వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯
                                                                                                                                                                                                   ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి  పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం  మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత . 
               గల్ఫ్ దేశాల ఆకర్షణ లో పడి ,సర్వం కోల్పోయిన దిగువ తరగతి ప్రజలు ఎందరో .దీనికి ఏ ప్రాంతమూ ,మినహాయింపు కాదు .మబ్బు లో నీరు చూసి ముంత ఒలక బోసుకొన్న వైనం .అప్పు చేసి ,దళారీలను నమ్మి ,అక్కడికి చేరి నీచం గా బతుకుతూ ,వీసాలు లేక తిరిగి రాలేని ,రోడ్లపై అడుక్కొంటూ అలమటించే వాళ్ల కధలు చాలానే వచ్చాయి .”ఎడారి లో కడ చూపు ”కధ ను బృందావన రావు రాసిన మంచి కధ .
హైదరాబాద్ పాత బస్తీ లో అల్లర్లలో కకా విక లైన జీవితాల దర్పణం ,అన్నదమ్ముల్లా ఉండాల్సిన మతాల మధ్య స్వార్ధం కోసం రగుల్తున్న చిచ్చు చూస్తూనే ఉన్నాం .కానిమానవత్వం పరిమళిస్తే ”శత్రు మైత్రి ”సాధ్యం అని రాసిన ముది గొండ శివ  కౌముది కధ కు జోహార్లు .రాజకీయ సామాజిక రుగ్మత-స్వార్ధం .దీనికి మందు లేదు .కాని మనసుంటే మార్గం ఉండక పోదు .నేత పని వారల మూగ బాధలను చిత్రించిన కధలూ చాలా వచ్చాయి .ఈ ”పోష్ కల్చర్ ”లో ఆడమగ,విద్యార్ధుల ,ఉద్యోగుల విశృంఖలత్వాన్ని ఎండ గట్టె కధలూ వెలిశాయి .మానవ సహజత్వాన్ని,మనిషి నిజాన్ని పట్టు కోని ఎస్వీ కృష్ణ ”వ్యసనం ”,”ఇంధనం ”,కనువిప్పు ”,కధలను మలిచాడు .ఆత్మాభిమానాన్ని గొప్ప వరం గాచూపించాడు .తలిదండ్రులు తొక్కిన మార్గం లో పిల్లలూ నడిస్తే అది మంచి అయితే మంచిదే.చెడు అయితే మాత్రం ప్రమాదం .అలాంటి కధే ”పుత్ర దేవోభవ ”.ఎంత సంపాదించినా తృప్తి ఉండదు .ఇంకా కావాలనే తపన .అప్పుడు ,ఇప్పుడు ,ఎప్పుడు ఇదే పరిస్థితి .తనలో తృప్తి ని చూసు కో లేని వాళ్ళు ,ఎక్కడా తృప్తి చెందరని  ,పొందలేరని రమణ కుమార్ రాసిన కధలు బోధిస్తాయి .ఆత్మ తృప్తి ,నిజాయితీ ,మంచితనం ,మమ కారం అన్నీ విలువైనవే .అవి బోధించే కధలన్నీ మంచి కి బాటలు వేసేవే .
సున్నిత మానవ హృదయ స్పందనలను అల్లం రాజయ్య ,ఉప్పల నరసింహం ,రఘూత్తమా రెడ్డి ఉత్తమ కధలుగా రాశారు .వీటిల్లో ఆర్ద్రత అంతర్వాహిని గా ప్రవహించటం విశేషం .జీవన విలువలను డబ్బు తో నిర్ణయించటం బాధా కారం .స్త్రీల జీవన సంఘర్షణ లను సత్యవతి, యశోదా రెడ్డి చూపించి ,స్త్రీ తనను తాను గౌరవించు కొంటె ,అందరి జీవితాలు వెలుగుతాయి అని బోధించారు కధల్లో .శ్రమ జీవుల కు వ్యతి రేకం గా నడిచే రాజకీయాలను గొల్లల సంఘటిత శక్తినీ తెల్పే కధలు వచ్చి వారిని చైతన్య పరిచాయి .ఎక్కువ జీతాలకు ,సౌఖ్యాలకు ఆశ పడి కార్పోరేట్ ఉద్యోగాలకు పోతే తనను తాను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పే కధలను సత్యవతి రచించారు .ఈ జీవితాలలో స్నేహానికి ప్రాధాన్యత లేక పోవటం ,ఒంటరి గా మిగిలి పోవటం ,లను గొప్పగా చూపించారు .ప్రపంచీకరణం లో నలిగి పోతున్న మనుషుల కధలన్నీ పెద్దింటి అశోక్ కుమార్ ,రాశారు .మనిషి అంత రంగం లో రాక్షసుడు ఎప్పుడూ ఉంటాడు .వాడు లేస్తే ప్రమాదం .తాత్కాలికం గా లేచినా నిద్ర బుచ్చితేనే తనకూ ,సంఘానికి మేలు .పాల కొడేటి కధల్లో అద్దె గర్భ ధారణ సమస్యను చక్కగా వివరించాడు .కుటుంబం ,వైవాహిక జీవితాలను పునరుద్దరించు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు .”నగ్న సత్యాలను ఏకరువు పెడితే అది డాక్యు మెన్ట రి అవుతుంది . దాన్ని కళాను గుణం గా రాస్తే మంచి కధ అని పించు కొంటుంది ”అన్నాడు ప్రఖ్యాత కధకుడు బుచ్చి బాబు ..digniti  of  labour  ,నేత్రదానం అవసరం ,తల్లి పిల్లల సెంటి మెంట్ ను హైటెక్ యుగం లో మనం మర్చి పోతున్న సంప్రదాయాలను,పండుగలను యెన్.ఎస్.యెన్.మూర్తి తన కధల్లో గుది గుచ్చారు .వంగూరి చిట్టెన్ రాజు ,అమెరికా లోని ఆంధ్రులు ,అక్కడ తెలుగు వాళ్ళ జీవనామ్శాలను చిత్రించే కధలు విరివిగా రాశారు .నిడదవోలు మాలతి పత్రికా నిర్వహణను అమెరికా నుండి చేస్తున్నారు .సామాజిక అంశాలతో తమిరిస జానకి వీరాజి ,కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ .శిలా వీర్రాజు ,బులుసు జి,ప్రకాష్, సులోచన కధలకు పదును పెడుతూనే ఉన్నారు .పోతుకూచి సాంబశివరావు తోమ్భాయ్యో పడి లో కూడా నిత్య్త్సాహం గా కధా రచన చేసి మార్గ దర్శకులు గా ఉన్నారు .మంజుశ్రీ పోతుకూచి ఆ తరానికి ,ఈ తరానికి గొప్ప వారదులే .కదాసేతువు ను నిర్మించారు .నిరంతరం గా లోపలా బయటా జరిగే సంఘర్షణ లను అనిసెట్టి శ్రీధర్ అద్భుత శైలి లో కధా రూపం చేశాడు. ఓల్గా వంటి అగ్ని కణాలు తమ భాష లో స్త్రీ పట్ల మొగ్గు చూపే ,ఆమె వెన్నంటి ఉండే కధలెన్నో రాశారు .బలహీన వరాల కోసం ,అంతే అలహీనం గా ఇల్లు కట్టే కాంట్రాక్టర్ ,కోళ్ల ఫాం లో కోళ్ళకు స్వేచ్చ లేనట్లు ,తనింట్లో తనకూ స్వేచ్చ లేని లీల” స్పృహ” కధ లో ఆలోచన రేకెత్తిస్తుంది .సం .వే.రమేష్ రాసిన ”ప్రళయ కావేరి కధలు” ,ఆ ప్రాంత జనాల సామాజికామ్శాలే  ప్రతీకలే .ఎందరో ఇలాంటి కధకులున్నారు .జనం కోసం జీవించే వాళ్ళు .
.          సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-02 -05 -12 .
కాంప్ —అమెరికా 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.