‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5

నగ్న సుందరి

‘’సాస్ బ్రన్నర్ ‘’అనే ఆమె రచించిన చిత్రం ‘’ఇంద్ర ధను ఆకాంక్ష ‘’చిత్రాన్ని చూశాడు భావుక చిత్రకారుడు సంజీవ దేవ్ .సరస్సులో ఇంద్ర ధనుస్సు ప్రతి ఫలిస్తూ ఉంటుంది .ఒక నగ్న సుందరి ఉత్తుంగ స్తనాలతో ఆ నీటిలో ఉంది .ఈనీటిలో లో వికసించిన కమలాన్ని కుడి చేత్తో స్వీకరిస్తూ ఎడమ చేతితో తన స్తనాన్ని తీసి ఇవ్వటానికి సిద్ధం గా ఉంటున్దామే .సరోవరానికి ఇవ్వటానికి తన నగ్న శరీరం లో’ సుందర కుఛ ద్వయం ‘’లో ఒక దాన్ని సమర్పించటానికి ఆమె సిద్ధ పడిందన్న మాట .ఆ చిత్రం ఒక ‘’రూప రాశి ‘’లాగా ,ఒక ‘’వర్ణ సంగీతం లాగా ‘’సంజీవ దేవ్ భావించాడు .ముగ్దుదయాడు .సౌందర్య దిద్రుక్ష పెరిగి స్రష్ట గా మార బోయే సూచన తనలో గోచరించింది .

ప్రిన్సిపాల్ సతీ మణి

బెజవాడ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి గారింటికి తరచూ సంజీవ్ వెళ్ళే వాడు   ఆయన భార్య గొప్పగా ఆదరించేది .’’ఆహారాలు అల్పాహారాలు పెట్టి ఆనంద పరచే వారు ‘’అని పొంగి పోయాడు .దేవ్ ని ‘’త్వరలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివి కమ్మని ‘’తరచూ ఆమె చెప్పేది .మనవాడికి మౌనమే సమాధానం .

ప్రసిద్ధ రచయిత ,సంచారి రాహుల్ సాంకృత్యాయన్ ను ప్రిన్సిపాల్ గారింట ఒక సారి సంజీవ దేవ్ చూశాడు అయన ‘’బౌద్ధ సన్యాసి అయినా మాంసా హారి’’ అది లేనిదే ముద్దా దిగేది కాదు భోజనాల సందర్భం లో ఏ ప్రాంత భోజనం బాగుంటుంది అని అడిగితే ‘’మాంసం ఉంటె ఏ ప్రాంత భోజనం అయినా బాహా భేషుగ్గా ఉంటుంది‘’అన్నాడు సాంకృత్యాయన్ .ప్రిన్సిపాల్ భార్య తెల్ల బోయింది .’’సన్యాసికి ఈ రుచి ఏమిటి “’అని విస్తు పోయింది .ఆమె సంజీవ్ వైపు ఆశ్చర్యం గా చూసింది .రాహుల్ జీవిటం లోని ‘’ఈ వ్యతి రేక తత్వాన్ని అర్ధం చేసుకో లేక పోతున్నాను ‘’అని బాధ పడ్డాడు బుద్ధం అంటే మహా విశ్వాసం ఉన్న సంజీవ్ ..అదే మన భాషలో చెప్పా లంటే ‘’చెప్పేవి శ్రీ రంగ నీతులు –దూరేవి ––గుడిసెలు ‘’అన వచ్చేమో

రాదా కృష్ణ

సంజీవ దేవ్ జయ దేవ మహా కవి రాసిన ‘’గీత గోవిందం ‘’చదివాడు ‘’.రాదా కృష్ణుల ప్రేమ ,శృంగార చేష్టలు ,రతి రమ్యతలు జయ దేవుని రచనలో చరమ స్తాయి నందుకోన్నాయి ‘’అని విశ్లేషించాడు ‘’.ఈ రకమైన విశుద్ధ శృంగారాన్ని ఆధ్యాత్మికత కు ప్రతీక ‘’ అనటం  దేవ్ కు ఇష్టం లేదు .’’అది మానవత్వానికి అవమానమే నన్నాడు .వారిలో రక్తి ఉంది ,కాంక్ష ఉంది .ప్రేమ ఉంది మానసిక ప్రేమ కట్టలు తెగి నప్పుడు ‘’శారీర ఐక్యత కోరుతుంది ‘’వీటి లోని ఐక్యతను ,అభి లాష ను ,అందాలను ఆనందాలను జయ దేవుడు రాదా కృష్ణుల చేస్టలుగా వర్ణించాడు .ఇది శుద్ధ శృంగారం .దీనిని ఇలాగే ఆనందించాలి .’’అని తన తీర్పు చెప్పాడు

బాపిరాజు కుమార్తె

ప్రసిద్ధ నవలా కారుడు, చిత్ర కారుడు అడివి బాపి రాజు తో  సంజీవ దేవ్ కుబెజవాడ లో  స్నేహం కుదిరింది .ఆయనకు వికలాన్గురాలైన ఒక కుమార్తె ఉంది .ఆమె కూడా మంచి చిత్ర కారిణి .ఆమె చిత్రాలు చూసి ‘’వయసుకు మించిన ప్రతిభ ,ఆ చిత్రాలలో గోచరిస్తుంది ‘’అని సంజీవుడు మెచ్చాడు

సీత

పొలం లో కూలీలు జానపద గీతాలు పాడుతున్నారు .లక్ష్మణుడు సీత ను అడవిలో వదిలి పెట్ట టానికి వస్తాడు ఆమె ఏంతో  మర్యాద చేస్తుంది ‘’పాలు కలవని నీళ్ళు పాదాల కిచ్చీ–నీళ్ళు కలవని పాలు పానానికిచ్చీ ‘’అని వాళ్ళు పాడటం విన్నాడు .’’సాదా మాటల్లో యెంత సుందర మైన ప్రయోగం జరిగిందో అని ఆశ్చర్య పోతాడు సంజీవ్ .పాలు కలిసిన నీళ్ళు అయితే పాదాలకు చీమలు పడతాయి ,నీళ్ళు కలిసిన పాలైతే తాగటానికి రుచి గా ఉండవు .అందుకనే సీతమ్మ అంత  జాగ్రత్త పడింది .అతిధి మర్యాదలు ఈ పదాల నుండీ సీతమ్మ వారి నుండీ నేర్చుకోన్నాడేమో సంజీవ దేవ్ అని పిస్తుంది తుమ్మ  పూడిలో ఆయన ఇంట జరిగే అతిధి మర్యాదలు సత్కారాలు వింటే ..లేక పోతే ప్రతి సంక్రాంతికి తుమ్మ పూడి సాహిత్య సభలు అంత ‘’రాణకేక్కేవా ?”’అని పిస్తుంది రచయితలూ కళా కారులు  అంత స్పందించే వారా అని అనిపించటం సహజం .

రోచన

లక్నో లో అసిత్కుమార్ హాల్దార్ ఇంట కొంత కాలం గడిపాడు సంజీవ్ .ఆయన మూడవ కుమార్తె ‘’రోచన ‘’తో  సాన్నిహిత్య మేర్పడింది ఒంటరిగా కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకొనే వారిద్దరూ .’’ఇంకా ఎక్కువ కాలం ఆమె అక్కడ ఉంటె ఫలితాలు మరొక రకం గా పరణమించేవి .’’అనుకొన్నాడు అందరాకుండా నో  అతని మంచికో రోచన కలకత్తా వెళ్లి పోయింది .ఆమె వెళ్ళటం ఈయనకు విషాదమే మిగిల్చింది .నీరసం అని పించింది .దీన్ని హాల్దార్ గమనించాడు ‘’రోచన ను  వివాహం చేసుకొనే  ఆలోచన నీకుందా ?’’అని అడిగాడు సూటిగా .’’నేనింకా నిర్ణయించుకోలేదు ‘’అని ఈయన సమాధానం .’’నిదానం గానే ఆలోచించి నిర్ణయం తీసుకో ‘’అని హాల్దార్ ప్రశాంతం గాసలహా ఇచ్చాడు .’’నా తప్త హృదయానికి ఆ మాట ఏంతో శాంతి నిచ్చింది ‘’అంటాడు బెంగ తగ్గి ఉల్లాసం గా ఉన్నాడు సంజీవ్ .

ఒక నాడు హిందీ కవి ‘’రామ నరేష త్రిపాఠీ’’ని దేవ్ కలిశాడు .అక్కడ సంజీవ దేవ్ ను హాల్దార్ గారి ‘’మూడవ అల్లుడు ‘’గా పరిచయం చేశారు .అందరూ నవ్వారు .’’నేను కూడా బయటికి నవ్వానే కాని నా లోపల నవ్వు లేదు ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-9-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.