సత్య కధా సుధ –3

  సత్య కధా సుధ –3

               భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు .మొదటి వాడు ఎప్పుడూ అంతా దైవాధీనం అంటూ ఉండటం వల్ల’’దైవాధీనం’’ అనే అందరి చేతా పిలువ బడే వాడు .రెండో వాడు అంతా రాజు గారి దయ అని భావిస్తూ‘’రాజాదీనం ‘’అని పిలువా బడ్డాడు .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .

                   ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతుంటే దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అనిఆలోచన వచ్చింది .ఒక శెట్టి గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .శెట్టి కి ఒక ఆలోచన వచ్చింది .గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని అను కొన్నాడు .అప్పుడే అను కొ కుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించాడు .ఇంటికి ఆహ్వానించి ఆయనకు దక్షిణ తో సహా కూష్మాండ దానం చేశాడు శెట్టి .దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు

                        మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు .గుమ్మడి కాయ కూర తిన్నారాని రాజు అడిగాడు .ఆహా ,ఓహో అద్భుతం అని బొంకాడు ఆయన .రాజు గారికి అర్ధమైంది .గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని .భటులను పిలి పించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .శెట్టి ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్ని కొన్నానని దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు .తాను  ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాదేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .మరో సారి రాజాదీనానికి ఏదో ఇవ్వాలని సంకల్పించాడు

              ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి రాజా దీనం గారు వచ్చే దారిలో పెట్టి ,భటుడి ని  కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు.రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు .రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు .అదృష్ట వంతున్ని ఎవరు చేద గొట్ట లేరు .దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది .దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది .అని ఇందులో ఉన్న సారాంశం .

                  పరమాత్మ ను పూర్తిగా మనస్పూర్తిగా నమ్మాలి అప్పుడే ఆయన కటాక్షం మన మీద పడుతుంది .మన ప్రయత్నం అంతా అయిన తర్వాత ,నువ్వే తప్ప ఇతరం లేదు అని శరణాగతి పొంది నప్పుడే పరమాత్మ అనుగ్రహిస్తాడని గజేంద్ర మోక్షం లో ద్రౌపదీ వస్త్రాప హరణం లో గోపికా వస్త్రాపహరణం లో తెలిసిన విషయమే .అలాంటిదే ఇంకొకద .ఒక చాకలి వానికి ఒక భక్తుడి తో విరోధం వచ్చింది .బాగా తప్ప తాగి ఆవేశం తో వాడు కావడి బద్ద తీసుకొని భక్తుణ్ణి బాదేస్తున్నాడు .దెబ్బ దేబ్బకూ భక్తుడు’’హరీ హరీ ‘’అంటూ  బాధ అను భావిస్తూ భగవంతడిని  తలచు కొంటుఅరుస్తున్నాడు .అప్పుడు వైకుంఠ వాసుడు రమా పర్యం కం లో విహరిస్తున్నాడు .ఆమె కు చెప్ప కుండా ఎక్కడికో వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు శ్రీ హరి .లక్ష్మీ దేవి అడిగింది ఎందుకు అంత త్వరగా చెప్ప కుండా వెళ్లి ,అప్పుడే వచ్చారేమిటి అని .అప్పుడు రమా రమణుడు ‘’ఓక  భక్తుడిని ఒక చాకలి తాగిన కోపం తో కావడి బద్ద తో  బాదు తుంటే అతడు నన్నే స్మరించాడుదెబ్బలను ఒర్చుకొంటు .అతన్ని రక్షించాలని ఆలస్యం చేయ కుండా వెళ్లాను ఈ లోగా ఆ భక్తుడు చాకలి చేతి లో కావడి బద్ద  లాక్కొని చాకలిని వీర బాదుడు బాదు తున్నాడు .ఇక నా పని అక్కడ లేదు అని గ్రహించి వెంటనే తిరిగి వచ్చేశా అని చెప్పాడు దీన పరాధీనుడు

                ఒక సారి వ్యాసుల వారు జనమేజయ మహా రాజు వద్దకు వచ్చి అతనికి ఒక పని చెబుతానని దాన్ని ఆచరించ గలడో  లేడో  అని అడిగాడు .తప్పకుండా చేస్తానన్నాడు రాజు .అప్పుడు ద్వైపాయనుడు ‘’నాయనా !కొద్ది రోజుల్లో ఒక గుర్రాల మంద అమ్మకానికి వస్తుంది .అందులో నల్లని పెద్ద గుర్రం ఉంటుంది .దాన్ని మాత్రం కోన వద్దు .కొన్నా దాన్ని ఎక్క వద్దు .ఎక్కినా ఉత్తర దిక్కుకు వెళ్ళద్దు .వెళ్ళినా నీకు కనిపించిన అమ్మాయితో మాట్లాడకు .,మాట్లాడినా ఆమె ను పెళ్లి చేసుకోకు ,ఆడినా ఆమె చెప్పి నట్లు వినకు ‘’అని చెప్పాడు .ఇదెంత పని అనుకొన్నాడు రాజు

                  కొన్నేళ్ళుగడిచాయి .గుర్రాల మంద వచ్చింది .కొనద్దను కొంటూనే నల్ల గుర్రాన్ని కొన్నాడు వద్దను కుంటూనే ఎక్కిస్వారి చేస్తూ వద్దను కొంటూనే ఉత్తర దిక్కు కు వెళ్లాడు అక్కడ ఏడుస్తున్న అందమైన అమ్మాయిని చూశాడు .మహర్షి చెప్పింది జ్ఞాపకం ఉంది .అయినా ఏమవుతుంది లే అనే ధీమా వచ్చింది ఆమెతో మాట్లాడటం గాంధర్వ వివాహం చేయటం రాజధానికి తీసుకు రావటం జరిగి పోయాయి .ఆమె కోరిక మీద సాధువులకు సంతర్పణ ఏర్పాటు చేశాడు .ఆమె వారికి నెయ్యి వడ్డిస్తూ ,జారుతున్న పైటను సద్దు కొంటోది .రాజు పర్య వేక్షణ చేస్తున్నాడు .ఆమె పైట వంక సాధువు లు చూస్తుండటం సహించ లేక పోయాడు ఓర లోని కత్తి లాగి దెబ్బకు పది మందిని గా ఆ సాధువు లందర్నీ చంపేశాడు పురోహితులు అడ్డ గిన్చినా ఆగ లేదు .అంతా అయిపోయిన తర్వాతా ‘’అయ్యో సాదు హత్య చేశానే ‘’అని కూల బడి పోయాడు .ఎదురు గా వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు .సిగ్గు తో తల వంచు కున్నాడు రాజు .వ్యాసుడి చ్చిన ఆరు అవకాశాలను తాను దాటి నందుకు ,మహా అపరాధం చేసి నందుకు కుమిలి పోయాడు రాజు .              ఈ విషయాన్నే భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ‘’ప్రక్రుతిస్త్వాం నియోక్షసి ‘’అని చెప్పాడు అర్జునుని తో .’’నువ్వు అహంకారం తో యుద్ధం చేయను అను కుంటావేమో .మానటం నీ అధీనం లో లేదు .ప్రకృతి బలాత్కారం గా నీ చేత చేయిస్తుంది ‘’అని వివరించాడు .ఈ సత్యాన్ని చాటి చెప్పే కధ మనం ఇప్పుడు చెప్పుకొన్న సత్య కధా సుధా .an unknown power always leads అంటారు అందుకే .ఇంతకీ ఈ కధ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే– వ్యాసుడిని జన మే జయుడు ‘’మహర్షీ !యమ ధర్మ రాజు అంశతో జన్మించి ,సకల సద్గుణాలు కలిగి జితేంద్రియుడు అని పిలి పించుకొన్న యుధిష్ఠిరుడు జ్యూదం లో పాల్గొనటం ,అన్నీ పణం గా పెట్టటం ,ఓడి పోవటం వింటుంటే ఆయన్ను ‘’అవి వేకి ‘’అనక తప్పటం లేదు .పెద్ద తాత గారు ధర్మ రాజు పెద్ద తప్పే చేశారు ‘’అన్నాడు దానికి పై అర్ధం ఉన్న గీతా శ్లోకం చెప్పి ఎంతటి వారి నైనా విధి  ఆడిస్తుందని మనం అందరం దాని చేతి లో కీలు బొమ్మలం అని తెలియ జెప్పే కధే ఇది .

       సశేషం —మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –8-5-12

                    కాంప్—అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.