గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు
గుజరాత్ పాలకుడు సిద్ధ రాజ జయ సింహ చేత కవి రాజు ,కవి చక్ర వర్తి బిరుదులు పొందిన శ్రీపాల కవి ప్రాగ్వత కుటుంబానికి చెందిన లక్ష్మణుని కుమారుడు .అన్హిల్ విద్ లో1095-1154 లో జీవించాడు . కవి గుడ్డివాడు అంటే ఆశ్చర్య పోతాం .కవికి ముప్ఫై ఏళ్ళ వయసులో శ్వేతాంబర ,దిగంబర జైనుల మధ్య పెద్ద తగాదా వచ్చింది .విస్తృత జైన సమ్మేళనం నిర్వహించారు .కర్నాటక రాజు కుముదచంద్ర దిగంబర జైన పాక్షం వహించాడు .గుజరాత్ కు చెందిన దేవాచార్యుడు శ్వేతాంబర జైన పక్షం వహించి చర్చలు వాదోపవాదాలు జరిపారు .ఈచర్చోప చర్చలలో శ్రీపాల కవి ప్రముఖ పాత్ర పోషించాడు .యశశ్చంద్రుడు దీనిని ‘ముదిత కుముద చంద్ర ‘’గ్రంధం లో పేర్కొన్నాడు ..అతడు ‘’వై రోచన పరాజయం ‘’కూడా రాశాడు .అతడు రాసిన అనేక ప్రశస్తి లు జైన ప్రాచీన లేఖ మాలలో కనిపిస్తాయి .
శ్రీ పాలుని కొడుకు సిద్ధ పాలుడు కూడా గోప్పకవే .1199వాడు .ఇతనికొడుకు విజయపాలుడు ప్రసిద్ధ కవి అని సోమప్రభ సూరి తెలియ జేశాడు .రాజా కుమారపాల ఇతని ముఖ్య స్నేహితుడు .అతని పోషక రాజు సిద్ధ రాజ భీమ సేనుడు చాళుక్య రాజు 1109-1241కాలం వాడు .రాజు గారి కోరిక పై ‘’ద్రౌపదీ స్వయం వరం ‘’అనే రెండు అంకాల నాటకం రాశాడు .విజయ పాల కవి 1244వరకు జీవించాడు .
169-సూరి వంశ చరిత్ర రాసిన -ముని రత్న సూరి
చంద్రా గచ్చకు చెందిన సముద్ర ఘోషుని శిష్యుడు ముని రత్న సూరి .ఇతని శిష్యుడు జయ సింహుడు గురువు గారిపై ప్రశస్తి రాశాడు ..’’అమమాస్వామి చరిత్ర ‘’ను చాళుక్య వంశానికి చెందిన వారాహి రాజు శ్రీమాల కుల రాజస్తాన కోశాధికారి యశోద వాల కుమారుడు జగద్దేవుడు రాయమని కోరితే రాశాడు .అప్పటికే గొప్ప కవి అని పించుకొన్నాడు దారానగరరాజు నరవర్మ ఆస్థానం లో ముప్ఫై కాండాలలో’’ అమామ స్వామి’’ జీవిత చరిత్రను మధుర మనోహరం గ రాశాడు పాట్నాలో ఈ రచన చేశాడు .1252శాంతి నాద ఆలయం లో చదివి వినిపించాడు ఇందులో పురాణ పాల ,యశపాల ,మన పాల ,మహానాద లను కీర్తించాడు .మరో గ్రంధం ‘మునీశ వర చరిత్ర ‘’ను ఇరవై మూడు కాండాలలో రాసి అందులో తన సూరి వంశానికి చెంది నప్రసిద్దుల జీవితాలను వర్ణించాడు .
170-వాది సింహ బిరుదాంకితుడు –అభయ దేవుడు
జైన సన్యాసి అభయ దేవుడు విజయ చంద్రుని శిష్యుడు .దేవా భద్రుని కొడుకు .జిన శేఖర సూరికి నాలుగ వ తరం వాడు . అభయ దేవుడు సర్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు .వాదోప వాదాలలో మహా నిష్ణాతుడు .అందుకే ‘’వాదిసింహ ‘’బిరుదంను కాశీ రాజు నుండి పొందాడు .అభయుని వలననే’’ రుద్ర పతిజ గచ్చ’’మహా ప్రాభవం పొందింది .ఈ కవి రాసిన ‘’జయంత విజయం ‘’, పందొమ్మిది కాండాల కావ్యం .1222లో దీన్ని రాశాడు .జయంతు ని జీవిత చరిత్ర ఇది .ఇందులో సూర్యోదయ సూర్యాస్తామయాలను ఋతువులను ,క్రీడలు , ,జైత్ర యాత్రలు విస్తారంగా వర్ణించాడు .
171- చంద్ర ప్రభ చరిత్ర కర్త -వీరనంది కవి
ఈ కవి గురించి పెద్దగా వివరాలు తెలియ లేదు. కాని ఈ కవి రాసిన ‘’చంద్ర ప్రభ చరిత్ర’’ పద్దెనిమిది కాండాలలోరాజు కనక ప్రభ ను ,జైన తీర్ధంకరుడైన చంద్రప్రభను వర్ణించాడు .చివరి కాండలో జైన సిద్ధాంతాలను ఆచరణ విధానాలను చెప్పాడు. చివర్లో ఇంద్రుని అవతారమే జినుడు అని తెలిపాడు .వీరనందికవి పదమూడవ శతాబ్ది ఉత్తరార్ధం లో ఉండి ఉంటాడు .
172-‘’ సంకేత’’ వ్యాఖ్య కారుడు[[ మాణిక్య చంద్ర
సాగారెంద్రుని శిష్యుడైన మాణిక్య చంద్ర లేక మాణిక్య సూరి రాజాగచ్చ కు చెందిన వాడు .కావ్య ప్రకాశ కు రాసిన వ్యాఖ్య ‘’సంకేత ‘’లో తన వంశ చర్తిత్ర చెప్పుకొన్నాడు .పార్శ్వనాధ చరిత్ర ,శాంతినాద చరిత్ర కూడా రాశాడు 1220కాలం వాడు .
173-దసశ్రావక చరిత్ర కర్త-పూర్ణ భద్రుడు
జినపతి శిష్యుడైన పూర్ణ భద్రుడు ప్రహ్లాదన పురం వాడు .రాసిన గ్రందాలు ‘’దసశ్రావక చరిత్ర ‘’.ధన్య శాలి భద్ర చరిత్ర ‘’’’కృత పుణ్య చరిత్ర ‘’ ‘,అతి ముక్తా చరిత్ర ‘’
174-ముని సువ్రత చరిత్ర కారుడు –పద్మ ప్రభ
విబుధ ప్రభ శిష్యుడైన పద్మ ప్రభుడు ‘’ముని సువ్రత చరిత్ర ‘’,’’కుంతు నాద చరితా చరిత్ర ‘’రాశాడు పదమూడవ శతాబ్ది తొలి కాలం వాడు .
175-ప్రత్యక బుద్ధ చరిత్ర రాసిన – లక్ష్మీ తిలక
జిన రత్న శిష్యుడు లక్ష్మీ తిలక ‘’ప్రత్యక బుద్ధ చరిత్ర ‘’ను పది హేడు కాండాలలో రాశాడు .ఇందులో నలుగురు జైన స్వామిలైన కరకందు,ద్విముఖ , నమి ,నగ్గాతి లను వర్ణించాడు .1255రచన ఇది .
176-పృథ్వి చంద్ర చరిత్ర కారుడు –ముని దేవ సూరి ,సత్య రాజ
పృథ్వి చంద్ర చరిత్ర ,శాంతినాద చరిత్రలు రాసిన ముని దేవ సూరి సత్య రాజు లు 1383ప్రాంతం వారు . 1200లో ప్రాకృత భాషలో దేవ చంద్ర ,శాంతి శ్రీలు రాసిన వాటినే వీళ్ళు సంస్కృతం లో అదే పేర్లతో రాశారు .
సశేషం
మీ-గబ్బిటడుర్గా ప్రసాద్ -7-7-15-ఉయ్యూరు
