ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

 ఊసుల్లో   ఉయ్యూరు –16      వీరమ్మ తల్లి తిరునాళ్ళు

                                  వీరమ్మ తల్లి చరిత్ర

పుట్టి నింటి నుంచి మెట్టి నింటికి 

తిరునాళ్ళు 2

వీరమ్మ తల్లి కి అయిదు వందల చరిత్ర వుంది .ఆ కాలమ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర  పెద కడియం అనే గ్రామం లో యాదవ కులానికి చెందిన ”బొడ్డు ”వారి ఆడ పడుచు గా ఆమె జన్మించింది .తండ్రి పరశురామయ్య ,తల్లి పార్వతమ్మ .పరమేశ్వర వర ప్రసాదం గా జన్మించి నందున ”వీర శివమ్మ ”అని పేరు పెట్టారు .చిన్న తనం నుంచి భక్తీ శ్రద్ధ లతో ,దైవ చింతన తో పెరిగింది .ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య ,చెల్లమ్మ ల పెద్ద కుమారుడు చింతయ్య తో ,ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు ,పెదకడియం లో ఆమెకు వివాహం చేశారు .కొంత కాలమ్ పుట్టింట్లో నే వుంది ,యుక్త వయసు రాగానే ఉయ్యూరు లోని మెట్టి నింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించ టానికి పుట్టి నింటి వారు పంపారు .అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ,ఆదరాన్ని పొందింది వీరమ్మ .తన సేవా తత్పరత తో అత్త గారైన మేనత్తను ,మామయ్యను మెప్పించింది .మరది భోగయ్య ను బిడ్డ లాగ చూసింది .చుట్టు పక్కల వారికే కాక బంధు గణానికీ అంతటికీ ఆమె ”ఉత్తమా ఇల్లాలు ”అయింది .భర్త సేవలో జీవితం ధన్యం చేసుకోంది .కాలమ్ ప్రశాంతం గా గడిచి పోతోంది .ఇంతలో కుటుంబం లో ఒక అలజడి రేగింది .మరది భోగయ్యకు అచ్చమ్మ తో వివాహ మైంది .ఆమె గర్విష్టి ,విద్యా హీన .ఆమెకు వీరమ్మ మీద అసూయా పెరిగింది .ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చు కోవటం ఆమె కు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది .అయితె సాధ్వి వీరమ్మ ,అత్త మామలకు ,మరిదికి నచ్చ చెప్పి ,తోడి కోడల్ని ,మళ్ళీ అత్త వారిల్లు చేరేట్లు చేసింది .ఆమె మనసు లోని అసూయా తొలగి పోయి ,తోడికోడళ్ళు అన్యోన్యం గా వుంటూ ,వూరి వారికి ఆదర్శ మైనారు .

                           భర్త మరణం -సహగమనం     

ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ .అతని కళ్ళు సాధ్వీ మణి వీరమ్మ పై పడ్డాయి .లోబరుచు కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు .దగ్గర లో వున్న” గురజాడ ”గ్రామం లోని తన బావ మరిది ”సీతయ్య ”ను తనకు సాయం చేయమని బ్రతిమి లాడాడు .అతడు రావణాసురుడికి మారీచుడు చేసి నట్లు హిత బోధ చేశాడు .చెవి కెక్క లేదు .ఎంతైనా బావ గారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్య కు   పట్టు కొంది .మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్త బడి చివరికి సాయం చేయ టానికి ఒప్పు కున్నాడు .మేకల ,గొర్రెల మేత కోసం చింతయ్య ,భోగయ్య సోదరులు వాటిని తోలు కోని ఉత్త రాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు .ఇదే అదునైన సమయం అని బావమరిది సీతయ్య ను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య .సీతయ్య ప్లాన్ వేశాడు .తన నౌకరుకు విషం పూసిన సొర ముల్లు ఇచ్చి ,చింతయ్య పై రహశ్యం గా ప్రయోగించమని చెప్పి పంపాడు .ముస్తాబాద్ లో గొర్రెల మందల దగ్గర నిద్ర పోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం వున్న ఆ సొర ముల్లు తో  పొడిచి హత్య చేశాడు . .చింతయ్య బాధ భరించ లేక చని పోయాడు .తమ్ముడు భోగయ్య అన్న  శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు . ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది .తాను గాడం గా ప్రేమించిన భర్త తో సహ గమనం చేయాలని నిస్చ యించుకొంది .తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసు కోని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బల వంత పెట్టారు .ఆమె కు కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది  .
సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు .వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయట పడుతూ ,ఆమె అంటే అందరి లో భక్తీ ఏర్పడింది . చింతయ్య కు  చితి ఏర్పాటు చేయించారు .వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది .గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే ,మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది .ముత్తైదువులు పసుపు దంచుతుంటే ,రోలు పగిలింది .వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోతూ వేసింది .ముత్తైదువులకు పసుపు ,కుంకుమ లు పంచి పెట్టింది .ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది .చింతయ్య చితికి తమ్ముడు   భోగయ్య నిప్పు అంటించాడు .వేలాది ప్రజలు భోరున విల పిస్తుండగా ,అత్తా మామలు ,బంధు గణం శోక సముద్రం లో మునిగి ఉండ గా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలి తో ,”పారెళ్ళు ”పెట్టించుకొని ,పెళ్లి కూతురు లా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించు కోని ,సాధ్వీమ తల్లి ,పతివ్రతా శిరోమణి ,వీరమ్మ తల్లి ,భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ,భగ భగ మండే ఆ మంటలో తానూ ,భర్త చితి పై చేరి అగ్ని గుండం లో సహ గమనం చేసింది .ఆదర్శ మహిళ గా ,మహిమ గల తల్లి గా ఆ నాటి  నుంచి ,ఈ నాటి  వరకు ప్రజల నీరాజనాలు అందు కొంటోంది
రాజ ప్రతినిధి  ”జిన్నా సాహెబ్’ వీరమ్మ నమస్కారం చేసి ,ఇంటికి వెళ్లి నిద్ర పోయాడు .ఆ రాత్రి నిద్ర లో వీరమ్మ భర్త చింతయ్య తో సహా మహా తేజో వంతం గా ,సర్వాలంకార శోభ తో ,కన్పించింది .స్త్రీలు పూజలు చేస్తున్నట్లు ,వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు ,గండ దీపాల కాంతి లో అమ్మ తల్లి ,ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ  ఉయ్యాల  ఊగు  తున్నట్లు  గుడి   పక్కనే  పెద్ద తటాకం  వున్నట్లు  ,అందులో  వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కల లో కన్పించిందట .ఉదయం లేచి జమీందారు ను పిలి పించారు .జమీందార్ కు కూడా అలాంటి స్వప్నమే వచ్చి నట్లు చెప్పారట     చింతయ్య మరణానికి కారకు లెవరో తెలుసు కోవ టానికి వేగుల్ని పంపారు .సుబ్బయ్యే కారణం అని అమ్మ వారి సహ గమనం రోజే తీవ్ర మైన బాధ తో అతడు మరణిం చాడని  తెలుసు కున్నారు  .సుబ్బయ్య వంశం సర్వ నాశనమై చివరికి వారసులెవరు లేకుండా నిర్వంశం అయింది .

ఆలయ నిర్మాణం -తిరునాళ్ళఏర్పాట్లు

అందరూ ఆలోచించి ,వీరమ్మ అత్త మామ ల తో సంప్రదించి ,గ్రామస్తులతో సమా వేశం జరిపి ,సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు .చెరువు తవ్వించారు .వీరమ్మ ,చింతయ్య లవిగ్రహాలను   ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు .జిన్నా గారు ,జమీందారు గార్ల సమక్షం లో భక్త జన సందోహం మధ్య వైభవం గా ప్రతిష్ట జరిగింది .ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నా గారే పెట్టు కొన్నారు .చెరువును తవ్వించిన ఖర్చు ,ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజులు పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు .
ఆ నాటి నుంచి ముందుగా మెట్టి నింటి వారు తర్వాత జిన్నా గారు రాజు గారు తర్వాత గ్రామస్తులు అమ్మ వారి ఉత్స వాలను ప్రారంభించి కొన సాగించారు .పారు పూడి వంశం వారినీ ,జమీందారు గారినీ ,ప్రభుత్వాధి కారులని ధర్మ కర్తలు గా జిన్నా గారు నియమించారు .అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరం గా నిర్వ హించే ఏర్పాటు చేశారన్న మాట .అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారే లతో సంబరాలు ప్రారంభ మవటం ఆన వాయితీ గా వస్తోంది .
అమ్మ వారు ఉయ్యాల ఊగే ప్రదేశం లో ఏ కట్టడమూ వుండదు .తన భర్తనూ హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్య ను కాలితో తన్ని,చిరు నవ్వు చిన్దిస్తున్నట్లు ఉయ్యాల ఊగటం లో అంత రార్ధం .ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్స వాలు ప్రారంబించటం జరుగు తోంది . చరిత్ర కాల గర్భం లో కలిసినా ,వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం .నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ .తిరునాళ్ళు  పదిహేను రోజుల్లో  ను ,ఉయ్యూరు లో ఏ  ఇంట్లోను    పసుపు దంచరు   ,కుంకుమ తయారు చేయరు  .ముందే  సిద్ధం  చేసు  కొంటారు  .కారం కూడా కొట్టరు .ఇవి స్వచ్చందం గా అందరు పాటించే నియమాలే .తిరునాళ్ళ లో అమ్మ వారికి సాధారణం గా   అందరు చీరే పసుపు కుంకుమ పెట్టటం అలా వాటు .అంతే కాక ఆ తర్వాత ఎవరింట్లో నైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చి నప్పుడు కూడా చీరా సారే పెడుతుంటారు మెట్టి నింట్లో వున్న అమ్మ వారికి  ”.అమ్మ వారి చీరలు” అని ప్రత్యేకం గా అందరికి అందు బాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణం లో ను లభిస్తాయి .ఆమె పవిత్రత ను ఇలా తర తరాలుగా పాటిస్తూ ,నేటికీ నిల  బెట్టు కొంటు న్నారు ఉయ్యూరు ,పరిసర గ్రామాల వారు .అమ్మ వారి ఊరేగింపులో జనరేటర్ తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టు కొంటుంది .యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు .పెళ్లి అయిన వాళ్ళు కూడా ,ఆ పవిత్ర దినాలలో బ్రహ్మ చర్యం పాటించి ,వంశ ప్రతిష్ట ను నిల బెట్టు కొంటారు .బంధువులను పిల్చుకొని విందు భోజ నాలు ఏర్పాటు చేసు కొంటారు .అంతా పెళ్లి శోభ లాగా వుంటుంది .ఇప్పటికీ పారు పొడి వంశాస్తులే ఆలయ పూజార్లు .ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి .అవన్నీ పూజారులే అనుభవిస్తారు . .   .ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర .ఇప్పుడు అమ్మ వారి చరిత్ర పై మంచి పాటల  కేసెట్లు సి.డి లు వచ్చి అందరికి అందు బాటు లో వున్నాయి

.–
సమాప్తం
21 -09 -1995 లో రాసిన ఈపరంపరను  ”ఊసుల్లో ఉయ్యూరు ”లో ఇప్పుడు చేర్చి   ఆవీరమ్మ  తల్లి కే భక్తీ తో  అంకితం చేస్తున్నాను  .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –15 వీరమ్మ తల్లి తిరునాళ్ళు 2 సంతానం కోసం ప్రాణా చారాలు

ఊసుల్లో ఉయ్యూరు –15

                                    వీరమ్మ  తల్లి తిరునాళ్ళు  2
 సంతానం కోసం ప్రాణా చారాలు 
సంతానం లేని మహిళలు  ,ఆలయం ప్రక్కనే వున్న చెరువు లో స్నానం చేసి ,మెడ లో ఒక్క మంగళ సూత్రం తప్ప ,ఏ ఆభరణాలు దరించ కుండా ,తడి బట్ట లతో ,వీరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు .అంటే బోర్లా పడుకొంటారు .ఒళ్లంతా తడిగా వుండటం వల్ల ,కొద్ది సేపటికి మగత వస్తుందని ,అమ్మ వారు కలలో కన్పించి ,కాయ కాని ,పండు కాని ,చేతిలో పెట్టి నట్లు కల వస్తుందని ,అలా వస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం తో చేస్తారు .ఇలా జరగటానికి కొన్ని గంటలు పట్ట వచ్చు ,లేక రోజులూ పట్ట వచ్చు .అది వారి పూర్వ జన్మ సుకృతం పై ఆధార పడి ఉంటుందని నమ్మకం .అమ్మ వారి అనుగ్రహం దొరకక పొతే కల రాదు .ప్రయత్నం ఫలించలేదని తెలుసు కుంటారు .వచ్చే ఏడాదికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు .ఈ ప్రాణాచారాలు ,అమ్మ వారు ఆలయం ప్రవేశించిన రోజూ నుండి ,పౌర్ణమి దాకా చేస్తారు .పౌర్ణమి ,ఆ ముందు రోజూ గరిష్టం గా ప్రాణాచారాలు చేసే వారు కన్పిస్తారు .ఇదంతా ,తర తరాలుగా వస్తున్న ఆచారం .ప్రాణాచారం పడుకొన్న వారికి తోడుగా ,వారి కుటుంబ స్త్రీలు సహాయం గా వుంటారు .
  సిడిబండి   
అమ్మ వారి తిరునాళ్ళు ప్రారంభ మైన పదకొండవ రోజూ న ”సిడిబండి ”వేడుక జరుగుతుంది .ఈ సంబరాన్ని చూడ టానికి ,ప్రజలు తండోప తండాలు గా వస్తారు .స్థానికం గా ఉయ్యూరు శివాలయం వీధిలో వాటర్ టాంక్ దగ్గర ,కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్లా బత్తులు– ప్రకాశ రావు  గారి కుటుంబం ,సిడిబండి చేస్తారు .ఇది చింత చెట్టు చక్రాల బండి .దానికి పొడవైన తాడి చెట్టు వుంటుంది .దాన్ని మధ్యలో చీల్చి తయారు చేస్తారు .ఇదే సిడి బండి అంటే .సుడి వేసే బండి ,అదే సిడి బండి .ప్రతి ఏడూ ఏ తాటి చెట్టు కొట్టాలో అమ్మ వారు వారికికలల కన్పించి చెబుతుందని ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తా రని అంటారు .చక్రాలు పాతవే.. తాడి మానె  కొత్త .వివిధ గ్రామాల నుండీ కోలాటం బృందాలు ,భజన  బృందాలు వచ్చి పాల్గొంటాయి .తమ శక్తి సామర్ధ్యాలను ,కళ లను ప్రదర్శించ టానికి పోటీ పడతారు .పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుణ్ణి సిడిబండి రెండో చివర కట్టిన బుట్టలో కోర్చోబెట్టి ఊరేగిస్తారు .అతని పై ప్రజలంతా ,అరటి పళ్ళు ,పొగాకు కాడలు విసురు తారు .గుమ్మడి కాయలూ విసిరేస్తారు .చెరుకు సీజన్ కనుక చెరుకు ముక్కలూ విసిరేస్తారు .మంచి గుమ్మడి కాయలతో బండిని అలంకరిస్తారు .ఇళ్ళ దగ్గర వార పోసి ,కానుకలు కొబ్బరికాయలు ,సమర్పించి ,హారతి ఇస్తారు .గుమ్మడి కాయలు సమర్పిస్తారు .సిడి బండి వాటర్ టాంక్ దగ్గర సాయం కాలమ్ బయల్దేరి ,రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆలయం దగ్గరకు చేర్తుంది .మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది .మొక్కు వున్న వారు బండిలో ని తొట్టె లో కూచుని గుడి చుట్టూ తిరుగు తారు .సిడి బండి రోజున స్కూళ్ళు ,కాలేజీలు   ఒకే పూటఅంటే ఉదయం మాత్రమే  పని చేస్తాయి .డప్పుల హోరు ఈ తిరునాళ్ళ ప్రత్యేకత .ఇసకేస్తే రాలనంత జనం .ఉయ్యూరు ఉప్పొంగి పోతుంది ఆ రోజు .

This slideshow requires JavaScript.

 మళ్ళీ మెట్టినింటికి చేరటం 
అంబరాన్ని అంటే సంబరాలు పదిహేను రోజులు జరుగు తాయి .ప్రతి ఇంటి వారు మట్టి ప్రమిదలలో  గులాం చల్లు కుంటు ఊరేగింపు గా వెళ్తారు .మొక్కులు చెల్లిస్తారు .కోళ్ళు బాగాతెగుతాయి . .మేకలు తెగుతాయి ,గొర్రె పొట్టేళ్ల వధకు అంతుండదు .ప్రతి రోజూ గుడి దగర ,అమ్మ వారి చరిత్ర ను హరికధా,బుర్ర కధ చెప్తారు .నాటకాలు వేయిస్తారు .విద్యుద దీపాలంకరణ కు కళ్ళు జిగేల్ మంటాయి .తిను బండారాలకొట్లు ,గాజుల కోట్లు ఖర్జూరపు కోట్లు ,కొబ్బరికాయల కోట్లు వేలం పాడి కొనుక్కొంటారు .ఫాన్సీ సామాల కొట్లు కూడా ఎక్కువే .ఆడ వారు అమ్మ వారిని దర్శించి తప్పకుండా గాజులు కొనుక్కొని వేసుకొంటారు .అలాగే పసుపు కుంకుమ కొంటారు .పిల్లలకు బలే సరదా .పసుపు కుంకుమ కలిపినా దాన్ని ”బండారు ”అంటారు .దర్శనం తర్వాత అందరు  బండారు ధరిస్తారు .పశువులకూ పెడ తారు .ఈ పదిహేను రోజుల్లో ”భండారు ”పెట్టు కోని వారు వుండరు .బలి ని ఇచ్చే జంతువులకు కూడా పెడతారు .దాన్ని రక్ష గా భావిస్తారు .సర్కసులు జెయంట్ వీల్,గారడీలు ,చిన్న జంతు ప్రదర్శన శాలలు బాగా ఆకర్షిస్తాయి .పూర్వం” చర్ బొప్పాయ్ గుండు” అనే ఆట ఆడేవాళ్ళం . ఒక గాజు తో చేసిన పెట్టె వుండేది .దానిలో రంగుల గుంటలున్దేవి .ఆ రంగుల గడులు బయట రబ్బరు షీట్ మీద ఉండేవి .రంగుల మీద డబ్బు కాయాలి .ప్లాస్టిక్ బాల్ తీసుకొని గాజు గోడకు కొడితే అది అటు ఇటు తిరిగి ఏదో గుంట మీద నిలుస్తుంది .ఆ రంగు మీడ్ద కాసిన వాడికి రెట్టింపు డబ్బు ఇస్తారు .బలే సరదాగా ఆడే వాళ్ళం .అలాగే ఒక చక్రం దానిలో సెక్టార్ల ఆకారం లో గదులు ,దాన్ని తాకుతూ ఒక ప్లాస్టిక్ నాలుక బద్ధ లాంటిది ఒకటి వుంటుంది .చక్రాన్ని తిప్పి వదిలేయాలి నాలుక బద్ద ఎక్కడ ఆగితే దాని మీద వున్న జంతువూ ల మీద పందెం కాసిన వారికి రెట్టింపు డబ్బు ఇస్తారు .పూర్వం మూడు ముక్కలాట కూడా వుండేది .ఇప్పుడు ఇలాంటి జూదాలన్నీ నిషేధించారు .మా చిన్నప్పుడు బడి ఎగ గొట్టి తిరణాల లో తిరిగే వాళ్ళు చాలా మంది వుండే వారు .మేము మాత్రం సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళం .రబ్బర్ బంతులు ఇనప సామాన్లు సత్తు గిన్నెలు బెలూన్లు కు గిరాకి ఎక్కువ .దొరకనివస్తువంటూ వుండదు .ప్రక్కనే జిల్లా పరిషద్ స్కూల్.  ఆ పదిహేను రోజులు స్కూల్ హాజరు బాగా తక్కువ గా వుంటుంది .పూర్వం గుండ్రటి చెక్కలతో వుండే నుయ్యి లాంటిది ఒకటి వుండేది .దాన్లో మోటారు సైకిల్ మీద అడుగు నుంచి పైకి వచ్చే వారు చుట్టూ తిరుగుతూ .చూడ టానికి టికెట్ వుండేది . రంగుల రాట్నం పిల్లలకు ఎక్కి తిరగటం సరదా.బూరలు ,పిల్లన గ్రోవులు ”,డమ డమాల బండ్లు’ కోని లాగుతుంటే ఆ చప్పుడు భలేగా వుండేది .వెదురు పుల్లలతో చేసిన బండ్లకు రంగు కాగితాలతో అలంకరించి అమ్ముతారు .అందరు ఖర్జూర పండు కొనుక్కుంటారు .ఇప్పుడు గుడి లో రోజూ ప్రసాదం గా పులిహోర లేక సెనగలు పెడుతున్నారు .ప్రతి ఇంటి వారు తప్పక వచ్చి దర్శనం చేసు కొంటారు .ఉయ్యూరు అ చుట్టూ ప్రక్కల వున్న వారు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో వుంటే తప్పక పిల్లా జెల్లా    తో తిరు నాళకు వచ్చి చూసి వెద తారు .పిల్లలకు పండగే పండగ .
ఇక్కడ తిరునాళ్ళు పూర్తి అయింతర్వాత దగరలో కృష్ణా నది ఒడ్డున వున్న అయిలురు లో జరిగే తిరునాలకు వెళ్లి అక్కడ కోట్లు పెట్టు కొంటారు .అక్కడ రెండు రోజుల తిరునాళ్ళు జరుగు తాయి ..తిరునాళ్ళు లో పదిహేనవ నాటి రాత్రి అంటే బహుళ ఏకాదశి నాడు అమ్మవారినీ ,అయ్య వారినీ గుడి నుంచి ,మేళ తాళాలతో బయల్దేర దీస్తారు .కొన్ని బజార్ల గుండా ఊరేగించి మెట్టి నింటికి చేరుస్తారు .దారిలో ప్రజలు హారతులిస్తారు వార పోస్తారు కొబ్బరికాయలు కొడతారు .అయితె అంతగా జనం వుండరు .కొమ్ము బుర్ర ల వాళ్ళు ఎక్కువ గా కని పిస్తారు .రుంజ వాయించే వారూ  ఉంటారు .అయితే అమ్మ వారు సరాసరి గుడి లో ప్రవేశించారు . .శివ రాత్రి నాడు ఉదయం కొమ్ము బూరలు ఊదు కొంటు అత్తారింటి నుంచి ,అయిలూరు తీసుకొని వెళ్లి కృష్ణా నది లో స్నానం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చిమెట్టి   నింటి దేవాలయం లో ప్రవేశ పెడతారు .యాదవకులానికి చెందిన వారే అమ్మ వారి అర్చకులు .అమ్మ వారు యాదవ కులానికి చెందినా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అత్యంత భక్తీ శ్రద్ధ లతో వీరమ్మ తల్లిని కొలిచి కోర్కెలను తీర్చుకొంటారు .భక్త జనానికి కొంగు బంగారం వీరమ్మ తల్లి .ముద్దు గా ;;జేజమ్మ తల్లి ”అని పిల్చు కుంటారు .వీరమ్మ పేరంటాలు అనికూడా పిలుస్తారు .ఇంత మహిమ గల వీరమ్మ అమ్మ వారి చరిత్ర తెలుసుకోవాలని ఉందా !వచ్చే ఎపిసోడు దాకా ఆగండి మరి .
క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –14 వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –1

ఊసుల్లో ఉయ్యూరు –14

                                       వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –౧

 ఉయ్యూరు గ్రామం లో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ఏకాదశి వరకు పదిహేను రోజుల పాటు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగు తాయి .ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేది శుక్ర వారం నుండి పదిహేడవ తేది శుక్ర వారం వరకు ఈ సంబరాలు జరుగు తున్నాయి .అందుకని ,అందరికీ తల్లి అయిన వీరమ్మ  పేరంటాలు తిరునాళ్ళు ,ఆ జేజితల్లి దివ్య చరిత్రను ఊస్సుల్లో ఉయ్యూరు లో ధారా వాహికం గా మీందరి కోసం అందిస్తున్న్నాను .అసలు గ్రామ దేవతల ప్రత్యేకత ను గురించి ముందు తెలుసు కోవాలి  .
 గ్రామ దేవతలు      
స్త్రీలు ప్రకృతి స్వరూపాలు .ప్రకృతి అంటే ప్రకృష్టమైన దాన్ని సృష్టించటం -అంటే -ఏదైనా సృష్టి చేయటం లో ,పరమ ప్రవీణు రాలైన వారిని ప్రకృతి అంటారు .సత్వ గుణానికి ”ప్ర”అనీ ,రాజోగునాన్ని ”కృ”అనీ ,తమో గుణాన్ని ”తి”అనీ అంటారు .అంటే ,త్రిగుణాత్మకమై ,సర్వ శక్తి సంపన్నమై సృష్టి లోని అన్ని కార్యాలకు ప్రదాను రాలే ప్రకృతి .అందుకే ఆమెను ”ప్రధానం ‘లేక ప్రకృతి అంటారు .ఇంకో రకం గా ఆలోచిస్తే ”ప్ర”అంటే ప్రధమం .”కృ”అంటే సృష్టి .అంటే సమస్త మైన శక్తికీ ,మొదటి కారణ స్వరూపిణి అని అర్ధం .సృష్టి కోసం పరబ్రహ్మ తనతకు తానే రెండు రూపాలుగా ,విభాక్తుడైనాడు .ఆ స్వరూపాలే మనం చెప్పుకొనే ప్రకృతి ,పురుషుడు .శరీరం లోని కుడి భాగం పురుషుడు ,ఎడమ భాగం ప్రకృతి అంటే స్త్రీ .ఆ ప్రకృతి అంశ తో జగత్తు ను పాలించే సకల దేవతలూ ఎర్పడుతున్నారు .అలాంటి దేవతలలో ఉయ్యూరు వీరమ్మ తల్లి ,పెద్దింటి నాంచారమ్మ ,పెనుగంచిప్రోలు తిరుపతమ్మ,,అంకాలమ్మ,సమ్మక్క సారక్క  మొదలైన దేవతలను గ్రామ దేవతలు అంటారు .ఈ దేవతల ప్రభావం జానపదుల మీదే కాక సామాన్య జను లందరి పైనా వుంది .వారు సర్వ జనుల మనోభీస్టాలను నెర వెరచే సర్వ సమర్ధులు గా ప్రసిద్ధి కెక్కారు .ఒక్కొక్క గ్రామ దేవతకు ఒక్కొక్క మహిమ వుంటుంది .వీరికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేక పోయినా ప్రత్యెక సందర్భాలలో సంబరాలు ,తిరునాళ్ళు జరుగు తాయి .ఆ రోజుల్లో పల్లెల్లో సందడే సందడి .సాధారణం గా మాఘ మాసం నుంచి వరుస గా ఈ దేవతలకు తిరునాళ్ళు జరుగుతూ వుంటాయి .
  మాఘం లో వీరమ్మ తల్లి తిరునాళ్ళు అమోఘం 

మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ,పదిహేను రోజులు ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ఘనం గా ,అమోఘం గా జరుగు తాయి .తిరునాళ్ళు అంటే తిరు అంటే పవిత్రమైన నాడులు అంటే రోజులు .ఆ మాటే తిరునాళ్ళు గా మారింది .అంటే మంచి రోజులని మొత్తం మీద అర్ధం .కృష్ణా జిల్లా లోనే అత్యంత ప్రాముఖ్యం కలవి వీరమ్మ తిరునాళ్ళు .జిల్లా లోని అన్ని ప్రాంతాల నుంచే కాక ,రాష్ట్రం లో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి ,వీరమ్మ తల్లిని దర్శించు కోని ,మొక్కులు చెల్లించుకొని సేవిస్తారు .ఇక్కడ గొప్పతనం ఏమిటంటే హిందువులే కాదు ముస్లిములు ,క్రిస్తియన్లు అందరు భక్తీ తో అమ్మ వారిని కొలవటం .అందరు ”వీరమ్మ తల్లి ”అని నోరారా పిలుస్తుంటే ,ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఏ మతం వాడైనా ”వీరమ్మ ”అని ఏక వచనం తో పిలవనే పిలవరు .అందుకే వీరమ అందరికీ తల్లి అయింది .అందరి కోర్కెలను తీర్చే దేవతగా ప్రసిద్ధి కెక్కింది .మతసామ రాశ్యానికి  వీరమ్మ తల్లి తిరునాళ్ళు గొప్ప ఉదాహరణ .లక్ష లాది భక్తులు అమ్మ వారిని దర్శించి ,పూజించి కానుకలు సమర్పించుకొంటారు .
  ఆలయ ప్రవేశం 

ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి రాత్రి అమ్మ వారు ఉయ్యూరు లో రావి చెట్టు దగ్గర లో వున్న ,అత్త వారింటి నుంచి ,మేళ తాళాలతో అట్టహాసం గా బయల్దేరు తుంది ”.గండ దీపాలు ”అంటే మట్టి ప్రమిదలలో నూనె తో లేక ఆవునేతి తో వెలిగించిన ఒత్తులను చేతి తో పట్టు కోని ,అవి కాల కుండా జాగ్రత్త వహిస్తూ ,మనసు లోని కోర్కెలను తీర్చు కోవటానికి ,వేలాది మంది స్త్రీలు పిల్లలు,మగవారు  అమ్మ  వారి వెంట నడుస్తారు కాళ్ళకు చెప్పులుండవు .ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన పల్లకి లాంటి దానిలో ,పీఠం మీద ,వీరమ్మ అమ్మ వారినీ ,భర్త చింతయ్య ల కొయ్య విగ్రహాలను చక్క గా కూర్చోబెట్టి ,మనుష్యులు మాత్రమే మోస్తూ ,అందులో ముఖ్యం గా ఆలయ పూజారులు భక్తీ శ్రర్ధ లతో మోస్తూ ,ఊరేగింపు చేస్తారు .దీన్నే అమ్మ వారు గుళ్ళోకి వెళ్ళటం అంటారు .అత్త వారిల్లైన గుడి నుంచి బయల్దేరే ముందు ,ఉయ్యూరు టౌన్ పోలిస్‌స్టేషన్ అధికారి -ఇన్స్పెక్టర్ అమ్మ వారికి పసుపు ,కుంకుమ నూతన వస్త్రాలు సమర్పించటం ఆన వాయితీ గా వస్తోంది .స్టేషన్  నుంచి వీటిని ఊరేగింపు గా మేళ తాళాలతో తీసుకొని వచ్చి ,అమ్మ వారికి సమర్పిస్తారు .లక్షలాది భక్తులు ఈ ఆలయ ప్రవేశాన్ని ,కన్నులారా చూసి పులకిస్తారు .గ్రామ వీధుల గుండా ఈ ఉత్సవం సాగుతుంది .ప్రతి ఇంటి దగ్గర పసుపు ,కుంకుమ తో కలిపినా నీటిని ,అమ్మ వారు రాగానే ‘వార’లాగా పోస్తారు .కొబ్బరికాయ ,హారతి ఇస్తారు .భక్తులంతా ”వాలా ,వాలా ”అనే నినాదం చేస్తుండగా ఉత్సాహం గా ఊరేగింపు సాగుతుంది .కోలాటాలు ,భజనలు ,బాండ్ మేళాలతో ,రోడ్లన్నీ ప్రతిధ్వనిస్తాయి .కిక్కిరిసిన జనం తో , కోలాహలం గా వుంటాయి రోడ్లన్నీ .గండ దీపం పట్టు కోని ముఖానికి  పెద్ద కుంకుమ బొట్టు పెట్టు కోని ,కాళ్ళకు పసుపు రాసుకొని ,మహిళా మతల్లులు   అమ్మ వారి వెంట నడుస్తుంటే,ప్రతి స్త్రీ వీరమ్మ తల్లి లాగే కని పిస్తుంది .మెయిన్ రోడ్డు చేరిన అమ్మ వారు ఉయ్యాల స్తంభాల దగ్గర ఉయ్యాల లూగుతుంది .ఇక్కడ జంతు బలి వుంటుంది .తర్వాత మళ్ళీ బయల్దేరి ,తాను అగ్ని ప్రవేశం చేసిన చోట ,కట్టిన ఆలయంలో ప్రవేశిస్తుంది .ఇక్కడ పదిహేను రోజులుంది ,భక్తులను అనుగ్రహిస్తుంది .పశువులను చక్క గా కడిగి ,సింగారించి ,రైతులు తోలుకు వచ్చి ,గుడి చుట్టూ తిప్పుతారు .ఎడ్ల బండ్లను ,వాహనాలను ,ఆలయం చుట్టూ తిప్పి ,రక్ష గా భావిస్తారు అత్త వారింటి నుంచి బయల్దేరిన వీరమ్మ తల్లికి ,ఆలయం చేరా టానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతుంది .అంటే  మర్నాడు రాత్రికి కాని ఆలయ ప్రవేశం చేయలేదు .కొత్త బట్టలతో ,బోనాలతో ప్రతి ఇంటా పండగ వాతావరణమే .బంధు మిత్రుల రాక తో ఇళ్ళన్నీ పెళ్లి కళ ను సంత  రించుకోని శోభిస్తాయి .  .

This slideshow requires JavaScript.

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -01 -12 .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం

కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం 

                                           దూర్వాస శాపం 
          
 కాళిదాసు రాసిన అభిజ్ఞాన  శాకుంతల నాటకం లో నాల్గవ  అంకానికి పరమ ప్రాముఖ్యత వుంది .ఈ అంకం లోను ప్రియంవద వ్యక్తిత్వావిష్కరణ జరిగింది .తాత పాదులు అంటే కణ్వ మహర్షి వస్తే ,ఆయనకు శకుంతలా దుష్యంతుల గాంధర్వం తెలిస్తే కోపగించు కొంటారేమో   నని సందేహిస్తుంది అనసూయ .ఇక్కడే అనసూయకు ,ప్రియంవడకు వున్న తేడా మళ్ళీ మనం గమనిస్తాం .తాత్కాలిక విషయాలలో ప్రియంవద బుద్ధి పాదరసం లా పని చేస్తుంది .చిట్కాలు చెప్పి అపాయాలు తప్పించ గలదు .అయితె దూర దృష్టి తక్కువ .అనసూయకు ఎక్కువ -పెద్దది కూడా కనుక సహజం .అందుకే కాష్యపుల విషయం లో ఒక స్థిర నిర్ణ యానికి రాలేక సందేహించింది .ప్రియంవద మాత్రం గౌతముడు ఒప్పు కుంటారని చెప్పింది .
         దూర్వాస మహర్షి శాప విధానం కూడా తమాషా గానే వుంటుంది .శకుంతలకుతెలియని   స్థితి లో ,మన్మదావస్థ  లో వున్నప్పుడు ముని ,ఆమెను శపిస్తాడు .ప్రియంవదకు శాప వృత్తాంతం తెలిసి ప్రధమ తప్పిదం కనుక చెలిని మన్నించ మని వేడింది .అంతటి కోపిస్టి మహర్షి చేతనే శాప విమోచనాన్ని చెప్పించిన నేర్పరి ఆమె .ఇక్కడ మనకే కాదు ,కాలిదాసుకు కూడా ప్రియంవద పైనే మక్కువ ఎక్కువని తెలుస్తుంది .ఆమె వ్యక్తిత్వాన్ని ఈ విధం గా పెంచి పోషించాడు కవి .దుర్వాసుని వద్దకు ప్రియంవడనే పంపటం శాప నివారణోపాయాన్ని ముని చేతనే చెప్పించటం ,ఆమె సమర్ధ త కు నిదర్శనం .శాపిష్టిమౌని ఎదుట nishkaapatyam గా ప్రవర్తించే సమర్ధత ఆమె కే వుంది అని నిరూపించాడు కవి .
                                 తాత పాదుల ఆగమనం 
        కణ్వ మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు .ఆయన శాకుంత లను దీవించిన విషయాన్ని ,కాళిదాసు ప్రియంవద చేతనే  చెప్పిస్తాడు .అయితే ,ఈ విషయం తమ ముగ్గురికే తెలుసు .మహర్షికి ,ఎవరు చెప్పారని అనసూయ  కు  అనుమానం వస్తుంది .అప్పుడు ప్రియంవద చెప్పిన సమాధానం అద్భుతం గా వుంది చూడండి -‘ఛందోమయ మైన వెద వాక్కు అతి పవిత్రమైన హోమ గుండం వద్ద పలుక బడింది ”.అంటుంది .ఛందోమయ మైన వాక్కు కు ,మహాత్మ్యం వుంటుంది .అది తిరుగు లేని సత్యం .పుట్ట బోయే  చక్ర వర్తి,గుణాతి శయం సూచింప బడింది . ఇంతకీ ఛందో వాక్యం ఏమంటోంది ?
 ”దుష్యన్తే నాహితం తేజో దధానం భూతయే భువః –అవేహి ,తనయాం ,బ్రహ్మన్నగ్ని గర్భాం శమీ మివ ”
            శకుంతల గర్భం లో ,సకల లోకాభ్యుదయం కోసం ,దుష్యంత వీర్యం -జమ్మి చెట్టు లో అగ్ని దాగి వున్నట్లు,వున్నది అని ఈ శ్లోక తాత్పర్యం .జమ్మి ,అగ్ని అనటం లో ఆ గర్భ ధారణ లోని ,పరమ పవిత్రతను గోచరింప జేశాడు కవి .ఆ తేజో వీర్యం తో జనించిన మహాపురుషుడు ,లోకారాద్యుడని  ,తెలుస్తుంది .సన్నివేశానికి తగిన ఔచిత్యం .ఔచిత్యానికి పరాకాష్ట కాళిదాసు కవిత్వం .పోలికలలో పవిత్రత ,చెప్పిన విషయం ఛందో బద్ధమై వుండటం అంటే Most scientific .దానిని  అశరీర వాణి ,పవిత్ర హోమ గుండం వద్ద పలకటం  కవికుల గురువు ప్రతిభకు పట్టాభిషేకం .భారతీయ జీవన విధానం లోని పరమ పవిత్రతను ,ఉదాత్త భావాలను అత్యంత ఉదాత్తం గా చెప్పవలసిన విధానాన్ని ,కాళిదాసు చక్కగా గుర్తించి ,ఆచరించి మార్గ దర్శి అయాడు .ప్రియంవద కణ్వ మహర్షి వద్ద ఉన్నప్పుడే ఆ ఛందో వాక్యం విని పించింది .ఆ వాక్యాన్ని ఆమె అలాగే భద్ర పరచుకొని ,తు.చ.తప్ప కుండా మిగిలిన వారందరికీ చెప్పింది .ఇక్కడ కూడా కవి ,ప్రియంవద కే అగ్రాసనం ఇచ్చాడు .
                                 వియోగ సన్నివేశం 
          శకుంతల అత్త వారింటికి ప్రయాణం అయింది .శకుంతలకు ,కణ్వాశ్రమ వనానికి వున్న అన్యోన్యాను రక్తి ని కాళిదాస మహా కవి ,ప్రియంవద చేతనే చెప్పించాడు .”శకుంతల వియోగం చేత లేళ్ళు ,దుఖం తో దర్భలను నోటి నుండి జార విడుస్తున్నాయి నెమళ్లు నృత్యం చేయటం మానే శాయి .లతలన్నీ ఎడుస్తున్నాయా అనట్లు పండు టాకులను రాలుస్తున్నాయి .వియోగ  దుఖాన్ని వనం లోని ,ప్రతి ప్రాణి యెట్లా అనుభావిన్చిందో ప్రియంవద కళ్ళకు కట్టి నట్లు వర్ణించింది -కాదు ,కాదు కాళిదాస మహా కవి ఊహించి ,వాచ్యం చేయించాడు ఆమెతో .ఇది అపూర్వ సన్ని వేశం .అన్యోన్యాను రాగ వర్ణనం కాలిదాసైక సాధ్యం అని పిస్తుంది 
          ఈ విధం గా కాళిదాస మహాకవి ప్రియంవద ను ప్రియాన్నే చెప్పేదానిగా ,శకుంతలకు కూర్మి చెలి కట్టే గా ఆమె మనోధర్మాన్ని గ్రహించి ,సందర్భోచిత సలహాలనిచ్చే నేర్పరిగా ,వ్యవహర్త గా ,అభిజ్ఞాన శాకుంతల మహా నాటకం లో సుప్రతిస్తితం చేశాడు .జీవత్వం తో తోన్కిస లాడిన పాత్ర గా ఆమె ను తీర్చి దిద్దాడు .
           ఇంత ప్రతిభా ,ఉత్పత్తులతో ఈనాటకాన్ని   రాశాడు కనుకనే ,జర్మన్ పండితుడు ,రచయిత ,కవి నాటక రచయిత ,విశ్లేషకుడు గోథె మహాను భావుడు ఈ నాటకాన్ని చదివి” ‘దివి భువి లను ఏకం చేసిన నాటకం ”అని ఆనందం పట్ట లేక నాట్యం చేశాడట .అలాంటి మహా నాటకం లో ఒక చిన్న పాత్రను నేను నా కు తెలిసిన మేరకు ఆవిష్కరించాను .
       మా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా నాన్న గారు స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు మాకు కాళిదాసు గారి రఘువంశ ,కుమార సంభావ కావ్యాలను అర్ధ తాత్పర్యాలతో సంత వేయించి నేర్పించారు .అందుకే వారికి ఈ వ్యాసాన్ని పిత్రూణం గా సభాక్తికం గా అంకిత మిస్తున్నాను .
               సంపూర్ణం 
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -01 -12 .


— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళిదాసు శకుంతల –4

 కాళిదాసు శకుంతల –4

                                             మన్మధ విజ్రుం భణ 
నాటకం  తృతీయాంకం లో శకుంతల విరహ వేదనను కవి వర్ణిస్తాడు .అందులో ప్రియంవద చిత్త వ్రుత్తి ని వెల్లడి చేసే సందర్భాలు అనేకం సృష్టించాడు కాళిదాస  మహా కవి . ఆమె శకుంతల హృదయాన్ని పసి కట్టే సింది . .వారిద్దరి చూపుల తూపుల లక్ష్యాలను ఎరిగి వుంది .అందుకే ,శకుంతల విరహం లో వుండగా ,అనసూయతో అన్నది ”రాజ ప్రధమ దర్శనం నుంచి ,మన చెలియ ఏమేమో అయి పోయింది .ఎందుకోసం ఇలా మనస్సుని కష్ట పెట్టు కొంటోంది ?”ఇక్కడ ప్రధమ దర్శనం అనే మాట వారి ఆంతర్యాన్ని మొదటి నుండీ తాను గమనించినట్లు స్పష్టం అవుతోంది .అప్పటి నుంచే ,వారిద్దరి ప్రవర్తన ను   ,తాను నిశితం గా పరిశీలించినట్లు తెలుస్తుంది .
అనసూయ బోళా శాంకరి .సఖినే అడిగి తెలుసుకొందాం అంది .చేలువురిరువురిలో ప్రియంవద చిన్నదే అయినా చెలికి ఇష్టురాలు .ఈ మన్మధా వస్థ ల సంగతి ఆమె కు తెలుసు .ప్రబంధ పథనం వల్లో ,పెద్దల వినికిడి వల్లో ఆమెకు తెలిసి వుంటుంది .చెలి వద్ద ఆమెకు చనువు బాగా ఎక్కువే .అందుకనే అంటోంది ”రోజురోజుకీ నీ అవయవ సౌందర్యం తగ్గు తోంది .లావణ్యం మాత్రం ఛాయా లాగా విడవ కుండా వుంది ”.అంటే ఇంకా మనసు లోని మాటను దాచటం దేనికీ ?హృదయం విప్పి ,మా వల్ల లభించే సాయాన్ని పొందు అని అర్ధం .శకుంతల ”మీతో కాక ఇంకెవరికి చెప్పుకోను ”?అంది .అప్పుడు వారిద్దరూ ”స్నిగ్ధ సంవిభక్తుం ఖలు దుఖం -సహ్య వేదనం భవతి ”అని వూరడిస్తారు
 మదన లేఖ 
అప్పుడు శకుంతల ,తన మనోభావాన్ని ,ఆవిష్కరిస్తుంది .రాజైన దుష్యంతుని వనాగమనం ,తన మనసులో వలపుల తొలి చిగురు వేసిందని తెలిపింది .నర్మ గర్భ అయిన ప్రియంవద కు ఉపాయాలూ ,మార్గాలు తెలుసు .అందుకే అనసూయతో ”ఇక -మన్మదావస్థ ను తొలగించాల్సిన సమయం వచ్చింది .రాజు అనురూప గుణాల చేత ,అభిలషనీయుడు  ”అంటుంది .దానికి సమాధానం గా అనసూయ ”సఖీ !నీ అనురాగం సార్ధకం .మహానది ,సముద్రాన్నే చేరుతుంది కదా !”ఇదంతా స్వభావ సిద్ధ మైన చర్య గా ఆమె భావించి అలా అన్నది .ఆమెకు అంతే తెలుసు .ప్రియంవద ఇలాటివి కాచి వడ పోసింది .ఆలన్కారికం గా ఆమెతో మహా కవి ఇలా అని పిస్తాడు ”కోవేదానీం సహకార మంతరే ణాతి  ముక్త లతాం పల్లవితా మర్హతి ”అంటే సర్వాంగ సుందరం గా చిగిర్చి,పుష్పించ నున్న పుష్పలత కు ,సహకార వృక్షం కాక వేరొకటి సరి పోతుందా ?”
అని భావం .తీయ మామిడి లోని గొప్పతనం ,ముక్త లత లోని సౌందర్య విలసనం ఒక దానికొకటి ఎంత చక్క గా సరిపోయాయో ,అలాగే ప్రియమైన మాటలతో కాళిదాసు గారి ప్రియంవద సాహితీ పిపాసు లకు తృప్తిని కల్గించే మాటలు అని పించాడు .
ఇలాంటి సందర్భాలలో చేయాల్సిన కార్య క్రమాలన్నీ ,పూర్వానుభవం వున్న ఆరిందా లాగా ప్రియంవద సిద్ధం చేసింది .శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి ,దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది .ఇందులో ఆమె నేర్పరితనం మనకు తెలుస్తుంది .భగవత్ ప్రసాదం గా ఇస్తే ,రాజు దాన్ని తిరస్క రించడు కదా కార్య సాధనకు అనువైన పధకం అది .చెలి మనో వేదనను తొలగించే మార్గం ,ఆ వ్యధను తెలియ జేసేందుకు చక్కని అవకాశం కల్పించింది ప్రియంవద .”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి  .”అని సూచించింది .అసలే సుకుమార మైన విషయం .అందుకే అత్యంతసుకుమార మైన  పద బంధమే ఔచిత్యం .అయినా శకుంతల సందేహించింది .ప్రియుడు అవధీరణం చేస్తాడేమో నని భయ పడింది .
మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు    ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది .ఇంత గాడ్హం గ మనసు లగ్నం అయినప్పుడే ,ఆమె హృదయ గత భావం కమ్మని గీతం గ వెలువడుతుంది అని ప్రియంవద యోచన .
మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన  పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప్రసాదాన్ని వుంచి ,పొట్లం లాగా మడిచి రాజుకు ఇవ్వ వచ్చు అని చెప్పింది .రాజు అక్కడికే వస్తాడు .ప్రియంవద నెమ్మది గా అంటుంది ”మీ ఇరువురి అన్యోన్య అను రాగం ప్రత్యక్షం అయాయి .అయినా మాచేలి యందలి ఆత్మీయత చేత నేను మళ్ళీ చెబుతున్నాను ”అని రాజ ధర్మాన్ని ,ఆయనకు గుర్తు చేసింది .ఆర్తి లో వున్న వారి ఆర్తి పోగొట్టటం రాజ ధర్మమే కదా అని భావం ”మా ప్రియ సఖి మన్మధ బారి పడింది .ఆమె ప్రాణం నిలప టానికి మీరే అర్హులు ”చాలా చిన్న చిన్న మాటలే .అందులో దుష్యంతుని పై శాకున్తలకున్న అవ్యాజ మైన ప్రేమను వ్యక్త పరుస్తూ మనమ్ధుని పీడా నుంచి ఆమెను కాపాడమనీ ,ఆమె చాలా కృశించి పోయి ఉందనీ ,ప్రాణాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ జ్ఞాపకం చేసిందన్న మాట .ఆమె ప్రాణం కాపాడటానికి అతడే సమర్ధుడు అని నిర్ద్వంద్వం గా చెప్పేసింది .ఇక్కడే ప్రియంవద నేర్పరి తనం మరో సారి కాళిదాసు మనకు వ్యక్తం చేశాడు .
ముందుగా శకుంతల కొంత తొందర పడ్డా ,తారు వాత సంయమనం చూపించింది .రాజుకు అనేక మంది భార్యలు ఉంటారనీ ,వినే వుంటుంది కనుక ,అంతఃపుర స్త్రీ లలో అంటే జనానా లో తన స్థానం ఏమిటో తెలుసు కోమని ప్రియంవద ను కోరింది .రాజు ,అవసరానికి తగిన వాగ్దానాలు చేశాడు .మిగిలిన కార్య క్రమం అంతా పూర్తి చేశారు చెలులు .ఇక అక్కడ తమ అవసరం లేదని గ్రహించారు .వారిద్దరినీ ఏకాంతం గా వుంచటం భావ్యం అని ప్రియంవద భావించింది ..అందుకే అటూ,ఇటూ ద్రుష్టి సారించి ”పర్యుత్సుకో మృగ పాతకో మాతర  మన్వేషతే ”అని అంటూ ,అక్కడినుంచీ జారుకున్నారు .ఇందులో భావం -తల్లి కోసం మగ లేడి పిల్ల బెంగ పెట్టు కొంది అని అర్ధం .భవిష్యత్తు లో భరతుడి జననాన్ని ,సూచించాడు .ఆతని కోసం వెదికే పరిస్థితి తెలిపాడు .గాంధర్వ వివాహం ఫలితం గా భరత వంశ శ్రేష్టుడు ఉద్భావిస్తాడని సూచ్యార్ధ సూచన చేశాడు కాళి దాసు .శకుంతలా దుష్యంతుల కోర్కె లీడేరి పుత్రోదయం జరుగు తుందని కవి కుల గురువు కాళిదాసు గారి కమ నీయ కవితా ప్రవచనం అది .ఆయన ప్రతిభ కు ప్రబల ఉదాహరణం గా ఈ వాక్యాన్ని విశ్లేషకులు ఉదహరిస్తారు .
సశేషం
Posted in రచనలు | Tagged | Leave a comment

వృద్ధాప్యం వచ్చినట్లే …

Posted in కవితలు, సేకరణలు | Tagged | Leave a comment

ఇక ఏ జన్మ కైనా ఇలాగే .. ఆంధ్ర జ్యోతి లో….

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జిందాబాద్ స.జ.స.–కవిత

జిందాబాద్ స.జ.స.–కవిత 

                                 కవి -ఏ.ఏం.ఏం.కుమార్
 అతని పేరు సదానందం -అవుతూంటాడు సమశ్యలతో సతమతం
అతని భార్యకు బి.పీ.షుగర్,ఓబీసిటి –సీరియల్స్ చూస్తుండగానే సస్పెన్సులో  ఆపేయటం
–        పిండి రుబ్బటానికి గ్రైన్దర్, పొడులకు మిక్సీ  –మాసిన బట్టలకు వాషింగ్ మషీన్
శారీరక శ్రమ లోపించటం -నిర్ధారించారు డాక్టర్లు సవా లక్ష టెస్టులు చేసి
ఇక ,పుత్రరత్నం స్కూల్ వదిలి ఇంటికి రాగానే -హోమ్‌వర్క్ ఎగ్గొట్టి కార్టూన్ నెట్ వర్క్
పుత్రికా మణి ,సౌందర్యాన్ని పెంపొందించే చానెళ్ళు -ఏం తింటున్నారో ,ఎంత తింటున్నారో తెలీకుండా
టి.వి.ముందు కూర్చొనే భోజన కార్యక్రమాలు -బద్ధ కానికి మరో పేరు ఆ భీమ ,భామలు
కొన్ని రోజులుగా సంతోషం గా చలాకీగా -సదానందం లో చెప్పలేని మార్పు
రెండు చార్జి లైట్లు కొన్నాడు -ఆయన భార్యకు బి.పీ.షుగర్ నార్మల్ కొచ్చింది
రుబ్బు రోలు రుబ్బటం తో ,బట్టలు స్వయం గా వుతుక్కోవటం తో
పని మనిషి చీకట్లో అంట్లు  తోమనని భీష్మించింది
ఆమెకిప్పుడు శారీరక శ్రమానందం తెలిసింది
పిల్లలకు టి.వి.బంద్,–చార్జి లైట్ వేలుగులూనే
పాపం హోమ వర్క్ సాగిస్తున్నారు ఇంటికి రాంగానే
అందరు కలిసి కబుర్లాడుతూ డైనింగ్ టేబుల్
భోజనాలతో మితం గా హితం గ  తింటున్నారు .
పెందరాలే నిద్రకుపక్రమిస్తున్నారు

     మాయో ,మంత్రమో వేసినట్లు స్మార్ట్ గా తయారయారు
ఇంతకీ వీటన్నిటికీ కారణం కరెంటు కోత
జేబు చిల్లు పడ కుండా బిల్లు కూడా చిక్కి పోయింది
కోత ఇబ్బంది పెట్టినా ,అందరికీ లాభాలే చేకూరాయ్
ఇన్ని లాభాలుంటే ,నిరసన దేనికన్నాడు సదానందం
అందుకే కొత్త పల్లవి ఎత్తు కొన్నాడు జిందాబాద్ కరెంటు కొతా
జిందాబాద్ స.జ.స.-స.జ.స.,స.జ.స.అంటూ వీరంగం వేశాడు .
ఇంతకీ దీని భావమేమి తిరుమలేశా అంటే సకల జనుల సమ్మె
అని సన్నాయి నొక్కులు నొక్కాడు సదానందం,చిదానందం గా .

Posted in కవితలు | Tagged | Leave a comment

కాళిదాసు ప్రియంవద –3

 కాళిదాసు ప్రియంవద –3

                                              బాకీనెపం 

 దేనికైనా తగిన సమాధానం చెప్పటానికి ప్రియంవదే   ముందుంటుంది .నేర్పుగా ”ఆర్య ధర్మ చరోపి -పరవశం జనహ్గురొహ్ పునరేతస్యా అనురూప వర ప్రదానే సంకల్పః ”అన్నది .”మా చెలి అస్వతంత్ర -తండ్రి కాష్యపులు తగిన వరుని చూసి ,వివాహం చేయాలను కొంటున్నారు ”అని చెప్పింది .దుష్యంతుడికి కావలసిన సమాధానం లభించింది .అనురూప వరుడు తానే అనీ నిశ్చయం కల్గింది .ఆమెది క్షత్రియ జన్మే అని రూధి   అయింది .కనుక ప్రయత్నం చేస్తే తప్పేముంది అను కొన్నాడు .అయితే శకుంతలకు మాత్రం ,తన వివాహ విషయ ప్రశంస చేయటం ,అందులో అపరిచితుడి తో చేయటం నచ్చ లేదు .రోషం కూడా వచ్చేసింది .”గౌతమి తో చెప్తాను ‘అంటూ  ,వెళ్ళటానికి బయల్దేర బోయింది . అతిధులను వదిలి అలా వెళ్ళటం ఆశ్రమ వాసులకు ధర్మం కాదని ప్రియంవద వారించింది .వినకుండా మళ్ళీవెళ్ళ బోతే   ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తూ వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది .”ఎందుకు ?”అని ఆమె ప్రశ్నిస్తే ,”వృక్ష సేచనే ద్వేమే దారయాసి తస్మా దేహి –తావదాత్మానం మోచయిత్వా తతో గమిష్యతి ” –వనం లో చెట్లకు నీరు పోసే కార్యక్రమం లో ,ఎవరి వంతు వారు నీరు పోయాలి కాని శకుంతల రవిక సవరించేతప్పుడు ,వనజ్యోత్స్న ను పరవశం తో చూసే సందర్భం లో ,నీరు పోయటం లో వెనకబడింది ఆ సంగతి గ్రహించిన ప్రియంవద కు ఇప్పుడు గుర్తు చేసి ,”ఆ రెండు చెట్లకు నేను నీళ్ళు పోశాను నా బాకీ తీర్చి వెళ్ళు ”అన్నది .రాజు ఈ మాట విని కరిగి పోయాడు .లతా లాగా కోమలం గా వున్న శకుంతల కండి పోతుందని బాధ పడ్డాడు .”ఇప్పటికే ఆమె ఘతోదకం మోసి ,మోసి అలసి పోయింది ఇదిగో ఈ బహుమానాలన్నీ తీసుకొని ,ఆమెను పరిశ్రమ నుంచి విముక్తి కల్గించండి ”అంటూ ,ఆ తొందరలో ,తన వెలి ఉంగరాన్ని ఇవ్వ బోయాడు .అంతకు ముందే అతను తనను తాను పరిచయం చేసుకొన్నా విధానం మర్చిపోయాడు .పారవశ్యం లో పది పోయాడు .తన స్తితి ని మర్చి పోయాడు .ఘటికులైన చెలులు ఉంగరం పై వున్న దుష్యంతుని పేరు చూసే శారు ఈలోగానే .ఇద్దరు అసలు విషయం పసి గట్టె శారు .
  వచ్చిన వాడు సాక్షాత్తు మహా రాజే నని తెలిసి తమ చెలి భాగ్యం పండింది అని సంబర పడ్డారు .ఇప్పుడు అవస్థ దుష్యన్తుదిడైంది .కంగారు లో ”నన్ను రాజుగా భావించ వద్దు .రాజాజ్న ను నెర వేర్చ టానికి వచ్చిన వాడినే కాని రాజును కాను” అని నొక్కివక్కాకించాడు .బొంకాడు  అని అర్ధమైంది వీరికి .వీళ్ళ వద్ద ఆతని కబుర్లేమీ పని చేయలేదు .ఆవలిస్తే పేగులు లెక్కే సే రకం చెలులు .దీనికి సమాధానం గా ప్రియంవద తో కాళిదాసు చెప్పించిన సమాధానం చూడండి —
”తేనహి నార్హత్యేతదంగులీయకం అంగుళీ వియోగ మార్యస్య –తవ వచనే నైవ -అనృనా నామైషా సఖీ సకున్తలే -మోచితాన్యను కంపి నార్యేన -అదివా మహా రాజెన గచ్చాదానీం ”సొగసు అంతా ఈ వాక్యం లోనే నిక్షిప్తమై వుంది .మహా రాజు గుట్టు రట్టయింది .బొంకేందుకు ఇంక అతనికి అవకాశం ,వ్యవధి ఇవ్వ కూడదని నిశ్చయించు కొంది .అయ్యా ”అంగుళీయకం తమ అంగుళి నుండి ,వియోగం చెంద వలసిన పని లేదు .తిరిగి స్వీకరించండి ‘అంటూ ,శకుంతలతో ”అనుకంప వల్ల విడిచి బెట్ట బద్దావ్.పోనీ మహారాజు దయ వల్లే ననుకో ”అంటుంది .”ఆర్యేన అని సంబోధించి ,”మహారాజేన ”అని అనటం తో రాజు బొంకి నట్లు ,తాను నిజాన్ని గ్రహించి నట్లు తెలుస్తుంది అందరికి .రాజు చేత విడువ బడ్డావు అనటం లో ,అంగుళీయక వియోగం అనటం లోను భావి కధా సూచన  తెలియ జేసే చక్కని పదాలను ఎన్నిక చేసి వాడాడు కాళి దాస మహా కవి .
         ఈ విధం గా ,కదాగామనానికీ ,భావి సూచనకు ప్రియంవద ను తీర్చి దిద్దాడు కవికుల గురువు .రాజు గా గుర్తించినందుకు శకుంతల ఆత్మ గతం గా సంతోషించింది .ఊరికే తమాషా గా ఊరడింపు గా ,”నన్ను విడి పించ టానికీ ,కట్టెయ్య టానికీ నువ్వేరవు  ”? అని అంటుంది .’దీని భావం రాజు దుష్యన్తునికే ,ఆ సామర్ధ్యం వుంది,మధ్యలో మీ రెవరు ?అని అర్ధం . మిగిలినవి ఈ సారి .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .

Posted in రచనలు | Tagged | 1 Comment

కాళి దాసు ప్రియంవద –2

    కాళి దాసు ప్రియంవద –2

                                         బంభర విజ్రుం  భణ  
ఇంతలో తుమ్మెద మూగింది .అందులోను ,గండు తుమ్మెద .శకుంతలను అల్లరి పెట్టటం ప్రారంభించింది .”రక్షించండి ,రక్షించండి ‘అని ఆమె ఆర్తి తో ఎలుగెత్తి అరిచింది .అప్పుడు చెలికత్తె లిద్దరూ ,యెగతాళి పట్టించారు .”కే ఆవాం పరిత్రాయం దుష్యంత మాక్రందస్వ ,రాజం రక్షితవ్యాని తపోవనాని నామ ”అన్నారు .ఆమెకు భయం .వీరికి ఎగతాళి .మనసులో ఊహించుకొంటే ,ఆ ఘట్టం భలే  మజా గా వుంటుంది .అక్కడ దుష్యంత మహా రాజుకు తననే స్మరిస్తున్నారనే ధీమా .దాని వల్ల లోలోపల ఆనందం .ఈ రెంటినీ మేళవించి   కాళిదాసు తన ప్రజ్న ను చూపించాడు .ఇంతకీ చెలికత్తె లేమన్నారు ?”ఎవరు రక్షిస్తా రమ్మా !దుష్యంతుని పిలువు .తపోవనాన్ని రక్షించేది మహా రాజే కదా !”.సమయం చూసి దుష్యంతుడు బయట పడే మంచి సన్ని వేశం .కవి నేర్పు నిరుప మానం అని పిస్తుంది .గేలి చేస్తూ యెగతాళి గా అన్న మాటలు నిజమే అయాయి .ఈ చిన్న పాత్రల ద్వారా తాను సాధించి చూపించ వలసిన్దంతా అభి వ్యక్తీకరించాడు .హాశ్యం తోనే ,అంతులేని నాటక కళా మర్మాన్ని విశదీకరించిన మహా భావ కవి కాళిదాసు .
మహా రాజు పొద చాటు నుండి బయట పడ్డాడు .పౌరుష    వచనాలు పల్కుతు ,తుమ్మేదను పార దోల్తాడు .ఎవరో రాజ పురుషుడు వచ్చాడని శకుంతలా ,సఖులు ఆయనకు స్వాగతం చెప్పారు .విషయాలన్నీ వివరం గా మాట్లాడు కోవ టానికి అనువైన స్థలం కావాలి కదా .ఇక్కడే మాట్లాడటం సందర్భోచితం కాదు .
    సప్తపర్ణి  ఛాయల్లో 
ప్రియంవద ,తెలివిగా ,ఏడాకుల అరటి ”సప్తపర్ణి”చెట్టు కింద కూర్చొని ,మాట్లాడు కోవచ్చునని సూచించింది .బడలికా తీరుతుందీ ,నీడా వుంటుంది ,సవివరంగా సంభాషించుకోనూ వచ్చు .”తేనహి అస్సాం ప్రచ్చాయ శీతలాయాం ,-సప్తపర్ణ వేదికాయాం ఆర్య ఉపవిశ్య.-పరిశ్రమ వినోదం కరోతు ”అన్నది సాభిప్రాయం గా .అసలే వేసవి .రాజు ఎండకు బడలిక చెందాడు.కనుక దట్టమైన నీడ  కావాలి .ఆ ప్రదేశమే సప్తపర్ణి చెట్టు కింద అరుగు .ఆ చెట్టు సౌరభం ,చల్లదనం ,మానసిక గ్లాని లను దూరం చేస్తాయి .ఆహ్లాదం కల్గుతుంది .వీటన్నిటినీ ద్రుష్టి లో వుంచుకొనే ప్రియంవద ఆ మాట అన్నది .ఆమె చాతుర్యానికి అబ్బుర పడుతాం . .కవి చాకచక్యానికి జోహార్ అంటాం .
ప్రియంవద చాలా లోకజ్ఞానం కలది .అనుమానం వచ్చి ,అనసూయను ప్రక్కకు పిలిచి ,వచ్చిన వాడు రాజ బంధువు గా కని పించటం లేదు సాక్షాత్తు దుష్యంత మహా రాజు గారే వచ్చారు అని తెలిపింది .త్వరగానే ,తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది .ఏదీ దాచుకొనే స్వభావం కాదామెది .వెంటనే అన్నది ”చతుర గంభీరాకృతి ర్మధురం -ప్రియ మాలపన్ప్రభురివ దృశ్యతే ”ఆకారం ,మాట ,రాజు అనే అనుమానాన్ని నిరూపిస్తున్నాయి .అనసూయ ఆయనతో తనను తాను  పరిచయం చేసుకోమని ,ఆయన్ను కోరింది .మహా రాజు తాను మహా రాజు తరఫున ,ఆశ్రమ ధర్మ నిర్వహణ విషయమై ,పరిశీలనకు వచ్చిన వాడిని అని చెప్పు కొంటాడు .అప్పుడు అనసూయ అన్నది ”స నాదా ఇదానీం ధర్మ చారిణః ”అంటే -ధర్మ చారిణులకు తగిన సమయం లో సనాదుడ వైనావు .అంటే ఆపద లో వున్న అబలలకు సహాయం చేశావనీ ,నీకు కాబోయే సహ ధర్మ చారిణి  లేవయ్యా నీవే నాదుడివి కూడా అని ద్వంద్వార్ధం గా చెప్పింది .కొంత వయసులో ప్రియంవద కంటే పెద్దది కనుక జాణ తనం చూపింది .ఆమె అన్న మాటలన్నీ సాభిప్రాయాలే .దుష్యంతుని కోరిక తీరు తుందని సూచ్యార్ధ సూచన . గంభీర మైన అర్ధాన్ని ,ఆ మాటల్లో జ్యోతకం చేయించాడు కవి .
     వలపు తేట 
అనసూయ ,ప్రియంవద లు ఒకరికి మించిన వారిన్కొకరు .శకుంతల లజ్జావనత మైంది .శకుంతలా దుష్యంతుల ఆకార వికారాలను త్రుటి లో గ్రహించారు వారిద్దరూ .వలపు ల జ్వాల రగుల్తోందని తెలుసు కొన్నారు .శకుంతల తో వారు ”సఖీ శకున్తలే !యద్యత్రా దయ తాతః సన్నిహితో భవేత్ ”అన్నారు .”నాన్న గారే వుంటే ఏం చేసే వారో ఇప్పుడు ”ఇది కదాగామనాన్ని వేగం చేసే మాట .అంటే తండ్రి గారు చేయాల్సిన పని నువ్వే చేయాలి అని చెప్పకుండా చెప్పటం .ఆమె లోపలి భావాన్ని వ్యక్తీకరించా టానికి తగిన మాట కూడా .ఇద్దరి హృదయ భావాలను  వెలికి తీసి,వలపు ను నాటి ,ప్రోది చేసే మాట .శకుంతల కు చిరు కోపం వచ్చింది .”వుంటే ఏం చేసే వారు “?అంది బుంగ మూతి పెట్టి .సఖులు దేవాంతకులు కదా వెంటనే అందుకొన్నారు .’ఇదం జీవిత సర్వస్వేనా వ్యతి దారో క్రుతార్దీ కరిష్యతి ”అన్నారు .స్త్రీ సహజ మైన మాటలు ఇవి శకుంతలకు వచ్చిన కోపానికి ”మేమేం చేశామమ్మా అంత కోపం ”అన్నట్లు వుంది.ఇంతకీ వాళ్ళ మాటల్లోని అర్ధం తెలుసోవాలి  .”నాన్న  గారే వుంటే ,తమ జీవిత సర్వస్వాన్ని -అంటే శకుంతలను అతిధి కి సమర్పించి వుండే వారు ”అని భావం .ఆమెనే సమర్పించి  వుండే వారు అని .లోని  అర్ధం .ఈ మాట ఆమె మనసు లోని కోరిక తీరే మాట .ఆమె చెవులకు ఇంపైన మాట .కర్ణ రసాయనం ప్రేయసీ ప్రియుల మనో గతాలను అతి స్వల్ప కాలం లో అవగతం చేసుకొన్న ఇష్ట సఖియలు వారిద్దరూ .సార్ధక నామ దేయులైనారు .
శకుంతల మళ్ళీ కోపాన్ని అభినయిస్తూ ”మీ మనసు లో ఏదో భావం వుంచుకొని ,మాట్లాడు తారు ”అన్నది .రాజు మనోభావాన్ని ప్రియంవద తక్కున(THAKKUNA ) గ్రహించింది .శకుంతల ముఖ కవళికలను గ్రహించింది .వలపు చిగురు తొడిగిందని అర్ధమయింది .రాజుతో నర్మ గర్భం గా”మళ్ళీ ఏదో చెప్పు బోతున్నారు “‘అంది అర్దోక్తిగా అతన్ని బయట పడేసింది .శకుంతల కోపం తో అంగుళీయకం తో బెదిరిస్తోంది .ఇక చాలు కట్టి పెట్టండి అనే భావం తో .
శకుంతలా జన్మ వృత్తాంతాన్ని దుష్యంతుడు వీరి వల్ల విని ఆమె సచ్చరిత్ర ”పారాయణం ”లా వుంది అన్నాడు .ఆమెను గురించి ఇంకా ఏదైనా అడగ వచ్చా అని అంటూనే ”మీ చెలి మన్మధ వ్యాపారాన్ని విసర్జించే తపస్సు వివాహం వరకే చేస్తుందా ?లేక -ఆజన్మ బ్రహ్మ చారిణి లా వుంది ,లేడి పిల్లతో వన వాసం లోనే ఉంటుందా ?అన్నాడు .వారి వలపు ఎలా పండిందో తరు వాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

మూసీ లో కీర్తి శేషు పి. వి

డిసెంబర్ లో విజయ వాడ లో  కవయిత్రి, కధా రచయిత్రి శ్రీ మతి కోపురి పుష్పా దేవి గారు ,తన పుస్తకావిష్కరణ సందర్భం గా చేసిన సత్కారం .ఇందులోని ప్రముఖులు -ఎడమనుంచి శ్రీ నండూరి రాజా గోపాల్ -చినుకు మాస పత్రిక సంపాదకులు- ,శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు ప్రముఖ కవి ,విమర్శకులు -,శ్రీ విహారి ,xప్రసిద్ధ కవి కధా రచయిత ,విమర్శకులు -శ్రీ కొల్లూరి,

క్ష్రయ్పత్రిక సంపాదకులు -పుష్పాదేవి కుమారుడు -పుష్పా దేవి ,ఆమె భర్త ,వారి కుమారుడు
Posted in సేకరణలు | Tagged | 1 Comment

కాళి దాసు ప్రియంవద -1

కాళి దాసు ప్రియంవద -1 

కవికుల గురువు కాళిదాసు ”అభిజ్ఞాన శాకుంతలం ”నాటకం లో తన అమృత కవితా  సంపదను నిక్షిప్తం చేశాడు .కవిత్వం పలు పోకడలు పోయి ,దివి భువులను ఏకం చేస్తుంది .భారతీయ జీవన విధానం యొక్క ఉత్రుష్టతను చాటి చెప్పిన నాటకం .ప్రేమైక జీవులు ప్రేమ మైకం లో పడి ,బాధ్యతలను ,గృహస్తాశ్రమ ధర్మాలను  విస్మరించ రాదనీ యెలు గెత్తి చెప్పాడు మహా కవి .ఇందులో ఆయన చిత్రించిన నాయికా నాయకులు ,శకుంతలా దుష్యంతులు సాహిత్యా కాశం లో చిర కాలమ్ ప్రకాశించే ధ్రువ తారలు గా నీలి చారు .ప్రధాన పాత్రల విషయం లోనే కాదు ,అతి సామాన్య పాత్రలను కూడా ,వ్యక్తిత్వం తో నిండి వున్నట్లు ,అతి శ్రద్ధగా పోషించారు .ప్రతి పాత్రను ,ఔచితీ యుతం గా  ,నిర్దుష్టం గా మలిచిన మహా శిల్పి కాళి దాసు .ప్రస్తుతం శాకుంతల నాటకం లో శకుంతల చెలి కత్తె ”ప్రియంవద ”పాత్ర నిర్వహణ లో కాళిదాసు చూపిన ప్రతిభా పాటవాన్ని వివరించటమే ఈ వ్యాసం ధ్యేయం .ఎవరి దృష్టీ సోకని పాత్ర ప్రియం వద  .1974 లో వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు విద్యార్ధి ”మాస పత్రిక లో ప్రచురిత మైంది .ఇప్పుడు మీ కోసం .

 వల్కలా శిధిలం 

నాటకం మొదటి అంకం లో దుష్యంత మహా  రాజు కణ్వా శ్రమం ప్రవేశించి ,ఆశ్రమ వాస విశిష్టతను అభినుతిస్తూ న్న సమయం లో శకుంతల ,తన ప్రియ చెలి కత్తెలు అనసూయ ,ప్రియంవద లతో ,చెట్లకునీళ్ళు  పోయటానికి రాగా వారిని చెట్టు చాటు నుండి చూస్తాడు .శాకున్తక్ల స్తన వల్కలం శిధిల మైంది .మళ్ళీ ముడి వెయ్య మని ప్రియంవద ను కోరింది .ఇద్దరు చెలికత్తె లలో చిన్నదీ ,చిలిపిదీ అయిన ప్రియంవద ”అత్ర పయోధర విస్తారయిత్రు మాత్మనో ,యౌవన ముపాలభస్వ.మాం కిం ఉపాలభసే ” అంటుంది .అంటే ,ఇంతకు ముందే నీ స్తన వల్కలం బిగించాను .ఇంతలోనే పాలిండ్లు పొంగాయా ?”అని మేల మాడింది .ఇక్కడ ఆమె రాజును చూడక పోయినా ,ఒక ప్రియా కర్షణ శకుంతలను ఉత్తేజితం చేసినందు వల్ల ,వల్కలం ముడి జారి పోయిందని  పరోక్షం గా మనం గ్రహించాలి .

      లతాసనాధం 

ప్రియంవద ,శకుంతలను పొగడ వృక్షం కింద కూర్చోమని చెప్పింది .ఆమె అలాగే కూర్చుంది .వెంటనే ప్రియంవద ”త్వయా ఉపగతాయా లతాసనాద ఇవ ,అయం కేసర వృక్షః ప్రతి భాతి ”అని  నవ్వుతు అంది .దీని అర్ధం ”నువ్వు దగ్గర వుండటం వల్ల ,తీగేతో కూడిన దాని లాగా ,ఈ పొగడ చెట్టు ప్రకాశిస్తోంది ”అని .ఇక్కడ మహా కవి ”లతాసనాద”అనే శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించాడు .ముందు జరుగ పోయే ఘట్టానికి తగిన మాట ఇది .ఒక సూచన ,ఒక చిహ్నం .భావి శుభ సూచన ఇక్కడ ధ్వనిస్తోంది తీగకు చెట్టు ఆసరా అంతే కాదు ,ఆ రెంటి కూర్పునేత్రానందం   కూడా .”లతా ”అంటే తీగ ను స్త్రీ మేను తో పోల్చటం కవులకు ఆచారం .అదో ప్రతీక .ఈ మాట విన్న శకుంతల ”అందుకే నువ్వు ప్రియంవద వై నావు ”అంటుంది ఈమె కూడా నర్మ గర్భం గా .అంటే ఆమెకూ ఈ మాట ఆనంద దాయకం గానే ఉందన్న మాట .కళ్యాణ ఘడియ దగ్గర పడిందని ,మనకూ సూచన కూడా .చెలికి ఇష్టమైన  ప్రియాన్ని మాట్లాడు తుంది కనుక ఆమె ప్రియంవద అయింది .శకుంతల కు   ఈ మాట ”సౌభాగ్య ప్రశంస ”గా వుంది .దుష్యంతుడు చెట్టు చాటునే వుండి అంతా గమనిస్తూనే వున్నాడు .”ప్రియంవద నిజమే చెప్పింది ”అని మురిసి పోయాడు .ఆయన మనసు లో వున్న కోరికను కూడా కవి మనకు తెలియ బర్చినట్లే .

  వనజ్యోత్స్న 

ఆ వనం లో ”వనజ్యోత్స్న ”అనే లతను శకుంతల చాలా మురిపెం గా పెంచు కొంటోంది .ఆ మాట అర్ధం వనాకినే వెన్నెల .ఆ లత ,బాల సహకార శాఖను ఆలంబనం గా చేసుకొని ,వనానికి నిజం గానే వెన్నెల పూయిస్తోంది .ఆ లత అంటే శకుంతలకు ప్రాణం .అదే ఆమె బహిప్రాణం .తన కళ్ళ రెప్పల్ని చూసుకున్తున్నాంత జాగ్రత్త గా దాన్ని చూసు కుంటుంది .ఇప్పుడు తదేక ధ్యానం తో రెప్పలార్ప కుండా ,ఆ లతను వీక్షిస్తోంది .ఈ విషయాన్ని ప్రియంవద వెంటనే పసి కట్టేసింది .ఇంకో చెలి కత్తె అనసూయతో ”సఖీ అనసూయే -ఆపి జానాపి కిన్నిమిత్తం -శకుంతలా వనజ్యోత్స్నం -అతి మాత్రం పశ్యతి ?”అని మేల మాడింది .అనసూయ ఈమె కంటే పెద్ద దైనా ,మాయా మర్మం తెలీంది .”నాకేం తెలీదు .నువ్వే చెప్పు ”అంది అమాయకం గా .మంచి చాన్సు లభించింది ప్రియంవద కు చాలా నేర్పుతో సందర్భోచితం గా ”యధా వన జ్యోత్స్నా అను రూపేణ ,పాదపెన సంగతా ,ఆపి నామైవ మహామపి ఆత్మనో ,రూపం వరం లభేయ మితి ”అంది కొంటె కోణంగి ప్రియంవద .ఇందులోని భావం ”వనజ్యోత్స్న కు ఎలా అనురూప మైన ఆధారం లభించిందో ,తనకు కూడా అలాగే లభిస్తుంది కదా “‘.ఇది పుంభావ సరస్వతి కాళిదాస మహాకవి కావ్య సృష్టి లో అద్భుత ,అపూర్వ ఘట్టం .ఆ మాటలు దుష్యంత మహా రాజు వింటూనే వున్నాడు కదా .అతని హృదయం లోను కళ్యాణ ఘంట మోగింది .శాకున్తలకూ మిక్కిలి ప్రియం గానూ వుంది .గుండె లోతుల్లోని కోర్కె కొంటెగా బయట పడింది .ఆమె నాయిక కదా .అంత తేలిగా బయట పడదు .అందుకని సిగ్గు తో మాట వరుసకి శకుంతల ఆమె తో ”ఆ!అది నీ మనసు లోని కోరిక ,అనవసరం గా నాకు అంట గడు తున్నావు ”.అంది .అందరు ఆ మాటకు కడుపారా నవ్వు కున్నారు .నిజం గా శకున్తలే ఆ వనానికి ”జ్యోత్స్న ”.ఇదీ కాళి దాసు గారి మహా నాటక నిర్వహణ .మరిన్ని విషయాలు మరోసారి .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ధీర వనిత రాణిమా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పద్య పుష్పకం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శుభా కాంక్షలు —పద్య కవిత

శుభా కాంక్షలు —పద్య కవిత —

                                         కవి -శ్రీ ఓగిరాల వెంకట సుబ్రహ్మణ్యం 

—  01 -”సరస భారతి ”సాహిత్య షడ్రుచులను 
           పిండి ,వడబోసి ,నోళ్లకు దండి గాను 
           అంది ఇచ్చేడు హంగుల పాత్ర యనుచు 
           నెల్ల రుప్పొంగి పొగడ వర్ధిల్లు గాత .
   02 –  చెవులకు నింపు గొల్పెడి 
           కువులున్దిరివ్యాస ,గీత ,కధలన్ 
           నవ రసముల యశమును 
           భవితను ఉయ్యూరు పురము భాసిలు గాతన్ 
  03 –   శ్రీ కార మైన భారతికి శ్రేయమోసంగును తెల్గుభాష ,ఏ 
           వాకున విన్ననున్ ,మొగలి వాసన వోలె భ్రమింప జేయుగా 
           ప్రాకట మైన మీ ”సరస భారతి ”వెల్గులు జిమ్మ ,నవ్వియే 
           సోకినా నెల్ల వారలకు శోభలు దేచ్చును సుప్రభాతమై .
 04 –    అజ్ఞానము పోనడచుచు 
           విజ్ఞానము పెంపు జేయు విధముగా ,విషయాల్ 
           విజ్ఞత జది వెడి వారల ,
           కు ,జ్ఞానము నందు గాత ,కొంగున పసిడై 
  05 –   విద్య ,విజ్ఞాన సంస్థలు వెల్లి విరియు 
           ఇక్షురస మాధురీ వృక్ష కక్ష్య లోన 
           వెలసే యంత్రము ,నందు లోన వేల ప్రజలు 
           విధులు నెర వేర్చి ,బ్రతుకులు వెళ్ళ బుచ్చ 
           నట్టి పుర మౌర !ఉయ్యూరు గట్టి తనము 
   06 –  తెలుగున పెక్కు సంచికలు ధీర తనంబున వెల్వరించు 
           వెలుగు నొసంగ గల్గుదురు విద్యలు నేర్చేడి బాల కోటికిన్ 
           లలితములైన భావముల లబ్ధిని గోరి,నూతన  వత్సర 
           మ్మిల సుఖ శాంతుల న్నిడేడు  రీతిని నెల్లరు స్వాగతిన్చుడీ .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

బ్రిటన్ లో తెలుగు బ్రౌన్ – గూటాల కృష్ణ మూర్తి

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తెలుగు కధ సజీవం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం -కవితలు -3 (చివరిది )

     హాస్య కవి సమ్మేళనం -కవితలు -3 (చివరిది ) 

                               నేను సైతం –రచన –మాది రాజు శ్రీని వాస శర్మ 

కవిత చెప్ప మంటారా?-చెప్పక చస్తానా
 కవిత హృదయం ఒకటి ఎడ్చిన్డిగా -ఓయబ్బో
నీ మనసు సున్నితమా ?నీ మనసు మత్తెక్కిన మదపు టేనుగని గుర్తించు
వెంటనే -భక్తీ ,వైరాగ్యం అనే తాళ్ళతో నారాయణుడి పాదాలకు కట్టి పడేయ్
ఇంతటి తో నీ పని అయి పోయిందని సంబర పడకు
మనసు లోకి చెడు తత్త్వం దోస కాయ లోకి ఈరు చేరి నట్లు చేరు తుంది
కూర్చోటానికి చోటిస్తే -పాడుకోటానికి చోటు చూసు కోని కాపురం పెడ తాయి
అందుకే -జీవితాంతం జాగ్రత్త అవ సరం -దైవ సాన్నిధ్యమే నీ కు తగిన మందు ,విందు
దాంతోనే పొందు సుఖం ,మానసిక శాంతీ .
    వెంగలాయ్  –రచన -మాది రాజు శివ లక్ష్మి 
నాపేరు ఆంజనేయ వెంగలాయ్ -అమ్మ సుమిత్రా వెంగలాయ్
మా నాన్న వెంగలాయ్ -ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు
నేను ప్రేమించిన అమ్మాయి -ఇంకొన్ని ప్రేమించానంటే
వాడికే ఇచ్చి పెళ్లి చేసిన వెంగలాయ్ నేను
పని మనిషి బల వంతం పెట్టిందని
తాళి కట్టి ఇంటికి తెచ్చిన వెంగలాయ్ నేను
పని మనిషి కదా అని ఇటేడు పని చేస్తున్డను కొంటె

    సోఫాలో కూర్చొని పురమాయిస్తోంది
కొడుకు వెంగలాయ్ ఆ వెర్రి వెంగలాయ్  ని పెళ్ళాడి
ఇంటికి తెస్తే కంపరం తో తల దించు కొన్న నేను వెంగలాయ్ నే

       ధన్య జీవి బొద్దింక -రచన –మైనే పల్లి సుబ్రహ్మణ్యం 

బొద్దింకా బొద్దింకా -సుర కత్తి లాంటి నెర జాణ
నీ లోని చురుకుదనం ఎక్కడుందో
చీకటి సాక్మ్రాజ్యానికి నీవే రా రాజువి రా రాణివి
నీ పాదమే రోగాలకు రస గుళిక
పచారి కొట్లో నువ్వు మహా లక్ష్మివి
నీ చురుకు దనం నీ ఖర్మ కాలుస్తుంది
బల్లి నీ పాలిటి యమ పాశం
ఎందరు కవులున్నా  నిన్ను పట్టించుకోలేదు
నేను నిన్ను స్మరించి ధన్యుడి నయానను కొంటా .

              కాబోయే వదిన గారి అందం 
                పద్య రచన -ముది గొండ సీతా రావమ్మ 

స్టీలు కంచము బోలు సీమంతి నీ ముఖం -ఆలు చిప్ప బోలు ,అక్షులేన్న
దొప్ప చెవులు జూడ గొప్పగా కని పించు -ముక్కు సొగసు నెన్న బొర్ర ముక్కు
పలు వరుస యన రాదు పరగ రంపపు పళ్ళు -సూది గాలి వరవడినేర్పు నేర్పు
యెర్ర బారిన జుట్టు ,ఏనుగు నీ నడుమును -గలము సొగసు విన్న ఖరము చచ్చు
రోకళ్ళు పోలిన జోకైన చేతులు -చాకి బానాను బోలు చాన కడుపు
పగలు కాంచిన నిడేది రాత్రి కనము -తాటకా శూర్పణఖలు
లేకమై పుట్టి నట్లుండు లీల తెలుప -ఆహాహా కాబోవు వదిన గారందము నను .

 దొంగ 
సైకి లెక్కి యొకడు సరదాగా పోవుచు -నగలు దోచు కొనియె
మరల తిరిగి వచ్చి మంచివి కొన లేవ -అనుచు కొట్టే ,సాగే ఆగ కుండ
మందు 
వైద్య శేఖరు దరి కేగి వనిత యోర్తు –   ఏది కాంచిన వాంతులు -ఇంపు లేదు
వంట చేసేది వారెవ్వ రింటి లోన -అనగా తానంచు పలుకంగ అందు కాతడు
వంట నీ పతి చేయంగ వాంతి తగ్గు -అదియే రోగంమునకు మందు అనుచు బల్కె
 ఎగస్ట్రా క్వాలిఫీ కేషన్
రూప వతియు ,సతియు  రూధి(ROODHI )   విద్యావతి
సహన వతి యు ,సాధ్వి సప్త పదికి –కోరే వరుడోకండు
గుణము లన్నియు గలవు -మిగుల గర్భ వతియు దగును నీకు
అటంచు పల్కే బ్రోకరతిశయము గ .

హాస్య కవి సమ్మేళనం కవితలు ఇంతటి తో సమాప్తం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం -కవితలు –2

   హాస్య కవి సమ్మేళనం -కవితలు –2

                                 చమక్కులు –రచన -వేలూరి కౌండిన్య 

 మషాలా వడ -మినప గారే -పానీ పూరీ -నీచం గా చూడకు దేన్నీ -కడుపు నింపునోయ్ అన్నీ
ఉల్లి పెసర ,ఇడ్లీ సాంబార్ -కారా కిళ్ళీ -నీ కడుపు కేసి చూస్తూ ఉంటాయ్ -తమ పని పట్ట మంటాయ్
చిల్లి గారే -చికెన్ పీసులు -మటన్ కుర్మాలు -కాదేదీ ఆకలికనర్హం -అదంతా అద్భుత పాక శాస్త్రం
ఉండాలోయ్ తిండి పుష్టి -తినాలోయ్ కడుపు నిండా –దొరకాలన్తే ఉడిపీ హోటల్
కడు పంటూ వుంటే -వండే రీతి వండితే -అయ్యరు హోటల్ కడుపుకు విందు -జిహ్వ చాపల్యం భలే పసందు .

 కొల వెరీ -రచన –ఛి.మాది రాజు బిందు వెంకట దత్త శ్రీ 

కొల వెరీ కొల వెరీ -ఇదో వెర్రి అయి పోయింది -ఏమి పాటలో ఏమి ఆటలో ?
మా కాలమ్ లో ఇలా కాదమ్మా ,హాయిగా కృష్ణా రామా అనుకొనే వాళ్ళం
మరిప్పుడో -మహేష్ ,ప్రభాస్ ,త్రిషా తాపసీ అంటున్నారు చోద్యం అన్తోందొక బామ్మ గారు
కాసే పటికి -పొలం వెళ్ళిన తాతయ్య ఇంట్లోకి వస్తు ,అవాక్కయ్యాడు
ధనుష్ లా  ఫీలై అద్దం ముందు కూచుని -కొల వెరీ కొల వెరీ కొల వెరీ
అంటూ ,కూని రాగాలు తీస్తున్న బామ్మ ను చూసి
తల తిప్పే సరికి  అప్పుడే వచ్చిన తాతయ్య
ఏమిట్రా ఈ గోలా అంటూ అరిచే బామ్మే–కొల వెరీ అని కొస వెర్రి తో కులుకు తుంటే
చుట్టూ చేరి చప్పట్లతో చిందు లేస్తున్న చిన్నారులు -అవ్వా !అవ్వ కు కూడా పట్టింది ఆ వెర్రి

        అప్పుల లోకం –రచన -విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ 

అప్పు అడుగ రాదు -అన్న బోర్డు చూసినప్పు దల్లా
నాకు వళ్ళు మండి పోతుంది -అప్పు చేయటం సరదానా -లేక
అప్పు చేయటం ఏదైనా హాబీనా ?అస్సలు అప్పు చేయని వాడెవ్వడు ?
అప్పు చేసి పప్పు కూడు తిన మన్నారు పెద్దలు -పప్పు కూడు తిందా మంటే
పప్పు ధరలు నింగిలో -మరి అప్పు చెయ్యక చస్తామా ?
అప్పు చేసినీ నిప్పు లాంటి సారా -తాగమన్నారు కొందరు సారా గ్రేసరులు
ఈ లోకం లో అప్పు చేయని వాణ్ని ఒక్కడ్నైనా చూపించండి
కారు కొనుక్కోవటానికి లోను ,ఇల్లు కొనటానికి లోను
చదువు కోటానికీ ,,పెళ్లి చేసు కోటానికీ లోన్లె లోన్లు
అడక్కుండా నే ఇస్తున్నాయి బాంకులు వెంట పడి మరీ
ఇస్తున్నప్పుడు తీసుకో కుంటే -బాధ పాడరా బాంకో ళ్ళు  ?
అందుకే అప్పు చేస్తున్నా -అప్పు తీర్చమని అడిగితె ,మరో లోన్ తీసు కొంటా
ఇలా అప్పుల్లో బతకటం ఎంత హాయో ఎంత  వీజీయో ?
ఈ విషయం తెలిసే బాలాజీ స్వామి అప్పు చేసే పెళ్లి చేసుకొని మనకు ఆరాధ్య మైనాడు
అప్పట్నించి ఇప్పటి దాకా వడ్డీ కడుతూ ,మనల్నీ ఫాలోఆన్ అంటున్నాడు .
కావున అప్పు సోదరు లారా !చిల్లర కొట్టు దగ్గర్నుంచి
ప్రపంచ బాంకు దాకా ,అందినంత అప్పు చేసి -ఆనందం గా జీవించండి
మన జీవితం లోను మయం చేసు కోండి -అప్పు దాతా సుఖీ భవా
అప్పు ,అప్పుడే ”శ్రీ రామ రక్ష ”అయి మనకు హాయినిస్తుంది -అప్పూ జిందా బాద్

  నాలుగు నష్టాలు —  పాట -రచన వడ్డాది లక్ష్మీ సుభద్ర 

తెల్లని కాష్టం కాల్చారంటే -నోరు గోల చేస్తుంది -కాన్సర్ బారిన పడ తారండీ –తెల్లని –
సురా పానం చేశా రంటే -లివర్ క్యావ్ క్యావ్ మన్తున్దండీ -ఆపైన బాల్చీ తంతా రండీ –తెల్లని —
మగువల వెంటా పడ్డా రంటే -పైలోకాలకు వెళ్ళ లేరండీ -ఎయిడ్స్ వ్యాధి బంధువై బాదిస్తున్దండీ –తెల్లని-
చతుర్ముఖ పారాయణం చేశా రంటే -ఇల్లూ,వొళ్ళూగుల్లే నండీ -ఇల్లాలు ,పిల్లలు అల్లాడి పోతారండీ –తెల్లని —

  తెలుసు కోండి –రచన -వి.శ్రీ ఉమా మహేశ్వరి 


              రండి బాబు రండి -రంగు రంగుల రాజ కీయ అట్లు -పుల్లా పుల్లని అట్లు
తియ్యా తియ్యని అట్లు -అలకల అట్లు -ఎదురు చూపుల అట్లు
లోక్ పాల్ బిల్లు పై -మంత్రి నీతి చూశాక -బీర కాయ లోని నెయ్యి జ్ఞాపకం వచ్చింది
విస్తరణ విస్తరణ అంటూ -రణ రంగాన్ని వాయిదా వేస్తూ
తీగ పాకం లాగా సాగ దీస్తూ నోర్రోరిస్తున్న అరిసె లాంటి మంత్రి పదవి
సామాజిక న్యాయం ,మార్పు అంటూ గొంతు చించుకొని
డైలాగులు వల్లించిన హీరో గారు -చివరికి తానె మారారు పార్టీ
ఊకలా యెగిరి ,మూడు రంగుల్లో కలిసి పోయారు
నిన్న గాక మొన్న ఒచ్చిన పిల్ల కాకి గోల భరించ లేక
వృద్ధ జమ్బుకాలన్నీ ఒక్కటై -స్వపక్ష ,ప్రతి పక్ష ,మిత్ర పక్ష
భేదాలన్నీ మరిచి,ఏక పక్షం గా అవిశ్వాసం పెట్టి
తమ విశ్వాసాన్ని నిరూపించి ,ఉండేలు దెబ్బ రుచి చూపించాయి
తెలంగాణా ముసుగు లో గుడ్డు లాడు కొంటున్న –
గోడ మీది పిల్లు లన్నీ విశ్వాసానికి గట్టి మద్ద తిచ్చి
తమ అసలు రంగు బైట వేసుకోన్నాయ్
ఏదో చేస్తేనే పెరోస్తుండానే భ్రమలు పోయి –
ఏమీ చేయ లేక పోయినా పేరు సంపాదిన్చేసిన
మొన గాడే సారధి అవచ్చు ఆశ్చర్యం లేదు
ప్రజా బలం లేకున్నా -బలమైన చాడీలు చెప్పే విద్య వుంటే
ఏకం గాపెద్ద గద్దె నే ఎక్కి కూర్చో వచ్చు  .
ఎవరు ఎవరిని ఒడారుస్తున్నారో అర్ధం కాని ఓదార్పు (ఓతార్పు )యాత్ర
హైటెక్ రాగాలాపన మాని కాడి భుజానేసుకొన్న మాజీ
హై కమాండ్ కను సన్న లేకుంటే దాడి కి గురు నని తెలిసింది కదా
ఈ సత్యాలు ఎరికయితే ,రాజకీయం నల్లేరు పై బండే నండీ .

 అత్త గారు -అప్ప డాల కర్రా--రచన -వేలూరి సుధా రాణి  

ఏడు వారాల నగలతో అండం గా అలంకరించి పంపారు
ఆమె వెనకే అరవై ఏళ్ళ అత్త గారూ -ఆవిదేప్పుడో -గం .భా.స.
వంట చెయ్య లేకో -తిన లేకో -మామ దేశాలు పట్టాడని వినికిడి
సంబారాలూ చీని  చీనాంబరాలూ -మేకప్పు సామాన్లు పట్టే మంచాలు
ఆ కర్ష  నీయం గా ఓరంగుల పెట్టె   సీమకు టికెట్‌తో గ్రహాంతర వాసమో
వజ్రా వుంగరమో ,కట్నం తాలూకు సోమ్మో
మిలియన్ డాలర్ల ప్రశ్న -ఆ రాత్రంతా కలత నిద్రే
మెరుగు కాగితం చింపు తోంది -శ్రీ మతి
అపు రూప మైన వస్తువు -మామ గారు దేశాంతరం పట్ట టానికి కారణ మైన వస్తు రాజం
మెరుస్తోంది తళ ,తళా –తళ తడుము కోన్నా -అది –అది అది–
తల తడుముకోండి –బొప్పి కట్టిన తలే చెబుతుంది ఏమిటో ?

మరో సారి మరిన్ని కవితలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం కవితలు -1

     హాస్య కవి సమ్మేళనం కవితలు -1

                                   తున్టరీలు —రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ 
01 -కాలెండర్లు మారి పోతున్నా -సెంచరీల సెంచరీని
మిస్ గానే ఉంచుతూ వున్న మాస్టర్ బ్లాస్టర్
మిసెస్ గా చేసుకొనే భాగ్య మేన్నదో ?
02 -మొదట్లో” దూకుడే” -పోను పోను పాపం పాకుడే
రంగులు మార్చే ”ఊసర వెల్లి ”ని జనం నమ్మ లేదు
రాజా కీయం గా రోజూ చూస్తున్నదే నని” లైట్” తీసుకొన్నారు
03 -”రాజ్యం లో” రాముడు నీలి రంగు పులుము కోన్నా
పాలనా నిర్వహణా ,భావము ,సర్వం పూజ్యం కావటం తో
దిక్కు లేని పక్షుల్లా చూస్తున్నారు చోద్యం
04 -ఉపాధ్యాయులకు ”టెట్ ”అని ప్రభుత్వం అంటే
” ఠాట్ ”పొమ్మంటున్నారు వీళ్ళు
05 ”-ద్రోణా చార్య” ప్రయోగం”-‘క్షేత్రం ” లో ఉసురు తీస్తే
”అద్దం లో దెయ్యమై ”-”వీడింతే”నంటాడు ”డాన్ ”-”రాతి నిర్వేదం” తో (సినిమా పేర్లతో చేసిన తమాషా )
06 -” రాజ్యం” వీర భోజ్యం అంటూ వీరంగం వేసి
మూడు రంగుల్లో” సూర్యుణ్ని” ముంచి
గుడ్డ లో పీలికై ,తేలికై ,ఆశతో అర్రులు చాస్తున్ననిన్నటి ” తెర వేలుపు ”
07 -నలభై మూడేళ్ళ సుదీర్ఘ” లోక పాల్” గర్భాన్ని మోసి
పాపం మృత శిశువుని కన్నది” లోక శోక సభ” .
08 -”దానే ”తుఫాను తనకు తానే -తరలి పోయింది తమిళ నాడుకు
అనుకుంటే -పాప వత్సరపు ,పాపం వదల నట్లు ,చివరి రోజూ
ఈడ్చి తనని ,ప్రభావాన్ని చూపించింది
ఈ వర్షం హర్షం కాదు నిండా ముంచేసింది
హాష్య కవిత్వం ను అపహాశ్యం చేసింది
09 -”కొల వెరి కొల వెరి” అంటూ వేలం వెర్రి
కొస వెర్రి తో పూనకం తో   అరుపులు ,కేకలూ .
10 -పురుగులు చాలా చవక -అర కిలో అర్ధ రూపాయే
అయితె ,రూపాయి పెట్టి కొనాలి కిలో బియ్యం .
11 -పారడీ గారడీ వాడు -H2o-ఫార్ములా వాడు
” రుక్కాయ్” కి   ”(జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి )
ఈ నవ్వుల గిలి గింతలు -చంద్రునికో నూలు పోగు .

    నేను ఎవరిని ?    రచన -పొన్నాడ సత్య ప్రకాశ రావు 

నాకు చప్పట్లు కొట్టక పొతే ”అడ్డం గా నరుకుతా ”–నేనొక తెలుగు సినిమా మాటల రచయితని
”నేనేత ఎదవనో నాకీ తెలీదు ”-నేనొక తెలుగు సినిమా హీరో ని
”నీ—–ఎంకమ్మ ”-నేనొక హాశ్య(అపహాశ్య )నటుడిని
”ఎసేఎండ్రా ”-నేనొక విలన్ని
”బాత్  రూం సీన్ లో నగ్నం గా స్నానిస్తా -నేనొక సహజ నటిని
తెలుగు పాటంటే పాడి పాడి చస్తా –నేను తెలుగు లోను” సింగు” తాను
మూడు dyuyatlu ,ఆరు ఫైట్లు ,కావెడు భీభత్సం ,కడివెడు రక్తం –నేనొక” తెలుగు సినిమాని ”
”నాలుక కోస్తా ”-నేనొక ఉద్యమ నాయకుణ్ణి
గర్భాలయ మైనా ,గర్భాదాన గదైనా నాకు అడ్డు లేదు –నేను సెల్ ఫోన్ ని
”నేను మెక్కింది వంద కోట్లే ”నువ్వు దొబ్బింది వెయ్యి కోట్లు’ -నేనొక రాజకీయ నాయకుడిని
”ప్రేమిస్తావా ?పీక కొయ్య మంటావా ?-నేనొక ”ప్రేమికుడిని ‘
దవడ కండరం బిగుసు కొంది -నేనొక థ్రిల్లర్ రచయితని
” i PROFOUNDLY THANK YOU ALL,FOR THE OPPORTUNITY ”–నేనొక తెలుగు వాడిని
”రామా కృష్ణా అను కోవాల్సిన వయసులో -అందమైన కవితల వెంట బడే -నేను గబ్బిట దుర్గా ప్రసాద్ ని .
మరిన్ని కవితలు మళ్ళీ
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

కళ కు రిటైర్మెంట్ లెదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –14 (చివరిది

                     సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –14 (చివరిది )

                                     భక్తి శరణా గతి ఆర్తి –౩

 ”మహిత రీతి నన్ను మన్నించిన ,నీడు మహిమ కేమి తక్కువ ?అని నిష్టురం వేస్తాడు రాముడి మీద .”సమయానికి తగు మాట లాడు తాడు రంగేశుడు ”అంటాడు త్యాగయ్య .అంటే పూల రంగడు అని ఎద్దేవా చేయటమే ”.సద్గంగా జనకుడు ,సంగీత సంప్ర  దాయకుడు ,.గోపీ మనో రధ మొసగ లేకనే గేలి చేసే వాడు .వనితలను సదా సొక్కు చేస్తాడు మ్రొక్క జేస్తాడు.”అదీ ఆ దేవుడి సత్తా.యశోద తనయుడు అని ముద్దు పెట్టు కొంటె లీల గా నవ్వు తాడు .ఆయనే రామ ,కృష్ణ ,రంగానాదుల త్రి మూర్తి మత్వం .”హరే రామ చంద్ర ,రఘు కులేష ,మృదు భాష ,శేష శయన ,పర నారీ సోదరారాజ విరాజుడు ”
తాను భక్తుడు అన టానికి సాక్ష్యాన్ని తన ఇష్ట దైవం అయిన శ్రీ రాముడికి తెల్పుకొంటాడు .పూర్వపు వారంతా మహా భక్తు లానే నమ్మకం వుంది తన స్వామికి .తన దగ్గర కు వచ్చే సరికి చెలగాటం ,సాచి వెత ,తాత్సారం .అందుకే బాధ పడతాడు .
”కామించి ప్రేమ మీర ,కరముల నీడు ,పాద కమ లముల  బట్టు కొను వాడు సాక్షి
రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి -మరీ –నారద ,శుక శౌనక ,పురందర ,నాగ జాధర ముఖ్యులు సాక్షి ”
అని ,ఇతిహాసాలఞానాన్ని తినీ ఒక చోటే చేర్చాడు రామ నామ రసికుడు త్యాగ రాజు .కవితా శిల్పం లో ”పైకి ”తీసుకొని వెళ్ళే నేర్పు త్యాగయ్యది .
అందరు భక్తి పారు లైతే ఇంక యమ ధర్మ రాజు కు పనేమీ వుంటుంది ?పెడ మార్గం పట్టి అయినా బక్తి తో ముక్తి పొందు తాము అంటే ”యముడికి ”వ్యాధే కదా .?మంచి కవితా రీతి తో సాగిన ఆ సంగీత దేశికుని భావనా బలానికి మరో ఉదాహరణ .”చిన్తిస్తున్నాడే యముడు ,సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూసి
శూల పాశ ధర భట జాలము జూచి -మరి మా ,కోలాహలములు  డిగే  ,కాల మాయెనే యమునికి
దారి తెలియ లేక ,తిరిగే వార లైన ,చాలు నంటే సారమని తాగ రాజు సంకీర్తనము పాడే రనుచు ”.
భక్తి విశ్వాసానికి ఇది పరా కాష్ట .”మద మ్మాత్సర్యమనే తెర దీస్తే ”అంతా ,జ్ఞాన ప్రకాశమే నంటాడు త్యాగయ్య .త్రిగునాత్మక మైన ఆత్మ ఆవరణ లను  చేదించి చూస్తె ,నిర్మల మనసు నిలి పితే ,జ్ఞాన చక్షువు ను తెరిస్తే ,నిశ్చలానందమేకదా. అదే ఎవరు కోరుకొన్నా.
”భజన పరులకు ,దండ పాణి భయం లేదు ”అని అభయ మిస్తాడు ఈ ”వేదండ పాలు దాసుడు ”దండ పాణి ని ఎదిరించా టానికి ,కోదండ పాణి వున్నా డని భావం .ధర్మ సంస్థాపన కోసం ”సరస సామ దాన భేద దండ చతురుడు -సాటి దైవ మెవరే  బ్రోవవే ”అని కీర్తిస్తాడు .”పరమ శామ్భావాగ్రేసరున్దనుచు ,పల్కు రావణుడు తెలియ లేక పోయే –
హితము మాట లెంతో ,బాగా బల్కితివి -సతతము గా అయోధ్య నిచ్చే నంటివి
నాథ సహోదరుని రాజు  జేసి ,రాక హతము చేసితివి ”అని అన్న పై పగ వున్నా తమ్ముడికి రాజ్యం ఇచ్చాడు .అందుకే శ్రీ రాముని దయ కావాలి అంటాడు .అది లేకుంటే యేఎ పని జరుగదు .
”నీ కటాక్షం చాలు ,దానం లంకను దయ చూసి నట్లు -దినము దురాశ దీరిన యట్లు
బ్రహ్మేంద్ర పట్టాను భవ మందిన యట్లు -నాలు గొక్క పది భువన మేలి నట్లు
కలుగు కులము లెల్ల కదా తేరి నట్లు -రాజీవ భవ నుత ,రమణీయ చరిత
రాజిల్లు త్యాగ రాజ వినుత ”అని పొంగి పోతాడు అల్ప సంతోషి త్యాగయ్య.రాముని దయతో సకల కోర్కెలు తీరు తాయి .ఇహ ,పర భాగ్య లక్ష్మి చే పట్టి నంతటి  విశ్వాసం త్యాగయ్య గారికి .
భ్కక్తికి ,సేవకు ,శరనాగాతికి చివరి మెట్టు స్వామిలో లీనం ఆవ తామే .ఈ తపన అంతా దాని కోసమే .సాయుజ్యం కంటే వేరే కోరిక ఏ భక్తునికీ వుండదు .ఆ భక్తి తో తన ఆత్మకు ,విశ్వాత్మకు అభేదం .అదే అద్వైతం .ఆ దివ్య సన్ని దానాన్ని ,మనసు లో కల్పించు కోని ,స్వామి లో లీన మై పోతూ ,జీవన్ముక్తు డైన ,గాన బ్రహ్మ ,నాద బ్రహ్మ ,కవి బ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ ,బ్రహ్మొహం అంతు పాడిన చివరి కృతి ధనాసి రాగం లో ”శ్యామ సుంద రాంగ ”అనే కృతి .ఎదురు గా పర మాత్మ తో మాట్లాడుతూ తనువు చాలించిన ధన్యుడు .ఆ దివ్య పురుషుని దివ్యాను భూతిని పంచ కొందాం .ఇదే ఆయన చరమ గీతం .–swan song  .తాను ధన్యుడు అయినందుకు సరైన ధన్యాసి రాగం లో కృతి ని చేయటం ఔచిత్యానికి పరా కాష్ట .
”హంస ఎలా ఆడుతూ ,పాడుతూ ,ప్రాణాలు విడుస్తుందో ,”త్యాగ రాజ హంస ‘కూడా ,పరమ హంస యై ,గాన జ్ఞానం తో పాంచ భౌతిక శరీరాన్ని వదిలి ,నిత్యా సత్య ,శాస్వతా నందాని పొందారు .అదొక అలౌకిక శోభాన్విత మైన వూహ .
”శ్యామ సుంద రాంగ ,సకల శక్తియును నీవెరా -తామస రహిత ,గుణ సాంద్ర ,
ధరను వెలయు శ్రీ రామ చంద్ర ,-దుష్ట దనుజ విహార -ఇష్త దైవమును నీవెరా -ఇలను త్యాగ రాజు వేరా ”
ఆధ్యాత్మిక జ్యోతి ,పరంజ్యోతి లో లీన మైంది .వాగ్గేయ కారునిగా ,నాద బ్రహ్మో పాసకుడు శ్రీ కాకర్ల త్యాగ బ్రహ్మ మనందరికీ నిత్య ప్రాతస్మర ణీయులు .
  త్యాగ రాజ మంగళా ష్టకం —     రచన —శ్రీ వాలాజ పేట వెంకట రమణ భాగ వతార్ 
01 -రామ బ్రహ్మ సుపుత్రాయ ,రామ నామ సుఖాత్మనే -రామ చంద్ర స్వరూపాయ త్యాగ రాజయ మంగళం
02 -శ్రీ కాకర్ల వంశాబ్ధి చంద్రాయామిత తేజసే –పూర్నాయ పుణ్య రూపాయ త్యాగ రాజయ మంగళం
03 -నారదా చార్య కరుణా పాత్రాయాద్భుట కీర్తయే -ధీరాయ నిర్వి కారాయ త్యాగ రాజయ మంగళం
04 -కావేరీ తీర వాసాయ కారున్యామృత ,వర్షినే  -అవీసుర రాజాయ త్యాగ రాజాయ మంగళం
05 -శ్రీ కారుణ్య సముద్రాయ లోకానుగ్రహ కారిణే –సాకేతాదిప భక్తాయ ,త్యాగ రాజాయ మంగళం
06 -యోగి పుంగవ మిత్రాయ ,యోగానంద స్వరూపినే -రాగ లోభ విముక్తాయ త్యాగ రాజాయ మంగళం
07 -గాన శాస్త్ర ప్రవీనాయ ,కలి కల్మష నాశినే -శరణా గత పోషాయ త్యాగ రాజాయ మంగళం
08 -దీన మానవ పోషాయ ,దివ్య నామ సంబోదినే –జ్ఞాన భక్తి ప్రదానాయ త్యాగ రాజాయ మంగళం .
  త్యాగ రాజ ప్రశంశ — పద్య  రచన —  శతావధాని ఎస్.రాజన్న కవి
01 –     ”అలకలు నుదిటి పై ,నలవోకగా తూగు -నొరపుల బాలు  డొక్కొక సారి
కోదండ ,తనకార ఘూర్నితాంభో రాశి  -హుమ్కార కాంతు(kanthu ) దొక్కొక్క సారి
జానకీ స్మిత మధు శ్యండి మాలా రోచి -రుత్సిక్త హృదయు డొక్కొక్క సారి
పావన నందన భక్తి బాష్ప దారాప్లవ -నోత్సుఖ చరణు డొక్కొక్క సారి
ఎన్ని రూపుల దర్శనం బిదేనో నీకు -రామ చంద్రుండు ముని జన ప్రణయ మూర్తి
లలిత వీణా కలస్వాన తులిత మొర్తి –త్యాగ రాజ గృహీత లీలావతార.
02 -”నాద సుధా రసంబే దళి తేంద్రనీలమ్ము ,పానమ్ము దేహమ్ము చేసి
సకల లోకా నంద సంధాయి దివ్య రాగంమునే ,చేతి చాపంము జేసి
వివిధ భావా వేష ,విజ్ఞాత్రు స్వర కన్య కాలనే చాపమ్ము ,గంటలుగ జేసి
చిర తపస్సంజాత శీతలా లాపనా ద్రవమునే వింటి శరమ్ము జేసి
ఎంత చక్కని రాముని సృష్టించు కొంటి -వయ్య ,జప యోగ కూలంకశా వ తార
గాన మందార ,స్వర కన్యకా విహార –తత్పదాదీన హృదయ -ఓ  త్యాగ రాయ ”.
 సర్వం సంపూర్ణం 
”త్యాగ రాజు కృతులలో సామాజిక ఆకృతులు” అనేశీర్షిక తో రాసిన  నాలుగు వ్యాసాలు ,’సంగీత సద్గ్రు శ్రీ త్యాగ రాజ స్వామి ”శీర్షిక తో రాసిన పద్నాలుగు వ్యాసాలు ,వెరసి 18  వ్యాసాల పరంపరను ”శ్రీ త్యాగ రాజ ఆత్మ విచారం ”   అనే పుస్తకం రాసి , అందులో కొత్త కోణం లో  త్యాగయ్యను ఆవిష్కరించిన” హాస్య  బ్రహ్మ ”  స్వర్గీయ భమిడి పాటికామేశ్వర రావు  (భ’కా’రా’)మాస్టారు గారికి సవినయం గా ,సభక్తి కం గా  అంకితమిస్తున్నాను .              
ఈ వ్యాస పరంపర కు ముఖ్య ఆధారం శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారి ”త్యాగ రాజు భక్తి సుదార్ణవం ”అనే ఉద్గ్రందం .దీనితో పాటు తిరుపతి దేవస్థానం ,తెలుగు అకాడెమి వారు త్యాగయ్య పై  ప్రచురించిన చిరు పుస్తకాలు ,అనేక పత్రికలలో నేను చదివిన వ్యాసాలు ఆధారం .
ఈ వ్యాసాలను నేను 01 -05 -93 న మొదలు పెట్టి ,05 -05 -93  వరకు  నాకోసం రాసుకొని పూర్తి చేశాను .అంటే  దాదాపు 18   సంవత్సరాల క్రితం రాసినవి అన్న  మాట . ఇప్పుడు మీ కోసం వెలుగు చూశాయి .ఇదంతా ఆ త్యాగ బ్రహ్మ అనుగ్రహమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —13

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —13

                                కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –2

    ”భక్తి లేని కవి జాల వారెన్యులు ,భావ మెరుగ లేరు ,కనుక భక్తి ,ముక్తి కల్గునని కీర్తనముల బోధించి తి ”అని చెప్పు కొన్నాడు త్యాగయ్య ”.మేను మోసం చేస్తుంది .హీన మైన ,మల మూత్ర రక్తముల కిరవు.మాయ మయం”కనుక నమ్మ వద్దు అంటాడు .సరసాంగి రాగం లో” అంగ  భూత శరీరం పై మొహం వదులు కో” అని అంటే ,మోహన రాగం లో ”మోహము నీపై మొనసి యున్నది రా ”అని రాముని స్తుతిస్తాడు .సందర్భోచితం గా ఆ రాగాలను ఎన్ను కోని ,కృతులను చెప్పటం ఎంతో ఔచిత్యం ,ప్రత్యేకత ..

జయంతి శ్రీ రాగం లో ”మరు గేలరా ఓరాఘవా ”అని సంబోధిస్తూ —
”మరుగేల ,చరాచర రూప పరాత్పర ,సూర్య సుధాకర లోచన –అన్ని నీవనుచు ,అంత రంగమున
తిన్నగా వెదకి తెలిసి కొంటి నయ్య -నిన్నె గాని మదినేన్న జాల నొరుల -నన్ను బ్రోవు మయ్య ,త్యాగ రాజ నుత ”

అంతర్ముఖుడైన ఒక మహా భక్తుడు శోధించిన సత్యాన్ని ,ప్రకాశింప జేసే మహాద్భుత మైన సంఘటన .అండ మైన పదాల పొందు ,వీనులకు విందు .భాష ,దానికి తగ్గట్టు భావం సుందరాతి సుందరం గా జత కూడిన అపూర్వ రాగ భావ సమ్మీలనం .
జగన్మోహిని రాగం లో జగన్మొహనం గా సంగీత మహాత్మ్యాన్ని తెలు పుటూ ,భక్తి సంగీతందైవాంశం అని   జ్ఞప్తికి తెస్తాడు .నాడో పాసనే తరించే మార్గమని సూచించిన ధన్య పురుషుడు త్యాగ రాజు .ఆ కీర్తనా వైభవం చూడండి –

”శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా –నాభి హృ త్కంత(kantha )    ,రసన ,నాసాదుల యందు
ధర ,రుక్సామాదులలో ,వర గాయత్రీ హృదయమున -సుర భూసురుల మానసమున,శుభ త్యాగ రాజా దులతో -శోభిల్లు”
గాయత్రి ఉపాసన రుక్ ఛందస్సు లలో ఒకటి అందుకే అదీ” త్రయి” లాగే అత్యంత పవిత్రమైనది అని చెప్పాడు .
”నీవె దైవ మని నమ్మి నాను దేవ ,-నీకు నాదు మేనమ్మినాను
మానము నీదే సుమ్ము ,అభిమానము నేలు కొమ్ము -చక్కని నీ రూపమును గని సోక్కితి ,నా హృదయమున ”

అని ,తన దేహం ,ఆ శ్రీ రాముని సొమ్మే అంటాడు .ఇదే ప్రతి పత్తి స్వరూపం అన్నారు పెద్దలు ,భక్తి విదులు .
రాదా దేవి ,ఎలా మధుర భక్తి తో ఆరాదిస్తుందో ,అలాగే తానూ రాముణ్ణి ,ఆరాధిస్తాడు .తన సేవాను భూతి ని చూపిస్తూ పులకలన్దిస్తాడు చూడండి ఆ భక్తి సామ్రాజ్య వైభోగం

”సత తంబు పదముల నర్పింతు ,-ఏకాంతమున నిన్నారాదింతు సీతా రామా !
తనివి దీర నిన్ను కౌగిలింతు ,దాహ మెల్ల దీర్చ సేవింతు
కనుల చల్ల గాను ,నిన్ను గందు ,-నాదు ,తనువు పులకరించ మెచ్చు కొందు
అడుగులకును మడుగు లం దిత్తు   -నిన్నస  రించి ,మెల్ల బల్క నిత్తు”
అని తనకు ,శ్రీ రాముడికి భేదం లేదని అంటున్నాడు .” నీవే  నేనైన నీ వాడు గాక త్యాగ రాజు వేరా ”

అన గల సత్తా దమ్ము అద్వైతి కి మాత్రమే   సాధ్యం .అలాటి వాడే త్యాగయ్య .తనలో పరమాత్మను ,పరబ్రహ్మం లో తనను చూసు కొన్న ,భక్తి వైరాగ్య ,సాధనా  ,శరణాగతి ,ఆర్తి  లను కల బోసు కోని పండిన త్యాగ జీవి .భగ వంతుని కి భక్త త్యాగ రాజు ”పరచిన red carpet welcome ”అన్నారు విద్వాద్వ రేన్యులు .”నీదు పలుకే పలుకురా ,నీదు కులుకే కులుకురా -నీదు తళుకే తళుకు రా ”అని మధుర ప్రేమ తో ఆరాట పడుతాడు

త్యాగయ్య .ఒక్క క్షణం కూడా ఆ రామున్ని విడిచి ఉండలేని పచ్చి  భక్తి .
భక్తి తో త్యాగయ్య కు

”తలచి తే మేనెల్ల పులకరించేని రామ -కను గొన్న నందమై కన్నీరు నిన్దేడిని       ఆలసించు వేళ జగ మంత తరుణ మయ్యేని -చరణ కౌగిలి వేళ చేలగమై మర చేని    చెంత నుండ గ నాదు చింతలు తొల గేని -‘

‘అని అనటం లో త్యాగ్యా కున్న అత్యంత విశ్వాసం జ్యోతకం ఆవు తుంది .ఉన్మత్తు డై తేనే భక్తి కి పరా కాస్త .ఒక రామ కృష్ణ పరమ హంస లా ,స్సదా శివ బ్రహ్మేన్ద్రుని లా కని పిస్తాడు .పరమ హంసత్వం పూర్తి గా పొందిన దివ్య పురుషుడు గా త్యాగ్యా మనకు కన్పిస్తాడు .ఆ తనమయత్వం చైతన్య ప్రభువు ను జ్ఞాపకం చేస్తుంది .ఈ కృతి లో కవితా సౌభాగ్యం ,శోభ ,శ్రీ రామ రూప సౌందర్య చిద్విలాసం దర్శనమిస్తుంది .”ఇంద్రియాలకు ఆహ్లాదం ఇచ్చే రూపం -నెమ్మది లేని జనన మరణమ్ముల తొల గించే నట రాజ వినతుడిని దర్శించి మనకూ ,ఆ భాగ్యాన్ని కల్పించాడు త్యాగయ్య .

సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అంకుల్ డయనమేట్ – ఎమెస్కో – పుస్తక ఆవిష్కరణ

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Tagged , | Leave a comment

సరస భారతి -33 వ సమా వేశం ” హాస్య కవి సమ్మె ళనం ”

2012 కొత్త సంవత్సరం  21 వ తేది శని వారం సాయంత్రం నాలు గింటికి ఫ్లోరా హై స్కూల్ లో నిర్వహం .సరస భారతి గౌరవాధ్యక్షులు ,ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామ లాడేవి గారు ,వాళ్ళ స్కూల్ లో నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించటం తో వేదికను అక్కడికి మార్చాం .అందరికీ మళ్ళీ ఫోన్లు చేయటం నలభైకార్డులు   రాసి వివరాలు తెలపటం మీడియా వారికి తెలియ జేసి పేపర్ కవరేజ్ ఇప్పించటం కూడా చేశాం .అంటే అందరికి వాయిదా పడి నట్లు ,21 వ తేది జరుగు తున్నట్లు తెలియ జేశాం అన్న మాట .మొత్తం మీద జరిగింది అని పించాం .ఆ వివ రాలే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .క్లిక్

క్లిక్

 

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –12 కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –1

          సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –12

                                   కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –1 
నవ విధ భక్తిని తన కవితా కృతుల్లో వికశింప జేశాడు త్యాగ రాజు .తన ఆరాధ్య మూర్తి రామ మూర్తి కి ఆర్తి గా విన్న విన్చుకొంటాడు .సర్వ సమర్పణ   భావం తో శరణా  గతు డౌతాడు .సామీప్య ,సాన్నిధ్యాలతో సాయుజ్యం పొందే మహోన్నత ఆత్మ పరతత్వ వేడి ఆయన .ఆలోకం లో ఆనంద సామ్రాజ్యం ఎలి ,మనల్ని కూడా ఆ విందు లో పాలు పంచు కోనేట్లు చేస్తాడు .ఆత్మ వేది త్యాగ బ్రహ్మ .
”యెంతని రాల్తు కన్నీరు ?జాలి ఎవరితో తెలిపితే తీరు ?అని ఆవేదన తెల్పి ,”పూలమ్మ బతికిన వారు రామా ,పుల్ల లమ్మ బిల్వ రాదు -ఆ చులకన నీకు కాదా ?అంటాడు ఆ రామున్నే .”భక్తి వేలుగుచే ,వెతలు తీరు ననే విశ్వాసం జ్ఞాన తేజం కలి గిస్తాడు .పరమ సుందరు డైన స్వామిని సేవించే వారి లక్షణాలేవో తాను సాధించి ,తెల్పే రచన చూద్దాం .
”అనృతంబాడాడు ,అల్పుల వేడడు ,సునృపుల గోలవడు ,సూర్యుని మరువడు -మాంసము ముట్టడు ,మధువును త్రాగడు ,పర హింస చేయడు ,ఎరుకను మరు వడు ”అని ,ఉత్తమ భక్తు దిన తన లక్షణాలను ఏకరువు పెడ తాడు .మూడు ఈషనాలను వాడనని ,వంచన చేయ నని ,బొంకనని ,చంచల చిత్తుడై  ,సౌఖ్యాన్ని వదలనని వేడు కొంటాడు .అంటే భక్తికి శీలం ఎంత ముఖ్యమో అందరికి తెలియ జేస్తాడు .”ఎందెందు జూచిన అందందే కలదు హరి ”అని ప్రహ్లాదునితో పోతన్న గా ఋ చెప్పించి నట్లు త్యాగయ్య గారు ‘నీకే తెలియక పొతే నేనేమి సేయుదురా ?లోకాదారుదవై ,నాలోని ప్రజ్వ లించే జాలి నీ కే తెలియక పొతే ”–”ఎందెందు చూచినా ,బలికిన ,సేవించిన ,పూజించిన ,అందందు నీవు అని తోచే తందరు
,నీ పాడార విన్దమును ,ధ్యానించిన డిందు కానీ ?/అని ప్రశ్నిస్తాడు .జాలి తన లో ప్రజ్వ లిస్తోందని ,అనటం కొత్త ప్రయోగం .అది కాల్చి తపన చేస్తోందని భావన .
ఆహ్లాద కర మైన భావాలతో ,తనపై మోపిన నింద శ్రీ పతి పద చిన్తనమే నట .తమాషా అయిన నింద ఇది .
”వారిజ నాయన ,నీ వాడను నేను ,వారము నను బ్రోవు -స్వల్ప ఫలదు లగు వేల్పుల ఏచిన అల్పు దనుచు నన్నందరూ బల్కిన ”కాస్త మైనా ,ఇస్తా మైనా దుస్తు దాని దూరినా పాపులు నాపై మోపిన నేరము -శ్రీ పతీ నీ పద చిన్తనమే ”ఇతర దేవతలు క్షుద్ర ఫలితాల నిస్తారు సజ్జనుల బలం అలాంటిది .
క్షమా భిక్ష వెడుతూ ,అనుతాపం గా గీతాన్ని పాడుతాడు .పశ్చాత్తాపం పొందిన అశ్రు జాల ముచేత హృదయాన్ని క్షాలనం చేసి హృదయం పవిత్రం ఆవు తుందని అంటాడు త్యాగయ్య .అందుకే తానా పూర్వ లోపాలన్నీ ,వరుసగా వివరిస్తాడు .  ”సకల భూతము లందు నీవై యుండ గా ,మది లేక బోయినా -చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కుతర్కు డైన , -పర ధనము కొరకు ,నొరుల మది కరగబల్కి ,-కడుపు నింపి తిరిగి నత్తి ,దుడుకు గలా నన్నే దొర కొడుకు బ్రోచురా
అంటూ ,మానవతకు దుర్లభ మనుచు ,నెంచి ,పరమానందమొండ లేక ,-మద మత్సర,కామ లోభ ,మోహములకు ,దాసుడై మోస బోతిని ”అని పశ్చాత్తాప హృదయం తో ఆత్మ క్షాళన చేసు కొంటాడు .
‘సతులకు కొన్నాళ్ళు ,ఆస్తికి ,సుతులకై కొన్నాళ్ళు ,ధన తతు లకి తిరిగితి నయ్యా -”ఇదీ త్యాగ రాజు ఆత్మా విచారం .నిజాయితీ .”పాప గణ ములన్నియు ,పురుషుని రూప మై ,బాధించి నాయత .అంటే పురుషుడైన తన రూపం లో .అంటే ఇదంతా ,స్వయం క్రుతాప రాదం .చక్కని ప్రయోగం ”పురుషుని రూపం ”అనటం .
”ఎటుల బ్రోతువో తెలియ  -ఏకాంత రామయ్య ”అని తన చరిత్ర అంతా కర్ణ కథోరం అని చెపు కొచ్చాడు
” వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి ,పుట్టు లోభుల నెల్ల పొట్ట కై పోగిడితి ,-దుస్టు లతో గూడి ,దుష్కృత్యములు సల్పి రట్టు జేసిన  త్యాగ రాజు ని దయతో ‘అని సిగ్గు విడిచి చెప్పే స్తాడు .తన గుట్టు రట్టు చేసు కొన్నాడు .ఈ ఆర్తి ని ఏకాంత రాముడే తీర్చాలని విశ్వాసం .
”సిగ్గు మాలి ,నా వలె ధర నెవ్వరు ,తిరుగ జాలరయ్య ముగ్గురి లో మేలైన రామ –మా ముఖాబ్జ దిన రమణ రామా -”వ్యర్ధం గా ఒక్క అక్షరం కూడా ప్రయో గిన్చడు  త్యాగయ్య .ఇక్కడ కూడా తన సిగ్గు మాలిన పను లన్నీ నిస్సిగ్గు గా బట్ట బయలు చేశాడు .
”ముందర దయతో బల్కిన దింక ముందు రాక పోయే -దద్ద నాలతో దినములు గడిపే దారి తెలిసి పోయే
అందరి చేతను న బ్రతుకు అపుడు నిందల కెడ మాయే–మందరధర ,నా జీవుడు జీవ మిందు సేయ నాయె అని దెలిసి ” ఈ కీర్తాన్ లో అన్న జపేశం పెట్టిన బాధలు ధ్వనిస్తాయి .ఆశ వుంది .జీవ ,పరమాత్మల ఇక్యతే సర్వ అనీన ప్రేమ .సర్వ యాతనలకు దివ్యౌషధం ,సద్ధర్మ పధం .”
”కన్నా తండ్రి త్యాగ రాజు నింక -కరుణ జూడ లేదు అని తెలిసి ”అందుకే మనశ్శాంతి అవసరం .అది ఇహ పర సాధనం కూడా .”సామ రాగం ”లో సామ వేద సారాన్ని ఈ కృతి లో అద్భుతం గా నిక్షిప్తం చేశాడు .ఆ రహశ్యం చూద్దాం .
”శాంతము లేక సౌఖ్యము లేదు -సారస దళ నయానా
దాన్తుని కైనా ,వేదాంతుని కైనా –దార సుతులు ధన ధాన్యము లుండిన
సారెకు ,జప తప సంపద కల్గిన – యాగాది  కర్మము లన్నియు చేసిన
బాగుగా సకల హృద్భావము తెలిసిన -ఆగమ శాస్త్రము లన్నియు జదివిన
భాగ వతులనుచు ,బాగుగా పేరైన -శాంతము లేక సౌఖ్యము లేదు ”
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాహితీ మిత్రులు మచిలీ పట్నం

సాహితీ మిత్రులు అనే మచిలీ పట్నం లో ని  సాహిత్య సంస్థ 31 వ వార్షి కోత్స వాన్ని ఈ రోజూ 22 -01 -12 ఉదయం నుంచి సాయంత్రం దాకా ”మహతి కళా వేదిక ”పై నిర్వ హిస్తోంది శ్రీ కిల పర్తి దాలి నాయుడు రాసిన ”సూది మొనలు ”అనే మినీ కవితా సంకలనాన్ని , శ్రీ మతి ఓలేటి ఉమా సరస్వతి సంపాదకత్వం లో వెలువడిన  ”పద్య పుష్పకం ‘అనే గ్రంధాలను ఆవిష్కరిస్తున్నారు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టు లైన  అయిదుగురు ప్రముఖులను సత్కరిస్తున్నారు .వారి వివ రాలే మీరు చూస్తున్నది

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరస భారతి -33 వ సమా వేశం ” హాస్య కవి సమ్మె ళనం ”సమీక్ష

సరస భారతి -33 వ సమా వేశం

                                          ” హాస్య కవి  సమ్మె ళనం ”సమీక్ష
2012 కొత్త సంవత్సరం వస్తోంది కదా ,ప్రతి సంవత్సరం ,మా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఆరోజు  ధనుర్మాసంలో  ప్రతి సంవత్సరం , తెల్ల వారు ఝామున లడ్డు లతో స్వామి వారలకు పూజ చేసి అందరికి ప్రసాదం గా పంచుతాము కదా ,ఆ రోజు సాయంత్రం ”హాస్య  కవి సమ్మేళనం” ”,ఆలయం లో నిర్వహించి ,అందరికి స్వామి వారి దర్శనం కల్గించి ,అతిధులకు ,కవి మిత్రులకు స్వామి వారి ప్రసాదం లడ్డు ను ఇస్తే బాగున్టింది కదా అని అంతా ప్లాన్ చేసి సిద్ధం చేస్తే ”తానే ”అనే తుఫాన ముంచు కొచ్చి విపరీత మైనవర్షాలతో  అల్ల కల్లోలం చేసింది  .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడు అనటానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేముంటుంది ?తప్పని సరి అయిన పరిస్తితు లలో అందరికీ చెప్పి వాయిదా వేసి 21 వ తేది శని వారం సాయంత్రం నాలు గింటికి ఫ్లోరా హై స్కూల్ లో నిర్వహం .సరస భారతి గౌరవాధ్యక్షులు ,ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామ లాడేవి గారు ,వాళ్ళ స్కూల్ లో నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించటం తో వేదికను అక్కడికి మార్చాం .అందరికీ మళ్ళీ ఫోన్లు చేయటం నలభైకార్డులు   రాసి వివరాలు తెలపటం మీడియా వారికి తెలియ జేసి పేపర్ కవరేజ్ ఇప్పించటం కూడా చేశాం .అంటే అందరికి వాయిదా పడి నట్లు ,21 వ తేది జరుగు తున్నట్లు తెలియ జేశాం అన్న మాట .మొత్తం మీద జరిగింది అని పించాం .ఆ వివ రాలే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .
సాయంత్రం అయిదున్నర కు సభ ప్రారంభించాం .ముద్దు ముద్దు గా గంటన్నర ఆలా శ్యాం తో .అతిధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు స్కూల్ వాళ్ళు .సభాధ్యక్షతను శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారు స్వీకరించారు .వాయిదా పడిన కవి సమ్మె ల నాన్ని పట్టు వదలని విక్ర మార్కులు గా నిర్వ హించటం సంతోషం అన్నారు .సభా సంచాలనం చేసిన నేను మాట్లాడుతూ ,వాయిదా పడిన వివ రాలన్నీ వివరించాను .ఇది 33 వ సమా వేశం అనీ ,ఈ వేదికను” పేరడీ చక్ర వర్తి స్వర్గీయ జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి” వేదిక గా భావిస్తున్నామని ,ఈ ‘హాస్హ్య కవి సమ్మె లనాన్ని ”అందరి చేత ”జరుక్ శాస్త్రి ”అని పిలువా బడే రుక్మిమీ నాద శాస్త్రి గారికి అంకితం ఇస్తునామని చెప్పాను .హర్ష ధ్వానాలు మిన్ను ముట్టాయి .ఆయన మన కృష్ణా జిల్లా నివాసే నని ”మా పూర్వీకులే వాటర్ ఫార్ముల H20nu కని పెట్టారు .అందుకే మా ఇంటి పేరు ”జల సూత్రం ”అయిందని ఆయన సరదా గా అనే వారని ,కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ విశ్వ నాద వగైరా మహాకవులకవిత్వాలకు   అద్భుత మైన పేరడీలు ఆయన రాశాడనీ విశ్వ నాద ను ”పాషాణ  పాక ప్రభో ”అని అనే వాడనీ జ్ఞాపకం  చేశాను .ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్నిప్రముఖ కవి ,సంగీతజ్ఞుడు ,బహు భాషా వేత్త  అయిన శ్రీ సామల సదాశివ గారికి ఇవ్వటం అందరు సంతోషించా దగిన విషయమనీ ,దానికి మనం హర్ష ధ్వానాలు చేయాలని చెప్పి అందరితో కార తాళ ధ్వనులతో సంతోషాన్ని వెలి బుచ్చాం . .తర్వాత ఈ మధ్య దివంగతు లైన ప్రముఖ కధా రచయితా ,గణిత శాస్త పుస్తక రచయిత ,ఆంగ్ల అధ్యాపకులు అయిన అవసరాల రామ కృష్ణా రావు గారి మృతికి ,భారతీయ ఆధ్యాత్మిక భావ ధారను ఖండ ఖండంత రాలకు వ్యాపింప జేసిన అనేక గ్రందాల రచయిత  ఇల  పావులూరి పాండు రంగ రావు గారికి ,ప్రసిద్ధ కవి” మల్లె మాల రామాయణ ”రచయిత,సినీ కవి  మల్లె మాల సుందర రామ రెడ్డి గారికి ,గొప్ప సంభాషణా రచయిత అల్లూరి సీతా రామ రాజు సిని మా కధా ,మాటల రచయిత మహా రది గార్లకు  సంతాపం ప్రకటిస్తూ రెండు నిముషాలు లేచి నిలబడి అందరం మౌనం పాటించి సాహితీ ఋణం తీర్చు కొన్నాం .          ముఖ్య అతిధి గా విచ్చేసిన డాక్టర్ రావి రంగా రావు మాట్లాడుతూ హాశ్యాన్ని పండించటం చాలా కష్టం అనీ తాను పూర్వంహాస్య   కవితల సంకలనాన్ని తెస్తే అందులో నాలుగు తప్ప ఏవీ హాస్యాన్నికూరి  పించ లేక పోయాయనీ  ,ఇక్కడ మంచి ప్రయత్నం చేసి హాస్యం  మీద కవి సమ్మె ళనం నిర్వ హించటం బాగుందని ప్రశంచించారు .మచిలీ పట్నం లోని ‘హాస్య లహరి ”అధ్యక్షులు డాక్టర్ బృందావనం ధన్వంతరీ ఆచార్య హాశ్యం మనసుకు ,బుద్ధికి ,శరీరానికి చాలా అవసరం అన్నారు .హాస్యాన్ని  వృద్ధి చేస్తే అది మన ఆయుస్సును పెంచుతుంది అని సూచించారు .ప్రముఖ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమ యాజీ ఆత్మీయ అతిధి గా మాట్లాడుతూ ఉయ్యూరు అంటే తనకు చాలాఇష్టం అనీ ,  ,ఇక్కడి కవి సమ్మె లనా లన్ని టికి తాను హాజరవు తున్నానని ,మంచి అభి రుచి వున్న సంస్థ గా సరస భారతి పేరు తెచ్చుకోన్నాడని ,చెప్పిహాస్య   స్పోరకమ్ గా తాను రాసిన పద్యాన్ని వినిపించారు .ఆత్మీయ అతిధి గా విచ్చేసిన మరో ముఖ్యులు శ్రీ కోసూరి ఆది నారాయణ రావు .పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేసి ,కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కు కార్య దర్శి గా పని చేసిన వారు .వారుత ప్రసంగం లో తాను తరచుగా ఇక్కడి సాహితీ కార్య క్రమాలకు వస్తున్తానని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి కార్య క్రమాలున్డటం ఆనందం గా వుందని అన్నారు .మరో ఆత్మీయ అతిధి retired  హెడ్ మాస్టర్ శ్రీ పీ.ఆంజనేయ శాస్త్రి గారు తాను చాలా కాలమ్ తర్వాతఇటు వంటి   కవి సమ్మేళనం లో పాల్గొన్నానని  1960 -70   కాలమ్ లో ఉయ్యూరు హై స్కూల్ లో తాను దుర్గా ప్రసాదు ,స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు ,అనే పిచ్చి బాబు ,జ్ఞాన సుందరం ,మహంకాళి సుబ్బా రామయ్య ,వల్లభనేని రామ కృష్ణా రావు కలిసి పని చేసి నప్పుడు దుర్గా ప్రసాద్ ,కాంతా రావు లు ప్రతి నేలా సైన్సు రూం నే సాహితీ వేదిక చేసి మమ్మలన్నదర్నీ పిలిచికార్య క్రమాలను నిర్వ హించే వారనీ ,సంక్రాంతికి ,ఉగాదికి అక్కడే కవి సమ్మె లనాలను నిర్వ హించి తమకందరికి ఉత్సాహాన్ని కల్గించే వారని గుర్తు చేసు కొన్నారు ,.మళ్ళీ ఇన్నేళ్ళకు ఇక్కడికి వచ్చి ,పాల్గొనటం మహదానందం గా వుంది అన్నారు .సభా వేదిక పైకి అతిధులను కార్య దర్శి శ్రీ మతి శివ లక్ష్మి ఆహ్వానించగా ,గౌరవా ధ్యక్షు రాలు   శ్రీ మతి శ్యామల దేవి కమ్మని ప్రార్ధన తో సభ ప్రారంభం చేశారు .అతిదు లందరికి ”గురజాడ అప్పా రావు ”గారిఫోటో ను జ్ఞాపిక గా అంద  జేశాం .

ఆ తర్వాత ,స్థానిక శ్రీని వాస విద్యా లయం లో రెండవ తరగతి చదువుతున్న ఛి .గణేష్ అనే చిరంజీవి 150 దేశాల పేర్లు ,వాటి రాజ దానులను ధారణ చేశి అందరినీ ఆశ్చర్య పరిచాడు .అతనికి జ్ఞాపిక అందజేసి కర  తాళ ధ్వనులతో అభినందనల ను తెలియ జేశాం .
ఆ తర్వాత అసలు కార్య క్రమం ”హాస్య కవి సమ్మేళనం ”ను ప్రముఖ కవి కధా రచయిత ,విమర్శకులు ,ఆంద్ర భూమి లో కాలమ్ రచయిత అయిన శ్రీ వేలూరి కౌండిన్య గారు ,ప్రముఖ మినీ కవిత్వ ,హైకూ కవిత్వ రచయిత ,ఆంద్ర బాంక్ ఉద్యోగి శ్రీ వసుధ బస వెశ్వ ర రావు గారు ,ప్రసిద్ధ కవ యిత్రి విశ్లేష కు రాలు ,తెలుగు పండిట్ ,వక్త అయిన శ్రీమతి కే.కనక దుర్గా గార్ల సంయుక్త ఆధ్వర్యం లో దాదాపు గంటన్నర జరిగింది .మధ్య మధ్య లో జోకుల బాకు లు విసురుతూ ,కవుల కవితలను విశ్లేషిస్తూ ,నవ్విస్తూ ,కవ్విస్తూ ఆద్యంతంహాస్యాన్ని   వడ్డీ వడ్డించారు కవి మిత్రులు ,నిర్వాహకులు .సుమారు తొంభై మంది వీక్షకులు దర్శించిన ఈ కవి సమ్మేళనం ఒక రకం గా విజయ వంతమే .ఇంకో రకం గా కాదు .ఎందుకు అంటే అడిగిఆహ్వానం లో యాభై మంది పేర్లు వేస్తె వచ్చిన కవి మిత్రులు పది హీను మంది మాత్రమే . శని వారం కావటం కొంత ,,,ప్రభుత్వ పాథ శాలలకు ఆ రోజే సంక్రాంతి సెలవుల తర్వాత ,ప్రారంభమైన రోజూ కావటం కొంత అసౌకర్యానికి గురి చేసి వారు రావటానికి ఇబ్బంది కలిగింది .ఇది ఊరట మాత్రమే .హాస్యానికి ఒక రకం గా ‘అప హాస్యమే  ”జరిగిందని నా భావన .అంతే  కాక వచ్చిన కవితల్లో ను సామాజిక చైతన్యంహాస్య స్పోర కత్వం   లేక పోవటం నాకు బాగా నిరాశ కల్గించింది .సరే అన్నీ మనం అనుకున్నంత హిట్లు కావు .కొన్నిఫట్లూ ఉంటాయనీ ,అంతా మన ప్రయోజకత్వమే కాదు ,కాలమ్ కూడా కలిసి రావాలని తెలియ జెప్పిన సమ్మేళనం ఇది .అతిధులకు ,నిర్వాహకులకు కవి మిత్రులకు కన్యాశుల్క   నాటకం లో చక్కని హాస్యాన్ని  పండించి ,తెలుగు జాతిని జాగృతం చేసిన వైతాళికుడు గురజాడ అప్పా రావు గారి ముచ్చ టైన  కలర్ ఫోటో లను జ్జ్ఞాపికలు గా అంద జేశాం .  .అందరు దాన్ని అద్భుతం గా వుందని మెచ్చుకోవటమే మాకు మిగిలిన ఆనందం .కవితలను పుస్తకం గా తేవాలని ముందుభావించినా   విర మించు కొన్నాం . .ఆ కవితలను మీ అందరి కోసం వరుసగా నెట్ లో త్వరలో అంద  జేస్తాం .ఫోటోలు త్వరలో నెట్ లో పెడతాం.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద చిత్ర రామాయణం – విహారి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —11

    సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —11

                              కృతులలో వ్యాజ నిందలు నిందా స్తుతులు అధిక్షేపణ 

 తాను నమ్మిన దైవాన్నో ,రాజునో ,ఇష్టమైన వాడినో ,తిడుతూ పొగడటటం ,పొగడుతూ తిట్టటం ,అధిక్షే పించటం ఒక రకమైన కవితా మర్యాద. చనువున్న కవి చేసే విచిత్ర ప్రక్రియ .భగ వంతుని లో ,ఆనందామృతం పంచుకొనే వారు చేసే రస రమ్య వినోదం .ఇందు లోను ,త్యాగయ్య ది పెద్ద పీటే .”నాకు ఇతర మతాలు తెలీవు .మది కరిగెట్లు భజన చేశాను .నేను భువిని మాని –నీవు కనికరం లేని హీనుడని పించుకోవటం మర్యాదా ?”అంటారు త్యాగ రాజ స్వామి రామ స్వామి తో .నింద  మోపి ,భయ పెడ్తున్నాడు .
శ్రీ రాముడు చేసిన వింత పనులకు గుట్టు తెలిసి కోని ,మంచి ఉద్దేశ్యం తోనే కీర్తిని ఆపాదిస్తాడు .కొత్త పోకడ ,సోంపు తో వున ఈ కృతిని తిలకించండి .
”నిరు పేద భక్తుల ,కారి కోత బడ  లేక గిరి పై ఎక్కావా ?రాలేరు అని శ్రీ రంగం లో దాగావా ?ఎప్పుడో వచ్చే ,జీర్ణ కుచేలుడి కోసం ,గోపీ వస్త్రాపహరణం చేశావా ?//అని ఎద్దేవా చేస్తాడు భక్త త్యాగయ్య.”నిన్ను ఆశ్రయిస్తే ,అన్నీ కష్టాలే .ఎవరేం బావుకొన్నారు ?”అని అధిక్షే పిస్తూ ప్రతి చోట ,ఒక కధకు ఊహ కల్పిస్తాడు .రసికత గల ఈ కృతి చూడండి –
”అడిగి ,సుఖము లెవరు అనుభవించిరి రా ,ఆది మూలమా రామా
ఆశ్రయించి ,వరమడిగిన ,సీత అడివికి బోనాయె –
ఆశ హరణా ,రక్కసి ఇష్ట మడగ ,అపుడే ముక్కు పోయేగా రామా
వాసిగా నారదముని ,వర మడుగ ,వనిత రూపు డాయే
ఆశించి దుర్వాసు డన్న మడుగ ,అపుడే మంద మాయే (కడుపు నిండి పోయింది )
సుతుని వేడుక జూడ దేవకి ,యడుగ ,యశోద సూడ నాయె
సతు లెల్ల ”రతి భిక్ష ”మడుగ ,వారి ,వారి పతుల వీడ నాయె ఓరామా
నీకే దయ బుట్టి ,బ్రోతువో ,బ్రోవవో నీ గుట్టు బయ లాయే
సాకేత ధామ ,శ్రీ త్యాగ రాజ నుత స్వామి -ఏటి ఈ మాయ ఓరామా  ”
”ఈ కృతి లో లలిత ,నిశిత అధిక్షే పణ వుంది ”అన్న విశ్లేషకుల మాట అక్షర సత్యం .అడిగిన వారికి ‘ఎగ నామం పెడ తావు నువ్వు ”అని శ్రీ రామునికే నామాలు పెట్టాడు గడుసు త్యాగయ్య.గురువుకే పంగ నామం అంటే ఇలాంటిదేనే మో ?
భక్తి పుట్టించిన అలౌకిక శక్తి తో త్యాగయ్య ”ఎన్నాల్లూరకే వుందువో  చూతాము .ఎవరడిగే వారు లేరా శ్రీ రామా ?”అని వాడుక భాష లోనే బెదిరిస్తాడు .ఇలాంటి దాన్ని ”ఉపద్రవ భక్తి ”అన్నారు .అంతే కాదు ,”అన్నీ ,తానను మార్గమునను ,చనితే ,నన్ను వీడెను ?అంటావు ,భార మంటావు .”అని నిందిస్తాడు .”తన్ను బ్రోవరా సదా అంటె ,ద్వైతుడనేవు ?”అని దిగ్భ్రమ చెందు తాడు .”ఏ దారి సంచ రించ మంటావు ?నువ్వే చెప్పు ?”అని నిల దీస్తాడు .ఇందులో ఆత్మానందం ,తన్మ యత్వం ,ఆత్మ విశ్వాసం ,అకలంక భక్తి వినమ్ర, వినీత ప్రార్ధన కన్పిస్తాయి త్యాగయ్య లో .
”దేహ బుధ్యాతు దాసోహం ,జీవి బుద్ధ్యా తు త్వదంశః   -ఆత్మ బుద్ధ్యాత్వమే వాహం ”అన్న శంకరా ద్వైతాన్ని ,భక్తి పూర్వక నిర్వచనం  ఇస్తాడు త్యాగ య్య భక్త శిఖామణి .
”నన్ను దగ్గరకు తీయ వద్దని ,నీ పరి వారం లో ఏవ రైనా అన్నారా నీతో ?లేక గరుత్మంతుడు ”సమ్మె చేశాడా “”/అని స్మిత పూర్వాభి లాషి (నవ్వి ,మాట్లాడే వాడు )మందస్మిత వదనారవిన్దుడు అయిన   రామ ప్రభువును ,అవహేళన చేస్తాడు ,ఆర్తి గా .”నగు మోము గన లేని ,నా జాలి తెలిసి ,నను బ్రోవగ రాదా శ్రీ రఘు వర -నీ నగు మోము
నగ రాజ ధర ,నీడు పరి వారు లెల్ల ,-ఒగి బోధ న చేసే వారలు గారే -ఇటులున్డుదురా ?
ఖగ రాజు నీ యానతి విని వేగ చానా లేదో ?గగనానికి ఇలకు బహుదూరంబని నాడో ?
జగ మేలే పర మాత్మా !ఎవరితో మొర లిడుదు -వగ జూపకు ,తాళను ,నన్నేలు కోరా -త్యాగ రాజ నుత” –
ఒక వేళ లంచాలేమైనా పని చేశాయా ?ఇకా ఎక్కువ ఎవరైనా ముట్ట జెప్పారా ?”అంటూ పాత కధలు మనోజ్ఞం గా జ్ఞాపకం చేశారు త్యాగయ్య .
”ఇభ రాజేంద్రుడు ఎక్కు వైన లంచమిచ్చినా డేమిరా ?-సభలో మానము బో సమయంబున సతి ఎమిచ్చేనురా ?
భాగవతాగ్రేసర ,రాసికావన ,జాగ రూకుండని  పేరే ?–రాగ స్వర యుత ,ప్రేమ భక్త ,జన రక్షక ,త్యాగ రాజ పండిత ”
భక్తుడిని ,ఉపెక్షిస్తుంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య .అందుకే అంత ఘాటు మాటల పోట్లు పొడిచాడు తన రామయ్యను .సంగీత భక్తుల యెడ ,శ్రీ రామునికి పక్ష పాఠం వుందని ,పాత భక్తి  సంగీత సార్వ భౌముల కధలు ,గాధలు విన్న వాడు ,వారి వ్యధలన్నీ తెలిసిన వాడు అయిన త్యాగయ్య .
భక్తుడు దీనా వస్తా లో వుంటే దేవి తో సరస సల్లాపాలా ?అని ”కోలా హల ”రాగం లో కోలా హలం ,హల్చల్ సృష్టించాడు .లలిత నిందా స్తుతి తో ,తళుకు బెళుకు తో మనసును ఆకర్షిస్తాడు .అవతారాలు పది వున్నా ,అందులో ”రామా వతారమే ,రామ వేషమే మిన్న ”అని ఉబ్బి పోయే ఉబ్బు లింగం త్యాగ బ్రహ్మం .
”పది వేసములలో ,రామ వేసమే -బహు బాగనుచు గోరు నన్ను ,బ్రోవ
ఇట్టి వేళ నీ కెట్లు తోచు నని ,-ఇల్లాలితో ముచ్చట లాడేదు ?
రట్టు నీ మనసు కెట్టు తోచెనో ,రక్షించుటకు ,శ్రీ త్యాగ రాజ నుత
మది లో యోచన పుట్ట లేదా ?మహా రాజ రాజేశ్వరా ?”
ఇటు కాక పొతే ,అటు నుంచి నరుక్కు రామ్మన్నారన్న నానుడి త్యాగయ్య కూ తెలుసు .అందుకే అయ్య వారిని వదిలి అమ్మ వారి శీలాన్ని పొగడటం ప్రారంభించాడు ..సీతమ్మ ను పెండ్లాడ బట్టే నీ వైభోగం అంటాడు కాంభోజి రాగ కృతిలో
”మా జానకి,చట్ట బెట్టగా ,మహా రాజు వైతివి -రాజ రాజ వర రాజీవాక్ష విను
రావా నారి యని రాజిల్లు కీర్తియు ,కాన కేగి యాజ్న మీరక
మాయా కారమునిచే ,శిఖి చెంతనే యుండి -దానవుని వెంట చని అశోక తరు మూల నుండి
వాని మాటలకు కోపగించి ,-కంట ,వధి ఇమ్పక నే యుండి
శ్రీ నాయక ,యశము ,నీకే కలగా -జేయ లేదా ?త్యాగ రాజ నుత ”
అక్క యైన శ్రీ మహా లక్ష్మి భర్త శ్రీ రాముని ,బావగా భావించి పెడు తున్న చీవాట్లు ,ఎత్తి పొడుపుల్లో చాతుర్యం ,మంచి పాకం లో సాగుతాయి ”.వైకున్థం లో వున్నా ,నా దగ్గరకు వచ్చి ,నా హృదయ పీఠం అధివ శించి  ,నన్ను సంతోషింప జేస్తున్నావు .మారు పలకవు .నేనేమైనా జార ,చొర భజన చేశానా” ?అని నిందా,స్తుతి అధిక్షేపణ పెన వేసి నిల దీస్తాడు .ఆ హక్కు తనకే వున్నట్లు భావితాడు .నిజం గా జారుడు చోరుడే కదా శ్రీ కృష్ణుడు .”తులసీ దాస సంప్రదాయం” లో శ్రీ కృష్ణ భజన చేయరట .శుద్దాత్వైతం లో అంటె” వల్లభా చార్యుల మతం” లో రామ భజన చేయరట .ఇదో వింత భక్తి .

” ప్రాప్తి గల్గు చోట ఫల మిచ్చు దైవంబు-ప్రాప్తి లేని చోట ఫలము లేదు
ప్రాప్తి లేక పసిడి ,పరమాత్ము డిచ్చునా ?”అన్నాడు ప్రజా కవి వేమన .అలాగే త్యాగయ్య కూడా
”రానిది రాదు ,సురాసురులకైనా ,-పోనిది పోదు భూసురలకైనా ”అంటూనే
దేవేంద్రునికి సుదేహము ,పూర్వ దేవుళ్ళకు అమృతం అభావం కాలేదా ?”అంటాడు .
”ఆ వన చర బాధలు ఆ మునులకే గానీ ,”అన్న మాట సర్వ జీవులకు ఆనవా యించే సూత్రమే .రాక్షసులను ” పూర్వ  దేవుళ్ళు ”అనటం సరదా అయిన మాట .వాళ్ళూ ఒకప్పుడు  దేవుళ్ళే నని గుర్తు చేయటమే .మునులకు అరణ్య వాసం పాపం వారి నుదిటి వ్రాత గా అభి వర్ణించటం తమాషా .దీన్ని ఎవరు తప్పించ లేరు అని ధ్వని .విధి బలీయం అనటాన్ని సమర్ధించటం ..
దొంగ దారు లు తొక్క కుండా ,మాట మీద నిల బడ మని ఘాటుగా నిందా స్తుతి చేస్తాడుతమాషాగా .”ఇల్లు బంగారం అయిందా ?”అనీ ,”రంగాడా విభీషణునికి ,పంగ నామ మిడిన రీతిని ”పూర్వ కధ గా అభి వర్ణిస్తాడు .విభీషణుని తో లంకకు వస్తానని ఎగ గొట్టిన రాముడి మాట ను ఇక్కడ గుర్తు చేశాడన్న మాట .
”వెన్న తా   భుజించి ,గోప కన్య ముఖమున -తిన్న  గా నలది నట్లు ;”అన్న కృతి లో ఆలా కృష్ణ లీలలు వర్ణిస్తూ చెప్పటం గొప్ప గా వుంది .ఇందు లో శ్లేష ను కూడా జోడించి చెప్పాడు .విభీష నుడి రాజ్యానికి  పోవ టానికి ఇష్ట పడని రాముడు ”సహ్యజ ”తీరం లో కొల్లడం ,కావేరి నదులు గా చీలిన అంతర్వేది తోనే తృప్తి పడ్డా డని  చమత్కారం .

”సారమౌ కవితల ,విని వెర్రి వాడు -సంతోష పడి ఏమి పడ కేమి ?
చేరెడేసి గుడ్డి కనులు  బాగా ,తెరచి ఏమి తెరవ కున్న వేమి ?
ఎదను శ్రీ రామ భక్తియు లేని ,నర జన్మ   -మెత్తి ఏమి ,మృగ మైతే నేమి ?
పదము ,త్యాగ రాజ నుతు ని పై ,గానిది -పాడితే ఏమి ?ఏడ్చి తే నేమి ”?

అని రసవత్తరం గా అధిక్షే పించే సత్తా త్యాగయ్య భక్తునిది .త్యాగ రాజ వినతుని ,కడిగి ఎందేయ గల సామర్ధ్యం చాతుర్యం ,చేవ ఆయనకే వుందని పిస్తాడు .ఎగ తాళి చేసినా ,సమయం తెలిసి పుణ్యాన్ని ,ఆర్జించాలని త్యాగయ్య హావం .సొంపైన నడ వాది ,మనసుకు పట్టే లోకోక్తులు ,లోక రీతి ,కాల గతి ,చూపిస్తాడు త్యాగయ్య .శ్రీ రామ భక్తి ఏ పరమ తారకం అనే పూర్తి విశ్వాసం తో వున్న భక్త శిరోమణి ,రామ పాద సేవా దురంధరుడు త్యాగ బ్రహ్మ .
వ్యాజ నిన్దాస్తుతులు ,అధిక్షేపణ లకు ఇంతటి తో స్వస్తి పలుకు దాం .
త్యాగ రాజ కృతుల్లో” భక్తి ,శరణా గతి ”గురించి తరువాత వివరంగా తెలుసు కొందాం
సశేషం
మీ –గబిత దుర్గా ప్రసాద్ –20 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –10

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –10

                                         పద చిత్రాలు –2
ఇంకొన్ని పద చిత్రాల సోంపు చూద్దాం .శ్రీ రామునికి ఇరు వైపులా సీతమ్మ ,లక్ష్మణుడు నిల బడి సేవ చేస్తున్న వైనాన్ని , ,ఖర హరుడైన శ్రీ రామునికి ”ఖర హర ప్రియ ”రాగం లో ,త్యాగయ్య ఔచితీ వంతం గా చేసిన రచన తిల కించండి . .
”ప్రక్కనా నిలబడి ,కొలిచే ముచ్చట  బాగా తెలప రాదా –చుక్కల రాయని ,గేరు మోము గల ,
సుదతి సీతమ్మ ,సౌమిత్రియు ,ఇరు ప్రక్కలా నిలబడి —
తనువు చే వందన మొనరించు చున్న -రాచనవున,, రామ కీర్తన చేయు చున్న రా
మనసున దలచి ,మై మరచి వున్న ,-రా నేనరుంచి ,త్యాగ రాజుని తో హరి హరి ,మీ కిరు  ప్రక్కలా ” ,
ఇదొక అలౌకిక చిత్రం .మాటల చిత్రం ,మనసు కు పట్టే చిత్రం .ఆ దృశ్యం ,మనో వీధి లో చూచి ,మై మరపించే పులకింపు .తానూ ,మైమరుపు తో  సేవిస్తున్న భావన .విశ్వాస  పూర్వక మైన ఆకాంక్ష.
త్యాగయ్య శ్రీ రాముడు కేళీ వినోదుడు .తెలుగు వారి ”ఓమన గుంటలు ”ఆడతాడు .విశ్వ రూపుని కేళీ విన్యాసం .ఆది దంపతుల మధుర ప్రణయ లీలను దివ్య చిత్రం గా మలుస్తాడు .పద బంధం తో ప్రేమ జ్యోత్న పరుస్తాడు .పోతన్న గారు ”అల వై కుమ్థ  పురంబు లో ”,అన్న పద్యానికి అనుకరణ ,చాతుర్యం చూపిస్తాడు త్యాగయ్య .
”మధుర మైన పల్కులసీతా రమణి తో ,”ఓమన గుంట గెలుచుట ” ” ,
చేత ,నొకరి నొకరు చూచుచు ,సాకేతాధిప ,నిజ మగు ప్రేమతో ,
బల్కు కొన్న ముచ్చట ,వాతాత్మజ ,భరతులు విన్నతుల .త్యాగ రాజ సన్నుత
విన నాస గోన్నానురా ,విశ్వ రూపు డనే ,మనసార ,వీనుల విందుగా ”
లలిత లావణ్య మూర్తి శ్రీ రాముని ముద్దు లోలికే మోము ను భక్తి మీర త్యాగ రాజు వర్ణిస్తాడు .సౌందర్యో పాసన తో ఆ స్వామి తను వంతా ,సౌందర్య సుకు మారం గా ,కాంతి వంతంగా ,కన్పిస్తుంది మనో వీధిలో
”సొగసు చూడ తరమా ?నీ సొగసు చూడ తరమా ?
నిగ నిగ మనుచు ,కపోల యుగము చే మెరయు మోము –అమరార్చిత పదయుగామో ,
కమ నీయ ,తను ,నిందిత కామ ,కామ రిపు నుత ,నీ -సొగసు చూడ తరమా ?
వర బింబ సమాధరమో ,వకుళ సురంబుల యుగమో–కర ద్రుత శర కోదండ ,మరక తాంగ వర మైన
చిరు నవ్వు ,ముంగురు లతో ,మరి కన్ను ల తెటో -వర త్యాగ రాజార్చిత ,వంద నీయ -ఇటు వంటి -సొగసు చూడ తరమా”
పంచ నదీ తీరం లో త్యాగయ్య స్వయం గా ,జరి పించిన నిత్య భజనో త్సవంకన్నుల   ముందు నిల బెట్టు తాడు .సుందర పద బంధాలు తాళ నృత్య గతులతో వెంట నర్తిస్తాయి .అదీ త్యాగయ్య కృతి వైభవం .
”హరి దాసులు వెడలె -ముచ్చట ఆనంద మాయే -దయాళో
హరి గోవింద ,నరహరి ,రామ కృష్ణ యని ,వరుసగ నామము కరుణ తో జేయుచు
సంగతి గాను ,,మృదంగ ఘోష ములచే ,పొంగుచు ,వీధుల కేగుచు ,మెరయుచు
         చక్కని హరి చే జిక్కితి మని ,మది సొక్కుచు నామమే ,దిక్కని పొగడుచు –హరి గోవింద
          దిట్ట ముగా నడు కట్టు తో నడుగులు ,బెట్టు చు ,తాళ ముల్  బట్టి,గల్ గల్లన
జ్ఞాన ముతో ,రామ ధ్యానముతో ,మంచి గానము తో ,’మేను దాన” మొస గుచు
రాజ ,రాజుని పై ,జాజులు ,చల్లుచు ,రాజిల్లుచు త్యాగ రాజు ని తో గూడి –హరి ,గోవింద” —
భక్తుల ఆనంద పార వశ్యం నృత్య గాన భంగి మలు ,మనో ఫలకం పై ,ముద్ర వేసి నట్లు గా పదాల పరుగు ,నాట్యం చేసి నట్లుండే నడక ,మనో హర పద బంధం .అర్ధ వంతం ,మధుర శబ్ద ప్రయోగం .వారందరికీ శ్రీ రామ నామమే దిక్కు .”మేను దానం ”అనటం లో శరణా గత తత్పరత కని పిస్తుంది . ఈ విధం గా తాను మనసు లో ఊహించుకొన ,తాను సమాధి స్తితి లో దర్శించిన ,శ్రీ రామ కుటుంబ సపరి వార చిత్రాలను చక్కని పద బంధాలతో మృదు మధుర పద సౌందర్యం తో వర్ణ చిత్రాలు గా వేసి ,చూసి తరించ మని తెలియ జేశాడు త్యాగ రాజ మహా పద చిత్ర కారుడు .
దీని తర్వాత ”కృతుల లో -వ్యాజ నిందా స్తుతి ,అధిక్షేపణ ”లను తారు వాతి భాగాలలో  తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –9

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –9

                                       కృతులలో పద చిత్రాలు 
పరమ భక్తాగ్రేసరుడు త్యాగయ్య శ్రీ రాముని కొలువు సన్నిధానం గా చేసుకొని, చూసి ,పాడి ,తన్మయుడై  ,ఒక దృశ్య చిత్రం లా మన ముందు వుంచుతాడు .,
”పాహి రామ యనుచు ,భజన సేయవే -మనసు రంజిల్ల బల్కె మదన జనకుడు
కలువల రేకుల ను గేరు కనుల జూచెను -భారతుడా వేళ కరిగి కరిగి నిలవగా
కరము బట్టి కౌగిలించే వరదు డప్పుడు -మనసు దెలిసి ,కలిసి హనుమంతు డుండగా
చనువు మాట లాడు ,చుండే సార్వ భౌముడు ”
ఊహలో అద్భుత పదచిత్రం గీశాడు .మనసుకు హత్తు కొనే హృద్య మైన రచన ఆ భావుక కవి కి వరం గా లభించింది .
అలాగే ”సౌరాష్ట్ర రాగం ”లో ”వినయము కౌశికు వెంట జను ,నంఘ్రులను ,చూచే దెన్నటికో ”అంటూరామ కధా విధానాన్ని రూపు కట్టిస్తాడు .చిత్ర కారుడిగా మన ముందు నిలుస్తాడు . ,
”ఘన మైన ,పుష్పక మున ,రాజిల్లిన సొగసును -చూచే దెన్నటికో
భరతుని గని చేయి బట్టు కోని ,వచ్చిన వేడుక ను చూచే దెన్నటికో
కనక సింహాసనమున ,నెల కొన్న ఠీవి ని ,చూచే దెన్నటికో ”        అని శ్రీ రామ పట్టాభిషేక మహోత్స వాణ్ని ,కళ్ళ ముందు ప్రదర్శిస్తాడు .హృదయాలను ,ఆర్ద్రం గా మారుస్తాడు .ఇక్కడ త్యాగయ్య లోని భక్తుడు ,కవి ,చిత్రకారుడు ,కొత్త రీతుల్లో కని పిస్తారు .ఆలన్కారికం గా రచన అందం పొందింది .అవయవాలకు ,ఉదాత్త మహిమ కల్పిస్తాడు
”వెనుక ,రాతిని ,నాతి చేసిన చరణము చూసే దెన్నటికో
ఘనమైన శివుని చాపము ను ,ద్రుంచిన ,పాదమును చూచే దెన్నటికో
ఆగమ నుతుని ,ఆనంద కందుని ,బాగ చూచే దెన్నడో
పరమ భాగవత ప్రియుని ,నిర్వి కారు ,నిరాకారుని  రాగ చూచే దెన్నడో ”ఈ కీర్తన లో ,బావం ,భాష ,కల  కండ పలుకే .
పలుకు పలుకున తేనే అంటే ఇదే .ఒక్కొక్క సంఘటన ఒక ”రవి వర్మ చిత్రమే నని పిస్తుంది”అన్న విజ్ఞుల భావన నూటికి నూరు శాతం నిజం .
ఈ చిత్రాలు ,విచిత్రాలే కాదు ,కళా మర్మాలకు ఆల  వాలు . త్యాగయ్య కీర్తనలు రస నిష్యంద నాలు .సౌందర్య స్ఫోరకాలు .గాన కవితా చాతుర్యాలు .
మారీచుని మదం అణచే వేళ ,శివుని ధనువు విరిచే వేళ ,శ్రీ రాముని ముంగురుల కదలిక ఆయనకు ,విశ్వా మిత్రునికి అద్భుత ఆనందాన్ని ,గగుర్పాటును కలుగ జేశా యట  .ఆ శిరో సౌందర్యం ఏమిటో  మనమూ దర్శిద్దాం .
”అలక లల్లలాడగ  ,,గని ,ఆ రాణ్ముని ఎటు పొంగెనో ?

—    చెలువు మారగను ,మారీచుని మద మణి చే వేళ
ముని సైగ దెలిసి ,శివ ధనువును విరిచే ,
సమయమున ,త్యాగ రాజ వినతుని ,మోమున రంజిల్ల  –అలకలల్ల లాడ
త్యాగ రాజ సత్కవి కి అంతా సుందరం ,శివం .
శ్రీ రాముని కొలువు లో ,త్యాగయ్య ప్రతి క్షణం తన్మయ స్తితి లో ఉంటాడు .గోష్టి ,సంకీర్తన ,సేవింపు ,మేలు కొలుపు ,పవ ళింపు దిన చర్య .
”చనవున ,పన్నీట స్నానము గావించి ,-ఘను నికి ,దివ్య భోజనమును ,బెట్టి
కమ్మని విడే మొసగుచు ,మరవక సేవించే –భాగవతులు ,బాగుగా ,ఘన ,నయ రాగ ములచే ,దీపా రాదన మొన రించి
వేగమే ,శ్రీ హరి విరుల పై ,పవళించి ,జోకొట్టి ,-త్యాగ రాజు సుముఖుని లేపే -”
ఇది సంపూర్ణ పరిచర్య స్వరూపం .కళ్ళకు కట్టి నట్లు వ్యక్తీకరించటం త్యాగయ నేర్పు .
శ్రీ రాముని కొలువులో ,వార కాంత ల ,రమణీయ లాశ్య విన్యాసం చూసి పక్కనున్న త్యాగయ్య తో రామయ్య  మెచ్చు కోలు మాటలు చెప్పి నట్లు భావిస్తాడు .ఆ దివ్య దృశ్యం మన కళ్ళ కు కట్టి నట్లు వర్ణిస్తాడు ,కాదు ,కాదు చిత్రిస్తాడు మహా భక్తాగ్ర గణ్యు డైన  త్యాగరాజ  కవి చిత్ర కారుడు .
”సుర కామినీ ,మణుల గాన -మాదరణ నాల కిన్చుచు
శృంగార ,రస యుక్త ,వారమ ణుల ల జూచి ,సరస త్యాగ రాజ వరుని తో బొగ డే
పలుకు కండ చక్కర ను గేరునే -పణ తు  లార చూడరే ”పటిక బెల్లం పలుకు మెల్ల ,మెల్ల గా కరుగు తూ రుచి నిస్తుంది .అంటే ఆ వాక్యాల మాధుర్యం క్షణికం కాదు ,శాశ్వతం ,ఆత్మాను భవం ,దివ్యాను భవం కవిత్వానికే ప్రాణం .
ఇంకొన్ని పద చిత్రాలు మరో సారి చూద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆత్మగానం – ఆంద్ర జ్యోతి లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధ్యధరా లో ఆ రాత్రి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహితి మిత్రులు మచిలీపట్టణం ఆహ్వానం

Ravi Ranga Rao Invitation

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –8 కృతుల లో ఆలన్కారికత -2

         సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –8

                                కృతుల లో ఆలన్కారికత -2

         త్యాగ రాజ స్వామి తన కృతులకు ముస్తాబు చేసిన అలంకారాలను కొంత వరకు చూశాం మిగిలిన అలంకార శోభ తిలకిద్దాం .
పంచ నదీ తీరాన్ని ,నిసర్గ రమణీయం గా వర్ణించాడు త్యాగయ్య .భౌగోళికం గా ఒక travelogue లా వుంటుంది .

”ఈడు లేని మలయ మారుతము చే ,కూడిన కావేరి తటమందు
వేడుచు ,భూసురు లగ్ని హోత్రులై ,వేద ఘోషముల చే,నుతింప
ఈ మహిలో సొగసైన చోళ సీమ యందు ,వరమైన ఈ పంచ నద పుర
ధాముని చెంతను ,వసించుటకై ,నీ మది నెంచగ ”

     ఇంత ఆనందాన్నిచ్చే పరి సరాల్లో సీతా రాములు వెలసి ఉన్నారట.అదీ ఆయనకు కలిగిన ఆనందం .
త్రిమూర్తులు ,శ్రీ రామ కధ విన్నారు .ఒక సామాన్య రాజుకు ,ఇన్ని మంచి గుణాలా ?అని సందేహించారట .ఈ గుణాలకు ,వెల కట్టాలి అను కొన్నారట .తమ గుణాలను అన్నిటిని   త్రాసుకు వుండే ఒక సిబ్బెలో ,శ్రీ రాముని గుణాలను రెండవ సిబ్బే లో వేసి తూచారట.వారి పళ్ళెం కిందకు జారి పోయిందట .వారి మత్సరం యెగిరి పోయిందట .ఈ ఘట్టాన్ని ,అత్యంత భావ గర్భితం గా ,ఆనంద పార వశ్యం తో వర్ణిస్తాడు భక్త కవి .ఒక రమణీయ కల్పనా శక్తి త్యాగయ్యలో ఆవిష్కృత మైన సందర్భం .
ఇంకొక చోట ,కావేరి నదిని సౌందర్య కన్యా మణి గా ఉత్ప్రేక్షిస్తాడు .కల నినాదం తో ,సుందర గమకం తో ,కమ్మని ,ఆ కావేరి జలమంతటి మాధుర్యం తో ,పవిత్రత తో ,కవితా శైలి తో  వర్ణిస్తాడు .

”సారి వెడలిన ,ఈ కావేరి చూడవే -వారు ,వీరనుచు జూడక ,తా
నవ్వారిగా ,భీష్టముల నొసగు చు –సావేరి చూడవే ”
దూరమున నొక తావున ,గర్జన భీకరమొక తావున ,నిండు కరుణ తో
నిరతము నొక తావున ,నడచుచు ,వర కావేరి కన్యకా మణి ”    అంటూ ,ఆ కావేరి

కన్య సొగసు ,అందం ,నిండుదనం ,,ఉద్ధృతి ,కరుణా న్త రంగం ,దృశ్య మానం చేస్తాడు .కావేరి నదికి ఒక గొప్ప సుగుణం వుంది .ఆ నీటిలో ఎనభై శాతం నీరు ఉపయోగానికి పని కొచ్చేదే .చిన్న నది అయినా” జీవనది” గా పేరు పొందింది .భావుకు డైన త్యాగయ్య కవిగా చెప్పిన  ”గేయ కధా చరిత్ర ”  గా దీన్ని విజ్ఞులు భావించారు .

   త్రిపుర సుందరి దేవి ని వర్ణిస్తూ ,ఆ దేవి లావణ్యాన్ని , అలౌకిక గుణ గౌర వాన్ని ,మనోజ్జ్నం గా మనసుకుహత్తు  కునేట్లు  మన ముందు నిలబెడ తాడు .రమ్య భావ విలసిత మైన రచన మనం దర్శిస్తాం .
”సుందరి నిను వర్ణింప ,బ్రహ్మాది సురల కైనా ,తరమా ,త్రిపుర సుందరి
కలకలమను ,ముఖ కళలు గని ,కలువల రాజు భువికి ,రాడాయె
చెలగు నీ లావణ్యము గని ,యల నాడె ,వల రాజు కానక (భస్మమై )పోయే
నిలువరమగు ,నీ గంభీరము గని ,జల రాజు జడ వేషు డాయె
బలమైన ధీరత్వమును గని ,కనకాచలుడు తా శిల రూపు (స్థాణువు )డాయె
కనులను గని ,సిగ్గు పడి ,గండు మీనులు ,వనధి వాసము చేయ నాయె
జనని ,నీ చిరు నవ్వు కాంతి సోకి  ,శివుడనుపమౌ శుభ్రు డాయె
కనకాంగి నీ స్వరమును విని ,వాణి ,మగని జిహ్వకు దా పూనికాయే (నాలుక పైన చేరింది )
పావనము సేయు ,బిరుదు గని ,భర్త ,పాపము పారి పోయే
భావించి ,నీ పాదమున ,త్యాగ రాజు భావుక మను కో నాయె –త్రిపుర సుందరి ”
ఇది ప్రబంధ రచనా ప్రక్రియ గా కని పిస్తుంది .ఇందులో ”అన్యాప దేశం ”వుంది ,అవహేళన వుంది ,అర్దాంతరం వుంది ,శ్లేష ,వ్యంగ్య వైభవం అన్నీ కలిపి అల్లిన సుగంధ సుమ మాల గా వుంది .అందుకని దీన్ని త్రిపుర సుందరి మెడకు  ఆ  భరణం చేశాడు .భక్తీ ,తాత్పర్యం ,అలౌకిక అను భూతి అన్నీ మేళ వించి రాసిన సర్వాలంకార శోభిత కృతి .ఆ పద చాతుర్యానికి అబ్బుర పడతాం .ఒక కవి సార్వ భౌముడు రాసిన ,అందం ,చందం ,మూర్తీ భ వించిన ,కవితా విన్యాసం లా సాహిత్య పరీమళాలు వెద జల్లిన సుమనోహర సుందర రచనా విన్యాసం .ఎంత చెప్పినా ఇంకా తక్కువే అని పిస్తుంది . త్యాగయ్య మాటల సృష్టికర్త .వేద వాగ్మయాన్ని ”మినుకు చదువులు ”అంటాడు .ఒక్క ఈ కృతే ”సరస శ్లేష కావ్యం ‘గా భాసిస్తుంది .అంతటి కావ్య గౌరవం కల్గించాడు ఒక్క కృతి లో .ధన్యుడు త్యాగయ్య .ధన్య తెలుగు కవితా సరస్వతి ,సంగీత సరస్వతి .
త్యాగ బ్రహ్మను ”కవి బ్రహ్మ ”అనటానికి ఈ ఒక్క కృతి చాలు అని పండిత విశ్లేషకుల ఏకాభి ప్రాయం . ఆయన రచనా పాట వానికి జోహార్లు అర్పించారు అందరు .ఏ కోణం లో చూసినా ఈ కృతి లోని కవిత్వం అమృత తుల్యం గా భాసిస్తుంది .అజరామరం గా అందుకే నిలిచి పోతుంది .ఇహ ,పర సాధక  మైన రచన  .అద్వైతామృత వర్షం తో మనల్ని తరింప జేశాడు ..
గాన లహరీ శీతల గంధ వాహనమే .హిమాలయోత్తుంగా కమనీయ భావనా  చాతుర్యమే ,మనకు కని పిస్తుంది .ప్రతి పదాన్ని ,సార్ధకం గా ప్రయోగించే శబ్ద బ్రహ్మ ,త్యాగ బ్రహ్మ .
తరు వాత త్యాగయ్య కృతుల్లో ”పద చిత్రాలు .”గురించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –13 ఆపద్బాంధవుడు- చిలుకూరి (చిలుకూరాయన) వెంకటేశ్వర్లు గారు

         ఊసుల్లో ఉయ్యూరు –13

                                 ఆపద్బాంధవుడు- చిలుకూరి వెంకటేశ్వర్లు గారు 

              1951 లో మేము హిందూ పురం నుంచి ఉయ్యూరు వచ్చేశాం .మా నాన్న గారికి హిందూపూర్ మునిసిపల్ హై స్కూల్ నుంచి ,జగ్గయ్య పేట జిల్లా పరిషద్ హై స్కూల్ కు బదిలీ అయింది .అందుకే ఉయ్యూరు కు చేరాం .రెండేళ్ళ తర్వాత నాన్న ఉయ్యూరు హై స్కూల్ కు వచ్చేశారు .
సంప్రదాయ కుటుంబం కనుక తద్ది నాలు ,పండుగలు శాస్త్రీయ పద్టతి  లోనే జరిగేవి .అప్పుడే మాకు చిలుకూరి వెంకటేశ్వర్లు గా రితో పరిచయం ఏర్పడింది .ఆయన మా బజార్లోనే కాలువ కు దగ్గర గా సూరి వాళ్ల ఇంట్లో అద్దె కు వుండే వారు .యడవల్లి శ్రీ రామ మూర్తి గారు అనే మోతు బరి రైతు అవతలి బజార్లో వుండే వారు .యెర్ర గా ,పిల్లి కళ్ళ తో చెవిలో బొచ్చు తో వుండే వాడు .ఖద్దరుబట్టలే కట్టే వాడు .పంచె ,లాల్చి ,ఉత్త రీయం .బ్రాహ్మడు ఎరువుల వ్యాపారం చేయటం ఆయన తోనే ప్రారంభం .వ్యాపారం చాలా పకడ్బందీ గా చేసే వాడు .ఆయనకు తమ్ముడు సాయం .ఆ ఎరువుల కొట్లో వెంకటేశ్వర్లు గారు గుమాస్తా గా పని చేసే వారు .జీతం పెద్ద గా ఉంటుందని అనుకోను .అసలు వీరిది ,ఉయ్యూరు కు దగ్గరలోని శాయ పురం అగ్ర హారం.అక్కడి నుంచి వచ్చి ఉయ్యూరు లో కాపురం పెట్టారు .పంచె కట్టి ,చొక్కా తొడిగే వారు .పైన తువ్వాల వుండేది .పొడుగ్గా ,బక్క పలుచ గా వుండే వారు .వియత్నాం నాయకుడు హోచిమన్ లాగా పిల్లి గడ్డం తో వుండే వారు .కొంచెం యెరు పు రంగే ..మాట చాలా స్పీడ్ గా వుండేది .అర్ధం అవటం కొంచెం కష్టం గా వుండేది .ముగ్గురు మగ పిల్లలు ,ఇద్దరు ఆడ పిల్లలు ఆయనకు .అందర్నీ ఆ జీతం తోనే పోషించాల్సి వచ్చేది .అందు కని ఎవరైనా తద్దినాలకు బ్రాహ్మణా  ర్తాలకు  పిలిస్తే వచ్చే వారు .రావటానికి ఆయన యడవల్లి వారి పర్మిషన్ తీసుకొని రావాల్సిందే .ఆయన్ను మధ్యాహ్నం  పన్నెండు గంటలకు వదిలే వారు .ఆ తర్వాతే ఆయన బ్రాహ్మణా ర్థం  కు వచ్చే వారు .ఇంట్లో వంటలు అయి రెడి గా వుంటే అప్పుడు ,ఎరువుల కొట్టుకు వెళ్లి చెప్పే వాళ్ళం .అప్పుడు ,ఆయన బయల్దేరి వచ్చే వారు .ఒక్కో సారి కొట్లో  పని ఒత్తిడి వుంటే ఆయన రావటం ఆలశ్య మయ్యేది . ఇక్కడ యజ మానులు ,ఆయన కోసం ఎదురు చూస్తూ ,తిట్టు కొంటు వుండే వారు .ఈ తిట్లు కొన్ని యద వల్లి వారికి కూడా .ఆయనకు అంటే శ్రీ రామ మూర్తి కి కర్కోటకుడు అని పేరు . అప్పు పెట్టె వాడు .మొహమాటం అనేది అసలు లేదు .నాన్న కు శిష్యుడు , మామయ్యకు సహాధ్యాయి .ఎక్కడైనా బావ కాని వంగ తోటలో కాదు అన్నట్లు ప్రవర్తించే వాడు .వెంకటేశ్వర్ల గారికి కూడా అక్కడ పని చేయటం కష్టం గానే వుంది . చాకిరీ గొడ్డు చాకిరి చేయాలి ,జీతం గొర్రె తోక .విసుగు అని పించి మానె శారు.
ఉద్యోగం పోయింది కనుక ,ఏదో ఒకటి చేసి పొట్ట పోషించు కోవాలి .కనుక బ్రాహ్మ ల ఇళ్ళల్లో నీళ్ళు పోసే వారు .పుల్లేరు కాలువ నుంచి ,పెద్ద ఇత్తడి బిందెల తో నిండా నీరు తెచ్చి ఇళ్ళల్లో పోసే వారు .మేమూ పోయిన్చుకోవటం ప్రారంభించాం . మడిగా  నీళ్ళు తెచ్చే వారు .తడి బట్టతో .బట్ట అంటే అంగ వస్త్రమే  ..   .పైన ఏమీ ఆచ్చాదన వుండేది కాదు .దాన్నే గోచి పోసి కట్టి తడి గా , మడి నీళ్ళు పోసే వారు . పండుగా .పబ్బం అయినా ,తద్దినాలు అయినా ఎక్కువ నీళ్ళు పోయించుకొనే వాళ్ళు . నెలకూ రెండు రూపాయలిచ్చే వారేమో ఒక బిందెడు నీళ్ళకు .ఆ తర్వాత క్రమం గా పెంచు కొంటు నెలకు ముప్ఫై దాకా ఇచ్చే వారు .ఈ చనువు తో ఆయన్ను” ఏమండీ” అనటం మానేసి ”చిలుకూరాయన ”అనే స్థితికి వచ్చాం .”అండీ పోయి ఏమయ్యా” లోకి వచ్చింది . అది మా అల్ప బుద్ధికి నిదర్శనం అని ఇప్పుడు అని పిస్తుంది . దీనికి తోడూ ఆయన కొంత వైదికం నేర్చుకొన్నారు .బ్రాహ్మనార్తాలతో పాటు మంత్రం చెప్పటం కూడా మొదలు పెట్టారు .అప్పటికి ఉయ్యూరు లో వంగల సుబ్బావధాని గారు ,కోట కృష్ణ మూర్తి గారు ,పాల పర్తి వెంకట్రామయ్య గారు వైదీకం చేసే వారు .మా ఇళ్ళలో సుబ్బయ్య గారే ఇంటి పురోహితులు .ఆ తర్వాత ఆయనకు వీలు లేక పొతే కృష్ణ మూర్తి గారు .ఒక్కో సారి వీరిద్దరికీ తీరుబడి లేక పోతే చిలుకూరాయనే మా కు పురోహితులు .మా నాన్న తరం వరకు బాగానే గడిచి పోయింది .మా తరం వచ్చే సరికి అభావం   ఏర్పడింది .అప్పుడు మాకు ఆపద్బాన్ధవుని లా,వెంకటేశ్వర్లు గారు తోడు పడ్డారు .నాన్న టైం లో పొలం లో కుప్ప నూర్చతసం లో చిలుకూరి వారి సహాయం తీసుకొనే వారు . రాత్రి తనతో పాటు పొలం లో కాపలా కు తీసుకొని వెళ్ళే వారు .ఒక వేళ నాన్న కు వెళ్ళటం కుదరక పొతే కడవకొల్లు పొలానికి ఆయన్నే కాపలాకి పంపే వారు . మాట కాదనటం ఆయన నిఘంటువు లో లేదు .ఆ తర్వాత నేను పొలం వ్యవ హారాలు చూసే టప్పుడు కూడా సాయం చేసే వారు .ఆ తర్వాత వాళ్ళబ్బాయి లక్ష్మీ నరసింహం,  నా దగ్గర చదవటం ,ఇంట్లోనే వుండి చదువు కోవటం , ఇక్కడే పడు కోవటం వల్ల , వాళ్ల నాన్న డ్యూటీ తీసుకొన్నాడు .తలలో నాలుక లా పని చేశాడు ఇప్పటికీ ఎక్కడ వుద్యోగం చేస్తున్నా ఉయ్యూరు వస్తే ముందు మా ఇంటికి వచ్చి ,కన పడి వెళ్తాడు .ఏమైనా పనుందా మాస్టారు అని అడిగి, వుంటే చేసి వెళ్తాడు .అతను మా ఇంట్లో చెయ్యని పని లేదు .ఏదైనా ఇంట్లో మా వల్ల కాక పొతే చిలుకూరికి చెప్పి చేయించుకోవటం అలా వాటు అయింది .ఇలా చేయించుకోవటం సిగ్గు గానే వున్నా ,వాడి ఆప్యాయత కు తప్పని సరి అయేది .ఆర్మీ లో పని చేసి , వాలంటరీ గా పదవీ విరమణ చేసి  బాంక్ పరీక్షలు రాసి పంజాబ్ నేషనల్ బాంక్ లో వుద్యోగం సంపాదించి, ఉయ్యురు లో స్వంత ఇల్లు కొనుక్కొని ,ప్రస్తుతం బీమ వరం లో పని చేస్తున్నాడు .
మా నాన్న గారు చని పోయింతర్వాత నెల మాసికాలకు చిలుకూరాయనే మంత్రం ,భోక్త .దాన్ని వాళ్ల భాష లో ”కూత .మేత ”అనే వారు . ఆయనకు ఒక సారి చెబితే చక్క గా జ్ఞాపకం పెట్టు కోని సమయానికి వచ్చే వారు .ఒక్కో సారి పని ఒత్తిడి లో ఆలశ్యం గా వచ్చి తిట్లు కూడా తినే వారు .అయినా నవ్వుతు మళ్ళీ మామూలే .కృష్ణ మూర్తి గారిని పిలిస్తే ”మీ కుల దైవం చిలుకూరాయన వున్నాడు గా ‘అని దేప్పే వాడు . ఇవన్నీ పట్టించు కోకుండా ,తన పని తాను చేసుకొని పోయే వాడు .ఒక వేళ ఆ ఇద్దరు  వస్తే రణ రంగం గా వుండేది తద్దినం .చిలుకూరాయనకు స్పీడ్ ఎక్కువ .కృష్ణ   మూర్తి గారు గూడ్సు బండి .ఈ  ఇద్దర్ని సముదాయించ లేక తల ప్రాణం తోకకు వచ్చేది . వెంకటేశ్వర్లు గారు నెమ్మది నెమ్మదిగా ఆబ్దీక మంత్రము నేర్చారు .ఆయన ఉచ్చారణ లో మాటలు ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ లో దొర్లి పోయేవి .మంత్రం  మొదలు ,చివర  తప్ప మధ్య దంతా  యెగిరి పోయేది .అట్లాగే ,ఏ టైం కి రమ్మంటే ఆ టైం కి వచ్చి ,కూతా మేత తో పని పూర్తి చేసే వారు రెందోబ్రాహ్మనుడిని కూడా ఆయనే తెచ్చుకొనే వారు .ఇంత ఇవ్వ మని అడగటం లేదు .ఎంత ఇస్తే అంత తో తృప్తి పడే వారు .ఎప్పుడు తనకు తక్కువ ఇచ్చినట్లు గా కంప్లైంట్ చెయ్య లేదు .అందుకనే ఎక్కువే ఇవ్వాలని పించి ఇచ్చే వాళ్ళం  కొందరిళ్ళలో అక్షరాభ్యాసం బారసాల ,పుణ్యః వాచనం చేసే వారు .శివాలయం లో అభిషేకాలు చేసే వారు .బ్రాహ్మణులు లేని కొరత ను తీర్చారు .ఎవరు పిలిచినా వెళ్ళే వారు .అందరితో స్నేహం గా మెలిగే వారు .ఆయన భార్య గారు కూడా మా ఇళ్ళల్లో ఒక మనిషి గానే మసిలే వారు .
మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు వచ్చినా ,ఉపనయనాలు అయినా ,ఇంకేమైనా ముఖ్యమైన వి జరిగినా మేము ముందు గా చెప్పేది చిలుకూరాయనకే .ఆ రోజుల్లో తప్పక సాయం గా వుండాలి అని కోరే వారం .అన్ని  పనులు మానేసి ,మాతో వుండి ఆ కార్య క్రమాలను గట్టెక్కించే వారు .వడ్డన  లో సాయం చేసే వారు .ఎవర్నైనా పిలుచుకు రావాలంటే వెళ్ళే వారు .కూరలు తరగటం వంట లో సాయం చేయటం చేసే వారు .ఈ పని ,ఆ పని అంటూ లేదు ఏపని అయినా రడీ .అదీ ఆయన తీరు .దేనికీ ఆశ వుండేది కాదు .ఎంత అవసరం వుంటే మన సాయం  కోరుతారు అనుకోని ముందుకు దూకే వారు .
బ్రాహ్మనులు ఎవరైనా చని పొతే అందరి ఇళ్ళ కు  వెళ్లి చెప్పి రావటానికి ఆయన్నే పంపే వారు .శ్మశానానికి తీసుకొని వెళ్ళే నలుగురి లో ఎవరు లేక పొతే ఆయన హాజరు .లేదు అనేది ఆయన కు తెలీదు  .అలాగే దిన వారాల్లో దానాలు పుచ్చుకోవటం లో ,ఏ మాత్రం సంకోచించే వారు కాదు .ఈ దానం తీసుకొంటే తనకేమైనా చెడు జరుగు తుంది అన్న ఆలోచన వుండేది కాదు .ఎదిస్తే అది తీసుకొనే వారు .అది కావాలి ,ఇది కావాలనే ఆశ లేదు .ప్రతి ఇంట్లోను ఇంట్లో మనిషి గా మెదిలే వారు .అందుకని ఆయన్ను పరాయి మనిషి గా చూసే వాళ్ళం కాదు .తద్దినం రోజూ భోక్తగా ,మంత్రం చెప్పే వాని గా ద్వి పాత్రాభినయం చేసి మెప్పించే వారు .భోక్తల విస్త్ల్లలో ఎవరి విస్తరి లో ముందు వడ్డించాలి దగ్గర్నుంచి ,ఏది ముందు వడ్డించాలి ,తరువాత ఏమి వడ్డించాలి అన్నీ వరుసగా చెప్పి సక్రమంగా జర గ టానికి తోడ్పడే వారు .అందుకీ ఇంట్లో ఆడ వాళ్ళు ముందుగా ఏ కార్య క్రమం వచ్చినా ”చిలుకూరాయన కు ” చెప్పారా ?” అని అడగటం పరి పాటు అయింది .అంత కార్య దీక్ష ఆయనది .యజ మాని కంటే ఎక్కువ బాధ్యత తో   వుండే వారు .అందుకే నాకు ఆయన వుంటే అన్నీ ఆటోమాటిక్ గా జరిగి పోతాయి అనే నమ్మకం వుండేది . చివరి వరకు అలా నే వున్నారాయన .పెద్ద కొడుకు నరసింహం అంటే తగని ప్రేమ .వాడు యాక మూరు లో ఇల్లు కొంటె తెగ సంబర పడి పోయారు .మా ఇద్దరినీ దగ్గరుండి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగే దాక వదలలేదు . నరసింహాన్ని మేము ”చిలుకూరి ”అనే వాళ్ళం /పేరు తో పిలవటం లేనే లేదు .ఇదీ మా ఒళ్ళు బలుపె.

”చిలుకూరాయన” అంటే తండ్రి ”,చిలుకూరి” అంటేకొడుకు .  .మా ఇంటిల్లి పాదికీ ఇదే అలవాటు .   చాలా సంపాదించాడని చెప్పుకొనే వారు ఆయన్ను గురించి .కాని ఎప్పుడు డబ్బు వున్న హజం ఆయన లో వుండేది కాదు .ఏమీ లేని వాడి గానే వుండే వాడు .ఆడంబరం ,హడా విడి లేవు .అతి సామాన్యం గా నే జీవితాన్ని గడిపారు .పెద్ద కొడుకు నరసింహానికీ అవే బుద్ధులు వచ్చాయి .అతనికి తండ్రి అంటే విప రీత మైన అభిమానం ,గౌరవం ,ప్రేమ వున్నాయి .చిలుకూరాయన కొద్ది గా జబ్బు పడి ,అనాయాసం గా మరణించారు .వారి దిన వారాలు ,సంవత్స రీకాలు దగ్గరుండి జరిపించాం చిలుకూరితో వాడి వివాహానికి మాకే పెత్తనం ఇచ్చాడు .అదీ మా చేత్తోనే జరిగింది .ఇలా మాఅందరికీ  తలలో నాలుక గా మసలుతూ ,ఆపద్బాన్ధవుడి గా వుండి ,ఆదు కొనే దైవమైన వెంకటేశ్వర స్వామి పేరు తోవున్న   చిలుకూరి వెంకటేశ్వర్లు గారిని ఇంత కాలానికైనా స్మరించే అదృష్టం కల్గినందుకు సంతోషం గా వుంది.

వీసా /”పాస్ పోర్ట్ కు” హైదరాబాద్  చిలుకూరు బాలాజే ఎట్లాగో ,మా ఇళ్ళలో పనులకు మా (చిలుకూరాయన) చిలుకూరి వెంకటేశ్వర్లు గారు అంటే అంత నమ్మకం మాకు .
మీ –గబిత దుర్గా ప్రసాద్ –17 -01 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

సంగీత సద్గురు శ్రీత్యాగ రాజ స్వామి –7

సంగీత సద్గురు శ్రీత్యాగ రాజ స్వామి –7

                                        కృతులలో ఆలంకారికత
ఇప్పటి వరకు శ్రీ త్యాగ రాజ స్వామి జీవితం బాల్యం ,యవ్వనం క్షేర్త్ర దర్శనం ,కైవల్యం ,పరంపర ,ఆయన కృతుల్లో వున్న సామాజికాంశాలు ,సర్వమత సహనం ,సంస్కరణ భావాలు ,భాష ,భావం ,జాతీయాలు ,నుడికారాలను గురించి వివరం గానే తెలుసు కొన్నాం .ఇప్పుడు త్యాగయ్య కృతుల్లో పొదిగిన అలంకార విలువలను గురించి తెలుసు కుందాం
              త్యాగయ్య మంచి అలంకార ప్రియుడు -వేషం లో కాదు .కవిత్వ రచనలో .శ్లేష ,విరుపులతో భావాన్ని పరి పాకం చేసే నేర్పున్న వాడు .యమ ,అనుప్రాసాలన్కారాల్లో పోతన్న కు సమ ఉజ్జీ గా కని పిస్తాడు .అందుకే కృతుల్లో అంత కలకండ మాధుర్యం .
‘   ”కుశ లవ జనక శ్రీ రామా ,కుశ లద    చతుర శ్రీ రామా -”అంటాడు చతురం గా .కుశాలదా అంటే క్షేమాన్ని ఇచ్చే వాడా అని అర్ధం .దీన్నే అర్ధ శ్లేష అంటారు .అలాగే మాటలపై లలిత శ్లేషకు ఉదాహరణ -”పాహి రామ యనుచు ,నీదు పదము నమ్మితి -పాహి రామ యనుచు నీదు పదము పాడితి ”
యమకాలన్కారం ఆయనకు గమకమే . అందులో -శ్లేష యమక చక్ర వర్తి త్యాగయ్య . ఆ సొగసు చూడండి
” కువలయ దళ నేత్ర ,పాలిత కువలయ దళితామిత్ర (శత్రున్జయుడు )-కమలాహిత గుణ భరిత రామా ,కమలాహిత ధర వినుత ( కమలానికి   శత్రువైన చంద్రుని ధరించిన శివుని చేత పొగడ బడే వాడా )త్యాగ రాజ నుత చరణ ,నిత్యాగ రాజ ధర సుగుణా (గోవర్ధన గిరి ని ధరించిన వాడా )
”పరమ  దయాళు వని ,పాలన సేతు వని ,సరగునదేవ రాయా  కొలచిన నాపై కరుణ లేదని ,కన్నీరాయె –చూచి నీ మనసు కరుగ దెందుకు రాయా ?”అని గట్టి గా అడిగే ధైర్యం కూడా ఆ భక్తుడైన త్యాగయ్యకు వుంది .”రాయ ”శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించి,మధుర శ్లేష వైభవాన్ని ,ప్రదర్శించాడు .భాష శిష్ట వ్యావ హారికం కావటం మరీ అందాన్నిచ్చింది .
”మావర ,ఉమా వర ,సన్నుత ”అనేది మంచి ప్రయోగం గా కని పిస్తుంది .లక్ష్మీ దేవి భర్త అనీ ,ఉమా దేవి భర్త శివునిచే ఆరాధింప బడే వాడా అనీ చక్కని అర్ధాలతో సాభిప్రాయం గా ప్రయోగించాడు” శ్లేషయ్య అయిన త్యాగయ్య ‘.
”ఖిలా చిత్త లౌకిక ,మనే శ్రుమ్ఖల మందు దగలకనే -ఉలూఖల బద్ధుని కి ,నిజ దాసుడై ,విలసిల్లు త్యాగ రాజు మాట ”
అనే కీర్తన లో శృంఖల అంటే గొలుసు -లౌకిక విషయాలనే గొలుసు తో బందీ కాకుండా -రెండవ ఉలూఖల బద్ధుడు అంటే రాతికి కట్ట బడిన బాల కృష్ణుడు అని అర్ధం .అద్భుత ప్రయోగాలివి .చెవులకు ఇంపు ,మనసుకు సోంపు ,ఆనందానికి దరి దాపు .ఇందులో  యమకం అనే అలంకారాన్ని ”యమహా ”గా వాడటమే కాదు ,కన్నయ్య బాల్య గాధ నూ జ్ఞప్తికి తేవటం గడుసు దనం .
”కనికరంముతో కని ,కరమిడి ,చిర కాలముసుఖ మను భవింప వేగము ”  అంటాడు త్యాగయ్య .దయతో చూసి ,చెయ్యి పట్టు కొని అనే అర్ధాలతో ”కని కర ”అనే మాటను మాంచి ప్రాస తో భక్తి ప్రసాదం గా అందించాడు .అర్ధ గాంభీర్యం తో కీర్తన వన్నె కెక్కింది .
”నానార్ధం ,విరుద్దార్ధం తో శబ్దాలను ప్రయోగించే నేర్పు భలేగా వుంది త్యాగయ్య లో .భాష ,అర్ధ జ్ఞానం లతో యోగ విధానం గా నామ జప మార్గాన్ని ,అర్ధ వంతం చేయాలి అనే భావం తో చెప్పిన కృతిని  కని, సుకృతిపొందుదాం .
”రామా యన చపలాక్షుల పేరు ,కామాదుల కోరు వారు వీరు
రామా యన బ్రహ్మమునకు పేరు ,ఆ మానవ జనార్తుల తీరు
అర్క మనుచు జిల్లేడు తరు పేరు ,మర్కట బుద్దు లెట్లు తీరు ?
అర్కుడన భాస్కరునకు పేరు ,కుతర్కమనే అంధ కారము  తీరు
అజ మన ,మేషమునకు పేరు ,అజుడని వాగీశ్వరునికి పేరు
కనుక తెలిసి ,రామ చింతన తో,నామము సేయవే వో మనసా ”అని బోధిస్తాడు .
మొత్తం మీద తెలుసు కావాల్సింది ఏమిటి అంటే -తర్కం ,కుతర్కం వదిలేసి ,చేసే జప నామానికి పూర్తీ గా అర్ధం తెలుసు కొని ,ఆత్మ శుద్ధి తో ,జపించి ,తపించి ,ముక్తి ని పొందమని సద్బోధ చేశాడు త్యాగ రాజ సద్గురువు .ఇందులో ఎన్నో తత్వ విషయాలు వున్నా ,అతి తేలిక మాటలతో తేట తెల్లం గా చెప్పటం త్యాగయ్య ప్రతిభకు నిదర్శనం .
రచన ను వివిధ గతులలో నడి పించి ,పాండిత్య జ్యోతిని చూపించి ,ప్రకాశ వంతం చేస్తాడు త్యాగ రాజు .
”దాంత ,సరి రక్షణాగ మాంత చర ,భాగవతాంత రంగ చర ,శ్రీ కాంత కమనీయ -గుణాంత కాంతక
హితాంత రహిత ,ముని చింత నీయ ,వేదాంత వేద్య –సా మంత రాజ నుత ,యాంత భాంత
నిశాంత ,శాంత కరుణా స్వాంత –నీ కిది సమయమురా -బ్రోవరా ,నా పాలి దైవమా !’
ఈ కీర్తన  శ్రీ రామ చంద్రుని గుణ నామాల అందాల మాల .సొగసైన ,మనోరంజనం చేసే వాన జల్లు .కుంటు పడని పద ధార.అన్వయ కాఠిన్యం లేని పద బంధం .యాన్తః -అంటే య అనే అక్ష రానికి తర్వాతి అక్షరం అయిన” ర ”అనే అక్షరం .భాంత అంటే భ అనే అక్ష రానికి తర్వాత ఉన్న”మ” అనే అక్షరం  .ఈ రెండు కలిస్తే ”రామ ”అంటే భవ్యుడు అయిన వాడు .చిన్న మాట లో అనంతార్ధం   పొది గాడు భక్తకవి .సరదా చేసి మాటల మాయ చూపి అందులో పడి పోకుండా తెర తీసి మాయ ను తొలగించి రామ దర్శనం చేయించాడు .రామ గుణ నామ సంకీర్తన చేసి.. ఈ కీర్తనను  చిరస్మరణీయం చేశాడు ..
ఆ కీర్తన లోనే ”చందనారి హర ,నందనాయుధ ,సనందనాది నుత -కుందరదన వర
మందార ధర ,గోవింద ముకుంద ,సందేహము నీకెందుకు నాపై ?”అని నడక మార్చినా పట్టు చెడ లేదు .అదే త్యాగయ్య కవిత్వ  మహిమ .భాషను ఎలా గైనా త్రిప్ప గల నేర్పున్న వాడు .”మల్లె మొగ్గల వంటి పలు వరుస ”అంటే త్యాగయ్య గారికి మహా ఇష్టం .అందుకే చాలా సార్లు శ్రీ రాముణ్ని” కుందరదన” అని ఆప్యాయం గా పిల్చుకొంటాడు .ఆ సొగసు చూసి మురిసి పోతాడు .అలాగే శివుడిని ”అమ్భోరుహ నయన ”అనటం ఆయన ప్రత్యేకత .”నీటి లో పుట్టిన అగ్ని నేత్రుడా “‘అని భావం .
చక్కని ఉపమాలన్కారాలతో భాషకు ,భావానికి పుష్టి ,తుష్టి కల్గిస్తాడు త్యాగ రాజ సత్కవి .
”అహమను జడత్వ మణఛి   ,బ్రోవ ,సహజమౌ నీ చేతి శరము లేవా?

జనన మరణము లను సూదిని నిల్ప ,ఘన మైన నీ యాజ్న గాదను వడిని
మద మత్సరములను గజములకు ,నీ కమలాంకుశ రేఖ అంకుశము ”  అంటూ గొప్ప భావాన్ని చక్కని ఉప మానం తో రక్తి కట్టించాడు .
”తనయుని ఏ జాతి యైన బ్రోవని తల్లి ,భూమిని గలదా ?ఓ రామ
ఇలను ,నిశ్చయము గా నీవు లేని తావు ఎందైన గలదా ?”అని భగవంతుని సర్వ వ్యాప కత్వాన్ని మంచి పోలికతో వివ రించాడు .మాన వత్వానికి ప్రేమ మయ రూపం తల్లి మాత్రమె నని స్పష్టీ కరణ ఇందులో తళుక్కున మెరుస్తుంది .
”ముల్లోకము లల్లాడిన ,ఇల్లే గతి గాని ,–ఇల నంతట  గల వాన కు, జలధే గతి గాని
గుణములలో నని గుంటే ,గుణియే గతి గాని ”అన్న నిత్య సత్యాన్ని ,చక్కని ఉప మానం తో బోధించాడు .భావుకుడైన మనో భావ కవి లా త్యాగయ్య భాసిస్తాడు .ఎన్ని రూపాలు దాల్చినా ,చివరికి పర బ్రహ్మ లో లయం పొందటమే జీవిత గమ్యం .అద్భుత మైన భావాన్ని ,అలతి ,అలతి పదాలో పొదిగి అలంకరాయుక్తం గా అభిషేకించాడు .ఆయన మనసు ”ఉరగములు పెనగి నట్లు ”ఉందట .”కల్ప భూజమున ,తీగ గట్టు రీతి మనసు ,కల్పము లేన్నైనా ,విడిచి కదలదు శ్రీ రామా !”అంటాడు .
”అద్వైత సామ్రాజ్యంము లు అబ్బి నట్లు రామా ,సద్వైరాగ్యము నిదియు సాయుజ్యమే రామా ”అని మంచి వైరాగ్య బుద్ధి సాయుజ్యానికి సమానమే అని సమర్ధించాడు .ఇందులో జాను తెనుగు ,నుడి కారం ,ఉపమల  విన్యాసం ,అద్వైతంసద్వై రాగ్యం తోనే వస్తుందనే బోధ ,అదే సాయుజ్యమనే ధీమా తో ఆనందాబ్ధి లో ఓల లాడుతూ ,మనల్ని అందులో ముంచి తేలుస్తున్నాడు అద్వైత గాన బ్రహ్మ త్యాగ బ్రహ్మ .,
ఈ అలంకార శోభను ఇంకో సారి మళ్ళీ దర్శిద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఆత్మవిమర్శా ? అంతర్యుద్ధమా ?

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –6

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –6

                                      భాష భావం మరియు జాతీయాలు నుడి కారం
”క్ష’కారం తో నూ ,అక్షర రమ్యత సాధింప గల నేర్పున్న వాడు త్యాగయ్య .మంచి బాణీ తో శ్రీ రాముని లోని 32 దివ్య గుణాలను ,ప్రౌఢ కవిత్వం తో ఆవిష్కరించిన కీర్తన వినండి .
”ముప్పది రెండు లక్షణములు గల -ప్రదక్షిణ మొనరింతాము రారే -కుక్షిని బ్రహ్మాన్దములున్న వట
విచక్షనుదట ,దీక్షా గురుడట ,శుభ లక్షణ లక్ష్యముగల కృతులకు ప్రత్యక్షం బౌనట ”
అక్షరస్తూ లైన భజన పరులకే అంత రంగ డౌ నట. . ఈ కృతి వేద భాష లో రాసి నట్లుంటుంది .కనుక పరమాత్మ రాక ఏం చేస్తాడు ?ఆ పరబ్రహ్మమే అక్షరుడు .”విదులకు ,కోవిదులకు మ్రొక్కే  ” సంస్కారి త్యాగ రాజు .
సంసారం మోక్షానికి దూరం కాదు .గృహస్తాశ్రమ ధర్మం గొప్పదని చాటి చెప్పే ఆశ్రమ రహశ్యం తెలిసిన జ్ఞాని .దాని ప్రయోజనాన్ని ,గొప్ప గా చెప్పాడు .
”సంసారు లైతే నేమయ్యా ,శిఖి పించావసంతు డెదుట నుండగ
హింసా దు  లెల్ల రోసి ,హంసాదుల గూడి ,-ప్రశంస చేయుచు ,నే ప్రొద్దు కంసారిని నమ్ము వారు ”అని బోధిస్తారు .
”దార పుత్రుల పరి చారకుల జేసి -సార రూపుని ,పద సారస యుగముల -సారే సారెకు మనసార పూజించు వారు ”
అని ,సంఘ మర్యాద పాటిస్తూ పరాత్పరుని సేవించాలనే ఉద్బోధ ఇందులో వుంది .
శ్రీ రాముని అతీత గుణ సౌభాగ్యాన్ని  వర్ణిస్తూ ,మురళీ గాన లోలుని లో శ్రీ రాముని దర్శిస్తూ ,ఆ మోహన రూపాన్ని ,”హిందోళ  రాగం ”లో అద్భుతం గా పలికిస్తున్నాడు అద్వైతి  త్యాగ రాజు .
”సామజ వర గమనా ,సాదు హృత్సార సాబ్జ పాల -కాలా తీత విఖ్యాత
సామ నిగమ జ ,సుధామయ ,గాన విచక్షణ –గుణ శీల దయాల వాల
యాదవ కుల మురళీ వాదన వినోద ,-మోహన కర ,త్యాగ రాజ వర నందన ”
సామజం అంటే సామ వేదం లో సంగీతం పుట్టిందని భావం .అలాగే ఏనుగు అని కూడా  అర్ధం .రాముని నడక -సామజ గమనం .సంగీత స్వ ర స్వరూపుడు శ్రీ రాముడు .అందుకని ఈ ప్రద ప్రయోగం ఔచితీ యుతం గా వుంది .ఇలాంటి ప్రయోగాన్ని ”రుచి మత్వం   ”అంటారు .సత్పురుషులనే మానస తామరాలకు సూర్యుడట .మాటలను విడదీయటం ,కలపటం ,పండిత కవి అయిన త్యాగ రాజుకు సులభమే .సామ వేదం లో స్వరాలు నాలుగు .ఉచ్చ శృతి -గాంధారం (గ )నాల్గవది చివరిది ”ని ”(గరిసని )నిషాదం .ఆరోహణ లో నిషాదం మొదటిది .నిషాదం ఏనుగు ఘీంకారం నుండి జనించిందని సంగీతజ్ఞుల విశ్లేషణ .ఇది సామ గానం మొదటిది .అందుకే ఏనుగు ”సామజం ”అయిందట .ఇంత అర్ధం తో ,పద ప్రయోగమ్ చేయ గల సత్తా త్యాగ రాజుది .”మహా కవి గాకేమి త్యాగ రాజు ”? అని పిస్తుంది మనకు .
జాతీయాలు -నుడి కారం
”కల్ల లాడి కడుపు పల్లము నింపుట ”అనేది కుక్షిమ్భారత్వానికి చక్కని తెలుగు .”మంచు వలె ప్రతి ఫలించే సంపద అనేది చక్కని ఉప మానం .ఇంద్రుణ్ణి ”వారి వాహ వాహనుడని ”అందం గా అంటాడు .”నీ అబ్బ !నీ సొమ్మేం పోయింది ?అనటానికి ”కరు ణించితే  నీదు తండ్రి సొమ్ము వెరవక పోనేరదు ”భక్తీ తో కూడిన చదువు వల్ల వచ్చిన జాను తెనుగు నుడి కారం ఇది .మాటలను అతి పొదుపు గా వాడటం త్యాగయ్య కు ఇష్టం .”శ్రీ పతి ”అనడు త్యాగ రాజు ”శ్రీ ప ”అని లేక పొతే ”మా ప ” అని  తేలిగ్గా అనేస్తాడు .అల్పార్ధాలలో అనల్పార్ధ త సాధిస్తాడు .”కలిగి యుంటే కదా కల్గును ”అన్నది చేసు కొన్న వారికి చేసుకోన్నంత అని అర్ధం లో వాడాడు .”చుట్టి చుట్టి ,పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి ”-గా శ్రీరాముని పదం పట్టాడట త్యాగయ్య..
తనను తాను పొగడు కోవటం అన టానికి ”పొడవున ఎంతాడు కొన్న ”అనే జాతీయం ప్రయోగిస్తాడు .భక్తీ ,ప్రేమలు బేరం ఆడే ,అంగడి దినుసులు  కావు ”అనటానికి బలే గా ”కొని యాడె నా ఎద ,దయ ,వెలకు కొని  యాడేవు సుమీ రామా !

-అని వెక్కి రింపు గా శ్లేష తో ప్రయోగించాడు .తన వారు దగ్గర చేర్చటం అనే అర్ధం లో”తన వారితనం లేదా ?”అంటాడు .మధుర పద బంధం తో కూడిన మాటల సోంపు ఇది .-భాష ఆయనకు లొంగి నడుస్తుందేమో నని పిస్తుంది .”తలకు వచ్చిన బాధ కు తల పాగా కు చికిత్స చేస్తే పోతుందా” ?అంటాడు .ఇదో చాటువు గా మిగిలి పోయింది .చెవికి ఇంపైన మాట అనటానికి ‘మృదు వార్త ”అంటాడు .వార్తకు ,మృదుత్వం కూర్చటం త్యాగయ్య గారి మంచి పనితనం .తిక్కన కూడా ”మృదు ద్యూతం ”అని ప్రయోగించాడు .
రూపము ,ప్రతాపము ,శర చాపము ,సల్లాపము ,”అంటూ ”పము ”తో అలంకరిస్తాడు .శ్రీ రామున్ని ”వర త్యాగ రాజ వాక్చేలావ్రుత ”అని ,తన కీర్తనా వస్త్రాలతో ,అలంకరిస్తాడు .అహల్యను ”తాను తాప మొర్వ లేని చాప రాయి ”అన్నాడు .ఇందులో జాను తెనుగు నుడికారం కని పిస్తుంది ”.జ్యావర నుత ,జ్యా జ్యావర ,బిడౌజావర జాశ్రిత ,త్యాగ రాజ ,జ్యావర రాజ రుద్రావనీసుర భావనీయ ,ముని జీవన ”అని ద్వ్యర్ధి కావ్యం లా అన గల సామర్ధ్యం ,శక్తి వున్న కవి త్యాగయ్య .జ్యావర నుత అంటే -భూ భర్త చేత కొని యాడ బడ్డ వాడు .జ్యాజ -అంటే -భూమి యందు పుట్టిన సీతా దేవి -వర భర్త అయిన శ్రీ రాముడు .బిడౌజ – ఇంద్రునికిఅవరాజ -అటే తమ్ముడా అంటే ఉపెంద్రుడైన శ్రీ రాముడు .జ్యావర -అంటే రాజ శ్రేస్తులకు ,అజ అంటే బ్రహ్మకు ,భవ దీయుడు -ద్యానింప దగిన వాడు ఇందులో అర్ధ శ్లేష ,గాంభీర్యం ,ప్రాస మాధుర్యం చూపిస్తాడు మహా కవి .
”పుట్టి న నాదే ,నిజ భక్తీ ,మెడకు గట్టి ,గుట్టు చెదరక , చేయి పట్టి ,గుట్టు చెదరక ,చేయి పట్టి విడువ రాదు ”అంటాడు .ఇదొక శక్తి వున్న జాతీయం .
”యజ్ఞాదులు సుఖ మను వారికి సముల జ్ఞానులు గలరా మనసా ”–”సుజ్ఞాన దరిద్రులు పరం పరలు ,అసుర చిత్తులు అంటాడు .ఒక విప్లవ వాదిగా, కత్తి తో తెగేసి నట్లు ,జ్ఞానం లేని దరిద్రులు ,సుజ్ఞాన దరిద్రులు .ఔచిత్య వంత మైన పద ప్రయోగం .లక్ష్మణుడిని ”నిద్దుర జితుడు ”అంటూ ,అతని సేవా ధర్మాన్ని జ్ఞాపకం చేస్తాడు .ఆ కధ  మన వూహ కు వదిలేస్తాడు .ఇదో సర్వ త్వంతంత్ర ప్రయోగం .కొంత మంది అనటానికి ”కేచన ”అనే సంస్కృత పదాన్ని ప్రయోగిస్తాడు .భాష పై అంతటి అది కారం వుందాయనకు .
”యోచనా ,కమల లోచనా ,నను బ్రోవ -సూచన తెలియక నొరుల ,యాచన చేటు ననుచు నీకు తోచెనా ?”అని తెలుగు పదాలతో ప్రారంభించి ,వెంటనే సంస్కృతం లోకి దూకి ”ద్యుతి విజితాయుత విరోచన -నన్ను బ్రోవ నింక” కేచన”,నిజ భక్తి
నిచయ పాప విమోచన ,కల బిరుదేల్ల గొని ,నన్నేచనా ?కృత విపిన చర వరాభి షేచనా ,త్యాగ రాజ పూజిత ”
అన్న కీర్తన లో ప్రౌఢ శబ్ద ప్రయోగం చేసి ,పండితుడు అని ముద్ర వేయించు కొన్నాడు త్యాగయ్య .ఇది మరో కొత్త మార్గం లో బాణీ లో శ్రీ రాముడికి నివేదించిన ”వేడి కోలు ”.భావం లోకి తొంగి చూస్తె -కాంతి చేత జయింప బడ్డ 10 వేల సూర్యులు కల వాడా అనే అర్ధం కోసం ‘ద్యుతి విజితాయుత విరోచన ”అన్నాడు .”చానా ”అనే శబ్దాన్ని చక్క గా ప్రయోగించి ,చెవులకు విందు చేకూర్చటం ఇందు లోని ప్రత్యేకత .
”రామ సుధా రస పాన మొక రాజ్యము చేసునే ?”అని రామ నామ ఫలానికి విలువ నిర్ణ యిస్తాడు .రాజ్యం కంటే గొప్పదని ధంకా బజాయిస్తాడు .ఇదీ మంచి నుడికారమే .”రూకలు పది వేలున్నా ,చేరెడు నూకలు గతి గాని ,కోకలు వెయ్యున్నా ,కట్టు కొనుట కొకటే గాని వో  మనసా –ఊరేలి తా,బండుట మూడు మూర తావు  గాని
యేరు నిండా బారిన పాత్రకు ,తగు నీరు వచ్చు గాని ”అనేకీర్తన   లో ప్రతి పాదం ఒక సామెతే .సామెతల ,ఆమెతలు త్యాగయ్య కు వెన్న తో బెట్టిన విద్యే .
”నీ మనసు ,నీ సొగసు ,నీ దినుసు ,వేరే –తామస మత దైన్య మేల ”అనటం లో ఆయన దినుసు ,రాముని దినుసు అంటే సత్తా తెలుస్తున్నాయి .
ఈ సారి త్యాగయ్య కృతుల్లో ఆలంకారికత్వాన్ని తెలుసు కొందాం
సశేషం —-                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —5

   సంగీత సద్గురు శ్రీ  త్యాగ రాజ స్వామి —5

                                             కృతుల్లో భాషా భావం 

తంజావూర్ కు తూర్పున  నాగ పట్నం లో ”నీలాయ తాక్షి దేవి ”అమ్మ వారు వెలిసింది .ఆమెను తన తోడ బుట్టిన , తోడి రాగం లో అందం గా కీర్తిస్తాడు త్యాగ రాజు .ఆమెకు తెలుగు అందం ,షోకు చేశాడు . ఆ కీర్తన ,నడక ,సొగసు చాలా ఇంపు గా వుంటాయి .కనుల పండువు గా వర్ణిస్తాడు .దృశ్యానికి చక్కని పద బంధాన్ని కూరుస్తాడు .అలౌకికానందం లో వున్న వారికే అలా వర్ణించటం సాధ్యం ..త్యాగయ్య త్యాగ రాజేశ్వరుడనే  శివుని వర ప్రభావం వల్ల జన్మించాడని చెప్పు కొన్నాం . .ఆ స్వామి అమ్మ వారి పేరు కమలా దేవి అని కూడా మనకు తెలుసు .త్యాగయ్య గారి రెండవ భార్య పేరు కూడా కమల అవటం తమాషా గా వుంటుంది ,కుదిరింది ,అదిరిందీ .ఇప్పుడు కీర్తన సొగసు చూద్దాం
”కరకు బంగారు వల్వగట్టి ,  ,సొగసు మీర -కరమున చిలుకను బట్టి ,నిర్జర తరు
విరులనుకోప్పు నిండ జుట్టి ,అదియు గాక –హరుని అట్టట్టా డించిన  నీ లీలను ”
చేతి లో చిలుక పెండ్లి ఊరేగింపు దృశ్యం .హరుని అట్టట్టా డించటం అనే దానిలో ఫ్లాష్ బాక్ కధ వుంది.పార్వతి శివునికై తపస్సు చేసి ప్రాణార్పణ చేస్తే ,ఆమె కళేబరాన్ని ,శివుడు భుజం మీద మోస్తూ ,ఊగి పోతున్న దృశ్యం ఇది .కన్నుల పండువు గా శివ దర్శనం చేయిస్తాడు .అదే త్యాగయ్య గారి రచనా వైభోగం . ఇదే ఆయన కధక చాతుర్యం కూడా .
”రాజ శేఖర ,సన్ను తంగ -త్యాగ రాజ హృదబ్జ సుభ్రుంగ –రాజిత కరుణా పాంగ -రతి రాజ జనక ,”పాప ధ్వాంత పతంగ” ”,ఈ చివరి మాటలో” పాపం అనే చీకటికి సూర్యుడు” అని చక్కని మాట వాడాడు త్యాగయ్య .
కల్యాణి రాగ కీర్తన ”నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి సేవ సుఖమో ,నిజముగా బల్కు మనసా ?”
దధి ,నవనీత ,క్షీరములు రుచో ,-దాశరధి ధ్యాన భజన సుధా రసము రుచో ?
శమ ,దమమను గంగా స్నానము సుఖమో _కర్దమ దుర్విషయ కూప స్నానము  సుఖమో ?
మమత బంధన యుత ,నరస్తుతి సుఖమో ?–సుమతి త్యాగ రాజ నుతుని కీర్తన సుఖమో ?”
ఇది ”యోగాన్ని సంపూర్ణం గా అనుభవించిన త్యాగ బ్రహ్మ చేసిన ఆధ్యాత్మిక జాగృతి శంఖా రావం ”గా చక్కని విశ్లేషణ చేశారు విబుధ వరులు .ఈ కీర్తన లో భాషా ,భావం ఒక దానితో ఒకటి పెన వేసుకొని ,అతి వేగంగా పరి గెత్తె మాధుర్య విలసిత స్వర రచన .ఈ కీర్తన ,నిత్యం జనం నోట నినదించే ప్రణవ మంత్రం అయింది .
”బంటు రీతి కోలు వియ్య మని ”వేడ గలడు ,ఆ బంటు వేషం ఎలా వుంటుందో రూపు కట్టి నట్లు చెప్పనూ గలడు .”’రోమాన్చామనే కంచుకం ”అనేది రామ భక్తుడు అనటానికి ముద్ర బిళ్ళ అట .”రామ నామం అనే వీర ఖడ్గం ధరించే బంటు వేషం ”కావాలి త్యాగయ్యకు .ఇలాంటి కోరికా ఏ భక్త కవీ వెలి బుచ్చిన దాఖలాలు లేవు .ఇది త్యాగయ్య స్వంతం .అలాంటి భక్తునికే సాలోక్య ,సారూప్య ,సామీప్య ,సాయుజ్య భాగ్యం  కలుగు తుంది .ఈ కోరిక లో చాలా గొప్ప ఆలోచన బయట పెడుతాడు .సాయుజ్యానికి-” సాన్నిధ్యం” ఆఖరి మెట్టు గా భక్తీ యోగం చెబుతుంది .
త్యాగ రాజు గారికి ”ర”వర్ణం మీద మోజేక్కువ .అది సంగీతానికి సౌలభ్యాన్ని ఇచ్చేది కనుక ఆయనకు బాగా నచ్చి ఉండ వచ్చు .అందుకే ”రాగ పంజరం ”అనే రాగం లో ”ద్విరదాద్భుత గమనం  (ఏనుగు నడక )తోగోపా కీర్తన రాసాడు .ఇందులో సంస్కృత భాష  ,మత్తేభం లా దౌడు తీస్తుంది .ఈ కీర్తన లో భాష ,భావం జోడు గుర్రాల స్వారి లా వుంటాయి .
” వరదా !నవనీతాశా ,పాహి –వరదా ,నవ మదనాశా ,ఏహి (రా)–శరదాభ ,కార విధృత శారాశర -శరదాశుగా ,సుమ శరదా ,శర హిత –ద్విరదాద్భుత గమనా -పుర దహన నుత -స్ఫురదా భరణా  ,జరావన పర -గరదా శన  ,తురగ రధా –
ద్యుతి జిత వరదాన జనాగ్రేసర ,త్యాగ రాజ ”’.
రకార విక్రీడితం తో కంచి వరద రాజ స్వామి పై చెప్పిన కృతి ఇది .శరద +అభ -నల్లని  మేఘం లాంటి కాంతి కల వాడా -కవి విద్రుత శర అంటే -చేతిలో విల్లు ,బాణం ధరించిన వాడా -ఆశర శరద ,ఆశుగా-అంటే రాక్షసులు అనే మేఘాలను పార ద్రోలె వాయువా -సుమ శరద -అంటే మన్మధునికి పుష్ప బాణాలను ఇచ్చిన వాడా –ద్విరదాద్భుత గమనా -ఏనుగు నడక వంటి చిత్రమైన గమనం కల వాడా -అజర ,ఆవన పరా -ముసలి తనం లేని దేవతలను రక్షించే వాడా –గరద ,ఆశన తురగ రధ -అంటే విషం వున్న పాముల్ని తినే గరుత్మంతుడు రధం గా వున్న వాడా –కాంతి జిత -అంటే కాంతి చేత జయం పొందే వాడా . ఇలా చిక్కని ,చక్కని భావాలను మనోహరం గా సంస్కృత పద భూయిష్టం గా ఆవిష్కరించే నేర్పు త్యాగయ్యకు వుంది .భాష ఆయనకు దాశ్యం చేసి నట్లు కని పిస్తుంది .ఎక్కడా కీర్తన కుంటు పడదు వేగం తగ్గదు ఆలోచన పదాల వెంట పరి  గెత్తు తుంది .ఒక అద్భుత శివ చిత్రం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.అలౌకిక ఆనందం  అనుభవం లోకి వస్తుంది . మధు మధుర భావాలను అత్యంత నేర్పుగా వ్యక్తీకరించే కవిత్వం  సహజం గా వున్న వాడు త్యాగయ్య .
”నిరు పేద భక్తుల కరి కోత బడ లేక గిరి పై నెక్కు కుంటివో ?- అంగలార్పు జూచి ,రంగ పురంబున  ,పండితివో ?
కాచిన భక్తుల జూచి ,ఆ ,బలినే యాచించ ,వెడలితివో -?జాలితో వచ్చు ,కుచేలుని గని ,గోపీ చేలము లెత్తితివో ?
నీ గుణముల గుట్టు ,బాగుగ దెలిసెను త్యాగ రాజ వినుత ”
ఈ కీర్తన అంతా కొత్త పోకడ లో వుంటుంది .సోంపు తో బాటు ,మనోహర భావం   ,చెణుకులు ,బెళుకులు తో తీర్చాడు .మహా కవుల సరసన నిలబెట్టే రచన గా దీన్ని గుర్తించారు .”భావ సంపదను , ,సహజ భాషా లాలిత్యాలను , ,తేనే వంటి జాను తెలుగును  ,జాలు వార్చే రచన .”
భాషలో ,భావం లో తెలుగు అందాలతో వర్ధిల్లిన ఈ కీర్తన ఆల కించండి
”ఇనాళ్ళు దయ రాకున్న వైన మేమి ?ఇపుడైనా తెలుప వయ్యా ?-
అలనాడు ,తరణి సుతార్తిని(సూర్య పుత్రుడు సుగ్రీవుని బాధను )దీర్పను వెలసి నిల్వగ లేదా ?
అదియును గాక ,బలము చూపగ లేదా ?వాని నేరములు తాలు కోని ,చెలిమి చేసి,  పదముల భక్తీయగా లేదా ?”

అంతే కాదు -”మనసున ,నిను కుల ధనము గా ,సంరక్షణ చేసితిని గాని ,మరచితినా ?” అని పాత కధను జ్ఞాపకం చేసి ,
ఐహిక ధనం కాదు ,భక్తి ధనం ఇవ్వ మని ఆర్తి గా వేడు కొంటాడు త్యాగ రాజ సుకవి .
”అలరుచు వచ్చు ,అర్భకుని ,తల్లి రీతి ,ఆదుకో ధర్మాంబికే ”
అంటూ పసి పిల్లాడు తల్లిని వేడు కొంటున్నట్లు ,వేడుకొంటాడు .”సర్వ విద్యా ప్రవీణుడు అయిన  జ్ఞాని శిశు ప్రవ్రుత్తి లో ఆనందిస్తాడు ”అని విజ్ఞుల భావన కు త్యాగయ్య ఈ కీర్తన లో సాక్షీ భూతం గా నిలుస్తాడు .క్రైస్తవ బోధ Sermon on mount లో కూడా శిశువు అయితేనే స్వర్గానికి ప్రవేశార్హత వుంటుంది అని చెప్పినట్లు అనుభవజ్ఞుల ఉవాచ .
మరో రకార రమ్యతను తిలకిద్దాం .ఇందులోని గమకం అనితర సాధ్యం అని పిస్తుంది
”ఎలా నీ దయా రాదూ -పరాకు చేసే వేలా సమయమూ గాదూ
బాల కనక ఆయ చేల ,సుజన పరి పాల ,శ్రీ రమా లోల ,-విధృత శర జాల ,శుభద   కరుణాల వాల
నవ నీల నవ మాలికా భరణ ,-రారా దేవాది దేవ,రారా మహాను భావ
రారా ,రాజీవ నేత్ర ,రఘు వర పుత్ర -సార తర సుధా పూర హృదయ  పరివార
జలధిగంభీర ,దనుజ సంహార ,దశరధ కుమార ,బుధ జన విహార
సకల శ్రుతి సార ,నాదు పై ఏలా దయా రాదూ ”
ఇందులో ”రారా”అనటం లో ఆర్తి ప్రతిధ్వనించి నట్లు వుంటుంది .ఆ నడక లో అతి వేగం కని పిస్తుంది .అత్యంత వేగం గా వచ్చి ఆదుకోమనే ధ్వని విన్పిస్తుంది .ఇన్నిటిని సాధించాడు ఈ కీర్తనలో .ఇదేదో రాయాలని రాసిన ది గా అని పించదు .తదేక ధ్యానం లో ,మహా సమాధిలో వున్నప్పుడు రాసిన అవ్యక్త మాధుర్యం కని పిస్తుంది ,విని పిస్తుంది .
ఇంకో కీర్తన లోకి ప్రవేశిద్దాం .”గ్రహ ”అనే పదాన్ని అనేక విధాల ఉపయోగించి తన పాండిత్య ప్రకర్షను చాటుకొన్నాడు త్యాగయ్య .భాషా ప్రయోగం మీద మంచి ఆవ గాహన ,అధికారం వున్న వాడు గా ప్రత్యక్ష మౌతాడు .ప్రార్ధన తో గ్రహ బలాల నన్నిటినీదూరం   చేయ వచ్చు అంటాడు .స్వానుభవం ను జోడించి చెప్పిన కీర్తన .అందుకే పెద్దలు ”తక్దీర్ (తల వ్రాత )ను ”తత్ బీర్ ” (పురుష ప్రయత్నం )తో పోగొట్ట వచ్చును అని చెబుతారు .రామానుగ్రహ బలం వుంటే ,ఏ గ్రహమూ ,ఏమీ చేయ లేదు .నిగ్రహం వుండాలి .
”గ్రహ బల మేమి ?శ్రీ రామానుగ్రహ బలమే బలము -గ్రహ బలమేమి?తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి ?
నవ గ్రహ పీడల పంచ పాపముల ,-నాగ్రహములు  ,కలకామాది -రిపుల నిగ్రహము సేయు హరిని భజించే త్యాగ రాజు నికి ,రాసికాగ్రేసరులకు ”అని భరోసా ఇస్తాడు .అనవసర కలవరం తో గ్రహాలకు శాంతులు ,జప తపాలు చేసి ,ఒళ్ళు గుల్ల చేసుకో వద్దు .రామానుగ్రహాన్ని పొందితే అన్నీ ఆయనే చూసు కుంటాడు .సర్వగ్రహాలూ ,ఆయన అనుగ్రహం మీదే పని చేస్తాయి అన్నది సారాంశం .
కీర్తన నడక లో రాజసం ,అందం ఒలక బోస్తు సాగే ఇంకో రచన చవి చూద్దాం
”మెరుగు బంగారందెలు బెట్టి ,మేటియౌ ,సరిగ వల్వలు గట్టి -సుర తరు సుమముల సిగ నిండ జుట్టి ,
సుందర మగు మోమున ముద్దు బెట్టి ”అంటూ శ్రీ రాముని దివ్య విభూతిని ప్రత్యక్షం చేస్తాడు .శ్రీ రామునికి సమాన మెవరు ?అని ప్రశ్నిస్తాడు .ఆయన భావం మరువంపు మొలక -ఆయనో -భక్తుల పంజరంపు చిలక .-పలుకు ,పలుకులకు తేనే లొలుకు మాట లాడు -సోదరుల హరి కి -సమాన మెవరు ?శ్రీ రాముడు భక్తుల మనో పంజరం లో చిక్కిన రామ చిలుక అట .చక్కని భావం .భక్తితో భావం , తో పరా కాష్ట   చెందిన కీర్తన .
మరిన్ని విశేషాలు మరో సారి
సశేషం                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –12

                                      చెవులు తుప్పు వది లించే సంక్రాంతి మేళాలు 

  మా వూర్లో మా చిన్న తనం లో  సంక్రాంతి  సంబరాలు ఘనం గా జరిగేవి .నెల రోజులు ఒకటే హడావిడి. ముఖ్యం గా సంక్రాంతి రోజున మంగళ వాద్యాల మేళా చూసి తీరాల్సిందే .ఉదయం ఏడు గంటలు ఆయె సరికి నాదస్వరం వాయించే వాళ్ళు అంటే నాయీ బ్రాహ్మలు ,ఒక డోలు కూడా వాయించే వాణ్ని వెంట వేసు కోని ,వీపుకు ఒక గోనే సంచీ వేసుకొని ఊదు కొంటు ,డోలు మోగించు కొంటు వచ్చే వాళ్ళు .వూళ్ళో ప్రతి ఇంటికి తిరిగే వారు .ఆ కాలమ్ లో అందరికి వ్యవ సాయం వుండేది కనుక ధాన్యం అప్పటికే కొత్త ధాన్యం  వచ్చేది కనుక ధాన్యమే వాళ్లకు పెట్టె వారు .పెద్ద వాళ్ళు పూజా ,,పునస్కారాలతో ,పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వటం లో ,బూడిద గుమ్మడి కాయతో ధాన్యం -దానం ఇవ్వటం తో మునిగి పోయే వారు .కనుక మేళ గాళ్ళ కు ధాన్యం పెట్టె బాధ్యత ను మా బోటి పిల్లలకు అప్ప గించే వారు .అప్పటికే కొట్లోనుంచి రెండు మూడు   బస్తాల ధాన్యం ను పాలేళ్ళ తో తీయించి సావిట్లో పెట్టించే వారు .వాళ్లకు కొలిచి పెట్ట టానికి ,పాల డబ్బా ,సేరు ,అడ్డ అంటే రెండున్నర సేర్లు పట్టే కొల  పాత్ర,మరకం అంటే నాలుగు సేర్లు పట్టే కొల పాత్ర సిద్ధం చేసి పెట్టు కొనే వాళ్ళం .
మేళ గాళ్ళు వాకిట్లోకి రావటమే ఊదు కొంటు ,డోలు మోగించు కొంటు వచ్చే వారు .మామూలు వాళ్ళు అయితె ఒక గొట్టం తో వడ్లు వాళ్ల సంచీలో చేటలో లేక పళ్ళెం లో  ముందే పోసుకొని,పెట్టె వాళ్ళం .వీళ్ళ వాయిద్యం చెవులకు ఇంపు గా వుండేది కాదు .కొంచెం బాగా వాయించే వారు వచ్చే వారు .వారితో కాసేపు ఎక్కువ  సేపు వాయింప జేసి ఒక సేరో .ఒక  అడ్డడో పెట్టె వాళ్ళం .
ఇంకా సుస్వర వాయిద్యం విని పించిన వారిని ఇంకాసేపు వాయింప జేసి ,ఒక మరకం వడ్లు చేట లో పోసి వాళ్ల సంచీ లో పోసే వాళ్ళం .వాళ్ళంతా సంతోషపడి నమస్కరిస్తూ వెళ్ళే వాళ్ళు .ఒక బాచ్ తర్వాత ఇంకో బాచ్ వచ్చేది .ఖాళీ వుండేది కాదు చేతి నిండా పనే .చాలా స్పీడ్ గా పెట్టి పంపించే వాళ్ళం .ఇంకా బాగా తెలిసిన మేళ గాళ్ళు వస్తే రెండు మూడు మరకాలు కొలిచి పోసే వాళ్ళం .ఊపిరి ఆడేది కాదు .నెమ్మది గా ఇంటి మంగలి వాళ్ళు వచ్చే వారు .వాళ్లకు వార్షికం గా ధాన్యం కొల్చే వారు సంవత్సరం అయింతర్వాత .అయితే ఇది ప్రత్యేకం .వారికి కనీసం పావు బస్తా కొలిచి పోసే వాళ్ళం .ఎంతో పొంగి పోయే వాళ్ళు .ఒక్కో సారి మా పెద్ద వాళ్ల మాట ప్రకారం అర బస్తా కూడా కొలిచి ఇచ్చే వాళ్ళం .ఈ పెద్ద మొత్తం ఇచ్చే టప్పుడు పాలేళ్ళ తో కోలి పించే వాళ్ళం .దాదాపుమధ్యాహ్నం పన్నెండు గంటల దాకా   ఈ సందడే సందడి .క్షణం తీరిక వుండేది కాదు .ఒక్కో సారి నడుములు నెప్పి పుట్టేవి ..అప్పటికే స్నానాలు ,కాఫీలు అయి పోయేవి కనుక జనం అయి పోయే దాకా అదో బాధ్యత గా నిర్వ హించే వాళ్ళం .నాకు మా తమ్ముడు ,మా అక్కయ్య లు తోడుండే వారు .ఈఅయిదు   గంటలూ .సన్నాయి మేళం ,డోలు మోతలతో వూరు, ఇల్లు మొగి పోతూండేది .చెవి తుప్పు వదిలి పోయేది .ఇందులో చాలా మంది వాయించటం రాని వాళ్ళే .ఘోరం గా వుండేది వింటుంటే .అయితె చెవులు మూసు కొంటు ,భరిస్తూ వడ్లు పెట్టె వాళ్ళం .కొందరి సంచులు నిండి పోయి ,ఇంటికి పంపించి ,మళ్ళీ వచ్చే వారు .ఊరంతా తిరగటం కదా .అందరు వితరణ శీలులే .పెద్ద ఆసాములు ఇంకా ఎక్కువ గా పెట్టి వాళ్ళను సంతృప్తి పరచే వారు .ఒక కోలా హలం గా జరిగి పోయేది .ఇలా సంవత్సరం లో ఒక్క సంక్రాంతి నాడే వచ్చే వారు .మళ్ళీ కని పించే వారు కాదు .అదీ దీని ప్రత్యేకత .ఒక్కో సారి వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తుండే వారు .ఒక యాక్టర్ మారే  వాడు .లేక ఒక చిన్న పిల్లాణ్ణి తెచ్చు కొనే వారు .వీళ్ళను తేలిగ్గా నే గుర్తు పట్టే వాళ్ళం .కోప పడి ,ఏదో కొంత ఇచ్చి పంపే వాళ్ళం . సందట్లో సడే మియా గా మొండి బండల వాళ్ళు ,కోయ వాళ్ళు ,లంబాడీలు ,చెంచులు వచ్చే వారు .వీరికీ తోచిన ధాన్యం వేసే వాళ్ళం .కొందరు ధాన్యం తీసు కొనే వారు కాదు .అందుకని అలాంటి వారి కోసం చిల్లర డబ్బులు రెడి చేసు కొనే వాళ్ళం .పావలా దగ్గర్నుంచి ,రూపాయి దాకా వేసే వాళ్ళం .కప్పల్ని ఆడించుకొంటు కొందరు వచ్చే వారు .వీరికీ యధా శక్తి ఇచ్చే వాళ్ళం .ఇంకో తమాషా కూడా వుండేది .బాలింత రాలు అని ఒక చేట లో ,పసి పిల్లాదినో ,పిల్లనో తీసుకొని కొందరు చెంచు ఆడ వాళ్ళు వచ్చే వారు .జాలి పడి ఎక్కువ ధాన్యమో ,డబ్బు లో ఇచ్చే వాళ్ళం .వీళ్ళ అరుపులు ,కేకలు ,అడుక్కోవ టాలు తో వాకిలి రణ రంగం గా వుండేది .దాసరి వాళ్ళు వచ్చే వారు.వాళ్ల తో   పాటు గంగి రెద్దు మేళ గాళ్ళు తప్పని సరి .గంగి రెద్దు వాళ్ళు భోగి ,సంక్రాంతి ,కనుమ నాడు కూడా వచ్చే వారు .రుంజ వాయించు కొంటు కొందరు వచ్చే వారు .వీరి మధ్య లో హరిదాస్సులు చిడతలు వాయించుకొంటూ ”హరిలో రంగ హరి ”అను కుంటు వచ్చే వారు .వాళ్ల నెత్తిమీద  గుండ్రని ఇత్తడి పాత్ర   వుండేది .వాళ్ల కు ఏదైనా వేయాలంటే పాపం వాళ్ళు ప్రతి ఇంటి ముందువంగాల్సి   వచ్చేది .అప్పుడు వేసే వాళ్ళం .వాళ్ళు చాలా వేగం గా ఊరంతా తిరి గేవాళ్ళు . .దీవించి వెళ్ళే వాళ్ళు .వీరి తో బాటు బైరాగులు వచ్చే వాళ్ళు .భోం భోం అని శంఖంఊదు కొంటు .యధా శక్తి గా వాళ్ళను తృప్తి పరిచే వాళ్ళం .ఇందులో ”పాన కాలు ”అనే అతను బ్రహ్మం గారి తత్వాలను చేదు నిజాలైన వాటిని తీయ గా పాడే వాడు ..అతను వారానికి ఒక సారే వచ్చే వాడు .అతని తత్వాలు అంటే నాకెందుకో చాలా ఇష్టం గా ఉండేవి .ఆసక్తి గా వినే వాడిని .  కొందరు పగటి భాగవతులు కూడా వచ్చే వారు .పిచ్చుక గుంట వాళ్ళు ,తుపాకీరాముళ్ళు అనే పిట్టల దొరలూ ,నూనె గుడ్డల వాళ్ళు రావటం బాగా గుర్తు .పిట్టల దొరల కబుర్లు కోటలు దాటేవి .సరదా గా వినే వాళ్ళం .వాళ్ల మాటల ప్రవాహం లో పడి కొట్టు కు పోవటమే .వాళ్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళం .పాత బట్టలు ఇచ్చే వాళ్ళం .
లేపాక్షి నంది అంతటి గంగి రెద్దు లతో వచ్చే వాళ్ళుగంగి రెద్దు వాళ్ళు . .మంచి అలంకరణ చేసే వాళ్ళు ఎద్దులకు .ఒళ్లంతా దుప్పట్లు ,బొంతలు కప్పే వారు ముఖానికి పసుపు  పెట్టి బొట్టు పెట్టె వారు  బంతి పూల దండలతో మెడను అలంకరించే వారు .చక్క గా ఇంటి ముందు ఆడించే వారు ”అయ్య గారికీ దణ్ణం పెట్టు ,అమ్మ గారికి దండం పెట్టు ”అంటే అవి చెప్పి నట్లు చేసేవి .తల ఊగించ మంటే వూగించేవి అందుకే ”డూడూ బస వన్న ”అనే పేరు వచ్చింది .చక్కగా  కూచో మంటే కూచునేవి .డాన్సు చేయ మంటే చేసేవి .చక్క గా వాయిస్తూ ,వాకిట్లో గొప్ప సందడి చేసే వారు .వారు పంచె .చొక్కా  ,తల పాగా కోటు  జోలె తో వచ్చే వారు .దాదాపు సంక్రాంతి నెల మొత్తం మీద కనీసం యాభై గంగి రెద్దులు వచ్చేవి .నాగరకత క్రమంగా పెర గటం ,నగర జీవన శైలి ఏర్పడటం ,ఆదరణ తగ్గటం వల్ల ఇవాళ ఇవన్నీ కని పించ టం లేదు .మేళ గాళ్ళు రావటం మానేసి దాదాపు పది హేనేళ్ళు అవుతోంది .అట్లాగే పిట్టల దొరలూ లేరు .గంగి రెడ్డ్ల వారు తగ్గారు .చెంచులు ,కోయదొరలు అసలే లేరు .వీరికి తోడూ ఎరుకల వాళ్ళు ,ఏనాది వాళ్ళు వచ్చే వారు .వారూ లేరు .కనుక సంక్రాంతి సందడి చాలా భాగం తగ్గి పోయింది ,ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ తరానికి వాటిని పరి చాయం చేయ టానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు .అయినా nativity  రావటం లేదు .వీళ్ళకు తోడూ” ఉపాదానం బ్రాహ్మలు ”కనీసం పది మంది ” సీతా రామాభ్యాం నమః ”అంటూ  వచ్చే వారు .వీరినే” యాయ వారం బ్రాహ్మలు”అనే వారు . వీరికి బియ్యం మాత్రమేపెట్టె   వాళ్ళం .”
ఇంట్లో పెద్ద వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు అని ముందే చెప్పాను .బ్రాహ్మలను ముందే చెప్పి ఉంచు కొనే వాళ్ళు .గుమ్మడి కాయలు బాగా పండేవి దొడ్లో .వాటిని సద్విని యోగం చేసుకోవాలి .అందుకని ,బ్రాహ్మణులకు కూష్మాండ దానం చేసే వారు .దానికి బంగారం జత చేసి ,ధాన్యం లో నో ,బియ్యం లోనో వుంచి ,విఘ్నేశ్వర పూజ ,గుమ్మిడి కాయకు పసుపు కుంకుమ పెట్టి  పూజ చేసి ,కాళ్ళు కడిగి ,నెత్తిన పాదోదకం చల్లు కోని అప్పుడు దానం చేసే వారు .సంక్రమణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు .దీనికి కూడా బ్రాహ్మలు అనేక మంది వచ్చే వారు .దంపత్యుక్తం గా దానాన్ని మడి బట్టలతో చేసే వాళ్ళు .మా తరం లోను మేమూ చేస్తున్నాం .వారసత్వాన్ని కాపాడు కొంటూనే  వున్నాం .ఇప్పుడు దానం తీసుకోవ టానికి రమ్మంటే వచ్చే వారే కరు వైనారు .కాల మహిమ .అయినా వారు వచ్చే దాకా ఎదురు చూసి ఇస్తున్నాం .వాళ్ళలో కొందరికి భోజనాలు ఉండేవి .అమ్మ ,ఆ తర్వాత నా శ్రీమతి ప్రభావతి మడి వంట చేసి వడ్డించే వారు .సంక్రాంతి నాడు పితృ దేవతలకు ప్రీతి కర మైన రోజూ .అందుకని కొత్త బట్టలను ఒక పళ్ళెం లో వుంచి ,దేవుడి దగ్గర పెట్టి ,పెద్దల పేరు చెప్పుకొని ,భోజనాల తరువా త కట్టు కొనే వాళ్ళం .మిగిలిన కులాల  వాళ్ళు కూడా యధాశక్తి బియ్యం ,తోట కూర కూర గాయాలు పెద్దల పేరు చెప్పి బ్రాహ్మలకు దానం ఇచ్చే వారు .

This slideshow requires JavaScript.

ధనుర్మాసం  డిసెంబర్    పదిహేడున ప్రవేశిస్తుంది .వాకిళ్ళల్నీ  ఆవు పేడ తో అలికి ,ముచ్చటైనముగ్గులు  పెట్టటం తెలుగింటి ఆచారం .ఆవు పెడ తో గొబ్బెమ్మలు చేసి రంగ వాల్లు లలో అందం గా కొలువు చేసి పసుపు ,కుంకుమ పెట్టి బంతి పూలతో అలంకరించి  ,పూజించటం ఆన వాయితీ .ఇవే సంక్రాంతి గొబ్బెమ్మలు .భోగి నాడు పిల్లలంతా కలిసి ”సుబ్బి గొబ్బెమ్మా సుబ్బంనివ్వవే ,చేమంతి పువ్వంటి చేల్లెల్నివ్వవే ,తామరపూవంటీ   తమ్మున్నివ్వవే ,మొగలి పువ్వంటి మొగున్నివ్వవే ,మల్లె పూవంటి మామా నివ్వవే ”అని సాయంత్రం పూట సందె గొబ్బెమ్మలను పెట్టి పాడు తారు .సెనగలు అటుకులు వగైరా పంచి పెడ తారు .పాటలతో  ,ఆటలతోకాల క్షేపం చేస్తారు .రోజూ గొబ్బెమ్మలను సాయంత్రం తీసిగోడకు పిడకలు గా కొట్టి ఎండిన తర్వాత దాచి రధ సప్తమి  నాడు అంటే మాఘ శుద్ధసప్తమి  రోజూ ఆ పిదకలపై పాలు పొంగించి పరవాన్నం వండి సూర్యునికి నైవేద్యం   పెట్టి ,చిక్కుడు ఆకుల్లో ప్రసాదం గా పెట్టు కోని తింటారు .సంక్రాంతి కి ఇళ్ళల్లో బొమ్మల కోలు వు పెట్టటం ఒక అల వాటు ,.చిన్న పిల్లలకు బోగి నాడు భోగి పళ్ళు పోస్తారు .రేగి పళ్ళు వచ్చే కాలమ్ కనుక ,రేగి పళ్ళు ,చిల్లర డబ్బులు  చెరుకు , ముక్కలు కలిపి నెత్తిన పోస్తారు .దిష్టి తీస్తారు .పేరంటం చేస్తారు ,భోగి ఉదయాన్నే భోగి మంటలు పెద్ద ఎత్తున వేసే వారు ,చలి కాచుకొనే వారు .ఈన్తిల్లిఇంటిల్లి పాదినీ  ఒక వరుస గా కూర్చో పెట్టి,ముఖాలకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి అప్పుడుతలంటి పోసే వాళ్ళు .ఒళ్లంతా నువ్వ్వుల నూనె పట్టించి ,పెసరపింది ని వొళ్ళంతా పట్టించి ,నలిచి కుంకుడు కాయ రసం తో తలంటి   స్నానం చేయించే వాళ్ళు .మగ వాళ్లకు ఇంటి మంగళ్ళు వచ్చి ఈ పని చేసే వారు .ఆడ పిల్లలు మంగళ హారతి పట్టి పాట పాడే వాళ్ళు .వాళ్లకు హారతి మామూలు ఇచే వారు .ఇది గొప్ప సంప్ర దాయం .
సంక్రాంతికి కొత్త అల్లుళ్ళ తో లోగిళ్ళు కళ కళ లాడేవి .వాకిళ్ళ లో ధాన్యం పురులు లక్ష్మీ దేవికి సంకేతం గా ఉండేవి .కొత్త బట్టలు కొని అందరు కట్టు కోవటం పరిపాటి .పాలేళ్ళకు కూడా కొత్త బట్టలు పెట్టె వాళ్ళం .పండగ మామూళ్ళు ఇచ్చే వాళ్ళం .అలాగే దసరాకు  వీరమ్మ తల్లి ,తిరుణాలకు ఇవ్వటం వుండేది .కనుమ నాడు గారెలు  వండటం పరి పాటి .కనుమ నాడు పశువులను కాలువలో కడిగి ,పసుపు కుంకం పెట్టి పూజించే వారు .ఆ మధ్యాహ్నం నుంచి పాలేళ్ళు గైరు హాజరు .సినీమా లకు ,కోడి పందాలకు వెళ్ళే వారు .సంక్రాంతి అంటే కోడి పందాల హోరు చెప్ప టానికి వీలు లేదు .పందెం కోళ్ళ ను తయారు చేసి జీడి పప్పు లాంటివి పెట్టి పందాలు ఆడించటం తెలుగింటి ఆచారం .వాటిపై డబ్బు కాయటం పోగొట్టు కోవటం సరదా .ఈ కోడి పందాలే నాగమ నాయుడికి ,నాగమ్మకు వైరానికి కారణమై  ,దాయాదుల యుద్ధం కురు క్షేత్ర యుద్ధం అంత ఎత్తున జరిగింది ”.పేకాటా” మా మూలే .మందు బాబుల విందు రోజూ లివి .పట్ట శక్యం కాదు .నడవటం వుండదు .తూలు కుంటు దొర్లు కుంటు పోవటమే .
ఇళ్ళల్లో సంక్రాంతి పిండి వంటలు భారీగా చేసు కొనే వారు .ఇరుగమ్మ ,పోరుగమ్మ సాయం చేసే వారు సామూహికం గా అరిసెలు ,చక్కిలాలు జంతికలు కారప్పూస చేయటం వుండేది .ఆ నాడు అంత తీరు బడి వుండేది .ఇవాళ అంతా బిజీ లైఫ్ .లోగిలి అంటే  నే వొళ్ళు  పులకించి పోయేట్లు వుండేది .లక్ష్మీ దేవి నాట్యం చేసు వాకిట్లో కొలువై ఉండేదా అన్నట్లుండేది ప్రతి ఇల్లు ,వాకిలి .అదో గత వైభవం .గుర్తు చేసుకోవటం మన ధర్మం .
అసలు మా వూళ్ళో ధను ర్మాసం వచ్చిందంటే ”హరికధలు ”కు కొలువు కూటం గా ఉండేవి .కాపుల వీధి రామాలయం దగ్గర నెల రోజులు హరి కధలు జరిగేవి .పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి కధలు చెప్పించే వారు .ఆంద్ర దేశం లో లబ్ధ ప్రతిస్తులైన హరిదాసు లందరూ వచ్చి కధలు చెప్పి రంజింప జేసే వారు .పొడుగు పాండు రంగ దాసు ,పట్నాల మల్లేశ్వర రావు ,కోట సచ్చిదానంద శాస్త్రి ,కడలి వీరయ్య ,మోపర్రు దాసు ,చైనా రాకెట్ అని పిలువబడిన ప్రభ ,జగన్నాధ దాసు ,శంకర రావు ,మొదలైన హేమా హేమీ లంతా వచ్చి కధలు చెప్పే వారు .చివరి రోజున వారికి ఘన సన్మానాలు .దానికోసం ఊరంతా తిరిగి చందాలు వసూలు చేయ టాలు బలే రంజు గా వుండేది .కాపులరామాలయం   దగ్గర సూపర్ వైజర్  సుబ్బా రావు గారు దీని బాధ్యత చే పట్టే వారు .
తరు వాత పోటీ ఎరిగింది .శివాలయం లో చెప్పించటం ప్రారంభించారు .దీనికి గోవింద రాజుల సత్యం ,కొలచల చల పతి వగైరా లు సారధ్యం వహించే వారు ,ఇది కాక విష్ణాలయం లో మొదటి నుంచీ హరి కధలు జారి గేవి .ముదు నూరు శంకర రావు గారు అనే భాగవ తార్ గారు రామాయణం ,బారతాలు చెప్పేవారు నెల రోజులు .ఉయ్యూరు లోచేవూరి   కనక రత్నం గారు అనే విశ్వ బ్రాహ్మణ భాగవతార్ వుండే వారు .పచ్చగా ,దబ్బ పండు ఛాయ తో కళ గలవెడల్పు   ముఖంతో చేతులకు ,కాళ్ళకు బంగారు కడియాల్తో .కొంచెం ఆడ తనం గా మాట్లాడే వారు .వ్రుత్తి బంగారు పని ప్రవ్రుత్తి హరి కధ .”సువర్ణ కంకణ కేయూర బిరుదాంకితులు”అనే వారాయన్ను .మంచి పేరు ప్రఖ్యాతు లుండేవి .బందర్లో మిగిలిన నగ రాలలో కధ చెబితే ఇసకేస్తే రాలనట్లు జనం వచ్చే వారని చెప్పు కొనే వారు .అదే పొరపాటున ఎప్పుడైనా  ఉయ్యూరు లో కధ పెడితే పట్టు మని పది మంది వుండే వాళ్ళు కాదు .నా మిత్రుడు స్వర్గీయ పెద్ది భొట్ల ఆదినారాయణ ,ఆయన శిష్యరికం చేసి కొంత నేర్చాడు .ఒక సారి మా భజనకార్య   క్రమం లో హరికద చెప్పాడు .బానే చెప్పాడు .పోరు గింటి పుల్ల కూర రుచి అంటే ఇదేనేమో .ఇదీ మా వూరి సంక్రాంతి గురించిన కొన్ని  జ్ఞాపకాలు .మీతో పంచుకున్నందుకుఆనందం. గా వుంది .

సంక్రాంతి శుభా కాంక్షలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సంక్రాంతి శుభా కాంక్షలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

పొంగల్ హంగామా

పొంగల్ హంగామా

            ”గుడ్ మార్నింగ్ బావా -హాప్పీ పొంగల్ ”అంటూ మా ఇంట్లోకి చేరాడు కాఫీ టైం చూసుకొని మా బామ్మర్ది ప్రకాశం ‘ఏవిట్రా ఏ దేశం లో వున్నావ్ ?తమిళనాడు నుంచి దిగుమతి అయావా ?”అన్నా .”అదేంటి బావా -నీతో ఏది మాట్లాడినా చిక్కే .అయినా తమిళ తంబి సంగతి ఎందుకొచ్చింది మధ్య లో ”అన్నాడు .”మన దేశం తెలుగు -అంటే దెలుగు దేశం పార్టి అని అపార్ధం చేసుకో మాకు .మనం వున్నది తెలుగు దేశం లో అని నా భావం.మనం శుభాకాంక్షలు తెలుగు లో ఏడ వాలని తెలీదా ? పొంగలి మనదే అయినా పొంగల్ మంది కాదురా సన్నాసీ ”అన్నాను .”పొద్దున్నే అక్షింతలు వేయిన్చుకోతానికి వచ్చి నట్లుంది నా పని .నీతో  ఏదిమాట్లాడినా తంటానే .సరే నీ దారిలోకే వస్తున్నా .సంక్రాంతి శుభా కాంక్షలు భావ గారూ “‘అన్నాడు నొక్కి పలుకుతూ .”అఘోరించావులే .ఏమిటి విశేషం ?”అన్నా.”విశేషాలు నా దగ్గరుంటే నీ దగ్గరకు చేరటం ఎందుకు ?నువ్వే ఏదైనా చెప్తావని ఈ బండీని తోలుకోచ్చా”అన్నాడు .బండీ అంటే వాడి భారీ శరీరం అని భావం ”.ఎలా వుందిరా రాష్ట్ర పరిస్తితి ?”అడిగా .”చాలా చప్పగా వుంది బావా >పందెం కోళ్ళు సంక్రాంతి వచ్చినా ముడుచుకు కూచున్నాయి .కాలు దువ్వటం లేదు ”అన్నాడు .అదేంట్రా ”కోస్తా బిడ్డలంతా ,అధికారులు ,ప్రజా ప్రతినిధుల కటాక్ష వీక్ష నాల తో కోడి పందాలు ,పేకాట జోరుగా సాగిస్తున్నారనీ ,కోట్లు చేతులు మారి కొందరి బతుకులకు తూట్లు పాడు తున్నాయని ,కొందరు అకస్మాత్తు గా గాలి సోదరుల్లా కుబేరు లై పోతున్నారనీ మీడియా అంతా కోడై కూస్తుంటే ?అన్నాను .
బావా !నువ్వేదో తెలివి గల మొహం అని వస్తే ఈ మాత్రం తెలీకుండా పేపర్ వార్తలు నాకు చదివి వినిపించి నా  చెవుల్లో కాబేజీ లు పెద్తున్నావు “”అన్నాడు .”అది కాదు బామ్మర్దీ !నీ మనసు లో ఏముందో నాకు తెలియాలి గా” ?అన్నా.”రాజ కీయ కోళ్ళు బావా నేను వాటి గురించే అన్నది .లోపలి భావం తెలుసుకో లేవు ?”‘అన్నాడు మళ్ళీ .”అదా నీ పైత్యం -కొందరికి ”వరం ”దొరికింది కదా .అందుకే కాళ్ళు చల్ల బడ్డాయి .తట పటాయిస్తున్నాయి .మీసాలు మేలేసినా కోళ్ళ కాళ్ళ కు కత్తులు కట్టటం లేదు .ఉత్తుత్తి ఆర్భాటం చేస్తున్నారు ”ఇంత సేపటికి ”యు కాచెడ్ తి పాయింట్ ”అన్నాడు .”ఓరి నీ ఇంగ్లీష్ మండా కాట్ అనాలిరా ”అన్నా .ఏదో ఎమ్ఫటిక్” గా ఉంటుందని అన్నా లే ”అంటూ ఇంతకీ ”మళ్ళీ ఏదో ”వరం ”అన్నావు దీని భావ మేమి తిరుమలేశా ?”అన్నాడు .”నేనేమీ చెప్పక్కర్లేదు .channella లో నిత్యం సంచరిస్తూన్తావుగా నీకు తెలీదా “”/?అన్నాను .”తెలిస్తే ఈ ఏడుపెందుకు పండగ పూటా “”అన్నాడు .”సరే విను -అన్నీ నా నోటి నుంచి చెప్పించాలని నీ ఆరాటం .అదేరా అదేదో పోలవరం టెండర బెల్లం నోట్లో పడే సరికి నోరు మూత పడిందని అంటున్నారు గా .ఆ వేశాలు చల్లారి ,కాలు దువ్వ టాలు మాని ,కుర్చీ లోంచి లేవకుండా మాటల తూటాలు పేలుస్తున్నారు కదా ?”అన్నాను .”నువ్వు అసాధ్యుడివి బావా !తెలీనట్లే ఉంటావు .అన్నీ తెలిసినట్లేచెప్తావు .  .నిన్ను నమ్మ లేను ,నమ్మ కుండా ఉండనూ లేను ” అన్నాడు ధూపం వేస్తూ .
బావా !గనుల్లో దూరిన” గాలి ”బయటకు వచ్చే దెప్పుడు ?”అన్నాడు .”ఒరే !అవన్నీ కోర్టు వ్యవ హారాలు .మనం చూస్తూ వూరు కోవటమే .కాలమే దారి చూపిస్తుంది ”అన్నా.”సరే కాని బావా !గాలి కోటలో మళ్ళీ అర క్వింటాల్ బంగారం
దొరికిందట ,ఇంకా కోట్ల కొద్దీ డబ్బుట –”అర్దోక్తి లో ఆగాడు .”ఇనుము బంగారం గా మారుతుందని పూర్వం నా గార్జు నా చార్యుడు ప్రయోగం చెసీ  చూపాడు కదా .అంతే కాదు ఆధినిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రతి మూల కాన్ని బంగారం గా మార్చ వచ్చునని తెలుసు కదా .అయితె” కర్సు అవుద్ది” .కర్సుకు వెనకాడేది లేదు గాలిని తంతే డబ్బు కురుస్తుంది .ఇప్పుడు సామెత మారి పోయింది .ఇదివరకు కుక్కను కొడ్తే వస్తుందనే వారు .”బావోవ్ !నువ్వు” గాలోప దేశం” చేసి నట్లుంది .అది కాదు బావా !రాష్ట్ర పరిస్తితి సంగతేమీ చెప్ప లేదే “?అన్నాడు మళ్ళీ ”అడక్కుండా చెప్తే మజా గావుండదు కదురా “”అన్నాను .”సరే చెప్పి పుణ్యం కట్టు కో ”అన్నాడు . ”చెప్ప టానికేం వుంది ?పార్టీలలో సివిల్ వార్లు ,ఆఫీసర్ల లో కోల్డ్ వార్లు ,మంత్రులలో సవాళ్లు ,శాసన సభ్యుల్లో అసమ్మతి సెగలు యేమని చెప్పాల్రా .ఎవడబ్బకు పుట్టిందీ రాష్ట్రం అని అంతా కుళ్ల బొడుస్తుంటే ?పని లో పనిగా మళ్ళీ అడక్కుండా పైనున్నవాళ్ల   పాలన తీరు కూడా చెప్పేస్తా .అవినీతి కూపం లో అధికార్లు ,మంత్రులు ,ఊచలు లెక్క పెడుతూ ,అంటీ అన్టనట్లు ,ఇదేదో మన ప్రభుత్వం కాదనే భావన తోఅంతా ప్రవర్తిస్తున్నార్రా బాధ్యత లేని ప్రతిపక్షం, బాధ్యత గా ప్రవర్తించని ప్రభుత్వం తో ప్రజలు విసిగి వేసారి పోయారు .ముందు నుయ్యి వెనక గొయ్యి ‘లా వుంది పాపం ”అన్నాను .. ”బావా !నువ్వు పిచ్చతిట్లు కోపం తో తిట్టినా ,బంగారం లాంటి కబుర్లు చెప్పి మాయ చేస్తావు .భలే వొడి వే “”అన్నాడు .”సరే ఇంతకీ మన క్రికెటర్ల మాటేమిటి ?”అన్నాడు ”నువ్వే చెప్పరా “”?అన్నా .”నిజం చెబితే నిష్టూరం గా వుంటుంది గాని బావా చెప్పేస్తా.ఆస్ట్రేలియా  మనకు అచ్చి రాలేదు బావా .అక్కడ మనం బాట్ పట్టుకొని గ్రౌండ్ లో పరి గెత్త లెం బావా .బాట్ పుచ్చు కొని పెవిలియన్ వైపు రావటం” వీజీ గా” వుంది బావా మనోళ్ళకు .ఏదీ కలిసి రావట్లేదు ”అన్నాడు బాధగా ,కసిగా బాగా ఆడటం లేదన్న అర్ధం తో .
” ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే గా! సినిమావిశేషాలేమిటి “?అడిగా .”ఏముంది బావా .దూకుడు చివర్లో జోరు తగ్గి పాకుడు మొదలు పెట్టింది .ఊసర వెళ్లి రంగు మారిస్తే రోజూ రాజకీయ నాయకులు మారుస్తూనే ఉన్నారుగా అని” లైట్” తీసుకొన్నారు జనం .పాపం రామ రాజ్యం జనం లేక వెల వెలా విల విలా .ఊరికే చూపిస్తానని నిర్మాత బతి మాలినా ఎక్కని యువత .అది సరే కాని బావా నీ లాంటి ముసలాల్లైనా ఎందుకు చూడరు పాపం “?అన్నాడు .”చూడచ్చు .కాని పదార్ధం వుండాలి కదా .అందులో సర్వం పూజ్యం అని మొదట్లో నే చెప్పాగా “”?అన్నా .”మరి నువ్వెందుకు చూశావ్ ?”అన్నాడు .”అరె బాపు మీద భక్తీ ,రామాయణం మీద భక్తీ ,రమణ మాట మీద భక్తీ అందుకే అవేమైనా దొరుకు తాయేమో నని వెళ్ళా .” సరే బావా ! నువ్వు చెబితే అమ్మ వారి ముందు కూచోనే” మీ  ముసలి ముఠా ”వింటుంది కదా పాపం వాళ్ల నైనా చూడమని చెప్ప లేదా”అన్నాడు పిచ్చిబామ్మర్ది ప్రకాశం చీకటిని చీలుస్తూ ”.నేనుచూసి   నందుకు వాళ్ళంతా నన్ను గేలి చేస్తున్నార్ర .ఫ్రీ గా వస్తే ఫినాయిలైనా తాగుతాం కాని దాని జోలికి పోం ”ఆన్నారు ”అని చెప్పా ఏదో  కళా రాదన అంటూ గొంతు చించు కొంటావ్  ఇదేనా ?”అన్నాడు  ఈసడిస్తూ .”కొన్ని జీవితాలింతే ”అన్నా వాడిని ఊరడిస్తూ ”ఇంతకీ నువ్వేనిని  సార్లు చూశావ్?”అన్నా.”నేను పిల్లకుఫ్రీ   అంటే నిక్కర్ వేసుకొని వెళ్లి చూసా .అంతే ”అన్నాడు .
‘బావా ఇంతసేపు వరండాలో కూచోబెట్టి వాయిన్చేశావ్ ,భోగి నిన్న అయితే, ఇవాళ తలంటి పోశావ్ ,ఇక చాలు కాఫీ కూడా ఇవ్వలేదు .కడుపంతా ఖాళీ గ వుంది .అక్కయ్య నడిగి తాగి పోతా ”అన్నాడు .”ఒరే పిచ్చి నా బామ్మర్దీ !నువ్వు వస్తావని వాసన కని పెట్టి మీ అక్క ముందే గుడికి చెక్కేసింది .నీ పప్పులు ఇక ఉడకవ్ ”అన్నాను .”ఉడుకుతాయి   బావా ! అదేదో aad ‘  లో అతను చెప్పినట్లు” .ఇక లాభం లేదనుకొని ,ఇంటి ముఖం పడుతూ ”కొల వెరి బావా కొల వెరి”అంటూ చేతులూపాడు .ఒక్క సారి ఆ చెయ్యి పట్టుకొని ” చంపేస్తా ”అని  గుంజి కూచ్చో పెట్టా . ”అంత కోపం ఎందు కమ్మా !వెళ్తూ ,వెళ్తూ గుడ్ బయ్ గా ఆ మాటలు అంటే అంత పొడుచు కొచ్చిన్దేమిటి ?”అన్నాడు . ”నువ్వు అన్న ఆ మాట ఏమిటి ?దాని అర్ధం ఏమిటి ?తెలుసు కొనే అన్నావా ?”అన్నా ఊగి పోతూ   శంకరాభరణం లో సోమయాజు ల్లాగా ..”ఆ! మాకూ తెలుసండీ .మా మేనల్లుడు రెండు నెలల నించీ రోజుకు నాలుగు సార్లు ఈ మాట నాతొ అనటం వాడు గ్రీటింగ్స్ చెబుతున్నాడు కదానని చెప్పి నప్పుడల్లా పది రోపాయలు ఇవ్వటంజరుగు  గుతోంది .వాడు తీసుకొని ముసి ముసి నవ్వులునవ్వు కుంటు జారు కుంటున్నాడు . .ఇంతకీ అదేమైనా బూతు మాటాబావా? “‘అన్నాడు ప్రకాశం .”నీతో వచ్చిన చిక్కు అదే .ఏదీ తెలుసు కోవు .మాట దొరికితే వెంటపడి వాడేస్తావు .ఇప్పుడు తమిళ దేశం లో ఒక సినిమా లో ఈ మాట వాడటం వల్ల జనం అంతా వేలం వెర్రి గా దాన్నే పట్టు కొన్నారు .వాయిన్చేస్తునారు .దాని అర్ధం ఎవరికీ అక్కర్లేదు .దానర్ధం ”చంపేస్తా “‘అని .అది మనకు కొస వెర్రి అయి పోయింది ..అంత పాపం నేనేం చేశాన్రా ?”అన్నా .అమాంతం కాళ్ళ మీద పడి పోయాడు  ప్రకాశం బామ్మర్ది .”ఈ తప్పు కాయి బావా.నా మేనల్లుడు నన్ను ఆట పట్టిస్తూ రోజూ డబ్బు ఈ రకం గా నొక్కే స్తున్నాడన్నా మాట .ఆరి పిడుగా ”అంటూ తుర్రున జారుకొన్నాడు . . .
పండగ సరదా కోసం కట్టిన జరదా
సంక్రాంతి శుభా కాంక్షలతో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –4

సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –4

                                            కృతులలో  భాష భావం
త్యాగయ్య కృతుల్లో వున్న భాష ,భావ గాంభీర్యాన్ని తెలుసు కొనే ముందు ,ఆ నాటి రాజుల సంగీత కళా పోషణ ఎలా వుందో ఒక సారి గుర్తుకు చేసు కొందాం .
భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం అని ,హిందూ స్తాని సంగీతం అని రెండు రకాలు .కర్ణాటక సంగీతాన్ని ”నారదీయ సంగీతం ”అనీ ,హిందుస్తానీ ని ”హనుమదీయ సంగీతమ్ ”అనీ పేరు .హనుమంతుడు గొప్ప గాయకుడు ,సంగీత స్రష్ట .మహా రాజులు ఎందరో ,సంగీత విద్వాంసులను ఆదరించి ,పోషించారు .సంగీతానికి గొప్ప ప్రచారం కల్గించారు .త్యాగయ్య గారి శిష్యుడు సుబ్బయ్య అనే ఆయన కుమారుడు ఎనిమిది గంటల పాటు ”సావేరి ”రాగాన్ని పాడిన ఘనుడట .నారాయణ తీర్ధుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే  మెప్పించిన మహా భక్త వరేన్యుడు .సదాశివ బ్రహ్మేన్ద్రులు మహిమలను ఎన్నోచూపిన  మహిమాన్వితుడు .క్రిష్నయ్య అనే విద్వాంసుడు ఎండ బాధ నుంచి తప్పించుకోవటానికి ”మలయ మారుత రాగాన్ని ”పాడి చల్ల బరచుకోన్నాదట .శీలం నరసయ్య అనే సంగీత విద్వాంసునికి 40 వేల రాగాల మీద మంచి పట్టు ఉండేదిట .పైడాల గురు మూర్తి అనే విద్వాంసుడు ,1000 గీతాలను రాశాడట .తంజావూర్ నాయక  రాజు ”చెవ్వప్ప ”సంగీత మహల్ నే కట్టించిన సంగీత ప్రియుడు .ఆ మహల్ లో గాయకుడు ఎంత తక్కువ శ్రుతి లో పాడినా కనీసం 1500 మందికి విని పించే ఏర్పాటు ఉందట . చత్రపతి శివాజీ మహారాజు వంశానికి చెందిన ”షాహాజీ ”మహా రాజు ఆస్థానం లో త్యాగయ్య గారి తాత గారు ;;గిరిరాజ కవి ”ఆస్థాన గాయకుడు గా వుండే వారు .శరభోజి మహా రాజు ఆస్థానం లో 360 మంది సంగీత విద్వాంసులు వుండే వారట .రోజుకు ఒక విద్వాంసునితో పాడించే వారట . తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ గొప్ప వాగ్గేయ కారుడు .సంగీత స్రష్ట .ఆయన ఆస్థానం లో వున్న ఫిడేల్ విద్వాంసుడు ”వడివేల్ ”  ప్రతిభకు మెచ్చి ,బంగారు ఫిడేల్ తయారు చేయించి ,బహూక రించాడట .గద్వాల్ రాజు సీతా రామి రెడ్డి సంగీత విద్వాంసులను ఆదరించి ,ఏటా వార్షికాలు ఇచ్చే వాడు .
భోజనం సమయం లో ”చిన్న గుమ్మడి కాయ ”అంత లడ్డు లు వడ్డించే వాడట .ఎన్ని తింటే అన్ని రూపాయలు కానుకగా అంద జేశే వాడట .కృష్ణా జిల్లా లో చల్లపల్లి ,నూజివీడు ,మైలవరం ,ముక్త్యాల ,తోట్ల వల్లూర్ జమీందారులు సంగీత కళను బాగా పోషించారు .గరిక పాటి కోటయ్య దేవర లాంటి మహా విద్వాంసులను ఆస్థాన విద్వాంసులను చేశారు .ఇలా ,వివిధ రాజులు ,జమీందార్లు సంగీత కళకు మంచి ప్రోత్సాహమిచ్చి పోషించారు .
”సంగీత సాహిత్య రాసాను భూత్యై-కర్ణద్వయం కల్పిత వాన్ విధాతా –ఏకేన హీనః పున రేక కర్ణో ,ద్వాభ్యాం విహీనో బదిరస్య ఏవ”అంటే బరహ మనకు రెండు చెవులను ఇచ్చాడు అవి సంగీర్హా ,సాహిత్యాలను విని ఆస్వాదిన్చాతానికే .అందులో ఒక దాని మీదైనా ఇష్టం లేక పొతే ఒక చెవి వున్న వాడి కింద లెక్క .రెండిటి మీదా ఆసక్తి లేక పొతే చెవిటి వాడి గానే భావించాలి .మన వాళ్ళు మనో రంజనం చేసే సంగీత ,సాహిత్యాలకు అంత ప్రాధాన్యత నిచ్చారు .తెలిసిన శ్రోత దొరికితే శ్లోకం శ్లోకత్వం పొందు తుంది .తెలియని శ్రోత దొరికితే శ్లోకం శోకం అవుతుంది అన్నారు పెద్దలు .రసికత్వం లేని విద్య రాణించదు .ఇప్పుడు త్యాగయ్య గారి కృతుల్లో వున్న ,భాష,భావ సౌందర్యాన్ని వివ రం గా తెలుసు కొందాం .
”ఏలా దయ రాదు ,పరాకు చేసే వేలా సమయము కాదు -”ఏలా ‘
”బాల కనక మయ చేల సుజన పరిపాల ,శ్రీ రమా లోల విధృత శర జాల -శుభద కరుణాల వాల -ఘన నీల నవ్య వన మాలికా భరణా ‘ఏలా ”అనే ”ఆథనా ”రాగం లో మొదటి కీర్తన రాశారు త్యాగయ్య .ఆయన శ్రీ రాముడు నారాయణుడే .దశావతారాలు ,ఆయన ప్రతీకలే .త్యాగ బ్రహ్మ అపర వాల్మీకి అవతారం అని భక్తుల విశ్వాసం .ఈ కీర్తన లో నామ ,రూప వర్ణనా వైభవం వుంది .లలిత పద విన్యాసం ,రుచికర మైన అను ప్రాసలు ,వున్న కీర్తన ఇది .సంస్కృత భాషా ప్రయోగం ప్రౌధం గా వుంది .సంగీత కళా విన్యాసము కన్పిస్తుంది .తెలుగు కూడా  అంత అందం గానే నడిచింది .
” మరవకే  నవ మన్మధ రూపుని -నీటో ,మెల్లని మాటొ కన్నుల తేటో ,మరి వలె వాటో ,మనసా –కులుకో ,పావలా గిలుకో ,కపురపు బలుకో ,చెక్కుల తాళుకో ”అనే దేవ గాంధారి రాగం లోని కీర్తన లో శ్రీరాముని రూపము ,అలంకారము లను తేట తెలుగు లో వర్ణిస్తూ రామునికి తెలుగుదనం అబ్బ జేశాడు త్యాగయ్య .శ్రీ రామునికి తెలుగు వారి ”వల్లే వాటు ”వేశాడు చిత్రాతిచిత్రం గా .
కొన్ని పదాలను తమాషా గా వాడు తాడు త్యాగ్యా భాస్కర కవి ని ”కవీనా ”అంటాడు .కవి +ఇన అని విడగొట్టు కొంటె కాని అర్ధం కాదు .వాల్మీకిని ”బిలజ మౌని ”అని చక్కని తెనుగు పేరు తో పిలిచాడు .అట్లాగే శ్రీ రాముడు ఆయన చేతిలో ”పాప గజ నృసింహుడు  ”అయి పోయాడు .
శ్రీరాగం లో రాసిన ”ఎందరో మహాను భావులు ”కీర్తన హై లైట్  గా భావిస్తారు అదొక నానుడి గా జనం లో నిల్చి పోయింది .అందులోని నడక సౌభాగ్యం ఎంత అద్భుతం గా వుందో గమనిద్దాం ..
”మానస వన సంచారము నిలిపి –మూర్తి బాగుగా పొడ గనే  వారెందరో మహాను భావులు
సరగున పాదములకు ,స్వాంతమను -సరోజమును సమర్పణము సేయు వారెందరో —
హరి గు  మ  ణు  లగు సరముల గళమున –శోభిల్లు భక్త కోటులిలలో ,తెలివితో
కరుణ కల్గిజగామేల్లను సుధా ద్రుష్టి చే బ్రోచు వారెందరో మహాను భావులు
హొయలు మీరి ,నడలు గల్గు -సరసుని సదా కనుల చూచుచు పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులయి ముదంబును ,యశము గల వారెందరో –”
ఈ కీర్తన లో త్యాగయ్య గారి సంస్కార హృదయం ఆవిష్కృత మైంది . ఈ గీతం తో సంగీత రాసికులే కాక భక్తులు కూడా ముగ్ధులై పరవశించి పోతున్నారు .అంత ప్రాచుర్యం పొందిక కృతి ఇది .

అల్లాగే ”దుర్జన జలద సమీర ”,”నయన నిందిత సరోజ ”అనే అద్భుత ప్రయోగాలు చేశారు .ఇందులో మిగిలిన వారి కంటే భిన్నం గా ఆలోచించి కొత్త పద ప్రయోగం చేయాలనే ఆలోచన మనకు స్పష్టం గా కని పిస్తుంది .ఆయన ది అగాధ సంగీత సాహిత్య రస జలధి .అందులో మునిగితే తేలటం కష్టం .మరోసారి మరిన్ని వివరాలు తెలుసు కొందాం

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి

some  క్రాంతి 

              ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి  

          తేలేక పోతుందా సంక్రాంతి అని ఆశ తో వున్నాం జనమంతా
ధనుర్మాస దీక్ష ఫలించి ,మేలు నోములకు  ,మేల్కొల్పులకు
నగర సంకీర్తనలకు మెచ్చి ,భారత భవ్య భావి భాస్కరుడు
మకర సంక్రమణం చేస్తున్న పుణ్య కాలమ్
”దొరికిన పేడ పరస్పరం చిమ్ముకోటానికి కాకుండా ”
గొబ్బెమ్మలు గా తీర్చి దిద్ది ,పౌష్య లక్ష్మిని ఆహ్వానిద్దాం
ప్రగతి ముగ్గులు వేద్దాం ,ఆశల రంగ వల్లులు దిద్దుదాం
సంక్రాంతి మా లక్ష్మిని సాదరం గా ఆహ్వానించి ,కొలుద్దాం
అనైక్యతా ,అనాచార ,అత్యాచార ,అవినీతి ఆహిమ్సలను ,
భోగి మంటల్లో మాడ్చి మసి చేద్దాం
ఆప్యాయత ,ఆదరణ ,ఆత్మీయతా ,ఆనందపు
వెచ్చ దానాన్నిపంచుకొని , ,పచ్చ దానాన్ని పొందుదాం
ప్రగతి సూర్యుడికి ఇష్టమైన
శ్రమ, సేవా అర్క పత్రాలను శిరస్సు పై దాల్చి
రమ్య ,పుణ్య స్నానాలు  చేసి తరిద్దాం .
”ప్రజాదిత్య హృదయ పథనం”  చేద్దాం
మహా తేజస్సు ,ఓజస్సు పొంది త్రివిక్రములమవుదాం
దేశం కోసం సర్వస్వం అర్పించిన జాతి పితరులకు
నిస్వార్ధ సేవా భావ తర్పణం తో తృప్తీ ఆనందం కల్గిద్దాం
స్నేహం పాలు నెయ్యి ,శాంతి బెల్లం కలిపి
ప్రశాంతి పొంగలి చేసి ,కనుమ నాడు
అందరం కలిసి ,ఆప్యాయం గా ఆరగిద్దాం
మమత ,మానవత ,సౌభాగ్యం ,ఐక్యత ల
బొమ్మల కొలువు చేద్దాం -వాటికి ప్రాణ ప్రతిష్ట చేద్దాం
సుస్థిర సౌభాగ్య రధాన్ని ,అందరం కలిసి లాగుదాం
నవ్యత్వం తో ,దివ్యాను భూతి పొంది
భారత భాగ్య విధాత లమవుదాం
some  క్రాంతి కాదు -సంపూర్ణ క్రాంతి కై
అహరహం పరిశ్రమిద్దాం
తెలుగు వాడు ,ఏ నాడు లో వున్నా ,
మన వాడే నన్న మహత్తర భావం పొందుదాం
తెలుగు భాషా ,సంస్కృతులను కలిసి నిలుపుకొంటూ
భావి తరాలకు ,ఆ వారసత్వాన్ని
అవిచ్చిన్నం గా అంద జేద్దాం
”మేరా భారత్ మహాన్’ ‘అని రుజువు చేద్దాం
జన్మ భూమి సేవలో మాతృభాషా సేవలో తరిద్దాం
తెలుగు జనమంతా ఒకటై ,భిన్నత్వంలో
ఏకత్వం చూపిద్దాం,-అఖండత్వాన్ని నిరూపిద్దాం .
మహా మానవ హారం గా మారి
భారత మాత గళ సీమను అలంకరిద్దాం .
సంక్రాంతి శుభా కాంక్షలతో —

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment