గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

కలువే వీర్రాజు అనే క్షచంద్ర వంశ క్షత్రియుని కుమారుడు నంజరాజు .భారద్వాజస గోత్రం .తండ్రి సైన్యాధ్యక్షుడై తర్వాత  18వ శతాబ్దం లో మైసూరురాజుఅయ్యాడు .తండ్రిలాగానే కొడుకు నంజరాజుతెలుగు కన్నడ సంస్కృతాలలో  కవి. ఎందరో కవిపండితులకు ఆశ్రయమిచ్చి ‘’నవ భోజ రాజు ‘’అని పించుకొన్నాడు .ఇతని ఆస్థానకవి నవ కాళిదాసు ‘’నంజరాజ యశో భూషణం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు . . నంజరాజకవి ‘’హాలస్య మహాత్మ్యం ‘’’’కాశీ మహిమార్ధ దర్పణం ‘’అనే రెండు తెలుగు కావ్యాలు రాశాడు .

సంస్కృతం లో నంజరాజు ‘’శివపాద కమల రేణు సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల కావ్యాన్ని శివునిపై రచించాడు .దీనినే శివ లీలార్ణవం అంటారు ఇది వేదాంత దేశికుల పాదుకా సహస్రం కు అనుకరణ .ఇది 25 పద్దతులుగా విభజింప బడింది .ప్రతిదానికీ  .ప్రస్తావన ,ప్రభావ ,భావన ,రూప ,ప్రసాదాన ,శృంగార ,కుసుమ ,ప్రణామ ,స్తుతి ,సంచార ,నియమ ,స్వాతంత్ర్య ,తాండవ ,రత్న ,అర్చన ,నక్షత్ర ,విడంబన ,భక్తీ ,శాస్త్ర ,యోగ ,విశ్రాణన ,దయా ,లక్ష్మి ,శైశవ ,చిత్ర అని పేర్లు పెట్టాడు .మొదటి శ్లోకం –

‘’ఈశం శైల సుతా నిభాస్య రారజో చండీశ్వరం నందినం –నత్వా భ్రుంగి రిటింత్రిషస్టమహితాశ్చభక్త్యున్నతాం క్త౦ ‘’

చివరి శ్లోకం

భద్రాకారం వహతు  సదా నః స్వాన్తోమూర్తిం శివ పాద రేణోభవ్యే-భవ్యేదాసేమయి కరుణా ర్ద్రే భంగే స్తాపం శమయ సుధా దృష్టీనాం’’

ఆశ్వాశాంత గద్యలో –‘’ఇతి శ్రీ చంద్ర కుల జలధి కౌస్తుభ శ్రీ కలువే శ్రీ వీర రాజ గర్భ పయః పారావార తనూభవాభి నవ భోజ రాజ బిరుదాంకిత నంజ రాజ విరచితే శివ లీలార్ణవ నామ్నిశివ పాద కమల రేణుకా సహస్రే చిత్ర పద్ధతిః సమాప్తా ‘’.నంజ రాజు రాసిన రెండవ గ్రంధం ‘’గీతాగంగాధరం ‘’ఇదీ శివ స్తుతియే .గీత గోవింద పద్ధతిలో ఉంటుంది .నాలుగు కాండల కావ్యం .దీనికి అదే ఆస్థాన పండితుడైన  కాశీ పండితుడు రాసిన శ్రవణానందిని అనే వ్యాఖ్యానం ఉంది .మొదటి శ్లోకం

‘’శ్రీ శైలజా చరణా పరసక్తి చిత్తః శ్రీ కంఠ పాద సరసీ రుహ చంచరీకః –శ్రీ వీర రాజ నృప శేఖర సత్కుమారఃశ్రీ నంజరాజ సుకవిఃకురుతెప్రబంధం ‘’.తరువాత శ్లోకాలలో వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .చివరగా –‘’

వీర నృపాల నందన న౦జమహీపతివిరచిత గీతం –ధీరజనాయ తనోతు శుభాని సదా శివ వర్ణన పూతం ‘’అని పూర్తీ చేశాడు

49-తట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ‘(19వ శతాబ్ది చివరి కాలం )

వట్టిపల్లి వెంకట లక్ష్మి ,సాంబ శివల పుత్రుడే కాశ్యప గోత్రీకుడైన నర కంఠీరవ శాస్త్రి ‘.తిరుపతి సంస్కృత కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్.19వశతాబ్ది చివరికాలం వాడు .20వ శతాబ్ది ప్రధమ భాగం లో మరణించాడు .ఎన్నోకావ్యాలు రాసినా కొద్ది లఘుకావ్యాలే దొరికాయి .అందులో శ్రీ వెంకటేశ్వరస్తోత్రం ,శ్రీ జ్ఞాన ప్రసూనా౦బి కా స్తోత్రం మాత్రమె మిగిలాయి .మిగిలినవన్నీ వ్రాతప్రతులుగా ఉండి పోయాయి .16ఏళ్ళ వయసులోనే ఆర్యా ఛందస్సులో 296శ్లోకాలాలో అభినవ వాసవ దత్తరాశాడు శివునిపై శ్లోకం తో మొదలు పెట్టాడు

వందామహే మహేశం వందారు జనాభి లాషిత మందారం –బృందారక మణి మకుటీసుందానిత సూన  .మురభితా ౦ఘ్రి యుగం ‘’

తర్వాత పార్వతి గణేశ సరస్వతిలను వాల్మీకిని స్తుతించాడు .వివరంగా వంశ చరిత్ర చెప్పాడు .

జ్ఞాన ప్రసూనామ్బికా నవ రత్న మాల లో 9అశ్వధాటి శ్లోకాలున్నాయి .అమ్మవారు కాళహస్తిలోని దేవత ‘

’కంఠారవో దధుప కంఠారిదుర్విహకంఠీర  వేంద్రా గమనో –త్కంఠానికామ సహితి కంఠాను కర్షికలక కంఠామలాప లలితా

శృంఠీభవ హనుజ క౦ఠీరవ ప్రకర  కుంఠీకృతిక్షమ బలా –కుంఠీ కరోతు నర కంఠీరవాఖ్య కవి క౦ఠీరవస్య దురితం ‘’.ఈకవి కొన్ని గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు అవి –వెలు వెంటి గరుడా చాల యజ్వ రాసిన తప్త చక్రాంక విధ్వంసనం , ,అయ్యాన విద్వత్ రాసిన వ్యాస తాప్తర్యా నిర్ణయం.

50-నారాయణప్ప మంత్రి

ఈ కవి కాలాదులేమీ తెలియ రాకపోయినా ‘’అభినవ భారతం ‘అనే 24సర్గల మహా కావ్యం రాసినట్లు తెలుస్తోంది .మొదటిదానిలో ప్రారంభం చివరిదానిలో సమాప్తం దొరకలేదు .దేవయాని  శర్మిష్ట ల కద ఇది .మొదటి సర్గలో శంతనుని వివాహ వర్ణన ఉన్నది

‘’విజ్ఞాప్య మాత్రే సుర సిద్ధ సూను రంబాలికా౦బికయా సహాంబం –పాణిగ్రహం కార యితుం చ తాసాం విచిత్ర వీర్యేణ సముదాతో భూత్’’

చివరలో యుదిస్టిరుని పరిపాలన ఉంది

‘తస్మిన్ మహీం శతాని ధర్మ సూనౌ ప్రజాః స్వధర్మే నిరతాఃసమస్తా –కలిస్తదానీంన భూమౌ ప్రవర్తితః కర్తాయుగశ్చధర్మః ‘’ఆశ్వాసాంత గద్యలో  –‘’ఇతి నరసప్ప మంత్రి కృతాభినవ భారతే మహాకావ్యే త్రయో వింశతి సర్గః ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్

సన్ వెన్ అని చైనా వాళ్ళు ఆప్యాయం గా పిలుచుకొనే సన్యట్ సేన్22-11-1866న చైనా దేశం అవినీతి ,కుట్రా కుతంత్రాలతో కుది౦చుకుపోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు చైనాలోని ‘’టౌన్ ఆఫ్ బ్లూ వాలీ ‘’అని పిలువబడే చోయ్ హాంగ్ లో జన్మించాడు .అద్భుత చియాంగ్ వంశ రాజురికం  విచ్చిన్నమైపోతోంది .విదేశేయులు ద్వారాల దగ్గర నిలబడటమే కాక వారిని ఊది పారేస్తున్నారు .అన్నాం ఫ్రెంచ్ సంరక్షణలో ,హాంగ్ కాంగ్ బ్రిటిష్ వారికి దక్కి ,మరో అయిదు ఓడరేవులుప్రారంభమై  పాశ్చాత్య వర్తకులను ఆహ్వానించాయి .టైపింగ్ తిరుగు బాటు దారులను ఓడించినా ,వారింకా సామ్రాజ్య సైనికులను వేధిస్తూనే ఉన్నారు .

చైనాలో కుటుంబం లేక వంశం పేరుముందు ఉంటుంది .’’సన్’’ అంటే వారసుడు అని అర్ధం .’’యట్ ‘’అంటే విశ్రాంతి అని అర్ధం .తల్లి తనకొడుకు విలాసంగా జీవి౦చరాదని కోరుకొంటుందనే భావానికి సూచన ‘’.సేన్ ‘’అంటే తల్లికి ఉండే మరో కోరిక ‘’చిరంజీవి ‘’గా వర్ధిల్లాలని తెలుపుతుంది .ఈ కుర్రాడి స్కూల్ లో పేరు ‘’వెన్ ‘’అంటే విద్యావంతుడు అని అర్ధం .చైనీయులుతమ పేర్లను ఆషామాషీగా భావించరు.దానికొక పరమార్ధం ఉందని పేర్లు పెడతారు . సేన్ తండ్రి ‘’సన్ తట్ సంగ్’’చదువురాని వరి పండించే రైతు .కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేసేవాడు .ఇంటిని మట్టి ,గానుగ సున్నం తో కట్టుకొన్నాడు .ఇంట్లో నేల నెర్రెలు విచ్చి ఉండేది .ముగ్గురు కొడుకులలో సేన్ చివరివాడు .ఇతను పుట్టే సరికి తండ్రికి54,తల్లికి40 వయసు .ఇద్దరాడపిల్లలు ,విధవలైన ఇద్దరు ఆంటీలు .ఇంతమంది ఇరుకిరుకుగా ఆ ఇంట్లోనే గడిపేవారు .కస్టపడ్డప్పటికీ సేన్ బాల్యం సంతోషంగానే గడిచింది .గాలిపటాలు చేపలవేట ,సెలవల్లో మందుగుండు సామగ్రి తయారు చేయటం తో కాలక్షేపం .మిగిలిన ఊరి పిల్లలకంటే ఒక విషయం లో వేరుగా ఉండేవాడు .నాగలి దున్నటం ఆచారం ఇస్టము౦ డేకాదు .స్వేచ్చగా స్వాతంత్ర గీతం పాడుతూ దేశ దేశాలు తిరిగే పక్షిలా ఉండాలనుకోనేవాడు .ఆవిషయాన్ని బహిరంగం గా చెప్పలేదు కాని అతని మనసులోని కోరిక మాత్రం అదే .పక్షి చేసే కిలకిలా రావం వింటే ఈభావామే పొటమరించేది..తెలియని సుదూర దేశాల గురించి కలలు కనేవాడు .ఒక ముసలి సైనికుడు గ్రామీణ మాండలికం లో అసాదారణమైన టైపింగ్ ల యుద్ధాలు ,వాళ్ళు యుద్ధ వీరులను ఎదిరించటాలు ,బానిసత్వం పై ద్వేషం ,అందరికీ సమానంగా భూమిని పంపిణీ చేయటం ,శిలువకు తప్ప దేనికీ వంగని ధైర్య సాహసాల గురించి  చెప్పిన కదలు విని  ఊగిపోఎవాడు .

