ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -3

3
           దాదాపు వెయ్యిమంది ప్రతినిధులతో ,విశిష్ట అతిదులైన విదేశీ ప్రముఖులు ,ఆచార్య వర్యులు ,గౌరవ అతిదులైన అధికార ప్రముఖులతో,ఆత్మీయ అతిదులైన పత్రికారంగా ప్రముఖులతో ,చేయూతనిస్తున్న వదాన్యులతో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు రంగ రంగ వైభవం గా ప్రారంభమై ,తెలుగు దేశం లో వివిధ రంగాలలో ప్రముఖులైన మహనీయుల చిత్రపటాల ఫ్లెక్షే లతో ,రంగు రంగుల బ్యానర్లతో  విజయవాడ  పట్టణం అంతా తెలుగు పండుగ వాతావరణం నెలకొని శోభాయమానం గా  వుంది .
కార్యకర్తలు ఉత్చాహం గా పని చేస్తూ ఏ అసౌకర్యము జరుగకుండా తోడ్పడుతున్నారు .జ్ఞాన పీత పురస్కార గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి స్వగృహం లో వారి చిత్రపటాలు ,పుస్తకాలు ,జ్ఞాపికలుప్రదర్శించటం సముచితం గా వుంది .పురావస్తు శాఖ ఏర్పరచిన నాణాల ,వస్తువుల చిత్ర ప్రదర్శన అందరిని ఆకర్షించింది .ముందుగా కేంద్ర సాహిత్య అకాడెమి ప్రతినిధి ,ప్రముఖ కన్నడ రచయిత ఆచార్య ఎస్.ఎల్.బైరప్ప స్ఫూర్తివంతమం గా ప్రసంగిస్తూ కన్నడ ప్రభుత్వం తమ భాషకు అన్నిరకాల సహాయం చేస్తోందని ,కర్ణాటక లోని ”భాషా భారతి ”అనే సంస్థ అనువాద సాహిత్యానికి వెన్నెముకగా నిలిచి ప్రోత్చాహిస్తోందని ,అదే విధం గా ఆంద్ర దేశం లోను ప్రభుత్వం తెలుగు భాషకు సేవ చేయాలని హితవు పలికారు .ప్రెస్ అకాడెమి అధ్యక్షులు శ్రీ టి.సురేంద్ర -పత్రికావిలేకరులకు శిక్షణ నివాలని సూచించగా ,స్వర్ణాంధ్ర పాతిక సంపాదకులు శ్రీ  కే.ఎస్ .తిలక్ -తెలుగు పత్రికల యాజమాన్యాలన్ని కలిసి ఇలాంటి సభలు నిర్వహించాలని కోరారు
               రెండవ రోజూ 14 -08 -11 ఆదివారం ఉదయం సాహితీ ప్రముఖులతో ఎస్.వి.ఎస్.కళ్యాణ మండపం లో ”సాహిత్యం,సాహిత్యానువాదాలు ,-ప్రచురణ రంగం ”అనే అంశం మీద మూడవ సదస్సు” గుర్రం జాషువా వేదిక ” పై జరిగింది .శ్రీ టి.శోభనాద్రి అతిధులను వేదికపై కిఆహ్వానిన్చాగా ,ఏ.బి.యెన్.ఆంద్ర జ్యోతి బ్యూరో చీఫ్ శ్రీ ఏ.కృష్ణా రావు సమన్వయము చేశారు .ముప్ఫై మందికి పైగా సాహితీ వేత్తలు పాల్గొని మంచి సూచనలు చేశారు .శ్రీ కృష్ణా రావు –నేడు పత్రికల లో పనిచేసే వారికి సాహిత్య పరిజ్ఞానం తక్కువ గ వుందని ,నిజానికి పత్రికలే సాహిత్య వ్యాప్తి అధికం గా చేస్తున్నాయని చెప్పారు .తెలుగు అకాడెమి సంచాలకులు శ్రీ యాదగిరి  పదిహేను కోట్ల రూపాయల వ్యయం తో అకాడెమి అనేక ప్రోత్చాహక కార్యక్రమాలు నిర్వహిస్తోందని,తాము నడుపుతున్న ”తెలుగ్గు ”మాస పత్రికకు విలువైన రచనలు రాసి పంపమని కోరారు .ఇతర రాష్ట్రాల లోని తెలుగు వారికి బోధనాశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ,తెలుగు నిఘంటువును డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు .ఫెలోషిప్పులను ఏర్పరిచి ప్రోత్చాహిస్తున్నట్లు తెలిపారు .ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి   -స్వతంత్రప్రతిపత్తి గల అనువాద వ్యవస్థ ఏర్పడాలని ,రచయితల సహకార సంఘాలు అవసరమని సూచించారు .ప్రముఖ రచయిత ,నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు తమ అభిభాషణం లో గొప్ప రచన ఆలోచన ను ప్రోది చేయాలి   ,ఆవేశాన్ని కాదుఅన్నారు  .ఇజాలు లేని నిజం చెప్పే రచనలు రాయమని రచయితలను కోరారు .ప్రముఖ విమర్శకులు శ్రీ కడియాల రాజా రామ మోహన రాయ్ –రచనలో జీవన వైవిధ్యంచూపాలి,దేశ భాషలను పరి పుష్టి చేసుకొంటూ సాహిత్యం ముందుకు వెళ్ళాలి అని సూచించిన సుబోద్ సర్కార్ మాటలు మరువరదన్నారు .యువకులు బాగానే చదువుతున్నారానీ ,బాగానే రాస్తున్నారని ఆందోళన చెందాల్సిన పని లేదని అంటూ ,మాండలీకాలు భాషకు అడ్డు కాదు అని చెప్పారు . ప్రముఖ కవి ,రచయిత శ్రీ విహారి -రచయితలకు పత్రికలు తగిన పారితోషికాలు ఇవ్వాలని తెలియ జేశారు .ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు ”తెలుగు నేర్చుకుందాం ”అనే శీర్షికను పత్రికలు నిర్వహించాలని సూచన చేస్తూ ముఖ్యం గా చిన్న బాల శిక్ష ను తయారు చేయాల్సిన అవసరం వుందని తెలియ జేహారు .
         ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కే.బి.లక్ష్మి -యువత కోసం ప్రత్యెక సదస్సు నిర్వహించాలి ,అనువాదకుల పానెల్ రావాలి ,చక్కని తెలుగు పదాల సృష్టి జరగాలి బాలల ,యువకుల కోసం పత్రికలు ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలి,సంప్రదాయాన్ని నిలబెట్టే రచనలు రావాలి అని చెప్పారు రవీంద్రుడు తెలుగు  సంభాషణ విని ”ఇది తెలుగా -సంగీతమా ?”అని ఆశ్చర్య పోయారని ,అంతటి కమ్మని ,మధురమైన సంగీత ప్రధానమైన భాష తెలుగు అని వివరించారు .అనతరం మాట్లాడిన డాక్టర్ రావి రంగా రావు -ఆంగ్లం లోకి అనువాదం ఆయె సాఫ్ట్ వేర్ ను యువ ఇంజినీర్లు తయారు చేయా లని సూచన చేశారు .సాహిత్యానికి మూల్యాంకన స్కేలె వుండాలని అభిప్రాయ పడ్డారు .అంతర్జాలాన్ని రచయితలు బాగా ఉపయోగించుకోవాలని అనారు .డాక్టర్ బాబీ వర్ధన్ -భాషే శ్వాస అంటూ పత్రికలు సామాన్య జనం వాడే పదాలను ఉపయోగించాలి అన్నారు .హాస్యావధాని డాక్టర్ శంకర నారాయణ చలోక్తులతో,సభారంజనం చేసి,ప్రతి నోట తెలుగు వినిపించాలనితెలుగంటే వెలుగే నని గుర్తు చేశారు .డాక్టర్ వెన్నా వల్లభ రావు ,డాక్టర్ వి.కృష్ణ కుమారి లు తెలుగు కోసం ప్రచార ఉద్యమం కావాలని కోరారు .అనంతరం మాట్లాడిన డాక్టర్ గుమ్మా సాంబ శివ రావు -సాహిత్య బోధన ఒక అంశం గా బోధించాలని ,రచయితలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ,సూచించారు .డాక్టర్ రాపాక ఎకామ్బరాచార్యులు -పత్రికల లో ”కళా సాహిత్య విజ్ఞాన వేదిక ‘నిర్వహించాలన్నారు .ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీ కృష్ణ -పాథక హృదయాలను తాకే రచనలు రావాలని ఆశించారు .డాక్టర్ జయ కుమారరాజు   తెలుగు భాష కోసం కృషి చేసిన ప్రాతస్మరనీయుడు సి.పీ.బ్రౌన్ పేరిట పురస్కారం ఏర్పాటు చేయాలని క్రిస్టియన్ సాహిత్యాన్ని కూడా గుర్తించి ప్రాదాన్యతనిచ్చి ,పురస్కారాలు అందించాలని కోరారు .గిరిజన సంస్కృతిని ,సాహిత్యాని పరి రక్షించామనిశ్రీ భాను నాయక సూచించారు .ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బాలి -మంచి గుండ్రని ఫాంట్ ను ముద్రణకు వాడాలని, లిపి మీద మరింత శ్రద్ధ చూపాలని విలువైన సలహా ఇచ్చారు .శ్లజాడల రాసి  రాసి  గుత్తి చంద్రశేఖర రెడ్డి ,శంకరస్వామి ,చిత్రకారుడు టి.వి ,డాక్టర్ లావణ్య ,డాక్టర్ టి .రంగస్వామి ,శ్రీమతి ఝాన్సి కే.లక్ష్మి కుమారి  ,చలన చిత్ర విశ్లేషకులు శ్రీ జి .ఎస్ రామా రావు ,శ్రీ   వేదాంతం రాజా గోపాల చక్ర వర్తి ,మున్నగు ప్రముఖులు తమ అమూల్య సూచనలు అంద జేశారు .యువకులు అధిక సంఖ్య లో పాల్గొనటం ఈ సభల ప్రత్యేకత ,మంచి పరిణామం .ఈ స్ఫూర్తి తో ”ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”ఏర్పడితే బాగుంటుంది అని సూచించిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు జాన్సన్ చోరగుడి మాట ఆలోచించదగినది .

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -2

2
                భోజన విరామం తర్వాత బెంజ్ సర్కిల్ దగ్గర వున్న ఎస్.వి.ఎస్.కల్య్యాన మండపం లో ”సురవరం ప్రతాప రెడ్డి వేదిక ”పై ”-తెలుగు ప్రజల చరిత్ర ,సంస్కృతి ,భాషా ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ,చరిత్ర పరిశోధన లో ఎదుర్కొంటున్న సమస్యలు -రేపటి సామాజిక అవసరాలు ”అంశాలపై మొదటి సదస్సు జరిగింది .శ్రీ     రాళ్ళబండి కవితా ప్రసాద్ సభా సమన్వయము చేశారు .వారు తమ ప్రసంగం లో రచయితలు ప్రాచుర్యం లో లేని అంశాలను ప్రస్తావించాలని  ,కళలకు కాణాచి అయిన రామప్ప దేవాలయం బ్లాస్టింగ్ వల్ల దెబ్బ తినే ప్రమాదం వుండటం బాధాకరం అని ,తెలుగుభాష సమగ్రచరిత్ర రావాలని ఆకాంక్షించారు .ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకొనే పద్ధతులను వివరించమని కోరారు .
          ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ –ఎన్నో అకాడెమీలు చేయాల్సిన పనులు శ్రీ బుద్ధ ప్రసాద్ ,వారి సహచరులు నిర్వహించటం గొప్పగా ఉందన్నారు .చరిత్ర అంటే గతం.గతం లేకపోతే భవిష్యత్తు లేదు .చారిత్రకఘాటనల మధ్య సంబంధాన్ని ,సాంస్కృతిక మార్పులను ,పరిశీలించటం 1950 నుంచే వచ్చింది .దీనిపై ఇంకా కృషి బాగా జరగాలి .సాంఘిక సంస్కరణల లో వచ్చిన సామాజిక మార్పులను అధ్యయనం చేయాలి .పరిష్కరించాల్సిన శాసనాలు వేల సంఖ్య లో వున్నాయి .వాటిని పరిష్కరించక పొతే చరిత్ర చీకటిమయం అవుతుందని అన్నారు .శాసనాలు చదివే ప్రముఖుల సంఖ్య తగ్గిపోయింది .జరిగిన పరిశోధనల మీద సమగ్ర నివేదిక రావాలి .నేటి అస్తిత్వ ఉద్యమాల వెలుగు లోస్థానిక చరిత్రలు నిర్మించాలని ,సూక్ష్మాన్శాలు కూడా చేర్చాలని ,సూచించారు .కైఫీయత్తులు జాతి సమగ్రత కు తార్కాణాలు .అగ్రహారాల చరిత్ర ,స్థానిక ప్రభువుల చరిత్ర ,దేవాలయాల చరిత్రలు తయారు చేయమని కోరారు .కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ,కాల పరిధిని నిర్ణయించి ,అమలు జరిగేటట్లు చేయాలని అన్నారు .వకుళాభరణం ఉపన్యాసం ”నమూనా ఉపన్యాసం ”గా ,ఉపన్యాసాలకే ఆభరణం గా అనిపించి స్ఫూర్తి దాయకమయింది .
           తరువాత మాట్లాడిన పురావస్తు శాఖ డిప్యూటి డైరెక్టర్ శ్రీ బి .సుబ్రహ్మణ్యం -నాణాల కేటగిరి జరగాలని ,ప్రతాపరుద్ర ,రాణి రుద్రమాంబ ల  కాలమ్ నాటి నాణాలు లభించలేదని ,ఎందుకు అవి లభ్యం కావటం లేదో సమగ్ర పరిశోధన జరపాలని ,కోరారు .నాణాల డాక్యు మెంటేషన్ జరుగుతోంది చెప్పారు .అనేక వేల నాణాల చరిత్ర వెలుగు లోకి తేవాలని సూచించారు .పురాతత్వ శాఖ నిపుణులు డాక్టర్ వి .వి .కృష్ణ మూర్తి -తన అనుభవాలను ,కృషిని సమగ్రం గా వివరించారు .తాలపత్రాలలోని చరిత్రను ఇంకా వెలికి తీయాలి .ప్రభుత్వం అవసరమైన ధనాన్ని కేటాయించి ప్రోత్చహించాలి .ధనాభావం తో   . ఆ శాఖ ముందడుగు వేయటం కష్టం అన్నారు .పురావస్తు శాఖ సంచాలకులు శ్రీ పీ.చెన్నా రెడ్డి -పురావస్తు శాఖ చేసిన పరిశోధనలన్నీ ఒక పుస్తకం రూపం లో తెచ్చి ,ఈ వేదిక మీదనే ఆవిష్కరిమ్పజేసి అందరికి ఉచితం గా పంచామని  తెలియ జేశారు .సిబ్బంది  కొరత బాగా వుందని ,రక్షణ సిబ్బంది లేకపోవటం తో చారిత్రిక కట్టడాలు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం వుందని ,వెంటనే ప్రభుత్వం వారిని నియమించాలని కోరారు .చారిత్రిక కట్టడాలకు వంద  మీటర్ల  లోపల ఎవ్వరూ కొత్త కట్టడం చేయరాదనీ దీన్ని అతిక్రమిస్తే తీవ్ర శిక్ష ఉంటుందన్న చట్టం వుందని ,దానిని అందరు గౌరవించాలని విజ్ఞప్తి చేశారు .అందరు కలిసి సమస్తి గా కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.అని భరోసా ఇచ్చారు
       అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ ఏ.బి .కే.ప్రసాద్ తమ సంభాషణ లో తాను అనైక్యతకే వ్యతిరేకినని ,భాషకు కాదని తెలియ జేశారు .అన్ని మాండలీకాలు అభివృద్ధి చెందాల్సిందే నన్నారు .అప్పుడే భాష సుసంపన్నం అవుతుంది అని అభిప్రాయ పడ్డారు .శాసనమండలి సభ్యురాలు శ్రేమతి నన్నపనేని రాజకుమారి -తెలుగును ప్రతి పాథ శాల  లోను బోధించే టట్లు చేయాలి అన్నారు .సీనియర్ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు –చరిత్ర పట్ల శ్రద్ధ లేకపోవటం మంచిది కాదని ,ఆసక్తి   కలవారు ప్రభుత్వం లో ,పరిపాలన లో లేక పోవటం విచారకరమని తెలియ జేశారు .అవగాహన అత్యంత ఆవశ్యకరం అని హితవు పలికారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అందరిని సత్కరించారు .విలువైన సలహాలు సూచనలు వక్తలు అందించటం తో సభా ఆశించిన లక్ష్యం నెరవేరింది .
            రెండవ  సదస్సు ”రాష్ట్రేతరుల తెలుగు భాషా సమస్యలు ”అన్న అంశం పై ”మండలి వెంకట కృష్ణా రావు వేదిక ” పై  జరిగింది .డాక్టర్ గౌరి శంకర్ సమన్వయ కారగా వ్యవహరించారు .ఓడిస్సా నుంచి డాక్టర్ ఆర్తి రఘునాధ వర్మ ,శ్రీమతి పుష్పలత గార్లు తామంతా తెలుగు సంస్కృతిని కాపాడు కొంటూనే ఉన్నామని , కళల ను  బోధించే ఉపాధ్యాయులు తమ కు లేరని ,తెలుపుతూ ,తెలుగు పుస్తకాలను అందించమని కోరారు .తెలుగు పాతశాలలు తగ్గి పోయాయని ఉపాధ్యాయుల కొరత తీవ్రం గా వుందని అన్నారు .ఇదివరకు వేసిన హౌసు కమిటీ కి కాలదోషం పట్టిందని దాన్ని పునరుద్ధరించా టానికి  కృషి చేయాలని కోరారు .అల్లాగే ఉపాధ్యాయ శిక్షణా  కేంద్రాన్ని ఎత్తి వేశారని ,   దానిని పునరుద్ధరించా టానికి ఒత్తిడి తేవాలని అన్నారు .తమ పిల్లలకు తెలుగు లో అభిరుచి కలిగే టట్లు చేయమని విన్నవించారు .
       తమిళనాడు కు చెందిన ప్రముఖ పరిశోధకులు శ్రీ సా.వెం .రమేష్ -తెలుగు వాళ్ల  మనసుల్లోంచి రాజకీయ చిత్రపటాలను తొలగిన్చుకోవలసిన దిగా  సూచించారు .తమిళనాడు ,కేరళ కర్ణాటక రాష్ట్రాల లోని కింది తరగతి జాతుల వద్ద అమూల్య భాషా సంపద ,చరిత్ర పాటల రూపం లో వుందని వాటిని ఇలాంటి సంస్థలు అక్కడికి వెళ్లి రికార్డు చేసి భద్రపరచమని సలహా ఇచ్చారు .తమ ప్రాంతానికి వచ్చి తెలుగు కు ప్రోత్చాహం ఇవ్వమని కోరారు .ఎవరైనా తెలుగును అవమానిస్తే నిలదీసి బుద్ధి చెప్పమని సూచించారు .శ్రీ బెల్లం కొండ నాగేశ్వర రావు  ,శ్రీ కలువ కుంట  నారాయణ రెడ్డి ,శ్రీ .ఏం .ఎస్ రామస్వామి రెడ్డి , .శ్రీ వై రామ కృష్ణ గార్లు తెలుగు  పాథ  శాలలు తగ్గి పోతున్నందుకు ఆందోళన చెందారు .పాథ శాలలో చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గి పోతోందని ,దీనికి కారణం తమిళ ప్రభుత్వ నిరంకుశ విధానమే నని ఆవేదన చెందారు .నిర్బంధం గా తమిళం నేర్చుకోవలసి వస్తోనని ,అక్కడి తెలుగు వారు మూడవ స్థాయి పౌరులుగా మారిపోవటం బాధాకరం గా వుందని తెలియ జేశారు .తెలుగును మొదటి భాష గా చేసేట్లు తమిళనాడు ప్రభుత్వం పైన ఒత్తిడి తెసుకొని రావలసినదిగా చెప్పారు .”ముగ్గురమ్మల    మూల పుటమ్మ  కు అమ్మ తెలుగమ్మ ”అన్న మాట మరచిపొవద్దని హితవు పలికారు .
         మహారాష్ట్ర నుంచి వచ్చిన శ్రీ అంబల్ల జనార్దన్ ,శ్రీ రాయచోటి కృష్ణ మూర్తి -అక్కడి తెలుగు వారికి సమస్యలు తక్కువేనని ,వున్నా   తామే పరిష్కరించు కొంటున్నామని తెలియ జేశారు .పుస్తక ప్రచురణకు సహకరించి ,ఆవిష్కరణ ఖర్చులు తగ్గించేట్లు చేయమని కోరారు .ప్రచురణ లో రాజకీయం చోటు చేసుకోవటం హర్షణీయం కాదనిఅన్నారు .సమీక్క్ష ల  కోసం ప్రత్యేకం గా పత్రికలు రావాలి అని అభిప్రాయ పడ్డారు . .  సమన్వయ కర్త శ్రీ గౌరి శంకర్ తనకు అన్ని రాష్ట్రాల వారితో సంబంధం వుందని వారి సమస్యలు కూడా తెలుసనీ తరచుగా వారితో  సంప్రదిస్తూ సమస్యా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటున్నానని ,ఇక్కడి ప్రభుత్వం ఆయా రాష్ట్రాల లోని తెలుగు వారికి ఇతోధికం గా సాయం చేస్తేనే వారి సమస్యలు తీరుతాయని తమ ప్రసంగం లో తెలిపారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుభాష కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ,తెలుగును మనమే కాపాడు కోవాలాని ,మనమే ముందు వుండి  పల్లెల పాఠాశాలలో తెలుగును బోధించే ఒత్తిడి తే వాలని ఆభిప్రాయా ప్రకటన చేశారు .భారతీయ భాషా కేంద్రమ్ అధికారి శ్రీ జి .ప్రభాకర్ తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించి ,అవసరమైన వారు సంస్థ నుంచి సేవలు అందుకోవలసినది గా సూచించారు .
  శ్రీమతి ఏ.బి.కే సుజాత కవితా సంపుటి ”బాల కవిత్వం ”,శ్రీమతి అమరజ్యోతి రాసిన ”మొలుస్తున్న రెక్కలు ”,శ్రీ శ్రీహరి కోటి రచన ”విద్యా శతక పద్యాలు ”పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .
ఆశించిన విధం గా రెండు సభలు విజయవంత మయాయి .ఆ తరువాత స్వర్గీయ ”వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”మీద డాక్టర్ కే.బి .లక్ష్మి గారి ఆధ్వర్యం లో ప్రత్యెక కవి సమ్మేళనం జరిగింది .శ్రీ అనంత శ్రీ రాం ,వంగపండు ప్రసాద రావు ,శ్రీ ఆశావాది ప్రకాశ రావు ,మొదలైన ప్రమముఖ కవులు పాల్గొని నేటి సమాజని ప్రభావితం చేసే కవితలతో శ్రోతలను అలరించారు .
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష

           కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ ,మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం ,న్యు ధిల్లీ లోని సాహిత్య అకాడెమీ వారి సౌజన్యం తో ”ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు 13 -08 -11  నుండి 15 -08 -11 వరకు విజయవాడ లో జరిగాయి 13  వ తేదీ శనివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్ర ప్రాంగణం లో ”తెలుగు తల్లి ” విగ్రహాన్ని పద్మ భూషణ్ ,శ్రీ సి .నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించటం తో సభలు ప్రారంభమయి నాయి .ప్రారంభ సభా   వేటూరి సుందర రామ మూర్తి సభా ప్రాంగణ వేదిక పై జరిగింది .”చరిత్ర ,సంస్కృతి ,సాంకేతికత -రేపటి అవసరాలు ”నేపధ్యం గా ఈ సభలను నిర్వహించారు .వేలాది ప్రతినిధులు ,తెలుగు భాషాభిమానులు పాల్గొని నిండుదనం తెచ్చారు .ఈ సభల గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు .ఆయన తన ప్రసంగం లో దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులందరికీ ధన్య వాదాలు తెలియ జేశారు .తన ఆరోగ్యం కంటే తెలుగు భాష ఆరోగ్యమే ముఖ్యం గా భావించి ,అనారోగ్యాన్ని లెక్క చేయకుండా నారాయణ రెడ్డి గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .అలాగే తెలుగు భాష కు తమ పత్రికలు, చానెళ్ళ ద్వారా విశేష కృషి చేస్తున్న ఈనాడు గ్రూప్ చైర్మన్ శ్రీ రామోజీ రావు ను అభినందించారు .తెలుగు భాష కోసం ,ఇంతమంది ఆవేదన చెంది పరితపించి భాషను కాపాడుకోవా టానికి వచ్చిన వారందరికీ ఆహ్వానం పలుకుతూ వారంతా సైనికులు లాగా పని చేయాలని కోరారు .పదిహేడు కోట్ల  మంది  మాతృభాష తెలుగు అనీ ,కాని దాని ప్రగతి  ప్రశ్నార్ధ కం గా మారటం విచారకరమని ,దిశా నిర్దేశం లేకుండా పోయిందనీ ప్రపంచీకరణ లో తెలుగు ఉక్కిరిబిక్కిరి అయిపోయిందనీ ,ఈ సమయం లో మనం చైతన్య స్ఫూర్తిని కల్గించక పోతే భవిష్యత్తు మనల్ని క్షమించదనీ అన్నారు .రచయితలు అందరు బాగా ఆలోచించి దిశానిర్దేశం చేయాలని సూచించారు

—         కార్యనిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లక్ష్య ప్రస్తావన చేశారు .2007 లో జరిగిన మొదటి సభలలో తెలుగు రచయితలన్దర్నీ ఒకే వేదిక మీదకు రప్పించటం లో కృత క్రుత్యులయామనీ ,తెలుగును తల్లిభాష గా చేసేందుకు మంచి ప్రయత్నం చేశామనీ ,చైతన్య యాత్రలు జరిపి తెలుగు కు ప్రాచీన హోదా సాధించామనీ ,ఆ తరువాత ముందుకు అడుగు వేయలేదని అన్నారు .తెలుగు సంస్కృతి తగ్గిపోయింది .రచయితలు దిశా నిర్దేశం చేయాలని,పాఠాశాలలో తప్పకుండా తెలుగును బోధించాలనీ ,రేపటి తరం సాంకేతికం గా పురోగమిస్తుందనీ ,దానికి తగ్గట్టు గా మనం తయారవాలనీ మన భాషను విశ్వ వ్యాప్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు

            జ్ఞాన  పీథ  పురస్కారగ్రహీత ,పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు .ఇతరదేశాలనుంచి ,ఇతరభాషా రచయితలు రావటం శుభ సూచకం అన్నారు .శాతవాహనుల కాలమ్ లోనే అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఏళ్ళ నాటికే తెలుగు భాష వున్నట్లు కరీం నగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభించిన శాసనాలు ,నాణాలు వల్ల తెలుస్తోంది .మెదక్ జిల్లా కొండాపూర్ లో టంక శాల  వుండేది .ప్రాకృత కావ్యం గాదా సప్తశతి లో పాడి ,కొట్టం ,చోద్యం వంటి తెలుగుపదాలున్నాయి .”సుందర తెలుంగు ”అని తమిలకవి సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించిన భాష తెలుగు .విదేశీ యాత్రికుడు నికోలాకొంటీ విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించి అక్కడ తెలుగు అమలు అవుతున్న తీరును చూసి ముగ్దుదయాడు .ఇప్పుడు ప్రసారమాధ్యమాలలో ,ఆంగ్ల వాడకం పెరిగింది  .తెలుగు మాధుర్యం వున్న అజంత భాష .గాంధీజీ రోజూ డైరీ రాసేవారు .తాను దాన్ని”గాన్దేయం”అన్న పేరుతొ తెలుగు చేశాననీ ,అందులో మహాత్ముడు ”మాతృభాషా తిరస్కారం -మాతృదేశ తిరస్కారమే ”అన్న మాట మనం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు .ఆంగ్లకవి  ఈట్స్   ప్రతినాగారకజాతి తన మాతృభాషలోనే మాట్లాడుతుందని తెలియజేశాడని ,భాషాపండితుడు హాల్డేన్ తెలుగుకు జీర్ణశక్తి ఎక్కువ అని ఇతరభాషా పదాలను తనలో చక్కగా ఇముడ్చుకోన్నదని మెచ్చినట్లు చెప్పారు .తెలుగును ప్రాధమిక స్థాయినుంచి పాతశాలల్లో బోధించాలని కోరారు .”మన మాత్రు భాష తెలుగు -మన రక్త ఘోష తెలుగు ”అని కవితాత్మికం గా చెప్పారు .రచయితలందరూ సామూహిక స్వరం తో ప్రభుత్వానికి అర్ధవంతమైన నివేదిక ఇచ్చి తోడ్పదవలసినడిగా కోరారు .
          ఈనాడు గ్రూప చైర్మన్ శ్రీ రామోజీ రావు -ఈ సభల సందర్భం గా 126 మండి లబ్ధ ప్రతిస్తులైన రచయితల రచనలతో ప్రచురించబడినబృహత్ గ్రంధం  ”తెలుగు పున్నమి ”ని ఆవిష్కరించారు .రామోజీ రావు తమ ఉపన్యాసం లో తెలుగు గడ్డ మీద పుట్టటం మన అదృష్టం .సంస్కృతి ,సంప్రదాయం ,జీవన విధానం ,కట్టుబాట్లకు భాష ప్రతిబింబం .మాతృభాష లో విద్యనేర్వటం తేలిక .సామాజికం గా ,ఆర్ధికం గా భాష ఉపయోగ పడాలి .సంస్కృతి తో భాష జీవకళ తో ఉట్టిపడుతుంది .నెహ్రు పండితుడు కోడా పాలనాభాష గా మాతృభాష వుండాలని కోరిన సంగతి గుర్తు చేశారు .యాస భాషకు బలం అన్నారు .జనభాష కావాలి .అవగాహన  ,ప్రేమ ల వల్ల , భాష బలపడుతుంది నిజమైన భాప ప ల్లెల్లో నే వుంది  .భాష ,సంస్క్రుతులే మన ఆస్తులని వాటిని జాగ్రత్త గా కాపాడుకోవాలని సూచించారు .తాము అందరు ఈ సభా లక్ష్యానికి పూర్తి మద్దతునిస్తామనీ తెలుగుభాష కొత్త పుంతలు తోక్కాలనీ నిర్దిష్ట  కార్యాచరణ తో పధకాన్ని రూపొందించి ,అమలు జేసేందుకు రచయితలు కృషి చేయమని కోరారు . తర్వాత ”తెలుగు వెన్నెల ”సావనీర్ ఆవిష్కరణ జరిగింది
           శాంతాబయోటేక్  అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.యి .వర ప్రసాద రెడ్డి ప్రసంగిస్తూ ,ప్రాచీన  భాషా హోదా నిలబెట్టుకోవాలి .జనాభాకు తెలుగు పాథకులకు  నిష్పత్తి విలోమం గా వుండటం బాధాకరం .దృశ్యమాధ్యమ ప్రభావం వల్ల పుస్తక పథనం తగ్గిందని ,యువత కు అవసరమైన రచనలు చేసి వారిని తీర్చి దిద్దాలని కోరారు .ఆశావాదం వైపు వారిని మల్లించాలి .సెన్సేషన్ నుంచి పాజిటివ్ దృక్పధం లోకి మార్చాలి .ఆత్మస్థైర్యం కలిగించాలి .అంతస్చేతనాను మేల్కొల్పాలి .భాష నాశనం అయితే సంస్కృతి వినాశనం అవుతుంది .విద్యార్ధులు పుస్తకాలు చదివి గోష్టిలో పాల్గొనే టట్లు చేయాలి .  ”తెలుగు అంటే ఆమని –నిరంతర సౌదామిని ”అని కవితాత్మకం గా ప్రసంగం ముగించారు .
          కేంద్ర సాహిత్య అకాడెమి కార్యదర్శి శ్రీ అగ్రహారం  కృష్ణ మూర్తి తాను తెలుగు దేశానికి చెందిన వాడినేనని కన్నడ ప్రాంతం లో వుండటం వల్ల తెలుగు మాట్లాడ లేనని తెలుగులో ప్రారంభించి ఆంగ్లం లో ప్రసంగించారు .కన్నడ ఆచయితలే ”తెలుగు తేట ”అని ప్రశంసించారని ,తెలుగుకు ,కన్నడానికి చాలా మంచి సంబంధాలున్నాయని  అకాడమి తరఫున అన్ని భాషల రచయిత లను పాల్గొనే టట్లు చేశామని ,భాషే అన్నిటి కంటే గొప్పది అన్నారు .తెలుగు అంతర్జాతీయ కీర్తి పొందిన భాష . తెలుగు లోని అభ్యుదయ వాదం ఇతరభాష లను ప్రభావితం చేసిందని తెలియ జేశారు .,
     ప్రసిద్ధ ఉర్దూ కవి ,ఇక్బాల్ పురస్కార గ్రహీత –శ్రీ షీన్ కాఫ్ నిజాం ధర్మార్ధ కామ మోక్షాలు లేని రచనలు పనికిరావు అన్నారు .”Poetic language is the   inner language of the poet ”అని తెలియ జేశారు
           సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ స్వర్గీయ ముక్కామల భూషణం  గారి సి.డి .లను ఆవిష్కరించి ముక్కామల శత జయంతిసంవత్చరం లో    ఇలా ఆవిష్కరించటం తన అదృష్టం అన్నారు .రచయితలు భాష కువెంనేముకలనీ   ,ఈ సభల తర్వాత కూడా ఈ స్ఫూర్తి తో పని చేయాలని సూచించారు .తెలుగు కధానిలయం సంస్థాపకులు,ప్రసిద్ధ కధా రచయిత శ్రీ కాళీపట్నం రామా రావు -తెలుగు కలుషితం అవుతూండటం బాధాకరమని ,ప్రసారమాధ్యమాలు భాషా కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు .ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కే.శ్రీనివాస్ -తెలుగు నిఘంటువును ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని ,దీనికోసం ప్రత్యెక ,శాశ్వత వ్యవస్థ వుండాలని సూచించారు .
          ఈ ప్రారంభ సభకు అతిధులను కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ వేదిక పైకి ఆహ్వానించారు అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు మాట్లాడుతూ ,మొదటి ప్రపంచ రచయితల సభలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయనీ ,ఇప్పటి సభలు అంతర్జాలం తో అనుసంధానం జరిగి ,తెలుగు విశ్వ వ్యాప్తమై వెలగాలన్న ఆకాంక్ష తో నిర్వహిస్తున్నామని తెలియ జేశారు .వేదిక పై పద్మ్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ,శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,డి.ఏం.ఆర్.శేఖర్ ,డెట్రాయట్ నుంచి వచ్చినడాక్టర్  ముక్కామల అప్పా రావు ,శాసనమండలి సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య ,జోర్డాన్ నుంచి విచ్చేసిన శ్రీ రమేష్ ,శ్రీ ఇమ్మడిసేట్టి రాం కుమార్ వంటి ప్రముఖులు ఆసీనులై వేదికకు ,సభకు, నిండుదనం తెచ్చారు .
           రేపటి మనుగడకు ,రేపటి పరిస్థితుల పై దృష్టి పెట్టి నిర్వహిస్తున ఈ సభలు ఉచ్చాహభారిత వాతావరణం లో ప్రారంభమై ,తెలుగు భాషా ,సంస్కృతి లను పరి రక్షించు కోవాలన తపన అందరిలోనూ కన్పించించి ,కర్తవ్య దీక్ష కు పూనుకోవాలి అన్న సందేశం ధ్వనించింది ,ప్రతిధ్వనించింది
Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరసభారతి -28 వ సమావేశం “మా అక్కయ్య ” అనురాగ కవిత సంపుటి – ఆవిష్కరణ సభ

28 వ సమావేశం – మా అక్కయ్య

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

నన్నయ్య నుంచి నా(నారాయణ రెడ్డి) వరకు నారాయణీయం – రమ్యభారతి లో … ఆర్టికల్

నారాయణీయం

Posted in రచనలు | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు – విజయవాడ 13,14,15

Prapancha Telugu 2


కృష్ణా జిల్లా తెలుగు రచయతల రెండవ ప్రపంచ మహా సభ

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్ లో హాలిడే మూడ్

       హాలిడే మూడ్ ఇన్ ఆంద్ర
            వేసవి శలవులు అయి పోయి జూన్ లో schools ,colleges తేరిచారు .బిల బిల మంటూ విద్యార్ధులు చదువులు ప్రారంభించారు .ఇదే తరుణం లో ఇప్పటి దాకా భూములకు శలవు లిచ్చిన రైతన్నలు మళ్ళీ సేద్యం పనులు ప్రారంభిస్తారు .నారు పొయ్యటం తో పనులు ప్రారంభమై ,నాట్లు వేయటం ,కలుపు తీయటం ,ఎరువులు వేసి భూమిని ఆకు పచ్చ బంగారం గా మార్చటం ,చివరకు భూదేవి పులకరించి పచ్చని బంగారం గా మారటం ,కోతలు ,కట్టివేతలు ,కుప్పలు వేయటం ,ధాన్యం నూర్పిడి ,కల్లాలన్నీ మేలిమి బంగారు రాశులు లాగా కళ కళ లాడటం .ఆ ధాన్యాన్ని ఇంటికి తొలి పురులు కట్టటం ,గాదెల్లో నిలవ చేయటం ,సంక్రాంతి మా లక్ష్మి ని పూజించి బసవన్నను ,దాసరులను ,గంగిరెద్దు మేలాలను సత్కరించటం ,ఇంటిముందు గొబ్బీమ్మలు ముగ్గుల హరివిల్లులు లతో ప్రతి పల్లె పులకరించి పోవటం సహజం గా జరిగే పధ్ధతి ఇప్పుడు దీనికి విరుద్ధం గా రైతన్న అలిగాడు .చేసేది లేక చేతులు ముడుచుకొని కూర్చున్నాడు .కదలడు ,మేదలడు .ఈ సంవత్చరం పంటకు సెలవు అన్నాడు .అన్న పూర్ణ గా విలసిల్లె ఆంద్ర దేశం లో అన్నానికే కరువు వచ్చే పరిస్థితి .దేశానికి ,వెన్నెముక అనీ ,అన్నదాత అనీ కీర్తి కిరీటాలు పెట్టటమే కాని ,అడిగిన ధర అందించే పాలకుడు కాని ,కళ్ళాల్లో అమ్ముకొనే స్థితి నుంచి బైట పడేసే నాధుడు కానీ ,కల్తీ విత్తనాలతో బతుకు భారం అవుతుంటే చూసి నివారించే అధికారి గానీ ,ఎరువులు అడిగిన వాడికి తప్ప అందరికీ సరఫరా అవుతున్నా ,కల్తీ ఎరువులు పొలాల్ని బీళ్ళు గా మారుస్తున్నా ,ఓదార్చే వాడు  ఆదుకొనే  వాడు లేక ఎన్ని మార్లు విన్న విన్చినా గోడు పట్టించుకోక పెడచెవిని పెడుతున్న ప్రభుత్వాన్ని ,దాని కొయ్యగుర్రం పాలనా అసమర్ధతను చూసి ,విసిగి వేసారి ,అలిగి ఆక్రోశించి ,మద్దతు ధరకోసం రోడ్డెక్కి అలిసి పోయి తనకున్న సమస్తాన్ని పొలం మీదే పెట్టుబడి పెట్టి అందు లోంచి కానీ కూడా రాలక పొతే ,వచ్చినా తెచ్చిన డబ్బుకు వడ్డీకి కూడా చాలకుంటే నిస్సహాయ స్థితి లో అన్నదాతలు తీసుకొన్న అసాధారణ నిర్ణయం ఇది .కడుపు మండి చేస్తున్న పంట సత్యాగ్రహం .బధిర శ్శన్ఖారవం గా మారిన ప్రభువుల కళ్ళు  ,చెవి తెరిపించే సాహసోపేత నిర్ణయం .గత్యంతరం లేకనే చేసిన పని .అదే క్రాప్ హాలిడే .                                      పూర్వం ఎప్పుడోకొన్నేళ్ళ   క్రితంపొగాకు  హాలిడేప్రకటించమని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు జ్ఞాపకం .అప్పుడూ ,ప్రభుత్వపు అసమర్ధత కే అది అద్దం పట్టింది .మనకు తిండి తిన టానికి జనం లేక కాదు .ఎగుమతులు చేసే వీలు లేక కాదు కానీ    వున్న ధాన్యం నిల్వ చేసే దిక్కు లేదు ,గోదాములు నిర్మించి ఆదు కొనే ఆపన్న హస్తం లేదు .దాచిన ధాన్యాన్ని సద్విని యోగం చేసే ప్రణాళిక లేదు .పనికి ఆహారం మాటల్లో నే కాని చేతల్లో ఎక్కడా విజయవంతం కాలేదు .అవుతుందని నమ్మించి అదంతా బడా బాబుల జేబుల్లోకి ,ప్రోక్లైనర్ల వోనర్ల పరం చేయటమే .వ్యవసాయ మంత్రి ఏమి మాట్లడుతాడో ఆయనకే తెలీదు .వ్యవసాయ విస్తరనాది కారులు వుండరు .కొత్త వారిని నియమించారు.నియమించినా వాళ్ళు చేరే నమ్మకం లేదు .వున్నా వాళ్ళు ప్రజాప్రతినిధుల బంటులు గానే వ్యవహరిస్తున్నారు కానీ  రైతు మేలు కోరి ఎక్కడా ప్రవర్తించరు .అంతా దళారీ వ్యవస్థ .గత ఏడేళ్ళు గా రాష్ట్రం అన్ని రంగాల్లో ను వెనకడుగే ఇక్కడ   అవినీతిలో ,ఆశ్రిత పక్షపాతం లో ,సెజ్ ల పేర పేదల కడుపు కొట్టటం లో ,అడివి పుత్రులను ,గిరిజనులను ,మత్చ్య కారుల్నీ వంచించటం లోను ,కారిడార్ల పేరిటా భూములన్నీ లాక్కోవటం లోను ,గనుల తవ్వకం పేరిట ఘనులకు గనులన్నీ అప్పనం గా సమర్పించటం లోను మనమే ముందు .బీహారును ,లాలూను ,మధు కొడాలను ,హర్షద్ మెహతాలను మనం మింపోయి ముందు నిలిచాము .మాటలకు చేతలకు పొంతన లేదు .ముఖ్యమంత్రి ఎవరో ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు ,పాలసీ ఏమిటో ,పదకాలేమితో వివరం వుండదు.ఇవన్నీ రైతుల పాలిటి శాపాలయాయి .సామాన్యుల పాలిటి పాశాలయాయి .అందుకే రైతన్నలు పొలం ,గట్టు చెట్టు చేమ,నీళ్ళు కాలువలు అనీ వదిలి భీష్మ ప్రతిజ్న తో దీక్ష చేబట్టారు .ఇది అందరికీ కళ్ళు తెరిపించాలి .అందరు శ్రద్ధ బట్టాలి .అంతా కలిసి నడవాలి .మనకు తిండి  పెట్టె అన్న పూర్ణ అయిన భూమాతను నిర్జీవం చేయద్దు ,పంట సిరి తో కలకలలాడే మాగాణులను ఎండు భూములు కానివ్వద్దు .త్వరగా నిర్ణయాలు తీసుకో వాళి .మళ్ళీ మన చేలు బంగారం పండాలి .అన్న పూర్ణ ఆంద్ర దేశం అన్న కీర్తి నిలవాలి .సస్య విప్లవం ,నీలి విప్లవం ,శ్వేత విప్లవం సాధించిన జాతి మనది .మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సంతరించాలి.   రైతన్న   గుండెలో గుబులు పోగొట్టాలి .గుండె ధైర్యం నింపాలి ఆసరాగా నిలవాలి .మన వెన్నెముకను మనమే రక్షించు కోవాలి .అది విరిగిన ,వంగినా ప్రమాదమే .అందరు కలిసి ముందుకు కదులుదాం దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు ధైర్యం చెప్పి ,అతని కోరికలు తీర్చి కన్నీరు తుడిచి మనమే అతనికి వెన్నెముక గా నిలుద్దాం .
             సరే ఇది ఇట్లావుంటే అసలు మనకు అంతా హాలిడే గానే కనిపిస్తోంది ఆంద్ర దేశం లో .మంత్రులు లేరు రాజీ నామా చేశారు .విధులు లేవు నిధులు మాత్రం అన్డుతున్నాయనే అంటున్నారు .శాసన సభ్యులు రాజీ నామా .వాళ్ళుఅంతే   హాయిగా అనుభవిస్తున్నారు .ప్రజలదగ్గరకు వెళ్ళక్కర్లేదు .ప్రజా సమస్యలు పట్టించుకోనక్కర్లేదు ,పనులు అడిగే వాడు లేడు చేసే వాడు లేడు .శాసన సభా సమావేశం అవదు .అయినా అక్కడేమీ జరగదని ముందే అందరికి తెలుసు speaker విదేశీ tours .కనుక అదీ హాలిడే ను ఎంజాయ్ చేస్తోంది .
                స్కూళ్ళు ,కాలేజీలు తెరిచినా నామ మాత్రమే .పనిరోజులు తక్కువ హాలిడే లు ఎక్కువ .ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలీదు .తెలంగాణా అనుకూలురు ,ప్రతికూలురు ఇద్దరు మద్దెల వాయిస్తూ అన్నిటికీ హాలిడే తో సరదా తీర్చుకొంటున్నారు  .బస్సులు తిరగవు .వాటికీ చక్రాల హాలిడే .ఫ్యాక్టరీలు పని చేయవు .వాటికి పొగ గొట్టం హాలిడే .విధులు బహిష్కరణ తో అన్నిటికీ దీర్ఘ కాల హాలిడే .కోర్టు పెట్టాలంటూ లాయర్ల సమ్మె తో కోర్తుకూ హాలిడే .హాలిడే లేనిది ,దినపత్రికలకు ,న్యూసు చాన్నేల్లకే .అవి అవిశ్రాంతంగా వార్తలు కుప్ప  పోస్తూనే వుంటాయి,చేరుగుతూనే వుంటాయి , చెండాడు తూనే వుంటాయి   ,భయపెడుతూనే వుంటాయి ,అభూత కల్పనల తో బుర్ర తినేస్తూనే వుంటాయి .న్యూస్ నాణ్యత తగ్గి వ్యూస్    కు ప్రాధాన్యత పెరిగి పోయింది పాపం పెరిగినట్లు .చిన్న సంఘటన జరిగితే కెమెరా అక్కడ పెట్టటం చొల్లు కబుర్లతో కాలమ్ వ్యర్ధం చేయటం .దీనికి హాలిడే లేదు ,రాదు ,వుంటే వాటికి మనుగడ లెదు .
          తెలంగాణా వాళ్ళు ఆంధ్రా వాళ్ళని ,వీళ్ళు వాళ్ళని తిట్టినా  తిట్టు తిట్టకుండా నాన్ స్టాప్ గా తిట్టుకొంటూనే  వున్నారు .దీనికి హాలిడే  లెదు .ఆందోళనకు బందులకు రాస్తా రోకోలకు ,బస్సులు తగలపెట్ట తానికీ హాలిడే లెదు .అనుక్షణం జరుగు తూనే వుంది .ఒకే భాష మాట్లాడుతున్నామన ఇంగిత జ్ఞానం కోల్పోయాం .ఒకే  తల్లి బిడ్డలం అని ఏనాడో మర్చి పోయాం .సభ్యతా ,సంస్కారానికీ హాలిడే ప్రకటించాం .మానవత్వానికి ముందే దీర్ఘ హాలిడే ఇచ్చేశాం .యాసిడ్ దాడులకు ,మాన భంగాలకు ,క్రౌర్యానికీ హింసకు ,ప్రతిహిమ్సకు ,నో హాలిడే స్త్రీల    పట్ల సభ్యతకు ,ప్రేమ విషయం లో బరి తెగిన్చాతానికీ, కట్నం విషయం లో బలవంతం గా గుంజటానికీ ,గృహ హింసకూ
మనం హాలిడే   ఇవ్వం .అవి నాన్ స్టాప్ గా జరక్క పొతే మన పైశాచిక ఆనందానికి హాలిడే వస్తుందని భయం .
            తెలుగు భాషకు ,సంస్కృతికీ హాలిడే ఎప్పుడో ఇచ్చేశాం .భావ దారిద్ర్యానికి ద్వారాలు ఏనాడో తెరిచే శాం .విదేశీ వ్యామోహం కు మాత్రం నో హాలిడే .అవన్నీ జాలీ డేలె  .కుంభకోణాలకు,ఆశ్రిత పక్ష   పాతానికీ ,అవినీతికీ, లంచాలకు ,అయినవాడికి ఆకుల్లో కాని వాడికి కంచాల్లోవడ్డించ తానికీ  నో హాలిడే .ప్రతిక్షణం ఇవి జరిగి పోతూనే వుంటాయి .కబ్జాలకు ,సేటిల్మెంట్లకు ,దోపిడీకి అన్యాక్రాన్తానికీ దేవునికే శత గోపురం పెట్ట తానికీ నో హాలిడే .ఇదంతాజాలీ గా  చేస్తూ అనుభవిస్తున్న హాపి డేస్
          దేశాన్ని  నేహ్రు అనుయాయులు పాలించాటానికి హాలిడే లెదు ,రాదు .గాంధి గారికి మాత్రం సెలవే .ఇప్పుడు కేంద్రం లో రాష్ట్రం లో ప్రభుత్వాలు వున్నాయని ఎవ్వరూ భ్రమించటం లెదు .అవి అధికారుల రధ చక్రాల మీదే   నడుస్తున్నాయి .మంత్రులు వున్నా కుంభకోణాల్లో దాగి వున్నారు .బయట పడలేరు .పడినా మళ్ళీ వాళ్లకు హాలిడేదొరకడు   .మళ్ళీ పదవుల్లో దూరుతారు .అదీ మన గొప్ప తనం .కుంభకోణాలకు సెలవే లెదు .యధేచ్చ గా సాగిపోతూనే వుంటాయి .ప్రధానికి అంత పెద్ద జోడు వున్నా అసలువి ఏవీ చూడ లెడు  ,వినలెడు   ,విన్నా నిర్లిప్తుడు .పాపం ఆయన చేతుల్లో ఏమీ లెదు .ఆయనా హాలిడే పురుషుడే .మొత్తం యంత్రాంగాన్ని ,మంత్రామ్గాన్ని తిప్పే మహిళకు పాపం జబ్బు చేసి దేశం వెలుపల వుంది .అందుకని ఇక్కడ పరిపాలన కు తాత్కాలిక హాలిడేస్ ప్రకటించారు .దిల్లి   సందర్శనకు పీ.ఏం ఆఫీసుకు సెలవే ఒక వేల వున్న లేనట్లే .అయితె ”జాదూ ”మామయ్యతో సంప్రదింపులకు నో హాలిడే .నిత్యం కొలువు నడుస్తూనే వుంటుంది .ఇదీ రాష్ట్ర దేశ పరిస్థితి .అంతా హాలిడే మీద నడుస్తోంది ఈ హాలిడే కి హాలిడే ఎప్పుడు వస్తుందో?ఎప్పుడు జన జీవనం శాంతి భద్రతల తో విలసిల్లుతుందో ?హాలిడే మూడ్ మారి హోలీడే   గా మారాలని అందరి ఆకాంక్ష.జాలీ  డే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ప్రస్తుతం ఈ రాతకు హాలిడే ప్రకటిస్తూ   శెలవ్ .
                 మీ దుర్గా ప్రసాద్ –10 -08 -11 .
Posted in రాజకీయం | 2 Comments

కృష్ణా జిల్లా ప్రపంచ తెలుగు రచయతల 2 వ మహాసభ ఆగస్ట్ 13,14,15… విజయవాడ లో…

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

    ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”
           జూలై ముప్ఫై తేదిశని వారం సాయంత్రం  నీ దివ్యసుందర విగ్రహాన్ని దర్శించాలని నీ సన్నిధికి చేరాం సకుటుంబ సమేతం గా .మేత అంటే గుర్తుకొచ్చింది .మా మేత ను మేమే తెచ్చుకోన్నాం దారిలో మెయ్యటానికి .భక్తీ ఎంతున్నా  బలం కూడా కావాలిగా .లోపల ఆకలి గంటలు కొట్టు తుంటే నీ గుడి గంటలు ఎలా వాయిన్చగలం స్వామీ .మర్చిపోయా అసలు గంటలే మోగించే పనే లేకుండా చేశావు .సరే స్వామీ .అధికారుల మనస్సులో దూరి కొన్ని మంచి పనులు చేయిస్తున్నా వయ్యా .మా బోటి ముసలి వారికీ ,కాలు కన్ను లేని వికలాంగులకు ఉచితం గా శీఘ్రం గా దర్శన యోగం కలిగిస్తున్నావు .చాలా సంతోషం స్వామీ .అదిగో అలాంటి దర్శనమే నేను నా భార్య ప్రభావతి చేశాం.యాభై రూపాయల టికెట్టు తో మా అబ్బాయి శర్మ ,కోడలు ఇందిరా ,మనవడు శ్రీ హర్ష ,మానవ రాలు హర్షిత ,ఉయ్యూరు  నుంచి వచ్చి మాతో చేరిన మా నాలుగో వాడు వెంకట రమణ ,కోడలు మహేశ్వరి లోపల మా లైన్ లోనే కలిశారు .అందరం రెప్పలు అర్చకుండా నీ సన్నిధి ని  నిలిచాం .ఎక్కడో చీకటి గుహలో వున్నావేం స్వామీ ?ఎంతో ఆర్భాటం గా రంగ రంగ వైభవం గా కనిపిస్తావని ఎదురు చూశాం .ఏమిటో మరీ చిన్న వాడివి గా కనిపించావేమిటి ?నాకు మాత్రమే నేమో అనుకొన్నా.అందరూ అదే మాట .ఆభరణాలూ లేవు .దండల సంభారమూ లేదు .బోసి పోయావయ్యా .మనసుకు ఎందుకో సంతోషం కలగ లేదయ్యా .అయినా నీది కటాక్ష వీక్షణమో ,ఆనంద హేలో ,అనుగ్రహ మో,తెలుసు కొనే సమయం ఎక్కడ /నీ నామాలు అన్నీ కప్పేశాయి .ఏభావము గొచరం కాదు .అదేదో మేమే అనుభవించాలని నీ టైరు భావం ఏమో .ఒక్క క్షణం నీ సుందర మంద హాస ముఖారవిందాన్ని చూద్దామనే ఆశ తో వచ్చాం.కాని ఎక్కడ నిలువ నిస్తున్నారయ్యా ?ఒకటే తోపుడు .పడ ,పడ మని విసవిసలు ,రుస రుసలు .త్తోపులాతలు తోడ తోక్కిల్లు .ఎక్కడ కింద పడతామో నని భయం చిన్న గాయలయితే నీకేమీ పట్టాడు .పెద్ద వాటికే నువ్వు భరోసా .అది సరే అంత చీకటి గుయ్యారం లో వుంది ఈ సకల భువనాలను ఎలా ఎలుతున్నావయ్య ?ఏదో ఆరడుగుల అంద గాదివని రామ ,కృష్ణుల అవతారాల్లో నిన్ను పూజించాం .నీ వైభవాన్ని ,సుందర రూపాన్ని పోగిదాం.ఇప్పుడేముంది ?నామాలే కదా స్వామీ ?అదియాన్ దాసోహమే నీకు కావాల్సింది .అది సరే అసలు నీ విగ్రహం అంత చినడైన్దేమిటి సామీ ?maayaa ?మర్మమా ?లఘు ,శూక్ష్మ లఘు దర్శనాలిస్తున్నందున నువ్వు లఘువు అయావా ?కొండలనే మాయ చేసిన నాయకులు నీకేక్కడి తిప్పలు తెస్తున్నారో నని బాధ గా వుంది .స్వర్ణ మయం అంటాడొకడు ,అనంత స్వర్ణం అన్తాదిన్కోడు ,అక్కడున్న బంగారం కంటే విలువైన శాసన సంపద ఎవరికీ అక్కర్లేదు .నువ్వు ఇవన్నీ కావాలని కోరావా ?మా కోరిక ఇలా తీర్చుకొనే ఉపాయమే ఇది .పోయింది పోగా ఇంకా వచ్చి చేరుతూనే వుంది నీ దివాణం లోకి పెన్నిధి .,
         ఒక దేశం ,ఒక ప్రాంతం అని ,ఒక మతం ,ఒక విశ్వాసమనీ ఏమీ లేదు .అందరు నీలో వారి వారి దేవతలను దర్శిస్తున్నారు .అందుకే ముజ్జగాల దొరవైనావు .విభావానికీ ,విధానానికీ కొదవ లేదు .నీకు ఏది కావాలన్నా సమ కూర్చే సంపన్నులున్నారు .సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకొనే వదాన్యులున్నారు .సేవా భావం తో సేవిస్తున్న లక్షలాది జనం వున్నారు .నీ గుది ఇక్కడ మాత్రమే పరిమితం కాదు .దాదాపు అన్ని దేశాల్లో నిన్ను వెలయింప జేసుకొన్నారు .పూజాదికాలతో ,భక్తీ ప్రపత్తులతో ,నిన్ను అనుక్షణం కొలుస్తున్నారు .కోరికలు నీకు నివేదించి ,సాఫల్యం పొందుతున్నారు .ఏ మూడింటికో నిన్ను లేపి అన్నీ నీకు నివేదించి దర్శన ప్రాప్తి కల్గిస్తున్నారు .మళ్ళీ అర్ధ రాత్రి దాకా నీకు విశ్రాంతి లేదు .ఎప్పుడు నిద్రిస్తావో ,ఎప్పుడు మేల్కొంతావో తెలీదు .సకల భువన రాక్షకుడికి నిద్రేమిటి?భోజన ,భాజనాలేమిటి .నీ కోసమా ఇవన్నీ ,కాదు మా కోసం .అన్నీ చూస్తూనే ఉంటావు .ఏమీ తెలీనట్లున్తావు .అంతా మునిగే దాకా కళ్ళు తెర్వ్వు .ఇలా అయితె ఎలా గయ్యా బాబూ?
           నీ దర్శనం చేసి విశ్రాంతి కోసం గడులున్నాఎమో నని ఇంటర్నెట్ లో వెతుకు తుంటే మూడు నెలల దాకా ఖాళీ లేవు అని తక్కున సమాధానం వస్తుంది .నిజమే ననుకొని నమ్మితే మునిగి పోవామే .తెలిసిన వాడినో ,బలిసిన వాడినో ,ఆశ్రయిస్తే అయిదు నిమిషాల్లో గది హుజూర్ అంతు ముందు నిలుచుంటుంది .నీకే పంగ నామాలు పెట్టె ఘనులు కో కొల్లలు నీ కొండ మీద .అడుగడుగునా ఏదో దగా ,మోసం .ఎలా భరిస్తున్నావు మహాను భావా /నీ దర్శనం చేసిన వారందరికీ ఉచితం గా చిన్న గోలీ కాయ సైజు లడ్డు ప్రసాదం గా ఇస్తున్నారు .బాగుంది .అందరికీ నీ లడ్డు ఉచితం గా అందుతోందని సంబర పడ్డాను .సామీ !అందులో పచ్చి సెనగ పిండి ఇంత పంచదార తప్ప ఏమీ లేదు .నువ్వు తినవుగానీకేమీతెలుస్తుంది దాని రుచి?
           ఎన్ని చూసుకోవాలి కొండపై నువ్వు ?బస్సులు ,వ్వతి సిబ్బంది ,సంబారాలు ,వసతి గృహాలు ,వాటి నిర్వహణ ,ప్రసాదాలు ,వినియోగం ,పూజలు ,పునస్కారాలు ,నిత్యకళ్యాణం పచ్చత్రనాలు ,ఉత్చవాలు ,వేడుకలు ,అడుగడుగు దండాలు ,ఆపదలు తీర్చటాలు ,హుండీ డబ్బులు ,దానికి కంటికి రెప్ప లా కాపాడు కోవతాలు ,లెక్కింపులో వెయ్యి కళ్ళ నిఘా వున్న తస్క్రులున్తూనే వుండటం ,అధికారులు ,వారికి రాచ మర్యాదలు ,మంత్రులు ,గవర్నర్లు దేశ విదేశీ ప్రముఖులు ,స్టార్లు ,సినిమా స్టార్లు ,వీళ్ళందరికీ సంతృప్తి పరచే ఏర్పాట్లు పాపం ఇవన్నే నువ్వు చూసు కో లేవని పాలక మండలిని ఏర్పాటు చేస్తే .అది నీకు శత గోపం పెట్టె స్తోంది .
            రామా రావు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు చేబట్టిన నిత్యాన్న దాన పధకం మహా భేషుగ్గా నడుస్తోంది .శ్రీ వారి ప్రసాదం గా కళ్ళ కద్దుకొని తింటున్నారు .దాని నిర్వహణా బాగుంది .దాన్ని ఇప్పుడు ఇంకా విస్తరించి గొప్ప సేవ చేయిస్తునావు .నీ కొండపై ఆకలితో ఒక్కరు ఉండ కూడదను కొన్నావా స్వామీ ?అందరికి ఉచిత భోజనమా ?ప్రపంచం లో ఇది ఎక్కడైనా సాధ్యమా ?ఇక్కడ అది సాధ్యమయింది .అన్న పూర్నా దేవి ఇక్కడ కొలువైంది .భక్తుల కోరికలు నువ్వు తీరుస్తుంటే ఆకలి ఆమె తీరుస్తోంది .అవును ఆమె నీ సోదరే కదా ?కొత్తగా వేగ్నేశ రాజు గారు ‘నిరతాన్న దానానికి సకల సదుపాయాయాలతో కట్టించిన ”తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన భవనం ”రాజు గారి భక్తీ ప్రపత్తులకు నిదర్శనం .ఒకే సారి ౫౦౦౦మన్ది భోజనం చేసే ఏర్పాట్లు బహు భేషుగ్గా వున్నాయి .ఎంతో సేవా భావం తో అక్కడ అన్న దాన కార్యక్రమం పవిత్రం గా జరుగు తోంది .భోజన సమయం లో విని పించే వేదోచ్చారణ ,ఆరన పూర్నాస్తకం వీనుల విందే కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఎరుక కలిగిస్తోంది .అన్నాన్ని నినదించ వద్దు ,అన్నాని పారేయవద్దు అని చెప్పే ఉపనిషద్ వాక్యాలు కర్తవ్య బోధ చేస్తున్నాయి .అదే భోజనం బయట వందరూపాయలు పెట్టినా లభించదు .శుచి ,శుభ్రం గా అక్కడి వారు మర్యాదగా ,గౌరవం గా ప్రవర్తించి ,అడిగి అడిగి ,మరీ తినిపిస్తున్నారు .నీ దర్శనం చేసిన వెంటనే నీ ఆలయానికి ప్రక్కనే ఇది వుండటం భక్తుల అదృష్టం .ఉత్తరాది వారికీ కావలసిన పదార్ధాలు అంటే రొట్టె చపాతి పూరీ వగైరాలు పెట్టె విధానమూ ఏర్పాటు చేసి వారినీ సంతృప్తి పరుస్తున్నావు .అయితె స్వామీ .ఒక్క మాట చెప్ప కుండా ఉండలేను .భోజనం కొంత అరవ వాసన వేస్తోంది .ఇంకా పూర్తి తెలుగు భోజనం అని పించటం లేదు .కాస్త కనికరించి తెలుగు రుచులు కలిగించు .ఇప్పుడు పెట్టె భోజనం బానే వున్నా రుచి లేదు .సారీ సామీ రుచి అంటే ఉప్పు కాదు .తినటానికి హితవు గా లేక పోవటమే .దాన్ని కాస్త పర్యవేక్షించి ఆంధ్రా భోజనమందించి ,ఆస్వాదిన్చేట్లు చెయ్యి స్వామీ .రేపటి బ్రహ్మోత్చావాలకు షడ్రసోపేతమైన భోజనం అందిస్తామని నిన్ను పాలించే సారీ నీ గుడిని పాలించే అధికారులు అంటున్నారు .చాలా సంతోషం .అప్పుడు నీను చెప్పింది కూడా గుర్తు చెయ్యి అన్న దాటా .
         నీ ఆలయ శోభ చూసే సమయం ,నీ ఆలయం లో శిల్ప కళా సౌందర్యాని దర్శించే భాగ్యం తగ్గి పోతోంది-నీ దర్శనపు తొందరలో .అవన్నే చూపించటానికి నీ ప్రచార సాధనం టి.వి వుంది గా .అందు లో చూసి తరించాల్సిందే .పూర్వం చక్రపొంగలి పులిహోర దద్ధోజనం ,వడ ప్రసాదాలున్దేవి .కొనుక్కోవటానికి దొరికేవి .ఇప్పుడవన్నీ ఎత్తేశారు పాపం ఒక లడ్డు తో నిన్ను సరి పుచ్చుతున్నారు .
            ఎంతో ఖర్చుతో నాద నీరాజనాన్ని సాయంత్రం పూట ఏర్పాటు చేస్తున్నారు .కాని అక్కడ కూర్చుని ఆస్వాదించే రసజ్ఞులు వెళ్ళ మీద లెక్క పెట్టినంత కూడా వుండటం లేదు .ఇది చాలా బాధాకరం గా వుంది స్వామీ .ఆరు ఏళ్ళ తర్వాత మళ్ళీ నీ దివ్య దర్శనం చేయించావు .నీ కళ్ళతో నిన్ను చూపించావు .కృతజ్ఞులం .లోపాలుంటాయి .సరి చేసు కోని ముందుకు సాగుదాం .జై శ్రీ వేంకటేశ .నమో నమో శ్రీ వేంకటేశ
           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -08 -11 .

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

”మో”హరించిన జ్ఞాపకాలు

”మో”హరించిన జ్ఞాపకాలు 
                    వేగుంట మోహన ప్రసాద్ ఉయ్యూరు లో అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య మరియు చెరుకు రైతుల కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకుని గా పనిచేసారు .అప్పటికే ఆయన కవిత్వపు హోరు ఆంద్ర దేశం అంతా నినదిస్తోంది .మాదాల కాశీ విశ్వేశ్వర రావు గారు ప్రిన్సిపాల్ గ పని చేస్తున్న కాలమ్ అని జ్ఞాపకం .పరుచూరి గోపాల కృష్ణ కూడా .కళాశాల ప్రారంభం లో వున్న తెలుగు లెక్చరర్ .ఇంటర్వ్యూ కువచ్చార్రు . నేను హాజరయాను తెలుగు పోస్ట్ కు .నాకు recommendation లేదు అప్పటికే నేను జిల్లా పరిషత్ లో సైన్సు టీచర్ గా పని చేస్తున్నాను అనే .. పిచ్చి బాబు కూడా చాలా తీవ్రం గా అన్ని కోణాల్లో నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు .గోపాల కృష్ణ తణుకు కాలేజి లో పని చేస్తూ వచ్చాడు .ఇంటర్వ్యూ సమయం లో ఖాళీ గ వున్నప్పుడు చాలా జోకులు పెల్చేవాడు .కధలు చెప్పే వాడు .ఇక్కడికి దగ్గరలో వున్న మేడూరు గ్రామస్తుడు .అనుభవం వుంది ,చాతుర్యం వుంది .అతను ఒక జోకు లాంటి నిజం చెప్పాడు .ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం .ఒక సారి ఒక ఆంగ్లేయుడు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ని చూడ టానికి వచ్చాడట .అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య గారు అన్నీ దగ్గరుండి చూపిస్తున్నారట .పంచదార చాలా నాన్యం గా వుందని ఇంగ్లీష్ వాడు మెచ్చాదట .దానికి సమాధానం గా గోపాల క్రిష్నయ్య గారు ”సార్ !మా మేకు ఏం మేకు సార్ మీఇంగ్లీషు వాడి  మీకే మేకు ”అన్నారట. .అంటే ,మా తయారు లో గొప్ప ఏముందండి ,మీ తయారే గొప్ప అని అర్ధం అలా మేకు బందీతో తెలుగు ఆంగ్లం కలిపి వాయిన్చాదట గోపాల క్రిష్నయ్య గారు ..ఇంగ్లీష్ వచ్చినా రాక పోయినా ఆయనకేమీ నష్టం లేదు . షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పి ఇక్కడి పారిశ్రామిక వికాసానికి ,రైతు అభ్యుదయానికీ ,కూలీల పనికి ఆర్ధిక రంగ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు ..పరుచూరి చెప్పిన ఆ మాటలు విని కడుపుబ్బా నవ్వు కొన్నాం .పరుచురికి ,పిచ్చి బాబుకు పోస్ట్ లు వచ్చాయి .అదో గొప్ప అనుభవం .ఆ తర్వాత ఇక్కడ పని చేసిన కాలమ్ లో పరుచూరి కాలేజీ లో మంచి నాటకాలు రచించి ,విద్యార్ధులతో వేయించేవాడు .మా పెద్దబ్బాయి శాస్త్రి ఆయన శిష్యుడే .ఒక నాటకం లో ఆడ వేషం వేశాడు మా వాడు .ప్రైజ్ కూడా వచ్చింది .సందడి చేయటం పరుచూరి కి ఒక కళ .ఇక్కడినుంచే నెమ్మదిగా సినిమా కి వెళ్ళాడు అప్పటికే అన్న వెంకటేశ్వర రావు ఆ రంగం లో బాగా రాణిస్తున్నాడు .ఇద్దరు కలిసి పరుచూరి బ్రదర్స్ గా సిని ఫీల్డ్ ను చాలా కాలమ్ నుంచి దున్నేస్తున్నారు .పేరు ,ప్రతిష్ట ,డబ్బు దశకం ,అన్నీ బాగానే సంపాదించారు .గోపాల కృష్ణ ఈ కాలేజీ నుంచి వెళ్ళిన వాడే నని చెప్పటానికే ఇది అంతా .
                అలాగే వేగుంట మోహన ప్రసాద్ గారు ఇక్కడ పని చేసి ఇక్కడి నుంచే విజయవాడ సిద్ధార్ధ కాలేజీ కి ఆంగ్ల శాఖ అధిపతిగా వెళ్లి నట్లు జ్ఞాపకం .అక్కడినుంచే ఆయన సాహితీ ప్రస్తానం అనేక రూపులు దాల్చి ,లబ్ధ ప్రతిస్తూ లైనాడు .ఇక్కడ వుండగా నా మిత్రుడు ,ప్రముఖ సాహితీ విమర్శకుడు స్వర్గీయ టి.ఎల్. కాంతా రావు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్చోల్ లో మాతో పాటు పని చేశాడు .మోహన ప్రసాద్ కవిత్వం అంటే మహదానంద పడి పోయేవాడు .ఆ కవితలు చదివి విని పించి మమ్మల్ని మో వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేశాడు .అప్పుడప్పుడు మో ను కలుస్తుండే వాళ్ళం .నేను పెద్ద గా మాట్లాడే వాణ్ని కాదు .కారణం ఆయన కవిత్వపు లోతు పాటులు నాకు తెలీవు .కాంతా రావు కు కొట్టిన పిండి .అప్పటికే రావు ఆంగ్ల కవులు ఫ్రెంచ్ ,కగ్ర్ర్మన్ కవుల కవితలన్నీ పుక్కిలి పట్టాడు .నేను ఇంకా ప్రవేశమే చేయని వాడిని .అతనితో పాటు నేను .ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాష్టారు రామ రావు ,జ్ఞానసుందరం ,కలిసే వాళ్ళం .మో కొంత గంభీరం గా వుండే వాడు .మూతి బిగించే వుండేది .ఉండాల్సిన కొలత కంటే రెండూ మూడు అంగుళాల పొట్టి చొక్కా వేసే వాడు .తమాషా గా వుండేది నాకు .చేతిలో అణు క్షణ అగ్నిహోత్రం..కాంతా  రావు మాట్లాడు తుంటే వినటమే మా పని .అయితె ఆప్యాయం గా పలకరించే వాడు మో రాసిన చితి చింత కవిత కు అవార్డ్ వచ్చినపుడు కాంతా రావు సంబర పడి పోయాడు .ఆ పుస్తకం నాకు ఇచ్చి చదవ మన్నాడు .చాలా సార్లు ప్రయత్నించా .అందు లోకి నేను ప్రవేశించలేక పోయాను .నాకు అర్ధం కాదని తేలిపోయింది పుస్తకం తిరిగి ఇచ్చేశాను .కాంతా రావు ఆ పుస్తకం మీద చాలా గొప్పగా మాట్లాడే వాడు .వ్యాసాలు రాసిన జ్ఞాపకం .మో పెదిమలు కొంచెం మొద్దు గా వుంటాయి ఆయన కవిత్వ లక్షణం లాగా నేమో .తర్వాత కాంతా రావు కూడా విజయవాడ సిద్ధార్ధ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా చేరి ఇక్కడినుంచి వెళ్లి పోయాడు .అక్కడ మో తో మొదట్లో చాలా స్నేహం గానే వుండే వాడు .కాంతా రావు  బోలా  వాడు .అందరినీ నమ్మేస్తాడు .అది విజయవాడ .ఎన్ని రకాల మనుషులుంటారో తెలీని అమాయకత్వం లో కొంత కాలమ్ వున్నాడు .చివరికి blood is thicker than water  అని తెలుసు కున్నానని కనిపించినపుడల్లా చెప్పే వాడు .అక్కడ సావాసా దోషం అతన్ని మృత్యువుకు అతి త్వరగా చేర్చటం జీర్ణించుకోలేని విషయం .
                    వేగుంట అంటే నాకు ఎందుకో వాళ్ల నాన్న గారు వేగుంట కనక రామ బ్రహ్మం గారు జ్ఞాపకం వస్తారు .ఏలూరు దగ్గర వట్లూరు లో ఆయన ప్రతి ఏడు సభలు ,సమావేశాలు నిర్వహించి ,లబ్ధ ప్రతిస్తులైన వారి నందర్నీరప్పించి   విందు భోజనాలు ,గోస్టులు ,చర్చలు జరుపుతుందే వారు .ఇవన్నీ పేపర్ లో చదివే వాడిని .అ సభలు దేని గురించో ,ఎవరెవరు వచ్చే వారో నాకు జ్ఞాపకం లేదు .అంటే మో కు కూడా తండ్రి వారసత్వం అబ్బి ఎప్పు డు పది  మందితో వుండటం కని పించేది .బెజవాడ లో జరిగే ప్రముఖ సభలన్నిటికీ హాజరు వేయించుకొనే వారు .అవసరం వస్తేనే మాట్లాడే వారు .పత్రికల వాళ్ళందరికీ ఇష్టుడు .radio  లో చాలా ప్రసంగాలు చేశారు .ఆయన చెబుతుంటే వినటం ఒక ఆనందం .మాట తడబడదు .ఎక్కడో మొదలు పెట్టి ఎకదికేక్కడికో తీసుకు పోతూ,యేవో శిఖరాలు ఎక్కిస్తూ ,అమాంతం గా లోయలోకి నెట్టేస్తూ ,చేయి పట్టుకొనినది  నడి సంద్రం లో ఈదిస్తూ ,చేయి వదిలేసి ,భయపెడుతూ ,ఆటగా పాటగా సాగుతుంది ఆయన రాత అయినా ప్రసంగమైనా .ఎంతమంది కవులుకళా కారులు  రచయితలు ఆయన ముని వెళ్ళ మధ్య ఉంటారో ఆశ్చర్యం వేస్తుంది ..ఆ ప్రవాహానికి ఒరవడికి ఉక్కిరి బిక్కిరి అవుతాం .తాను మాత్రం చిదానందం గా నే ఉంటాడు .ఇంతవరకు ఆయన కవిత్వం లో నాకు ఒక్కటి కూడా అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు .అది నా లోపమే .అందులో ప్రవేశించే ఓర్పు ,నేర్పు మనకు వుండాలి కాని ఆయనేం చేస్తాడు .అందుకనే నాకు అనిపిస్తుంది కన్యా శుల్కంలో  గిరీశం తో గురజాడ అనిపించినట్లు ”algebra made difficult  ”లాగానే పాపం మో కూడా కవిత్వాన్ని most difficult గా మార్చేశా డేమో నని . .
             అతను విషాదాన్ని ప్రేమిచాడు .నిరీహలో మునిగి పోయాడు .రహస్తంత్రిని మీటి రసనాడుల్ని కదిలించాలను కొన్నాడు .అయితె అతని ఆవేశం ముందు అతని కవిత్వం ఒంకర్లు కొంకర్లు పోయింది .అలవి కాని గుర్రం అయిందేమో అనిపిస్తుంది .విషాద మోహనం మోహన విషాద మయింది .ప్రపంచాకవులు ,దేశీయ కవులు అతని ఆక్రమించుకొని ,నడిపించారు .ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి చేరు తాడో తెలీని నట్టడవి మార్గ గమనం అని పిస్తుంది .విశ్వ మానవ సంవేదనకు సంకేతం గా నిలబడాలన్న ఆకాంక్ష మో ది .అది ఎంతవరకు సాధించాడో తెలిసిన వాళ్ళు చెప్పాలి .తన కవితా త్న్త్రులతో జగతిని మేలు కొలిపే కవి తనమెదడు    లోని తంత్రులే తెగి ,రక్తం గడ్డ కట్టి మెదడు స్తంభించిన అచేతన స్థితి లో కొన్ని గంటల కాలమ్ వున్నా డంటే అమితాస్చర్యం వేస్తుంది  మెదడును  కదిలించే కవిత్వం చెప్పిన వాడి మెదడు డెడ్ అయిందంటే విధి వైపరీత్యాన్ని ఏమను కోవాలి ?
                 ”ఆట కదరా శివా ”అని శివ సాన్నిధ్యం లో నిరంతరం సంచరించే తనికెళ్ళ భరణి కి మో ఆప్తుడు ఎలా అయాడా  అని నాకు తీరని సందేహం .అంతేకాక తన పేరిట ఇచ్చే మొదటి పురస్కారం మోకు అందివ్వటం మరీ విడ్డురం .ఇద్దరి జన్మ సంస్కారాలకు అవి తీపి గురుతులు .అనిర్వచనీయ స్నేహ ,సోశీల్యాలకు హారతులు .
               కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం లో అనువాదకుడు గా పనిచేసి నిజంగా తెలుగు సాహితీ లోకానికి అమూల్య సేవ లందించాడు మో .రావి శాస్త్రి కదల ను ఆంగ్లం లోకి అనువదించటానికి పడిన శ్రమ ,తీసుకొన్న శ్రద్ధ ,ఎంపిక చేసుకొన్నా విశిష్ట వ్యక్తుల తీరు చూస్తె ఆయన perfection కు యెంత విలువ నిస్తాడో నాకు అర్ధమయింది .ఆ పుస్తకాన్ని అమెరికా లో మేము వుండగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారునాకు పంపించారు .అప్పుడే చదివాను .చాలా గొప్ప అనువాదం .రావి శాస్త్రి గారి తెలుగు అంతా అందులో దిగుమతియింది .ఆశ్చర్యం కలిగించింది .మో ఇంకా ఏయే అను   వాదాలు చేశారో తెలీదు కాని ఏది చేసినా ఆయన ముద్ర వుండటం ఖాయం .
               కృష్ణ జిల్లా రచయితల సంఘం ద్రావిడ విశ్వ విద్యాలయం సంయుక్తం గా నిర్వహించిన అనేక కార్య క్రమాల్లో మోహన ప్రసాద్ వచ్చి ,మౌన ప్రేక్షకుని గా వుండే వారు  ఆయన   రాక  కోసం అభిమానులు ఎదురు చూసే వారు ..ఆయన రాక నిండుదనం తెచ్చేది .తన దేహాని పరోపకారం కోసం అవయవ దానం చేసిన మానవీయ మూర్తి .మో ను నిర్వచించటం కష్టం .అనిర్వచనీయం ఆయన కవిత్వం ,వ్యక్తిత్వం .మో అంటే మోహన కవిత్వం లో ముంచే వాడు .మో అంటే మొగమాటం లేని వాడు .మో అంటే మొద్దు నిద్ర వదిలిన్చేవాడు .మూక కవిత్వాన్ని పక్కకు నెట్టి  ,ప్రత్యేకతకు ముందు నిలిచేవాడు ,.మో కవితకు పదార్ధ నిఘంటువు అవసరం.దాన్ని రూపొందించే కృషి లో మో అభిమానులు ముందు నిలవాలి . మో ఒక్కడే ఒక కవితా శిఖరం .దాని పైకి పాకాలంటే గుండె ధైర్యం కావాలి ప్రతిభ కావాలి ,అనుభూతి చెందే హృదయం కావాలి .లేకుంటే అదొక సంక్లిష్ట కల్లోల కాసారమే .దిగిన కొద్దీ లోతు ,ఊపిరి సలపని ఉత్కాన్త ,వేదన ,సంవేదన ,విషాద నిషాద భరిత ఆక్రోశం ,ఆవేదన అంతు చిక్కని శోధన
               నాకు తెలుగు సాహిత్యం లోముగ్గురు విలక్షనులు   కనిపిస్తున్నారు .ఒకరు కదా రచయిత త్రిపుర ,రెండు నవలా రచయిత వడ్డెర చండీ దాసు ,మూడు modern   కవి మో  ..ముగ్గురూ ముగ్గురేఅర్ధం కారు .అర్ధం చేసుకో కుండా ఉండలేము . అర్ధం అయినట్లు నటించను లేము ..
                         మీ — —  గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు –04 -08 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | 1 Comment

శాస్త్ర వేత్త ఆర్థర్ సి..క్లార్క్

        శాస్త్ర వేత్త  ఆర్థర్ సి..క్లార్క్
—                     దాదాపు 900 రచనలు చేసిన ఆర్థర్ క్లార్క్ 1917 లో డిసెంబర్ 17 న జన్మించాడు . ఏడవ ఏడునుంచి శిలాజాల మీద ,డినోసార్స్,మీద FLYING   మీద  ద్రుష్టి నిలిపాడు .స్వంత TELESCOPE ను ,రాకెట్ ను తయారు చేశాడు .తండ్రి టెలిఫోన్ ,టెలిగ్రాఫ్ లలో పని చేశాడు .తల్లి ,సోదరుడు కూడా TELEGRAPHISTS పద్దెనిమిది ఏళ్ళ వయసు లోనే port ఆఫీసు లో పనిచేసి ,TRANSMITTER ,CRYSTAL RADIO సెట్ తయారు చేసిన  సృజన ఉన్న వాడు .అతని టీచర్స్ అతని పై మంచి ప్రభావం చూపించారు .కధలు బాగా చెప్పే నేర్పు వుండేది .బాబి పియర్స్ అతనికి ఫిజిక్స్ ,MATHS బోధించిన గురువు . .
డబ్బు లేక యూనివెర్సిటీ  .లో చదవ లేక పోయాడు .సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ,ఆ డిపార్ట్మెంట్ లో నే పని చేశాడు .18 ఏళ్ళ వయసు లో లండన్ చేరాడు .SPACE TRVEL మీద ,సైన్సు FICTION .మీద శ్రద్ధ చూపాడు . SPACESHIP తయారు చేయటం లో సాయ పడ్డాడు .ASTRONOMY మీద శ్రద్ధ పెరిగింది .CELESTIAL NAAVIGATION చదివాడు .ఇంతటి తో ఆగలేదు ELECTONICS లో శిక్షణ పొందాడు .”mORE TELEVISION WAVE FORMS ”అనే గొప్ప వ్యాసం రాసి అందరి ద్రుష్టి లో పడ్డాడు .GLIDE PATH అనే FICTION రాశాడు ..” principle of communication satillites ”మీద చాలా వివరణాత్మక         వ్యాసాలు  రాసి  ,ఆ  రంగం లో అభ్యుదయానికి   బాటలు   వేశాడు     .స్పేస్  fiction మీద preludes   రాశాడు .
                        ఫిజిక్స్ abstract అనే పత్రిక కు సహాయ సంపాదకుడై నాడు .humorous stories about psuedo science పేర చాలా కధలురాసి   అందర్నీ ఆకర్షించాడు .ఇవన్నీ  ”Tales from the white heart ”పేర ప్రచురితం .అయాయి .తాను రాసే వాటికి ఉద్యోగం అడ్డం గా వుందని భావించి పూర్తి కాలమ్ రచయిత అయాడు .స్పేస్ travel మీద శాశ్రీయ అవగాహనతో ”ఇంటర్ planetary ఫ్లైట్ ”పుస్తకాన్ని ,”An introduction to astronautics ”ను రాశాడు .ఈ రెండూ సామాన్యులకు ,ఆ రంగం లో అవగాహన కల్పించ టానికే రాశాడు .తర్వాత మొదటి సారి అమెరికా కు వెళ్ళాడు . తాను రాశిన ”The exploration of space ”పుస్తకాన్ని అమెరికా లో ప్రచ్రించాడు .1952  లో   newyork     radio   ,టి.వి.  ప్రొగ్రమ్మెస్ లో  పాల్గొన్నాడు .తనకున్న శాస్త్రీయ ఆవ గాహన తో ”The sands on Mars ” రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈయన రాసిన ”స్పేస్ ఒడిస్సే ”అనే పుస్తకం( 2001 )యాభై సార్లు ముద్రణ పొంది మూడు మిలియన్ల కాపీలు అమ్ముడయి రికార్డు సృష్టించింది .
                      లండన్ కు మళ్ళీ చేరాడు క్లార్క్ .ఒకే సమయం లో చాలా ప్రాజెక్ట్స్ చేబట్టి విజయ వంతం గా ముగించాడు .”Childhood ”s end ”పుస్తకం రాశాడు .అదే సమయం లో ”Expedition to Earth ”రాసి ఆశ్చర్య పరిచాడు .1953 లోమళ్ళీ అమెరికా వెళ్ళాడు  ఫ్లోరిడా లో diving నేర్చుకొన్నాడు . పెళ్లి చేసుకొన్నాడు కాని ఆరు నెలల్లో పెదాకులు .,విడాకులు ..ఎప్పటికి అప్పుడు కొత్తది ”నేర్చుకోవాలనే తపన .అందిన దానితో తృప్తి పడ లేదు .తర్వాత ద్రుష్టి అంతా ఇప్పుడు సముద్ర యానం మీద పడింది .1956 లో సింహళం లో స్థిర పదాలని పించింది .”The fortunes of paradise
రాశాడు .”Deep range ,dolphin island ,imperial earth ”అనే fiction  పుస్తకాలు రాశాడు ఇరవై ఏళ్ళు శ్రీలంక లో నే వున్నాడు . అక్కడి tax సమస్యల వల్ల లంకను ఆరు నెలలకు ఒక సారి వదిలి విదేశాలకు వెళ్ళే వాడు .తర్వాత  ,బ్రిటిష్ పోరాసత్వము పొంది ,లంక లో ఇల్లు కొనుక్కున్నాడు .ఒక దేశ పౌరిడిగా వుంటూ  ,వేరొక దేశం లో స్థిర నివాసం పొందిన ఘనుడు క్లార్క్ .లంక లో residential స్టేటస్ పొందాడు .1976 లో లంక ప్రభుత్వం ”the  clerk act ‘  ‘తెచ్చింది ‘  ఇతరదేశీయులు లంక లో స్వంత ఇంటిలో వుంటే పన్ను కట్టక్కర లేదు అని సారాంశం ..ఇది ఆయన కోసమే చేసినా ,చాలా మందికి ప్రయోజనం కలిగింది .తెచ్చింది ..residential గెస్ట్ గా మొదట గుర్తింపు పొందిన వాడు క్లార్క్ .
                   ప్లే బాయ్ లాంటి పత్రికలకు రాస్తూనే వున్నాడు .”A fall of moon dust ”అనే సీరియల్ రాశాడు .శ్రీ లంక సముద్రం లో మునిగి ఈత కొడుతుంటే రెండు లోయలు ,చాలా వెండి నాణాలు కని పించాయి /.తన యాత్రను ”indian ocean treasure ”గా రాశాడు .తరువాత ” the treasure of the great reef ”అనే రెండవ పుస్తకమూ రాశాడు .1962 లో gummam తగిలి రక్తం గడ్డ కట్టి పక్షవాతం వచ్చింది పాపం .అయినా రచన మాన లేదు ‘ తర్వాత ఓల్డ్ polio జబ్బు చేసింది .”The ghost from the grand banks ,the hammer of god ,garden of Rama ,Rama revealed ”పుస్తకాలు అంత వ్యాధి లోను రాసి తన వ్యాధిని రాతతో జయించే పని చేశాడు .ఎన్నో విశ్వ విద్యాలయాలాకు వెళ్లి అద్భుతమైన ఉపన్యాసాలతో విద్యార్ధులను ,శాస్త్రీయ అవగాహన పొందేట్లు స్ఫూర్తి నిచ్చాడు .స్వంత తెలివి తేటలతో సృజన తో ,పరిశోధన తో ,అరుదైన రచనల తో ప్రభావితం చేసి ఆదర్శ ప్రాయుడైన శాస్త్ర వేత్త గా నిలిచాడు ,ప్రజా హృదయం గెలిచాడు అర్హర్ సి,క్లార్క్ .ధన్య జీవి .సకల కళా ప్రవీణుడు .
                               మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 –క్యాంపు –బెంగళూర్    . –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | Leave a comment

చంద్ర నివాసం

    చంద్ర నివాసం
                 చంద్ర  యానం తేలికై పోయింది .అక్కడ వుండి జనంజీవించాలంటే చాలా కష్టమే .దాన్ని వాస యోగ్యం చేసు కోవాలి .భూభారం తగ్గించి చంద్ర లోకం లో నివశించాలని అందరు ఉబలాట పడుతున్నారు .స్థలాల అమ్మకాలు జరుగు తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే .పూర్తి జన జీవితం అక్కడ వర్ధిల్లాలి అంటే ఏమి చేయాలి అని శాస్త్రజ్ఞులు బుర్రలు బద్దల కొట్టు కుంటున్నారు .అయితె అది అసాధ్యం కాదు ,కష్టమైనా సుసాధ్యమే నని తెలియ జేస్తున్నారు .దానికి అనుసరించాల్సిన వ్యూహాలను రచించు కొని వాటి ప్రకారం నడిస్తే చంద్ర నివాసం తేలికే నని నీల్ అనే స్పేస్ శాస్త్ర వేత్త చాలా వ్యాసాల ద్వారా ఊహించి సూచించారు .అందు లోని కొన్ని విషయాలు మీ ముందుంచుతున్నాను .
                       ముందుగా చంద్రుని పై మూడు islaands   ను ఏర్పాటు చేయాలి మొదటి islaand ను చాలా పెద్ద గోలాకారపు  donut shape   వున్న  tori లాంటిది ఏర్పాటు చేయాలి .దీనిలో మనకు కావలసిన ఆహార ధాన్యాలనుకూరలు పండ్లు  పండించుకో వచ్చు ..ఇది స్వయం పోషకం గా వుండే collony  లాగా పని చేయాలి అంతే కాక భూమికి ఆర్ధికం గా సాయం చేసే ట్లు నిర్వహించు కోవాలి .ఇది ఒక పక్కా గా    చాలా పెద్దది గా వుండాలి /.భూమి చంద్రుల మధ్య సయోధ్య వున్నంతకాలం ఇది  ఉండాల్సిందే .ఎల్.  5 అనే   సొసైటీ ఏర్పడాలి .ఇది స్పేస్ లో colonization ఏర్పరిచి ,,దీన్ని నేషనల్  స్పేస్ institution తో కలిపేయాలి .దీని వల్ల ఇప్పుడు నేషనల్ స్పేస్ సొసైటీ ఏర్పడుతుంది .
        రెండవ island  గురించి తెలుసు కొందాం .చంద్రుని మీద workers  కోసం కాలనీ ఏర్పాటు చేయాలి .  ఇది మాస్ డ్రైవర్ లాగా పని చేయాలని నీల్ భావించాడు .ఇందులోని   ఎలెక్ట్రో మాగ్నెటిక్ re -circulating conveyor బెల్ట్ లెక్క పెట్ట టానికి వీలు లేనన్ని buckets ను అనంతం గా లునార్ పదార్ధం తో నింపి ఎల్ five కు అంటే పైన చెప్పిన చోటికి పంపుతూనే వుంటుంది .దీనితో అక్కడ నిర్మాణ కార్య  క్రమాన్ని నిరాఘాటం గా కోన సాగించ వచ్చు .ఇది ఆరు వేల అడుగుల పొడవు ఉండి ,నాలుగు మైళ్ళ eqatorial పరిధి  తో ,140 ,౦౦౦  ల జనాభా j తోఉంటుందట .  .
                             island  –3  అన్నిటికంటే పెద్ద ది. .నాలుగు మైళ్ళ వెడల్పు ,ఇరవై మైళ్ళ పొడవు తో 500 చదరపు మైళ్ళ వైశాల్యం తో వుంటుంది . ఈ దీవిని మామూలు material  తో కట్ట వచ్చునట .అంటే ఇనుము ,అల్యుమినుం ,స్పెషల్ గ్లాస్స్ , లను ఉపయోగించి కట్టచ్చు .అయితె దీనిలో oxygen పీడనం  సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తున వున్నట్లుఎనభై మైళ్ళ పొడవు ,పదహారు మైళ్ళ వెడల్పు తో వుండాలి .స్విర్జేర్లాండ్ లో సగం అన్న మాట ఇక్కడ artificial గ్రావిటీ వుంటుంది భూమి మీద ఉన్నట్లే ఇక్కడ కూడా ,గాలి ,భూమి ,నీరు ,సహజ సూర్య కాంతి
లభిస్తాయి .20   మైళ్ళ  పొడవు ఇరవై మైళ్ళ వెడల్పు వున్న cylinders .  ఒకదానికి ఒకటి  సమాంతరం గా నిర్మించి ,వాటి చివరలను అర్ధ గోలాకారపు మూత లతో మూసేయాలి .ఆ సిలెండర్లు భ్రమణం చెందు తూంటే గ్రావిటీ ఏర్పడు తుంది .ఒక అద్భుత మైన లోయ లో ఉంటున్న అనుభవం కలుగు తుందట  దీనినే కమ్యునిటీ అంటారు . సూర్య కాంతి నే శక్తి జనకం గా ఉపయోగిస్తారు .ఇక్కడ మచ్చు కైనా తుఫాన్లు ,మంచు ,వరదల బెడద ,మంచు తుఫాన్లు ఉండక పోవటం ఆశ్చర్యం కల్గిస్తుంది .;ఇంకో విశేషం ఏమిటంటే చలి కాలమ్ అనేది ఇక్కడికి ప్రవేశించనే ప్రవేశించదు .ఈ మూడవ islaand లో
పది మిలియన్ల జనం నివశించ వచ్చునట    మనుష్యులతో పాటు ,కోళ్ళు ,టర్కీలు ,పందులను కూడా పెంచుకో వచ్చు నట ఇక్కడ ..ఇన్ని అవకాశాలుంటే ఎందుకండీ భూమిని నమ్ము కోని వుండటం?కొంప ,గోడు మ్ముకొని చంద్ర మండలం పై .జెండా పాతెద్దాం.భూమి మీద జన సమ్మర్దం తగ్గిద్దాం ..అయితె బాబుల్లారా.!ఇవన్నీ శాస్త్ర వేత్త నీల్ గారి ఊహలు .అవి ఆచరణ లోకి రావటం ఎప్పుడో ?మనం చంద్ర సదనం చేరటం ఎప్పుడో ?నిరాశ వద్దు .నేటి శాస్త్ర వేత్త ఊహే రేపటి ఆవిష్కారం అని చాలా సార్లు రుజు వైంది .జలాంతర్గామి ,చంద్ర మండల యాత్ర missile ఇవన్నీ ఊహల్లోంచి అంటే సైన్సు fiction లోంచి సైంటిఫిక్ truth గా మారినవే ..”ఉందిలే మంచి కాలమ్ ముందు ముందునా ”అని పాడు కొంటు ఎదురు చూద్దాం .
                                                 మొత్తం మీద మొన్న కుజ గ్రహం మీద ,ఇవాళ చంద్రగ్రహం మీద నివాసం వుండే అవకాశాలు  అన్నీ చూసారు నాతొ పాటు వచ్చి..థాంక్స్
                                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 .క్యాంపు—బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

మూడు దేశాలు –భిన్న భావాలు

—                                                               మూడు దేశాలు –భిన్న భావాలు
                                                       
                                                                      భూటాన్
                        హిమాలయ రాజ్యం భూటాన్ .బౌద్ధం వ్యాపించిన దేశం .మానవాభి వృద్ధికి భూటాన్ ఒక ప్రయోగ శాల అంటారు .”నా తలిదండ్రులు అనేకులు.వారిని బాధించకుండా వుండాలి ”అన్నది భూటాన్ సూక్తి .నేరాల రేట్ బాగా తక్కువగా  గా వున్న దేశం .హత్య అనే మాట  ఇక్కడ ఎక్కడా వినబడదు .సగటు ఆయుర్దాయం 42 నుంచి   64     సంవత్చారాలకు పెరిగింది ఈ దేశం లో శైనికుల కంటే బౌద్ధ సన్యాసులు ,గురువులు ఎక్కువ .ఇక్కడ పొగాకు అమ్మకం నిషేధించారు .ఇక్కడి సైన్యం liquor తయారు చేస్తుంది అంటే అంత తీరిక  గా వుంటారు . అందులో రెడ్ పాండా బీర్ ,డ్రాగన్ రం ప్రసిద్ధ మైనవి .వీరికి  13   నెంబర్   చాలా లక్కీ నెంబర్ .మార్జువానా ను అసలు వాడరు .దాన్ని పందులకు ఆహారం గా పెడతారు .దాన్ని తింటే ఆకలి బాగా వేసి తిండి బాగా తిని పందులు దున్న పోతుల్లా బలుస్తాయ ట ఇక్కడ ”ల”అనే మాట ఎక్కువగా వినపడుతుంది అంటే సర్ అని అర్ధం .మర్యాద బాగా వుంటుంది .శాంతి కాముకులు .అహింసను ఆచరణ లో పాటిస్తారు . . .
                                                            క్వటార్
                       ఈ దేశం గ్యాస్ మీద నిర్మించబడిన దేశం .ప్రపంచ చమురు నిల్వ వున్న దేశాల్లో ఇది మూడవది .అంటే సహజ వాయువు విరివి గా లభించే దేశం .అక్కడ లభ్యమవుతున్న గ్యాస్ తో అమెరికా లోని మొత్తం జనాభా 100   ఏళ్ళు heat ను పొందవచ్చట స్త్రీలు కార్లు నడుపుతారు .వోట్హక్కును విని యోగించుకొంటారు ప్రజలు ఎక్కువ కాలమ్ ఆరోగ్యం తో జీవిస్తారు . అయితె ఎక్కువ శాతం మంది సేవకులే .ఇక్కడి భూమిలో 98 శాతం ఎడారే .మిగిలిన నివాస భూమి రెండు శాతమే .ఇసుక తుఫానులు రెండు వందల అడుగుల ఎత్తుకు వస్తాయి అందుకనే వలసలు పోతుంటారు .  .
  ఒక క్షణం వున్న భూమి మరు క్షణం కన్పించాడు  ,అభద్రతా ,.. .అనిశ్చిత పరిస్థితి  అంత ఎక్కువ గా .  వుంటుంది ప్రజా జీవితమంతా పై కప్పు లేని ఇళ్ళల్లోనే .”The ground means the sand is literally shifting from their feet ”నీతి ప్రవ్వాహం కాళ్ళ కింద ఇసకను తొలగిస్తున్నట్లు ఇసుకే ఇక్కడ జారి ,పారి పోతుంటుంది .ఇసుక సముద్రం లో చుక్కాని లేని స్థితి వారిది .
                   వీళ్ళ చరిత్ర క్రీస్తు శకం 650 ఉంచి 1600 వరకు రికార్డు చేయబడ లేదు .తమకు అంటూ స్వంత సంస్కృతీ లేని వాళ్ళు .ఇవాళ సంస్కృతీ తో చాలా comfortable   ఈ దేశం లో lotteries బాగా ఎక్కువ .
                                                         మోల్డోవా     
                  ఈ దేశం పూర్వ soviet union లోనిది చాలా చిన్న దేశం .ఇక్కడ దరిద్రం ,బాధలు చాలా ఎక్కువ . దీని రాజ ధాని chisinow ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతారు .వీళ్ళు పూర్వం రోమన్లు .అదే వీరి చారిత్రిక వెళ్ళు అక్కడే వున్నాయి .యునియన్ లో వున్నపుడు ఏ దేశానికి అయినా వెళ్ళే హక్కు వుండేది .ఇప్పుడు యుక్రెయిన్ కు తప్ప ఎక్కడికి వెళ్ళా లన్నా వీసా కావాల్సి రావటం వీరి దుర దృష్టం . వీరి ఆరాధ్య రచయిత పుష్కిన్ ..ఈ దేశం కంటే బీదరికం లో వున్న దేశాలు సంతోషం గా వున్నాయి .విధి వీరి జీవితాలతో ఆడుకొని విధి వంచితులను చేసి ,సంతోషాన్ని ,ఆనందాన్ని దూరం చేసింది ..దీనికి కారణం చుట్టూ వున్న దేశాలు బాగా ధనిక దేశాలవటమే ..వారి మనోభావాన్ని వారి మాటల్లో విందాం  ”.”we have been abused and.abandoned by every where .We have no pride in any thing .Not even our language ”. వాళ్ల మంత్రులు కూడా కంత్రీలే.అంటున్నారు .వాళ్ళు కూడా స్వంత భాష లో మాట్లాడారట .రాస్ష్యాన్ భాషే మాట్లాడు తారు అని ఈసడిస్తారు .మాల్దోవాన్సంస్కృతి అనేది నాశన మై పోయిందని విచారిస్తున్నారు .ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడు కొనక పొతే మిగిలేది శూన్యమే .ఇది అన్ని దేశాల వాళ్ళు గ్రహించాల్సిన పరమ సత్యం .ఇది వరకు చెప్పు కొన్న క్వటార్ దేశం ధనిక దేశంకాని అక్కడ సంస్కృతీ లేదు .ఇది బీద దేశమైనా సంస్కృతీ నాశనం అయింది ..
అందుకనే ఈ దేశాన్ని  ”least happy place in the soviet union ”అంటారు .ఇక్కడి భాష లో ce  sa fac అంటే ‘ ”what  can   i  do ” అని అర్ధం .?
                        ఇప్పటి మన దేశం లో లాగా అవినీతి ,లంచగొండి తనం పుచ్చి పురుగులు కారుతోంది అక్కడ .35 ఏళ్ళ లోపు వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్ళారట .దీనికి కారనక్మ్ డబ్బు తో డాక్టర్ డిగ్రీ కొన్నారని భయం .అధికారులన్న ,ప్రజా ప్రతినిదులన్న డాక్టర్స్ ఆనా ,engineerlu అన్న ,మేస్టార్లు అన్న అందరికీ సంకోచమే .అపనమ్మకమే కారణం .నమ్మకం లేని చోట బ్రతుకు యెంత దుర్భరమో వాళ్ళను చూస్తె తెలుస్తుంది .పెద్దలన్నా ,మరణించిన వారన్నా అపార గౌరవం వీళ్ళకు .ఏడాది కో సారి జాతీయ శలవు దినం వుంటుంది .పెద్దలను ఆత్మీయం గా గొప్ప గా సన్మానిస్తారు .అందుకనే  .
”Moldovans treat the dead better than the living ”అని అనుకొంటారు .”పోయినోళ్ళు ఎప్పుడు మంచోల్లే”    అన్నది బాగానే వుంది ”  వున్న వొళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ”అని మాత్రం భావించక పోవటం విచార కరం .మర్యాద రామన్నలు ఆయె స్థితి వాళ్లకు లేదు .నిత్య విచార గ్రస్తులు ,బాధా సర్పdastulu.happin ess అనేది వీళ్ళ జీవితాల   లోంచి తొలగి పోయింది పాపం .  . .                     రాస్ష్యాన్ భాష లో schaste  అంటే happiness .జెర్మనీ ఆ ”గో మెన్ నసి ”అంటే ”i am sorry ”.అయితె ఇంత మర్యాదగా మాట్లాడటం  మాల్డోవ సంస్కృతీ లో లేదు .వాళ్ల డి  అంతా rough అండ్ తౌఘ్  ”The seeds of Maldovan unhappiness are planted in their culture ..A culture that be littles the value of trust and friend ship ”అని తెసిన వాళ్ళు సానుభూతి చూపిస్తారు .అందుకనే సెయింట్ Augustine .  ”the happiness  of hope ”కావాలని అంటాడు .  . భారత దేశం లో  ”Hope is the sheet anchor of every man .When hope is destroyed ,great grief ఫోల్లోవ్స్ which is almost equal to death itself ”   అని భావించి ముందుకు దూసుకు పోతారు
               చివరగా  జర్మన్  తత్వ వేత్త Schopenhauer అన్న మాటలు అందరం మననం చేసు కొందాం ”Because they feel unhappy ,,,–men cannot bear the sight of some one they think is happy ”
                       మోల్డోవా దేశ ప్రజల జీవితాలలో ఆనందం వెల్లి విరియాలనీ ,దానికి కావలసిన ఆశ ను వారు ఆహ్వానించి బతుకు భయం నుంచి బయట పడి మిగతా సోదర దేశాల లాగాఅభి వృద్ధి సాధించాలని కోరుకొందాం . శోకాల    తిమిరావళి ఆనంద దీపావళి గా మారాలని ఆశిద్దాం .
                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 . క్యాంపు–బెంగళూర్
Posted in సేకరణలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం ) -2

                                    బ్లాకు హోల్ (కృష్ణ బిలం )  —౨ సెకను   
                                 అకస్మాత్తు గా నక్షత్ర ద్రవ్య రాశి అంతా కేంద్ర బిందువు దగ్గరకి సంకోచం చెందిచేరుతుంది  .ఈ క్రియ అతి వేగం గా జరుగుతుంది కనుక  చూడలేరు .ఒక  వద్ద        సెకను లో మిలియన్ భాగం కాలమ్ లో ఇది జరిగి పోతుంది .అపుడు అతి శక్తి వంత మైన గామా కిరణాలు వెలువడతాయి .ఇలా ఏర్పడిన బ్లాకు హోల్ యొక్క density ,gravitation   ఫోర్సు లు ఈ పాయింట్ వద్ద    అనంతం  గా అయిపోతాయి .. దీనినే singularity అంటారు అప్పుడు స్టార్ లోని ద్రవ్యపదార్ధం పూర్తిగా అణచి వేయబడి ఉనికినే కోల్పోతుంది .ఈ singularity చుట్టూ అంతరిక్ష volume అందులో పదార్ధం అంతా పడి పోయి ,ఏదీ దాని నుంచి  తప్పించు కోలేని పరిస్థితిఏర్పడు తుంది .ఇదే బ్లాకు హోల్ .నల్ల బిలం దీని  వ్యాసార్ధాన్ని          .”schwarzschild  radius కేంద్రం నుంచి కొలుస్తారు .         
                             ఏ నక్షత్రం ద్రవ్య రాశి అయినా  పది సోలార్ మాస్ కంటే ఎక్కువైతే ,బ్లాకు హోల్ ఏర్పడి హైడ్రోజెన్ అంతా ఖర్చు అయి పోయి ,దాని పతనానికి ఏదీ అడ్డు పడ లేని పరిస్థితి ఏర్పడుతుంది .దీనికి సూపర్ నోవా ఏర్పడే అవసరము ,రాదు .దాని బరువే దాని పతన హేతువు .బరువంతా బ్లాకు హోల్  లోకి కుంచించుకు పోతుంది .
                       సోలార్ మాస్ ఒకటి పాయింట్ నాలుగు కంటే తక్కువ గా వుంటే అవి వైట్ dvarf స్టార్స్ అవుతాయి .అంటే వాటిలోని న్యూక్లియర్ energy  పూర్తిగా ఖర్చు అయి పోయిందన్న మాట .
 ఇది  వరకు చెప్పు కొన్న రెడ్ giant తెల్ల వామన నక్షత్రం లాగా మారి స్థిర పడి పోతుంది .  ఈ  తెల్ల వామన నక్షత్రాలు ఇంకా సంద్రం గానే వుంటాయి .దీన్నికి కారణం వీటి లోని degenerated మేటర్ .
  న్యూట్రాన్ స్టార్ కు అందులో కొంత స్థిరమన critical ద్రవ్యం వుంది ,తదుపరి పతనాన్ని ఆపే శక్తి కలిగి ఉండదు ఈ లిమిట్ నే ”చంద్ర శేఖర్ లిమిట్ ”అని నోబెల్ బహుమతి గ్రహీత మన చంద్ర శేఖర్ పేరు గా పిలుస్తారు .అదే ఒకటి పాయింట్ నాలుగు సోలార్ మాస్ .దీనికి మించిన తెల్ల వామన తార బరువు గా వుంటే అది collaapsar స్టార్ అయి చివరికి బ్లాకు హోల్ గా మారి పోతుంది
   బ్లాకు హోల్ చుట్టూ వున్న పరిధి ని ఈవెంట్ horizon అంటారు దేనికి వెలుపల వున్న అంత రిక్ష యాత్రికునికి ఈవెంట్ హారిసన్ లోపల ఏమి జరుగు తున్నది తెలియదు .అంటే బ్లాకు హోల్ లోపల ఏమి జరిగేదీ ఎవరికి తెలియదన్న మాట .దీనికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే బ్లాకు హోల్ గ్రావిటీ చాలా లోతుగా సాంద్రం గా వుండి ,కాంతికూడా ఈవెంట్ హోరిజోన్ నుంచి తప్పించుకో లేక పోవటమే .
                       సాధారణం గా శక్తి  frequency  కి అనులోమాను పాతం గా వుంటుంది .కాంతి శక్తిని కోల్పోతే దాని frequency కూడా తగ్గి పోతుంది . frequency ,మరియు తరంగ దైర్ఘ్యం అంటే wave length  లు విలోమాను పాతం లో వుంటాయి .కనుక frequency తగ్గితే wave  length  పెరుగు తుంది .ఇలా తరంగ దైర్ఘ్యం పెరగటాన్ని  రెడ్ షిఫ్ట్ అంటారు .దీనికి కారణం ఎరుపు రంగు  wave length .ఎక్కువకావటమే మిగతా రంగుల కంటే ..బ్లాకు హోల్ కేంద్రం లో గ్రావిటీ అనంతం .కనుక దీనినుంచి తప్పించు కోవాలి అనుకొనే కాంతి అనంతం గా శక్తిని కోల్పోతుంది .అందుకే రెడ్ షిఫ్ట్    ఈ ప్రాంతం లో అనంతం గా వుంటుంది ..
                        ఈవెంట్ హోరిజోన్ లో కాలమ్ కూడా స్తంభించి పోతుంది  అంటే అంతరిక్ష నావికుడికి ఇక్కడ ఒక సెకండ్ కాలమ్ గడిస్తే మిగతా విశ్వం లో అనంత కాలమ్ గడిచి పోయినట్లే .దీనినే టైం ఫ్రోజెన్ అంటారు .అంతరిక్ష నావికుడు తన telescope లో చూస్తూ వుంటే ఇక్కడ ఆస్ట్రోనాట్ నెమ్మది నెమ్మదిగా ఈవెంట్ హోరిజోన్ వైపుకు పడి పోతున్నట్లు గమనిస్తాడు .చివరిగా ఈవెంట్ హోరిజోన్ లో ప్రయాణీకుడుశాశ్వతం గాఫ్రోజెన్ అయినట్లు   అనిపిస్తుంది . einstein శాస్త్రజ్ఞుడు  అందుకే ద్రవ్యం ,కాలమ్ ,పొడవు అన్నీ సాపెక్షాలు అన్నాడు .ఇవి మనం చూసే పాయింట్ అఫ్ viiew  ,మరియు, చూసే ప్రదేశం అంటే frame ల మీద ఆధార పడి వుంటాయి అని వివరించాడు .   .
                     iఇవీ   నల్ల బిల విశేషాలు ..దాని ప్రభావం లోకి జార కుండా జాగ్రత్త వహిద్దాం .ఇంత సేపు నాతొ అంత రిక్ష యానం చేసి ,బ్లాకు హోల్ విశేషాలను తెలుసు కొన్నందుకు కృతజ్ఞతలు
                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్  
Posted in రచనలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1

                 బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1
                       జాన్ వీలెర్ అనే శాస్త్ర వేత్త 1969 లో ”solar gravitation collapse  గురించి రాస్తూ బ్లాకు హోల్ అనే పదం మొదటి సారిగా ఉపయోగించాడు .అయితె దీన్ని 18 వ శతాబ్దం లో మాత్రమే జాన్ మిచెల్ ,డీ లాప్లేస్ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించి సమర్ధించారు .ఇంతకీ అందరు ఈ పదాన్ని వాడుతారు కాని దీన్ని గురించి పూర్తిగా తెలియదు .ఇది ఒక బాగా ఎక్కువ  సాంద్రత గల దట్టమైన నక్షత్రం .దాని బరువు విపరీతం గా పెరిగి పోవటం తో అది కూలి పోతుంది అందులోకి అతి వేగవంతమైన కాంతి కూడా దానిఆకర్షణ నుంచి తప్పించుకో లేదు  .ఏదీ దాని నుంచి తప్పించుకో లేదు .కనుక అది అడుగున ఖాళీ గా వున్న పెద్ద బిలం లాగా అనిపిస్తుందిఅంతరిక్షం లో ..దాని సమీపానికి వచ్చిన ప్రతి దాన్ని పీల్చేస్తుంది .నల్ల బిలం అని  ఎందుకు అంతాఅంటారు అంటే    దానిలో కాంతి ప్రకాశించ దు .  మన సూర్యుడు కూడా పెద్ద నక్షత్రమే అయినా సూర్య గోళం బ్లాకు హోల్ గా మార లేదు .దీనికి కారణం దాని బరువు చాలదు.1 .4 సోలార్ మాస్ కాని అంతా కంటే ఎక్కువ ఉంటేనే అది బ్లాకు హోల్ గా మారుతుంది  . .మన సూర్యునికి అంత సీన్ లేదు .ఇప్పుడు అంత పెద్ద బరువున్న తారలు బ్లాకు హోల్ గా ఎలా మారుతాయో తెలుసు కొందాం …
                          మున్దుఆ నక్షత్రం అంటే ఏమిటో తెలుసు కొందాం .తార అంటే hydrogen .గోలమే ..హైడ్రోజెన్ ఒకే పరమాణువు గల తేలికైన మూలకం .రెండు పరమాణువులతో హైడ్రోజెన్ అణువు ఏర్పడుతుంది .ఇదే హైడ్రోజెన్ వాయు molicule .దీని కేంద్రకం అంటే న్యుక్లియస్ ఫ్యూజన్ కు గురి అవుతుంది దాని మధ్య భాగం లో .అప్పుడు అక్కడ .నాలుగు మిలియన్ల centigrade ఉష్ణోగ్రత ఏర్పడుతుంది .ప్రతి నక్షత్రానికి శక్తి ఈ ఫ్యూజన్ వల్లే లభిస్తుంది .ఇప్పుడే నాలుగు హైడ్రోజెన్ న్యూక్లియై కలిసి ఒక హీలియం న్యూక్లియస్ గా మారుతుంది .  ఈ స్థితి లో కొంత ద్రవ్యం శక్తి గా మారుతుంది .సూర్యునిలో ప్రతి సెకనుకు నాలుగు మిలియన్ల పదార్ధం శక్తి గామారుతుంది .అయిన్స్టీన్  శక్తి సూత్రం ప్రకారం  సూర్యుడు 4 .4  ..సేస్తిలియాన్ హర్సే పవర్ శక్తిని ఒక సెకను కు ఇస్తాడు .ఈ శక్తి దాని వ్యాప్తికి తోడ్పడు తుంది .ఈ వ్యాప్తి శక్తి దాని సంకోచ బలాన్ని సమ తుల్యం చేస్తుంది .ఈ contraaction  ఫోర్సు నక్షత్రం బయటి పొరలను బట్టి వుంటుంది .బయటి ద్రవ్యం నాశనమాయే స్థితి లోకి వచ్చి లోపలి gravitation center  లో కూలి పోతుంది .అప్పుడు అందు లోని హీలియం ఆ నక్షత్రానికి ఇంధనం గా మారు తుంది .ఇప్పటి వరకు  దానికి ఇంధనం హైడ్రోజెన్ మాత్రమే .నక్షత్రానికి హాట్ core అనేది వుంటుంది .కానీ బయటి పొరల్లోకి విపరీతం గా వ్యాకోచం చెందు తూ వుంటుంది .అలాంటి స్టార్స్ ను  రెడ్ giants అంటారు .. దాని వ్యాకోచ పరిమాణం ను బట్టి రంగును బట్టి ఆ పేరు వస్తుంది .
                       కానీ ఇందాక చెప్పిన సూర్యుని కంటే అనేక రెట్లు పెద్ద గా వున్న నక్షత్రాల లో న్యూక్లియర్ రియాక్షన్ core  లోజరిగిస్వాధీనం తప్పే స్థితి లో వుంటాయి .అప్పుడు ఆ ప్రదేశం collapse  అవుతుంది  ..అప్పుడు విస్ఫోటనం జరుగు తుంది .ఆ స్థితి లో స్టార్ తన ద్రవ్యాన్ని అంతరిక్షం లోకి నెట్టేస్తుంది దానినే సూపర్ నోవ అంటారు .ఆ తర్వాత నక్షత్ర పదార్ధం చిన్న సాంద్ర మయిన వస్తువు గా మారి పోతుంది .ప్రోటాన్ లు ,ఎలేక్ట్రోన్ లు ధీకోని న్యుట్రాన్లు  .   ఏర్పడుతాయి అప్పుడుసూపర్  dense స్టార్ ఏర్పడుతుంది .అప్పుడు   స్టార్  దాని core లో సాలిడ్ న్యుట్రాన్లు మాత్రమే వుంటాయి .ఇదే న్యూట్రాన్ స్టార్ .ఇవి ఒక cubic centimeter కు పది మిలియన్ టన్నుల సాంద్రత లో వుంటాయి .అంటే నీటి కంటే తొమ్మిది trliyan . రెట్లు ఎక్కువ.
                   స్టార్ బరువు 1 .4 .నుంచి రెండు సోలార్  మాస్ మాత్రమే వుంటే –అది న్యూట్రాన్ స్టార్ గా మారి పోతుంది .మాస్ రెండు దాటితే  ఇంకా సంకోచం జరుగు తుంది .అప్పుడు న్యూట్రాన్ స్టార్ collapsar స్టార్ అవుతుంది .అది gravitation ఆకర్షణ వల్ల కేంద్రం లోకి collaapse అవుతుంది .కుంచించుకు పోయిన కొద్దీ దాని వ్యాసార్ధం తగ్గుతుంది .చివరికి ఒక లిమిట్  కు చేరుతుంది .దీనినే squarzschild radius అంటారు .ఈ దశలో బయటి ద్రవ్యం చాలా సాంద్రత చెందుతుంది .చివరికి కాంతి కూడా దీని ప్రభావానినికి లోను కాక తప్పదు .ఆ నక్షత్ర ఆకర్షణ క్షేత్రం విపరీతం గా పెరిగి పోతుంది .కనుక అంతరిక్షం లో ప్రయాణించే ఏ నావికుడికి  ఇది కన్పించదు .
                             ఇప్పటికే అంతరిక్ష శోధన లో చాలా దూరం వెళ్లాం .ఇక్కడ ఆగి మళ్ళీ కృష్ణ బిలం అదే బ్లాకు హోల్ గురించి మళ్ళీ పూర్తిగా తెలుసు కొందాం .akkade వుండండి
                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | 1 Comment

కుజ గ్రహ నివాసం

                                కుజ నివాసం
                      భూమి  మీద జనాభా పెరిగి పోతోంది .నివాసానికి తగిన స్థలం లేక జనం విల వల  లాడుతున్నారు .తగినంత ఆహారము దొరకటం లేదు .అందుకని వేరే గ్రహం మీద వుండే ఆవ కాశం కోసం శాస్త్రజ్ఞులు వెతుకు తున్నారు .అనేక ప్రయోగాలు చేసిన తరువాత మాన్నవులకు ఆవాస యోగ్యమైనది కుజ గ్రహమే నని నిర్ణయించారు .మనకు అక్కడ లభించే సౌకర్యాలేమిటి ?అక్కడ మానవ జీవతం దివ్యం గా సాగుతుందా ?అని అందరి అనుమానం .ఆ అనుమానాలు తీర్చే ప్రయత్నమే ఇది .
                            కుజ గ్రహ్హం లో అద్భత సుందర దృశ్యాలు కని పిస్తాయి .అక్కడి పర్వతాలు ఎవేరేస్ట్ పర్వ తానికంటే మూడు రెట్లు పెద్దవి .లోయలు అమెరికా లోని కాన్యోన్స్ లోయ కంటే మూడు రెట్లు లోతైనవి ,అయిదు రెట్లు పొడవైనవి విశాల మైన మంచు క్షేత్రాలున్నాయి .వేలాది కిలోమీటర్ ల పొడవైన వింత యైన ఎండి పోయిన నదీ గర్భాలున్నాయి .కుజు ని లోని గాలిలో తొంభై అయిదు శాతం caarbon dioxide  వుంటుంది .ఇది మానవుడు జీవిన్చాతానికేమాత్రము పనికి రాని వాయువు అని అందరికి తెలుసు .సముద్ర మట్టానికి దగ్గర లో వున్న వారు 150   మిల్లిరియం ల radiation  ను ఒక ఏడాది లో లోనవుతుంటారు .కుజునిలో గ్రావిటీ సున్నా .దీని వల్ల కండరాలు శిధిలమై పోతాయి .  అందుకే కుజుని పైకి అంతరిక్ష నౌకలు పంపేటప్పుడు నావికులకు ”micro gravity science ””
 పై మంచి అవగాహన కల్పిస్తారు .అక్కడి వాతావరణం immune system దెబ్బ  తింటుంది .అందుకని నౌకల్లో కృత్రిమ గ్రావిటీ ని కల్పిస్తారు .తోక చుక్కలు కుజున్ని తాకి నప్పుడు వెలువడే ధూళి మానవులకు ప్రమాదం కల్గిస్తుఅక్కడి క్రిములు వ్యోమ గామి ద్వారా భూమిని చేరి జబ్బులు వ్యాపించ వచ్చు .
—        కుజుని లో పగటి కాలమ్ ఇరవై నాలుగు గంటలు వుంటుంది .పగటి  వేడి –50 డిగ్రీలు నుంచి +10degreella వరకు వుంటుంది  .భుఉమిమీద ఆకర్ర్షణ శక్తి కుజుని పై దానికంటే రెండున్నర రెట్లు .చంద్రును గ్రావిటీ కంట కుజునిది సుమారు రెండున్నర రెట్లు . చంద్రుని లో వాతావరణం లేదు .అక్కడ రోజుకు 672 గంటలు . అయితెకుజులో తేమ వేడివుంటాయి .కనుక జీవులు బతికే  ఇక్కడి mఆవ కాశం ఉండ వచ్చు .కార్బోన్ dioxide ఎక్కువ కనుక గ్రీన్ హుసే వాయువుల ప్రమాదమూ ఎక్కువే .భూమి మీద ఉన్నట్లే.మూడు పాయింట్ ఏడుబిలియన్ సంవత్చరాల కిందటి  ”micro cosmic organism ”.. ఉండ వచ్చు .మార్స్ మీద compass పని చేయదు .కారణం అక్కడ అయస్కాంత శక్తి లేక పోవటమే .”celestial navigation ” విధానం లో దిశలను తెలుసు కొంటారు .అక్షంస రేఖాంశాలను నిర్నయిస్తాఉ .మార్స్ కు ధ్రువ తార అంటే పోల్ స్టార్ లేదు .ఫోబోస్ ,మరియు ,diemos   అనే asteroids దీని చుట్టూ తిరుగు తాయి .మార్స్ లో ఒక రోజూ అంటే 24 గంటల 39 నిమిషాల 6 సెకన్లు .ఇక్కడ సంవత్చారానికి 669  రోజులు .వీటిని sols అంటారు .ఇక్కడ మంచు భూమికి ఒక మేటర్ లోతున వుంటుంది .అమెరికా లోని కొలరాడో లో ఇంటికి ఒక వైపు వింటర్ (నార్త్ ) రెండో వైపు
 సుమ్మెర్  ( సౌత్ )  ఒకే కాల లో వుండి ఆశ్చర్యం కలిగిస్తాయి .అలాగే కుజునిలోఇలాగే వుండిఆశ్చర్యం కలిగిస్తాయి మార్స్ లో కూడా ఆగష్టు మధ్యలో కన్పిస్తాయి ఇక్కడి మంచు ను i    perma frost అనీ లేక ఫ్రోజెన్ mud అనీ అంటారు .
                   కుజునిలో వెండి ,lanthanum ,cerium ,సోమరియం ,గల్లియం ,gadolium ,బంగారం ,palladium ,రుబీడియం ,platinum ,ర్హోదియం ,యూరోపెం మొదలైన విలువైన ఖనిజాలున్నాయి .భూమి నుంచి కుజునికి అక్కడి నుంచి భూమికి వస్తువులను త్రి భుజ విధానం లో వ్యాపారం చేయ వచ్చు  దీని విషయం లో జాన్ మిల్టన్ కవి కొత్త లోకాన్ని గురించి  రాసిన కవిత బలేగా వుంది చదవండి ”Witness ts new made world another heaven —From heaven gate not faarr founded in view –on the clear Hayaline ,the glaassie sea –Of amptitude almost immence with stars –Numerous and every starr perhaps a world –Of destined habitation .”
              అందుకని  మానవులకు మార్స్ రెండవ నివాస స్థానం అవాలని భావిస్తున్నారు .అందుకు అక్కడ ఏమి చేయాలి ?కొత్త సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలి .లేక పొతే సాంకేతిక మైన స్తబ్ధత ఏర్పడు తుంది .ఇప్పటికే అభివృద్ధి రాటు తగ్గి పోయింది .అందుకు martian ingenunity కావాలి .దాని వల్ల సృజనాత్మకత పెరిగి ఏవి కావాలో వేటిని వదిలించుకోవాలో తలిసి అభి వృద్ధికి మార్గం తేలిక అవుతుంది .కుజున్ని రెడ్ ప్లానెట్ అంటారని మనకు తెలుసు . మాల్తుస్ చెప్పిన అంచనాలన్నీ తప్పినాయి .మానవులు ఉత్పత్తులను వ్యయం చేసే వారు మాత్రమే కాదు ,వనరులను సృజించే నేర్పు కూడా వున్న వారు .ఈ విషయం అతనికి అప్పటికి తెలీదు .దీనికి కొత్త సాంకేతికత శాస్త్రీయ జ్ఞానం తోడ్పడు తాయి .జనాభా పెరిగితే ఆక్రమణ రేట్ వేగవంతం అవుతుంది .
               భూమికి కుజుని కంటే మిగిలిన గ్రహాలూ చాలా దూరం లో వున్నాయి .ఇది అమెరికా నుంచి యూరప్ కు వున్న దూరానికి లక్ష రెట్లు దూరం లో  మార్స్  ఉంది .మార్స్ లో రవాణా చేయటం చాలా సులభం .అక్కడున్న కార్బోన్ డి oxide ను hydrogen తో కలిపి mithane ను తయారీ చేసి శక్తి గా వినియోగించవచ్చు నని శాస్త్రజ్ఞుల భావన .ఇవాళ ప్రపంచం క్లిష్ట పరిస్థితులలో వుంది .మన పాత సరిహద్దులు మూసుకు పోయాయి .సాంఘిక జడత్వం వచ్చేసింది .అభివృద్ధి నెమ్మదిలో నడుస్తోంది .ఇది చాలదు .ప్రభుత్వాలు inkaa  పూర్తిగా కళ్ళు తెరవటం లేదు .ద్రుష్టి పెట్ట లేక పోతున్నాయి.కుజ నివాసం కష్టమే .కాని తప్పదు .జండా అక్కడికి ఎత్తేయాల్సిందే తప్పదు ..ఇక్కడపప్పులు ఉడకటం లేదు .కొత్త బంగారు లోకం చూడాల్సిందే .దుకాణం పెట్టాల్సిందే .అక్కడికి చేరే వారికి అవసరమైన టెక్నాలజీ ని అందించాలి .శాస్త్రీయ దృక్పధాన్ని కల్గించాలి .సృజనాత్మకతను ప్రోత్చాహించాలి .స్వేచ్చ గా అలోచించి కొత్త పరికరాల రూప కల్పనకు వీలు కల్పించాలి .ఆ సాహస వంతులకు అండగా నిలవాలి ..కుజ గ్రహం జడత్వం వున్న మనుష్యులను కోరదు .అక్కడ నిరంతర అన్వేషణ తో ముందుకు సాగే వారికే స్థానం .ముసలి వారు  ముతక vaaru పనికి రారు .యువరక్తం పొంగి పొరలే నవ యువత కావాలని స్వాగతిస్తోంది కుజగ్ర్హం .గ్రహచారం బాగుండక  కుజ గ్రహానికి వెళ్ళద్దు .అక్కడి గ్రహ చారాన్ని మానవులకు అనుకూలం గా మార్చటానికి వెళ్ళాలి అక్కడి మంచును నీరుగా మార్చాలి .కార్బోన్ దిఒక్షిదె ను పంటలకు ఉపయోగించాలి .పరిశారమలను నెలకొల్పాలి .వున్న భూమి లో అనుకూల మైన పంట పండించాలి .భూమి నున్దిఅక్కడికి కావాల్సినవి దిగుమతి చేసుకొని ,అక్కడి పారిశ్రామిక వస్తువులను భూమికి ఎగుమతి చేయ వచ్చు .ఇది సాధ్య్యమాయే రోజూ త్వరలోనే రానుంది   అప్పుడు రెడ్ ప్లానెట్ అయిన కుజ గ్రహం మనకు రెడ్ కార్పెట్  welcome ఇస్తుంది                                                          
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –౨౭-07-11.camp–bengalur
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సేకరణలు | Leave a comment

థాయి ల్యాండ్ విశేషాలు

        థాయి ల్యాండ్ విశేషాలు
                                     థాయి లాండ్ ప్రజల కళ్ళల్లోనే నవ్వు కన్పిస్తుంది .మంచి చిరు నవ్వు కోసం ఎదురు చూస్తుంటారు శ్మశానం లో కూడా నవ్వటం వారి ప్రత్యేకత ..ఈప్రజలు మన  చిరుఅవ్వును మెచ్చుతారు .మనతో ఏకీభవించక పోయినా ,మన పద్ధతికి అడ్డు పడరు .ఏదైనా బాగా చెయ్యాలి అనే సంకల్పం వాళ్ళది .sad స్మైల్ కూడా వుంది .”నేను నవ్వ టానికి ప్రయత్నిస్తున్నా కాని ,నవ్వ లేక పోతున్నానని నిజాయితీ గా చెప్తారు .కస్టపడి పని చేసి సాధిస్తారు .సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు కొననే కొనరు ,చదవరు కూడా .సంతోషం గురించి ఆలోచిస్తుంటే ఆ ఆనందం తగ్గి పోతుంది అంటారు ,.సంతోషాన్ని వెలువ రించా టానికి మాటలు లెవ్వు ,చాలవు అని వారి విశ్వాశం .లైట్ గ తీసుకోవటం వాళ్ల పధ్ధతి .అందుకే ఏమి జరిగినా వాళ్ల భాష లో ”mai  penlai  ”అంటారు అంటే ”నెవెర్ మైండ్ ”.వాళ్ళది ”జై -యెన్ ”అనగా కూల్-హార్ట్ .గొప్ప కబుర్ల పోచిగోరులు .మాంచి వ్యూహ కర్తలు కూడా . .
                         వాళ్ల దేశం లో ఎక్కడ చూసినా”” హ్యాపీ ”అనే మాటే కన్పిస్తుంది .happy toilet ,హ్యాపీ లైఫ్ ,హ్యాపీ pub  వగైరాలన్న మాట .వాళ్ల వంటకాలలో గొప్పది ”హ్యాపీ పబ్ ”ఇది noodles తో చేసిన వంటకం  ,,ఇదే వాళ్లకు double happiness .దేని గురించీ seriousness లేదు .”We do not take anything seriously ..What ever it is we accept it ‘అనటం వాళ్ల నైజం .
”We laugh and laugh non stop .>We still run over and help ,but we are laughing at the same time .”అని వాళ్ల సహజ స్వభావాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు .నడి రోడ్డు మీద ఎవరైనా పొరపాటున పడ్డా ,వారిని చూసి నవ్వుతూనే వుంటారు .అయితె వారికి చేయాల్సిన సహాయాన్ని నవ్వు తూనే చేస్తారు .అదీ వీరి ప్రత్యేకత .ఎవరికైనా ఒత్తిడి (stress )వుంటే ప్రవర్తన మార్చుకోమని సలహా ఇస్తారు .ఎంత ధన వంతు లైనా తోట పని చేసుకొంటారు .గడ్డిని mow చేసుకొంటారు .అదొక fun అంటారు .fun ను వాళ్ల భాషలో ”సానుక్ ”అంటారు .
             సభల్లో ,సమావేశాల్లో కూడా నవ్వుతూనే వుంటారు .అది మాకు సహజం అంటారు వాళ్ళు .నవ్వు లేకుండా ఉండలేరు .ఊపిరి పీల్చినంత సహజం వాళ్లకు నవ్వు .లావుగా వుండే వాళ్ళను హాష్యం తో గేలి చేస్తుంటారు .వాళ్ళను ”హిప్పో ”అంటారు నవ్వుతూనే
                 2004 లో సునామి వచ్చినపుడు వేలాది మంది చని పోయారు .దీనికి కారణం ప్రభుత్వం అని నెపం వేయలేదు థాయి ప్రజలు .జరిగిన దాన్ని వినయం గా స్వీకరించారు . ఈ జన్మ లో అనుకొన్నది సాధించలేక పొతే మరుసటి జన్మ లో సాధించు కో వచ్చును అను కొంటారు .అయ్యో అయ్యో అయోయ్యో చెయ్యి  జారి పోయిందే నని విచారీన్చరు,బాధ పడరు ,కుమిలి పోరు . భవిష్య వాణిని నమ్ముతారు .ముస్లిమ్స్ దాడి చేసి సర్వ నాశనం చేస్తే తిట్ట లేదు ,బజారున పడ లేదు ,ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయలేదు ..సహనం తో ఒర్చుకొన్నారు .ఆవేశం తో వివేకం కోల్పో లేదు .ఆయుధాలు సంధించి తిరగ బడ లేదు .శాంతి ,సహనమే వాళ్ల ఆభరణాలు .అహింసా పరమో ధర్మః అనేదే వాళ్ల నమ్మకం .వేల కొలది తెల్ల cranes ను తెల్ల కాగితాలతో తయారు చేసి విమానాల నుంచి శాంతి కోసం జారవిడిచి తమ శాంతి పధాన్ని ప్రపంచానికి చాటారు .శాంతి కాముకు లైన థాయి లాండ్ ప్రజలు .అందరికి వారు ఆదర్శం గా నిలిచారు
                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 –క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3

                 శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3
                                                     హలేబేడు  శ్రీ హొయసలేశ్వర స్వామి దేవాలయం
                    బేలూరు కు 16 కి.మీ. దూరం లోను ,హసన్ కు 31 కి.మీ.లోను ,మైసూర్ కు 149 కి.మీ.దూరం లోను హలేబేడు వుంది .బంతి పూల వనాలు రోజా , పూల చెట్లు ,బంగాళా దుంప పొలాలు చూడ ముచ్చటగా వుంటాయి pine aapple . పంట ఎక్కువ ఇది 12 .వ శతాబ్ది లో హోయసల రాజుల రాజధాని .ఇక్కడ్డి శివుని పేరు హోయశాలేస్వరుడు .నిర్మించిన శిల్పి కేతన మల్ల వర్మ  విష్ణు వర్ధన మహా రాజు కాలమ్ లో నిర్మాణం జరిగింది ..దీనికి ఆనుకొనే ,ఆయన భార్య శాంతలాదేవి రాణి నిర్మించిన దేవాలయమూ వుంది .ఈ దేవాలయాలకు ముందు చాలా విశాల మైన సరస్సు వుంది .సముద్రం లాగా పొంగి ప్రవహించే సరస్సు నుంచి ,ఆలయానికి ప్రవేశించాలి కనుక ద్వార సముద్రం అనే పేరు వచ్చింది ఈ వూరికి .ఇంతకీ  హలేబేడు ”అంటే ”నాశన మయిన నగరం” అని అర్ధం .14  వ శతాబ్దం  లో మాలికాఫార్ దీనిపైకి దండెత్తాడు .అయితె ఇక్కడి ప్రజలు ఇసుక  తో ఆలయం అంతా కప్పేసి కాపాడు కొన్నారట .హలేబేడు దేవాలయ శిల్ప సౌందర్యం నభూతో న భవిష్యతి గా వుంటుంది .భారతీయ ఆలయ శిల్ప నిర్మాణ కళ లో దీని ప్రత్యేకత ఇంక దేనికీ లేదు ..బేలూర్ దేవాలయం లో లోపలి శిల్ప సౌందర్యం అద్భుతం అని పిస్తే హలేబేడు దేవాలయం బాహ్య శిల్ప సౌందర్యానికి దర్పణం .విధానం అంతా బేలూర్ ఆలయం గానే వుంటుంది .అయితె ఎత్తైన ప్లాట్ ఫారం మీద అక్కడి లానే నిర్మించబడింది.ఇది ద్వికూట విమాన పధ్ధతి లో వుంది .అంటే ఇద్దరు మూల దేవతలుంటారు .అంటే రెండు శివ లింగాలుంటాయి .ఈ దేవాలయ సముదాయం కూడా ”chloritic chist ”. శిల తో నిర్మించారు .అంటే మెత్తగా సబ్బు లాగ వుంటుంది శీలా .విగ్రహం పూర్తి అవగానే ఇనుము లాగా గట్టి పడటం దీని ప్రత్యేకత .దీన్నే pot stone అని కూడా అంటారు . హోయసల శిల్ప కళా చాతుర్యం అంతా ఇక్కడ కని పిస్తుంది .ఇక్కడి రెండు శివ లింగాలు తూర్పు ముఖం గావుండి ,ప్రతి దానికి ప్రత్యెక మండపం కలిగి వుంటాయి .ఈ రెండు కలిసి బృహత్ ఆలయం గా ,విశాల మైన పండపం గా కనిపిస్తుంది .లోపల రాజులు ,రాణీలు ,అంతఃపుర జనం కూర్చొనే గల్లెరీ లున్నాయి .లోపల జరిగే కార్య క్రమాలను వారుహాయిగా వీక్షించ వచ్చు   రంగ మంటపాలున్నాయినాత్యం చేసేందుకు వీక్షించ  .చిన్న శివ లింగాలు వున్నాయి రెండు ఆలయాలలోను .నిత్య పూజ జరుగు తుంది .అయితె గాలి గోపురం లేదు .గర్భాలయాన్ని మంటపాన్ని కలిపే ప్రదేశాన్ని శుక నాసి అంటారు .దీని స్తంభాలన్నీ శిల్ప కళా శోభితం .పైన వివిధ శిల్ప శోభితమైన పై కప్పు వుంది .చూడ టానికి కళ్ళు చాలవు అని పిస్తాయి .అతి పెద్ద ,అతి చిన్న శిల్పాలను ఉంచటానికి తగిన ప్రదేశం వుంది .గోతిక్ ఆర్ట్ కు మించిన కళా వైభవం వుందని విశ్లేషకుల భావన .  ఇంగ్లీష్ లో చాలా వివరం గా ,వేగం గా ,ద్వార పాలకులైన నంది డుంతి విగ్రహాలు సకల కళా శోభితాలు .ముక్కు దగ్గర అతి శూక్ష్మ రంద్రాలున్నాయి .అందు లో నుంచి సన్నని పుడక దూరిస్తే దూరి పోతుంది .అన్త్తటి సూక్ష్మ విషయాలపైన కూడా శ్రద్ధ పెట్టి చెక్కిన శిల్పాలవి .అనితర సాధ్యం అని పిస్తుంది .చూసి ఆనందించాలే కాని చెప్పి తే తెలిసేది కాదు .ఆ అనుభూతే వేరు మా గయుడు ఇంగ్లీష్ లో చాలా వివరం గా విశ్లేశానాత్మకం గా ,సూది గుచ్చి నట్లు మంచి శైలి లో వివరించి అనుభూతి చెందేట్లు చేశాడు .రెండు ఆలయాలకు వున్న భేదాలు స్పష్టం గా వివరించాడు .వీటికి మించిన శిల్ప కళ ప్రపంచం లో నే లేదు లేదు లేదు అని ఘంటా పధం గా చెప్పటం అందరికి గొప్ప ఆనందం కల్గించింది ;.ఇప్పటికి సగటున రోజూ కు కనీసం రెండు వేల మంది వీక్షకులు వస్తారట .ఇది un season .సీజన్లో లో కనీసం పది వేల మందికి తక్కువ కాకుండా దర్శిస్తారట  .కొద్ది రోజుల్లో ప్రపంచం లోనే గొప్ప యాత్రాస్థలం గా బేలూర్ హలేబేడు లు అవుతాయని విశ్వాశం గా చెప్పాడు .అలా కావాలని అందరం భావించాం.మంచి ప్రయాణ సౌకర్యం వుంది ,రోడ్లు బాగున్నాయి ,వసతి భోజన సౌకర్యాలు సంతృప్తికరం .
                         ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోకి ప్రవేశించాలి .ఇంకా దక్షిణ ,తూర్పు ,పడమర ద్వారాలున్నాయి .స్తంభాలన్నీ lathe తో చిత్రిక పట్టి వుంటాయి .సూర్య విగ్రహం చాలా పెద్దది .జగతి ప్లాట్ ఫారం మీడే ఇదీ నిర్మించబడి ,ప్రదక్షిణ కు అనువుగా వుంటుంది .వెనుక భాగాన నల్ల రాతి తో చేసిన చాలా పెద్ద నంది విగ్రహం మనోహరం గా వుంది .ఇది దేశం లోని పెద్ద నంది విగ్రహాలలో మూడవది .లేపాఖి ,నంది అన్నిటికన్నా పెద్దది .అయితె ఈ నందీశ్వరుని వుచ్చ్వాష ,నిస్శ్వాసాలను చిత్రించిన తీరు పరమ ఆశ్చర్యం .దేనికి తోడూ నంది శరీరం పై మూపురం పై ,మెడపై చెక్కిన అందమైన ఆభరణాలు మువ్వలు ,గంటలు చూస్తె ఇంత పరమ కళా వైభవం తో ఇంకీక్కడా నంది విగ్రహం లేదని పించటం ఖాయం .అందుకనే శిల్ప కళ రీత్యా ఇదే ప్రపంచం లో అతి సుందర నంది విగ్రహం గా భావిస్తారు .అంటే ఇదే నెంబర్ one bull structure .చుట్టూ వున్న శిల్ప కళా శోభ బేలూర్ లానే వుంటుంది .శివుని  వివిధ భంగిమలు అంటే కామ దహనం ,పార్వతీ కల్యాణం ,గజాసుర సంహారం ,రావణుడు కైలాసాన్ని పైకేత్టటం ,వినాయక నృత్యం ,కుమారస్వామి సూర్యుడు ,,చుట్టూ చెక్కిన మదనికలు ,ఏనుగులు ,సింహాలు ,గుర్రాలు అన్నీ బేలూర్ లానే వున్నై .హోయసల దేవాలయాలన్నీ బయటి గోడలపై వుండే శిల్పాలకు ప్రసిద్ధి .
రెక్కల సొగసు తో వుండే గరుత్మన్తుడున్న గరుడా స్థంభం ఇక్కడ ప్రసిద్ధ మైనది .ఇక్కడి గరుడులు రాజు రాణి లకు రక్షణ బంట్లు .రెండవ వీర భాల్లాల రాజు అంగరక్షకుడు కురువ లక్ష్మణ విగ్రహం వుంది .భాల్లాలుని మరణం విని యితడు భార్య ,పిల్లలు ,మిగిలిన అంగ రక్షకులతో ఆత్మ బలిదానం చేసుకొని స్వామి భక్తిని ప్రకతిన్చుకోన్నాదట .ఈ కధప్రాచీన కన్నడ లిపి లో ఒక స్థంభం మీద చెక్కబడి వుంది .ఈ ఆలయానికి నైరుతి దిశ లో నక్షత్రాక్రుతి లోని అందమైన కేదారేశ్వర దేవాలయం వుంది .
          హలీబేడు లో పార్శ్వ నాద మందిరం వుంది .శిల్పకళకు పరాకాష్ట గా దీని నిర్మాణం ఉంటుందట .14 అడుగుల పార్శ్వ నాద విగ్రహం చూడ ముచ్చట  గా ఉంటుందట  .ఆయన శిరస్సుపై ఏడు తలల పాము చెక్కబడి వుంటుంది .అలాగే శాంతి నాద స్వామి ,ఆది నాద స్వామి అనే జైన తీర్ధంకరుల దేవాలయాలు ఇక్కడ వున్నాయట .మేము ఇవేవీ చూడ లేదు .
అలాగే శేషశాయను డైన రంగనాధ స్వామి దేవాలయం కళా శోభితం గా ఉంటుందట ఆయన బొడ్డు లోనుంచి ఉద్భవించిన బ్రహ్మ ,ఆది దేవియిన లక్ష్మి విగ్రహాలతో శోభస్కర మైన ఆలయం.మేము చూడ లేదు .
ఇంతటి శిల్ప కళా శోభితమైన ,అరుదైన హోయసల రాజుల కళావైదగ్ధ్యాన్ని  ,అమరశిల్పి జక్కనా చార్య ,,ఆయన కుమారుడు అపర మయబ్రహ్మ అయిన దంకనా చార్యుడు ల  మనోహర కళా సృష్టికి జేజేలు .ఈ శిల్పాలను దర్శించటానికి మామూలు  నేత్రం కాదు మనో నేత్రం వుండాలి ,చూసింది మననం చేసుకొనే ఓపిక వుండాలి మెచ్చే సంస్కారం కావాలి .శిల్పి ఎభావంతో చేక్కాడో తెలుసుకొనే నేర్పున్డాలి .వీటిని అన్నిటిని అనుభవించి అనుభూతి చెందే హృదయం కావాలి .వీటికి మించి ,తీరిక గా చూసే సమయమూ కావాలి .అప్పుడు ఒక కళా క్షేత్రాన్ని దర్శించిన చిరంతనానుభావం తో మనసు పరవళ్ళు తొక్కుతుంది .కొద్ది సమయం లోనే ఇంతటి అనుభూతిని పొందాం’ఏ పూర్వ జన్మల సుక్రుతమో ?  జన్మ ధన్య మైంది.i.ఇంకో విషయం వింటే మరీ ముక్కు మీద వేలు వేసుకో కుండా ఉండలేము .హౌరా ! అనుకోకుండా ఉండలేము .అదేమిటి అంటే ఈ ఆలయాలలోని శిల్పాలను చక్కగా వెతి కవి విడదీసి పక్కన పెట్టి మళ్ళీ ఇలాగీ ఈ బృహత్ ఆలయాలను పునర్నిర్మించ వచ్చునట .అంటే ఫ్రేము   ఫ్రేమే ల మీద శిల్పాలు చెక్కి అమర్చారన్న మాట .ఫ్రమే కనుక తీసేసి మళ్ళీ ఇంకో చోట బిగించు కో వచ్చు .ఎక్కడా అతికిన్చినట్లుండదు .కాని దేని కడిగా విడి విడి గా వున్నట్లు అనిపించదు .ఇదీ ఆ మహా శిల్పుల నిర్మాణ చాతుర్యం .అపర బ్రాహ్మలు సృష్టికే ప్రతి సృష్టి చేశారు మరో మయులు వారందరూ
                         దాదాపు అయిదున్నర గంటలకు మళ్ళీ బస్ ఎక్కి రాత్రి ఎనిమిదిన్నరకు బెంగళూర్ చేరాను .మజేస్తిక్ బస్ స్టాండ్ లో బస్ ఎక్కి మార్త హళ్లి కి తోమ్మిదిమ్బావుకు చేరాను .మా అబ్బాయి శర్మ కార్ లో వచ్చి ,ఇంటికి మునే కోలాల కు తీసుకొని వెళ్ళాడు .
                                   కే.ఎస్.టి.డి  ఆఫీసు లోకర్ణాటక రాష్ట్రం గురించి   రాసిన మాట నాకు నిజమని పించింది ”One state but many worlds ”
                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 .క్యాంపు –బెంగళూర్ .

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు, రచనలు | Leave a comment

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర —2

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర  —2
                                                   బేలూర్ చెన్న కేశవ స్వామి దేవాలయం
              శ్రావణ బెల్గోలా నుంచి బేలూర్ వచ్చాం .బెల్గోలా లో మెట్ల లెక్క తప్పు గా రాశాను .చంద్రా గిరి కొనండ యక్క తానికీ దిగ టానికీ పక్క పక్కనే వేరు వేరు గా మెట్లుంటాయి .తొక్కిసలాట లకు అవకాశం లేదు .ఈ రెండు దారుల్లోని మొత్తం మెట్లు 641 మాత్రమే 1282 అని పొరపాటుగా చెప్పాను .
బేలూర్ అనగానే శ్రీ రామ కృష్ణ పరమ హంస కొలువై వున్న పశ్చిమ బెంగాల్ లో కలకత్తా కు దగ్గర వున్న బేలూర్ అను కొంటారు చాలా మంది .కాదు .ఆది ఆధ్యాత్మిక సౌందర్య కేంద్రం .ఇది నేత్రానందాన్ని ఇచ్చే కళా సౌందర్య కేంద్రం .అక్కడ ముక్తి ,ఇక్కడ మనోల్లాసం లభిస్తాయి .బేలూర్ హసన్ కు 38ki బెంగళూర్ కు 222 కి .దూరం .తేల్లాని పూలతోవున్నబంగాళా దుంప పండే పొలాలతో ,బంతిపూల వనాలతో , చెట్లు కళకళ లాడుతూ దారి అంతా హరిత వనం లా కనిపిస్తుంది .
            ఇక్కడి దైవం చెన్న కేశవ స్వామి .వీళ్ళు విష్ణు టెంపుల్ అంటారు .చెన్న అంటే సుందరమైన అని అర్ధం .విష్ణు నామాలలో మొదటిదే కేశవ అనే నామం .స్వామికి ముక్కుకు ముక్కెర వుండటం విశేషం .స్త్రీత్వం  కన్నులు  తో కనిపిస్తూ  బహు సుందరునిగా ఉంటాడు .మోహినీ ఆవ తారం గా భావిస్తారు .ఇక్కడి శిల్ప సంపద వర్ణనా తీతం .కన్నుల పండువ .ప్రతి శూక్ష్మ విషయాన్ని శిల్పి మనో నేత్రం తో దర్శించి శిల్పించాడు .బేలూర్ అన గానే అమర శిల్పి జక్కన్న జ్ఞాపకం వస్తాడు .”ఈ నల్లని రాలలో ఏ కన్నులు  దాగెనో ,ఈ బండల మాటునా యే గుండెలు మొగెనో —పైన కఠిన manipin ,లోన వెన్నా  అనిపించును ,ఉలి అలికిడి తాక గానే గలగలా మని పొంగి poralunu ” అనే నారాయణ రెడ్డి గారి పాట చెవుల్లో రింగుమంటుంది .నాగేశ్వర రావు నటన అద్భుతం అని పిసుంది .ఇక్కడే కళా తపస్వి విశ్వ నాద్ ”శంకరా భరణం ”సినిమా లో మంజు భార్గవి నాట్యాన్ని చిత్రీక రించారు .ఎన్నో సినిమాలకు వేదికయింది .ఇవన్నీ ఒకసారి మనసు లో మెదిలాయి ఇప్పుడు దీని చారిత్రిక వైభవాన్ని తెలుసు కొందాం .గైడు ఇంగ్లీష్ లో చాలా బాగా వివరించాడు .ప్రతి శిల్పాన్ని దగ్గరుండి చూపించి అందులోని కళా సారాన్ని తేలిగ్గా చెప్పాడు .ప్రతి సూక్ష్మ విషయం వివరించాడు .
                    బేలూరు ను వేలా  అనే పురీ అనే వారు .క్రమంగా వేలూరు గా చివరికి బీలుర్ గా మారింది .హోయసల రాజులు దాదాపు మూడు వందల సంవత్చారాలు పాలించిన దేశం .హోయ -సాల ”అనే  రెండు మాటలు కలిసి హోయసల అయింది .అంటే అర్ధం” ! సాల ! కొట్టు ”..ఈ రాజ్య మూల పురుషుడు సాలుడు ఇక్కడ సింహాన్ని సంహరించాదట .అప్పటినుంచి వారి వంశం  నామం హోయసల అనగా సింహాన్ని ఒంటి చేతితో చంపినా వాడు అని మార్చుకొన్నారు ..వీరు దేవగిరికి చెందిన సేఉన యాదవుల కు చెందిన వారు .అవక్ర పరాక్రమంతో చాళుక్య ,చోళ పాన్ద్యులను ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించారు .
వీరిలో విష్ణు వర్ధన మహారాజు చాళుక్యులను ఓడించి సామ్రాజ్య సుస్థిరతకు బాట వేశాడు .ఆయన కాలమ్ లోనే కర్ణాటక రాజ్యం లో కనీ ,వినీ ఎరుగని రీతి లో దేవాలయాలను నిర్మించాడు .అందులో ఈ ముఖ్యమైనవి బేలూర్ లోని కేశవాలయం ,హలేబేడు లోని శివాలయం ..అప్పటి వరకు జైన మతాన్ని అవలంబించిన విష్ణు వర్ధనుడు ,వైష్ణవ మతాన్ని మతాన్ని స్వీకరించి ,తన ,ధర్మాన్ని విశ్వాసాన్ని తెలియ జేయటానికి వీటిని నిర్మిఇంచాడని శాశ నాలు తెలియ జేస్తున్నాయి .ఇంకో కధనం ప్రకారం చాళుక్యులను ఓడించిన విజయ గాధకు చిహ్నం గా నిర్మించాడని .తలకాడు లో చాలక్యుల పై విజయమే ఈ నిర్మాణానికి కారణం .ఆ కాలమ్ లో దేవాలయాలలు మతానికి ,న్యాయానికి ,ధనాగారానికి ,ఆధ్యాత్మిక జ్ఞాన బోధకు ,సంగీతా నాట్య కళలకు నిలయాలు ..హోయసల రాజులు కళా ,శిల్పకళ ,మతాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చారు .బేలూరు దేవాలయం ఏక కూట ,హలేబేడు లో ద్వికూటా  సోమనాధ పురం లో త్రికూట ఆలయాలు నిర్మింపజేశారు .హోయసల రాజులు 950 లో రాజ్య పాలకు లయారు .పదమూడవ శతాబ్దం లో కర్ణాటక అంతా వారి స్వాధీనం లోకి వచ్చింది హర్ష వర్ధనుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించటానికి ప్రయత్నిస్తే కుమారుడు రెండవ వీర భాల్లాలుడు ఆ కోర్కెను నెర వేర్చాడ్డు .చోలులను రాజ్యానికి తెచ్చి ”చోళ ప్రతిస్తాపనా చార్య ”అనీ .”దక్షిణ చక్ర వర్తి ”అనీ ”హోయసల చక్ర వర్తి అనీ ”అనీ బిరుదు పొందాడు .చివరికి హోయసల రాజ్యం విజయ నగర సామ్రాజ్యం అధీనం లోకి ,చివరికి ధిల్లీ సుల్తానుల చేతిలోకి జారి పోయింది
                                   రాజా విష్ణు వర్ధనుడు భగవద్ శ్రీ రామానుజ్జుల శిషుడు .ఈ ఆలయాల నిర్మాణం విష్ణు వర్ధనుని కాలమ్ లో మొదలై ,మూడవ నరసింహుని కాలమ్ లో పూర్తి అయాయి .మొత్తం103  సమ్వత్చరాలుపట్టింది నిర్మాణానికి .కర్ణాటక ,ద్రావిడ శిల్ప సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది .118   శిలా శాశనాలు కన్పించాయి ఈ ఆలయ నిర్మాణానికి వాడిన శిలను ”chloritic schist ”అంటారు తెలుగు లో సబ్బు శిల అనచ్చు .అంటే అంత  మెత్తగా ఉంటుందట .శిల్పం పూర్తి అవగానే చాలా గట్టి పది పోతుందట .అదీ దీని గొప్పతనం .అంతా మెత్త గా ఉండ బట్టే ఇంత సూక్ష్మ కళను ప్రదర్శించ గలిగారు .అంటే చెక్కే టప్పుడు మైనం లాగా ఒదిగి పోంది
.ఏ రూపం .,కావాలంటే ఆ రూపం పొందుతుంది శిల్పి చేతిలో .నగిషీ చెక్కటానికి బంగారం లాగా ప్రవర్తిస్తుంది .ఒక రకం గా ఇది శిలా బంగారం అన్న మాట ..ఈ ఆలయాలు ఎత్తైన పీఠం మీద ఉండేట్లు నిర్మించారు .అదో విశేషం  .మన ఆలయాలు నెల మట్టం గా వుంటాయి .అడుగు భాగాన ఏనుగులు ,వాటిపై సింహాలు ,వాటిపై అశ్వం మీద శైనికులు ఆలయం చుట్టూ చెక్కారు .ఏనుగు బలానికి ,సింహం ధైర్యానికి అశ్వం వేగానికి ప్రతీకలు .ఒక శిల్పానికి ,ఇంకో దానికి సంబంధం వుండదు .దేని కదే ముచ్చటగా వేరు వేరు భంగిమలలో కన్పించటం శిల్పుల ప్రతిభకు అద్దం పడుతుంది .అనేక లతలు ,పురాణ గాధలు ఆలయం అంతా బయటి వైపు కనిపిస్తాయి .ఆలయాన్ని ”జగతి ” వేదిక మీద నిర్మించారు .దీని వల్ల భక్తులు ప్రదక్షిణ చేయ టానికి ఏ మాత్రం ఇబ్బంది వుండదు .
     లోపల కళా సంపద తో విలసిల్లె స్తంభాలు న్నాయి .గోడలలో గాలి వెలుతురూ ,లోపలి రావా టానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కారు .విష్ణు వర్ధన మహారాజు ,అతని రాణి శాంతలా దేవి విగ్రహాలను కమనీయం గా చెక్కారు .లోపల గర్భాలయం వుంది .రంగ మంటపం లో ఆలయ నాట్య కట్టెలు నృత్యం చేసే వారు .మొత్తం మీద 28   ventilator  నారశింహ ,ఆంజనేయ విగ్రహాలు రమణీయం గా వున్నాయి .వీరి ఇలవేలుపు నృశింహ స్వామి .అందుకని అన్ని వైపులా ప్రహ్లాద వరడుడిని ,హిరణ్య కశిప సంహారాన్ని కళా త్మకం గా చెక్కారు . ఆలయం లోని విమానం కాల క్రమం లోద్వంశం అయింది .శ్రీ కృష్ణ దేవరాయలు గోపర నిర్మాణం చేశాడు . రాతి రధం వుత్చావాలలో ఉపయోగిస్తారు . .
                       ఆలయం వెలుపల గోడల పై 644   ఏనుగులు   చెక్కారు  చిన్నగా ముచ్చటగా వుంటాయి .తూర్పున వున్న ద్వారం వద్ద రతీ మన్మధుల విగ్రహాలు అతి సుందరం గా వున్నాయి .లోపల నారశింహ స్స్తంభం వుంది .ఇది బాల్ bearingu ల మీద చక్క గా తిరుగు తుంది ..ఆ నాదే baall bearing   విధానం అమల్లో ఉందన్న మాట .లోపల వున్న నలభై ఎనిమిది శిల్ప కళా వైభవం తో ఉన్న రాతి స్తంభాలున్నాయి .వాటి సౌందర్యం వర్ణనా తీతమే .మండపం పై కప్పు మీద కూడా గొప్పప కళా వైభవం దర్శన మిస్తుంది .ఒక దేవేంద్ర సభలో వున్న అనుభూతి కలుగు తుంది .ఈ శిల్పాలు వ్వులితో కొన్ని lathe యంత్రాల మీద కొన్ని నగిషీలు చెక్కారు .ఈ స్తంభాల మీద 42 సాల భంజికలు అంటే మదనికలు  వివిధ భంగిమలతో మనసును దోచేస్తాయి .వీరినే శిలా బాలికలు అంటారు బయట చెక్కిన దర్పణ సుందరి శిల్పం ,భస్మ మోహిని ,లోపలి స్థంభ భట్టాలికా శిల్పాలు శిల్పి ఊహలకు ప్రతిబింబాలు .గజాసురున్ని శివుడు సంహారించే దృశ్యం ,గరుడుని రెక్కలు ,రూపం ,వామనావ తారం ,కైలాసాన్ని పెకలించే రావణుడు ,దుర్గా దేవి ,మహిసాసుర మర్దనం ,వరాహ అవతారం ,,భైరవ  రూపం లోని శివుడు ,సూర్య దేవుడు ,రధం ,కళా చాతుర్యానికి పరా కాస్ట .ఇంత సుందరం గా ,ఇంత సున్నితమైన చెక్కడం ప్రపంచం లో లేనే లేదు .హాట్స్ ఆఫ్ to జక్కనా చార్యా ,ఆయన కుమారుడు ,వారికి సహకరించిన ఇతర స్థాపతులకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద సాల మహారాజు సింహాన్ని చంపే శిల్పం మనోహరం .ఇదే హోయసల రాజ్య చిహ్నం .
               చెన్న కేశవ స్వామినే విజయ నారాయణుడు అంటారు .1117  లో దీన్నిప్రతిష్టించారు .నాలుగు హస్తాలాతో శంకు ,చక్ర గద ,పద్మాలతో పరమ మనోహరం గా దర్శనం ఇస్తాడు .ముందే చెప్పినట్లు ముక్కుకు ముక్కేర్ తో బాటు తలలో పువ్వులు కూడా వుండటం ప్రత్యేకత .ఇదే మోహినీ అవతారం .విగ్రహం పై భాగాన చుట్టూ దశావతారాలు అతి సూక్ష్మం గా చెక్కబడి విష్ణువు అనంతత్వాన్ని సూచిస్తుంది .దీనినే” ప్రభావలి” అంటారు .
                    ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన ”కప్పే చెన్నగ రాయా ”విగ్రహాన్ని రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది .దీన్నే కప్పు చెన్న  కేశవ ఆలయం అంటారు .దీనిలో గణపతి ,సరస్వతి ,లక్ష్మి నాయన ,చామున్దేశ్వారి ,వేణుగోపాల విగ్రహాలు వున్నాయి ..ప్రసిద్ధ శిల్పి జక్కనా చార్యుడు తన స్వగ్రామం కైదల నుంచి ఇక్కడికి వచ్చాడు .అతని కుమారుడు దంకనా చార్యుడు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాడు .ఒకరికొకరు తెలియదు .జక్కన చెన్న కేశవ విగ్రహం చెక్కాడు  .కొడుకు ఆ శిల్పం లో  లోపం ఉందన్నాడు .లేదని వాదించాడు తండ్రి .లోపం చూపిస్తే కుడి చేయి నరుక్కున్తానని శపథం చేశాడు . విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించారు . .గంధం అంతా యిట్టె ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం ఆర లేదు .అక్కడ ఒక ఖాళీ కనిపించింది .అందులో ప్రాణం తో వున్న k కప్ప బయట పడింది .ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు ..అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు .దేవుడు కలలో కన్పించి స్వగ్రామ రమ్మన్నాడట .తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞా గా చెన్న కేశవ ఆలయాన్ని కట్టారు .జక్కన చేయి మళ్ళీ తిరిగి వచ్చిందట ..
              చెన్న కేశవ ఆలయం కు పడమర వీర నారాయణ  ,దక్షిణాన సౌమ్యనాయకి దేవాలయం ,ఆండాళ్ దేవాలయం వున్నాయి .ఆలయం బయట  నలభై రెండడుగుల గ్రావిటీ పిల్లర్ వుంది   ,అన్నిటినీ తట్టుకొని చరిత్రకు సాక్షి గా నిలబడి వుంది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
                 అతి సున్నితమైన శిల్ప చాతుర్యానికి బేలూర్ దేవాలయం సజీవ సాక్షి .జీవితం లో తప్పక అందరు చూదాల్సినదే .ఒక్క రోజూ చాలదు .శిల్ప రహస్యం ,శిల్పి చాతుర్యం ,శిల్పి ఉహా త్మక్త అర్ధం చేసు కోవాలంటే రోజులు పడుతుంది .పరమ కళా వైభవం తో విలసిల్లె ఈ శిల్ప సంపదను గురించి ఎంతో కాలమ్ గా వినటమే కాని ఇప్పుడే ప్రత్యక్షం గా చూసి ,అనుభవించాను .నేను చూసింది ,తెలుసు కొన్న దానిలో వెయ్యో వంతు కూడామీకు విడమర్చి చెప్పి ఉండనని నా నమ్మకం .నాతొ పాటు ఆ కళా జగత్తు లో విహరించిన మీకు ధన్య వాదాలు  .ఇక్కడి కళా సౌందర్యాన్ని అనుభవించి మయూర హోటల్ లో భోజనం చేసి ఇక్కడికి 22   కి మే ,దూరం లో వున్న హలేబెడుకు ఒక అరగంటలో చేరాము .శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు కలిసి త్రిభుజం లాగా వుంటుంది .అందుకే దీన్ని triangular trip అంటారు .
హలేబేడు లోని హోయశాలేస్వర దేవాలయం గురించి తరువాత రెలియ జేస్తాను .
                                    మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ .–26 -07 -11 .క్యాంపు–bengaalu
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 2 Comments

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర —-1

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర   —-1
                    ఈ నెల ఇరవై మూడు శనివారం పై మూడు ప్రదేశ సందర్శనకు కే.ఎస్.టి.డి .అంటే కర్ణాటకస్టేట్  టూరిసం దేవేలోప్మేంట్  వాళ్ల బస్ లో  వెళ్లాన్ను .రాను ,పోను 500ki .మీ. దూరం .935 rs  ఉదయం నాలుగింటికే లేచి ,స్నానం ,సంధ్య ,పూజ చేసుకొని ,పొద్దున్నే అయిద్య్మ్బావుకు మార్త హళ్లి బస్ స్టాండ్ లో corporation సర్కిల్ కు అక్కడి బాదామి హుసే దగ్గర బస్ ఎక్కాను .పావు తక్కువ ఏడుకు బయల్దేరింది .వోల్వ బస్ ,ఏ.సి . మంచి రోడ్ ,లాంకో వాళ్ళు నిర్మించిన యెన్.హెచ్ .48 .హసన్ మీదు గా వెళుతుంది ,ఇది దాటితే మాంగాలుర్ ,మలబారు తీరం .అవి కాఫీ ,తేయాకు ,రబ్బర్ తోటలకు ప్రసిద్ధి .ఉదయం ఎనిమిదిన్నరకు”” ఎద్యుర్  ”అనేకి.మీ. చోట కాఫీ ,తిఫ్ఫిన్లకు ఆపాడు .గారే తిని     ,కాఫీ తాగాను .బానే వున్నాయి తొమ్మిదిన్నరకు శ్రావణ బెలగోలా చేరింది బస్ .బెంగళూర్ నుంచి 160, కి.మీ.కొబ్బరి తోటలు ,పనస చెట్లు ,చెరుకు తోటల మధ్య ప్రయాణం .మెయిన్ రోడ్ నుంచి ,single రూట్ లో  ప్రయాణం .మన కోన సీమ అందాలన్నీ ఇక్కడ క్కనిపిస్తాయి .అయితె అక్కడి లాగా కాలువలుండవు ..పరవశించే ప్రకృతి .ఉదయం కదా చాలా ఆహ్లాదం గా వుంది .
                            గంట సమయం ఇచ్చారు .పైకి వెళ్లి ”జైన ముని బాహుబలిని దర్శించి తిరిగి రావా టానికి .రాను పోను 1282 రాతి మెట్లు .పట్టుకొని నడవ టానికి ఇనుప రాడులున్నాయి   ..మొదట్లో మెట్లు చిన్ని గా వున్నా పోను పోను మోకాళ్ళు ఎత్తి అడుగులు వేయాలి .మొత్తం మీద రొప్పు కొంటు ,రోజూ కొంటు పైకి వెళ్లి గోమాతేస్వర దర్శనం చేశాను .58 అడుగుల ఎనిమిది అంగుళాల ఏకశిలా విగ్రహం .తెల్ల graanite రాయితో చేయ బడింది .ఇదంతా కొండపై చెక్కారు .చూడ ముచ్చట గా వుంది విగ్రహం .కళ్ళు చాలా పైకెత్తి చూడాలి .మహా నగిషీ గా చెక్కాడు శిల్పి .బాహుబలి కాళ్ళ కు చుట్టూ కొన్న లతలు ,,నుంచొని తపస్సు చేస్తుంటే పేరిగినా పొదలు చెట్లను సూచిస్తుంది పక్కనే పాము .తపస్సును భంగం చేయ టానికి వచ్చిందట .ఇవేమీ గమనించక తీవ్ర తపస్సును నుంచునే ఆయన చేశారట జ్ఞానోదయాన్ని పొందారు మా బాచ్ పదిఎడు మంది .అందర్లో ముందు దర్శించి కిందికి దిగింది నేనే .ఒక అమ్మాయి ఇరవై ఎల్లున్తాఎమో ,నా నడక .స్పీడు చూసి తన వాళ్ళతో  ”this gentle man seems much younger to me ”అంటున్డటం విన్నాను .జైనులు ,నడవలేని వాళ్ళు phrame పడక కుర్చీ లో పడుకుంటే కూలీలు మోసుకు పోతున్నారు పైకి .డోలీ అంటారు .అంతా భక్తీ భావం తో వస్తారు ఇన్ని మెట్లు ఎక్కి దిగటం చాలా కష్టమే .కాని ఇస్టమై వస్తున్నాము కనుక ఏమీ అనిపించదు .ఈ మధ్యే జైన ,బౌద్ధ మతాలను గురించి రాశాను కనుక ఇప్పుడిక్కడ చూడటం ఆనందం ,జీవిత సాఫల్యం ..ఇన్నాళ్ళ కు కోరిక తీర్చాడు జైన ముని .మనసార నమస్కరించాను .ప్రపంచం లో శాంతి విస్తరిమ్పజేయ మని ఆ మహా బలిని కోరాను
                            ఇప్పుడు ఈ క్షేత్రం లోని విశేషాలను వివరిస్తాను .బెల్ అంటే తెల్లని కోలా అంటే సరస్సు .కొలను అన్న మాట .స్వచ్చమైన తెల్లని నీటితో నిండిన సరస్సుఅని పూర్తి అర్ధం శ్వేత సరోవరం ..అలాంటి సరస్సు ,దానికి మెట్లు ,నిండా నీరు తో కనపడి దాని అర్ధాన్ని తెలియ జేస్తుంది గ్రామ మధ్యమం లో ఉందీ కొలను .ఈ మూడు క్షేత్రాలు హసన్ జిల్లా లో వుండటం విశేషం .తలకాడుకు చెందిన విశ్వకర్మ స్థపతులు ,ఈ మహా విగ్రహాన్ని చెక్కిన శిల్పులు .ప్రపంచం లో దీనికి మించిన ఏక శిలా విగ్రహం ఇంకీక్కడా లేదు .ఇక్కడ రెండు కొండలున్నా యి ఇంద్ర గిరి ,చంద్ర గిరి .మౌర్య చంద్ర గుప్తుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేయటం వల్ల చంద్ర గిరి అనే పేరు వచ్చింది .దానికి జ్ఞాపకం గా అశోకుడు ఇక్కడ ఒక బాసాది నిక్రీస్తు పూర్వం,మూడవ శతాబ్దం లో నిర్మించాడు దీనితో పాటు ఇక్కడ తపస్సు చేసిన వివిధ మత గురువుల ,అంటే శ్రమనకుల ఆలయాలు క్రీస్తు తర్వాత అయిదు ,ఆరు శతాబ్దుల లో నిర్మించారు .నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తికి శిష్యుడైన చాముండా రాయలు అనే రాష్ట్ర కూట రాజు చంద్ర గిరి మీద దేవాలయం కట్టించాడు .ఇక్కడ 800 కు పైగా శిలా శాశనాలు కనిపించాయట .ఇవి పూర్వ కనడ అంటే హల కనడ భాష లో వుంటాయి ఇది భట్టారక మతానికి పీఠం .వీరు దేశీయ గంగ మూల సంఘానికి చెందిన వారు .   .
                        జైన తీర్ధన్కరులు ఇరవై నలుగురు .మొదటి ఆయన పురు దేవుడు .ఈ యాన్నె వృషభ దేవ అనీ ఆది నాదుదని అంటారు .ఈయనకు ఇద్దరు భార్యలు పెద్ద రాణి యశస్వతి .ఈమెకు భరతుడు అనే కుమారుడు,ఇంకా వందమంది కొడుకులు ,బ్రహ్మ అనే కుమార్తె కలిగారాట్ .చిన్న రాణి సునందకు బాహుబలి అనే కొడుకు పుట్టాడు .ఒకప్పుడు ఇంద్రుడు నీలాంజన అనే దేవ దాసీ చేత వ్రుశాభుడి కొలువు లో నాట్యం చేయిన్చాదట .భరతునికి పట్టాభిషేకం చేసి రాజ్యం ఇచ్చాడు .బాహు బాల్ని .యువ రాజు గా అభిషేకించాడు రాజు వృషభ దేవుడు .భరతుడు అయోధ్యను ,బాహు బలి పౌదానా పురాన్ని రాజధానులు గా చేసుకొని పాలించారు .ఒక రోజూ భరతుని ఆయుధాగారం లో చక్ర రత్న అనే విసిరే గుండ్రటి వస్తువు కనిపించింది .దీన్ని చూసిన జ్యోతిష్యులు హరతుడు చక్ర వర్తి అవుతాడని చెప్పారు .దీనితో ఆశ పెరిగి తాను జగజ్జేత కావాలని నిర్ణయించుకొని ,తన కింద వున్న సామంతుల్నందర్నీ లొంగి పోమన్నాడు .యుద్ధం ప్రకటించాడు .కాని తమ్ముడు బాహుబలి లొంగ లేదు .పెద్ద యుద్ధమే జరిగి వేలాది మంది చనిపోయే     ప్రమాదం వుందని    ఇరువైపులా మంత్రులు సమాలోచనలు జరిపి ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేశేట్లు నిర్ణయించారు .యుద్ధం తీవ్రం గా జరిగింది .బాహుబలిదే పైచేయి అయింది ..అన్న తల వంచాడు .విజయం తమ్ముడిదే నని ఒప్పుకొన్నాడు .కాని వెంటనే బాహు బలికి జ్ఞానోదయం అయింది .ఈ ప్రపంచం శాశ్వతం కాదు ,ఈ భోగాలు ,రాజ్యం శాశ్వతం కాదు అనిపించింది .తన రాజ్యాన్ని కూడా అన్న భారతునికే  ఇచ్చి ,అతడే చక్రవర్తి అని ప్రకటించి తపస్సు కోసం అడవులకు వెంటనే బయల్దేరి వెళ్ళాడు .
                    భగవాన్ బాహుబలి నుంచునే ఘోర తపస్సు ధ్యానం చేశాడు .ఆయన చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి .ఆయన ఏమీ చలించ లేదు .పాములు కాళ్ళకు చుట్టుకోన్నాయి .లతలు ఒళ్ళంతా అల్లుకు పోయాయి .కేవల జ్ఞానాన్ని సాధించటం కోసం వేటినీ లెక్క పెట్ట లేదు .కాని మనసు ఇంకాస్థిర   పడ లేదు .రాజ్యం మీద ఏమూలనో కాంక్ష వున్నట్లు అనిపించింది .అన్న కు ఇది తెలిసి వచ్చాడు .తన కిరీటాన్ని తీసి తమ్ముడి పాదాల చెంత పెట్టాడు .”ఇది నీ రాజ్యం .నువ్వు నాకు ఇచ్చావు .దీని గురించి చింత వద్దు ”.అన్నాడు .అప్పుడు ఒక్క సారిగా బాహుబలి మనో కవాటాలు విచ్చుకొన్నాయి .సంకుచితత్వం పోయింది   కేవల జ్ఞానం సాధించి చివరికి నిర్వాణం ప్న్డాడు .వేలాది మందికి  జ్ఞానం కలిగించాడు  . గాంగ వంశానికి చెందిన రెండవ రాచమల్లు .మహా రాజు గారి మంత్రి చావుండా రాయాలె ఇక్కడి బాహుబలి విగ్రహాన్ని చేక్కించింది .ఆచార్య నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తి గారి ఆధ్వర్యం లో క్రీస్తు శకం 981 లో ఈ మహా నిర్మాణం జరిగింది . అంటే 1030 .సంవత్చరాల నాటి విగ్రహం చావుందరాయలను గోమాథ gomatha అని కూడా అంటారు .అందుకే  బహుబలిని gomathesvaru డు అంటారు ఆచార్య నేమి రెండు సిద్ధాంతాలని ప్రతిపాదించాడు .ఆయన ప్రియ శిష్యుడైన గోమాథుడు వాటిని gomatha సార జీవకాండ అని ,gomatha సార కర్మ కాండ అని ప్రచారం లో వున్నాయి ..
                           గోమతేస్వరుడు అనే బాహుబలి విగ్రహం పీఠం మీద కన్నడ ,తమిళ పూర్వ maraatha అక్షరాలూ కని పిస్తాయి ఇవి 981 కాలానికి చెందినవి .ఇంత మహా విగ్రహం చేక్కిన్చాటానికి కారణం ఏమిటి ?అని ఆలో చిస్తే కర్మ పై మానవుడు సాధించిన విజయమే అది అని తెలుస్తుంది .ఒక మహాజ్ఞాని ,మహాతపస్సంపంనుడుఅత్యంత ప్రశాంతితో ఎలా ఉంటాడో తెలియ జేస్తుంది కూడా .విగ్రహం వెడల్పు 26 అడుగులు .పూర్తి దిగంబర విగ్రహం .అక్కడికి వెళ్లి దర్శిస్తుంటే ఏ మనో వికారాలు కలగక పోవటం నాకే ఆశ్చర్యం గా వుంది .అంతటి ప్రభావం వుంది అక్కడ .అద్భత శిల్ప చాతుర్యం ,సునిశిత చెక్కడం మనకు ఆశ్చర్యం కల్గిస్తాయి  ఒక్కొక్క కాలు పది అడుగుల పొడవు .పూర్తి సౌష్టవం తో శిల్ప కళా మర్మజ్నం తో చెక్కిన విగ్రగ్రహం .బాహుబలి జుట్టువంకీలు  తిరిగి poduggవుంటుంది .ఆయన వున్న తపో భంగిమకు ”కాయతోత్సర్గ ”అంటారు .కళ్ళు తెరుచుకొని వుంటాయి .చెవులు విశాల మైనవి .పెదిమల చివర చిరు నవ్వు ,ప్రపంచాన్ని చూస్తున్న ద్రుష్టి ,ప్రశాంతత ,మూర్తీభవించి నట్లుండె మంగళ కర విగ్రహం .విశాల బాహువులు చేతులను కిందికి వదిలేసినట్లున్తాయి .యే రక మైన ఆధారం లేకుండా ఇంత భారీ విగ్రహం అన్ని ఆటు పోట్లు తట్టుకొని శతాబ్దాల పాటు నిలిచి ,ఇప్పటికి దేశ విదేశాలనుంచి జైన మతారాధకులను ఆకర్షిస్తోంది .పన్నెండు సంవత్చారాల్కు ఒక సారి బాహు బలికి మహా కుంభాభిషేకం జరుగు తుంది .ఆవుపాలునెయ్యి పెరుగు గంధం .. పూల్లు మస్తాకానికి అభిషేకం నిర్వహిస్తారు .లక్ష లాది జనం పాల్గొని భక్తీ ప్రపత్తులతో దర్శించి ,పూజించి ,తరిస్తారు .ఇందిరా గాంధి ప్రధాన  మంత్రి గా అక్కడికి వెళ్లి కుంభాభిషేకం లో ఒక సారి పాల్గొన్నారు .పైనుంచి పడిన అభిషేక  పదార్ధాలు  పాదాల మీద పడాలి   .అప్పుడే అది పూర్తి అయినట్లు ఒక సారి అలాజరగ లేదట  ఒక భక్తురాలు ”గుల్లిక యాజ్జి ”అనే ఆమె పోసింతర్వాత అభిషేక జలం పాదాలను తాకిందట అందుకని ఆమె జ్ఞాప కార్ధం ఒక
చిన్న గుడీ కట్టారు అక్కడే . ఈ వూరు హసన్ కు పదిహేను కిలో మీటర్లు .ఆచార్య నిమికి దేవాలయం వుంది .
                     మహా బాహుబలి దివ్యదర్శనం తో మనసంతా ఆనందాన్ని నింపుకొని ,,పురాతన చరిత్రను మననం చేసుకొంటూ బస్ ఎక్కాను .పదకొండు గంటలకు బస్ బయల్దేరి బెలూరుకు పన్న్నేన్డుం బావుకు తొంభై కిలో మీటర్లు ప్రయాణించి చేరింది
                        బేలూరు విశేషాలు మరో సారి తెలియ జేస్తాను .
                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25-07-11.–క్యాంపు   –బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2

 తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2
         —————————————–”
డాక్టర్ వసంత్ రాసిన ”తెల్ల కొప్పెర తెప్పం ;;”కధా సంపుటి లోని కధలను గురించి తెలియ జేశాను కదా .ఇప్పుడు అందు లోని జాతీయాలు ,సామెతలు ,మాండలీక వైభవం గురించి వివ రిస్తాను .శేప్పేది శేప్పి శేప్పులా కొట్టి ,శిప్పలా బెల్లము పెడతాడు ముసిలోడు .”పగోన్ని పంచాంగము అడిగి నట్లు ”’కర్నాతకము   గుర్రమైతే తమిళ నాడు గాడిదే ”.”ఆలు పోయెరా గోవిందా –ఆలు పోయిన అనంత పురముల అన్నెము దొరికేర గోవిందా ”
”      ”పొద్దున్న పోయేది టీ అంగడి .పొద్దు మునిగ వంక పోయేది మందు అంగడి ..”కసువామి కాడ కుక్క  కసువు తినేలా ,పశువుని తిన్నిచ్చేలా ”తాను తినడు ఇతరులకు పెట్టడు అన్న అర్ధం లో వాడింది .
”తిరిసి తినేదానింటికి గింజల పులుసుకి పొతే గిద్ది పీక్కొని అమ్పించిందట ”అడుక్కొని తినే దానింటికి ఏదైనా పెట్టమని వెళ్తే గిన్నె లాక్కొని పంపించిందట .
”రాగ్గింజంత రెడ్దోడుంటే రాజ్యమే శేది పోతుంది ”రెడ్ల మీది ద్వేషాన్ని తెలియ జేసే సామెత మనం కూడా ”ఉల్లి పాయంత  కాపు వుంటే ఊరంతా చెడ గోద్తాడు ”
”శివుని పూజలా కరిడి దూరినట్లు ”  శివ పూజ చేస్తుంటే ఎలుగు బంటి అడ్డ మోచ్చినట్లు అనే భావం .అడ్డ మొచ్చి పని చెడ గొట్టే వాళ్ల గురించి అనే మాట .
”కారే మారే కట్టాలి పట్టా ,కాలకుండా పోనుకోవే బొండెం బిడ్డా ”ఒక జాన పద పాట
”ఎదురిల్లు పాడైతే ఎండిన కట్టెలు శ్హిక్కు తాయని ఎదురు శుశే కాలమ్ .అవతలీ  వాడి బాధ చూసి ఆనందించే వాడు .
”గౌనోల్ల శాద్యం ఎడూల్ల ఎల్లెలుపంత ”అంటే గౌడుల వ్యవసాయం ఎడ్ల వెడల్పు అనగా బాగా విస్తరించి వుంటుంది .”గోనోల్ల శేనులా పంట పండిందంటే ,పేదోళ్ళ ఇంటిలా గాదినిన్దినట్లే ”గౌడులు ఉదార స్వభావం వున్న వాళ్ళు అని తెలియ జేస్తోంది . వాళ్ల  చేనుల్లో పంట బాగా పండితే బీదా ,బిక్కి కి అన్నానికి కొదవ ఉండదని భరోసా .’
      ”మ్మన మెట్లా సంతకు పొతే మంచి సరుకునే ఏరి కొంటామో ,,ఆ దేవుడు కూడా అట్లే మంచోల్లని ముందర తీసుకొని పోతాడు ”.
      ”గువ్వ    ఇడిసి పోయిన గూడు లా వుంది ”
”తినేది ,కుడిసేది ,తిమ్మక్క ఇంట్లా -పోనుకోనేది లేశేది పాపక్క ఇంట్లా”  సత్రా  భోజనం మఠా నిద్ర అన్నట్లుంది .    ”
”ఉబిసో ఉబ్బెసో ఎపించుకొందాం ”పని అవాలంటే అవతలి వాడిని వుబ్బేసి లేక తిట్టి పని చేయించు కోవాలని భావం .
”బోరని వానలా వాన పడితే ధరణి పండుద్ది అంటా ”అంటే భరణి కార్తె లో వర్షం పడితే భూంమి బాగా పండుతుంది .
”బంతి భోజనానికి ముందుండాల ,ఎదురు యాజ్యానికి ఎన కుండాల ””మా పక్క యా పొద్దు వడ్లకు   ,రెడ్లకు కొదవ లేదు .”అంటే ఎక్కడ చూసినా రెడ్లే కనిపిస్తారు .వడ్లు పండే పొలాలే కని పిస్తాయి
ఇలాంటివి సందర్భోచితం గా ప్రయోగించి కధా గమనానికి ,అర్ధం ,పరమార్ధం కల్పించారు రచయిత .ఇంకా ఎన్నో హోసూరు జాతీయాలు ,సామెతలు వుండి వుంటాయి వాటిని అన్నిటిని భద్రం  చేయాల్సిన అవసరం వుంది .హోసూరు తెలుగు ప్రజానీకం మీద ఈ బాధ్యత చాల వుంది .
                                                                 మాండ లీకాలు
  హోసూర్ మాండలీకాలు బాగున్నాయి .భాషా వేత్తలు ,సామాన్య జనం మర్చి పోయిన వాటిని వీళ్ళు చాల ధారాళం గా వాడుతున్నట్లు కన్పించింది .అందులో నాకు బాగా నచ్చిన పదం ”మొయిలు ”అంటే మేఘం ..ఇది కావ్యాలకే పరిమిత మయింది .కానీ ఇక్కడ ఎక్కువ గా వాడుతున్నారు నాకు ఎంతో ఆనందం కల్గింది .సువర్ణ సుందరి సినిమా లో ”ఏమో తటిల్లతిక మేమో ,మై మరపేమో ,మొయిలు రాజు దరిమురిసినదేమో ”  అన్న పాట జ్ఞాపకం వచ్చింది .దీన్ని ఇప్పటికీ వాడుతున్న హోసూర్ తెలుగు ప్రజకు వీర తాళ్ళు .                                                                                                                                                                                
                         రంగుల తొండను  బాపన తొన కత్తె అంటారు .మేడి పండ్లకు ఆత్తి పండ్లంటారు .మనము వాడతాం .ఇంద్ర ధనసు కు మరో ముద్దు  పేరు కాముని బిల్లు .అంటే కాముని విల్లు .మీజు అంటారు నీటిలో  ఈదటాన్ని . వగరును తొగరు అనటం కావ్యాలలో వుంది .కాలీ ఫ్లవర్ వీళ్ళకు పువ్వు కోసు .చిన్నరాలును రోలు   ను  కటాని అని పిలుస్తారు ..సాయంత్రాన్ని మాపు సారి అంటారు మాపు అంటే సాయం సమయమే .పందిరికి సప్పరం అంటారు .చలువ చప్పరం మనకు వాడుక లో వుంది చప్పరం సప్పరం అయింది .వంటిల్లు వీళ్ళకు మూలిల్లు .అర్ధవంత మైన మాటే .నట్టిల్లు అంటే ముందు ఇల్లు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి జ్ఞాపకం వస్తారు .ఊరేగింపుకు మెరగని అనటం మామూలు .పొలాన్ని మడి అంటారు .అందరు వాడేదే మాదిగే నాలు అంటే పొలం గట్లు .కొక్కెర అంటే కొంగ చిన్నయ సూరి గారి పంచతంత్రం లో చదివిన మాటే .మెట్ట ను శేను అని ,మాగాణిని కాన అనీ అంటారు .సన్నాయి కి కొలువు అనే మంచి పేరు వాడు తారు .పరక అంటే చీపిరి .మనం కూడా పరక కొట్టటం అంటాము .అంటే వూడవటం .కలంగిరి కాయ అంటే పుచ్చ కాయ .పంగల కర్రను కవలు కొమ్మ అంటారు .కవల అంటే జంట .రెండు కొమ్మలు కలిసింది మంచి మాట .పువ్విరిసి –గంగ రావి .కరిడి –ఎలుగు బంటి .మట్టిగాడు –చిరుత .సేండు –బంతీ .ఇది చెండు కు అపభ్రంశం .కేళిక –వీధి భాగవతం –కేళి అంటే భలే మంచి మాట .”మగువ తన కేళికా మందిరమునకు జనియెన్ ”అని చదువు కొన్నాం .కొబ్బరి కాయలకు భలే మంచి పేరుంది వీళ్ళకు ”ఎల నీరు కాయ ”అంటే లేత నీల్లున్న కాయలు అనే అర్ధం .మోచ్చులు –కత్తులు .ఇదీ కొంత మంది వాడే మాటే .పొంజు –కాగడా .కిరసనాయలు కు సీమ నూనె అని పేరు .దీన్ని అంతా వాడతారు .
జీతం–సంబలం .గర్భిణి –యాగిటి  urumunu గుడుగు అని మెరుపును మించు అని అంటారు .ఇవీ కావ్యాలలో కని పించే మాటలే .యెర్ర బడటం –కేమ్బారు   .–కెంపు అవటం   కెంపు అంటే ఎరుపే ..
తమిళులు –కొంగోళ్ళు …ఒగ్గట్టు –ఐక మత్యం  –ఒక కట్టు గా వుండటం .కట్టు గట్టు అయింది .ఆశ –ఆపెకారము .–అంటే ఆపేక్ష .గోరటి గువ్వ –గోరింక .మాను కుంకే గువ్వ –వడ్రంగి పిట్ట .మాను అంటే చెట్టు చెట్టును ముక్కుతో తొలి చేది .జమ్సరి –విజయ దశమి .పన్యారం –ప్రసాదం .మసలకు –తెల్ల వారు జామున మసలు వేళ అని వాడతారు .తిరిసి తినడం –అడుక్కొని తినటం .”తిరిపెమునకు ఇద్దరాల్లా గంగ విడువు పార్వతి చాలున్ ”అని శ్రీనాధుని చాటు   వు .కిర్లి కిర్లి  ———— –పడి పడి   నవ్వటం ఏడవటం .
దూర్లు –చాడీలు –దూరటం అంటే తిట్టటం .గాసి –కష్టం –గాసిలి అని వాడటం తెలుసు .తిక్కన పద బంధం .ఆరట్లు –బాతా ఖానీ –తడుసు కోనేకి –ఆగ టానికి .తడవు అంటే ఆలస్యం చేయటం.సంబళము –జీతం .ఇది వినని మాటే మనకు .ఎండ్లేలుగు –వెన్నెల .అంటే ఎండ లాంటి వెలుగు –లేక వెండి వెలుగు .పుట్టి –గంప .నీళ్ళ పై ప్రయాణించే గుండ్రని ది పుట్టి మునిగింది అంతా అయిపొయింది అని అర్ధం .రాతి గువ్వలు –గబ్బిలాలు .వాటి ఆవాస స్థానం వల్ల వచ్చిన్ అ పేరు .రణ వంతులు –రాబందులు –పీక్కు తినేవి అనే భావమేమో .చీటీగ –దోమ -..ఇదీ వినని మాటే నాకు .సోగుడు –మంచు .ఈ మాట  కావ్యాలలో ఉందేమో .గొన్ని పులుగు –లద్దె పురుగు –పులుగు అంటే పక్షి అని సాధారణం గా అనుకొంటాము .ఇక్కడ పురుగు కు కూడా అన్వయించింది .
      పునాది–తలాడి .బోకలు –పెంకులు .ఇదీ వింత మాటే . . రెయ్యి –అర్ధ రాత్రి -సగం రేయి –సగం రాత్రి
ఇంక వాక్య నిర్మాణం లో ఎలాంటి మార్పులున్నాయో చూద్దాం .ఎపుడు అనేది యెబుడు అయింది .రాతో రాత్రి –రాత్రికి రాత్రికి   కోడి కూసే జాము –తొందరలో కోడి గూజాము .అయింది .జంబు సవారి స్పీడు లో జెంసరి  ఇచ్చి విడి చేస్తే –అయిన్దోచ్చు .ఇచ్చి-విడిచేస్తేc  –ఇచ్చిడిస్తే  అయింది చే వ్రాలు చేవ రాలు గా  మారింది అలాగే తిట్టు పదం దూట్టడికే –తూత్తేలికే అయుండచ్చు .నవ్వుతు నవ్వుతు కాస్తా ”నాగ నగతా ”గా మారింది .
               ఇన్ని చక్కని సామెతలు జాతీయాలను ,అర్ధ వంతమైన మాండాలి కాన్ని   తన కధల్లో నింపి వాటికి ,కావ్య  గౌరవాన్ని తెచ్చిపెట్టి , ,వారి జీవన విధానానికి హోసూరు కు ,అక్కడి తెలుగు ప్రజలకు తెలుగు భాషకు తెలుగు తల్లికి నీరాజనం గా అందించిన డాక్టర్ వసంత్ గారిని మనసారా అభినందిస్తూ ,మరిన్ని రచనలు వారి నుండి రావాలని కోరుకొంటూ ,వస్తాయనిఆశిస్తూ ,,మిగిలిన బ్రాహ్మణ వైశ్య ,కుమ్మరి కమ్మరి మ్మోదలైన వృత్తుల వారి జీవన విధానాలను కధలుగా రాసి ,,రాసి పోయాలని కోరుతూ    ,సెలవ్  .
                        మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -07 -11 .క్యాంపు —బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

 

