వాల్ట్ విట్మన్ —–3

       వాల్ట్ విట్మన్ —–3
            ప్రజాకవి ,సామాన్యుని కవితలో మాన్యుని చేసిన వాడు ,ప్రజల బాధలు తన బాధలుగా భావించి, వారికి అనధికార శాసన సభ్యుడైన వాడు ,కవితకు కాదేది అనర్హం అని చాటిన వాడు ,అందర్నీ సమానంగా ఆదరించిన వాడు ,అమెరికన్ భాషలో అచ్చమైన కవిత్వం చెప్పి ,ఇది కవిత్వమా అని వెక్కిరించిన వారి చేతనే నిజమైన కవిత్వం ఇదేనని అనిపించుకున్న వాడు వాల్ట్ విట్మన్ .అతని కవితా ప్రవేశం ఎలా జరిగిందో తెలుసు కొన్నాం .ఇక ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం .
                     విట్మన్ 1819may 31 న   అమెరికా లో లాంగ్ ఐలాండ్ వెస్ట్ హిల్స్ గ్రామం లో జన్మించాడు .manhattan కు యాభై  మైళ్ళ దూరం .”Underneath all nativity –I swear I will stand by my own nativity ”అని రాసుకొన్నాడు .తండ్రి ఇంగ్లిష్ ,తల్లి డచ్ .తండ్రి నుంచి ఆంగ్ల మూలాలు ,తల్లినుంచి నిబద్ధత వారసత్వం గా పొందాడు .తండ్రి నుంచి స్వేచ్చగా ఆలోచించటం ,ప్రజాస్వామ్యం మీద సానుభూతి లభించాయి   .తండ్రి వడ్రంగి .జీవితం లో ఆయన ఏమి సాధించ లేదు పాపం .కుటుంబం brooklyn  చేరింది .ఏడు ఇళ్ళు కొన్నాడు తండ్రి .దేన్నీ నిలుపుకో లేదు .అప్పుడది అమెరికా లో నాల్గవ పెద్ద నగరం .ఇరవై ఎనిమిదేళ్ళు ఇక్కడే మన కవి జీవితం గడి పాడు .పూర్తి గ్రామీణ వాతావరణ మైన island కు నగరవాసనలు వెదజల్లే మన్హట్టన్ కు బ్రూక్ల్లిన్ మధ్యలో వుంది .మట్టిరోడ్లు ,చెత్త చెదారం ,పందులు ,కోల్లతో భీభత్స౦ గా వుండేది . ఫెర్రి సాయం తో మన్హట్టన్ కు చేరాలి .
              విప్లవ నాయకుడు Marquis De Lafayetti 1825 lo ఇక్కడికి  వచ్చాడు అప్పటికి వాల్ట్ వయసు ఆరు  . ఆ హీరో ఈ చిట్టి కవిని ఎత్తుకొని ముద్దాడిన సంఘటన ఈయనకు బాగా జ్ఞాపకం వుంది . అప్పుడు quaker ఉద్యమం బాగా వుంది .deism ఉద్యమము సమాంతరంగా నడుస్తోంది .వీళ్ళకు దైవభక్తి .విట్మన్ క్వేకర్ ఉద్యమం ఇష్టమైంది . inspired voice of the self ”. అంటె ఇష్టం ఏర్పడింది .దీనికి గ్రంధాలు ,వాక్యాలు అక్కర్లేదు .పదకొండేళ్ళకే చదువుకు గంట కొట్టి బ్ర్రోక్లిన్ లో ఒక లాయర్ దగ్గర బాయ్ గా చేరాడు .1831  లో  samuel క్లెమెంట్స్ వద్ద సహాయకుడిగా చేరాడు .ఆయన లాంగ్ island అనే వార పత్రికకు ఎడిటర్ .అందులో ప్రింటర్ గా పని చేశాడు .జార్జి వాషింగ్టన్ .జెఫెర్సన్ లను స్వయం గా చూశాడు . ,
1932 లో  అక్కడ కలరా బాగా వ్యాపించింది మళ్ళీ కుటుంబం వెస్ట్ హిల్స్ కు మారింది .లాంగ్ island పేపర్ కు కంపోజర్ గా పని చేశాడు .కొంతకాలం స్కూల్ టీచర్ గా చేశాడు .స్థిర సంపాదన లేదు .స్వంత వీక్లీ ”లాంగ్ islaander ”పత్రిక నడిపాడు .ఇంటింటికి తిరిగి పత్రిక అమ్మే వాడు .వారం లో 38 మైళ్ళు తిరగాల్సి వచ్చేది .తర్వాత జమైకా లో టైపు సెట్టర్ అయాడులాంగ్ islaand డెమొక్రాట్ పేపర్ కు .అదీ అచ్చిరాలేదు మళ్ళీ టీచర్ అయాడు విసుగుతో తన్ను ”miserable kind of dog ”అనుకొన్నాడు తర్వాత రెండు మూడు పేపర్ లలో పని చేశాడు .ఏది కలిసి రాలేదు .
baffalo లో ఫ్రీ soil  పార్టీ కి ప్రచారం చేశాడు .దాని ఆదర్శం ”free soil ,free speech ,free labour ,and free men ” .బానిసత్వం పోవాలని ఇంకా దేశం లో బానిసలు ఉండరాదని ప్రచారం .మళ్ళీ బ్ర్రోక్లిన్ ఫ్రీమన్ పేపర్ పెట్టి నడిపాడు .పేపర్ ఆఫీసు తగలడింది .ఆ తర్వాత ఆ పార్టీ కూడా ఎన్నికలలో  ఓడి తగలడింది .
