ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58

25-ఛంద స్ శాస్త్ర వేత్త- (స్ప్రంగ్ రిధం సృష్టికర్త )జెరార్డ్ మాన్లి హాప్కిన్స్

తనకాలం లో గుర్తింపు పొందకపోయినా పుట్టిన వందేళ్ళకు జెసూట్ టీచర్ హాప్కిన్స్ కవి 1930-40-కాలపు  రాడికల్  కవులపై తీవ్ర ప్రభావాన్ని చూపాడు . ఈకవి చనిపోయిన ముప్ఫై ఏళ్ళ తరువాతకాని అతని కవితలు ప్రచురింపబడలేదు .అందులోని శైలి  అందరూ దిగ్భ్రమ చెందారు .ఈ కవిదారిలో ఆడెన్ ,స్పెండర్ డిలాన్ ధామస్ ,మొదలైన ఇరవయ్యవ శతాబ్దపు కవులు కవిత్వం రాశారు .చూడగానే ఇంప్రెస్ అయెట్లు ఉండటం ఈ  కవిత్వ లక్షణం .రూపకలంకారాలకు పట్టం కట్టాడు .సంక్షిప్త అర్ధం తో కవిత లల్లాడు

హాప్కిన్న్స్ లండన్  లోని  స్స్ట్రాఫోర్డ్ ఎసేక్స్ లో 11-6-1844పుట్టాడు .పదహారోఏట కవిత రాసి ప్రైజ్ కొట్ట్టేశాడు .మరో రెండేళ్లకు హీరోయిక్ కప్లేట్స్  రాసి మళ్ళీ ప్రైజ్ నొక్కాడు .వయసు పద్దెనిమిదిలో  బాలియోల్ కాలేజిలో చేరి వాల్టర్ పాటర్స్ లాగా కవిత్వం రాశాడు .అప్పటికే సంగీతం చిత్రలేఖనలలో నైపుణ్యం ఉంది .మతం తో మమేకమయ్యాడు ..మత పద్ధతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించేవాడు .ఇరవై మూడవ ఏట కేధలిక్ మతాన్ని తీసుకొన్నాడు కార్డినల్ న్యూమాన్ అయాడు .అప్పటినుంచి అంకిత భావంతో  ప్రీస్ట్ గా పని చేశాడు .రాసిన కవితలన్నీ తగల బెట్టేశాడు’ .కవిత్వం ఒక విలాసం అని త్యజించాడు .క్రిస్టల్ ఫీల్డ్ ఆక్స్ ఫర్డ్ ,డబ్లిన్ లలో ప్రచారాలు నిర్వహించాడు .నలభై ఏళ్ళు వచ్చాక డబ్లిన్ రాయల్ వర్సిటిలో గ్రీక్ బోధించాడు .మరింత కఠిన నియమాలతో జీవించాడు .మురికి వాడల్లోని జనం జీవన పరిస్తితులకు చలించి అక్కడికి వెళ్లి సేవచేయటం మొదలు పెట్టాడు .ఇక్కడే టైఫాయిడ్ జ్వరం వచ్చి నలభై అయిదవ ఏట 8-6-1889 మరణించాడు .

కవిత్వం మళ్ళీ రాయటం ప్రారంభించాక రాసినది అంతా ప్రకాశ మానం గా రాశాడు .సడలని విశ్వాసం ఆరాధన తో రాశాడు .తన జీవితానికి అన్వయించుకొంటూ రాశాడు .మానవ ప్రపంచం కాదు ఆయనకు కనిపించింది దైవ ప్రపంచమే .మానవ ప్రపంచం లో భయం ,అనుమానం కనిపించాయి .స్నేహితుడు రిచర్డ్ వాట్సన్ డిక్సన్ కు జాబు రాస్తూ నగర జీవితం లోని పేదల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చలించి పోతున్నానని ,తన జాతి పతనం కలవర పరుస్తోందని  ఆ శతాబ్దపు నాగరకతలో బోలుతనం గోచరిస్తోందని అని తెలియ జేశాడు .ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జ్ కి ఉత్తరం రాస్తూ త్వరలోనే ఒక మహా విప్లవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తన భావనలు కమ్యూనిస్ట్ భావనుగా ఉన్నాయేమోనని కాని అదినిజమని ,ధనిక దేశమైన ఇంగ్లాండ్ కస్టాల పాలై గౌరవ మర్యాదలు ,విజ్ఞానం ,సుఖం ఆశలు కోల్పోయి జీవించే రోజులు దగ్గరలో నే ఉన్నాయని చెప్పాడు .అట్టడుగు వర్గాలవారికి విద్య నేర్పక పోతే తాము సర్వనాశనమై పోతున్న విషయం తెలుసుకోలేరని వ్యధ చెందాడు .ఇవన్నీకాకపోయినా ఇందులో కొన్ని భావాలు  కవితల్లో దించాడు .సానేట్స్ రాసి అందులో అనారోగ్య సంతోష విషాదాన్ని రాశాడు .దైవ ప్రపంచాన్ని ప్రస్తుతించాడు .తను రాసినదాన్ని తిరస్కరిస్తారేమోనన్న భయమూ అతన్ని పీడించి ప్రచురించటానికి సాహసం చేయలేక పోయాడు .ఇవన్నీ అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించినవే అయినా చనిపోయేదాకా ప్రచురితానికి నోచుకోలేదు .

భౌతిక వాద విజ్రు౦భణ మతపరమైన యదార్ధత లమధ్య అగాధాన్ని గమనించాడు హాప్కిన్స్ .తనలోని ఆధ్యాత్మిక వ్యక్తిని జాగృతం చేశాడు .తాను రాసినవి తన సన్నిహిత మిత్రుడు బ్రిడ్జెస్ కు ఇచ్చాడు .అందులోని కవితా పంక్తుల్ని చదివి దిగ్భ్రమ చెందాడు బ్రిడ్జెస్ .’’పోయెమ్స్ ఆఫ్ జేరార్డ్ హాప్కిన్స్’’పేరుతొ విడుదలచేశాడు .అందులో హాప్కిన్ చెప్పిన ‘’స్ప్రుంగ్  రిధం ‘’గురించి వివరించాడు .హాప్కిన్స్ కు గొప్ప శ్రోతలు ఉండేవారు .అందులోని చందోరీతుల్ని ఆస్వాది౦చేవారన్నాడు హాప్కిన్స్ .పదమూడేళ్ళ తర్వాతహాప్కిన్ చెప్పినదానిలోసత్యాన్ని  యువ కవులు గుర్తించారు .రెండవ ఎడిషన్ లో హాప్కిన్ ను అర్ధం చేసుకొని స్వాగతించారు

a poetic metre approximating to speech, each foot having one stressed syllable followed by a varying number of unstressed ones.అని స్ప్రంగ్  రిధం ను నిర్వచించారు .’’the poetical language of an age should be the current language heightened to any degree and unlike itself but not an absolete one ‘’అంటాడు హాప్కిన్స్ .తనకవిత్వం లో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చునని క్రమంగా దోష రహితమై మిల్టన్ శైలిని అందుకొంటు౦ దని  రిడ్జేస్ కు రాశాడు .హాప్కిన్స్ దైవం ఆవహించి రాయలేదు ప్రతీక లో  మునిగి రాశాడు .ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించి భగవంతుని ఉత్కృష్ట తను ఆవిష్కరించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం ‘’glory be to God for drappled things –For skies of couple color as a brinded cow

for rose moles all in stipple upon trout that swim –fresh fire coal chestrnut falls ,finches wings

land scape plotted and pieced –fold fallow and plough and all trades their gear and tackle and trim ‘’అంతేకాదు మరో కవితలో ‘’man must begin know this ,where nature ends-nature and man can never be fast friends ‘’అని ఆనాడే హెచ్చరించాడు  ‘’మెటఫర్ లను బ్రేకింగ్ పాయింట్ దాకా సాగదీసి వదిలేవాడు హాప్కిన్స్ .ఒకోసారి స్విన్ బరన్ కవిని మించిపోయి రాసేవాడు ‘’I caught this morning morning ;s  minion ,king—Dom and day light ;s Dauphin ,dapple dawn drawn falcon in his riding ‘’

1935కు హాప్కిన్ ప్రాముఖ్యం ఏమిటో లోకానికి తెలిసింది అతని కవితల కొత్త ఎడిషన్ తెచ్చారు రాసిన ఉత్తరాలను ప్రచురించారు .’’ఏ హోప్ ఫర్ పోయిట్రీ’’’లో సి డే లేవిస్ –హాప్కిన్స్ ప్రతిభ ఏమిటో వివరించాడు .’’no poet since Donne has drawn his material from so wide a radius . By him the language which his prosody swings to the other extreme ,for it is based on the rhythms of common speech .he is a true revolutionary poet ‘’అన్నాడు .హాప్కిన్స్ దిస్వేచ్చా స్వరమే కాని హద్దులలోనే ఉంది .ప్రయోగాత్మక కవుల పై అధిక ప్రభావం చూపాడు .వాళ్ళు ఆధునిక కవిత్వాన్ని అతని సంప్రదాయాలను జాతీయాలను చేర్చి పుష్టి కలిగించారు .అతనిప్రయోగాలు మరింతా లోతుగా అన్వేషి౦చటా నికి తోడ్పడ్డాయి .అందుకే ఆ తరం లో పూర్వీకుడిగా హాప్కిన్స్ జేజేలు అందుకొన్నాడు .మరింత సరళీకృత కవిత్వ భాషకు నాందిపలికాడు .అతను వాడిన ఆడంబర పదజాలం నేడు అత్యవసరం తప్పనిసరి అయ్యాయి .భావోద్రేకాల పొంగు కు అతనికవిత్వం నిలయమైంది .రచయిత లూయీ అంట ర్ మేయర్’’ the world was prodigal  with vision .Nature was a divine turmoil and God an eternal exuberance ‘’అని చెప్పిన మాటలు పూర్తీ యదార్ధం .

Image result for gerard manley hopkinsImage result for gerard manley hopkinsImage result for gerard manley hopkins

Image result for gerard manley hopkins

మరో ప్రముఖుని తోకలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ .-11-7-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంధ్రకు తీరని అన్యాయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేదాలపై దాడి -మేనకా గాంధి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన్‌మోహన్ బాటలో మోదీ

మన్‌మోహన్ బాటలో మోదీ

  • 11/07/2015
TAGS:

అదే దృశ్యం పదే పదే ఆవిష్కృతమవుతోంది…అదే ఇతివృత్తం అదే కథనం, అవే పాత్రలు, అదే కథ! భారతీయుల పాలిట ఇదంతా ఘోరమైన వ్యధ. ఇతివృత్తం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత, భారత వ్యతిరేక జిహాదీ హత్యాకాండ. ఇతివృత్తం దశాబ్దులుగా మారడంలేదు…పాత్రధారులు మాత్రం ‘అప్పుడప్పుడు’ మారిపోతున్నారు. రష్యాలోని ‘ఊఫా’లో సరికొత్తగా శుక్రవారం విరుచుకొని పడిన వికృత దృశ్యంలో పాత్రధారులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి జిహాదీ హంతకుడు నవాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్‌ను అతగాడి నాయకత్వంలోని తథాకథిత-సోకాల్డ్- పౌర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది పాకిస్తాన్ సైనిక దళాలలోని పెత్తందార్లు. ఈ పెత్తందార్లు పాకిస్తాన్‌లోని జిహాదీ ఉగ్రవాదులకు, మతోన్మాదులకు తాబేదార్లు. అందువల్ల నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం పాకిస్తాన్‌లోని జిహాదీ మతోన్మాదులతో కరచాలనం చేయడంతో సమానం. ఈ జిహాదీ మతోన్మాదులు నిరంతరం మనపై చీకటి దాడులు చేస్తుండడం ‘ఊఫా’లో శుక్రవారం సంభవించిన ‘మోదీ, షరీఫ్‌ల కరచాలన’ పరిణామానికి నేపథ్యం. ఈ కరచాలనంతో గతంలో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాధినేత మన్‌మోహన్ సింగ్ ఆరంభించిన కథలో మరో ఆవృత్తి మొదలైంది. 2009లో రష్యాలోని ఏకాథరిన్‌బర్గ్‌లో మన్‌మోహన్ సింగ్ పాకిస్తాన్ అధినేత అసఫ్ అలీ జర్దారీతో కరచాలనం చేశాడు. అప్పటి ప్రధాని యూసఫ్ రజా జిలానీని ఈజిప్టులోని షరమ్ అల్ షేక్‌లో కౌగలించుకున్నాడు. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన పాకిస్తానీలు సృష్టించిన భయానక బీభత్సకాండ రక్తపు మరకల తడి ఆరకముందే మన్‌మోహన్ సింగ్ జర్దారీని, జిలానీని కలుసుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ ‘తడి’ని మరోసారి తలపునకు తెప్పించాడు. నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం ద్వారా. 2009 నాటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ, స్వభావానికీ ఇప్పటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ స్వభావానికీ మధ్య ఎలాంటి అంతరం లేదు. మన ప్రభుత్వ విధానంలో కూడ ఎలాంటి మార్పు రాలేదని నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం వల్ల మరోసారి ధ్రువపడింది.
పాకిస్తానీ జిహాదీలు మనదేశంలోని నిరాయుధులను వందల సంఖ్యలో హత్య చేశారు. హత్యాకాండ జరిగిన వెంటనే ‘తీవ్ర స్వరం’తో నిరసన తెలపడం మన ప్రభుత్వ విధానంలోని మొదటి దశ. దోషులను పట్టి బంధించి మన దేశానికి పంపించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం రెండవ దశ. అంతవరకు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడబోమని, పాకిస్తాన్ నాయకులను కలుసుకోబోమని కరచాలనం చేయబోమని, చర్చల ప్రసక్తి లేనేలేదని ప్రకటించడం మూడవ దశ. ‘‘నేరస్థులను మాకు అప్పగించకపోయినా ఫర్వాలేదు. మీ దేశంలోని విచారించి తీరాలి..’’ అని బెట్టు చేస్తూ మెట్టుదిగడం నాలుగవ విపరిణామం. ఈ మొత్తం వ్యవహారాన్ని మరచిపోవడం మన ప్రభుత్వ విధానంలోని ఐదవ దశ… తరువాత మన ప్రధాని, మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలు, యధావిధిగా పాకిస్తాన్ హంతక ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకోవడం, కలసి విందులారగించడం, స్నేహ గీతాలను ఉమ్మడిగా ఆలపించడం సంప్రదాయమైంది. నరేంద్ర మోదీ ‘ఊఫా’లో ఈ సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఈ సంప్రదాయం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మన్‌మోహన్ సింగ్ పాలన నుండి సంక్రమించిన విధాన వారసత్వం. ప్రభుత్వాల నిర్వాహకులు మారినప్పటికీ జాతి హితానికి సంబంధించిన విధానాలు మారరాదన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి! ఈ స్పూర్తిని నరేంద్ర మో ప్రభుత్వం మరోసారి నిలబెట్టింది. క్షతికారునితో క్షతగాత్రుడు చేతులు కలపడమేనా జాతీయ హితం. క్షతిని కలిగిస్తున్న హత్యలు చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రవృత్తిలో మార్పు వచ్చినట్టయితే గతాన్ని మరచిపోయి ఆ దేశ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చు. మనదేశ ప్రజలు బాధపడరు. కానీ పాకిస్తాన్ నోటిలో ఇప్పటికీ రక్తపు మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రక్తం బీభత్సకారులు చంపిన భారతీయులది. అలాంటి నోటితో నవాజ్ షరీఫ్ ఇచ్చినట్టు చెబుతున్న హామీలను నమ్మడం ఆత్మవంచన మాత్రమే. ఊఫాలో నరేంద్ర మోదీ చేతిని నవాజ్ షరీఫ్ రక్తహస్తం ఊగిస్తుండిన సమయంలోనే అమర్‌నాథ్ యాత్రికులపై దాడికి జిహాదీలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడినాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విధానంలో ఎక్కడ వచ్చింది మార్పు?
జాకీ ఉర్ రహమాన్ లఖ్వీ అనే వాడిని శిక్షించడానికి ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో స్పష్టం చేసిందట. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన జిహాదీ హంతకులను ఉసిగొల్పి నడిపించిన వాడు ఈ లఖ్వీ. శుక్రవారం నవాజ్ షరీఫ్ లఖ్వీ విషయమై నరేంద్ర మోదీకి ఏవో హామీలు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో విశ్వసనీయత ఎంతశాతం? ‘న్యాయస్థానాలు విడుదల చేసిన’ లఖ్వీని విచారించి శిక్షించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇక ముందు పూనుకుంటుందన్నది వంచన క్రీడలోభాగం. నవాజ్ షరీఫ్‌ను నరేంద్ర మోదీ గట్టిగా నిలదీసినందువల్ల ఇకపై పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాగలదన్నది మన ప్రభుత్వం వారి ఆశాభావం. కానీ బుధవారం నాటి పాకిస్తాన్ ప్రభుత్వ విధానం శుక్రవారం మారిపోయిందని విశ్వసించడం తార్కికమా? జమాత్ ఉద్ దావా ముఠాలో పేరుమోసిన హంతకుడు హఫీజ్ సరుూద్ అసలు సూత్రధారి. సరుూద్‌నీ నిర్బంధించి విచారించాలని, అతని నాయకత్వంలోని జమాద్ ఉద్ దావాను నిషేధించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది కూడ. కానీ తీర్మానాన్ని అమలు జరపలేదని జమాత్ ఉద్ దావాను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించలేదని 2009 జూలై లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విముక్తి చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పాటించవలసిన అవసరం లేదని కూడ లాహోరు హైకోర్టు స్పష్టం చేయడం చరిత్ర. హైకోర్టు నిర్ణయాలను ఆ తరువాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధ్రువపరిచింది..
హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అభినయించిన న్యాయ ప్రక్రియ లఖ్వీ విషయంలో కూడ పునరావృత్తమైంది. ఇది ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం లఖ్వీని విచారించి శిక్షిస్తుందన్న ఆశాభావంతో మోదీ రష్యాలో షరీఫ్‌తో కరచాలనం చేయడమే విస్మయకరం. 2008 డిసెంబర్ నాటి సమితి తీర్మానాన్ని అమలు జరిపినట్టు అభినయించి సమితిని అంతర్జాతీయ సమాజాన్ని వంచించిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విశ్వసించడం ఎండమావి నుండి నీరు తోడడానికి ప్రయత్నించడంతో సమానం. గత ఆగస్టు 18న మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగదెంపులు చేసుకొంది. కాశ్మీరీ విచ్ఛిన్నకారులతో చర్చలు జరుపడం మాననంతవరకు, సీమాంతర ఉగ్ర క్రీడను ఉపసంహరించుకునే వరకు పాకిస్తాన్‌తో చర్చలు జరపరాదన్నది మన ప్రభుత్వం అప్పుడు చెప్పిన మాట. రెండింటిని పాకిస్తాన్ మానుకోలేదు…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ ఫోటో ఆ బాలుడి జీవితాన్నే మార్చింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనాకు చెక్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57

24–ఫ్రెంచ్ సింబాలిక్ కవిత్వ ఘనుడు –పాల్ వెర్నేన్

విషయవా౦ఛలను  బాగా అనుభవించినా స్వచ్చమైన కవిత్వం రాసిన ఫ్రెంచ్ కవి పాల్ వేర్నేన్.30-3-1844ఫ్రాన్స్ లోని మెత్జ్ లో పుట్టాడు .తండ్రి నికొలాస్ అగస్టేవేర్లేన్ నెపోలియన్ సైన్యం లో కాల్బలానికి కెప్టెన్ గా ఉన్నాడు .లీజియన్ ఆఫ్ ఆనర్ గౌరవం పొందాడు .1851లో కుటుంబం పారిస్ కు మారింది .పాల్ చదువులో బాగా దూసుకుపోయాడు .సాహిత్యం లో ,అలంకార శాస్త్రాలలో ,మృత భాషలలో  ఆనర్స్ డిగ్రీ సాధించాడు ‘లైస్ బోనపార్టే నుండి డిగ్రీపొంది సిటి అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్ డిపార్ట్ మెంట్  లో క్లార్క్ గా చేరాడు .ధ్యాసమాత్రం కవిత్వం  మీద ఉండేది .పదమూడో ఏటనే బాడలేర్ పై ఆసక్తికలిగింది .తను అతనికంటే ఇంకా బాగా రాయగలను అనుకొన్నాడు ‘

ఇరవై లో కుర్ర బోహీమియన్ గాంగ్ తోకలిసి ఒక జట్టును ఏర్పరచాడు .వీళ్ళు తమను ‘’పార్నాస్సియన్లు ‘’గా పిలుచుకొన్నారు .నాయకుడు లేకంటే డీ లిజిల్ .ఆంక్షలు లేని రోమా౦టిజం ను  వ్యతిరేకించారు .మళ్ళీ క్లాసిజం రావాలి అని కోరుకొన్నారు .అదీ చాలా స్పష్టమైన విధాన లో టెక్నిక్ తో ఉండాలని ఆశించారు .దీనికి తగినట్లు వేర్నేన్ కవిత్వం రాసి దారి చూపించాడు. మొదటిపుస్తకం ‘’పోయెమ్స్ సాచుర్నీస్ ‘’ప్రచురించాడు .ఇరవై ఏళ్ళకే అ పేరులోని సాచురిన్ ను సార్ధకం చేసుకొన్నాడు .కవిత్వం లో సున్నితమైన నిర్మాణం ,మంద్ర స్వరం చూపాడు .సంగీత స్వరంలాగా కవితలు ఆకర్షించాయి .అందులో స్వచ్చత కనిపించింది .పవిత్రత దర్శన మిచ్చింది .వయోలిన్ శబ్దం లాగా దీర్ఘం గా ,చిరుగాలి సవ్వడిలా హాయిగా మాధుర్య విలసితంగా కవిత్వం రాశాడు .ఇంతవరకు బాగానే ఉంది .

అయ్యగారు మేజర్ అయ్యేసరికి దురలవాట్లలో పడిపోయి హోమో సేక్సువల్ గా  మారి  విపరీతంగా తాగిపూర్తిగా దారితప్పాడు .తండ్రి చనిపోయాడు తల్లి బాగా ఆప్యాయంగా చూసింది .మధ్య తరగతి గౌరవాన్ని చాలెంజ్ చేశాడు ప్రీస్ట్ లను అవహేళన చేశాడు .నాస్తిక జెండా ఎగరేశాడు .సమాజం పట్ల అసహ్యం ,ప్రయోగాలతో రెండవ పుస్తకం గా ‘’గాలేంట్ ఫెస్టివల్స్ ‘’రాసి అచ్చేశాడు .ఇవి మొజార్ట్ సంగీత ద్వనుల్లా ఉన్నాయన్నారు .అదే ఏడాదిలో మేటేల్డీ మాటీ డీ ఫ్లార్వేల్ తో ప్రేమాయణం సాగింఛి పెళ్లాడాడు .మంచి జోడీయే అని అంతా భావించారు.పెళ్ళితోనైనా దారిన పడతాడు అనుకొన్నారు.మనవాడికి ఇరవై అయిదు ఆ అమ్మాయి ఇతనికంటే చాలా చిన్నది .కాని బాగా అన్యోన్యం గా ఉన్నారు ఈ ఆనందాన్ని ‘’ది గుడ్ సాంగ్ ‘’కవితలలో పోదిగాడు .ఈసుఖ జీవితం ఎక్కువ కాలం లేదు .

పెళ్ళయిన న ఏడాదికే  ఫ్రాంకో –ప్రష్యన్ యుద్ధం1870లో  వచ్చింది. గురూగారు మళ్ళీ డోసుపెంచి తెగ తాగి వీరంగం వేస్తున్నాడు .పాత చెడు అలవాట్లకు బానిసైపోయాడు .ఉద్యోగం హుళక్కి అయింది .దీనికి తోడూ తల్లి దురాశతో ఉన్న డబ్బు అంతా స్పెక్యులేషన్ పై పెట్టింది .అంతా తిరు క్షవరమై చేతికి చిప్ప మిగిలింది .వేర్నేన్ కు అత్తవారు ఒక ఇల్లు ఇచ్చారు .ఒక రోజు పోస్ట్ లో ఒక అద్భుత కవిత్వం వచ్చింది రాసినవాడు కొత్తకుర్రాడు ఆర్ధర్ రిమ్బాడ్.వాడు ఇతని దగ్గరకు చేరి ఇద్దరూ ‘’ఒకటైపోయారు ‘’.

అర్దర్ తండ్రికూడా మనకవి తండ్రిలాగా ఆర్మీ ఆఫీసర్ .తల్లి కోపిష్టి .పదిహేనవ ఏట ఆర్ధర్ తను పార్నాస్సియన్ అయిపోయాననుకొన్నాడు .విచిత్రంగా పారిస్ కమ్మ్యూన్ లో చేరి అకస్మాత్తుగా వదిలేసి తానుఒక యోగిని అని ప్రకటించాడు .అప్పుడే వేర్నేన్ ను కలవటానికి తాను రాసిన వంద లైన్ల కవిత్వాన్ని వెంట తెచ్చాడు .ఇక్కడే తిష్ట వేశాడు.ఇల్ల్యూమినేషన్స్ పేరు  మీద   ఏదో భ్రమలో రాసిన కవిత్వం అది .వాడు మురికి బట్టలు మార్చేవాడుకాదు. సంఘాన్ని గూర్చి పట్టించుకోనేవాడు కాదు .మాజిక్ ,తంత్రాలు నేర్చి ప్రయోగించేవాడు .రిమ్బా ద్చేసేది అంతా    పరమ పవిత్రమైనదిగా వేర్నేన్ భావించాడు .వాడినే ఆరాధించాడు పెళ్ళాం సంగతి పట్టించుకోలేదు.ఆమె కుటుంబం వాళ్ళు ఒక సారి వీళ్ళ ఇద్దరిపై విరుచుకు పడ్డారు .వేర్నేన్ ఇల్లువదిలి బాయ్ ఫ్రెండ్  రిమ్బాడ్ తో కలిసి వెళ్ళిపోయాడు.

తమల్ని తాము ‘’సూర్య పత్రులు ‘’గ భావించి  ఈ జంట లండన్  చెక్కేశారు  .ఇద్దరి పోషణాభారం వేర్నేన్ తీసుకొని ఫ్రెంచ్ భాష నేర్పుతూ లండన్ లో ఇంగ్లీష్ లెక్చర్లు ఇస్తూ సంపాదించాడు .తర్వాత బెల్జియం చేరారు .ఏడాది కే ‘’మగ దాంపత్యం ‘’ముగిసింది .తాగిన మైకం లో ఒకరినొకరు తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .సహజం గా రిమ్బాడ్ హోమో సేక్సువల్ కాదు .మనకవి గారి కపి చేస్టలకు బలైనాడు ‘’;కోపో ద్రేకం తో బ్రస్సెల్స్ లో వేర్నేన్ వాడిపై కాల్పులు జరిపాడు ;కాల్పుగాయం చిన్నదే కాని వేర్నేన్ పడిపోయాడు .తల్లి ,పెళ్ళాం వచ్చి వాడితో స్నేహం వదులుకోమన్నారు ‘సరేనని వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ మరో రౌండ్ గుళ్ళు పేల్చాడు వేర్నేన్ .ఇది బహిరంగమై అరెస్ట్ అయి రెండేళ్ళు చువ్వలు లేక్కేశాడు .

ఈ లోగా రిమ్బాద్ భ్రమ  కవిత్వాలు రాసి ‘’ఏ సీజన్ ఇన్ హెల్ ;;ప్రచురించాడు .ఈ వింత విపరీత ధోరణి కవిత్వమే తర్వాత సర్రియలిస్ట్ లకు ‘’ బైబుల్ ‘’అయింది ;అపస్మారకం లో రాసిన కవిత్వం అని ముద్రపడింది ;రాసిన ఇరవై ఏళ్ళకు కాని ముద్రణ భాగ్యం పొందలేదు .రిమ్బాడ్ ఉద్యోగాలు ఏకం మారి దేనిలోనూ స్తిరపడకండా టీచర్ గా  సర్కస్లోను  ,డాక్ వర్కర్ గా డచ్ ఆర్మీ  సైనికుడిగా  సైప్రస్ క్వారీ లో కూలీగాఅనేక   అవతారాలెత్తాడు .  ,  విసుగెత్తి ఆఫ్రికా వెళ్లి ఫ్రెంచ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేశాడు బంగారం ,దంతం దిగుమతి ఎగుమతి లో పని చేశాడు వెబ్ రివర్ ను ,అబిసీనియాలోనిఆగాదాన్ ప్రాంతాన్ని అన్వేషించాడు .ఆయుధ సామగ్రి దొంగిలించి స్థానికులకు అమ్మాడు .బానిసలను అమ్మేవాడనీ రూమర్ ఉంది .అబిసీనియా అమ్మాయి తో బ్రహ్మాండమైన భవంతిలో విలాసంగా జీవించాడు అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా అతనికి  సంక్రమించిన  సిఫిలిస్ వ్యాధి ప్రాణా ౦తకమైంది ;కాలికి గాయమై మానలేదు యూరప్ వెళ్లి కలికి శాస్త్ర చికిత్స చేసుకోవాలనుకొన్నాడు .ఆపరేషన్ సక్సెస్ కాని పేషెంట్  డైడ్.సిఫిలిస్ ముదిరి మార్సిల్లిస్ హాస్పిటల్ లో 1-8-1896మరణించాడు .అప్పటికి వయసు ముప్ఫై ఏడే రిమ్బాడ్ కు .

వేర్నేన్ జైలు నుంచి విడుదలయ్యాడు వయసు ముప్ఫై ఒకటి .నాస్తికత్వాన్ని వదిలేసి చిన్ననాటి పరిస్తితులకు వచ్చాడు భార్యను తల్లిని వచ్చి తనను తీసుకు వెళ్ళమని కోరాదు .పాపం నుండి విముక్తిపొందిన వాడుగా మారాడు .భార్య ఇతను జైల్లో ఉండగానే విడాకులు తీసుకొన్నది నమ్మలేదు ఇతనిని .మైండ్ బ్లాక్ అయి మళ్ళీ రిమ్బాడ్ ను జేర్మనీనుంచి వచ్చి తనతో ఉండమని కోరాడు .వాడికి అప్పటికే జ్ఞానప్రకాశం కలిగి మళ్ళీ ఈ రొంపిలోకి దిగటానికి ఇష్టపడలేదు .

జైలు లో ఉండగానే వేర్నేన్ కొన్ని పాటలు  రాశాడు .వాటిని ‘’రొమాన్సెస్ వితౌట్ వర్డ్స్ ‘’పేరుపెట్టి ప్రింట్ చేశాడు ‘అది జానపదసాహిత్యం లా సరళంగా సూటిగా ఉంటూ నర్మగర్భితం గా ఉంది .సెంటిమెంట్ తో వండిన కవితలివి ;ఎందరినో ప్రభావితం చేశాయి .’’take rhetoric  and wring its neck ‘’ అని తోటికవులను ప్రబోధించాడు .(అలంకార శాస్త్రాన్ని తీసుకొని దాని మెడ పిండండి) అనిభావం ‘

వేర్నేన్ జీవితం లో చివరి పద్దెనిమిది ఏళ్ళు నరకం అనుభవించాడు .చేసినతప్పులు మనసును కల్లోల పరచాయి .పశ్చాత్తాపదగ్దుడయ్యాడు .వర్జిన్ గాడ్ ఆఫ్ హెవెన్ కు గ్రీన్ గాడెస్ కు మధ్య ఊగిసలాడాడు .టీచర్ గ పని చేశాడు .కాని పాత తప్పులు కెలికి బాధించారు రిజైన్ చేశాడు .భూమి పుత్రుడిలా ఉండాలనుకొన్నాడు.కానీ అనుభవం  లేదు .ఒకసారి తాగిన మైకం లో తల్లినే బాదిపారేశాడు అరెస్ట్ చేసి జైల్జైల్లో పెట్టారు .విడుదలైనతర్వాత బారు గడపలు తొక్కుతూ తిరిగాడు .జ్ఞానోదయం కలిగింది .ఈ సారి అదిపక్కా గా నిలబడింది కాని వ్యభిచారం లో దిగిపోయాడు .ఈ స్తితిలోను కవితలురాశాడు ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి సాహసించలేదు ‘కఫే ల చుట్టూ తిరిగాడు కప్పుకాఫీకి పెగ్గు డ్రింక్ కీ ,ఒక పోస్టల్ స్టాంప్ కీ ‘

నలభైలలో నరాల బలహీనతత వచ్చింది .వాతరోగం వచ్చింది జుట్టురాలిపోయి బట్టతలయింది .వాగాబాండ్ లా ఉన్నాడని అనటోల్ ఫ్రాంక్ అన్నాడు .అతనిపాటలు  విలన్ మాటల్లా ఉన్నాయన్నారు .రాసింది ఏదీ క్లిక్ కాలేదు.మరీ డల్ అయ్యాడు .అయినా రాస్తూనే ఉన్నాడు .రాసిన దానికి మెరుగు పెడుతూనే ఉన్నాడు .పబ్లిష్ చేస్తూనే ఉన్నాడు ‘కొంత స్పష్టత కొంత అస్పస్తత కొంత లోతు కొంత బోలుతనం ఉండేది అవే ఆధునిక కవిత్వానికి దారి చూపాయి .తన పందోమ్మిదవ కవితా సంపుటిగురించి కలలు కంటు౦డగా కిడ్నీ ట్రబుల్  జీర్ణాశయ వ్యాధి వచ్చాయి .చేతిలో పెన్నీ కూడా లేని కడు బీదతనం లో ఉన్నాడు .8-1-1896లో యాభై రెండేళ్లకే మరణించాడు పాల్ వేర్నేన్ .అప్పటికే అందరూ అతన్ని మర్చేపోయారు .

అతను జీవి౦ఛిన కాలాన్ని ‘’ఫిండీ సీకిల్ ‘’అన్నారు .అంటే విలువల పతనకాలం అని అర్ధం.అతన్ని శాపగ్రస్త(కర్సేడ్ పోయెట్)అన్నారు .ఇలాంటివారు మలార్మే ,రిమ్బాడ్ ,ఆలీస్ డీ చామ్బెరీర్ .  వీరంతా కవితా సంప్రదాయాన్ని దిక్కరించినవారే .దానివలన ప్రజల ఆగ్రహ అవమాన అవహేళనకు గురయ్యారు. కాని1896’’సింబలిస్ట్ మాని ఫెస్టో’’విడుదల అయిన తర్వాత సింబాలిజం అనేకొత్త మాట ఆవిష్కారమైంది .అదే నూతన సాహిత్య ఉద్యమ౦ గా వచ్చింది .వేర్నేన్, రిమ్బాడ్,మలార్మేమొదలైన వారిని సింబాలిస్ట్ కవులుగా గుర్తించారు  .వీరంతా కోపెంహాన్ ఈస్తటిక్స్ ను ఆరాది౦చినవారే.విల్, అన్ కాన్షస్ మొదలైన పదాలను ,సెక్స్ విషయాలను వాడినవారే .డేలిరియం ,నార్కాటిక్స్,ఆల్కహాల్ బాధితులే మిడీవల్ సెట్టింగ్ చూపినవారే

వేర్నేన్ కవిత్వం సంగీత కర్తలకు బాగా ఉపయోగపడింది. దాన్ని చక్కగాస్వరపరచి వాడుకొన్నారు .కాలం మర్చిపోయిన ఈ కవిని మళ్ళీ కనుక్కున్నారు అతని వేషం భాష వారికి ఆరాధ్యమైనాయి అందుకే’’ ప్రిన్స్ ఆఫ్ పోయేట్స్ ‘’అని కీర్తించారు అభిమానులు . In poetry, the symbolist procedure—as typified by Verlaine—was to use subtle suggestion instead of precise statement (rhetoric was banned) and to evoke moods and feelings through the magic of words and repeated sounds and the cadence of verse (musicality) and metrical innovation.

Netsurf17 - Paul Verlaine.pngImage result for paul verlaine

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11—7-15-ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56

23-19వ శతాబ్దపు వాస్తవిక సాహిత్య సృస్తికర్తలలో ఒకడు –హెన్రి జేమ్స్

హెన్రి జేమ్స్ తరువాత ఏ ఆధునిక రచయితా అంతకు మించి గొప్ప ఫిక్షన్ ను సృష్టించలేదు .అతని పోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడి ,ది వింగ్స్ ఆఫ్ ది డవ్,ది ఎమ్బాసడర్స్,దిగోల్డెన్ బౌల్  కు మించిన నవలలు లేవు .ఐర్లాండ్ నుంచి వలసవచ్చిన తాత మూడుమహా గొప్ప ఐశ్వర్యాలను ఇచ్చాడు .తండ్రి బిజినెస్ లో  దెబ్బతిని మిస్టిక్ అయ్యాడు .స్వీడెన్ బర్గ్ శిష్యుడై నాడు .తాత నుండి  సంపదపై అభిమానాన్ని ,తండ్రినుండి దానిపై ఏవ గింపు ను  పొందాడు హెన్రి జేమ్స్ .

15-4-1843 లో అమెరికా న్యూయార్క్ లోతండ్రి కి రెండవ వాడుగా పుట్టాడు ఇతనికన్న ఏడాదిదపెద్ద విలియం జేమ్స్ ఫిలాసఫర్ సైకాలజిస్ట్ అయ్యాడు ;అమెరికా ,యూర పు దేశాల్లో దేన్నీ ఎంచుకోవాలో తెలియక సందిగ్ధం లో కొన్నాల్లున్నాడు .ఏడాదివయసులోనే తండ్రితో అనేక దేశాలు తిరిగాడు.అన్నతోబాటు పారిస్ ,లండన్ జేనీవాలలో చదివాడు . కాస్మాపాలిటన్ జీవితం లో పెరిగాడు .ఏదేదో అవుదామనుకొంటే తండ్రి వ్యాపారం లో కుదేలయ్యాడు .ప్రిస్టేజ్ దెబ్బ తిన్నది .

చిన్నతనం నుంచే రాయటం అలవాటైంది .పద్నాలుగో ఏటనే కొడుకు రచనలు చూసి తండ్రి తల్లితో అద్భుత నవలలు రాస్తున్నాడు మనవాడు అని చెప్పి మురిసిపోయాడు .పద్దేనిమిదో ఏట ఒక అగ్నిప్రమాదాన్ని ఆపుతూ గాయ పడ్డాడు అది జీవితాంతం బాధించింది .పందోమ్మిదో యేట అందగాడుగా ఉండేవాడు.మాసాచూసేట్స్లోని జేమ్స్ రసెల్ లోవెల్ అనే మహా రచయిత ను చూసి తానూ అంతవాడిని కావాలనుకొన్నాడు .ఇరవై ఒకటవ ఏడాది నార్త్ అమెరికన్ రివ్యూలో ఒకపుస్తకాన్ని సమీక్షించాడు .రాసిన మొదటికద అట్లాంటిక్ మంత్లి లో  వచ్చింది .యవ్వన దశలో అనేక ప్రాంతాలు తిరిగాడు .యూరప్  బాగా ఆకర్షించింది .అక్కడే ఉండి రచనలో పేరు తెచ్చుకోవాలనుకొన్నాడు .

రెండేళ్ళ తర్వాత కేంబ్రిడ్జ్ తిరిగి వచ్చాడు .మళ్ళీ యూరప్ వెళ్లి తర్జనేవ్ జోలా ,ఫ్లాబర్ట్ లను కలిశాడు వారంతా హెన్రి కధల్ని మెచ్చుకొన్నారు .లండన్ లో పుట్టి ఉంటే బాగుండేది   అనుకొన్నాడు .పారిస్ మోహం పెంచింది వదల్లేక పోయాడు .ఇంగ్లాండ్ తనిల్లు కావాలని కలకన్నాడు నేర వేర్చుకొన్నాడు .లండన్ లో స్తిరపడి అంతర్జాతీయ పరిస్తితులపై నవలలు రాశాడు.పాత ,కొత్తతరానికి వారధి కావాలనుకొన్నాడు ‘అంతర్జాతీయ రచయిత అనిపించు కోవాలని ఉండేది .మొదటి నవల  వచ్చిన పదేళ్లకు ‘’రోడరిక్ హడ్సన్ ‘’అనే నవల రాశాడు .అతని రచనలలో మూడు దశలున్నాయి .మొదటిజేమ్స్ రెండవ జేమ్స్ ,పాతకాలపు నటజేమ్స్ .

జీవిత మధ్యకాలం లో రాసిన పోర్ట్రైట్ ఆఫ్ ఏ లేడి  కొత్తదనం తో మిరుమిట్లు గోలిపింది .ఇంగ్లీష్ ఫిక్షన్ కు కొత్త వొరవడి దిద్దింది .తరువాత వచ్చిన వింగ్స్ ,గోల్డెన్ బౌల్ నవలలు క్లిష్టమైనవి .కాని గొప్ప కళా ఖండాలని పించాయి .వాటి నిర్మాణం ఆశ్చర్యపరిచింది .ముప్ఫయారేళ్ళ వయసులో ‘’డైసీమిల్లర్’’రాసి పేరు తెచ్చుకొన్నాడు .1882లో తల్లీ తండ్రిచనిపోగానే అమెరికా తిరిగి వచ్చాడు .కొద్దికాలం లోనే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు .మళ్ళీ 21 ఏళ్ళదాకా అమెరికా వెళ్ళలేదు. ప్రముఖ డ్రమటిస్ట్ అవాలని అనుకొన్నాడు .కాని రాసిన నాటకాలు ఫలించలేదు .జ్ఞానోదయం అయి నాటకానుభవం తో నవలను తీర్చిదిద్దాడు .

జీవితాంతం హెన్రి పెళ్లి చేసుకోలేదు. కాని చాలామందిని వలచాడు. అరవైయేళ్ళు వచ్చేసరికి జీవిత ప్రవాహం చాలా దూరం ప్రవహించింది అనిపించింది .అపజయాలు బాధిస్తున్నాయి .తన జీవిత చరిత్రగా ‘’ది ఎ౦బాసడర్స్ ‘’రాశాడు . .’’live all you can It is a mistake not to .It does not so much matter what you do in particular ,as long as you have your life —live ‘’అనేది హెన్రి సిద్ధాంతం ముసలితనం మీద పడుతున్న కొద్దీ రచనలో పటుత్వం తగ్గింది .ఒకా అపరాధభావం ఏదో మనసులో మెదిలింది .

1907లో న్యూయార్క్ లో ‘’నావల్స్ అండ్ టేల్స్’’రావటం ప్రారంభమైంది .ఆ తర్వాతా ఇరవైఆరు పుస్తకాలు రెండేళ్లలో వెలువడ్డాయి . హెన్రి చనిపోయినతర్వాత ముప్ఫైఆరు పుస్తకాలుగా ఆయన రచనలు ప్రచురితమైనాయి .

మొదటి ప్రపంచ యుద్ధం హేన్రిని కలవర పరచింది .జర్మనీపై అసహ్యం ఇంగ్లాండ్ పై దేశభక్తికి కారణమైంది .బ్రిటిష్ పౌరునిగా ఇంగ్లాండ్ స్వీకరించింది 1916జనవరి ఒకటిన ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ ‘’పతకం అందుకొన్నాడు .కాని ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు .అన్నలాగానే హార్ట్ ఎటాక్ వచ్చింది దానిపై న్యుమోనియా సోకింది .డెబ్భై మూడేళ్ళు రాకముందే 8-2-1916 చనిపోయాడు హెన్రి జేమ్స్ .’చనిపోయిన  తర్వాత అతని రచనలు కొన్ని వెలుగు చూశాయి..వందదాకా కధలు చిన్న నవలలు రాశాడు .పెద్దనాటకాలు ఎనిమిది రాశాడు .ట్రావేలోగ్స్ రాశాడు .

హెన్రి అంటే ఇష్టం లేనివారు అతని శైలిని వస్తువును దూషించారు .వ్యంగ్య వైభవం కోసం కొన్ని మర్యాదలను కాదన్నాడు అన్నారు . ఇలియట్ ‘’his mastery over ,his baffling escape from ideas ,–a mind so fine that no idea could violate it’’అన్నాడు .అతని శైలిపై ఎక్కువ మంది విరుచుకు పడ్డారు .అతనిది ‘’warm manner saying nothing in infinite sentences ‘’అన్నాడు ధామస్ హార్డీ. ‘అతనిది రంగుల రాత అన్నారు .కాని ఆధునిక విమర్శకులు మాత్రం మొదటిరకం ఇంగ్లీష్ నవలా రచయిత అని మెచ్చారు రెండు స్థాయిలలో కధలు చెప్పాడు అన్నారు .’’hippopotamas rolling a pea’’లాగా అతని స్టైల్ ఉందన్నాడు హెచ్ జి వేల్స్’.ఇంగ్లాండ్ దేశం నైతిక పతన దశలో ఉన్నప్పుడు మళ్ళీ సవ్య మార్గం పై నడిపించినవాడు హెన్రి .

చనిపోయిన తర్వాతా హెన్రి జేమ్స్ ను మరల కనుగొన్నారు .’James was not only America;s  few great novelists ,but one of the very first to use a fine sensibility as a weapon against the blunt insensibilities of the age .’’

హెన్రి చివరికాలపు రచనలను ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్ లతో పోలుస్తారు . అతని పాయింట్ ఆఫ్ వ్యూ ,ఇంటీరియర్ మోనోలోగ్ ,అన్ రేలియబుల్ నారేటర్స్ చాలా విలక్షణమైనవి .హెన్రి  సాహిత్య విమర్శ కు  ఎంతో సేవ చేశాడు .రచయితలకు ప్రపంచాన్ని గురించి చెప్పే విషయాలలో  స్వేచ్చ ఉండాలని హెన్రి జేమ్స్ అభిప్రాయం .మంచి నవలలు అంటే మంచిపనితో ఉండే జీవితం అంటాడు  “a work of art must lift up the hear’’అన్నది అతని సిద్ధాంతం.మూడు సార్లు నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడుకాని లభించలేదు .

Henry James.jpgInline image 1

మరో ప్రముఖ దర్శనం లోకలుద్ద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లయన్సు క్లబ్ ,విజయవాడ – అంజలి – అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆహ్వానం – బందా

లయన్సు క్లబ్ ,విజయవాడ – అంజలి – అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆహ్వానం – బందా

నమస్తే -రామారాగారు విజయవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరిస్తున్న మధుర క్షణాలలో మా అందరి హార్దికాభినందనలు .

రామారావు బందా
మరెక్కడైనా ఇలా ఉందా
క్లబ్ అని పింఛి చూపాలి హుందా
   మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ –

ధన్యవాదములు – నేను పుట్టింది సింహ రాశిలో – నేను మెట్టింది సింహ సమూహాల్లో  –

 అయినా నే బందానే  ( బందా అనగా సేవకుడని , మంచి వారికి బందీ అని మంచి వారైన జ్ఞన వృధ్ధులకు బానిస అని అనేకార్ధాలు)

img155 img156

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్కర గోదావరి -అక్షర సరస్వతి శ్రీపుల్లెల శ్రీరామ చంద్రుడు -మూసీ జులై

పుష్కర గోదావరి -అక్షర సరస్వతి శ్రీపుల్లెల శ్రీరామ చంద్రుడు -మూసీ జులై

pullela1 001 pullela2 001 pullela3 001 pullela4 001 pullela5 001

musi1 001 musi2 001 musi3 001 musi4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాశరధి రంగా చార్య ”చిల్లర దేవుళ్ళు ”కు దేవులపల్లి రామానుజరావు ముందుమాట -రచన జులై

దాశరధి రంగా చార్య ”చిల్లర దేవుళ్ళు ”కు దేవులపల్లి రామానుజరావు ముందుమాట -రచన జులైchillar2 001 chillar3 001 chillara1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీవంగూరి రాజు అమెరికా కాకమ్మకద -రచన -జులై

శ్రీవంగూరి  రాజు అమెరికా కాకమ్మకద -రచన -జులైvanguri1 001 vanguri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వృద్ధ గంగే -గోదావరి స్వరూప స్వామి సూర్య ప్రశస్తి

 
 
 


 
 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -55

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -55

22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్-2(చివరిభాగం )

డాక్టర్ జేమ్స్ –

మొదట బెర్లిన్ లో చేరాడు .జీర్ణ స్తితి దెబ్బతింది తలనెప్పి బాధించింది .డిప్రెషన్ లోపడిపోయాడు .గదికే పరిమితమైనాడు .కాలక్షేపానికి పుస్తకాలు విస్తృతంగా చదివాడు ఏదోకోత్తమార్పు రావాలని తండ్రికి రాశాడు .డాక్టర్ తాప్లిత్జ్ స్నానాలు చేయించమన్నాడు .చేశాడుకాని మార్పేమీ రాలేదు .స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ లు తిరిగాడు ఉపన్యాసాలు విన్నాడు .ఇవీ పని చేయలేదు .మళ్ళీ అమెరికా చేరి హార్వర్డ్ నుంచి మెడికల్ డిగ్రీ పొంది కేం బ్రిడ్జి లో నాలుగేళ్ళున్నాడు .

ఫ్రీవిల్ మహాత్మ్యం

మానసికంగా బాగా కుంగిపోయాడు .సడెన్ గా తనలాంటి వారెందరో ప్రపంచం లో ఉన్నారనే ఎరుక కలిగింది అంతే దెబ్బకు జబ్బు తగ్గింది .రేనోవీర్ రాసిన ‘’ఫ్రీ విల్ ‘’వ్యాసం చదివాడు .అది మంచి ప్రభావాన్నికలగ జేసింది. ఫ్రీ విల్ పై అవగాహన ఏర్పడింది .ఆరోజు నుంచే తన జీవితం లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాసుకొన్నాడు ‘తన అస్తిత్వంపై నమ్మకం  కలిగి సృజనాత్మక శక్తికి ప్రాదాన్యమిచ్చాడు .దీనితో ఆరోగ్యం బాగై శారీరక మానసిక స్థితి అద్భుతంగా మెరుగైంది .జీవితం అంటే భయం, చావు పై ఆరాధనా పోయాయి .

ప్రొఫెసర్ విలియం జేమ్స్

ముప్ఫై ఒకటవ సంవత్సరం లో హార్వర్డ్ లో అనాటమీ ఫిజియాలజీ ఇంస్ట్రక్తర్ గా ఉద్యోగం లో చేరాడు .ముప్ఫై  ఏడవ ఏట ఫిలాసఫీ బోధించాడు నలభై మూడులోపే ప్రొఫెసర్ అయ్యాడు. ఆలీస్ హౌ గిబెంస్ ను పెళ్ళాడి అయిదుగురు పిల్లల్ని కన్నాడు .టీచర్ గా మంచి పేరోచ్చింది .’’ఫిలాసఫీ ఆఫ్ ఇవల్యూషన్ ‘’పై కొత్త కోర్సు  ఏర్పాటు చేశాడు అమెరికాలో ఇదే మొదలు .ఇందులో ఫిజియాలజీ సైకాలజీ మధ్య ఉన్న సంబంధం ను చేర్చాడు .విద్యార్ధులతో ఫ్రీ గా కలిసిపోయేవాడు .సందేహ నివృత్తి చేసి మానసిక దీపం వెలిగించేవాడు .’

సైకాలజీ లో ప్రధమ గ్రంధం

నలభై ఎనిమిది రాక పూర్వమే మొదటిపుస్తకం ‘’ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ‘’రాసి ప్రచురించాడు .సైకాలజీ మీద అదే మొట్టమొదటి పుస్తకం  అంతే కాదు ఆధునిక సైకాలజీకి ఆధార భూతమైనదికూడా . .ఏడేళ్ళ తర్వాతా ‘’ది విల్ టుబిలీవ్’’గ్రంధం రాశాడు .ఆ తర్వాత వెంట వెంటనే చాలా పుస్తకాలు రాశాడు .’’హ్యూమన్ ఇమ్మోరాలిటి ,’’దివెరైటీస్ ఆఫ్ రెలిజియస్  ఎక్స్పీరిఎన్స్’’’’ప్రాగ్మాటిజం   ‘’అనే మూడు గ్రంధాలు రచించాడు .ప్రాగ్మాటి జం కు ‘’ఏ న్యు నేం ఫర్ సం ఓల్డ్ వేస్ ఆఫ్ థింకింగ్’’అని టాగ్ పెట్టాడు .దీనికి సీక్వెల్ గా ‘’ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ‘’రాశాడు .’’ఏ ప్లూరలిష్టి క్ యూని వర్స్’’మొదలైనవి మరణానంతరం వచ్చాయి .వీటిలో ఏది చదివినా అట్టడుగు మనిషికి అర్ధం యెట్లు ఉంటుంది. ఫిలాసఫీని ఫిక్షన్ లాగా రాసిన ఘనత విలియం జేమ్స్ దే’’.’’philosophy is thinking about things in the most comprehensive  possible way’’అంటాడు జేమ్స్ .

విలియం జేమ్స్ చెప్పిన వస్తువుల గురించి ఆలోచన ను మూడు శీర్షికలుగా అర్ధం చేసుకోవాలి .మీలియోరిజం (వృద్ధి చేయటం )ప్రాగ్మాటిజం (వ్యవహార విషయం )ప్లూరలిజం (అనేకత్వం)మిలియోరిజం గురించి చెబుతూ ‘’జీవితంలో అనేక క్రూర సంఘటనల తో  అన్యాయం తో ఉన్నా ,మనం ఆలోచించి శ్రమించి దాన్ని బాగు పరచగలం ‘జీవన విధానాలలో ఉత్రుస్టమైన మార్పులు తెస్తే ఇది సాధ్యమే ‘’అన్నాడు .సంపదలో వ్యత్యాసం ను అందరికి సమానం గా పంచి మార్పు తేవచ్చు .యుద్ధాన్ని నివారించటానికి నైతిక సమానత్వం మోరల్ ఈక్వివలేంట్ అవసరం అంటాడు .చిత్తడి భూములను బాగుచేయటం కాలువలు తవ్వించటం ,వ్యాధులను నిరోధించటం ,కరువు నివారించటం మొదలైన వాటిలో మానవుల సామర్ధ్యాలను వినియోగించితే యుద్ధం ఊసు ఉండడు అన్నాడు .

ప్రాగ్మాటిజం గురించి చెబుతూ శుద్ధ కారణం ప్యూర్ రీజన్ ను గురించి చెప్పాడు .మన భావాలను విస్పష్టంగా చెప్పాలి ;దానికోసం కొత్త మార్గం కావాలి .అదే ప్రాగ్మాటిజం ‘ఇది పాత సిద్ధాంతాలపై తిరుగుబాటు మాత్రమె కాదు.పాతుకుపోయిన సిద్ధాంతాలకీలక భావనలలో  మార్పుకూడా ..కీట్స్ కవి చెప్పిన అందమే సత్యం సత్యమే అందం అన్నదాన్ని జేమ్స్ అంగీకరించాడు కాని రెండూ సాలలపేక్షమే అన్నాడు .మంచితనం అన్నది ప్రాధమికమూకాదు ,అందరానిదీకాదు .

ఇక మూడవది ప్లూరలిజం .ఇది ఏకత్వానికి సమాధానం .అనేక పరిష్కార మార్గాలున్నాయి అంటాడు .’అన్నిటి గురించీ ఆలోచించాలి ఒకే సమస్యకు ఒకటే పరిష్కారం కాదు అనేకం ఉంటాయని  గ్రహించామన్నాడు .యాభై ఎనిమిదవ ఏట జేమ్స్ గిల్ ఫోర్డ్ లెక్చర్లు ఇవ్వటానికి ఎడిన్ బర్గ్ వెళ్ళాడు ఈ ఉపన్యాసాల సారాంశమే అతని ‘’వెరైటీస్ ఆఫ్ రెలిజియస్ ఎక్స్పరిఎన్స్ ‘’పుస్తకం .’’సోసైటీ ఆఫ్ ఫిజికల్ రి సెర్చ్ ‘’ను ఏర్పరచి అధ్యక్షుడయ్యాడు .అరవై అయిదేళ్లకు హార్వర్డ్ ప్రొఫెసర్ షిప్ నుంచి తప్పుకొన్నాడు అరవైఎనిమిదిలో మళ్ళీ అమెరికా వచ్చాడు ‘ఇక్కడికి రాగానే ఇంగ్లాండ్ లో తమ్ముడు హెన్రి తీవ్రంగా జబ్బు పడ్డాడని తెలిసింది వెంటనే వెళ్లి తీసుకొచ్చాడు .మొదటిసారి గుండెపోటు వచ్చింది. తట్టుకున్నాడు .న్యు హాంప్షైర్ లోని స్వగ్రామం కోకోరువా చేరేలోపలే గుండె ఆగి 26-8-1910 లో 68 ఏళ్ళకే మరణించాడు విలియం జేమ్స్ .

James saw life as a continuous experiences ,a progress in which things and thoughts objects and their relations were equally integrated’ . అతని ఫిలాసఫీని ‘’ఫిలాసఫీ ఫర్ ఫిలిష్టి న్స్’’అన్నారు అంటే సంస్కృతీ కళలకు వ్యతిరేకమైనవారి ఫిలాసఫీ అని అర్ధం .

విలియం ప్రభావం

విలియం జేమ్స్ ప్రభావం అమెరికా  ప్రెసిడెంట్లు   ఉడ్రోవిల్సన్,రూజ్ వెల్ట్ ల ఆలోచనా ధోరణిపై అధికం .శాంతాయన జేమ్స్ ఫిలాసఫీ కి ఆకర్షితుడు .జేమ్స్ కొత్త శకానికి శంకుస్థాపన చేశాడు ‘.ఎపిస్టమాలజి మెటాఫిజిక్స్ ,సైకాలజీ ,విద్య మతం మిష్టిజం  లపై ఎన్నో ఉద్గ్రంధాలు రాశాడు .ఫిలాసఫీలో అతను రాసిన ‘’రాడికల్ ఇమ్పిరిసిజం ‘’ఉత్క్రుస్టగ్రంధం ‘’’an thing short of god is not rational ,and every thing more than god is impossible ‘’అనినమ్మాడు . “First, it is essential that God be conceived as the deepest power in the universe, and second, he must be conceived under the form of a mental personality.”

‘’ధీరీ ఆఫ్ ఎమోషన్ ‘’అనేదాన్ని కార్ల్ లాంజ్ నుండి గ్రహించి  విస్తృత పరచాడు [W]e must immediately insist that aesthetic emotion, pure and simple, the pleasure given us by certain lines and masses, and combinations of colors and sounds, is an absolutely sensational experience, an optical or auricular feeling that is primary, and not due to the repercussion backwards of other sensations elsewhere consecutively aroused. To this simple primary and immediate pleasure in certain pure sensations and harmonious combinations of them, there may, it is true, be added secondary pleasures; and in the practical enjoyment of works of art by the masses of mankind these secondary pleasures play a great part. The more classic one’s taste is, however, the less relatively important are the secondary pleasures felt to be, in comparison with those of the primary sensation as it comes in. Classicism and romanticism have their battles over this point.

 

‘Jamesian theory of self[edit]

William James developed a theory of self that was divided into two main categories. The first was the “Me” self, and the second was the “I” self.[48] The “me” self refers to the aspects of someone that come from that person’s experiences. James broke the “me” self down into three sections, The Material Self, The Social Self, and The Spiritual Self.[49]For James, the “I” self was classified as the thinking self. James linked this self to the soul of a person, or what we now think of as the mind.[50] The Pure Ego was the name given to the “I” self.[49]

Free will[edit]

In The Will to Believe, James simply asserted that his will was free. As his first act of freedom, he said, he chose to believe his will was free. He was encouraged to do this by reading Charles Renouvier, whose work convinced James to convert from monism to pluralism. In his diary entry of April 30, 1870, James wrote,

I think that yesterday was a crisis in my life. I finished the first part of Renouvier’s second Essais and see no reason why his definition of free will—”the sustaining of a thought because I choose to when I might have other thoughts”—need be the definition of an illusion. At any rate, I will assume for the present—until next year—that it is no illusion. My first act of free will shall be to believe in free will.[25]

Inline image 1  Inline image 2    Inline image 3  Image result for william jamesImage result for william james

 సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా తండ్రి మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి

మా తండ్రి మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి

  • 10/07/2015
TAGS:

మోదీకి లాల్‌బహదూర్ కుమారుడి వినతి
వారణాసి, జూలై 9: దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మృతికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు సునిల్ శాస్ర్తీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నందున కేంద్రం జోక్యం చేసుకుని వాటిని నివృత్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి మరణానికి సంబంధించిన అన్ని పత్రాలు వెల్లడించాలని ప్రధాని మోదీని వినమ్రంగా కోరుకుంటున్నాం. నిజానిజాలేమిటో తెలుసుకోవాలని మేం ఆశిస్తున్నాం’ అని బిజెపి నేత సునిల్ శాస్ర్తీ స్పష్టం చేశారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ (61) 1966 జనవరి 11న తాష్కెంట్‌లో చనిపోయారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ఆయన మృతి చెందారు. గుండెపోటుతో శాస్ర్తీ చనిపోయారని వార్తలొచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీని వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాష్కెంట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ భారత ముద్దుబిడ్డ అంటూ శ్లాఘించారు. ఆయన నిజమైన దైశభక్తుడని, అలాంటి నేత భారత్‌లో ఉండడం నిజంగా గర్వకారణమని మోదీ స్పష్టం చేశారు. ‘మాతో ఎవరు మాట్లాడినా లాల్‌బహదూర్ మరణం గురించే ప్రస్తావిస్తుంటారు. మా తండ్రి ఎలా చనిపోయారని ఇప్పటికీ అడుగుతున్నారు’ అని సునిల్ శాస్ర్తీ తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండు మూడు పర్యాయాలు తమ తండ్రి మృతికి సంబంధించి పత్రాలు బహిర్గం చేయాలని కోరినా ఫలితం లేకపోయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సునిల్ చెప్పారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే ప్రధాని చనిపోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని యావత్ జాతి ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నారు.

పుష్కరాల వేళాయే..

  • 10/07/2015
TAGS:

రాజమహేంద్రిలో సాంస్కృతిక సౌరభం కనువిందుగా ఉత్సవ హేల
1000 మంది కళాకారులతో కూచిపూడి ఏకకాల ప్రదర్శన ఫుడ్ ఫెస్టివల్స్, ప్యాకేజీ టూర్లు

రాజమండ్రి, జూలై 9: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసిన అనంతరం సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని, పర్యాటక సంబరాలు జరుపుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాలు 14 నుండి ప్రారంభమవుతున్నప్పటికీ, 13 సాయంత్రం నుండే సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటుచేయటం ద్వారా గోదావరి తీరానికి పుష్కర శోభను తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. వివిధ ప్రాంతాల నుండి గురువారం రాజమండ్రికి బయలుదేరిన పుష్కర జ్యోతులు కూడా 13న సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పుష్కర జ్యోతులకు రాజమండ్రిలో స్వాగతం పలకటం ద్వారా గోదావరి పుష్కర మహోత్సవ సన్నాహక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి నగరానికి అన్ని వైపుల నుండి వచ్చిన పుష్కర జ్యోతులను పుష్కరఘాట్‌కు తీసుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించటం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా రోడ్‌కమ్‌రైలు వంతెన మీద నుండి ఆకాశ దీపాలను వదిలే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. అనంతరం గోదావరి హారతి ఉత్సవంతో పాటు లేజర్‌షో, బాణసంచా కాల్పులు, రాత్రి 8గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కీరవాణి సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 11వేదికలపై సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానం, ఆనం కళాకేంద్రంలోను, ధవళేశ్వరం, ద్రాక్షారామం, కోటిపల్లి, ఆత్రేయపురం, వాడపల్లి, కొవ్వూరు, సిద్ధాంతం, పాలకొల్లు, నర్సాపురంలో సాంస్కృతిక వేదికలను ఏర్పాటుచేశారు. 13న సాయంత్రం 1000 మంది కళాకారులతో రాజమండ్రి నగరంలో ర్యాలీ నిర్వహించటం ద్వారా సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తొలి రోజు కూచిపూడి కళాకారిణి స్వప్న సుందరి బృందంతో ప్రదర్శనలు ప్రారంభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరితో పాటు, అనేక జాతీయ, రాష్టస్థ్రాయి కళాకారులతో ప్రదర్శనలు జరిగే విధంగా సాంస్కృతిక ఉత్సవాల కార్యాచరణను రూపొందించారు. చివరి రోజు 25న వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటుచేశారు.
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, నర్సాపురంలో సైకత శిల్పాల ఫెస్టివల్, తూర్పుగోదావరి జిల్లాలోని కె గంగవరంలో ప్రభల ఉత్సవం, రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటుచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజి టూర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. రాజమండ్రి నుండి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట ఒక ప్యాకేజి, ద్రాక్షారామం, కోటిపల్లి, అయినవిల్లి, అప్పనపల్లి మరో ప్యాకేజి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్యాకేజి టూర్లను పర్యాటక సంస్థ నడపాలని నిర్ణయించింది. పుష్కరాలు సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ నుండి కూడా ప్యాకేజి టూర్లను పర్యాటక శాఖ ఏర్పాటుచేయనుంది. (చిత్రం) తిరుమల నమూనా ఆలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కర స్నానం ఎలా చేయాలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జైలు గోడల్ని చేదించిన కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’

హరిహర రాయల ఆస్థానం లో లోలంబరాజ కవి ఉండేవాడు .సూర్య పండితుని వంశానికి చెందినా దివాకరుని పుత్రుడు  .’’హరివంశ’’ కావ్యంఅయిదు కాండలలో  రాశాడు .’’సుందర దామోదర ‘’కావ్యం లో శ్రీకృష్ణ చరిత్ర రాసి కంస వధ తో పూర్తీ చేశాడు .వైద్య శాస్త్రం లో నూ అపార అనుభవమున్నవాడు . ఉపయుక్త వైద్య గ్రంధాలు చక్కని కవిత్వం తో రాశాడు .

189- డిండిమ కవి సార్వ భౌముడు -అరుణ గిరి నాధుడు

మొదటి రాజనాధుడు అభిరామా౦బికల కుమారుడుఅరుణ గిరినాధుడు .సామశాఖకు చెందిన గౌతమ గోత్రీకుడు .మాతామహుడు అభిరాముడు ‘’శ్రీకంఠ ఆగమ శాస్త్రం ‘’లో మహా పండితుడు ‘’.డిండిమప్రభు’’లేక మొదటి డిండిమ గా ప్రసిద్ధుడు .సభాపతి మేనమామ ,నృత్తరాజు పితామహుడు .శ్రీకవిగా తాతగారు సురేంద్ర అగ్రహారం లో పేరు పొందాడు ఎనిమిది భాషలలోపండితుడు .యజ్నా౦బిక ను  వివాహమాడాడు.  .ఎవరిని ఓడించినా డిండిమ (ఢక్క)ను మోగించి జయభేరిగా సూచించేవాడు .అందుకే రెండవ డిండిమకు  కవి సార్వ భౌముడు అనే బిరుదు వచ్చింది .విజయనగర రాజు రెండవ దేవ రాయలకాలం లో 1422-48కాలం లో ఉండేవాడు .కవిమల్లుని చర్చల్లో ఓడించాడు .’’సోమవల్లి యోగానందం ‘’అనే ప్రబంధాన్ని రాశాడు .హాస్య వ్యంగ్య అవహేళనాత్మక రచన ఇది .

అరుణ గిరినాదుడైన డిండిమ భట్టు కుమారుడే రెండవ రాజ శేఖరుడు .ఇతనికీ డిండిమ కవిసార్వ భౌమ బిరుదు ఉంది .రెండవ డిండిమ భట్టు  అంటారు .సాల్వనరసింహ రాయల ఆస్థానకవి .సాళువాభ్యుదయం రాశాడు .ఇతన్ని గురించి మొదటిభాగం లో తెలుసుకొన్నాం .

190-పాండవాభ్యుదయ కవి- శివ సూర్య

అభిరాముని కొడుకు సభాపతికి స్వయంభు అనే కొడుకు ,అభిరామ కామాక్షి అనే కూతురు ఉన్నారు .స్వయంభు రెండవ డిండిమ కూతుర్ని పెళ్ళాడాడు .వీరికుమారుడే శివ సూర్య కవి .వీళ్ళది శ్రీ వత్స గోత్రం .సూర్యకవి ఎనిమిది కాండల’’ పాండవాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .ఇది మహా భారత కధ .ఇతని కొడుకు భాస్కరుడు హాలఘట్టి రాజు ఆశ్రితుడు .’’వల్లవాభ్యుదయం’’ అనే అయిదు  అంకాల  నాటకం రాశాడు .శ్రీరంగం దగ్గర తిరువనక్కాల్ లో జంబు నాద  ఉత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు .అభిరామ కామాక్షికి కృష్ణ ,రామ అని ఇద్దరు కొడుకులు .

అభిరామ కామాక్షి కూడా గొప్పకవి .శ్రీరామ కధను ‘’అభినవ –రామాభ్యుదయం ‘’కావ్యం గా ఇరవై నాలుగు కాండలలో రాసింది .

191- .కవిరాజ రాజు  -రెండవ అరుణ గిరి నాధుడు .

నాలుగవ డిండిముడు లేకకుమార డిండిమ అయిన రెండవ అరుణ గిరినాధుడు రాజనాధుని కొడుకు .పరేంద్రఅగ్రహారం లో ఉండేవాడు .వీరనరసింహ రాయల  కృష్ణ దేవరాయల ఆస్థానకవి .1505-1530కాలపు కవి .బహుభాషా వేత్త గా సుప్రసిద్ధుడు .’’డిండిమ కవి సార్వసార్వ భౌమ ‘’’’కవిరాజ రాజ ‘’బిరుదాంకితుడు .’’వీరభద్ర విజయం ‘’అనే నాటకం రాశాడు .ఇందులో—వీరభద్ర జనం నుండి దక్ష యజ్ఞయ విధ్వంసం వరకు కద ఉంది .భూపతి రాయ పురం లో రాజ నాద ఉత్సవం లో ఈనాటకాన్ని  ప్రదర్శించారు .

192- భాగవత చంపు రాసిన -మూడవ రాజనాధుడు

కుమార డిండిమ కొడుకే మూడవ రాజ నాధుడు .విజయనగర రాజు అచ్యుత దేవరాయల కోరికపై ‘’భాగవత చంపు 1530-42‘ లో ’రాశాడు .శ్రీకృష్ణుని చరిత్ర ఇది .ఈ కవి రాసిన ‘’అచ్యుత రాయాభ్యుదయం ‘’పన్నెండు కాండల కావ్యం .మొదటి విజయనగర పాలకులనుంచి మొదలు పెట్టి తుళువ వంశ రాజులను ,వారి చంద్ర వంశాన్ని గురించి రాశాడు .నరస వీరనరసింహ కృష్ణ రాయల వరకు వర్ణించాడు .కృష్ణ దేవరాయల మరణం తర్వాత నరసింహ రాయల మూడవ భార్య ఓబులాంబ కొడుకు అచ్యుతరాయలు రాజు అయ్యాడు .ఈ కావ్యం లో ఎక్కువగా అచ్యుత రాయల దక్షిణ దేశ దండయాత్రల గురించే రాశాడు .అతని తీర్ధ యాత్రాక్రమాన్నీ వివరించాడు .బిజాపూర్ సుల్తాన్ ను ఓడించి ఘన విజయం సాధించటం తో కావ్యం పూర్తి  అవుతుంది .

కుమార డిండిను కూతురు ను మల్లికార్జున లేక స్పులింగకు ఇచ్చి పెళ్లి చేశారు .యితడు లక్ష్మణ సావిత్రిలకొడుకు .ఇతని తాత సోమనాధుడు సభాపతి దేశికుని శిష్యుడు .మల్లి ‘’సత్యభామ పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .మూలనాడు ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .

193- సుభద్ర ధనుంజయ నాటకకర్త -మొదటి రాజ నాధుడు –

కుమారడిండిమ కాక రెండవ రాజనాదునికి ఒక కూతురు ఉంది .ఈమెను స్వయంభు కుమార్తె కొడుకు మొదటి రాజనాద్ కు ఇచ్చి పెళ్లి చేశారు .  స్వయంభు కు స్వయంభునాద ,కుమారుడు ఇతడు ‘’శంకరా నంద చంపు’’రాశాడు ఇది శివార్జునుల యుద్ధ కద .దీనితో బాటు ‘’కృష్ణ విలాస’’కావ్యమూ రాశాడు .ఇది పధ్నాలు కాండలు.’’’సుభద్ర –ధనుంజయ ‘’అనే అయిదంకాల నాటకం రాశాడు ‘’రత్నేశ్వర ప్రసాదాన ‘’అనే మరో అయిదు అంకాల నాటకమూ చేశాడు .కాశీలోని రత్నేశ్వర స్వామి అనుగ్రహం తో రత్న చూడ ,రత్నావతి ల వివాహం జరిగిన విధానం వర్ణించాడు ‘’మదన గోపాల విలాసం ‘’అనే భాణమూ రచించాడు ఇది రాదా కృష్ణుల ప్రేమ శృంగార కద.’’హరిశ్చంద్ర చంపు ‘ను సోమవారం నాడు రాశానని చెప్పాడు .

ఈ విధంగా డిండిమ వంశం లోని అనేక మంది కవులు అద్భుత కావ్య సృష్టి చేసి ఇంగువ కట్టిన గుడ్డ సామెతను నిజంగానే రుజువు చేసుకొన్నారు   .

194- తంజావూర్ దివాన్ -గోవింద దీక్షితులు

వసిష్ట గోత్రీకుడైన గోవింద దీక్షితుల భార్య నాగాంబ యజ్ఞనారాయణ ,వెంకట మఖ లు కొడుకులు .తిరు నాగేశ్వరం పట్టేశ్వారం లో ఎక్కువగా ఉన్నాడు .తంజా వూరు రాజులు చెవ్వప్ప ,అచ్యుత ,రఘునాధ రాయల ఆస్థానం లో మంత్రి పట్ట్టేశ్వారం  ఇప్పటికీ భార్యా భర్తల చిత్రాల అంతఃపురం లో చూడచ్చు .ఇంట్లో దీక్షితులు పరమ సంప్రదాయ బద్ధం గాను రాజాస్థానం లో పరమ పవిత్రం గా న్యాయ ధర్మాలకోసమూ పని చేసేవాడు .రాజకీయ దురంధరుడుగా పేరు .రఘునాధ గోవింద దీక్షితుల ఆత్మీయతపై గొప్ప శ్లోకం ప్రచారం లో ఉంది .’’చినామాద్యంత నామానౌ మహీ ప్రుద్వీశ తా ఉభౌ

శాస్త్రే శస్త్రే చ నిపుణా భాహువేషు హవేషు చ ‘’

దీక్షితులు అద్వైతా చార్యులుగా ప్రసిద్ధి చెందాడు .స్వయంగా కవి పండితుడు మహా రచయిత .అప్పయ్య దీక్షితులపై వీరాభిమానం ఉన్నవాడు .ఆయనను ‘’కల్ప తరువు ‘’పై భాష్యం రాయమనికోరాడు .అయన పరిపాలనలో ఎన్నో మండపాలు ,కావేరినదిపై అనేక స్నాన ఘట్టాలు నిర్మింపజేశాడు ఎన్నో అగ్రహారాలను రాజుల చేత దానం ఇప్పించిన దక్షుడు . .ధర్మ శాస్త్ర పారమెరిగినవాడు .న్యాయ బద్ధ పాలనకు అ౦కితమైనవాడు .వాదప్రతివాదాలు విని సామరస్యంగా సమస్యను పరిష్కరించటం గోవింద దీక్షితుల ప్రతేకత .వేదం లో చెప్పబడిన సకల క్రతువులు యజ్ఞాలు యాగాలు చేసిన పరమ కర్మిష్టి .జీవితం చివరలో అన్ని రాజ కార్యాలను సంపదను అన్నిటిని భగవంతునికి సమర్పించి కర్మ ఫల త్యాగాం తో జన్మను సార్ధకం చేసుకొన్న పుణ్యాత్ముడు .అద్వైత ఫలాన్ని మాత్రమె ఆశించిన మహా నైష్టికుడు.కుంభకోణం లో అమ్మవారు మంగలాంబ సన్నిధిలో తపస్సుతో గడిపి మోక్షాన్నిపొందిన పదహారవ శతాబ్దపు మహనీయుడు  గోవిన్దదీక్షితులు .కుంభకోణం ,తిరువది,పట్టేశ్వరం లలో గోవింద దీక్షితుఅలను అక్కడి శివలింగాలలతో పూజించి జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞత తెలియ జేసుకొంటారు’ ఆ శివలింగాలలో గోవింద దీక్షితులను దర్శిస్తారు అంటే పరమాత్మలో ఐక్యమయ్యాడని భావం .ఆయనకూ ఆయన ధర్మ పత్నికి అక్కడ విగ్రహాలు నెలకొల్పి గౌరవించారు.

దీక్షితులకు సంగీత జ్ఞానం అపారం  ఆధునిక శాస్త్రీయ సంగీత సిద్ధాంత కర్తలు ముగ్గురిలో ఒకరు దీక్షితులు .మిగిలిన ఇద్దరు రామామాత్యుడు ,సోమనాధుడు . కుంభకోణం లోని రామస్వామి దేవాలయం ,నిర్మించాడు దివాన్ బహదూర్ గా ఉన్నప్పుడు .అప్పుడే ఈ రామస్వామి దేవాలయానికి  చక్రపాణి దేవాలయానికి మధ్య కారిడార్ కూడా నిర్మింప జేశాడు .

గోవింద దీక్షితుల రచనలలో’’సాహిత్యసుధ ‘’సంస్కృత సాహిత్య చరిత్ర .ఎందారోకవుల పరామర్శ.తన గురువులను రఘునాధ రాయాల గురించి రాశాడు. ‘కుమారుడు  వెంకట మఖి  తన ‘’చతుర్దండి ప్రకాశిక ‘’లో తన తండ్రి దీక్షితులు ‘’సంగీత సుధానిధి ‘’రాశాడని ,రామాయణం లోసు౦దరకా౦డకు వ్యాఖ్యానం కూడా రచించాడని చెప్పాడు .

గోవింద దీక్షితుల ఇద్దరు కొడుకులు యజ్ననారాయనుడు వేంకటేశ్వరుడు లేక వెంకట మఖి .వెంకట మఖి నీలకంఠకు గురువు ,’’సాహిత్య సామ్రాజ్య కావ్య ‘’ ‘’వార్తికాభారణ ‘’రచయితకూడా.

యజ్ననారాయణ  దీక్షితులు సర్వతోముఖ ప్రతిభకలవాడు .కవిత్వం లో దిట్ట .రఘునాధ రాయల ఆస్థాన కవి .రాజే యజ్ఞనారాయణ గురువుకూడా .అఆతను రాసిన పద మూడుకాండల’’సాహిత్య రత్నాకరం ‘’ఇప్పుడు లభించి అందుబాటులో ఉంది .’’ రఘునాధ విలాసం ‘’ అనే అయిదు అంకాల నాటకం ,’’రఘునాధ భూప విజయం ‘’అనే తంజావూర్ నాయక రాజుల చరిత్రకావ్యం ,రఘునాధుని సింహళ సమీప ద్వీప విజయం  ఇందులో ఉన్నాయి.వెంకటేశ్వర రచన ‘’చిత్ర బంధ రామాయణం ‘’కు వ్యాఖ్యానమూ రాశాడు .ఇలా గోవింద దీక్షితుల కుటుంబం వారూ గోప్పకవులై సాహిత్య రచన చేసి దీక్షితుల గౌరవాన్ని ఇనుమడింప జేశారు .

195-రత్న ఖేటుడు అనే అభినవ భావ భూతి – శ్రీనివాస దీక్షితులు

భావస్వామి కొడుకు కృష్ణకవి మనవడు శ్రీనివాస దీక్షితులు భావ స్వామికి ఆరవ తరం వాడు ‘’భాష్య’’రచయిత .విశ్వామిత్ర గోత్రం.ఇతనికి ముగ్గురు కొడుకులు కేశవ అర్ధనారీశ్వర ,రాజ చూడామణి .సాయంకాల దిక్చక్రాన్ని అద్భుతంగా వర్ణించి నందుకు చోళ రాజు ‘’రత్నఖేట ‘’బిరుదాన్నిచ్చాడు .ఆ పేరే నిలిచిపోయింది .అప్పయ్య ,గోవింద దీక్షితులకు సమకాలీనుడు .’’షద్భాష చతుర ‘’,’’అద్వైత విద్యాచార్య ‘’,అభినవ భవ భూతి ‘’’’దంతిజ్యోతి దివా  ప్రదీపు ‘’అనేగోప్ప బిరుదులూ అందుకొన్నాడు .గొప్ప పండిత విజ్ఞాని .వేదాంతం పై విస్తృత రచనలు చేశాడు .పద్దెనిమిది నాటకాలు ,అరవై  కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శివలీలలను వర్ణిస్తూ ‘’సితికంఠవిజయం ‘’రాశాడు .దమయంతీ పరణయాన్ని ‘’భైమపరిణయం ‘అనే నాటకంగాను ,రుక్మిణీ కల్యాణాన్ని’’భైష్మిపరిణయం  ‘’చంపువును  రాశాడు .అతని ‘’సాహిత్య సంజీవిని ‘’,’’భావోద్బేధీ’’,’’రసార్నవ ‘’,’’అలంకార కౌస్తుభ ‘’’’కావ్య దర్పణ ‘’,’’కావ్య సార సంగ్రహ’’,’’సాహిత్య సూక్ష్మ సరణి ‘’అలంకార గ్రంధాలు .జింజి రాజు సూరప్ప కోరితే ‘’భావనా పురుషోత్తమ ‘’అనే దృష్టాంత నాటకం రాశాడు ‘’196- కావ్య దర్పణ రచయిత -రాజ చూడామణి

రత్న ఖేటశ్రీనివాస ,కామాక్షిల పుత్రుడు రాజ చూడామణి .తంజావూర్ పాలకుడు రఘునాధరాయల ఆస్థానకవి .’’రఘునాధభూప విజయం ‘’రాశాడు.కవిత్వం లో తండ్రికి తగ్గ కొడుకు .మీమాంసలో గొప్పవాడు .అనేక కావ్యాలు నాటకాలు  అలంకార గ్రంధాలు రచించాడు .1636లో జైమిని సూత్రాలకు ‘తంత్ర శిక్షా మణి ;వ్యాఖ్య ;రాశాడు .’’రుక్మిణీకలాపం ‘’అనే పదికాండల కావ్యం రుక్మిణీదేవి  చరిత్ర .’’శంకరాభ్యుదయం ‘’రాశాడు కాని ఆరు అధ్యాయాలే దొరికాయి.’’భారత చంపు ,’’కంస వధ ‘’,’’వృత్త రత్నావళి ‘’,’’సాహిత్య సామ్రాజ్య’’,’’చిత్ర మంజరి ‘’కూడా అతని రచనలే ‘.ఇందులో వృత్త రత్నావళి శంకరాచార్యుల ‘’తారావళి ‘’కి అనుసరణ..యమక కావ్యంగా ‘’రత్న ఖేట విజయం ‘’రాశాడు .ఇది తండ్రి కవితా ప్రతిభకు నీరాజనమేకాక త్ర్యర్దికావ్యం .ఇందులో శ్రీ రామ శ్రీ కృష్ణ ,పాండవ కధలున్నాయి .ప్రత్యక్షర శ్లేష వైభవం తో ‘’మంజు భాషిణి ‘’అనే గద్యరచనా చేశాడు. భోజుని రామాయణ చంపు దీనికి ఆధారం .రామాయణ యుద్ధ కాండ కధ.

శృంగార సారస్వత ‘’అనే భాణం కూడా రాజ చూడామణి రాశాడు .ఆనంద రాఘవ అనే అయిదు అంకాల నాటకమూ రాశాడు .సీతారామ కల్యాణం నుంచి పట్టాభిషేకం దాకా కద ఉంది .’’కమ లిని కల హంస ‘’అనే నాలుగు అంకాల నాటకం ‘కమలాకరుని కూతురు కమలిని కి ,కలహంస కు జరిగిన వివాహమే కద ఈ నాటకాలు రఘునాధుని ఆస్థానం లోను చిదంబరం లోను  ప్రదర్శింపబడేవి . .తన కావ్య దర్పణం లో అలంకార చూడామణి విషయం ప్రస్తావించాడు .

197-నైషద పారిజాత కర్త -కృష్ణాధ్వరి

రఘునాధ రాయలు రాజ్యం లో;కృష్ణాధ్వరి లేక కృష్ణ దీక్షిత ,లేక అయ్యదీక్షితులు ఉండేవాడు .ఈ కవి ‘’నైషద పారిజాతం ‘’అనే ద్వ్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల చరిత్ర పారిజాతాపహరణం కధలను జోడించాడు.అలాగే’’ రఘునాధ భూపతీయం’’అలంకార గ్రంధం లో తన ప్రభువు రఘునాధ రాయలను శ్లాఘించాడు .

ఇతని కుమారుడే మృత్యుంజయుడు .గురువు రాజ చూడామణి దీక్షితుడు.ఇతని ‘’ప్రద్యుమ్నోత్తర చరిత్ర ‘’అనే పదకొండు కాండల కావ్యం లో వజ్రపురి రాక్షసుని కుమార్తె కు  ప్రద్యుమ్నునికి జరిగిన వివాహాన్ని గురించి రాశాడు .మృత్యుంజయుని కొడుకు అనంత నారాయణుడు జయ దేవుని గీత గోవిందం లాంటి ‘’గీతా శంకరం అనే సంగీత రూపకం రాశాడు.

198-శివ తత్వ రహస్యం కర్త-నీల కంఠ లేక అయ్యదీక్షితులు

నారాయణ భూమి దేవి లకుమారుడు నీల కంఠుడు .అప్పయ్యదీక్షితుని తమ్ముడు అచ్చతి కిస్టకు  మనవడు .అయ్యదీక్షితులుగా ప్రసిద్ధి ;గోవింద దీక్షితుల కుమారుడు వెంకట మఖి వద్ద విద్య నేర్చాడు .’’కైయాట’’పైవిమర్శ రాశాడు’’.శ్రీకంఠ వేదాంతం లో లోతులు చూసిన వాడు .’’శివ తత్వ రహస్యం ‘’రాశాడు .తాని నలుగురు సోదరులూ మహా కవులే .ఇతని ‘’నీల కంఠ చంపు’’ పాలసముద్ర మధనం ,అందులో హాలాహలం రావటం శివుడు మింగటం కద దీన్ని 1637లో రాశాడు .’’శివలీలార్నవ ‘’ఇరవై రెండుకా౦డలలో శివుని అవతారమైన మధురలో అర్చింప బడే  హల్సాశ్వనాద కు సంబంధిన ఆరవైనాలుగు లీలలను వర్ణించాడు .’’గంగావతరణం ‘’ ఎనిమిది కాండలకావ్యం .దివిజ గంగ భూమిని చేరిన కద.’’కలివిదంబన’’,సభారంజన ‘’,’’అన్యాపదేశ శతకం ‘’,శాంతివిలాసం ‘’,వైరాగ్య శతకం ‘’,ఆనంద సాగరసస్తత్వం ‘’మొదలైనవిమిగిలిన వైవిధ్య రచనలు .’’

అయ్యా దీక్షితుల ‘’చిత్రమీమాంస దోషాదికారం ‘’ లో జగన్నాధ పండితరాయల సిద్ధాంతాలను విమర్శిస్తూ అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలను అన్నిటినీ సమర్ధించాడు .’’ఏడు అంకాల ‘’నల చరితా౦తకం’’నాటకం రాశాడు .కవిగా గొప్ప పేరు సంపాదించాడు.అతని ఊహలు అద్భుతం ఉత్ప్రేక్షలు నిరుపమానం .

ఇతని మూడవ కుమారుడు గీర్వాణేంద్రుడు  ,’’శృంగార కోశ భాణం’’రాశాడు.అన్యాపదేశ శాతాకమూ చేశాడు .ఇతని నలుగురు సోదరులూ కవులే .ఇందులో అతిరాత్ర యజ్ఞుడు ‘’కుశకుముద్వతీయం ‘’అనే నాటకం రాశాడు .అచ్చ దీక్షితులు అతని నల చరిత్ర నాటకం పై వ్యాఖ్యానం రాశాడు .

199-చిత్ర రత్నాకర హాస్య కవి -చక్ర కవి

లోకనాద అంబ ల కుమారుడే చక్రకవి .పతంజలి రామ చంద్రుల సోదరుడు .పాండ్య ,చేర రాజులు తనని ఆదరించారు నీలకంఠ దీక్షితులు మెచ్చినకవి .పదిహేడవ వ శతాబ్దం వాడు ‘ఆశువుగా ధారాళంగా రుక్మిణి జానకి గౌరీ ,ద్రౌపది ల కళ్యాణాలను వర్ణించాడు .ఎనిమిదికాండల ‘’జానకీ పరిణయం ‘’ఇందులో భాగమే .మిగిలినవి పద్య గద్యాత్మకం ‘’’చిత్ర రత్నాకరం ‘’హాస్య పూరిత రచన .శ్లోకం లో మొదటిభాగం ప్రశ్న రెండవ భాగం లో సమాధానం రాశాడు .

200- యమక కవి-ఏక దినప్రబంధ రచయిత – వేంకటేశ

వేంకటేశుడు శ్రీనివాసుని కుమారుడు వేంకటేశుని మనవడు .ఆత్రేయ  గోత్రీకుడు . .కనెల్ దగ్గర అరశనపల్లి లో   1596లో పుట్టాడు.’’’రామ యమకార్నవం ‘’,రామచంద్రోదయ ‘’కావ్యాలలో యమకం లో రస  బంధం గా  రామకధను రాశాడు .

సూర్యనారాయణ యజ్ఞేశ్వర జ్ఞానంబ ల కుమారుడు .ఆలూరి బ్రాహ్మణుడు .ఎన్నో యజ్న యాగాలు చేసిన కుటుంబం .1601లో లింగాయ ప్రభు దర్బారులో ఒకే రోజులో ఒక ప్రబంధం  రాస్తానని శపథం చేసి ‘’ఏక దిన ప్రబంధం ‘’ను మహా భారత కధగా చెప్పాడు .

భారద్వాజ గోత్రానికి చెందిన మలయా కవి రామనాధ కవిపుత్రుడు .మదురై జిల్లాలో ఉండేవాడు .పద్దెనిమిది కాండల మీనాక్షీ పరిణయం ‘’రాశాడు .ఇందులో మీనాక్షి సుందరేశుల వివాహం వర్ణించాడు .’’పార్వతీ పరిణయం ‘’ను ఎనిమిదికాండల లో రాశాడు .కాళిదాసు కుమార సంభవం రీతిలో ఈశ్వర సుమతి ‘’రచించాడు .

మనవి

ఇప్పటి వరకు తంజావూరు నాయక రాజుల పాలనలోను ,అంతకు ముందు విజయ నగర సామ్రాజ్యం లోను ప్రభ వించిన కవులను, వారి సాహిత్య  ప్రక్రియా వైవిధ్యాలను ,ఒకే కుటుంబానికి చెందినతాత తండ్రి కుమారుడు మనవడు లు సృష్టించిన సాహిత్యాన్ని గూర్చి చెప్పుకొన్నాం .ఆ రాజుల సాహిత్య పోషణా ,ప్రజానురంజక పాలనా తెలుసుకొన్నాం .

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’రెండవ భాగం లో ఇప్పటికి 54మంది సంస్కృతకవుల గురించి తెలియ జేసే అదృష్టం నాకు దక్కింది .అంతకు ముందు మొదటిభాగం లో146మంది అమరభాషాకవులను గురించి రాసిన విషయం దానిని సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారికి అంకితమిచ్చి శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో 15-3-15న  ఆవిష్కరణ జరిపిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది .ఈ రెండవ భాగం 14-5-15 న ప్రారంభించాను .అప్పుడప్పుడు రాస్తూ 54మంది కవులను ఈ రోజుతో  పూర్తీ చేశాను .ఇప్పటికి 200మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణం గురించి రాసిన  అదృష్ట వంతుడిని నేను. రెండవ భాగానికి ముఖ్య ఆధారం  ‘’history of classical Sanskrit literature’’రచయిత శ్రీ ఏం క్రిష్ణమాచారియార్  అని ముందే తెలియజేశాను .ఈ గ్రంధాన్ని కొని నాకు పంపి చదివించి రాయిస్తున్న ప్రేరణ మూర్తి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి మరో సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .ఇది ఫుల్ స్టాప్ కాదని ,కామా యేనని మనవి చేస్తూ ,వీలువెంట మిగిలిన కవులను గురించి కూడా రాస్తానని తెలుపుకొంటున్నాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-7-15-ఉయ్యూరు

 

,

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పునరేకీకరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రట్టుకానున్న గుట్టు.

రట్టుకానున్న గుట్టు..

  • 09/07/2015
TAGS:

సమాచారం పొందే హక్కును ప్రజలు వివిధ రాజీయ పక్షాల విషయంలో ఉపయోగించకొనలేకపోవడం నడచిపోతున్న వైపరీత్యం. సమాచార హక్కుల చట్టం -ఆర్‌టిఏ- కింద ప్రభుత్వ విభాగాలకు చెందిన సమాచారాన్ని పౌరులు పొందగలుగుతున్నారు. కానీ రాజ్యాంగబద్ధమైన రాజకీయ పార్టీల నిధుల గురించి, వాటిని వారు సేకరించే విధానం గురించి సమాచారం మాత్రం ప్రజలకు అందకపోవడం ప్రజాస్వామ్య వైపరీత్యం. ఈ చట్టం తమకు వర్తించదన్నది రాజకీయ పక్షాలు ప్రధానంగా జాతీయ రాజకీయ పక్షాలు చేస్తుండిన వాదం. ఎందుకు వర్తించదో వివరించవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం రాజకీయ పక్షాలను ప్రశ్నించడంలో పారదర్శకత ప్రాధాన్యం మరోసారి ప్రస్ఫుటిస్తోంది. ఈ పారదర్శకత వల్ల తమ అంతర్గత సంస్థాగత స్వాతంత్య్రానికి భంగం కలుగుతోందన్నది రాజకీయ పక్షాల భయం. కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ నిష్ఠను నిరంతరం అభినయిస్తున్న మన రాజకీయ పక్షాలు తమ నిధుల గుట్టు మాత్రం రట్టు కారాదని పట్టుదలతో ఉండడం పారదర్శక సూత్రాన్ని పరిహసిస్తున్న పరిణామం. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జారీ చేసిన ఆదేశంలో వివిధ రాజకీయ పక్షాల నిధి నిక్షేపాల సంగతి మరోసారి చర్చనీయాంశమైంది. 2013లో కేంద్ర సమాచార న్యాయసంఘం-సిబిఐ- వారు రాజకీయ పక్షాలు సార్వజనిక సంస్థలని నిర్ధారించారు. ఈ నిర్ధారణను రాజకీయ పక్షాల వారు బహిరంగంగా ధిక్కరిస్తుండడం మంగళవారం సర్వోన్నత న్యాయాదేశానికి ప్రాతిపదిక. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొనేవరకు ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం ఇప్పుడు వ్యవస్థీకృతమైపోయింది. అవినీతిని పరిశోధించడం మొదలు ఆహార భద్రత వరకు అనేకానేక విషయాలలో సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాలు, జోక్యం చేసుకున్న తరువాత మాత్రమే పాలకులలో కదలిక ఏర్పడడం చరిత్ర. ఇలా ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం గురించి ప్రతి రాజకీయ పార్టీ కూడ ఎప్పుడో అప్పుడు విమర్శించడం కూడ చరిత్ర. కానీ ఈ రాజకీయ పార్టీలు తమకు మాత్రం ఆర్టీఏ చట్టం వర్తించరాదని పట్టుదలతో ఉండడం గురివింద ప్రవృత్తికి చిహ్నం. సంస్థాగతంగా జరిగే వ్యవహారాలను ఆర్‌టిఏ ద్వారా బయటపెట్టడం ఇంటిగుట్టును ఇల్లెక్కి చాడడంతో సమానమన్నది రాజకీయ పార్టీల వితండవాదం. ఈ వితండవాదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడ సమర్ధించడం మరో వైపరీత్యం. తాము ఎవరివద్ద ఎంతమొత్తం విరాళంగా సేకరిస్తున్నదీ బయటకు రాకూడదన్నదే ఈ ప్రధాన రాజకీయ పక్షాల ఐక్య స్వరానికి ప్రధాన కారణం.
ఆర్‌టిఏ చట్టం కేవలం నిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. రాజకీయ పార్టీలు సార్వజనిక సంస్థలు కనుక చట్టం వాటికి కూడ వర్తించాలని మాత్రమే కేంద్ర సమాచార న్యాయ సంఘం-సిఐసి- వారు 2013లో నిర్ధారించారు. అయితే గుమ్మడికాయల దొంగలు భుజాలను తడుముకున్న చందంగా అన్ని పార్టీలు కూడ ప్రధానంగా తాము సేకరిస్తున్న విరాళాల గురించి మాత్రమే ఉలిక్కిపడ్డాయి. అందువల్ల చట్టం నుండి రాజకీయ పార్టీలకు మినహాయింపు ఇవ్వాలన్న ఐక్య ప్రతిఘటన 2013లోనే మొదలైంది. ఆరు జాతీయ పక్షాలను చట్టం పరిధిలోకి తీసుకొని రావాలని నిర్ధారించిన వెంటనే అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపిఏ- ప్రభుత్వం వారు చట్టాన్ని సవరించడానికి పూనుకున్నారు. ఈ సవరణకు దాదాపు అన్ని పార్టీలు వత్తాసు పలకడం అప్పటి కథ. ఆర్‌టిఏ పరిధి నుంచి రాజకీయ పక్షాలను మినహాయించాలని నిర్దేశిస్తూ ముసాయిదా సవరణ బిల్లు కూడ 2013 ఆగస్టులో రూపొందినట్టు ప్రచారమైంది. ఎందువల్లనో ఆ సవరణను చట్టం చేసే సాహసానికి అప్పుడు రాజకీయ పార్టీలు పూనుకోలేదు. నిధుల గురించి జాతీయ రాజకీయ పక్షాలు సమాచారం వెల్లడించాయి కనుక మళ్లీ చట్టంలో మార్పులు అవసరం లేదని ప్రభుత్వం భావించిందట. అందువల్ల ప్రత్యేకించి రాజకీయ పక్షాలను చట్టం పరిధి నుంచి మినహాయించాలన్న సవరణ చట్టం కాలేదు.
రెండేళ్ల తరువాత గత మార్చిలో సిఐసి వారు మళ్లీ తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ ఆరు జాతీయ రాజకీయ పక్షాలు అ నిర్ణయాన్ని ధిక్కరిస్తూనే ఉన్నాయి. ఇలా చట్టాన్ని తమ నిర్ణయాన్ని ధిక్కరించేవారిపై చర్యలు తీసుకొనే అధికారం తమకు లేదని సిఐసి వారు స్వయంగా ప్రకటించడం చట్టంలోని లొసుగులకు నిదర్శనం. న్యాయ ధిక్కారానికి పాల్పడిన ఈ రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేయడం ఎవరి బాధ్యత? ప్రభుత్వం పూనుకోవడం లేదు. అందువల్లనే సమాచార హక్కు సామాజిక ఉద్యమకారులు సుభాన చంద్ర అగర్వాల్, జగదీశ్ ఎస్. ఛోకర్ ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, వీరు దాఖలు చేసిన దరఖాస్తులోని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు అరుణ్‌మిత్ర, అమితవరాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం న్యాయ ప్రమే యం అనివార్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఎన్నికల కమిషన్ వారు కూడ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరింది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీలుకూడ సర్వోన్నత న్యాయస్థానంలో నిలబడి సమాధానం చెప్పవలసి ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఈ జాతీయ రాజకీయ పక్షాలు తమ నిధుల వివరాలను ప్రతి ఏటా స్వచ్ఛందంగా వెల్లడించవలసి ఉంది. అయితే నిమంధనలలోని లొసుగుల కారణంగా విరాళాలను చెల్లిస్తున్న వారిలో అందరి పేర్లను ఈ రాజకీయ సంస్థలు బయటపెట్టనవసరం లేదు. అందువల్ల గుప్తదాతల గుట్టు రట్టు కావడం లేదు.
ఈ గుప్తదాతలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోను స్నేహ సంబంధాలు కలిగి ఉండడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారినప్పటికీ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొరబడుతూనే ఉండడం సామాన్య జనాలకు అంతుపట్టని వ్యవహారం. రాజకీయంగా బద్ధ విరోధులైన రాజకీయ సంస్థల వారు ప్రపంచీకరణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయంలో ఉండడం జాతీయ వైపరీత్యం. చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్ వంటి విదేశాలకు చెందిన దోపిడీ దారులను అనుమతించడం ఈ ఏకాభిప్రాయానికి ఒక నిదర్శనం మాత్రమే. ఈ వాల్‌మార్ట్ సంస్థవారు దాదాపు అన్ని దేశాలలోను రాజకీయ నిర్వాహకులకు విరాళాలు సమర్పిస్తున్న తీరును అమెరికా కాంగ్రెస్ వారు సైతం తప్పుపట్టారు. వాల్‌మార్ట్ అమెరికాకు చెందిన దోపిడీ సంస్థ. ఇలా సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు మనదేశంలోని రాజకీయ పార్టీలను మంచి చేసుకొనడం బహిరంగ రహస్యం. ఎలా మంచి చేసుకుంటున్నాయన్నది ప్రజలకు వెల్లడి కావలసిన రాజకీయ రహస్యం…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధ్యప్రదేశ్ గొడవల్లో పదో నిందితుడు గవర్నరే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి నీళ్ళల్లోనే ఉంది ”ఎటకారం ”కృష్ణ భగవాన్ ఉవాచ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సకలజన ”సన్నాసులారా ”ఏకం కండి గులాబి నాయన పిలుపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య  ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు

మాధవ అనే పేరుగల విద్యారన్యులు శ్రింగేరి పీఠాది పతులు.విజయనగర సామ్రాజ్య సంస్థాపకులుగా కీర్తి గడించారు .హరి హర బ్బుక్క రాయలను ప్రేరేపించి  విజయనగర రాజ్య స్థాపన చేసి రాజులను చేశారు .రాజ్య పాలనలో సాలహా లిస్తూ రాజ గురువు అనిపించుకొన్నారు .అందుకే వారికి ‘’కర్నాటక సింహాసన స్థాపనా చార్య ‘’అని పేరు వచ్చింది .ఆయన సాయన శ్రీమతుల కుమారుడు  భారద్వాజ గోత్రీకులు .న్యాయ ,వేదాన్తాలపై అద్భుత రచనలు చేసి మార్గ దర్శకం చేశారు .అనంత మహా విజ్ఞాని .వేదాలపై విద్యారణ్య భాష్యం పరమ ప్రామాణికం .విద్యారణ్య విరచిత ‘’దేవ్యపరాద స్తోత్రం ‘’అనన్య సదృశం .అందులో వారి కవితా ప్రభ మహాద్భుతంగా ఆవిష్కరింప బడింది .వారు రాసిన’’ శ్రీ శంకర విజయం ‘’అన్తాకు ముందు వచ్చిన శంకర భగవత్పాదుల చరిత్రలన్నిటినీ పరాస్తం చేసి అనన్య సదృశంగా పరమోత్క్రుస్తంగా ఉంది నేటికీ అందరికీ ప్రమాణ గ్రంధం గా ఉంది .83ఏళ్ళ సార్ధక జీవితం గడిపిన విద్యా రన్య స్వామి 1387లో శంకర సాన్నిధ్యం చేరారు .

విద్యారన్యులు ‘’పరాశర మాదవీయం ..,’’సర్వ దర్శన సంగ్రహం ‘’భారతీయ దేదాంత కరదీపికలు .సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు వీటిని పరామర్శిస్తూ అందులో పదారు రకాలైన సిద్ధాంతాలను  క్రమ ఆరోహణ క్రమం లో వివరించారని అవి అద్వైత మత భావ వ్యాప్తికి తోడ్పడ్డాయని తెలియ జేశారు .అవే చార్వాక మతం, బౌద్ధమతం ,జైనమతం ,పూర్ణ ప్రజ్న,నకులీశ పాశుపతం ,శైవం ,ప్రత్యభిజ్న(కాశ్మీరశైవం ),రసేశ్వరం ,వైశేషికం ,అక్షపాదలేక న్యాయం ,జైమినీయం ,పాణినీయం ,సాంఖ్య ,పతంజల యోగం ,ఆది శంకరుల వేదాంతం .సర్వ దర్శన సంగ్రహం లో ఈ పదహారు లేవుకాని వాటి మొత్తం సారం అంతా శంకరాద్వైతం లో నే ఉందని తెలియ జేశారు .ఒక్కొక్కమతాన్ని విడివిడిగా సమీక్షించి వాటి లోని డొల్లతనాన్ని బయట పెట్టాడు .లోకాయత లేక భౌతిక వాదం గురించి ఇంకెక్కడా లేని సమాచారం సర్వ దర్శన సారం లో ఉంది .

విద్యారన్యుల మరోగ్రంధం ‘’పంచ దశి ‘’.అద్వైత వేదాంత సారం అంతా ఇందులో నిక్షిప్తం చేశారు .పది హీను అధ్యాయాల గ్రంధం .వివేక ,దీప ,ఆనంద అనే మూడు భాగాలుగా ఉంటుంది ,’’మాధవీయ శంకర విజయం’’ అనేది సంక్షిప్తశంకర విజయం .ఇది ఆది శంకరాచార్యులైన శంకర భగవత్పాదుల జీవిత చరిత్ర .మీమాంస సూత్రాలకు భాష్యం కూడా రాశారు .పదహారు ఏళ్ళు శృంగేరి పీఠాదిపత్యం నిర్వహించి విద్యారణ్య స్వామి సిద్ధి చెందారు .ఆయనది ఒక శకం .అద్వైతానికి ఆయన ఎత్తిన పతాక .

విద్యారన్యుల వారి తమ్ముడు  సాయనుడు మొదటి బుక్క ,రెండవ హరిహరుల మంత్రి .ఆయనకొడుకులు కంపన సంగీత గాయకుడు .మయనుడు కవి .సింగన వేద పండితుడు .సాయన 1378లోచనిపోయాడు . వేదాలపై భాష్యం రాశాడు .’’సుభాషిత సుధా నిధి ‘’లో చక్కని నీతులు చెప్పాడు .పది అధ్యాయాల ‘’అల౦కారసుదానిది’’ రాశాడు .

స్వామి మరో తమ్ముడు భోగనాధుడు రెండవ సంగమ రాజు సమకాలీనుడు .మహా గొప్పకవి .రామోల్లాసం ,త్రిపుర విజయం ,శృంగార మంజరి ,ఉదాహరణ మాల ,మహా గణపతి స్తోత్రం, గౌరీనాధ స్తోత్రం రాశాడు .

Image result for vidyaranya of vijayanagara  Inline image 1Image result for vidyaranya of vijayanagara

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

-తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు

వెంకట నాధుడే పూర్ణ ప్రజ్ఞ సంపాదించి  వేదాంత దేశికులైనారు .ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంట అవతారం గా భావిస్తారు .1268కాలం .నూటపాతిక దాకా గ్రంధాలు రాశారు .శ్రీ వైష్ణవం లో వడిగల శాఖ సంస్థాపకులు వేదాంత దేశికులు .దక్షిణ భారత వైష్ణవాలయాలలో దేశికుల విగ్రహం తప్పని సరిగా ఉంటుంది .వీరిని గూర్చి మనం మొదటి భాగం లో విపులంగా  తెలుసుకొన్నాం .

186-సాకల్య మల్ల కవి

మల్లయార్య ,కవిమల్ల అని పిలువ బడే సాకల్య మల్లకవి మాధవుని కుమారుడు .అద్వైతమతానికి చెందిన వాడు. సంగ భూపాలుని ఆస్థానం లో వేదాన్తదేశికుని శిష్యుడు నాయనా చార్య చేతిలో వాదం లో ఓడిపోయాడు .సింగభూపాలుడు 1330లోరాచ కొండ రాజు .సాకల్యుడు వైష్ణ ఆచార్యుని పై భేతాలుడు అనే పిశాచిని బ్రాహ్మణ శిష్యుని వేషం లో పంపాడని అయన పల్లకిలో గ్రామాంతరం వెడుతూ శిష్యుడిని పల్లకి మోయ మన్నాడని ,వాడు పల్లకి కిందపడేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశాడని ఈ విషయం గ్రహించి వైష్ణవ స్వామి దానికి విరుగుడుగా మంత్రం వేశాడని దానికి లొంగిపోయి అతి భక్తిగా భేతాళ శిష్యుడితో చచ్చినట్లు పల్లకి మోయిచెట్లు చేశాడని ఒక కద ప్రచారం లో ఉంది . ఈ కవికి శ్రీరాముడు కలలో కనిపించి కావ్యం రాయమని కోరితే ‘’ఉదార రాఘవం ‘’రాశాడు .ఇది పద్దెనిమిది కాండలకావ్యం .కాని మనకు మిగిలింది ఏడు కాండలే .రామాయణ కధను రఘు వంశం ఆధారం గా రాశాడు .సరళమైన కవిత్వం .మాయి సూరి కొడుకు చావుండి దీఇకి వ్యాఖ్య రాశాడుకాని అసంపూర్తిగా దొరకినది .రాంపల్లి గోపీ నాధుడు కూడా వ్యాఖ్య రాశాడు .

ఇప్పటివరకు మనకు తెలిసింది ఏమిటంటే అనేకార్ధ కావ్యాలు బాగా విజ్రుమ్భించి సాహిత్యాన్ని సర్కస్  ఫీట్ల కింద మార్చాయని జైన కవులూ ఈ ప్రభావం లో పడి పోయారని వారూ దాని అంతు చూశారని తర్వాత నెమ్మదిగా ధోరణి మారి వంశ  చరిత్రలు  బాగా వ్యాప్తి లోకి వచ్చాయని అందులో చాలా భాగం చరిత్ర ఉన్నదని అలంకార గ్రంధాలు  నిఘంటువులు కూడా కవులు రాసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని తెలిసింది .ఈ కవులు ఎక్కువ భాగం గుజరాత్  ,కాశ్మీర  రాజుల ఆస్థానకవులు .ఎక్కువ మంది సూరి బిరుదున్నవారు. అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .జైన మతాచార్యులుగా లబ్ధ ప్రతిస్టూలు .రాజులను ఆ మతం లోకి మార్చిన వారు .విభవ ప్రాభవాలు అందుకొన్నవారు .వీరి తర్వాతకవులు దక్షిణా పదానికే ఎక్కువగా చెందిన వారు వచ్చారు .విజయ నగర సామ్రాజ్యం ఏర్పడటం తో వచ్చిన మార్పు ఇది .ఆ సామ్రాజ్య నిర్మాత శ్రీ విద్యారన్యులవారు. వారినే మాధవ విద్యా రన్యులు అంటారు .ఇక నుంచి కద విజయ నగరానికి చేరుతుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక

rachana1 001 rachana2 001 rachana3 001బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నిన్నటి తరం కథ -దాట్ల దేవదానం రాజు 0

నిన్నటి తరం కథ

  • -దాట్ల దేవదానం రాజు
  • 04/07/2015
TAGS:

…….
కథల పోటీలో ఎంపికైన రచన
……….

కొందరంతే.. సర్దుకుపోరు, విలువల పట్ల రాజీపడరు. అలాగే, తరాల మధ్య తేడాను కొలవలేం. ఇదంతా కాలం తెచ్చిన మార్పేనా? అవును… అంతే అయి వుండాలి. కొన్ని తగవులు ఎన్నటికీ తెగవు. ఇందుకు ఉదాహరణగా రంగారావుని తీసుకుంటే…
***
రంగారావుకి ఎనభై రెండేళ్ళు. పొద్దుట రాఘవకు, తనకూ జరిగిన సంభాషణ చుట్టూనే ఆలోచనలు సాగుతున్నాయి. చిన్నతనంలో తను వంద రూపాయల నోటును కనులారా చూసిందీ లేదు, చేత్తో పట్టుకుందీ లేదు. అత్తారింటికి పెళ్లాం దగ్గరకెళ్లాలంటే.. రేవు దాటడానికి పావలా, బస్సుకు అర్ధ రూపాయి.. రాను పోను సరిపడే డబ్బులు లెక్క కట్టి ఇచ్చేవాడు నాన్న. ఉమ్మడి కుటుంబంలో నాన్న మాట జవదాటే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఆయన చూపులు భయపెట్టేవి. గదమాయించి మాట్లాడితే వణుకు వచ్చేది. మరి ఇప్పుడో..? పెద్దలంటే లెక్కలేదు, మర్యాద లేదు. అక్రమ సంపాదన నిలబడదని అంటే రాఘవకు చుర్రుమని కోపం వచ్చేసింది.
‘‘నీతి,నిజాయితీలతో బతకడం వల్ల ఒరిగేదేమీ లేదు. మడి కట్టుకుని కూర్చుంటే మన పని అంతే. నీకు తెలియదు తాతయ్యా..! డబ్బు చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం. ఎలా సంపాదించావన్నది కాదు ప్రశ్న. సంపాదించడమే ముఖ్యం. మీ రోజులు వేరు. ఉన్నదాన్ని తినడం తెలియని తరం మీది. మేం అలా కాదు. ముందు మేం అనుభవించాలి. ఆ తర్వాతే మిగిలిన వారికి..’’ అని రంగారావు మంచానికి చేరువుగా కుర్చీ జరుపుకుంటూ అన్నాడు రాఘవ. రంగారావు మాట్లాడలేదు. ఒకసారి మనమడి కేసి చూసి ఊరుకున్నాడు.
రాఘవకు క్షణం తీరిక ఉండదు. ప్రత్యేకంగా అతను చేసేదేమిటో తెలియదు. ఎవరెవరో పనుల కోసం వస్తుంటారు. అస్తమానం హైదరాబాదు తిరుగుతుంటాడు. మంత్రులంటాడు.. అధికారులంటాడు.. డబ్బుకు ఇబ్బంది ఉన్నట్లుగా ఎప్పుడూ కనిపించడు. హాయిగా ఖర్చుపెడతాడు.
రాఘవ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే ప్రమాదంలో చనిపోయారు. రంగారావు దగ్గరే పెరిగాడు. నెల క్రితం రంగారావుకు సుస్తీ చేయడంతో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అప్పట్నుంచీ కాసేపు తాత దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు.
‘‘ఎన్నైనా చెప్పు రాఘవా.. న్యాయంగా కూడబెట్టిందే నిలుస్తుంది. అలా కానిదైతే మట్టికొట్టుకుపోవడం ఖాయం’’ మరలా రంగారావు అన్నాడు.
చిరాగ్గా చూశాడు రాఘవ.
‘‘అంటే… నన్ను శపిస్తున్నావా..?’’
‘‘అయ్యో… అంతమాట ఎందుకురా? పైవాడి పిలుపు కోసం ఎదురుచూస్తున్నవాడిని. అయినా నినె్నందుకు అంటాను? నీవేమైనా దోపిడీలు చేస్తున్నావా? కాని పనులు చేస్తున్నావా?’’
‘‘అలాంటివాళ్ళే లోకంలో ముప్పాతిక మంది ఉన్నారు. వాళ్ళంతా దర్జాగా హాయిగా బతుకుతున్నారు. ఒక్కసారి డబ్బు పోగుపడాలే గానీ అక్కడ్నుంచి అదే పెంచుతుంది. ఈ వాదనలు నీకూ, నాకూ మధ్య ఎప్పుడూ ఉండేవే. ఆసుపత్రిలో నీవు చస్తావో, బతుకుకతావో అని మేం ఏడుస్తుంటే- నాకో కోరిక ఉంది. అది తీర్చు- అన్నావు. అదేమిటో చెప్పు తప్పక చేస్తాను’’ అన్నాడు రాఘవ లేచి నిలబడుతూ.
మంచం మీద పడుకుని కబుర్లు చెబుతున్న రంగారావు నెమ్మదిగా లేచి స్టూలుమీంచి మంచినీళ్ళ గ్లాసు అందుకుని తాగాడు.
‘‘నా బాధంతా దాని గురించే. ఈ వారంలో జరిగిపోతే మంచిది. ఆ తర్వాత నేనేమైనా ఫర్వాలేదు. అడ్డు చెప్పకుండా నేను చెప్పినచోటుకి తీసుకెళ్ళు’’ అని కాసేపు ఆగి- ‘‘అన్నట్టు రెండొదల రూపాయలు కావాలి నాకు. మొత్తం కావాల్సింది వెయ్యి.. అయతే- రెండొందలు తక్కువైంది.. ఇవ్వు’’-
వెంటనే రాఘవ పర్సులోంచి అయిదు వందల నోటు తీసి ఇచ్చాడు.
‘‘ఉహూ.. వద్దు.. రెండొందలే కావాలి’’ అన్నాడు రంగారావు.
రంగారావు తాను తీసుకున్న నోట్లను రెండు మడతలు చేసి తలగడ కింద దాచుకున్నాడు.
‘‘నీకెప్పుడు వీలవుతుంది?’’
‘‘వర్షాలు పడుతున్నాయి కదా తగ్గనీ.. వెళదాం.. ఇంతకీ ఏ ఊరు వెళ్లాలి?’’ అడిగాడు రంగారావు.
‘‘అబ్బో.. చాలా దూరమే… పని చెప్పు… నేను వెళ్లి పూర్తిచేసి వస్తాను’’.
‘‘నేనే వెళ్లాలి, ఆ మహానుభావుడి దగ్గరకు. ఇలా దగ్గరకు రా. నా చేతిలో ఒట్టేయి రెండు రోజుల్లో తీసుకెళ్తానని’’.
చేయి అందుకుని ఒట్టువేసాడు రాఘవ.
రంగారావు కళ్ళముందు వెంకన్నబాబు కనిపించారు. ‘ఏనాటి వెంకన్నబాబు… ఎంత మంచి మనిషి’ అనుకున్నాడు.
***
రెండు రోజులు గడిచాయి. ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే వుంది. రంగారావు ఉదయానే్న లేచాడు. పనివాడి సాయంతో స్నానాదికాలు పూర్తిచేశాడు. పంచె కట్టుకున్నాడు. చొక్కా తొడుక్కున్నాడు. తీరా చూస్తే చొక్కా ముందుభాగంలో డాగులున్నాయి. ఒక బొత్తాం సగం విరిగిపోయి ఉంది. విప్పేసి మరొక మంచి చొక్కా తీసుకుని వేసుకున్నాడు. రాఘవ కోసం ఎదురుచూస్తున్నాడు, అతను రాలేదు. ఉరుములు.. మెరుపులు.. వర్షం మళ్లీ ప్రారంభమైంది.
‘‘ఈవేళ అంత పెందరాళే లేచారెందుకు?’’ రాఘవ భార్య రమ అడిగింది.
రంగారావు చెప్పలేదు. రమ రెట్టించలేదు. క్షణాలు గడుస్తున్నాయి. రాఘవ రాలేదు. వర్షం కొద్దిగా తెరిపిచ్చింది. రంగారావు అసహనంగా ఏదో గొణుక్కుంటున్నాడు. ఇంట్లో పనిచేసే సూరీడుని లోపలికెళ్లి రాఘవను పిలుచుకు రమ్మన్నాడు. మళ్లీ వర్షం మొదలైంది. కాసేపటికి రాఘవ వచ్చి తాతయ్యని చూసి ఆశ్చర్యపోయాడు, అంత పొద్దునే్న బట్టలు వేసుకున్నందుకు.
‘‘ఏరా.. ఇంకా అలాగే ఉన్నావేంటీ? మాట మరిచావా?’’ అడిగాడు రంగారావు.
ఏమిటన్నట్లు చూశాడు రాఘవ.
‘‘బడాయికి మొన్న ఒట్టు పెట్టావ్.. గుర్తులేదా?’’
‘‘ఇప్పుడా?.. చూడు.. వాతావరణం ఎలా వుందో? వర్షం బాగా పడుతోంది. తుపానుగా మారే అవకాశం ఉందంటున్నారు. వర్షాలు తగ్గాక వెళదాం లే’’ తేలిగ్గా అన్నాడు.
రంగారావు కోపంగా చూసి నెమ్మదిగా లేచాడు. భుజంమీద తువ్వాలు మంచం మీదకు, చొక్కా తీసి రాఘవ మీదకు విసిరేశాడు. జుట్టు చెరిపేసుకున్నాడు. పంచె కూడా విప్పబోతూండగా రాఘవ దగ్గరకొచ్చి పట్టుకున్నాడు. గోడ వార బల్ల దగ్గరకు పోయి అటువైపు చూస్తుండిపోయాడు. ఆయన ఉపయోగించే ఆయుధం ఒకటే.. వౌనవ్రతం..! పమిట కొంగు తుడుచుకుంటూ వచ్చి నడుం మీద చేయి వేసుకుని నిలబడిన రమ్య పకపకా నవ్వింది.
‘‘బుజ్జిగాడి కోపతాపాలు కూడా ఇలాగే ఉంటాయి. వాడికన్నీ ముత్తాతగారి బుద్ధులే’’ అంది.
తాత గెడ్డం పట్టుకుని బతిమాలాడు రాఘవ. ఆయన అలక మానలేదు. ఇక తాత మాట వినక తప్పలేదు రాఘవకి. ఆఖరికి తాతే నెగ్గాడు. రాఘవ కారు తీశాడు. ఇంటి నుంచి రోడ్డుకి చేరే క్రమంలో ఎదర చక్రం మురికి గుంటలోకి దిగబడింది. కారు దిగి ఇద్దరి మనుషుల సాయంతో బయటకు లాగాడు. మరలా చిరు జల్లులు. రంగారావు దర్జాగా డ్రైవింగు సీటు పక్కన కూర్చున్నాడు. కారు ఊరు దాటింది.
‘‘ఇప్పటికైనా.. చెప్పు తాతయ్యా.. ఫ్రెంచి యానాం అవతల ఆ ఊరు… పేరేమిటన్నారు? ఇంతకీ అక్కడికెళ్లి మనం ఏం చేయాలి?’’ కారు అద్దాల్లోంచి రోడ్డును చూస్తూ అన్నాడు రాఘవ.
‘‘మనం వెళ్లాల్సిన ఊరు ఉప్పంగల. ఇక పని ఏమిటంటావా? అక్కడికి వెళ్లాక నీకే తెలుస్తుంది. కారు జాగ్రత్తగా పోనీయ్’’
‘‘మీ ముసిలాళ్లకు అంతా చాదస్తం. ఒక పట్టాన వినరు. వయసొచ్చేకొలదీ మరీ చంటిపిల్లలైపోతారు. అనుకున్నది అయిపోవాలి అంతే. చూస్తున్నారా..? వర్షం.. ఇంకో రోజు తెరిపిగా ఉన్నప్పుడైతే.. ఏమైంది?’’ చిన్న గొంతుతో విసుగ్గా తాత వంక చూస్తూ అన్నాడు రాఘవ.
‘‘రోజులన్నీ చూస్తూండగా జారిపోతున్నాయి రా.. ఈసారికి కష్టపడు. ఇంకెప్పుడూ బాధపెట్టనులే. అయినా నాదే తప్పు.. ఇనే్నళ్ళపాటు దాటెయ్యవలసింది కాదు’’
అమలాపురం చేరారు. మూడు గంటలు పట్టింది. యానాం వెళ్లాలంటే మరో గంట పడుతుంది. యానాం నుంచి ఆ ఊరు ఎంత దూరమో..? అదే అడిగాడు రాఘవ. రంగారావు చెప్పబోయాడు. అకస్మాత్తుగా కారు ఆగింది. ఇంజన్‌లో ఏదో సమస్య. దారంటా వెళ్ళేవారిని తోయమని కారును రోడ్డు పక్కకు చేర్చాడు రాఘవ. మెకానిక్ సరిచేసేటప్పటికి మరో అరగంట గడిచింది. మళ్లీ ప్రయాణం. రాముడ్ని స్తుతించే పాటేదో కూనిరాగం తీస్తూ అందుకున్నాడు రంగారావు. రాఘవ భరించలేకపోతున్నాడు. ఇలా ఇరుక్కున్నందుకు మనసులో తిట్టుకున్నాడు. క్షణాలు గడిచేకొలదీ ఇక ఆగలేకపోయాడు.
‘‘చెవుల్లో ఊరికే రొద పెట్టకు తాతయ్యా.. కాసేపు వౌనంగా ఉండు.. అసలు విషయం చెప్పవు. నీకు తెలుసో లేదో ఎంతో కొంత లాభం లేకుండా ఏ పనీ చేయను. సొమ్ము ఒడిలో పడాలే గానీ అది అక్రమమో, సక్రమమో అని చూడను. ఎదుటివాడి నుంచి సొమ్ము ఎలా రాబట్టుకోవాలో, మనం ఇవ్వాల్సింది ఎట్లా ఎగ్గొట్టాలో తెలుసు. అలాంటివాడిని ఈవేళ నీ పాలబడ్డాను’’ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా పైకి అనేశాడు రాఘవ.
కళ్లింత చేసుకుని కొత్తగా వింటున్నట్లుగా రాఘవ కేసి చూస్తుండిపోయాడు రంగారావు. రాఘవ ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఎదుర్లంక చేరుకున్నారు. యానాం- ఎదుర్లంక వంతెన పనులు పూర్తయనా ప్రారంభోత్సవం జరగలేదు. అటు దరికి చేరాలంటే ఇక పడవే గతి. కారును కూడా దాటించాలంటే ఫంట్ అవసరం. రావులపాలెం మీదుగా వెళితే చుట్టూ తిరిగినట్టవుతుందని ఇలా వచ్చారు. మహోధృతంగా.. గోదావరి. చెదురుమదురుగా పడవలు.. ద్విచక్ర వాహనాలకు ఇబ్బంది లేదు. ఇద్దరు మనుషులు మోసుకెళ్లి పడవలోకి దింపేస్తారు. ఫంట్ రెండు రోజులుగా రావడం లేదట. మరమ్మతుల కోసం వెళ్లిందట.
‘‘కారు దాటే మార్గం లేదు.. ఏం చేద్దాం తాతయ్యా.. వెనక్కెళ్లి మరో రోజు వద్దామా..?’’
రంగారావు తీక్షణంగా గోదావరి కేసి, ఆకాశం వైపు దృష్టి సారించాడు. ఆ సరికి మేఘాలు చెదిరిపోయాయి.
‘‘ఇంతా చేసి ఇప్పుడు వెనక్కెళితే.. మరలా రావడం ఎప్పుడు కుదురుతుందో? ఊళ్ళో ఎవరింటి దగ్గరైనా కారును ఉంచేసి, మనం ఏ ఆటోనో మాట్లాడుకుని వెళదాం’’
ఎదుర్లంక గ్రామం ఏటి ఒడ్డునే వుంది. కారుని ఊళ్ళోకి పోనిచ్చాడు. దారిలో పరిచయస్తుడొకడు తగిలాడు. అతను చూపించిన చోట కారు ఉంచేసి, మరలా రేవు దగ్గరకు వచ్చారు. యానాం చేరేటప్పటికి మరో గంట గడిచింది. ఆటో మాట్లాడుకున్నారు. గతుకుల రోడ్డు, ఆరు కిలోమీటర్ల దూరం. ప్రయాసపడి ఉప్పంగల చేరారు. తీరా అక్కడికి వెళ్లాక రంగారావుకు కావాల్సిన వెంకన్నబాబు యానాంలో ఉంటున్నట్లుగా తెలిసింది. వెంకన్నబాబు యానాంలో ఎక్కడుంటున్నాడో తెలుసుకోగానే రంగారావు ఆశ్చర్యపోయాడు. బాధగా ఉంది. స్థిమితంగా లేదు. విన్న విషయం అర్థం కావడానికి సమయం పట్టింది.
ఒక్కోసారి కాలం కొట్టే దెబ్బల్ని ఊహించుకోలేం. వెంకన్నబాబు లాంటి పరోపకారి యానాం వృద్ధాశ్రమంలో ఉంటున్నాడంటే వింతకాక మరేమిటి? వెంకన్నబాబుకు అందులో చేరే అగత్యం ఎందుకు కలిగింది? నమ్మినవాడు చేసిన మోసానికి సర్వం కోల్పోయాడని తెలిసి విచారం కలిగింది.
‘‘ఏమిటి తాతయ్యా.. ఊళ్ళో వాళ్ళు చెప్పింది విన్న దగ్గర్నుంచీ.. అలా ముడుచుకునిపోయావేమిటి? మనుషుల్ని గుడ్డిగా నమ్మితే అంతే మరి..’’
***
యానాం ఓల్డేజ్ హోం పరిశుభ్రంగా ఉంది. ఆడవాళ్ళు ఒక పక్క, మగవాళ్ళు మరోపక్క గదుల్లో ఉన్నారు. వెంకన్నబాబు చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. జ్ఞాపకశక్తి మందగించింది. రంగారావును చాలాసేపటివరకు గుర్తుపట్టలేదు. ఆయన్ని అలా చూడగానే రంగారావుకు దుఃఖం ముంచుకొచ్చింది. బావ వరుసతో ముచ్చట్లు మొదలెట్టారు. శారీరక అవస్థల గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఆఖరి సారి కలిసి ముప్ఫై అయిదేళ్లు అవుతుందని లెక్కలు కట్టుకున్నారు.
రాఘవ మాత్రం అక్కడ ప్రేక్షకుడయ్యాడు.
‘‘ఒక అపరాధ భావం నన్నీమధ్య పీడిస్తున్నది. మిమ్మల్ని కలవకుండా చచ్చిపోతాననే భయం ఈవేళ నన్ను ఇక్కడకు రప్పించింది. మిమ్మల్ని చూశాను, చాలు. మీరు ఆ చుట్టుపక్కల ఊళ్ళకు మకుటం లేని మహారాజులా ఎలా మెలిగారో ప్రత్యక్షంగా చూసినవాడిని. ఒక్క చేతిమీదుగా కాగితం, కలం లేకుండా మీరు చక్కబెట్టిన వ్యవహారాలు మరొకళ్లకి సాధ్యమయ్యే పనికాదు’’ నెమ్మదిగా ఒక్కో మాట చెబుతూ కంటతడి పెట్టాడు రంగారావు.
వెంకన్నబాబు కళ్ళు మిలమిలా మెరిశాయి. ఇద్దరు ముసిలాళ్ళ సొదకు ఇంక అంతులేదని గ్రహించి రాఘవ పొడిగా దగ్గాడు. వాళ్ళను వదిలి దూరంగా పోబోయాడు. రంగారావు గమనించి రాఘవ చేయి పట్టి ఆపాడు.
‘‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం నేను మీ దగ్గర మూడొందలు తీసుకున్నాను. ఆ బాకీ అలాగే ఉండిపోయింది. ఆ సొమ్ము మీకివ్వాలని మా మనవడ్ని తోడు చేసుకుని వచ్చాను. నన్ను రుణవిముక్తిడ్ని చేయండి’’ అని చెప్పి వెంకన్నబాబు చేతిలో డబ్బు పెట్టాడు.
‘‘ఇదేమిటి? ఇప్పుడెందుకూ…?’’ ఆ నోట్లను తిరిగి ఇచ్చేయబోయాడు. ఉంచమని దణ్ణం పెట్టి జేబులో కుక్కాడు రంగారావు.
వెంకన్నబాబు తన జేబులోనుంచి నోట్లు తీసి లెక్కపెట్టాడు.
‘‘మీ దగ్గర నేను తీసుకున్నది మూడొందలు… ఎప్పటిమాట… ధర్మప్రభువులు, ఈ మొత్తం మీరు తీసుకుంటేనే నాకు తృప్తి’’ అన్నాడు రంగారావు.
‘‘నేనేమైనా.. వడ్డీ వ్యాపారినా?’’ అని మూడొందలు తన దగ్గర ఉంచుకుని మిగిలిన ఏడొందలు తిరిగి ఇచ్చేసాడు వెంకన్నబాబు.
ఎవరి పంతం వారిదే. ఆయన వద్దంటాడు.. ఈయన కుదరంటాడు.. ఈయన బతిమాలతాడు. ఆయన కాదు పొమ్మంటాడు. ఇది ఇంతలో తెమిలేలా లేదు. ఎవరికివారు తమ మాటే నెగ్గాలనుకుంటున్నారు. రాఘవ చేతులు కట్టుకుని చూస్తూ నిలబడ్డాడు. ఆ ఇద్దరూ ఒక పురాతన క్రీడ ఏదో ఆడుతున్నట్లుగా ఉంది. ఆ ఆటకు ముగింపు లేదు. *

రచయత సెల్ నెం: 94401 05987

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి

వస్తుపాల ,తేజపాలకు గురువు ఆచార్యుడు ఉదయ ప్రభ సూరి .కవి సిద్ధాంతకర్త ,ఖగోళ శాస్త్రజ్ఞుడు .అతని ‘’ఆరంభ సిద్ధి ‘’ఖగోళ విషయం పై రాసిందే .’’ఉపదేశ మాలా కార్మిక ‘’ఉపదేశామాలకు రాసిన వ్యాఖ్యానం. ధర్మాభ్యుదయం లేక ‘’సంఘాదిపతి చరిత్ర ‘’అనే మహాకావ్యం వస్తుపాల రాజు పశ్చిమ దేశ జైన మందిర సందర్శనం పై రాసింది ,నరేంద్ర ప్రభ కూడా దీనిలో భాగ స్వామి .అతని ‘’సుకృత కృతి కల్లోలిని ‘’వస్తుపాల ,తేజపాలుల  శత్రున్జయ  యాత్ర పై రాసినది .దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యం ఉందికూడా .వస్తుపాల వంశ చరిత్రతో బాటు చాపోత్కల ,చాళుక్య రాజుల గురించి వివరాలూ ఉన్నాయి .

180- చాళుక్య వాంశ చరిత్ర రాసిన -జయ సింహ సూరి

బోచ్ లో ముని సువ్రత కు ఆచార్యుడైన జయ సింహ సూరి వీరసూరి శిష్యుడు .శ్వేతాంబర జైనుడు .ఒకప్పుడు వస్తుపాలుని సోదరుడు తేజపాల ఈ జైన మందిరాన్ని సందర్శించ టానికి వచ్చినపుడు ఇరవై అయిదు బంగారు నాణాలు అంబదలో ఉన్న సకుమిక విహార కు దానం చేయమని శ్లోకం లో అడిగాడు .వెంటనే రాజు ఇచ్చేశాడు .వస్తుపాల ప్రశస్తి లో ఈ సోదరుల దాత్రుత్వాన్ని శ్లాఘించాడు .దానానికి  క్రుతజ్ఞాతగా ‘’హమ్మీర మద మర్దనం ‘’నాటకాన్ని  వస్తుపాల కొడుకు జయంతి సింహు ని కోరికపై రాశాడు .కాంబే లో భీమేశ ఉత్సవం నాడు దీన్ని ప్రదర్శించారు .ఇందులో వస్తుపాల, స్నేహితుడు వీర ధవళ  కలిసి గుజరాత్ ను మహమ్మదీయ దండ యాత్రనుంచి రక్షించిన చరిత్ర వర్ణించాడు .ఉపమలతో ఉల్లాసంగా కవిత్వం ఉంటుంది .విరాధ వల్ల కొలువులో వస్తుపాల మంత్రిగా ఉండేవాడు .కనుక ఈ నాటకం 1220-30మధ్య రచించి ఉండాలి .జయసింహుని ’’వస్తుపాల ప్రశస్తి ‘’చాళుక్య వంశ చరిత్ర .మొదటి మూల రాజు నుండి అందరిని చేర్చి రాశాడు .

181- కదా రత్న సాగరం రాసిన -నరచంద్ర సూరి

1288 వాడైన నరచంద్ర సూరి అనేక ‘’ప్రశస్తులు ‘’రాశాడు .వస్తుపాలపై రాసిన ప్రశస్తి గిర్నార్ శాసనం లో లభిస్తుంది .హరత పురి యాగచ్చ కు చెందిన మలదారి దేవప్రభ సూరి శిష్యుడు .అనర్ఘ రాఘవం పై వ్యాఖ్యానం రాశాడు .వస్తుపాలుని కోరిక మేరకు ‘’కదా రత్న సాగరం ‘’రాశాడు .శిష్యుడు నరేంద్రప్రభ ‘’అలంకార మహోదధి ‘’రచించాడు .దేవ ప్రభ రాసిన ‘’పా౦ డవ చరిత్ర ‘’,ఉదయ ప్రభ రచన ‘’ధర్మాభ్యుదయం ‘’లను సవరించి మెరుగులు దిద్దాడు

182-సరస్వతీ పుత్రుడు -బాల చంద్ర సూరి

చంద్రా గచ్చ కు చెందిన హరి భద్ర సూరి శిష్యుడే బాల చంద్ర సూరి .ధోల్కా రాజు విరాధ వాలుని మంత్రి వస్తుపాలుడిని తెగ ప్రశంసించాడు .రాజు మరణం తర్వాత వస్తుపాలుని అభ్యర్ధనకేరకు ‘’వసంత విలాసం ‘’అనే పద్నాలుగు కాండాల కావ్యాన్ని వస్తుపాల మంత్రిత్వ గరిమను గురించి రాశాడు .వస్తుపాలుడు మరణించాడు .పద్దెనిమిది కాండలలో మొదటికాండం లో తన చిన్ననాటి జీవితం రాసుకొన్నాడు .గాయక్వాడు రాజాల అదీనం లో ఉన్న కాడి జిల్లాలో మోదేరక నగరం  లో  ధర్మ వేదుడు అనే ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడని ,బాధలలో ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు చేసేవాడని దీనితో జైనమతం పట్ల ఆకర్షితుడయాడని రాశాడు .అతని ఇంటికి వచ్చిన అతిధులకు చేతి నిండా ధనం ఇచ్చి పంపేవాడు .భార్య పేరు విద్యుత్ .కొడుకు ముంజల .ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచే ప్రపంచం మాయ అని తెలుసుకొన్నాడు .హరి భద్ర సూరి గురుత్వం తో విషయ పరిజ్ఞానం పెరిగి జైనం లోకి మారటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .అనుమతిపొంది జైనమందిరం లో గురువు శిక్షణలో అన్నీ నేర్చాడు .బాల చంద్ర అనే ఆశ్రమనామం పెట్టాడు గురువు .చనిపోయిన తర్వాత శిష్యుడినే అధికారి  అయెట్లు చేశాడు .పద్మాదిత్యుడి  పాదపద్మాల పై చాళుక్య చక్ర వర్తి కిరీట మణి కాంతులు పడేవని అంతటి మహిమాన్వితుడైన పద్మాదిత్యుడి శిష్యుడనని చెప్పుకొన్నాడు .

వాడిదేవసూరి  లోని గచ్చ కు చెందినఉదయసూరి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడని ,దాన్ని సాధన చేసేవాడినని ఒక సారి యోగ  నిద్రలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై తన  భక్తికీ ఆరాధనకు మెచ్చి  కాళిదాసులాగా తన కుమారుడిగా భావిస్తానని చెప్పింది ‘’అని రాసుకొన్నాడు .బాలచంద్ర రాసిన కవిత్వానికి వస్తుపాలుడు ఏంతో సంతోషించి వెయ్యి ‘’ద్రమ్మల’’(drammaas)తో బాల చంద్ర సూరిని ఆచార్యునిగా చేసినట్లు ‘’ప్రబంధ చింతామణి ‘’తెలియ జేస్తోంది .

183  కీర్తి కౌముది  ,కావ్యాదర్శ కర్త -సోమేశ్వర దేవుడు

సోమశర్మ లేకసోమేశ్వర దేవుడు ఆశుకవి .కుమార,లక్ష్మి ల కుమారుడు .అతని పైన ఎనిమిదవ  తరం వాడైన సోలుడు అన్హిల్ విద్లో చాళుక్య సామ్రాజ్యాన్ని మొదట స్థాపించిన మూల రాజు ఆస్థాన పురోహితుడు .సోలుని తర్వాత ఆకుటుంబం వారందరూ ఆస్థాన పురోహితులే అయ్యారు .సోమేశ్వరుడు వస్తుపాల రాజు స్నేహితుడు .విరాధ పాల ,విశాల దేవ రాజుల దర్బారులో సోమేశ్వరుని ప్రశస్తి  ని రాజశేఖరుడు’’ ప్రబంధ కోశం ‘’లో తెలియ జేశాడు .హరిహర ,సుభటులు సోమేశ్వరుని స్నేహితులు .వీరిద్దరుసోమకవి కవిత్వాన్ని మెచ్చారు .సోమేశ్వరుడు తన ‘’కీర్తి కౌముది ‘’లోను ,’’సురతోత్సవం ‘’లోను తన పోషకరాజులను  కీర్తించాడు .ఇందులోని రెండవ కావ్యం లో పదిహేను కాండాలలో సురత రాజును ,అతని చైత్ర వంశాన్ని ,వర్ణించాడు ఇందులోని హిమాలయ వర్ణన అసదృశం..’’ఉల్లాఘ రాఘవం ‘’లో శ్రీరామచరిత్రను నాటకీకరించాడు .పార్ధ పరాక్రమ కావ్యానికి యువ రాజు ప్రహ్లాదనుడు కవి అని సురతోత్సవం లో చెప్పాడు .రామ శతకం కూడా రాశాడు సోమ .కావ్యాదర్శ రాశాడు .కావ్య ప్రకాశ కు వ్యాఖ్య కూడా రాశాడు సోమేశ్వరుడు .

184- అమరచంద్రునిజంట కవి-  అరిసి౦హుడు

లావణ్య  సింహుని కొడుకైన అరి సింహుడు వస్తుపాల మంత్రి ఆశ్రితుడు .తక్కూరకు అధికారి .అమరచంద్రుడు సహ సాహిత్య జీవి .అమరచంద్రునికి సిద్ధ సరస్వతి మత్రాన్ని ఉపదేశించింది అరి సింహుడే .ఈ జంట కవులు ‘’కవి కల్ప లత’’సూత్రాలు కలిసి రాశారు .అరి సింహుడు ‘’కవితార హాసం ‘’రాశాడు .పదకొండు కాండాల’’సుకృత సంకీర్తన ‘’లో అరి వస్తుపాలుని మహోజ్వల చరిత్ర రాశాడు .మొదటి కాండం లో అనహిల్ల పట్టణం నిర్మించిన వన రాజును ,అతని చాపోత్కర వంశ రాజులను వర్ణించాడు .ఇది ఉదయ ప్రభ రాసిన సుకృత కల్లోలిని లాగానే ఉంటుంది .రెండవ కాండలో చాళుక్య రాజ్య మూల పురుషుడు మూల రాజు తో ప్రారంభించి రెండవ భీమ దేవుదు వస్తుపాల, తేజపాలల   దాకా రాశాడు .మిగిలిన కాండలలో వస్తుపాలుని యాత్రలు దాన ధర్మాలు వివరించాడు .ప్రతికాండం చివర అమరసింహుడు తాను రాసిన నాలుగు శ్లోకాలను చేర్చాడు .మల్లినాధుడు నిర్మించిన గోడ లోని గూడు ను కూడా వర్ణించాడు .వీటికి ఆధారాలుగా మౌంట్ ఆబూలో శిలాశాసనాలున్నాయి .

185- ప్రబంధ చింతామణి కర్త -మేరుతంగ

మేరుతంగ రాసిన ‘’ప్రబంధ చింతామణి ‘’మహా గొప్పచారిత్రిక  కావ్యం .1306లో దీన్ని వాద్వాన్ లో వైశాఖ శుద్ద్ధ పౌర్ణమినాడు పూర్తీ చేశాడు .ఇందులో అయిదు ప్రకాశ లున్నాయి .ప్రతి ప్రకాశకు ప్రబందాలుంటాయి .ప్రతి ప్రబంధం లో ఒక కద ఉంటుంది .అదీ దీని నిర్మాణం .విక్రమశకానికి ఆద్యుడైన విక్రమాదిత్యుని కధతో కావ్యం ఆరంభమవుతుంది .తర్వాత శాతవాహనుని పూర్వజన్మ వృత్తాంతం ఉంది .ఆ తారవాత సుదీర్ఘంగాఅన్హిల్ విద్  చాళుక్య రాజుల చరిత్ర  భోజరాజు ముంజ రాజులతో వారి సంబంధం ఉంటాయి .పిమ్మట వాఘేల రాజు లావణ్య ప్రసాదు ,విరాధ వాల రాజు ల గురించి సుదీర్ఘ చరిత్ర రాశాడు కవి .ఇందులో వారిమంత్రులు వస్తుపాల తేజ పాల వ్రుత్తా౦తమూ చేర్చాడు .చివరి కాండ లో లక్ష్మణ సేన ,ఉమాపతి ,భర్తృహరి గురించి ఆసక్తికర విషయాలున్నాయి .మేరుతంగ రాసిన ‘’మహా పురుష చరిత్ర ‘’జైన మునుల చరిత్ర యే.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జైన గోదారి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్తమానమే జీవిత సౌభాగ్యం -92 ఏళ్ళశ్రీ కాళ్ళకూరి ఫణి పద్మనాభం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వర్సిటిపై ఉదాసీనత –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాపం పాపం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ మౌన చాణ క్యం -ఇండియాగేట్ కృష్ణారావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

panchangam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎన్టిఆర్ కృష్ణ విగ్రహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యూరోస్ కు గ్రీస్ ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం

సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంgodavari pushkara parichayam 1 001 gp2 001 gp3 001 gp4 001 gp5 001 gp6 001 gp7 001 gp8 001 gp9 001 gp10 001 gp11 001 gp12 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోదావరి పుష్కర శోభా యాత్ర –

గోదావరి పుష్కర శోభా యాత్ర –pushkara yatra 4 001 pushkara yatra1 001 pushkarayatra2 001 pushkarayatra3 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-177- వేణీ కృపాల -అమరచంద్ర కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

177- వేణీ కృపాల  -అమరచంద్ర కవి

అమరకవి లేక అమరచంద్ర కవి అన్హిల్ వద్ లోని వాగట నగరానికి చెందిన వాడు .జైన గురు సంప్రదాయానికి చెందిన వాడు .జినదత్త సూరి శిష్యుడు .సిద్ధ సరస్వతి మంత్రాన్ని ఉపాసించి ,సరస్వతీ దేవి కటాక్షం తో అశేష కవితా సామర్ధ్యం పొందాడు .గుజరాత్ రాజు విశాల దేవుడికి ఈ కవి సామర్ధ్యం తెలిసి తన రాజధాని ధవలక్కక కు ఆహ్వానించాడు .అక్కడ  సోమేశ్వర ,నానక మొదలైన  పండిత కవుల చేత కవిని పరీక్షింప జేశాడు .అమరుని కవితా ప్రాగాల్భ్యానికి వారందరూ ఆశ్చర్య పోయి గొప్పకవి అని ప్రకటించారు .రాజు ఘన సన్మానం చేశాడు .విరాధ వాల రాజు కొడుకు విశాల దేవుడు 1243-1262మధ్య లో పాలన చేశాడు .కనుక అమర చంద్రకవి పదమూడవ శతాబ్ది మధ్యలో ఉండి  ఉంటాడు .అమర కవి బాలభారతం లో  సూర్యోదయ వర్ణన పరమాద్భుతం గా చేశాడు .ఈ వర్ణన వలననే కవికి ‘’వేణీ కృపాల ‘’బిరుదు లభించింది .

అమర చంద్రుని ఇతర కృతులలో బాల భారతం ప్రసిద్ధి చెందింది .మహా భారత పర్వాలను అనుసరిస్తూ రాశాడు .ఉదాత్త కవిత్వం రాయటం వలన కావ్యాన్నికాళిదాసు  రఘు వంశం సరసన చేర్చారు .అలంకార శాస్త్ర గ్రంధం ‘’కావ్య కల్ప లత’’ను ఛందస్సుపై ‘’ఛందో రత్న వల్లి ‘’ముక్తావళి ‘’రాశాడు .సాకేతిక విషయ పరంగా ‘’కలాకలాపం ‘’పద్మానంద కావ్యం ‘’,లేక జినేంద్ర చరిత్ర కూడా చేశాడు .ఇందులో జినుని పుట్టుక నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .అమర చంద్రుడు తన స్నేహితుడి రచన ‘’కావ్య కల్ప లత’’ను పూర్తీ చేసి దానికి కి వ్యాఖ్యానంగా ‘’కవి శిక్షా వ్రుత్తి ‘’రచించాడు .

178-సరస్వతీ పుత్ర- వస్తుపాల రాజ కవి

ఆచరాజు ,కుమార దేవి ల కుమారుడే వస్తుపాలుడు .వీరు ప్రసిద్ధ పఠాన్ల వంశం వారు .ముత్తాత చందపుడు రాజ ప్రముఖులలో సూర్యుడు అని గుర్తింపు పొందాడు .ఆయనకు నలుగురు కొడుకులు .చండప్రసాద్ ,సూరా ,సోమ ,అశ్వ రాజు .పెద్ద వాడు రాజ ముద్రికకు అధికారి .రాజ్యం లో మిగిలిన ముగ్గురూ అత్యున్నత ప్రభుత్వాదికారులే .భార్య అభూ అనే సైన్యాధికారి కూతురు .అతను ధోకా రాజు వరద వాల కు  ముఖ్య మంత్రి .. అతని శక్తి సామర్ధ్యాలు అపూర్వం ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి దక్కన్ ,లతా గోద్రా రాజుల దండయాత్రలను సమర్ధంగా ఎదుర్కొని రాజ్యాన్ని రక్షించాడు .1221చిరస్మరణీయ మౌంట్ ఆబూ యాత్ర చేశాడు .అక్కడ దేవాలయాలకు భూరి దానాలు చేశాడు అవి శిలాఫలకాలపై కనిపిస్తాయి .అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది .1242లో చనిపోయాడు .సోమేశ్వర కవి తన ‘’కీర్తి కౌముది ‘’లో వస్తుపాల గుణగణాలను దాతృత్వాన్ని భక్తిని  శీల సంపదను విశేషంగా వర్ణించాడు ..

వస్తుపాలుడు స్వయంగా కవి .ఇతరకవుల ప్రతిభను మెచ్చాడు .సోమేశ్వరునిపై అసూయ ఉన్నా హరిహర కవిని ఆదరించాడు .మూడు గొప్ప గ్రంధాలయాలను స్థాపించాడు .విలువైన వ్రాత ప్రతులను సేకరించి వాటిలో భద్ర పరచాడు .నరచంద్ర సూరి రాసిన ‘’కదా రత్న సాగరం ‘’ను ప్రోత్సహించాడు .నరేంద్ర ప్రభుని ‘’అలంకార మహోదధి ‘’ని కూడా సమాదరించాడు .దీని వలన విలువైన సాహిత్యం వచ్చింది .వస్తుపాలుని జ్ఞానం అసాధారణ మైనది ‘’సరస్వతీ పుత్రుడు ‘’అనే బిరుదు పొందాడు .’’కవి కున్జర’’’’ కవి చక్రవర్తి’’ ఇతర బిరుదులు .కవి జనాశ్రయం తో దర్బారు సరస్వతీ సామ్రాజ్యం అని పించేది .అందుకే వస్తుపాలుని ‘’లఘు భోజుడు ‘’అని కీర్తించారు .అతని ఆస్థానం లో ఉద్దండకవులు సోమేశ్వర ,అరిసింహ ,నానక మొదలైన వారుండేవారు .

వస్తుపాలుడు రాసిన ‘’నర నారాయణా నంద ‘’కావ్యం పదహారు కాండలు కలది.నర నారాయణ స్వరూపులైన అర్జున శ్రీ కృష్ణుల దివ్య చరిత్ర ఇందులో రాశాడు .గిర్నార్  అడవులలో వారిద్దరి సంచారం ,సుభద్రను అర్జునుడు ఎత్తుకు వెళ్లి వివాహం చేసుకోవటం మొదలైన కధలున్నాయి .ఉత్ప్రేక్షకు వైభవంతెచ్చి ఆ వర్ణనలతో కావ్య పరిపుష్టి కలిగించాడు .శిశుపాల వధ ను అనుసరించి రాశాడు .కదా కధనం లో అనేక సూక్తులు చెప్పాడు వస్తుపాలుడు .వాటినన్నిటిని సేకరించి ఒక పుస్తకం గా ప్రచురించారు .జల్హణుని ‘’సూక్తి ముక్తావళి’’ లో ఇందులోనివి చాలా భాగం చోటు చేసుకొన్నాయి .అతని ‘’ఈశ్వర మనోరధ మయ  స్తోత్రం ‘’భక్తికి, ఆధ్యాత్మికతకు విశిస్ట మైనదిగా గుర్తింపు పొందింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-15 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు

గుజరాత్ పాలకుడు సిద్ధ రాజ జయ సింహ చేత  కవి రాజు ,కవి చక్ర వర్తి బిరుదులు పొందిన  శ్రీపాల కవి ప్రాగ్వత కుటుంబానికి చెందిన లక్ష్మణుని కుమారుడు .అన్హిల్ విద్ లో1095-1154 లో జీవించాడు . కవి గుడ్డివాడు అంటే ఆశ్చర్య పోతాం .కవికి ముప్ఫై ఏళ్ళ వయసులో శ్వేతాంబర ,దిగంబర జైనుల మధ్య పెద్ద తగాదా వచ్చింది .విస్తృత జైన సమ్మేళనం నిర్వహించారు .కర్నాటక రాజు కుముదచంద్ర దిగంబర జైన పాక్షం వహించాడు .గుజరాత్ కు చెందిన దేవాచార్యుడు శ్వేతాంబర జైన పక్షం వహించి చర్చలు వాదోపవాదాలు జరిపారు .ఈచర్చోప చర్చలలో శ్రీపాల కవి ప్రముఖ పాత్ర పోషించాడు .యశశ్చంద్రుడు దీనిని ‘ముదిత కుముద చంద్ర ‘’గ్రంధం లో పేర్కొన్నాడు ..అతడు ‘’వై రోచన పరాజయం ‘’కూడా రాశాడు .అతడు రాసిన అనేక ప్రశస్తి లు జైన ప్రాచీన లేఖ మాలలో కనిపిస్తాయి .

శ్రీ పాలుని కొడుకు సిద్ధ పాలుడు కూడా గోప్పకవే .1199వాడు .ఇతనికొడుకు విజయపాలుడు ప్రసిద్ధ కవి అని సోమప్రభ సూరి తెలియ జేశాడు .రాజా కుమారపాల ఇతని ముఖ్య స్నేహితుడు .అతని పోషక రాజు సిద్ధ రాజ భీమ సేనుడు చాళుక్య రాజు 1109-1241కాలం వాడు .రాజు గారి కోరిక పై ‘’ద్రౌపదీ స్వయం వరం ‘’అనే రెండు అంకాల నాటకం రాశాడు .విజయ పాల కవి 1244వరకు జీవించాడు .

169-సూరి వంశ చరిత్ర రాసిన -ముని రత్న సూరి

చంద్రా గచ్చకు చెందిన సముద్ర ఘోషుని శిష్యుడు ముని రత్న సూరి .ఇతని శిష్యుడు జయ సింహుడు  గురువు గారిపై ప్రశస్తి రాశాడు ..’’అమమాస్వామి చరిత్ర ‘’ను చాళుక్య  వంశానికి చెందిన వారాహి రాజు శ్రీమాల కుల రాజస్తాన కోశాధికారి  యశోద వాల కుమారుడు జగద్దేవుడు రాయమని కోరితే రాశాడు .అప్పటికే గొప్ప కవి అని పించుకొన్నాడు దారానగరరాజు నరవర్మ ఆస్థానం లో ముప్ఫై కాండాలలో’’ అమామ స్వామి’’ జీవిత చరిత్రను మధుర మనోహరం గ రాశాడు పాట్నాలో ఈ రచన చేశాడు .1252శాంతి నాద ఆలయం లో చదివి వినిపించాడు ఇందులో పురాణ పాల ,యశపాల ,మన పాల ,మహానాద లను కీర్తించాడు .మరో గ్రంధం ‘మునీశ వర చరిత్ర ‘’ను ఇరవై మూడు కాండాలలో రాసి అందులో తన సూరి వంశానికి చెంది నప్రసిద్దుల జీవితాలను వర్ణించాడు .

170-వాది సింహ బిరుదాంకితుడు –అభయ దేవుడు

జైన సన్యాసి అభయ దేవుడు విజయ చంద్రుని శిష్యుడు .దేవా భద్రుని కొడుకు .జిన శేఖర సూరికి నాలుగ వ తరం వాడు . అభయ దేవుడు సర్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు .వాదోప వాదాలలో మహా నిష్ణాతుడు .అందుకే ‘’వాదిసింహ ‘’బిరుదంను కాశీ రాజు నుండి  పొందాడు .అభయుని వలననే’’ రుద్ర పతిజ గచ్చ’’మహా ప్రాభవం పొందింది .ఈ కవి రాసిన ‘’జయంత  విజయం ‘’, పందొమ్మిది కాండాల కావ్యం .1222లో దీన్ని  రాశాడు .జయంతు ని జీవిత చరిత్ర ఇది .ఇందులో సూర్యోదయ సూర్యాస్తామయాలను ఋతువులను ,క్రీడలు , ,జైత్ర యాత్రలు విస్తారంగా వర్ణించాడు .

171- చంద్ర ప్రభ చరిత్ర కర్త -వీరనంది కవి

ఈ కవి గురించి పెద్దగా వివరాలు తెలియ లేదు. కాని ఈ కవి రాసిన ‘’చంద్ర ప్రభ  చరిత్ర’’  పద్దెనిమిది కాండాలలోరాజు కనక ప్రభ ను ,జైన తీర్ధంకరుడైన  చంద్రప్రభను వర్ణించాడు .చివరి కాండలో జైన సిద్ధాంతాలను ఆచరణ విధానాలను చెప్పాడు. చివర్లో  ఇంద్రుని అవతారమే జినుడు అని తెలిపాడు .వీరనందికవి పదమూడవ శతాబ్ది ఉత్తరార్ధం లో ఉండి ఉంటాడు .

172-‘’ సంకేత’’ వ్యాఖ్య కారుడు[[ మాణిక్య చంద్ర

సాగారెంద్రుని శిష్యుడైన మాణిక్య చంద్ర లేక మాణిక్య సూరి రాజాగచ్చ కు చెందిన వాడు .కావ్య ప్రకాశ కు రాసిన వ్యాఖ్య ‘’సంకేత ‘’లో తన వంశ చర్తిత్ర చెప్పుకొన్నాడు .పార్శ్వనాధ చరిత్ర ,శాంతినాద చరిత్ర కూడా రాశాడు 1220కాలం వాడు .

173-దసశ్రావక చరిత్ర కర్త-పూర్ణ భద్రుడు

జినపతి శిష్యుడైన పూర్ణ భద్రుడు ప్రహ్లాదన పురం వాడు .రాసిన గ్రందాలు  ‘’దసశ్రావక చరిత్ర ‘’.ధన్య శాలి భద్ర చరిత్ర ‘’’’కృత పుణ్య చరిత్ర ‘’ ‘,అతి ముక్తా చరిత్ర ‘’

174-ముని సువ్రత చరిత్ర కారుడు –పద్మ ప్రభ

విబుధ ప్రభ శిష్యుడైన పద్మ ప్రభుడు ‘’ముని సువ్రత చరిత్ర ‘’,’’కుంతు నాద చరితా చరిత్ర ‘’రాశాడు పదమూడవ శతాబ్ది తొలి కాలం వాడు .

175-ప్రత్యక బుద్ధ చరిత్ర రాసిన – లక్ష్మీ  తిలక

జిన రత్న శిష్యుడు లక్ష్మీ తిలక ‘’ప్రత్యక బుద్ధ చరిత్ర ‘’ను పది హేడు కాండాలలో రాశాడు .ఇందులో నలుగురు జైన స్వామిలైన కరకందు,ద్విముఖ , నమి ,నగ్గాతి లను వర్ణించాడు .1255రచన ఇది .

176-పృథ్వి చంద్ర చరిత్ర కారుడు –ముని దేవ సూరి ,సత్య రాజ

పృథ్వి చంద్ర చరిత్ర ,శాంతినాద చరిత్రలు రాసిన ముని దేవ సూరి సత్య రాజు లు  1383ప్రాంతం వారు . 1200లో ప్రాకృత భాషలో దేవ చంద్ర ,శాంతి శ్రీలు రాసిన వాటినే వీళ్ళు సంస్కృతం లో అదే పేర్లతో రాశారు .

సశేషం

మీ-గబ్బిటడుర్గా ప్రసాద్ -7-7-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి (శ్రీ పీఠం) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర గోదావరీ పుష్కరాల లో (జూలై 14 నుంచి 26, 2015) వరకూ ఐదు లక్షల మంది యాత్రీకులకి అన్నదాన కార్యక్రమం

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి (శ్రీ పీఠం) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో

పవిత్ర గోదావరీ పుష్కరాల లో (జూలై 14 నుంచి 26, 2015) వరకూ

ఐదు లక్షల మంది యాత్రీకులకి అన్నదాన కార్యక్రమం

అమెరికా, భారత దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తుల విరాళాలకి విన్నపం

(Last Date to receive tax-deductible donations in USA: July 20, 2015)

2003 నాటి అనుభవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుండి జరుగుతున్న పవిత్ర గోదావరి పుష్కరాలలో కూడా 5 లక్షల మంది భక్తులకి (రోజుకి 45 వేల చొప్పున పన్నెండు రోజులు పాటు) ఉచిత అన్నదానం కార్యక్రమానికి పూజ్య పరిపూర్ణానంద స్వామి సంకల్పించారు. అత్యంత పరిశుభ్రమైన, పవిత్ర వాతావరణలో పౌష్టిక పదార్థాలతో త్వరిత పంపిణీ కోసం భోజనం పొట్లాలు తయారు చేసే సమగ్ర పథకం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాజమండ్రి (ఆంధ్ర ప్రదేశ్), ధర్మపురి (తెలంగాణా) లలో జరిగే ఈ అత్యవసర అన్నదాన కార్యక్రమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తున్నాయి.

కేవలం 12 సంవత్సరాలకి ఒక సారి మాత్రమే లభించే ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమానికి అమెరికా దాతల ఆర్ధిక సహకారాన్ని అర్థిస్తున్నాం. ఇటు అమెరికాలోనూ, అటు భారత దేశం లోనూ విరాళాలకి పూర్తి పన్ను రాయితీ లభిస్తుంది.

Suggested Donation Categories

Donors contributing from Rs. 10,000 (About US$150) to Rs. One Lakh (About US$1500) receive specific services during Pushkaraalu as suggested by Pujyasri Paripunranada Swami garu. Please see complete details in the attached documents.

How to Donate in USA

(All currencies worldwide including India are accepetd. All donations in USA are tax deductible. Tax ID 76-0444238)

  1. On-Line with any credit card.

 

Click or cut & paste the following link in the URL and follow prompts.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=A7538EZX97EH8

or    log onto:

 

 www.vangurifoundation.blogspot.com

click on DONATE button on right and follow prompts.
Enter the purpose of Donation as “GODAVARI PUSHKARALU ANNADANAM”:

 

  1. By Check payable to Vanguri Foundation of America, Inc., 

     write in Memo section:  Godavari Pushkaralu -2015

    Mail to:

Vanguri Foundation of America, Inc.

P.O. Box 1948

Stafford, TX 77497

How to Donate in India

Please see attached detailed Appeal with account details.

Last Date to receive tax-deductible donations in USA: July 20, 2015

For more information

Shankar Planjery

Phone: 630 297 4610, E-mail: planjerys@gmail.com

or

Vanguri Chitten Raju

Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 -167- ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

167-   ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

ఇప్పటి వరకు  ఏడర్దాలకావ్యం వరకే పరిమితమైన సంస్కృత సాహిత్యం లో శతపత్రం లాగా శాతాదికార్ధ కావ్యం ప్రభ వించింది. కర్త సోమప్రభా చార్య కీర్తి దశ దిశలా దాని పరిమళం లా వ్యాపించింది .ఒకే శ్లోకానికి వంద అర్ధాలు  వచ్చేట్లు రాసిన కవిత్వం ఇది .న భూతో అని పించింది .ఈ  కావ్యం తో ఆయనకు ‘’శాతార్ధిక ‘’బిరుదు లభించింది .సుమారుగా 1177లో దీనిని రాశాడు .ఉపోద్ఘాతం లో అయిదు శ్లోకాలు రాశాడు .అందులో సూచికలో తాను భావించిన వంద అర్ధాలను వివరించాడు .మొదట ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల ను ,తర్వాత  వైదిక  దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వర నారద మొదలైన వారి  విషయాలను ,చివరలో తన సమకాలీన కవులైన వాది దేవ సూరి ,హేమచంద్రాచార్య ,లను వారితో బాటు జైనమత  పోషక రాజులైన   జయ సింహ దేవా ,కుమారపాల ,అజయ దేవ ,మూల రాజ , గుజరాత్ ను పాలించిన చాళుక్య రాజులను  సిద్ధిపాల అనే  గౌరవ నీయ కవి ,పౌరుడిని ,ధర్మాచార్యులైన అనిత దేవ ,విజయ సింహులను గురించి చెప్పాడు .కావ్యం చివరలో అయిదు శ్లోకాలలో ప్రశస్తి రాసి అందులో తన గురించి శిష్యులు కీర్తించిన విషయాలను చేర్చాడు .సోమ ప్రభాచార్యుడు ‘’శృంగార వైరాగ్య తరంగిణి ‘ అనే నీతి కావ్యం ’రాశాడు  .

ఇలా అనేకార్ధ కావ్యం ఆవిర్భవించింది సోమప్రభా చార్య కవితా ప్రభ వలన .ఒక అజ్ఞాత కవి ‘’నల హరిశ్చంద్ర ‘’కావ్యం రాశాడు .శ్లోకం మొదటి నుంచి చదివితే నల చరిత్ర ,చివరి నంచి చదివితే హరిశ్చంద్ర చరిత్ర వస్తుంది .దీనికి కామెంటరీ కూడా జోడించాడు .హరదత్త కవి ‘’రాఘవ –నైషదీయం ;;రాశాడు .ఇది రామ, నల  కద.ఈ కవి గార్గ్య  గోత్రీకుడు .తండ్రి జయ శంకరుడు  .దీని వ్యాఖ్యానం లో భట్టోజి దీక్షితులను ,భట్తమల్ల ,కేశవ ,రామ కృష్ణ ,రభస యాదవ మొదలైన  నిఘంటు కారులను పేర్కొన్నాడు .  ఇది పద్దెనిమిదవ శతాబ్ది తొలి కాలపు రచన .

అనంతసూరి   రచన ‘’హరిశ్చంద్రోదయం ‘’ఇరవవై కా౦డాల ద్వ్యర్దికావ్యం  .ఇందులో ఒక హరిశ్చంద్రుడు పురాణ పురుషుడైతే రెండవ హరిశ్చంద్రుడు కవి గారి పోషక రాజు .

సూర్యకవి లేక సూర్య దాస లేక దైవ జ్ఞాన పండితుడు ‘’రామ –కృష్ణ విలోమ కావ్యం ‘’అనే ముప్ఫై ఎనిమిది కాండాలు గా రాశాడు .మొదటి నుంచి శ్లోకాన్ని చదివితే రామ పరామైన అర్ధం ,రెండవ చివర నుండి చదివితే కృష్ణ పరమైన అర్ధం వస్తుంది .కవి భరద్వాజ గోత్రీకుడు తండ్రి జ్ఞానాది రాజు .పార్ధ పురం లో ఉండేవాడు .దేవగిరి రాజు రామ ఆస్థానం లో రామ కవి ఉండేవాడు .ఈ కవి ఖగోళ విజ్ఞాని .1539లో ‘’సూర్య ప్రకాశ ‘’రాశాడు .లీలావతి గ్రంధం  పై1542లో  విమర్శ రాశాడు .అతడు అయిదు కాండాలలోరాసిన ‘’నృసింహ చంపువు ;’’’బాల బోధిక ‘’వ్యాఖ్య ,దేవేశ్వరుని ‘’కవికల్పలత ‘’లభిస్తున్నాయి .

కృష్ణ మూర్తి అనే మేధావి ,కవి ‘’కంకణబంధ రామాయణం ‘’అనే ముప్ఫై రెండు అక్షరాల ఏకశ్లోకం రాశాడు .ఇది చేతిగాజు లాగా గుండ్రం గా ఉంటుంది కనుక కంకణం అనే పేరొచ్చింది .ఎడమ వైపు నుంచి మొదలు పెట్టి చదివినా కుడి నుంచి ఎడమకు చదివినా ,లేక ఏ అక్షరంనుంచి మొదలు పెట్టి చదివినా అరవై రెండు శ్లోకాలు వచ్చేట్లు రాసిన ఏక శ్లోక కావ్యం .కవి తల్లి గౌరీ తండ్రి సర్వజ్ఞుడు.వసిస్టగోత్రం .సర్కారు జిల్లాల వాడై ఉంటాడని ,పందొమ్మిదవ శతాబ్ది కవి అని తెలుస్తోంది .

ఇదే రకమైన కంకణ బంధ ఏక శ్లోక కావ్యాన్ని మరింత వృద్ధి  చేసి శ్రీ చర్ల భాష్యకార శాస్త్రి రాశారు .ఈయన కృష్ణా జిల్లా కాకర పర్తి గ్రామ వాసి .కంకణ  బంధ రామాయణం లో వచ్చే ప్రతిశ్లోకానికి వచ్చే అర్ధ భావాలనుతెలియ జేస్తూ, సంయుక్తాక్షరాలను విడదీసి అందులోనుంచి 128 శ్లోకాలను విడమర్చి చూపించాడు .

ఈ విధంగా అనేకార్ధ కావ్యాలు వాటిలో చమక్కులు జిమ్మిక్కులు విపరీతం గా పెరిగి పోయి సాహిత్యం ఒక సర్కస్ కింద మారింది .బుద్ధికి పదును పెట్టి౦ది కాని మనసుకు హృదయానికి స్థానం లేకుండా పోయింది .దీనికి తగిన సాహిత్య వైద్యం చేసే కవి ఆవిర్భ వించాల్సిన  అవసరం కలిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాంస్కృతిక యుద్ధ స్వరం విమలక్క -మరియు సినారేకవిత



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషను నిరంతర సాధన చేయండి -తానా లో జస్టిస్ రమణ ,మంత్రి వెంకయ్యనాయుడు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment