నల్ల వజ్రం –నిక్కి గివాని
అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ పరిచింది .నల్ల జాతి విముక్తి పోరాటానికి నడుం బిగించింది .సాంఘిక దురన్యాయాలకు నెమ్మదిగా నిరసన తెలుపుతూ ,క్రమంగా జాతి వివక్షత కు వ్యతిరేకం గా నిలిచి పోరాడింది .రెండవ నల్ల జాతి రచయిత ల సామావేశం 1967 లో పాల్గొని ,ఆనాటి నేత అమిరీ బరాకా ప్రభావానికి లోనైంది .నల్ల జాతి వారు విడిగా కొత్త సాహిత్యాన్ని .సర్వ స్వతంత్రం గా నిర్మించాలని నినదించింది .అప్పటి వరకు ఉన్న అమెరికన్ ఇంగ్లీష ,యురోపియన్ సాహిత్య సంప్రదాయ పద్ధతులు శాశించే దారి వదిలి కొత్త దారి తొక్కాలని ఆలోచన చేసింది
బాల్యం –చదువు
ఆమె పూర్తీ పేరు’’ యోలాందే గివాని జూనియర్’’ .1943 జూన్ ఏడున అమెరికా లో టేన్నిసి రాష్ట్రం లోని నాక్స్ విల్లి లో జన్మించింది .బాల్యం సిన్సినాటి లో గడిచింది .మళ్ళీ నాక్స్ విల్లి చేరి తాతయ్య ఇంట్లో ఉంది. ఫిస్క్ స్కూల్ లో చేరింది .అనుమతి లేకుండా స్కూల్ మానేసి నందుకు మొదటి సెమిస్టర్ కు అనుమతించ లేదు ..సిన్సియాటి చేరి ,అక్కడి యునివేర్సిటి లో రాత్రి తరగతులలో చేరింది ..మళ్ళీ ఫిస్క్ కు వచ్చి ,సోషల్ సబ్జెక్ట్ తీసుకొని చదివింది .ఒక వర్క్ షాప్ లో బ్లాక్ ఆర్ట్ ఉద్యమ కారులైన బరాకా ,జోన్స్ లను చూసింది .అప్పటికే పౌరహక్కుల ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది ..నిషేధింప బడ్డ’’ స్టూడెంట్ నాన్ వయలెంట్ కొ ఆర్డినేషన్ కమిటీ ‘’ ,ని పునరుద్ద రించింది .1967 లో ఆనర్స్ డిగ్రీ తీసుకొని సిన్సినాటి కి వచ్చింది ..1968 ఏప్రిల్ నాలుగున పౌరహక్కుల నాయకుడు అమెరికన్ గాంధి మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ హత్య జరిగింది .గివాని హతాశు రాలై అట్లాంటా లో జరిగిన ఆయన అంత్య క్రియలకు హాజరైంది .న్యూయార్క్ లోని కొలంబియా లో ఉన్న స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరింది .’’సృజనాత్మక రచన ‘’కోర్సు తీసు కొన్నది .కాని రాయ లేమో నని భావించి డిగ్రీ తీసుకో కుండానే మానేసింది .
ఉద్యోగం –రచనలు
ఆనర్స్ డిగ్రీ పొంద గానే ‘’బ్లాక్ ఫీలింగ్ ,బ్లాక్ టాక్’’ కవితా సంపుటు లను స్వయం గా ప్రచురించింది .విప్లవ జర్నల్ అయిన ‘’కన్సేర్వేషన్‘’పత్రిక సంపాదకు రాలైంది .సిన్సియాటి లో మొట్ట మొదటి ‘’బ్లాక్ ఆర్ట్స్ ఫెస్టివల్ ‘’నిర్వహించింది .దేలావార్ కు మకాం మార్చి సెటిల్ మెంట్ హౌస్ లో పని చేస్తుండగా ,పెన్సిల్వేనియా వర్సిటి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్ వస్తే చేరింది .కొంత కాలం చదివి మానేసింది .’’బ్లాక్ జడ్జిమెంట్ ‘’అనే పుస్తకం రాయటం లో నిమగ్న మైంది . తర్వాత క్వీన్స్ కాలేజి లో విద్యా బోధనా చేసింది .పుస్తకాలను స్వయం గా ముద్రించాలని ఆమె భావించింది .బర్డ్ లాండ్ లోని జాజ్ క్లబ్ లో కవిత్వం విని పిస్తుంటే వందలాది మంది విని ఆనందించి ప్రోత్స హించే వారు .ఈ కధనం అంతా స్థానిక పత్రికల లో వస్తే పదివేల కాపీలు అమ్ముడయి రికార్డ్ సృష్టించింది .1970 ‘’బ్లాక్ జడ్జిమెంట్ ‘’పుస్తకాన్ని విడుదల చేసింది .చాలా మంది చదివి మెచ్చారు .పెళ్లి చేసుకొని ఒక కొడుకు ను కన్నది .
కవితా పథనం –పాటల ఆల్బం
1970 లో గివాని నికితాం ప్రెస్ ద్వారా నల్ల కవితలను మొదటి ‘’ఆంత్రోపాలజీ ‘’ గా ,’’night comes softly’’ పేరప్రచురించి ,తను ఎన్నాళ్ళ నుంచో అనుకొన్న కోరిక తీర్చు కొంది .తరువాత ‘’సోల్ ‘’అనే టి.వి.ప్రోగ్రాం చేసింది .హార్లెం లో ప్రేక్షక సమూహాలకు కవితలను చదివి విని పించి మెప్పు పొందింది .’’స్పిన్ యే సాఫ్ట్ బ్లాక్ సాంగ్ ‘’ను ముద్రించి ,రికార్డ్ చేసి మొదటి ఆల్బం ‘’ట్రూత్ ఇస్ ఆన్ ఇట్స్ వే ‘’పేర విడుదల చేసింది .దానికి మంచి ఆదరణ లభించింది .లండన్ లో గివాని జేమేస్ బాల్డ్విన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ను 1971 లో ప్రచురించి ప్రాచుర్యం పొందింది .1972 లో ఆమె రాసిన ‘’ట్రూత్ ‘’పాటల ఆల్బం ‘’బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బం ‘’గా రికార్డు ,రివార్డు పొందింది .’’మై హౌస్ ‘’అనే ఆమె పుస్తకం 1973 అమెరికన్ లైబ్రరి అసోషియేషన్ వారి ఉత్తమ పుస్తకాల జాబితా లో చేరింది .ఆదర్శ కవి మార్గ రేట్ వాకర్ తో ‘టేపేడ్ డయలాగ్ ‘’ను ఇచ్చింది .’’లేడీస్ హోం జర్నల్ ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’అవార్డ్ నిచ్చి సత్కరించింది ముప్ఫై వ జనం దినాన్ని న్యూయార్క్ లోని లింకన్ సెంటర్ లో కవిత్వం చదివి గడి పింది .ప్రభుత్వ ఆహ్వానం పై ఘనా ,టాంజానియా ,జాంబియా దేశాల్లో పర్య టించి ఉపన్యాసాలనిచ్చింది .’’ego tripping and other poems for young readers ‘’ను ప్రచురించింది .’’ల్like a ripple on a pond’’ ‘’ఆల్బం విడుదల చేసింది .
గౌరవాలు
కవిత్వం పై ఉదాహరణ ల తో మాట్లాడటం అంటే గివాని కి చాలా ఇష్టం .ప్రత్యక్ష ప్రసారాలు ,రికార్డింగులు అంటే మరీ ఇష్టం .అదే ఆమె వ్యాపకం అయింది .ప్రతి మాటను అర్ధ వంతం గా ప్రయోగించటం ,ప్రయోగాత్మకం గా ,ప్రబోదాత్మకం గా రాయటం ఆమె ప్రత్యేకత .ఇంగ్లీష భాష భావ వ్యక్తీకరణకు సరి పోదు ‘’అని ఆమె నిశ్చితాభి ప్రాయం .’’ఇంగ్లీష లో అందరు మాట్లాడుతారు కాని ,ఇంగ్లీష మాట్లాడరు ‘’అంటుంది .మరి తనకు సరైన భాష ఏది అని అడిగితే ‘’ఆఫ్రికా లో మాట్లాడే భాష ‘’అంటుంది .(african oral tradition ).నల్ల జాతి స్త్రీలు అంటే అత్యంత అభిమానం .మగవారిని ‘’బ్యూటిఫుల్ బ్లాక్ మెన్ ‘’అని అన్నా ,వారి భావాలన్నా ,మొరటు ప్రవర్తన అన్నా ఆమెకు కోపం .వారికి నల్ల జాతి స్త్రీలంటే ఇష్టం ఉండదు అని గట్టిగా చెప్పింది ..అందుకే ‘’ఉమెన్ ‘’అనే కవిత లో it is a sex object if you are pretty –and no love –or no love and no sex if you are fat –get back fat black women be a mother –grand mother strong thing but no women ‘’అని నిర్భయం గా మన్ల మగవారి ఆంతర్యాన్ని ఆవిష్కరించింది .
1970-80 కాలం లో రెండు వందల కవిత్వపు రీడింగులు ,ఉపన్యాసాలు ప్రతి సంవత్సరం ఇచ్చింది .సంవత్సరానికో పుస్తకం ,ఒక ఆల్బం విడుదల చేసింది .ఎన్నో సంస్థలు ,కమీషన్లు ,ప్రజా సంబంధ శాఖలు ఆమెను ఆహ్వానించాయి .అయినా విద్యా బోధన మాన లేదు .ఒహాయో ,మిన్నిసోటా ,వర్జీనియా విశ్వ విద్యా ల యాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసి గౌరవం పొందింది .1989 లో ‘’బ్లాక్ స్టడీస్ ‘’లో ఇంగ్లీష ప్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ చేసింది .
90 వ దశకం లో డజన్ల కొద్దీ డాక్టరేట్లు ఆమెను వరించాయి .ఎన్నో సాహిత్య ,పౌర సంస్థలు ఆమెకు అవార్డు లిచ్చి సత్కరించారు .ఒక డజన్ నగరాల తాళం చెవులను (కీస్ )లను ఇచ్చి అత్యధిక గౌరవం చూపారు .ఒహాయో ఉమెన్స్ హాల్ఆఫీస్ కు ఎన్నుకో బడింది .తెన్నిసి రాష్ట్రం రాష్ట్ర ప్రముఖ మహిళా పురస్కారం ప్రదానం చేసింది .’’రోజా పార్క్ ఉమెన్ ఆఫ్ కరేజ్ ‘’అవార్డు పొందింది .ఎబని ,మాడే మోసిల్లి ,ఎసెన్స్ పత్రికలూ ఆమె ను ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’గ ప్రకటించి గౌరవించాయి ..N.A.A.P.అవార్డ్ ను మూడు సార్లు దక్కించుకొన్న అరుదైన నల్ల జాతి సాహితీ మూర్తి ఆమె .ఎన్నో పిలలల పుస్తకాలు రాసింది .స్వీయ చరిత్రను రాసుకోన్నది .అది ఒక రకం గా నల్ల జాతి వారి చరిత్రే .నేషనల్ బుక్ అవార్డ్ కు నామినేట్ అయింది .ఆమె వ్యాసాలను ‘’సేక్రెడ్ కౌస్ అండ్ ఆదర ఎడిబుల్స్ ‘’గా ప్రచురించింది .’ లంగ్ కేన్సర్ వ్యాధికి గురి అయిణా విజయ వంత మైన ఆపరేషన్ తో జీవించింది . 2005 లో staan ford తో కలిసి ‘’బ్రేకింగ్ ది సైలెన్స్ ,’’ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఆఫ్ బ్లాక్ కాన్సర్ సర్వైవర్స్’’ ‘’పుస్తకాలను సంపాదకత్వం వహించి విడుదల చేసింది .
నల్ల జాతి అని పిలువ బడే ఆఫ్రో అమెరికన్లు సామాజికం గా ,ఆర్ధికం గా ,రాజకీయం గా చైతన్య వంతులు కావాలని ,వారిలో ఈ భావ దీప్తి ప్రజ్వ లించాలని అహరహం శ్రమించిన అలుపెరగని పోరాట యోధురాలు గివాని .అందు కోసం కొత్త ఆలోచనలను ,కొత్త పోకడలను ఆహ్వానించింది ,అమలు జరిపింది .మాటలు కాక చేతల్లో సత్తా చూపించింది .నల్ల వారి శక్తి ని నిరూపించింది .నలుపు లో అందం ఉందని తెలియ జెప్పింది .నల్లవారినందర్నీ ఎకోన్ముఖులను చేసి బ్లాక్ పాన్ధర్స్ ను ఏర్పాటు చేసి తమ అస్తిత్వాలను మేల్కొల్పింది .తమ జాతి లోని వారి త్యాగాలను ,కష్టాలను ,అంకిత భావాన్ని వెలుగు లోకి తెచ్చే రచనలు చేసి జాగృతి నింపింది .మాండలికాన్ని ప్రోత్సహించి ,తానూ ఆ బాటలో నడిచి ఆదర్శ వంతు రాలై ‘’ నల్ల వజ్రం’’ గా వెలిగింది నిక్కి గివాని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-5-12—camp-charlotte –north carolina .u.s.a.