Posted in రచనలు | Leave a comment

తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —1

        తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —
            ——————————————————
                   ఈ నెల 18 వ తేది బెంగళూర్ నుంచి హోసూర్ వెల్లి నపుడు అక్కడి సాహితీ మిత్రులను కలిసిన వివరాలన్నీ మీకుఅంద జేశాను .అక్కడి యువకుడు ,ఉత్చాహ వంతుడు ,తెలుగు భాషా కార్య కర్త ,కవి ,కధకుడు అయిన డాక్టర్ యెన్ .వసంత్ గారు తన మొదటి కధా సంపుటి ”తెల్ల కొక్కెర తెప్పం ”నాకు బహూక రించారు ..దాన్ని వెంటనే చదివాను .ఇది హోసూర్ మాండలికం లో రాసిన కధా హారం .మాండలికాలు భాష కు జీవ నాడులు ..వాటిలో కాలా తీత మైన శబ్ద సంపద వుంటుంది .కాల క్రమేనా భాష పై అనేక శక్తుల ప్రభావం పని చేయటం వల్ల మాండలికాలు మరుగై పోతున్నాయి .అది గ్రహించిన రచయితలు ,చైతన్న్య వంతులై తమ ప్రాంత మాండలికాన్ని బ్రతికించు కొనే ఉద్దేశం తో మాండలికం లో కధా రచన ప్రారంభించారు .కవితా సంపుటులు తెస్తున్నారు .మామూలు వ్యాసాలు మాండలికం లో రాసి భాష అస్తిత్వాన్ని నిల బెట్టు తున్నారు .ఇలా వచ్చిన వే నామిని సుబ్రహ్మణ్యం రాయల సీమ మాండలికం లోను ,ఖదీర్ బాబు కధలు ,బార్బర్ కధలు ,మిట్టూరోడి  కధలు ,ముస్లిం మైనారిటీ కధలు ,తెలంగాణా మాండలికం లోను ,ఉత్తరాంధ్ర మాండలికం లోను వస్తున్న కధలు .వీటి నన్నిటిని పాథకులు ఆదరిస్తూనే వున్నారు .పత్రికలూ ప్రోత్చాహిస్తూనే వున్నాయి ..హోసూర్ ప్రాంతం లోని మాండలికం నేపధ్యం తో ,తన తల్లి గారు చెప్పినవిషయాలను భద్రపరచి ,స.వెం గారి ప్రోత్చాహం తో వసంత్ ఈ కధలు రాశారు. ఇది ఆయన ప్రధమ ప్రయత్నమని అంటున్నారు కాని ,ఒక చేయి తిరిగిన రచయిత రాసిన తీరుగా వుండటం డాక్టర్ గారి ప్రతిభకు నిదర్శనం  
                      ఇరవై కధలున్న ఈ సంపుటి కధల్ని హోసూర్ కధలు గా కూడా పిలుస్తున్నారు .ఈ పుస్తకాన్ని వసంత్ తన తేనే పలుకుల తెలుగమ్మతన తొలి మాటలతో పలకరించిన తన కన్నతల్లి
వెంకట లక్ష్మమ్మ గారికి అంకితమిచ్చి ,తల్లి రుణాన్ని ,తెలుగు భాషామ తల్లి రుణాన్ని తీర్చు కొన్నారు .ఇక్కడ తెలుగును రెండవ అధికార భాష గా చెయ్యాలనే ఉద్యమ స్ఫూర్తి కలవారు వసంత్ .అంతే కాదు తమ కళ్ళముందే తెలుగు మాట ,పాట పద్యం ఊర్ల పేర్లు ఆటలు కనుమరుగవటం తో తల్ల డిల్లి పోయారు .ఇక్కడి సామెతలు ,ఆచార వ్యవహారాలూ ,చిన్న నాటి జ్ఞాపకాలను కతలు గా మలచాలన్న  రమేష్ గారి హితం  బలం గా పనిచేసి కధలకు శ్రీ కారం చుట్టారు .
               ఇందులోని వాన కోయిల ,చీమక్క దోమక్క ,కాకమ్మ గువ్వమ్మ ,బంగారు పేట కధలు పశు పక్షాదులను పాత్రలు గా చేసుకొని వాటిలోనూ సామాజిక నీతి ని చెప్పారు .ఇవి పంచ తంత్ర కధల్లా బాగా వున్నాయి .కొన్ని కధలు వాళ్ల పల్లె టూరి జ్ఞాపకాలను ,పెళ్ళిళ్ళను ,దేవుడి ఉత్చ వాలనుగురించి చెబితే ,భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచినపుడు ఇక్కడి హోసూర్ ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రం లో కలపమని గోల చేసినా పట్టించు కోని ఆంద్ర వాళ్ల చేతకాని తనాన్ని గురించి ,ఇంకొన్ని భాషా సమస్య ,సెజ్ ల వ్యాప్తితో వచ్చిన పెను ముప్పు ,జీవన సరళిలో వచ్చిన మార్పు ,మళ్ళీ వాటిని కాపాడు కోవటానికి   ,పిన్నలు ,పెద్దలు చేసిన పోరాటం గురించి వున్నాయి .దారి తప్పిన యువకుల్ని ఉపాయం తో గాడిలో పెట్టిన కదా ,ఉపాయం తో అపాయం తప్పించిన పెద్దమ్మ కధ చెప్పటం లో అలాగే పల్లె బతుకులు శిధిల మాయే తీరు కొండ కోనా యేరు వూరు గురించిన తీయని జ్ఞాపకాలన్నే కల గలిపిన పుస్తకం ఇది .చాలా ఆవేదనతో ,అనుభవంతో అడుగడుగునా తన మాండలీకానికి పట్టం కడుతూ ,అందర్నీ చదివిన్చేట్లు చేసిన కధలివి .మంచి ప్రయత్నం .దీనిని చూసి ఈప్రయత్నానికి   సంబర పడి ,గుర్తించి వసంత్ గారికి ఆగస్ట్ ఏడవ తేది హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో  సంమానిస్తూ , అవార్డ్ ప్రదానం చేస్తున్నారు . .వారికి మనఃపూర్వక అభినందనలు .తొలి ప్రయత్నం తో మంచి గుర్తింపు లభించింది .
                  ఏటి గడ్డ కధలో తన పల్లె లోని చిన్న నాటి అనుభవాలను గుది  గుచ్చి . ఆ చల్ల గాలి ,తోట దొడ్డి యేరు నీరు ,ఆట పాట గువ్వల గుసగుసలు గాలి రాయబారాలు ఇంకెక్కడా దొరకవని ఒక్క తన పల్లె లోనే వున్నాయని సంబర పడ్డారు . తన బాబాయి అంటే పిన్నప్ప పెళ్లి జ్ఞాపకాలను ,తీరును కళ్ళకు కట్టినట్లు వర్ణించారు పిన్నయ్య పెళ్లి కతలో .తెల్ల కొక్కెర  తెప్పం అంటే తెల్ల కొంగల సమూహం  అవి నీటి మీద వాలితే ఒక తెప్ప లాగా కని పించటం .చిన్న నాడుఏడాదిలో కొన్ని రోజులు ఎక్కడి నుంచో కొంగలు వచ్చి వాళ్ల వూరి చెరువు లో దిగి బండ రాయి మీద చేరితే ఒక తెల్ల తెప్ప లాగా కని పించింది రచయితకు .కొంగలు యెగిరి పోగానేతెప్పం   కూడా పోయిన్దనుకొనే అమాయక పిల్లగాడు .పాలేరు వివరించి చెబితే తెలిసింది .కొంగలు బండ మీద వాలటం వల్ల తెప్పగా కనిపించిందని ,కొంగలు యెగిరి పోగానే బండ అక్కడే వుందని తెలుసుకొన్నాడు ”కొన్ని సమాశారాలు ఒగరు సెప్పి తెలుసుకొనే దాని కన్నా ,మనము నేరుగా సూసి అర్తము శేషు కొంటె ఆ ఆనందమే వేరు గౌడూ ”అని మన్చి హిత బోధ చేశాడు జర గప్ప ఈ కద పేరే కధా సంపుటానికి పేరు అయింది .పల్లె టూరి అమాయ కత్వం ప్రకృతి సొగసు ,పక్షుల స్వైర విహారం ,నేత్రానందమైన అనుభూతి పల్లె సొగసులు వున్న కధలకు ఈ పేరు సహజం గా వుంది ., .నీడ నీళ్ళు కద లో అమాయకం గా ఒక చిన్నోడు మంచినీళ్ళు దోసిళ్ళలో తాగుతుంటే చెట్టు మీది చిన్న తొండ పిల్ల ఆ దోసితి నీటిలో పడి కడుపు లోకి పోయిందని ,మనో వ్యాధి తో చిక్కి శల్యమైన వాడి భయాన్ని పక్క వూరి మంత్ర గాడిని రప్పించి ,దోకులకు  మందిచ్చి ,కక్కించి ,తాను పట్టి తెచ్చిన తొండ పిల్లను అందు లో వేసి బయటకు వచ్చేసిందనినమ్మకం   కలిగించి వాణ్ని మామూలు మనిషిని చేసిన పెద్దమ్మ తెలివి తేటలను బయట పెట్టిన కద .ఆద్యంతం సరదా గా సాగుతుంది ..
                        ఊళ్ళోని పంటను చెట్టు కాయలను అర్ధ రాత్రి ఊళ్ళోని కొందరి  సాయం తో దొంగలు కాజేస్తుంటే అది కొరివి దెయ్యాల పని అనుకొనే అమాయక జనం కళ్ళునుతెరిపించి  ప్రత్యక్షం గా చూపించిన గౌడు కధే కొరివి దయ్యాలు .దొంగ గా ,తాగు బోతూ గా మారిన ఒక యువకుడిని వాడి, తండ్రి మార్చమని కోరటం తో వూరి పెద్ద గౌడు  వాన రాయ సామి వుత్చావం లో లో ఉపాయంగా మార్చి ,మళ్ళీ మామూలు మనిషిని చేసిన కద .వాన కోసం వాన రాయ స్వామిని పూజించటం పల్లె టూరి పధ్ధతి .తెలుగు భాష ను దూరం చేసే పనులు తమిళ ప్రభుత్వమూ ,తమిళ అది కారులు చేస్తుంటే వూరు కో లేక మాస్టారు సహాయం తో పిన్నా పెద్ద కుర్రాళ్ళు అంతా కలిసి పోరాడి తెలుగుకు మళ్ళీ మంచి రోజులు తెచ్చిన కదే మా వూరు .గుమ్మయ్య మొడుగు అంటే గుమ్మయ్య మడుగుఅని అర్ధం .ఈ కధలో ఆ మడుగు చుట్టూ వున్న faunaa ,floraa లను అత్యద్భుతం గా వర్ణించారు ,వాళ్ళమ్మ  వండే పిండి వంటల లిస్టు కూడా బాగుంటుంది నోరు ఊరిస్తూ .ఇంత అందమైన మడుగు పరిశ్రామల పేరిట వ్యర్ధ పదార్ధాలు తమిళ తంబుల మేడలలోని మురికి నీరు ,చేరి వాతావరణ కాలుష్యం ,జల.వాయు కాలుష్యం ఏర్పడి జన జీవనం దుర్భర మైంది .ఎవరు తమిళుల ను ఎదిరించే సాహసం చేయ లేక పోయారు .భరిస్తూ వూరు కొన్నారు .పారిశ్రామిక ప్రగతి తెచ్చిన ప్రమాదం ఇది .దసరా పది రోజుల వుత్చావాన్ని ”జం సవారీ ”కడలో బాగా వివరించారు .నాకు తెలిసి నంతవరకు మేము హిందూ పురం లో వుండగా ”జంబు సవారి ”అని దసరా పండుగను చేయటం జ్ఞాపకం వచ్చింది .విజయ దశమి నాడు వాహనాలలో కార్లలో బస్సుల్లో సాయంత్రం అందరు డబ్బు ఖర్చు లేకుండా ఊరంతా ఫ్రీ గా తిరిగే వారు .మేమప్పుడు పిల్లలం .జంబు సవారి అని తెగ సంబర పడే వాళ్ళం .బస్సుల్లో సుగూరు ఆంజనేయ స్వామి గుడికి ఫ్రీ గా వెల్లి వచ్చే వాళ్ళం .ఆ జంబు సవారే ఇక్కడ జం సవారి అయిందని పిస్తోంది .అమ్మాయి ,అల్లుడు ఇద్దరు ఉద్యోగాల్లో ఉండి ,డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకు తుంటే తండ్రి మారప్ప ఉపాయం ఆలోచించి తన వూరిలో జరిగే పరస అంటే దేవుడి పండుగకు బలవంతం మీద ఒప్పించి ,రప్పించి ,వాళ్ల మనస్సుల్లో మార్పు తెప్పించి ,సంసారసౌఖ్యాన్నిఅర్ధం చేసుకోనేట్లు రాసిన కధే ”పరస ”బాగా రాస్శారు .
                    చిన్నతనం లో చిరు తప్పు చేస్తే ,దానిని మహాత్ముల బోధనా తో సరిదిద్దు కోని మళ్ళీ ఆ తప్పు చేయకుండా అందరి క్షేమం కోసం పాటు పడుతూ ,తన యావత్ ఆస్తిని ఆఅశ్రమానికి రాసిచ్చి ,అందులోనే స్వామి సేవ చేస్తూ ,జీవితాన్ని పందిన్చుకోంది పెద్దమ్మ .అయితెకొన్నేళ్ళకు   ఎవరో వచ్చి చిన్నప్పుడు ఆమె చేసిన తప్పును జ్ఞాపకం చేసి ఆశ్రమ వాసులకు చెబితే అప్పటిదాకా  నిప్పులా  చూసిన వాళ్ళు ఆమెను దూరం చేశారు .భరించ లేక వేరే వూరు వెల్లి అక్కడా సమాజ హితం గా బతుకు తూ చని పోయింది .అక్కడి ప్రజా అంతా ఆమెను దేవతలాగా భావించి అంత్య క్రియలను అత్యంత వైభవం గా జరిపారు .ఇక్కడి ఆశ్రమ వాస్లు వెల్లి చూసి తమ తప్పిదం తెలుసు కొన్నారు .ఈ కధే ”పెద్ద మనసు పెద్దమ్మ ”మనిషి చనిపోతే జనం యెంత ఎక్కువ గా వస్తే వాళ్ళు స్వర్గానికి పోతారని పెద్దమ్మ అంటూ వుండేది .అదే నిజ మయింది .
              సెజ్ ల పేర భూములు పోగొట్టుకొని చిన్నా ,చితక రైతులు రోడ్ మీద పడిన కధే ‘ఆపత్తు ”.తన సర్వం తన తొందర వల్ల ,కొడుకు వ్యసనాల వల్ల పో గోట్టుకొన్న గౌడు చివరికి తన కర్మ మిగిలిన రైతులకు కలగ కూడదని ,రైతులన్దర్నీ సమీకరించి ,ప్రభుత్వాన్ని నిలదీసి ,అధికార్లను ఒప్పించి మార్పు తెప్పించాడు .మంది కలిస్తే సమాస్యా విడి పోతుంది .అని తెలియ జెప్పారు .
మన ప్రాంతం లో సంస్కృతం అంటే దేవ భాష మాత్రమే కాదు బూతు అని కూడా అని అర్ధం వున్న సంగతి అందరికి తెలిసిందే .దీన్నే మనం పన్నెండో నెంబర్ భాష అంటాం  .పిట్టన్నకు సంస్కృతం నేర్చుకొంటే గౌరవం పెరుగు త్తుందని భావించి జిట్టన్న మాట విని పక్క వూరికి పోయి అక్కడ అమ్మ లక్కలు తిట్టు కొనే బూతులు చాటుగా విని వాళ్ల కళ్ళలో పడి దెబ్బలు తిన్నాడు సరదా గా సాగే కద ”.రచయిత సెన్స్ అఫ్ హుమౌర్ కి మచ్చు తునక” .సముస్క్రుతము ”కద
                     పంచాయితీ ఎన్నికల్లో గెలవా టానికి అన్ని పాట్లు పడతాడు శీనప్ప   .చివరికి గెలిచాడు .తెలుగు లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే అది కారి ఒప్పుకో లేదు .ఇంకేమి వుంది ?తెలుగు లంతా సమాయత్త మినారు .అన్ని పంచాయితీ అధ్యక్షులుకలిసి నడిచారు .ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు .ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల కోరిక మన్నించింది .అందరు ఒకే సారి వారి ఊళ్లలో తెలుగు లో ప్రమాణ స్వీకారం చేసిన కధే ”తల వర ”అంతే పంచాయితీ అధ్యక్షుడు .దాన్ని తిర గేస్తే వర తల విశిష్ట మైన తల .హెడ్ మాస్టర్ లాగా .అంటే గ్రామానికి ముఖ్యడు .
            ఈ ప్రాంతపు సాహితీ వేత్త ,కవి ,రచయిత నంద్యాల నారాయణ రెడ్డి   గారి కి ఆంధ్రలు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ సరిగా తెలుగు వాళ్ళను పట్టించు కో లేదని .ఆ కోపం ఇప్పటి దాక వుంది .ఆ అసహనాన్ని వీలైనప్పుడల్లా ఆయన ప్రదర్శిస్తారు .ఇక్కడ ఏ కార్య క్రమం జరిగిన ఆయనే ముందుంటారు .మంచి సలహాలనిస్తారు …అర్జీలు రాస్తారు .తెలుగే కాదు తమిళ ,కన్నడాలలోను మాట్లాడ గలరు ,రాయ గలరు .వారి కోప తాపాలను తమాషా గా తెలియ జేసే కధే ”ఆంధ్రా వొళ్ళ శేతలా అయితిండా ?.బాగా చెప్పారు రచయిత .చక్కని హాస్యము పండించారు నారాయణ తాత ,నాయినమ్మ సంభాషణలలో .
             ఒక వాన కోయిల అక్కను ఆవ మాన పరిచి అక్క తనకు అన్య్యాయం చేసిందని గుడ్డి గా నమ్మి అక్కనే కాళ్ళతో తన్ని బయట పడేస్తే బండ రాయి తగిలి అక్క చని పోయింది .తాగినమైకం దిగి తప్పు తెలుసు కోని విల విలా ఏడుస్తూ అక్క కోసం దేశం అంతా ”ఆక-ఆక ”అని పిలుసు గాలిస్తోందట ..వాన కోయిల హోసూర్ ప్రాంతం లో దుక్కులు దున్నే టప్పుడు కని పించే పిట్ట అది ఆకా -ఆకా అని కూస్తుందట .దీన్ని ఆధారంగా చాలా కమ్మటి నీతి బోధక మైన కద చెప్పటం వసంత్ గారి భావుకతకు  అద్దం పాడు తుంది .తొందర పాటు అనర్ధం అని నీతి .
               కోలారు ప్రాంతం లో బంగారు గనులున్నాయని అందరికి తెల్లుసు ..బాల రాజు అనే రాజు  ఏడవ రానికి కడుపు వచ్చింది /బిడ్డ పుడితే  రాజ్యానికి అరిష్టం అని మిగిలిన రాణులు , భావించి ఆమెను చంపాలని రాణుల ఆలోచన తెలుసుకొనిబంగారమ్మ  రాణీ వాసం వదిలి అడవి చేరింది  అక్కడ ప్రసవించింది .కొడుకుని ఒకా బావురుపిల్లికిబిడ్డ ను పెంచే బాధ్యత అప్పగించి చని పోయింది .ఒక రోజూ రాజు చంద్ర చూదేశ్వర స్వామి దర్శనానికి రాణులతో వచ్చాడు .అక్కడకొడుకుని  చూస్సాడు .అందరు వాడికి రాజా కళ వుందని భావించారు .అపుడు బావురు పిల్లి నిజం చెప్పింది రాజైన బాల రాజుకు  బంగా రమ్మ గొప్ప తనాన్ని తెలుసు కోని వారంతా చేసిన తప్పు తెలుసు కొన్నారు .కొడుకును స్వీకరించాడు రాజు .బంగారమ్మ చేసిన త్యాగానికి ముగ్ధుడై ఆమె పేర బంగారు పేట కట్టించాడు .కోలారు సీమ లో వున్డిది బెంగాల్లుర్ నుంచి మద్రాస్ వెళ్ళే రైల్ దారిలో ఈ వూరు కనిపిస్తుంది .తర తరాలు గా వస్తున్న కధకు శాశ్వత రూపం ఇచ్చి బంగారు కద తయారు చేశారు సంపెంగ పూవుల వంటి గుబాళింపుతో సంపత్ .
యెంత బల శాలి అయినా ఒక్కడు ఏమి చేయలేదు .కలిసి వుంటే కలదు సుఖం .అని తెలియ జెప్పిన కధే ”చీమక్క -దోమక్క ”అలానే  ”కాకమ్మ గువ్వమ్మ ”కధలో బద్ధకం పనికి రాదనీ ,శ్రమించి పనిచేస్తే సౌఖ్యం అని తెలియ జెప్పారు .సోంబేరి తనం కొంప మీదికి తెస్తుంది .చివరి కద ”ఎల్లమ్మ తెలివి ;;”.ఎల్లమ్మ కొడుకులు వూళ్ళో లేరని తెలిసి దొంగలు ఆమె ఇంటికి చేరి దోచుకోవటానికి సిద్ధమైనారు .ఎల్లమ్మ తెలివైనది పరిస్థితి అర్ధం చేసు కోని తన కొడుకులు ఇంట్లూనే తలో చోటా వున్నట్లు బిల్డ్ అప్  ఇచ్చి ,పేరు పేరునా వాళ్ళని పిలుస్తూ ,గొంతు మార్చి వాళ్ళే సమాధానం చెబుతున్నట్లు సమాధానం ఇస్తూ దొంగల్ని బెదిరించి పారి పోయేట్లు చేసింది .అపాయాన్ని ఉపాయం తో తప్పించింది తెలివి గల ఎల్లామ్మ .
ఈ విధం గా ఇరవై కధల్లో వైవిధ్యం వుంది .సామాజిక బాధ్యత వుంది .పల్లె సొగసుల పట్ల ఆరాధనా భావం వుంది .తెలుగు భాషకు జరుగు తున్న అపకారంవుంది ,దాన్నించి కాపాడు కొనే ఆలోచన వుంది ,మాండలీకానికి మహర్దశ పట్టించిన విధానం వుంది .కమ్మని కధలు ,కమ కమ్మని శైలి ,నిండు కావేరి లాంటి స్వత్చత వుంది .ఎక్కడా ఆవేశ కావేశాలు ,చంపు ,నరుకు లేవు .ఆలోచన వుంది .దానికి తగ్గ ఆచరణ మార్గం వుంది .కధలో మాండలికాలు బయటి వాళ్లకు అర్ధం కావేమో నని ప్రతి కద చివర వాటికి వాడుక లోని  అర్ధాలు ఇవ్వటం బాగుంది .
            ఇప్పటి దాక  కధా ,దాని సంవిధానం  మాత్రమే  చెప్పాను .అందులోని సామెతలు జాతీయాలు ,మాండలికం లోని సొగసులు తరువాత తెలియ జేస్తాను
                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -౦.అలానే 7 -11 –క్యాంపు–బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

టర్కీ రచయిత ఒర్హం పానుక్

        టర్కీ రచయిత ఒర్హం పానుక్
                         —————————–
                             సాహిత్యం అంటె ఒక మందు .అన్నాడు టర్కీ రచయిత ఒర్హం పానుక్ .టర్కీ భాష లో ఏడు నవలలు రాశాడు .స్వీయ అనుభవాల గురించి చాలా వ్యాసాలు రాశాడు .వీటిలో తన జీవిత కవాటాలను అందరి కోసం తెరిచాడు ..బాగా చైన్స్మోకింగ్ చేసే వాడు .దాని దుష్ఫలితాలను అనుభవించి  పూర్తిగా మానేశాడు .తన జీవిత చరిత్రను ”other colours ”గా రాశాడు .దీనికే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది చాలా తమాషా గా  ,కదిలించేట్లుగా ఆడుతూ పాడుతూ చెప్పినట్లు వుంటుంది ఆయన కధనం .తన సాహిత్య జీవితం లో ఆయనే తల మానిక .తన కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూపించే నేర్పు ఆయనది .చాలా భావ శ్పోరకం గా ,సప్త వర్ణ మాలగా ఆయన రచన వుంటుంది .ముఖ్య మైన విషయాన్ని దేనినీ ఆయన దాచడు ,వదిలి పెట్టడు . .
                 ఆయన నవల ”my   name is red ”కు డబ్లిన్ లిటరరీ అవార్డ్ వచ్చింది .పానుక్ రచనలు యాభై పైగా ఇతర భాషల్లోకి అనువదింప బడినాయి ..ఆయన స్వగ్రామం ఇస్తాంబుల్ .దానితో ఆయన అనుబంధం విడ దీయ లేనిది ..ఆయన రచన లన్నీ దాని చుట్టే తిరుగు తాయి రాస్శ్యా కు చెందిన ప్రఖ్యాత నవలా రచయిత దాస్తోవిస్కీ కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ గురించీ ,దానితో తన సంబంధం గురించే ఎక్కువ గా రాశాడని అందరికి తెలుసు .అలాగే జేమ్స్ జాయిస్ డబ్లిన్ గురించీ,ప్రౌస్ట్ పారిస్ గురించీ ఇలానే రాశారు .అది వారికి తీపి అనుబంధం .ఏది చెప్పినా వాటి చుట్టూనేకధ తిరుగుతుంది .ఇలా రాయటం వల్ల ప్రపంచం లోని అన్ని దేశాల పాథాకులు ,తాము స్వయం గా ఆ పట్టణాలలో తిరుగుతూ ,ఆ కధా విధానాన్ని అనుభూతి పొందినట్లున్తుంది .అదీ వారి ప్రత్యేకత .ఈ విషయాన్ని తానె స్వయం గా నోబెల్ బహుమతి తీసుకొనే టప్పుడు ఉపన్యాసం గా చెప్పాడు పానుక్ .
                     మీరు కవి ఎందుకు కాలేదు అని అడిగితె ఆయన ”God was not  speaking to me –I realised that a poet is some one through whom God is speaking .You have to be possessed by poetry ”.అని తనకు దేవుని అనుగ్రహం లేదని ,కవిత్వం భగవద్దత్తం అయిన వరం అని ,.కవిత్వం ద్వారా భగవంతుడు మాట్లాడు తాడని చాలా నిజాయితీ గా చెప్పాడు .అందుకని తాను ఒక గుమాస్తా లాగా పని చేస్తున్నానని అంటె వచనమే రాస్తున్నానని తమాషా గా అంటాడు .తనకు Thomas Man ”ఆదర్శ రచయిత అన్నాడు తన తలలో screw లూజు ”అనీ చెప్పాడాయన .  .
తన తరం రచయితలు జాతీయ భావం తో కూడిన ఆదునిక సాహిత్యం సృష్టించాలని కోరాడు ఎందుకు అంటె తాను ”I am a westernizer ”అని ఒప్పుఒన్నాదు కనుక తాను కోరినట్లు మిగతా వారైనా రాస్తే బాగుంటుందని భావించాడు ..భేషజం  లేకుండా చెప్పాడు .
                      ఒర్హం పానుక్ ఒక తమాషా కధ చెప్పాడు .అది ఇబ్ని అరేబి చెప్పిన కధ అని ఆయనే చెప్పాడు .ఒక సుల్తాన్ చిత్ర రచనలో పోటీలు పెట్టాడటచైనా అరిస్ట్ లకు ,మిగతా వారికి .రెండు గోడల మధ్య తెర కట్టించాడు .ఒక గోడపై చైనా చిత్ర కారులు ,ఇంకో గోడపై మిగిలిన దేశాల చిత్రకారులు painting వేయాలి .మిగిలిన వారు చాలా కష్ట పడి చిత్ర రచన చేశారు ..చైనా వాళ్ళు మాత్రం గోడంతా గోకి అద్దం లా పైంట్ చేశారు .సుల్తాన్ పరీక్షించ టానికి వచ్చాడు ..ముందుగా మిగిలిన దేశాల వారి పైంటింగ్ చూశాడు .అద్భతం అన్నాడు .తర్వాత తెర తీయించి చైనా వాళ్ల పైంటింగ్ చూశాడు  .అందులో ఏమీ లేదు .అవతలి వారు వేసిన painting ను ఈ గోడ అద్దం లాగా చూపించేట్లు చేశారు చైనా వాళ్ళు .చైనా వాళ్ళకే బహుమతిని ఇచ్చాడు సుల్తాన్ .గోడ ను అద్దం లా మార్చిన వారి కళా హృదయాన్ని మెచ్చాడన్నా మాట సుల్తాన్ .
                  రచన గురించి పానుక్ కు కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి .వాటిని గురించి తెలుసు కొందాం .
            ”A writer talks of things that every one knows ,but does know they know .”
            ”I write because I want to read books like the ones I write ”
           I can only part take in real life by changing it .I write because it is a habit ,a passion .I write because I am afraid of being forgotten .I like the glory and interest that writing brings .I write to be alone ..Every one expects me to write .”
             ఇలా కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పటం పానుక్ ప్రత్యేకత .ముసుగు వుండదు .సూటిగా హృదయానికి తాకుతుంది .ఆలోచన రేకెత్తిస్తుంది అదీ పానుక్ ప్రత్యేకత .ఒక టర్కీ రచయిత నోబెల్ పొందటం పానుక్ తో నేప్రారంభం అనుకొంటా  ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -07 -11 .–క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

శ్రీ రమణ వాణి

   శ్రీ రమణ వాణి
      —————
                    రామన్  అని పిలువ బడే శ్రీ రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆంద్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం దగ్గరలో జన్మించిన శ్రీ అ యల సోమయాజుల గణపతి శాస్త్రి గారు .వారినే వాశిష్ట గణపతి అని గణపతి ముని అని అంటారు .రమణ మహర్షి లోని  అనంత జ్ఞానాన్ని అర్ధం చేసుకొని శ్రీ రమణులు అని పిలవటం ప్రారంభించారు గణపతి ముని .రమణులు వీరిని గౌరవం గా ”నాయన గారూ”అని పిలిచే వారు .గణపతి ముని గొప్ప తపస్సంపన్నులు .వెద వేదాంగాలన్నీ క్షుణ్ణం గా చదివారు .వేదం లోని విషయాలు భారతం లో పాత్రల రూపం లో ఎలా చోటు చేసు కొన్నాయో వివరం గా పుస్తకం రాశారు .రమణ మహర్షి గొప్ప తనాన్ని లోకానికి అనేక ఉపన్యాసాల ద్వారా ,పుస్తకాల ద్వారా తెలియ జేశారు .ఎన్నో స్తోత్రాలు రాశారు .అమ్మ ఆయన నోట పలుకు తుందని ప్రతీతి .అలాగే ఆంద్ర దేశం లోని సూరి నాగమ్మ గారు రమణాశ్రమం లో వుండి ,శ్రీ రమణుల సేవలో పునీతురాలైనారు .ఆమె వ్రాసిన” రమణాశ్రమం ఉత్తరాలు ”చాలా ప్రాచుర్యం పొందాయని అందరికి తెలుసు .గుడిపాటి వెంకట చలం గారు అన్నీ వదిలి చివరికి రమణ మహర్షి చెంత చేరి జీవితం ధన్యం చేసుకోన్నారన్నది లోక విదితమే .చింతా దీక్షితులు శ్వాశ అంతా రమణ భగ వానే .ఇలా ఎందరెందరినో తన  అమృత వాక్కుల చేత ప్రభావితం చేశారు భగవాన్ రమణ మహర్షి .వారి ఉపదేశ సారాన్ని ఇప్పుడు తెలుసు కొందాం .
                       పురుషార్ధం అంటే పరమ పురుషున్ని అర్ధం చేసుకోవటమే .పురుష ప్రయత్నానికీ ఇదే అర్ధం .
భాగవతం లో జడ భరతుడిని గురించి చెబుతూ పోతన్న గారు  ”చంపగ .వచ్చిన వారి యందు ,కరవాలము నందు ,కాళి యందు ,ను అచ్యుత భావము వహించే ”అంటారు .అంటే దేని మీద ఆయనకు ద్వేషం ,ప్రేమ అనేవి లేవు .అంతా సమ భావనమే .ఇదే స్థితి ని శ్రీ రామ కృష్ణ పరమ హమ పొందారని విజ్ఞులు తెలియ జేశారు .
         వలలో చిక్కిన పక్షి ప్రాణ వాయువును నిరోధించి నట్లు మనం కూడా చేస్తే మనసు లోని చాంచల్యం  పోతుంది .దీనినే ”జాల పక్షి వద్రోధ సాధనం ”అన్నారు రమణ మహర్షి
  ప్రాణా యామం అంటే ప్రాణ శక్తిని ,మనస్సును ,సమన్వయము చేయటమే .”మనసా ప్రాణస్య ఈక్షణం –ఇతి ప్రాణా యామః ”అంటే మనసును ,ప్రాణం పైన పెట్టటమే .
మనసు ,ప్రాణం రెండు ఒకే వృక్షం యొక్క రెండు శాఖలే .
”హృదయ మేవ ప్రాణ ,మనసోరుత్పత్తి స్థానం   భవతి –హృద్యేవ ఆత్మ జ్యొథిహ్ ప్రకాశతే ”ప్రాణం ,మనసు  ఉత్పత్తి స్థానం ఆత్మజ్యోతి ప్రకాశించే హృదయమే .
  లయం అనే మాట తరుచు గా వాడుతాం .లయం అంటే తాత్కాలికం గా శాన్తిన్చాటమే .నిద్ర పోవటం లాంటిది .ప్రాణా యామం ద్వారా మనసు శాంతిన్చినా ,తాత్కాలికమే .ఆ స్థితి అయి పోగానే మనసు మళ్ళీ చంచలమవుతుంది ..అయితె జ్ఞానం ద్వారా పొందిన మనసు వాసనలను పొందదు. .స్థిరం గా వుంటుంది .అందుకే ”మనో నాశాయ మోక్షం ”అన్నారు .జాగృతి స్థితి లో మేలు కోని వున్నా ,మనసు బ్రహ్మ భావన పొందితే ఇంక గ్రహణ శక్తి వుండదు .
     ”ఆజ్యం పునః క్షీరో న భవతి ”నెయ్యి మళ్ళీ పాలు కాలేవు ..కావు కూడా .పండు మళ్ళీ కాయ  కాలేదు .అట్లాగే మరణిస్తే మళ్ళీ పుట్టదు .
  ప్రాణాన్ని నిరోధిస్తే మనసు లయం అవుతుంది .మనో వృత్తిని నిరోధిస్తే మనసు వినాశం అవుతుంది .ప్రాణ నిరోధం తో లయమైన మనసు ,మళ్ళీ పని చేస్తూ వుంటుంది . .మనసు లోని వాసనల నాశనమే నిజమైన నాశనం .”లయ వినాశనే ఉభయ రోదనే –లయా గతం పునర్భవతి’నో మృతం ”’అన్నాడు గీతా చార్యుడు . మనో నాశ మోక్షం అమనస్క యోగం కావాలి .అలాంటి స్వ -ఆత్మ స్థితి లో ఉత్కృష్టమైన యోగికి ఇంక ఏ పనీ చేయాల్సిన అవసరం వుండదు .
     ”దృశ్య వారితం –చిత్త మాత్మనః –చిత్త దర్శనం -తత్వ దర్శనం ”మనసు అంతర్ముఖం చేసి ,ఆత్మ స్వరూపం లో ఉంచటమే చిత్ లేక తత్వ దర్శనం .
మనసు అంటే అంతఃకరణం .–కరణం అంటే పని ముట్టు ..అంటే మనసు మన లో వుండే లోపలి పని ముట్టు .కాళ్ళు ,చేతులు బయటి పని ముట్లు .”
”తెలియ బడు చున్న విశ్వంబు దృశ్య మగును –తెలివినై   సర్వమును కాంచు –దృక్కు నేను –మిగుల నా కంటే అన్యమేమియును లేదు –సత్యమిది –సర్వ వేదాంత సంగ్రహంబు ”అని సీతా రామాంజనేయ సంవాదం చెబుతున్నది ఇదే .
మనసు ,మనసు అని విచారణ చేస్తే ,చివరికి చేరేది మూల స్థాన మైన పరమేశ్వర స్థానమే .అంటే మనస్సు అనేదే లేని స్తానం .
పతంజలి మహర్షి ;యోగః ;  చిత్త వ్రుత్తి నిరోధః ”అన్నారు .చూచే వాడు ,చూసేది చూడ బడేది కలిస్తే త్రిపుటి అంటారు .జ్ఞాని అంటే కళ్ళున్న గుడ్డి వాడు .అంటే  కళ్ళు  వున్నా బయటి ప్రపంచ జ్ఞానం లేని వాడు .అంటే త్రిపుటి రాహిత్యం పొందిన వాడు .
ఇంగ్లీష్ లో నెవెర్ మైండ్ అంటారు అంటే పట్టించుకోక పోవటమే .దీన్నే మన వాళ్ళు ”నైవ మానసం ”అన్నారు .పట్టించుకోవటాన్ని విషయం అంటారు .పట్టించుకోక పొతే ఏమీ వుండదు .ఆలోచనా ప్రవ్రుత్తి నుండి ,మనసునుతన వైపుకు  మరల్చు కోవటమే .”ద్రుశ్యాను విద్ధ సంకల్ప సమాధి ”అన్నారు .అదే నెవెర్ మైండ్ .సహజం గా మనసు ప్రశాంతం గా నే వుంటుంది .దానిపై ఆలోచనలను కేంద్రీకరిస్తే సంసారం అవుతుంది .లేక పొతే ఏదీ లేదు .మనసు వాటి వెంట పరిగెత్తితే అశాంతి పరిగెత్తకుండా వుంటే పరమ శాంతి .అదే నిశ్చింత .ఇదే నైవ మానసం .నైవ మానసమే అమనస్క యోగం .
వృత్తులు రెండు రకాలు ఇదం వ్రుత్తి .,అహం వ్రుత్తి .ఇదం వ్రుత్తి అంటే ప్రాణాయామం ధ్యానం వల్ల నియమించ బడటం ..అహం వ్రుత్తి అంటే మనసు పై లగ్నం చేస్తేనే నశించేది .
”సత్తాయా చిత్ –చిత్త యామ్యహం ”అంటారు రమణ మహర్షి .సత్ నే చిత్ అంటారు .ఆ చిత్ అంటే ”నేను ”
దేహ ఉపాధి ధ్యాస వదిలేస్తే ఈశ్వర దర్శన మైన స్వ ఆత్మ స్వరూప దర్శనం లభిస్తుంది .అప్పుడే తాను ఈశ్వర స్వరూపుడు అవుతాడు .
 జీవస్తు దైవికః ””ఇక్కడ దైవిక అనే పదం శ్రీ రమణుల సృష్టే .దైవ గుణం తో వున్న జ్ఞానినే దైవికుడు అంటారు .దైవికః జీవః  అంటే సత్వ గుణ ప్రదానుడే దేవుడు .
”ఆహామపేతకం –మహాదిదంత పో రమణ వాణి దం” అహంకారాలు నాశన మైతే ,ఆత్మ స్వరూపం తెలిసిన జ్ఞానమే నిజమైన తపస్సు .  ”అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అభి భాషణం
                         ముప్ఫై శ్లోకాలలో చక్కగా ఆత్మ దర్శనాన్ని ,పాడుకోవటానికి వీలుగా వున్న ఛందస్సులో సంస్కృతం లో ”ఉపదేశ సారం ”అనే పేరిట  అద్భతం గా చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షి
అందు లోని సారాన్ని శ్రీ ఏకాత్మ గారు మనోహరం గా ,సుబోధకం గా ఆవిష్కరించారు అందులో కొంత సార సంగ్రహం చేసి మీకు అందించాను . ..
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —21 -07 -11 .క్యాంపు –బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4

   హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4
              ———————————————–
                              ఇంతవరకు హోసూరు తెలుగు ప్రజలు నిర్వహించిన వివిధ సాహిత్య ,కార్య క్రమాలను గురించి తెలుసు కొన్నాం .ఇంత చేస్తున్నా తమిళ తంబి కరుణ తెలుగు వారికి నిధి ఇవ్వ లేదు ,విధి ఇవ్వలేదు .తన తమిళ ఆధిపత్యం నెత్తి కెక్కింది .”ఎంగుం తమిళం –ఎదలుం తమిళం ”అనే నినాదం తో శివాలెత్తి పోతున్నాడు కరుణ .ఈ మాటలకు అర్ధం ఎక్కడైనా ,ఎందులోనైనా తమిళం మాత్రమే ఉండాలట .మిగతా భాష లన్ని తీసి కట్టు అట. ఇప్పుడు ఒక్క ఓటర్ లిస్టు లో మాత్రమే తెలుగు పేర్లు కనిపిస్తాయి .మిగత ఎక్కడా తెలుగు వాసన కూడా లేదు .అయితె ఓటర్ పేరు పక్క వూరి పేరు మాత్రం తమిళం లోనే ఉంటుందట .ఇంకా పిచ్చి ముదిరి అసలు మీ పేర్లు తెలుగు  లో రాయలేక చస్తున్నాం .పేర్లు తమిళ పేర్లు పెట్టు కొండి అని ఉచిత సలహా పారేశాడు కళ్ళ జోడు కరుణ .లోకం అంతా పచ్చ గా కనిపిస్తుందట కామెర్ల వాడికి ..ఇది మరీ చిచ్చు పెట్టింది .తెలుగుల ఆత్మ గౌరవం దెబ్బతింది .తెలుగు వారికే కాదు కన్నడ ,మలయాళీ ,ఉర్దూ మైనారిటీ లకు కూడా ఇదే దుస్థితి ..ఇక సహించ లేక పోయారు .ఎదురు తిరగటం ప్రారంభించారు .మైనారిటీ లంతా    కలిసి పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని గ్రహించారు .ఇంకా వూరు కొంటె అసమర్ధత అవుతుందని ,తొండ ముదిరితే ఊసర వెల్లి అవుతుందని అర్ధమయింది అందరికి            ..              కర్నాటక లో ముప్ఫై మూడు శాతం తెలుగు వారు న్నారు .ఏడు జిల్లాలలో మెజారిటీ తెలుగు వారిదే .అయితె తెలుగు స్చూల్స్ మాత్రం 170 మాత్రమే నట .వీటినీ పెంచుకోవాలనే స్థిర సంకల్పం తో వున్నారు .కన్నడ ప్రభుత్వం తో పేచీ లేదు .

This slideshow requires JavaScript.

                     అన్ని సమస్యలు ఒక్కటొక్కటే పరిష్కరించు కుంటు వస్తున్నారు హోసూర్ తెలుగు వారు .అయితె ఇప్పుడు ఇంకో కొత్త ప్రమాదం వచ్చి పడింది వారికి .హోసూర్ లో రెండు పారిశ్రామిక వాడలను తమిళ నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది తూర్పు ,పడమరలు గా .ఇండియా లోనే ఇంత పెద్ద పరిశ్రమలు ఇంక ఎక్కడా లేవట .ఇవన్నీ sipcot
అనే పేర వెలిశాయి .అంటె ”smaall    scale industries promotion corporation of tamil naadu ”మొత్తం ఏడు వేల కోట్ల పెట్టుబడి .ఇక్కడ గుండు సూది మొదలు చిన్న విమానాలు వరకు తయారు చేస్తారు .టి.వి.ఎస్. ,titan ,అశోక్ లేలాండ్ ,ఇండియన్ నిప్పాన్ మొదలైన 5000 లకు పైగా భారీ ,మధ్య తరగతి పరిష్మలున్నాయి .లారీలు బైకులు ,ఆటోలు చిన్న విమానాలు ఇక్కడ తయారు చేస్తారు .ఇ.టి .పార్క్ ,500 కోట్లతో సెజ్ వున్నాయి అటో mobiles leather,ప్లాస్టిక్పరిశ్రమలు వుండి  ఎగుమతులకు బాగా తోడ్పడు తున్నాయి .ఉపాధి అవకాశాలు బాగా నే వున్నా,పంట భూములన్నీ హారతి కర్పూరం అయి పోయాయని ఇక్కడి రైతులు నిర్వేదం గా వున్నారు .60 ,౦౦౦మన్దికి ఇవి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి .కానీ తమిళులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో స్థిర పడ టం తో మళ్ళీ తెలుగు భాషా వ్యాప్తికి చాలా అడ్డంకి కలుగు తోందని భాషాభిమానుల మనో వేదన .రెడ్డొచ్చె మొదలాడు అన్న తీరు గా వుంది ఈ పారిశ్రామీకరణ 2005 నుంచే ప్రారంభం అయింది .రెండు దశల్లో .ఇదికూడా కరుణానిధి ఇక్కడి తెలుగును ,తెలుగు వారినీ దెబ్బ తీయటానికి పన్నిన పన్నుగడ అని అంటున్నారు మిత్రులు .నోటితో పలకరించి నొసలు తో వెక్కి రించి నట్టుంది .
                 ఇవీ హోసూరు లోని తెలుగు వాళ్ల మనో వేదన ,బాధ  ..ఒక పక్క ఆధునికత వచ్చిందని ఆనందం ఇంకో పక్క తెలుగు అస్తిత్వానికి మళ్ళీ ప్రమాదం ఏర్పడుతోందని బాధ
                   ఏమైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోరాట పటిమ గల ఇక్కడి తెలుగు ప్రజలు సమస్యలను వ్యూహాత్మకం గా పరిష్క రించు కో గలరనే గొప్ప విశ్వాసం వాళ్ళను ,వారి అకున్తిత దీక్షను ,పట్టు వదలని విక్రమాదిత్యాన్ని .ఓర్పు నేర్పు లను చూసిన తరువాత నాకు అని పించింది ..భవిష్యత్తు వారందరికీ భద్రం గా వుండాలని ,తెలుగు కు పట్టాభిషేకం జరుపుతూ తెలుగు తేజాన్ని దశ దిశలా వెద జల్లు తారని భావిస్తున్నాను .వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ధైర్య స్తైర్యాలు ప్రాసాదించ వలసినది గా భగ వంతుడిని ప్రార్ధిస్తున్నాను .సరస్వతీ దేవి  వారికి ఎప్పుడు అండ గా నిలుస్తుందని భావిస్తాను .హోసూరు తెలుగు వాణి హోరెత్తి దశ దిశలా మారు మోగాలి .అందరికీ హోసూరు ఆదర్శం కావాలి .హోసూర్ మిత్రు లందరికి మరొక్క సారి నమస్సులు ,అభినందనలు తెలియ జేస్తున్నాను
..                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 .–క్యాంపు –బెంగళూర్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

        హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3
  —————————————-
                      ఇలా అప్రతిహతం గా తెలుగు ప్రజలు హోసూరు లో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ..ప్రక్క నున్న రాయ వెల్లూర్ ను ప్రభావితం చేసి ,అక్కడా తెలుగు పునరుజ్జీవనానికి సాయ పడ్డారు .’.ఈ ప్రాంతం లో దాదాపు యాభై దాకా జానపద కళలు వున్నాయి .అవి జీవచ్చవాలై పోయే పరిస్థితి వస్తోందని .ఆరాటం చెందారు .వాటిని మళ్ళీ వెలుగు లోకి తెచ్చి ఆ కళా కారులకు జీవన భ్రుతి కి లోటు లేకుండా చేయాలనే ఆలోచన వచ్చింది .స.వెం .రమేష్ గారు ఇక్కడికి వచ్చి జాన పద కలలను ఒక జాతర గా నిర్వహించాలని సూచించి ,వెంట నిలిచి ,కార్యక్రమానికి శ్రీ కాం చుట్టారు .దానిని ”పల్లె కళల పరస ” అనే పేరుతొ 2007 మార్చ్ 24  ,25 ., తేదీలలో హోసూర్ లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు .నాయని కృష్ణ కుమారి ,చిలుకూరి దేవపుత్ర రమేష్ బాబు ,రమేష్ వంటి ప్రముఖులు హాజరై దాన్ని దగ్గరుండి నడిపించారు .ఇది రెండు రోజుల పండుగ గా జరిగింది పరస అంతే జాతర .మనం కళా జాతర అంటాం .ముప్ఫై పల్లె కలలను కళా కారులు ప్రదర్శించ్చారు .దీని పై సావనీర్ కూడా తీసుకొని వచ్చారు .తెలుగు విస్గ్వ విద్యాలయం ,దాతల సహకారం తో రంగ రంగ వైభవం గా పరస జరిగి తెలుగు వారినే కాక అందర్నీ పరవశింప జేసింది .

డా వసంత్ , నారాయణ రెడ్డి, నేను , కృష్ణప్ప , ముని రాజు

                           ఇక్కడి యువ రచయితలను ప్రోత్చాహించే తలంపు తో తెలుగు కధ లను రచించే విధానం పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆర్ వి ఎస్ .సుందరం వంటి రచయితలూ వచ్చి అర్ధవంతమైన రీతి లో నిర్వహించారు .హోసూర్ మాండలికం లో కధలు రాయించారు ..వాటిని ప్రచురిన్న్చి రచయితలకు గొప్ప ప్రోత్చాహం కలిగించారు .హోసూర్ సామెతలు ,నానుడులు ,పద బంధాలు శిధిలం కాకుండా వాటిని జాగ్రత్త గా సేకరించి భద్ర పరిచే కార్య క్రమం చే బడు తున్నారు ..ఇదే మన తరగని ఆస్తి .విజ్ఞాన సంపద .తరతరాల నుండి వస్తున్న నిధి .దాని విలువ అపూర్వం అనంతం .దాన్ని కాపాడు కోవాలి .మన తరం లో చేయ్క్క పొతే భవిష్యత్ తరాలు అసలు చెయ్యలేవు . వారికి అందుబాటు లో కూడా వుండవు దీన్ని బాధ్యత గా డాక్టర్ వసంత్ లాంటి యువకులు
సేకరిస్తున్నారు .
                          అనుక్షణ ఆలోచనా పరుడైన స.వెం .రమేష్ గారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది .దక్షిణ రాష్ట్రాలయిన తెలుగు ,కన్నడ ,తమిళ మళయాళ మొదలైన అయిదు రాష్ట్రాల జాన పద కలాజాతర చేసి అందర్నీ తెలుగు జన జీవన స్రవంతిలో కలపాలి .అంతే అది వెంటనే కార్య రూపం దాల్చింది .తమిళనాడు లోని తిరుచు నాపల్లి అనే తిరుచి లో ఏర్పాటు చేశారు ..ఇదీ పల్లె కళల పరస పేరుతొ జరిగింది .అప్పటి దాకా విడి విడిగా వున్న పదిహేడు తెలుగు జాతులను సమావేశ పరిచి రమేష్ గారు వారందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చ్చారు .వారిలో ఐక్యత సాధించి ముందడుగు వేశారు తిరుచి లో అంతా రెడ్లు .బాగా సంపన్నులు .ఇదివరకు అంతా తెలుగే ఇప్పుడు మారింది .వాసవి మహల్ లో తిరుచ్చి కోట ఆకారం లో వేదిక ఏర్పాటు చేశారు .కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ,ఇతర రాష్ట్రాల మంత్రులు అందరు హాజ రైనారు .”దక్షిణ భారత పల్లె కళల పండుగ ”అని తెలుగు అక్షరాలతో వేదిక మీద అతి పెద్ద బాన్నెర్ కట్టారు ..”మా తెలుగు తల్లి కి మల్లె పూదండ ”పాటతో కార్యక్రమ ప్రారంభమయింది .కూచిపూడి నాట్యం తో కళా సంరంభం ప్రారంభమైది . మహా సంబరం గా జరిగాయి కళా వేడుకలు .జనం మెచ్చి వేలాది రూపాయలు కళా కారులకు ఇష్ట పూర్తిగా చదివించారు .ఆ ఉత్చాహం వర్ణనా తీతం .అంతా కన్నుల పండగే .ఒక్క క్షణం వృధా పోలేదు వచ్చిన వారందరికీ పెళ్లి భోజనాలను మించిన భోజనాలు వసతి కల్పించారు .స్థానిక రెడ్డి సంఘం మొత్తం ఖర్చు భరించి రెండు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది .మొత్తం 400 మంది కళా కారులు పాల్గొన్నారు .తమిళులు నోరు వెళ్ళ బెట్టి చూశారట .తెలుగు ఇంత ప్రమాదమా ?అని ముక్కున వేలు వేసు కొన్నారట .ప్రమాదం అంటె వాళ్ల భాషలో అద్భుతం అని అర్ధం ..ఇలా చేయటం వల్ల తెలుగు వారికి ఏమి ఒరిగింది అనే సందేహం రా వచ్చు .తెలుగు భాష ,సంస్కృతి ఎంత ప్రాచీనమైనవో    ,యెంత కళా సంపద తెలుగు వారికి ఉన్నదో ,ఎన్నెన్ని కళా రూపాలు తెలుగు లో వున్నాయో ఒకే వేదిక మీద తెలుగు వారి తో సహా అందరు చూసి తెలుసు కున్నారు .తల్లి భాష తెలుగు పట్ల పూజ్య  భావం ,gouravam,ఆరాధన కలిగాయి తెల్లుగు మాత్రుభాషీయుల ఉత్చాహం చాలా గొప్పది అనే అభిప్రాయం సర్వత్ర్ గోచరించింది .దీనిని చూసిన వారంతా తమ జిల్లాలో ఇలాంటి జాతర చేయమని మరీ మరీ కోరారట .అంతా స్పందన లభించింది .హోసూర్ ఏం ఎల్ ఏ..గోపీనాద్ గారు దీని కోసం చాలా shraminchaarata  ..ఆయన తెలుగు వాడే .తమిళ అసెంబ్లీ లో తెలుగు లోనే మాట్లాడు తారట .ఇదంతా రమేష్ గారి ప్రోత్చాహం ,హోసూర్ తెలుగు సంఘాల నిర్వహణ సామర్ధ్యం ..ప్రజల సహకారం ..
                                     హోసూర్ గురించి మరిఒన్ని సంగతులు నాల్గ భాగమైన చివరి భాగం లో తెలియ జేస్తాను
                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 .క్యాంపు బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2

             హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2
        ———————————————
                         హోసూరు తమిళ నాడు రాష్ట్రం లో కృష్ణ గిరి జిల్లా లో వుంది .దీనికి అయిదు కిలోమీటర్ల దూరం లోనే కర్నాటక సరిహద్దు వుంది .హోసూర్ జనాభా లక్ష మంది .అందులో తెలుగు వారు అరవై శాతం .అంతే షుమారు అరవై వేల మంది అన్న మాట .ఇక్కడ కన్నడ ఉర్దూ ,మళయాళ ,తమిళాలు లో  మాట్లాడే వారు కూడా వున్నారు .రాజ్యం తమిలులది .సంపర్కం కన్నడం .తెలుగు వారు అంతా ఇళ్ళల్లో తెలుగే మాట్లాడు తారు .కొందరు తెలుగు ,కన్నడం కలిపి మాట్లాడు తారు .హిందూ పురం లో లాగా అనిపిస్తుంది .తమిళం చాలా కాలమ్ వీళ్ళకు తెలియదు .తమిళం మాట్లాడే వారిని అంటరాని వారి గా భావించే వారు .దిగువ సీమకు చెందిన వాళ్ళు అని తమిలుల్ని ఈసడించే వారట .కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది .సుమారు పది హీను కిలో మీటర్ల పరిధి లో హోసూర్ వుంది .హోసూర్ తాలుకా కూడా .తాలూకా లోని మొత్తం జనాభా రెండు లక్షలు .ఒక్క హోసూర్ పట్టణం లోనే లక్ష జనాభా. .వర్షాధార పంటలే ఇక్కడ .రాగి బాగా పండుతుంది .బోరు బావులు తవ్వి సేద్యం చేస్తున్నారు ,.బావుల కింద వారి కొద్ది గా పండిస్తారు .కూర గాయాలు బాగా పండించి బెంగళూర్ ,తదితర ప్రదేశాలకు పంపుతారు ..ఇక్కడ గులాబి పూలు విపరీతం గ పూస్తాయి .ఇక్కడినుంచే ఎక్కడికైనా ఎగుమతి .జరుగు తుంది .వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది .తమిళ తెలుగు ,కన్నడ రాష్ట్ర బస్ లు ఇక్కడ కన్పిస్తాయి .సేలం ,చెన్నై కి ఇక్కడినుంచి వెళ్ళ వచ్చు .కుప్పం దగ్గరే .అలాగే రాయ వేలుర్ కూడా . ఎయిర్ conditioned సిటీ గా హోసూర్ ను భావిస్తారు ఏప్రిల్ మే నెలల్లో మాత్రం కొంచెం వుక్క పోస్తుందట . .

ముని రాజు , కృష్ణప్ప

                            1970 వరకు హోసూర్ లో పూర్తిగా తెలుగే వుండేది .సేలం వరకు తెలుగు తప్ప ఇంకోటి మాట్లాడే వారు కాదట .1970 లో  డి.ఏం .కే .అధికారం లోకి వచ్చింది .అప్పటినుంచి హోసూర్ తెలుగు వారి కస్టాలు ప్రారంభం అయాయి .తమిళాన్ని ఇక్కడ నిర్బంధం చేసింది .ఆ పార్టి భాషోన్మాదం తో తెలుగు ప్రజ అల్లాడి poyindi .వీరి  .వల్ల భయం ఏమిటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ పెరిగి పోయి ,తమిళ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తారో నని .అందుకని చట్టాలన్నీ కఠిన తరం చేసింది .ఉక్కు పాదం తో తెలుగును అణగ  దొక్క టానికి అన్ని ప్రయత్నాలు చేసింది దానికి రంగు పూయటానికి హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది .అలాగే తెలుగు ”ఒళిగా”అంటె  quit తెలుగు  ఉద్యమం అన్న మాట. అప్పటి దాకా వెయ్యి తెలుగు స్చూల్స్ ఉండేవి  ..రిజిస్ట్రేషన్ తో సహా వ్యవహారం అంతా తెలుగు లోనే జరిగేది .ఇది కరుణానిధి కి కన్ను కుట్టింది .కరుణ పోయి అకారణం గా ఆకరుణఆవేశించింది  .పూర్తి అధికారం వుంది .పైన ఎదిరించే సాహసం ఎవరికి లేదు .కేంద్రం లో ఏ ప్రభుత్వం వున్నా ,బెదిరించి ,పోట్లాడి ,అలిగి నీలిగి  ,బెదిరించి ,అన్నీ సాధించుకొనే నేర్పు అతనిది .కక్కా లేక మింగా లేక పోతున్నాడు 1990  వరకు ఏమీ చెయ్య లేక పోయాడు కరుణ .అప్పటిదాకా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు   తెలుగు లోనే జరిగేవి .హోయసల రాజుల కాలమ్ నుంచి హోసూర్ వుంది హస వూరు హోసూర్ గా మారిందని అంటారు .
                        అప్పటి దాకా మద్రాస్ రాష్ట్రం గా వున్న దీని పేరును తమిళనాడు గా 69 లో మార్చారు …మైసూర్ స్టేట్ ను 73  కర్నాటక గా మార్చారు .  భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచేసమయం
లో 1956   లో  పటాస్క్కర్ కమిటీ సర్వ్ చేసి హోసూరు ప్రజలు ఏ రాష్ట్రం లో కావాలంటే ఆ రాష్ట్రం లో ఉండ వచ్చునని రిపోర్ట్ ఇచ్చింది .అయితె ఆంద్ర రాష్ట్రం లో చేరి పోవాలని హోసూర్ ప్రజలకు పూర్తిగా వున్నా ఎవరు వుద్యమించలేదు .ఎవరికీ గట్టిగా విన్నపాలు చేయక పోవటం పాపం ఇప్పుడ వారు అనుభవించే కష్టాలకు కారణం అయింది .దీని పక్కనే వున్న దేన్కని కోట తాలూక కన్యా కుమారి జిల్లా అంతపెద్దది దాన్ని రెండు గా విభజించి హోసూర్ ,దేన్కని తాలూకా లను ఏర్పాటు చేశారు .దేన్కని అంటె తెన్కని అనేనేమో తెన్కని ప్రభువు నన్నే చోడుడు కుమార సంభవం  కావ్యం తెలుగు లో రాశాడ్డు .తెన్కనాదిత్య బిరుదు వుంది ఆయనకు .ప్రబంధాలకు మార్గ దర్శి అయాడు
డా వసంత్
తమిళ భాషా సమస్య చాపకింద నీరు లాగా ప్రవేశించింది .ఇది తెలుసు కొనే సరికే అంతా మించి పోయింది .అప్పటి దాకా తెలుగే అధికార భాష గా వుంది .ఇప్పుడు తమిళాన్ని ఇక్కడ అధికార బాష గా చేయటం పుండు మీద కారం చల్లి నట్లయింది ఈ మార్పును ఒప్పుకో లేదు .జీర్ణించుకో లేక పోయారు .ఇక్కడ తెలుగు సంఘాలు యాబ్భై ఏళ్ళ నుంచే వున్నాయి .అయినా చురుగ్గా పని చేయ లేక పోయాయని ఇప్పటి వారి భావన .. అప్పటి శాసన సభ్యులు కోదండ రామయ్య శక్తి వంచన లేకుండా తెలుగును రక్షించటానికి ప్రయత్నించారు .అప్పుడే  తమిళ నాడు లో తెలుగు భాషోద్యమ సంఘం ఏర్పడి పని చేస్తోంది .
.                   హోసూర్ ప్రజలు జై తెలుగు తల్లి అని ఉద్యమం ప్రారంభించారు .ఇక్కడి బోసు బజార్ లో ని మిత్రబృందం మొదటి సారిగా ఉద్యమించింది .వీరికి ఘంటసాల మిత్ర బృందం తోడైంది .,నంద్యాల నారాయణ రెడ్డి గారి ప్రోద్బలం తో తెలుగు  ప్రజ లు అంతా  సంఘటిత మయారు .తెలుగు భాషోద్యమ నాయకులు సామల రమేష్ బాబు గారు ,సా.వెం .రమేష్ గారు వీరికి అండ గా నిలిచారు .వారిద్దరూ ఇక్కడికి వచ్చి మార్గ నిర్దేశం చేశారు .వీరికి ఆత్మ స్థైర్యాన్ని ,ధైర్యాని కల్గించి వెన్ను తట్టి ,అండగా నిలిచారు .దీనికి ఇక్క్కడి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు ,కైవారం తాతయ్య గారు ,ప్రేరణ నిచ్చారు .స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు .”దూషించు వారి -నయ భాషిన్చి –ప్రేమతో భూషించావే  మనసా  ”అన్న తాతయ్య గారి గీతం వీరికి భగవద్గీతే అయింది .కర్తవ్యమ్ బోధ పడి ముందడుగు వేశారు .ఇక మడమ తిప్ప లేదు .ఇలా అయిదు వైపులా నుంచి ప్రోత్చాహం లభించి కదం తొక్కారు ఇక్కడి తెలుగు ప్రజ ..తర్వాత 2001 లో  కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం ఏర్పడింది .ఇది మరీ వూతాన్ని ఇచ్చింది .దీన్ని వీళ్ళు ముద్దుగా కృష్ణ రసం అన్నారు .సంక్షిప్త పరచి …ప్రతి నెల మొదటి ఆది వారం అందరు సమావేశం అవుతారు ..తర్వాత కోదండ రామయ్య ఆంద్ర సంస్కృతి సమితి భవనం లో సమావేశాలు జరుగు తాయి .రచయితల సంఘం వారం లో మూడు రోజులు పర్యటించి ,సమస్యలను తెలుసు కొంటారు .ఆదివారం సమావేశం లో చర్చించి పరిష్కారాలను కనుగొంటారు .సామల రమేష్ బాబు ,స.వెం రమేష్ గార్లు వీరికి పరమ ఆత్మీయులై నారు .వారిద్దరిని సంప్రదించ కుండా ఏ కార్యక్రమం జరపరు .
                           తమిళ ప్రభుత్వ తెలుగు వ్యతిరేకత వల విద్యార్ధులు తెలుగు స్కూల్ లలో చేరటం తగ్గింది ..దీన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు .అందుకే ప్రతి సంవత్చరం మే ,జూన్ నెలల్లో ఇంటింటికి తిరిగి తెలుగు స్చూల్లలో విద్యార్ధులను చేర్పించటానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారు .వీరి ప్రయత్నాలు ఫలించి ,తలిదండ్రులు తెలుగు స్చూల్స్ లో చేర్పిస్తున్నారు క్రమంగా తమిళ బడులన్ని తెలుగు బడులు  గా మారాయి .చీకటిని తిట్టుకుంటూ కూర్చోటం కంటే చిరు  దీపం వెలిగిస్తే అంతా కాంతి ఏ కదా .ఫెబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ”తెలుగు మాత్రు   భాషా దినోత్చవం ”వైభవం గా జరుపు తారు .అంతా కలిసి బాన్నేర్లు పట్టుకొని గ్రామాల్లో ప్రచార యాత్ర చేసి వుత్చాహం కల్గిస్తారు .ప్రతి ఉగాది పండుగ నాడు బోస్ బజారు నుంచి వూరు ఊరంతా ఉగాది శుభా కాంక్షల బాన్నేర్లు ,flexeelu ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని తెస్తారు .అచ్చమైన తెలుగు పండుగ కదా ఉగాది .అందుక అంతటి సంబరాలు నిర్వహించటం .ఆగస్ట్ లో గిడుగు రామ మూర్తి జయంతిని వ్యావహారిక భాష దినోత్చవం గా నిర్వహిస్తారు .నవంబెర్ లో తెలుగు భాషకు ఎన లేని సేవ చేసి ,అనేక గ్రంధాలను ప్రచ్రించిన ప్రాతస్మరనీయుడు సి .పీ .బ్రౌన్  జయంతి జరిపి ఆయన భాషా సేవను గుర్తుకు తెచ్చుకుంటారు .స్ఫూర్తిని పొందుతారు .విద్యార్ధులకు వేమన పద్యాలపై పోటీలను నిర్వహిస్తారు .ఇక్కడి బస్తి యువక సంఘం ఆధ్వర్యం లో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవితా సంకలనం తెస్తారు .
                 2004  లో  ”తెలుగు వాణి ”పత్రిక నెల కొల్పి ఉత్చాహ వంతులైన యువ రచయితలతో కవితలు ,హోసూర్ మాండలికం లో కధలు ,వ్యాసాలు రాయిస్తున్నారు .ఇది ఎందరికో మంచి వేదిక అయింది .వారి సృజనకు గొప్ప అవకాశం లభించింది ,..బోధనా ,పరిశోధనా ధ్యేయం గా వాణి తన  బాణీ ని చాటు తోంది ..దీనికి తోడు ”తల్లి భాష ” మాస పత్రిక ఇక్కడితెలుగులా మనో భావాలను కవిత ,కధ పాట పద్యం ,మాండలికం ద్వారా  ప్రతి బిమ్బించేట్లు  చేస్తోంది .
                         హోసూర్ లో జరుగు తున్న ఈ వైవిధ్యభరిత  కార్యక్రమాలను చూసిన రాయ వెల్లూర్ తెలుగు ప్రజానీకం తాము ,తమ పిల్లలు తెలుగు నేర్చుకున్తామని ,నేర్పే ఏర్పాటు చేయమని వీరిని కోరారు .వీరికి మంచి ఉత్చాహం లభించింది .తమ ప్రయత్నాలు ప్రక్క ప్రదేశాలకు విస్తరిస్తున్నందున కుసంబర పడ్డారు ..అయితె వారికి నేర్పాలంటే సు స్సిక్షుతులు అయిన కార్య కర్తలు కావాలి .వారికి తెలుగు ఎలా నేర్పాలో తెలియాలి ..అందుకని దగ్గర లో వున్న కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయాన్ని ఆశ్రయించారు .వారు రేసౌర్సే పెర్సొన్స్ కు శిక్షణ నిచ్చారు కస్తూరి విశ్వనాధం ,పరిమి రామ నరసింహం వంటి వుద్దండులుకదిలి వచ్చి యువకులకు మంచి శిక్షణ నిచ్చి తీర్చి దిద్దారు .వెల్లూర్ జిల్లా లోని 120 గ్రామాల నుండి గ్రామానికి కనీసం ముప్ఫై మంది వరకు వచ్చి నేర్చుకొన్నారు .తెలుగు లో ప్రావీణ్యం పొందారు .నల్లూరు గ్రామం లో ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించారు .స్త్రీలు విశేషం గా పాల్గొని ,తాము ,ఏమీ ,వెనుక బడ లేదని నిరూపించారు …దీని ప్రభావం బాగా వుంది .తమిళ విద్యార్ధులు తెలుగు కవితలు రాసి తెలుగు వారినే ఆశ్చర్య పడేట్లు చేశారు కృషి వుంటే మనుషులు రుషులవు తారు ,మహా పురుషు లవు   తారు అన్న దానికి ఇది నిదర్శనం .ఈ ఖర్చును అజంతా వాచ్ కంపెని వారు ,ఇతర వదాన్యులైన దాతలు భరించి ఒక గొప్ప సామాజిక మార్పుకు దోహద పడ్డారు .వారందరూ అభినంద నీయులు .ఈ విజయం అంతా హోసూరు లోని తెలుగు సంస్థ కు ,దాని నిర్వాహకులకు దక్కు తుంది
                             మరిన్ని హోసూరు విషయాలు ఇంకో సారి .
                              మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 . క్యాంపు —బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి ——1

     హోరెత్తిస్తున్న హోసూర్  తెలుగు ప్రజా వాణి   ——1
                                                                 ——————————————–
                                హోసూర్ గురించి చాలా కాల0 గా వింటున్నాను .అక్కడి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నడుస్తున్న చరిత్ర మాస పత్రిక లో చదువుతున్నాను .అడపా దడాపా దాని సంపాదకులు ,ఆప్తులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చేసే ప్రసంగాల ద్వారా కూడా  తెలుస్తున్నాయి .సా.వెం .రమేష్ గారి రచనల ద్వారా చాలావిషయాలతెలిశాయి .
అక్కడ తెలుగు భాషను రక్షించుకోవటానికి వారు చేస్తున్న పోరాటాలు ,తెలుగు సంస్కృతిని కాపాడుకోవటానికి  అవలంబిస్తున్న  విధానాలు ,తమిళనాడు ప్రభుత్వం హోసూర్ తెలుగు వారికి చేస్తున్న అన్యాయం ,ఆ అన్యాయాన్ని సరిదిద్దటానికి వారు చేస్తున్న పోరాటం ,విని ,చదివి హోసూర్ చూడాలనే అభిప్రాయం మనసులో బలం గా నాటుకొంది .ప్రత్యక్షం గా అక్కడి విషయాలు తెలుసుకోవాలనిపించింది .ఎట్లాగు బెంగళూర్ లో వున్నాను కనుకా,ఇక్కడికి హోసూర్ బాగా దగ్గర కనుక వెళ్ళటానికి నిర్నయిన్చుకొని ఉయ్యూరు లోని మా అబ్బాయి రమణకు ఫోన్ చేసి రమేష్ బాబు గారికి ఫోన్ చేసి హోసూర్ లో ఆయనకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ అడిగి తెలుసు కోమని చెప్పాను .వాడు వెంటనే ఆయన నుంచి అక్కడి డాక్టర్ వసంత్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు .

నంద్యాల నారాయణ రెడ్డి గారు

ఈ నెల పద్దెనిమిదవ తేది సోమవారం ఉదయం బెంగళూర్ లో పదిగంటల కల్లా భోజనం చేసి మా అబ్బాయి శర్మ వాళ్ల ఇంటిను౦చి బయల్దేరాను .సిటీ బస్ ఎక్కి సిల్క్ బోర్డు దగ్గర దిగాను .ఇక్కడ సేనియర్ సిటిజెన్స్ కు కన్సెషన్ వుంది బస్సుల్లో .సిల్క్ బోర్డు దగ్గర తమిళనాడు బస్సు ఎక్కి హోసూర్ మధ్యాహ్నం పన్నెండున్నరకు చేరాను .బస్ స్టాండ్ నుంచి వసంత్ గారికి ఫోన్ చేసి హోసూర్ కు వచ్చిన విషయం చెప్పాను .ఆయనకు ముందుగా నేను ఫోన్ చెయ్యలేదు .ఇప్పుడే చేశాను .పాపం ఆయన ఎంతో బాధ గా తాను హోసూర్ కు ముప్ఫై కిలోమీటర్ల దూరం లోచిన్న తిరుపతి అనే  ఒక పల్లె టూరిలో క్లినిక్ లో వున్నానని ,సాయంత్రం దాకా రాలేనని ,తన మిత్రుడు రఘునాధ రెడ్డి గారిని పంపిస్తున్నానని ,ఆయన అన్ని విషయాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు .రెడ్డి గారు నాకోసం వచ్చి నన్ను తన బండి మీద నంద్యాల నారాయణ రెడ్డి గారింటికి తీసుకొని వెళ్లి ,నా గురించి చెప్పి ,హోసూర్ లో జరిగే కార్య క్రమాలన్ని నాకు తెలియ జేయమని చెప్పారు .తాను మళ్లి వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళారు వీరు అగ్రిగోల్డ్ లో పని చేస్తూ ,మంచి సేవా కార్య కర్త గా పేరు తెచ్చుకొన్నారు .నారాయణ రెడ్డి గారు వ్యవసాయ దారులు యాభై అయిదేళ్ళ పైవారు .మంచి రచయిత .తమిళ కన్నడాలలో మంచి పట్టున్న వారు .ఏ రకమైన మెమొరాండం అయిన ఏ భాషలో నైనా రాయ గలరు .మంచి శైలి ,ఆవేశం ,తెలుగు ను రక్షించు కొనే తపన వున్న వారు .ఆయన రాసిన దంతా నాకు చదివి విని పించారు .అదంతా నేను వాయిస్ రికార్డర్ లో రికార్డు చేశాను .దాదాపు రెండు గంటలు ఇలా గడిపాము .భోజనం చెయ్యమన్నారు .చేసి వచ్చానని చెప్పాను .రెండు సార్లు కాఫీ ఇచ్చారు .ఇంతలో క్క్రిష్ణప్ప గారు వచ్చారు .ఆయన స్వతహాగా కన్నడిగులు.అయినా తెలుగు భాషోద్యమానికి తీవ్రం గా కృషి చేస్తున్నారు .కాసేపటికి మునిరాజు వచ్చారు .యువకుడు ,కవి ,కధా రచయిత .పత్రికలలో ఆయన రాసినవి పడుతుంటాయి .చివరగా డాక్టర్ వసంత్ చేరారు .అందరం సరదాగా కబుర్లు చెప్పుకొన్నాం .వసంత్ గారు మంచి కార్య దీక్షా పరులు .యువకుడు .సాయంత్రం ఆయన ఇంటిదగ్గర క్లినిక్ లో వుంటారు .”తెల్ల కొక్కెర తెప్పం ”అనే కధా సంపుటి వెలువరించారు ..దీనికి ఆగస్ట్ ఏడవ తేదిన వారికి హైదరాబాద్ లో తెలుగు విశ్వ విద్యాలయం లో సన్మానం ,పురస్కారం వున్నట్లు చెప్పారు .ఆ సమయం లో సా.వెం .రమేష్ గారు వీరితో ఫోన్ చేసి మాట్లాడారు నాతో  కూడా ఫోన్ లో రమేష్ గారు మాట్లాడారు .ఆయన రచనలు చదవటమే కాని ప్రత్యక్షం గా చూడ లేదు .ఆయన నిరంతర సంచారి .ఎప్పుడు ఏదో ప్రదేశానికి వెళ్లి అక్కడి తెలుగు వారి భాషా విషయాలు పరిశోధించి వ్యాసాలు రాస్తుంటారు .ప్రళయ కావేరి అనే వారి కధా సంపుటికి అవార్డు వచ్చింది .నాతొ చాల ఆత్మీయం గా మాట్లాడారు .ఉయ్యూరు ,ఆ పరిసర ప్రాంతాలు తెలుసు నని ,చెప్పారు .ఇక్కడి ఈ మిత్ర బృందానికి ఆయన గొప్ప ప్రేరణ .అలాగే రమేష్ బాబు గారు .వాళ్లిద్దరే స్ఫూర్తి ప్రదాతలు గా నిండు మనసుతో అందరు చెప్పారు .ఇలాంటి మిత్రులకు ఇంకో యాభై మంది సుశిక్షుతులైన కార్య కర్తలు తోడ్పడుతూ ,చాలా కార్య క్రమాల్ని దిగ్విజం గా జరపటం విశేషం .మంచి అనుభూతి పొందాను .ఇక్కడికి రావటం నాకు చాలా ఉపయోగ పడింది ..అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ,ఫోటోలు దిగి ,వసంత గారి కారు లో మునిరాజు గారితో కలిసి హోటల్ కువెళ్ళి టిఫిన్ చేసి ,రాత్రి ఏడు గంటలకు బస్ ఎక్కి తొమ్మిదింటికి బెంగళూర్ చేరాను అక్కడి విషయాలన్నీ నారాయణ రెడ్డి గారు చెప్పిన వివరాలు మీకు వివరం గా తెలియ జేస్తాను .మంచి మిత్రబృందాన్ని ,సేవా నిరతుల్ని ,భాషాభి మానుల్ని ,భాషోద్యమ కార్య కర్తల్ని ,అకున్తిత దీక్షా దక్షుల్ని ,అంకిత భావం తో ,ప్రతి ఫలా పేక్ష లేకుండా ,తమ అమూల్య సమయాన్ని ,ధనాన్ని తెలుగును నిలబెట్ట టానికి కృషి చేస్తున్న నిత్కృషీ వాళుల్ని చూసిన ఆనందం మనసు నిండా నింపుకొని ఇంటికి సంతృప్తిగా చేరాను .వారి మర్యాద ,మన్నన ,పెద్దరికం ,కలుపుగోలు తనం నన్ను బాగా ఆకర్షించాయి మేమున్న మార్త హళ్లి కి హోసూర్ సుమారు నలభై కిలో మీటర్లు .వెళ్లి తిరిగి రావా టానికి సుమారు వందరూపాయలవుతుంది .

రఘునాధ రెడ్డి

హోసూరు కృష్ణా గిరి జిల్లా లో వుంది-తమిళనాడు నాడు లో .అయిదు కిలో మీటర్ల లో కర్నాటక సరిహద్దు .దీపావళికి బెంగళూర్ వాళ్ళంతా హోసూర్ వెళ్లి టపాకాయలు కొనుక్కుంటారు .చవక .అవి తమిళనాడు లోని శివ కాశి నుంచి వస్తాయ.పెద్ద ఊరే లక్ష జనాభా .అందులో అరవై వేలమంది తెలుగు వారే .ఇక్కడి శాసన సభ్యుడు తెలుగు వారే ..అయినా భాషా వివక్షతకు ఇక్కడి తెలుగు వారు ,కన్నడిగులు ,మలయాళీలు ,ఇబ్బంది పడుతున్నారు .ఇవన్నీ వివరం గా మళ్ళీ రాస్తాను
                                      మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 —-క్యాంపు —బెంగళూర్ .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

అలాస్కా విశేషాలు

                అలాస్కా విశేషాలు 
                        అలాస్క ధ్రువ ప్రాంతం లో వున్న సంగతి అందరికి తెలుసు .ఇక్కడి క్యాలెండరు Tlingit–indian calender ను ఉపయోగిస్తారు .వీరి సంవత్చరం ఆగస్ట్ తో ప్రారంభం అవుతుంది .అప్పుడు పక్షులు పర్వతాల మీద నుండి కిందికి దిగుతాయి జంతువులూ శీతాకాలం గుహల్లోకి ప్రవేశిస్తాయి .సెప్టెంబర్ ను స్మాల్ మూన్ అంటారు .చేపలు ,బెర్రీలు కనిపించవు .నవంబర్ ను స్నో మూన్  అంటారు .నీళ్ళు గడ్డ కడతాయి .డిసెంబర్ ను సైలెంట్ మూన్ అంటారు .డోనట్లు తింటారు .దినసరి చర్యలేమీ వుండవు .
—                జనవరి లో గూస్ మూన్ వస్తుంది .బాతులు ఉత్తరం వైపు చూస్తాయి .సూర్యుడు నెమ్మది గా కనిపిస్తాడు తిరుగు ప్రయాణం లో .ఉత్తరాన గొప్ప ఆరోరా కనిపించి అద్భుతం అని పిస్తుంది .ఫెబ్రవరి లో కనిపించే చంద్రున్ని బేర్ మూన్ అంటారు .నిద్రలో వున్న నల్ల ఎలుగులు అన్నీ రెండవ వైపుకు తిరుగు తాయి .మార్చ్ లో వచ్చేదిసి ఫ్లవర్ మూన్    సముద్రం లోని జీవ జాతులన్నీ పెరగటం ప్రారంభిస్తాయి .ఏప్రిల్ చంద్రున్ని మూన్ ఆఫ్ రియల్ ఫ్లవరింగ్ అంటారు .భూమి మీద వున్నమొక్కలకు ప్రాణం వస్తుంది ..
                 మే లో హాచింగ్ మూన్ వస్తుంది .పక్షులు గుడ్లు పెడతాయి జూన్ లో సాల్మన్ మూన్ వస్తుంది .సముద్ర జలాల్లో సాల్మన్ చేపలు విపరీతం గా కన్పిస్తాయి .అక్కడ వుండే netive అలాస్కంలు చెట్టు కొమ్మలతో అదిరించి పట్టుకొంటారు జూలై లో మూన్ అఫ్ బర్త్ వస్తుంది .తీరాల్లో టెంట్లు వేసుకొని జనం చేరతారు .రద్దీ ఏర్పడుతుంది .చైతన్యం తోనికిస లాడు తుంది .ఆగస్ట్ నెలలో మొదటి పదిహేను రోజులను పదమూడవ నెలగా  భావిస్తారు .దీనికి ఇంకో పేరే ఫాట్టింగ్ మూన్ ..జంతువులూ kovvuto బలిసి వుంటాయి వీటితో వ్యాపారం బాగా చేస్తారు .సంపాదన కాలమ్ ఇదే .
                         అలాస్కా లోని  ప్రజల భాష ను చినూక్ అంటారు .దీనిలో 500 మాటలే వుంటాయి .ఇదంతా వ్యాపార పరిభాష గా వుంటుంది .దీనికి వ్యాకరణం లేదు .ఈ భాష ప్రదేశాన్ని బట్టి మారుతుంది .ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ పదాలు వచ్చి చేరు తున్నాయి .
సరదాగా కొన్ని పదాలు ,వాటి అర్ధాలు తెలుసు కొందాం.
హి-హి –అంటే నవ్వు -మనం కూడా హి హి అని నవ్వుతాము కదా .సరైన మాట.
pish అంటే చేప .–ఎఫ్ బదులు పీ వచ్చింది .ఒకరకం గా వికృతి అన్న మాట    —
హీ-హీ-house –వినోదం ఇచ్చే చోటు
ఇల్లాహీ–భూమి
hi -yu అంటే   చాలా . —
mukka a -muck – –ఆహారం —మన ముక్కా -ముడుసు లాటిదేమో ?
siwash –అంటే –ఇండియన్ —నీచుడు అనే అర్ధం లో వాడుతారు .అయ్యో రాత అక్కడా మనం నీచం గానే చూడబడుతున్నాం అన్న మాట .
tillicum   స్నేహితుడు .
                                    ఇట్లు మీ tillicum అంటే స్నేహితుడు ——గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -07 -11 –క్యాంపు —బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్

     అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్
                           పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen  లను ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధతినే హేబెర్ ప్రాసెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్ అనే జెర్మనీ శాస్త్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త్రవేత్త గా పేరు .అమ్మోనియా తయారు తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్లవానికి నాందిఅయాడు హేబెర్ .తర్వాత యుద్ధంలో శత్రునాశనానికి  విష వాయువులు కని పెట్టి ప్రయోగించాడు .సైన్యం లో అత్యున్నత పదవి పొంది యుద్ధ వ్యూహం లో ఆరితేరాడు .కానీ నాజీ ప్రభుత్వం ఏర్పడి హిట్లర్ అధికారానికి రాగానే యూదులందర్నీ ఏరి చంపేశాడు .పాపం హేబెర్ కూడా సర్వస్వం కోల్పోయి ,అనామకుడుగా ,అనాధగా మిగిలి పోయాడు .అతని జీవితం ఒక పాఠం మాత్రమే కాదు అందరికి గుణ పాఠం కూడా .ఎందుకు ,ఎలా ,ఏమిటీ అనుకుంటూ ,ఆ వివరాలు తెలుసు కొందాము .  ,
                              ముందే చెప్పినట్లు హేబెర్ బాష్ తో కలిసి అమ్మోనియా తయారు చేశాడు .దీనితో కృత్రిమ రసాయనిక ఎరువులు తయారయాయి .పంటలకు వర ప్రసాదం అయింది .పంటలు రెట్టింపు గా పండాయి. సశ్యవిప్లవ సాధనకు రాచ మార్గం ఏర్పడింది .మనం తినే అన్ని పదార్ధాలలో nitrogen వుంది .జనుము ,పిల్లి పెసర  మొదలైన మొక్కల వెళ్ళ మీద నైట్రోజెన్ స్థాపక శూక్ష్మ జీవులు౦టాయని చదువు కొన్నాం .హేబెర్ ఈ విషయాలను సూక్ష్మం గా పరిశోధించాడు .నైట్రోజెన్ వాడకం పెరిగితే అంతా మార్పే అని భావించాడు .ఆయనకు laboratory ,ఫ్యాక్టరీ ,యుద్ధ రంగాలు ఇష్టమైనవి . మార్పు తేవటం ,కొత్తది సృష్టించటం అతనికి చాలా ఇష్టం .అతను క్రూరుడు కాదు కానీ ,అతను మంచి విధేయుడు ,ఉదారుడు ,కష్టపడే వాడు ,సృజన కలవాడు .వీటన్నిటికి తగిన ప్రతిఫలాలను పొందాడు .
                         బెర్లిన్ లో piperonal అనే వాసన వేసే రాసాయననాన్ని కనిపెట్టాడు .1891 లో chemistry ,ఫిజిక్స్ ,philosophy  లలో డిగ్రీ సాధించాడు .physical chemistry నీ అధ్యనం చేశాడు .అప్పటికి జెర్మనీ లో వున్నా పదివేల మంది యూదులలో  హేబెర్ కూడా ఒకడు . ఆడవాళ్ళను అర్ధం చేసుకొనే మనస్తత్వం అతనికి లేదు .వారి విషయం లో అతని అభి ప్రాయం ఇలా వుంది
”women are like lovely butterflies to me .I admire their colours and glitter ,but i get no future ”.రంగుల సీతా కొక చిలుకలు  ఆడవాళ్ళు వారి పై మెరుగులే చూస్తాను అనే తత్త్వం ..బిస్మార్క్ అనే వాడట ”the german’s fear nothing but god ”germany     వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మితే అమెరికన్లు సాంకేతిక విధానం పై ద్రుష్టి సారిస్తారు .  చివరికి germanlu
సాంకేతిక మిలిటరీ విధానాన్ని అనుసరించారు .సృజనకు విలువ నిచ్చారు .ఆయుధమే విజయానికి కారణం గా తెలుసు కొన్నారు .ప్రప్పంచాదిపత్యం కావాలంటే జెర్మనికి ,దాని అస్తిత్వానికి ఆయుధబలమే శరణ్యం అని తెలుసు కొన్నారు .జెర్మని దేశానికి జీవిత కాల సివిల్ సర్వీసు ప్రొఫెసర్ గా వున్నాడు హేబెర్ .అతని అమ్మోనియా ప్రాజెక్ట్ వల్ల దేశం లో ప్రతి వారికి తిండి దొరికింది .ఒక రకంగా అన్న దాత అయాడు .అందరిలోనూ ముఖ్యుడయ్యాడు .తాను జెర్మని లో అతి శక్తి సామర్ధ్యాలు కలవాడిని అన్నాడు .తాను పరిశ్రమలకే ఆద్యుడు .జెర్మని మిలటరీ విధానం లోను ,ఆర్ధిక విషయాలల లోను అగ్రగామి కావటానికి తానే కారకుడనని తనకు జెర్మని లో ప్రవేశార్హత లేని ప్రదేశం లేదని , చెప్పాడు కూడా …
                         హేబెర్ తీరు తెన్నులు చూసి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ”our entire much praised technological progress and civilization generally could be compare to an ax in the hand of pathological criminal ”అని హెచ్చరిన్న్చాడు ఇతను కనిపెట్టిన విష పదార్ధాలను గురించి తెలుసు కోని .
                 1914  లో    germani  దేశంలతో యుద్ధం చేసింది .ఫ్రాన్సు  ఇంగ్లాండ్ లతో యుద్ధం చేసింది .వాళ్ళను జయించటం కష్టమైంది .కందకాలలో వున్న శత్రువులను తరిమి వేయటం కష్టమైంది .అప్పుడు dia nisidine chloro sulphate .ఉపయోగించారు  .ఏ ప్రభావం కలిగించ లేదు .ఇదే ప్రపంచం లో మొదటి వాయు   ప్రయోగం ..తర్వాత బెంజాల్ bromide గ్యాస్ ప్రయోగించాడు .శత్రువుల కళ్ళు మండాయి .తరువాత tear దీనినే zxylyl bromide  గ్యాస్ అంటారు .శత్రు సంహారం  జరిగి జెర్మని గెలిచింది ఇవన్నీ హేబెర్ సృష్టించినవే .”హేబెర్ was fascinated .his mind latched on to the problems of gas weaponry and did not let go for the rest of the war ..అంతా ఎదిగి పోయాడు ,అంతా ముఖ్యుడైనాడు యుద్ధ వ్యూహం లో .
                         క్రమం గా మిలిటరీ సలహా దారుడై నాడు .స్వయం గా యుద్ధ రంగం లో నిలిచాడు .మిలిటరీ జనరల్ గా ఆలోచించాడు .తన మేధా సంపత్తికి ,విధి నిర్వహణను జోడించాడు .చివరికి పర్ స్యన్ ఆఫీసర్ అయాడు .autocratic and and useless in his will to victory అని   పించుకొన్నాడు . మిలిటరీ వ్యవస్థ ను నిర్వహించే దశకు పెరిగాడు .ఒక సారి ఆయన ప్రయోగ శాలలో ఒక విద్యార్ధి ప్రయోగం చేస్తుంటే అనుకోకండా ఒక గ్యాస్ ఏర్పడి ఆ విద్యార్ధి చని పోయాడు .అప్పుడు హేబెర్ కు అర్ధమైంది గ్యాస్ వే అపోన్ ఎంతటి దారుణం చేయ గలదో .అదే క్లోరిన్ గ్యాస్ .దాన్ని ట్యాంకులలో ఎక్కువ పీడనం తో నింపి బెల్జియం సిటీ లోని ఎప్రేస్స్ లోని ట్రెంచ్ లో వున్న శత్రు శైనికు లపై ప్రయోగించాడు .వాళ్ళంతా ఊపిరి ఆడక దెబ్బకి ఠా . .దీనితో యుద్ధం లో విప్లవాత్మక మార్పు వచ్చింది .గ్యాస్ నుపయోగించి శత్రు శైన్యాన్ని చంప వచ్చు అతి తేలికగా .ఈ రోజునే డే అఫ్ cypress అంటారు ఇలాంటి ప్రయోగాలు భార్య క్లారా కు ఇష్టం లేదు .వద్దు అని వారించింది .మానవాళికి చేటు అని హెచ్చరించింది .మొండి హేబెర్ వినలేదు .చివరికి ఆమె పిస్టల్  తో కాల్చుకోని ఆత్మ హత్య చేసుకోంది .  గ్యాస్ వేఅపోన్ మీద విల్ఫ్రెడ్ ఓవెన్ అనే బ్రిటిష్ సైనికుడు ,కవి ఒక కవిత కూడా రాశాడు దాని దుష్పరిణామం మీద .తర్వాత అమెరికా hydrogen cyanide గ్యాస్ ను వాడింది .దీనినే pervertion of science  గా అందరు విమర్శించారు .అయితే దీన్ని ప్స్య్చోలూగికాల్ గా చూశాడు హేబెర్ .తేలిగ్గా తీసుకొన్నాడు .           .
                  హేబెర్ అమ్మోనియా మీద రాయల్టీ బాగా వచ్చేది హేబెర్ కు . లో 1918 లో జర్మనీ ఓడి పోయింది .యుద్ధ విమానాల వాడకం అవసర మైంది .మిరచ్లె వేఅపొంస్  సాధించటం లో నిమగ్న మైంది .నోబెల్ బహుమతి పొందాడు హేబెర్ .౧౯౩౨ ఎన్నికలలో నాజి పారి అధికారం లోకి వచ్చింది హిట్లేర్ తిరుగు లేని నాయకుడయ్యాడు .యూదులను నిర్దాక్షిణ్యంగా గా కాల్చి చంపేశాడు .పదవులన్నీ పోయాయి హేబెర్ కు .అస్తిత్వానికే ఎసరు వచ్చింది .జెర్మనీ నుంచి వ్ల్లిపోఎవారికి కొంత అవకాశం ఇచ్చారు .వెళ్ళే వాళ్ళందరికీ హేబెర్ సాయం చేశాడు .తాను ఎటు తేల్చుకో లేక పోయాడు .అమ్మోనియా అమ్మకం తగ్గి రాబడి బాగా తగ్గింది .సహాయం కోసం అందర్నీ యాచించాడు ఎవరు ముందుకు రాలేదు .
స్విర్జర్లాండ్ చేరాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు .శానిటోరియం లో చేరాడు  .తన భాగస్వామి బాష్ ను సహాయం చేయమని రాశాడు .వాడేమి పట్టి౦చు కోలేదు .కొత్త ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకొని వాడు మళ్ళీ సంపాదన మీద పడ్డాడు .1934 ౨౯  janavari న బాసెల్ లో చనిపోయాడు .ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త మక్ష్ ప్లాంక్ మాత్రమే అంత్యక్రియలకు హాజరైనాడు .జెర్మనీ పట్టించుకోలేదు .పేపర్ లో వార్త కూడా రాయ లేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలమ్ లో జెర్మని కి అత్యధికం గా సేవలందించిన వాళ్ళలో ప్రధముడు హేబెర్ .అలాంటి వాడికే ఇంతటి దుర్గతి .అతని బంధువులనందర్నీ గ్యాస్ చా౦బర్ లలో పెట్టి చంపేసింది నాజి ప్రభుత్వం .చివరికి విస్మృత శాస్త్ర వేత్త గా మిగిలి పోయాడు .అతని స్మ్రుతి చిహ్నం కూడా లేదు .
                   హేబర్ హీరో మరియు విలన్ .అయాడు .”german ,patriot ,a victim of naazi’s .A patron saint for guns and butter .he was the founder of the military industrial complex and the inventor of the chemistry through which the world now feeds itself ”ఇంతటి గొప్ప శాస్త్ర వేత్తకు ఇంతటి దుర్గతి ..ఆయన నిర్మించిన తూర్పు జెర్మని లోని Leuna -వేర్కే
ఆయన జీవిత సర్వస్వం .ఆ పేరు తీసేసింది నాజి ప్రభుత్వం .చివరి జీవిత కాలమ్ లో ప్రవాసి గా గడపవలసి వచ్చిది పాపం .1952  లోని   బెర్లిన్ లోని  . ”The fritz Haber institute of the Max plank society మాత్రమే మిగిలింది .
          celebration of a murderer –heber —father of gas war fare ” ani 1968  లో న్యువ శాస్త్ర వేత్తలు జర్మని లో జరుపు కొన్నారు
scientists could desclaim direct responsibility for theuse to which mankind  had put their disinterested discoveries .We feel compelled to tae a more active stand now ,because –nuclear power is fraught with infinity greater danger than were all the inventions of the past ”’అని ఫ్రాంక్ రిపోర్ట్ వచ్చింది .ఇదే కొత్త ఉద్యమం గా మారింది .
       సాంకేతిక శక్తిని the machine అన్నారు .గ్యాస్ weapons ను గ్యాస్ -troops అన్నారు . .శాస్తవేత్తలు సరాసరి యుద్ధ విధానాలలో పాల్గొన రాదు .తాము శోధించి సాధించిన విపత్కర ఆయుధాలు ,మాన వాళి వినాశకరం కా కుండా జాగ్రత్త పడాలి .లేకుంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అణు బాంబు యెంత మానవ విధ్వంసం చేసిందో గుర్తుంచు కోవాలి.
                                  మీ —గబ్బిటదుర్గా ప్రసాద్   —17 -07 -11 —క్యాంపు –బెంగళూర్ . .
Posted in రచనలు | Leave a comment

బెంగళూర్ రౌండ్స్

                                          బెంగళూర్ రౌండ్స్
                      జూలై పన్నెండవ తేది మంగళ వారం బెంగళూర్ sight సీఇంగ్ కు మా అబ్బాయి శర్మ కర్నాటక tourismవాళ్ల బస్సు లో నేను వెళ్ళటానికి టికెట్ బుక్ చేశాడు .ఖరీదు 270 రూపాయలు
ఏ.సి.బస్ .ఇది మజేస్తిక్ లో కెనర బ్యాంకు ఏ.టి.ఏం .దగ్గర నుంచి బయల్దేరుతుంది .నేను శర్మ కార్ లో మున్నె కొలాల్ నుంచి మార్త హళ్లి వెళ్ళా.అక్కడ సిటీ బస్ లో majestic లో వున్న కెంపే గౌడ బస్సు స్టేషన్ కు వెళ్ళా.రిజర్వేషన్ టికెట్ వుంటే సిటిబస్ లో ఫ్రీ గా ప్రయాణం .ఉదయం ఏడున్నరకు మెజెస్టిక్  చేరా.బస్సు స్టాండ్ చాలా పరిశుభ్రం గా నిర్వహ్హిస్తున్నారు .నెంబర్ ను బట్టి బస్ ఆగే స్థలాలు వున్నాయి .మనం ప్రయాణం చేసే బస్సు నె౦బర్ తెలిస్తే బస్ ఎక్కడ ఆగుతుందో తేలిగ్గా తెలుసుకోవచ్చు .ఇక్కడ పోలీసులు కూడా చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పటం బాగుంది .సహాయం కావాలా అనే స్థితి లో ఇక్కడి జనం వుండటం ఆశ్చర్యమేస్తుంది .అక్కడే రాఘవేందర్ కాంటీన్ లో కాఫీ తాగాను .పది రూపాయలు .ఇంటి దగ్గరే ఇడ్లీ టిఫిన్ చేసి రెండు సార్లు కాఫీ తాగే బయల్దేరా.కోడలు ఇందిరా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా ఇచ్చింది,మంచినీళ్ళ బాటిల్ తో సహా .sight సీఇంగ్ ను వీళ్ళు బెంగళూర్ రౌండ్స్ అంటారు .దీనికి దగ్గరే సిటీ రైల్వే స్టేషన్ వుంది .ఈ మొత్తాన్ని కేమ్పగౌడ సర్కిల్ అంటారు ఇక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే బస్సులు కూడా వున్నాయి
                       బెంగళూర్ రౌండ్స్ బస్ ఎనిమిదిన్నరకు వచ్చింది .బస్ చాలా బాగా వుంది ఇందులో రెండు రకాల క్లాస్సేస్ వున్నాయి ముందుగా సీట్స్ వుంటే సిల్వర్ క్లాస్స్ .వెనక సీట్లు ఇంకొంచెం సదుపాయం గా వుంటాయి .ఇది గోల్డెన్ క్లాసు .చార్జీ లో తేడా కూడా వుంటుంది గోల్డెన్ చార్జి ఎక్కువ .బస్ లో సగం మందే నిండారు .ఇందులో మార్త హళ్లి నుంచి వచ్చిన తెలుగు ఫ్యామిలీ వుండటం కాలక్షేపానికి కలిసి వచ్చింది తొమ్మిది గంటల పడి నిముషాలకు బస్ బయల్దేరింది .guide  కూడా వున్నాడు .డ్రైవర్ కు guide కు తెలుగు బాగా నే వచ్చ్చు .     
                           ముందుగా ఇస్కాన్ వాళ్ల రాధ కృష్ణ గుడికి వెళ్లాం .ఇది మూడు అంతస్తులు గా కొండ మీద వుంది .ఎక్కాసికి అక్కడ చక్కని సూచనలు మనల్ని గమ్య స్థానానికి తేలిగ్గా చేరుస్తాయి .ఇది యాభై కోట్ల ప్రాజెక్ట్ .ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది .చాలా వైభవం తో ఉంటాడు స్వామి .ఆ పైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వుంది .ఆయనా వెండి వెలుగులతో మెరిసి పోతున్నాడు .ఆ పైన అసలు దేవాలయం వుంది .అదే శ్రీ రాధాకృష్ణ దేవాలయం .మూర్తులు మనోహరం గా వున్నాయి .గొప్ప అలంకరణ .పూలా హారాలు నిండుగా ,మెండుగా వుంది చూడటానికి రెండు కళ్ళు చాలవు .రాదా కృష్ణ ,కృష్ణ బలరామ దేవతా మూర్తులు దివ్యం గా వున్నాయి అనుక్షణం దివ్యనామ  హరేకృష్ణ సంకీర్తనం మానషిక ప్రశాంతినీ ,ఆనందాన్ని ఇస్తుంది .భక్తి తో కనులు అనుకోకుండా మూసుకు పోతాయి .అదొక దివ్య ధామం  దివ్యానుభూతి .తీర్ధం ఇస్తారు .దిగి వస్తూంటే ఇంకో చోట ప్రసాదం పెడతారు .చాలా రుచిగా వుంటుంది .అదే దారిలో కిందకు దిగి మళ్ళీ బస్ ఎక్కాం .
                అక్కడినుంచి గవి గంగాధర దేవాలయం కు ప్రయాణం మొదలు పెట్టాం .దారిలో గైడు  బెంగళూర్ విశేషాలు వివరించాడు .ఆ విషయాలు మీకు అందిస్తున్నాను .బెంగళూర్ కు అసలు పేరు బెంత కాలూర్  .అంటే ఉడకపెట్టిన పప్పు పల్లె దీనికి ఒక కధ వుంది. వీర భల్ల మహారాజు ఒక సారి ఈ ప్రాంతానికి అడవికి వేటకు వచ్చి దారి తప్పి ఒక ప్రాంతం చేరాడు .ఆకలి గా వుంది .తినటానికి ఎవరైనా ఏదైనా పెడతారేమోనని ఎదురు చూశాడు .అప్పుడు ఒక అవ్వ కన బడింది .ఆమెను అడిగాడు తినటానికి ఏదైనా పెట్టమని .ఆమె దగ్గర పచ్చి శెనగలున్నాయి .వాటిని ఉడికించి పెట్టింది .రాజు పరమానందం గా తిన్నాడు .మైసూర్ చేరి కధంతా మిగతా వారికి చెప్పాడు .ఆ వూరి పేరేమిటి అని వాళ్ళు అడిగితే బెంత కాలూర్  అన్నాడట పప్పులు తిన్నది జ్ఞాపకం చేసుకొని .
                    ఒకానొక కాలమ్ లో మైసూర్ మహారాజు తన సామంత రాజు ,సైన్యాధిపతి అయిన కెంపే గౌడ ను ఇప్పుడున్న బెంగళూర్ ప్రాంతం లో ఒక గ్రామాన్ని నిర్మించమని ఆదేశించాడట .ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న కెంపే గౌడ సర్కిల్ దగ్గర నుంచి నాలుగు వైపులకు నాలుగు ఎద్దులను వదిలాడట .అవి యెంత వరకు వెళ్లి ఆగి పోతాయో అంతవరకూ గ్రామాన్ని విస్తరింప జేయాలని నిర్ణయించుకొన్నాడు .ఆ ఎద్దులు ఒక్కొక్కటి బయలు దేరిన చోటు నుంచి నలభై కిలోమీటర్లు వెళ్లి ఆగి పోయాయి ..అంతవరకూ నాలుగు వైపులా హద్దులు ఏర్పరచి గ్రామాన్ని విస్తరించాడు .ఇప్పుడు ఈ నగరం పరిధి 180kilometers .కెంపెగౌడ కుమారుడు ఇమ్మిడి కేమ్పరాయలు నాలుగు వైపులా సరిహద్దుల దగ్గర ఎత్తైన గుట్టలపై గోపురాలు కట్టించాడు .నగరం అంతవరకూ విస్తరించింది .ఈ నగర నిర్మాణం కేమ్పెరాయలు మొదటగా  1535  లో మొదలు పెట్టాడు   గంగా ధర దేవాలయం లో శిలాశాశనం వుంది దీనిలో ఈ నగరానికి బెంగళూర్ అనే పేరు వున్నట్లు తెలిసింది .అందుకే బంగాలూర్ ,bengloor    అనే ఆంగ్లేయ పేర్లను తొలగించి శాసనం లో వున్న పేరునే ఇప్పుడు పెట్టారు .అదే బెంగళూర్ . ,
                        దారిలో గవి గంగాధర స్వామి గుడీ వుంది .ఇదిt త్రేతా  యుగం నాటి దేవాలయం .గౌతమ మహర్షిస్వామి ప్రతిష్ట చేసారని స్థల పురాణం లో వుంది .ఒక గుహలో ఉంటాడు శివుడు .గవి అంటె గుహ అని పేరు .నంది ముందు శివ లింగం వుంటుంది .దక్షిణ దిశగా ఉంటాడు దేవుడు .మకర సంక్రాంతి నాడు సాయంత్రం అయిదు గంటల పది నిముషాలకు సూర్యుని వెలుగు కిరణాలు నంది కొమ్ముల మీద పడి అక్కడి నుంచి శివలింగం మీద పడతాయి .ఆ సమయం  లో జనం విపరీతం వస్తారు చూడటానికి .టి.వి .లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి .ఇక్కడ ఒక సొరంగ మార్గం వుంది .గౌతమ మహర్షి ఇక్కడి ఈ గుహనుంచి కాశీ దాకా వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేసి వచ్చేవారట .ఇప్పుడు సొరంగ మార్గ ప్రవేశానికి అనుమతి లేదు .స్వామి దర్శనం చేసుకొని జన్మ చరితార్ధం చేసుకోన్నాము.ఇక్కడే వున్న శాసనం మీద బెంగళూర్ పేరు వుంది .
                            దీనికి దగ్గర లో దొడ్డ గణపతి దేవాలయం వుంది .దొడ్డ అంటె పెద్ద .విరాట్ స్వరూపుడు గా గణపతి దర్శనమిస్తాడు .ఈయన్నే గం గణపతి అంటారు .గణపతి దర్శనం సర్వ శుభ ప్రదం
                  దొడ్డ గణపతి ఆలయం దగ్గరే దొడ్డ నంది గుడి వుంది .దీనిని ఇక్కడి వాళ్ళునంది బుల్ టెంపుల్ అంటారు ..దీనికీ ఒక కధ వుంది .ఈ ప్రాంతం లో ఒక శివాలయం ఉండేదట .అందులో నంది రాత్రి పూట ఇక్కడి వేరుశనగ పంటను రాత్రి పూట గుడిలోంచి బయటకు వచ్చి తినేసేదట .ఆశ్చర్యం గా వుండేది రైతులకు .ఒక రోజూ అందరు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపలా కాశారు .దేవాలయం నుంచి ఒక ఎద్దు వచ్చి పంటను తినేయటం గమనించారు రైతులు .చేతిలోని బల్లెం తో దాన్ని కొట్టారు .కాలికి గాయమై,నెత్తురు ధార పాతం గ కారింది .ఎద్దు అదృశ్యమైంది .అంతే అప్పటినుంచి పంటలు అన్నీ నాశనం అయాయి కరువు కాటకాలతో జనం అలమటించారు .  ,నీటికి తిండికి నోచుకోలేదు .అప్పుడు ఒక మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారు .ఆయన కాళ్ళపై పడి ఈ సంక్షోభం నుంచి బయట పడేయమని వేడుకొన్నారు రైతులు .ఆయన దివ్య ద్రుష్టి తో అన్నీ తెలుసుకొని ,వారు గాయం చేసింది సామాన్యమైన ఎద్దుకు కాదని ,శివుని వాహన మైన నందీశ్వరునికీ నని ,ఆయన శాపం వల్లనే ఈ ఇబ్బందులని చెప్పాడు .తరుణోపాయం కోరారు వారు .అప్పుడు ముంఫలి అనే ఈ ప్రాంతం కొండ మీద నందీశ్వర విగ్రహం ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తే మళ్ళీ నంది అనుగ్రహం కలుగుతుందని హితవు చెప్పాడు .వాళ్ళు చాలా పెద్ద నందీశ్వర విగ్రహం చెక్కించి ,ప్రతిష్టించి ,నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ నందీశ్వరుని అనుగ్రహానికి పాత్రులయారు .అప్పటినుంచి పంటలు బాగా పండుతున్నాయి .కృతజ్ఞతా పూర్వకం గా కార్తీక మాసం చివరి శని వారం నాడు రైతులందరూ తమకు పండిన వేరుశనగ పంటనుతెచ్చి నందీశ్వరునికి నైవేద్యం పెట్టటం విశేషం .ఇదీ ఈ క్షేత్ర మహిమ .నంది చాలా పెద్దది .నల్లరాతితో సర్వాంగ సుందరం గా నిర్మింకాబడింది .శిల్పవైభావం అపూర్వం గా వుంది .లేపాక్షినంది ,యాగంటి నంది జ్ఞాపకం వస్తాయి .గంగాధర గుడీ  పక్కనే  సూపర్ స్టార్ రజని కాంత్ చదివిన elemntary స్కూల్ వుంది .దీన్ని ఫోటో తీశాను .
.శివ దర్శనానికి ముందు నంది దర్శనం చేయాలి .అసలు శివుని ముందు నంది ఎందుకు ?శివుడు అగిహోత్రుని వంటి వాడు .ఆయన తీక్షణాన్ని నంది తన ఉచ్చ్వాస నిస్స్వాశాలతో తగ్గిస్తుందట .
                         తరువాత టిప్పుసుల్తాన్ వేసవి విడిది చూశాం .అంతా చెక్కతో నిర్మించబడింది.’నాణ్యత కోసం వీటిని కావేరి నదిలో మూడు సంవత్చారాలు నాన బెట్టిన తర్వాతే వుపయోగించారట .ఈ భవననిర్మాణం హైదరాలి ప్రారంభించాడు .అతని కొడుకు టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు .రంగులు చెక్కు చెదర లేదు .టిప్పు బ్రిటిష్ వారినేదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మైసూర్ మహారాజు .బ్రిటిష్ వాళ్ల కుయుక్తుల వల్ల ఓడి పోయాడు .టిప్పు అంటె ఒక ధైర్యం ,ఒక విశ్వాసం ,ఒక సాహసం ..ఇందులో అతని చిత్ర పటం వుంది .దాని ముందు నుంచుని మనం ఎటు కదిలినా అతను ,మనవైపే చూస్తున్నట్లున్డటం విశేషం .అలాగే బ్రిటిష్ సైనికుడిపై కి ఉరికే పులిలాగా వుండే చిత్రం భయంకరంగా టిప్పు అంటె ఏమిటో చూపిస్తుంది .అందులో పులి టిప్పు నే .అతని జండా పై పులి బొమ్మ వుంటుంది
మిస్సైల్స్ కు ,ప్లాస్టిక్ సర్జెరీ కి టిప్పు రాజ్యం లో మంచి పేరుంది .ఇక్కడినుంచే అవి ఇతరదేశాలకు చేరాయట ..వేసవిలో టిప్పు ఇక్కడే మకాం ..
                       తర్వాత లాల్ baagh చేరాం .లంచ్ break  .నేను లోపలి వెళ్లి తెచ్చుకొన్న భోజనం చేశాను .మిగిలిన వాళ్ళు కామత్ హోటెల్ కు వెళ్ళారు .ఒకటవ నెంబర్ gate నుంచి లోపలి వెళ్లాం .పదిరూపాయలు టికెట్ .నేను టికెట్ లేకుండానే లోపలి వెళ్లాను .నన్నెవరు అడగ లేదు కూడా .నడిచి అంతా చూశా. పావురాయిలు బాగా వున్నాయి .వాటికీ ఆహారం వేస్తున్నారు యాత్రీకులు ..నెమ్మదిగా చూసుకొంటూ గుట్టమీద వున్న గోపురం చూశా .ఇట్లాంటివి ఇంకా మూడు ,మూడు వైపులా వున్నాయి .గ్లాస్స్ హుసే వుంది .ఫ్లవర్ క్లోక్ నేలమీద వుంది .నేను చూడ లేదు .రెండవ నెంబర్ gate కు చేరాలి అక్కడికి బస్ వస్తుంది రెండు గంటలకు ..baagh విస్తీర్ణం 240 ఎకరాలు .ఒక రోజూ లో చూడటం కుదరదు .నాలుగు వైపులా దారులున్నాయి .ఇది కేంగెల్ హనుమంతయ్య రోడ్ లో వుంది .ఆయన కర్నాటకకు రెండవ ముఖ్య మంత్రి ..
రెండు గంటలకు వచ్చిన బస్ లో కూర్చున్నాం .సిల్క్ పాలసు కు తీసుకు వెళ్ళాడు .నేను సిల్క్ పైజమా ,లాల్చి 350rs కు కొన్నా,.అక్కడినుంచి విధాన సౌధ ,చిన్నస్వామి క్రికెట్  స్టేడియం ,highcourt ,ఫీల్డ్ మార్షల్ మానెక్షా  పోలీసు పరదే గ్రౌండ్స్ ,కన్నడ రాజకుమార్ ఇళ్ళు ,రామకృష్ణ హెగ్డే , ఎద్యురప్ప ఇళ్ళు వగైరాలన్నీ బస్ నుంచే చూశాం ..ఇక్కడ అనిల్ కుంబ్లే సర్కిల్ ద్రావిడ్ రోడ్ అమితాబ్ సర్కిల్ ,ప్రముఖ violin , విద్వాంసుడు చౌడప్ప స్ట్రీట్ ,చూశాం .ఇక్కడి ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రముఖుల పేర వీధులు ,సెంటర్లు భవనాలు stadiumlu నిర్మించి వారికి ఘన నివాళు లర్పించటం ఆనందం గా వుంది .మన రాష్ట్రం లో రాజీవ్ ,ఇందిరా పేర్లు తప్ప ఇంకోటి పెట్టక పోవటం చరిత్ర క్షమించదు .సిగ్గుతో తల వంచుకోవాలి మనం . ఒక కవి పేర ఒక కళా కారునీ పేర మనం ఏమీ స్మారకాలు పెట్టటం లేదు .వున్నా  చాలా తక్కువే ..వీళ్ళను చూసి మనం నేర్చుకోవాలి ..రాహుల్ ద్రావిడ్ చదివిన సెయింట్ జోసెఫ్ కాలేజి  చూశాం .నూట యాభై ఏళ్ళ చరిత్ర గల కాట్టన్ హై స్కూల్ ,బ్రిగాదియర్ రోడ్ ,ఇమ్పెరియాల్ రోడ్ చూసాము .తర్వాత విశ్వేశ్వరయ్య సైన్సు ,టెక్నాలజీ మ్యూజియం దీని పక్కనే పురా వస్తు ముసియం లను చూసాం .రెండు చూడ తగినవి .పక్కనే కబ్బన్ పార్క్ .చూడలేదు .ఇక్కడ నుంచి మార్త హల్లికి సిటీ బస్ లో వెళ్లాను అక్కడినుంచి ఇంటికి ఆరు గంటలకు చేరా. రోజంతా సరదాగా ,గడిచింది  .ఇదే బెంగళూర్ రౌండ్స్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -07 -11 .–క్యాంపు—bengalur
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–4

వాల్ట్ విట్మన్ —–4
                      ఫ్రీ వెర్సె కు ఆద్యుడై ,తన ప్రయోగాలను విశ్వవ్యాప్తం చేసి ,ఎందరో ఆగామి యువకవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ,కష్టాల కడలి ఈదుతున్నా ,దుఖాల సుడిగుండం లో చిక్కు కున్నా ,చేతిలో చిల్లి గవ్వ నిలవ కున్నా ,చెయ్యి పెట్టిన ప్రతి చోటా విధి వక్రించినా వాల్ట్ విట్మన్ లోని కవితా జ్వాల ఆరలేదు .అను నిత్యం ప్రజ్వలిస్తూనే వుంది .కవితా లహరి ఆగలేదు ,నిత్య శ్రోతస్వినిలా పరుగిడుతూనే వుంది .ఎందరికో ప్రేరణ కల్గించాడు .కవిత్వాన్ని సామాన్యుడి ముందుకు తెచ్చి నిలిపాడు  .అసలైన జాతీయ అమెరికా కవిత్వాన్ని సృష్టించాడు .slang కు నీరాజనాలు ఇచ్చాడు .
               ఆనాటి ప్రముఖ గాయకుల౦దరితో మంచి పరిచయం ఏర్పడింది .beatles  తో పరిచయం ధృఢ౦ అయింది.  వీళ్ళలో ఏదో కొత్తదనం ,అసలైన అమెరికన్ సంగీతం వున్నాయని చెప్పాడు .They are democratic –they wished to be the bard of democracy ” అని beetel సంగీతానికి జేజే లు పలికాడు .
”I sing myself -walt whitman ,an American ,one of the roughs ,a cosmos ”అని పాడుకొన్నాడు .సెక్స్ ను ప్రకృతి సిద్ధమైనది గా , భావించాడు .”Exaggerations will be revenged in human phisiology ”అని హెచ్చరించాడు .””of phisiology from top to toe I sing ”అని  రాశాడు ,అలానే చేశాడు కూడా. దానినే popular pornography అని పిలిచారు .
ఈసడించిన ఎమెర్సన్ మహాశయుడే ”The most extraordinary piece of wit and wisdom that america has yet contributed .I greet you at the beginning of a great career which yet must have a long foreground some where for such a star ”అని మనసార దీవించాడు .ఆల్కాట్ మురిసే పోయాడు .ఆయన్ను అమెరికన్ బార్డ్ అంటే  మహర్షి అని అంతా అన్నారు ఉత్తర దక్షిణాలను, చదువుకొన్న వారినీ ,చదువు లేని వారినీ  సమానం చేసిన మహానీయుడిగా గుర్తించారు .అమెరికన్ జాతి మొత్తాన్ని ఏకీకృతం చేసిన మహాకవి గా ప్రశంశించారు .కాని కొందరు మాత్రం పిచ్చి ఆస్పత్రినుంచి పారిపోయిన పిచ్చోడు  అన్నారు . దయనీయమైన మనో వైకల్యం తో ఉన్నాడని అన్న వారు వున్నారు . .
                       విట్మన్ అవతారం చాలా విచిత్రం గా వుండేది ”rough satyr ,broad shouldered ,gray beard ,wearing a strpped calico jacket over a red flannel shirt and coarse overalls ”ఇదీ అతని వేషం .మన గద్దర్ లాగా ఊహించుకో వచ్చు నేమో . 1857 -59 మధ్య డైలీ టైమ్స్ లో పనిచేశాడు అప్పుడే వ్యభి చారాన్ని చట్ట పరిధి లోకి తేవాలని రాశాడు తర్వాత చాలా చిన్న ఉద్యోగాలు చేశాడు .తండ్రి చనిపోయాడు .వాషింగ్టన్ వార్ హాస్పిటల్ లో నర్స్  గా చేరి పనిచేశాడు .గాయపడిన సైనికులను ఓదార్చే వాడు .600 సార్లు ఆ ఆస్పత్రిని సందర్శించాడు .సహాయ సహకారాలు అందించాడు .దాదాపు లక్ష మంది సైనికులను పలక రించాడు .ఒక కవి ఇలా ప్రజా సేవలో వుండటం అరుదైన విషయం .రాయటం నా వంతు సేవ మీ వంతు అనే లోకం లో ఇది చాలా విడ్డురం గా వుంది కదూ .1865  లో తన యుద్ధ కవితలనుdrum taps పేర వెలువరించాడు .finest poetry produced by the civil war ”గా  పేరు  పొందింది .ఇందులో దేశ భక్తి ప్రతిధ్వనించింది .1873 లో  cerebrial hemorrage   వచ్చింది .గడ్డిపరకలను చివరిసారిగా 1881 లో ప్రచురించాడు .చాల గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత కూడా .    .
                        అబ్రహం లింకన్ మరణం తో చలించి పోయాడు .ఆయనపై అనేక ప్రసంగాలు చేశాడు .andru కార్నెజీ ,జేమ్స్ రుస్సేల్ మార్క్ ట్విన్ వంటి మహామహులంతా విని మెచ్చారు .చాలా వస్తువులు విట్మన్ పేర మార్కెట్ లోకి విడుదల అయాయి .అందులో వాల్ట్ విట్మన్ సిగార్ ,ఒకటి .చాలా దేశాల్లో విట్మన్ societies ఏర్పడ్డాయి .మిక్కి వీధిలో రెండు అంతస్తుల భవనం కొన్నాడు .తన సమాధి నిర్మింప జేసుకొన్నాడు .తన కుటుంబ సభ్యులకు అందులో స్థానం కల్పించాడు .ఇదే ప్రసిద్ధ walt witman tomb ”
                 1881 లో కొత్త కవితలు రాశాడు వీటిని death bed edition అన్నారు ,1891 లో న్యుమోనియా వచ్చింది .అతని ఆత్మ శక్తే అతనికి తోడూ .1892  మార్చ్ 26 న విట్మన్ మహా కవి మరణించాడు .సెక్స్ ను విశాల వేదిక పై చర్చింప జేసిన మొట్ట మొదటి కవి విట్మన్ .
              విట్మన్ సకల కళా వల్లభుడు .థియేటర్ ఆర్ట్ ,శిల్ప కల సంగీతం ,ఫోటోగ్రఫి ,painting మొదలైన కళలో లోతైన అవగాహన వుంది .ఆ కళల్లో నిపుణులైన వారందరితో పరిచయం వుంది  photography afterall was the merging of sight and chemistry of eye and machine of organism and mechanism ముచ్ as American instrument of seeing .no culture was more in love with science and technology than America was and the camera was the perfect emblem of the joining of the human senses to chemistry and physics via machine ”
అని ఫోటోగ్రఫి కళను అద్భుతం గా ఆవిష్కరించాడు విట్మన్ .సాంకేతిక పరిజ్ఞానంలోను ,architecture లోను గొప్ప ప్రవేశం వుంది .1853 లో newyork లో వరల్డ్ ఫెయిర్ జరిగితే వెళ్లి చూసి మురిసి song of exposition గా కవిత రాశాడు .డెమోక్రాటిక్ రాజకీయాలపై మోజుండేది .లిబెరల్ democracy కావాలి అనే వాడు .  చివరగా అతని కవితా పంక్తుల్ని రుచి చూద్దాం
”I raise voice for far superber themes for poets and for art .To exalt the present and the real –To teach the average man the glory of his daily walk and trade ” సామాన్యునికి అందుబాటు లో వున్న సకల విషయాల లోతులు చూడాలి అని భావం .
     reynolds అనే విమర్శకుడు ”walt whitman’s boundless love and inclusive language make his writing attractive and exciting practically all readers ”అని విట్మన్ కవిత్వాన్ని అంచనా వేశాడు .మరువ తగని ,మరువ లేని మహా కవి ,ప్రజా కవి ,అమెరికా హృదయాన్ని ఆవిష్కరింసిన దార్శనికుడు ,మానవతా వాది ,సకల జన హితుడు ,ప్రపంచాన్ని తనలో ,తనలో ప్రపంచాన్ని చూసుకొన్న మాన వీయ మూర్తి వాల్ట్ విట్మన్ .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–3

       వాల్ట్ విట్మన్ —–3
            ప్రజాకవి ,సామాన్యుని కవితలో మాన్యుని చేసిన వాడు ,ప్రజల బాధలు తన బాధలుగా భావించి, వారికి అనధికార శాసన సభ్యుడైన వాడు ,కవితకు కాదేది అనర్హం అని చాటిన వాడు ,అందర్నీ సమానంగా ఆదరించిన వాడు ,అమెరికన్ భాషలో అచ్చమైన కవిత్వం చెప్పి ,ఇది కవిత్వమా అని వెక్కిరించిన వారి చేతనే నిజమైన కవిత్వం ఇదేనని అనిపించుకున్న వాడు వాల్ట్ విట్మన్ .అతని కవితా ప్రవేశం ఎలా జరిగిందో తెలుసు కొన్నాం .ఇక ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం .
                     విట్మన్ 1819may 31 న   అమెరికా లో లాంగ్ ఐలాండ్ వెస్ట్ హిల్స్ గ్రామం లో జన్మించాడు .manhattan కు యాభై  మైళ్ళ దూరం .”Underneath all nativity –I swear I will stand by my own nativity ”అని రాసుకొన్నాడు .తండ్రి ఇంగ్లిష్ ,తల్లి డచ్ .తండ్రి నుంచి ఆంగ్ల మూలాలు ,తల్లినుంచి నిబద్ధత వారసత్వం గా పొందాడు .తండ్రి నుంచి స్వేచ్చగా ఆలోచించటం ,ప్రజాస్వామ్యం మీద సానుభూతి లభించాయి   .తండ్రి వడ్రంగి .జీవితం లో ఆయన ఏమి సాధించ లేదు పాపం .కుటుంబం brooklyn  చేరింది .ఏడు ఇళ్ళు కొన్నాడు తండ్రి .దేన్నీ నిలుపుకో లేదు .అప్పుడది అమెరికా లో నాల్గవ పెద్ద నగరం .ఇరవై ఎనిమిదేళ్ళు ఇక్కడే మన కవి జీవితం గడి పాడు .పూర్తి గ్రామీణ వాతావరణ మైన island కు నగరవాసనలు వెదజల్లే మన్హట్టన్ కు బ్రూక్ల్లిన్ మధ్యలో వుంది .మట్టిరోడ్లు ,చెత్త చెదారం ,పందులు ,కోల్లతో భీభత్స౦ గా వుండేది . ఫెర్రి సాయం తో మన్హట్టన్ కు చేరాలి .
              విప్లవ నాయకుడు Marquis De Lafayetti 1825 lo ఇక్కడికి  వచ్చాడు అప్పటికి వాల్ట్ వయసు ఆరు  . ఆ హీరో ఈ చిట్టి కవిని ఎత్తుకొని ముద్దాడిన సంఘటన ఈయనకు బాగా జ్ఞాపకం వుంది . అప్పుడు quaker ఉద్యమం బాగా వుంది .deism ఉద్యమము సమాంతరంగా నడుస్తోంది .వీళ్ళకు దైవభక్తి .విట్మన్ క్వేకర్ ఉద్యమం ఇష్టమైంది . inspired voice of the self ”. అంటె ఇష్టం ఏర్పడింది .దీనికి గ్రంధాలు ,వాక్యాలు అక్కర్లేదు .పదకొండేళ్ళకే చదువుకు గంట కొట్టి బ్ర్రోక్లిన్ లో ఒక లాయర్ దగ్గర బాయ్ గా చేరాడు .1831  లో  samuel క్లెమెంట్స్ వద్ద సహాయకుడిగా చేరాడు .ఆయన లాంగ్ island అనే వార పత్రికకు ఎడిటర్ .అందులో ప్రింటర్ గా పని చేశాడు .జార్జి వాషింగ్టన్ .జెఫెర్సన్ లను స్వయం గా చూశాడు . ,
1932 లో  అక్కడ కలరా బాగా వ్యాపించింది మళ్ళీ కుటుంబం వెస్ట్ హిల్స్ కు మారింది .లాంగ్ island పేపర్ కు కంపోజర్ గా పని చేశాడు .కొంతకాలం స్కూల్ టీచర్ గా చేశాడు .స్థిర సంపాదన లేదు .స్వంత వీక్లీ ”లాంగ్ islaander ”పత్రిక నడిపాడు .ఇంటింటికి తిరిగి పత్రిక అమ్మే వాడు .వారం లో 38 మైళ్ళు తిరగాల్సి వచ్చేది .తర్వాత జమైకా లో టైపు సెట్టర్ అయాడులాంగ్ islaand డెమొక్రాట్ పేపర్ కు .అదీ అచ్చిరాలేదు మళ్ళీ టీచర్ అయాడు విసుగుతో తన్ను ”miserable kind of dog ”అనుకొన్నాడు తర్వాత రెండు మూడు పేపర్ లలో పని చేశాడు .ఏది కలిసి రాలేదు .
baffalo లో ఫ్రీ soil  పార్టీ కి ప్రచారం చేశాడు .దాని ఆదర్శం ”free soil ,free speech ,free labour ,and free men ” .బానిసత్వం పోవాలని ఇంకా దేశం లో బానిసలు ఉండరాదని ప్రచారం .మళ్ళీ బ్ర్రోక్లిన్ ఫ్రీమన్ పేపర్ పెట్టి నడిపాడు .పేపర్ ఆఫీసు తగలడింది .ఆ తర్వాత ఆ పార్టీ కూడా ఎన్నికలలో  ఓడి తగలడింది .
                    1848 లో చిన్న దుకాణం తెరిచాడు .పెన్సిళ్ళు ,పెన్నులు అమ్మాడు .1849 లో ‘the newyork డైలీ news పేపర్ నడిపి ఒక పెన్ని కే పేపర్ అమ్మాడు .ఆర్ధికం గా నష్టపోయి లేపేశాడు .
                      1850 లో తిరుగు బాటు కవిత్వం leaves of grass రాయటం ప్రారంభించాడు .అదే ఆధునిక వచన కవిత్వానికి నాంది అయింది దీన్నే ఫ్రీ వెర్సె అంటారు .లాంగ్ island sketches రాశాడు .బ్ర్రోక్లిన్ ఆర్ట్ యునియన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నిక అయాడు . materialistic age లో . easthetic sense తెచ్చాడు వ్యాపారం చేద్దామని తండ్రి లాగా ఇళ్ళు కోని అమ్మాడు .నెత్తిన టోపియే మిగిలింది .అప్పటికే కవిత్వం లో మంచి పరిపక్వత సాధించాడు .  ”marvelously innovative poet ”అనిపించుకొన్నాడు .”most revoluutionary and inspired poet ”అని ముద్ర పడింది  పుస్తక౦ 1855 లో  వెలువడింది . .అప్పుడు దేశం లో వున్న లంచగొండి తనానికి చలించి పోయాడు ఇవాల్టి మన అన్న హజారే లాగ .the 18th president అన్న కవితలో రాజకీయ నాయకులను చిట్టెలుకలు ,maggots తో పోల్చాడు .వీటి వల్ల జనం లో ఏకీ భావన కలిగించాడు .boy ని b hoy అనేవాడు ,రాసే వాడు .అది అక్కడి మాండలీకం .అలాగే girl న g hal అని రాసేవాడు ఇప్పుడు భోయ్ అనీ గాళ్ అనటం అతను నేర్పిన విద్యే .vitman is the bower bhoy in literature ”అని  అమెరికన్స్ .   మురిసి   పోయారు
విట్మన్ ను ”cultural verniloquil .He was poetically enacting the kind of performances that he witnessed among Americanactors and singers ‘అని ప్రశంసించారు .అదే చివరికి అమెరికన్ స్టైల్ అయింది .అభినయించేవాడికి ,ప్రేక్షకుడికి మధ్య అడ్డు గోడ తొలగి పోయింది .దీనినే అమెరికా ప్రజలు విపరీతం గా ఇష్ట పడ్డారు .తమదైన ,స్వదేశీ భావన భాషా వ్యక్తీకరణ ఇన్నాళ్ళకు లభించిందని ఎంతో పొంగి పోయారు ఇంకో పక్క మార్క్ ట్వైన్ వచనం లో పూర్తి nativity  తెచ్చాడు ఇద్దరు నిజమైన అమెరికన్ సాహిత్యాన్ని సృష్టించి జన నీరాజనాలు అందుకొన్నారు .తాము ఏమిటో ఇన్నేళ్ళకు అమెరికా ప్రజలు తెలుసు కోనేట్లు చేసిన మార్గ దర్సులు వాల్ట్ విత్మాన్,మార్క్ ట్వైన్…’అతను ఒక spontaneous actor ,;.ఫెర్రి బోటు మీద కూర్చోని,బస్సుల్లో తిరుగుతూ shakespeare  కవితలను అలవోకగా చదివి జనానికి వినిపించే వాడు విట్మన్ .
”I do not ask the wounded person how  he feels –,I my self become the wounded person ”అని జనం తో ,వారి భావాలతో మమేకం అయిన అసాధారణ ప్రజా కవి ,వై తాళికుడు వాల్ట్ విట్మన్ ..
మరిన్ని విశేషాలు మరో సారి అందిస్తాను
                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | 2 Comments

సాహితి మండలి 257 వ సమావేశము

Posted in సభలు సమావేశాలు | Leave a comment

వాల్ట్ విట్మన్—2

    వాల్ట్ విట్మన్—2
                వాల్ట్ విట్మన్ బానిసత్వాన్ని ద్వేషించాడు .equilibrium కావాలి అన్నాడు .అది కూడా స్నేహపూర్వకం గా వుండాలి .ఇక్కడే ఒక చక్కని కవిత రాశాడు ”I am the poet of slaves and of the master of the slaves —-I go with the slaves of the earth equally with the masters —and i will stand between the masters and the slaves —Entering into both so that both shall understood me alike ”అని తన  మనసును  బయట   పెట్టాడు .
”I”అనటం విట్మన్ తో నే అమెరికన్ కవిత్వం లో ప్రారంభ మైంది .జనం తో మమైక్యం చెందిన భావన   . కలిగించాడు
అందుకే ”  he cultivated superb   calm character to meliorate personal upheavals ” అని ప్రశంసలు పొందాడు .తన ముఖ్య కార్యక్రమం “”great contribution of the New BIble ”అని ప్రకటించాడు .జేమ్స్ రాజు కొత్త bible రాసినట్లు ,తానూ కొత్త నీరు తేవాలని భావించాడు .అందుకనే తన గడ్డిపరకలు అనే కవితా సంపుటిలో ”read these leaves in the open air season of every year of your life of all nations
and specially tou.s. poets most need poets –since political leaders were failing miserably to hold the nation to gether ,poets alone held the key to social cohesion .The presidents shall not be their common refery so much as their poets shall .The poet is the orbitrator of the diverse and he is the key .He is the eqallizer of the age and land he supplies what wants supplying and checks what wants checking .”అని కవికి వున్న సామాజిక బాధ్యతను గుర్తు చేశాడు .ప్రజా సమస్యల్ని కవులు చాలా ప్రతిభావంతం గా పాకులాడి దృష్టికి తేగలరు అని ఆయన భావన .
   అతని గడ్డిపరకలు కవిత్వం లో ప్రజాస్వామ్య ద్రుష్టి ముందు చూపు వున్నాయి .అందుకే సామాజిక ,వర్గ ,మత ,సెక్స్ ,వగైరా లకున్న అడ్డంకులను సవాలు చేశాడు .అంతకు ముందెవ్వరు వీటిపై ద్రుష్టి పెట్ట లేదు .ఇతనే ఆద్యుడు .1950లో   మాత్రమే సాంఘిక అడ్డంకుల్ని తొలగించింది అమెరికన్ ప్రభుత్వం .అంతే విట్మన్ కవి ప్రభుత్వానికి మార్గ దర్శనం చేశాడు అని తెలుస్తోంది. అతనికి పూర్తి సమానత్వం కావాలి .అదే ఆయన ధ్యేయం .అతనిలో దక్షిణ ,ఉత్తర ప్రాంత జనులు ఒక్కటే అందుకే అందరిని దృష్టిలో పెట్టుకొనే ”నేను ”అని అందరిని సమాన భావనతో చూశాడు ..
                       నేటివ్ అమెరికన్స్ పై portraits వేశాడు ..ఆ మధ్యనే వచ్చిన యురోపియన్ల పైన ,ఆఫ్రికన్ అమెరికన్ ల పైన వేశాడు .తనను బానిస గా భావించు కొన్నాడు .”I am the hounded slave —I wine at the bite of dogs –Helland despair are up on me ”అని వాళ్ల బాధ తన బాధ గా చెప్పుకొన్నాడు .ఇదే మన శ్రీ శ్రీ కి ఆదర్శం అయింది .కవితామయ స్వర్గాన్ని ఊహించాడు (ఉటోపియా )అందులో ధనవంతులు ,పేదలు ,అధికారులు ,సామాన్యులు అందరు అన్యోన్యం గా వుండాలి ఇదే democratic I”’.  సాంగ్ అఫ్ మై సెల్ఫ్ కవితలో ”of every hue and trade and rank ,of every caste ,and religion –Not merely of the New World but of Africa ,Europe or Asia  a wandering savage —A farmer ,a mechanist or artist ,a gentleman ,sailor ,lover or quaker ”అందరు ,అన్ని దేశాల వాళ్ళు ,అన్ని వృత్తుల వాళ్ళు తన వాళ్ళే నన్నారు .దీన్నే శ్రీ శ్రీకుమ్మరి కమ్మరి   , దాగలి గొడ్డలికట్టీ సుత్తీ  సమస్త వృత్తుల వాళ్ళు తన వాళ్ళే నన్నాడు .
శ్రీకి ప్రేరణ విట్మన్. .తనను పిట్టలదోరగా ,న్యాయవాదిగా వైద్యునిగా మతాదికారిగా పోల్చుకొన్నాడు .
                      తనను చూసి అమెరికా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని నేర్చుకోవాలని ఆశ పడ్డాడు . ”  The proof of the poet is that his country absorbs him as affectionately as he has absorbed ”అని నమ్మాడు .కవి తన దేశం తో మమైక మయినట్లు దేశం కూడా కవిలో అయిక్యమవ్వాలని అతని సుందరస్వప్నం అతను ఆశించి నట్లే అది నెరవేరింది .ఎమెర్సన్ ,రోసేట్టే ,స్విన్బర్న్ ,మొదలైన వారు ముందుగా ,విట్మన్ ను అర్ధం చేసుకో లేక పోయినా ఇప్పుడు పూర్తిగా మారి అతని కవిత్వానికి పట్టాభి షేకం చేయటం మొదలు పెట్టారు .అరచేతితో సూర్యుని తేజాన్ని ఆపలేము అని తెలుసు కొన్నారు .””I greet you at the beginning of a great career ”అన్నాడు ఎమెర్సన్ .”Your poetry has the best merits ,namely of fortifying and encouraging ”అనీ అన్నాడాయన
                      మిగిలిన వారు ”It had attemppted to abolish all narrowness of vision ,immediately became subject to narrow interpretations .his begign qualities are very exemplary ”అని కితాబు ఇచ్చారు .గుడ్ గ్రే పోఎట్ అని ప్రశంసించారు .
‘                లింకన్ అంతే వీర అభిమానం విట్మన్ కు .రోజూ ప్రెసిడెంట్ లింకన్ ఆఫీసు కు వెళ్ళటం చూశే వాడు .లి౦కన్ ను హోం spun అని ,కెప్టెన్ అనీ గొప్పగా ఆరాధించేవాడు .”captain o captain ”అని లింకన్ పై అద్భుతమైన కవిత రాసి తన భక్తిని ఆరాధనా భావాన్ని వ్యక్త పరిచాడు .
race and caste విషయం లో conservative stand తీసుకొన్నాడు .
Witman is the master of language experimentation అని పేరు పొందాడు .తన కవిత్వం గురించి ”No one can know leaves of grass who  judges it piecemeal ,–do not take the trouble to examine what they started out to criticize ,to judge a man from his own stand point ,to even find out what that stand point is ”అని  విస్శ్లేషించాడు  .ఇది స్వంత     డబ్బా  కాడు    .స్వయం  వ్యక్తీకరణ  మాత్రమే .
                మరిన్ని జీవిత విశేషాలు ఇంకో saari
                             మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -07 -11 క్యాంపు బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —-1

    వాల్ట్ విట్మన్ —-1

అమెరికన్ కవిత్వాన్ని ఇంగ్లేష్ వాళ్ల బారి నుంచి కాపాడి కొత్త ఆలోచనలతో ,కొత్త పదబంధాలతో చ౦ధస్సుని వదిలి  సామాన్య మానవుడిని ,కార్మిక, కర్షక ,బడుగు జీవుల జీవితాలను కవిత్వం లో చిత్రించి ,అమెరికన్ కవిత్వాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన కవి ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .అందుకనే ఆయన్ను America’s most beloved and influential writer  అన్నారు .radical democratic inclusiveness to literature తెచ్చిన ఘనత విట్మన్ దితన విశేష వ్యక్తిత్వం తో ‘The diverse ,pedestrian images of హిస్ చుల్తురె  into soaring ,fresh  poetry ” లోకి మార్పించాడు..ఆధునిక కవులకు మార్గదర్శనం చేశాడు ,సృజనాత్మకత తో ప్రయోగాలతో సాంఘిక అసమానత్వాలను కవిత్వీకరించాడు .అంతకు ముందు సాహిత్యం లో వీరికి స్థానమే లేదు .అదో జగత్ సహోదరుల జీవితావిష్కరణ చేఇన మానవతా వాది .కవిత్వం వరదలా జాలు వారుతుంది .ఆయనది వచనం తో కూడిన కవిత్వం .ఛందస్సు , దూరం చేశాడు .సహజ సిద్ధం గా కవిత్వం చెప్పాడు .పాత   అలంకారాలకు  స్వస్తి చెప్పాడు .లోకాన్ని కొత్త తరహాలో ,కొత్త కోణం లో ఆవిష్కరించి ,కవిత్వాన్ని భూమార్గం పట్టించిన ప్రజా కవి అని పించుకున్నాడు . . rhythemic of voice and feeling ను తెచ్చాడు .                    1885 లో ఆయన మొదటి రచనలు ప్రచురించాడు .అదే leaves of grass   .అంటె గడ్డి పరకలు .దీన్ని చూసిన అమెరికన్ మేధావి తోరో జంతువులూ మాట్లాడే భాష లాగా వుందని ఈసడించాడు .అంతే కాదు America ‘స్ గ్రే poet అన్నాడు .అతని కవిత్వాన్ని boston నగరం నిషేధించింది. అక్కడ వున్న ఎమెర్సన్ మహాశయుడు కూడా మెచ్చలేదు .బోస్టన్  లో నిషేధానికి గురి అయితే ఆ కాలం లో అదో గొప్ప ..ఆకాలం లో underware గురించి నగ్నత్వం గురించి రాసే వాళ్ళు కాదు .musiyam లో వున్న  నగ్న శిల్పాలకు బట్టలు కప్పిన కాలమ్ అది .అయితే విట్మన్ తన కవితలో ఇరవై ఎనిమిది మంది నగ్న స్త్రీ లను నదిలో స్నానం చేస్తున్న వారిని కవిత్వం లో నింపాడు .”Thruster holding me tight and that i hold tight –we hurt each other as the bride groom and the bride hurt each other ”  అని  రాస్తే ఎవరు అర్ధం చేసుకో లేక పోయారు .సెక్స్ ను ఇంత బహిరంగం గా ఇంత వరకు ఎవరు రాయ లేదు .అయితే విట్మన్ ది మోనో sexuality కాదు .ద్విలింగ సంపర్కానికే ప్రాధాన్యత నిచ్చాడు .తన కవిత్వాన్ని అంచనా వేయ టానికి ” The world’s current times and deeds and their spirit ,must first be ,profoundly estimated ”   అని లోకానికి సత్తా వుంటే త్నకవిత్వం అర్ధమవుతుందని సవాలు చేసి చెప్పాడు .  వర్తమానం తో కవి తాదాత్మ్యత చెందక పొతే అతను దారి తప్పినట్లే అంటాడు .అందుకానే అతని రచనలు అన్నీ ”The age tranfigured ”   గానే వుంటాయి .19 శతాబ్దపు విషయాలన్నీ కవిత్వీకరించాడు .అప్పుడు 1850  నడుస్తోంది అంతర్యుద్ధ కాలమ్ .దేశం అంతా అవినీతి ,లంచగొండి తనం పుచ్చిపోయింది .ఇవాల్టి మన దేశం లానే ..ఆనాటి   అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాన్క్లిన్ పిఎర్స్ .గురించి ”The president eats dirt and excrement for his daily meals ,–likes it and tries to force it on the states ”  అని ఏమాత్రం  భయపడ కుండా కవిగా తన బాధ్యత నెరవేర్చాడు .ప్రజావాణిని తన గొంతులో పలికించాడు .అందుకని దేశంలోని మంచి చెడ్డ న్యాయం ,అన్యాయం కవిత్వం లో రూపు దాల్చాడని భావించాడు .ఇవన్నీ కవిత అనే పాత్రలోమార్పు పొందాలన్నాడు .  .దీనికోసం ఉద్యమం రావాలని కోరాడు .ప్రశ్నించటం ,పరీక్షించటం ,విసర్జించటం రావాలి అని కోరాడు ..ఆడవారి హక్కుల పోరాటం లో ఆయన పాల్గొన లేదు .ఫ్రీ లవ్ ను ప్రోచ్చహించినా ఆ ఉద్యమం లో లేడు ..fourst. socialism లోను  లేడు .దీనినే working class radical movement  అంటారు .కమ్యునిస్టు లతో  దోస్తీ ల్లేదు .anaarchism లోను సభ్యుడు కాదు .,కార్య కర్త కాడు .”be radical ,be radical -be not too damned radical ”  అతని సిద్ధాతంఅని విమర్శకులు ఎద్దేవా చేశారు .రాసేదంతా వాళ్ల గురించి కాని వాళ్ల హక్కుల పోరాటం లో పాల్గొన నందుకు అతన్ని ప్రశ్నించారు .Eccessive radicalism  విట్మన్ కు ఇష్టం లెదు . వాళ్ళు వివాహాన్ని legalised prostitution ”  అన్నారు .అది విట్మన్ కు నచ్చ లెదు .ఆయనది ”definite convservative streak ”.extreemes  కు వెళ్ళడు .మధ్యే మార్గం ఆయనకు చాలా ఇష్టం .homo sexuality కి వ్యతిరేకి .తనను గురించి ”The equable man who could handle all things grotesque or accentric ” గా అభివర్ణించుకొన్నాడు అతను ఒక legend .అతన్ని గురించి ఎ౦త చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా వుంటుంది ఇంతటి తో ప్రస్తుతం ఆపు తున్నాను మళ్ళీ  తరువాత  వివరిస్తాను
   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -07 -11 .క్యాంపు –బెంగళూర్

వివాహ వ్యవస్థను ప్రోత్సహించాడు .conventional marriages ను వద్దు అనే ఫ్రీ లవ్ ఉద్యమం తో జత కట్ట లేదు .

Posted in రచనలు | Leave a comment

మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు

మరిన్ని స్టీన్  బెక్ స్మృతులు
                 జాన్ స్టీన్ బెక్ రచనల వైవిధ్యం ,నాణ్యత ,సంక్లిష్టతలను అంచనా వేయటానికి ఒక చట్రంలో కుదించటం   సాధ్యం కాదు అని విమర్శకులు చేతులెత్తేశారు .ఆయన తన పశ్చిమ తీర ప్రాంత స్వగ్రామం నుంచి ,తూర్పు తీర మెట్రో పోలిస్ వరకు పయనం సాగించాడు .non  fiction  ఆయనుకు ఇంకో దారి .The grape wrath  తో అంతర్జాతీయ ప్రముఖ రచయిత అయాడు .దీనితో పాటు తన దైన స్వంత సంస్కృతీ కి out cast గా   మారాడు  .అతని రచనలన్నీ ఒక విధం గా ఆయన స్వీయ చరిత్రలే .1930 లో కాలిఫోర్నియా కు వలస వచ్చిన వారి జీవిత ఆటు పోట్లను ,దైన్యాన్ని ,తన రచనలలో ప్రతిబి౦బిచాడు .
   గుల్ఫ్ అఫ్ కాలిఫోర్నియా ను the  sea of cortez అంటారు ..దాన్ని క్షు౦డ౦ గా పరిశోధించాడు అంటే expedition చేశాడు .సముద్ర జీవులను స్పెసిమెన్ గా సేకరించటానికి తన స్నేహితుడు ఎడ్ రికెట్స్ కు చాలా ధన సహాయం చేశాడు .కొంత కాలమ్ లండన్ లో war time accounts   చూశాడు .యుద్ధం లో తాను చూసిన భీభత్సానికి depress  అయాడుకూడా .1947 లో రష్యా వెళ్ళాలని అనుకొన్నాడు .దీనిని తన అంతర్జాతీయ అవగాహన పెంచుకోవటానికి తోడ్పడుతుందని బావించాడు .దురదృష్ట వశాత్తు తన ముఖ్య స్నేహితుడు ,తోటి జీవావరణ శాస్త్రవేత్త రికెట్స్ మరణం అకస్మాత్తుగా సంభవించటం తో వెళ్ళ లేక పోయాడు .వివాహ సమస్యలు అతన్ని కదల నివ్వ లేదు .అప్పటి మెక్సికోrevolutionary  నాయకుడు Emiliyano Zapta పై సమగ్ర పరిశోధన చేసి ప్రచురించాడు   .ఆయన పై తీసిన సినిమా కు స్క్రిప్ట్ కూడా రాశాడుబెక్ ..
                        తాను నివశించిన సాలీనా వాలీ గురించి  East of Eden రాశాడు .ఇందులో తన తల్లి వంశం గురించి తన బాల్యం గురించి వివరం గా రాశాడు .ఇది అంతగా ఆదరణ పొందలేదు .1961  లో The winter of our discontent రాశాడు న్యూయార్క్ జీవితం లోని fictional   సెట్టింగ్ గా దీన్ని రాశాడు .1962 లో జాన్ స్టీన్ బెక్ కు నోబెల్ బహుమతి లభించింది .అప్పుడే Travels with Charley  in search of America   రాశాడు బాగా అమ్ముడయింది .1966 లో అమెరికా అండ్ అమెరికన్స్ పుస్తకం రాశాడు .తర్వాత లెటర్స్త   టు అలీసియ రాశాడు  .    .
           టెన్నిసన్ కవి ”All experience is an arch where through gleams that un travelled world whose margin fades -for ever and for ever when i move ”అని చెప్పినట్లే బెక్ జీవితం కూడా సాగినట్లు అనిపిస్తున్నది .
                       ఇదీ మహా రచయిత ,నోబెల్ పురస్కార గ్రహీత జాన్ స్టీన్ బెక్ గురించి న మరిన్ని జ్ఞాపకాలు .
                                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -07 -11 క్యాంపు బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.

         వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.
               తమిళ నాడు లో మధురై లో అరవింద్ కాంతి ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్. గోవిందప్ప వెంకట స్వామి dr .v గా జగత్ ప్రసిద్ధుడు .లక్షలాది కాంతి శస్త్ర చికిత్సలు చేశాడు .84..ఏళ్ళ వయసు .యువకుడు గా ఉన్నప్పుడే rhumatic arthitis వచ్చి వెళ్ళు స్వాధీనం తప్పాయి .పెన్ను కూడా పట్టుకోలేని స్థితి .determination,conventionalwisdom  తో జయించాడు .అతి సున్నిత మైన కంటి శాస్త్ర చికిత్సా నిపుణిడిగా స్థిర పడ్డాడు .అదే అద్భుతం .రోజుకు వంద cateract  ఆపరేషన్ లు చేస్తాడు .కొన్నెల్ల కిందటనే లక్ష పూర్తి చేశాడు .
                    భారత దేశం లో పద్నాలుగు మిలియన్ల గుడ్డి వారు వున్నారని అంచనా .ప్రపంచం లోని వారిలో ఇది సగం శాతం .ఇందులో 80 శాతం cataract  తో బాధ పడుతున్నారు .ఇది నయం చేయ గల వ్యాదియే .”No one should be blind if it can be helped -just as we have eradicated other global health problems like polio ,that were once common .We can eliminate blindness .We can do it now .” అని ఆయన పూర్తి నమ్మకం .
         ఆయన శ్రీ అరవిందుల శిష్యుడు .అరవి౦దాశ్రమాన్ని చాల సార్లు సందర్శించాడు .గాంధి గారి ప్రభావం అరవిందుల ప్రభావం ఆయనపై చాలా వుంది .అరవి౦దులను అనేక సార్లు దర్శించి దివ్య .అనుభూతి పొందాడు  .అరవి౦దులలో special radiation   వుందని భావించాడు ..ఆయన లో దివ్య శక్తి ప్రవేశించిందని భావించాడు .అది లసేర్ లో వ్యాప్తి చెంది గుడ్డితనాన్ని పోగొట్టింది .”   I found that the more I worked for this goal ,the more help I got ”  అంటాడాయన 1976 లో రిటైర్ అయాడు మధురై మెడికల్ కాలేజీ నుంచి యాభై ఎనిమిదేళ్ళు నిండిన తర్వాత ..అప్పుడే అరవింద్ ఇన్ స్టిట్యూట్  స్థాపించాడు .చేతిలో పెద్దగా ధనం లేదు .కాని పదకొండు పడకలు,ముగ్గురు డాక్టర్స్ వున్నారు .ఇప్పుడే పని ప్రారంభం అయింది అంటారు ఆయన .
                 యాభై ఏళ్లుగా వైద్య వ్రుత్తి లో వున్నాడు .ఇప్పటికి ఆ ఆస్పత్రి ”ది వరల్డ్ ‘స BUSIEST EYE హాస్పిటల్ .ఏడాదికి రెండు లక్షల ఆపరేషన్లు ఇక్కడ జరుగు తాయి .1500 మొబైల్ EYE కాంపస్ నిర్వ హించారు పల్లె టూళ్ళల్లో.నేపాల్ ,బంగ్లాదేశ్, కంబోడియా దేశాల్లో ను వేటిని నిర్వహించారు .”మధు మేహాన్ని తరిమి గొట్టటమే తన ధ్యేయం గా చెప్పారు .అది తన SPIRITUAL PRACTICE ” అని ప్రకటించాడు .అత్యన్నత మైన వైద్యం ఇక్కడ అందుతుంది .చాల చాల తక్కువ ఖర్చుతో వైద్య సేవలు ఇక్కడ దొరుకు తాయి అమెరికా లోని కంటి ఆస్పత్రుల కంటే ఇక్కడికే చాలా ఎక్కువ మంది వస్తారు ..
డాక్టర్ వి. గారిది రాబిన్హుడ్ తరహా .అరవై శాతం మంది పేదలకు ఉచితం గా వైద్యం చేస్తారు .PAYING   PATIENTS  ఇచ్చే దాంట్లో SUBSIDISED గా పేదలకు ఉచితం గా చేస్తాడు .ఏ.సి .రూముల్లోనే ఆపరేషన్ జరుగు తుంది .ఉచితం గా కళ్ళ జోడులు ఇస్తారు కూడా .మక్ డోనాల్డ్  ఆయనకు ఇంకో ఆదర్శం .GOOD ,CHEAP ,REPRODUCTIVE SERVICE ఇవ్వటం ఆయనకు ఇష్టం .డాక్టర్ వి .పది డాలర్స్ కే ఆపరేషన్ చేస్తారు .అదే అమెరికా ,ఆస్పత్రుల్లో కనీసం 1500 డాలర్లు అవుతుంది కంటి ఆపరేషన్ కు .అందుకే ఆయన్ను దేవుడి గా భావిస్తారు . .ఆయనకు INTERNATIONAL LIONS CLUB . సహకారం పూర్తిగా లభిస్తుంది .
ఆయన నిర్వహించే ఆరో లాబ్ లో అతి తక్కువ ఖర్చుతో శాస్త్ర చికిత్చ చేసే పరికరాలు అతి నాణ్యమైనవి తయారు చేస్తారు .మందులు కూడా చాలా చవక ధరలకే అందేట్లు తయారు చేస్తారు .ఇదీ ఇక్కడి ప్రత్యేకత .ఇతర దేశాల్లో ఇవి కొనాలంటే కళ్ళు తిరిగి పోయే రెట్లుంటాయి .”WITHOUT ADMINISTRATORS ,DOCTORS HAVE TO MANAGE ,A BUSINESS WHEN THEY COULD BE ELIMINATING BLINDNESS ”అనే భావన ఆయనది .ఇక్కడ అందరు అంకిత భావం తో ,సేవా దృక్పధం తో పని చేస్తారు .ఇదే అరబిందో సంస్క్రతి .ఆయనలో spiritual ,and material    goals మిళితమై వున్నాయి .ఆయన దృష్టిలో కంటి శాస్త్ర చికిత్చ చాలా తేలిక అయితే పేషెంట్ ను ఆస్పత్రికి రప్పించటమే కష్టం అంటారు . indian spirituality and western know how ను మిళితం చేసి కు గది వుంటుంది .విజయం సాధించిన వీరుడు ఆయన .ప్రతి గదిలో అరవిందుల ఫోటో వుంటుంది .meditation కు ప్రత్యెక గది వుంటుంది .meditation అంటే భగవంతునితో మౌన సంభాషణ అని  ఆయన భావం .తాను ఎప్పుడు a etter tool ,a receptacle for the divine force ”గా వుండాలని అనుకుంటాడు మనమంతా అంకిత భావం తో పూర్తి దృష్టిని కేంద్రీకరించి పని చేయాలని సలహా నిస్తారు ”you work on your work ,then ,supernatural consciousness works through you ”.అనే నమ్మిక.ఆయనది
                    ఆయన వివాహం చేసుకో లేదు .ఆయన కుటుంబం లోనే డజనుకు పైగా డాక్టర్స్ వున్నారు .మానవ సేవలో నే మాధవ సేవ వుంది .విడిగా దేవుని సేవ చేయాల్సిన పని లేదు అన్తారాయన్ .అయితే చాలా ఉదారంగా ,స్వార్ధ రహితం గా ప్రవర్తించి పని చేయాలి .అదే భగవంతునికి ఇష్టం అంటారు కూడా ..ఎవరైనా ఆయన ఎదుట aayana సేవలను పొగుడుతూ వుంటే తేలిగ్గా నవ్వేసి ”I just want to eliminate the world ‘s  blindness ”   అని ఊరుకుంటారు ..that is డాక్టర్ వి.అంటే గోవిందప్ప వెంకట స్వామి . ఆ ద్రుష్టి ప్రదాతకు వందనం ,అభి వందనం ..ఇలాంటి వారు ఉండ బట్టే ధర్మం ఇంకా భూమి మెడ నిలిచి వుంది

ఆంద్ర దేశం లో తెనాలికి చెందిన వెంపటి సూర్య నారాయణ గారికి కూడా ఇంతటి పేరు ప్రఖ్యాతులున్నాయని మనకు తెలుసు .ఆయనా ఎందరికో ఉచిత కంటి ఆపరేషన్ లు నిర్వహించారని విన్నాం.eye camps నిర్వహించి పేదల పాలిటి పెన్నిధి గా కీర్తి పొందారు .డాక్టర్ శివా రెడ్డి గారికీ ఇంతటి     పేరుందనివిన్నాను .ఎందరో మహానుభావులు .వీరందరికీ వంద నాలు .

      మీ —గబ్బిట దుర్గా ప్రసాద్  —-13 -07 -11 –క్యాంపు –బెంగళూర్   .
Posted in రచనలు | 1 Comment

జాన్ స్టీన్ బెక్ —-2

            జాన్ స్టీన్ బెక్    —-2
—               స్టీన్ బెక్ పుస్తకాల అమ్మకం క్రమంగా తగ్గగానే మెక్సికొ కు వెళ్ళాడు . కాలిఫోర్నియా కు తిరిగి రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత .”it is not my country any more ”అనీ అన్నాడు .ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country  అయి ఆరాధనా స్థలం అవటం విశేషం .
        Juvaan de fuca strait చాలా భయంకరమైనది .దీన్ని grave yard of pasific అంటారు ,.valanicia అనే ఓడ  1906  లో సాన్ fraanisco నుంచి నూట యాభై నలుగురితో బయల్దేరి తీరానికి ఇరవై గజాలు దూరం ఉండగానే మునిగి పోయింది 117 ” మంది చనిపోయారు .దీని తర్వాతే టైటానిక్ ఆరు ఏళ్ళు తర్వాత మునిగింది .
            స్టీన్ బెక్ ,రికెట్స్ కలిసి princes norah ship లో discovery కి బయల్దేరారు .పసిఫిక్ 75 మిలియన్  చదరపు మైళ్ళుంటుంది .భూమిని మూడొంతులు కప్పి వేసేంత అన్న మాట . అట్లాంటిక్ కు రెండు రెట్లుంది పసిఫిక్ .దీనికి సౌత్ సి అనే పేరుంది .
స్టీన్ బెక్ ఎక్కువ గా యుద్ధ నవలలు రాశాడు .కానీ సైనికుల కోరిక మేరకు యుద్ధం సమస్య లేకుండా”” కాన్నేరి రో  ”వాళ్ల కోసమే రాసాడు .”where men hungering for love destroy every thing lovable about them ”అని రాశాడు .ఈ నవల ఆయన idyll అంటారు .దాన్ని ”a dream that does not and could not exist ”అన్నాడు ”it is  an   imaginary  respite ఇన్ ఆ వరల్డ్ అఫ్ వార్ ”’అన్నాడు  .1945  లో  ఈ భావాలను escapism. గా భావించారు కొంతమంది . అందుకే పుస్తకాల అమ్మకాలు తగ్గాయి .రికెట్స్ పేర పది హీను ,స్టీన్ బెక్ పేర నాలుగు స్పెసిమెన్ కు తర్వాత పేరు పెట్టారు . lampenyactus  Stein beckiyaa ‘ . అన్నది  long fin lamp fish ను బెక్ కాలిఫోర్నియా లో కనుక్కున్నాడు .1939   లో rolf bolin ను గుర్తించాడు  ఇలాగే మిగిలినవి కూడా .
               జర్మని మేధావి ,రచయిత వేదాంతి గోథె  రాసిన ”Rest not !life is sweeping by –go and dare before you die —something mighty and sublime –leave behind to conquer time ”అని fraust లో రాసిన మాటలు రికెట్స్కు కు  బాగా   ఇష్టం అన్నాడు బెక్ .రికెట్స్ కు రోడ్ ఆక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదం గా వున్నప్పుడు ఒంటరిగా అతని లాబ్ లో ఉండలేక    రఘు ప్రసాద్ అనే marine విద్యార్ధిని తోడూ గా ”స్టెయిన్ బెచ్క్ వుంచుకున్నాడు .బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చినపుడు న్యూ యార్క్ టైం పత్రిక కూడా ఏమీ ప్రాధాన్యత నివ్వ లేదు .అతని జీవావరణ సందేశం వాళ్లకు అర్ధం కాక పోవటమే కారణం ..ఆ పత్రికఅతన్ని    ”మోర్ అబౌట్ socialogy   than literature ”అని రాసి సరి పెట్టింది .ఇప్పుడు అతని పుస్తకాలను 1930 లో అతను చెప్పిన radicalism గురించి    అధ్యనం చేస్తున్నారు . అతని రచనలను రాదికాల్ అండ్ naturalistic హుమనిసం అన్నారు కొందరు మేధావులు ..బెక్ మాత్రం ”humans are animals and thus are one with nature ”అని నోరు మూయించాడు .రికెట్స్ ,bek  ఇద్దరు కలిసి ”  . ”why do we so dread to think of our species as species ?that human self love would suffer too much and that the image of god might prove to be a mask ?”అని ప్రశ్నించారు .
              స్టీన్ బెక్ కు నోబెల్ వచ్చినపుడు బ్లూం అనే విమర్శకుడు ”The people in Stock Holm often seem to have a dusty file of people ,no one ever heard of that they pull out when making the awards ”అని ఈసడించాడు . అతన్ని సరిగా అర్ధం చేసుకోక .ఇష్టం వచ్చినట్లు అనామకుడికి అవార్డు లిస్తున్నారు అన్నాడు .
1965  లో బెక్ చని పోయిన తర్వాత ecology మీద జనం లో శ్రద్ధ పెరిగింది  . 1970  లో న్యూస్ వీక్ పత్రిక ecology పై ప్రత్యెక వ్యాసాలను రాయించింది .ఆ సంవత్చ రాన్ని  ”the year of ecology ”అని యు.ఎస్ .ఏ . పేరు పెట్టింది .అప్పట్నించి స్టీన్ బెక్ పడిన తపనేమితో జనానికి అర్ధమైంది .”becks ecoloogical message finally began  to resonate with the culture at large ”అదుగో అప్పటినుంచి అతని రచనలను కొత్త కోణం లో చదవటం ప్రారంభించారు .academician   లు ,scientists స్టీఫెన్ బెక్  కు గౌరవించటం ప్రారంభించారు .అతడిప్పుడు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం అయాడు .   ఒరెగాన్ లో ”marine science center in new port ;”   ఏర్పడింది .దీనినే stein beck అండ్ the సిగా గౌరవం గా పిలుస్తున్నారు . ”
          తన ”లైఫ్ అఫ్ లెటర్స్ ” పుస్తకం లో  జాన్ స్టీన్ బెక్ ”to finish is  sadness to a writer  .–a little death –.he puts the   the  last word down and it is  done ..but it is not  really done ..the story goes on  and leaves the writer behind ,for  no story  is ever done  ”అని ముగిస్తాడు .
                              ఇదీ నాకు చాలా ఇష్టుడైన జాన్ స్టీన్ బెక్   చరిత్ర ,రచనలపై నాకు తెలిసిన నేను తెలుసుకొన్న విషయాలు మీతో పంచుకున్నాను
                                                        మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —13 -07 -11 .—క్యాంపు –బెంగళూర్ 
”లైఫ్ అఫ్ లెటర్స్
Posted in రచనలు | Leave a comment

జాన్ స్టీన్ బెక్

     జాన్ స్టీన్ బెక్
               అమెరిక లోని కాలిఫోర్నియా లో జన్మించిన జాన్ స్టీన్ బెక్ గొప్ప కధా రచయిత ,నవలా కారుడు ,నోబెల్ బహుమతి గ్రహీత .ఆయన పర్యావరణాన్ని జీవావరనాని  గురించి కూడా అద్భుతం గా రాశాడు .ఆయన జీవించి వున్న కాలమ్ లో ఎవరు దాన్ని పట్టించు కోలేదు .మరణానంతరం అదొక అద్భుత రచన అని అందరు మెచ్చారు .అంతే కాదు జీవావరణ పర్యావరణాన్ని గురించి రాసిన మొదటి రచయిత గా గుర్తింపు పొందాడు .మాన వత్వం మూర్తీభవించిన రచయిత ,.అతనితో బాటు ఆ నాటి జీవావరణ  పర్యావరణ విషయాలపై అధ్యయనం చేసిన వారిలో అతని స్నేహితులు edrickets ,కాంప్బెల్ కూడా వున్నారు
స్టీన్ బెక్ canery row రచన లో ఆ ప్రాంతపు ప్రజల జీవన విధానాన్ని ,గొప్పగా చిత్రించాడు .అక్కడి జనాభాని whores ,pimps ,gaamblers గా వర్ణించాడు .అదే సమయం లో రికెట్స్ ఫసిఫిక్ సముద్ర ప్రాంతపు జీవావరనాన్ని బాగా లోతుగా అధ్యయనం చేశాడు .బెక్ తో కలిసి రెండు పుస్తకాలు Between fasific tides ,sea of cortez రాశాడు .వీటిని పర్యావరాణ శాస్త్ర వేత్తలు ఇప్పటికీ claassics గా భావిస్తారు  పర్యావరణం పై మానవుడు చేసే దౌష్ట్యం ,దాని వల్ల కలిగే అనర్ధాలు చాలా లోతుగా చర్చి౦చిన వాళ్ళిద్దరూ .రికెట్స్ un assuming scientist గా భావించారు .ఒక legend అన్నారు .
                      తన స్నేహితుడు రికెట్స్ గురించి చెబుతూ బెక్ అతని ప్రభావానికి లోను కాని వారు లేరని ,ఎలా ఆలోచించాలో నేర్పిన మహనీయుడని ,అందమైన అద్భుతమైన జీవులను ఎలా పట్టుకోవాలో ఎలా పరిశీలించాలో నేర్పాడని అంటాడు .రికెట్స్ ఇరవైయిదేల్లు సముద్ర జీవుల specimen collection లో  గడిపాడు . tide pool fish ను  వెన్నెముక లేని ఎన్నో స్పెసిమెన్ లను
కని పెట్టాడు .దీనివల్ల అతనికి sea shore ecology బాగా అర్ధమైంది .ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇరవై సముద్ర జీవుల చెందిన స్పెసిమెన్ లను రికెట్ అండ్ స్టీన్ బెక్ అని వాళ్ల పేర్ల మీద గౌరవం గా పిలుస్తున్నారంటే వారి జీవ శాస్త్ర కృషి ఎంతటిదో తెలుస్తోంది .సముద్ర జీవావరణ అధ్యననానికి ఆ స్నేహితుల సేవ అపూర్వ మైనది అని శాస్త్రజ్ఞులు ప్రశంసించారు .
                        కానేరి రో అనేది కాలిఫోర్నియా లోmonetary వుంది .ఆ ప్రాంతాన్ని ,అందులోని జనాభాను బెక్ తిట్టినా 1957 తర్వాత ఆ ప్రదేశం గొప్ప యాత్రా స్థలం గా మారింది .అక్కడ ప్రసిద్ధమైన చేపలు దొరుకు తాయి .మనిషి స్వార్ధం తో అక్కడి చేపల మరణానికి కారకుడు అవుతున్నాడని బెక్ బాధ పడ్డాడు .ఇవ్వాళ అదొక గొప్ప వ్యాపార కేంద్రమైంది .నగలకు ,ఫాషన్ కు ,గాల్లెరీలకు ,నిలయమైంది .ఇదంతా ఎలా జరిగిందో తెలుసు కుంటే ఆశ్చర్య పోతారు .ఇదంతా తాము ఆప్యాయం గా ఆరాధించే తమ మహా రచయిత జాన్ స్టీన్ బెక్ ను చిరస్మరణీయం చేయటానికి జరిగిన మార్పు .తన కాలమ్ కంటే ముందు ఆలోచించే గొప్ప రచయితకు అక్కడి ప్రజలిచ్చిన నజరానా .మన దేశం లో మనం ఏ రచయిత కైనా ఇంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చి కృతజ్ఞత తెల్పుకున్నామా ని ఆలోచిస్తే సిగ్గేస్తుంది .
                           స్టీన్ బెక్ దాదాపు ముప్ఫై పుస్తకాలు రాశాడు .కొన్ని సినిమాలు గా ,టి.వి.సీరియల్స్ గా వచ్చాయి .ఇరవై తొమ్మిది పుస్తకాలు academic nominations పంపబడినాయి ..పులిజర్ బహుమతి పొందాయి .1962 లో నోబెల్ బహుమతిని సాహిత్యం లో పొందాడు జాన్ స్టీన్ బెక్ ..ఇప్పుడు అక్కడ స్టీన్ బెక్ సొసైటీ ఏర్పడింది . Stein Beck”s news letter and quarterly journals
ప్రచురింప బడుతునాయి .రెండు విశ్వ విద్యాలయాల్లో స్టీన్ బెక్ research సెంటర్ లు నడుస్తున్నాయి .Intenational Stein Beck Congress ఏర్పడింది .door stop size biography లు ఆయనపై వచ్చాయి .చాలా మంది ఆయన రచనలపై పరిశోధనలు చేసి పీ.హెచ్.డి. పొందారు .ఇప్పటికీ అతని పుస్తకాలు ఏటా ఇరవై లక్షల కాపీలు అమ్ముడు పోతూనే వుంటాయి .ఆయన ,ఆయన రచనలు చిరంజీవులు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదను కుంటా. బెక్ పుస్తకం east Eden   oprah’s book club లో  re launch అయి గౌరవాన్ని ఆపాదిన్సింది .1998 లో అతని స్వగ్రామం సాలినాస్ లో multi million dollor  stein beck center ఏర్పడింది .అతను జీవితాన్నపుడు ద్వేషించిన వారంతా ఇప్పుడు అతన్ని ఆరాదిస్తున్నారు .అతని స్మృతి చిహ్నాలలో గొప్పది మానేటరి లోని ocean వ్యూ avenue .దీన్ని కానేరి వ్యూ అంటారు .ఇదిప్పుడు గొప్ప tourist attraaction . అయింది
               రికెట్స్ తో కలిసి రాసిన పుస్తకం లో the reports of biologists are the measures ,not of the science but of the men themselves ”అని రాశారిద్దరూ . రికెట్స్ రాసిన between the facific tide పుస్తకం a claassic in the literature of marine bilogy అన్నారు అంతా .దీని రచనలో బెక్ సహాయం  ఎక్కువ గా వుంది .బెక్ రాసిన ది grapes of wrath నవల ను 93 పని రోజుల్లో అయిదు నెలల్లో రాశాడు బెక్ .దాన్ని 75 వేల డాలర్లు ఇచ్చి సినిమా కు కొనుక్కున్నారు .అంత డబ్బు ఏ రచయితకు అప్పటి వరకు ఇవ్వలేదట . .ఆ సినిమా డైరెక్టర్ జాన్ ఫోర్డ్ కు అకాడెమి అవార్డు వచ్చింది .తర్వాత  the grapes of the wrath పుస్తకం ecology   పాఠ్య పుస్తకం అవటం బెక్ కు వున్న జీవావరణ అవగాహనకు జోహార్ అనిపిస్తుంది .అతని మరో పుస్తకం  sea of cortez  అన్నది a record of an ecological study of marine fauna ”అని పేరు పొందింది .సాధారణ నవలా రచయిత అని ముద్ర పడ్డా బెక్ ఇప్పుడు అసాధారణ జీవావరణ శాస్త్ర వేత్త అని పించుకోవటం  ఆశ్చర్యం ,ఆనందం కలిగిస్తుంది
                                                                    మరి కొన్ని విషయాలు తరువాత మనవి చేస్తాను  ——మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 13 -07 -11 .క్యాంపు –బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

పీయూష లహరి

   పీయూష లహరి
     ”విత్తం త్యాగ సమేతం ”–డబ్బు త్యాగంతో రాణిస్తుంది ,సార్ధకత్వం కల్గిస్తుంది .
”దానం  ప్రియవాక్య హితం —జ్ఞానం అగర్వం –క్షమాన్వితం శౌర్యం —విత్తం త్యాగ సమేతం –దుర్లభమే త చ్చతుర్భద్రం ”ఇవన్నీ కలిసినప్పుడు మనిషికి అసాధ్యమైనది లేదు
”ఓరి దేవుడా !నా పూర్వ జన్మలో ఒక్కసారి కూడా నీకు నమస్కారం చేయలేదు .తర్వాత జన్మలో కూడా చెయ్యను .నన్ను ఈ రెంటికీ క్షమించు ,.”అని ప్రార్ది౦చాడట ఒక భక్తుడు .దీని భావం గమనిద్దాం .పూర్వజన్మలో నమస్కారం చెయ్యలేదు కనుక నాకు ఈ జన్మ వచ్చింది .ఈ మానవ శరీరం లో వున్నాను .ఇప్పుడు నమస్కరిస్తున్నాను కనుక నాకు పునర్జన్మ లేదు .కనుక వచ్చే జన్మలో నమస్కారం చెయ్యను అని గొప్ప చమత్కారం చేస్తూ భక్తి గొప్ప తనాన్ని చాటి చెప్పాడు కవి..                                                            సదాశివ బ్రహ్మే౦దులు ఒక శ్లోకం లో  ”ప్రాకృత భోగ వాసరే తామ్యాసి చేతో మధు కుతో హెతొహ్ —-న్యాగ్రోధ బీజ ముప్త్యా శోచంనివ నామ్ర మస్యేతి”  మామిడి  టెంక పాతితే మామిడి చెట్టే వస్తుంది రావి గింజ పాతి మామిడి చెట్టు రావాలంటే రాదు .ఎన్నోపాపాలు   జన్మ జన్మల్లో చేసి దుఃఖ పడుతున్నాను అంటె ఏమి ఫలం ?ఏది చేస్తే దాని ఫలితమే లభిస్తుందని తెలుసుకో .
చేసే పనిలో సు +అనుస్తితం అంతే స్వనుష్టితం అంటే sincerity కావాలి  .
శృంగేరి పీఠాదిపతిశ్రీ శ్రీ అభినవ శివానంద భారతి స్వామి —సుందర కాండ పారాయణ చేసేటప్పుడు ఎదురుగా ఒక చెక్క కుర్చీని వేసి ఖాళీ గా ఉంచే వారట .ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని వింటాడని శ్రీ వారి ధృఢ విశ్వాసం .
”యదా సకల భూమండలాది పతిరపి –అయోధ్యా పథిహ్ ఇతి వ్యవహ్రియతే ”అంటారు శంకర భగవత్పాదులు .రాముడు సకల భువన పతి అయినా అయోధ్యాపతి   అనే అంటారంతా ..నిజంగా ఆయన సకల భువనాలకు అధిపతే కదా .
దేవుడు మన లాంటి వాడు కాదు .మనకు కాళ్ళు చేతులున్నాయి .వాటితో అన్ని పనులు  చేస్తాము .కాని ఆయనకు ఇవిలేకపోయినా   అన్ని పనులు చేయ గలడు .
”స్తానాభి లాస్షీ తపసి స్థితోహం త్వాం ప్రాప్యావాన్ దేవమునీంద్ర గుహ్యం –కాచన్ విచిన్వన్నపి దివ్య రంతం -స్వామిన్ –క్రుతార్దోస్మి వరం న యాచే ”  ఇవి ధ్రువుడు అన్న మాటలు .ఏదో కావాలని తపస్సు చేశా .నీ దర్శనం లభించింది .ఇంకేమి వరం కావాలి నాకు ?
కాశీ హిందూ విశ్వ విద్యాలయం శంకుస్థాపనకు మదన మోహన మాలవ్యా శృంగేరి పీతాదిపతి శ్రీ శ్రీ శివానంద నరుసింహ భారతీ తీర్ధ స్వామిని ఆహ్వానించారు .అందుకు శ్రీ వారికి తగిన సమయం లేక పోయింది .రాలేనని చెప్పారు .వస్తే తప్ప కదలను అని భీష్మించాడు మాలవ్యా .ఇద్దరు ఉద్దండులె .చివరికి గురు పాదుకలు ఇచ్చి పంపారు స్వామీజీ .వాటిని పూజనీయ స్థానం లో వుంచి కార్యక్రమాన్ని నిర్వహించారు మాలవ్యాజీ .
”గీతలో రోజూ కనేసం ఒక శ్లోక మైనా చదువు .విష్ణు సహస్ర నామాలలో ఒక్క నామ మైనా పలుకు దేవునిపై ధ్యాస ఉంచు అనవసర విషయాలపై దృష్టి మరల్చకు ”అని హితవు చెప్పారు శ్రీ శంకరులు.ఇది అందరు పాటించాల్సిన విధానమే .
”భక్త్యా పుండరీకాక్షం స్తవేరార్చన్నరః-సదా ”అన్నాడు భీష్ముడు భగవంతుని భక్తి తో సేవిస్తే అదే గొప్ప పని అని భావం .
ఒక భక్తుడు గోపికను ఇలా వర్ణి౦చాడట”విక్రేతు కామాఖిల గోపబాలా — మురారి పాదార్చిత చిత్త వ్రుత్తిహి—దధ్యాధికం మొహవశాదవేచ –గోవింద దామోదర మాధవేతి ”   దీని అర్ధం –ఒక గోపిక పాలు ,పెరుగు అమ్మటానికి వెళ్లి శ్రీ కృష్ణ ధ్యానం లో పాలోయమ్మ పాలు ,పెరుగోయమ్మ పెరుగు అనకుండా గోవిందా ,దామోదరా మాధవా అంటోందట .అది భక్తీ తన్మయం .
శంకరాచార్యులే స్వయం గా ”నారాయణ ,కరుణామయ ,శరణం కరవాణి తావకో చరణౌ –ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు”అని ప్రార్ధించారు .నీ పాదాలే నాకు శరణు .నా నాలుక ఎప్పుడు నారాయణ ,కరుణామయ ,శరణం ,కరవాణి ,తావకో చరణౌ ”అనే ఆరు మాటలే పలకాలి
గుడీ ,గోపురం ఎత్తు గా ఉండ  ”టానికి కారణం మనిషి అల్పత్వాన్ని తెలియ జేయ టానికే .
”అహమేవ మాతో మహీపతే రితి సర్వః –ప్రక్రుతిరిష్వ  చింతయేత్ ”.అన్నాడు కాళిదాసు  రాజు దగరకు వచ్చిన ప్రతి వాడు రాజు తనను బాగా చూశాడు అనుకు౦టాడట –ఇది దిలీప మహారాజు విషయం లో చెప్పిన మాట .
దిలీప మహారాజు అనే వాడట ”ఈ మనిషి మంచి వాడా కాదా అని నాకు అవసరం లేదు .అతను తగిన వాడితే అతను నాకిష్టుడే .మందు చేదైనా జబ్బు నివారిస్తే మంచిదేగా ”
పక్షుల ,జలచరాల పాద చిహ్నాలను గుర్తించ లేనట్లే జ్ఞానుల గమనమూ తెలుసుకో లేము .
విశ్వం అంతా ధర్మం మీదే నడుస్తోంది ”ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాః ”.అన్నది వేదం .
దేవుడి దయ అంటె చేతిలో కర్ర పట్టుకొని గొర్రేపిల్లాడిగా కాపలా కాయటం కాదు .మనం చేసే పనికి ఫలితాన్నిచ్చేవాడు అని భావించాలి .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

అమృత బిందువులు

అమృత బిందువులు
”దయా సర్వ భూతేషు ”అనేది లక్ష్యం కావాలి .శాంతి ,అనసూయ శౌచం ముఖ్యం .దయ అంటే ”పర దుఃఖ ప్రహరనోచ్చాయా –దయా ”ఇతరుల బాధ తీర్చటమే దయ ”.తతోపి ఆశా గరీయశి ”అంటే భగవంతుని కంటే గొప్పది ఆశ.
రామాయణ సారం ”రామా వర్ద్వర్తి తవ్యం -రావణా వన్నవర్తి తవ్యం ”  రాముడి లా ప్రవర్తించండి .రావణునిలా వద్దు .
దొరికిన దానితో తృప్తి పడాలి
నీలకంఠ దీక్షితులు మామూలు మనిషే.  మనిషి కి ,కవికి గల తేడా గురించి బాగా చెప్పారు .మామూలు మనుష్యులు ఉపయోగించే శబ్దాలే కులూ ఉపయోగిస్తారు .అయితే వారి చేతిలో ఆ శబ్దాలకు మహత్తు ,సంమోహనత్వం కలుగుతుంది .కవి భావాన్ని స్పష్టం గా చెప్పగలడు .అదే గీటు రాయి గొప్ప కవి అని చెప్పటానికి .ఆది శంకరాచార్యులు అలాంటి అపురూప కవి .
          శివ పాదాది కేశాంత స్తోత్రం లోశివుని   గ్రీవాన్ని అంటే కంఠాన్నిశంకరాచార్య గొప్పగా వర్ణించారు
”సంభ్రాన్తాయాఃశివాయః పఠర్విలయ భియా సర్వలోకోప తాపం —త్శం విగ్నస్సాపి విశ్నొహ్  సరభ సముభాయో ర్వారనా ప్రేరనాభ్యాం
మధ్యే త్రి శంక వీయమను భవతి దశాం యత్ర హాలాహలోష్మా –సోయం సర్వ పదాం నః శమయతు నిచయం నీలకంతస్య కష్తః ”
సగభాగం పార్వతి ,సగభాగం విష్ణువు ,శివుని శరీరం లో ఆక్రమించారు .క్షీర సాగర మధనం లో హాలాహలం ఉద్భవించి ,లోకాలను తల్లదింప జేస్తోంది .దాన్ని ఎలా ఆపాలో ఎవరికి తెలియటం లేదు .అప్పుడు శివుడు అకస్మాత్తు గా దాన్ని మింగేశాడు .పార్వతి భయ భ్రాంత మైంది .అది లోపలి పోతే తాను నాశనం అని పార్వతి ,బయటకు వదిలేస్తే లోకాలు దహించి పోతాయని విష్ణువు బాధ పడ్డారట అని దీని భావం .అందుకని విషం శివుని కంఠం లోనే దాచేశాడు .త్రిశంకువు లాగ అటు లోపలి చేరక బయటకు రాక కంత   భాగం లో చేరి నీల కంట నామం సార్ధక మైంది .ఇదీ భగవత్పాదుల అపూర్వ కవితా దృష్టి ,సృష్టి .
అలాగే వేరొ శ్లోకం లో ”నా బుద్ధి పరిపరి విధాల పోతోంది .అది నేఐ ద్రుధం గా ఉండేట్లు చెయ్యి చూసిన్డల్లా కావాలని పిస్తోంది వ్యామోహాన్ని అనగేట్లు చేయి సంత్రుప్తినివ్వు .సంసారాన్ని దరిచేరే మార్గం చూపించు .మోక్షం ప్రసాదించు .ఇది ఆయన తనకు తాను చెప్పుకున్నా ,మనందరి తరఫునా చెప్పారు .లేకపోతే ఆయనకు వ్యామోహాదులు ఉంటాయా ?   .
”ఉధృత నగాభి దనుజ ,దనుజ కులా మిత్ర ,మిత్ర శశి హ్రుస్టే –హ్రుష్టే భవతి ప్రభావతి ,న భవతి ,కిం భవ ,తిరస్కారః ”అంటారు ముక్తపద గ్రస్తం లో అపూర్వం గా .ప్రతి శ్లోకం లో గొప్ప అనుభవం ,అనుభూతి వుంటుంది .పరిణత ప్రజ్ఞకు నిదర్శనం వారి కవిత .సత్ఫలాలను ,ఫలితాలను ఇస్తాయి .
”వేద పూర్వకస్తు నాస్యాదికార ఇతి సిద్ధం ”.జ్ఞాన సముపార్జనకు వేదాన్ని అందరు తెలుసుకోవాలి అనిశంకరుల  .భావన .
”దానేన ద్విషంతో ”దానం వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు .దానం ప్రియవాక్య హితం గా వుండాలి దీనినే శ్రీ కృష్ణుడు సాత్విక దానం అన్నాడు ..”దాతవ్యమితి ”అనగా ప్రతిఫలా పేక్ష లేకుండా దానం చేయాలి .
”క్రుత్వాసహితం హి సంతాపం శాపం దేహేతి నో వదేత్ ”–ఇతరుల మనసును కష్త పెడితే తప్పక కష్టాల పాలు అవుతారు .అందులో అవతలి వారి ప్రమేయం వుండదు
”జ్ఞానం అగర్వః ”జ్ఞానం గర్వాన్ని చేదించాలి అని భగవత్    పాదులన్నారు .ఒకడు జ్ఞాని దగ్గరకు వెళ్లి అజ్ఞానాన్ని పోగోత్తమన్నాడు .ఆయన ఈ లోపల మీరు దానిపై విచారణ చేస్తుండండి .ఆ తర్వాత రండి నాకు తెలిసింది అనిపిస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను ”అన్నాడట .
”క్షమాన్వితం శౌర్యం ”క్షమా ,ఓర్పు ఉన్నదే శౌర్యం .శౌర్యం తో కలిసిన క్షమ వల్లే శోభిస్తారు .
                  మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -07 -11 క్యాంపు —బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

సుధా సింధు

సుధా సింధు
            అహంకారాలు మూడు ఒకటి అహం బ్రహ్మాస్మి రెండు మిధ్యాహంకారం మూడవది గౌణ.”పుత్రే పుష్టి అహం పుష్టి –పుత్రే నష్టే అహం నాస్తి ”పుత్రుడు బాగుంటే నేను బాగుంటాను .ఇది గౌణ అహం .చివరిది రెండోది పోతే మొదటిది లభిస్తుందని విద్యారణ్య వచనానికి శంకర భాష్యం .
     అహంకారం లో కారం పోవాలంటే రజోగుణం ,దానికి కారణ మైన కోరికలు వాసన ,మనస్చాన్చాల్యం పోవాలి అప్పుడే అహం కలుగుతుంది .
paul brinton అనే పాశ్చాత్యుడు శ్రీ రామనులను సందర్శించి అడిగిన ప్రశ్నకు ”who am I ”అని ఆలోచించ మన్నారు మహర్షి
నీళ్ళమీద నడిచే శక్తి పొందాను అని ఒకాయన శ్రీ రామ కృష్ణ పరమహంస దగ్గర గొప్పగా చెప్పాడట .”పావలా ఇచ్చి నదిని దాటటానికి నీ జీవితం అంతా వృధా చేసుకున్నావు నాయనా ”అన్నారట పరమహంస .
   ఒకసారి దుర్యోధనుడిని అడిగారట ఎవరో ”అన్ని శాస్త్రాలు చదివావు కదా .ఎందుకు చేదుగా ప్రవర్తిస్తున్నావు ? ”  దానికి అతని సమాధానం ”జానామి ధర్మం నచ మే ప్రవ్రుత్తిహ్ -జానామి అధర్మం నచ మే నివ్రుత్తిహ్ ”దాని అర్ధం –ధర్మమేదో నాకు తెలుసు అయితె దాని వైపు నా మనసు పోవటం లేదు .అధర్మం బాగా తెలుసు నా మనస్సు అటే లాగుతుంది .అందుకే పాపాలు చేస్తున్నాయి .నేనేమి చేయను ?
        ఒకసారి అరునునుడు కృష్ణునితో ”నువ్వు చెప్పేవన్నీ తెలుస్తున్నాయి బావా .కానీ లోకం లో మానవులు విరుద్ధం గా ప్రవర్తిస్తున్నారు కారణం ఏమిటో తెలియటం లేదు ”అన్నాడు /.ఆపుడు కన్నయ్య ”కోరికలు ,కోపం వారిని అలా ప్రవర్తిన్చేట్లు చేస్తాయి .అన్నాడని మనకు గీత తెలియ జేస్తోంది .
పూర్వం గురుకులాల్లో శిష్యుడు తప్పు చేస్తే చన్నీటి తో స్నానం చేయించే వారట .అంతే రోజూ శిష్యుడికి వేడి నీటి స్నానమే ఉండేదని తెలుస్తోంది
      ”తస్మాత్ యత్ పురుషో మనసాదిగాచ్చతి –తద్వాచా వదతి తత్కర్మనా కరోతి ”అని వేదం అన్నది .అంటే మానవుడు ఏది ఆలోచిస్తాడో ,చెప్తాడో ,అదే  చేస్తాడు . ”మనసా నిష్ట చింతనం ”మనసు లో చెడు ఆలోచన వస్తే అది పాపమే .
”నీ ఉనికి కోసం చాలా ప్రయత్నాలు చేశా. నిన్ను నిరూపించటానికి ఎన్నో వాదాలు చేశా .ఇంకా కొంతమంది రాతి హృదయం వున్న వాళ్ళున్నారు .వాళ్లకు నమ్మకం కలగటం లేదు .అయినా వారిపై నాకు జాలి వుంది .వారినీ క్షమించు .యందు కంటే వారంతా ఎప్పుడు నీ స్మరణే చేస్తున్నారు ..ఈశ్వరుడు లేదని వాదిస్తూ ,నీ నామమే వాళ్ళు సదా జపిస్తుంచే మూడులు వారు .వారిమీద అపార నీ కరునామ్రుతం  కురిపించు ”అని దీనులు ,మూధుల పై సానుభూతి చూపించాడు ప్రహ్లాదుడు .   ”వితదాభి నివేశః ”   wasteful attachment పనికి రాదు అని భావం
వచనేకా దరిద్రతా ”మాటలో పారుష్యం పనికి రాదు అది పాపమే .”అనృతం చైవ ”అబద్ధమూ పాపమే .”పైశూన్యం చాపి సర్వశః ”–చాడీలు చెప్పటం నేరం .”అసం బద్ధ ప్రలాపం నేరం ”అనవసరం గా మాట్లాడటము నేరమే .ఇవన్నే పడి పాపాలు .మూడు బుద్ధికి ,నాలుగు నాలుకకు ,మూడు శరీరం తో చేసే పాపాలివి .
ఉపదేశ పంచకం లో శంకర భగవత్పాదులు ”జన కృపా నైస్తార్య ముత్చ్రుజ్యతే ”అన్నారు అంటే ఇతరుల సానుభూతి కోరరాదు .వారి కోపం కూడా పనికి రాదు .పెద్దల దారిలో నడవాలి .
    వాసనలు మూడు .మొదటిది శాస్త్ర వాసన ఇది మూడు రకాలు .పాత ,శాస్త్ర ,అనుష్టాన వ్యసనాలు .పాత వ్యసనం అంటే నేర్చుకోవాలనే తపన .భరద్వాజ మహర్షి జీవిత కాల మంతా ఏదో ఒకటి నేర్చు కున్తూనే జీవించాడు .ఇంద్రుణ్ణి ప్రార్ధించాడు .ఆయన మహర్షితో ”నువ్వు నేర్చింది పర్వతం లో అణు మాత్రమే .ఎన్ని జన్మ లైనా
నేర్చుకోవటానికి ఇంకా మిగిలే వుంటుంది .సాగునో పాసన తో జీవితం ధాన్యం చేసుకో ”అని చెప్పాడట .పతన వ్యసనానికి భరద్వాజుడు ఉదారణ .
  రెండోది శాస్త్ర వ్యసనం .శాస్త్రాలన్నీ నేర్వాలనే కోరిక .ఒక సారి నారదుడు తనకు శాస్త్రాలన్నే తెలుసు అన్నాట్ట సనత్కుమారునితో .”ఆత్మ విద్య వచ్చా ”అని అడిగాడాయన .రాదనీ చెప్పాడు నారదుడు .ముందు దాన్ని సాధన చెయ్యమని సలహా ఇచ్చాడు .
      దూర్వాసుడు చదివిన శాష్ట్రాలన్నే బాలలకు ఎత్తుకొని వెళ్లి శివుడికి చూపించాడట .అక్కడున్న ఒక జ్ఞాని ‘నీ పరిస్థితి గాడిదమీద వున్న బట్టల మూట లా వుంది .దానికి ఆ బరువే తెల్సు .అందులో ఏముందో తెలీదు .నీ పరిస్థితీ అదే .అందులోని సారం గ్రహించు ”అని బుద్ధి చెప్పాడు
”భుక్తయే నతు ముక్తయే ”శాస్త్ర జ్ఞానం భుక్తికే కాని ముక్తికి కాదు .
                                   మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -07 -11 క్యాంపు –బెంగళూర్ –

 

Posted in రచనలు | Leave a comment

ధర్మ ధార

   ధర్మ ధార
    ”నేను అజ్ఞానానికి సాక్షి గా వుండే దేవుడిని ”అనే నిశ్చయం వల్ల అనర్ధాలన్నీ తొలగి పోతాయి .”నా జ్ఞానం స్యామాహం దేవో జ్ఞాన సాక్షేతి నిశ్చయాత్ -సర్వానర్ధ నివ్రుత్తిస్యాత్ ”అంటుంది వేదాంత డిండి మం .
  కాళీయ మర్దనం అంటె jump into the nector
  గుడాకేశ అంటె అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడు –అర్జునుడు
బయట వున్న కుండలో ,లోపల బయట అంతా శున్యమే .నీళ్ళతో వున్న కుండలో లోపల బయట అంతా పూర్ణం గానే వుంటుంది ఇదే ఆత్మ సర్వ వ్యాపికత్వం అంటారు రమణ భగవాన్
  బలరాముడి మామ తన కూతుర్ని ఎవరిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు .బ్రహ్మ నవ్వి .నా దగ్గర వున్న క్షణ కాలమ్ లో భూలోకం లో యుగాలు గడిచి పోయాయి .ద్వాపరయుగం నడుస్తోంది .వెళ్లి బలరామునికిచ్చి పెళ్లి చెయ్యి అని పంపించేసాడు ఇది భాగవత కధ .మన శాస్త్రజ్ఞులు తెలుసు కొన్న black hole ,event horizon ఇలాంటివే .
   ఒక సారి తద్దినం పెడితే ,పితృదేవతలకు రోజూ ,భోజనం పెట్టినట్లే .
        శ్రీ రామ కృష్ణ పరమ హంసకు నోటి కాన్సెర్ వచ్చింది .ఏమీ తినలేక పోయేవారు .ద్రవ పదార్ధం కూడా లోపలి వెళ్ళేది కాదట .ఒక శిష్యుడు ఆయన బాధ చూడలేక దగ్గరకు వెళ్లి ”స్వామీ !అమ్మను ప్రత్యక్షం చేసుకొని వ్యాధి నివారించుకో వచ్చు కదా ”అని సలహా చెప్పాడట .అప్పుడు పరమ హంస నవ్వి ”అన్ని నోళ్ళతో అంతా తింటున్నారు కదా ఈ ఒక్కనోటితో తినక పొతే ఏం అని అమ్మ నన్ను అడిగితె నా దగ్గర సమాధానం లేదు ”అని తన సర్వాత్మనా భావాన్ని ఎరుక పరిచారట .
     తార అంటె తరించేది అని అర్ధం .మనమంతా తారలమే .అందుకే ఆమె ప్రాతస్మరనీయురాలు .
వాలి అంటే వలయితేవాలి .మాయా మొహం చుట్టేసి వున్న వాడు అని భావం  దైవ కృపతో మాయ తొలగాటమే వాలి వధ .
      సుగ్రీవుడు అంటె షట్విశిష్ట మైన శుద్ధి –ఇది దాటితే కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రం వుంటుంది .విశుద్ధులైన వారికి పరమేశ్వరాజ్న అమృత స్వరూపాన్ని చేస్తుంది . చక్రాలతో గ్రీవం అంటె కంఠం దగ్గర విశుద్ధ చక్రం వున్న వాడుసుగ్రీవుడు ..అందుకే తార వాలి వధ తర్వాత సుగ్రీవుని భార్య అయి పతివ్రతల్లో స్థానం పొందింది .
   విగ్రహం అంటె విశిష్టం గా గ్రహించేది అని భావం
తులసీ దాసు శ్రీ రాముని ప్రార్ధిస్తూ ”రామా !నీ నివాసమైన నా హృదయం లో నిన్ను వెళ్లగొట్టే కామ,క్రోధాదులైన ఆరుగురు శత్రువులు ఆక్రమించారు .వాళ్ళను బయటికి పంపి ,నీ స్థానం లో నువ్వు ఉండక పోతే నీ గొప్ప తనం ఏమిటి ?అని గడుసుగా ప్రశ్నించాడు .
మానవుడు ఒక్కడే తల పైకి ఎత్తుకొని తిరగ గలడు .జంతువులవన్నీ అదో ముఖాలే .
  చిల్లులు వున్న కుండ లోని దీపం చిల్లుల ద్వారా కాంతిని గది అంతా ప్రసరింప జేస్తుంది .అలాగే మన లోని ఆత్మ చైతన్యం జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు ప్రకాశించి ప్రపంచాన్ని ప్రకాశింప జేస్తుంది .జ్ఞానం పొందుతుంది .అదే ఆత్మ దీపం .అందర్లోనూ ఆ జ్యోతి వుంది .
   కృష్ణార్జునులు ఒక సారి ఒక పేద వాడింటికి వెళ్ళారు .వాడు ఆవు పాలు ఇచ్చి సేవించాడు వారిద్దరినీ .కృష్ణుడు పాలు తాగి ”నీ ఆవు చావ ”అని దీవించాడట వాణ్ని .తర్వాత ఒక ధనవంతుడింటికి వెళ్ళారు వాడేమి వీళ్ళకుపెట్టలేదు   పైగా ”దున్న పోతుల్లాగా వున్నారు .పనిచేసుకొని బతక లేరా ”అని తిట్టాడు ..”నీ సంపదా ,పిల్లలు పెరగాలి ”అని కృష్ణుడు వీడిని దీవించాడు .కృష్ణుని భావం ఏమిటో అర్జునునికి అర్ధం కాక వివరించమని కోరాడు .కృష్ణుడు ”పేద వాడు నన్ను చేర టానికి వాడి ఆవే అడ్డం .అది పొతే నాలో ఐక్యం అవుతాడు .అందుకని అలా అన్నాను .ధనవంతుడు సంతానం పెరిగి ధన గర్వంతో పుడుతూ ,చస్తూ జంజాటం లో మునిగి అలానే వుండాలని దీవించా ”అని వివరించాడు .త్యాగమే మోక్షానికి మార్గం అని దీని వల్ల తెలుసుకో తగిన సత్యం .
పండితుడు ”అహమేవ పండితః ”అనుకొన్నాడు .తర్వాత ”అహమపి పండితః ”అని తెలుసు కున్నాడు .చివరికి ”అహం న పండితః ”అని జ్ఞానం తెచ్చుకొన్నాడు .
  హనుమ అంటె బుద్ధి —సీతా అంటె ప్రకృతి .–అంటె పరమేశ్వరుని నుంచి వేరు అయినది .వారిద్దరిని సంధానం చేశాడు హనుమ అదే సుందర కాండ .
                                       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -07 -11 క్యాంపు —బెంగళూర్ .
Posted in రచనలు | Leave a comment

ఆలోచనామృతం

                      ఆలోచనామృతం
కాళీయ మర్దనం అంటే మనసు లోని దురాలోచనలను పోగొట్టుకోవటమే . విషం లేని పాములా మనసును శుద్ధి చేసుకోవటమే దీని లో ఉన్న పరమార్ధం .అందుకు మనస్సు అనే సరస్సు లోకి దూకాలి .
కళ్ళకు కన్ను అయిన అన్ని చూడాలి స్వప్రకాశాన్ని చూడ టానికి వేరే కన్ను అవసరం లేదు .
ప్రాణ మయ కోశ౦ మాట్లాడటం ,నడక ,విసర్జన మొదలైన సుఖ దుఖాలతో వున్న క్రియలతో ప్రాణం తో కలిసి వుంటుంది ఇది రజోగుణ ప్రభావానికి లోని పని చేస్తుంది .
జ్ఞానేంద్రియాలు లేక పోయినా స్వప్నం లో దృశ్యాలు కనిపించటం మనోమయ కోశం .ఇది సత్వ గుణ ప్రధానమైంది .
జ్ఞానేంద్రియాలు ,నిశ్చల మైన బుద్ధితో కూడినది విజ్ఞాన మయ కోశం .
జ్ఞాని కళ్ళున్న గుడ్డి .నోరున్న మూగ .చెవులున్న చెవిటి  .ప్రహ్లాదుడు ,శబరి ఈ కోవకు చెందిన వారు .
man minus  mind is God ..God plus mind is man .
”దృశ్య  వారితం    చిత్త  మాత్మనః  .చిత్త    దర్శనం   తత్వ         దర్శనం  ”అంది   ఉపనిషత్ సారం
మనస్సు పై ఆత్మ కాంతి పడితే జగత్తు ప్రతిఫలించాడు అని రమణ మహర్షి అంటారు .”కామః ,సంకల్ప ,విచికిచ్చా ,శ్రద్ధా ,అస్రద్దా ,ధృతి ,అద్రుతి హరీ ,ఇతి సర్వం మనః ఏవ ” అంది బృహదారణ్యకం .అంతే కామం ,సంకల్పం ,సంశయం ,శ్రద్ధ ,అశ్రద్ధ ,ధైర్యం ,అధైర్యం ,లజ్జ ,ధీ ,భయం అన్నీ మనస్సు అంటేఅంతఃకరణ అని అర్ధం .
ఆనంద మయుడు ఆనంద స్వరూపుడు కాదు .మయ శబ్దం భోక్తగా చెప్పబడింది .జ్ఞాని ఆనందానికి ,సుషుప్తి ఆనందానికి ఇదే తేడా అన్నారు వివేకానంద .
ఈశ్వర అంటే ఈశ నశీలః అంటే నియంత్రించే వాడు అని అర్ధం .జనానా దేవతు కైవల్యం .
ధ్యానం నుంచి బయటకు రాగానే మనసు బహిర్ముఖం అవుతుంది .ఏ.సి .లోంచి బయటకు రాగానే ఎండ తగిలి నట్లు .
ఆత్మ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతః భవతి .అంటే ఆత్మ తెలిస్తే జగత్తు అంతా తెలిసినట్లే .
జ్ఞానం పొందాలను కోవటం లోనే అజ్ఞానం ఉందంటారు రమణులు .
ఆధ్యాత్మ విద్యా విద్యానాం అనగా ఆధ్యాత్మ విద్యే అసలు విద్య .
మనసును ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి .అదే చిత్త శుద్ధి .అంటే స్వార్ధాన్ని వదిలించు కోవటమే .
కామ క్రోధాదులు ఆరింటిని చంపి ,త్రికరణాలు వదిలి ,ద్వైత దృష్టిని వీడి సమస్తం ఎకత్వమనే ఆత్మ తత్వాన్ని తెలుసు కోవటమే మోక్షం .
research అంటే వున్నది తెలుసు కోవటమే .search కాదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -07 -11 క్యాంపు –బెంగళూర్

Posted in రచనలు | Leave a comment