సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు
సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో
నిన్న అంటే ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారంసాయంత్రంనాలుగు గంటలకు సరస భారతి 43 వ సమావేశాన్ని ‘’శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం ‘’గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం (ఏ.సి.లైబ్రరి )లో’’శ్రీమతి తెన్నేటి హేమలత సాహితీ వేదిక ‘’పై నిర్వహించింది .ఆహూతులైన అతిధులకు కవులు రచయితలకు పురస్కార గ్రహీతలకు ,మీడియా మిత్రులకు సాహితీ అభిమానులకు అధ్యక్ష స్తాయి లో గబ్బట దుర్గా ప్రసాద్ ఉగాది శుభా కాంక్షల తో స్వాగతం పలికారు .అతిధులను ,పురస్కార గ్రహీతలను వేదిక పైకి ఒక్కొక్కరిని ఆహ్వానించగా వారన్దరికి కమలా ఫలం తో సరస భారతి సభ్యులు సాహితీ ప్రియులు వేదిక పైకి ఆహ్వానించారు . సరసభారతి గౌరవాధ్యక్షురాలుశ్రీమతిజోశ్యుల శ్యామల దేవి ప్రార్ధనతో సభను ప్రారంభించారు .సభకు అధ్యక్షులు గా వ్యవహరించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ ఉయ్యూరు రావటం అంటే తమ కెంతో ఇస్టమని ఇక్కడ సరసభారతి వారు నిర్వహించే కార్యక్రమాలు చాలా విస్తృత స్తాయిలో ఉంటాయని తనలాగా దుర్గా ప్రసాద్ గారికి కూడా సాహిత్య ఆశ ఎక్కువ అని ఏదైనా సవాలుగా తీసుకొని సమర్ధ వంతం గా నిర్వహించటంలో అయన సమర్ధులని మంచి కార్యకర్త అని ఇలాంటి సభలు ఉయ్యూరు లో జరపటం ఎంతో సంతోషమని మని ఇలాంటివి విజయ వాడ మచిలీ పట్నం వంటి పెద్ద పట్నాలలో నిర్వహించే రోజు సరసభారతికి తప్పక వస్తుందని ఆశను వెలి బుచ్చారు .దుర్గాప్రసాద్ గారు ఇంటర్నెట్ ను సమర్ధ వంతం గా ఉపయోగిస్తున్నారని సరసభారతి బ్లాగ్ లో రోజుకు కనీసం ఆరేడు ఆర్టికల్స్ ఉంటాయన్ అన్ని విషయాలను సమగ్రం గా ఉండే బ్లాగ్ అని ఇంత తక్కువ కాలం లో లక్ష మంది పైగా వీక్షకులను ఆకర్షించటం సామాన్య విషయం కాదని ,ఎక్కడ ఏ సమావేశ విషయమైనా సరసభారతి అందిస్తోందని ఇది గర్వించాల్సిన విషయమని అన్నారు .
అనుకోని అతిధి గా విచ్చేసిన ఉయ్యూరు నివాసి హైదరాబాద్ లో జర్నలిజం కాలేజి ని స్థాపించి ఎందరో యువకలకు జర్నలిజం కోర్సులో ప్రవేశం కల్పించి తీర్చి దిద్దినప్రిన్సిపాల్ శ్రీ గోవింద రాజు చక్రధర్ మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ గారి సాహిత్య కార్య క్రమాలను తెలుసుకోన్నానన్నారు ప్రతి ఇంటిలో వంట గది ఉన్నట్లే పుస్తకాల గది ఉండాలని ,పుస్తక రచన ప్రచురణ వెలువరించటం చాలా వ్యయ ప్రయాసలతో కూడినదని దీన్ని సరస భారతి సమర్ధం గా ఉయ్యూరు లో చేయటం స్వాగతిమ్పదగిన విషయమని మన యోగ, ఆయుర్వేద విద్య ,శాస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని మన కట్టు బొట్టు అందరికి ఆదర్శం గా ఉంటాయని అందరు వీటిని అనుకరించి మనకు కను విప్పు కల్గిస్తున్నారని అన్నారు .
ముఖ్య అతిధి తాజా మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ తమప్రసంగం లో ఏదేశం లో నైనా సాహిత్యమే ఆజాతి జీవితాన్ని, జీవనాన్ని ప్రభావితం చేస్తుందని ,తెలుగు సాహిత్యం సర్వతో ముఖం గా వృద్ధి చెందిందని దీనికి కారకులైన కవి పండిత రచయితలకు మనం రుణ పడి ఉన్నామని అన్నారు .మన చరిత్రను భావి తరాలకు అందజేస్తున్న సరసభారతి ఆదర్శం గా పని చేస్తోందనిఈ సంస్థ ప్రచురించిన పది పుస్తకాలలో తాను ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించటం తన అదృష్టమని తెలిపారు సమావేశాలు నిర్వహించటం పెద్దల్ని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించటం పుస్తకాలు రాయటం ముద్రించి ఆవిష్కరణ లు చేయటం కవి సమ్మేలణాలునిర్వహించటం అన్నీ ఒంటి చేత్తో నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్ మాస్టారు అందరికి ఆదర్శం అని డెబ్భై మూడేళ్ళ వయసులో యాభై ఏళ్ళ వారుగా చలాకీ గా ఉండటం లో రహస్యం అయన నిరంతర చైతన్య మే నని చెప్పారు .ఈ లైబ్రరి పై అంతస్తు నిర్మాణం లో ఉందని అక్కడ సాహితీ సమావేశాలు జరుపుఒనే అన్ని వసతులు కల్పిస్తామని వై వి.బి.తెలియ జేశారు .
పుస్తకావిష్కరణ
సిద్ధ యోగి పుంగవులు దైవం –సశాస్త్రీయ పరిశోధన పుస్తకాలను ,ఆధ్యాత్మిక గీతాలు సి.డి.లను రాజేంద్రప్రసాద్ చక్రధర్ సుబ్బారావు గార్లు ఆవిష్కరించారు .సిద్ధయోగి పుంగవులు రాసిన దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సరసభారతి ప్రచురించిన దవ పుస్తకం అని తన అయిదవ రచన అని దీనిని నెట్ లో రాశానని దీన్ని అమెరికా లో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితం ఇవ్వలనుకొని వారికి తెలియబర్చానని ఆయన తమను ఇంతవారిని గా తీర్చి దిద్దిన తమ మాతృమూర్తి స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ గారికి అంకిత మివ్వమని కోరారని తెలియ జేశారు .ముప్ఫై అయిదు ఎపిసోడ్లపుస్తకాన్ని రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ చ క్కగా ముద్రించి అందించారని వారిద్దరి ఋణం తీర్చుకోలేనిదని అన్నారు ఇటీవల అమెరికా కు వెళ్లి నప్పుడు గోపాల కృష్ణ గారు అలబామా లో ని తమ గ్రామం హాంట్స్ విల్ కు ఆహ్వానించి అక్కడ అలబామా తెలుగు అసోసియేషన్ తో తనకు సన్మానం జరిపారని తనకు అయిదు వందల డాలర్ల చెక్కు అందజేశారని చెప్పారు అందువల్లనే ఈ డబ్బుతో ఈ పుస్తకం తెచ్చి వారి తల్లి గారికి అంకితం చేశానని అన్నారు .ఆమె మలయాళస్వామి వారి వద్ద మంత్రం దీక్ష తీసుకొని అనుసరించిన ధన్యాత్మురాలని వివరించారు గోపాల కృష్ణ గారి ఆత్మీయత మరువలేదని ఈ లైబ్రరి ఇంత ఉన్నత స్తితి లోకి రావటానికి వారే కారణం అని చెప్పారు .
దైవం శాస్త్రీయ పరిశోధన గ్రంధ కర్త ఈ పుస్తకాన్ని రాయటం డిటిపి కవర్ డిజైన్ ,కవర్ అంతా తానే చేశానని god అంటే జనరేషన్ ,ఆర్గనైజేషన్ ,డిస్త్రక్షన్ అని అదే సృష్టి స్తితి లయ కారకుడైన భగవంతుడు అని మనం అంటామని చక్కని వివరణ నిచ్చారు .శ్రీ శృంగారపు వెంకటప్పయ్య గారు తాము రాసి స్వర పరచి తెచ్చిన సిడి గురించి ప్రసంగించి విశేషాలు వివరించారు .
పురస్కార ప్రదానం
ప్రతి ఉగాదికి సరసభారతి స్వర్గీయ గబ్బిట భవనమ్మ మృత్యుంజయ శాస్త్రిగారల స్మారక ఉగాది పురస్కారాలను అంద జేస్తుంది దీన్ని వారి కుమారులు కోడలు దుర్గాప్రసాద్,ప్రభావతి దంపతులు అందజేస్తారు ఈ రోజు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన పన్నెండు మందికి నగదు పురస్కారం తో పాటు శాలువా, పూల హారం చందన తాంబూలం పన్నీటి జల్లు లతో వివేకానంద స్వామి ఫోటో ఉన్న జ్ఞాపిక లను అందజేశారు దీనిని రాజేంద్రప్రసాద్ సుబ్బారావు గార్ల సమక్షం లో వారి చేతుల మీదుగా నిర్వహించారు .పురస్కారాలను అందుకొన్న వారు ఉచిత రీతి స్పందన తెలియ జేశారు
మొదట గా అఖిల భారత కూచి పూడి నృత్య కేంద్ర కార్య దర్శి శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ తమ స్పందన తెలియ జేస్తూ తమ తలిదండ్రులు చేసిన సత్కారం లాగా ఉందని తాను ఇటువంటి వాటికి సాధారణం గా రానని కాని దుర్గాప్రసాద్ గారి పిలుపు లో ఆత్మీయత ఉండటం వల్ల వచ్చానని ఇది మరపు రాని సంఘటన అని అన్నారు .ప్రముఖ కవయిత్రి ,కదా రచయిత్రి శ్రీమతి జి.మేరి కృపా బాయి ప్రసంగిస్తూ తనను గుర్తించి సన్మానం చేసి నందుకు క్రుతజ్ఞాతలని ఉయ్యూరు లో జరిగిన కదా సదస్సుకు కవి సమ్మేళనాలకులకు హాజరయ్యానని ఇక్కడి వారి ఆదరణ మరువలేమని చెప్పారు బందరు చరిత్ర పరిశోధకులు శ్రీ మహమ్మద్ సిలార్ గారు తమ స్పందన లో తనను బందరు వారే గుర్తించలేదని దుర్గా ప్రసాద్ గారే మొదట ఆహ్వానించి సమ్మానిన్చారని ఇది తెలిసి రేపు ఉగాదికి బందరు వారు న్మానింప బోతున్నారని తన సన్మానాలకు ఇక్కడే నాంది జరిగిందని సంతోషం వెలి బుచ్చారు కధకుడు విమర్శకుడు .శ్రీ వేలూరి కౌండిన్య సరసభారతి తో తన బాంధవ్యాన్ని నేమరేసుకొన్నారు .నెల్లూరు రు లో శ్రీ తిక్కన మహా కవి లలిత కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు బ్రాహ్మీ మూర్తిగా అపర తిక్కనావతరం గా అందరికి కనీ పించారు చక్కని పద్యాలతో శుభాశంసనంచేశారు ఇక్కడికి రావటం మరపు రానిసంఘటన గా పేర్కొన్నారు .ప్రముఖ వక్త ,తెలుగు పండితురాలు శ్రీమతి కే.కనక దుర్గా మహాలక్ష్మి ఇదంతా సరస్వతీ దేవి కటాక్షం అని తనను ఆహ్వానించి సత్కరించటం మరచి పోలేనని చిన్న వారిలో కూడా ప్రతిభను గుర్తించి ఇలా సన్మానం చేయటం సరసభారతి అధ్యక్షులకే చెల్లిందని చెప్పారు .ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయ వాడ తెలుగు పండితులు ,రచయిత శ్రీ దిట్టకవి శేషాచార్యులు తమ పద్యాలతో కృతజ్ఞతలను ఉగాది శుభా కాంక్షలను తెలియ జేశారు .ఘంటసాల గారి మేనల్లుడు సుమధుర గాయకులూ ,పెద కల్లేపల్లి ఒరి-ఎంటల్ హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ తమ స్పందన లో దుర్గా ప్రసాద్ గారితో చాలా కాలం గా పరిచయం ఉన్నా ఉయ్యురుకు రావటం ఇదే ప్రధమం అని అన్నారు మహా కవి కాళిదాసు సినిమా లోని ‘’మాతంగ కన్యాం మనసా స్మరామి ‘’అనే కాళిదాసు రచనను ఉచ్చైస్వరం గా పాడి సభ్యలను మరో లోకం లోకి తీసుకొని వెళ్ళారు ఏ స్తాయిలో పడినా ఎక్కడా గాత్రానికి తేడా రాలేదు అందరి హర్షధ్వానాలు అందుకొన్నారు .హైదరాబాద్ స్టేట్ బాంక్ లో ఉద్యోగిస్తూ చిత్రకళా లో అనితర సాధ్య ప్రతిభ ను కన పరుస్తున్న టి.వి.ఎస్.బి.శాస్త్రి (ఆనంద్ )తనకు ఉయ్యూరు తో ఉన్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు దుర్గాప్రసాద్ గారు తన బావగారని తమ అ క్కయ్యే అయన భార్య ప్రభావతి అని చెప్పారు .గీతా జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ దేశ విదేశాలలు పర్య టించిన భగవద్గీత ‘’ ఫేం‘’చిరంజీవి మాదిరాజు బిందు దత్తశ్రీ తన స్పందనలో ‘’ఒకే ఒక్కడు ‘’అన్న గీతం లో దుర్గా ప్రసాద్ సర్వతో ముఖ ప్రతిభను వర్ణించి చెప్పింది ,ఇలా అందరు తమ అనుభవాలను అందరికి అందజేసి జేజే లందు .కొన్నారు .బందరు కవయిత్రి సాహితీ విదుషీమణి శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మ గారు తనకు జరిగిన సన్మానానికి ఆనందం తో పులకించి స్పందన తెలిపారు .
వివేకానంద స్వామి పై వ్యాస రచన –బహుమతులు
సరసభారతి ఎప్పుడూ విద్యార్ధులను మహిళలను దృష్టిలో ఉంచుకొనే కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇది స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్భం గా సరసభారతి స్కూల్ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలను అమరవాణి హైస్కూల్ లో ప్రిన్సిపాల్ పి.వి.నాగరాజు చేత నిర్వహిమ్పజేసి బహుమతులను అందించారు ఈ బహుమతులను ప్రఖ్యాత కదా రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారు స్వంత ఖర్చులతో అందజేశారు వీరికి సరసభారతి కృతజ్ఞత త్రేలియ జేసింది
లత సాహితీ ప్రస్తానం .
కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ శ్రీ జి.వి.పూర్ణ చంద్ లత తో తనకున్న పరిచయాన్ని గుర్తుకు చేసుకోనిప్రసంగించారు లతా పై ఒక కార్య క్రమం దుర్గా ప్రసా ద్ గారు నిర్వహించటం విశేషం అని అన్నారు .’’లతరాయ లేదు చెప్పింది ఆవిడ చెబితే సన్నిహితుడు ఆంజనేయులు గారు స్వయం గా రాశారని తెలియ జేశారు .తన నవల ‘’సప్త సింధు ‘’ను చెయ్యి పట్టుకొని రాయించిన అక్క లత అన్నారు .చలం కోరే శ్రీ స్వేచ్చ లత కోరలేదని ఆమె కోరిన స్వేచ్చ విచ్చల విడి తనానికి కాదని ,సంసార సుఖం లో సమాన స్తాయి అని స్త్రేకి ఆత్మ రక్షణ కోరింది మొదట లతా మాత్రమె నని ఇప్పుడు స్త్రీ ఉద్యమాలు నిర్వహించే వారందరి కంటే ముందే లత వారి తరఫున నిల బడిందని పురుషాహంకారాన్ని సాహిన్చాలేదని తెలియ జేశారు .తెలుగు సాహిత్య అకాడెమి కి పోటీ చేసిఅధ్యక్షురాలి గా గెలిచినా స్త్రీ లతఅన్నారు .అలానే గుత్తికొండ సుబ్బా రావు గారు అకాడెమి సభ్యులవటానికి కారణం లత గారే నని ఆయన్ను ఆమె తన తరఫున పోటీకి నిలబెట్టి గోపాల రెడ్డి గారి అభ్యర్ధిని ఓడించి గెలిపించిన సత్తా ఉన్న స్త్రీ లతఅన్నారు . ఆమె రామాయణ కల్ప వృక్షానికి రంగనాయకమ్మ రాసిన విష వృక్షానికి దీటుగా విశ్వనాధను సమర్ధిస్తూ’’ సీతాయణం ‘’రాసిన తీరు అద్వితీయం అని వివరించారు ఆమె ‘’ఊహాగానం,’’మోహన వంశీ’’ ఆ రోజుల్లో పాసనగా అందరు చదివి ఉత్తెజితులయ్యారని చెప్పారు .శ్రీ చలపాక ప్రకష్ చేసిన సూచన ‘’కృష్ణా జిల్లా పై కవిత’’పై స్పందిస్తూ దీన్ని ప్రకాష్, దుర్గా ప్రసాద్ గార్ల సంపాదకత్వం లో తెద్దామని సమగ్రం గా ఉండేట్లు చేద్దామని అన్నారు .శ్రీమతి మందరపు హైమవతి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు ఆత్మీయ అతిధులు గా తమ ప్రసంగాలలో సరసభారతి చేస్తున్న సేవలను ప్రస్తుతించారు .పూర్ణ చంద్ తమ ప్రసంగం లో ఎప్పుడు దుర్గా ప్రసాద్ ను ప్రస్తావించినా ‘’నాన్న గారు ‘’అని సంబోధించటం ఆయనకూ అందరికి ఎంతో ఆప్యాయతను గౌరవాన్ని కల్గించింది ఇది పూర్ణ చంద్ సంస్కారం అది అందరికి అబ్బేది కాదు .
దుర్గా ప్రసాద్ స్పందిస్తూ ఈ వేదిక ను లతా వేదిక భావించి కార్య క్రమం నిర్వహించటం దానిలో శ్రీ పూర్ణ చంద్ ఆమె సాహితీ ప్రస్తానాన్ని ఆవిష్కరించటం ఎంతో విలువ నిచ్చిందని కృతజ్ఞతలను తెలిపి శాలువా హారాలతో సత్కరించారు
నెలవారీ సమావేశాలకు స్వస్తి
ఇది తమ వివాహం అయి 49 స్వతరాలు పూర్తీ అయి 50 వ ఏడు లో ప్రవేశించిన సందర్భం గా ఏర్పాటు చేసిన సభ అనిదుర్గా ప్రసాద్ చెప్పారు అంతేకాక ఇక ముందు సరస భారతి నెల వారీ కార్యక్రమాలకు స్వస్తి పలికి అంతర్జాలం కే పరి మితం అవుతుందని తెలియ జేయటానికి కూడాఈ సమావెశం లో తెలియ జేయటానికే నని నని అన్నారు . .తాను చదవాల్సింది ఎంతో ఉందని రాయాల్సిందీ చాలా ఉందని ,ప్రముఖ తత్వవేత్త ,జిజ్ఞాసి ఇమ్మాన్యుయల్ కాంట్ పై ప్రారంభించిన రచన పూర్తీ చేయాలనాను కొంటున్నానని దీనికి చాలా సమయం వెచ్చించాల్సి ఉందని తెలియ జేశారు .జూన్ మూడవ తేదీ సోమవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా సరసభారతి ప్రచురిస్తున్న పదకొండవ పుస్తకం ,దుర్గా ప్రసాద్ ఆరవ రచన, అయిన శ్రీ ఆంజనేయస్వామి మాహాత్మ్యం ‘’పుస్తకం శ్రీ సువర్చలన్జనేయస్వామి వారల దేవాలయం లో ఆవిష్కరణ జరుగుతుందని దీనినీ ప్రకాష్ గారే ముద్రించి అందిస్తున్నందుకు క్రుతజ్ఞాతలని ఈ పుస్తకం తో సరసభారతి పుస్తక ప్రచురణ ను కూడా ఆపివేస్తోందని తెలిపారు .
సాహితీ కదంబం
ఉగాది సాహితీ కదంబాన్ని తెలుగు లెక్చరర్ డాక్టర్ వై శ్రీలత, ప్రముఖ కవి, విశ్లేషకులు .శ్రీ అరసవిల్లి కృష్ణ,ప్రఖ్యాత హాస్య రచయిత శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ గార్లు సమర్ధత తో నిర్వహించారు .సుమారు ముప్పయి మంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టింది .అందరికి స్వామి వివేకా నంద ఫోటో జ్ఞాపికలను అందజేశారు దాదాపు నాలుగు గంటల కాలం సాగిన ఈ కార్యక్రమం మొత్తం ఎంతో అనుభూతి నిచ్చింది అందరు ఎంతో ఆనందించారు .
సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి సభా నిర్వహణలో సహకరించి వందన సమర్పణ చేశారు .
సుమారు వంద మంది పాల్గొన్న సభ నిండుగా కను విందుగా కానీ పించింది . సరస్వతీ మూర్తుల మధ్య కొన్ని గంటల పాటు తమ దంపతులు ఆనందం గా గడపటం మహా అను భూతి నిచ్చిందని వీరందరి ప్రేమకు, ఆత్మీయతకు ,సాహిత్యభిలాషకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోగలమని సంతోషం నిండిన కన్నులతో దుర్గా ప్రసాద్ దంపతులు తమ మనోభావాన్ని వ్యక్తం చేశారు .
సాహితీ కదంబం లో చదివిన వాటిని సరసభారతి బ్లాగ్ లో కొద్ది రోజుల్లో సీరియల్ గా ప్రచురిస్తాము .చదివి స్పందన తెలియ జేస్తే సంతోషిస్తాము
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-4-13-ఉయ్యూరు


namaste, hearty conngrats on conductiing ugadi meet in a grand way there is a mistake in my story cell phone “ye varthanina navvutune (smiling )chebutundi” ani padali “ye varina” ani padindi dayachesi gamaninchandi ponnada satyaprakasarao
LikeLike
శ్రీ గబ్బిటవారిచే అరచేతిలో శాస్త్రీయ దైవమని ప్రశంసలందు కొనిన
నా రచన “దైవం – శాస్త్రీయ పరిశోధన” గ్రంధము చదవాలనే అభిలాష కలవారు
సంప్రదించండి ……………. బందా వేంకట రామారావు ,సెల్.9393483147
LikeLike