                    1848 లో చిన్న దుకాణం తెరిచాడు .పెన్సిళ్ళు ,పెన్నులు అమ్మాడు .1849 లో ‘the newyork డైలీ news పేపర్ నడిపి ఒక పెన్ని కే పేపర్ అమ్మాడు .ఆర్ధికం గా నష్టపోయి లేపేశాడు .
                      1850 లో తిరుగు బాటు కవిత్వం leaves of grass రాయటం ప్రారంభించాడు .అదే ఆధునిక వచన కవిత్వానికి నాంది అయింది దీన్నే ఫ్రీ వెర్సె అంటారు .లాంగ్ island sketches రాశాడు .బ్ర్రోక్లిన్ ఆర్ట్ యునియన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నిక అయాడు . materialistic age లో . easthetic sense తెచ్చాడు వ్యాపారం చేద్దామని తండ్రి లాగా ఇళ్ళు కోని అమ్మాడు .నెత్తిన టోపియే మిగిలింది .అప్పటికే కవిత్వం లో మంచి పరిపక్వత సాధించాడు .  ”marvelously innovative poet ”అనిపించుకొన్నాడు .”most revoluutionary and inspired poet ”అని ముద్ర పడింది  పుస్తక౦ 1855 లో  వెలువడింది . .అప్పుడు దేశం లో వున్న లంచగొండి తనానికి చలించి పోయాడు ఇవాల్టి మన అన్న హజారే లాగ .the 18th president అన్న కవితలో రాజకీయ నాయకులను చిట్టెలుకలు ,maggots తో పోల్చాడు .వీటి వల్ల జనం లో ఏకీ భావన కలిగించాడు .boy ని b hoy అనేవాడు ,రాసే వాడు .అది అక్కడి మాండలీకం .అలాగే girl న g hal అని రాసేవాడు ఇప్పుడు భోయ్ అనీ గాళ్ అనటం అతను నేర్పిన విద్యే .vitman is the bower bhoy in literature ”అని  అమెరికన్స్ .   మురిసి   పోయారు
విట్మన్ ను ”cultural verniloquil .He was poetically enacting the kind of performances that he witnessed among Americanactors and singers ‘అని ప్రశంసించారు .అదే చివరికి అమెరికన్ స్టైల్ అయింది .అభినయించేవాడికి ,ప్రేక్షకుడికి మధ్య అడ్డు గోడ తొలగి పోయింది .దీనినే అమెరికా ప్రజలు విపరీతం గా ఇష్ట పడ్డారు .తమదైన ,స్వదేశీ భావన భాషా వ్యక్తీకరణ ఇన్నాళ్ళకు లభించిందని ఎంతో పొంగి పోయారు ఇంకో పక్క మార్క్ ట్వైన్ వచనం లో పూర్తి nativity  తెచ్చాడు ఇద్దరు నిజమైన అమెరికన్ సాహిత్యాన్ని సృష్టించి జన నీరాజనాలు అందుకొన్నారు .తాము ఏమిటో ఇన్నేళ్ళకు అమెరికా ప్రజలు తెలుసు కోనేట్లు చేసిన మార్గ దర్సులు వాల్ట్ విత్మాన్,మార్క్ ట్వైన్…’అతను ఒక spontaneous actor ,;.ఫెర్రి బోటు మీద కూర్చోని,బస్సుల్లో తిరుగుతూ shakespeare  కవితలను అలవోకగా చదివి జనానికి వినిపించే వాడు విట్మన్ .
”I do not ask the wounded person how  he feels –,I my self become the wounded person ”అని జనం తో ,వారి భావాలతో మమేకం అయిన అసాధారణ ప్రజా కవి ,వై తాళికుడు వాల్ట్ విట్మన్ ..
మరిన్ని విశేషాలు మరో సారి అందిస్తాను
                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

2 Responses to వాల్ట్ విట్మన్ —–3

  1. telugu2008's avatar telugu2008 says:

    సందర్భోచితమయిన వ్యాసం. ఇటీవలి నా ప్రేరణ విట్మన్. కవిత్వం అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదనీ, అది సామాన్యుడి భాష కావాలని, ఆ భాషకి కవిత్వ స్తాయినిచ్చిన వాడు విట్మన్. వీలు వెంబడి, కొన్ని కవితల అనువాదాలు కూడా ఇస్తే బాగుంటుంది.

    Like

  2. మాస్టారు, మీరు ఆంగ్లసాహిత్యాన్ని కూడా అవుపోసన పట్టినట్టున్నారు. సరళమైన తెలుగులో ఈ మహాకవిని గురించి వ్యాసపరంపర అభినందనీయం.

    Like

Leave a reply to telugu2008 Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.