వైల్దేరిసం (Wilderism )

     వైల్దేరిసం               (Wilderism )
Thornton Wilder గొప్ప అమెరికన్ నాటక రచయిత అని చేపాను కదా .ఇప్పుడు అతని మనోభావాలు తెలియ జేస్తాను .అవి అందరు తెలుసుకోవలసినవే ..రచయిత రాసే భాష అతను జీర్ణించుకున్న అనుభవం ద్వారా తనను గురించి తనకు తాను తెలియ జెప్పుకొంటాడు అంటాడు ఆయన .నాటక రంగం మీద ప్రతిక్షణం ”ఇప్పుడే ”అనిపిస్తుంది .భవిష్యత్తుకు ,భూతకాలానికి మధ్య పాత్రధారులు ఖడ్గ ధార (rajor edge )మీద నిలబడి ,అత్యంత అవసరమైన అంతరాత్మ ప్రబోధకం గా మాటలు పెదాలు దాటి అప్పటికపుడు ప్రయత్నా రహితం గా మాట్లాడుతారు .నవలా అంటే జరిగి పోయిన విషయం .చెప్పేవాడికి స్వయం గారద్దు పరచేదేమి లేక  ఉండక విషయాన్ని దాచి మనకు అతని గొంతు వినిపించేట్లు చేస్తాడు .మళ్ళీ మళ్ళీ లేక్కలేసుకుంటూ జరిగి పోయిన సంఘటనలతో తాను ఎంచుకున్న సంఘటనలను జ్ఞాపకం చేసు కుంటాడు .ఇతను లెక్కించటానికి వీలు కాని ఇతరుల కంటే మనముందు నిలిచి తనకున్న పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు అంటాడు వైల్దేర్
                   నాటక రంగం అన్ని కళల కంటే మహోన్నత మైనదని అతని భావన .మానవుడు తన లాంటి మరో మానవుని మనోభావాలను అప్పటికప్పుడు  పంచుకొనే వీలున్న  రంగం .రచయిత లందరికి ఏదో కొంత నీతిని బోధించాలని పిస్తుంది .అక్కడినుంచి ,యంత్రం కదలటం మొదలవుతుంది .ఇంకో రకం గా చెప్పాలంటే మనం గాస్ స్టవ్ మీద వండుకొన్న పదార్ధం ఆ గాస్ వాసనతో వుండదు .కాని మనం అందులే వేసిన దినుసుల లోని రుచే వస్తుంది .నాటకం చెప్పేదేమిటంటే -జీవితం జీవిస్తూ ,అందులోనే జీవితాన్ని తెలుసుకోవటం లా వుంటుంది .”మీరు ఎందుకు రాస్తున్నారు ?”అని వైల్దేర్ ను అడిగితే ”నేను ఎందుకు రాస్తున్నాను అంటే -నాపై నేను ప్రయోగం చేసుకుంటూ ,కొత్తపుస్తకాన్ని ఆవిష్కరించాతానికే ,అది చదివి నేను ఆనందించటానికి,లేకపోతే ఒక కొత్త నాటకం తో నన్ను నేను మరచిపోవటానికి,లేక తాదాత్మ్యం చెందటానికి”అన్నాడు ”మీరు చెప్పిన విషయాలన్నీ మీరు రాసిన పుస్తకాలు నేరవేర్చాయా ?”అని ప్రశ్నిస్తే ”లేదు ”అని ఖచ్చితం గా చెప్పాడు .
                         వైల్దేర్ అభిప్రాయం ప్రకారం రచయిత తప్పని సరిగా విమర్శకుడు అయివుండాలి ..ప్రతి వాక్యం శక్తివంతం గా తిరస్కరిమ్పబడే అస్తిపంజరమే నంటాడు .ప్రతి అంగీకారం సత్యం శక్తి ,సౌందర్యం మొదలైన వాటిని పాలించేదే .రచనావ్యాసంగం చాలాభాగం వదలివేయబడే వ్యూహాత్మక అంతశ్చేతనా విధానమే .విమర్శకుడు పందోమిదిభాగాలు నీళ్ళలోనే మునిగివుందే మంచుపర్వతమే (ఐస్ బెర్గ్ )అంటాడు నాటక కర్త వైల్దేర్ .ఎందుకు ,ఎలా రాశాడు అనే విషయం మీద రాసే వారిని W.B.yeats  ”వసంతాన్ని మురికి చేయటం వంటిది ”అన్న మహాకవి బ్రౌనింగ్ వాక్యం తో హెచ్చరించినట్లు వైల్దేర్ చెప్పాడు చివరగా వైల్దేర్ ”ఆపిల్ పండుఎర్రబడిన   చోట తొంగి చూడకు-చూస్తే   మన స్వంత ఎడెన్ కాని నువ్వు కాని నేను కాని ఉండము ‘.అని హితవు చెప్తాడు
                                                       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -10 -11 .

 

Posted in అనువాదాలు | Leave a comment

నాటక రచయిత wilder

                        నాటక రచయిత wilder
ప్రయోగాత్మక నాటక రచయిత గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాటక రచయిత  Thorton wilder .అమెరికా లోని విస్కాన్సిన్ లో ని మాడిసన్ లో 17 -04 -1897  లో జన్మించాడు .సృజాత్మక నవలా కారుడు ,నాటక రచయిత .విశ్వం మీదఆయన  ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి .1920 లో yale  విశ్వ విద్యాలయం లో డిగ్రీ పూర్తి చేశాడు .1930 -37 మధ్య చికాగో విశ్వ విద్యాలయం లో డ్రా ,క్లాసిక్స్ బోధించాడు .1926 లో   the kobaala అనే  మొదటి    నవల  రాశాడు   .తర్వాతి   నవల   bridge of saint louis   1927 లో రాస్తే దాన్ని సినిమా తీశారు .టి.వి .లో కూడా వాడుకునారు .1930 లో the women of andros రాశాడు .ఆయన రాసిన దాన్ని బట్టి ఆయన్ను అమెరికన్ అని అనుకోలేదు .గ్రీకు రచయిత ఏమో ననుకున్నారు .అంటే అతని కృషి యెంత గొప్పదో తెలుస్తుంది .1948 లో the ides of march ,1967  లో  The english day ,1973 లో    Thiophilus North రాశాడు  .
                 అతని నాటకాలు కొత్త తరహా గా వుంటాయి .అందులోని పాత్రలు ప్రేక్షకులతో మాట్లాడు తాయి .అంటే ఆ కాలాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు . . .మనం ఆ కాలమ్ లో వున్న  అనుభూతి వుంటుంది .అందులో భాగస్వాములం అవుతాం .అదొక గొప్ప థ్రిల్లింగ్ .1938 లో రాసిన నాటకం అవర్ టౌన్ ..ఇందులో స్టేజి మేనేజర్ పాత్ర సృష్టికి ఆశ్చర్య పోతాం .1958 లో వచ్చిన the match maker  లో కూడా ఇలాంటి సృజనాత్మక ప్రయోగమే చేశాడు .ప్రేక్షకులతో మాట్లాడటమే వీటి ప్రత్యేకత .helo daddy naatakam కూడా  super hit .ఇది ముసిచల్ డ్రామా గా సినిమా గా వచ్చింది .
                      the skin of our teeth నాటకం 1942 లో ఒక కాలానికి చెందిన విషయాలను వరుస తప్పించి ,తారుమారు చేసే పధ్ధతి anachronism అంటే కాల వ్యతిక్రమం అనే కొత్త విధానం తో రాశాడు .ఆ నాటి భౌగోళిక చారిత్రాత్మక కాలాల లోని పాత్రలను తీసుకొని వారి తోనే ప్రేక్షకులతో మాట్లాడించే విధానం ఇందులో వుంది .ఇదో నూతన ప్రక్రియ .దీని వల మానవ అనుభవాలు ఏ కాలమ్ లో నైనా ,ఏ ప్రదేశం లో నైనా ఒకటి గానే వుంటాయి అని చెప్పటం అతను సాధించిన విజయం .ఇలా కొత్త తరహా ప్రయోగాలను నాటక రంగం లో చేసి సఫలీక్రుతుదయాడు .విపరీతం గా ప్రేక్షక ఆదరణ పొందాడు
wilder .అతని అనుభవాలను గురించి ఇంకో సారి తెలియ జేస్తాను .
                                                             మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -10 -1
Posted in సేకరణలు | Leave a comment

“సరదాగా కాసేపు ” ఆవిష్కరణ న్యూస్ పేపర్స్ లో

Newspaper-clips

Posted in సభలు సమావేశాలు | Leave a comment

SARADAGA KASEPU by Gabbita KrishnaMohan Book release function

Title of the book: SARADAGA KASEPU by Gabbita KrishnaMohan Book release function held today 15th October 2011, at Ravindra Bharati. This book is adapted in Telugu based on Ten Selected short strories from Mulliner Series of P G Wodehouse. The book was released by Mr Mohan Kanda IAS, former Chief Secretary, Andhra Pradesh Other dignatories on stage were: Mr Vamsi, Writer, Music Director, Film Director and Singer Ms Ravalapalli Suneetha – eminent writer Hasya Brahma Sankarnarayana from Eenadu group Poodoori Rajireddy, Editor FUNDAY – SAKSHI B. Eswara Reddy, Manager, Visalaandhra Publishing house Anchored by: Rampa, Cartoonist Book Published by: Visalaandhra Publishing House

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సాహితీ మండలి ఉయ్యురు 260 వ సమావేశం

Sahithimandali 260 111016_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మండలి బుద్ధ ప్రసాద్ – సన్మాన సభ – అవనిగడ్డ – 14.10.2011

Posted in సభలు సమావేశాలు | Leave a comment

తెలుగు భాష “చిరంజీవి”

Telugu Basha Chiranjivi

Posted in సభలు సమావేశాలు | Leave a comment

గురజాడ 150 వ జయంతి ఉయ్యూరు లో – కృష్ణా జిల్లా రచయతల సంఘం – సరస భారతి –

Gurajada 150 111022

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

గాంధీతాతా నువ్వే చెప్పు! – కంచ ఐలయ్య

గాంధీతాతా నువ్వే చెప్పు!
11_10_2011_004 Gandhi tata

రావాలనుకున్న తెలంగాణ రాష్ట్రం రాక మా ప్రాంతపు ముగ్గురు నేతలు నువ్వు పుట్టిన రోజున నీ సమాధి దగ్గర నీ టోపి పెట్టుకొని కూర్చున్నారు. ఆ మూడు ఫోటోలు చూస్తే నాకు నువ్వు బతికి వుండగా మూడు కోతులకు చెడు మాట్లాడం, చెడు వినం, చెడు చూడం అని నేర్పిన నీతి గుర్తొచ్చింది. అందులో ఒకాయిన గాడ్సే గాడిలో ముసలితనం పొంది ఇప్పుడు నీ గాడికొచ్చాడు. ప్రాంతాల పంపకంలో 55 కోట్ల రూపాయలు పాకిస్థానుకియ్యాలని నువ్వు ఉపవాసనమున్నందుకు నిన్ను చంపుడు సరైందని వాదించి, వాదించి ఇప్పుడు నీ దగ్గరికెందుకొచ్చాడు?

ఆయన పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో నీ అహింస సూత్రం ఆకుతో సమానమని ముస్లిం ఆడోల్ల కడుపులు కోసి పిండాలను మంటల్లో ఏసిన అహింసా అసలు రూపం అని వాదించాడు. అలా వాదించి, వాదించి మొన్న మోడీ సద్భావనంలో నీ ఫోటో పెట్టుకోగానే నువ్వు కాంగ్రెస్‌ను వదిలేసి వాళ్ళతో పోతున్నావని ఈయన నీ సమాధి దగ్గరికొచ్చి, చెడు చేసుడటుంచి, చెడు మాట్లాడనన్నట్టు కూర్చున్నాడు.

తెలంగాణలో వాళ్ళ రాజ్యమొస్తే ముస్లింలను ఊచకోత కొయ్యమని ఎక్కడ చెప్పడం లేదు. స్వాతంత్య్రం రాకముందే ముస్లింల రక్షణ మీద, రాజ్యం ఏర్పాటు మీద (పాకిస్థాన్) నువ్వు 1931 నాటికే ఒప్పుకున్నావుగా. మైనార్టీల వాటాపై గాని రక్షణపై గాని వీళ్ళు అగ్రిమెంట్ ముందు అవసరం లేదంటున్నారు. నువ్వేమో వాళ్ళకు ప్రత్యేక దేశమివ్వటానికే ఒప్పుకున్నావు. నిన్ను వాళ్ళు చంపి 63 ఏండ్లయింది. ఎన్నడు నీ దగ్గరికి రానోళ్ళు గీ చిన్న తెలంగాణ కోసమొస్తున్నారంటే మాకందరికి భయమేస్తుంది.

తెలంగాణ ప్రాంతానికి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, చత్తీస్‌ఘడ్ నుంచి వీళ్ళ కన్న తల్లి ఆర్.యస్.యస్. పైసల్నీ పదాతిదళాల్ని పెద్ద ఎత్తున పంపుతుంది. భాషా రాష్ట్రాలను విడగొట్టడం తెలంగాణతో మొదలుపెట్టి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లకు చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని పాకించి, కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలనేది వాళ్ళ వ్యూహం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెలమ దొరల రాజ్యం ఏర్పరచవచ్చని ఒక ప్రయత్నం జరుగుతుంది.

మీ దగ్గరికొచ్చిన రెండోనేత ఇక్కడ తెలంగాణ రాజ్యాన్ని నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాక ఇక్కడ రెడ్డి, వెలమలను కొంత అణచిపెట్టారు. కాంగ్రెస్ గూటి నుండి ఒక దళితుడు, టిడిపి గూటి నుండి ఒక బి.సి. తెలంగాణలో ముందున్న పెట్టుబడిదారులుగా కనిపించారు. ఒక ముస్లిం కుటుంబం కూడా ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో యస్.సి, బి.సి.లు అన్ని రంగాల్లో కనిపించడం మొదలైంది. కుల నిర్మూలన అసలు చెయ్యొద్దనీ నువ్వు కూడా అంబేద్కర్‌తో పోరాడి దాన్ని కాపాడావు కదా! దాని నిర్మూలనకు ఇదొక ‘అడ్డ’గా తయారైందని వీళ్ళు తపన చెందుతున్నారు.

ఇక్కడి మూడు ప్రాంతాల్లో అన్నిటికంటె ఎక్కువ ‘బి.సి’ చైతన్యం ఉన్న ‘అడ్డ’గా ఇది తయారైంది. ఈ ప్రమాదం నుండి కాపాడాలంటే ‘ఆంధ్ర కమ్మరాజ్యం’ ‘రాయలసీమ రెడ్డిరాజ్యం’గా మారినట్టు దీన్ని ‘వెలమ రాజ్యం’గా మార్చే ‘విప్లవం’ ముందుకొచ్చింది. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లా తప్పో ఇక్కడే నిరూపించాలని ఈ ఇద్దరు నాయకుల్ని నీదగ్గరికొచ్చిన పెద్ద రావు, అడవిలోని అజ్ఞాతరావు అనుమతితోనే ముందుపెట్టారు. అంటే ఈ చిన్న రాష్ట్రంలో వెలమరాజ్యం రాబోతుందన్నమాట. నీ అండదండలతో నెహ్రూ చెప్పినట్లు ఈయన ఆంధ్ర పాలకుల దీవెనలతో ఎదిగి కుటుంబపార్టీని పెట్టాడు. 2001లో అప్పులతో పార్టీ ప్రారంభించి “కలెక్షన్ క్యాపిటల్ అక్యుములేషన్” ఒక కొత్త సిద్ధాంతాన్ని అమెరికా నుంచే దిగుమతి చేశారు. ఈ అక్యుములేషన్ బనియా “బిజినెస్ క్యాపిటల్ అక్యుములేషన్” పూర్తిగా విరుద్ధమైంది.

బనియా బిజినెస్ క్యాపిటల్ పిసినారితనం కలిగి ఉంటుంది. కాని కలెక్షన్ క్యాపిటల్ ఖర్చు చేస్తుంది, కొంత ఇన్‌వెస్ట్ చేస్తుంది. ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నడు ఖర్చుపెట్టలేదు. కాని ఈయన కుటుంబ సభ్యుల నేతృత్వంలోని స్వాడ్‌లకు భయపడి బాగానే రాలారు. ఈ క్రమంలోనే వెలమ కలెక్షన్ క్యాపిటల్ కూడ కొన్ని కుటుంబాల్లో జమైంది. ఇప్పుడు వెలమలకు రెండు టి.వి. చానెల్స్ ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ‘తంతే వీరు హైదరాబాద్ పరుపులో’ పడ్డారు. ఇటువంటి మీడియా పట్టు తెలంగాణ రెడ్డి క్యాపిటల్‌కు లేదు.

బి.సి., యస్.సి.లు ఈ క్యాపిటల్ ప్రచార సాధనాల ముందు నిలువలేదు. తెలంగాణ రెడ్లు రాయలసీమ రెడ్ల గుప్పిట్లో ఇరుక్కుపోయి బయటపడేలోపే పనంతా జరిగిపోయింది. ఇక్కడి వెలమలు అన్ని రంగాల్లో రెడ్లకు అందనంత ఎత్తు ఎదిగారు. తాతా నీది చిన్నకులమైనా అది జాతి అంతటా ఉంది కనుక నువ్వొక జాతీయవాదివయ్యావు. వీళ్ళది చిన్న ప్రాంతంలోని చిన్నకులం కనుక ప్రాంతీయ వాదమే వారికి ‘శ్రీరామ రక్ష’. నీకు లేని మంచి లక్షణాలు కొన్ని వాళ్ళకున్నాయి. నీకు ఫార్‌మల్ పవర్ వద్దన్నావు. వాళ్ళకది సంపూర్ణంగా కావాలి.

నువ్వు సిద్ధాంత శత్రువువనుకున్న అంబేద్కర్‌ను డిస్‌ప్రూవ్ చేసి చిన్న రాష్ట్రాల్లో ఎంత చిన్నవైన అగ్రకులాలే అధికారంలోకి వస్తాయని చెప్పడానికి వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. అన్ని రంగాల్లో అంబేద్కర్ సిద్ధాంతం చితికిపోవడమే నువ్వు కోరుకునేది కూడ. ఆ పని వాళ్ళు చెయ్యగలరు. ఐతే ఈ ‘కలెక్షన్ క్యాపిటల్’ చలనశక్తి ఎంతో మీ తరానికి అర్థంకాదు. ఇది ముందు బొంబాయిలో శివసేనతో ప్రారంభమైంది. ఇది చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సెంటిమెంట్ ప్రాంతీయ వాదం దీని బలం.

దీని మజిల్ పవర్ ఇంగ్లీషు విద్యలేని బి.సి.ల నుండే ఎక్కువ వస్తుంది. ఇది ఎంత వేగంగా కలెక్ట్ అవుతుందో అంత వేగంగా ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి ఆర్.యస్.యస్. అండ, అడవి పోరాటం అండ రెండు ఉండడంతో ఇది ఇంకా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఈ ఊపులోనే ఇక్కడ అంబేద్కర్‌ను చంపడం దాని లక్ష్యం. ఈ హత్య నీ అహింస సిద్ధాంతంతో కూడ చెయ్యొచ్చు. అంబేద్కర్ చచ్చిన కులాల్ని లేపి విద్యతో అధికారుల్ని, మంత్రుల్ని చేశాడు. అది తెలంగాణ వెలమలకు రెడ్లకు అసలె గిట్టని సమస్య. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళు మూస్తే అంబేద్కర్ ఆటోమ్యాటిక్‌గా చస్తాడు. ఆ పని 1969 నుండే ప్రారంభమైంది. గత రెండు ఏండ్లలో తారాస్థాయికి చేరుకుంది.

తెలంగాణ రాగానే తెలుగుతల్లి సహాయంతో వెలమ పాలకులు ఇంగ్లీషు విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆపేస్తారు. అది నీకు ఇష్టమే. గత పదేండ్లలో ‘కమ్మ క్యాపిటల్’ పాలనలో కాస్త కదిలాడిన తెలంగాణ బి.సి.లు, మాదిగలు ఇప్పటికే మంటగలిసే రోజొచ్చింది. ఇక్కడున్న వెలమ-రెడ్లు కొన్ని చిన్న కులాల నుంచి వచ్చిన మేధావులు తమ వెంట ఉంచుకోవచ్చు. కాని సామాజిక తెలంగాణ బి.సి., మాదిగ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతలోనైన సందుపట్టే చాన్స్‌పోయింది.

ఇప్పుడు తెలంగాణ వస్తే వెలమ క్యాపిటల్‌కు-రెడ్డి క్యాపిటల్‌కు మధ్యనే అధికారం తిరుగుతుంది. సమైక్యాంధ్రలో అది రెడ్డి, కమ్మ క్యాపిటల్ మధ్య తిరిగేది. వెలమలు సమైక్యాంధ్రను ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ‘కలెక్షన్ క్యాపిటల్’ బిజినెస్ క్యాపిటల్ అడవి అండతో కూడ పరిపాలించలేరు. కమ్మ క్యాపిటల్‌తో తట్టుకోలేని సమైక్యాంధ్ర రెడ్లు వైఎస్ఆర్ హయాంలో ‘అగ్రెసివ్ స్టేట్ ప్లండర్’ రూపంలో నిలదొక్కుకోవడమే కాక కమ్మ క్యాపిటల్‌నే ఉక్కిరిబిక్కిరి చేశారు.

తాతా, గ్లోబలైజ్‌డ్ పెట్టుబడితో ఆర్గనైజ్‌డ్ అగ్రెసివ్ పెట్టుబడి సమీకరణ నీకాలంనాటి బనియా వ్యాపారంలా చిన్న మొత్తాలను దండి కొట్టే వ్యాపారంతో సంపాదించదు. అది రోజువారీగా దండుకుంటుంది. మొదట్లో కొంత అభివృద్ధి లక్షణమున్న కమ్మ క్యాపిటల్, అది అధికారంలో ఉన్న ఆఖరి దశలో చాలా గర్విష్టిగా తయారై ఒక పక్క మొత్తం వ్యవసాయ రంగాన్ని, మరో పక్క తెలంగాణ వెలమ రెడ్లని, కాలికింద బంతిలా తొక్కింది. ఆ అణచివేత నుండి ఈ అగ్రెసివ్ వెలమ ‘కలెక్షన్’ క్యాపిటల్ పుట్టింది. ఇది త్వరలోనే నిలదొక్కుకున్నది. పెరిగి పెద్దదయింది.

దీనికి వెనుకబడిన, ప్రాంతాల స్వయం పాలన సిద్ధాంతాన్ని తుపాకిలా పట్టుకున్న ‘అన్న’ల అండ దొరికింది. వాళ్ళు ఓటు బైకాట్ అని బయటికి చెప్పినా, అది కనుసైగతో కొత్త పార్టీ బాక్సుల్లో పడ్డది. ఇలా పుట్టిన పార్టీలు ఆత్మగౌరవం నినాదంతో గులాబీ జెండా కింద సకల వెలమల్ని సమీకరించింది. 1969లో పోరాటం ఆంధ్రా తెలంగాణ భూస్వామ్య శక్తుల మధ్య జరిగి చివరికి ఆంధ్ర రెడ్డి భూస్వామ్య శక్తులు చెన్నారెడ్డితో పరిపాలించబడడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు పోరు పెట్టుబడి రంగానికి మారింది. నక్సలిజానికి ఉత్తర తెలంగాణ వెలమ పెట్టుబడిదారులకు ఉన్న కుల పునాదుల్ని కమ్మ పెట్టుబడి అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫేలయింది.

నీ దగ్గరకొచ్చిన మూడో టోపి పౌరహక్కుల పాయది. అది మధ్యవర్తిత్వ పని చేస్తున్నది. పౌరహక్కుల ఉద్యమంలో బాగా కష్టపడి కాలం గడిచిన ఒక మిత్రుడు చెప్పినట్లు ఆ ఉద్యమంలో కొంతమంది ఆస్తుల్ని కాపాడుకోవడానికి పనిచేశారు. ఇప్పుడు అటువంటి కొన్ని శక్తులు ఆస్తులు కాపాడుకోవడం దశ దాటిపోయి, ఆస్తుల్ని పెంచుకొని కొత్త అవతారమెత్తడానికి ఇదొక అదును. ఈ టోపీ, మార్క్స్‌కూ, మావోకు టోపీ పెట్టి నీ దగ్గరకొచ్చింది. ఆస్తుల పెంపకంలో ఈ కోవవారు ప్రస్తుతం కాషాయ టోపీ, ‘కద్దర్’ టోపీ ఏదైన పెట్టడానికి సిద్ధం. ఐతే దాని ప్రధాన పని వెలమ-రెడ్ల మధ్య మధ్యవర్తిత్వం. ముందేమైతదో చెప్పలేం.

ఈ ఉద్యమంలో దళిత నేతృత్వ పాయకూడ ఒకటున్నది. దానికి కిందా పైనా వెలమలే ఉన్నారు. ఈ పాయ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నీ వేషంలో చెబుతుంది. గదెట్ల సాధ్యం. గణపతికి కల్లుతాపాలని చూస్తే తాగుతాడా? ఆయన తనవాళ్ళు నుండొచ్చే విస్కే తాగుతాడు. అందుకే సకల సమ్మెలో దళిత-బహుజనుల ఏకైక పెట్టుబడైన చదువు బందు పెట్టిండ్రుగాని విస్కీతాగుడు బందు పెట్టలే. ఈ కొత్త పెట్టుబడికి దేన్ని ఎప్పుడు, ఎట్లా బందు పెట్టాలో తొందర్లోనే అర్థమైంది. అది ఎంత ఆడిన, పాడిన అధికారం దాని చేతికి రాదు. అది కలవారి కాలువల్లో నీళ్ళు మాత్రమే పోయగలదు. ఆ నీళ్ళన్నీ ఈ ప్రాంతపు దొరవారి నదిలోనే పడుతాయి.

తాతా నీకు అనుభవమున్నది. నీ జాతీయ పోరాటంలో ఒక్క అంబేద్కర్ మాత్రమే నీ కాలువలకు నీళ్ళురాకుండా తన పెరట్లో తన చెట్లో పెట్టుకొని నీళ్ళుపోసుకున్నాడు. జిన్నా నీ కాలువకే గండికొట్టి తనదో చెరువు కట్టుకున్నాడు. ఇక మిగతా కాలువల్లోని నీళ్ళు నీ నదిలోనే పడ్డాయి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏదో ఒక కాలువలో నీళ్ళుపోసి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల నాలుకలెండ కొట్టినోల్లే. వాళ్ళనుండి పూర్తిగా లాభం పొందింది నువ్వే. వాళ్ళదప్పుడు ఎంత మంచి జాతీయవాదమో ఇప్పుడంత మంచి ప్రాంతీయ వాదం కూడా.

నిన్ను నేనడిగే అఖరి ప్రశ్నేమంటే, ఆంధ్ర కమ్మ-రెడ్డి క్యాపిటల్‌లో కొంత భాగం ఇంత తొందరగా వెలమల గంపలో పడ్డాక వచ్చే కొత్త రాష్ట్రంలో సామాజిక తెలంగాణో, బహుజన తెలంగాణో సాధ్యమేనా? ఇప్పటికీ వెలమల క్యాపిటల్‌కు ఉన్న తిరోగమన అగ్రెసివ్ హిందుత్వ లక్షణాలను మా కండ్ల ముందే చూస్తున్నాం. రాజ్‌ఘాట్‌లో వాళ్ళకు, నీకు కుదిరిన అగ్రిమెంట్ తెలంగాణలో అంబేద్కర్‌ను చంపడమే అయితే ఈ చిన్న రాష్ట్రాల కోసం జరిగే పోరాటంలో నీ అహింస పోరాటం ప్రకారమే దళిత-బహుజనులు తమను తామే చంపుకుంటున్నారు కదా! ఇది ఎంత కాలం జరగాలి? ఎంత మంది సచ్చేదాక జరగాలి? ఇక్కడ ప్రజలంత సచ్చి పాలకులు బతికుంటే చాలా? నువ్వు నడిపిన మొత్తం స్వాతంత్య్ర పోరాటంలో కూడ ఇంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారా?

క్యాపిటల్ ఆంధ్రదైనా, రాయలసీమదైనా, తెలంగాణదైనా ఇక్కడి పాలకకులాల మధ్యే తిరుగుతుంది. అధికారం మాకు కావాలనుకునే దళిత-బహుజన రాజకీయ నేతలైనా, ఉద్యమ నేతలైనా పెట్టుబడి ఏ కులాల్లో ఉంది, దాని బలమెంతో చూడకుండా చూస్తే సామాజిక న్యాయం దొరుకుతుందనుకుంటే గాంధీ టోపి వీరి నెత్తుల మీద కూడ పెడతారు. సిద్ధాంతాలకతీతంగా రాష్ట్రం సాధించుకోవాలి అని ఆర్.యస్.యస్.ని, అంబేద్కర్‌ని, మావోను ఒకే పడవెక్కిస్తే పడవ మునుగుద్ది కాని బతికి బయట పడేది నాలుగు పడగల హైందవ నాగరాజే.

– కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

Posted in రాజకీయం | 2 Comments

ముక్కోతి కొమ్మచ్చి లో రమణుడి నానుడి

Ramanudi Naanudi

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

సరదాగా కాసేపు పది కధలు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఏమండోయ్ ! తప్పకరండి సరదాగా కాసేపు పి జి వుడ్ హౌస్ – పది కధలు – ఆవిష్కరణ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | 2 Comments

సరసభారతి – 27.09.2011

ఆడియో -౨ adiyo -3

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

బతుకమ్మ కాదు… రాజకీయాలాడలి … ఆంధ్ర జ్యోతి

IMG

Posted in సేకరణలు | 1 Comment

రసభారతి – జాషువా జయంతి- విజయవాడ- సాహితీ మండలి – వుయ్యూరు సమావేశం

రసభారతి  – జాషువా జయంతి – విజయవాడ

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

అనంతం – రసభారతి

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంద్ర జ్యోతి లో కంచ అయిలయ్య రాసిన ”చదువులకు సమ్మె వద్దు ‘

Posted in సమయం - సందర్భం | Leave a comment

హైకూలు

 హైకూలు
01 -పది రోజులు రోడ్డు మీద
     రక్తమే కాని, మంచినీటి వాసన
     ఆశ ఎండ మావియా ?
02 -అస్థవ్యస్థత అవహేళన నుంచి
      రాజీ  నాగరికం
      రెండూ  ఎక్కడున్నవి అక్కడే
03 -ప్రతి తరం
      నాగరికతను  నేర్చుకొంటుంది
      లేకుంటే అందనంత ఎత్తున వుంటుంది
04 -అసలైన వాళ్ళు వదిలేసి వెళ్ళారు
      వేలాది  ఏళ్ళు   గడిచి పోయాయి
      వారి జన్యు సంపద వెనుదిరిగింది
05 -అంతులేని నరకులాట
      తోచిన విధం గా పొగడ్తలు
      చరిత్ర-అంతా  బుకాయింపే
06 -అశ్లీలం,అవాస్తకత
      విధి బాధిత చిన్నారులు
      నెత్తుటితో తడిసిన చీలిక పేలికలు
07 -జాగ్రత్తగా మనం ఏడుస్తాం
      గడిచిన గాధల ఆనవాళ్ళు
      ఆశ ,ప్రేమ ఇక్కడే నిలిచి పోయాయి
08 -కామం ఇంద్రియాన్ని పట్టుకొంటుంది
      సత్యాన్వేషణ లో శరీరగతమవుతుంది
      వాటి అన్వేషణ అనంతం
09 -వాగ్దానాల  వర్షం
    శీఘ్రం గా తొందర్లోనే మరుపు
    అయినా వాటినే పట్టుకు వేలాడటం
10 -చిన్న నా పగిలిన గుండె
      నవ్వు పుట్టిస్తుంది విపరీతం గా
      సూర్య కాంతి కీచు   ధ్వని
ఈ హైకూలను ”hyku-you ”పేరిట ”Cindy  Rosecrance అనే ఆమె రాసింది .ఆమె midwest లో montana  నివాసి .నిజాన్ని నిర్భయం గా చురుక్కుమనేట్లు చెప్పే చేవ వుందామెకు .యుద్ధం   ,స్నేహం  ,ప్రేమ ,మరణాల పై భావాత్మక రచనలు …చేసిన మంచి రచయిత్రి .ఈమె కవితల్లో నవ్వు పుట్టించే తప్పుల తడక విషయాలే కాక దుఃఖ భారాన్ని కల్గించే విషాదమూ ఉంటుంది .అన్ని సహజ నిజాలే .
         నాకు తోచిన రీతిలో వీటిని అనువదించి అందిస్తున్నాను .సూచనలుంటే తెలియ జేయండి .ఆ రచయిత్రిని పరిచయం చేయటానికే నేను చేసిన ప్రయత్నం
            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —16 -09 -11 .
Posted in అనువాదాలు | 1 Comment

పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానమ

ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరసభారతి 29 వ సమావేశం -ఆహ్వానం

సరసభారతి 29 వ సమావేశం ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సంపూర్ణ ఆహారం -అవిశ

Avisa

Posted in ఆరోగ్యం | Leave a comment

నాకు నచ్చిన రెండు మంచి కవితలు

 రెండు మంచి కవితలు
                                      1  —    శై ”శవ”గీతం —రచన —చల్లా మధుసూదన్ –9490638222
         ఆకాశం  కాలు   జారి   –నెలనీల్లోసుకొంది  నీల్లోసుకొంది
         అడవికి వంధ్యత్వం–సాగర గర్భం లో సంతాన సాఫల్య కేంద్రం
          ఆకలికి ఒక ఆలింగనం -దాహానికి -గాఢ   చుంబనం
          కాలంతో మైధునం –అరక్షిత లైంగిక సంబంధం .
          నిద్రలేమి స్వప్నాన్ని స్కలించింది –కాలానికి బిడ్డలు కావాలి –వేగంతో సహ జీవనం జీవిస్తోంది
         యూజ్ అండ్ త్రో –శుక్రకణాలు -లేటెస్ట్ ట్యూబ్ లో –అండం ఫలదీకరణ
          కండోం అడ్డు గోడలు –అన్వాన్తేడ్ వాంచలు దాటి –అండ  నిర్ధారణ జరిగి –డిస్పోజబుల్ పిల్లల జననం .
         తల్లి పాల వారోత్చావాలు –తెట్రాప్యాక్ లోముర్రుపాలు
         చుక్కల మందు మాత్రల విందు
         సన్  ఆఫ్ లేకుండా –కేరాఫ్ అడ్డ్రెస్ వెతుక్కుంటూ–కేర్ కేర్ మంటూ –చైల్డ్ కేర్ సెంటర్ కు
         విదేశీ నిధులు –స్వచ్చంద విధులు –అనాధ శరణాలయాలకు –పాక్కొంటు వెళుతున్నారు .
        సెక్స్ లోను బుక్స్ లోను –సగం సగం —కుటుంబ నియంత్రణ లో మాత్రం —సింహభాగం
        అంగం వెనకాల –వో గర్భాశయం –పాపా(యి ) లతో నిండి –ప్రసవించేందుకు సిద్ధం గా వుంది
        కత్తులు మరగ బెట్టండి  –బల్లలు సిద్ధం చేయండి –మగాళ్ళకు —మ్రుగాళ్ళకు —వేసేక్టమి చేసెయ్యండి ..
                             -2-మరిచిపోయాను —–రచన  –మరాతి మూలం –ఏ;ది .జోషి —అనువాదం –డాక్టర్ నలిమెల భాస్కర్ –9704374081
                              ——————-
           హాల్లోకి   టి .వి  వచ్చాక  –నేను మాట్లాడ్డం మరిచి పోయాను —
ఇంటికి వాహనం తెచ్చాక –నేను నడవటమే మర్చిపోయాను —
      జేబులోకి కాలిక్యులతోర్ వచ్చాక –ఎక్కాలన్నీ మర్చిపోయాను
      తార్రోడ్డు వచ్చాక -మట్టి సుగంధం మర్చి పోయాను
      కుహనాసంబంధాల్ని  సంబాలించ లేక –ప్రేమానురాగాలు మరిచి పోయాను
     ఫాస్ట్ ఫుడ్ ప్రపంచం లో –తృప్తిచెందతమూ   మర్చిపోయాను
   పాప్, రాక్ రణ గోనల్లో –సంగీత సరిగమలు మర్చి పోయాను
   క్షణిక మైన ఎండమావుల వెంట పరుగు పెట్టి –ఒక మంచిపని వల్ల లభించే తృప్తిని మరిచి పోయాను
  నాలుగు రాళ్ళు కూడబెట్టుకొనే ప్రయత్నం లో –తోటి వాళ్ళ స్ప్రుహనే మర్చిపోయాను
  ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లో –ప్రశాంతం గా వో క్షణం నిలవడం మర్చి పోయాను .
మనసు విప్పి హాయిగా నవ్వడం మర్చి పోయాను –నవ్వడం మరిచాక జీవించటం కూడా మర్చిపోయాను .
            ఈ రేడు కవితలు ఈ రోజూ అంటే 10 -09 -11  ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురింపబడ్డాయి .నాకు నచ్చి మీకూ నచ్చుతాయని పంపుతున్నాను .మీ స్పందన తెలియ జేయటానికి కవుల సెల్ నేమ్బెర్లు కూడా  ఇచ్చాను .మీ స్పందన వారిని ఉత్తేజితం చేస్తుందని భావిస్తూ
                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -09 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సమయం - సందర్భం | Leave a comment

సినిమా పోస్టర్’ పుస్తకావిష్కరణకు ఆహ్వానం

Eswar

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ రమణ కద – మిధునం

శ్రీ రమణ కద – మిధునం

Posted in ముళ్ళపూడి & బాపు | 4 Comments

నేను చదివిన – ఓ మధుర జ్ఞాపకం

Sankarambadi Sundarachari

Posted in సరసభారతి ఉయ్యూరు | 4 Comments

సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం

   సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం
                   ఈ రోజూమాజీ  రాష్ట్రపతి ,జగద్విఖ్యాత మహా తత్వ వేత్త  రాజనీతిజ్ఞుడు ,ఆదర్శ ఆచార్యుడు ,విశిష్ట దౌత్య వేత్త  -సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 129  వ జయంతి .దీనినే భారత దేశం ”గురుపూజోత్చావం ”గా జరుపుకొంటూ ,ఆ మహనీయుని కి కృతజ్ఞతలను తెలుపుతోంది ”.Platonoc kingdom ”కు రాజైన రాష్ట్ర పతి ఆయన .సర్వ మత రహస్యాలను ఆకళింపు చేసికొనిన వ్యక్తిత్వం .మనసును వశ పరచుకొనే ,మూర్తిమత్వం భారతీయత ఉట్టిపడే స్వచ్చమైన సాంప్రదాయక  వస్త్ర   దారణ ,సంభాషణ ,సర్వ వేదాంత రహస్యాలు నాలుక చివర వుండే అత్యంత మేధో సంపత్తి వారిది .వారి సంభాషణం గంగానదీ ప్రవాహమే .మహా నియంత ,రష్యా అధినేత స్టాలిన్ హృదయాన్ని దోచుకొన్న మనీషి .తాను చేసిన తప్పులను రాదా కృష్ణన్ ఎదుట ఒప్పుకొని ,ఆ నియంత పశ్చాత్తాప పడ్డాడంటే ,ఆయన వ్యక్తిత్వం యెంత గొప్పదో తెలుస్తోంది .”ప్రొఫెసర్ ”అని స్టాలిన్ వీరిని గౌరవం గా పిలిచే వాడు .”త్వరలోనే తత్వ వేత్తలు రాజ్యాధి కారులు అవుతారు ”అని ఆయన తో చెప్పి భవిష్యత్తును ఊహించాడు స్టాలిన్ . .
               రాదా కృష్ణన్ వాగ్ధాటి అమోఘం .బ్బ్రిటిష్ ప్రధాని anthoni eden  రాదా కృష్ణన్ వచో వైభవం స్వయం చూసి ”మా దేశం లో రాదా కృష్ణన్ లాగా ఆంగ్లం లో అనర్గళం గా మాట్లాడే వారు ఒకరో ,ఇద్దరో వుంటారు ..దున్నిన నాగేటి చాలులో చెంగు చెంగున ఎగిరే కుందేలు పిల్ల లా ఆయన మాట్లాడుతుంటే ,కాళ్ళు తడ బడే పసిపిల్ల   వాడిలా వుంది నా పరిస్థితి”అని నిర్మోహ మాటం గా చెప్పి సర్వేపల్లి వాక్ చాతుర్యాన్ని మెచ్చాడు .రాజ్యసభలో ఆయన ఇచ్చినరూలింగ్స్   అన్నీ ఆదర్శ ప్రాయమైనవే నని విజ్ఞుల అభిప్రాయం .ఆయన అనే వారు ”సంప్రదాయాన్ని విచ్చిన్నం చేస్తే ఇక ముందు అంతా. విచ్చిన్నమే సాంప్రదాయం అవుతుంది ”.
ఆయన లో హాస్య ప్రియత్వం బాగా వుండేది .ఒకసారి భూపేష్ గుప్తా అనే కమ్యునిస్ట్ సభ్యుడు ”ఒక సమయోచిత ప్రశ్న వేస్తాను ”అన్నాడట .దానికి రాధాకృష్ణన్ ”మొదటి సారిగా సమయోచిత ప్రశ్న వేస్తున్నారట వినండి ”అని చమత్కరించారు .యోగ విద్య పై సభలో అంతా మాట్లాడుతుంటే ”ఒక అరగంట మాట్లాడ కుండా వుంటే అదే యోగం ”అని చురక వేశారు .ఒక సారి ప్రధాని నెహ్రు లోక్ సభలో మాత్రమే ఆమోదించబడిన బిలును”పార్లమెంట్ ఆమోదించింది ”అన్నాడు .వెంటనే సర్వేపల్లి ”’పండిత్జీ    !పార్లమెంట్ అంటే లోక్సభా ,రాజ్య సభ కలిసి”అనిఅనగానే  నాలిక కరచుకొని నవ్వేశాడు పండిట్ నెహ్రు .ఉపరాష్ట్రపతి రాజ్య సభ చైర్మన్ గా వ్యవహరిస్తారని మనకు తెలుసు కదా .
              గాంధీ జి కి సర్వేపల్లి   అంటే గురుభావం .ఆయనకు ఈయనంటే విపరీతమైన అభిమానం .తాను భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి గాంధిగారికి  అంకితం ఇచ్చారు .అప్పుడు మహాత్ముడు ”నేను మీ అర్జునున్ని .మీరు నా శ్రీ కృష్ణులు ”అన్నారు .ఒకసారి గాంధీని కూడాఆట  పట్టించారు .”ఆవు పాలు తాగటం అంటే మాంసం తినటమే”అన్నాడు గాంధి ఒక సందర్భం లో .ప్రక్కనే వున్న రాదా కృష్ణ పండితుడు ”అయితె తల్లి పాలు తాగిన వాడు నర మాంసం తిన్నట్లేనా “”?అని చమత్కరిస్తే బోసి నవ్వుల బాపు కూడా ముసి ముసి నవ్వులు నవ్వాడట .
             సర్వే పల్లి ఇతరులతోసంభాశిస్తుంటే   ఒక్కొక్క సారి ”మౌన వ్యాఖ్యాన దక్షిణా మూర్తి ‘లాగా ,ఇంకొక సారి ,నిమిషానికి రెండొందల పదాల వేగం గా ,ఎక్కడా తడబాటు లేకుండా ,వియద్గంగా ప్రవాహం గా వుంటుంది .మంచి ఉదాత్త ,అనుదాత్తాలతో ,భావ సంజ్న లతో మహా వేగం గా జాలు వారుతుంది .బ్రిటిష్ మేధావులు ,మహా వక్తలు ,తత్వ వేత్తలు ,ఆయన వేదాంత సంభాషణా గరిమకు ముగ్ధులై తాముమళ్ళీఆ ప్లేటో ,అరిస్టాటిల్ కాలమ్ లో వున్నామా అని సంభ్రమం ప్రకటించే వారట .అందుకే వారు ”The return of Plato ”అని సగౌరవం గా భావించే వారు .విజ్ఞాన ఖని ,మేధో నిధి ,రాదా కృష్ణన్ .”Radha krishnan  fought true war of independence at the academic flora of the rulers ”.అని కీర్తింప బడిన చాతుర్యం సర్వే పల్లి పండితునిది  .
        శాస్త్ర ,మత ,వేదాంతాల త్రివేణీ సంగమమే సర్వే పల్లి పండితుడు .భినత్వం లో ఏకత్వ దర్శన ఆయన అభిమతం . అప్పటి దాకా భిన్న దృక్పదాలతో వున్న సైన్సు కు ,మతానికి చక్కని స్నేహ సేతువును నిర్మించిన ఘనత ఆయనది .ఒక సారి ఆయన్ను నోబెల్ బహుమతికి  nominate చేయటానికి అంగీకారం తెలియ జేయమని కోరారు .అప్పుడు ఆ మహా తత్వ వేత్త”Do you want to buy peace (shanti ),I hold dear,in exchange for the profits from the sale of an ingrediant for weapons of destruction ”?అని నిర్మోహ మాటం గా తిరస్కరించిన ఉత్తమ సంస్కారి .
    వినయమే ఆయన భూషణం .విద్యార్ధులకు ఆయన ఇచ్చిన సందేశం ”The  philosopher;s laboratory   is life as it lived and the product of the work in it ,is the marga pointing to the goal of oneness ” .వసుధైక   కుటుమ్బాకం అనేది ఆయనకు నచ్చిన భావం .ఆయన రాష్ట్ర పతి గా వున్న కాలమ్ లో రాష్ట్రపతి భవనం ఒక దేవాలయం గా వుండేది .దేశ విదేశాలనుంచి mahonnatulu,తత్వ వేత్తలు ,జ్ఞానులు వారిని సందర్శించి ప్రభా  వితులవుతూండే వారు . అత్యున్నత విలువలకు ప్రాధాన్యత నిచ్చిన మహోన్నత వ్యక్తీ రాదా కృష్ణన్ .మన తెలుగు వాడు అని గర్వ పడే వాళ్ళం .ఆయన పాలనను ” he established the precedent of independent action by the president disowning the dummification of the post ”.అని గర్వం గా చెప్పుకొనే వారు .రబ్బర్ స్టాంప్ ప్రసిడెంట్ గా ఆయన వ్యవహరించలేదు .ఆ స్థానానికి విలువ ,పేరు ,హుందా ను తెచ్చారు .ఆయన కాలమ్ లో చాలా సార్లు ప్రదానికీ  ,కాబినెట్ మంత్రులకు ,రాష్ట్ర పతికి వున్న విశేష అధికారాన్ని ,తుది మాట రాష్ట్ర పతిదే ననిగుర్తు చేస్తూ . చెప్పాల్సిన సందర్భాలు వచ్చాయి .తన విదుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధి గా నమ్మి పరిఆలించిన రాష్ట్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణన్ . .ఆంద్ర ప్రదేశ్ లోని చిత్తూర్జిల్లా కాళహస్తి లోయువ  ఉపాధ్యాయునిగాప్రారంభమైన ఆయన జీవితం సర్వోత్క్రుస్త రాష్ట్ర పతి పదవి తో పరిపూర్ణమై ,ఆదర్శ వంతమై శ్రేష్టమై పూజనీయమైంది . వారి జన్మ దిన మైన ఈ రోజూ న గురు పూజోత్చావ సందర్భం గా  ఉపాధ్యాయులందరికి శుభా కాంక్షలు .సర్వే పల్లి సర్వ ఉత్కృష్ట  జీవితం అందరికి ఆదర్శ ప్రాయం కావాలని ,ఈ దేశ భవిష్యత్తును తీర్చి దిద్దే గురుతర బాధ్యత వారిపైన వుందని గుర్తు చేస్తూ –సెలవ్ —
               మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

మా అక్కయ్య సమీక్ష – ఆంధ్ర భూమి – ఆదివారం రివ్యూ

ఆంధ్ర భూమి రివ్యూ

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

    ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ఆయన్ను ఆంధ్ర బిర్లా ఎందుకంటే ఆయన పరిశ్రమలు సాధారణ పిన్ నుంచి రాకెట్ ఇంధనం  వరకు అన్నీ తయారుచేసే రక రకాల పరిశ్రమలు స్థాపించారు.
          సార్ధక నామదేయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ .హరిశ్చంద్రుని లోని ,మనో నిబ్బరం ,నిష్ట ,నియమం ఆయన్ను గొప్ప పారిశ్రామిక వేత్తను చేశాయి .ఆయన కట్టు ,బొట్టు ,నడక ,నడత చూస్తె ఒక ఆదర్శ మూర్తి మనకు ప్రత్యక్ష మైనట్లున్తుంది .యెంత ఎదిగినా ఒదిగి వుండే స్వభావం ,తల ఎత్తుకొని నిలబడే విధానం ఆయన్ను అందరికీ ఆరాధ్యుడిని చేశాయి .పశ్చిమ గోదావరి జిల్లా కు ముఖ్యం గా తణుకు పట్టణానికి  భారత దేశ పటం లో ఒక గుర్తింపు స్థానాన్ని తెచ్చిన ఘనుడు ఆయన .ఆంద్ర దేశం లో పారిశ్రామిక విప్లవాన్ని స్వాగతించి ,దాని ద్వారా తణుకును తీర్చి దిద్దిన మేధావి ..విద్య ముఖ్యం కాదు ,వివేచనా ,ఆదర్శం ,శక్తి సామర్ధ్యం వుంటే అన్నిటా అగ్ర శ్రేణి లో ఉండవచ్చు నని రుజువు చేసిన వ్యాపార”భగీరధుడు” ‘ .విద్యా ,వైద్య రంగాలలో గణనీయ మైన సేవ లందించి ”ఆంధ్రా బిర్లా ”అని అప్యాయం గా అందరి ప్రశంశలు అందుకొన్న అవిశ్రాంత పధికుడు .,91 సంవత్చారాలు నిండు జేవనం గడిపి   నిన్ననే  కను మూసిన మాన వీయ మూర్తి శ్రీముళ్ళ పూడి  హరిశ్చంద్ర ప్రసాద్ ఇక లేరు .
              రాబోయే తరాలకు ఏమి కావాలో హరిశ్చంద్ర ప్రసాద్ గారికి తెలుసు .అందుకనే ”ఆంద్ర షుగర్స్ ”సంస్థను స్థాపించి దాన్ని శాఖోప శాఖలు గా విస్తరించారు .స్వాతత్ర్యం రావటానికి ముందే దీన్ని స్థాపించటం విశేషం .తణుకు లో రాకెట్ ఇంధనం తయారీ ని చేబట్టారు  .ఇది ఆధునిక పారిశ్రామిక రంగం లో కొత్త మలుపు .అక్క మాంబా  textiles ,ఆంద్ర పెట్రో chemicals ,హిందూ స్థాన allied chemicals ,స్థాపన లో ఆయన ద్రుష్టి యెంత విశాలమైనదో తెలుస్తుంది .ఆయన పారిశ్రామిక సేవలను విశాఖ పట్నం ,గుంటూరు లకూ విస్తరించారు .వ్యవసాయ రంగమే అన్నిటికి మూలం అన్న అభిప్రాయానికి చేదోడుగా పారిశ్రామీకరణ అవసరాని గుర్తించి అమలు చేసిన తొలి తరం పెద్దాయన ప్రసాద్ గారు అందుకనే ఆయన్ను అందరు ”పెద్దాయన ”అని ఆత్మీయం గా పిలుచుకొని భక్తీ ప్రదర్శిస్తారు .పరిశ్రమలు పట్టణాలకే పరిమితం కాకూడదని ,పల్లెలకు విస్తరింపజేసిన ముందు చూపు వారిది .కావాల్సిన యంత్రాలన్నిటిని  విదేశాలనుంచి తెప్పించారు .వెలగ పూడి రామ కృష్ణ గారి సలహా లతో ముందడుగు వేశారు .రామ కృష్ణ గారితో కలిసి అమెరికా ,జపాన్,యూరప్ దేశాలను సందర్శించి అవసరమైన పరిజ్ఞానాన్ని పొందారు .అక్కడి పరిశ్రమల పని తీరును పరిశీలించారు . 600 టన్నుల సామర్ధ్యం తో ప్రారంభమైన షుగర్ ఫ్యాక్టరీ ,నేడు 6000  టన్నుల సామర్ధ్యానికి చేరటం వారి నిరంతర కృషి ఫలితమే .
         శ్రీ ప్రసాద్ ఫాఫ్సి ప్రెసిడెంట్ గా పని చేశారు .వాణిజ్య రంగ విస్తరణకు దారులు చూపారు .ఆయన సంస్థలలో ఉద్యోగులను తన స్వంత కుటుంబ సభ్యులను గా చూడటం గొప్ప విశేషం .ఖద్దరు  దుస్తులేధరించే వారు .పంచె ,లాల్చి ఖండువా  ధరిస్తారు .ముఖం మీద నిలువు బొట్టు తీర్చిదిద్ది  నట్లుంటుంది .కోటేరు తీసిన ముక్కు వారి ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని పిస్తుంది .యెంత గొప్ప పారిశ్రామిక వేత్త గా గుర్తింపు పొందినా  విలువలను అతి భద్రం గా కాపాడారు .సాధారణమైన ,హుందా అయిన జీవితాన్నే జీవించారు .వ్యవసాయం ఆధారం గా పరిశ్రమలు విస్తరించాలి అని వారి తాపత్రయం .సాటి పారిశ్రామిక వేత్తలు ఆయన్ను” భీష్మా చార్యులు ”గా గౌరవించే వారు .                             విద్యా రంగ వికాసానికీ ముళ్ళపూడి విశేష కృషి చేశారు .తణుకు లో polytechnic కళాశాల స్థాపించి వేలాది విద్యార్ధుల బంగారుభవిష్యత్తు   కు బాట వేశారు .ఆ కళాశాల అంటే ఆంద్ర దేశం లో గొప్ప పేరు .అక్కడ సీట్ రావటం మామూలు విషయం కాదు .అంతా పకడ్బంది నియమాలు .అక్కడ చదివి పాస్స్ అయితె ఎక్కడైనా కళ్ళకు అద్దు కోని ఉద్యోగం ఇచ్చేవారు .అక్కడి శిక్షణ కు గొప్ప పేరుండేది .సమర్ధులైన  అధ్యాపకులుండే వారు .కాకినాడ లో రంగ రాయ మెడికల్ కాలేజీ స్థాపనకు హరిశ్చంద్ర ప్రసాద్ విశేష కృషి సలిపారు .
          మెక్షికొ లో జరిగిన అంతర్జాతీయ షుగర్ industry సదస్సులో పాల్గొన్న ఘనత వారిది .ఆయనకు బెస్ట్ management అవార్డ్ వచ్చింది .ఉత్తమ పరిశోధనా పురస్కారం వారిని వరించింది .  నాగార్జున విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ నిచ్చింది .”చక్కర కళా ప్రపూర్ణ ”బిరుదును అనకా పల్లి చెరుకు పరిశోధనా సంస్థ ప్రదానం చేసింది .తణుకు లో అన్ని వసతులతో 172  పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు వైద్యాన్ని అందు బాటు లోకి తెచ్చారు .అక్కడే మంచి గ్రంధాలయమూ,నెలకొల్పారు .
           శ్రీ ప్రసాద్ రాజకీయాలలోనూ రాణించారు .తొమ్మిదేళ్ళు ఆంధ్రా కాంగ్రెస్ పార్టి సభ్యులుగా వున్నారు .1952 -55 కాలమ్ లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో విధాన మండలి సభ్యులు గా వున్నారు .రెండు సార్లు తణుకు నుంచి శాసన సభకు సభ్యుడు గా ఎన్నికయారు .అయిదేళ్ళు తణుకు మునిసిపల్ చైర్మన్ గా పని చేశారు .నందమూరి తారక రామా రావు ముఖ్య మంత్రి గా వున్నపుడు ఆయన ఆన్తరంగికులలో ఒకరు గా మెలిగారు .ఆంద్ర జ్యోతి పత్రికకు కొంత కాలమ్ డైరెక్టర్ గా వున్నారు . ఇన్ని రకాల సేవలందించి ,పారిశ్రామిక రంగ పురోగతికి సాక్షీభూతుడై ,”,పరిశ్రమల పితామహుడు ”గా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ ప్రసాద్ చదువుకొన్నది ఎస్.ఎస్.ఎల్.సి .మాత్రమే నని తెలిస్తే ఆశ్చర్య పోతాం .
                           మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

విశ్వాత్మ లోకి విశ్వ నరుడు -నండూరి రామ మోహన రావు గారు

             విశ్వాత్మ లోకి విశ్వ నరుడు
                 నండూరి రామ మోహన రావు గారు ఇక లేరు అక్షర విశ్వ రూపం చూపిన దార్శనికులాయన .ఆయనకు ఖగోళం ,భౌతిక శాస్తాలు కరతలామలకం .పరిణామ  క్రమాన్ని అధ్యనం చేసిన శాస్త్ర వేత్త .దానితో” నరావతారం ”రాసి మానవ ఆవిర్భావాన్ని ఆవిష్కించారు శాస్త్ర్రేయతను జోడించి .ప్రపంచ సాహిత్య మధనం చేసిన పండితుడు .తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా ,పరీక్షించి ,బహుదేశ సిద్ధాంతాలను అవలోడనం చేసి ,సమగ్రమ్ గా ,”విశ్వ దర్శనం” రాశారు .ఆయన అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేశారు .రాజకీయ వ్యంగ్య రచనలు చేసి ”సవ్య సాచి ”అని పించుకొన్నారు .అవి నాయకులకు కొరడాలైతే చదువరులకు దీపావళి మతాబులైనాయి .ప్రఖ్యాత ఈసబ్ కధలను ”కధా గేయ సుధానిధి ”గా రాశారు .బాపు బొమ్మలు వేస్తె ”మిత్రలాభం ,మిత్రభేదం ”రాసి అందరికి ఆనందాన్ని ,విజ్ఞానాని ,వినోదాన్ని పంచారు .అనువాదం లో అందే వేసిన చేయి రావు గారిది .మార్క్ ట్విన్ రచించిన Tom sawer ,huckle berrifin ”నవలను తెలుగు లో అద్భుతం గా అనువదించారు .అవి సీరియల్ గా వస్తున్నంతకాలం ఆత్రం గా ఎదురు చూసే వారు .అలాగే రాజు -పేద ,విచిత్ర వ్యక్తీ అనేవి కూడా ఆయన అనువాద రచనలే .ఆయన అనువాద శైలి చాలా ఆకట్టుకొనేది .ఒరిజినల్ పుస్తకమే చదువుతున్న ఫీలింగ్ కల్పించే వారు .సరళం గా ,సవ్యం గా సూటిగా సాగే రచన వారి ప్రత్యేకం .ఱొబెర్త్ళౌఇస్  stevenson రాసిన treasure island  ను” కాంచన ద్వీపం” గా తెలుగు లోకి తెచ్చారు .అదీ సూపర్ హిట్ అయింది .అందుకేనేమో బాపు రమణలు కొంటెగా ”అనువాద హనుమంతు ”అని పిలిచే వారట .ఆయన బాల సాహిత్యమూ సృజించారు .హరి విల్లు ,బాల గేయాలు  అందు లో ముఖ్య మైనవి .
            ముళ్ళ పూడి వెంకట రమణ గారి భార్య రామ మోహన రావు గారి సోదరే .ఆయన కృష్ణా జిల్లా ఆరుగొలను గ్రామం  లో జన్మించారు 1927 లో .ఇరవయి ఒకటి వయసు లోనే” విజ్ఞానం” అనే లిఖిత పత్రికకు  సంపాదకులైనారు .ఆ తర్వాత పత్రికా రంగం లో దేదీప్య మానం గా వెలిగి పోయారు .ఆంద్ర పత్రిక లో ప్రవేశించి ,ఆ తర్వాత ఆంద్ర జ్యోతి కి సబ్ ఎడితరై సమాదకులుగా 1980  లో  బాధ్యతలు చేబట్టారు .నార్ల తరువాత జ్యోతి బాధ్యతలు ఆయనే చేబట్టారు .సుమారు 34  సంవత్చారాలు దాని సంపాదకులు గా పనిచేసి ఎందరో రచయితలను ప్రోత్చాహించారు .కొత్త శీర్షికలను ప్రవేశ పెట్టారు .పత్రిక సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దే వారు .ఆయన సంపాదకీయాలు చాలా సూటిగా సరళం గా ఉండేవి .వాటిని ఒక సంపుటం గా తెచ్చారు .ఈ నాటి తరానికి అవి కరదీపికలే .అలాగే అనుపల్లవి ,వ్యాఖ్యావళి ,చిరంజీవులు పుస్తకాలను రచించారు .l ముళ్ళ పూడి వెంకట రమణ గారు గతించిన కొన్ని నెలలకే నండూరి రామ మోహన రావు గారుతమ ఎనభై నాల్గవ ఏట,పరమ పదించటం   ఆ కుటుంబానికి తీరని వ్యదే .సాహితీ కుటుంబానికి తీరని లోటే .వారి ఆత్మ కు శాంతి కాగాలని కోరుకొందాం .
                     మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు

హాస్యం ఉండ్రాళ్ళు

              పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొంతూండగా మా బావ మరిది ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  ఏమో కాని వ్యధ పంచిపెదతావేమోనని బాధ అన్నా .మూతి బిగించి వాడు అదే నీతో వున్న చిక్కు .బావమరిదిని కదా నన్ను ఎంకరేజ్ చెయ్యవ్ .ఎప్పుడూ ,నీ పేరు ,ప్రఖ్యాతులేనా మేమూ వున్నాం బాబూ .మమ్మల్నీ కనిపెట్టాలి అన్నాడు నిష్టూరం గా .సరేరా అసలు విషయం ఏమిటి అడిగాను .వాడు .ఇవాళ వినాయక చవితి కదా సాయంత్రం ఒక సాహితీ సభ జరుగు తోంది అందులో నన్నూ పాల్గొనమని కబురు చేశారు .నీకు వేరే ప్రోగ్రాం ఉందటగా .నీ బదులు నేనట .ఇంతకీ ఏమిటి ప్రోగ్రాం అన్నాను .హాస్యం వండి వడ్డించాలి  .మనకు ఎప్పుడు అలవాటు లేదాయే .నువ్వున్నావనే ధైర్యం తో ఒప్పుకొన్నాను బావా నీవే తప్ప ఇతహ్పరంబెరుగా ఆనాడు బేలగా ,పీలగా .సరేరా .నువ్వెంతవరకు prepare అయావు అని అడిగా .వెంటనే ఒక చిట్టా జేబులోంచి తీసి చేత్తో పట్టుకొన్నాడు .బావా -ఈ మధ్య కొన్ని కంపెనీలు యాద్డ్  కోసం రాయమనే పేపర్ ప్రకటన చూసి కొంత రాశా .పంపావా అని అడిగాను .పంపాను తిరుగుటపా   లో వచ్చేశాయిఅన్నాడు కూల్ గా .అర్ధమైంది వాడి పరిస్థితి రోట్లో తలపెట్టేశాగా ఇంక రోకటి పోట్లకు వెరవటం ఎందుకు ?.సరే చిట్టా విప్పమన్నాను .బావా నవ్వద్దు .ఎంకరేజ్ చెయ్యి బావా .మర్రి చెట్టుకింద మోకను చేస్తున్నావు నన్ను ఎదగానీకుండా అనిమల్లీ గగ్గ్గోలు .సరే కానిమ్మన్నాను
     పోటాష్ తయారు చేసే కంపనీ ki ఒక స్లోగన్ రాశా .విను అన్నాడు .ఒదులు అన్నా.”వాడండి మీ చేలకు పోటాష్ -లేకుంటే మీరు మటాష్ ”అని చదివాడు .నోర్ముయ్యి కామోష్ అన్నా భరించలేక .ఇంకోటి చూడు .అవతలి వాడి ప్రతిభ అంటే నీకు ఈర్ష బావా మొదట్నించీ .అని రెండోది చెప్పాడు ”వినాయక చవితికి ఉండ్రాళ్ళు -తింటే బిడ్డలను కంటారు గొద్రాళ్ళు ”అన్నాడు .రాళ్ళతో ఊడగోడ్తారు పళ్ళు అన్నాను .కొంచెం చిన్న బుచ్చుకొని మూడోది లంకించుకొన్నాడు .”పెరిగింది పెరిగింది అవినీతి –నీతి అతిగ్గా పెరిగితే వచ్చేదే అవినీతి ”అని చల్లగా వినిపించాడు ”.నీ మతి మండితే వచ్చేదే ఈ కపి నీతి ”అని అడ్డకట్ట వేశాను .సరే ఇంకోటి విడుస్తా విను అన్నాడు .నీకున్న సిగ్గు లజ్జా వదులు చాలు అదే పెద్ద హాష్యం అన్నా.వాడు ఊరుకోంటాడా ?
”అన్నా హజారే –అరె అరె -దేశం బేజారే-ఆయన మాట అంటే జీ హుజూరే –దేశానికి ఆయన ఒక కొత్త వజీరే ” అన్నాడు .కొంచెం దగ్గిరికి వచ్చావురా అన్నా .బావా నువ్వు అండ గా వుంటే చెలరేగుతాచూడు   అన్నాడు .అంత చెలగాటం వద్దు నాయనా అని సర్ది చెప్పా .”నాగం గురించి ఒకటి రాశా అన్నాడు సరే విడువు అన్నా ”అన్నా నాగం -నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆగం –నీతో కష్టం వేగటం -మీ ఆవిడ యెట్లా భరిస్తోందో నీ  ఆగడం ”పర్లేదు కానీ అని ఉత్చాహ పరిచాను .”అందరి మీదా కాలు దువ్వె కే.సి ఆర్.–కిక్కురు మనకుండా వున్నావేమిటి యార్ ”ఒరే దవడ పగలగోడతారు  take care  అని వారించాను .సరే .”ఉద్యోగుల సమ్మె మళ్ళీ వాయిదా –వాళ్ల కేమి పోయింది ఫాయిదా ”అన్నాడు అర్ధం ఏమిటీ అన్నాను .ఏదో ప్రాస కలిసింది కదానని వాయించా అన్నాడు .నిన్ను వాయించేస్తారు ఖాయలా పడతావు అన్నాను .”పాలైతే నువ్వు జైలు –ఎవడో ఇప్పించక పోడు  బెయిలు ”- వహ్వా వహ్వా అన్నా.వాడు యెగిరి గంతేశాడు .”పావలాకే పంట ఋణం –అదీ పండితే గా తీర్చేది ఋణం ”భేష్ అన్నాను ..మా వాడు రెచ్చిపోయాడు .”మన్యాన్ని ఒనికిస్తున్న డెంగ్యు –చెయ్యాలి దానితో పాపం కుంగ్ ఫ్యూ ”సెహబాష్ అన్నాను .”అవినీతి లో ఆఫీసర్ బీల –దొరికి పొతే అయాడు  బేల .”ఇంకా వుంది నీ కడుపు లోకక్కెయ్యి అన్నా ..”అవినీతి వర్గం పై వుమ్మీయ్యి అన్నాడొకడు –తీరా ఉమ్మేస్తే పడేది వాడి మీద కాదా అన్నాదిన్కోడు ” —
”తెలుగును ఉద్ధరించాలి మనం -అదీ సి.ఏం .తో ప్రారంభించాలి అదే మన ఖర్మం ”. దారిలో పడ్డాడు మా వాడు అని లోపల కొంత సంతోషం .బయటికి అంటే మరీ రెచ్చిపోతాడని వూరుకొన్నాను .”గణపతి విగ్రహాలకు వాడండి మట్టి –లేకుంటే పర్యావరణం  నోట్లో మట్టి ”అని చదివాడు .ఇంక ఆపక పొతే చంపేస్తాను కుట్టి కుట్టి .అని వాడి హాస్య ప్రయత్నానికి పెట్టించాను ఫుల్ స్టాప్ .పాపం బిక్క మొహం తో వెళ్లి పోయాడు వాడు కనీసం వెళ్తానని చెప్పకుండా వాళ్ల అక్కతో కూడా మాట్లాడకుండా .
రాత్రి లోకల్ chaannel లోమా బావ మరిది హాసపు ఉండ్రాల్లకు ప్రధమ బహుమతి వచ్చింది అని    విన్నాను .అంటే తెలుగు హాస్యం యెంతబాగా వృద్ధి చెందిందో నని   బాధ పడ్డాను .ఇది చదివి నవ్వు రాక పొతే తప్పూ నాది కాదు  –.నవ్వక పొతే తప్పు మీది  .
               శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -11 .

 

Posted in సమయం - సందర్భం | 2 Comments

శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ

శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ
         శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీ గణపతి .”గ”అంటే జ్ఞానం  . ”ణ ” అంటే నిర్వాణం .”ఈశ” అంటే స్వామి .అంటే గణేశుడు జ్ఞాన ,నిర్వానాలకు స్వామి అని ardham .”హీరంభుడు ”అని కూడా ఆయనకు పేరు .అంటే ”వో !దీన రక్షకా “‘అని భావం .”ఏకదంతుడు ”అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి .ఆయన చెవులు చేటలు   .అంటే చెడును చెరిగి వేస్తాయి .మంచిని మాత్రమే నిలుపుతాయి .విఘ్నాలను తొలగించి మనల్ని పరిశుద్ధులను చేస్తాడు అందుకే శూర్ప కర్ణుడు అని పేరు .అన్ని చెడు పనులకు నాలుక మూలం .అది బైట వుంటే ఇతరుల దోషాలను ఎంచు తాము  .మనసు అనే జిహ్వాగ్రాన్ని మనవైపే తిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనం తెలుసుకొంటే ,ముక్తి లభిస్తుంది అని పెద్దలంటారు .అందుకేగజాననుని   జిహ్వాగ్రం కంఠం వైపుకు వుంది ,మనకు మార్గ దర్శనం గా కన్పిస్తుంది .
            శ్రీ కృష్ణుడు ,గణేశుడు వేరు కాదు .అభిన్నులు .ఏక స్వభావులు .గణేశుడు పరశురాముడిని తన తుండం చేత బంధించి సర్వ బ్రహ్మాండ దర్శనం ,గోలోకం లో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేయించితరింప జేశాడు   అని బ్రహ్మ వైవశ్వత పురాణం లో గణేశ ఖండం లో వుంది .నిర్గుణ ,సద్గుణ బ్రహ్మాలకు అధిపతి కనుక ”గణాధిపతి ”అన్నారు .
          ”ఓం నమస్తే గణపతయే ,త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి ,త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ”అని గణపతి అధర్వ శీర్ష కృతి తెలియ జేస్తోంది .
                శ్రీ కృష్ణ ,శ్రీ గణేష్ లకు సంబంధించిన ఒక కధను గురించి తెలుసు కొందాం .ధర్మధ్వజుని కుమార్తె తులసి .ఆమె శ్రీమన్నారయనుడిని వివాహం చేసుకోవాలని భావిస్తుంది .ఒక రోజూ గణపతి కనిపిస్తే ”నువ్వు శ్రీ కృష్ణుని అవతారమే కదా నన్ను పెళ్లి చేసుకో ”అని వేడుకొంది .ఆయన ”వివాహం బంధ కారణం –నాకు ఆ కోరికే లేదు ”అని స్పష్టం గా చెప్పాడు .అప్పుడు తులసికి కోపం వచ్చి ”వివాహం వద్దు అంటున్న నీకు తప్పక వివాహం అవుతుంది ”అని శపించింది .గణపతికి కూడా కోపం వచ్చి ”అనవసరం గా నన్ను శపించావు కనుక రాక్షస భార్యవై జన్మిస్తావు .తర్వాత వృక్ష రూపం పొందుతావు ”అని ప్రతిశాపం ఇచ్చాడు .ఆమెకు పశ్చాత్తాపం కలిగి గానేషుని ప్రార్ధిస్తే ,”వృక్ష రూపం పొందినా ,లోకారాధ్యురాలవు అవుతావు .శ్రీ నారాయనార్ప దివ్య కుసుమం నువ్వు .నీ దళాలతో చేసిన పూజ ప్రజలకు ముక్తిని ప్రసాదిస్తుంది ”అని శాప విమోచన కల్గించాడు .
              ఆ తర్వాత జన్మలో తులసి శంఖచూడుడు అనే రాక్షసుని భార్య అయింది .శంఖ చూదుని ఆగడాలు భరించ లేక శివుడు అతన్ని త్రిశూలం తో సంహరించాడు .తన కలాంశ తో   ఆమె తులసి వృక్ష రూపం పొంది అందరి ముక్తికీ కారకురాలు అయింది .అందుకే తులసి దళం తన పూజకు పనికి రాదనీ గణపతే చెప్పుకొన్నాడు .a వినాయక చవితి నాడు గనేశుని  పూజకు తులసి దళాలు నిషిద్ధమయాయి .శ్రీ కృష్ణ గణేశులు  అభిన్నులై లోకారాధ్యులైనారు .ఇప్పుడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ తత్త్వం గురించి తెలుసు కొందాం .
             గోలోకంమండలా కారం   గా వుంటుంది .ప్రళయ సమయం లో శ్రీ కృష్ణుడు మాత్రమే శేషించి ఉంటాడు .మురళి ధరించి ,శ్రీ వత్చాన్కిట వక్షస్థలం పై కౌస్తుభం తో ప్రకాశిస్తూంటాడు .ఆయనే పరబ్రహ్మ .,పురుషోత్తముడు .ఎప్పుడూ ”కిషోర ”వయసు లోనే ఉంటాడు .గోపా వేష ధారియై ,గోపీ జనం తో పరివేష్టించి ఉంటాడు .పరిపూర్ణుడై ,సర్వ వ్యాపియై ప్రవర్తిస్తాడు .”సదారాసా మండల  విహారి ”.సర్వ సిద్ధి స్వరూపుడు .సర్వ సిద్ధి ప్రదాత .ఆదిపురుషుడు ,అవ్యక్తుడు .
            శ్రీ కృష్ణుని దక్షిణ పార్శ్వం నుంచి సత్వ రాజస్ ,తమోగుణాలు ,వాటి నుంచి మహస్సు ,అహంకారం ,పంచ భూతాలూ ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి .తరువాత నారాయణుడు జన్మించాడు .ఆయన భార్య లక్ష్మి దేవి .వామ పార్శ్వం నుంచి ”సదాశివుడు ”జన్మించాడు .పంచ ముఖాలు కలిగి దిశలే వస్త్రాలుగా ,సకల సిద్దేశ్వరునిగా,గురువులకే గురువు గా ఆయన ప్రవర్దిల్లాడు .ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు కూడా .శ్రీ కృష్ణ నాభి కమలం నుంచి మహా తపస్వి బ్రహ్మ ప్రభావించాడు .చతుర్ముఖాలతో ,కమండల ,జపమాలతో ,ప్రకాశించాడు .దేహధారులకు జన్మ దాత .సరస్వతీ వల్లభుదయాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ”పుట్టాడు  .సర్వజీవులపై సమభావం కలవాడు .ధర్మ దేవుని వామ భాగం నుంచి ”మూర్తి ”అనే స్త్రీ జన్మించి యముని భార్య అయింది .శ్రీ కృష్ణుని ముఖం నుంచి వీణా పుస్తక దారిని ,షోడశ వర్ష కన్య సరస్వతి” జన్మించింది .శ్రీకృష్ణుని మనసు   నుంచి ”శ్రీ మహాలక్ష్మి ‘,బుద్ధి నుంచి మూల ప్రకృతి ”ఈశ్వరి ”జన్మించారు .ఈశ్వరి ఏ సర్వ  శక్తులకు మూలం .వేయి భుజాలతో ,భయంకరం గా దుర్గతి నాశిని ”దుర్గ ”భాసించింది .శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .శ్రీ కృష్ణుని జిహ్వాగ్రం నుంచి వేదమాత ”సావిత్రి ” ఉద్భవించింది .కృష్ణుని మనసున్నుంచి సమస్త ప్రాణులను మధించే మన్మధుడు ,అతని వామ భాగం నుంచి ”రతీదేవి ”జన్మించి భార్య అయింది  .
          శ్రీ కృష్ణ వీర్యం జలం లో పడి సహస్ర దైవ సంవత్చరాల తర్వాత గొప్ప  అండం గా మారి ”విరాత్పురుషుడు ”జన్మించాడు .విశ్వానికి ఆయనే ఆధారం .చేవులనుండి మధుకైటభులు జన్మించి ,బ్రహ్మను మింగేయాలని ప్రయత్నిస్తే నారాయణుడు చక్రాయుధం తో సంహరించాడు .వాళ్ల కొవ్వు నుంచి ఈ పృథ్వి ఉత్పన్నమైంది అందుకే భూమికి ”మేదిని ”అని పేరు వచ్చింది .భూమి యొక్క అధిష్టాత్రి దేవి పేరు ”వసుంధర ”.శ్రీ కృష్ణ వామ భాగం నుంచి ,”రాధ ”జన్మించింది .ఆమె కూడా సదా ”కిషోర ”వయస్క .ఆమె రోమాలనుండిగోపికలు    ,శ్రీ కృష్ణరోమాలనుంచి   ”గోపాలురు ”జన్మించారు .వీరు రాదా క్రిష్ణులకు ”పార్శ్ర్శ్వదులు  ”.వీరు రాధను ,కృష్ణుని పోలి వుంటారు .నిత్య యవ్వనులు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .
       శ్రీ కృష్ణ గుహ్య ప్రదేశం నుంచి కుబేరుడు ,భూత ప్రేత ,పిశాచాదులు ,కుడి కంటి నుంచి ప్రమద   గణాలు ,ఎడమ కంటి నుంచి ”ఈశానుడు ”పుట్టారు .బ్రహ్మ దేవుడు శ్రీ క్రిష్ణానుగ్రహం తో విశ్వ సృష్టి చేశాడు .బ్రహ్మ నాభి నుంచి ”విశ్వకర్మ ”అష్టవసువులు ,,మనసు నుంచి సనకస ,సనందన ,సనాతన సంత్కుమారులు ,ముఖం నుంచి ”స్వయంభు మనువు ”,లలాటం నుంచి ఏకాదశ రుద్రులు ,ప్రభవించారు .అనావృస్టి చివర ”నారదుడు ”పుట్టాడు .పుట్టగానే నీరు ను లోకానికి ఇచ్చాడు కనుక నారదుడు అని పిలువ బడ్డాడు .నారం అంటే నీరు ,జ్ఞానం అని అర్ధాలు .రెండూ ,ఆయనకు వర్తిస్తాయి .బ్రహ్మ కంఠం నుంచి పుట్టిన వారే ”నరదులు ”అంటే నరులు ..ఇలా శ్రీ కృష్ణ పరబ్రహ్మ తన నుంచి అఖిల ప్రపంచాన్ని సృష్టించి ,పరిపాలించి ,తన లోనే లయం చేస్తాడు అని ”బ్రహ్మ వైవర్త పురాణం –శ్రీ కృష్ణ ఖండం ”లో చెప్పబడింది .కృష్ణ అంటే ”సర్వ చరాచర కొటులలో ఆత్మ అయిన వాడు ”అనీ ,ఆదివాచకం అనీ అర్ధం .అంటే సర్వులకు ఆయనే ఆది పురుషుడు .
                     శ్రీ కృష్ణ ,శ్రీ గణేశ జయంతులు ఒక్క రోజూ తేడాతో దాదాపు ఒకే నెలలో వచ్చినట్లే .సెప్టెంబర్ ఒకటి వినాయక చవితి కనుక .ఆ మహానుభావులను స్మరించి ,అర్చించి జన్మ సాఫల్యం చేసుకొందాం .సిద్ధి ,బుద్ధులను ప్రసాదించే వాడు గనాదీశుడైతే ”శరశ్చంద్ర   ప్రభువు ”అయిన శ్రీ కృష్ణుడు భారత భూమి పై అవతరించి ,ధర్మ సంస్థాపన చేసి ,గీతామృతాన్ని పంచి ,భక్తీ జ్ఞాన ,వైరాగ్యాలను తేటతెల్లం చేసి ,ప్రేమను కురిపించి ,అందరి హృదయాలను ఆకర్షించి ,స్మరణ మాత్రం గా ముక్తి ప్రదాత అయాడు .అందుకే స్వామి త్యాగీశానంద ,ఆ మహానుభావుడిని ,పురాణ పురుషుడిని పూర్ణావతార స్వరూపుడిని ”The first teacher in the historry of the world to discover and proclaim the grand truth of love for love’s sake and duty for duty sake ”.”అంటే ప్రేమ ప్రేమ కొరకు ,విధి కర్తవ్య నిర్వహణకు అనే సత్యాన్ని ప్రపంచ చరిత్ర లో మొదట గ్రహించి ,ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు శ్రీ కృష్ణుడు ”అని చాటి చెప్పిన దేశికుడు .అందుకే ”కృష్ణం వందే జగద్గురుం ”.
           వినాయక చవితి శుభాకాంక్షలను   సాహితీ బంధువులందరికీ తెలియ జేస్తూ సెలవ్ .
            మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .—31 -08 -11
Posted in సమయం - సందర్భం | Leave a comment

దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు

మహాత్మా గాంధి కృష్ణా జిల్లా దివి తాలుకా 1930 ప్రాంతం   లో పర్యటించినపుడు అక్కడి ప్రజలు బ్రహ్మ రధం పట్టి అరవై ఎడ్ల బండీలతో వూరేగించారుం . ఆ దృశ్యాన్ని తన తొమ్మిది ఏళ్ళ వయసు లో చూచే మహద్భాగ్యం తనకు కలిగింది అని ఉప్పొంగి పోయారు ఈ రోజూ అంటే ఆగస్ట్ ముప్ఫై వ తేదీన 91 వ సంవత్చరం లోకి ప్రవేశించిన శ్రీ మండలి రాజా గోపాల రావు గారు .వారితో నాకు పదేళ్ళ క్రితం పరిచయం అయింది .ఆ కాలమ్ లో శ్రీ సింహాద్రి వెంకటేశ్వర రావు గారు ”దివి సాహితీ మిత్రులు ”అనే సాహితీ సంస్థను స్థాపించి

ప్రతినెల ఒక సాహితీ సభ ను అవనిగడ్డ లో  నిర్వహిస్తుండే వారు

ఆడియో – ౧

. ఒకసారి ఏదో సభలో నా ప్రసంగం విని వారు నన్ను వారి సభలో ప్రసంగించమని కోరారు .ఆ సభలో మొదటి సారి శ్రోత గా విచ్చేశారు .రాజా గోపాల రావు గారు .ఆ సభలో నేను శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి కధ లను గురించి మాట్లాడిన గుర్తు .వారు చా

లా ఆనంద పడ్డారు .నన్ను అభినందించారు .ఆ తర్వాత నేను ఇంకో ఆరు సభల్లో అవనిగడ్డ    లో మాట్లాడాను . వారు దాదాపు అన్నిటికి వచ్చినన్ను  అభినందిస్తూ ఒక మాట అన్నారు ”మాస్టారు .మీరు మాట్లాడితేనే ఇక్కడి సభలకు వస్తున్నాను .మిగిలిన వాటికి నాకెందుకో వెళ్లాలని పించదు ”అని నన్ను ఆప్యాయం గా ,ఆత్మీయునిగా భావించి చెప్పారు .అప్పుడే వారి గురించి పూర్తిగా తెలుసు కొన్నాను .వారు రాసిన పుస్తకం ఒకటి నాకు ఇచ్చారు .అది చదివి నా భావం వారికి లేఖ లో రాశాను

ఆదియి -౨

.దానికి వారు సహృదయతతో తరచూ ఫోన్ లో సంభాషించే వారు ..ఈ మధ్య ఆరేడు సంవత్చారాలుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు లేవు .ఈ మధ్య నేను బెంగుళూర్ లో వున్నపుడు వారు ఇంటికి మా అబ్బాయి రమణ కు ఫోన్ చేసి నన్ను గురించి వివరాలు తెలుసుకోన్నారట .నేను ఉయ్యూరు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు .తనకు తొంభై వెళ్లి ఈ నెల ముప్ఫై వ తేదీకి తొంభై ఒకటి వస్తుందని నన్ను చూడాలని తనకు వుందని ,కాని వయోభారం వల్ల రాలేక పోతున్నానని కాని ఎప్పుడో ఒకప్పుడు తప్పక వచ్చినన్ను  చూసి వెళ్తానని మొన్న అన్నారు 

 

ఆడియో -౩        .అప్పుడు నేను వారితో నేనే వారింటికి పులిగడ్డకు వారి జన్మ దినోత్చావం నాడు వచ్చి హాప్పీ బర్త్ డే చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని వారి తో ముఖాముఖి మాట్లాడుతానని చెప్పాను .అన్న మాట ప్రకారం ఇవాళ ఉదయం పులిగడ్డ వెళ్లి వారి ఇంటిలో వారిని దర్శించాను .పదేళ్ళ క్రితం ఎలా వున్నారో ఇప్పుడు అలాగే అదే ఆరోగ్యం తో వున్నట్లు కనిపించారు .దంపతులిద్దరూ ఎంతో ఆత్మీయం గా

ఆదరించి ,స్వీటు హాట్ ,పళ్ళు  టీ ఇచ్చి తమ అతిధి మర్యాదను చూపించారు .

తన జీవితం గురించి చెప్పమని నేను అడిగాను .తాను పులిగడ్డ లోనే జన్మించానని ,తాము కాపు కులస్తులమని తమ కుటుంబానికి తాతల తరం లో మూడు వేల ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉండేదని ,అయితె దివి సీమలో కాలువలు సాగు కోసం త్ర్వ్వినప్పుడు దాదాపు పొలాలన్నీ దానిలో పోయాయని ముంపుకు గురి అయి కొంత నష్టం జరిగిందని ,తండ్రుల కాలమ్ లో దాదాపు ఏమీ మిగల లేదని .తమ తరం లో అనుభవించటానికి అసలు సెంటు భూమి కూడా లేదని శిస్తు కట్టే పరిస్థితి లేదని నవ్వుతు చెప్పారు .పిత్రార్జితం అయిన స్థలం లో ఒక  రేకుల షెడ్డు వేసుకొని వారు వుంటున్నారుయెనభైఒక యేళ్ళున్న భార్య గారితో .ఆనాడు బస్తా ఓడలు రెండు రూపాయలే నని కాని శిస్తు మాత్రం ఎనిమిది నుంచి పడి రూపాయలున్దేదని శిస్తు కట్టటానికి మూడు లేక నాలుగు బస్తాలు అమ్మితే కాని కట్ట లేక పోఎవారమని ,కట్టక పొతే బ్రిటిష్ ప్రభుత్వం జప్తులు చేసేదని దాంతో కూడా పొలాలు అన్నీ హారతి కర్పూరం అ

యాయని ఆవేదన తో చెప్పారు .

.తన తొమ్మిదవ ఏట గాంధీజీ ని చూసే భాగ్యం కలిగిందని ,ఆ ప్రభావం తన మీద బాగా వుందని అప్పటినుంచి ఖద్దరు కడుతూనే వున్నానని చెప్పారు .గ్గోసి పోసి ఖద్దరు పంచ,ఖద్దరు లాల్చి ,పైన అంచు ఖద్దరు ఖండువా ఇదీ వారి వస్త్ర ధారణ .అంతా తెల్లని తెలుపే .మీసం .జుట్టు తెలుపు .వారి మాట స్వచ్చమైనది ,మనసు స్వచ్చం ,వేశం స్వచ్చం ,హృదయం స్వచ్చం .నుదుట యెర్రని కుంకుమ బొట్టు .వారిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి కలుగుతుంది .ఆ కళ్ళల్లో కాంతి ,వెలుగు,చిరునవ్వు మనకు వారిపై గౌరవభావం ఏర్పడుతుంది .సాకా హారమే తన ఆరోగ్య రహస్యం అన్నారు .గాంధీజీ చెప్పినట్లు తనకు ”సత్యమేవ జయతే ”అనేదే మంత్రమని ,తన బలం సత్యమేనని ,సత్యానికి మించింది లేదని ,తాను ఎప్పుడు అసత్యం చెప్పలేదని ,లేని దానికోసం ఆరాటం లేదని ,ఉన్నదానితో సంతృప్తి పొందటమే తన జీవితం అ

ని చెప్పారు .

మత్రికులతిఒన్ మాత్రమే పాస్స్ అయిన గోపాల రావు గారు ఆంగ్లం లో మంచి ప్రవేశం పొందారు .చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతారు ,రాస్తారు .తుతిఒన్ చెప్పి జీవితం కొంత కాలమ్ గడిపారు .తరువాత రెవిన్యూ లో ఉద్యోగం పొందారు .అందులో రెండు ప్రోమోశాన్లు పొంది అవనిగడ్డ లోనలభై ఏళ్ళ క్రితం  రిటైర్ అయారు .క్విట్ ఇండియా ఉద్యమం లో తాను పాల్గోన్నాని తన అనుభవాన్ని తెలిపారు .అవని గడ్డ లో రెవిన్యూ కార్యాలయం ముందు ఆ నాటి ఇంగ్లీష్ రెవిన్యూ ఆఫీసర్ ఎదుట త్రివర్ణ పతాకం చేతబట్టి ”If you do not quit India ,I will crush you ”అని  బిగ్గరగా అరిచానని ,అందరు తన్ను ఆశ్చర్యం తో చూశారని ,తనను అర్రెస్ట్ చేయిస్తానని దొర ఆదేశం జారీ చేస్తుంటే,తన వాళ్ళు తన్ను బలవంతం గా ఇంటికి తీసుకొని వెళ్లారట .అయితె ఏ క్షణం

లోనైనా అర్రెస్ట్ వారంట్ జారీ చేసే ఆవ కాశం వుందని తన తండ్రి ,కుటుంబం చెప్పగా తాను అజ్ఞాతం లో కి వెళ్లానని ,అలా ఒక సంవత్చరం under ground   లో ఉన్నాననీ ,చెప్పారు . అయితె వూరు వదిలి వెళ్లలేదని పొలాల్లో వున్న ఇళ్ళలో వుంటూ స్థానాలు మారుస్తూ ఎవ్వరికీ కనపడ కుండా గడిపానని .పాలేళ్ళు తాను ఎక్కడ వున్నానో
తెలుసుకొని భోజనాన్ని రహస్యం గా తెచ్చే వారని అన్నారు .

స్వాతంత్ర్యం పొందిన తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేశారని ,అదే తనకు ఆధారం అనీ అన్నారు .రెవిన్యూ లో పనిచేస్తూ ఆస్తి కూడ పెట్టుకోని ఆదర్శ ఉద్యోగి గోపాల రావు గారు . ధర్మమే మార్గం గా ,అహింసే పరమావధిగా ,షోచమే విధిగా ,జీవితాన్ని పండించు కొంటున్నారు .

ఎక్కడ కాంగ్రెస్ సభలు జరిగినా తాను వెల్లెవాడినని ,దాదాపు ఎక్కువ భాగం న

డిచే వెల్లెవాడినని ,సామాన్య జీవితమే తనకు ఇస్తామని చెప్పారు .అవనిగడ్డలో చిరువోలు రాదా కృష్ణ మూర్తి గారు అనే బ్రాహ్మణుడు ఖద్దరు దుకాణం నడుపుతూందే వారనీ ,వారే తనకు ఆదర్శమని ,ఆయన గురువు అనీ ,ఆయన షాప్ లొం అందరు కలిసి దేశ విషయాలు చర్చిన్చుకోనీ వారమని సభలకు ఏర్పాట్లు తామే చేశే వారమని అన్నారు .ప్రకాశం ,పట్టాభి ,కాకాని ,బ్రహ్మయ్య లతో చాలా గొప్ప పరిచయాలుండే వని ,తాను ఎప్పుడు కార్య కర్తగానే వున్నానని చెప్పారు .చంద్ర రాజేశ్వర రావు ,సనకా బుచ్చి కోటయ్య ,సుం దరయ్య లతో పరిచయం వుందని ఇక్కడ అన్ని భావాల వారు వృద్ధి చెందారని తెలిపారు .

దేశం లో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగు తోంది కదా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితె అవినీతి వెళ్ళు పాతుకొని పోయిందనీ ,దాన్ని రూపు మాపటం ఎవరి వల్ల కాదని

అంతగా దేశం భ్రస్టు పట్టి పోయిందని ఆవేదన చెందారు .యే ఆదర్శం తో స్వాతంత్ర్యాన్ని పొందామో దానికి వ్యతిరేకం గా జరుగుతూన్డటం బాధాకరమని బాధ పడ్డారు .ఆదర్శం అనేది లేక పోవటం జాతికి పట్టిన పట్టిన చీడ అన్నారు .దాన్ని పొందక పొతే జాతికి భవిష్యత్తు లేదు అని గట్టిగా చెప్పారు .యువకులకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా అని అడుగగా ,యువశక్తిని తక్కువ అంచనా వెయ రాదనీ ,దాన్ని వ్యవస్తీకరిస్తే దేశానికి బలం జీవంకలుగు తాయి   అన్నారు .అవినీతి లేని సమాజం ఏర్పడటానికి అందరు సహకరించాలన్నారు .ఆ రోజూ కోసం తానూ ఎదురు చూస్తున్నాను అని చెప్పారు .

 

 

తన భార్య తనకు ద్బందువే నని తనకు జీవిత భాగ స్వామి అవటం తాను చేసు కొన్న పుణ్యమేనని ఆనందం గా చెప్పారు .ఆమెను ”ఏమండీ !గోపాల రావు గారు ఆదర్శం ,ఆదర్శం అంటూ ఏమీ పెద్దగా సంపాదించలేదు ,మంచి ఇల్లు కట్టలేదు ,రేకుల షెడ్ లో కాపురం ఇంట్లో ఆదినికమైన వసతులు లేవు .మీకు బాధ గా లేదా ?”అని నేను అడిగితె ఆ దొడ్డ ఇల్లాలు ”నాకు వారి మీద ఏమీ కోపం లేదు .వారు యెంత సంపాదిస్తే దానితోనే జీవితాన్ని గడపటం నేర్చుకోన్నాం .పిల్లలందరికీ మంచి చదువులే చెప్పించాము .అందరు చక్కగా అభివృద్ధి చెందారు .ఇదంతా మా వారి మంచితనం వల్లనే .మాకు అతిగా కోరికలు లేక పోవటమే మా ఆఅనన్దానికి కారణం ”అని స్పష్టం గా చెప్పారు .”మీరు గోపాల రావు గారి భార్య గా గర్వ పడుతున్నారా ,సంతృప్తి తో వున్నారా ?”అని అడిగితె తాను పూర్తి సంతృప్తి తో వున్నానని ,అది లేదు ఇది లేదు అనే ఆరాటం తమ కుటుంబం లో లేదని ఇప్పటికి గోపాలరావు గారి తమ్ముడి కుటుంబం ,తమ పిల్లలు అందరు గోపాల రావు గారి కుటుంబం గానే ప్రవర్తిస్తున్నామని గోపాల రావు గారి మాటే అందరికి శిరో దార్యం గా భావించటం తమ పిల్లల గొప్పతనం అనీ అ

న్నారు .ఉమ్మడి కుటుంబ భావన తమ బలం అన్నారు .

ఆ ఆదర్శ దంపతులకు శుభాకాంక్షలు అందజేసి ముకుళిత హస్తాలతో నమస్సు లందించి ,వారి వద్ద శెలవు తీసుకొని వారికి ”మా అక్కయ్య -అనురాగ కవితా సంపుటిని ”అందజేసి ,ఇంటికి బయల్దేరాను .మా కుటుంబం కల కాలమ్ సుఖ సంతోషాలతో

వర్ధిల్లాలని ఆ వృద్ధ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా శీర్వదించి నాకు వీడ్కోలు చెప్పారు .ఈ

అనుభవం నాకు చిరస్మరణీయం గా వుంది .

 

 

Posted in సమయం - సందర్భం | 1 Comment

మా అక్కయ్య కవిత సంపుటి – ఆవిష్కరణ – వార్త పత్రికలలో

News Maa Akkaiah

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 పుస్తకావిష్కరణ -సమీక్ష

మా అక్కయ్య అనురాగ కవితా సంపుటి ఆవిష్కరణ సభ
ఆడియో

—  ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆదివారం సాయం సంధ్య వేల ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో సరసభారతి ఇరవైఎనిమిదవ సమావేశం లో వందమంది సాహిత్యాభిమానులు ,రచయితలు ,కవులు ,వివిధ పత్రికల అధినేతలు ,హాజరై సభకు నిండుదనం తెచ్చారు .ఆహ్వానించిన అతిధులంతా సమయానికి విచ్చేసి సహకరించారు .వేదిక మీదకు అతిధులను నేను ఆహ్వానించగా ,సరసభారతి సభ్యులు వారిని ఫలాలతో సత్కరించి వేదిక పై ఆసీనులఎట్లు చేశారు .రెండు చారిత్రిక సంఘటనల మధ్య ఈ సమావేశం జరుగుతోందని ఆహ్వానం పలుకుతూ అన్నాను ,అన్నా హజారే గారి పిలుపుతో దేశ ప్రజలంతా ఆయన కు సంపూర్ణ మద్దతు నిచ్చి నిలబడి హజారే కోరిన మార్పులను జన లోక్పాల్ లో పార్లమెంట్ ఆమోదించటం ప్రజావిజయం అనీ ,అది నిన్ననే జరిగిందని ,రేపు అంటే ఇరవైతోమ్మిదవ తేది వ్యావహారిక భాషోద్యమ సారధి గిడుగు రామ మూర్తి గారి జయంతి అని దానిని ”తెలుగుభాషా దినోత్చావం ”గా జరుపుకొంటామని .ఇంకో మూడు రోజుల్లో భారత ప్రజల తొలి పండుగ వినాయక చవితి జరుపుకొ బోతున్నామని

ఈ నేపధ్యం లో ఈ పుస్తకావిష్కరణ జరాటం ఆనందదాయకం గా వుందని అన్నాను .ఆహ్వానించిన వారంతా విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాను .విస్తృతమైన ప్రచారం చేసిన పత్రికల వారికీ ,”వార్తా విపంచి ”ద్వారా దాదాపు ప్రతిరోజూ పుస్తక ఆవిష్కరణను శ్రోతలకు తెలియజేసిన విజయవాడ ఆకాశ వాణి కేంద్రానికి దాని డైరెక్టర్ మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపాను .ఈ వేదికను స్వర్గీయ వేగుంట మోహన ప్రసాద్ (మో) వేదిక గా,నిర్వహిస్తున్నామని ,ఈ సభ వారికి అంకితం అనీ అన్నాను .
           ”మా అక్కయ్య ”అనురాగ కవితా సంపుటిని శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషం గా వుందని ఇది రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున సరసభారతి అయిదవ పుస్తకమని ,సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను ప్రసాద్ అమృత హస్తాలతో ఆవిశారించటం చారిత్రాత్మకమనిఅన్నాను .  పుస్తకావిష్కరణ చేసిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు సరసభారతి గొప్ప అదృష్టాన్ని కల్గించిందని ,అన్ని పుస్తకాలను తనతో ఆవిష్కరిమ్పజేయటం సరసభారతి విశాల హృదయానికి నిదర్శనమని ,మానవత్వపు విలువలు మరిచి పోతున్న ఈ కాలమ్ లో అనురాగాలు ఆత్మీయతలను దూరం చేసుకొంటున్న తరుణం లో ఉగాది నాడు యాభై మంది కవులతో ”మా అక్కయ్య ”శీర్హికతో కవి సమ్మేళనం నిర్వహించి ,అయిదు నెలల్లోనే పుస్తకం గా ముద్రించి ఆవిష్కరించటం అద్భుత మైన విషయం అనీ ,సరసభారతి ,దాని నిర్వాహకులు అకున్తిత దీక్ష తో చేస్తున్న సాహితీ కార్యక్రమాలకు తరచుగా తనను ఆహ్వానించటం ముదావహం గా వుందనిఅన్నారు ఈ లైబ్రరీ నిర్మాణం లో దుర్గా ప్రసాద్ కృషి ఎంతో వుందని ,దీనికి ఆర్ధిక సాయం చేసిన శ్రీ మైనేని గోపాల క్రిష్నయ్య గారి ఉదారహృదానికి ధన్యవాదాలని చెప్పారు .ఇలాంటి సభలు హాయిగా జరుపు కోవటానికి దీని పైన సభా మందిరం నిర్మించాలన్న కోరిక చాలా కాలమ్ గా దుర్గా ప్రసాద్ మాస్టారు కోరుతున్నారని ఆ కోరిక కొద్ది కాలమ్ లో తీరబోతోందని చెప్పారు .పై అంతస్తుకు నాలుగు లక్షల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థ మంజూరు చేసిందని ,అన్ని సౌకర్యాలతో పై అంతస్తు నిర్మించి సాహిత్య సంగీత కళా సాంస్కృతిక వేదిక గా దాన్ని తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు .డబ్బు సాంక్షన్ చేసిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ రొంది కృష్ణ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు …సమాజ హితం తో ,విస్తృత ప్రయోజనాలకోసం కవులు రాయాలని ,సమాజ హితం ముఖ్యమని తెలుగు భాషను అందరం కలిసి రక్శీన్చు కోవాలని అన్నారు ..
            ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ యెన్ .వి ఎస్ .చలపతిరావు గారు తమ పత్రిక సాహిత్యాన్ని పోషించటానికి యువకులకు ,బాలలకు ప్రత్యెక స్శీర్శికలు నిర్వహిస్తున్నామని ,వాటికి రచనలు పంపమని కోరారు .తర్వాత శ్రీ చలపతిరావు గారికి సరసభారతి ఘనం గా ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా దుర్గా ప్రసాద్ దంపతులు సత్కారం జరిపించారు .పత్రికా విలేఖరులు కూడా రావు గారిని చాలా ఆత్మీయం గా సన్మానించారు .పూలహారాలతో ,శాలువాలతో ముంచెత్తారు .రావు గారు కృతజ్ఞతలు తెలియ జేశారు
          నెల్లూరు లోని సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ vice చైర్మన్ ,”స్టేట్ లీడర్ ”జాతీయ పక్ష పత్రిక సంపాదకులు శ్రీ సర్వేపల్లి రామ మూర్తి గారు ఆత్మీయ అతిధి గా ప్రసంగిస్తూ ,ఇక్కడి ఈ సాహితీ వాతావరణం తనను ముగ్ధుణ్ణి చేసిందని ,ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ,ప్రచురిస్తున పుస్తకాలు ఎందరికో ప్రేరణ కల్గిస్తాయని ,ఇంకా అభివృద్ధి లోకి సరసభారతి రావాలని యువతకు ప్రత్యెక కార్య క్రమాలనూ నిర్వహించాలని హితవు పలికారు .
            కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి డాక్టర్ శ్రీ జి .వి .పూర్ణచంద్ తమ అభిభాషణలో ఉయ్యూరు లో మాస్టారు ఆధ్వర్యం లో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమాలకు తాను ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు హాజరవుతూన్తామని ,చాలా నిష్టతో ,సమయపాలనతో ,ప్రయోజనంతో సరసభారతి కార్యక్రమాలునిర్వహిస్తోందని ,అయిదు పుస్తకాలు ప్రచురించటం ఆశా మాషీ కాదని ,కృష్ణా జిల్లా రచయితల సంఘం చేసే ప్రతి కార్యక్రమానికీ మాస్టారు తప్పక హాజరవుతారని తమలో ఆయన ఒకరనీ ,తాము ప్రచురించిన పుస్తకాలన్నితిలో మాస్త్త్రి విలువైన రచనలున్నాయని ,తాము ఇటీవల నిర్వహించిన ప్రపంచ సభలు గొప్ప స్పూర్తిని కలిగించి ఆధునిక సాంకేతికత తెలుగు భాష కు ఎలా ఉపయోగ పడుతోందో ,భాషా వ్యాప్తికి దోహదపడుతోందో అందరికి తెలుసుకొనే అవకాశం కల్గిందని అన్నారు .
           మాచిలి పట్నం బోధన కళాశాల రెతిరెద్ ప్రిన్సిపాల్ ,మరియు ,మినీ కవితోద్యమ సారధి ,వందలాది సభాలోఅను నిర్వహించిన వారు ,యువకవులకు ప్రేరణ ,ఎన్నో పుస్తకాలను ప్రచురించిన రావి రంగా రావు గారు ప్రసంగిస్తూ ,తాను అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఎప్పుడో కవితలు రాసానని కవులు యెంత రాశామని కాక యెంత బాగా రాశామో ఆలోచించి రాయాలని సంక్షిప్తత చాలా ముఖ్యమని ,కవిత హృదయానికిచేరువ కావాలని రాసి కంటే వాసి ముఖ్యం అని ,అక్కయ్య మీద కవిసంమేలనానికి తాను హాజరయానని ,పుస్తకావిష్కరణకు తనను పిలవటం తన పట్ల నిర్వాహకులకున్న సహృదయతే నని ,మానవీయ సంబంధాలు శిదిలమైతే  మనుష్యులుగా మన గలగలేమని వాటిని కాపాడుకోవాలని సూచించారు .
          సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి శ్రావ్యమైన కంఠం తో తెలుగు భాషతియ్యదనంపై మంచి పాట పాడి జన  రంజనం చేశారు .ప్రసిద్ధ కవులు రచయితలు ,సాహితీ సభా నిర్వాహకులు అయిన శ్రీ వేలూరి కౌండిన్య ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ;శ్రీ ఉమామహేశ్వరి గార్లు సహృదయ స్పందన తెలుపుతూ వుయురుకు ఎప్పుడు పిలిచినా వస్తున్నామని ఇక్కడి వారి పిలుపు లో ఆత్మీయత ,అనురాగం ఉంటాయని అందుకే తప్పకుండా వస్తున్తామని అన్నారు .ఆంద్ర ఉపన్యాసకురాలు డాక్టర్ శ్రీ లత సరసభారతి లో తాను ఒకరుగా వుండటం గర్వ కారణం గా వుందని మంచి కార్యక్రాలను నిర్వహించటం ,అందరికి సమాన మైన ప్రాతినిధ్యాన్నీవ్వతమ్ ఇక్కడి వారి ప్రత్యేకత యారు .కోస్తా ప్రభ సంపాదకులు శ్రీ శ్రీరాం యాదవ్ ,చిన్నయ సూరి విజ్ఞాన పరిషత్ కార్యదర్శి శ్రీ టి .శోభనాద్రి గార్లు మానవీయతకు పట్టం కట్టే ఇలాంటి కార్యక్రమాలు తరుచు జరగాలని కోరారు .అతిదులందరికి జ్ఞాపికలు సరసభారతి అంద జేసింది .
      తరువాత ”మా అక్కయ్య కవితా సంపుటిపై సమీక్షను ఆంధ్రా బాంక్ ఆఫీసర్ ,మినీ కవితా సారధి శ్రీ వసుధ బసవేశ్వర రావు నిర్వహించారు .పద్యకవిత్వం పై సమీక్షను గుడివాడ ఆంద్ర బాంక్ సీనియర్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ జి.వి .బి. శర్మ చేశారు .కవుల కవిత్వం లోని లోతు పాట్లను తెలియజేశారు .గుండెకు తాకినా కవితలను ఉదాహరించారు .కైకలూర్ లోని సాహితీ మిత్రులు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ చింతపల్లి వెంకట నారాయణ   కవిత్వాన్ని విశ్లేషించారు .మంచి కవితా హృదయం తో ఆలోచనాత్మకం గా ,గుండెలను  పిందేన్టగాకవితలున్నాయని,అందరు ఫీల్ అయి రాశారని మంచితరుణం లో మంచి పుస్తకం వచ్చిందని అందరు అభినంద నీయులే నన్నారు .
            యువకుడు ,ఉత్చాహవంతుడు ,రమ్యభారతి త్రైమాస పత్రిక సంపాదకుడు కవి ,కధారచయిత ,అనేక బహుమతుల గ్రహీత మంచి నిర్వాహక సామర్ధ్యం వున్న వారు అయిన శ్రీ చలపాక ప్రకాష్ సభాధ్యక్షత వహించారు .ఇందరు పెద్దలుండగా సభాధ్యక్షతను యువకుడైన తనను చేయటం సరసభారతి నిర్వాహకుల వినూత్న ద్రుష్టి అని ,యువతకు యెంత ప్రాధాన్యత ఇక్కడ లభిస్తోందో దీన్ని బట్టే అర్ధమవుతోందని ,తాను ఇక్కడి కార్యక్రమాలకు ఈ మధ్య తరచుగా వస్తున్నానని వీరి సభానిర్వహణ నిర్దుష్టం గావ్ ఉంటుందని మెచ్చారు .చాలా హుందాగా ,అర్ధవంతం గా ప్రకాష్ సభను నిర్వహించి అందరి ప్రశంసలు అందుకొన్నారు .బాంధవ్యాలను మరిచి పోతున్న తరుణం లో అక్కయ్యకు పెద్ద పీత వేశారని అలాగే పిన్ని ,బాబాయ్ ,తాతయ్య నానమ్మ ,అమ్మమ్మల పై కూడా  కవిసంమేలనాలు నిర్వహించి యువకులను భాగ స్వామ్యులను చేయాలని కోరారు .
           చివరగా నేను మాట్లాడాను .ఈ పుసకం ఇంత సర్వాంగ సుందరం గా తయారవటానికి కారకులు శ్రీ వసుధ ,మరియు శ్రీ వెంకట నారాయణ గారలె.వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఒక్క కృతజ్ఞత చెప్పటం తప్ప అన్నాను .సాధారణం గా కవి సమ్మేళనం అంటే కవులు తమ కవిత్వం చదివి వినిపించావచ్చని ఆశ తో వస్తారు .కాని ఈ రోజూ కవిసంమీలనానికి మించి కవులు ,సాహిత్యాభిమానులు ఇంతమంది విచ్చేయటం ఉయ్యూరు మీద సరసభారతి మీద వున్న గొప్ప నమ్మకం మాత్రమే నని తెలిసింది .ముఖ్యం గా మహిలామతల్లులు అంతంత దూరం నుంచి రావటం ఎంతో మహదానందం గా వుంది నాకు ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు ,వదినలు పిన్నులు ,అమ్మక్కయ్యలు ,మాత్రుమూర్తులున్నారని తెలిసి మురిసి పోతున్నాను .మీ ఋణం నేను తీర్చుకోలేను .చేతులెత్తి అందరికి నమస్కరించి నా అశక్తతను సవినయం గా తెలుపుకొంటున్నాను .అని నా కృతజ్ఞతలు తెలియ జేశాను .నాకు సహకరించి ఈ కార్య క్రమం ఇంత వేడుక గా నిర్వహించటానికి తోడ్పడిన నా కుటుంబ సభ్యులకు ,నాకు చేదోడు వాదోడుగా నిలిచిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శిఉవలక్శ్మికి టెక్నికల్ ,సలహాదారు ,ప్రచార సారధి శ్రీ బాల గంగాధర రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను
   చివరగా శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ చేశారు .జనగణ మన తో సభ పూర్తి అయింది .మూడు గంటల పాటు మహదానందం గా ,క్రికిరిసిన సాహిత్యాభిమానులతోఆవిష్కరణ సభ చిరస్మరణీయం అయింది .సహకరించిన లైబ్రరీ యాజమాన్యం అభినందనీయులు .
          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -08 -11.
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 వుయ్యూరు లో పుస్తకావిష్కరణ

This slideshow requires JavaScript.

మా అక్కయ్య -1

మా అక్కయ్య -2

మా అక్కయ్య – 3

మా అక్కయ్య – 4

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ

అవినీతి వ్యతిరేక ఉద్యమం

          -నిన్న అంటే 25  వ తేది గురువారం ఉయ్యూరు   రోటరీ క్లబ్ వారు తమ సమావేశం లో ”అవినీతి వ్యతిరేక ఉద్యమం ”పై ముఖ్య అతిధి గా వచ్చి  ప్రసంగించమని కోరారు .నేను మాట్లాడాను .రోటరియన్లు అందరు వున్నారు .వారి ముందు మాట్లాడే అరుదైన అవకాశం లభించింది .కే.సి.పీ .జనరల్ మేనేజర్ గారిచేత నాకు  సత్కారం చేయించారు .ఆ సందర్భం గా నేను మాట్లాడిన ప్రసంగా పాఠం మీతో పాటు సాహితీ బంధువు లందరికీ .

— ”అవినీతి ని ఆంగ్లం లో corruption  అంటారు .దీనికి నిఘంటువు లో చెడగొట్టు (spoil )కుళ్ల జేయు   (rotten ) ,దుర్మార్గమైన ,భ్రష్టమైన ,నీచమైన (base ) ,అవినీతి కరమైన ,లంచం ఇచ్చే (bribe )అనే అర్ధాలున్నాయి .పోతన గారి భాగవతం లో తండ్రి హిరణ్య కశిపుడు కుమారుడు ప్రహ్లాదుడిని  విష్ణువు ఎక్కడ వున్నాడు అని అడిగితే చెప్పిన పద్యం అందరికి తెలుసు .ప్రహ్లాదుడు విష్ణువు లేని చోటు లేదు అని చెప్పాడు ఆ పద్యం లో .దాన్ని కొంచెం మార్చి చెబితే అవినీతి లేని చోటు లేదు అని నాకు అనిపించి ,

పోతన గారికి క్క్షమాపణలు చెప్పుకొంటూ —”ఇందుగలదు ,అందు లేదు అని సందేహము వలదు వక్రి ఎందెందు వెదకి జూచిన అందందే కలదు మానవాగ్రణి వింటే ,కంటే ”అని నిస్సందేహం గా చెప్పవచు .

           అవినీతిఎందుకు వస్తోంది అని ఆలోచిస్తే -ప్రభుత్వాల అసమర్ధత వల్ల అని సమాధానం .ప్రభుత్వ వ్యవస్థలలో సరైన అనుసంధానం తో కూడిన నిఘా ,పర్యవేక్షణ లేక  పోవటం వల్ల అవినీతి పెరుగు తోంది .చాలామంది medhaavula అంచనా ప్రకారం అవినీతి కూకటి వ్రేళ్ళు రాజకీయం లో వున్నాయి .అధికారం పేరిగినా కొద్దీ అవినీతి అదే దామాషా లో పెరుగు తుంది .అందుకే ఇంగ్లీష్ లో ”power corrupts ,absolute power corrupts absolutely ”అన్నారు .ఇంతకీ అవినీతిని నిర్వచించ గలమా ?విశ్లేషకులు ఇలా నిర్వచించారు ”.వ్యక్తీ తన స్వార్ధం కోసం,తన అధికారాన్ని దుర్వినియోగం చేయటమే అవినీతి ”.దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే అధికారమే అవినీతికి మూల స్థానం .లిబియాలో ,ఈజిప్ట్ లో .సూడాన్ లో మన రాష్ట్రం లో అవినీతి ఏరులై పారతానికి కారణం పుత్రప్రేమ .వారికోసం ఎంతటికైనా తెగించారు .చరిత్ర భ్రస్తులైనారు ముబారక్ ,గడాఫీ రాజశేఖర రెడ్డి అని మనకు అందరికి తెలుసు .కరుణానిధి కూతురు  కోసం మేనల్లుళ్ళ కోసం కక్కూర్తి పడి భంగపడ్డ విషయం రోజూ కధలు ,గాధలుగా వింటూనే వున్నాం .ప్రభుత్వ ధనాన్ని ,స్థలాలను ధారాదత్తం చేసి ,దోచుకొని అందలాలు ఎక్కి అన్ని సుఖాలు అందుకొన్నా వాళ్ళే వారంతా .
          పోలీసు వ్యవస్థ ,పౌర వ్యవస్థ లలో రాంకు పేరిగినా కొద్దీ అవినీతి అడ్డ గోలు గా పెరుగుతుందని విశ్లేషకుల వివరణ .దీనికి తోడు ఎన్నికలు వస్తే చాలు అవినీతి పండగే .ఎల్లలు దాటి అవినీతి అడ్డు ,ఆపు లేక అన్ని రకాల విశ్వ రూపం దాలుస్తుంది .డబ్బు ,అధికారం ,ప్రలోభం అన్నీ ఉపయోగించి ఎన్నికలలో గెలవటం సర్వ సాధారణం అయింది .వాడికే అధికారం దక్కుతోంది .అంటే అవినీతి నాయకుల్నే మనం ఎన్నుకొన్తున్నాము .మరి వాడు తాను ఖర్చు పెట్టిన దానికి వందల రెట్లు సంపాదించుకొనే వీళ్ళు అన్నీ చూసుకొంటాడు .అతి కొద్ది కాలమ్ లో అపర కుబెరుడై పోతున్నాడు .వాడి అధికారానికి దౌష్ట్యానికి ఎదురు లేదు .గట్టి రాజకీయ ,ఆర్ధిక oligarchy అంటే  కొద్దిమంది  వున్న ముఠా వల్ల అవినీతి పెరిగి పోతోంది అని పాల్ జాన్సన్ నిర్వచించాడు.అధికారులు ,నాయకులు తమ స్వంత పలుకుబడిని పెంచుకోవటానికి ,సబ్సిడీలు ,ఇతర వాణిజ్య సంస్థల నుంచి రక్షణ కోసం లాభం కోసం ఇచ్చే వన్నీ అవినీతి లో భాగమే .ఇవి రాజకీయం తో వ్రేళ్ళు గట్టి పడి ,మిగిలిన అన్ని చోట్లకు ప్రాకి ఇబ్బంది కలిగిస్తాయి .ఈ oligarchy  –రాజకీయ అవినీతి పరుల సంస్కృతిని పెంచుతుంది .న్యాయం ,చట్టం,పోలీసు వ్యవస్థ ,కోర్టులు వీటిని అన్నిటిని ప్రలోభపెట్టి ,ప్రభావితం చేస్తారు ఈ ముఠా.దీని వల్ల రావలసిన మంచి పరిణామాలు ఆలస్యమై పోతాయి ,లేక రాకుండా పోవనూ వచ్చు .
                                అవినీతిని అంత మొందించే ప్రక్రియ
                 మనకున్న న్యాయ,చట్ట సంస్థలు అన్ని కలిసి అవినీతికి వ్యతిరేకం గా పోరాడాలి ”.స్వతంత్రమైన అవినీతి నిరోధక వ్యవస్థ ”ఏర్పడాలి .ఈ వ్యవస్థ అవినీతి బడాబాబుల భారతం పట్టాలి ..ఇది స్వతంత్ర సంస్థ గా,విస్తృతమైన అధికారాలతో వుండాలి .ఇందులో రాజకీయ లొసుగులు ఉండరాదు .యెంత పెద్ద రాజకీయ నాయకుదినైనా ,ఆర్ధిక .పారిశ్రామిక వేత్తనైనా విచారించి శిక్షించే అధికారం ఈ సంస్థకు వుండాలి .దీనికి విశేషమైనాక్ విచాక్షనాదికారం వుండాలి .అత్యున్నత స్థాయి లో వున్న వ్యక్తులను విచారించటానికి రాష్ట్రపతి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా చేయాలి .దీనికి ప్రభుత్వమే తగిన సిబ్బందిని ,బడ్జెట్ ను ఇవ్వాలి .అవినీతి పరులను జైల్లో పెట్టేంత వరకు వీరికి పూర్తి అధికారాలు లభించాలి .ఇలా చేస్తే రాజకీయ ఒత్తిడి చాలా భాగం తగ్గి పోతుంది .ఇప్పుడున్న చట్టాలు ,వాటి వినియోగం ,అవినీతి సామ్రాట్టుల జోలికి రాష్ట్రపతి కాని ప్రధాని కాని వెళ్ళే వెసులు బాటు లేదు .అందుకే స్వతంత్ర వ్యవస్థ అవసరం .వారిని chaallenge  చేసే దమ్ము కూడా వుండటం లేదు .ఇది మరీ విచారకరం .
              ఈ స్వతంత్ర వ్యవస్థ ప్రభుత్వ పబ్లిక్ రంగ సర్వీసెస్ తో ఏకీకృతమై పని చేయాలి .పబ్లిక్ సంస్థలలో అవినీతి నిర్మూలిస్తే ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగు తుంది .విశ్వాసము కూడా పెరుగుతుంది .ప్రజా ప్రయోజనాల కోసం దాతలనుంచి విరాళాలు సేకరించి,మళ్ళీ వారికి ఇంకో విధం గా లబ్ది చేకూర్చటం అవినీతి లో ఒక భాగమే .వ్యవస్థలో ,విధాన నిర్ణయాలలో సంస్క్రరణ రూపం లో ఇవన్నీ రావాలి .దీనికి రాజకీయం గా గొప్ప నిష్ఠ వుండాలి .దీని తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం దేశం లో అత్యున్నత వ్యక్తిత్వం ,గట్టి రాజకీయ ధృఢ నిశ్చయం వున్న మహోన్నతులను తయారు చేయటం యెట్లా అని .మంచి పౌరవ్యవస్థ వల్ల నే ఇది సాధ్యం .ప్రస్సారమాధ్యమాలు ,సివిల్ సేర్వసులు రాజకీయం గా లోతులు తరచి సమాచారాన్ని ప్రాలకు అందించి జాగృతం చేయాలి కేవలం watch dogs గా వుంటే చాలదు .అవినీతిని అంతం చేసే అధికారులకు వ్యవస్థలకు పూర్తిమద్దతును   మీడియా ఇవ్వాలి .కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ,దాని ప్రభావంతో దెబ్బతిన్న ఇతర వ్యవస్థలను చక్కదిద్దే కార్యక్రమం ప్రజాసహకారం తో చేయాలి .ఇదంతా స్వచ్చమైన పరిపాలన వల్లనే సాధ్యం అని అందరు గ్రహించాల్సిన ముఖ్య విషయం .
               పౌర సమాజానికీ ,దేశానికీ ,ప్రైవేటు సెక్టారు కు చక్కని సమతూకాన్ని అంటే balance ను సమకూర్చ గలిగింది సమర్ధవంతమైన ప్రభుత్వాలే . విధానాలు ప్రకటించటం లో వున్న శ్రద్ధప్రభుత్వాలకు  అమలు చేయటం లో లేదు .అక్కడికొచ్చే సరికి చిత్త శుద్ధి తగ్గి పోతోంది .ఇదే ఇన్ని అనర్ధాలకు కారణం .మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ వుంది ,స్వేచ్చాయుత మీడియా వుంది .కనుక స్వచ్చమైన ,నీతి వస్న్తులైన ,సమర్ధులైన వారిని వీటి లో నియమిస్తే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది ,తమ బాధ్యతను నెరవేర్చే టందుకు సిద్ధ పడతారు .ఇవి మనం చేయలేక పోతే మనం ”నైతికం గా అవినీతి పరులం ”అయినట్లే అని భావించాలి .దీన్నే morally corrupt అంటారు .ఇది మనందరి బాధ్యత .ఆత్మ విశ్వాసం తో ,చేతలతో ముందడుగు వెయ్యాలి .పారదర్శకత అన్నిటా వుండాలి .లోకాయుక్త ,లోకపాల్ మనకు వున్నా ,వాటికి ప్రత్యేకమైన enforcement అధికారాలు లేవు .నామ మాత్రమే అవి    .
 ఈ విషయాలను అన్నిటిని చాలా ఏళ్ళ క్రితమే మన ఉయ్యూరు నివాసి ,అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ముప్ఫై ఏళ్ళకు పైగా సేవలందించిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్రవేత్త ,ప్రస్తుతం అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటున్న శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ తన గ్రంధాలలో విపులం గా చర్చించి దిశా నిర్దేశం   చేశారు  .ప్రభుత్వాలు వాటిని అధ్యనం చేసి తీరు మార్చుకో క పోతే సంక్షోభం తప్పదు   .                        ఇప్పుడు కరెంట్ టాపిక్ ”జన లోక్ పాల్ ‘సాంఘిక సేవా లో జీవితాన్ని పండించుకొని ,నిస్వార్ధ సేవ చేస్తున్న శ్రీ అన్నా హజారే అవినీతి తీరు తెన్నులు చూసి విసుగు చెంది దానికి వ్యతిరేకం గా పోరాడుతూ జన లోక్ పాల్ బిల్లు కోసం నిరశన దీక్ష చేస్తున్నారు .ఆ నాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇలాగే ఉద్యమించి రెండవ స్వాతంత్ర సంగ్రామం చేసి ప్రజా పాలన తెచ్చారు .మళ్లి ఇప్పుడు హజారే కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు .ప్రభుత్వం మీన మేషాలు లేక్కిస్తోంది .పది ర్రోజులైంది ఆయన ఆరోగ్యం దెబ్బతిన కుండా ,ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా స్పందించాలి ఆయన చేస్తున్న ఉద్యమమే ”India against corruption ”.(I.A.C.).వ్యక్తిత్వం  ,సచ్చీలం  ,నిజాయితీ వున్న వారినే పరిపాలకులు గా ఉంచాలన్నది ఆయన అభిప్రాయమే కాదు భారతదేశ ప్రజాభిప్రాయం కూడా .
            అవినీతి మూడు దశల్లో వుంటుంది అని ఒక విశ్లేషణ .దేవుడిని నాకు అది కావాలి ఇది కావాలి అవి ఇస్తే నీకు అది చేయిస్తా ఇది చేయిస్తా అని కోరుకోవటం తోనే మొదలి స్థాయి అవినీతి ప్రారంభం అన్నాడు ఒకాయన నిజమే .దేవుణ్ణి మనం అవినీతి లోకి లాగుతున్నాం .రెండోస్తాయి లంచం ఇవ్వటం ,పుచ్చుకోవటం .మూడో లెవెల్ లో మంత్రులస్తాయి అవినీతి ఇంతకీ అవినీతికి కారణాలు ఏమిటో తెలుసా ?మనమీద మనకు నమ్మకం లేక పోవటం ,మానవత్వపు విలువలు దూరమవటం ,త్యాగభావం లేక పోవటం ,సేవా నిరతి తగ్గటం ,స్వార్ధం పెరగటం ,అభద్రతా భావం .అభద్రతా బ్భావం తో డబ్బే ప్రధాన శక్తి అని భావించి దానికోసం అవినీతి రొంపిలో దిగటం .అత్యున్నత స్థాయిలో వున్న వాళ్ళు రోల్ మోడల్స్ గా లేక పోవటం మానకు చాలా నష్టం కలిగిస్తోంది .గాంధి నెహ్రు ,పటేల్ రాజెన్ బాబు  సర్వేపల్లి ,ప్రకాశం ,లాల్బహదూర్ శాస్త్రి వంటి మహామహుల  తర్వాత ఒక అబ్దుల్ కలామే మనకు ఆడర్శపురుషుడి గా కన్పిస్తున్నారు .మిగతా వారి గురించి మనం నేర్చుకోవాల్సిన్దేమి లేదు .అదీ దేశానికి దౌర్భాగ్యం .వున్న వారంతా రోల్డ్ గోల్డ్ వంటి వారే అవటం జాతి చేసుకొన్న దురదృష్టం .అవినీతి తగ్గ టానికి ప్రజల్లో ఆత్మ స్థైర్యం ,అవగాహన పెంచాలి .యువతకు బాధ్యతలు అప్పగించాలి .వారింకి మార్గ దర్శకత్వం చేయాలి .వారి శక్తిని తక్కువ అంచనా వెయ రాదు .ఇవాళ ప్రపంచం అంతా జరుగుతున్న అవినీతి పోరాటం ,అవినీతి ప్రభుత్వాలను గద్దె దించటం లో యువకులు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయం గా,ఆదర్శవంతం గా ఉంది .
          ఉత్పత్తి సృష్టించటం లో మానవత్వపు విలువలను మంట బెట్ట రాదు .ఆధ్యాత్మికతను దానికి జోడించాలి .మనం విశ్వ పౌరులం అన్న భావన చాలా ముఖ్యం .పవిత్ర వ్యక్తిత్వాన్ని అందరు పెంచుకోవాలి .జీవితాన్ని ,తమ భాషా ,సంస్కృతులను ప్రేమించాలి .మన వారసత్వం లోని మానవతా విలువలను భద్రం గా కాపాడు కోవాలిఅప్పుడు చెడు మార్గం వైపు అడుగు పడదు .ప్రభుత్వం కూడా ”gross domestic happiness ”మీద ద్రుష్టి పెట్టాలి కాని ”gross domestic product ” మీద కాదు అని చ్చేప్పిన వారి మాట పాటించాలి .అలాగే ”prosperity has meaning when there is happiness and common welfare built into the system ”అని సమాజ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు శిరోధార్యం గా భావించాలి .అవినీతి సామ్రాజ్యాలను కూకటి వేళ్ళతో పెకలించి ,ఆ దోచిన సంపదను జాతి పరం చేయాలి .అన్నా హజారేకు మద్దతు అంటే వూరికే గొంతు కలపటం కాదు .ఒక సమర్ధవంతమైన నీతి ,పౌరబాధ్యత ,సమాజ సేవ నిజాయితీ  వున్న మంచి వ్యక్తిని అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రధానిని చేయాలి .అపుడే హజారే కన్న కలలు నిజం అవుతాయి .ఇప్పటి బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని కావటానికి తగిన అన్ని అర్హతలు వున్న వాడు అని నాకు అనిపిస్తోంది .ఆ దిశ గా రాజకీయ పక్షాలు ,ప్రజా కలిసి అడుగు వేస్తె ఆ నాటి జనతా ప్రభుత్వం లా   మేలు చేసే మరో మంచి ప్రభుత్వం వస్తుంది .
              ప్రజాకవి కాలోజి నారాయణ రావు ఎప్పుడు ”private wrong can be drowned in a cup of wine ,but for public wrong ,it requires rivers of blood ”అన్న మాటల్ని చెబుతూ వుండే వారట .అందుకే ఆయన ప్రజాకవి అయారు .మన మాజీ రాష్ట్ర పతీ అబ్దుల్ కలాం ”’నా కంటే నాదేశం మహోన్నతమైనది అనే భావం నా దేశ నాయకులకు ,నాదేశ ప్రజానీకానికి వారి గుండెల్లో బాగా నాటుకోనేట్లు చెయ్యి ”అని ప్రతి రోజూ రాత్రి నిద్రించాటానికి ముందు భగవంతుని ప్రార్దిస్తారట .మనం కూడా అలా చేస్తే యెంత బాగుండు? భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రేమే కోర్ట్ ”Even god cannot help this country .God is silent spectator .The centre and state governments have become non functunal ”అని 2008  లో చెప్పింది అంటే యెంత దౌర్భాగ్య స్థితి లో మనం ఉన్నామో   తెలుస్తోంది .ఈ విపత్కర పరిస్థితినుంచి ,ఈ అవినీతి జాడ్యం నుంచి మన దేశం బయట పడి ఆదర్శవంతం గా నిలవాలని కోరుకొంటూ ,ఆశిస్తూ ,సెలవ్ ”
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -08 -11.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in సభలు సమావేశాలు | 3 Comments

శ్రీ కృష్ణ తత్త్వం —2 గోపికా భక్తి

శ్రీ కృష్ణ తత్త్వం —2

                                         గోపికా భక్తి

—    ”ధర్మ కర్తయు ,ధర్మ భర్తయు ,ధర్మ మూర్తియు నైన ,స —త్కర్ముదీషుడు ,ధర్మ శిక్షయు ,ధర్మ రక్ష యు జేయగా

       నర్మలిన్ ,ధరమీద బుట్టి ,పరంగాన జన సంగమే –ధర్మ మంచుదలంచి జేశే నుదాత్త మానస చెప్పుమా ?”అని ఆనాడే పరీక్షిత్తు అడిగాడు మనకు వచ్చే సందేహాన్ని ముందే వివరిస్తాడు మహర్షి వ్యాసుడు .,దాని వ్యాఖ్యాత మన పోతన .ఆ భక్తి వైభావమేమితో తిలకించి పులకిద్దాం .సందేహ నివృత్తి లో నివ్రుత్త పదాన్ని చేరుదాం .బ్రహ్మ ,గోపికల భక్తికి పులకించి పోయాడు .గుణ ,దేహాలను వదిలి ,బంధ నిర్ముక్తులైనందుకు పరమానంద భారితుదయాడు పరబ్రహ్మ .పోతన గారి పద్యమందారం లో దాన్ని దర్శిద్దాం
”తరుణుల్ గొందరు మూల గేహముల నుద్దండించి రారాక త–ద్విరహాగ్నిం బరితాప మొందుచు ,మనోవీదిన్ ,విభున్ ,మాధవున్ —
బరి రంభంబులు సేసి,జారుదనుచున్ ,భావిన్చియున్ ,జొక్కి ,పోం –దిరి ముక్తిన్ ,గుణ దేహముల్ విడిచి ,ప్రీతిన్ ,బంధ నిర్ముక్తలై ”.
  బ్రహ్మ కూడా ,శ్రీ కృష్ణ పాద సేవా తత్పరత తో ,తన్మయత్వం పొందాడు .సమస్తం పరమేశ్వరార్పణం లో వున్న ఆనందం -బ్రహ్మ పదం లో కూడా లేదు అని ”ఎరుక ”పొందాడు సృష్టికర్త .అంత సమ్మోహన మూర్తి ఆయన .ఆ లీల అంత అద్భుతమైనదీ ,చిత్తాకర్షణ కలదీ .
”ఎలా బ్రహ్మపదంబు ,వేదములకున్ ,వీక్షిమ్పగా రాని ని –న్నీ లోకంబున ,నీ ,వనాన్తమునం ,మందలో ,”గృష్ణ ”యం
 చాలాపాది ,సమస్త భావములు ,నీయందే సమర్పించు ,నీ –వ్రేలం దక్కని పాదరేనువులపై ,వేస్టించినం జాలదే ‘
గోపికలు శ్రీకృష్ణుని మానసిక అర్చన చేశారు .అందుకే విశిష్టమైన అర్చకులయారు .శ్రీ కృష్ణ భావాన్ని హృద్గతం చేసుకొన్నారు .జారిపోకుండా పదిల పర్చుకొన్నారు .పులకించిన మేనులతో కౌగలించు కొన్నారు .అయితే ఇదంతా ,”యోగి ”లాగా చేశారు .కనుక వారికి వేరే భావం ఏమీ లేదు .ఏ తప్పు లేదు .సర్వ సమర్పణ తో చేశారు .దానికి అంత మహిమ వుంది .దేహ భ్రాంతి వీడి ,,బ్రహ్మ భావం నిండి ,ముక్తి కాంతా పరిష్వంగ సుఖం పొందటం  చూపిస్తాడు .అదీ ఉత్కృష్ట భక్తి అంటే .
  ”ఒక్క లతాంగి  మాధవుని ,యుజ్వల రూపము జూడ్కి ,తీగలం –జిక్కగా బట్టి ,హృద్గతము జేసి ,వెలిం జనకుండ ,నేత్రముల్
   గ్రక్కున మూసి ,మేన బులకంబులు గ్రమ్మగా ,గౌగాలించియున్ –జోక్కములైన ,లోచవుల జొక్కుచు ”యోగి ”కైవడిన్ ”
  ఇంతగా అల్లుకు పోతున్నా ,వారికి తాను   ప్రత్య్పకారం ఏమీ చేయలేని వాడినని కృష్ణుని సమాధానం .దానికి కారణం గోపికలు దోషరహితం గా ,నిరంతరం గా తనను  అర్చ్చిన్చటమే .బ్రహ్మాదులు ,మునులు ,గోపికలకు నమస్కరించి జేజేలు పలికారు .ఇది భక్తికి పరాకాష్ట .అందుకే నారద మహర్షి ఎక్కడ భక్తి విషయం వచ్చినా ,”యధా వ్రజ గోపికాయాం ”అని ఉదాహరిస్తూంటాడు .
  ”పాయని గేహ శృంఖలముల బాసి ,నిరంతర మత్చరత్వముమ్ –జేయుచునున్న ,మీకు బ్రతి సేయ ,యుగంబులనైన నెర ,నన్ —
  బాయక గోల్చుమానసము ,బ్రత్యుపకారముగా దలంచి ,నా –పాయుట తప్పుగా గొనక ,భామినులార ,కృపన్ ,శమిమ్పరే ”
మనసులో ఎప్పుడు భావించటమే తాను ఇచ్చే ప్రత్యుపకారం అట .ఎంత నంగనాచిత్వామో చూశారా కన్నయ్యది ?అయినా గోపికలకు కావాల్సింది ఇంకేముంది ?
  మురళీ గానాన్ని విని ,పరవశాలై వచ్చిన gopikalanu  ఇళ్ళకు మరలి పొమ్మని కోరాడు కొంటె కృష్ణుడు .వాళ్ళు చల్లగా ,చక్కని సమాధానం చెప్పారు .పద్మ గంధాన్ని మెచ్చే తుమ్మెద ఇతర పుష్ప గంధాన్ని కోరాదని ,తమ తపస్సు ఫలితం గా తనను చేరామని ,అందర్నీ వదిలి వచ్చామని ,తమది సర్వ సమర్పనమేనని ,తమకు ఇంక ఏ ఆలోచనా లేదని ,దీనం గా ప్రాధేయ పడ్డారు .భగవద్రతి తప్ప ఇంక ఏ కోరికా వారికి లేదు .
”సిరికి నుదార చిహ్నములు సేయు ,భవత్క్చరనారవిన్దముల్ –సరసిజ నేత్ర ,మా తపము ,సంపద జేరితి ,,మేట్టకేలకున్
మరలగ లేము ,మా మగల మాటున నొల్లము ,పద్మగంధముల్ –మరగిన తేటులన్య కుసుమంబులకుం,జన నిచ్చగించునే ‘
ఆ దీనాలపాలకు కరిగి పోయాడు వెన్న తిన్న మనసున్న కన్నయ్య .అందర్నీ సంతృప్తి పరిచాడు .ఆత్మారాముడై ,రమించి ,వారి కోర్కెలకు సఫలత్వం చేకూర్చాడు .సర్వం సమర్పించి గోపికలు ”యోగి బృందార వంద్యులు ”అయారు .కాత్యాయినీ వ్రత దీక్ష లో వారి కోరికా విలక్షణం గానే కని పిస్తుంది .”వో తల్లీ !మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ ,నేతి వసంతములాడుచు ,జాతర చేసెదము ,భక్తి చాతురి తోడన్ ”అన్నారు .కాదు అనిపించాడు భక్త పోతన .వ్యాస భాగవతం లో”శ్రీ కృష్ణుని పతిగా ”చేయమని కోరినట్లు రాశారు పోతనాచార్యుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి హృదయాధి నాదునిగా చేయమని ప్రార్ధించటం ఆయన హృదయ వేదిత్వం అని రసజ్ఞులు ,విశ్లేషకులు భావించారు .
             శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల తో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -08 -11 .

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ కృష్ణ తత్త్వం

    శ్రీ కృష్ణ తత్త్వం
               శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు .రేపు అంటే సోమ వారం కృష్ణాష్టమి అవటం మన అదృష్టం .ఆ రోజుల్లో అష్టమి తిది తో పాటు రోహిణీ నక్షత్రం కూడా కలిస్తే మహామహిమ గల పర్వ దినం అవుతుంది .శ్రీ వైష్ణవులకుభాద్రపద కృష్ణ పక్షం లో,అష్టమి ,నవమి తో కలిస్తే కృష్ణాష్టమి .రోహిణీ నక్షత్రం కలిస్తే కలియుగ వైకున్తమే నని పద్మ పురాణం లో వుంది .
         శ్రీ కృష్ణ తత్త్వం శ్రీమద్భాగవతం లో వ్యాసుల వారు చక్కగా ఆవిష్కరించారు .బ్రహ్మ దేవుడు ఒకప్పుడు ”సృష్టి ఎలా చేయాలి ”అనే సందిగ్ధం లో పడ్డాడు ”.తప ,తప ”అని అశరీర వాణి విన్పించింది .తపస్సు చేశాడు .పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు .ఆత్మ తత్వాన్ని బోధించమని కోరాడు .శ్రీ హయగ్రీవ రూపం దాల్చి నాలుగు శ్లోకాలతో తత్వోపదేశం చేశాడు .అదే భాగవతం .దీనినే ”హయగ్రీవ బ్రహ్మ  విద్య ”అంటారు .దీని విస్తరణ ,సారాంశమే భాగవత స్వరూపం .భాగవత తత్త్వం లో వేదాంతుల మాయా సిద్ధాంతం ,సాన్ఖ్యుల ప్రకృతి సిద్ధాంతం ,శైవుల శాక్తేయం ,మీమాంసకుల కర్మ మొదలైన వన్నీ భగవంతుని దివ్య లీలలలో సమన్వయ పరచటం జరిగిందిఅని పాశ్చాత్య పండితులు  అభిప్రాయ   పడ్డారు . శ్రీమద్భాగవతం భగవంతుని వాజ్మయ అవతారం  అన్నారు శ్రీ రామ కృష్ణ పరమహంస .నారదీయం లో సకల వెద సారం వుంది అని ప్రముఖుల అభిప్రాయం .భగవత్ స్వరూప మైన ఈ ప్రపంచ సృష్టి రూపాన్ని వివరించేది ,అంటే భక్తుల ను గూర్చి వివరించేది భాగవతం అని విజ్ఞుల భావన .
           శ్రీ కృష్ణుడు బ్రహ్మం యొక ఆనంద స్వరూపం .ఆయన లీల,మధురిమ వల్ల సృష్టి అంతా జరిగింది అని శ్రీ అరవిందుల అభిప్రాయం ”.నిత్య సత్యానంత అమర లీలయే ఆయన .వేణు గానం   లో మానవుని లోని అజ్ఞాన మాయమైన క్రీదారూపాన్ని మార్చి ,దానిలో తన స్వీయ దివ్య ఆనందం యొక్క లీలా విలాసాన్ని నింపుతాడు .రాధ ,భగవంతుని విశుద్ధ ప్రేమ యొక్క మూర్తీ భావం .అదిసంపూర్ణం,సమగ్రం    .–ఆత్మ ప్రదానానికి ,సంపూర్ణ నివేదనకు సంకేతం”అంటారు శ్రీ అరవిందులు .
   ” గోపా ”అంటే  ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పాలించే వారు ”అని వారి భాషణం .వారిలో ఆధ్యాత్మిక అనుభవం వుంది .ప్రేమ ,భక్తి ,ఆత్మదానం గల అసాధారణ జీవులుగా భావిస్తారు గోపికలను .గోలోకం లో ప్రేమ ,సౌందర్యం,ఆనందం గల దివ్య ప్రపంచం ఆధ్యాత్మిక ప్రభలతో వెలుగుతుంది .గోపి ,గోప రూపాలైన ఆత్మలు ఆ ప్రభలను కాపాడుతాయి .రాధ ప్రాకృతిక ఆత్మ .కృష్ణుడు భగవదాత్మ .
         ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి విష్ణు లోకానికి వెళ్లి ఆయన తోడ పై కూర్చోవాలని కోరిక తెలిపింది .”నువ్వు భూలోకానికి వెళ్ళు .నేను కృష్ణుడు గా పుట్టి నీ కోరిక తీరుస్తాను .’అని చెప్పాడు .వ్రజ భూమి లో వ్రుషభానునికి ,కళావతి కి రాధ జన్మించింది .కృష్ణునికి ఆమె మేనత్త .కృష్ణుడు గో లోకం లో వున్నప్పుడు ”రాసము నుండి,ఆతనిప్రక్కనుండి ,పరిగెత్తింది ”అంటే ”రాసంబు నుండి పుట్టి హరి ఎదుట ధావనము చేసింది ”కనుక రాధ అయింది .రాధ శరీర రోమ కూపాలనుండి గోపికలు జన్మించారు .కృష్ణుడు అంటే సర్వం చేశే వాడు ,చిత్తాన్ని ఆకర్షించే వాడు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .కృష్ణ వర్ణం” నీలం ”.సముద్రం ,ఆకాశం అనంతమైన నీల వర్ణం కలవి .అనతత్వానికి ప్రతీకయే నీల వర్ణం .వజ్రనీలం ఆతని తేజస్సు .
        అవతారం పరిణామానికి   ప్రతీక గా శ్రీ అరవిందులు  భాష్యం చెప్పారు .జలం లో మాత్రమే సంచరించేది మత్యావతారం .ఉభాయచరం కూర్మావ తారం .భూచరం వరాహావతారం .పశు మానవ కలయికే నారశింహ అవతారం   .పొట్టి మొదటి  మానవుడే వామనావ తారం .అది భౌతికత ,లోపలి భగవత్ తత్త్వం వుండటం తో ప్రపంచాన్ని ఆక్రమిన్చేవాడు  .రాజసిక .ర్రజషిక రూపం పరశు రాముడు .సాత్విక రూపమే శ్రీ రాముడు .శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక వికాసం యొక్క చివరి రూపం ”.సూపెర్ మైండ్” అంటే శ్రీ కృష్ణుడే .బుద్ధుడు నిర్వాణం ,విమోచనం కల్పిస్తాడు .ఉత్కృష్ట రాజ్యాన్ని   భూమి పైకి తెచ్చి ,ప్రతిఘటించే వారిని సంహరించి ,లోపాల్ని సరిదిద్దే వాడే కల్కి అవతారం .ఈ విధం గా ఊర్ధ్వ క్రమం లో క్రమ పరిణామ దశలు కన్పిస్తాయి .శ్రీ క ఆనంద మయుడై  ,ఆనంద దిశ గా నడిపే వాడే శ్రీ కృష్ణుడు  .
”ఓం సచ్చిదానంద రూపాయ -క్రిష్ణాయాక్లిష్ట  కర్మనే  –నమో వేదాంత వేద్యాయ-గురవే బుద్ధి సాక్షినే  ”
                       మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -08 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు రచయతల మహా సభల దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సాహితీమండలి ఉయ్యూరు – 258 ఆహ్వాననం

Sahithimandali 258 110821

Posted in సభలు సమావేశాలు | Leave a comment

జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–“దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

        జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి
                 దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది .దిశా నిర్దేశం చేయ లేని ప్రధాని ,నిమ్మకు నీరెత్తి నట్లు మౌనమే నీ భాష వో చిన్ని మనసా అనుకుంటూ ,నీరో చక్ర వర్తి లా జేబుల్లో చేతులు పెట్టు కోని పాపం జపం చేసు కొంటు ,నీతిని చూడను మంచిని వినను  మాట్లాడను అని భీష్మించు కోని కూర్చొంటే ,అవినీతి చక్ర వర్తులు అందలం ఎక్కి సందడి చేస్తూ ,కలకలం సృస్తిస్తున్నా కిమిన్నాస్తి గా వున్న ఈ దేశం నిజం గా మునుగు తున్న పడవే .ఆ నాటి లోక నాయక జయ ప్రకాష్ నారాయణ్ ఏ స్ఫూర్తి తో దేశాన్ని మేలు కొలిపి జనతా ప్రభుత్వం ఎర్పరచాటానికి కారణమయారో అలాంటి పరిస్తి తే మన ముందుంది .పూజ్య అన్నా హజారే దేశ ప్రజల గుండె తలుపులు తట్టి జాగృతం చేస్తున్నారు .ఇక అది బధిర శంఖారావం కాకూడదు .సమయం వచ్చేశింది .జాతి జనులంతా సమైక్యం అవాలి .ఇక్కడ పార్టీ భేదాలు పక్కన పెట్టండి .అభిప్రాయ భేదాలు విడనాడండి .అన్ని పార్టీలు దాదాపు ఒకే వేదిక పైకి చేరటం ఒక శుభ సందర్భం .దీన్ని చారిత్రాత్మక సన్ని వేశం గా భావించండి .ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఆసన్న మయ్యాయి .దేశాన్ని మళ్ళీ ఆ చీకటి రోజుల్లో కి నేట్టకండి .అయితే కిం కర్తవ్యం ?
              దేశం లో ఇప్పుడు అవినీతికి ,ఆశ్రిత పక్ష పాతానికి దూరం గా ఉంటూ ,సమర్ధుడు గా పేరు పొంది  ,దార్శనికుని గా గణత కెక్కిన, వివాద రహితుడైన బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను  ప్రధాన మంత్రి ని చేయ టానికీ ,ఆయన నేతృత్వం లో ప్రజా స్వామ్య జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయ టానికి బి;జే.పీ .,వామ పక్షాలు , తెలుగు దేశం ఇతర ప్రజాస్వామ్య పార్టీలు అన్నా ది .ఏం .కే .,మొదలైన ప్రతి పఖాలన్ని ఏక తాటి పై నిలిచి ,ఆయనకు మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలి .ఆలశిస్తే కాలమ్ క్షమించదు .చరిత్ర సహించదు .నితీష్ కుమార్ నాకేమీ బంధువు కాదు ,ఆత్మీయుడు కాదు ,మచ్చ లేని నాయకుడు అనే నేను ఈ సూచన చేశా .అన్నా వెనక వుండి ఆ నాటి జయ ప్రకాష్ లా నైతికబలం   ఇస్తారు .ప్రభుత్వాన్ని నడపాల్సింది ఇలాంటి సమర్దులే .
          ఇక మన రాష్ట్రం లో” జగన్మాయ ”దృష్టాంతాలు ,వృత్తాంతాలు రోజూ paper లలో మీడియా లో చూసి కంగారు పడకండి .ఇదంతా ఒక సేన్సషణ్ .ఆ తర్వాత పవిత్ర జలం చల్లి అగ్ని పునీతుడిని చేసి పార్టీ పగ్గాలు అప్ప గిస్తారు .కనుక దీనికే చంకలు గుద్దు కో నక్కర్లేదు .ఆనాడు సుఖరాం ,రాంలాల్ ,చెన్నా రెడ్డి ,భజన్ లాల్ లను అక్కున చేర్చి నట్లే మళ్ళీ అతనికి అందలం అందిస్తారు .అతని శక్తి సామర్ధ్యాలు ,సామ్రాజ్య విస్తరణ తెలిసిన వారెవ్వరూ దూరం చేసు కో లేరు .ఇదో విష సంస్కృతి .మళ్ళీ ఆ గూటికి చేరాల్సిందే .చేర్చు కోవాల్సిందే .ఇది తాత్కాలిక ఎడబాటు .దీన్ని భూతద్దం లో చూడద్దు .దీన్ని తగిన వారెవరో చూసుకొంటారు
             మనం విశాల దృక్పధం తో ఆలోచిద్దాం .అన్న కు మద్దతు అంటే ఒట్టి మాటలు కాదు .సమర్ధమైన నీతి వంతమైన ,నిజమైన పరిపాలనను అందించటమే .వో నా దేశ ప్రజలారా ,రాజకీయ పార్టీ ప్రముఖు లారా రండి ,కలవండి ఏకం కండి .సమర్దవంత మైన జాతీయ ప్రాభుత్వాన్ని ఏర్పరచి భారత మాత కన్నీరు తుడవండి ,ప్రజల బాగోగులను పట్టించుకోండి .ఇక అలసత్వం వహిస్తే ప్రజా చైతన్యం ముందు మీరు తల వంచుకొని నిల బడాల్సి వస్తుంది జాగ్రత్త . ,
                                     గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -08 -11 .
Posted in రాజకీయం | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు –సమీక్క్ష —-7

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు  –సమీక్క్ష —-7
               ముగింపు సభకు ముందు జరిగిన సభలో స్టూడియో యెన్ .అధికారి శ్రీ సాంబశివ రావు–బిడ్డలు తెలుగు తల్లిని కాపాడు కొంటాం అని ఓదార్చే దయనీయ స్థితి రావటం శోచనీయం అన్నారు .ఇప్పుడుమనం ”బాధా ప్రయుక్త రాష్ట్రం ”లో వున్నాం.యాస భూషణమే నన్నారు ..ఒడిస్స లోని బరంపురం లో ఇటీవల తెలుగు మహాసభలను దిగ్విజం గా నిర్వహించిన శ్రీ పూడి పెద్ది సత్య నారాయణ -తమ రాష్ట్రం లో సమస్యల్ని తామే పరిష్కరించు కొంటున్నామని ,తెలియ జేశారు .గుంటూరు కు చెందిన శ్రీ పాపి రెడ్డి తమ అనుభవాలను వివరించారు .జర్నలిజం కళాశాల అధినేత ప్రముఖ పాత్రికేయులు శ్రీ సతీష్ చంద్ర తమ ప్రసంగం లో తెలుగు వారు తెలుగు తక్కువ వారు గా వుండటం బాధాకరం.భాష ఉత్పత్తి సంబంధాల మీద వృద్ధి చెందుతుంది .ఆలోచనా మాధ్యమం ఆంగ్లం గా వుంటే అసలైన తెలుగు రాదు .భాష ప్రజాస్వామీకరణ చెందాలి .గిడుగు రామ మూర్తి గారి తర్వాత భాషోద్యమం చేబట్టిన వారు లేక పోవటం విచారకరం .పామర జనులు వాడే పదాలను పత్రికలను స్వీకరించాలి అప్పుడే భాష పరిపుష్టం అవుతుందని  సలహానిచ్చారు .సారం నుంచి భాష రూపం లోకి వస్తుంది .ఉద్యమాలు భాషనూ శాశిస్తాయి .తెలుగు తల్లి నడకను ఆపవద్దు అని కోరారు .అన్ని వర్గాల ప్రజలు మాట్లాడే పదాలు భాషలో చేర్చాలని సూచించారు .ప్రముఖ సిని విశ్లేషకులు శ్రీ పైడి పాల మాటాడుతూ తెలుగు సినిమా భాష ,మాట ,పాట ,పేర్లు తెలుగును భ్రస్టు పట్టిస్తున్నాయని ఆవేదన చెందారు .మేలు కంటే కీడు ఎక్కువ జరుగు తోంది .పాటల్లో ,మాటల్లో ఆశ్లీలాలు చోటు చేసుకోవటం హర్షణీయం కాదు .జాగ్రత్త పడక పొతే భాష తీవ్రమైన నష్టానికి   లోను అవుతుందని హెచ్చరించారు .
                                          ముగింపు సభ
         ముగింపు సభకు శ్రీ పూర్ణచంద్ అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు .శ్రీ బుద్ధ ప్రసాద్ సభలో చేసిన తీర్మానలనుప్రవేశ పెట్టి చదివి విని పించారు .తెలుగు జాతి పునరుజ్జీవనం అట్టడుగు స్థానం నుంచి చేబట్టాలి .తెలుగు భాషా ,సంస్కృతి సభలు జరపాలి .తెలుగు లోనే అందరు మాట్లాడాలి,మాట్లాడించాలి .ప్రభుత్వం పై ప్రేరణాత్మక మైన ఒత్తిడి తేవాలి .తెలుగును కించ పరిచే వారిని తీవ్రం గా వ్యతి రేకించాలి .ప్రపంచం లోని వివిధ భాషల రచయితల కొస ”ప్రపంచ రచయితల సంఘం”ఏర్పరచాలి .వచ్చే నందన నామ సంవత్చారాన్ని ”తెలుగు భాషా సంవత్చరం ”గ ప్రకటించాలి .తెలుగును పాలనా భాష గా చేయాలి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాదేమిని ,అధికారభాషా సంఘాన్ని పునరుద్ధరించాలి .తెలుగు లో చదివిన వారికి ప్రోత్చాహకాలు అందించాలి .తెలుగు కు మంత్రిత్వ శాఖ ప్రత్యేకం గా వుండాలి .ఈ తీర్మానాలను సభ ఏకగ్రీవం గా కరతాళ ధ్వనులతో ఆమోదించింది .ఇవన్నీ నిర్దిష్ట కాల పరిమితి లో జరగాలని అందరు కోరారు .
         అనుకోని అతిధి గా విచ్చేసిన లోక్ సత్తా అధినేత ,శాసన సభ్యులు శ్రీ జయ ప్రకాష్ నారాయణ -భాషను సజీవం గా ఉంచే ప్రయత్నం చేయాలి ,ఇరవై రెండు భాషల సమాఖ్య గా భారత దేశం ఇన్నేళ్ళుగా ఒకటిగా నిలిచి వుండటం గర్వ కారణం అన్నారు .తల్లిభాష వల్లనే బిడ్డ మేధస్సు వికశిస్తుంది .దీన్ని ప్రచారం చేసి అందర్నీ ఒప్పించాలి .భాషా  పరిణామ రావాలి .మారుతున్న అవసరాలకు తగినట్లు భాష మారాలి .కన్యాశుల్కం అజరామరం కావ టానికి కారణం సజీవ భాషా ప్రయోగమే నని గుర్తు చేశారు .
     హెచ్.ఏం.టి వి .అధినేత కే.రామచంద్ర మూర్తి –జిల్లా పత్రికలలో మాండలీకం బాగా వాడుతున్నారని ,ఇది శుభసూచకం అన్నారు .తెలుగు ,ఆంగ్లం ,అంతర్జాల భాషా  ఈ మూడూ అవసరమే నని చెప్పారు .భాషా విస్తరణకు పర్యవేక్షణ వుండాలని సూచించారు .సాక్షి పత్రిక సంపాదకులు శ్రీ కల్లూరి భాస్కరం –కొత్త పదాలకు ప్రామాణికత సాధించాలని అన్నారు .ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు –నూతన శకానికి ఈ సభలు దోహదం చేశాయి అని మెచ్చుకొన్నారు .పద్మశ్రీ తుర్లపాటి కుటుంబ రావు -భాషను ,సంస్కృతినివిచ్చిన్నం   చేసే విధానం మంచిది కాదన్నారు .శ్రీ యలమంచిలి శివాజీ -అన్ని ప్రాంతాల రచయితలు ఒక చోట చేరిభాషను  గురించి ఆలోచించటం మంచి సంప్రదాయం”.క్రాప్ హాలిడే ”అనే పదం మన రాష్ట్రం లో సంచలనం సృస్తిన్చాతమే కాదు ,ఆంగ్ల భాషలోచేరిందని తెలిపారు   .
  ఎమెస్కో అధినేత శ్రీ విజయ కుమార్ -సార్వ జనీన రచనలు చేయమని రచయితలకు హితవు పలికారు .”తూర్పున వెలుగు రేకలున్న కాలమ్ లోపశ్చిమాన చీకటి  వుంది ”అన్న జర్మన్ రచయిత మాట మరువ రాదు అని గుర్తు చేశారు .ప్రముఖ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర నాద్ చౌదరి మాట్లాడుతూ భాష సాంఘిక అవసరం అన్నారు మాత్రు భాషే . .   అభివృద్ధి కి సోపానం   .ప్రభుత్వం కాదు ,ప్రజలే భాషను నిలబెట్ట గలరు  .భాషలో కొత్త పదాలు చేరటం తప్పదు . పాశ్చాత్య అనుకరణ   మంచిది కాదు .ఈ దేశ సంస్కృతిని నిలబెట్టుకోవాలి .జీవించటం ,తర్కించటం లో స్వేచ్చ అవసరం అని  అన్నారు .శాసన మండలి సభ్యలు శ్రీ చిగురు పాటి వర ప్రసాద్ –ఇటీవలి కాలమ్ లో భేదాలు లేని రాష్ట్ర స్థాయి సమావేశామీ సభలే అవటం ఆదర్శ వంతం గా వుంది అని హర్హాన్ని ప్రకటించారు .ఓడిస్సా రచయిత్రి పద్మశ్రీ ప్రతిభారాయ్ భాషను వాడక పొతే ప్రమాదం అని హెచ్చరించారు .
         ముగింపు సభకు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంద్ర ప్రదేశ్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్   శ్రీగ్రంధి  భవానీ ప్రసాద్ తమ సందేశం లో తెలుగు తనం అన్నిటా వర్దిల్లాల్ని ,భాషను తక్కువ చేసి మాట్లాడ రాదనీ ,తెలుగు చిరంజీవి అవటం తధ్యం అనీ ,సంక్షోభాలను నివారించేది భాషేనని ,ఇక్కడి ఈ స్పందన ప్రపంచాన్ని కదిలిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు .సామాన్యుని కోసం రచనలు చేయమని సూచించారు .సమస్యలను ప్రతిబింబించే రచనలు రావాలని ,తెలుగు అజరామర మైన భాష అని ఆశావహం గా తమ ప్రసంగాన్ని ముగించారు .
   మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం అధిపతి శ్రీ ప్రభాకర్ -భాషాభి వృద్ధి ఒక పధకం గా ప్రభుత్వం చే బట్టాలి  అని  కోరారు .శ్రీ గోళ్ళ నారాయణ రావు -అక్షర రధం క్షేమంగా గమ్యస్థానం చేరుతుందని,కొత్త తెలుగు పలుకుబడులతో తెలుగు పరి పుష్టం అవుతుందని ఆశించారు .శ్రీ రసమయి రామా రావు -సదస్సున్ను జయప్రదం చేసిన అందరకు కృతజ్ఞతలు తెలియ జేశారు .ఇంతమంది ప్రముఖులు వేదిక నలంకరించి సుసంపన్నం చేసి నందుకు కార్యవర్గం కృతజ్ఞతలు తెలియ జేసింది
   కార్య వర్గ సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదు గా జ్ఞాపికలు ,తెలుగు పున్నమి పుస్తకాన్ని అందించి ,శాలువాలతో సత్కరించారు .వాలన్తీర్లందరికి జ్ఞాపికలు అందజేసి ,వారి సేవలను ప్రస్తుతించారు .
   మూడు రోజుల పాటు తెలుగు భాషా యజ్ఞం గా ,తెలుగింటి పెళ్లి వేడుక గా ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు దిగ్విజమయాయి .నిబద్ధత ,సమయ పాలన విస్తృతమైన ఏర్పాట్లు చేసి క్రుతక్రుత్యులయారు .సర్వశ్రీ గుత్తికొండ సుబ్బా రావు ,జి.వి .పూర్ణచంద్ ,మండలి బుద్ధప్రసాద్ ,యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లు సభలను విజయవంతం గా ఆశావహం గా నిర్వహించి నందుకు అందరి ప్రశంశలను అందుకొన్నారు .తెలుగు భాష చిరంజీవి అవుతుందని ,విశ్వ భాష గ వర్ధిల్లుతుందని ,విశ్వ వ్యాప్తం అవుతుందని ఈ సభలు పూర్తి ఆశాభావంను  అందరి లోను కల్గించాయి
          ఈ మూడు రోజులు సాయంత్రం వేళల్లో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం లో సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వహించి కళా సరస్వతికి నీరానాలన్దించారు .శ్రీ గరిక పాటి నరసింహారావు గారి అష్టావధానం ,తెలుగు ప్రశస్తి నృత్య రూపకం ,ఆచంట బాలాజీ నాయుడు గారిమయసభ ,శ్రీ చందు భాస్కర రావు గారి హరికధా ,”తెలుగు భాష నాడు ,నేడు నృత్య రూపకం ,శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి గారి ”ఆంద్ర  ‘   పద్య కవితా వైభవం” ,శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారి ”దేశ భక్త ”ఏక పాత్రాభినయం ,పానుగంటి వారి ”స్వభాష ”ప్రహసనం ”జయహో కృష్ణ దేవ రాయ ”నృత్య రూపకం,శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారి ”వేమన ”పద్య నాటకం ప్రేక్షకులను మధురానుభూతిని కల్గించి చిరస్మరణీయం చేశాయి .

 

Posted in సభలు సమావేశాలు | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6
          కంప్యుటర్ లింగ్విస్ట్ కు జీవితాని అంకితం చేసి పని చేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు -భాషకు సామర్ధ్యం జోడించాలి .అని రంగాల్లో తెలుగుని వాడాలి అప్పుడే మనగలుగుతుంది మనది అవుతుంది పాలిసి మేటర్ గా తెలుగును అన్నిటా ఉపయోగించాలి .దీనికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి .ఏ లిపి లోనైనా తెల్గు చదువుకొనే ఆలోచనా చేశాం .ఇదే ”విశ్వ సంకేత మాలిక ”.తెలుగు పడ విశ్లేషిని  ఏర్పాటయింది .సంక్లిష్ట రూపం లో వున్న తెలుగును సరళ తరం చేస్తున్నాం .ఈ ఏర్పాటు ఏ భారతీయ భాషకు లేదు .”తెలుగు పడ జనకం”తయారు చేశాం .తెలుగు రాణి వాళ్ళు కూడా తెలుగు పదం సృష్టించుకో వచ్చు .”తెలుగు పదవిభాగ నిధి ”తయారు చేశాం .రెండు లక్షల పదాలు ఇందులో వున్నాయి .ఇది పడ విశ్ల్షణ చేసే విధానం .”పడ సత్వ నిరోపనం ”వచ్చింది .సంధి విచ్చేదకం ,బహుభాషా నిఘంటువు లు తెచ్చాం.తెలుగు పర్యాయ పడ కోశం చేశాం .వీటి అన్నిటి ద్వారా యంత్రానువాదం చేయటానికి మార్గం తేలికయినది .దీనిపై ఇంకా కృషి చేస్తే పరిపూర్ణత సాధించ వచ్చు .పాణినీయం ఆధారం గానే అన్నీ జరుగుతున్నాయని హర్శధ్వానాలమధ్య తెలియ జేశారు .కంప్యుటర్ శక్తి అనంతం అన్నారు .బాలవ్యాకరనానికి అది వ్యాకరణం సృస్తిన్చాము అని ఇది ఒక అపూర్వ ప్రయోగం విప్లవం అన్నారు .ఉమమహేశావర రావు గారి ఉపన్యాసం ఆసాంతం ఆ కట్టు కొంది .పులకించిన ప్రతి నిధులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలియ జేయటం ఆ మహానుభావుని విజ్ఞానానికి ఘనమైన అభినందనం .
          ప్రసిద్ధ పండితులు కవి ,రచయితఆచార్య శలాక రఘునాధ శర్మ -తెలుగు భాష లో మనము ,అమ్మ అనే రెండు పదాలు వుండటం అదృష్టం .అమ్మ అనే మాటలో సర్వ వాజ్మయం నిక్షిప్తమై వుంది అని గొప్ప భావాన్ని అందించారు .శ్రీ కాలనాధభట్ట వ్వీర భద్ర శాస్త్రి కాగితం వాడకం తగ్గి కంప్యుటర్ వాడకం హెచ్చటం గొప్ప మార్పు అని అభిప్రాయ పడ్డారు .64 కళలు .కాం సంపాదకులు శ్రీ పాలెపు కళాసాగర్ -తాము లలిత ,చిత్రకళలు ,నాటకం పైన మంచి సంచికలు తెచ్చామని ,చెప్పారు .రమణీయ ఫాంటు సృష్టి కర్త
శ్రీ అంబరీష ఉచితంగా తమ ఫాంటును ఆదిత్య ఫాంట్.కాం ద్వారా ప్న్దవచ్చునని తెలియ జేశారు .తన మేనమామ ప్రముఖ కవి విమర్శకులు స్వర్గీయ మిరియాల రామ కృష గారి ”ఇంచక్కటి తెలుగు వదలి -ఇంకో భాష ఎందుకురా –భలే తెలుగు బంగారం లాంటి తెలుగు ”కవితను చదివి ఉత్తేజితులను చేశారు .
           సభా సమన్వయ కర్త శ్రీ కూచిభొట్ల ఆనంద్ చక్కని సమన్వయము చేసి అమ్రుతానందాన్ని పంచారు .తెలుగు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు .తెలుగు విశ్వ వ్యాప్తమై ,అంతర్జాలం తో అందర్నీ చేరి ,ప్రపంచం లోనే మొదటి స్థానం పొందుతుందని తెలుగు భాష చిరంజీవి అని ,విశ్వ భాష గ త్వరలోనే గుర్తింపు తెచ్చుకొంటుందనీ ఆశాభావం తో అందరి కరతాళ ధ్వనులు అందుకొన్నారు .సభలో ప్రతిస్పందనను తెలియ జేయమని కోరారు ”.ఈ సదస్సు అర్ధవంతమైన ,ప్రయోజన కరమైన ,ప్రయోగాత్మకమైన ప్రామాణిక మైనసదస్సు అనీ ఈ తరం వారికీ భవిష్యత్ తరాల వారికి అత్యంత అవసరమైన సభ అనీ ఇందులోపాల్గొన్న  యువ సాంకేతిక నిపుణులు అభినందనీయులని తెలుగు చిరంజీవి అనే నమ్మకం కలిగించినందుకు అందరికి అభినందనలు”అని గబ్బిట దుర్గా ప్రసాద్ తమ ప్రతిస్పందన తెలియ జేయ గానే అందరూ ఆమోదం తెలిపారు .
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5

                                 ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5
           65 వ భారత స్వాతంత్ర్య దినోతవంసందర్భం గా 15 -08 -11 సోమవారం ఉదయం ఎస్.వి .ఎస్.కళ్యాణ మండప ప్రాంగణం లో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ జరిపారు .ఆ తర్వాత ”మా కొద్దీ తెల్ల దొరతనం ”అని జాతీయ స్ఫూర్తిని కలిగించిన తొలి జాతీయ కవి స్వర్గీయ ”గరిమెళ్ళ సత్యనారాయణ వేదిక ”పై   స్వాతంత్ర్య దినోత్చవ సభ  వైభవం గా జరిగింది .మూడవ రోజూ ,ఆఖరి రోజూ అయిన ఈ రోజూ ”జాతీయతా భావం -రచయితల పాత్ర ”అనే అంశం పై సభ జరిగి జాతీయ స్ఫూర్తిని కలిగించింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించినిర్వహించారు .అధ్యక్షోపన్యాసం లో రచయితల సభలు స్వాతంత్ర్య దినోత్చావం నాడు ముగియటం చారిత్రాత్మక మైన సన్ని వేశం అన్నారు   .వందే మాతరం తో పాటు జాతీయ గీతాలను శ్రీమతి భూదేవి శ్రావ్యం  గా ఆలాపించి దేశభక్తిని కలిగించారు .కొందరు కవులు ,గాయకులూ ప్రబోధ గీతాలను పాడిఉత్తేజం   కల్గించారు .  తమ అభిభాషణం లో శ్రీ బుద్ధ ప్రసాద్ -మహామహుల త్యాగ ఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నా స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు .ఆ తరం లోని కవులు గరిమెళ్ళ ,చిలకమర్తి ,గురజాడ ,రాయప్రోలు ,దామరాజు పుండరీకాక్షుడు తమ గీతాలతో జాతీయ చైతన్యం కల్గించారు .ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ప్రజల్ని జాతీయ ఉద్యమం వైపు నడిపాయి .మన తాలి రాజకీయ ఖైది గాడిచర్ల హరి సర్వోత్తమ రావు అని జ్ఞాపకం చేశారు .శ్రీ అరవిందుల జన్మ దినం నాడు స్వాతంత్ర్యం రావటం ఆనంద దాయకం .భారతీయ స్వాతంత్ర్య పోరాటం లో తెలుగు వారి పాత్ర గణనీయం .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారు తెలుగు వారు అవటం మనకు గర్వ కారణం .ఆ నాటి ఉద్యమ ధ్యేయం మాతృభాష లో విద్యా బోధన .ఇప్పటికీ ఆ కోరిక తీరక పోవటం దురదృష్టం .మొదటి ప్రధాని నెహ్రు సాహిత్య వ్యాప్తికి అకాడెమీలు స్థాపించి తన దార్శనికతను నిరూపించారు .ఇవాళ అవన్నీ  అంతరించాయి .వాటి పునరుద్ధరణ తక్షణ కర్తవ్యమ్ .సంస్కృతీ సంపదను పరి రక్షించు కోవాలి .సమాజాన్ని సమైక్య పరచాలి అన్న అ నాటి నాయకుల ,పాలకుల దూర దృష్టి ని  ఇప్పటి వారు అలవరచు కోవాలి .రచయితలు విశ్వ జనీన దృక్పధం తో రచనలు చేయాలని ,విశ్వ శ్రేయస్సే ధ్యేయం కావాలని ఉద్వేగం గా ఉత్తేజం గా తమ ప్రసంగాన్ని ముగించి స్వాతంత్ర్య దినోత్చవ వేడుక రోజున గొప్ప స్ఫూర్తి కల్గించారు
         ప్రముఖ హిందీ రచయిత్రి,సంఘ సేవకురాలు  శ్రీమతి ప్రతిభా రాయ్ -మనభాశాలను ,సంస్కృతినీ కాపాడుకొనే కొత్త ఉదయం నడుస్తూందని చెప్పారు .భాషలన్నిటిని గౌరవించాలి .మాతృభాషను మరువ రాదు అని ఉద్బోధించారు ..ప్రసిద్ధ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర naadh చౌదరి –స్వాతంత్ర్యం అంటే సాంఘికం గా అభి వృద్ధి  చెందటమే . సాంఘిక స్వేచ్చ ,రాజకీయ స్వేచ్చ తో jatha కలవాలి .యువతరం మన ఆశా దీపం .వారిని మరిచి పోరాడు .తెలుగు రచయితలు చాల మండి తనకు తెలుసుననీ వారంతా గొప్ప జాతెయ భావం కలిగించారని గుర్తు చేశారు .కలకత్తా కు చెందిన ప్రముఖ సంస్కృత ఆచార్యులు శ్రీమతి ఉషా చౌదరి -తనకు ఈ సభలు చూస్తుంటే తెలుగు నేర్చుకోవాలని అనిపిస్తోందని,తెలుగు గొప్ప సంస్క్రుతీవిలసనం కల్గించిన భాష.అన్నారు .భారత అంటే సూర్యుడు ,ప్రకాశం ,జ్యోతి అనే అర్ధాలున్నాయి .ఆ వెలుగులు జాతి లో నింపాలి .రచనల లో ఆ ప్రకాశం కనిపించాలి,వికాసం కలిగించాలి ,పురోగమనానికి తోడ్పడాలని కోరారు .శాసనమండలి సభ్యులు శ్రీ అయిలాపురంవెంకయ్య తెలుగుభాష వికాసానికి ఈ సభలు తప్పక తోడ్పాడుతాయి అని ఆశాభావం ప్రకటించారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ –మనది మహత్తర జాతి .అమెరికా అధ్యక్షులు ఒబామా కు మన గాన్దీజియే స్ఫూర్తి అని ఆయనే ఇటీవల తెలియ జేశారని చెప్పారు .గత అయిదు వేల ప్రపంచ చరిత్ర లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అయిదుగురు ప్రముఖుల్లో ముగ్గురు భారతీయులే అవటం మనకు గర్వ కారణం .ఆ ముగ్గురు శ్రీ కృష్ణుడు ,బుద్ధుడు మహాత్మా గాంధి అని భావ స్ఫోరకం గా తమ ప్రసంగాన్ని ముగించారు .వివిధ భాషా వేత్తలు ఈ సభలో ప్రసంగించి గొప్ప జాతీయ స్ఫూర్తిని కలిగించి చరితార్ధం చేశారు ,
            ఈ సభ తర్వాత ఆరవ సదస్సు” సి.పీ.బ్రౌన్ వేదిక ”పై ”సాంకేతికం గా తెలుగు భాషాభివృద్ధి ”అనే అతి ముఖ్యమైన విషయం పై  జరిగింది .ఇందులోని చర్చనీయ అంశాలు –”కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలతో తెలుగుభాష ,ఫాంట్లు ,ఉపకరణాలు లిపి వికాసం -ఆధునిక అవసరాలు ” సభా సమన్వయాన్ని అమెరికా లోని సిలికానాంధ్ర కు చెందిన మచిలీపట్నంకు చెందిన శ్రీ కూచిభొట్ల ఆనంద్ కావటం ఆనంద దాయకం గా వుంది .మొదటగా ”రమణీయ ”అనే ఉచిత తెల్లుగు ఫాంట్ ను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .ఇది చాల కీలకమైన సదస్సు .అందరి దృష్టీ దీనిమీదే వుంది .
        తొలి ప్రసంగం లో సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ హర్ష వర్ధన్ తెలుగును మృత భాష గా కాకుండా ,అమృత భాష గా చేయమని సూచించారు .సమన్వయ కర్త శ్రీ   ఆనంద్ –తెలుగుకు ప్రపంచ హోదా సాధించాలి .మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాని వాడుకోవాలి .నేడు అంతర్జాలం మానవ నాగారకతను   అధికం గాప్రభావితం   చేస్తోంది .హారీ పోట్టర్ పుస్తక రచయిత్రి అంతర్జాలం తోనే అంతట్టి ప్రాముఖ్యం పొందింది .తొలి ఇంటర్నెట్ సదస్సు హైదరాబాద్ లో జరిపాం.ఇప్పుడు ”ఈ” పుస్తకాలు విరివిగా వస్తున్నాయి .సిలికాన్ వాలీ కాలిఫోర్నియా లో సెప్టెంబర్ లో ఒక అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సు నిర్వహించ బోతున్నాం .లక్షలాది పుస్తకాలను నిక్షిప్తం చేసుకొనే పరికరం వచ్చింది ఇది చదువుకోను వచ్చు కావాలంటే చదివి వినిపించుకోనేట్లు చేసుకో వచ్చు .త్వరలో ఆరు అందమైన తెలుగుఫాంట్లు తెస్తున్నాం .అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు భాషకు అంతర్జాతీయ హోదా సాధించటమే మన ధ్యేయం  .తెలుగు కొద్ది రోజుల్లో విశ్వ భాష అవుతుంది అని చాలా నిర్దుష్టం గా విశ్వాసం గా ప్రసంగించి ఈ సభ ఆలోచనకు సార్ధకత తెచ్చారు .
          తరువాత ప్రసంగించిన శ్రీ అమరనాధ రెడ్డి తెలుగు స్పెల్లింగ్ చెక్కర్ ,ఎడిటర్ ,బ్రౌజర్ లను విడుదల చేసినట్లు తెలియ జేశారు .ఇంటర్నెట్ లో మార్పులకు యూనికోడ్ కన్సార్టియం ఏర్పాటు చేసి ,ఎక్కువ మంది తెలుగు వారు అందులో ఉండేట్లు చేస్తున్నామని చెప్పారు .కృష్ణా  విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ మైనేని కేశవా దుర్గా ప్రసాద్ -ఆధునిక సాంకేతికత్వంతో తెలుగు పురోగమిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు .శ్రీ వీవెన్ దృశ్య మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రసంగించారు విండోస్ విస్టా తో మన కంప్యూటర్ లో తెలుగు రాసుకో వచ్చు.mobiles
లో కూడా తెలుగు రాసే అవకాశం వచ్చింది .పుస్తకం చదివి వినిపించే ఏర్పాటు వచ్చింది ‘.ఈ ‘పత్రికలు చాలావున్నాయి .వాటిలో వ్యాసాలు రాయ వచ్చు .”బహుళ భాషా నిఘంటువు” వస్తోంది .మూడు వందలకు పైగా తెలుగు బ్లాగులు వున్నాయి .సాహిత్యం ,రచ్చబండ బ్లాగులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి .”పద్య సుబోధకం ”వుంది ” .గురూజీ ”అనే సెర్చింగ్ బ్లాగ్ ద్వారా ఏవిషయాన్ని అయినా క్షణాల్లో పొందవచ్చు .ఇవన్నీ  ఉచిత సేవలే .తెలుగు లోనే కంప్యుటర్ వస్తోంది దీన్నే ”స్థానికీ కరణం ”అంటారు .అన్ని కంప్యూటర్లు అర్ధం చేసు కొనే ఫాంట్ త్వరలో రాబోతోంది .పుస్తకాలని ఈ పుస్తకాలుగా మార్చి అమ్ముకో వచ్చు .ఆన్ డిమాండ్ తో పుస్తకాలుముద్రించుకోవచ్చు  అని” కంప్యుటర్ ,అంతర్జాలం ”అనే అంశం మీద సాదికారికం గా  .వివరనాత్మకం గా సుబోధకం గా ప్రసంగించి అభినందనలు అందుకొన్నారు .
    శ్శ్రీ వెంకట రాం  -ఈ పుస్తకాలపై పూర్తి వివరణ ఇచ్చారు.డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో 23 వేల తెలుగు పుస్తకాలు వున్నాయి .  మై డాక్యుమెంట్ లో వీటిని  దాచుకో వచ్చు .యూనివేర్సాల్.ది.ఎల్.లో 14 వేల పుస్తకాలను వాడుకో వచ్చు .పీ.ది.ఎఫ్  .లో వాటిని దాచుకో వచ్చు  .యాభై దాకా యూనిఫైడ్ కోడ్ లున్నాయి .వెబ్ మొబైల్ లో పత్రికలు చదువుకోవచ్చు . ”విద్యానిధి .ఆర్.ఆర్గ్ లో తెలుగు సిద్ధాంత గ్రందాలున్నాయి .”telugu thesis .కం లో అన్ని పరిశోధక గ్రంధాలు లభిస్తాయి .”గూ రీడర్ ”ద్వారా గూగుల్ నెట్ లోని పుస్తకాలు అనే దొరుకు తాయి .ఇతరులకు పుస్తకాలు ఇచ్చి సహాయపదేట్లు చేయ గలుగు తున్నాం .అయితే తెలుగు పుస్తకాలకు డిజిటల్ రైట్స్ మేనేజిమేన్త్స్ వచ్చేట్లు చేయాలి అని సవివరనాత్మకం గా ప్రసంగించారు .
   వీకీ పీడియా ను గురించి శ్రీ కిరణ్ మాట్లాడారు .దాన్ని చదవమనీ అందులో రాసి పరిపుష్టి కల్గించమని కోరారు .నలభై వేల పదాలతో నిఘంటువు ఉందనీ ,అందరు సహకరిస్తే దాన్ని ఇంక పెద్ద నిఘంటువు గ చేయ వచ్చునని తెలిపారు .ఇది ఒక మహా విజ్ఞాన సర్వస్వం అని వీకీ ని గురించి చెప్పారు
        ఇంతవరకు సాంకేతికం గా జరిగిన సభ విజయవాడ లోక్ సభ సభ్యులు శ్రీ లగడపాటి రాజా గోపాల్ రావటం తో సందడి తో నిండింది .ఆయన తెలుగు మీద మమకారం పెంచుకోవాలని సూచించారు .ఆదరణ పొందాలి తెలుగు అని ఆశించారు .తెలుగు ప్రాధాన్యత ను అందరు గుర్తించాలి ”భారత్తేయత బంధం –తెలుగు అనుబంధం ”అని ,;”భరత మాత పుత్రులలో ఘన పుత్రం తెలుగు ”అని కవిత్వం చదివి అలరించారు .తెలుగుభాష ప్రతి ఇంట ప్రతినోట పలికే టట్లు చేద్దాం అని ఆవేశం గా  అన్నారు .లగడపాటిని బుద్ధప్రసాద్ తెలుగుకు ప్రాచీన హోదా నిధులను విడుదల చేయించ వలసిందిగా అభ్యర్ధించగాఆయన సానుకూలం గా స్పందించారు .
   లిపి రూపశిల్పి శ్రీ శివరావు తెలుగు భాషకు ఒకే కీ బోర్డు వుండాలని ,అక్షరాని సుందరతరం చేయాలని ,ఏ అక్షరాన్ని తీసివేయ రాదనీ కోరారు మలేషియా కు చెందిన శ్రీ మునిరత్నం నాయుడు -1975 లో ”అంతర్జాతీయ తెలుగు సంస్థ” ఏర్పడిందని,దానికి కారకులు మాజీ విద్యామంత్రి స్వర్గీయ మండలి కృష్ణా రావు గారు అని గుర్తు చేశారు .చైనా జెర్మని ఫ్రాన్సు   దేశాల్లో కంప్యూటర్లు ఆయా భాషల్లోనే వున్నాయని ,మనం కూడా తెలుగు కంప్యుటర్ తయారు చేసు కోవాలని మంచి సూచన చేశారు   .

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -4

     రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభలు –4
          రెండవ రోజూ మధ్యాహ్నం ”గిడుగు రామ మూర్తి వేదిక ”పై నాల్గవ సదస్సు ”మాత్రుభాషల మనుగడ ,మాండలీకాల వినియోగం ,తెలుగు భాష కు ప్రాచీన హోదా అనంతర చర్యలు-తెలుగు భాషోద్యమం ”చర్చనీయాంశాలు జరిగింది .నడుస్తున్న చరిత్ర సంపాదకులు శ్రీ సామల రమేష్ అధ్యక్షా స్థానం వహించగా ద్రావిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి శ్రీ గంగి శెట్టి లక్ష్మీ నారాయణ కీలక ప్రసంగం చేశారు .భాష పేరిట ఇంత గొప్ప పండుగ జరగటం చిరస్మరణీయం అన్నారు .చరిత్ర స్ఫూర్తి గతంకాదు గతి అని వివరించారు .అంటే నడిపించేది .ఒక ఉద్యమం గా ముందుకు సాగక పోతే భాషకు మనుగడ కష్టం అంటూ దిశా నిర్దేశం చేస్తూ ప్రసంగించి ఉత్తేజితుల్ని చేశారు .వారి సంభాషణ ఆద్యంతం స్ఫూర్తి దాయకం గా వుండి వక్తలకు ,ప్రతినిధులకు ,ఆనందం కల్గించింది .తర్వాత మాట్లాడిన డాక్టర్  ద్వా.నా.శాస్త్రి -భాషలో ఒత్తులు ,సున్నాలు తగ్గి పోవటం బాధగా వుంది అంటూ ,చానెళ్ళలో తెలుగు నేర్పెవారిని నియమించి భాష నేర్పించాలని సలహా ఇచ్చారు .తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావు అన్నది భ్రమే నని ఇటీవలి కాలమ్ లో పోటీ పరీక్షలలో తెలుగు లో చదువుకొన్న వారే అగ్రస్తానాలు సంపాదించిన విషయం సోదాహరణం గా వివరించారు .డాక్టర్ వేలిమల సిమన్న  –ప్రామాణిక  భాష గురించి  కృషి జరగాలని ,పాండిత్య దృష్టి తో కాకుండా శాస్త్రీయ దృష్టిని కూడా జోడించి నిఘంటు నిర్మాణం జరగాలని సూచన చేశారు .జిల్లా మాండలీక పదకోశాలు విస్తృతం గానే వస్తున్నాయి .”ఆంద్ర ప్రదేశ్ మాండలిక పడ కోశం ”రావాల్సిన అవసరం ఎంతైనా వుంది అన్నారు .ఆధునిక సాహిత్యానికి వ్యాకరణాలు రావాలి .ప్రతిభ పెరుగుతూనే వుంది .తెలుగును శాస్త్రీయ దృష్టి తో బోధించాలి .మాతృభాష పట్ల మక్కువ వున్న అధికారులను నియమిస్తే భాష అభివృద్ధి చెందుతుంది అన్న విలువైన సూచన చేశారు .డాక్టర్ బూదాటి వెంకటేశ్వర రావు -తమ ప్రసంగం లో రచయితలు స్వయం వ్యక్తిత్వాన్ని సాధించుకోవాలి,ఆత్మ గౌరవం హుందా తో పని చేయాలి వైవిధ్యాలు వైరుధ్యాలు కా కూడదు .సమన్వయ దృక్పధం అవసరం అని హితబోధ చేశారు .సుప్రసిద్ధ సాహితీ వేత్త డాక్టర్ యు.ఏ.అనంత మూర్తి తమ అభి భాషణం లో -సాంకేతికత స్థిరబిందువు కాదనీ ,నిన్నటి సాంకేతికత నేటికి మారిపోతోందని ,ప్రయత్నా లోపం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం సాధించు కోవాలని ,మేధ ,అభ్యాసం ,లక్ష్యం వుంటే అన్నీ సాధించ వచ్చు నని సండర్భ శుద్ధిగా సలహా నిచ్చారు .ఏది ఎందుకోసం ,ఎవరి కోసం రాస్తున్నామో రచయితలు ఆత్మ పరిశీలనతో రాయాలని కోరారు .భాషా దురభి మానం వదిలి భాషాభిమానం తో ముందడుగు వేయమన్నారు .డాక్టర్ పాల పర్తి శ్యామలానంద ప్రసాద అవధాని ప్రాధమిక స్థాయి లోనే తెలుగు నేర్పాలి భాష నిరంతరం మారుతూనే వుంటుంది .అవసరమైన ఇతార భాషా పదాలను స్వీకరించి పరిపుష్టి కూర్చాలి .సహజమైన వాక్య నిర్మాణం చేయాలి .,దాన్ని వ్యాకరణం లో చేర్చాలి .తెలుగులో విస్తృతం గా మాట్లాడించాలి .తప్పులు దిద్దాలి .ప్రోత్చాహకాలు అందించాలి .అని మంచి సూచనలు చేశారు .శ్రీమతి సత్యవాణి -దేనికైనా భాషే మూలాధారమని ,దాని బోధనా ఆకర్షణీయం గా వుండాలని కోరారు .పత్రికా సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు మాట్లాడుతూ  ,మాండలీకం వేరు ,భాష వేరు అనుకోరాదని ,డిగ్రీ స్థాయి వరకు తెలుగు లో బోధన వుండాలని,నిరంతరం భాషను ఉపయోగించాలని ,ఆఫ్రికన్ దేశాల భాషా స్వాతంత్ర్య ఉద్యమం అందరికి స్ఫూర్తి దాయకం కావాలి అన్నారు  .ప్రసిద్ధరచయిత భాషోద్యమ నాయకులు శ్రీ కాలువ మల్లయ్య -తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలి ,ప్రైవేటు పాథ శాలల్లో కూడా తెలుగు నేర్పించటానికి తీవ్ర కృషి చేయాలని స్పష్ట మైన భాష విధానం కావాలని ,సూచన చేశారు .తర్వాత మాట్లాడిన డాక్టర్ గౌరి శంకర్ ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన తెలుగు వారిని అభినందిస్తూ ,పశ్చిమ బెంగాల్లో తెలుగు పుస్తకాలను ,అక్కడి బెంగాలే భాష లో నేర్పే ప్రయత్నాలు చేస్తున్నామని ,అయినా సఫలం కాలేక పోయామని ఆవేదన చెందారు .ఇక్కడి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల తెలుగు వారికి ఉచితం గ పుస్త కాలు అందించమని సలహానిచ్చారు .ధిల్లీ లో తెలుగును బాగానే నేర్చుకొంటున్నారు . గుజరాత్ లోని సూరత్ లో తెలుగు అభ్యాసం వుంది .మారిషస్ లో తెలుగును ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు నేర్చుకొంతున్నారని ,డిగ్రీ లో స్పెషల్ తెలుగు చదవటం హర్షదాయకం గా వుందని అన్నారు .మలేషియా లో తెలుగు వాడకం తగ్గి పోతోందని బాధ పడ్డారు .     ,                 డాక్టర్ సంగయ్య -అన్నమయ్య ఉపయోగించిన పదాల మీద పరిశోధన జరగాలి అని చెప్పారు .విజయవాడ లోని భవానీ పురం ,ముత్యాలం పాడు పేర్లు వచ్చిన చరిత్ర వివరించారు .పాత్యామ్శాలలో తెలుగు ఉపయోగాన్ని తెలియజేయాలన్న విలువైన సలహా నిచారు .తాతయ్యలు పాటలతో పద్యాలతో కధలతో చిన్నారులను తీర్చి దిద్దాలి అని చెప్పారు .కళాశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం కావాలి అన్నారు .డాక్టర్ పీ.వి.సుబ్బారావు -ప్రపంచీకరణ వ్యామోహం లో మన భాషను మరచి పోవటం సిగ్గు చేటు .1969 లో    తెల్లుగు మాధ్యమం  లో చదివితే అయిదు మార్కులు అదనం గా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు అమలు జేయక పోవటం విచారకరం ,.అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయమని డిమాండ్ చేశారు .
          శ్రీ పమ్మి పావన్ కుమార్ భాష అంటే సాంఘిక వ్యవస్థ .నిఘంటు నిర్మాణానికి ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోమని సలహా చెప్పారు .శ్రీ ముత్తేవి రవీంద్ర నద -తెలుగు భాషకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వున్న విషయాన్ని విపులీకరించారు .బుద్ధుని కాలమ్ లో తెలుగు వాడుకం లో వుండటం దాని ప్రాచీనత కు నిదర్శనం అన్నారు .సభాధ్యక్షులుడాక్టర్ సామల రమేష్ బాబు తెలుగును అభివృద్ధి చేసి mundu తరాలకు అందించే బాధ్యత మన అందరిది అని గుర్తు చేశారు ఇందుకు ప్రజలు ,ప్రభుత్వం రచయితలు సమష్టి గా చేతులు కలిపి ముందడుగు వేయాలని సూచించారు .సభలో పాల్గొన్న వక్తలందరికి శ్రీ లక్ష్మి ప్రసాద్ సత్కారం చేశారు .
          సాయంత్రం కాశీనాధుని నాగేశ్వర రావు వేదికపై ”సాహిత్య పత్రికలు -రేపటి మనుగడ ”అనే విషయం పై అయిదవ సదస్సు జరిగింది .ముందుగా వివిధ ప్రముఖ రచయితలు రాసిన పడి పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్,శ్రీ బుద్ధ ప్రసాద్ లు  ఆవిష్కరించారు .
    వేదిక మీదకు వివిధ పత్రికా సంపాదకులను,చానెళ్ళ అధిపతులను  బుద్ధ ప్రసాద్ ఆహ్వానించారు .ముందుగా ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు తెలుగు నవనీత సమానం .కమ్మని అజంత భాష .అయిన నీలి నీడలు కమ్ముతునాయి విమర్శను సహృదయం తో స్వీకరించి ముందుకు సాగాలి .మేధావులు ,మహనీయులు ఇకనుంచైనా మౌనాన్ని వదిలి తమ కాలం అనే కరవాలానికి పని చెప్పి జాతిని ఉత్తేజితం చేయాలని అభిప్రాయ పడ్డారు .
         యెన్.టి.వి .కి చెందిన శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు -మనుషుల లోని మానవత్వం మంట కలిపి ,మానసిక ఆందోళనకు గురి అవుతున్న వారికి స్థైర్యం కల్పించి ,మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టాలని అమృతం లాంటి తెలుగును చిన్నారులకు నేర్పుతూ బ్భాషను దక్కించుకోవాలని ఉద్వేగం గా మాట్లాడారు .సురభి పత్రిక సమాదకులు శ్రీ రాజా శుక -తెలుగును కాపాడాల్సిన బాధ్యత తలి దండ్రుల మీదే ఎక్కువగా వుంది అనారు .నేటి విద్యల కోసం తెలుగును వదులు కోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు .చినుకు మాస పత్రిక సంపాదకులు శ్రీ నండూరి రాజా గోపాల్ సాహిత్య పత్రికలను ప్రజలు ,ప్రభుత్వమాదరించాలని ,ఉత్తమ విలువలతో ప్రబోధాత్మక రచనలు చేయమని రచయితలను కోరారు .పత్రికలకు ప్రాంతీయత ఆపాదించా వద్దు అని గట్టిగా చెప్పారు .భావ వీణా సంపాదకులు శ్రీ కల్లా కృష్ణా రావు రచన లోసత్తా వుంటే అన్ని కాలాలల లోను ఆదరణ ఉందన్నారు .నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ తమ పత్రిక అత్యంత విలువైన పారితోషికం తో రాబంద్ అ రచనను ప్రోత్చాహిస్తున్నామని తెలియ జేశారు .నెలవంక -నెమలీక సంపాదకులు శ్రీ వి .శ్రీ రాములు నేటి సమాజం లో ఉదాత్తత తో పత్రిక సేవ చేసే మహానీయులున్నారని ,దానిని సద్వినియోగ పరచుకొని మాత్రుభాశాభివ్రుద్ధికి కృషి చ్యాలని సూచన చేశారు .
         కావ్య సమీక్ష సంపాదకులు శ్రీ మోడు రాజేశ్వర రావు -కేవలం సమీక్షల కోసమే తాము పత్రికను నడుపు తున్నామని ,సద్వినియోగం చేసుకోమని భాషను భావి తరాలకు అందించేది అమ్మ అని అందుకే మాత్రు భాష అంటే అమ్మ సేవే అన్నారు .శ్రీ ది .వి ఆర్..నరసింహారావు -ఒక రూపాన్ని పద్యం ద్వారా చెప్పగల భాష మనది అని పద్యాత్మక వివరణ నిచ్చారు .భావ తరంగిణి సంపాదకులు శ్రీ భవిష్య -సాహిత్య పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం కావటం శోచనీయం ,సహృదయులు అండగా నిలవాలని భావ ప్రకటన చేశారు చివరిగా మాట్లాడిన శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ -నేటి సమాజ దుస్థితిని కొన్ని శతాబ్దాల క్రిందటే ఊహించి శేషప్ప శతకం రాశాడని ,పద్యాన్ని చినప్పతినుంచే పిల్లలకు నేర్పితే తేలిగ్గా అలవడుతుందని చక్కని సూచన చేయటం తో సభా తన ప్రాచుర్యాన్ని నింపుకొన్నది .పాల్గొన్న ప్రముఖులు అందరికి ,శ్రీమతి నన్నపనేని రాజకుమారి శ్రీ బుద్ధ ప్రసాద్ ,లక్ష్మి ప్రసాద్ లు సముచిత సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియ జేశారు .
                 ఈ నాటి చివరి సభా” కొమర్రాజు లక్ష్మణ రావు ”  వేదిక పై సాహిత్య సంస్థల ప్రతినిధుల సమావేశం  గా జరిగింది .ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ బి.హనుమా రెడ్డి -ప్రజలకు ప్రభుత్వానికి సాహిత్య సంస్థలు వారధి గా పని చేస్తున్నాయి .అన్నారు .గజల్ శ్రీనివాస్ కమ్మని గజల్లు పడి సందేశం అందించారు .కడప జిల్లా అధ్యక్షులు శ్రీ జింకా సుబ్రహ్మణ్యం ,చిత్తూర్ కు చెందిన శ్రీ టంగుటూరి మెహబూబ్ ,పశ్చిమ గోదావరి కి చెందిన శ్రీ నున్న అన్జారావు ,కృష్ణా కు చెందిన శ్రీమతి కోకా విమల కుమారి తమ జిల్లాలలో జరిగే కార్యక్రమాలను తెలియ జేశారు .యువభారతి అధినేత శ్రీ మాడభూషి అనంతా చార్యులు తమ సంస్థ చేసే సేవలను వివరిస్తూ ,తాము నిర్వహించే కార్యక్రమాలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వారంతా తెలుగు లోనే మాట్లాడు తారని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .తెలుగు రధం సంపాదకులు శ్రీ కొంపెల్ల శర్మ సంస్థలో సభ్యత్వం ముఖ్యం కాదు ,సభ్యతా పూర్వక కార్యక్రమాలు ముఖ్యం సంస్థలు చేసే సత్కారాలను అర్హులైన వారికే చేయాలని కాలోచితమైన సలహానిచ్చారు .
            జనసాహితికి చెందిన శ్రీ దివి కుమార్ ఆంగ్ల భాషకు దాసోహం కావద్దని అయితే విశాల దృక్పధం కలిగి వుండాలని కోరారు .గుంటూరు జిల్లా కు చెందిన శ్రీ జానీ బాష తెలుగు వారు ఖచ్చితం గా తెలుగు లోనే సంతకం చేయాలని,మార్పు మనతోనే ప్రారంభం కావాలని సముచిత సూచన చెసిఆదర్శమ్ వైపుకు దృష్టి ని మరల్చారు .
         అనంతరం ప్రముఖ కవి రచించిన ”కవిత్వం ఒక సామాజిక  స్వప్నం”అనే కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది .
        రాత్రి  ఏడు గంటలకు స్వర్గీయ” వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”పై ప్రతినిధుల కవి సమ్మేళనం డాక్టర్ శ్రీమతి  రేజీనా గారి ఆధ్వర్యం లో కమనీయం గా అర్ధ రాత్రి వరకు జరిగింది .సమాజ హితమైన రచనలు చేసి కవులంతా తమ కర్తవ్యాన్ని నెర వేర్చి సమాజాన్ని జాగృతం చేశారు .
          రెండవ రోజూ సభలు అత్యంత నిబద్ధత తో నిర్మాణాత్మక మైన సూచనలతో దిశా నిర్దేశం గా జరిగి అందరికి ఆనందాన్ని పంచాయి

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment