బెంగళూర్ రౌండ్స్

                                          బెంగళూర్ రౌండ్స్
                      జూలై పన్నెండవ తేది మంగళ వారం బెంగళూర్ sight సీఇంగ్ కు మా అబ్బాయి శర్మ కర్నాటక tourismవాళ్ల బస్సు లో నేను వెళ్ళటానికి టికెట్ బుక్ చేశాడు .ఖరీదు 270 రూపాయలు
ఏ.సి.బస్ .ఇది మజేస్తిక్ లో కెనర బ్యాంకు ఏ.టి.ఏం .దగ్గర నుంచి బయల్దేరుతుంది .నేను శర్మ కార్ లో మున్నె కొలాల్ నుంచి మార్త హళ్లి వెళ్ళా.అక్కడ సిటీ బస్ లో majestic లో వున్న కెంపే గౌడ బస్సు స్టేషన్ కు వెళ్ళా.రిజర్వేషన్ టికెట్ వుంటే సిటిబస్ లో ఫ్రీ గా ప్రయాణం .ఉదయం ఏడున్నరకు మెజెస్టిక్  చేరా.బస్సు స్టాండ్ చాలా పరిశుభ్రం గా నిర్వహ్హిస్తున్నారు .నెంబర్ ను బట్టి బస్ ఆగే స్థలాలు వున్నాయి .మనం ప్రయాణం చేసే బస్సు నె౦బర్ తెలిస్తే బస్ ఎక్కడ ఆగుతుందో తేలిగ్గా తెలుసుకోవచ్చు .ఇక్కడ పోలీసులు కూడా చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పటం బాగుంది .సహాయం కావాలా అనే స్థితి లో ఇక్కడి జనం వుండటం ఆశ్చర్యమేస్తుంది .అక్కడే రాఘవేందర్ కాంటీన్ లో కాఫీ తాగాను .పది రూపాయలు .ఇంటి దగ్గరే ఇడ్లీ టిఫిన్ చేసి రెండు సార్లు కాఫీ తాగే బయల్దేరా.కోడలు ఇందిరా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా ఇచ్చింది,మంచినీళ్ళ బాటిల్ తో సహా .sight సీఇంగ్ ను వీళ్ళు బెంగళూర్ రౌండ్స్ అంటారు .దీనికి దగ్గరే సిటీ రైల్వే స్టేషన్ వుంది .ఈ మొత్తాన్ని కేమ్పగౌడ సర్కిల్ అంటారు ఇక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే బస్సులు కూడా వున్నాయి
                       బెంగళూర్ రౌండ్స్ బస్ ఎనిమిదిన్నరకు వచ్చింది .బస్ చాలా బాగా వుంది ఇందులో రెండు రకాల క్లాస్సేస్ వున్నాయి ముందుగా సీట్స్ వుంటే సిల్వర్ క్లాస్స్ .వెనక సీట్లు ఇంకొంచెం సదుపాయం గా వుంటాయి .ఇది గోల్డెన్ క్లాసు .చార్జీ లో తేడా కూడా వుంటుంది గోల్డెన్ చార్జి ఎక్కువ .బస్ లో సగం మందే నిండారు .ఇందులో మార్త హళ్లి నుంచి వచ్చిన తెలుగు ఫ్యామిలీ వుండటం కాలక్షేపానికి కలిసి వచ్చింది తొమ్మిది గంటల పడి నిముషాలకు బస్ బయల్దేరింది .guide  కూడా వున్నాడు .డ్రైవర్ కు guide కు తెలుగు బాగా నే వచ్చ్చు .     
                           ముందుగా ఇస్కాన్ వాళ్ల రాధ కృష్ణ గుడికి వెళ్లాం .ఇది మూడు అంతస్తులు గా కొండ మీద వుంది .ఎక్కాసికి అక్కడ చక్కని సూచనలు మనల్ని గమ్య స్థానానికి తేలిగ్గా చేరుస్తాయి .ఇది యాభై కోట్ల ప్రాజెక్ట్ .ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది .చాలా వైభవం తో ఉంటాడు స్వామి .ఆ పైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వుంది .ఆయనా వెండి వెలుగులతో మెరిసి పోతున్నాడు .ఆ పైన అసలు దేవాలయం వుంది .అదే శ్రీ రాధాకృష్ణ దేవాలయం .మూర్తులు మనోహరం గా వున్నాయి .గొప్ప అలంకరణ .పూలా హారాలు నిండుగా ,మెండుగా వుంది చూడటానికి రెండు కళ్ళు చాలవు .రాదా కృష్ణ ,కృష్ణ బలరామ దేవతా మూర్తులు దివ్యం గా వున్నాయి అనుక్షణం దివ్యనామ  హరేకృష్ణ సంకీర్తనం మానషిక ప్రశాంతినీ ,ఆనందాన్ని ఇస్తుంది .భక్తి తో కనులు అనుకోకుండా మూసుకు పోతాయి .అదొక దివ్య ధామం  దివ్యానుభూతి .తీర్ధం ఇస్తారు .దిగి వస్తూంటే ఇంకో చోట ప్రసాదం పెడతారు .చాలా రుచిగా వుంటుంది .అదే దారిలో కిందకు దిగి మళ్ళీ బస్ ఎక్కాం .
                అక్కడినుంచి గవి గంగాధర దేవాలయం కు ప్రయాణం మొదలు పెట్టాం .దారిలో గైడు  బెంగళూర్ విశేషాలు వివరించాడు .ఆ విషయాలు మీకు అందిస్తున్నాను .బెంగళూర్ కు అసలు పేరు బెంత కాలూర్  .అంటే ఉడకపెట్టిన పప్పు పల్లె దీనికి ఒక కధ వుంది. వీర భల్ల మహారాజు ఒక సారి ఈ ప్రాంతానికి అడవికి వేటకు వచ్చి దారి తప్పి ఒక ప్రాంతం చేరాడు .ఆకలి గా వుంది .తినటానికి ఎవరైనా ఏదైనా పెడతారేమోనని ఎదురు చూశాడు .అప్పుడు ఒక అవ్వ కన బడింది .ఆమెను అడిగాడు తినటానికి ఏదైనా పెట్టమని .ఆమె దగ్గర పచ్చి శెనగలున్నాయి .వాటిని ఉడికించి పెట్టింది .రాజు పరమానందం గా తిన్నాడు .మైసూర్ చేరి కధంతా మిగతా వారికి చెప్పాడు .ఆ వూరి పేరేమిటి అని వాళ్ళు అడిగితే బెంత కాలూర్  అన్నాడట పప్పులు తిన్నది జ్ఞాపకం చేసుకొని .
                    ఒకానొక కాలమ్ లో మైసూర్ మహారాజు తన సామంత రాజు ,సైన్యాధిపతి అయిన కెంపే గౌడ ను ఇప్పుడున్న బెంగళూర్ ప్రాంతం లో ఒక గ్రామాన్ని నిర్మించమని ఆదేశించాడట .ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న కెంపే గౌడ సర్కిల్ దగ్గర నుంచి నాలుగు వైపులకు నాలుగు ఎద్దులను వదిలాడట .అవి యెంత వరకు వెళ్లి ఆగి పోతాయో అంతవరకూ గ్రామాన్ని విస్తరింప జేయాలని నిర్ణయించుకొన్నాడు .ఆ ఎద్దులు ఒక్కొక్కటి బయలు దేరిన చోటు నుంచి నలభై కిలోమీటర్లు వెళ్లి ఆగి పోయాయి ..అంతవరకూ నాలుగు వైపులా హద్దులు ఏర్పరచి గ్రామాన్ని విస్తరించాడు .ఇప్పుడు ఈ నగరం పరిధి 180kilometers .కెంపెగౌడ కుమారుడు ఇమ్మిడి కేమ్పరాయలు నాలుగు వైపులా సరిహద్దుల దగ్గర ఎత్తైన గుట్టలపై గోపురాలు కట్టించాడు .నగరం అంతవరకూ విస్తరించింది .ఈ నగర నిర్మాణం కేమ్పెరాయలు మొదటగా  1535  లో మొదలు పెట్టాడు   గంగా ధర దేవాలయం లో శిలాశాశనం వుంది దీనిలో ఈ నగరానికి బెంగళూర్ అనే పేరు వున్నట్లు తెలిసింది .అందుకే బంగాలూర్ ,bengloor    అనే ఆంగ్లేయ పేర్లను తొలగించి శాసనం లో వున్న పేరునే ఇప్పుడు పెట్టారు .అదే బెంగళూర్ . ,
                        దారిలో గవి గంగాధర స్వామి గుడీ వుంది .ఇదిt త్రేతా  యుగం నాటి దేవాలయం .గౌతమ మహర్షిస్వామి ప్రతిష్ట చేసారని స్థల పురాణం లో వుంది .ఒక గుహలో ఉంటాడు శివుడు .గవి అంటె గుహ అని పేరు .నంది ముందు శివ లింగం వుంటుంది .దక్షిణ దిశగా ఉంటాడు దేవుడు .మకర సంక్రాంతి నాడు సాయంత్రం అయిదు గంటల పది నిముషాలకు సూర్యుని వెలుగు కిరణాలు నంది కొమ్ముల మీద పడి అక్కడి నుంచి శివలింగం మీద పడతాయి .ఆ సమయం  లో జనం విపరీతం వస్తారు చూడటానికి .టి.వి .లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి .ఇక్కడ ఒక సొరంగ మార్గం వుంది .గౌతమ మహర్షి ఇక్కడి ఈ గుహనుంచి కాశీ దాకా వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేసి వచ్చేవారట .ఇప్పుడు సొరంగ మార్గ ప్రవేశానికి అనుమతి లేదు .స్వామి దర్శనం చేసుకొని జన్మ చరితార్ధం చేసుకోన్నాము.ఇక్కడే వున్న శాసనం మీద బెంగళూర్ పేరు వుంది .
                            దీనికి దగ్గర లో దొడ్డ గణపతి దేవాలయం వుంది .దొడ్డ అంటె పెద్ద .విరాట్ స్వరూపుడు గా గణపతి దర్శనమిస్తాడు .ఈయన్నే గం గణపతి అంటారు .గణపతి దర్శనం సర్వ శుభ ప్రదం
                  దొడ్డ గణపతి ఆలయం దగ్గరే దొడ్డ నంది గుడి వుంది .దీనిని ఇక్కడి వాళ్ళునంది బుల్ టెంపుల్ అంటారు ..దీనికీ ఒక కధ వుంది .ఈ ప్రాంతం లో ఒక శివాలయం ఉండేదట .అందులో నంది రాత్రి పూట ఇక్కడి వేరుశనగ పంటను రాత్రి పూట గుడిలోంచి బయటకు వచ్చి తినేసేదట .ఆశ్చర్యం గా వుండేది రైతులకు .ఒక రోజూ అందరు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపలా కాశారు .దేవాలయం నుంచి ఒక ఎద్దు వచ్చి పంటను తినేయటం గమనించారు రైతులు .చేతిలోని బల్లెం తో దాన్ని కొట్టారు .కాలికి గాయమై,నెత్తురు ధార పాతం గ కారింది .ఎద్దు అదృశ్యమైంది .అంతే అప్పటినుంచి పంటలు అన్నీ నాశనం అయాయి కరువు కాటకాలతో జనం అలమటించారు .  ,నీటికి తిండికి నోచుకోలేదు .అప్పుడు ఒక మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారు .ఆయన కాళ్ళపై పడి ఈ సంక్షోభం నుంచి బయట పడేయమని వేడుకొన్నారు రైతులు .ఆయన దివ్య ద్రుష్టి తో అన్నీ తెలుసుకొని ,వారు గాయం చేసింది సామాన్యమైన ఎద్దుకు కాదని ,శివుని వాహన మైన నందీశ్వరునికీ నని ,ఆయన శాపం వల్లనే ఈ ఇబ్బందులని చెప్పాడు .తరుణోపాయం కోరారు వారు .అప్పుడు ముంఫలి అనే ఈ ప్రాంతం కొండ మీద నందీశ్వర విగ్రహం ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తే మళ్ళీ నంది అనుగ్రహం కలుగుతుందని హితవు చెప్పాడు .వాళ్ళు చాలా పెద్ద నందీశ్వర విగ్రహం చెక్కించి ,ప్రతిష్టించి ,నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ నందీశ్వరుని అనుగ్రహానికి పాత్రులయారు .అప్పటినుంచి పంటలు బాగా పండుతున్నాయి .కృతజ్ఞతా పూర్వకం గా కార్తీక మాసం చివరి శని వారం నాడు రైతులందరూ తమకు పండిన వేరుశనగ పంటనుతెచ్చి నందీశ్వరునికి నైవేద్యం పెట్టటం విశేషం .ఇదీ ఈ క్షేత్ర మహిమ .నంది చాలా పెద్దది .నల్లరాతితో సర్వాంగ సుందరం గా నిర్మింకాబడింది .శిల్పవైభావం అపూర్వం గా వుంది .లేపాక్షినంది ,యాగంటి నంది జ్ఞాపకం వస్తాయి .గంగాధర గుడీ  పక్కనే  సూపర్ స్టార్ రజని కాంత్ చదివిన elemntary స్కూల్ వుంది .దీన్ని ఫోటో తీశాను .
.శివ దర్శనానికి ముందు నంది దర్శనం చేయాలి .అసలు శివుని ముందు నంది ఎందుకు ?శివుడు అగిహోత్రుని వంటి వాడు .ఆయన తీక్షణాన్ని నంది తన ఉచ్చ్వాస నిస్స్వాశాలతో తగ్గిస్తుందట .
                         తరువాత టిప్పుసుల్తాన్ వేసవి విడిది చూశాం .అంతా చెక్కతో నిర్మించబడింది.’నాణ్యత కోసం వీటిని కావేరి నదిలో మూడు సంవత్చారాలు నాన బెట్టిన తర్వాతే వుపయోగించారట .ఈ భవననిర్మాణం హైదరాలి ప్రారంభించాడు .అతని కొడుకు టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు .రంగులు చెక్కు చెదర లేదు .టిప్పు బ్రిటిష్ వారినేదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మైసూర్ మహారాజు .బ్రిటిష్ వాళ్ల కుయుక్తుల వల్ల ఓడి పోయాడు .టిప్పు అంటె ఒక ధైర్యం ,ఒక విశ్వాసం ,ఒక సాహసం ..ఇందులో అతని చిత్ర పటం వుంది .దాని ముందు నుంచుని మనం ఎటు కదిలినా అతను ,మనవైపే చూస్తున్నట్లున్డటం విశేషం .అలాగే బ్రిటిష్ సైనికుడిపై కి ఉరికే పులిలాగా వుండే చిత్రం భయంకరంగా టిప్పు అంటె ఏమిటో చూపిస్తుంది .అందులో పులి టిప్పు నే .అతని జండా పై పులి బొమ్మ వుంటుంది
మిస్సైల్స్ కు ,ప్లాస్టిక్ సర్జెరీ కి టిప్పు రాజ్యం లో మంచి పేరుంది .ఇక్కడినుంచే అవి ఇతరదేశాలకు చేరాయట ..వేసవిలో టిప్పు ఇక్కడే మకాం ..
                       తర్వాత లాల్ baagh చేరాం .లంచ్ break  .నేను లోపలి వెళ్లి తెచ్చుకొన్న భోజనం చేశాను .మిగిలిన వాళ్ళు కామత్ హోటెల్ కు వెళ్ళారు .ఒకటవ నెంబర్ gate నుంచి లోపలి వెళ్లాం .పదిరూపాయలు టికెట్ .నేను టికెట్ లేకుండానే లోపలి వెళ్లాను .నన్నెవరు అడగ లేదు కూడా .నడిచి అంతా చూశా. పావురాయిలు బాగా వున్నాయి .వాటికీ ఆహారం వేస్తున్నారు యాత్రీకులు ..నెమ్మదిగా చూసుకొంటూ గుట్టమీద వున్న గోపురం చూశా .ఇట్లాంటివి ఇంకా మూడు ,మూడు వైపులా వున్నాయి .గ్లాస్స్ హుసే వుంది .ఫ్లవర్ క్లోక్ నేలమీద వుంది .నేను చూడ లేదు .రెండవ నెంబర్ gate కు చేరాలి అక్కడికి బస్ వస్తుంది రెండు గంటలకు ..baagh విస్తీర్ణం 240 ఎకరాలు .ఒక రోజూ లో చూడటం కుదరదు .నాలుగు వైపులా దారులున్నాయి .ఇది కేంగెల్ హనుమంతయ్య రోడ్ లో వుంది .ఆయన కర్నాటకకు రెండవ ముఖ్య మంత్రి ..
రెండు గంటలకు వచ్చిన బస్ లో కూర్చున్నాం .సిల్క్ పాలసు కు తీసుకు వెళ్ళాడు .నేను సిల్క్ పైజమా ,లాల్చి 350rs కు కొన్నా,.అక్కడినుంచి విధాన సౌధ ,చిన్నస్వామి క్రికెట్  స్టేడియం ,highcourt ,ఫీల్డ్ మార్షల్ మానెక్షా  పోలీసు పరదే గ్రౌండ్స్ ,కన్నడ రాజకుమార్ ఇళ్ళు ,రామకృష్ణ హెగ్డే , ఎద్యురప్ప ఇళ్ళు వగైరాలన్నీ బస్ నుంచే చూశాం ..ఇక్కడ అనిల్ కుంబ్లే సర్కిల్ ద్రావిడ్ రోడ్ అమితాబ్ సర్కిల్ ,ప్రముఖ violin , విద్వాంసుడు చౌడప్ప స్ట్రీట్ ,చూశాం .ఇక్కడి ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రముఖుల పేర వీధులు ,సెంటర్లు భవనాలు stadiumlu నిర్మించి వారికి ఘన నివాళు లర్పించటం ఆనందం గా వుంది .మన రాష్ట్రం లో రాజీవ్ ,ఇందిరా పేర్లు తప్ప ఇంకోటి పెట్టక పోవటం చరిత్ర క్షమించదు .సిగ్గుతో తల వంచుకోవాలి మనం . ఒక కవి పేర ఒక కళా కారునీ పేర మనం ఏమీ స్మారకాలు పెట్టటం లేదు .వున్నా  చాలా తక్కువే ..వీళ్ళను చూసి మనం నేర్చుకోవాలి ..రాహుల్ ద్రావిడ్ చదివిన సెయింట్ జోసెఫ్ కాలేజి  చూశాం .నూట యాభై ఏళ్ళ చరిత్ర గల కాట్టన్ హై స్కూల్ ,బ్రిగాదియర్ రోడ్ ,ఇమ్పెరియాల్ రోడ్ చూసాము .తర్వాత విశ్వేశ్వరయ్య సైన్సు ,టెక్నాలజీ మ్యూజియం దీని పక్కనే పురా వస్తు ముసియం లను చూసాం .రెండు చూడ తగినవి .పక్కనే కబ్బన్ పార్క్ .చూడలేదు .ఇక్కడ నుంచి మార్త హల్లికి సిటీ బస్ లో వెళ్లాను అక్కడినుంచి ఇంటికి ఆరు గంటలకు చేరా. రోజంతా సరదాగా ,గడిచింది  .ఇదే బెంగళూర్ రౌండ్స్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -07 -11 .–క్యాంపు—bengalur
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–4

వాల్ట్ విట్మన్ —–4
                      ఫ్రీ వెర్సె కు ఆద్యుడై ,తన ప్రయోగాలను విశ్వవ్యాప్తం చేసి ,ఎందరో ఆగామి యువకవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ,కష్టాల కడలి ఈదుతున్నా ,దుఖాల సుడిగుండం లో చిక్కు కున్నా ,చేతిలో చిల్లి గవ్వ నిలవ కున్నా ,చెయ్యి పెట్టిన ప్రతి చోటా విధి వక్రించినా వాల్ట్ విట్మన్ లోని కవితా జ్వాల ఆరలేదు .అను నిత్యం ప్రజ్వలిస్తూనే వుంది .కవితా లహరి ఆగలేదు ,నిత్య శ్రోతస్వినిలా పరుగిడుతూనే వుంది .ఎందరికో ప్రేరణ కల్గించాడు .కవిత్వాన్ని సామాన్యుడి ముందుకు తెచ్చి నిలిపాడు  .అసలైన జాతీయ అమెరికా కవిత్వాన్ని సృష్టించాడు .slang కు నీరాజనాలు ఇచ్చాడు .
               ఆనాటి ప్రముఖ గాయకుల౦దరితో మంచి పరిచయం ఏర్పడింది .beatles  తో పరిచయం ధృఢ౦ అయింది.  వీళ్ళలో ఏదో కొత్తదనం ,అసలైన అమెరికన్ సంగీతం వున్నాయని చెప్పాడు .They are democratic –they wished to be the bard of democracy ” అని beetel సంగీతానికి జేజే లు పలికాడు .
”I sing myself -walt whitman ,an American ,one of the roughs ,a cosmos ”అని పాడుకొన్నాడు .సెక్స్ ను ప్రకృతి సిద్ధమైనది గా , భావించాడు .”Exaggerations will be revenged in human phisiology ”అని హెచ్చరించాడు .””of phisiology from top to toe I sing ”అని  రాశాడు ,అలానే చేశాడు కూడా. దానినే popular pornography అని పిలిచారు .
ఈసడించిన ఎమెర్సన్ మహాశయుడే ”The most extraordinary piece of wit and wisdom that america has yet contributed .I greet you at the beginning of a great career which yet must have a long foreground some where for such a star ”అని మనసార దీవించాడు .ఆల్కాట్ మురిసే పోయాడు .ఆయన్ను అమెరికన్ బార్డ్ అంటే  మహర్షి అని అంతా అన్నారు ఉత్తర దక్షిణాలను, చదువుకొన్న వారినీ ,చదువు లేని వారినీ  సమానం చేసిన మహానీయుడిగా గుర్తించారు .అమెరికన్ జాతి మొత్తాన్ని ఏకీకృతం చేసిన మహాకవి గా ప్రశంశించారు .కాని కొందరు మాత్రం పిచ్చి ఆస్పత్రినుంచి పారిపోయిన పిచ్చోడు  అన్నారు . దయనీయమైన మనో వైకల్యం తో ఉన్నాడని అన్న వారు వున్నారు . .
                       విట్మన్ అవతారం చాలా విచిత్రం గా వుండేది ”rough satyr ,broad shouldered ,gray beard ,wearing a strpped calico jacket over a red flannel shirt and coarse overalls ”ఇదీ అతని వేషం .మన గద్దర్ లాగా ఊహించుకో వచ్చు నేమో . 1857 -59 మధ్య డైలీ టైమ్స్ లో పనిచేశాడు అప్పుడే వ్యభి చారాన్ని చట్ట పరిధి లోకి తేవాలని రాశాడు తర్వాత చాలా చిన్న ఉద్యోగాలు చేశాడు .తండ్రి చనిపోయాడు .వాషింగ్టన్ వార్ హాస్పిటల్ లో నర్స్  గా చేరి పనిచేశాడు .గాయపడిన సైనికులను ఓదార్చే వాడు .600 సార్లు ఆ ఆస్పత్రిని సందర్శించాడు .సహాయ సహకారాలు అందించాడు .దాదాపు లక్ష మంది సైనికులను పలక రించాడు .ఒక కవి ఇలా ప్రజా సేవలో వుండటం అరుదైన విషయం .రాయటం నా వంతు సేవ మీ వంతు అనే లోకం లో ఇది చాలా విడ్డురం గా వుంది కదూ .1865  లో తన యుద్ధ కవితలనుdrum taps పేర వెలువరించాడు .finest poetry produced by the civil war ”గా  పేరు  పొందింది .ఇందులో దేశ భక్తి ప్రతిధ్వనించింది .1873 లో  cerebrial hemorrage   వచ్చింది .గడ్డిపరకలను చివరిసారిగా 1881 లో ప్రచురించాడు .చాల గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత కూడా .    .
                        అబ్రహం లింకన్ మరణం తో చలించి పోయాడు .ఆయనపై అనేక ప్రసంగాలు చేశాడు .andru కార్నెజీ ,జేమ్స్ రుస్సేల్ మార్క్ ట్విన్ వంటి మహామహులంతా విని మెచ్చారు .చాలా వస్తువులు విట్మన్ పేర మార్కెట్ లోకి విడుదల అయాయి .అందులో వాల్ట్ విట్మన్ సిగార్ ,ఒకటి .చాలా దేశాల్లో విట్మన్ societies ఏర్పడ్డాయి .మిక్కి వీధిలో రెండు అంతస్తుల భవనం కొన్నాడు .తన సమాధి నిర్మింప జేసుకొన్నాడు .తన కుటుంబ సభ్యులకు అందులో స్థానం కల్పించాడు .ఇదే ప్రసిద్ధ walt witman tomb ”
                 1881 లో కొత్త కవితలు రాశాడు వీటిని death bed edition అన్నారు ,1891 లో న్యుమోనియా వచ్చింది .అతని ఆత్మ శక్తే అతనికి తోడూ .1892  మార్చ్ 26 న విట్మన్ మహా కవి మరణించాడు .సెక్స్ ను విశాల వేదిక పై చర్చింప జేసిన మొట్ట మొదటి కవి విట్మన్ .
              విట్మన్ సకల కళా వల్లభుడు .థియేటర్ ఆర్ట్ ,శిల్ప కల సంగీతం ,ఫోటోగ్రఫి ,painting మొదలైన కళలో లోతైన అవగాహన వుంది .ఆ కళల్లో నిపుణులైన వారందరితో పరిచయం వుంది  photography afterall was the merging of sight and chemistry of eye and machine of organism and mechanism ముచ్ as American instrument of seeing .no culture was more in love with science and technology than America was and the camera was the perfect emblem of the joining of the human senses to chemistry and physics via machine ”
అని ఫోటోగ్రఫి కళను అద్భుతం గా ఆవిష్కరించాడు విట్మన్ .సాంకేతిక పరిజ్ఞానంలోను ,architecture లోను గొప్ప ప్రవేశం వుంది .1853 లో newyork లో వరల్డ్ ఫెయిర్ జరిగితే వెళ్లి చూసి మురిసి song of exposition గా కవిత రాశాడు .డెమోక్రాటిక్ రాజకీయాలపై మోజుండేది .లిబెరల్ democracy కావాలి అనే వాడు .  చివరగా అతని కవితా పంక్తుల్ని రుచి చూద్దాం
”I raise voice for far superber themes for poets and for art .To exalt the present and the real –To teach the average man the glory of his daily walk and trade ” సామాన్యునికి అందుబాటు లో వున్న సకల విషయాల లోతులు చూడాలి అని భావం .
     reynolds అనే విమర్శకుడు ”walt whitman’s boundless love and inclusive language make his writing attractive and exciting practically all readers ”అని విట్మన్ కవిత్వాన్ని అంచనా వేశాడు .మరువ తగని ,మరువ లేని మహా కవి ,ప్రజా కవి ,అమెరికా హృదయాన్ని ఆవిష్కరింసిన దార్శనికుడు ,మానవతా వాది ,సకల జన హితుడు ,ప్రపంచాన్ని తనలో ,తనలో ప్రపంచాన్ని చూసుకొన్న మాన వీయ మూర్తి వాల్ట్ విట్మన్ .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–3

       వాల్ట్ విట్మన్ —–3
            ప్రజాకవి ,సామాన్యుని కవితలో మాన్యుని చేసిన వాడు ,ప్రజల బాధలు తన బాధలుగా భావించి, వారికి అనధికార శాసన సభ్యుడైన వాడు ,కవితకు కాదేది అనర్హం అని చాటిన వాడు ,అందర్నీ సమానంగా ఆదరించిన వాడు ,అమెరికన్ భాషలో అచ్చమైన కవిత్వం చెప్పి ,ఇది కవిత్వమా అని వెక్కిరించిన వారి చేతనే నిజమైన కవిత్వం ఇదేనని అనిపించుకున్న వాడు వాల్ట్ విట్మన్ .అతని కవితా ప్రవేశం ఎలా జరిగిందో తెలుసు కొన్నాం .ఇక ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం .
                     విట్మన్ 1819may 31 న   అమెరికా లో లాంగ్ ఐలాండ్ వెస్ట్ హిల్స్ గ్రామం లో జన్మించాడు .manhattan కు యాభై  మైళ్ళ దూరం .”Underneath all nativity –I swear I will stand by my own nativity ”అని రాసుకొన్నాడు .తండ్రి ఇంగ్లిష్ ,తల్లి డచ్ .తండ్రి నుంచి ఆంగ్ల మూలాలు ,తల్లినుంచి నిబద్ధత వారసత్వం గా పొందాడు .తండ్రి నుంచి స్వేచ్చగా ఆలోచించటం ,ప్రజాస్వామ్యం మీద సానుభూతి లభించాయి   .తండ్రి వడ్రంగి .జీవితం లో ఆయన ఏమి సాధించ లేదు పాపం .కుటుంబం brooklyn  చేరింది .ఏడు ఇళ్ళు కొన్నాడు తండ్రి .దేన్నీ నిలుపుకో లేదు .అప్పుడది అమెరికా లో నాల్గవ పెద్ద నగరం .ఇరవై ఎనిమిదేళ్ళు ఇక్కడే మన కవి జీవితం గడి పాడు .పూర్తి గ్రామీణ వాతావరణ మైన island కు నగరవాసనలు వెదజల్లే మన్హట్టన్ కు బ్రూక్ల్లిన్ మధ్యలో వుంది .మట్టిరోడ్లు ,చెత్త చెదారం ,పందులు ,కోల్లతో భీభత్స౦ గా వుండేది . ఫెర్రి సాయం తో మన్హట్టన్ కు చేరాలి .
              విప్లవ నాయకుడు Marquis De Lafayetti 1825 lo ఇక్కడికి  వచ్చాడు అప్పటికి వాల్ట్ వయసు ఆరు  . ఆ హీరో ఈ చిట్టి కవిని ఎత్తుకొని ముద్దాడిన సంఘటన ఈయనకు బాగా జ్ఞాపకం వుంది . అప్పుడు quaker ఉద్యమం బాగా వుంది .deism ఉద్యమము సమాంతరంగా నడుస్తోంది .వీళ్ళకు దైవభక్తి .విట్మన్ క్వేకర్ ఉద్యమం ఇష్టమైంది . inspired voice of the self ”. అంటె ఇష్టం ఏర్పడింది .దీనికి గ్రంధాలు ,వాక్యాలు అక్కర్లేదు .పదకొండేళ్ళకే చదువుకు గంట కొట్టి బ్ర్రోక్లిన్ లో ఒక లాయర్ దగ్గర బాయ్ గా చేరాడు .1831  లో  samuel క్లెమెంట్స్ వద్ద సహాయకుడిగా చేరాడు .ఆయన లాంగ్ island అనే వార పత్రికకు ఎడిటర్ .అందులో ప్రింటర్ గా పని చేశాడు .జార్జి వాషింగ్టన్ .జెఫెర్సన్ లను స్వయం గా చూశాడు . ,
1932 లో  అక్కడ కలరా బాగా వ్యాపించింది మళ్ళీ కుటుంబం వెస్ట్ హిల్స్ కు మారింది .లాంగ్ island పేపర్ కు కంపోజర్ గా పని చేశాడు .కొంతకాలం స్కూల్ టీచర్ గా చేశాడు .స్థిర సంపాదన లేదు .స్వంత వీక్లీ ”లాంగ్ islaander ”పత్రిక నడిపాడు .ఇంటింటికి తిరిగి పత్రిక అమ్మే వాడు .వారం లో 38 మైళ్ళు తిరగాల్సి వచ్చేది .తర్వాత జమైకా లో టైపు సెట్టర్ అయాడులాంగ్ islaand డెమొక్రాట్ పేపర్ కు .అదీ అచ్చిరాలేదు మళ్ళీ టీచర్ అయాడు విసుగుతో తన్ను ”miserable kind of dog ”అనుకొన్నాడు తర్వాత రెండు మూడు పేపర్ లలో పని చేశాడు .ఏది కలిసి రాలేదు .
baffalo లో ఫ్రీ soil  పార్టీ కి ప్రచారం చేశాడు .దాని ఆదర్శం ”free soil ,free speech ,free labour ,and free men ” .బానిసత్వం పోవాలని ఇంకా దేశం లో బానిసలు ఉండరాదని ప్రచారం .మళ్ళీ బ్ర్రోక్లిన్ ఫ్రీమన్ పేపర్ పెట్టి నడిపాడు .పేపర్ ఆఫీసు తగలడింది .ఆ తర్వాత ఆ పార్టీ కూడా ఎన్నికలలో  ఓడి తగలడింది .
                    1848 లో చిన్న దుకాణం తెరిచాడు .పెన్సిళ్ళు ,పెన్నులు అమ్మాడు .1849 లో ‘the newyork డైలీ news పేపర్ నడిపి ఒక పెన్ని కే పేపర్ అమ్మాడు .ఆర్ధికం గా నష్టపోయి లేపేశాడు .
                      1850 లో తిరుగు బాటు కవిత్వం leaves of grass రాయటం ప్రారంభించాడు .అదే ఆధునిక వచన కవిత్వానికి నాంది అయింది దీన్నే ఫ్రీ వెర్సె అంటారు .లాంగ్ island sketches రాశాడు .బ్ర్రోక్లిన్ ఆర్ట్ యునియన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నిక అయాడు . materialistic age లో . easthetic sense తెచ్చాడు వ్యాపారం చేద్దామని తండ్రి లాగా ఇళ్ళు కోని అమ్మాడు .నెత్తిన టోపియే మిగిలింది .అప్పటికే కవిత్వం లో మంచి పరిపక్వత సాధించాడు .  ”marvelously innovative poet ”అనిపించుకొన్నాడు .”most revoluutionary and inspired poet ”అని ముద్ర పడింది  పుస్తక౦ 1855 లో  వెలువడింది . .అప్పుడు దేశం లో వున్న లంచగొండి తనానికి చలించి పోయాడు ఇవాల్టి మన అన్న హజారే లాగ .the 18th president అన్న కవితలో రాజకీయ నాయకులను చిట్టెలుకలు ,maggots తో పోల్చాడు .వీటి వల్ల జనం లో ఏకీ భావన కలిగించాడు .boy ని b hoy అనేవాడు ,రాసే వాడు .అది అక్కడి మాండలీకం .అలాగే girl న g hal అని రాసేవాడు ఇప్పుడు భోయ్ అనీ గాళ్ అనటం అతను నేర్పిన విద్యే .vitman is the bower bhoy in literature ”అని  అమెరికన్స్ .   మురిసి   పోయారు
విట్మన్ ను ”cultural verniloquil .He was poetically enacting the kind of performances that he witnessed among Americanactors and singers ‘అని ప్రశంసించారు .అదే చివరికి అమెరికన్ స్టైల్ అయింది .అభినయించేవాడికి ,ప్రేక్షకుడికి మధ్య అడ్డు గోడ తొలగి పోయింది .దీనినే అమెరికా ప్రజలు విపరీతం గా ఇష్ట పడ్డారు .తమదైన ,స్వదేశీ భావన భాషా వ్యక్తీకరణ ఇన్నాళ్ళకు లభించిందని ఎంతో పొంగి పోయారు ఇంకో పక్క మార్క్ ట్వైన్ వచనం లో పూర్తి nativity  తెచ్చాడు ఇద్దరు నిజమైన అమెరికన్ సాహిత్యాన్ని సృష్టించి జన నీరాజనాలు అందుకొన్నారు .తాము ఏమిటో ఇన్నేళ్ళకు అమెరికా ప్రజలు తెలుసు కోనేట్లు చేసిన మార్గ దర్సులు వాల్ట్ విత్మాన్,మార్క్ ట్వైన్…’అతను ఒక spontaneous actor ,;.ఫెర్రి బోటు మీద కూర్చోని,బస్సుల్లో తిరుగుతూ shakespeare  కవితలను అలవోకగా చదివి జనానికి వినిపించే వాడు విట్మన్ .
”I do not ask the wounded person how  he feels –,I my self become the wounded person ”అని జనం తో ,వారి భావాలతో మమేకం అయిన అసాధారణ ప్రజా కవి ,వై తాళికుడు వాల్ట్ విట్మన్ ..
మరిన్ని విశేషాలు మరో సారి అందిస్తాను
                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | 2 Comments

సాహితి మండలి 257 వ సమావేశము

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వాల్ట్ విట్మన్—2

    వాల్ట్ విట్మన్—2
                వాల్ట్ విట్మన్ బానిసత్వాన్ని ద్వేషించాడు .equilibrium కావాలి అన్నాడు .అది కూడా స్నేహపూర్వకం గా వుండాలి .ఇక్కడే ఒక చక్కని కవిత రాశాడు ”I am the poet of slaves and of the master of the slaves —-I go with the slaves of the earth equally with the masters —and i will stand between the masters and the slaves —Entering into both so that both shall understood me alike ”అని తన  మనసును  బయట   పెట్టాడు .
”I”అనటం విట్మన్ తో నే అమెరికన్ కవిత్వం లో ప్రారంభ మైంది .జనం తో మమైక్యం చెందిన భావన   . కలిగించాడు
అందుకే ”  he cultivated superb   calm character to meliorate personal upheavals ” అని ప్రశంసలు పొందాడు .తన ముఖ్య కార్యక్రమం “”great contribution of the New BIble ”అని ప్రకటించాడు .జేమ్స్ రాజు కొత్త bible రాసినట్లు ,తానూ కొత్త నీరు తేవాలని భావించాడు .అందుకనే తన గడ్డిపరకలు అనే కవితా సంపుటిలో ”read these leaves in the open air season of every year of your life of all nations
and specially tou.s. poets most need poets –since political leaders were failing miserably to hold the nation to gether ,poets alone held the key to social cohesion .The presidents shall not be their common refery so much as their poets shall .The poet is the orbitrator of the diverse and he is the key .He is the eqallizer of the age and land he supplies what wants supplying and checks what wants checking .”అని కవికి వున్న సామాజిక బాధ్యతను గుర్తు చేశాడు .ప్రజా సమస్యల్ని కవులు చాలా ప్రతిభావంతం గా పాకులాడి దృష్టికి తేగలరు అని ఆయన భావన .
   అతని గడ్డిపరకలు కవిత్వం లో ప్రజాస్వామ్య ద్రుష్టి ముందు చూపు వున్నాయి .అందుకే సామాజిక ,వర్గ ,మత ,సెక్స్ ,వగైరా లకున్న అడ్డంకులను సవాలు చేశాడు .అంతకు ముందెవ్వరు వీటిపై ద్రుష్టి పెట్ట లేదు .ఇతనే ఆద్యుడు .1950లో   మాత్రమే సాంఘిక అడ్డంకుల్ని తొలగించింది అమెరికన్ ప్రభుత్వం .అంతే విట్మన్ కవి ప్రభుత్వానికి మార్గ దర్శనం చేశాడు అని తెలుస్తోంది. అతనికి పూర్తి సమానత్వం కావాలి .అదే ఆయన ధ్యేయం .అతనిలో దక్షిణ ,ఉత్తర ప్రాంత జనులు ఒక్కటే అందుకే అందరిని దృష్టిలో పెట్టుకొనే ”నేను ”అని అందరిని సమాన భావనతో చూశాడు ..
                       నేటివ్ అమెరికన్స్ పై portraits వేశాడు ..ఆ మధ్యనే వచ్చిన యురోపియన్ల పైన ,ఆఫ్రికన్ అమెరికన్ ల పైన వేశాడు .తనను బానిస గా భావించు కొన్నాడు .”I am the hounded slave —I wine at the bite of dogs –Helland despair are up on me ”అని వాళ్ల బాధ తన బాధ గా చెప్పుకొన్నాడు .ఇదే మన శ్రీ శ్రీ కి ఆదర్శం అయింది .కవితామయ స్వర్గాన్ని ఊహించాడు (ఉటోపియా )అందులో ధనవంతులు ,పేదలు ,అధికారులు ,సామాన్యులు అందరు అన్యోన్యం గా వుండాలి ఇదే democratic I”’.  సాంగ్ అఫ్ మై సెల్ఫ్ కవితలో ”of every hue and trade and rank ,of every caste ,and religion –Not merely of the New World but of Africa ,Europe or Asia  a wandering savage —A farmer ,a mechanist or artist ,a gentleman ,sailor ,lover or quaker ”అందరు ,అన్ని దేశాల వాళ్ళు ,అన్ని వృత్తుల వాళ్ళు తన వాళ్ళే నన్నారు .దీన్నే శ్రీ శ్రీకుమ్మరి కమ్మరి   , దాగలి గొడ్డలికట్టీ సుత్తీ  సమస్త వృత్తుల వాళ్ళు తన వాళ్ళే నన్నాడు .
శ్రీకి ప్రేరణ విట్మన్. .తనను పిట్టలదోరగా ,న్యాయవాదిగా వైద్యునిగా మతాదికారిగా పోల్చుకొన్నాడు .
                      తనను చూసి అమెరికా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని నేర్చుకోవాలని ఆశ పడ్డాడు . ”  The proof of the poet is that his country absorbs him as affectionately as he has absorbed ”అని నమ్మాడు .కవి తన దేశం తో మమైక మయినట్లు దేశం కూడా కవిలో అయిక్యమవ్వాలని అతని సుందరస్వప్నం అతను ఆశించి నట్లే అది నెరవేరింది .ఎమెర్సన్ ,రోసేట్టే ,స్విన్బర్న్ ,మొదలైన వారు ముందుగా ,విట్మన్ ను అర్ధం చేసుకో లేక పోయినా ఇప్పుడు పూర్తిగా మారి అతని కవిత్వానికి పట్టాభి షేకం చేయటం మొదలు పెట్టారు .అరచేతితో సూర్యుని తేజాన్ని ఆపలేము అని తెలుసు కొన్నారు .””I greet you at the beginning of a great career ”అన్నాడు ఎమెర్సన్ .”Your poetry has the best merits ,namely of fortifying and encouraging ”అనీ అన్నాడాయన
                      మిగిలిన వారు ”It had attemppted to abolish all narrowness of vision ,immediately became subject to narrow interpretations .his begign qualities are very exemplary ”అని కితాబు ఇచ్చారు .గుడ్ గ్రే పోఎట్ అని ప్రశంసించారు .
‘                లింకన్ అంతే వీర అభిమానం విట్మన్ కు .రోజూ ప్రెసిడెంట్ లింకన్ ఆఫీసు కు వెళ్ళటం చూశే వాడు .లి౦కన్ ను హోం spun అని ,కెప్టెన్ అనీ గొప్పగా ఆరాధించేవాడు .”captain o captain ”అని లింకన్ పై అద్భుతమైన కవిత రాసి తన భక్తిని ఆరాధనా భావాన్ని వ్యక్త పరిచాడు .
race and caste విషయం లో conservative stand తీసుకొన్నాడు .
Witman is the master of language experimentation అని పేరు పొందాడు .తన కవిత్వం గురించి ”No one can know leaves of grass who  judges it piecemeal ,–do not take the trouble to examine what they started out to criticize ,to judge a man from his own stand point ,to even find out what that stand point is ”అని  విస్శ్లేషించాడు  .ఇది స్వంత     డబ్బా  కాడు    .స్వయం  వ్యక్తీకరణ  మాత్రమే .
                మరిన్ని జీవిత విశేషాలు ఇంకో saari
                             మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -07 -11 క్యాంపు బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —-1

    వాల్ట్ విట్మన్ —-1

అమెరికన్ కవిత్వాన్ని ఇంగ్లేష్ వాళ్ల బారి నుంచి కాపాడి కొత్త ఆలోచనలతో ,కొత్త పదబంధాలతో చ౦ధస్సుని వదిలి  సామాన్య మానవుడిని ,కార్మిక, కర్షక ,బడుగు జీవుల జీవితాలను కవిత్వం లో చిత్రించి ,అమెరికన్ కవిత్వాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన కవి ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .అందుకనే ఆయన్ను America’s most beloved and influential writer  అన్నారు .radical democratic inclusiveness to literature తెచ్చిన ఘనత విట్మన్ దితన విశేష వ్యక్తిత్వం తో ‘The diverse ,pedestrian images of హిస్ చుల్తురె  into soaring ,fresh  poetry ” లోకి మార్పించాడు..ఆధునిక కవులకు మార్గదర్శనం చేశాడు ,సృజనాత్మకత తో ప్రయోగాలతో సాంఘిక అసమానత్వాలను కవిత్వీకరించాడు .అంతకు ముందు సాహిత్యం లో వీరికి స్థానమే లేదు .అదో జగత్ సహోదరుల జీవితావిష్కరణ చేఇన మానవతా వాది .కవిత్వం వరదలా జాలు వారుతుంది .ఆయనది వచనం తో కూడిన కవిత్వం .ఛందస్సు , దూరం చేశాడు .సహజ సిద్ధం గా కవిత్వం చెప్పాడు .పాత   అలంకారాలకు  స్వస్తి చెప్పాడు .లోకాన్ని కొత్త తరహాలో ,కొత్త కోణం లో ఆవిష్కరించి ,కవిత్వాన్ని భూమార్గం పట్టించిన ప్రజా కవి అని పించుకున్నాడు . . rhythemic of voice and feeling ను తెచ్చాడు .                    1885 లో ఆయన మొదటి రచనలు ప్రచురించాడు .అదే leaves of grass   .అంటె గడ్డి పరకలు .దీన్ని చూసిన అమెరికన్ మేధావి తోరో జంతువులూ మాట్లాడే భాష లాగా వుందని ఈసడించాడు .అంతే కాదు America ‘స్ గ్రే poet అన్నాడు .అతని కవిత్వాన్ని boston నగరం నిషేధించింది. అక్కడ వున్న ఎమెర్సన్ మహాశయుడు కూడా మెచ్చలేదు .బోస్టన్  లో నిషేధానికి గురి అయితే ఆ కాలం లో అదో గొప్ప ..ఆకాలం లో underware గురించి నగ్నత్వం గురించి రాసే వాళ్ళు కాదు .musiyam లో వున్న  నగ్న శిల్పాలకు బట్టలు కప్పిన కాలమ్ అది .అయితే విట్మన్ తన కవితలో ఇరవై ఎనిమిది మంది నగ్న స్త్రీ లను నదిలో స్నానం చేస్తున్న వారిని కవిత్వం లో నింపాడు .”Thruster holding me tight and that i hold tight –we hurt each other as the bride groom and the bride hurt each other ”  అని  రాస్తే ఎవరు అర్ధం చేసుకో లేక పోయారు .సెక్స్ ను ఇంత బహిరంగం గా ఇంత వరకు ఎవరు రాయ లేదు .అయితే విట్మన్ ది మోనో sexuality కాదు .ద్విలింగ సంపర్కానికే ప్రాధాన్యత నిచ్చాడు .తన కవిత్వాన్ని అంచనా వేయ టానికి ” The world’s current times and deeds and their spirit ,must first be ,profoundly estimated ”   అని లోకానికి సత్తా వుంటే త్నకవిత్వం అర్ధమవుతుందని సవాలు చేసి చెప్పాడు .  వర్తమానం తో కవి తాదాత్మ్యత చెందక పొతే అతను దారి తప్పినట్లే అంటాడు .అందుకానే అతని రచనలు అన్నీ ”The age tranfigured ”   గానే వుంటాయి .19 శతాబ్దపు విషయాలన్నీ కవిత్వీకరించాడు .అప్పుడు 1850  నడుస్తోంది అంతర్యుద్ధ కాలమ్ .దేశం అంతా అవినీతి ,లంచగొండి తనం పుచ్చిపోయింది .ఇవాల్టి మన దేశం లానే ..ఆనాటి   అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాన్క్లిన్ పిఎర్స్ .గురించి ”The president eats dirt and excrement for his daily meals ,–likes it and tries to force it on the states ”  అని ఏమాత్రం  భయపడ కుండా కవిగా తన బాధ్యత నెరవేర్చాడు .ప్రజావాణిని తన గొంతులో పలికించాడు .అందుకని దేశంలోని మంచి చెడ్డ న్యాయం ,అన్యాయం కవిత్వం లో రూపు దాల్చాడని భావించాడు .ఇవన్నీ కవిత అనే పాత్రలోమార్పు పొందాలన్నాడు .  .దీనికోసం ఉద్యమం రావాలని కోరాడు .ప్రశ్నించటం ,పరీక్షించటం ,విసర్జించటం రావాలి అని కోరాడు ..ఆడవారి హక్కుల పోరాటం లో ఆయన పాల్గొన లేదు .ఫ్రీ లవ్ ను ప్రోచ్చహించినా ఆ ఉద్యమం లో లేడు ..fourst. socialism లోను  లేడు .దీనినే working class radical movement  అంటారు .కమ్యునిస్టు లతో  దోస్తీ ల్లేదు .anaarchism లోను సభ్యుడు కాదు .,కార్య కర్త కాడు .”be radical ,be radical -be not too damned radical ”  అతని సిద్ధాతంఅని విమర్శకులు ఎద్దేవా చేశారు .రాసేదంతా వాళ్ల గురించి కాని వాళ్ల హక్కుల పోరాటం లో పాల్గొన నందుకు అతన్ని ప్రశ్నించారు .Eccessive radicalism  విట్మన్ కు ఇష్టం లెదు . వాళ్ళు వివాహాన్ని legalised prostitution ”  అన్నారు .అది విట్మన్ కు నచ్చ లెదు .ఆయనది ”definite convservative streak ”.extreemes  కు వెళ్ళడు .మధ్యే మార్గం ఆయనకు చాలా ఇష్టం .homo sexuality కి వ్యతిరేకి .తనను గురించి ”The equable man who could handle all things grotesque or accentric ” గా అభివర్ణించుకొన్నాడు అతను ఒక legend .అతన్ని గురించి ఎ౦త చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా వుంటుంది ఇంతటి తో ప్రస్తుతం ఆపు తున్నాను మళ్ళీ  తరువాత  వివరిస్తాను
   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -07 -11 .క్యాంపు –బెంగళూర్

వివాహ వ్యవస్థను ప్రోత్సహించాడు .conventional marriages ను వద్దు అనే ఫ్రీ లవ్ ఉద్యమం తో జత కట్ట లేదు .

Posted in రచనలు | Leave a comment

మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు

మరిన్ని స్టీన్  బెక్ స్మృతులు
                 జాన్ స్టీన్ బెక్ రచనల వైవిధ్యం ,నాణ్యత ,సంక్లిష్టతలను అంచనా వేయటానికి ఒక చట్రంలో కుదించటం   సాధ్యం కాదు అని విమర్శకులు చేతులెత్తేశారు .ఆయన తన పశ్చిమ తీర ప్రాంత స్వగ్రామం నుంచి ,తూర్పు తీర మెట్రో పోలిస్ వరకు పయనం సాగించాడు .non  fiction  ఆయనుకు ఇంకో దారి .The grape wrath  తో అంతర్జాతీయ ప్రముఖ రచయిత అయాడు .దీనితో పాటు తన దైన స్వంత సంస్కృతీ కి out cast గా   మారాడు  .అతని రచనలన్నీ ఒక విధం గా ఆయన స్వీయ చరిత్రలే .1930 లో కాలిఫోర్నియా కు వలస వచ్చిన వారి జీవిత ఆటు పోట్లను ,దైన్యాన్ని ,తన రచనలలో ప్రతిబి౦బిచాడు .
   గుల్ఫ్ అఫ్ కాలిఫోర్నియా ను the  sea of cortez అంటారు ..దాన్ని క్షు౦డ౦ గా పరిశోధించాడు అంటే expedition చేశాడు .సముద్ర జీవులను స్పెసిమెన్ గా సేకరించటానికి తన స్నేహితుడు ఎడ్ రికెట్స్ కు చాలా ధన సహాయం చేశాడు .కొంత కాలమ్ లండన్ లో war time accounts   చూశాడు .యుద్ధం లో తాను చూసిన భీభత్సానికి depress  అయాడుకూడా .1947 లో రష్యా వెళ్ళాలని అనుకొన్నాడు .దీనిని తన అంతర్జాతీయ అవగాహన పెంచుకోవటానికి తోడ్పడుతుందని బావించాడు .దురదృష్ట వశాత్తు తన ముఖ్య స్నేహితుడు ,తోటి జీవావరణ శాస్త్రవేత్త రికెట్స్ మరణం అకస్మాత్తుగా సంభవించటం తో వెళ్ళ లేక పోయాడు .వివాహ సమస్యలు అతన్ని కదల నివ్వ లేదు .అప్పటి మెక్సికోrevolutionary  నాయకుడు Emiliyano Zapta పై సమగ్ర పరిశోధన చేసి ప్రచురించాడు   .ఆయన పై తీసిన సినిమా కు స్క్రిప్ట్ కూడా రాశాడుబెక్ ..
                        తాను నివశించిన సాలీనా వాలీ గురించి  East of Eden రాశాడు .ఇందులో తన తల్లి వంశం గురించి తన బాల్యం గురించి వివరం గా రాశాడు .ఇది అంతగా ఆదరణ పొందలేదు .1961  లో The winter of our discontent రాశాడు న్యూయార్క్ జీవితం లోని fictional   సెట్టింగ్ గా దీన్ని రాశాడు .1962 లో జాన్ స్టీన్ బెక్ కు నోబెల్ బహుమతి లభించింది .అప్పుడే Travels with Charley  in search of America   రాశాడు బాగా అమ్ముడయింది .1966 లో అమెరికా అండ్ అమెరికన్స్ పుస్తకం రాశాడు .తర్వాత లెటర్స్త   టు అలీసియ రాశాడు  .    .
           టెన్నిసన్ కవి ”All experience is an arch where through gleams that un travelled world whose margin fades -for ever and for ever when i move ”అని చెప్పినట్లే బెక్ జీవితం కూడా సాగినట్లు అనిపిస్తున్నది .
                       ఇదీ మహా రచయిత ,నోబెల్ పురస్కార గ్రహీత జాన్ స్టీన్ బెక్ గురించి న మరిన్ని జ్ఞాపకాలు .
                                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -07 -11 క్యాంపు బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.

         వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.
               తమిళ నాడు లో మధురై లో అరవింద్ కాంతి ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్. గోవిందప్ప వెంకట స్వామి dr .v గా జగత్ ప్రసిద్ధుడు .లక్షలాది కాంతి శస్త్ర చికిత్సలు చేశాడు .84..ఏళ్ళ వయసు .యువకుడు గా ఉన్నప్పుడే rhumatic arthitis వచ్చి వెళ్ళు స్వాధీనం తప్పాయి .పెన్ను కూడా పట్టుకోలేని స్థితి .determination,conventionalwisdom  తో జయించాడు .అతి సున్నిత మైన కంటి శాస్త్ర చికిత్సా నిపుణిడిగా స్థిర పడ్డాడు .అదే అద్భుతం .రోజుకు వంద cateract  ఆపరేషన్ లు చేస్తాడు .కొన్నెల్ల కిందటనే లక్ష పూర్తి చేశాడు .
                    భారత దేశం లో పద్నాలుగు మిలియన్ల గుడ్డి వారు వున్నారని అంచనా .ప్రపంచం లోని వారిలో ఇది సగం శాతం .ఇందులో 80 శాతం cataract  తో బాధ పడుతున్నారు .ఇది నయం చేయ గల వ్యాదియే .”No one should be blind if it can be helped -just as we have eradicated other global health problems like polio ,that were once common .We can eliminate blindness .We can do it now .” అని ఆయన పూర్తి నమ్మకం .
         ఆయన శ్రీ అరవిందుల శిష్యుడు .అరవి౦దాశ్రమాన్ని చాల సార్లు సందర్శించాడు .గాంధి గారి ప్రభావం అరవిందుల ప్రభావం ఆయనపై చాలా వుంది .అరవి౦దులను అనేక సార్లు దర్శించి దివ్య .అనుభూతి పొందాడు  .అరవి౦దులలో special radiation   వుందని భావించాడు ..ఆయన లో దివ్య శక్తి ప్రవేశించిందని భావించాడు .అది లసేర్ లో వ్యాప్తి చెంది గుడ్డితనాన్ని పోగొట్టింది .”   I found that the more I worked for this goal ,the more help I got ”  అంటాడాయన 1976 లో రిటైర్ అయాడు మధురై మెడికల్ కాలేజీ నుంచి యాభై ఎనిమిదేళ్ళు నిండిన తర్వాత ..అప్పుడే అరవింద్ ఇన్ స్టిట్యూట్  స్థాపించాడు .చేతిలో పెద్దగా ధనం లేదు .కాని పదకొండు పడకలు,ముగ్గురు డాక్టర్స్ వున్నారు .ఇప్పుడే పని ప్రారంభం అయింది అంటారు ఆయన .
                 యాభై ఏళ్లుగా వైద్య వ్రుత్తి లో వున్నాడు .ఇప్పటికి ఆ ఆస్పత్రి ”ది వరల్డ్ ‘స BUSIEST EYE హాస్పిటల్ .ఏడాదికి రెండు లక్షల ఆపరేషన్లు ఇక్కడ జరుగు తాయి .1500 మొబైల్ EYE కాంపస్ నిర్వ హించారు పల్లె టూళ్ళల్లో.నేపాల్ ,బంగ్లాదేశ్, కంబోడియా దేశాల్లో ను వేటిని నిర్వహించారు .”మధు మేహాన్ని తరిమి గొట్టటమే తన ధ్యేయం గా చెప్పారు .అది తన SPIRITUAL PRACTICE ” అని ప్రకటించాడు .అత్యన్నత మైన వైద్యం ఇక్కడ అందుతుంది .చాల చాల తక్కువ ఖర్చుతో వైద్య సేవలు ఇక్కడ దొరుకు తాయి అమెరికా లోని కంటి ఆస్పత్రుల కంటే ఇక్కడికే చాలా ఎక్కువ మంది వస్తారు ..
డాక్టర్ వి. గారిది రాబిన్హుడ్ తరహా .అరవై శాతం మంది పేదలకు ఉచితం గా వైద్యం చేస్తారు .PAYING   PATIENTS  ఇచ్చే దాంట్లో SUBSIDISED గా పేదలకు ఉచితం గా చేస్తాడు .ఏ.సి .రూముల్లోనే ఆపరేషన్ జరుగు తుంది .ఉచితం గా కళ్ళ జోడులు ఇస్తారు కూడా .మక్ డోనాల్డ్  ఆయనకు ఇంకో ఆదర్శం .GOOD ,CHEAP ,REPRODUCTIVE SERVICE ఇవ్వటం ఆయనకు ఇష్టం .డాక్టర్ వి .పది డాలర్స్ కే ఆపరేషన్ చేస్తారు .అదే అమెరికా ,ఆస్పత్రుల్లో కనీసం 1500 డాలర్లు అవుతుంది కంటి ఆపరేషన్ కు .అందుకే ఆయన్ను దేవుడి గా భావిస్తారు . .ఆయనకు INTERNATIONAL LIONS CLUB . సహకారం పూర్తిగా లభిస్తుంది .
ఆయన నిర్వహించే ఆరో లాబ్ లో అతి తక్కువ ఖర్చుతో శాస్త్ర చికిత్చ చేసే పరికరాలు అతి నాణ్యమైనవి తయారు చేస్తారు .మందులు కూడా చాలా చవక ధరలకే అందేట్లు తయారు చేస్తారు .ఇదీ ఇక్కడి ప్రత్యేకత .ఇతర దేశాల్లో ఇవి కొనాలంటే కళ్ళు తిరిగి పోయే రెట్లుంటాయి .”WITHOUT ADMINISTRATORS ,DOCTORS HAVE TO MANAGE ,A BUSINESS WHEN THEY COULD BE ELIMINATING BLINDNESS ”అనే భావన ఆయనది .ఇక్కడ అందరు అంకిత భావం తో ,సేవా దృక్పధం తో పని చేస్తారు .ఇదే అరబిందో సంస్క్రతి .ఆయనలో spiritual ,and material    goals మిళితమై వున్నాయి .ఆయన దృష్టిలో కంటి శాస్త్ర చికిత్చ చాలా తేలిక అయితే పేషెంట్ ను ఆస్పత్రికి రప్పించటమే కష్టం అంటారు . indian spirituality and western know how ను మిళితం చేసి కు గది వుంటుంది .విజయం సాధించిన వీరుడు ఆయన .ప్రతి గదిలో అరవిందుల ఫోటో వుంటుంది .meditation కు ప్రత్యెక గది వుంటుంది .meditation అంటే భగవంతునితో మౌన సంభాషణ అని  ఆయన భావం .తాను ఎప్పుడు a etter tool ,a receptacle for the divine force ”గా వుండాలని అనుకుంటాడు మనమంతా అంకిత భావం తో పూర్తి దృష్టిని కేంద్రీకరించి పని చేయాలని సలహా నిస్తారు ”you work on your work ,then ,supernatural consciousness works through you ”.అనే నమ్మిక.ఆయనది
                    ఆయన వివాహం చేసుకో లేదు .ఆయన కుటుంబం లోనే డజనుకు పైగా డాక్టర్స్ వున్నారు .మానవ సేవలో నే మాధవ సేవ వుంది .విడిగా దేవుని సేవ చేయాల్సిన పని లేదు అన్తారాయన్ .అయితే చాలా ఉదారంగా ,స్వార్ధ రహితం గా ప్రవర్తించి పని చేయాలి .అదే భగవంతునికి ఇష్టం అంటారు కూడా ..ఎవరైనా ఆయన ఎదుట aayana సేవలను పొగుడుతూ వుంటే తేలిగ్గా నవ్వేసి ”I just want to eliminate the world ‘s  blindness ”   అని ఊరుకుంటారు ..that is డాక్టర్ వి.అంటే గోవిందప్ప వెంకట స్వామి . ఆ ద్రుష్టి ప్రదాతకు వందనం ,అభి వందనం ..ఇలాంటి వారు ఉండ బట్టే ధర్మం ఇంకా భూమి మెడ నిలిచి వుంది

ఆంద్ర దేశం లో తెనాలికి చెందిన వెంపటి సూర్య నారాయణ గారికి కూడా ఇంతటి పేరు ప్రఖ్యాతులున్నాయని మనకు తెలుసు .ఆయనా ఎందరికో ఉచిత కంటి ఆపరేషన్ లు నిర్వహించారని విన్నాం.eye camps నిర్వహించి పేదల పాలిటి పెన్నిధి గా కీర్తి పొందారు .డాక్టర్ శివా రెడ్డి గారికీ ఇంతటి     పేరుందనివిన్నాను .ఎందరో మహానుభావులు .వీరందరికీ వంద నాలు .

      మీ —గబ్బిట దుర్గా ప్రసాద్  —-13 -07 -11 –క్యాంపు –బెంగళూర్   .
Posted in రచనలు | 1 Comment

జాన్ స్టీన్ బెక్ —-2

            జాన్ స్టీన్ బెక్    —-2
—               స్టీన్ బెక్ పుస్తకాల అమ్మకం క్రమంగా తగ్గగానే మెక్సికొ కు వెళ్ళాడు . కాలిఫోర్నియా కు తిరిగి రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత .”it is not my country any more ”అనీ అన్నాడు .ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country  అయి ఆరాధనా స్థలం అవటం విశేషం .
        Juvaan de fuca strait చాలా భయంకరమైనది .దీన్ని grave yard of pasific అంటారు ,.valanicia అనే ఓడ  1906  లో సాన్ fraanisco నుంచి నూట యాభై నలుగురితో బయల్దేరి తీరానికి ఇరవై గజాలు దూరం ఉండగానే మునిగి పోయింది 117 ” మంది చనిపోయారు .దీని తర్వాతే టైటానిక్ ఆరు ఏళ్ళు తర్వాత మునిగింది .
            స్టీన్ బెక్ ,రికెట్స్ కలిసి princes norah ship లో discovery కి బయల్దేరారు .పసిఫిక్ 75 మిలియన్  చదరపు మైళ్ళుంటుంది .భూమిని మూడొంతులు కప్పి వేసేంత అన్న మాట . అట్లాంటిక్ కు రెండు రెట్లుంది పసిఫిక్ .దీనికి సౌత్ సి అనే పేరుంది .
స్టీన్ బెక్ ఎక్కువ గా యుద్ధ నవలలు రాశాడు .కానీ సైనికుల కోరిక మేరకు యుద్ధం సమస్య లేకుండా”” కాన్నేరి రో  ”వాళ్ల కోసమే రాసాడు .”where men hungering for love destroy every thing lovable about them ”అని రాశాడు .ఈ నవల ఆయన idyll అంటారు .దాన్ని ”a dream that does not and could not exist ”అన్నాడు ”it is  an   imaginary  respite ఇన్ ఆ వరల్డ్ అఫ్ వార్ ”’అన్నాడు  .1945  లో  ఈ భావాలను escapism. గా భావించారు కొంతమంది . అందుకే పుస్తకాల అమ్మకాలు తగ్గాయి .రికెట్స్ పేర పది హీను ,స్టీన్ బెక్ పేర నాలుగు స్పెసిమెన్ కు తర్వాత పేరు పెట్టారు . lampenyactus  Stein beckiyaa ‘ . అన్నది  long fin lamp fish ను బెక్ కాలిఫోర్నియా లో కనుక్కున్నాడు .1939   లో rolf bolin ను గుర్తించాడు  ఇలాగే మిగిలినవి కూడా .
               జర్మని మేధావి ,రచయిత వేదాంతి గోథె  రాసిన ”Rest not !life is sweeping by –go and dare before you die —something mighty and sublime –leave behind to conquer time ”అని fraust లో రాసిన మాటలు రికెట్స్కు కు  బాగా   ఇష్టం అన్నాడు బెక్ .రికెట్స్ కు రోడ్ ఆక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదం గా వున్నప్పుడు ఒంటరిగా అతని లాబ్ లో ఉండలేక    రఘు ప్రసాద్ అనే marine విద్యార్ధిని తోడూ గా ”స్టెయిన్ బెచ్క్ వుంచుకున్నాడు .బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చినపుడు న్యూ యార్క్ టైం పత్రిక కూడా ఏమీ ప్రాధాన్యత నివ్వ లేదు .అతని జీవావరణ సందేశం వాళ్లకు అర్ధం కాక పోవటమే కారణం ..ఆ పత్రికఅతన్ని    ”మోర్ అబౌట్ socialogy   than literature ”అని రాసి సరి పెట్టింది .ఇప్పుడు అతని పుస్తకాలను 1930 లో అతను చెప్పిన radicalism గురించి    అధ్యనం చేస్తున్నారు . అతని రచనలను రాదికాల్ అండ్ naturalistic హుమనిసం అన్నారు కొందరు మేధావులు ..బెక్ మాత్రం ”humans are animals and thus are one with nature ”అని నోరు మూయించాడు .రికెట్స్ ,bek  ఇద్దరు కలిసి ”  . ”why do we so dread to think of our species as species ?that human self love would suffer too much and that the image of god might prove to be a mask ?”అని ప్రశ్నించారు .
              స్టీన్ బెక్ కు నోబెల్ వచ్చినపుడు బ్లూం అనే విమర్శకుడు ”The people in Stock Holm often seem to have a dusty file of people ,no one ever heard of that they pull out when making the awards ”అని ఈసడించాడు . అతన్ని సరిగా అర్ధం చేసుకోక .ఇష్టం వచ్చినట్లు అనామకుడికి అవార్డు లిస్తున్నారు అన్నాడు .
1965  లో బెక్ చని పోయిన తర్వాత ecology మీద జనం లో శ్రద్ధ పెరిగింది  . 1970  లో న్యూస్ వీక్ పత్రిక ecology పై ప్రత్యెక వ్యాసాలను రాయించింది .ఆ సంవత్చ రాన్ని  ”the year of ecology ”అని యు.ఎస్ .ఏ . పేరు పెట్టింది .అప్పట్నించి స్టీన్ బెక్ పడిన తపనేమితో జనానికి అర్ధమైంది .”becks ecoloogical message finally began  to resonate with the culture at large ”అదుగో అప్పటినుంచి అతని రచనలను కొత్త కోణం లో చదవటం ప్రారంభించారు .academician   లు ,scientists స్టీఫెన్ బెక్  కు గౌరవించటం ప్రారంభించారు .అతడిప్పుడు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం అయాడు .   ఒరెగాన్ లో ”marine science center in new port ;”   ఏర్పడింది .దీనినే stein beck అండ్ the సిగా గౌరవం గా పిలుస్తున్నారు . ”
          తన ”లైఫ్ అఫ్ లెటర్స్ ” పుస్తకం లో  జాన్ స్టీన్ బెక్ ”to finish is  sadness to a writer  .–a little death –.he puts the   the  last word down and it is  done ..but it is not  really done ..the story goes on  and leaves the writer behind ,for  no story  is ever done  ”అని ముగిస్తాడు .
                              ఇదీ నాకు చాలా ఇష్టుడైన జాన్ స్టీన్ బెక్   చరిత్ర ,రచనలపై నాకు తెలిసిన నేను తెలుసుకొన్న విషయాలు మీతో పంచుకున్నాను
                                                        మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —13 -07 -11 .—క్యాంపు –బెంగళూర్ 
”లైఫ్ అఫ్ లెటర్స్
Posted in రచనలు | Leave a comment

జాన్ స్టీన్ బెక్

     జాన్ స్టీన్ బెక్
               అమెరిక లోని కాలిఫోర్నియా లో జన్మించిన జాన్ స్టీన్ బెక్ గొప్ప కధా రచయిత ,నవలా కారుడు ,నోబెల్ బహుమతి గ్రహీత .ఆయన పర్యావరణాన్ని జీవావరనాని  గురించి కూడా అద్భుతం గా రాశాడు .ఆయన జీవించి వున్న కాలమ్ లో ఎవరు దాన్ని పట్టించు కోలేదు .మరణానంతరం అదొక అద్భుత రచన అని అందరు మెచ్చారు .అంతే కాదు జీవావరణ పర్యావరణాన్ని గురించి రాసిన మొదటి రచయిత గా గుర్తింపు పొందాడు .మాన వత్వం మూర్తీభవించిన రచయిత ,.అతనితో బాటు ఆ నాటి జీవావరణ  పర్యావరణ విషయాలపై అధ్యయనం చేసిన వారిలో అతని స్నేహితులు edrickets ,కాంప్బెల్ కూడా వున్నారు
స్టీన్ బెక్ canery row రచన లో ఆ ప్రాంతపు ప్రజల జీవన విధానాన్ని ,గొప్పగా చిత్రించాడు .అక్కడి జనాభాని whores ,pimps ,gaamblers గా వర్ణించాడు .అదే సమయం లో రికెట్స్ ఫసిఫిక్ సముద్ర ప్రాంతపు జీవావరనాన్ని బాగా లోతుగా అధ్యయనం చేశాడు .బెక్ తో కలిసి రెండు పుస్తకాలు Between fasific tides ,sea of cortez రాశాడు .వీటిని పర్యావరాణ శాస్త్ర వేత్తలు ఇప్పటికీ claassics గా భావిస్తారు  పర్యావరణం పై మానవుడు చేసే దౌష్ట్యం ,దాని వల్ల కలిగే అనర్ధాలు చాలా లోతుగా చర్చి౦చిన వాళ్ళిద్దరూ .రికెట్స్ un assuming scientist గా భావించారు .ఒక legend అన్నారు .
                      తన స్నేహితుడు రికెట్స్ గురించి చెబుతూ బెక్ అతని ప్రభావానికి లోను కాని వారు లేరని ,ఎలా ఆలోచించాలో నేర్పిన మహనీయుడని ,అందమైన అద్భుతమైన జీవులను ఎలా పట్టుకోవాలో ఎలా పరిశీలించాలో నేర్పాడని అంటాడు .రికెట్స్ ఇరవైయిదేల్లు సముద్ర జీవుల specimen collection లో  గడిపాడు . tide pool fish ను  వెన్నెముక లేని ఎన్నో స్పెసిమెన్ లను
కని పెట్టాడు .దీనివల్ల అతనికి sea shore ecology బాగా అర్ధమైంది .ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇరవై సముద్ర జీవుల చెందిన స్పెసిమెన్ లను రికెట్ అండ్ స్టీన్ బెక్ అని వాళ్ల పేర్ల మీద గౌరవం గా పిలుస్తున్నారంటే వారి జీవ శాస్త్ర కృషి ఎంతటిదో తెలుస్తోంది .సముద్ర జీవావరణ అధ్యననానికి ఆ స్నేహితుల సేవ అపూర్వ మైనది అని శాస్త్రజ్ఞులు ప్రశంసించారు .
                        కానేరి రో అనేది కాలిఫోర్నియా లోmonetary వుంది .ఆ ప్రాంతాన్ని ,అందులోని జనాభాను బెక్ తిట్టినా 1957 తర్వాత ఆ ప్రదేశం గొప్ప యాత్రా స్థలం గా మారింది .అక్కడ ప్రసిద్ధమైన చేపలు దొరుకు తాయి .మనిషి స్వార్ధం తో అక్కడి చేపల మరణానికి కారకుడు అవుతున్నాడని బెక్ బాధ పడ్డాడు .ఇవ్వాళ అదొక గొప్ప వ్యాపార కేంద్రమైంది .నగలకు ,ఫాషన్ కు ,గాల్లెరీలకు ,నిలయమైంది .ఇదంతా ఎలా జరిగిందో తెలుసు కుంటే ఆశ్చర్య పోతారు .ఇదంతా తాము ఆప్యాయం గా ఆరాధించే తమ మహా రచయిత జాన్ స్టీన్ బెక్ ను చిరస్మరణీయం చేయటానికి జరిగిన మార్పు .తన కాలమ్ కంటే ముందు ఆలోచించే గొప్ప రచయితకు అక్కడి ప్రజలిచ్చిన నజరానా .మన దేశం లో మనం ఏ రచయిత కైనా ఇంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చి కృతజ్ఞత తెల్పుకున్నామా ని ఆలోచిస్తే సిగ్గేస్తుంది .
                           స్టీన్ బెక్ దాదాపు ముప్ఫై పుస్తకాలు రాశాడు .కొన్ని సినిమాలు గా ,టి.వి.సీరియల్స్ గా వచ్చాయి .ఇరవై తొమ్మిది పుస్తకాలు academic nominations పంపబడినాయి ..పులిజర్ బహుమతి పొందాయి .1962 లో నోబెల్ బహుమతిని సాహిత్యం లో పొందాడు జాన్ స్టీన్ బెక్ ..ఇప్పుడు అక్కడ స్టీన్ బెక్ సొసైటీ ఏర్పడింది . Stein Beck”s news letter and quarterly journals
ప్రచురింప బడుతునాయి .రెండు విశ్వ విద్యాలయాల్లో స్టీన్ బెక్ research సెంటర్ లు నడుస్తున్నాయి .Intenational Stein Beck Congress ఏర్పడింది .door stop size biography లు ఆయనపై వచ్చాయి .చాలా మంది ఆయన రచనలపై పరిశోధనలు చేసి పీ.హెచ్.డి. పొందారు .ఇప్పటికీ అతని పుస్తకాలు ఏటా ఇరవై లక్షల కాపీలు అమ్ముడు పోతూనే వుంటాయి .ఆయన ,ఆయన రచనలు చిరంజీవులు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదను కుంటా. బెక్ పుస్తకం east Eden   oprah’s book club లో  re launch అయి గౌరవాన్ని ఆపాదిన్సింది .1998 లో అతని స్వగ్రామం సాలినాస్ లో multi million dollor  stein beck center ఏర్పడింది .అతను జీవితాన్నపుడు ద్వేషించిన వారంతా ఇప్పుడు అతన్ని ఆరాదిస్తున్నారు .అతని స్మృతి చిహ్నాలలో గొప్పది మానేటరి లోని ocean వ్యూ avenue .దీన్ని కానేరి వ్యూ అంటారు .ఇదిప్పుడు గొప్ప tourist attraaction . అయింది
               రికెట్స్ తో కలిసి రాసిన పుస్తకం లో the reports of biologists are the measures ,not of the science but of the men themselves ”అని రాశారిద్దరూ . రికెట్స్ రాసిన between the facific tide పుస్తకం a claassic in the literature of marine bilogy అన్నారు అంతా .దీని రచనలో బెక్ సహాయం  ఎక్కువ గా వుంది .బెక్ రాసిన ది grapes of wrath నవల ను 93 పని రోజుల్లో అయిదు నెలల్లో రాశాడు బెక్ .దాన్ని 75 వేల డాలర్లు ఇచ్చి సినిమా కు కొనుక్కున్నారు .అంత డబ్బు ఏ రచయితకు అప్పటి వరకు ఇవ్వలేదట . .ఆ సినిమా డైరెక్టర్ జాన్ ఫోర్డ్ కు అకాడెమి అవార్డు వచ్చింది .తర్వాత  the grapes of the wrath పుస్తకం ecology   పాఠ్య పుస్తకం అవటం బెక్ కు వున్న జీవావరణ అవగాహనకు జోహార్ అనిపిస్తుంది .అతని మరో పుస్తకం  sea of cortez  అన్నది a record of an ecological study of marine fauna ”అని పేరు పొందింది .సాధారణ నవలా రచయిత అని ముద్ర పడ్డా బెక్ ఇప్పుడు అసాధారణ జీవావరణ శాస్త్ర వేత్త అని పించుకోవటం  ఆశ్చర్యం ,ఆనందం కలిగిస్తుంది
                                                                    మరి కొన్ని విషయాలు తరువాత మనవి చేస్తాను  ——మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 13 -07 -11 .క్యాంపు –బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

పీయూష లహరి

   పీయూష లహరి
     ”విత్తం త్యాగ సమేతం ”–డబ్బు త్యాగంతో రాణిస్తుంది ,సార్ధకత్వం కల్గిస్తుంది .
”దానం  ప్రియవాక్య హితం —జ్ఞానం అగర్వం –క్షమాన్వితం శౌర్యం —విత్తం త్యాగ సమేతం –దుర్లభమే త చ్చతుర్భద్రం ”ఇవన్నీ కలిసినప్పుడు మనిషికి అసాధ్యమైనది లేదు
”ఓరి దేవుడా !నా పూర్వ జన్మలో ఒక్కసారి కూడా నీకు నమస్కారం చేయలేదు .తర్వాత జన్మలో కూడా చెయ్యను .నన్ను ఈ రెంటికీ క్షమించు ,.”అని ప్రార్ది౦చాడట ఒక భక్తుడు .దీని భావం గమనిద్దాం .పూర్వజన్మలో నమస్కారం చెయ్యలేదు కనుక నాకు ఈ జన్మ వచ్చింది .ఈ మానవ శరీరం లో వున్నాను .ఇప్పుడు నమస్కరిస్తున్నాను కనుక నాకు పునర్జన్మ లేదు .కనుక వచ్చే జన్మలో నమస్కారం చెయ్యను అని గొప్ప చమత్కారం చేస్తూ భక్తి గొప్ప తనాన్ని చాటి చెప్పాడు కవి..                                                            సదాశివ బ్రహ్మే౦దులు ఒక శ్లోకం లో  ”ప్రాకృత భోగ వాసరే తామ్యాసి చేతో మధు కుతో హెతొహ్ —-న్యాగ్రోధ బీజ ముప్త్యా శోచంనివ నామ్ర మస్యేతి”  మామిడి  టెంక పాతితే మామిడి చెట్టే వస్తుంది రావి గింజ పాతి మామిడి చెట్టు రావాలంటే రాదు .ఎన్నోపాపాలు   జన్మ జన్మల్లో చేసి దుఃఖ పడుతున్నాను అంటె ఏమి ఫలం ?ఏది చేస్తే దాని ఫలితమే లభిస్తుందని తెలుసుకో .
చేసే పనిలో సు +అనుస్తితం అంతే స్వనుష్టితం అంటే sincerity కావాలి  .
శృంగేరి పీఠాదిపతిశ్రీ శ్రీ అభినవ శివానంద భారతి స్వామి —సుందర కాండ పారాయణ చేసేటప్పుడు ఎదురుగా ఒక చెక్క కుర్చీని వేసి ఖాళీ గా ఉంచే వారట .ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని వింటాడని శ్రీ వారి ధృఢ విశ్వాసం .
”యదా సకల భూమండలాది పతిరపి –అయోధ్యా పథిహ్ ఇతి వ్యవహ్రియతే ”అంటారు శంకర భగవత్పాదులు .రాముడు సకల భువన పతి అయినా అయోధ్యాపతి   అనే అంటారంతా ..నిజంగా ఆయన సకల భువనాలకు అధిపతే కదా .
దేవుడు మన లాంటి వాడు కాదు .మనకు కాళ్ళు చేతులున్నాయి .వాటితో అన్ని పనులు  చేస్తాము .కాని ఆయనకు ఇవిలేకపోయినా   అన్ని పనులు చేయ గలడు .
”స్తానాభి లాస్షీ తపసి స్థితోహం త్వాం ప్రాప్యావాన్ దేవమునీంద్ర గుహ్యం –కాచన్ విచిన్వన్నపి దివ్య రంతం -స్వామిన్ –క్రుతార్దోస్మి వరం న యాచే ”  ఇవి ధ్రువుడు అన్న మాటలు .ఏదో కావాలని తపస్సు చేశా .నీ దర్శనం లభించింది .ఇంకేమి వరం కావాలి నాకు ?
కాశీ హిందూ విశ్వ విద్యాలయం శంకుస్థాపనకు మదన మోహన మాలవ్యా శృంగేరి పీతాదిపతి శ్రీ శ్రీ శివానంద నరుసింహ భారతీ తీర్ధ స్వామిని ఆహ్వానించారు .అందుకు శ్రీ వారికి తగిన సమయం లేక పోయింది .రాలేనని చెప్పారు .వస్తే తప్ప కదలను అని భీష్మించాడు మాలవ్యా .ఇద్దరు ఉద్దండులె .చివరికి గురు పాదుకలు ఇచ్చి పంపారు స్వామీజీ .వాటిని పూజనీయ స్థానం లో వుంచి కార్యక్రమాన్ని నిర్వహించారు మాలవ్యాజీ .
”గీతలో రోజూ కనేసం ఒక శ్లోక మైనా చదువు .విష్ణు సహస్ర నామాలలో ఒక్క నామ మైనా పలుకు దేవునిపై ధ్యాస ఉంచు అనవసర విషయాలపై దృష్టి మరల్చకు ”అని హితవు చెప్పారు శ్రీ శంకరులు.ఇది అందరు పాటించాల్సిన విధానమే .
”భక్త్యా పుండరీకాక్షం స్తవేరార్చన్నరః-సదా ”అన్నాడు భీష్ముడు భగవంతుని భక్తి తో సేవిస్తే అదే గొప్ప పని అని భావం .
ఒక భక్తుడు గోపికను ఇలా వర్ణి౦చాడట”విక్రేతు కామాఖిల గోపబాలా — మురారి పాదార్చిత చిత్త వ్రుత్తిహి—దధ్యాధికం మొహవశాదవేచ –గోవింద దామోదర మాధవేతి ”   దీని అర్ధం –ఒక గోపిక పాలు ,పెరుగు అమ్మటానికి వెళ్లి శ్రీ కృష్ణ ధ్యానం లో పాలోయమ్మ పాలు ,పెరుగోయమ్మ పెరుగు అనకుండా గోవిందా ,దామోదరా మాధవా అంటోందట .అది భక్తీ తన్మయం .
శంకరాచార్యులే స్వయం గా ”నారాయణ ,కరుణామయ ,శరణం కరవాణి తావకో చరణౌ –ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు”అని ప్రార్ధించారు .నీ పాదాలే నాకు శరణు .నా నాలుక ఎప్పుడు నారాయణ ,కరుణామయ ,శరణం ,కరవాణి ,తావకో చరణౌ ”అనే ఆరు మాటలే పలకాలి
గుడీ ,గోపురం ఎత్తు గా ఉండ  ”టానికి కారణం మనిషి అల్పత్వాన్ని తెలియ జేయ టానికే .
”అహమేవ మాతో మహీపతే రితి సర్వః –ప్రక్రుతిరిష్వ  చింతయేత్ ”.అన్నాడు కాళిదాసు  రాజు దగరకు వచ్చిన ప్రతి వాడు రాజు తనను బాగా చూశాడు అనుకు౦టాడట –ఇది దిలీప మహారాజు విషయం లో చెప్పిన మాట .
దిలీప మహారాజు అనే వాడట ”ఈ మనిషి మంచి వాడా కాదా అని నాకు అవసరం లేదు .అతను తగిన వాడితే అతను నాకిష్టుడే .మందు చేదైనా జబ్బు నివారిస్తే మంచిదేగా ”
పక్షుల ,జలచరాల పాద చిహ్నాలను గుర్తించ లేనట్లే జ్ఞానుల గమనమూ తెలుసుకో లేము .
విశ్వం అంతా ధర్మం మీదే నడుస్తోంది ”ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాః ”.అన్నది వేదం .
దేవుడి దయ అంటె చేతిలో కర్ర పట్టుకొని గొర్రేపిల్లాడిగా కాపలా కాయటం కాదు .మనం చేసే పనికి ఫలితాన్నిచ్చేవాడు అని భావించాలి .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

అమృత బిందువులు

అమృత బిందువులు
”దయా సర్వ భూతేషు ”అనేది లక్ష్యం కావాలి .శాంతి ,అనసూయ శౌచం ముఖ్యం .దయ అంటే ”పర దుఃఖ ప్రహరనోచ్చాయా –దయా ”ఇతరుల బాధ తీర్చటమే దయ ”.తతోపి ఆశా గరీయశి ”అంటే భగవంతుని కంటే గొప్పది ఆశ.
రామాయణ సారం ”రామా వర్ద్వర్తి తవ్యం -రావణా వన్నవర్తి తవ్యం ”  రాముడి లా ప్రవర్తించండి .రావణునిలా వద్దు .
దొరికిన దానితో తృప్తి పడాలి
నీలకంఠ దీక్షితులు మామూలు మనిషే.  మనిషి కి ,కవికి గల తేడా గురించి బాగా చెప్పారు .మామూలు మనుష్యులు ఉపయోగించే శబ్దాలే కులూ ఉపయోగిస్తారు .అయితే వారి చేతిలో ఆ శబ్దాలకు మహత్తు ,సంమోహనత్వం కలుగుతుంది .కవి భావాన్ని స్పష్టం గా చెప్పగలడు .అదే గీటు రాయి గొప్ప కవి అని చెప్పటానికి .ఆది శంకరాచార్యులు అలాంటి అపురూప కవి .
          శివ పాదాది కేశాంత స్తోత్రం లోశివుని   గ్రీవాన్ని అంటే కంఠాన్నిశంకరాచార్య గొప్పగా వర్ణించారు
”సంభ్రాన్తాయాఃశివాయః పఠర్విలయ భియా సర్వలోకోప తాపం —త్శం విగ్నస్సాపి విశ్నొహ్  సరభ సముభాయో ర్వారనా ప్రేరనాభ్యాం
మధ్యే త్రి శంక వీయమను భవతి దశాం యత్ర హాలాహలోష్మా –సోయం సర్వ పదాం నః శమయతు నిచయం నీలకంతస్య కష్తః ”
సగభాగం పార్వతి ,సగభాగం విష్ణువు ,శివుని శరీరం లో ఆక్రమించారు .క్షీర సాగర మధనం లో హాలాహలం ఉద్భవించి ,లోకాలను తల్లదింప జేస్తోంది .దాన్ని ఎలా ఆపాలో ఎవరికి తెలియటం లేదు .అప్పుడు శివుడు అకస్మాత్తు గా దాన్ని మింగేశాడు .పార్వతి భయ భ్రాంత మైంది .అది లోపలి పోతే తాను నాశనం అని పార్వతి ,బయటకు వదిలేస్తే లోకాలు దహించి పోతాయని విష్ణువు బాధ పడ్డారట అని దీని భావం .అందుకని విషం శివుని కంఠం లోనే దాచేశాడు .త్రిశంకువు లాగ అటు లోపలి చేరక బయటకు రాక కంత   భాగం లో చేరి నీల కంట నామం సార్ధక మైంది .ఇదీ భగవత్పాదుల అపూర్వ కవితా దృష్టి ,సృష్టి .
అలాగే వేరొ శ్లోకం లో ”నా బుద్ధి పరిపరి విధాల పోతోంది .అది నేఐ ద్రుధం గా ఉండేట్లు చెయ్యి చూసిన్డల్లా కావాలని పిస్తోంది వ్యామోహాన్ని అనగేట్లు చేయి సంత్రుప్తినివ్వు .సంసారాన్ని దరిచేరే మార్గం చూపించు .మోక్షం ప్రసాదించు .ఇది ఆయన తనకు తాను చెప్పుకున్నా ,మనందరి తరఫునా చెప్పారు .లేకపోతే ఆయనకు వ్యామోహాదులు ఉంటాయా ?   .
”ఉధృత నగాభి దనుజ ,దనుజ కులా మిత్ర ,మిత్ర శశి హ్రుస్టే –హ్రుష్టే భవతి ప్రభావతి ,న భవతి ,కిం భవ ,తిరస్కారః ”అంటారు ముక్తపద గ్రస్తం లో అపూర్వం గా .ప్రతి శ్లోకం లో గొప్ప అనుభవం ,అనుభూతి వుంటుంది .పరిణత ప్రజ్ఞకు నిదర్శనం వారి కవిత .సత్ఫలాలను ,ఫలితాలను ఇస్తాయి .
”వేద పూర్వకస్తు నాస్యాదికార ఇతి సిద్ధం ”.జ్ఞాన సముపార్జనకు వేదాన్ని అందరు తెలుసుకోవాలి అనిశంకరుల  .భావన .
”దానేన ద్విషంతో ”దానం వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు .దానం ప్రియవాక్య హితం గా వుండాలి దీనినే శ్రీ కృష్ణుడు సాత్విక దానం అన్నాడు ..”దాతవ్యమితి ”అనగా ప్రతిఫలా పేక్ష లేకుండా దానం చేయాలి .
”క్రుత్వాసహితం హి సంతాపం శాపం దేహేతి నో వదేత్ ”–ఇతరుల మనసును కష్త పెడితే తప్పక కష్టాల పాలు అవుతారు .అందులో అవతలి వారి ప్రమేయం వుండదు
”జ్ఞానం అగర్వః ”జ్ఞానం గర్వాన్ని చేదించాలి అని భగవత్    పాదులన్నారు .ఒకడు జ్ఞాని దగ్గరకు వెళ్లి అజ్ఞానాన్ని పోగోత్తమన్నాడు .ఆయన ఈ లోపల మీరు దానిపై విచారణ చేస్తుండండి .ఆ తర్వాత రండి నాకు తెలిసింది అనిపిస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను ”అన్నాడట .
”క్షమాన్వితం శౌర్యం ”క్షమా ,ఓర్పు ఉన్నదే శౌర్యం .శౌర్యం తో కలిసిన క్షమ వల్లే శోభిస్తారు .
                  మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -07 -11 క్యాంపు —బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

సుధా సింధు

సుధా సింధు
            అహంకారాలు మూడు ఒకటి అహం బ్రహ్మాస్మి రెండు మిధ్యాహంకారం మూడవది గౌణ.”పుత్రే పుష్టి అహం పుష్టి –పుత్రే నష్టే అహం నాస్తి ”పుత్రుడు బాగుంటే నేను బాగుంటాను .ఇది గౌణ అహం .చివరిది రెండోది పోతే మొదటిది లభిస్తుందని విద్యారణ్య వచనానికి శంకర భాష్యం .
     అహంకారం లో కారం పోవాలంటే రజోగుణం ,దానికి కారణ మైన కోరికలు వాసన ,మనస్చాన్చాల్యం పోవాలి అప్పుడే అహం కలుగుతుంది .
paul brinton అనే పాశ్చాత్యుడు శ్రీ రామనులను సందర్శించి అడిగిన ప్రశ్నకు ”who am I ”అని ఆలోచించ మన్నారు మహర్షి
నీళ్ళమీద నడిచే శక్తి పొందాను అని ఒకాయన శ్రీ రామ కృష్ణ పరమహంస దగ్గర గొప్పగా చెప్పాడట .”పావలా ఇచ్చి నదిని దాటటానికి నీ జీవితం అంతా వృధా చేసుకున్నావు నాయనా ”అన్నారట పరమహంస .
   ఒకసారి దుర్యోధనుడిని అడిగారట ఎవరో ”అన్ని శాస్త్రాలు చదివావు కదా .ఎందుకు చేదుగా ప్రవర్తిస్తున్నావు ? ”  దానికి అతని సమాధానం ”జానామి ధర్మం నచ మే ప్రవ్రుత్తిహ్ -జానామి అధర్మం నచ మే నివ్రుత్తిహ్ ”దాని అర్ధం –ధర్మమేదో నాకు తెలుసు అయితె దాని వైపు నా మనసు పోవటం లేదు .అధర్మం బాగా తెలుసు నా మనస్సు అటే లాగుతుంది .అందుకే పాపాలు చేస్తున్నాయి .నేనేమి చేయను ?
        ఒకసారి అరునునుడు కృష్ణునితో ”నువ్వు చెప్పేవన్నీ తెలుస్తున్నాయి బావా .కానీ లోకం లో మానవులు విరుద్ధం గా ప్రవర్తిస్తున్నారు కారణం ఏమిటో తెలియటం లేదు ”అన్నాడు /.ఆపుడు కన్నయ్య ”కోరికలు ,కోపం వారిని అలా ప్రవర్తిన్చేట్లు చేస్తాయి .అన్నాడని మనకు గీత తెలియ జేస్తోంది .
పూర్వం గురుకులాల్లో శిష్యుడు తప్పు చేస్తే చన్నీటి తో స్నానం చేయించే వారట .అంతే రోజూ శిష్యుడికి వేడి నీటి స్నానమే ఉండేదని తెలుస్తోంది
      ”తస్మాత్ యత్ పురుషో మనసాదిగాచ్చతి –తద్వాచా వదతి తత్కర్మనా కరోతి ”అని వేదం అన్నది .అంటే మానవుడు ఏది ఆలోచిస్తాడో ,చెప్తాడో ,అదే  చేస్తాడు . ”మనసా నిష్ట చింతనం ”మనసు లో చెడు ఆలోచన వస్తే అది పాపమే .
”నీ ఉనికి కోసం చాలా ప్రయత్నాలు చేశా. నిన్ను నిరూపించటానికి ఎన్నో వాదాలు చేశా .ఇంకా కొంతమంది రాతి హృదయం వున్న వాళ్ళున్నారు .వాళ్లకు నమ్మకం కలగటం లేదు .అయినా వారిపై నాకు జాలి వుంది .వారినీ క్షమించు .యందు కంటే వారంతా ఎప్పుడు నీ స్మరణే చేస్తున్నారు ..ఈశ్వరుడు లేదని వాదిస్తూ ,నీ నామమే వాళ్ళు సదా జపిస్తుంచే మూడులు వారు .వారిమీద అపార నీ కరునామ్రుతం  కురిపించు ”అని దీనులు ,మూధుల పై సానుభూతి చూపించాడు ప్రహ్లాదుడు .   ”వితదాభి నివేశః ”   wasteful attachment పనికి రాదు అని భావం
వచనేకా దరిద్రతా ”మాటలో పారుష్యం పనికి రాదు అది పాపమే .”అనృతం చైవ ”అబద్ధమూ పాపమే .”పైశూన్యం చాపి సర్వశః ”–చాడీలు చెప్పటం నేరం .”అసం బద్ధ ప్రలాపం నేరం ”అనవసరం గా మాట్లాడటము నేరమే .ఇవన్నే పడి పాపాలు .మూడు బుద్ధికి ,నాలుగు నాలుకకు ,మూడు శరీరం తో చేసే పాపాలివి .
ఉపదేశ పంచకం లో శంకర భగవత్పాదులు ”జన కృపా నైస్తార్య ముత్చ్రుజ్యతే ”అన్నారు అంటే ఇతరుల సానుభూతి కోరరాదు .వారి కోపం కూడా పనికి రాదు .పెద్దల దారిలో నడవాలి .
    వాసనలు మూడు .మొదటిది శాస్త్ర వాసన ఇది మూడు రకాలు .పాత ,శాస్త్ర ,అనుష్టాన వ్యసనాలు .పాత వ్యసనం అంటే నేర్చుకోవాలనే తపన .భరద్వాజ మహర్షి జీవిత కాల మంతా ఏదో ఒకటి నేర్చు కున్తూనే జీవించాడు .ఇంద్రుణ్ణి ప్రార్ధించాడు .ఆయన మహర్షితో ”నువ్వు నేర్చింది పర్వతం లో అణు మాత్రమే .ఎన్ని జన్మ లైనా
నేర్చుకోవటానికి ఇంకా మిగిలే వుంటుంది .సాగునో పాసన తో జీవితం ధాన్యం చేసుకో ”అని చెప్పాడట .పతన వ్యసనానికి భరద్వాజుడు ఉదారణ .
  రెండోది శాస్త్ర వ్యసనం .శాస్త్రాలన్నీ నేర్వాలనే కోరిక .ఒక సారి నారదుడు తనకు శాస్త్రాలన్నే తెలుసు అన్నాట్ట సనత్కుమారునితో .”ఆత్మ విద్య వచ్చా ”అని అడిగాడాయన .రాదనీ చెప్పాడు నారదుడు .ముందు దాన్ని సాధన చెయ్యమని సలహా ఇచ్చాడు .
      దూర్వాసుడు చదివిన శాష్ట్రాలన్నే బాలలకు ఎత్తుకొని వెళ్లి శివుడికి చూపించాడట .అక్కడున్న ఒక జ్ఞాని ‘నీ పరిస్థితి గాడిదమీద వున్న బట్టల మూట లా వుంది .దానికి ఆ బరువే తెల్సు .అందులో ఏముందో తెలీదు .నీ పరిస్థితీ అదే .అందులోని సారం గ్రహించు ”అని బుద్ధి చెప్పాడు
”భుక్తయే నతు ముక్తయే ”శాస్త్ర జ్ఞానం భుక్తికే కాని ముక్తికి కాదు .
                                   మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -07 -11 క్యాంపు –బెంగళూర్ –

 

Posted in రచనలు | Leave a comment

ధర్మ ధార

   ధర్మ ధార
    ”నేను అజ్ఞానానికి సాక్షి గా వుండే దేవుడిని ”అనే నిశ్చయం వల్ల అనర్ధాలన్నీ తొలగి పోతాయి .”నా జ్ఞానం స్యామాహం దేవో జ్ఞాన సాక్షేతి నిశ్చయాత్ -సర్వానర్ధ నివ్రుత్తిస్యాత్ ”అంటుంది వేదాంత డిండి మం .
  కాళీయ మర్దనం అంటె jump into the nector
  గుడాకేశ అంటె అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడు –అర్జునుడు
బయట వున్న కుండలో ,లోపల బయట అంతా శున్యమే .నీళ్ళతో వున్న కుండలో లోపల బయట అంతా పూర్ణం గానే వుంటుంది ఇదే ఆత్మ సర్వ వ్యాపికత్వం అంటారు రమణ భగవాన్
  బలరాముడి మామ తన కూతుర్ని ఎవరిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు .బ్రహ్మ నవ్వి .నా దగ్గర వున్న క్షణ కాలమ్ లో భూలోకం లో యుగాలు గడిచి పోయాయి .ద్వాపరయుగం నడుస్తోంది .వెళ్లి బలరామునికిచ్చి పెళ్లి చెయ్యి అని పంపించేసాడు ఇది భాగవత కధ .మన శాస్త్రజ్ఞులు తెలుసు కొన్న black hole ,event horizon ఇలాంటివే .
   ఒక సారి తద్దినం పెడితే ,పితృదేవతలకు రోజూ ,భోజనం పెట్టినట్లే .
        శ్రీ రామ కృష్ణ పరమ హంసకు నోటి కాన్సెర్ వచ్చింది .ఏమీ తినలేక పోయేవారు .ద్రవ పదార్ధం కూడా లోపలి వెళ్ళేది కాదట .ఒక శిష్యుడు ఆయన బాధ చూడలేక దగ్గరకు వెళ్లి ”స్వామీ !అమ్మను ప్రత్యక్షం చేసుకొని వ్యాధి నివారించుకో వచ్చు కదా ”అని సలహా చెప్పాడట .అప్పుడు పరమ హంస నవ్వి ”అన్ని నోళ్ళతో అంతా తింటున్నారు కదా ఈ ఒక్కనోటితో తినక పొతే ఏం అని అమ్మ నన్ను అడిగితె నా దగ్గర సమాధానం లేదు ”అని తన సర్వాత్మనా భావాన్ని ఎరుక పరిచారట .
     తార అంటె తరించేది అని అర్ధం .మనమంతా తారలమే .అందుకే ఆమె ప్రాతస్మరనీయురాలు .
వాలి అంటే వలయితేవాలి .మాయా మొహం చుట్టేసి వున్న వాడు అని భావం  దైవ కృపతో మాయ తొలగాటమే వాలి వధ .
      సుగ్రీవుడు అంటె షట్విశిష్ట మైన శుద్ధి –ఇది దాటితే కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రం వుంటుంది .విశుద్ధులైన వారికి పరమేశ్వరాజ్న అమృత స్వరూపాన్ని చేస్తుంది . చక్రాలతో గ్రీవం అంటె కంఠం దగ్గర విశుద్ధ చక్రం వున్న వాడుసుగ్రీవుడు ..అందుకే తార వాలి వధ తర్వాత సుగ్రీవుని భార్య అయి పతివ్రతల్లో స్థానం పొందింది .
   విగ్రహం అంటె విశిష్టం గా గ్రహించేది అని భావం
తులసీ దాసు శ్రీ రాముని ప్రార్ధిస్తూ ”రామా !నీ నివాసమైన నా హృదయం లో నిన్ను వెళ్లగొట్టే కామ,క్రోధాదులైన ఆరుగురు శత్రువులు ఆక్రమించారు .వాళ్ళను బయటికి పంపి ,నీ స్థానం లో నువ్వు ఉండక పోతే నీ గొప్ప తనం ఏమిటి ?అని గడుసుగా ప్రశ్నించాడు .
మానవుడు ఒక్కడే తల పైకి ఎత్తుకొని తిరగ గలడు .జంతువులవన్నీ అదో ముఖాలే .
  చిల్లులు వున్న కుండ లోని దీపం చిల్లుల ద్వారా కాంతిని గది అంతా ప్రసరింప జేస్తుంది .అలాగే మన లోని ఆత్మ చైతన్యం జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు ప్రకాశించి ప్రపంచాన్ని ప్రకాశింప జేస్తుంది .జ్ఞానం పొందుతుంది .అదే ఆత్మ దీపం .అందర్లోనూ ఆ జ్యోతి వుంది .
   కృష్ణార్జునులు ఒక సారి ఒక పేద వాడింటికి వెళ్ళారు .వాడు ఆవు పాలు ఇచ్చి సేవించాడు వారిద్దరినీ .కృష్ణుడు పాలు తాగి ”నీ ఆవు చావ ”అని దీవించాడట వాణ్ని .తర్వాత ఒక ధనవంతుడింటికి వెళ్ళారు వాడేమి వీళ్ళకుపెట్టలేదు   పైగా ”దున్న పోతుల్లాగా వున్నారు .పనిచేసుకొని బతక లేరా ”అని తిట్టాడు ..”నీ సంపదా ,పిల్లలు పెరగాలి ”అని కృష్ణుడు వీడిని దీవించాడు .కృష్ణుని భావం ఏమిటో అర్జునునికి అర్ధం కాక వివరించమని కోరాడు .కృష్ణుడు ”పేద వాడు నన్ను చేర టానికి వాడి ఆవే అడ్డం .అది పొతే నాలో ఐక్యం అవుతాడు .అందుకని అలా అన్నాను .ధనవంతుడు సంతానం పెరిగి ధన గర్వంతో పుడుతూ ,చస్తూ జంజాటం లో మునిగి అలానే వుండాలని దీవించా ”అని వివరించాడు .త్యాగమే మోక్షానికి మార్గం అని దీని వల్ల తెలుసుకో తగిన సత్యం .
పండితుడు ”అహమేవ పండితః ”అనుకొన్నాడు .తర్వాత ”అహమపి పండితః ”అని తెలుసు కున్నాడు .చివరికి ”అహం న పండితః ”అని జ్ఞానం తెచ్చుకొన్నాడు .
  హనుమ అంటె బుద్ధి —సీతా అంటె ప్రకృతి .–అంటె పరమేశ్వరుని నుంచి వేరు అయినది .వారిద్దరిని సంధానం చేశాడు హనుమ అదే సుందర కాండ .
                                       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -07 -11 క్యాంపు —బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

ఆలోచనామృతం

                      ఆలోచనామృతం
కాళీయ మర్దనం అంటే మనసు లోని దురాలోచనలను పోగొట్టుకోవటమే . విషం లేని పాములా మనసును శుద్ధి చేసుకోవటమే దీని లో ఉన్న పరమార్ధం .అందుకు మనస్సు అనే సరస్సు లోకి దూకాలి .
కళ్ళకు కన్ను అయిన అన్ని చూడాలి స్వప్రకాశాన్ని చూడ టానికి వేరే కన్ను అవసరం లేదు .
ప్రాణ మయ కోశ౦ మాట్లాడటం ,నడక ,విసర్జన మొదలైన సుఖ దుఖాలతో వున్న క్రియలతో ప్రాణం తో కలిసి వుంటుంది ఇది రజోగుణ ప్రభావానికి లోని పని చేస్తుంది .
జ్ఞానేంద్రియాలు లేక పోయినా స్వప్నం లో దృశ్యాలు కనిపించటం మనోమయ కోశం .ఇది సత్వ గుణ ప్రధానమైంది .
జ్ఞానేంద్రియాలు ,నిశ్చల మైన బుద్ధితో కూడినది విజ్ఞాన మయ కోశం .
జ్ఞాని కళ్ళున్న గుడ్డి .నోరున్న మూగ .చెవులున్న చెవిటి  .ప్రహ్లాదుడు ,శబరి ఈ కోవకు చెందిన వారు .
man minus  mind is God ..God plus mind is man .
”దృశ్య  వారితం    చిత్త  మాత్మనః  .చిత్త    దర్శనం   తత్వ         దర్శనం  ”అంది   ఉపనిషత్ సారం
మనస్సు పై ఆత్మ కాంతి పడితే జగత్తు ప్రతిఫలించాడు అని రమణ మహర్షి అంటారు .”కామః ,సంకల్ప ,విచికిచ్చా ,శ్రద్ధా ,అస్రద్దా ,ధృతి ,అద్రుతి హరీ ,ఇతి సర్వం మనః ఏవ ” అంది బృహదారణ్యకం .అంతే కామం ,సంకల్పం ,సంశయం ,శ్రద్ధ ,అశ్రద్ధ ,ధైర్యం ,అధైర్యం ,లజ్జ ,ధీ ,భయం అన్నీ మనస్సు అంటేఅంతఃకరణ అని అర్ధం .
ఆనంద మయుడు ఆనంద స్వరూపుడు కాదు .మయ శబ్దం భోక్తగా చెప్పబడింది .జ్ఞాని ఆనందానికి ,సుషుప్తి ఆనందానికి ఇదే తేడా అన్నారు వివేకానంద .
ఈశ్వర అంటే ఈశ నశీలః అంటే నియంత్రించే వాడు అని అర్ధం .జనానా దేవతు కైవల్యం .
ధ్యానం నుంచి బయటకు రాగానే మనసు బహిర్ముఖం అవుతుంది .ఏ.సి .లోంచి బయటకు రాగానే ఎండ తగిలి నట్లు .
ఆత్మ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతః భవతి .అంటే ఆత్మ తెలిస్తే జగత్తు అంతా తెలిసినట్లే .
జ్ఞానం పొందాలను కోవటం లోనే అజ్ఞానం ఉందంటారు రమణులు .
ఆధ్యాత్మ విద్యా విద్యానాం అనగా ఆధ్యాత్మ విద్యే అసలు విద్య .
మనసును ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి .అదే చిత్త శుద్ధి .అంటే స్వార్ధాన్ని వదిలించు కోవటమే .
కామ క్రోధాదులు ఆరింటిని చంపి ,త్రికరణాలు వదిలి ,ద్వైత దృష్టిని వీడి సమస్తం ఎకత్వమనే ఆత్మ తత్వాన్ని తెలుసు కోవటమే మోక్షం .
research అంటే వున్నది తెలుసు కోవటమే .search కాదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -07 -11 క్యాంపు –బెంగళూర్

Posted in రచనలు | Leave a comment

మా మైసూర్ సందర్శనం —02

                 మా మైసూర్ సందర్శనం —02
                శ్రీ రంగ పట్నం నుంచి మైసూర్ కు వెళ్ళే దారిలో కావేరి ఆనకట్ట నుంచి మైసూర్ కు మంచి నీళ్ళు సరఫరా చేసే వ్యవస్థ కన్పించింది.  చాలా ఎత్తైన పిల్లర్ల మీద నీటిని  తోట్టేల్లాంటి సిమెంట్ కాలువ ద్వారా సరఫరా చేస్తున్నారు .గొప్ప టెక్నికల్ vision .అది మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ప్రణాళిక .మైసూర్ జన దాహార్తి తీర్చిన అపర భగీరదుడాయన. బృందావన్ గార్డెన్ల నుంచి ఈ సరఫరా .దాదాపు నలభై కిలో మీటర్ల దూరం .అద్భుతమైన ఆలోచన ,ఆచరణ .దీనికి ఆమోదం చెప్పి ఆవిష్కరిమ్పజేసిన మైసూర్ మహారాజు ధన్యుడు ,స్మరనీయులు ఆయన ,మోక్షగుండం కూడా .ఆయనది జ్ఞాన ,విజ్ఞాన గుండం .జనం హితమే మోక్షమని నమ్మి ఆచరించిన ,అపర విస్వేస్వరుడు .గంగను తలపై ఆయన ధరిస్తే ఈయన నిరంతర కావేరి ప్రవాహం సాధించాడు .
              కావేరి నదిలో ముఖ్యం గా తలకావేరి లో అంటె జన్మస్థానం లో  అంటె మైసూర్ కు 164 కిలోమీటర్ల దూరం లో వున్న చోట తులా సంక్రమణం నాడు స్నానం చేస్తే మోక్షమే .ఇది అక్టోబర్ లో వస్తుంది .ఇక్కడ కావేరి చిన్న గుంట గా కన్పించటం విశేషం . అక్కడినుంచి ఒక సిల్క్ పాలెస్ దగ్గర బస్సు ఆగింది అక్కడ షాపింగ్ చేసాము .40 గ్రాముల సిల్క్ చీరలు ఇక్కడ ప్రత్యేకం .ఉంగరం రింగ్ లో నుంచి మొత్తం చీర దూరి రావటం దీని ప్రత్యేకత ,నలభై గ్రాములే వుంటుంది చీర బరువు .అందుకే ఆ పేరు .పైన మంచి గంధం స్టోర్స్ వుంది .చూడటం తప్ప కొనే స్థాయిలో వుండవు .తర్వాత ఒక హోటల్ దగ్గర భోజనానికి ఆపాడు .మేము ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు, పెరుగు అన్నం రోడ్ పక్క చెట్ల కింద తిన్నాం .తెలుగు వాళ్ళు చాలా మంది మాతో వచ్చారు .
                      అక్కడినుంచి మైసూర్ పాలసు కు వెళ్ళాం .టికెట్లు డబ్బిస్తే కొని ఇచ్చారు .రాజ భవనం చూశాం .  చాల అద్భుతం గా వుంది .రెండు కళ్ళు చాలవు .వైభవం అంతా మూర్తీభవించి కన్పించింది .చాలా అందం గా ప్రతిదీ కళాత్మకం గా వుంది .వెలుగు ,వెలుతురూ బాగా ప్రవేశించేట్లుంది .రాజా గారు దసరా నాడు ఎక్కి ఊరేగే బంగారు అంబారి వుంది .రాజా వంశం అంతా కళ్ళకు కట్టినట్లు వుంది .వెండి ద్వారాలున్నాయి దర్బారు హాల్ బాగుందిముచ్చటగా  .అమ్మ వారి అన్ని రకాల మూర్తులున్నాయి .గొప్ప పైంటి౦గ్స్ కట్టి పడేస్తాయి .ఆ రంగుల సమ్మేళనం గొప్ప ఆకృతులను  సృష్టించింది .పెద్ద పెద్ద డోముల్లో లైట్స్ ఆశ్చర్యం గా వుంటాయి .మహారాజ వైభవం అంతా అడుగు అడుగునా దర్శన మిస్తుంది ఒక రకం గా సకల కళా వేదిక ఆ రాజా ప్రాసాదం .ఇదొక్కటే చూశాం .ప్రక్కనే museum వుంది .చూడ లేదు .దీని దగ్గర నవీన కృష్ణాలయం వుంది దర్షించాము .తలుపులు మూసేసినా తలుపులకున్న రంధ్రాల లోనుంచి స్వామిని దర్శించ వచ్చు
.తర్వాత ఆది లక్ష్మీ రమణ స్వాములను దర్షించాము .లోపలి camera అనుమతించరు .బయటే డిపాజిట్ చేయించుకొని locker లో పెట్టి తాళం చెవి నెంబర్ ఇస్తారు .అంతా పూర్తిగా చూసింతర్వాత తాళం చెవి ,నెంబర్ వున్న కాగితం ఇస్తే మన కామెర ఇచ్చేస్తారు .ఇది ఉచిత సేవ .అలాగే చెప్పులు కూడా గంటన్నర సమయం ఇస్తారు ఇవన్నీ చూడ టానికి .త్వర త్వరగా చూశాము .  .పాపం ప్రభావతి నడవ లేక నడిచి అంతా చూసింది .
                        సుమారుగా నాలుగు గంటలకు బయల్దేరి సుమారు నలభై నిమిషాల ప్రయాణం తో చాముండి హిల్ పైకి చేరాం .తిరుపతి కొండ ఎక్కి నట్లే వుంటుంది ఘాట్ రోడ్ అయిదు కిలోమీటర్లు .పై నుంచి చూస్తే మైసూర్ అంతా చిన్న అట్ట పెట్టెలు లాగా కన్పిస్తుంది .చాముండీ రేస్ కోర్సు మైదానం ,వగైరాలన్నీ కనిపిస్తాయి పచ్చని ప్రకృతి మధ్య అందమైన ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి 2525 అడుగుల ఎత్తు వున్న కొండ ఇక్కడే చాము౦డేశ్వరి దేవి ఆలయం వుంది .పరమ అద్భుతమైన మూర్తి .ఆమె మహిషాసుర మర్దిని .ఇక్కడే మహిషాసురుణ్ణి మట్టు పెట్టి చంపింది .
మహిషుడు పాలించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతాన్ని మహిష మండలం అనీ ,మహిష పురం అనీ మైసూరు కు పేరు వచ్చింది .సంపెంగ పూలు విరివిగా దొరుకుతాయి అమ్మవారికి వాటిని భక్తితో సంర్పించాము .పనస చెట్లు ,చెట్లనిండా కాయలతో కను విందు చేస్తాయి .మామిడి చెట్లు ,అశోక చెట్లు, వేప, నేరేడు, యుకలిప్తాస్ చెట్లు ఎక్కువ .ఇక్కడే మహిషాసురుని విగ్రహం మొదట్లోనే కన్పిస్తుంది .
              ఇక్కడినుంచి ఒక గంట ప్రయాణం లో బృందావన్ గార్డెన్ కు చేరాము .రెండు గంటల సమయం ఇచ్చారు చూడ టానికి .ఇక్కడే కావేరి నదికి చాలా ఎత్తైన ఆనకట్ట కట్టారు .ఇదీ విశ్వేశ్వరయ్య గారి అద్భుతమైన ఆలోచనే .ఆన కట్ట నీటిని ఉపయోగించి గొప్ప ఉద్యాన వనం నీటి ఫౌంటైన్స్ ,జల జలా జారి పారీ ప్రవాహాలు పచ్చని పసరిక చెట్లు పుష్ప వనాలు ముచ్చటగా వుంటుంది .బ్యూటిఫుల్ ప్లేస్ .అందుకే మైసూర్ కు సిటీ అఫ్ గార్డెన్స్ అని పేరు చక్కగా సరిపోతుంది .తప్పక చూడాల్సిన ప్రదేశం .సర్వం మరిచి ఆనందానుభూతి కి లోను అవుతాం .డామ్ కు ఆనుకొని కావేరి మాత విగ్రహం పెట్టారు .ఆ మాత కు కావేరి జలం బొట్లు  గా పడుతూ అభిషేకం చేసినట్లుంటుంది .ఆ జలాన్ని పవిత్ర జలం గా భావించి నెత్తినా చల్లుకుంటారు .ఆ పక్క నుంచి డాం పైకి ఎక్కి చూడ టానికి రెండు వైపులా మెట్లున్నాయి .ఎక్కి చూశాను .అందమైన కావేరి నదీమాత దర్శనం
పులకరి౦పజేస్తుంది .ఈ డామ్ ఒక లక్ష యాభై వేల ఎకరాలకు పంట నీరు అందించి సస్య శ్యామలం చేస్తోంది .జల విద్యుత్ లేదిక్కడ .irrigation  కోసమే కట్టిన ప్రాజెక్ట్ ఇది .దీన్ని నిర్మింపజేసిన రాజు కృష్ణ రాయ ఒడయార్ .అందుకే దీనికి కృష్ణ రాయ సాగర్ అని పేరు వచ్చింది .ఆయన విగ్రహం కూడా ఉందిక్కడ .ఆ జంట సాధించిన అద్భుతాలే నేడు మైసూర్ ప్రజలు అనుభవిస్తున్నారు .ప్రజా సేవలో సర్ మోక్ష గుండం .కే.ఆర్.లు తమ జీవితాలను ధాన్యం చేసుకున్నారు .ఇక్కడ ఫోటోలు మన కెమేరా తో తీసుకోవాలంటే యాభై రూపాయలు కట్టి రసీదు తీసుకోవాలి .పైన museum దగ్గర మ్యూజిక్ ఫౌంటైన్ వుంది . సంగీత ధ్వనికి ఫౌంటై లోని జలం అనుగుణం గా నాట్యం చేస్తుంది .ఇది సరిగ్గా రాత్రి ఏడు గంటలకు ఒక పావుగంట వుంటుంది .దీనికోసం lake లో మర boat లో జనం వస్తారు జనం తో నిండి పోతుందా ప్రదేశం .ఆహ్మదాబాద్ దగ్గర స్వామి నారాయణ్ గుడి లో చూసాము . అమెరికా లో చాల చోట్ల చూశాము శాంతినివాసం సినిమా లో నాగేశ్వర రావు ,రాజసులోచన జంటగా duets  ఇక్కడే పాడారు. ”రావే రాధ రావే రాధ రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన షాద రాత్రి ”అని పాడుతారు .ఘంటసాల మ్యూజిక్ .junor సముద్రాల పాటలు రాశాడు .ఎన్నో సార్లు చూశాను ఆ సినిమా .అందులో నాగయ్యగారికి శ్రీనివాస్  గారు     పాడిన ”జయ జయరాం జానకి రామ  ” ”పాట గొప్పగా వుంటుంది .
ఇలాంటి డామే రమణాశ్రమం.    దగ్గర మేట్టుర్ డాం తమిళనాడులో వుంది .అదీ చాల బాగుంటుంది .ఇప్పడు అక్కడ డాం లో నీరు లేకపోవటం వల్ల ఫౌంటేన్లు అవీ పనిచేయవు .సినిమా లన్నీ ఇక్కడే తీసే వారు . రాత్రి ఎనిమిది గంటలకు బస్ మళ్ళీ బయల్దేరింది బెంగళూర్ కు .ఇక్కడినుంచి ఊటీ వెళ్ళే వారు రాత్రికి హోటల్ లో వుండి మర్నాడు ఉదయం బయల్దేరి ఊటీ వెళ్తారు .రాత్రి ఒంటి గంటకు బెంగళూర్ మార్తహళ్లి    చేరాం..శర్మ కార్ లో వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .
                   దీనితో ఒక్క రోజూ మైసూర్ సందర్శనం పూర్తి అయింది .చాల దూరమే అయినా సమయ పాలన బాగా చేశారు అందరు .హాయిగా సాగింది ప్రయాణం .గొప్ప అనుభవం .చిర కాల కోర్కె ఇలా తీరింది .సంతోషం గా ఉంది .
             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —08 -07 -11 .క్యాంపు —బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

మైసూరు ప్రయాణం -1

          మా మైసూర్ దర్శనం
                 నిన్న అంటే జూలై ఏడవ తేది మైసూర్ యాత్రకు బయల్దేరాం .బెంగళూర్ నుంచి india tourism development corporation వాళ్ల బస్సు లో మార్త హళ్లి నుంచి మైసూర్ కు 160 కిలోమీటర్లు .రాను పోను ఒక్కొక్కరికి 390 రూపాయలు .ఉదయం ఆరు గంటలకు ఇక్కడ బయల్దెరీన బస్ ఎడుమ్బావుకు మెజెస్టిక్ చేరింది .అక్కడి నుంచి ఒక గంట ప్రయాణం తర్వాత ఒక హోటల్ టిఫిన్ కు ఆపారు .ఇక్కడ ఇడ్లి చిన్న ఉతప్పం లాగ వుంది .గారే బావుంది .కాఫీ పర్లేదు .దారి అంతా పచ్చదనం పరచుకోన్నట్లు కన్నుల పండువ గా ఉంది
.ఎత్తైన చాలా లావుగా వున్న వృక్షాలను చూశాం .చెరుకు పంట ముఖ్యం గా బెల్లం చెరుకు సాగు కనపడింది .బెల్లం తయారు చేసే బట్టీలు కన్పించాయి కావేరి పరీవాహక ప్రాంతం కనుక వారి బాగా పండుతుంది . నూర్చిన వెంటనే మళ్ళీ పంట వేయటం కన్పించింది .కోన సీమ అందాలను పోలి వుంది .కొబ్బరి చెట్లు విస్తారం గా వున్నాయి .కొబ్బరి కాలు కూడా చాలా పెద్దవి ..పూల తోటలు ముచ్చట గా వున్నాయి .సుమారు పదకొండు గంటలకు శ్రీ రంగ పట్నం చేరాం .నాలుగు లైనుల దారి .స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ ను తగ్గించాయని పించింది .ఎన్నో ఏళ్ళ కోరిక మైసూర్ దర్శనం ఇవాళ తీరుతోందని  ఆనందం . రెండు సార్లు అంతకు ముందు బెంగుళూర్ వచ్చినా మైసూర్ రావటం కుదర లేదు
                                      శ్రీ రంగ పట్నం
           వైకు౦ఠ౦ లో విరజా నది తో సమాన మైనది కావేరి నది ”విరజా నది ఏ శ్రీ కావేరి  -శ్రీ రంగ నాధుడే  అల” శ్రీ నాధుడు  ”అని అందరికి నమ్మకం . శ్రీ రంగానాదుడిని మన్నారు దేవుడనీ అంటారు .రంగనాధుడు ఇక్ష్వాకు రాజుల ఇలవేలుపు అని విశ్వ నాద తమ కల్పవృక్ష రామాయణం లో తెలియజేశారు .ఇక్కడి ఆలయం కలియుగ వైకున్తమే మూడు రంగనాధ క్షేత్రాలు వున్నాయి తూర్పున శ్రీ రంగం లో ,దక్షిణాన అనంతశయనమ్  లో,పశ్చిమాన శ్రీ రంగ పట్నం లో .అన్ని చోట్ల విగ్రహాలు   స్వయం వ్యక్త మూర్తులే .శ్రీ రంగ పట్నం లో దక్షిణ ,ఉత్తర పశ్చిమ కావేరి నదులు కలిసి పోతాయి .ఒకప్పుడు కావేరి నది శ్రీ రంగానాధుని గురించి తపస్సు చేసింది ఆమెకు మూడు వరాలిచ్చాడు స్వామి .గంగ కంటే కావేరి పవిత్ర మవుతుందని ,శ్రీ రంగం గొప్ప యాత్రా స్థలం అవుతుందని శ్రీ రంగడు ఇక్కడే శేష తల్పం మీద శ్రీ మహా విష్ణువు లాగా ఇక్కడే కావేరి నదీ సేవలో స్థిరం గా వుండి పోతాడని వరం ఇచ్చాడు . . ఇక్కడి స్వామిని బ్రహ్మ రుద్రాది దేవతలు అర్చించారు .శ్రీ రంగ నాద వైభవాన్ని గౌతమ మహర్షి వర్ణించి చెప్పాడు .మేష మాసం లో ,శుక్ల పక్ష సప్తమి నాడు శనివారం వశిష్ట  వామదేవాది ఋషులు స్వామిని దర్శించారు .ఇక్కడ మూర్తి శేష సాయి గా కుడి చేతి లో తల పెట్టుకొని ,ఎడమ చేతిని చాపుకొని ,వక్షమునందు శ్రీ లక్ష్మీ దేవితో కనిపిస్తాడు .అందుకే  ఈ క్షేత్రానికి గౌతమ క్షేత్రమని ,బ్రహ్మానంద విమానమని పేరు వచ్చింది . ,  .
                  నారదుని వలన గౌతముడు పంచ రాత్ర విధానం తో స్వామిని అర్చించాడు .తులా మాసం లో గంగా నది కావేరి లో చేరి భక్తులకు ముక్తి నిస్తుంది .తులా మాసం లో కృష్ణ పక్ష దశమి నాడు అష్ట తీర్ధ ష్ణానం చేసి కోరికలను నెరవేర్చుకుంటారు .కావేరి లో ఒక సారి స్నానం చేస్తే గంగలో మూడు రోజులు ,యమునలో అయిదు రోజులు ష్ణానం చేసి నంత ఫలితం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం .ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీ దేవి పై మొహపడిన చిత్రసేన ,చిత్రరదులనే గంధర్వులు ఇంద్ర శాపం చేత రాక్షసులై ,చివరికి తులా మాసం లో పౌర్ణమి రోజూ ఇక్కడి కావేరి లో స్నానం చేసి శాప విముక్తులైనారు .
.                ఈక్షేత్రానికి ల  క్క్షోద్యానవనం అని పేరుంది .లక్ష్మి నరసింహ ,గంగాధరేశ్వర ,జ్యోతిర్మని ఆళ్వారు లు కొలువై ఉన్నారిక్కడ ..ఈ ఆలయ అంతర్భాగాన్ని 817 లో హంబి అనే నర్తకి నిర్మించింది .894 లో గంగా వంశ రాజు తిరుమలయ్య నవరంగ మంటపాన్ని ,తిరుమల శ్రీనివాస ఆలయాన్ని కట్టించాడు .1117 లో శ్రీమద్రామానుజులు ఈ క్షేత్ర దర్శనం చేశారు .అప్పుడు హోయసల బిట్ట దేవుడు పాలిస్తున్నాఅతన్ని జైన మతం నుంచి వైష్ణ వానికి ,మార్చి విష్ణు వర్ధన రాయలు అనే పేరు పెట్టాడు .రాజు ఇచ్చిన అధిక ద్రవ్యాని ,ఎనిమిది గ్రామాల భూమిని స్వామి సేవకు వినియోగించారు .హేబ్బరులు ,లేక ప్రభువులను రక్షకులు గా నియమించారు .౪౪౫౪ లో రాజా తిమ్మని హెబ్బార్ విజయనగరం చేరి రాజాస్థానం లో దశ నాయకుడయ్యాడు .తరువాత ఇక్కడికి వచ్చి కోటను.ఆలయ ద్వారాన్ని పెద్ద గోడను చుట్టూ నిర్మించాడు .
                   తర్వాత శ్రీరంగ పట్నం విజయ నగర ప్రభువుల పాలన లోకి వచ్చింది రాజా ప్రతినిధి శ్రీ రంగ రాయలు పట్టణాన్ని బాగా విస్తరింప జేశాడు .ఆలయం లో లోపలి ప్రాకారాన్ని అయిదు మెట్లను ,రెండు ప్రక్కల రెండు రాతి ఏనుగుల్ని నిర్మించాడు .ఇతని భార్య అలుమేలమ్మ అనేక ఆభరణాలను సమర్పించింది .వాటిని మంగళ ,శుక్ర వారాల్లో అలంకరిస్తారు .శ్రీ రంగ రాయలకు సంతానం లేదు అప్పటి మైసూర్ మహారాజు శ్రీ రాజా వడియార్ కు రాజ్యం అప్పగించి తల్కాడు సమయం లో విశ్రాంతి తీసుకొన్నాడు .
     శ్రీ రాజా వడియార్ ఒక సారి ఇక్కడికి దర్శనానికి వచ్చాడు మంగళ ,శుక్ర వారాల్లో అలంకరించిన ఆభరణాలను అలువేలు మంగమ్మకు తిరిగి ఇచ్చి వేస్తుండే వారు. ఇది గమనించి ఒడియార్ ఆ నగలు ఆమె దగ్గర ఉండ కూడదని వెంటనే ఇచ్చేయమని ఆజ్ఞా పించాడు .ఆమె ఇవ్వ లేదు గుర్రం ఎక్కి తలకాడు కు పారిపోయి ,మలంగి దగ్గర వాటిని కావేరి లో పారేసి ,తాను ఆ అగాధ జలాల్లో దూకి మునిగింది .వెంట తరిమే సైనికులతో తలకాడు ఎడారి అవుతుందని మైసూర్ రాజులు సంతాన హీను లవుతారని శపించింది వెంటనే మలంగి అగాధం గా మారి దాని చుట్టూ ఎడారి ఏర్పడింది .అదే తలకాడు ఎడారి ఇప్పటికి కనిపిస్తుంది
                 ఒడియార్  కు ఈ విషయం తెలిసి బాధ పడి ,ఆమె విగ్రహం చేయించి రాజా మందిరం లో పెట్టించాడు ..నిత్యం పూజ చేసే వాడు .అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ పూజ జరుగుతూనే వుంది ,దసరాల్లో చాల వైభవం గా ఈ పూజ జరుగు తుంది .ఆలి ద్వారం దగ్గర అలవేలు మంగమ్మ ,శ్రీ రంగ రాయల శిలా విగ్రహాలు కనిపిస్తాయి .ఆమె బహుక రించిన నాసికా భరణం ఇప్పటికి కనిపిస్తుంది .అది మొదట్లో నిమ్మ పండు అంతా వుండేది. క్రమంగా తగ్గుతూ చిన్నదిఅయి  పోతుండటం గమనించదగింది .
      1610 నుంచి 1699 వరకు శ్రీరంగ పట్టణమే మైసూరు రాష్ట్ర రాజా దాని .౧౭౬౦ లో ఇమ్మడి కృష్ణ దేవ ఒడియార్ హైదేరాలీని సేనా పతిని  చేశాడు .హైదర్ రంగని భక్తుడు .రాత్రి పూట అతనికి స్వామి కలలో కన్పించి మాట్లాడే వాడట .తరచూ స్వామి దర్శనం చేసే వాడు .ఒకసారి  శాత్రు శైన్యం మైసూర్ రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చారు హైదర్ వారితో యుద్ధం చేశాడు .శత్రువుదే పై చేయిగా వుండి గోదావరి ఒడ్డున యుద్ధం జరిగింది .హైదర్ రంగానాధుని ధ్యానించి గోదావరి లోతు తగ్గాలని ప్రార్దిన్చాదట .వెంటనే నది బలహీన మైందట ,.హైదర్ సేన తేలిగ్గా అవతలి ఒడ్డుకు చేరి శత్రు సంహారం చేసి మైసూర్ రాజ్యాన్ని కాపాడాడు .వెంటనే గోదావరి మళ్ళీ ఉధృతం అయిందట .శత్రువులు దాటలేక పోయారు హైదర్ తేలిగ్గా శ్రీరంగ పట్నం చేరాడు సైన్యం తో .దీన్ని బట్టి య్దర్ కు రంగానాధుని పై యెంత భక్తీ విశ్వాసాలున్నాయో తెలుస్తోంది
               ప్రతి ఏడు ధనుర్మాసం లో ఇరవై ఒక్కటి రోజూ నుండి ఇక్కడ కొటారి ఉత్సవాలు వైభవం గా జరుగు తాయి దీని కోస౦ పెద్ద కోతరం నిర్మించారు .ఈ సమయం లో మైసూర్ మహారాజు స్వయం గా పాల్గొనటం ఆన వాయితీ .తొమ్మిదో రోజున స్వామికి మోహిని అలంకారాన్ని వేసి రాజు తో పూజ చేయిస్తారు .సంగీత కచ్చేరీలు జరుగు తాయి .వీటిలో రాజు ,రాజా కుటుంబీకులు ,హైదరాలి,జనానా అంతా భక్తీ శ్రద్ధలతో పాల్గొనే వారు .1774 లో
ఎనిమిదవ రోజూ అగ్ని ప్రమాదం జరిగినది .రాజు బాధ పడ్డాడు .వెంటనే నిమిషాల మీద హైదరాలి ఉత్సవం నిర్విఘ్నం గా జరిగే ఏర్పాట్లు చేశాడు మర్నాడు ఉత్సవం ప్రారంభించే సమయానికే కొత్త మండపం కట్టించాడు హైదర్ ,.దీనికే పాతాల మండపం అని పేరు .
             1782 లో హైదర్ మరణం తర్వాత టిప్పు సుల్తాన్ సేనాధి పతి అయాడు .అతను రాజును తొలగించి తానె మైసూర్ రాజు అయాడు .అప్పుడు ఇమ్మడి కృష్ణ రాజా ఒడియార్ అయిదేళ్ళ వాడు .మహమ్మదీయుల దాడిలో అతన్ని రంగనాధ గోపురం అయిదవ అంతస్తు లో దాచి కాపాడారు .టిప్పు పరిపాలన లో మీర్ సాదిక్ ప్రముఖ స్థానం పొందాడు .ఇతడు ఇక్కడి కొన్ని దేవాలయాలు ధ్వంసం చేశాడు .దీని బారి నుండి కాపాడు కోవటానికి ఆలయ అధికారులు ఆలయాలకు ఇంటి కప్పులు వేయించారట. పూర్ణయ్య వీధి లో వున్న జనార్దన స్వామి అలాంటిదే .చిన్న దేవాలయాల లోని దేవుళ్ళను అర్చకులు రంగనాధ ఆలయానికి తీసుకొని వచ్చి కాపాడు కొన్నారు .గోడల లోపలి వైపున ప్రతిష్టించారు .అలాంటి వాటిలో శ్రీ కృష్ణ ,పట్టాభిరాం ,మురళీ కృష్ణ విగ్రహాలున్నాయత .హైదర్ కు రంగని పై భక్తీ ఎక్కువ గా వుండటం తో దీని జోలికి పోలేదు .
                      ఆంగ్లేయుల పాలన లో ,వారి తోటి యుద్ధం లో టిప్పుకు చాల డబ్బు కావలసి వచ్చింది .అప్పుడు రంగానాధాలయం లోని విలువైన ఆభరణాలను తీసుకొని పోయివారికిచ్చి సంతృప్తి చెందిన్చాడని కధనం .కొన్ని ఫ్రెంచ్ వారికి ,కొన్నిరష్యా వారికి చేరాయత .క్రెమ్లిన్ రాజా ప్రాసాదం లో ఇప్పటికి అవి కన్పిస్తాయట .ఇప్పుడున్న స్వామి ఆభరణాలన్నీ టిప్పు సుల్తాన్ స్వామికి బహుకరించిన వేనట .
               1799 లోశ్రీ రంగ పట్నం బ్రిటిష్ వారి వశం అయింది ముమ్మడి కృష్ణ రాజా ఒడియార్ మైసూర్ ను రాజధానిగా చేసి ,పూర్ణయ్య ను దివాన్ గా నియమించారు ,.కోతరోత్సవం మామూలు గా జరిపాడు .తొమ్మిదవ రోజూ స్వయం గా పాల్గొనే వాడు .నాల్గవ కృష్ణ రాజా ఒడియార్ శ్రీ చామ రాజేంద్ర స్మారక సత్రాన్ని నిర్మించాడు .కావేరి నదికి మెట్లు కట్టించాడు .దీన్నే రాజా ఘట్టం అంటారు .తులసి వనం స్వామి పూజ కోసం ఏర్పాటయింది .ఆయన జన్మ దినమైన ఆషాఢ బహుళ విదియ నాడు స్వామి మెరవాలి ఈ మండపానికి చేరుతుందట .ఆ కార్య క్రమాన్ని ”చక్కర పొంగలి వుత్సవం ”అంటారట .
                 జయచామ రాజా వడయార్ పాలన లో కూడా అంటె  1954 వరకు ఈ వుత్సవాలు జరిగేవి.
             మొదట్లో శ్రీ రంగ నాధుడు తూర్పు ముఖం గా చేతికి ,శిరస్సుకు మధ్య ఎడముగా తల పైకెత్తి వుండే వాడట .కాల క్రమం లో మార్పు చెంది ఇప్పుడున్న ముద్రా స్థితి లో ఉన్నాడని బాగా వృద్ధులైన పూజారులు ,యాత్రికులు చెప్పుతారు  .ఇది ఇక్కడి  విశేషం .
స్వామి దర్శం కన్నుల పండుగ చేసుకొని ,ఆనందం తో బస్సు ఎక్కి నెమ్మదిగా మైసూర్ వైపుకు ప్రయాణం సాగించాం .ఇక్కడికి పదహారు కిలోమీటర్లు ఇక్కడే శిధిల మైన శ్రీరంగ పట్టణమ్ కోట ,కోటలోకి నీటి మార్గం ద్వారా ఆంగ్లేయులు ప్రవేశించిన చోటు ,టిప్పు సమాధి అన్నీ బస్సు లో నుంచే చూసాం .మహా వైభవం గా వెలిగి ,బ్రిటిష్ వారితో పోరాడి భారత దేశ స్వాతంత్ర ,స్వేచ్చ కోసం అసువు లర్పించిన మహా వీరుడు టిప్పు సుల్తాన్ వీర మరాణం పొందాడు .జన హృదయం లో స్థిర స్థానం సంపాదించాడు .జోహార్ టిప్పు సుల్తాన్ .
.                             మిగిలిన విశేషాలు తరువాత తెలియ జేస్తాను
                              మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —08 -07 -11  —క్యాంపు —బెంగళూర్ .

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హిమాలయ యోగుల దివ్య భావనలు

హిమాలయ యోగుల దివ్య భావనలు మన ముఖం చూసి ఎవరైనా గుర్తిస్తారు .కాని ఋషుల ముఖం ఇక్కడ కనిపించదు .అది భగవంతుని లో వుంటుంది .ఇక్కడ వుండేది భగవానుని పాదాలు మాత్రమే .అందుకే మహర్షులకు పాద నమస్కారం చేస్తారు .సన్యాసికి లోకం వెలుపల ఆత్మ జ్ఞానం కలిగితే ,సంసారికి లోకం లోనే కలుగు తుంది మోక్షం పొందిన ఆత్మకు జీవిత చక్రం తిరుగుతూ వున్నా ,కర్మ బంధం అంటాడు .ఆధ్యాత్మిక శక్తి ప్రతి గుండె లోను నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది .సరైన విధం గా ఉపయోగిస్తే ,నిస్వార్ధత ,ప్రేమ సంకల్పం ,దైవ భక్తీ ద్వారా ఆ శక్తి పెరుగు తుంది .గడచినా వంద ఏళ్ళలో ఈ నేలపై జన్మించిన వారిలో శ్రీ రమణ మహర్షి అత్యున్నతులు అన్నారు .సర్వేపల్లి రాదా కృష్ణ పండితులు . కాశ్మీర్ లో యేసు క్రీస్తు తపస్సు చేశాడట .ఒక రష్యన్ రచయిత ”the unknown life of Jesus Christ ”అనే పుస్తకం లో రాశాడు .ఆయన తపస్సు చేసిన చోటును కాష్మీరీలు గుర్తించి చూపిస్తారు .ఆయన ధరించిన దుస్తులు కాశ్మీరి దుస్తులే .ఆయన తలకట్టు శైలి కాష్మీరీయులది ఆయన చేసిన అద్భుతాలు హిమాలయ యోగులు చేసినవే .ఆయన వున్న ప్రాంతాన్ని ”తఖ్త్ ఏ తావూస్ ”అంటారు .అంటే మహనీయులున్న చోటు అని అర్ధం .పదమూడవ ఏట నుంచి ముప్ఫయ వఏడు వరకు క్రీస్తు కాశ్మీరు లోనే ఉన్నాడట . సోక్రటీసుకు విషం ఇచ్చి తాగమంటే ”దీన్ని దేవుడితో పంచుకో వచ్చా ?విషం ఋషిని చంపలేదు .కారణం ఋషి వాస్తవం లో జీవిస్తాడు .వాస్తవం శాశ్వత మైంది ”అని నవ్వుతు విషాన్ని తాగే శాడు హిమాలయాల లోని ”గంగోత్రి ”ని హంసల దీవి అంటారు. క్రిష్ణాశ్రం అనే హిమాలయ యోగి హిమాలయాల్లో ఒంటికి బట్టలు లేకుండా ,చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో హిమాలయాలన్నీ తిరిగాడు .స్వామి రామ తీర్ధ ఇరవై వేల అడుగుల ఎత్తు వరకు ఎక్కాడు .ఋషీ కేష్ లో ఒక సారి పైనుంచి అయిదు వందల అడుగుల కిందకి జారి పడి నిల దోక్కుకొని నిలిచాడు . బుద్ధిని బాహ్యం గా కేంద్రీక రిస్తే ”త్రాటకం ”అంటారు .అంతర్ముఖం చేస్తే ఏకాగ్రత అంటారు . అఘోరీ బాబా బద్రి నాద్ దగ్గరుండే వారు .చనిపోయిన శవాన్ని ఆయన వండారు తినటానికి .అది అద్భుతమైన తియ్యని పదార్ధం గా మారి పోయిందట.ఒక బందా రాతిని పంచదార గా మార్చిన మహాను భావులాయన . మరణ సమయం లో ఒక యోగిని చేసిన మంత్రోచ్చాటన ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ గుహలో మారు మోగటం స్వామి రామ తీర్ధ చూశారట. భారతి అంటే అర్ధం –భా అంటే విజ్ఞానం –రతి అంటే ప్రేమికుడు .అంటే విజ్ఞాన ప్రేమికుడని. భావం . తెనాలి రామ లింగడు ”నేను పోతే మొక్షానికే పోతాను ”అన్నాడట .అందరు నోరు వెళ్ళ బెట్టారట అర్ధం కాక .అప్పుడు ఆయనే దాని అర్ధం చెప్పాడు .నేను అనే భావం పోతే అంటే వదిలించు కుంటే వచ్చేది మోక్షమే కదా అదీ వికట కవి గడుగ్గాయి తనం .. మాయ అంటే అర్ధం –యః –అది ,మా –లేనిది అంటే లేనిది ఉన్నట్లుగా కనిపిమ్పజేసేదే మాయ .”ఘటిత ఘటనా పటీయసీ మాయా ” సీతా దేవి లంకలో అశోక వనం లో నే వుంది అంటే శోక౦ లేని చోట వుంది అని అర్ధం .దానినే బ్రహ్మీస్థితి అంటారు ”బ్రహ్మవేద బ్రహ్మా భవతి ”బ్రహ్మం ను తెలుసుకున్న వాడు బ్రహ్మమే అవుతాడు అని భావం . వరాహం కూడా దేవుడు తన లాగే ఉంటాడు అనుకొంటు౦దిట .”ద్రుష్టి జ్ఞాన మయం కృత్వా పశ్యేత్ బ్రహ్మ మయం జగత్ ”. ఇవి మంచి ముత్యాలు .ఏరి మీ కోసం ఉంచాను .వాటిని హాయిగా చదివి ఆనందించండి మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –06 -07 -11 క్యాంపు –బెంగళూర్ .

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్లూ వేల్స్ (blue whales )

బ్లూ వేల్స్ (blue whales )
               బ్లూ వేలుకు పెద్ద  గుండె  వుంటుంది  .గుండె బరువు ఏడు టన్నుల పైనే .మన ఇంట్లో పెద్ద గది అంతాన్న మాట .దానికి నాలుగు చిన్న గడులుంటాయి .చిన్న పిల్లలు తల నిటారుగా వుంచుకొని హాయిగా అందులో నడవ వచ్చు .వాల్వేస్ లోంచి రావా టానికి మాత్రం తల వంచాలి .వాటి కవాటాలు
స్వింగింగ్ డోర్స్ అంతా పెద్దవి .ఇది వందల అడుగులున్తుంది  గుండె వంద  .చిన్నది పుట్ట గానే ఇరవై అడుగుల పొడవుంటుంది .నాలుగు టన్నుల బరువుంటుంది .మామూలు గా మనం నడిపే కార్ కంటే పెద్దది అన్న మాట .రోజూ తల్లి దగ్గర వంద గాలన్ల పాలు తాగు తుంది .రోజుకు రెండు వందల పౌన్ల బరువు పెరుగు తుంది .సుమారుగా ఏడు లేక ఎనిమిది ఏళ్ళు వచ్చే సరికి పుష్పవతి అవుతుంది .మేటింగ్  కోసం ఎవరికీ కనపడ కుండా వెళ్లి పోతుంది .మేటింగ్ ఎలా జరుగు తుందో ,ఆ సమయం లో దాని తిండి ఏమిటో ,ప్రవర్తన ఎలా వుంటుందో ఎవరికీ ఇంకా తెలీదు .ప్రపంచం లో 10 ,000  బ్లూ వేల్సులున్నాయని అంచనా. ఇంత పెద్ద జలచరం ఇంతవరకు ఏదీ లేదు .భారీ కాయంతో భారీ  గుండెతో ఇవి జంటలు జంటలుగా ప్రయాణం చేస్తాయి .చొచ్చుకుంటూ పోతూ చేసే అరుపులు వాటి తెరచుకున్న నోటి ధ్వని ని నీళ్ళ అడుగున మైళ్ళ కొద్దీ దూరం నుంచి విని పిస్తుంది
                         నేను తెలుసుకున్న విషయాలు మీకు తెలిపాను .ఇంకా దీని  గురించి సమాచారం వుంటే తెలియ జేయండి కలుపుతాను
                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —o6  –07 -11 .—క్యాంపు —-బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

హుమ్మింగ్ బర్డ్

హుమ్మింగ్ బర్డ్

                       హుమ్మింగ్ బర్డ్ గుండె సెకనుకు పది సార్లు కొట్టుకుంటుంది .ఇవి అమెరికా లోనే వున్న పక్షులు .వీటిలో మూడు వందల రకాల పక్షులున్నాయి .చెవులు దోప్పల్లా గా చేసి వాటిగూటి  దగ్గర నుంచుంటే గుండె చప్పుడు స్పష్టం గా వినిపిస్తుంది .ప్రతి రోజూ అది వేలాది పుష్పాలపై వాలుతుంది .గంటకు ఆరు వందల మైళ్ళ వేగం తో ప్రయాణం చేస్తుంది .అంతే ఎగం తో వెనక్కి కూడాఎగర గలగటం  దేని ప్రత్యేకత .ఆగకుండా ఆంటేఅయిదు వందల మైళ్ళు ఎగర గలడు .ఆగితే దాని చావు దగ్గర పడ్డట్లే .అప్పుడు దాని నిద్ర మామూలు కంటే పదిహేను శాతం తగ్గుతుంది .గుండె ఆగిపోయినంత పని అవుతుంది .వెచ్చదనం లేకపోయినా ,తియ్యని పదార్ధాలు తినక పోయినా గుండె చల్లబడి పోతుంది .చివరికి గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు .ఈ పక్షులకు   race car hearts ఉంటాయట. ఇవి ఆపు లేకుండా ఆంటే నాన్ స్టాప్ గా అయిదు వందల మైళ్ళుఎగురు తుంది .గాలి లోని oxygen ను పీలుస్తాయి .మన కంటే గుండె ప్పలుచని ,తేలిక fiber తో చేయ బడి వుంటుంది .ఇవన్నీ oxygen మింగటానికి సాయ పడుతాయి . వాటి గుండె చర్మానికి దగ్గరలో vundi భూమ్యాకర్షణ శక్తి కి అందకుండా జడత్వం (inertia ),బారి పడకుండా కాపాడుతుంది .నిరంతరం ఆహారం వేటలో వుంటుంది .ఆ అన్వేషనే దానికి ప్రాణాంతకం కూడా .వాటికి ఏ ఇతర జీవుల కంటే గుండె జబ్బులు ఎక్కువ గా వస్తాయి .సాధారణం గా ప్రతి జీవి ,తన జీవిత కాలమ్ లో రెండు బిలియన్ల సార్లు గుండెను స్పందిమ్పజేస్తుంది .దీన్ని గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది మన హృదయ స్పందనను నెమ్మదిగా తక్కువ వేగం తో చేస్తే తాబేలు లాగా రెండు వందల ఏళ్ళు బతక గలం .కానీ హుమ్మింగ్ బర్డ్ లాగా గుండె వేగం గా కొట్టుకోనేట్లు చేస్తే దాని లాగానే మన ఆయుష్యు కూడా రెండే రెండు సంవత్చ రాలు మాత్రమే అవుతుంది .కనుక శ్వాశ మీద ధ్యాస ఉంచమని మహర్షులు ఏనాడో చెప్పారు .పని హడావిడిలో అతిగా ఊపిరి పీలుస్తూ ,ఊపిరి కోల్పోయే స్థితికి మనం వస్తున్నాం .కనుక ఈ పక్షి మనకు మంచి గుణ పాథామే నేర్పు తోంది .ఆయుస్సు పెరగాలంటే గుండె ను మరీ వేగం గా కొట్టుకో నివ్వ రాదు .ఆరాటం పనికి రాదు .emotionlu  కంట్రోల్ లో వుండాలి ప్రశాంత చిత్తం కావాలి .కోపం తాపం ,ద్వేషం ,అసూయలకు దూరం అవాలి .అప్పుడే పూర్నాయుస్సు లభిస్తుంది .
—                                                 మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ ——-06 -07 -11 . —క్యాంపు –బెంగళూర్ .

 

Posted in రచనలు | 1 Comment

నా ఆటోగ్రాఫ్ –” హిందూపురం – మరొక సారి – ప్రయాణం – ” గుర్తుకొస్తున్నాయి……

నేను నా శ్రీమతి, ఇందిర, శర్మ, హర్ష, హర్షిత బెంగలూరు నుంచి ఆది వారం అందరం కార్ లో ఇక్కడికి యాభై కిలో దూరం లో వున్న ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయం వెళ్లాం.బాగుంది .ఎద్యురప్ప తరుచు వచ్చి దర్శనం చేసుకొనే క్షేత్రం ఇది .అక్కడినుంచి  అరవై కిలో దూరం లో వున్న హిందూ పురం  వెళ్లాం .మేమున్న పాత ఇంటికి చేరాము  ఇంటి వాళ్ళు తాళం వేసుకొని బయటికి వెళ్ళారు .అక్కడి ఇంటి ఫోటో తీశాం .అక్కడే వుండే నా స్నేహితుడు గుండు రావు ఇంటికి వెళ్లాం అతను బదరి వెళ్ళాడట .కొడుకు బానే మాట్లాడాడు .

This slideshow requires JavaScript.

-అదే దగ్గరగా వున్న మా చినప్పుడు మేము కూర్చొనే రామ మందిరం చూసాం .అక్కడే కచేరి సావిడి వుండేది అది పోలీసు స్టేషన్ గా మారింది .మా నాన్న స్నేహితుడు రాఘవేంద్ర రావు గారింటికి వెళ్తే ఎవ్వరు కనిపించలేదు వీళ్ళ అబ్బాయి గోపాల్ గొప్ప డాక్టర్ అక్కడినుంచి దక్షిణా మూర్తి దేవాలయానికి వెళ్ళాం .దక్షిణా మూర్తి అనే స్నేహితుందే వాడు .ఆ దేవాలయం అర్చకుని కొడుకు .వాడు చని పోయాడట వాళ్ల తమ్ముడు కోడలు వాళ్ళు చక్కగా మాట్లాడారు .అక్కడే దగ్గర గడ్డమీద స్కూల్ లోనే నేను అయిదవ తరగతి వరకు చదివాను .దానికి దగ్గరలో కన్యకా పరమేశ్వరి గుది ,అయిదు లాంతర్ల స్థంభం ,మా అక్కయ చదివిన హై స్కూల్ చూసి హోటల్ లో టిఫిన్ చేసి దారిలో వేణుగోపాల ఆలయము సూగూరు ఆంజనేయ స్వామి గుడి చూసి బెంగళూరుకు రాత్ర ఏడున్నరకు చేరాం .

దారిలో విపరీతం గ పనస కాయలు కనిపించాయి గుట్టలు గుట్టలు .ఫోటో లు తీశాం .ఒక పండు చాలా పెద్దది డెబ్భై కి కొన్నాం .అన్నీ తోనలే బాగుంది  దాదాపు పన్నెండు గంటల ప్రయాణం రాను పోను రెండు వందల కిలోమీటర్లు .శర్మ బాగానే డ్రైవ్ చేశాడు .పిల్లలు హర్ష ,హర్షిత బాగా ఎంజాయ్ చేశారు కోడలు ఇందిరా ,మీ అమ్మ కూడా సంతోషించారు

This slideshow requires JavaScript.


హిందూ పుర లో మా నాన్న ఇరవైరెండు ఏళ్ళు హై స్కూల్ లో తెలుగు పండిట్ గా చేశారు నేను అయిదవ క్లాస్స్ వరకు ఇక్కడే చదివాను ఇది సుమారు అరవై రెండేళ్ళ నాటి ముచ్చట (1948 –52 ) .ఎందుకో ఆవూరు అంటే మాకు చాలా అభిమానం .బెంగళూర్ నుంచి హిందూ పురం నూట ఇరవై కిలోలు .మీరు ఇదివరకు బెంగుళూర్ లో నేనొక్కడినే హిందూపూర్ వెళ్లి నీను తిరిగిన ప్రదేశాలన్నీ చూసి వచ్చాను  ?అదో గొప్ప అనుబంధం .ఆ ఊరు  ఆ దారులు సందులు గొందులు అన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి .ఎప్పుడు ఆ వూరు కలలో కన్పిస్తూనే వుంటుంది .అదీ విశేషం .నా చిన్న నాటి స్నేహితులు అబ్బాయి ,సోమసుందర్ ,చలపతి కల్లురావు ,దక్షిణా మూర్తి ,నాగ రత్నమ్మ అంటా పైకి వెళ్లి పోయారు .గోదావరి దేవి అని మా ఇంటి దగ్గర మునిసిపల్ కర్పోరత్తోర్ వుండేది .దర్జా మనిషి .వాళ్ళ ఆయనే రాఘవెంర రావు గారు హై స్కూల్ లో నాన్న తో పాటువాళ్ళ అమ్మాయిలూ వెంకు బై ,తారా బై ,సునండలు .ఎప్పుడు మా ఇంటికి వాళ్ళు ,వాల్లిల్లకు మేము వెళుతూ వుండే వాళ్ళం .శ్రీని వాస రావు గారు అనే టీచర్ మాకుహై స్కూల్ నుంచి నాకు చాక్ పీసులు తెచ్చిచ్చే వారు .ఆయన కోసం రోజు ఎదురు చూసే వాడిని .మాకు తెలుగు చెప్పిన సుబ్రహ్మనీ శాస్త్రి గారు ,మా క్లాస్స్ టీచర్ ఆశీర్వాదం గారు ,ఇరావతమ్మ టీచర్లు ఇంకా గుర్తే .ఫ్లూటు అద్భుతం గా వాయించే రాయప్ప  మేస్తారికి నేనంటే చాలా ఇష్టం .గోదావరమ్మ గారింటి పక్కనే ఈమని సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు వుండే వాడు ఆయన భార్య అన్న పూర్ణమ్మ .అమ్మకు గోదావరమ్మ ,అన్నపూర్నమ్మలు మంచి స్నేహితులు. పురోహితుని కొడుకే అబ్బాయి నాకు దోస్తు .మన్యం గారు ముడ్డి మీద గోచీ ఎగాలాగి వంగి వడ్డన చేసే వాడు .ఆయన్ని నీను బాగా అనుకరించే వాడిని .అంటా తరచుగా నాతొ ఆ అనుకరణ చేయించి నవ్వు కొనే వారు వీళ్ళ బంధువురంగ నాయకస్వామి గుడి దగ్గర వుండే వారు పురోహితుడే .సుబ్బరామయ్య అని ఒక పురోహితుడు బెంగళూర్ రోడ్ లో వుండే వాడు .హై స్కూల్ చాల దూరం .అక్కడ ద్రావింగ్ మేష్టారు తో నాన్నకు దోస్తీ .ఆది వారం వాళ్ళింటికి వెళ్ళే వాళ్ళం .హిందూ పురం లో వుండగా భారత మాట పూజ చేసే వాళ్ళం ప్రతి శుక్ర వారం రాత్రికి .ప్రసాదాలు నైవేద్యం పెట్టె వాళ్ళం .నాకు ఒక బృందం వుండేది .నేనే గాంగ్ లీడర్ .ఇల్లన్న్నీ మిద్దేలే .మేము పై అంతస్తున్న మిద్దె ఇంట్లో వున్నాం  .

                         మా మామ్మ కూడా మాతో వుండేది .ఆవిడే వంట .రేషన్ రోజు లవి వుయ్యూరు  నుంచి బియ్యం రైల్ లో మామయ్యా గంగయ్య గారు పంపే వాడు .యెర్ర కిరసనాయిలే .బియ్యం దొరక్క పొతే రాగి సంకటే తినే వాళ్ళం .మా అమ్మ బాగా చేసేది .అందులోకి సాంబార్ బాగా చేసేది .రెండు కలిపి తింటే ఆనందో బ్రహ్మే ..రాగి పొడి లో బెల్లం కలుపుకు తినే వాళ్ళం .అదిరేది రేషన్ లో వున్నా మా ఇంటికి వారానికి కనీసం ముగ్గురు పేద విద్యార్ధులు వారానికి చెప్పు కొని మాతో పాటే రాగి సంకటి తినే వాళ్ళు .బాగా ధన వంతుల పిల్లలు నాన్న దగ్గరకు తెలుగు నేర్చుకోవటానికి వచ్చే వారు .ఆయనంటే అందరికి భయమే .ఆయనకు పైన విడిగా గది వుండేది .ఇంకోటి మాకు .పైన పెద్ద హాలుంది అక్కడే అందరం పాడుకొనే వాళ్ళం .కింద వంట ఇల్లు ,నెల మాలిగా చిన్న గదులు రెండు బాత్ రూం ఉండేవి నీళ్ళ బావి వుంది చాలా లోతుకు ఉండేవి నీళ్ళు తోడాలంటే ప్రాణం గండం గా వుండేది .వేడి నీళ్ళకు అందా ఒక పొయ్యిలో పాటి పెట్టి వుండేది .దానికి ఇంధనం చింత పిక్కల పొట్టు ,లేక వేరుసెనగ పొట్టు బస్త్తలకు బస్తాలు వచ్చేవి .మాంచి పాలు ,పరుగు వెన్న నెయ్యి దొరికేది .నెయ్యి పోసే అమ్మాయి ఇప్పటికి కళ్ళకు కట్టి నలున్తుంది నెయ్యి పూసలు పేరుకొని ఘుమ ఘుమ వాసనలతో వుండేది ఇంటికి లేత్రిన్లున్దేవి కావు ..బాటకు చెరువు గట్టుకో వెళ్ళే వాళ్ళు మగ వాళ్ళు .ఆడ వాళ్ళు సందుల్లో కి వెళ్ళే వారుపాపం .కాశీ నాద అనే డాక్టర్ మాకు ఫ్యామిలీ డాక్టర్ .ఎర్రమందే దేనికైనా .సీసాలలో ఇచ్చే వాడు
              గోదావరమ్మ చివరి కూతురు సునంద మూర్తి అనే నాన్న శిష్యుడిని వివాహం చేసు కొంది.మేము హిందూపూర్ 1952 లో వదిలేశాము .మా నాన్న కు ఇక్కడ సేవిసు తో పరిగణించి కాకాని వెంకట రత్నం గారు కృష్ణా జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గా వుండగా జగ్గయ్య పేరా జిల్లా హై స్కూల్ కు బదిలీ చేశారు .తర్వాత వుయ్యూరు వచ్చి మూడేళ్ళ తరువాత వుయ్యుర్లోనే రిటైర్ అయారు .
                 హిందూ పుర లో నేను రాజేంద్ర ప్రసాద్ గారిని సంజీవ రెడ్డి గారినీ సభల్లో చూశా. ఇక్కడి చాల మంది కవులు ,రచయితలతో నాన్నకు పరిచయాలు బాగా ఉండేవి వారి రచనలు పంపి అభిప్రాయం కోరే వారు .కల్లూరు సుబ్బారావు గారితో గురు మూర్తి గారితో పరిచయాలున్దేవి .ఆంద్ర దేశం నుంచి విస్వనాది ,జొన్నల గడ్డ సత్యనారాయణ ,జమ్మల మడక ,జటా వల్లభ వంటి ఉద్దండులు ఇక్కడ ఉపన్యాసాలకు వచ్చి మా ఇంట్లోనే వుండే వారని అమ్మ చెప్పింది ఇక్కడ పెట్టిన భగవద్గీత పోటీల్లో నాకు ,మా అక్క దుర్గా కు ప్రధమ బహుమతులు వచ్చాయి .శ్లోకాలను వెనకా నుంచి ముందుకు కూడా చెప్పించారు .మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారే మాకు భగవద్గీత నేర్పారు .అప్పుడు బహుమతిగా ఇచ్చిన భగవద్గీత పుస్తకమే ఇప్పటికీ నేను రోజు పారాయణ చేసేది .నాకు భక్తీ యోగం లో మా  అక్కయ్యకు  పురుషోత్తమ ప్రాప్తి యోగం లో పరీక్ష చేసారు .ఇక్కడ టూరింగ్ TALKIES ఉండేవి .సినిమా కు వెళ్తే తినుబండారాలు మంచినీళ్ళ మరచెంబు ఉండాల్సిందే సంసారం సత్యమేవ జయతే చూసినట్లు జ్ఞాపకం .దసరా ఇక్కడ బాగా చేస్తారు .దశమి నాడు బస్సులు బందీలు అన్నిట్లో అందరిని ఫ్రీ గ ఎక్కించుకొని ఊరంతా తిప్పే వారు .మేము సూగూరు ఆంజనేయ స్వామి గుడి దాక వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే వాళ్ళం ఎక్కడి కైనా వెళ్ళాలంటే జట్కా బందీలే .నాన్న శిష్యుడు ఒక కుంటిసాఎబు గారు మాకు జట్కా కట్టే వాడు .మేమేప్పుడైనా సెంటర్ కు వెళ్తే అక్కడినుంచి జట్కా కావాలని అబద్ధం చెప్పి ఇంటికి వచ్చి దాక్కునే వాళ్ళం .కాసేపు చూసి వెళ్లి పోయే వాడు
                హిందూ పురం దగ్గర విదుర అస్వతం అనే క్షేత్రం వుంది వీలైనప్పుడు వెళ్ళే వాళ్ళం .లేపాక్షి చాలా సార్లు చూశాం .అందులో పూజారి నాన్న శిష్యుడు మాకు భోజనం కూడా పెట్టె వారని జ్ఞాపకం .మా మేన మామ ఒకసై వాళ్ళ అమ్మాయితో వచ్చి మమ్మల్నందర్నీ బెంగుళూర్ తీసుకొని వెళ్లి అన్నీ చూపించాడు ఇక్కడ బెల్లం ,వేరుసెనగ చిత పండు మందీలు ఎక్కువ .వీటి వ్యాపాం బాగా జరుగు తుంది .బెల్లపు చెరుకు పండుతుంది .బెల్లం చిన్న అచ్చులు ముద్దల్లగా ఉండేవి భూమిలో అందాలో దాచే వాళ్ళు ..తేళ్ళు ,మంద్ర గబ్బలు ఎక్కువ .యఎవరింట్లో వచ్చినా నన్నే కేక వేసే వారు ,నేను ధైర్యం గా వెళ్లి చంపే వాడిని అప్పుడు ప్లేగు వ్యాధి బాగా వుండేది .ఇల్లంతా ఖాళీ చేసి తలుపు కు కింద చిన్న రంధ్రం చేసి మందు పిచికారే చేసే వాళ్ళు నాలుగు రోజులైతే కాని తలుపు తీయరు .వందల్లది ఎలుకలు చచ్చి పది ఉండేవి వాటిని తీసి వూరు బయట తగల బెట్టె వారు .ఇదంతా మునిసిపాలితియే చేసేది .
                     ఇక్కడి జనానికి  భక్తీ ఎక్కువ .ప్రతి దేవాలయం లో పూజలు బాగా జరిగేవి ధనుర్మాసం శివాలయం లోను జరిగేది .ప్రసాదాలకు వెళ్ళే వాళ్ళం .హరికధలు బాగా చెప్పించే వారు .తెనాలికి చెందినా పిల్లల మర్రి రామ దాసు గారు నెలల తాబడి హరికధలు చెప్పేవారు .ఆఖరి రోజున వారికి ఘన సత్కారం చేసి దానం బాగా ఇచ్చి సమారాధన చేసి సాగానంపెవారు .ఇక్కడి వైశ్యులు మహా వితరణ శేలులు .కన్యకామ్మ వారి గుడిలో ఎప్పుడు కార్య క్రమాలు జరిగేవి ఇక్కడి జనం తాంబూలం బాగా వేసే వారు .బొద్దు దగ్గర చిన్న సంచీ వుంటుంది అందులో అరలుంటాయి వాటిలో సున్నం వాక్క ,తంబాకు వుంటాయి అవి చుట్టుకోతం నోట్లో వేసు కోటం వుమ్మేస్తున్డటం .అందరికి ఇదే అల వాటు .ఇప్పుడు చుస్తే నాకు పెద్దగా అల నవిలే వాళ్ళు కన్పించలేదు .
                    మా ఇంటి దగ్గర ఒక ముస్లిం కుటుంబం వుండేది వాళ్ళు సాయంత్రం ఏడు గంటలకు అందరు వరుసగా కూర్చొని స్వీట్లు ఫలహారం గా తినే వారు .ఒక సారి ఎనుకో వాళ్ళింటికి వెళ్తే మాకు పెట్టారు .అప్పటినుంచి రోజు మా కోసం ఎదురు చూసే వారు .మేము వెళ్ళాక పొతే కబురు చేసే వారు .తల్లి ,తండ్రి కొడుకులు .మా ఇంటి దగ్గరే ”రాయల కళా భవనం ”అనే ఇల్లుండేది .యజమాని పేరు కల్లూరి సుబ్బా రావు అని జ్ఞాపకం .భార్య చాలా మంచిది నెలకో సారి సాహిత్య సభలు జరిపే వాడు .అంతకా కలిపి అయిదార్గురు కూడా వుండే వారు కాదు .మేము ఉత్కంతతో వాకిట్లో నుంచి చూసే వాళ్ళం .ఆయన బాగా కోపిస్టి .కేక లేసె వాడు .మర్నాడు పపీర్ లో సభ బ్రహ్మాండం గా జరిగినట్లు జనం బాగా వచ్చినట్లు రాసేవారు .ప్రత్యక్ష సాక్షులం మేము కనక మాకు నావు వచ్చేది .అందుకే ఎక్కడైనా సభ జరిగి జనం లేక పొతే రాయల వారి సభా భవనం అని ఎక్కిరించే వాళ్ళం
                           ఇదీ హిందూ పురం తో మా అనుబంధం .ఒక్క సారి వెనక్కి తిరిగి చుస్తే జ్ఞాపకం వచ్చిన VISHAYAALIVI
                                        —దుర్గా ప్రసాద్ —-05 -07 -11 –క్యాంపు –బెంగళూర్

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగ దాకా —04

కృష్ణ నుంచి గంగ దాకా —04

జూన్ 24 న ఉదయం అటో లలో బయల్దేరి మణికర్ణిక ఘట్టం చేరాం .అక్కడ మంత్ర పూతం గా స్నానం చేశాం .అక్కడే మా రెండో అబ్బాయి శర్మ లాగా వున్న ఒక అబ్బాయి స్నానం చేస్తూ కనిపించాడు .ఫోటో లు తీసుసున్నాం .మనిషిని పోలిన మనిషి ఉంటాడన టానికి ఇది మంచి ఉదాహరణ గా అనిపించింది .అక్కడినుంచి ,పిల్లల హుషారు తీర్చటానికి 150 రూపాయలు రాను ,పోనుకి ఇచ్చే ఏర్పాటులో బోటు లో గంగకు అవతలి ఒడ్డుకు చేరాం .ఇక్కడ మంచి ప్రవాహం వుంది లోతు మరీ ఎక్కువ లేదు .హాయిగా ,జోరుగా ,హుషారుగా భక్తిగా అందరం గంటకు పైగా స్నానం చేశాము .మళ్ళీ అందరికి మంత్రం చెప్పి స్నానం చేయించాను .దంపతులు గా స్నానం చేశాం .అర్ఘ్య ప్రదానం ,సంధ్యా వందనం చేసాను .ఈత కొట్టాను .చాల రోజూ లైంది ఈత కొట్టి .కొంచెం ఇబ్బందైనా పూర్వపు అలవాటుంది కనుక ఇబ్బంది కలుగ లేదు .ఫోటోలు తీసుకున్నాం .ఉయ్యూరు నుంచి మా ఆవిడ ప్రభావతి మా ఇంటిలోని అరటి చెట్లనుంచి ,దొప్పలు తయారు చేసి ,మధ్యలో రంధ్రం లాగా ఖాలే చేసి అందులో ఉయ్యూరు నుంచి తెచ్చిన ఆవునెయ్యి వత్తులతో దీపారాధన చేశారు ఆడ వాళ్ళు అంతా చాలా భక్తీ శ్రద్ధలతో .పూజలు చేసి నైవేద్యం పెట్టి ,ఆ వెలుగు దివ్వేనలను భక్తితో గంగా నది లోకి వదిలి ఆనందం పొందారు .చిరకాల కోర్కె నర వేరిందని సంబర పడ్డారు .ఇది విశ్వనాధ ,విశాలాక్షి ల అనుగ్రహం గా భావించారు .పరవశించారు .గంగ హారతి కోర్కె ఇలా నేర వేరింది .అక్కడి నుంచి మళ్ళీ గంగ లో మణికర్ణికా ఘాట్ కు చేరి అటో లో విశ్వ నాద ఆలయం దగ్గరకు చేరాము అది ఒక గల్లి ఆంటే ఇరుకు సందు రెండు ఐపులా అనేక దుకాణాలు .మధ్యలో దారి ముగ్గురు పట్టే కంటే వెడల్పు వుండదు .అలాగే దారి చేసు కుంటు ,విశ్వేస్వరాలయం చేరం .మేమిద్దరం సామన్లకు కాపలా వుండి ,మిగిలిన వారిని దర్శనానికి పంపాము .ఇక్కపట్టే డ సెక్యూరిటీ బాగా వుంది .తణికీ చేసి లోపలకు పంపుతారు .వాళ్ళు తరిగి వచ్చిన తర్వాత మేమిద్దరం దర్శనానికి వెళ్లాం.ముందుగా అన్న పూర్నాదేవి దర్శనం చేశాం .అక్కడే డుంతి గణపతి దర్శనం ,చేసి శ్రీ విశ్వేశ్వర దర్శనం చేశాం .అప్పటికే అభిషేకం ప్రారంభమయింది దూరం నుంచే దర్శనం చేశాం .చాలా గొప్ప అనుభూతి .మన జీవితం ఇందుకే అనిపిస్తుంది .నిన్న ఇవాళ సామిని రెండు చేతులతో తాకి కళ్ళ కద్దుకొనే గొప్ప అదృష్టం మాకు లభిచలేదు అదొక లోటు అనిపించింది .మా వాళ్లకు ఆ అదృష్టం కలిగింది .అయితె ఇది వరకు చాలా సార్లు దర్శించే భాగ్యం మాకు కలిగిందనే ఊరట . అన్న పూర్ణమ్మ ఆలయం లో దానికి అనుబంధం గా వున్న వెద విద్యాలయం లో చదివే విద్యార్ధులు బారులు గా అమ్మ వారి సన్నిధి లో కూర్చుని ,శ్రీ శంకరాచార్యుల వారు రచించిన ”అన్న పూర్ణ అష్టకం ”చాలా పరవశం తో పథించుతారు .చూడ ముచ్చటగా వుంటుంది అన్నపూర్ణమ అనుగ్రహం తోనే మనకు అన్నం లభిస్తోందని అందరి భావన .ఒక చేత్తో పరవాన్నం గిన్నె వేడిది ,దానిలో ఒక గరిట ఆమె చేతిలో వున్న విగ్రహాలను కోని ఇంటికి తెచ్చుకొని దేవుని దగ్గర పెట్టుకొని పూజిస్తారు .అందరి ఇళ్ళల్లో అన్న పూర్ణ విగ్రహం వుంటుంది .మా అమ్మ భావానమ్మ ”నిత్యానందకరీ ,వరాభయ క్రీ ,సొందర్య రత్నాకరీ –నిర్ధూతాఖిల భూరి పావన కరీ .మాతాన్న్ పూర్నేశ్వరీ”అని పాడుకునే వారు చివరిగా ప్రతి శ్లోకానికీ ;;భిక్షాం దేహి కృపా కరీ మాతాన్న పూర్నేశ్వరీ ..”అని భక్తిగా ప్రతి ఇంటి ఆడ వారు పాడు కొనే వారు .అంతే కాదు ”అక్షయంబుగా కాశి లోపల అన్న పూర్ణ భావానివై ,మోక్ష మోసగేడు కనక దుర్గకు మూల కారణ శక్తివై సాక్షి గణ పతి కన్న తల్లివి సద్గుణా వతి శాంభవీ ” అనీ పాడుకోవటం ఇంకా గుర్తుంది . ఇంకా కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను .మణికర్ణికా ఘట్టం విస్వేస్వరాలయానికి దగ్గర ఇక్కడా శవ దహనాలు బాగానే జరుగు తాయి .పూర్వం విష్ణు మూర్తి ఇక్కడ ఒక తటాకాన్ని తన చక్రాయుధం తో త్రవ్వి దాని ఒడ్డున కూర్చుని కాశీ విశ్వేశ్వరుని గూర్చి తపస్సు చేశాడట .విస్వనాధుడు ప్రత్యక్షమై తపస్సుకు మెచ్చి తలను ఆనందం గా వూపాదట. అప్పుడు శివుని కుడి చెవి కి వున్న మణికర్ణిక జారి కిందపదిందట .అప్పటినుంచి ఈ రేవుకు మణికర్ణికా ఘట్టం నే పేరు వచ్చిందని కధనం విష్ణు మూర్తి తవ్విన తటాకమే చక్ర తీర్ధం .ఇది ఇప్పుడు నదీ గర్భం లో కలిసి పోయింది మనికర్నికకు దగ్గరలోనే రాణీ అహల్యాబాయి ఘాటుంది .దీనిగురించిన కధ అందరు తెలుసు కోవాలి .రాణి అహల్యా దేవి గంగ ఒడ్డున ఒక స్నాన ఘట్టం కట్టించి ,అక్కడొక శివాలయం ప్రతిష్టించాలని కోరిక గా ఉండేదట .ఆమె జీవిత కాలమ్ జరగలేదు .కొడుకుని ఆ బాధ్యతా నేర వేర్చమని కోరిందట ఆయన తల్లికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఘట్టం నిర్మించి శివాలయం కట్టించి ఆనందం గా ”అమ్మ ఋణం తీర్చుకుననాను ”అన్నాడట అంతే వెంటనే ఆలయం నదిలో ఒక పక్కకు ఒరిగి పోయింది .ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని నిటారుగా నిల బెట్ట లేక పోయారు .ఇప్పటికీ అది నది లో సగం మునిగి ఒరిగి కని పిస్తుంది .ఎందుకు ఇలా జరిగిందీ అని ఆయన వితర్కించు కున్నాడట .అప్పుడు అర్ధం అయింది తల్లి ఋణం ఎవరు తీర్చుకోలేరని ,తీర్చరానిదని ,తీర్చాననుకోవటం మూర్ఖం ,అహంభావమనీ ,అసంభవం అనీ .ఇది అందరు తప్పక గుర్తించు కో తగినది , ఇంకో విషయము కాశి గురించి తెలుసు కోవాలి .వ్యాస మహర్షి విస్వేస్వరుని కోపానికి గురి అయి కాశీ నుంచి బయటకు వెళ్ళ గొట్ట బడ్డాడు .దానినే ”వ్యాస నిష్కాసనం ”అంటారు .ఈ విషయాలన్నీ శ్రీ నాద కవి సార్వ భౌముడు తన భీమ ఖండ పురాణం లో అత్యద్భుతం గా వర్ణించాడు .భీమా రామం లో వ్యాసుని అగస్త్య మహర్షి కాశీ ని వదలి వచ్చిన కారణ మేమిటి అని అడిగితె ఆయన ఈ కధంతా చెప్పాడు భిక్ష దొరక్క తనకు కోపం వచ్చి కాశీ ని సపించనని చెప్పాడు .ఇక్కడ శ్రీనాధుడు ఆ కోపాన్ని క్ష అనే అక్షర విన్యాసం తో గొప్పగా చెప్పాడు ”కుస్స్సక్షి ప్రోద్భవ నిస్తురా క్షుభిత దుస్తాంద కారంబుతో కన్నుల్ మూయగ భిక్షా పాత్రము నెల వైచితిని ……. ” పద్యం రాశాడు .మర్నాడు అన్న పూర్నా దేవి కరుణించి భిక్షకు ఆహ్వానించి శిష్యులతో సహా అందరికి షడ్ర సోపేత మైన విందును ఇచ్చింది .ఆ విందు తిని తబ్బిబ్బైన వ్యాసుడు ఆనందాన్ని ,సంతృప్తినీ మళ్ళీ అదే క్షకార విన్య్యసంతో వర్ణించాడు కవి సార్వ భౌముడు ”ద్రాక్షా పానకా ఖండ శర్కరాలతో ,రంభా ఫల శ్రేనితో ,అక్షయ్యంబగు యేరు బాల కల మహారం నిశ్శన్కతాన్ కుక్షుల్ నిండగా నారగించితిమి ఇక్సుద్ర క్షుధా శాంతికిన్ ”అని వర్ణించటం ఆ మహా కవికే చెల్లింది .పద్య శిల్పం తెలిసిన మహాకవి ఆయన . పార్వతీ పరమేశ్వరులు వ్యాసునికి దర్శన మిచ్చారు .ఆ వైభావాన్నే చాల సుందరం గా వర్ణించాడు కవి .ఒకే పదం తో ఇద్దరికీఅన్వయిస్తూ చేప్పినపద్యసౌన్దర్యం ..”చంద్ర బింబానన -చంద్ర రేఖా మౌళి -నీల కుంతలా భాగ -నీల గళుడు–ధవాలయతెక్షణ ,–ధవలాఖిలాన్గుండు –మదన మోహన గాత్ర ,మదన హరుడు .ధవల్లాయతెక్షిత గౌరి శ్రీ విశ్వ నాధుండు కనక రత్న చట్టియలు పట్టికోనుచు ఎగు దేన్చిరి ఒయ్యార మెసగ మెసగ విహరణ క్రీడా మాయున్నా వేడి కపుడు ”అని ,ధవళ సుందర దేహి నాగేంద్ర నిభాయాన ,నాగ కుండల దారి భువన మోహన గాత్ర ,భువన కర్త –కనక రత్న మెట్టి చట్టలు పట్టికోనుచుఎగు దేన్చిరి ఒయ్యార మెసగ మెసగ విహరణ క్రీడా మా యున్న వేడి కపుడు ”విన్తూన్తేనే ఆ దివ్య మంగళ స్వరూపం కళ్ళ ఏదుట ప్రత్యక్షమవుతుంది .అదీ కవిసార్వ భౌమ సాహితీ సాహితీ వైభవం అంతా గొప్ప కాశిని ఎలా వదిలి పెట్టావు అని అడుగుతూ కాశీ లో రాత్రి పూట తా అనుభవాన్ని మనకు పంచుతాడు అగస్త్యడు ”ఆకాశంబున అర్ధ రాత్రముల చంద్రాలోకముల్ కాయగా –నానా సైకత వేదికా స్తలములన్ ,నల్దిక్కులనన్ ”శంభు ,కాశీ నాదు ,విశ్వేశు శ్రీ కన్తునిన్ ,మేనేల్ల్న్ పులకాన్కురంమోసగా నిండారు మిన్నేటి లోన్ ”అని పరవశం గా చెప్తాడు ఆయన అనుభవం ,పరమ మాహేశ్వరుడైన శ్రీనాధుని అనుభవం చివరికి మన అనుభవం అని పిస్తాడు .ఇందులో భావం ”అర్ధ ఏమిటి? ,”అర్ధ రాత్రి పునామి వెన్నెల గంగానది నీపై పడి వెండి వెలుగులు చిమ్ముతోంది గంగమ్మ ఇసుక తినేల మీద అగస్త్యుడు ఆనందంగా ,పరవశం గా శంభో శంకర శివా నీల కంతా అని ఉద్విగ్నంగా పాడుతూ పులకించి పోతున్నాదట .యెంత గొప్ప అనుభవం .ఒక్క సారి మనసు లో ఆద్రుశ్యాన్ని ఊహించుకొంటే ఒళ్ళంతా పులాకాన్కురాలు రావా ?అదీ అనుభూతి .దాన్ని కవిత్వం లో అందరికీ పంచాడు కవి సార్వ భౌముడు .ఈ పాయాలు మాకు ఇంటర్ లో పాత్యాంశం .దీని బోధించన వారు ఆచార్య పాటిబండ్ల మాధవ శర్మ గారు .ప్రతి పద్యం బట్టీ పట్ట మన్నారు .అలాగే అందులోని 72 పద్యాలు అంతట పట్టాను .అవి న హృదయం లో జీర్నిన్చ్కుపోయాయి జ్ఞాపకం ఉన్నంత వరకు మీ ముందుంచాను .మతి ముపు లో కొన్ని కుపి గంతులున్దచ్చు .ఆఆచార్యుల విద్యా భిక్షకు నేను సదా రుణ పడి వుంటాను .ఆరు వివరించే తీరు మహాద్భుతం .అలాగే వారే ననయ రచిత ”ఉదంకో పాఖ్యానం ”బోధించి నా మనసు పై చెరగని ముద్ర వేశారు .అందులోని నాగ స్తుతిని కన్తతా పట్టి రోజూ చాడువుకోమన్నారు .ఆ పద్యాలు కూడా భట్టీయం వేశాను ఒక్కసారి మాధవ శర్మ గారికి కృతజ్ఞతా పూర్వక వందనాలు తెలియ జేస్తున్నా మని కర్ణిక లో ప్రారంభించి చాలా దూరం వచ్చాము .మధ్యాహ్నం పన్నెండుకు లక్ష్మణ శాస్త్రి గారింటికి చేరాము .అక్కడ మా ఆవిడ అక్క గారు జానకి గారు గోదానం చేసుకొన్నది మాతో సహా ఇరవై మందికి కాశీ సమారాధాన్ చేసుకోంది పూర్ణం బూరెలు ,పులిహోర పప్పు ,బంగాళా దుంప కూర రెండు పచ్చళ్ళు పప్పు పులుసు అప్పడాలు పెరుగు భోజనం .రుచి కరం గా వున్నాయి .తర్వాత నేను ఆనందు ,వంశీ కలసి కరివేన వారి సత్రానికి వెళ్లాం .ఖమ్మం లోని మా పెద్ద తోడల్లుడు గారుమూర్తి గారు ఇచ్చిన ౨౫౦౦ ల రూపాయలు ,జానకి గారిచ్చిన 1116,లు క్న్నదానానికి జమ చ్శాము .నేను మూడు వందలు సమర్పించాను .వారు చసె సేవకు యెంత ఇచ్చినా చాలదు .అక్కడినుంచి వానషి స్తాతిఒన్ చేరి క్యిడు గంటలకు పాట్నా ఎక్ష్ప్రెస్స్ ఎక్కి మర్నాడు రాత్రి తొమ్మిదిన్నరకు హైదరాబాద్ చేరాం .ఎవరిల్లకు వారం వెళ్లి పోయాము .ఆనంద్ చాల ఖర్చు చేశాడు .అనే లెక్కవేసి మా ఇద్దరి ఖర్చు వాది చేతిలో డబ్బు పెట్టాను స్టేషన్ లో .మర్యాద గా తిరస్కరించి ఇది డబ్బుతో కొనే అనుభవం కాదు బావా .మీరు మాతో రావటమే మా ఆనందం .డబ్బుతో ముడి పెట్టా వద్దు అన్నాడు .సరే చేసేదేమీ లేదు కనుక ఆ డబ్బు మళ్ళీ న జేబులో పెతుకొన్నా తప్పని పరిస్థితుల్లో …అంటే ఒక రకంగా ఇది మాకు sponsored ప్రోగ్రాం అయిందన్న మాట కాశీ ఉన్ని సిలు పట్టు బట్టలకు ప్రసిద్ధి ఇత్తడి ,కంచు రాగి పాత్రలు ఇక్కడ బాగా వుంటాయి రాగి పాత్రల్లో గంగాజలం నింపుకొని సీల్ వేయించి పవిత్రం గా ఇంటికి తెచ్చుకొని ఎవుడి గదిలో పెతుకుంటారు కర్ర బొమలు బాగుంటాయి రాతి ,పాలరాతి విగ్రహాలకు పేరు మృగ చర్మాలు ,రుద్రాక్షలు దర్భాసనాలు పట్టు బట్టలకు ప్రసిద్ధి జర్దా కిల్లి ఇక్కడి ప్రత్యేకత గంగా లహరి ,యమునా లహరి లను జగన్నాధ పండిత రాయలు రాశాడు .ఆయన ఆంధ్రుడే .శంకరాచార్యుల వారు ఇక్కడి అందరి దేవాలపి భక్తీ చిప్పిల్లే స్తోత్రాలు రాశారు గంగాస్తకం ,యమునాస్తకం కూడా ప్రసిద్ధి చెందాయి కాశీ అలహాబాద్ లలో ఎక్కడా రాజా కీయ నాయకుల సినిమా స్టార్ల కటౌట్లు కన్పించవు బాన్నర్లు కన్పించక పోవటం బలే ఆశ్చర్యమేసింది .మన కున్న ఈ దరిదాపు కల్ట్ వారికి లేక పోవటం అభినందిన్చాదగింది .భక్తికీ ,ముక్తికీ కాశీ చాలా పవిత్ర మైంది ,ప్రశస్తమైంది .ఆ కాశీ పట్టణానికి విశ్వేశ్వర ,విశాలాక్షి ,అన్నపూర్ణ కాల భైరవ డుంతి గణపతి గంగా మాటలకు భక్తీ తో నమస్కరించి ,పునర్దార్శ్నమివ్వమని మనసారా వేడు కొనాను ఇదేం తే మోస్ట్ సచ్రెద్ హోలీ ప్లేస్ కాశీ ?అయితె తే వర్స్ట్ దిర్తిఎస్త ప్లేస్ కాశీ అవటం విచారకరం .రోడ్లు బాగుండవు .పురాతన రాళ్ళతో ,ఇటుక రాళ్ళతో రోడ్లుంటాయి .మైన్తెనన్స్ లేదు .ఇరుకు రోడ్లు .చెత్తా చేదారేర్ భయంకరం .అడుగు అడుగునా గోమాతలు స్పీడ్ బ్రేఅకేర్లు గా అడ్డుకుంటాయి .అయితె ఏమీ చేయవు .తమ దారిలో తాము పోతుంటాయి .ఇదివరకు దోమలు లేవు .ఇప్పుడు పుష్కలం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు .ఆంధ్రా హోటల్లు తక్కువే .ఇంకా రావలసివుంది ఇంకొంచెం శ్రద్ధ ని ప్రభుత్వం చూపించాలి .కల్మశాలనుంది గంగను విముక్తి చేయాలి .అప్పుడు ఇంకా భక్తీ భావం పెల్లుబికి వస్తుంది .లాగే యాత్రీకులు కూడా తమ వంతు ధర్మాన్ని నిర్వహించి ,నది మురికి కూపం గా మారటానికి సాయ పడరాదు .ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ప్రభుత్వం drainage సౌకర్యం పెంచాలి .అప్పుడు కాశీపవిత్ర పావన స్వచ్చ ,శుభ్ర ఆరోగ్యకేంద్రమై భక్తికీ ముక్తికీ ఇహ పరాలకు స్వర్గ ధామం గా ఆనంద వనం గా విలసిల్లుతుంది .దీనికి మనం అందరం బాధ్యత వహించాలి . ”స్వర్గాతస్సుఖ కరీ దివౌకసాం -శైల రాజా తనయాతి వల్లభా —డున్ది భైరవ విదారిత విఘ్నా –విశ్వ నాద నగరీ గరీయశే యత్ర దేహ పతనేన దేహినాం ముక్తి రెవ భవతీతి నిశ్చితం —పూర్వ పుణ్య నిచఎవ లభ్యతే విశ్వనాధ నగరీ గరీయశే యత్ర తీర్ధ మమలా మణియా సదా శివ సుఖ ప్రదాయినీ —-యా శివేన రచితా నిజాయుదై ,విశ్వ నాద నగరీ గరీయషీ యత్ర ముక్తి రాఖిలిస్తూ జంతుభిర్లభ్యతే మరణ మాత్రత స్సదా —నా అఖిల అమర గానైస్చ వందిత,విశ్వనాధ నగరీ గరీయసే యత్ర శాక్రనగారీ గరీయషీ –యత్ర దారునగారీ గరీయసీ –యత్ర కేశవా పురీ లఘీయసీ ,విశ్వ నాద నగరీ గరీయషీ యత్ర దేవ తటినీ ప్రదీయసీ ,యత్ర విశ్వ జననీ పటీయసీ—యత్ర భైరవ క్రుతిర్బలీయసీ ,విశ్వ నాద నగరీ గరీయసీ — ఇది వెద వ్యాస మహర్షి విరచిత కాశీ అస్తోత్తరం —లో కొన్ని శ్లోకాలు ఇంత దాకా మాతో కాశీ ప్రయాగ యాత్రల్లో పాలు పంచుకున్న మీ అందరికి కృతజ్ఞతలు ‘ ”కృష్ణ నుంచి గంగ దాకా ” సంపూర్ణమైనది మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-04 -07 -11 —క్యాంపు —బెంగళూర్ .

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగ దాకా -03

    

    కృష్ణ నుంచి గంగ దాకా —౦౩
              మధ్యాహ్నం మూడు గంటలకు ఆటో కు మూడు వందల యాబై కి రెండు ఆటో లలో లక్ష్మణ శాస్త్రి గారింటినుంచి నగర సందర్శనకు బయల్దేరాం .ముందుగా రెండు కిలో మీటర్ల దూరం లో వున్న కాల భైరవ ఆలయం చేరాం .విశ్వనాధ దర్శనం తర్వాత ఇది చాలా ముఖ్యం .భైరవుడు ఆంటే శునకం ,ఈయన కాశీ క్షేత్ర పాలకుడు .నిరంతరం కాశీని రక్షిస్తుంటాడు .అక్కడ వుండే పూజారి ఈకల కుంచె తో నెత్తిమీద బాదుతూ కాశీతోరం కడతాడు .అది నల్లగా ఉంటుందని అందరికి తెలుసు .కొనుక్కొని ఇళ్ళకు తెచ్చి బంధువులందరికీ ఇస్తారు .అది కాల భైరవ రక్ష అన్న మాట .ఇక్కడ ఒక కధ తెలియ జేస్తాను .పూర్వం బ్రహ్మ దేవుడు అహంకారం తో బల గర్వం తో తానే పరబ్రహ్మ స్వరూపం అని విర్ర వీగి పరమేశ్వరుణ్ణి కూడా తూలనాడాడు .శివుడికి కోపం వచ్చి తన తేజం నుంచి కాలభైరవున్ని ఉద్భవి౦పజేశాడు .ఆయన వీర ఆవేశం తో బ్రహ్మ వెంట పడి ఆయనకున్న అయిదవ శిరస్సును గోళ్ళతో పీకేశాడు .ఆ తల ఆయన చేతికే అంటుకు పోయింది .దాన్ని వదిలించుకోవటానికి కాలభైరవుడు లోకాలన్నీ తిరిగాడు చివరికి కాశీ క్షేత్రం చేరా గానీ ,ఆయన బ్రహ్మ హత్యా పాతకం పోయి ,బ్రహ్మ కపాలం ఊడి కింద పడి పోయింది .అంతటి బ్రహ్మ హత్యను కూడా పోగొట్టే మహిమాన్విత క్షేత్రం కాశీ .ఆది శంకరాచార్యుల వారు  ”కాశికా పురాదినాద కాల భైరవం భజే ”అనే మకుటం తో అష్టకం రాశారు .అది మనసులో చదువుకున్నాను .దాన్ని పఠిస్తే  మంచి ఫలితం లభిస్తుంది 
                             తర్వాత గవ్వల గౌరి మందిరంచేరాం .అక్కడ అయిదు గవ్వలను చిన్న మట్టి ప్రమిదలో పెట్టి అయిదు రూపాయలకు అమ్ముతారు .మహిళలు కోని అమ్మ వారి ముందు నిలిచి పూజారి చెప్పినట్లుగా ”కాశీ ఫలం మాకు ,గవ్వల ఫలితం నీకు ”అని చెప్పి ఆమె పై విసరాలి .అందరు తప్పక దర్శిస్తారు .ఆమె దర్శనం ఫల ప్రదం .దీనికి దగ్గరలో దుర్గా దేవి మందిరం దర్శిస్తారు .
                      తర్వాత తులసీ మానస మందిరం చూశాం .పూర్తి పాల రాతితో కట్టిన రెండస్తుల భవనం .గోస్వామి తులశీదాస్ కాశీ నివాసి .ఇక్కడే ఆయన శ్రీ రామ చరిత మానస్ అనే రామాయణాన్ని హిందీ లో రాశారు .మహాభక్తుడు .దీన్నే తులసీ రామాయణం అంటారు .ఉతరాది వారికి వాల్మీకం తర్వాత ఇదే అత్యంత ప్రీతి పాత్రం .ఇందులోనే హనుమాన్ చాలీసా వుంది .అందరు దీన్ని పారాయణ చేసి మంచి ఫలితం పొందుతారు మదిరం గోడల మీద తులసీ రామాయణం అంతా చెక్కారు .ముఖ్య సంఘటనల chitraalu కూడా గోడలపై కను విందు చేసేంత మనోహరం గా వుంటాయి దీన్ని 1964 లోసేత్ రతన్లాల్ నిర్మించాడు .ఇక్కడ పాలరాతి పంచ పట్టాభిరామ స్వామి మందిరం ,తులసీ దాసు మందిరం చూడ తగినవి  కుడివైపు  కైలాస పర్వతం ,ఎడమ వైపు రామేశ్వరం నిర్మించారు  
                      తర్వాత శ్రీ మదన మోహన మాలవ్యా గారు నిర్మించిన ”కాశీ విశ్వ విద్యాలయం ”సందర్సి౦చాము .వందలాది ఎకరాలలో ,దాదాపు అన్ని ఫాకల్టీ లతో వున్నది .పూర్వం ఇక్కడ చదవటం ఒక వరం .బెనారస్ డిగ్రీ కి చాలా విలువ వుంది .మాలవ్యాజీ దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి ఎంతో శ్రమ అవమానం భరించి దీన్ని నిర్మించారు .అవసరమైతే రైల్వే కూలీగా పనిచేసి సామాన్లు మోసి డబ్బు కూడా బెట్టిన మహాను భావుడాయన .శ్రీ శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించి ఆరంభం వారి చేతుల మీదుగా జరిపించారు .లోపల బ్రహ్మాండమైన విశ్వేశ్వరాలయం రెండతస్తులతో వుంది. పాలరాతి కట్టడం .నిత్యం అభిషేకం చేస్తారు .పీడా శిఖరం చాలా ముచ్చటగా వుంటు౦ది. మాననీయ మాలవ్యా విగ్రహం లోపల ఆకర్షణీయం గా వుంటుంది .ఆ మహాను భావుని కృషికి ,పట్టుదలకు దీక్షకు ,విద్యాభిమానానికి ,మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను .ఆయన విద్యా సేవ గురించి కధలు ,గాధలు గా చెప్పుకొనే వారు నా చిన్నప్పుడు .పాఠ్యాంశాలుగా కూడా చదువు కున్నాం .ఎందరు తెలుగు వారిక్కడ చదువుకొని డిగ్రీలు పొందారు .విశ్వనాధ సత్య నారాయణ గారిని ఆహ్వానించి రామాయణ కల్ప వృక్ష పద్యాల్ని ఆయన నోటితో విని ఘన సన్మానం చేశారిక్కడ .
                         తిరిగి వస్తు దారిలో ”సంకట మోచన హనుమాన్”ను దర్శి౦చాము .చాల శోభగా ,గొప్ప అలంకారం తో ,దివ్య సుందర మూర్తి గా కనిపిస్తారు .మంగళ ,శని వారాల్లో ఇసక వేస్తె రాలనంత జనం .వివిధ రకాలైన స్వీట్లు ప్రసాదం గా అమ్ముతారు .ఇక్కడ ఏ దేవాలయం లోను ,కొబ్బరికాయ కొట్టరు .ప్రసాదం నైవేద్యం పెట్టరు .మనమే నైవేద్యం పెట్టుకొని తీసుకు వెళ్ళాలి సెక్యూరిటీ బాగా వుంటుంది .కెమెరాలు సెల్ ఫోన్లు నిషిద్ధం 
                      200 ఏళ్ళ క్రితం ఏర్పడిన సంస్కృత కళాశాల వుంది దేశం లోని. అన్ని ప్రాంతాలనుండి విద్యార్ధులు వచ్చి చదువు కొంటారు .వారణాశి కంటోన్మెంట్ దగ్గర భారత మాత మందిరం వుంది .దేశాన్ని అంతా సిమెంట్ తో చక్కగా నిర్మించారు .పర్వతాలు ,నదులు ,సముద్రాలు ,ముఖ్య ప్రదేశాలు చాలా స్వభావ సిద్ధం గా కనిపించి ,సంభ్రమాన్ని కల్గిస్తాయి .హం సబ్ ఏక్ హాయ్ అనే భావం కలుగుతుంది .సుందర భారత మాట దర్శనం తో మనసంతా దేశ భక్తీ కలిగి పులకిస్తాం .
                         ఒక సిల్క్ స్టోర్స్ ఆడ వాళ్ళు షాప్పింగ్ చేసిన తర్వాత అందరం .మళ్ళీ శాస్త్రి గారింటికి చేరాం అక్కడినుంచి రిక్షాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర మందిరం చేరాం .విశ్వేశ్వర లింగాన్ని చేతితో తాకి స్వయం గా గంగా జలం తో అభిషేకం చేసే అరుదైన ,అద్భుతమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది భక్తులకు .దేనికే డబ్బులు లేవు .ఉచిత దర్శనమే .పూజార్లు అడుగు తారు .విశ్వేశ్వర దర్శనం ముక్తినిస్తుంది .చూసి ,తాకి ,పులకి౦చామ్ .రాత్రి ఎనిమిది గంటలకు రోజూ రెండు గంటల పాటు అభిషేకం జరుగు తుంది .తప్పక చూడ తగినది .అప్పుడు లింగాన్ని ముట్టుకో నివ్వరు .దూరం నుండే దర్శనం .ఉదయం పదకొండు గంటలకు కూడా అభిషేకం చేస్తారు .స్వామి దర్శనం తో ఒళ్ళు పులకిస్తుంది ,శివ స్తుతి చదువు కుంటు దర్శనం చేస్తారు భక్తులు .ఆనందం తో హరహర మహాదేవ శ౦భో అని నినాదాలు చేస్తూ దర్శిస్తారు .అభిషేకం బాగుంటుంది ఘంటా నినాదాలు ,ఓంకార ధ్వని ,శంఖ నాదం తో ఆలయం అభిషేక సమయం లో మార్మోగుతుంది .కైలాసం లో వున్న అనుభూతి కలుగు తుంది .భూకైలాసం అనిపిస్తుంది ముకుళిత హస్తాలతో జనం ఒళ్ళు మరిచిపోయి అమందానందం తో తనువు ,మనసు ఎకమైపోతాయి .ఇక్కడ పార్వతీ దేవి ఆలయం వుంది .ఆమెను సందర్శించి మొక్కు కున్నాము .ఇక్కడ శివుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తారు .ఆ పూల దండలు శివునికి నివేదిస్తారు .ఆవు పాలు గ్లాసులతో అమ్ముతారు .వాటినీ స్వయం గా అభిషేకం చేసుకో వచ్చు .స్వీట్లే ఇక్కడి నైవేద్యం .రక రకాల స్వీట్లు అమ్ముతారు .పాలను బాగా మరిగించి ,పైన తేట  ఆంటే మీగడ విడిగా తీసి పంచ దార వేసి అమ్ముతారు ..దీన్ని మలాయి అంటారు .అంతా దీన్ని ఇష్టం గా తింటారు .మేము తిన్న్నాము .
                      ఇక్కాడ వ్విశ్వ నాద మందిరం గురించి కొన్ని వివరాలు .మహమ్మదీయుల దండయాత్రలో ఈ ఆలయం అనేక సార్లు ద్వంస౦ అయింది .మళ్ళీ పునర్నిర్మించబడింది .దీని పక్కనే మసీదు కూడా వుంది కాశీ లో హిందూ ,ముస్లిం ,జైన బౌద్ధ ,christavululu మత సహనం తో నివశించటం విశేషం . 
                 మణికర్ణికా ఘట్టం నుంచి నాలుగు ఫర్లాంగుల దూరం లో నే విశ్వేశ్వర ఆలయం వుంది. దీని గోపురం 22 మణుగుల బంగారం రేకులతో నిర్మించబడింది ఈ బంగారాన్ని రంజిత్ సింగ్ మహారాజు సమర్పించారు ఇప్పుడున్న మందిరం 1785 లో రాని అహల్యాబాయి నిర్మించారు. తెల్లవారు ఝామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఆలయం తెరచి వుంటుంది .ఆంటే nonstop దర్శనం అన్న మాట. అక్కడినుంచి రెండు కిలో మీటర్ల దూరం లో విశాలాక్షి మందిరానికి బయల్దేరాం .దారి ఇరుకు .కరెంటు లేదు .మధ్యలో నల్లటి ఆవులు మనల్ని రాసుకుంటూ పోతాయి .వర్షం తో కాళ్ళు జారుతున్నాయి .చాలా భయంకరంగా వుంది నడక సాగాడు జారి పడి పోతామేమో నని భయం .ఈ దారి ఏమిటీ అని మా ముసలాళ్ళ గోల. మధ్య చాల కస్టపడి విశాలాక్షి ని దర్షించాము .ముందున్న విగ్రహం వెనుక అసలైన విగ్రహం వుంది .దాని ప్రభావం కాపాడటానికి ముందు విగ్రహం వుంది . పూజారి చేతిలో ఇరవై పెడితే అమ్మ వారి ఫోటో ,గాజులు ,కుంకుం పొట్లం కట్టి ఇస్తారు .అది తీసుకొని శాస్త్రి గారింటికీ అక్కడ అప్పటికే కరివేన వారి సత్రం నుంచిన ఫలహారపు పోట్లాలతో హాలిడే హోం చేరాం .రాత్రి పన్నెండు గంటలకు కాని కరెంటు రాలేదు .తెచ్చిన టిఫిన్ అతుకుల పులిహోర బాగా ఇష్ట పడి తిన్నాం నిద్ర పోయాం 
              రోజూ రాత్రి పూట గంగా దేవికి ఏడు గంటలకు అన్ని ఘాటుల లోను హారతి ఇవ్వటం సంప్రదాయం .నయనానందకరం .దొప్పలలో దీపం ఆవు నెయ్యితో కలిపింది వెలిగించి మహిళలందరూ గంగలో వదులు తారు .మనోహరమయిన సన్నివేశం .గంగలో ఆ దీపాలు కదిలి అలలకు ఊగుతుంటే అద్భుతం గా వుంటుంది .మేల తాళాలు కూడా వాయించి శోభ కల్గిస్తారు .ఈ గంగా హారతి హరిద్వారం లో చాలా చాలా హృదయాహ్లాదం గా వుంటుంది .అనురాధా పోడ్వాల్ చాల గొప్ప పాట పాడారు .ఆ రికార్డు పెట్టి దీపాలు సమర్పించటం రివాజు 
                      ఇవాళ అన్న పూర్ణ దర్శనం చేయ లేక పోయాం .టైం చాలక .మర్నాడు చేద్దామని భావించాము .వర్షం మూలం గా గంగ హారతికి వెళ్ళ లేక పోయాం .
            ఉత్తర భారత దేశం లో పూజారులను ”పండాలు””అంటారు .పండితులు అని అర్ధం .పండితుడే పండా గా మారాడు .వీళ్ళదే హవా. ఇక్కడ జోషీ అనే ఆయనకు చాలా భవనాలు ,ఎంతోమంది అనుచరులు వున్నారు .domination ఆయనదే .తర్వాత మన తెలుగు వాళ్ళు వచ్చి బాగా స్థిరపడ్డారు పౌరోహిత్యం లో .ఇక్కడ రాజా కీయాన్ని ప్రభావితం చేసేది పండాలె .అందుకే చెన్న రెడ్డి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా వున్నప్పుడు ఈ పండా వ్యవస్థ రద్దు చేయ టానికి విశ్వ ప్రయత్నం చేశాడు .ఆయన వల్ల కాలేదు .చివరికి ఆయన్ను తమిళ నాడు కు మార్చారు తప్ప ఏమీ జరగలేదు 
                     మిగిలిన విషయాలు తరువాత అందిస్తాను ….ఇప్పటికి సెలవ్ ——–మీ —గబ్బిట .దుర్గా ప్రసాద్ –02 o7 -11 క్యాంపు –బెంగళూర్ .
                           
                 
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగదాక-2

కృష్ణ నుంచి గంగదాక-2

అలహాబాదు చాల ప్రసిద్ధమైంది .ఇక్కడే ఆది శంకరాచార్యులు మండన మిశ్రుని ,ఆయన భార్య ఉభయ భారతిని వాదం లో ఓడించి శిష్యునిగా మార్చాడు .ఆయనే పద్మ పాదుడు .అలాగే బౌద్ధ ధర్మం ఏమి చెప్పిందో తెలుసు కోవటానికి కొద్దికాలం ఆధర్మ చరణ చేసిన ఆయన హిందూ ధర్మానికి చాలా అపచారం చేశానని వూక లో పడుకొని దేహాన్ని కాల్చుకుని దేహత్యాగం చేసినది ఇక్కడే .త్రివేణి సంగమం లో పునిస్త్రీలు భర్తతో కలిసి వేణి పూజ చేసుకుంటారు.ఇది జీవితం లో ఒక్క సారే చేసుకోవాలట. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి సుమారు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ,ఇక్కడే పురోహితునిగా స్థిర పడిన పురోహితులు హరి జగన్నాధ శాస్త్రి గారు .మంచి పురోహితులు .బాగా చేయిస్తారు .మేము మొదటి మూడు సార్లు ఆయనతోనే చేయించాము .ఆయన దగ్గర వుండటనికి రూములు దొరుకు తాయి .ముందుగా చెప్తే టిఫిన్ ,భోజనం కూడా ఏర్పాటు చేస్తారు.అచ్చంగా ఆంధ్రా భోజనమే దొరుకు తుంది అదీ విశేషం .ఈయన గారి మేనల్లుడే కాశీ లో పురోహితునిగా వున్నా చల్ల లక్ష్మణ శాస్త్రి .అక్కడా వుండటానికి ,అవకాశాలున్నాయి . అలహాబాద్ నుంచి వారణాసి 120 కిలోమీటర్లు .ఇంకో విషయం .ఆగ్రా ఢిల్లీ లనుంచి యమునా నది ఇక్కడికి అలహాబాద్ లో చేరుతుంది-.గంగా నది హరిద్వారం దగ్గర హృషీకేష్ నుంచి భూమార్గం పట్టి ఇక్కడికి చేరుతుంది .ఇక్కడినుంచి కాశీ కీ ప్రయాణం చేస్తుంది .అదీ ఈ రెండు నదుల కధ . తెల్లవారు ఝామునే అంటే జూన్ 23 న అందరం కారులో నాలుగు గంటలకే బయల్దేరాం.తెల్ల వారు ఝామున రెండు గంటలకే అందరం లేచి ,కాల కృత్యాలు తీర్చుకున్నాము .గంగా నది పక్క నుంచే ప్రయాణం .ఇక్కడి నుంచే శ్రీ రాముడు ,లక్ష్మణుడు ,సీతా దేవి గంగను దాటి దండకారణ్యం ప్రవేశించారు.కార్ డ్రైవర్ కు పిలక జుట్టుంది .బాగా నడిపాడు .మధ్యలో ఒక చోట ఒక బడ్డి కొట్టు దగ్గర ఆగి ,కాఫీ తాగాము .మట్టికప్పులలో కావాలని తాగాము .అందరు సంతోషం గా వాటిలో తాగారు .కొన్ని ఖాళీ కప్పులు అడిగి తెసుకుంది ప్రభావతి వుయ్యుర్లో చూపించటానికి .సుమారు మూడు గంటల ప్రయాణం తర్వాత కాశి చేరాం .మహారాజా రోడ్ లో వున్న స్టేట్ బ్యాంకు హాలిడే హోం చేరి సామాన్లు దించాము .కావలసినవి సర్దుకొని అక్కడి బాయ్ ఇచ్చిన కాఫీలు తాగి ఒక అరగంటలో హరిశ్చంద్ర ఘాట్ చేరాం .ఒడ్డున బట్టలన్నీ పెట్టి అందరం గంగా నదీమతల్లి లో స్నానం చేశాం .ప్రవాహం తక్కువే .జన్మ జన్మల పూజా ఫలం ఇక్కడ స్నానం .ఈ హరిశ్చంద్ర ఘాట లోనే పూర్వం సత్య హరిశ్చంద్ర మహారాజు తన కొడుకు లోహితాష్యుని దహనం చేశ్హాడు ,ఇక్కడే వీర బాహు అనే కాటి కాపరికి అమ్ముడు పోయాడు .వీర బాహు వంశం ఇప్పటికి ఘాట్ ను పర్యవేక్షణ చేస్తోంది. భార్య చంద్ర మతి ఇక్కడే ఒక బ్రాహ్మణ స్త్రీ కీ పనిమనిషిగా సేవలు చేసింది .హరిశ్చంద్ర చక్రవర్తి జాతకం అంతా తల క్రిందులైనది ఇక్కడే .అను క్షణం శవాలు కాలుతూనే వుంటాయి లాట్లకు లాట్లు కర్ర దుంగలు ఘాటు ఒడ్డున నిలవ వుంటాయి .సగం కాలిన శవాలను గంగలో తోయటం ఇక్కడ మామూలే .కాశీ అంటే మహా స్మశానం .ఇక్కడ చని పోతే ముక్తి తప్పదు . చని పోయే వారి చెవిలో శివుడు శ్రీ రామ తారక మంత్రం వుపదేశిస్తాడట .అందుకే ఇక్కడికి చేరి అద్దెకు ఇల్లు తీసుకొని అందులో వుంటూ మరణాన్ని ఆహ్వానిస్తారు .నిత్యం శ్రీ విశ్వనాధదర్శనం ,గంగా స్నానం చేస్తూ .జన్మ పండించుకొంటారు .అన్నపూర్ణమ్మ వుంది కనుక తిండికి లోటు లేదు .ఏ కులానికి ఆకులం సత్రాలు లున్నాయి భోజనం పెడతారు .కాశీ లో తొమ్మిది రోజులు ఉండాలని నియమము .చాలా మంది పాటిస్తారు .బ్రాహ్మణులకు కరివేన వారి సత్రం మంచి సేవ లు చేస్తోంది .మున్డుగా మనం ఎంతమంది భోజనానికి వస్తామో వుదయమే చెప్పాలి గాత్రంతో సహా .పద కొండు గంటల కల్ల భోజనం పెడతారు .సాయంకాలం టిఫిన్ మాత్రమె .పులిహోర ,పిండి ,అటుకుల పులిహోర, దోసె ఇలా వేరైటి లుంటాయి. సాయంత్రం రైల్ కీ వేల్లెవాళ్ళకి ప్యాక్ చేసి ఇస్తారు. మజ్జిగ ఇస్తారు .అన్నీ చాలా మర్యాదగా శ్రద్ధ గా చేస్తారు .అడిగి అడిగి వడ్డిస్తారు .చాల రుచికరం గా వుంటాయి ఏవైనా .ఆన్న పూర్ణా దేవి ప్రసాదం గా భావించి ,కళ్ళ కద్దుకొని భక్తీ ముక్తి వస్తుందనే పూర్తీ విశ్వాశం తో తింటారు.. వీళ్ళ మొదటి సత్రం శ్రీ శైలం లో ఉంది. ..ఇక్కడే ఆంధ్ర ఆశ్రమం వుంది .గదులు దొరుకు తాయి వుండటానికి .ఇక్కడ వుండి కరివేన వారి సత్రం లో భోజనం చేస్తుంటారు ,దీనికి దగ్గరే నారద ఘాటు ,మానస సరోవరం ఘాటు వున్నాయి సరే –గంగా స్నానం చేశాం కదా నేను పితృదేవతలకు ,బంధువులకు ,మిత్రులకు నాకు తెలిసిన వారందరికి జల తర్పణ౦ చేశాను .అందరి స్నాన సంకల్ప మంత్రం చెప్పి స్నానం చేయించాను .గట్టు మీదకు చేరి నేను తెచ్చుకున్న స్ఫటిక శివ లింగానికి అభిషేకం నమక ,చమకాలతో చేసుకున్నాను .ఆడ వాళ్ళు దీపాధన చేసుకున్నారు ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ గంగమ్మ ఒడ్డున ఇవన్నీ జరుపు కోవటం పదేళ్ళ క్రితం వచ్చినపుడు కూడా వారం రోజులుండి రోజు గంగా స్నానం ,ఒడ్డున అభిషేకం మహాన్యాసం తో చేసుకున్నాను .విశ్వేశ్వర దర్శనము చేసే వాళ్ళం . నెమ్మదిగా అందరం మెట్లు ఎక్కి హరిస్చంద్ర ఘాట్ చివర రోడ్ కు దగ్గర్లో వున్న చల్లా లక్ష్మణ శాస్త్రి గారింటికి చేరాం .మా బావ మరిది ఆనంద్ ముందే అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ అంటే మా అత్త గారి ఏడవ మాసికం ఏర్పాటుకు సిద్ధం చేశాడు. పది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకు పూర్తి అయింది .మూడు కూరలు, గారేలు, బూరెలు మూడు పచ్చళ్ళు తో బ్రాహ్మణ వంటతో మంచి ,కైకలూరు పురోహితులు చక్కని మంత్రోచ్చారణతో ఇద్దరు భోక్తలతో జరిగింది భోజనం బాగానే వుంది అచ్చంగా మన ఇళ్ళ దగ్గిర జరిగినట్లే ఉంది. లక్ష్మణ శాస్త్రి గారు అమలా పురం నుంచి ఇక్కికి వచ్చి పౌరోహిత్యం చేస్తూ స్థిరపడిపోయారు . కాశి అనేబడే వారణాశి వరుణ ఆశి అనే 2 నదుల మధ్య వుంది .నది ఒడ్డున వ్యాపించిన నగరమిది .ఇక్కడే దివోదాసు అనే రాజు పరిపాలించాడు శ్రీనాధుడు ‘’దివోదాసు బహా విశ్రాంత బలమ్ము చేత అని ‘’భీమ ఖండ పురాణం లో వర్ణించాడు .ఆయనే ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరి మహర్షి గా తరువాత జన్మ ఎత్తాడు .కాశీ పట్టు బట్టలకు పేరు .మగవాళ్ళకు కాశీ పట్టు బట్టలు బాగుంటాయి .ఆడ వాళ్లకు బెనారస్ పట్టుచీరలు బాగా నచ్చుతాయి .కాశితువ్వాళ్ళు ఎరుపురంగులో ముచ్చటగా వుంటాయి .దర్భ తో చేసిన చాపలు ఇక్కడి ప్రత్యేకత .అన్గోస్త్రాలు ,ధావళి లకు ప్రసిద్ధి .కావాలని మడి కట్టుకొనే వాళ్ళు కొనుక్కుంటారు .కాశీ లోనే బుద్ధుడు సారనాద్ దగ్గర మొదటి సారిగా శిష్యులకు బౌద్ధ ధర్మాన్ని బోధించాడు .సారనాద్ దగ్గర స్థూపాలు తప్పక చూడాలి .మేము వెళ్ళలేదు ఇదివరకే చూశాం .అశోక స్తంభం ,అశోక చక్రం ఇక్కడేమ్యూజియం లో వున్నాయి భారత దేశం జాతి గుర్తుగా జాతీయ చిహ్నం అయ్యింది. .ఆయుర్వేదం ఇక్కడి నుంచే వ్యాప్తి చెందింది .వ్యాస మహర్షి ఇక్కడే తన ఉపనిషత్తులు పురాణాలు, బ్రహ్మ సూత్రాలు రాశాడు వ్యాస మహర్షి .ఇక్కడే ఏడు రోజులు భిక్ష తనకు ,తన శిష్యులకు దొరక్క కోపం తో కాశీ ని శపించాడు చివరికి అన్నపూర్ణ దేవి ఇంటికి పిలిచి ఆతిద్యం ఇచ్చింది. కానీ శివునికి కోపం వచ్చి కాశీ లో వుండే అర్హతలేదని ,కాశీని వదిలి పొమ్మని హెచ్చరించాడు .అప్పుడు అవతలి ఒడ్డున వున్న కాశీ మహారాజు పాలిస్తున్న ప్రదేశం చేరి ఆక్కడే వున్నాడు .దానినే వ్యాస కాశి అంటారు .బోటు మీద అక్కడికి వెళ్లి చూడచ్చు .ఇప్పుడు బ్రిడ్జి పడింది కోట వుంది అక్కడే మన రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించిన స్థలం వుంది డబ్బులు లేక అక్కడినుంచి చొక్క పుస్తకాలు తలపై గట్టిగా కట్టుకొని ,గంగా నదిని ఈదుకుంటూ కాశీ చేరి బడికి వెళ్లి చదువుకొని మళ్ళీ సాయంత్రం ఈదుకుంటూ ఇంటికి చేరిన మహోన్నత వ్యక్తీ శ్రీ శాస్త్రీజీ .బిస్మిల్లాఖాన్ కాశీలో నే వుండే వారు ,తన షహనాయితో విశ్వనాదున్ని పరవసింప చేసిన భారత రత్న ఖాన్జీ .ఇతర దేశాల వాళ్ళు రమ్మని ఆహ్వానించారు అయినా గంగను , విశ్వనాధుడు ని వదిలి రాలేనని ఇక్కడే స్తిర పడిన మహాను బవుడు అయన. కాని ఆయన్ని అంత్య కాలంలో భారత ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వకపోవటం విచారకరం. ఇక్కడ హనుమాన్ భక్తులు ఎక్కువ తాలి ఖానా లున్నాయి ,కుస్తీ పట్టటం లో మంచి శిక్షణ నిస్తారు .మల్ల యోధులకు ప్రసిద్ధి వ్యాసుడు ఆతర్వాత దక్షిణాదికి వచ్చి బాసరలో సరస్వతీ దేవిని గోదావరి ఒడ్డున ప్రతిష్టి౦చాడు .అగస్త్య మహర్షి ,భార్య లోపాముద్ర తో కలిసి విశ్వేశ్వర దర్శనం తో పులకించి ,వింధ్య పర్వత గర్వమణచి దక్షిణాదికి ముఖ్యం గా ఆంధ్ర రాష్ట్రం చేరాడు .ద్రాక్షారామం ,భీమేశ్వరాలను సందర్శించాడు .తమిళులకు అగస్యుడ౦టే వీర అభిమానం .వాళ్ళ రచన లన్నిటిలో అయన ప్రస్తావన వుంటుంది . శ్రీ రాముడు ,హరిశ్చంద్రుడు సగరుడు ,దివోదాసు ,బింబిసారుడు ,అశోకుడు, మౌర్యులు, గుప్తులు, అయోధ్య నవాబులు అందరు కాశీ ని పాలించారు .రాణి అహల్యాదేవి కీ కాశీ అంటే భక్తీ ప్రపత్తులు ఎక్కువ పూర్వపు చక్రవర్తులు అశ్వమేధయాగం చేసిన ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘాట్ అంటారు .మణికర్నికఘాట్ చాల పవిత్రమైనది గా భావిస్తారు .కేదార్ఘాట్ కు మంచి పేరుంది ఒడ్డున కేదారేశ్వరుడు ఉంటాడు. కాశీ లో ఈ చివరనుంచి ఆచివర కు 64 ఘాట్లున్నాయి .యాత్రికులు బోటు లో అన్నీ తిరిగి చూస్తారు కాశీకి విదేశీ యాత్రికులు చాలా ఎక్కువమంది వస్తారు .ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు భక్తీ శ్రద్దలతో గంగా స్నానం చేసి దైవ దర్శనం చేస్తారు .ముక్తి క్షేత్రమనే నమ్మిక .ఎంతో మంది తెలుగు వారు ఇక్కడ స్థిరపడ్డారు .కాశీ మొదటినుంచి గొప్ప ఆర్ష విద్యా కేంద్రం .అన్నీ రాష్ట్రాల వారు ,వేదం ,శాస్త్రం ,వ్యాకరణం ,తర్కం నేర్చుకోవ టానికి కాశీ కె వచ్చే వారు .ఇక్కడి పండితుల దగ్గర చేరిరి శిష్యరికం చేసి విద్యనేర్చి పట్టా పొంది ఇళ్లకు వెళ్ళే వాళ్ళు .విద్యకు చాల సంవత్సరాలు గడిపేవారు ఎక్కడ జయించి జయ పత్రిక పొందినా కాశీ పండితుని మెప్పించి జయ పత్రిక పొందితేనే గుర్తింపు .అంతటి మహోన్నత పాండిత్యం ఇక్కడి పండితులది .తరువాత స్థానం బెంగాల్ లోని నవద్వీపనిధి. అయితే మన పండితులు కొందరు ఇక్కడి పండితుల్ని జయించి సెహబాష్ అనిపించుకున్న వారు వున్నారు .ఈ విహయాలు నేను రాసిన ‘’ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ‘’అనే పుస్తకంలో వున్నాయి మిగిలిన విషయాలు మళ్ళీ రాస్తాను మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 01-jul-2011 —కాంప్ —బెంగళూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 2 Comments

కృష్ణ నుంచి గంగ దాకా

కృష్ణ నుంచి గంగ దాకా

————————

కృష్ణా నది ఒడ్డ్డునే వున్న విజయవాడకు 25 కిలోమీటర్ల దూరం లో ఉయ్యూరు వుంది .అక్కడినుంచి నేను నా భార్య ప్రభావతి ఈ నెల 18 వ తేది రాత్రి బయల్దేరి బస్సులో హైదరాబాద్ చేరాం .ముందు మా పెద్దబ్బాయింటికి వెళ్లి అక్కడినుంచి మా బావమరిది ఆనంద్ ఇంటికి మధ్యాహ్నం చేరాం .అక్కడ ప్రయాణానికి కావలసినవన్నీ తయారు చేసుకొని సిద్ధమైనాం.21 ఉదయం పాట్నా ఎక్ష్ప్రెస్స్ లో మా ప్రయాణం .మేమిద్దరం ,ఆనంద్ ,అతని భార్య ఇద్దరు పిల్లలు అతనీ అత్తగారు .ఇదీ మా బృందం .ఏడుగురు సభ్యులం .టికెట్స్ అన్నీ నెల రోజుల ముందే బుక్చేశాడు మా బావమరిది . కాబ్ లో అందరం ఉదయంతొమ్మిది న్నర గంటల కు సేకందరాబాద్ స్టేషన్ చేరాం .మారెసెర్వెద్ కం పార్ట్మెంట్ లో మా సీట్లలో కూచున్నాం .ట్రైన్ సరిగ్గా పదిగంటలకు బయల్దేరింది .పొద్దున్నే ఇంటిదగ్గర ఏడుగంటలకు అందరం వేడి అన్నం కూర పచ్చడి పెరుగు తో భోజనం చేసే బయల్దేరాం .రైల్ అయిదు గంటలు ఆంద్ర దేశం లోనే ప్రయాణం చేసింది .ఆంద్ర లో చివరి హాల్ట్ సిర్పూర్ .అక్కడినుంచి మహా రాష్ట్ర ప్రారంభం మా బృందం లో మూడు తరాల వాళ్ళం వున్నాం .మేమిద్దరం ఆనంద్ అత్త ఆంటే మా ఆవిడా అక్క గారు అరవై అయిదు పై వాళ్ళం .ఆనంద్,భార్య యాభై లోపు .వాళ్లపిల్లలు స్పందన వంశీ లు ఇరవైమూడు లోపు .అమ్మాయి బి teck పాస్స్ అయి వ్వుద్యోగం లో వుంటే తమ్ముడు బి teck మూడవ ఏడు . .నేను దీనితో నాల్గో సారి ,మా ఆవిడ మూడో సారి ఆనంద్ రెండో సారి రుక్మిణి పిల్లలు మొదటిసారి కాశీ యాత్ర . ఆ రోజూ టైమ్స్ అఫ్ ఇండియా పేపర్ కోని చదివాను .అందులో రెండు ముఖ్య విషయాలు చెప్తాను .ఒకటి అన్నా హజారే గారి గురించి .పూనా కు దగ్గరలో ఆయన గ్రామానికి చుట్టూ 2200 ఎకరాల భూమి వుంటే అందులో ఆయన కాలు పెట్టేసమయానికి 330 ఎకరాలు మాత్రమే సాగు భూమి .ఆయన మిలిటరీ లో రిటైర్ అయింతర్వాత వచ్చిన penshion డబ్బు తో వాటినితీర్చిదిద్దాలను కొన్నాడు .అందర్నీ సమీకరించి సాంద్ర వ్యవ సాయం చేసి ,చెక్ డాములు నిర్మంచి కొద్ది కాలంలో 1750 ఎకరాలలో పంటలు పండించే ఏర్పాటు చేశాడు .ఇదివిప్లవాత్మక మార్పు .దిగుబడి బాగా వచ్చి అప్పటి దాకా తలసరి ఆదాయం 250 రూపాయలనుంచి ,29000 రూపాయలకు పెరిగిందట .అందుకే ఆయన ను అంతా ఆదర్శం గా తీసుకున్నారు .మనసులోనే ఆయనకు నమస్కరించాను .రెండో విషయం నాగ పూర్ సమీపం లో లో త్రవ్వ కాలలో 25000 ఏళ్ళ నాటి రాతి చిత్రాలు కనిపించాయట ఇదో అద్భుతం పిల్లలకు ఆ విషయంచెప్పి హుషారు చేశా.బలార్శ వచ్చింది .అది వేపచేట్లకు ప్రసిద్ధి .చాల ముదురు చేట్లున్తాయి timber డిపో . వాళ్ళు ఇకడికి వచ్చే కొనుక్కు వెళ్తారు .ఆంద్ర ప్రదేశ్లో అతి పెద్ద timberdipo హైదరా బాద్ లో వున్న అక్కినేని నాగేశ్వర రావుది రెండోది ఉయ్యూరు లోని సుదీర్ timbar డిపో .దాని యజమాని నూకల లింగమూర్తి ఇక్కడికి వచ్చే కలప కొంటాడు .అఆడవులు మనకు దారిలో కనిపించవు దూరం గావున్తాయేమో . గాంధి గారు వున్న సేవాగ్రామం స్టేషన్ లో బండి ఆగుతుంది రాత్రి ఏడు గంటలకు నాగపూర్ చేరాం .ఇది మహారాష్ట్ర కు సాంస్కృతికరాజా దాని అన వచ్చు .ఇక్కడ కాంగ్రెస్ సభలు జరిగి స్వాతంత్ర ఉద్యమం కోసం ముఖ్య తీర్మానాలు చేశారు .ఆర్ .ఎస్ .ఎస్ ,కు ఇది కేంద్ర బిందువు .దాని అధినేతలిక్కడే వుంటారు .కమలాలకు నాగపూర్ చాలా ప్రసిద్ధి .ఇప్పుడు season కాదు తోటలు నాగపూర్ దాటినా తర్వాత కన్పిస్తాయి .ఈ ప్రాంతం లో మన తెలుగు వాళ్ళు చాలా గణనీయ సంఖ్య లో వున్నారు .మనవైపు నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం కస్టపడి చేసి మంచిపంటలు పండిస్తున్నారు .ఈ ప్రాంతం రూపు రేఖలు మార్చిన వాళ్ళు మన వాళ్ళే .నాగపూర్ తెలుగు అసోసియేషన్ చాలా కాలమ్ నుంచి బాగా పనిచేస్తోంది .ఇవన్నీ పిల్లలకు చెప్పుతుంటే చెవులు రిక్కించి విన్నారు ..దారిలొఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ రాత్రికి చపాతి తిన్నాం.మన మంచిర్యాల్ కు ముందు గోదావరి నది దర్శనమిచ్చింది.దాని తర్వాత సిర్పోర్ కాగజ్ నగర్ వచ్చింది .అక్కడి తెల్ల కాగితాలు బాగుండేవి వెదురు చేట్లుకాగితంపై కన్పించేవి .ఏనుగు మార్కు పేపర్ కూడా మా చిన్నప్పుడు బాగా వాడే వాళ్ళం అదే నంబర్ one రాజమండ్రి లో ఆంద్ర పేపర్ తయారయేది.ఇవన్నేఒక్క సారి జ్ఞాపకంవచ్చాయి ;రాత్రి బెర్త్ ల పైపడుకోన్నాము ;.దారిలో ఎక్కడా పచ్చనిపోలాలు కనిపించవు చిన్న చెట్లు తుప్పలె.మోదుగ చెట్లు బాగా వున్నాయి .దాని ఆకులతో విస్తర్లు కుడతారు .అదే ఇక్కదిప్రజల జీవనాధారం .గొర్రెలు ,మేకల పెంపకం వుంది .బోరు బావులు తక్కువ .కరెంటు లేని గ్రామాలు కూడా వున్నాయనిపించింది .బాగా వెనక పడిన ప్రాంతాలే ఇవి .మంచి ఇల్లుకూడా లేవు .నాగ పూర్ నుంచి వర్షం ప్రారంభం అయి దాదాపు 1000 .కిలో మేటేర్లదూరం వరకు వర్షం మాతోనే వచ్చింది .కానుగ చెట్లు బాగా కనిపించాయి .అక్కడక్కడ నల్ల రేగడి భూమి అరుదు గా కన్పించింది .రాత్రి నిద్ర పోయాము .ఉదయం కాఫీలు తాగాము .ఇటార్శి అర్ధరాత్రే వచ్చినట్లుంది మధ్య ప్రదేశ్ లో కి ప్రవేశిస్తాము .మధ్యాహ్నం పదకొండు గంటలకు అలహాబాద్ చేరాం .ఇక్కడ హిందీ లో ఇలాహాబాద్ అని రాస్తారు .ఇదిఉత్తరప్రదేశ్ లో వుందని మనకు తెలుసు .ఆంద్ర ,,మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్ చేరాంఅన్న మాట . యు.పీ tourism వాళ్ల తో మాట్లాడి కాంతెస్సా కార్ మాట్లాడుకొని స్టేషన్ నుంచి state బ్యాంకు వాళ్ల హాలిడే హోమేచేరాం ఆనంద్ స్టేట్ బాంక్ లో ఆఫీసర్ కనుక మున్దేబోక్ చేశాడు ,విశాల మైన రూం. డబల్ కాట్ బెడ్ .సోఫాలు వున్న పెద్ద హాలు ,టి.వి .వేడి నీళ్ళు ,ఫ్రిట్జ్ అన్ని సౌకర్యాలు వున్నాయి .రోజుకు పది.. రూపాయలే అద్దె బ్యాంకు వాళ్ళకే ఇస్తారు .అక్కడ సామాను దించి ప్రయాగ లో స్నానానికి కావలిసినవి విడి గా సద్దుకొని వెంటనే బయల్దేరం స్నానం sight సీఇంగ్ అన్నీ కలిపి ఒక్కొక్కల్లకి 400 రోపాయలు .అప్పటికే మధ్యాహ్నం పన్నెండు దాటింది .రాయల్రెస్టారెంట్ లో దక్షినాది టిఫిన్లు దొరుకు తాయని తెలిసి అక్కడికివేల్లాం .రెట్లు వింటే గుండె గుభేలే .కాఫీ నలభై రూపాయలు .ఇడ్లి అరవై అయిదు .ప్లాట్ పెరుగు వడ డెబ్భై .ఇదే అందరం తిని ,మూడు కాఫీలు అందరం సర్దుకున్నాం .ఆ రోజూ నాపుట్టిన రోజూ అని టిఫిన్లు అయిన తర్వాత తెలియ జేసి బిల్లు 610 నేనే చెల్లించాను చిన్న పార్టీ ఇచ్చినట్లు .అంతా ఆశ్చర్యపడ్డారు ఒక్క మాట కూడా ముందుగా చెప్పనందుకు . త్రివేణి సంగమం చేరాం కారులో అక్కడినుంచి టూరిసం వాళ్ళు ఏర్పాటు చేసినబోటు లో బ సంగమ స్థలం చేరాం .అప్పటికి సుమారు ఒకటిన్నర .నేనే అందరికి స్నాన సంకల్పం చెప్పాను .పడవ వాడు దారిలో ఒక చోట 140 అడుగుల లోతున నీళ్ళు వున్నాయని చెప్పాడు .అంతా కంగారుపద్దాం..కాని సంగమ స్థానం లో కేవలం నాలుగు అడుగులలోతు నీళ్ళ l దగ్గర బోటు ఆపాడు .అందులోంచి దానికి ఆనుకున్న లంగరు వెయ బడ్డ ఇంకోబోఅట్ లోకి మారాం .దాన్ని పట్టుకొని స్నానం చెయ్యాలి .గంగ నీరు తెల్లగా ,యమునా నీరు నల్లగా కనిపిస్తాయి .సరస్వతి అంతర్వాహిని .ఈ మూడు కలిసే చోటే త్రివేణీ సంగమం .చాలావిత్ర మైనది .ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే ఇక్కడ స్నానం చేయ గలుగు తాం అందరికి విషయాలన్నీ చెప్పాము నేను ఆనంద్ .ఒళ్ళు పులకించిపోయింది స్నానానికి ఒక్కొక్కరం దిగాం.ముందుగా నా కంటే పెద్ద మా ఒదిన గారిని ఆంటే మా ఆవిడ అక్క గారిని ఆంటే ఆనన్ద అత్తగారిని నీళ్ళలోకి దిమ్పాము .ఆవిడ చాలా భయ పడింది .భయం ఒదిలించాం .దిగిన్తర్వాట కేకే .భలెఆనన్దమ్ సంతృప్తిగా స్నానం చేసింది తర్వాత మా దంపతులు మేనల్లుడు మేన కోడలు దిగి స్నానం చేశాం .తర్వాత ఆనంద్ దంపతులు.నేను కాసేపు నీళ్ళలో ఈదాను .ఫోటోలు తీశారు . ప్రవాహం తక్కువ లోతు తక్కువ గా వుంది ఇదివరకు మూడు సార్లు వచ్చినప్పుడు కాళ్ళు నెల మీద ఆనేవి కాదు .విపరీతమైన వేగం .ఇసుక కోసుకుపోతుండేది .ఈ సారి నిలకడ గా వుండటం అందరి అదృష్టం .గంటపైగా స్నానం చేశాము .అందరం భూతల స్వర్గం లోవున్నట్లు భావించాం .ఆ అనుభవం మాటలతో చెప్ప లేనిది .ఈ క్షేత్రానికి అంతా పవిత్రత వుంది శంకరాచార్యులు నడయాడిన నెల ,మండన మిశ్రుని ఓడించి శిష్యున్నిగా చేసు కొన్న ప్రదేశం ,ఎన్ని యుగాల నుండో ఈ వాహ్హిని ఎన్ని కోట్లమందినికిముక్తినిచ్చినోఅవన్నీ తలుచుకుంటే ఆనందం అర్ణవం అవుతుంది జన్మ తరించిందని పిస్తుంది .కంఠం గద్గదిక మవుతోంది .మాటలు రావు .ఎందరు మహర్షులు వ్యాసాదిమునులు వాల్మీకాది మహర్షులు కాలు మోపి న పుణ్య భూమి . నీటితో మా పితృదేవతలకు ,తెలిసిన బంధు మిత్రాడులకు ,మరిచి పోయిన మహాను భావులకు పేరుపేరునా జ్ఞాపకం చేసుకొని తర్పణం జలం తో ఇచ్చి నా , విధి నేర వేర్చాను సాయం సంధ్య వార్చాను . ఆ నదీమ తల్లులకు మనసారా నమస్సులన్దిన్చాము .ఆ నదుల వల్లనే వల్లనే ఇక్కడ అద్భత మైన నాగరకత వర్ధిల్లింది .సుక్షేత్రాలైనాయిపోలాలు పాడి పంట వెద శాస్త్ర విజ్ఞానం వికశించి ప్రపంచం లో భారత దేశం సాంసృతిక విషయాలలో ముందుంది . .గంగా పుష్కరాలు వెళ్లి సరిగ్గ నెల అయింది .ఈ సంవత్చరం అంతా పుష్కరమే .కనుకుపుష్కర స్నాన ఫలం దక్కింది ,మధ్యాహ్నం 12 -.01 మధ్య పుష్కరుడు ఉంటాడట అప్పుడే కొట్లాదిదేవతలు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారట .అలాంటి సమయం లో చేసే అరుదైన అదృష్టం కల్గింది కొంతాలస్య అయినా .ఆనందం తో కల్లుకళ్ళు మూసుకు పోతున్నాయి .పిల్లలు మరుపు రాని అనుభూతిపొంది నట్లు చెప్పారు .ఇదివరకు ఇక్కడికి పెంగ్విన్లు సైబీరియా నుంచి వలస పక్షులువచ్చాయి.ఇప్పుడవి కనిపించ లేదు season కాదేమో .ఇంతా ఆనందాన్ని మూట కట్టుకొని సంగమ జలాన్నిబాటిళ్ళలో కావలిసి నంత పట్టుకొని నెమ్మదిగా మళ్ళీ మా బోటు చేరి బట్టలు మార్చుకోన్నాం .ఉయ్యూరు లో మా ఆవిడ నా కిష్టమైన మైసూర్ పాక్ చేసి తెచ్చింది .నాపుట్టినరోజు ఆంటే మైసూరు పాక్ ఉండాల్సిందే .మా అమ్మ ఎప్పుడు చేసి పెట్టేది .తర్వాత ప్రభావతి .అందరికి పుట్టిన రోజూ స్వీటు తినిపించాం అంతా శుభా కాంక్షలు చెప్పారు .త్రివేనికి నెమ్మదిగా వీడ్కోలు పలుకుతూ కృతజ్ఞత చాటుతూ ,మానసిక వుల్లాసాన్నిపొందుతూ ఒడ్డుకు చేరాం .నదీస్నానం చాలా యోగ్యమైనది కరెంటు ఆంటే ప్రవాహం మరియు విద్యుత్తూ అనిఅర్ధం .ఇలాంటి పవిత్ర నదీ జలాలలో స్నానం చేస్తే ఒంటికి శక్తి ప్రవాహం చేరుతుంది .శరీరానికి మనస్సుకు ఉల్లాసం కలుగు తుంది .ఆధ్యాత్మిక భావ లహరి మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తుంది .మోకాళ్ళ నేప్పులతో అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి లో వున్న నా భార్య త్రివేణీ సంగమ స్నానం చేసినతర్వాత తనకు కొత్త శక్తి వచ్చిందని హాయిగా నడవ గలుగు తున్నానని చెప్పి ,మాతో పాటు నడిచి అన్దర్నేఆశ్చర్య పరిచింది .అదీ దాని ఫలితం .కొత్త శక్తిని నింపుకొని ,మనసంతా ఆనందాన్ని నింపుకొని ,అంతకు ముందు లేని వింత అనుభూతిని పంచుకొని అందరం ఆ త్రివేణీ మాతకు హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు చేతులు జోడించి చెప్పి గాలిలో తేలి పోయేట్లు పొంగిన మనసులతోనిండిన సంత్రుప్తి తో నెమ్మది గా ఒడ్డుకు చేరాం .ఇక్కడి వాళ్ళు ఈప్రదేశాన్ని సంగం అంటారు .రాజా కపూర్ ఆ పేరుతో సినిమాకూడా తీశాడు .ఒడ్డున పూర్వపు రాజుల కోట వుంది చాలా పెద్దది .ఇదివరకు అందర్నీ లోపలికివెల్లి చూడ నిచ్చే వారు .ఇప్పుడు అవకాశం లేదు మళ్ళీ కారు ఎక్కి sight సీఇంగ్ కు బయల్దేరాం .దగ్గరలో బడే హనుమాన్ గుడిని చూశాం .నా పుట్టిన రోజున మా ఇలవేలుపు దర్శనం శుభదాయకం .ఎక్కడో లోతులో వున్తాడుస్వామి .పైనించి కటకటాల ద్వారా చూడాలి .ఆనంద్ భవన్ అయిదు దాటితే మూసేస్తారు .అక్కడికి ఇంకో పావు గంట ఉందనగా చేరాం .ముసలి వాళ్ళు కార్లోనే వున్నారు .పిల్లలకు అన్నీ వివరిస్తూ ,వీలయితే ఫోటోలు తీస్తూ తీరిగ్గా చూపించాం .మోతీలాల్ ఇక్కడే లా ప్రాక్టీసు చేశాడు .రాజకీయాలలో చేరి గొప్ప నాయకుడైనాడు .ఆయన గదులు ,పుస్తకాలు వాడిన వస్తువులు చూశాం .తర్వాత నెహ్రు గారి వైభవం .ఆఅర్వాతైన్దిరా గాంధి వైభవం .నెహ్రు ఒడుగు చేసు కున్న ఫోటో వుంది .శీర్షాసనం వేస్తున్నాదీ వుంది చరక ,గుర్రపు సార్టు వున్నాయి గాంధి గారు తరచుగా ఇకడికి వచ్చిమోతీలాల్ జవహర్లాల్ ల తో సంభాషణ చేసే వారు .ఆయనకు ఒక ప్రత్యెక మైన గది వుంది ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఆనంద భవన్ లోనే జరిగేవి .అందుకే దానికంట ప్రాముఖ్యం .మంచి లాన్లుపచ్చగా మనసు హాయినిస్తాయి.కొన్ని కోట్లు ఖరీదైన ఆస్తులివి .దేశానికి రాసిఇచ్చి మహా త్యాగులని పించుకున్నారు .అందుకే ప్రజలు ఆ కుటుంబానికి బ్రహ్మ రధం పడతారు .దానికి తగ్గట్టే మొతెలాల్ ,జవహర్లాల్ ఇందిరా ,రాజీవ్ ,సోనియా లు దేశ రాజా కీయం కీలక పాత్ర పోషించారు దీనికి దగ్గరే గంగ ఒడ్డున భరద్వాజ మహర్షి ఆశ్రమం వుంది .శ్రీ రాముడికి ఆ తర్వాత భరతుడికి ఆ ముని అతిధి మర్యాదలు చేసి మార్గ దర్శనం చేశాడు .అక్కడి నుంచి పార్కు musiam వేణీ మాధవ్ దర్శనమ్చేశాం .ఇక్కడ పెరుగు అలిపిన మజ్జిగలో పంచదార వేసి ఇస్తారు చాలా బాగుంటుంది .లస్సి అంటారు .తాగని వాళ్ళు ఇస్సీ అనాల్సిందే .స్వీట్లు ఎక్కువ తింటారు .ఇక్కడ ,కాశీ లో బిల్దిన్గులకు బయట సిమెంట్ ప్లాస్తింగ్ చెయ్యరు .టీ ని మట్టి కప్పులతో తాగాటమిక్కడి పద్ధతి .ఎంగిలి వుండదు .తాగ గానే పగలకొట్టేస్తారు అంతా అయింతర్వాత పొద్దున్న టిఫిన్ చేసిన హోటల్కే వెళ్లి భోజనం చేశాం .ఒక్కొక్కరికి 135 రస్.చాల బాగా వుంది భోజనం .ఇష్టపడి తిన్నాం .అలసట మూడు వంతులు సంగమ స్నానం తోమిగిలిందిభోజనం తో తీరింది . హాలిడే హోం చేరాం .అందరికి పక్కలు ఏర్పాటు చేశారు . పడుకున్నాం కాని .దోమల వల్ల నిద్ర బాగా పట్టలేదు .తెల్ల వారు ఝామున మూడింటికి కార్ లో బయల్దేరి 125 కిలోమీటర్ల దూరంలో వున్న వారణాశి అనే కాశీకి ప్రయాణం పెట్టుకున్నాం .ఆ వివరాలు తరవాత మనవి చేస్తాను మా యాత్రలో పాలు పంచుకున్న మీకు ధన్య వాదాలతో మీ .గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -06 -11 —-క్యాంపు —హైదరాబాద్

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – అమరావతి

Posted in రచనలు | Leave a comment

తెలుగు కధల్లో జీవిత సత్యాలు

తెలుగు కధల్లో జీవిత సత్యాలు
 
               శ్రీ వాకాటి పాండురంగా రావు ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ లు సంకలనం చేసిన ”కదాభారతి తెలుగు కధానికలు ”ఈరోజు చదివాను .అందులో అందరికి తెలియజేయాల్సిన కొన్ని జీవిత సత్యాలను కధకులు అద్భుతంగా వివరించారు .అవి నాకు నచ్చి ,మీకూ ,నచ్చుతాయని మీ ముందుంచుతున్నాను .వాక్యాలన్నీ రచయితలవే ..నేను కూర్పరిని మాత్రమే .
 
  దేవుడి పల్లకి —అవసరాల రామ కృష్ణా రావు
  ————————————————-             
 
కామ రూపులైన దేవతలూ ,పరకాయ ప్రవేశం చేసిన మనుష్యులూ పుష్కలంగా వున్న కాశీ మజిలీ కధలోని మనోహర దృశ్యాలను కళ్ళకు కట్టి నట్లు సన్నాయి లోని మలయ మారుతం అలా ఎక్కడికేక్కడికో తెలియని దూర తీరాలకు తీసుకొని వెళ్లి పోతోంది .కధ చివరని ,మాంచి బిగింపు వున్న ముగిమ్పులా ,మద్దెల దరువులు ముచ్చటగా విని పిస్తున్నాయి .దేవుడు ఊరేగి తున్నాడు .పూజా ప్లుస్ అరులు మాత్రంకుర్రాళ్ళను   కోప్పడుతున్నారు .
 
          ”పద్నాలుగు భువనాలు కడుపులో పెట్టుకున్నాడట .చూస్తె   చిన్న కుర్రాడు .అని కృష్ణున్ని ప్రతి వాళ్ళు పొగుడు తున్నారు .పాపం ఎలా భరిస్తున్నాడో యెంత గొప్ప వాడో అనుకుంటూ —ఇంతగొప్ప వాణ్ని ,బరువైన వాణి అవలీలగా అదేపనిగా చంకనేసుకున్తున్నాను .నన్ను మెచ్చుకున్న తలక మాసిన వాడు ఒక్కడూ కనపడ్డు .ఇంతకీ ప్రాప్తం ”అని యశోదా దేవిసరదాకి అన్నదట .
 
”వూళ్ళో ఎవరు చచ్చిపోయిన తనే నాయకత్వం వహించేసుబ్బయ్య చనిపోతే ఒక్కరూ ఆ శవాన్ని స్మశానానికి తెసుకు వెళ్ళటానికి ఒక్కడూ రాలేదు .పిల్లాలు చనిపోతే తలి దన్ద్రుల్నిఒదార్చిగుడ్డా కప్పి  శ్మశానానికి తెసుకొని వెళ్ళేవాడు సుబ్బయ .అతను చేసిన అనాధ ప్రేత సంస్కారాలకి లెక్క లేదు .కాని వూరు అతనికేమి తోడుగా నిలవలేదు .కామేశం ”నేను మొగాణ్ణి  కనుక ”అని చిన్న పిల్లాడైనాకామేశం  ముందుకు వచ్చి పై బట్టలు పిరికి తనం ,భయం అన్నిటినీ విప్పిపారేశాడు .వాడు మనిషి గా మళ్ళీ మాట్లాడితే మనీషిగా మారింది అప్పుడే . గాఢమైన జడత్వం లో నిద్రిస్తున్న చీకటిగూడును చీల్చుకొని జ్ఞ్గాలిగొంగళి  పురుగు రంగు రంగుల చుక్కల చుక్కల శ్సీతా కొక చిలుకల మారి ఎగిరి పోయింది .అప్పుడే అమావాష్య బతుకు లో అందమైన దీపావళి ”కామేశానికి తోడూ జగన్నాధం వీళ్ళకు తోడూ ఊళ్ళోని పిల్ల లంతా జతకలిసి సుబ్బయ్య అంతిమ సంస్కారానికి దండులా కదిలారు .అపుడు బుద్ధి వచ్చింది ఊళ్ళోని పెద్దలకు .వాళ్ళు అంతా భక్తుల్లా ముందుకు దూకారు .పిల్లలే ముందు శవ వాహకులై మున్డునారు ప్రతి కుర్రాడు భుజం కలిపాడు .చివరికి సుబ్బయ్య చావు దేవుడి పెళ్లి లా వైభవం గా జరిగింది .అప్పుడు కామేశం అన్న మాటలు మరువ రానిది ”మన్చి పనులు చేద్దామని పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం .అవసరం వస్తే ఆమడ దూరం పారి పోతాం .అలాంటి బతుకు బతుకు కాదు చావు .మనం చేసే మంచి అనులకు ఇదే నాంది .మన సంస్కారం ఇక్కడ్నించే ప్రారంభిద్దాం .
 
మర మనిషి —-కొమ్మూరివేణుగోపాల రావు —–”
———————————————————-
 
తల్లితనయుడికి వున్న సంబంధం బాంధవ్యం లాభ నష్టాల త్రాసుతో తూచటం చేత కాదు శ్రీ దేవికి .కాని ఈ విషయం లో భర్తతో వాదించాడు .మౌనం గా వుంటుంది .అనా కారిగా పుట్టిన కొడుకు చని పోయాడు .దాన్నిస్పెసిమేన్ గా మేఇకాల్ ల్యాబ్ ఉంచాడు .తండ్రి తనం కంటే ప్రొఫెసర్ తనం అతన్ని డామినేట్ చేసింది .రోజూ దాన్ని చూస్తూ వెళ్ళేవాడు.చివరికి అతనిలో మార్పు వచ్చింది .దాని చెంతనున్చుంటే అతని హృదయం స్పందిన్చినట్లుండేది .శరీరం చేమర్చేది .అక్కడ ప్రదర్శనకు పెట్టిన పదార్ధం సైన్సు ను విరజిమ్మే ఆ పయుక్త వస్తువు ,తన రక్తం లో రక్తం తన బొమికలో బొమిక తనలో ఒక అంగం అనే భావం బలపడింది .
 
maramanishilo   మానవత్వం ప్రవేశించింది .మొదట విజ్ఞానాభి రుచి ,తదుపరి యుద్ధం ,తదనంతరం అభిమానం ఆ తర్వాత ఆకర్షణ ,అటుపై మమకారం వెర్రి భ్రమ పిదప ఏకత్వం ఒక దాని వెనుక ఒకటివిరుచుకు పడుతూ అతన్ని కుదిపిపారేస్తున్నాయి .ఆ ఆకృతి ,నిద్రలో కూడా ప్రత్యక్షమవుతోంది .సీసాలో పెట్టిన ఆ స్పెసిమెన్ ను పగల కొట్టి తన పిల్లాడిని ఆప్యాయం గా కావలించుకొని పిత్రుప్రేమ కురిపించి స్మశానానికి తీసుకువ్ల్లి పితృ విధి నెరవేర్చి ఊపిరిపీల్చుకున్నాడు ప్రొఫెసర్ శ్రీధర్ .
 
కానుక –ముళ్ళపూడి వెంకట రమణ —
————————————————-
 
–ఉహించిన సంగీతాన్ని భావన చేసి భావించిన దాన్ని అనుభవించి దర్శించే సరికి గోపన్నకు ఒక సత్యంగోచారించింది .సంగీతాన్న్ని అనుభూతికి తెచ్చు కోవటానికి జంత్ర గాత్రాలను ఉపయోగించ బోవటం అవివేకం .జలపాతాన్ని వెదురు గొట్టం  లో ఇమడ్చటం పొరబాటు .సముద్రాన్ని పాల కడవ లో ఇమడ్చటం తెలివి తక్కువ .వూహ కందే సంగీతం లో పాట కండేది శత సహశ్రాంశం వుండదు .ఊహసాగినకొద్దీ స్వరలతదిగంతాలకు వ్యాపించింది .ఆకాశం వరకు వ్యాపించింది రోదసి అంతా నిండి పోయింది .క్రమంగా ఓంకార జనితమై న స్వరార్నవం తిరిగి ఓంకారమై ,భువన సమ్మోహనం గాభీకరం గా , అద్భుతం గా ,ఎరుక పడ సాగింది .శ్రుత సంగీతం లా ఇందులో పశ్రుతులు లేవు .అపశబ్దాలు రావు .అని వేదాంతాలు అన్ని సత్యాలు అర్ధ సత్యాలేనంటు తనలో భాగాలేనంటూ  నిలచే అద్వైత సత్యం లా ఈ సంగీతం లో అపస్వరాలు కూడా అర్ధస్వరాల పూర్ణ స్వరాల పక్కన నిలిచి అందాలు సంతరించుకొనిఅంగం  గా  భాశించాయి.ప్రతి అనువునా భగవంతుడున్నాడని  ప్రతి శబ్దం లోము సంగీతం వుంది .అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించటానికి గోపన్నకు శక్తి చాల లేదు .అందమానందం ,ఇంత దగ్గరగా వస్తే ఇంత దుర్నిరీక్షాలై దుర్భారాలై ఉంటాయని క్రిష్ణయ్యసంగీతాన్ని వింటుంటే అతనికి అనిపించింది .
 
            శృతి బద్ధంగా తాను తయారు చేసిన వేణువు వుందో లేదో నిర్నయంచే జ్ఞానం తనకు ఉందా అని అనుమానం వచ్చింది గోపనకు .శ్రుతులన్నీ దాచుకొన్న బోజ్జలోని ఒంకారానికి మూల స్థాన మైన నాభిలోంచి మంగళ గళం లోంచి మధురాధరాల లోంచి  ,రాదాధరాలను పవిత్రం చేసిన మధురాధరాల లోంచి ,జీవం వచ్చి తన వేణువు లో ప్రవేశిస్తుంది .అసత్యమైన వేణువు లేనే లేదు .భగవంతునికి ఉపయోగపడని వేణువే లేదు .సహస్ర వేణు  నాద స్వరార్నవం లో సాక్షాత్తు మహా విష్ణువే తేలుతున్నాడు .
 
                                                మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ —-29 -06 -11 .
Posted in రచనలు | Leave a comment

ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .

జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి,  వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.
Posted in సేకరణలు | 4 Comments

మా కాశీ -మజిలీ- కధ

సాహితీ బంధువులకు శుభ కామనలు    .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి    నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ  మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి చేసి తెచ్చిన నాకు ఇష్టమైన మైసూరు పాకు ను అందరికి పెట్టి సరదా గా గడిపాము .మా బృందం అంతా శుభాకా౦క్షలు చెప్పారు .ఇలా త్రివేణి సంగమంలో పుట్టిన రోజూ జరుపుకోవటం వింత అనుభవం .
— 23  తేది కాశీ చేరి హరిశ్చంద్ర ఘాట్ లో పావన   గంగా స్నానం చేసి ,అక్కడే దగ్గరలో వున్న చల్లా లక్ష్మణ శాస్త్రి అనే కాశీ పురోహితుల ఇంటిలో మా బావ మరిది వాళ్ల అమ్మ గారి ఏడవ మాసికం జరిపాడు  ఆంటే మా అత్త గారిది అన్న మాట .సాయంత్రం కాలభైరవ విశాలాక్షి ,విశ్వనాధ,  గణపతి దర్సన౦చేసి తరించాము .బెనారస్ హిందూవిశ్వ   విద్యాలయాన్ని కూడా చూశాము ..
              24 ఉదయం మణికర్ణికా ఘాట్ లో స్నానం చేసి అవతలి తీరం లోని మంచి ప్రవాహగంగలో కూడా పుణ్య స్నానం చేశాము అక్కడ నుంచి మళ్ళీ కాశీ విశ్వేశ్వర అన్న పూర్ణదర్శనం   చేశాము . మాతో వచ్చిన మా ఒదిన గారు ఆంటే మా ఆవిడ అక్క గారు లక్ష్మణ శాస్రి గారింట్లోనే గోదానం చేసి 20 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసింది .  రాత్రి బయల్దేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరాం .రాను ,పోను ప్రయాణం అంతా పాట్నా ఎక్స్ ప్రెస్ లోనే.  26 తేది న అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న మా రెండో మేనల్లుడు కుటుంబం తో సహా వచ్చి వాళ్లఅబ్బాయి  ఉపనయనం హైదరాబాద్ లో వాళ్ల స్వగృహంలో జరిపితే వెళ్లి చూసి ఆశీర్వది౦చాము  .27  హైదరాబాద్ లోమా   పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో నా పుట్టిన రోజూ జరిగింది  dates   ప్రకారం    .మీరు పంపిన శుభాకా౦క్షలకు  కృతజ్ఞతలు .
                   30  వ తేది గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బీద రధం (గరీబ్ రధ్ )రైల్ లో బెంగళూరు మా రెండో అబ్బాయి శర్మ దగ్గరకు మేమిద్దరం వెళ్తున్నాం .ఇప్పటికింతే ..మళ్ళీ కలుద్దాం     మీ    దుర్గా ప్రసాద్  .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

ప్రాచీన భారతం లో పశు పెంపకం

Posted in రచనలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – కళాసాక్షి- లేపాక్షి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – ఆంధ్రదేవర శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – వ్యాసపురి బాసర

Posted in సేకరణలు | 1 Comment

దర్శనీయ క్షేత్రాలు – జగన్మోహనాకర ర్యాలీ కేశవ స్వామి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – మంగళగిరి పానకాలస్వామి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ పుణ్య క్షేత్రాలు – అరసవిల్లి సూర్యనారాయణుడు

Posted in రచనలు | Leave a comment

దర్శనీయ పుణ్య క్షేత్రాలు – శ్రీకూర్మం

Posted in సేకరణలు | 2 Comments

పంచ నారసింహ క్షేత్రం – వేదాద్రి

Posted in రచనలు | Leave a comment

సరసభారతి 2 వ ‘వంద’ నాలు

సరసభారతి ప్రారంభం ఒక సంస్కృతిక సభ తో ప్రారంభం అయ్యింది. ఉయ్యురు లో ఒక సాధారణ సాహిత్య పత్రిక లాగ ప్రారంభం అయ్యింది. http://wp.me/P1jQnd-2

దానితో పాటు సభలు, సమావేశాలు ప్రారంభం అయ్యాయి. http://wp.me/P1jQnd-dS

ఒక బ్లాగ్ లాగా (బ్లాగ్ కీ పర్యాయ పదం ఉసుల గూడు) ఆలోచనతో ఉసుల గూడు ప్రారంభం. సరసభారతి సంస్కృతిక కార్యక్రమాలు ప్రాచుర్యం, సమకాలీన రాజకీయ విశ్లేషణ, ప్రమఖుల పుస్తకాల విశ్లేషణ. అనువాదాలు, సేకరణలు.నేను చదివినవి, నేను కొన్ని రోజుల క్రిందట రాసుకోన్నవి అన్నీ మీకోసం అందించాను.

నేను మొదట పేపర్ మీద వ్రాసి స్కాన్ చేసి పెట్టటం. మీ అందరి సహకారాలతో మెల్ల మెల్లగా టైపు చెయ్యటం ప్రారంభం.

27.01.2011 మొదటి పోస్ట్ తో  ప్రారంభం. దాదాపు 6నెలలో 200 గువ్వలు తయారు అయ్యాయి. 10000 వీక్క్షకులు. 90 అభిప్రాయాల తో ముందుకు పోతోంది

చాలా మంది ఈమెయిలు ద్వారా, ఫోన్ చేసి  తమ అభిప్రాయాలు తెలిపారు ,  సభల లో బ్లాగ్ చర్చకు వచ్చంది.

సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు.

72 వ సవత్సరం లో కూడా బ్లాగ్ రాయడం. నాకు ఒక వ్యసనం లాగా మారింది. రోజు ఒక పోస్ట్ పెట్టడం. నేను వెళ్ళిన సభలు, ఆహ్వానాలు మీ అందరికి పంచడం కూడా ఒక అనుభూతి.

కరెంట్ కష్టాలు (రాస్తుండగా పోవడం), తప్పులు దొర్లడం జరిగాయి. ప్రస్తుత కాలానికి సరిపడా రాయడం నిజం గా ఒక గొప్ప అనుభూతి

ఈ స్పూర్తి తో నే http://suvarchalaanjaneyaswami.wordpress.com స్టార్ట్ 

అయ్యింది.

మరొక సారి మీ అందరికి సరసభారతి 2 వ  ‘వంద’ నాలు

నేను రాసిన దానికి, నాకు వెంట వెంటనే స్పందించి నాకు స్పూర్తి నిచ్చిన మైనేని గోపాల కృష్ణ, గుత్తి కొండ సుబ్బారావు, శ్యాం నారాయణ, కప్పు గంతు, కే బి లక్ష్మి , రామినేని భాస్కర్, తదేపాల్లి పతంజలి , ప్రేమ చంద్, దాసరి మొ!! వారి అందరికి ప్రత్యెక కృతఙ్ఞతలు

నా ఈ చిన్ని ప్రయత్నం లో సహకరించిన మా (మన) కుటుంబం సభ్యులందరికి అభినందనలు

మీ కోసం కొన్ని కామెంట్స్ నన్ను ముందుకు నడిపించినవి .

భమిడిపాటి ఫణిబాబు
harephala.wordpress.com/2009/04/15/బాతా�…

పాత రోజులు చాలా బాగా గుర్తు చేశారు మాస్టారూ.

photodummy.blogspot.com/Submitted on 2011/02/01 at 3:05 pmనమస్కారం దుర్గప్రసాద్ గారు. ఈ వ్యాసం పేరు చూసి చాలా ఆశ్చర్యం వేసింది మా వూరు గురించి ఎవరు రాస్తారు అని. ఇంకా ఈ మొత్తం పుస్తకం చూసి చాల సంతొషం వెసింది. మీకు చాలా కృతజ్ఞతలు.
మాది వుయ్యూరు దగ్గర కొమ్మూరు, వుయ్యూరులోనె 15 సంవత్సరాలు ఉన్నాము.వుయ్యూరు గురించి తెలీని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. ఈ పుస్తకం ప్రింట్ చెసి పెట్టుకుంటాను. 
వుయ్యురా ? ఉయ్యురా ? ఉయ్యురు ఊసులు
2 #
కొత్తపాళీ
kottapali.blogspot.comSubmitted on 2011/02/08 at 11:57 amనమస్కారం. సందర్భోచితమైన సమాచారం ఇచ్చారు.
మీరు ఉయ్యూరులోనే ఉంటారా? శివాలయ అర్చకులు మాకు కావలసినవారే. 
రధసప్తమి శ్లోకం
రాజేంద్రకుమార్ దేవరపల్లి
itsvizag.com/
devarapalli.rajendrakumar@gmail.comSubmitted on 2011/02/25 at 8:44 amచాలా చక్కగా మీ అనుభూతులు అనుభవాలు మాతో పంచుకున్నారు.మీరు చెప్పే విధానం సరళంగా,పక్కవారితో మాట్లాడుతున్నట్టుగా ఉంది.అలాంటి సహజశైలి ఇవ్వాళ చాలా అవసరం.
.తరచూ రాస్తూ మాకు మీ జ్ఞానం పంచండి.అన్నట్టు పుచ్చకాయ వ్యాసం బాగుంది కానీ ఇంకా ఆచరణలోకి తేలేదు….నేను

 

మరికొన్ని ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం -2
1 # 
SHANKAR
BLOGAVADGEETHA.BLOGSPOT,COMSubmitted on 2011/02/28 at 4:51 amనిజానికి ‘పద్మ’ అవార్డులకే “బాపు-రమణ” అనే అత్యుత్తమ పురస్కారం రాలేదు.
ఇక భారత రత్న అవార్డు పుట్టకముందే భారత రత్నాలైన వాళ్లకు అదొక లెక్కా.ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినా దానికి అర్ధముండదు.

 

బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు
తెలుగిల్లు
telugillu.wordpress.comSubmitted on 2011/03/05 at 12:49 amనిజ్జంగా చెబుతున్నా భలే బాగుందేGopalakrishnaఆలోచనాలోచనం సమయాన్ని సార్దకం చేసుకోవటం ఎలా

Submitted on 2011/03/05 at 7:19 pm

Sir: I have read with great interest and attention your posts on how valuable the duration of our existence here on earth in the human form. It is said in a simple, brief and interesting manner with a parable from our scriptures, a method always great teachers use. Ordinarily, most of us spend, most of our time, mechanically like automatons looking for something to happen to us with the sad realisation, at the end of our lives, how NOT to live our lives or how we should have lived it. In my opinion the manner you explained or rather expounded about the sacredness of time and how to make best use of it with discrimination touches the heart, I hope, the younger generation as well as the older generation to make best use of their remaining allotted time. Never too late. I consider this as an offering to GOD himself and not just a “lip service’ that we can only ignore at our peril. You are a wonderful teacher. Please keep reflecting and refracting. THANKS.

 

తెలుగు బ్లాగు కి పర్యాయ పదం
sudha
illalimuchatlu.blogspot.comSubmitted on 2011/03/10 at 11:47 amశ్రీ దుర్గా ప్రసాద్ గారూ,
మళ్ళీ బాపు,ముళ్ళపూడి ఇద్దరితోనూ ఒకేసారి మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా అనిపించిందండీ… మీరు రాసిన అనుమాన శిష్యుడు, ఇంకోతి రమణ… రచనలు చదివాక.రమణగారి రచనలతో ఎంతగా మమేకం అయ్యారో చూపిస్తున్నాయి ఆరచనలు. హాస్యరచయితగా రమణ స్థానాన్ని సరైన సమయంలో స్థిరపరిచారు మీరు. హాస్యం రాసిన వాళ్ళే తక్కువ…ఆ తక్కువ వాళ్ళందరూ రచనల్లో చాలా గొప్పవాళ్ళే. ఆ గొప్పవాళ్ళలో రమణ గారు ఎందులోనూ తక్కువ కాదని, వాళ్ళందరికన్నా కూడా గొప్పవాళ్ళేనని ఢంకా బజాయించి మరీ చెప్పారు.
అదీ, అభిమానమంటే.

 

అనుమాన శిష్యుడు అనే శంక లెంక
vanaja vanamali
vanajavanamali.blogspot.com
Submitted on 2011/03/14 at 10:59 pmvery nice.. nirvahisthunna meeku, paalgontunna andhariki abhinandhanalu.
మా అక్కయ్య” అనురాగ కవి సమ్మేళనం- మార్చ్ 27 న- ఆహ్వానం
Rani
photodummy.blogspot.com/Submitted on 2011/04/12 at 1:10 amగాంధీ గారు వుయ్యురు వచ్చారని, ఈ మీ పోస్ట్ చదివాకే తెలిరాజేష్ జి
blogger.com/profile/17278163223888892114

Submitted on 2011/04/01 at 3:37 pm

అద్భుతంగా రాసారండీ.. ఎంత రాసినా తరగని అజరామరమీ కళాఖండం.

#”బ్రోచే వారెవరురా ”పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు

నేనైతే ఆ భంగిమలకోసం ఈ పాటని ఎన్ని సార్లు చూసానో!

#.అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే… రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,.తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”

మంచి గ్రాహ్యక శక్తి మీది! ఆహ్.. ఇవి నేనెప్పుడూ గమనించ లేదు. మళ్ళీ ఒకసారి శంకరాభరణం చూడాల్సిందే ఆయితే.

ఇంత చక్కగా మీ అభిప్రాయం పంచుకున్నందులకు కృతజ్ఞతలు!

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”
2 #

 

గాంధీ స్మృతి శాంతి యాత్ర ఉయ్యూరు విశేషాలు
రహ్మానుద్దీన్ షేక్
satyaanveshana.blogspot.comSubmitted on 2011/03/16 at 11:16 pmమీ స్వదస్తూరి ఉండాలనో మరే కారణమో గానీ , మీరిలా స్కాన్ చేసినవి పెట్టారు, కానీ అవి మిగతా వాళ్ళు పంచుకోవాలంటే కష్టం. అందుకని వీలైనంత వరకూ, మీరు టైప్ చేసి పెట్టండి 
డింగరి కి అప్పుడే అరవయి ఎ’ళ్ళా” ?
Dhulipala Arka Somayaji
arkasomayaji.blogspot.com(పొదుగుగ�…Submitted on 2011/03/15 at 6:58 pmఅయ్యా దుర్గా ప్రసాద్ గారూ! ఒంటి పూట బడుల కారణంగా మీ ప్రొగ్రాం వినలేక పోయాను.ఆ బాధ నుండీ తప్పించారు.ఆ వ్యాసాన్ని మీ బ్లాగులో పెట్టి.చాలా…చాలా……చాలా….బాగుంది.మీ సందేశం నచ్చింది.కూడలిలో “పొదుగు గిన్నె” అనే బ్లాగు ద్వారా ఎవేవో వ్రాస్తూ ఉంటాను.ఖాళీ ఉన్నప్పుడు.దర్శించ కోరిక. 
శాస్వతానందం -ఆలోచనా
రాజేష్ జి
blogger.com/profile/17278163223888892114Submitted on 2011/05/09 at 9:41 pm$దుర్గాప్రసాదు గారు
మీ ము౦గినపూడి సముద్రతీర ఛాయాచిత్రములు చాలా బావున్నాయి… ఎంత అంటే ఉన్నఫళంగా అమాంతం ఆ సముద్రంలో దూకి కాసేపు ఈత కొట్టాలనిపిస్తుంది. అలాగే మీ కుటుంబం కూడా చూడ ముచ్చటగా ఉంది. ఈసారి ము౦గినపూడికి రావాల్సిందేఇక్కడ పంచుకున్న౦దుకు ధన్యవాదాలు

 

మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మా ఫామిలీ
చాగల్లు రాగిణి
paaluneelu.blogspot.comSubmitted on 2011/06/05 at 5:32 pmఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వివరం రాసినందులకు థాంక్స్. కాకపోతే ఈయనంత వ్యాపారవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్న రాజకీయ పార్టీల విలీనం అనే వాటికి చక్కగా ఓ రూపం ఇచ్చి దానిద్వారా ప్రతి ఫలాన్ని పొందిన మహానుభావులలో ప్రధముడు వీరు. అప్పట్లో నాకు ఊహ రానికాలం, కాకపోతే అంతో ఇంతో CPI అంటే అభిమానం ఉండేది. కానీ వీరి పార్టీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, వీరిది కూడా ఓ చిన్నపాటి పార్టీ అనుకుంటా. అంతగా గుర్తు లేదు కానీ CPIలో వీరి పార్టీ విలీనం అయ్యి మావైపు వీరు చాలా భూములు బినామీ పేర్లతో కొనుక్కుని వారి సంతానానికి ఇచ్చారని అప్పట్లో వీరిపై ఓ అపవాదు. 
ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టినది ఈయనే – శ్రీ పాగ పుల్లారెడ్డి
satyaSubmitted on 2011/06/08 at 3:41 pmదాదాపు వెయ్యి సంవత్సరాల పూర్వమే , అస్పృశ్యతపై ఉద్యమం జరిగింది, శూదృల ఆలయప్రవేశం, కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాలవారికి సమాశ్రయణం (మంత్రోపదేశం), స్త్రీలకి వేదాద్యయనం, వేదాలయొక్క, ఆలాయాలయొక్క జీర్ణోద్దరణ-సరళీకరణ, అన్ని కులాలవారికి ఏక స్థానంలో ప్రసాదవితరణ మొదలైన ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి ….
వీటన్నింటికి మూల కారకులు శ్రీ భగవద్రామానుజులు. వీరి శ్రీవైష్ణవ-ఉద్యమంలో వెళ్ళిన ప్రతీచోట ఏకకాలంలో లక్షలమంది ఉద్దరింప బడేవారు. వీరిపై ఎన్నో నిందలు, దాడులు, హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. కాని వారి వైభవాన్ని ఏమాత్రం ఆపలేకపోయారు….. కేవలం సమాచారమ్ కోసం చెబుతున్నాను.-satya

 

అస్పృశ్యత పై సమరం – మహాత్ముని కంటే ముండు మొదలైంది
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మామిడి పళ్ళ తద్దినం

మామిడి పళ్ళ తద్దినం 
 
మా మామయ్య గారింట్లో వేసవి కాల0 లో ఆంటే వైశాఖ జ్యేష్ట మాసాల్లో తద్దినాలు వచ్చేవి .అది మామిడి పళ్ళసీజన్ కనుక  ఆ తద్దినాలలో మామిడిపళ్ళు  బాగా వడ్డించే వాళ్ళు భోజనం లో.. .అందుకే వాటిని మామిడి పళ్ళ తద్దినం అనేవాళ్ళం ఇది సుమారు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట .తద్దినం ఎవరిదో మాకు పట్టేది కాదు .  మామిడి పళ్ళ మీదే మా ధ్యాస .  చాలా వైభవం గా జరిపే వారు. ముందే పనస కాయలు కొనేవారు .లేక పొతే ఎవరైనా తెచ్చి ఇచ్చే వారు .పైన వున్న ముళ్ళ పొర అంతా చెక్కి  ,అడుగున గోనే పట్టా మీద నిలువుగా వుంచి  దానికి పసుపు , నువ్వుల నూనె పూర్తిగా పట్టించి పైనుంచి కత్తితో ముక్కలు ముక్కలుగా పొట్టు వచ్చేటట్లు కొట్టే వాళ్ళు .  దీనికి ప్రత్యేకమైన కత్తులు ఉండేవి.  కనుకనే వీటిని  పనస కత్తులనేవాళ్ళు .  .చెరుకునరికే కత్తులను కూడా ఉపయోగించే వారు .  మా నరసింహం తాతయ్య ,మామయ్య  బాగా కొట్టేవారు .ఇందులో వాళ్ళు దిట్టలు  .చూస్తుంటే మాకూ వచ్చేది .వాళ్ళు అలిసిపోతే నేను , సూరి నరసింహం ,పెద్ది భొట్ల ఆదినారాయణ  మా మామయ్య తోడల్లుడి కొడుకు శాస్త్రులు ఆపని చేసే వాళ్ళం .ఆ రోజూ విస్తళ్ళు ఆంటే అరటి ఆకులు అంత బాగా వాడే వాళ్ళు కాదు .బాదం ఆకులు కోసి శుభ్రం చేసి గుండ్రగా విస్తళ్ళు కుట్టే వారు .నరసింహం తాత చాలా బాగా కుట్టే వాడు .ఒక్కొక్క సారి తామరాకులు   కూడా వాడే వారు అవి ఒకరకమైన వాసన వచ్చేవి . అరటి దొప్పలతో విస్తళ్ళు కుట్టే వారు.  వూళ్ళో వున్న బ్రాహ్మణ కుటుంబాలను అందర్నీ భోజనాలకు పిలిచే వారు .  పెద్ద వాళ్లకు ,పెద్దవి చిన్న వాళ్లకు చిన్నవి వేసే వారు .మధ్యాహ్నం ఒంటి గంట తరవా తే భోజనాలు . వంట  మా అత్తయ్య మహాలక్ష్మమ్మ గారు ,నా అమ్మ భవానమ్మ గారు కొలచల శ్రీరామ మూర్తి గారి భార్య ,మా చిన్న మామ్మ శౌభాగ్యమ్మ గారు కలిసి చేసే వారు .అంతా పరస్పర సాయమే .మడి కట్టుకొని చేయాల్సిందే .కాశీపోసి చీర కట్టుకోవాల్సిందే .
కూరలు పనసపొట్టు ఆవ పెట్టి కూర ,కంద లేక పెండలం కూర ,దొండ కాయ కూర అరటికాయ కూర లేక దోసకాయ కూర .ఆంటే కనీసం నాలుగు కూరలు ఉండేవి .అలాగే నాలుగు రకాల పచ్చళ్ళు .అందులో ముఖ్యం గా నువ్వుల పొడి ,అల్లం పచ్చడి ,దోసకాయ పచ్చడి ,ఆవ పచ్చడి ఉండేవి పెసరపప్పు ,మాత్రమే వ౦డే   వారు .పరవాన్నం తప్పనిసరి . గారెలు కారంవి వుత్తవి .బూరెలు తప్పదుచారు , పెరుగు లేక మజ్జిగ అరటి ఊచ కూర వీలుని బట్టి చేసే వారు .బెండకాయ కూర కూడాఅంతే  .చామదు౦పల కూర కూడా దేనికో దానికి ప్రత్యామ్నాయం.  మంచి తిండి పుష్టి వున్న భోక్తలనే పిలిచే వారు, ఇద్దరు భోక్తలు తప్పనిసరి .మంత్రానికి వంగల సుబ్బయ్య గారే ఆయన ,మాకూ మా మామయ్య గారికి ఇంటి పురోహితుడు .మామయ్యకు సహాధ్యాయి నాన్నకు  కు శిష్యుడు .వేదం క్షుణ్ణంగా  చదువు కొన్న వాడు .బ్రాహ్మల ఇంట్లోనే కార్య క్రమాలు నిర్వహించే వారాయన .అపర కర్మలు కూడా కొద్ది కుటుంబాలకే పరిమితం .ఆయన మంత్రం చదువుతుంటే దేవతలు ,పితృదేవతలు ప్రత్యక్షం అయినట్లుండేది .చక్కని స్వరం .గంభీర మైన ధ్వని మామయ్య ఆయన్ను ఏరా అనేవాడు ,ఆయనా ఈయన్ను ఏరా గంగయ్య అనే వారు .భోక్తలు భోజనం చేస్తుంటే అధిశ్రవణ౦ చెప్పటానికి కనీసం నలుగురు బ్రాహ్మలు వచ్చే వారు .వారిని పిలవక్కరలేదు .తద్దినం ఎప్పుడో ముందే వారికి తెలిసి తమ విధి అని భావించి వచ్చే వారు .అధిశ్రవణ౦ చెబుతూంటే చాలా గొప్పగా వుండేది .అందరు గొంతు కలిపి వంతుల వారీగా చెప్పే వారు మేము విని ఆనందించే వాళ్ళం, అందులో ఏ అర్ధముందో మాకు తెలీదు .కాని వేద మంత్రాలు మమ్మల్ని ఆకర్షించేవి
                   మధ్యాహ్నం పదకొండున్నరకు కార్య క్రమం ప్రారంభ మయ్యేది  . అప్పటికి ఆడ వాళ్ళువంట పూర్తి చేసి సిద్ధం గా వుండే వారు భోక్తలు భోజనాలు చేస్తుంటే మమ్మల్ని ఊళ్ళోకి వెళ్లి భోక్తల భోజనాలు అవుతున్నాయి భోజనానికి రండి అని చెప్పమనే వాడుమమయ్య.  అలాగే ఇంటింటికీ ,చిన్నా ,పెద్ద ఆడ మగా ,అందరిని రమ్మని చెప్పేవాళ్ళం .వాళ్ళు కూడా ఈ పిలుపు కోసం ఎదురు చూస్తుండే వాళ్ళు ..భోక్తలుగా సాధారణం గా  శాయపురం అగ్రహారం లోని వారిని పిలిచే వారు .వారు మంచి కర్మిష్టులు .  వ్యవసాయం బాగా చేసే వారు . వేద వేదా౦గ  పారీణులు .యజ్న యాగాలు నిర్వహించిన వారు . క్రమ జట ఘనా లలో ఘనాపాటీలు . ఉయ్యురుకు మూడు మైళ్ళ దూరం శాయపురం .అప్పటికి రవాణా సౌకర్యాలు లేవు నడిచి వచ్చి వెళ్ళటమే .ఉభయ సంధ్యల్లో సంధ్యావందనం ,దేవతార్చన వారి జీవితం లో భాగం వారికి మాంచి తిండి పుష్టి వుండేది .అందుకే వారిని పిలిచే వారు .అధిశ్రవణానికి కంభం పాటి వారిని కోట పూర్ణానందం గారిని అవధాన్ల గారినీ ఉయ్యూరు లోని కోట కృష్ణ మూర్తి గారిని పిలిచే వారు .ఏ తద్దిననికైనా ఈ బృందం మామూలే .
              మామయ్య కు మామిడి తోట వుండేది. ముందే పక్వానికి వచ్చిన కాయలు కోసి వాళ్ళింట్లో గదిలో పండపెట్టే వారు .అవి ఎప్పుడు పండుతాయా అని మాకు ఆరాటం మూడు రోజులకోసారి కాయలు తిరగేసే వారు .సరిగా ఆనాటికి తయారయ్యేవి.  ఘుమ ఘుమ వాసనలు ఇల్లంతా వ్యాపించేవి ము౦దుగా రాసాలు వస్తాయి .తరువాత బంగిన పల్లి .బ్రాహ్మణులకు సుష్టుగా వడ్డించే వారు .కమ్మని నెయ్యితో పప్పు కలిపి పచ్చళ్ళు అనుపానం గా తినేవారు చేతి వెళ్ళ లోంచి నెయ్యి కారి పోయేదాకా వద్దనే వారు కాదు  .అది అయింతర్వాత పనస పొట్టు కూర మరీ మరీ వడ్డించుకొని తినేవారు మా అత్తయ్య పనస పొట్టు వండటం లో expert  చాలా రుచిగా వుండేది ఆ కూరకు ఆవ పెట్టటమే ఒక కళ రుచి దాని వల్లే వచ్చేది .దానిలో వేగిన మిరపకాయలు నంచుకొంటు తింటే స్వర్గంకనిపించేది .అది లాగించిన తర్వాతే మిగతా కూరల జోలికి పోయే వారు .నువ్వుల పొడి మహా రుచికరం .మారు వేసు కోని తినేవారు దేన్నీ వదిలే వారు కాదు .గారెలు వడ్డి౦చడం తరువాయి, వాయి వాయి లోపలి వెళ్ళేవి .బూరెలు అంతే .కనీసం అవి ఒక్కొకటి ఇరవైకి తక్కువ కాకుండా తినే వారు .చారు పోయించుకొనే వారు చివరికి మామిడి పళ్ళు ఒక పట్టు పట్టే వారు .కొసరి కొసరి రసాలు వేసే వారు. వడ్డన అంతా ఆడ వాళ్ళే ..ఒక వేల బంగిన పల్లి కాయలైతే అటూ ఇటూ చెంపలు తరిగి టెంకతో సహా వేసే వారు .భోజనం అయింతర్వాత చూస్తే ఒక్కో విస్తరి దగ్గర చిన్న కొండ పరిమాణం లో టే౦కలు పోగులు    .భోక్తలు ఇంత ఇష్టం గా తింటే పితృ దేవతలు సంతృప్తి చెందినట్లు భావించే వారు .తృప్తి చెందుతారని నమ్మకం .అందుకే అంత శ్రద్ధగా చేసే వారు కనుక దానిపేరు శ్రాద్ధం అయింది .కాల క్రమం లో ఆ తిండి పుష్టి లేదు తిని హరాయించుకొనే వారు ఆ నాడు .ఇవాళ తిన్నా హరాయిన్చుకోలేని దుస్థితి మనది .కమ్మని భోజనం పెట్టటం తన అదృష్టం గా గృహస్తు భావించే వాడు .తిని గృహస్తుని సంతోష పెట్టాలని అతిధులు భావించే వారు .బ్రాహ్మల భోజనాలు అయ్యేదాకా అధిశ్రవణ౦ జరిగేది .వాళ్ళు కూడా భోక్తల భోజన౦ తర్వాత మాతో పాటు కూర్చుని భోజనం చేసే వారువూరి వారందరితో  . భోజనాలకొచ్చిన వారికీ పై విధం గానే వడ్డన జరిగేది. అందరు సంతృప్తిగా భోజనం చేసే వారు .మామిడి పళ్ళు తరిమి తరిమి వడ్డించే వారు .పొట్ట బరువవుతున్నా ,సర్దుకుంటూ ,తినేవారు .ఒక్క ముక్క కూడా విడిచిపెట్టే వారుకాదు .భోజనం అయేసరికి విస్తరి కడిగిన ముత్యం లావుండేది .అంత శుభ్ర౦ గా భోజనం చేసే వారు .ఆ నాడు భోజనం ఒకకళ   .ఇవాళ ఫాషన్ .సంతృప్తి ఆనాటి జీవితం .వీళ్ళ విస్తళ్ళ దగ్గరా మామిడి టెంకలు గుట్టలే గుట్టలు ,ఇద్దరు ముగ్గురు తరుగు తుంటే ఇద్దరు వడ్డించే వాళ్ళు .పిల్లలం కదా మేము .మేము యధా శక్తి గా లాగించే వాళ్ళం .బాగా తినే వాళ్ళను చూసి ఇకిలించేవాళ్ళం .భోజనాల తర్వాత అందరికి వక్క పొడి .తమల పాకులు ఇచ్చే వాళ్ళు సున్నం రెడీ గా వుండేది తాంబూలం సేవించి అందరు మామయ్యను అభినందించి వెళ్ళే వారు .తద్దినం పెట్టె వారు ముందు రోజూ రాత్రి ఉపవాసం .తద్దినం నాడు రాత్రి ఏమీ తిమరు .మామయ్య దీన్ని తప్పకుండా పాటించే వాడు .నాకూ అదే అలవాటయింది .పితృ కార్యాన్ని ఇంత శ్రద్ధాసక్తులతో పెట్టట౦ .వాళ్ళింట్లోనే కనపడేది .కొలచల శ్రీ రామ మూర్తి గారింట్లోను ఇలాగే జరిపే వారు వూళ్ళో వాళ్ళు భోజనాల తరువాత ఇళ్ళకు వెళ్ళేవారు సుమారుగా ఎనభై  మ౦దికి పైనే భోజనం చేసే వాళ్ళు .ఎ౦త ఖర్చు ,ఎ౦త శ్రమ ,ఎ౦త ముందస్తు తయ్యారు ? వీటిని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది .మామయ్య వాళ్ళు అంత గొప్పగా ఈ వేసవి తద్దినాలు పెట్టె వారు. మా అమ్మమ్మ దుర్గమ్మ   గారి తద్దినం వైశాఖ మాసం లో వచ్చేది.  జ్యేష్టం లో మా అమ్మ నాన్న  అంటే  మా మాతామహులు శి౦గిరి శాస్త్రి గారి తద్దినం .తద్దినం ఎవరిదైనా మాకు మాత్రం అవి మామిడి పళ్ళ తద్దినాలే .బయటి వూరి న్నుంచి వచ్చిన వారు భోజనం తర్వాత మామయ్య గారి అరుగు మీద పడుకొని విశ్రాంతి తీసుకొని సాయంత్రం నెమ్మదిగా వాళ్ల ఊళ్ళుచేరే  వారు బ్రాహ్మలకు దక్షిణ పట్టింపు లేదు .యెంత ఇచ్చినా తీసుకొనే వారు .భోజనమే ముఖ్యం .తోటలో మామిడి పళ్ళు లేక పొతే కొని అయినా ఇంత తంతూ జరిపేవారు .అదో  ఆనందం .అంతే ఈ ఖర్చులు కోసం ఎకరాలమ్ము కోలేదు, అప్పులు చేయలేదు .బ్రాహ్మణ వ్యవసాయం అనిపించుకో లేదు .మంచి ఫల సాయం తీసే వాడు .మామయ్య కుటుంబం లో అందరు ఆయనకు సహకరించటం గొప్ప విశేషం .
                మాతో పాటు మీరు కూడా మామిడి పళ్ళతో శుష్టుగా భోజనం చేశారు కదా .భుక్తాయాసం గా వు౦డి వుంటుంది, కొంచెం విశ్రమించండి
          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -06 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 2 Comments

మా మామయ్య

   మా మామయ్య 
 
మా మామయ్య పేరు గుండు గంగాధర శాస్త్రి .అందరు గంగయ్య అని పిలుస్తారు .ఊర౦దరు  గుండు గంగయ్య గారని అందరు అంటారు .మా ఇంటి ప్రక్కనే వాళ్ల ఇల్లు ,మా అమ్మ ఆ ఇంట్లోనే పుట్టి ,మాఇంటి కోడలయింది .మా అమ్మ పేరు భవానమ్మ .పచ్చగా బంగారు రంగులో వుండేది .మామయ్య నల్లగా చింత గింజ లాగ ఉండేవాడు .ఇద్దరు అక్కా తమ్ముడు అంతే కొత్త వాళ్ళు నమ్మలేరు .మామయ్య వేదం ,ఉపనిషత్తులు ,శాస్త్రాలు చదివిన వాడు .స్మార్తం బాగా తెలుసు .జ్యోతిశ్య౦ లో అ౦దె వేసిన చెయ్యి .నేను పుట్టినప్పుడు ,పీలగా ప్రాణం లేనట్లు వుండే వాడినట .అమ్మకు తల్లి పాలు లేవట మామయ్యను పిలిచి ”ఒరే గంగయ్య నీ మేనల్లుడికి డబ్బా పాలు కొనుక్కు రారా ”అందట డబ్బు ఇస్తూ .ఆయన ”వీడి కేందుకే ఉంటాడో పోతాడో లాగా వున్నాడు డబ్బా దండగ ”అన్నాడట .కాదులేరా తల్లి ప్రాణ౦ కదా అందిట అమ్మ.  అప్పుడు ఒక సారి జాతకం వేసి చూస్తాను .బతికి బట్ట కడితే డబ్బా నేనే తెస్తాను అని ఇంటికి వెళ్లి జాతకం వేసుకొచ్చి ”అక్కయ్య !వీడు మహార్జాతకుడు .బాగా పైకి వస్తాడు ఆరోగ్యము బాగుంటుంది మంచి భవిష్యత్తుంది ఆయుషు బాగా వుంది .ఏమి  ఫర్వాలేదు ”అని వెంటనే బజారు వెళ్లి గొల్ల భామ మార్క్ పాల డబ్బా స్వంత డబ్బుతో కోని తెచ్చిచ్చాడట .అప్పటినుంచి నా మీద తగని ఆపేక్ష గా వుండే వాడు ఇవన్నీ మా అమ్మ చెప్పింది నాకు .
మామయ్య వాళ్లకు దాదాపు ఇరవై ఎకరాల పొలం వుండేది .మా పొలాల పక్కనే వుయ్యురులో ,కాటూరులో .వాళ్లకు బండి ఎడ్లు ,పాలేళ్ళు ఉండేవి .మామయ్యకు పొలం దున్నటం కూడా వచ్చు . ఆవు, గేదెల పాడి ఉండేది.  పాలేరుతో పాటు పొలం వెళ్లి పనులు పురమాయించి చేయిస్తూ మంచి పంట పండించే వాడు నాట్లు వేయుట ,కలుపు తీయటం ,కోత కోయటం ధాన్యం నూర్పిడి, అన్నీ చేసే వాడు, చేయించే వాడు.  గొడ్డలి తో పాలేళ్ళసహాయం తో కట్టెలు కొట్టే వాడు ..దెబ్బ వేస్తె ఖచ్చితం గాపడాల్సిన చోటే గొడ్డలి   పడేది  .పాలేళ్ళకు కూడా అంత నైపుణ్యం వుండేది కాదు .బందరు దగ్గర చిట్టి గూడూరు ఓరియ౦టల్  కాలేజీ లో తెలుగు పండిట్ training పూర్తి చేశాడు . వరదా చార్యుల వారి శిష్యుడు ,జల సూత్రం రుక్మిణీ నాద శాస్త్రికి (ఝారుక్ )సహాధ్యాయి . మొక్కపాటి కోటేశ్వరరావు కూడా ఆయనకు సహాధ్యాయి.  కొంతకాలం ఉయ్యూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో జునియర్ తెలుగు పండితుడిగా చేశాడు . వుద్యోగం చేయాల్సిన అవసరం లేదు న్యాయానికి .కానీ సరదా .నాకు తొ మ్మిదో క్లాస్స్ లో తెలుగు టీచర్ గా వచ్చాడు .ఒక సారి ఒక లేడీ ఇన్స్పెక్టర్ వచ్చింది పాఠం విని  ,ప్రశ్నలు అడగ మంది .మామయ్య పాఠం శ్రద్ధగా వినే వాళ్ళు కాదు పిల్లలు .జవాబులు ఎవరు చెప్పలేక పొతే అన్నీ నన్నే అడిగే వాడు .నేను వెంటనే చెప్పేవాన్ని .ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చింది .ఎవరు ఈ అబ్బాయి అని అడిగింది?  ఒక కుర్రాడు మాస్టారి మేనల్లు డండీ అన్నాడు .దానితో బండారం బయట పడింది .నన్ను మెచ్చుకొని ,మామయ్యను ఇంకా బాగా అ౦దరికి అర్ధం అయ్యే టట్లు చెప్పాలని అంది .క్లాసు అంతా నన్ను మెచ్చారు . మంచి సరదా మనిషి మామయ్య .అందర్నీ చిలిపి కబుర్ల తో రెచ్చగోట్టేవాడు. సూర్య కా౦తమ్మను, సన్న క౦తమ్మ  అనేవాడు పాపం ఆ అమ్మాయి ముసి ముసి నవ్వులు నవ్వేసి కాని ఏమీ అనేది కాదు ..కష్ట పడి పాఠం చెప్పేవాడు .పద్యాన్ని రాగ యుక్తం గా చదివేవాడు .శ్లోకాలు అర్ధవంతం గా పాడే వాడు .                               మామయ్యకు పురాణాలన్నీ కరతలామలకం .ఉయ్యూరు విష్ణాలయం లో పురాణ౦ చెప్పేవాడు .ఖచ్చితం గా సమయాన్ని పాటించే వాడు .ఎంతమంది వింటున్నది అక్కర్లేదు .తన డ్యూటీ పురాణ ప్రవచనమే ఒక్కో సారి మా అమ్మ తో సహా అయిదుగురు కంటే వుండే వారు కాదు .రామాయణ ,భారత భాగవతాలు చెప్పాడు .సంస్కృత మూలం చదివి చక్కగా భావం వివరించేవాడు .మా అమ్మ ముఖ్య శ్రోత .అయితె మాటలు మింగే వాడు .అందుకని అందరికి అర్ధమవటం కష్టం గా వుండేది అయితే ప్రతి ఫలా పేక్ష లేకుండా ఈ కార్య క్రమాన్ని నిర్వహించటం మామయ్య గొప్పతనం .ఆ కాల౦ లో మైకులు లేవు .స్వచ్చంద సేవ మామయ్యకు ఇష్టం .
            ఉయ్యూరు స్కూల్ లో పనిచేసే ప్పుడు తోటి టీచర్లు నెలకొక పార్టీ అడిగే వారు .అడిగినప్పుడల్లా ఇచ్చేవాడు గారెలు, పులిహోర, దద్ధోజనం, పళ్ళు,లడ్డూలు, మైసూర్పాక్,ఆవడలు, కాఫీ అన్ని ఇంటిదగ్గర మా అత్తయ్య చేసేది .అమ్మ సాయం చేసేది. మేము అన్నీ సత్తు కారియర్లలో మోసుకొని వెళ్లి అందరికి వడ్డించి తింటుంటే, మాకు నోరు ఊరేది మేమూ తినే వాళ్ళం .ఒకరికి పెట్టాలనే సరదా మమయ్యది సంస్కృతం  లో యెంత  పండితుడో పన్నెండో నెంబర్ అంటే బూతులు మాట్లాడటం లోను నె౦బర్ ఒన్. ఆడవాళ్ళను మాటలతో వుడికించే వాడు ,సరదా మాటలతో కవ్వించే వాడు ,నవ్వించే వాడు .బంధువులైనా అంతే బయటి వాళ్లైనా అంతే .పాపం ఆయన్ను ఏమీ అనే వారు కాదు ముసి ముసి నవ్వులు నవ్వి నీకు వయసు వచ్చినా బుద్ధి రాలేదు నీ జిమ్మడ అనే వాళ్ళు, ఇదంతా సుమారు యాభై ,అరవై ఏళ్ళ కిందటి విషయాలు .
                 ఇతరులకు సాయం చేయటం లో మామయ్య ముందుంటాడు .మంచి మాట కారి .గొప్ప ప్లాన్ ప్రకారం అన్నీ చేసే వాడు .పెళ్ళిళ్ళు ,ఉపనయనాలు, బంతులు, వేడుకలు అన్నిటా మామయ్య హస్తం ఉండాల్సిందే .మా ఇంట్లోనే కాదు వూళ్ళో ఏ బ్రాహ్మణ కుటుంబం లో నైనా గంగయ్య గారి సలహా ,సంప్రదింపులు ,సాయం ఉండాల్సిందే .మాదీ ఆచారం రెండు పూట్ల సంధ్యావందనం, మధ్యాహ్నం దేవతార్చన అన్నీ యధాప్రకారం జరిగేవి శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతితో ప్రత్యక్ష పరిచయం వుండేది .వీలయినప్పుడల్లా పీఠాధిపతి దర్శనం చేసే వాడు .వారు ఈయనకు శుభాశంశలు పంపుతూండేవారు .మామయ్య గారింట్లో నృశింహ జయంతి ని వైభవం గా చేసే వారు ఆ రోజల్లా ఇంటిల్లి పాదీ ఉపవాసమే  ,అభషేకం ,పూజ ,సాయంత్రం మామిడి పళ్ళు ,విసన కర్రలు పంచేవాడు. పానకం అందరికి ఇచ్చే వారు .రాత్రికి టిఫిను .మర్నాడే భోజనం .అయితె ఆ కాల౦ లో చెరుకుపల్లి శాస్త్రులు గారు కూడా నృశింహ జయంతిని చేసే వారు ఇదే విధానం .అందరం అక్కడికీ వెళ్లి అన్నీ తీసుకొనే వాళ్ళం మర్నాడు వారింట్లో ఊరిలోని బ్రాహ్మణు లందరికి మర్నాడు భోజనాలు .షడ్రసోపేతంగా వుండేది .ఆప్యాయత ,అభిమానం తో శాస్త్రి గారి దంపతులు అందరినీ ఆదరించేవారు .ఆయన మహా విద్వాంశులు .నాన్న గారికి ఆయన గురువు గారు అన్నీ శాస్త్రీయం గా చేసే వారు .మామయ్య అక్కడ వడ్డన సాయం చేసే వారు .వంచిన నడుము ఎత్తకుండా యెంత సేపైనా మామయ్య వడ్డించే వాడు .అదే నాకు అలవాటైంది .ఎవరింట్లో నైనా అంతే .మంచి ,ఆచరణీయ మైన సలహాలు ఇచ్చేవాడు .మామయ్య వుంటే యజమానికి  నిశ్చి౦తే .అన్ని వరుస క్రమం లో జరిగి పోయేవి .మంచి ముందు చూపు వుంది .
                   మామయ్య చదరంగ ప్రవీణుడు .పేకాట ప్రియుడు .బాడ్మింటన్ ప్లేయర్ .సంగీత జ్ఞానం ఎక్కువ తరంగాలు బాగా పాడే వాడు . బాలమురళీ కృష్ణ ఆంటే అభిమానం తక్కువ గా వుండేది .సెమ్మంగుడి ,ఈమని ,పిచ్చిహరి లంటే అభిమానం .వుయ్యురుకు ఏ బ్రాహ్మణుడు ఏ సమయం లో వచ్చినా మామయ్య గారింట్లోనే భోజనం .మా అత్తయ్య మహాలక్ష్మి గారు అర్ధ రాత్రైనా అతిధులకు వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు.వున్న దానితో సంతృప్తిగా భోజనం పెట్టేవారు .ఇక్కడ మా చిన్న తాతయ్య నరసింహం గారి గురించి చెప్పాలి మా అమ్మ,మామయ్యల తండ్రి శి౦గిరి శాస్త్రి, తల్లి దుర్గమ్మ చాలా చిన్నతనం లోనే చనిపోయారు. నరసింహం గారే ఆంటే వీళ్ళ బాబాయి గారే వీళ్ళను పెంచి పెద్ద చేసి వివాహాలు చేశారు .వీళ్ళిద్దరూ ఆంటే ఆయనకు పిచ్చి ఆప్యాయత. అమ్మను అమ్మాయ్ అనీ మామయ్యను అబ్బాయ్ అని ఎంతో ప్రేమ గా పిల్చేవాడు .ఆయన మంచి వ్యవహార దక్షుడు, కోర్టు పక్షి కూడా .మావి ,వాళ్ళవి ఎన్నో వ్యవ హారాలు కోర్ట్ ద్వారా సాధించి కొంపలు నిలబెట్టాడు .మేమ౦తా తాతయ్య అని ఎంతో గౌరవం గా పిలిచే వాళ్ళం ఆయనా ,మా అమ్మా వాళ్ల నాన్న ఆంటే మా తాతయ్య ఊళ్ళోకి బంది పోటు దొంగలు వచ్చి ఇళ్ళ మీదకు పడితే బరిసెలు చేత్తో పట్టుకొని ఎదిరించి పారి పోయేట్టు చేసిన వీరులు .వీరిద్దరికీ తోడూ మా ఇళ్ళ దగ్గరే వున్న వైశ్య ప్రముఖుడు వెంట్రప్రగడ వెంకట రత్నం .మా అమ్మ వీటిని మాకు వీర గాధలు గా చెప్పేది .
              మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు 1961  లో చనిపోయారు మా మామయ్యే మాకు అన్నీ మా అమ్మ 1982 లో మరణించింది .అప్పుడుకుడా మామయ్యే మాకు అండ . మా ఇంట్లో అన్ని ముహూర్తాలు ఆయనే పెట్టాడు .దగ్గర వుండి అన్నీ జరిపించాడు .మా మామయ్యకు తన కూతురునిచ్చి నాకు పెళ్లి చేయాలని వుండేది .రోజుకు పది సార్లైనా మా ఇంటికి వస్తూండే వాడు .నాన్నకు ఎందుకో మామయ్య మీద సదభి ప్రాయం వుండేది కాదు .ఆయనతో మాట్లాడటం తక్కువే .అయినా ఇవేమీ పట్టించుకోకుండా అమ్మ మీద గౌరవంతో మాకు అన్నీ చేసే వాడు .దుర్గా అనే ఆయన కూతురును ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకొనే వాడు .నాకూ చేసుకోవాలనే వుండేది అప్పటికి పెళ్ళంటే ఏమిటో తెలీదు, మా ఇద్దర్ని మొగుడు పెళ్ళాం అనే అందరు అనే వాళ్ళు .దురదృష్ట వశాత్తు ఆ అమ్మాయి తేలు కుట్టి చని పోయింది.  తర్వాత ఆ అమ్మాయి చెల్లెల్ని నాకు ఇవ్వాలనుకున్నాడు .అందరికి అదే ఆలోచనా .పాపం ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింది .నాకు పెళ్లీడు వచ్చింది పిల్ల నిస్తానని అనలేదు. ఆయన ఆంటే చేసుకొనటానికి నేను సిద్ధం .మామయ్య మా కుటుంబానికి చేసిన దానికి కృతజ్ఞత అనుకొనే వాణ్ని .చివరికి ఆయనే ”నాయనా నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో ”అని చెప్పాడు చెప్పలేక చెప్పలేక .నేనూ బాధ పడ్డాను .కాని విధికి అంతా తలవంచాల్సిందే .అప్పటికే మా నాన్న గారు గతించారు .మా అమ్మ, మా మామయ్యనే నాకు సంబంధాలు చూడమని , ఆయన మీదే భారం వేసింది .అప్పుడు ఆయన మా అమ్మ చెల్లెలి(చతుర్వేదుల వెంకాయమ్మ -వెంకటప్పయ్య) మనుమరాలు(తూటుపల్లి ప్రకాశం-పద్మావతి ల మూడవ అమ్మాయి ) ప్రభావతి అయితే బాగుంటుందని సూచించాడు .దగ్గరుండి పెళ్లి జరిపించాడు .భగవంతుని దయ తో పిల్లా ,పాప తో సుఖం గా వున్నాం .ఇది మామయ్య చేసిన మరో మంచి పని .
                   కూచిపూడి భాగవతులు సంవత్సరానికో సారి ఉయ్యూరు వచ్చి ఒక వారం రోజులుంది ఇల్లిల్లు తిరిగి దశావతారాల పాటలు పాడుతూ ధనం సంపాదించుకొనే వారు. మామయ్య గారింట్లో దిగే వారు .కొందరు వాళ్ళింట్లో కొంతమంది మా ఇంట్లో భోజనం .అమ్మకు ,నాన్నకు వీరంటే అభిమామం .ముందుగా మా ఇంటికే వచ్చి పాడి డబ్బు తీసుకోవటం తరతరాలుగా వచ్చింది. మా బోణీ మంచిదని నమ్మకం . వాళ్ళింట్లో బ్రాహ్మణులకే భోజనం పెట్టే  వారు .మా నాన్న అట్లా కాదు చదువు కొనే వారెవరైనా వారికందరికీ వారాలిచ్చి భోజనం డబ్బు సాయం చేసే వారు .
               మామయ్య గారింటిలో ఏది చేసినా వూరందరికీ వేడుకే .ఆ బ్రాహ్మణ్యం అంతా అక్కడే భోజనాలు మడి వాళ్ళు ఆరోజు చాలా మంది వుండే వారు .మడి కట్టుకొనే వంట .భోజనాలకు వచ్చే టప్పుడు చెంబు ,గ్లాసు ,మంచినీళ్ళు తెచ్చుకోవటం అందరికి అలవాటు .ఆడవాళ్ళంతా కలిసి వండే వారు, వడ్డించే వారు .ఎవరిట్లోనైనా అదే పధ్ధతి .సామూహిక సహకారం ఆంటే ఏమిటో చూపే వారు ..వాళ్లింట్లో పెద్ద కూతురు రాజ్యలక్ష్మి వివాహం అయిదు రోజులు చేశారు .పెద్దకొడుకు పద్మనాభం ఒడుగుకూడా అయిదు రోజల వేడుకే .తర్వాత తర్వాత తగ్గింది, శాయిపురం నుంచి చదువుకొన్న వేద పండితులోచ్చేవారు .అందరికి లేదనకుండా భోజనం లభించేది .పూర్వం మామయ్య వాళ్ల ఇంటి పేరు కొలచల అట, అయితే ఊళ్ళోకి బ్రాహ్మలెవరు వచ్చినా ఆతిధ్యం వీరింటి లోనని ముందే చెప్పేవారట .వీళ్ళ ఇంటిముందు ఒక రాతి గుండు ఉండేదిట .  ఊళ్ళోకి ఎవరైనా వస్తే ”ఆ గుండు వారింటికి వెళ్ళండి భోజనం దొరుకు తుందని జనం చెప్పేవారట .చివరికి కొలచల పోయి గుండు ఇంటిపేరు అయింది అతిధులను ఆదరించటం వల్ల .
           మంచి ఆరోగ్యం గా వుండే వాడు మామయ్య ఒక కొడుకు ఉయ్యూరు లోనే రోడ్డు ప్రమాదం లో చని పోవటం ఆయన్ను బాధించింది .కుంగి పోయాడు .పెద్దకొడుకు సంసారానికి పెద్ద గా ఉపయోగ పడక పొవడమూ ఆయనకు బాధ కలిగింది .తాళ్ళను హరిన్చుకొనే ఆరోగ్యం .కట్టెలను కొట్టిన ధృడత్వం . కానీ ఇవేమీ సాయం చేయలేదు .బి.పీ ..దానితో పక్షవాతం వచ్చింది .ఇది ఎవ్వరు ఊహించని విషయ౦ , మాట పడి పోయింది, కాళ్ళు చేతులు స్వాధీనం తప్పాయి .కుటుంబం అంతా నిలబడి సేవ చేసింది అప్పటికే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి .ఆరోగ్యం కుదుట బడింది, నెమ్మది గా మళ్ళీ మా ఇంటికి రాక పోకలు సాగించే వాడు, ఆవకాయ బాగా ఇష్టం .హార్లిక్స్ పొడి మా ఇంట్లోది చేతుల్లో పోసుకు తినటం అలవాటు .మేము వాళ్ల కుటుంబం తో సన్నిహితం గా వుండాలని ఆరాట పడే వాడు .కానీ వాళ్ళింట్లో వాళ్లకి అది నచ్చేది కాదు. క్రమం గా దూరం పెరిగింది. చివరిసారిగా మా ఇంటికి వచ్చి మా ఆవిడ ప్రభావతి రెండు చేతులు పట్టుకొని.  రెండిళ్ళునూ కలిపే బాధ్యతా ఆవిడదేనని ఆవేదనతో చెప్పాడు .ఆంటే ఆ తర్వార కొద్ది రోజులకే మమ్మల్ని వదిలి మా మయ్య పై లోకాలకు  చేరాడు .
                  మామయ్యకు యాత్రలు చేయటం ఇష్టం .దాదాపు అన్ని క్షేత్రాలు అత్తయ్య తో పాటు తిరిగాడు కొన్ని నాన్న అమ్మలతో వెళ్ళాడు .మేము చిన్నపిల్లలు గా వున్నప్పుడు హిందూపురం లో వుంటే పెద్ద కూతురు తో అక్కడికి వచ్చి బెంగుళూరు ,లేపాక్షి ,విదురాఅశ్వత్థం  మమ్మల్ని తీసుకొని చూపించాడు .మేము హిందూపూర్ నుంచి ఉయ్యూరు వస్తుంటే, బెజవాడ రైల్వే స్టేషన్ కు వచ్చి మమ్మల్ని దింపుకొని హోటెల్ కు తీసుకు వెళ్లి ఇడ్లీ సాంబార్ తినిపించే వాడు .సాంబారు ఆంటే మహా ఇష్టం రెండిడ్లీ అయిదు ప్లేట్ల సాంబారు తాగేవాడు ,మాతో నూ అలాగే తినిపించేవాడు.  స్వీట్లుబాగా తినే వాడు వక్క పొడి మా ఇంటికి వచ్చి వేసుకొనేవాడు.  కాఫీ ప్రాణి.  కిళ్ళీ కట్టిస్తే చక్కగా తృప్తిగా తినేవాడు మాంచి తి౦డి పుష్టి వుండేది .కష్ట పడటం బాగా ఇష్టం .హృదయం చాలా మంచిది ..దీపావళి వచ్చిందంటే మతాబులు చిచ్చు బుడ్లు కట్టే వాడు .మాతోనూ కట్టించే వాడు అవి చక్కగా కాలటానికి మంచి పాళ్ళతో పదార్ధాలు కలిపే వాడు .మా పుస్తకాలకు అట్టలేసే వాడు .బైడి౦గ్ చేయించే వాడు .మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమద్ జయంతికి మాతో పాటు వచ్చి పద్ధతిత ప్రకారం జరిపించే వాడు అందులో ఒక పూజారికి మా గోత్రనామాలు గుర్తుకు రాక గోడ మీద రాసుకొంటే పరిహాసం చేసే వాడు. ఎప్పుడు నవ్విస్తూ, నవ్వుతూ ,ఏడిపిస్తూ మాటలు అంటూ ,మాటలంటే పడుతూ చిద్విలాసం గా నవ్వుతు వుండే మా మామయ్య ఆంటే నాకు ఎంతో ఇష్టం ,అభిమానం ,ఆరాధన .ఇన్నేళ్ళ కైనా ఆయన పై ఇది రాయటం నా అలసత్వానికి నిదర్శనం .ఇప్పుడైనా రాసినందుకు కొంతలో కొంత ఆనందం ..
                                   మీ —గబ్బిట -దుర్గా ప్రసాద్ –20 -06 -11 .
Posted in రచనలు | Leave a comment

యాభై ఎళ్ల ప్రతిభా’చంద్ర’ గ్రహణం

Posted in సేకరణలు | 1 Comment

గ్రామీణ క్రీడలు

                 గ్రామీణ క్రీడలు
 
                                                   మొక్క   అయి  వంగనిది మానై వంగుతుందా అనే సామెత అన్ని విషయాల్లోనూ సార్ధకమే .శరీర భాగాలన్నీ విడిగా వున్నా ,వాటి శక్తులను ఏకీకృతం చేస్తే అద్భుత శక్తి జనిస్తుంది .ఆ శక్తి కేంద్రం మనం అనుకొన్నది సాధించటానికి తోడ్పడుతుంది .అంతరిక శక్తులను వికశింప జేస్తే అభివృద్ధి సార్ధక మవుతుంది .శారీరక దార్ధ్యత మానషిక దారుధ్యాన్నిస్తుంది .ఇవన్నీ చిన్నతనం నుంచి ,విద్యార్ధులలో బాల బాలికలలో ఆసక్తి రేకెత్తిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది .
భారతీయ గ్రామీణ జీవన విధానం లో గ్రామీణ క్రీడలు భాగాలే .మన చిన్నతనం లో పల్లెటూర్ల ల్లోని పండుగల సందర్భం గా గ్రామీణ క్రీడలను ప్రోత్చాహించటం వుండేది .చెడుగుడు ,ఉప్పు ఆట ,మగపిల్లలు ఆడితే ,తొక్కుడు బిళ్ళ ,వామన గుంట గవ్వలు ,వైకుంఠ పాళీ మొదలైనవి ఆడపిల్లలు ఆడే వాళ్ళు .ఏ వయసుకు తగిన ఆట ఆడటం మనకు మామూలే .ఈ ఆటల్లో కలిసి కట్టుగా ఆడటం ,నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించటం ముఖ్యం గా భావించే వారు .
పల్లె టూళ్లో గోళీలాట బాలురకు చాలా ప్రత్యేకమైన ఆట .ఎంత దూరం లో వున్న గోళీనైనా ,వేళ్ళతో గురి చూసి కొట్టటం ,బరిలోనుంచి బయటకు పడేట్లు కొట్టటం ఇందులోని గొప్పతనం .గురికి మంచి శిక్షణ నిచ్చేది గోళీలాట .ఒక వెలుగు వెలిగిన అచ్చ తెలుగు ఆట .ఆధునిక నాగరికతలో కొంతకాలం మరుగైంది .ఇప్పుడు అన్ని గ్రామాల్లో మళ్ళీ ఊపు అందుకుంది .తరువాత చెప్పుకో దగింది గూటిబిళ్ళ  ఆట .చిన్న  పిల్లలకు  చాల   ఇష్టమైన ఆట .ఎంతో దూరానికి ఎంతో ఎత్తుగా ,చేతి తోనో కాలి  తోనో బిళ్ళను కర్రతో కొట్టి ఎవరికీ అందనంతగా పంపటం ,బలప్రదర్శనకు నిదర్శనం .ఇది ఇప్పటి గోల్ఫ్ ఆటకు ప్రాతిపదిక .
                   ఇంకో ఆట టైరు ఆట .గుండ్రని టైరును చేతితోనో ,కర్ర తోనో చాలా వేగంగా పరిగెత్తిస్తూ .మంచి వ్యాయామం చేస్తారు .కోకో తెలుగు వారికి చాలా ఇష్టమైన ఆట . వేగం గా పరిగెత్తటానికీ పట్టుపడకుండా తప్పించుకోటం కు మంచి నైపుణ్యం తో ఆడే ఆట .యుద్ధ రంగానికి పనికి వచ్చేఆట  ఇంకో ముచ్చటైనది కుంది కుంటు  కుంటుకుంటూ పరిగెత్తుతూ ,మామూలుగా పరిగెత్తే వాళ్ళను పట్టుకోవటం .శరీర భారాన్ని ఒంటికాలి మీద మోపటం ,దానితో పరిగెత్తి అనుకున్నది సాధించటం ఇందులో విశేషం …పులి -మేక ఆట మరో వేడుకైన ఆట .బలవంతుని చేతిలో బలహీనుని పాట్లు తెలియ జేస్తుంది .బలహీనుడు కూడా తన శక్తి వంచన లేకుండా బలవంతుని పాల బడకుండా ఆత్మ రక్షణ తో వుండటం దీని ప్రత్యేకత .ఇది నిత్యం మన జీవన సమరం లో ఎదుర్కొనే సమశ్యలకు పరిష్కార మార్గం చూపే ఆట .
      అందరిని అలరించే ది బచ్చాలాట .సిగరెట్టూ పెట్టెల అట్టలను దొంతర గా పెట్టి ,చదును గా వుండే నాప రాయి ముక్కతో ,ఆదొంతరను పడగొట్టి బరిలోంచి బయటకు వచ్చేట్లు చేయటం .చేతి బల నిరూపణకు ,లాఘవానికీ ఈ ఆట తోడ్పడుతుంది .మరో అద్భుతమైనది బొంగరాలాట .తాడుతో బొంగరం తిప్పటం ,ఎక్కువ సేపు తిరిగేలా చేయటం ,అరచేతిలో బోగారాన్ని ఆడించటం గొప్ప నైపుణ్యానికి పరీక్షే .
       అట్ల తద్దె ,ఉండ్రాళ్ళ తద్దె .తెలుగింటి బాలికల వెలుగైన పండుగలు .తెల్లవారుజ్హామునే లేవటం ,గోరింటాకు పెట్టుకోవటం ఉయ్యాల ఊగటం ,అటు ఆరోగ్యానికి ,ఇటు ఆనందానికి ,తోడ్పడే ఆటలు .ఉయ్యాల ల్లోగతం లో ఎంతో వయ్యారం వుంది .మన చిన్నారి బాలికలకు వేడుకైన ఆట ఇది .
                   ఈ గ్రామీణ క్రీడలను గ్రామీణులను చైతన్యం చేయ టానికి మహారాజులు దసరాల్లో ,సంక్రాంతి నాడు ఉగాది,వేడుకల్లో ఏర్పాటు చేసే వారు .విల్లు ,అంబు లతో వేడుకలు చపే వారు .ఇవన్నీ ఆమూహిక శక్తికి నిదర్శనాలు .కలసి వుంటే కలదు సుఖం అన్న దానికి తార్కాణాలు .ఆరోగ్యకరమైన జీవితానికి ,మానసిక పరిణతికి దోహకాలు
      అమాయకత్వానికి ప్రతీకలు బాల బాలికలు .వారి లోని శక్తి యుక్తులను జాతీయ జీవన స్రవంతిలో మేళవింప జేసి ,జాతి వికాసాన్ని ,జాతీయతా స్ఫూర్తిని కలిగించే క్రీడలివి .  క్రీడా స్ఫూర్తితో అది గెలవటం చిన్న తనం నుండి అలవాటైతే ,ఏ జీవన విధానం లో వున్నా ,సరైన దృక్పధం లో సమస్యా పరిష్కారం సాధ్యమని తెలియ జెప్పేది . స్పర్ధయా వర్ధతే విద్యా , అవినేర్వవలసినవే .శిక్షణతో సాధింప వలసినవే .మెళకువలు నేర్వ వలసినవే .అనుభవం లోకి తెచ్చుకోవలసినవే .సాధించిన విద్యలన్నీ ప్రదర్శితాలై తేనే వాటికి రాణింపు .గుర్తింపు, ప్రోత్సాహం ఉంటేనే క్రీడా కారులు అందులో ఆసక్తిగా పాల్గొంటారు .
                   ఈ ఆటల్లో రెండు రకాలున్నాయి .లోపల ఆడుకోనేవి.వీటినే ఇండోర్ గేమ్స్ అంటారు .ఆరుబయట క్రీడా మైదానాలలో ఆడేవి వీటికి  అవుట్డోర్ గేమ్స్ అనిపేరు .
            పుల్లలాట అందరు ఆడేది .  చైనా పూచిక పుల్లలను కట్ట గా పట్టుకొని , నిలువుగా నించో బెట్టి వదిలేస్తారు .   ఒక పుల్లతో ఆ పుల్లల్ని ఒకదానికొకటి తగల కుండా బయటకు తీసేట్లు ఎగరేయటం .  ఒక కల, ఇంకో టి దాడి  ఆట .బుద్ధి సూక్ష్మతను తెలియ జేసే దాగుడు మూతలు చిలిపి తనంతో ఆడే సరదా ఆట .వరుసగా పిల్లలు వంగోని వుండే వాళ్ల మీద నుంచి దూకటం ఒక ప్రతిభే .ఇదే నటి హై జుంప్ .బల్లెం విసరటం ఆట నుంచే జావెలిన్ త్రో వచ్చింది .
             ఆడపిల్లలు మరీ ఇష్టమైన ఆట తాడు ఆట .తాడు చివరలను ,రెండు చేతులతో పట్టుకొని ,కోసల్లను నెలకు తాకిస్తూ తిప్పుతూ దానిలోంచి దూకటం.  ఎక్కువ సార్లు ఎవరు అనుకొన్న సమయం లో దూకితే వాళ్ళు గెలిచి నట్లు.
                  కోలాటం బాల బాలికలు లయబద్దం గా అదే ఆట .వొం ఆట ,నాయకుణ్ణి పట్టుకొనే ఆట .చైతన్య ప్రదర్శనకు ,వివేక శక్తికీ పరీక్ష .బంతి ఆట చిన్నప్పుడే కాదు పెళ్లి నాడు వేడుకైన ఆటే .ఇవన్నీ రూపాంటాం చెంది ,సాఫ్ట్ బాల గా ,త్రో బాల్ గ ,ఆర్చెరీ గా మారాయి.  ప్రాధమికం గా ఇవన్నీ భారతీయ గ్రామీణ ఆటలే.  అవే నేడు మార్పు చెంది ప్రపంచ వ్యాప్తం గా వర్ధిల్లు తున్నాయి .  పాటవానికీ, సామర్ధ్యానికీ, ప్రతిభకు, వివేచనకు ఈ క్రీడలు ఆలవాలాలు.  అంగ వైకల్యం గల వారు కూడా పాల్గొంటూ తమ సామర్ధ్యాన్ని రుజువు చేస్తున్నారు . .
   స్వదేశీ క్రీడలని ప్రోత్సహించే ఇలాటి కార్య క్రమాలు ప్రోత్సహి౦ప దగినవే వీటన్నిటికి ఒకే  సూత్రం జాతీయ స్ఫూర్తి .   క్రీడల ముగింపు రోజున చిన్నారులు రంగు రంగుల కాగితం రాకెట్లను విసురుతారు.  అన్ని రంగులు కలిసి అచ్చమైన, స్వచ్చమైన తెలుపు రంగు ఏర్పడి, భిన్నత్వం లో ఏకత్వం అనే భార తీయ భావన కలుగు తుంది . నేటి బాలలే రేపటి పౌరులు .  నైతికత ఆధారం గా ఆడే ఆటలలో జీవన పోరాటం లోను ,రుజు వర్తనతో లక్ష్యాన్ని సాధించాలని చెప్పే జీవిత సత్యం ఇది .ఈ నాటి లేత మొగ్గలే రేపటి వికసిత వర్ణ పుష్పాలు
 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -06 -11
ఇది 15 -12 -2002  నుండి      ప్రభుత్వం  హైదరాబాద్ శిల్పారామం లో వారం రోజులు నిర్వహించిన గ్రామీణ క్రీడల పోటీలసందర్భం గా  రాసి చదివించిన వ్యాసం
Posted in రచనలు | Leave a comment

జనక మహోత్సవం (fathers day)

    జనక మహోత్సవం

అందరికి జనక మహోత్సవ శుభా కాంక్షలు
మనకు గొప్ప తండ్రులున్నారు .వారిని గుర్తుంచుకొనే రోజూ .మన వాళ్ళను మాత్రమే కాదు .జాతికి మార్గ దర్శనం చేసే వారినీ స్మరించాలి.  పురాణ పురుషులలో దశరధుడు కుమారులైన రామాదులను ఎంతో ప్రేమగా పెంచి ,వాళ్ల చదువు సంధ్యలన్నీ స్వయం గా పర్యవేక్షించి ,వారికేమి కావాలో అన్నీ సమకూర్చాడు .ముఖ్యంగా  రాముడంటే బహిప్రాణం  గా జీవించాడు .వదిలి ఒక్క క్షణం కూడా వుండే వాడు .కాని తనకుమారునికి సకల విద్యలు విశ్వామిత్ర మహర్షి నేర్పించటానికి తనతో యాగ సంరక్షణకు పంపమంటే ముందు సందేహించినా కులగురువు ఆజ్న తీసుకొని పంపాడు .కొడుకు అభివృద్దే ధ్యేయం .అందుకే రామునికి తండ్రి ఆంటే అంత అభిమానం పితృవాక్య పాలన కోసం అరణ్యాలకు వెళ్ళాడు .అదే ఆదర్శం అని లోకానికి చాటాడు  . తర్వాత శ్రీ కృష్ణుని తండ్రి వసుదేవుడు  తాత్కాలికం గా కొడుక్కి దూరమైనా కంస సంహారం తర్వాత వాళ్ళని వదిలి పెట్టి ఉండలేదు .అలాగే పెంచిన నందుడు కూడా అంతే   కృష్ణ బలరాముల్ని కంటికి రెప్పలాగా కాపాడాడు .పెంపుడు తల్లి యశోద ,కన్న తల్లి దేవకీ అంతే .రాక్షసుల వల్ల కొడుకులకు ప్రమాదం అని పిల్లా జల్ల తో మొత్తం రేపల్లెజనాన్ని  వేరొక సురక్షితప్రాంతానికి తరలించాడు .అదీ పుత్ర ప్రేమ అంటే  .పరశురాముని తండ్రి జమదగ్ని కూడా కుమారుని తన అంత వాణ్ని చేశాడు .ద్రోణుడు తన పుత్రుడు ఆశ్వర్ధామ కు సకల విద్యలు నేర్పి తండ్రిన మించిన కొడుకు ను చేశాడు .శివుడు తన కుమారుడు వినాయకునికి విఘ్నాదిపత్యం ఇచ్చాడు .బ్రహ్మ కుమారుడు నారదుడు సకల విద్యా వేత్త.  తండ్రినుంచి సంక్రమించిన విద్య . ఇలాగ ఎందరో పురాణ పురుషులు తమ కుమారులను వున్నతోన్నతం గా తీర్చి దిద్దారు .వాళ్ళ కలలను వారిలో సాఫల్యం పొందేటట్లు చూసుకొన్నారు . .
ఆ ఆధునిక కాల౦ లో the great son of a great father  అని జవహర్ లాల్ కు ,ఆయన తండ్రి మోతీలాల్  కు పేరు .the great daughter of a great father అని ఇందిరకు ,జవహర్ లాల్ కు పేరు . రవీంద్ర  కవి  తండ్రి దేవేంద్రుడు కూడా అమితపుత్ర  వాత్సల్యం తో పెంచి ,అన్నీ ఇంటిదగ్గరే నేర్చుకొనే సౌకర్యం కల్పించాడు .గాంధీ గారి తండ్రీ కొడుకు కోరింది చేశాడు .భయ భక్తులు ,నిబద్ధత సంక్రమిమ్పజేశాడు .సరోజినీ నాయుడి తండ్రి కూతురు ఆశలు నెరవేర్చాడు .కవి సామ్రాట్ విశ్వ నాద సత్యనారాయణ గారికి తండ్రే  ఆదర్శం .ఆయన కోరిక మీదనే రామాయణ కల్ప వృక్షం రాశాడు .  వేయి పడగలు నవల లో పాత్ర తండ్రిదే .ఎందరో హరికధ పితామహులు  తండ్రి ప్రేరణ తో ఆ విద్యకు సార్ధకత తెచ్చారు .  ప్రముఖ వాగ్గేయ కారుడు త్యాగబ్రహ్మకు తండ్రి గురువు .  ఆయన అడుగు జాడల్లో సంగీతా సాధన చేసారు బాలమురళీ కృష్ణ తండ్రి స్ఫూర్తితో ఎదిగాడు .  బాల సుబ్రహ్మణ్యం కు సంగీతం నేర్పి ఇంత వాడుగా  ఎదగ టానికి తండ్రి ప్రోత్సాహమే . సంగీత విద్వా౦ సులందరికీ దాదాపు తండ్రులే అన్నీ,ద్వారం ,మల్లాది సోదరులు ,హిందుస్తానీ సంగీత మూర్తులందరికి సాంప్రదాయంగా త౦డ్రుల నుంచే విద్య సంక్రమించింది .  చిత్రలేఖనం ,నాట్యం, బుర్రకధ ,చిందు ,పిచ్చిక గుంటలు అన్ని కలలు తలి దండ్రుల దగ్గర నేర్చేవే .నాటక రంగ ప్రముఖులు ఇలాగే విద్య న్నేర్చారు .ఇవాళ సిని రంగాన్ని ఏలుతున్న యువ హీరోలు ,హీరోయిన్లు వారసత్వ సంపద గా నిలబడ్డ వారే .నిర్మాతలు తండ్రి వారసత్వాన్ని కోన సాగిస్తున్న వారే .ఇలా తండ్రి ప్రభావం అన్ని రంగాల్లో అందరి మీయా గాదం గా వుండటం చూస్తూనే వున్నాం .ఈ కాలమ్ లో తండ్రి అమెరికా వెళ్తే కొడుకూ వెళ్ళటమే.  తండ్రి సాఫ్ట్ వారే అయితె కొడుకూ అంటే అంతె  తండ్రి డాక్టర్ -కొడుకు అదే బాట తండ్రి ఇంజనీర్ పుత్రుడూ అదే దారి .లాయర్  కవి ,రచయిత ,విమర్శకుడు ఆంద్ర దేశం లో లేరు అంతే  అతిశయోక్తి కాదు .
కాదంబరి అనే వచన కావ్యాన్ని సంస్కృతం లోరాసిన  పట్ట బాణుడు త్సండ్రినుంచి  సకలం   నేర్చాడు .ఎదురుగా కొడుకును మెచ్చే వాడు కాదు .  కాని భార్యతో కొడుకు పాండిత్యాన్ని పరవశంగా ప్రశంసించే వాడట . కవయిత్రి మొల్లకు తండ్రియే ప్రత్యక్ష గురువు .  శ్రీ కృష్ణ దేవరాయల కుమార్తె గొప్ప కవయిత్రి అయిందంటే తండ్రి స్ఫూర్తే .అమెరికా ప్రెసిడెంట్లు తండ్రి కుర్చీలో కూర్చున్న వారే.  మన దేశం లో లోకసభ ,రాజ్యసభ అసెంబ్లీ స్థానాలు తండ్రి వదిలేసినవే .మంత్రులు అంతే .  అప్పుడు సామర్ధ్యం ,ప్రతిభ చూసి ఎంపిక చేసే వారు . ఇప్పుడు సామాజిక న్యాయం ,సానుభూతి తో సీట్లిచ్చి బలవంతం గా కూర్చో బెట్టటం అలవాటైంది .అలా ఇవ్వనందుకు ఒకకుర్రాయన  వీధిన పడి ఎలా ఆగం చేస్తున్నాడో చూస్తున్నాం .చాలా మంది ప్రతిభ సామర్ధ్యం చూపి నిలబడ్డారు .

కొద్దిమంది అనర్హ కొడులుకులు అలా అధికారమం లోకి వచ్చినా చాలా మంది యోగ్యులే కొలువు దీరారు .
తండ్రి గుణ గణాలని పుణికి పుచ్చుకొని గొప్పవారైన వారెందరో అన్ని దేశాల్లో వున్నారు .తండ్రి ఆదర్శాన్ని నిలబెట్టిన వారు ఎక్కువే పుత్రోత్సాహము కొడుకు ను కన్నప్పుడు వచ్చే దానికంటే వాడు ప్రయోజకుడై ,మంచివాడుగా నిలబడితే ఇంకా ఎక్కువ అన్న సామెత అందరికీ తెలిసిందే ఇదే మనందరికీ గుర్తుంచు కోదగిన విషయం . విషయం ఆశ్చర్య రామాయణం లో శ్రీరాముని కుమారులు లవ,కుశ లిద్దరూ పెరిగి పెద్దవాళ్లయి.  ధైర్య,శౌర్య పరాక్రమాలలో అద్వితీయులై ,వినయవిభూశానులై మర్యాదమన్ననలతో  మా జనాన్ని ఆకర్షిస్తుంటే వాల్మీకి మహర్షి వచ్చి మహాదానందపడి ”శ్రీరామా !ఇప్పటిదాకా లోకంలో నువ్వొక్కడివే రాముడు .ఇప్పుడు నీ కుమారులతో కలిసి ”త్రిరామాభిమయం అయింది లోకం .”అని మురిసి పోతూ చెప్పాడట ఇప్పుడు రాముని ఆనందం శివ ధనుస్సును విరిచినప్పటి కంటే  ,రావణున్ని సంహారం చేసి నప్పటి కంటే అనేక రెట్లు పెరిగిందట .  సంతానం సాఫల్యవంత మైతే ఆ తండ్రికి అంతకు  మించిన ఆనందం వుండదు .  అదే మనం తండ్రులకు ఈ జనక మహోత్స్చవం రోజున ఇవ్వాల్సిన నిజమైన అభిమాన కానుక .  దినాలతో సరిపెట్ట వద్దు .అభిమానం ప్రేమ ,ఆప్యాయత ,గౌరవం ,మర్యాదా చూపండి, చేతల్లో   కుదరకపోతే కనీసం మాటల్లో .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్– 19 -06 -11 .  .
Posted in రచనలు | 1 Comment

జ్ఞాపక శకలాలు ———–02

         జ్ఞాపక శకలాలు ———–02
                                                                  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి 
           కధక చక్రవర్తి ,ప్రపంచ కధా రచయితల్లో ఒకరుగా పేరొందిన వారు శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఆయన కధల్లో ”వడ్లగింజలు ”చాల ప్రాచుర్యం పొందింది .కధ ఎత్తుకోవటం ,ముక్తాయింపు ఇవ్వటం లో సిద్ధ హస్తులు .ఆయన స్పృశించని వస్తువు లేదు ,స్పృశించి బంగారం గా మార్చని కధ లేదు .ప్రతి వాక్యం ఒక పేరా గా రాయటం ఆయన శైలి .ఏం .వి,.ఎల్ .నరసింహారావు అన్నట్లు ఒక వేలూరి శివ రామ శాస్త్రి ,ఒక శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి ,ఒక విశ్వ నాద సత్యనారాయణ ప్రపంచ కధానికా రచయితల స్థాయి లోని వారు .శ్రీ పాద వారి తెలుగు నుడికారం గోదారిఒయ్యారాలు పోతుంది భావం గాఢ౦ గా హృదయానికి తాకుతుంది మాటకు సొగసులు చెక్కే మర్మం ఆయనది .భాషకు సువాసన అందించటం ఆయన నేర్పు .ఆయన తీరు ,నడక ,వేషం ,భాష ,అంతా కళాత్మకం గా వుంటుంది .అగ్ర కులం లో జన్మించినా అన్త్యజులను అక్కున చేర్చుకొన్నా మనీషి .సంస్కారం ఆయన ప్రత్యేకత .పురోగామిత్వం ఆయన నైజం .ఆయన రాసిన ”అనుభవాలు-జ్ఞాపకాలూను ”అనే పుస్తకం లో ఆనాటి పల్లె టూరి అగ్రహారాల జీవితకళ్ళకుకడుతుంది.      అందరు చదివి తీరాల్సిన పుస్తకం .ఆయుర్వేద మందులు తయారు చేశారు ,పుస్తకాలు అచ్చు వేశారు .ముక్కుకు సూటిగా నడిచి కొంత ఇబ్బందీ పడ్డారు .హిందీని వ్యతిరేకించారు .చెప్పింది చేశారు ,రాశారు ,చేసేదే చెప్పారు .తెలుగు కధా శ్రీపాదులు శాస్త్రి గారు  .
                                                                            చెకోవ్ 
                  కాలాన్ని అధిగమించిన క్రాంత దర్శి ,ప్రపంచ కదానికారచయితల్లో అగ్రేసరుడు చెకోవ్ ..ఆయన జయంతి ఏప్రిల్ 30  సుమారు నూట యాభై సంవత్చరాల క్రితం వాడు .సమకాలీనుల మెప్పు పొంద లేక  పోయాడు .అంతమాత్రాన ఆయన గొప్పదనం ఆగిపోలేదు .సుమారు 130  ఏళ్ళక్రితం రాసిన ”గూస్ బెర్రీస్ ”కధ చాల మంచిపేరు తెచ్చింది .ఆయన తన కాల౦ కన్నా ఎన్నో దశాబ్దాలు ముందుండే ఆలోచనా పరుడు .వంచన హింస ,అవమానాలను ఎదిరించాటమే ఆయన వ్యక్తిత్వం .”మాన్ ,sixthnumber వార్డ్ ,విండో మొదలైన కధలు విశ్వ విఖ్యాతి చెందాయి .వ్యంగ్యం గా కరుణ రసార్ద్రం గా రాయటం ఆయనకే చెల్లింది ఆయనకు ఘన నివాళిగా unesco  చెకోవ్ నామ సంవత్స రాన్ని జరిపింది .ఇలాంటి సంస్మరనాలను ఆయన ”దిన వారాలు ‘అని ఎగతాళి చేసే వాడు .(rituals )రష్యా కు చెందిన ఈ మహారచయిత గురించి రష్యా సాహిత్య పితామహుడు leo tolstoi  ”చెకోవ్ అసమాన ప్రతిభ కల వాడు .ఆయనకు పోలిక ఎవరు లేరు .జీవితాన్ని చిత్రించిన మహా రచయిత .ప్రతి ఒక్కరికీ అర్ధమయేట్లు రాయటమే ఆయన ప్రత్యేకత ”ఇంగ్లాండ్ కు చెందిన బెర్నార్డ్ షా ”సంపూర్ణ నాటక కళా చైతన్యాన్ని పొందుతున్న రచయిత చెకోవ్ .ఆయన్ను చూస్తె నేను ఇప్పుడిప్పుడే తప్పటడుగులు ప్రారంభించిన వాడినేమోనని పిస్తోంది ”అని ఘన నివాళి అందించాడు .ఆయన నాటకాలు జన హృదయాలను ఆవిష్కరించాయి అందుకే ఆయను నాటక రంగ ప్రస్తానం లో ముందుకు దూసుకు పోతున్న విజయ ధ్వజం చెకోవ్ ‘అన్నారు .
                                                                     కులపతి 
              బందరులో పుట్టి ,ఎందరో మహా మహులకు గురువై కులపతిగా కీర్తిపొంది అభినవ కణ్వ మహర్షిగా పేరొంది న వాడు రఘుపతి వెంకట రత్నం నాయుడు ..పట్టాభి ,చలం ,కృష్ణ శాస్త్రి లకు ఆదర్శ ప్రాయుడు .అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన మేటి అధ్యాపకుడు .బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఆంద్ర రాజా రామ మోహన రాయ్ అనిపించుకోనాడు .మద్రాస్ విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులై అంతర్ముఖుడైన బ్రహర్షి నాయుడు గారు .
                                                                     మహా కవి కాళిదాస్ 
       దివికి భువికి మనోజ్న మైన అనుసంధానాన్ని కల్గించి ,ప్రపంచ నాటక కర్తలలో అతి గొప్పవాడని జర్మన్ మహా పండితుడు ”గోథె”చే ప్రశంశించ బడిన వాడు ,శ్లోక చతుష్టయం తో మానవ మనోధర్మాన్ని ఆవిష్కరించిన వాడు ,మత్తేభాన్ని దూతగా దూత మత్తేభం ఆంటే మేఘసందేశం వ్రాసి అందులో భారత దేశపు భౌగోళిక స్వరూపాన్ని అత్యద్భుతం గా వర్ణించిన వాడు ,”అస్చుత్తరశ్యాం డిసి దేవ తాత్మా హిమాలయో నాభి నగాధి రాజా ”అని హిమవంతుని సౌందర్యాన్ని పరవశించి వర్ణించి ,రఘువంశ కుమార సంభావాలలో గొప్ప కావ్య గౌరవాన్ని సంతరించిన కవికుల గురువు కాళిదాస  మహా కవి కి  ప్రతియేటా మే నెల 23  న మధ్య ప్రదేశ్ లోని ఉజ్జైన్ లో ”కాళిదాస సమారొహ్ ”ఆంటే కాళిదాస ఉత్చవం జరుపు తారు .దేశం లో కళా ,సాహిత్య ,సంగీతాలలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి ”కాళిదాస్ సమ్మాన్ ”పురస్కారాన్ని అందించి ఆ మహా కవిని స్మరించి తరిస్తారు .ఉపమా కాళిదాసస్య అని పెరుపొందాడాయన ,వాక్కుకు అర్ధానికి విడదీయ రాని బంధం వుందని నిరూపించాడు .
                                                                        హరీన్ చట్తో  
              ”   ఒకరికిచెప్పగల  మనుకోవటం   అహంభావం -ఒకరికి చెప్పాలనే కోర్కె మనోదుర్బలం ”అని మానవ స్వభావాన్ని అద్దం చెప్పినట్లుగా చెప్పిన వాడు ప్రముఖ పార్లమెంటేరియన్ ,కవి ,నటుడు ,గాయకుడు విమర్శకుడు అందరిచే ఆప్యాయంగా  ”హరీన్ చట్తో”అనిపిలిపించుకొనే హరీంద్రనాథ చట్టోపాధ్యాయ .93  సంవత్చరాలసుదీర్ఘజీవితాన్ని    రుచిచూసిన వాడు .21 యొక్క ఏళ్ళ క్రితం 23 -06 -1990lo మరణించాడు
 .బెజవాడ పార్లమెంటరీ నియోజక వర్గానికి మొదటి పార్లమెంట్ సభ్యునిగా  ఎన్నికైన వాడు .ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు .మహాకవి .సౌ౦దర్యారాధకుడు .ఆధ్యాత్మిక వాది .అభ్యుదయ పద గామి .ఆయన ధర్మ పత్ని కమలా దేవి చట్టోపాధ్యాయ  .ఆయనే ఆమెకు స్ఫూర్తి .ఆయన సోదరే సరోజినీ నాయుడు .రవీంద్రనాథ టాగూర్ ”నా వారసుడు హరీన్ ”అన్నాడంటే ఆయన గొప్పతనమేమిటో మనకు తెలుస్తోంది
                                                                పై మహానుభావుల గురించిసూక్ష్మ పరిచయం   చేశాను .వారి స్ఫూర్తి పొందాలంటే ఇంకా విస్తృతం గా అధ్యయనం చేయాలి
                                                                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -06 -11
Posted in రచనలు | Leave a comment