‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6

 ‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6

కాత్యాయని

కులూ లోయ కు వెడుతున్న చిన్న బండీ లో ఎక్కాడు సంజీవ దేవ్ .ఒక కొత్త దంపతులు అక్కడికే హనీ మూన్ కు వెళ్తున్నారు .అమ్మాయి పేరు కాత్యాయని ,ఆయన ఆనంద కపూర్ .కాత్యాయని ఎక్కువ చురుకైన అమ్మాయి తానూ నవ్వి ఇతరులను నవ్విస్తున్దామే .ఎన్నెన్నో విషయాలపై వీరిద్దరూ సంభాషించు కొంటున్నారు వారిని విడిచి వెళ్ళే సమయం వస్తుంటే దేవ్ బాధ పడ్డాడు ..భరింప రాని  వేదన కలిగింది .ఆమె భర్త మాత్రం ఈమె మాటలు వింటూ నవ్వుతున్నాడు .కాత్యాయని కూడా వియోగ బాధ పడింది .’’కల్సుకోవటం లో ఆనందం, విడి పోవటం లో విషాదం ఉంటుంది ‘’అని తెలిసింది .దీని పై ఆలోచనా స్రవంతి సాగింది .ఇలా అనుకొన్నాడు ‘’తన భర్త స్నేహ మయ సాన్నిధ్యం లో నన్ను మరిచి పోగలదు .మరి నేను ఎవరి ప్రేమ మయ సాన్నిధ్యం లో ఆమె ను మర్చి పోగలను “’.ధవళ ధారా సాన్నిధ్యం లో కాని, అంత రాత్మ సాన్నిధ్యం లో కాని ఆమె ను మర్చి పోవటానికి ప్రయత్నించాలని నిర్ణ యించుకొన్నాడు .ఇలా ‘’ప్రయాణం లో పదనిసలు ‘’చాలా సార్లు విన్నాడు .

అపర ద్రౌపదులు

కులూ లోయ నుంచి లడక్ వరకు స్త్రీలు ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకొంటారు .భర్త మరణించక పోయినా ,వివాహం చేసుకొంటారు .అన్నదమ్ము లందరికి ఒకే భార్య ఉండే ఆచారమూ ఉంది .’’ఈ సాంఘికా చారం మూలం గా కుటుంబాల సంఖ్య పెరక్కుండా నియంత్రణ ఏర్పడుతుంది .భర్తల సంఖ్య పెరిగితే సంతానం సంఖ్య పెరగదు కదా ‘’అనే విషయాన్ని మన వాడు గ్రహించాడు .

హెలీనా రోరిక్

ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికొలాస్ రోరిక్ ఇంట అతిధిగా సంజీవ దేవ్ కొంత కాలం ఉన్నాడు రోరిక్ భార్య మేడం హెలీనా రోరిక్ .భర్తకు తగ్గ స్త్రీ .ఒక రోజు చలి బాగా ఉంది .సంజీవ దేవ్ ఉన్న గదిలో ‘’ఈస్తర్ లిలీ ‘’కుండీ ని పెట్టమని ఆమె పని మనిషి ని ఆదేశించింది .ఆ సువాసన లో చలి బాధ తగ్గి నట్లని పించింది .అది భౌతిక సత్యమో ,మనో వైజ్ఞానిక సత్యమో తేల్చుకోలేక పోయాడు .’’ఆ పూవు చాలా రోజుల వరకు వడ మడక జ్యోతి వలే వెలుగుతూ ,మధుర సుగంధాన్ని వెద జల్లు తున్నదని ‘’సంబర పడ్డాడు .దాని నుంచి వెన్నెల ప్రసరిస్తున్నట్లు గా ఉంది .’’వెన్నెలకు సువాసన ,సువాసన కు వెన్నెల ఉందని ‘’ఊహల్లో తేలియాడాడు .ఈ అనుభూతిని ‘’లిరిక్ ‘’లలో చెప్పాడు –అంతా నవ్వారు రోరిక్ ‘’నీ అను భూతి సత్య మైనది పరిమళం చంద్రునిది వెన్నెల పూవులది –ఈ రెండూ కూడా సంజీవ్ దేవ్ వి’’ అని కవిత చదివితే అందరూ నవ్వారు .

రష్యన్ మహిళ  ‘’

రోరిక్ నిలయం లో ఇద్దరు రష్యన్ మహిళలున్నారు .చిన్నామే బలిస్టంగా అవయవ పుష్టి కలది .నిండిన ఆరోగ్య మైన చిరు నవ్వు నవ్వుతుంది .ఆమె తన చరిత్ర అంతా పూదోట లో ఓ పూట  చెప్పింది .విద్య పెద్ద గా లేదు .ఆమెకు దేశాటనం మీద ప్రీతీ .భారతి తోనూ ,రోరిక్ లతోనూ కాలం గడపటం లో ఆనందం ఉందట .అయితే ‘’ఇలాంటి యుక్త వయసులో ఒంటరిగా జీవించటం లో నరాల బాధ ,మానసిక బాధా లేదా ?’’అని అని ఆమెను అడిగాడు .ఆమె నవ్వుతూ ‘’అందరిలో జీవిస్తుంటే ,ఒంటరిగా జీవించటం ఎలా అవుతుంది ?’’అని అడిగిందామె .ఆమె లోని సూక్ష్మ గ్రాహ్యత ను అవగాహన చేసుకొన్నాడు దేవ్ .’’వ్యక్తీ లో నిండిన మానసిక ఆనందం కనక ఉంటె ,శారీరక ఉద్రేకాలు కూడా వ్యక్తీ ని బాధించవు ‘అని గ్రహించాడు .’’సహజా అందం కొరత ఏర్పడి నపుడే ఇతర బయటి ఆనందం కోసం వెదకాలేమో ?’’అని తెలుసు కొన్నాడు .

పిట్టలు తోలే అమ్మాయి

ఒక రోజు హిమాలయాల్లో మొక్క జొన్న చేలోకి వెళ్ళాడు సంజీవ్ .పదహారేళ్ళ అమ్మాయి రాతి మీద నిలబడి పిట్టల్ని తోల్తోంది .మనవాడూ ఆమె పక్కన చేరాడు .ఆమె తత్తర పడింది .ఈయన నవ్వితే ఆమె కూడా నవ్వింది .హిందీలో ఆమెను పలకరించాడు .ఆ భాష ఆమె కు రాదు ‘’కులీన భాష ‘’లో ఆమె మాట్లాడింది .ఆ భాష ఈయనకు తెలియదు .చేసేదేముంది ?ముఖాలు చూసి నవ్వుకొన్నారు .’’భాష తెలిస్తే ఇద్దరం ఎన్ని కబుర్లు చెప్పుకొనే వారమో ?’’అను కొన్నాడు .అయితే ‘’భాష ఉంటె అనుభూతి తీవ్రత పల్చ బడుతుంది .భాష లేక పొతే తీవ్రాత హెచ్చుతుంది ‘’ఆమె ను మళ్ళీ చూడా లను కొన్నాడు .’’మాట  తెలిసిన వాళ్ళ కంటే తెలీని వాళ్ళ మీద ఎక్కువ ఆకర్షణ ఏర్పడుతుంది ‘’అంటాడు .’’ఈ ఇరవయ్యవ శతాబ్దం లో కూడా ఇద్ద్దరు తరుణ వయస్కులు తమ పరస్పర భావాలను వ్యక్తం చేసుకోవటానికి భాష అడ్డంకి అయి నందున భాషా శాస్త్రం మీద ,శాస్త్రజ్ఞుల మీద నాకు కోపం వచ్చింది ‘’అని బాధ పడతాడు .భాష కుల మతాతీత భావాలకు అంకురార్పణ జరిగింది సంజీవ దేవ్ లో ‘’.అడ్డు గోడల చేదనకు బలం కల్గింది .హృదయ భాష లకు అంటే ,మౌన భాష కు మించిన భాష లేదు ‘’అనే ఎరుక కలిగింది .’’హృదయ భాష విశ్వ జనీన మైనది ఐతే ఇది ప్రేమ హృదయాలకు మాత్రమె అర్ధమవుతుంది ‘’అని గ్రహించాడు

కమీషనర్ గారి సతీ మణి

లాహోర్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ హిమ్మత్ ఖాన్ .దేవ్ అక్కడ బస చేశాడు .ఆయన సతీ మణి చాలా సంతోషించింది .ఆదరించింది .ఆ మధ్యనే వివాహం జరిగింది .పిల్లలు లేరు .’’ఈ ముస్లిం దంపతుల ఆదరణ మూలంగా లాహోర్ లో ఉన్న సమయం ఏంతో ఆనంద మయం గా గడిచి పోయింది’’అని ముచ్చట పడ్డాడు .సంజీవ్ కోసం ఆమె ప్రత్యేకం గా శాకా హారమే చేసి పెట్టేది దాన్ని ఆమె ఏంతో  సంతోషం గా చేసి వడ్డించేది .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-13 ఉయ్యూరు  .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.