాడు .కొంతకాలానికి అకస్మాత్తుగా జబ్బు చేసి రాజుకు తెలియ బరచకుండా తన స్వగ్రామం చేరాడు .అక్కడ కాళికాదేవి పూజలో గడిపాడు .అక్కడ ఒక వనం లో చాతకపక్షికనిపిస్తే దానికి తన గోడు చెప్పి రాజుగారికి వెళ్ళగక్కమని  సందేశానికిపంపటం ఇతి వృత్తం .ఇందులోనూ దారిలోఉన్నపట్టణాలు ప్రజాసమూహాలు రాజులవర్ణన యధాప్రకారం కవి దట్టించాడు .ఇందులో కొచ్చిన్ మంత్రి రాజ గోపాల్ ప్రస్తావన ఉంది  .ఈయన పి .రాజగోపాలాచారి అని కొచ్చిన్ దివాన్ గా 1896-1901వరకు ఉన్నాడు అన్నది  చారిత్రిక సత్యం .ఎడ ప్పల్లి బ్రాహ్మణ రాజుల వర్ణనా ఉంది .వాళ్ళు దాంతాలి నాయకులు కావచ్చు .

404-నీలకంఠ సందేశకర్త -శ్రీధరన్ నంబి (1774-1830 )

నెమలి సందేశం అనే సందేశకావ్యాన్ని శ్రీధరన్ నంబి రాశాడు . కేరళ పట్టాంబి వంశం వాడు .భారత పిశరాట్టి  శిష్యుడై గొప్ప జ్యోతిశ్శా స్త్ర   వేత్త అయ్యాడు ,. ఈ వంశం వారు కాలికట్ రాజుల ఆస్థాన కవులు జ్యోతిష శాస్త్ర వేత్తలుఅయ్యారు .ఈ కవి  విక్రమాదిత్య చరిత్ర కూడా రాశాడు .నాయకుడు నాయకికి నీలకంఠం అంటే నెమలి ద్వారా  పంపిన సందేశం .జామోరీ రాజులకు హైదర్ జంగ్ కు జరిగిన యుద్ధం ,యూరోపియన్ జంటలు వాహనాలమీద తిరగటం ,బ్రాహ్మణులు వేద వేదాంత శాస్త్రాలు నేర్వటం వగైరా వర్ణనలన్నీ ఉన్నాయి .

405-మరికొన్ని సందేశ కావ్యాలు

కవి సార్వ భౌమ కొకుణ్ణి తంపురన్ కోటు నల్లూర్  (1858-1926 )’’విప్రసందేశం ‘’,18 వ శతాబ్దికి చెందిన రామపనివాద ‘’122 శ్లోకాల శారికాసందేశం ‘’1858-1926 కాలపు కవి సార్వ భౌమ కొకుణ్ణి తాంపురన్ కోటు నల్లూర్ ‘’విప్ర సందేశం ‘’అజ్ఞాతకవి విరచిత ‘’చకోర సందేశం ,పులియనల్లూర్ తెక్కపట్టు అనే నంబూద్రి బ్రాహ్మణకవి ‘’సంపాతి సందేశం ‘’,వాయస్కర  కు చెందిన   ఆర్యన్ నారాయణ మసాటు ‘’స్యేన  సందేశం ‘’కేరళలో సందేశకావ్యాలుగా చరిత్రకెక్కి సంస్కృత వాజ్మయం లో స్థానం పొందాయి.  ఇవన్నీ మూస కావ్యాలుగా కనిపించినా వాటిలో చారిత్రిక నేపధ్యం ఉన్నది.  ఆకాలపు రాజుల, ప్రజల జీవిత విధానాలకు అవి అద్దం పట్టాయి . వీటిపై ప్రత్యేక పరిశోధనలు జరిగి వాటిలోని చారిత్రిక  విషయాల నిగ్గు తేల్చారు పరిశోధకులు .. ఆరకంగా ఇవి చారిత్రిక సందేశ కావ్యాలుగా రాణ కెక్కాయి .

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8–8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

కేరళకు చెందిన 14 వ శతాబ్దపు కవి పూర్ణ సరస్వతి -పూర్ణ జ్యోతిష్యుని శిష్యుడు .ఉత్తర మలబార్ లోని కాట్టుమటం ఇళ్లాం  కు చెందినవాడు .పూ ర్ణ సరస్వతి వంశాన్ని పరశురాముడు ఆశీర్వదించి నట్లు ఐతిహ్యం .అనేక శాస్త్రాలలో విస్తృతపాండిత్యం కవిత్వ రచనలో మేటి అవటం వలన ఆయనకు పూర్ణ సరస్వతి అనేది బిరుదుగా లభించిన పేరు .కావ్యం లో పూర్వభాగం ,ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి .మొత్తం 102 శ్లోకాలు .కాంచీపురం లో ఒక కన్య ఒక ఉత్సవం లో శ్రీ కృష్ణుని మోహన రూపం చూసి మనసు పారేసుకొన్నది . ఒక హంసతో తనమనోభావాలను బృందావన కృష్ణునికి సందేశంగా పంపటం ఇతి వృత్తం .రాయబారి హంస చేర  ,పాండ్య దేశాలు చూస్తూ కావేరి ,కాళింది ,తామ్రపర్ణి లను దాటి తిరువనంతపురం వగైరాలను చూస్తూ బృందావనం చేరింది వీటి నన్నిటిని కవి చక్కగా అందంగా వర్ణించాడు .తిరువాన్కూర్ రాజు సర్వకళా  వల్లభ వంశీష. ఆయన బలపరాక్రమాలు వర్ణించాడు . బహుశా ఈ రాజు స్వాతి తిరుణాల్ రామవర్మ కావచ్చును .ఆయన రాజరికానికి వచ్చిన 1829-46 కాలం లో ఈ కావ్య రచన చేసి ఉండాలి .ఇందులో సుచీన్ద్రం లోని ప్రసిద్ధ ‘’కై ముక్కు ‘’అంటే వేడి నేతిలో చేయిపెట్టటం కూడా వర్ణితం . దోషి ఎవడైనా శుచీన్ద్రాలయం లో వేడి నే తిలో చేయి పెట్టించి దోషి అవునోకాదో నిర్ణయిస్తారు .దోషి అయితే చేయి కాలిపోతుంది .లేకపోతె ఏమీ కాదు

 కావ్యం లో దేవదాసి వ్యవస్థ వర్ణన కూడా ఉన్నది .తామ్రపర్ణి నదీతీర బ్రాహ్మణ అగ్రహారాలు స్నానఘట్టాలు ప్రకృ తి సౌందర్యం వర్ణన కూడా కనిపిస్తుంది ,.బ్రాహ్మణులను భూదేవతలు అని వర్ణించాడుకవి .

400-మయూర సందేశ కర్త -ఉదయ (16 వ శతాబ్దం )

కేరళ సందేశకావ్యాలలో మయూర సందేశం తలమాని కమైనది . దీనికర్త ఉదయ 16 వశతాబ్ది రాజకవి.ధ్వన్యాలోకానికి అభినవ గుప్తుడు రాసిన లోచన వ్యాఖ్యానికి ఈయన ‘’కౌముది ‘’వ్యాఖ్య రాశాడు .ఉదయ మానాకులం రాజా వంశీకుడు .వీరిపూర్వీకుడు శ్రీకంఠ మహాకవి .శ్రీకంఠుడు అనే నాయకుడు అంటే కవే  కున్నాం కులం వద్ద అన్నకార లో ఉన్నతనప్రేయసి మార చేమంతి కి మయూరంద్వారా తనమనసులోమాటను రాయబారంగా పంపటం .త్రివేండ్రం నుండిఅన్నకారకు మాప్ వేసి దారి చూపించడు కవి .సముద్ర  తీరం వెంబడి వర్కాలనుంచి క్విలన్ కు వెళ్లి ,అక్కడినుంచి తూర్పు కు తిరిగి కంటియూర్ మీదుగా కాయముకులం రాజుల రాజధాని కొట్టాయం చేరి , పుల్లా నదిదాటి కొచ్చిన్ రాజులువుండే త్రిపునీతురావెళ్లి .అల్వాయ్ నదిదాటి చిన్నమంగళం క్రన్ననూర్ మీదుగా బ్రహ్మమక్కాలకు తన ప్రేయసిని చేరుకోవాలి అని రూట్ మాప్ ఇచ్చిపంపాడు .ఇందులో చెప్పబడిన రాజులు మహాకవులు వ్యాఖ్యానాలు రాసినవారు .కోళంబ  అనేది కూపకులుల నగరం .

  సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-17-కాంప్-షార్ల్లెట్- అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment