సంగీత సింగీతం

సంగీత సింగీతం

ఆరుతక్కువ వందేళ్ళ వయసులో మెగాఫోన్ పట్టి 49ఏళ్ళక్రిందటి ఆలోచనలను 29ఏళ్ళ బాలాకుమారుడిగా ‘’వీల్చైర్ పర్సన్ ‘’సింగీతం శ్రీనివాసరావు అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ కు కనులవిందు సినిమా తీసిపెట్టాడు .రాజేంద్రప్రసాద్ రమ్యకృష్ణ ల ‘’బృందావనం ‘’మూవీ మరచిపోలేనిది .నిత్య నూతనం .సింగీతం గారిని రావి కొండలరావు దంపతులు ,లవకుశ నాగరాజు ,సుహాసిని ,అనితాచౌదరి మొదలైన వారిని రామోజీ ఫిలిం సిటి లో ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ లో మేమూ పాల్గొని రోజూ చూసేవాళ్ళం .మా మనవడు హర్ష ‘’చిన్న బన్నీ’’ రోల్ ప్లే చేశాడు  . గుణశేఖర్ డైరెక్టర్ .మణిశర్మ మ్యూజిక్ .బాంబే అమ్మాయి హీరోయిన్ .అల్లుఅర్జున్ చాలా ఎనేర్జిటిక్ గా నటించేవాడు, డాన్స్ చేసేవాడు .పాటలు వేటూరి .రోజుమమ్మల్ని కార్లు మీద షూటింగ్ కు తీసుకు వెళ్లి రాజభోగాలతో మాంచి కాఫీటిఫిన్ భోజనాలతో సాయంత్రం స్పెషల్ స్నాక్స్ తో మెక్కించి, ఆ=షూటింగ్ అవగానే మళ్ళీ కారులో మా అబ్బాయి శర్మ ఇంటికి రవాణా చేసేవారు .పైన చెప్పిన నటులందరితో రోజూ మాట్లాడేవాళ్ళం. అనితా, సుహాసిని మాశ్రీమతిని వదిలేవారుకాదు ఫోటోలు తీసుకొనేవారు .నేనూ నాగరాజు చాల మాట్లాడుకొనే వాళ్ళం .అదొక పండగ .అందరికి సిల్కు పంచ లాల్చి ఉత్తరీయం ఆడవాళ్ళకు సిల్క్ చీర జాకెట్ వగైరా. అన్నీ ఫ్రీ .సినిమా అట్టర్ ఫ్లాప్ .

ఒకప్పుడు కళాతపస్వి విశ్వనాథ్ కళా కృష్ణ హీరోగా ‘’సిరిమువ్వల సింగినాదం ‘’అనే సినిమా మొదలుపెట్తాడు కానీ విడుదలకాలేదు .అదొక్కటే ఆయన ప్లాన్ ఫ్లాప్ . సింగీతం మాత్రం రొటీన్ కుభిన్నంగా సింగ్ గీతం తీశాడు .అంటే పాట పాడరా బేటాఅని అర్ధం కూడా.సింగీతం సంగీతం అనికూడా అనుకోవచ్చు .నాకు ఎందుకో నచ్చని దేవిశ్రీ ప్రసాద్  సంగీత సరిగమలు ఇందులో వీనులవిందు చేస్తాయి .మాటపాటఅయినపుడు మనసు విచ్చుకొంటుంది .భావాలు పురివిప్పి నాట్యమాడుతాయి .అదొక దివ్య లోకమే అవుతుంది .అనుభవి౦చెవాడికి అనుభవించినంత .  ఆనందోబ్రహ్మ అంటే ఏమిటో తెలుస్తుంది .

  ఊరంతా బంగారమే అయిన ఒకపల్లెటూరి లో ఒకమ్మాయి, తండ్రీ మైనింగ్ తో ప్రయత్నిస్తారు.దీన్ని విదేశీయుడికి కట్టబెట్టే దురాలోచన వారిది .వారసత్వంగా తనకొచ్చిన భూములున్నాయనిఅందులో బంగారం గనులున్నాయని  తెలుసుకొన్న హీరో ఆ వూరువచ్చి ,ఆ అమ్మాతో చేతులుకలిపి.దోచుకోవటానికి అక్కడున్న చివరి చెట్టు ను కూడా నరికేస్తారు .ఆ చెట్టు తల్లిలాంటిది అని హీరోయిన్ అడ్డు తగిలినా వినరు .ఆగ్రామ దేవత కుబేరుడికి కోపం వచ్చి ప్రజలనోటినుంచి మాట రాకుండా పాటమాత్రమె  వచ్చేట్లు శపిస్తాడు.రాజేంద్రప్రసాద్ సినిమాలో లాగా నిజాలు మాత్రమె బయటికొస్తాయి .ఈ నిజాలు ఎవరికొంప కొల్లేరు చేస్తాయి అన్నది వెండి తెరమీద చూసి తెలుసుకోవాలి .

 ఎమోషన్ ను పాటలో చెప్పించటం ఈ సినిమా ముఖ్యఉద్దేశం .దాన్ని సింగీతం సంగీతం లో బాగా చెప్పించాడు. తానూ నలభై  ఏళ్ళక్రితం కన్న కల కు కళా నిజరూపమిచ్చి సఫలం చేశాడు.హాట్స్ ఆఫ్ సింగీతం సార్ తాతగారు సారీ ముత్తాతగారు ,సారీ సినీ నిత్యనూతన బ్రహ్మగారూ .ఏమయ్యింది ఏమయ్యింది అనే సాంగ్ తో సింగీతం సినిమా మొదలెట్టినా ,ఆతర్వాత మాటలుకూడా పాటలుగా రావటం కొందరికి బోర్ బోరున్నర అనిపించవచ్చు .లాగ్ ఎక్కు వైంది అన్నమాట .దీన్ని సెకండ్ హాఫ్ లో కవర్ చేసి ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు దర్శకుడు ,పతాక సన్నివేశం లో మాంచి సంగీతం ఉర్రూతలూగించి కథకు గొప్ప ప్లస్ పాయింట్ అవుతుంది .

 చెట్టును తల్లిగా చూసుకొనే  గౌరిపాత్రలోః అహల్య ఒదిగిపోతే , ప్రతాప్ గా  అయాన్ , రేణుపాత్రలోషాలిని  అందరూకోత్తోళ్ళే అయినా అనుభవమున్నట్లే నటించారు  .అహల్య డైలాగ్ డెలివరి ఇబ్బందికరంగా ఉన్నట్లు మాత్రం అనిపించింది .మిగిలిన పాత్రధారులు పరిధిమేరకు నటించి విజయానికి సహకరించారు .ఊరు సెట్ అస్సలు బాగాలేదు .ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం ఆర్టిస్టిక్ గాలేదు ఆర్టి ఫిషియల్ గా ఉంది .మొత్తం మీద సినిమా ట్రెండ్ సెట్టింగ్ గా వినూత్నంగా ఉంది .కలెక్షన్లు కూడా బానే ఉన్నాయని అంటున్నారు .సంగీతం మీద ఆశతో తీసిన సింగీతం అదృష్ట౦ ఎలాఉందో ?

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-26-ఉయ్యూరు .   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.