సత్య కధా సుధ—10 (చివరి భాగం)
ఏ జన్మ లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు చుట్టూ విచారిస్తు న్నాడు .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని ,ముందు పండి జన్మ తర్వాత మోక్షం వస్తుందని చెప్పాడు గురువు .గురువు గారు పంది జన్మ ఎత్తటం శిష్య్డుదు జీర్ణించు కోలేక పోయి తన కర్తవ్యమ్ ఏమిటో చెప్ప మన్నాడు ..దానికాయన ‘’ఊరికి ఉత్తరాన ,ఒక ఎరుకల వాని ఇంట్లో ఒక పంది పిల్లగా జన్మించ బోతున్నానని ఆ పిల్లకు మొహం మీద తెల్ల మచ్చ ఉంటుందని ,వెంటనే తన్ను చంపేస్తే సరాసరి తనకు మోక్షం వస్తుందని చెప్పాడు .శిష్యుడు అలానే చేస్తానని మాట ఇచ్చిన తరువాత గురువు హాయిగా ప్రాణం వదిలాడు
గురువు చెప్పినట్లే ఎరుకల వాడింటికి శిష్యుడు వెళ్లాడు .అక్కడ ఒక పంది ఈన టానికి నొప్పులు పడుతోంది .కాచుక్కూచున్నాడు శిష్యుడు దుడ్డు కర్రతో .పంది ఈని ఇరవై పిల్లల్ని కన్నది .అందులో ముఖం మీద తెల్ల మచ్చ పిల్ల కని పించింది .శిష్యుడు ఎరుకల వాడిని బతిమి లాడి ఆ పిల్లను తీసుకొని ,చాటుగా దుడ్డు కర్రతో దాని కపాల మోక్షం చేసి గురువు గారికి మోక్షం కల్పించాలని కర్ర ఎత్తాడు .ఇంతలో గురువు గారి గొంతు ఆ తెల్ల మచ్చ పంది పిల్ల నుంచి విని పించింది ‘’నాయనా !నన్ను చంపవద్దు .నాకు చాలా ఆనందం గా ఉంది .పాలు తాగే సమయ మైంది .మా అమ్మ దగ్గర పాలు తాగుతాను .’’అని చెప్పాడు గురువు గారు .దీనిని బట్టి తేలేదేమి టంటే ఎంత నికృష్ట జన్మ ఎత్తినా మరణానికి జీవి భయ పడుతుంది అని .
మేక ‘’మే,మే’’అని ఆరుస్తుందని మనకు తెలుసు .మానవ మేక యేమని అరుస్తుందో సరదాగా అయినా, సత్యమే చెప్పాడు ఒక కవి .
‘’అపత్యం చ మే –కళత్రం మే –ధనం మే –బంధవాస్చ మే —జల్పస్త మితి మర్త్యాజం హన్తి కాల వృకో బలాత్ ‘’
దీని అర్ధం ఇది –మానవుడు అనే మేక సంతానం నాది –భార్య నాది ,ధనం నాది –బంధు వర్గం నాది అని ‘’మేమే ,మేమే ‘’అంటూ అరుస్తుందట .ఈ అరుపు విని కాలం అనే తోడేలు మీద పడి బలాత్కారం గా మేక మానవున్ని చంపేస్తుంది .సంస్కృతం లో మే –మమ –అంటే నాది అని అర్ధం .
చని పోతే నాది అనేది ఏదీ ఉండదని తెలియ జెప్పే ఒక కధ –
ఒక రాజు వంది మాగధుల స్తోత్రాలతో హాయిగా నిద్ర లేచాడు .తన వైభవాన్ని తానే మురిసి పోతు మనసు లో ఒక శ్లోకం కూర్చు కొంటున్నాడు .ఒక పండితుడు రాజు గారికి తెలీకుండా ఆయన మంచం కింద నక్కి వింటున్నాడు .రాజు గారు శ్లోకాన్ని బిగ్గరగా చదివాడు
‘’చేతో హరాయువతః సుహ్రుదోను కూలః –సద్బాన్ధవాహ్ప్రనయ గర్భ గిరిస్చ భ్రుత్యాః
గర్జంతి దంతి నివహః తరలాస్తూ రంగాః –మన్యే మమై తదపి సర్వ మదృష్ట జాతం ‘’
వెంటనే మంచం కింద ఉన్న కవి పండితుడు ‘’సంమీలనే నయనయొహ్ సహ కించి దస్థి’’అని అయిదు పాదాలు ఉండే ఆ శ్లోకాన్ని అయిదవ పాదం చెప్పి పూర్తీ చేసి మంచం కింద నుంచి బయటికి వచ్చాడట .పేదరికం బాధ తట్టు కోలేక దొంగతనం చేయటానికి మనసొప్పక తను ఇలా మంచం కింద దాక్కో వాల్సి వచ్చిందని నిజం చెప్పాడు పండితుడు .రాజు పండితుడిని క్షమించి ధనం భూమి ఇచ్చి సత్కరించి పంపాడట .ఇంతకీ ఆ శ్లోక స్వారస్యం తెలుసు కోవాలి కదా –రాజు తన శ్లోకం లో ‘’నా మనస్సుకు ఆనందం కల్గించే సుందరాన్గులున్నారు ,అనుకూలమైన స్నేహితులున్నారు ,కష్ట సుఖాల్లో పాలు పంచుకొనే బంధువు లున్నారు ,మాటలతో ,రాజ భక్తీ తో సేవ లందించే నౌకర్లు చాకర్లున్నారు ఘీన్కరించే మత్త గజాలున్నాయి .వాయు వేగాలైన గుర్రాలున్నాయి .ఈ భాగ్యం అంతా నా అదృష్టం నుంచి వచ్చిందే ‘’అని పొంగి పోయాడు .మంచం కింది కవి పూరించిన దాని అర్ధం –‘’కన్ను మూస్తే ఈ ప్రపంచం లో నాది అనుకో దగిన దేదీ నీకు ఉండదు ‘’.
సజ్జన ,దుర్జన మైత్రి ఎలా ఉంటుందో తెలిపే శ్లోకాన్ని అందిస్తాను
‘’దిక్ దిక్ –సజ్జన మైత్రీ –దుర్జన సంసగా ఏవనో భవతు –సజ్జన వియోగ కాలే భవంతి తీవ్రాణి దుఖాని ‘’—అర్ధం –
‘’ఛీ ఛీ –సజ్జన మైత్రి మాకు వద్దు –దుర్జన స్నేహమే మాకు లభించాలి .ఎందు కంటే సజ్జనులతో యెడ బాటు కల్గితే తట్టు కొ లేనంత దుఖం కలుగుతుంది .దుర్జనుల తో యెడ బాటు మహాదానందం గా ఉంటుంది ‘’అని తమాషా గా అర్ధ వంతం గా చెప్పాడు కవి .దీని అంతరార్ధం –దుర్జన సాంగత్యం వెంటనే వాదులు కోమని .’’శుక మహర్షి ‘’సాంగత్యం పరీక్షిత్తు మహారా జుకు మోక్ష మార్గాన్ని చూపించింది .అదే ‘’శకుని ‘’సాంగత్యం దుర్యోధనుడిని సర్వ నాశనం చేసిందని మనకు తెలిసిన విషయమే .
‘’సాధూనాం దర్శనం పుణ్యం ,స్పర్శనం పాప నాశనం –సంభాషణం సర్వ తీర్ధాని ,వందనం మోక్ష దాయకం ‘’అని పెద్దలు చెప్పారు అందుకే ఆడి శంకరులు ‘’లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ‘’అని దైవాన్ని చేయూత నిమ్మని మనసారా ప్రార్ధించారు .
సాంగత్య ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యక్ష ఉదాహరణ లతో ఎలా చెప్పారో తెలియ జేస్తాను –గాలితో సాంగత్యం చేసిన ధూళి దేవాలయ గోపురం ఎక్కింది .నీళ్ళ తో కలిసిన ధూళి పాతాళానికి పోయింది .నన తో సాంగత్యం చేసిన నార తల కెక్కింది .ఇనుము నిప్పుతో కలిసి మెత్త బడింది .మట్టి తో నీళ్ళ తో కలిసి త్రుప్పు పట్టి నశించింది .మహాత్ముల చేతు లతో ప్రతిష్టింప బడిన రాయి దేవత్వం పొందింది .అంధుడికి కళ్ళున్న వాడితో సంబంధం పురోగమ నానికి సహక రించింది .జ్ఞాని కి జ్ఞాని సంబంధం ప్రజ్ఞాని ని చేసింది .
మహాత్ములు తీర్ధాలకే మహా పవిత్ర శక్తిని అందించ గలరు –వివేకానంద స్వామి తపస్సు చేసిన కన్యా కుమారి లోని సముద్ర శిల ‘’వివేకానంద రాక్ ‘’అని పేరు పొందింది .బుద్ధుడు తపస్సు చేసిన గయ ‘’బుద్ధ గయ ‘’అయింది ఆదీ కవి నన్నయ భట్టారకుడు తపస్సు చేసిన ‘’తారకాసుర పట్టణం ‘’-తణుకు అయింది .నిప్పు రవ్వ ఎంతటి మహారన్యాన్ని అయిన దగ్ధం చేస్తుంది .సజ్జన సాంగత్యం ఎంత అజ్ఞాంద కారాన్నైనా అంత రింప జేస్తుంది .
ప్రార్ధన అంటే ప్ర+అర్ధన వివరం గా చెప్పాలంటే భగవంతున్ని వేరుగా ఉంచి ,తాను వేరుగా ఉంది అర్ధించటమే ప్రార్ధన .మరి ధ్యానం అంటే –‘’నేను భగవంతున్ని స్మరిస్తున్నాను అనే భావం నశించి తాదాత్మ్యాన్ని పొందటం .
మానవ మనస్సు మర్కటం లా చపలం అని భగవత్పాదులు సౌందర్య లహరి లో ఒక శ్లోకం లో చమత్కారం గా జ్ఞాన బోధకం గా చెప్పారు –
‘’కపాలిన్ భిక్షో –మే హృదయ కపి మత్యంత చపలం –దుధం భక్త్యా బధ్వా శివ భవ దదీనం కురు విభో ‘’
కపాలం చెత్తతో పట్టు కొని బిచ్చ మెత్తు కొనే ఆది భిక్షూ !మహా చపల మైన నా మనస్సు అనే కోతి నాకు ధ్యానానికి భంగం కలిగిస్తోంది .మహాత్మా !ఈ కోతి ని బంధించి నీతో తీసుకొని పో ..నాకు మనస్సు లేకుండా చేస్తే అమనస్క యోగం కలిగి మోక్షం కరతలా మలకం అవుతుంది’’ .ఇక్కడి చమత్కారం ఏమిటో తెలిసే ఉంటుంది .భిక్ష గాడి చేతి లో గొలుసు తో కట్టేసి ఉన్న కోతి ఉంటె ,ఆ కోతిని ఆడిస్తూ వినోదం కల్గిస్తూ ఉంటె అందరు సంతోషం తో భిక్ష ఎక్కువ గా వేస్తారు బాగా లా భిస్తుందని వెటకారం .
ఒకప్పుడు దత్తాత్రేయ మహర్షి అరణ్యం లో నడుస్తున్నాడు .ఒక చోట మార్గం రెండుగా చీలింది .ఏ దారి లో వెళ్ళాలో తెలియ లేదు .దగ్గర్లో ఒక చెరువు దగ్గర చేపలు పట్టే వాడు గాలం తో చేపలు పడు తున్నాడు .వాడి దగ్గరకు వెళ్లి ఎటు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .వాడికి ఈ లోకం టో సంబంధం లేదు చేప గాలానికి తగిలితే బుట్ట లో వేసుకోవాలనే ధ్యాస .తప్ప.మహర్షి ఎంత మొత్తు కొని అరచినా వాడేమీ ఉలక లేదు ,పలక లేదు .చేప చిక్కి బుట్టలో వేసుకొన్న తర్వాత దత్తుని చూసి ‘’ఏమి కావాలి ?’’అని అడిగాడు .ఆ చేపల వాడికి మహర్షి నమస్కరించి ‘’చేపలు పట్టటం లో నీకున్న శ్రద్ద్ధ నాకు ధ్యాన సాధన లో ఉంటె,ఏ నాడో మోక్షాన్ని పొందే వాడిని ‘’అని ఆశ్చర్య పోతూ దారి తెలుసుకొని వెళ్లి పోయాడు దత్తాత్రేయ మహర్షి
వ్యాస మహర్షి ఒక సారి అరణ్య మార్గాన వెడుతుంటే ఒక చిన్న పురుగు ,ఆ దారి ని దాట టానికి కంగారు పడు తూన్డటం చూశాడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చి కంగారు కు కారణం అడిగాడు ‘ఆ పురుగు ‘’మహర్షీ !ఒక మహారాజు ఈ దారి లో రధం మీద వస్తున్నట్లు భగ వచ్చక్తి తో తెలుసు కొన్నాను .రధం వచ్చే లోపు అవతలి వైపుకు చేరాలి లేక పోతే చావు తప్పదు ,రధంకింద పడి నలిగి పోతాను ‘’అంది .దానికి వ్యాసుడు ‘’చిన్న పురుగువి నువ్వు ఉంటె ఎంత ,చస్తే ఎంత ?’’అన్నాడు తేలిక భావం తో .దానికా కీటకం ‘’మునీంద్రా !అలా అన వద్దు .మానవులకున్నట్లే మాకూ సుఖ దుఖాలుంటాయి .సుఖం మీద ఆశ ,దుఖం మీద భయం మాకూ సహజమే .’’అని జవాబు చెప్పే సరికి వ్యాసునికి లోక జ్ఞానం లేకుండా తాను ప్రశ్నించి నందుకు సిగ్గు పడి క్షమాపణ చెప్పి వెళ్లి పోయాడట .
చితి ,చింత –లకు భేదం ఏమిటి అని శిష్యుడొకడు గురువు ను ప్రశ్నిస్తే –చితి ప్రాణం లేని శరీరాన్ని కాలుస్తుంది .చింత ప్రాణం ఉన్న దేహాన్ని కాలుస్తూనే ఉంటుంది అని గురువు సమాధానం చెప్పాడు .
బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునుడు మట్టి పాత్ర తో భిక్షాటన చేసుకొనే వాడు .అది చూడ లేక ఒక ధనికుడు ఆయనకు బంగారు పాత్రనిచ్చాడు .దానితో నే భిక్షాట నానికి వెళ్లాడు .ఒక రోజు రాత్రి నాగార్జునుడుందే గుహ లోకి దొంగ ప్రవేశించాడు .దొంగను చూసి ఏమి కావాలని అడిగాడు .బంగారు పాత్ర కావాలన్నాడు వాడు .ఓస్ ఇంతేనా తీసుకో అని తానే దాన్ని ఇచ్చేశాడు దొంగకు . .మళ్ళీ పాత పాత్రే .అను కోకుండా కొన్ని రోజుల తర్వాత దొంగ గుహ లోకి వచ్చాడు.ఇంకేమి కావాలని అడిగాడు ఆచార్యుడు .’’నాకేమీ వద్దు .ఈ పాత్ర తీసుకొని వెళ్ళిన దగ్గర్నుంచి నాకు నిద్రాహారాలు లేవు .ఎవరు ఎత్తుకు పోతారోనని భయం .అదే దిగులు .మీ బంగారు పాత్రను మీరు తీసుకొని నాకు మనశ్శాంతి ని ప్రసాదించండి ‘’అని కాళ్ళ మీద పడి పాత్రను అక్కడే వదిలేసి వెళ్లి పోయాడట
ఇవన్నీ సత్య దర్శనం చేసే కధలే,విషయాలే . .ఈ వ్యాస పరంపరను ప్రారంభించ టానికి ముందే నేను చెప్పి నట్లు ఈ విషయాలన్నీ శ్రీ టి.వి.కే.సోమయాజులు గారు రచించిన ‘’సత్య దర్శనం ‘’లోనివి .వారికి ప్రేరణ కల్పించిన వారు ‘’స్వామి శ్రీ నిశ్రేయ సానంద జీ మహారాజ్ ‘’ –స్వామీజీ తణుకు లో శ్రీ రామ కృష్ణ సేవా సమితి స్థాపించి ఎందరికో ప్రేరణ నిచ్చిన గురు వరెన్యులు .సోమయాజులుగారు వీరి అనుగ్రహం తో రాసిన పుస్తకం ఇది .నన్ను ఆకర్షించింది ఆ సుధను మీకూ అందించాలని చేసిన ప్రయత్నమే ఇది .
సమాప్తం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-5-12—కాంప్ –అమెరి