బాల్యం లో అందరిలాగానే కస్టపడి స్కూల్ కు వెళ్లి చదివాడు .ముఖం దేవాలయ బడి , గోడకు పెట్టి ,పంతులగారి వెదురు బెత్తం దెబ్బలకు అటూ ఇటూ కదుల్తూ చైనావారి ఒకటో తరగతికిచెందిన  మూడక్షరాల క్లాసిక్  బట్టీ పడుతూ ఉండేవాడు .ఇతని కుగ్రామం  చాలా వెనుక బడినదే. ఎదిగే వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్లి పోవాలని అనుకొనేవాడు . ఈ చాన్స్ 15ఏళ్ళ వయసులో వచ్చింది .ఇతనికంటే పదిహేనేళ్ళ పెద్దవాడైన అన్న ‘’ఆ మీ ‘’ హవాయి ద్వీపానికి వెళ్లి సంపన్నుడయ్యాడు .ఒక సారి ఇంటికొచ్చి తమ్ముడిని తనకు సహాయం గా తీసుకొని వెళ్ళటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .హానాలూలు చేరే టప్పటికి సేన్ బలమైన గడ్డం ,సున్నితమైన నోరు ఉన్న  14 ఏళ్ళ కుర్రాడే .  అన్నకు అక్కడ ఒక ఫారం తో బాటు జెనరల్ స్టోర్స్ కూడా ఉంది .అక్కడ స్టోర్స్ లో పని చేస్తూ హవాయ్ ,జపాన్ మూలాలను గ్రహించి ,జ్ఞాన సంపాదనకోసం ఆరాట పడ్డాడు .అన్న తమ్ముడిని చర్చ్ ఆఫ్ ఇంగ్లీష్ స్కూల్ లో చేర్పించాడు .ఇక్కడ లెక్కలు బైబిల్ ,చరిత్ర నేర్చాడు .తండ్రి క్రైస్తవానికి మారాడు .కనుక ఈ చిన్నకొడుకు తాను  కూడా క్రిస్టియన్ అనే అనుకొన్నాడు .ఇంగ్లీష్ భాషలోనే క్లాసులు జరిగేవి .తమ్ముడు ప్రజ్ఞావంతుడై ,పాశ్చాత్యులకంటే మరీ వేస్త్రెన్ గా మారిపోతున్నాడని అన్న అనుకొనే వాడు .17ఏళ్ళ వయసులో ఇంగ్లీష్ గ్రామర్ పరీక్షలో సేన్ బహుమతి పొందాడు .కుర్రాడు ముదిరాడు అని గ్రహించి సమాజం లో తన స్థానానికి ప్రమాదమని  అన్న తమ్ముడిని చైనాకు తిరిగి పంపించేశాడు .

యువ  సన్యట్ సేన్  చదువు తో తిరిగి వచ్చి ఇబ్బందిపెట్టాడు .సంప్రదాయాన్ని అనుసరించటానికి ఒప్పుకోలేదు విగ్రహారాధన ,పూర్వీకుల ఆరాధన ,పూజ లపై తిరగ బడ్డాడు .ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలలో ఒక దాని వేలు విరగ్గొట్టాడు .ఊరంతా ఆశ్చర్యపోయింది ఇతని ప్రవర్తనకు.బహిష్కరించి హాంగ్ కాంగ్ కు పంపేసింది .కొన్ని నెలల తర్వాత్ క్వీన్స్ కాలేజిలో చేరి బైబిల్ చదివి అత్యుత్సాహంగా క్రైస్తవం గురించి దిమ్మ తిరిగేట్లు మాట్లాడటమేకాక ఇద్దరు విద్యార్ధుల్ని మతం పుచ్చుకోనేట్లు చేశాడు .ఇంతలో యెంత మార్పో ?

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వేటూరి ఆనంద మూర్తి గారి లేఖ

image (7)

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వర్తమానం లో జీవించు ,శరీరం మీ ఏకైక కానుక- కృష్ణ పాండవీయం కి యాభై – ఎడారిలో కోయిల రంగనాధ్

Inline image 1  జీవితం మInline image 1


Inline image 2
Inline image 1
Inline image 2
Inline image 1
Inline image 2

Inline image 2న


Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనకు తెలియని మన తెలుగు

manaku teliyani mana telugu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -18(చివరిభాగం ) శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

  దైవ చిత్తం -18(చివరిభాగం )

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

                      పదకొండవ అధ్యాయం  

పేజి -173,పేరా-3

.నాలుగు శక్తులలో  బలహీనమైనది అయినా గురుత్వాకర్షణ విశ్వ నిర్మాణాన్ని రూపొందిస్తుందికనుక ఈ పుస్తకం లో గురుత్వాకర్షణ గురించి చెప్పే సూత్రాలకే అధిక ప్రాధాన్య మిచ్చాను .

శాస్త్రి గారి భాష్యం –ఇది ఎందుకంటె పురాణాలు వివిధ దేవతలను వేర్వేరు శక్తులకు ప్రతినిధులను చేసి,తర్వాత దైవమైన గణేశుని కి పేరు పెట్టాయి .ఆయనది  గెలాక్సీలనన్నిటినీ  అఖిల నక్షత్ర మండలాలను అంటే నక్షత్ర గణాలను కలిగి ఉన్న గజ వక్త్ర౦గల శరీరం .అందుకే గణేశుడు  .ఆయన ఎంత శక్తి వంతుడు అంటే దేవతలు కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొంటే,ఏదైనా సృష్టించాలంటే  ముందు ఆయనను పూజించి,ప్రసన్నం చేసుకొని విఘ్నాలు రాకుండా చూసుకొంటారు. దీనిని ఆయన వ్యతిరేక శక్తుల అంటే గెలాక్సీ ఎడమ ,కుడి చుట్టగా ఉన్న నక్షత్ర సముదాయాలు బాహువులుగా ఉన్నవాడని గ్రహించాలి .ఈనాక్షత్రాలు ఎడమ వైపు ఉంటె కొంత ప్రభావాన్ని చూపిస్తాయి .కుడి వైపు ఉంటె వ్యతిరేక ప్రభావాన్ని కలగ జేస్తాయి .  మొత్తం మీద ఒక ప్రభావం రెండో దానికి అది మంచి అయినా చెడు అయినా విఘ్నం కలిగిస్తుంది  .ఈ అనివార్య పరిస్థితి ని గుర్తించి దేవుడు కూడా ఈ విఘ్నాల విషయం లో ఏమీ చేయ లేక చేతు లెత్తేశాడని  పురాణాలు పేర్కొన్నాయి. కాని భగవంతుని దయతో నివారింప బడని చెడు పని లేదు .అందుకనే ఆటంకాలు కలగ కుండా చేయమని దయ చూపమని  ముందుగానే వినాయకుని ప్రార్ధిస్తారు .  ఇది తర్కానికి అతీతమైన  భావోద్వేగ విషయం (ఎమో షనల్).మొత్తం మీద గణేశుడు ముఖ్యవిశ్వోద్భవ శక్తి(కాస్మోలాజికల్ ఫోర్స్ ) ఐన   గురుత్వాకర్షణ దైవం.ఈ కీలక భావన వినాయక చవితి కధలో 27నక్షత్రాలకు భర్త అయిన చంద్రుడితో పగ రూపం లో చెప్పబడింది .అలాగే  భాగవతం లోని గజేంద్ర మోక్ష కద కన్యా రాశికి చెందిన హస్తా నక్షత్ర రూపమైన ఏనుగు  ,చివరికి మకరం (మకర రాశి )నుండి  రక్షి౦పబడుతుంది  .ఈ ప్రతీకాత్మికతను గణేశుని ప్రార్ధనలో చివరికి చెప్పే శ్లోకం ద్వారా రుజువు చేయ వచ్చు

‘’వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభా –అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘’

దీని అర్ధం ‘’ఓ గణేశ దేవా !ప్రపంచాన్నిఅన్ని వైపుల నుంచి  పాలించే తుండం కలిగి ఉన్నావు .నువ్వు కోటాను కోట్ల నక్షత్రాలు ఒక చోట చేరితే వచ్చే కాంతితో సమానమై విరాజిల్లుతున్నావు .నేను నీకు సర్వ సమర్పణమయెట్లు చేసి  నేనుయజ్ఞం గా భావించి  నిర్వర్తించే  ఏ క్రతువుకు  కూడా విఘ్నం రాకుండాకాపాడు

పేజి -174,పేరా-3

ఒక వేళ ఏకీకృత సిద్ధాంతం సాధ్యమైతే ,అది నియమాల ఏర్పాటు ,,సమీకరణాలు మాత్రమె .ఈ సమీకరణాలు  విశ్వాన్ని వర్ణించటానికి సాధ్యమౌతాయా ?లెక్కల సూత్రాలు ఎన్ని ఉన్నా విశ్వం ఎందుకు అన్న ప్రశ్నకు ,దాని వివరాలకు  సమాధానం ఇవ్వగలవా?అసలు ఈ విశ్వం ఎందుకు ఇంత కస్టపడి బట్ట కట్టాలి –మనగలగాలి?ఏకీకృత సిద్ధాంతం దాని అస్తిత్వాన్ని చెప్పగలదా?విశ్వానికి సృష్టికర్త అవసరమా ,ఒక వేళ అవసరమైతే ఆయన విశ్వానిపై మరేదైనా ప్రభావం చూప గలడా?

శాస్త్రి గారి మహా భాష్యం –హాకింగ్ గారి మహా ప్రశ్న ‘’ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి తేబడింది ?అని .ఉపనిషత్ సాహిత్యం దీనికి చక్కని సమాధానం చెప్పింది .ఆత్మయేవిశ్వానికి  మూలం ,ఆధారం వనరు ,రూప కర్త (డిజైనర్ ).అవే ఉపాదాన కారణ౦ –ఇచ్చేది  విశ్వ నిర్మాణ రూపానికి నిమిత్త కారణం .మరోరకంగా సులభంగా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే –స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను ప్రయత్నించి’’ దైవ చిత్తాన్ని’’(మైండ్ ఆఫ్ గాడ్ ) తెలుసుకొనే ప్రయత్నం చేశాడు , భారతీయ అద్వైత  వేదాంతం తగిన సమాధానం ఎప్పుడోనే చెప్పింది .మామూలు భాషలో చెప్పాలంటే సృష్టికి కారణం ఆత్మ మాత్రమే .తాత్వికంగా (ఫిలసాఫికల్ )చెప్పాలంటే ఆత్మ సృష్టించటం లేదు .అది అలాగే ఉంది (ఇట్ జస్ట్ ఈజ్ )మనం మనకున్న పరిమిత జ్ఞానం తో ఇప్పుడున్న విశ్వాన్ని దర్శిస్తున్నాం అంతే.దేవుడు లేక ఆత్మ ను చూసి అది సృష్టి అని పొరబడుతున్నాం .నిజానికి సృష్టికి మొదలు ,తుది అనేవి లేనేలేవు .ఉదాహరణ పూర్వకం గా చెప్పాలంటే ఇంద్ర ధనుస్సు ప్రత్యక్ష సాక్షం .వ్యక్తి ఒక ప్రత్యెక స్థానం లో ని బిందువు వద్ద ఉండి ,నిర్నీత దిశలో ఉన్న సూర్యుని చూస్తేనే ఇంద్ర ధనుస్సు కనిపిస్తుంది .వ్యక్తి కదిలిన , లేక సూర్యుడు కదిలిన క్షణం లో అది  కానీ పించదు .అన్నది మన అనుభవమే .సృష్టి కూడా అలాంటిదే .రజ్జు సర్ప భ్రాంతిలో మనం పొరబడుతున్నాం ఈ విషయాలు పూర్వపు అధ్యాయం లోనే మనం చెప్పుకొన్నాం .’’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే దైవ చిత్తం లేక దేవుని మనసు అంటేఅర్ధం  –దేవుడు ఈ విశ్వంగా కనిపించటమే .

కాని దేవుడికి ఆది, అంతం లేవు .దీన్ని అందరూ అంగీకరించారు .విశ్వానికి కూడా ఆద్యంతాలు లేవు గణితం ,తర్కం ఆధారంగా వాదిస్తే –‘’అవి రెండూ ఒకటి కావా ?అవును రెండూ ఒకటే .ఇదే స్వామీ అద్వైత సిద్ధాంతం .హాకింగ్ గారి ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే ఇదే – దైవ చిత్తం –దేవుని మనసు .

సంపూర్ణం

మనవి -నా మీద అత్యంత ఆదరాభిమానాలతో తాము రాసిన ”దిమైండ్ ఆఫ్ గాడ్ ”పుస్తకాన్ని డిసెంబర్ 20 వ తేదీన నాకు తమ ఇంటి వద్ద అందజేసిన శ్రీ ఏ .సి పి.శాస్త్రి గారికి ధన్యవాదాలు .దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తాను అని అప్పుడే వారికి చెబితే మహద్భాగ్యం అన్న సౌజన్యం వారిది .మర్నాడు 21తేదీ నుండి వారి పరిచయం తో పాటు ”దైవ చిత్తం ”ను రాయటం మొదలు పెట్టి ఈ రోజుకు అంటే 7వా తేదీకి  18ఎపిసోడ్ లుగా రాసిపూర్తీ చేసి  మీకు అందజేశాను . ఇందులో గుణాలన్నీ శాస్త్రి గారివి హాకింగ్ గారివి . దోషాలన్నీ మాత్రం నావే  అని సవినయం గా మనవి చేస్తున్నాను .శాస్త్రి గారి ఆలోచనలను భావాలను ఎంతరకు తెలుగులోకి తేగలిగానో నాకు తెలియదు .వారి చిత్తాన్ని అర్ధం చేసుకోన్నానో లేక నా చిత్తం వచ్చినట్లు రాశానో అనే సందేహం .ఏమైనా ఒక మంచి విలువైన గ్రంధాన్ని అనువదించే మహద్భాగ్యం నాకు కల్పించి నందుకు శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .ఈ వ్యాస పరంపర లో నేను చేసిన పొరబాట్లు ,అర్ధం చేసుకో కుండా రాసిన విషయాలు అర్ధం చేసుకొన్నా సరైన భాషలో చెప్పాల్సిన రీతిలో చెప్పక పోవటం ఏవైనా ఉంటె నా దృష్టికి తీసుకు రావలసినదిగా శ్రీ శాస్త్రిగారినీ ,సాహితీ బంధువులను కోరుతున్నాను .

 

 

 

.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –7-1-16-ఉయ్యూరు

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉడతలు లేని ఊరు ,పిచ్చికలు లేని గూడు పొంచి ఉన్న ముప్పు ,తమిళనాడు గెలుగు గోడు

Inline image 1
 
Inline image 2
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మేద్దాం …బాస్ ,అమరావతిప్లాన్ పక్కా కదన రంగం లో నేవీ నౌక.. తెల్ల ఇసుకలో తేలిపోదాం ,నంది వెనక రంది

Inline image 1Inline image 1


Inline image 2


Inline image 2Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌదీ దూకుడు ,”’ఇజీనగరమ్ లో తెలుగు వర్సిటి ”

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తర కొరియా హైడ్రో బాంబ్

Inline image 1


Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -17 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

   దైవ చిత్తం -17

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -165,చివరి పేరా

కానీ అసలు అలాంటి ఏకీకృత సిద్ధాంతం ఉంటుందా ?లేక మనం ఎండమావుల వెంట పరిగెడుతున్నమా?3 రకాల అవకాశాలున్నాయి 1-పూర్తి సంపూర్ణ ఏకీకృత సిద్ధాంతం ఉంది మనదగ్గర దమ్ము శక్తి ఉంటె ఏదో ఒక రోజు దాన్ని కనిపెట్ట గలం.2-ఈ విశ్వానికి అంతిమ సిద్ధాంతం లేనే లేదు కానీ అనంతమైనసిద్ధాంత క్రమం ఉండి.విశ్వాన్ని మరింతగా ఖచ్చితంగా వివరించ గలుగుతుంది .3-అసలు విశ్వానికి సిద్ధాంతమే లేదు ,సంఘటనలను ఒక కొంతపరిమితి దాటి  ముందస్తు అంచనా వేయలేము ,ఒకోసారి అవి యాదృచ్చికంగా ,ఏక పక్షంగా ఏర్పడచ్చు .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ మూడి టిలో వేద జ్ఞానం చివరిదాన్ని నిర్ణయించుకొని అందులో రెండవది ఒక భాగం అని చెప్పినట్లనిపిస్తుంది .ఈ కింది విధంగా దాన్ని విస్తరించి చెప్పచ్చు .

  ప్రపంచం   7 లయల కు లోబడి నడుస్తుంది అని ప్రవచించింది .అవే సంస్కృతం లో గాయత్రీ ,త్రిష్టుప్ ,జగతి ,అనుష్టుప్ ,ఉష్ణిక్ మొదలైన ఛందస్సులు  .అని ఇదివరకే తెలుసుకొన్నాం కనుక విశ్వం ఈ ఏడు ఛందస్సుల అధీనం లో పాలింప బడుతోంది.  ఇందులో గాయత్రి ,త్రిష్టుప్,జగతి అనే మూడు ఛందస్సులు సమస్త విశ్వాన్ని పాలిస్తున్నాయి  .   వీటినే అలంకార యుతంగా వసు, రుద్ర ,ఆదిత్య గా ,8,11,12 సంఖ్యలుగా చెప్పారు .ఇవి వేదసాహిత్యం లో ముఖ్యంగా భగవద్గీతలో  పదే పదే చెప్ప బడినాయి .వీటిని విష్ణు (వసు ),రుద్రా (త్రిష్టుప్ ),ఆదిత్య (గాయత్రి )గా గుర్తించి చెప్పారు .ఇందులో విష్ణువు సృష్టి కర్త ,రక్షకుడు. రుద్రుడు నాశన లేక లయ కారకుడు .ఆదిత్యుడు కొనసాగించేవాడు .వీరి రాజ్యాలు స్వతంత్రమైనవి(ఇండి పెండేంట్) ,వేరోకదాని ఆధారం లేనివి(ఒవెర్లాప్ ) ,,రద్దు అయ్యేవికావు(సూపర్ సీడ్).ఈ ముగ్గురు దేవతలు’’ శక్తి దేవి’’కిలేక ఆమె కుమారుడు గణపతి కి  అధీనమై ఉంటారు.గణేశుడు గేలాక్సీలు ,నక్షత్ర మండలాలతో  కూడిన సకల విశ్వానికి ప్రతినిధి .ఆయన శక్తి  సామర్ధ్యాలు అగణితమైనవి   -అపరిమేయమైనవి .

   పేజి -166,పేరా -2

   దేవుడు మనసు మార్చుకొని ఉండచ్చు అని దేవుని ఊహిస్తూ సెయింట్ అగస్టీన్ చెప్పింది అవాస్తవం( ఫాలసి )కు ఉదాహరణ .ఆయన దేవుడు కూడా ఒక ప్రాణి అని ,కాలం తో పాటు ఉంటాడని దేవుడు సృష్టించిన విశ్వం లో కాలం ఆయన  ఆస్తి ,అనీ ఆయన సృష్టించినపుడు దేనికోసం  సృస్టిం చాడో ఆయనకు తెలుసుననీ చెప్పాడు .

  శాస్త్రి గారి వ్యాఖ్య –ఈ విషయం లో మనం పాశ్చాత్య ఆలోచనా పరులను అభి నందించాలి .వేదం ‘’కాలం అనేది దేవుని పీఠంఅనీ దానిపై నుండే లోకాలను పరిపాలిస్తాడని చెప్పింది .కాలం శేషం .సృష్టి మొత్తం వినాశానమైనా కాలం మిగిలి ఉంటుంది కనుక శేషం అన్నారు .కనుక దేవుని సృష్టిలో మొదటిది కాలమే అని నిర్ణయమైంది .అందుకే మహర్షి వేద వ్యాసుడు విష్ణుమూర్తి  కల్పాల(సృస్టుల ) ) మధ్య విరామ కాలం లో  ముడతలుగా ముడుచుకొన్నఆది శేషునిపై పవళించినట్లు వర్ణించాడు .ఇదే కాల చక్ర భ్రమణం అని ,శేషుడు అంటే కాలం విష్ణువు ను సేవిస్తున్నాడని ,ఆయన పడగలనీడలో హరి నిద్రిస్తున్నాడని అంతరార్ధం .సృష్టి ప్రారంభించాలి అని ఆయన అనుకోన్నప్పడల్లా కుమారుడైన బ్రహ్మను సృష్టి చేయమని ఆదేశిస్తాడు .విష్ణుమూర్తి మాత్రం’’ పాము పడక’’ దిగకుండా కాల సింహాసనం పై దర్జాగా విశ్రాంతి పొందుతూ ఉంటాడు .ఆయన అక్కడే ఉన్నాడు ఉంటాడు .ఆయనకు ఆది అంతాలు లేవు .బ్రహ్మ సృష్టి ప్రక్రియ ప్రారంభించగానే కాలం ప్రారంభమవుతుంది .సృష్టి నశిస్తే దానితో పాటు కాలమూ సమాప్తమౌతుందని ఇదివరకు అధ్యాయాలలోనే వివరంగా చెప్పుకొన్నాం .కనుక కాలం సృష్టికి ఆస్తి.

 సమాప్తి –పేజి -168,పేరా 1

  నువ్వొక స్పెషలిస్ట్ అయితే ,అప్పటికీ ,సైంటిఫిక్  సిద్ధాంతాలలో కొన్ని విషయాలు మాత్రమె నీకు తెలిసి అర్ధం చేసుకోగల్గుతావు .సైన్స్ అభివృద్ధి యెంత వేగం గా ఉందంటే స్కూళ్ళలో కాలేజీ యూని వర్సిటీలలో నేర్చింది అంతా ‘’కొంచెం ‘’అవుట్ ఆఫ్ డేట్ ‘’అయి పోతుంది .అంటే కాలానికి తగినది కాదని పిస్తుంది .అతి కొద్దిమంది మాత్రమె వేగంగా పురోగమించే జ్ఞాన సరిహద్దు (నాలెడ్జ్ ఫ్రాంటియర్)అందుకోగలరు .వారు తమ కాలాన్నంతటినీ వెచ్చించి ఇందులో కొద్ది జాగా లోమాత్రమె  ప్రత్యెక నైపుణ్యాన్ని చూపగలరు .మిగిలిన జనాభా కు ఈ  పురోగమనం విషయం , అది కలిపించే   ఉత్సాహం భావోద్రేకం అసలేమీ తెలియదు .

శాస్త్రీ జీ మహా భాష్యం –నిజానికి  ‘’’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’(కాలం సంక్షిప్త చరిత్ర  )అనే స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త రాసిన గ్రంధం లో ని పదవ అధ్యాయం లో ఉన్న మూడు పేజీలలోని ప్రతి మాటను ‘’యూని ఫైడ్ దీరీ ఆఫ్ ఫిజిక్స్ (యూని ఫైడ్ దీరీ  ఆఫ్ యూని వర్స్) ను అన్వేషించే వారందరూ బట్టీ పట్టి జ్ఞాపకం ఉంచుకో దగినదే . దీనినే సాధారణ భాషలో’’ సత్యం ‘’అంటారు .వేదందీన్ని గుర్తించింది . నిత్య జీవిత సంగ్రామం లో సతమతమయ్యే ప్రజల దృష్టిని దీనికోసం మళ్ళించవద్దని ,జీవితాన్ని సత్యాన్వేషణలో త్యాగం చేయాలను కొన్నవారి కి మాత్రమె దీనిపై శిక్షణ నివ్వాలని నిష్కర్ష గా చెప్పింది .భగవంతుని సర్వ సమర్పణ  చేసినవారు అవగాహన చేసుకొన్న వారు   సత్య స్వభావాన్ని చేరటానికి అవగాహన  సమర్ధం కాదని అనుభవించటం ద్వారానే సాధ్యమని చెప్పారు .దీనికి కఠినమైన ,శీలం, నైతికత ,ఆధ్యాత్మిక నియమావళి కావాలి .ఈ విషయాలనన్నిటినీ కేనోపనిషత్ ఒక్క వాక్యం లో చెప్పింది –

‘’మానవులారా –నమ్మండి –ఆత్మ తెలుసుకొన్నాను అన్నవాడికి తలియ బడదు  ,నాకు తెలియదు అన్నవారికి ఆత్మతెలియ  బడుతుంది .-

‘’అవిజ్ఞాతం విజానతాం-విజ్ఞానాతం అవిజ్ఞానతం’’

  వారిలో రెండవ  వర్గంలోని జ్ఞాని- స్టీఫెన్ హాకింగ్ – భగవంతుడు ఆయన్ను ఆశీర్వ దించుగాక .

   సశేషం

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -16 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -16

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పదవ అధ్యాయం –భౌతిక శాస్త్ర ఏకీకరణ

పేజి -155,పేరా -1

మొదటి అధ్యాయం లో వివరించినట్లుగా ,విశ్వం లోని అన్ని విషయాలకు కలిపి ఒకే విధమైన సిద్ధాంతం నిర్మించటం చాలా కష్టం .దీనికి బదులు కొంత పరిమితి తో జరిగే విషయాలను ,మిగిలిన ప్రభావాలను వదిలేసి లేక ఉజ్జాయింపుగాకొన్నిటికే   చేసి పాక్షిక సిద్ధాంతాలను తయారు చేయటానికి ముందడుగు వేశాం.

శాస్త్రీజీ కామెంట్ –ఈ కష్టం హిందూ పురాణాల లోనూ ఉంది .వివిధ పురాణాలు వేర్వేరు సందర్భాలలో రచింప బడినాయి .వీటినన్నిటినీ సమీకృతం చేయటం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు .కొన్ని పురాణాలు శివుడే విశ్వానికి సృష్టి కర్త  ఆయనే శాశ్వతం అని ప్రకటించాయి . ప్రధానంగా  శివుడు అగ్ని రూపుడు. వేదం అగ్ని సృష్టికి కారణమని చెప్పింది .కొన్ని పురాబాలు విష్ణువే సృష్టికర్త అని చెప్పాయి ఆయనను నారాయణుడు అన్నాయి. అంటే జ్ఞానానికి నీటికి నివాసం  అని అర్ధం .పురాణాలు నీరే అని భావించి సృష్టికి నీరే కారణమన్నాయి ,ఋగ్వేదం ఇతర దేవతలకంటే వరుణదేవుడికిపై స్థాయి నిచ్చి  ప్రాధాన్యమిచ్చింది .పురాణాలు వివిధ సందర్భాలలో రాయబడినాయని ముందే చెప్పుకొన్నాం .ఋగ్వేదం ఈ దేవతలందరికి మహర్షులు వేరు వేరు పేర్లు పెట్టారని .వీరంతా సత్యం కు ప్రతి రూపాలని సత్యం ఒక్కటే నని చెప్పింది .అదే ‘’ఏకం సత్ విప్రా బహుదా వదంతి ‘’అంటే సత్యం ఒక్కటే .ప్రవక్తలు వివిధ నామాలు పెట్టారు .

పేజి -157,పేరా -1

ఏడవ అధ్యాయం లో చెప్పినట్లు అనిశ్చిత సూత్రం లేక సిద్ధాంతం (అన్ సర్టే నిటి ప్రిన్సిపుల్)అంటే అర్ధం ఖాళీ స్థలం కూడా వాస్తవిక ,అవాస్తవిక అంటేకణాలు ,ప్రతికణాల జంటలతో నిండి ఉంటుంది అనటం లో ఇబ్బంది  వస్తోంది .ఈ కణాలకు అనంత శక్తి ఉండి ఉండాలని ,అందువలన అయిన స్టీన్ ప్రసిద్ధ  సిద్ధాంతం E=mc2 ప్రకారం వాటికి అనంత ద్రవ్య రాశి ఉండి ఉండాలి .గురుత్వాకర్షణ బలంవిశ్వాన్ని  వక్రత చెంది౦చి అనంత చిన్న విశ్వాలుగా మార్చి ఉండచ్చు

వ్యాఖ్య –ఇదే శక్తి సిద్ధాంతం .అంటే శక్తియే జగత్ సృస్టి కారణం  .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంఘం – బందా వేంకట రామారావు

IMG_20160106_111413

Posted in కవితలు | Tagged | Leave a comment

ఇసుక నేలపై పరిగెత్తిన ప్రాజెక్ట్ క్రికెట్ ”థౌజండ్ వాలా ”,ప్రతి రోజూ ఒక కొత్త సంవత్సరమే

Inline image 1

Inline image 2

—

Inline image 1

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -15 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -15

 

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

కాల శరం (ది యారో ఆఫ్ టైం)

పేజి -145-పేరా 2

కాలం తో ఎంట్రోపిలేక రుగ్మతలేక కల్లోలం  అనేది’’ కాలశరం’’ కు ఒక ఉదాహరణ .ఇది గతానికి, భావిష్యత్తు కూ విభజన రేఖగా ఉంటుంది .కాలానికి  మార్గ నిర్దేశం చేస్తుంది .

ఇది దేర్మో డైనమిక్స్ లో రెండవ సూత్రాన్ని అనుసరిస్తుంది –ఆ సూత్రం ‘’మూసేసిన వ్యవస్థ లేక ఎంట్రోపి కాలం తో బాటు పెరుగుతుంది ‘’

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ వాక్య నిర్మాణమే విడ్డూరంగా ఉంది .అది ఇలా ‘’మూయబడిన ఏ వ్యవస్థలోనైనా రుగ్మత లేక ఎంట్రోపి,ఎప్పుడూ కాలం తో పెరుగుతుంది ‘’అని ఉండాలి. భారతీయ సాహిత్యం ముఖ్యంగా వేదాంత సాహిత్యం మానవ శరీరానికి ఒక భావ యుక్తమైన మంచి నిర్వచనం చెప్పింది .అదే శరీరం.దీని నిర్వచనం  –‘’శరావత్ గచ్చతే ఇతి శరీరః ‘’  అంటే బాణం లాగా దూసుకు పోయేది .అందుకని హాకింగ్ శాస్త్ర వేత్త ఈ అధ్యాయానికి ‘’కాల శరం ‘’అని పేరు పెట్టాల్సింది .

పేజి 146,పేరా- 1

ఒక వ్యవస్థ ఆదేశింప బడిన అతి తక్కువ స్థాయి నుండి ప్రారంభ మైనదని అనుకొంటే ,కాలం గడిచిన కొద్దీ ఆ వ్యవస్థ సైన్సు సూత్రాలనాధారం గా మార్పు చెందుతుంది (ఇవాల్వ్ ).దాని స్థితి మారుతుంది మరి కొంతకాలం తర్వాత ఆ వ్యవస్థ ,ఆదేశించినదానికంటే అస్త వ్యస్తంగా కల్లోలంగా  మారే అవకాశం ఉండచ్చు .ఎందుకంటె ఇంకొన్ని ఇలాంటి స్థితులే ఉన్నాయికనుక . ఈ వ్యవస్థ మొదట్లో ఒక ఉన్నత ఆదేశానికి విదేయం గా ఉండి ఉంటె ఈ రుగ్మత కాలాన్ని బట్టి పెరుగుతుంది .

వ్యాఖ్య –ఈ చర్చచూడటానికి  చాలా సాధారణమైనదే అనిపించినా చాలా నైరూప్యమైనది (ఆబ్ స్ట్రాక్ట్)ఈ  పరిస్థితిని వేదం గుర్తించి చర్చించింది .పురాణాలు అనుసరించాయి .ఇక్కడ యజుర్వేద రుక్కును తెలియ జేయాలి .ఈ రుగ్మత లేక అస్త వ్యస్త త అంటే రాక్షసులే .దీన్ని దర్శ పూర్ణ మాస యజ్ఞం,సోమయాగాలలో చర్చించారు .యజుర్వేదం లో ఈ మంత్రం మరలమరల వస్స్తుంది

‘’యో ఆస్మాన్ ద్వేష్టి యంచ వయం ద్విష్మా ‘’భావం –మనల్ని ద్వేషించే శత్రువు ,మనం  ద్వేషించే శత్రువే .

నిజానికి  దీన్ని యజుర్వేదం గుర్తించింది ,ఋషులు అనుసరించారు .అందుకే ప్రతి వైదిక కర్మ శాంతి కోసమే. అశాంతి అస్తవ్యస్థత కల్లోలం  రూపు మాపటమే . దీని మహర్షులు గుర్తించారు ,విశ్వ౦ పై దయ చూపించే దేవుడే శంకరుడు .అస్తవ్యస్త రుగ్మతా స్థితియే రుద్రుడు. దేవతలు ఆదేశాలు .అసురులు ఎంట్రోపి..లేక రుగ్మతలేక కల్లోలం  .సృష్టి ప్రారంభం లోనే ఈ ఇద్దరికీ నిర్దిష్ట విధులను ఆదేశించారు .ఇదే హయ్యర్ ఆర్డర్ –అంటే ఉత్తమ స్థితి .దీని తత్వాత రాక్షసులు ఘోర తపస్సు వలన బ్రహ్మాది దేవతలవరాల వల్ల శక్తి వంతులయ్యారు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు అప్పుడు విష్ణు మూర్తి దగ్గరకు  పరిగెత్తటం,ఆయన జోక్యం చేసుకోవటం ఉండనే ఉంది. దీనిపై చెప్పాల్సింది చేటలలో చాలా ఉంది .

పేజి -147 పేరా-2

కంప్యూటర్ మెమరీ రెండు స్థితులలో ఏదో ఒకదానిలో ఉండే మూలకాల తో కూడిన వ్యవస్థ .చిన్న ఉదాహరణ –అబాకస్ –అంటే పిల్లలు లెక్కలు నేర్పించే చిన్న పూసల చట్రం.అతి సాధారణంగా ఇందులో అనేక  తీగలు ,ప్రతి తీగమీద ఒక పూసా ,దాన్ని ఒకటి లేక రెండు స్థానాలలో జరిపే వీలు ఉంటుంది .కంప్యూటర్ మెమరి లో ఒక విషయాన్ని రికార్డ్ చేసేముందు అది రుగ్మతలేక అస్తవ్యస్త లేక కల్లోల స్తితిలో ఉ౦టుంది.ఒక అంశాన్నికంప్యూటర్ మెమరి లో   రికార్డ్ చేసే ముందు  సమాన సంభావ్య స్తితుల కోసంరెండు స్థితులలో ఉండి ,మెమరీ విస్మరణ స్థితిలో ఉంటుంది  .అబాకస్ తీగలమీద పూసలు చెల్లా చెదరుగా ఉంటాయన్నమాట .సిస్టం తో గుర్తుంచు కోవలసిన దానితో మెమరి అనుసంధానమైన తర్వాత  వ్యవస్థ రెండిటిలో  ఏదో ఒక స్థితిలోకితప్పకుండా  వచ్చేస్తుంది . అబాకస్ పూసలు తీగలపై ఎడమ లేక కుడి వైపు చేరిపోతాయని అర్ధం .కనుక జ్ఞాపకశక్తి  లేక మెమరి ఒకానొక అస్తవ్య స్థితి నుండి ఆదేశించే స్థితిలోకి వస్తుంది .మెమరీసరైన స్థితిలో నే ఉంచటానికి కొంత శక్తిని వినియోగించాలి (పూసలను కదిలించటానికి ,కంప్యూటర్ కు శక్తిని అందించటానికి లాగా ) .ఈ శక్తి చెదరిపోయి ఉష్ణం గా  మారి ,విశ్వం లో రుగ్మతను,కల్లోలాన్ని  మరింత పెంచుతుంది . ఆదేశిత  మెమరీ కంటే ఈ అస్తవ్యస్థత ఎక్కువగా ఉంటుంది. ఈ విధం గా కంప్యూటర్ కున్న కూలింగ్ ఫాన్ వెలువరించే ఉష్ణంఅంటే  ఒక సారి కంప్యూటర్ మెమరీ లో రికార్డ్ అయ్యాక ,విశ్వం లోని మొత్తం రుగ్మత కల్లోలం మరింత పెరుగుతుంది .కంప్యూటర్ గతాన్ని జ్ఞాపకం చేసుకొనే కాల మార్గం ఆ స్థితిలో ,రుగ్మత పెరిగే దానితో సమానం గా ఉంటుంది

శాస్త్రి గారి భాష్యం –ఈ భావాలన్నీ మన పురాణాలలో ఉన్నవే. సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ దేవాసురలను  అంటే ఆర్డర్ మరియు డిసార్దర్ లను సృష్టించాడు .రాక్షసులు తపస్సు చేస్తే   డిసార్డర్ పెరిగి ప్రపంచం లో ఉష్ణం పెరిగిపోతుంది .పురాణాలు ఈ ఉష్ణాన్నే ప్రపంచాన్ని కాల్చటం గా భస్మం చేయటం గా  చెప్పాయి .దీనితో సువ్యస్థితం ఉన్నది అస్తవ్యస్తమై పోతుంది కల్లోలానికి గురౌతుంది .దేవతలు  అంటే సువ్యవస్థ విష్ణువును చేరి రక్షించమని ప్రార్ధిస్తారు .విష్ణుమూర్తి ఏదోఒక అవతారం దాల్చి ,అవ్యవస్త కున్న  మూల రూపాన్ని,కారణాన్ని  ధ్వంసం చేసి  మళ్ళీ వ్యవస్థను సుస్థిరం చేస్తాడు .అందుకే విష్ణు మూర్తి అవతారాలు అనంతం .అందులో దశావతారాలు చాలా ముఖ్యమైనవి. కపిల ,వేద వ్యాస మొదలైన మహర్షులు విష్ణువు  అవతార స్వరూపులే .

పేజి -148,పేరా -2

సాధారణ సాపేక్ష సిద్ధాంతం  విశ్వం ఎలా ప్రారంభమైందో  ఊహించ  లేక పోయింది .కారణం సైన్సుకు తెలిసిన అన్ని సూత్రాలు బిగ్ బాంగ్ సింగులారిటి(ఏకత్వ ) సిద్ధాంతం తో తుడిచి పెట్టుకు పోయాయి .

వ్యాఖ్య –దీన్ని మనం ఆత్మ యొక్క ‘’సంకల్ప పూర్వస్తితి ‘’అన వచ్చా ?హాకింగ్ దీనినే ప్రీ డెసిషన్ స్టేజ్ – అన్నాడు అంటే అప్పుడు సైన్స్ సూత్ర్రలేమీ లేవన్న మాట .ఆత్మ అంటే సృస్టికర్తయేఅని ఇది వరకే చెప్పుకొన్నాం .ఆయనే సూత్రాలను ,శాస్త్రాన్ని చేస్తాడని ఉపనిషత్తులు ఉద్ఘోషి స్తున్నాయి .వీటిని ఉపనిషత్తులు కవితాత్మకం గా ‘’సో అకామయత ,బహుస్యాం ప్రజయేత్’’అన్నాయి .  భావం –ఆత్మ అనేకాన్ని సృజించాలలను కొన్నది అంటే ఏక రూపం బహురూపం కావాలని భావించింది .ఈ నిర్ణయానికి లేక భావనకు ముందు ఆత్మఒకటే ఉంది ,రెండవది ఏదీ లేదు  .బహురూపంగా విస్తరించాలన్న   ఆత్మ సంకల్పం సైన్స్ సూత్రాలు అనుసరించాయి  ఈ సూత్రాలు లేక పొతే సృష్టి కి అవకాశం లేదు .సృష్టి తనతో సూత్రాలను తెచ్చుకొంటు౦ది .లయం అయిఅనప్పుడు తన తో పాటు తీసుకొని వెడుతుంది .

పేజి -152,పేరా -3

ఏమైనా మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ,  ఆహార రూపం లో ఉన్న కనీసం వెయ్యి కేలరీల సువ్యవస్తిత  ఉష్ణాన్ని ,అవ్యవస్థిత శక్తి గా నే చుట్టూ ఉండే గాలి నుంచి గ్రహించి  వేడి ,చెమట రూపం లో మార్చి ఉంటారు  , ఇది విశ్వం లో ఇరవై మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ యూనిట్ల రెట్లు  అవ్యవస్తను ఏర్పాటు చేసి ఉంటుంది . ఈ పుస్తకం లోని ప్రతి విషయాన్నీ నువ్వు గుర్తుంచుకోవాంటే   నీ బుర్రలో పది   లియన్ మిలియన్ మిలియన్ రెట్ల డిసార్డర్,కల్లోలాన్ని   పెంచుతుంది .

శాస్త్రిగారి మహా భాష్యం –ఇది సైన్సు చెప్పిన విషయం కనుక మనం తప్పక నమ్మాలి .ఇదే విషయాన్ని మన పురాణాలు చెప్పాయంటే నమ్ముతామా ?.ఇంతకీ అవి ఏం చెప్పాయి ?’’ఎవరైనా తపస్సు చేస్తుంటే ప్రపంచం లో వేడి పెరిగి అవ్యవస్థ మౌతుంది .సువ్యవస్థ కు రాజైన ఇంద్రుడు అప్సరసలను పంపి ,ఆ ఉష్ణానికి కారణమైన దానిని నాశనం చేసి ,అవ్యవస్తను కూల్చేస్తాడు సంస్కృతం లో అప్సర అంటే నీటి ప్రవాహం .వేద విజ్ఞానం యెంత గొప్పదో యెంత ఆలోచనా పరమైనదో దీని వలన తెలుస్తోంది .మహర్షులు తపస్సు చేస్తున్నా ఈ వేడి పుట్టి జగత్ సంక్షోభానికి కారణమవుతుంది .దీనిని అఆపటానికి కూడా  నీరే కావాలి . ఈవేడికి అగ్ని పర్వతాలు బద్దలౌతాయి సముద్రాలు పొంగుతాయి ,దిక్పాలకులు ఒణుకుతూ బెదిరి పోతారు .వీటినిచిత్రాలుగానూ చూసే ఉంటాం   . మునుల తపస్సును అప్సరసలు ఆపలేక పొతే ,తనకంటే బ్రహ్మజానులైన వారిని ఇంద్రుడే దిగి వచ్చి నచ్చ చెప్పటం తెలుసు మనకు .రాక్షసుల తపస్సు వేరొక రకం .వారికి ఇంద్రుని కూలద్రోసి .అవ్యవస్తను కల్లోలాన్ని కలిగించి ఇంద్రపదవి పొందటం అనే ఆశతో తపస్సు చేస్తారు  .వీళ్ళ తపో భంగాని కి  అప్సరసల అంద చందాలు ,కులుకు ఒయ్యారాలు ఏవీ పనిచేయక అప్సరసలే’’ నీరు కారిపోతారు’’.అప్పుడువిశ్వ  సృస్టికర్తే దిగి వచ్చి ఆ పాపాత్ములముందు రాజ దండం తో ఒంగి వాళ్ళు కోరిన వరాలిచ్చి సంతృప్తి పరుస్తాడు  జగత్కల్లోలాన్ని తగ్గిస్తాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేమోటాలాజి పిత పుస్తకావిష్కరణ సరసభారతి ఉయ్యూరు

కేమోటాలాజి పిత పుస్తకావిష్కరణ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ  -ఉయ్యూరు

 

నేను రాసిన ”కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాక )పుస్తకాన్ని శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర  ప్రసాద్ సౌజన్య సహకారాలతో సరస భారతి ఆధ్వర్యం లో ముద్రించి,జనవరి చివరి 25వ తేది సోమవారం ఉదయం 10 గం లకు ఉయ్యూరు ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో ,కాలేజీ తో సంయుక్తంగా నిర్వ హిస్తున్న సభలో   ఆవిష్కరిస్తున్నామని తెలియ జేస్స్తున్నాను . కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డా శ్రీ జి వి పూర్ణ చంద్,’’భారత్ టుడే’’ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ ,’’హ్యాం రేడియో’’నిర్వాహకులు శ్రీ సూరి శ్రీరామ మూర్తి దంపతులు ,సీతారామయ్య గారి బంధువులు ,మరెందరో ప్రముఖులు పాల్గొనే  ఈ సభకుసాహిత్యాభిమాను లందరూ   విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

కొలచల సీతారామయ్య

”పుల్లేరు కాలువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ  హీనంగా భావించ కుండా  చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి, అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో  కేమిస్ట్రి ”బిరుదులు  పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,రష్యాలో ఉన్నా   మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని జీవితాంతం రాష్యాలోనే గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి ,చరిత్రదృష్టిలో  పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి”    ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ”

పూర్తీ వివరాలతో  ఆహ్వాన పత్రిక  ఒక వారం తర్వాత అంద  జేస్తాం –దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -6-1-16-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

27వ విజయవాడ పుస్తక మహోత్సవం లో 5-1-16 మంగళవారం సాయంత్రం శ్రీ అరవిందుల సావిత్రి పై ”highlights in Savitri ఆంగ్ల గ్రంధా విష్కరణ ,”బుచ్చి బాబు శత జయంతి” సభా దృశ్యాలు

27వ విజయవాడ పుస్తక మహోత్సవం లో 5-1-16 మంగళవారం సాయంత్రం శ్రీ అరవిందుల  సావిత్రి పై ”highlights in Savitri ఆంగ్ల గ్రంధా విష్కరణ ,”బుచ్చి బాబు శత జయంతి” సభా దృశ్యాలు

విజయవాడ పుస్తక మహోత్సవం లో 7-1-16గొల్లపూడి ,శంకరనారాయణాదులు వండి వడ్డించే నవ్వుల విందు

 

 

 

 

 

navvula vindu 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మౌన గురువు రమణ మహర్షి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమిత్ కు షాకు ?సింగపూర్ బౌద్దాలయాలు

—

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వదువులకోసం దూర తీరాలకు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకలు తీరిన కమ్యూనిస్ట్ బర్దన్ ,7గురు అమర వీరులు

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పఠనం వ్యసనం కావాలి ,పఠాన్కోట పాఠాలు

Inline image 1
 
 
Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ భయంకర్ రచనలు

sakshi ysr boidata scan0009

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వాగతం లో సునామీ -కవిత ,నిరసన గళం వినిపించిన కవిత -,అమరుడు కాదు అర్జునుడు

Inline image 1  Inline image 2
Inline image 3

Posted in కవితలు | Tagged | Leave a comment

మైరావణ పాత్ర ఎక్కడిది ?భూమి -ఆశీత -ఆకు పచ్చని సంతకం అద్దేపల్లి ,నిగూఢ భావ వ్యాసాలు

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పవిత్ర నాగ వల్లీ దళం (తమల పాకు ),గో రక్షకుడు భరద్వాజుడు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు” బంగ్లా ”జ్యోతి ,త్రికాలాన్వేషణే సాహిత్యం,అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం

Inline image 3

—

Inline image 2
 
Inline image 4
 
 
Inline image 5
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అగ్ర వర్ణ ఏం ఏ లను అలా అన గలదా ?అనిత ఆవేదన ,కోటలోనే ముష్కరులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషా సంక్షోభం -ప్రపంచీకరణ ,ఇంటింటికీ ఇంటర్ నెట్

భాషా సంక్షోభం -ప్రపంచీకరణ ,ఇంటింటికీ ఇంటర్ నెట్

 

Inline image 1

—

Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య – పుస్తకావిష్కరణ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ  -ఉయ్యూరు

— సరసభారతి ఆధ్వర్యం లో  నేను రాసిన ”కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాక )పుస్తకాన్ని శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర  ప్రసాద్ సౌజన్య సహకారాలతో ముద్రించి,జనవరి చివరి వారం లో ఆవిష్కరిస్తున్నామని తెలియ జేస్స్తున్నాను .

”పుల్లేరు కలువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని  దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా  చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమో టాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రై బో  కేమిస్ట్రి ”బిరుదులు  పొంది సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,రష్యాలో ఉన్నా   మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందినసాహసి ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ”

పూర్తీ వివరాలతోకరపత్రం ఒక వారం తర్వాత అండ జేస్తాం –దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దురాచారాలపై సంకుల సంమరం,మనవ జీవిత వికాసం లో లలితకళలు

Inline image 2  Inline image 3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హజారే అందరికి బేజారే

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పఠాన్ కోట పై పంజా -ఇండియన్ డాగ్స్ వస్తున్నాయి -ఇండియా విద్యార్ధులకు అవమానం

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంధుల అక్షర శిల్పి ,మానవ హక్కుల వైతాళికురాలు

 


Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భక్తీ యాగం రాజకీయ యోగం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలగిరి ప్రేమ తత్వమే జగతికి జ్యోతి –

Inline image 1

గబ్బిInline image 2ట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాల గర్భం లో 25 గ్రామాలు అగ్ని పరీక్షలో కమలం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొంత హాస్యం కొంత సందేశం ,చీకట్లో నారింజరంగు సాయం కాల అన్వేషణ

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇదే మనపాలిటి అయుత చండీయాగం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభినందనలో ఉండాలి హృదయ స్పందన జగ్గీ వాసుదేవ్ ,మంగళ సూత్రం అంతరార్ధం

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యాభై ఏళ్ళక్రితం దేవత ఎవరికీ దక్కని సౌఖ్యం కుదిరిన జత

Inline image 1


Inline image 2
Inline image 3
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వానప్రస్థం మీ చేతుల్లోనే — అనంతం లో ఆనందం రవి శంకర్ ,అనుకోవడం..బాధపడటం ఎందుకు?యాంకర్ సుమ

వానప్రస్థం మీ చేతుల్లోనే
31-12-2015 23:34:03

వర్ణాశ్రమధర్మాలు అనే మాట పలు సందర్భాల్లో వింటూంటాం. వర్ణం మనకు తెలిసిందే, కానీ ఆశ్రమం పూర్తిగా ఆశ్రమమని అర్థం కాదు. ఏ విషయంపై మనం శ్రమతో దీక్షతో పనిచేస్తామో అది ఆ విషయానికి సంబంధించిన ఆశ్రమం. అనగా జీవితంలో ఒకానొకదశ.
వేదాలు మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకూ జీవితకాలానికి కావాలసినంత టైమ్‌టేబుల్‌ తయారు చేశాయి. ఇందులో నాలుగు భాగాలు లేదా పీరియడ్‌లు ఉన్నాయి. ఏ దశలో మనిషి ఏం చేయాలని నిర్దేశించాయి. ఈ టైమ్‌టేబుల్‌లో ఒక పీరియడ్‌ వానప్రస్థం.
మనుస్మృతిలాంటి పుస్తకాల్లోనూ, ఇతిహాస, పురాణాల్లోనూ ఆశ్రమాల గూర్చి చర్చ విస్తారంగా ఉంది. మహాభారతంలో అనేకచోట్ల, ముఖ్యంగా శాంతి పర్వంలో మనిషి జీవితంలోని నాలుగు దశలు, ఆయా దశల్లో వ్యక్తి చేయాల్సిన పనులు వివరంగా కనిపిస్తాయి. విద్య నేర్చుకునే దశను బ్రహ్మచర్యాశ్రమం అనీ, వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అనీ, వయస్సు మళ్లిన తర్వాత క్రమక్రమంగా తన బాధ్యతలను పిల్లలకు అప్పగించడం, జ్ఞానం పట్ల ఆసక్తి చూపడం, సమాజానికి ఉపయోగించే పనులు చేయడం అనేది మూడో దశ. దీనికే వానప్రస్థాశ్రమం అని పేరు. వనం అంటే అరణ్యం. ప్రస్థం అంటే ప్రయాణం. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఉండే రణగొణ ధ్వనులు లేని ప్రాంతమే అరణ్యం (రణం అంటే శబ్దం). పూర్వం నిజంగానే అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ సాధారణ జీవితం గడపడం ఇందులోని లక్ష్యం. ఈ దశ నుంచి పూర్తిగా తప్పుకుని పరివ్రాజకుడిగా (సంన్యాసి) ఉండటం అనేది చివరి దశ.
ఆధునిక జీవనంలో మనం ఈ మూడు దశలనే చూస్తాం. బాల్యంలో విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగం చేయడం, కొంత కాలానికి ఆ ఉద్యోగం నుంచి ఇష్టంగానో, అయిష్టంగానో విరమించడం అనే మూడు దశలు. మొదటి రెండు దశల్లోని వ్యక్తి జీవితం శ్రమతో నిండి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా శ్రమతో కూడినవే. అయినా వీటి నుంచి విరమించడానికి చాలామందికి చాలా మందికి మనసొప్పదు. చాలామంది ఎంతో బాధతో పదవీ విరమణ చేయడం, జీవితంలో శూన్యత్వాన్ని అనుభవించడం జరుగుతుంది. జీవితంలో ఎంతో సాఫల్యం పొంది, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తులు కూడా నిరాశకు, మానసిక క్షోభకు గురికావడం కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూంటాం. మధ్య వయసులో విసుగు (boredom ) ఎలా తొలగించాలి అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న ఒకానొక ముఖ్య సమస్య.
పూర్వీకులు చెప్పిన వానస్రస్థానికీ, ప్రస్తుత విశ్రాంత (రిటైర్డ్‌) జీవనానికీ కొంత పోలిక ఉంది. రెండింటిలోనూ వ్యక్తి ఒక బాధ్యత నుంచి వైదొలగడం, కొత్త జీవనాన్ని ప్రారంభించడం ఉంది. సమయాన్ని ఏ రీతిలోనైనా గడిపే స్వేచ్ఛ ఉంది. అయినా ఈ రెండింటి మధ్య భేదం చాలా ఉంది. వానప్రస్థం స్వచ్ఛందంగా తీసుకున్న మార్గం.
పదవీవిరమణ బలవంతంగా వచ్చిన విశ్రాంతి. వానప్రస్థంలో త్యాగమనే అంశం ఉంది. ఇదివరకు అనుభవించిన అధికారాన్నీ, సుఖాన్నీ, బాధ్యతల్నీ స్వతంత్రంగా వదలడం. ఈనాటి విశ్రాంత జీవనంలో త్యాగం అనే అంశం లేదు. వానప్రస్థంలో శరీరాన్నీ, మనసు, ఇంద్రియాలను నిగ్రహించి ధార్మికంగా ఉండటం, సమాజం కోసం పని చేయడం, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం అన్నది లక్ష్యం. రిటైర్మెంట్‌లో ఈ ధార్మికత అనే ప్రస్తావన లేదు. వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి అహింస, సత్యం వ్రతంగా ఉంచుకుని నిప్పులాంటి జీవనం గడపాలని శాంతిపర్వం చెబుతుంది. రాజులు కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లడం పరిపాటిగా ఉండేది. బహుశా అందువల్లనే మన చరిత్రలో పాశ్చాత్యదేశాల్లోలాగా తండ్రులను బంధించిన సంఘటనలు కనిపించవు. రాజులే కాకుండా మిగతావారికీ కూడా ఈ వానప్రస్థం ఉండేది. పుత్రుడికి పుత్రుడు కల్గిన తర్వాత గృహస్థు వానప్రస్థానికి వెళ్లాలి (శాంతిపర్వం). అతిథులను ఆదరించడం కోసం అవసరమైన ధనాన్ని పెట్టుకోవడం తప్పుకాదని కూడా చెప్పారు.
వేదాలు అనేక కర్తవ్యాలు, కర్మలు, వ్రతాలు అనే పేరిట మనిషికి ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంచింది. అందువల్ల వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి కూడా ఎలాంటి మానసిక సంక్షోభం, నైరాశ్యం లేకుండా దాన్ని ఒక ధర్మంగా భావించి సంతోషంగా ఉండేవాడు. సుఖాలను వదిలివేయడం కూడా ధర్మమే అన్నప్పుడు వ్యక్తికి నైరాశ్యం ఉండదు. పదవీ విరమణలో ధర్మమనే అంశం లేనందున ఒక వ్యక్తికి స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకోవడంగా భావిస్తాడు. దీనివల్ల అశాంతి, నిరాశలతో పాటు జీవన గమ్యం లేకపోవడం జరుగుతుంది.
జీవితంలో ఆనందం ఎలా నింపుకోవాలి అన్నది మామూలు మనిషితో పాటు శాస్త్రవేత్త, తత్వవేత్త అందరూ ఆలోచించే విషయం. మనిషి తన వ్యక్తిగత సుఖాన్ని పొందుతూనే ఇతరుల మేలుకై పనిచేయడాన్ని ధార్మిక జీవనం అంటారు. మనిషి కొంతైనా ధార్మిక మార్గంలో లేనపుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో తైత్తరీయ ఉపనిషత్తు వర్ణిస్తుంది. అయ్యో నేను మంచి మార్గంలో ఎందుకు నడవలేదు, ఎందుకు చెడు పనులు చేస్తూ వచ్చాను అని ఎంతో కొంత ఆవేదన ప్రతిమనిషీ పడతాడని రుషి భావన. చాలామందిలో ఇలాంటి ఆవేదనను మనం చూస్తూంటాం. చిన్నతనంలో ఫలానా విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేది. ఫలానా విధంగా ఉంటే పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ఉండేవారు అని విచారించడం చూడగలం.

వానప్రస్థంలో ఉన్న కొన్ని అంశాలను ఈనాటి విశ్రాంత జీవన విధానంలో చేర్చుకోగలం. అరణ్యానికి పోకపోయినా మనం చేస్తున్న పనులను చాలామటుకు తగ్గించుకోగలం. అనవసరమైన పనులను చాలావాటిని మానేయగలం. మనం ఉన్న చోటే అరణ్యం (నిశ్శబ్దంగా ఉన్న స్థలం)గా మార్చుకోవచ్చు. ఏకాంతాన్ని శాపంగా కాకుండా వరంగా భావించుకోవచ్చు. విశ్రాంత జీవితంలో ఉన్న వేలాది మంది అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, వారి మేధోసంపదను వృథా చేయడం చూస్తూంటాం. వీరిలో ప్రతి ఒక్కరూ అనేక మంది బాలబాలికలను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దగలిగారు. ఇటీవల కొన్ని చోట్ల వయోజనుల నివాసం (community for elderly)లో బాలల హాస్టల్‌ నిర్వహిస్తూ ఉండటం మంచి ఉదాహరణ. సమాజ శ్రేయస్సుకై ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనిని కర్మయోగం అంటారని ఇదివరలో తెలుసుకున్నాం. ఈ విశ్రాంత దశలోనైనా మనం కొంత వరకు కర్మయోగాన్ని ఆచరిస్తే జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వాళ్లం అవుతాం.

డాక్టర్‌ కె. అరవిందరావు
రి

టైర్డు డీజీపీ

 

 

అనంతంలో ఆనందం
31-12-2015 23:45:55

ఐదు యమాల్లో రెండింటి గురించి తెలుసుకున్నాం. మిగతా మూడు అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అస్తేయ అంటే దొంగతనం చేయకుండా ఉండటం. అందంగా కనిపించిన వ్యక్తిని చూడగానే.. అంత అందంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. అయితే అలా అనుకోవడంతోనే వారి రూపాన్ని దొంగలిచ్చినట్టు. ఈ దొంగలించడం అసూయను పుట్టిస్తుంది. నచ్చిన దానిని పొందాలనే కోరికను పుట్టిస్తుంది. అస్తేయ- అసూయను తొలిగిస్తుంది. దొంగతనం చేయాలనే కోరికను రానివ్వదు.

బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః

బ్రహ్మ అంటే అనంతం. బ్రహ్మచర్యం అంటే అనంతంలో చరించడం. అనంతమైన నీ స్వభావాన్ని గుర్తించినపుడు దీపపు వెలుగులా ప్రసరిస్తావు. అపుడు బ్రహ్మచర్యం సహజంగా జరుగుతుంది. గాఢమైన ధ్యానంలో కూర్చున్నపుడు నీ శరీరాన్ని గురించిన స్పృహ ఉండదు. ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటే అంత తక్కువగా నీ శరీరం ఎరుకలో ఉంటుంది. అనంతమైన జ్ఞానంలో ఉన్నపుడు ఒత్తిడులు, శరీరపు భారం, శరీరం ఉన్నదనే ఎరుక ఉండవు. ఇది బ్రహ్మచర్యం. ఆకాశం లేదా అనంతం అనే ప్రకృతిలో నీవు ఉన్నపుడు అత్యధికమైన శక్తి, ధైర్యసాహసాలు నీకు లభిస్తాయి. ఎప్పుడూ అటూఇటూ చూస్తూ, ఎవరు అందంగా ఉన్నారో గమనిస్తూ లేదా ఎవరితో సంగమించాలని వెతుక్కుంటూ తిరిగేవారిలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎవరినీ ప్రభావితం చేయలేరు.

అపరిగ్రహస్తేయ జన్మకథాయాంతాసంబోధః

నీకంటూ సమకూర్చుకోకుండా జీవించినపుడు నీ పూర్వజన్మల జ్ఞానం, ఇతర జీవాలను గురించిన జ్ఞానం నీకు లభిస్తుంది. మరింత కావాలనే కోరిక ఉన్నప్పుడు, ఆలోచనలు కేవలం తన గురించే వస్తూ ఉంటాయి. వాటితోపాటు భయం కూడా వచ్చి చేరుతుంది. జీవితపు అనంతత్వం అనేది తెలియకుండా పోతుంది. నీకంటూ లేకుండా ఉండటం అంటే నీ ఉనికిలో ఆత్మవిశ్వాసం, నీ సామర్థ్యంపై విశ్వాసం, నీవెవరో తెలుసుకుని ఉండటం. నీకు రొట్టెలు చేయడం ఎలాగో తెలిసినపుడు ఏడాదికి సరిపడా ఒకేసారి చేసి ఉంచుకోవు కదా. తమ శక్తి తెలియనివారు, స్వార్థపరులు అన్నిటినీ కూడబెడుతుంటారు. ఇలా కూడబెడుతూ, కూడబెడుతూ చివరకు కన్నుమూస్తారు. ధనాన్ని పొదుపు చేయవద్దని, కూడబెట్టవద్దని చెప్పలేదు పతంజలి మహర్షి. అలా కూడబెట్టిన దాని ప్రభావం ఏమిటో ఆలోచించమంటున్నాడు.

అపరిగ్రహ- అంటే ప్రజల నుంచి ఏదీ గ్రహించకుండా ఉండటం. కూడబెట్టకుండా ఉండటం. దీనికి పూర్తి వ్యతిరేకం పరిగ్రహ- అంటే అన్నిటినీ స్వీకరించడం, వాటి గురించి ఆశ్చర్యపోవడం, ఆనందంగా ఉండటం. ఎవరి నుంచీ ఏమీ స్వీకరించకుండా జీవించడం ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని. దీనిని కూడా సాధన చేసేవారు అక్కడక్కడా ఉంటారు. ఈ ఐదు యమాలు మహావ్రతాలు. సాధనను బట్టి ఫలితం వస్తుంది.

శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, వ్యవస్థాపకులు
ఆమెకు చిన్నా పెద్దా, ఆడ మగా అందరూ అభిమానులే. ‘సుమ’ధురంగా మాటల సెలయేరులో ప్రేక్షకుల్ని పయనింపచేయడం ఆమె ప్రత్యేకత. అదే స్టేజిషోలయితే సమయస్ఫూర్తితో… కొన్ని సెటైర్లు, మరికొన్ని పంచ్‌లు వేస్తూ, చమక్కులు విసురుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారామె. 2015 తనకెలాంటి అనుభవాల్ని మిగిల్చింది. అలాగే ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో సుమ కనకాల చెప్పిన మాటల ముచ్చట్లు…

‘‘పోయిన ఏడాదిలో శని, ఆదివారాలు పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. పనిచేయకుండా ఉన్న ఆ రెండు రోజుల్ని పిల్లల కోసం కేటాయించేశాను. ఆడియో లేదా అవార్డ్‌ ఫంక్షన్‌లు ఏవైనా ఉంటే మాత్రం యాంకరింగ్‌ చేస్తున్నాను. 2016లో కూడా అదే కంటిన్యూ చేస్తాను.

గడిచిందిలా

2015 సంవత్సరం ఎలా గడిచింది అని మీరడిగితే 2013, 14 సంవత్సరాల్లాగే అనేది నా సమాధానం. చెప్పాలంటే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పెరిగింది. చిన్నపిల్లల దగ్గర్నించి పెద్ద వారి వరకూ అందరూ నన్ను వాళ్ల కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూస్తున్నారు. దాంతో నా ఎనర్జీ మరింత పెరిగింది. కొత్తగా నేర్చుకున్న అంశం పాజిటివ్‌గా ఉండటం. కొన్ని ప్రభావాలు, ఇబ్బందులు నాపై పడినప్పటికీ మానసికంగా సమతుల్యత పాటించటం నేర్చుకున్నా. నా ఎనర్జీ నేనే (‘నీ ఎనర్జీ నేను’ అంది కూతురు మనస్విని. వెంటనే ‘అవునవును’ అన్నారు సుమ).

మనసు పడిన బాధ

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ఘటనలే కాకుండా ఇతర దేశాల్లో యుద్ధాల్లో మరణించే వారి గురించి ఆలోచించినపుడు కూడా బాఽధగా అనిపిస్తుంది. ఇటీవల రంగనాథ్‌ గారు, కొరియోగ్రాఫర్‌ భరత ఆత్మహత్య చేసుకోవడం వంటి దుర్ఘటనలు మనసును విపరీతంగా బాధించాయి.

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

మా పిల్లలు సర్‌ప్రైజ్‌ బహుమతులు ఇచ్చే అవకాశం నాకు ఇవ్వరు. రోషన్‌, మనస్విని ముందుగానే ప్లాన్‌ చేసుకుని మరీ వాళ్లకి కావాల్సినవి నాతోనే కొనిపించుకుంటారు. మనస్విని మాత్రం నాకోసం గ్రీటింగ్‌ కార్డులు తయారుచేస్తుంది. వాటిని మా హాల్లో గోడలకు అందంగా అతికిస్తుంది. రాజీవ్‌కు అయితే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఏమీ ఇవ్వలేదు. రాజీవ్‌ బర్త్‌డేకి మాత్రం గ్రీటింగ్‌ కార్డ్‌ కొని.. దాని మీద విషెస్‌ రాసి ఇచ్చాను. గ్రీటింగ్‌ కార్డులో విషెష్‌ రాసి చెప్పడంలో భిన్నమైన అనుభూతి కలుగుతుంది. అది ఎంతకాలమైనా పదిలంగా ఉంటుంది కూడా.

నేర్చుకున్నవి… చదివినవి… నచ్చినవి

20 నుంచి 30 ఏళ్ల వరకూ లెర్నింగ్‌ పీరియడ్‌ అంటారు. గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి. అంటే 30 ఏళ్లలోపు కెరీర్‌ను డిసైడ్‌ చేసుకోవాలి.. 30-40 సంవత్సరం వరకూ మనం మెరుగుపడాలి. 40 నుంచి 50 వరకూ అందులోనే ఉండటం మంచిదట. 2015 నాకు 40వ సంవత్సరం. ఇదే ప్రొఫెషన్‌నే కంటిన్యూ చేస్తాను. ఇక 50-60 వరకూ మనం వేరే వారిని తయారుచేసుకోవచ్చు. పాట, నాట్యం వంటివాటిలో దేవుడు నాకు కొద్దిగా ప్రావీణ్యం ఇచ్చాడు. యాంకరింగ్‌లో అదే చేస్తున్నాను.

‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకం చదివాను. ఆ పాకిస్తానీ అమ్మాయి ఎన్ని కష్టాలొచ్చినా చదువుపై ప్రేమ పెంచుకుంది. గ్రేట్‌ గర్ల్‌. సాధారణంగా షూటింగ్‌ గ్యాప్‌లో బుక్స్‌ చదువుతుంటాను. ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్‌లో కనీసం హెడ్‌లైన్స్‌ చదువుతాను. టెక్నాలజీ విషయానికి వస్తే చూపుడువేలుపైనే ప్రపంచం నడుస్తోందిప్పుడు. నేనయితే ఫేస్‌బుక్‌ ఎక్కువగా చూస్తుంటాను.
మనమెంత అనిపించింది

అమెరికాలో క్రూజ్‌ వెకేషన్‌కు వెళ్లటం మంచి ఎక్స్‌పీరియన్స్‌. లాస్‌ఏంజిల్స్‌ నుంచి మెక్సికోకి వెళ్లే నౌకలో మూడురోజులు కుటుంబమంతా కలిసి ప్రయాణించాం. చుట్టూ సముద్రపు నీరు, రాత్రిపూట చిమ్మచీకటిని చూస్తుంటే.. మనమెంత అనిపించింది. అలాగే ఈ లోకం పెద్ద వింత అనిపించింది. ప్రకృతి నుంచి దూరం వెళ్లే కొద్దీ మనం అనే అహం పెరుగుతుంది. ప్రకృతి దగ్గరికి వెళ్లే కొద్దీ భయం పెరిగి అహం తగ్గిపోతుంది.

హాయిగా నవ్వుకున్నాను

తిరువన్నామలై వెళ్లినపుడు మా అమ్మతో పాటు నేను, పిల్లలూ రమణభగవాన్‌ కొండకు వెళ్లాం. కొండ నుంచి కిందకు దిగుతుంటే కోతులు అడ్డొచ్చాయి. మా అబ్బాయిని ‘కోతి కళ్లల్లోకి చూడొద్దు’ అన్నాను. ‘కోతి కళ్లల్లోకి నేను చూడలేదు, కోతే నా కళ్లలోకి చూస్తోంది’ అన్నాడు. ఈలోపు ఓ కోతి వచ్చి మా అమ్మ చీర కొంగును లాగుతుంటే.. మా అమ్మ ‘వద్దు రమణా’ అంటోంది. ఆ సన్నివేశం చూశాక నవ్వాపుకోలేకపోయాను. ఆ తర్వాత కొండదిగామో లేదో వానరమూక మమ్మల్ని అడ్డగించి, అడిగి మరీ వాటర్‌బాటిల్స్‌ తీసుకెళ్లాయి.

టెన్షన్‌ అనవసరం

నిర్మాత స్రవంతి రవికిషోర్‌ గారి చిత్రం ఆడియోఫంక్షన్‌కి యాంకరింగ్‌ చేశాను. ఆ ఫంక్షన్‌లో నాలుగో పాటకు డాన్స్‌ చేస్తారు అని చెప్పడం మర్చిపోయి ఐదో పాట చెప్పేశాను. దాంతో రవికిషోర్‌ గారితో ‘సారీ సర్‌’ అన్నాను. అందుకు ఆయన ‘ఏమైందమ్మా ఇప్పుడు. ఎవరైనా అరె్‌స్టచేస్తారామ్మా’ అన్నారాయన. ఆ మాటతో ఇన్ని సంవత్సరాలనుంచి యాంకరింగ్‌ చేస్తున్న నేను అంత టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదనుకున్నా.

చేయాలనుకుని మిగిలిపోయినవి

అది చేయాలి. ఇది చేయాలి అని ముందుగానే అనుకుని ప్లాన్‌ చేసుకునే అలవాటు లేదు. ఖమ్మంలో ఓ ఓల్డేజ్‌హోమ్‌కు మూడేళ్లనుంచీ సపోర్టు చేస్తున్నాను. ఈ ఏడాది దానికి సొంతంగా బిల్డింగ్‌ కడుతున్నారు.

ఎంతో ఇష్టం

ఉదయం ఏడున్నరకు పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. అదే టైంలో నేను షూటింగ్‌లకు బయల్దేరి వెళ్లిపోతాను. పిల్లలకి నచ్చిన ఫుడ్‌ చేయటం నాకు సరదా. కొత్తగా కుండబిర్యానీ వండడం నేర్చుకున్నా. దాన్ని వండిపెడితే ఇంటిల్లిపాదీ బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వాళ్లని సంతోషపెట్టే విషయాలకోసం సమయం కేటాయించటం నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఎప్పుడూ ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా..’ పాట పాడుతుంటాను’’ అని గడిచిన ఏడాది గురించి చెప్పారు సుమ.

ఫెయిల్యూర్‌ తట్టుకోలేను
2016 ఎలా ఉండాలి అనుకుంటున్నారు, సెలబ్రేషన్స్‌ ఎక్కడ అని అడిగితే ‘‘నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండవు. ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటే ఒత్తిడి వస్తుంది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేను. అందుకే దేని గురించీ ఆలోచించను. కెరీర్‌ పరంగా వచ్చేది సక్సెస్‌ కాదు. వ్యక్తిత్వపరంగా, మానసికంగా వచ్చేదే సక్సెస్‌. నా షో హిట్‌ అయితేనే సక్సెస్‌ అనుకోను.
గత నాలుగేళ్లనుంచీ కొత్తసంవత్సరం రోజున ప్రోగ్రామ్స్‌ చేసేందుకు వెళ్లడం మానేశాను. మా ఇంట్లో వాళ్లందరం కలిసి ఇంట్లోనే వేడుక చేసుకుంటాం. సరదాగా అందరం కలిసి బయటకు వెళ్తాం’’ అన్నారు.

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనా సవాలుకు మోడీ జవాబుకాలం తో కదులు

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -14 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -14

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -136,పేరా 2

యూక్లిడియన్ స్పేస్ టైం,అనంత ఊహాత్మక టైం కు పాకితే ,లేక ఎక్కడో సింగ్యులారిటీ(ఏకత్వం ) లో ఇమాజినరి కాలం లో మొదలైతే , విశ్వావిర్భ కాలాన్ని చెప్పే సంప్రదాయ సిద్ధాంతం ఉన్న సమస్యలే మళ్ళీ ఎదురౌతాయి .దేవుడికి విశ్వం ఎలా ప్రారంభమైందో తెలుసు ,మనం అది ఎలా పురుడు పోసుకోన్నదో వివరించే ఏ ఒక్క కారణాన్నిచెప్పలేం .పైగా  క్వాంటం దీరీ ఆఫ్ గ్రావిటికొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దాని ప్రకారం స్పేస్ టైంకు సరిహద్దు లేదు ,అందుకని సరిగాద్దు వద్ద ప్రవర్తన ఎలా ఉన్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు .సైన్సు సూత్రాలు విచ్చిన్నమయ్యే సిన్గ్యులారిటీలు లేవు . దేవుడిని  ప్రార్ధించ టానికి ఉండే సరిహద్దు అంచు లేదు   లేక స్పేస్ టైం కు కొత్త సరిహద్దు నిబంధనలు ఏర్పాటు చేయమనటానికీ వీలు లేదు .’’విశ్వానికి సరిహద్దు నియమం అంటే దానికి బౌండరీయే లేదు ‘’అన్న ఒక్క సత్యాన్ని మాత్రం  నిశ్చయం గా చెప్ప గలం .విశ్వం పూర్తిగా స్వయం సమృద్ధం,స్వయం నియంత్రణం  (సెల్ఫ్ కం టైండ్).దానిని బయటి విషయం ఏదీ ప్రభావితం చేయలేదు .విశ్వం సృజింప బడదు ,నశింప బడదు ,ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది (బి ).

శాస్త్రి గారి భాష్యం –హాకింగ్ శాస్త్ర వేత్త గారి సైన్సు ఈ రకమైన నిర్ణయాలకు  వచ్చినందుకు అభినందించాలి .ఇది ఉపనిషత్,,బ్రహ్మ సూత్రాల  భావాలనే ప్రతి బింబిస్తోంది .వేదాంతం ప్రకారం ఆత్మ అనేది అనంత మైనది .’’సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ‘’అనేది ఉపనిషద్వాక్యం .సృష్టికి కారణం అనేది శాశ్వతమైనది (ఎటర్నల్ ),సర్వజ్ఞమైనది(ఆమ్ని సెంట్ ) ,అనంతమైనది (ఇంఫినిట్ ).చూసేది అదే కనుక ఎప్పుడూ సృష్టింప బడదు .

వేరొకటి ఏదీ దాన్ని చూడలేదు .అందుకే అది’’ ద్రష్ట ‘’అయింది .అంటే చూసేదేకాని చూడ బడేది కాదు ‘’నతు దృశ్యతే ‘’.అది చూడబడదు ,తెలియ బడదు ,దాన్నిఆత్మ జ్ఞానం వలన  అనుభవించటం ద్వారా నే  తెలియ బడుతుంది .అంటే చూసేవాడు చూడబడే వాడితో ఐక్యమైనప్పుడే ఇది సాధ్యమౌతుంది .అంటే ఆత్మ పరమాత్మ లో చేరినప్పుడే .అదే మొత్తుకొన్నాడు హాకింగ్ శాస్త్ర వేత్త –‘’it would just Be ‘’అంటూ .ఈ విషయాన్ని అద్వైత సిద్ధాంత వ్యాపకులు శంకరాచార్య స్వామి బాగా ప్రచారం చేశారు .ఇదే  ఏకత్వం లేక అద్వైతం .దానిప్రకారం సృష్టి కర్త బ్రహ్మం ఒక్కడే .రెండో వాడు లేడు.దీని ప్రాతిపదికమీద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే’’ నిత్యం ‘’అని ముగించారు .ఆత్మ సృష్టింప బడదు , నశింపబడదు .కారణం అదెప్పుడూ సృష్టింప బడలేదు కాబట్టి .  దృశ్య ప్రపంచామంతా భౌతిక దృష్టికి చెందినదే .హాకింగ్ చెప్పిన ఏకత్వ సిద్ధాంతం కూడాఇదే  ‘’విశ్వం స్వయం సృష్టి (సెల్ఫ్ కన్తైండ్),దీనిని బయటి శక్తులేవీప్రభావితం చేయలేవు .అది ఎప్పటికీ సృష్టింప బడదు .నశించదు ఎప్పుడూ ఉంటూనే ఉంది ‘’.

మన మహర్షులు ఆత్మను యెంత స్పష్టంగా దర్శించి వివరించారో తెలుస్తోంది  విశ్వం అంటే  స్వయం నియంత్రణ కలది  .ఆత్మను శంకరులు గొప్ప పోలిక తో చెప్పారు .అదే రజ్జు సర్ప భ్రాంతి .తాడును చూసి పాము అనుకోవటం దీని గురించి ఇది వరకే చెప్పుకొన్నాం .దేవుడు మానవులకు ఈ విశ్వ రూపం లో కనిపిస్తాడు .ఇంద్రియ నిగ్రహంతో స్థిరమైన మనసుతో ఉంటె మనకు కనిపించేది వస్తు సముదాయం కాదు పరమాత్మయే .,అంటే సృష్టి కారణ భూతుడే ,కాని అప్పుడుసృష్టి కనిపించదు అంటే ప్రభావం (ఎఫెక్ట్ ) కనిపించదు అన్న మాట .ప్రపంచం సృష్టింప బడినట్లు  నాశనమైనట్లు  భ్రాంతి పొందుతాం .వాస్తవానికి సృష్టీ లేదు వినాశానమూ లేదు .కనుక విశ్వావిర్భావమూ లేదు ,అంతమూ లేదు .అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది ,ఉంటుంది .స్టీఫెన్ హాకింగ్ దృష్టిలో అదే ‘’ఇట్ జస్ట్ వుడ్ బి’’.

అందుకే మన ఉపనిషత్తులు’’ సృష్టికర్త ‘’అనే మాట వాడకుండా  చాలా జాగ్రత్త పడ్డాయి .అవి ఎప్పుడు చెప్పినా ‘’సృష్టికి కారణం ‘’అనే చెప్పాయి . మనకు సృష్టికారణం భ్రాంతిగా భాసిస్తుంది .అంటే మనమనసులలోనే ఏర్పడుతుంది దైవం ఎప్పుడూ సృష్టి చేయాలని సంకల్పించడు దీనికి కారణం అయన సంకల్ప ,వికల్పాలకు అతీతుడు .అయన నిర్వి కల్పుడు .ఇదే హాకింగ్ మాటలలో ‘’సెల్ఫ్ కంటైండ్అండ్ నాట్ ఎఫెక్తేడ్ బై ఎని థింగ్ అవుట్ సైడ్ ఇట్ ‘’.మన పురాణాలు కూడా దీనిని బాగానే వివరించాయి .వేద,ఉపనిషత్ ల ను అర్ధం చేసుకోవటానికే పురాణాలు తోడ్పడుతాయి సృష్టి కర్తలలో ఒకరైన శివుని గురించి పురాణం చెప్పింది .ఆయనవస్తుతహా ’’ అభవుడు ‘’అంటే పుట్టుక లేనివాడు లేక పుట్టని వాడు ఆయనకు చావులేదు కనుక ‘’మృత్యుంజయుడు ‘’.పుట్టనివాడికి చావు లేదు కదా .పుట్టుక ,నాశనం లేని దానికి ‘’స్వభావం ‘’(నేచర్ ) ఏమిటి ?ఎప్పుడూ ఉండటమే –అదే హాకింగ్ గారి మంత్రం –‘’ఇట్ వుడ్ జస్ట్ బి ‘’.

పేజి -139,పేరా-2

అందుకని మనంఅనుకొనే  ఇమాజినరి టైం(ఊహా కాలం )నిజంగా ఎక్కువ ఆధార పడేదిగా కనిపిస్తోంది .మనం అనుకొనే వాస్తవం అనుకొన్న విశ్వాన్ని వివరించటానికిమనం సృష్టించుకొన్న అయిడియా అది .నేను మొదటి అధ్యాయం లో చెప్పినట్లు శాస్త్రీయ సిద్ధాంతం అనేది ఒక గణిత ప్రతిరూపమే (మోడల్ ).ఈ మోడల్ తో మన పరిశీలనలను వివరిస్తాం .ఇది మన మనసులలో మాత్రమె ఉంటుంది .కనుక వాస్తవ ,ఊహాత్మక కాలం ఏది అని ప్రశ్నించటం అర్ధ రహితం .కనుక అదే పనికొచ్చే వర్ణన చేయటానికి సహాయ పడే విషయం .

శాస్త్రి గారి కామెంట్ –సైంటిస్ట్ లు నిజాయితీగా ఆలోచించేవారు .వారు ఒకసారి సైన్స్ అనేది మనసు లేక మెదడు (మైండ్ )లోనే ఉంటుంది అంటారు .కనుక అది సత్యానికి బద్ధం కాదు .స్వతంత్రమైనది శాస్త్రమే అయిన పదాలు ,భాష మానవుడు తయారు చేసిందే .అవి సంఘటనలను మాత్రమె వర్ణించ గలవు .అవి కాలం నిజమైనదా  ఊహా జనితమా  అనేది చెప్పలేవు .కాలం భగవత్ సృష్టిలో మొదటిది కనుక మాటలు దైవాన్ని  వర్ణించ లేవు  .’’మాటలు మనసుతో కలిసి దేవుని సమీపానికి చేరి ,తిరి గోస్తాయి కాని దేవుని వర్ణించ లేవు ‘’ అని ఉపనిషద్వాక్యం .దీనికి సంబంధించిన శ్లోకం –

‘’యతో వాచో నివర్తం తే  అప్రాప్య మనసా సహా ‘’.

పేజి -140,లో  చివరి వాక్యం, 141పేజీ లో వాక్యాలు

సృష్టికి ఆరంభం ఉంది అనుకొంటే ,దాన్ని సృష్టి చేసిన వాడు ఒకరు ఉండాలి .కాని విశ్వం స్వీయ నియంత్రమైతే (సెల్ఫ్ కంటైండ్ ),సరిహద్దే లేక పొతే ,అంచు ఉండకపోతే ,దానికి ఆది అంతం ఉండదు .అది అలా ఉంటూనే ఉంటుంది .అప్పుడు సృష్టి కర్త కు స్థానం ఉండదు కదా .

శాస్త్రి గారి వ్యాఖ్యానం-ఉపనిషద్వేదాంతం ఈ సమస్యను  సృష్టి కర్త ను సృష్టి తో గుర్తించి (ఐడెంటి ఫై )పరిష్కరించింది .అదే సెల్ఫ్ లేకఆత్మ.మనం ప్రపంచాన్ని చూస్తున్నా ప్రపంచం లో ఒకరం అయిన  ,మనల్ని మనమే చూసు కొంటున్నామనం చూస్తున్నది ఆత్మనే .ఈ విషయం లో సైంటిస్ట్ హాకింగ్ ఒక  అడుగు ముందుకు వేసి సృష్టి, సృష్టి కర్త ఒకరే అనేశాడు .అలా చెప్పి ఉండకపోతే సైన్సు ,,ఆధ్యాత్మికత వేరు వేరే అనేది రుజువు చేసినట్లు అయ్యది . ఆ సందేహం రాకుండా స్పష్టంగా చెప్ప్పాడు ధైర్యంగా .మతపరమైన అనుభవాలు  సైంటిఫిక్  వాదాల జోలికి వెళ్ళ కుండా నిషేధానికి గురి అయ్యేవి .సాధారణంగా సైంటిస్ట్ లకు మత దృక్పధం ఉండదు .కాని నా ద్రుష్టి లో హాకింగ్ సైంటిస్ట్ దేవుడు ఉన్నాడని నమ్ముతాడు అని పిస్తుంది .ఆయన రాస్సిన ఈ పుస్తకం ఎక్కడ చెప్పినా భగవంతుడు ఉన్నాడు అన్న భావమే గోచరిస్తుంది .అది ‘’టేకెన్ ఫర్  గ్రా౦ టెడ్’’’’అనుకోవచ్చు మనం .అంటే మనం అనుకోన్నది ఆయనకు అంగీకారమే నని అర్ధం . తన నిజాయితీ అనుమానాన్ని ప్రశ్నించాడు .

భారతీయ తర్క శాస్త్రం కూడా దేవుడు ఉన్నాడనే అన్నది. కాని ఆయన ఉనికి ని రుజువు చేసే జోలికి పోలేదు. అదే తెలివైన పని

లాజిక్ అంటే తర్కం ‘’ఏ సంఘటన జరగాలన్నా నాలుగు ముఖ్య కారణాలు ఉంటాయని చెప్పింది .అవి -1-ఈశ్వరుడు  2-అదృష్ట౦ 3-దేశ౦  4-కాలం .ఇందులో మొదటిదే దైవం .

 

సశేషం

2016 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2016-ఉయ్యూరు

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

 

Inline image 1  Inline image 2


Inline image 3
 
Inline image 4
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment