నవ్యాంధ్ర నవనిర్మాణం ”కవిసమ్మేళనం -3 చివరిభాగం
48వ గ్రంధాలయ వారోత్సవం -విజయవాడ టాగూర్ లైబ్రరీలో 18-11-15 బుధవారం సాయంత్రం రమ్య భారతి సరసభారతి మల్లె తీగ సంయుక్త ఆధ్వర్యం లో ”నవ్యాంధ్ర నవ నిర్మాణం ”పై కవి సమ్మేళన దృశ్యాలు
’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1
48వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా
‘’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1
వేదిక –టాగూర్ గ్రంధాలయం –విజయవాడ
తేది ,సమయం -18-11-15-బుధవారం –సాయంత్రం -6గం లకు
నిర్వహణ –రమ్యభారతి ,సరసభారతి, మల్లెతీగ సాహితీ సంస్థలు
కవితలు
1-ఐతే ఒకే –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్
సింగపూర్ సి౦గారమైనా
చైనా చైతన్యమైనా
జపాన్ నాణ్యమైనా
మలేసియా మహా భాగ్యమైనా
దేన్ని అనుసరించి ,అనుకరించి నిర్మించినా
మనభాష ,మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా
బడుగు జీవుల బతుకులతో చెలగాటమాడకుండా
రైతన్న ,నేతన్న ల నడుం విరవ కుండా
నవ్యాంధ్ర నవ నిర్మాణం సాగిస్తామని నమ్మకం కలిగిస్తారా
ఐతే ఒకే .
2-నవ్యాంధ్ర నిర్మాణం –శ్రీమతి కోపూరి పుష్పాదేవి
అద్భుత రాజ దాని అమరావతి
ఆంధ్రుల ఆశ శ్వాస అమరావతి
అయిన వారికి ఆకులు వదిలి
కాని వారికి క౦చాల౦ది స్తోంది అమరావతి
పచ్చని చేలను ఫలహారం చేసి
బంగారు గుడ్లు పెడతానంటోంది
అరచేతిలో వైకు౦ఠాలు మా కొద్దు
ఆకాశానికి నిచ్చెనలసలే వద్దు
అంకితభావం ఏంతో ముద్దు
కృషి తైలం పోసి
శ్రమ జ్యోతులు వెలిగిద్దాం
అపూర్వ అమరావతిని సాధిద్దాం
ఆంధ్రుల పోరాట పటిమే కాక
నిర్మాణ సౌభాగ్యాన్నీ
ప్రపంచానికి చాటి చెబుదాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-15
సాహితీ ప్రియులకు ఆహ్వానం -గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఉయ్యూరులోని సరస భారతి విజయవాడలోని రమ్య భారతి ,మల్లె తీగ సంస్తలచేత ఈ రోజు 18-11-15 బుధవారం సాయంత్రం 6 గం .లకు టాగూర్ లైబ్రరీలో నిర్వహింప బడుతోంది . కవులకు,సాహిత్య ప్రియులకు , సాదర ఆహ్వానం .విచ్చెసి జయ ప్రదం చేయండి .-దుర్గాప్రసాద్ ,చలపాక ప్రకాష్ ,కలిమిశ్రీ ,

నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి (
వాదూలస గోత్రీకుడు వడ్లమాని అన్నయ శాస్త్రి విశాఖ పట్నం సంస్కృత పాఠ శాలలో సంస్కృత పండితునిగా పని చేశాడు ‘’సీతారామ రాజాభ్యుదయం ‘’అనే చంపూ నాటకం రాశాడు .సాధారణం గా కావ్యాలు దృశ్యకావ్యాలు గానో శ్రవ్య కావ్యాలుగానో ఉంటాయి కాని ఈకవి దృశ్య శ్రవ్య మిశ్రమం చేసి రాశాడు .ఉపోద్ఘాతం లో నే కవి ఈ విషయం వివరించాడు ,’’సంతు ఖాలు భువి బహూని నాటకాని,అనేకాని చ కావ్యాని ప్రబందాస్చ బహువిధాః .తాద్రుష్పద్దతి వ్యతిరిక్తతాయాంపూర్వకల్పితదృశ్య శ్రవ్యత్వో భయ సంబంధ మిశ్రతయా వివిధ కావ్య రాసాని మగ్నానామపి బుధ నామాహృదకారిణీ భవే దియామితినిస్చినుమః ‘’.దీన్ని రాయటాన్ని సమర్ధించుకొన్నాడు కూడా .
ఇది మిశ్రమ కావ్యం అనటానికి రచయితలకు ,పాత్రలకు మధ్య జరిగే సంభాషణలు దృశ్య కావ్యం అని పిస్తే ,సుదీర్ఘ వర్ణనలు శ్రవ్య కావ్యం అని పిస్తుంది .ఈ చంపూ నాటకం లో నాలుగు స్తబకాలున్నాయి .మొదటిస్తభకం’’నాయక వ౦శాభి వర్ణనం ‘’ లో ‘’నాయకుడైన సీతా రామరాజు వంశాభి వర్ణనం ‘చేశాడు కవి .రామ రాజు కాకర్ల వంశస్తుడు .ఆలమండలో ఉండేవాడు .ఇది విజయనగర ప్రభువు ఆనంద గజపతి రాజు పరిపాలనలో ఉండేది .కాకార్ల వంశం వారు విజయ నగర రాజు కు సైనికాధికారులు .రామ రాజు పూర్వీకుల వర్ణన కూదాచేశాడు కవి .రెండవ స్తబకం’’కృతి సమర్పణం ‘’ లో హరిహర రాజ పట్టాభిషేక వర్ణన ఉంది .మూడవది ‘’యువ రాజ విలాసం ‘’లో సీతారామ రాజు చేసిన త్యాగం ,అయన వివాహం ,పట్టాభి షేకం రాజు మంత్రి కొడుకుతో వింధ్యగిరి పర్యటన ఉంటాయి .నాలుగవ స్తబకం ‘’సమ్మేళనం ‘’లో సీతారామ రాజు పుణ్య క్షేత్ర సందర్శనం ,ఇతర రాజులపై యుద్ధాలు విజయాలు ,అంతం లో తండ్రీ కొడుకుల సమాగమం ఉన్నాయి .ఈ కావ్యం లో శాంతరసం ఉందని కవే చెప్పాడు.
పండిత ప్రకాండుల ప్రశంసలు అందుకొన్నాడు కవి అన్నయ శాస్త్రి .ఇది అతి అరుదైన సంస్కృత చంపూ కావ్యం .కవి కవిత్వ ప్రతిభకు కొన్ని ఉదాహరణలు చూద్దాం .
‘’ఆస్తి ఖల్వాఖిల వసుంధరా వలయ ప్రతి నిధిః సహస్ర రధసవిలాస గమన సముచితా విశంక తరధ్యాపయ పదిక జన సతత సంచరణ మసృణిత విపులోపల ఫలక ధటితఘంటా సంతత క్రేత్రు జన సముదయ బహు ముఖారవ పూరణ జనిత ప్రతిధ్వానతయా అనపేక్షిత ‘’ఇలా సాగే కమ్మని కవిత్వం .చివరలో ‘’శ్రీ మదానంద గజపతి మహా రాజేన పరిపాలయ మానస్య మహా మండలస్య శ్రీమత్చలమండనగరీ’’అని పూర్తీ చేశాడు .
రెండవ స్తబకం లో ‘’ అహో అస్య శశి మృతోః-సౌభాగ్యం తదాహి –అల్పావశేష తదన్కా పటలీతరూణాం నత్యన్త్య మండన వతీ వినితేవ భాతి ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-11-15-ఉయ్యూరు
గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా సరస భారతి ఆధ్వర్యం లో ’17-11-15-మంగళ వరం ఉదయం 11గం.లకు ఉయ్యూరు ఏ సి గ్రంధాలయం లో ‘నూతన రాజ దాని అమరావతి ”పై విద్యార్ధులకు వక్తృత్వ పోటీల నిర్వహణ
16-11-15-కార్తీక మాసం మొదటి సోమవారంనాడుసాయంత్రం 5గం లకు ఉయ్యూరులో కే సి పి.ఆవరణలో శ్రీ పరిపూర్నానంద స్వామి వారి ఆధ్వర్యం లో ,గ్రామస్తుల ,పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతోజోరున కురుస్తున్న వర్షాన్ని అధిగమించి 25వేలమంది భక్త జనం నిర్వహించిన ”కోటి దీపోత్సవం ”
|
|||||||||||
|
15-11-15-ఆదివారం మా ద్వారకా తిరుమల ,రామారావు గూడెం అగ్రహారం దేవాలయ సందర్శన పూజ ,మరియు ఏలూరులో మా కొత్త మేనకోడలు ఛి సౌ భారతి దంపతుల స్వగృహం లో లో విందు
41-చిన్ముద్ర యాయో వట వృక్ష మూలతో –మౌనీంద్ర వర్గానుపచిత్య శాశ్వతం
జ్ఞానం ప్రవక్తి ప్రగ్రుహీత మౌనకో –నౌమి ప్రభుం తం స్వమనీషి తాప్తయే .
42తం మృకండు సుత మంత కార్తిత –స్రస్తమాయురుపనీయ శాశ్వతం
యో రరక్ష విభురంత కాంతక –స్స్వాయుషా చ యశసౌ యునక్తుమాం
43-మాతాత్వం త్వం జనకో –బందుస్త్వం త్వం సఖా తదాదీశ
కర్తా కరణం కారణ –ముత కార్యం త్వమసి నాసిత త్వేన.
44-శచీపతీరితం రతేః పతిం సుమైరవాకిరం
తమాహన స్తృతీయ యాద్రుశా దిశేశ సమ్ముఖే
అజీవ యన్నిజేనతం ద్వితీయ లోచనే నతే
కుటుంబినీ విడంబ నాహివా మహో మహీయసీ .
45-సర్ప హారవలయా౦ఘ్రి నూపురో –భస్మ చందన విలేపనో భవాన్
వహ్ని ద్రుక్త దపి చాశ్రయంత్యహో –జ్ఞాన రత్న నిధి రిత్య మీ జనాః.
46-యోంధక మార్యః ప్రోతం-శూలేపాదయతిపల లఖండమివ
ఆప్రాతశ్చా సాయం –లోకావన హేతు తంత మీడేహం.
47-ఉదంచ యందివ భువం విదార యం దిశోదశ
ప్రదూర యన్ప్రభావ భాసుర స్సురైః ప్రసృస్యతి
విడంబనేయ మప్యహో విశాల విశ్వ మంగళ
ప్రకార తా పరిస్ఫుర త్ప్రతీతి క్రుద్వివేకినాం .
48–స్వేనాస్థితం హృదయ మధ్య ఉదేతు నిత్యం –
ముఖ్యం విలోచన మహీస మహీశాతాంగ
ఆహ్లాద యేద్దయిత యోపహృతం ద్వితీయం
దుఖావహం దహతుమే దురితం తృతీయం .
49-కామాం దగ్ధ్వా మాతుల –మీక్షణ వహ్నిర్నదీ ప్రవాహస్య
మధ్యస్థం కురు షేబ్జం-దోషే న్యంముత శిక్షయ సిసామ్యాత్ .
50జయతు జయతు దేవో ర్ధాంగజా నిర్మహేశో
జయతు జయతు దేవీ తస్య వామాప్య వామా
జయతు జయతు తజ్జాయా పతీడ్య ప్రసాదో
జయతు జయతు భక్తౌఘ శ్శివా ర్ద్య స్మదాదిః.
51-జయతి పితృ పితా మే కర్మ క్రుద్బ్రహ్మ రూపో
జయతి సుకవి శౌ౦డః కోపి మాతామహోదయం
జయతి చెరువు వంశ్యస్సత్యనారాయణోసౌ
జయతి గురు కటాక్షో యత్ర సాంబ ప్రసాదః
52-లింగోద్భవే మహా దేవే –నానా వృత్త స్తవాంచితా
సత్య నారాయణేనేయం –కృతి నా కృతి రర్పితా.
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః సమాప్తా
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-15-ఉయ్యూరు
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383)
రాచకొండ వెలమ రాజ్య స్థాపకుడు అనపోత నాయకుడు 1361లో జన్మించి 1383లో మరణించాడు .మొదటి సింగమ నాయకుని కొడుకు .కాకతీయ ప్రతాపరుద్రుని వద్ద పనిచేశాడు .సింగన రసార్నవ సుధాకర కర్త సర్వజ్ఞ సింగ భూపాలుని తండ్రి .అనపోతునికి ‘’సోమకుల పరశురామ ‘’.’’జల్లిపల్లి రణ క్షోణిభారతీక మల్ల ‘’త్రిభువనిరాయక ‘’,’’ఖడ్గ నారాయణ ‘’బిరుదులున్నాయి . అనపోతుడు మహా కవి పోషకుడు మాత్రమె కాదు తానూ గొప్ప కవే .’’అభిరామ రాఘవ ‘’నాటక కర్త .ఇందులో కొన్ని శ్లోకాలు మాత్రమె సింగన మొదలైన వారు ఉదాహరించారు .వాటినో సారి చూద్దాం
‘’హంత సారస్వతం చక్షుః కవీనాం క్రాంత దర్శినాం –అతిరస్య ప్రవర్తేత నియతార్యషు
‘’విద్వానసౌ కలావానపి రసికౌ బహువిధ ప్రయోగజ్ఞః-ఇతి చ భవంతం విద్గో నిర్యూడం సాదు తత్వయా సర్వం ‘’
7-నరసింహ విజయ వ్యాయోగ కర్త -దేవులపల్లి అన్నపూర్ణేశ్వర శర్మ
దేవులపల్లి సుబ్బరాయ కుమారుడే అన్నపూర్ణేశ్వర శర్మ .కౌ౦డిన్యస గోత్రీకుడు .నూజివీడు జమీ౦దారిలోని శోభనాద్రి వాసి .’’నరసింహ విజయ వ్యాయోగం ‘’నాటకం రాశాడు.ఇతని కాలం గురించి తెలియదు .ఈ నాటకం లో మూడవ వంతు భాగమే దొరికింది .ఉన్న పదిహేను పత్రాలలో ౩,5,7,10,11,15మాత్రమె లభించాయి .మూడవ పత్రం లో నటి ,సూత్ర దారుల సంభాషణ ఉంది .ఇందులో కవిజీవితాన్ని చెప్పాడు .ఈ కొద్ది భాగాలలోనే కవి మేధస్సు, కవిత్వ సౌరభం తెలుస్తుంది .లభించని పత్రాలలో ఏమి ఉందొ తెలియదు .హరికి సురాచార్యుడు హిరణ్య కశిపుని చేతిలో సూర్యుడు పొందిన పరాభవం వివరించాడు .రంగ దాసుడికి శోభనాచల మహాత్మ్యాన్ని గురించి వసంత వివరిస్తుంది .వసంత కుసుమారుడు గరుడ వాహన విశేషాలను వివరిస్తాడు.నారదుడు నరసింహావతార ఆవిర్భావాన్ని వివరించాడు .-
‘’తచ్చా లాస్య స్తంభ తొంభోధరణి కర సముజ్జ్రుమ్భ గంభీర రావః –శుమ్భా జ్రుమ్భ ద్విషద్విండధర దలనాజ్జ్హృమ్భ దంభోలికేళిః-వీక్షా రూక్ష స్ఫులితంగక్రుమ్భిత దితిసుతా ధ్యక్ష సూతే స్సమక్షం –రక్షా మీక్షా న్వల క్షధృతి వితాతినృహర్యక్ష రూపోక్షరో భూత్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
‘
‘’
—
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -4
31-నమా౦సి శిరసా తనోమిపదయో -స్త్రిణేత్ర తవ మా౦కురుష్వసుదియుం
నలోప ఇయ తాత వాప్తి భగవన్ –మమా పి క్రుతితా భవేదిహ పరా .
32-శాంతం దాంతం పాపదూరం సుభీమం –భర్గం దేవం భక్త హృ త్సౌ హ్రుదస్తం
గూఢం యోగిప్రాణసంధ్యార్య మాణం-శాస్తారం త్వాం భక్తి పూర్వం నమామి .
33-అజినం వసానమ మరైర్విమతం –యమనస్తమాది రహితం పరమం
ప్రవదంతి వేద నివహా విబుధా –స్తమహం వ్రజామి శరణం గిరీశం .
34-హర ,భవ దేవ భీమ పరమేశ్వర హే –భవ హర శూల హస్త సురవర్గ పతే
స్మర హర వామదేవ దహనేంద్రియ భో –మృడ శివ చంద్ర శేఖర పరేష నమః .
35-కైలాస పర్వత దరీక్రుతాలయం –వహ్ని ప్రభూత లలితాపతిం ప్రభుం
లింగోద్భవం లలితయానమామ్యాహం –కార్య క్షమా రుహని వృద్ధయే శివం .
36-హర శివ దేవ దేవ మృడ శర్వ పరేశ సురేశ దూర్జటే
కవన పదార్ధ కీర్తి ధన జీవిత ధాన్య సుతాది సంపదః
సువిమల దేహ మద వినివారయ భీతి మపోహ శాత్రవాన్
జటిల,మహేశ ,మామవ నమామి సదా శివ తే పదాబ్జయోః.
37-శంకర ,గౌరీశ జటిల శూలి –న్నంధక శత్రో వటుక పరేశ
సర్ప విభూషం సురనత మంఘ్రిం –హే భవతే నౌమ్య వ హరి బాణ .
38-గజారే ,హి శూలిన్ ,వటుక వివతేబ్ధీషుదే దానవారే
పినాకిన్ హే శంభో గిరీశ భవ మాం రక్ష భక్తార్తి నాశ
శ్రయిష్యామీశం త్వాం మదన వశరం సర్వ పాప ప్రణాశం
మదీశం ,భూతేశం సువిశద తనుం భీష్మ సూ మూర్ధజం త్వాం.
39-ధరా దరాది వాస మాశ్రితార్ది కల్ప పాదపం
విదాతృ విష్ణు ముఖ్య దేవపూజితాంఘ్రి పద్మకం
సరస్వతీ ముఖాభి గీయ మాన కీర్తి భాసురం
శివం సదా౦ధ కాసురాహరం నమామి శాశ్వతం .
40-ప్రియా ముఖే క్షణ క్షణే సుహ్రుత్త యాతి శీతయా
దృశా శివ స్సమీక్షతాం కిరాత రూప దారక
శ్మశాన భస్మ సంచయాతి శుక్ల విగ్రహశ్శి వో
గాజాజినోత్తరీయ కోర్ధి కల్ప వృక్ష కో మృడః.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
4-శతకంఠరామాయణ కవి-పరశు రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)
సీతారామాంజనేయ సంవాదం రాసిన పరశురామ పంతుల లింగ మూర్తి కి ఐదవ తరం వాడైన అనంత పండిత రాయలు 19 శతాబ్ది వాడు .వరంగల్ దగ్గర అంబాలా గ్రామ నివాసి .వెంకా౦బికా ,రామ కృష్ణ సోమయాజుల పుత్రుడు .భారద్వాజ గోత్రం .అనత మంజరి టీకా- రాశాడు. ’’సీతా విజయ చంపు ‘’రాశాడు .దురదృష్ట వశాత్తు మూడవ స్తబకం లో ఆగిపోయింది .ఇందులో సీతాదేవి శత కంఠ రావణ వధ చేసిన కద ఉంది .రావణుడికి వంద తలకాయలున్నట్లు రాయటం వలన దీనికి ‘’శత కంఠ రామాయణం ‘’ అని కూడా అంటారు .దీనికి మూలం వసిష్ట రామాయణం .మొదట్లో లక్ష్మీనారాయణ ,సరస్వతి ఆంజనేయ విఘ్నేశ్వర దేవతలను ఇదే వరుసలో స్తుతి౦చాడుకవి .తర్వాత తన వంశ చరిత్ర చెప్పుకున్నాడు .పిమ్మట వ్యాస వాల్మీక కాళిదాస కవులను స్తుతింఛి కధలోకి ప్రవేశించాడు .శివుడు పార్వతికి చెప్పిన కధను వ్యాసమహర్షి నైమిశారణ్య ఋషులకు తెలియ జేశాడు .కొన్ని వచనాలతో సహా మొదటి స్తబకం లో 94శ్లోకాలున్నాయి .మొదటి ఇరవై శ్లోకాలలో పూర్వ రామాయణ కధను చెప్పాడు .రావణుడికి బంధువైన శత కంఠుడు రావణ సంహార వార్త విని మూడులోకాల పై దాడి చేసి చీకటిలో ముంచేస్తాడు .శ్రీమహా విష్ణువు సలహాపై ఇంద్రాది దేవతలు ఈ విషయాన్ని అయోధ్య రామునికి నివేదిస్తారు .శ్రీరాముడు వారికి అభయ మివ్వటం తో మొదటి స్తబకం పూర్తి అవుతుంది .ఇందులో శ్రీరాముని ధైర్య పరాక్రమాల వర్ణన శ్లోకం చూద్దాం
‘’ధైర్యే నమ్నీ కృతో మేరుర్జన్డ్యవాన్ తుహినా చలః –మంద రాద్రి రపి భ్రాంతం కదం స్యుర్యేన తేసమాః ‘’
రెండవ స్తబకం లో 68శ్లోకాలున్నాయి ..ఆరు ఋతువుల వర్ణన ఇందులో విస్తారంగా చేశాడు .సీతారాముల క్రీడలున్నాయి .పుష్పవనాలు జలదారలను వర్ణించాడు .ముక్త పద గ్రస్తం లో వసంతు ఋతు వర్ణన బాగుంటుంది .
‘’శ్రీమత్పల్లవ తల్లజ సముల్ల సత్ప్రసూన సాయక సముత్స ముచిత ,వాసంతికా లతో దవిసితమహామండప పటలీవిభాసమానం ,విభాస మాన స్వద్రుమన్మనోహర మరంద బిందు సముయదాస్వాదానంద తుందిల సమున్మత్త శీలాముఖం ,శీలా ముఖ ‘’ఇలా సాగిపోతుంది .వర్షతువులో ఆరుద్ర పురుగు వర్ణన కవితాబద్ధం చేశాడు కవి .
‘’తదేంద్ర గోషాః కాశ్యప్యాం కురు విందఇవా బభుః-మహేంద్రాయ బలిం దాతుం విన్యస్తా వర్ష హేతవే ‘’
మూడవ స్తబకం లో 67మాత్రమె ఉన్నాయి .ఇవన్నీ సీతారామ కామక్రీడా వర్ణనలే .సభ్యతా సరిహద్దు దాటి కూడా వర్ణించిన శ్లోకాలున్నాయి .ఉదయ సూర్య వర్ణన ముచ్చటగా ఉంది –
‘’చకాశ కౌముదీ కామం కౌముదం తన్వతీద్విజాన్ –ప్రాచీ దిక్కామినీ కాంత నాసా ముక్తా రుచిర్యదా ‘’
అనంత రామ పండితకవి ఛందో వైవిధ్యం బాగా చూపాడు ఇదే తర్వాత తెలుగు కవులకు మార్గదర్శన మైంది .చంపు బదులు చంబు అని వాడిన మొదటికవి ఈయనే .
5-ఆసూరి అనంతా చార్య (1930)
ఇరవయ్యవ శతాబ్ది చివరికవి ,మహోన్నత పండితుడు ఆసూరి అనంతాచార్య .తెలంగాణా వాడు .జమీ౦దారులతో ఎన్నో సన్మానాలు అందుకోన్నవాడు .నాల్గొండ జిల్లా బేతవోలు ,కృష్ణా జిల్లా మునగాల జమీందార్లు చేసిన సత్కారం చిరస్మరణీయం .’’చంపూ రాఘవం ‘’1863లో రచించాడు .ఇది 1929లో ప్రచురితమైంది .ఇది భోజుని చంపువు ను మించి ఉందని శిష్యుడుఆసూరి వెంకట నృసింహా చార్య అన్నాడు .దీన్ని తెలుగు అక్షరాలలో ప్రింట్ చేశారు .కనుక మిగిలిన వారికి దీని సౌరభం తెలియటం కష్టమైంది .భోజుడిని అనుకరించటం లక్ష్యంకాదుకాని శ్రీ వైష్ణవ ప్రచారానికే ప్రాదాన్యమిచ్చాడు .గురువు నృసింహ సూరి ని స్తుతిస్తూ కావ్యం మొదలు పెట్టాడు .60విశిష్టాద్వైత మతాలను వివరించాడు .విశిష్టాద్వైతం లో పరమ శివుడు శ్రీమహా విష్ణువుకు పరమ భక్తుడు .
రావణుడు అష్ట దిక్పాలకులను బంధించి అష్ట కస్టాలు పెట్టె వర్ణ న చూడండి –‘’సోయం బిడౌజసం నిస్తేజసం తనూన పాతం ,సమవర్తినం శ్రమ వర్తినం ,నైక్రుతం భీరు రుతం ,ప్రచేతసం విచేతసం ,జగత్ప్రాణం గలత్ప్రాణం,ధననాధం ధన బాదం ,గార కంఠం కరు కుంఠం,ప్రభాకరం అభాకరం ,తారాపతిం కరాస్తితం చ సతతం సంతనోతీతి ‘’
లక్ష్మణుడి శేషత్వం శ్రీ మత్వాలను రామునితో అడవికి వెళ్ళేటప్పుడు తెలియ జేశాడు .లంక లోని సీత తన ఇల్లాలు కావాలని రావణుడి కోరిక తెలిపే శ్లోకం –‘’పశ్య దోషా చరేశం మాం ,భవత్వంసహా ధర్మిణా-నైచే త్వమాహవ మేవాంతే ,వసన్నద్య నిపీడయే ‘’.ఈ కావ్యం 70సార్లు ముద్రణ పొందింది .కిష్కింద కాండలో ని వసంత ఋతువు వర్ణనలో లో ఆసూరికవి దీప్తి ఆ సూర్యుని లా భాసిస్తుంది .భోజ పోలికలేమీ లేకుండా సృజన పరాకాష్ట గా ఉంటుంది .రెండు శ్లోకాలు మచ్చుకి
‘’చకోరా జ్యోత్స్నా యాం త్రుప్యం చాతకా ఇవ వర్శతః –వవర్దురప్యకూపారా స్తభ కామ్క ఇవ వైణవః
స్ప్రుటంతీన్దీవరాస్తోమా ద్రుశో నృణాం నిమీలితాః-చరన్తి రాక్షసాస్సర్వే నశ్యంతి చ తమోగుణాః’’.రామ రావణ యుద్ధం లో కవి శృంగార ,ఉత్సాహ ,కరుణ ,ఆశ్చర్య ,అతిహాస ,భయానక భీభత్స రౌద్ర ,శాంత అనే తొమ్మిది రసాలను వర్ణించాడు .
సీతా రాముల జన రంజక పాలన తో చంపూ రాఘవం పూర్తవుతుంది .’’తారక సంకుల మాస మహీయం తారక మేవ భవాబ్ది గతానాం –కొరకితా ఋతుకాల మనాప్త ,సార మితి కిల సస్య జలాప్తా ‘’.చివరగా ఫల స్తుతి చెప్పాడు ‘’యోవా ఇమాం రామ కదా సుదామా దధాతిభూమౌ స సుపర్వరాజః –యధేహ సౌభాగ్య కళాది పూర్ణః స్తతః పదం శాశ్వతముల్లభేత ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
‘’
‘
‘’
లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -3
21-శీతాద్రి మందిర సురస్తుత కృత్య శూలిన్ –హేమాద్రికార్ముక హిమాద్రి సుతా కళత్ర
విద్రా వితాసుర సురద్రుమ వద్వితీర్ణ –భద్ర ప్రదాన పురుష ప్రణమామి పాహి .
22-ఉన్మత్త పుష్ప సుహితాయ ,హితాయ తుభ్య –మున్మత్త మన్మధ హరాయ ,హరాయ నౌమి
ఆయుః ప్రయచ్చపరమం పరి పాల యాస్మాన్ –సర్వత్ర దేహి విజయం వినయం చ విద్యాం .
23-కంఠే కాలం వపుషి ధవళం లోహితం కేశ పాశే –భూషాస్థానే భుజగ భరితం చంద్ర సాంద్రం కిరీటే
దారార్ధాంగం భవహర మజం సర్వ దేశ ప్రభుత్వాం-శాంతం దాంతం శరణ మగమం పాహిమాం దేవ దేవ.
24-ద్రుతవిలంబిత భక్తి సమాశ్రయ –ద్ద్రుత విలంబిత సత్ఫలదానమాం
హర ,శివాద్య భవా౦తక సంహర –మహిత భవ్య తనో పశునాయక .
25-వందే సర్వ దురంధర –మి౦దీవర బంధు క౦ధ రాభ్యర్ధం
సుందరరూప మధీశమ్ –వందారుం పాతుమాం సదా సోయం .
26-ఆర్యాం సంగత మార్య౦ –సూర్యాంత ర్భాస మాన మసమానం
ఆర్యా గీత్యా సంస్తౌ –మ్యార్యం హ్యార్యేషుమాంసదా కుర్యాత్ .
27-అభవ కమల విలసిత పదయుగ్మే-జటిల కమల విలసిత పద జాలైః
స్తుతి మనిశ మకరవ మను గృహాణ-ప్రణయ హృదయ కమల విలసితాప్త్యా.
28-భవ మజ మవితారం సర్వ లోకైన నాధం-జటిల మభవ మాద్యం సర్వదా తారమీశం
హర మమర పతిం త్వాంవందనీయం నమామి –త్వమ పృధుక మేనం సత్యనారాయణం మాం .
29-సింహ వాహా పతే స్వర్గ గేహ ప్రభు –స్తుత్య మాం సర్వదా సత్యనారాయణం
త్వత్పాదాంభోజ యుగ్మ ద్విరేఫాయితం –భక్తి యుక్తిం విదేయం విధేహి ప్రభో .
30-సర్వ లోకా౦తవోత్దాను రాగా పిత –స్వేస్ట సర్వేశ దేవేశ భో
కర్త్రుతా,భోక్త్రు తా,దాత్రుతా, దాత్రుతా –యుర్మఖైః పాల్యతా మర్భకో య౦ త్వయా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
మనవి –బెజవాడలో ఉన్న సంస్కృత మహా విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు పరిచయమవ్వగా వారికి మన గీర్వాణం గురించి దాని అభివృద్ధి గురించి తెలిపి ,మన పుస్తకాలు పంపి వారి గురించి వారికి తెలిసిన ఇతర సంస్కృత కవులగురించి, గ్రందాల గురించి వివరాలు ఉంటె ఇవ్వమని కోరాను. వారు మాడభూషి క్రిష్ణమాచారియార్ పుస్తకం లో విషయాలు రాశారా అని అడగగా అక్షరం వదలకుండా రాశానన్నాను .ఆచార్య బిరుదరాజు రామ రాజు గారి పుస్తకం చూశారా అని అడిగితే లేదని చెప్పగా దానిపేరు ‘’Contribution of Andhra to Sanskrit Literature ‘’అని బాగా రాశారని ప్రయత్నించి తెప్పించుకోమని తన దగ్గరున్న పుస్తకాలు వివరాలు త్వరలో పంపిస్తానని చెప్పారు .నేను వెంటనే మా ఆత్మీయులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారికి ఈ విషయం మెయిల్ రాశాను . వారు ఆ సాయంత్రానికి నెట్లో వెదికి అది హైదరాబాద్ లోని సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘’వారి దగ్గరున్నదని ,వారి అబ్బాయి శ్రీ బసవ రాజు గారు చెప్పారని వారి నంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటే రాజుగారికి ఫోన్ చేయగా ,తమవద్ద స్టాక్ అయి పోయిందని భీమిలీ లో ఉన్న తమ సోదరి శ్రీమతి రాధాకుమారి గారి వద్ద ఉన్నాయని తాను ఫోన్ చేసి చెప్పానని ,నన్నుఫోన్ చేసి మాట్లాడమని ఏంతో ఆత్మీయంగా చెప్పారు .వెంటనే రాదాకుమారిగారికి ఫోన్ చేయగా తమ అన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారని, నా అడ్రస్ ను మెసేజ్ గా పంపమని చెప్పారు. వెంటనే ఆ పని చేశాను .వారు కొరియర్ లో ఖర్చులు పెట్టుకొని ,పుస్తకం ఖరీదు 112రూపాయలు కూడా తీసుకోకుండా ‘’అమూల్యం ‘’గా నాకు పంపారు .అన్నా సోదరిల సౌజన్యం మరువలేనిది .వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియ జేశాను .ఈ గ్రంధం నా చేతిలోకి రావటానికి ఇంత జరిగింది .ఇదంతా మా గోపాల కృష్ణ గారికి నామీదా, సరసభారతి మీద ఉన్న అపూర్వ గౌరవం సహృదయత, ప్రోత్సాహం .వీరందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .రామ రాజు గారు చాలా శ్రమ పడి విషయ సేకరణ చేసి800 పేజీలలోఆంగ్లం లో రాసిన ఉద్గ్రంధం ఇది .దీన్ని చదువుతుంటే వారికిఇలాంటి గ్రంధాన్ని రాయాలన్న కోరిక కు ప్రేరణ అంతకు ముందే వచ్చిన ‘’contribution of Kerala to Sanskrit Literature ‘’మరియు ‘’contribution of West Bengal to Sanskrit Literature ‘’అని అర్ధమైంది .ఇలా ఎవరో ఒకరు ఆ రాష్ట్ర కవుల రచనలగురించి రాయక పొతే ఎలా తెలుస్తుంది ?రాజుగారి ప్రయత్నం పి.హేచ్.డికోసం చేసింది .కానిఅనివార్య కారణాల వాళ్ళ అది సాధ్యం కాలేదు .కనుక వారే పూనుకొని ఢిల్లీ లోని సంస్కృత సంస్థాన్ మొదలైన సంస్థల ఆర్ధిక సాయం తో 2002లో ప్రచురించారు . ఈ పుస్తకం లో నేను ఇప్పటిదాకా రాయని కవులు చాలామంది ఉన్నారు .వారి గురించి ఇక వరుసగా నాల్గవ గీర్వాణం-‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4లో ధారా వాహికంగా రాస్తున్నాను .చదివి స్పందించండి .-మీ దుర్గా ప్రసాద్
3-అన్నయార్య (1704-1778)
ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం లో ఉన్న సూరాపురం జమీందారి ని బేదార్లు అనే తెలుగు నాయకులు పాలించారు .1752-1773కాలం లో పాలించిన పామినాయకుడు ముగ్గురు వైష్ణవ మతాచార్య సోదరులను అక్కడికి ఆహ్వానించాడు. వారి ప్రభావం వలన జమీందారు వైష్ణవ మతం స్వీకరించాడు .వీరు అనంతపురం జిల్లాలోని లోని జమ్మల మడుగు తాలూకా బుక్క పట్టణానికి చెందిన వారు .శ్రీనివాసాచార్య వెంకాంబ కుమారులు .వారే వెంకటార్య ,అన్నయాచార్య లేక అన్నయ దీక్షితులు ,చిన్నయా చార్య లేక శ్రీనివాస దేశికులు .వీరి ని బుక్కపట్టణం కుటుంబం వారు అంటారు .వీరంతా మహా విద్వాంసులు మహా కవి పండితులు .సోదరత్రయం దాదాపు వంద సంస్కృత గ్రంధాలు రచించారు .కాని చాలా భాగం అచ్చుకు నోచుకోలేదు .శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు వీరి చరిత్ర త్రవ్వి తీసి వెలుగు లోకి తెచ్చారు. అయితే అన్నయార్య విషయం లో రెడ్డిగారు పొరబడ్డారు .వీరి వారసులు ఇప్పటికీ కర్నాటక,ఆంధ్రా లో మహబూబ్ నగర్ జిల్లా అమర చింత వనపర్తి లలో ఉన్నారు .పామినాయకుడు భార్గవ పురాణం రాశాడు ,వైష్ణవం లోకి రాకముందు ఆయన పేరు రాఘవ భూపాలుడు .వెంకటార్య రాజ గురువు .అన్నయార్య ,శ్రీనివాసులు కూడా పామినాయక ,ఆతనికుమారుడు వెంకట నాయక పోషణలో ఉన్నారు .
అన్నయార్య వాజపేయం పౌ౦డరీకం ,గారుడ చాయణం ఆప్తోర్యామ చేసి దీక్షితుడయ్యాడు .అన్నయార్య ‘’తత్వ గుణాదర్శ౦ ‘’అనే చంపూకావ్యం సంస్కృతం లో రాశాడు .ఇది వెంకట నాయక పాలనలో రాసినట్లు కనిపిస్తుంది .తన వంశ చరిత్రను ముందే రాశాడు .ఇది వేంకటాధ్వరి రాసిన ‘’విశ్వ గుణాదర్శం ‘’ను పోలి ఉంటుంది .జయ ,విజయ అనే పాత్రల ద్వారా వైష్ణవ ,శైవ మతాల విషయ చర్చ చేయించాడు .
‘’ఆచార్య వింశతి ‘’అనే స్తోత్రాన్ని వేదాంత దేశికులపై రాశాడు .ఇరవై శ్లోకాల కావ్యం .చివర్లో తన గురించి చెప్పుకున్నాడు .’’దేశిక యశో భూషణం ‘’అనే మరో కృతి చేశాడు ‘’రసోదార భాణ౦ ‘’రాశాడు ఇది శృంగార తిలక వసంత మంజరి ల ప్రేమకధ 246శ్లోకాలున్నాయి .కొంత గద్యమూ ఉంది .కవిత్వాన్ని గుప్పించేశాడు .ఉపోద్ఘాతం లో తన గురించి తాన సమకాలికుల గూర్చి రాశాడు .నాంది లోనే కవి గారి కవితా శక్తి జ్యోతకమవుతుంది .దీన్ని వెంకటాచలం లోని శ్రీనివాస ఉత్సవాలలో ప్రదర్శించేవారు .చివర ఇచ్చిన వివరాలను బట్టి తల్లి లక్ష్మాబ అని తెలుస్తుంది .గురువు ఆచార్య దీక్షితులు .72శ్లోకాలతో ‘’అభినవ కర్ణామృతం ‘’రాశాడు .విశిష్టాద్వైత గ్రంధాలు కూడా అన్నయార్య రచించాడు .అవే ‘’ఆనంద తార తమ్యఖండనం ,’’వ్యావహారికత్వ ఖండన సారం ‘’.
ఆయన రచనా వైదుష్యానికో మచ్చు తునక—‘’ఇచ్చండాయార్ధ విదుషా కమలా నివాస –తాతార్య గర్భ జనుషా సుగుణైక ధామ్ని-ఆచార్య దీక్షిత కటాక్ష ద్రుతాతి భూమ్నా-ప్రీత్యైహరేర్వరచితో మధురః ప్రబంధాః’’
మరోకవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-15-ఉయ్యూరు
నమస్తే చక్రధర్ గారు -ముందుగా మీకు,మీ కుటుంబానికి దీపావళి శుభా కాంక్షలు మీరు ఏంతో ఆప్యాయంగా నన్ను చదవమని మా రమణ తో అందజేసిన”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” పుస్తకం ఈ నెల రెండవ తేదీ న మొదలు పెట్టి పదకొండవ తేదీ అంటే ఈవేళ, తొమ్మిది రోజుల్లో నాకు వీలు దొరికినప్పుడు చదు వుతూ పూర్తీ చేశాను .చాలా గొప్ప పరిశ్రమ చేశారు మీరు .నాకూ అక్కినేని అభిమానం ఉంది . ఎన్నో విలువైన ఫోటోలు సేకరించారు ఎంతోమంది అభిప్రాయాలను సేకరించి రాశారు .బాగు0ది . మంచి రీడబిలిటి ఉన్న పుస్తకం అందరు చదివి జీవిత వికసనాన్ని పొందాల్సిన పుస్తకం . యువతకు గొప్ప ఆదర్శ గ్రంధమే.వ్యక్తిత్వ వికాసానికి అన్నిరకాలా దోహద పడే ఉపయుక్త గ్రంధం . నాకు ముఖ్యం గా ఆదుర్తి రాసిన ”దొంగ ”ఆత్రేయ రాసిన ”ఆప్తుడు ”చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి మిగిలినవి మెహర్బానీకి మొహమాటాలకు చెప్పినట్లున్నాయి .ఇండస్ట్రిలో ఇవి తప్పవు అనుకొంటా ..వీలు చూసుకొని నా పూర్ర్తి సమీక్ష రాస్తాను –దుర్గాప్రసాద్ This gallery contains 25 photos.
సాహితీ బంధువులకు దీపావళి శుభా కాంక్షలు -స్వర్గీయ సద్గురు శివానంద మూర్తి గారి ”సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ”చేసే సేవా,ధార్మిక సాహిత్య ,సాంస్కృతిక కార్యక్రమాలను,సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికాలో ఉంటున్నా నిశితంగా పరిశీలిస్తూ సద్గురువు లపై ఉన్న భక్తీ తాత్పర్యాలకు నిదర్శనం గా , సంస్థ అభివృద్ధికి ప్రోత్సాహకంగా , ఆసంస్థ కు సరసభారతిద్వారా రూ 11,116(పదకొండు వేల నూట పదహారు రూపాయలు ) సభక్తికంగా 2-11-15 న అందజేయి0చారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను . గొపాలకృష్ణ గారి వితరణకు అభినందనలు తెలియ జేస్తూ ,ఇందులో సరసభారతికి సముచిత స్థానం కల్పించినందుకు ,వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవానుడు ఆయు రారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాను . దుర్గాప్రసాద్
—