మైసూరు ప్రయాణం -1

          మా మైసూర్ దర్శనం
                 నిన్న అంటే జూలై ఏడవ తేది మైసూర్ యాత్రకు బయల్దేరాం .బెంగళూర్ నుంచి india tourism development corporation వాళ్ల బస్సు లో మార్త హళ్లి నుంచి మైసూర్ కు 160 కిలోమీటర్లు .రాను పోను ఒక్కొక్కరికి 390 రూపాయలు .ఉదయం ఆరు గంటలకు ఇక్కడ బయల్దెరీన బస్ ఎడుమ్బావుకు మెజెస్టిక్ చేరింది .అక్కడి నుంచి ఒక గంట ప్రయాణం తర్వాత ఒక హోటల్ టిఫిన్ కు ఆపారు .ఇక్కడ ఇడ్లి చిన్న ఉతప్పం లాగ వుంది .గారే బావుంది .కాఫీ పర్లేదు .దారి అంతా పచ్చదనం పరచుకోన్నట్లు కన్నుల పండువ గా ఉంది
.ఎత్తైన చాలా లావుగా వున్న వృక్షాలను చూశాం .చెరుకు పంట ముఖ్యం గా బెల్లం చెరుకు సాగు కనపడింది .బెల్లం తయారు చేసే బట్టీలు కన్పించాయి కావేరి పరీవాహక ప్రాంతం కనుక వారి బాగా పండుతుంది . నూర్చిన వెంటనే మళ్ళీ పంట వేయటం కన్పించింది .కోన సీమ అందాలను పోలి వుంది .కొబ్బరి చెట్లు విస్తారం గా వున్నాయి .కొబ్బరి కాలు కూడా చాలా పెద్దవి ..పూల తోటలు ముచ్చట గా వున్నాయి .సుమారు పదకొండు గంటలకు శ్రీ రంగ పట్నం చేరాం .నాలుగు లైనుల దారి .స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ ను తగ్గించాయని పించింది .ఎన్నో ఏళ్ళ కోరిక మైసూర్ దర్శనం ఇవాళ తీరుతోందని  ఆనందం . రెండు సార్లు అంతకు ముందు బెంగుళూర్ వచ్చినా మైసూర్ రావటం కుదర లేదు
                                      శ్రీ రంగ పట్నం
           వైకు౦ఠ౦ లో విరజా నది తో సమాన మైనది కావేరి నది ”విరజా నది ఏ శ్రీ కావేరి  -శ్రీ రంగ నాధుడే  అల” శ్రీ నాధుడు  ”అని అందరికి నమ్మకం . శ్రీ రంగానాదుడిని మన్నారు దేవుడనీ అంటారు .రంగనాధుడు ఇక్ష్వాకు రాజుల ఇలవేలుపు అని విశ్వ నాద తమ కల్పవృక్ష రామాయణం లో తెలియజేశారు .ఇక్కడి ఆలయం కలియుగ వైకున్తమే మూడు రంగనాధ క్షేత్రాలు వున్నాయి తూర్పున శ్రీ రంగం లో ,దక్షిణాన అనంతశయనమ్  లో,పశ్చిమాన శ్రీ రంగ పట్నం లో .అన్ని చోట్ల విగ్రహాలు   స్వయం వ్యక్త మూర్తులే .శ్రీ రంగ పట్నం లో దక్షిణ ,ఉత్తర పశ్చిమ కావేరి నదులు కలిసి పోతాయి .ఒకప్పుడు కావేరి నది శ్రీ రంగానాధుని గురించి తపస్సు చేసింది ఆమెకు మూడు వరాలిచ్చాడు స్వామి .గంగ కంటే కావేరి పవిత్ర మవుతుందని ,శ్రీ రంగం గొప్ప యాత్రా స్థలం అవుతుందని శ్రీ రంగడు ఇక్కడే శేష తల్పం మీద శ్రీ మహా విష్ణువు లాగా ఇక్కడే కావేరి నదీ సేవలో స్థిరం గా వుండి పోతాడని వరం ఇచ్చాడు . . ఇక్కడి స్వామిని బ్రహ్మ రుద్రాది దేవతలు అర్చించారు .శ్రీ రంగ నాద వైభవాన్ని గౌతమ మహర్షి వర్ణించి చెప్పాడు .మేష మాసం లో ,శుక్ల పక్ష సప్తమి నాడు శనివారం వశిష్ట  వామదేవాది ఋషులు స్వామిని దర్శించారు .ఇక్కడ మూర్తి శేష సాయి గా కుడి చేతి లో తల పెట్టుకొని ,ఎడమ చేతిని చాపుకొని ,వక్షమునందు శ్రీ లక్ష్మీ దేవితో కనిపిస్తాడు .అందుకే  ఈ క్షేత్రానికి గౌతమ క్షేత్రమని ,బ్రహ్మానంద విమానమని పేరు వచ్చింది . ,  .
                  నారదుని వలన గౌతముడు పంచ రాత్ర విధానం తో స్వామిని అర్చించాడు .తులా మాసం లో గంగా నది కావేరి లో చేరి భక్తులకు ముక్తి నిస్తుంది .తులా మాసం లో కృష్ణ పక్ష దశమి నాడు అష్ట తీర్ధ ష్ణానం చేసి కోరికలను నెరవేర్చుకుంటారు .కావేరి లో ఒక సారి స్నానం చేస్తే గంగలో మూడు రోజులు ,యమునలో అయిదు రోజులు ష్ణానం చేసి నంత ఫలితం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం .ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీ దేవి పై మొహపడిన చిత్రసేన ,చిత్రరదులనే గంధర్వులు ఇంద్ర శాపం చేత రాక్షసులై ,చివరికి తులా మాసం లో పౌర్ణమి రోజూ ఇక్కడి కావేరి లో స్నానం చేసి శాప విముక్తులైనారు .
.                ఈక్షేత్రానికి ల  క్క్షోద్యానవనం అని పేరుంది .లక్ష్మి నరసింహ ,గంగాధరేశ్వర ,జ్యోతిర్మని ఆళ్వారు లు కొలువై ఉన్నారిక్కడ ..ఈ ఆలయ అంతర్భాగాన్ని 817 లో హంబి అనే నర్తకి నిర్మించింది .894 లో గంగా వంశ రాజు తిరుమలయ్య నవరంగ మంటపాన్ని ,తిరుమల శ్రీనివాస ఆలయాన్ని కట్టించాడు .1117 లో శ్రీమద్రామానుజులు ఈ క్షేత్ర దర్శనం చేశారు .అప్పుడు హోయసల బిట్ట దేవుడు పాలిస్తున్నాఅతన్ని జైన మతం నుంచి వైష్ణ వానికి ,మార్చి విష్ణు వర్ధన రాయలు అనే పేరు పెట్టాడు .రాజు ఇచ్చిన అధిక ద్రవ్యాని ,ఎనిమిది గ్రామాల భూమిని స్వామి సేవకు వినియోగించారు .హేబ్బరులు ,లేక ప్రభువులను రక్షకులు గా నియమించారు .౪౪౫౪ లో రాజా తిమ్మని హెబ్బార్ విజయనగరం చేరి రాజాస్థానం లో దశ నాయకుడయ్యాడు .తరువాత ఇక్కడికి వచ్చి కోటను.ఆలయ ద్వారాన్ని పెద్ద గోడను చుట్టూ నిర్మించాడు .
                   తర్వాత శ్రీరంగ పట్నం విజయ నగర ప్రభువుల పాలన లోకి వచ్చింది రాజా ప్రతినిధి శ్రీ రంగ రాయలు పట్టణాన్ని బాగా విస్తరింప జేశాడు .ఆలయం లో లోపలి ప్రాకారాన్ని అయిదు మెట్లను ,రెండు ప్రక్కల రెండు రాతి ఏనుగుల్ని నిర్మించాడు .ఇతని భార్య అలుమేలమ్మ అనేక ఆభరణాలను సమర్పించింది .వాటిని మంగళ ,శుక్ర వారాల్లో అలంకరిస్తారు .శ్రీ రంగ రాయలకు సంతానం లేదు అప్పటి మైసూర్ మహారాజు శ్రీ రాజా వడియార్ కు రాజ్యం అప్పగించి తల్కాడు సమయం లో విశ్రాంతి తీసుకొన్నాడు .
     శ్రీ రాజా వడియార్ ఒక సారి ఇక్కడికి దర్శనానికి వచ్చాడు మంగళ ,శుక్ర వారాల్లో అలంకరించిన ఆభరణాలను అలువేలు మంగమ్మకు తిరిగి ఇచ్చి వేస్తుండే వారు. ఇది గమనించి ఒడియార్ ఆ నగలు ఆమె దగ్గర ఉండ కూడదని వెంటనే ఇచ్చేయమని ఆజ్ఞా పించాడు .ఆమె ఇవ్వ లేదు గుర్రం ఎక్కి తలకాడు కు పారిపోయి ,మలంగి దగ్గర వాటిని కావేరి లో పారేసి ,తాను ఆ అగాధ జలాల్లో దూకి మునిగింది .వెంట తరిమే సైనికులతో తలకాడు ఎడారి అవుతుందని మైసూర్ రాజులు సంతాన హీను లవుతారని శపించింది వెంటనే మలంగి అగాధం గా మారి దాని చుట్టూ ఎడారి ఏర్పడింది .అదే తలకాడు ఎడారి ఇప్పటికి కనిపిస్తుంది
                 ఒడియార్  కు ఈ విషయం తెలిసి బాధ పడి ,ఆమె విగ్రహం చేయించి రాజా మందిరం లో పెట్టించాడు ..నిత్యం పూజ చేసే వాడు .అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ పూజ జరుగుతూనే వుంది ,దసరాల్లో చాల వైభవం గా ఈ పూజ జరుగు తుంది .ఆలి ద్వారం దగ్గర అలవేలు మంగమ్మ ,శ్రీ రంగ రాయల శిలా విగ్రహాలు కనిపిస్తాయి .ఆమె బహుక రించిన నాసికా భరణం ఇప్పటికి కనిపిస్తుంది .అది మొదట్లో నిమ్మ పండు అంతా వుండేది. క్రమంగా తగ్గుతూ చిన్నదిఅయి  పోతుండటం గమనించదగింది .
      1610 నుంచి 1699 వరకు శ్రీరంగ పట్టణమే మైసూరు రాష్ట్ర రాజా దాని .౧౭౬౦ లో ఇమ్మడి కృష్ణ దేవ ఒడియార్ హైదేరాలీని సేనా పతిని  చేశాడు .హైదర్ రంగని భక్తుడు .రాత్రి పూట అతనికి స్వామి కలలో కన్పించి మాట్లాడే వాడట .తరచూ స్వామి దర్శనం చేసే వాడు .ఒకసారి  శాత్రు శైన్యం మైసూర్ రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చారు హైదర్ వారితో యుద్ధం చేశాడు .శత్రువుదే పై చేయిగా వుండి గోదావరి ఒడ్డున యుద్ధం జరిగింది .హైదర్ రంగానాధుని ధ్యానించి గోదావరి లోతు తగ్గాలని ప్రార్దిన్చాదట .వెంటనే నది బలహీన మైందట ,.హైదర్ సేన తేలిగ్గా అవతలి ఒడ్డుకు చేరి శత్రు సంహారం చేసి మైసూర్ రాజ్యాన్ని కాపాడాడు .వెంటనే గోదావరి మళ్ళీ ఉధృతం అయిందట .శత్రువులు దాటలేక పోయారు హైదర్ తేలిగ్గా శ్రీరంగ పట్నం చేరాడు సైన్యం తో .దీన్ని బట్టి య్దర్ కు రంగానాధుని పై యెంత భక్తీ విశ్వాసాలున్నాయో తెలుస్తోంది
               ప్రతి ఏడు ధనుర్మాసం లో ఇరవై ఒక్కటి రోజూ నుండి ఇక్కడ కొటారి ఉత్సవాలు వైభవం గా జరుగు తాయి దీని కోస౦ పెద్ద కోతరం నిర్మించారు .ఈ సమయం లో మైసూర్ మహారాజు స్వయం గా పాల్గొనటం ఆన వాయితీ .తొమ్మిదో రోజున స్వామికి మోహిని అలంకారాన్ని వేసి రాజు తో పూజ చేయిస్తారు .సంగీత కచ్చేరీలు జరుగు తాయి .వీటిలో రాజు ,రాజా కుటుంబీకులు ,హైదరాలి,జనానా అంతా భక్తీ శ్రద్ధలతో పాల్గొనే వారు .1774 లో
ఎనిమిదవ రోజూ అగ్ని ప్రమాదం జరిగినది .రాజు బాధ పడ్డాడు .వెంటనే నిమిషాల మీద హైదరాలి ఉత్సవం నిర్విఘ్నం గా జరిగే ఏర్పాట్లు చేశాడు మర్నాడు ఉత్సవం ప్రారంభించే సమయానికే కొత్త మండపం కట్టించాడు హైదర్ ,.దీనికే పాతాల మండపం అని పేరు .
             1782 లో హైదర్ మరణం తర్వాత టిప్పు సుల్తాన్ సేనాధి పతి అయాడు .అతను రాజును తొలగించి తానె మైసూర్ రాజు అయాడు .అప్పుడు ఇమ్మడి కృష్ణ రాజా ఒడియార్ అయిదేళ్ళ వాడు .మహమ్మదీయుల దాడిలో అతన్ని రంగనాధ గోపురం అయిదవ అంతస్తు లో దాచి కాపాడారు .టిప్పు పరిపాలన లో మీర్ సాదిక్ ప్రముఖ స్థానం పొందాడు .ఇతడు ఇక్కడి కొన్ని దేవాలయాలు ధ్వంసం చేశాడు .దీని బారి నుండి కాపాడు కోవటానికి ఆలయ అధికారులు ఆలయాలకు ఇంటి కప్పులు వేయించారట. పూర్ణయ్య వీధి లో వున్న జనార్దన స్వామి అలాంటిదే .చిన్న దేవాలయాల లోని దేవుళ్ళను అర్చకులు రంగనాధ ఆలయానికి తీసుకొని వచ్చి కాపాడు కొన్నారు .గోడల లోపలి వైపున ప్రతిష్టించారు .అలాంటి వాటిలో శ్రీ కృష్ణ ,పట్టాభిరాం ,మురళీ కృష్ణ విగ్రహాలున్నాయత .హైదర్ కు రంగని పై భక్తీ ఎక్కువ గా వుండటం తో దీని జోలికి పోలేదు .
                      ఆంగ్లేయుల పాలన లో ,వారి తోటి యుద్ధం లో టిప్పుకు చాల డబ్బు కావలసి వచ్చింది .అప్పుడు రంగానాధాలయం లోని విలువైన ఆభరణాలను తీసుకొని పోయివారికిచ్చి సంతృప్తి చెందిన్చాడని కధనం .కొన్ని ఫ్రెంచ్ వారికి ,కొన్నిరష్యా వారికి చేరాయత .క్రెమ్లిన్ రాజా ప్రాసాదం లో ఇప్పటికి అవి కన్పిస్తాయట .ఇప్పుడున్న స్వామి ఆభరణాలన్నీ టిప్పు సుల్తాన్ స్వామికి బహుకరించిన వేనట .
               1799 లోశ్రీ రంగ పట్నం బ్రిటిష్ వారి వశం అయింది ముమ్మడి కృష్ణ రాజా ఒడియార్ మైసూర్ ను రాజధానిగా చేసి ,పూర్ణయ్య ను దివాన్ గా నియమించారు ,.కోతరోత్సవం మామూలు గా జరిపాడు .తొమ్మిదవ రోజూ స్వయం గా పాల్గొనే వాడు .నాల్గవ కృష్ణ రాజా ఒడియార్ శ్రీ చామ రాజేంద్ర స్మారక సత్రాన్ని నిర్మించాడు .కావేరి నదికి మెట్లు కట్టించాడు .దీన్నే రాజా ఘట్టం అంటారు .తులసి వనం స్వామి పూజ కోసం ఏర్పాటయింది .ఆయన జన్మ దినమైన ఆషాఢ బహుళ విదియ నాడు స్వామి మెరవాలి ఈ మండపానికి చేరుతుందట .ఆ కార్య క్రమాన్ని ”చక్కర పొంగలి వుత్సవం ”అంటారట .
                 జయచామ రాజా వడయార్ పాలన లో కూడా అంటె  1954 వరకు ఈ వుత్సవాలు జరిగేవి.
             మొదట్లో శ్రీ రంగ నాధుడు తూర్పు ముఖం గా చేతికి ,శిరస్సుకు మధ్య ఎడముగా తల పైకెత్తి వుండే వాడట .కాల క్రమం లో మార్పు చెంది ఇప్పుడున్న ముద్రా స్థితి లో ఉన్నాడని బాగా వృద్ధులైన పూజారులు ,యాత్రికులు చెప్పుతారు  .ఇది ఇక్కడి  విశేషం .
స్వామి దర్శం కన్నుల పండుగ చేసుకొని ,ఆనందం తో బస్సు ఎక్కి నెమ్మదిగా మైసూర్ వైపుకు ప్రయాణం సాగించాం .ఇక్కడికి పదహారు కిలోమీటర్లు ఇక్కడే శిధిల మైన శ్రీరంగ పట్టణమ్ కోట ,కోటలోకి నీటి మార్గం ద్వారా ఆంగ్లేయులు ప్రవేశించిన చోటు ,టిప్పు సమాధి అన్నీ బస్సు లో నుంచే చూసాం .మహా వైభవం గా వెలిగి ,బ్రిటిష్ వారితో పోరాడి భారత దేశ స్వాతంత్ర ,స్వేచ్చ కోసం అసువు లర్పించిన మహా వీరుడు టిప్పు సుల్తాన్ వీర మరాణం పొందాడు .జన హృదయం లో స్థిర స్థానం సంపాదించాడు .జోహార్ టిప్పు సుల్తాన్ .
.                             మిగిలిన విశేషాలు తరువాత తెలియ జేస్తాను
                              మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —08 -07 -11  —క్యాంపు —బెంగళూర్ .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.