అమెరికా లో బౌద్ధం
క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు .అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డారు .1800 లో బౌద్ధం అమెరికా లో ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధం లాటిన్ భాష లో ఉంది .అందుకని దాన్ని అమెరికా వారు స్త్రెంజ్ రెలిజియన్ అని పిలిచారు .1844 లో బాగా వేళ్ళూను కొంది .the d col అనే మేగజైన్ మొదటి సారిగా ఆంగ్లం లో బౌద్ధ గ్రంధాన్ని ప్రచురించింది .1875 లో ఏర్పడిన థియాసాఫికల్ సొసైటీ బౌద్ధ ధర్మానికి ఆకర్షితం అయింది .కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఇక్కడ బౌద్ధ పతాకను ఎగర వేసి ,ప్రాచుర్యం కల్పించాడు .ఆ సొసైటీ స్థాపకులలో రెండవాడీ యన .
1893 లో చికాగో లో ప్రపంచ మత మహాసభలు జరిగి నప్పుడు ఈ మతాధి పతులు పా ల్గోన్నారు .బౌద్ధం ఆదర్శ వంత మైనదని అట్లాంటిక్ మంత్లీ లో ఒక మెథడిస్ట్ రాశాడు .దానితో చాలా మంది బౌద్ధాన్ని ఆదరించి ,ప్రవేశం కల్పించారు .చికాగో న్యూయార్క్ ,సాన్ ఫ్రాన్సిస్కో లలో మహా బోధి శాఖలేర్పడ్డాయి .1897 లో సాన్ ఫ్రాన్సిస్కో లో ధర్మ సంఘం ఏర్పడింది .అమెరికన్లకు జెన్ శిక్షణ నిచ్చారు . చైనా నుండి మొదటి సారిగా బౌద్ధులు అమెరికా చేరారు 1840-1900 మధ్య రెండున్నర మిలియన్ చైనీయులు అక్కడి కల్లోల రాజకీయ పరిస్తితులకు భయ పడిదేశాన్ని వదిలి పెట్టి వెళ్లారు . చాలా మంది హవాయి ద్వీపం లో చెరుకు ప్లాంటేషన్ లో చేరారు .ఆ తర్వాతా హవాయి దేశాన్నిఅమెరికా తనలో కలుపు కొంది .కొందరు చైనీయులు కాలి ఫోర్నియా వచ్చారు .దాన్ని వాళ్ళ భాష లో ‘’gam-san ‘’ .అన్నారు .అంటే ‘’బంగారు పర్వతం ‘’అప్పుడు అక్కడ గోల్డ్ రష్ ఉండేది .అక్కడి సియర్ర నెవాడా లో కొండల కింద బంగారం లభించింది .ఇక్కడికి చేరిన వారు తమ వాళ్ళను పిలిచి రప్పించు కొన్నారు .
1949 లో కాలిఫోర్నియా లో చైనీయుల సంఖ్యా 55 మాత్రమే .అయిదేళ్ళలో 40,000 అయారు .మొదట్లో మగ వారు మాత్రమే వచ్చారు ..ఆ తర్వాతా కుటుంబాలను తర లించారు .కాలిఫోర్నియా వీరిని బాగా ఆద రించింది . 1852 లో కాలి ఫోర్నియ లెజిస్లేటర్ గవర్నర్’’ చైనీయులు ఉత్తమ జాతి వారని ‘’ పేర్కొన్నాడు .అయితే కొన్ని నెలలకే వారి మీద ఆంక్షలు పెరిగాయి .వారికి పౌరసత్వ హక్కులు ఇవ్వం అన్నారు .1882 వచ్చే సరికి చైనీయుల పై అంటి సెంటి మెంట్ పెరిగి పోయింది . 1892 .లో బహిష్కరణ చట్టాన్ని తెచ్చారు .వారిని దేశం లోకి అనుమతించ లేదు .1910లో వలస వారి బంధన సెంటర్లు ఏర్పడ్డాయి . 1920 లో ఇతర దేశాలలోని అమెరికన్లకు ప్రవేశం కల్పించారు .1924 లో ఏడాదికి వంద మందినే అనుమతించారు .అదీ ఐరోపా దేశాస్తులకే .ఇక్కడ పుట్టిన వా తెల్ల వారికే అమెరికా పౌరసత్వం అని తేల్చి చెప్పారు .
శాన్ ఫ్రానిస్కో లో మొదటి చైనా దేవాలయం ‘’కాంగ్ చు టెంపుల్ ‘’అనే పేరు తో చైనా టౌన్ లో ఏర్పడింది .1906 భూకంపం లో దెబ్బతింటే కూల్చేశారు ‘’.kuan tie ‘’అనేఅనే దేవుని విగ్రహాన్ని మాత్రం కాపాడు కొన్నారు .1909 ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి కొత్త దేవాలయం కట్టారు .శాన్ఫ్రాన్సిస్కో కు వంద మైళ్ళ దూరం లో సియార్ర నెవాడా కొండల కింద ‘’ఆరో విల్లి ‘’లో వేలాది చైనీయులు చేరారు .గుడిని ముందు కర్రతో తర్వాతా రాతి తో కట్టు కున్నారు . దాని ప్రవేశ ద్వారం ‘’పూర్ణ చంద్రుని ఆకారం ‘’లో ఉండటం వల్ల ‘’మూన్ టెంపుల్ ‘’అంటారు .బంగారు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు .
జపాన్ వారు 1865-1912 మధ్య వలస వచ్చారు .ఈ కాలాన్ని జపనీయులు ‘’మీజి కాలం ‘’అంటారు .1870 లో యాభై మంది మాత్రమే ఉంటె 1992 కి లక్ష మంది జపానీయులు అయ్యారు .వ్యవసాయం చేశారు .వీళ్ళ పైనా ఆంక్షలు వచ్చాయి .కోర్టుల దాకా వెళ్లారు .అయినా పౌరసత్వం ఇవ్వ లేదు .జోడో శింశు అనే బౌద్ధ దేవాలయానికి చెందిన స్కూలు ఇమ్మిగ్రంట్స్ పక్షాన నిలిచింది .’’యంగ్మెన్ బుద్ధిస్ట్ అసోసియేషన్’’ ఏర్పడింది .చైనా వారిలా కాకుండా జప్స్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొన్నారు .ఇక్కడి తమ భర్తల కోసం వేలాది మంది భార్యలు అమెరికా చేరి వారి ఫోటోల సాయం తో గుర్తించి కుటుంబాలను ఏర్పరచు కొన్నారు .అందుకే 1908-21కాలాన్ని ‘’picture bride era’’అని పిలుస్తారు .
ఇమ్మిగ్రంట్స్ బాగా పెరిగి పోవటం తో b.m.n.a.సేవా కార్య క్రమాలను చే బట్టింది .ఇక్కడి బౌద్ధ ఆలయాలను బుద్ధిస్ట్ చర్చ అని పిలిచే వారు .1960 కాలాన్ని’’zen decade for america’’అన్నారు .. 1950 నుండి జెన్ బూం బాగా వచ్చింది .ఈ కాలం లో ‘’బీట్ జెనెరేషన్ ‘’వాళ్ళు జెన్ బుద్ధిజం వైపుకు వెళ్లారు .ప్రసిద్ధ సాహితీ వేత్తలు దీనిలో చేరే సరికి గొప్ప ఆకర్షణ గా నిలిచింది .వారి భావన లో ‘’ఏదో ఒక రోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా వైట్ హౌస్ లో ఒక గదిలో కూర్చుని ధ్యానం చేస్తాడు ‘’ అని నమ్మారు .1990 లో బీట్ జెనెరేషన్ లో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చింది జెన్ . wake up ‘’అనే బుద్ధుని చరిత్ర హాండ్ బుక్ గా వచ్చింది
shunryu suziki అనే జెన్ గురువు సాన ఫ్రానిస్కో కు వచ్చి బౌద్ధాలయం లో ప్రీస్ట్ అయాడు .అతని ప్రభావంతో 1960,.జెన్ మౌంటేన్ సెంటర్ ఏర్పడింది tassa jaraa hot springs వద్ద .దీని ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిల్స్ .1965-2000 కాలం లో మూడవ ఫేజ్ బుద్ధిజం అమెరికా చేరింది .అమెరికన్లు జెన్ మతం వైపుకు బాగా ఆకర్షింప బడ్డారు .1965-1990 మధ్య చైనా అమెరికన్లు నాలుగు రెట్లు పె రిగారు .తైవాన్ వారు లాస ఏంజెల్స్ లో అత్యంత సుందర ,విశాల బౌద్ధ ఆలయాన్ని’’ Hsi lai ‘’అంటే coming to west పేరిట halsinda heights లో ౩౦ మిలియన్ డాలర్ల తో నిర్మించారు .దీన్ని వైస్ ప్రెసిడెంట్ అల్గోరే సందర్శించాడు .ఇక్కడ గురువులకు ఆశ్రమాలున్నాయి .ఇవన్నీ బౌద్ధ సంస్కృతిని ,చైనా ,జపాన్ సంస్క్రుతులను కాపాడు కోవటానికి సహక రిస్తున్నాయి .
ఇక్కడి నూట యాభై బౌద్ధ ఆలయాలలో శ్రీ లంక ,థాయిలాండ్ ,లావోస్ ,కంబోడియా దేశాల నుండి వ్యాపించిన ‘’తెరవాడా ‘’పధ్ధతి లో పూజాదికాలను నిర్వ హిస్తున్నారు .లంక లో ఉన్న బౌద్ధ విహారం’’ధర్మ వజ్ర ‘’పేరుతొ 1980 లో బుద్ధ పౌర్ణమి నాడు నిర్మించారు .వేలాది బౌద్ధులు ,మత గురువులు హాజరైనారు .
‘’ you will always be an asian ,always an out sider ,not an american ‘’అని కిమ్మకొనే సిహరత్ అనే గురువు బోధించాడు .ఇప్పటి బుద్ధిజం పై నిరసనలు విని పిస్తున్నా ,అది అప్రతి హతం గా ముందుకు సాగి పోతూనే ఉంది .1993 లో ‘’world parliament of religions ‘’శత వార్షి కోత్స వానికి చికాగో నగ రానికి వేలాది ఏషియన్ అమెరికంలుతరలి వచ్చి అనుభూతి పొందారు .ఇరవైవ శతాబ్దం లో అమెరికా లోని బౌద్ధుల సంఖ్య మూడు మిలియన్లను దాటింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15-5-12 –కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com


మంచి విషయాల్ని తెలియ జేసారండీ.
భారద్దేశం లో బౌద్ధం అధోగతి లో కి వెళ్ళినప్పుడు మిగిలన దేశాలలో దాని పెంపు కనిపించింది.
ఇప్పటి కాలపు మాటల్లో చెప్పా లంటే, ‘ఎలెక్ట్రానిక్ డంప్’ లాగా అన్న మాట.
చీర్స్
జిలేబి.
LikeLike
http://bhamidipatibalatripurasundari.blogspot.in/
LikeLike
బాగుంది.బౌద్ధ ధర్మంలోని తొలి శాఖలు రెండు: మొదటిది థేరవాద( దీనినే స్థవిరవాద
అనికూడా అంటారు.) రెండవది మహా సాంఘిక శాఖ.థేరవాద లేక స్థవిరవాద శాఖ
బుద్ధుడిని దైవంగా భావించదు. ఈ శాఖీయులు పేరుకు తగ్గట్టే అత్యంత కఠినమైన
నియమనిష్ఠలను పాటిస్తూ, బుద్ధుడిని శాక్యముని (శాక్య వంశంలో జన్మించి ,
కోరికలను త్యజించి, ఎనభై ఏళ్ళకు పైగా జీవించి, తత్త్వ బోధనలు కావించి,
అంతిమంగా’ నిర్వాణం’ పొందిన ఒక ఆదర్శప్రాయమైన పురుషుని) గానే భావిస్తారు.
వీరు శ్రీ లంక, బర్మా, థాయిలాండ్, కంబోడియా మొదలైన ప్రాంతాలలో వ్యాపించారు.
వీరే ఆ తరువాత కాలంలో హీనయాన (Lesser Vehicle) శాఖగా పిలువబడ్డారు.
మరో ప్రాచీన శాఖ మహా సాంఘిక శాఖ. వీరు బుద్ధుడు దైవమనీ, ఆయనకు
మరణం లేదనీ, ఆయన ‘ అవలోకితేశ్వరుని’గా అనుక్షణం మనందరినీ కనిపెడుతూ
పలు జన్మలు (జాతకములు) ఎత్తుతూ, మనమధ్యే ఉంటూ, మన యోగక్షేమాలు
విచారిస్తూ, మనల్ని ఆదుకుంటాడని నమ్ముతారు.టిబెట్, చైనా, కొరియా, జపాన్
ప్రాంతాలకు ఈ శాఖీయులు విస్తరించారు.వీరే అనంతర కాలంలో మహాయాన
(Greater Vehicle) శాఖ్హీయులని పిలువబడ్డారు.
— ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్,న్యూజెర్సీ, యు.యస్.ఏ. నుంచి.
LikeLike
గొప్ప తత్వం .బాగా వివరించారు.
LikeLike