— మూడు దేశాలు –భిన్న భావాలు
భూటాన్
హిమాలయ రాజ్యం భూటాన్ .బౌద్ధం వ్యాపించిన దేశం .మానవాభి వృద్ధికి భూటాన్ ఒక ప్రయోగ శాల అంటారు .”నా తలిదండ్రులు అనేకులు.వారిని బాధించకుండా వుండాలి ”అన్నది భూటాన్ సూక్తి .నేరాల రేట్ బాగా తక్కువగా గా వున్న దేశం .హత్య అనే మాట ఇక్కడ ఎక్కడా వినబడదు .సగటు ఆయుర్దాయం 42 నుంచి 64 సంవత్చారాలకు పెరిగింది ఈ దేశం లో శైనికుల కంటే బౌద్ధ సన్యాసులు ,గురువులు ఎక్కువ .ఇక్కడ పొగాకు అమ్మకం నిషేధించారు .ఇక్కడి సైన్యం liquor తయారు చేస్తుంది అంటే అంత తీరిక గా వుంటారు . అందులో రెడ్ పాండా బీర్ ,డ్రాగన్ రం ప్రసిద్ధ మైనవి .వీరికి 13 నెంబర్ చాలా లక్కీ నెంబర్ .మార్జువానా ను అసలు వాడరు .దాన్ని పందులకు ఆహారం గా పెడతారు .దాన్ని తింటే ఆకలి బాగా వేసి తిండి బాగా తిని పందులు దున్న పోతుల్లా బలుస్తాయ ట ఇక్కడ ”ల”అనే మాట ఎక్కువగా వినపడుతుంది అంటే సర్ అని అర్ధం .మర్యాద బాగా వుంటుంది .శాంతి కాముకులు .అహింసను ఆచరణ లో పాటిస్తారు . . .
క్వటార్
ఈ దేశం గ్యాస్ మీద నిర్మించబడిన దేశం .ప్రపంచ చమురు నిల్వ వున్న దేశాల్లో ఇది మూడవది .అంటే సహజ వాయువు విరివి గా లభించే దేశం .అక్కడ లభ్యమవుతున్న గ్యాస్ తో అమెరికా లోని మొత్తం జనాభా 100 ఏళ్ళు heat ను పొందవచ్చట స్త్రీలు కార్లు నడుపుతారు .వోట్హక్కును విని యోగించుకొంటారు ప్రజలు ఎక్కువ కాలమ్ ఆరోగ్యం తో జీవిస్తారు . అయితె ఎక్కువ శాతం మంది సేవకులే .ఇక్కడి భూమిలో 98 శాతం ఎడారే .మిగిలిన నివాస భూమి రెండు శాతమే .ఇసుక తుఫానులు రెండు వందల అడుగుల ఎత్తుకు వస్తాయి అందుకనే వలసలు పోతుంటారు . .
ఒక క్షణం వున్న భూమి మరు క్షణం కన్పించాడు ,అభద్రతా ,.. .అనిశ్చిత పరిస్థితి అంత ఎక్కువ గా . వుంటుంది ప్రజా జీవితమంతా పై కప్పు లేని ఇళ్ళల్లోనే .”The ground means the sand is literally shifting from their feet ”నీతి ప్రవ్వాహం కాళ్ళ కింద ఇసకను తొలగిస్తున్నట్లు ఇసుకే ఇక్కడ జారి ,పారి పోతుంటుంది .ఇసుక సముద్రం లో చుక్కాని లేని స్థితి వారిది .
వీళ్ళ చరిత్ర క్రీస్తు శకం 650 ఉంచి 1600 వరకు రికార్డు చేయబడ లేదు .తమకు అంటూ స్వంత సంస్కృతీ లేని వాళ్ళు .ఇవాళ సంస్కృతీ తో చాలా comfortable ఈ దేశం లో lotteries బాగా ఎక్కువ .
మోల్డోవా
ఈ దేశం పూర్వ soviet union లోనిది చాలా చిన్న దేశం .ఇక్కడ దరిద్రం ,బాధలు చాలా ఎక్కువ . దీని రాజ ధాని chisinow ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతారు .వీళ్ళు పూర్వం రోమన్లు .అదే వీరి చారిత్రిక వెళ్ళు అక్కడే వున్నాయి .యునియన్ లో వున్నపుడు ఏ దేశానికి అయినా వెళ్ళే హక్కు వుండేది .ఇప్పుడు యుక్రెయిన్ కు తప్ప ఎక్కడికి వెళ్ళా లన్నా వీసా కావాల్సి రావటం వీరి దుర దృష్టం . వీరి ఆరాధ్య రచయిత పుష్కిన్ ..ఈ దేశం కంటే బీదరికం లో వున్న దేశాలు సంతోషం గా వున్నాయి .విధి వీరి జీవితాలతో ఆడుకొని విధి వంచితులను చేసి ,సంతోషాన్ని ,ఆనందాన్ని దూరం చేసింది ..దీనికి కారణం చుట్టూ వున్న దేశాలు బాగా ధనిక దేశాలవటమే ..వారి మనోభావాన్ని వారి మాటల్లో విందాం ”.”we have been abused and.abandoned by every where .We have no pride in any thing .Not even our language ”. వాళ్ల మంత్రులు కూడా కంత్రీలే.అంటున్నారు .వాళ్ళు కూడా స్వంత భాష లో మాట్లాడారట .రాస్ష్యాన్ భాషే మాట్లాడు తారు అని ఈసడిస్తారు .మాల్దోవాన్సంస్కృతి అనేది నాశన మై పోయిందని విచారిస్తున్నారు .ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడు కొనక పొతే మిగిలేది శూన్యమే .ఇది అన్ని దేశాల వాళ్ళు గ్రహించాల్సిన పరమ సత్యం .ఇది వరకు చెప్పు కొన్న క్వటార్ దేశం ధనిక దేశంకాని అక్కడ సంస్కృతీ లేదు .ఇది బీద దేశమైనా సంస్కృతీ నాశనం అయింది ..
అందుకనే ఈ దేశాన్ని ”least happy place in the soviet union ”అంటారు .ఇక్కడి భాష లో ce sa fac అంటే ‘ ”what can i do ” అని అర్ధం .?
ఇప్పటి మన దేశం లో లాగా అవినీతి ,లంచగొండి తనం పుచ్చి పురుగులు కారుతోంది అక్కడ .35 ఏళ్ళ లోపు వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్ళారట .దీనికి కారనక్మ్ డబ్బు తో డాక్టర్ డిగ్రీ కొన్నారని భయం .అధికారులన్న ,ప్రజా ప్రతినిదులన్న డాక్టర్స్ ఆనా ,engineerlu అన్న ,మేస్టార్లు అన్న అందరికీ సంకోచమే .అపనమ్మకమే కారణం .నమ్మకం లేని చోట బ్రతుకు యెంత దుర్భరమో వాళ్ళను చూస్తె తెలుస్తుంది .పెద్దలన్నా ,మరణించిన వారన్నా అపార గౌరవం వీళ్ళకు .ఏడాది కో సారి జాతీయ శలవు దినం వుంటుంది .పెద్దలను ఆత్మీయం గా గొప్ప గా సన్మానిస్తారు .అందుకనే .
”Moldovans treat the dead better than the living ”అని అనుకొంటారు .”పోయినోళ్ళు ఎప్పుడు మంచోల్లే” అన్నది బాగానే వుంది ” వున్న వొళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ”అని మాత్రం భావించక పోవటం విచార కరం .మర్యాద రామన్నలు ఆయె స్థితి వాళ్లకు లేదు .నిత్య విచార గ్రస్తులు ,బాధా సర్పdastulu.happin ess అనేది వీళ్ళ జీవితాల లోంచి తొలగి పోయింది పాపం . . . రాస్ష్యాన్ భాష లో schaste అంటే happiness .జెర్మనీ ఆ ”గో మెన్ నసి ”అంటే ”i am sorry ”.అయితె ఇంత మర్యాదగా మాట్లాడటం మాల్డోవ సంస్కృతీ లో లేదు .వాళ్ల డి అంతా rough అండ్ తౌఘ్ ”The seeds of Maldovan unhappiness are planted in their culture ..A culture that be littles the value of trust and friend ship ”అని తెసిన వాళ్ళు సానుభూతి చూపిస్తారు .అందుకనే సెయింట్ Augustine . ”the happiness of hope ”కావాలని అంటాడు . . భారత దేశం లో ”Hope is the sheet anchor of every man .When hope is destroyed ,great grief ఫోల్లోవ్స్ which is almost equal to death itself ” అని భావించి ముందుకు దూసుకు పోతారు
చివరగా జర్మన్ తత్వ వేత్త Schopenhauer అన్న మాటలు అందరం మననం చేసు కొందాం ”Because they feel unhappy ,,,–men cannot bear the sight of some one they think is happy ”
మోల్డోవా దేశ ప్రజల జీవితాలలో ఆనందం వెల్లి విరియాలనీ ,దానికి కావలసిన ఆశ ను వారు ఆహ్వానించి బతుకు భయం నుంచి బయట పడి మిగతా సోదర దేశాల లాగాఅభి వృద్ధి సాధించాలని కోరుకొందాం . శోకాల తిమిరావళి ఆనంద దీపావళి గా మారాలని ఆశిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 . క్యాంపు–బెంగళూర్


sir,what you wrote about Bhutan is true. It is a lovely and peaceful country.Idonot know about Quatar.One of my relatives who lived in Romania told me life is difficult there .,similar to Moldavia.
LikeLike