చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )
ఈ సంచికలో ముఖ్యమైన ముఖా ముఖం ఉంది అది డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు చేసిన ఇంటర్వ్యు అది .అందులో ముఖ్య విషయాలు ‘’కృతి అంటే వర్ణమే .రాగ భావం,ఫ్లో రెండు ఉంటె స్వరకల్పన బాగుంటుంది .సంగీత త్రిమూర్తులైన త్యాగ రాజు ,శ్యామ శాస్త్రి దీక్షితార్ ఎక్కువ కృతులు నోటికి వస్తే రాగాలాపన బాగుంటుంది లు సంగీతం అంటే ఇలా ఉండాలి అని చెప్పిన వారు దేవుడే వారి రూపాలలో వచ్చాడు అంతకు ముందు పురందరదాసు అన్నమయ్య ఉన్నా వాళ్ళు సంగీతజ్ఞులు కారు .భజన పరులు మాత్రమె .వాళ్ళు పాడే వారు కాక పోవటం వాళ్ళ వాళ్లకు శిష్యా బృందం యేర్పడ లేదు .అన్నమయ్య 32 వేల కృతులు రాసాడు అంటే రోజుకు ఎన్ని రాసి ఉండాలి ?ఆయన సంగీతం పాడాడో ఇతరులకు చెప్పాడో రికార్డు లేదు అసలు అన్నమయ్య సంగీతం అనేదే లేదు మనకి .గురువు అనే వాడు అచ్చం త్యాగ రాజు గారి లానే ఉండాలి .అయన దగ్గర సంగీతం నేర్చుకొన్న మొదటి12 మంది చివరిదాకా ఆయన తోనే ఉన్నారు .అంటే త్యాగయ్య ఫాస్ట్ క్లాస్ గా పాదేవాడని తెలుస్తోంది .బాగా సంగీతం బోధించేవాడని అర్ధమవుతుంది .ధనమ్మాల్ కు వెయ్యి కృతులు వచ్చు .అన్నీ మెదడులోనే భద్ర పరచుకొందామే .మంచి గురువు వెల్ ఎక్విప్పేడ్ గా ఉండాలి .చెప్పడం రావాలి .శిష్యుడికి ఏది పలుకుతుందో ఎలా పలక వచ్చో అలా సాధన చేయించి పాడించాలి శిష్యుడి గొంతు ధర్మాన్ని అర్ధం చేసుకోవాలి మహారాజులు త్యాగయ్యను అడిగి మరీ పాదిన్చుకోన్నారంటే ఆయన ఒకటో నంబర్ పాతగాదన్న మాట .గోవింద రాజు పిల్లే నోటి పాత వీణ వాయించి నట్లుండేది .ఆయన ఒక ఐడియల్ నాకు .ధనమ్మాల్ గమకానికి ,అరియకుడి పాటకు దీటుగా నిలుస్తారు .సుభాష్ లా ఉంటేనే సంగీతం .మనసును ఆకర్షించే సంగీతమే మంచి సంగీతం .తంజావూర్ బాణీ పాడే వాళ్ళంతా నాకు గురువులే .
‘’ద్వారం వెంకట స్వామి నాయుడు గారు నాద యోగి .ఆయనకు కృతి పాతం లేదు .వీణ సంగమేశ్వర శాస్త్రి గారి వద్ద పక్క వాద్యాం గా వీణ వాయించి నాయుడు గారు ఆ అందాన్ని గ్రహించారు .నేను నాదం లో అందాన్ని వెతుక్కుంటూ పోతున్నాను గాయకుడు అన్నవాటిని నాయుడు గారు మహా తేలిగ్గా వాయించే వారు .ఆయన జీనియస్ .నా శిష్యులు ఓలేటి వెంకటేశ్వర్లు నేదునూరి కృష్ణ మూర్తి లు అంటే నాకు అభిమానం నా మనో ధర్మం తెలిసిన వారు వారిద్దరూ .నా బాణీ అంటూ వేరే లేదు దక్షినాది బానీయే నా బాణీ నేను నా సంగీత యాత్రలో ఎంతో తృప్తి చెందాను 1119 కృతులను నాల్గు సంపుటాలుగా తెచ్చాను అది పల్లవుల పుస్తకం .’’మనో ధర్మ సంగీతం ‘’అనే అయిదు పుస్తకాలు రాశాను .మల్లాది సూరి బాబు నేను చెప్పిన దల్లా ఆకళించుకొన్న గొప్ప శిష్యుడు వేరి రిసేప్తివ్ అతను .’’ఇలా సంగీత పినాక పాణి వానిని బానినితెలుగు వారికి మళ్ళీ ఇంకోసారి రుచి చూపించాడు భట్టు దీన్ని ఇంత విపులం గా ప్రచురించిన నండూరి అభినందనీయుడు .
2012 లోవిరిసిన తెలుగు కవితా వసంతాన్ని డాక్టర్ కడియాల రామ మోహన రాయ్ విపులం గా వివా రించారు పూర్వం శ్రీ వాత్స వ ఇలా ఏ ఏడాది కా ఏడాది రచనల నన్ని సమీక్షించటం గుర్తు కొస్తుంది .’’అదృష్ట దీపక్ కు మద్రాస్ జ్ఞాపకాలు ‘’మండుతున్నట్లు ‘అని పించాయి .’ అవేవీ ఇప్పుడు లేకపోవటమే వెలితి ..ఇస్మాయిల్ కవిత్వ లాలిత్యాన్ని యై కామేశ్వరి పరామర్శించారు .’’యూని వర్సితీలలో తెలుగు డిపార్ట్మెంట్ ఎత్తేస్తే కాని తెలుగు విమర్శ బాగు పడదు ‘అన్నాడట ఇస్మాయిల్ .ఆయన అనుభవాల ఆధారం గా ఊహా లోకం లో రూపు దాల్చిన కవితలను చదివి ఆనందించమని రచయిత్రి కోరింది .
‘’నవ్విపోదురు గాక ‘’అంటూ సినీ నిర్మాత మురారి రాసిన పుస్తకం సంచలనమే రేపింది దాన్ని సమీక్షించాడు పాటి బండ్ల దక్షిణా మూర్తి .’సినీ రంగం లో హిపోక్రసి లేని వారు భానుమతి డి.వి.నరస రాజు ఇద్దరు మాత్రమె నన్నాదట శ్రీ శ్రీ .అలాగే చక్రపాణి మురారి కూడా అదే కోవకి చెందుతారని మూర్తి గారి కితాబు .’’వెలుతురూ జల పాతం గా డెబ్భై ఏళ్ళ గిడ్డి సుబ్బారావు ను కొనియాడాడు సింగం పల్లి .మాకినేని సూర్య భాస్కర్ ‘’ప్రపంచ భాష గా తెలుగు ‘’వర్ద్ధిల్లాలంటే పది సూచనలు చేశాడు అందులో తెలుగు కంప్యూటింగ్ విషయ నిర్మాణానికి కృషి చెయ్యాలని అంతర్జాల వెబ్ ,డిజిటల్ గ్రంధాలయాలు మున్నగు వాటిలో తెలుగు విశ్యాభి వృద్ధి జరగాలి అన్నది ముఖ్యమైంది
‘’రుబాయీల తెలుగు కవి సమ్రాట్టు ‘’అంటూ శ్రీ తిరుమల శ్రీని వాసా చార్య ను ‘’సుధామ‘’వివిధ కోణాల్లో ఆవిష్కరించాడు .’’ఈ దేశం వృక్షానికి ప్రతి మనిషి ఒక ఆకు –ఈ దేశం పుష్పానికి ప్రతి మనిషి ఒక రేకు –ఈ తరు పుష్పాల పైన ఎవరైనా చేయి వేస్తె—తత్ క్షణమే అవుతాడు ప్రతి మనిషి ఒక బాకు ‘’అన్న పంక్తుల్ని ఉదాహరించటం బాగుంది .’’జననీ జనకులను మర్చి పోతే యెట్లా –బోధించిన గురువుని మర్చిఒతే యెట్లా –ణీ కోసం నిచ్చెన నిలిపిన దేశాన్నే –ఋణం తీర్చకుండా మరచి పోతే యెట్లా ?/’’అని ప్రశ్నిస్తారు ఆచార్య .
‘’తెలుగు కదా సౌందర్యాన్వేషణ ‘’అనే ప్రత్యెక వ్యాసం లో గుడిపాటి తిలక్ బైరాగి ,బుచ్చిబాబు చలం వేగుంట ,స్మైల్ మొదలైన వారి కధల్లో ఉన్న సౌందర్యాన్ని వెలికి తెచ్చే ప్రయత్నం బాగుంది అందులో తెలుగు రచయిత్రుల్లో తాత్విక బలం ఉన్న రచయిత్రి గా జలంధర ను ప్రస్తుతించాడు .
డాక్టర్ పూర్ణ చంద్ ‘’రాయల నాటి పాలనా భాష ‘’ను సమీక్షించి అది నేటి అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో సూచించాడు .శాసనాల్లోంచి ,ప్రాచీన కావ్యాల్లోంచి ఆధారాలు వెదికి అధ్యయనం చేయించాలని ,కొత్త పరి భాషా పదాలను సూచించటానికి ప్రజల్ని భాగ స్వామ్యులను చేయాలని ,ఆ పదాలను అంతర్జాలం లో ఉంచితే విస్తృత చర్చ జరిగి నిగ్గు తెల్తుందని దానికి ఇంగ్లీష్ సమానార్ధాన్ని ఇస్తూ పెంపు చేస్తూ మహా నిఘంటువు తయారు చేయాలని మంచి సూచనలే చేశారు
అరసవిల్లి కృష్ణ ‘’సావిత్రి ‘’ని అగ్ని శ్వాస గా అభి వర్ణించాడు .’’ నా వంట్లో రక్త మామ్సాలన్ని నూరి ముద్దచేసి –ఔషధం చేసి –నా అనువనువుకీ పూశాను –ఇప్పుడు –నువ్వు వస్తాడువు అయ్యావు–శాసకుదవయ్యావు ‘’అని పితృస్వామ్య సమాజం లో కొడుకు పాత్రను మన ముందు నిల బడుతుంది సినీ నటి సావిత్రి మరణిస్తే ‘’తరలి పోయిన తార తరుణి సావిత్రి –ఇక నైనా పొండుమా విను వీధి విశ్రాంతి ‘’అని ఈ సావిత్రి అన్నాడట .
ఆదూరి సత్య వతి రచన ‘’ఒక వేణువు పలికింది ‘’ని సమీక్ష చేసింది వి.సీతా మహాలక్ష్మి ‘’ఉత్తమ మైన ఆత్మా పరమైన కవిత్వం లో ఉన్న లావణ్యం మరెక్కడా ఉండదు ‘’అన్న కృష్ణ శాస్త్రి పంక్తుల్ని ఉదాహరిస్తూ రచన సాగింది .’’ఒక వేణువు పలికినది –ఒక మనసును ఊపినది –ఒక ఆమని ఓడిగినది–ఒక పున్నమి విరిసినది ‘’సత్యవతికి ఆత్మా భక్తీ పరమాత్మ ప్రకృతి ఆమె కవిత్వం మనోహర స్వరపరిమలాలను వెదజల్లే ఒక వేణువు అని తీర్మానించింది సమీక్షకురాలు లక్ష్మి .
చివరగా తెలుగు భాషోద్యమానికి ఎత్తిన బావుటా అయిన ఇటీవలే పరమ పాడించిన చలమాల ధర్మా రావు గారి పై మండవ శ్రీరామ మూర్తి మనసుల్ని తాకే రచన చేసి ఆయన్ను ఆయన భాషా సేవలను ప్రస్తుతించారు .
16 బాపూ కొంటె బొమ్మలు ముసి ముసి నవ్వులు ,నోరు వెల్ల బెట్టినవ్వేనవ్వులు కిసుక్కు నవ్వులు ,పగలబడి నవ్వటాలు అవతలి వాడు హడలి చచ్చేట్లు బిగ్గరగానవ్వటం ,కేవ్వుకేకలు ,పెట్టిస్తాయి .. హాస్యం ,వ్యంగ్యం ,రిపార్టీ ,ఎద్దేవా, అమాయకత్వం , తో పులకరిస్తాం .. వీటి విలువ అసలు కట్టనే కట్టలే మండీ బాబు . .
ఇన్ని విభిన్న రుచుల్ని ,విభిన్న ధోరణుల్ని, విభిన్న భాషా సంప్రదాయాల్ని ఒక్క చోట చేర్చి చినుకు చినుకుగా , హర్షపు చినుకులుగా తీర్చి దిద్ది ప్రత్యెక సంచికను నవ వసంత సంచిక గా వెలువరించటానికి సంపాదకుడు రాజ గోపాల్ చూపిన శ్రద్ధ ,రాయించిన తీరు, రాసిన వారి నేర్పూ, ,చదివించిన వైనం చూస్తె ఆశ్చర్యం వేస్తుంది మరో సారి చినుకు ను , రాజ గోపాల్ కను మనసారా అభి నందిస్తున్నాను ఈ సంచిక వెల 60 రూపాయలు మాత్రమె .ప్రతి పేజీని మనం ఆనందం గా అనుభవిస్తాం ఈ ఆనందాన్నీ వెల కట్టలేము కదా. త.ప్పక అందరు కొని చదివి అమూల్య సమయాన్ని సార్ధకం చేసుకోండి.నవ వసంత సంచిక గా చినుకు వసంతాన్ని చినుకు గా తెచ్చింది . అనుభవించటం మన కర్తవ్యం .
చినుకు ప్రత్యెక సంచిక పై చిలికించిన మాటల చినుకులు సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-4-13- ఉయ్యూరు

