బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1

                 బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1
                       జాన్ వీలెర్ అనే శాస్త్ర వేత్త 1969 లో ”solar gravitation collapse  గురించి రాస్తూ బ్లాకు హోల్ అనే పదం మొదటి సారిగా ఉపయోగించాడు .అయితె దీన్ని 18 వ శతాబ్దం లో మాత్రమే జాన్ మిచెల్ ,డీ లాప్లేస్ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించి సమర్ధించారు .ఇంతకీ అందరు ఈ పదాన్ని వాడుతారు కాని దీన్ని గురించి పూర్తిగా తెలియదు .ఇది ఒక బాగా ఎక్కువ  సాంద్రత గల దట్టమైన నక్షత్రం .దాని బరువు విపరీతం గా పెరిగి పోవటం తో అది కూలి పోతుంది అందులోకి అతి వేగవంతమైన కాంతి కూడా దానిఆకర్షణ నుంచి తప్పించుకో లేదు  .ఏదీ దాని నుంచి తప్పించుకో లేదు .కనుక అది అడుగున ఖాళీ గా వున్న పెద్ద బిలం లాగా అనిపిస్తుందిఅంతరిక్షం లో ..దాని సమీపానికి వచ్చిన ప్రతి దాన్ని పీల్చేస్తుంది .నల్ల బిలం అని  ఎందుకు అంతాఅంటారు అంటే    దానిలో కాంతి ప్రకాశించ దు .  మన సూర్యుడు కూడా పెద్ద నక్షత్రమే అయినా సూర్య గోళం బ్లాకు హోల్ గా మార లేదు .దీనికి కారణం దాని బరువు చాలదు.1 .4 సోలార్ మాస్ కాని అంతా కంటే ఎక్కువ ఉంటేనే అది బ్లాకు హోల్ గా మారుతుంది  . .మన సూర్యునికి అంత సీన్ లేదు .ఇప్పుడు అంత పెద్ద బరువున్న తారలు బ్లాకు హోల్ గా ఎలా మారుతాయో తెలుసు కొందాం …
                          మున్దుఆ నక్షత్రం అంటే ఏమిటో తెలుసు కొందాం .తార అంటే hydrogen .గోలమే ..హైడ్రోజెన్ ఒకే పరమాణువు గల తేలికైన మూలకం .రెండు పరమాణువులతో హైడ్రోజెన్ అణువు ఏర్పడుతుంది .ఇదే హైడ్రోజెన్ వాయు molicule .దీని కేంద్రకం అంటే న్యుక్లియస్ ఫ్యూజన్ కు గురి అవుతుంది దాని మధ్య భాగం లో .అప్పుడు అక్కడ .నాలుగు మిలియన్ల centigrade ఉష్ణోగ్రత ఏర్పడుతుంది .ప్రతి నక్షత్రానికి శక్తి ఈ ఫ్యూజన్ వల్లే లభిస్తుంది .ఇప్పుడే నాలుగు హైడ్రోజెన్ న్యూక్లియై కలిసి ఒక హీలియం న్యూక్లియస్ గా మారుతుంది .  ఈ స్థితి లో కొంత ద్రవ్యం శక్తి గా మారుతుంది .సూర్యునిలో ప్రతి సెకనుకు నాలుగు మిలియన్ల పదార్ధం శక్తి గామారుతుంది .అయిన్స్టీన్  శక్తి సూత్రం ప్రకారం  సూర్యుడు 4 .4  ..సేస్తిలియాన్ హర్సే పవర్ శక్తిని ఒక సెకను కు ఇస్తాడు .ఈ శక్తి దాని వ్యాప్తికి తోడ్పడు తుంది .ఈ వ్యాప్తి శక్తి దాని సంకోచ బలాన్ని సమ తుల్యం చేస్తుంది .ఈ contraaction  ఫోర్సు నక్షత్రం బయటి పొరలను బట్టి వుంటుంది .బయటి ద్రవ్యం నాశనమాయే స్థితి లోకి వచ్చి లోపలి gravitation center  లో కూలి పోతుంది .అప్పుడు అందు లోని హీలియం ఆ నక్షత్రానికి ఇంధనం గా మారు తుంది .ఇప్పటి వరకు  దానికి ఇంధనం హైడ్రోజెన్ మాత్రమే .నక్షత్రానికి హాట్ core అనేది వుంటుంది .కానీ బయటి పొరల్లోకి విపరీతం గా వ్యాకోచం చెందు తూ వుంటుంది .అలాంటి స్టార్స్ ను  రెడ్ giants అంటారు .. దాని వ్యాకోచ పరిమాణం ను బట్టి రంగును బట్టి ఆ పేరు వస్తుంది .
                       కానీ ఇందాక చెప్పిన సూర్యుని కంటే అనేక రెట్లు పెద్ద గా వున్న నక్షత్రాల లో న్యూక్లియర్ రియాక్షన్ core  లోజరిగిస్వాధీనం తప్పే స్థితి లో వుంటాయి .అప్పుడు ఆ ప్రదేశం collapse  అవుతుంది  ..అప్పుడు విస్ఫోటనం జరుగు తుంది .ఆ స్థితి లో స్టార్ తన ద్రవ్యాన్ని అంతరిక్షం లోకి నెట్టేస్తుంది దానినే సూపర్ నోవ అంటారు .ఆ తర్వాత నక్షత్ర పదార్ధం చిన్న సాంద్ర మయిన వస్తువు గా మారి పోతుంది .ప్రోటాన్ లు ,ఎలేక్ట్రోన్ లు ధీకోని న్యుట్రాన్లు  .   ఏర్పడుతాయి అప్పుడుసూపర్  dense స్టార్ ఏర్పడుతుంది .అప్పుడు   స్టార్  దాని core లో సాలిడ్ న్యుట్రాన్లు మాత్రమే వుంటాయి .ఇదే న్యూట్రాన్ స్టార్ .ఇవి ఒక cubic centimeter కు పది మిలియన్ టన్నుల సాంద్రత లో వుంటాయి .అంటే నీటి కంటే తొమ్మిది trliyan . రెట్లు ఎక్కువ.
                   స్టార్ బరువు 1 .4 .నుంచి రెండు సోలార్  మాస్ మాత్రమే వుంటే –అది న్యూట్రాన్ స్టార్ గా మారి పోతుంది .మాస్ రెండు దాటితే  ఇంకా సంకోచం జరుగు తుంది .అప్పుడు న్యూట్రాన్ స్టార్ collapsar స్టార్ అవుతుంది .అది gravitation ఆకర్షణ వల్ల కేంద్రం లోకి collaapse అవుతుంది .కుంచించుకు పోయిన కొద్దీ దాని వ్యాసార్ధం తగ్గుతుంది .చివరికి ఒక లిమిట్  కు చేరుతుంది .దీనినే squarzschild radius అంటారు .ఈ దశలో బయటి ద్రవ్యం చాలా సాంద్రత చెందుతుంది .చివరికి కాంతి కూడా దీని ప్రభావానినికి లోను కాక తప్పదు .ఆ నక్షత్ర ఆకర్షణ క్షేత్రం విపరీతం గా పెరిగి పోతుంది .కనుక అంతరిక్షం లో ప్రయాణించే ఏ నావికుడికి  ఇది కన్పించదు .
                             ఇప్పటికే అంతరిక్ష శోధన లో చాలా దూరం వెళ్లాం .ఇక్కడ ఆగి మళ్ళీ కృష్ణ బిలం అదే బ్లాకు హోల్ గురించి మళ్ళీ పూర్తిగా తెలుసు కొందాం .akkade వుండండి
                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1

  1. రమేష్ రెడ్డి s's avatar రమేష్ రెడ్డి s says:

    మంచి సమాచారం గురువు గారు.. చాల రోజులకి ఇలా పూర్తి గ తెలుసు కి గలిగాను కృష్ణ బిలం గురించి.. నాకు విశ్వం గురించి ఇంకా తెలుసు కోవాలని ఆసక్తి ఉంది.. మీవి ఇంకా ఏమైనా స్టోరీ లు ఉన్నాయా..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.