మా మైసూర్ సందర్శనం —02

                 మా మైసూర్ సందర్శనం —02
                శ్రీ రంగ పట్నం నుంచి మైసూర్ కు వెళ్ళే దారిలో కావేరి ఆనకట్ట నుంచి మైసూర్ కు మంచి నీళ్ళు సరఫరా చేసే వ్యవస్థ కన్పించింది.  చాలా ఎత్తైన పిల్లర్ల మీద నీటిని  తోట్టేల్లాంటి సిమెంట్ కాలువ ద్వారా సరఫరా చేస్తున్నారు .గొప్ప టెక్నికల్ vision .అది మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ప్రణాళిక .మైసూర్ జన దాహార్తి తీర్చిన అపర భగీరదుడాయన. బృందావన్ గార్డెన్ల నుంచి ఈ సరఫరా .దాదాపు నలభై కిలో మీటర్ల దూరం .అద్భుతమైన ఆలోచన ,ఆచరణ .దీనికి ఆమోదం చెప్పి ఆవిష్కరిమ్పజేసిన మైసూర్ మహారాజు ధన్యుడు ,స్మరనీయులు ఆయన ,మోక్షగుండం కూడా .ఆయనది జ్ఞాన ,విజ్ఞాన గుండం .జనం హితమే మోక్షమని నమ్మి ఆచరించిన ,అపర విస్వేస్వరుడు .గంగను తలపై ఆయన ధరిస్తే ఈయన నిరంతర కావేరి ప్రవాహం సాధించాడు .
              కావేరి నదిలో ముఖ్యం గా తలకావేరి లో అంటె జన్మస్థానం లో  అంటె మైసూర్ కు 164 కిలోమీటర్ల దూరం లో వున్న చోట తులా సంక్రమణం నాడు స్నానం చేస్తే మోక్షమే .ఇది అక్టోబర్ లో వస్తుంది .ఇక్కడ కావేరి చిన్న గుంట గా కన్పించటం విశేషం . అక్కడినుంచి ఒక సిల్క్ పాలెస్ దగ్గర బస్సు ఆగింది అక్కడ షాపింగ్ చేసాము .40 గ్రాముల సిల్క్ చీరలు ఇక్కడ ప్రత్యేకం .ఉంగరం రింగ్ లో నుంచి మొత్తం చీర దూరి రావటం దీని ప్రత్యేకత ,నలభై గ్రాములే వుంటుంది చీర బరువు .అందుకే ఆ పేరు .పైన మంచి గంధం స్టోర్స్ వుంది .చూడటం తప్ప కొనే స్థాయిలో వుండవు .తర్వాత ఒక హోటల్ దగ్గర భోజనానికి ఆపాడు .మేము ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు, పెరుగు అన్నం రోడ్ పక్క చెట్ల కింద తిన్నాం .తెలుగు వాళ్ళు చాలా మంది మాతో వచ్చారు .
                      అక్కడినుంచి మైసూర్ పాలసు కు వెళ్ళాం .టికెట్లు డబ్బిస్తే కొని ఇచ్చారు .రాజ భవనం చూశాం .  చాల అద్భుతం గా వుంది .రెండు కళ్ళు చాలవు .వైభవం అంతా మూర్తీభవించి కన్పించింది .చాలా అందం గా ప్రతిదీ కళాత్మకం గా వుంది .వెలుగు ,వెలుతురూ బాగా ప్రవేశించేట్లుంది .రాజా గారు దసరా నాడు ఎక్కి ఊరేగే బంగారు అంబారి వుంది .రాజా వంశం అంతా కళ్ళకు కట్టినట్లు వుంది .వెండి ద్వారాలున్నాయి దర్బారు హాల్ బాగుందిముచ్చటగా  .అమ్మ వారి అన్ని రకాల మూర్తులున్నాయి .గొప్ప పైంటి౦గ్స్ కట్టి పడేస్తాయి .ఆ రంగుల సమ్మేళనం గొప్ప ఆకృతులను  సృష్టించింది .పెద్ద పెద్ద డోముల్లో లైట్స్ ఆశ్చర్యం గా వుంటాయి .మహారాజ వైభవం అంతా అడుగు అడుగునా దర్శన మిస్తుంది ఒక రకం గా సకల కళా వేదిక ఆ రాజా ప్రాసాదం .ఇదొక్కటే చూశాం .ప్రక్కనే museum వుంది .చూడ లేదు .దీని దగ్గర నవీన కృష్ణాలయం వుంది దర్షించాము .తలుపులు మూసేసినా తలుపులకున్న రంధ్రాల లోనుంచి స్వామిని దర్శించ వచ్చు
.తర్వాత ఆది లక్ష్మీ రమణ స్వాములను దర్షించాము .లోపలి camera అనుమతించరు .బయటే డిపాజిట్ చేయించుకొని locker లో పెట్టి తాళం చెవి నెంబర్ ఇస్తారు .అంతా పూర్తిగా చూసింతర్వాత తాళం చెవి ,నెంబర్ వున్న కాగితం ఇస్తే మన కామెర ఇచ్చేస్తారు .ఇది ఉచిత సేవ .అలాగే చెప్పులు కూడా గంటన్నర సమయం ఇస్తారు ఇవన్నీ చూడ టానికి .త్వర త్వరగా చూశాము .  .పాపం ప్రభావతి నడవ లేక నడిచి అంతా చూసింది .
                        సుమారుగా నాలుగు గంటలకు బయల్దేరి సుమారు నలభై నిమిషాల ప్రయాణం తో చాముండి హిల్ పైకి చేరాం .తిరుపతి కొండ ఎక్కి నట్లే వుంటుంది ఘాట్ రోడ్ అయిదు కిలోమీటర్లు .పై నుంచి చూస్తే మైసూర్ అంతా చిన్న అట్ట పెట్టెలు లాగా కన్పిస్తుంది .చాముండీ రేస్ కోర్సు మైదానం ,వగైరాలన్నీ కనిపిస్తాయి పచ్చని ప్రకృతి మధ్య అందమైన ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి 2525 అడుగుల ఎత్తు వున్న కొండ ఇక్కడే చాము౦డేశ్వరి దేవి ఆలయం వుంది .పరమ అద్భుతమైన మూర్తి .ఆమె మహిషాసుర మర్దిని .ఇక్కడే మహిషాసురుణ్ణి మట్టు పెట్టి చంపింది .
మహిషుడు పాలించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతాన్ని మహిష మండలం అనీ ,మహిష పురం అనీ మైసూరు కు పేరు వచ్చింది .సంపెంగ పూలు విరివిగా దొరుకుతాయి అమ్మవారికి వాటిని భక్తితో సంర్పించాము .పనస చెట్లు ,చెట్లనిండా కాయలతో కను విందు చేస్తాయి .మామిడి చెట్లు ,అశోక చెట్లు, వేప, నేరేడు, యుకలిప్తాస్ చెట్లు ఎక్కువ .ఇక్కడే మహిషాసురుని విగ్రహం మొదట్లోనే కన్పిస్తుంది .
              ఇక్కడినుంచి ఒక గంట ప్రయాణం లో బృందావన్ గార్డెన్ కు చేరాము .రెండు గంటల సమయం ఇచ్చారు చూడ టానికి .ఇక్కడే కావేరి నదికి చాలా ఎత్తైన ఆనకట్ట కట్టారు .ఇదీ విశ్వేశ్వరయ్య గారి అద్భుతమైన ఆలోచనే .ఆన కట్ట నీటిని ఉపయోగించి గొప్ప ఉద్యాన వనం నీటి ఫౌంటైన్స్ ,జల జలా జారి పారీ ప్రవాహాలు పచ్చని పసరిక చెట్లు పుష్ప వనాలు ముచ్చటగా వుంటుంది .బ్యూటిఫుల్ ప్లేస్ .అందుకే మైసూర్ కు సిటీ అఫ్ గార్డెన్స్ అని పేరు చక్కగా సరిపోతుంది .తప్పక చూడాల్సిన ప్రదేశం .సర్వం మరిచి ఆనందానుభూతి కి లోను అవుతాం .డామ్ కు ఆనుకొని కావేరి మాత విగ్రహం పెట్టారు .ఆ మాత కు కావేరి జలం బొట్లు  గా పడుతూ అభిషేకం చేసినట్లుంటుంది .ఆ జలాన్ని పవిత్ర జలం గా భావించి నెత్తినా చల్లుకుంటారు .ఆ పక్క నుంచి డాం పైకి ఎక్కి చూడ టానికి రెండు వైపులా మెట్లున్నాయి .ఎక్కి చూశాను .అందమైన కావేరి నదీమాత దర్శనం
పులకరి౦పజేస్తుంది .ఈ డామ్ ఒక లక్ష యాభై వేల ఎకరాలకు పంట నీరు అందించి సస్య శ్యామలం చేస్తోంది .జల విద్యుత్ లేదిక్కడ .irrigation  కోసమే కట్టిన ప్రాజెక్ట్ ఇది .దీన్ని నిర్మింపజేసిన రాజు కృష్ణ రాయ ఒడయార్ .అందుకే దీనికి కృష్ణ రాయ సాగర్ అని పేరు వచ్చింది .ఆయన విగ్రహం కూడా ఉందిక్కడ .ఆ జంట సాధించిన అద్భుతాలే నేడు మైసూర్ ప్రజలు అనుభవిస్తున్నారు .ప్రజా సేవలో సర్ మోక్ష గుండం .కే.ఆర్.లు తమ జీవితాలను ధాన్యం చేసుకున్నారు .ఇక్కడ ఫోటోలు మన కెమేరా తో తీసుకోవాలంటే యాభై రూపాయలు కట్టి రసీదు తీసుకోవాలి .పైన museum దగ్గర మ్యూజిక్ ఫౌంటైన్ వుంది . సంగీత ధ్వనికి ఫౌంటై లోని జలం అనుగుణం గా నాట్యం చేస్తుంది .ఇది సరిగ్గా రాత్రి ఏడు గంటలకు ఒక పావుగంట వుంటుంది .దీనికోసం lake లో మర boat లో జనం వస్తారు జనం తో నిండి పోతుందా ప్రదేశం .ఆహ్మదాబాద్ దగ్గర స్వామి నారాయణ్ గుడి లో చూసాము . అమెరికా లో చాల చోట్ల చూశాము శాంతినివాసం సినిమా లో నాగేశ్వర రావు ,రాజసులోచన జంటగా duets  ఇక్కడే పాడారు. ”రావే రాధ రావే రాధ రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన షాద రాత్రి ”అని పాడుతారు .ఘంటసాల మ్యూజిక్ .junor సముద్రాల పాటలు రాశాడు .ఎన్నో సార్లు చూశాను ఆ సినిమా .అందులో నాగయ్యగారికి శ్రీనివాస్  గారు     పాడిన ”జయ జయరాం జానకి రామ  ” ”పాట గొప్పగా వుంటుంది .
ఇలాంటి డామే రమణాశ్రమం.    దగ్గర మేట్టుర్ డాం తమిళనాడులో వుంది .అదీ చాల బాగుంటుంది .ఇప్పడు అక్కడ డాం లో నీరు లేకపోవటం వల్ల ఫౌంటేన్లు అవీ పనిచేయవు .సినిమా లన్నీ ఇక్కడే తీసే వారు . రాత్రి ఎనిమిది గంటలకు బస్ మళ్ళీ బయల్దేరింది బెంగళూర్ కు .ఇక్కడినుంచి ఊటీ వెళ్ళే వారు రాత్రికి హోటల్ లో వుండి మర్నాడు ఉదయం బయల్దేరి ఊటీ వెళ్తారు .రాత్రి ఒంటి గంటకు బెంగళూర్ మార్తహళ్లి    చేరాం..శర్మ కార్ లో వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .
                   దీనితో ఒక్క రోజూ మైసూర్ సందర్శనం పూర్తి అయింది .చాల దూరమే అయినా సమయ పాలన బాగా చేశారు అందరు .హాయిగా సాగింది ప్రయాణం .గొప్ప అనుభవం .చిర కాల కోర్కె ఇలా తీరింది .సంతోషం గా ఉంది .
             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —08 -07 -11 .క్యాంపు —బెంగళూర్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

1 Response to మా మైసూర్ సందర్శనం —02

  1. vardhani's avatar vardhani says:

    chalabagundi mariyu bAGANACHINDI

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.