కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1 ఆయ్య వారేంచేస్తునారు అంటే ?

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1

                                                                                ఆయ్య  వారేంచేస్తునారు అంటే ?

   — చేసిన తప్పులు దిద్దు కొంటున్నారు అని సామెత ఉందని తెలుసుగా .మామూలు అయ్య వారలకు ,గురువులకు ఇది మామూలే .గుగ్గురువులకూ ఒక్కో సారి తప్పదు .కాని గురు దేవులు ,విశ్వ కవి అని పించుకొన్న వాడు ,తాను రాసిన గీతాంజలికి, తనకూ ,భారతీయ సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాడు రవీంద్ర నాద టాగూర్ కు కూడా ఈ స్థితి తప్పలేదట .ఆయన బెంగాలీ భాష లో మొదటగా గీతాంజలి పద్యాలను రాశాడు కదా .అయితే అది అంతర్జాతీయం గా పేరు తెచ్చు కోవాలంటే విశ్వ వ్యాప్త మైన భాష అని పించుకొంటున్న ఇంగ్లీష్ లోకి అనువదిస్తే నే కాని గుర్తింపు రాదు .ఆ విషయం ఆ మహాశయునికి తెలుసు .ఎవరో అను వాదం చేస్తే ఎలా ఉంటుందో ? తన భావాలను సరిగ్గా అందులో పొందు పరుస్తారో లేదో నని ఆయనే తనకున్న అపార ఆంగ్ల జ్ఞానం తొ ఆంగ్లం లోకి అనువాదం చేశేశాడు .సరే బానే ఉంది .అంతా అయిం తర్వాత ఒక అను మానం పీడించింది .ఆంగ్లం తనకు పరాయి భాష .తానేమో బెంగాలీ లో బాగా చెప్పగలిగాడు .తన భావాలను తాను అదే స్పూర్తిగా ఆంగ్లం లోకి తీసుకు రాగాలిగానో లేదో, పడాల్సిన చోట అర్ధ వంత మైన, భావ స్పోరక మైనఆంగ్ల పదాలు వేశానో లేదో తన మాటలు మంత్ర శబ్దాలు గా ఉన్నాయో లేదో నని సందేహం కలి గింది .ఎవరి కైనా ఆంగ్లం లో నిష్ణాతుడికి చూపించి తప్పు లుంటే దిద్దించాలని నిర్ణ యించు కొన్నాడు

               ఆ కాలం లో సి.ఎఫ్ .ఆండ్రూస్ ఇంగ్లీష్ లో దిట్ట ,గాంధీ గారికి దగ్గరి వాడు ,కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యుడు కనుక ఆయనకు పంపి క్షుణ్ణం గా చదివి మార్పు లుంటే సూచించమని కోరాడు .ఆయన ఆసాంతం చదివి చాలా బాగా ఉందని నాలుగు చోట్ల మాత్రమె దోషాలున్నాయని అవి సరి చేస్తే చాలు నని కితాబిచ్చాడు .ఆండ్రూస్ చెప్పిన చోట్లతప్పులు దిద్ది  ఆయన సూచించిన పదాలను చేర్చాడు .హమ్మయ్యా అనుకొన్నాడు గురుదేవ్

                   ఒక సారి యూరప్ పర్యటనలో విశ్వ కవి ఒక కవి సమ్మేళనం లో పాల్గొని తన గీతాంజలి ని మొట్ట మొదటి సారిగా శ్రోతలకు చదివి విని పిస్తున్నాడు .అందరు మరోలోకం లో విహరించిన అను భూతి పొందారు అద్భుతం అని మెచ్చుకొన్నారు .ఆ సభలో ఉన్న ‘’మీట్స్ ‘’అనే యువ కవి ఒక్క సారిగా లేచి ‘’అద్భుతం పరమాద్భుతం ఇంత గొప్ప కవిత నేనింత వరకు వినలేదు .ఈ కవిత్వానికి ఏదో ఒక రోజు నోబెల్ బహు మతి రావటం ఖాయం ‘’.అన్నాడట .ఆ తర్వాత రవీంద్రుడు ఆ కావ్యాన్ని మీట్స్ కవికి చూపించాడట .ఆయన అంతా పరిశీలనగా చదివి ఒక్క నాలుగు చోట్ల తప్పులు దొర్లాయి అని పిస్తోంది .వాటిని మార్చమని సలహా ఇచ్చాడట .తీరా చూస్తే ఆ నాలుగు మాటలు తను రాసినవి కావట .ఆండ్రూస్ సూచించిన మాటలని మీట్స్ కు వివరించి చెప్పాడు .అప్పుడా యువ కవి ‘’భాషా దృష్టిలో అవి తప్పులు గా కని పించినా కావ్య దృష్టిలో అవే మేలైన, అర్ధ వంత మైన పదాలు .కనుక మొదట మీరు రాసిన పదాలనే ఉంచండి‘’అని హితవు చెప్పాడట .గురు దేవులు కధ మళ్ళీ మొదటికే వచ్చిందని తాను రాసిన పదాలనే ఉంచి ముద్రించాడట .ఆయువ కవి చెప్పిన భవిష్య వాణినిజమై ,గీతాంజలి నోబెల్ సాధించింది .

              అందుకే స్వామి మధు సూదన సరస్వతి తాను రాసిన గ్రంధం లో తప్పు లుంటే సూచించమని కోరను అని ఒక వేళ సూచించినా రేపటికి తాను ఉంటానో లేనో నని గడుసుగా సెల విచ్చారు .తనది ఎందరో నడిచిన ”ఎంగిలి మార్గమే ”ననితనభాషలో తప్పులనేవిఉండవనీ చెప్పారు .ఒక వేళఉండినా దిద్దాలంటే మళ్ళీ తిరిగిరాయాల్సిందే కనుక ఆ ప్రయత్నం చేయ వద్దని చదు వరులను కోరాడు స్వామి . 

                  స్వ ఆత్మా ప్రాప్తి కోసం చెప్పే వేదాంత మార్గాలన్నీ అబద్ధాలు అంటారు చైనా తత్వ వేత్తలు .అనేక వేల గ్రంధాలు ఆత్మమార్గాన్ని బోధించటానికి ఉన్నాయి అవి .సత్యాన్ని మాటల ద్వారా తెలియ జేయ వచ్చు కాని గమ్యాన్ని చేర్చలేవు .శబ్దాలకు ,మాటలకు అందేది సత్యం కాదని చైనా వారు అంటారు వారిది ‘’మార్గం కాని మార్గం ‘’అంటారు . అదే ‘’Tao ‘’.అంటే నడిచే దారి గమ్యానికి చేర్చ దు .అయితే గమ్యం చేరటం యెట్లా ?వ్యక్తి స్వయం గా తన ఆత్మ స్వరూపాన్ని తెలుసు కోవటానికి నడ వాల్సిన పనేమీ లేదుగా .తన లోనే ఆత్మ ఉందిగా దాన్ని తెలుసుకోవటానికి మార్గాలక్కరలేదు నడవక్కర్లేదని వారి భావన .

                    మంచి కబుర్ల తొ మళ్ళీ కలుద్దాం

                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-12-12-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1 ఆయ్య వారేంచేస్తునారు అంటే ?

  1. చాలా బాగున్నాయి ఈ కబుర్లు

    కాని క్షేపము అంటే waste అని విన్నాను

    కాని ఇక్కడ మీరు వ్రాసినవన్నీ very use full items

    నిజానికి మీరు చెప్పటం వలెనే తెలిసింది లేకుంటే తెలిసేది ఎలానో కూడా తెలియదు…

    Tao గురించి గాలిస్తాను ….

    ధన్యోస్మి
    ?!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.